Activities calendar

22 November 2016

రైతులు, ప్రజల పోరాటానికి జగన్‌ మద్దతు

తూర్పుగోదావరి : జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్‌ పరిశ్రమ వద్దంటూ రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటానికి వైసీపీ అధినేత జగన్‌ మద్దతు తెలిపారు. బాధితులను కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దానవాయిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. 

22:17 - November 22, 2016

తూర్పుగోదావరి : దివీస్‌ ఫ్యాక్టరీ బాధితులకు అండగా ఉంటామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నా బలవంతంగా లాక్కొంటున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చేస్తున్న నేతలు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. 
దానవాయిపేటలో భారీ బహిరంగ 
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్‌ పరిశ్రమ వద్దంటూ రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటానికి వైసీపీ అధినేత జగన్‌ మద్దతు తెలిపారు. బాధితులను కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దానవాయిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. 
మధును పోలీసులు దారుణంగా అడ్డుకున్నారన్న జగన్  
దానవాయిపేట, చుట్టుపక్కల బాధిత గ్రామాల ప్రజలు 82 రోజులుగా ఫ్యాక్టరీ వద్దని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే రాజాపై 22 కేసులు పెట్టారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు బాధితులను పరామర్శించేందుకు వస్తే.. పోలీసులు దారుణంగా అడ్డుకున్నారన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు లేఖ రాసినా పట్టించుకోలేదని జగన్‌ అన్నారు. ఫ్యాక్టరీ నిర్మిస్తే తమ బతుకులు నాశనమవుతాయని ఆందోళనలు చేస్తున్న మహిళలను పోలీసులతో కొట్టించి.. కేసులు పెట్టడం దారుణమన్నారు జగన్‌.
20 వేల మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి : జగన్  
దివీస్‌ ఫ్యాక్టరీ వల్ల 20 వేల మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని జగన్‌ అన్నారు. 100 కి.మీ దూరంలో ఉన్న ఫార్మాసిటీకి దివీస్‌ను తరలించే అవకాశం ఉన్నా.. అక్కడ భూముల ధరలు అధికంగా ఉండటంతో.. దానవాయిపేటతో పాటు.. పలు గ్రామాల్లో రైతుల దగ్గర నుంచి భూములను తక్కువ ధరకు లాక్కొని.. దివీస్‌కు దారాదత్తం చేస్తున్నారన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు మేలు జరగకపోగా.. ఫ్యాక్టరీ విడుదల చేసే వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతుందని.. మత్స్యకారుల బతుకులు అగమ్యగోచరంగా మారుతాయన్నారు వైఎస్‌ జగన్‌. 
ప్రజలతో జగన్‌ ముఖాముఖి 
దివీస్‌ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించే వరకు ప్రజలకు అండగా ఉంటామని జగన్‌ హామీ ఇచ్చారు. అంతకుముందు బహిరంగ సభ వేదికపై బాధిత ప్రజలతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. తాము పడుతున్న బాధలు, ప్రభుత్వం తీరును ప్రజలు జగన్‌కు వివరించారు. 

 

22:11 - November 22, 2016

హైదరాబాద్ : 14 రోజులైంది. అయినా సీన్‌ మారలేదు. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగడం జనానికి దినచర్యగా మారింది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా.. నగదు అందుతుందో.. లేదోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. ఇక వృద్ధులు, వ్యాధులతో బాధపడే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక పెన్షన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోంది. 
పెరుగుతున్న నోట్ల కష్టాలు 
నోట్ల కష్టాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 14 రోజులు అవుతున్నా ఇంకా బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద జనాలు బారులు తీరుతూనే ఉన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డా.. అందరికీ నగదు అందుతుందో.. లేదో తెలియని పరిస్థితి. బ్యాంకులకు ఆర్బీఐ నుంచి సరిపడ నగదు అందకపోవడంతో.. బ్యాంకులు ఖాతాదారులకు క్యాష్‌ ఇవ్వడం లేదు. మరోవైపు ఖాతాదారుల నుంచి ఆందోళనలు పెరగడంతో.. బ్యాంక్‌ ముందు నో క్యాష్‌ బోర్డులు పెడుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా మూసివేస్తున్నారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి నిలబడిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరోవైపు వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. ఇక పెన్షన్‌దారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెన్షన్‌ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని పెన్షన్‌దారులంటున్నారు.
జనం గగ్గోలు 
డబ్బు కోసం ఉదయం నుంచే చలిలో ఏటీఎంల ముందు నిలబడాల్సి వస్తుందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇంకా కొన్నిచోట్ల ఏటీఎంలలో నో సర్వీసు బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇక పోస్టాఫీసులలో నగదు మార్పిడి కింద రెండు వేల నోటు ఇస్తుండడంతో చిల్లర కష్టాలు ఎదురవుతున్నాయని ప్రజలంటున్నారు. 
ఒంగోలులో బ్యాంక్ ఖాతాదారుల ధర్నా
ప్రకాశం జిల్లా ఒంగోలులో కొప్పోలు యూనియన్‌ బ్యాంక్‌ వద్ద ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా నిరాశే ఎదురవుతుందని ఆరోపించారు. ఇక పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిల్లర కష్టాలతో బేరాలు అవస్థలు పడాల్సి వస్తుందని ఆటోడ్రైవర్లు అంటున్నారు. 
కూలీలపై తీవ్ర ప్రభావం.
కూలీ పనులు చేసుకునే ప్రజలపై కూడా నోట్ల రద్దు తీవ్ర ప్రభావాన్ని చూపింది. చేసిన పనికి పాత నోట్లు ఇవ్వడం.. లేదంటే రెండు వేల నోటు ఇస్తుండడంతో కొత్త కష్టాలు తలెత్తుతున్నాయంటున్నారు. మరోవైపు బిజినెస్‌ కూడా తగ్గిందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. తిరుపతిలో సీపీఐ చేపట్టిన ఆందోళనలో జాతీయ నేత నారాయణ  పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పలువురు నేతలను అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
ఆర్బీఐ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన 
సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట సీపీఎం ఆందోళన చేపట్టింది. డిసెంబర్‌ 31 వరకు పాతనోట్లను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలన్నీ డీలాపడ్డాయి. కొనుగోలు, అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. సీజన్‌ అయినప్పటికీ అమ్మకాలు లేవని వ్యాపారులంటున్నారు. 
ఇండియన్‌ ఇంటర్నేషన్‌ ట్రేడింగ్‌ ఫెయిర్‌పై ప్రభావం
పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్‌ ఇంటర్నేషన్‌ ట్రేడింగ్‌ ఫెయిర్‌పై పడింది. బిజినెస్‌ లేక 29 రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్‌ వెలవెలబోతున్నాయి. ఇదిలావుంటే.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రజలకు, ఖాతాదారులకు సేవలందించేందుకు అవస్థలు పడాల్సి వస్తుందని బ్యాంక్‌ సిబ్బంది వాపోతున్నారు. మొత్తానికి మోదీ నిర్ణయంతో దీర్ఘకాలంగా ప్రయోజనాలున్నప్పటికీ.. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. 

 

22:04 - November 22, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ స్తంభించింది. ప్రధాని సభలో సమాధానం చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు అంశంపై వరుసగా ఐదోరోజు కూడా పార్లమెంట్‌ దద్దరిల్లింది. ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని.. ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు డిమాండ్‌ చేశాయి. రాజ్యసభలో పలువురు సభ్యులు ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు పలుమార్లు వాయిదా పడింది.
ప్రధాని చర్చలో పాల్గొనాలి : కాంగ్రెస్‌ 
పెద్ద నోట్ల రద్దుపై  సుదీర్ఘంగా చర్చ జరగాలని, ప్రభుత్వం జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు చర్చకు సహకరించకుండా మూడు రోజులుగా సభను అడ్డుకుంటున్నాయని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఆరోపించారు. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ప్రధాని చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పెద్ద నోట్ల మార్పిడి కారణంగా ఇప్పటివరకు సుమారు 70 మంది మృతి చెందారని,  ప్రజల కష్టాలేంటో తెలియాలంటే  ప్రధాని సభలో ఉండాలని, బయట మాట్లాడడం కాదని ఆజాద్‌ మండిపడ్డారు.
రాజ్యసభ రేపటికి వాయిదా 
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా ఎలాంటి మార్పు లేదు. ప్రధానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో డిప్యూటి ఛైర్మన్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై లోక్‌సభ అట్టుడికింది. సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ప్రశ్నొత్తరాలను కొనసాగించారు. 
పెద్ద నోట్ల రద్దుతో పేదలు మృతి : మల్లిఖార్జున ఖర్గే 
పెద్ద నోట్ల రద్దు అంశంపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పీకర్‌ను కోరారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా పేదలు, రైతులు మరణిస్తున్నారు...పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి...కూలీలకు దినసరి వేతనం లభించడం లేదు...చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రధాని సభకు వచ్చి నోట్ల రద్దుపై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
చర్చకు ప్రభుత్వం సిద్ధం : అనంత్‌ కుమార్‌ 
పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని లోక్‌సభలో కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. చర్చ నుంచి ప్రతిపక్షాలే పారిపోతున్నాయని విమర్శించారు.  
లోక్‌సభను రేపటికి వాయిదా 
విపక్షాల డిమాండ్‌కు స్పీకర్‌ అనుమతించక పోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు మోదికి అండగా నిలిచారని, ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతున్నా... పేదలు, రైతులు, సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో సభాకార్యక్రమాలను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రతిపక్షాలు నల్లధనానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉంటాయో.. లేక నల్ల కుబేరులకు అండగా నిలుస్తాయో తేల్చుకోవాలని వెంకయ్యనాయుడు సవాల్‌ విసిరారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు పట్టు వీడడం లేదు...ప్రభుత్వం మెట్టు దిగడం లేదు...దీంతో పార్లమెంట్‌ సమావేశాలు ఎలాంటి చర్చ జరక్కుండానే గత ఐదు రోజులుగా వాయిదా పడుతోంది.

