Activities calendar

29 November 2016

టీఎస్ స్పెషల్ సీఎస్ గా సురేష్ చంద్ర!

హైదరాబాద్ : టీఎస్ స్పెషల్ సీఎస్ గా సురేష్ చంద్రకు ప్రమోషన్ ఇవ్వనున్న సర్కార్. కాసేపట్లో సర్కార్ అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

చార్మినార్ పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్ : చార్మినార్ పోలీసుల వేధింపులు తాళలేక ఖాజా హసన్ (30) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.చోరీకి గురైన బైక్ ను కొనుగోలు చేశాడని, ఖాజా హసన్ ను నిన్ని రాత్రంతా పీఎస్ లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు.. ఆ అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

20:37 - November 29, 2016

ఇంక అంతా తెలుపేనా? నల్లధనం అనేది దేశంలో ఉండదా? నోట్ల రద్దుతో అంతా మారిపోతుందా? అస్సలు నల్లధనం అంతా రూ.1000, రూ.500లుగానే ఉందా? ఇదే నిజమయితే సంతోషమే. కానీ వాస్తవం వేరుగా కనిపిస్తోంది. నల్లదనం నోట్లుగా లేదని, నల్లధనం ఎప్పుడూ చేతులు మార్చుకుని, స్థానం మార్చుకుని పరిపరి విధాలుగా స్థిరపడుతోందని అంచనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మనీ వెలికి తీయడానికి నోట్ల రద్దే మార్గం అంటున్న సర్కార్ తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశం నేటి వైడాంగిల్ విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:14 - November 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు ఏడేళ్లు పూర్తయ్యాయి.ఉస్మానియా పోరళ్లు పట్టిండ్రు హారతి, రాజుకుంటున్న పోలవరం పోరు, చంద్రాలు జేయాలే పైసలు ఖరారు, కంటిలో నిప్పులు పోసుకున్న కోదండరాం, డబుల్ బెడ్ రూం ఇళ్ల మీద సార్ మారాం, గాలొచ్చినప్పుడే తూర్పారబట్టాలే, ఒట్లిచ్చినపుడే జనాన్ని జోకొట్టాలే, ముసలిని పట్టిన జూలకంటి రంగన్న, టేల్ పాండ్ కాడ ఊర్లు తెర్లు తెర్లు, ప్రైవేటు దావఖానలకు రిబ్బను కటింగులు, ప్రైవేటోళ్ల సేవల మునిగిన పెద్దలు ఇత్యాది అంశాలపై మల్లన్న ముట్లు కార్యక్రమంలో మల్లన్న ఘరం ఘరం అంశాలను మీ ముందుకు తీసుకొచ్చారు. అలాంటి అంశాలను చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఎదురు కాల్పుల్లో ఏడుగురు జవాన్ల మృతి

జమ్మూకశ్మీర్: సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నగ్రోతా ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆర్మీ క్యాంపులోకి ముష్కరుల చొరబడి ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

బ్లాక్ మనీ మార్పిడి కుంభకోణం పై విచారణ: డీసీపీ పాలరాజు

హైదరాబాద్ : విజయవాడలో బ్లాక్ మనీ మార్పిడి కుంభకోణం పై విచారణ కొనసాగుతుందని డీసీపీ పాలరాజు తెలిపారు. కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ నుండి 43 ఖాతాల్లో రూ.12లక్షలు డిపాజిట్ చేసి రూ. 6లక్షలు డ్రా చేసినట్లు పేర్కొన్నారు. 38 ఖాతాల్లో లావాదేవీలు నడిచాయని, నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నట్లు డీసీపీ స్పష్టం చేశారు.

19:09 - November 29, 2016

హైదరాబాద్ : బేగం పేటలో కవిత అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఈ మధ్యనే ప్రేమ వివాహం చేసుకున్న ఈశ్వర్, కవిత ఆటోలో వెళ్తున్నారు. ఆటోను ఆపిన ఓ యువకుడు కవిత,ఈశ్వర్ ను కత్తితో పొడిచాడు. కవిత అక్కడిక్కడే మృతి చెందగా ఈశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దారుణానికి తెగబడిన యువకుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

బేగంపేటలో యువతి దారుణ హత్య

హైదరాబాద్ : బేగం పేటలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఆటోలో వెళ్తున్న యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచాడు. అక్కడిక్కడే యువతి మృతి చెందింది. దారుణానికి తెగబడిన యువకుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రేమ వివాహమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

18:52 - November 29, 2016

ఏలూరు: తుందుర్రు కంసాలబేతపూడిలో ఉద్రిక్తత నెలకొంది. జనచైతన్య యాత్రకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేకు పరాభవం జరిగింది. నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణంపై వెనక్కి తగ్గాలని గ్రామస్తుల డిమాండ్‌ చేశారు. శంకుస్థాపన చేసిన శిలా ఫలకాలు ధ్వంసం చేశారు. అంతే కాకుండా టీడీపీ జెండాలు, ఎమ్మెల్యే ఫ్లెక్సీలను గ్రామస్తులు తగులబెట్టారు.

18:49 - November 29, 2016

విజయవాడ : ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై ఏపీ ఆర్థికశాఖ ప్రకటన విడుదల చేసింది. ఎప్పటిలాగే జీతాలు, సామాజిక పెన్షన్లు, బ్యాంకు అకౌంట్లలో వేస్తున్నట్లు తెలిపింది. అకౌంట్ లేని పెన్షనర్లు రెండు రోజుల్లోగా ఖాతాలు తీసుకోవాలని ఆదేశించింది.

18:47 - November 29, 2016

విజయవాడ : స్టాప్‌కు తెలియకుండా... బ్లాక్‌ మనీని గాంధీమహిళా కళాశాల కరస్పాండెంట్ సీఎల్ కాంతారావు.. లెక్చరర్లు, సిబ్బంది అకౌంట్లలో డిపాజిట్ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పలువురు లెక్చరర్లు, సిబ్బంది... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కరస్పాండెంట్‌ కాంతారావుతో పాటు మరో 10 మందిని.. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్యాంక్ అధికారుల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

18:44 - November 29, 2016

హైదరాబాద్ : భూమధ్య రేఖ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. దీని ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణకు వర్షసూచన లేదు కానీ రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

బ్యాంకు అకౌంట్లలోనే ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు

విజయవాడ : ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. బ్యాంకు అకౌంట్లలోనే జీతాలు, పెన్షన్లు వేస్తామన్నారు. బ్యాంకు అకౌంట్లు లేని పెన్షనర్లు రెండు రోజుల్లోగా అకౌంట్లు తెరుచుకోవాలని, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది.

గడువు పొడిగించే ఆలోచన త‌మ‌కు లేదు : కేంద్రం

ఢిల్లీ : పాతనోట్ల మార్పిడిని ఈనెల‌ 24వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఆపేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, పలు నిబంధ‌న‌ల‌తో ప‌లుచోట్ల ర‌ద్ద‌యిన‌ 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా, రద్దయిన పెద్ద‌నోట్ల డిపాజిట్ గ‌డువు తేదీని పెంచాల‌ని వ‌స్తోన్న డిమాండు ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. ముందుగా ప్ర‌క‌టించిన మేర‌కే ఈ గ‌డువు డిసెంబర్ 30వ‌ర‌కే ఉంటుంద‌ని, గడువును పొడిగించే ఆలోచన త‌మ‌కు లేదని పేర్కొంది. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు స‌హా మిగతా బ్యాంకుల వద్ద సరపడా న‌గ‌దు నిల్వలు ఉన్నాయ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

తుందుర్రు కంసాలబేతపూడిలో ఉద్రిక్తత

ప.గో : తుందుర్రు కంసాలబేతపూడిలో ఉద్రిక్తత నెలకొంది. జనచైతన్య యాత్రకు వచ్చిన నర్సాపురం ఎమ్మెల్యేను ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ వ్యతిరేక గ్రామస్తులు అడ్డుకుని, ఆక్వాఫుడ్ పార్క్ శిలా ఫలకాన్ని ధ్వసం చేశారు. టిడిపి జెండాలు, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలను గ్రామస్తులు తగలబెట్టారు.

'అసెంబ్లీ స్థానాల పెంపెనకు రాజ్యాంగ సవరణ చేయాలి'

ఢిల్లీ : అసెంబ్లీస్థానాల పెంపుపై ఏపీ, తెలంగాణ నుంచి అభ్యర్థనలు వచ్చాయని హోంశాఖ తెలిపింది. అసెంబ్లీ స్థానాల పెంపెనకు రాజ్యాంగ సవరణ చేయాలని, అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యాసాధ్యాలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 వరకు పెంపు సాధ్యం అవుతుందని తెలిపింది. లోక్ సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు హోంశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

18:17 - November 29, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంపై ఆర్థికరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌లాంటి వారు కూడా మోదీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు అంశాన్ని.. అడ్డూ అదుపులేని ప్రభుత్వ ఏకపక్ష ధోరణిగా అమర్త్యసేన్‌ అభిర్ణించారు.

ఏకపక్ష నిర్ణయం....

అమర్త్యసేన్‌..! ఆర్థిక రంగంలో తిరుగులేని శాస్త్రవేత్త. ఈ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు చేశారాయన. ఆర్దికరంగంలో అమర్త్యసేన్‌ చేస్తున్న కృషికి ఎన్నో అవార్డులు , రివార్డులు ఆయనను వరించాయి. అయితే దేశంలో హాట్‌ టాపిక్‌గా మారిన నోట్లరద్దు నిర్ణయపు హేతుబద్ధతను ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం.. నియంత్రణ లేని ఏకపక్ష చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, కొత్త సమస్యలూ ఉత్పన్నం అవుతాయని అన్నారు. కొద్దిమంది నల్ల కుబేరుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం... ఎక్కువశాతం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దేశంలో మెజార్టీగా ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజలు నోట్ల రద్దుతో అష్టకష్టాలు కష్టాలుపడుతున్నారని వ్యాఖ్యానించారు.

నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో కేంద్రం విఫలం

విదేశాల్లోని నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తామని విఫలమైన తరహాలోనే.. ఈ అంశంలోనూ ప్రభుత్వం విఫలమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఒక నిర్ణయం తీసుకునేముందు మంచి చెడులను ముందే బేరీజు వేసుకోవాలని సూచించారు. 

నోట్ల రద్దుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : నోట్ల రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్‌ 8లోగా నోట్ల రద్దుపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆర్‌బీఐ, కేంద్ర ఏడీజీ నటరాజన్‌ను హైకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దు అధికారం కేంద్రానికి ఉందని.. కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని నటరాజన్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరపు వాదన విన్న హైకోర్టు ప్రస్తుతం కేసుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది. 

