Activities calendar

28 November 2016

21:59 - November 28, 2016

ఢిల్లీ : ఆదాయపన్న చట్ట సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పలు కీలక సవరణలతో కూడిన ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టారు. లెక్కల్లోచూపని ఆదాయాన్ని 50 శాతం పన్ను చెల్లించడం ద్వారా వైట్‌గా మార్చుకోవచ్చని ఈ బిల్లులో ప్రతిపాదించారు.మిగిలిన 50శాతంలో 25శాతం మొత్తాన్ని వెంటనే విత్‌ డ్రా చేసుకోవచ్చని.. మిగిలిన మొత్తాన్ని నాలుగేళ్ల తర్వాత తీసుకొనేలా సవరణలు ప్రతిపాదించారు. ఈలోగా అధికారుల దాడుల్లో నల్లధనం వెలుగు చూస్తే.. ఆ మొత్తంలోంచి 85 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగానూ బిల్లులో ప్రతిపాదించారు.

ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం భారీ సవరణలు
అక్రమార్కులకు వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం భారీ సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. సభలు వాయిదా పడేముందు తొలుత లోక్‌సభలోను, ఆ తర్వాత రాజ్యసభలో ఆయన ఐటీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
మిగిలిన 50 శాతంలో తక్షణమే 25 శాతం డబ్బు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు
బిల్లులో ప్రధానంగా రెండు అంశాలను పొందుపరిచారు. తమ వద్ద ఉన్న లెక్కల్లోచూపని ఆదాయాన్నిఅధికారికంగా ప్రకటించేవారి వద్ద నుంచి 50శాతం పన్ను కింద తీసుకుంటారు. మిగిలిన 50 శాతం మొత్తంలో తక్షణమే పాతిక శాతం డబ్బును విత్‌ డ్రా చేసుకునేలా మిగిలిన 25 శాతం మొత్తాన్నినాలుగేళ్ల తర్వాత తీసుకొనేలా చట్ట సవరణను ప్రతిపాదించారు. ప్రభుత్వం తీసుకునే 50 శాతం మొత్తాన్ని, 30 శాతం పన్ను కింద, పది శాతం పెనాల్టీ కింద, 30శాతం పన్నుపై 33శాతం సర్‌ఛార్జి రూపంలో వసూలు చేస్తారు.

దాదాపు 85 శాతం స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం
అధికారుల సోదాల్లో నల్లధనం వెలుగు చూస్తే.. అందులోంచి 70శాతాన్ని పన్ను రూపంలో, 15శాతం పెనాల్టీ రూపంలో.. మొత్తం 85 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. బ్లాక్‌మనీ కలిగిన వ్యక్తికి 15 శాతం మాత్రమేమిగులుతుంది. ఈ విధంగా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయాన్ని ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనకు మళ్లించి పేదరిక నిర్మూలన పథకాలకు వెచ్చించనున్నారు.

అన్ని పార్టీలతోనూ చర్చలు
కొత్త చట్టసవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలతోనూ చర్చలు ప్రారంభించింది.

 

21:54 - November 28, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్షాలు ..ఇతర విపక్షాలు నిర్వహించిన బంద్‌ విజయవంతం అయింది. తెలంగాణవ్యాప్తంగా లెప్ట్‌పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజలు నిరసనలతో హోరెత్తించారు. పలు ప్రాంతాలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. మోదీప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటామని నినదించారు.

హైదరాబాద్‌లో విపక్షాల నిరసనలు
పెద్దనోట్ల రద్దుపై నిరసనలు హోరెత్తాయి.. ర్యాలీలతో లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు, జనం రోడ్డెక్కారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో విపక్షాలు కదంతొక్కాయి. నిజాయితీ పరులైన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కోట్ల రూపాయల నల్లధనాన్ని పోగేసుకున్న దొంగలు తప్పించుకునేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు మండిపడ్డారు. మోదీ సర్కార్‌ అనాలోచిత నిర్ణయమని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

వాపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ సంపూర్ణం
అటు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆర్బీఐ ముందు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోందని కాంగ్రెస్‌నేతలు విమర్శించారు. నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే పేరుతో కోట్లా మంది ప్రజలను మోదీ ఇక్కట్ల పాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట, మణుగూరుల్లో వాపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. విద్యా, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌పాటించాయి. లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు మానవహారం నిర్వహించి ఆందోళనలు నిర్వహించారు.

లెఫ్ట్‌పార్టీలు ఆందోళన
పెద్దనోట్ల రద్దుపై ఆదిలాబాద్‌జిల్లాలో లెఫ్ట్‌పార్టీలు ఆందోళన నిర్వహించాయి. నల్లధనం వెలికి తీయడానికి తాము వ్యతిరేకం కాదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా .. సంపన్న వర్గాలను బాగుచేయడానికే నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసి 2వేల రూపాయల నోట్లు తీసుకొచ్చారని వామపక్షాల నాయకులు విమర్శించారు. అటు నిజామాబాద్‌ జిల్లాల్లోనూ వామపక్షాలు కదంతొక్కాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ... జిల్లా కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

యాదాద్రి భువనగిరి, సూర్యాపేటజిలాల్లో
దేశవ్యాప్త బంద్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేటజిలాల్లో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంల్‌, వైసీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మోదీప్రభుత్వం నల్లకుబేరులకు మద్దతిస్తోందని విమర్శించారు.పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

విపక్షాలు నిరసనలు
వరంగల్‌ నగరంలో విపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారని కరీనంనగర్‌లో విపక్షాలు నిరసనకు దిగాయి. అటు వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ నిరసనకు దిగింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలు కదంతొక్కారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిరసించారు. 

21:49 - November 28, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా వామపక్షాలు నిర్వహించిన బంద్‌ ఏపీ లో విజయవంతమైంది. కార్మిక, కర్షక, ప్రజా సంఘాలన్నీ మద్దతు ఇవ్వడంతో ప్రజా జీవితంపై బంద్‌ ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బంద్‌ నుంచి ఆర్టీసీ కి మిననహాయింపు ఇచ్చినప్పటకీ... ప్రయాణికులు లేకపోవడంతో బస్‌ స్టేషన్లు వెలవెలపోయాయి.

నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాల పిలుపు
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాల పిలుపు మేరకు జరిగిన బంద్‌ ఏపీలో ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్‌, వైసీపీ, జనసేన బంద్‌ చేపట్టకపోయినా, నిరసనోద్యమాన్ని నిర్వహించాయి. బంద్‌, నిరసనలతో ఆంధ్రప్రదేశ్‌ హోరెత్తింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గోవడంతో జన జీవనంపై తీవ్ర ప్రభావం కనిపించింది.

వాణిజ్య రాజధాని విజయవాడలో బంద్‌ సంపూర్ణం
ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. లెనిన్‌ సెంటర్‌ నుంచి వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. భారీగా వ్యాపారం జరిగే బీసెంట్‌ రోడ్‌, వస్త్రలత, కాళేశ్వరరావు మార్కెట్‌, బందర్‌రోడ్డు తదితర వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రంపై వామపక్ష నేతలు మండిపడ్డారు.

లెనిన్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మానవహారం
లెనిన్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మానవహారం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు అటు లెనిన్‌ సెంటర్‌తోపాటు, ఇటు కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జనసేన నేతలు, కార్యకర్తలు కూడా విజయవాడలో ర్యాలీలు నిర్వహించారు.
నిరసన ప్రదర్శనలు, ర్యాలీతో గుంటూరు హోరెత్తిన గుంటూరు
గుంటూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బంద్‌ జరిగింది. తెనాలి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో వామపక్ష నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు, ర్యాలీతో గుంటూరు హోరెత్తింది. వైపీసీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా నల్ల జెండాలతో నిరసన నిర్వహించాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో బంద్
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం కనిపించింది. తాడేపల్లిగూడెంలో బంద్‌ నిర్వహిస్తున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రం ఏలూరులో వామపక్షాలు బంద్‌ నిర్వహిస్తే, కాంగ్రెస్‌, వైసీపీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట్ల, పెద్దపురం ప్రాంతాల్లో జనజీవనంపై బంద్‌ ప్రభావం కనిపించింది.
విశాఖపట్నంలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్‌
పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ విశాఖపట్నంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీల్లో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష నేతులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. వామపక్ష నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
తిరుపతిలో స్థంభించిన జన జీవనం
భారత్‌ బంద్‌తో తిరుపతిలో జన జీవనం స్తంభించింది. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి. వైసీపీ, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బంద్‌
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బంద్‌ ప్రభావం కనిపించింది. వామపక్షాలు నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో జిల్లాలోని హిందూపురం, కదిరి, కల్యాణదుర్గం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం కనిపింది.
కడపలో వామపక్షాలు బైక్‌ ర్యాలీ
కడపలో వామపక్షాలు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. పెద్ద నోట్లు రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై నిరసన వ్యక్తం చేశారు. పులివెందులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
బంద్‌ సక్సెస్‌
మొత్తంమీద పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాల ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన బంద్‌ సక్సెస్‌ అయ్యింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ఐదొందలు, వెయ్యి నోట్ల రద్దుతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గళం విప్పారు. ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. 

