Activities calendar

26 November 2016

22:16 - November 26, 2016

'పోరాడితే పోయేదిలేదు బానిస సంకెళ్లు తప్ప'.. అన్న కారల్ మార్క్స్ మాటను నిజం చేసిన ఫెడెల్ క్యాస్ట్రో ఇకలేడు. ఐదు దశాబ్ధాలపాటు క్యూబాను పాలించిన క్యాస్ట్రో తన 90 వ ఏటా కన్నుమూశారు. ఆ మహానేత జీవితం ఒక్క రెక్క విప్పిన రెవల్యూషన్. అంతేకాదు ఆ గెరిళ్లా యుద్ధ వీరుని పోరాటం ప్రపంచ విప్లవ వీరులకు స్ఫూర్తిదాయకం. జీవితమంతా పోరాటాల బాటలో ఎర్రసూరీడులా మండి అస్తమించిన విప్లవ సూరీడు ఫెడెల్ క్యాస్ట్రో. ఆ విప్లవసూరీడు, మహానేత మృతికి తీవ్ర సంతాపం తెలియచేస్తూ టెన్ టివి. నివాళులర్పిస్తోంది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:59 - November 26, 2016

గోవా : జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో గత రెండు రోజులుగా కాల్పులు సద్దుమణిగాయని ర‌క్షణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తెలిపారు. జ‌వాను త‌ల న‌రికినందుకు ప్రతీకారంగా స‌రిహ‌ద్దులో భార‌త్ చేప‌ట్టిన దాడుల‌ను వెంటనే ఆపాల్సిందిగా పాకిస్థాన్ డిజిఎం ఫోన్‌ చేసి అభ్యర్థించారని మంత్రి పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఓ భార‌త జ‌వాను త‌ల న‌రికిన నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద ఉన్న పాక్‌పోస్టులపై ఇండియన్‌ ఆర్మీ ఉధృతమైన దాడులు చేయడంతో పాకిస్తాన్‌ వెనక్కి తగ్గిందని పారీకర్‌ చెప్పారు. అయితే కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌కు పాల్పడుతోంది మీరేన‌ని తాను గుర్తు చేసిన‌ట్లు ఆయన తెలిపారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

 

21:57 - November 26, 2016

ఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా హైకోర్టులు, ట్రిబ్యున‌ళ్లలో ఉన్న ఖాళీల‌ను కేంద్రం భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి టీఎస్ ఠాకూర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టులలో 500 వరకు జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఠాకూర్ మండిపడ్డారు. ఈపాటికి పనిచేస్తూ ఉండాల్సిన 500 మంది జడ్జీలు పనిచేయడం లేదన్నారు. అసలు నియామకాలే జరగలేదని తాను అనట్లేదని.. ఇప్పటికి 120 మందిని మాత్రమే నియమించారని తెలిపారు. ట్రిబ్యునల్ చైర్మన్‌కు క‌ల్పించాల్సిన క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డానికీ ప్రభుత్వం ముందుకు రాక‌పోవ‌డంతో చాలా మంది జ‌డ్జీలు ఆ ప‌ద‌వుల‌ను నిరాక‌రిస్తున్నారని ఠాకూర్ వెల్లడించారు. చీఫ్‌ జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. చీఫ్ జస్టిస్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కానీ జడ్జీల నియామకంలో మాత్రం ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించలేమన్నారు. 

21:53 - November 26, 2016

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని జాతీయ పోలీసు అకాడమీలో తన పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న మోదీ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో 51వ డీజీపీ-ఐజీపీల సదస్సులో ఇవాళ పాల్గొన్నారు. రెండో రోజు సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పోలీసు మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఐబీ ఆఫీసర్లకు మోదీ పోలీసు మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కొందరు కేంద్రమంత్రులు, అన్ని రాష్ర్టాల డీజీపీలు పాల్గొన్నారు. 

 

21:51 - November 26, 2016

హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ప్రజల పరిస్థితి. కరెన్సీ లేక 18 రోజులుగా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా బ్యాంకులకు వచ్చిన సెలవులు.. ఆ కష్టాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలు ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు ఉదయం నుంచే ఏటీఎంల వద్ద బారులు తీరారు. మరోవైపు ఏటీఎంల నుంచి రెండు వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండడంతో గండం ఎలా గడుస్తుందోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. 
18 రోజులు గడుస్తున్నా....
నోట్లు రద్దు చేసి 18 రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. మరోవైపు బ్యాంకులకు రెండు రోజులు సెలవులు రావడంతో ప్రజల కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. నగదు తీసుకునేందుకు ఏటీఎంలు ఒక్కటే దిక్కయ్యాయి. దీంతో ప్రజలంతా ఏటీఎం వద్ద బారులు తీరారు. రద్దీ పెరగడంతో.... గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అందరికీ క్యాష్‌ అందని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల క్యూలైన్లలో నిలబడ్డవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక ఏటీఎంలలో 2 వేల నోటు మాత్రమే వస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెలవెలబోతున్న వ్యాపారాలు
మరోవైపు చిల్లర కష్టాలతో వ్యాపారాలన్నీ వెలవెలబోతున్నాయి. మార్కెట్‌కు వచ్చే వాళ్లంతా రెండు వేల నోట్లు తెస్తుండడంతో చిల్లర ఇవ్వలేకపోతున్నామని వ్యాపారులంటున్నారు. ఏటీఎంలలో చిల్లర నోట్లు కూడా పెడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏటీఎంల దగ్గరకు భారీగా ప్రజలు వస్తుండడంతో ఏటీఎంలు కూడా మొరాయిస్తున్నాయని.. దీంతో ఇబ్బందులు తీవ్రమవుతున్నాయని ప్రజలంటున్నారు. ఇక ఈరోజు బ్యాంకులకు సెలవు అని తెలియక చాలా ప్రాంతాలలో ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. తీరా విషయం తెలుసుకుని నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
ప్రజలకు కాంగ్రెస్‌ అండ 
ఇక సిద్దిపేటలో ఏటీఎం కేంద్రాల వద్ద గంటల తరబడి నిలబడి అవస్థలు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్‌ అండగా నిలిచింది. క్యూలైన్లలో నిలబడ్డవారికి వాటర్‌ బాటిళ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు అందజేశారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బ్యాంకులకు సెలవు కారణంగా ప్రజలకు మరో రెండు రోజులు ఇబ్బందులు తప్పేటట్లు లేదు. 

 

21:47 - November 26, 2016

హైదరాబాద్ : క్యూబా విప‌్లవయోధుడు, మహోద్యమకారుడు ఫిడెల్‌ క్యాస్ట్రో మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం తెలిపారు. క్యాస్ట్రో చనిపోయినా పోరాటస్ఫూర్తి కలకాలం నిలిచి ఉంటుందన్నారు. కమ్యూనిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నిలవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడ్డారు.
క్యూబా ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుంది : మోడీ 
క్యూబా విప్లవయోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతిపట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్నారీ, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్యూబా ప్రజలకు, ప్రభుత్వానికి తమ సానుభూతిని ప్రకటించారు. ఈ విషాద సమయంలో క్యూబా ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని మోడీ తెలిపారు. ఫిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు వీరుడని పొగిడారు. ఆయన మృతితో భారత్ ఒక మంచి స్నేహితున్ని కోల్పోయిందని తన ట్విట్టర్ ట్విట్ చేశారు. 
క్యాస్ట్రో మృతి పట్ల వామపక్ష నేతలు సంతాపం  
క్యూబా యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల దేశవ్యాప్తంగా వామపక్ష నేతలు సంతాపం తెలిపారు. క్యూబా విప్లవానికే నేత కాదని.. ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేస్తున్న అందరికి నేతగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ తెలిపారు. ఫిడెల్‌ కాస్ట్రో మరణం విచారకరమైనదని సీపీఎం నేత రాఘవులు అన్నారు. చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని లిఖించిన గొప్ప విప్లవకారుడు ఫిడెల్‌ కాస్ట్రో అని ఆయన అన్నారు. క్యాస్ట్రోకు ఎంబీ భవనలో సీపీఎం నేతలు నివాళులర్పించారు. క్యాస్ట్రో మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. కమ్యునిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఫిడెల్ క్యాస్ట్రో మరణం తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిరంతరం పోరాటాలే క్యాస్ట్రోకు ఘనమైన నివాళి అని తెలిపారు. ఫిడెల్‌ క్యాస్ట్రోకు నల్లగొండ జిల్లా సీపీఎం నేతలు నివాళులర్పించారు. 40 ఏళ్ల పాటు క్యూబా అభివృద్ధికి క్యాస్ట్రో ఎంతో కృషి చేశారని తెలిపారు. 
క్యాస్ట్రో మృతికి పవన్ ట్విట్టర్ లో సంతాపం  
ఇక ఫిడెల్‌ క్యాస్ట్రో మృతిపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ప్రజల్లో స్ఫూర్తి నింపిన నాయకుడికి జనసేన సెల్యూట్‌ చేస్తుందన్నారు. చెగువేరాతో క్యాస్ట్రో సాగించిన పోరాటాన్ని.. ఈసందర్భంగా మననం చేసుకుంటున్నామన్నారు. క్యూబన్ల ప్రజారోగ్యం కోసం క్యాస్ట్రో ఎంతగానో కృషి చేశారని ట్విట్టర్‌లో పవన్‌ తెలిపారు. 

 

2017..18 కేంద్ర బడ్జెట్ రూపకల్పనపై జైట్లీ కసరత్తు

ఢిల్లీ : 2017..18 కేంద్ర బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ఆర్థక శాఖ అరుణ్ జైట్లీ కసరత్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ, ట్రేడ్ గ్రూప్ లతో జైట్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఫిడెల్ క్యాస్ట్రో మృతికి ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సంతాపం

విజయవాడ : ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సంతాపం తెలిపారు.  ఫిడెల్ క్యాస్ట్రో గొప్ప నేత కొనియాడారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నిలబడి మద్దతు ప్రకటిస్తే ప్రజలకు ధైర్యం వస్తుందని చెప్పారు. కర్నూలు ఎస్ బీఐలో డబ్బుల కోసం వచ్చి మృతి చెందిన బాల్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

ఈనెల 29న చెరువులకు జియో ట్యాగింగ్ : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : ఈనెల 29న చెరువులకు జియో ట్యాగింగ్ చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు జియో ట్యాగింగ్ ను డిసెంబర్ 2 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల జియో ట్యాగింగ్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ కూడా రూపొందించామని చెప్పారు. ట్యాగింగ్ పై ఇంజినీర్లు, సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ పనులపై ప్రతిరోజు సీఈకి తెలియజేయాలన్నారు. చెరువుల జియో ట్యాగింగ్ పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. 

 

పాకిస్తాన్ కొత్త సైనికాధ్యక్షుడిగా కమర్ జావెద్ భాజవా

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ కొత్త సైనికాధ్యక్షుడిగా కమర్ జావెద్ భాజవా ఎన్నికయ్యారు. ఈనెల 29తో రాహిల్ షరీఫ్ పదవీకాలం ముగియనుంది. 

హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ కు చేరిన పీవీ సింధు

హైదరాబాద్ : పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరారు. సెమీస్ లో హాంకాంగ్ క్రీడాకారిణి చంగ్ నగన్ యిపై 21...14, 21...16 సెట్లతో విజయం సాధించారు. ఫైనల్ చైనీస్ ప్లేయర్ తైపీతో సింధు తలపడనున్నారు. 

20:50 - November 26, 2016
20:48 - November 26, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 28 న జరిగే హార్తాల్ కు తమ పార్టీ మద్దతిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.  దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న నిరసనలకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు. ఈ బంద్ లో ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొని విజయవంతం చేయాలని భూమన పిలుపునిచ్చారు. 

 

20:45 - November 26, 2016

కడప : రాష్ట్ర ప్రజలందరూ నగదు రహిత చెల్లింపులు అలవాటు చేసుకోవాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి జన్‌ధన్‌ అకౌంట్లు ప్రారంభించేందుకు సహకరిస్తామని కడప మున్సిపల్‌ మైదానంలో జరిగిన డ్వాక్రా సదస్సులో ఆయన చెప్పారు. రూపీ కార్డులు ఇస్తామన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగేందుకు నగదు రహిత చెల్లింపులు అవసరమని చంద్రబరాబు చెబుతున్నారు. 
 