 

21:55 - November 22, 2016

హైదరాబాద్ : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా కచేరీల్లో పాల్గొన్నారు. భక్తప్రహ్లాద చిత్రంలో నారదుని పాత్ర వేసి అందరినీ మెప్పించారు. 8 ఏళ్ల వయసులో కచేరీ చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్‌, మలేషియా, సింగపూర్ దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషాల్లో పాటలు పాడిన బాలమురళీకృష్ణ.. 400లకు పైగా సినీ గీతాలకు సంగీతం సమకూర్చారు. తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న బాలమురళీకృష్ణ.. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. బాలమురళీకృష్ణ మృతి సినీ, సంగీత జగత్తుకు తీరనిలోటని పలువురు సినీ, సంగీత ప్రముఖులు అన్నారు.  
చెన్నైలో రేపు అంత్యక్రియలు 
చెన్నైలోని బీసెంట్‌నగర్‌లో బుధవారం మధ్యాహ్నం మంగళంపల్లి అంత్యక్రియులు నిర్వహించునున్నట్లు.. కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. నలతగా ఉందని రెండు రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన... మంగళవారం సాయంత్రం రాగమాలపిస్తూ అనంతలోకాలకు చేరారు. బాలమురళీకృష్ణకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి వద్ద సంగీత స్వర సాధనకు శ్రీకారం చుట్టి గాత్ర సంగీతంలోనేకాక వయోలిన్‌, వీణ, మురళి, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. టీటీడీ, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్‌ దేశాల్లో మంగళంపల్లి పలు కచేరీలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25వేల కచేరీలు చేసిన ఘనత ఆయన సొంతం. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషన్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.  
మంగళంపల్లి మృతి పట్ల పలువురు సంతాపం 
మంగళంపల్లి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు, ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు.  మంగళంపల్లి కుటుంబసభ్యుడిగా పెరిగానని ప్రముఖ సంగీత విద్వాంసులు మోహనకృష్ణ తెలిపారు. సినీ, సంగీత ప్రపంచానికి మంగళంపల్లి మృతి తీరని లోటని ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కే. విశ్వనాథ్‌ అన్నారు. చెన్నైలోని బీసెంట్‌నగర్‌లో బుధవారం మధ్యాహ్నం మంగళంపల్లి అంత్యక్రియులు నిర్వహించునున్నట్లు..కుటుంబసభ్యులు తెలిపారు. 
కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానం 
మధురగాయకుడు, గాన గంధర్వుడు.. పద్మ విభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ... తిరిగిరానిలోకాలకు తరలివెళ్లారు. తన మధురగానంతో.. ఎంతోమందిని ఓలలాడించిన ఆ సుమధుర స్వరం.. మూగపోవడం సంగీత ప్రియులనే కాదు... యావద్ భారతాన్ని కలిచివేసింది. కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానాన్ని అధిరోహించిన బాలమురళీకృష్ణ హిందుస్థానీ సంగీతం, పాశ్యాత్య సంగీతాల్లోనూ నిష్ణాతులు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యులైన బాలమురళి తల్లి వీణ కళాకారిణి. ఆయన తండ్రి వేణువు, వయొలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. పుట్టుకతోనే సంగీతాన్ని ఉగ్గుపాలతో అందుకున్న బాలమురళి..తన ఎనిమిదో ఏటనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో తొలి కచేరి చేశారు. 15 ఏళ్ల వయసు వచ్చే సరికే 72 మేళకర్త రాగాల్లో పట్టు సాధించారు.  
కొత్త రీతులతో తాళ వ్యవస్థ
మాతృభాష తెలుగుతో పాటు సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 400కు పైగా కర్ణాటక సంగీత బాణీల్లో బాలమురళీకృష్ణ.. కృతులు, వర్ణాలు, జావళులు, తిల్లానలు రచించారు. సంగీత సామ్రాజ్యంలో ఆయన అందుకున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు మరెవరూ అందుకోలేదని చెప్పాలి.  రచనలతో పాటు గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి తదితర రాగాలను సృష్టించి భారతీయ సంగీతంలో బాలమురళి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. గతి భేదం, సశబ్ద క్రియ వంటి కొత్త రీతులతో తాళ వ్యవస్థను కూడా బలోపేతం చేసిన ఘనత బాలమురళీ కృష్ణకే దక్కుతుంది. 
భక్త ప్రహ్లాద చిత్రంలో నారద మహర్షి పాత్ర 
భక్త ప్రహ్లాద చిత్రంలో నారద మహర్షి పాత్ర ద్వారా వెండి తెరను అలంకరించిన బాలమురళీ కృష్ణ మరెన్నో చిత్రాల్లోనూ నటించారు. నటనకన్నా సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆయన... హంసగీతె కన్నడ చిత్రంలో హిమాద్రి సుతే పాహిమాం అన్న కీర్తనను ఆలపించారు. ఈ గానానికి గానూ 1976లో ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. తర్వాత మాధవాచార్య అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.  1957 నుంచే బాలమురళి సినిమాల్లోపాటలు పాడారు. ముఖ్యంగా తెలుగులోని గుప్పెడు మనసు చిత్రంలో... మౌనమె నీభాష మూగ మనసా అన్న పాట ప్రతి హృదయాన్నీ కరిగించింది. ఈ మధురగానానికి.. 1976, 87లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, 1987లో బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, 2010లో బెస్ట్‌ క్లాసిక్‌ సింగర్‌ అవార్డులు నడిచివచ్చాయి.
25వేలకు పైగా సంగీత కచేరీలు 
తన జీవితంలో.. ప్రపంచవ్యాప్తంగా 25వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బాలమురళీకృష్ణ, అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, శ్రీలంక తదితర ఎన్నో దేశాల్లో కచేరీలు చేసి కర్ణాటక సంగీత ఘనతను ఖండాంతరాలు దాటించారు. కర్నాటక సంగీతంతో పాటు.. త్యాగరాజ కీర్తనల్లో కూడా ఆయన ప్రతిభ అసామాన్యమనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. 
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు 
తన గానమృతంతో.. సంగీత ప్రియులను ఓలలాడించిన ఈ గాన గంధర్వుడిని కేంద్రం సముచితంగా సత్కరించింది. జాతీయ స్థాయిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న బాలమురళీకృష్ణ.. 2005లో ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గౌరవాన్ని పొందారు. సంగీత రంగంలో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ఈ సంగీత శిరోమణి, మద్రాసులోని మ్యూజిక్ అకాడెమీ నుంచి సంగీత కళానిధి పురస్కారాన్ని సాధించారు.  సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞానసాగర వంటి ఎన్నో బిరుదులు బాలమురళిని వరించాయి. 

21:36 - November 22, 2016

రోజు కూలీ వదులుకుని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నదెవరు..? అనారోగ్యాన్ని లెక్క చేయకుండా క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నదెవరు..? డబ్బులు రాల్చని ఏటీఏంల ముందు ఆశగా మూగిందెవరు..? నల్లధనం దాచుకున్న వాళ్లలో ఒక్కడైనా ఈ గుంపులో ఉన్నాడా..? అచ్ఛేదిన్ ఎవరికి ? ఈ అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:44 - November 22, 2016

ఆయితారం తర్వాత సోమవారం రాదు, బాలుకొండ ఎమ్మెల్యేది బాజాప్త తప్పు, పార్లమెంట్ కు ప్రధాని ఎందుకు వస్తలేడు, రాష్ట్రంల పంచాది.. కేంద్రంల సోపతి, పగటేషంగట్టిన శివప్రసాద్, ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:38 - November 22, 2016

పెద్దపల్లి : గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. కాసులు ఇస్తేనే కాన్పులు చేస్తామని సిబ్బంది మొండికేశారు. డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద నుంచి రూ. 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేశారు. వైద్య సిబ్బంది రోగులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆర్ బీఐ మరో వెసులుబాటు

హైదరాబాద్ : ప్రజలు ఆర్ బీఐ మరో వెసులుబాటు కల్పించింది. బిగ్ బజార్లలో డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఎల్లుండి నుంచి బిగ్ బజార్లలో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల రూపాయలను విడ్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.

 

20:26 - November 22, 2016

చెన్నై : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా కచేరీల్లో పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ పుట్టిన 13 రోజులకే తల్లి మృతి చెందింది. భక్తప్రహ్లాద చిత్రంలో నారదుని పాత్ర వేసి అందరినీ మెప్పించారు. 
400లకు పైగా సినీ గీతాలకు సంగీతం 
8 ఏళ్ల వయసులో కచేరీ చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్‌, మలేషియా, సింగపూర్ దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషాల్లో పాటలు పాడిన బాలమురళీకృష్ణ.. 400లకు పైగా సినీ గీతాలకు సంగీతం సమకూర్చారు. తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న బాలమురళీకృష్ణ.. పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌తో పాటు ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. బాలమురళీకృష్ణ మృతి సినీ, సంగీత జగత్తుకు తీరనిలోటని పలువురు సినీ, సంగీత ప్రముఖులు అన్నారు. జుగల్‌బందీ కచేరీలకు బాలమురళీకృష్ణ రూపకర్త. అనేక కచేరీలో చేసిన.. ప్రముఖ సంగీత విధ్వాంసులు మంగలంపల్లి బాలమురళీకృష్ణ గానం మూగబోయింది. ఆయన స్వర మాధుర్యం ఝరిలో పడి ఆశేష తెలుగు ప్రజానీకం.. తమను తాము మరిచిపోయేవారంటే అతిశయోక్తి కాదేమో...  కర్ణాటక సంగీతంతో పాటు బాలమురళీకృష్ణ ఆలపించిన త్యాగరాయ కీర్తనలు కూడా తెలుగువారికి సుపరిచితమే.. 

 

20:13 - November 22, 2016

గుంటూరు : శ్రీచైతన్య స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వంశీకృష్ణ మృతి చెందాడు. మూడు రోజులుగా వంశీ కృష్ణ జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంతో ఉన్నా కూడా... యాజమాన్యం పట్టించుకోలేదని... వారి నిర్లక్ష్యం వల్లే వంశీ చనిపోయాడంటూ... స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. ఆందోళన తీవ్రతరం కావడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకు దిగిన వంశీకృష్ణ కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:07 - November 22, 2016

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చిన్న తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిందని వక్తలు చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, రాకేష్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. చిన్న తరహా పరిశ్రమలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

19:49 - November 22, 2016

ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. పాఠశాలల మూసివేత, స్కూళ్లలో  ఉపాధ్యాయులు నియామకాలపై పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు...ఈ అంశాలపై ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందని సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:45 - November 22, 2016

బ్యాంక్ ల దగ్గర క్యూలు తగ్గడం లేదు. ఏటిఎంల దగ్గరా అదే పరిస్థితి. ఇంకెంతకాలం ఈ కష్టాలు? ఇంకెన్ని రోజులు ఈ చిల్లర సమస్యలు?  రద్దయిన నోట్ల స్థానంలో కొత్త వాటిని ముద్రించడానికి ఇంకెంత సమయం పడుతుంది? అసలు మన కెపాసిటీ ఎంత? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది
పెద్ద నోట్ల విలువ 14.18 లక్షల కోట్లు
కొత్త నోట్ల ముద్రణ చిటికెలో అయ్యే పని కాదు. ఆర్ బిఐ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత మార్చి 31 నాటికి మన దేశంలో 16 లక్షల 42వేల కోట్ల రూపాయలు చలామణిలో వున్నాయి. ఇందులో 500, 1000 రూపాయల నోట్ల విలువే 14 లక్షల 18 వేల కోట్లు. ఇవన్నీ రద్దయ్యాయి. ఇప్పుడు ఇంత డబ్బు కొత్తది ముద్రించాలి. ఇది ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలోనో అయ్యే పని కాదు. రద్దయినవాటిలో 500 రూపాయల నోట్ల సంఖ్య 15,700 కోట్లు. రద్దయినవాటిలో 1000 రూపాయల నోట్ల సంఖ్య 6,300 కోట్లు.  ఈ రెండింటినీ కలిపితే రద్దయిన నోట్ల సంఖ్య 22,000 కోట్లు. ఇప్పుడు వీటన్నింటినీ ముద్రించాలి. 
రోజుకి 10 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్
మన దేశంలో రోజుకి 10 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను అంతే సంఖ్యలో ముద్రించాలంటే 5 నుంచి 7 నెలల సమయం పడుతుంది. అంటే దాదాపు ఉగాది పండుగ వెళ్లే దాకా నోట్ల ముద్రింపు కార్యక్రమాన్ని ఏకబిగిన కొనసాగించాల్సి వుంటుంది. ఒకవేళ రద్దయిన నోట్ల విలువకు సరిసమానమైన వంద రూపాయల నోట్లను ముద్రించాలంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. ప్రభుత్వం 2వేల రూపాయల నోట్ల మీద మమకారం చూపించడానికి ఇదే ప్రధాన కారణం. రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగితే, చిల్లర కష్టాలు తప్పవు. 

