Activities calendar

20 November 2016

21:33 - November 20, 2016

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం రోబో2.0. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ఇందులో విలన్‌ పాత్ర పోషిసున్నారు. ముంబైలో...ఫస్ట్ లుక్‌ను విడుదల జరిగింది. సంచలన విజయం సాధించిన రోబో సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ కాగా.. ఆస్కార్ విన్నర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

21:32 - November 20, 2016

విశాఖపట్టణం : టెస్టు రసవత్తరంగా మారుతోంది. చివరిరోజు స్పిన్నర్లు విజృంభిస్తే.. భారత్ విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ నాలుగోరోజు.. భారత్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కోహ్లీ ఒక్కడే 81 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌కు భారత్‌ 405 పరుగుల లక్ష్యం విధించింది. లక్ష్యం భారీగా ఉండటంతో.. ఇంగ్లండ్‌ డ్రాకే ప్రయత్నిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి.. 87 పరుగులు చేసింది. చివరిరోజు ఇంగ్లండ్ ముందు 318 పరుగుల లక్ష్యం ఉండగా.. భారత్‌కు 8 వికెట్ల అవసరముంది. 

21:31 - November 20, 2016

చైనా : ఒలింపిక్స్ రజత పతక విజేత వీపీ సింధు మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బాడ్మింటన్‌ టోర్నీని కైవసం చేసుకుంది. చైనా క్రీడాకారిణి సున్‌యు ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. ఒలింపిక్స్ తరువాత సింధు విజయం సాధించిన సిరీస్ ఇదే. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకరైన సింధు ...చైనాకు చెందిన తొమ్మిదో ర్యాంకర్ సున్ యు పై గెలిచి టైటిల్‌ ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో రౌండ్‌ను చేజార్చుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో అమీతుమీ తేల్చుకోవాల్సి వచ్చింది. మొదటి రౌండ్‌లో 21-11 పాయింట్ల ఆధిక్యం కనబరిచిన సింధు.. రెండో రౌండ్‌లో 17-21 పాయింట్లతో వెనుకబడింది. ఫలితాన్ని నిర్దేశించే మూడో రౌండ్‌లో సింధు తనదైన అద్భుత పోరాట పటిమతో చైనా క్రీడాకారిణి సున్‌యును ఒత్తిడిలో పడేసింది. మూడో గేమ్ లో దాదాపు ఆరు పాయింట్ల వరకూ సింధు-సున్ యులు సమంగా నిలిచి మ్యాచ్ పై ఆసక్తిని రేపారు. ఆ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత అదే ఊపును చివరి వరకూ కొనసాగించింది. 21-11 తేడాతో మూడో సెట్‌ని గెలుచుకుని.. టైటిల్‌ చేజిక్కించుకుంది. చైనా సూపర్ సిరీస్ విజయంతో పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు ప్రముఖులు సైతం సింధుకు అభినందనలు తెలియజేశారు. 

21:29 - November 20, 2016

ఆగ్రా : నల్లధనం నియంత్రణ కోసం కేంద్రం తీసుకున్న చర్యను ప్రజలందరూ స్వాగతించారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గడిచిన 10 రోజుల్లో బ్యాంకుల్లో 5లక్షల కోట్ల రూపాయల పాత నోట్ల డిపాజిట్లు వచ్చాయని తెలిపారు. ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన' కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆగ్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అయినా.. నల్లకుబేరులకు జీవితాంతం ఇబ్బందులు తప్పవన్నారు. నిజాయితీపరులైన పేదలు, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేయాలన్నదే లక్ష్యమన్నారు ప్రధాని.

21:27 - November 20, 2016

ఢిల్లీ : రాష్ట్ర సమస్యలే ఎజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్... కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌...ప్రధానంగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనుమతులపై చర్చించారు. కేంద్రప్రభుత్వ పథకాలైన ఉదయ్, ఉజ్వల్‌లో తమ రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేయాలని కోరారు. తెలంగాణలో భారీ స్థాయిలో రూట్‌ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం సబ్సిడీలు అందించాలని కోరారు.

భద్రాద్రి థర్మల్..
భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని వాద్రా నుంచి నిజమాబాడ్ డిచ్‌పల్లి వరకూ పవర్‌గ్రిడ్‌ కనెక్టెవిటీ ఏర్పాటు పనులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. దీనిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రేపు కూడా కొనసాగనుంది. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి...శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. 

21:26 - November 20, 2016

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా క్యూలు కడుతున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఏటీఎంలు మొరాయిస్తుండటం, లేదా అవుట్‌ ఆఫ్‌ సర్వీస్‌ అనే బోర్డులుండటంతో... వినియోగదారులు కొత్త నోట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద నోట్ల రద్దై 12 రోజులు కావొస్తున్న పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఎక్కడ చూసినా ఏటీఎంల ముందు జనం బారులు తీరి కనిపిస్తున్నారు.

వ్యాపారుల నష్టం..
పెద్ద నోట్ల రద్దుతో వివిధ రకాల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కస్టమర్లు రాక... పూల మార్కెట్‌లతో పాటు పండ్లు, కూరగాయలు, నాన్ వెజ్ మార్కెట్లు బోసిపోయాయి. ప్రతి ఆదివారం మాంసం ప్రియులతో కిటకిటలాడే చికెన్‌ సెంటర్లు, మాంసం విక్రయ కేంద్రాలు వినియోగదారులు లేక విలవిల్లాడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో గిరాకి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నోట్ల రద్దు వ్యవహారం పేదలు, కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కూలీకి వెళితే పాత నోట్లు ఇవ్వడం.. సరుకులు తెచ్చుకునే దుకాణాల్లో కొత్త నోట్లే తీసుకునే పరిస్థితి ఉండటంతో.. రోజూ వారి కూలీలు తీవ్ర దయనీయ స్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. ఇంటి అద్దెలు కట్టడానికి కూడా డబ్బులు లేవని మహిళలు వాపోతున్నారు.

చిన్న నోట్లు ఎక్కడ ? 
చిన్న నోట్లు అందుబాటులో లేకపోవడంతో హోల్ సేల్, రిటైల్ పండ్ల మార్కెట్ కుదేలైపోయింది. కార్తీక మాసంలో వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాపారాలు లేక వ్యాపారులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండ్ల తోటలు కొనుగోలు చేస్తే...ఇపుడు చిల్లర దొరక్క.. వ్యాపారం లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొనుగోలు చేసేందుకు వచ్చేవారు 2 వేల నోటు తీసుకురావడంతో చిల్లర లేక వ్యాపారాలను వదులుకుంటున్న పరిస్థితి నెలకొంది. గతంలో రోజుకు మూడు వేల వరకు వ్యాపారం అయ్యేదని.. ఇప్పుడు ఐదు వందల వ్యాపారం కూడా జరగడం లేదని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలు చూసైనా... ప్రభుత్వం వేగంగా... ఐదు వందల రూపాయల కొత్త నోట్లతో పాటు.. వంద రూపాయల నోట్లను విరివిగా మార్కెట్లోకి విడుదల చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు సరఫరా పెరిగి... ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేస్తే కానీ.. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా.. ఆర్బీఐ, బ్యాంకులు... వేగంగా నోట్ల పంపిణీపై దృష్టిపెట్టినట్టు కనిపించడం లేదు.   

21:23 - November 20, 2016

ఉత్తర్ ప్రదేశ్ : గమ్యానికి చేరకుండానే బతుకులు తెల్లవారిపోయాయి. ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ మృత్యు శకటమే అయింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం 115 మందిని బలితీసుకుంది. గాఢ నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటనలో బోగీల మధ్య ఛిద్రమైన మృతదేహాలు కలచివేశాయి. ఈ ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌ దేహత్‌ జిల్లాలోని పుఖ్రాయాన్‌ వద్ద తెల్లవారుజామున ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏ1, ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, జీఎస్‌, బీ1, బీ2, బీ3, బీ2, లగేజీ ర్యాక్‌ బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న అధికారులు రెస్య్కూ ఆపరేషన్‌ చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. సహాయచర్యలు చేపట్టేందుకు వారణాసి, లక్నో నుంచి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు 250 మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది ప్రమాదస్థలి వద్ద సహాయ చర్యలు చేపట్టారు. ఇంకోవైపు... ప్రమాదం జరిగిన మార్గంలో పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ.. ప్రధాన స్టేషన్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసింది. రైళ్లను పునరుద్ధరించేందుకు భారీ క్రేయిన్లతో బోగీలను తొలగిస్తున్నారు. ప్రయాణికులను సమీపంలోని రైల్వే స్టేషన్లను తరలించి, రైళ్లు, బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు.

సానుభూతి తెలిపిన సురేష్ ప్రభు..
ప్రమాద స్థలికి చేరుకున్న రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 3.5లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైల్వే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని సురేష్‌ ప్రభు హెచ్చరించారు. ఈఘటనపై విచారణకు ఆదేశించారు. రైల్వే భద్రతా కమిషనర్‌ విచారణ జరుపుతారు.

పలువురు దిగ్ర్భాంతి..
రైలు ప్రమాదంపై అటు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. సహాయచర్యలు ముమ్మరం చేయాలని యూపీ సీఎం అఖిలేశ్‌ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 25వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు యూపీ సీఎం ప్రకటించారు. అటు మధ్యప్రదేశ్‌ సీఎం కూడా మృతులకు రెండేసి లక్షలు, క్షతగాత్రులకు యాభైవేల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా రైలు ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించిన సురేష్ ప్రభు..

లక్నో : కాన్పూర్ రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు సందర్శించారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను గూర్చి సురేశ్ ప్రభు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంతోషంగా ఉందన్న సింధు..

చైనా : ఓపెన్ సూపర్ సిరీస్ ను కైవసం చేసుకోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సంతోషం వ్యక్తం చేసింది. సూపర్ సిరీస్ గెలవడం చాలా రోజులు నాటి కల అని, చాలా సంతోషంగా ఉందన్నారు. 

20:40 - November 20, 2016

డైరెక్టర్ పేరు చూసి థియేటర్స్ కి ఆడియెన్స్ వచ్చేలా చేసిన వాళ్ల లిస్ట్ లో 'పూరీ జగన్నాథ్' ఒకరు. ఈ దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేశాడు. కానీ ప్రస్తుతం సినిమా సినిమాకి 'పూరీ' ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాడు. హిట్స్ కొట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే, ఫ్లాప్స్ ఇవ్వడంలోనూ వెరైటీ చూపిస్తున్నాడు. 'పూరీ' చేతిలో పడితే తమ కెరీర్ న్యూ టర్న్ తీసుకోవడం గ్యారంటీ అని ఆశలు పెట్టుకొన్న హీరోల్ని కూడా నిలువునా ముంచేస్తున్నాడు. 'లోఫర్' డిజాస్టర్ మరిచిపోకముందే 'ఇజం'తో మరో డిజాస్టర్ ఇచ్చాడు. 'ఇజం' తో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనుకుంటే నేనింతే అని రోటీన్ మూవీ తీశాడు పూరీ. లుక్స్ పరంగా 'కల్యాణ్ రామ్' మేకోవర్ ని టోటల్ గా మార్చేశాడు. ఈ మూవీ ట్రైలర్స్ చూసి ఈ సారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగించడమే కాకుండా 'ఇజం'తో 'కల్యాణ్ రామ్' దశ తిరిగిపోవడం షూర్ అనుకొన్నారంతా. కానీ 'పూరీ' మాత్రం మరో డిజాస్టర్ ఇచ్చాడు. 'ఇజం' డిజాస్టర్ తో 'పూరీ జగన్నాథ్' తో ఏ హీరో కూడా మూవీ చేసే సాహసం చేయలేకపోతున్నారు. 'ఇజం' రిలీజై 2 నెలలు గడుస్తుంది. కానీ 'పూరీ' మాత్రం సైలెంట్ అయిపోయాడు. 'ఇజం'తో నిర్మాతగా 'కల్యాణ్ రామ్' మరింత నష్టపోయాడు. ఈ మూవీ డిజాస్టర్ లో 'పూరీ'దే మేజర్ పార్ట్. ఓ సోషల్ మేసేజ్ స్టోరీని తనదైన రోటీన్ స్క్రీన్ ప్లే తో చుట్టేశాడు. మరి 'ఇజం' డిజాస్టర్ తో 'పూరీ'కి నెక్ట్స్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

20:27 - November 20, 2016
20:23 - November 20, 2016

'ఉత్తేజ్' కి చిన్నప్పటినుండి చదువు అబ్బలేదని ఆయన అన్నయ్య పేర్కొన్నారు. 'ఉత్తేజ్'తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. అందులో భాగంగా 'ఉత్తేజ్' చిన్నతనం..ఇతరత్రా విషయాలు తెలుసుకోవాడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఆయన అన్నయ్యతో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా చిన్పప్పుడు ఉత్తేజ్ ఎలా ఉన్నారో..ఇతర విషయాలు ఆయన వెల్లడించారు. మరి ఉత్తేజ్ గురించి ఆయన అన్నయ్య ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలాంటే వీడియో క్లిక్ చేయండి. 