18:09 - November 29, 2016

హైదరాబాద్ : బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డికి ఘోర పరాభవం జరిగింది. ఓ కాంట్రాక్టర్‌ జంగారెడ్డి చెంప చెళ్లుమనిపించాడు. రాజీకోసం పిలిచి జంగారెడ్డిపై చేయిచేసుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. జంగారెడ్డి సోదరునికి పెట్రోల్‌ బంక్‌ ఉంది. అతనికి క్రషర్‌ యజమాని 6లక్షల రూపాయలు బాకీపడినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు విషయంలో జంగారెడ్డికి క్రషర్‌ యజమానికి మధ్య గొడవజరిగింది. అప్పట్లో జంగారెడ్డి క్రషర్‌ యజమానిపై చేయిచేసుకున్నారని.. దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం క్రషర్‌ యజమాని చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య గొడవను తొలగించేందుకు రాజీకి పిలిచారు. ఈ నేపథ్యంలో క్రషర్‌ యజమాని ఇంటికి వచ్చిన జంగారెడ్డిపై కాంట్రాక్టర్‌ చేయిచేసుకున్నారు. ఇదంతా ఫ్రీప్లాన్డ్‌గా చేసినట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది.  

18:08 - November 29, 2016

యాదాద్రి : భువనగిరిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలేరు మండలానికి చెందిన భాస్కర్, నీలావేణి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన వీరు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో అక్కడున్న స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. 

18:06 - November 29, 2016

వరంగల్ : కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షకు ఏడేళ్లు పూర్తైన సందర్భంగా వరంగల్‌లో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియోను చూడగలరు.

హజీ అలీ దర్గాలోకి ప్రవేశించిన మహిళలు

ముంబై : హజీ అలీ దర్గాలోకి మహిళలు ప్రవేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 80 మంది మహిళలు ఛాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. త్వరలోనే శబరిమలను సందర్శిస్తామని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు.

 

చంద్రబాబుతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్ భేటీ

విజయవాడ: సీఎం చంద్రబాబుతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్ భేటీ అయ్యారు. వాల్తేర్ పరిధిలోని రైల్వే ప్రాజెక్టుల ప్రగతిని సీఎంకు వివరణ రూ.300 కోట్లతో విశాఖ పోర్టు ట్రస్ట్ - గోపాలపట్నానికి బల్పులైన్ నిర్మించాలని ఉమేష్ సింగ్ సీఎంను కోరారు.

లావాదేవీలపై సలహాలు కోరిన ప్రత్యేక టాస్క్ఫోర్క్ కమిటీ

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరిన ప్రత్యేక టాస్క్ఫోర్క్ కమిటీ నియమించింది. డిసెంబర్ 10 లోగా తమ సలహాలు, సూచనలను [email protected]కు పంపించాలని సూచించారు.

విజయవాడలో బ్లాక్ మనీ మార్పిడి కుంభకోణం

హైదరాబాద్ : విజయవాడలో బ్లాక్ మనీ మార్పిడి కుంభకోణం బయపడింది. బ్లాక్ మనీని లెక్చరర్లు, సిబ్బంది అకౌంట్లలోకి గాంధీ మహిళా కళాశాల కరస్పాండెంట్ సీఎల్ కాంతారావు వేసినట్లు తెలుస్తోంది. చెప్పకుండా తమ ఖాతాలలో డబ్బులు వేయడం పట్ల పలువురు లెక్చరర్లు, సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని మర్కంటైల్ బ్యాంకు నుంచి లావాదేవీలు జరిగినట్లు సమాచారం. కరస్పాండెంట్ కాంతారావుతో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జార్ఖండ్ లో ఆరుగురు నక్సల్స్ అరెస్ట్....

జార్ఖండ్: పోలీసులు జార్ఖండ్ లోని కతికుండ్ ఏరియాలో ఆరుగురు నక్సలైట్లను అరెస్ట్ చేశారు. నక్సల్స్ నుంచి రూ.31లక్షల నగదుతోపాటు బ్యాంక్ ఖాతాల పాస్‌బుక్‌లు, ఒక ఏటీఎం, రెండు దేశీయ తుఫాకులు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

తెలంగాణ ఉద్యోగులకు ఊరట

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. వచ్చే నెల ఉద్యోగులకు ఇచ్చే జీతంలో 10 వేల రూపాయలు నగదు చేతికిచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించింది. దేశమంతా నోట్ల కష్టాలతో అల్లాడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తెలంగాణ ఉద్యోగులకు ఊరట కలిగించనుంది.

ఉపాధి హామీ పథకంపై మంత్రి జూపల్లి సమీక్ష

జనగామ: జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, అధికారులతో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉపాధి హామీ పథకంపై ఎంపీడీవోలు, అధికారులతో మంత్రి జూపల్లి చర్చించారు.

16:00 - November 29, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపడతామని.. మౌలిక స‌దుపాయ‌ల కల్పన‌లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వచ్చారు. రాష్ట్రంలోని ఆర్థికలోటు కారణంగా అభివృద్ధి ప‌థకాలకు.... ఎటువంటి అటంకం కలగకుండా విదేశీ సంస్థల రుణాల కోసం ప్రయత్నాలు చేశారు. విదేశాల్లో పర్యటించి... ర‌హదార్ల నిర్మాణానికి ఏసియ‌న్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారం తీసుకున్నారు. అమ‌రావ‌తి మెట్రోరైల్ నిర్మాణానికి జైకా వంటి సంస్థల‌తో ఒప్పందాలు చేసుకున్నారు.

రాష్టంలో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి

రాష్ట్రంలోని అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌కారం అందించేందుకు పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. . అయితే వీటిని పొందాలంటే కేంద్రప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం రాష్ట్రంలొ 5 వేల 472 కోట్ల రూపాయ‌ల విదేశీ రుణ నిధుల‌తో పనులు సాగుతున్నాయి. మరో 11వేల 538 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్రం అనుమతించింది. ఇక‌ తాజాగా 37వేల 873 కోట్ల..విదేశీ రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది రాష్ట్ర సర్కారు.

ఆయా అభివృద్ధి కార్యకమాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు .....

కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర హైవేల విస్తర‌ణ‌ కోసం16 వందల 79 కోట్లు...కరవు, రైతుల సంక్షేమం కోసం 18 వందల 31 కోట్లు, పట్టణ నీటి సరఫరా నిర్వహణ ప్రాజెక్టు అమలుకు 3వేల723 కోట్లు ప్రతిపాదించారు. వంతెనల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.3 వేల 200 కోట్లు అవసరమంటూ ఏపీ సర్కారు...కేంద్రాన్ని కోరింది.

రాష్ట్రంలోని ఐదు ప్రాజెక్టులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనుమతి

రాష్ట్రంలోని ఐదు ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే అనుమతినిచ్చింది. కమ్యూనిటీ బేస్డ్‌ నీటి సరఫరాకు 16 వందల కోట్లు, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం రూ.50 కోట్లు ఇచ్చింది. అమరావతి నగర నిర్మాణానికి 4 వేల 749 కోట్లు, ఇరిగేషన్‌, లైవ్లీహుడ్‌ మెరుగదల ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కేటాయించింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ నిర్మాణానికి రూ.2 వేల 689 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన నేపథ్యంలో విదేశీ రుణాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడింది. మరోవైపు కేంద్రంపైనా ఆధారపడుతోంది. కేంద్రప్రభుత్వంతో సమన్వయం చేసుకునేలా..అధికారులను దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సత్ఫలితాన్నిస్తాయో చూడాలి. 

15:56 - November 29, 2016

ఢిల్లీ : 2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9వ తేదీకు వరకు సీఎం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజలను ఐక్యం చేసిందని నిజామాబాద్‌ టిఆర్ ఎస్ ఎంపీ కవిత చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ దీక్ష ప్రారంభించి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో దీక్షా దివస్‌ నిర్వహించారు. టీఆర్ ఎస్ ఎంపీ లు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ దీక్షతో కేంద్రం దిగొచ్చి, తెలంగాణ ప్రకటించిన విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ దీక్ష తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిందని ఈ సందర్భంగా కవిత చెప్పారు. 

15:53 - November 29, 2016

మొహాలీ : టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ భారత్‌కు పోటీనే లేకుండా పోయింది. మొహాలీ టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిధ్య భారత్‌ నాలుగో రోజే సంచలన విజయం సాధించింది. మూడో ఇన్నింగ్స్‌లో స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ను 236 పరుగులతో ఆలౌట్‌ చేసిన టీమిండియా....స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.103 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ రెండో ఓవర్లోనే మురళీ విజయ్‌ వికెట్‌ కోల్పోయినా.....8 ఏళ్ల తర్వాత టెస్ట్‌ రీ ఎంట్రీ ఇచ్చిన పార్థివ్‌ పటేల్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 20.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. స్పిన్‌ త్రయం అశ్విన్‌,జడేజా, జయంత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముగ్గురూ కలిసి 12 వికెట్లు పడగొట్టడంతో పాటు....బ్యాటింగ్‌లో 217 పరుగులు జోడించి టీమిండియాను విజేతగా నిలిపారు. టెస్టుల్లో ఓటమంటూ లేకుండా భారత్‌ సాధించిన 13వ విజయం కావడం విశేషం. 

15:51 - November 29, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్‌లో చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. క్యాష్‌ లెస్ విధానం ద్వారా నగర వాసులు చెల్లింపులు చేసే విధంగా వ్యవస్థను రూపుదిద్దుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియోను చూడగలరు...

15:49 - November 29, 2016

ఢిల్లీ : ఐటీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే ప్రస్తుత సమయంలో సభలో సమగ్ర చర్చ జరపలేమని స్పీకర్ విపక్షాల డిమాండ్ తోసిపుచ్చారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.

దద్దరిల్లిన రోజ్యసభ....

పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభ దద్దరిల్లింది. నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. జీరో అవర్‌లో చర్చ చేపట్టేందుకు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రయత్నించగా.. అందుకు సభ్యులు అంగీకరించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు రావాలంటూ సభ్యులు పట్టుపట్టారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభను డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ రేపటికి వాయిదా వేశారు.  

15:39 - November 29, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఆమెను న్యూఢిల్లీలోని స‌ర్ గంగా రామ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌పడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆసుప‌త్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి. స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం

హైదరాబాద్ : మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 147, రెండో ఇన్నింగ్స్ 104/2, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 283, రెండో ఇన్నింగ్స్ 236 చేయగా మూడో టెస్టులో ఇంగ్లండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఆదాయపు పన్ను చట్టసవరణ బిల్లు కు లోక్ సభ ఆమోదం

ఢిల్లీ : లోక్ సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య ఆదాయపు పన్ను చట్టసవరణ బిల్లు కు మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదం తెలిపింది. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

ఆదాయపన్ను చట్ట సవరణపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

ఢిల్లీ : లోక్ సభలో ఆదాయపన్ను చట్టసవరణ -2016 బిల్లు పై చర్చ జరుగుతోంది. ఆదాయపన్ను చట్టం సవరణపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఓటింగ్ కు ముందు చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఐటీ సవరణ బిల్లును నిన్ననే సభలో ప్రవేశపెట్టామని జైట్లీ పేర్కొన్నారు. నల్లధనంపై చర్యలు తీసుకుంటామన్నారు. 70వేల కోట్ల నల్లధనం బయటకు వచ్చిందని, బినామీ ఆస్తుల జప్తునకు చట్టం తెచ్చాం, విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెచ్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం అని. నల్లధనాన్ని పేద అభివృద్ధికి వాడుతామని జైట్లీ ప్రకటించారు.

