Activities calendar

23 November 2016

ప్రధాని మోడీకి జగన్ లేఖ

హైదరాబాద్ : ప్రధాని మోడీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని జగన్ లేఖలో పేర్కొన్నారు. పేద, మధ్య తరగతితోపాటు చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న అనకాపల్లి మార్కెట్ యార్డు మూతపడిందన్నారు.

 

21:54 - November 23, 2016

చెన్నై : సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, నేపథ్య గాయకుడు డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతియ యాత్రకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవల్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.   
బాలమురళీ కృష్ణ అంత్యక్రియలు పూర్తి
అభిమానులు, సంగీత ప్రియుల అశ్రునయనాల మధ్య సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, నేపథ్య గాయకుడు డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని బీసెంట్‌నగర్‌ శ్మశానవాటిలో ఆయన పెద్దకుమారుడు అభిషేక్‌ అంత్యక్రియలు నిర్వహించారు. 
బాలమురళీకృష్ణ పార్థివదేహానికి పలువురు ప్రముఖుల నివాళులు 
అంతకుముందు చెన్నైలోని స్వగృహంలో సందర్శనార్థం ఉంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. సినీనటుడు కమలహాసన్‌, ప్రముఖ గాయకుడు ఏసుదాసు, మనో, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగయ్య  తదితరులు నివాళులు అర్పించి.. ఆయన సేవలను స్మరించుకున్నారు. సంగీత ప్రపంచంపై మంగళంపల్లి చెరగని ముద్రవేశారని జేసుదాసు అన్నారు. ఆయన్ని చూసి సంగీత కళాకారులందరూ నేర్చుకోవాలని జేసుదాసు సూచించారు.  
అభిమానులు కన్నీటి పర్యంతం 
చెన్నైలోని బాలమురళీకృష్ణ నివాసం నుంచి సాగిన అంతిమయాత్రలో సినీ ప్రముఖులు, అభిమానులు, దేశంలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ తర్వాత చెన్నై జేసుదాసు అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత ప్రపంచానికి మంగళంపల్లి చేసిన సేవల్ని గుర్తుచేసుకొని ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. 

 

21:49 - November 23, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వ‌ద్ద పాకిస్థాన్ జ‌రుపుతున్న దాడుల‌ను భారత్‌ తిప్పికొడుతోంది. భార‌త ఆర్మీ జరిపిన ఎదురుదాడుల్లో 8 మంది పాకిస్తాన్‌ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని పాక్‌ సైనిక మీడియా విభాగం ఐఎస్‌పిఆర్‌ నిర్ధారించినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది. మాచిల్ సెక్టార్‌లో మంగ‌ళ‌వారం పాక్ ద‌ళాలు ముగ్గురు భార‌తీయ జ‌వాన్లు చంపేసినందుకు భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. మరోవైపు పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఏడుగురు సైనికులు మృతి చెందినట్లు పాక్‌ సైనిక మీడియా విభాగం ఐఎస్‌పిఆర్‌ పేర్కొంది. పాకిస్థాన్ ఆర్మీ స్థావ‌రాల‌పై జ‌రుగుతున్న దాడుల కోసం 120ఎంఎం హెవీ మోర్టార్స్‌, మెషీన్‌గ‌న్‌ల‌ను వాడుతున్నట్లు భారత ఆర్మీ ప్రక‌టించింది. జ‌వాన్లను పాశ‌వికంగా హ‌త్య చేయ‌డం స‌హించ‌మ‌ని, అందుకే పాక్ స్థావ‌రాల‌పై ఆక‌స్మికంగా భీక‌ర దాడుల‌కు దిగిన‌ట్లు భార‌త ఆర్మీ పేర్కొంది. 

 

21:45 - November 23, 2016

తూర్పుగోదావరి : పెద్దనోట్ల రద్దు నిర్ణయం మంచిదే  అయినా..సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేత జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. ఉద్దేశాలు మంచివైనా, అమలు సరిగ్గా ఉండాలని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం వెలువడిందని చెప్పారు. అయితే పెద్దనోట్ల రద్దుతో ప్రజలెవరూ సంతోషంగా లేరని తెలిపారు. రాష్ట్ర ప్రజల కష్టాలను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత ఏపీ సర్కారుపై ఉందన్నారు. నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసు అని పేర్కొన్నారు. 

 

21:40 - November 23, 2016

ఢిల్లీ : నోట్ల మార్పిడి అనంతరం.. దేశంలో వడ్డీరేట్లు తగ్గనున్నాయని కేంద్రం తెలిపింది. నోట్ల రద్దు ఇబ్బందులపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఇప్పటివరకు 6లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరిందని సుప్రీంకు తెలిపారు. నోట్ల కొరత ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని...కేవలం సరఫరాలోనే జాప్యం ఏర్పడుతోందని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. 
స్టే విధించేందుకు నిరాకరణ 
పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేచోట విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నోట్ల రద్దుపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను విడివిడిగా విచారించాలన్న ప్రభుత్వ అఫిడవిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. స్టే విధించేందుకు నిరాకరించింది. 
12 పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా దాఖలైన మొత్తం 12 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.  కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు వివరించారు. నోట్ల కొరత ఉందన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వ్‌బ్యాంక్‌, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లు కావాల్సినంత కరెన్సీని ముద్రించిందని.. అయితే ఆ నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసులకు రవాణా చేసేందుకు జాప్యం జరుగుతుందని వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త నోట్లను త్వరగా తరలించే ప్రయత్నం చేస్తామని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. 
ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్లు డిపాజిట్‌
నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు 6 లక్షల కోట్ల రూపాయలు ఆయా బ్యాంకులలో డిపాజిట్‌ అయ్యాయని.. రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. నోట్ల మార్పిడి ప్రక్రియ ద్వారా మొత్తం 15 లక్షల కోట్లు డిపాజిట్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తుందని అటార్నీ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక పిటిషనర్ల తరపున కాంగ్రెస్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించనున్నారు. 

 

21:37 - November 23, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌లో సమావేశాల్లో ఎలాంటి మార్పు లేదు. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ప్రధాని సభలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన...నినాదాల మధ్య ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాజ్యసభకు రేపు ప్రధాని హాజరయ్యే అవకాశం ఉంది.
ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా 
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఆరో రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడ్డాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే  పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఉభయ సభల్లోనూ ఆందోళనకు దిగాయి. దేశవ్యాప్తంగా నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోది సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ఇప్పటివరకు సుమారు 75 మంది క్యూలైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోయారని బిఎస్‌పి నేత మాయావతి తెలిపారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే.. నోట్ల రద్దుపై ప్రధాని సభలో కాకుండా బయట మాట్లాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నోట్ల రద్దుతో అనిశ్చిత పరిస్థితి : ఏచూరీ
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని దీనిపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని సిపిఎం నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.
రాజ్యసభ గురువారానికి వాయిదా 
తీవ్ర గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించక పోవడంతో డిప్యూటి ఛైర్మన్‌ పిజె కురియన్‌ రాజ్యసభను గురువారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలోనూ అదే పరిస్థితి
లోక్‌సభలో కూడా అదే పరిస్థితి. శీతాకాల సమావేశాల్లో తొలిసారిగా హాజరైన ప్రధాని నరేంద్రమోది మౌనం వహించారు. సభ ప్రారంభం నుంచే  విపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.  పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్‌ నిరాకరిండంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా విపక్షాల ఆందోళన సద్దుమణగలేదు. 
చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్న వెంకయ్య 
నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో అన్నారు. పేదలు, దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతిపక్షాలు వాయిదా తీర్మాణంపై చర్చకు పట్టుబట్టడం సరైంది కాదన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని  వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
లోక్‌సభ గురువారానికి వాయిదా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంపై కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులను పక్కనబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తాము చర్చకు సిద్ధమని, చర్చను ప్రారంభించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని విపక్షాలు పట్టించుకోలేదు. దీంతో లోక్‌సభను  గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.
వాయిదాల పర్వం 
లోక్‌సభలో చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం...చర్చ అనంతరం ఓటింగ్‌కు మాత్రం ససేమిరా అంటోంది. రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉండటంతో సభలో ప్రధాని మాట్లాడాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండానే వాయిదాల పర్వం కొనసాగుతోంది.

 

21:28 - November 23, 2016

పూంచ్ సెక్టార్ లో 8 మంది పాక్ సైనికులు హతం

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పూంచ్ సెక్టార్ లో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుపెట్టింది. 

21:20 - November 23, 2016
21:16 - November 23, 2016

ప్రధాని యాప్ సర్వేపై భారీ స్పందన

ఢిల్లీ : ప్రధాని యాప్ సర్వేపై భారీ స్పందన వచ్చింది. పెద్ద నోట్ల రద్దుపై 5 లక్షల మంది ప్రజలు స్పందించారు. పెద్ద నోట్ల రద్దను 73 శాతం మంది సమర్థించారు. 90 శాతం మంది ప్రజలు 4 స్టార్ల రేటింగ్ ఇచ్చారు.

పోస్టాఫీసుల్లో సేవింగ్ ఖాతాల్లో పాత నోట్ల డిపాజిట్లకు అనుమతి

ఢిల్లీ : పోస్టాఫీసుల్లో సేవింగ్ ఖాతాల్లో పాత నోట్ల డిపాజిట్ లకు ఆర్థిక శాఖ అనుమతించింది.

20:55 - November 23, 2016

జీడీపీ భారీగా తగ్గనుందా..? ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం ఉండబోతోందా..? చిన్నబతుకులపై పెద్ద దెబ్బ పడనుందా..? రద్దుతో చిత్తయిందెవరు..? రద్దు రిజల్ట్స్..!! ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో ఏచూరి పిటిషన్

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిటిషన్ వేశారు. కొత్త నోట్లు ప్రజలందరికీ అందే వరకు డిసెంబర్ 30 వరకు పాత నోట్లను అనుమతించాలని కోరారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. 

 

రేపు రాజ్యసభకు ప్రధాని మోడీ..?

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ రేపు రాజ్యసభకు హాజరయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై సభలో మోడీ వివరణ ఇవ్వనున్నారు.  రేపు ఉదయం 10 గంటలకు రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం నిర్వహించనున్నారు. 

 

బాలానగర్ ప్రేమ్ నారాయణ పాఠశాలలో విషాదం

హైదరాబాద్ : బాలానగర్ లోని ప్రేమ్ నారాయణ పాఠశాలలో విషాదం నెలకొంది. అదే పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థిని మీనాక్షి పై నుండి దూసుకెళ్లింది. మినాక్షి అక్కడికక్కడే మృతి చెందింది.  

