Activities calendar

21 November 2016

21:57 - November 21, 2016

ఢిల్లీ : నోటు రద్దు కారణంగా మృతి చెందడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఓ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 15 వందలు మార్చుకోవడానికి 70 ఏళ్ల సియారాం మూడు రోజుల పాట్లు క్యూలైన్లో నిల్చున్నారు. నవంబర్‌ 15, 16న క్యూలైన్లో నిల్చున్నా నగదు మార్చుకోలేక పోయారు. నవంబర్‌ 17న సియారాం మళ్లీ లైన్లో నిల్చున్నారు. ఒంట్లో ఓపిక నశించిన ఆ పెద్దమనిషి కుప్పకూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన తండ్రి మరణానికి మోడీ ప్రభుత్వమే కారణమంటూ సియారాం కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పరిహారం కింద తమ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కేంద్రం సరైన ఏర్పాట్లు చేయనందునే సియారాం చనిపోయినట్లు ఆరోపించాడు.

 

21:54 - November 21, 2016

ఢిల్లీ : దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇవాళ 385 పాయింట్లు నష్టపోయి... 25వేల 765 వద్ద ముగిసింది. నిఫ్టీ 145 పాయింట్ల నష్టంతో 8వేల కంటే దిగువకు పడిపోయింది. చివరకు 7వేల 929 వద్ద ముగిసింది. దేశీయంగా కరెన్సీ కష్టాలు, డాలర్‌ బలపడటం, ట్రంప్‌ భయాలకు తోడు... డచ్‌ బ్యాంకు సెన్సెక్స్‌ లక్ష్యాన్ని 27,000 నుంచి 25,000 కోత విధించడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నోట్ల రద్దు ప్రభావం.. వ్యాపార రంగాలపై తీవ్రంగా ఉండటంతో... ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్ బిఐ, యస్‌ బ్యాంకు, హిందాల్కో షేర్లు నష్టాలు చవి చూశాయి. భారతీ ఇన్‌ఫ్రా టెల్‌, విప్రో, టెక్‌ మహీంద్ర, రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి.

 

21:53 - November 21, 2016

ఉత్తరప్రదేశ్ : లక్నో.. ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ వైమానిక దళానికి చెందిన ఆరు జెట్ విమానాలు ఆ ఎక్స్‌ప్రెస్ వే మీద ల్యాండ్ అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే మీదుగా గంటకు 3 వందల కిలోమీటర్ల వేగంతో ఈ జెట్ విమానాలు వెళ్లాయి. ఇది దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. 

21:49 - November 21, 2016

విజయవాడ : కరెన్సీ కష్టాలపై చంద్రబాబు దృష్టి సారించారు. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రైతుల రుణాల రీషెడ్యూల్‌ గడువును పొడిగించాలని ఆర్బీఐని కోరుతూ తీర్మానం చేశారు. రాష్ట్రానికి వెయ్యి కోట్లు వంద నోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. చిల్లర సమస్యలు అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చూడాలని బ్యాంకర్లకు సూచించారు.
బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం 
నోట్ల రద్దుతో రాష్ట్రంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. నోట్ల రద్దు అనంతరం ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో రైతుల రుణాల రీషెడ్యూల్‌ను 2017 జూన్‌ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పాత నోట్ల ద్వారా రుణాలు తీర్చేందుకు బ్యాంకులు అనుమతించాలని చంద్రబాబు సూచించారు. ఇక రెండు వేల రూపాయల నోటుతో ఏర్పడిన చిల్లర కష్టాలను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు జరపాలన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు ఆలయాల్లోని హుండీ ఆదాయాన్ని చలామణిలోకి తీసుకురావాలన్నారు.
రాష్ట్రానికి రూ. 90 కోట్ల మేర కొత్త 500 నోట్లు : చంద్రబాబు 
నోట్ల రద్దు తర్వాత రాష్ట్రానికి 90 కోట్ల రూపాయల మేర కొత్త 500 నోట్లు మాత్రమే వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కీలక సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. మరో ఐదు వేల కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని... ఆ మొత్తంలో వెయ్యి కోట్లు.. వంద రూపాయల నోట్లు ఇవ్వాలని కోరామని చంద్రబాబు తెలిపారు. కరెన్సీ కష్టాలు లేకుండా ప్రజలు నగదురహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు కలిసి పనిచేయాలన్నారు. 

 

21:44 - November 21, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో... బ్యాంకు స్ట్రాంగ్ రూములు నిండిపోతున్నాయి. ప్రధాని ప్రకటన వచ్చిన పది రోజుల్లోనే.. ఐదున్నర లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో చేరాయి. గత 10రోజుల్లో జరిగిన లావాదేవీలపై ఆర్బీఐ ప్రకటన చేసింది. 
బ్యాంకుల్లో 5.12లక్షల కోట్లు డిపాజిట్‌  
దేశంలో పెద్దనోట్లను రద్దు చేసిన దగ్గర నుంచి ప్రజలు పాత కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే పనిలో పడ్డారు. ఈ నెల 10 నుంచి 18 వరకు అంటే 9 రోజుల్లో ప్రజలు 5.లక్షల 12 వేల  కోట్ల రూపాయల పాత కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. మరో 33 వేల కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లను మార్పిడి చేసుకున్నారు. అలాగే ఈ తొమ్మిది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల ద్వారా లక్షా మూడు వేల కోట్ల రూపాయల కొత్త నోట్లను ప్రజలకు పంపిణీ చేశారు. 
పాతనోట్లను డిపాజిట్‌ చేసేందుకు జనం పరుగులు 
పెద్దనోట్లు చెల్లవని ప్రధాని మోదీ ప్రకటించడంతో.. బ్యాంకుల్లో పదో తేదీ నుంచి పాత నోట్లను డిపాజిట్‌ చేయడానికి.. పరిమితి స్థాయిలో నోట్లను మార్చుకునేందుకు  అనుమతించారు. దీంతో తొమ్మిది రోజుల్లో ప్రజల నుంచి మొత్తం 5 లక్షల 45వేల కోట్ల రూపాయల పాత కరెన్సీ బ్యాంకులకు చేరింది. కాగా 2016 మార్చి నాటికి 14 లక్షల 12వేల  కోట్ల రూపాయల నగదు 500, వెయ్యి రూపాయల నోట్ల రూపంలో చెలామణిలో ఉంది. ఈ అంచనా ప్రకారం ప్రజల వద్ద ఇంకా ఎనిమిది లక్షల 67వేల కోట్ల రూపాయల విలువైన పెద్దనోట్లు ఉన్నాయి. వీటిని డిపాజిట్‌ చేసేందుకు, మార్చుకునేందుకు డిసెంబర్‌ 30వ తేదీ వరకు గడువు ఉంది. అయితే ఈ డబ్బంతా బ్యాంకులకు చేరదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
14.12లక్షల కోట్ల నగదులో రూ.3.5లక్షల కోట్ల నల్లదనం
మొత్తం 14లక్షల 12వేల  కోట్ల రూపాయల నగదులో పెద్ద నోట్లు 25 శాతం అంటే 3లక్షల 5వేల కోట్ల రూపాయలు నల్లదనం రూపంలో ఉందని , ఈ మొత్తం బ్యాంకులకు చేరదని నిపుణులు అంటున్నారు. ఈ డబ్బును రిజర్వ్‌ బ్యాంకుకు లాభంగా పరిగణించి అంతే మొత్తంలో కొత్త నోట్లను ముద్రిస్తుంది. తర్వాత డివిడెండ్‌ల రూపంలో కేంద్రానికి బదిలీ చేస్తుంది. ఈ అంచనా ప్రకారం ప్రజల నుంచి మరో 5లక్షల17వేల కోట్ల రూపాయల పాత కరెన్సీ మాత్రమే బ్యాంకుల వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా  పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు.. చిన్న వ్యాపారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 
పాత 500 నోట్లతో విత్తనాలు కొనుగోలు చేసే అవ‌కాశం 
మరోవైపు రైతులు పాత 500 నోట్లతో విత్తనాలు కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పించింది ఆర్థిక శాఖ‌. చిన్న వ్యాపారులు ఓవర్‌ డ్రాఫ్ట్‌, క్యాష్ క్రెడిట్ ఖాతాల నుంచి వారానికి 50 వేల వ‌ర‌కు న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే క‌నీసం మూడు నెల‌ల నుంచి యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లకే ఈ వెసులుబాటు కల్పించింది. వ్యక్తిగత ఓవ‌ర్‌డ్రాఫ్ట్ అకౌంట్లకు ఇది వర్తించదు.