21:42 - November 28, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చాలన్న డిమాండ్‌తో... విపక్షాలు భారత్‌ బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించాయి. ప్రజలు స్వచ్ఛందంగానే బంద్‌కు సహకరించారు. కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు ధర్నాలు, రాస్తారోకోల ద్వారా మోదీ తీరుపై నిరసనను వ్యక్తం చేశాయి.

విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్‌
నోట్ల రద్దు అంశానికి సంబంధించి రైతులు, పేదలు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. చాలాచోట్ల ప్రజలే బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. వామపక్షాలతో పాటు.. పలు పార్టీల కార్యకర్తలు కూడా ఈ బంద్‌కు మద్దతుగా ప్రజామద్దతును కూడగట్టారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో బంద్‌ పూర్తి సక్సెస్‌ అయింది.

ఢిల్లీలో ఆందోళనలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. కేరళలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. వామపక్షాలు ఉదయం 6 గంటల నుంచే బంద్‌ను ప్రారంభించాయి. దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రయివేట్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. బ్యాంకులు, హాస్పిటల్స్, టూరిజం సెంటర్లు, శబరిమలై భక్తులు, పెళ్లిళ్లకు మాత్రం బంద్‌ నుంచి మినహాయింపు నిచ్చాయి.పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు పలు చోట్ల భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. స్కూళ్లు, కాలేజీలు, ప్రయివేట్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. వామపక్షాల ప్రాబల్యం అధికంగా ఉన్న చోట బంద్‌ సంపూర్ణంగా జరిగింది.

మమతా బెనర్జీ, వామపక్షాలు విడివిడిగా ర్యాలీలు
తృణమూల్‌ కాంగ్రెస్‌ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల రాకపోకలు కొనసాగాయి. కోల్‌కతాలో మమతా బెనర్జీ, వామపక్షాలు విడివిడిగా ర్యాలీ నిర్వహించాయి.

మోదీని దేశ రాజకీయాల నుంచి దూరం చేస్తా : మమతా
నోట్ల ర‌ద్దు వ‌ల్ల పేద ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని సిఎం మమతాబెనర్జీ ఆరోపించారు. మోదీని దేశ రాజకీయాల నుంచి దూరం చేస్తాన‌ని దీదీ శ‌ప‌థం చేశారు.

త్రిపురలోనూ బంద్‌ సంపూర్ణంగా

త్రిపురలోనూ బంద్‌ సంపూర్ణంగా జరిగింది. వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించి నోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేశాయి.నోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేస్తూ బీహార్‌లో సిపిఐ కార్యకర్తలు కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు.

తమిళనాడులో బంద్‌ పాక్షికంగా
తమిళనాడులో బంద్‌ పాక్షికంగా జరిగింది. డిఎంకే కార్యకర్తలు చెన్నైలో బస్సులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్నాటకలో బంద్‌ ప్రభావం కనిపించలేదు. కాంగ్రెస్‌ పార్టీ భారత ఆక్రోశ్‌ పేరిట ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. అటు ఉత్తరప్రదేశ్‌ ప్రజలూ బంద్‌ పాటించారు.

 

21:38 - November 28, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధించారు. అవినీతి, నల్లధనాన్ని నిర్మూలించేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును గుడ్డిగా వ్యతిరేకించడం మంచిందికాదని మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు. కేబినెట్ భేటీలో నగదు రహిత లావాదేవీలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు.

నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి : కేసీఆర్ లను
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను ప్రోత్సహించాలని కేబినెట్‌లో నిర్ణయించింది. ఇందుకోసం టీఎస్‌ వ్యాలెట్‌ రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 500 రూపాయల పైబడి లావాదేవీలు నగదు రహితంగా చేస్తామన్నారు కేసీఆర్.

స్తిరాస్థి వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం స్తిరాస్థి వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ రంగంలోని కార్మికులు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.

ఎస్సై రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై పోస్టుల నియామక రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఈ కీని రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ విడుదల చేశారు. ఆ బోర్డు వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ కీపై అభ్యంతరాలేమైనా ఉంటే అభ్యర్థులు [email protected] కు మెయిల్‌ చేయవచ్చన్నారు. ఈ అభ్యంతరాలను డిసెంబర్‌ 2 సాయంత్రం 5గంటల లోపు మెయిల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

20:58 - November 28, 2016

పాత పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రటించారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రజల్లో గందరగోళం నెలకొంది. పలు విషయాల్లో ప్రజలకు స్పస్టత అనేది లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర గందరగోళంలో పడ్డారు. అటు చూస్తే బ్యాంకుల్లో కొత్తనోట్లు కొరత..ఇటు చూస్తే పాతనోట్ల మార్పిడికి పలు ఆంక్షలు..లావాదేవీల్లో కొరవడిన అస్పష్టత..బ్యాంకులు..పోస్టాఫీసుల్లోనూ పలు పరిమితులు..ఆంక్షలు..డిసెంబర్ 15వరకూ పాతనోట్లతోనే చెల్లింపులు..ఇలా పాత పెద్దనోట్ల రద్దుతో పలు వ్యాపారాలు..ఆదాయాలు స్థంభించిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో లావాదేవీల్లో లాజిక్కులేంటీ ?నగదులో నలుపు తెలుపు ఏదీ ?బ్యాంకులు - ఖాతాదారుల సంబంధాలు దెబ్బతింటున్నాయా?ఎంత వేయాలి? ఎంత తీయాలి? కేంద్రం తీసుకుంటున్న రోజుకో నిర్ణయంతో ఖాతాదారులకు కస్టమర్లకు కోటి అనుమానాలు..సందేహాలపై నిపుణుల సమాధానాల కోసం టెన్ టీవీ చర్చలో చూడండి..ఈ చర్చలో శశికుమార్ (ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్),రాంబాబు (ఏఈఏ జాతీయ కార్యదర్శి) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నిపుణుల సూచనల కోసం ఈ వీడియోను చూడండి..

20:52 - November 28, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై పార్లమెంట్‌ అట్టుడికింది. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని విపక్షాలు డిమాండ్‌ చేపట్టాయి. చర్చకు తాము సిద్ధమేనని అధికార పక్షం చెప్పినా విపక్షాలు ఆందోళన విరమించలేదు. తీవ్ర గందరగోళం మధ్య పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
దేశంలో అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు : మల్లికార్జున్‌ ఖర్గే
పెద్ద నోట్ల రద్దు అంశం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేసింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని చర్చలో పాల్గొనాలని విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రం నిర్ణయం కారణంగా దేశంలో రైతులు, పేదలు, కార్మికులు, మహిళలతో సహా అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయం వల్ల దేశంలో ఆర్థిక ప్రతిష్టంభన నెలకొందని తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉందని, రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని ఎస్పీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నారు. దీనిపై ప్రధాని మోది సభలో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.
నోట్ల రద్దు అంశంపై చర్చకు సిద్ధం : రాజ్‌నాథ్‌సింగ్‌
నోట్ల రద్దు అంశంపై తాము చర్చకు సిద్ధమేనని లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రధాని మోది చర్చలో పాల్గొంటారని విపక్షాలకు హామీ ఇచ్చారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ రెండుసార్లు వాయిదా
సభలో సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభాకార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్‌సభను స్పీకర్‌ మంగళవారానికి వాయిదా వేశారు.
భారత్‌ బంద్‌కు మోది తీసుకున్న నిర్ణయమే కారణం : ఆజాద్
నోట్ల రద్దు అంశంపై అటు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. భారత్‌ బంద్‌కు మోది తీసుకున్న నిర్ణయమే కారణమని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ప్రజా ఆగ్రహం రోజు పేరిటే తాము ఆందోళన నిర్వహించామని తెలిపారు. నోట్ల రద్దు అంశంపై ప్రధాని నిర్ణయం తీసుకున్నందున సభలో ఆయనే సమాధానం చెప్పాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. చర్చకు తాము సిద్ధమేనని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి మరోసారి స్పష్టం చేశారు.
'దలాల్‌' వ్యాఖ్యపై రాజ్యసభలో రగడ
సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలన్నీ సభ కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. ఈ క్రమంలో పలుమార్లు సభను వాయిదా వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్‌ అగర్వాల్‌ పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ `దలాల్‌' అని వ్యాఖ్యానించారు. దీనిపై బిజెపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
రాజ్యసభను మంగళవారానికి వాయిదా
అనంతరం ఆందోళన పెద్దనోట్ల రద్దు అంశంపైకి మళ్లింది. పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపించకపోవడంతో రాజ్యసభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు.