20:40 - November 26, 2016

'పెద్ద నోట్ల రద్దు....సంక్షోభంలో సామాన్యుడు' అనే అంశంపై టెన్ టివి బిగ్ డిబేట్ నిర్వహించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలోనే లోపం ఉందని వక్తలు అన్నారు. నోట్ల రద్దుతోనే నల్లధనాన్ని అరికట్టవచ్చనే ప్రభుత్వం ఆలోచన అవివేకమన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని.. నల్లకుభేరులు తప్పించుకున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలకు కష్టాలు తప్ప.. అదనంగా ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు తీసుకున్న నిర్ణయంగానే భావించాలన్నారు. నల్లధనం కుబేరులపై సర్జికలు దాడులు కాదని... ప్రజలు, బ్యాంకులపై ప్రభుత్వం సర్జికల్ దాడులు చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ డిబేట్ లో బీజేపీ నేత అల్జాపురం శ్రీనివాస్, సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, ఆర్థిక రంగ నిపుణులు, వీక్షణం ఎడిటర్ ఎం.వేణుగోపాల్, ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, టీడీపీ నేత పెద్దిరెడ్డి, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట్రామయ్య, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ, ఆర్థిక రంగ నిపుణులు పాపారావు పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే...
బీజేపీ నేత అల్జాపురం శ్రీనివాస్... 
'మోడీ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలకు సంక్షోభం... కానీ ప్రజలకు కాదు. ఫిజికల్ ఇబ్బంది ఉంటుంది. 
సీపీఎం కేంద్రకార్యదర్శి వర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు... 
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలోనే లోపం ఉంది. 93శాతం బ్లాక్ మనీ విదేశాల్లో ఉందని మోడీ చెప్పారు. కార్పొరేట్లకు 7 వేల కోట్ల రూపాయలను రద్దు చేశారు. 90 శాతం నల్లధనం రెండు వేల మంది దగ్గర ఉంది. వారి పేర్లు కూడా ప్రభుత్వానికి తెలుసు. కానీ వారిపై దాడులు లేవు. చర్యలు లేవు. నల్లకుబేరులను అరెస్టు చేయలేదు. వారిని రాజరికమార్గంలో పంపారు. జనం డబ్బులు బ్యాంకుల్లో చేరాయి. ప్రజల సొమ్మును మళ్లీ కార్పొరేట్లకు కట్టబట్టేందుకు కుట్ర చేస్తున్నారు. ఇది నాటకం. 4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జనవరి నుంచి ధరలు తగ్గిస్తారా....? మొత్తం డబ్బులో నల్లధనం 6 శాతమే ఉంది. కార్పొరేట్లకు డబ్బు కట్టబట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఇది ఒక డబ్బు మార్పిడి స్కాం.
వీక్షణం ఎడిటర్ ఎం.వేణుగోపాల్....
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పుడు నిర్ణయం. లిక్విడ్ క్యాష్ రాజకీయ నాయకుల దగ్గరే ఉంటుంది. పెద్ద నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనాన్ని అరికట్టలేరు. 1978లో కూడా నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఇలానే చేశారు. రిలయన్స్, బులియన్, చిట్ ఫండ్, వ్యైద రంగంలో నల్లధనం ఉంది. నల్లధనం ఉన్నవారిపై దాడి చేయకుండా 130 కోట్ల మందిపై దాడి చేశారు. ప్రధాని చెప్పినట్లు ప్రకటిత లక్ష్యాలు వాస్తవం కాదు. నల్లధనాన్ని అరికట్టే కోరిక బీజేపీ ప్రభుత్వానికి  లేదు. క్యాష్ లెస్, భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజేషన్ చేయాలని జైట్లీ చెప్పారు.  
ఎపిసిసి జనరల్ సెక్రటరీ గిడుగు ముద్రరాజు...
డెసిజన్ తీసుకున్నపరిస్థితిని ఆలోచన చేయాలి. ఇది అవివేకమైన చర్య. 2 వేల రూపాయల నోటు తీసుకురావడం అవివేకం. క్యాష్ లెస్ సొసైటీ వ్యవస్థ చేస్తామనడం హాస్యాస్పదం. చాలా గ్రామాలకు అందుబాటులో బ్యాంకులు లేవు. ఎకానమిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసంఘటిత రంగం కుదేలైంది.
ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి...
పెద్ద నోట్ల రద్దు..ఆచరణలో ఇబ్బందులు వస్తున్నాయి. సుపరిపాలన రావాలి. క్లిష్టమైన విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచన చేయాలి. అనేక గ్రామాలకు అందుబాటులో బ్యాంకులు లేవు.
టీడీపీ నేత పెద్దిరెడ్డి 
అంతు చిక్కని సాహసోపేతమైన నిర్ణయం... కానీ ఇబ్బందులు ఉన్నాయి. 
బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వెంకట్రామయ్య
టీమ్ వర్క్ జరగలేదు. టీమ్ వర్క్ జరిగివుంటే ఇది సాధ్యం కాదని చెప్పేవారు. సామాన్యుడిపై, బ్యాంకులపై సర్జికల్ దాడులు జరిపినట్లు ఉంది.
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ
డబ్బుల కోసం సామాన్యులు క్యూలో ఉన్నారు. పదిహేను రోజులైనా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిని నల్లధనం వ్యతిరేకులని ప్రధాని అంటున్నారు. పర్యవసానాల్ని ఎందుకు అంచనా వేయలేదు. ఎందుకు ఆర్ బీఐ అంచనా వేయలేకపోయింది. దేశంలో బీజేపీ లేనప్పుడే దేశభక్తి ఉంది. దేశభక్తి గురించి బీజేపీ చెప్పవలసిన అవసరం లేదు. త్యాగాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పులేదు. కానీ అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి. జీడీపీపై దీన్ని ప్రభావం ఉంటుంది. 
ఆర్థిక రంగ నిపుణులు పాపారావు  
మోడీ నిర్ణయం సరైనది కాదు. నల్లకుబేరులు తప్పించుకున్నారు. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులు ఒత్తడి ఉంది. 90 శాతం మంది అసంఘిత రంగంపై ఆధారపడి ఉన్నారు. వారు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

https://youtu.be/mYIEZy6oqbM

 

భారత్ బంద్ కు మద్దతిస్తున్నాం : ముద్రగడ

హైదరాబాద్ : తమ డబ్బు తాము తీసుకోవడానికే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. పేదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలిచ్చిన భారత్ బంద్ కు మద్దతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నోట్ల రద్దు విషయం కొందరు పెద్దలకు, టీడీపీ, బీజేపీ నేతలకు ముందుగానే తెలిసిందంటున్నారని, ఇది విచారకరమన్నారు.

కడప మున్సిపల్ స్టేడియంలో టీడీపీ బహిరంగ సభ

కడప : మున్సిపల్ స్టేడియంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. విద్యార్థులు, డ్వాక్రా మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వంచారు. నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో లాభాలుంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ లో నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలన్నారు. పసుపు, కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు
ఇస్తున్నట్లు చెప్పారు. 

 

అలీన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన క్యాస్ట్రో : వి.శ్రీనివాస్ రావు

హైదరాబాద్ : అలీన ఉద్యమానికి ఫెడరల్ క్యాస్ట్రో వెన్నుదన్నుగా నిలిచారని సీపీఎం జాతీయ కార్యదర్శివర్గం సభ్యులు వి.శ్రీనివాస్ రావు తెలిపారు. ఎంబి భవన్ లో క్యాస్ట్రో సంతాప సభ నిర్వహించారు. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో మావో తర్వాత అంతటి పేరు గడించిన నేత క్యాస్ట్రో అని అన్నారు. 

 

ఢిల్లీ బయల్దేరిన ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హస్తినకు పయనమయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ప్రధానికి వీడ్కోలు పలికారు.

 

19:01 - November 26, 2016

క్యూబా : కమ్యూనిస్టు మహాశిఖరం నేలకొరిగింది. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పాటుపడిన క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో తుదిశ్వాస విడిచారు. 90ఏళ్ల కమ్యూనిస్టు కురువృద్ధుడు క్యాస్ట్రో అనారోగ్యంతో కన్నుమూశారు. పేదల మణిదీపం క్యాస్ట్రో మరణంతో క్యూబా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. 
మహోన్నత శక్తి ఫెడరల్‌ క్యాస్ట్రో 
ఫెడరల్‌ క్యాస్ట్రో.... ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. ఆ పేరు వినగానే మనలో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని పాతరేయమని గుర్తు చేస్తుంది. అంతేకాదు.. పీడిత ప్రజలపై సాగే దోపిడీకి వ్యతిరేకంగా పోరాడమని పిలుపునిస్తుంది. అంతటి మహోన్నత శక్తి ఫెడరల్‌ క్యాస్ట్రో పేరుకుంది. 
అమెరికా సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేసిన క్యూబా
ఫెడరల్‌ క్యాస్ర్టో క్యూబాకు సుదీర్ఘకాలంపాటు దేశాధ్యక్షుడిగా పనిచేశారు.  1959 నుంచి 1976 వరకు ప్రధానిగా పనిచేశారు.  1976 నుంచి 2008 వరకు క్యూబాకు అధ్యక్షునిగా విశేషమైన సేవలందించారు. క్యాస్ట్రో సారధ్యంలోనే క్యూబా అన్ని రంగాల్లో ఊహించని ప్రగతి సాధించింది.  క్యూబా దేశం ఆర్దికంగా బలమైన శక్తిగా ఎదిగింది.  అంతేకాదు.. అమెరికాకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. అమెరికాతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి క్యూబా ఎదిగిందంటే.. అందుకు తెరవెనుక నాయకుడు క్యాస్ట్రో అని  చెప్పక తప్పదు. క్యూబా అధ్యక్షుడిగా దేశానికి ఫిడెల్‌ మార్గనిర్దేశనం చేశారు.  క్యాస్ట్రో ఉక్కుసంకల్పం, పట్టుదల, అంకుఠిత దీక్షతో క్యూబా అనతికాలంలోనే  ఎనలేని శక్తిగా ఎదిగింది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని సవాల్‌ చేసి ఎదురునిలిచింది.
యుక్తవయసులో విప్లవ భావాలు
ఫిడెల్‌ క్యాస్ట్రో అసలు పేరు ఫిడెల్‌ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్‌. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచే క్యాస్ట్రోలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. విప్లవ భావాలు యుక్తవయసులోనే  అలవడ్డాయి. అప్పుడే అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా నిరసించారు క్యాస్ట్రో.  మొదటి నుంచి విప్లవ భావాలు కలిగిన ఫిడెల్‌.. హవానా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.  సామ్యవాద భావాలతో బలమైన బంధం ఏర్పర్చుకున్న ఫిడెల్‌ తమ్ముడు రౌల్‌ క్యాస్ట్రోతో కలిసి 1953లో అప్పటి క్యూబా మిలిటరీ నియంత పుర్జెసియా బటిస్టాపై దాడికి తెగబడ్డారు.  ఈ దాడిలో తమ్ముడితో కలిసి బందీగా చిక్కిన క్యాస్ట్రో... 15ఏళ్ల కారాగార శిక్ష  ఎదుర్కొని బయటకు వచ్చారు.  ఆ తర్వాత తన తమ్ముడు  రౌల్, మరో విప్లవ యోధుడు చేగువేరాతో పాటు ఎంతోమంది యువతను చేరదీసి, గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చారు. క్యూబాలో విప్లవోద్యమాన్ని రగిల్చి  1959, జనవరి 9న  నాటి బటిస్టా ప్రభుత్వాన్ని గెరిల్లా యుద్ధంతో గద్దె దింపారు.  పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశంగా క్యూబాను ఏర్పాటు చేశారు.  కేవలం 33 ఏళ్ల వయసులోనే  క్యూబా త్రివిధ దళాల అధిపతి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత నెలరోజుల్లోనే ఆ దేశ ప్రధానిగా అధికారం చేపట్టారు.  ఆ తర్వాత 1976 నుంచి 2008 వరకు  అధ్యక్షుడిగా క్యూబాకు మార్గ నిర్దేశం చేశారు. 
క్యాస్ట్రోపై 638సార్లు అమెరికా హత్యాయత్నం
మొదటి నుంచి అమెరికా సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా క్యాస్ట్రో వ్యతిరేకిస్తూ వస్తుండడంతో...ఆయనను అంతమొందించేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది.  తన గూడాఛార సంస్థ సీఐఏతో క్యాస్ట్రోను హత్య చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.  ఇలా మొత్తంగా 638సార్లు క్యాస్ట్రో హత్యకు ప్రయత్నించింది. అయినప్పటికీ నిత్యం అప్రమత్తంగా ఉండే ఫిడెల్‌ క్యాస్ట్రో అమెరికా కుట్రలను తుత్తునియలు చేశారు. అమెరికా ప్రయత్నాలన్నీ ఛేదించి మృత్యుంజయుడిగా నిలిచారు. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన ప్రధాని మోడీ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. కాసేపట్లో ప్రధాని ఢిల్లీ వెళ్లనున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ప్రధానికి వీడ్కోలు పలుకనున్నారు.

18:48 - November 26, 2016
18:46 - November 26, 2016

హైదరాబాద్ : ప్రజల నగదు కష్టాలపై సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎంపీలంతా ప్రజలకు మద్దతుగా బ్యాంకుల వద్ద చెక్కులతో నిలబడితే బాగుంటుందని చెప్పారు. ఎపి, తెలంగాణ ఎంపీలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద నిలబడి తమ మద్దతు ప్రకటిస్తే ప్రజలకు ధైర్యం వస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో డబ్బుల కోసం క్యూలో నిలబడి మృతి చెందిన బాల్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:43 - November 26, 2016
18:42 - November 26, 2016

మెదక్ : ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రెండున్నరేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 41వ రోజు మెదక్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు మంబోజిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన తమ్మినేని బృందం .. మెదక్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో సరిపడ వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రులలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 

 

18:37 - November 26, 2016

మెదక్ : సంచారం చేస్తూ జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బుడగ జంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా వెల్దూర్తి మండలం రామాయంపల్లిలో అనేకమంది బుడగ జంగాలు జీవనం కొనసాగిస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సమస్యలను వీడియోలో చూద్దాం....

 

18:35 - November 26, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 28 న నిర్వహించే ఆక్రోశ్ దిన్ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛంథంగా పాల్గొని విజయవంతం చెయ్యాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడ‌రంతా రోడ్ల మీదికొచ్చి నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్నస‌మ‌స్యపై నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ లో ఆర్బీఐ ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా కలిసి మానవహారం చేపట్టనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 

 

18:32 - November 26, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లను రద్దు చేసి 18 రోజులైనా  ప్రజలకు చిల్లర కష్టాలు తీరలేదు. అలాగే ఈరోజు..రేపు బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి. సోమవారం కూడా భారత్‌బంద్‌ కారణంగా బ్యాంకులు తెరిచే అవకాశం లేదు. దీంతో సామాన్యులకు చిల్లర కష్టాలు మరింత పెరగనున్నాయి. బ్యాంకుల సెలవులతో తెల్లవారుజాము నుంచే ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. ఇప్పటికే  కనీస అవసరాలు తీరక అల్లాడుతున్న జనం..బ్యాంకుల సెలవులతో మరిన్ని సమస్యలు ఎదుర్కోనున్నారు. 