19:33 - November 22, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎపి మంత్రులు, టిడిపి నేతలు ఊసరవెల్లి చందంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వాఖ్యానించింది. నిన్న మొన్నటి వరకు  ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్ధించిన టిడిపి నాయకులు, ఇప్పుడు తప్పుపడుతున్న విషయాన్నివైసిపి నేతలు గుర్తు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా మారుతున్న సమయంలో టిడిపి నేతలు ఇప్పుడు తమ పంథా మార్చుకుంటున్నారని వైసిపి నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. 

19:27 - November 22, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే అయినా ఇది దేశానికి ఎంతో మంచి కార్యక్రమమని టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ అన్నారు. నోట్ల రద్దు విషయంలో విపక్షాలు మోదీని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. ముందుగానే బ్యాంకులకు చిన్న నోట్లు సరఫరా చేసి ఉంటే నల్లకుబేరులకు విషయం తెలిసిపోయేదని మురళీమోహన్‌ అభిప్రాయపడ్డారు. 

 

రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం

 హైదరాబాద్ : కేంద్ర బృందం రేపు రాష్ట్రానికి రానుంది. పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రంలో పరిణామాలపై పరిశీలించనున్నారు. 

 

గవర్నర్ నరహింసన్ తో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరహింసన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. హస్తిన టూర్, తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

19:20 - November 22, 2016
19:14 - November 22, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కష్టాలు వర్ణనాతీతం.. దేశంలో ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. నోట్లు రద్దయి 13 రోజులవుతున్నా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. సరైన చిల్లర లేక చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రతి రంగంపై ఈ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చిల్లర కొరతతో పనులు దొరక్క, పూట గడవక, కడుపు నిండక, వ్యాపారాలు జరగక ప్రజలు నరకయాతన పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:51 - November 22, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కష్టాలు వర్ణనాతీతం.. దేశంలో ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. నోట్లు రద్దయి 13 రోజులవుతున్నా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. సరైన చిల్లర లేక చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రతి రంగంపై ఈ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చిల్లర కొరతతో పనులు దొరక్క, పూట గడవక, కడుపు నిండక, వ్యాపారాలు జరగక ప్రజలు నరకయాతన పడుతున్నారు. 

 

శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో విద్యార్థి వంశీకృష్ణ మృతి

గుంటూరు : శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో వంశీకృష్ణ అనే విద్యార్థి మృతి చెందాడు. మూడు రోజులుగా వంశీకృష్ణ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కానీ స్కూల్ యాజమాన్యం బాలునికి సరైన వైద్యం అందించలేదు. దీంతో పరిస్థితి విషమించి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

18:42 - November 22, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. సామాన్యుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు.. వికలాంగులు... వితంతువులు వారి పింఛన్లు కోసం పాట్లు పడుతున్నారు. బ్యాంకులు.. ఏటీఎంల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పాతనోట్లు రద్దుకావడంతో పింఛన్లపై ఆధారపడే వికలాంగులు..వృద్ధులు.. వితంతువులు అవస్థలు పడుతున్నారు. ఈ నెల అందాల్సిన పింఛన్‌ ఇంకా చేతికి రాలేదు. దీంతో కనీస అవసరాలు తీరక ఆవేదన చెందుతున్నారు. డబ్బుల కోసం గంటల తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సి వస్తోందని.. రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని బాధపడుతున్నారు. అయినా ప్రయోజనం ఉండడం లేదని వృద్ధులు వాపోతున్నారు. బ్యాంక్‌ అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. 
ఖాతాలకే పరిమితమైన పింఛన్లు
రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులు కలుపుకుని మొత్తం 35 లక్షల 86వేల 5వందల 60 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. అయితే నవంబర్‌లో అందాల్సిన పింఛన్లు ఇంకా చేతికి రాలేదు. ఈ నెల మొత్తం ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసినప్పటికీ.. ఆ డబ్బులు తీసుకోలేక వృద్ధులు నానా తంటాలు పడుతున్నారు. ఏటీఎంలు పనిచేయకపోవడం...బ్యాంకుల్లో నిధుల లేమి..రద్దీ వెరసి పింఛన్‌ డబ్బులు తీసుకోలేకపోతున్నారు. బ్యాంకుల వద్దే పడిగాపులు కా‌స్తున్నారు. బ్యాంకులు అధికారులు చొరవచూపి..పింఛన్‌దారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు..వికలాంగులు కోరుతున్నారు. 

 

 

18:33 - November 22, 2016

గుంటూరు : ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలకంటే డబ్బుకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం డబ్బే పరమావధిగా భావిస్తోంది. అధిక ఫీజుల వసూళ్ల మీద ఉన్న ధ్యాస పిల్లల ప్రాణాలపై చూపడం లేదు. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు.. ఫీజు వస్తే సరిపోతుందని భావిస్తున్నారు. జిల్లాలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో ఓ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. యాజమాన్య నిర్లక్ష్య ధోరిణికి ఓ నిండు ప్రాణం బలై పోయింది. స్కూల్ లో విద్యార్థి మృతి చెందాడు. జిల్లాలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో వంశీకృష్ణ అనే విద్యార్థి  9 వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజులగా వంశీకృష్ణ  జ్వరంతో బాధపడుతున్నాడు. కానీ స్కూల్ యాజమాన్యం బాలునికి సరైన వైద్యం అందించలేదు. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. అతని తల్లిదండ్రులకు సమచారం చూడా ఇవ్వలేదు. విద్యార్థి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. రూమ్ లో వేసి తలుపు వేశారు. పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. అతను మృతి చెందిన మృతదేహాన్ని స్కూల్ ఆవరణంలో పడేశారు. సమాచారం తెలుసుకున్న వంశీకృష్ణ తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వంశీకృష్ణ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.  
కుమారుడి కుటుంబ సభ్యులు.. 
'మాకు ఏం చెప్పలేదు. పాలు ఇవ్వలేదు, మంచినీళ్లు ఇవ్వలేదు. ఆర్ ఎంపి వైద్యుడి చేత వైద్యం ఇప్పించారు.
ఎస్ ఎఫ్ ఐ నేత...
డాక్టర్, అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులకు సమాచారం లేదు. పిల్లల ప్రాణాలతోటి శ్రీచైతన్య యాజమాన్యం చెలగాటమాడుతోంది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి. హత్యానేరం కింద శ్రీచైతన్య యాజమాన్యను అరెస్టు చేయాలి' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:07 - November 22, 2016

జమ్మూకాశ్మీర్ : మచ్చల్ సెక్టార్ లో దారుణం జరిగింది. పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యకు పాల్పడింది. ముగ్గురు భారత జవాన్లను పాక్ సైన్యం దారుణంగా చంపింది. బంధించి, చిత్ర హింసలకు గురి చేసి దారుణంగా హత మార్చారు. కుళ్లిపోయిన స్థితిలో ఓ జవాను మృతదేహం పడి ఉంది. మృత దేహాలను భారత సైన్యం గుర్తించింది. పాక్ సైన్యానిది పిరికిపంద చర్యగా భారత్ అభివర్ణించింది. పాక్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:59 - November 22, 2016

చెన్నై : మధురగానం మూగబోయింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగలంపల్లి బాలమురళీకృష్ణ (86) కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1930జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. ప్రపంచం వ్యాప్తంగా 25 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:42 - November 22, 2016

హైదరాబాద్ :అసలే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి... నోట్ల రద్దుతో  తీవ్ర స్థాయిలో నష్టం కలుగుతోంది. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఏపీ ఖజానాకు గండిపడుతోంది. చిల్లర ఇక్కట్లు అన్ని రంగాల‌ను కుదిపేయడంతో  ప్రభుత్వానికి నిధుల రాక పూర్తిగా త‌గ్గిపోతోంది.  దీంతో ఈ నెల‌ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు కూడా  కష్టతరంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.
ప్రైవేట్‌, ప్రభుత్వ రంగాలు కుదేలు
పెద్ద నోట్ల ర‌ద్దుతో  ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో పన్నుల రాబడి స‌గానికి పైగా ప‌డిపోయింది. దీంతో  రాష్ట్ర  ఖజానాకు తీవ్ర స్థాయిలో గండిపడుతోంది. నోట్ల ర‌ద్దు ప్రభావం నాలుగైదు రోజులకు మించి ఉండదని భావించిన  ఆర్థిక శాఖ... మరో నాలుగైదు నెలలపాటు ఆ భారాన్ని  మోయాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి. 
కీలకమైన శాఖల్లో తగ్గిన ఆదాయం
రాష్ట్ర ఆదాయానికి కీలకమైన వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్, వాహన రిజిష్ట్రేనన్స్ నిలిచిపోవడంతో....రోజూవారి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్స్ శాఖ గత ఏడాది నవంబర్ నాటికి 270కోట్లు ఆర్జించగా... ఈ నెల మొదటి వారానికి కేవలం 60కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. సాధారణంగా వచ్చే ఆదాయం కంటే దాదాపు 50 శాతం మేర ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఆర్థిక శాఖకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. 
రూ. 1430 కోట్ల ఆదాయం తగ్గుదల 
రాష్ట్ర ఆర్థిక శాఖకు నోట్ల రద్దు రూపంలో పెద్ద దెబ్బ తగలడంతో...ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 14 వందల 30కోట్ల రూపాయల ఆదాయపు తగ్గుదల నమోదైంది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే...ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 15వేల కోట్ల రూపాయల వరకూ ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక శాఖ ఆందోళన చెందుతోంది. దీని ప్రభావం ప్రభుత్వ ఉద్యోగుల  జీతాలపైనా పడనుంది. పెద్దనోట్ల రద్దుతో ఉద్యోగుల, పెన్షనర్లకు నగదు చెల్లించడం కష్టతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్‌ బారోయింగ్‌ ద్వారా అప్పులు తెచ్చి...  ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందుకోసం దాదాపు 13 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న  ఏపీకి నోట్ల రద్దు రూపంలో తేరుకోలేని దెబ్బతగిలింది. మరి ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

 

17:33 - November 22, 2016

వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ రద్దు నిర్ణయంతో పరిస్థితులు చక్కబడక, డబ్బులు దొరకక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రజలకు, ఖాతాదారులకు సేవలందించేందుకు బ్యాంకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. అస్థవ్యస్త నిర్ణయం వల్ల సిబ్బందికి, బ్యాంకులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. నగదు లేక పోవడంతో ఖాతాదారులకు సమాధానం చెప్పలేక ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. బ్యాంకులు, ఉద్యోగులు బాధలకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:29 - November 22, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లు డీలా పడ్డాయి. కొనుగోళ్ళు, అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహన అమ్మకాలకు ఇది మంచి సీజన్. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బిజినెస్‌ పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ కన్నుమూత

చెన్నై : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగలంపల్లి బాలమురళీకృష్ణ (86) కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1930జులై 6న తూర్పుగోదారి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. 25 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు. 

