Activities calendar

27 November 2016

22:20 - November 27, 2016
22:18 - November 27, 2016
22:17 - November 27, 2016
22:15 - November 27, 2016
22:13 - November 27, 2016

పంజాబ్ : మొహాలి వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ మొదట్లో తడబడ్డా.. చివరకు నిలబడింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 268/8తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను 15 పరుగులకే కుప్పకూల్చారు టీమిండియా బౌలర్లు. భారత్‌ వికెట్లు చేజార్చుకోవడంతో ఆధిక్యం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ జట్టు స్కోరు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నయవాల్‌ ఛటేశ్వర్‌ పుజారా నిలకడగా ఆడాడు. అయితే అర్ధశతకం దిశగా సాగిన పార్థీవ్‌ పటేల్‌ ఆదిల్‌ రషీద్‌ వేసిన 20 ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ తొలుత దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 3వ వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మూడో సెషన్‌ ముందు జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. చివరి సెషన్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. శతకంతో ఆదుకుంటాడని భావించిన కోహ్లీ 62 పరుగులకు ఔటయ్యాడు. 208 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో వున్న భారత్‌ను ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ అర్ధశతకం, రవీంద్ర జడేజా నిలకడైన బ్యాటింగ్‌ ఆదుకొన్నారు. ఆట ముగిసే సమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 

22:11 - November 27, 2016

పంజాబ్‌ : పటియాలా జైలుపై మిలిటెంట్లు దాడి చేశారు. పోలీసు యూనిఫాంలు ధరించిన 10 మంది దుండగులు జైలు సిబ్బందిపై 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. జైలులో ఉన్న ఐదుగురు కరడుగట్టిన మిలిటెంట్లను విడిపించుకుపోయారు. 
10 మంది దుండగులు దాడి 
పంజాబ్‌లో దారుణం జరిగింది. పటియాలా సమీపంలోని నబా కారాగారంపై సాయుధులైన 10 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు ప్రాంగణంలోకి పోలీసుల దుస్తుల్లో వచ్చిన దుండగులు సిబ్బందిపై వంద రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం కారాగారంలో ఉన్న ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మిందర్‌సింగ్‌ మింటూ సహా గురుప్రీత్‌సింగ్‌, వికీ గోండ్రా, నితిన్‌ డియోల్‌, విక్రమ్‌జిత్‌ సింగ్‌ అనే మిలిటెంట్లను విడిపించుకునిపోయారు. పోలీసులు వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు.
హర్మిందర్ ప్రధాన నిందితుడు
కేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ హర్మిందర్‌ పంజాబ్‌లో జరిగిన పది ఉగ్రదాడుల్లో ప్రధాన నిందితుడు. 2013 నుంచి గుర్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ గోపి అనే సహచరుడితో కలిసి పలువురిని చంపేందుకు పన్నాగాలు పన్నాడనే అభియోగం ఉంది. అప్పటి నుంచి ఈ కేసుల్లో హర్మిందర్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అని పోలీసులు వెల్లడించారు. 2014లో హర్మిందర్‌, గుర్‌ప్రీత్‌లను ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పంజాబ్‌లో పటియాలా జైలుపై దాడి చేసి ఐదుగురు మిలిటెంట్లను విడిపించుకొని పోయిన దుండగుల కోసం, తప్పించుకున్న మిలిటెంట్ల కోసం పటియాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

 

22:04 - November 27, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం మౌనప్రేక్షకుడిలా ఉండిపోదని ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నగదు రహిత లావాదేవీలకు అవసరమై ఈ పేమెంట్స్‌ వ్యవస్థను  బలోపేతం చేస్తామన్నారు. ఈ-పేమెంట్స్‌వ్యవస్థ ను పెంచేందుకు తగిన విధానాన్ని రూపొందించడానికి ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించారు సీఎం. కరెన్సీ నోట్లతో పనిలేకుండానే  ప్రజలు లావాదేవీలు జరిపేలా బ్యాంకర్లతో  కలెక్టర్లు  చర్చించాలని కేసీఆర్‌  సూచించారు. 

 

21:59 - November 27, 2016

హైదరాబాద్ : మాదిగ ధర్మయుద్ధ సభ వేదికగా సర్వే సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన మాదిగలను రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ కేసీఆర్‌ వారిని మరిచిపోయారని ఆయన ధ్వజమెత్తారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజల చేతుల్లోనే పార్టీల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో దళితులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ విస్మరించారని టీటీడీపీ నేత ఎల్‌ రమణ మండిపడ్డారు. 

 

21:54 - November 27, 2016

మెదక్ : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర బృందానికి ప్రజలు తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. పీజీ చదివిన లక్ష్మణ్‌ అనే యువకుడు సరైన ఉద్యోగం దొరక్క.... మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో టీ అమ్ముకుంటున్నాడు. ఎస్సీ కార్పొరేషన్‌ సంస్థలో లోన్‌కు దరఖాస్తు చేసుకున్నా... బ్యాంకు అధికారులు తనకు లోన్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తనలాగే ఉన్నత చదవులు చదివిన వారికి సరైన గైడెన్స్‌ లేక... ఉద్యోగం దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ర్ట ప్రభుత్వమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని విన్నవించాడు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:35 - November 27, 2016
21:27 - November 27, 2016

తూర్పుగోదావరి : దేశంలో ప్రజాస్వామ్య హ‌క్కుల‌పై దాడి జ‌రుగుతోంద‌ని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. రాజ‌మండ్రిలో జ‌రిగిన ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియ‌న్ ర‌జతోత్సవ స‌భ‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హజరయ్యారు. ప్రశ్నించ‌డ‌మే దేశ‌ద్రోహ‌మ‌న్నట్టుగా చిత్రీక‌రించే ప‌రిస్థితి రావ‌డం దురదృష్టకరం అన్నారు. ప్రజ‌ల త‌మ హ‌క్కుల కోసం నిల‌దీయ‌గ‌లిగిన నాడే నిజ‌మైన స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి అర్థముంటుంద‌ని వ్యాఖ్యానించారు. నోట్ల ర‌ద్దు పేరుతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మూలంగా దేశంలో 2 శాతం జీడీపీ కోల్పోయే ప్రమాదం ఉంద‌న్నారు. ఇది దేశంలో ఆర్థిక సంక్షోభానికి సూచిక‌గా మార‌బోతోంద‌న్నారు. ఇన్సూరెన్స్  ఉద్యోగుల హ‌క్కుల కోసం ఐక్య పోరాటాలు సాగించాల‌ని పిలుపునిచ్చారు. ఈ స‌భ‌లో ఆ సంఘం జాతీయ నాయ‌కులు ఎన్ ఎం సుంద‌రం స‌హా ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. 

 

21:22 - November 27, 2016
21:20 - November 27, 2016

మాదిగలంతా వెంకయ్య వైపు చూస్తున్నారన్న లక్ష్మణ్

హైదరాబాద్ : మాదిగలంతా వెంకయ్య వైపు చూస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీకి కట్టుబడి ఉందన్నారు. 

నగదు రహిత విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నగదు రహిత విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నగదు రహిత పాలసీ, ఈ పేమెంట్ రూపకల్పనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. 

 

సముద్రంలో నలుగురు గల్లంతు

కృష్ణా : నాగాయిలంక మండలం ఎదురుమొండి వద్ద సముద్రంలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు జింకలపాలెం వాసులుగా గుర్తించారు. లైట్ హౌస్ వద్ద సముద్ర స్నానానికి 20 మంది వెళ్లారు. 

21:02 - November 27, 2016

విజయవాడ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు విద్యావ్యాప్తికి ఇచ్చిన హామీలన్నింటిని పూర్తిగా విస్మరించారని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానం రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్ సోషలిస్ట్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. అందుకే దీన్నికాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రఘువీరారెడ్డి చెప్పారు.  విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రేపటి హర్తాల్ లో జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నాలని పవన్‌ కల్యాణ్ కు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.  కేంద్ర ప్రభుత్వ విద్యా విధాన ముసాయిదాపై విజయవాడ దాసరి భవన్ లో విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర విద్యాసదస్సులో రఘవీరారెడ్డి, రామకృష్ణలు పాల్గొన్నారు. 

 

20:59 - November 27, 2016

పశ్చిమగోదావరి : పెద్దనోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్యాటక ప్రదేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువైంది. పర్యాటకులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. కార్తీక మాసం సందర్భంగా.. సరదాగా కుటుంబం సభ్యులతో కలిసి బీచ్‌కు వచ్చిన పర్యాటకులు చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కు పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో ఈ ఒక్క రోజే దాదాపు లక్షమందికి పైగా పర్యాటకులు బీచ్‌ను సందర్శించినట్లు చెబుతున్నారు. అయితే.. బీచ్‌లో చిల్లర సమస్య ఎక్కువగా కనిపిస్తోందని పర్యాటకులు అంటున్నారు. 

 

20:56 - November 27, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐలోని ఉన్నతాధికారులు, సిట్‌లోని సీనియర్‌ జడ్జీ షా గత 10 నెలలుగా నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని, త్రివిధ దళాధిపతులు, కేబినెట్‌లోని మంత్రులు, రాష్ర్టపతి ప్రణబ్‌తో చర్చించిన తర్వాతే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మోడీ తీసుకున్నారని, అందువల్లే సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదని చెప్పారు. అంతేగానీ... మోడీ ఒక్కరే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలా తీసుకుంటారని సురేష్‌రెడ్డి ప్రశ్నించారు. 