మోదీకి దమ్ముంటే నన్ను జైలుకు పంపించాలి: సీఎం మమత

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి దమ్ముంటే తనను జైలుకు పంపాలని బెంగాల్ సీఎం మమతా బెర్జీ సవాల్ విసిరారు. దేశంలో బ్లాక్ మనీ ఎమర్జెన్సీ నడుస్తోందని, ప్రజల ధనాన్ని మోదీ, బిజెపి నేతలు కొల్లగొడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత దేశ జీడీపీ పడిపోతుందని, నోట్ల రద్దుకు ముందే బిజెపి నేతలు భూములు కొన్నారని ఆరోపించారు. సూపర్ మార్కెట్ లకు డబ్బులు ఇస్తున్నారు కానీ ప్రభుత్వ బ్యాంకులకు పైసా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ రేపట్టికి వాయిదా పడింది. నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ విపక్షాలు వెల్ లోకి ఆందోళన చేపట్టడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఎల్బీ నగర్ లో సైకో వీరంగం

హైదరాబాద్ : ఎల్బీ నగర్ లో సైకో వీరంగం సృష్టించారు. స్థానికులపై సైకో కత్తితో దాడి, 15 మందికి గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు సైకోకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

14:13 - November 29, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు అనంతర పరిణామాలపై అధ్యయనానికి కేంద్రప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అ కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యం వహించనున్నారు. కమిటీలో సభ్యులుగా మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, త్రిపుర, ఒడిశా, బీహీర్ సీఎంలు ఉన్నారు. డిసెంబర్ 2న ఆరు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది.

13:46 - November 29, 2016

పెద్దనోట్లు రద్దై 21 రోజు కొనసాగుతోంది. కాని.. జనం కష్టాలు మాత్రం తీరడంలేదు. బ్యాంకుల ముందు గంటలకొద్దీ నిల్చుని.. జనం విసుగెత్తి పోతున్నారు. డిమాండ్‌కు తగినంత క్యాష్‌ లేకపోవడంతో.. బ్యాంకులు కూడా ఉసూరుమంటున్నారు. ఆర్బీఐ నుంచి క్యాష్‌ తగినంత రావడంలేదని బ్యాంకర్లు అంటుంటే.. ఇంట్లో ఉప్పు , పప్పులు కొనుక్కోడానికి కూడా డబ్బుల్లేవని సామన్యులు ఆక్రోశిస్తున్నారు. ఈ అంశంపై మహిళపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మానవి వేదికలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో హైమావతి(ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి),  పుష్పలీల (మాజీ మంత్రి),  పాల్గొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:42 - November 29, 2016

మెదక్ : తెలంగాణ సమగ్రాభివృద్దే లక్ష్యం కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 44వ రోజు సిద్దిపేట జిల్లాలో కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా మెట్టు వద్ద మహాజన పాదయాత్ర 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 1100 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.. తమ్మినేని బృందానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి స్వాగతం పలికి.. పాదయాత్ర చేస్తున్న బృందాన్ని సన్మానించారు. ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల జీవితాలు బాగుపడడం లేదని ఒంటేరు అన్నారు. పాదయాత్రను అన్ని వర్గాలు అభినందిస్తుంటే.. కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే అడ్డుచెబుతుందని తమ్మినేని అన్నారు.

తెలంగాణలో ప్రజల జీవితాలు బాగుపడడం లేదన్న నేతలు
సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పాదయాత్ర బృంద సభ్యులంటున్నారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. దళితులు, మైనారిటీలతో పాటు అనేక వర్గాలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాన్ వెస్లీ పేర్కొన్నారు. 

13:37 - November 29, 2016

హైదరాబాద్ : అసలే పెద్ద నోట్ల రద్దుతో.. తీవ్ర కష్టాల పాలవుతున్న సామాన్యులకు ఇప్పుడు మరో సమస్య పట్టుకుంది. తాజాగా వచ్చిన కొత్త నోట్లలో ఎవి అసలో..ఏవి నకిలీ నోట్లో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సందట్లో సడేమియా అన్నట్లు... కొత్త రెండు వేల రూపాయల నోట్లను కలర్‌ జిరాక్స్‌ తీసి అసలు నోట్లుగా నమ్మిస్తూ మోసం చేస్తున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు, నకిలీ నోట్లను ఎలా గుర్తు పట్టాలి..? నకిలీ నోట్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది.

బెంబేలెల్తిస్తున్న నకిలీ నోట్లు

కొత్త కరెన్సీపై అవగాహన లేక అయోమయం ..సామాన్యులను బెంబేలెత్తిస్తున్న నకిలీ బెడద ఆర్థిక వ్యవస్థకే ఛాలెంజ్‌ విసురుతున్న మోసగాళ్లు..అప్రమత్తతే నకిలీ నోట్ల నివారణకు పరిష్కారం..వైపు పెద్ద నోట్ల కష్టాలు కొసాగుతుండగానే...సందట్లో సడేమియా..అన్నట్లు.. నకిలీ నోట్లు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి...పాత నోట్ల రద్దుతో కొత్తగా వచ్చిన రెండువేల రూపాయాల నోట్లను కలర్‌ జిరాక్స్‌ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఘరానా మోసగాళ్లు పెరిగిపోయారు...కొత్త నకిలీ నోట్లను మార్కెట్‌లో తేవడంతో అసలో..నకిలీనో తేల్చుకోలేక సామాన్యులు గందరగోళంతో ఉన్నారు...అదే సమయంలో చిరు వ్యాపారుల్లో సైతం గుబులు పుట్టిస్తున్నాయి. సేమ్‌ టూ సేమ్‌ అసలు కరెన్సీని పోలిన నాణ్యమైన పేపర్‌తో నకిలీ కొత్త నోట్లను తయారు చేసి కొందరు చెలామణి చేస్తున్నారు. దీంతో వినియోగదారులు నకిలీ నోట్లను గుర్తించలేక మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో కేటుగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే నిరంతర అప్రమత్తతతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆర్బీఐ విడుదల చేసిన కొత్త రెండువేల రూపాయాల నోట్లపై ఇరువైపుల ఏడు గీతలుంటాయి..ఆ గీతల్ని వేళ్లతో ముడితే కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది.. అలా ఉబ్బెత్తుగా మార్క్‌ ఉన్నట్లయితే అది అసలు నోటు. లేదంటే అది నకిలీ నోటనే అర్ధం...

ఒరిజినల్‌ నోట్లలో ఫ్లోరోసెంట్‌ కలర్‌తో కూడిన ఆర్బీఐ ట్రేడ్‌ మార్క్‌
దీంతో పాటు ఈ నోట్లలో ఫ్లోరోసెంట్‌ కలర్‌తో ఉండే ఆర్బీఐ భారత్‌ అనే ట్రేడ్‌ మార్క్‌ ఉంటుంది. అది నకిలీ నోటా.. అసలు నోట అని తెలుసుకోవాలంటే.. నోటును అల్ట్రా వైలట్‌ కిరణాల కింద ఈ నోటును పెడితే ఫ్లోరోసెంట్‌ ట్రేడ్‌ కలర్‌ కనిపిస్తుంది. అలా కనిపించింటే అది అసలు నోటని.. లేదంటే.. నకిలీదని తేల్చవచ్చు...

అంధులు గుర్తించడానికి వీలుగా ఎడమ భాగంలో రెక్టాంగిల్‌ మార్క్‌
అంధులు గుర్తించడానికి వీలుగా ప్రతినోటులో ఓ మార్క్‌ ఉంటుంది. కొత్త రెండువేల రూపాయల నోట్లపై ఎడమ భాగంలో రెక్టాంగిల్‌ మార్క్‌ ఉంటుంది. అది అంధులు చేతితో తడమగానే ఉబ్బెత్తుగా వేలికి తగులుతుంది. దీంతో అది ఎంత నోటన్నది ఇట్టే చెప్పేయొచ్చు. ఒకవేళ అలాంటి మార్కు ఏదీ లేదంటే అది పక్కా నకిలీదిగా నిర్ధారణకు రావచ్చు. అదే విధంగా రెండు వేల రూపాయల నోటును 45 డిగ్రీల కోణంలో మలిచి చూస్తూ.. అందులో రెండువేల రూపాయలు అని ఆయిల్‌తో రాసిన నంబర్‌ కనిపిస్తుంది.

వాటర్‌ మార్క్‌ ఉంటే అసలు నోటు.. లేదంటే నకిలీ నోటు
కొత్త నోట్లలో వాటర్‌ మార్క్‌ లైన్‌ క్లియర్‌గా ఉంటుంది. వాటర్‌ మార్క్‌ను చూడగానే అది నకిలీ నోటో.. అసలు నోటో చెప్పేయొచ్చు. అలాగే ఏదైనా నోటు ఫేక్‌ నోటని అనుమానం వస్తే.. ఓ వైట్ పేపర్‌పై ఆ నోటును పెట్టి పెన్సిల్‌తో రుద్దితే.. ఆర్బీఐ అనే మార్క్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అలా కనిపించకపోతే.. అది నకిలీ నోటుగా తేల్చవచ్చు. ఇలా నోటును ట్రేస్‌ చేసి.. సామాన్యులు కూడా దీన్ని పసిగట్టవచ్చు.
నోట్లపై అవగాహన కల్పించాల్సిన అవసరం
కొత్త నోట్లను జిరాక్స్‌ తీసి అసలు నోట్లుగా చెలామణి చేస్తున్న నేపథ్యంలో.. ప్రజలకు కొత్త కరెన్సీ నోట్లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నకిలీ నోట్ల బెడద నేపథ్యంలో.. సామన్యుడికి భరోసాగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. 

13:23 - November 29, 2016
12:51 - November 29, 2016
12:48 - November 29, 2016

ఢిల్లీ : నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో టీచర్లు కదం తొక్కారు. ఎస్‌టీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

12:46 - November 29, 2016

జమ్ముకశ్మీర్‌ : ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. నగ్‌రోత ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలతో నగ్‌రోతలో విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు సాంబా సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌ ముగిసింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.

12:43 - November 29, 2016

కొలంబియా : ఘోర ప్రమాదం జరిగింది. బ్రెజిల్ నుంచి ఫుట్‌బాల్ క్రీడాకారులతో వెళ్తున్న విమానం కూలిపోయింది. మెడిల్లిన్స్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని పర్వతాల్లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఫుట్‌బాల్ క్రీడాకారులతో సహా 72 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో సరిపోయినంత ఇంధనం లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫుట్‌బాల్ క్రీడాకారులకు బుధవారం మెడిల్లిన్స్‌లో కోపా సౌదమెరికానా ఫైనల్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు క్రీడాకారులంతా బ్రెజిల్ నుంచి మెడిల్లిన్స్‌కు బయలేర్దారు.