20:36 - November 23, 2016

కొత్త ఇంట్ల కుడికాలు పెట్టనున్న సీఎం సారు, కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి, మోడీ ముంగట మోకరిల్లిన సీఎం కేసీఆర్ సారు, నర్సాపురం కాడా నాలుగువేల గజాలు కబ్జా, రక్తంతో ఉత్తరం రాసిన 108 ఉద్యోగులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

ముగిసిన కేంద్రమంత్రివర్గ సమావేశం

ఢిల్లీ : కేంద్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. దేశ వ్యాప్తంగా జవహర్ లాల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

 

20:19 - November 23, 2016

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎపిసిసి నేత తులసీరెడ్డి, టీడీపీ నాయకురాలు రేణుక, బీజేపీ నేత శ్రీదర్, సీపీఐ జాతీయ నేత నారాయణ పాల్గొని, మాట్లాడారు. నోట్ల రద్దుతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కుదేలయ్యాయని చెప్పారు. మోడీ నిర్ణయంతో నల్లకుబేరులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. పేదలే ఇక్కటు పడుతున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:58 - November 23, 2016

చెన్నై : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చెన్నై బీసెంట్‌ రోడ్డులోని హిందూ శ్మశానవాటికలో ఆయన పెద్దకుమారుడు అంత్యక్రియలు నిర్వహించారు. బాలమురళీకృష్ణ నివాసం నుంచి సాగిన అంతిమయాత్రలో సినీ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకు ముందు... మంగళంపల్లి బాలమురళీకృష్ణకు  పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.  

 

రేపు సీఎం కేసీఆర్ దంపతులు గృహప్రవేశం

హైదరాబాద్ : రేపు తెల్లవారుజామున ఉదయం 5.22 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, చినజీయర్ స్వామి పాల్గొననున్నారు. సీఎం కార్యాలయం, సమావేశ మందిరం, భవనాల సముదాయానికి 'ప్రగతి భవన్' గా నామకరణం చేశారు.

 

19:33 - November 23, 2016

విశాఖ : కాపు గర్జన సమయంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో నిందుతులుగా ఉన్న వారికి మద్దతుగా కాపునేత ముద్రగడ పద్మనాభం అనకాపల్లికి వచ్చారు. కొంతమంది కాపు జేఏసీ నేతలు అనకాపల్లి ఆర్పీఎఫ్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. వారికి మద్దతుగా ఉండేందుకు ముద్రగడ అనకాపల్లి రైల్వే స్టేషన్ కు రావడంతో ఆర్పీఎఫ్ పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ వారిని కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తోందని కాపు నేతలు మండిపడ్డారు. 

 

19:27 - November 23, 2016

కడప : కడప కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఏడాదికోసారి నిర్వహించే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ వైసిపి నేతలు మాటల యద్ధానికి దిగారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాష, కమలాపురం ఎమ్మెల్యే రవింద్రనాథ్‌ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కలుగ జేసుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత ఇరు పార్టీల నాయకులు అక్కడి నుండి వెల్లిపోవడంతో మళ్లీ ప్రశాంతవాతావరణంలో ఎన్నికల్ని నిర్వహించారు. ఉదయం నుండి సాగిన ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఐదు స్టాండింగ్ కమిటీలను కైవసం చేసుకుంది.

 

19:24 - November 23, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో వస్త్ర వ్యాపారం కుదేలయ్యింది. కోట్లలో జరగాల్సిన వ్యాపారం వేలకు పడిపోయింది. విజయవాడ వస్త్రలత కాంప్లెక్స్‌లో బిజినెస్‌ పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:21 - November 23, 2016

నెల్లూరు : జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా నోట్లకట్టలు పట్టుపడ్డాయి. గూడూరు సమీపంలోని బుధానం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ కారులో 16 లక్షల కొత్త రెండు వేలనోట్లు, 10 లక్షల పాత నోట్లు పోలీసులకు చిక్కాయి. మొత్తం రూ.26 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు వివరాలపై కారు డ్రైవర్ ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పట్టుబడ్డ డబ్బులు పవన్ కుమార్, మురళీకృష్ణలవిగా కార్ డ్రైవర్ తెలిపాడు. నగదు మార్పిడి చేస్తామనే వారి సమాచారం పోలీసులకు అందించండని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మరిన్ని వివరాలను వీడిదయోలో చూద్దాం...

 

19:11 - November 23, 2016
19:06 - November 23, 2016

హైదరాబాద్‌ : తాజాగా హైదరాబాద్‌లో మరో కల్తీ దందా బయటపడింది. తలకు రాసుకునే కొబ్బరినూనె కల్తీ గుట్టును ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. మలక్‌పేటలో సలీం అనే వ్యక్తి గత 2నెలలుగా కొబ్బరినూనెను ప్యారాచూట్‌ పేరుతో కల్తీచేస్తూ గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కొబ్బరినూనె తయారీ కేంద్రంపై దాడిచేశారు. 750 లీటర్ల కల్తీ కొబ్బరినూనె, 150 బాటిళ్లు, తయారీకి ఉపయోగించిన యంత్రాలను సీజ్‌ చేసి నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

19:02 - November 23, 2016
19:01 - November 23, 2016

సంగారెడ్డి : ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ సీపీఎం అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరనే పరిస్థితిని వివరించేందుకే సీపీఎం పాదయాత్ర చేపట్టిందన్నారు. కాంగ్రెస్ తరపున పాదయాత్రకు పూర్తి మద్దుతిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

18:56 - November 23, 2016

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 38వ రోజుకు చేరుకున్న సందర్భంగా..పాదయాత్ర విశేషాలను మీడియాకు వివరించారు. ఇప్పటివరకు 950 కిలోమీటర్లు పూర్తిచేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని..బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏవీ అమలు కావడంలేదన్నారు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అప్పులు కట్టలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్మరి, కుమ్మరి, చాకలి కులాల ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఏకైక సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:49 - November 23, 2016

జగిత్యాల : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం ఒకరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. పాత నోట్ల రద్దు ఓ వ్యక్తి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. జగిత్యాల మంగలగడ్డవాడలో అంజద్‌అలీ తన దగ్గర ఉన్న ఐదు వేల రూపాయలను మార్చుకునేందుకు నిన్న బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. నిరాశతో వెనుదిరిగిన అంజద్‌అలీకి రాత్రి గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పెద్ద నోట్ల రద్దు వల్లే అంజద్‌ అలీ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 

 

దివీప్ నిర్మాణ కోసం చెట్ల తొలగింపు

తూర్పుగోదావరి : తొండంగి మండలంలో దివీప్ నిర్మాణ చేపట్టనున్నారు. చెట్లు తొలగించేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది.

18:41 - November 23, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 540 కోట్లనష్టం వస్తుందని.. సీఎస్ రాజీశ్ శర్మ.. కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. నోట్ల రద్దు కష్టాలపై అధ్యయనం కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్రబృందం.. సీఎస్‌తో భేటీ అయింది. నోట్ల రద్దుతో రాష్ట్రంలో తలెత్తిన వాస్తవ పరిస్థితులను.. సీఎస్‌ రాజీవ్‌శర్మ కేంద్ర బృందానికి వివరించారు. రద్దు వల్ల నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ..ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల మేర నష్టం వస్తుందని వివరించారు. కేంద్రం వెంటనే..
ప్రభుత్వానికి ఏర్పడిన నగదు కొరత తీర్చాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో పాత 1000 రూపాయల నోట్లను.. అనుమతించాలని కూడా సీఎస్ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దుపై అధ్యయనం చేసేందుకు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 

 

18:37 - November 23, 2016

అనంతపురం : ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కొడికొండ చెక్ పోస్టు వద్ద బాలకృష్ణ కాన్వాయ్ లో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ లో ఢీకొన్న రెండు వాహనాలు

అనంతపురం : ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కొటికొండ వద్ద కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు.

నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి రోజుకు 540 కోట్లనష్టం : సీఎస్‌

హైదరాబాద్ : నోట్ల రద్దు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 540 కోట్లనష్టం వస్తుందని.. సీఎస్ రాజీశ్ శర్మ.. కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. నోట్ల రద్దు కష్టాలపై అధ్యయనం కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్రబృందం.. సీఎస్‌తో భేటీ అయింది. నోట్ల రద్దుతో రాష్ట్రంలో తలెత్తిన వాస్తవ పరిస్థితులను.. సీఎస్‌ రాజీవ్‌శర్మ కేంద్ర బృందానికి వివరించారు. 

17:56 - November 23, 2016

ఢిల్లీ : పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కుట్రలు ఉన్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మోడీ నిర్ణయాలకు ప్రజలు సరైన రీతిలో తీర్పునిస్తారని  చెప్పారు. పార్లమెంటు సరిగా జగాలంటే ప్రధాని సభకు రావాలన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఈనెల 28న ఆల్‌ఇండియా ప్రొటెస్ట్‌ డేని పాటించాలని నిర్ణయించామన్నారు. 'విడివిడిగా కదం తొక్కండి కలిసి పోరాడండి' అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని ఏచూరి తెలిపారు. 

 

17:50 - November 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో 2011వ సంవత్సరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రైల్ రోకో కేసును సికింద్రాబాద్ రైల్వే కోర్టు కొట్టేసింది. తెలంగాణ సాధన కోసం టీజేఏసీ ఇచ్చిన పల్లె పల్లె పట్టాలపైకి పిలుపుతో... సికింద్రాబాద్ మౌళాలి రైల్వే ట్రాక్‌పై పలువురు రైల్ రోకో చేశారు. దీంట్లో మొదటి ముద్దాయిగా ప్రొఫెసర్‌ కోదండరాం,..ఆయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లారెడ్డి, అహ్మద్ ఖాన్‌లపై  రైల్వే పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే కేసు విచారణలో భాగంగా వీరంతా కోర్టుకు హాజరయ్యారు. 2వ మెట్రో పాలిటన్ న్యాయమూర్తి ముందు హాజరు కాగా..వారిని మందలించి కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించిందని ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. 

 

17:43 - November 23, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సీట్ల పెంపునకు.. ఆర్టికల్ 170-3 ప్రకారం.. 2026లో జనాభా గణన అనంతరం.. సాధ్యమని కేంద్రహోంశాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో... టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి హన్స్ రాజ్... లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:36 - November 23, 2016

ప్రకాశం : సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో సహకార సంఘాల రైతులు నిరసన చేపట్టారు. నగరంలోని కర్నూలు రోడ్డు బైపాస్ కూడలి వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ , పాతమార్కెట్ మీదుగా చర్చి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ఈదర మోహన్‌తో పాటు సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్బీఐ గవర్నర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం రైతులు కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసుల ముట్టడిని అడ్డుకోవడంతో అధికారులకు రైతులు వినతిపత్రం సమర్పించారు. సహకార బ్యాంకులలో 500, వెయ్యి నోట్లు తీసుకోకూడదు అనే నిభందన రైతులకు ఇబ్బందికరంగా ఉందని పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ అన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయం వలన 4కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. 