 

18:27 - November 26, 2016

హైదరాబాద్ : ప్రధాని బందోబస్తు..అంతటా అప్రమత్తం...విధుల్లో ఉన్న పోలీసులు ప్రతీ క్షణం గస్తీ...అదే సమయంలో తుపాకీ పేలిన శబ్దం కలవరపెట్టింది. వెంటనే వెళ్లి చూస్తే డ్యూటీలో ఉన్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కుప్పకూలిపోయి కన్పించాడు...ప్రధాని బందోబస్తు కోసం వచ్చిన ఎస్సై ఆత్మహత్య కలకలం రేపింది... ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తున్నా...అసలు విషయం తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.
సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్న శ్రీధర్..
ప్రధాని నరేంద్రమోడి పర్యటన సందర్భంగా నగరంలో బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రధాని పర్యటన బందోబస్తులో భాగంగా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లి 20 అంతస్తుల భవనంలోని 19వ అంతస్తులో నిలబడి గస్తీ నిర్వహిస్తున్నాడు...సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర సమయంలో విధుల్లో ఉన్న శ్రీధర్‌ తన రివాల్వర్‌తో చాతి భాగంలో గురిపెట్టుకుని కాల్చుకున్నాడు...రివాల్వర్‌ శబ్దం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులంతా ఒక్కసారిగా కలవరపడ్డారు.
2012లో ఎస్సైగా రిక్రూట్‌
2012లో ఎస్సైగా రిక్రూట్‌ అయిన శ్రీధర్‌ వరంగల్ జిల్లా పైడిపల్లికి వాస్తవ్యుడు...నాలుగేళ్లలో నాలుగు పోలీసు స్టేషన్లు మారారు. గతంలో గుడిహత్నూర్, ముధోల్, కాగజ్‌నగర్ స్టేషన్లలో చేసిన ఆయన..ప్రస్తుతం కుమ్రంభీం జిల్లా చింతనమనేపల్లి స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రేమ వ్యవహారమే కారణమా..?
శ్రీధర్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది...అయితే తాను ప్రేమించిన అమ్మాయి విషయంలో కన్నవారు ఒప్పుకోపోవడంతో మనస్తాపానికి గురయిన శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకునే విషయం సన్నిహితుడికి చెప్పినట్లు తెలుస్తోంది. .దీంతో ఆ స్నేహితుడు వారించినట్లు సమాచారం...ఉదయం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిందని సన్నిహితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.. అయితే నాలుగేళ్లలో ఎన్నో పోలీసు స్టేషన్లు మారిన శ్రీధర్‌కు ప్రేమ వ్యవహారమేనా..?లేక మరేదైనా కారణాలున్నాయాన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీలు ప్రజలకు మద్దతుగా బ్యాంకుల వద్ద నిలబడాలి : పవన్

హైదరాబాద్ : ప్రజల నగదు కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎంపీలంతా ప్రజలకు మద్దతుగా బ్యాంకుల వద్ద చెక్కులతో నిలబడితే బాగుంటుందని సూచించారు. ఎపి, తెలంగాణ ఎంపీలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద నిలబడి తమ మద్దతు ప్రకటిస్తే ప్రజలకు ధైర్యం వస్తుందన్నారు. 
కర్నూలు జిల్లాలో డబ్బుల కోసం క్యూలో నిలబడి మృతి చెందిన బాల్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 

17:59 - November 26, 2016

హైదరాబాద్ : క్యాస్ట్రో మరణం ప్రపంచ ఉద్యమానికి తీరని లోటు అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ లో నిర్వహించిన క్యాస్ట్రో సంతాప సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అమెరికా, యూరప్ సామ్రాజ్యావాదాన్ని ధీటుగా ఎదుర్కొన్న ఒకే ఒక్కడు క్యాస్ట్రో కొనియాడారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు క్యాస్ట్రో స్ఫూర్తి ప్రధాత అని అన్నారు. క్యూబాలో అత్యున్నత పరిపాలనకు ఆయన మార్గదర్శి అని  చెప్పారు. క్యాస్ట్రో స్ఫూర్తితో విలువలతో కూడిన పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మొహాలీ టెస్టు... ముగిసిన తొలిరోజు ఆట

హైదరాబాద్ : మొహాలీలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ : బెరిస్టో 89, బట్లర్ 43, స్టోక్స్ 29, కుక్ 27, వోక్స్ 25, అలీ 16, రూట్ 15, హమీద్ 9, క్రీజులో రషీద్ (4) ఉన్నాడు. 

 

క్యాస్ట్రో గొప్ప మేధావి : సురవరం

కృష్ణా : క్యూబా మాజీ అధ్యక్షులు క్యాస్ట్రో గొప్ప మేధావి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కొనియాడారు. విజయవాడలో క్యాస్ట్రో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి క్యాస్ట్రో అని అన్నారు.

 

17:36 - November 26, 2016

కరీంనగర్‌ : పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న నిర్వహించతలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి. ప్రజలు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలందరూ ఆందోళనలో పాల్గోవాలని కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీపీఎం, సీపీఐ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వామపక్ష నేతలు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వామపక్ష నేతలు అన్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండాలని కోరారు.

 

17:30 - November 26, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో రోజు రోజుకు పెరుతున్న పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా సీపీఎం ప్రజాభేరి పాదయాత్ర చేపట్టింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. తణుకు నుంచి ప్రారంభమైన యాత్ర పద్నాలుగు రోజులపాటు పదహారు మండలాల్లో నాలుగొందల కిలో మీటర్లు కొనసాగుతుంది. వచ్చే నెల 9న ఏలూరులోని జిల్లా కలెక్టరేట్‌ దగ్గర మహా ధర్నా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:22 - November 26, 2016

విజయనగరం : కేసీఆర్ లక్షలాది గజాల్లో ఇళ్లు కట్టి జగన్ కన్నా తానేమి తక్కువ తినలేదని నిరూపించారని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు విమర్శించారు. విజయనగరంలో నిర్వహించిన టీడీపీ జనచైతన్య యాత్రలో అశోక గజపతిరాజు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలు దోచుకొని రాష్ట్ర విభజనకు సహకరించిన నేతలు... ఇప్పుడు ప్రజా సేవ అంటూ మనముందుకు వస్తున్నారని మండిపడ్డారు. నల్లధనం నిర్మూలనపై తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఉద్ఘాటించారు. 

 

బాలికపై నలుగురు యువకులు అత్యాచారం

 కృష్ణా : గన్నవరం మండలం అల్లాపురంలో దారుణం జరిగింది. బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ఎంబీ భవన్ లో ఫిడెల్ క్యాస్ట్రో సంతాప సభ

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ లో క్యూబా మాజీ అధ్యక్షులు ఫిడెల్ క్యాస్ట్రో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

 

16:39 - November 26, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు, చిన్ననోట్లు దొరక్క పద్దెనిమిది రోజులుగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికితోడు ఈరోజు నుంచి వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు. దీంతో ఈ విషయం తెలియక ఉదయం నుంచే జనాలు బ్యాంకులకు తరలి వస్తున్నారు. బ్యాంకులు మూసివేసి ఉండటంతో వచ్చిన ప్రజలు నిరాశకు గురవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:36 - November 26, 2016

విశాఖపట్నం : దేశంలో నగదు రహిత చెల్లింపులు పెరగాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఏకీకృత కార్డును అందుబాటులోకి తీసుకురానున్నట్లు... తెలిపారు. ఇరవై ఒక్క బ్యాంకులు కలిసి తీసుకొస్తున్న ఈ కార్డుకు తర్వలోనే పేరు ఖరారు చేస్తామన్నారు. విశాఖపట్నంలో జరిగిన నివాసిత సంక్షేమ సంఘాల జాతీయ సదస్సుకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద నోట్ల రద్దు ప్రాధాన్యతను వివరించారు. విశాఖ నగర పాలక సంస్థలో నగదు రహిత లావాదేవీలను ఆయన ప్రారంభించారు. పౌరసేవలన్నీ నగదు రహితంగా జరిగేలా ఉమ్మడి కార్డు తీసుకొస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారు. 

 

16:26 - November 26, 2016

మాస్కో: రష్యాలోని ఓ టీవీ ఛానల్‌ లైవ్‌లో చర్చ ఘర్షణకు దారితీసింది.. పోలండ్‌ జర్నలిస్ట్‌ తమోజ్‌, ఉక్రెయిన్‌ మాజీ ఎంపీ ఇహోర్‌ మార్కోవ్‌ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. రష్యాలో కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నాయన్న అంశంపై ఈ చర్చ నడిచింది. జర్నలిస్ట్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన మార్కోవ్‌... తన చేతిలోని పేపర్‌ను తోమజ్‌ ముఖంపైకి విసిరేశారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యక్ష ప్రసారంలోనే కొట్టుకున్నారు. ఇదంతా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైంది.

 

16:23 - November 26, 2016

మేడ్చల్‌ : జిల్లాలోని ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తరగతులను బహిష్కరించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి...న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ.. ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కాగా విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.  

 

16:18 - November 26, 2016

హైదరాబాద్‌ : నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఓ ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్‌ఐ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రధాని బందోబస్తులో విధుల్లో ఉన్న శ్రీధర్‌ కొమురంభీం జిల్లా..చింతమానేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఈయనకు ఇంకా పెళ్లికాలేదు. వరంగల్‌ జిల్లా పైడిపల్లి గ్రామంలో శ్రీధర్‌ జన్మించారు. గతంలో ముథోల్‌..కాగజ్‌నగర్‌ రూరల్‌లో పని చేశారు. కాగా ఆయన మృతికి కారణాలు ఇంకా తెలియలేదు. 

 

16:11 - November 26, 2016

హైదరాబాద్‌ : నగరంలో .. నకిలీ కరెన్సీని ముద్రించి.. చలామణి చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ప్రింటింగ్‌ మిషన్, స్కానర్లు.. నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నకిలీ నోట్ల చలామణి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:05 - November 26, 2016

మెదక్ : కమ్యునిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యూబా మాజీ అధ్యక్షుడు, మహోద్యమకారుడు క్యాస్ట్రో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఫిడెల్‌ క్యాస్ట్రో మృతికి సంతాపం తమ్మినేని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిడెల్‌ క్యాస్ట్రో ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపిచ్చారు. అగ్ర రాజ్యం అమెరికాను అల్లాడించిన ఘనత క్యాస్ట్రోదని కొనియాడారు. 

 

14:04 - November 26, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు సైతం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పలువురు ఇప్పటికే సెలబ్రెటీలు సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితలోప్రముఖ క్రికేటర్ యువరాజ్ సింగ్ కూడా చేరాడు. ఆయన త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే వారంలో ఇతడి వివాహం జరగనుంది. పెళ్లి ఖర్చుల కోసం రిజర్వ్య్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2.5 లక్షలు మాత్రమే డ్రా చేసుకొనే అవకాశం యువరాజ్ కు ఇచ్చింది. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు..బ్లాక్ మనీకి భారతీయులు సహకరించాలని మీడియాతో యువరాజ్ పేర్కొన్నాడు. 

13:59 - November 26, 2016

ముంబై : 26/11 అంటే దేశ ప్రజలు మరిచిపోలేని రోజు. ముష్కరులు ముంబైలో పేలుళ్లు జరిపి నేటికి సరిగ్గా 9 సంవత్సరాలు అవుతోంది. నవంబర్ 26, 2008లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైపై జరిపిన దాడిలో 166 మంది మృతి చెందారు. ఇందులో కొంతమంది పోలీసులు వీరమరణం పొందారు. ఈ సందర్భంగా ముంబై పేలుళ్ల మృతులకు దేశం ఘనంగా నివాళులర్పించింది. ముంబైలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్ నివాళులర్పించారు. 

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : 10కే రన్ సందర్భంగా ఆదివారం హుస్సేన్‌సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.

పోలీసులకు ఆధునాతన ఆయుధాలు - ఫడ్నవీస్..

ముంబై: పోలీసులకు అధునాతన ఆయుధాలు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. 26/11/2008 రోజు టెర్రరిస్టుల దాడి ఘటనలో మృతులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. 

13:49 - November 26, 2016
13:48 - November 26, 2016
13:46 - November 26, 2016

హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీని ముద్రణ గట్టురట్టైంది. కరెన్సీని ముద్రించి.. చలామణి చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు. దొంగ నోట్లను ముద్రిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను గుర్తించామని అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. వారి దగ్గర నుంచి ప్రింటింగ్‌ మిషన్, స్కానర్లు..నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

13:42 - November 26, 2016

ఒడిశా: సీఐటీయూ 15వ జాతీయ మహాససభలు పూరీలో ప్రారంభమయ్యాయి. సీఐటీయూ జాతీయ అధ్యక్షులు పద్మనాభవన్ జెండా ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు, కమ్యూనిస్టు నేతలు హాజరయ్యారు.
గడిచిన మూడేళ్లలో కార్మికుల సమస్యలు, పోరాటాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశాల్లో కీలక తీర్మానాలు..కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏ సమస్యలపై పోరాడుతున్నారో వాటి ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశ వ్యాప్త సమ్మెలో రెండు కోట్ల మంది పాల్గొన్నారని, ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వాలపై వత్తిడి తీసుకొచ్చే విధంగా పోరాటం చేయాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

13:35 - November 26, 2016
13:31 - November 26, 2016

ఢిల్లీ : క్యూబా యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపట్ల వామపక్ష నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన క్యూబా విప్లవానికే నేత కాదని.. ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేస్తున్న అందరికి నేతగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ తెలిపారు. ఆయన చనిపోయినా.. క్యాస్ట్రో పోరాట స్ఫూర్తి కలకాలం నిలిచి ఉంటుందన్నారు.