 

20:52 - November 27, 2016

తూర్పుగోదావరి : సదరన్‌ క్యాంపుల్లో ప్రభుత్వ అధికారుల తీరు వికలాంగుల‌కు శాపంగా మారుతోంది. అధికారులు క‌నీసం క్యాంపులవైపు రాకపోవడంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. ధృవీకరణ పత్రాల కోసం గంపెడాశలతో వచ్చిన వికలాంగులకు నిరాశే మిగులుతోంది. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన సదరన్‌ క్యాంపులో దివ్యాంగుల కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం...!
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దివ్యాంగులు పడుతున్న కష్టాలైతే అన్నీఇన్నీకావు. వాస్తవానికి విక‌లాంగుల సంక్షేమ శాఖ.. దివ్యాంగుల ధృవీకరణ పత్రాల జారీని సదరన్‌ సంస్థకు అప్పగించింది. అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదరన్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లో వికలాంగులకు పరీక్షలు నిర్వహించాలి. ధృవీకరణ పత్రాలు అందజేయాలి. ఇదీ సదరన్‌ క్యాంపు ముఖ్యోద్దేశం. కానీ, ఆచరణలో జరుగుతున్నది మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 
వికలాంగుల ఆవేదన 
రాజ‌మ‌హేంద్రవ‌రం ప్రభుత్వాసుప‌త్రిలో ప్రతీ శుక్రవారం పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. బాధితులకు విక‌లాంగ గుర్తింపు కార్డులు జారీ చేయాలి. కానీ, గ‌డిచిన ఆరు నెల‌లుగా కంప్యూట‌ర్లు మొరాయింపు, సాఫ్ట్ వేర్ స‌మ‌స్యల సాకుతో స‌ర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. అంతేకాదు.. ప‌రీక్షల కోసం వ‌స్తున్న వారిని పరిశీలించేందుకు వైద్యులు కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దూర ప్రాంతాల‌ నుంచి వ్యయప్రయాసాలకు ఓర్చి వ‌చ్చిన దివ్యాంగులకు ఈ క్యాంపుల్లో నిరాశే ఎదుర‌వుతోంది. అధికారుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. గంటల తరబడి వేచి చూసి చివరకు పనికాకుండానే వెనుదిరగాల్సి వస్తోందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
అధికారుల తీరుపై సీఐటీయూ నేతలు ఆగ్రహం 
సదరన్‌ క్యాంపుల్లో అధికారుల తీరుపై సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా రోజుల తరబడి తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వికలాంగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపించాలని వారు కోరుతున్నారు.

 

20:45 - November 27, 2016

తూర్పుగోదావరి : కాపుజాతి కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం సరైందని సినీనటులు మోహన్‌బాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లిన సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడారు. ముద్రగడ చేసే ఉద్యమంలో ఆయన విజయం సాధించాలని మోహన్‌బాబు ఆకాంక్షించారు. 

 

20:41 - November 27, 2016
20:39 - November 27, 2016

'జయమ్ము నిశ్చయమ్మురా'.. సినిమా టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శివాజీరాజ్ మాట్లాడారు. సినిమా గురించి వివరించారు. తమ అనుభవాలను తెలిపారు. పలు అసక్తికరమైన విషయాలు వివరించారు. ఆ వివరాను వీడియోలో చూద్దాం..

 

20:32 - November 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపుకు ఇచ్చినట్లయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన  ఏ ఒక్క హామీ కూడా కేసీఆర్ ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు. దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాలు భూమి ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు. గిరిజనులను 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదని తెలిపారు. మైనారిటీలకు కూడా రిజర్వేషన్ల కల్పిస్తామని చెప్పి మాట తప్పారని పేర్కొన్నారు. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబం కోసం రాష్ట్ర బడ్జెట్ వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కసారైనా జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసున్న వారికి కాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర్ రావులకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శిచారు. నకిలీ ఉద్యమకారులను మంత్రలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర ఆలోచనలు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలకు ప్రమాదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.

20:21 - November 27, 2016

హైదరాబాద్ : అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి సభ్యత్వం చాలా అవసరమని తెలిపారు. సభ్యత్వం విషయంలో మనల్ని మనం మోసం చేసుకోవద్దన్నారు. పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావాలని తెలిపారు.

20:16 - November 27, 2016

ఢిల్లీ : కెనడియన్ బ్యూటీ, ఉమెన్స్ టెన్నిస్‌ రైజింగ్‌ స్టార్‌ యూజీని బుషర్డ్‌....టెన్నిస్‌ వరల్డ్‌లో మరోసారి హాట్‌ టాపిక్‌గా నిలిచింది. బుషర్డ్‌ ప్రస్తుత సింగిల్స్‌, డబుల్స్‌లో దూసుకుపోతున్న స్టార్ మాత్రమే కాదు....లక్షాలాది మంది టెన్నిస్‌ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న క్రీడాకారిణి. ఎప్పుడూ ప్రాక్టీస్‌, ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో బిజీగా ఉండే బుషర్డ్‌....ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ అడిగిన వెంటనే తనలోని జ్యూస్‌ మేకింగ్‌ స్కిల్స్‌ను సైతం బయట పెట్టింది.

20:14 - November 27, 2016

ఢిల్లీ : హాంకాంగ్‌ టోర్నీ ఫైనల్లో పీవీ సింధు పరాజయం పాలైంది. ఫైనల్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తయ్‌ జు ఇంగ్‌ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో సింధు సిల్వర్‌ మెడల్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. రెండు సెట్లుగా జరిగిన మ్యాచ్‌లో 15...21, 17...21 తేడాతో సింధు మ్యాచ్‌ కోల్పోయింది.

20:13 - November 27, 2016


హైదరాబాద్ : రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ కానున్నారు.  ఈ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మొహాలీ టెస్టు... రెండో రోజు ముగిసిన ఆట

పంజాబ్ : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొహాలీ టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 12 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో అశ్విన్ (57), జడేజా (31) ఉన్నారు. 

 

మొహాలీ టెస్టులో అశ్విన్ హాఫ్ సెంచరీ

పంజాబ్ : మొహాలీలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ అశ్విన్ ఆఫ్ సెంచరీ చేశాడు. 

ఏలూరులో దారుణం...

పశ్చిమగోదావరి : ఏలూరులో దండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని దారుణంగా హత మర్చారు. ఏలూరులో భాస్కర్ అనే కార్పెంటర్ ను కత్తులతో పొడికి చంపారు. 

20:08 - November 27, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో దండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని దారుణంగా హత మర్చారు. ఏలూరులో భాస్కర్ అనే వ్యక్తి కార్పెంటర్ వృతి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే ఇవాళ కూడా పనికి వెళ్లి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో బడేటివారి వీధిలో గుర్తు తెలియిని దుండగులు భాస్కర్ కళ్లల్లో కారంపొడి చల్లి కత్తులతో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. పాత కక్షలతో స్నేహితులే హత్య చేసి ఉంటారని భాస్కర్ బంధువులు ఆరోపిస్తున్నారు. హంతకులను పట్టుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పత్తి రైతులకు చేదు వార్త

హైదరాబాద్ : పత్తి రైతులకు చేదు వార్త. భారత్ నుంచి పత్తి దిగుమతులను పాకిస్తాన్ నిలిపివేశారు. సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో పత్తితోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను పాక్ నిలిపివేసింది. ఏటా భారత్ నుంచి పాక్ కు 2.7 మిలియన్ బేళ్ల పత్తి ఎగుమతి జరుగుతుంది. భారత్ పత్తి ఎగుమతుల్లో 40 శాతం పాకిస్థాన్ కు వెళ్తోంది. 

16:41 - November 27, 2016

హైదరాబాద్ : ఇన్నాళ్లు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతాయని ఆశపడ్డ నేతల్లో.. ఇప్పుడు కలవరం మొదలైంది. కేంద్ర ప్రకటనతో వారంతా అయోమయంలో పడ్డారు. 2026 సంవత్సరం వరకూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల్లో అనుమానాలు, ఆందోళనలు రెట్టింపయ్యాయి. 
భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందన్న ధీమాతో రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలు భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపాయి. నియోజకవర్గాల పెంపును దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున తమతమ పార్టీల్లోకి చేర్చుకున్నాయి. అయితే 2026 వరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని కేంద్రం తాజాగా ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. 
టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన
కేంద్రం ప్రకటన టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళనలు మొదలయ్యాయి. సీట్ల పెంపు 2026 సంవత్సరం వరకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టమైన సమాధానం ఇచ్చింది. దీంతో వలస నేతల పరిస్థితి మరింత అయోమయంగా కనిపిస్తోంది. అయితే... నియోజకవర్గాల పెంపు తర్వాతే ఎన్నికలు జరుగుతాయని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఎంపీ వినోద్‌కుమార్‌ చెబుతున్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ కవలం చిన్న సవరణతో ఇది సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అన్న అంశం రాజకీయ వర్గాల్లో మాత్రం కొత్త టెన్షన్‌ సృష్టిస్తోంది. 

 

16:25 - November 27, 2016

మెదక్ : వర్గ, సామాజిక పోరాటాలతోనే మార్పు సాధ్యమవుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సామాజిక పోరాటాలు నిర్వహించాలని మహాసభ నిర్ణయించిందని, అందులో భాగంగానే మహాజన పాదయాత్ర చేపట్టామని చెప్పారు. ఇవాళ్టితో సీపీఎం మహాజన పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. అంబోజిపేట, శంకరంపేట, చేగుంట, కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట, గొల్లపల్లి, దౌల్తాబాద్‌లో పాదయాత్ర కొనసాగుతోంది. చేగుంటలో సాగిన పాదయాత్రలో సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లా సీపీఎం ఉద్యమ నిర్మాత కేవల్‌ కిషన్‌ సమాధి వద్ద సీతారాం ఏచూరి, తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ రూపాల్లో సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. 70 ఏళ్లలో దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందలేదని, వారికి అభివృద్ధి ఫలాలు అందడమే నిజమైన సామాజిక న్యాయమని అభిప్రాయపడ్డారు. దళితులు, గిరిజనులను అభివృద్ధి చేసేందుకు లాల్‌, నీల్‌ జెండాలు ఏకమయ్యాయన్నారు. కమ్యూనిస్టులు, దళిత సంఘాలు కలిసి ఒకే వేదికపై పోరాటాలు నిర్వహిస్తున్నాయని గుర్తుచేశారు. 