17:31 - November 23, 2016

తిరుపతి : ప్రధాని నరేంద్రమోడీపై సీపీఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. ప్రజాకోర్టులో మోడీకి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుని నిరసిస్తూ తిరుపతిలో నారాయణ ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్యుల్ని ఇబ్బందులు పెడుతున్న ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నోట్ల రద్దుకు కారణమైన ఆర్ బీఐ గవర్నర్‌ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

మరో యాప్ ను ఆవిష్కరించిన పేటిఎం

హైదరాబాద్ : చిన్న దుకాణాల్లోనూ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు పేటీఎం అవకాశం కల్పిస్తూ మరో యాప్ రూపొందించింది. నోట్ల రద్దుతో కొత్త వ్యాపార వ్యూహాలను పేటీఎం అనుసరిస్తోంది. నోట్ల రద్దు తర్వాత రోజుకు పేటీఎం రూ.120 కోట్లు లావాదేవీలు చేస్తోంది.

రేపు సీఎం కేసీఆర్ అధికారిక నివాస భవనం ప్రారంభం

హైదరాబాద్: రేపు తెల్లవారుజామున సీఎం కేసీఆర్ అధికారిక నివాస భవన సముదాయం ప్రారంభం కానుంది. రేపు ఉదయం 5.22 నిమషాలకు కేసీఆర్ గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ దంపతులు, చినజీయర్ స్వామి హాజరు కానున్నారు. ప్రస్తుతమున్న 2 భవనాలు, కొత్తగా నిర్మించిన సీఎం నివాసం, సీఎం కార్యాలయం, సమావేశ మందిరం భవనాల సముదాయానికి 'ప్రగతి భవన్ | గా నామకరణం చేయనున్నారు.

17:10 - November 23, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు పాత 500, వెయ్యి నోట్లు చెల్లకపోవడం.. మరోవైపు 2 వేల నోటుకు చిల్లర లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇదే సమయంలో చిల్లర మాఫియా తమను దోచుకుంటున్నారని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రోగులంటున్నారు. రోగులు, వారి సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను వీడియోలో చూద్దాం...

 

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితో మంత్రి హరీష్ రావు భేటీ

ఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఎంపీలు సమావేశం అయ్యారు. కోల్డ్ స్టోరేజ్ లు, గిడ్డంగులు, ఈ-మార్కెటింగ్ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కోటి35 లక్షల కొత్తనోట్లతో ఉడాయించిన డ్రైవర్

బెంగళూరు : కొత్త నోట్లు తరలిస్తున్న వ్యాన్ తో సహా డ్రైవర్ ఉడాయించాడు. రూ. కోటి 35 లక్షల నగదును ఏటీఎంలో పెట్టేందుకు వెళ్తుండగా డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

16:42 - November 23, 2016

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పూంచ్ సెక్టార్ లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుపెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఐదు పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఎదురు కాల్పుల్లో ఏడుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి. ఇటీవలే ముగ్గురు భారత జవాన్లను పాకిస్తాన్ సైన్యం దారుణంగా చంపింది. పెట్రోలింగ్ చేస్తున్న భారత సైనికులు మనోజ్ కుమార్, మన్ దీప్ సింగ్ తో పాటు మరో సైనికులుపై వెనుక నుంచి పాక్ సైన్యం దాడి చేసి హత మార్చింది. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ ప్రకటించింది. ఈమేరకు భారత సైన్యం పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు సైనికులను ఇవాళ హత మార్చింది. మరిన్ని వివరాలను వీడియోలో  చూద్దాం...

 

శాసనసభ స్థానాల సంఖ్య పెంచడం సాధ్యం కాదు : హన్సరాజ్

ఢిల్లీ : ప్రకారం ఆర్టికల్ 170ని సవరించే వరకు శాసనసభ స్థానాల సంఖ్య పెంచడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ స్పష్టం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ పై రాజ్యసభలో ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపునకు తెలంగాణ రాష్ట్రం ఏమైనా ప్రతిపానదలు పంపించాదా అని.. దానికి కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని టీజీ కోరారు. టీజీ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026లో జనాభా గణన అనంతరమే అసెంబ్లీ స్థానాల పునర్విభజన సాధ్యమని వెల్లడించింది.

అమరావతి నిర్మాణం పై చంద్రబాబు సమీక్ష

విజయవాడ : ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణాలపై తన అనుభవాలను వివరించారు. కాకినాడ, నెల్లూరు, తాడిపత్రి, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో తక్షణం గృహ నిర్మాణ పథకం పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నాలుగు నమూనాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. అన్ని మున్సిపాలిటీల్లో రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

దివీస్ నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు...

తూ.గో : తొండంగి మండలంలో దివీస్ నిర్మాణ పనులు ప్రాంభించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. నిర్మాణ స్థలంలో చెట్లను తొలగించేందకు యాజమాన్యం రంగంలోకి దిగడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో యాజమాన్యం వెనుదిరిగింది.

16:17 - November 23, 2016
16:16 - November 23, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో 15 రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు క్యూలు తగ్గడం లేదు. బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలు కడుతున్నారు. డబ్బులు లేవని బ్యాంక్‌ సిబ్బంది పంపించేస్తున్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు రోజూ రావాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకు నిబంధనలతో... డబ్బులు డ్రా చేసుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతోందని ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

బీసెంట్ నగర్ శ్మశాసన వాటికలో మంగళంపల్లి అంత్యక్రియలు...

చెన్నై : బీసెంట్ నగర్ శ్మశాసన వాటికలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్యక్రియలు జరిగాయి. మురళీ కృష్ణ అంత్యక్రియలను పెద్ద కుమారుడు అభిరామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు.

16:08 - November 23, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుతో నిర్మాణరంగం కుదేలయ్యిందని భావిస్తున్న తరుణంలో...నిర్మాణం రంగ ప్రతినిధులు మాత్రం ఇది కేవలం తాత్కాలికమే అంటున్నారు. పెద్ద పరిశ్రమలపై పెద్దనోట్ల రద్దు వ్యవహారం పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవచ్చని వ్యాపారవేత్తలు అంటున్నారు. ఆర్ధిక వేత్తలు మాత్రం నోట్ల రద్దు  ఆర్థికాభివృద్ధికి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. నోట్ల రద్దు దాని వివిధ రంగాలపై దాని ప్రభావాలు అనే అశంపై ప్రముఖ వ్యాపారవేత్తలు, రియల్టర్ లు, ఆర్థిక వేత్తలు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే... 'నిర్మాణ రంగంపై నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమే. పెద్ద పరిశ్రమలపై ప్రభావం స్వల్పమే. పెద్దనోట్ల రద్దు ఆర్థికాభివృద్ధికి పెద్ద దెబ్బ' అని ఆర్థికవేత్తలు అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

జన్ ధన్ ఖాతాలపై ఆర్థికశాఖ కన్ను

ఢిల్లీ : జన్ ధన్ ఖాతాలపై ఆర్థిక శాఖ కన్ను వేసింది. ఇప్పటికే జన్ ధన్ ఖాతాల్లో రూ. 21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించింది. ముఖ్యంగా బెంగాల్, కర్నాటకరాష్ట్రాల్లో ఎక్కువగా డిపాజిట్లు గుర్తించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇద్దరు పాక్ సైనికులను మట్టుబెట్టిన భారత్

జమ్మూకాశ్మీర్ : పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఫూంచ్ సెక్టార్ లో ఇద్దరు పాక్ సైనికులను భారత్ మట్టుబెట్టింది. అంతే కాకుండా పాక్ కు చెందిన 5 పోస్టులను భారత్ జవాన్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి.

 

15:56 - November 23, 2016

ఢిల్లీ : రాజ్యసభలో ఇవాళ కూడా ఎటువంటి చర్చ జరగలేదు. సభ ప్రారంభం నుంచి విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని... దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలంటూ విపక్షాలన్ని ఏకమయ్యాయి. పలుమార్లు సభ వాయిదా పడ్డ పరిస్తితిలో మార్పు రాకపోవడంతో... డిప్యూటీ ఛైర్మన్ కురియన్.. సభను రేపటికి వాయిదా వేశారు. 

15:53 - November 23, 2016

తూర్పు గోదావరి : రాజమండ్రి ఎంజీ హోల్ సేల్ బట్టల మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓషాపులో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఈ మంటలు మరికొన్ని షాపులకు వ్యాపించండంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదంలో 2 షాపుల్లోని బట్టలు పూర్తిగా దగ్ధమవడంతో 2 కోట్ల 50 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతల ఫైర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు పొంగులేటి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి లు ఫైర్ అయ్యారు. భూసేకరణ చట్టం ఉల్లంఘించొద్దన్న హైకోర్టు వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొత్త క్యాంపు ఆఫీసులోకి వెళ్లే ముందు డబుల్ బెడ్ రూం ఇళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందంలో భాగమే మోదీ, కేసీఆర్ భేటీ అయ్యారని ఆరోపించారు. ప్రధానితో కేసీఆర్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సింది పోయి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దును సమర్థించడం దారుణం అని మండిపడ్డారు.

15:36 - November 23, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు  కేంద్రం ప్రకటించింది. డెబిట్‌  కార్డుల వినియోగంపై డిసెంబర్‌ 31వరకు చార్జీలు రద్దు చేసినట్టు కేంద్రఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ చెప్పారు. ఈ - వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్‌బీఐ పెంచినట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదు కొరత లేకుండా పోస్టాఫీసుల ద్వారా నగదు  సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

 

నోట్ల రద్దుతో రోజుకు రూ.540 కోట్ల నష్టం : సీఎస్ రాజీవ్ శర్మ

హైదరాబాద్ : నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి రోజుకు రూ.540 కోట్ల నష్టం వాటిల్లిందని, సీఎస్ రీజవ్ శర్మ కేంద్ర బృందానికి వివరించారు. పెద్ద నోట్ల రద్దు పై అధ్యయనం చేసేందుకు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. నోట్ల రద్దుతో రాష్ట్రంలో తలెత్తిన వాస్తవ పరిస్థితులను కేంద్ర బృందానికి సీఎస్ రాజీవ్ శర్మ వివరించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రబుత్వానికి రూ.3వేల కోట్ల మేర నష్టం వస్తుందని సీఎస్ వివరించారు. నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి ఏర్పడిన నగదు కొరత తీర్చాలని సీఎస్ కేంద్రబృందాన్ని కోరారు.

15:31 - November 23, 2016

అనంతపురంలో త్రిసభ్య కమిటీ పర్యటన...