 

టీ.ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వనున్నారు. 90 రోజుల శిశు సంరక్షణ సెలవులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

21:31 - November 21, 2016

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విదుదల

హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విదుదలైంది. మార్చి 1 నుంచి 17 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 2 నుంచి 18 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

నోట్ల మార్పిడి క్యూలైనులో 49 ఏళ్ల వ్యక్తి మృతి

ఢిల్లీ : నోట్ల మార్పిడి క్యూలైనులో 49 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల వ్యవహారం కోరుతూ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

21:06 - November 21, 2016
20:59 - November 21, 2016

పట్టాలు విరుగుతాయి..!! రైళ్లు ఢీకొంటాయి..!! సిగ్నల్స్ తప్పుగా వస్తాయి.. నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని బలితీసుకుంటుంది...!! రైలు ప్రయాణంలో భద్రత లేదా..?! పట్టాలెందుకు తప్పంది..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:53 - November 21, 2016

గుడుల గోపురాలకు చేరుతున్న నల్లధనం, పోలవరంల మునిగిపోతున్న సంత, పులి అవతారం ఎత్తిన కుక్క, అడవుల పొంటిబోయిన మల్లన్న, ఈ టీఆర్ ఎస్ లీడర్ కు మానవత్వం ఉందా..? అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:51 - November 21, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని, ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్ట్టాయి. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. 
ఉభయ సభల్లో గందరగోళం 
పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. నోట్ల రద్దుపై ప్రధాని మోదీ సభకు వచ్చి వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ గందరగోళం నెలకొంది. లోక్‌సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్ష సభ్యులు సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. లోక్‌సభలో గందరగోళ పరిస్థితుల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.
రాజ్యసభలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ 
రాజ్యసభలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. నల్లధనానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ప్రధానిమంత్రి నరేంద్రమోదికి మద్దతు పలుకుతున్నారని రాజ్యసభలో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. విపక్షాలు నల్లధనానికి అనుకులంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. విపక్షాల నినాదాల మధ్య మంత్రి మాట్లాడుతుండగానే ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ సభను వాయిదా వేశారు. కాన్పూరు రైలు ప్రమాద మృతులకు లోక్‌సభ నివాళులర్పించింది. కేంద్రరైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కాన్పూర్ రైలు ప్రమాద ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ ఘటన దౌర్భాగ్యపూరితమైనదని, దీనిపై ఫోరెన్సిక్‌ నిపుణులతో దర్యాప్తు జరుపిస్తామని, దోషులెవరైనా వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
కాన్పూర్‌ రైలు దుర్ఘటన మృతులకు రాజ్యసభలో నివాళులు 
రాజ్యసభలోను కాన్పూర్‌ రైలు దుర్ఘటన మృతులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విపక్షాలు మరో డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఏటీఎంలవద్ద క్యూలలో నిలబడి 70 మంది ప్రాణాలు కోల్పోయారనీ.. వారికి కూడా నివాళులు అర్పించాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్‌ చేశాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ నుంచి విపక్షాలు పారిపోతున్నాయని ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని, విపక్షాలు చర్చకు సిద్ధంగా లేవని ఆయన ధ్వజమెత్తారు.
ఉభయసభలు రేపటికి వాయిదా 
నోట్ల రద్దు పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడగా, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. 

 

20:39 - November 21, 2016

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో సంక్షోభానికి దారి తీస్తుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థిక నిపుణులు పాపారావు, సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, బీజేపీ నేత లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం కుబేరుల భరతం పట్టలేదని చెప్పారు. ఇంతవరకు బ్లాక్ మనీని వెలికితీసిన దాఖలాలు లేవన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:30 - November 21, 2016

కర్నూలు : సోలార్‌ ప్లాంట్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ.. శకునాల గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. సోలార్‌ ప్లాంట్‌ దగ్గరకు వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు నేతలతో సహా గ్రామస్తులను అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేవరకు తమ పోరాటం ఆగదని గ్రామస్తులు స్పష్టం చేశారు. 

 

20:21 - November 21, 2016

కృష్ణా : విజయవాడలో పెద్ద నోట్ల మార్పిడి ముఠాగుట్టును  సీసీఎస్ పోలీసులు రట్టు చేసారు. వీరి నుంచి.. ఏడు లక్షల యాభై వేల రూపాయల నగదును, ఐదుగురి నిందితులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగూచూశాయి.  ఫేక్‌ కరెన్సీ ముఠాతో వీరికి సంబంధాలున్నట్లు, అధికార పార్టీ నేత అనుచరుడు ఒకరు ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:19 - November 21, 2016

విశాఖ : ప్రభుత్వ శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు విశాఖలో దశలవారీగా స్వైపింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఎస్ బీఐ సహకారంతో ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని తర్వాత మిగిలిన ఆఫీసులకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నగదు రహితంగా వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లెసెన్స్‌లు జరుగనున్నాయి. దశలవారీగా ఇతర ప్రభుత్వ శాఖలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 

ప్రొ.లక్ష్మీకి రెండు రోజుల పోలీసు కస్టడీ

గుంటూరు : ప్రొ.లక్ష్మీకి రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. రేపు, ఎల్లుండి లక్ష్మీని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మీపై అరోపణలు ఉన్నాయి. ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ రేపు విచారణ రానున్నారు. 

 

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిరసన దీక్ష భగ్నం

అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీపీ లెవల్స్ తగ్గటంతో జేసీనీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సీఎం కేసీఆర్ కు తమ్మినేని 26 వ లేఖ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 26 వ లేఖ రాశారు. ముస్లింలలోని కొన్ని సంచార తరగతులు కడు పేదరికంలో మగ్గుతున్నాయన్నారు. సంచార తరగతులు స్థిర నివాసం కోసం కాలనీలు నిర్మించాలన్నారు. విద్య లేక వారి పిల్లలూ అదే వృత్తిలో నెట్టబడుతున్నారని పేర్కొన్నారు. ఆయా తరగతుల స్థితిగతులపై సామాజిక సర్వే నిర్వహించాలని కోరారు. వారి సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సంచార ముస్లింలకు ఉపాధి శిక్షణ ఇప్పించాలన్నారు. పిల్లల చదువుకు జిల్లాకో ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

19:46 - November 21, 2016

సూర్యపేట : ఈదులూరి సంతోష్‌కు టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్‌ అన్నారు. ఈదులూరి సంతోష్‌ గతంలో కాంగ్రెస్‌ నుంచి సర్పంచ్‌కు పోటీ చేసి ఓడిపోయాడని.. తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాడని కర్నె ప్రభాకర్‌ తెలిపారు. 

 

19:44 - November 21, 2016

సూర్యాపేట : జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ యువజననేతగా చెప్పుకుంటున్న ఈదులూరి సంతోష్‌ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఉద్యోగాలిప్పిస్తామని... పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసిన సంతోష్... తరువాత బాధితులపై దాడికి పాల్పడ్డ వైనం వెలుగు చూసింది. దాడికి పాల్పడ్డ వైనంపై 10టీవీలో కథనాలు ప్రసారమయ్యాయి. 10టీవీ కథనాలను చూసి బాధితులు ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారు. దీంతో బాధితులు... ఒక్కోక్కరుగా సంతోష్ కన్సల్టెన్సీ కార్యాలయానికి వచ్చి తమకు ఉద్యోగం రాలేదని ప్రశ్నిస్తున్నారు. తాము చెల్లించిన డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడినంటూ పలువురిని బెదిరిస్తూ డబ్బు వసూళ్లు చేసిన సంతోష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కంపెనీల్లో ఉద్యోగాలిస్తామంటూ...  యువకుల నుంచి ఈదులూరి సంతోష్ భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇప్పటికే వందలాది మంది సంతోష్ మోసానికి బలైపోయారు. జాబ్ రాని వారు డబ్బులు అడిగితే.. వారిపై దాడులకు పాల్పడ్డాడు.  