12:39 - November 29, 2016

కరీంనగర్ : రామగుండంలో సింగరేణి ఉద్యోగులు పిల్లలు ఆందోళనకు దిగారు. షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ గుర్తింపు యూనియన్‌ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు అడ్డుకుని, వాగ్వాదానికి దిగారు. రామగుండం సింగరేణి మేడిపల్లి ఏపీసీ 4లో గుర్తింపు యూనియన్‌ నేతలు గేట్‌ మీటింగ్‌ నిర్వహిస్తుండగా వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఒక్క ఏడాది సర్వీసు ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

12:37 - November 29, 2016

విజయవాడ : ఏపీ రాజ‌ధానిలో చిల్లర కష్టాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. చిరు వ్యాపారులు చిల్లర కష్టాలతో అల్లాడుతున్నారు. ప్రస్తుతం శీతాకాల దుస్తులకు మంచి గిరాకీ ఉండాల్సినప్పటికీ.. చిల్లర దొరక్క వ్యాపారాలు న‌డ‌వ‌డం లేదని వ్యాపారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర నోట్లు అందుబాటులో లేక చిరు వ్యాపారులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం వున్న వింట‌ర్ సీజన్ రీత్యా వింటర్ క్లాత్స్ కి మంచి గిరాకీ వస్తుందని ఆశించిన వ్యాపారులకు నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ప్రారంభమయ్యాయి. రూ. 2000 నోటుకు చిల్లర దొరక్క బిజినెస్ పై ఎఫెక్ట్ పడిందని వారు వాపోతున్నారు.  

12:33 - November 29, 2016

ఢిల్లీ : ప్రధాని మోదీ బాణం గురి తప్పిందని టీడీపీ ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. నల్లకుబేరులపైకి సంధించిన బాణం సామాన్యులపై పడిందన్నారు. మోదీ ప్రధాని కావాలని ఆశించిన వారిపై నోటు రద్దు బాణం తగిలి విలవిల్లాడుతున్నారన్నారు. విచిత్ర గెటప్ లతో సందర్భానుసారంగా వేషాలు వేస్తూ సెంటారాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈరోజు మరో గెటప్ లో పార్లమెంట్ ఆవరణలో ప్రత్యక్షమయ్యారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ షర్ట్‌ ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చారు. బ్లాక్ మనీని స్విస్ బ్యాంక్ నుండి తీసుకొస్తానన్న ప్రధాని మోదీ నోట్ల రద్దును చేసి సామాన్యులపై మోదీ బాణాన్ని ఎక్కుపెట్టారని విమర్శించారు. మోదీ నిర్ణయంతో నల్లకుబేరులు సంతోషంగా ఉన్నారని.. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని శివప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల కష్టాలు తీర్చాలని మోదీకి విజ్ఞప్తి చేస్తూ.. కళాకారుడిగా వినూత్నంగా నిరసన తెలుపుతున్నట్లు చెబుతున్నానని ఎంపీ శివప్రసాద్‌ పేర్కొన్నారు. 

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..మహిళ మృతి

యాదాద్రి భువనగిరి : బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్కూల్స్ లో యోగా తప్పనిసరి : సుప్రీంకోర్టు..

ఢిల్లీ: యోగా స్కూల్ నుంచి తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈమేరకు ఇందుకు సంబంధించి కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? తెలపాలని కోరింది. 6వ ఏడు పిల్లల నుంచి 14వ వయసు వచ్చే వరకు యోగాను తప్పనిసరి చేయాలని కోరింది.

12:12 - November 29, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల నిర్ణయం అనుకున్న ఫలితాలను సాధిస్తుందా...? ప్రజా అవసరాలకు సరిపడా కరెన్సీని చెలామణిలోకి తీసుకురాకుండానే.. ప్రభుత్వం చిన్న చిన్న కష్టాలని తోసి పుచ్చుతోందా..? మోదీ నిర్ణయంతో అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నది సామాన్యులేనా...? ఇంతకీ నోట్ల రద్దు నిర్ణయం మున్ముందైనా... ఆశించిన స్థాయిలో సత్ఫలితాలిస్తుందా...? జస్ట్‌ వాచ్‌...!

మోదీ ప్రకటనతో చెలామణిలో ఉన్న 86 శాతం పెద్ద నోట్ల రద్దు
పెద్ద నోట్ల రద్దుకు ముందు ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేయకపోవడంతో... ప్రజల అవసరాలకు సరిపడా కొత్త కరెన్సీ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు.. ఇలా.. అనేక వర్గాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చెలామణిలో ఉన్న 86 శాతం పెద్ద నోట్లను రాత్రికిరాత్రి ఒకే ఒక్క ప్రకటనతో చెల్లుబాటు కాకుండా చేసిన ప్రధాని మోదీ.. అందుకు తగిన రీతిలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెద్దనోట్ల రూపంలో వున్నది 3 నుంచి 5 శాతం మాత్రమేనని ఆర్థికవేత్తల అంచనా..
నల్ల ధనం కట్టడి, తీవ్రవాదుల నిధులకు అడ్డుకట్టతో పాటు నకిలీ కరెన్సీని రూపు మాపాలన్న లక్ష్యంతో మోదీ పెద్ద నోట్లు రద్దు చేశారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే పెద్ద నోట్లు రద్దు చేశారో.. ఆ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అంతెందుకు..ఐదు వందలు, వేయి రూపాయల నోట్ల రూపంలో ఉన్నది కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమేనని ఆర్థికవేత్తల అంచనా. అంటే కేవలం 35 శాతం నల్లధానాన్ని నిరోధించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం..కొత్తగా 2 వేల రూపాయల నోట్లను తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

నోట్ల రద్దు వ్యవహారం ఆశించిన స్థాయిలో లేదంటున్న నిపుణులు
నోట్ల రద్దుతో తీవ్రవాదుల వద్ద గల నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడుతుందా అంటే... అదీ సాధ్యమయ్యే పరిస్థితి లేదనేది నిపుణుల వాదన. దేశవ్యాప్తంగా 400 కోట్ల నకిలీ కరెన్సీ అంటే.. ప్రతి పది లక్షల రూపాయల్లో కేవలం 250 రూపాయలు మాత్రమే నకిలీ కరెన్సీ చెలామణిలో ఉన్నట్లు గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్రవాదులు ఎక్కడ కూడా పెద్దనోట్లను తమ వెంట తీసుకెళ్లే అవకాశం లేదు. ఇటీవల సరిహద్దు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు తీవ్రవాదుల వద్ద కొత్త 2 వేల రూపాయల నోట్లు బయటపడటం ద్వారా.. పెద్ద నోట్ల ప్రభావం తీవ్రవాదాన్ని ఏ మేరకు నిరోధిస్తుందన్నది తేట తెల్లమవుతోంది. కాబట్టి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఆశించిన స్థాయిలో టెర్రిరిజాన్ని నిరోధించలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

నగదు మార్పిడి కోసం క్యూ లైన్లలో 71 మంది మృతి
భవిష్యత్‌ అభివృద్ధి దృష్ట్యా ప్రజలు చిన్న చిన్న కష్టాలను భరించలాని చెబుతున్న మోదీ ప్రభుత్వం సూచిస్తోంది. కానీ.. ఇప్పటికే నగదు మార్పిడి కోసం క్యూ లైన్లలో 71 మంది చనిపోయారు. అనారోగ్యం బారిన పడి.. సరైన సమయంలో చికిత్స అందక అనేక మంది పిల్లలు మృతి చెందారు. ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. ఇవి చిన్న చిన్న కష్టాలెలా అవుతాయన్న ప్రశ్నలు సామాన్యుల్లో వెల్లువెత్తుతున్నాయి.

టెక్స్‌టైల్‌, గార్మెంట్స్‌, జ్యువెల్లరీ రంగాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఫట్‌
మరోవైపు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. టెక్స్‌టైల్‌, గార్మెంట్స్‌, లెదర్‌, జ్యువెల్లరీ, తదితర రంగాల్లో ఈ వారంలోనే దాదాపు 4 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. 6 మిలియన్లకు పైగా కార్మికులకు ఇప్పటికీ జీతాలు అందలేదు. ప్లాంటేషన్‌ రంగానికి చెందిన దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులూ..నోట్ల రద్దు దెబ్బతో తీవ్ర కష్టాల్లో మునిగిపోయారు. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నా... మోదీ ప్రభుత్వం మాత్రం మున్ముందు మంచి రోజులొస్తాయని చెబుతూ.. తీవ్ర ఇక్కట్లకు గురిచేయడం సబబు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

లావాదేవీల కోసం మొబైల్‌ యాప్‌లను వాడాలని సూచిస్తున్న కేంద్రం
నగదు రహిత లావాదేవీల కోసం మొబైల్‌ యాప్‌లను వాడాలని సూచిస్తున్న సర్కార్‌.. అసలు దేశంలో ఇంకా చాలామంది నిరక్షరాస్యులున్నారన్న విషయాన్ని మరిచిపొతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అసలు బ్యాంకు ఖాతాలే తెరవని వాళ్లూ చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఆశిస్తున్న ప్రతిఫలాలు ఏ మేరకు అందిపుచ్చుకుంటామన్ని ప్రశ్న అందిరినీ వేధిస్తోంది.

గడువు మరింత పెంచాలని వామపక్షాల డిమాండ్‌
ఈ నేపథ్యంలోనే..మోదీ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల అవసరాలకు సరిపడా కొత్త కరెన్సీని చెలామణిలోకి తీసుకురాకుండా.. పాత ఐదు వందలు, వేయి నోట్లను డిసెంబర్‌ 30 గడువు పెట్టడంపై దేశవ్యాప్త నిరసనలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్నామ్నాయ మార్గాలు చూపకుండా.. స్వల్ప కాల గడువు పెట్టడం సరికాదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. 500, వేయి రూపాయలతో రైతుల లోన్లు, అవసరాలు తీర్చుకునేలా గడువు ను మరింత పెంచాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఉభయసభలు మరోసారి వాయిదా..

ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన ఉభయసభలు తిరిగి ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే తిరగి వాయిదా పడ్డాయి. లోక్‌సభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే మళ్లీ పెద్ద నోట్ల రద్దుపై రగడే జరిగింది. ప్రధాని సభకు వచ్చి నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలని ప్రతిపకాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ సభను ఉదయం 11గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే అదే సీను క్రియేట్ అయింది. దీంతో స్పీకర్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు అదే నిరసన కొనసాగించటంతో ఉభయ సభలూ మధ్యహ్నాం 2గంటలకు వాయిదా పడ్డాయి. 

11:44 - November 29, 2016

కొలంబియా :  ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యంత దారుణమైన ప్రమాదం జరిగింది.  కొలంబియాలో బ్రెజిల్ విమానం కూలిపోయింది. బ్రెజిల్ నుండి సాకర్ క్రీడాకారులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో 70మందికి పైగా ప్రయాణీకులున్నట్లుగా అంచనా. వీరందరూ మృతి చెందినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  సౌత్ అమెరికన్ ఫుట్ బాల్ టీమును తీసుకువెళుతున్న విమానం కొలంబియాలో కుప్పకూలిపోయింది.ఈ విమానంలో మొత్తం 70 మంది ప్రయాణీకులుండగా వారిలో అత్యధికులు ఫుట్ బాల్ టీంకు చెందిన జట్టు అధికారులేనట్లుగా తెలుస్తోంది. సౌత్ అమెరికన్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడేందుకు చాపెకోయిన్సే ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా విమానంలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఈ దుర్ఘటన జరిగినట్లుగా సమాచారం. 