రాఘవులు సంతాపం..
విప్లవనేత..క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ కాస్ట్రో మరణం విచారకరమైనదని సీపీఎం నేత రాఘవులు అన్నారు. చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని లిఖించిన గొప్ప విప్లవకారుడు ఫిడెల్‌ కాస్ట్రో అని ఆయన అన్నారు. ఆయన మృతి క్యూబాకే కాక విప్లవోద్యమానికి తీరని లోటు అని అన్నారు. 

13:29 - November 26, 2016

క్యూబా విప్లవకారుడు, రాజకీయ నేత ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు.. ఆగస్టు 13, 1926న జన్మించిన క్యాస్ట్రో... కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. కాస్ట్రో.. క్యూబాను 1959 జనవరి నుండి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించారు. క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టిన ఫిడేల్‌... దేశాభివృద్ధికోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. క్యూబాను పశ్చిమార్థ భూగోళంలో మొట్ట మొదటి సామ్యవాద దేశంగా మార్చారు. అమెరికాకు పూర్తివ్యతిరేకంగాఉన్న ఈ విప్లవవీరున్ని హత్య చేసేందుకు యూఎస్‌కుచెందిన గూఢాచార సంస్థ సి.ఐ.ఏ 638 సార్లు ప్రయత్నించింది.. క్యాస్ట్రో కాల్చే చుట్టలో బాంబు పెట్టి, అతని స్కూబా-డైవింగ్ సూట్‌లో ప్రాణాంతకమైన ఫంగస్‌ను ప్రయోగించి చంపేందుకు ట్రై చేసింది. మాఫియా తరహాలోకూడా కాస్ట్రోను కాల్చివేయటానికి చూసింది. ఈ కుట్రలనుంచి తప్పించుకున్న కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడ్డారు.

బిరాన్ గ్రామంలో జననం..
కాస్ట్రో క్యూబాలోని మయారి పట్టణానికి సమీపంలోని ఉన్న బిరాన్ గ్రామంలో జన్మించారు.. క్యాస్ట్రో తండ్రి స్పెయిన్ దేశం నుంచి వలస వచ్చిన చెరకు తోటల పెంపకం దారుడు. కాస్ట్రో తల్లి లీనా రుజ్ గొంజాలెజ్ పనిమనిషిగా చేసేవారు. చిన్నతనంనుంచి క్యాస్ట్రో చురుగ్గాఉండేవారు.. ఉద్యమాల్లో పాల్గొనేవారు.. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలోచేరిన ఫిడేల్‌ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే 1952లో క్యూబా ప్రతినిథుల సభ కోసం జరగబోయే ఎన్నికల్లో పోటీచేశారు. అయితే అదే సమయంలో బాటిస్టా.... మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు. కాస్ట్రో.... బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించారు.

15 ఏళ్ల జైలు శిక్ష..
జూలై 26, 1953 న కాస్ట్రో దళాలు క్యూబాలోని మోన్‌కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుబడిన క్యాస్ట్రోకు 15ఏళ్ల జైలుశిక్ష విధించారు.. 1955లో బాటిస్టా ఫిడేల్‌ను విడుదల చేశాడు. జైలునుంచి బయటకువచ్చిన కాస్ట్రో జూలై 26 ఉద్యమం అనే పేరుతో విప్లవ దళాన్ని నిర్మించారు... ఈ విప్లవ దళంతో కాస్ట్రో మెక్సికో వెళ్లారు... అక్కడే విప్లవ కారుడు చెగువీరా వీరితో కలిసారు. మొత్తం 82 మందితో కూడిన ఈ విప్లవ దళం 1956 డిసెంబరులో క్యూబాలో కాలు పెట్టింది.. ఈ దళంలోని 70 మంది పోరాటంలో అమరులయ్యారు.. కాస్ట్రో, అతని సోదరుడు రౌల్ కాస్ట్రో, చెగువీరా మరో 12 మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలోని సియెర్రా మేస్త్రా పర్వత శ్రేణిలోకి పారిపోయారు. అక్కడి ప్రజలను విప్లవదళంలోకి చేర్చుకున్నారు.. దళాన్ని అనూహ్యంగా పెంచుకున్న క్యాస్ట్రో 1958 డిసెంబరులో హవానాకు బయలుదేరాడు. ప్రజలనుంచి క్యాస్ట్రోకు లభించిన ఆదరణచూసిన బాటిస్టా జనవరి 1, 1959 న దేశం విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత క్యూబా నాయకుడిగా కాస్ట్రో అధికారాన్ని చేపట్టారు.

సోషలిస్టు రాజ్యం..
అధికారాన్ని చేపట్టిన వెంటనే కాస్ట్రో అమెరికాతోసహా విదేశీయులతోపాటు.. పలువురు స్వదేశీయుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు... ఈ చర్యలతో అమెరికాతో దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి.. అప్పు, ఆయుధాలు, ఆహార సరఫరా అవసరాలకోసం క్యాస్ట్రో సోవియట్ యూనియన్‌కు దగ్గరయ్యారు.. క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశారు.... వ్యవసాయాన్ని సమష్టిగా నిర్వహించారు... క్యూబాలో ఏక పార్టీ పాలనతో సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పారు.. ఈ నిర్ణయాలతో ధనవంతులైన క్యూబన్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. కాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవటంతో యూఎస్‌ ఆగ్రహించింది.. 1960లో క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకుంది. 

అమెరికా కుతంత్రాలు..
1961లో క్యూబా నుండి ప్రవాసం వచ్చిన వారి ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికా ప్రయత్నించింది.. ఈ ఘటన తరువాత కాస్ట్రో మరింతగా సామ్యవాదం వైపు దృష్టిపెట్టాడు... సోవియట్ యూనియన్ తో బలమైన బంధాలను ఏర్పాటుచేసుకున్నాడు.. యూనియన్‌నుంచి ఆర్థిక, సైనిక పరమైన సహాయాలను పొందారు.. వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా క్యాస్ట్రో ఎదిగాడు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు సహాయం చేశారు... కాస్ట్రో ప్రభుత్వం క్యూబన్లకు మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలను కల్పించింది.. 1991లో సోవియట్ యూనియన్ పతనమవటంతో ఆ దేశం నుండి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది. అయినా కూడా కాస్ట్రో సామ్యవాద పంథాకే బలంగా కట్టుబడ్డాడు.... వృద్ధాప్యం మీదపడటంతో తన తమ్ముడు రౌల్‌ క్యాస్ట్రోకు ఫిడేల్‌ బాధ్యతలు అప్పగించాడు.. 2008లో పరిపాలనా బాధ్యతలనుండి ఫిడెల్ కాస్ట్రో తప్పుకున్నాడు.

ఉప్పేంగే సముద్రం.
ఫిడెల్ కాస్ట్రో.. ఈ పేరు వింటే ఒక ఉప్పొంగే సముద్రం గుర్తుకు వస్తుంది. విరుచుకుపడే ఉద్యమ కెరటం స్ఫురణకు వస్తుంది. క్యూబా నియంత బాటిస్టాను గద్దె దింపి.. క్యూబాను కమ్యూనిస్టు దేశంగా అర్థ శతాబ్దం పాటు నడిపారు. క్యూబా నిర్మాణం కోసం అహర్నిషలు కష్టపడ్డారు.... నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అకుంఠిత దీక్ష, పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు.. కోట్లాదిమంది ప్రజల ఆదరణ పొందాడు.. అనేక సంచలన నిర్ణయాలతో అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించారు.. అమెరికా కుట్రలను తిప్పికొట్టి మృత్యుంజయుడిగా బయటపడ్డారు.. ఇప్పటికీ ఆ దేశ హీరో ఎవరంటే క్యాస్ట్రో పేరే చెబుతారు అక్కడిప్రజలు.... నియంత పాలన సంకెళ్లనుంచి దేశాన్ని విడిపించేందుకు క్యాస్ట్రో చేసిన పోరాటం అనేక ఉద్యమాలకు దిక్సూచీలా నిలిచింది.. ఈ యోధుడి మరణం తమ దేశానికి తీరని లోటని క్యూబా ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు..

13:03 - November 26, 2016

శీతాకాలం..చలి..పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో పలు అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు భుజించాల్సి ఉంటుంది.

  • గోధుమ..జొన్నలు..సజ్జలు..మినుముల..రాగులు..కందిపప్పు..ఇలా కొన్ని శక్తి అందినిస్తాయి.
  • రోజూ వారీ డైట్‌లో తృణ ధాన్యాలు తీసుకోవాలి. పిల్లలకు తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాలి. వేరు శెనగలు, తేనెను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • అల్లం టీ తాగడం ద్వారా జలుబు, అసిడిటీని దూరం చేసుకోవచ్చు. కారం, చేదు, పులుపు గల వస్తువుల్ని మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ, పెరుగు కాస్త కూడా చేర్చుకోవచ్చు.
  • పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్, పన్నీర్, మిల్క్, దాల్, సోయాబిన్, ఫిష్, గుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చర్మం, కీళ్ళు మొదలగు వాటిని రక్షిస్తాయి.
  • శీతాకాలం లో శరీరం పొడిగా తయారవుతుంటుంది. ఈ పొడితత్వాన్ని తట్టుకొనేందుకు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగాల్సి ఉంటుంది.
  • వేడి నీళ్లతో స్నానం చర్మం మరింత పొడిబారేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
  • చలి తక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 7-8 గంటలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నడకను ఎంచుకోవడం ఉత్తమం.
  • బాదం నూనె, బాదంపొడి, అరటి ముక్కలు, గ్లిజరిన్ లేదా తేనే లు ప్రతొక్కటి రెండు చెంచాల మోతాదు తీసుకోవాలి. నాలుగు టీ స్పూన్లు పాలు ఆ మిశ్రమానికి కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపుంచి కడిగేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయోగపడుతుంది.
  • జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌ మీల్‌పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధంపొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.
12:45 - November 26, 2016

ఫిడెల్ క్యాస్ట్రో చరిత్రలో నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనపై ఎన్నో హత్యాయత్నాలు జరిగినప్పటికీ ఆయన ప్రాణాలను మాత్రం బలిగొనలేకపోయాయి. ఫిడెల్ క్యాస్ట్రో ఇక లేరు అన్న వార్తతో క్యూబాతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. క్యాస్ట్రో మృతిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), లక్ష్మీనారాయణ (విశ్లేషకులు), వేణుగోపాల్ (ఏఐఐఈఏ వైస్ ప్రెసిడెంట్) అభిప్రాయాలు పంచుకున్నారు. క్యాస్ట్రో జీవిత విశేషాలు..స్పూర్తిపై వక్తలు ఎలాంటి అభిప్రాయాలు తెలుసుకొనేందుకు వీడియో క్లిక్ చేయండి. 

12:37 - November 26, 2016

అల్లు అరవింద్ ప్రయత్నాలు ఫలించలేదంట. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన 'ధృవ'కు 'సింగం' పంజా తప్పట్లేదు. 'ధృవ' వచ్చిన వారానికే 'సూర్య' మూవీ 'ఎస్-3' థియేటర్లలోకి దిగిపోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. డిసెంబరు 16న 'ఎస్-3' రిలీజ్ అని నిర్మాత జ్నానవేల్ రాజా ప్రకటించాడు. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎస్3' సినిమాపై కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. దీంతో 'ధృవ' పోటీ వస్తే 'చరణ్' మూవీకి ఇబ్బందని అల్లు అరవింద్ భావించాడు. అందుకే తన సన్నిహితుడైన 'సూర్య'తో సంప్రదింపులు జరిపి 'సింగం3' కాస్త వాయిదా వేయించడానికి గట్టి ప్రయత్నమే చేశాడని టాక్.

యదావిధిగా ఎస్ 3 రిలీజ్..
ఐతే క్రిస్మస్ ఫెస్టివల్ తో పాటు ఇయర్ ఎండింగ్ కావడంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో చాలా సినిమాలు ఆల్ రెడీ సినిమాల రిలీజ్ లను అనౌన్స్ చేసుకున్నాయి. దీంతో 'సూర్య' అండ్ టీమ్ యధావిధిగా డిసెంబర్ 16న 'ఎస్-3' బాక్సాఫీసు వద్ద గర్జించడానికి రెడీ అయ్యాడు.
'సింగం' సిరీస్ లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలకు సూపర్ హిట్టుగా నిలిచాయి. దీంతో 'ఎస్-3' మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు హరి ఈ మూడో భాగాన్ని కూడా ఊరమాస్ సినిమాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ తో నింపేసినట్లు తెలుస్తుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తే కూడా ఇదే అర్ధం అవుతోంది. ఈ మూడో భాగంలో 'సూర్య' సరసన 'శ్రుతి హాసన్'.. 'అనుష్క' కథానాయికలుగా నటించారు.

12:19 - November 26, 2016

క్యాస్ట్రో మరణం తీరని లోటు - మధు..

పశ్చిమగోదావరి : ఫిడెల్ క్యాస్ట్రో మరణం తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిరంతరం పోరాటాలే క్యాస్ట్రోకు ఘనమైన నివాళి అని తెలిపారు. 

'సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు తీరని లోటు'

మెదక్ : ఫిడెల్ క్యాస్ట్రో మృతిపట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. క్యాస్ట్రో మరణం క్యూబా ప్రజలకే కాదు..సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు తీరనిలోటని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఐదు దశాబ్దాలపాటు క్యాస్ట్రో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. అటుపోట్లను తట్టుకుని క్యూబా నిర్మాణానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. పలు దేశాల్లో విప్లవపోరాటాలకు క్యాస్ట్రో స్పూర్తిగా నిలిచారని తెలిపారు. క్యాస్ట్రో ఆశయాలను కొనగించడమే ఆయనకిచ్చే నివాళి అని తమ్మినేని తెలిపారు. 

క్యాస్ట్రో మృతికి సీపీఎం నేతల సంతాపం..

హైదరాబాద్ : ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సీపీఎం నేతలు తమ్మినేని, మధు, రాఘవులు, సీపీఐ నేతలు సురవరం, నారాయణ, చాడా, రామకృష్ణలు సంతాపం తెలిపారు. 

11:54 - November 26, 2016

ఫిడెల్ కాస్ట్రో.. ఈ పేరు వింటే ఒక ఉప్పొంగే సముద్రం గుర్తుకు వస్తుంది. విరుచుకుపడే ఉద్యమ కెరటం స్ఫురణకు వస్తుంది. క్యూబా విప్లవనాయకుడు, బాటిస్టాను గద్దె దింపి.. క్యూబాను ఒకే పార్టీ కమ్యూనిస్టు దేశంగా అర్థ శతాబ్దం పాటు నడిపించారు. ఆయన శనివారం మృతి చెందారు. ఈయన మృతి పట్ల ఆయన అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. 'కమ్యూనిస్టు క్యూబా ఆదర్శాలు ఈ భూమి మీద ఎప్పటికీ నిలిచే ఉంటాయి. నిరంతర మానవ పోరాటంలో సామాజిక, సాంస్కృతిక విజయాలు తప్పక సిద్ధిస్తాయి' అని ఎప్రిల్ నెలలో క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ లో ఫిడెల్ ప్రసంగించారు. జనాన్ని ఈ ప్రసంగం ఉర్రూతలూగించింది. కాస్ట్రో క్రేజ్ ఫరెవర్ అన్నట్లుగా ఉద్యమనేతకు జనం నీరాజనాలు పలికారు.

అర్ధ శతాబ్దం పాటు దేశాన్ని నడిపించిన క్యాస్ట్రో..
జీవిత చరమాంకంలోకి ప్రవేశించానని ఇటీవలే క్యాస్ట్రో చెప్పారు. తన ఆదర్శాలను కొనసాగించాలని పార్టీకి పిలుపునిచ్చారు. తాను లేకపోయినా, తన అభిప్రాయాలు ఉంటాయని, వాటిని కొనసాగించాలని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఉత్సాహం, హుందాతనంతో కృషి చేస్తే మనుష్యుల వస్తుపరమైన, సాంస్కృతిక అవసరాలను తీర్చటం సాధ్యమేనని నిరూపించామని ఆనాడు క్యాస్ట్రో పేర్కొన్నారు.

1926లో జననం..
1926, ఆగస్టు 13న బిరాన్‌ హొల్గూయిన్‌ ఫ్రావిన్స్ క్యాస్ట్రో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన నాటి అమెరికా అనుకూల బటిస్టా సేనలకు వ్యతిరేకంగా పోరాడారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్‌ క్యూబా చేస్తోన్న ఆందోళనల్లో విద్యార్థి నాయకుడిగా భాగం పంచుకున్నారు. తర్వాతి కాలంలో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పోరాటానికి వెన్నుచూపని నైజం ఆయనలోఉం ది. అందుకే నాయకుడిగా ఎదిగేలా చేసింది. 1959లో క్యూబాను హస్తగతం చేసుకున్న ఆ పార్టీయే నేటికీ అధికారంలో కొనసాగుతుండటం గమనార్హం.

11:38 - November 26, 2016

పోరాటయోధుడు క్యాస్ట్రో ఇకలేరు. ఆయన తుదిశ్వాస విడిచారు. 1926 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. ఈయన పూర్తి పేరు ఫిడెల్ అలెహంద్రో క్యాస్ట్రో రుజ్. ఈయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. 

చరిత్రలో నిలిచిపోతారు - సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్..
క్యాస్ట్రో చరిత్రలో నిలిచిపోతారని సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ పేర్కొన్నారు. క్యూబా విప్లవానికి ముందు ఎన్నో ప్రగతి శీల శక్తులు పోరాటాలు చేసి నిర్భందాలకు గురయ్యాయని, ఎంతోమంది ఊచకోతకు గురయ్యారన్నారు. మొత్తం 57 పార్టీలుండేవని, వాటిన్నింటినీ ఏకం చేశాడన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాకు పక్కలో బళ్లెంగా తయారయ్యాడన్నారు. వ్యవసాయ రంగాన్ని విపరీతంగా అభివృద్ధి చేశాడని, సోవియట్ యూనియన్ క్యూబాకు సహకరించిందన్నారు. చేగువేరా క్యూబా పోరాటంలో పాల్గొన్నారని, ఈయన మరణానంతరం ప్రస్తుతం కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. క్యూబా వెళ్లి వచ్చి చాలా మంది పుస్తకాలు రాశారని, క్యాస్ట్రోను దైవంగా భావించే వారు ఉన్నారని తెలిపారు. ప్రజల మద్దతు ఉంటే ఎంతటి బలమైన శక్తిని ఎదుర్కోవచ్చన్నారు.

క్యాస్ట్రో మరణం తీరని లోటు - మధు..
విప్లవయోధుడు క్యాస్ట్రో మరణం విప్లవ ఉద్యమానికి తీరని లోటని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. అమెరికాను గడగడలాడించాడని, ఆయన మృతి పట్ల ఏపీ సీపీఎం ఘనంగా నివాళి అర్పిస్తోందన్నారు. నవ క్యూబా నిర్మాణానికి ప్రజలకు అనుగుణంగా నిర్మించారని, ప్రజా నేత లేకపోవడం బాధాకరమన్నారు.

విద్య..వైద్యకు అధిక ప్రాధాన్యత – వేణుగోపాల్..
ఫిడెల్ క్యాస్ట్రో మరణం తీరని లోటని ఏఐఐఈఏ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆయన జీవిత విశేషాలను టెన్ టివికి తెలిపారు. అమెరికాను గడగడలాడించిన వ్యక్తి అని నిరంతర పోరాటమే క్యాస్ట్రో సందేశమన్నారు. క్యూబా తమ కనుసన్ననల్లో ఉండాలని అమెరికా ప్రయత్నించిందని పే ర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం..ప్రజల సిద్ధాంతో మలిచారని పేర్కొన్నారు. క్యాస్ట్రో విద్య..వైద్యకు అధిక ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. క్యూబాకు తాను వెళ్లడం జరిగిందని, కొన్ని ప్రాంతాలను తాను చూసి మాట్లాడడం జరిగిందని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. క్యూబాలో ఉన్నంత వైద్యులు దేశంలో ఎక్కడా లేరని, పెట్టుబడి దారి వ్యవస్థ నుండి బయటపడి ఒకదేశంగా మారిన వెనిజలాకు వైద్యులు పంపించే స్థితికి క్యూబా చేరిందన్నారు. విదేశాలకు వైద్యులను పంపించే స్థితికి క్యూబా చేరిందని, ఇక్కడ వైద్య విద్య ఎంత ప్రాధాన్యతనిచ్చారో అర్థమౌతుందన్నారు. టీచర్లకు ఎక్కువ జీతాలు వస్తాయని తనకు ఆనాడు చెప్పడం జరిగిందని, ఆయన నుండి ఎన్నో నేర్చుకోవచ్చని ప్రధానంగా ప్రజల మధ్య ఎప్పుడూ ఉండాలనేది నేర్చుకోవచ్చన్నారు. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

11:26 - November 26, 2016

ఢిల్లీ : పోరాటయోధుడు క్యాస్ట్రో ఇకలేరు. ఆయన తుదిశ్వాస విడిచారు. 1926 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. ఈయన పూర్తి పేరు ఫిడెల్ అలెహంద్రో క్యాస్ట్రో రుజ్. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు క్యూబా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1959 నుండి 2008 వరకు క్యూబాను క్యాస్ట్రో పాలించారు. క్యూబాలో బాటిస్టా నిరంకుశ పాలనకు క్యాస్ట్రో వ్యతిరేకంగా పోరాటం చేశారు. క్యూబాను సామ్యవాద దేశంగా మలిచేందుకు ఫిడెల్ క్యాస్ట్రో ఎనలేని కృషి చేశారు. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలో పలు విప్లవ ఉద్యమాలకు కూడా సహాయం చేశారు. 2008లో సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు వారసుడిగా ప్రకటించారు. క్యాస్ట్రోను హత్య చేసేందుకు సీఏఐ 638 సార్లు ప్రయత్నించి విఫలమైంది. 

నర్వాల్ ప్రాంతంలో అగ్నిప్రమాదం..

జమ్మూ కాశ్మీర్ : నర్వాల్ ప్రాంతంలో అగ్నిప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 80కి పైగా ఇళ్లు ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

ఎల్ బినగర్ లో నకిలీ కరెన్సీ తయారీ..

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టురట్టైంది. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. రూ. 3 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ఎస్ఐ ఆత్మహత్య..

హైదరాబాద్ :పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ఉప్పర్ పల్లి చౌరస్తా వద్ద రివాల్వర్ తో ఎస్ఐ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ఆసిఫాబాద్ జిల్లా వాసి. నగర బందోబస్తులో భాగంగా శ్రీధర్ ఇక్కడకు వచ్చారు.

 

పోలీసు అమరవీరులకు మోడీ శ్రద్ధాంజలి..

హైదరాబాద్ : సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జాతీయ అకాడమీలో జరుగనున్న డీజీపీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకంటే ముందు పోలీసు అమరవీరులకు ప్రధాని శ్రద్ధాంజల్లి ఘటించారు. 

41వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర..

మెదక్ : 41వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. మెదక్, పిలికొట్టాల, రాసుపల్లి, కుంటూరు, కాజిపల్లి, మందాపూర్, రాన్జీతండా, కొరివిపల్లి తండా, గువ్వలపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. 

అచ్యుతాపురం వద్ద రోడ్డు ప్రమాదం..

భద్రాది : దమ్మపేట (మం) అచ్యుతాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొన్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 

09:38 - November 26, 2016
09:36 - November 26, 2016

గద్వాల : ఓ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉండవల్లి పీఎస్ లో రఘుపతి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా దొంగలు హల్ చల్ చేస్తుండడంతో పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఖాకీలు గస్తీలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు దొంగలున్న సమాచారంతో అక్కడకు వెళ్లగా పరారీకి ప్రయత్నించారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన రఘుపతి గుండెపోటుతో అక్కడికక్కడనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఇతని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం..

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దొంగలను పట్టుకొనేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ రఘుపతి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను ఉండవల్లి పీఎస్ లో రఘుపతి పనిచేస్తున్నాడు. దీనితో కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. 

09:23 - November 26, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో సామాన్యులే కాదు.. సర్కార్‌ ఉద్యోగులు కూడా సతమతమవుతున్నారు. సకాలంలో జీతం రాక కాదు.. వచ్చిన వేతనం ఎలా తీసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. జీతం ఖాతాలలో కాకుండా చేతికందిస్తే బాగుంటుందని కోరుతున్నారు. ప్రధానమంత్రి మోదీ నిర్ణయంతో...దేశం మొత్తం కరెన్సీ కష్టాలతో సతమతమవుతోంది. చేతిలో పాత పెద్ద నోట్లున్నా మారని పరిస్థితి. దీంతో బ్యాంకుల్లో పెద్దనోట్లు డిపాజిట్‌ చేసేందుకు ఓ వైపు.. ఖర్చులకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలు..బ్యాంకుల వద్ద పడిగాపులు మరోవైపు.. ఇలా ప్రజలు పడని పాట్లు లేవు. కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కష్టజీవుల జాబితా కూడా అదేస్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులూ ఈ కష్టజీవుల జాబితాలో చేరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత తొలిసారిగా జీతాలు అందుకోబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చులకు సరిపడా డబ్బు విత్‌డ్రా చేయడం ఎలాగో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

సాధ్యం కాదన్న ప్రభుత్వం..
25వ తేదీనుంచి ఈ నెల 30 వరకు వేతనాలు వారివారి ఖాతాల్లో పడిపోతుంటాయ్‌. అయితే మొత్తం జీతాన్ని చేతికి ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ అది సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వేతనాలలో 10వేల రూపాయాలైనా తమ చేతికి ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు ఇబ్బందులు కలిగించవద్దని ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులే కాకుండా.. రెండు లక్షల 25 వేల మంది పెన్షనర్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వారు కూడా నగదు రూపంలోనే పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే వివిధ శాఖల్లో 80వేల మంది ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగికి పది వేలు నగదు ఇస్తే తమ వేతనం మొత్తాన్నీ నగదు రూపంలో ఇవ్వాలని వారు కోరుతున్నారు. నోట్ల కష్టాలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రూపంలో పది వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్యాన ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. మరి తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగుల పట్ల ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

09:19 - November 26, 2016
09:09 - November 26, 2016

హైదరాబాద్ : పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపడుతున్నా మందుబాబులు మాత్రం మారడం లేదు. మద్యం సేవిస్తూ పలువురు పట్టుబడుతున్నారు. ఇందులో పలువురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. శుక్రవారం పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారినుంచి 149 వాహనాలు సీజ్ చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ఓ మహిళ హల్‌చల్ చేసింది. మద్యం సేవించి పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. పోలీసులు ఆమెపైకూడా కేసు నమోదు చేశారు.