 

16:20 - November 27, 2016

దేశప్రయోజనాలకోసమే పెద్దనోట్లను రద్దుచేసినట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. చేతిలో మొబైల్‌ ఉంటే పర్సుతో పనిలేదన్నారు. యూపీలో ఎన్నికల ప్రచారం భాగంగా పరివర్తన్‌ర్యాలీలో ఆయన  మాట్లాడారు. నల్లకుబేరులు మాత్రమే పెద్ద నోట్లు ఉపయోగిస్తున్నారని .. నల్లధనం వెలికి తీయడానికి ఇదే సరైన సమయం అన్నారు. పెద్దనోట్ల రద్దు విషయంలో వెనక్కువెళ్లే ప్రశ్నేలేదన్నా మోదీ.. బ్లాక్‌మనీ పనిపట్టడానికి ప్రజల సహకారం అవసరమన్నారు. 

 

16:00 - November 27, 2016

విశాఖపట్నం : పెద్ద నోట్ల రద్దయి రెండు వారాలు దాటుతున్నా ఇంకా నోట్ల కష్టాలు తీరడంలేదు. పాతనోట్లు చెల్లడం లేదు. చిల్లర కష్టాలు కొనసాగుతున్నాయి. రూ. 2వేల నోట్లకు చిల్లర దొరకడం లేదు. గిరాకీలేక చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు. చిల్లరలేక చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతూనేఉన్నారు. విశాఖ సీతమ్మధార ఫిషింగ్‌ మార్కెట్‌ లో దయనీయ పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

విజయవాడలో కేంద్రప్రభుత్వ విద్యావిధానం ముసాయిదాపై సదస్సు

విజయవాడ : కేంద్రప్రభుత్వ విద్యావిధానం ముసాయిదాపై రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీసీఐ నేత రామకృష్ణ పాల్గొన్రాను. కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయని విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఎన్డీఏ ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానం.. రాజ్యాంగంలోని సెక్యులర్ సోషలిస్టు స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు.

 

కుశీనగర్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

యూపీ : కుశీనగర్ లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమపై విశ్వాసంతో ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అకాంక్షలు నెరవేర్చడమే తమ బాధ్యత అని తెలిపారు.

 

తెలంగాణ సెంటిమెంట్ కు తెరపడింది : మోత్కుపల్లి

హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కు తెరపడిందని చెప్పారు. కేసీఆర్ అన్ని రకాలుగా విఫలమయ్యారని చెప్పారు. నల్లధనం నివారణకు నోట్లు రద్దు చేయాలన్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారని చెప్పారు. చివరి వరకు టీడీపీలోనే కొనసాగుతునాని స్పష్టం చేశారు. 

 

కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపునకు ఇచ్చినట్లైంది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపునకు ఇచ్చినట్లయిందని టీడీపీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్ తన కటుంబం కోసం  రాష్ట్ర బడ్జెట్ వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కసారైనా జలుకు వెళ్లారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసున్న వారాకి కాకుండా తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారని వమర్శింమచారు. నకిలీ ఉద్యమకారులను మంత్రలుగా చేశారు. ప్రమాదకర ఆచోలచనలు, ప్రమాదకర ఆలోచనలు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలకు ప్రమాదని హెచ్చరించారు.

సామాన్యులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి : ఎల్.రమణ

హైదరాబాద్ : నోట్ల రద్దు వల్ల సామాన్యుడు ఇబ్బందులు పడకుండా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎల్.రమణ అన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా సంస్థాగతంగా బలపడుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి నుంచే కష్టపడుదామన్నారు. 

 

ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి సభ్యత్వం చాలా అవసరమని తెలిపారు. సభ్యత్వం విషయంలో మనల్ని మనం మోసం చేసుకోవద్దన్నారు. పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావాలని తెలిపారు.

 

టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు విస్తృస్థాయి సమావేశం

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు విస్తృస్థాయి సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదు, తెలంగాణలో పార్టీ బలోపేతం, కొత్త జిల్లాలపై పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతోంది. 

 

నోట్ల రద్దు చేయాలని మోడీకి బాబు లేఖ - మోత్కుపల్లి..

హైదరాబాద్ : నల్లధనం నివారణకు నోట్లు రద్దు చేయాలని ప్రధాని నరంద్ర మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారని టిడిపి నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కు తెరపడిందని, కేసీఆర్ అన్ని రకాలుగా విఫలం చెందారని తెలిపారు. 

13:36 - November 27, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో ఏపీ రవాణ రాజధాని విజయవాడలో రవాణ రంగం కుదేలైంది. సరకు రవాణ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. వంద కాదు, వెయ్యి కాదు.. విజయవాడలో ఉన్న మూడు లక్షల లారీల్లో సగానికి పైగా ఆగిపోయాయి. మిగిలినవి అరకొరగానే తిరుగుతున్నాయి. రవాణ రంగంపై ఆధారపడిన కార్మిక కుటుంబాలు ఆకలితో పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో విజయవాడ రవాణ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:35 - November 27, 2016

విశాఖపట్టణం : అనాకపల్లిలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం నిర్వహించిన జనచైతన్య యాత్రకు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యాచరు. ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై మంత్రి అయ్యన్న, పీలా గోవిందు ఎక్కారు. వీరితో పాటు మరికొంతమంది ఎక్కడం..బరువు ఎక్కువ కావడంతో బండి ఇరుసు తెగింది. దీనితో అయ్యన్నతో పాటు పలువురు కిందపడిపోయారు. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. 

నమో మోడీ..మౌన మోడీ - ఏచూరి..

మెదక్ : నమో మోడీ..మౌన మోడీగా మారాడని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. చేగుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 90 శాతం నల్లధనం దేశాలలో ఉంది అని మోడీ పేర్కొనడం జరిగిందని, మరి నోట్ల రద్దు వల్ల ఎం ఉపయోగమని ప్రశ్నించారు. నోట్ల రద్దుకి వ్యతిరేకంగా రేపు దేశ వ్యాప్తంగా జరిగే బంద్ లో పాల్గొనాలని, ప్రజలు రోడ్ల మీదికి రావాలని ఏచూరి పిలుపునిచ్చారు. 

13:24 - November 27, 2016

అమెరికా : డల్లాస్‌లో వెంకటేశ్వరస్వామి వైభవోత్సవాలను నిర్వహించారు. టిటిడి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సావాల్లో భాగంగా సుప్రభాతసేవ, తోమాలసేవ, అర్చన, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. డల్లాస్‌లోని తెలుగువారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అచ్చం తిరుమలలో నిర్వహించిన విధంగానే డల్లాస్‌లో కూడా పూజా కార్యక్రమాలు జరిపారు. వెంకటేశ్వరుని సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించిన టిటిడిని పలువురు అభినందించారు. టిటిడి సభ్యుడు ఏవీ రమణ, భానుప్రకాశ్‌రెడ్డి , అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. 

13:23 - November 27, 2016

మెదక్ : తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 42వ రోజు కొనసాగుతోంది. ఈరోజు మెదక్‌ జిల్లాలోని గువ్వలపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. శంకరంపేట, కేవలకిసన్‌ సమాధి, చేగుంట, కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట, గొల్లపల్లి, దౌల్తాబాద్‌లో కొనసాగనుంది. మహాజన పాదయాత్రలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. 93 శాతం ఉన్న అణగారిన వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీతారాం ఏచూరి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సీపీఎం మహాజన పాదయాత్ర చేపట్టిందంటున్న సీతారాం ఏచూరి టెన్ టివితో మాట్లాడారు. ఆయన ఎలాంటి అంశాలపై మాట్లాడరో వీడియో క్లిక్ చేయండి. 

13:20 - November 27, 2016

ఢిల్లీ : దేశంలో ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌లను వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు కలుగుతుండడంతో ఇక నుంచి ప్రజలు డిజిటల్‌ బ్యాంకింగ్‌ మార్గాలను వినియోగించుకోవాలని మోదీ అన్నారు. 

13:18 - November 27, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్‌ రోకోలు చేయాలని నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఈనెల 8న తీసుకున్న నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్ల రద్దు చేసిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా కరెన్సీని రద్దు చేయడాన్ని నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో సమాన్యులు, రైతులు, కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చాయి.

తెలుగు రాష్ట్రాలు సిద్ధం..
తెలుగు రాష్ట్రాలు ఇందుకు సర్వం సిద్ధమయ్యాయి. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయిచింది. పెద్ద నోట్ల రద్దకు నిరసనగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ స్తంభింపచేయాలని ఏపీ పీపీసీ నిర్ణయించింది. నోట్ల రద్దు తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 28 న జరిగే హార్తాల్ కు తమ పార్టీ మద్దతిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న నిరసనలకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి నిరసనగా సోమవారం జరిగే బంద్‌కు.. ఏపీలో సీపీఎం శ్రేణులు సిద్ధమయ్యాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం కూడా భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలకు సంఘీభావంగా ప్రజా ప్రతినిధులందరూ బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ఆటో కార్మిక సంఘాల సమాఖ్య భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సిద్ధమతున్నాయి. 

భారత పురుషుల హాకీ జట్టు విజయం..

ఢిల్లీ : నాలుగు దేశాల ఇన్విటేషన్ టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది. మలేషియాపై 4-1 తేడాతో భారత్ పురుషల హాకీ జట్టు గెలుపొందింది. ఈ గెలుపుతో భారత పురుషుల హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. 

ముద్రగడ పోరాట యోధుడన్న మోహన్ బాబు..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడను సినీ నటుడు మోహన్ బాబు కలిశారు. ముద్రగడను కలవడం సంతోషంగా ఉందని, ముద్రగడ పోరాటయోధుడని మోహన్ బాబు అభివర్ణించారు. 

వర్గ, సామాజిక పోరాటాలతో మార్పు - ఏచూరి..

మెదక్ : చేగుంటకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లా సీపీఎం ఉద్యమ నిర్మాత కేవల్ కిషన్ సమాధి వద్ద ఏచూరి, తమ్మినేని, వెంకట్ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేగుంటలో ఏర్పాటు చేసిన సభలో ఏచూరి మాట్లాడారు. వర్గ, సామాజిక పోరాటాలతోనే మార్పు సాధ్యమన్నారు. సామాజిక పోరాటాలు నిర్వహించాలని మహాసభ పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగానే మహాజనపాద యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ రూపాల్లో సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు.