ఉభయ సభలూ వాయిదా..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆందోళన కొనసాగుతోంది. మంగళవారం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చ చేపట్టాలని.. ప్రధాని మోదీ చర్చలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. భాజపా పార్లమెంటరీ సమావేశం కొనసాగుతున్నందున ప్రధాని ఇప్పుడు రాలేదని.. చర్చ ప్రారంభిస్తే.. ప్రధాని మధ్యలో హాజరవుతారని తెలిపారు. కానీ వారు వినకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

11:29 - November 29, 2016

ఢిల్లీ : పార్లమెంటరీ సమావేశంలో భాగంగా ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నోట్ల రద్దుపై చర్చ కోసం రాజ్యసభలో విపక్ష సభ్యులు పట్టుపట్టాయి. ప్రధాని చర్చకు రావాలంటూ మాయావతితో పాటు విపక్ష సభ్యులు నినాదాలు చేసారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్యలో మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నోట్ల రద్దు అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా వుందనీ..ముందు చర్చ ప్రారంభించాలని కోరారు. చర్చకు ప్రధాని మోదీ హాజరవుతారని తెలిపారు. అయినా వినని విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు కొనసాగించారు. ప్రధాని చర్చకు వస్తేనే చర్చ చేపడతామని ఈక్రమంలో మధ్యహ్నాం 12గంటలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభనువాయిదా వేశారు. ఇదే వాతావరణం లోక్ సభలో కూడా కొనసాగటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను మధ్యహ్నాం 11.30లకు రాజ్యసభ 12గంటలకు వాయిదా వేశారు. 

11:28 - November 29, 2016

మెదక్ : సామాజిక న్యాయం సమాగ్రాభివృద్ధి లక్ష్యంగా..సాగుతున్న మహాజన పాదయాత్ర 43 వ రోజు పూర్తి చేసుకుంది. పల్లెపల్లెలో తమ్మినేని పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభిస్తోంది. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.

43వ రోజు..1070 కిలోమీటర్ల పాదయాత్ర..
సీపీఎం మహాజన పాదయాత్ర 43వ రోజుకు చేరింది. 1070 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మెదక్‌ జిల్లాలో పాదయాత్ర కొనసాగింది. 43వ రోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్‌లో ప్రారంభమైన ఈ పాతయాత్ర .. ఎల్లారెడ్డిపేటలో ముగిసింది. దౌలతాబాద్‌ దగ్గర పాదయాత్ర బృందం బీసీ గురుకులాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను తమ్మినేని బృందం దృష్టికి తెచ్చారు. హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని తమ్మినేని అన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. విద్యార్థులు నిజాయితీగా ఉన్నప్పుడే దేన్నైనా సాధిస్తారని..కుల పట్టింపులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా.. గిరిజనుల జీవితాలు ఇంకా మారలేదు..
ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా.. గిరిజనుల జీవితాలు ఇంకా మారలేదని ఆదివాసి గిరిజన నేత నైతం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు లేక గిరిజన గూడెలు అల్లాడుతున్నాయని ఆయన ఆవేదన చెందారు. వెంటనే ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లెల్లో ప్రజలకు కనీసం మంచినీళ్లు అందించని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వట్టి మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తుందని నైతం రాజు అన్నారు.

 

11:02 - November 29, 2016

కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ సమావేశం..

ఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై తొలిసారిగా ప్రధాని మోదీ ఈరోజు లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీ నుంచి పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తున్న విపక్షాలను శాంతింపజేసేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో ఒకరోజు చర్చ జరిగినా ముందుకు వెళ్లలేదు. ప్రధాని మోదీ సభకు వచ్చిన తరువాతే చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

10:53 - November 29, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దై 21 రోజు కొనసాగుతోంది. . జనం కష్టాలు మాత్రం తీరడంలేదు. నగరంలోని రవీంద్రభారతి వద్ద వున్న రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉదయం నుండే జనం బారులు తీరి నిల్చున్నారు. బ్యాంకుల ముందు గంటలకొద్దీ నిల్చుని.. జనం విసుగెత్తి పోతున్నారు. డిమాండ్‌కు తగినంత క్యాష్‌ లేకపోవడంతో..కరెన్సీకోసం సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంలచుట్టూ తిరుగుతూనే ఉన్నారు.. గంటలకొద్దీ క్యూకట్టినా నగదు దొరక్క అవస్థలు అనుభవిస్తున్నారు.. రెండు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకోవడంతో .. బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరారు. మరోపక్క 50రోజలు ఓపిక పట్టాలని కేంద్రం చెబుతోంది.. ఇప్పటికే 20రోజలు గడిచి పోయాయి. అయినా ఈ కష్టాలకు కనీసం కామా కూడా పడే పరిస్థితుల కానరావటంలేదు.

లారీ..బస్ ఢీ..ముగ్గురు మృతి..

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 44 నంబరు జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని ఓ ప్రయివేట్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

కరెన్సీ కట్టల తరలింపు..అరెస్ట్..

అనంతపురం : న‌ల్లధనం మాట ఏమో కానీ కొత్తనోట్ల క‌ట్ట‌లు మాత్రం భారీగా వెల్లడవుతున్నాయి. ఆదివారం రాత్రి అనంత‌పురంలో వాహ‌నాలు త‌నిఖీ చేస్తున్న పోలీసుల‌కు కొత్త రూ.2వేల నోట్ల క‌ట్ట‌లు క‌నిపించాయి. కారులో వెళ్తున్న ఓ వ్య‌క్తి బ్యాగును త‌నిఖీ చేయగా అందులో రూ.18 ల‌క్ష‌ల విలువైన కొత్త రూ.2వేల నోట్లు క‌నిపించాయి. నోట్లు త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని ధ‌ర్మ‌వ‌రానికి చెందిన బంగారం వ్యాపారి ర‌వూఫ్‌గా పోలీసులు గుర్తించారు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీసులు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు అప్ప‌గించారు.

నగ్రోటాలో ఉగ్రదాడి..

జ‌మ్ముక‌శ్మీర్‌ : లో మ‌రోమారు ఉగ్ర‌వాదులు తెగ‌బ‌డ్డారు. కూంబింగ్ నిర్వ‌హిస్తున్న భ‌ద్ర‌తాద‌ళాల‌పై కాల్పులు జ‌రిపారు. దీంతో స్పందించిన ఆర్మీ తిరిగి కాల్పులు ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఇరు వ‌ర్గాల మ‌ధ్య భీకర ఎన్‌కౌంట‌ర్ కొన‌సాగుతోంది. ఈ ఉద‌యం 5.30 గంట‌ల స‌మ‌యంలో జ‌మ్ములోని న‌గ్రొట్టా స‌మీపంలోని ఆర్మీ యూనిట్‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించారు. గ్రనేడ్లు విసురుతూ కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు జ‌వాన్ల‌కు గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

ర‌వీంద్ర‌భార‌తి విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ కు శిక్ష ఖరారు..

హైదరాబాద్ : ర‌వీంద్ర‌భార‌తి విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ స‌హా మ‌రో ఏడుగురికి నందిగామ కోర్టు శిక్ష‌లు ఖ‌రారు చేసింది. ఒక్కొక్క‌రికి రెండేళ్ల జైలు శిక్ష, ప‌దివేల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తూ తీర్పు వెల్ల‌డించింది. 2005లో మున్నేరువాగులో స్నానానికి దిగిన ర‌వీంద్ర‌భార‌తి స్కూలు విద్యార్థుల్లో 15 మంది ప్ర‌మాద‌వ‌శాత్తు అందులో మునిగి మృతి చెందారు. ఈ కేసును విచారిస్తున్న నందిగామ కోర్టు విచార‌ణ పూర్తికావ‌డంతో శిక్ష‌లు ఖ‌రారు చేసింది. విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ వీర‌మాచ‌నేని వెంక‌టేశ్వ‌ర‌రావుతోపాటు మ‌రో ఆరుగురికి రెండేళ్ల జైలు శిక్ష‌, రూ.10 వేల జ‌రిమానా విధించింది.

పెయింటర్ దారుణ‌హ‌త్య‌..

పశ్చిమగోదావరి : ఏలూరు జూట్‌మిల్ స‌మీపంలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు అత‌డిని రాళ్ల‌తో దారుణంగా కొట్టి చంపారు. మృతుడు వ‌న్‌టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని నాగేంద్ర కాల‌నీకి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడు పెయింట‌ర్‌గా పనిచేస్తుంటాడ‌ని పోలీసులు తెలిపారు. 

10:46 - November 29, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు..కొత్తనోట్ల కష్టాలు రోజురోజుకూ కొనసాగుతున్నాయి. పాత నోట్లు చెల్లక..కొత్త పెద్దనోట్లకు చిల్లర దొరక అటు కొనుగోలుదారులు..ఇటు వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నామనీ ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు చూడలేదని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద రూపాలయ బేరానికి కూడా కొనుగోలు దారులు రెండు వేల నోటు ఇస్తున్నారనీ దీంతో బేరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కూరగాయల వ్యాపారులు పేర్కొంటున్నారు. 

10:44 - November 29, 2016

గుంటూరు : పెద్ద నోట్లు రద్దు చేసి 21 రోజులు అయ్యింది. బ్యాంకులు, ఏటీఎంల్లో చాలినంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో ప్రజల కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నగదు విత్‌ డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర జనం బారులు తీరారు. చాలా నోట్ల ఏటీఎంలను మూసివేశారు. చెక్‌ ద్వారా 24 వేల రూపాయలు విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించినా.. బ్యాంకులు మాత్రం రెండు లేదా మూడు వేల రూపాయలు మించి ఇవ్వడంలేదు. అదేమని పశ్నిస్తే నగదు అందుబాటులో లేదని బ్యాంకు అధికారులు పేర్కొంటుంటే..మరోపక్క చిల్లర దొరక్క..పాతనోట్లు మారక ప్రజలు నానా పాట్టు పడుతున్నామని వాపోతున్నారు. ఇక ఇంట్లో శుభకార్యాలు వున్నవారి పరిస్థితి మరీ దారుణంగా వుంది. నియమిత ఎమౌంట్ డ్రాతో వారి పాట్లు వర్ణనాతీతంగా వున్నాయి. 

10:42 - November 29, 2016

జమ్ము కశ్మీర్ : భారత్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగ్రోటలోని ఆర్మీ యూనిట్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉదయం 5గంటల ప్రాంతంలో ఈఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన ప్రాంతాన్ని సైనిక దళాలు చుట్టుముట్టి అణువణువునా గాలిస్తున్నారు. దాదాపు 12మంది ఉగ్రవాదులు నగ్రోటాలోని ఆర్మీ యూనిట్ లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. సైనిక శిబిరం గేటు దగ్గర కాపలా ఉన్న జవాన్లపై గ్రెనేడ్లుతో దాడి చేసి లోపలికి చొరబడ్డారు. దీంతో తేరుకున్న సైనిక దళాలు ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదుల కూడా కాల్పులు జరపడంతో ఈ ప్రాంతంలో భయానక వాతావరంణ నెలకొంది. సైనికులు, ఉగ్రవాదులు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను, మరో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ గాయపడ్డారు. భారత సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. జమ్ము-కశ్మీర్‌లోని చెమ్లియాల్‌ ప్రాంతంలో కూడా మరో ఉగ్రవాద దాడి జరిగింది. గస్తీ తిరుగున్న బీఎస్ఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పౌరులెవ్వరూ బైటకు రావద్దని ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. 

