Activities calendar

30 November 2016

21:56 - November 30, 2016

మహబూబ్ నగర్ : రైతుల కోసం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 790 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే రైతులకు చెల్లించాలని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసెండెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో రేవంత్ చేపట్టిన రైతు పోరుబాట యాత్ర ముగింపు సభ జరిగింది. సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. లేదంటే కేసీఆర్ గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. 

21:45 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా పని చేశారని చెప్పారు. తెలంగాణ సచివాలయంలో రాజీవ్‌శర్మ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. మరోవైపు కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు.

సచివాలయంలో ఘనంగా రాజీవ్‌శర్మ వీడ్కోలు కార్యక్రమం
సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో పూర్తి చేయగలిగామంటే అది సీఎస్‌ రాజీవ్‌శర్మ కృషి ఫలితమేనన్నారు సీఎం కేసీఆర్‌. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రశాతంగా పూర్తి చేయగలిగారని అభినందించారు.తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడ్కోలు కార్యక్రమం సచివాలయంలో ఘనంగా జరిగింది. వీడ్కోలు సభకు ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా పనిచేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేశారని సీఎం కొనియాడారు. ఏపీ నుంచి ఎదురైన సవాళ్లను ఆయన ఓపికతో అధిగమించారన్నారు.

తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ అడ్వైజర్‌గా రాజీవ్‌శర్మను నియామకం : సీఎం కేసీఆర్‌
తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ అడ్వైజర్‌గా రాజీవ్‌శర్మను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన సేవలను మరింత వినియోగించుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని రాజీవ్‌శర్మ తెలిపారు.

కొత్త సీఎస్ గా బాధ్యతు స్వీకరించిన ప్రదీప్ చంద్ర
మరోవైపు సీఎస్‌గా రాజీవ్ శర్మ... పదవీ విరమణతో ఆయన స్థానంలో... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్రను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం... ప్రదీప్ చంద్ర సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. మద్రాస్ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మెంట్ కలకత్తాలో ఎంబీఏ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. గతంలో గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్‌గా కూడా పని చేశారు.

21:40 - November 30, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దై 22 రోజులవుతున్నా.. కరెన్సీ కష్టాలు ఇంకా తీరడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద నగదు కోసం గంటల తరబడి నిల్చుని... విసుగెత్తి పోతున్నారు. డిమాండ్‌కు తగినంత క్యాష్‌ లేకపోవడంతో.. బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఏ ఏటీఎం సెంటర్‌ దగ్గర చూసినా.. నో క్యాష్‌, ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నెలాఖారు రోజుల్లో నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు నామమాత్రపు కరెన్సీ కూడా అందుబాటులో లేక సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రేపు ఒకటో తారీఖు రావడంతో... ఉద్యోగుల కష్టాలు రెట్టింపు కానున్నాయి.

వృద్ధుల బాధలు వర్ణనాతీతం
కరెన్సీ కోసం సామాన్యులు బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గంటలకొద్దీ క్యూ కట్టినా నగదు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా.. నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏటీఎమ్‌ సెంటర్లలో నగదు పెట్టిన కాసేపట్లోనే ఖాళీ అవుతున్నాయి. క్యాష్‌ కష్టాలు అందరికంటే వృద్ధులను ఎక్కువగా బాధిస్తున్నాయి.

మూడు వారాలు దాటినా తీరని కష్టాలు
కేంద్రం పెద్దనోట్ల రద్దు ప్రకటించి.. మూడు వారాలు దాటింది. అయినా సామాన్యులకు నోట్ల కష్టాల నుంచి ఏ మాత్రం ఉపశమనం లభించడం లేదు. ఇన్నాళ్లు చేతిలో ఉన్న చిన్న నోట్లతో ఎలాగోలా సర్దుకున్నా... నెలాఖరు రావడంతో చేతిలో పైసలు నిండుకున్నాయి. ఎవరినైనా అప్పు అడిగినా ఎవరూ ఇవ్వని పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులున్నా.. తీసుకోలేని పరిస్థితి.

పాలబిల్లు, కేబుల్‌, పేపర్‌బిల్లుల చెల్లింపులకు హడలిపోతున్న సామాన్యుడు
మొదటివారంలోనే పాలబిల్లు, కేబుల్‌, పేపర్‌బిల్లు తదితరాల చెల్లింపులు ఎలాగో తెలియక సామాన్యుడు మదనపడుతున్నాడు. ఇప్పటికీ చాలా ఏటీఎంలు మూతపడి ఉండటం, తెరిచి ఉన్న కొన్ని ఏటీఎంల, బ్యాంకుల వద్ద నగదు ఉపసంహరణకు భారీ వరసలు తప్పడం లేదు. ఇప్పటికీ చాలా ఏటీఎంలలో రెండువేల నోట్లే వస్తున్నాయి. ఎక్కడ చిల్లర దొరక్క రెండు వేల నోట్లు కేవలం దాచుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ఫలితంగా మార్కెట్లో నగదు చలామణి కావడం లేదు. కొత్త 500 నోట్లు వచ్చాయని ప్రకటించినా... ఇప్పటికీ ఆ నోటు ముఖం చూడని వారే అధికం. కరెన్సీ కష్టాలు జనాన్ని రోజురోజుకు వెంటాడుతున్నాయి.

పెరిగిన చిల్లర కష్టాలు
పాత నోట్ల రద్దు నేపథ్యంలో నగదుతో పాట చిల్లర కష్టాలు పెరిగాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బ్యాంకు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారు తిరిగి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జేబులో కొత్త 2వేల నోటు ఉన్నప్పటికీ ఏ వస్తువు కొనలేని పరిస్థితి నెలకొంది.

అద్దాలు పగిలి ఓ మహిళకు స్వల్ప గాయాలు
వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆంధ్రాబ్యాంకులో బ్యాంకు అద్దాలు పగిలి ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బ్యాంకు తెరవగానే ఖాతాదారులు ఒక్కసారిగా లోపలికి రావడంతో బ్యాంకు ముందు ఉన్న గ్లాస్‌ పగిలిపోయింది.

నో క్యాష్‌ బోర్డులు
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు నేటీకి అల్లాడుతున్నారు. డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్తే బ్యాంకులు తెరిచిన రెండు గంటలలోపే డబ్బులు అయిపోతున్నాయి. కనీసం ఏటీఎంల వద్దనైనా డబ్బులు తీసుకుందామంటే నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కరెన్సీ కష్టాలు పరిష్కారం అయ్యేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జనం కోరుతున్నారు. 

21:35 - November 30, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 10వేల రూపాయలను నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. 10 వేల రూపాయల నగదు ఇచ్చేందుకు బ్యాంకర్లు సైతం అంగీకరించారు. డబ్బుల్లేకున్నా రేషన్ సాపుల్లో సరుకులను సరఫరా చేస్తున్నామన్నారు. ఉన్న నగదును సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. నగదు రహిత లావాదేవీలు జరగాల్సిన అవుసరముందని మరోసారి స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీల కోసం ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఫైవర్ గ్రిడ్ వల్ల నగదు రహిత లావాదేవీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో రూ10వేలు తీసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

తెలంగాణ డీజీపీకి హైకోర్డు ఆదేశాలు..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఎన్నిక నిర్వహణపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. నాలుగేళ్లు ఎన్నికలు న్విహించడంలేదరనీ..మాజీ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాజు పిటీషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కోర్టు డిసెంబర్ 14కు వాయిదా వేసింది. 

రాంగోపాల్ వర్మపై వంగవీటి రంగా పిటీషన్..

విజయవాడ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా 'వంగవీటి' చిత్రాన్ని తీస్తున్నారని చెబుతున్న రాంగోపాల్ వర్మ... వాస్తవాలను వక్రీకరించి తీస్తున్నాడని, ఈ సినిమాను విడుదల కాకుండా నిలుపుదల చేయాలంటూ రాధా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం డిసెంబర్ 2న విచారించనుంది.

పెరిగిన పెట్రోల్ ధర..

ఢిల్లీ : కరెన్సీ కష్టాలకు తోడు దేశప్రజలకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. లీటరు పెట్రోల్ ధర 0.13 పైసలు పెరిగింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బుధవారం రాత్రి నిర్ణయాన్ని వెల్లడించాయి. అదే సమయంలో డీజిల్ ధర 0.12 పైసలు (ఒక లీటరుకు)తగ్గింది. కొత్త ధరలు నేటి(నవంబర్ 30) అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ !

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ అకౌంట్‌ హ్యాక్ అయింది. రాహుల్ ట్విట్టర్ ఎకౌంట్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ లను హ్యాకర్లు పోస్ట్ చేశారు. అయితే ఎవరు హ్యాక్ చేశారనేది తెలియరాలేదు. అయితే రాహుల్ అకౌంట్ హ్యాక్ అవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాహుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి దాన్నుంచి అశ్లీల మాటలను ట్వీట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. 

ఏపీ ఉద్యోగులకు శుభవార్త!..

గుంటూరు : ఏపీలోని ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏటీఎం, బ్యాంకు క్యూలలో నిల్చోలేక సాధారణ పౌరులు చేతులెత్తేస్తున్నారు. ఈ క్లిష్ఠపరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వోద్యోగి, పెన్షనర్ కు పది వేల రూపాయలు చేతికి ఇచ్చేలా స్రభుత్వం చర్యలుతీసుకుంది. ఈ మేరకు బ్యాంకర్లతో జరిపిన సమావేశంలో బ్యాంకు అధికారులు ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో సచివాలయం, బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ప్రతి ప్రభుత్వోద్యోగి, పెన్షనర్ చేతికి పదివేల రూపాయల జీతం అందజేయనున్నారు.

20:44 - November 30, 2016

ఈ వాక్యం ఎక్కడైనా చదివినట్టు గుర్తొస్తోందా.. మీ జేబులో ఉన్న ప్రతి నోటుపైనా ఉంటుంది. కొత్త నోటుపైనే కాదు.. సర్కారు చెల్లవని చెప్పిన అయిదొందలు, వెయ్యి నోట్లపై కూడా.. మరి ఆ ప్రామిస్ ఏమయింది. ఒట్టు తీసి గట్టున పెట్టారా? ప్రజలకు భరోసానిచ్చే ఆర్బీఐ ప్రామిస్ ఎలా గాల్లో కలిసింది? బ్యాంకులంటే ప్రజలకు మధ్య ఉండాల్సిన నమ్మకం ఎందుకు పోతోంది? దీనికి కారణం బ్యాంకులా? ఆర్బీఐనా? లేక ప్రభుత్వమా? ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. నోటూ నోటూ ఎందుకు చెల్లవంటే తెల్లమొహం వేసింది. ఏటీఏం ఏటీఎం సొమ్మెక్కడా అంటే బ్యాంకునడగమంది. . బ్యాంకూ బ్యాంకూ మా డబ్బులేమయ్యాయీ అంటే ఆర్బీఐని అడగమంది.. ఆర్బీఐ ఆర్బీఐ ఈ దేశంలో ఏం జరుగుతోందీ అంటే.. నాకేం తెలుసు సర్కారుని అడగమంటోంది.. బ్యాంకంటే ఓ భరోసా..బ్యాంకంటే ఓ నమ్మకం..బ్యాంకంటే ఓ బలం.. బ్యాకంటే ఓ వెలకట్టలేని ఆసరా.. కానీ, ఇప్పుడా బ్యాంకు వెక్కిరిస్తోంది. నా చేతుల్లోనూ ఏం లేదని వట్టి చేతులు చూపిస్తోంది. ఐ ప్రామిస్డ్ టు పే అని ఓ ప్రామిస్ చేశారు.. అదే మన ఆర్ధిక వ్యవస్థకు.. చలామణీలో ఉన్న సొమ్ముకు ఓ నమ్మకం.. అదే దేశంలో ప్రతి అమ్మకానికి కొనుగోలుకు..సొమ్ముతో ముడిపడిన ప్రతి వ్యవహారానికి ఓ గ్యారంటీ.. కానీ, ఇప్పుడా గ్యారంటీ ఒక్కసారిగా వమ్మయింది. దీనికి ఆర్బీఐని ప్రశ్నించాలా? లేక సర్కారుని నిలదీయాలా? ఇక్కడ నమ్మకం కోల్పోయిందెవరు? ఆఖరికి కొత్త నోట్లు కూడా నమ్మకంగా కనిపించని పరిస్థితి ఏర్పడిందా? చిన్న బ్రేక్ తర్వాత..ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోంది..కరెన్సీ నోటుపై చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కారు..పూటకో కొత్త మాటతో రిజర్వ్ బ్యాంకు తమాషా చేస్తోంది. బ్యాంకులను కస్టమర్లకు మధ్య ఉన్న నమ్మకం సడలుతోంది. ఇవన్నీ ఆలా ఉంచితే,ఆఖరికి కొత్త నోట్లు కూడా నమ్మకంగా కనిపించని పరిస్థితి ఏర్పడిందా? ఓ పక్క కరెంటులేని గ్రామాలున్నాయి.. ఇంటర్నెట్ లేని ప్రజలు మెజారిటీలో ఉన్నారు. అసలు టెక్నాలజీని ఉపయోగించలేని వారు నూటికి తొంభైమంది ఉన్నారు.. కానీ, క్యాష్ లెస్ ప్రజలున్న దేశాన్ని క్యాష్ లెస్ ఎకానమీగా మారుస్తామంటున్నారు.. ఇది ఎప్పటికి సాధ్యం..? ఈ లోగా ఎన్ని సమస్యలు వస్తాయి? ప్రజల అవసరాలనుబట్టి సర్కారు నిర్ణయాలుండాలి. ప్రజల డిమాండ్లను బట్టి సర్కారు చర్యలుండాలి. కానీ, రాజకీయ ప్రయోజనాలకోసమో, లేక మరేదో లాభాల కోసమో నిర్ణయాలు తీసుకుంటే అంతిమంగా దేశానికి ప్రయోజనం మాట అటుంచి, కోలుకోలేని నష్టానికి కారణం అవటం మాత్రం ఖాయం.. నోట్ల రద్దుతో దేశంలో మెజారిటీ ప్రజలను నానా పాట్లకు గురిచేయటం ఇంతకంటే భిన్నంగా ఉండబోదు.. నమ్మకాన్ని పెంపొందించకుండా, భరోసాని తగ్గించే నిర్ణయాలు ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రం క్షేమకరం కాదు.

బీజేపీ మహిళా సంఘం నేత హత్య..

మధ్యప్రదేశ్ : బీజేపీ మహిళా సంఘం నాయకురాలు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో ఆమెపై కాల్పులు జరపడంతో మృతి చెందారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో బుధవారం ఈ దారుణం జరిగింది. మృతురాలు ఆ పార్టీ మహిళా సంఘం నాయకురాలు జమిలా ఖాన్‌గా గుర్తించారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

20:27 - November 30, 2016

రోజు చిత్ర చిత్రమైన వార్తలను తీసుకొచ్చి మనల్ని ఖుషీ చేసే మన మల్లన్న ఏదో ఓ షట్టర్ కాడ కూసున్నడు...ఎందుకు కూసున్నడో ఏందో తెలుసుకుందాం రండ్రి..ఏంది మల్లన్న ఈడ కూసుండావ్ .. ఆ..ఆ..స్టేట్ బ్యాంక్ ఏటీఎం కాడ కూసున్నడు మల్లన్న..పైసలు తీసుకునేందుకో ఏమోనల్ల..కాదంట..జనాలు ఏటీఎంల తాన గెట్ల నాయనల్ను పడుతున్నడో మనకు సెప్పేందుకే ఆడ కూసున్నడు..మరి పబ్లిక్ గెటువంటి సిందర వందర పడుత్తన్నరో చూపెడుతున్నడు మరి చూడుండ్రి...

20:00 - November 30, 2016
19:57 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. రెవిన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఎంజీ గోపాల్‌, గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శిగా చిత్ర రామచంద్రన్‌, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా రమేశ్‌దత్‌ ఎక్కా, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా వెంకటేశ్వరరావు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, బీసీ వెల్ఫేర్‌ ముఖ్య కార్యదర్శిగా అశోక్‌కుమార్‌, రెవిన్యూ శాఖ(ఎక్సైజ్‌) ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్‌ను, సీఎస్‌ ప్రదీప్‌చంద్రకు ఇన్‌ఛార్జి సీసీఎల్‌ఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే.. యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా సవ్యసాచిగోష్‌, పురపాలక శాఖ కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌, ఆర్థిక శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియాను నియమించారు. 

కేసీఆర్ ను జైల్లో పెట్టాలి : రేవంత్

హైదరాబాద్ : తాగి కారు నడిపితేనే జైల్లో పెడుతున్నారు కదా ..తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా? లేదా? అంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీపీ తలపెట్టిన పోరుయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి చురుకైన నాయకత్వం, సామాజిక న్యాయం చేయగలిగిన పార్టీ కావాలని, పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం కావాలని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం లేదని అన్నారు.

సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర..

హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రదీప్ చంద్రను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. కాగా సీఎస్ గా రాజీవ్ శర్మ పదవీకాలం ముగియటం..ఈరోజు సచివాలయంలో ఆయనకు వీడ్కోలు సభ ఘనంగా  నిర్వహించారు. 

19:51 - November 30, 2016
19:42 - November 30, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా వుండాలని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని తీవ్రంగా విమర్శించారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఈరోజుతో ముంగిపు దశకు చేరుకుంది.  ఈ సందర్భంగా కోస్గిలో టీ.టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారనీ దీనికి ప్రభుత్వం నకిలీ విత్తన కంపెనీని ఆస్తులను జప్తుచేసి ఆ ఆస్తిని రైతులకు పంచాలని డిమాండ్ చేశామని దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. నష్టపరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ప్రశ్నించారు.  దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని సొంత కుటుంబ సభ్యులకు మాత్రం పదవులకు కట్టబెట్టారని విమర్శించారు. తాగి కారు నడిపితేనే జైల్లో పెడుతున్నారే.. మరి తాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా? లేదా? అంటూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీపీ తలపెట్టిన పోరుయాత్ర ఈరోజుతో ముగిసింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాగిన మత్తులో రాత్రికి ఒక నిర్ణయం.. తెల్లవారిన తర్వాత మరో నిర్ణయం తీసుకుంటున్న వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. కనుక, తెలంగాణ రాష్ట్రానికి చురుకైన నాయకత్వం, సామాజిక న్యాయం చేయగలిగిన పార్టీ కావాలని, పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రభుత్వం కావాలని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం లేదని అన్నారు. నకిలీ ఉద్యమకారులందరిని తెలంగాణలో మంత్రులను చేసిన ఘనత కేసీఆర్ ది అని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేయాలని, కేంద్రం ఇచ్చిన రూ.790 కోట్ల ఇన్ పుట్ సబ్బిడీ రూపాయి కూడా రైతుకు అందలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

19:28 - November 30, 2016

తూర్పుగోదావరి : గొల్లప్రోలులో సమాచార హక్కు చట్టం ప్రచారకుడు పడాల వెంకట భరత్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో విద్యా కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన భరత్‌.. గొల్లప్రోలులోని ఓ పాఠశాల ఆవరణలో కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. ప్రస్తుతం భరత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. భరత్‌.. ఉపాధ్యాయుల పనితీరుపై సహ చట్టంతో సమాచారం సేకరించి డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఈవో 29 మంది ఉపాధ్యాయులకు ఒకేసారి షోకాజ్‌ నోటీసులు పంపిచారు. అయితే.. భరత్‌పై ఓ ఉపాధ్యాయిని లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో.. అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై వచ్చిన భరత్‌.. పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం చేశారు. 

19:10 - November 30, 2016

కడప : పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కడప కార్పొరేషన్‌ ఎదుట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని మధు మండిపడ్డారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. మున్సిపాలిటీలో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే చలో అసెంబ్లీకి పిలుపు ఇస్తామంటున్న మధు పేర్కొన్నారు.

19:07 - November 30, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి సుజనాచౌదరీ అన్నారు. ఢిల్లీలోని సుజనా చౌదరీ నివాసంలో సమావేశమైన టీడీపీపీ చర్చించింది. నోట్ల రద్దు అంశంలో కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సహాయంపై చర్చించారు. పార్లమెంట్‌ లో చర్చలు జరగకుండా విపక్షాలు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అటు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై మరోసారి ప్రధానికి కలవాలని సమావేశంలో నిర్ణయించామని సుజనా చౌదరీ అన్నారు. 

19:05 - November 30, 2016

ఢిల్లీ : నగదు రహిత లావాదేవీలపై కేంద్రం అధ్యయన కమిటీని ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్‌గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కమీటీ తెలిపారు. కమిటీ మెంబర్లుగా మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తోపాటు ఒడిశాసిఎం నవీన్‌ పట్నాయక్‌, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ ఉన్నారు. వీరితోపాటు నీతిఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ అరవింద్‌ పనగారియా, సీఈఓ అమితాబ్‌కాంత్‌లు ఉన్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా నందన్‌నిలేఖని , బోత్సవ్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ 'న్మేజయ సింహా'తోపాటు నెక్కోర్‌ సంస్థ ఎండి రాజేష్‌జైన్‌, ఐ-స్పిరిట్‌ కోఫౌండర్‌ శరత్‌చంద్ర, అహ్మదాబాద్‌ ఫైనాన్సియల్‌ ప్రొఫెసర్‌ జయంత్‌ వర్మలను కమిటీలో మెంబర్లుగా కేంద్రం ప్రకటించింది. 

18:41 - November 30, 2016
18:35 - November 30, 2016

హైదరాబాద్ : బ్లాక్‌ మనీ పెరగటానికి కాంగ్రెస్సే కారణమన్న సీఎం కేసీఆర్‌పై శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. తమ పార్టీ నేతల వద్ద నల్ల డబ్బు ఉంటే అధికారంలో ఉండి కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ర్టంలో సగం మంది వరకూ బ్యాంకు అకౌంట్స్ లేవని, అలాంటప్పుడు క్యాష్‌ లెస్‌ స్టేట్‌ చేయడం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలన్నారు. కేసీఆర్‌ తన ఫాం హౌజ్‌ కూలీలకు డెబిట్‌ కార్డుతో డబ్బులు పంచుతారా...? అని సెటైర్లు వేశారు. 

18:33 - November 30, 2016
18:31 - November 30, 2016

హైదరాబాద్ : చిల్లర సమస్యలను గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది.మైక్రో ఏటీఎం కార్డుల ద్వారా కూరగాయల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి రైతు బజార్‌లో ప్రయోగత్మకంగా అమలు చేసింది.ఐడీఎఫ్‌సి బ్యాంకు సౌజన్యంతో మైక్రో ఏటీఎం కార్డుల నిర్వహణను చేపట్టింది. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు..చిల్లర కూపన్లు తీసుకుని కూరగాయలు కొనుకోవచ్చు..కనిష్టంగా పది రూపాయల నుండి గరిష్టంగా రూ. 500 వరకు కూపన్లు లభ్యవుతాయి. త్వరలోనే అన్ని రైతు బజార్లలో ఈ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధానం పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్న వినియోగ, అమ్మకందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

18:25 - November 30, 2016

సంగారెడ్డి : తెలంగాణ హస్తకళకు ప్రభుత్వం తరపున చేయూతనిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డిలో నిర్మించిన హస్తకళల భవనం గోల్కొండ హస్తకళల ఎంపోరియంను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేపాక్షి హస్తకళ పేరును గోల్కొండ హస్తకళగా పేరు మార్చి తెలంగాణ సంస్కృతికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పొల్గొన్నారు. 

18:22 - November 30, 2016

మెదక్ : మెదక్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా ధర్మారం తమ్మినేని బృదం పర్యటించింది. ధర్మారంలో అప్పులపాలై.. భూమి అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్న బాలయ్య, గాలయ్య కుటుంబాన్ని తమ్మినేని పరామర్శించారు. బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులను, పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తున్నాయని తమ్మినేని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం రైతులను, పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని తమ్మినేని విమర్శించారు. అప్పులపాలై భూమి అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

18:13 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ వివేక్‌ను నియమిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతరాష్ర్ట వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా వివేక్‌ను నియమించారు. ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. డీఎస్‌ స్థానంలో వివేక్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది ప్రభుత్వం.

17:23 - November 30, 2016

తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ మున్సిపల్‌ అధికారులపై మండిపడ్డారు. సంగారెడ్డి కరెక్టరేట్ లో మున్సిపల్ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఏడాదిగా ఇండ్ల నిర్మాణాలు లేవంటూ అధికారులు లెక్కలు చెప్పడంపై కేటీఆర్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నా జిల్లా కేంద్ర అభివృద్ధిని విస్మరించారని ఆయన ఆరోపించారు. రానున్న ఆరు నెలల్లో సంగారెడ్డి రూపు రేఖలు మార్చేస్తామని తెలిపారు. ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తున్నామని ,ఎవరైనా ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్‌ హెచ్చరించారు.

'నాడా' తుఫాన్..

విశాఖపట్టణం : వాయుగుండం తుఫాన్ గా మారింది. తుఫాన్ కు 'నాడా' గా నామకరణం చేశారు. చెన్నైకి 1010 కి.మీ., పుదుచ్చేరికి 790 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది. డిసెంబర్ 2న చెన్నై లేదా కేరళ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.

 

17:01 - November 30, 2016

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నేడు పదవీ విరమణ చేయనున్న రాజీవ్‌శర్మకు సచివాలయంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. రాజీవ్ శర్మ వీడ్కోలు సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రాజీవ్ శర్మకు శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఇంకా పలువురు మంత్రులు కూడా రాజీవ్ శర్మను అభినందించి సత్కరించారు. ఈ సభకు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి, జగదీష్ రెడ్డి, లక్మారెడ్డి, ఇతర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు హాజరయ్యారు. వీరితోపాటు నూతన సీఎస్ గా నియమించబడిన ప్రదీప్ చంద్ర కూడా హాజరయ్యారు.  ఈ సందర్భంగా సచివాలంయలో మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సీఎస్ బాధ్యలు స్వీకరించింది రాజీవ్ శర్మేననీ నూతన జిల్లాల పునర్విభజనలో రాజీవ్ శర్మది కీలక పాత్ర వహించారని ప్రశంసించారు. ఈ రెండున్నర ఏళ్ళల్లో ఎన్నో అవార్డులనుత తెలంగాణ సొంతం చేసుకుందన్నారు. రాష్ట్ర విపత్కర పరిస్థతుల్లో రాష్ట్రానికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ శర్మ పటిష్టమైన పునాది వేసి వెళ్తున్నారని పేర్కొన్నారు.రాజీవ్ శర్మ సేవలు తెలంగాణ ఎప్పటికూ గుర్తుంచుకుంటున్నారు. రాజీవ్ శర్మను ప్రభుత్వ సలహాదారుగా నిలమిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం చాంబర్ లోనే ఆయన చాంబర్ కూడా వుంటుందనీ ప్రకటించారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

సీఎస్ కు కేబినెట్ ర్యాంక్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎస్ గా పదవీ విరమణం పొందిన రాజీవ్ శర్మకే టి.సర్కార్ కేబినెట్ ర్యాంకు కల్పించింది. ఆయన వీడ్కోలు సభ కొద్దిసేపటి క్రితం జరిగింది. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాజీవ్ శర్మ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుందని, అందుకని చీఫ్ అడ్వయిజర్ గా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

 

అమరావతి నిర్మాణంపై సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : అమరావతి నిర్మాణంపై సీఎం సమీక్ష ముగిసింది. రాజధాని నగరం చుట్టూ 3 రింగ్ రోడ్డుల నిర్మాణానికి లక్షా 36 వేల ఎకరాలు అవసరం ఉంటుందని, రాజధాని నిర్మాణ విషయంలో రాజీ పడవద్దని సీఎం బాబు సూచించారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామన్నారు. 

16:32 - November 30, 2016

హైదరాబాద్ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న రైతు భ‌రోసా యాత్రలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ కొడంగ‌ల్ లో నిర్వహించనున్న భారీ బ‌హిరంగ స‌భ‌తో... తొలిద‌శ పోరు యాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బ‌హిరంగ స‌భ జ‌రిగే ముందు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా పోలేప‌ల్లి ఎల్లమ్మ గుడి నుంచి కోస్గి వ‌ర‌కు 18 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేయ‌నున్నారు రేవంత్ . ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీటీడీపీ.

అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి 
అధికార పార్టీని తన విమర్శనాస్త్రాలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి. ఇందుకోసం దశలువారీగా పోరాటాన్ని సాగిస్తున్నారు. మల్లన్న సాగర్ రైతుల పక్షాన రెండు రోజులు దీక్షచేసిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి...కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రాజెక్టుల గురించి మ‌హా రాష్ట్ర తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్‌రెడ్డి చేసిన జలసౌధ ముట్టడి...పార్టీ శ్రేణుల్లో నైతిక బలాన్ని నింపింది. మ‌హా ఒప్పందంలోని వాస్తవాల‌ను తెలుపుతూ ఆయన చేసిన ఆధారాలు కూడా ప్రభుత్వ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర పెట్టాయనే వార్తలు వినిపించాయి.

ఉస్మానియా యూనివ‌ర్పిటీలో జ‌రిగిన విద్యార్థి గ‌ర్జన‌
ఉస్మానియా యూనివ‌ర్పిటీలో జ‌రిగిన విద్యార్థి గ‌ర్జన‌కు హాజ‌రై...విద్యార్థి లోకానికి తానెప్పుడూ అండ‌గా ఉంటాననే సంకేతాల‌ను పంపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో అదికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే సత్తా తనకుందనే విశ్వాసాన్ని కార్యకర్తల్లో కల్పించారు. తాజాగా రేవంత్ నిర్వహిస్తున్న రైతు భ‌రోసా యాత్రల ప‌ట్ల తెలంగాణ రైతాంగం నుంచి అనూహ్యస్పందన వస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రైతు ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమే: రేవంత్
రైతు భరోసా యాత్రల్లో భాగంగా రైతు ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమేనంటూ రేవంత్‌రెడ్డి అధికారపార్టీపై విరుచుకుపడుతున్నారు. రైతులంతా వలసబాట పడుతున్నా సర్కారు స్పందించడం లేదంటూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. భూపాల ప‌ల్లి, ఖ‌మ్మం, పెద్దప‌ల్లి, సూర్యాపేట‌, న‌ల్లగొండ జిల్లాల్లో రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు యాత్రల‌కు ప్రజ‌ల నుంచి పెద్ద యెత్తున సంఘీభావం ల‌భించిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

 

16:23 - November 30, 2016

నిజామాబాద్‌ : పెద్దనోట్ల రద్దు ప్రభావం అన్ని వ్యాపారాలపై పడింది. చిరు వ్యాపారాలైతే నోట్ల రద్దు దెబ్బకు కుదేలైపోయాయి. ప్రజల దగ్గర చిల్లరలేకపోవడంతో... నిజామాబాద్‌లోని నాన్‌వెజ్‌ మార్కెట్‌ డీలా పడింది. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్కెట్‌ చిల్లర కష్టాలతో కళతప్పింది. నిజామాబాద్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌లో నోట్ల కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం...

మాంసం విక్రయాలకు నిజామాబాద్ నాన్ వెజ్ మార్కెట్ ఫేమస్‌
నిజామాబాద్‌లోని నాన్‌వెజ్‌ మార్కెట్‌ మాంసం విక్రయాలకు ఎంతో ఫేమస్‌. ఈ మార్కెట్‌లో చికెట్‌, మటన్‌, ఫిష్‌మాంసం ఒకేచోట లభిస్తుంది. దీంతో ఈ మార్కెట్‌ ఎప్పుడూ కొనుగోలుదారులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక సండే రోజైతే మార్కెట్‌ మరింత బిజీగా మారుతుంది. మాంసం కొనుగోలు చేయడానికి జనం క్యూలుకడతారంటే ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కళతప్పిన నిజామాబాద్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌
పెద్దనోట్ల రద్దుతో నిజామాబాద్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఇప్పుడు పూర్తిగా కళతప్పింది. నోట్ల రద్దు ప్రభావం ఈ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. పాతనోట్లు చెల్లకపోవడం... కొత్త రెండువేల నోట్లకు చిల్లర లేకపోవడంతో మాంసం విక్రయాలు మందగించాయి. పెద్దనోట్ల రద్దుతో తమ వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

ఖాతారాసుకుని మాంసం విక్రయిస్తున్న వ్యాపారులు
పెద్దనోట్లకు చిల్లర లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు ఖాతాలు రాసుకుని మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇక కొంతమంది అదీకూడా చేయకపోవడంతో కొనుగోళ్లులేక ఇబ్బందిపడుతున్నారు. పెద్దనోట్లకు చిల్లర లేకపోవడంతో తమ వ్యాపారాలు డీలా పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి వ్యాపారులు.

నాన్‌వెజ్‌ కోసం వెళ్లిన జనానికి నిరాశగా వెనుదిరుగుతున్న కొనుగోలుదారులు
మాంసం వ్యాపారుల పరిస్థితి ఇలా ఉంటే... కొనుగోలుదారుల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పెద్దనోట్లకు చిల్లరలేకపోవడంతో 20 రోజులుగా మాంసం కొనుగోలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లో పార్టీలు, పంక్షన్‌లు చేసుకునేందుకు ఇబ్బందిపడుతున్నామని చెప్తున్నారు.

వెంటనే కొత్త 500 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలంటున్న ప్రజలు
పెద్దనోట్లు తెచ్చిన తంటాతో ఇటు అమ్మకందారులు... అటు కొనుగోలుదారులూ ఇబ్బందిపడుతున్నారు. కొన్నిచోట్ల కొత్త 500 నోట్లు అందుబాటులోకి వచ్చినా.. నిజామాబాద్‌లో మాత్రం అవి లభించడం లేదు. దీంతో అన్నివర్గాల ప్రజలూ ఇబ్బందిపడుతున్నారు. వెంటనే కొత్త 500 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

టి.సీఎస్ వీడ్కోలు సభ..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ వీడ్కోలు సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, డిప్యూటి సీఎంలు, స్పీకర్, డిప్యూటి స్పీకర్, మంత్రులు పలువురు హాజరయ్యారు. 

టి.సీఎస్ వీడ్కోలు సభ..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ వీడ్కోలు సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, డిప్యూటి సీఎంలు, స్పీకర్, డిప్యూటి స్పీకర్, మంత్రులు పలువురు హాజరయ్యారు. 

16:17 - November 30, 2016

కృష్ణా : గత కొంతకాలంగా కృష్టా, గుంటూరు జిల్లాల్లో కల్తీ కారం మాఫియా రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు కారం స్టోరేజ్ లపై దాడులు చేపట్టారు. విజిలెన్స్ ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర సమీపంలోని స్ఫూర్తీ కోల్డ్ స్టోరేజ్ పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 4వేల కల్తీ కారం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేములపల్లి గ్రామ సమీపంలో పంటపొలాల్లో దాదాపు 1500 కల్తీకారం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కల్తీకారం విలువ సుమారుగా రూ.కోటి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రైతుల పేరుతో కల్తీ మాఫియా నిర్వహిస్తున్న వ్యాపారులు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసినట్లుగా తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న కారం సాంప్లిన్స్ స్వీకరించి విచారణ చేపడతామని బాధ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవీందర్ బాబు పేర్కొన్నారు. 

కల్తీ కారం బస్తాల స్వాధీనం..

కృష్ణా : జిల్లాలో భారీగా కల్తీ కారం నిల్వలను కనుగొన్నారు. 2500 కల్తీ కారం బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్ల మండలం కీసర సమీపంలోని స్పూర్తి కోల్డ్ స్టోరేజ్ పై విజిలెన్స్ దాడులు నిర్వహించాయి. విజిలెన్స్ ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 

16:05 - November 30, 2016

భువనగిరి : మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలతో సభ్యుల మధ్య గలాటాలు..గందరగోళాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సభ్యులు ఆ మాట మరచి ఆకతాయి వ్యక్తుల్లా గలాటాలు సృష్టించటం మామూలుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో భువనగిరి మున్సిపల్ సర్వసభ్య సమావేశం కూడా దీనికి ఏమాత్రం అతీతంగా లేదు.స్థానికంగా ఉన్న ఏఐజీ గ్లాస్‌ పరిశ్రమకు మున్సిపాలిటీ నీరు ఇవ్వొద్దని విపక్ష, టీఆర్ఎస్‌ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో సమావేశంలో గందరగోళంగా మారింది.

డీఎస్ స్థానంలో జి.వివేక్..

హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ జి.వివేక్ ను నియమిస్తూ టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్ స్థానంలో ఈయన్ను నియమించారు. 

16:00 - November 30, 2016

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవీస్. భర్త సీఎం అయినా ఈమె మాత్రం బ్యాంక్ ఎంప్లాయిగా కొనసాగుతున్నారు. ఈమెకు పాటలు పాడడం చాలా ఇష్టమంట. దీనితో పలు చిత్రాల్లో గానం అందించారు. కునాల్ కోహ్లీ తీసిన 'ఫిర్ సే', ప్రకాస్ ఝూ సినిమా 'జై గంగాజల్' కోసం ఆమె పాటలు పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బితో ఈమె స్టెప్పులు వేస్తున్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. సౌత్ ముంబాయిలోని ఓపెరా హౌస్ దగ్గర అహ్మద్ ఖాన్ ఓ మ్యూజిక్ వీడియో తీస్తున్నాడు. ఇందులో 'బిగ్ బి' కూడా నటిస్తున్నారు. రెడ్ కలర్ మినీ స్కర్ట్ వేసుకున్న 'అమృత'..'అమితాబ్'తో స్టెప్పులేసింది. ఆర్ట్స్ ఇనిస్టిట్యూట్ హెడ్ గా అమితాబ్ కనిపిస్తాడంట. ఈ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయేందుకు అమృత రావడం..సంభాషణలో భాగంగా ఈ పాట వస్తుందంట. 'ఫిర్ సే' అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో కోసం ఇదంతా షూటింగ్ చేశారని టాక్. 

15:58 - November 30, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌.. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్‌ కలకలం రేగింది. సీనియర్‌ విద్యార్థులు.. జూనియర్‌ విద్యార్థిని ర్యాగింగ్‌ చేసిన ఘటన వెలుగుచూసింది. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న తనను రాత్రి పూట తమ పనులు చేయాలంటూ సీనియర్‌ విద్యార్థులు వేధించినట్టు రాఘవేంద్ర చెప్పారు. హాస్టల్ రూమ్‌లోకి తీసుకువెళ్లి.. షర్ట్‌ ఇప్పించి కొట్టారని రాఘవేంద్ర చెప్పారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా సెకండియర్ విద్యార్థులు నిర్భయ, సాయి అనే విద్యార్థులు మానసికంగా తీవ్రంగా వేధించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫిర్యాదు మేరకు సదరు విద్యార్థులపై విచారణ చేసిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మరికొందరు విద్యార్ధులు సీనియర్ విద్యార్ధుల వేధింపుల నేపథ్యంలో చదువుకు స్వస్థి చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితులకు కూడా వుండటం గమనించదగిన విషయం.

15:46 - November 30, 2016

'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' సెట్లో 'నందమూరి' హీరో కనబడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'పవన్ కళ్యాణ్', 'శృతి హాసన్' కాంబినేషన్ లో దర్శకుడు 'డాలీ' 'కాటమరాయుడు' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంపై 'పవన్' భారీ అంచనాలు పెట్టుకున్నారంట. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం ఈ చిత్రం రూపొందుతోంది. ఇక సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అవుతూ వస్తున్నాయి. తాజాగా 'కాటమరాయుడు' సెట్లో 'నందమూరి తారక్' కనిపించడం హల్ చల్ సృష్టిస్తోంది. ఫొటోలో 'శివ బాలాజీ'తో 'తారక్' లంచ్ చేస్తున్నట్లు ఉంది.
ఈ సినిమాలో 'పవన్' కు ముగ్గురు అన్నదమ్ములుంటారని, ఈ పాత్రల్లో 'శివ బాలాజీ'తో పాటు 'అజయ్'.. 'కమల్ కామరాజు' నటిస్తున్నారు. మరి 'తారక్' కూడా ఏదైనా పాత్ర పోషిస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కానీ తన ఫ్రెండ్ 'శివ బాలాజీ'ని కలిసేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చినట్లు 'తారకరత్న' పేర్కొంటున్నాట్లు తెలుస్తోంది. మార్చి 29వ తేదీన 'కాటమరాయుడు'ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఉగాది అనంతరం విడుదలయే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో వేచి చూడాలి. 

15:45 - November 30, 2016

ఒడిశా : పూరీలో జరుగుతున్న సీఐటీయూ 15వ జాతీయ మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలుగా కే. హేమలత ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తపన్‌సేన్‌ ను ఎన్నుకున్నారు. కోశాధికారిగా కేఎల్ మాల్కోటియా ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 32 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 16 మంది ఉపాధ్యక్షులు, మరో 16 మంది కార్యదర్శులు ఉన్నారు. సుకొమల్‌ సేన్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నికైన హేమలత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామిక మహిళ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అంగన్‌వాడీ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అసంఘటితరంగ కార్మికులకు 18 వేల రూపాయల కనీస వేతనం, చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడారు. కార్మికులందరికీ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కృషి చేశారు. పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని ఉద్యమించారు.  

15:42 - November 30, 2016

హైదరాబాద్ : అందరూ ఏకమైతేనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. నిర్వాసితుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో... టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వాసితుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు. నిర్వాసితుల సమస్యలపై ఈ సదస్సులో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని కోదండారం చెప్పారు. 

15:40 - November 30, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌ ఢమల్‌ అందా? మొన్నటి వరకు లాభాలు నింపిన రియల్‌ వ్యాపారం.. ఇప్పుడు నష్టాల బాట పట్టిందా? ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు కొనేవారు లేక రియల్టర్లు పరేషాన్‌ అవుతున్నారా? ఈ ప్రశ్నలకు రియలెస్టేట్‌ రంగ నిపుణులు డోంట్‌ వర్రీ..బీ హ్యాపీ అంటున్నారు. హైదరాబాద్‌పై పెద్దనోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమే అంటున్నారు. రానున్న కాలంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటంతో.. రియల్ రంగం మళ్లీ ఊపందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారంపై నిపుణుల స్పందన
హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని.. ఎవరూ అధైర్య పడవద్దంటున్నారు రియల్‌ఎస్టేట్‌ రంగ నిపుణులు. దేశ వ్యాప్తంగా సుమారు 30 శాతం మేర రియల్ ఎస్టేట్ ధరలు తగ్గే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నా..హైదరాబాద్‌పై ఆ ఎఫెక్ట్ ఉండదంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో హైదరాబాద్‌లో భూముల ధరలు పడిపోలేదని.. నగదు కొరతతో కొనుగోళ్లు నిలిచిపోయాయంటున్నారు. సిటీలో రియల్‌ బూమ్‌ ఎవర్‌ గ్రీన్‌ అంటున్నారు. ఏటా 20 వేల అపార్ట్ మెంట్ల విక్రయాలు, ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలతో కలిపి సుమారు వెయ్యి కోట్ల వరకు వ్యాపారం సాగుతుందని చెప్పుకొస్తున్నారు. నగరంలో ఐటీ, సర్వీస్ సెక్టార్ అధికంగా ఉన్నందునా..భవిష్యత్‌లో రియల్‌ఎస్టేట్‌ జోరు కొనసాగే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.

సిటీలో నోట్ల రద్దు ఎఫెక్ట్‌ తాత్కాలికమే అంటున్న క్రెడాయి
మరోవైపు డిమానిటైజేషన్ ప్రభావం పాజిటివ్‌గానే వుండే అవకాశం ఉందని రియల్‌ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నోట్ల రద్దుతో బ్యాంకుల్లో లక్షల కోట్ల డిపాజిట్‌ అవుతున్నాయని.. ఇళ్ల రుణాలపై ప్రస్తుతం 9, 10 శాతం ఉన్న వడ్డీ రేట్లు.. 6 నుంచి 5 శాతానికి పడిపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరుకావచ్చని చెబుతున్నారు. ఈ పరిణామాలు రియల్ రంగానికి ఊతమిచ్చే అవకాశాలు ఎక్కువ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పన్నులు తగ్గిస్తే ఎగవేతలుండవని నిపుణుల సూచన
ప్రస్తుతం రియల్ రంగంలో డబుల్ టాక్సేషన్ వల్ల సుమారు 30 శాతం పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో కొందరు కొంత బ్లాక్, మరికొంత వైట్ రూపంలో లావాదేవీలు నిర్వహిస్తున్నారని.. అదే పన్నులను వీలైనంతగా తగ్గిస్తే ఎగవేతలు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే.. బంగారం, స్టాక్ మార్కెట్ కన్నా రియల్ వ్యాపారంలోనే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుందని రియల్‌ ఎస్టేట్‌ ఎనలిస్టులు అంటున్నారు. 

15:36 - November 30, 2016

జమ్ము కశ్మీర్ : దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాల నుంచి ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై బీఎస్ఎఫ్ డీజీ కేకే శ‌ర్మ ఈ రోజు మీడియాకు వివ‌రించారు. సరిహద్దుల్లో 24 గంటలూ నిఘా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ రోజు జ‌మ్ముక‌శ్మీర్‌లోని చెమ్లియాల్, సాంబా ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు చొర‌బాటుకి య‌త్నించారని వారి ప్ర‌వేశాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకున్నామ‌ని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో కంచెల ఆధునికీకరణకు విస్తృత చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను, దాడుల‌ను తిప్పికొడుతున్నామ‌ని చెప్పారు. యోగా, ప్రాణాయామాల‌తో భార‌త‌ భద్రతా సిబ్బంది ఉప‌శ‌మ‌నం పొందుతూ ఉత్సాహంగా ప‌నిచేస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

15:34 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర నియామకం అయ్యారు. సీఎస్ గా ప్రదీప్ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం సచివాలయంలో సీఎస్ గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రదీప్ చంద్రను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరికాసేపట్లో రాజీవ్ వీడ్కోలు పలకనున్నారు. కాగా పాత సీఎస్ గా విధులు నిర్వహించిన రాజీవ్ శర్మకు సచివాలయంలో రెండుసార్లు బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

భువనగిరి మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాస..

నల్గొండ : భువనగిరి మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ఏఐజీ గ్లాస్ పరిశ్రమకు మున్సిపాల్టీ నీరు ఇవ్వవద్దని విపక్ష, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

క్యాష్ లెస్ పంచాయతీలపై మంత్రి జూపల్లి సమీక్ష..

హైదరాబాద్ : క్యాష్ లెస్ పంచాయతీలపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఆసరా ఫించన్ ల పంపిణీలోనూ క్యాష్ లెస్ విధానం తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. త్వరలో బ్యాంక్ లు, పోస్టాఫీస్ ల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని మంత్రి జూపల్లి నిర్ణయం తీసుకున్నారు. 

15:23 - November 30, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో నాని ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్యాకేజీ ప్రకటించిన రెండున్నర నెలలు అవుతోందనీ..ప్యాకేజీ అమలు దిశగా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు.

15:22 - November 30, 2016

ఏంటీ రూ. 500తో పెళ్లా ? జోక్ చేస్తున్నారా ? అసలు సాధ్యమేనా అని అనుకుంటున్నారు కదా..సాధ్యం అని అనుకుంటే అసాధ్యం కాదేమో..అవును వేలు..లక్షలు..కోట్లు..ఖర్చు పెట్టి అట్టహాసంగా పలువురు పెళ్లిళ్లు చేసుకుంటున్న రోజులివి. ఇటీవలే ఓ ప్రముఖ వ్యాపారి తన కుమార్తె కోసం వందల కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ ఓ జంట మాత్రం రూ. 500తో తమ పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సలోని సిదానా 2013 బ్యాచ్ టాపర్. ఈమెది పంజాబ్. రాజస్థాన్ కు చెందిన ఆశిష్ వశిష్ట కూడా ఐఏఎస్ కు ఎంపికయ్యారు. వీరిదదరూ ట్రైనింగ్ కోసం ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో చేరారు. ఇక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరువాత సిదానా..ఆశిష్ లు ఇతర రాష్ట్రాల్లో పనిచేయడం ప్రారంభించారు. దూరం..రోజులు పెరుగుతున్న కొద్దీ వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలోపేతం అవుతూ వచ్చింది. చివరకు వివాహం చేసుకోవాలని ఆశిష్..సిదానాలు నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించారు. కానీ అట్టహాసంగా కాకుండా చాలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారంట. అంతేగాకుండా ఇదిలా ఉంటే పెద్దనోట్ల రద్దు వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని బింద్ కోర్టులో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఇందుకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 28వ తేదీన కోర్టుకు అమ్మాయి, అబ్బాయి తరుపు బంధువులు వచ్చారు. చట్టపరంగా చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. కోర్టుకు ఫీజుగా కేవలం రూ.500 చెల్లించారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. రూ.500తో వారి పెళ్లి జరిగిపోయింది. అదండి సంగతి...

15:21 - November 30, 2016

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో తాము హంగామా చేయడానికి రావడం లేదని సిపిఎం సభ్యులు మహ్మద్‌ సలీం అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని.. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇంకెన్నాళ్లు ఇబ్బందులు పడాలి... మరెందరు చనిపోవాలని సలీం ప్రభుత్వాన్ని నిలదీశారు. తామిచ్చిన వాయిదా తీర్మాణంపై చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయం ప్రభుత్వమే ముందుకు వచ్చి చర్చలో పాల్గొనాలన్నారు.

టీఎస్ సీఎస్ గా ప్రదీప్ చంద్ర..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్రను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్ కు చెందిన వారు. సాయంత్రంతో రాజీవ్ శర్మ పదవీకాలం ముగియనుంది. 

కూలిన చాపర్..3గురు ఆర్మీ అధికారులు మృతి..

పశ్చిమ బెంగాల్‌ : సుక్నా ప్రాంతంలో భార‌త ఆర్మీ హెలికాఫ్ట‌ర్ కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు ఆర్మీ అధికారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మ‌రో జూనియ‌ర్ అధికారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయాల‌పాల‌యిన అధికారిని భద్రతా సిబ్బంది ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 

ముగిసిన సీఐటీయూ మహాసభలు..

ఒడిశా : పూరీలో అఖిల భారత సీఐటీయూ మహాసభలు ముగిశాయి. సీఐటీయూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కె.హేమలత, ప్రధాన కార్యదర్శిగా తపన్ సేన్ ఎన్నికయ్యారు. 

రాజ్యసభలో గందరగోళం..

ఢిల్లీ : రాజ్యసభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుమార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 2గంటలకు తిరిగి సభ ప్రారంభమైంది. విపక్షాల చేపడుతున్న ఆందోళనపై డిప్యూటి స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడి ఘటన అనంతరం సంబంధిత మంత్రి సభలో ప్రకటన చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వెల్లడించారు. 

14:05 - November 30, 2016

ప్రేమ పేరుతో మోసపోతున్న అమ్మాయిలు.. కలహాలు.. అంశంపై నిర్వహించిన మానవి మరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి మాట్లాడారు. కాలర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధాలను ఇచ్చారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:59 - November 30, 2016

సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని సీపీఎం మహాజన పాదయాత్ర బృందం సభ్యులురాలు ఎస్.రమ అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర45వ రోజుకు చేరింది. పాదయాత్ర బృందం 400 గ్రామాల్లో పర్యటించింది. 1130 కిమీ పూర్తి చేసుకుంది. పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వస్పందన వస్తుంది. సీపీఎం బృందానికి స్థానికులు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈమేరకు రమ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేదు. బీడీ కార్మికులకు జీవన భృతి అమలు కావడం లేదని.. అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

లోక్ సభ రేపటికి వాయిదా..

న్యూఢిల్లీ : లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే నగ్రోటా ఉగ్రదాడిపై..పెద్ద నోట్లపై చర్చకు సభ్యులు పట్టుబట్టారు. సభ్యుల ఆందోళనతో పలు మార్లు వాయిదా పడింది. చివరకు స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. 

13:47 - November 30, 2016

సరిహద్దులో 24గంటలూ నిఘా - బీఎస్ఎఫ్ డీజీ

ఢిల్లీ : దేశ స‌రిహ‌ద్దు సరిహద్దుల్లో 24 గంటలూ నిఘా ఉంద‌ని బీఎస్ఎఫ్ డీజీ కేకే శ‌ర్మ స్ప‌ష్టం చేశారు. చెమ్లియాల్, సాంబా ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు చొర‌బాటుకి య‌త్నించారని వారి ప్ర‌వేశాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకున్నామ‌ని చెప్పారు. 

13:40 - November 30, 2016

 హైదరాబాద్ : 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వడం కష్టమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఎంసెంట్ నిర్వహణపై తెలంగాణ విద్యాశాఖ సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ఎంసెట్ లేకుండా ఇంజనీరింగ్ అడ్మిషన్లు చేపట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 162 పాఠశాలలకు నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:38 - November 30, 2016

చలికాలం..ఎన్నో అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో చిన్నపిల్లల చర్మం పొడిబారడం..ఇతరత్రా సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శిశువులు చలికాలంలో ఆరోగ్యంగానే ఉంటారు.

  • శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది.
  • చిన్నారులకు ఆహారం అలవాటు చేసే విషయంలో వైద్యుల సలహాలు పాటించడం ఉత్తమం.
  • చిన్నారులకు దుమ్ము..ధూళి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి మైదానాల్లో చిన్నారులను ఆడించకూడదు.
  • చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు క్రీములు రాయాలి.
  • తలకు..చెవులకు చలిగాలి సోకుండా ఉండేందుకు క్యాప్ లు పెట్టాలి.
  • చలిగాలి తట్టుకొనే దుస్తులను..స్వెట్టర్స్ వేయాలి.
  • చలికాలంలో ఉదయం ఎండ వచ్చేవరకు చిన్న పిల్లలు, వృద్ధులు, అస్తమ వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా ఉండడం ఉత్తమం. 
13:34 - November 30, 2016
13:13 - November 30, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)పై హైకోర్టు చర్యలు తీసుకుంది. బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై అడ్ హాక్ కమిటీ చర్యలు తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, సెక్రటరీ జాన్ మనోజ్ లను సస్పెండ్ చేసింది. జాయింట్ సెక్రటరీ పురుష్తోం అగర్వాల్, ట్రెజరర్ పై వేటు పడింది. 

 

12:57 - November 30, 2016

ఢిల్లీ : జాతీయ జెండా, జాతీయ గీతంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సినిమా థియేటర్లకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు తప్పనిసరిగా జాతీయగీతం ప్రదర్శించాలని ఆదేశించింది. జాతీయ జెండా, జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కరూ గౌరించాలని పేర్కొంది. జాతీయ గీతం ప్రదర్శన సమయంలో థియేటర్లలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 14 కు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:42 - November 30, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మళ్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ తాము స్పీకర్ మీద విమర్శలు చేయలేదని.. ప్రభుత్వం మీదే తమ విమర్శలని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని తెలిపారు. నిబంధన 56 కింద చర్చ చేపట్టాలన్నారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించాలని కోరారు. అలా కాకుంటే చర్చను తాము స్వాగతించమని చెప్పారు. చర్చ నుండి ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. అనంతరం బీజేపీ నేత అనంతకుమార్ మాట్లాడుతూ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి చర్చకు సిద్ధమని చెబుతూనే ఉన్నామని చెప్పారు. దేశ భద్రత అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు. సభలో హంగామా చేయడం తమ ఉద్దేశం కాదని సీపీఎం తెలిపింది. చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ నిర్వహించాలని టీఎంసీ పేర్కొంది. 

ఎంసెట్ రద్దుపై ఆలోచిస్తున్నాం - కడియం..

హైదరాబాద్ : ఎంసెట్ రద్దుపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఎంసెట్ లేకుండా ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై చర్చిస్తున్నట్లు తెలిపారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం కష్టమన్నారు. 

లోక్ సభ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. ఉదయం ప్రారంభమైన సభలో విపక్షాలు ఆందోళన చేయడంతో మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో విపక్షాలు ఆందోళన చేశాయి. పెద్దనోట్లు రద్దు అంశంపై చర్చ చేపట్టాలని, చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాల ఆందోళనతో సభను మధ్యాహ్నం 12.45గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

12:35 - November 30, 2016
12:35 - November 30, 2016

విక్టరీ వెంకటేష్..టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు. 'వెంకటేష్' ఎంతో ఊహించుకున్న 'బాబు బంగారం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బడ్జెట్ ని రాబట్టగలిగింది కానీ ఈ చిత్రం వల్ల 'వెంకటేష్' కి ప్రత్యేకంగా ఒరిగింది మాత్రం ఏం లేదని చెప్పాలి. అందుకే 'గురు' రీమేక్ తో అయినా బాక్సాఫీసు వద్ద విక్టరీ నమోదు చేయాలని ఈ సీనియర్ స్టార్ కసిగా ఉన్నాడు. 'వెంకటేష్' బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన 'సాలా ఖద్దూస్' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'గురు' టైటిత్ తో తెరకెక్కుతున్న సెప్టెంబర్ 19 వ తేదీన స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో 'వెంకీ' బాక్సర్ గా నటిస్తున్నారు. ఇందుకు శిక్షణ..వ్యాయామాలు కూడా చేశారు. డిసెంబర్ 13వ తేదీన 'వెంకటేష్' పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందంట. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారంట. బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన 'రీతికా సింగ్' తెలుగులో కూడా నటిస్తోంది. సుధా కొంగర దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ లో మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రీమేక్ తో అయిన 'వెంకీ' సోలోగా సూపర్ హిట్టు కొడుతాడో చూడాలి.

రూల్ 56 కింద చర్చ జరగాలి - ఖర్గే..

ఢిల్లీ : తాము స్పీకర్ పై విమర్శలు చేయలేదని కాంగ్రెస్ సభ్యుడు ఖర్గే పేర్కొన్నారు. సభ వాయిదా పడిన అనంతరం 12గంటలకు ప్రారంభమైన లోక్ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపైనే తాము విమర్శలు చేయడం జరుగుతోందన్నారు. పెద్దనోట్లు రద్దు అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని, నిబంధన 56 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించాలని, అలా కాకుండా చర్చను స్వాగతించమన్నారు. 

12:17 - November 30, 2016

ఢిల్లీ : రాజ్యసభలో వాయదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయసభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపటికే మళ్లీ వాయిదా పడింది. అంతకముందు నగ్రోట ఉగ్రదాడిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ పిజె.కురియన్ సభను 12గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

 

 

 

 

 

 

 

12:15 - November 30, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' గురించి ఏ విషయమైనా బయటకు వచ్చిదంటే చాలు..దాని గురించి అభిమానులు ఆరా తీస్తుంటారు. ఆయన చిత్రం..కుటుంబ వివరాలు..ఇతరత్రా విషయాల గురించి అభిమానులు ఆతృతగా ఆరా తీస్తుంటారు. 'చిరంజీవి' ఫ్లాష్ బ్యాక్ ల విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతోంది. ముగ్గురు హీరోయిన్లు 'చిరు'ను ఆటపట్టిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. 'సుమలత'..'జయసుధ'..'సుహాసిని' ముగ్గురూ 'చిరు'తో దిగిన అప్పటి ఫొటో హల్ చల్ చేస్తోంది. 'జయసుధ' తన ఫేస్ బుక్ లో ఈ ఫొటో పోస్టు చేశారు. 'జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి..మేము తిరిగి వెనక్కి వెళ్లాలని కోరుకుంటున్నా' అంటూ పోస్టింగ్ లో 'జయ' రాసుకొచ్చారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే 'వి.వి.వినాయక్' దర్శకత్వంలో 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 150వ చిత్రం కావడంతో ఈ సినిమాను 'చిరు' ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ రసాభసం..

పశ్చిమగోదావరి : ఏలూరులో జరుగుతున్న మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. బీసీ కులాలను విడదీసేందుకే కమిషన్ వేశారంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 

ఎస్వీకేలో నిర్వాసితుల రాష్ట్ర సదస్సు..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వాసితుల రాష్ట్ర సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రొ.కోదండరాం, వివిధ జిల్లాల భూ నిర్వాసితులు హాజరయ్యారు. 

సంగారెడ్డిలో గోల్కోండ హస్తకళ భవనం ప్రారంభం..

సంగారెడ్డి : జిల్లాలో గోల్కోండ హస్తకళ భవనాన్ని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు ప్రారంభించారు. మన సంస్కృతి, సంపద్రాయాలు ప్రతిబింబించేలా గోల్కోండ హస్త కళా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 

11:54 - November 30, 2016
11:53 - November 30, 2016

పెద్ద నోట్ల రద్దు..రూ. 2వేల నోటు...సామాన్యుడి కంట తడిపెట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగాయి. కేవలం రూ. 2000 వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని కేంద్రం పేర్కొనడంతో ప్రజలు బ్యాంకులు..ఏటీఎంల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎన్నో రంగాలపై 'నోట్ల రద్దు' తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ సందర్భంగా ప్రభావం ఏ విధంగా ఉందో బాహ్యాప్రపంచానికి తెలియచేయడానికి టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా చర్లపల్లి పారిశ్రామిక వాడల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఓ కార్మికుడు తన ఆవేదన తెలియచేశాడు. గరీబోడికి ఏమి లేదని, తనకు 12వేలు జీతం వస్తుందని లక్ష్మీనారాయణ కార్మికుడు పేర్కొన్నాడు. ప్రతి నెలా 12వ తేదీన జీతం వస్తుందని, ఇంతవరకు జీతం లేదని కన్నీళ్లు పెట్టాడు. కంపెనీలో డ్యూటి చేసినా ఏం లాభం లేదని, రూ. 2వేలు తీసుకెళితే చిల్లర తీసుకరా అని అంటున్నారని వాపోయాడు. మోడీకి ఎవరూ సపోర్టు చేయడం లేదని, రూ. 2వేలు రద్దు చేసి పాతనోట్లను కొనసాగించాలని తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:52 - November 30, 2016

చెన్నై : తమిళనాడుకు తుపాను ముప్పు పొంచివుంది. చెన్నైకి వెయ్యి కిమీ దూరంలో వాయుగుండం ఏర్పడింది. డిసెంబర్ 2న వేదారణ్య..చెన్నై మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో తమిళాడులో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతారణ శాఖ తెలిపింది. ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:45 - November 30, 2016

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' సతీమణి వార్తల్లో ఎక్కారు. ఆమె పీఎస్ కు వెళ్లారు. దంపతుల మధ్య ఏదైనా గొడవలా ? అని ఏదోదో ఊహించుకోకండి. 'ఖాన్' ఇంట్లో దొంగలు పడ్డారు. ఏకంగా 'ఖాన్' సతీమణి 'కిరణ్' కు చెందిన బంగారు నగలను తస్కరించారు. 'అమీర్' దంపతులు బాంద్రాలో ఓ నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం తనింట్లో దొంగలు పడ్డారని 'కిరణ్' పోలీసులకు తెలపడంతో ఈ సంగతి బయటపడింది. తన ఇంటి బెడ్ రూం లో లాకర్ లో ఉంచిన బంగారం ఉంగరం..డైమండ్ నక్లస్ కనిపించకుండా పోయాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇంటి పనివాళ్లు దొంగిలించి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమీర్ ఖాన్ తన తాజా చిత్రం 'దంగల్' తో బిజీగా ఉన్నారు. హర్యాణాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

వర్క్ షాప్ ను ప్రారంభించిన కడియం..

హైదరాబాద్ : సర్వశిక్ష అభియాన్ భవన్ లో ఆర్జేడీలు, డీఈవోల వర్క్ షాప్ ను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. 

11:36 - November 30, 2016

ప్రకాశం : జిల్లాలోని టుంగుటూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న టూరిస్టు బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అయ్యప్పభక్తులకు గాయాలయ్యాయి. ఏలూరు నుంచి శబరిమలకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హెచ్ సీఏ బ్యాంకుల ఖాతాలపై హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్ : క్రికెట్ అసోసియేన్ బ్యాంకుల ఖాతాలన్నీ సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై అడ్ హక్ కమిటీ చర్యలు తీసుకుంది. హెచ్ సీఏ అధ్యక్షులు అర్షద్, సెక్రటరీ జాన్ మనోజ్ సస్పెన్షన్ కు గురయ్యారు. జాయింట్ సెక్రటరీ పురుషోత్తం అగర్వాల్, ట్రెజరర్ ఫైనా వేటు పడింది. 

11:33 - November 30, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. రాజ్యసభలో నాగ్రోతా ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల సభ్యులు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వారికి సంతాపం తెలియచేయాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు డిమాండ్ చేశాయి. 
వీర జవాన్లకు సంతాపం తెలియచేయాలి - ఆజాద్..
జమ్మూలోని కీలక సైనికస్థావరం నాగ్రోతా కంటోన్మెంట్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన వారికి రాజ్యసభ సంతాపం తెలియచేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ పేర్కొన్నారు. 

సర్జికల్ అనంతరం దాడులు - మాయావతి..
సర్జికల్ అనంతరం ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఎంతో మంది జవాన్లు వీరమరణం పొందుతున్నారని మాయావతి పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు వీరమరణం పొందారని తెలిపారు. వెంటనే దీనిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. 

చర్చకు సిద్ధమన్న జైట్లీ..సంతాపం తెలియచేయాలన్న శరద్ యాదవ్..
నల్లధనం, సరిహద్దు అంశంపై విపక్షాలు చర్చ కావాలంటే ప్రభుత్వం చర్చకు సిద్ధమని మంత్రి జైట్లీ ప్రకటించారు. జవాన్ల వీరమరణంపై సంతాపం తెలియచేయాలని రాజ్యసభలో శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. సరిహద్దులో ఏడుగురు వీరమరణం పొందారని, పెద్దనోట్లు రద్దు దేశం రక్షణ కోసం తీసుకున్న చర్య అయితే క్యూ లైన్ లో పలువురు మృతి చెందారని శరద్ యాదవ్ పేర్కొన్నారు.

సభ వాయిదా..
రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో డిప్యూటి ఛైర్మన్ పి.జె.కురియన్ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు లోక్ సభలో కూడా ఆందోళన నెలకొనడంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

చెన్నైకి వాయు గండం..

చెన్నై : మరో వాయుగుండం పొంచి ఉంది. చెన్నైకి 1000 కి.మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. డిసెంబర్ 2న వేదారణ్యం - చెన్నై మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం పేర్కొంది. ప్రధాన ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో వెళ్లవద్దని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. 

బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు..

ఢిల్లీ : బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ నియమించింది. బీజేపీ ఢిల్లీ నూతన అధ్యక్షుడిగా మనోజ్ తివారీని నియమించారు. సతీష్ ఉపాధ్యాయ స్థానంలో తివారి ఎంపికయ్యారు. బీహార్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నిత్యానంద రాయ్ ని నియమించారు. 

జవాన్ల వీరమరణంపై సంతాపం తెలియచేయాలి - శరద్ యాదవ్..

ఢిల్లీ : జవాన్ల వీరమరణంపై సంతాపం తెలియచేయాలని రాజ్యసభలో శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. సరిహద్దులో ఏడుగురు వీరమరణం పొందారని, పెద్దనోట్లు రద్దు దేశం రక్షణ కోసం తీసుకున్న చర్య అయితే క్యూ లైన్ లో పలువురు మృతి చెందారని శరద్ యాదవ్ పేర్కొన్నారు. 

అన్నింటికీ చర్చకు సిద్ధం - జైట్లీ..

ఢిల్లీ : నల్లధనం, సరిహద్దు అంశంపై విపక్షాలు చర్చ కావాలంటే ప్రభుత్వం చర్చకు సిద్ధమని మంత్రి జైట్లీ ప్రకటించారు.

 

సర్జికల్ అనంతరం దాడులు - మాయావతి..

ఢిల్లీ : సర్జికల్ అనంతరం ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఎంతో మంది జవాన్లు వీరమరణం పొందుతున్నారని మాయావతి పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు వీరమరణం పొందారని తెలిపారు. వెంటనే దీనిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. 

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. లోక్ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. పెద్దనోట్లు రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ సభను 12గంటల వరకు వాయిద వేశారు. 

వీర జవాన్లకు సంతాపం తెలియచేయాలి - ఆజాద్..

ఢిల్లీ : జమ్మూలోని కీలక సైనికస్థావరం నాగ్రోతా కంటోన్మెంట్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన వారికి రాజ్యసభ సంతాపం తెలియచేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ పేర్కొన్నారు. 

లోక్ సభకు హాజరైన మోడీ..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వారికి సంతాపం తెలియచేయాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు డిమాండ్ చేశాయి. 

11:10 - November 30, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ లోక్ సభకు హాజరయ్యారు. రాజ్యసభలో నగ్రోట ఉగ్రదాడిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
 

10:52 - November 30, 2016

మెదక్ : తెలంగాణలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పల్లెపల్లెలో పాదయాత్ర బృందానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి తెలియజేస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. స్వ రాష్ట్రం సిద్ధించినా ప్రజా సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని ఈ సందర్భంగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 
తమ్మినేని బృందానికి పలువురు అభినందనలు 
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 44వ రోజు సిద్దిపేట జిల్లాలో కొనసాగింది. సిద్దిపేట జిల్లా మెట్టు వద్ద మహాజన పాదయాత్ర 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 1100 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.. తమ్మినేని బృందానికి పలువురు అభినందనలు తెలిపారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి స్వాగతం పలికి.. పాదయాత్ర బృందాన్ని సన్మానించారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజల జీవితాలు బాగుపడటం లేదని ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.  
పాదయాత్రకు విశేష స్పందన
సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల వారు తమ కష్టాలను పాదయాత్ర బృందానికి చెప్పుకుంటున్నారు.  సిద్ధిపేట జిల్లా  తడ్కపల్లిలో మహిళలు మంగళ హరతులతో పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రకు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య మద్దతు తెలిపారు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు క్షోభకు గురవుతున్నారని చుక్కారామయ్య అన్నారు. 
కేసీఆర్ కు వాస్తు పిచ్చి : బాలలక్ష్మి 
గ్రామీణ జనాభా అధికంగా ఉన్న భారతదేశంలో నగదు రహిత ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెడితే ఎంతవరకు విజయవంతం అవుతుందని పాదయాత్రలో పాల్గొన్న ఓయూ విద్యార్థి జేఏసీ నేత బాలలక్ష్మి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. వాస్తు పిచ్చితో ఉన్న భవనాలను కూలగొడుతున్న కేసీఆర్‌... తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయడం లేదని బాలలక్ష్మి అన్నారు. 
చట్టాలను ధిక్కరించే అధికారం ఎవరిచ్చారు : తమ్మినేని
తడ్కపల్లిలో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ హాస్టల్‌ను పాదయాత్ర బృంద సభ్యులు సందర్శించారు. అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు తమ్మినేని బృందానికి చెప్పుకున్నారు. మంత్రి హరీష్‌రావు మల్లన్నసాగర్‌పై అహంకార పూరితంగా వ్యవహరించడం గర్హనీయమని తమ్మినేని అన్నారు. చట్టప్రకారం భూసేకరణ చేపట్టకుండా..చట్టాలను ధిక్కరించే అధికారం ఎవరిచ్చారని తమ్మినేని ప్రశ్నించారు. 
సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరం : జాన్ వెస్లీ
సీపీఎం మహాజన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పాదయాత్ర బృంద సభ్యులు జాన్‌ వెస్లీ అన్నారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. దళితులు, మైనారిటీలతో పాటు అనేక వర్గాలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని జాన్‌ వెస్లీ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. మైనారిటీలకు లోన్లు ఇచ్చి వారిని ఆదుకోవాలని లేఖలో డిమాండ్‌ చేశారు.  

 

10:41 - November 30, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్‌ అంతా నగదు రహిత లావాదేవీలు జరగాలని కేంద్రం చెబుతుండడంతో పీవోఎస్ మెషీన్స్ కి డిమాండ్ పెరుగుతోంది. పీవోఎస్ మెషీన్స్ వాడకం ఎలాగో.. అవి పొందడం ఎలాగో.. అవి పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలో 10 టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ వివరాను వీడియోలో చూద్దాం....

 

10:37 - November 30, 2016
10:36 - November 30, 2016

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. చెన్నైకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం మరింత బలపడుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రాగల 48 గంటల్లో తుపానుగా మారే అవకాశముంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:28 - November 30, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో నగ్రోట ఆపరేషన్ కొనసాగుతోంది. నగ్రోట సైనిక శిబిరంపై నిన్న ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ముష్కరుల కాల్పుల్లో ఏడుగురు భారత జవాన్లు మృతి చెందారు. ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హత మార్చింది. నగ్రోట ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు నక్కారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నగదు కొరత పరిష్కార బాధ్యత అందరిదీ - బాబు..

విజయవాడ : నగదు రహిత లావాదేవీలపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులు, సెర్ప్, మెప్మా ఉద్యోగులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. నగదు కొరత పరిష్కరించే బాధ్యత అందరిదీ అని, ప్రజల్లో భరోసా పెంచాలని బాబు సూచించారు. వ్యవస్థ పట్ల నమ్మకం పెరిగి విశ్వాసం రావాలని పేర్కొన్నారు. 

10:23 - November 30, 2016

విజయవాడ : పెద్దనోట్లు రద్దు చేసి రోజులు గడుస్తున్నాయి. కానీ సామాన్యుల ఇక్కట్లు మాత్రం తొలగడం లేదు. చాలానంత డబ్బులు లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎంలు..బ్యాంకుల ఎదుట పడిగాపులు పడుతున్నారు. విజయవాడలోని స్వరాజ్యమైదానంలో మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగే వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి టెన్ టివి ప్రయత్నించింది. నోట్ల రద్దు వల్ల తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. చిల్లర..డబ్బులు లేక కూరగాయాలు కొనుక్కోలేకపోతున్నామని వినియోగదారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నెలలో రైతు పంటలు వస్తాయని రైతు బజార్ అధికారి పేర్కొన్నారు. ఆటోమెటిక్ గా ధరలు తగ్గుతాయని, అంతేగాకుండా చిల్లర సమస్యతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు..

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. లోక్ సభ..రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలను కొనసాగించే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు..నల్లధనం అంశంపై ప్రధాని స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 

10:11 - November 30, 2016
10:09 - November 30, 2016

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో నల్లధనం..నోట్ల రద్దుపై చర్చ జరుగుతుందా ? అనే సందేహాలు నెలకొంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ కు ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఐటీ చట్టం సవరణ బిల్లును ఆర్థిక మంత్రి జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. నోట్ల రద్దుపై వాయిదా తీర్మానం..ఆదాయపు పన్ను చట్టం సవరణ బిల్లు ఒకే అంశాన్ని సంబంధించింది కావడంతో కలిపి చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం నాడు ప్రారంభమయ్యే ఉభయసభల్లో రగడ చెలరేగే అవకాశం ఉంది. పార్లమెంట్ లో విపక్షాలు సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నాయి. క్యూలో నిలబడి మృత్యువాత పడిన వారికి పరిహారం చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నోట్ల రద్దు చేశారు కానీ తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఉభయసభల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

09:34 - November 30, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి 22 రోజులు అయ్యింది. బ్యాంకులు, ఏటీఎంల్లో చాలినంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో  ప్రజల కష్టాలు  ఎదుర్కొంటూనే ఉన్నారు. నగదు  విత్‌ డ్రా చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర జనం బారులు తీరారు. చాలా చోట్ల ఏటీఎంలను మూసివేశారు.  మరోవైపు నోట్ల రద్దు ప్రభావం అన్ని వ్యాపారాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా చిల్లర కష్టాలతో కూరగాయల మార్కెట్లలో బిజినెస్‌ పడిపోయిందని వ్యాపారులంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:31 - November 30, 2016

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అటవీప్రాంతంలో ఎర్రచందనం కూలీలు హల్‌చల్‌ చేశారు. కూంబింగ్‌ చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి మూడురౌండ్లు కాల్పులు జరిపారు. ముగ్గురు కూలీలను అరెస్ట్‌ చేశారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:25 - November 30, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణ్ రావు, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్, బీజేపీ అధికార ప్రతినిధి పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. నల్లధనం ఉన్నవారు ఎవరూ లైన్ లో నిలబడలేదని.. సామాన్యులే నిలబడి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో చిల్లర ఉంచాలని సూచించారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:17 - November 30, 2016

అలనాటి అందాలనటి 'కాంచన' గుర్తుండే ఉంటుంది కదా...దాదాపు 30 సంవత్సరాల తరువాత ఈమె మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి'లో ఆమె నటించనున్నట్లు ఇటీవలే దర్శకుడు సందీప్ వంగా ప్రకటించారు. కాంచన వయస్సు 77 ఏళ్లు. ఆమె చివరిసారిగా శ్రీ దత్త దర్శనం తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా 1985లో విడుదలైంది. అనంతరం మేకప్ వేసుకోలేదు. సినిమాలో నటించాలని తాను కోరినప్పుడు తొలుత కాంచన అంగీకరించలేదని సందీప్ వంగా పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆమె ఒప్పుకున్నారని తెలిపారు. విజయ్ కు బామ్మగా 'కాంచన' నటించనుందని, సినిమాలో ఆమెది కీలక పాత్ర అని తెలిపారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని జనవరిలో రిలీజ్ కానుందని టాక్.

09:10 - November 30, 2016

బీడీ పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపుతుందని తెలంగాణ బీడీ కార్మిక సంఘం నేత సిద్ధి రాములు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిప పేర్కొన్నారు. 'తెలంగాణలో బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువ.  బీడీ కార్మికుల మీద కూడా నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నోట్ల రద్దు తర్వాత చాలా చోట్ల యాజమాన్యాలు కార్మికులకు చెల్లింపులు నిలిపివేశాయి. నోట్ల రద్దు తర్వాత బీడీ పరిశ్రమ, కార్మికులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఆయన చర్చించారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు

ఢిల్లీ : ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగింది. ఆరు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

08:48 - November 30, 2016

విజయవాడ : రియల్ రంగంలో భారీ సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గృహ నిర్మాణ రంగంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పకడ్బందీ చట్టాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాజధానిలో రియల్ భూమ్ నేపథ్యంలో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అక్రమాలను అరికట్టి...పారదర్శకతను పాటించేందుకు రియల్‌ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసుందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త పుంతలు 
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతిలో ఒక్కసారిగా రియల్‌ రంగం పరుగులు పెడుతోంది. అలాగే వైజాగ్‌, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో సైతం రియల్‌ రంగం వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో పారదర్శకత లేక గృహ నిర్మాణ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతోంది. కట్టడాలు, అమ్మకాలు, కొనుగోళ్ల రేట్లపై నియంత్రణ లేక ఏపీ సర్కార్‌ పై అనేక విమర్శలు వచ్చాయి.
గతంలో రియల్ ఎస్టేట్ చట్టం 
అయితే రియల్ రంగంలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు గతంలోనే ఏపీ సర్కార్ రియల్ ఎస్టేట్ చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకే కొత్తగా రియల్ రెగ్యులేటరీ అధారిటి, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను తీసుకురావాలని భావిస్తోంది. ఈ చట్ట ప్రకారం ఎవరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్నా ముందుగా రెగ్యులేటరీ అధారిటిలో నమోదు చేసుకోవాల్సిందే. రియల్‌ ఏజెంట్లు కూడా తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రియల్టర్లు తమ వ్యాపార వివరాలను అథారిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
రియల్ రెగ్యులేటరీ అధారిటిలో రిజిస్టర్‌ 
ఇక 500 చదరపు మీటర్లకన్నా ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టినా, ఎనిమిది అంతస్తుల కన్నా ఎక్కువ సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మించినా తప్పనిసరిగా రియల్ రెగ్యులేటరీ అధారిటిలో రిజిస్టర్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన 90 రోజుల్లోగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భూ యాజమాన్య పత్రాలు, అభివృద్ధి చేసేందుకు ఉన్న అనుమతులు, నిర్మాణానికి ఉపయోగించే సాంకేతిక సిబ్బంది వివరాలు, కాంట్రాక్టర్ల వివరాలు, దశల వారీగా చేయనున్ననిర్మాణాల వివరాలు, ఖర్చు అంచనాలు, అమ్మకం రేట్లు ఇతర సమాచారం అథారిటీకి సమర్పించాల్సి ఉంటుంది.
30 రోజుల్లోగా అథారిటీ అనుమతులు 
వివరాలు వచ్చిన తరువాత 30 రోజుల్లోగా అథారిటీ అనుమతులు ఇస్తుంది. అనంతరం రియల్టర్‌ అథారిటీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించేందుకు లాగిన్ ఐడి పాస్ వర్డ్‌ కేటాయిస్తారు. ఫలితంగా ఆన్ లైన్ లో నమోదు చేయబడుతుంది. రిజిస్టర్‌ అయిన రియల్టర్లపై ఫిర్యాదులు వచ్చినా, నేరుగా అథారిటీకే అనుమానాలు వచ్చినా, దర్యాప్తు చేసి రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే అధికారం అథారిటీకి ఉంటుంది. రద్దు చేసిన రియల్‌ వ్యాపారుల బ్యాంకు ఖాతాలు నిలిపి వేస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అథారిటీలకు కూడా వీరి సమాచారాన్ని అందిస్తారు.
రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు 
అలాగే రియల్ రంగంలోని వివాదాల పరిష్కారానికి రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభత్వం. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రతిపాదనలు సీఎం కార్యాలయానికి చేరాయి. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర అనంతరం రియల్ రెగ్యులేటరీ అధారిటి, అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యరూపం దాల్చనున్నాయి. మొత్తానికి రియల్ రంగంలో జరుగుతున్న అక్రమాలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వం నడుబిగించింది. అయితే సర్కార్ చేపడుతున్న సంస్కరణలు ఎంత మేరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయో వేచి చూడాలి.

 

08:41 - November 30, 2016
08:36 - November 30, 2016
08:34 - November 30, 2016

సూర్యాపేట : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం తాడ్వాయి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:29 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఇసుక మాఫియాపై కొరడా ఝుళిపించనుంది ప్రభుత్వం. అవసరమైతే సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని అదేశించారు మైనింగ్‌ శాఖమంత్రి కేటీఆర్. స్ధానిక అవసరాలను పక్కకు పెట్టి..శాండ్ ని బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. సచివాలయంలో మైనింగ్ సమస్యలపై   టిఎస్ ఐఐసి ఛైర్మన్ తో కలసి  మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇసుక అక్రమార్కులపై సర్జికల్ స్ర్టయిక్స్ 
ఇసుక అక్రమార్కులపై సర్జికల్ స్ర్టయిక్స్ చేయాలని గనుల శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులకు అదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాదారణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచడం..ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇసుక నిల్వలు గుర్తింపు
రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల్లో మునిగిపోయే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉన్నట్లు మైనింగ్‌ శాఖ గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలని..దీన్ని స్థానిక అవసరాలకు ఉపయోగించుకోవాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాలకు సరిపోయినంత ఇసుక అందుబాటులో ఉన్నదని..వీటితోపాటు టీఎస్‌ఎండీసీ ద్వారా వాణిజ్య అవసరాలకు సైతం దీన్ని  వినియోగించాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 
ప్రత్యేకంగా టీఎస్‌ఎండీసి అధికారులు..
గతంలో మిడ్ మానేరు ప్రాజెక్టులో నీరు చేరడంతో అందుబాటులో ఉన్న ఇసుకను తవ్వి తీయలేకపోయామని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అందుబాటులోని ఇసుక మైనింగ్ కొరకు ప్రత్యేకంగా టీఎస్‌ఎండీసి అధికారులు..జిల్లాల్లో  పర్యటించి కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

 

08:22 - November 30, 2016

హైదరాబాద్ : క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు జీహెచ్ ఎంసీ సిద్ధమైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రారంభిస్తున్నట్టు బల్దియా కమిషనర్‌ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాల‌ని ప్రభుత్వం కూడా నిర్ణయించ‌డంతో బల్దియా అధికారులు ఇందుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. బిల్ క‌లెక్టర్ల‌కు స్వైపింగ్ మిష‌న్స్ స‌మ‌కూర్చాల‌ని నిర్ణయించారు. 
నగదు రహిత లావాదేవీలు 
500, వెయ్యి నోట్ల రద్దుతో ప్రభుత్వ రంగానికి పెద్ద మొత్తంలో ఆదాయం త‌గ్గిపోయింది. కొన్ని సంస్థల‌కు మాత్రం ఆదాయం భారీగా స‌మ‌కూరింది. రానున్న రోజుల్లో ప‌రిస్థితి ఇలానే ఉంటే ఇబ్బందులు త‌ప్పవ‌ని భావించిన ప్రభుత్వం ప‌న్నులు, ఫీజుల‌ను క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌ ద్వారా నిర్వహించాల‌ని నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అందుకు త‌గ్గట్లుగా పూర్తిస్థాయిలో అన్ని విభాగాలు స‌మాయ‌త్తం కావాల‌ని సూచించింది. 
క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌ కు బ‌ల్దియా ఏర్పాట్లు 
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌ పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా బ‌ల్దియా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి వివిధ విభాగాల హెచ్ఓడీలు, జోన‌ల్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, వాల్యువేష‌న్ అధికారుల‌తో ప్రత్యేక స‌మావేశం నిర్వహించారు. ప్రస్తుతం 12 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ప‌న్నులు చెల్లిస్తున్నారని, వాటిని 100 శాతానికి పెంచాలని ప్లాన్‌ చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌ మై జీహెచ్ ఎంసీ మొబైల్ యాప్ ద్వారా స్వైపింగ్‌ మిష‌న్లు, సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లతోపాటు జీహెచ్ఎంసీ అకౌంట్ నెంబ‌ర్‌కు నేరుగా ప‌న్నులు చెల్లించే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామ‌న్నారు. 
అన్‌లైన్ చెల్లింపుల విష‌యంలో ప్రత్యేక శిక్షణ 
గ్రేట‌ర్ కార్పొరేష‌న్‌కు చెందిన అన్ని విభాగాల అధికారుల‌కు అన్‌లైన్ చెల్లింపుల విష‌యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తామ‌న్నారు కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. ఆస్తిప‌న్ను వ‌సూళ్ల కోసం ప‌నిచేస్తున్న బిల్ క‌లెక్టర్లకు స్వైపింగ్ మిష‌న్స్ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పాత నోట్లతో దేశంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేసిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీని కేంద్రం గుర్తించింది . తాజాగా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ ప్రక్రియ‌ను అమలు చేస్తే ఫిబ్రవ‌రి, మార్చ్‌ నెలల్లో భారీగా ప‌న్నులు వ‌సూలు అవుతాయని భావిస్తున్నారు. 

 

08:16 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కత్తి ప్రదీప్‌చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ మధ్యాహ్నం సీఎస్‌ రాజీవ్‌శర్మ నుంచి కొత్త సీఎస్‌గా ప్రదీప్‌ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రదీప్‌ చంద్ర 1982 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి..డిప్యూటీ కలెక్టర్‌గా సర్వీసు ప్రారంభించిన ఆయన..22 రకాల పోస్టుల్లో విధులు నిర్వహించారు. 

 

08:12 - November 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ సర్కార్‌ ప్లాన్ చేస్తోంది. అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు మధ్య సమన్వయం చేసుకుంటూనే కొత్త రాష్ట్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇవాల్టితో రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుండటంతో..సచివాలయంలో ఆయనను ఘనంగా సన్మానించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ముఖ్య సలహాదారుడిగా నియమించాలని నిర్ణయం 
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ తెలంగాణలో.. తొలి చీఫ్‌ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించిన రాజీవ్ శర్మ పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. అత్యవసర సమయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అప్పగించిన పనిని సక్సెస్‌ చేసిన రాజీవ్‌ శర్మ, ప్రభుత్వానికి అనుకూల ఫలితాలు వచ్చేలా చేశారు. ఈ కారణంగానే, ప్రభుత్వం, రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని రెండు సార్లు పొడిగించింది. మరో సారి పదవీ కాలాన్ని పొడిగించాలని కోరినా.. డివోపిటి ఒప్పుకోకపోవడంతో ఆయన్ను రిలీవ్‌ చేయడం అనివార్యమైంది. అనుభవజ్ఞుడైన రాజీవ్ శర్మ సేవలను మరింత కాలం ఉపయోగించుకోవాలని భావించిన సీఎం కేసీఆర్.. ఆయన్ను తన ముఖ్య సలహాదారుడిగా నియమించాలని నిర్ణయించారు. 
కేసిఆర్‌తో రాజీవ్ శర్మకు అత్యంత సాన్నిహిత్యం 
తెలంగాణ బిల్లు సమయంలో కేంద్ర హోంశాఖ సెక్రటరీగా విధులు నిర్వహించిన రాజీవ్ శర్మకు.. ఆ సమయంలో ఎంపీగా ఉన్న కేసిఆర్‌కు అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. మన ఉరు మన ప్రణాళిక..సమగ్ర కుటుంబ సర్వే సక్సెస్ చేయడంలో శర్మ కీలక పాత్ర పోషించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న 9, 10 షెడ్యూల్ అంశాలతో పాటు ఉద్యోగుల బదిలీ విషయంలోనూ కమలనాథన్ కమిటీతో సమన్వయం చేసుకుంటూనే.. ఏపీ సీఎస్‌తో సమావేశమవుతూ సామరస్య పూర్వకంగా పలు సమస్యలను చాలా వరకు పరిష్కరించారు. 
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ రూపకల్పనలో కీలక పాత్ర 
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక పథకాల రూపకల్పనలో రాజీవ్‌ శర్మ కీ రోల్ పోషించారు. జిల్లాల పునర్విభజనలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి నేతృత్వం వహించి.. సమస్యలు పరిష్కరించడంలో తనదైన పాత్ర పోషించారు. 1982 బ్యాచ్‌కి చెందిన రాజీవ్ శర్మ అనుభవం చాల ఎక్కువ. ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. ఎన్‌ఎమ్‌సిజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, కేంద్ర హోం శాఖ అడిషనల్  సెక్రటరీగా సేవలందించారు. దీంతో రాజీవ్‌శర్మను ఘనంగా సన్మానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ కూడా హాజరుకానున్నారు. 

 

శేషాచలం అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్

తిరుపతి : చంద్రగిరి మండలం శేషాచలం అటవీప్రాంతంలో సచ్చినోడుబండ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం కూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ముగ్గురు కూలీలను టాస్స్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

నేడు మంజునాథ కమిషన్ ను ఏపీ బీసీ సంఘాల జేఏసీ

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల జేఏసీ నేడు ఏలూరులో మంజునాథ కమిషన్ ను కలవనుంది. బీసీ రిజర్వేషన్ల జాబితాలో అనర్హులను చేర్చవద్దని నేతలు మంజునాథ కమిషన్ ను కోరనున్నారు. 

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

ఢిల్లీ : నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. నీటి కేటాయింపులపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. 

07:44 - November 30, 2016

హైదరాబాద్ : ఇక నుంచి రాష్ట్రంలో చిన్న మొబైల్ యాప్‌ ప్రజ‌లు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మారనుంది. ప్రభుత్వ కార్యాకలాపాలకు కేంద్ర బిందువు కానుంది. అదే టిఎస్‌-వాలెట్‌.. మారుతున్న ఆర్ధిక పరిణామాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వం తరుపున ఈ-వాలెట్‌ను సర్కార్‌ ప్రవేశ పెడుతోంది. పేటిఎం తరహాలో టిఎస్‌-వాలెట్‌ అనే యాప్‌ను సిద్ధం చేస్తోంది. క్యాష్‌లెస్‌ స్టేట్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఇది మొదటి అడుగుగా సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 
తెలంగాణ ప్రభుత్వ యాప్‌
టీఎస్‌-వాలెట్..కొత్తగా రాబోతున్న తెలంగాణ ప్రభుత్వ యాప్‌. ప్రభుత్వ బిల్లులు,.టాక్స్‌ల ద‌గ్గర నుంచి మొబైల్ రీఛార్జ్‌లు, సినిమా టిక్కెట్లు, రెస్టారెంట్ బిల్ల్స్ వ‌ర‌కు అన్ని ఈ యాప్ ద్వారానే  పే చేసుకోవ‌చ్చు. అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. పేటిఎం, మెబిక్విక్‌, ఎయిర్‌టెల్‌ మనీ, ఎస్‌బీఐ వాలెట్‌ లాంటివి ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి బ్యాంకు ప్రత్యేకంగా యాప్స్‌ను రూపొందించాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను క్యాష్‌ లెస్‌ లావాదేవీలు వైపు మళ్లించాలంటే ప్రభుత్వమే అప్లికేషన్‌ విడుదల చేయడం వల్ల ఫలితంగా ఉంటుందనేది సీఎం కేసీఆర్‌ అభిప్రాయం..
ప్రభుత్వ చెల్లింపులు టిఎస్‌ వాలెట్‌కి అనుసంధానం 
మార్కెట్‌లో ఉన్న యాప్స్ లో అన్ని ర‌కాల సౌక‌ర్యాలు లేవు. ముఖ్యంగా ప్రభుత్వ చెల్లింపుల విష‌యంలో ఇప్పటికి ఆన్‌లైన్ సదుపాయంలేదు. తెలంగాణ ప్రభుత్వం వందశాతం ప్రభుత్వ చెల్లింపుల‌ను ఆన్‌లైన్‌లోకి తెచ్చి అన్నింటిని టిఎస్‌ వాలెట్‌కి అనుసంధానం చేయ‌నుంది. ప్రతినెల క‌చ్చితంగా చెల్లించాల్సిన క‌రెంట్‌, వాట‌ర్‌, టెలిఫోన్ బిల్లుల‌ను యాప్ ద్వారా ప్రజ‌లు చెల్లించ‌డం మెద‌లుపెడ‌తారు. అ త‌ర్వాత అర్టీసీ ప్రతి నెల బస్ పాసులు, రిజర్వేషన్లు, ఇలా ప్రభుత్వానికి సంబంధించిన సేవలకు యాప్‌ను ఉపయోగిస్తారు. ఇలా ప్రజలకు ఆన్‌లైన్‌ వాడకానికి అలవాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం..మ‌రోవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న స‌ర్వీస్ కావ‌డంతో ప్రజ‌ల‌కు న‌మ్మకం కూడా ఉంటుంద‌ని, మ‌రింత విస్తృతంగా యాప్‌ను ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి ఉప‌యోగించాల‌ని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
స్మార్ట్‌ఫోన్ విత్ డెటా సిమ్ కార్డ్ 
చిన్న వ్యాపారులు, చిల్లర వ్యాపారాలు చేసేవాళ్లు న‌ష్టపోకుండా ముందుగా వారికి అవ‌స‌ర‌మైతే స్మార్ట్‌ఫోన్ విత్ డెటా సిమ్ కార్డ్ ఇవ్వాల‌నే యోచ‌న కూడా ఉంది. మార్కెట్‌లో త‌క్కువ ధర‌కు ల‌భిస్తున్న స్మార్ట్ ఫోన్‌ల‌ను స‌బ్సిడితో అందించాల‌నే ప్రణాళిక ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యాపారాలు రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ స్మార్ట్ ఫోన్‌లు అందించాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ఇతర ఈ-వాలెట్ యాప్‌ల‌ను తెలంగాణ ఐటి శాఖ‌ ప‌రిశీలిస్తుంది. టిఎస్ వాలెట్ రూప‌క‌ల్పన, మెయింటెనెన్స్ కోసం టాటా, మ‌హింద్రా లాంటి కంపెనీల‌తోనూ సంప్రదింపులు జ‌రుపుతున్నట్లుగా స‌మాచారం. కేవ‌లం ధ‌ర్డ్ పార్టీగా మాత్రమే  ఆ కంపెనీలు టెక్నికల్‌ సపోర్టును అందిస్తాయి. పూర్తి స్థాయిలో టీఎస్‌-వాలెట్‌ భద్రతా, లావాదేవీలు ప్రభుత్వ ఐటీ శాఖ నిర్వహిస్తుంది. ఒకేసారి అండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో యాప్‌ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చూడటానికి చిన్న యాప్‌ అయినా మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలకు ఇదే భవిష్యత్తులో కేంద్ర బిందువుగా మారునుంది.

 

07:37 - November 30, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దై 22 రోజులు గడిచిపోయాయి. కానీ..జనం కష్టాలు మాత్రం తీరడం లేదు. బ్యాంకుల ముందు గంటలకొద్దీ నిల్చుని.. జనం విసుగెత్తి పోతున్నారు. డిమాండ్‌కు తగినంత క్యాష్‌ లేకపోవడంతో.. బ్యాంకు అధికారులు కూడా ఉసూరుమంటున్నారు. ఆర్బీఐ నుంచి క్యాష్‌ తగినంత రావడంలేదని బ్యాంకర్లు అంటుంటే.. ఇంట్లో ఉప్పు , పప్పులు కొనుక్కోడానికి కూడా డబ్బుల్లేవని సామన్యులు ఆక్రోశిస్తున్నారు. ఇటు ఏ ఏటీమ్‌ సెంటర్‌ దగ్గర చూసినా.. నో క్యాష్‌, ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ బోర్డులే కనిపిస్తున్నాయి. 
నగదు దొరక్క అవస్థలు 
కరెన్సీ కోసం సామాన్యులు బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గంటలకొద్దీ క్యూకట్టినా నగదు దొరక్క అవస్థలు అనుభవిస్తున్నారు. క్యాష్‌ కష్టాలు అందరికంటే వృద్ధులను ఎక్కువగా బాధిస్తున్నాయి. గంటలకొద్దీ  లైన్లో నిల్చుని..  తీరా కౌంటర్ వద్దకు వెళ్లే సరికి క్యాష్‌ లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 రోజలు ఓపిక పట్టాలని కేంద్రం  చెబుతోంది. ఇప్పటికే 20రోజలు గడిచి పోయాయి. ఇంట్లో నిత్యావసర సరుకులు నిండుకున్నాయి. కనీసం రోగులకు మెడిసిన్‌ కొందామన్నా డబ్బులేక ఇబ్బందులు పడుతున్నామని .. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంక్‌ అధికారులు మాత్రం తమ తప్పేం లేదంటున్నారు. ఆర్బీఐనుంచి తమకు క్యాష్‌ రావడంలేదని.. అందుకే కష్టమర్లకు అసౌకర్యం కలుగుతోందంటున్నారు. 
ఎక్కడ చూసినా.. నో క్యాష్‌ బోర్డులు 
మరోవైపు ఎక్కడ చూసినా.. నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏటీమ్‌ సెంటర్లలో నగదు పెట్టిన కాసేపట్లోనే ఖాళీ అవుతున్నాయి. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి సిండికేట్‌ బ్యాంకులో ఖాతాదారులకు నగదు ఇవ్వడం లేదని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో హిందూపురం-మడకశిర రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఇటు నెల్లూరు వేదాయపాలెం ఎస్‌బీఐ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దాదాపు 20 రోజులుగా ఖాతాదారులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు. 20 శాతం కమీషన్‌ ఇచ్చిన వారికే పెద్ద నోట్ల నగదు మార్పిడి జరుగుతోందంటూ మేనేజర్‌పై ఖాతాదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. 
చిల్లర దొరక్క ఇబ్బందులు 
ప్రస్తుతం 2 వేల నోటు ఉన్నా.. దానికి చిల్లర దొరక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరెస్సీ కష్టాలు 50రోజులు భరించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం చెబుతోటుంటే.. కనీస అవసరాలు తీరక సామన్యులు ఆక్రోశిస్తున్నారు. 

07:27 - November 30, 2016

విజయవాడ : నోట్ల సమస్యను ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ విపత్తుగా అభివర్ణించారు. కరెన్సీ కష్టాలను అధిగమించడానికి ఉమ్మడి, సమన్వయ కృషి అవసరమన్నారు. బ్యాంకు అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణాలు తెలిపిన ఆయన..ప్రజల సమస్యలు తీర్చడానికి బ్యాంకింగ్‌ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నట్లు చెప్పారు. 
బ్యాంకర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ 
బ్యాంకు అధికారులు తమపై వత్తిడి పెడుతున్నామని అనుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలను సమస్యల నుంచి గట్టెక్కించడమే తమ లక్ష్యమన్నారు. బ్యాంకర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు..అందరూ కలిసికట్టుగా పని చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమీక్ష జరుపుతున్నప్పటికీ బ్యాంకర్లు సహకరించకపోవడంతో తాము నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుందని బాబు ఇది వరకే అధికారులను హెచ్చరించారు. 
అందుబాటులో చాలా తక్కువ నగదు : బ్యాంకు అధికారులు  
రాష్ట్రంలో అందుబాటులో నగదు చాలా తక్కువగా ఉందని సమీక్షలో బ్యాంకు అధికారులు బాబుకు తెలిపారు. సెల్ మిషన్లు కూడా తక్కువే ఉన్నాయన్న అధికారులు.. రాష్ట్రం సాంకేతికంగా ముందంజలో ఉందని తెలిపారు. దీంతో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తామని చెప్పారు. 
ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటు పాడాలి : చంద్రబాబు
ప్రజలందరూ ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటు పడడం నేర్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నోట్ల రద్దుతో వ్యాపారాలన్ని స్తంభించిపోయాయని తెలిపారు. నోట్ల రద్దు పరిణామాలు ఎదుర్కొనేందుకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డ్వాక్రా, ఉపాధి, పెన్షన్, జీతాలకు సంబంధించిన లావాదేవీలన్ని అన్ని ఆన్‌లైన్‌లోనే జరగాలన్నారు. బ్యాంక్ ఖాతా లేనివారు వెంటనే ఖాతాలు ఓపెన్ చేసుకోవాలని సూచించారు. ఇకపై రేషన్ షాపుల్లోనూ నగదు డ్రా చేసుకోవచ్చన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏపీలో ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు.. సాధ్యమైనంత త్వరగా కరెన్సీ కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారు. బ్యాంకు అధికారుల పని తీరు మెరుగు పడితేనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు బ్యాంకింగ్‌ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

తెలంగాణ కొత్త సీఎస్ గా నేడు ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎస్ గా ప్రదీప్ చంద్ర నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 

సూర్యపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

సూర్యపేట : మునగాల మండలం తాడ్వాయి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుకుసుకుంది. 

 

Don't Miss