Activities calendar

24 November 2016

21:59 - November 24, 2016
21:58 - November 24, 2016

మెదక్ : సామాజిక న్యాయం- తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని చేరుకోనుంది. శుక్రవారం ఉదయం మెదక్‌ జిల్లా కౌలపల్లిలో రికార్డు నమోదు కానుంది. వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్న నేపథ్యంలో.. మంబోజిపల్లిలో బహిరంగ నిర్వహించనున్నట్లు సీపీఎం కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు తెలిపారు. ఈ సభకు ప్రజాగాయకుడు గద్దర్‌తో పాటు.. పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 

 

21:56 - November 24, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన ఆక్రోశ్‌ దివస్‌కు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున సమాయత్తమవుతున్నాయి. ఈ  ఆందోళనలో  ప్రజలు ఎక్కువగా పాల్గొనే విధంగా మూడు రోజుల పాటు  చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆక్రోశ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. 
ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు 
పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. మోదీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు గళం విప్పుతున్నాయి. ఆందోళన బాట పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న నిర్వహించతలపెట్టిన ఆందోళనకు  అన్ని పార్టీలు, ప్రజలు కలిసి రావాలని సీపీఎం ఏపీ కార్యదర్శి పీ మధు పిలుపు ఇచ్చారు. 
ఈ సర్వేలు బూటకం :రఘువీరా 
పెద్దనోట్ల రద్దుకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వం చెప్పడాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుపట్టారు. ఈ సర్వేలు బూటకమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిసనగా ఈనెల 28న జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గోవాలని కోరారు. 
పేద ప్రజల నడ్డి విరిశారన్న కేవీపీఎస్  
పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల నడ్డి విరిశారని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలు పేదలను కొట్టి పెద్దలకు పెట్టేలా ఉన్నాయని కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి విమర్శించారు. ఆక్రోశ్‌ దివస్‌ రోజు అన్ని లావాదేవీలను స్తంభింపచేయడం ద్వారా పాలకుల వెన్నులో వణుకు పుట్టించాలని విపక్షాలు నిర్ణయించాయి. 

 

21:52 - November 24, 2016

ఢిల్లీ : ప్రధాని సభలో లేకుండా పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో జరిగే చర్చకు అర్థం ఉండదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి వ్యాఖ్యానించారు. చర్చ వినకుండా ప్రధాని ఏ సమాధానం ఇస్తారని ఏచూరి ప్రశ్నించారు. టూ జీ కుంభకోణంపై చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రెండు రోజులు పూర్తిగా సభలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పెద్దనోట్లపై చర్చ సమయంలో ప్రధాని సభలో ఉండాలన్నారు. 

21:49 - November 24, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో వరుసగా ఏడో రోజు కూడా విపక్షాల ఆందోళన కొసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరుకావడంతో రాజ్యసభలో చర్చ ప్రారంభమైనా.. పూర్తి స్థాయిలో కొనసాగలేదు. మధ్యాహ్నం ప్రధాని సభకు రాకపోవడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. విపక్షసభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ రాజ్యసభను శుక్రవారానికి  వాయిదా  వేశారు. పెద్ద నోట్ల అంశంపై లోక్‌సభలో సమాజ్‌వాదీ ఎంపీ అక్షయ్ యాదవ్‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌పైకి కాకిగాలు చించి విసరడం వివాదానికి దారితీసి, సభ వాయిదా పడింది. 
ఏడో రోజు కూడా అదే వరుస 
పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో ఏడో రోజు కూడా అదే వరుస కొనసాగింది. ఇదో పెద్ద కుంభకోణమంటూ, ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్‌ చేస్తూ, సభా కార్యకలాపాలను అడ్డుకొన్నాయి. ప్రధాని మోదీ సభకు హాజరై సమాధానం చెప్పాలని పట్టుపట్టాయి. విపక్ష సభ్యులు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పొడియం దగ్గరకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం జరుగుతున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అక్షయ్‌ యాదవ్‌ కాగితాలు చించి స్పీకర్‌పైకి విసరడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సుమిత్రా మహాజన్‌ సభను  మధ్యాహన్నం 12 గంటలకు వాయిదా వేశారు. 
లోక్‌సభను శుక్రవారానికి వాయిదా
లోకసభ పునఃప్రాంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పురాలేదు. పెద్ద నోట్ల రద్దుపై జేపీసీతోపాటు ప్రధాని సభకు హాజరుకావాలని విపక్షాలు పట్టుపట్టడంతో.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 
జాతీయ ఆదాయంపై తీవ్ర ప్రభావం : మన్మోహన్ సింగ్ 
ఇక రాజ్యసభలో జీరో అవర్‌ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడంతో పెద్దనోట్ల రద్దుపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ తరపున మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చర్చను ప్రారంభించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతోపాటు అన్ని వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిందని విమర్శించారు. 'పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తి... జీడీపీ 2 శాతం తగ్గే ప్రమాదం ఉంది. జీడీపీ రెండు శాతం తగ్గుతుందనడం తక్కువ చేసి చెప్పడం కానీ, ఎక్కువ చేసి చెప్పండం కానీ కాదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఏవిధంగా అమలు చేస్తారో ప్రధాని నిర్మాణాత్మక కార్యాచరణతో ముందుకు రావాలి. ఇదేసమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాన్ని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి'. పెద్దనోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు తీసుకుంటున్నతలా తోక లేని  నిర్ణయాలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని మన్మోహన్‌సింగ్‌ మండిపడ్డారు. 
నగదు ఉపసంహరణపై బ్యాకింగ్‌ వ్యవస్థ రోజుకో నిర్ణయం
నగదు ఉపసంహరణపై బ్యాకింగ్‌ వ్యవస్థ రోజుకో నిర్ణయం తీసుకోవడం, నిబంధనల్లో మార్పులు చేయడం మంచిదికాదు. ఇది ప్రధాని మంత్రి కార్యాలయంతోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుపై దుష్ప్రభావం చూపుతోంది. నిబంధనల మార్పులను ఆర్బీఐ నిస్సిగ్గుగా సమర్థించుకోవాడం తప్పు. ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నా ఆర్‌బీఐ తన నిర్ణయాలను సమర్థించుకోవడం క్షమార్హం కాదు. సమాజంలో అధిక సంఖ్యలో ఉన్న సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారో ప్రధాని ఆచరణాత్మక కార్యాచరణతో ముందుకు రావాలి.)
ప్రధాని మోడీ మధ్యాహ్నం రాకపోడంపై అభ్యంతరం  
మన్మోహన్‌సింగ్‌ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేశ్‌ అగర్వాల్‌, టీఎంసీ సభ్యుడు డెరిక్‌, బీఎస్‌పీ సభ్యురాలు మాయావతి చర్చలో పాల్గొన్నారు. ఆ తర్వాత సభ్యను మధ్యాహ్న భోజనానికి వాయిదా వేశారు. పునఃప్రారంభమైన తర్వాత మాయావతి చర్చను కొసాగించారు. ఉదయం సభకు హాజరైన ప్రధాని మోడీ.... మధ్యాహ్నం రాకపోడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దును ప్రజలు సమర్థిస్తున్నారని ప్రభుత్వ ప్రచారం చేసుకోడాన్ని మాయవతి తప్పుపట్టారు. ఇదే నిజమైతే వెంటనే లోక్‌సభను రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్‌ చేశారు. 
రాజ్యసభ శుక్రవారానికి వాయిదా 
పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ప్రధాని సభలో ఉండాలని పట్టుపడుతూ విపక్ష సభ్యులు రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. చర్చ కొనసాగిస్తే ప్రధాని వస్తారని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హామీ ఇచ్చారు. అరుణ్‌ జైట్లీ హామీని ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. ప్రధాని రావాలంటూ కార్యకలాలను స్తంభింపచేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

 

ముగిసిన కేంద్రమంత్రివర్గ ప్రత్యేక సమావేశం

ఢిల్లీ : కేంద్రమంత్రివర్గ ప్రత్యేక సమావేశం ముగిసింది. ఆదాయపు పన్ను సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం... నగదు రద్దు తర్వాత డిపాజిట్లపై పన్నుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అర్ధరాత్రి 12 నుంచి పాట నోట్ల మార్పిడి బంద్ చేయనున్నారు. రూ. 500, వెయ్యి రూపాయల నోట్ల మార్పిడికి అవకాశం లేదు. పాత నోట్లు డిసెంబర్ 15 వరకు చెల్లుబాటు కానున్నాయి. డిసెంబర్ 8 నుంచి 31 మధ్య జరిగిన డిపాజిట్లపై విచారణ చేపట్టనున్నారు. బ్యాంకు కౌంటర్లలో నోట్ల మార్పిడిని నిలిపివేశారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్లకే అవకాశం ఇచ్చారు. 

 

21:26 - November 24, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుపై కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే అష్ట కష్టాలు పడుతున్న దేశ ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.  బ్యాంకులలో 500, వెయ్యి నోట్ల మార్పిడిని నిలిపివేసింది. రేపటి నుంచి పాత నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. అయితే.. డిసెంబర్‌ 15 వరకు పాత నోట్లతో విద్యుత్‌, నీటి బిల్లులు చెల్లించే అవకాశం కల్పించారు. మరోవైపు డిసెంబర్‌ 2 తేదీ వరకు టోల్‌ట్యాక్స్‌ రద్దు చేయగా.. 3వ నుంచి 15వ తేదీ వరకు పాత నోట్లు చెల్లించేందుకు అనుమతిచ్చారు. ఇక నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్‌ అత్యవసరంగా భేటీ అయ్యింది. ప్రధాని మోడీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం 'మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉందని' పలువురు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడికి నో ఛాన్స్

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే అష్ట కష్టాలు పడుతున్న దేశ ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడికి అవకాశం లేదని స్పష్టం చేసింది. రేపటి నుంచి పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్లకే పరిమితమని తేల్చి చెప్పింది. 

21:01 - November 24, 2016

నోట్ల సమస్యను పశ్నిస్తే తప్పా...? కరెన్సీ కష్టాలు లేవనెత్తితే దేశ ద్రోహమా..? సరిహద్దులో సైనికుడితో పోలికలెందుకు..?  ప్రశ్నిస్తే నేరమా..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

కొనసాగుతున్న కేంద్రమంత్రివర్గ ప్రత్యేక సమావేశం

ఢిల్లీ : కేంద్రమంత్రివర్గ ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ ప్రతిష్టంభన, పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న సమస్యలపై చర్చిస్తున్నారు. రాత్రి 8 గంటలకు సమావేశం ప్రారంభమైంది.

 

ఆక్వాఫుడ్ నిర్వాసిత గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత

పశ్చిమగోదావరి : ఆక్వాఫుడ్ నిర్వాసిత గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. తుందుర్రు, కంసాలబేతపూడి, జొన్నలగరువుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జన చైతన్య యాత్రకు సిద్ధమయ్యారు. జన చైతన్యయాత్రను అడ్డుకుంటారనే అనుమానంతో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని పోలీస్ హెచ్చరికలు జారీ చేశారు. ఆక్వాఫుడ్ వ్యతిరేక పోరాట సమితి నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. 

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తొలి నిర్ణయం

హైదరాబాద్ : పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఇకపై ఎస్టీ విద్యార్థులకు నిర్వహణ ఖర్చులు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తొలి నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ప్రతి నెలా రూ.1050, రూ.1200 చెల్లిస్తారు.