12:55 - November 27, 2016
12:54 - November 27, 2016

పరుగెత్తేటప్పుడు ప్రతిదీ పారదర్శకమే. పద్యం అద్దంలా ఉండదు. అబద్ధంలా ఉంటుంది. ఈ మాటలు అన్న కవి మరెవరో కాదు 'హెచ్చార్కే'. హెచ్చార్కేగా తెలుగు సాహీతి ప్రియులకు సుపరిచితులు. ఆయన పూర్తిపేరు కొణిదెల హనుమంతరెడ్డి. 'అక్షరం..అంతరంగం' ఆయనతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన తన జీవిత విశేషాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:32 - November 27, 2016

'రాజు గారి గది' మూవీలో హీరోగా నటిస్తున్నట్లు టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను మీడియాతో 'నాగ్' పంచుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోందన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని, తాను నటించిన మరో సినిమా 'నమో వెంకటేశాయ' ఫిబ్రవరిలో విడుదలవుతుందని తెలిపారు. కొత్తదనాన్ని తెలుగు ప్రజలు ఆదరిస్తారని, తప్పకుండా ఈ సినిమా బాగుంటుందనే నమ్మకంతో ఈ సినిమా మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. డ

ఎడ్లబండిపై నుండి కిందపడిన మంత్రి అయ్యన్న..

విశాఖపట్టణం : అనకాపల్లి జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లబండిపై వెళుతుండగా ఎద్దులు బెదరడంతో మంత్రి అయన్న పాత్రుడు, ఎమ్మెల్యే గోవింద్ లు కిందపడిపోయారు. 

తొలి గేమ్ కోల్పోయిన సింధు..

ఢిల్లీ : హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో తెలుగు తేజం పీవీ సింధు తొలి గేమ్ ను కోల్పోయింది. సింధుపై తొలి గేమ్ లో చైనా క్రీడాకారిణి తయ్ జు గెలుపొందింది. 

టి.టిడిపి విస్తృత సమావేశం..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి నేతలు విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. కాసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

12:14 - November 27, 2016

నోట్ల రద్దు అనేక రంగాలను తాకుతోంది. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. టాలీవుడ్ ను కూడా రద్దు సెగ తాకింది. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. నోట్ల రద్దుతో ప్రేక్షకులు సినిమా థియేటర్ రాడని..చిల్లరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని దర్శక..నిర్మాతలు భావిస్తున్నారంట. తాజాగా నోట్ల రద్దు 'ధృవ'ని కూడా తాకింది. డిసెంబర్ 2న 'ధృవ' సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలో నోట్ల రద్దు కావడంతో విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్ణయించిందని తెలుస్తోంది. నోట్ల రద్దు కారణంగా విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారని తెలుస్తోంది. డిసెంబర్ 9వ తేదీన 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రానుందని అల్లు అరివింద్ పేర్కొనట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

నోట్ల రద్దుతో సమస్యలు వస్తాయని తెలుసు - మోడీ..

ఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే నోట్లను రద్దు చేసినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆయన మన్ కీ బాత్ లో మాట్లాడారు. నోట్ల రద్దు అసాధారణ నిర్ణయమన్న మోడీ ఇబ్బందుల నుండి బయటపడటానికి 50 రోజుల సమయం పడుతుందన్నారు. నోట్ల రద్దును ప్రజలు స్వాగతించారని, నోట్ల రద్దుతో సమస్యలు వస్తాయని ముందే తెలుసన్నారు. 

11:37 - November 27, 2016

చిత్తూరు : పవిత్ర శ్రీవారి ఆలయం..ఈ ఆలయానికి ఎంతో మంది వివిధ దేశాలు..వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడకు తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఇక్కడ అమలు చేసే నిబంధనలు తు.చ.తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. శ్రీవారి నామం తప్ప ఇతర నినాదాలు చేయకూడదనే నిబంధన ఉంది. కానీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రి తిరుమల నిబంధనలు ఉల్లంఘించారు. మంత్రి ఉదయ్ కుమార్ తన అనుచరులతో కలిసి శ్రీవారి ఆలయానికి వచ్చారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శన అనంతరం బయటకు వచ్చిన ఉదయ్ కుమార్ ఆలయ ప్రాంగణంలో సీఎం 'జయ'కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనితో ఈ నినాదాలు కొంత కలకలం సృష్టించాయి.
గత కొంతకాలంగా సీఎం జయలలిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం బాగుపడడం కోసం అభిమానులు..నేతలు పూజలు..హోమాలు నిర్వహిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగైందని ఇటీవలే వైద్యులు వెల్లడించారు. నినాదాలు చేసిన మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

శ్రీవారి ఆలయంలో మంత్రి ఉదయ్ కుమార్ నినాదాలు..

చిత్తూరు : మంత్రి ఉదయ్ కుమార్ తిరుమల నిబంధనల్లు ఉల్లంఘించారు. సీఎం జయలలితకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనుచరులతో కలిసి వచ్చిన ఆయన ఆదివారం ఉదయం ఈ నినాదాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారు. 

11:23 - November 27, 2016
11:22 - November 27, 2016
11:21 - November 27, 2016

హైదరాబాద్ : టి.టిడిపి సర్వసభ్య సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు రానున్నారు. నవంబర్ 1వ తేదీ నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వంపై బాబు ప్రధాన దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై నేతలకు బాబు దశా..దిశ నిర్ధేశం చేయనున్నారు. నేతలతో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సందడిగా నెలకొంది. ఈ సందర్భంగా అమర్ నాథ్ బాబుతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా తీసుకుంటున్న..తీసుకబోతున్న చర్యలు..ప్రణాళికలపై ఆయన మాట్లాడారు. 

పాదయాత్రలో పాల్గొన్న ఏచూరి..

మెదక్ : సీపీఎం మహాజన పాదయాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పాల్గొన్నారు. కాసేపటి క్రితం చేగుంటకు పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రకు ఏచూరి సంఘీభావం వెల్లడించారు. 

11:11 - November 27, 2016

ఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. పాటియాలోని నభా జైలుపై పది మంది దుండగులు దాడులకు తెగబడ్డారు. ఐదుగురు ఖైదీలను విడిపించుకెళ్లారు. విడిపించుకొని వెళ్లిన వారిలో ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ తో పాటు నలుగురున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుందని తెలుస్తోంది.
భోపాల్ సెంట్రల్ జైలు ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నభా జైలులోకి పది మంది దుండగులు పోలీసుల దుస్తులో వచ్చారు. వచ్చి రాగానే తీవ్ర భయాత్పోతాన్ని సృష్టించారు. సిబ్బందిపై పాయింట్ బ్లాక్ లో గురి పెట్టి ఆయుధాలను లాక్కొని నిరాయుధలు చేశారు. అనంతరం విచక్షణారహితంగా వంద రౌండ్లు కాల్పులు జరిపారు. జైలు గోడలను బద్దలు కొట్టి ఐదుగురిని విడిపించుకెళ్లారు. వీరు ఎక్కడకు పరారయ్యారో తెలియడం లేదు. గతంలో చాలాసార్లు వీరిని విడిపించుకొనేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. మారణాయుధాలతో విరుచకపడడం.. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో జైలు సిబ్బందికి ఏమి చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. దుండగులకు ఎవరైనా సహకరించారా ? ఇతరత్రా వాటిపై దర్యాప్తు చేపట్టారు. 

10:29 - November 27, 2016

 

హైదరాబాద్ : నోట్ల కష్టాలు 19వ రోజుకు చేరుకుంది. పెద్ద నోట్లు రద్దు కావడంతో ప్రజలు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నగదు తీసుకోవడానికి తెల్లవారుజాము నుండే ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు. కానీ పలు ఏటీంఎలు క్లోజ్ కావడంతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. శని, ఆదివారం..సోమవారం భారత్ బంద్ కారణంగా బ్యాంకులు మూతపడుతుండడంతో డబ్బుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తెలుసుకొనేందుకు టెన్ టివి రామ్ నగర్ లో పర్యటించింది. పలువురు తమ బాధలు చెప్పుకున్నారు.

విజయవాడలో..
విజయవాడలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏటీంఎల ఎదుట నో క్యాష్..ఔట్ ఆఫ్ సర్వీసు..నో వర్క్ అనే బోర్డులు పెడుతుండడంతో ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. 

10:21 - November 27, 2016

హైదరాబాద్ : నాయకుల్లో వర్గపోరు..కార్యకర్తల్లో నిస్తేజం..పార్టీలో నిలువెల్లా ఆవరించిన నీరసం.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ టిడిపిలో నెలకొన్న పరిస్థితి. పార్టీలో మళ్లీ ఉత్తేజం నింపేందుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోటిడిపికి దిశా నిర్దేశం చేసేందుకు బాబు సిద్దమయ్యారు. కాసేపట్లో టి-టిడిపి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నాయకులకు బాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పార్టీ సభ్యత్వనమోదులో చురుకుగా వ్యవహరించని నియోజకవర్గాల ఇంచార్జ్‌లపై కూడా వేటు పడే అవకాశం ఉందంటున్నారు టీటీడీపీ నేతలు. దీంతోపాటు కొత్తజిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన అడహక్ కమిటీల పనితీరును కూడా చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. మొత్తంమ్మీద సుదీర్ఘవిరామం తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌కు వస్తుండటంతో టీటీడీపీలో ఉత్తేజం కనిపిస్తోంది.

ఉత్సాహంగా సభ్యత్వం..
ఈ సందర్భంగా టెన్ టివితో ఆ పార్టీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. సభ్యత్వం ప్రారంభంలో మందకొడిగా జరిగినా ప్రస్తుతం ఉత్సాహంగా కొనసాగుతోందన్నారు. 2014లో జరిగిన సభ్యత్వం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలనే దానిపై ఓ కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. పార్టీలో అంతర్గత కలహాలు ఏవీ లేవని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం జరుగుతోందన్నారు. చర్చలో భేదాభిప్రాయాలు రావడం సహజమేనన్నారు. 