20:42 - November 28, 2016

జేబులో కరెన్సీ అవసరం లేదు.. బీరువాలో కట్టలు దాచుకోవలసిన పనిలేదు.. చిన్న ప్లాస్టిక్ కార్డుంటే చాలు పనైపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ట్రాన్సాక్షన్ క్లియరౌతుంది. జేబులో బరువైన వాలెట్ కాస్తా... మోబైల్ వాలెట్ గా మారుతోంది. ఇంతకీ చెప్పేదేంటంటే.. కరెన్సీ నోట్లు మాయమై... డిజిటల్ ఎకానమీ దిశగా దేశాన్ని నడిపించాలని కేంద్రం భావిస్తోంది. మరిదీనికి సాధ్యాసాధ్యాలెన్ని.. అవరోధాలేంటి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..సింగపూర్ లాంటి దేశానికి 30ఏళ్లు పట్టింది. మరి ఇప్పటికి 91వస్థానంలో ఉన్న మనదేశం డిజిటల్ ఎకానమీలో ఎప్పుడు దూసుకెళ్తుంది. ఇదే సమాధానం తెలియాల్సిన ప్రశ్న. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు అంతంత మాత్రంగా ఉన్నచోట.. ఎవరికోసం ఈ నిర్ణయం.. ఎవర్ని కష్టపెట్టి ఈ లక్ష్యం సాధిస్తారు.. చాలా సవాళ్లు... అస్పష్ట సమాధానాలు..నగదు రహిత భారతం ఎంత వరకు సాధ్యం .. ఎన్నాళ్లలో సాధ్యం..గ్రామీణ భారతం ఎన్నేళ్లకు ఈ అంశాన్ని అందుకోగలదు?బ్యాంకింగ్ రంగం విస్తరణలో ఇంకా ఎంతో సాధించాల్సిన సమయంలో ఈ లక్ష్యం ఎంతవరకు అందుకోగలం..? డిజిటల్ ఎకానమీ సృష్టిలో మన స్థానం ఎక్కడ? ఎన్నాళ్లకు లక్ష్యాన్ని సాధించగలం.. మహా మహా దేశాలకే చాలా కాలం పట్టింది.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్యాష్ లెస్ అయిన దేశాలు చాలా తక్కువ. మరి ఈ జాబితాలో మన ప్లేస్ ఎక్కడ? డిజిటల్ ఎకానమీ ఏర్పాటులో చాలా అడుగున ఉన్న మనం ఎన్నాళ్లకు క్యాష్ లెస్ కంట్రీగా మారగలం..? సర్కారు అంచనాల్లో సాధ్యాసాధ్యాలెంత? డెబిట్, క్రెడిట్ కార్డులు వచ్చి చాలా కాలమైనా వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్న వారి సంఖ్య తక్కువ. ప్లాస్టిక్ కరెన్సీకి అలవాటు కాకముందే మొబైల్ వాలెట్ లు వచ్చేశాయి. కానీ, మరో పక్క మన దేశం ఇంటర్నెట్ సౌకర్య కల్పనలో మాత్రం చాలా వెనుకబాటులో ఉంది. ఈ పరిస్థితుల్లో క్యాష్ లెస్ కంట్రీగా మారటానికి అవరోధాలు మరిన్ని కనిపిస్తున్నాయి. దేశ ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయాలుండాలి. గ్రామీణ ప్రజలు అధికంగా ఉన్నచోట, సాంకేతికంగా సవాళ్లు ఉన్నచోట క్యాష్ లెస్ గా మారటం అంత సులభ సాధ్యమేమీ కాదు. మరోపక్క ప్లాస్టిక్ కరెన్సీ మాత్రమే నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికడుతుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి.. నల్లధనం జనరేట్ అయ్యే మార్గాలను నియంత్రించకుండా.. కరెన్సీ నుంచి ఇతర రూపాల్లోకి మారిన నల్లధనాన్ని వెలికి తీయకుండా చేసే మార్పులు పూర్తి ఫలితాల్ని ఇస్తాయా అంటే సందేహమే.. 

ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర!..

తమిళనాడు : మధురైలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ మైసూరు, కొల్లం, మలప్పురం, చిత్తూరు, నెల్లూరు బాంబు పేలుళ్ల కేసుల్లో వీరు నిందితులుగా వున్నారు. వీరిని ఆల్ ఖైదా ఉగ్రవాదులుగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 22 మంది నేతలను చంపేందుకు వీరు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు, దేశంలోని ఆరు కోర్టులను పేల్చేందుకు వీరు రెక్కీ నిర్వహించారని వెల్లడించారు. అరెస్టైన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ సుల్తాన్, కరీమ్, అబ్బాస్ అలీలుగా గుర్తించారు.

క్యేష్ లెస్ సిద్ధిపేటకు చర్యలు : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నల్లధనం రూపు మాపేందుకే కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిందని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు జరగాలని సూచించారు. సిద్ధిపేట జిల్లాలో ఉన్న సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా మోడల్ గా తీసుకుని 100 శాతం క్యాష్ లెస్ నియోజకవర్గంగా చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. బ్యాంకులు కూడా సహకరిస్తామని చెప్పాయని ఆయన తెలిపారు.

20:02 - November 28, 2016

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలు జరగితేనే నోట్ల కష్టాలను సాధ్యమైనంత త్వరగా అధిగమించవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్ధతు తెలుపుతోందని తెలిపారు. సుమారు మూడు గంటలపాటు కేబినెట్ భేటీ కొనసాగింది.  సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..పాత నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర పరిస్థితుల పట్ల ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఈ అంశంపై తన అభిప్రాయాలను..సూచనలను  ప్రధానితో చర్చించాననీ..ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. నల్ల ధనం అనేది పలు రూపాల్లో వుంటుందనీ..అది బంగారం రూపంలో కూడా వుంటుందన్నారు. నల్లధనం అనేది ఏ రూపంలో వున్నాసరే వెలికితీయాలన్నారు. భారత్ ది నగదు ఆధారిత వ్యవస్థనీ..నగదు రహిత లావాదేవీలు పెరగాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంపై నోట్ల రద్దు ప్రభావం పెద్దగా పడిందని తెలిపారు. దీంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారనీ..రాష్ట్ర ఆదాయంపై తీవ్రంగా పడిందన్నారు. కూలీలకు ఉపాధిలేకుండాపోయిందన్నారు.దీనికోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. బ్యాంక్ ఎకౌంట్స్ ..మొబైల్ యాప్స్ వంటి పలు ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరగాలన్నారు. దీనికోసం ప్రతీ మూడు నాలుగు గ్రామాలకు ఒక బ్యాంక్ బ్రాంచ్ లు వుండాలనీ..ప్రతీ 1500 లమంది జనాభాకు ఒక ఏటీఎం ఉండాల్సిన అవుసరముందన్నారు. అలాగే రిజిస్ట్రేషన్స్..ఎక్సైజ్ శాఖ లావాదేవీలు కూడా ఆన్ లైన్ జరగాలని సూచించారు. రాష్ట్రంలో టీ.ఎస్ వాలెట్ ఐటీ డిపార్ట్ మెంట్ ద్వారా ప్రవేశపెడుతున్నామన్నారు. నగదు రహిత లావాదేవాలను ప్తోసహించేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ వేశామని తెలిపారు. దేశంలో నగదు రహిత లావాదేవీలకోసం 10కోట్ల స్వైపింగ్ మిషన్స్ కావాలన్నారు. ఢిల్లీకి రాష్ట్రానికి మధ్య ఇద్దరు వ్యక్తులు అనుసంధానంగా వుండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో మోదీ ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలు 25కోట్లు వున్నాయన్నారు. నల్లధనం నిర్మూలించాలంటే ముందుగా అవినీతిని నిర్మాలించాల్సిన అవుసరముందన్నారు. అందుకోసం లంచం ఇవ్వద్దనీ..లంచం తీసుకోవద్దని సూచించారు. 

19:12 - November 28, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు అంశం హైకోర్టుకు చేరింది.. నోట్లు రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి మైసూరారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. వ్యక్తిగత అవసరాలకోసం బ్యాంకులకువెళితే డబ్బులు ఇవ్వడంలేదని మైసూరా ఆరోపించారు.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.. డబ్బులేదంటూ బ్యాంకులు మూసివేయడం ఐపీ పెట్టి పారిపోయిన వ్యక్తితో సమానమని మండిపడ్డారు.. 

విజయవాడ మెట్రోకు లైన్ క్లియర్..

విజయవాడ : ఏపీ రాజధాని అమరాతి మెట్రో రైలుకు తొలి అడుగు పడింది. మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లకు డీఎంఆర్ సీ టెండర్లకు ఆహ్వానించింది. జనవరి 19వ తేదీని టెండర్లకు చివరి తేదీగా నిర్ణయించింది. తొలి కారిడార్ ను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి నిడమలూరు వరకు 13.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. రెండో కారిడార్ ను పీఎస్ డీఎస్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.

19:02 - November 28, 2016

అనంతపురం : ఏపీలో భారత్ ఆక్రోశ్ నిరసన ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోను..రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోనూ భారత్‌ ఆక్రోశ్ నిరసన ప్రశాంతంగా నడుస్తోంది... నల్లధనాన్ని బయటకుతెస్తామన్న ప్రధాని మోదీ.. రెండు వేలనోటుతో మరింత అవినీతి పెంచే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. 

18:53 - November 28, 2016

విజయవాడ : విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి మార్గం సుగమమైంది. మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచిన డీఎంఆర్ సీ 2 కారిడార్లలో నిర్మాణం చేయనుంది. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి నిడమనూరు వరకు 969 కోట్ల రూపాయల అంచనాతో మొదటి కారిడార్‌, పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి పలమనేరు వరకు.. 832 కోట్ల అంచనాతో రెండో కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

అసెంబ్లీ ముందు అర్థనగ్నంగా ఎమ్మెల్యే నిరసన..