 

19:35 - November 21, 2016
19:33 - November 21, 2016

మెదక్ : పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు. చిల్లర నోట్ల కోసం పాట్లు పడుతూనే ఉన్నారు. కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట జిల్లాలో చాలా ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. ఉన్న ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. 
సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్థం
పాతనోట్ల రద్దు నిర్ణయంతో.. సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారింది. చేతిలో ఉన్న డబ్బులు చెల్లక.. చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు.. ఏటీఎంల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. గంటల తరబడి పడిగాపులుకాస్తున్నారు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదని.. కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని ప్రజలు పడుతున్న ఆవేదనన అంతాఇంతా కాదు. డబ్బులుండి కూడా పస్తులుండే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. పాతనోట్లను తీసుకుని బ్యాంకులు అంతకంటే పెద్దనోట్లు ఇస్తున్నారని.. మా కష్టాలను మరిన్ని పెంచారని వాపోతున్నారు. చాలా ఏటీఎంలు మూసివేసి ఉంటున్నాయని.. దీంతో ఏం చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
మార్కెట్‌లో చిల్లర దొరక్క ఘర్షణలు
మార్కెట్‌లలో చిల్లర దొరక్క చాలాచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌ బంక్‌ల వద్ద ప్రజలు అక్కడి సిబ్బందితో చిల్లరకోసం గొడవలకు  దిగుతున్నారు.  ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లరనోట్లు ముందుగా విడుదల చేసి... పెద్దనోట్లను రద్దు చేస్తే ఇన్ని ఇబ్బందులు తలెత్తేవి కాదని అభిప్రాయపడుతున్నారు. 
ద్రవ్య నిల్వలు లేవంటున్న బ్యాంకు సిబ్బంది
ప్రజల పరిస్థితి ఇలా ఉంటే బ్యాంకు సిబ్బంది పరిస్థితి మరోలా ఉంది.  బ్యాంకులకు వచ్చే వేలాదిమంది అవసరాలు తీర్చగలిగినంత ద్రవ్య నిల్వలు మా వద్ద లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. సంగారెడ్డిలో 194, మెదక్‌లో 84, సిద్ధిపేటలో 99 బ్యాంకులు ఉన్నాయి. అయితే మూడు జిల్లాలోని ప్రజల అవ‌స్థలు తొలగాలంటే సుమారుగా వెయ్యి కోట్ల నగదు నిల్వలు అవసరమవుతాయి. ఈ మొత్తం కోసం బ్యాంకర్లు ఇండెంట్‌  పెట్టారు. అయితే రెండు వందల కోట్ల కంటే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వలేమని రిజర్వ్‌ బ్యాంక్‌ తేల్చి చెప్పింది. దీంతో తాత్కాలిక కష్టాలు తప్పవని బ్యాంకు అధికారిణి విజయలక్ష్మి అంటున్నారు. డబ్బులు లేకే ఏటీఎంలలో కూడా నగదు పెట్టలేకపోతున్నామని ఆమె చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల.. కొంత ఆనందం వ్యక్తం చేసినా.. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

 

19:27 - November 21, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. పెద్ద నోట్లు రద్దై 13రోజులు గడుస్తున్నా ఇంకా సామాన్యుల కష్టాలు తీరలేదు. ఏటీఎంల ముందు క్యూలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల్లో రద్దీ అలాగే ఉంది. పలు చోట్ల ఏటీఎంలు మొరాయిస్తున్నాయి. చాలాచోట్ల ఏటీఎంల ముందు అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నోట్ల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. పెద్దనోట్లరద్దుతో పలు దుకాణాలు బోసిపోతున్నాయి. కొత్త నోట్ల కొరతతో చిరువ్యాపారులు నష్టాలపాలవుతున్నారు. చిరు వ్యాపారులు నష్టాల్లో ఉన్నారు. గిరాకీలేక ఇబ్బందులు పడుతున్నారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:20 - November 21, 2016

హైదరాబాద్ : ఉదయం ఏడు దాటినా బయటకు రాలేని పరిస్థితి.. రాత్రి ఎనిమిదైతే బయట ఉండలేని పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చిన్నారులు, వృద్ధులకు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
చలి మరింత ఎక్కువ 
తెలుగు రాష్ట్రాల్లో చలి మరింత ఎక్కువైంది. మెదక్‌ పట్టణంలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 7 డిగ్రీలు తక్కువ. మెదక్ లో గత పదేళ్లలో నవంబరులో అతి తక్కువ ఉష్ణోగ్రత 8.6 డిగ్రీలు కాగా దానికి సమీపంలో ప్రస్తుతం నమోదైంది. దీంతో శీతలగాలుల వీస్తున్నాయి. 
పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అధికం 
ఉత్తరదిశ నుంచి వస్తున్న గాలుల వల్ల వాతావరణం చల్లబడుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అధికంగా ఉంటున్నాయి. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటున్నందున భిన్నమైన వాతావరణం నెలకొంది. రేపటి వరకు శీతలగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎక్కువగా చలి గాలుల తీవ్రత 
ఉదయం వేళల్లో చలి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. పగటి పూట మేఘాలు కేంద్రీకృతమై ఉంటున్నా.. రాత్రి వేళ సాధారణ పరిస్థితి ఉంటుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయి. మెదక్, నల్లగొండల్లో 6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా 9 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు నమోదైంది. నగరంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.
రాత్రికాగానే చలి 
ఉదయం పూట ఎండ దంచికొడుతుంటే..రాత్రికాగానే చలి కూడా వణికిస్తోంది. ఈ వాతావరణ వైవిధ్యంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే నగరంలో రోగాలవ్యాపించి యాతనగా తయారైంది. చలికాలంలో పగటి సమయం తక్కువ. దీనికి తోడు వేడి, చలి రెండింటి నడుమ వ్యత్యాసాలు శరీరంలోని హోర్మోన్లపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శుభ్రత, చక్కని ఆహార నియమాలే ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసాలను తట్టుకొనేలా చేస్తాయని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఎండ..చలి మధ్యన నలిగిపోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు వ్యాపించవని డాక్టర్లు సూచిస్తున్నారు. 

 

19:09 - November 21, 2016

గుంటూరు : కరెన్సీ సమస్య... అమరావతిలో మరింత దారుణంగా మారింది. 10 గ్రామాలకు కలిపి ఒకే బ్యాంక్ ఉండడం, అందరూ ఒకే చోటుకి రావడంతో రద్దీ మరింత ఎక్కువ అవుతోంది. గ్రామాలు, పట్టణాలు ఎక్కడ చూసినా బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. ప్రైవేటు బ్యాంకులు కంటే ప్రభుత్వరంగ బ్యాంకులకు జనం పోటెత్తారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:04 - November 21, 2016

విజయవాడ : నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరోవైపు ఆర్బీఐ జారీ చేసిన రెండు వేల రూపాయల నోటుతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. రెండు వేల రూపాయలకు చిల్లర లేదని విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులను టికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాగ్ కలకలం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాగ్ కలకలం రేపింది. ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం వద్ద బ్యాగులో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. సీఐఎస్ ఎఫ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేట్టాయి. 

 

ప్రధాని మోడీతో అరుణ్ జైట్లీ సమావేశం

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు. అంతకముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మోడీ భేటీ అయ్యారు. 

18:17 - November 21, 2016

ఢిల్లీ : సీఎం తెలంగాణ కేసీఆర్... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని నాలుగు మార్గాలను జాతీయ రహదారులుగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ భూములలో ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు చేపట్టనున్న రోడ్ల విస్తరణకు రవాణా శాఖ నుంచి సహకారం అందించాలని కేసీఆర్ గడ్కరీని కోరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రకటించిన జాతీయ రహదారులకు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే భూ సేకరణకు అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. భూ సేకరణ అనంతరం నాలుగు లైన్ల విస్తరించేందుకు  సిద్ధమని గడ్కరీ తెలిపారు. గత యాభైయేళ్ళు గా జరగని అభివృద్ధి... ఐదేళ్లలో చేస్తామని కేసీఆర్ కు గడ్కరీ హమీ ఇచ్చారు.

 

18:13 - November 21, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో తీవ్ర రగడ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాయిదాల పర్వం కొనసాగింది. ప్రధాని మోడీ సభకు వచ్చి పెద్ద నోట్ల రద్దుపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టి సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభా కర్యక్రమాలు స్తంభించాయి. సభా గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని సాభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం  కనిపించలేదు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

 

17:51 - November 21, 2016
17:48 - November 21, 2016
17:46 - November 21, 2016

విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్

ముంబై : విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ముంబై కోర్టు మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

 

 

 

నోట్ల రద్దు ప్రభావం పోలవరం ప్రాజెక్టుపై పడదన్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : తమిళనాడు, కర్నాటకతో రగడ జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. నోట్ల రద్దు ప్రభావం పోలవరం ప్రాజెక్టుపై పడదని తెలిపారు. 

 

సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ సమర్పించిన లోధా కమిటీ

ఢిల్లీ : లోధా కమిటీ సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది. బీసీసీఐ పెద్దలకు లోధా కమిటీ షాక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రస్తుత ఆఫీస్ బేరర్స్ ను తొలగించాలని సిఫార్సు చేసింది. బీసీసీఐ పర్యవేక్షణ బాధ్యతలు మాజీ హోంసెక్రటరీ జీకే పిళ్లైకి అప్పగించాలని సూచించింది. పిళ్లైకి తాత్కాలిక పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. 