08:50 - November 26, 2016

బాబాయ్ పొమ్మంటే అబ్బాయ్ రమ్మన్నాడట. 'బాలకృష్ణ', 'కృష్ణవంశీ'ల 'రైతు' సినిమాకి బ్రేక్ పడింది. దీంతో 'రాఖీ' కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. 'యంగ్ టైగర్' కూడా ఈ క్రియేటివ్ డైరెక్టర్ తో మరో మూవీకి రెడీ అంటున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తరువాత 'బాలకృష్ణ', 'కృష్ణవంశీ' డైరెక్షన్ లో 'రైతు' మూవీ చేయాలనుకున్నాడు. కానీ అనుకోని విధంగా 'రైతు' సినిమా ఆగిపోయినట్లు వినికిడి. ఈ సినిమాలోని ఒక కీలక పాత్రలో నటించాలని 'బాలకృష్ణ', 'కృష్ణవంశీ' స్వయంగా 'అమితాబ్' ని కోరారు. అయితే, బిగ్ బి బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కు 'అమితాబ్' నో చెప్పినట్లు వినిపిస్తుంది. దీంతో 'రైతు'కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో 'యంగ్ టైగర్' తో 'కృష్ణవంశీ' మరోసారి మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

పదేళ్ల కిందట..
పదేళ్ల కిందట 'కృష్ణవంశీ', 'ఎన్టీఆర్' కాంబినేషన్ లో 'రాఖీ' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ కాజ్ తో వచ్చిన ఈ మూవీ మంచి రిజల్ట్ రాబట్టింది. ముఖ్యంగా 'రాఖీ' చిత్రంలోని 'ఎన్టీఆర్' ఫెర్మామెన్స్ కి ఆడియన్స్ తో పాటు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లోని ఫెర్మామెన్స్ హీరోస్ లో 'ఎన్టీఆర్' ది బెస్ట్ అని 'కృష్ణవంశీ' చాలా సార్లు చెప్పాడు. అందుకే మరోసారి ఈ మాస్ స్టార్ తో మరోసారి సోషల్ కంటెంట్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం 'కృష్ణవంశీ' చేస్తున్న 'నక్షత్రం' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ వెంటనే తన వద్ద ఉన్న స్టోరీని 'ఎన్టీఆర్' కి వినిపించాలని ఈ దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడట. 'ఎన్టీఆర్' సైతం తనకు 'రాఖీ' లాంటి బెస్ట్ ఫెర్మామెన్స్ క్యారెక్టర్ ఇచ్చిన 'కృష్ణవంశీ'తో మూవీ చేయాలనే ఆలోచలో ఉన్నాడట. 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ తో స్వీంగ్ లో ఉన్న 'యంగ్ టైగర్' ఈ టైంలో 'కృష్ణవంశీ' తో మూవీ చేస్తాడా అనేది అసలు క్వశ్చన్. మరి 'ఎన్టీఆర్' నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడో చూడాలి.

08:43 - November 26, 2016

'కళ్యాణ్ రామ్' రూట్ మార్చాడు. కామెడితో సక్సెస్ కొట్టాలని ఈ నందమూరి హీరో ప్లాన్ చేస్తున్నాడు. 'ఇజం'తో రివర్స్ పంచ్ పడడంతో ఈ హీరో కామెడి ట్రై చేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకే ఓ కామెడి డైరెక్టర్ తో న్యూ మూవీకి రెడీ అయ్యాడు. 'ఇజం' తరువాత 'కళ్యాణ్ రామ్' కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోతుందని చాలా మందే అనుకున్నారు. అంతేకాదు 'ఇజం' తర్వాత ఈ హీరోతో సినిమా చేయడానికి చాలామంది క్రేజ్ దర్శకులు క్యూలో ఉన్నారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో 'ఫటాస్' దర్శకుడు అనిల్ రావిపూడి ఈ హీరో కోసం మరో మంచి స్క్రిప్టు రెడీ చేశాడనే వినిపించాయి. అంతేకాదు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, పరశురామ్, దేవా కట్టా ఇలా చాలా పేర్లే వినిపించాయి. కానీ ఇవన్ని వట్టి పుకార్లే అని తెలిపోయింది. లేటేస్ట్ గా 'కళ్యాణ్ రామ్' ఓ కామెడి దర్శకుడితో న్యూ మూవీకి ఫిక్స్ అయ్యాడట. నిజానికి 'కళ్యాణ్ రామ్' 'ఇజం' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం 'పూరీ' జగన్నాథ్ లాంటి బడా డైరెక్టర్ తో మూవీ చేస్తుండడంతో తన కెరీర్ ప్లస్ అవుతుందని భావించాడు. కానీ కెరీర్ మారడమేమో కానీ పూర్తిగా డైలామాలో పడేశాడు. 'కళ్యాణ్ రామ్' బాడీ లాగ్వేంజ్ ని మార్చేసిన 'పూరీ' ఈ హీరో కి హిట్టు మాత్రం ఇవ్వలేకపోయాడు. దీంతో ఇక యాక్షన్ స్టోరీస్ కి పుల్ స్టాప్ పెట్టి కామెడి స్టోరీస్ పై ఫోకస్ చేయాలని 'కళ్యాణ్ రామ్' ఫిక్స్ అయ్యాడట.
కామెడీ చిత్రాల స్పెషలిస్టు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'కళ్యాణ్ రామ్' న్యూ మూవీ చేయబోతున్నాడట. 'షేర్', 'ఇజం' లాంటి సీరియస్ సినిమాలు దెబ్బ కొట్టడంతో 'ఫటాస్' లాంటి ఎంటర్ టైనర్ అయితేనే బెటర్ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లిస్తాడని పేరున్న నాగేశ్వరరెడ్డి మరి 'కళ్యాణ్ రామ్' కి సక్సెస్ ఇస్తాడో చూడాలి.

08:41 - November 26, 2016

మెదక్ : 40 రోజులు.. వెయ్యి కిలోమీటర్లు.. అదే జోష్‌.. అదే హుషారు.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అట్టడుగున ఉన్న సామాన్య ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు.. వారికి అండగా నిలబడేందుకు చేస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలకు తమ్మినేని బృందం ధన్యవాదాలు తెలిపింది. ఇదే ఉత్సాహంతో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తామన్నారు తమ్మినేని. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలైన పాదయాత్ర.. 40వ రోజు మెదక్‌ జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాసంఘాల నేతలు పాదయాత్ర చేస్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

మంబోజిపల్లిలో శిలాఫలకం..
వెయ్యి కిలో మీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంబోజిపల్లిలో వెయ్యి కిలోమీటర్ల శిలాఫలకాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేశారు. పాదయాత్ర బృందం సభ్యులు నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తమ్మినేని బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రకు అన్ని జిల్లాల కార్యకర్తలు, ప్రజలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని తమ్మినేని అన్నారు. పాదయాత్ర సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలపై పార్టీలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇదే స్ఫూర్తితో 4 వేల కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని తమ్మినేని ఆశాభావం వ్యక్తం చేశారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలపై డిసెంబర్‌ 2న ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించనున్నట్లు పాదయాత్ర నిర్వాహక సభ్యుడు వెంకట్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగం గుర్తించిన సామాజిక అంశాల పట్ల చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ప్రజలకు ఎప్పుడూ సీపీఎం అండగా ఉంటుందన్నారు. ఈనెల 27న పాదయాత్రలో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారన్నారు.

బృందాన్ని కలిసిన షుగర్ ఫ్యాక్టరీ బృందం..
వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంబోజిపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా తెలంగాణ వేదిక పార్టీ నేతలు హాజరై.. పాదయాత్రకు మద్దతిచ్చారు. ప్రజలందరికీ న్యాయం జరగాలంటే పాదయాత్రకు మద్దతివ్వాల్సిన అవసరముందన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని బహిరంగ సభలో తమ్మినేని తెలిపారు. ఇక పాదయాత్ర బృందాన్ని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. ఫ్యాక్టరీని మూసివేసి తమను రోడ్డున పడేశారని.. తమకు న్యాయం చేసే విధంగా చూడాలని వినతిపత్రం అందించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 

తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. 4 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోద వుతాయని వెల్లడించింది. గత 24 గంటల్లో అత్యంత కనిష్టంగా లంబసింగిలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చింతపల్లి, పాడేరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, మెదక్‌తో పాటు వివిధ చోట్ల 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో 11 డిగ్రీల అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

08:24 - November 26, 2016
08:23 - November 26, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు ప్రభావం ఇంకా వీడడం లేదు. చిల్లర కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. డబ్బులు దొరక్క ఒకరు..రెండు వేల రూపాయల చిల్లర దొరక్క మరొకరు..ఇలా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు, రేపు బ్యాంకులకు సెలవు దినం కావడంతో ప్రజలకు కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. ఇప్పటికీ రోజుకు రూ. 2వేలు డ్రా చేయాలనే నిబంధన అమలవుతోంది. మెహిదీపట్నం రైతు బజార్ లో చిల్లర ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయ నుండే సందడిగా మారే రైతు బజార్ లో ప్రస్తుతం వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. ఎలాంటి కష్టాలు నెలకొన్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

08:18 - November 26, 2016

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డీజీపీలతో కలిసి యోగసనాలు వేశారు. సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జాతీయ అకాడమీలో జరిగే డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి మోడీ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఉదయం 8గంటలకు యోగసనాలు వేశారు. అనంతరం జరిగే డీజీపీల సదస్సులో మోడీ పాల్గొననున్నారు. 8గంటల నుండి సాయంత్రం 5గంటల దాక డీజీపీల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో అంతర్గత భద్రతపై చర్చించనున్నారు. అంతర్గత భద్రత ఏ విధంగా ఉంది ? ఏలాంటి చర్యలు తీసుకోవాలి ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలని ? అనే దానిపై చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దు టెర్రరిస్టులపై ప్రభావం అనే దానిపై కూడా చర్చించనున్నారు. రక్షణ పరంగా..ప్రజలకు అవసరమైన చర్యలపై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. ఈ సదస్సుఅ నంతరం సాయంత్రం 5.05 గంటలకు రోడ్డు మార్గాన ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. 5.30గంటగలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. 7.40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.
శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. రెండో రోజు సమావేశంలో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు. ముగింపు సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. 

07:55 - November 26, 2016

సీక్వెల్ కోసం తమిళ స్టార్ ధనుష్ ముగ్గరు హీరోయిన్స్ తో రోమాన్స్ చేయబోతున్నాడు. ఈ బక్కపలుచని బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్టు గా నిలిచిన వీఐపీ చిత్రానికి సీక్వెల్ గా వీఐపీ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ నాట వేగంగా సినిమాలు చేసే స్టార్ హీరోల్లో 'ధనుష్' ముందుంటాడు. ఏడాదికి కనీసం రెండు రిలీజ్ లు ఉండేలా చూసుకుంటాడు. అలాగని క్వాలిటీ విషయంలో రాజీ పడడు. ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే తొడారి (రైల్) కోడి (ధర్మయోగి) సినిమాలను రిలీజ్ చేశాడు. ఇందులో 'తొడారి' నిరాశ పరిచినా, 'కోడి' సినిమా సూపర్ హిట్టయింది. ఈ ఊపులో 'ధనుష్' ప్రస్తుతం 'వీఐపీ' సీక్వెల్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్ ని తీసుకున్నాడు. 'ధనుష్' పక్కన 'కాజల్ అగర్వాల్ ', 'అమలపాల్', 'మంజిమా మోహన్' ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మొదటి భాగంలో 'అమలపాల్' హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక 'కాజల్' ఇంతకు ముందు 'ధనుష్' తో 'మారి' సినిమాలో నటించింది. ఇక 'మంజిమా మోహన్' తొలిసారి 'ధనుష్' తో జోడి కడుతోంది. 'వీఐపీ' సీక్వెల్ ని ప్రొడ్యూసర్ కలైపులి.ఎస్.థాను నిర్మిస్తుండగా, 'ధనుష్' భార్య 'సౌందర్య' దర్శకత్వం వహిస్తుండడం విశేషం. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ధనుష్', 'గౌతమ్ మీనన్', 'వెట్రి మారన్' దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు.

07:49 - November 26, 2016

'ధృవ' చిత్రం 'రామ్ చరణ్' కి సవాల్ గా మారింది. ఈ సినిమా ముందు చాలా టార్గెట్స్ ఉన్నాయి. చిన్న హీరోలు దాటేసిన ఆ మార్క్, 'చరణ్' కి మాత్రం అందని ద్రాక్షలా ఉంది. యంగ్ హీరో 'నాని' గత ఏడాదే 'భలే భలే మగాడివోయ్' తో యుఎస్ లో మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టాడు. రీ సెంట్ గా హీరోగా రీ ఏంట్రీ ఇచ్చిన 'విజయ్ దేవరకొండ' లాంటి యంగ్ హీరో కూడా 'పెళ్లిచూపులు' సినిమాతో ఓవర్సీస్ లో మిలియన్ క్లబ్బును అందుకున్నాడు. కానీ 'చరణ్' సినిమాలు మాత్రం ఇప్పటి వరకు యూఎస్ లో మిలియన్ క్లబ్ అందుకోలేదు. ఇప్పుడు ఈ టార్గెట్ 'ధృవ' చిత్రానికి సవాల్ గా మారింది. గత ఏడాది 'బ్రూస్ లీ' తో 'చరణ్' ఓవర్సీస్ లో ఏకంగా 2 మిలియన్ డాలర్లను కొల్లగొడుతాడని అంచనా వేశారు.