10:16 - November 27, 2016

చిత్తూరు : కాసేపట్లో ఎస్ఐ పరీక్ష జరగనుంది. మదనపల్లిలో పరీక్ష నిర్వాహణకు బయలుదేరిన రెవెన్యూ సిబ్బంది అనంత లోకాల్లోకి వెళ్లిపోయారు. ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఘోర దుర్ఘటనలో రెవెన్యూ సిబ్బంది మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. వి. కోట ఇన్ ఛార్జీ తహశీల్దార్ మురళీధర్, జూనియర్ అసిస్టెంట్ హరినాథ్, అటెండర్ కృష్ణవేణిలతో పాటు మరో ఇద్దరు బొలెరో వాహనంలో వెళుతున్నారు. కైగల్ జలపాతం వద్ద వేగంగా వస్తున్న కంటెనర్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీనితో మురళీధర్, హరినాథ్, కృష్ణవేణిలు అక్కడికక్కడనే మృతి చెందారు. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రెవెన్యూ సిబ్బంది మృతి చెందడంతో ఇతర ఉద్యోగులు..వారి కుటుంసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

బైరెడ్డిపల్లి మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

చిత్తూరు : బైరెడ్డి పల్లి (మం) కైగల్ జలపాతం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  బొలేరో వాహనాన్ని కంటెనర్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు రెవెన్యూ సిబ్బంది గా గుర్తించారు. మదనపల్లిలో ఎస్ ఐ పరీక్ష నిర్వాహణకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో వి.కోట తహశీల్దార్ ఉన్నారు. 

09:55 - November 27, 2016
09:47 - November 27, 2016

ఒడిశా : కార్మికులు, సామన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యపోరాటానికి సీఐటీయూ పిలుపు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఒడిశాలోని పూరిలో జరుగుతున్న సీఐటీయూ 15వ మహాసభల్లో ప్రసంగిస్తున్న నేతలు కోరారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు, కార్మికులు ఎదుర్కొటున్న ఇబ్బందులతోపాటు, కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. 

పూరీలో..
 ఒడిశాలోని పూరీలో సీఐటీయూ 15 వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈనెల 30 వరకు జరిగే ఈ సమావేశాల్లో కార్మికులు, ప్రజలు  ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సీఐటీయూ ఆవిర్భావం తర్వాత ఒడిశాలో మొదటిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు సీఐటీయూ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సమావేశాలు జరుగుతున్న  ప్రాంగణానికి సమర్‌ ముఖర్జీ నగర్‌గా పేరు పెట్టారు. సీఐటీయూ మహాసభల సందర్భంగా  పూరీలో ఎక్కడ చూసినా ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. 

మోదీ పాలనలో పెరిగిన నిరుద్యోగం..
పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో కార్మికలు, కర్షకులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 74 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాని మోదీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో నిరుద్యోగిత పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల  ఉపాధికి గండికొడుతున్న విధానాలపై చర్చించారు. వీటన్నింటిపైనా ఈ మహాసభల్లో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. 

నేతల విమర్శలు..
ప్రధాని మోదీ పాలనలో కార్మిక హక్కులు మృగ్యమయ్యాయని సీఐటీయూ నేతలు విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం 18 రూపాయలు ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోదీ పాలనలో ప్రజలకు ఆహార భద్రత కరువై ఆకలి చావులు పెరిగిన అంశంపై సీఐటీయూ మహాసభల్లో చర్చిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో ప్రజాసమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం వ్యక్తం చేశారు. సంఘటిత పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచకపోతే కష్టాలు మరింత పెరుగుతాయని, సంఘటిత పోరాటాలకు అందరూ కలిసి రావాలని సీఐటీయూ  నేతలు విజ్ఞప్తి చేశారు.  

09:45 - November 27, 2016

హైదరాబాద్ : హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ అవగాహన కోసం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో 10కే రన్‌ నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌, టెన్నీస్‌ స్టార్‌ సానియామీర్జా జెండా ఊపి 10కే రన్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌, హీరోయిన్‌ రాశీకన్నాలతో పాటు పలువురు సినీ తారలు సందడి చేశారు. యువత, నగరవాసులు చాలామంది ఎంతో ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు. 

09:44 - November 27, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి పులి గజ గజలాడిస్తోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు వణికిపోతున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది. ఏజెన్సీలోని లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పదకొండుగంటలవరకూ సూర్యుడి జాడే కనిపించడంలేదు. ఇక తెలంగాణలో చలిగాలులు మరింత పెరిగాయి. మెదక్‌లో అత్యల్పంగా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలితీవ్రత మరి కొన్ని రోజులపాటు కొనసాగే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. 

09:43 - November 27, 2016

శ్రీకాకుళం : జిల్లా హిరమండలం ఎగువరుగడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. స్థానికులపై దాడి చేయటంతో... ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పాతపట్నం మండలం వ్యక్తి తవుడుగా గుర్తించారు. ఓ శుభకార్యక్రమానికి హాజరైన తవుడు తిరుగుప్రయాణంలో విగతజీవిగా మారాడు.. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... అక్కడ ఏనుగుల ఆనవాళ్లను చూశారు.. మూడురోజులుగా నాలుగు ఏనుగుల గుంపులు మండలంలో సంచరిస్తున్నాయి.. ఈ ఏనుగులే దాడి చేసిఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు... గతంలో కూడా ఏనుగుల దాడిలో ఇద్దరు మృతిచెందారు.. ఇంతమంది చనిపోతున్నా అధికారులు ఇటువైపే చూడటంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..

09:40 - November 27, 2016

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరోలేఖ సంధించారు. జిల్లాల విభజన తర్వాత మెదక్‌ జిల్లా పారిశ్రామికంగా వెనకబడిందన్నారు. జిల్లాలో ఉన్న ఒక షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను రోడ్డున పడేశారని ఆరోపించారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర మెదక్‌ జిల్లాలో 41వ రోజు కొనసాగింది. మంబోజిపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర.. మెదక్‌, పిల్లికొట్టాల, రాసుపల్లి, కుంటూరు, కాజిపల్లి, మందాపూర్‌, రాన్జీతండా, కొరివిపల్లితండా మీదుగా పర్యటిస్తూ గువ్వలపల్లిలో ముగిసింది. మహాజన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. గ్రామాలలో ఉన్న అనేక సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు.

మెదక్ ఏరియా ఆసుపత్రి..
పాదయాత్ర చేస్తున్న తమ్మినేని బృందం మెదక్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సరిపడ సిబ్బంది లేకపోవడంతో సరిగ్గా వైద్యసేవలు అందడం లేదన్నారు తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యసేవలందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కార్‌.. రెండున్నరేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రుల్లో ఖాళీగా పోస్టులు భర్తీ చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

జిల్లా బలహీనం..
పాదయాత్ర చేస్తున్న బృందాన్ని బుడగ జంగాలు కలిశారు. సంచారం చేసుకుంటూ జీవించే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని.. తమ పిల్లలకు పౌష్టికాహారం కూడ ఇవ్వలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకునేలా చూడాలని సీపీఎం బృందానికి బుడగ జంగాలు విజ్ఞప్తి చేశారు. జిల్లాల విభజన తర్వాత మెదక్‌ జిల్లా బలహీనపడిందని తమ్మినేని అన్నారు. జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడి 11 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమ్మినేని అన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని 31వ లేఖ రాశారు. ఫిడెల్‌ క్యాస్ట్రో మృతికి సీపీఎం పాదయాత్ర బృందం సంతాపం తెలిపింది. కొవ్వొత్తులతో పాదయాత్ర నిర్వహించారు. కమ్యునిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో ప్రపంచానికి ఆదర్శమని తమ్మినేని కొనియాడారు.

సిక్కోలులో ఏనుగుల బీభత్సం..

శ్రీకాకుళం : జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. స్థానికులపై దాడి చేయడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. హిరమండలం ఎగువరడలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

08:20 - November 27, 2016

బియ్యం కడిగి నీళ్లు ఏం చేస్తాం..అంటే ఏం చేస్తాం..పారబోస్తాం..అంటారు కదా..కానీ ఈ నీళ్లను ఉపయోగిస్తే అందం మెరుగవుతుందంట. బియ్యం నీళ్లు అందానికే కాకుండా మొక్కలకు కూడా ఉపయోగపడుతుందంట. ఈ నీళ్లు వాడుకుంటే చక్కటి ప్రయోజనం ఇస్తాయి. విటమిన్స్ మినరల్స్ మన చర్మానికే కాకుండా జుట్టు పోషణకు కూడా ఉపయోగపడుతుంది.

  • బియ్యం కడిగిన నీళ్లు జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట అనంతరం తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ సిల్కీగా మారుతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయాలి.
  • మొటిమలు ఉన్న వారు బియ్యం కడిగిన నీళ్లతో కడగడం వల్ల మంచి మార్పు వస్తుంది.
  • రషెస్ ఎక్కువగా ఉంటే తొలుత ఒకసారి బియ్యం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం 15 నిమిషాల తరువాత మళ్లీ బియ్యపు నీటితో కడుక్కోవాలి.
  • కాటన్ బాల్ ని బియ్యం కడిగిన నీళ్లలో ముంచి ముఖానికి అప్లై చేయాలి. దీనిద్వారా సాఫ్ట్ గా..ప్రెష్ గా తయారవుతుంది. 
08:03 - November 27, 2016

'ప్రభాస్ అంటే పిచ్చి..లవ్ యూ' అని బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి 'గుత్తా జ్వాలా' వ్యాఖ్యలు చేసిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరగుతోంది. ఓ మీడియా సమావేశంలో పలు కామెంట్స్ చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'గుత్తా జ్వాలా' పలు వివాదాల కారణంగా వార్తల్లోకెక్కింది. తన తోటి ఆటగాడు 'చేతన్ ఆనంద్' ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం కొద్దిరోజులకు విడాకులు తీసుకుంది. అనంతరం కోచ్ గోపిచంద్ తో గొడవలు..మాజీ క్రికెటర్ తో ఎఫైర్ ఉందంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఓ మీడియాతో 'గుత్తా జ్వాలా' మాట్లాడినట్లు టాక్. ఈ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. 'భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికీ పరపతి ఉండకూడదు. భర్తకు చేదోడుగా భార్య, భార్యకి చేయూతగా భర్త ఉండాలి. కానీ మా ఇద్దరిలో ఇలా జరగలేదు. అందుకే మా మధ్య వున్నా సంబంధాల్ని కొనసాగిపొంచలేకపోయాం' అని తన గురించి చెప్పినట్లు వార్తలు వెలువెడుతున్నాయి. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదు కానీ నచ్చిన అబ్బాయి దొరికితే మాత్రం వివాహం చేసుకుంటానని చెప్పిందంట. తనకు నటుడు ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టం అని..ప్రభాస్ చాలా పొడవుగా ఉంటాడని కామెంట్స్ చేసినట్లు టాక్. ఐలవ్ ప్రభాస్ అని కూడా చెప్పిందంట. 