20:44 - November 24, 2016

పార్లమెంట్ల గట్టిగైన నోట్ల ఫైటింగ్, ఇద్దరు చంద్రుల నోట్ల ఇరికిన విభజన కాయ, అందరు లీడర్లను కలిపిన రైల్వే కోర్టు, అమెరికా ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్, ఇరవై మంది చావుకు కారణమైన కోతి, కరీంనగర్ లో ఉచిత వివాహ కార్యక్రమం, ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం, ప్రేమికురాలిని వినూత్నంగా ఆటపట్టించిన ప్రేమికుడు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:39 - November 24, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో.. తెలంగాణ సర్కార్‌ విలవిల్లాడుతోంది. ఆర్థిక పరిపుష్టిగల రాష్ట్రంగా ఎదుగుతున్న తరుణంలో.. కేంద్ర నిర్ణయంతో ఆదాయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మోదీ ఎఫెక్ట్‌లో గందరగోళ పరిస్థితిలో పడ్డారు. తాజా పరిణామాలు సీఎం కేసీఆర్‌కు కూడా దిమ్మతిరిగే షాకిచ్చిందనే చెప్పవచ్చు. 
రాష్ట్రం అతలాకుతలం 
రాష్ట్ర విభజన అనంతరం మిగులు బడ్జెట్‌తో ఆర్థిక పరిపుష్టి గల రాష్ట్రంగా అవతరించిన.. తెలంగాణ భవిష్యత్‌పై గట్టి ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతోంది. రెండేళ్లుగా ధనిక రాష్ట్రమని చెబుతూ.. ఆర్థిక పురోగతి సాధించే దిశగా కృషి చేస్తోంది. అయితే .. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో రాష్ట్రం ఒక్కసారిగా అతలా కుతలం అయ్యింది. ఇప్పటి వరకు ఆర్థిక పురోగతిలో పరుగు పెడుతున్న రాష్ట్ర ఆదాయం పూర్తిగా కుప్పకూలినంత పనైంది. 
గడ్డు పరిస్థితి దాపురించే ప్రమాదం : ఆర్థిక శాఖ 
రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే.. కరెన్సీ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే.. కనీసం ఉద్యోగుల జీతాలు, ఆసరా పెన్షన్లకు కూడా గడ్డు పరిస్థితి దాపురించే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్సైజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు, కమర్షియల్‌ టాక్స్‌తో పాటు ట్రాన్స్ పోర్టు, మైనింగ్ వంటి శాఖల ద్వారా స‌ర్కార్ కి ఆదాయం స‌మకూరేది. దీంతో ఆదాయ వనరులకు ఢోకా లేకుండా ఉండేది. 
8 కోట్లకు పడిపోయిన ఆదాయం 
వివిధ మార్గాల ద్వారా నిత్యం రెండు వందల కోట్ల వరకు వచ్చే ఆదాయం.. మొదటి నాలుగైదు రోజుల్లో 8 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలో సరిపడా నగదు ప్రజలకు అందకపోవడంతో.. ప్రజల లావాదేవీలు స్థంభించాయి. దీంతో మార్కెట్‌లన్నీ కుదేలై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఈ నేపథ్యంలో మొత్తం సర్కార్‌ ఖజానా పరిస్థితి అల్లకల్లోలంలో పడ్డట్లయింది. పరిస్థితిని సమీక్షించడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానిని కలిసి వివరించారు. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఆదాయం దివాలా తీసిందని, పథకాలు, ఇతర ఖర్చులకు గడ్డు పరిస్థితి తలెత్తిందని వివరించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ప్రధానిని కోరారు. 
ఇంకా 30 శాతం వరకు ఆదాయం పడిపోయే ఆస్కారం 
ఇక... మోడీ ప్రకటనకు ముందురోజు నాటికి రాష్ట్రంలో జరిగిన స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు 23 వేల 712 కాగా.. రాబడి 90 కోట్ల 49 లక్షలు. నవంబర్‌ 9 నుంచి 19 వరకు మొత్తం పనిదినాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు కేవలం 14 వేలు. వీటి ద్వారా రాష్ట్రానికి సమకూరిన ఆదాయం..73 కోట్లు మాత్రమే. ఇవి కూడా మోడీ ప్రకటనకు ముందు జరిగిన అగ్రిమెంట్లు.  ఆ తర్వాత అసలు రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు చేసుకునే వారే కరువయ్యారని, ఈ క్రమంలో ఇంకా 30 శాతం వరకు ఆదాయం పడిపోయే ఆస్కారం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  
ఇంకా 15 శాతం ఆదాయం పడిపోయే ప్రమాదం 
గతంలో లక్ష్యానికి మించి జరిగిన మద్యం అమ్మకాలతో.. నెలకు 1000 నుంచి 1100 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. మోదీ నిర్ణయంతో ఎక్సైజ్‌ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. మోదీ ప్రకటన తర్వాత రోజుకు 30 నుంచి 35 కోట్లు.. అంటే దాదాపు ఈ పదిరోజుల్లో 300 కోట్ల అమ్మకాలు తగ్గాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ రెండు మూడు రోజుల నుంచి మద్యం అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ.. కస్టమర్ల నుంచి వచ్చే ఆదాయం పెరగడం లేదు. దీంతో ఇంకా 15 శాతం ఆదాయం పడిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు  చెబుతున్నారు. 
కమర్షియల్‌ టాక్స్‌ శాఖపై తీవ్ర ప్రభావం 
ఇక.. నవంబర్‌లో అన్ని రకాల సేల్స్‌ పడిపోవడంతో.. కమర్షియల్‌ టాక్స్‌ శాఖపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ సమయంలో 2500  నుంచి 2800 కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరేది. ప్రస్తుతం కనీసం 1800 కోట్లు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తం 30 శాతం ఆదాయం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. రాష్ట్రానికి మరో ఆదాయ వనరైన ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌పై కూడా పెద్ద నోట్ల ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం వివిధ రకాల పన్నులు, ఫెనాల్టీల ద్వారా 6వేల కోట్ల వరకు రాబడి వచ్చే ఈ శాఖలో.. ఇప్పుడు  45 శాతం కంటే మించి రావడం లేదని, ఇదే సమయంలో లగ్జరీ ట్యాక్స్‌ ఆదాయం కూడా పడిపోయిందని చెబుతున్నారు.  
ఉద్యోగులకు జీతాలివ్వడంలో చెల్లింపుల్లో జాప్యం..?
రాష్ట్ర ఆదాయం ఎలా ఉన్నా.. ఉద్యోగులకు జీతాలివ్వడం తప్పదు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులకు 3000 కోట్లకు పైగా చెల్లించాల్సిందే. వీరితో పాటు పెన్షనర్లకు 1300 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర వాటాగా నెలకు 50 కోట్లకు పైగానే చెల్లించాలి. వృద్ధాప్య, వితంతు పింఛన్ల కింద దాదాపు 370 కోట్ల వరకు చెల్లించాల్సిందే. ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తం నెలకు 5000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చెల్లింపుల్లో జాప్యం అయ్యే అవకాశం ఉందని ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన నెలకొంది. సరిపడా కరెన్సీ లేకుండా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం అనేది ఇబ్బందులతో కూడుకున్నదని ఆర్థిక మంత్రి ఈటెల అభిప్రాయపడ్డారు. 
పూర్తిగా స్థంభించిన ఆదాయం  
తెలంగాణలో చిరు వ్యాపారులదే రాష్ట్ర ఆదాయంలో పెద్ద వాటాగా ఉంది. నగదుతో ముడిపడి ఉండే వ్యాపారాలు కావడంతో.. చిరు వ్యాపారుల నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా స్థంభించిన పరిస్థితి ఉంది. నగదు చెలామణిలో పరిమితులు, ఆంక్షలు కూడా రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది.  మొత్తానికి మోదీ నిర్ణయం.. రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది స్పష్టం అవుతోంది. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో భవిష్యత్‌లో రాష్ట్రానికి తిప్పలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

20:26 - November 24, 2016

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఆదాయానికి గండి పడుతుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత బి.వెంకట్, టీకాంగ్ నేత మల్లురవి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వక్తలు అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ప్రారంభమైన కేంద్రమంత్రివర్గ ప్రత్యేక సమావేశం

ఢిల్లీ : కేంద్రమంత్రివర్గ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ ప్రతిష్టంభన, పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలపై చర్చిస్తున్నారు. 

20:00 - November 24, 2016

కృష్ణా : తెలుదేశం పార్టీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. రెండున్నరేళ్ల నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ఎన్నికల హామీల అమలుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పట్టీసీమ ఎత్తిపోతల పథకంతో కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు సాగునీరు ఇచ్చామని తెలిపారు. 

 

19:52 - November 24, 2016

అనంతపురం : సినీ నటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపురంలో సందడి చేశారు. టీడీపీ జనచైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నడిపి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

 

19:47 - November 24, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుపై మోడీకి జనం బ్రహ్మరథం పడుతున్నారంటూ వచ్చిన సర్వే పచ్చి బూటకమని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం 10 లక్షల మంది మాత్రమే మద్దతిచ్చారని తెలిపారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలు అడుగుతున్న 18 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 28న చేపట్టిన 'ఆక్రోష్‌ దివస్‌'కు ప్రజలంతా మద్దతివ్వాలని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. 

 

19:37 - November 24, 2016

విజయవాడ : డిసెంబర్‌ ఒకటో తేదీ నాటికి ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు ఉండకూడ చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. మొబైల్‌ ఫోన్లు లేని నిరుపేదలందరికీ ఫోన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చిన్న నోట్లను పెంచుకోవాల్సిన అవసరముందని.. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు బాబు సూచించారు. 

 

'ప్రగతి భవన్' రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదిక : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కొత్తగా ప్రారంభించిన ప్రగతి భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. 'ప్రగతి భవన్' రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదిక అని సీఎం కేసీఆర్ అన్నారు. 'జనహిత' సమావేశ మందిరం ప్రభుత్వ పథకాలు, విధానాల రూపకల్పన, అమలు, ప్రజలతో ముఖాముఖీలు నిర్వహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇకపై అధికారిక సమావేశాలు ఇక్కడి నుంచే జరుగుతాయని తెలిపారు. ఇఫ్తార్ విందులు, క్రిస్మస్, ఉగాది వేడుకలు, కవి సమ్మేళనాలు, ఇతర అధికారిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తామని చెప్పారు. 

 

19:11 - November 24, 2016
18:44 - November 24, 2016

హైదరాబాద్ : సినిమా షూటింగ్‌ విరామ సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కొత్త రెండు వేల నోట్లను నిశితంగా పరిశీలించారు. వంద నోటుకు, కొత్త రెండు వేల నోటుకు ఉన్న తేడాను చూశారు. పవన్‌కల్యాణ్‌ నోట్లను పరిశీలిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. 

నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బందులు : రతన్ టాటా

హైదరాబాద్ : నోట్ల రద్దుపై రతన్ టాటా తొలిసారి స్పందించారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని రతన్ టాటా అన్నారు. 

 

జీవితకాల కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ

ముంబై : రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ.68.86 స్థాయికి చేరింది.  

18:12 - November 24, 2016

సంగారెడ్డి : నోట్ల రద్దు ప్రభావంతో వ్యాపార, వాణిజ్య, కార్యకలాపాలు సగానికి సగం తగ్గిపోయాయి. నోట్ల రద్దు వ్యవహారం ఎలక్ట్రానిక్, వస్త్ర, ఫైనాన్స్ రంగాలను తీవ్రంగా కుంగదీస్తోంది. నూతన సంవత్సరం, క్రిస్మస్ సీజన్ నేపథ్యంలో జరగాల్సిన వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయని వ్యాపారులు వాపోతున్నారు. కళకళలాడాల్సిన షాపులు, కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:04 - November 24, 2016

నల్గొండ : పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు, రైతులు తీవ్ర నష్టపోతున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నోట్ల రద్దుతో దేశంలో ఆర్ధికంగా గందరగోళ పరిస్థితి నెలకొందన్న ఆయన.. వేల కోట్ల ఎగ్గొట్టిన వారిని వదిలి సామాన్యులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. నల్ల కుబేరులు ఎవ్వరూ పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడటం లేదని గుత్తా సుఖేందర్‌ అన్నారు.

 

17:58 - November 24, 2016

మెదక్ : ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 39వ రోజు మెదక్‌ జిల్లాలో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ప్రవేశించిన తమ్మినేని బృందానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు. టీసర్కార్ పాలనపై విమర్శలు చేశారు. 

 

17:46 - November 24, 2016
17:45 - November 24, 2016

హైదరాబాద్ : 500, వెయ్యి రూపాయల నోట్లు రద్దుతో జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఈరోజు వరకు పాత నోట్లతో బకాయిలు చెల్లించేందుకు అవకాశం కల్పించడంతో నగరవాసులు భారీగా బకాయిలు చెల్లించారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీకి 235 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈరోజు 16 కోట్ల రూపాయలు వసూలు కాగా.. అర్ధరాత్రి వరకు గడువు ఉండడంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:44 - November 24, 2016

ఢిల్లీ : మోడీ సర్కార్‌ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో అఖిల భారతీయ కిసాన్‌ సభ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. రాంలీల మైదానం నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌ వరకు నిర్వహించిన ర్యాలీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ మొత్తం జాతి సంపద అంతా వంద మంది చేతుల్లోనే ఉందన్నారు. 

