Activities calendar

25 November 2016

21:59 - November 25, 2016
21:56 - November 25, 2016

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధృవ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌తేజ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత అరవింద్‌స్వామి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

21:55 - November 25, 2016

ఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌, ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ సింధు మరో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌పై కన్నేసింది. చైనా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి జోరు మీదున్న సింధుకు హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లోనూ పోటీనే లేకుండా పోయింది. క్వార్టర్‌ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిఒన లియాంగ్‌ జియావూపై సంచలన విజయం సాధించి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.తొలి సెట్‌ను 21-17తో నెగ్గిన సింధు... రెండో సెట్‌లో పోరాడి 21-23తో కోల్పోయింది. మూడో సెట్‌ నుంచి జోరు పెంచిన సింధు లియాంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా  21-18తో చెమటోడ్చి నెగ్గి...సెమీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. 

 

21:54 - November 25, 2016

ముంబై : ఐటీ రంగ షేర్ల జోరుతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆరు నెలల్లో అతిపెద్ద సింగిల్ డే నమోదుగా రికార్డు సృష్టించిన సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో.. 26వేల 316 వద్ద ముగిసింది. నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 8వేల 114 వద్ద క్లోజైంది. రూపాయి విలువ పాతాళానికి పడిపోవడంతో.. ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ 5 శాతం పెరిగాయి. అదేవిధంగా కొన్ని దిగుమతులపై యాంటీ-డంపింగ్ డ్యూటీలను ప్రభుత్వం విధించడంతో స్టీల్ తయారీ కంపెనీలు కూడా లాభాల బాట పట్టాయి. నవంబర్ నెల డెరివేటివ్ల గడువు నిన్నటితో ముగియడంతో మార్కెట్లో ఇవాళ కొనుగోళ్లు పెరగడం కలిసొచ్చింది. డాలర్తో రూపాయి మారకం విలువ 35 పైసలు లాభపడి 68రూపాయల 40 పైసలుగా నమోదైంది. 

 

21:52 - November 25, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడారు. కాలర్ మైకు ద్వారా కొద్దిసేపు మాట్లాడారని అపోలో ఆసుపత్రి తాజా హెల్త్‌ బులెటిన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.  చికిత్సలో భాగంగా జ‌య‌ల‌లిత‌కు ప్రతిరోజూ కొద్ది స‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గతవారం చెప్పారు. అయితే ఎక్కువ సమయం ఏ అవసరం లేకుండా స్వయంగానే శ్వాస తీసుకుంటున్నారు. జయలలిత స్టాటిక్, యాక్టివ్ ఫిజియోథెరపీ తీసుకుంటున్నార‌ని.... కొన్ని రోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని కూడా తెలిపారు. జ‌య‌ల‌లిత ఎప్పుడు డిశ్చార్జి కావాల‌న్నది ఆమె ఇష్టమేనని ప్రతాప్‌ రెడ్డి పేర్కొన్నారు. జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ జయలలిత సెప్టెంబ‌రు 22న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

 

21:49 - November 25, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల ర‌ద్దుపై పార్లమెంట్‌లో ప్రతిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. తాము నల్లధనాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రధాని మాట్లాడుతున్నారని విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్షాల గందరగోళం నడుమ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ అట్టుడికింది. 
ప్రతిప‌క్షాల‌పై విరుచుకుపడిన ప్రధాని  
ఉభయ సభల సమావేశాలు ప్రారంభానికి ముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోది పార్లమెంట్‌ ఆవరణలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని త‌ప్పుబ‌డుతున్న ప్రతిప‌క్షాల‌పై ప్రధాని విరుచుకు పడ్డారు. నల్లధనం ఉన్నవారికి సమయం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరికి బాధ కలుగుతోందన్నారు. వారికి 72 గంటల సమయమిస్తే ... మోది గొప్పవాడని పొగిడేవాళ్లని ప్రధాని పేర్కొన్నారు. 
ప్రధాని వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ 
నల్లధనానికి ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. మోదీ తమను బ్లాక్ మనీ బాస్‌లుగా వర్ణిస్తున్నారని ఆరోపించాయి. దీనిపై ప్రధాని మోది  క్షమాపణ చెప్పాలని ఆజాద్‌తో సహా విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో మధ్యాహ్నం రెండున్నర వరకు సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా ఎలాంటి మార్పు లేకపోవడంతో  డిప్యూటీ ఛైర్మన్ సభను సోమవారానికి వాయిదావేశారు.
లోకస‌భలోనూ ఇదే రగడ
అటు లోకస‌భలోనూ ఇదే రగడ. విపక్షాలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మాట్లాడే యత్నం చేయగా స్పీకర్‌ అనుమతించలేదు. ఇందుకు నిరసనగా ప్రతిప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. విపక్షాల ఆందోళ‌న మ‌ధ్యే స్పీకర్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాల‌ను కొన‌సాగించారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ స‌భ‌ను 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. ఈ సమయంలో లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకేందుకు యత్నించిన రాకేష్‌సింగ్‌ను లోక్‌సభ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభలో కొద్దిసేపు కలకలం రేగింది. 
సభలోకి దూకేందుకు రాకేష్‌సింగ్‌ యత్నం  
తిరిగి సభ ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన వీడలేదు. విజిటర్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకే యత్నం చేసిన రాకేష్‌సింగ్‌పై భద్రతా అధికారులు విచారణ జరిపి హెచ్చరించి వదిలేసినట్లు స్పీకర్‌ మహాజన్‌ సభకు తెలిపారు. అనంతరం లోక్‌సభను 28వ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

21:44 - November 25, 2016

చెన్నై : నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఆచరణలో ఘోరంగా విఫలమైందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ విమర్శించారు. నోట్ల రద్దును నిరసిస్తూ చెన్నైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో బృందా కరత్‌ పొల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ఐదొందలు, వెయ్యి నోట్లు రద్దు చేసి పదిహేడు రోజులైనా కరెన్సీ కష్టాలు ఇంకా తగ్గలేదన్నారు. పెద్ద నోట్ల మార్పిడికి డిసెంబర్‌ వరకు గడువు ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని బృందా కరత్‌ డిమాండ్‌ చేశారు.

 

21:36 - November 25, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అనాలోచిత చర్యగా స్పష్టమవుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో రైతాంగం, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. తక్షణమే పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలని  డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని మధు తెలిపారు. 

 

21:26 - November 25, 2016

ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వేధింపులు.. బిడ్డను చంపుకున్న తల్లి

ప్రకాశం : హనుమంతునిపాడు మండలం వేములపాడులో దారుణం జరిగింది. నాలుగు నెలల పసికందును తల్లి గొంతు నులిమి చంపింది. ఆడ పిల్ల పుట్టిందని అత్తమామల వేధింపులు తాళలేక తల్లి కన్న బిడ్డను చంపుకుంది.
  

21:06 - November 25, 2016

ఇండస్త్రీకి సినిమా చూపిస్తున్న నోట్ల రద్దు, బ్యాంకుల ముందు పడి గాపులు.. బోసిపోతున్న థియేటర్లు, షూటింగులు లేక విలవిల్లాడుతున్న జూ.ఆర్టిస్టులు, టాలీవుడ్ కి కరెన్సీ షాక్, సినిమా కష్టాలు.. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:59 - November 25, 2016

శ్రీనివాస్ రెడ్డి, పూర్ణిమ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. 'జయమ్ము నిశ్చయమ్మురా' ఇవాళ విడులైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మరి ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులు అభిప్రాయాలు, టెన్ టివి రివ్యూను వీడియోలో చూద్దాం...

చైనాలో భారీ భూకంపం

బీజింగ్ : చైనాలో భారీ భూకంపం సంభవించింది. జిన్జియాంగ్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5 శాతంగా నమోదు అయింది. జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. 

20:50 - November 25, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో సామాన్యులే కాదు.. సర్కార్‌ ఉద్యోగులు కూడా సతమతమవుతున్నారు. సకాలంలో జీతం రాక కాదు.. వచ్చిన వేతనం ఎలా తీసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. జీతం ఖాతాలలో కాకుండా...చేతికందిస్తే బాగుంటుందని కోరుతున్నారు .
పెద్దనోట్ల రద్దుతో ప్రభుత్వ ఉద్యోగులు సతమతం
ప్రధానమంత్రి మోదీ నిర్ణయంతో...దేశం మొత్తం.. కరెన్సీ కష్టాలతో సతమతమవుతోంది. చేతిలో పాత పెద్ద నోట్లున్నా మారని పరిస్థితి.. దీంతో బ్యాంకుల్లో పెద్దనోట్లు డిపాజిట్‌ చేసేందుకు ఓ వైపు.. ఖర్చులకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలు..బ్యాంకుల వద్ద పడిగాపులు మరోవైపు.. ఇలా ప్రజలు పడని పాట్లు లేవు. కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కష్టజీవుల జాబితా కూడా అదేస్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులూ ఈ కష్టజీవుల జాబితాలో చేరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత తొలిసారిగా జీతాలు అందుకోబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చులకు సరిపడా డబ్బు విత్‌డ్రా చేయడం ఎలాగో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.
జీతాన్ని చేతికి ఇవ్వాలని కోరిన ఉద్యోగులు
25వ తేదీనుంచి ఈ నెల 30 వరకు వేతనాలు వారివారి ఖాతాల్లో పడిపోతుంటాయ్‌.. అయితే మొత్తం జీతాన్ని చేతికి ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు.. కానీ అది సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. దీంతో వేతనాలలో 10వేల రూపాయాలైనా తమ చేతికి ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు ఇబ్బందులు కలిగించవద్దని ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.      
ఆందోళన చెందుతున్న పెన్షనర్లు
సర్వీసులో ఉన్న ఉద్యోగులే కాకుండా.. రెండు లక్షల 25 వేల మంది పెన్షనర్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది..వారు కూడా నగదు రూపంలోనే పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే వివిధ శాఖల్లో 80వేల మంది ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి పది వేలు నగదు ఇస్తే.. తమ వేతనం మొత్తాన్నీ నగదు రూపంలో ఇవ్వాలని వారు కోరుతున్నారు.   
నగదు రూపంలో పది వేలు 
నోట్ల కష్టాలు నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రూపంలో పది వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. హర్యాన ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది.. మరి తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

20:35 - November 25, 2016

శంషాబాద్ ల దిగి హైదరాద్ వచ్చిన మోడీ, కొండ నాలుకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది, ఆంధ్రుల అమ్మలక్కలకు ఆండ్రాయిడ్ ఫోన్లు, అమర జవాన్ల భార్య ఆమరణ నీరాహారదీక్ష, హిందూపురంల గర్జించిన బాలయ్య, మందు తాగితే గుండె పోట్లు రావంట, పట్టా గొలుసుల చోరీ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

'అనంత' జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం

అనంతపురం : సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయాలను వారికి వివరించారు.

 

20:28 - November 25, 2016

పెద్ద నోట్ల రద్దు ఉద్యోగుల వేతనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఆండ్ సేల్స్ నేత రాజు భట్, యూటీఎఫ్ కోశాధికారి శారద, ఏపీఎన్ జీవో నేత విద్యా సాగర్ పాల్గొని మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:18 - November 25, 2016

విజయవాడ : కాపులకు ఎలాంటి రాజకీయ రిజర్వేషన్లు ఉండవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. కాపులను ఆర్థికంగా బలపరిచేందుకే బీసీల్లో కలుపుతామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:13 - November 25, 2016

హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభాయ్‌ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి బయల్దేరి వెళ్లారు. రాత్రికి అక్కడే బసచేస్తున్న ప్రధానమంత్రి.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీ/ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులను, రాజకీయ పార్టీల నేతలను కలుస్తారా, లేదా? అనే దానిపై స్పష్టత లేదు. అలాంటి వివరాలేవీ ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో పొందుపర్చలేదు. దినచర్యలో భాగంగా ప్రధాని శనివారం తెల్లవారుజామున గంట సేపు యోగా కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారని, 7 నుంచి 8 గంటల వరకు రిజర్వు సమయమని ప్రధాని షెడ్యూలులో పేర్కొన్నారు. తర్వాత 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా డీజీపీలు, ఐజీపీల సమావేశంలో పాల్గొంటారు. 