అనంతపురం : రోడ్డు విస్తరణ వివాదంపై త్రిసభ్య కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. తిలక్ రోడ్డులో మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ షరీఫ్ పర్యటిస్తూ స్థానికుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

28న జాతీయ నిరసన దినం : ఏచూరి

ఢిల్లీ : నోట్ల రద్దు పై 28వ తేదీన జాతీయ నిరసన దినంగా పాటించాలని నిర్ణయించినట్లు సీపీఎం నేత సీతారాం ఏచూరి తెలిపారు. పార్టీలు విడివిడిగా కదంతొక్కాలి-- కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నిర్ణయం వెనక చాలా కుట్రలున్నాయని ఏచూరి స్పష్టం చేశారు. నోట్ల రద్దు అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

నగరంలోని ఏపీ బస్సుల్లో వైఫై సేవలు

హైదరాబాద్ : రేపటి నుండి నగరంలో ఏపీ బస్సుల్లో వైఫై సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. మొదటి 20 నిమిషాల వరకు వైఫై సేవలు ఉచితమని, అనంతరం 100 ఎంబీకి రూ.25 లు వసూలు చేయనున్నట్లు తెలిపారు. 100 ఎంబీ డేటాను 24 గంటల పాటు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

14:49 - November 23, 2016

హైదరాబాద్ : ఫోర్జరీ, చీటింగ్ కేసులో చందనా బ్రదర్స్ అధినేత రామారావును ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్రకు, రామారావుకు మధ్య భూ వివాదం ఉంది. ఈనేపథ్యంలో ఫణీంద్ర అనే వ్యక్తి పేరుతో బెదిరింపు లేఖ రాసుకొని.. గుంటూరు వెళ్లి పోస్టు చేసి తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఫణీంద్ర నుంచి తనకు బెదిరింపు లేఖ వచ్చిందని ఎస్ ఆర్ నగర్ పీఎస్ లో రామారావు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేసిన పోలీసులు...రామారావు కావాలనే వేరే వ్యక్తి పేరుతో లేఖ రాసినట్లు పేర్కొన్నారు. లేఖ పోర్టరీ అని తేలడంతో రామారావును పోలీసులు అరెస్టు చేశారు. ఫణీంద్రను ఇబ్బంది పెట్టాలనే కుట్రతో రామారావు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ఉషాముళ్లపూడి కమాన్ ఎదురుగా పెద్ద గొయ్యి

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని ఉషాముళ్లపూడి కమాన్ ఎదురుగా జాతీయరహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

14:40 - November 23, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభమైంది. నోట్ల రద్దుపై వాడి వేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. రాజ్యసభలో గందరగోళం నెలకొంది.

భారీగా పతనమైన రూపాయి విలువ

ముంబై: రూపాయి విలువ భారీగా పతనమైంది. 9 నెలల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 68.48 కి పడిపోయింది.

రాజమండ్రి లోని వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం

తూ.గో: రాజమండ్రి తాడితోటలో ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పక్కన ఉన్న 3 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసి పడటంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో చందనాబ్రదర్స్‌ అధినేత రామారావు అరెస్ట్

హైదరాబాద్ : ఫోర్జరీ, చీటింగ్ కేసులో చందనా బ్రదర్స్ అధినేత రామారావును ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫణీంద్ర అనే వ్యక్తి  పేరుతో బెదిరింపు లేఖ రాసుకొని..రామారావు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేసిన పోలీసులు...రామారావు కావాలనే వేరే వ్యక్తి పేరుతో లేఖ రాసినట్లు పేర్కొన్నారు. 

 

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ

ఢిల్లీ : వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభమైంది. నోట్ల రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభలో గందరగోళం నెలకొంది. 

 

14:15 - November 23, 2016

టాలీవుడ్ ప్యూచర్ యువరాణి అంటూ కీర్తిసురేష్ ని పొగిడేస్తున్నారు. స్లోగా ఈ చెన్నై బ్యూటీ గాలివీస్తున్నట్లు కనిపిస్తుంది. నానితో నేను లోకల్ మూవీలో నటిస్తున్న ఈ పొన్ను ఇద్దరు బడా స్టార్స్ మూవీలో హీరోయిన్ గా సెట్ అయినట్లు సమాచారం. మరీ కీర్తీసురేష్ దక్కించుకున్న ఆ బడా మూవీస్ ఏంటో మీరే చూడండి.
నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి 
నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తికి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ వచ్చింది.ఈ మూవీ తరువాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చిన ఆచితూచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఓమ్లీ బ్యూటీ నానితో నేను లోకల్ మూవీ చేస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే కేవలం రెండు సినిమాలతోనే కీర్తీ టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నట్లు వినికిడి.
పవన్, మహేష్ సరసన కీర్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో రాబోయే మూవీలో కీర్తిని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే యూనిట్ ఈ బ్యూటీ పేరు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. దీంతో పాటు మహేష్ బాబు న్యూ మూవీలో కూడా కీర్తీనే హీరోయిన్ ఫైనల్ చేసినట్లు సమాచారం. శ్రీమంతుడు తరువాత మహేష్ తో కొరటాల శివ కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఒపెనింగ్ జరుపుకున్న మూవీలో ప్రిన్స్ పక్కన హీరోయిన్ కోసం వెతుక్కతున్నారు. లక్కీ గా ఈ ఛాన్స్ కీర్తి సురేష్ ని వరించినట్లు వినిపిస్తుంది. శ్రీమంతుడు మూవీలో మహేష్, శృతి హాసన్ పెయిర్ సూపర్ గా సెట్ అయినట్లే, మహేష్ కీర్తిల జోడి ఆడియన్స్ ని పుల్ ఎంటర్ టైన్ చేస్తుందని కొరటాల భావిస్తున్నాడు. అందుకే కీర్తి సురేష్ అయితే ప్రిన్స్ కి సరైన జోడి అని ఫిక్సైపోయాడట. చూస్తుంటే కీర్తీ టాలీవుడ్ లో చక్రం తిప్పే రోజులు వచ్చేసినట్లే కనిపిస్తుంది.

13:56 - November 23, 2016

అమీర్ ఖాన్ టాలీవుడ్ పై దాడి చేయాలని డిసైడయ్యాడు. షారూఖ్ ఖాన్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ బాటలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కూడా తెలుగుపై ఓ రాయి వేసి చూద్దామనే ఆలోచనకు వచ్చేశాడట. మరి అమీర్ ఖాన్ టాలీవుడ్ పై దాడి చేయడం ఏంటో చూద్దాం...
తెలుగు మార్కెట్ పై కన్నేస్తున్న బాలీవుడ్ స్టార్స్
అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఇలా బాలీవుడ్ స్టార్స్ కొంతకాలంగా తెలుగు మార్కెట్ పై కన్నేస్తున్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో తో సల్లూభాయ్,రుస్తుంతో అక్షయ్ కుమార్ టాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు . ఇప్పుడు దంగల్ మూవీతో అమీర్ ఖాన్ కూడా తెలుగు కలెక్షన్లపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ ఫర్ పెక్ట్ టాలీవుడ్ బాక్సఫీస్ పై యుద్దానికి రెడీ అయ్యాడు. 
డిసెంబర్ 23న దంగల్ రిలీజ్ 
అమీర్ ఖాన్ అప్ కమింగ్ మూవీ దంగల్ డిసెంబర్ 23న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో యుద్దం టైటిల్ తో డబ్ చేయనున్నారు.అమీర్ స్వయంగా నిర్మించిన దంగల్ ని ఏక కాలంలో హిందీతో పాటు తెలుగులో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. ఈ చిత్రం ఇండియన్ రెజ్లర్ ఫోగట్ రియల్ లైఫ్ స్టోరీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ధూమ్ 3 తెలుగులో రిలీజ్ 
ఇంతకు ముందు అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసిన ధూమ్ 3ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ చిత్రం తెలుగులో మంచి రిజల్ట్ రాబట్టింది. దీంతో దంగల్ మూవీపై ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగులో యుద్ధం పేరు తో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మరీ యుద్దం తెలుగు బాక్సఫీసు మీద ఎలాంటి యుద్ధం చేస్తుందో చూడాలి.

 

13:37 - November 23, 2016

సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 'వినియోగదారుల రక్షణ' చట్టంను 1986లో రూపొందించబడిందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. 'వినియోగదారుల హక్కుల' గురించి ఆమె మాట్లాడారు. ప్రతి పౌరుడు వినియోగదారుడేనని, కష్టాలు..నష్టాల గురించి..రక్షణ కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు. అనునిత్యం అనేక రకాల కొనుగోళ్లు చేస్తుంటామని, ఏదైనా అపాయం కలిగించే వస్తువు ఉంటే దీనిని నుండి రక్షించుకోవచ్చన్నారు. తెలుసుకోవాల్సిన హక్కు వినియోగదారుడికి ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:34 - November 23, 2016

సంగారెడ్డి : ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఏకైక సీఎం కేసీఆర్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సీపీఎం మహాజన పాదయాత్ర 39వ రోజుకు చేరుకుంది. సంగారెడ్డిలో ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా సితార థియేటర్ ప్రాంతంలో కబ్ఙాకు గురైన దళితుల ఇళ్ల స్థలాలను పాదయాత్ర బృందం పరిశీరించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీపీఎంకు మద్దతు తెలిపారు. 

13:33 - November 23, 2016
13:29 - November 23, 2016
13:25 - November 23, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో సామాన్యులు ప్రతిరోజూ నరకం చూస్తున్నారని.. ఎంపీ కేవీపీ అన్నారు.. సాక్షాత్తూ కేంద్రమంత్రి సోదరుడు చనిపోతే ఆస్పత్రిలో పాతనోట్లు తీసుకోలేదని గుర్తుచేశారు.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధాని మోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు..

13:24 - November 23, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నోట్లు రద్దయి 15రోజులు గడుస్తున్నా ఇంకా సమస్యలు తీరలేదు. అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకోవాలంటే డీడీ తప్పనిసరిగా మారింది. విజయవాడలో తగ్గిన రిజిస్ట్రేషన్లపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:17 - November 23, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో అన్నారు. పేదలు, దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ చారిత్రక నిర్ణయానికి దేశ వ్యాప్తంగా ప్రజలు మోదికి అండగా నిలిచారని తెలిపారు. ప్రతిపక్షాలు వాయిదా తీర్మాణంపై చర్చకు పట్టుబట్టడం సరైంది కాదన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాకముందు ఈ నెల 8న కేంద్రం నిర్ణయం తీసుకుందని, అనంతరం పార్లమెంట్‌లో చర్చలో ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయని, ఉన్నట్టుండి విపక్షాలు అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నాయో అర్థం కావడం లేదని చర్చను కొనసాగించాలని వెంకయ్యనాయుడు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

13:17 - November 23, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై వరుసగా ఈ రోజు కూడా పార్లమెంట్‌ స్తంభించింది. సభ ప్రారంభం కాగానే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. సభ ప్రారంభం నుంచే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌సభకు ప్రధానమంత్రి నరేంద్రమోది హాజరైనా సభలో ఎలాంటి మార్పు లేదు. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాణంపై చర్చ జరిపేందుకు స్పీకర్‌ నిరాకరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్లకార్డులను తొలగించిన సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తాము చర్చకు సిద్ధమని, చర్చను ప్రారంభించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని విపక్షాలు పట్టించుకోలేదు. విపక్షాల గందరగోళం నడుమ సభను స్పీకర్‌ రేపటికి వాయిదా వేశారు..