 

17:13 - November 21, 2016

విశాఖ : ప్రభుత్వ శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు విశాఖలో దశలవారీగా స్వైపింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఎస్ బీఐ సహకారంతో ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని తర్వాత మిగిలిన ఆఫీసులకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:10 - November 21, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో పెన్షన్ల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెయ్యి, ఐదొందల పాత నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ప్రాధాన్యత ఇస్తున్న బ్యాంకులు.. పెన్షనర్ల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. పెన్షన్‌ సొమ్ము చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర గంటలతరబడి వేచివున్నా ప్రయోజనం ఉండటంలేదని ఆవేద వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి తిరిగినా పెన్షన్‌ డబ్బులు ఇవ్వండంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:06 - November 21, 2016

కృష్ణా : పాత నోట్లు రద్దై 13 రోజులు గడుస్తున్నా ప్రజలు కష్టాలు తీరడం లేదు. చిల్లర కోసం పాత నోట్లు మార్చుకోవడం కోసం ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయవాడలో ఏటీఎంలలో 2 వేల నోట్లు రావడంతో చిల్లర కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కనీస అవసరాలు కోసం డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం వద్ద జనాలు బారులు తీరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:55 - November 21, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దేశంలో ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. నోట్లు రద్దయి 13 రోజులవుతున్నా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. అన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. నోట్ల రద్దు ఆర్టీసీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే విజయవాడ బస్టాండ్ నోట్ల రద్దుతో ఖాళీగా కనిపిస్తోంది. బస్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి. సగం మేర ఆదాయానికి నష్టం వాటిల్లింది. దీంతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోంది. ఆర్టీసీని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న వ్యాపారులు, హమాలీలు, ఆటో వాలాల పరిస్థితి దారుణంగా తయారైంది. చిల్లర కొరతో హమాలీలు, ఆటోవాలాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా నగదు సరఫరా చేసి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

జమ్మూకాశ్మీర్ లో బ్యాంకు దోపిడీ

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని బుడ్గామ్ జిల్లాలో దుండుగులు బ్యాంకు దోపిడీ చేశారు. దుండుగులు రూ.13 లక్షలు దోచుకెళ్లారు. అందులో రూ.11 లక్షల వరకు పాత నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

 

16:39 - November 21, 2016

కర్నాటక : గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఒబుళాపురం మైనింగ్ సంస్థపై ఐటీ దాడులు నిర్వహించింది. బళ్లారిలోని సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఖర్చుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:26 - November 21, 2016

ఢిల్లీ : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. చర్చ చేపట్టాల్సిందేనని నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పిన సభ్యులు వినిపించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

 

16:05 - November 21, 2016

సంగారెడ్డి : 13 రోజుల దాటినా పెద్ద నోట్ల కష్టాలు సామాన్య జనాన్ని వదలడం లేదు. కనీస అవసరాలు తీరక పస్తులుండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కార్‌ తీరును వృద్ధులు తీవ్రంగా నిరసిస్తున్నారు. సంగారెడ్డిలోని బ్యాంకుల ముందు సామాన్య జనం కష్టాలు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:55 - November 21, 2016

విశాఖపట్నం : విశాఖ టెస్ట్‌లో భారత్‌ విజయభేరి మోగించింది. భారత బౌలర్ల ఎదురుదాడిని ఇంగ్లండ్ ఏమాత్రం నిలువరించలేకపోయింది. భారత పెట్టిన 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 97.3 ఓవర్లలో 158  పరుగులకే ఆలౌట్‌ అయ్యి ఓటమి పాలైంది. మొదటి టెస్టులో భారత్ 246 పరుగుల సూపర్ విక్టరీ నమోదు చేసింది. నాల్గో రోజు ఆటలో రెండు వికెట్లను కూల్చి ఫర్వాలేదనిపించిన భారత్.. ఐదో రోజు ఆటలో మాత్రం చెలరేగిపోయింది. ఇంగ్లండ్ ఆటలో డకెట్ పరుగులేమీ చేయకుండా మూడో వికెట్ గా పెవిలియన్ చేరితే, ఆ పై కాసేపటికి మొయిన్ అలీ రెండు పరుగులు చేసి నిరాశపరిచాడు. డకెట్ ను అశ్విన్ అవుట్ చేస్తే, అలీని జడేజా పెవిలియన్ కు పంపాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన బెన్ స్టోక్స్ ను ఆరు పరుగులకే యాదవ్‌ బౌల్డ్‌ చేశాడు. జో రూట్‌ 25 పరుగులు, రషీద్‌ 4 పరుగులు చేయగా మొహ్మద్‌ షమీ వీరిని అవుట్‌ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఇక తరువాత అరగంట వ్యవధిలో ఇంగ్లండ్ మిగతా మూడు వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ తలో మూడు వికెట్లు సాధించగా, షమీ, జడేజాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కోహ్లీని వరించింది. 

 

15:52 - November 21, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో జీహెచ్ ఎంసీ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కూలీ డబ్బుల కోసం బ్యాంకు ముందు గంటలకొద్దీ క్యూకడుతున్నారు. క్యూలోనే గంటలకొద్దీ సమయం గడిచిపోతోంది. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ కోసం బ్యాంకుముందు నిరీక్షణ చేస్తున్నారు. వృద్ధులు క్యూలో నిలబడలేకపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

15:49 - November 21, 2016

పశ్చిమగోదావరి : స్కాడ్‌ ఆఫ్ సిస్టం ద్వారా అవసరాలను బట్టి విద్యుత్‌ను పంపిణీ చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గొల్లగూడెంలో ఆయన పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుకున్నారు. 

గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఖర్చుపై ఐటీ అధికారులు ఆరా

కర్నాటక : గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఒబుళాపురం మైనింగ్ సంస్థపై ఐటీ దాడులు నిర్వహించింది. బళ్లారిలోని సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లి ఖర్చుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

 

రాజ్యసభ మంగళవారానికి వాయిదా...

ఢిల్లీ : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పిన వినకుండా సభ్యులు ఆందోళన చేట్టారు. దీంతో చైర్మన్ కురియన్ 
మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

14:05 - November 21, 2016

కాలేజ్ అమ్మాయిల నుండి కార్పొరేట్ ఎంప్లాయిస్ వరకూ కంఫర్ట్ గా వుండే కుర్తీస్ నే ఇప్పుడు అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. లెగ్గింగ్ మీదకైనా, చుడీ మీదకైనా కరెక్ట్ గా సూట్ అయ్యే కుర్తీస్ అందరూ ఇష్టపడే..అందరికీ సరపడే సైజులతో ఈనాటి సొగసు మీ ముందుకొచ్చేసింది..మరి ఎందుకు ఆలస్యం ఈ అందమైన కుర్తీలకు ఒక్క క్లిక్ తో చూడండి..

13:54 - November 21, 2016

తిరుపతి : ప్రజా సమస్యలపై విచిత్ర వేషధారణతో గళమెత్తే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ...నోట్ల రద్దుతో ప్రజల ఇక్కట్లపైనా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బుర్రకథ రూపంలో సామాన్యుల ఇబ్బందులను తెలియజేశారు. 13 రోజులవుతున్నా సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదని ఎంపీ శివప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కేంద్రానికి తెలియటంలేదని ప్రశ్నించారు.

13:50 - November 21, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 36వరోజుకు చేరింది.. సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సీపీఎం బృందం సభ్యులు.... పల్వట్ల, మార్వెల్లి, తాలెల్మ, బ్రాహ్మణపల్లి, డాకూరు, జోగిపేట, ఆందోల్‌లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూండి..

13:48 - November 21, 2016

విజయవాడ : 25 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన హెరిటేజ్‌ కంపెనీ పై అనవసర ఆరోపణలు చేయడం తగదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అధికారపార్టీపై ప్రతిపక్షం కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. నీతినిజాయితీలు కలిగిన కంపెనీని ఉండాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు హెరిటేజ్‌ను స్థాపించారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రతిపక్షం మానుకోవాలని తెలిపారు. 