10:41 - November 29, 2016

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 44 నంబరు జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని ఓ ప్రయివేట్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఓ మహిళ రోడ్ క్రాస్ చేస్తేన్న నేపథ్యంలో వేగాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవటంతో బస్ లారీని ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. 

10:39 - November 29, 2016

ఢిల్లీ : ఆదాయపన్నుచట్ట సవరణ బిల్లును కేంద్రం సోమవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పలు కీలక సవరణలతో కూడిన ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టారు. లెక్కల్లోచూపని ఆదాయాన్ని 50 శాతం పన్ను చెల్లించడం ద్వారా వైట్‌గా మార్చుకోవచ్చని ఈ బిల్లులో ప్రతిపాదించారు.మిగిలిన 50శాతంలో 25శాతం మొత్తాన్ని వెంటనే విత్‌ డ్రా చేసుకోవచ్చని.. మిగిలిన మొత్తాన్ని నాలుగేళ్ల తర్వాత తీసుకొనేలా సవరణలు ప్రతిపాదించారు. ఈలోగా అధికారుల దాడుల్లో నల్లధనం వెలుగు చూస్తే.. ఆ మొత్తంలోంచి 85 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుగానూ బిల్లులో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నేడు లోక్ సభలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా మంగళవారం లోక్ సభకు హాజరయ్యే అవకాశాలున్నట్లుగా సమాచారం.ఈక్రమంలోనే బీజేపీ ఎంపీలందరికీ ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఎంపీలందరూ సభకు హాజరుకావాలని విప్ లో ఆదేశాలు జారీ చేశారు. దీంతో లోక్ సభలో చర్చ జరుగుతుందా? లేదా రచ్చ జరుగుతుందా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.

10:38 - November 29, 2016

గుంటూరు : ఒకటో తారీఖు వస్తుందంటే చాలు.. ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో... వేతన జీవుల గుండెల్లో మరింత దడపుడుతోంది. పాత నోట్ల రద్దు వల్ల ఆదాయం తగ్గినా.. ఉద్యోగుల వేతనాలకు సమస్య లేదని, బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలా సొమ్మును ఎలా తీసుకోవాలన్న భయం ఉద్యోగులను వేధిస్తోంది. అందుకే ఏపీ ఉద్యోగులంతా ఇప్పుడు వామ్మో ఒకటో తారీఖు అంటూ హడలెత్తిపోతున్నారు.

20 రోజులు కావొస్తున్నా... ఇంకా నగదు కొరత
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. 80 శాతం ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి 20 రోజులు కావొస్తున్నా... ఇంకా నగదు కొరత మాత్రం తీరడం లేదు. ప్రజల అవసరాలకు తగిన నగదు లభించట్లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలా..? లేక బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితుల నేపథ్యంలో అవసరాలకు తగిన సొమ్మును.. ఎలా విత్‌డ్రా చేసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. ఇంటి అద్దె, పాల ఖర్చులు, కూరగాయల కొనుగోలు, పిల్లల ఫీజులతో పాటు ఇతర ఖర్చులకు చేతిలో డబ్బు ఎలా అన్న సందిగ్ధంలో పడిపోయారు. హర్యానా, తెలంగాణ ప్రభుత్వాల తరహాలో తమకూ వేతనంలో పదివేలో, పదిహేను వేలో నగదు రూపంలో ఇచ్చి మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయాలన్న ఆలోచన చేస్తే బాగుంటుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. కానీ వేతనాల్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి.

మరింత దారుణంగా అమరావతి ఉద్యోగుల పరిస్థితి
అమరావతి ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లిన ఉద్యోగులు.. చాలామంది తమ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచి ఒంటరిగానే అమరావతి వెళ్లారు. దీంతో అటు ఏపీలో.. ఇటు హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. వారాంతంలో కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేందుకు రవాణా ఖర్చులూ కలిసి తడిచి మోపడవుతున్నాయి. దీంతో ఒకటో తారీఖు జీతం తీసుకుంటే గానీ కుటుంబాలు గడవని పరిస్థితితో ఉద్యోగులున్నారు. జీతం రాగానే విత్‌డ్రా చేసుకుంటే గానీ... రెండుచోట్లా ఇంటి అద్దెలు, పాలబిల్లులు, కూరగాయలు, ఇతర ఖర్చులకు సరిపోదని ఉద్యోగులు వాపోతున్నారు.

24 వేలు తీసుకోడానికి అనుమతించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ
ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే 15.66 లక్షల మందికిపైగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఒకటోతేదీ తర్వాత బ్యాంకులకు నగదు విత్‌డ్రాకోసం వస్తే పరిస్థితి ఎలాగుంటుందో ఊహించడమే కష్టంగా ఉందని బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులు, ఆర్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఒక్కో వ్యక్తి వారంలో గరిష్టంగా 24 వేలు తీసుకోడానికి అనుమతించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిందే తప్ప ఆ మేరకు కొత్తనోట్లు అందుబాటులోకి తేలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.

ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలంటున్న ఉద్యోగులు
హైదరాబాద్ నుంచి అమరావతికి రావడంవల్ల చాలా నష్టపోయామని ఆంధ్రా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో వేతనాలు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోతే.. డబ్బుల్లేక మానసికంగానూ ఇబ్బంది పడాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.  

10:37 - November 29, 2016

పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరులో హత్యల పరంపర కొనసాగుతోంది. కాగా గతంలో ఓ కార్పెంట్ కూడా దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ పెయింటర్ హత్యకు గురయ్యాడు. పశ్చిమగోదావరి గోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జూట్ మిల్లు సెంటర్ వద్ద ఒక వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతుడు వన్‌టౌన్‌కు చెందిననాగేంద్రకాలనీ వాసి పెయింటర్ రాజుగా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి మద్యం త్రాగి వస్తుండగా దారిలో హత్యకు గురయినట్లుగా తెలుస్తోంది. మృతుడి పక్కన ఓ నాపరాయి ముక్కలు వుండటంతో మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణతో హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్టున్న‌ట్టు పేర్కొన్నారు. పాత‌క‌క్ష‌ల నేప‌థ్యంలోనే హ‌త్య జ‌రిగి ఉంటుంద‌ని అనుమానిస్తున్న‌ట్టు తెలిపారు. ద‌ర్యాప్తు అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు  పేర్కొన్నారు.

10:34 - November 29, 2016

పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చాలన్న డిమాండ్‌తో... విపక్షాలు భారత్‌ బంద్‌ను నిర్వహించాయి. కాగా బంద్ పై బీజేపీ మాట్లాడుతూ ఇది భారత్ బంద్ కాదు అవినీతి బంద్ అని పేర్కొంది. బంద్ పై సక్సెస్ కాలేదనీ..ప్రజలు దీనిపై పెద్దగా స్పందించలేదని..ప్రజలు నోట్ల రద్దును సమర్థిస్తున్నారనీ దీనికి విపక్షాల బంద్ కు ప్రజల స్పందనే నిదర్శనం అని బీజేపీ అంటోంది...ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో నంద్యాల నర్శింహారెడ్డి(సీపీఎం నేత),నగేష్ కుమార్ (ప్రముఖ విశ్లేషకులు) తులసీ రెడ్డి (ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి),తాడూరి శ్రీనివాస్(టీఆర్ఎస్ నేత)పాల్గొన్నారు. ఈ అంశంపై సీపీఎం నేత నంద్యాల నర్శింహారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలి తప్ప మొండిగా వ్యవహరించకూడదని సూచించారు. నోట్ల రద్దుపై చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైందనీ..భారత్ లో నగదు రహిత లావాదేవీలు అసాధ్యమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి..

10:28 - November 29, 2016

మన దేశంలో ఆన్ లైన్ లావాదేవీలకు సంబంధించిన నాలెడ్జి వున్న వారి సంఖ్య చాలా తక్కువ. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్లో వున్న డబ్బులను ఎక్కడో విదేశాల్లో వున్న సైబర్ నేరగాళ్లు కూడా దొంగిలించే అవకాశం వుంది.

డబ్బుల్లేని ఏటీఎంలు 80శాతం
పెద్ద నోట్లు రద్దు చేసి మూడు వారాలైంది. నాలగవ వారంలో కూడా ఏటిఎంల దగ్గర క్యూలు కనిపిస్తున్నాయి. 80శాతం ఏటిఎంలలో డబ్బుల్లేవు. ఒకటో తేదీ తర్వాత పరిస్థితి తలచుకుంటే గుండెల్లో దడ పుడుతోంది. ప్రతి నెలా మొదటి వారంలో సాధారణ రోజుల్లోనే చాలా ఏటిఎంలలో నో క్యాష్ బోర్డులు వేలాడుతుండేవి. ఒకటో తేదీ తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటి అద్దె, పాలు, చిల్లర సామానులు, పనిమనిషి ఇలా రకరకాల బిల్లులు చెల్లించాల్సి వుంటుంది. తమ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులున్నా వాటిని డ్రా చేసుకోలేని స్థితిలో ఈ దేశప్రజలు చిక్కుకున్నారు. ఇలాంటి దయనీయ స్థితి ఇంతకుముందెన్నడూ తలెత్తలేదు.