బీహార్‌ : అసెంబ్లీ ముందు ఓ ఎమ్మెల్యే వినూత్న నిరసన కలకలం రేపింది. బీజేపీ ఎమ్మెల్యే బిన‌య్ బిహారీ పాట్నాలోని అసెంబ్లీకి అర్థనగ్నంగా అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

18:39 - November 28, 2016

సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి ప్రజలను ఇబ్బందుల్లోనెట్టిందని సంగారెడ్డిజిల్లా సీపీఎం నేతలు విమర్శించారు. కొత్తనోట్లు వచ్చేంతవరకు రద్దుచేసిన వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వామపక్షాలు ఇతర ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌పిలుపులో భాగంగా జిల్లాకేంద్రంలో సీపీఎం కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు దిగారు. మోదీ దిష్టిబొమ్మను దగ్ధంచేసి నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తొందని సీపీఎం నేతలు విమర్శించారు.

నోట్ల మార్పిడి..12మంది అరెస్ట్..

సూర్యాపేట : నోట్ల మార్పిడి వ్యవహారంలో సూర్యాపేట ఎస్పీ పరిమళ 12మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులకు మీడియా ముందు ప్రవేశపెట్టారు. రూ.30లక్షల కొత్త రూ.రెండు వేల నోట్లు,రూ.80వేల పాత నోట్లను వారివద్దనుండి స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో ఎంపీటీసీ, సర్పంచ్ కూడా వుండటం విశేషం. ఇద్దరు గడ్డిపల్లి ఎస్ బీహెచ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వున్నట్లుగా తెలుస్తోంది. 

బాంబు పేలుళ్ళ కేసులో ముగ్గురి అరెస్ట్ ..

హైదరాబాద్‌: చిత్తూరు, నెల్లూరులలో బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితుల్ని ఎన్‌ఐఏ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. మైసూరు, కొల్లం, మలప్పురం బాంబు పేలుళ్ల కేసులోనూ నిందితులుగా గుర్తించిన ఈ ముగ్గురినీ తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో పట్టుకున్నారు. తదుపరి విచారణ కోసం అనుమానితుల్ని మైసూర్‌కు తరలించారు. ఏప్రిల్‌ 7న చిత్తూరు కోర్టు ఆవరణలో, సెప్టెంబర్‌ 12న నెల్లూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనల్లో ఈ ముగ్గురిని నిందితులుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పట్టుబడిన ముగ్గురూ అనుమానిత ఆల్‌ఖైదా ఉగ్రవాదులుగా ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.

18:22 - November 28, 2016
18:18 - November 28, 2016
18:11 - November 28, 2016

హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, నిర్వాసితుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సుముఖంగా లేనట్లుందని జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి కొత్త నివాసం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కొత్త ఇళ్లు కావాలనుకుంటే ప్రభుత్వ భవనాలు చాలా ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోకుండా ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఎనిమిది ఎకరాల్లో చేపట్టిన సీఎం కొత్త ఇల్లు నిర్మాణం ఏడాదిలోనే పూర్తయిందని.. కానీ పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం మాత్రం ఏళ్ల పాటు కొనసాగుతోందని కోదండరామ్‌ విమర్శించారు. 

18:03 - November 28, 2016

మెదక్ : సీపీఎం మహాజన పాదయాత్ర 43వ రోజుకు చేరింది. 1070 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మెదక్‌ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా.. గిరిజనుల జీవితాలు ఇంకా మారలేదని ఆదివాసి గిరిజన నేత నైతం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు లేక గిరిజన గూడెలు అల్లాడుతున్నాయన్నాయన్నారు. గిరిజనుల సంక్షేమానికి సాగునీరే కాదు కనీసం త్రాగునీరు కూడా సరఫరా చేయలేకపోతోందని ఆయన విమర్శించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న తమకు ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుంటున్నామన్నారు.గిరిజనులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

మళ్లీ టీడీపీలోకి మైసూరా?..

కడప : సీఎం రమేష్ తో వైసీపీ నేత మైసూరారెడ్డి మంతనాలు జరిపారు. ఎర్రగుంట్లలో మైసూరారెడ్డి టీడీపీ నేత సీఎం రమేష్ కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారా? అన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైసూరారెడ్డిని సీఎం రమేష్‌ కలిసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్‌ రవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు మైసూరాను కలిసిన సమయంలో సీఎం రమేష్ వెంట ఉండడం విశేషం. అనంతరం సీఎం రమేష్ తో మైసూరాతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడటంతో దీనిపై మరింత అనుమానాలు బలపడుతున్నాయి.

17:37 - November 28, 2016

సంగారెడ్డి : పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అందరికీ ఈ ప్రభావరం పలు విధాలుగా కనిపిస్తోంది. పట్టణాల్లో ఒకరకమైన ఇబ్బందులుంటే గ్రామాల్లో మరోరకమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇబ్బంది ఏమైనా కారణం మాత్రం పాత పెద్దనోట్లే అందరి కష్టాలకూ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రభావరం అనేది గ్రామీణ ప్రాంతాలలో భారీగా కనిపిస్తోంది. పెద్దనోట్లను రద్దు చేస్తే ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి వెన్నెముకైన రైతన్నలు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారు. పాతనోట్లు మారక..కొత్త పెద్దనోట్లకు చిల్లర లేక.. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు కొనాలన్నా..ఎరువులు కొన్నాలన్నా..ఆఖరుకి కూలీలకు డబ్బులివ్వాలన్నా కూడా నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తోంది. ఇప్పటికే పాత పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఇబ్బంది పడని రంగమంటూ లేదనేది ప్రధానంగా కనిపిస్తోంది.  

ముగ్గురు అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

హైదరాబాద్ : ముగ్గురు అల్ ఖైదా ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో కరీం, అయిష్, అబ్బాస్ అలీ ఉన్నారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు సులేమాన్, సకీమాన్ కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. మోదీ తో పాటు 22 మంది హత్యకు ఉగ్రవాదులు కుట్రపన్నారని, వారి వద్ద నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

ఏసీబీ వలలో దత్తలూరు పంజాయతీరాజ్ ఏఈ

నెల్లూరు : కాంట్రాక్టర్ నుంచి రూ. 55వేలు లంచం తీసుకుంటూ దత్తలూరు పంచాయతీరాజ్ ఏఈ రవి శంకర్ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.

గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతు..

ఖమ్మం : తూర్పుగోదావరి జిల్లా వేలేరు పాడు మండలం కోయదాలో గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఒక బాలిక మృతదేహం లభ్యం కాగా మిగతా వారికోసం గాలింపు కొనసాగుతోంది. బాధితులు భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట వాసులుగా గుర్తించారు.

సాగునీరు విడుదలకు టీఎస్ సర్కార్ నిర్ణయం

హైదరాబాద్ : రబీ సాగుకు నీటిని విడుదల చేయాలని టీఎస్ సర్కార్ నిర్ణయించింది. నాగార్జున సాగర్ లాంటి వివిధ ప్రాజెక్టుల నుంచి 50 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.

17:12 - November 28, 2016

సంగారెడ్డి : మోదీ ప్రభుత్వ అనాలోచి నిర్ణయం వల్ల ..పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌నేత జగ్గారెడ్డి అన్నారు. పెద్దనోట్ల రద్దుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : తెంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై కేబినెట్ చర్చిస్తున్నట్లు సమాచారం.

ముగిసిన మూడో రోజు ఆట

మొహాలీ టెస్టు : మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నిసంగ్స్ 78/4, క్రీజులో రూట్ (36), గారెత్ బట్టి 56 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. బ్యాటింగ్ లో బ్రిస్టో 17, కుక్ 12, స్టోక్స్ 11, మొయిన్ అలీ 5 తీయగా బౌలింగ్ లో అశ్విన్ 3 వికెట్లు, జయంత్ కు వికెట్ తీశారు.

17:04 - November 28, 2016

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టుపై ముందుకు సాగాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాజమండ్రిలో నిర్వాసితులతో కలిసి సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబుకు డబ్బుపైన ఉన్న ప్రేమ గిరిజనులపై లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మిస్తే 2 లక్షల మంది నిర్వాసితులు అవుతారని గుర్తుచేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా ముందుకు వెళ్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్య దర్శి మధు అన్నారు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 12 సంవత్సరాలు అయినా ఇప్పటికీ నాలుగు గ్రామాలకు కూడా పునరావాసం కల్పించలేదంటున్న మధు విమర్శించారు.

విజయవాడ మెట్రో నిర్మాణానికి డీఎంఆర్ సీ టెండర్లు

విజయవాడ : మెట్రో రైలు నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. మెట్రో నిర్మాణానికి డీఎంఆర్ సీ టెండర్లు పిలిచింది. 2 కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం జరగనుందని, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి నిమనూరు వరకు రూ.969 కోట్ల అంచనాతో మొదటి కారిడార్ నిర్మాణం, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి పలమనేరు వరకు రూ. 832 కోట్ల అంచనాలతో రెండో కారిడార్ నిర్మించనున్నట్లు పేర్కొంది.

16:59 - November 28, 2016

రంగారెడ్డి : మేడ్చల్‌ గుండ్లపోచంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌లో మంటలు వ్యాపించారు. ఈ ఘటనలో కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది.మహారాష్ట్రకు చెందిన కంటైనర్ 50శాతం కాలిపోయినట్లుగా తెలుస్తోంది.స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలకు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.  

16:56 - November 28, 2016

ఢిల్లీ : ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం భారీ సవరణలు ప్రతిపాదించింది. అధికారికంగా ప్రకటించకుండా అధికారుల దాడులు, పర్యవేక్షణలో పట్టుబడిన నగదుపై... దాదాపు 30శాతం పన్నుతో పాటు 33శాతం సర్‌ఛార్జిని వసూలు చేయాలని, 10 శాతం పెనాల్టీని కూడా విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రకారం పట్టుబడిన మొత్తంలో 73శాతం పన్ను కింద పోతుంది. మిగిలిన 27 శాతం నగదులో... 25శాతం నాలుగేళ్ల పాటు లాక్ ఇన్ చేసి ప్రధాన మంత్రి గరీబ్ యోజనకు మళ్లిస్తారు. ఈ సవరణలతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. సభలు వాయిదా పడేముందు తొలుత లోక్‌సభలోను, ఆ తర్వాత రాజ్యసభలో ఆయన ఐటీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 

16:54 - November 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు, ప్రత్యామ్నాయ చర్యలపై ఇందులో చర్చిస్తున్నారు. అలాగే నగదు రహిత లావాదేవీల నిర్వహణ.. ప్రజలకు అవగాహణ కల్పించే విధానంపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే కొత్త సీఎస్ ఎంపికపైకూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

16:30 - November 28, 2016

ఢిల్లీ : ఆదాయపన్ను చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐటీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం అమల్లోకి వస్తే... ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ములో 30 శాతం పన్ను విధించడమే కాకుండా... అదనంగా 33 శాతం సర్ ఛార్జిని, 10 శాతం పెనాల్టీని విధిస్తారు. అంటే 73 శాతం కట్టాల్సి ఉంటుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ చట్ట సవరణ బిల్లుకు ఆమెదం పొందేలా కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. దీనికి సంబంధించి అన్ని పార్టీలతో ఇప్పటికే చర్చలను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. 

16:06 - November 28, 2016

విజయవాడ : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడులు నయా తుగ్లక్‌లుగా తయారయ్యారని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా విజయవాడలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రరత్న భవన్‌ నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని రఘువీరారెడ్డి అన్నారు. కనీస అవసరాలు తీరక అల్లాడుతున్నారని అన్నారు.

సహారా చీఫ్ కు సుప్రీంలో ఊరట

ఢిల్లీ : సహారా చీఫ్ కు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. రూ.600 కోట్లను ఫిబ్రవరి 6లోగా చెల్లించేందుకు అవకాశం కల్పించింది. తదుపరి విచారణ ఫ్రిబవరి 6కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

పీవోఎస్ మిషన్ లపై పన్నులు రద్దు చేసిన కేంద్రం

ఢిల్లీ : పీవోఎస్ మిషన్ లపై కేంద్రం పన్నుల రద్దు చేసింది. 12.5 ఎక్సైజ్ పన్ను, 4 శాతం ప్రత్యేక అదనపు పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31 వరకు పన్ను రద్దు అమలు చేయనున్నట్లు పేర్కొంది.

15:49 - November 28, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ దళారీ పాత్ర పోషిస్తోందన్న బీఎస్పీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర రగడ జరిగింది. మధ్యహ్నం సభ ప్రాంభమైన తర్వాత నరేశ్‌ అగర్వాల్‌ నల్లధనం అంశాన్ని లేవనెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ... ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ... దళారీ పదాన్ని ఉపయోగించారు. అధికార బీజేపీ సభ్యులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేశ్‌ అగర్వాల్‌ క్షమాపణ కోసం పట్టుపట్టారు. రికార్డులను పరిశీలించిన డిప్యూటీ చైర్మన్‌ దళారీ పదాన్ని పార్లమెంటురీ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. 

సీఎం కేసీఆర్ పై ప్రొ.కోదండరాం తీవ్ర విమర్శలు

హైదరాబాద్ : సీఎంకు బంగ్లా ఉండగా మరో భవనం అవసరం లేదంటూ సీఎం కేసీఆర్ పై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిలోనే ఇంత పెద్ద భవనం కట్టిన ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆలస్యమెందుకు చేస్తోందని ప్రశ్నించారు. 30వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూ నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నామని, సదస్సు నిర్వాసితులందరినీ పిలుస్తామని తెలిపారు.

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన వీఆర్వో

ప్రకాశం : ఓ రైతు నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ కర్లుపాడు మండలం తాటివారిపల్లె వీఆర్వో ఏసీబికి చిక్కాడు.

15:36 - November 28, 2016

పశ్చిమ బెంగాల్ : పెద్దనోట్ల రద్దుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నిరసనకు దిగింది. కోల్‌కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హజరయ్యారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్య ప్రజానీకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం మోదీపై మమతాబెనర్జీ మండిపడ్డారు. నల్లధనాన్ని అరికడతామని చెప్తున్న మోదీ... స్విస్‌ బ్యాంకుల్లోని నల్ల కుబేరుల జాబితా ఎందుకు బహిర్గత పర్చడం లేదో.. చెప్పాలని ప్రశ్నించారు. 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చి అవినీతిని అంతమొందిస్తామంటే జనం నమ్మరని ఆమె ఎద్దేవా చేశారు. 

15:32 - November 28, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫోన్ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులపై చర్చించారు. 5 రాష్ట్రాల సీఎంలతో ఏర్పాటు చేసే ఉపసంఘానికి నాయకత్వం వహించాలని బాబును జైట్లీ కోరారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రారంభమైన టీఎస్ కేబినెట్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ భేటీ నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.

ఆదాయంపై పన్ను, అదనపు పన్ను పై తేలని లెక్క...

ఢిల్లీ : ఆదాయపన్ను సవరణ బిల్లును లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టారు. ఆదాయంపై పన్ను, అదనపు పన్ను లెక్కతేలలేదు. ప్రధాన మంత్రి పేదల సంక్షేమ పథకంలో పన్నును ప్రతిపాదించారు. లెక్కతేలని ఆదాయంపై 30శాతం అదనపు పన్ను, గుర్తు తెలియని ఆదాయంపై 10శాతం పెనాల్టీ విధించారు.

13:50 - November 28, 2016

మెదక్ : సీపీఎం మహాజన పాదయాత్ర మెదక్‌ జిల్లాలో కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నిజాయితీగా ఉన్నప్పుడే దేన్నైనా సాధిస్తారని..కుల పట్టింపులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.  

13:49 - November 28, 2016
13:47 - November 28, 2016
13:46 - November 28, 2016
13:46 - November 28, 2016
13:45 - November 28, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు ప్రభావం గ్రామీణ ప్రాంత ప్రజలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు చిల్లరలేక అష్టకష్టాలు పడుతున్నారు. రబీ సీజన్‌లో వ్యవసాయ పెట్టుబడులకూ  డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. అకస్మాత్తుగా మోదీ తీసుకున్న నిర్ణయంతో తాము అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:41 - November 28, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వామపక్షాలు హైదరాబాద్‌ సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు భారీ ర్యాలీ ప్రారంభించారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని వామపక్ష నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దనోట్ల రద్దు కార్పొరేట్‌ పెద్దలకు తప్ప సామాన్యులకు ప్రయోజనం లేదని దుయ్యబట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:38 - November 28, 2016
13:35 - November 28, 2016

వరంగల్ : పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ చేపట్టిన నిరసన ఉత్తర తెలంగాణాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వరంగల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన చేపట్టారు. నోట్ట రద్దు నిర్ణయం సామాన్యులకు అవస్థల్ని మిగిల్చిందని... సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. జనాల నోటు సమస్యల్ని తీర్చాలన్నారు. ఈమరేకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:32 - November 28, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై ఢిల్లీలో ఎర్రదండు కదం తొక్కింది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ లెఫ్ట్‌ పార్టీలు  భారీ ర్యాలీ నిర్వహించాయి.  మోదీకి  వ్యతిరేకంగా  పెద్దపెట్టున వామపక్ష కార్యకర్తలు నినాదాలు చేశారు. మోదీ నిర్ణయంతో  సామాన్య ప్రజలే ఇబ్బంది పడుతున్నారని నేతలు మండిపడ్డారు.   కార్పొరేట్‌ శక్తులు, సంపన్నులకు మోదీ వంతపాడుతున్నారని ఆరోపించారు. మోదీ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని... లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
 

13:22 - November 28, 2016
13:20 - November 28, 2016

'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర యూనిట్ మహారుద్రాభిషేకం నిర్వహించింది. సినీ నటుడు 'బాలకృష్ణ' 100 సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర విజయాన్ని కోరుతూ చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. ఫిలింనగర్ దైవ సన్నిధానానికి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, చిత్ర బృందం వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య సరసన వైశిష్ఠి దేవిగా శ్రియ శరణ్ నటిస్తోండగా, బాలీవుడ్ నటి హేమా మాలిని ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేక్షకులు, ఆయన అభిమానులు మెచ్చే అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని నిర్మాతలు తెలిపారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు 26 లక్షలకు పైగా వ్యూస్ లభించడం విశేషం. చారిత్రత్మాక నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండడంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అంచనాలకు తగ్గట్టే దర్శక, నిర్మాతలు సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్. వంద లోకేషన్స్ లో ఒకేసారి విడదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. 

13:14 - November 28, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళనతో లోక్ సభ దద్దరిల్లింది. లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగింది. మధ్యాహ్నం 2 గం.లకు సభ వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే క్యూబా మాజీ అధ్యక్షుడు, మహానేత ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం లోక్ సభ లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యామ్నం 12 గంటలకు వాయిదా వేశారు. వాయదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని మళ్లీ పట్టుబట్టాయి. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నోట్ల రద్దుతో 70 మందికి పైగా మృతి చెందారని తెలిపారు. ప్రధాని సభలో తప్ప అన్ని చోట్ల నోట్ల రద్దుపై మాట్లాడుతున్నారని జయప్రకాశ్ చెప్పారు. ములాయంసింగ్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. విపక్షాల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 

13:08 - November 28, 2016

బాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్న 'రణబీర్' మహిళలకు సారీ చెప్పాడు. ఇంకోసారి ఇలా చేయనని, ప్రతి మహిళపై గౌరవ ఉందని పేర్కొన్నాడు. ఎందుకు ? ఏమీ జరిగింది ? అనేది తెలుసుకోవాలని ఉంది కదా...రణబీర్ సినిమాల్లోనే కాక పలు యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జాక్ అండ్ జాన్స్ పురుషుల దుస్తులకు 'రణవీర్' బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీకి సంబంధించిన బోర్డు ఇటీవలే పలు నగరాల్లో వెలిసింది. ఒక్కసారిగా మహిళలు దీనిపై కన్నెర చేశారు. 'డోన్ట్ హోల్డ్ ఇట్ బ్యాక్' అంటూ ట్యాగ్ లైన్ రాసి ఉంది. ఫొటోలో ఓ మహిళను రణబీర్ ఎత్తుకుని వెళుతున్నట్లు ఉంది. 'ఆఫీసు పనిని ఇంటికి తీసుకెళ్ల వచ్చంటూ' క్యాప్షన్ తగిలించారు. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 'రణవీర్' స్పందించారు. మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు, వృత్తిపరంగా మహిళపై తనకు గౌరవం ఉందని, వారికి అగౌవరం కలిగేలా ఇంకెప్పుడు ఏమి చేయబోనని పేర్కొన్నారు. 

13:03 - November 28, 2016

రంగారెడ్డి : జిల్లాలోని జిల్లెలగూడలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. కేశబాగుల శ్రీలత, ఎం.శ్రావణి, ఎస్.సంద్యారాణి ఆదివారం అదృశ్యమయ్యారు. స్పెషల్ క్లాస్ ఉందని విద్యార్థినులు స్కూల్ కు వెళ్లారు. విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:52 - November 28, 2016

బాలీవుడ్ ఆల్ టైం టాప్ హీరోయిన్లలో 'క‌త్రినా కైఫ్' ఒకరు. ఆమె కనిపిస్తే చాలు ఆ సినిమా హిట్టే అన్న అభిప్రాయం ఉండేది. కానీ కొన్ని రోజులుగా ఈ అమ్ముడు కనిపించడం లేదు. ఆమె నటించిన మూడు సినిమాలు 'ఫాంటమ్'...'ఫితూర్'..'బార్ బార్ దేఖో' బాక్సాపీస్ వద్ద పరాజయం చెందాయి. మాజీ బాయ్ ఫ్రెండ్ 'రణబీర్ కపూర్' తో కలిసి 'జగ్గా జాసూస్' అనే సినిమాలో నటిస్తోంది. ఏప్రిల్ 7 తేదీన ఈ చిత్రం విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. విడుదలకు చాలా సమయం ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోందంట. తాజాగా ఓ ఫొటో సోషల్ మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. మాల్దీవులకు వెళ్లిన 'కత్రీనా' ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల కోసం ఫొటో షూట్ లో పాల్గొంది. తన ఒడిలో 'కత్రినా' కూర్చొన్న ఫొటోను సెలబ్రిటీ డిజైనర్ మల్హోత్ర ఇన్ స్ట్రాగామ్ లో షేర్ చేశాడు. దానికి పోజర్స్ ఇన్ మాల్దీవ్స్ క్యాప్షన్ కూడా పెట్టాడు. అదండి సంగతి...

12:52 - November 28, 2016

కేఎల్ వర్సిటీ విద్యార్థి సూసైడ్..

గుంటూరు : తాడేపల్లి కేఎల్ వర్సిటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలో 4వ అంతస్తు పై నుండి కిందకు దూకి బీటెక్ విద్యార్థి సాయి చరణ్ సూసైడ్ చేసుకున్నాడు. 

హస్తినలో కదం తొక్కిన ఎర్రదండు..

ఢిల్లీ : వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండీ హౌస్ నుండి జంతర్ మంతర్ వరకు లెఫ్ట్ పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. 

నోట్ల రద్దుపై చర్చకు సిద్ధం - రాజ్ నాథ్..

ఢిల్లీ : నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. చర్చపై ప్రభుత్వం వెనక్కి వెళ్లడం లేదని, ప్రధాన మంత్రి కూడా సభకు వస్తారన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

12:30 - November 28, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మూడో సారి వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మొదటగా క్యూబా మాజీ అధ్యక్షుడు, మహానేత ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుండగా పెద్ద నోట్ల రద్దుపై విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్షాలు చుట్టుముట్టాయి. రాజ్యసభ వెల్ లోకి విపక్ష సభ్యులు దూసుకెళ్లారు. స్పీకర్ వారించిన వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పీజే.కురియన్ రాజ్యసభను అరగంటపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో నోట్ల రద్దుపై మళ్లీ గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను మద్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 
తిరిగి సభ ప్రారంభం కాగానే నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేట్టాయి. స్పీకర్ ఎంత వారించినా వినలేదు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 

 

ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. నోట్ల రద్దుతో 70 మందికి పైగా మృతి చెందారని ఆ పార్టీ నేత ఖర్గే లోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో మంత్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని, దానికి ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నోట్ల రద్దు అంశంపై విపక్షాల పట్టు

ఢిల్లీ : లోక్ సభలో విపక్ష సభ్యుల అందోళన కొనసాగతోంది. నోట్ల రద్దు అంశంపై చర్చ జరపాలని, అదే సమయంలో ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టాయి. ఇంత జరుగుతున్నా ప్రధాని మాత్రం సభకు రాకుండా తప్పించుకుంటున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.

12:11 - November 28, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన మరికొద్ది సేపటికి మళ్లీ రాజ్యసభ వాయిదా పడింది. అర్ధగంటలోనే రెండు సార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మొదటగా క్యూబా మాజీ అధ్యక్షుడు, మహానేత ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుండగా పెద్ద నోట్ల రద్దుపై ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్షాలు చుట్టుముట్టాయి. రాజ్యసభ వెల్ లోకి విపక్ష సభ్యులు దూసుకెళ్లారు. స్పీకర్ వారించిన వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పీజే.కురియన్ రాజ్యసభను అరగంటపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో నోట్ల రద్దుపై మళ్లీ గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను మద్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

 

రాజ్యసభ మ.2గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంవంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళన ల మధ్య రాజ్యసభ మూడో సారి వాయిదా పడింది.

అట్టుడుకుతున్న ఉభయసభలు

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉభయసభలో విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతోంది.

12:08 - November 28, 2016

టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నిఖిల్' కూడా ఒకరు. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఈ హీరో. 'శంకరాభరణం' డిజాస్టర్ తరువాత 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' అనే చిత్రంలో 'నిఖిల్ నటించాడు. టైగర్ ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇటీవలే విడుదలైంది. పెద్ద నోట్లు రద్దు ఎఫెక్ట్ తో పలు చిత్రాలు వెనుకంజ వేశాయి. కానీ 'నిఖిల్' చిత్రం మాత్రం విడుదలైంది. పోటీ కూడా లేకపోవడంతో ఈ చిన్న సినిమాకు కలెక్షన్ల పంట పండుతోందంట. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలు సాధిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు దూసుకపోతోందని టాక్ వినిపిస్తోంది. శుక్రవారం 95వేల డాలర్లు సాధించిందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే 'నిఖిల్' కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవనుంది. ఈ వారాంతానికి హాఫ్ మిలియన్ మార్క్ రీచ్ అవ్వటం ఖాయమని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారంట.  

12:07 - November 28, 2016

టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఫ్యామిలీ..వారి ప్రేమ..వివాహంపై దృష్టి నెలకొంది. అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య..సమంత ప్రేమ వివాహం అందరికీ తెలిసిందే. వీరి వివాహం త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతోంది. కానీ వివాహం ఎప్పుడో మాత్రం తెలియడం లేదు. కానీ ఈ జంట మాత్రం చక్కర్లు కొడుతూ..ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తోంది. చిన్న చిన్న పార్టీలకు చైతూ..సమంతలు హాజరవుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల చైతూ పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటోలను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. తాజాగా ఓ పార్టీలో చిందేస్తూ మస్త్ ఏంజాయ్ చేస్తున్న ఫొటోను సమంత అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు ఎక్కడ చిందులు వేశారో..వారికే తెలియాలి. 

తిరిగి ప్రారంభమైన ఉభయసభలు

ఢిల్లీ : రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉపభసభలు నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలన్న విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. 

రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలడని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళన నేపధ్యంలో ఒకసారి వాయి అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూటీ ఛైర్మన్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రధాని నిర్ణయం వల్లే భారత్ బంద్ : ఏచూరి

ఢిల్లీ : ప్రధాని నోట్ల రద్దుపై ప్రధాని తీసుఉన్న నిర్ణయం వల్లే భారత్ బంద్ జరుగుతుందని సీపీఎం నేత ఏచూరి ఆరోపించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభంమైన రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభలో సమాధానం చెప్పాలని రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగిస్తున్నాయి. నోట్ల రద్దు పై ప్రజలు ఆక్రోశంగా ఉన్నారని ఆందోళన చేపట్టారు. సభలో ప్రధాని సమాధానం చెప్పాలని పోడియం చుట్టు ముట్టి ఆందోళన చేపట్టాయి.దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

పోస్టాఫీసులో నోట్ల మార్పిడి అవకతవకలపై సిబీఐ కేసు నమోదు

హైదరాబాద్ : తపాలాశాఖ లో నోట్ల మార్పిడి అవకతవకలపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, హిమాయత్ నగర్ పోస్ట్ మాస్టర్ రేవతి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రవితేజపై కేసు నమోదు చేశారు.

డిసెంబర్ 31 వరకు పాతనోట్లను అనుమతించాలి: రాఘువులు

హైదరాబాద్ : నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత బీవీ రాఘవులు, వి. శ్రీనివాసరావు, సీపీఐ నేత నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ... బిజెపి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయం పట్ల టీఆర్ ఎస్, టీడీపీ వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. కార్మికులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 31 వరకు పాతనోట్లను అనుమతించాలని రాఘువులు డిమాండ్ చేశారు.

నోట్ల రద్దు పై పార్లమెంట్ కమిటీ వేయాలి: రఘువీరా

విజయవాడ : నోట్లు రద్దు పై లెనిన్ సెంటర్లో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ... నోట్ల రద్దు వల్ల ప్రజా జీవనం అస్థవ్యవస్థమైందని పేర్కొన్నారు. నోట్ల రద్దు పై పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

జిల్లెల గూడలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం

రంగారెడ్డి : జిల్లాల గూడలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. ఆదివారం స్పెషల్ క్లాసు ఉందని స్కూలుకు వెళ్లిన కేశబాగుల శ్రీలత, ఎం శ్రావణి, ఎస్. సంధ్యారణి అనే ముగ్గురు విద్యార్థినులు మరళా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ద్యాప్తు ప్రారంభించారు.

11:30 - November 28, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. క్యూబా మాజీ అధ్యక్షుడు, మహానేత ఫిడెల్ క్యాస్ట్రో మృతికి ఉభయసభలు సంతాపం తెలిపాయి. అనంతరం లోక్ సభ, రాజ్యసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని విపక్షాలు చుట్టుముట్టాయి. ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యామ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

 

లోక్ సభ మ.12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై లోక్ సభలో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మ.12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్బీఐ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లజెండాలతో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు బైఠాయించారు. అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ పాల్గొన్నారు.

11:23 - November 28, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. క్యూబా మాజీ అధ్యక్షుడు, మహానేత ఫిడెల్ క్యాస్ట్రో మృతికి ఉభయసభలు సంతాపం తెలిపాయి. అనంతరం లోక్ సభ, రాజ్యసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పెద్ద నోట్ల రద్దుపై ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన విపక్షాలు చుట్టుముట్టాయి. రాజ్యసభ వెల్ లోకి విపక్ష సభ్యులు దూసుకెళ్లారు. స్పీకర్ వారించిన వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ పీజే.కురియన్ రాజ్యసభను అరగంటపాటు వాయిదా వేశారు. 

 

రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు పై చర్చించాలని విపక్షాలు పట్టు పట్టడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అంతే కాకుండా విపక్షాలు ప్లకార్డులు చేతపట్టి వెల్ లోకి దూసుకువచ్చాయి. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా నడిపేందుకు సహకరించాలని కోరినా వినకపోవడంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు లోక్ సభలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. స్పీకర్ మాత్రం ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

11:16 - November 28, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. క్యూబా మాజీ అధ్యక్షుడు, మహానేత ఫిడెల్ క్యాస్ట్రో మృతికి ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం లోక్ సభ, రాజ్యసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. 

11:15 - November 28, 2016

ఢిల్లీ : పార్లమెంట్ లో ప్రతిపక్షాల సమావేశం ముగిసింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రధాని సమాధానంపై ప్రతిపక్షాలు పట్టువీడలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

రాజ్యసభలో గందరగోళం

ఢిల్లీ : రాజ్యసభలో నోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులు చేతపట్టి ప్రధాని సమాధానం చెప్పాలంటూ వెల్ లోకి దూసుకువచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

ఫెడెల్ క్యాస్ట్రో మృతి పార్లమెంట్ సంతాపం

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫెడెల్ క్యాస్ట్రో మృతికి పార్లమెంట్ సంతాపం తెలిపింది. మరో వైపు నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు సమావేశం అయ్యాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నుట్లు తెలుస్తోంది. విపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. 

11:03 - November 28, 2016

ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్

హైదరాబాద్ : నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఆక్రోస్ దివస్ గా పాటిస్తూ నిరసన తెలుపుతోంది. బంద్ నుండి బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారు.

10:58 - November 28, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా నేడు విపక్షాలు భారత్ బంద్ కు పిలుపిచ్చాయి. మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. బంద్ తో ఢిల్లీలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. విపక్షాలు ఆందోళన, ర్యాలీలకు సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగుతోంది. పెద్ద నోట్ల రద్దుపై మండిపడుతున్నారు. మోడీది అనాలోచిత నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రజలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కడపలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీపీఐ, కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తిరుపతి, విశాఖ, విజయవాడలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్దనోటు రద్దుపై తెలంగాణలోనూ నిరసనలు హోరెత్తిపోతున్నాయి. 
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట బస్ డిపో ముందు వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. కరీంనగర్ డిపో ఎదుట సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డిలో బంద్ కొనసాగుతోంది. 
తిరుపతి..
తిరుపతిలో కాంగ్రెస్, జనసేన, వైసీపీ నేతలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా నేతలు మాట్టాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే... దేశంలో ఎమెర్జెన్సీ పాలన కొనసాగుతోంది. ప్రశ్నించిన వారిని, నిర్ణయాన్ని తప్పుబట్టిన వారిని జాతి ద్రోహులుగా చిత్రీకరించడం దుష్టచర్య. టీడీపీ దోపిడీ, దొంగల పార్టీ. చంద్రబాబు ప్రజా ద్రోహానికి కూడా...నిరసనగా ఆందోళన చేపడతామని చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ 
విజయవాడ బస్టాండు ప్రయాణికులు లేక వెలవెల బోతుంది. బస్సులకు మినహాయింపు ఇచ్చినా...ఖాళీగా వెళ్తుతున్నాయి. డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. ఎన్ హెచ్ 5, 9 పై వాహనాలు నిలిచిపోయాయి. వామపక్ష నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. బస్సులు ప్రయాణికులు లేకుండా తిరుగుతున్నాయి. రవాణా స్తంబించి పోయింది. వాణిజ్య సముదాయలు వెలవెల బోతున్నాయి. జనసేన పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది.
కడప
కడపలో విపక్షాల ఆందోలన కొనసాగుతోంది. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట కాంగ్రెస్, సీపీఎం నేతల ధర్నా. పోలీసులు నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నరేంద్రమోడీ ఏకపక్ష నిర్ణయం వల్ల దేశ ప్రజానీకం ఇబ్బందులు పడుతుందన్నారు. నల్లకుబేరులతో మోడీ సర్కార్ కుమ్మక్కు అయిందని ఆరోపించారు. సామాన్యుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 
కృష్ణా  
కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రయాణికులు లేక విజయవాడ నెహ్రూ బస్టాండ్ వెల వెల బోతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలకు అసౌకర్యంగా ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 
హైదరాబాద్ 
హైదరాబాద్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ ప్రభావం కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన, కార్యక్రమాలు చేపట్టారు.

 

నాభా జైలు పై దాడి కేసులో పురోగతి

పంజాబ్ : నాభా జైలు పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జైలు పై దాడి చేసి ఖైదీలను విడిపించిన కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. పరారీలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది మింటూను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ సరిహద్దులో మింటూను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న పర్మిందర్ నిన్న ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేయగా... పంజాబ్ సమీప రాష్ట్రాల్లో సరిహద్దుల్లో నిఘా ను పెంచారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

నీరు-ప్రగతి వల్లే సంక్షోభం నుంచి బయటపడ్డాం:సీఎం చంద్రబాబు

విజయవాడ : నీరు - ప్రతి పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 26శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉందని ...నీరు-ప్రగతి వల్లే సంక్షోభం నుంచి బయటపడ్డామని సీఎం పేర్కొన్నారు. పట్టిసీమ జాతీయస్థాయిలో ఒక నమూనాగా మారిందని చెప్పారు.

గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరు : నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బంద్ లో పాల్గొన్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి అరండల్ పేట పీఎస్ తరలించారు. పీఎస్ లో వామపక్ష నేతలు ఆందోళనకు దిగాయి.

లెనిన్ సెంటర్ లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ : లెనిన్ సెంటర్ లో వామపోఆల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, కార్పొరేట్ మొండిబకాయిల రద్దును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, సీఐటీయూ నేతలు పాల్గొన్నారు.

10:17 - November 28, 2016
10:15 - November 28, 2016

పెద్ద నోట్ల రద్దు అశాస్త్రీయమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత విజయ్ కమార్, వైసీసీ నేత కొండా రాఘవరెడ్డి పాల్గొని, మాట్లాడారు. చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చాయని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:14 - November 28, 2016
10:13 - November 28, 2016

స్నానం కోసం వెళ్లి నలుగురు గల్లంతు

కృష్ణా : జిల్లా నాగయలంక లైట్ హౌజ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నానం కోసం వెళ్లిన 20 మంది యువకుల్లో నలుగురు గల్లంతయాయారు. వీరంతా ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

10:11 - November 28, 2016

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లు కీలకదశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీవర్గీకరణ బిల్లును పెట్టి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని మందకృష్ణ మాదిగ కోరారు. ధర్మయుద్ధం మహాసభకు హాజరైన అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీవర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. ఎస్సీవర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు పలు రాజకీయ పార్టీలు హాజరై ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. ఇక ఏ శక్తులు ఎస్సీవర్గీకరణ ను ఆపలేవని చెప్పాయి.

కీలకదశకు ఎస్సీ వర్గీకరణ బిల్లు : మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ బిల్లు కీలకదశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి బిల్లును పార్లమెంట్ లో ఆమోదింప చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైంది : దత్తాత్రేయ
ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. ఎమ్మార్పీస్ ధర్మయుద్ధం మహాసభలో పాల్గొన్న ఆయన ఎస్సీవర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునివ్వాలన్నారు.

మాదిగల న్యాయ పోరాటానికి అండగా ఉంటాం : వెంకయ్యనాయుడు
మాదిగల న్యాయ పోరాటానికి అండగా ఉంటానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ జరగాలన్న ఆయన.. ఎస్సీ వర్గీకరణ జరిగేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ మద్దతు : జానారెడ్డి
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ మద్దతిస్తోందని జానారెడ్డి తెలిపారు. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని జానారెడ్డి కోరారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ మద్దతిస్తోందని కాంగ్రెస్ ఎల్పీనేత జానారెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ కోసం ఏ విధంగా అన్ని పార్టీలు పనిచేశాయో దీర్ఘకాలికంగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని జానారెడ్డి అన్నారు.

ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మద్దతు : రేవంత్ రెడ్డి
ఎస్సీలకు ఇప్పటికే న్యాయం చేయడంలో ఆలస్యం జరిగిందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కు టీడీపీ పూర్తి మద్దతిస్తోందని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్మయుద్ధం మహాసభకు పలు రాజకీయ పార్టీలు హజరయ్యాయి. ఈ సందర్భంగా ఎస్సీవర్గీకరణ బిల్లుకు మద్దతినిస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. 

10:09 - November 28, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించేందుకు.. తెలంగాణ కేబినెట్‌ ఇవాళ మధ్యాహ్నం భేటీ కానుంది. రాష్ట్రంలో చిల్లర సమస్యలు.. ఖజానాకు నష్టం తదితర అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఇవాల్టి కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు

పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చర్చ
లంగాణలో పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సోమవారం భేటీ కానుంది. 8వ తేది రాత్రి నుంచి రాష్ట్రంలో పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తెస్తూనే ఉంది. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు విడివిడిగా.. పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులపై కేంద్రానికి నివేదించారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో.. తక్షణమే తీసుకోవాల్సిన ప్రత్యమ్నాయ చర్యలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.

నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయానికి గండి
నవంబర్ 8 నుంచి 20 రోజులుగా రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. వాణిజ్య పన్నుల శాఖ నుంచి రావాల్సిన ఆదాయంలో 50 శాతం పడిపోయింది. ఇక మోటారు వాహనాల రూపంలో ఆర్టీఏకు రావాల్సిన ఆదాయానికి గండి పడింది. ఆదాయం 40 శాతానికి పడిపోయిందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం విషయంలోనూ ఇదే పరిస్థితి. భూ రిజిస్ట్రేషన్లు నిలిచి పోవడంతో స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇదే విషయాన్ని ఇటీవల అధ్యాయనం కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి నివేదించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మూడో దశ పనులు, హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు వేల కోట్ల రుపాయల అవసరం ఉంది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది.

కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిల వాయిదాకు కసరత్తు
సీఎం కేసీఆర్ సైతం రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం సాధ్యం కాదని.. వాటిని కొంత కాలం వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు వేల నోటుతో చిల్లర కష్టాలు మరింత పెరిగాయని.. తద్వారా 2 నెలల్లో ప్రభుత్వానికి సుమారు 3 వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో సోమవారం కేబినెట్‌ భేటీలో రాష్ట్రంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యమ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీంతో పాటు కొత్త చీఫ్‌ సెక్రటరీ ఎంపిక అంశంపై కూడా మంత్రి వర్గ సహచరులతో సీఎం చర్చించే అవకాశం ఉంది.

10:07 - November 28, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇవాళ బంద్‌ పాటిస్తున్నాయి. ధర్నాలు, రాస్తా, రైల్‌ రోకోలతో ప్రజాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను సన్నద్ధం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్, జేడీయూ మాత్రం బంద్‌ను  పాటించడం లేదంటూ ప్రకటించాయి. 
భారత్‌ బంద్‌కు పిలుపు
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈనెల 8న తీసుకున్న నిర్ణయం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్ల రద్దు చేసిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా కరెన్సీని రద్దు చేయడాన్ని నిరసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. 
నల్లజెండాలతో కాంగ్రెస్ నిరసన  
తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయిచింది. పెద్ద నోట్ల రద్దకు నిరసనగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ స్తంభింపచేయాలని ఏపీ పీపీసీ నిర్ణయించింది. 
హార్తాల్‌కు వైసీపీ మద్దతు
నోట్ల రద్దు తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ జరిగే హార్తాల్‌కు తమ పార్టీ మద్దతిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న నిరసనలకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతోందని అన్నారు.
బంద్ కు సీపీఎం శ్రేణులు సిద్ధం 
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి నిరసనగా ఇవాళ జరిగే బంద్‌కు..ఏపీలో సీపీఎం శ్రేణులు సిద్ధమయ్యాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం కూడా భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలకు సంఘీభావంగా ప్రజా ప్రతినిధులందరూ బ్యాంకుల దగ్గర  క్యూలో నిలబడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. 
జైరాం రమేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు 
నోట్ల రద్దు, భారత్ బంద్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరికి సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాల్టి 'భారత్ బంద్‌'కు కాంగ్రెస్ పిలుపునివ్వలేదని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా తమ పార్టీ నిరసనలు మాత్రం చేపడుతున్నట్టు చెప్పారు. 
బంద్‌లో పాల్గొనడం లేదని జేడీయూ ప్రకటన
మరోవైపు బంద్‌లో తాము పాల్గొనడం లేదని జేడీయూ ప్రకటించింది. బీహార్‌లో అధికార జేడీయూ భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్‌జేడీలు బంద్‌కు మద్దతుగా నిలుస్తుండగా..జేడీయూ మాత్రం బంద్‌కు దూరమని ప్రకటించడం విశేషం. 
బంద్‌ను పాటించనున్న టీఎంసీ 
తృణమూల్‌ కాంగ్రెస్ మాత్రం బంద్‌ను పాటించనుంది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మార్చ్‌ జరగనుంది. కోల్‌కతాలో జరగనున్న ఈ కార్యక్రమానికి సుమారు లక్షమంది హాజరవుతారని భావిస్తున్నారు. ఆప్‌ పార్టీ నేతృత్వంలో న్యూఢిల్లీలోని సెంట్రల్‌ పార్క్‌లో భారత్ బంద్‌ జరగనుంది. 
ఆటో కార్మిక సంఘాల సమాఖ్య బంద్‌కు మద్దతు
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల ఆటో కార్మిక సంఘాల సమాఖ్య భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సిద్ధమతున్నాయి.

07:21 - November 28, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బంద్‌కు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. ధర్నాలు, రాస్తారోకో, రైలు రోకోలతో ప్రజా గ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని 14 ప్రతి పక్ష పార్టీలు నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, జేడీయూ మాత్రం బంద్‌లో పాల్గొనటం లేదు. కేవలం నిరసనలకే పరిమితమవుతామని ప్రకటించాయి. 
శ్రీకాకుళం ఆర్టీసీ డిపో ముందు ఉద్రిక్తత 
భారత్‌బంద్‌ కారణంగా ఆయా ప్రాంతాలలో తీవ్రస్థాయిలో ఆందోళన జరగుతోంది. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న  11 మంది  ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
కడపలో కాంగ్రెస్, సీపీఐ నేతల అరెస్టు
పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కడప, ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోల ముందు కాంగ్రెస్, సీపీఐ ధర్నా చేపట్టాయి. కడపలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేట ఆర్టీసీ డిపో ముందు వైసీపీ నేతలు బైఠాయించాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేటి నుంచి హన్మకొండలో సీపీఐ నిర్మాణ మహాసభలు

వరంగల్ : నేటి నుంచి హన్మకొండలో సీపీఐ నిర్మాణ మహాసభలు జరుగనున్నాయి. సభలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి హాజరుకానున్నారు. 

 

కడపలో సీపీఐ, కాంగ్రెస్ నేతలు అరెస్టు

కడప : భారత్ బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్టాంట్ వద్ద సీపీఐ, కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించాయి. నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

Don't Miss