 

17:40 - November 24, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్  కొత్త  క్యాంప్‌ ఆఫీసు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 5.22 గంటలకు కేసీఆర్‌ దంపతులు నూతన భవనంలోకి గృహ ప్రవేశం చేశారు. సుమారు 36 కోట్లతో.. అత్యాధునిక హంగులతో ఈ క్యాంప్‌ ఆఫీసును నిర్మించారు. 150కి పైగా గదులు .. 500 మందితో ఒకేసారి మీటింగ్‌ నిర్వహించే విధంగా హాల్‌.. మినీ థియేటర్లు లాంటి ఎన్నో హంగులు కొత్త క్యాంప్‌ ఆఫీసుకు హైలెట్‌గా ఉన్నాయి. సీఎం కొత్త క్యాంపు ఆఫీసు విశేషాలను వీడియోలో చూద్దాం...

 

17:38 - November 24, 2016

విజయవాడ : చిల్లర కష్టాలతో రైల్వే స్టేషన్లలో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. పెద్దనోట్లకు చిల్లరలేక బిజినెస్‌ సగానికి సగం తగ్గిపోయింది. రెండువేల నోట్లకు తాము ఎక్కడినుంచి చిల్లర తేవాలని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. పాతనోట్లతోని తిప్పలు తప్పడం లేదు. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

 

హాంకాంగ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ లో సైనా, పీవీ సింధు

హైదరాబాద్ : హాంకాంగ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ లో సైనా నెహ్వాల్, పీవీ సింధు చేరుకున్నారు. జపాన్ క్రీడాకారిణి సయాకా సాటో పై 21-18,9-21, 21-16 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. చైనీస్ తైపీ షట్లర్ చింగ్ పై 21-10, 21-41 తేడాతో సింధు విజయం సాధించింది.

17:34 - November 24, 2016
17:33 - November 24, 2016

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి వస్తున్న లారీ, చిత్తూరు వైపు వస్తున్న మరొక లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. భారీగా మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. దీంతో ఒక లారీలోని డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో లారీలోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఎవరనేది తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలార్పారు. ఈ ఘటన మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

 

రా.8గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ

ఢిల్లీ : ఈ రోజు రాత్రి 8 గంటలకు అత్యవసరంగా కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ పార్లమెంట్ ఉభయసభల ప్రతిష్టంభన, పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.

టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్, సిమెంట్ కంపెనీల మధ్య ఎంవోయూ

హైదరాబాద్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో హౌసింగ్ కార్పొరేషన్, సిమెంట్ కంపెనీల మధ్య ఎంవోయూ కుదిరింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ బస్తా రూ. 230 లకే అమ్మడానికి 32 కంపెనీలు ముందుకు వచ్చాయి. మూడేళ్ల పాటు బస్తా సిమెంట్ ధర రూ. 230లకే విక్రయించనున్నట్లు తెలిపింది. డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమవ్వనున్న 27.31 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఈ కంపెనీలు అందజేయనున్నాయి.

నోట్ల రద్దు సమస్యలు కేంద్రానికి నివేదిస్తా: రెడ్డి సుబ్రహ్మణం

హైదరాబాద్ : సీఎస్ రాజీవ్ శర్మను కేంద్ర బృందం సభ్యులు రెడ్డి సుబ్రహ్మణం కలిశారు. క్షేత్రస్థాయిలో నోట్ల రద్దు సమస్యలు తెలుసుకున్నామని, ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సుబ్రహ్మణం తెలిపారు.

17:19 - November 24, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దుకావడం, కొత్త నోట్లు దొరక్కపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అనారోగ్యంవస్తే ఆస్పత్రికికూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గన్ ఫౌండ్రీలో బ్యాంకర్లతో మంత్రి ఈటెల భేటీ

హైదరాబాద్ : గన్ ఫౌండ్రీలో బ్యాంకర్లతో మంత్రి ఈటెల రాజేంద్ర సమావేశం అయ్యారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

రూ.235 కోట్ల పన్ను వసూలు : కమిషనర్ జనార్థన్ రెడ్డి

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో ఈ రోజు ఇప్పటి వరకు రూ.16 కోట్ల పన్నులు వసూలు చేశామని కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు రూ.235 కోట్లు పనులు వసూలయ్యాయని, పాత నోట్లతో పన్నులు చెల్లించేందుకు ఈ అర్థరాత్రి వరకు గడువు వుందని తెలిపారు.

17:10 - November 24, 2016

హైదరాబాద్ : మామూలు సమయాల్లోనే ఆర్టీసీ బస్సుల్లో చిల్లర దొరకదు. నోట్ల రద్దు తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది. చిల్లలేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. టికెట్లు కొనేందుకు తగిన చిల్లరలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

డిజిటల్ వ్యాలెట్ పై ప్రభుత్వం దృష్టి : జైట్లీ

ఢిల్లీ : డిజిటల్ వ్యాలెట్ పై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డిజిటల్ వ్యాలెట్ ద్వారా లావాదేవీలను పెంచుతామని జైట్లీ స్పష్టం చేశారు.

 

ప్రధానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు: సురవరం

హైదరాబాద్ : ప్రధాని మోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నోట్ల రద్దు అంశంపై మోదీ పార్లమెంట్ లో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హడావిడిగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈనెల 28న వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చించి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని సురవరం కోరారు.

16:47 - November 24, 2016

కరీంనగర్ : రెండు వారాలు దాటినా పెద్ద నోట్ల సమస్యలు ప్రజలను వెంటాడుతునే ఉన్నాయి. నగదు బదిలీ చేసుకునేందుకు బ్యాంకుల ఎదుట జనాలు బారులు తీరుతున్నారు. అత్యవసర, నిత్యావసరాల కొనుగోలు కోసం కొందరు కొత్త నోట్ల కోసం క్యూ కడితే.. పాత నోట్ల మార్పు కోసం మరికొందరూ లైన్లలో నిలబడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో నోట్ల కష్టాలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
వ్యాపార సంస్ధలపై తీవ్ర ప్రభావం 
పెద్ద నోట్ల రద్దు ప్రభావం జనాలతో పాటు వ్యాపార సంస్ధలపై తీవ్రంగా పడుతోంది. బ్యాంక్ ఎదుట ఉదయం 9 గంటలకే జనాలు క్యూ కడుతున్నారు. సాయంత్రం వరకు వేచి ఉన్న నగదు దొరక్క పోవడంతో క్యూ లైన్లలో వేచి ఉన్న వారంతా నిరాశతో వెనుతిరుగాల్సిన పరిస్థితులు తలెత్తుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ బ్యాంకులు నగదు చెల్లించకుండా డిపాజిట్లు మాత్రమే స్వీకరిస్తుండటంతో కనీస అవసరాలకు కూడా డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు.
కుప్ప కూలిన రియల్‌ ఎస్టేట్‌ రంగం 
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుప్ప కూలింది. భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయాయి. కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో రిజిస్టేషన్లు లేక కార్యాలయాలు బోసిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ నెల 1 నుంచి 8వరకు 13 రిజిస్టేషన్‌ కార్యాలయాల్లో వెయ్యి 650 రిజిస్టేషన్లు కాగా 9 నుంచి 20 వరకు 12 రోజుల్లో 1,449 మాత్రమే అయ్యాయి. సగటున రోజుకు 22లక్షలకు పైగా ఆదాయం తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 
మద్యం అమ్మకాలపై నోట్ల ప్రభావం 
ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం అమ్మకాలపై రద్దు చేసిన నోట్ల ప్రభావం పడింది. గతంలో కంటే అమ్మకాలు తగ్గినట్లు మద్యం వ్యాపారులు చెప్తున్నారు. 2000 రూపాయలతో నోట్లు వచ్చినప్పటికి సరిపడ చిల్లర దొరక్క, చిల్లర ఇవ్వలేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికి నోట్ల ప్రభావంతో బంగారం, బట్టల వ్యాపారులు గిరాకీ లేక తంటాలు పడుతున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలు లేక పోవడంతో ఈ నెల షాపుల్లో పని చేస్తున్న వారికి వేతనాలు చెల్లించడం భారంగా మారుతుందని వ్యాపారులు అంటున్నారు. అత్యవసరం పరిస్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులకు పాత నోట్లు మినహయింపు ఇచ్చినప్పటికీ ప్రైవేటు హస్పిటల్ యాజమాన్యాలు తీసుకోకపోవడంతో రోగులు నానా తంటాలు పడుతున్నారు. 
కుదేలవుతున్న చిరు వ్యాపారులు 
పెద్ద వ్యాపారులే కాదు చిరు వ్యాపారులు పెద్ద నోట్ల రద్దుతో కుదేలవుతున్నారు. కూరగాయల వ్యాపారులు మొదలు అడ్డ కూలీల వరకు అందరూ చిల్లర కోసం తంటాలు పడుతునే ఉన్నారు. ఇక పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను నిలువు దోపిడి చేస్తున్నారు. చిల్లర లేదంటూ ఎంత ఇస్తే అంత పెట్రోల్‌ పోస్తున్నారు. అనవసరం అయినప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డిజిల్ పోయించుకుంటున్నారు. 500 రూపాయలు ఇస్తే 300 రూపాయల పెట్రోల్ పోయించుకుంటేనే చిల్లర ఇస్తున్నారు. చిల్లర దొరక్క ఉన్న నోట్లను చెల్లుబాటు చేసుకోవాలనే యోచనలో వాహనదారులు పెట్రోల్ బంకు నిర్వహకులు పెట్టిన కండీషన్స్ కు తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం ప్రయాణికులకు కండక్టర్ కు ప్రయాణికులకు మధ్య చిల్లర గోడవలు జరుగుతునే ఉన్నాయి. మొత్తానికి సామాన్యుడు మొదలుకొని ధనవంతుల వరకు అందరిని నోట్ల కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. నోట్ల మార్పు మంచిదే అని అందరూ చెప్తున్నప్పటికీ.. మరి కొంత కాలం వరకు నోటు కష్టాలు తప్పేలా లేనట్లు తెలుస్తుంది.

 

నగరంలోని పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు

హైదరాబాద్ : నగరంలోని పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. హిమాయత్ నగర్ పోస్టాఫీస్, అబిడ్స్ జీపీవోలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

నోట్ల రద్దుపై సుప్రీం లో కేంద్రం అఫిడవిట్ దాఖలు

ఢిల్లీ : నోట్ల రద్దుపై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జీడీపీలో కేవలం 4 శాతం మాత్రమే నగదు రూపంలో లావాదేవీలు నడుస్తున్నాయని, భారత జీడీపీలో 12 శాతం నగదు లావాదేవీలు నడుస్తున్నాయి. 70ఏళ్ల నల్లధనాన్ని బయటకు తీసుకురావడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాం అని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది.

16:42 - November 24, 2016

హైదరాబాద్‌ : నగరంలోని హయత్‌ నగర్‌ లో దారుణం జరిగింది. బంజారాకాలనీలో నందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యకు టీచర్‌ వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

16:32 - November 24, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను విస్మరించిందని తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరకు సుధాకర్‌  విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఇందిరాపార్క్‌ దగ్గర తెలంగాణ ఉద్యమ వేదిక నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల హామీలను అమలు చేయాలని కోరారు. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీక్ష చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి.. గాంధీనగర్‌ పీఎస్‌కు తరలించారు. 

 

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 192 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 25,860 వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 7,965 పాయింట్ల వద్ద ముగిసింది.

కోల్ట్ స్టోరేజీలు, కారం మిల్లులపై విజిలెన్స్ దాడులు

గుంటూరు : కోల్డ్ స్టోరేజీలు, కారం మిల్లులపై మార్కెటింగ్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.15కోట్ల విలువైన కల్తీకారం నిల్వలను పట్టుకుని సీజ్ చేశారు.

ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన నోటు ఇచ్చా : సీతారం ఏచూరి

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం పై రాజ్యసభలో చర్చ జరుగుతున్నపుడు ప్రధాని ఉండాల్సిందేనని సీపీఎం నేత సీతారం ఏచూరి డిమాండ్ చేశారు. నోట్ల రద్దును 90 శాతం ప్రజలు తమను సమర్థిస్తున్నారని మోదీ చెప్పుకుంటున్నారని తెలిపారు. బతుకుదెరువే లేనపుడు ప్రజల్లో తిరుగుబాటు ఎలా వస్తుందని మండిపడ్డారు. నోట్ల రద్దు ప్రకటన చేసింది ప్రధానియే కాబట్టి దీనిపై ఆయనే స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందేనని తెలిపారు. ప్రధానిపై సహాహక్కుల ఉల్లంఘన నోటు ఇచ్చానని తెలిపారు.

రెండు లారీలు ఢీ... ఇద్దరు సజీవ దహనం..

చిత్తూరు : చంద్రగిరి సమీపంలోని బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొన్నాయి. మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధం అయ్యాయి. ఈప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. 