జంతర్ మంతర్ వద్ద విపక్షాల ధర్నా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై విపక్షాలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగాయి. ఇదే అంశంపై ఉభయల్లోనూ విపక్షాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్

విజయవాడ: విద్యాశాఖ అధికారులు, వైస్ ఛాన్సలర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

12:58 - November 23, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దు అయి 15 రోజులు గడుస్తున్నాయి. సామాన్యులకు అష్టకష్టాలు పడుతున్నారు. చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నారు. కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పనులు వదిలేసి ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. రెండు వేల రూపాయల నోటుతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

హబ్సిగూడలో...
రెండు వారాలు గడుస్తున్నా చిల్లర కష్టాలు ఇంకా తీరలేదు. హబ్సిగూడలోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట ప్రజలు క్యూలు కడుతున్నారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతోందన్నారు. ఎన్నో నిబంధనలు పెడుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు పేర్కొన్నారు.
మెదక్..
మెదక్ సంగారెడ్డిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బ్యాంకుల ఎదుట క్యూలు కడుతున్నారు. తెల్లవారుజామునుండే బ్యాంకుల ఎదుట పడిగాపులు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

త్వరలో వెలగపూడి సచివాలయంలో సీఎం కార్యకలాపాలు

అమరావతి : వచ్చే సోమవారం నుంచి వెలగపూడి సచివాలయంలో సీఎం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. భవానీ ద్వీప పర్యాటక సంస్థ (బీఐటీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భవానీ ద్వీప పర్యాటక సంస్థ పరిధిలోకి విజయవాడ రానుంది. అమరావతి పరిసరాల్లోని కృష్ణా నదిలో ద్వీపాలు ఏర్పాటు చేయనున్న పేర్కొంది.

12:50 - November 23, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు లోక్ సభను కుదిపేస్తోంది. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాలు ధర్నా నిర్వహించాయి. పెద్దనోట్ల రద్దు విషయం వెనక్కి తీసుకోవాలని నేతలు పెద్ద ఎత్తున నినదించారు. కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, సమాజ్ వాది పార్టీల నేతలు హాజరయ్యారు. నోట్ల రద్దుపై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 

మాజీ సీఎం జగన్నాథ మిశ్రాపై సుప్రీం కన్నెర

న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాన కుంభకోణం కేసులో తరచూ గైర్హాజర్ కావడాన్ని తప్పుపట్టింది. ప్రతీసారి ఏదో సాకు చెబుతూ కోర్టుకు రావడంలేదని మండిపడింది. కాగా, దాన కుంభ కోణం కేసులో మిశ్రా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

12:39 - November 23, 2016

టాలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు హీరోల చిత్రాలపై చర్చ జరుగుతోంది. మెగాస్టార్ 'చిరంజీవి' 150వ చిత్రం కాగా..'బాలకృష్ణ' వందో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాలను ఇరువురు హీరోలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 'చిరంజీవి' నటిస్తున్న చిత్రానికి 'ఖైదీ నెంబర్ 150' పేరు పెట్టారు. జనవరిలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రైతు సమస్యను ప్రధానంగా చేసుకొని వినాయక్ స్క్రిప్టు సిద్ధం చేసినట్లు, పంటలు పండక కునారిల్లుతున్న రైతాంగ పరిస్థితిని హైలైట్ చేస్తూ సినిమా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. కథ అంతా రైతుల చుట్టూ తిరగడం..ఈ చిత్రంలో ఖైదీ పాత్రను చిరు పోషిస్తుండడంతో టాలీవుడ్ లో హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే చిత్ర ఆడియో వేడుకను అంగరంగవైభవంగా జరపాలని చిత్ర నిర్మాణ రామ్ చరణ్ తో పాటు మెగా హీరోలు భావిస్తున్నట్లు టాక్. డిసెంబర్ 18వ తేదీన చిత్ర ఆడియోను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు 'పవన్ కళ్యాణ్' హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా టాలీవుడ్ ప్రముఖులను సైతం పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. రెండు సార్లు 'ఖైదీ' టైటిల్ తో హిట్స్ కొట్టిన మెగాస్టార్ ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటారనేది ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఈ 'ఖైదీ నెంబర్ 150' 'చిరంజీవి' రీ ఏంట్రీ గ్రాండ్ సక్సెస్ ఇచ్చి వెల్ కమ్ చెప్పుతోందో చూడాలి.

లోక్ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం ఉభయసభలను కుదిపేస్తోంది. నోట్ల రద్దు అంశం ప్రధాని సమాధానం ఇవ్వాలని పట్టుబడుతూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఒక సారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం అయినా ఇదే పరిస్థితి కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

12:28 - November 23, 2016

నేచురల్ స్టార్ గా పేరొందిన 'నాని' స్పీడు మీదున్నాడు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఆయన నటించిన చిత్రాలు విజయవంతం అవుతుండడంతో 'నాని' ఆచూతూచి అడుగేస్తున్నాడు. ఈ ఏడాది 10నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు రిలీజ్ చేయడం విశేషమంటే, ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడం మరో విశేషం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నేను లోకల్ సినిమాను ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవున్నాడు. ఇంతలోనే మరో రెండు సినిమాలను లైన్ పెట్టినట్లు సమాచారం. ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలుపెడితే, భలేభలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్మన్, మజ్నులతో కంటిన్యూగా ఐదు హిట్స్ కొట్టాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'నేను లోకల్' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. డెబ్యూ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని, డివివి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించనున్నాడు. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినాయక్, కొరటాల శివ హాజరయ్యారు. ఈ చిత్రంలో 'నాని' ఎలా కనిపించనున్నాడో..కథ..ఇతరత్రా వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. 

విపక్షాలవి చౌకబారు రాజకీయాలు :వెంకయ్యనాయుడు

ఢిల్లీ : పార్లమెంట్ కు ప్రధాని హాజరైనా చర్చించడానికి విపక్షాలకు ఉన్న అభ్యంతరం ఏంటి అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. సామాన్యులకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నామని, విపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని వెంకయ్య మండిపడ్డారు. ప్రజలు మా పక్షాన ఉన్నారనడానికి బైపోల్ ఫలితాలే నిదర్శనమని వెంకయ్య స్పష్టం చేశారు.

లోక్ సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై లోక్ సభలో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ అంశంపై సభలో ప్రధాని ప్రకటనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

టిడిపి నేతల అరెస్ట్

హైదరాబాద్ : వైన్ షాపుల ముందు మద్య సేవించడాన్ని ఎత్తివేయాలని, బెల్టు షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట టిడిపి ధర్నా చేపట్టింది. ధర్నాలో పాల్గొన్న రావుల చంద్రశేఖర్, పెద్దిరెడ్డిని అరెస్టు చేసి గోషామహల్ పీఎస్ తరలించారు.

12:15 - November 23, 2016

బ్యాంకర్లతో సీఎస్ రాజీవ్ శర్మ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ బ్యాంకర్లతో సమావేశం అయ్యారు. పెద్ద నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ఈ భేటీ లో చర్చిస్తున్నట్లు సమాచారం.

కేంద్రమంత్రి సదానందగౌడకు తప్పని నోట్ల కష్టాలు

బెంగళూరు : కేంద్ర మంత్రి సదానందగౌడకు నోట్ల కష్టాలు తప్పలేదు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందానంద గౌడ సోదరుడు భాస్కర్ గౌడ మృతి చెందాడు. బిల్లు చెల్లింపుకు పాత నోట్లు ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. పాత నోట్లు స్వీకరించమని కొత్తనోట్లు ఇస్తేనే మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ నెల 24 వరకు పాత నోట్లు స్వీకరించాలన్న నిబంధనను గుర్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చెక్కు రూపంలో రూ.60 వేల బిల్లు చెల్లించారు.

12:12 - November 23, 2016

టాలీవుడ్ నటి రకూల్ ప్రీత్ సింగ్ కు ఐటీ నోటీసులు అందచేసింది. ఇటీవలే 'గాలి జనార్దన్ రెడ్డి' కూతురు వివాహంలో 'రకూల్' చిందులేసిన సంగతి తెలిసిందే. ఈ భామతో పాటు మిల్క్ బ్యూటీ 'తమన్నా' కూడా ఆడారు. బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి పెళ్లి అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దక్షిణాదికి చెందిన రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. సుమారు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు వార్తలు వెల్లువడ్డాయి. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దులో కూడా ఈ వివాహం జరగడంతో పలు విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వివాహంపై ఐటీ శాఖ కన్నేసింది. డబ్బు తీసుకున్న వారి గురించి ఆరా తీస్తోంది. అందులో భాగంగానే రకూల్ కు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను రకూల్ ఖండిస్తోంది. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంటోంది. ఇందులో నుండి 'రకూల్' ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. 

కొనసాగుతున్న లోకసభ

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పట్టుబట్టడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభ కొనసాగుతోంది.

రాజ్యసభ మళ్లీ వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం ఉభయ సభలను కుదిపేస్తోంది. నోట్ల రద్దు అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభంమైన సభలో అదే తీరు కొనసాగడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట టిడిపి ధర్నా

హైదరాబాద్ : నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట టిడిపి ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్, తదితర నేతలు పాల్గొన్నారు. వీరు రోడ్డు పై బైఠాయించిన నిరసన తెలుపుతున్నారు.

రైల్వే కోర్టులో మంత్రులకు ఊరట

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రుల నాయిని నర్శింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు, కిషన్ రెడ్డిలకు ఊరట లభించింది. సికింద్రాబాద్ రైల్వే కోర్టు కేసు ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీలో మొబైల్ కరెన్సీ వినియోగం పెరగాలి: చంద్రబాబు

విజయవాడ: డిసెంబర్ కల్లా ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్ కరెన్సీ వినియోగం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం కలెక్టర్లు, వీసీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ బ్యాంకింగ్‌లో విద్యార్ధులకు వర్క్ షాప్‌లు నిర్వహించాలని, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్‌లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత తక్షణ ఉపశమనం మొబైల్ కరెన్సీ, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ అనే తెలిపారు. వీటిపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్ధులపై ఉందని అన్నారు. 

ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్

ఢిల్లీ : నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని మోదీ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు పై ఆర్థిక మంత్రికి తెలియదు కానీ ప్రధాని తన స్నేహితులకు ముందే చెప్పారు అని ఆరోపించారు. నోట్ల రద్దు వ్యవహారం పెద్ద కుంభకోణం అని అభివర్ణించారు.

11:28 - November 23, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. పెద్దనోట్ల రద్దు అంశంపై ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు లోక్ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. పెద్దనోట్లు రద్దు అంశంపై ప్రధాని మాట్లాడాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

రాజ్యసభలో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పిలవాలని, దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమాధానం చెప్పాలని మాయావతి డిమాండ్ చేశారు. తాము లేవనెత్తే అంశాలను మోడీ వినాలని, పెద్దనోట్లు రద్దుపై సభలో కాకుండా బయట మాట్లాడడం సరికాదన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ కు సమాధానం చెప్పాల్సినవసరం ప్రధానికి ఉందని సీపీఎం సభ్యుడు ఏచూరి పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దయి 15 రోజులు అవుతున్నా ఇంకా సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. చర్చ తొలుత ప్రారంభించాలని డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. దీనితో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశాయి. దీనితో డిప్యూటి చైర్మన్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.  

రాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

ఢిల్లీ : రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ప్రధాని సభకు రావాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రజాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం నేత సీతారం ఏచూరి డిమాండ్ చేశారు.

నోట్ల రద్దుపై కేంద్రం పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

11:10 - November 23, 2016

ఢిల్లీ : బ్యాంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. విత్తనాల కొనుగోళ్లకు పాతనోట్లు చెల్లుతాయని ప్రకటించారు. రబీ, ఖరీఫ్ సీజన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, క్రాప్ లోన్లకు సరిపడా డీసీసీబీలకు నగదు అందించడం జరుగుతుందన్నారు. సహకార బ్యాంకులకు నా బార్డు రూ. 21వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డెబిట్ కార్డు వినియోగంపై రుసుము పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాలెట్లలో నగదు పరిమితిని ఆర్ బీఐ పెంచిందని, రైల్వే శాఖ ఆన్ లైన్ లో రైలు టికెట్ బుకింగ్ కు సేవా రుసుము రద్దు చేసిందన్నారు. ఆన్ లైన్ లో రైలు టికెట్ బుకింగ్ కు డిసెంబర్ 31 వరకు సేవా రుసుము రద్దు కొనసాగుతుందన్నారు. 1.5 లక్షల పోస్టాఫీసుల్లో కొత్తనోట్లు అందుబాటులో పెట్టనున్నట్లు, డిజిటల్ ట్రాన్స్ క్షన్స్ పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

బ్యాంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయి: శక్తికాంత్ దాస్

ఢిల్లీ : బ్యాంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని శక్తికాంత్ దాస్ ప్రకటించారు. విత్తనా లకొనుగోళ్లకు పాతనోట్లు చెల్తుతాయని, రబీ, ఖరీఫ్ సీజన్ కు ఎలాంటి ఇవ్వంది లేదని స్పష్టం చేశారు. క్రాప్ లోన్లకు సరిపడ డీసీసీబీలకు నగదు అందిస్తామని,1.55 లక్షల పోస్టాఫీసుల్లో కొత్త నోట్లు అందుబాటులోకి వస్తాయిని, డెబిట్ కార్డు వినియోగంపూ రుసుము పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

10:45 - November 23, 2016

ఎదురు కాల్పుల్లో 6గురు మావోల మృతి

జార్ఖండ్ : లతేహార్ జిల్లాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు - కోబ్రా బెటాలియన్ మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందినట్లు సమాచారం.

కోర్టుకు హాజరైన దత్తాత్రేయ, నాయిని, కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయిని, కేటీఆర్ హాజరయ్యారు.

10:42 - November 23, 2016

తూర్పుగోదావరి : పెద్దనోట్ల రద్దు విషయం మంచిదేనైనా సామాన్యుడు మాత్రం ఇబ్బందులు పడుతున్నాడని వైసీపీ నేత జగన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం వెలువడిందని, పెద్దనోట్ల రద్దుతో ప్రజలెవరూ సంతోషంగా లేరని తెలిపారు. రాష్ట్ర ప్రజల కష్టాలను కేంద్రానికి తెలియచేయాల్సిన బాధ్యత ఏపీ సర్కార్ పై ఉందన్నారు. నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబు నాయుడికి ముందే తెలుసని జగన్ ఆరోపించారు. 

భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఢిల్లీ : భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్థాన్ పై భారత్ ఎదురుదాడి ప్రారంభించింది. ఫూంచ్, రాజౌరి, కెల్ లో పాక్ పోస్టులపై భారత్ సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది.

10:35 - November 23, 2016

ధర్నా చేపట్టిన కేయూ మెస్ సిబ్బంది

వరంగల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కేయూ ఫస్ట్ గేట్ వద్ద మెస్ సిబ్బంది ధర్నాకు దిగింది. దీంతో కేసులో 3వేల మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.

నోట్ల రద్దు పై ప్రతిపక్షాలు ఆందోళన

ఢిల్లీ : నోట్ల రద్దు పై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాప్రారంభించాయి.

జగన్ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ : మంత్రి ప్రత్తిపాటి

విజయవాడ : నోట్ల రద్దు అంశంలో జగన్ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అభివృధ్ధిని అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దివీస్ యాజమాన్యాన్ని జగన్ డబ్బులు డిమాండ్ చేశారని, ఆ డబ్బులు ఇవ్వనందుకే దివీస్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దివీస్ కి వైఎస్ హయాంలోనే భూములు కేటాయించారని... దివీస్ ద్వారా 3 వేల మందికి ఉపాధి వస్తుందని తెలిపారు.

నోట్ల రద్దు వ్యవహారం బాబుకు ముందే తెలుసు: జగన్

తూ.గో : నోట్ల రద్దు వ్యవహారం చంద్రబాబుకు ముందే తెలుసునని... అందుకే 450 శాతం లాభాలతో హెరిటేజ్ ను అమ్ముకున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.

మొహాలీ టెస్ట్ కు భారత్ జట్టులో స్వల్ప మార్పు

హైదరాబాద్ : ఈనెల 26 నుంచి మొహాలీలో భారత్ ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నారు. వృద్ధిమాన్ సాహా స్థానంలో పార్దివ్ పటేల్ కు చోటు దక్కింది.

10:08 - November 23, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుపై విపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా చేపట్టాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు జంతర్ మంత్ వద్ద వద్ద టీఎంసీ ధర్నా చేపట్టనుంది. ఆ పార్టీ నేత మమత బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని సభలో ఉండాలని, ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలనై చర్చ చేపట్టాని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా మృతి చెందిన 70 మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీనితో వరుసగా నాలుగో రోజు ఉభయసభల్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఐదో రోజు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందని తెలుస్తోంది. కావేరీ అంశంపై సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సైతం నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్దల సభలోనూ నోట్ల రద్దు అంశం తుపాన్ సృష్టించింది. సభ పూర్తిగా వాయిదాలకే పరిమితమైంది. 

పెద్ద నోట్ల సమస్య రైతాంగాన్ని కుంగదీస్తోంది:తమ్మినేని

సంగారెడ్డి : పెద్ద నోట్ల సమస్య రైతాంగాన్ని కుంగదీస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న పాద యాత్ర39 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ప్రభుత్వానికి 26 లేఖలు రాసినట్లు తమ్మినేని తెలిపారు. ఏ ఒక్క దానికి ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం గతం కంటే వెనుకబడే పరిస్థితి కనిపిస్తుందని, అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

8వ బెటాలియన్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ : కొండాపూర్ 8వ బెటాలియన్ లో విజయ్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే విజయ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడు ప్రకాశం జిల్లా వాసి.

ఫూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్:మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ దుశ్చర్యలను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు.

09:36 - November 23, 2016

విజయవాడ : అమరావతిలో విద్యుత్ సరఫరా గ్రిడ్ నిర్మాణాన్ని ప్రైవేట్‌ రంగానికి అప్పగించేందుకు ట్రాన్స్ కో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులను పిలిపించి ప్రీ బిడ్డింగ్‌ కూడా నిర్వహించింది. దీనిపై ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్లరూపాయల విలువైన పనుల్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఏపీ నూతన రాజధాని అమ‌రావ‌తికి మెరుగైన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలన్న లక్ష్యంతో అమరావతి చుట్టూతా ప్రత్యేక విద్యుత్ వలయాన్ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో ఎలాంటి విద్యుత్‌ అంతరాయాలు కలగకుండా అత్యాధునిక టెక్నాలజీతో గ్రిడ్‌ను నిర్మించేందుకు ఏపీ ట్రాన్స్‌కో ప్రణాళికలు సిద్ధం చేసింది.

గ్రిడ్‌ నిర్మాణానికి రూ.1500కోట్లు..
విద్యుత్‌ గ్రిడ్‌ నిర్మాణం కోసం రాజధానికి నలుమూలలా ఉన్న చిలకలూరిపేట, గుడివాడ, ఏలూరు, ఐనవోలు ప్రాంతాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లను నిర్మించనున్నారు. 440 కేవీతోపాటు 220, 132 కేవి సబ్ స్టేషన్లను నిర్మించడానికి ట్రాన్స్‌కో అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు ట్రాన్స్ మిషన్ లైన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 1500 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. దీని కోసం ట్రాన్స్‌కో అధికారులు ప్రీ బిడ్డింగ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రిలయన్స్, అదాని, ఎల్ అండ్ టీ, కల్పతరు, టెక్నో సంస్థల ప్రతినిధులు హాజరై.. అధికారులతో చర్చలు జరిపారు.

వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రైవేట్‌ పరం చేస్తున్నారు..!
అయితే.. రాజధాని ప్రాంతానికి ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు నిర్ణయం మంచిదే అయినా.. దాని నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ఏపీ ట్రాన్స్ కో నిర్ణయాన్ని విద్యుత్‌ ఇంజనీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ ట్రాన్స్ కోను కాదని..వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును 25 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారని విద్యుత్‌ ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపి ట్రాన్స్ కో వైఖరి వల్ల..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాద ఉందంటున్నారు. ట్రాన్స్‌కో యాజమాన్య నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

09:32 - November 23, 2016

మెదక్ : పల్లెలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 37వ రోజు పూర్తి చేసుకుంది. అనేక చోట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ్మినేని బృందానికి తమ సమస్యలు వెల్లబోసుకుంటున్నారు. ప్రజా బతుకులు బాగు పడాలన్న లక్ష్యంతో సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 37వ రోజు పాదయాత్ర సంగుపేట, చౌటకూరు, సరపుపల్లి, సుల్తానాపూర్‌, సింగూరు చౌరస్తా, న్యూ వన్నాపూర్‌, సొంపేట, పసల్‌వాది, సంగారెడ్డిలో కొనసాగింది. 37వ రోజు వరకు పాదయాత్ర.. 950 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతులు, నిరుద్యోగులు , కులవృత్తులవారు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పాదయాత్రలో పాల్గొన్న ఎంబీసీ నేత ఆశయ్య అన్నారు. కేసీఆర్‌ పాలనలో గిట్టుబాటు ధర లేక వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, కులవృత్తులవారికి ఎలాంటి మేలు జరగడం లేదని ఆశయ్య అన్నారు. దళిత గూడాలు, మైనారిటీ ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని ఆశయ్య అన్నారు. సహకార సొసైటీలకు రుణాలిచ్చి కులవృత్తులను ఆదుకోవాలని ఎంబీసీ నేత ఆశయ్య డిమాండ్‌ చేశారు.     