 

20:04 - November 25, 2016
19:59 - November 25, 2016
19:57 - November 25, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 100 సెంటర్లలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటు అక్షయపాత్ర ప్రతినిధులు, పౌరసరఫరా శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరై చర్చించారు. ప్రాంతాల వారీగా ఎలాంటి మోనును అందించాలనే విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి సునీత తెలిపారు.   

 

19:54 - November 25, 2016

తూర్పుగోదావరి : రద్దైన 500, వెయ్యి నోట్లను డిసెంబర్‌ 31 వరకు చెల్లుబాటయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు కోరాయి. ఈ మేరకు కాకినాడలో ప్రజాసంఘాలు ధర్నా చేశాయి. అలాగే విదేశాల్లోని బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తేవాలని ప్రజసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

 

19:49 - November 25, 2016

విజయవాడ : రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడికి మరికొంత గడువు ఇవ్వకపోవడం పట్ల ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వియజవాడ హెడ్‌ పోస్టాఫీసు దగ్గర ఆందోళనకు దిగారు. కొత్త కరెన్సీ నోట్లు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదని నేతలు అన్నారు. కొత్త కరెన్సీ పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు పాత నోట్ల మార్పిడికి అవకావం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు జీతాలు కరెన్సీ రూపంలోనే ఇవ్వాలని కోరారు.

 

19:44 - November 25, 2016

విజయవాడ : ప్రజల్లో ఉండే వారికి, పార్టీలో కష్టపడి పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన కల్లుగీత, క్రిష్ణ బలిజ పూసల, మేదర ఫెడరేషన్ పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై, ప్రసంగించారు. నాయకులు తన చుట్టూ తిరిగితే లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో తాము ఎక్కువగా ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది బలహీన వర్గాలకు మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 

 

19:38 - November 25, 2016

విజయవాడ : ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ  శాసనసభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పేరుతో నిధులు విడుదల చేస్తుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు  విజయవాడలో చంద్రబాబును కలిశారు. నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. టీడీపీ శాసనసభ్యులతో పాటు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

19:35 - November 25, 2016

గుంటూరు : అమరావతి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో తొలి ఏసీబీ దాడి జరిగింది. లంచం తీసుకుంటుండగా హోంశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనాధ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీనాధ్‌ నుంచి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:32 - November 25, 2016

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లి అర్జున్ థియేటర్ లో జయమ్ము నిశ్చయమ్మురా సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు శివరాజ్ కనుమూరి సందడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్ వేసిన ప్రీమియర్ షో లకు మంచి స్పందన వచ్చిందన్నారు. మూడు సంవత్సరాల పాటు పడ్డ కష్టాన్ని ఈ రోజు థియేటర్లలో చూస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 

 

19:29 - November 25, 2016

మెదక్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదంగా సాగుతున్న సీపీఎం మహాజనపాదయాత్ర మెదక్ జిల్లా మంబోజిపల్లిలో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా మంబోజిపల్లిలో 1000 కి.మీల శిలాఫలాకాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పాదయాత్ర బృందం సభ్యులు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. పాదయాత్రకు అడుఅడుగునా జనాలు నీరాజనాలు పలికారు. అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలైన మహాజనపాదయాత్ర నిర్విరామంగా 40రోజులపాటు మహబూబ్ నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగింది. పాదయాత్రలో సామాజిక తరగుతులు, కులవృత్తులు, కార్మిక, కష్ట జీవులు తమ్మినేని బృందానికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను ఇబ్బందులను సీపీఎం పాదయాత్ర బృందం ముందు వెళ్లబోసుకుంటున్నారు. 

 

మధిరలో రూ.కోటి విలువైన నకిలీ కారం పట్టివేత

ఖమ్మం : మధిరలో రూ.కోటి విలువైన నకిలీ కారం పట్టుకున్నారు. ఇల్లందుపాకలో కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వ ఉంచిన 509 టన్నుల నకిలీ కారం బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం దెందుకూరులో భారీగా నకిలీ కారం బస్తాలు పట్టుకున్నారు. 

ఛత్తీస్ గఢ్ లో నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ జిల్లా నీలిమడుగు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోస్టులు చనిపోయినట్లు సమాచారం. పోలీసులు భారీగా మావోయిస్టు సమాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

19:14 - November 25, 2016

సంగారెడ్డి : నల్లధనం అరికట్టేందుకు కేంద్ర తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా, పర్యవసానాలను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. ఈమేరకు కోదండరామ్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తగినన్ని నగదు నిల్వల్ని రాష్ట్రానికి తెప్పించి సామాన్య ప్రజల కష్టాలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:09 - November 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పెంపు కోసం కేంద్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్ కోరారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్యను పెంచేలా కేంద్రం వెంటనే ఏపీ పునర్వివ్యస్థీకరణ చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇదేమీ జఠిలమైన సమస్య కాదని..రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం సవరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోని నియోజకవర్గాల పెంపు ఉండేలా చట్టసవరణ చేయాలని వినోద్ డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి..సవరణ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

 

హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని, ఇరు పార్టీల డీజీపీలు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలికారు. 

 

కాసేపట్లో శంషాబాద్ కు ప్రధాని మోడీ

రంగారెడ్డి : కాసేపట్లో ప్రధాని నరేంద్రమోడీ శంషాబాద్ కు రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని, ఇరు పార్టీల డీజీపీలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 

 

కాసేపట్లో శంషాబాద్ కు ప్రధాని మోడీ

రంగారెడ్డి : కాసేపట్లో ప్రధాని నరేంద్రమోడీ శంషాబాద్ కు రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని, ఇరు పార్టీల డీజీపీలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 

ట్యాంక్ బండ్ పై 'లవ్' లోగో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై 'లవ్' లోగోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందీ ఇంగ్లీష్ లోనూ లోగో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ లోగో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందన్నారు.సందర్శకులకు సెల్ఫీ స్పాట్ గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

17:39 - November 25, 2016
17:37 - November 25, 2016

సీఎం మాతో కక్ష సాధింపుగా మాట్లాడారు: పెద్దిరెడ్డి

విజయవాడ : సీఎం మాతో కక్ష సాధింపుగా మాట్లాడారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రాంచద్రారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ముగిసింది. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.... నోట్ల రద్దు, ప్రజలఇ బ్బందులు సీఎంకి వివరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వలేదు. సీఎంతో సమావేశం చాలా నారాశగా జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధులు ఇవ్వకుం టిడిపి ఇంఛార్జికి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులివ్వమని సీఎం డైరెక్టుగా చెప్పారని ఇది చాలా దారుణం అని రామచంద్రారెడ్డి అన్నారు.

 

17:35 - November 25, 2016

ఏసీబీ వలకు హోంశాఖ డిపార్ట్ మెంట్ సెక్షన్ ఆఫీసర్

గుంటూరు : రూ.50వేలు లంచం తీసుకుంటూ హోంశాఖ డిపార్ట్ మెంట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్ ఏసీబీకి పట్టుబడ్డాడు.

17:32 - November 25, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఉగ్రవాదులకు, ఆర్మీ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. నిఘావర్గాల సమాచారం మేరకు బందీపురాలోని నైద్‌ఖై ప్రాంతంలో ఉదయం ఆర్మీ సోదాలు నిర్వహించింది. సోదా నిర్వహిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపాయి. దీంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లతో పాటు ఇతర ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. సోపోర్‌లో కూడా ఉగ్రవాదులకు ఆర్మీ దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. 

 

కాంగ్రెస్ హయాంలోనే నల్లధనం విదేశాలకు తరలింది: వెంకయ్యనాయుడు

విశాఖ : కాంగ్రెస్ హయాంలోనే నల్లధనం విదేశాలకు తరలివెళ్లిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నల్లధనం దాచేందుకు సైప్రస్, మారిషస్ స్వర్ణధామాలు అని చెప్పారు. సమాచార మార్పిడి కోసం ఆ దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుందని తెలిపారు.

17:29 - November 25, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. కుల్గాంలో పోలీసుల కన్వాయ్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. పోలీసు వాహనంపై ఉగ్రవాదులు తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పోలీసును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల దాడితో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

17:21 - November 25, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నేతలు అన్నారు. ఈమేరకు బ్యాంకు ఉద్యోగులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న ముద్రణ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పని చేసినా కరెన్సీ కొరత తీర్చే అవకాశం లేదని చెప్పారు. మరో 5 నెలల పాటు బ్యాంకుల్లో నగదు కొరత ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వారి మాటల్లోనే..
'ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరికీ మంచి జరిగే విధంగా ఉండాలి. నోట్ల రద్దుతో జరిగే పరిణామాలను ప్రభుత్వం ఊహించలేదు. మరో 5 నెలల పాటు బ్యాంకుల్లో నగదు కొరత ఉంటుంది. డబ్బు కొరత లేకపోతే నిబంధనలు ఎందుకు విధించారు?. కేంద్రం ప్రభుత్వ బ్యాంకుల వ్యతిరేక విధానాలను ఆచరిస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలో బ్యాంకులు నో క్యాష్‌ బోర్డులు పెట్టలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానం చెప్పాలి' అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించండి: తమ్మినేని

మెదక్ : పాదయాత్రలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు మా దృష్టికి వచ్చాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తెలిపారు. గత 40 రోజులగా రాష్ట్రంలో పాద యాత్రలో చేస్తున్నారు. కనీస వేతన సలహా మండలి బోర్డు ఏర్పాటు చేసినా కార్మికులకు ఫలితం లేకుండా పోయిందన్నారు. నిత్యావసరాల ధరలు రెండొందల రెట్లు పెరిగాయని.. వారి కనీస అవసరాలు తీర్చుకునేం వారికిచ్చే వేతనాలు చాలడం లేదని ఆరోపించారు. కనీస వేతనం రూ.18వేలు అమలయ్యేలా చూడాలని, అన్ని పరిశ్రమల్లో ఇఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

16:52 - November 25, 2016

కర్నూలు : జిల్లాలో విషాదం నెలకొంది. పెద్ద నోట్ల రద్దు మరొకరి ప్రాణాన్ని బలితీసుకుంది. డబ్బుల కోసం ఎస్బీఐ వద్ద క్యూలో నిల్చుని రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందారు. నందికొట్కూరులోని స్థానిక ఎస్ బీఐ వద్ద రిటైర్డ్ ఉద్యోగి బాలరాజు రెండు గంటలుగా క్యూలైన్ లో నిల్చున్నారు. 4 రోజులుగా బ్యాంకుకు వస్తున్న డబ్బులు లేకపోవడంతో.. ఖాళీగా వెళ్లారు. ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపించడంతో మనస్థాపం చెందారు. గుండెపోటు రావడంతో బాలరాజు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం విషమించడంతో బాలరాజు మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మాట్లాడుతున్న తమిళనాడు సీఎం జయలలిత

చెన్నై: జ్వరం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తదితర సమస్యలతో రెండు నెలలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రెండు నెలల తర్వాత తొలిసారి మాట్లాడారు. స్పీకర్స్ (కాలర్ మైక్) ద్వారా ఆమె కొద్ది నిమిషాల సేపు మాట్లాడినట్టు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డినట్టు ఆయన చెప్పారు.