 

16:13 - November 24, 2016

ఢిల్లీ : వాహనదారులకు ఊరట లభించింది. కేంద్రప్రభుత్వం హైవేలపై టోల్ ట్యాక్స్ రద్దును పొడిగించింది. ఈరోజుతో ముగియనున్న గడువును కేంద్రం పొడిగించింది. డిసెంబర్ 1 వరకు హైవేలపై టోల్ ట్యాక్స్ రద్దును పొడిగించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:01 - November 24, 2016
15:59 - November 24, 2016

సంగారెడ్డి : నోట్ల రద్దు చేసి 16 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రజల కష్టాలు తీరడం లేదు. సంగారెడ్డిలో ఎక్కడా చూసినా ఏటీఎంలు మూసివేసిన పరిస్ధితి. ఒకటి రెండు ఏటీఎంలు పనిచేసినా రెండు వేల రూపాయల నోట్లు రావడంతో చిల్లర దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పట్టణంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏటీఎంలో వంద రూపాయల నోట్లు రావడంతో జనాలు బారుతీరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

డిసెంబర్ 1 వరకు హైవేలపై టోల్ ట్యాక్స్ రద్దు

హైదరాబాద్ : హైవేలపై టోల్ ట్యాక్స్ రద్దును కేంద్రం పొడిగించింది. డిసెంబర్ 1 వరకు హైవేలపై టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

ప్రధాని మోడీపై మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు

ఢిల్లీ : రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు వ్యవస్థీకృత, చట్టబద్ధ దోపిడీ అని విమర్శించారు. మోడీ నిర్ణయం చారిత్రక నిర్వహణ తప్పిదమన్నారు. ఈ నిర్ణయం వల్ల 90 శాతం మంది ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. 

సీఎం అధికారిక భవన్ నుంచి కేసీఆర్ కార్యకలాపాలు ప్రారంభం

హైదరాబాద్ : ప్రగతి భవన్ లోని సీఎం అధికారిక భవనం నుంచి సీఎం కేసీఆర్ కార్యకలాపాలు ప్రారంభించారు.

 

 

15:43 - November 24, 2016

హైదరాబాద్ : నగరంలోని పోస్టాఫీసుల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. నోట్ల మార్పిడిలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నారు. పలు పోస్టాఫీస్లుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆబిడ్స్ లోని జీపీవో, హిమాయత్ నగర్ లోని పోస్టాఫీసుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పోస్టాఫీసుల్లో ఎలాంటి లోపాలు బయటపడలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

హైదరాబాద్ లోని పోస్టాఫీసుల్లో సిబిఐ సోదాలు

హైదరాబాద్ : నగరంలోని పోస్టాఫీసుల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. పలు పోస్టాఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

15:36 - November 24, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ పలు మార్లు వాయిదా పడింది. అంతకముందు వాయిదా పడిన సభ.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిపేపటికే విపక్షాల ఆందోళనతో మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన కొద్దిసేపటికే...సభలో గందరగోళం నెలకొంది. ప్రధాని సభకు రావాలని విపక్షాలు పట్టుబట్టాయి. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. నోట్ల రద్దు అంశంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రధాని ఉంటే సభ జరుగుతుందని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పోడియం వద్దకు చేరి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. 'మన్ కీ బాత్ బంద్ కరో'...'మన్ కీ బాత్ బంద్ కరో'... అంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. సభాపతి వారించినా విపక్షాలు పట్టించుకోలేదు. దీంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై జరుగుతున్న చర్చలో సభలో ప్రధాని ఉంటే సభ జరుగుతుందని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పోడియం వద్దకు చేరి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించారు.

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం పై జరుగుతున్న చర్చలో ప్రధాని సభలో ఉండాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో వాయిదా పడిన రాజ్యసభ తిరిగి ప్రారంభం అయ్యింది.

జీవితకాల కష్టానికి పడిపోయిన రూపాయి విలువ

ముంబై : జీవితకాల కష్టానికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూ.68.86 స్టాయికి చేరింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే నెలలో 70 మార్క్ ను దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

14:50 - November 24, 2016

ఢిల్లీ : నోట్ల రద్దును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని బీఎస్పీ నాయకురాలు మాయావతి అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశంలోని పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మోడీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని ఎలా బయటకు తెస్తారని ప్రశ్నించారు. 

పెద్ద నోట్ల రద్దును ఆమోదిస్తున్నాం : మాయావతి

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును ఆమోదిస్తున్నట్లు మాజీ మాయావతి తెలిపారు. అమలు జరుగుతోన్న తీరే సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న సర్వే అబద్ధం అని మాయావతి పేర్కొన్నారు. 90 శాతం మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకస్తున్నారని, నోట్ల రద్దు పై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

14:43 - November 24, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని బీఏస్పీ నాయకురాలు మాయవతి తెలిపారు. అయితే అమలు జరుగుతున్న తీరే సరిగా లేదన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్య జనం ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న సర్వే అబద్ధమన్నారు. 

 

చర్చకు భయపడి ప్రధాని సభ నుంచి పారిపోయారు:విపక్షాలు

ఢిల్లీ : రాజ్యసభ లో నోట్ల రద్దు అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రధాని సభలో ఉండాలని విపక్షాలు పట్టుబట్టాయి. అంతే కాకుండా ఛైర్మన్ పోడియం వద్ద ఆందోళనకు దిగాయి. చర్చకు భయపడి ప్రధాని సభ నుంచి పారిపోయారని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు: మంత్రి పోచారం

వరంగల్ : 5 జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రులు పోచారం, చందూలాల్, కడియం భేటీ అయ్యారు. 2 వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ అధికారిని నియమిస్తామని పోచారం తెలిపారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సీడ్స్ తయారు చేసే అధికారులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. భూసార వివరాలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలని, రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని పోచారం సూచించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆర్బీఐ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : నోట్ల రద్దు పై ఆర్బీఐ అధికారులు, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28,29 నాటికి ఏపీకి రూ.3వేల కోట్ల కరెన్సీ వస్తుందని చంద్రబాబుకు ఆర్బీఐ అధికారులు తెలిపారు. డిసెంబర్ 1 కల్లా ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు ఉండకూడదని, డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అందరి వద్ద సెల్ ఫోన్లు ఉండాలని సీఎం సూచించారు.

'జైజవాన్, జైకిసాన్ అనే నినాదాన్ని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కింది'

ఢిల్లీ : రైతులకు రుణ మాఫీ చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీలు చేస్తున్నారని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ఢిల్లీల అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. జైజవాన్, జైకిసాన్ అనే నినాదాన్ని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఏచూరి ఆరోపించారు.

14:26 - November 24, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి రాజ్యసభ ప్రారంభం అయింది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ కొనసాగింది. ప్రధాని మోడీ రాజ్యసభకు రావాలని విపక్షాలు పట్టుబట్టాయి. నోట్ల రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 
 

13:35 - November 24, 2016

ఢిల్లీ : రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు కదం తొక్కారు. అఖిలభారత కిసాన్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సుమారు 50 వేల మంది రైతులు పాల్గొన్నారు. రైతు కూలీలకు 300 రూపాయల కూలితోపాటు 200 రోజుల ఉపాధి హామీని కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. టెన్ టివితో పలువురు నేతలు మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:33 - November 24, 2016

సంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 39వ రోజుకు చేరుకుంది. మెదక్‌ జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర బృందానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందని శోభన్ నాయక్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:31 - November 24, 2016

మెదక్ : సీపీఎం మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో 38వ రోజును పూర్తిచేసుకొని 39వ రోజు మెదక్‌ జిల్లాలోకి ప్రవేశించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర ఇప్పటివరకు 975 కిలోమీటర్లను పూర్తిచేసుకుంది. మెదక్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించగానే..మెదక్‌ జిల్లా వాసులు, సీపీఎం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీపీఎం బృందానికి స్థానిక మహిళలు..బోనాలతో స్వాగతం పలికి తమ్మినేనితో పాటు బృంద సభ్యులందరికి పుష్పగుచ్చాలు ఇచ్చి జిల్లాలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ..టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలు ఆర్ధికంగా చితికిపోయారని..వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 

13:26 - November 24, 2016

హైదరాబాద్ : మామూలు సమయాల్లోనే ఆర్టీసీ బస్సుల్లో చిల్లర దొరకదు.. నోట్ల రద్దు తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది.. చిల్లలేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. చిల్లర కొరత ఏర్పడిందని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మేనేజర్ టెన్ టివికి తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఎంజీబీఎస్ బస్ స్టాండులో ఎలాంటి పరిస్థితి నెలకొందే తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా స్టేషన్ మేనేజర్ మాట్లాడారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:24 - November 24, 2016

ఢిల్లీ : లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంతో ఉదయం ప్రారంభమైన లోక్‌సభ....ప్రతిపక్షాల ఆందోళనతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేస్తున్న నోట్ల రద్దు అంశం.. గురువారం పతాకస్థాయికి చేరింది. ఇప్పటి వరకు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయడం వరకే పరిమితమైన ఎంపీలు... తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌పైకి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అక్షయ్ యాదవ్ టియర్ పేపర్స్‌ను విసరడంతో లోక్‌సభలో కలకలం రేగింది. దీంతో అక్షయ్ యాదవ్ పై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభా నియమాలను ఉల్లంఘించడమేనని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రారంభమైన లోక్‌సభ విపక్షాల ఆందోళనతో రేపటికి వాయిదా పడింది. 

13:13 - November 24, 2016

నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలి: ఓబ్రయిన్

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఓబ్రయిన్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై జరుగుతున్న చర్చలో ఓబ్రయిన్ మాట్లాడుతూ..నల్ల కుబేరులను నియంత్రిండం కోసం కోట్ల మంది జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో వ్యాపార వాణిజ్య రంగాలు క్షీణించిపోయాయి. ఇది 16 విపక్ష పార్టీల ఆందోళన కాదని దేశ ప్రజల గళం అని అన్నారు.

అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులుపడుతున్నారు: తృణమూల్ ఎంపీ

ఢిల్లీ : అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తృణమూల్ ఎంపి డెరిక్ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు పై రాజ్యసభలో చర్చ డెరిక్ మాట్లాడుతూ...విదేశాల నుంచి బ్లాక్ మనీ ఎందుకు తీసుకురాలేకపోయారు? రియల్ ఎస్టేట్ బినామీ బిల్లు వాళ్లు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత రూ.500 నోటును మరింత కాలం ఎందుకు చెలామణి చేయలేకపోయారు. ఈ ప్రక్రియను రహస్యంగా ఉంచాలని అనుకుంటే ఏడాది కాలంగా రూ.100 నోట్లను ఎక్కువ సంఖ్యలో ఎందుకు ప్రింట్ చేయలేదు. 90 శాతం డెబిట్ కార్డులు మనీ విత్ డ్రాకు మాత్రమే పనికి వస్తున్నాయి. దేశంలో ఐదింట నాలుగు గ్రామాల్లో బ్యాంకులే లేవన్నారు.

12:46 - November 24, 2016

ఢిల్లీ : నల్లధనం విదేశాల్లో ఎంతుంది ? భారత్ లో ఎంతుందని ఎస్సీ ఎంపీ నరేష్ అగర్వాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిన అనంతరం ఎంపీ నరేష్ అగర్వాల్ ప్రసంగించారు. సామాన్యులు రెండు వేల కోసం రోజంతా క్యూ లైన్లలో నిల్చుంటున్నారని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నల్లధనం ఉన్న పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు క్యూ లైన్లలో నిల్చొన్నారా అని ప్రశ్నించారు. మీడియాపై తొలి ఎమర్జెన్సీ లాగానే ఇప్పుడు ఆంక్షలు విధించారని, మీడియా ద్వారా అంతా బాగుందని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 9 నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైందని చెబుతున్నారని తెలిపారు. రెండు నెలల ముందే ఆర్బీఐ గవర్నర్ మారడం అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. బీజేపీ నేతల ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈ నోట్ల రద్దు తీసుకున్నారని ఆరోపించారు. కొంత మంది న‌ల్ల‌కుబేరుల కోసం రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌దని, విదేశాల్లో ఉన్న న‌ల్ల‌ధ‌నం ఎప్పుడు తీసుకొస్తారో వెల్ల‌డించాల‌ని అన్నారు.