 

పుదుచ్చేరి ఉప ఎన్నికలో సీఎం నారాయణస్వామి

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నిలక కౌంటింగ్ కొనసాగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. పుదుచ్చేరి ఉప ఎన్నికలో సీఎం నారాయణస్వామి గెలుపొందారు. 11 వేల ఓట్ల తేడాతో ఓంశక్తి శేఖర్ (అన్నాడీఎంకే) పై విజయం సాధించారు.

 

త్రిపుర బజ్రాలా, కొవాయి అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం గెలుపు

త్రిపుర : ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నిలక కౌంటింగ్ కొనసాగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపుర బజ్రాలా, కొవాయి అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం గెలుపొందింది. 

 

త్రిపుర బజ్రాలా, కొవాయి అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం గెలుపు

త్రిపుర : ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నిలక కౌంటింగ్ కొనసాగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపుర బజ్రాలా, కొవాయి అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం గెలుపొందింది. 

 

మాంటెస్వర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ గెలుపు

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నిలక కౌంటింగ్ కొనసాగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. మాంటెస్వర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ గెలుపొందింది. 1,27,127 ఓట్ల తేడాతో టీఎంసీ గెలుపొందింది. 

 

తమ్లకి లోక్ సభ ఉప ఎన్నికలో టీఎంసీ గెలుపు

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నిలక కౌంటింగ్ కొనసాగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. వెస్టు బెంగాల్ లోని తమ్లకి లోక్ సభ ఉప ఎన్నికలో టీఎంసీ గెలుపు సాధించింది. 4,97,528 ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థి దివ్యేందు విజయం సాధించారు. 

ఏడు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఉప ఎన్నిలక కౌంటింగ్

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నిలక కౌంటింగ్ కొనసాగుతోంది. 4 లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. 

జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు భారత జవాన్లు వీర మరణం

జమ్మూకాశ్మీర్ : మాచిల్ సెక్టార్ లో ముగ్గురు భారత జవాన్లు వీర మరణం పొందారు. ఒక జవాను మృత దేహాన్ని పాక్ సైన్యం ధ్వంసం చేశారు. పాక్ సైన్యంది పిరికిపంద చర్యగా భారత్ అభివర్ణించింది. పాక్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. 

 

16:25 - November 22, 2016

గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనింగ్ లీజు ఇక చెల్లదన్నారు. పరిశ్రమల అనుబంధ క్వారీలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

15:51 - November 22, 2016
15:49 - November 22, 2016

సంగారెడ్డి : రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు వారివి.. కాయకష్టం చేసినా పస్తులుండే పరిస్థితి వచ్చింది. కూలీ చేయించుకొని డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మేస్త్రిలది.. కూలీ చేసి డబ్బులు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత మేస్త్రి, కూలీల జీవన స్థితిగతులపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బాహుబలి..2లోని కొన్ని సన్నివేశాలు లీక్...

హైదరాబాద్ : బాహుబలి..2 సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. 9 నిమిషాల వీడియో లీక్ చేశారు. ఈ మేరకు సినిమా నిర్మాత ఫిర్యాదు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

15:37 - November 22, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం ఆందోళన చేపట్టింది. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి ఆర్బీఐ అదికారులకు వినతిపత్రం అందచేసారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని..డిసెంబర్‌ 31 వరకు పాతనోట్లను అనుమతించాలని డిమాండ్ చేశారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:34 - November 22, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై లోక్‌సభ అట్టుడికింది. ప్రధాని నరేంద్ర మోది సభకు రావాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దు పేదలు, రైతులు మరణిస్తున్నారు...పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి...కూలీలకు దినసరి వేతనం లభించడం లేదు...చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఖర్గే అన్నారు. ప్రధాని సభకు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఖర్గే అన్నారు. స్పీకర్‌ ఇందుకు అనుమతించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దుపై చర్చకు సిద్ధం : అనంత్ కుమార్  
పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని లోక్‌సభలో కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. చర్చ నుంచి ప్రతిపక్షాలే పారిపోతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోది అవినీతిపై పోరాడుతున్నారని, దేశ ప్రజలంతా ఆయన వైపే ఉన్నారని... అసోం, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి విజయమే ఇందుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాని మోడీ సభకు వచ్చి సమాధానం చెప్పాలి : కాంగ్రెస్‌ 
నాలుగో రోజు పార్లమెంట్‌ దద్దరిల్లింది. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు పట్టు వీడటం లేదు. 11.30 వాయిదా అనంతరం సభ ప్రారంభమైంది. సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ ఎంపీ ఆజాద్‌ అన్నారు. ప్రధాని మోడీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ విజ్ఞప్తి చేసినా విపక్షాలు పట్టించుకోలేదు. స్పీకర్‌ పోడియాన్ని విపక్ష సభ్యులు చుట్టుముట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఛైర్మన్‌ సభను మ.2గంటలకు వాయిదా వేశారు. 
పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో రగడ 
పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో రగడ కొనసాగుతోంది. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ప్రధాని చర్చలో పాల్గొనాలని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు 70 మంది మృతి చెందారని, ప్రజల కష్టాలేంటో ప్రధాని సభలో ఉంటే తెలుస్తుందని ఆజాద్‌ అన్నారు. బయట సభల్లో ప్రధాని మాట్లాడుతున్నారని సభకు వచ్చి ఆయన మాట్లాడాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు.
జవాబు చెప్పేందుకు సిద్ధం : ముక్తార్ అబ్బాస్ నక్వీ
పెద్ద నోట్ల రద్దుపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగాలని, ప్రభుత్వం జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు చర్చకు సహకరించకుండా మూడు రోజులుగా సభను అడ్డుకుంటున్నాయని నక్వీ ఆరోపించారు.

 

15:22 - November 22, 2016

హైదరాబాద్ : బాహుబలి..2 వీడియో లీక్ అయింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాష్ హీరోగా, రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న బాహుబలి..2 సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. 9 నిమిషాల వీడియో లీక్ చేశారు. ఈ మేరకు సినిమా నిర్మాత ఫిర్యాదు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రాఫిక్స్ ఎడిటింగ్ విభాగంలో పని చేస్తున్న కృష్ణ అనే వ్యక్తిని విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నేరం రుజువు అయితే 2 నుంచి 3 సం.లు శిక్షపడే అవకాశం ఉంది. 

15:11 - November 22, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. ప్రధాని మోడీ సభకు వచ్చిన పెద్ద నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలని ఉభయ సభల్లో విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌ సభలో విపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఆటు రాజ్యసభలోనూ పెద్ద నోట్ల రద్దు అంశంపై దుమారం రేగింది. విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సభలో గందరగోళంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నోట్ల రద్దుపై చర్చకు సిద్ధం : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతించారని కేంద్ర ఆర్ధిక మంత్రి ఆరుణ్ జైట్లీ తెలిపారు. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్నారు. మోడీ సాహసోపేత నిర్ణయంతో ఇబ్బందులు కలిగినా అంతిమంగా ఎన్నో మేళ్లు జరుగుతాయన్నారు. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాయన్నారు. 

సా.6 గం.లకు గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : సాయంత్రం 6 గంటలకు గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

13:57 - November 22, 2016
 • మధుమేహంతో బాధపడేవారు రోజు వారి ఆహాంరలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి.
 • ప్రతి రోజు ఓ కప్పు ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు తీసుకోవాలి.
 • బయటకు వెళ్లిన సమయంలో ఆకలిగా అనిపిస్తే దోసకాయలు..క్యారెట్ తినండి.
 • శరీరంపై దద్దుర్లు ఏర్పడితే ధనియాల కాషాయం తాగాలి.
 • కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 • మలబద్ధ నివారణ..మంచి శక్తినివ్వడానికి ఖర్జూరం తీసుకోవాలి.
 • ఉప్పు తక్కువగా ఉండే ఆహారపదార్థాలు భుజించాలి.
 • రోజుకో యాపిల్ పండు తీసుకుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సినవసరం ఉంటుంది.
 • రోజుకు మూడు లీటర్ల నీళ్లు తాగితే రోగాలు దగ్గరకు రావు.
 • అల్లం తీసుకోవడం వల్ల ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. ఎక్కిళ్లు కూడా తగ్గుతాయి.
 • జామపండు భుజించడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
 • మామిడి పండుకు మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది.
 • మునగాకు వంటల్లో వాడడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
 • వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
 • దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
 • నేరేడు పళ్లు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. 

ప్రధాని సభకు ఎందుకు రావడం లేదు - రాహుల్..

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనే అంశంపై చర్చించేందుకు ప్రధాని మోడీ సభకు ఎందుకు రావడంలేదని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వెంటనే పార్లమెంట్‌కు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ. 2000 నోట్ తో ఇబ్బందులు - పల్లా..

హైదరాబాద్: రూ.2000 నోటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బ్యాంకుల్లోకి రూ.500 నోట్లను పంపాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. 

నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు - మోడీ..

ఢిల్లీ : ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా భవిష్యత్ లో దాని ప్రయోజనాలు పొందుతారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నల్లదనం, అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయన్నారు. 

13:36 - November 22, 2016

ఎంతో కష్టపడి నవమాసాలు మోసిన బిడ్డ తల్లి ఒడికి చేరుకోకముందే మృత్యుముఖాన్ని చూస్తోంది. తెలంగాణలో ఇలాంటి మరణాలు సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది ? దీనికి గల కారణాలు ఏంటీ ? దీనిపై టెన్ టివి వేదికలో ప్రత్యేక చర్చ కార్యక్రమం చేపట్టింది. కె.స్వరాజ్య లక్ష్మి (గైనకాలజిస్టు), మమత రఘువీర్ (ఛైల్డ్ యాక్టివిస్టు) పాల్గొని పలు సూచనలు..సలహాలు తెలియచేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:26 - November 22, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ఇబ్రహింపట్నంలో ప్రారంభమైన మహాజన పాదయాత్ర ప్రస్తుతం సంగారెడ్డిలో కొనసాగుతోంది. జిల్లాలోని సిగ్గుపేట, చౌటకూరు, సర్వపల్లి, సుల్తాన్ పూర్, సింగూరు చౌరస్తా, సోంపేట, సంగారెడ్డిలో పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటలకు సంగారెడ్డిలో బహిరంగసభ జరగనుంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఎలాంటి వివరాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

13:22 - November 22, 2016

హైదరాబాద్ : ఆసుపత్రుల్లో పాతనోట్లు తీసుకోవాలని కేంద్రం పేర్కొన్నా ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదు. మెడికల్ హాల్స్ లో సైతం తీసుకోకపోవడంతో రోగులు..వారి కుటుంసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతనోట్లను ఈనెల 24వరకు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆసుపత్రుల్లో డిసెంబర్ 31వరకు పాతనోట్లను చెల్లింపులు చేసే విధంగా చూడాలని రోగులు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:16 - November 22, 2016

ఢిల్లీ : అక్టోబర్‌ 15వ తేదీన అదృశ్యమైన జేఎన్‌యూ విద్యార్ధి నజీబ్‌ ఆచూకీ ఇంకా లభించకపోవడంపై విద్యార్ధి సంఘాలు ఢిల్లీలో భారీ ర్యాలీ చేశాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల 5వేల మంది విద్యార్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్ధులు భారీగా తరలివెళ్లారు. నజీబ్‌ ఆహ్మద్‌ ఆచూకీ కనుక్కోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విద్యార్థులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:14 - November 22, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై టిడిపి ప్రభుత్వ స్వరం మారుతోంది. నిన్నమొన్నటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయనాన్ని బాహాటంగా సమర్థించిన మంత్రులు, తెలుగుదేశం నేతలు ఇప్పడు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ క్రమంగా కేంద్రానికి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన తర్వాత... అదే రోజు ఈ నిర్ణయాన్ని సమర్ధించిన తొలి ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. నల్లకుబేరుల భరతం పట్టేందుకు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ మోదీని ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒకటి రెండు రోజులు ఇబ్బందులు తప్పవనుకున్నా.... ఈ సమస్య అంతకంతకు పెరుగుతోండడంతో ఇప్పుడు టీడీపీ మంత్రులు, పార్టీ నేతల వైఖరిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని కేంద్ర వైఖరి తప్పు..

పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమయ్యే పరిణామాలను ముందుగా అంచనా వేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏపీ మంత్రులు తప్పుపడుతున్నారు. ఇది అనాలోచిత నిర్ణయం అనలేకపోయినా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. పన్నెండు రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులతో కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతతోపాటు, అసంతృప్తి పెరుగుతోందన్న వాదాన్ని వినిపిస్తున్నారు.

రైతులు, పేదల్లో అశాంతి పెరుగుతోంది..
పెద్ద నోట్లు రద్దు చేసే ముందు చంద్రబాబు లాంటి కొందరి సలహాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదంటున్నారు. రైతులు, పేదల్లో అశాంతి ప్రబలుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. జనాభాలో ఒకటి లేదా రెండు శాతం ఉన్న నల్లకుబేరుల కోసం 125 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడటం సమంజసమా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

అరగంటలో ఖతం..
ఏటీఎంల్లో పెడుతున్న నదగు అరగంటలో అయిపోతున్న పట్టించుకునే దిక్కులేదా.. అంటూ తెలుగుదేశం మంత్రులు ప్రశ్నిస్తున్నారు. నగదు అయిపోయిన వెంటనే మళ్లీ ఎందుకు పెట్టలేకపోతున్నారని నిలదీస్తున్నారు. పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లకు సహకార బ్యాంకులకు అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇది రైతులకు ఎంతో నష్టం కలిగిస్తోందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. బ్యాంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనంతకాలం... ప్రజల అసంతృప్తికి అంతం ఉండదంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, బీజేపీపై జనంలో పెరుగుతున్న అసంతృప్తి టీడీపీపై పడకుండా చూసేందుకు ఏపీ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇందుతో తమ తప్పేమీలేదని, అంతా కేంద్రానిదేనన్న వాదాన్ని వినిపిస్తున్నారు. 

13:12 - November 22, 2016

చిత్తూరు : పెద్దనోట్ల రద్దుతో వ్యాపారాలన్నీ కుదేలవుతున్నాయి. లాభాలు లేక వ్యాపార వాణిజ్య సంస్థలు డీలా పడుతున్నాయి. ఏటీఎంలు సైతం ఖాళీ అవుతున్నాయి. కానీ అక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా ఆదాయం పెరుగుతోంది. బ్యాంకుల్లా రద్దీ లేకపోయినా..పైసలు మాత్రం పోగువుతున్నాయి. ఏంటా స్థలం...ఎక్కడీ చోద్యం అనేగా మీ డౌట్‌...వాచ్‌ దిస్ స్టోరీ...నోట్లరద్దుతో అన్ని రంగాలు డీలా పడ్డాయి. చిల్లర కష్టాలతో ప్రభుత్వ..ప్రైవేట్‌ సంస్థల ఆదాయానికి గండి పడింది. అయితే తిరుమలలో మాత్రం ఆదాయం పెరిగింది. సాధారణంగా పండగ రోజులలో మాత్రమే కనిపించే ఆదాయంలోని పెరుగుదల ....ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనిపించడంపై ఆలయ సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చిల్లర కష్టాలు..
చిల్లర కష్టాల ప్రభావం భక్తులపైనా పడుతోంది. తిరుమల వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. అయినా ఆదాయం పెరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం సాధారణంగా రెండున్నర కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల మధ్యలో ఉంటుండగా.. పెద్ద నోట్ల రద్దుతో హుండీ ఆదాయం బాగా పెరిగింది. సోమవారానికి శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల పైనే ఉంది. కేంద్రప్రభుత్వ నియమాలతో పాతనోట్లు మార్చుకునేందుకు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. దీంతో బ్యాంకుల చుట్టూ తిరిగాలంటే బడాబాబులకు తలప్రాణం తోకకొస్తోంది. దీనికి బదులు వెంకన్నస్వామికైనా సమర్పించుకుంటే పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతోనే హుండీలో డబ్బులు వేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

12:59 - November 22, 2016
12:34 - November 22, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు మెచ్చుకున్నారు. సోమవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో అరుణ్ జైట్లీ మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు విషయంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. దేశ ప్రయోజనాల కోసం మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని దీనిని దేశ ప్రజలు స్వాగతించారని తెలిపారు. ఇన్నేళ్లు ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ఇవి కొన్ని రోజులు మాత్రమేనని తెలిపారు. దేశంలోని బ్యాంకులు సరిపడా డబ్బులు పంపిణీ చేయాలని అనడం మాటలు చెప్పినంత తేలిక కాదని, అది చాలా ప్రహాసనంతో కూడుకున్న పని అని తెలిపారు.

ప్రజలు అండగా ఉన్నారు - వెంకయ్య..
రూ. 500, రూ.1000 నోట్లు రద్దు నిర్ణయానికి ప్రజలు అండగా నిలిచారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల పక్షనా ఉంటారా ? నల్లధనం కుబేరులకు అండగా ఉంటారా అని విపక్ష సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుకు ప్రజలు అండగా నిలిచారని, కొంత ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. కానీ పేదలు...రైతులు..ఇతరులకు మేలు జరుగుతుందన్నారు. బ్యాంకు ఉద్యోగులు..విపక్షాలు కావాలనే ఆందోళన చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ లో సభా కార్యక్రమాలకు విపక్షాలు అడ్డుకోవడం తగదన్నారు. 

12:32 - November 22, 2016

చిత్తూరు : పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై సీపీఐ ఆందోళన చేసింది. పరిపాలన భవనం ఎదుట నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీపీఐ నేత నారాయణ మాట్లాడారు. పేద ప్రజలపై సర్టికల్ దాడి చేశారని, ప్రధాన మంత్రి మోడీని ప్రజా కోర్టులో ఉరివేయాలని డిమాండ్ చేశారు. పీఎం, ఆర్ బీఐ గవర్నర్ రాజీనామా చేయాలన్నారు. సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేశారని, లక్ష వేల..కోట్ల రూపాయలు మాత్రమే సరఫరా చేశారని తెలిపారు. ఆరు నెలల వరకు ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. రిలయెన్స్ కంపెనీ..అదానీ..నల్లధనం వారిని మాత్రం సంతృప్తిపరచారన్నారు. ప్రజాస్వామ్య గొంతును నొక్కేందుకు మోడీ..వెంకయ్య నాయుడులు ప్రయత్నిస్తున్నారని, పార్లమెంట్ లో ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. 

12:16 - November 22, 2016

ఢిల్లీ : రాజ్యసభ..లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మూడో రోజూ సభల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అరుపులు..కేకలతో లోక్ సభ దద్దరిల్లగా రాజ్యసభ పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. పెద్దనోట్లు రద్దు అంశంపై చర్చించాల్సిందేనని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని లోక్ సభ..రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రధాని సభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని లోక్ సభ, రాజ్యసభ స్పీకర్ లు పలుమార్లు సూచించారు. రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టడంపై డిప్యూటి ఛైర్మన్, స్పీకర్ లు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ సభలో ఎలాంటి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేశారు. లోక్ సభలో విపక్షాల ఆందోళన సద్దుమణగకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు.

చర్చకు సిద్ధం - ఖర్గే..

లోక్ సభలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాల్సిందేనని పేర్కొన్నారు. రైతులు మృతి చెందుతున్నారని, వివాహాలు ఆగిపోయాయని, బీడీ వర్కర్స్..చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాము చెప్పే అంశాలను ప్రధాన మంత్రి వినాలని అందుకోసం ఆయన్ను సభకు వచ్చే విధంగా చూడాలని కోరుతున్నట్లు ఖర్గే పేర్కొన్నారు. 

ప్రధాన మంత్రి సభకు రావాలి - ఖర్గే..

ఢిల్లీ : లోక్ సభలో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాల్సిందేనని పేర్కొన్నారు. 

పార్లమెంట్ ముట్టడికి జేఎన్ యూ విద్యార్థుల పిలుపు..

ఢిల్లీ : పార్లమెంట్ ముట్టడికి జేఎన్ యూ విద్యార్థులు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం రామ్ లీలా మైదానం నుండి భారీగా విద్యార్థులు తరలివెళుతున్నారు. ప్రస్తుత విద్యావిధానం, నోట్ల రద్దు అంశాలపై విద్యార్థులు నిరసన చేపట్టారు. అదృశ్యమైన జేఎన్ యూ విద్యార్థి నజీబ్ ఆచూకి తెలపాలని వారు డిమాండ్ చేశారు.

 

ఉగ్రవాదుల చేతికి కొత్తనోట్లు..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదుల చేతికి కొత్త నోట్లు చిక్కాయి. బందిపోర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. వీరివద్ద రెండు వేల రూపాయలు నాలుగు లభ్యమయ్యాయి. 

11:55 - November 22, 2016
11:42 - November 22, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశం రాజ్యసభను కుదిపేసింది. మూడో రోజు ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఎంతో మంది మృతి చెందారని, ఆయన వచ్చి ప్రకటన చేయాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో మాట్లాడే మోడీ ఇక్కడ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 16వ తేదీన జరిగిన సమావేశంలో చర్చ చేయాలని పట్టుబడడం జరిగిందని నఖ్వీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి సభలో ఉండాలని సీపీఎం సభ్యుడు ఏచూరి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 70 మంది మృతి చెందారని, దేశంలో పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ప్రధాన మంత్రి సభకు రావాలని తాను కోరడం జరగదని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కు సంబంధించిన అంశమని డిప్యూటి ఛైర్మన్ తెలిపారు. దీనితో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభలో ఎలాంటి మార్పు లేకపోవడంతో డిప్యూటి ఛైర్మన్ సభను 12గంటల వరకు వాయిదా వేశారు.
మూడో రోజు ప్రారంభమైన సమావేశంలో విపక్షాలు పెద్దనోట్లు రద్దు అంశంపై ఆందోళన చేపట్టాయి. ప్రధాన మంత్రి వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనితో సభను 11.30గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. 