16:44 - November 25, 2016

ఢిల్లీ : నీట్ మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షల్లో కోటాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. 50 శాతం జాతీయ కోటాలో తెలంగాణ, ఏపీలకు అనుమతి లేదంటూ ఎంసీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ తెలంగాణకు చెందిన శ్రావ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఎంసీఐకి నోటిసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:37 - November 25, 2016

విజయవాడ : సీఎం క్యాంపస్ లో సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు సచివాలయాన్ని  సందర్శించారు. ఉదయం సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదు. సాయంత్రం 4 గంటలకు వారికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. సా. 4 గం.లకు సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:28 - November 25, 2016
16:27 - November 25, 2016

మహారాష్ట్ర : ముంబాయిలో ఓ కేర్ టేకర్ అత్యంత రాక్షసంగా ప్రవర్తించింది. పది నెలల పసిపాపను చావ బాదింది. ఆడుకుంటున్న పిల్లను లాగిలాగి కొట్టింది.  దెబ్బలు తగిలి నొప్పితో పాప ఏడుస్తున్నా వదిలిపెట్ట లేదు. పసిబిడ్డ అన్న కనికరం లేకుండా కొట్టిన చోటే కొట్టింది. నవీ ముంబాయ్‌లోని పూర్వా ప్లేస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. తన బిడ్డ ఒంటినిండా గాయాలు ఉండటంతో పాప తల్లి ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే పాపను కేర్ టేకర్ అఫ్సానాషేక్ కొడుతూ కనిపించింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌కు పంపించారు.

 

16:23 - November 25, 2016

హైదరాబాద్‌ : నగరంలో రేపటి నుంచి మూడు రోజులపాటు డీజీపీల సదస్సు జరుగనుంది. సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జాతీయ అకాడమీలో జరుగనున్న ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 
సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ 
డీజీపీల సదస్సుకు మొట్టమొదటి సారి హైదరాబాద్‌ ఆథిత్యం ఇస్తోంది. సర్దార్‌ వల్లభాయిపటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ఈ సదస్సు జరుగుంది. ఈ సదస్సును హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు 29 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు, సీఐఎఫ్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ, సీబీఐ, కేంద్ర పారామిలటరీ విభాగాల చీఫ్‌లు హారవుతారు.
డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న మోడీ
డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ  పాల్గొంటున్నారు. శనివారం ఉదయం ఆయన డీజీపీలను ఉద్దేశించి  ప్రసంగిస్తారు. శుక్రవారం సాయంత్రమే ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు చేరుకుంటారు. జాతీయ పోలీసు అకాడమీలోని రాజస్థాన్‌ హౌస్‌ను ప్రధాని బస కోసం కేటాయించారు. 
హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం 
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.  శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జాతీయ పోలీసు అకాడమీ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు చోట్ల ప్రత్యేక పికెట్‌లను ఏర్పాటు చేశారు. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.  ప్రధాన కూడళ్లు, రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతిపక్షాలు నిరసనకు దిగే అవకాశముండడంతో దారిపొడవునా... పోలీసులు మోహరించారు. 
డీజీపీల సదస్సులో పలు అంశాలపై చర్చ 
మూడు రోజులపాటు జరిగే డీజీపీల సదస్సులో పలు అంశాలపై చర్చ జరుగనుంది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల దాడులు, పాక్‌సైన్యం కాల్పులు, మావోయిస్టుల కార్యకలాపాలు, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. దేశ అంతర్గత భద్రత, మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచడంపైనా ప్రధానంగా దృష్టి సారించనున్నారు. 

 

16:20 - November 25, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి అన్నారు. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చర్యను జగ్గారెడ్డి తప్పుపట్టారు. సామాన్య జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, కనీస చర్యలకు ఉపక్రమించకపోవడంపై ఆయన మండిపడ్డారు. దీనికి నిరసనగా రేపు సంగారెడ్డిలో ముంబాయి జాతీయ రహదారిని దిగ్బంధం చేయనున్నామని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఎంఐసీకి నోటీసులు

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఎంఐసీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.నీట్ మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో కోటాపై సుప్రీం పిటిషన్ దాఖలు అయ్యింది. 50 శాతం జాతీయ కోటాలో తెలంగాణ, ఏపీలకు అనుమతి లేదంటూ ఎంసీఐ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ సుప్రీంలో తెలంగాణ కు చెందిన శ్రావ్య అనే విద్యార్థి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

సీఎం చంద్రబాబు తో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

విజయవాడ : సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల నిధల కేటాయింపు పై సీఎం కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే సచివాలయాన్ని వైసీపీ ఎమ్మెల్యే సందర్శించారు.

'ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఫలాలు త్వరలో విడుదల చేస్తాం`

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై లోక్ సభలో టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రశ్నించారు. దానికి అర్జున్ రామ్ మేఘ్వాల్ బదులిస్తూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేశామన్నారు. ఏపీ నేతలు ప్రత్యేక సాయం అడుగుతున్నారని, ప్యాకేజీ ఫలాలు త్వరలోనే విడుదల అవుతాయని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

16:01 - November 25, 2016

కడప : జిల్లాలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజల అల్లాడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర అసహానం వ్యక్తమవుతోంది. పదిహేడు రోజులు పూర్తయిన బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద క్యూలో నిలబడటం మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. 2000 రూపాయల నోటుతో తమకు మరిన్ని కష్టాలు తోడయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పాకిస్థాన్ తో సింధూ జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తాం: మోదీ

పంజాబ్ : ఆనంద్ పూర్ సాహిట్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాకిస్థాన్ తో సింధూ జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తామని.. పాకిస్థాన్ కు ఒక్క చుక్క నీరు వదలమన్నారు. సింధూ నదిలో భారత్ కు దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడుకుంటామన్నారు. ఆ నీటితో పంజాబ్, కాశ్మీర్ లను సస్యశ్యామలం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.

51వ డీజీపీల కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్

హైదరాబాద్ : నేషనల్ పోలీస్ అకాడమీలో 51వ డీజీపీల కాన్ఫరెన్స్ ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 29 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ లు పాల్గొన్నారు.

సీఎంలు కేజ్రీవాల్, మమతా బెనర్జీలపై సుప్రీంలో పిటిషన్

ఢిల్లీ : పాత నోట్ల రద్దు పై సీఎంలు కేజ్రీవాల్, మమతా బెనర్జీలు ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని సుప్రీం కోర్టులో న్యాయవాది అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 456 పాయింట్ల వద్ద లాభపడి 26.316 వద్ద ముగిసింది. నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 8.114 వద్ద ముగిసింది.

మోడీ పై 302 కేసు నమోదు చేయాలి: సిపిఐ నారాయణ

అనంతపురం : ఇండియన్ కరెన్సీ విలువలను దిగజార్చిన మోడీపై తక్షణమే 302 కేసు నమోదు చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఆర్బీఐ గరవ్నర్ ఉర్జీత్ పటేల్ ను ప్రజాకోర్టులో ఉరితీయాలని కూడా సూచించారు. కార్పొరేట్లతో చేతులు కలిపి ప్రజల్ని రోడ్డు పాలు చేశారని ఆరోపించారు. డబ్బు కోసం 60 మంది చనిపోయారని... ఇవన్నీ సర్కార్ హత్యలే అని అన్నారు.

ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రియురాలు ఆత్మహత్య

కామారెడ్డి : బిక్నూర్ మండలం మల్పుల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బీసీల్లో రాజకీయం తెచ్చిన ఘనత టీడీపీదే: చంద్రబాబు

విజయవాడ : బీసీల్లో రాజకీయం తెచ్చిన ఘనత టీడీపీదే సీఎంచంద్రబాబు అన్నారు. వెనుకబడిన కులాల ఫెడరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిధిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. బీసీలను కాంగ్రెస్ విస్మరించిందని, కాంగ్రెస్ హయాంలో దయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అవినీతి పోవాలి, ప్రజాస్వామ్యం అపహాస్యం కావద్దని సూచించారు. కాపుల్లో ఎవనుకబడిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాపులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు ఇస్తాను, కానీ రాజకీయాల్లో కాదని తేల్చేశారు.

15:21 - November 25, 2016

హైదరాబాద్ : ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఓయూలో ఉత్సవాలపై ఉస్మానియా వీసీ, అధికారులు, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ రంజీవ్‌ ఆచార్యులతో ఆయన సమీక్షించారు. ఉత్సవాల సందర్భంగా భారతదేశంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో కాన్ఫడరేషన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని.. పలు పుస్తకాలను తీసుకురావాలని ఆలోచిస్తున్నామని కడియం అన్నారు. అలాగే ఓయూలో సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

 

నాగోల్ లో మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని ఎల్బీనగర్ సమీపంలోని నాగోల్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, అనంతరం శ్మశానవాటికకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఢిల్లీలో బాణసంచాపై నిషేధం : సుప్రీం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారుల లైసెన్స్ లు రద్దు చేయాలని, ప్రస్తుతానికి కొత్త లైసెన్స్ లు జారీ చేయవద్దని, బాణసంచావల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

15:09 - November 25, 2016

ఢిల్లీ : రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. స్పీకర్ పోడియంను విపక్ష సభ్యులు చుట్టుముట్టాయి. రాజ్యసభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత వారించినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా ఆందోళన చేపట్టాయి. దీంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రాజ్యసభను సోమవారం ఉదయం 11.00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కాపులు రాజకీయంగా బాగానే ఉన్నారు : సీఎం చంద్రబాబు

విజయవాడ : రాజకీయంగా కాపులు బాగానే ఉన్నారని, బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

14:55 - November 25, 2016

విజయనగరం : పాత నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ నేతలు అన్నారు. పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ విజయనగరంలో సీఐటీయూ నేతలు, కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు మాట్లాడుతూ సామాన్యుడి కష్టాలను కేంద్రప్రభుత్వం గాలి కొదిలేసిందని విమర్శించారు. పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం సరికాదని హితవు పలికారు. రద్దు చేసిన రూ. 500, వెయ్యి నోట్లను డిసెంబర్ 31వరకు అమలులో ఉంచాలని కోరారు. డబ్బులకు కోసం నల్లకుబేరులు ఎవరు కూడా క్యూలో నిలబడడం లేదని.. సామాన్య ప్రజలే నిలబడి అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ జీతాలను నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రాజ్యసభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేపట్టాయి. విపక్ష సభ్యులను డిప్యూటీ ఛైర్మన్ వారించినా వినపకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్ష సభ్యులు

ఢిల్లీ : రెండు సార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. విపక్షాలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడంలో సభలో గందరగోళం నెలకొంది.

డిపాజిట్ చేసేందుకు క్యూలో నిలబడిన రిటైర్డ్ ఉద్యోగి మృతి

కర్నూలు : నందికొట్కూరు ఎస్ బీఐ బ్యాంకు వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చి క్యూలైన్లో నిలుచున్న రిటైర్డ్ ఉద్యోగి బాలరాజు మృ

100 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు : మంత్రి పరిటాల

గుంటూరు : రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేస్తామన్నారు. మెనూ పై సీఎం తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అక్షయ పాత్ర ద్వారానే అన్నా క్యాంటీన్ల నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

రాజ్ నాథ్ సింగ్ ఘన స్వాగతం

హైదరాబాద్ : డీజీపీల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, డీజీపీ అనురాగ్ శర్మ, ఎన్పిఏ డైరెక్టర్ జనరల్ బహుగుణ, ఏపీ డీజీపీ సాంబశివరావు లు ఘన స్వాగతం పలికారు.

కుల్గాంలో పోలీసు వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూకాశ్మీర్ : కుల్గాంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.