2015 16 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జిడిపి 136 లక్షల కోట్లు..
కేంద్ర ప్రభుత్వం, ఆర్ బిఐ కొత్త కరెన్సీ సరఫరా విషయంలో పూర్తిగా విఫలమయ్యాయి. ప్రజలు డిపాజిట్ చేసినదాంట్లో కనీసం నాలుగో వంతు కొత్త నోట్లను సరఫరా చేయలేకపోయారు. చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే ఇంకా జేబులో పర్సు ఎందుకంటూ ప్రధాని నరేంద్రమోడీ చిలుకపలుకలు పలుకుతున్నారు. ఇక మనమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లోనికి, ఆన్ లైన్ బదలాయింపుల్లోకి, నగదు రహిత లావాదేవీలలోకి మరలిపోవాలంటూ ప్రతిరోజూ హితోపదేశాలు చేస్తున్నారు. మా డబ్బులు మాకివ్వండి మహాప్రభో అని జనం మొత్తుకుంటుంటే, ఆయన డిజిటల్ కలలు కంటూ కాలం కరగదీస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఊహాలోకాల్లో విహరించకుండా, వాస్తవికంగా ఆలోచించి, రద్దయిన నోట్లకు సరిసమానంగా కొత్త నోట్లను సరఫరా చేసి వుంటే, ఇవాళ జనం రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తేది కాదు. కొత్త నోట్ల ముద్రణ, సరఫరా విషయంలో తన అసమర్ధతను నిరూపించుకున్న ప్రభుత్వం ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లాలంటోంది. 2015 16 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జిడిపి 136 లక్షల కోట్లు. ఇందులో నగదు రహిత లావాదేవీలు జరిగింది కేవలం 11.3 లక్షల కోట్లే. ఈ విషయం తెలిసి క్యాష్ లెస్ ఎకానమీ గురించి మాట్లాడడంలో అర్ధం లేదు. 120 కోట్ల మంది జనాభా వున్న మన దేశంలో 17 కోట్ల మందికే స్మార్ట్ ఫోన్లున్నాయి. 48 కోట్ల మందికే ఇంటర్నెట్ యాక్సెస్ వుంది. వీరిలో రోజుకి ఒక్కసారైనా ఇంటర్నెట్ వాడేవారు కేవలం 20 కోట్ల మందే. మనదేశంలో 64.5 కోట్ల డెబిట్ కార్డులున్నాయి. మూడు నాలుగు డెబిట్ కార్డులున్నవారు కూడా చాలామంది వున్నారు. డెబిట్ కార్డు వున్నవారందరికీ దానిని వినియోగించడం తెలియదు. ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేయాలంటే పక్కవారి సహాయం కోరేవారు నిత్యం మనకు తటస్థపడుతూనే వుంటారు. ఇలాంటి సమయంలో డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడడంలో అర్ధం వుంటుందా?

దేశంలో దాదాపు 65 లక్షల డెబిట్ కార్డులు హ్యాక్ అయినట్టు గుర్తింపు
డిజిటల్ లావాదేవీల గురించి ఎంతో కొంత అవగాహనవున్నవారు కూడా తరచూ మోసాల బారినపడుతున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నోట్ల రద్దు కొద్ది వారాల క్రితమే మన దేశంలో దాదాపు 65 లక్షల డెబిట్ కార్డులు హ్యాక్ అయినట్టు గుర్తించిన బ్యాంక్ లు వాటిని నిలిపివేసి, కొత్తవి జారీ చేశాయి. సకాలంలో గుర్తించి, బ్యాంక్ లు స్పందించబట్టి సరిపోయింది. ఒకవేళ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించి వుండకపోతే, అంతమంది ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? వారి సొమ్మంతా ఏమైపోయి వుండేది? డిజిటల్ లావాదేవీల వల్ల ఎన్ని సుఖాలు, సౌక్యాలున్నాయో, అన్ని రకాల ముప్పులూ పొంచివున్నాయి. ఎక్కడో నైజీరియాలో వున్న సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును మొత్తానికి మొత్తం ఊడ్చేసే ప్రమాదం వుంది. అలాంటి కేసులూ భారీగానే వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టే రక్షణాత్మక చర్యల మీద పెడుతున్న శ్రద్ధ చాలా తక్కువ. ఏటిఎం కేంద్రాల్లోనూ, దుకాణాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల దగ్గర మన కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేరగాళ్లు దొంగిలించే ఆస్కారం వుంది. మనకు తెలియకుండానే మన సిమ్ కార్డును బ్లాక్ చేయించి, మరో డూప్లికేట్ సంపాదించి, దాని సహాయంతో మన అకౌంట్లలోని డబ్బును కొల్లగొట్టే వీలుంది. ఇక పేటిఎం లాంటి ఈ వ్యాలెట్ సంస్థలు సరియైన రక్షణాత్మక చర్యలు తీసుకోకపోతే, వాటి ద్వారా కూడా మన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలో పడే ప్రమాదం వుంది. ఇలా అనేకరకాలుగా సైబర్ నేరగాళ్లకు ద్వారాలు తెరచి వున్న సమయంలో రాత్రికి రాత్రి మనదగ్గరున్న నోట్లు రద్దు చేసి, కొత్త నోట్లు అందుబాటులో లేకుండా చేసి, మాయోపాయాలతో కోటానుకోట్ల మందిని బలవంతంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ లోకి నెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం? దేశం కోసమా? కొన్ని కార్పొరేట్ గద్దల కోసమా? రక్షణాత్మక చర్యలకు సంబంధించిన నాలెడ్జి లేని ఫలితంగా రేపు ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడి, తమ బ్యాంక్ అకౌంట్ల లో వున్నదంతా కోల్పోతే, దానికి బాధ్యత మోడీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? కోల్పోయిన సొమ్మును తిరిగి తెప్పిస్తుందా? అసలు ఇప్పుడు సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎన్నింటిని పరిష్కరిస్తున్నారు? సైబర్ నేరాలను ఛేదించే విషయంలో మన పోలీస్ లకున్న పరిజ్ణానం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నోట్లను రద్దు చేసి పారేసిన మోడీ ప్రభుత్వం మీద లేదా? 

09:44 - November 29, 2016

పాత నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రజలంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లాలంటోంది. ఆర్ బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడుతున్నారు. అయితే, డిజిటల్ లావాదేవీలు సురక్షితమేనా? అసలు మన దేశంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించే నాలెడ్జి ఎంత మందికి వుంది? సైబర్ నేరాలు ఏయే రూపాల్లో జరిగే అవకాశం వుంది? ఏటిఎం కేంద్రాల్లోనూ, పాయింట్ ఆఫ్ మిషన్ల దగ్గర కార్డులు స్వైప్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఫ్రీ సాఫ్ట్ వేర్ మూవ్ మెంట్ యాక్టివిస్ట్ కిరణ్ చంద్ర 10టీవీ స్టూడియోకి వచ్చారు. మరింత సమచారానికి ఈ వీడియో చూడండి..ఆన్ లైన్ లో మెలకువలను తెలుసుకోండి..

07:13 - November 29, 2016

తూర్పుగోదావరి : పోల‌వ‌రం ర‌ణం మొద‌ల‌య్యింది. స‌ర్కారు సంగ‌తి తేలుస్తామంటూ సీపీఎం హెచ్చరించింది. నిర్వాసితుల గోడు పట్టించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పోల‌వ‌రం విలీన మండ‌లాల కేంద్రం చింతూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది నిర్వాసితుల‌తో బ‌హిరంగ‌స‌భ జ‌రిగింది.

27 రోజుల పాటు పాద‌యాత్ర..610 కిలోమీట‌ర్లు
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పోల‌వ‌రం చుట్టూ చ‌ర్చ సాగిస్తోంది. 2018 నాటికి ప్రాజెక్ట్ క‌ట్టితీరుతామ‌ని ఇప్పటికే ప్రక‌టించింది. సీఎం చంద్రబాబు కూడా ప్రతీ సోమ‌వారాన్ని పోల‌వ‌రంగా మార్చేస్తున్నట్టు ప్రక‌టించారు. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్ట్ నిర్వాసితులు స‌మ‌స్యలు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సీపీఎం క‌న్నెర్ర చేసింది. విలీన మండ‌లాల్లో పేరుకుపోతున్న ప్రజా స‌మ‌స్యల‌కు తోడుగా పోల‌వ‌రం నిర్వాసితుల న‌ష్టప‌రిహారంపై పాద‌యాత్ర సాగించింది. 27 రోజుల పాటు సాగిన పాద‌యాత్ర ప‌లు మండ‌లాల్లో 610 కిలోమీట‌ర్ల మేర సాగింది.

వేలాది మంది నిర్వాసితులతో భారీ బహిరంగ సభ
పాద‌యాత్ర ముగింపు సంధర్భంగా చింతూరులో నిర్వహించిన స‌భ‌కు వేలాదిగా గిరిజ‌నులు, నిర్వాసితులు త‌ర‌లివ‌చ్చారు. పున‌రావాస ప్యాకేజీపై పోరుయాత్ర సాగించారు. ద‌శాబ్దం క్రితం నాటి ప్రాజెక్ట్ పున‌రావాస ప్యాకేజీ అమలు విష‌యంలో రీ స‌ర్వే చేయాల‌ని డిమాండ్ చేశారు. బాధితులంద‌రికీ పూర్తి స్థాయి న‌ష్ట ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. పున‌రావాసం చెల్లించ‌కుండా ప్రాజెక్ట్ ప‌నులు చేప‌ట్టాల‌ని ప్రయ‌త్నిస్తే స‌హించేది లేద‌ని హెచ్చరించారు.

సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యురాలు బృందాకారత్‌ ఆగ్రహం
చింతూరు ఐటీడీఏ నుంచి సెంట‌ర్ వ‌ర‌కు సాగిన ర్యాలీ త‌ర్వాత బ‌హిరంగ‌ స‌భ జ‌రిగింది. స‌భ‌లో పాల్గొన్న సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యురాలు బృందాకారత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజ‌నుల‌తో క‌లిసి నృత్యం చేసిన ఆమె వేదిక ఎక్కిన త‌ర్వాత చంద్రబాబుకి ఘాటు హెచ్చరిక‌లు చేశారు. ఏపీ సీఎం మ‌హా ఉన్మాది అని విమ‌ర్శించారు. మ‌నుషులంటే చంద్రబాబుకి లెక్కలేద‌న్నారు. డ‌బ్బు కోసం ఏం చేయ‌డానికైనా తెగించే వ్యక్తిలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. గిరిజల‌ ప‌ట్ల మాన‌వ‌త్వం మ‌ర‌చిపోతున్నార‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గిరిజ‌న ప్రాంతాల‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది : మధు
ప్రభుత్వం గిరిజ‌న ప్రాంతాల‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంద‌ని సీపీఎం రాష్ట్ర కార్యద‌ర్శి మ‌ధు ఆరోపించారు. క‌నీసం విద్య, వైద్య స‌దుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేద‌న్నారు. విలీన మండ‌లాల ప్రజ‌లను గాలికొదిలేశార‌ని విమ‌ర్శించారు. చంద్రబాబు త‌న వీపును చూసుకుని బ‌లం అనుకుంటున్నార‌ని.. ప్రజ‌లు త‌గిన పాఠం చెబుతార‌ని హెచ్చరించారు. రావ‌ణుడి తోబుట్టువులా వ్యహ‌రిస్తున్నార‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై మండిపడ్డ నేతలు
పాద‌యాత్రలో పాల్గొన్న సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజ‌య్య , మాజీ ఎంపీ మిడియం బాబు రావు త‌దిత‌ర నేత‌లు కూడా చంద్రబాబు స‌ర్కారుపై దుమ్మెత్తిపోశారు. గిరిజ‌నుల స‌మ‌స్యలు ప‌ట్టని స‌ర్కారు ఏజెన్సీ వాసుల‌కు అన్యాయం చేయాల‌ని చూస్తే అడ్డుకుని తీరుతామ‌ని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యద‌ర్శి అరుణ్ తో పాటు ప‌లువురు నేత‌లు ఈ సభలో పాల్గొన్నారు.