రాజ్యసభ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఉదయం ప్రారంభం కాగానే విపక్షాలు పెద్దనోట్లు రద్దు అంశంపై ఆందోళన చేపట్టాయి. దీనితో 11.30గంటలకు వాయిద వేశారు. తిరిగి సమావేశం ప్రారంభం కాగానే సభలో విపక్షాలు ఆందోళన చేశాయి. సభలో ఎలాంటి మార్పు లేకపోవడంతో డిప్యూటి ఛైర్మన్ సభను 12గంటల వరకు వాయిదా వేశారు. 

11:21 - November 22, 2016
11:18 - November 22, 2016

ఢిల్లీ : రాజ్యసభలో మూడో రోజు అదే పరిస్థితి కొనసాగింది. పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. విపక్షాలు నినాదాలు చేస్తూ సభ కార్యక్రమాలకు ఆటంకాన్ని కలిగించారు. పెద్దనోట్లు రద్దు అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్కటన చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన విరమించాలని, సభ సజావుగా జరిగే విధంగా చూడాలని డిప్యూటి ఛైర్మన్ కోరారు. 

మాజీ సీఎం నరేష్ కన్నుమూత..

ఉత్తర్ ప్రదేశ్ : మాజీ సీఎం రమేష్ నరేష్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. చికిత్స పొందుతూ లక్నో ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. 

10:52 - November 22, 2016

సంగారెడ్డి : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 36వ రోజు సంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. పల్లెపల్లెలో తమ్మినేని బృందానికి ప్రజలు తమ సమస్యల గోడు వెల్లబోసుకున్నారు. ముస్లిం సంచార జాతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. సామాజిక న్యాయం, ప్రజా సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 36వ రోజు సంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. 36వ రోజు పల్వట్లలో ప్రారంభమైన యాత్ర మర్వల్లి, తాళ్లేల్మ,బ్రాహ్మణపల్లి, డాకూర్‌, జోగిపేట, ఆంధోల్‌ వరకు కొనసాగింది. జోగిపేటలో తమ్మినేని బృందం చేనేత పరిశ్రమలను సందర్శించి, చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపల్లెలో పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం లభించింది. 36వ రోజు 23 కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్ర మొత్తం 960 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

హామీలెక్కడ..
సీపీఎం చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర.. దేశంలోనే ఎప్పుడూ జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల సమస్యలు తీరుతాయని అందరూ ఆశించారని, అయితే రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరడం లేదని తమ్మినేని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే...మన ఉద్యోగాలు మనకే.. మన నీళ్లు మనకే అని అనుకున్నామని, కానీ కేసీఆర్‌ పాలన విధానంలో లోపాలున్నాయని తమ్మినేని అన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనాలోనే లోపముందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో గిరిజనుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయని గిరిజన సంఘం నేత శోభన్‌ అన్నారు. గిరిజనులు భూముల్లేకనే వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల వలసలు అరికట్టాలంటే.. ప్రభుత్వం వారికి భూములివ్వాలని శోభన్‌ డిమాండ్‌ చేశారు. ముస్లిం సంచార జాతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ముస్లిం సంచార జాతులు కనీస వసతులు కూడా లేక అల్లాడుతున్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తమ్మినేని అన్నారు.

10:50 - November 22, 2016

ఢిల్లీ : మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి, మద్యం కింగ్‌ విజయ్‌ మాల్యాల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రంగరంగ వైభవంగా కుమార్తె పెళ్లి చేసిన జనార్దన్‌రెడ్డి... ఓబులాపురం మైనింగ్‌ కంపెనీపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. విజయ్‌ మాల్యా అరెస్టుకు ముంబై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి, గనుల యజమాని గాలి జనార్దన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. గాలి కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు ప్రారంభించింది. బళ్లారిలోని ఓబులాపురం మైనింగ్‌ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు జరిపారు.

పెళ్లి ఖర్చులపై విచారణ జరిపించాలని డిమాండ్..
అక్రమ మైనింగ్‌ కేసులో అరెస్టైన గాలి జనార్దన్‌రెడ్డి నిందితుడు. కొంత కాలం జైల్లో ఉండి బెయిల్‌ పై విడుదలయ్యారు. నాలుగు రోజలు క్రితం బెంగళూరు రాజమహల్‌ మైదానంలో కుమార్తె పెళ్లిని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం 650 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వివాహ వీడియో ఆహ్వానానికే ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగింది. పెళ్లికి సినీ ప్రముఖులతోపాటు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన జరిగిన ఈ పెళ్లికి ఇంత భారీ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు నేతలు ప్రశ్నించాయి. ఇదంతా నల్లధనం కాదా.. అని నిలదీశారు. కుమార్తె పెళ్లి ఆడంబరానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక, ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార హక్కు కార్యకర్త టీ నరసింహమూర్తి ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. పెళ్లిక ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయల నిధులు ఎక్కడ నుంచి వచ్చాయో విచారణ జరిపించాలని కోరారు. దీంతో కదిలిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఓబులాపురం మైనింగ్‌ కంపెనీపై దాడులు చేశారు. సోదాల్లో విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

భారత్‌-బ్రిటన్‌ల మధ్య నేరస్థుల మార్పిడి ఒప్పందం..
మరోవైపు బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి, బ్రిటన్‌ పారిపోయి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను స్వదేశానికి రప్పించాలంటూ సీబీఐ ముంబై కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విజయ్‌ మాల్యా అరెస్టుకు బెయిల్‌కు ఆస్కారంలేని వారెంట్‌ జారీ చేసింది. భారత్‌-బ్రిటన్ల మధ్య కుదిరి నేరస్థుల పరస్పర మార్పడి ఒప్పందం ప్రకారం మాల్యాను స్వదేశం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఆధారంగా లండన్‌లోని భారత్‌ రాయబార కార్యాలయ అధికారుల సహకారంతో మాల్యాను ఇండియాకు అప్పగించాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నట్టు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 2న మాల్యా.. బ్రిటన్‌ పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. 

10:22 - November 22, 2016

త్రిపుర రెండు స్థానాల్లో సీపీఎం విజయం..

ఢిల్లీ : త్రిపుర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో సీపీఎం గెలుపొందింది. పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో సీఎం నారాయణ స్వామి గెలుపొందారు. 11వేల ఓట్ల తేడాతో అన్నాడీఎంకే అభ్యర్థి శేఖర్ విజయం సాధించారు. 

10:10 - November 22, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. జనాల చిల్లర కష్టాలపై విపక్షాలు ఏకమౌతున్నాయి. మూడు రోజులుగా పార్లమెంట్ ఉభయసభలు స్తంభిస్తున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు..అధికార పక్షాలు చర్చిస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడి మృతి చెందిన 70 మందికి సంతాపం తెలపడంతో పాటు చర్చ జరగాలని..ఓటింగ్ కూడా జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాయి. రోజుకో నిరసన కార్యక్రమం చేపట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. స్వల్పకాలిక చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. 

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం..

ఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

09:56 - November 22, 2016

జపాన్ : భూకంపంతో జపాన్ వణికిపోయింది. ఈశన్య జపాన్ లో సునామీ హెచ్చరికలకు జారీ అయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. పుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. మరోవైపు న్యూజిలాండ్ ఉత్తర ఐలాండ్ లో కూడా భూకంపం సంభవించింది. జపాన్ లో భూకంపం వల్ల ప్రాణ..ఆస్తుల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

09:26 - November 22, 2016
09:24 - November 22, 2016

నోట్ల రద్దు..పార్లమెంట్ ను కుదేపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో స్పందించాలని విపక్షాలు ఆందోలన చేపడుతున్నాయి. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం చెబుతారని కేంద్రం పేర్కొంటోంది. మరోవైపు పెద్దనోట్లు రద్దు వల్ల సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నాడు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవని స్వపక్షం పేర్కొంటోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

09:20 - November 22, 2016

ఢిల్లీ : నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. గత మూడు రోజులుగా రాజ్యసభ..లోక్ సభలు స్తంభిస్తున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దుపై విపక్షాలు సభల్లో ఆందోళన చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నోట్ల కోసం క్యూలో నిలబడిన వారిలో 70 మంది చనిపోవడం..వీరిపై సంతాప తీర్మానం చేయాలని..చర్చ జరగాలని అనంతరం ఓటింగ్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ఆదివారం భేటీ అయిన పది పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నేడు కూడా విపక్షాల భేటీ జరగనుంది. గాంధీ విగ్రహం నుండి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. నిరసన కార్యచరణ, పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి. 

09:12 - November 22, 2016
09:09 - November 22, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు 'వరుణ్ తేజ్'. ఇతను చేసిన 'లోఫర్' డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ సినిమాపై దృష్టి కేంద్రీకరించాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' అనే చిత్రంతో పాటు శేఖర్ కమ్మల డైరెక్షన్ లో 'ఫిదా' అనే చిత్రం చేస్తున్నాడు. 'మిస్టర్' మూవీ షూటింగ్ లో 'వరుణ్ తేజ్' గాయపడిన సంగతి తెలిసిందే. ఊటిలో జరిగిన షూటింగ్ లో 'వరుణ్' కుడి కాలు బెణికింది. దీనితో వైద్యులు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనితో 'వరుణ్' ఇంటికే పరిమితమయ్యాడు. ఇక గాయం నుండి పూర్తిగా కోలుకోవడంతో తాను చేస్తున్న ప్రాజెక్టులను స్పీడ్ గా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. 50 రోజుల తర్వాత 'వరుణ్' 'మిస్టర్' సెట్ లోకి అడుగుపెట్టాడు. సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం తెలియచేశాడు. 50 రోజుల తర్వాత షూటింగ్ మొదలు పెట్టానని, షూటింగ్ లో పాల్గొనడం చాలా ఎగ్జైటింగ్ ఉందని తెలిపాడు.

09:00 - November 22, 2016

కరీంనగర్ : జిల్లాలో జోరుగా అక్రమ బియ్యం సరఫరా జరుగుతోంది. సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాజేపేట - నాగ్ పూర్ ప్యాసింజర్ లో 300 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఓ వ్యక్తి మీడియాకు సమాచారం అందించాడు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రామగుండంలో ట్రైన్ ఆపారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ వ్యక్తి తెలిపాడు. ఈ బియ్యం మహారాష్ట్రకు తరలించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

08:55 - November 22, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఆదిలాబాద్ లో 11, మంచిర్యాల, నిర్మల్ లో12, ఆసిఫాబాద్ లో 13, లంబసింగి లో 6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. కొస్తాలోని శివారు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఈశాన్య రుతుపవనలు బలహీన పడడంతో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. వచ్చే మూడు, నాలుగు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. చలి ఎక్కువగా ఉండడంతో గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

146కి చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ : కాన్పూర్‌లో ఆదివారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన వారి సంఖ్య 146కు చేరుకుంది. పుఖ్ర‌యాన్ వ‌ద్ద ఇండోర్‌-పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పిన సంగ‌తి తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 11 డిగ్రీలు, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో 12 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లాలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