ముంబైలోని ఒషివారాలో అగ్ని ప్రమాదం

ముంబై : ఒషివారాలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

14:03 - November 25, 2016

తాను నటించిన సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు టాలీవుడ్ యంగ్ హీరో 'నిఖిల్' ధన్యవాదాలు తెలిపారు. ఆయన నటించిన చిత్రం 'ఎక్కడకు పోతావు చిన్నవాడా' మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర హీరో 'నిఖిల్', దర్శకుడు 'ఆనంద్'తో టెన్ టివి ముచ్చటించింది. పలు చిత్ర విశేషాలను వారు తెలియచేశారు. అంతేగాకుడా పలువురు కాలర్స్ అభిప్రాయాలు పంచుకున్నారు. నోట్ల రద్దులో కూడా చిత్రం మంచి విజయం సాధించిందని, ఇందుకు ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు 'నిఖిల్, 'ఆనంద్' పేర్కొన్నారు. మరి వారు ఎలాంటి విశేషాలు వెల్లడించారు ? ఎవరెవరు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:53 - November 25, 2016
13:51 - November 25, 2016

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నిఖిల్' ఒకరు. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. ఈయన నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి కూడా. తాజాగా 'ఎక్కడకు పోతావే చిన్నవాడా' అనే చిత్రంలో నటించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా 'నిఖిల్'..చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా 'నిఖిల్' మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం పట్ల పలువురు తిట్టారని పేర్కొన్నారు. ఎందుకంటే నోట్ల రద్దు వల్ల జనాల దగ్గర డబ్బుల్లేవు అని తెలిపారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే సక్సెస్ అవుతుందని అనుకున్నామని అందుకే సినిమాను విడుదల చేయడం జరిగిందన్నారు. చిత్రం పది కోట్ల కలెక్షన్ చేయబోతోందని, యూఎస్ లో కూడా కలెక్షన్స్ బాగా ఉన్నాయన్నారు. రెండో వారం అయినా విజయవంతంగా నడుస్తోందని, కథ మంచిగా ఉంటే ఆదరిస్తారని ఈ సినిమా రుజువు చేస్తోందన్నారు. ప్రతిది రివ్యూ బాగా ఇచ్చారని, ప్రధానంగా టెన్ టివి రివ్యూస్ చూసి ప్రేక్షకులు కదులుతుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు 'నిఖిల్' పేర్కొన్నారు. 

13:44 - November 25, 2016

మెదక్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర మెదక్ జిల్లా మంబోజిపల్లిలో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా మంబోజిపల్లిలో 1000 కి.మీల శిలాఫలాకాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పాదయాత్ర బృందం సభ్యులు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. పాదయాత్రకు అడుఅడుగునా జనాలు నీరాజనాలు పలికారు. అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలైన మహాజన పాదయాత్ర నిర్విరామంగా 40 రోజుల పాటు మహబూబ్ నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగింది. పాదయాత్రలో సామాజిక తరగుతులు, కులవృత్తులు, కార్మిక, కష్ట జీవులు తమ్మినేని బృందానికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను ఇబ్బందులను సీపీఎం పాదయాత్ర బృందం ముందు వెళ్లబోసుకుంటున్నారు.

13:42 - November 25, 2016

నిజామాబాద్‌ : జిల్లా సహకార చక్కెర కర్మాగారం మూతపడేందుకు రంగం సిద్ధమైంది. అందులో పనిచేస్తున్న కార్మికులను వీఆర్‌ఎస్‌ ద్వారా పంపించేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నాయి. డిసెంబర్‌ -31లోగా కార్మికులను సాగనంపేందుకు ప్రయత్నాలు జోరందుకోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 100 రోజుల్లో ఈ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామన్న కేసీఆర్‌ హామీని అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా సారంగపూర్‌లోని సహకార చక్కెర కార్మాగారానికి గొప్ప చరిత్రే ఉంది. 1962 జనవరి 18న ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 1964 నుంచి గానుగ ఆడటం ప్రారంభించింది. కామారెడ్డికి చెందిన 22,200 మంది రైతులు ఈ కర్మాగారంలో షేర్‌ హోల్డర్లుగా చేరారు. అంతేకాదు రైతుల ఆధ్వర్యంలో సహకార రంగంలో నడిచిన కర్మాగారం ఇది. అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసిన కర్మాగారంగానూ ఇది పేరు గాంచింది.

2008 మార్చిలో..
గతమెంతో ఘన చరిత్ర కలిగిన ఈ కర్మాగారం నేడు మూతపడేందుకు రంగం సిద్ధమయ్యింది. రైతులకు, కార్మికులకు తీపిని పంచిన ఈ ఫ్యాక్టరీ..ఇప్పుడు చేదును మిగుల్చుతోంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో నిజామాబాద్‌ సహకార చక్కెర కార్మాగారం ఉనికే ప్రశ్నార్దకమయ్యింది. నాడు కార్మికులతో కళకళలాడిన ఈ కర్మాగారం నేడు పిచ్చిమొక్కలతో వెలవెలబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ చక్కెర ఫ్యాక్టరీలు నెలకొల్పడం, అందుకు పాలకులు, నాయకులు వత్తాసు పలకడంతో ఈ కర్మాగారం నిర్వీర్యమవుతూ వచ్చింది. చివరికి 2008 మార్చిలో మూతపడింది.

వీఆర్‌ఎస్‌తో ఉద్యోగులను సాగనంపే యోచన..
50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సహకార చక్కెర కర్మాగారం పూర్తిగా మూసివేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని, డిసెంబర్‌ - 31 లోపు వారికి రావాల్సిన ప్రయోజనాలు అందించి వారిని సాగనంపాలని చక్కెర చెరుకు కమిషనర్‌.... పరిశ్రమలు వాణిజ్యశాఖ ప్రధాన కమిషనర్‌కు ఈనెల 19న నివేదిక పంపారు. 35 మంది రెగ్యులర్‌, 11మంది సీజనల్‌ ఉద్యోగుల పదవీ విరమణ, వారి ప్రయోజనాల కోసం.. మొత్తంగా 6.66 కోట్లు అవసరమవుతాయని.. నివేదికలో సూచించారు. వీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి రంగం సిద్ధం కావడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న 200 మంది ఎన్‌ఆర్‌ఎం కార్మికులకు పరిహారం ఊసేలేదు.

అధికారంలోకి వచ్చినా పట్టించుకోని కేసీఆర్‌..
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌.. నిజామాబాద్‌ సహకార చక్కెర కర్మాగారాన్ని 100 రోజుల్లోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ అధికారంలోకి వచ్చింది. రెండున్నర సంవత్సరాలుగా కేసీఆర్‌ సర్కార్‌ పాలన సాగిస్తోంది. అయినా కేసీఆర్‌ ఈ కర్మాగారం గురించి పట్టించుకున్న పాపానపోలేదు. కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 13 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని కార్మికులు చెప్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని కార్మికులు వాపోతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో వీఆర్‌ఎస్‌ తీసుకోబోమని... తమను ఇతర శాఖల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ చక్కెర కర్మాగారం పరిధిలో 100 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రస్తుతం ఎకరాకు కోటికిపైగా ధర పలుకుతోంది. దీంతో ఈ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. కర్మాగారంలో 100 కోట్లకుపైగా విలువచేసే యంత్రసామాగ్రి ఉంది. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్దకంగా మారింది.

13:36 - November 25, 2016

శ్రీకాకుళం : ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లు...నల్లకుబేరుల కోసం తీసుకున్న నిర్ణయం సామాన్యుల పాలిట శాపంగా మారింది. నోట్ల రద్దు పుణ్యమా అని...పనిదొరక్క...దొరికినా...చిల్లర పాట్లతో ఉపాధిని పొందుకోలేక పేద, మధ్యతరగతి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. శ్రీకాకుళంలో ఆయా కులవృత్తుల వారు నోట్ల రద్దుతో గగ్గోలు పెడుతున్నారు. రజకులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులు సైతం మాకెందుకీ బాధలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం బడాబాబులపై ఏ మేర ప్రభావం చూపుతుందో తెలియదుగానీ అట్టడుగు స్థాయి ప్రజలపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఊర్లోని అందరి బట్టలు ఉతికి..ఉపాధిని పొందే రజకులు సైతం లబోదిబోమంటున్నారు. చిల్లర కష్టాలతో ప్రజలెవరూ బట్టలు వేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

1900 ఎక్కడ తీసుకరావాలి..
అసలే అంతమాత్రంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని నోట్లకష్టాలు వదలడం లేదు. సీజన్‌లో కూడా ఉపాధి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నామని వ్యవసాయ కూలీలు చెబుతున్నారు. పోనీ ఉన్న వ్యవసాయాన్ని పండించుకుందామంటే చిల్లర లేక తంటాలు పడుతున్నామని అంటున్నారు. ఇక వ్యాపారులైతే...చిల్లరో రామచంద్రా అంటూ నానా అగచాట్లు పడుతున్నారు. వంద రూపాయల వస్తువులు కొని...రెండు వేల రూపాయల నోటు చేతిలో పెడుతున్నారని చెబుతున్నారు. 1900 రూపాయలను ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. చిల్లర దెబ్బకు వ్యాపారం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలు గడుస్తున్నా..చిల్లర కష్టాలు తీరకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి..ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

13:25 - November 25, 2016

ఢిల్లీ : విపక్షాల తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ప్రారంభం నుంచే ప్రధాని మోది సభకు రావాలంటూ డిమాండ్‌ చేస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. పార్లమెంట్‌లో పుస్తక ఆవిష్కరణకు వచ్చిన మోదీ సభకు ఎందుకు రాలేదని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యుల నినాదాల మధ్యే కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాల ఆందోళనతో సభలో తీవ్రం గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకేందుకు యత్నించిన రకేష్‌సింగ్‌ను లోక్‌సభ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 

13:19 - November 25, 2016

హైదరాబాద్ : ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కొన్ని ప్రభుత్వ సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన వందల కోట్ల రూపాయల మొండి బకాయిలు పెద్ద ఎత్తున వసూలయ్యాయి. నోట్ల రద్దుతో ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సంస్థల ఖజానాలు ఇప్పుడు గళగళలాడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌ సంస్థల పంట పడింది. కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన మొండిబకాయిలు వసూలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత పాత నోట్లతో ఆస్తి పన్ను, తాగునీటి ఛార్జీలు, విద్యుత్తు బిల్లులు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పెద్ద ఎత్తున పన్ను చెల్లింపులకు ప్రజలు బారులు తీరారు. ఈ నెల 9వ తేదీ నుంచి 24 అర్థరాత్రి వరకు పాత నోట్లతో చెల్లింపులకు అధికారులు అనుమతించడంతో ఆయా సంస్థలకు కాసుల వర్షం కురిపించింది.

గతేడాది వసూలైన మొత్తం రూ.40 కోట్లు..
దాదాపు 500 కోట్ల రూపాయల మొండి బకాయిలతో ఆర్థికంగా కుదేలైన జీహెచ్‌ఎంసీకి ఈ నిర్ణయం కొత్త ఊపిరి పోసింది. రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని చెప్పడంతో నగరంలోని వేలాది మంది పాత బకాయిలతోపాటు వచ్చే ఏడాది చెల్లించాల్సిన పన్నులను కూడా చెల్లించారు. కేవలం 15 రోజుల్లో 234 కోట్ల రూపాయలు వసూలైంది. గతేడాది ఇదే సమయానికి రూ.40 కోట్లు మాత్రమే వసూలైంది.

గతేడాది కంటే రూ. 150 కోట్లు ఎక్కువ..
అలాగే జలమండలికి ఉన్న 300 కోట్ల రూపాయల బకాయిల్లో కేవలం ఈ 15 రోజుల్లోనే సుమారు 100 కోట్ల రూపాయల దాకా వసూలయ్యాయి. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్తు సంస్థకు కూడా ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయల బిల్లులు వసూలయ్యాయి. గతేడాది ఇదే సమయానికి వసూలైన మొత్తం కంటే ఇది 150 కోట్లు ఎక్కువ.

రూ. 200 కోట్లు నష్టం..
మరోవైపు ఆర్టీసీ, హెచ్‌ఎండీఏలకు మాత్రం నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర నష్టాలను మిగిల్చింది. నోట్ల రద్దు తరువాత మొదటి వారం రోజులు ఆర్టీసీకి రోజూ 40 లక్షల రాబడి తగ్గిపోయింది. ఇప్పుడు కూడా 30 లక్షలు తక్కువగానే వస్తోందని అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో అన్నింటి కంటే ఎక్కువ నష్టపోయింది హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ. స్థిరాస్తి రంగం ద్వారా హెచ్‌ఎండీఏకు ఏటా 250 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కేంద్ర నిర్ణయంతో దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంమ్మీద నోట్ల రద్దు నిర్ణయంతో కొన్ని ప్రభుత్వ సంస్థల పంట పండగా..మరికొన్ని సంస్థల నడ్డి మాత్రం విరిగింది. 

13:15 - November 25, 2016

శీతాకాలంలో దొరికే పండ్లలో 'జామపండు' ఒకటి. ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమి సి ఉసిరిలో కూడా ఉంటుంది. దీనికి ధీటుగా జామ అని చెప్పుకోవచ్చు. నిమ్మ..నారింజ కన్నా నాలుగు నుండి పది రెట్ల ఎక్కువగా విటమిన్ సి ఇందులో ఉంటుంది. విటమిన్‌-ఏ, విటమిన్‌-బీ, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి జామ పండు వల్ల ఎలాంటి మేలు కలుగుతుందో చూద్దాం...

 • గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
 • జామలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది.
 • జామలో పీచుపదార్థాలు ఉండడం వల్ల జీర్ణక్రియ వృద్ధి బాగా జరుగుతుంది.
 • శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడానికి జామపండు ఉపయోగపడుతుంది. జామకాయల్లో విటమిన్‌-ఎ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంతేగాకుండా ఇంకా ఎన్నో లాభాలున్నాయి. 

లోక్ సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం ఉభయసభలను కుదిపేస్తోంది. సభకు ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టి ఆందోళన చేపట్టాయి. సభ వెలుపల విపక్షాలు నల్లకుబేరులకు వత్తాసు పలుకుతున్నాయని చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒకసారి వాయిదా పడి తిరిగి ప్రారంభం అయినా అదే పరిస్థితి కొనసాగడంతో సభను వాయిదా వేస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

'రిజర్వ్ బ్యాంక్ వాస్తవాలు ప్రకటించాలి'

హైదరాబాద్ : కొత్త నోట్ల ముద్రణలో రిజర్వ్ బ్యాంక్ వాస్తవాలు చెప్పాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. మరో 5 నెలల పాటు బ్యాంకుల్లో నగదు కొరత ఉంటుందని.. దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ముద్రణా కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేసినా కొరత తీర్చే అవకాశం లేదని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాల పంపిణీలో సమస్యలు ఎదుర్కోక తప్పదని, ప్రజలు మరింత అసహనానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి వరకు 15,707 మిలియన్ల రూ.500 నోట్లు, 6326 మిలియన్ల రూ.1000 నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు.

12:53 - November 25, 2016
12:50 - November 25, 2016

ఊహ తెలియని వయస్సులో 'అఖిల్' సినిమాల్లో నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమానే 'సిసింద్రి'. ఈ సినిమాలో 'ఆటాడుకుందాం రా..అందగాడా' అంటూ 'నాగార్జున'తో 'టబు' డ్యాన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 'అఖిల్' హీరోగా పలు సినిమాలు నిర్మితమౌతున్నాయి. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'అఖిల్' ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో 'టబు' నటించనుందనే వార్త చక్కర్లు కొడుతోంది. 'అఖిల్' సినిమాలో నటించాలని చిత్ర యూనిట్ కోరినట్లు తెలుస్తోంది. 'నాగార్జున', 'టబు' పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల తర్వాత టబు మళ్లీ తెలుగులో సినిమా చేయబోతోందంటూ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది. కీలకమైన పాత్ర కోసం 'టబు'ను ఎంపిక చేశారని..'నాగార్జున' స్వయంగా ఫోన్ చేసి అడగటంతో 'టబు' ఓకే చెప్పిందని టాక్. 2017 జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోందని, 'అఖిల్' సరసన 'మేఘ ఆకాష్' హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. 

ఏసీబీ పట్టుబడ్డ ఏఈ మహబూబ్ పేరా

అనంతపురం : రాయదుర్గం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ మహబూబ్ పేరాను ఏసీబీకి వలపన్ని పట్టుకున్నారు. ఏఈ మహబూబ్ పేరా, అసిస్టెంట్ బాబాను అదుపులోకి తీసుకున్న సీబీఐ విచారణ చేపట్టింది.

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ : కొండాగావ్ జిల్లాలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతాదళాల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేస్తున్నాయి.

 

బరిండాలో ఎయిమ్స్ భవనానికి ప్రధాని శంకుస్థాపన

పంజాబ్ : ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పనే ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్ లోని బరిండాలో ఎయిమ్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రాల వికాసం కోసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రహదారులు, విమానాశ్రయాలు, విద్యాసంస్థలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితం కాదని, తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

 

12:32 - November 25, 2016
12:27 - November 25, 2016

విశాఖపట్టణం : యుద్ధ సమయాల్లో నావికా దళం పాత్రను వివరిస్తూ తూర్పు నావికా దళం విశాఖలో డే ఎట్‌ సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నావికా దళం ప్రాధాన్యత, పాత్రను వివరిస్తూ విన్యాసాలు జరగనున్నాయి. 7 యుద్ధ నౌకలు సముద్రంలో విన్యాసాలు చేయనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

12:12 - November 25, 2016

విజయవాడ : తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయింపుల కొరకే కేవలం సీఎం చంద్రబాబును కలవనున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దాదాపు మూడు సంవత్సరాలైనా తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

లోక్ సభలోనూ గందరగోళం

ఢిల్లీ: వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. అయినా స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

12:07 - November 25, 2016

చిత్తూరు : పెద్దనోట్ల రద్దు సెగ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెకూ తాకింది. డబ్బుల కోసం నారావారిపల్లె గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర లేక నానా అవస్థలు పడుతున్నారు. నారావారి పల్లె గ్రామస్తులు పడుతున్న కరెన్సీ కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి రెండు వారాలు దాటినా సమస్య మాత్రం ఇంకా తీరలేదు. డబ్బుల కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారి పల్లె గ్రామస్తులకూ ఈ తిప్పలు తప్పలేదు. నారావారిపల్లె తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కువ జనాభా కలిగిన ఈ గ్రామంలో ఎలాంటి బ్యాంకుగానీ, ఏటీఎంలుగానీ లేవు. నారావారిపల్లెకు దగ్గర్లోని రంగంపేటలో మాత్రం ఓ బ్యాంకు ఉంది. అందులోనూ డబ్బులు లేకపోవడంతో నారావారిపల్లె గ్రామస్తులు డబ్బుల కోసం తిరుపతికి వెళ్లాల్సి వస్తోంది.

బ్యాంకుల వద్ద క్యూలు..
ఉదయాన్నే తిరుపతి చేరుకుని బ్యాంకుల దగ్గర నారావారిపల్లె గ్రామస్తులు క్యూలు కడుతున్నారు. గంటలకొద్దీ క్యూలైన్‌లోనే నిలబడుతున్నారు. పనులన్నీ మానుకుని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా డబ్బు అందుతుందన్న గ్యారంటీ లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి క్యూలో నిల్చుంటే బ్యాంకు సిబ్బంది వారికి రెండువేల నోట్లు ఇస్తున్నారు. దీంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. రెండువేల నోట్లను మార్పించేందుకు తమకు తలప్రాణం తోకకు వస్తోందని వాపోతున్నారు. అంతేకాదు..నిత్యావసరాలు తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగని వ్యాపారాలు..
నారావారిపల్లెలో చిన్నచిన్న వ్యాపారాలు, చిరుతిళ్లు అమ్మేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో వారి వ్యాపారాలు సాగడం లేదు. రోజుకు వంద రూపాయలు కూడా రావడం లేదని చిరుతిళ్లు అమ్మే ఓ వృద్దురాలు వాపోతోంది. బడ్డీకొట్టి వారి పరిస్థితీ ఇంతే. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకురావాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. వంద, ఐదు వందల నోట్లు ఎక్కువగా చలామణిలోకి తీసుకురావాలని నారావారిపల్లె గ్రామస్తులు కోరుతున్నారు.

రాజ్యసభ మ.2.30 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే అధికార విక్షాల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. నోట్ల రద్దు అంశంపై ఆజాద్ మాట్లాడుతుండగా అధికార పక్షం అడ్డుపడటంతో విపక్షాలు ఒక్కసారిగా ఛైర్మన్ పోడియం చుట్టి ఆందోళన చేపట్టాయి. దీంతో ఛైర్మన్ సభను వాయిదాను వేస్తున్నట్లు ప్రకటించారు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటు పై మంత్రివర్గ ఉపసంఘం భేటీ...

అమరావతి : ఏపీలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు పై వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ తో పాటు ఇస్కాన్ ప్రతినిధులు, సీఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.

డిసెంబర్ 2న భవిష్యత్ కార్యాచరణ: ముద్రగడ

తూ.గో: కాపు ఉద్యమాన్ని ఆపమని... దాని కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే నని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. డిసెంబర్ 2న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. గతంలో పాదయాత్రలకు అనుమతులు తీసుకున్నట్లు ప్రభుత్వం నిరూపించగలదా అని సూటిగా ముద్రగడ ప్రశ్నించారు.

సభకు రాకుండా ప్రధాని అవమానించారు: విపక్షాలు

ఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అంశం రాజ్యసభలో రగడ సృష్టిస్తోంది. ప్రధాని మోదీ సభకు రావాలంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభకు రాకుండా విపక్షాలను ప్రధాని అవమానించారని, విపక్షాలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో పుస్తకావిష్కరణకు హాజరైన ప్రధాని సభకు ఎందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశ్నించారు. అయితే నోట్ల రద్దుపై ముందు చర్చ ప్రారంభించండని, ప్రధాని వచ్చి చర్చలో పాల్గొంటారని డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రధాని సభకు రావాల్సిందే అని సభ్యులు పట్టుబట్టారు.

11:33 - November 25, 2016
11:29 - November 25, 2016

విజయవాడ : రైల్వే స్టేషన్ వద్ద ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఆటో..రిక్షా కార్మికులు నేడు ఖాళీగా ఉంటున్నారు. దీనికంతటికి కారణం పెద్దనోట్ల రద్దేనని వారు పేర్కొంటున్నారు. చిల్లర కష్టాలు వీరి జీవితాలను కుదేలు చేస్తున్నాయి. ఆటో, రిక్షా కార్మికులపై చిల్లర కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాధారణ రోజుల్లో ప్రయాణీకుల తీసుకుంటూ వెళుతుండడం కనిపిస్తుంటుంది. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రయాణీకులు ఎవరూ రావడం లేదని ఆటో కార్మికులు పేర్కొంటున్నారు. మరింత విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:26 - November 25, 2016

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షాలకు క్షమాపణలు చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ ఉభయసభలూ శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎంపీ దిపెస్ ఘోష్ కు రాజ్యసభ నివాళి అర్పించింది. సభ కార్యక్రమాలు కొనసాగిస్తుండగా విపక్షాలు అడ్డు తగిలాయి. ప్రతిపక్షంపై ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనితో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రధాని అలాంటి ఆరోపణలు చేయవచ్చా - ఆజాద్..
నిన్న నోటీసు ఇవ్వడం జరిగిందని, చర్చలో పాల్గొనడానికి వచ్చారా ? లేదా ? అనేది తొలుత స్పష్టం చేయాలని నిన్న అడగడం జరిగిందన్నారు. లైబ్రరీ, ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారని ఇది పార్లమెంట్ కు సంబంధం ఉందన్నారు. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరు కావడం పట్ల స్వాగతం కూడా పలకడం జరిగిందన్నారు. కానీ నల్లధనానికి ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నారంటూ మోడీ పేర్కొనడం సబబేనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక విధంగా పార్లమెంట్ ను అవమానపరిచినట్లేనని తెలిపారు. ఇది చాలా తప్పు అని దేశ ప్రధాని ఇలాంటి ఆరోపణలు చేస్తారా ? అని ప్రశ్నించారు. పార్లమెంట్ తప్ప అన్ని చోట్ల ప్రధాని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ప్రధాని రావాలి - మాయావతి..
నల్లధనం..పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయట పలు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ రోజు కూడా ప్రతిపక్షాలు ఉద్ధేశించి పలు వ్యాఖ్యలు చేశారని మాయావతి పేర్కొన్నారు. వెంటనే ప్రధాన మంత్రి సభకు రావాలని డిమాండ్ చేశారు. 

విపక్షాల ఆందోళనతో ఉభయసభలు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల నోట్ల రద్దు అంశంపై వివపక్షాల నిరసనతో దద్దరిల్లుతోంది. ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు స్పీకర్ పోడియం చుట్టి ముట్టి ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఉభయసభలను వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.