13:44 - November 21, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు భారత చరిత్రలోనే అతిపెద్ద తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ముగ్గురు నలుగురికి చెప్పి ప్రధాని మోది ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం వల్ల వచ్చే సమస్యలపై ఆయన దృష్టి పెట్టలేదని విమర్శించారు. పెద్దవాళ్ల బ్యాంక్‌ వెనక తలుపుల నుంచి లోనికెళ్తున్నారని, పేదవాళ్లు మాత్ర నోట్ల మార్పిడి కోసం గంటలతరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోది బుల్లెట్‌ ట్రెయిన్‌ల గురించి మాట్లాడతారు కానీ సామాన్య ప్రయాణికుల భద్రతపై ఎప్పుడు నోరు విప్పరని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. రైల్వే మౌళిక సదుపాయాలను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

13:35 - November 21, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం నియంత్రించడమేమో గానీ సామాన్యుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం.. కూలీ నాలి చేసుకోని పొట్ట నింపుకునే కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. రోజూ రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. పొట్ట చేత పట్టుకోని హైదరాబాద్‌కు వలస వచ్చిన అడ్డకూలీల పరిస్థితి దారుణం మారింది. చిరు వ్యాపారులు చిల్లర కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రేటర్‌ పరిధిలో సామాన్యుల ఇబ్బందులు
పెద్ద నోట్ల రద్దుతో గ్రేటర్‌ పరిధిలో సామాన్యుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నిత్యవ‌స‌ర స‌రుకులు కొన‌డానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. నోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. పొట్ట చేతపట్టుకొని సొంత ఊరిని వదిలి ఇక్కడకు వచ్చిన కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అడ్డా కూలీల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

రూ.2000 నోటుకు చిల్లర ఇవ్వలేక చిరు వ్యాపారుల అవస్థలు
500, 1000 నోట్ల రద్దుతో చిరువ్యాపారులు, కిర‌ణ‌షాపు యజమానులు ఇబ్బందులు ప‌డుతున్నారు. పెద్దనోట్ల మారకం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో పాటు అందుబాటులోకి వ‌చ్చిన 2000 రూపాయల నోటుకు కూడా చిల్లర దొర‌క‌డం లేదు. చిన్న చిన్న స‌రుకుల‌ కోసం కిరాణ షాపుల‌కు వ‌చ్చే వారికి చిల్లర ఇవ్వడానికి ఇబ్బందులు ప‌డుతున్నారు వ్యాపారులు. త‌మ‌కు గిరాకీలు తగ్గి గ‌తంలో కంటే స‌గం స‌రుకులు త‌క్కువ‌గా తెస్తున్నామని షాపు యజమానులు అంటుంటే.. చిల్లర క‌ష్టాల‌తో కిరాణ షాపు రాలేకపోతున్నామని కస్టమర్లు చెబుతున్నారు. అత్యవ‌స‌ర‌మైన మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలీలు, కార్మికులపై తీవ్రంగా పెద్ద నోట్ల ప్రభావం
రోజు వారీ కూలీ మీద ఆధార‌ప‌డ్డ బ‌డుగు జీవుల క‌ష్టాలు మ‌రీ ఎక్కువ‌య్యాయి. రెక్కాడితే గాని డొక్కాడని అడ్డాకూలీలు క‌ష్టాల‌తో కాలం వెళ్లదీస్తున్నారు. వారం, ప‌దిరోజుల నుండి ప‌నుల లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని వాపోతున్నారు. దొరికే ఒక‌టి రెండు ప‌నుల్లోనూ పాత‌నోట్లను తీసుకోవాల‌ని వత్తిడి చేస్తున్నారని గోడు వెల్లబోసుకున్నారు. రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇచ్చి వాటిని పంచుకోమ్మన‌డంతో చాలా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయంటున్నారు. ఆటోవాలాలు కూడా ఇదే ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. చిల్లర కొరతతో ఆటోలకు గిరాకీ తగ్గిందని చెబుతున్నారు.

పాత నోట్లతో అడ్డా కూలీల అవస్థులు
చిల్లర కష్టాలు ఒకవైపు.. పాత నోట్ల మార్పిడి మరోవైపు.. సామాన్యుడి నడ్డి విరుస్తోంది. చిరు వ్యాపారులకు చిల్లర చిక్కులు తెచ్చిపెడితే... పాత నోట్లు అడ్డా కూలీలకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. ఇంకేన్నాళ్లీ కష్టాలనుకుంటూ సామాన్యుడు కాలం వెల్లదీస్తున్నాడు. 

13:26 - November 21, 2016

హైదరాబాద్ : తన ఇంటి కోసం వందల కోట్లు ఖర్చుపెట్టే కేసీఆర్..విద్యార్థుల ఫీజులను మాత్రం విడుదల చెయ్యడం లేదని టీఎన్ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిలుకా మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ సెక్రటేరియట్‌ ఎదుట టీఎన్ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫీజులు విడుదల చెయ్యకపోతే...ఈనెల 24న కేసీఆర్ గృహప్రవేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

వైద్యశాఖాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం..

హైదరాబాద్ : వెంగళ్‌రావు నగర్‌లోని ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో జిల్లా వైద్యాధికారులు, వైద్యశాలల సూపరింటెండెంట్‌లతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. వైద్యసేవల పనితీరు, వైద్యశాలల విభజన, విస్తరణ, ఖాళీలు, అవసరాలు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం..

విశాఖ‌ప‌ట్నం: రెండోటెస్ట్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఘన విజయం సాధించింది. చిత్తుగా ఓడించింది టీమిండియా. 246 ప‌రుగుల తేడాతో ఓడించి ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 

12:41 - November 21, 2016

సంగారెడ్డి : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో పల్లె పల్లెను పలకరిస్తూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 35వ రోజు పూర్తి చేసుకుంది. ప్రతి గ్రామంలో పాదయాత్ర బృందానికి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని నిమ్జ్‌ భూనిర్వాసితుల సమస్యపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

35 రోజు నాటికి పాదయాత్ర 900 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర
ప్రజా సమస్యలపై సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. 35వ రోజు సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ ఎక్స్‌రోడ్‌లో ప్రారంభమైంది. అక్కడి నుంచి తిరూర్‌, మహబాద్‌పూర్‌, రాయిపల్లి, ఘట్‌పల్లి, వట్‌పల్లి, గొర్రెకల్లు, నాగులపల్లి వరకు కొనసాగింది. 35వ రోజు నాటికి పాదయాత్ర 900 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సింగూరు దగ్గర నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ విజయపాల్‌ రెడ్డి, నారాయణఖేడ్‌ ఎంపీపీ కాంగ్రెస్‌నేత పీ సంజీవరెడ్డి పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా..ప్రజాసమస్యలపై సీపీఎం పోరాటం చేయడం శ్లాఘనీయమని మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఈ పాదయాత్ర ముందుకు పోతుందని నారాయణఖేడ్‌ ఎంపీపీ సంజీవరెడ్డి అన్నారు.

ఆశావర్కర్లు 106 రోజులు సమ్మె చేసినా సమస్యలు పరిష్కరించలేదు : రమ
ఆశావర్కర్లు 106 రోజులు సమ్మె చేసినా వారి సమస్యలు పరిష్కరించలేదని పాదయాత్ర బృందం సభ్యురాలు ఎస్‌ రమ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, అంగన్‌వాడి ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్‌కు లేఖ రూపంలో తెలియజేస్తున్న తమ్మినేని..
పల్లెపల్లెలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు లేఖ రూపంలో తెలియజేస్తున్న తమ్మినేని.. తాజాగా నిమ్జ్‌ భూ సేకరణపై మరో లేఖ రాశారు. ఝరాసంగం మండలంలో రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా.. భూసేకరణ చేయడం తగదని సూచించారు. బహుళ పంటలు పండే భూములను లాక్కోవడంలో ఆంతర్యం ఏమిటని తమ్మినేని లేఖలో ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం కాకుండా.. 123 జీవో ప్రకారం పరిహారం ఇవ్వడం అన్యాయమని, సంబంధిత గ్రామాల్లో సర్వే నిర్వహించి రైతుల ఇష్టానుసారం భూ సేకరణ చేయాలని సూచించారు.

12:33 - November 21, 2016

తిరుపతి : విచిత్ర వేషాలు వేసిన ప్రజాసమస్యలను ప్రశ్నించే ఎంపీ శివప్రసాద్ ఇప్పుడు తాజాగా మరో వేషం కట్టారు. దేశం ప్రస్తున సమస్యగా మారిన పాత పెద్దనోట్ల అంశంపై ఆయన బుర్రకథ వేషంతో నిరసన తెలిపారు. డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలంతా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ ఎంపీ శివప్రపాద్‌ అన్నారు. ప్రజా సమస్యలపై విచిత్ర వేషధారణతో గళమెత్తే ఆయన...నోట్ల రద్దుతో ప్రజల ఇక్కట్లపైనా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బుర్రకథ రూపంలో సామాన్యుల ఇబ్బందులను తెలియజేశారు. 

12:27 - November 21, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌లో నోట్లరద్దుపై వేడి కొనసాగనుంది. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విరుచుకుపడుతున్న విపక్షాలు.. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అధికార పార్టీని మరింత ఇరుకున పెట్టేందుకు యోచిస్తున్నాయి. ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నోట్లరద్దుపై కాంగ్రెస్ పార్టీ...లోక్‌సభలో వాయిదాతీర్మానం ప్రవేశపెట్టనుంది. 

12:23 - November 21, 2016

హైదరాబాద్ : దిల్ సుక్ నగర్ జంటపేలుళ్ళ కేసు వాయిదా పడింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జంటపేలుళ్ళ కేసును డిసెంబర్ 13కు వాయిదా ఎన్ ఐఏ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. నిందితులకు ఎటువంటి శిక్ష పడుతుందని ఎదురు చూసిన వారికి నిరాశ ఎక్కువైంది. ఇప్పటికే ఈ ఘటన జరిగి మూడున్నర సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 138 మంది గాయపడిన విషయం తెలిసిందే. 

రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య..

ఉత్తరప్రదేశ్‌: పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 133కు చేరింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణ లోపం ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. యూపీలో రైలు ప్రమాదమృతులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నోట్ల రద్దుపై పట్టుపట్టారు.దీంతోసభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను మధ్యహ్నానికి వాయిదా వేశారు.

నోట్ల రద్దుపై మరోసారి సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం..

ఢిల్లీ : పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అయితే, ఇంత‌కు ముందు ఆయా పిటిష‌న్ల‌ను అన్నింటినీ కొట్టి వేయాల‌ని కోరిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ సారి మాత్రం అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయ‌స్థానానికి విజ్ఞ‌ప్తి చేసుకుంది.

11:59 - November 21, 2016

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. యూపీలో రైలు ప్రమాదమృతులకు సభ సంతాపం తెలిపింది. పెద్దనోట్ల రద్దుపై లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాలు ఈ అంశంపై చర్చ చేపట్టాలని.. ప్రధానమంత్రి సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేపట్టాయి. అయితే స్పీకర్‌ వారి విజ్ఞప్తిని పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆందోళన తీవ్రం కావడంతో ఒకసారి సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా ఆందోళన కొనసాగించడంతో తిరిగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. మొదటిసారి వాయిదా అనంతరం తిరిగి లోక్‌సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్‌..చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను గెలుచుకున్న పీవీ సింధుకు అభినందనలు తెలుపుతూ తీర్మానాన్ని చదివి వినిపించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రకటన చేశారు. రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 133 మంది ప్రయాణికులు మృతిచెందారని..ఒక్కో మృతుని కుటుంబానికి రైల్వేశాఖ తరపున 3.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి 50వేలు, స్పల్పంగా గాయపడ్డ వారికి 25వేలు నష్టపరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేశాఖ ఇస్తున్న మొత్తంతో పాటు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి 2లక్షలు పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని..ప్రమాదంపై విచారణ కమిటీ దర్యాప్తు చేస్తోందని ప్రకటించారు మంత్రి సురేష్ ప్రభు. 

సచివాలయం ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ యత్నం..

హైదరాబాద్ : ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో సచివాలయం ముట్టడికి టీఎన్ ఎస్ ఎఫ్ యత్నించింది. దీంతో ఆందోళన కారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్ కు తరలించారు. కాగా ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రయివేటు కళాశాలల యాజమాన్యలు కూడా గతంలో బంద్ పాటించిన సంగతి తెలిసిందే. 

విశాఖ మ్యాచ్ లో ఓటమికి దగ్గరలో ఇంగ్లండ్..

విశాఖ : జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓటమికి చేరువయింది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మెన్లు కనీసం రెండంకెల స్కోరును కూడా చేరుకోకుండానే పెవిలియన్ చేరుతున్నారు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ జయంత్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కీలక బ్యాట్స్ మెన్ రూట్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెహమ్మద్ షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిగాడు. ప్రస్తుతం బెయిర్ స్టో (10), రషీద్ (0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో రెండు వికెట్లు తీసుకోగా... షమీ, జయంత్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు.

ప్రారంభమైన కొంతసేపటికే రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల స‌మావేశాల్లో భాగంగా ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభమ‌య్యాయి.కాన్పూర్ రైలు ప్రమాదంలో 120 మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మృతుల‌ కుటుంబాల‌కు ఉభ‌య‌స‌భ‌లు సంతాపం తెలిపాయి. అనంత‌రం నోట్ల ర‌ద్దుపై ఉభ‌య‌స‌భ‌ల్లో చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, విప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే లోక్‌స‌భలో ప్ర‌శ్నోత్త‌రాలు ప్రారంభించారు. రాజ్యసభలో కూడా విపక్షాలు నిరసన వ్యక్తం చేయటంతో రాజ్యసభను  కురియన్ మ.12.30లకు వాయిదా వేశారు. 

11:17 - November 21, 2016

ఢిల్లీ : శుక్రవారం వాయిదా పడిన పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభమయ్యిన అనంతరం రైల్వే ప్రమాదంలో మృతి చెందిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. రైల్వే మృతులతో పాటు పెద్ద నోట్ల రద్దు వల్ల మరణించివారికి కూడా నివాళులర్పించాలని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. వాళ్లు కూడా భారతీయులేనని స్పష్టం ఆయన స్పష్టం చేశారు.పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్‌ పోడియాన్ని విపక్ష సభ్యులు చుట్టుముట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను 12 .30గంటలకు వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో అదే గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టు బట్టాయి. దీంతో సభలో మరోమారు గందరగోళం నెలకొంది. ప్రారంభమై పది నిమిషాలు కాకముందే సభ మరోసారి వాయిదా పడింది. సభను 12గంటల వరకు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ వాయిదా వేశారు.

లైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోయారని శ్రద్ధాంజలి ఘటించాలి : ఏచూరి
పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యప్రజలు ఇబ్బందులకు గురయ్యారని సిపిఎం నేత ఏచూరి అన్నారు. నోట్ల మార్పిడి కోసం లైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోయారని ఏచూరి తెలిపారు. వారికి కూడా శ్రద్ధాంజలి ఘటించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. దీని తర్వాత చర్చకు తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

11:10 - November 21, 2016

నోట్లు రద్దు..కొత్తనోట్ల కొరత దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. అసలు పాత పెద్దనోట్లు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? దీని వల్ల లాభమా? లేక నష్టమా? ఈ అంశంపై రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు సంభవించనున్నాయి? అనే అంశంపై టెన్ టీవీ ప్రముఖ చార్టెడ్ ఎకౌంటెంట్ సీటీ చౌదరితో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది.. మరి నోట్ల రద్దుపై చౌదరి ఎటువంటి విశేషణ చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

11:06 - November 21, 2016

పశ్చిమగోదావరి : కార్తీక మాసమంటే పరమ శివుడికి ప్రీతిపాత్రమైనది..కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాల్లో భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. ఇక పంచారామ క్షేత్రాల్లో భక్తుల దాకిడి చెప్పనే అక్కర్లేదు. కార్తీక మాసంలోనూ..శివరాత్రి రోజున ఒకేరోజు పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే శివప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధం చెందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.

ఇవే ఆ పంచారామ క్షేత్రాలు :
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలోని గునిపూడి..సోమేశ్వరుడు.. పాలకొల్లులో రామలింగేశ్వడు..క్షీరారామము..తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామములో భీమేశ్వరుడు ..సామర్లకోటలో భీమేశ్వరుడు ..గుంటూరు జిల్లాలో అమరావతిలో అమరేశ్వరుడుగా స్వామివారు పూజలందుకుంటున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా రెండు ఆరామాల విశిష్టతలు..
ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపై పడటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత..ఈ జిల్లాలోనే మరొక ఆరామమం భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది.

గుంటూరు జిల్లా అమరావతి..
గుంటూరు జిల్లాలో గుంటూరుకు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి.

తూర్పుగోదావరి జిల్లాలో రెండు క్షేత్రాలు..
ఇదే జిల్లాలో కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు..శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుండటం ఈ ఆలయం యొక్క విశిష్టత..

10:46 - November 21, 2016
10:25 - November 21, 2016

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది. కాగా వీరికి న్యాయస్థానం ఎటువంటి శిక్షను విధించనుందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 138 మంది గాయపడిన విషయం తెలిసిందే.రియాజ్ బక్తల్, అసదుల్లా అక్తల్, అక్తర్ అలియాస్ మెల్, హర్, యాసిన్ బక్తల్, యజాజ్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రియాజ్ బక్తల్ పరారీలో ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్ధాల యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో 157మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన 502 డాక్యుమెంట్లను పరిశీలించింది.మొత్తం 157 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం
ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ప్రత్యేక కోర్టు కేసు విచారణ పూర్తి చేసింది. మొత్తం 157 మంది సాక్షులను విచారించింది. ఎన్‌ఐఏ అందజేసిన 502 డాక్యుమెంట్లను, ఘటనా స్థలంలో సేకరించిన 201 మెటీరియల్స్‌ను కోర్టు పరిశీలించింది. నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలనూ విన్న న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

10:19 - November 21, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి.. పెద్ద నోట్లు రద్దై 13రోజులు గడుస్తున్నా ఇంకా సామాన్యుల కష్టాలు తీరలేదు..ఏటీఎం లముందు క్యూలు కొనసాగుతున్నాయి.. బ్యాంకుల్లో రద్దీ అలాగేఉంది.. చాలాచోట్ల ఏటీఎం లముందు అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. కొత్త నోట్ల కొరతతో చిరువ్యాపారులు నష్టాలపాలవుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు మొరాయిస్తుండగా చాలాచోట్ల అవుట్‌ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెద్దనోట్లరద్దుతో పలు దుకాణాలు బోసిపోతున్నాయి. గిరాకీల్లేక చిరువ్యాపారులు నానా అగచాట్టూ పడుతన్నారు. నోట్లకోసం జనాల అవస్థలకు గురవుతున్నారు. రామ్ నగర్ లోని ఏటీఎం సెంటర్ వద్ద ఎటువంటి పరిస్థితులున్నాయో వీడియోలో చూడండి..

10:14 - November 21, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను చలి గజగజా వణికిస్తోంది. ఏపీలోని విశాఖ, తెలంగాణలోని మెదక్‌ జిల్లాల చలి పంజా ధాటికి వణికిపోతున్నాయి. విశాఖలోని లంబసింగిలో 5 డిగ్రీలకు టెంపరేచర్‌ పడిపోవడంతో మన్యం వాసులు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇటు తెలంగాణలో చలి మరింత అధికమైంది. ప్రస్తుత శీతాకాలంలో అత్యల్పంగా 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత మెదక్‌ పట్టణంలో నమోదైంది. ఇది సాధారణంకన్నా 7 డిగ్రీలు తక్కువ. మెదక్‌లో గత పదేళ్లలో నవంబరులో అతి తక్కువ ఉష్ణోగ్రత 8.6 డిగ్రీలు కాగా దానికి సమీపంలో ప్రస్తుతం నమోదైంది. ఇక చలికి హైదరాబాద్‌ నగర వాసులు వణికిపోతున్నారు. సాధారణంగా మద్నాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.9 డిగ్రీలకు చేరడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. రెండురోజులుగా నగరంలో సాధారణకంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నగరంలో కనిష్ఠంగా 12.9 డిగ్రీలు, గరిష్టంగా 30.2 డిగ్రీలు నమోదయ్యింది.దీంతో శీతలగాలుల ఉద్ధృతి అధికమవుతోంది. ఉత్తరదిశ నుంచి వస్తున్న గాలుల వల్ల వాతావరణం చల్లబడుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అధికంగా ఉంటున్నాయి. రాత్రి, పగలు ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటున్నందున భిన్నమైన వాతావరణం నెలకొంది. వారం రోజుల్లో చలితీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.

10:08 - November 21, 2016

జమ్ముకశ్మీర్: కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి య‌థేచ్ఛ‌గా తూట్లుపొడుస్తున్న పాకిస్థాన్ తాజాగా మ‌రోమారు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. స‌రిహ‌ద్దులోని రాజౌరి సెక్టార్ వద్ద పాక్ బలగాలు భారత్ జవాన్లపై కాల్పులు పాల్పడ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ ఆర్మీ జ‌వాను వీర‌మ‌ర‌ణం పొంద‌గా మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. 24 గంటల్లో పాక్ మూడుసార్లు కాల్పుల ఉల్లంఘన విరమరణకు పాల్పడింది. ఆదివారం రాత్రంతా పాక్ కాల్పులు జరుపుతూనేవుంది. దీంతో భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తత కొనసాగుతోంది. సెప్టెంబర్ 29 తరువాత పాక్ కాల్పుల్లో 14మంది భారత్ సైనికులు..12మంది స్థానిక పౌరులు మృతిచెందారు. పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఎల్ వోసీ వద్ద 28 సార్లు కాల్పులకు తెగబడింది. 

జంట పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు..

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది. కాగా వీరికి న్యాయస్థానం ఎటువంటి శిక్షను విధించనుందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

10:05 - November 21, 2016

పాత పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి దేశంలో అన్ని రంగాలకు సంబంధించి ఎకానమి స్థంభించిపోయింది. ఇది రాష్ట్ర ఖజానాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. పలు అంశాలపై సహనంగా..సమన్వయంతో వ్యవహరించే ఏపీ సీఎం చంద్రబాబు కూడా నోట్ల రద్దు అంశంపై తాను సహనం కోల్పోయాననీ..పేర్కొన్నారు. ఒక సమస్య ఇన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉండటం తన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 12 రోజులైనా డిమానిటైజేషన్‌ సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధాకరమన్నారు. ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్న బాబు.. దీనిపై తనకే అసహనంగా ఉందని పేర్కొన్నారు. ఇటు తెలంగాణ సీఎం కూడా ఇదే అంశంపై ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాపై పడిన తీరు..ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు గురించి కూలకషయంగా చర్చించారు. పాత నోట్ల రద్దుతో తెలుగు రాష్ట్రాల ఖాజానాపై ప్రభావం అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి (ప్రముఖ విశ్లేషకులు) దినకర్ (టీడీపీ నేత),తాడూరి శ్రీనివాస్(టీఆర్ఎస్ నేత) మేర్గు నాగార్జున (వైసీపీ నేత)పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:38 - November 21, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. నోట్ల రద్దును సమర్ధిస్తూ ప్రకటనలు చేస్తున్న పార్టీలు... ఇదే అంశాన్ని అసరాగ చేసుకుని విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో నోట్ల రద్దు అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం
దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలను నోట్ల రద్దు అంశం ఏదో ఓ రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉంది. నోట్ల రద్దు నిర్ణయంలో ఉన్న లొసుగులను పలు పార్టీలు తవ్వి తీసే పనిలో పడ్డాయి. కొన్ని రాజకీయ పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని నేరుగా తప్పుబడుతుండం.. మరికొన్ని రాజకీయ పార్టీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే....అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఇదే అంశాన్ని అసరాగా చేసుకుని విమర్శలకు దిగుతున్నాయి. అధికార పార్టీ ఓ అడుగు ముందుకు వేసి ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతకు నోట్ల రద్దు నిర్ణయం మింగుడు పడడం లేదని, అంతు చిక్కని వ్యాధితో సతమతం అవుతున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసంటున్న వైసీపీ నేతలు
పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వైసీపీ... తమపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు అన్ని దారులను వెతుకుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు ముందే తెలుసున్న వాదనను తెరపైకి తెస్తోంది. ఇందుకు సంబంధించి జరిగిన కొన్ని సంఘటనలను వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు.

ముందు జాగ్రత్తతో హెరిటేజ్‌ సంస్థను అమ్ముకున్నారంటూ ఆరోపణలు
కేంద్ర నిర్ణయం పది రోజుల ముందుగా తెలియడంతోనే చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను విక్రయించారని ఆరోపణలను చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు లేకుండా రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం ప్రజలకు కొత్త ఇబ్బందులు సృష్టించడమే అంటూ.....వైసీపీని టార్గెట్ చేస్తోంది.

07:20 - November 21, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక రంగానికి ఊతమా..? లేక విధాన వైఫల్యమా..? దీనిపై దేశ ఆర్థిక నిపుణుల్లోనే కాదు.. అంతర్జాతీయ మీడియాలోనూ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. భారత్‌లో కరెన్సీ కష్టం రోజురోజుకీ పెరుగుతుండడాన్నీ అంతర్జాతీయ మీడియా నిశితంగా పరిశీలిస్తోంది. గడచిన పన్నెండు రోజులుగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపై విదేశీ పత్రికలు ఎలాంటి కామెంట్స్‌ చేశాయో ఓ లుక్కేద్దామా..?

భారత్‌లో కరెన్సీ కష్టాలపై విదేశీ మీడియా పలు కథనాలు..
నవంబర్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలోని 14 లక్షల కోట్లకు పైగా... ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు ఒక్కసారిగా చెల్లనివిగా మారిపోయాయి. కరెన్సీకి ఒక్కసారిగా కొరత ఏర్పడింది. ప్రభుత్వం సరైన రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని కారణంగా.. చిల్లర నోట్ల కోసం ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ దూరం క్యూల్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులపై విదేశీ పత్రికలు విశ్లేషణాత్మక కథనాలను, ఎడిటోరియల్స్‌ను ప్రచురించాయి.

దాదాపు ప్రతి అంశాన్నీ గమనించిన విదేశీ మీడియా

అన్ని పత్రికల్లో వచ్చిన వార్తల సారాంశం పరిశీలిస్తే మోదీ నిర్ణయం ఏమంత సఫలమయ్యే అవకాశాలు లేవన్న భావన వ్యక్తమవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో చాలా కుటుంబాలు నగదు లేక పడుతున్న పాట్లు, దినకూలీలు ఉపాధిని కోల్పోతున్న వైనం.. చిల్లర నోట్లు లేక ఆహారం, మందులను కొనలేని దైన్యం.. క్యూలైన్లలో వృద్ధుల అవస్థలు.. ఇలా దాదాపు ప్రతి అంశాన్నీ విదేశీ మీడియా స్పృశించింది.

ధనికులు నల్లధనాన్ని షేర్లు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు మళ్లించారు: ది గార్డియన్‌ 

ధనికులకు ఏం బాధ లేదు. వారంతా నల్లధనాన్ని షేర్లు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు మళ్లించారు. కానీ పాపం పేదలే.. దారుణంగా నష్టపోయారని ది గార్డియన్‌ పత్రిక ఎడిటోరియల్‌ రాసింది. పేదలకు సాధారణంగా బ్యాంకు ఖాతాలు కూడా ఉండవని, వారు నగదు వినియోగంపైనే ఆధారపడతారని, బ్యాంకుల్లో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి తీసుకునేంత డబ్బూ.. సమయం వారి వద్ద లేదని ది గార్డియన్‌ విశ్లేషించింది. ఇప్పటికే దాదాపు డజన్‌ మంది వరకూ క్యూలైన్లకు బలయ్యారని.. కరెన్సీ కష్టాల వల్ల.. ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని గార్డియన్‌ పత్రిక ఎడిటోరియల్‌లో పేర్కొంది. అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీతకు.. నోట్ల రద్దు నిర్ణయం తోడ్పడే అవకాశం ఉన్నా.. పన్నుల విధానంలో సమూల మార్పులు చేసి ఉంటే సామాన్యుడికి కష్టాలు తప్పేవని ది గార్డియన్‌ అభిప్రాయపడింది.

భారత్‌లో 78 శాతం నగదు లావాదేవీలే -: ది న్యూయార్క్‌ టైమ్స్‌

ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కూడా పెద్దనోట్ల రద్దుపై ఎడిటోరియల్‌ రాసింది. భారత్‌లో నగదు లావాదేవీలు ఎంతో కీలకమని, బ్రిటన్‌, అమెరికాలో 20 నుంచి 25 శాతం మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతాయని, భారత్‌లో ఈ పర్సెంటేజీ 78 దాకా ఉంటుందని ది న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. భారత్‌లో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగం బాగా తక్కువని ఫలితంగా.. ఇప్పటికీ నగదు కోసం.. కోట్లాది ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌లో పేర్కొంది.

సరిపడా కొత్త కరెన్సీ ముద్రణ అంత సులువు కాదు: బ్లూమ్‌బర్గ్‌
ప్రధాని మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశంలోనే విప్లవాత్మక పరిణామమని బ్లూమ్‌బర్గ్‌ పత్రిక తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. దేశ అవసరాలకు సరిపడా కరెన్సీ ముద్రించడం అంత సులువైన అంశం కాదని బ్లూంబర్గ్‌ వెల్లడించింది. యాభై రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోదీ చెప్పినప్పటికీ... కొత్త నోట్లు వచ్చేలా... ఇంతవరకు కనీసం ఏటీఎంలను కూడా సరిచేయలేదని బ్లూమ్‌బర్గ్‌ పత్రిక విశ్లేషించింది.

గ్రామీణ భారతంలో నగదు రూపంలోనే ఆర్థిక వ్యవహారాలు: ది హెరాల్డ్‌
ది హెరాల్డ్‌ పత్రిక కూడా దాదాపు ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గ్రామీణుల్లో కొంతమంది మాత్రమే ఏటీఎంలు వినియోగిస్తున్నారని, అత్యధికులు నగదుపైనే ఆధారపడుతున్నారని వెల్లడించింది. దేశంలోని చాలా మంది మహిళలకు బ్యాంకుఖాతాలే లేవని హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది. ఈ నగదు లావాదేవీల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తూ... కూలీ పనులకు కూడా వెళ్లలేకపోతున్నారని ది హెరాల్డ్‌ రిపోర్ట్‌ చేసింది.

పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ భరోసా పోయింది :  పాకిస్తాన్‌ మ్యాగజైన్‌ 
ఇక దాయాది పాకిస్తాన్‌లోని పత్రికలు మాత్రం మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నట్లుగానే సంపాదకీయాలు రాశాయి. కరెన్సీ నోటు అనేది ఓ భరోసా అని.. పెద్ద నోట్ల రద్దుతో ఆ భరోసా, నమ్మకం భారత్‌లో పటా పంచలైందని, చాలా మంది బ్యాంకుల ముందు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారని పాకిస్తాన్‌ మ్యాగజైన్‌ రాసింది. వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు తమ పనుల్ని వదిలి పెట్టుకుని డబ్బుల కోసం ఆందోళన చెందుతున్నారని పాక్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. నల్లధనం కట్టడికి నోట్ల రద్దు నిర్ణయం మేలు చేస్తోందేమే కానీ... అదే సమయంలో.. నిర్ణీత గడువులోగా సామాన్యుల కష్టాలను ఒడ్డెక్కించాల్సిన అవసరం ఉందని పాకిస్తానీ మ్యాగజైన్‌ పేర్కొంది. 

07:16 - November 21, 2016

విజయవాడ : నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌కు తక్షణమే మరో రూ.5వేల కోట్లు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సహకార బ్యాంకులకు నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ లావాదేవీల ఛార్జీలు తగ్గించాలని బాబు సూచించారు.

నోట్ల రద్దుతో ఏపీ పరిస్థితులపై కేంద్రానికి చంద్రబాబు లేఖ
పెద్ద నోట్ల రద్దుతో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీకి తక్షణమే మరో రూ.5వేల కోట్లు పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై పన్ను మినహాయింపులు కల్పించాలని, సహకార బ్యాంకుల్లో రైతులకు నిబంధనలు సడలించాలని కోరారు. రూ.వెయ్యి కోట్ల వరకు రూ.20, 10, 50, 100 నోట్లు ఉండేలా చూడాలని, పీవోఎస్‌ యంత్రాలకు రాయితీలు కల్పించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు.

కొత్త నోట్లు పంపాలని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కు ఫోన్
రాష్ట్రానికి కొత్త నోట్లు పంపాలని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కు సీఎం ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉర్జిత్ పటేల్ సానుకూలంగా స్పందించారని.. ఇవాళ రాష్ట్రానికి రూ. 2,200 కోట్ల కరెన్సీ వస్తుందని, అందులో రూ. 400 కోట్ల చిన్ననోట్లు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్‌బీఐ రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లను పంపిందని వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్షిస్తున్న చంద్రబాబు.. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్రమంత్రి సుజనాచౌదరిని ఆదేశించారు.

 

07:04 - November 21, 2016

హైదరాబాద్‌: నగరంతోపాటుతో పాటు.. యావద్దేశాన్నీ ఉలికిపడేలా చేసిన దిల్‌షుక్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు తుదిదశకు చేరింది. ఎన్ ఐఏ న్యాయస్థానం ఈ కేసులో దోషులను నిర్ధరించడంతో పాటు శిక్ష ఖరారు చేయనుంది.

కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు
2013 ఫిబ్రవరి 21 సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని ఏ వన్‌ మిర్చి సెంటర్‌ వద్ద... నాలుగు నిమిషాల వ్యవధిలో కోణార్క్‌ థియేటర్‌ వద్దగల ఆనంద్‌ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ జంటపేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 138 మంది గాయపడ్డారు.

సాక్ష్యాధారాలతో ప్రత్యేక కోర్టులో ఎన్ ఐఏ చార్జిషీటు
జంటపేలుళ్లపై విచారణ ప్రారంభించిన ఎన్ ఐఏ ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ సభ్యులే ఈ ఘటనకు పాల్పడినట్లు తేల్చింది. తగిన సాక్ష్యాధారాలతో ప్రత్యేక కోర్టులో ఎన్ ఐఏ చార్జిషీటు దాఖలు చేసింది. ఆరుగుర్నిప్రధాన నిందితులుగా చేర్చింది. ఏ-1గా రియాజ్‌ భత్కల్‌, ఏ-2గా అసదుల్లా భత్కల్‌, ఏ-3గా అక్తర్‌ అలియాస్‌ మోను, ఏ-4గా వకాస్‌, ఏ-5గా యాసిన్‌ భత్కల్‌, ఏ-6గా ఇజాజ్‌లను చార్జిషీట్‌లో చేర్చింది. వీరిలో ప్రధాన నిందితుడు యాసిన్‌ భత్కల్‌ మినహా మిగిలిన అందరూ జైల్లో ఉన్నారు. యాసిన్‌ భత్కల్‌ పాకిస్థాన్‌లో ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ఏ-6గా ఇజాజ్‌ పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాడన్న సాక్ష్యాధారాలను ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించారు. నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, 1967 దేశద్రోహ చట్టంలోని సెక్షన్ల కిందా కేసు పెట్టారు.

మొత్తం 157 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం
ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ప్రత్యేక కోర్టు కేసు విచారణ పూర్తి చేసింది. మొత్తం 157 మంది సాక్షులను విచారించింది. ఎన్‌ఐఏ అందజేసిన 502 డాక్యుమెంట్లను, ఘటనా స్థలంలో సేకరించిన 201 మెటీరియల్స్‌ను కోర్టు పరిశీలించింది. నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలనూ విన్న న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

Don't Miss