07:34 - November 22, 2016

నోట్ల రద్దు వ్యవహారం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. రైతులను, కూలీలను వృత్తిదారులను కరెన్సీ సమస్య చుట్టుముట్టింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చివరకు ఓ ప్రహసనంగా మారిపోతుందన్న అన్న అనుమానం కలుగుతోంది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్న విషయాన్ని నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. పెట్రోల్ , ఆస్పత్రి బిల్లులు, రైలు, విమాన , బస్సు చార్జీలకు రెండు రోజుల పాటు పాత నోట్లు చెల్లుతాయని ప్రకటించిన ప్రభుత్వం మరుసటి రోజు బ్యాంక్ లు, ఏటిఎంలు పనిచేయవంటూ దేశ ప్రజలంతా సహకరించాలని కోరింది. ఆ తర్వాత పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్ ల దగ్గర, విత్ డ్రా చేసుకునేందుకు ఏటిఎంల దగ్గర జనం క్యూ కట్టారు. రెండు రోజుల్లో పరిస్థితి గాడిన పడుతుందంటూ తొలుత భావించారు. రెండు రోజులు కాదు రెండు వారాలైంది. పరిస్థితి మారలేదు. బ్యాంక్ లు, ఏటిఎంల దగ్గర క్యూలు తగ్గడం లేదు. ప్రధాని నరేంద్రమోడీ కన్న తల్లి హీరాబెన్ 95 ఏళ్ల వయస్సులో కూడా బ్యాంక్ కెళ్లి నోట్లు మార్చుకున్న వైనం ఆయనలోని ప్రచార వ్యూహ రచనా నైపుణ్యానికి నిదర్శనం. అందరి దృష్టిని ఈజీగా ఆకర్షించేలా ప్రచార వ్యూహాలు రూపొందించే మోడీ బృందం పరిపాలనా వ్యవహారాలలో అంతే నైపుణ్యం ప్రదర్శించడం లేదన్న వాస్తవాన్ని గత రెండు వారాలు రుజువు చేస్తున్నాయి. నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రణాళికా రహితంగా వ్యవహరించిందన్నదే సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ముందు చూపు, ముందస్తు జాగ్రత్త చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవేవీ లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల తామంతా బ్యాంక్ ల దగ్గర, ఏటిఎంల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోందంటూ సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు రెండు మూడు రోజులు క్యూ లైన్లలో అవస్థపడ్డా, ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్న నమ్మకంతో దేశ ప్రజలంతా దాదాపు రెండు వారాలుగా ఓపికగా వ్యవహరిస్తున్నారు. ఇన్ని రోజులు ఇంతగా సహకరించినా, చివరకు క్యాష్ లేదంటూ చాలా ఏటిఎంలు, బ్యాంక్ ల దగ్గర బోర్డులు పెట్టడం, గంటల తరబడి క్యూలో నిల్చున్నా 2000 రూపాయల నోట్లు చేతిలో పెట్టడం, దానికి చిల్లర లభించకపోవడం వంటి పరిణామాలు సామాన్యుల దైనందిన జీవితాలను తీవ్రంగానే ప్రభావితం చేస్తున్నాయి.

దేశ ప్రజల సహనం..
దేశ ప్రజల సహనాన్ని మరీ ఎక్కువ రోజులు పరీక్షించడం మోడీ ప్రభుత్వానికి మంచిదికాదు. తొలి పది రోజుల్లో 5లక్షల 44 వేల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లు బ్యాంక్ లలో డిపాజిట్ అయ్యాయి. ఇంకా దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పాత నోట్లు బ్యాంక్ లకు చేరాల్సి వుంది. స్వీకరించిన పాతనోట్లకు సమాన కరెన్సీని ప్రజలకు తిరిగి ఇవ్వలేదు. పది రోజుల్లో దాదాపు అయిదున్నర లక్షల కోట్లు స్వీకరించిన బ్యాంక్ లు, అందులో లక్ష కోట్లు మాత్రమే తిరిగి జనానికి చేర్చగలిగాయి. అందుకే జనం ఇప్పుడు చిల్లర సమస్యను తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. పట్టణాలలో బ్యాంక్ అకౌంట్లు వున్నవారు, ఆన్ లైన్, డెబిట్ కార్డుల ద్వారా వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి అలవాటుపడుతూ, చిల్లర సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, గ్రామాల్లో సమస్య తీవ్రంగానే కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు దాదాపు స్తంభించిపోయాయి. ఎక్కడా వ్యవసాయ మార్కెట్ లు పనిచేయడం లేదు. అక్కడకక్కడా ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నా, డబ్బులు చెల్లించడం లేదు. చిట్టీలు రాసిస్తున్నారు. దీంతో రైతులు కూడా కూలీలకు చెల్లింపులు వాయిదాలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉపాధి హామీ పథకం చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. మొత్తానికి చిన్న రైతుల, కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది.

రబీ సీజన్ లో..
రబీ సీజన్ లో ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసేందుకు పాత 500, 1000 రూపాయల నోట్లను అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన రైతులకు ఎంత ఉపశమనం కలిగిస్తుందో చెప్పలేం. రైతులెవ్వరూ నల్లకుబేరులు కారు. వ్యాపారుల నుంచి వారికి రావాల్సిన పేమెంట్స్ నిలిచిపోయాయి. బ్యాంక్ సిబ్బంది మొత్తం పాత నోట్ల వ్యవహారంలోనే తలమునకలయ్యారు. దీంతో ఇతర లావాదేవీలన్నీ కుంటుపడుతున్నాయి. రైతులకు వ్యవసాయ రుణాలు నిలిచిపోయాయి. సరిగ్గా ఇప్పుడే రబీ కోసం విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి రైతులది. 

07:16 - November 22, 2016

పాత నోట్ల రద్దు నేపథ్యంలో రైతుల కూలీల కష్టాలు రెట్టింపయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత ఏర్పడింది. పాత నోట్ల రద్దు తో రైతులు, కూలీలు, గ్రామీణులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత రంగారావు విశ్లేషించారు. 

07:10 - November 22, 2016

హైదరాబాద్ : అధికార పార్టీ కండువా కప్పుకుని ...యూత్‌లీడర్‌గా చెలామణి అవుతూ....మోసాలు..అరాచకాలకు పాల్పడుతున్న సంతోష్‌ పాపం పండింది.. రెండ్రోజులుగా సంతోష్‌ అరాచకం వీడియో బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు... ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడి బాధితులపై అమానుషానికి పాల్పడ్డ సంతోష్ తమవాడు కానే కాదంటున్నారు అధికారపార్టీ నేతలు...అయితే సంతోష్‌ మంత్రి,ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలను బయటపడడంతో నేతలు కాస్త భుజాలు తడుముకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో అధికారపార్టీ యువనేతగా చెలామణి అవుతూ...మంత్రి,ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగి..అధికారిక కార్యక్రమాల్లో అన్నీ తానైనట్లు బిల్డప్ ఇస్తూ భారీ మోసాలకు పాల్పడి బాధితులపై అరాచకం సృష్టిస్తున్న ఈదునూరి సంతోష్‌పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు... రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు...వీడియో సాక్ష్యాలు అధికారపార్టీలో కలకలం రేపాయి. సంతోష్ అరాచకం సాక్ష్యాధారాలతో సహా ప్రసారం కావడంతో కంగుతిన్న గులాబీ నేతలు అతను తమ పార్టీనే కాదంటూ ప్రచారం చేస్తున్నారు...మొత్తానికి పరువుపోకుండా అధికార నేతలే పోలీసులకు డైరెక్షన్ ఇచ్చి కేసులు నమోదు చేయించినట్లు తెలుస్తోంది.

నగదు వసూళ్లు..
స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని.. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేశాడు. తీరా ఉద్యోగాల ఊసే లేకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి గదిలో బంధించి అమానుషంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ తన్ని అరాచకంగా వ్యవహరించాడు. అది అంతా సెల్ ఫోన్ లో రికార్డు చేస్తే వికృతానందాన్ని పొందాడు. అయితే ఆరు నెలలుగా సాగుతున్న ఈ దారుణం ఆ వీడియోలు బయటికి రావడంతో వెలుగుచూసింది. అర్వపల్లి మండలము తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ గతంలో కాంగ్రెస్ నాయకుడిగా.. తర్వాత ఆప్‌ లీడర్‌గా చెలామణి అయిన సంతోష్.. ప్రస్తుతం టిఆర్ఎస్ యువజన భాగంలో ఉంటూ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడిగా ప్రచారం చేసుకుంటున్నాడు జాబ్‌ కన్సల్టెన్సీ ఆరంభించి అక్రమాలకు తెరలేపాడు. ఈదునూరి సంతోష్ అకృత్యాలపై ఆధారాలతో సహా మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో 420 ,506 ,342 ,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే సంతోష్ కు.. టిఆర్ఎస్ కు ఎటువంటి సంబందం లేదని మంత్రి జగదీష్ రెడ్డికి సంతోష్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదని.. రెండు రోజులుగా అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. వీడియో తీయించి.. డబ్బులు అడిగిన వారి పరిస్థితి ఇలాగే ఉంటదని అందర్నీ బెదిరించినట్లు సమాచారం. అదే వీడియో బయటికి రావడంతో సంతోష్ అరాచకాలకు తెరపడింది.

06:59 - November 22, 2016

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఇప్పుడు ఉత్సాహం ఉరకలేస్తోంది. రైతు పోరుయాత్ర సక్సెస్‌లో ఉన్న టి-టిడిపి, రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అధినేత చంద్రబాబు, లోకేష్‌లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని నేతలు నిర్ణయించారు. టి-టిడిపి అధ్యక్షులు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో... ముఖ్యనేతలంతా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సమావేశమై భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించారు. ఇప్పటికే ప్రజాసమస్యలపై పోరాటాలు చేపట్టిన టి-టిడిపి, పలురకాల ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల ఆత్మహత్యలపై టి-సర్కార్ విధానాలను నిలదీస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త క్యాంపు కార్యాలయంలోకి అడుగు పెట్టేలోగా ఫీజు బకాయిలు చెల్లించకుంటే, గృహప్రవేశం రోజునే, క్యాంపు కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాలని తెలుగుదేశం విద్యార్థి విభాగం రెడీ అవుతోంది.

రేవంత్ ఆధ్వర్యంలో..
టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలంతా తెలంగాణలోని పలు జిల్లాల్లో మినీ పాదయాత్రలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో నిర్వహించిన రైతు పోరు యాత్రకు మంచి స్పందన రావడంతో ..ఈనెల 24, 25, 26 తేదీల్లో పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం కూడా నిర్వహించాలని టీ టీడీపీ నేతలు భావిస్తున్నారు.  దీనికి పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కూడా ఆహ్వానించడానికి నాయకులు రెడీ అయ్యారు. దీంతో అటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను విమర్శించడంతోపాటు.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడానికి వీలవుతుందని నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. 

06:56 - November 22, 2016

శ్రీకాకుళం : జిల్లాల్లో ఇవాళ్టి నుంచి గ్రానైట్‌ క్వారీలు మూతపడనున్నాయి. డీఎంఎఫ్‌ ఫండ్‌తోపాటు , అధిక సెస్‌ల రూపంలో వేస్తున్న పన్నలు భారంగా మారాయని గ్రానైట్‌ యాజమానులు రిలేనిరాహార దీక్షలకు దిగుతున్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ గనులశాఖ ఏడీ కార్యాలయాల ముందు కార్మికులతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

06:55 - November 22, 2016

తూర్పుగోదావరి : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగి మండలం దానవాయిపేటలో దివిస్‌ బాధితులతో ఆయన సమావేశం కానున్నారు. స్థానికులతో ముఖాముఖిలో పాల్గొని దివిస్‌ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్‌ జగన్‌ మద్దతు తెలుపనున్నారు. ఇక్కడ దివిస్‌ ల్యాబ్‌కు వ్యతిరేకంగా గత కొంతకాలంగా స్థానికులు పోరాడుతున్న విషయం తెలిసిందే.

06:54 - November 22, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో నాబార్డ్‌ నుంచి నిధులు అందనున్నాయని.. దీంతో ప్రాజెక్ట్‌పై విపక్షపార్టీలు చేస్తున్న రాద్ధాంతానికి చెక్‌ పెడతామంటున్నారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్ట్‌పై కేంద్రం నుంచి ప్రశంలు అందుతున్నాయన్నారు చంద్రబాబు. ప్రాజెక్టులను అనుసంధానం చేయడానికి పట్టిసీమను ఒక మోడల్ ప్రాజెక్ట్‌గా కేంద్రం గుర్తించిందని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇక మరింత వేగంగా సాగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు, కాంట్రాక్ట్‌ లతో మాట్లాడిన చంద్రబాబు పలు సూచనలు చేశారు.

ఈనెల 29లోగా..
పోలవరం స్పిల్ వే డిజైన్ కు ఈ నెల 29లోగా అనుమతి రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్పిల్ వే డిజైన్లను ఢిల్లీలోని సీడబ్యూసీ అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. డిసెంబర్ 10న పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాంక్రీట్ పనులు ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాజెక్టులో ఇంకా 17.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలతోపాటు.. ఎర్త్‌డ్యామ్‌ వర్క్‌ జరగాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికే ప్రతి నెల 42 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరుగుతున్నాయని, పనులను మరింత వేగవంతం చేయడానికి 50-70లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు తవ్వకాలను పెంచనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అటు ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన ఇనుమును విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకుంటామని చెప్పారు.

49వేల ఎకరాల భూమి..
అటు ప్రాజెక్ట్‌ కోసం ఇంకా 49వేల ఎకరాల భూమిని తీసుకోవాల్సి ఉందన్నారు చంద్రబాబు. భూసేకరణ, పునరావాసం కోసమే 27వేల కోట్ల రూపాయలు అవసరమని, దీనికోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మరో వారం రోజుల్లో పోలవరానికి నాబార్డ్‌ నిధులు వస్తున్నాయని తెలిపారు. అయితే కొన్ని జకీయ పార్టీలు ప్రాజెక్ట్‌ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ... ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్ట్‌ను కేంద్రప్రభుత్వం మోడల్‌ ప్రాజెక్ట్‌గా గుర్తించిందన్నారు సీఎం చంద్రబాబు. అంతర్‌రాష్ట్ర నదుల అనుసంధానం సాధ్యం కాని పరిస్థితుల్లో జిల్లాల మధ్యనే నదుల అనుసంధానాన్ని విజయవంతంగా చేసి చూపించడంపై..కేంద్రం నుంచి ప్రశంలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే పట్టిసీమ ద్వారా 46.74 టీఎంసీల నీటిని వినియోగించుకున్నామన్నారు. రాష్ట్రంలో పవర్ గ్రిడ్ తరహాలోనే వాటర్, స్మార్ట్ గ్రిడ్ తీసుకురాబోతున్నామని వెల్లడించారు.

06:52 - November 22, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. సామాన్యుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు.. వికలాంగులు... వితంతువులు వారి పింఛన్లు కోసం పాట్లు పడుతున్నారు. బ్యాంకులు.. ఏటీఎంల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పాతనోట్లు రద్దుకావడంతో పింఛన్లపై ఆధారపడే వికలాంగులు..వృద్ధులు.. వితంతువులు అవస్థలు పడుతున్నారు. ఈ నెల అందాల్సిన పింఛన్‌ ఇంకా చేతికి రాలేదు. దీంతో కనీస అవసరాలు తీరక ఆవేదన చెందుతున్నారు. డబ్బుల కోసం గంటల తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సి వస్తోందని.. రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని బాధపడుతున్నారు. అయినా ప్రయోజనం ఉండడం లేదని వృద్ధులు వాపోతున్నారు. బ్యాంక్‌ అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు.

రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు..
రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులు కలుపుకుని మొత్తం 35 లక్షల 86వేల 5వందల 60 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. అయితే నవంబర్‌లో అందాల్సిన పింఛన్లు ఇంకా చేతికి రాలేదు. ఈ నెల మొత్తం ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసినప్పటికీ.. ఆ డబ్బులు తీసుకోలేక వృద్ధులు నానా తంటాలు పడుతున్నారు. ఏటీఎంలు పనిచేయకపోవడం...బ్యాంకుల్లో నిధుల లేమి..రద్దీ వెరసి పింఛన్‌ డబ్బులు తీసుకోలేకపోతున్నారు. బ్యాంకుల వద్దే పడిగాపులు కా‌స్తున్నారు. బ్యాంకులు అధికారులు చొరవచూపి..పింఛన్‌దారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు..వికలాంగులు కోరుతున్నారు. 

06:42 - November 22, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ వ్యాపారులు గగ్గొలు పెడుతున్నారు. పాత నోట్లను తీసుకోవడానికి పెట్రోల్ పంప్ లకు ఇచ్చినట్లుగా తమకు మినహాయింపు ఇవ్వాలని.. అలాగే పౌల్ట్రీ కిచ్చిన రుణాలపై 6 నెలలు మారటోరియం విధించాలని కోరుతున్నారు. దేశంలో పౌల్ట్రీ రంగానికి విశేషమైన స్థానం వుంది. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల వ్యాపారం చేస్తూ పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది ఈ పరిశ్రమ. తాజాగా 500, వేయి రూపాయల నోట్లను రద్దు చేయడం ఈ పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టింది. పాల్ట్రీ పరిశ్రమలో చెల్లింపులన్ని దాదాపు నగదు రూపంలోనే జరుగుతాయి. రిటైల్ లో కోడి మాంసం, కోడి గుడ్లను కొనుగోళ్లు చేసే వారు అందరు నగదు రూపంలో డబ్బు చెల్లించడం పరిపాటి. అయితే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కొనుగోళ్లు మందగించాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

100 కోట్ల నష్టం..
పెద్దనోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా రోజుకి 100కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని పౌల్ట్రీ వ్యాపారులు వాపోతున్నారు. తెలంగాణలో కూడా రోజుకి 20 కోట్ల మేర నష్టపోతున్నామని.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ ఛైర్మన్ రంజీత్‌ రెడ్డి చెబుతున్నారు. పల్లెల్లో ఇప్పటికే 80% లాభాలు పెద్ద నోట్ల రద్దు వల్ల ఆగిపోయాయని ఫెడరేషన్‌ ప్రెసిడెంట్ ప్రదీప్‌రావు తెలిపారు. పౌల్ట్రీ కంపెనీల్లో 10లక్షల ఎంప్లాయిస్ పని చేస్తున్నారని.. వీరికీ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. 500, వెయ్యి నోట్ల రద్దుతో పౌల్ట్రీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఎంత మేర పట్టించుకుంటుందో వేచి చూడాలి. 

06:39 - November 22, 2016

విజయవాడ :ఏ చిన్న అవకాశం వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసే ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ కొంత కాలంగా సైలెంట్‌గా కనిపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంపై వైసీపీలోని కిందిస్థాయిలో నేతలే స్పందిస్తున్నారు తప్ప అధినేత మాత్రం మౌనం వీడడం లేదు. అసలింతకు జగన్ మౌనం వెనుక అంతర్యమేమిటనే చర్చలు సొంత పార్టీలోనే కొనసాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు అంశంలో ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి మౌనంగా ఉండటంపై సొంతపార్టీలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షనేతగా ఆయన ఇంతవరకు ఏవిధమైన ప్రకటనకూడా చేయకపోవడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో కిందిస్థాయి నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. పెద్ద నోట్లరద్దు అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన వైఖరిని బాహాటంగానే వెల్లడిస్తుండగా... విపక్షనేత జగన్‌ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. దీంతో పెద్దనోట్ల రద్దుపై విపక్ష నేత జగన్‌ స్పందన కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు మాత్రం నిరుత్సాహమే ఎదురవుతోంది.

తూ.గో.జిల్లాలో జగన్ పర్యటన..
జగన్ పై ఇప్పటికే అక్రమ ఆస్తులకు సంబంధించి కేసులు నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై స్పందించాలా వద్ద అన్న అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తే. సెల్ఫ్‌గోల్ చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కోక తప్పదని, కేంద్ర నిర్ణయాన్ని తప్పబడితే సంకేతాలు మరోలా వెళుతాయన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత 15 రోజులుగా ఎక్కడా కనిపించని జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలోనైనా ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యలపై స్పందిస్తారా లేదా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. 

06:37 - November 22, 2016

విజయవాడ : లక్ష పాత నోట్లకు.. 70 వేలు కొత్త నోట్లు, మంచి తరుణం మించిన దొరకదు.. వెంటనే రండి.. ఎంతైనా మారుస్తాం..! మీరు అనువైన ప్రాంతానికే వస్తాం..! ఏ ఇబ్బంది రాకుండా చూస్తాం..ఇది విజయవాడ కేంద్రంగా సాగుతున్న నోట్ల మార్పిడి దందా..! ఎట్టకేలకు ఈ ముఠా కార్యకలాపాలకు బెజవాడ పోలీసులు చెక్‌ పెట్టారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని రద్దు చేసిన పాత నోట్లను కమిషన్‌ పద్ధతిలో మారుస్తున్న ఓ ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ ముఠా వివరాలను వెల్లడించారు. కీర్తి, సైమన్‌, జీవన్‌లు ప్రధాన సూత్రదారులని వివరించారు. వీరు 18 శాతం కమిషన్‌ తీసుకుని పాత నోట్లను మార్చుకుని వాటికి రూ.100, రూ.2000 నోట్లను ఇస్తున్నారని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఈ కేసుకు సంబందించి మొత్తం 17మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.6.8లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేసే కీర్తి అనే మహిళ నగదు మార్పిడిలో కీలకమైన పాత్ర పోషించదని పోలీసులు తెలిపారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఈ ముఠా వెనుక ఉన్నట్లు పోలీసులకు ఉన్న సమాచారం. దీనిపై కూడా వీరిని పూర్తిస్థాయిలో విచారించి ఆ తరువాత వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. బ్యాంకర్ల పాత్ర ఏమైనా ఉందో అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో సంబంధమున్న అందర్నీపై కేసులు నమోదు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

నేడు తూ.గో.జిల్లాలో జగన్ పర్యటన..

తూర్పుగోదావరి : నేడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించనున్నారు. తొండంగి మండలం దానవాయిపేటలో దివీస్ బాధితులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. 

ప్యాసింజర్ రైలులో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు..

కరీంనగర్ : కాజేపేట - నాగపూర్ ప్యాసింజర్ లో మహారాష్ట్రకు అక్రమంగా 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారు. సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. 

నేడు సుప్రీంకు సీఎం కేజ్రీవాల్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసులో నేడు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరు కానున్నారు. 

ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ..

గుంటూరు : ప్రొపెసర్ లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. విద్యార్థిని ఆత్మహత్య కేసులో లక్ష్మీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

Don't Miss