ఆశలు నిజమౌతాయా ? 
అందుకు తగ్గట్టే యూ ఎస్ లో ఈ సినిమాను 200లకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 'చిరంజీవి' గెస్ట్ రోల్ చేయడంతో 'బ్రూస్ లీ' కి ఓవర్సీస్ లో తిరుగుండదని అనుకున్నారు. కానీ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో ఈ మూవీ ఓవర్సీస్ లో డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో 'ధృవ' చిత్రం ఓవర్సీస్ లో 'చెర్రీ'కి పరువు సమస్యగా మారింది. సినిమా ఎలా ఉన్నా 'చరణ్' కి లోకల్ మార్కెట్ లో ఈజీగా 40కోట్లు వసూళ్లు చేయగల స్టామినా ఉంది. కానీ 'చెర్రీ'కి ఓవర్సీస్ లో ఇప్పటికీ పెద్దగా మార్కెట్ లేదు. చిన్న చిన్న హీరోలు అక్కడ మిలియన్ క్లబ్ ని టచ్ చేస్తున్నారు. కానీ మెగా వారసుడికి మాత్రం ఇది అందని ద్రాక్షలా ఉంది. 'ధృవ' చిత్రంపై మంచి హైప్ ఉంది. మంచి టాక్ వస్తే 'ధృవ' ఫస్ట్ మిలియన్ డాలర్ మూవీగా నిలిచిపోనుంది. మరి 'ధృవ' సినిమా అయిన మెగా తనయుడి ఓవర్సీస్ ఆశలను నిజం చేస్తుందా చూడాలి.

07:44 - November 26, 2016

'జనతా' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్టుని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేయాడానికి 'ఎన్టీఆర్' జాగ్రత్తలు తీసుకుంటున్నాడడు. వరుసగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ డైరెక్టర్ కథలు చెప్పినా వినేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా యంగ్ టైగర్ ని ఒప్పించలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. అయితే 'సర్దార్' తో ఖంగుతిన్న 'బాబీ' చెప్పిన స్టోరీ మాత్రం 'ఎన్టీఆర్' శాటిస్ఫై అయినట్లు సమాచారం. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తో షాక్ అయిన 'బాబీ' ఒక్క ఛాన్స్ అంటూ చాలా మంది హీరోలకు స్టోరీలు చెబుతున్నాడంట. 'రవితేజ' కోసం ఓ కథ రెడీ చేసి బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో పక్కన పెట్టేశాడు. ఇప్పుడు 'ఎన్టీఆర్' కోసం ఈ దర్శకుడు ఓ పవర్ పుల్ స్టోరీని సిద్దం చేసి వినిపించాడంట. రీసెంట్ గా 'ఎన్టీఆర్' ను కలిసిన 'బాబీ'.. ఓ పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ వినిపించాడంట. స్టోరీ లైన్స్ విన్న 'ఎన్టీఆర్' వెంటనే పూర్తి స్టోరీని తీసుకురమ్మని చెప్పాడట. 'ఎన్టీఆర్' పాజిటివ్ రెప్పాన్స్ రావడంతో దర్శకుడు 'బాబీ' పూర్తి స్టోరీని రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ దర్శకుడు తయారు చేయనున్న కథ పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని వినికిడి. 'బాబీ' ఇంతకు ముందు చేసిన రెండు సినిమాలు పోలీస్ స్టోరీసే కావడం గమనార్హం. మరి ఈ దర్శకుడు స్టోరీ రెడీ చేసేలాలోగా వేరే దర్శకుడు స్టోరీ చెప్పి 'ఎన్టీఆర్' ని ఒప్పిస్తే 'బాబీ' కి ఛాన్స్ మిస్ అయినట్లే. చూద్దాం 'పవన్' దర్శకుడిని 'ఎన్టీఆర్' ఆదుకుంటాడేమో.

07:39 - November 26, 2016

'గౌతమి పుత్రశాతకర్ణి' మూవీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్క నందమూరి ఫ్యాన్స్ అనే కాదు సిని ఇండస్ట్రీ యావత్తు ఈ చిత్రం రిలీజ్ కోసం అంతే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 'బాలయ్య' వందో చిత్రం కావడం, అందులోనూ చారిత్రాక నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో 'శాతకర్ణి'పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా 'గౌతమి పుత్ర శాతకర్ణి' షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో 'బాలకృష్ణ', 'శ్రియ' కాంబినేషన్ లో వచ్చే ఓ పాటను గత వారం రోజులుగా చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తైనట్లే అని తెలుస్తోంది. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని యూనిట్ ప్రణాళికలు వేసుకుంది.

థియేట్రికల్ ట్రైలర్..
'శాతకర్ణి' థియేట్రికల్ ట్రైలర్ ను డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ చేయనున్నట్లు వినిపిస్తోంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ లో యుద్ధవీరుడి పాత్రలో 'బాలయ్య' అదరహో అనిపించాడు. దీంతో థ్రియేటర్ ట్రైలర్ ను సినిమాపై మరింత అంచనాలు పెంచేలా కట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది. డిసెంబర్ రెండవ వారంలో ఆడియో రిలీజ్ చేసి జనవరి 12న సంక్రాంతి బరీలో దూకడానికి 'శాతకర్ణి'ని ముస్తాబు చేస్తున్నారు. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలుసుకోవడానికి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 

డీజీపీలతో కలిసి మోడీ యోగసనాలు..

హైదరాబాద్ : జాతీయ పోలీసు అకాడమీలో డీజీపీలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యోగసనాలు వేశారు. అనంతరం డీజీపీల సదస్సులో మోడీ పాల్గొననున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు డీజీపీల సదస్సు జరుగనుంది. సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జాతీయ అకాడమీలో జరుగనున్న ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

07:24 - November 26, 2016

పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. నల్లధనంపై విపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ను కుదిపేసింది. హౌస్ కు నాయకుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయట ఎందుకు తిరుగుతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), బెల్యా నాయక్ (టి.కాంగ్రెస్), అల్జాపూర్ శ్రీనివాస్ (బీజేపీ) నేతలు పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు తెలిపిన అభిప్రాయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

కొడంగ్ లో అండర్ 19 అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్..

హైదరాబాద్ : నేటి నుండి కొడంగల్ లో అండర్ -19 అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ జరగనుంది. తెలంగాణలోని 20 జట్లు హాజరు కానున్నాయి.

తాడేపల్లిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సు..

పశ్చిమగోదావరి : నేడు తాడేపల్లిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొననున్నారు. 

06:52 - November 26, 2016
06:50 - November 26, 2016

విశాఖపట్టణం : నీలిరంగు సముద్ర కెరటాలను చీలుస్తూ దూసుకేళ్లే భారీ యుద్ధనౌకలు..అబ్బుపరిచే సైనికుల విన్యాసాలు... కళ్లు చెదిరే నావికాదళ సాహసాలకు....వేదికైంది విశాఖ తీరం. నింగిలోకి దూసుకుపోతున్న యుద్ధ విమానాలు...శత్రు జలాంతర్గాములను కనిపెట్టి నాశనం చేసే సబ్ మెరైన్‌లు..అత్యాధునిక హెలీకాప్టర్ లు..ఒకటా రెండా...తూర్పు నావికాదళ సైనికుల యుద్ధ విన్యాసాలతో విశాఖ తీరం పులకించింది. నేవీ అమ్ములపొదిలోని అస్త్రాలకు సముద్రతీరం సలాం చేసింది. నావికాదళ విన్యాసాలకు విశాఖ తీరం మరోసారి సిద్ధమైంది. ప్రతీ ఏటా నేవీ నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా... అబ్బుర పరిచే యుద్ధ విన్యాసాలను తూర్పునావికాదళం ప్రదర్శిస్తోంది.

పలు విన్యాసాలు..
యుద్ధ సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగిన నావికులను రక్షించే కార్యక్రమాన్ని సెర్చ్ అండ్ రెస్క్యూ డిమానిష్ట్రేషన్ పేరుతో నిర్వహించారు. హెలీకాప్టర్ పై నుంచి తాడుతో కిందకు దిగిన సైనికుడు సంద్రంలో దిగే విన్యాసం ఎంతగానో ఆకట్టుకుంది. సముద్రగర్భాన ఉన్న జలాంతర్గాములను కనిపెట్టే అత్యాధునిక సింధు గోశ్ రకం జలాంతర్గామి ..కమోవ్ హెలీకాప్టర్ విన్యాసం ఉత్కంఠను రేకెత్తించింది. 1971 , డిసెంబర్ 4 న భారత్ -పాక్ యుద్ధ సమయంలో భారతనావికాదళం...పాకిస్తాన్‌లోని కరాచి హార్బర్ ను ధ్వంసం చేసిన సందర్భాన్ని నేవీ డే గా జరుపుకుంటారు. ఇందులో భాగంగా తూర్పు నౌకాదళం పదిహేను రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్నే డే ఎట్ సీ కార్యక్రమంగా జరిపారు. డే ఎట్ సీ పేరుతో ఒక రోజు సముద్రంలో గడిపే అవకాశాన్ని విశాఖ వాసులకు, ప్రధానంగా విద్యార్థులకు కల్పించింది తూర్పు నావికాదళం.

అపూరమైన అనుభవాలు..
ప్రదర్శనలో భాగంగా ఫ్లైఫాస్ట్ విన్యాసాలు చేసింది నావికాదళం. నేవీ అమ్ములపొదిలో ఇటీవలే చేరిన హెలీకాఫ్టర్ లు ధ్వనివేగంతో అత్యంత సమీపంనుంచి దూసుకుపోయే అరుదైన కార్యక్రమమే ఫ్లైపాస్ట్. ఈ కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ జలాశ్వ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. భారతీయ నౌకాదళంలో ఆరు హెలీకాప్టర్లు డెక్ పై దిగే సామర్ధ్యం కలిగిన ఐఎన్ ఎస్ జలాశ్వ తన పేరును సార్ధకం చేసుకుంది. సుమారు 600 అడుగుల పొడవు, 16 వేల 900 టన్నుల బరువు కలిగిన ఈ యుద్ధనౌక.. గంటకు 20 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తూ తన రాడార్ వ్యవస్థలు, అత్యాధునిక ఆయుధ సంపత్తితో అబ్బురపరిచింది.. విశాఖతీరంలో డే ఎట్ సీ కార్యక్రమం సందర్శకులకు అపురూపమైన అనుభవాలు పంచింది. 

06:47 - November 26, 2016

అనంతపురం : పెద్ద మాదిగనవుతానన్న చంద్రబాబు చరిత్రలో పెద్దమోసగాడయ్యాడని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన మాదిగల తిరుగుబాటుసభలో సీపీఐనేత నారాయణతో పాటు మాజీమంత్రి శైలజానాథ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎంఎస్ రాజు పాల్గొని ప్రసంగించారు.ఎస్సీ రిజర్వేషన్ కోసం మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయపరమైనదని అందుకు సీపీఐ కలసివస్తుందని నారాయణ హామీ ఇచ్చారు. 

06:45 - November 26, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. వచ్చే ఏడాది 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో...వాటిని కైవసం చేసుకునేందుకు అధికార టిడిపి వ్యూహరచన చేస్తోంది. అటు ప్రతిపక్ష వైసీపీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఏపీ శానసమండలిలో 2017 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎమ్మెల్సీ స్థానాలు భారీగా ఖాళీ అవుతున్నాయి. ఈ జాబితాలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న మండలి చైర్మన్ చక్రపాణితో పాటు, రెడ్డప్పరెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో మండలి వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ప్రతిభా భారతి, మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్ జానీ, చంగల్ రాయుడు, సుధాకరబాబు ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటాలో మెట్టు గోవిందరెడ్డి, సి.నారాయణరెడ్డి, బొడ్డు భాస్కరరావు, అంగర రామ్మోహన్ రావు, మేకా శేషుబాబు, విశ్వప్రసాద్, వాకాటి నారాయణ రెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి పదవి కాలం 2017 మార్చిలో ముగియనుంది. గ్రాడ్యుయేట్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు, టీచర్స్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుండటంతో... మొత్తం 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.

వ్యూహాలు..
ఖాళీ అవుతున్న మండలి స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. గవర్నర్ స్థానిక సంస్థల కోటాల్లో ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాల్లో 10 సీట్లు వస్తాయని అధికార టిడిపి భావిస్తోంది. ప్రస్తుత మండలి వైస్ చైర్మన్‌ సతీష్ రెడ్డితో పాటు..కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన వాకాటి నారాయణ రెడ్డి, సుధాకరబాబు మరోసారి పోటీ చేసే అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జూపూడి, శోభా హైమావతి, ప్రతిభా భారతి, మంతెన సత్యనారాయణ రాజు, మల్లెల లింగారెడ్డి, కరణం బలరాం, ఎన్ ఎమ్ డి ఫ‌రూక్, సాయిబాబా, చందుసాంబ‌శివ‌రావు ఎమ్మెల్సీ ఎన్నికలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.

ఆశావాహులు..
ఎమ్మెల్యేల కోటాలో వైసీపీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే అవకాశం వుండటంతో.. ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు ప్రముఖులు అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. ఇక గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆయా రంగాల్లో సీనియర్లు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు చోట్ల టిడిపి తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించటం ద్వారా, గెలుపు అవకాశాల కోసం వ్యూహాలు సిద్దం చేస్తోంది.