కారులో తరలిస్తున్న రూ. 26లక్షల స్వాధీనం..

నెల్లూరు : బోధనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ. 26 లక్షలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. నెల్లూరు నుండి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

 

09:10 - November 23, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు అయిపోయి 14వ రోజులు దాటిపోయింది. 15వ రోజు కూడా అవే పరిస్థితులు నెలకొంటున్నాయి. చిల్లర కోసం ఒకరు..డబ్బుల కోసం మరొకరు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా రూ. 2000 నోటును ప్రవేశ పెట్టారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యల వల్ల సామాన్యుడు కుదేలయిపోయాడు. డబ్బుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ బ్యాంకు..ఏ ఏటీఎం చూసినా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. డబ్బుల కోసం తెల్లవారుజాము నుండే క్యూలు కడుతున్నారు. రామ్ నగర్ లో ఎలాంటి పరిస్థితి నెలకొందో వీడియో క్లిక్ చేయండి. 

08:20 - November 23, 2016

ప్రకాశం : చీరాల నారాయణ కాలేజీలో ప్రిన్స్ పాల్స్ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. కాలేజీకి ఆలస్యంగా వచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో విద్యార్థిని ప్రిన్స్ పాల్స్ చితకబాదారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమన్ అనే విద్యార్థి చీరాలలో ఉన్న నారాయణ కాలేజీలో చదువుతున్నాడు. కాలేజికి లేట్ గా వచ్చాడని ప్రిన్స్ పాల్స్ విజయ్ కుమార్, మహేష్ లు సుమన్ ను చితకబాదారు. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు సుమన్ తెలియచేశాడు. దీనితో వారు వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

08:19 - November 23, 2016

నాడు రాజకీయ విజ్ఞానం నేర్పిన గడి..నేడు దుర్మార్గులకు పెట్టని కోట..


ఒకప్పుడు ఇది చారిత్రక ప్రదేశం..కానీ నేడు అసాంఘీక శక్తులకు నిలయం. దీని పేరు వింటేనే గుర్తు వచ్చేది ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ కనిపించేది పాపాత్ములే. ఓపెన్ ఏయిర్ బార్ గా మందుబాబులు మార్చేశారు. దుర్మార్గాలకు అడ్గా మారిపోయింది. రక్తం చిందించే వారు..వ్యభిచారం నిర్వహించే వారు కూడా ఉన్నారు. ఇక ప్రేమికులు అయితే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఎక్కడ అని అనుకుంటున్నారు. గండిపేటలో...పర్యాట కేంద్రంలో నిఘా లోపంతో అసాంఘీక శక్తులు చెలరేగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:34 - November 23, 2016

పెద్ద నోట్ల రద్దుపై ఇది అంతం కాదు...ఆరంభం మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వెంకటేశ్వర్లు (బీజేపీ), నర్సింహరెడ్డి (సీపీఎం), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చర్చ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..

హైదరాబాద్ : నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది. పెద్దనోట్లు రద్దు ప్రభావం..రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రెండు రోజులు తెలంగాణలో బృందం అధ్యయనం చేయనుంది.

 

07:06 - November 23, 2016

పెద్ద నోట్ల రద్దు చిరు వ్యాపారుల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. వ్యాపారాలు పడిపోవడంతో తోపుడు బండ్ల వ్యాపారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. తగినంత చిల్లర అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై టెన్ టివి జనపథంలో స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ నేత మల్లేష్ అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:04 - November 23, 2016

500, 1000 రూపాయల నోట్ల రద్దు వ్యవహారం చిరు వ్యాపారులను, తోపుడుబండ్ల వ్యాపారులను శాపగ్రస్తులుగా మారుస్తోంది. హైదరాబాద్ లాంటి మహానగరంలోనూ వ్యాపారాలు పడిపోయాయి. ఎప్పుడూ కిటకిటలాడే మార్కెట్లు సైతం వెలవెలబోతున్నాయి. నాయకుడికి పరిపాలనా దక్షత వుండాలి. సాహసోపేత నిర్ణయాలు తీసుకునేవారికి ముందు చూపు కూడా వుండాలి. తాము తీసుకోబోయే నిర్ణయాలు ఎవరెవరి జీవితాల మీద ఎంతెంత ప్రభావం చూపిస్తాయో ఖచ్చితమైన అంచనా వేసుకుని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినవారే సమర్ధులైన నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు విషయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారంటూ తొలుత ప్రశంసించినవారు కూడా ఇప్పుడు ముందు చూపు లేకుండా వ్యవహరించారంటూ వేలెత్తి చూపిస్తున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు అంశాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ దానివల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదన్న అంశం గత పది రోజుల్లో నిరూపితమైంది. తొలి పది రోజుల్లో ప్రజలు దాదాపు అయిదున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంక్ ల్లో డిపాజిట్ చేయగా, కేవలం లక్ష కోట్లు మాత్రమే తిరిగి చలామణిలోకి వచ్చాయి. అంటే మనం అయిదు రూపాయలు ఇస్తే, ప్రభుత్వం ఒక్క రూపాయి మాత్రమే తిరిగి వెనక్కి ఇవ్వగలిగింది. ఈ లెక్కన చూస్తే ప్రజలు తాము డిపాజిట్ చేసిన పాత నోట్లకు సరిసమానమైన కొత్త కరెన్సీని తిరిగి పొందడానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. తాజా అంచనాల ప్రకారం రద్దయిన పాత కరెన్సీకి సరి సమానమైన కొత్త నోట్లను ముద్రించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని చెబుతున్నారు.

నానా ఆగచాట్లు..
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల సామాన్యులు నానా అగచాట్లు పడుతున్నారు. బ్యాంక్ లు తాళాలు తెరవడానికి ముందే జనం వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. అర్ధరాత్రి దాకా ఏటిఎంల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని వయస్సుల వారు బ్యాంక్ క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. కానీ, రాజకీయ నాయకులుగానీ, సినిమా యాక్టర్లుకానీ, సెలబ్రిటీలుకానీ, పారిశ్రామికవేత్తలుకానీ ఎక్కడా క్యై లైన్లలో కనిపించడం లేదు. పాత నోట్లు మార్చుకోవడానికి, డబ్బులు డ్రా చేసుకోవడానికి సామాన్యులు అవస్థలు పడుతుంటే, నల్లకుబేరులు మాత్రం కడుపులో చల్ల కదలకుండా వ్యవహారం చక్కదిద్దుకుంటున్నారు.

దయనీయం..
నోట్ల రద్దుతో చిరు వ్యాపారుల, తోపుడు బండ్ల వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఎప్పుడూ కిటకిటలాడే మార్కెట్లు సైతం వెలవెలబోతున్నారు. రోజుకి నాలుగైదు వేల రూపాయల బిజినెస్ చేస్తే తప్ప, హైదరాబాద్ లాంటి మహానగరంలో చిరు వ్యాపారులు బతకడం కష్టం. హైదరాబాద్ లో తోపుడు బండ్ల వ్యాపారులు ఏ రోజు మాల్ ఆ రోజు కొనుక్కొస్తుంటారు. రాత్రి కల్లా దాన్ని అమ్మేసుకుంటారు. ఒకవేళ ఏ రోజుది ఆ రోజు అమ్ముడుపోకపోతే, వారి కుటుంబ జీవనం దెబ్బతింటుంది. చిరు వ్యాపారాలు చేసేవారు రెండు మూడు రోజుల నష్టాన్ని భరించగలరు కానీ, అంతకు మించి నష్టాలు కొనసాగితే తట్టుకోవడం కష్టం. నోట్ల రద్దు తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు తోపుడుబండ్ల వ్యాపారులు. ఇప్పటికే పది రోజులుగా వ్యాపారాలు పడకేశాయి. ఈ పరిస్థితి ఇంకెంత కాలం వుంటుందో తెలవదు. చిల్లర అందుబాటులో లేకపోవడం వీరికి పెద్ద సమస్యగా మారుతోంది. వీధి వ్యాపారుల బిజినెస్ ను పెద్ద పెద్ద మాల్స్ లాగేసుకుంటున్నాయి. ఇదీ మోడీ ప్రభుత్వం రద్దు చేసిన నోట్ల మహిమ.

06:57 - November 23, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో చత్తీస్ గఢ్‌, మహారాష్ట్ర , తెలంగాణ ఇరిగేషన్ మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్, అసోం, రాజస్థాన్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల కార్యదర్శులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 పెండింగ్ ప్రాజెక్టులలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో దేవాదుల, రాజీవ్ బీమా, ఎస్ఆర్ఎస్ పి రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమరం భీమ్, జగన్నాధ పూర్ పెదవాగు, గొల్లవాగు, వరద కాలువ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక సాగునీటి పారుదల నిధి నుంచి నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితికి లోబడి ఇదివరకే వివిధ ప్రభుత్వ పథకాలకు రుణ సహాయం తీసుకున్నందున ఇప్పుడు 11 ప్రాజెక్టులకు ఎఫ్ఆర్బీఎం పరిమితిలో అప్పు పొందడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

7900 కోట్లు..
సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి చేయడానికి గాను దీర్ఘకాలిక సాగునీటి నిధి కింద కేంద్రం 20 వేల కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్ గా సమకూర్చింది. ప్రాధాన్యతా పరంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర జలవనరుల శాఖ, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ, నాబార్డుల మధ్య గత సెప్టెంబర్ 6న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని జాతీయ జలవనరుల టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు కూడా అయిన మంత్రి హరీశ్ రావు నాబార్డు బృందానికి తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందంలో కుదిరిన వడ్డీ రేట్ల ప్రకారమే కాళేశ్వరం కార్పొరేషన్ కు నిధులివ్వాలని మంత్రి కోరారు. కేంద్ర షెడ్యూల్ ప్రకారం మూడేళ్లలో ఈ 11 ప్రాజెక్టులు పూర్తి చేయవలసి ఉందని.. ఇందుకుగాను 7900 కోట్ల నిధులు అవసరమని నాబార్డు బృందానికి మంత్రి వివరించారు. అయితే ఈ మొత్తం అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం పూచీ ఉంటున్నందున నాబార్డు ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.