12:39 - November 24, 2016

ఢిల్లీ : పేద ప్రజలకు 50 రోజులు కష్టాలే అని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యసభలో పెద్దనోట్లు రద్దు అంశంపై చర్చ జరిగింది. చర్చను మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. నోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. బ్లాక్ మనీ అరికట్టేందుకు పెద్దనోట్లు రద్దు అని ప్రధాన మంత్రి మోడీ చెబుతున్నారని.. కానీ ప్రధాని అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదన్నారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 60-65 మంది మృతి చెందారని సభకు తెలిపారు. సామాన్యుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తమ డబ్బును తామే తీసుకోలేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. నోట్ల రద్దుతో జీడీపీ 2 శాతం పడిపోయే అవకాశం ఉందని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మెజార్టీ కార్మికులకు ఈ నిర్ణయం సమస్యగా మారిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయంలో నిర్వాహణ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. నల్లధనం, ఉగ్రవాద సమస్యల పరిష్కారానికి నోట్ల రద్దు మార్గం కాదని, దేశంలో ఎంతమంది దగ్గర నల్లధనం ఉందో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. 

యూపీ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం: ఎంపి నరేశ్ అగర్వాల్

ఢిల్లీ : యూపీ ఎన్నికల నేపథ్యంలో నోట్ల రద్దు అంశం పై ప్రధాని నిర్ణయం తీసుకున్నారని ఎస్పీ ఎంపి నరేశ్ అగర్వాల్ ఆరోపించారు. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై జరుగుతున్న చర్చలో నరేశ్ మాట్లాడుతూ లండన్ లో ఎంజాయ్ చేస్తున్న మాల్యా బాకీలను ఎలా మాఫీ చేశారు అని ప్రశ్నించారు. అసలు దేశంలో నల్ల ధనం ఎంత ఉందో ప్రభుత్వ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్దనిర్ణయం తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పని సరి అని పేర్కొన్నారు. 9 నెలల ముందే ఈ ప్రక్రియ మొదలైందని, 2 నెలల ముందు ఆర్బీఐ గవర్నర్ ను మార్చడం పై అనేక అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

12:28 - November 24, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన విరమించలేదు. రాజ్యసభకు ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. గురువారం ప్రారంభమైన సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. జీరో అవర్ తరువాత చర్చకు అనుమతినివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ విపక్షాలు ఆందోళన విరమించలేదు. ప్రధాని ఎందుకు తప్పించుకుంటున్నారని విపక్షాలు ప్రశ్నించాయి. సభ 12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించార. అనంతరం సభ ప్రారంభం కాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్, కేంద్ర మంత్రి జైట్లీ మాట్లాడారు.

పార్లమెంట్ స్టేట్ మెంట్ చేయాలి - ఆజాద్..
తనకు ముగ్గురు ప్రధాన మంత్రులతో పనిచేసే అనుభవం ఉందని, పార్లమెంట్ లో ఒక స్టేట్ మెంట్ చేయాల్సి ఉంటుందని కానీ అలా చేయలేదని ఆజాద్ పేర్కొన్నారు. . జపాన్, గోవా, యూపీ, ఆగ్రా సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాయిస్ వినడం జరిగిందన్నారు. కానీ ప్రధాన మంత్రి బీజేపీకి కాదని అందరి ప్రధాన మంత్రి అని..దేశానికి ప్రధాన మంత్రి అని పేర్కొన్నారు. నోట్ల రద్దు అంశంపై ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోకుండానే నోట్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. 12గంటల నుండే చర్చను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.

చర్చకు ఒకే..
తాము చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి జైట్లీ సభకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ చాల మంచి విషయం చెప్పారని, మధ్యాహ్నం 12గంటలకు చర్చ జరగాలని పేర్కొనడం మంచి పరిణామమని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారు. మొదలు చర్చ సజావుగా జరిగిందని, ఒక్కసారిగా విపక్షాలు తన రాజనీతిని మార్చి వేశారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి సభకు రావాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. 

దేశం ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటోంది: నరేశ్ అగర్వాల్

ఢిల్లీ : దేశం ఆర్థిక ఎమర్జెన్సీని ఎదుర్కొంటోందని ఎస్పీ ఎంపి నరేశ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై చర్చను చేపట్టింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. 50 రోజుల్లో అన్నీ అయిపోతాయని ఎలా అనుకుంటారు అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతులు కరెన్సీ అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఎంత? దేశంలో ఉన్న బ్లాక్ మనీ ఎంత? ధనవంతులు ఎంత మంది క్యూలో నిల్చున్నారు అన్న ప్రశ్నించారు. 

12:21 - November 24, 2016

సంగారెడ్డి : పల్లెలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 38వ రోజు పూర్తి చేసుకుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు సమస్యలను తెలుసుకొనే ప్రయత్నంలో భాగంగా తమ్మినేని బృందం సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించింది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రజా బతుకులు బాగు పడాలన్న లక్ష్యంతో సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగింది. 38వ రోజు పాదయాత్ర సంగారెడ్డి, సదాశివనగర్‌, హనుమాన్‌గడ్డ, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, గుండ్ల మాచనూరు చౌరస్తా, బోరపట్ల, మల్కాపూర్‌, దౌల్తాబాద్‌ ప్రాంతాల్లో పాదయాత్ర సాగింది. 38వ రోజు వరకు మొత్తం 970 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు 350కిపైగా గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలను పలకరిస్తూ ఈ పాదయాత్ర సాగింది.

పాదయాత్రలో పాల్గొన్న జగ్గారెడ్డి..
38వ రోజు పాదయాత్రను సంగారెడ్డి జిల్లాలో సీపీఎం కేంద్రకార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత పాదయాత్రలో భాగంగా సంగారెడ్డిలోని సితార థియేటర్ ప్రాంతంలో కబ్ఙాకు గురైన దళితుల ఇళ్ల స్థలాలను పాదయాత్ర బృందం పరిశీలించింది. అయితే సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మహాజన పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ సీపీఎం అని జగ్గారెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్ తరపున సీపీఎం పాదయాత్రకు తాను పూర్తి మద్దుతిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

నోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు: మన్మోహన్

ఢిల్లీ : నోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై చర్చ ప్రారంభం అయ్యింది. ఈ చర్చలో మన్మోహన్ మాట్లాడుతూ...ఇప్పటికే క్యూలైన్లలో దాదాపు 65 మంది చనిపోయారు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు మూలంగా జీడీపీ 2 శాతం పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నల్లధనం, ఉగ్రవాద సమస్యల పరిష్కారానికి నోట్ల రద్దు మార్గం కాదన్నారు. ప్రజలు తమ డబ్బును తామే తీసుకోలేక అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యసభలో నోట్లరద్దు అంశంపై చర్చ ప్రారంభం

ఢిల్లీ : పెద్ద సభ రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై చర్చ ప్రారంభం అయ్యింది. మరో రాజ్యసభకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు.

లోక్ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ:వాయిదా అనంతరం తిరిగి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

తిరిగి ప్రారంభమైన ఉభయసభలు

ఢిల్లీ : వాయిదా అనంతరం తిరిగి ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మరో వైపు రాజ్యసభకు ప్రధాని హాజరయ్యారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం..తల్లి మృతి

ప్రకాశం: చీరాలలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా రైలుకిందపడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మరణించగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.

ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయాలి: మధు

నెల్లూరు : పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు స్తంభించాయని సీపీఎం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఆయన నెల్లూరు లో మీడియాతో మాట్లాడుతూ రైతులు పంటలు అమ్ముకోలేని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా28న చేపట్టిన ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

హయత్ నగర్ లో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : హయత్ నగర్ పరిధిలోని బంజారాకాలనీలో సాయి చైతన్య స్కూల్ విద్యార్థిని నందిని ఆత్మహత్య చేసుకుంది. టీచర్ వేధింపుల వల్లే తమ కుమార్తె మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఏపీలో ఈ పాస్ యంత్రాలు ప్రారంభం

విజయవాడ: ఆర్టీసీ రిజర్వేషన్ కేంద్రాల్లో ఈ-పాస్ యంత్రాలు అందుబాటులో కి వచ్చాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఈ-పాస్ యంత్రాలను మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ ప్రారంభించారు. తొలుత కృష్ణా, గుంటూరులో ఈ-పాస్ యంత్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2-పాస్ యంత్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీకి రూ.17 కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి శిద్ధా తెలిపారు.

ఢిల్లీలో కిసాన్ సభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఢిల్లీ : రామ్ లీల మైదానం నుంచి జంతర్ మంతర్ వరకు అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయల్దేరింది. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, రూ.300 కూలీతో 200 రోజుల ఉపాధి హమీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. పొలాలకు సాగునీరు ఇవ్వాలని, దళితులపై దాడులకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్ట్రీట్ వరకు అఖిలభారత కిసాన్ సభ మార్చ్ నిర్వహించింది.

పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి : మాయావతి

ఢిల్లీ : పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని పెద్ద నోట్ల రద్దు పై ప్రధాని మోడీ యూపీ మాజీ సీఎం మాయావతి సవాల్ విసిరారు. పెద్ద నోట్ల రద్దు పై ప్రధాని సర్వే బూటకం అని మండిపడ్డారు.

11:27 - November 24, 2016

హైదరాబాద్ : రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు అనంతరం జీహెచ్ఎంసీ పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. పాత నోట్లతో పన్నులు చెల్లించవచ్చని పేర్కొనడంతో ప్రజలు పన్నులు భారీగా చెల్లించారు. అయితే దీని గడువు 24వ తేదీ వరకు విధించారు. దీనితో పాతనోట్లతో అర్ధరాత్రి వరకు పన్నులు చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా సెంటర్లలో డబ్బులు చెల్లించవచ్చన్నారు. జలమండలి, హెచ్ఎండీఏ ఈ సౌకర్యాలు కల్పించడం జరుగుతోందన్నారు. పాతనోట్ల ద్వారా జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

పార్లమెంట్ ఉభయసభలు మ.12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం ఉభయసభలను కుదిపేస్తోంది. ఉభయ సభలు ప్రారంభం అయిన వెంటనే నోట్ల రద్దు అంశంపై భలో ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

11:22 - November 24, 2016

ఢిల్లీ : రాజ్యసభలో మళ్లీ అదే తీరు కొనసాగింది. నోట్ల రద్దు అంశం పార్లమెంట్ ఉభయసభలనూ కుదేపిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ముందు చర్చ జరగాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దు..నల్లధనంపై విపక్షాలు చర్చించాలని, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చర్చను ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనసాగించే విధంగా సహకరించాలని, మాట్లాడేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అవకాశం కల్పించడం జరిగిందని డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. ఆర్థిక శాఖకు సంబంధించిన అంశమని, ఆ శాఖకు సంబంధించిన మంత్రి సభలో ఉన్నారని పేర్కొన్నారు. విపక్షాలు ఆందోళన విరమించుకోకపోతే తాను సభను వాయిదా వేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి సమాధానం చెప్పి తీరాల్సిందే..ఎందుకు పారిపోతున్నారని బీఎస్పీ సభ్యురాలు మాయావతి ప్రశ్నించారు. నోట్ల రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని ఛాంబర్ లో సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. మరోవైపు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశానికి విపక్షాలు నిరాకరించాయి. 

లోక్ సభ వాయిదా

ఢిల్లీ : మాజీ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, సంగీత విద్యాంసుడు బాలమరళీకృష్ణ మృతికి లోక్ సభ నివాళి అర్పించింది. అనంతరం నోట్ల రద్దు అంశంపై చర్చకు సిద్ధమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయినా విపక్షాలు మాత్రం ప్రధాని సమాధానం చెప్పాలని ఆందోళన చేపట్టాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రాజ్యసభలో గందరగోళం

ఢిల్లీ : ప్రారంభమైన కొద్ది సేపటికే రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. 

జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం

గుజరాత్ : జామ్ నగర్ రిలయన్స్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు గాయాలయినట్లు సమాచారం.

10:47 - November 24, 2016

రవిబాబు..ఆయన స్టైలే వేరు. ఆయన తనదైన శైలిలో చిత్రాలు చేస్తుంటారు. 'అల్లరి', 'అనసూయ', 'అవును' సినిమాలు రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 'పందిపిల్ల'పై సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి 'అదిగో' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. లో బడ్జెట్ తో సినిమాలు తీసే రవిబాబు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రవిబాబు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పలువురు ఏటీఎంల వద్ద క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. 'రవిబాబు' కూడా డబ్బుల కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. 'పందిపిల్ల'ను చంకన పెట్టుకొని ఏటీఎం వద్ద కనిపించడంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  

మణిపూర్ సరిహద్దుల్లో భూకంపం

న్యూఢిల్లీ: మణిపూర్ సరిహద్దుల్లోని మయన్మార్‌లో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్టు తెలిపారు. ఏదైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు.

10:39 - November 24, 2016

సాహసోపేత ప్రదర్శనలు..ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్స్...నిండు ప్రాణాన్ని బలిగొన్న యూ ట్యూబ్ రియాల్టీ షో...

పెరుగుతున్న టెక్నాలజీ అనేక ప్రమాదాలను కొని తెస్తోంది. కాలానికి అనుగుణంగా అప్ డేట్ అవుతున్నా కొన్ని ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వాటిలో రియాల్టీ షో ప్రభావం చిన్నపిల్లలపై విపరీతంగా పడుతున్నాయి. యూ ట్యూబ్ లో సాహస వీడియో చూసిన ఓ బాలుడు అదే రీతిలో ప్రయోగం చేయబోయి మృత్యువాత పడ్డాడు. కొవ్వొత్తి వెలిగించి నోట్ల కిరోసిన్ పోసుకుని ఘన్ శ్యాం అనే బాలుడు ఊదాడు. ముఖంపై మంటలు అంటుకుని తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ విషాదం పలువురిని కంటతడిపెట్టించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

చైనాలో కూలిన టవర్ : 40 మంది మృతి

బీజింగ్ : చైనాలోప‌వ‌ర్ ప్లాంట్‌కు చెందిన ట‌వ‌ర్ కూలిపోవ‌డంతో 40 మంది మృతిచెందారు. జాంగ్జీ ప్రావిన్స్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. అప్రమత్తమైన అధికారులు ట‌వ‌ర్ శిథిలాల‌ను తొలిగిస్తున్నారు. ప్రమాదానికి కారణాలను శోధిస్తున్నారు.

పోలీసుల కూబింగ్ ఎర్రచందనం కూలీ అరెస్ట్

చిత్తూరు : చంద్రగిరి మండలం గుండాలబండ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. పోలీసుల కూబింగ్ లో ఎర్రచందనం 8మంది కూలీలు తారసపడగా 7గురు పరారీ కాగా ఒకరిని అరెస్టు చేశారు.

10:23 - November 24, 2016

విజయవాడ: పెద్దనోట్ల రద్దు ప్రభావం ఇంకా వీడలేదు. చిల్లర దొరక్క..డబ్బులు దొరక్క చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు రైతులపై పెను ప్రభావం చూపెడుతోంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. నిత్యం సందడిగా ఉండే స్వరాజ్య మైదానం ప్రస్తుతం వెలవెలబోతోంది. అక్కడ కష్టాలు..సమస్యలు తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. చిల్లర కోసం వంద కష్టాలు పడుతున్నామని వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వ్యాపారం లేక నష్టాల్లో ఉన్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఘనంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ కుమార్తె వివాహం

హైదరాబాద్ : గచ్చిబౌలిలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూతురి వివాహానికి కేంద్ర మంత్రి హన్స్ రాజ్, చిరంజీవి, జానారెడ్డి హాజరయ్యారు. అంతే కాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 50కిపైగా పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. 

10:13 - November 24, 2016

హైదరాబాద్ : పాతనోట్లతో చెల్లింపులకు ఈ రోజుతో గడువు ముగియనుంది. హాస్పిటల్స్, మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, రైల్వే టికెట్ కౌంటర్లు, ఆర్టీసీ బస్సులు, పౌర సేవా కేంద్రాల్లో, ప్రభుత్వ పన్ను చెల్లింపులకు కూడా ఇవాళ్టితోనే గడువు ముగియనుంది. రేపటి నుంచి పాత నోట్లు కేవలం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పాతనోట్లతో పన్ను చెల్లింపులకు చివరిరోజు కావటంతో పన్ను చెల్లింపుదారులు పౌరసేవా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. ఇదిలా ఉంటే కాచిగూడ ఎస్ బీఐ ఏటీఎం వద్ద కొత్త రూ. 500 నోట్లు లభ్యమౌతున్నాయి. చిల్లర లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు పేర్కొన్నారు. 

10:10 - November 24, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి సమాధానం చెబుతారు ? ఆయన అసలు సమాధానం చెబుతారా ? అనే ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం రానుంది. పార్లమెంట్ లో నోట్ల రద్దు అంశం దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదు రోజుల పాటు సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
​విపక్షాలు ఏకమయి ధర్నాలు..నిరసనలు తెలియచేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిపై సభలో సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. బుధవారం లోక్ సభకు ప్రధాని హాజరైనా ఏమి మాట్లాడలేదు. విపక్షాలు ఆందోళన విరమించుకోకపోవడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రధాన మంత్రి బయట మాట్లాడడం కాదని..సభలో సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. విపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గి సమాధానం చెబుతుందా ? లేదా? అనేది వేచిచూడాలి.  

నేటి అర్థరాత్రితో పాత నోట్లకు చెట్లుచీటీ

హైదరాబాద్ : ప్రభుత్వ సేవల్లో నేటితో పాతనోట్ల చెల్లుబాటు ముగియనుంది. ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ అర్థరాత్రి వరకు పాతనోట్లు చెల్లుబాటు అవుతాయి.

అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల తో రాజ్ నాథ్ భేటీ

ఢిల్లీ : కాసేపట్లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది.

09:36 - November 24, 2016
09:30 - November 24, 2016

ఢిల్లీ : నోట్ల మార్పిడి అనంతరం.. దేశంలో వడ్డీరేట్లు తగ్గనున్నాయని కేంద్రం తెలిపింది. నోట్ల రద్దు ఇబ్బందులపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఇప్పటివరకు 6లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరిందని సుప్రీంకు తెలిపారు. నోట్ల కొరత ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని...కేవలం సరఫరాలోనే జాప్యం ఏర్పడుతోందని కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేచోట విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నోట్ల రద్దుపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను విడివిడిగా విచారించాలన్న ప్రభుత్వ అఫిడవిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. స్టే విధించేందుకు నిరాకరించింది.

12 పిటిషన్లు..
దేశవ్యాప్తంగా దాఖలైన మొత్తం 12 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు వివరించారు. నోట్ల కొరత ఉందన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వ్‌బ్యాంక్‌, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లు కావాల్సినంత కరెన్సీని ముద్రించిందని.. అయితే ఆ నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసులకు రవాణా చేసేందుకు జాప్యం జరుగుతుందని వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త నోట్లను త్వరగా తరలించే ప్రయత్నం చేస్తామని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

6 లక్షల కోట్ల రూపాయలు..
నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు 6 లక్షల కోట్ల రూపాయలు ఆయా బ్యాంకులలో డిపాజిట్‌ అయ్యాయని.. రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. నోట్ల మార్పిడి ప్రక్రియ ద్వారా మొత్తం 15 లక్షల కోట్లు డిపాజిట్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తుందని అటార్నీ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇక పిటిషనర్ల తరపున కాంగ్రెస్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించనున్నారు. 

09:26 - November 24, 2016

మెహందీ పెట్టడానికి ఇంటికి పిలిచాడు...ఆ తరువాత ఏమైంది. ?

మగాళ్లు మృగాలవుతున్నారు. తమ కోరికను తీర్చుకోవడానికి కొందరు కామాంధులు ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. ఆడవాళ్లు కనబడితే చాలు వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వారి ఉసురు తీస్తున్నారు. శుభకార్యాలకు మెహందీ పెడుతూ జీవించే ఓ యువతిని ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పి ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

09:22 - November 24, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే, మొబైల్ ఇ వ్యాలెట్ సంస్థలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. ఈ పది రోజుల్లో వీటి వ్యాపారం నాలుగు రెట్లు పెరిగింది. మన దేశంలో అత్యధికశాతం లావాదేవీలు క్యాష్ రూపంలోనే సాగుతుంటాయి. క్యాష్ లెస్ లావాదేవీలు చాలా స్వల్పం. పెద్ద నోట్ల రద్దు వెనక క్యాష్ లెస్ లావాదేవీలు పెంచాలన్న వ్యూహం కూడా వున్నది. గత పది రోజుల్లో క్యాష్ లెస్ లావాదేవీలు పెరగడం విశేషం. ఆన్ లైన్ సేవలు, డెబిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ లావాదేవీల మీద చక్కటి అవగాహన వున్నవారంతా ఇప్పుడు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. డబ్బుల కోసం ఏటిఎంల దగ్గర క్యూ కట్టకుండా ఎలక్ట్రానిక్ లావాదేవీలతో కొనుగోళ్లు సాగిస్తున్నారు. దీంతో ఇలాంటి సేవలు అందించే సంస్థలు పండుగ చేస్కుంటున్నాయి.

పేటిఎం సత్ఫలితాలు..
ఇదే అదనుగా మొబైల్ , ఈ వ్యాలెట్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన మొబైల్ పేమెంట్స్ కంపెనీ పేటిఎం సత్ఫలితాలనే సాధించినట్టు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేటిఎం లావాదేవీలు రోజుకి 70 లక్షలకు పెరగడం విశేషం. రోజుకి 120 కోట్ల బిజినెస్ చేయడం ఓ రికార్డుగా చెబుతున్నారు. ఈ ఏడాది బిజినెస్ లక్ష్యాన్ని 4 నెలల ముందుగానే పేటిఎం సాధించడం మరో విశేషం.

లావాదేవీలే ఎక్కువ..
ప్రస్తుతం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లావాదేవీల కంటే పేటిఎం లావాదేవీలే ఎక్కువగా వున్నట్టు యాజమాన్యం చెబుతోంది. మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఓలా మనీ లాంటి సంస్థలు కూడా నోట్ల రద్దుతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మొబైల్, ఈ వ్యాలెట్ వ్యాపారాలు నాలుగు రెట్లు పెరిగినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని సంస్థలు కూడా మొబైల్ వ్యాలెట్ వ్యాపారంలోకి ప్రవేశిస్తాయన్న అంచనాలున్నాయి. పేటిఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్ లాంటి మొబైల్ ఇ వ్యాలెట్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్ బిఐ నెలవారీ లావాదేవీల పరిమితిని 20వేల రూపాయల వరకు పెంచింది. గతంలో 10 వేల రూపాయల లావాదేవీలకే పర్మిషన్ వుండేది. 

దీపక్ ట్రాన్స్ పోర్ట్ గోదాంలో మంటలు..

ప్రకాశం : చీరాలముంతావారి కూడలిలో అగ్నిప్రమాదం సంభవించింది. దీపక్ ట్రాన్స్ పోర్ట్ గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకసిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో కోట్లల్లో ఆస్థినష్టం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.

09:14 - November 24, 2016

కేసీఆర్ గృహ ప్రవేశానికి గవర్నర్ హాజరు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గృహ ప్రవేశ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం కేసీఆర్ దంపతులు గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 

09:10 - November 24, 2016

హైదరాబాద్ : 'చిల్లర' కష్టాలు ఇంకెన్ని రోజులు ? ఎన్ని రోజులు ఇలా ఇబ్బందులు పడాలి ? అని చిల్లర వ్యాపారస్తులు, ఇతరులు ప్రశ్నిస్తున్నారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి 16 రోజులు గడిచిపోయాయి. చిల్లర సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రూ. 2000 నోటుకు చిల్లర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నా చేతికి రూ. 2వేలు మాత్రమే వస్తుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార..వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయి. కూకట్ పల్లి మార్కెట్ లో మైక్రో ఏటీఎంలను అందుబాటులో ఉంచి కూరగాయాల విక్రయాలు సాగుతున్నాయి. కొత్తపేట మార్కెట్ లో ఎలాంటి పరిస్థితి నెలకొందో వీడియో క్లిక్ చేయండి. 

కొనసాగుతున్న 'చిల్లర' కష్టాలు..

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దయి 16 రోజులు గడుస్తున్నా చిల్లర కష్టాలు తొలగడం లేదు. చిల్లర వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కొత్తపేట మార్కెట్ లో వ్యాపారం లేక నష్టపోతున్నామని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. 

08:36 - November 24, 2016

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' న్యూ మూవీ 'దంగల్' విడుదలకు ముందే హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాంగ్ రిలీజ్ అయ్యింది. 24గంటల్లోనే 40 లక్షల మంది ఈ వీడియోను చూడడం విశేషం. లెజెండర్ రెజ్లర్ మహవీర్ సింగ్ పోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన 'దంగల్' ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోట్ ను వినూత్నంగా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో 'యుద్ధం' పేరిట విడుదల కానుంది. 

బాలల పరార్..

హైదరాబాద్ : నాగోల్ ఛైల్డ్ హోం నుండి 12 మంది బాలలు పరారయ్యారు. వాచ్ మెన్ పై దాడి చేసి పరారయ్యారు. ఎల్ బినగర్ లో ఫిర్యాదు చేశారు. 

08:27 - November 24, 2016

హైదరాబాద్ : సైదాబాద్ లో ఓ వ్యాపారి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు అనంతరం కొద్ది రోజులకు ఈ సోదాలు జరగడం గమనార్హం. సైదాబాద్ లో వ్యాపారి నర్సరాజు నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద భారీ మొత్తంలో నగదు, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నుండి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నర్సారాజు వద్ద రూ. 35 నుండి రూ. 40 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు జరిగే సమయంలో ఇంట్లోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. సోదాల అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

08:21 - November 24, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు నూతన గృహ ప్రవేశం చేశారు. కానీ గృహ ప్రవేశానికి సంబంధించిన విశేషాలను మీడియాకు అందచేయలేదు. కేవలం గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని వీడియోలను మాత్రమే వాట్సప్ ద్వారా మీడియాకు అందచేయడం గమనార్హం. ఉదయం 5.22 గంటలకు ఈ గృహ ప్రవేశం జరిగింది. గృహ ప్రవేశానికి చిన జీయర్ స్వామిజీ హాజరయ్యారు. కేసీఆర్ దంపతులను ఆయన ఆశీర్వదించారు.

  • 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.36 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • 150కి పైగా గదులు
  • 500 మందితో ఒకేసారి మీటింగ్‌ నిర్వహించే విధంగా హాల్‌
  • విజిటర్స్ బస చేసేందుకు లాంజ్‌
  • జిల్లా, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశం
  • సీఎంవో కార్యదర్శులు అందుబాటులో ఉండే విధంగా చాంబర్లు
  • ఐదు భవనాలను కలిపి 'ప్రగతి భవన్‌'గా పేరు
  • సమావేశాలు నిర్వహించే హాల్‌కు 'జనహిత'గా నామకరణం
08:14 - November 24, 2016

హైదరాబాద్ : అంబర్ పేట కూరగాయల మార్కెట్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ బొమ్మ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కనున్న పది కూరగాయాల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఎలా అంటుకున్నాయో తెలియరాలేదు. 

08:12 - November 24, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దయి 15 రోజులు దాటిపోయాయి. కానీ ఇంకా ఇక్కట్లు తీరడం లేదు. మధ్యతరగతి..సామాన్యుడి అష్టకష్టాలు పడుతున్నాడు. రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ. 2000 నోటును తీసుకొచ్చారు. దీనితో చిల్లర కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. ముఖ్యంగా కూలీలు, చిన్న వ్యాపారస్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కొత్తపేట మార్కెట్ లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కేంద్రం తీసుకున్న చర్యలపై వ్యాపారస్తులు మండిపడుతున్నారు. చిల్లర దొరక్క నానా ఆగచాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 2000 వేల నోటుకు చిల్లర ఎక్కడి నుండి తీసుకరావాలని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు..కొనుగోలుదారుల ఇక్కట్లు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

అంబర్ పేట కూరగాయాల మార్కెట్ లో ప్రమాదం..

హైదరాబాద్ : అంబర్ పేట కూరగాయాల మార్కెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పది కూరగాయాల దుకాణాలు దగ్ధమయ్యాయి. 

07:38 - November 24, 2016

నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ కు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. నోట్ల రద్దు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ప్రకటించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి.వెంకట్ (సీపీఎం నేత), అల్జాపురి శ్రీనివాస్ (బీజేపీ), గోసల శ్రీనివాస్ యాదవ్ (టిపిసిసి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

సైదాబాద్ లో వ్యాపారి ఇంట్లో ఏసీబీ సోదాలు..

హైదరాబాద్ : పాతబస్తీలోని సైదాబాద్ లో వ్యాపారి నర్సరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిన్న మధ్యాహ్నం నుండి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఏపీలో బడి రుణం తీర్చుకుందాం కార్యక్రమం..

విజయవాడ : నేటి నుండి డిసెంబర్ 8 వరకు 'బడి రుణం తీర్చుకుందాం' కార్యక్రమం జరగనుంది. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం జరగనుంది. 

నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం..

హైదరాబాద్ : నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. మంత్రులు పోచారం, ఈటెల, అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొననున్నారు. నోట్ల రద్దు ప్రభావంపై చర్చింనున్నారు. 

ఆర్టీసీ సిటీ ఏసీ బస్సుల్లో వైఫై..

హైదరాబాద్ : నేటి నుండి ఆర్టీసీ సిటీ ఏసీ బస్సుల్లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి 20 నిమిషాల వరకు వైఫై ఉచితంగా అందచేయనున్నారు. 20 నిమిషాల అనంతరం 100 ఎంబీకి రూ. 25 వసూలు చేయనున్నారు. 100 ఏంబీ డేటా 24గంటల పాటూ వినియోగించవచ్చు. 

నేటితో పౌర సేవలకు 'పాత నోట్ల' గడువు ముగింపు..

హైదరాబాద్ : నేటితో పౌర సేవలకు 'పాతనోట్ల' గడువు ముగియనుంది. అర్ధరాత్రి నుండి పాత నోట్ల చెల్లుబాటు నిలిచిపోనుంది .

07:04 - November 24, 2016

నోట్ల రద్దు ప్రభావం వృత్తిదారుల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. ఏ రోజు ఆదాయంతో ఆ రోజు జీవితాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి వృత్తిదారులది. రోజువారీ ఆదాయాలు పడిపోతే, వీరి జీవనయానం పెను ప్రమాదంలో పడుతుంది. క్షురకులు, రజకులు, నిర్మాణరంగ కార్మికులు, మత్స్యకారులు, గీతకార్మికులు, కార్పెంటర్స్ ఇలా సమస్తవృత్తులవారూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో వివిధ వృత్తులవారు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై టెన్ టివి జనపథంలో బిసి సబ్ ప్లాన్ సాధన కమిటి నేత కిల్లె గోపాల్ విశ్లేషించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:02 - November 24, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో నిధుల కొరతకు చెక్‌ పెడతామంటున్నారు అధికారులు. నిధుల సమీకరణకోసం 5 ప్రతిపాదనలను రూపొందించారు. విదేశీ సంస్థలు, ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో నిధుల కొరతను అధిగమించవచ్చని చెబుతోంది సీఆర్‌డీఏ. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచారు..సీఆర్‌డీఏ కమిషనర్‌. సీఆర్‌డీఏ రూపొందించిన ప్రతిపాదనలో మొదటిది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం. దీని ద్వారా మౌలిక సదుపాయల కల్పన కోసం 5,500 కోట్లరూపాయలు సమకూరగలవని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో ప్రతిపాదన ప్రకారం లీజు-రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలో ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ నివాసాలు, సీడ్ కేపిటల్ ఏరియా అభివృద్ధిని చేపడతారు. ఈ విధానంలో మొత్తం రూ.2,850 కోట్లు సీఆర్‌డీఏకు సమకూరగలవని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.  ఇక మూడో ప్రతిపాదన కింద' జీ2జీ ఈక్విటీ ఫండ్' ను ఏర్పాటు చేస్తారు. దీని ప్రకారం రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతున్న విదేశీ సంస్థలను భాగస్వాములను చేస్తారు. దీని ద్వారా 1400 కోట్ల రూపాయల నిధులు సమీకరించవచ్చంటున్నారు.  నాలుగవ ప్రతిపాదనను సమిష్టి పెట్టుబడుల పథకంగా పిలుస్తున్నారు. దీని ప్రకారం.. స్పెషల్ పర్పస్ వెహికిల్ స్కీమ్‌ కింద రాజధాని పరిధిలో కొంత భూమిని రిజర్వ్ చేసి ఉంచుతారు. ఆ భూమిని యూనిట్లుగా విభజించి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తారు. ఇలా ఈ విధానంలో 2500 కోట్ల రూపాయలు సమీకరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.సీఆర్‌డీఏ రూపొందించిన 5వ ప్రతిపాదన ప్రకారం.. ముందుగా నిర్ణీత విలువ కలిగిన బాండ్స్ ను జారీ చేస్తారు. దీని ద్వారా 2వేల కోట్లరూపాయల నిధులు సమకూరగలవని అధికారులు అంచనా వేశారు. సీఆర్‌డీపీ రూపొందించిన ఈ ఐదు ప్రతిపాదనలు అమలు చేస్తే.. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నిధుల సమీకరణ సులభమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

06:58 - November 24, 2016

పెళ్లికి లైన్‌ క్లియర్‌ కావడంతో సమంత, నాగచైతన్యలు చక్కర్లు కొట్టేస్తున్నారు. పెళ్లి గురించి ప్రకటన వచ్చే వరకు ప్రేమ గురించి బయటపడకుండా ఎంతో సీక్రెట్ గా వ్యవహరించిన ఈ జంట.. ఇప్పుడు హుషారుగా షికార్లు చేస్తున్నారు. అభిమానుల కోసం తాము ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. మొన్నటికి మొన్న చైతూతో కలిసి టెన్నీస్‌ ఆడిన ఫొటోను పోస్ట్ చేసిన సమంత.. తాజాగా దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో సమంత తన మ్యారేజ్‌లో ధరించే వెడ్డింగ్ రింగ్‌ను కూడా పోస్ట్ చేయడం విశేషం.

06:57 - November 24, 2016

సీనియర్‌ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ టీమిండియాలో రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో గాయపడిన వృద్దిమాన్‌ సాహా స్థానంలో బీసిసిఐ సెలక్టర్లు పార్థివ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోన్న పార్దివ్‌ 8 ఏళ్ల తర్వాత భారత జట్టు తరఫున అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా కే ఎల్‌ రాహుల్‌ జట్టులో ఉన్నా మూడో టెస్ట్ లో పార్థివ్‌ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. మూడో టెస్ట్‌కే పార్థివ్‌ పటేల్‌ పరిమితమయ్యే అవకాశాలు సైతం లేకపోలేదు. మరి అనూహ్యంగా దక్కిన ఈ అవకాశాన్ని పార్థివ్‌ పటేల్‌ సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.

06:56 - November 24, 2016

హైదరాబాద్ : పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు.. కానీ ఇప్పుడు అదే పెద్దలు పెళ్లంటే పెద్ద కష్టం అంటున్నారు. జీవితాంతం వధూవరులకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే పెళ్లి వేడుక ఇప్పుడు చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారా.. దీనంతటికీ కారణం కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయమని ప్రత్యేకంగా చెప్పేదేముంది. మన భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి పెళ్లి అయ్యే వరకు పెళ్లింట్లో సందడే సందడి. పెళ్లికి కావాల్సిన సామాగ్రి, నగలు, అలంకారాలు, అట్టహాసాలు ఇలా ప్రతిది కొనుగోలు చేయడానికి నగదు చాలా ముఖ్యం.. కానీ ఇప్పుడు నోట్ల రద్దుతో వివాహ వేడుకలకు పెద్ద కష్టం వచ్చిపడింది. మొత్తంగా దేశంలో పెళ్లి కళే తప్పింది.

ప్రయోజనం ఏదీ ? 
పెళ్లికి రెండున్నర లక్షల రూపాయలను డ్రా చేసుకోవచ్చని కేంద్రం మినహాయింపు ఇచ్చినా.. దానివల్ల అంతగా ప్రయోజనం కనిపించడం లేదని పెళ్లింటివారు వాపోతున్నారు. రెండున్నర లక్షలతో పెళ్లిచేయడం కష్టమని భావించిన వారిలో ఎక్కువ మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే మూహూర్తాలు ఖాయం చేసుకొని పెళ్లి మండపాలు మాట్లాడుకున్నవారు, శుభలేఖలు పంచుకున్న వారు మాత్రం తూతూ మంత్రంగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.  నోట్ల రద్దుతో ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఇబ్బంది అవుతుందని.. చివరికి కట్న కానుకలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి తలెత్తిందని పెళ్లింటి వారు తమ ఆవేదనను వెల్లిబుచ్చుతున్నారు. అలాగే పెళ్లిళ్లకు బంధువులు రావాలన్నా చిల్లర కొరతతో రాలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొత్తమ్మీద ప్రధాని మోదీ నిర్ణయంతో ఎంతో వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్ల కళ తప్పింది. 