08:02 - November 27, 2016

పీపుల్స్ ప్లాజాలో 10 కే రన్..

హైదరాబాద్ : పీపుల్స్ ప్లాజాలో 10 కే రన్ జరిగింది. హెల్త్ అండ్ ఫిట్ నెస్ కోసం అవగాహన ర్యాలీ జరిగింది. ఈ రన్ లో మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్, సీపీ మహేందర్ రెడ్డి, సినీ నటుడు రామ్ చరణ్, రాశీఖన్నా, సానియా మీర్జా పాల్గొన్నారు. 

07:45 - November 27, 2016

కోలీవుడ్ హీరో, సూపర్ స్టార్ 'రజనీకాంత్' అల్లుడు 'ధనుష్' వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఇతనిపై కోలీవుడ్ లో చర్చ జరుగుతోందంట. 'ధనుష్' తమ కొడుకేనంటు ఓ వృద్ధ దంపతులు కోర్టుకు హాజరు కావడం కలకలం సృష్టిస్తోంది. కోర్టు విచారణ చేపట్టి జనవరి 12వ తేదీన కోర్టుకు స్వయంగా హాజరు కావలంటూ 'ధనుష్' కు నోటీసులు పంపింది. గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. 'ధనుష్' వివాహ సమయంలో తమ కుమారుడని..అతడిని తమకు అప్పగించాలంటూ ఆరోపణలపై 'ధనుష్' తండ్రి కస్తూరి రాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా 'ధనుష్' తమ కుమారుడంటూ మధురై జిల్లాకు చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఆ.మలంపట్టికి చెందిన కదిరేశన్‌, మీనాళ్‌ దంపతులు మేలూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. 'ధనుష్‌' తమ కుమారుడని, అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు. 'ధనుష్‌' తమ కుమారుడేనని చెప్పడానికి పలు ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. వృద్ధులైన తమకు 'ధనుష్‌'తో నెలకు రూ. 65వేలు జీవనభృతిని ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. నిజంగా వీరు 'ధనుష్' తల్లిదండ్రులేనా ? కాదా ? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. 

07:33 - November 27, 2016

భారత స్టార్‌ షట్లర్‌, ఒలింపిక్స్ సిల్వర్‌ మెడలిస్ట్ సింధు మరో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌పై కన్నేసింది. చైనా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి జోరు మీదున్న సింధుకు హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లోనూ పోటీనే లేకుండా పోయింది. సెమీఫైనల్స్‌లో హాంగ్‌కాంగ్ స్టార్‌ చెంగ్‌ నాన్‌ యీపై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సైనా నెహ్వాల్‌ను ఓడించిన చెంగ్‌ నాన్‌ యీ...సింధును అధిగమించడంలో మాత్రం విఫలమైంది. తొలి సెట్‌ ఆరంభంలో దూకుడుగా ఆడిన చెంగ్‌ ఆ తర్వాత సింధు చెలరేగడంతో తేలిపోయింది. పవర్‌ఫుల్‌ స్మాష్‌లతో ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగిన సింధు...తొలి సెట్‌ను సునాయాసంగా 21-14తో నెగ్గింది. రెండో సెట్‌లోనూ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా రాణించిన సింధు ...చెంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆధిపత్యం ప్రదర్శించింది. 21-16తో రెండో సెట్‌ సైతం నెగ్గి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. టైటిల్‌ ఫైట్లో సింధు....తైవాన్‌కు చెందిన తై జూ ఇంగ్‌తో పోటీపడుతుంది. గత వారమే చైనా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన సింధు....హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

07:30 - November 27, 2016

మొహాలీ : టెస్ట్ మొదటి రోజు భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో ఇంగ్లండ్‌ జట్టు మరోసారి తేలిపోయారు. భారత పేస్‌, స్పిన్‌ బౌలర్లు పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ఒంటరి పోరాటం చేసిన ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌ స్టో ప్రస్తుత సీజన్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

పోటీ పడిన భారత బౌలర్లు..
భారత పేస్‌, స్పిన్‌ బౌలర్లు పోటీలు పడి మరీ వికెట్లు తీయడంతో తొలి రోజే ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. హమీద్‌ను ఔట్‌ చేసి ఉమేష్‌ యాదవ్‌ భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. ఫామ్‌లో ఉన్న అలిస్టర్‌ కుక్‌ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌ స్టో మాత్రం తన సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. టెస్టుల్లో 13వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన బెయిర్‌ స్టో ప్రస్తుత సీజన్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆదుకున్న బెయిర్ స్టో..
కష్టాల్లో ఉన్న జట్టును లోయర్‌,మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో కలిసి ఆదుకున్నాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన జానీ మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ ఓక్స్ లతో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఇంగ్లండ్‌ జట్టు పరువు కాపాడాడు. 76 బంతుల్లో టెస్టుల్లో 13వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన బెయిర్‌ స్టో 2016 సీజన్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో సీజన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 89 పరుగులకు ఔటై 11 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న బెయిర్‌ స్టో ప్రస్తుత సీజన్‌లో 1340 పరుగులు నమోదు చేశాడు.

ఇంగ్లండ్ బౌలర్లు రాణిస్తారా ? 
ఆఖర్లో జయంత్ యాదవ్‌, జడేజా సైతం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు.దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు 268 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌, జయంత్ యాదవ్‌, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టగా....మహమ్మద్‌ షమీ, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్‌ జట్టు బౌలర్లు రాణిస్తేనే భారత్‌కు పోటీ ఇవ్వగలుగుతుంది. రెండో రోజు సైతం ఆధిపత్యం ప్రదర్శిస్తే....భారత జట్టు మ్యాచ్‌పై పట్టు బిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

07:23 - November 27, 2016

పంజాబ్ : టీమిండియా ఆల్ రౌండర్ 'యువరాజ్ సింగ్' కొద్దిగంటల్లో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఈనెల 30వ తేదీన గురుద్వారాలో యువీ - హాజెల్ కీచ్ వివాహం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఈ వివాహ వేడుకకు స్వల్ప సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు సమాచారం. కానీ ఈ పెళ్లికి తాను హాజరు కావడం లేదని 'యూవీ' తండ్రి 'యోగరాజ్ సింగ్' పేర్కొనడడం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆయన ఓ కారణం చెప్పాడు. 'దేవుడి పై నమ్మకముంది. కానీ మత గురువుల మీద నమ్మకం లేకనే ఈ పెళ్లికి హాజరు కావడం లేదు' అని పేర్కొన్నారు. దీని గురించి యువీకి ముందే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే యువరాజ్ కోరిక మేరకు నవంబర్ 29వ తేదీన మెహిందీ ఫంక్షన్‌కు హాజరవుతానని పేర్కొన్నారు. పెళ్లిళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ సూచించారు. కాబోయే కోడలు 'హాజెల్ కీచ్' పై యోగరాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమెను 'ఏంజెల్' గా అభివర్ణించారు. యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ కు తల్లి షబ్మం కు మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయినట్లు తెలుస్తోంది. 

ఎస్సై పోస్టుల భర్తీకి నేడు ఫైనల్ పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలోని కమ్యూనికేషన్స్, పీటీవో విభాగాల్లో ఎస్సై పోస్టుల భర్తీకి నేడు ఫైనల్ రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు..మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. 

నేడు టి.టిడిపి విస్తృతస్థాయి సమావేశం..

హైదరాబాద్ : నేడు టి.టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. 

06:48 - November 27, 2016

క్యూబా నిర్మాత, మహాయోధుడు ఫిడేల్‌ క్యాస్ట్రో భారత్‌ అంటే ప్రత్యేక అభిమానం చూపేవారు.. రెండు దేశాలమధ్య సంబంధాల బలోపేతం కోసం మొదటినుంచి కృషి చేశారు. మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌వరకూ అందరు ప్రధానులతో భేటీ అయ్యారు. క్యూబా దిగ్గజం ఫిడేల్ క్యాస్ట్రో.. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఎంతో చొరవచూపారు. విప్లవ యోధుడు భారత్‌ అంటే ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అందరితో ఆయన సమావేశమై.. భారత్‌ పట్ల ఆయనకున్న ప్రత్యేకతను చాటారు. క్యాస్ట్రో అధ్యక్షుడు అయ్యాక ఇండియా, క్యూబా మధ్య సంబంధాల బలోపేతంపై రెండు దేశాలు ప్రత్యేక దృష్టిపెట్టాయి.. 1959 నుంచి రెండుదేశాల మధ్య రాకపోకలు సాగాయి. 1973, 1983లో ఫిడేల్‌ క్యాస్ట్రో ఇండియా వచ్చారు.

1991లో ఎదురు దెబ్బ..
సోవియట్‌ యూనియన్‌తో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్న క్యాస్ట్రోకు 1991లో ఎదురుదెబ్బ తగిలింది.. సోవియట్‌ యూనియన్‌ పతనవమవడంతో ఆదేశంనుంచి సహాయం ఆగిపోయింది. అలాంటి కష్టసమయంలో క్యూబా-ఇండియా మధ్య వాణిజ్య బంధం మరింత పెరిగింది. క్యూబా నుంచి చక్కెర దిగుమతి చేసుకున్న భారత్... బదులుగా.... గోదుమలు, బియ్యాన్ని ఎగుమతి చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఇరుదేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి.