06:42 - November 26, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం టీఆర్‌ఎస్‌.. టీడీపీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2026లోపు సాధ్యం కాదని కేంద్రం అంటున్నా.. చేసి తీరాల్సిందేనని కేసీఆర్‌, చంద్రబాబు సర్కార్‌లు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం జరగకుండా ఉంటేనే మంచిదని భావిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం చర్చానీయాంశంగా మారింది. దీనిపై కేసీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాలు కోటీ అశ‌లు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే రెండు పార్టీలు ఆపరేషన్‌ ఆక‌ర్ష్ తో రెడ్ కార్పెట్ పరిచారు. దీంతో ఇత‌ర పార్టీల‌ నుంచి చాలామంది నేత‌లు .. టీఆర్‌ఎస్‌.. ఏపీలో టీడీపీ గూటికి చేరుతున్నారు.

కాంగ్రెస్ ఆశలు...
అసెంబ్లీ పున‌ర్విభ‌జ‌న జరిగితే కొత్తగా వచ్చిన నేతలకు సీట్లను మ‌రింత‌గా పంచవచ్చని అధికార పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయంలో పునర్‌ విభజన కోసం... కేసీఆర్‌, చంద్రబాబు క‌లిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా దీనిపై కాంగ్రెస్‌లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ జరుగుతోంది. పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో ఇప్పటికే చాలామంది కాంగ్రెస్‌ నేతలు.. టీఆర్ఎస్ లో చేరిపోయారు. పున‌ర్విభ‌జ‌న జరిగితే పెరిగిన సీట్లలో వారికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఇప్పటికే కేసీఆర్ హామీ ఇచ్చినట్టు స‌మాచారం. పునర్విభజన జ‌ర‌గ‌క పోతే... 2019 ఎన్నిక‌ల ముందు టీఆర్‌ఎస్‌లో సీట్లలో అల‌జ‌డి రేగుతంద‌ని.. ఇదంతా త‌మ‌కు రాజ‌కీయంగా లాభిస్తుందని అంచనావేస్తున్నారు హ‌స్తం నేతలు. 2026 జ‌న గ‌ణన తర్వాతనే పున‌ర్విభ‌జ‌న సాధ్యమని... మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేయడంతో హస్తం నేత‌లు ఖుషి అవుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ పున‌ర్విభ‌జ‌న ఆగిపోతే..తమకు లాభిస్తుందని కాంగ్రెస్‌ ఆశిస్తుంటే..విభజన జరిగితేనే లాభమని టీఆర్‌ఎస్‌, టీడీపీలు ఆశపడుతున్నాయి. మోదీ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి ఇద్దరు చంద్రులు నియోజకవర్గ పునర్విభజన సాధించుకుంటారో.. లేదా కాంగ్రెస్‌ ఆశలకు జీవం పోస్తారో వేచిచూడాలి.

06:39 - November 26, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కు మరో లాండ్ మార్క్ తయారైంది. హైదరాబాద్ ప్రత్యేకతను తెలియజెప్పేలా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ పేరుతో ప్రత్యేక సింబల్ ను ఏర్పాటు చేశారు. స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేష‌న్...., కృష్ణకృతి ఫౌండేష‌న్ మ‌రియు ఆర్ట్ ఎట్ తెలంగాణ ఉమ్మడిగా హిందీ ఇంగ్లీష్ అక్షరాల‌తో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు .హైద‌రాబాద్ అందాలు ఉట్టిప‌డేలా వీధులు రోడ్ సైడ్ అందంగా అగుపించేలా ఇప్పటికే వాల్ పెయింటింగ్ చేయించింది బ‌ల్దియా. స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేష‌న్..కృష్ణకృతి ఫౌండేష‌న్ మ‌రియు ఆర్ట్ ఎట్ తెలంగాణ స‌హ‌కారంతో నెక్లెస్ రోడ్, రాజ్ భ‌వ‌న్ రోడ్ వాల్స్ పై స్పెష‌ల్ పెయింటింగ్స్ రూపొందించింది. హైద‌రాబాద్ ఇమెజ్ పెరిగేలా వివిధ విభాగాలు గ్రేట‌ర్ ప‌రిధిలో ప‌లు లాండ్ మార్క్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి.

ఆకట్టుకొనే శిల్పం..
హైద‌రాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ల‌వ్ హైద‌రాబాద్ అనే అక్షరాల‌తో కూడిన‌ శిల్పం ఇప్పుడు మ‌రో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలుస్తోంది. దాదాపు 9అడుగుల ఎత్తులో ఉన్న ఈ అంద‌మైన ల‌వ్ హైద‌రాబాద్ శిల్పం హిందీ.... ఇంగ్లీష్ అక్షరాలతో త‌యారు చెయ్యబ‌డింది. టాంక్ బండ్ ను సంద‌ర్శించే ప‌ర్యాట‌కుల‌కు ప్రత్యేకంగా సెల్ఫీలు తీసుకొనే స్పాట్ గా ఇది మారుతుంద‌న్నారు మున్సిప‌ల్ శాఖామంత్రి కేటీఆర్. న‌గ‌ర‌ మ‌ధురానుభూతుల‌ను నింపేవిధంగా ఈ లవ్ హైద‌రాబాద్ ఉంద‌న్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఆర్ట్ చూడ‌టానికి అహ్లదంగా ఉంటుంద‌న్నారు. హైదారాబాద్ గొప్పద‌నాన్ని పెంచేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామ‌ని న‌గ‌ర‌మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్ అన్నారు. స్ట్రీట్ ఆర్ట్ ద్వారా హైద‌రాబాద్ ఇమేజ్ పెరుగుతుంద‌న్నారు. హైద‌రాబాద్ కు అంత‌ర్జాతీయ గుర్తింపు తేవ‌డానికి కృషి చేస్తున్నామని మేయర్ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కు పలు ల్యాండ్ మార్క్ లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరికొన్ని లాండ్ మార్క్ లు జోడయితే హైదరాబాద్ మరింత అందాన్ని అందిపుచ్చుకోవడం ఖాయం. 

06:35 - November 26, 2016

విజయవాడ : ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నారని వైసీపీ శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. లేఖలు రాసినా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయని వైఖరిపై ముఖ్యమంత్రిని కలిసి నిరసన వ్యక్తం చేశారు. వైపీసీ శాసనసభాపక్ష విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రెండున్నరేళ్ల తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబును కలవడం ఇదే మొదటిసారి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, నియోజకవర్గ సమస్యలపై చర్చించారు.

నిధుల దుర్వినియోగం..
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం గురించి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు శాసనసభ్యులకు కాదని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ల పేరుతో నిధులు కేటాయిస్తుండటాన్ని తప్పుపట్టారు. ఈ నిధులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. తమపై ఓడిపోయి, టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఉన్న వారికి నిధులు కేటాయించడం, వీరు సిఫారసు చేసిన వారికే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వ తీరును చంద్రబాబు సమక్షంలోనే తప్పుపట్టారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల నుంచి ఎమ్మెల్యేలను దూరం చేసేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఇది మంచిదికాదని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 20 మంది ఎమ్మెల్యేలకు నిధుల కేటాయిస్తూ, తమను విస్మరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వాదించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చిరిస్తున్నారు.

తాత్కాలిక సచివాలయం సందర్శనం..
అంతకుముందు ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను పరిశీలించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణ పురోగతి, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించంలేదదని ఆరోపించారు. అనంతరం రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాలను సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవకతవకలు గురించి రైతులు వైసీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీసి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

06:30 - November 26, 2016

హైదరాబాద్ : నారావారిపల్లె, ఎర్రవల్లి, నర్సన్నపేట ఈ మూడు గ్రామాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకత వుంది. చంద్రబాబు, కెసిఆర్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకీ వెరీ స్పెషల్ గ్రామాలివి. మరి అలాంటి గ్రామాల్లో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంత? ఈ మూడు గ్రామాలను సందర్శించిన 10టీవీ ప్రతినిధులకు ఆసక్తికర అనుభవాలు ఎదురయ్యాయి.

నారావారిపల్లె..
ఇది నారావారిపల్లె. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వగ్రామం. డిజిటల్ యుగం గురించి, నగదు రహిత లావాదేవీల ఆవశ్యకత గురించి తరచూ బోధిస్తూ వుంటారాయన. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు స్వగ్రామం వుంది. కానీ, ఈ ఊళ్లో బ్యాంక్ లు కానీ, ఏటిఎంలు కానీ లేవు. బ్యాంక్ సేవలు పొందాలంటే రంగంపేటకానీ, తిరుపతి కానీ వెళ్లాల్సి వుంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నారావారిపల్లె గ్రామస్తుల కష్టాలు మరింత పెరిగాయి. రంగంపేట బ్యాంక్ లో డబ్బుల్లేవు. దీంతో పెద్ద నోట్లు మార్చుకోవడానికి 20 కిలోమీటర్ల దూరంలోని తిరుపతికి వెళ్లాల్సి వచ్చిందంటున్నారు గ్రామస్తులు. చిల్లర కష్టాలు షరామామూలుగానే వెంటాడాయి.

ఎర్రవెల్లి..నర్సన్నపేట..
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను దత్తత తీసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో వుండే ఈ గ్రామాలకూ పెద్ద నోట్ల మార్పిడి సమస్య తప్పలేదు. చంద్రబాబు సొంత ఊళ్లో బ్యాంక్ లేదు కానీ, కెసిఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో బ్యాంక్ లున్నాయి. అయితే, ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలే తాము ఫేస్ చేస్తున్నామంటున్నారు దత్తత గ్రామాల ప్రజలు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక అనుబంధ గ్రామాల్లోని ప్రజలంతా చెబుతున్న మాట ఒక్కటే 2000 నోట్లు ఇస్తే ఏం చేస్కోవాలి. దయచేసి చిల్లర ఇవ్వండి. అనే. 

06:27 - November 26, 2016
06:25 - November 26, 2016

కడప : ఏపీ సీఎం చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు... జనసమీకరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు అధికారులు కట్టుదిట్టమైన భద్రాతా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇవాళ జరగనున్న సీఎం టూర్‌లో భాగంగా... సభా ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు.

జనచైతన్య యాత్రలో..
ఉదయం కడప ఎయిర్‌ పోర్ట్ నుంచి రాజంపేటకు చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే జనచైతన్య యాత్రలో పాల్గొంటారు. అనంతరం కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. తరువాత మున్సిపల్‌ మైదానంలో జరగబోయే డ్వాక్రా మహిళల సదస్సులో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు...ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

06:24 - November 26, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ డీజీపీల సమావేశంలో పాల్గొంటారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని పర్యటన సందర్భంగా శివరాంపల్లిలోని జాతీయ పోలీస్‌ అకాడమీ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రబలగాలు పోలీస్‌ అకాడమీ ప్రాంతంలో పహరా కాస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌యాక్షన్‌ ఫోర్స్‌ తోపాటు రాష్ట్ర పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. డీజీపీల సమావేశం అనంతరం ప్రధాని ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు పుష్పగుచ్ఛాలతో సాదర ఘనస్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి మోదీ నేరుగా శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లారు. ఎన్‌పీఏలోని రాజస్థాన్‌ భవన్‌లో బస చేశారు. శనివారం ఉదయం ఎన్‌పీఏలో డీజీపీలు, ఐజీలతో కలిసి యోగా చేస్తారు. అనంతరం రాష్ట్రాల పోలీసు డైరెక్టర్‌ జనర్స్‌, ఇన్ స్పెక్టర్‌ జనరల్స్ సమావేశంలో పాల్గొంటారు. అంతర్గ భద్రతాంశాలపై చర్చిస్తారు. శాంతిభద్రతలను సమీక్షిస్తారు. శనివారం సాయంత్రం తిరిగి ఢిల్లీకి తిరిగి వెళతారు. ప్రధాని రాక సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంతోపాటు జాతీయ పోలీసు అకాడమీలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేటి నుండి డీజీపీల సదస్సు..

హైదరాబాద్ : నగరంలో నేటి నుంచి మూడు రోజులపాటు డీజీపీల సదస్సు జరుగనుంది. సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జాతీయ అకాడమీలో జరుగనున్న ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

 

గచ్చిబౌలిలో జాతీయ రైఫిల్ షూటింగ్..

హైదరాబాద్ : జాతీయ రైఫిల్ షూటింగ్ టోర్నీ శనివారం నుండి గచ్చిబౌలిలో మొదలుకానుంది. అండర్ -14, 17, 19 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పోటీలను ప్రారంభించనున్నారు. 

నేటి నుండి భారత్ - ఇంగ్లండ్ మూడో టెస్టు..

మొహాలీ : నేడు భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 

నేడు టీంఎయూ ప్రతినిధుల భేటీ..

హైదరాబాద్ : బస్ భవన్ లో యూనియన్ కార్యాలయంలో టీఎంయూ ప్రతినిధులు భేటీ కానున్నారు. సమావేశంలో టీంఎయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డితో పాటు ఇతర రాష్ట్ర నేతలు ప్రతినిధులతో సమావేశమై చర్చించనున్నారు. 

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్..

హైదరాబాద్ : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. నేడు ఉదయం 6నుండి 7గంటల వరకు ఐపీఎస్ లతో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. 8గంటల నుండి సాయంత్రం 5గంటల దాక డీజీపీల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 5.05 గంటలకు రోడ్డు మార్గాన ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. 5.30గంటగలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. 7.40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

 

ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పడ్ గోన్ కర్ కన్నుమూత..

పుణె : ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పుడ్ గోన్ కర్ (72) శుక్రవారం అనారోగ్యంతో పుణెలోని ఓ దవాఖానాలో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. 

Don't Miss