రాజ్యసభ మ.12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. నోట్ల రద్దు అంశంపై జరుగుతున్న చర్చలో ప్రధాని పాల్గొనాలని డిమాండ్ చేశాయి. అంతే కు సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఛైర్మన్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేపట్టాయి. ఛైర్మన్ ఎంత వారించినా వినకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపట్టికే విపక్షాల ఆందోళనతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను మ.12గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఉభయసభల్లో పెద్దనోట్ల రద్దుపై రగడ

ఢిల్లీ : ఉభయసభల్లో పెద్ద నోట్ల రద్దుపై రగడ జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు పై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభలో ఛైర్మన్ పోడియం చుట్టుముట్టి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోక్ సభలో గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. పార్లమెంట్ లో తప్ప ప్రధాని అన్నిచోట్లా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపి ఆజాద్ మండిపడ్డారు.

పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి దానిపై వివరణ ఇవ్వాలని, సభలో జరుగుతున్న చర్చలో ప్రధాని మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉభయసభలో ఆందోళన చేపట్టాయి. గందరగోళం మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

రాజ్యసభలో విపక్షాల ఆందోళన

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. సభకు ప్రధాని రావాలని విపక్షాలు పట్టుబట్టి ఆందోళన చేపట్టాయి.సభ ప్రారంభం అయిన వెంటనే మాజీ ఎంపీ దిపెన్ ఘోష్ కు నివాళి అర్పించింది.

ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. నోట్ల రద్దు అంశం ఉభయ సభలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఈ అంశంపై చర్చ సందర్భంగా ప్రధాని ఉండాలని విపక్షాలు పట్టుబట్టి సభను అడ్డుకున్నాయి. సభ సజావుగా జరిగేందుకు రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రయత్నాలను విపక్షాలు తిప్పికొట్టాయి.

ప్రధాని తప్పనిసరిగా సభకు హాజరు కావాలి: విపక్షాలు

ఢిల్లీ: పార్లమెంట్ లో విపక్షాలతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ ముగిసింది. ఈ భేటీ ప్రధాని తప్పనిసరిగా సభకు హాజరు కావాలని లేదంటే సభను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

10:37 - November 25, 2016

సినిమా అనేది రంగుల ప్రపంచం. కలర్ ఫుల్ లైఫ్ తో ఎప్పుడూ రిచ్ గా కనిపిస్తుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నోట్ల రద్దు నిర్ణయం సినీ రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. పెద్దనోట్లు చెల్లక సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ పరిశ్రమపై ఆధారపడిన వారంతా రోడ్డునపడ్డారు. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువగా నివాసం ఉండే కృష్ణానగర్ మొత్తం కళ తప్పింది. చిల్లర దొరక్క అష్టకష్టాలు పడుతున్న వీరి కష్టాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

10:30 - November 25, 2016

ఢిల్లీ : భారత సంతతి మహిళ నిక్కీ హేలీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా తరపున ఐక్యరాజ్య సమితిలో నిక్కీహేలీని రాయబారిగా నియమిస్తున్నట్టు ఎన్నికయిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. నిక్కీ ప్రస్తుతం సౌత్‌ కరోలినా రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నారు. తమ రాష్ట్రంలో చట్టబద్ధత లేని శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడాన్నిఆమె తప్పబట్టారు. అధ్యక్షుడు ఒబామా హెల్త్ కేర్‌ విధానాలను నిక్కీ తీవ్రంగా వ్యతిరేకించారు. సిక్కు సామాజిక వర్గానికి చెందిన నిక్కీ రిపబ్లికన్‌ పార్టీ ముఖ్యనేతల్లో ఒరుగా ఉన్నారు. నిక్కీ హేలీని ఎంపిక చేయడంతో ప్రవాస భారతీయు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

10:29 - November 25, 2016

మెదక్ : మహాజన పాదయాత్ర శుక్రవారానికి 1000 కి.మీ మార్క్ ను చేరుకోనుంది. తెలంగాణ పల్లెల్లో మహాజన పాదయాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది. సామాజిక తరగుతులు, కులవృత్తులు, కార్మిక, కష్ట జీవులు తమ్మినేని బృందాని అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను ఇబ్బందులను సీపీఎం పాదయాత్ర బృందం ముందు వెళ్లబోసుకుంటున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి ముచ్చటించింది. పాదయాత్రలో గతంలో చేసినప్పటికీ ఈ పాదయాత్ర విస్తృతమైందని, గతంలో నడిచిన దూరం కంటే ఎక్కువగా దూరం నడుస్తున్నట్లు తెలిపారు. కానీ ఆనాడు తీసుకున్న సమస్యలు కొన్ని వర్గాలకు పరిమితమైందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93 శాతం ప్రజలకు సంబంధించిన సమస్య అని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్ర చేయడం ఎక్కువ సంతృప్తినిస్తోందన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

ఆర్బీఐ కౌంటర్లలో డిసెంబర్ 31 పాత నోట్ల మార్పిడి: ఆర్బీఐ

హైదరాబాద్ : డిసెంబర్ 31 వరకు ఆర్బీఐ కౌంటర్లలో రూ.500, 1000 నోట్లను మార్పిడికి అవకాశం ఉందని ఆర్బీఐ ప్రకటించింది.

10:23 - November 25, 2016

గుంటూరు : పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు తీవ్రమౌతున్నాయి. మొదట మంచిదే అన్న ప్రజలు ప్రస్తుతం వ్యతిరేక గళం విప్పుతున్నారు. గుంటూరులో రోడ్ల మీదకు వచ్చి తమ అభిప్రాయాలు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. నోట్ల రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఉదయం వస్తే మధ్యాహ్నం..మధ్యాహ్నం వస్తే ఉదయం ఇలా తిప్పుతూనే ఉన్నారని ఓ యువతి వాపోయింది. రోజుకు రెండు వేల రూపాయల చొప్పున ఇస్తామంటున్నారని..కానీ రూ. 2వేల చిల్లర ఎక్కడా దొరకడం లేదన్నారు. ఏటీఎంలు కూడా మూసివేస్తున్నారని, ఇంత దారుణం ఎక్కడా చూడలేదన్నారు. మిగతా విశేషాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:22 - November 25, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో దుమారం తగ్గలేదు. ప్రధాని సభకు హాజరు కావాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. నిన్న ఒక్క రోజు రాజ్యసభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. మధ్యాహ్నం అనంతరం సభకు హాజరు కాలేదు. దీనితో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చర్చ పూర్తయ్యేంతవరకు ప్రధాని సభలోనే ఉండాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల ఆందోళనతో సభలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రానున్నారు. దీనితో విపక్షాలు మళ్లీ ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. రాజ్యసభ..లోక్ సభలో మళ్లీ వాయిదాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

'జన్ ధన్ ఖాతాల్లో చేరిన డబ్బు బ్లాక్ మనీ కాదు'

ఢిల్లీ : జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయిన డబ్బులన్నీ బ్లాక్ మనీ కాదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. అంతే కాదు ఈ ఖాతాల్లో రూ. 21 వేల కోట్ల డబ్బు జమ అయిందని, ఈ ఖాతాలన్నింటినీ పరిశీలించి, రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ అయిన ఖాతాలను విచారిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని ఆర్థిక వేత్తలు తప్పుపడుతున్నారు. జన్ ధన్ యోజన ఖాతాల్లో ఉన్న డబ్బంతా నల్లధనం కాదని వ్యాఖ్యానిస్తూ, ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తే, మోదీ సర్కారుకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

అథ్లెటిక్ పోటీలను ప్రారంభించిన మంత్రి వెంకయ్యనాయుడు

విశాఖ : జాతీయస్థాయి జూనియర్ అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

విజయవాడ:స్టేట్ గెస్ట్ హౌస్ వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయ్యింది. ప్రత్యేకంగా ఈ రోజు సీఎం చంద్రబాబును కలవనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

సామాన్యుడు సైతం సైనికుడిలా పోరాడాలి : ప్రధాని

ఢిల్లీ :సామాన్యుడు సైతం సైనికుడిలా పోరాడాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆయన ఢిల్లీలో ఈ రోజు 'న్యూవెర్షన్ ఆప్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా` అనే పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు రాజ్యాంగం పట్ల అవగాహనకు ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేయాలన్నారు. నల్లధనం, అవినీతిపై ఉమ్మడి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. సామాన్యుడు సైతం సైనికుడిలా పోరాడాలని, ఆన్ లైన్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్ తో చక్కబెట్టుకోవచ్చని సూచించారు.

ఎదురు కాల్పుల్లో ఒక జవాన్, ఇద్దరు ఉగ్రవాదుల మృతి

జమ్మూకాశ్మీర్ : సోపోర్, బందిపొరాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చగా... ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందాడు.

 

09:32 - November 25, 2016

ఢిల్లీ : బీజేపీ మాజీ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ప్రచారంలో సిద్ధూ పాల్గొంటారని పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. సీటు ఇవ్వమని అడగకుండానే తమ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధూ ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. సిద్ధూ సతీమణి నవజ్యోత్‌ కౌర్‌, ఆవాజ్‌-ఈ-పంజాబ్‌ నేత పర్గత్‌ సింగ్‌ ఈనెల 28న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. సిద్ధూ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయనకి లోక్‌సభ టికెట్‌ గానీ, లేదా క్యాబినెట్‌లో పదవి ఇస్తారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

09:23 - November 25, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి రెండు వారాలు దాటినా సామాన్యుడికి కష్టాలు మాత్రం తీరడం లేదు. 17 రోజులు దాటినా ప్రజల ఇబ్బందులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. నేటి నుంచి పాత నోట్ల మార్పిడి రద్దు చేయడంతో బ్యాంకులో ఖాతాల్లేని వారికి కష్టాలు తప్పేలా లేవు.. దీంతో బ్యాంకులో అకౌంట్లు లేని వారు అకౌంట్‌ తీసుకోని పాత నోట్లను జమ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొత్త 500, 2000 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చినా అవి పూర్తి స్థాయిలో రాకపోవడంతో సామాన్యులు అత్యవసర, నిత్యావసర ఖర్చులకు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీగా చిల్లర కొరత ఏర్పడటంతో చేతిలో 2000 రూపాయల నోటు ఉన్నా ఉపయోగ పడని పరిస్థితి.. ఏటీఎంలలో, బ్యాంకుల్లో కొత్త 500 రూపాయల నోట్లు లేకపోవడంతో వంద నోట్లు అస్సలే దొరక్క పోవడంతో ప్రజలకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. హైదరాబాద్‌లోనే సగానికి పైగా ఏటీఎంలు పనిచేయకపోవడం.. పని చేసినా చిన్న నోట్లు లేకపోవడంతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సామాన్యుడు చిల్లర కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

17వ రోజు..
17 రోజు సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రమైన చిల్లర కొరత ఏర్పడింది. చిరు వ్యాపారి దగ్గర నుంచి అడ్డా కూలీల వరకు అందరూ పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం అల్పాహారం చేసేందుకు కూడా చిల్లర కొరత ఏర్పడటంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. సంగారెడ్డి జిల్లాలో..హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితి చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

09:20 - November 25, 2016

మెదక్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలు ఆర్ధికంగా చితికిపోయారని.. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మహాజన పాదయాత్ర శుక్రవారానికి 1000 కి.మీ మార్క్ ను చేరుకోనుంది. తెలంగాణ పల్లెల్లో మహాజన పాదయాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది. సామాజిక తరగుతులు, కులవృత్తులు, కార్మిక, కష్ట జీవులు తమ్మినేని బృందాని అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలను ఇబ్బందులను సీపీఎం పాదయాత్ర బృందం ముందు వెళ్లబోసుకుంటున్నారు.

మెదక్ జిల్లాలో పాదయాత్ర..
మెదక్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించగానే.. జిల్లా ప్రజలు, సీపీఎం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీపీఎం బృందానికి స్థానిక మహిళలు..బోనాలతో స్వాగతం పలికి తమ్మినేనితో పాటు బృంద సభ్యులందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తమ్మినేని అన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాలు ఆర్ధికంగా చితికిపోయారని.. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

శుక్రవారం బహిరంగ సభ..
సామాజిక న్యాయం- తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం ఉదయం మెదక్‌ జిల్లా కౌలపల్లిలో 1000 కి.మీ మైలురాయిని చేరుకోనుంది. వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్న నేపథ్యంలో.. మంబోజిపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఎం కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు తెలిపారు. ఈ సభకు ప్రజాగాయకుడు గద్దర్‌తో పాటు.. పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రజల ఎజెండాతో చేస్తోన్న పాదయాత్రకు భారీ స్పందన లభిస్తోంది. అయితే ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని సీపీఎం బృందసభ్యులు అంటున్నారు. 

కొనసాగుతున్న చిల్లర కష్టాలు..

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దు అయి 17 రోజులు గడుస్తున్నా చిల్లర కష్టాలు కొనసాగుతున్నాయి. డబ్బుల కోసం తెల్లవారుజాము నుండే పలు ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. రెండు వేల రూపాయలకు చిల్లర దొరక్క ప్రజలు నానా ఆగచాట్లు పడుతున్నారు. 

రాయిలాపూర్ నుండి ప్రారంభమైన పాదయాత్ర..

మెదక్ : రాయిలాపూర్ నుండి సీపీఎం మహాజన పాదయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కౌడీపల్లికి పాదయాత్ర చేరుకోనుంది.

09:14 - November 25, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దయి 17 రోజులు గడుస్తోంది. కానీ సామాన్యుడి కష్టాలు తీరడం లేదు. పాత నోట్ల మార్పిడి బంద్ నేటి నుండి అమల్లోకి రానుంది. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శుక్రవారం ఉదయం వెలవెలబోయింది. పలు రాష్ట్రాలకు..తెలుగు రాష్ట్రాల జిల్లాలకు ఇక్కడి నుండి రైళ్లు వెళుతుంటాయి. కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చిల్లర దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో తమ తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

రేపటి నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు..

తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సిద్ధమైంది. ఈనెల 26 నుండి డిసెంబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 

08:05 - November 25, 2016

పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 24వ అర్ధరాత్రి నుండి డిసెంబర్ 15 వరకు అనుమతించిన పాత రూ. 500 నోటు వాడుకోవచ్చని పేర్కొంది. మరోవైపు బ్యాంకుల్లో రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఎక్కడెక్కడ పాత 500 నోట్లు చెల్లుతుందంటే..

 • చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలు.
 • ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలు.
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాల్టీ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఫీజులు చెల్లించవచ్చు. కానీ ఒక్కో విద్యార్థి రూ. 2వేల వరకు ఫీజులు చెల్లించవచ్చు.
 • విద్యుత్, నీటి బిల్లుల కోసం బకాయిలు చెల్లించవచ్చు.
 • డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు టోల్ వసూలు లేదు. డిసెంబర్ 3 నుండి 15 వరకు పాత నోట్ల ద్వారా చెల్లించచ్చు.
 • పెట్రోల్ బంకులు..శ్మశాన వాటికలు..కోర్టు ఫీజులు చెల్లించవచ్చు.
 • ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులకు.
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాల కేంద్రాల్లో చెల్లించవచ్చు.
 • రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుండి విత్తనాల కొనుగోలుకు తీసుకుంటారు.
 • కన్జ్యూమర్ కో ఆపరేటివ్ స్టోర్లలో రూ. 5వేల వరకూ కొనుగోళ్లకు
 • విదేశీయులు వారానికి రూ. 5 వేల వరకూ విదేశీ కరెన్సీ మార్చుకోవచ్చు.
 • రైల్వే కేటగిరింగ్ సేవలకు, సబర్బన్, మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు.
 • రైల్వే టికెట్ కౌంటర్లు, బస్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు) ఎయిర్ పోర్టు కౌంటర్లలో చెల్లించవచ్చు. 
07:44 - November 25, 2016

పెద్దనోట్లు రద్దు అంశం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేస్తోంది. ఈ అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఉదయం రాజ్యసభ కు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం సభకు హాజరు కాలేదు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), విష్ణు (ఏపీ బీజేపీ), గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:05 - November 25, 2016

రోజురోజుకి క్షీణించిపోతున్న రూపాయి విలువ మన వంటిళ్లను షేక్ చేస్తోంది. మనం నిత్యం వాడే వంట నూనెల ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. విదేశాల నుంచి భారీగా దిగుమతులు చేసుకోవడమే ఇందుకు కారణం. ఒకవైపు కరవు. మరో వైపు పెద్ద నోట్ల రద్దు. ఇంకో వైపు అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం. అమెరికన్ డాలర్ బలపడుతోంది. మన రూపాయి బక్కచిక్కిపోతోంది. ఇప్పటికే రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఈ పతనం ఎక్కడ ఆగుతుందో తెలియదు. రూపాయి విలువ పడిపోతే, నేరుగా మన వంటింటి మీదే దాని ప్రభావం పడుతుంది. మన వంట నూనెల ధరలు సలసలకాగిపోతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. ఎందుకంటే వీటి కోసం మనం విదేశాల మీద ఆధారపడుతున్నాం. మనం వాడే వంట నూనెల్లో 70శాతం విదేశాల నుంచి కొనుక్కోవాల్సిన దుస్థితిలో చిక్కుకున్నాం.

పడిపోయిన ఉత్పత్తి..
గత దశాబ్దకాలంలో వంట నూనెల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణ ప్రాంతాల్లో 29శాతం చొప్పున పెరిగితే, నూనె గింజల ఉత్పత్తి మాత్రం 7శాతం పడిపోయింది. 2013-14లో అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాక పూర్వం మన దేశంలో నూనె గింజల ఉత్పత్తి 33 మిలియన్ టన్నులు వుండగా, అది గత సంవత్సరం 26 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది కూడా కరవు కోరలు చాచడంతో నూనె గింజల ఉత్పత్తి మరింత పడిపోతోంది. వేరు సెనగ పంటను కాపాడుకోవడానికి అనంతపురం రైతులు పడుతున్న కష్టాలు కళ్లల్లో మెదులుతూనే వున్నాయి. ఓ వైపు కరవు పరిస్థితులు, మరో వైపు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడిన నేపథ్యంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోతోంది. వేరుసెనగ, పొద్దుతిరుగుడు, సోయా, రేప్ సీడ్, ఆముదం, నువ్వులు ఇలా 9రకాల నూనెగింజల ఉత్పత్తి తగ్గిపోతోంది. వీటిని పండించాలంటేనే రైతులు భయపడుతున్నారు.

పెరుగుతున్న వంటనూనెల వినియోగం..
మరోవైపు వంటనూనెల వినియోగం పెరుగుతోంది. ఉత్పత్తికీ, వినియోగానికి మధ్య వున్న కొరతను తీర్చేందుకు విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు పెంచుతోంది ప్రభుత్వం. గత సంవత్సరం 14.8 మిలియన్ టన్నుల క్రూడ్, రిఫైండ్ ఆయిల్ ను దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో 7 మిలియన్ టన్నుల వంట నూనె ఉత్పత్తి అవుతుంటే, అంతకు రెట్టింపు పరిమాణంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకు 60 వేల కోట్ల రూపాయలకు పైగానే వెచ్చిస్తున్నాం. ఇప్పుడు దిగుమతుల బిల్లు 70వేల కోట్ల రూపాయలు దాటుతుందన్న భయాలున్నాయి.

ప్రభుత్వాల వైఫల్యాలు..
ఒక వైపు దిగుమతి చేసుకోవాల్సిన పరిమాణం పెరుగుతోంది. ఇంకో వైపు రూపాయి విలువ పడిపోతోంది. దీంతో వంట నూనెల ధరలు పెరగడం ఖాయమన్నది ఇండస్ట్రీ టాక్. మన దేశం ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి వంట నూనెల దిగుమతి చేసుకుంటోంది. ఆయా దేశాల్లో రిఫైన్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకునే లక్ష్యంలో ముడి వంట నూనెలపై ఎగుమతి సుంకాలు భారీగా పెంచాయి. మనదేశంలో 15 నుంచి 20శాతం దిగుమతి సుంకాలు పెంచారు. దీంతో వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి విలువ పడిపోవడంతో సలసలకాగి, మనల్ని మలమలకాల్చేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాలు నూనె గింజల ఉత్పత్తి సాగును పెంచే చర్యలు చేపట్టకపోవడం, మద్దతు ధరలిచ్చి రైతులను ప్రోత్సహించకపోవడం, ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారడం లాంటి చర్యల వల్ల మనం వంటనూనెలు కొనుక్కోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. 

07:02 - November 25, 2016

అసలే నోట్ల రద్దు వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ చెబుతున్నారు వంట నూనెల వ్యాపారులు. డాలర్ తో మారకంలో మన రూపాయి విలువ పడిపోతున్నందున వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం వుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వంటనూనెలను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం. మనం విదేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం పరిస్థితి ఏమిటి? నూనె గింజల సాగు విస్తీర్ణం పెరగాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రూపాయి విలువ పడిపోతున్నందున వంట నూనెల ధరలు పెరిగే అవకాశం వున్న నేపథ్యంలో వినియోగదారుల మీద ఆ భారం పడకుండా వుండాలంటే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు సంఘం నేత అరిబండి ప్రసాదరావు విశ్లేషించారు. మరి ఆయన ఎలాంటి అంశాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:00 - November 25, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకు గులాబీ దళం సిద్ధమవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో శాసనసభా సమావేశాలు నిర్వహించాలని అధికార పార్టీ రెడీ అవుతోంది. ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు అధికార పార్టీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తోంది. గతంలో జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఒక రోజు సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వం ఈ సారి నాలుగైదు రోజుల పాటు శాసనసభను సమావేశపర్చాలని భావిస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా తిప్పికొట్టేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే విపక్షాలు పట్టు పడుతున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో భారీ అవినీతి జరుగుతోందన్న విమర్శలను ప్రతిపక్షపార్టీలు చేస్తున్నాయి. దీంతో పాటు రాజకీయంగా అందరి మెడకు చుట్టుకుంటున్న నయీంతో సంబంధాల అంశం కూడా శాసనసభను కదిపేసే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

వాడీవేడీ..
ఇటు గ్యాంగ్‌స్టార్‌ నయీంతో తమ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని సిట్‌ విచారణలో తేలితే.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా రెడీగా ఉన్నామని ఇప్పటికే గులాబీ దళపతి సంకేతాలు కూడా ఇచ్చారు. పది పనిదినాలకు తగ్గకుండా సమావేశాలను నిర్వహిస్తామని గత శాసనసభా సమావేశాల సందర్భంగా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.

06:58 - November 25, 2016

విజయవాడ : భుజబలం చాలనపుడు బుద్ధిబలంతో కొట్టాలి.. ఇపుడు ఇదే నీతిని అనుసరిస్తోంది ఏపీలోని ప్రతిపక్షం. నిత్యం అధికారపార్టీపై విమర్శలతో విరుచుకుపడే వైసీపీ నేతలు ఒక్కసారిగా రూట్‌ మార్చారు. ప్రభుత్వంపై సామరస్య అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ప్రతిపక్ష వైసీపీ వ్యూహానికి అధికార టీడీపీ ఏలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిగా మారింది..! ప్రతిపక్ష వైసీపీ సాంప్రదాయ రాజకీయానికి భిన్నంగా ఆలోచించింది. ప్రభుత్వంపై విమర్శలు..మాటల దాడులకంటే.. సామరస్యవ్యూహామే శక్తివంతమైనది నమ్ముతోంది. నిన్నటిదాకా యువభేరీ, రైతుభరోసా యాత్రతోపాటు పలు ప్రజాసమస్యలపై జనంలోకి వెళ్లిన వైసీపీ కొత్తగా ఇపుడు కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లుతోంది.

సీఎం ఆఫీస్‌ నుంచి ఇంతవరకు రాని సమాధానం..
వైసీపీకి ప్రస్తుతం ఉన్న 47 మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవవర్గాల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణియించారు. ఈనెల 4వ తేదీనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎం కార్యాలయానికి వెళ్లి అపాయింట్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. అయితే... సీఎం ఆఫీస్‌ నుంచి ఇంతవరకు సమాధానం రాకపోవడంతో అపాయింట్‌మెంట్‌ లేకపోయినా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి తీరుతామంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.

ఒత్తిడి పెంచే వ్యూహం..
ప్రజాసమస్యల పరిష్కారం కోసమే తాము ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోరామని పైకి చెబుతున్నా.. అంతర్గతంగా అధికార పార్టీపై ఒత్తిడి పెంచే వ్యూహం అనుసరిస్తోంది వైసీపీ. తమ నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ లీడర్లే ప్రస్తుతం హవా కొనసాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తాము ప్రజాప్రతినిధులమైనా..తమను పట్టించుకోకుండా టీడీపీ లీడర్లకే అధికార పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము ప్రజల్లో పట్టుకోల్పోతున్నామనే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకే తాజాగా సామరస్య అస్త్రాన్ని సిద్ధం చేసింది ప్రతిపక్ష వైసీపీ. ప్రతిపక్ష వ్యూహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

06:56 - November 25, 2016

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లోకి అట్టహాసంగా అడుగు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. భవనంలోని వివిధ రకాల ఫీచర్స్ ను వివరించారు. ప్రజలకు - ప్రభుత్వానికి మధ్య ప్రగతి భవనం అనుసంధాన కర్తగా.. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు వేదికగా నిలుస్తుందన్నారు. పాలనా ఫలాలు క్షేత్రస్థాయికి ఏవిధంగా చేరుతున్నాయో ప్రగతి భవన్‌ నుంచే పర్యవేక్షిస్తామన్నారు. ప్రగతిభవన్‌ రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో భాగంగా నిర్మించిన జనహిత మందిరం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వంతో నేరుగా మాట్లాడ్డానికి ప్రగతి భవన్‌ వేదికగా మారుతుందన్నారు.

అన్నీ ప్రగతి భవన్ లోనే..
కలెక్టర్ల సదస్సుతోపాటు ఎలాంటి సమావేశం నిర్వహించాలన్నా ఇంతకు ముందు అనువైన స్థలం, వేదిక లేక చాలా ఇబ్బంది పడ్డామని... ఇపుడు ప్రగతి భవన్‌ అందబాటులోకి రావడంతో ఆ సమస్యలు తొలగాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. నూతన క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత బీసీ హాస్టళ్లకు సంబంధించిన ఫైలుపై తొలిసంతకం చేశారు. రాష్ట్రంలో ఉన్న 101 బీహాస్టళ్లలో మొత్తం 14,685 మంది విద్యార్థులకు ఇక నుంచి నెల నెలా 1050 నుంచి 1200 రూపాయలు అందనున్నాయి. ప్రభుత్వ పండుగలతోపాటు.. ఇఫ్తార్‌ విందులు, క్రిస్‌మస్‌ డిన్నర్లు, ఉగాది రోజున పంచాంగ శ్రవణం లాంటి కార్యక్రమాలు ఇక నుంచి ప్రగతిభవన్‌లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి అన్నారు. 

06:45 - November 25, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుపై కేంద్ర కమిటీ బృందం సచివాలయంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గత రెండు రోజులుగా కేంద్ర బృందం రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పర్యటించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్ధితులను, ఇబ్బందులను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తమకు అవగతమయ్యాయని కమిటీ సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం తెలిపారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు నగదు రహిత లావాదేవీలకు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారని కేంద్రం బృందం ప్రతినిధి రెడ్డి సుబ్రమణ్యం తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన పలు సూచనలను కేంద్రప్రభుత్వం, ఆర్బీఐలకు నివేదిస్తామని కేంద్ర కమిటీ బృంద సభ్యులు తెలిపారు. 

06:42 - November 25, 2016

విజయవాడ : ఇకపై లావాదేవీలన్నీ డిజిటల్‌ రూపంలో జరిపేందుకు ఏపీ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మొబైల్‌ ఫోన్లు లేని పేదలందరికీ ఫోన్లు ఇచ్చే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులపై చర్చించేందుకు బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం.. ఆర్థిక లావాదేవీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో సమీక్ష..
పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై చర్చించేందుకు విజయవాడలో బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కసరత్తు కొనసాగించాల్సిందేనని సూచించారు. డిసెంబర్‌ ఒకటో తేదీలోగా ప్రజలకు ఆర్థిక లావాదేవీలతో సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. రాష్ట్రంలో డిజిటల్‌ లావాదేవీలు జరిపే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఇందుకోసం మొబైల్‌ ఫోన్లు లేని పేదలందరికీ ఫోన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

మరో మూడు వేల కోట్లు..
రాష్ట్రంలో చిల్లర కష్టాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఈనెల 28, 29వ తేదీ వరకు రాష్ట్రానికి మరో మూడు వేల కోట్ల కరెన్సీ రానుందని.. వీటిలో 60 కోట్ల రూపాయలు చిన్న నోట్లు ఉంటాయని ఆర్బీఐ అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇంకా చిన్న నోట్లను పెంచుకోవాల్సిన అవసరముందని.. ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు తలెత్తకుండా బ్యాంకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 

06:39 - November 25, 2016

హైదరాబాద్ : ఎప్పుడు విత్తనాలు, ఎరువులతో ఇబ్బంది పడే రైతులకు ఈ సారి కొత్తగా కరెన్సీ కష్టాలు వచ్చి పడ్డాయి. తమ దగ్గర ఉన్న పాత నోట్లు చెల్లకపోవడంతో విత్తనాలు కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో రైతులు పడుతున్న నోట్ల కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం..! 500, వెయ్యి నోట్ల రద్దు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరంగల్‌ జిల్లాలో రైతులను కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

ఆర్బీఐ సూచనలు..
విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు రద్దైన పాత నోట్లను విత్తన కంపెనీలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించినా యజమానులు మాత్రం సూచనలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో రైతులు విత్తనాలు కొనలేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. విత్తనాలు దొరకపోగా.. పట్టణానికి రాకపోకలకు అదనపు ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ఇప్పటికే వేసిన పంటలకు ఎరువులను వేసేందుకు కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు రైతులు. దీంతో పంట వేసి కూడ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని విత్తన కంపెనీ యజమానులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరముందని చెబుతున్నారు. 

06:36 - November 25, 2016

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధలైన ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అసలే..ఆర్థిక కష్టాలలో..నష్టాల నావను నెట్టుకొస్తున్నరెండు కార్పొరేషన్లు ప్రయాణికుల లేమితో మరింతగా నష్టాలను చవిచూస్తున్నాయి. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రకటన చేసిన నాటినుంచి నేటి వరకూ తీవ్రస్ధాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి.

ప్రతిరోజు రూ.60 లక్షలు నష్టం..
నవంబర్ 8 పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం తొలిరోజు టిఎస్ ఆర్టీసీ కోటిరూపాయలు నష్టాన్ని చవిచూడగా.. నాటి నుండి నేటి వరకూ ప్రతిరోజూ 60 లక్షల రూపాయల నష్టాన్ని నమోదుచేస్తూ వస్తోంది. ప్రయాణికులు చిల్లరదొరక్క తమతమ టూర్లను వాయిదా వేసుకుంటుండగా సుమారు ఈ 16 రోజుల్లోనే 1300 కోట్ల రూపాయలకు పైగా...నష్టాల్ని చవిచూసింది. మరికొంతకాలం ఇదే ఆర్థిక అస్థిరత ఉంటున్న నేపధ్యంలో పెద్దనోట్ల రద్దు వ్యవహారం టిఎస్ ఆర్టీసీకి కోలుకోలేని నష్టం తప్పదని అధికారులు వాపోతున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీకి ఇదే పరిస్ధితి..
మరోవైపు ఏపీలోకూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. జర్నీకి కావాల్సిన చిల్లర దొరక్క జనం తప్పసరి అయితేనే ప్రయాణీస్తున్నారు. దీంతో ఏపీలో కూడా అక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఏపీఎస్ఆర్టీసీ సైతం నష్టాలను చవిచూస్తొంది... ప్రయాణీకుల చిల్లర సమస్యలను తొలగించి అక్యుపెన్సీని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. నగదుతో నిమిత్తం లేకుండా ప్రయాణాలు జరిపేందుకు ఈ పాస్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రయాణీకులు తమ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సహాయంతో టిక్కెట్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బస్టాండ్లు, లాంగ్ రూట్ బస్సులలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తున్నా భవిష్యత్తులో అన్నీ బస్సుల్లో...నగదు రహిత టిక్కెట్ పొందే విధానాన్ని అమలు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తొంది. సాధారణంగా నవంబర్ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో... ఆర్టీసీలో రద్దీ అధికంగా ఉంటుంది. కాకపొతే.. పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ సంస్ధలు భారీగా నష్టపోతున్నాయి. మరో నెలరోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుండటంతో... ఈ తరహా నష్టాలు భారీగా పెరిగే అవకాశం ఉందనీ అధికారులు అంచానా వేస్తున్నారు.

06:32 - November 25, 2016

ఢిల్లీ : నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై స్టే విధించాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం నోట్ల రద్దుపై కేంద్రాన్ని అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది. మరోవైపు నల్లధనం, అవినీతి నిర్మూలనలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఏడు దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన నల్లధనాన్ని నోట్ల రద్దుతో బహిర్గతం కానుందని తెలిపింది. నల్లధనం, అవినీతిపై ప్రభుత్వ పోరాటం వెనుక దాగిన ఉద్దేశాలు వివరించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది. ఇక దేశంలో నగదు లావాదేవాల నిష్పత్తిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, జీడీపీలో నగదు లావాదేవీల వాటా ప్రపంచ సగటు 4 శాతం కాగా, భారత్‌లో ఇది 12 శాతంగా ఉందని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. 

06:29 - November 25, 2016

ఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్‌ 8 తర్వాత బ్యాంకు డిపాజిట్లపై ఆదాయపన్ను చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. 

హైదరాబాద్ కు రానున్న మోడీ..

ఢిల్లీ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుల అకాడమీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు మోడీ హాజరు కానున్నారు. 

బాబును కలువనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

విజయవాడ : నేడు చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు కలువనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని వైసీపీ శాసనసభా పక్షం కోరనుంది. 

టోల్ ట్యాక్స్ రద్దు పొడిగింపు..

ఢిల్లీ : డిసెంబర్ 2వ తేదీ వరకు హైవేలపై టోల్ ట్యాక్స్ రద్దు పొడిగించారు. డిసెంబర్ 2 అర్దరాత్రి నుండి డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ గేట్ల వద్ద పాత రూ. 500 నోట్లు చెల్లుబాటు జరుగుతుందని కేంద్రం పేర్కొంది. 

నేటి నుండి పెద్దనోట్ల మార్పిడి బంద్..

హైదరాబాద్ : నేటి నుండి పాత రూ. 500, రూ. 1000 నోట్ల మార్పిడి బంద్ కానుంది. బ్యాంకు కౌంటర్లలో నోట్ల మార్పిడి నిలిపివేయనున్నారు. కేవలం బ్యాంకులు, పోస్టాపీసుల్లో డిపాజిట్లకు మాత్రమే అనుమతినించనున్నారు. 

పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష...

హైదరాబాద్ : నేడు పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరించనున్నారు. 

నేటి నుండి హుండీల లెక్కింపు..

హైదరాబాద్ : నేటి నుండి హుండీల లెక్కింపు చేపట్టనున్నారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, తదితర దేవాలయాల్లో హుండీలను లెక్కించనున్నారు. 

నేడు వైసీపీ ఎమ్మెల్యేల భేటీ..

విజయవాడ : నేడు వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. అనంతరం వెలగపూడి సచివాలయం సందర్శించి రాజధాని ప్రాంత రైతులతో ఎమ్మెల్యేలు ముఖాముఖి నిర్వహించనున్నారు. 

Don't Miss