మరోసారి నిర్వాశితుల సమస్యలు తెరపైకి
మ‌రోసారి పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్యలు ఈ పాద‌యాత్ర ద్వారా తెర‌ మీద‌కు రావ‌డంతో చ‌ర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం మీద పెడుతున్న శ్రద్ధ నిర్వాసితుల మీద చూప‌క‌పోవ‌డంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 

07:11 - November 29, 2016

గుంటూరు : ఓవైపు నోట్ల రద్దుతో ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంటే...మరోవైపు అభివృద్ధి పథకాల నిర్వహణ ఏపీ సర్కారుకు తలకు మించిన భారమవుతోంది. దీంతో విదేశీ నిధులపై ఆశగా చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విదేశీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు అదనపు నిధులు సంపాందించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

రాష్టంలో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపడతామని.. మౌలిక స‌దుపాయ‌ల కల్పన‌లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వచ్చారు. రాష్ట్రంలోని ఆర్థికలోటు కారణంగా అభివృద్ధి ప‌థకాలకు.... ఎటువంటి అటంకం కలగకుండా విదేశీ సంస్థల రుణాల కోసం ప్రయత్నాలు చేశారు. విదేశాల్లో పర్యటించి... ర‌హదార్ల నిర్మాణానికి ఏసియ‌న్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారం తీసుకున్నారు. అమ‌రావ‌తి మెట్రోరైల్ నిర్మాణానికి జైకా వంటి సంస్థల‌తో ఒప్పందాలు చేసుకున్నారు.

ప్రస్తుతం రూ. 5,472 కోట్ల విదేశీ నిధులతో రాష్ట్రంలో పనులు
రాష్ట్రంలోని అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌కారం అందించేందుకు పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. . అయితే వీటిని పొందాలంటే కేంద్రప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం రాష్ట్రంలొ 5 వేల 472 కోట్ల రూపాయ‌ల విదేశీ రుణ నిధుల‌తో పనులు సాగుతున్నాయి. మరో 11వేల 538 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్రం అనుమతించింది. ఇక‌ తాజాగా 37వేల 873 కోట్ల..విదేశీ రుణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది రాష్ట్ర సర్కారు.

రాష్ట్ర హైవేల విస్తర‌ణ‌ కోసం రూ. 1,679 కోట్లు
కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో రాష్ట్ర హైవేల విస్తర‌ణ‌ కోసం16 వందల 79 కోట్లు...కరవు, రైతుల సంక్షేమం కోసం 18 వందల 31 కోట్లు, పట్టణ నీటి సరఫరా నిర్వహణ ప్రాజెక్టు అమలుకు 3వేల723 కోట్లు ప్రతిపాదించారు. వంతెనల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.3 వేల 200 కోట్లు అవసరమంటూ ఏపీ సర్కారు...కేంద్రాన్ని కోరింది.

కమ్యూనిటీ బేస్డ్‌ నీటి సరఫరాకు రూ. 1600 కోట్లు
రాష్ట్రంలోని ఐదు ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే అనుమతినిచ్చింది. కమ్యూనిటీ బేస్డ్‌ నీటి సరఫరాకు 16 వందల కోట్లు, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం రూ.50 కోట్లు ఇచ్చింది. అమరావతి నగర నిర్మాణానికి 4 వేల 749 కోట్లు, ఇరిగేషన్‌, లైవ్లీహుడ్‌ మెరుగదల ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కేటాయించింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ నిర్మాణానికి రూ.2 వేల 689 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.

చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకూ సత్ఫలితాన్నిస్తాయో చూడాలి
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన నేపథ్యంలో విదేశీ రుణాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడింది. మరోవైపు కేంద్రంపైనా ఆధారపడుతోంది. కేంద్రప్రభుత్వంతో సమన్వయం చేసుకునేలా..అధికారులను దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సత్ఫలితాన్నిస్తాయో చూడాలి. 

07:05 - November 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ చరిత్రలో ప్రాముఖ్యత కలిగిన రోజు...కేసీఆర్ ఆమరణ దీక్ష దినం...టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు... ఇవాల్టితో తొమ్మిదేళ్లు నిండుతున్నాయి. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆయన చేపట్టిన దీక్ష తెలంగాణ సాధనలో కీలకపాత్ర వహించింది. ఈ రోజును దీక్ష దివస్‌గా పురస్కరించుకొని...గులాబి నేతలు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

రాష్ట్ర సాధనకు ఎన్నో ఉద్యమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ...ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అయినా..... ఉపశమన చర్యలతో కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది. అయితే కాలంగడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడుపోసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరింత గట్టి పునాది పడిన రోజు...
అది 2009వ సంవత్సరం...నవంబర్ 29వ తేదీ ...... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరింత గట్టి పునాది పడిన రోజు...ఆమరణ దీక్ష చేసేందుకు గులాబి బాస్ సిద్ధం... అప్పటికే తెలంగాణ అంతటా ఉత్కంఠ వాతావరణం...... దీక్షకు అనుమతిస్తే ఇబ్బందులు తప్పవన్న ప్రభుత్వ నిర్ణయంతో.... సభా స్థలికి చేరుకోక ముందే కేసీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా..... కేంద్రం దిగి వచ్చే వరకు తన నిర్ణయం మారదని తేల్చి చెప్పి పోలీసుల అదుపులోనే దీక్షను గులాబి దళపతి కొనసాగించారు.

ఆమరణ దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు
ఖమ్మం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో...హుటాహుటిన పోలీసులు నిమ్స్ కు తరలించారు. పది రోజుల ఆమరణ దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం... తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో గులాబి బాస్ దీక్ష విరమించారు. అలా కేసీఆర్ దీక్ష ఫలితంతో... దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.

కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి సరిగ్గా ఏడేళ్లు
కేసీఆర్ ఆమరణ దీక్షను చేపట్టి....నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా గులాబి పార్టీ నేతలు రక్త దాన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోవివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

 

07:02 - November 29, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రెడీ అయింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్‌పెట్టేందుకు ఐదు రాష్ట్రాల సీఎంలతో ఓ కమిటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉండాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి ఫోన్ చేశారు.

వెయ్యి,5వందల నోట్ల రద్దు సమస్యలపై చంద్రబాబు కమిటీ..!
వెయ్యి, ఐదువందల రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలు.. సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. నోట్ల రద్దు సమస్యలకు సమాధానం కనుక్కోడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర రెడీ అయ్యింది.

నోట్లరద్దు సమస్యలపై చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలు
పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కమాండ్ కంట్రోల్ నుండి వీడియో ఫుటేజ్‌ల ద్వారా ఏటీఎంల వద్ద వున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలీస్, రెవిన్యూ యంత్రాంగాలను అనునిత్యం వేకప్‌లో ఉంచారు. ప్రతి రెండు రోజులకోసారి బ్యాంకర్లతో సమావేశమై ఆర్బీఐ నుంచి వస్తున్న నగదు నిల్వలు ప్రజలకు ఎలా అందుబాటులో వుంచుతున్నారన్న విషయాన్ని రివ్యూ చేస్తున్నారు. అటు బ్యాంకు ఖాతాలున్న వారందరికీ రూపీ కార్డులు అందుబాటులో వుంచాలని బ్యాంకర్లను కోరటం, వాటిని ఉపయోగించటం ఎలాగో గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియచేసే విధంగా డ్వాక్రా సంఘాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను కూడా చేపట్టారు చంద్రబాబు. దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో కొంతమేర ప్రజల నుండి వ్యతిరేకత తగ్గిందని కేంద్రం అనుకుంటోంది.

మితగా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ నగదు కష్టాల ప్రభావం తక్కువ
మిగతా రాష్ట్రాలతో చూస్తే.. ఏపీలో నగదు కష్టాలు కాస్తతక్కువగా ఉన్నాయని తెలుసుకున్న కేంద్రం.. సీఎం చంద్రబాబును సంప్రదించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి, చంద్రబాబుకు ఫోన్ చేసి, పెద్దనోట్ల రద్దు వివాదంపై ఓ కమిటిని వేయనున్నట్లు, ఆ కమిటికి చైర్మన్ గా ఉండాలని కోరినట్టు సమాచారం. మొత్తంమీద పెద్ద నోట్ల రద్దు అంశంలో విపక్షాల ఆరోపణలను, చంద్రబాబు నేతృత్వంలోని కమిటి ఇచ్చే సూచనలతో చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ అంశంలో ఎలాంటి సూచనలు వస్తాయో వేచి చూడాలి.

 

07:00 - November 29, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో బ్యాంకులు విఫలమయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వారాలు గడిచినా బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ఇప్పటికీ ప్రజలు బారులు తీరుతూ కనిపిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల మేరకు నదగు సమకూర్చడంలో విఫలమైన బ్యాంకు అధికారుల తీరుపై మండిపడ్డారు. బ్యాంకర్ల సహాయ నిరాకరణతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్ద నోట్లు రద్దు అనంతర పరిస్థితులపై చంద్రబాబు సమీక్ష
పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ప్రభుత్వ అధికారులు హాజరైన ఈ సమావేశంలో కరెన్సీ కష్టాలు పరిష్కరించడంలో విఫలమైన బ్యాంకర్లపై మండిపడ్డారు.

బ్యాంకర్ల దగ్గర సెంట్రల్‌ సర్వర్‌ సమాచారం లేకపోవడంపై అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి ఇరవై రోజులైనా బ్యాంకు అధికారులు దగ్గర సెంట్రర్‌ సర్వర్‌కు సంబంధించిన కచ్చితమైన సమాచారం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన సమయంలో బ్యాంకులను సమన్వయం చేయాల్సిన రిజర్వు బ్యాంకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రోజువారీ నిర్వహిస్తున్న సమీక్షలకు లీడ్‌ బ్యాంకు అధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చినా మొక్కుబడి సమాచారంతో హాజరుకావడంపై మండిపడ్డారు. ఏ సమాచారం లేకుండా సమీక్షకు వస్తే ప్రయోజనం ఏంటని నిలదీయడంతో సమాధానం చెప్పలేక బ్యాంకు అధికారులు నీళ్లు నమిలారు.
చిన్న నోట్లను అందుబాటులో ఉంచని బ్యాంకుల తీరుపై బాబు అసహనం
రాష్ట్ర ప్రజల అసవరాలకు తగ్గట్టుగా చిన్న నోట్లను అందుబాటులో ఉంచని బ్యాంకుల తీరును చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రం నుంచి భారీగా డిపాజిట్లు జమ అవుతున్నా.. ఉపసంహరణకు చాలా తక్కువ మొత్తంలోనే డబ్బు అందుబాటులో ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం బ్యాంకులకు మంచిదికాదని హెచ్చరించారు. మూడు రోజుల్లో ఉద్యోగులకు జీతాలు, పెన్షర్లకు పించన్లు అందిచాల్సిన ఉన్న సమయంలో బ్యాంకుల దగ్గర చిన్న నోట్లు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించిన చంద్రబాబు.. వచ్చే నెల మొదటివారంలోనే వృద్ధాప్య, వింతంతు, వికలాంగులకు పెన్షన్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. బ్యాంకు ఖాతాలులేని పెన్షనర్లతో వెంటనే జన్‌ ధన్‌ అకౌంట్లు తెరిపించాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రానికి మరో వెయ్యి కోట్ల కరెన్సీ పంపాలని కోరుతు ఆర్‌బీఐకి లేఖ రాయాలని అధికారులను కోరారు.

 

Don't Miss