2012లో..
2012లో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ క్యూబా పర్యటనలో అద్భుతం జరిగింది. అనారోగ్యంతో క్యాస్ట్రో బహిరంగ కార్యక్రమాలకు రాకపోయినా హమీద్‌ అన్సారీతో మాత్రం భేటీ అయ్యారు.. దాదాపు గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీపై అన్సారీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.. అసలు కలుస్తారో లేదో అని తాను భావించానని... అలాంటిది తనను సాదరంగా ఆహ్వానించి గంటసేపు మాట్లాడటం ఎంతో సంతోషాన్నించిందని అన్సారీ చెప్పారు. ఇలా భారత్‌ అంటే తమకెంత ఇష్టమో.. ఆ కమ్యునిస్టు యోధుడు చెప్పకనే చెప్పాడు. అలీనోద్యమంలోనూ క్యూబా, భారత్‌ ముఖ్యపాత్ర పోషించాయి.. ఈ సమయంలో రెండు దేశాలు పరస్పరం ఎంతో సహకారం అందించుకున్నాయి. ముఖ్యంగా ఫిడేల్‌ గుండెలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేకంగా చోటు ఉండేదని క్యూబా నేతలు చెబుతారు. 

06:42 - November 27, 2016

భావాలు వారి మధ్య బంధాన్ని ఏర్పరచాయి. సిద్ధాంతాలు వారిని చిరకాల మిత్రుల్లా మలిచాయి. ఆలోచనలు వారి మధ్య స్నేహాన్ని పెంచాయి. ఉద్యమాలే ఊపిరిగా.. నియంత పాలనకు వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం చేసిన మహావీరులు చెగువేరా, ఫిడెల్‌ క్యాస్ట్రో మధ్య ఎనలేని అనుబంధం ఉంది. క్యూబా విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో.. ఉద్యమ సమయంలో చెగువేరా సలహాలు తీసుకునే వారు. చెగువేరా, క్యాస్ట్రో మధ్య అనుబంధంపై ప్రత్యేక కథనం. 

అరుదైన ఘట్టం..
సరైన ఆలోచన ఎంత ముఖ్యమో దానిని పక్కాగా అమలుచేయడమూ అంతే ప్రధానం. ఇక సాయుధపోరాటంలో ఎత్తుగడలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. క్యూబా విప్లవ పోరాటంలో ఫిడెల్‌ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ములపొదిలోని ప్రధాన ఆయుధం చేగువేరా. ఎక్కడో పుట్టి, పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం తుపాకి పట్టిన చేగువేరాకు, అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహం ఇస్తూ విప్లవాన్ని విజయవంతం చేయడంలో ఫెడెల్‌ క్యాస్ట్రో అనుసరించిన తీరు చరిత్రలో అరుదైన ఘట్టం.

ప్రయాణమార్గంలోని గ్రామాల్లో సమావేశాలు..
1950 దశకం నుండి క్యూబాలో అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. చెరుకు రైతులతో పాటు సామాన్య ప్రజల జీవితాలనూ పీల్చి పిప్పిచేస్తూ నాటి ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకున్న ఆవేశాన్ని విప్లవానికి అనుకూలంగా మలచడంలో ఫిడెల్‌కు చేగువేరా అందించిన సహకారం అనిర్వచనీయం. 1956లో ఫిడెల్ క్యాస్ట్రో తన 80 మంది అనుచరులను 'గ్రాన్మా' నౌకలో తీసుకొనిపోయి బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫల ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే తర్వాతి రెండేళ్ళ కాలంలో విప్లవంగా మారిపోయింది. బృందాలుగా విడిపోయిన విప్లవ సైన్యాలు.. తాము ప్రయాణించే మార్గంలో తారసపడే గ్రామాలకు వెళ్లి, రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహించేవారు. వాళ్లని పోరాటానికి సిద్ధం చేసేవారు.

అర్థమయ్యేలా విశదీకరణ ..
వైద్యుడిగా ఫిడెల్‌ విప్లవ సైన్యంలో చేరిన చేగువేరా.. మార్క్సిజం, లెనినిజంల పంథాను సహచరులకు మరింత అర్థమయ్యేలా వివరించేవాడు. అతనిలోని బోధకుడిని గుర్తించిన ఫిడెల్‌.. రైతులు, కూలీలతో నిర్వహించే సమావేశాల్లో చేగువేరాను మాట్లాడాల్సిందిగా ప్రోత్సహించేవాడు. దోపిడి, తిరుగుబాటు, పోరాటం, విప్లవం, సమానత్వం, కమ్యూనిజం, సోషలిజం.. ఒక్కటేమిటీ అన్ని అంశాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా వివరించడం, యుద్ధక్షేత్రంలో ఏమాత్రం బెరుకులేకుండా దూసుకెళ్లడం చేగువేరా సహజ నైజం. చే విధానాలకు ఏనాడూ అడ్డుచెప్పని ఫిడెల్‌.. చివరికి చెగువేరా క్యూబాను విడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా అదేపని చేశాడు. తనలా చేగువేరా ఒక దేశానికే పరిమితమైపోయేవాడు కాదు.. 'ప్రపంచ పోరాట యోధుడు' అని అందరికన్నా ముందు గుర్తించింది ఫెడల్‌ క్యాస్ట్రోనే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం..
చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. రచయితగా, గెరిల్లా యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిపొందిన చేగువేరా దేశాలు తిరుగుతూ ప్రజల అవస్థలు చూసి తల్లడిల్లిపోయాడు. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో, రావుల్ క్యాస్ట్రోలను కలుసుకున్నాడు. ప్రసిద్ధ 'జులై 26 విప్లవం'లో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్యూబా చేరుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశాడు. ఫిడెల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. విప్లవం విజయవంతం అయిన తర్వాత ప్రధాని హోదాలో ఫిడెల్ క్యాస్ట్రో.. క్యూబాకు ఆయువుపట్టైన చక్కెర పరిశ్రమల శాఖకు చేగువేరాను మంత్రిగా నియమించాడు. ప్రస్తుతం క్యూబా ప్రపంచ చెక్కెర గిన్నె(సుగర్‌ బౌల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌)గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.

క్యూబా విడిచి బొలీవియా వెళ్లాలనుకున్న చేగువేరా..
విప్లవం అనంతరం ఒక దేశంగా క్యూబా మనుగడ సాధించాలంటే అమెరికా మినహా, ప్రపంచంలోని మిగతా దేశాలతో సఖ్యత అత్యవసరమైంది. ఆ బాధ్యతను కూడా క్యాస్ట్రో.. చేగువేరాకే అప్పగించాడు. క్యూబా విదేశాంగ మంత్రి హోదాలో భారత్‌ సహా రష్యా, శ్రీలంక, జపాన్‌, చైనా తదితర దేశాల్లో పర్యటించి, కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుని క్యాస్ట్రో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అధికార నిర్వహణ కంటే విప్లవం పురుడుపోసుకుంటున్న మిగతా లాటిన్ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలకు తన సేవలు అవసరమని భావించిన చేగువేరా క్యూబా విడిచి బొలీవియా వెళ్లాలనుకున్నాడు. నిజానికి చేగువేరా లాంటి తురుపుముక్కను వదులుకోవడానికి ఏ రాజనీతిజ్ఞుడూ సిద్దపడడు. కానీ అది విప్లవ పోరాటం. అక్కడ వ్యక్తిగత స్నేహాలకు తావులేదు. అందుకే దేశాధినేతగా కాకుండా ప్రియమైన స్నేహితుణ్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఫిడల్‌ క్యాస్ట్రో.. చేగువేరాకు వీడ్కోలు పలికాడు. బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న చే మరణించాడు. దేశాలు వేరైనా... ఇద్దరు యోధుల పంధా... సామాన్యుల సమస్యల పరిష్కారమే కావడంతో... ఒకటిగా నడిచి.. హక్కులపై పోరులో తమదైన ముద్ర వేశారు.

06:37 - November 27, 2016

విజయవాడ : ఏపీలో త్వరలో కొలువుల జాతర మొదలు కాబోతోంది. మరిన్ని ఉద్యోగ ప్రకటనలు చేసేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. గ్రూప్1, గ్రూప్3 నోటిఫికేషన్లతో పాటు పంచాయితీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్‌లో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి వచ్చే ఏడాది ప్రారంభంలోనే పరీక్షల నిర్వహణకు సిద్దమవుతోంది. ఓవైపు పోలీస్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే..తాజాగా మరిన్ని పోస్టులు భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. వచ్చే నెలలో వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఎపిపిఎస్‌సి సిద్ధమవుతోంది.

వచ్చే నెల మొదటివారం..
ఈ నెల 8న 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన ఏపీపీఎస్సీ... వచ్చే నెల మొదటి వారంలో గ్రూప్‌-3 ఉద్యోగాల ప్రకటన విడుదలకు సన్నాహాలు చేస్తొంది. కీలక మైన గ్రూప్1 నోటిఫికేషన్ సైతం డిసెంబర్‌ చివరి వారంలో ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నూతన సంవత్సర కానుకగా డిగ్రీ, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు ప్రకటన ఇవ్వనుంది. ఆ తర్వాత వెయ్యి పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న మిగతా పోస్టులకూ వేగంగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్దమౌవుతోంది.

నిరుద్యోగుల హర్షం..
అయితే గతంలో గ్రూప్ 1, గ్రూప్2 పరీక్షల నిర్వహణలొ దొర్లిన తప్పులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బేరీజు వేసుకొని సమస్యలు అధిగమించాలని ఏపీపీఎస్సీ ప్లాన్ చేస్తోంది. ఆన్‌ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తొంది. ఇటీవల జరిగిన ఏఈఈ పరీక్ష ఫలితాలు డిసెంబర్‌ మొదటివారంలో విడుదల చేయనుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేయనున్న ప్రకటనలపై ఆ రాష్ట్ర నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

06:34 - November 27, 2016

హైదరాబాద్ : నాయకుల్లో వర్గపోరు, కార్యకర్తల్లో నిస్తేజం.. పార్టీలో నిలువెల్లా ఆవరించిన నీరసం. ఇదీ ప్రస్తుతం తెలంగాణటీడీపీలో నెలకొన్న పరిస్థితి. ఒకప్పుడు.. లక్షల మంది కార్యకర్తలతో ఊరూరా కళకళ్లాడిన పసుపుపార్టీ .. ఇపుడు చాలా జిల్లాల్లో నామమాత్రంగా మిగిలింది. పార్టీలో మళ్లీ ఉత్తేజం నింపేందుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు రంగంలోకి దిగారు. తెలంగాణలో టీడీపీ చేస్తున్న పోరాటం ప్రజల్లోకూ అంతగా దూసుకెళ్లలేకపోతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. టీ-టీడీపీ నేతలతో అన్నమాటలివి. పార్టీ అధినేత అన్నట్టుగానే నానాటికీ తీసికట్టు అన్నట్టుగా తయారైంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. పార్టీలో ఉత్తేజం నింపేందుకు రైతు పోరుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లుతున్నారు టీటీడీపీ నేతలు. అయితే యాత్రలో కొందరు అగ్రకుల నాయకుల ఆదిపత్యంపై బీసీనేతలు కోపంగా ఉన్నారు. దీనిపై ఇటీవల విజయవాడకు వెళ్లి మరీ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన బీసీ నేతలు.