20:21 - November 20, 2016
20:20 - November 20, 2016
19:58 - November 20, 2016

తనకు కంఫర్ట్ లేకపోతే చిరాకు అని సినీ నటుడు, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'ఉత్తేజ్' పేర్కొన్నారు. 'శివాజీ'తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈసందర్భంగా ఆయన తన జీవిత విశేషాలను వెల్లడించారు. తనకు చదువు అబ్బలేదని, సినిమాలంటే పిచ్చ ఇష్టమని అని వ్యాఖ్యానించారు. కుటుంబం..పిల్లల పెంపకంపై ఎమోషనల్ గా స్పందించారు. అంతేగాక నటుల వాయిస్ ను అనుకరించారు. ఎంతో ఉత్సాహంగా..ఆహ్లాదకరంగా సాగిన ఈ ఇంటర్వ్యూను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:28 - November 20, 2016

నైటీలు వేసుకునే ఆడవారు స్కూటర్ పై వెళుతాంటారని..అలాగే..మార్కెట్ లకు వెళుతారని..అలా వెళుతారా అని సినీ కమెడీయన్ 'ఉత్తేజ్' పేర్కొన్నారు. 'ఉత్తేజ్'తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈసందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. తాను ఫోన్ మాట్లాడవచ్చు..పిల్లలు మాత్రం ఫోన్ మాట్లాడకూడదు..మీరు అలా ఉండవచ్చు..పిల్లలు మాత్రం ఉండకూడదు..ఇదక్కెడ అంటూ ప్రశ్నించారు. నాలుగు రకాలుగా పిల్లలు ఎదుగుతారని తెలిపారు. సోషల్ ఎడ్యుకేషన్ లేదని, నాలుగు రకాలుగా ఎడ్యుకేషన్ ద్వారా పిల్లలు ఎదుగుతారని పేర్కొన్నారు. వంద..వంద మార్కులు సంపాదించి ఏం లాభం..అంటూ పేర్కొన్నారు. ఇలా చెబుతుంటే తన కుటుంబసభ్యులు..ఇతరులు విలన్ గా చూశారని 'ఉత్తేజ్' పేర్కొన్నారు. 

19:21 - November 20, 2016

ప'బిచ్చగాడు' ఫేం 'విజయ్ ఆంటోనీ' న్యూ మూవీ 'బేతాళుడు'కి సంబంధించి 10 నిమిషాల సినిమాను నెట్లో వదిలారు. సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికే యూనిట్ ఇలాంటి ప్లాన్ వేసింది. 10నిమిషాల శాంపిల్ ప్రోమోతో విజయ్ ఆంటోనీ నిజంగానే సినిమాపై అంచనాలు పెంచేశాడు. ప్రస్తుతం ప్రమోషన్ తో ఎంత సెన్సేషన్ సృష్టించామా అనేదే ట్రెండ్. కావాల్సినంత ప్రమోషన్ చేస్తే ఆటోమ్యాటిక్ గా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఒక మైనస్ కూడా ఉంది. ప్రమోషన్ చేశాక కంటెంట్ లో దమ్ము లేకపోతే మాత్రం చేతులు కాలిపోతాయ్. కానీ 'బిచ్చగాడు' ఫేం 'విజయ్ ఆంటోనీ' మూవీ 'బేతాళుడు' మాత్రం ప్రమోషన్ కి ఏ మాత్రం తీసిపోని కంటెంట్ బాక్సాఫీసుని షేక్ చేయడానికి రెడీ అయిపోయింది.

పెరిగిన అంచనాలు...
'బిచ్చగాడు' తో వచ్చిన ఫేం ని కంటిన్యూ చేయడానికి 'విజయ్ ఆంటోని' చాలా ప్లాన్స్ వేస్తున్నాడు. 'బిచ్చగాడు' కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ కావడంతో కొత్త మూవీ 'సైతాన్' ను ప్లాన్ ప్రకారం ప్రమోషన్ చేస్తున్నాడు. తెలుగులో 'బేతాళుడు' టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి ముందే 10 సినిమాల సినిమాను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ప్రమోషన్ కోసం 'బేతాళుడు' టీం వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ పై ఇటీవల రిలీజ్ చేసిన 10 నిమిషాల మూవీ భారీ అంచనాలు పెంచేసింది. దీంతో ఈ మూవీపై ఆడియన్స్ ఎనలేని క్యూరియాసిటీ కలుగుతుంది. సినిమాలోని సైకాలాజికల్ థీమ్ అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ థ్రిల్ చేస్తున్నాయి. శాంపిల్ తో మెస్మరైజ్ చేసి 'విజయ్ ఆంటోనీ' పుల్ మూవీతో ఏ మేరుకు సర్ ఫ్రైజ్ చేస్తాడో బేతాళుడు సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.  

పురస్కారం మాతృమూర్తికి అంకితం - బాలు..

హైదరాబాద్ : ఎస్పీ బాలసుబ్రమణ్యంకు శతవసంతి చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారం అందచేశారు. పురాస్కరాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. బాలసుబ్రమణ్యంకు అందచేశారు. సినీ రంగంలో 50 ఏళ్ల ప్రస్థానం సాగిందని, ఈ పురస్కారం తన మాతృమూర్తికి అంకితం చేస్తున్నట్లు బాలు వెల్లడించారు. 

47వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు..

గోవా : 47వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా 1032 చిత్రాలను అంతర్జాతీయ చలన చిత్ర కమిటీ పరిశీలించింది. 88 దేశాల నుండి 194 చిత్రాలను కమిటీ ఎంపిక చేసింది. ముగింపు వేడుకల్లో దర్శకులు రాజమౌళి పాల్గొననున్నారు.

18:43 - November 20, 2016

అనంతపురం : జిల్లా పెనుకొండ హైవేకి సమీపంలో చిరుతపులి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వేటగాళ్లే చిరుతను చంపి...వాటి గోళ్లను ఎత్తుకెళ్లారనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు జనావాసాలలోకి మృగాలు రాకుండా పొలాల వద్ద వేసిన కంచెను దాటుతూ చిరుత మరణించి ఉండవచ్చుననే అనుమానాలు వినిపిస్తున్నాయి.

18:42 - November 20, 2016

చిత్తూరు : తిరుమలలో పార్వేటి మండపం వద్ద టిటిడి నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ప్రకృతి ఒడిలో వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వన భోజనాన్ని ఆరగించారు. ఈ సందర్బంగా పార్వేటి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసారు. సుమారు 550 ఏండ్ల క్రితం వరకూ పార్వేటి మండపం వద్ద అన్నమయ్య వంశీకులు వనబోజన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తరవాత టిటిడి గత ఆరు సంవత్సరాలుగా తిరిగి వన భోజనం కార్యక్రమం నిర్వహిస్తోంది. 

18:41 - November 20, 2016

విజయనగరం : జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నవరత్‌ నుంచి విశాఖ వస్తున్న ఆర్టీసీ బస్సు రామభద్రాపురంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

18:30 - November 20, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్..అభయగోల్డ్ జాబితాలో మరో సంస్థ చేరింది. ఏజెంట్లను ముంచింది. ఎల్ఐసీ అనుబంధ సంస్థ గ్రీన్ మైక్రో ఇన్సూరెన్స్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మైక్రో ఫైనాన్స్ తరహాలో నగదు వసూలు చేసి ఏకంగా రూ. 4కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. దీనితో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోరుతూ ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు. నెలకు రూ. 200 నుండి రూ. 300 కట్టితే బాగుంటుందని సూచించారని, విజయవాడలో కంప్లైంట్ ఇచ్చినా స్పందించడం లేదన్నారు. తాము చాలా మంది చేత కట్టించడంతో వారు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. సంవత్సరంన్నర తరువాత ఏమి చేశారో తెలియడం లేదని వాపోయారు. రాజు అనే వ్యక్తి ప్రత్యేకంగా గుంటూరులోని కార్యాలయాన్ని ప్రారంభించి ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బాండ్లను కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ బాండ్లు చెల్లవని ఎల్ఐసీ అధికారులు పేర్కొంటున్నారు. దీనితో ఏజెంట్లు లబోదిబోమంటున్నారు. 

సిగరేట్ల కంటెనర్ అపహరణ..

విశాఖపట్టణం : సబ్బవరం వద్ద దారి దోపిడి చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై సిగరేట్ల కంటైనర్ ను దొంగలు అపహరించారు. అనకాపల్లి సమీపంలో డ్రైవర్ ను నిర్భందించి రూ. 5 కోట్ల విలువైన సిగరేట్ల సరుకులతో దొంగలు పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

18:21 - November 20, 2016
18:20 - November 20, 2016

ఒంగోలు : రద్దు చేసిన పెద్దనోట్లను సహాకార బ్యాంకుల్లో మార్చుకొనే వెసులుబాటు లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా సోమ..మంగళవారాల్లో బ్యాంకుల వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. సహకార బ్యాంకుల ఉద్యోగులు..మంగళవారం నిర్వహించతలపెట్టిన మహా ధర్నాకు పార్టీ తరపున మద్దతు తెలియచేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి రూ. 500 కోట్లు ఖర్చు చేసినా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించారని విమర్శించారు. 

కాన్పూర్ ఆసుపత్రికి వెళ్లిన మధ్యప్రదేశ్ సీఎం..

ఉత్తర్ ప్రదేశ్ : రైలు ప్రమాద ఘటనలో కాన్పూర్ ఆసుపత్రిలో బాధితులను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు..గాయపడిన వారికి రూ. 50వేలుఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

'అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కు'

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంకు ప్రభుత్వం కొమ్ముకాస్తే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. యాజమాన్యానికి కొంతమంది పెద్దలు కొమ్ముకాస్తున్నారని, పోలీసు అధికారులు బ్రోకర్ల వలే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులను బెదిరించిన శ్రీకాకుళం ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇబ్బందులు లేకుండా ఆస్తులు అమ్మేలా సీఎం చొరవచూపాలన్నారు. 

పవన్ కు కలిసిన దత్తన్న...

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. కుమార్తె ఆహ్వానపత్రికను పవన్ కు అందచేశారు. 

17:32 - November 20, 2016

కరీంనగర్ : జిల్లా వీవంకలో విషాదం చోటుచేసుకుంది. పోకిరీల వేధింపులు తట్టుకోలేక శివాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జమ్మికుంటలో డిగ్రీ చదువుతున్న శివాణి రోజూ బస్సులో కాలేజీకి వెళ్లివచ్చేది. ఇదే క్రమంలో కొంతమంది కుర్రాళ్లు ఆమెను వేధించేవారు. దీంతో మనస్తానానికి గురైన శివాణి...ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తెను కిరణ్, అతని స్నేహితులే వేధించారని ఆమె తండ్రి నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

17:12 - November 20, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో రాష్ట్రాలు ఆర్తికంగా నష్టపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, పెద్దనోట్ల రద్దుతో బడ్జెట్ పై ప్రభావం చూపెడుతుందన్నారు. డబ్బు రాకపోతే కొన్ని స్కీంలపై ప్రభావం ఉంటుందని ఉద్యోగుల జీత భత్యాలపై ప్రభావం ఉండదన్నారు. 

17:10 - November 20, 2016

వరంగల్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూరగాయాల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో చిరు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారాలు కుదైలైపోయాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 500, రూ. 2000 నోట్లు తీసుకొస్తున్నారని, దీనితో చిల్లర ఇవ్వలేకపోతున్నామన్నారు. గిరాకీ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఇంగ్లండ్ 87/2..ముగిసిన నాలుగో రోజు ఆట..

విశాఖపట్టణం : భారత్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. విజయానికి ఇంగ్లండ్ ఇంకా 318 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ తొలి, రెండో ఇన్నింగ్స్ లో 455, 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్సింగ్స్ లో అశ్విన్, జడేజాలకు చెరో వికెట్ దక్కింది. 

16:29 - November 20, 2016

మేడ్చల్ :  పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శరాఘాతంలా మారిందని నవతెలంగాణ పత్రిక సంపాదకులు వీరయ్య పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రాలో సీఐటీయూ ప్రథమ మహాసభలు జరిగాయి. ఈసందర్భంగా వీరయ్య మీడియాతో మాట్లాడారు. నల్లధనం వెలికి తీత పేరిట తీసుకున్న ఈనిర్ణయంతో ప్రజల కొనుగోళ్ల శక్తి దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడా పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు లక్షలు..కోట్లు కుచ్చుటోపి పెట్టడంతో ఈ సంస్థలు ఇప్పుడు తీవ్ర ద్రవ్యకొరతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 

16:24 - November 20, 2016
16:24 - November 20, 2016

గాంధీ బజార్ లో ఉద్రిక్తత..

అనంతపురం : పాతూరు గాంధీ బజార్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు వెడల్పులో భాగంగా అక్రమ భవనాలు కూల్చేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో వచ్చారు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు.

 

ఆగ్రాలో ప్రధాన మంత్రి మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఉదయం కాన్పూర్ లో రైలు ప్రమాదం జరిగిందని, సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రైలు ప్రమాద ఘటనపై కేంద్రం విచారణ జరిపిస్తుందని, ఇల్లంటే నాలుగు గోడలు మాత్రమే కాదన్నారు. ఇంటికి సరైన అర్థం వచ్చేలా నిర్మాణం చేస్తామన్నారు. దేశంలో పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నోట్ల రద్దుపై పలు సమస్యలు ఎదురవుతాయని తాను ముందే చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. 

16:16 - November 20, 2016

విజయవాడ : ఓ సమస్య అపరిష్కృతంగా ఉండడం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చంద్రబాబు టెలీక్ఫారెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనకే అసహనంగా ఉందని..ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. సంక్షోభంలో పరస్పర సహకారం..సమన్వయం సమర్థకార్యాచరణ ప్రధానమన్నారు. సమర్థతను నిరూపించుకొనేందుకు బ్యాంకర్లకు అవకాశం ఉందని, రాష్ట్రానికి మరో రూ. 2వేల కోట్ల కరెన్సీ వచ్చిందన్నారు. ఇందులో రూ. 100 నోట్లు 400కోట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహితంగా జరగాలని, జన్ ధన్ ఖాతాల్లో రూపే కార్డులను యాక్టివేషన్ చేయాలని ఆర్ బీఐ, ఎస్ఎల్ బీసీ అధికారులకు సూచనలు అందించారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఎస్ఎల్ బీసీ, బ్యాంకర్లతో ప్రత్యేక భేటీ ఉంటుందన్నారు. 

16:04 - November 20, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు పేదలను..సామాన్యుడిని కుదేలు చేస్తోంది. చేతిలో డబ్బు ఉన్నా చిల్లర దొరక్క కొందరు..డబ్బులు దొరక్క మరికొందరు..ఇలా చాలా మంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పెద్దనోట్ల రద్దు చేసి 12 రోజులయిన తరువాత సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. నోట్ల మార్పిడిపై ప్రభుత్వం తగిన కసరత్తులు చేయలేదన్నారు. సరైన అంచనాలు లేకుండా నోట్ల రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేసిందని, కొత్త కరెన్సీ ఎంత మేర అందుబాటులో ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణాల్లోని మార్కెట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నోట్ల మార్పిడికి వచ్చే వృద్ధుల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. నోట్ల రద్దుపై జనసేన ఎలా స్పందిస్తుంది ? పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. మరి పవన్ చేసిన సూచనలు..విమర్శలపై బీజేపీ, టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

గోయల్ తో ముగిసిన కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తో సీఎం కేసీఆర్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, విద్యుత్ విభాగంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై గోయల్ తో కేసీఆర్ చర్చించారు.

 

నోట్ల రద్దుపై పవన్ స్పందన..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. నోట్ల మార్పిడిపై ప్రభుత్వం తగిన కసరత్తులు చేయలేదన్నారు. సరైన అంచనాలు లేకుండా నోట్ల రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేసిందని, కొత్త కరెన్సీ ఎంత మేర అందుబాటులో ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణౄల్లోని మార్కెట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నోట్ల మార్పిడికి వచ్చే వృద్ధుల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

15:54 - November 20, 2016
15:33 - November 20, 2016

యూపీ రైలు ప్రమాద ఘటనలో కొనసాగుతున్న చర్యలు..

ఉత్తర్ ప్రదేశ్ : పాట్నా - ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రమాదంలో 100 మంది మృతి చెందారు. 200 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

15:06 - November 20, 2016

ఢిల్లీ : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో జరుగుతున్న ఇబ్బందులను చెప్పేందుకు కేసీఆర్ ఢిల్లీకి వచ్చారు. ప్రధాని భేటీ అనంతరం వివిధ కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను వివరించారు. ఈ భేటీలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఎంపీలు పాల్గొన్నారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ సాంకేతిక అంశాలపై చర్చించారు. 24గంటల పాటు కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎలాంటి సమస్యలు ఏర్పడుకుండా చూడాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

14:59 - November 20, 2016

అమెరికా : కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారికి ఎలాంటి సేవలు నిర్వహిస్తారో ఆ సేవలను న్యూజెర్సీలోనూ కొనసాగిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే వైభోత్సవాల్లో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. న్యూజెర్సీలోని వారందరూ పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. సుప్రభాత సేవ, తోమాల, అర్చన, సహస్ర కళశాభిషేకం నుంచి ఏకాంత సేవ వరకు తిరుమలలో చూసిన విధంగానే ఇక్కడ కూడా స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

14:58 - November 20, 2016

చిత్తూరు : శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్‌ తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని బాబు గురుకుల్‌ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. శనివారం రాత్రి ఏకాంత సేవతో మూతపడిన ఆలయాన్ని గురుకుల్‌ అంత్యక్రియల అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించి తెరవనున్నారు. 

14:55 - November 20, 2016

హైదరాబాద్ : సుల్తాన్ బజార్..వ్యాపార కేంద్రం..ఎప్పుడు చూసినా ఈ ప్రాంతం వినియోగదారులతో కిటకిటలాడుతుంటుంది. కానీ ప్రస్తుతం ఈ బజార్ బేజార్ అయిపోతోంది. కొనుగోళ్లు లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వీరిపై పడింది. చిల్లర సమస్యతో సుల్తాన్ బజార్‌లో అమ్మకాలు భారీగా పడిపోయాయి. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిరు వ్యాపారుల ఆదాయానికి గండి కొడుతోంది. మరో వైపు చిల్లర దొరక్క జనాలు అల్లాడుతున్నారు. బ్యాంకుల ముందు వినియోగదారులు బారులు తీరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:52 - November 20, 2016
14:50 - November 20, 2016

ఛండీఘఢ్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు పెద్ద నోట్ల రద్దు సెగ తగిలింది. బీజేపీ అధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశం అల్లకల్లోలం అవుతున్నా కేంద్రం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు వాటర్‌ క్యాన్లను ప్రయోగించారు. దీంతో ఛండీఘడ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

14:48 - November 20, 2016

ఉత్తరప్రదేశ్‌ : ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్‌పూర్‌ దేహత్‌ జిల్లాలోని పుఖ్రాయాన్‌ వద్ద తెల్లవారుజామున పట్నా - ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 97 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటుచేశారు. ఏ1, ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, జీఎస్‌, బీ1, బీ2, బీ3, బీ2, లగేజీ ర్యాక్‌ బోగీలు పట్టాలు తప్పాయి.

స్పందించిన సురేష్ ప్రభు..
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు స్పందించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధికారులందరూ తక్షణం ప్రమాదస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మోడీ దిగ్ర్భాంతి..
యూపీలో ఘోర రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆరా తీసిన అఖిలేష్ యాదవ్..
రైలు ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరా తీశారు. డీజీపీకి ఫోన్‌ చేసి సహాయచర్యలపై సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

రాజ్ నాథ్ సింగ్ విచారం..
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులందరూ సహాయచర్యల్లో పాల్గొనాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

14:44 - November 20, 2016

వనపర్తి : జిల్లాలో దారుణం జరిగింది. వివాహిత కూతురుతో సహా అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాకొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన పవిత్రకు శివకుమార్ అనే వ్యక్తితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి వైష్ణవి (8నెలలు) చిన్నారి ఉంది. ప్రస్తుతం పవిత్ర మూడు నెలల గర్భిణీ. ఈ నేపథ్యంలో పవిత్ర..చిన్నారి వైష్ణవి మృతేదహాలు చెరువులో లభ్యమయ్యాయి. వారి మృతికి భర్తే కారణం అంటూ శివ ఇంటి ముందు మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. చంపేసి పీఎస్ కు వెళ్లి లొంగిపోతే సరిపోతుందా ? ఇంకో అమ్మాయికి ఇలాంటి ఘోరం జరగవద్దని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన భార్య కనిపించడం లేదంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కానీ పవిత్రను శివే హత్య చేశాడంటూ కుటుంబసభ్యులు ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

13:55 - November 20, 2016

చైనా : హైద‌రాబాదీ బ్యాడ్మింట‌న్ సెన్సేష‌న్ పీవీ సింధు మ‌రో ఘ‌న‌త సాధించింది. చైనా ఓపెన్ రూపంలో కెరీర్‌లో తొలిసారి సూప‌ర్ సిరీస్ టైటిల్ గెలిచింది. ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన తొలి బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర‌ సృష్టించిన సింధు.. తాజా విజ‌యంతో కెరీర్‌లో మ‌రో మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఫైన‌ల్లో చైనా ప్లేయ‌ర్ సున్ యుపై 21-11, 17-21, 21-11 తేడాతో గెలిచి టైటిల్ ఎగ‌రేసుకుపోయింది. సింధు కెరీర్‌లో ఇదే తొలి సూప‌ర్ సిరీస్ టైటిల్‌. గ‌తేడాది డెన్మార్క్ ఓపెన్ ఫైన‌ల్ చేరినా.. టైటిల్ గెల‌వ‌లేక‌పోయిన ఆమె.. ఈసారి త‌న క‌ల‌ను సాకారం చేసుకుంది. 

13:47 - November 20, 2016
13:45 - November 20, 2016

హైదరాబాద్ : పసి పిల్లలు తాగే పాల నుంచి వయో వద్ధులు తీసుకునే పండ్ల వరకు ప్రతిదీ కల్తీమయం. ఏది తిందామన్నా.. కల్తీ కాటేస్తోంది. ఏటేటా వీపరీతంగా పెరిగిపోతున్న మాంస వినియోగాన్ని ఆయుధంగా చేసుకొని కల్తీ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోనున్నారని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

పెరిగిపోతున్నకల్తీ మాంసం
సండే వచ్చిందంటే ముక్క కావల్సిందే అంటారు చాలామంది. మితంగా తీసుకుంటే మాంసాహారం మంచిదే అయినా.. ఇప్పుడు మాంసాన్ని సైతం కల్తీ కాటు వేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా పదేళ్లలో మాంసం వినియోగం 20 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. పశు గ్రాసం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, తదితర కారణాల వల్ల పశుపోషణ భారంగా మారింది. మరోవైపు మాంసం వినియోగం వేగంగా పెరిగిపోతోంది. దీన్ని ఏదో విధంగా క్యాష్‌ చేసుకోవాలనే తలంపుతో కొన్ని ఆహార సంస్థలు కల్తీ వ్యాపారానికి తెరదీస్తున్నాయి.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ల్యాబ్‌ సర్వే...
భారత దేశ పౌరులు మాంసాహార ప్రియులు'' నివేదికలు చెబుతున్న మాట ఇది! అయితే, దేశంలో మాంసాహార నాణ్యతా పరీక్షల తీరు అత్యంత అధ్వాహ్నంగా ఉండటం కలవరపరుస్తోంది. భారత దేశంలో మేక, గొర్రె, కోడి మాంసాలకు ఎక్కువ గిరాకీ ఉంది. దీంతో మేక, గొర్రె మాంసం పేరుతో ఇతర జీవుల మాంసాన్ని, కోడిమాంసం ముసుగులో బాతు మాంసాన్ని విక్రయిస్తున్నారు. దేశంలోని 50 శాతానికి పైగా ప్రజలు కోడిమాంసాన్నే వినియోగిస్తున్నారు. ప్రతి ఏటా 8 నుంచి 10 శాతంగా ఈ రంగం వృద్ధి సాధిస్తోంది. ఇదే కల్తీ రాయుళ్లకు వరంగా మారింది. గతేడాది సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎన్విరాన్మెంట్‌ ల్యాబ్‌ ప్రతినిధులు దేశంలో వివిధ ప్రదేశాలలోని కోడి మాంసాల శాంపిళ్ళ పై చేసిన ప్రయోగాలలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి.

కోళ్లలో యాంటీబెయోటిక్స్ వాడకం
దేశంలోని కొన్ని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడానికి కొన్ని రకాల యాంటీబయోటిక్స్‌ను వాటి శరీరంలోకి పంపిస్తున్నట్టు ఈ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. ఈ రసాయనం సదరు జీవి కండరాలు, లివర్‌, కిడ్నీ తదితరాలను ఉబ్బినట్టు చేస్తుంది. తద్వారా ఆ కోడి తక్కువ సమయంలో బాగా బలిసినట్టు కనిపిస్తుంది. పైకి చూసే వారికి ఆ కోడి ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించినా లోపలమాత్రం విషరసాయనాలతో నిండి ఉంటోంది. దాదాపుగా ఇదే విధానం మేకలు, గొర్రెల్లో కూడా జరుగుతోందని ఆ సంస్ధ తెలిపింది. అటు కోడి మాంసానికి సైతం కొందరు అక్రమార్కులు యాంటీ బయోటిక్స్‌ను ఎక్కించి బాగా ఉబ్బినట్లుగా తయారు చేస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించి క్యాష్‌ చేసుకుంటున్నారు.

కల్తీ మాంసం వినియోగంతో అనారోగ్యాల పాలు
ఇవేవీ తెలియని ప్రజలు ఆ మాంసాన్ని తమ ఆహారంగా తీసుకోవడం వల్ల న్యుమోనియా, క్షయా, సెప్సిస్‌, క్యాన్సర్‌ వంటి రోగాలబారిన పడుతున్నారు. రోగాలతో చచ్చిన కోళ్ళు, మేకలతో చేసిన వంటకాల్ని కొన్ని హోటళ్ల్లు, కొన్ని రెస్టారెంట్లు మాంసంపై రసాయన రంగులు చల్లి వేడివేడిగా వడ్డిస్తూ ప్రజల ఉసురు తీస్తున్నాయి. ఇక రెడీమెడ్‌గా దొరికే నాన్‌ వెజ్‌ పిజ్జా, బర్గర్‌, పఫ్‌ల విషయంలో పరస్ధితి మరింత దారుణం. అమెరికా,ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. వాస్తవానికి ఆహారరంగంలో నిబంధనలను కఠినంగా అలుచేస్తాయన్న మంచిపేరున్న ఐరోపాదేశాలు సైతం కల్తీ మాంసాహార విక్రయాలను గుర్తించలేకపోతున్నాయి.

కల్తీ మాంసంతో ఆస్పత్రిపాలవుతున్న 120 మంది హైదరాబాదీలు
కల్తీ మాసం విషయంలో నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి. మనదేశంలో మాంస పరీక్షల కోసం సేకరించిన ప్రతి ఐదు నమూనాల్లో ఏ ఒకటీ ప్రమాణాలతో లేవు. మాంసంలో ప్లాస్టిక్ పదార్ధాలను కలుపుతున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. హోటళ్లల్లో తినే ఆహారం వల్ల ప్రతి నెలా సుమారు 120 మంది హైదరాబాదీలు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

ఈస్ట్రోజన్‌ హార్మోన్‌తో గుడ్ల కృత్రిమ ఉత్పత్తి
నేడు మార్కెట్లలో లభిస్తున్నవి ఎక్కువగా హాప్లాయిడ్‌ కోడిగుడ్లే. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌తో గుడ్లను కృత్రిమంగా ఉత్పత్తయ్యేలా చేస్తున్నారు. ఈ కోడిగుడ్లు తిన్న అమ్మాయిల్లో గైనిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. కోళ్లకు వాడుతున్న గ్రోత్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల పురుషుల్లోనూ రొమ్ము పెరిగిపోతుంది. బ్రెస్ట్‌ రిమూవింగ్‌ సర్జరీలలో అధిక శాతం పురుషులే చేయించుకుంటున్నారని ఓ సర్వేలోనూ వెల్లడైంది. రోజరోజుకు పెరుగుతోన్న మాసం వినియోగంలో కల్తీ ఆందోళనకు గురిచేస్తోంది. కల్తీ మాంసం విషయంలో ప్రభుత్వం తగిన యంత్రాంగాన్ని కేటాయించి పౌరుల ఆరోగ్యాన్నికాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

13:38 - November 20, 2016
13:36 - November 20, 2016

విశాఖ : అధికార అండదండలతో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడే రోడ్డును అర్ధాంతరంగా మూసేసింది ఓ షిష్పింగ్ కంపెనీ యాజమాన్యం. ఒక రహదారే కాదు, గ్రామ రెవెన్యూ భూమి, ఇలా ఎన్నింటినో ఆక్రమించేసింది. ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తున్న విశాఖలోని ఓ షిప్పింగ్ కంపెనీ తీరుపై టెన్ టివీ కథనం.

విశాఖలో శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ..10 ఎకరాల్లో ఏర్పాటు
విశాఖ నగర శివారులోని మింది గ్రామపరిధిలో దాదాపు 15 ఏళ్ల క్రితం శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ప్రారంభమయ్యింది. 15 నుంచి 22/8 సర్వే నెంబర్ లలో 10 ఎకరాలకు పైగా శ్రావణ్ షిప్పింగ్ భూమి ఉంది. ఈ భూమిని ఆనుకొని మింధి గ్రామానికి చెందిన 60 అడుగుల రోడ్డు, స్మశానం, అమ్మవారి దేవస్థాన స్థలం, గ్రామ రెవెన్యూ భూమి, జీవీఎంసీ భూములు ఉన్నాయి. అయితే క్రమక్రమంగా ఈ భూములను శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఆక్రమించుకొని కంపెనీకి చెందిన కంటైనర్లు, భారీ వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు ఉపయోగించుకుంటోంది.

కంపెనీ తీరును వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
కంపెనీ తీరును గ్రామస్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో ఆరేళ్ల క్రితం కూడా మింధి గ్రామస్తులకు, శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యం మధ్య ఈ రోడ్డుకు సంబంధించిన వివాదం చోటుచేసుకుంది. గ్రామస్తులంతా ఆందోళనకు దిగడంతో తమకు రోడ్డు కావాలని 60 అడుగుల రోడ్డును కంపెనీకి ఇస్తే ప్రత్యామ్నాయంగా మరో రోడ్డును గ్రామస్తులకు ఇస్తామని పెద్దమనుఘుల ముందు ఒప్పందం చేసుకొంది. దీంతో అప్పట్లో ఈ వివాదం సద్దుమణిగింది.

ఒప్పందాన్ని ఉల్లంఘించిన కంపెనీ
పెద్దమనుఘల ముందు చేసుకొన్న ఒప్పందాన్ని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఉల్లంఘించి వివాదానికి కారణమైన రోడ్డును, ప్రత్యామ్నాయంగా ఇచ్చిన రోడ్డును రెండింటిని పూర్తిగా మూసేసింది. దీంతో గ్రామస్తులు తిరిగి ఉద్యమబాట పట్టారు. కంపెనీ తీరుపై కన్నెర్ర చేసిన తమపై పోలీసుల సహాయంతో అక్రమకేసులు పెట్టి కంపెనీ యాజమాన్యం వేధిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కంపెనీ కబ్జాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
మింది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కలిసి రహదారితో పాటుగా అనేక ప్రభుత్వ, పోర్టుకు చెందిన భూములను సదరు షిప్పింగ్ కంపెనీ ఆక్రమించుకుందని ఫిర్యాదు చేసారు. దీనిపై స్ధానిక ఎమ్మెల్యే స్పందించారు. గ్రామస్తులు, పోర్టు, జీవీఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

కొంతమంది కావాలనే తమపై విమర్శలు చేస్తున్నారంటున్న కంపెనీ
ఇదీలా ఉంటే మరో వైపు కంపెనీ వినిపిస్తున్న వాదన పూర్తి భిన్నంగా ఉంది. తాము వచ్చిన తర్వాతే ఇక్కడ రోడ్డు వేశారన్నారు. పోర్ట్ క్లియరెన్స్ వస్తే ప్రజలకు సెఫ్టీతో కూడిన రోడ్డు వస్తోందని చెబుతున్నారు. తమపై కొంతమది కావాలనే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

ఇప్పటికైనా స్పందించాలంటున్న గ్రామస్తులు
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరీ ప్రభుత్వం, అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలంటే వేచి చూడాల్సిందే. 

13:29 - November 20, 2016
13:27 - November 20, 2016

విజయవాడ : ఒక సమస్య ఇన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉండటం తన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆర్‌బీఐ, ఎస్‌ఆర్‌బీసీ అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 12 రోజులైనా డిమానిటైజేషన్‌ సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధాకరమన్నారు. ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్న బాబు.. దీనిపై తనకే అసహనంగా ఉందన్నారు. సంక్షోభంలో పరస్పర సహకారం, సమన్వయం, సమర్థ కార్యాచరణ ప్రధానమన్నారు. ఇది సమర్థతను నిరూపించుకునే అవకాశంగా బ్యాంకర్లు భావించాలన్నారు. రాష్ట్రానికి మరో రూ.2వేల కోట్లు వచ్చాయని తెలిపారు. ఇందులో రూ.100 నోట్లు రూ. 400 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరగాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జన్‌ధన్‌ ఖాతాలలో రూపేకార్డులను వెంటనే యాక్టివేషన్‌ చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.

13:12 - November 20, 2016

నిజామాబాద్ : కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారిని ఏజెంట్లు అడ్డంగా దోచేస్తున్నారు. ఏజెంట్లు ఆడుతున్న అడ్డగోలు భాగోతంలో అప్పులు చేసి మరీ గల్ఫ్ బాటపడుతున్న వారు అనేక మోసాలకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఏ గ్రామంలో చూసిన ఏజెంట్ల వలలో చిక్కి మోసపోయిన బాధితులే కనిపిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఉపాధి కోసం చాలామంది గల్ఫ్ బాట
నిజామాబాద్ జిల్లాలో పొట్టకూటి కోసం చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. వీరి అయాకత్వాన్ని ఆసరా చేసుకొని కొందరు ఏజెంట్లు అడ్డంగా దోచేస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్, మలేషియా లాంటి దేశాలకు కార్మికులను తీసుకెళుతూ వారి పాస్ పోర్టులను ఏజెంట్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. అక్కడ ఎయిర్ పోర్టు నుంచి బయటపడగానే ఏజెంట్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మలేషియాలో బార్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, పబ్బులు, వాణిజ్య సముదాయాల్లో ఉద్యోగాలున్నాయంటూ నమ్మంచి కార్మికులను మభ్య పెడుతున్నారు.

నిజామాబాద్, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ కు వలస
తాజాగా నిజామాబాద్, కరీంనగర్,అదిలాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు రెండు వేల మందిని.. ఏజెంట్లు మలేషియాకు తరలించారు. వర్క్ వీసాలు ఇస్తామని నమ్మించిన ఏజెంట్లు.. కార్మికుల నుండి లక్షన్నర చొప్పున వసూలు చేసి విజిట్ వీసాలు చేతిలొ పెట్టి నట్టేట ముంచారు. ఏయిర్ పోర్టు నుండి బయటకు రాగానే పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వర్క్ వీసా కోసమని బురిడి కొట్టించారు.

చేతిలో పాస్ పోర్టు లేకపోవడంతో దోంగచాటుగా పని
చేతిలొ పాస్ పోర్ట్ లేకపోవటంతో దొరికిన పనిని దొంగచాటుగా చేస్తూ కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్మికులు మలేషియా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఒకవేళ పోలీసులు తనిఖీల్లో చిక్కితే కార్మికులు జైళ్ల పాలవుతున్నారు. జరిమానా చెల్లించిన వారు ఔట్ పాస్ పోర్టుతో బయటకు వస్తున్నారు.

మలేషియాలో చిక్కుకొన్న వారిని ఇండియాకు రప్పించాలి: సీఐటీయూ
ఏజెంట్ల చేతిలో మోసపోయి మలేషియాలొ కష్టాలు పడుతున్న వారిని ఇండియాకు రప్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి పేరుతో మోసం చేసిన ఏజెంట్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్, మలేషియా లో చిక్కుకొన్న బాధితుల విషయంలో ప్రభుత్వం దృష్టిసారించాలని బాధితులు కోరుతున్నారు. 

13:08 - November 20, 2016

విజయవాడ : సమజానికి రక్షణగా నిలవాల్సిన ఓ పోలీస్ అధికారి ప్రభుత్వ భూములనే మింగేశాడు. దేశ రక్షణ కోసం పనిచేసిన సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, రెవెన్యూ, ఫారెస్ట్ , ఎస్సీ వర్గాలకు చెందిన 100 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. ఏకంగా ఈ భూములకు పెన్సింగ్ వేశాడు.

కృష్ణా జిల్లాలో డీఎస్పీ స్ధాయి అధికారి భూదాహం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం రెవిన్యూ పరిధిలో దేశం కోసం పోరాడిన సైనికులకు ప్రభుత్వం కేటాయించిన భూములతో పాటు ప్రభుత్వ, ఫారెస్ట్, ఎస్సీలకు చెందిన భూములు ఉన్నాయి. వీటిపై ఇదే జిల్లాలో పనిచేస్తున్న ఓ డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుపడింది. దీంతో వెంటనే సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను తన బంధువుల పేరుతో అనామతు కొనుగోళ్లు చేశాడు. సైనికుల భూములకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ, ఫారెస్ట్, అసైండ్ భూములను సైతం ఆక్రమించుకొన్నాడు.
27 ఎకరాల సైనికుల భూమి తన భార్య పేరుతో కొనుగోలు
ఈ డిఎస్పీ స్ధాయి అధికారి కృష్ణా జిల్లా నందిగామలో పనిచేస్తున్న సమయంలో సైనికులకు కేటాయించిన 27 ఎకరాల భూమిని తనభార్యపేరుతో కొనుగోలు చేసి అనామతుగా స్వాధీనం చేసుకున్నాడు. ఇటీవల భూములు ధరలు పెరగడంతో బండిపాలెంకు చెందిన కనగాల సత్యనారాయణ అనే వ్యక్తి సహాయంతో ఎస్సీలు పొందిన అసైన్డ్ భూములను సైతం ఆక్రమించుకోన్నాడు. దాదాపుగా 100 ఎకరాల సైనిక, ప్రభుత్వ, ఫారెస్ట్, అసైన్డ్ భూములలో ఇనుప కంచెను ఏర్పాటు చేసాడు. దీనిపై కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్ధానిక రెవెన్యూ అధికారులు ప్రాధమిక విచారణ చేపట్టారు.

భూ కబ్జాల వెనుక రాజకీయ నాయకుల అండదండలు
ఈ భూ కబ్జా వెనక రాజకీయ నాయకులు అండదండలు, పోలీసుల సహాకారం పుష్కలంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలలుగా ఈ భూములను చదును చేసి పెన్సింగ్ పనులు నిర్వహిస్తునన్న స్ధానిక రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. 

12:59 - November 20, 2016

విశాఖ : పెద్దనోట్ల రద్దుతో విశాఖలోని చిల్లర వర్తకులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిల్లర కొరత కూరగాయలు అమ్ముకునే చిల్లర వర్తకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆటోవాలాలకు కిరాయిలు తగ్గి ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా చిల్లర నోట్లను అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తొలగిపోతాయని అప్పటివరకూ ఈ కష్టాలు తప్పవని వినియోదారులు పేర్కొంటున్నారు.

12:56 - November 20, 2016

ఉత్తరప్రదేశ్‌: ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్‌పూర్‌ దేహత్‌ జిల్లాలోని పుఖ్రాయాన్‌ వద్ద తెల్లవారుజామున పట్నా - ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 96 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటుచేశారు. ఏ1, ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, జీఎస్‌, బీ1, బీ2, బీ3, బీ2, లగేజీ ర్యాక్‌ బోగీలు పట్టాలు తప్పాయి.

రైలు ప్రమాదంపై స్పందించిన రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు స్పందించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధికారులందరూ తక్షణం ప్రమాదస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి
యూపీలో ఘోర రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

అఖిలేశ్‌ యాదవ్‌ ఆరా
రైలు ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరా తీశారు. డీజీపీకి ఫోన్‌ చేసి సహాయచర్యలపై సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులందరూ సహాయచర్యల్లో పాల్గొనాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

12:47 - November 20, 2016

నాజాతి చరిత్ర నా జాతి సౌందర్యాత్మక పని విలువలు వేల సంవత్సరా నుండి యజ్ఞంలో తగలబడుతూనే వున్నాయంటూ దళిత బహుజన ధిక్కార స్వరమై ఎగసిపడి కవి గుడిపల్లి నిరంజన్ కవితలు..లందపొద్దు అనే సంకలనంతో ఈనాటి అక్షరం..ఈ జి.లక్ష్మీ నరసయ్య విశ్లేషణ ఈనాటి అక్షరంలో చూడండి..

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ఛత్తీస్‌గఢ్‌ : ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. సిలియారి, మందార్ మధ్య ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో బోగీలు చెల్లాచెదరుగా పడిపోయాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వేను బాగు చేసేందుకు ప్రయత్నించారు. కాగా ఈరోజు ఉదయం యూపీలో పాట్నా ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 96 మందికి పైగా మృతి చెందగా మరో 150మందికి పైగా గాయాలయ్యాయిన విషయం తెలిసిందే. 

బాబు లేఖలతో ఏపీకి రూ.2,200కోట్లు..

విజయవాడ : నోట్ల మార్పిడితో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజల ఇబ్బందులకు గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు రిజర్వ్ బ్యాంకు కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాని ఫలితమే ఆదివారం నాడు ఏపీకి రూ.రూ.2,200 కోట్లు స‌ర‌ఫ‌రా చేసింది. ఆదివారం ఆ సొమ్మును అన్ని జిల్లాల‌కు పంపిణీ చేయ‌నుంది. న‌గ‌దు ర‌వాణా కోసం త‌గిన ఏర్పాట్లు చేయాలనీ..వాహ‌నాలు, భ‌ద్రతా సిబ్బందిని నియ‌మించాల‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని కోరింది. 

91కి పెరిగిన రైలు ప్రమాదం మృతులు..

ఉత్తర్‌ప్రదేశ్‌ : కాన్‌పూర్‌ దేహత్‌ జిల్లాలోని పుఖ్రాయాన్‌ వద్ద పాట్నా - ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 91 మంది మృతి చెందినట్లుగా సమాచారం. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కదులుతున్న ట్రైన్ లో మహిళపై లైంగిక దాడి..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటుచేసుకుంది. రాజధాని నేరాలకు నిలయమైపోతోంది. కదులుతున్న రైల్లో ఓ మహిళపై దుర్మార్గులు లైంగిక దాడికి పాల్పడ్డారు. రైల్లోని మహిళల కోచ్ లో కేవలం ఐదుగురు మహిళలు ఆన్నారు. అందులో నలుగురు మహిళలు షాదారాలో దిగిపోయారు. ఆ తర్వాత కోచ్ లో కేవలం ఓ 32 ఏళ్ల మహిళ మాత్రమే ఉంది. ఆ సమయంలో ఆ కోచ్ లోకి ముగ్గురు దుండగులు ప్రవేశించి ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని ఇద్దరి పారిపోగా... ఒకడు మాత్రం ఆమెను దారుణంగా కొట్టి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది.

బాలీవుడ్ బాద్షాకు తప్పిన ప్రమాదం..

ముంబై : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. షారూఖ్ తాజా చిత్రం 'డియర్ జిందగీ' షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది.ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా షారుఖ్, అలియాలు గల్లీ రోడ్డులో సైకిల్ పై చక్కర్లు కొట్టే సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో సైకిల్ పక్కన నిలుచున్న షారుఖ్ ను గమనించని టెంపో డ్రైవర్ టెంపోను ముందుకు దూకించటంతో అది సైకిల్ పైనుండి దూసుకుపోయింది. కానీ ముందే గమనించిన షారుఖ్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో... అతనికి పెను ప్రమాదం తప్పింది.

అన్నలకు నోటు పాట్లు..

ఖమ్మం : పాతనోట్ల రద్దు దేశంలోని అన్ని రంగాల మీద తీవ్రప్రభావం చూపిస్తోంది. దీనికి మావోయిస్టులు కూడా అతీతంకాదు. పాతనోట్లకు మార్చుకునే యత్నంలో మావోలు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రజల ద్వారా నోట్లు మార్చుకునేందుకు యత్నిస్తుండా పామేడు పోలీసులు పట్టుకున్నారు. రై.6లక్షల నోట్లను మార్చుకునే గ్రామీణులు వాటికి సంబంధించి ఎటువంటి వివరాలు చెప్పకపోవటంతో అవి మావోలకు సంబంధించిన నగదుగా భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

11:16 - November 20, 2016

వరంగల్ : ఎంత సరుకు అమ్మినా అంతా ఉత్తదే.... మార్కెట్ మాయకు... చెక్కుల చిక్కులకు చిత్తవ్వాల్సిందే. బకాయిలు భయ పెడుతున్నాయి... బ్యాంకర్లు దడ పుట్టిస్తున్నారు. ఆశతో వస్తున్న అన్నదాతలకు నల్లధనం కట్టడి వ్యవహారం గుదిబండగా మారింది. కేంద్రం నిర్ణయం తెల్ల బంగారానికి శాపమవుతోంది. కర్షకుల కంట నీరు తెప్పిస్తున్న పెద్ద కష్టంపై 10TV స్పెషల్ స్టోరీ...!

ఆసియా ఖండంలోనే ఎనుమాముల మార్కెట్ అతి పెద్దది..
క్వింటాళ్ల పత్తి అమ్మినా.. ఖాళీ చేతులతో ఇంటిముఖం...వ్యాపారులు ఇస్తున్న చెక్కులతో రైతులకు చిక్కులు..నిత్యం క్రయవిక్రయాలతో కళకళలాడే వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్‌. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పుడీ మార్కెట్‌కు వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. క్వింటాళ్లకు క్వింటాళ్ల తెల్ల బంగారాన్ని అమ్మిన రైతులకు వ్యాపారులు నగదుకు బదులు చెక్కులు ఇస్తున్నారు. దీంతో అన్నదాతలు.. చేతుల్లో చెక్కులు పట్టుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే అనావృష్టి, అతివృష్టితో నష్టాల పాలైన రైతులు..తాజా కరెన్సీ కష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
చెక్కులతో కూలీలకు డబ్బులెలా ఇవ్వాలని రైతుల ఆందోళన
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు.. మార్కెట్‌కు పెద్ద మొత్తంలో సరుకులు తెచ్చినా డబ్బులు దక్కని పరిస్థితి ఉంది. పత్తిని విక్రయించిన రైతులకు వ్యాపారులు చెక్కులు ఇవ్వడం అన్నదాతల పాలిట ఆశనిపాతంగా మారుతోంది. చెక్కులతో కూలీలకు, ఇతరులకు డబ్బులెలా ఇవ్వాలని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యాపారులు ఇచ్చిన చెక్కులతో బ్యాంకులకు వెళితే.. బ్యాంకర్లు వాటిని వడ్డీ కింద జమ చేసుకునే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

దిక్కుతోచని పరిస్థితిలో ఉద్దెరకు సైతం సరుకును అప్పగించి వెళ్తున్న రైతులు
పెద్ద నోట్లు చెలామణి కాకపోవడంతో వ్యాపారులు.. రైతులు తీసుకొచ్చిన సరుకులు కొంటున్నారు కానీ.. రైతులకు నగదు ఇవ్వడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉద్దెరకు సైతం సరుకును అప్పగించి వెళుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎలా అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఎనుమాముల మార్కెట్‌లో.. కొందరు వ్యాపారులు చీటిపై ధర వేసి మరో వారం పదిరోజుల తర్వాత రమ్మని చెబుతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో పత్తి క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నా, రైతులకు డబ్బులు అందడం లేదు. పెద్ద నోట్ల కట్టడి తర్వాత మహబూబాబాద్‌ , కేసముద్రం మార్కెట్లు కొద్ది రోజులుగా మూతపడ్డాయి.

చిల్లర నోట్లు దొరక్క పత్తి ఏరే కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి
మరోవైపు పత్తి చేల్లో విరగబూసిన పత్తిని సేకరించేందుకు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. చిల్లర నోట్లు దొరక్క పత్తి ఏరే కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో అటు పండిన పంట చేతికి రాక.. ఒకవేళ పంట చేతికొచ్చినా.. మార్కెట్‌లో నగదు లభించక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

కనీసం హోటళ్లలో భోజనం చేద్దామన్న పెద్ద నోట్లు చెల్లుబాటు కాని పరిస్థితి
మరోవైపు పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో... ఏనుమాముల మార్కెట్‌ డీలా పడిపోయింది. గతేడాది డెబ్బై వేల నుంచి లక్షా యాభైవేల పత్తి బస్తాలు మార్కెట్‌కు వస్తే.. ఈసారి కనీసం పది వేలు కూడా మించకపోవడం శోచనీయం. మార్కెట్‌కు వచ్చే రైతులు కనీసం హోటళ్లలో భోజనం చేద్దామన్న పెద్ద నోట్లు చెల్లుబాటు కావడం లేదు. అష్టకష్టాలు పడి కొత్త నోట్లను తీసుకొచ్చినా.. రెండు వేలకు చిల్లర లేదని వ్యాపారులు వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

ఎరువులు కొనేందుకు కూడా నోట్ల కష్టాలే
వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం విక్రయించేందుకు వెళ్తే నగదు ఇవ్వకుండా...బ్యాంకులో డబ్బులు జమ చేస్తామంటున్నారని, కనీసం ఎరువులు కొనాలన్నా... పాత నోట్లను తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఎరువుల బస్తాలు, కూలీలకు డబ్బులు లేక వ్యవసాయం పూర్తిగా కుంటుబడిపోతోంది. సీజన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.  

11:05 - November 20, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా చిల్లర కష్టాలే. కూరగాయాల మార్కెట్లో అయితే చిల్లర సమస్యను మాటల్లో చెప్పలేము. ఏ కూరగాయ కొనాలన్నా 10, 20 చిల్లర నోట్లు ఉండాల్సిందే. ప్రస్తుతం చిల్లరదొరక్క కూరగాయల మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిల్లర కష్టాలను తీర్చేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన టోకెన్ల జారీ విధానం మెరుగైన ఫలితాలను ఇస్తోంది.

కూరగాయల మార్కెట్ల చిల్లర కష్టాలకు చెక్‌పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
ఇక్కడ మీరు చూస్తుంది కూకట్‌పల్లి రైతు బజార్‌. పెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరక్క, అమ్మకాలు లేక నిన్నటి వరకు ఈ రైతు బజారు వెలవెలబోయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఓ వినూత్న ప్రయోగంతో మళ్లీ ఈ రైతు బజార్‌ వినియోగదారులతో కిటకిటలాడుతోంది. రైతులకు, వినియోగదారులకు పెద్దనోట్ల రద్దుతో ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించటానికి వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ కూకట్‌పల్లి రైతు బజార్లో ఐడీఎఫ్ సీ బ్యాంక్‌తో కలిసి,..ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన 20,10,5 రూపాయల విలువైన టోకెన్ల జారీ విధానం మెరుగైన ఫలితాలనిస్తోంది.

ఏ బ్యాంకులో అకౌంట్‌ ఉన్నా..టోకెన్ల ద్వారా సమస్యకు చెక్‌
కూకట్‌పల్లి రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ఈ మైక్రో ఏటీఎం ద్వారా ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్న వినియోగాదారులైనా ఇక్కడ టోకెన్లు తీసుకోవచ్చు. కేవలం ఆధార్‌ నెంబర్ అనుసంధానమై ఉంటే చాలు,.ఇక్కడ రైతు బజార్‌లో టోకెన్‌లు జారీ చేస్తారు. వేలిముద్ర ద్వారా మన అకౌంట్‌లోని డబ్బు డెబిట్ అయి తద్వారా టోకెన్‌లు జారీ చేస్తారు. ఈ టోకెన్లతో మనకు కావాల్సిన కూరగాయలు కొనుక్కోవచ్చు. మనకు ఎంత కావాలంటే అంత డబ్బుకు సరిపడా ఇక్కడ టోకెన్‌లు ఇస్తారు. ఒక్క పూటలోనే దాదాపు 7వేల రూపాయల విలువైన టోకెన్‌లు జారీచేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే కొనుగోలుదారులు వినియోగించగా మిగిలిన టోకెన్లు తిరిగి తీసుకొని వారికి డబ్బు చెల్లిస్తామని..అలాగే సాయంత్రం రైతుల దగ్గర ఎన్ని టోకెన్లు ఉంటే అంత నగదును వారికి ఇస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు,వ్యాపారులు
చిల్లర సమస్య కొరతను తీర్చటానికి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కూకట్‌పల్లి రైతు బజార్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ విధానం బాగుందని ఇటు వ్యాపారులు అటు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన ఈ స్కీంపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే వ్యాపారం పుంజుకుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు ఎంతో ఉపయోగపతుందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

10:55 - November 20, 2016

ఖమ్మం : పాతనోట్ల రద్దు దేశంలోని అన్ని రంగాల మీద తీవ్రప్రభావం చూపిస్తోంది. దీనికి అడవి అన్నలుగా పిలవబడే మావోయిస్టులు కూడా అతీతంకాదు. పాతనోట్లకు మార్చుకునే యత్నంలో మావోలు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్లకు తరలిస్తుండగా బీజాపూర్ పామేడులో రూ.6లక్షలను పోలీసులు పట్టుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా మావోలు నోట్ల మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. డబ్బును తరలిస్తున్న గ్రామస్తులు వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించకపోవటంతో పామేడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ ద్వారా పదుల సంఖ్యలో మావోలు మృతిచెందారు. దీంతో వారికి గట్టిదెబ్బే తగిలింది. ఇప్పుడు నోట్లు మార్చుకునే క్రమంలో వారి ఉనికి పోలీసులకు తెలిసే అవకాశాలు చాలానే వున్నట్లుగా తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో వున్నవారే నోట్లు మార్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. మరి అడవిలో తమ రహస్య జీవనాన్ని సాగిస్తున్న అన్నలు ఈ విషయంలో గిరిజనులు,ఆదివాసీలపై ఆధారపడి నోట్ల మార్పిడి కొనసాగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారి ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నట్లుగా సమాచారం.

మృతులకు రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటన

ఉత్తరప్రదేశ్ : రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.మూడున్న లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేలు, స్వల్పంగా గాయపడినవారికి 25వేలు ఎక్స్ గ్రేషియా రైల్వే శాఖ ప్రకటించింది. కాగా తెల్లవారు ఝామున పాట్రా ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 68 మంది మృతి చెందగా మరో 150మందికి పైగా మృతిచెందినట్లుగా తెలుస్తోంది. 

10:23 - November 20, 2016

ఉత్తరప్రదేశ్‌ : ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాన్‌పూర్‌ దేహత్‌ జిల్లాలోని పుఖ్రాయాన్‌ వద్ద తెల్లవారుజామున పట్నా - ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 63 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్రమాదానికి గురైన బోగీలు..
సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటుచేశారు. ఏ1, ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, జీఎస్‌, బీ1, బీ2, బీ3, బీ2, లగేజీ ర్యాక్‌ బోగీలు పట్టాలు తప్పాయి.
రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి
యూపీలో ఘోర రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభుకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయచర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైలు ప్రమాదంపై స్పందించిన రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు
రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు స్పందించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అధికారులందరూ తక్షణం ప్రమాదస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రైల్వే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైలు ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరా
రైలు ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆరా తీశారు. డీజీపీకి ఫోన్‌ చేసి సహాయచర్యలపై సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

ఘోర రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం కేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులందరూ సహాయచర్యల్లో పాల్గొనాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.
రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటన
ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.మూడున్న లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేలు, స్వల్పంగా గాయపడినవారికి 25వేలు ఎక్స్ గ్రేషియా రైల్వే శాఖ ప్రకటించింది. 
 హెల్స్ లైన్లు నంబర్లు : 
రైలు ప్రమాదంపై ఘటనకు సంబంధించి హెల్స్ లైన్లు : ఇండోర్: 074121072,ఉజ్జయిన్ : 0734 2560906, ఝాన్సీ : 0510 1075, పుఖ్రాయిన్ : 0511 3270239, రాట్లాం : 07412 1072, ఒరాయ్ : 05162 1072 నండర్లను సంప్రదించవచ్చు 

 
 
09:53 - November 20, 2016

హైదరాబాద్ : ఆదివారం నాడు ముక్క లేకుండా ముద్ద దిగ‌ని భోజన ప్రియులకు పెద్ద ఇబ్బందే ఎదురైందబ్బా. హైద‌రాబాద్‌లోని రామ్ నగర్ మార్కెట్ పై చిల్లర దెబ్బ అబ్బా అనిపిస్తోంది. ఈ మార్కెట్ తెలియనివారుండరు. ఏరకం నాన్ వెజ్ కావాలన్నా ఇక్కడ పుష్కరలంగా దొరుకుతుంది. పాత పెద్దనోట్లు మారకం..కొత్త పెద్దనోట్లు చేతికి రాకతో చిల్లర నోట్లు లేక నాన్ వెజ్ కొనుక్కునే దారలేక నాన్ వెజ్ ప్రియులు పెద్ద ఇబ్బందుల్లో పడిపోయారు. మామూలు రోజులుకంటే ఆదివారం వచ్చిందంటే చాలు రామ్ నగర్ మార్కెట్ కు మంచీ గిరాకీ వుంటుంది. చిల్లర బెడదతో మ‌ట‌న్‌, చేప‌ల మార్కెట్లు వెల‌వెల‌బోతున్నాయి. కొనుగోళ్లు త‌గ్గ‌డంతో స‌ర‌ఫ‌రా త‌గ్గింది. ఫ‌లితంగా చేప‌లు, మ‌ట‌న్ ధ‌ర‌లు ఒక్క‌సారిగా పెరిగాయి. నోట్ల దెబ్బకు రామ్ నగర్ మార్కెట్ ఏమాత్రం అతీతంకాదన్నట్లుగా వుంది. ఇప్పటికే నోట్ల రద్దు..చిల్లర నోట్లు అందుబాటులో లేక చిరువ్యాపారులు ఆదాయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వారు పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందులేంటో ఈ వీడియోలో చూడండి..

09:26 - November 20, 2016

రైలు ప్రమాదంపై హెల్ప్ లైన్ నంబర్లు..

ఉత్తరప్రదేశ్ : రైలు ప్రమాదంపై ఘటనకు సంబంధించి హెల్స్ లైన్లు : ఇండోర్: 074121072,ఉజ్జయిన్ : 0734 2560906, ఝాన్సీ : 0510 1075, పుఖ్రాయిన్ : 0511 3270239, రాట్లాం : 07412 1072, ఒరాయ్ : 05162 1072 నండర్లను సంప్రదించవచ్చు 

రైలు ప్రమాదంపై సీఎం అఖిలేష్ ఆదేశాలు..

ఉత్తరప్రదేశ్ : రైలు ప్రమాదంపై సీఎం అఖిలేష్ యాదవ్ డీజీపీకి ఫోన్ చేసి వివరాలకు తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు అఖిలేష్ ఆదేశించారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకూ 30 మృతదేహాలు వెలికి తీసినట్లుగా కాన్పూర్ ఐజీ తెలిపారు. 

రైలు ప్రమాదఘటనపై విచారణకు ఆదేశం: సురేష్ ప్రభు

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ట్రైన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందా లేకా పట్టాలలో నాణ్యతా లోపమనే దిశగా విచారణకు ఆదేశించామన్నారు. ప్రమాదానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

09:01 - November 20, 2016

హైదరాబాద్ : నగరంలో వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు పెద్దింటి బిడ్డలు తాడుగుమైకంలో తేలిపోతుంటారు. తప్పతాగి వాహనాలు నడుతుపుతుంటారు. డ్రంక్ డ్రైవ్ లో పోలీసులు తనిఖీలు చేపట్టినా వీరు ఏమాత్రం భయపడరు. ఈ క్రమంలో డ్రంక్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు పెద్దింటి పుత్రరత్నాలు దొరికిపోయారు.  తప్పతాగి కారు స్టీరింగ్‌ పట్టిన పెద్దోళ్ల పుత్ర రత్నాలు ట్రాఫిక్‌ పోలీసులకు అడ్డంగా దొరికారు. పీకల్లోతూ తాగిన యువకులు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీకెండ్‌ కావడంతో జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. 7కార్లు, 3బైకుల్ని సీజ్‌ చేశారు.

రైలు ప్రమాద ఘటనపై ప్రధాని సానుభూతి..

ఉత్తరప్రదేశ్ : పాట్నా ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, రాజ్ నాథ్ సింగ్ మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో పట్టాలు తప్పిన బోగీలు ఏ1,ఎస్1 నుండి ఎస్ 6 వరకూ బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలుతప్పిన జీఎస్, బీ1 నుండి బీఈ లగేజ్ ర్యాక్ బోగీలు కూడా పట్లాలు తప్పాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు  ఘటనాస్థలికి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు.

రైలు ప్రమాదంలో 45కుపెరిగిన మృతుల సంఖ్య..

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు పెరిగింది. దాదాపు 150మందికి పైగా గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుఝూము ఉదయం 3.30 ప్రాంతంలో కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పాట్నా ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. పుఖ్రయాన్‌ వద్ద పాట్నా నుంచి ఇండోర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటికే 45మంది మృతి చెందగా మరింతగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

08:43 - November 20, 2016

విజయనగరం : రామభద్రాపురంలో బస్ ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మరో 10మందికి గాయాలయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలతో సహా ఓ చిన్నారి వున్నట్లుగా తెలుస్తోంది. 37 మంది ప్రయాణీకులున్న ఈ బస్ ఉదయం నుండి దట్టంగా కురుస్తున్నందువల్ల మార్గం సరిగా కనిపించక మరోవాహనాన్ని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్ లోని వారు ఒరిస్సా నవరంగ్ పూర్ కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్ పోలీసులు సంఘనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని బారంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చికిత్స తీసుకునేవారి పరిస్థితి నిలకడగా వున్నట్లుగా వైద్యులు పేర్కొంటున్నట్లుగా సమాచారం

08:37 - November 20, 2016

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు పెరిగింది. దాదాపు 150మందికి పైగా గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుఝూము ఉదయం 3.30 ప్రాంతంలో కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పాట్నా ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. పుఖ్రయాన్‌ వద్ద పాట్నా నుంచి ఇండోర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటికే 45మంది మృతి చెందగా మరింతగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

45 మృతదేహాలను వెలికి తీత
ప్రధానంగా ఎస్ 2 బోగీకి ఎక్కువగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 45 మృతదేహాలను వెలికి తీశారు. రైల్వే శాఖ, హోం శాఖ కూడా పరిస్థితులకు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏరియాకు సంబంధించి రైళ్ళ రాకపోకలను దారి మళ్లించారు. మరికొన్న రైళ్ళను దారి మళ్ళించారు. ప్రయాణీకులను బస్ ల ద్వారా వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నారు.

రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని, కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, రాజ్ నాథ్ సింగ్ సానుభూతిని ప్రకటించారు. ఎన్డీఆర్ ఎఫ్ చీఫ్ కు సహాయక చర్యల్ని చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. రైల్వే మంత్రి ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రమాదస్థలిలో సహాయక చర్యలకు అధికారలకు ఆదేశాలు జారీ చేశారు. అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిథులు ప్రమాదస్థలంలో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.  ప్రమాద బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం దురదృష్ణ కరమని రైల్వే మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి  హెల్ప్ లైన్ ఏర్పాట్లు చేశారు. హెల్స్ లైన్లు : ఇండోర్: 074121072,ఉజ్జయిన్ : 0734 2560906, ఝాన్సీ : 0510 1075, పుఖ్రాయిన్ : 0511 3270239, రాట్లాం : 07412 1072, ఒరాయ్ : 05162 1072 నండర్లను సంప్రదించవచ్చు 

బోల్తా పడిన బస్..ముగ్గురు మృతి..

విజయనగరం : ఒడిశా రాష్ట్రానికి చెందిన బస్సు బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతులలో ఇద్దరు మహిళలు సహా ఓ చిన్నారి కూడా వున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని రామభద్రాపురం గ్రామం దగ్గర ఒడిశా బస్సు బోల్తా కొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు ప్రమాదస్థలికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

07:55 - November 20, 2016
07:52 - November 20, 2016

విశాఖ : వైజాగ్‌ టెస్ట్‌ మూడో రోజు ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు గట్టి పోటీనిచ్చింది.200 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించిన భారత జట్టు ఇంగ్లండ్‌ ముందు భారీ లక్ష్యాన్నుంచాలని పట్టుదలతో ఉంది. అశ్విన్‌ 5 వికెట్ల ఫీట్‌, విరాట్‌ కొహ్లీ హాఫ్‌ సెంచరీ మూడో రోజు ఆటకు హైలైట్‌గా నిలిచాయి.

మూడో రోజు ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు గట్టి పోటీ
వైజాగ్‌ టెస్ట్‌ మూడో రోజు ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు గట్టి పోటీనిచ్చింది.200 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించిన భారత జట్టు విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది.

5 వికెట్లకు 103 పరుగులతో మూడో రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్‌
5 వికెట్లకు 103 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు...ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 152 పరుగులు జోడించి ఆలౌటైంది.హాఫ్‌ సెంచరీలతో ఇంగ్లండ్‌ జట్టును ఆదుకున్న బెన్‌ స్టోక్స్‌, బెయిర్‌స్టో 6వ వికెట్‌కు 110 పరుగులు జోడించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్‌
లోయర్‌ ఆర్డర్‌లో ఆదిల్‌ రషీద్‌ సైతం రాణించడంతో ఇంగ్లండ్‌ జట్టు 255 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లు పడగొట్టాడు.
40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌
200 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నివ్వడంలో విఫలమయ్యారు. ఫామ్‌లో ఉన్న పుజారా సైతం ఒక్క పరుగుకే ఔటవ్వడంతో భారత్‌ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

టెస్టుల్లో కోహ్లీ 13 హాఫ్‌ సెంచరీ నమోదు
తొలి ఇన్నింగ్స్‌లో సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన విరాట్‌ కొహ్లీ మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించిన విరాట్‌ కొహ్లీ....టెస్టుల్లో 13వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.

298 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌
మూడో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 98 పరుగులు చేసింది. విరాట్‌ 56, రహానే 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం 298 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌....ఇంగ్లండ్‌ ముందు 400 పరుగులకు పైగా లక్ష్యాన్నుంచాలని పట్టుదలతో ఉంది.

భారీ లక్ష్యాన్ని చేధించడం ఇంగ్లండ్‌ జట్టుకు పెద్ద సవాలే...
వైజాగ్‌ పిచ్‌పై భారత స్పిన్నర్లను ఎదుర్కొని భారీ లక్ష్యాన్ని చేధించడం ఇంగ్లండ్‌ జట్టుకు పెద్ద సవాలే. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.  

07:47 - November 20, 2016

చైనా : భారత స్టార్‌ షట్లర్‌, ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ సింధుకు చైనా ఓపెన్‌లో పోటీనే లేకుండా పోయింది. చైనా ఓపెన్‌ సెమీఫైనల్‌లో సంచలన విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.సెమీఫైనల్‌లో సౌత్‌ కొరియా స్టార్‌ సంగ్‌ జి హూన్‌పై మూడు సెట్లలో పోరాడి నెగ్గింది. తొలి సెట్‌ను 11-21తో కోల్పోయిన సింధు రెండో సెట్‌ నుంచి జోరు పెంచింది. సంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా 23-21, 21-19తో చెమటోడ్చి నెగ్గి...ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. 

07:42 - November 20, 2016

తమిళనాడు : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆయన విజయమే చెన్నైలోని ఓ హోటల్‌ యజమానికి కొత్త ఆలోచన తెప్పించింది. ఇంతకు ఏమిటా ఆలోచన ? ట్రంప్‌ విజయం ఆయనకు ఎలా లాభపడింది?.. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఎందుకు ఆలస్యం... పదండి చూసేద్దాం.

చెన్నైలోని రామాపురంలోని సుప్రభ రెస్టారెంట్‌ స్పెషాలిటీ
ఇది చెన్నైలోని రామాపురంలోని సుప్రభ రెస్టారెంట్‌.అమెరికాలో ట్రంప్‌ గెలుపుతో ఈ హోటల్‌ రాత మారిపోయింది. ట్రంప్‌ గెలుపునకు ఈ హోటల్‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? అదే ఇప్పుడు అక్కడ స్పెషాలిటీ.

ఫేమస్‌ అయిన ట్రంప్‌ దోశ
ఈ హోటల్‌ యజమాని పేరు సిపి ముకుద్‌. కేరళవాసి. చెన్నైలో స్థిరపడి హోటల్‌ నిర్వహిస్తున్నాడు. అమెరికా ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఈయనను చాలా భావోద్వేగానికి గురి చేశాయి. ఎలాగైనా ట్రంప్‌ విజయం సాధించాలని ముకుద్‌ ఆశించాడు. అలాగే అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలవడంతో.. ఆ విజయాన్ని వినూత్నంగా నిర్వహించాలని ముకుద్‌ భావించాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం.. తన హోటల్‌లో ట్రంప్‌ పేరుతో ఏదైనా వంటకం తయారుచేయాలనుకున్నాడు. అంతే.. దక్షిణ భారతదేశంలో దోశలకు ఫేమస్‌ కాబట్టి.. ట్రంప్‌ పేరుతో వెరైటీ దోశ వేయాలని భావించాడు. ట్రంప్‌కు వైట్‌ కలర్‌ చాలా ఇష్టం కాబట్టి.. వైట్‌ దోశను వేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ దోశను.. పిండి, బట్టర్‌, చీజ్‌, ప్రూట్‌ సలాడ్‌ మిక్స్‌డ్‌తో తయారు చేయించాడు. దోశతో పాటు.. ఆరు పచ్చళ్లను అందిస్తున్నాడు. ఈ దోశ టేస్ట్‌ కస్టమర్లకు తెగ నచ్చేసింది. ఈ వెరైటీ దోశను రుచి చూసినవాళ్లంతా మళ్ళీ మళ్లీ హోటల్‌కు వస్తున్నారు. మరో నలుగురికి ఈ టెస్ట్‌ గురించి చెబుతున్నారు. దీంతో ట్రంప్‌ దోశతో పాటు.. ముకుద్‌ సుప్రభ హోటల్‌ ఫేమస్‌ అయిపోయింది. చెన్నై మొత్తం ఈ దోశ గురించి తెలియడంతో ముకుద్‌ హోటల్‌కు నగరవాసులు క్యూ కడుతున్నారు.

ఫ్రూట్‌ సలాడ్‌ దోశ రూ.75..మామూలు వైట్‌ దోశ రూ.50
తొలుత ట్రంప్‌ విజయానికి గుర్తుగా మూడు రోజులపాటే ఈ దోశను అందించాలనుకున్నాడు. కానీ వస్తున్న స్పందనను చూసి ఇదే కంటిన్యూ చేస్తున్నాడు. ఫ్రూట్‌ సలాడ్‌తో అయితే 75 రూపాయలకు,.. మామూలుది అయితే 50 రూపాయలకు అందిస్తున్నాడు. దీన్ని రుచి చూసేందుకు కస్టమర్లు హోటల్‌కు బారులు తీరుతున్నారు. ట్రంప్‌ తన వ్యాపారానికి ఈ విధంగా ఉపయోగపడినందుకు ముకుద్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

07:38 - November 20, 2016

జమ్ము కశ్మీర్ : 4 నెలల తర్వాత కశ్మీర్‌ జనంతో కిటకిట లాడింది. షాపింగ్‌ చేస్తూ ప్రజలు బిజి బిజీగా కనిపించారు. విద్యాసంస్థలు, దుకాణాలు తెరచుకున్నాయి. రోడ్లపై వాహనాలు తిరిగాయి. లోయలో సాధారణ స్థితి నెలకొనడంతో స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.

133 రోజుల తర్వాత జనంతో కళ కళ లాడిన కశ్మీర్‌ లోయ...
జనంతో కళ కళ లాడిన కశ్మీర్‌ లోయ...రోడ్లపై భారీ సంఖ్యలో వాహనాలు ...జనంతో కిక్కిరిసి పోయిన మార్కెట్లు ...133 రోజుల తర్వాత జమ్ముకశ్మీర్‌లో కనిపించిన దృశ్యమిది. నాలుగు నెలల తర్వాత కశ్మీర్‌లో విద్యా, వ్యాపార సంస్థలు తెరచుకోవడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. శ్రీనగర్‌ షాపులన్నీ జనంతో కిటకిటలాడాయి. తమ పిల్లలు బాగా చదువుకోవాలి...మంచి ఉద్యోగాలు చేయాలి...ప్రపంచంతో పోటీ పడాలన్న ఆకాంక్షను ఓ వ్యాపారి వ్యక్తం చేశారు. సాధారణ స్థితి నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని కశ్మీర్ యువత డిమాండ్‌
కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొనడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలను కూడా ప్రభుత్వం ఎత్తివేయాలని యువత డిమాండ్‌ చేసింది.

కశ్మీర్‌లో కనిపించని పెద్దనోట్ల రద్దు ప్రభావం
పెద్దనోట్ల రద్దు ప్రభావం కశ్మీర్‌ లోయలో అంతగా కనిపించడం లేదు. జులై నుంచి అక్కడ వ్యాపార లావాదేవీలు స్తంభించడమే ఇందుకు కారణం. కశ్మీర్‌ లోయలో అధికారులు ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రజలు దైనందిన కార్యక్రమాల్లో బిజి బిజీగా గడిపారు. టెన్త్‌ ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు బస్సుల్లో వెళ్లారు. శ్రీనగర్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఉదయం నుంచే జనంతో రోడ్లు రద్దీగా కనిపించాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో తొలిసారిగా పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరయ్యారు.

బుర్హాన్‌ వాణి ఎన్‌కౌంటర్‌ తర్వాతఅట్టుడికిన కశ్మీర్
బుర్హాన్‌ వాణి ఎన్‌కౌంటర్‌ తర్వాత వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్‌ పిలుపుతో కశ్మీర్‌ లోయ అట్టుడికింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, భద్రతాదళాలు పెల్లెట్‌ గన్‌లతో కాల్పులు జరపడం నిత్యకృత్యంగా మారింది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతో కర్ఫ్యూ నీడలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ నేపథ్యంలో వేర్పాటువాదులు వారాంతంలో రెండు రోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు. ప్రజలు యథావిధిగా తమ కార్యకలాపాలు తిరిగి కొనసాగించుకోవచ్చని తెలిపారు. దీంతో లోయలో సాధారణ స్థితి నెలకొంది.

07:30 - November 20, 2016

విజయవాడ  : పెద్ద నోట్ల రద్దు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో.. కొత్తగా రెండు వేల రూపాయల కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్‌లోకి నకిలీ రెండు వేల రూపాయలు ప్రవేశించాయి. నకిలీ దందా చేస్తున్న ముఠాలు.. అమాయకులకు నోట్లు అంటగట్టి మోసం చేస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న నకిలీ నోట్ల చలామణి ముఠాలో మోసపోయిన వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్న నకిలీ నోట్లు
నల్లధనం, నకిలీ నోట్లు భారత్‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ.. సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయన్న ఉద్దేశంతో కేంద్రం ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల కరెన్సీ నోటు ఇప్పుడు జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

మార్కెట్‌లోనికి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు
బ్యాంకుల్లో పాత కరెన్సీ మార్చుకుంటే రెండు వేల రూపాయల నోట్లే ఎక్కువగా ఇస్తున్నారు. వీటిని మార్చుకోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. మరోవైపు నకిలీ రెండు వేల రూపాయల నోట్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. అచ్చం ఆర్బీఐ జారీ చేసిన నోటు మాదిరిగానే నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. అసలు, నకిలీకి తేడా తెలుసుకోలేకపోతే మాత్రం కష్టాలు తప్పవని విజయవాడ కేంద్రంగా జరిగిన ఓ ఘటన రుజువు చేసింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో కలర్‌ స్కానర్లతో నకిలీ నోట్లు తయారుచేసిన చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జరిగిన ఇలాంటిదే మరో ఘటన జనాన్ని కలవరానికి గురి చేస్తోంది.

పదిహేను లక్షల పాత నోట్ల మార్పిడికి యత్నం
వరంగల్‌కు చెందిన ఓ వ్యాపారి తన దగ్గర ఉన్న 15 లక్షల రూపాయల పాత కరెన్సీని మార్చుకునేందుకు విజయవాడకు చెందిన ఓ ముఠాను సంప్రదించాడు. ఎంతపెద్దమొత్తమైనా కమిషన్‌ ప్రాతిపదికపై మార్పిడికి సహకరిస్తామంటూ నమ్మబలికారు. ఇంకేముందుని వరంగల్‌ నుంచి విజయవాడ వెళ్లిన వ్యాపారి... తన దగ్గరున్న 15 లక్షల రూపాయల పాత నోట్లకు ముఠా చేతిలో పెట్టాడు. దీనికి బదులు ఆర్బీఐ జారీ చేసిన కొత్త నోట్లు తమ దగ్గరున్నాయని నమ్మబలికి నకిలీ నోట్లు అంటకట్టారు. ఏది అసలో, ఏది నకిలినో తెలియని ఆ వ్యాపారి... ఇచ్చిన నోట్లు అసలైవేనని నమ్మి సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు. తీరా తన దగ్గర ఉన్నరెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తే... నకిలీవని తేలడంతో మోసపోయానంటూ లబోదిబో మంటున్నాడు. నకిలీ నోట్ల బెడద ఎంత పెద్ద సమస్యగా మారిందో దీనిని అర్థం చేసుకోవచ్చు.

ఒరిజినల్‌ నోట్లలో సెక్యూరిటీ త్రెడ్‌ కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది
మెజెంతా రంగులో ఆర్బీఐ విడుదల చేసిన రెండు వేల రూపాయల నోటు ధగదగా మెరుస్తూ ఉంటుంది. నకిలీ నోట్లకు మెరుపులు ఉండవు. మెజెంతా రంగు డల్‌గా కనిపిస్తూ, వెలవెలపోతుంది. సెక్యూరిటీ ఫీచర్స్‌లో భాగంగా ముద్రించిన సిల్వర్‌ ఫాయిల్‌లో కూడా తేడా ఉంది. ఒరిజినల్‌ నోట్లలో సిల్వర్‌ ఫాయిల్‌ పొర ముద్రించినట్టుగా ఉంటుంది. కానీ వరంగల్‌ వ్యాపారికి బెజవాడ ముఠా అంటగట్టిన నకిలీ నోట్లలో సిల్వర్‌ ఫాయిల్‌ అతికించినట్టుగా ఉంది. అలాగే నోటుపై ఉండే సెక్యూరిటీ త్రెడ్‌లో కూడా తేడా ఉంది. ఒరిజినల్‌ నోటుపై సెక్యూరిటీ త్రెడ్‌ కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ముట్టుకుంటే తెలుస్తుంది. కానీ నకిలీ నోటును తాకినా సెక్యూరిటీ త్రెడ్‌ వేలికి తాకదు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో కలర్‌ స్కానర్ల సహాయంతో నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

రెండు వేల రూపాయల నోట్లను ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి
రెండు వేల రూపాయల అసలు నోటుకు, నకిలీ నోటుకు తేడా తెలుసుకోవపోతే వరంగల్‌ వ్యాపారిలా ఎవరైనా మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త... వ్యాపార, ఇతరేతర లావాదేవీల్లో భాగంగా మీ చేతికి రెండు వేల రూపాయల నోటు వస్తే ఒకటి రెండు సార్లు చూసుకోండి. సిల్వర్‌ ఫాయిల్‌, సెక్యూరిటీ త్రెడ్‌లను క్షణ్ణంగా పరిశీలించండి. సిల్వర్‌ ఫాయిల్‌ నోటుతోపాటు ముద్రించినట్టు లేకపోయినా.... అతికించినట్టు ఉన్నా వెంటనే దానిని తిరస్కరించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ త్రెడ్‌ తాకితే వేలికి తగిలేగా ఉండాలని సూచిస్తున్నారు. అలాలేకపోతే తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించడంతోపాటు నకిలీ నోట్ల చలామణికి సబంధించిన ముఠాల సమాచారం ఉంటే తెలియజేయాలని కోరుతున్నారు. 

07:24 - November 20, 2016

తూర్పుగోదావరి : నోట్ల ర‌ద్దు వ్యవ‌హారంలో కేంద్రం వైఖ‌రి స‌మ‌ర్థవంతంగా లేద‌ని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో సుడిగాలి ప‌ర్యట‌న చేసిన ఆయ‌న ప‌లు స‌భ‌ల్లో మాట్లాడారు. పెద్ద నోట్ల ర‌ద్దును తాము ఆహ్వానించిన‌ప్పటికీ ప్రజ‌లు క‌ష్టాలు ప‌డుతున్న ప‌రిస్థితిపై ఆయ‌న ఆందోళ‌న వ్యక్తం చేశారు. స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం తాను జైట్లీకి, ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌కి లేఖ రాసిన‌ట్టు తెలిపారు. ప్రజ‌లంద‌రూ సెల్‌ ఫోన్‌ ద్వారా.. బ్యాంకింగ్‌ లావాదేవీలు జరపాలని కోరారు.

చంద్రబాబు రాజ‌మహేంద్రవ‌రంలో సుడిగాలి ప‌ర్యట‌న‌
ఏపీ సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజ‌మహేంద్రవ‌రంలో సుడిగాలి ప‌ర్యట‌న‌ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల‌తో బిజీ బిజీగా గ‌డిపారు. రాజ‌మండ్రి అర్బన్, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటించారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పార్టీ కార్యక‌ర్తల స‌మావేశంతో పాటు జ‌న‌చైత‌న్య యాత్రలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధికి నేత‌లంతా కృషి చేయాలంటూ మార్గద‌ర్శనం చేశారు.

జన్‌ధన్‌ అకౌంట్లు ఉన్నవాళ్లంతా రూపీకార్డులు తీసుకోవాలి..
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజ‌లంతా ఇక్కట్లు ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. అయితే ఇవ‌న్నీ తాత్కాలిక‌మే అన్న ఆయ‌న రాష్ట్రంలో ప్రజ‌లంద‌రూ.. సెల్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిపే విధానం నేర్చుకోవాలన్నారు. జన్‌ధన్‌ అకౌంట్లు ఉన్నవాళ్లంతా రూపీకార్డులు తీసుకోవాలని.. దాని ద్వారానే లావాదేవీలు జరపాలని కోరారు.

డ్వాక్రా మ‌హిళా రుణాల మాఫీతో పాటు అన్ని హామీలు అమ‌లు చేస్తాం
డ్వాక్రా మ‌హిళా రుణాల మాఫీతో పాటు అన్ని హామీలు అమ‌లు చేస్తామ‌ని చంద్రబాబు మ‌రోసారి స్పష్టం చేశారు. నిరుద్యోగుల‌ను ఆదుకోవడానికి కొత్త ప‌థ‌కం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. వ‌చ్చే నెల నుంచి రేష‌న్ దుకాణాల‌న్నీ రీటైల్ షాపులుగా మార్చబోతున్నామ‌న్నారు. అన్నిచోట్లా ఈపాస్ విధానం ప్రవేశ పెడుతున్నామ‌న్నారు.

పార్టీ కార్యక‌ర్తల ద్వారానే ప్రజా ప‌థ‌కాలు అమ‌లు: బాబు
ఏపీలో ఇప్పుడు రాజ‌కీయంగా టీడీపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌న్న చంద్రబాబు.. కార్యక‌ర్తలంద‌రూ బ‌ల‌ప‌డేలా తాను ప్రయ‌త్నిస్తాన‌న్నారు. ప్రతీ ఒక్కరికీ మంచి ఆదాయం ల‌భించేలా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యక‌ర్తల ద్వారానే ప్రజా ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌న్నారు. 

07:17 - November 20, 2016

హైదరాబాద్ : 11 రోజులు దాటినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. పేద వాడి దగ్గర నుంచి చిరు వ్యాపారి వరకు అందరూ పెద్ద నోట్ల దెబ్బకు కుదేలవుతున్నారు. చిల్లర కష్టాలు ఒకవైపు, పాత నోట్ల మార్పిడి మరోవైపు.. వ్యాపార, వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కోట్ల వ్యాపారం నిలిచిపోయింది. కరెన్సీ లేక మార్కెట్‌ యార్డులు మూతపడ్డాయి. పనులు లేక హమాలీలు, పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాత నోట్ల ప్రభావంతో పూల మార్కెట్లు డీలా
పాత నోట్ల ప్రభావంతో పూల మార్కెట్లు డీలా పడ్డాయి. కార్తీక మాసంలో లక్షల్లో జరగాల్సిన వ్యాపారం వేలల్లో జరుగుతోంది. పూల ధరలు అమాంతం పడిపోవడంతో విజయవాడలో వ్యాపారం మొత్తం కుదేలయ్యింది. సీజన్‌ టైంలో 150 రూపాయలు పలికే పూలు పెద్ద నోట్ల రద్దుతో 20 రూపాయలకు పడిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

రోడ్డెక్కిన ఉల్లి రైతులు
పెద్ద నోట్ల రద్దుతో పంట అమ్ముడు పోక రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లిని కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు ఉల్లిని తరలించారు. తీరా ఉల్లిని తరలించాక కరెన్సీ లేదని అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీనియర్‌ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు
ఆర్బీఐ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివాహా వేడుకలకు రెండున్నర లక్షలు విత్‌ డ్రాకు ఆర్బీఐ అనుమతిస్తే బ్యాంకులు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నగదు మార్పిడి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో సీనియర్‌ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వారంతపు సంతలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌
చిల్లర కష్టాలు గిరిజనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఔనురు గ్రామంలో వారంతపు సంతలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌ తీవ్రంగా పడింది. ప్రతి వారం గిరిజనులతో కిటకిటలాడే సంత.. ఈ సారి కొనుగోలు దారులు లేక వెలవెలబోయింది. చిల్లర కష్టాలతో పాటు నోట్ల కొరతతో వ్యాపారం డీలా పడింది. ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బైటపడిన మెదక్‌ ఎస్బీహెచ్ లో కొత్త కరెన్సీ స్కాం
పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు ఇలా ఉంటే మెదక్‌ ఎస్బీహెచ్ లో కొత్త కరెన్సీ స్కాం బయటపడింది. కోటీ 20 లక్షల రూపాయలు ఒకే రోజు విజయ డెయిరీ ఖాతా నుంచి డ్రా చేశారు. ఇది జరిగి వారం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపించాలని సొసైటీ సభ్యుల డిమాండ్‌ చేస్తున్నారు. 11 రోజులు దాటినా మనీ పాట్లు మాత్రం తగ్గకపోయే సరికి.. ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. 

07:10 - November 20, 2016

ఉత్తరప్రదేశ్‌ : శనివారం అర్థరాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. యూపీలో ఇండోర్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో పాట్నా ఎక్స్ ప్రెస్ 14 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు కాన్పూర్ ఐజీ జకీ అహ్మద్ తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

 

06:58 - November 20, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే 500 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులపై ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్‌..సమస్యల పరిష్కారానికి ప్రధానికి కీలక సూచనలు చేశారు. ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్‌.. మోదీతో చర్చించిన వివరాలను ఈరోజు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

ప్రధాని మోదీతో కేసీఆర్‌ కీలకభేటీ
పెద్ద నోట్ల రద్దు సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం అయ్యారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో నోట్ల రద్దుతో పాటు పలు కీలక అంశాలపై మోదీతో సీఎం కేసీఆర్ చర్చించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులను మోదీకి సీఎం వివరించారు. కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గృహిణులు దాచుకున్న మొత్తాన్ని నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా 500 నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పెద్ద నోట్ల మార్పిడి కొనసాగించాలన్నారు.

పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించిన మోదీ
500, వెయ్యినోట్లను రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రధానికి సీఎం కేసీఆర్‌ వివరించారు. వాణిజ్యం, ఎక్సైజ్‌, రవాణా శాఖ రంగాలకు తీరని నష్టం వాటిల్లిందన్నారు ఇప్పటివరకు సుమారు 3,250 కోట్ల రూపాయల నష్టం రాష్ట్రానికి వాటిల్లినట్లు సీఎం కేసీఆర్‌ ప్రధానికి తెలిపారు. ఇక నోట్ల రద్దువల్ల గ్రామీణస్థాయిలో బ్యాంకు లావాదేవీలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని..గ్రామీణ ప్రాంతాల్లో అన్‌ అకౌంటబుల్‌ మనీ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారు. 2.50 లక్షల పరిమితి నుంచి గృహిణులకు విముక్తి కలిగించాలన్నారు. అలాగే గ్రామీణ బ్యాంకులకు కొత్తనోట్లను సరఫరా చేసి రైతులు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో వివిధ ప్రభుత్వ పథకాలు నిలిచిపోకుండా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని సీఎం ప్రధానిని కోరారు.పెద్ద నోట్ల రద్దు అంశంపై సీఎం కేసీఆర్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ కావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగించింది. 

డిసెంబర్‌ 11న ఓయూలో విద్యార్థి యుద్ధభేరి..

హైదరాబాద్ : డిసెంబర్‌ 11న ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వద్ద విద్యార్థి యుద్ధభేరి సభ నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి రాజ్యం ఆధ్వర్యంలో నిర్వహించే యుద్ధబేరి సభ జరుగనుంది. దీనికి సంబంధించి వాల్‌పోస్టర్‌ను శనివారం ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌, కల్వకుర్తి ఆంజనేయులు ఆవిష్కరించారు.

నోటు దెబ్బకు బ్యాంక్ మేనేజర్ మృతి..

నెల్లూరు : బార్కాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ షరీఫ్ మృతి బ్యాంకు ఉద్యోగుల్లో విషాదం నింపింది. బ్యాంకులో తీవ్ర ఒత్తిడితో అస్వస్థతకు గురైన షరీఫ్ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో వెంటనే స్పందించిన బ్యాంకు సిబ్బంది ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆయన మార్గమధ్యంలోనే మృతిచెందారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.

పట్టాలు తప్పిన పాట్నా ఎక్స్ ప్రెస్..10మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌ : ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటన కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ రైలు పాట్నా నుంచి ఇండోర్ వెళ్తుంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

Don't Miss