06:54 - November 24, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో జన్‌‌ధన్ అకౌంట్లలో డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఒక్కసారిగా ఈ డిపాజిట్లు పెరిగాయి. ఇప్పటివరకు పేదలకు చెందిన జన్‌ధన్‌ ఖాతాల్లో 21 వేల కోట్ల రూపాయలు డిపాజిట్ జమ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జన్‌ధన్ ఖాతాల్లో ఎక్కువగా నగదు జమ అయిన రాష్ర్టాల్లో పశ్చిమబెంగాల్ మొదటి స్థానంలో ఉండగా..కర్నాటక రెండో స్థానంలో నిలిచింది. ఇంతకుముందు లావాదేవీలు జరుగని ఖాతాల్లో నగదు జమపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. నగదు లావాదేవీల్లో అవకతవకలు జరిగినా, ఇతరుల డబ్బును తమ ఖాతాల్లో జమ చేసినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 8 తర్వాత జరిగిన పెళ్లిళ్లపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

06:52 - November 24, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల ర‌ద్దుతో గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. బిజినెస్‌ సరిగ్గా నడవక వ్యాపారాలు బోసిపోతున్నాయి. పాత నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు కస్టమర్ల రద్దీతో కళకళలాడిన షాపులు.. ఇప్పుడు బోసిపోతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం మోటర్ వాహ‌నాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వ ఖాజనాకు భారీ గండిపడుతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇబ్బందులు రోజు రోజుకు పెరిగిపోతునే ఉన్నాయి. నోట్ల ర‌ద్దు.. కొత్త నోట్ల సర్క్యూలేషన్‌ ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో వాహ‌నాల అమ్మకాలు భారీగా ప‌డిపోయాయి. వేలాదిగా సిటీకి వచ్చిన కొత్త వాహనాలు గోడౌన్ల‌కే ప‌రిమితం అయ్యాయి.

నిలిచిపోయిన కొనుగోళ్లు..
గ్రేట‌ర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు వేలాది కొత్త వాహ‌నాలు రోడ్డు మీద‌కు వ‌స్తాయి. అయితే.. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల మ‌నీ అందుబాటులో లేక వాహ‌నాల కోనుగోళ్లు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. గ‌త నెల‌తో పోలిస్తే 80 నుండి 90శాతం అమ్మకాలు ప‌డిపోయాయంటున్నారు వ్యాపారులు. అయితే కొందరు వ్యాపారులు పాత నోట్లు తీసుకుంటున్నా.. చాలామంది స‌సేమిరా అంటున్నారు. వ్యాపారాలు పూర్తిగా మంద‌గించ‌డంతో వ్యాపారాన్ని పెంచుకోవ‌డానికి డిడిలు అనుమ‌తించ‌డంతో పాటు స్వైఫింగ్ మిష‌న్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికంటూ చేప‌ట్టిన సంస్కర‌ణ‌లు.. వాహ‌నాల డీలర్లకు మాత్రం పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. అంతేకాదు.. నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్.. టాక్స్ ల ద్వారా ప్రభుత్వానికి వ‌చ్చే ఆదాయం కూడా భారీగా త‌గ్గిపోయింది. మరోవైపు చిరువ్యాపారులు బిజినెస్‌లేక ఉసూరుమంటున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా ఖాళీ చేతుల్తో ఉండాలోనని ఆందోళన చెందుతున్నారు. 

06:42 - November 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు కోసం తెలంగాణ రాష్ట్రం ఏమైన ప్రతిపాదనలు పంపిందా ? అని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాల పెంపు కుదరదని స్పష్టం చేశారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్‌ 371ను సవరించాల్సిన అవసరముందన్నారు. అయితే అది ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి.. నియోజకవర్గాల సంఖ్య పెంపు కుదరదని హన్సరాజ్‌ తెలిపారు.

సీట్లను పెంచాల్సి ఉంది..
అయితే.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. చట్టం ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదు. దీంతో రాజ్యాంగ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం అటార్నీ జనరల్‌ సలహా కోరింది. నిబంధనలు అంగీకరించవని అటార్నీ జనరల్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తూ తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే డీ లిమిటేషన్‌ను 2026 వరకు సీల్‌ చేస్తూ గతంలో పార్లమెంట్‌ చట్టాన్ని ఆమోదించడంతో.. అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేకుండాపోయింది.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు..
ఇదిలావుంటే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరని విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాలని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు పెంచాలని కోరతున్నాయి. రాష్ట్రాన్ని విభజించేందుకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను వాడుకున్నారో.. అదే ఆర్టికల్‌తో రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చని ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అయితే.. తాజాగా రాజ్యసభలో కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటనతో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు కష్టమేనని తెలుస్తోంది. మరి ఈ ప్రకటనపై తెలంగాణ రాష్ట్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

06:39 - November 24, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టార్‌ నయూం ఎన్‌కౌంటర్‌ తర్వాత అధికార పార్టీ నేతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తాజాగా వారిలో మరింత గుబులు రేపుతున్నాయి. అన్ని పార్టీల నేతలకు ఈ గ్యాంగ్ స్టార్‌తో సంబంధం ఉన్నా... గులాబీ నేతలు కీలకంగా వ్యవహరించారన్న విమర్శలు తీవ్రంగా రావడంతో వారిలో గుబులు రేగుతోంది. పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయడం మొదలు పెట్టడంతో పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. పొలిటికల్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన గ్యాంగ్‌స్టార్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత చాలామంది నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అందరికీ నయూంతో సత్సంబంధాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. రోజుకో పార్టీ నేత పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రధానంగా నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేతల పేర్లు ఎక్కువగా తెరపైకి వచ్చాయి.

పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు..
నయీం ముఠాతో ఎదుర్కొన్న ఇబ్బందులపై సిట్‌ బృందానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్‌ కూడా చేశారు. కానీ, చార్జ్ షీట్ లు వేయడంలో జాప్యం జరుగుతుండటంతో కొంత మంది నయూం అనుచరులకు బెయిల్‌లు కూడా లభించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా చార్జ్ షీట్ లు దాఖలు చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొంతమంది నేతల పేర్లు కూడా ఫిర్యాదులో సిట్ ముందుకు రావడంతో అధికారికంగా వారి పేర్లు కోర్టుకు చేరనున్నాయి. దీంతో గులాబీ పార్టీలో మరోసారి నయీం వ్యవహారం చర్చనీయంశంగా మారింది. కీలక బాధ్యతల్లో ఉన్న నేతలకు ఉద్వాసన తప్పదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరికొంత మంది నేతలు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి తమకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా ఎలాంటి సెటిల్ మెంట్లలో భాగస్వామ్యం లేదని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసుల విచారణపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సిట్ విచారణ చివరి వరకు ఎంత మంది మెడకు చుట్టుకుంటోందో అన్న అనుమానాలు నేతలను వెంటాడుతున్నాయి.

06:36 - November 24, 2016

విజయవాడ : డిసెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో లక్షా ఇరవై వేల గృహా నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. పట్టణ గృహ నిర్మాణం పథకం కింద నిర్మించే ఇళ్లకు నాలుగు నమూనాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. గృహ సముదాయాల నిర్మాణ సమయంలోనే మూల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది గృహ నిర్మాణ వ్యయంలో భాగంగా వుండాలే తప్ప లబ్దిదారుని నుంచి అదనంగా వసూలు చేయకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రతి నెలా ప్రగతి నివేదికలు..
పట్టణాలు, నగరాల్లోని రహదారులపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. పురపాలక శాఖ, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో రాష్ట్రంలోని మొత్తం 110 మున్సిపాలిటీల్లో రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట్ల నూతన రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు. కాకినాడ, నెల్లూరు, తాడిపత్రి, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో తక్షణం పనులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. మున్సిపాలిటీల్లో పరిస్థితిపై ప్రతినెలా ప్రగతి నివేదికలు ఇవ్వాలన్నారు. 

06:33 - November 24, 2016

హైదరాబాద్ : కేసీఆర్ కొత్త క్యాంపు ఆఫీస్ లోకి వెళ్లే లోపు .. పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీపై స్పష్టత ఇవ్వాలని శాస‌న‌మండ‌లి ప్రతిప‌క్ష నేత ష‌బ్బీర్ ఆలీ డిమాండ్ చేశారు. గ‌వ‌ర్నర్ ప్రసంగంలో ఇచ్చిన డ‌బుల్ బెడ్ రూమ్ హామీ ఎందుకు అమ‌లు కావ‌డం లేదో కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌న్నారు. దీనిపై గతంలో తాను లేఖ రాసినా.. సీఎం నుంచి ఎలాంటి సమాధానం రాలేద‌న్నారు. వాస్తు పేరుతో ప్రజాధ‌నాన్ని వృధా చేయ‌డానికి ..రాష్ట్ర ఖ‌జానా కేసీఆర్ జాగీరు కాద‌ని షబ్బీర్ అలీ మండిప‌డ్డారు.

06:31 - November 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎం క్యాంప్‌ ఆఫీసు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 5.22 గంటలకు కేసీఆర్‌ దంపతులు నూతన భవనంలోకి గృహ ప్రవేశం చేశారు. సుమారు 36 కోట్లతో.. అత్యాధునిక హంగులతో ఈ క్యాంప్‌ ఆఫీసును నిర్మించారు. 150కి పైగా గదులు .. 500 మందితో ఒకేసారి మీటింగ్‌ నిర్వహించే విధంగా హాల్‌.. మినీ థియేటర్లు లాంటి ఎన్నో హంగులు కొత్త క్యాంప్‌ ఆఫీసుకు హైలెట్‌గా ఉన్నాయి. శాస్త్రోక్తంగా ఈ గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, త్రిదండి చినజీయర్‌స్వామి హాజరయ్యారు. 

36 కోట్లు..
కొత్త క్యాంప్‌ ఆఫీసును 8 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 36 కోట్ల వ్యయంతో పక్కా వాస్తు ఆధారంగా నిర్మించారు. కొత్త క్యాంప్‌ ఆఫీసులో 150కి పైగా గదులు ఉండడం విశేషం. 500 మందితో ఒకేసారి మీటింగ్‌ నిర్వహించే విధంగా పెద్ద హాల్‌ను నిర్మించారు. దీంతోపాటు విజిటర్స్‌ బస చేసేందుకు ప్రత్యేక లాంజ్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అత్యాధునిక సాంకేతిక హంగులతో మినీ థియేటర్‌ను కూడా నిర్మించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో సీఎం డైరెక్ట్‌గా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక సీఎంవో కార్యదర్శులందరూ సీఎంకు అందుబాటులో ఉండేవిధంగా చాంబర్లు నిర్మించారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు సీఎం కొత్త క్యాంప్‌ ఆఫీసుకు హైలెట్‌గా నిలవనున్నాయి.

సర్వాంగ సుందరం..
కొత్త క్యాంప్‌ ఆఫీసులో నిర్మించిన సీఎం నివాసం, కార్యాలయం, సమావేశ మందిరంతో పాటు.. పాత ఆఫీసులోని రెండు భవనాలను కలిపి.. ప్రగతి భవన్‌గా పేరు పెట్టారు. వివిధ వర్గాలు, అధికారులతో జరిపే సమావేశానికి జనహిత అని నామకరణం చేశారు. ఈ హాల్‌లో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కుల వృత్తులకు చెందిన వర్గాలతో సీఎం భేటీలు నిర్వహిస్తారు. మొత్తానికి సర్వాంగ సుందరంగా నిర్మించిన కొత్త క్యాంప్‌ ఆఫీసు గృహ ప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. 

నేటి నుండి గ్రామీణ హస్తకళల మేళా..

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ సంస్థ గురువారం నుంచి 14వ జాతీయ గ్రామీణ హస్తకళల మేళా ప్రారంభంకానుంది. ఐదు రోజుల పాటు ఈ మేళా జరగనుంది. 

నేడు ప్రతిపక్షాలతో భేటీ కానున్న రాజ్ నాథ్ సింగ్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల తో ఈ సమావేశం జరగనుంది. 

నేడు రాజ్యసభకు మోడీ..?

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నేడు రాజ్యసభకు హాజరయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై సభలో మోడీ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. 

సీఎం అధికారిక నివాస భవనం ప్రారంభం..

హైదరాబాద్ : సీఎం అధికారిక నివాస భవనం ప్రారంభమైంది. ఉదయం 5.22 గంటలకు కేసీఆర్ దంపతులు గృహ ప్రవేశం చేశారు. శాస్త్రోక్తంగా ఈ గృహ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, చిన జీయర్ స్వామి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. 9 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా అధికారిక నివాసాన్ని నిర్మించారు. క్యాంపు కార్యాలయం, సమావేశ మందిరాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుత క్యాంపు ఆఫీస్ సమీపంలో ఈ నూతన భవనాలు నిర్మాణమయ్యాయి. సీఎం అధికారిక నివాసానికి 'ప్రగతి భవన్' గా నామకరణం చేశారు. 'ప్రగతి భవన్' లో సీఎం నివాసం, కార్యాలయం ఉండనున్నాయి. సీఎం సమావేశ మందిరానికి 'జనహిత'గా నామకరణం చేశారు.

Don't Miss