06:53 - November 23, 2016

గుంటూరు : కార్పొరేట్‌ విద్యాసంస్థ మరో చిన్నారిని చిదిమేసింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల కాసుల కక్కుర్తితో చిన్నారులు సమిధలుగా మారుతున్నారు. మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నా.. వైద్యం చేయించక పోగా.. కనీసం తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన శ్రీచైతన్య యాజమాన్యం గుంటూరులో ఓ పసివాడి ఉసురు తీసింది. తల్లిదండ్రులకు కడుపుకోతను కలిగించేదాకా శాంతించలేదు శ్రీచైతన్యస్కూలు యాజమాన్య అహంభావం. గుంటూరులోని శ్రీచైతన్య టెక్నోస్కూలు నిర్లక్ష్యానికి 9వ తరగతి చదువుతున్న వంశీకృష్ణ అసువులుబాశాడు. మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్న వంశీకృష్ణకు ఆర్‌ఎంపీ వైద్యునితో ట్రీట్‌మెంట్‌ చేయించడం.. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు శ్రీచైతన్య స్కూల్‌ యాజమాన్యం.

ఏడాదికి రూ. 70 వేలు..
ఒక్కగానొక్క కొడుకు.. గొప్పగా చదవాలని ఖర్చుకు వెనుకాడకుండా.. కార్పొరేట్‌ విద్యాసంస్థలో చేర్పించారు. ఏడాదికి 70వేల రూపాయల ఫీజుతో వంశీకృష్ణను గుంటూరు శ్రీచైతన్య టెక్నోస్కూల్లో చేర్పించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తమకనుపాపను రాక్షసులకు అప్పగిస్తున్నామన్న సంగతి మర్చిపోయామంటున్నారా తల్లిదండ్రులు. బాగా చదువు వస్తుందన్న ఆశతో ప్రభత్వ పాఠశాలకు కాకుండా చాలా మంది తల్లిదండ్రుల లాగానే తమ వాడినీ శ్రీచైతన్యస్కూల్‌కే పంపించారు. చదువంటే.. ప్రశ్నలు జవాబులు బట్టీపట్టడమే గొప్పతనంగా ఫీలయి అమలు చేసే.. విద్యావ్యవస్థ అని తెలుసుకోలేక పోయారు. చదువంటే.. పుస్తకాలతోపాటు.. ఆటలు, పాటలు.. కేరింతలు.. ఇలా అన్నీ ఉండాలి..కాని.. ఇక్కడ మాత్రం అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో చిన్నారులను కుక్కేసి .. ఫీజుల పేరుతో జేబులు నింపుకోవడమనే విధానం.. బహుచక్కగా అమలవుతుంది. క్రమశిక్షణ పేరుతో కనీసం తల్లిదండ్రులను కూడా కలవనీయకుండా.. చదువులు అమ్మేస్తుంటారిక్కడ.

పలు విమర్శలు..
విద్యను వ్యాపారంగా మార్చిన పాలకులకు .. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఏంజరుగుతుందోకూడా తెలుసుకోడానికి తీరకలేకుండా పోయింది. విద్యార్థి మృతితో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా.. ఏ ఒక్క మంత్రిగాని.. అధికారిగాని కనీసం స్పందించిన పాపాన పోలేదని విద్యార్థిసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొడుకు మృతిచెంది తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుంటే.. పోలీసులు మాత్రం.. స్కూల్‌ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా విద్యశాఖ అధికారులు స్పందించి.. తమ కుమారుడి మృతికి కారణం అయిన శ్రీచైతన్య టెక్నోస్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

06:48 - November 23, 2016

మెదక్ : పెద్దనోట్ల రద్దుకుముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిఉంటే ఈ సమస్యలు తప్పేవని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.. చిన్న నోట్లతోపాటు.. కొత్త 500నోట్లను ముందే బ్యాంకులకు తరలిస్తే బావుండేదని అభిప్రాయపడ్డారు.. 70శాతంమంది వ్యవసాయదారులున్న భారత్‌లో ఆన్‌లైన్‌ లావాదేవీలు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు.. మోదీ నిర్ణయంపై విద్యార్థులు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

06:45 - November 23, 2016

కామారెడ్డి : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ఘోరంగా దెబ్బతింది. జిల్లాల పునర్విభజనలో తర్వాత ఈ జిల్లాలో జోరుగా రియల్ వ్యాపారం జోరుగా సాగింది. ప్రధాని మోదీ నిర్ణయంతో ఒక్కసారిగా విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. పెద్ద నోట్ల రద్దు నిర్మాణ రంగంపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నోట్ల పుణ్యమా అని లక్షల రూపాయలతో చేపట్టే రియల్ వ్యాపారం మందగించింది. హౌసింగ్ ప్రాజెక్టుల పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కూలీల బతుకు దుర్భరంగా మారింది. మరోవైపు గతంలో భూములను కొనుగోలు చేసిన వారు సైతం నోట్ల దెబ్బకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందుకు రావటం లేదు.

తీవ్ర నష్టం..
రద్దుతో ప్లాట్ల కొనుగోలుకు ఎవరు ముందుకు రాకపోవడంతో రియల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణలో నిజామాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా పరిధిలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా కుప్పకూలింది. ఆర్మూరు బోధన్‌ మున్సిపాలిటీల పరిధిలో గత సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. కొత్త జిల్లాల ప్రకటన తరువాత అయితే మరింత జోరుగా సాగింది. పెద్ద నోట్ల రద్దు ముందు వరకు నిజామాబాద్ శివారులోని ముబారక్ నగర్ ప్రాంగ్రా అర్సపల్లి గూపన్ పలల్లి దర్మారం డిచ్ పల్లి నాగారం వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఈ గ్రామాల పరిధిలో గజం భూమి రెండు వేల నుంచి నాలుగు వేల వరకు అమ్మకాలు సాగాయని.. రద్దు నిర్ణయం తర్వాత రిజిస్ట్రేషన్లు అమాంతం తగ్గిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కామారెడ్డి జిల్లాలోను నెలకొంది. కొత్తగా జిల్లా ఏర్పడడంతో కామారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ ఒకసారి ఊపందుకుంది. జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లి అడ్లూరు, రామేశ్వర్ పల్లి, క్యాతం పల్లి, పొందుర్తి గ్రామాలలో ఎకరం 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్మకాలు జరగగా ప్రస్తుతం 20 లక్షలకు కూడా అమ్మకాలు జరగడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌లో పెద్ద నోట్ల చలామణి మళ్లీ పుంజుకుంటే తప్ప రియల్ ఎస్టేట్ రంగం కోలుకోదని వ్యాపారులు అంటున్నారు. 

06:39 - November 23, 2016

ఢిల్లీ : కరెన్సీ నోట్ల కొరతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఆర్బీఐ మరో వెసులుబాటు కల్పించింది. బిగ్‌ బజార్లలో డబ్బులు విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది. గురువారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. డెబిట్‌ కార్డులతో రెండు వేల రూపాయలు తీసుకోవచ్చు. పెళ్లిల్ల కోసం బ్యాంకులు నుంచి రెండున్నర లక్షల రూపాయలు తీసుకునే వారికి షరతులు విధించింది. ఈ నెల 8వ తేదీకి ముందు ఖాతాల్లో ఉన్న సొమ్మును మాత్రమే ఉపసంహరించుకోవాలి. ఆ తరువాత ఖాతాల్లో జమ చేసిన డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలులేదు. వధూవరులు, వీరి తల్లిదండ్రుల ఖాతాల నుంచి మాత్రమే డబ్బులు తీసుకోవాలి. శుభలేఖతోపాటు పెళ్లి ఖర్చుల వివరాల ఆధారాలను బ్యాంకు అధికారులకు ఇవ్వాల్సి ఉంది. 

06:37 - November 23, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై ఇది అంతం కాదు...ఆరంభం మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. బిజెపి పార్లమెంటరీ సమావేశంలో మోది భావోద్వేగానికి లోనయ్యారు. పెద్ద నోట్ల రద్దుపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయానికి మద్దతు పలుకుతూ బిజెపి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

లక్షల కోట్లు జమ..
పెద్దనోట్ల రద్దు అంశంపై బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి, నల్లధనంపై పోరాటంలో ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనన్నారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, పెద్దనోట్ల రద్దుపై దుష్ప్రచారం చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోది విమర్శించారు. పెద్దనోట్ల రద్దుకు గల కారణాలను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదేనని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దును విపక్షాలు తప్ప దేశ ప్రజలందరూ స్వాగతించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్థికమంత్రి కూడా తెలియకుండా చేశారని కొందరంటున్నారని... అలాంటప్పుడు తమ పార్టీ నేతలకు ఎలా తెలుస్తుందని విపక్షాలను ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకుల్లో లక్షల కోట్లు జమ అవుతున్నాయని, దీంతో సామాన్య ప్రజలకు లాభం చేకూరనుందని జైట్లీ చెప్పారు.

తప్పుదోవ పటిస్తున్న విపక్షాలు...
5 వందలు, వెయ్యి నోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోది చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, దీని వల్ల పేదలు, రైతులు, సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు నల్లధనానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడతాయా...లేక నల్ల కుబేరులకు అండగా నిలబడతాయా అన్నది తేల్చుకోవాలని వెంకయ్యనాయుడు సవాల్‌ విసిరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై www.narendramodi.in ఓ యాప్‌ రూపొందించారు. దీనిపై తమ నిర్ణయాన్ని తెలపాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో విపక్షాల దాడిని తిప్పికొట్టడానికి ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలని మోది భావిస్తున్నారు. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఎన్‌బిటి-సి వోటర్‌ నిర్వహించిన సర్వేలో ప్రధానికి మోదికి మద్దతు లభించింది. అయితే ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని చాలామంది తప్పు పట్టారు.

నేడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్యక్రియలు..

చెన్నై : నేడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. బీసెంట్ నగర్ లో తుది వీడ్కోలు జరగనుంది. 

రేపు కొత్త నివాసంలోకి వెళ్లనున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొత్త నివాసంలోకి వెళ్లనున్నారు. తెల్లవారుజామున 5గంటలకు నూతన గృహ ప్రవేశం చేయనున్నారు. 9 ఎకరాల్లో క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మాణం చేశారు. 

నేడు ఢిల్లీలో మంత్రి హరీష్ పర్యటన..

హైదరాబాద్ : నేడు మంత్రి హరీష్ రావు ఢిల్లీలో పర్యటించనున్నారు. పీఎంకేఎస్ వై సమావేశంలో పాల్గొననున్నారు. ఎఫ్ఆర్బీఎంతో సంబంధం లేకుండా రుణం ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. 

Don't Miss