నీరసంగా టీ-టీడీపీ సభ్యత్వ నమోదు..
మరోవైపు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు నీరసంగా సాగుతోంది. కార్యక్రమం ప్రారంభించిన దాదాపు నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు కేవలం 1లక్షా25వేల మంది మాత్రే పార్టీసభ్వత్వం తీసుకున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మినహా... మిగిలిన జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు. 40 నుండి 50 నియోజకవర్గాల్లో అయితే.. ఒక్క సభ్యత్వం కూడా నమోదు కాకపోవడం.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంత దిగజారింతో అర్థమవుతుంది.

ఇవాళ టీ.టీడీపీ సర్వసభ్య సమావేశం..
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోటిడిపికి దిశా నిర్దేశం చేసేందుకు సిద్దమయ్యారు ఆపార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు. ఇవాళ జరిగే టి-టిడిపి సర్వసభ్య సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పార్టీ సభ్యత్వనమోదులో చురుకుగా వ్యవహరించని నియోజకవర్గాల ఇంచార్జ్‌లపై కూడా వేటు పడే అవకాశం ఉందంటున్నారు టీటీడీపీ నేతలు. దీంతోపాటు కొత్తజిల్లాల్లో ఇప్పటికే ఏర్పాటైన అడహక్ కమిటీల పనితీరును కూడా చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. మొత్తంమ్మీద సుదీర్ఘవిరామం తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌కు వస్తుండటంతో టీటీడీపీలో ఉత్తేజం కనిపిస్తోంది. 

06:31 - November 27, 2016

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మరోసారి ఊపందుకుంది. ఎమ్ఆర్ పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్ లో 'మాదిగ ధర్మయుద్దం' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మరోసారి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆందోళన ఉదృతం చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పలు రూపాల్లో నిరసన తెలిపిన మందకృష్ణ మాదిగ.. సాయంత్రం హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో మాదిగ ధర్మయుద్దం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్దమైయ్యారు.

ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్..
మాదిగ ధర్మయుద్ధ సభ ఏర్పాట్లను మందకృష్ణమాదిగతో కలిసి టి-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని ఎమ్మార్పీఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు హాజరవుతున్నట్లు తెలిపారు. వర్గీకరణకు సానుకూలత వ్యక్తం చేసే ప్రతి వ్యక్తి ధర్మయుద్ధ సభకు తరలిరావాలని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. కేసిఆర్ మంత్రివర్గంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లేకపోవటం అంబేద్కర్ ను అవమానించటమేనన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్న ఎమ్మార్పిఎస్‌ నేతలు ..కేంద్రప్రభుత్వానికి వినిపించేలా మరోసారి ఉద్యమగళాన్ని వినిపిస్తామంటున్నారు. 

06:29 - November 27, 2016

పశ్చిమగోదావరి : ప్రత్యేక హోదాను మించిన ఆర్థిక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చామని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో బీజేపీ నిర్వహించిన రైతు బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌, వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం వల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని అమిత్‌ షా గుర్తు చేశారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 40వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. 

06:27 - November 27, 2016

కడప : రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి, నల్లధనం లేని సమాజ నిర్మాణానికి ఇది ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. నగదు రహిత చెల్లింపులను పెద్ద ఎత్తున చేపట్టే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కడపలో జరిగిన డ్వాక్రా సదస్సులో చెప్పారు. చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించారు. కడప మున్సిపల్‌ మైదానంలో జరిగిన డ్వాక్రా సదస్సులో పాల్గొన్నారు. డ్వాక్రా సభ్యులతో పాటు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. డ్వాక్రా బృందాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు... పెద్ద నోట్ల రద్దుతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ కష్టాలు తాత్కాలికమేనన్న విషయాన్ని ప్రస్తావించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, నల్లధనం సమస్యల పరిష్కారానికి ఇది దోహదం చేస్తున్నందని చెప్పారు. అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

మేడా కన్వేన్షన్ సెంటర్ లో కార్యకర్తల సమావేశం..
డ్వాక్రా సదస్సు తర్వాత కడపలోని మేడా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన టీడీపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 19 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు చంద్రబాబు పసువు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళితే టీడీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదన్నారు. బలహీన వర్గాల ప్రజల కోసం తర్వలో ఐదు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. 

06:25 - November 27, 2016

హైదరాబాద్ : ఉగ్రవాదం, తీవ్రవాదం దేశ పురోభివృద్ధికి ఆటంకాలుగా మారాయని.. వాటికి వ్యతిరేకంగా నిరంతరం పోరు సాగించాలని డీజీపీ, ఐజీలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో డీజీపీలు, ఐజీల సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో పోలీసులు ధైర్యంగా పోరాడిన తీరును కొనియాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న 51వ డీజీపీ, ఐజీల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉద‌యం అకాడ‌మీలోని స‌ర్దార్ వల్లభాయ్ ప‌టేల్ విగ్రహానికి నివాళులు అర్పించిన త‌ర్వాత స‌ద‌స్సులో పాల్గొన్నారు. దేశ అంత‌ర్గత భద్రత, పోలీస్ వ్యవస్థ బ‌లోపేతం, దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు, మావోయిస్ట్ తీవ్రవాదం, స‌రిహ‌ద్దు రాష్టాల్లో చొర‌బాట్లు తదితర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో ప్రధాని డీజీపీల‌కు దిశా నిర్ధేశం చేశారు. అంత‌ర్గత భ‌ద్రతపై రాజీప‌డ‌వ‌ద్దని.. నిత్యం అప్రమత్తంగా ఉంటూ కేంద్రం స‌మ‌న్వయంతో ముందుకెళ్ళాల‌ని సూచించారు. పోలీసులకు నాయకత్వ లక్షణాలు ముఖ్యమన్నారు.

మొబైల్ యాప్..
అనంతరం ఇండియన్‌ పోలీస్‌ ఎట్ యువర్‌ కాల్ మొబైల్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అత్యుత్తమ సేవలందించిన వారికి ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రధాని అందజేశారు. శాంతి భద్రతలో పరిరక్షణలో పోలీస్ మేధస్సు, ప్రత్యక్ష గస్తీకి గల ప్రాముఖ్యాన్ని అనుక్షణం అధికారులు గుర్తుంచుకోవాలన్నారు మోదీ. నిరంతర ప్రగతి దిశగా సాంకేతిక పరిజ్ఞానం, మానవ సామర్థ్యం మేళవింపు ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు దేశంలో విధి నిర్వహణలో 33 వేల మంది పోలీసులు అమరులయ్యారని.. వారి త్యాగాలను ఈ జాతి ఏనాడూ మరవబోదన్నారు. దేశ శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై తగిన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇక ఇప్పటికే దేశంలోని 14 రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్ట్ తీవ్రవాదంపై మ‌రింత ఉక్కుపాదం మోపాల‌న్నారు ప్రధాని మోదీ. అవ‌స‌ర‌మైన‌ ఆధునిక సాంకేతికత‌ను వాడుకోవాల‌ని కేంద్ర నిఘా సంస్థలను స‌మ‌న్వయం చేసుకోవాల‌ని అన్నారు. స‌ద‌స్సు ముగిసిన అనంత‌రం ఢిల్లీకి బ‌య‌లుదేరిన ప్రధానికి శంశాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం, గ‌వ‌ర్నర్, మంత్రులు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

నేడు అబుదాబి గ్రాండ్ ప్రి...

అబుదాబి : ఫార్ములాన్ -2016 సీజన్ అంతిమదశకు చేరుకుంది. చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్ ప్రిలో ఓవరాల్ విజేత ఎవరో తేలనుంది. రోస్ బర్గ్, హామిల్టన్ నువ్వా..నేనా అన్నట్లు తలపడుతున్నారు. 

నేడు మాదిగల ధర్మయుద్ధ మహాసభ..

హైదరాబాద్ : నేడు మాదిగల ధర్మయుద్ధ మహాసభ జరగనుంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ద్వారానే మాదిగలు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికపరంగా ప్రగతిని సాధిస్తారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. 

నేటి నుండి సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలు..

హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర సమితి నిర్మాణ మహాసభలు ఆదివారం నుండి ఈనెల 30 వరకు జరగనున్నాయి. హోటల్ హరిత కాకతీయలో ఈ మహాసభలు జరగనున్నాయి. 

రసవత్తరంగా ఇంగ్లండ్, భారత్ మూడో టెస్టు..

మొహాలీ : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. టీమిండియా..ఇంగ్లండ్ పూర్తి అధిపత్యం ప్రదర్శించింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ తడబడింది. బెయిర్ స్టో అర్ధ సెంచరీతో ఆదుకోవడంతో ఇంగ్లండ్ గాడిలో పడింది. ఇదే దూకుడు కొనసాగిస్తే మొహాలీ టెస్టు కూడా టీమిండియాదే అవుతుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 268/8. 

రేపు భారత్ బంద్..

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాలు ఇతర ప్రతిపక్షాలు సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రజల కరెన్సీ కష్టాలు 18వ రోజు కూడా కొనసాగాయి. 

బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై ఉగ్ర దాడి..

కాశ్మీర్‌ : కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడిచేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

దారి దోపిడిలో ఆరుగురు నిందితుల అరెస్టు..

హైదరాబాద్ : దారి దోపిడి కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 19 లక్షలకు గాను రూ. 15.90 లక్షలు రికవరీ చేశారు. కారు, రెండు బైక్ లను నార్త్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss