Activities calendar

31 October 2016

22:00 - October 31, 2016

జమ్ము కశ్మీర్‌ : సరిహద్దులో పాకిస్థాన్‌ దళాల కాల్పుల ఉల్లంఘన కొనసాగుతోంది. పూంచ్‌, రాజౌరి సెక్టార్‌లో పాక్‌ సైనికులు జరిపిన దాడిలో ఓ భారత జవాను అమరుడయ్యాడు. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మన్‌కోట, బాలా కోట ప్రాంతంలో కూడా పాక్‌ సైనికులు కాల్పలు జరుపుతున్నారు. మన్డీమ్‌ సెక్టార్‌లో పాక్‌ దళాలు నియంత్రణ రేఖకు ఆవలి వైపు నుంచి తుపాకులు, మోర్టార్‌ షెల్స్‌ ఉపయోగించి భారీగా దాడి చేశాయి. సర్జికల్‌ దాడుల తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

21:58 - October 31, 2016

ఢిల్లీ : దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనత స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్‌కే దక్కుతుందని ప్రధాని న‌రేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజ‌లంద‌రినీ ఒకే తిరంగా జెండా కింద ఉంచ‌డానికి ప‌టేల్ ఎన‌లేని కృషి చేశార‌ని కొనియాడారు. దేశాన్ని విడ‌గొట్టడానికి, చెల్లాచెదురు చేయ‌డానికి, అంత‌ర్గతంగా విభేదాలు సృష్టించ‌డానికి చాలా శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌ని మోదీ హెచ్చరించారు. దేశం బలోపేతం కావాలంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప‌టేల్ జ‌యంతి సంద‌ర్భంగా మోదీ ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఐక్యతా ర‌న్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత పటేల్ డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. 

21:55 - October 31, 2016

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో అక్వాపార్క్‌కు వ్యతిరేకంగా పోరాడి.. జైల్లో ఉన్న ఆరేటి సత్యవతి విడుదలైంది. 70 రోజుల పాటు తణుకు జైల్లో ఉన్న సత్యవతికి ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకే.. మమ్మల్ని అరెస్టు చేసి జైళ్లో పెట్టారని సత్యవతి ఆరోపించింది. దీంతో మహిళలను జైళ్లో పెట్టాలనే చంద్రబాబు కోరిక నెరవేరిందని పేర్కొంది. అయితే తమపై ఎంత నిర్బంధాలు విధించినా ఆక్వాపార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం ఆపబోమని సత్యవతి స్పష్టం చేసింది. 

21:53 - October 31, 2016

మహబూబ్ నగర్ : మహాజన పాదయాత్ర ఇప్పటికే సక్సెస్‌ అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రభుత్వంలో పాదయాత్ర కదలిక తెచ్చిందన్న తమ్మినేని బీసీ సబ్‌ప్లాన్‌ తెచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తండాల్లో, గ్రామాల్లో యువత ఉపాధి పనులు లేక అల్లాడుతున్నారని, ఉపాధి పనులు కల్పించి, పెండింగ్‌ బిల్లుల్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తమ్మినేని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రజా సమస్యలు పరిష్కరించేవరకు ప్రభుత్వం వెంట పడతామని ఆయన అన్నారు. స్థానిక సీపీఐ నేత ఈర్ల నర్సిహ్మ, బీఎస్పీ నేత శ్రీనివాస్‌, టీడీపీ నేత సతీష్‌ మాదిగ, రావుల చంద్రశేఖర్‌, దయాకర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్ర శేఖర్‌ పాదయాత్రకు మద్దతు తెలిపారు.

కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి : రేవంత్ రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని సీఎం కేసీఆర్‌.. నేలకు ముక్కు రాయాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రకు సంఘీభావంగా.. పాలమూరు జిల్లా తిమ్మాజీపేటలో.. పాదయాత్రలో పాల్గొన్నారు.

15వ రోజు పాదయాత్రలో 3కి.మీటర్లు నడిచిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి
సీపీఎం మహాజన పాదయాత్ర 15వ రోజుకు చేరింది.. మహబూబ్‌నగర్‌ జిల్లానుంచి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది.. 15వ రోజు జడ్చర్లలో ప్రారంభమైన యాత్ర నగసాల, తిమ్మాజిపేట, మరికల్‌, ఇందిరానగర్‌ తండా, వట్టెం గ్రామాల్లో పర్యటించింది. తిమ్మాజీపేటలో సీపీఎం పాదయాత్రకు తెలంగాణ టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్రతో పాటు మూడు కిలోమీటర్లకు పైగా నడిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సీపీఎం పాదయాత్రకు తమ మద్దతు ఉంటుందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీపీఎం పాదయాత్ర అత్యంత సమంజసమైందని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు మరిచిన కేసీఆర్‌ ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. 

21:47 - October 31, 2016

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ ఎక్కడున్నాడనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. తన భర్త పోలీసుల అదుపులోనే ఉన్నాడని.. వెంటనే కోర్టులో హజరు పర్చాలని ఆర్కే భార్య శిరీష.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పూర్తి స్థాయి సమాచారంతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఆర్కే భార్య శిరీష హైకోర్టులో పిటీషన్
మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య శిరీష వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని శిరీష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు మాత్రం ఆర్కే తమ అదుపులో లేడని చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత ఆర్కే ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆర్కే సతీమణి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ గ్రేహౌండ్స్ పోలీసుల అదుపులో ఆర్కే ఉన్నాడన్న కచ్చితమైన ప్రాథమిక సమాచారం తమ వద్ద ఉందని కోర్టులో శిరీష పిటిషన్ దాఖలు చేసారు.

బూటకపు ఎన్ కౌంటర్ అంటూ పిటీషన్
పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన రఘునాధ్‌ ఏపీ గ్రేహౌండ్స్ పోలీసుల అదుపులో ఆర్కే ఉన్నాడని కోర్టుకు తెలిపారు. ఏవోబీలో జరిగినది బూటకపు ఎన్‌కౌంటర్ అని.. అతి కిరాతకంగా 32 మంది మావోయిస్టులను చంపారని కోర్టుకు తెలిపారు. కనీసం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మృతదేహాలను కూడా చూపించకుండా పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు
పిటిషనర్ వాదనను విన్న న్యాయస్థానం ...ప్రభుత్వం తరపు న్యాయవ్యాదిని వివరణ కోరగా ఆర్కే ఎక్కడున్నాడో తమకు తెలియదని, తమ అదుపులో మాత్రం ఆర్కే లేడని కోర్టుకు వివరణ ఇచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం.. అక్కడ స్నిగల్ వ్యవస్థ లేక పోవడం వల్లే ..ఎక్కడున్నాడనేది తెలియక భయాందోళనలకు గురవుతున్నారని కోర్టుకు తెలిపారు. సమగ్ర సమచారంతో గురువారం కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని.. మావోయిస్టులైనా సామాన్యులైనా అందరికీ మానవ హక్కులు ఒకే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేసు తమ పరిధిలోకి వచ్చింది కాబట్టి దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. మరోవైపు ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

21:43 - October 31, 2016

హైదరాబాద్ : సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై తమకు అనుమానాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్‌కౌంటర్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చెబుతున్న వాదన తమకు అంగీకారం కాబోదని చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. కేవలం మెజిస్టీరియల్ విచారణ జరిపించడం తమకు సమ్మతం కాదన్నారు

21:41 - October 31, 2016

మధ్యప్రదేశ్‌ : భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పరారైన 8మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌తో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

భోపాల్‌ సెంట్రల్‌ జైలులో అలజడి. ..
ఆదివారం అర్ధరాత్రి దాటాకా 2,3 గంటల సమయంలో భోపాల్‌ సెంట్రల్‌ జైలులో అలజడి. అక్కడ కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు రామశంకర్‌ను చంపి 8మంది సిమీ ఉగ్రవాదులు పారిపోయారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు పక్కా ప్రణాళికతో ఆపరేషన్‌ నిర్వహించారు. భోపాల్‌ శివారు ప్రాంతంలోని మాలిఖేడా గ్రామ సమీపంలో పోలీస్ బలగాలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. సిమీ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరపడంతో తాము ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈఎదురుకాల్పుల్లో 8 మంది సిమి ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం భోపాల్‌ కేంద్ర కారాగానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు
జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులను సిమీకి చెందిన షేక్‌ ముజీబ్‌, మహ్మద్‌ ఖాలీద్‌ అకిల్‌, జాకీర్ హుస్సేన్ సాదిక్, మహ్మద్‌ సాలిక్, మెహబూబ్‌ మాలిక్‌, అంజద్ ఖాన్‌లుగా గుర్తించారు.

ఉగ్రవాదుల పరారీ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశం
ఉగ్రవాదుల పరారీ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జైలు సూపరింటిండెంట్‌తో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఉగ్రవాదులు జైలును బద్దలు కొట్టి పారిపోయినట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చెప్పారు. దీనిపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిమీ ఉగ్రవాదుల వద్ద ఆయుధాలున్నట్లు ఆయన తెలిపారు.

స్టీల్‌ ప్లేట్లు, స్పూన్లతోనే సెక్యూరిటీ గార్డును చంపిన ఖైదీలు
భోపాల్ సెంట్రల్ జైలులో సిమీ ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డును స్టీల్‌ ప్లేట్‌తో గొంతు కోసి చంపి.. బెడ్‌షీట్ల సాయంతో గోడలను దూకి పారిపోయినట్లు పోలీస్‌ అధికారులు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన సిమీ ఉగ్రవాదులపై దేశద్రోహం, దోపిడీ, ఉగ్రవాద చర్యల కేసులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు.

భోపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమీ ఖైదీలు
భోపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి 8 మంది సిమీ ఖైదీలు ఎలా పారిపోయారు? సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నట్లు? జైలులో ఉన్న ఖైదీలకు ఆయుధాలు ఎలా లభించాయి? ఎన్‌కౌంటర్‌లో 8 మంది సిమీ ఉగ్రవాదుల మృతి చెందిన నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిమీ ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
భోపాల్‌ సెంట్రల్‌ జైలు ఆదివారం అర్థరాత్రి దాటాకా 8 మంది సిమికి చెందిన విచారణ ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖైదీలకు దీపావళి పండగ కూడా కలిసొచ్చింది. రాత్రివేళ అందరూ పండగ సంబరాల్లో మునిగిపోగా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తొలుత అక్కడ కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు రామ శంకర్‌ను హత్య చేశారు. ఇందుకోసం వాళ్లు ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదు. తాము తినే స్టీల్‌ ప్లేట్లు, స్పూన్లతోనే గార్డును చంపారు. ఆకాశంలో మిరుమిట్లు గొలిపే బాణసంచా పేలుడు శబ్దాల మధ్య కప్పుకునే దుప్పట్లనే తాడుగా చేసుకుని జైలులోని పలు గోడలను దూకేసి సిమీ ఖైదీలు పారిపోయారు.

స్థానికుల సమాచారంతో కొన్ని గంటల్లోనే ఉగ్రవాదుల హతం
పోలీసుల కళ్లు గప్పి వారు ఎంతో దూరం వెళ్లలేదు. తెల్లవారుజామున స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భోపాల్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో ఖైదీలు దాక్కున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడ ఆపరేషన్ నిర్వహించారు. తప్పించుకున్న కొన్ని గంటల్లోనే సిమీ ఉగ్రవాదులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

2013లో ఖండ్వా జైలు గోడలు బద్దలు కొట్టి పారిపోయిన ఖైదీలు
ఇందులో ముగ్గురు ఇంతకు ముందు జైలు నుంచి పారిపోయిన వాళ్లే. 2013లో భోపాల్‌కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండ్వా జైలు గోడలు బద్దలు కొట్టి పారిపోయారు. ఇందులో ఒకరు లొంగిపోగా, మరోక ఖైదీ తెలంగాణ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో నలుగురు సిమీ ఉగ్రవాదులను 2016లో ఒడిషా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిమీ ఉగ్రవాదులకు కరీంనగర్‌ బ్యాంక్‌ లూటీ, 2014లో చెన్నయ్‌ సెంట్రల్‌ స్టేషన్‌లో ఆగి వున్న బెంగలూరు-గువహతి బాంబు పేలుడుతో సంబంధం ఉంది.

2001లో సిమీపై నిషేధం విధించిన ప్రభుత్వం
నిజానికి భోపాల్‌ సెంట్రల్‌ జైలుకు పటిష్టమైన భద్రత ఉంది. రౌండ్‌ ద క్లాక్‌ ఎలక్ట్రానిక్‌ సర్విలెన్స్‌ సిస్టం ఏర్పాటు చేశారు. అయినా ఉగ్రవాదులు పారిపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తానికి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న కారణంతో.. 2001లో నిషేధానికి గురైన స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా- సిమీ గ్రూప్‌కు చెందిన 8మంది ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో హతులవడం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.   

21:33 - October 31, 2016

విజయవాడ : ఏపీలో కొత్తగా నాలుగు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే ఖాయిలాపడిన టైక్స్‌టైల్‌ పరిశ్రమల విద్యుత్‌ సబ్సిడీ 350 కోట్లను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. మధురవాడలో 400 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీయే తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. వుడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించారు.

ఖాయిలాపడిన టైక్స్‌టైల్‌ పరిశ్రమల విద్యుత్‌ సబ్సిడీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలోని తన కార్యాలయంలో భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో4 ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీసిటీలో రెండు, విశాఖ, చిత్తురులో ఒక్కో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాయిలాపడిన టైక్స్‌టైల్‌ పరిశ్రమల విద్యుత్‌ సబ్సిడీ 350 కోట్లను ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది.
గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌పై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ
గొర్రెలు, మేకల పెంపకందారుల ఫెడరేషన్‌పై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. 50 శాతం సబ్సిడీ అంశంపై కేబినెట్‌ భేటీలోచర్చ జరిగింది. అలాగే విశాఖలో వుడా స్థానంలో మెట్రో డెవలప్‌మెంట్‌ అధారిటీ ఏర్పాటుపై వచ్చే కేబినెట్లో తుది రూపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మధురవాడలో 400 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీయే తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

జనచైతన్య యాత్రలపై మంత్రులకు ముఖ్యమంత్రి దిశాదిర్దేశం

జనచైతన్య యాత్రలపై మంత్రులకు ముఖ్యమంత్రి దిశాదిర్దేశం చేశారు. జనచైతన్యయాత్రల సమన్వయ బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. నెలలో సొంత నియోజకవర్గంలో పది రోజులపాటు పాల్గొనాలన్నారు. సొంత జిల్లా, ఇన్‌చార్జ్‌గా ఉన్న జిల్లాలో పది రోజుల చొప్పున జనచైతన్య యాత్రల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం తదితర అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు.

తాళ్లగడ్డలో యువకుడు దారుణహత్య

నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇమ్రాన్ అనే వ్యక్తి మద్యం మత్తులో శ్రీను అనే యువకుడిని రాయితో కొట్టిచంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

స్టెప్పులేసిన హోంమంత్రి..

హైదరాబాద్‌: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి స్టెప్పులేశారు. యాదవ సోదరులు రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదగాలని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లో జరిగిన సదర్‌ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని నృత్యం చేసి స్థానికుల్ని ఉల్లాసపరిచారు. 

20:48 - October 31, 2016

ఉక్కు మా హక్కని ఉద్యమించారు.. ప్రాణ త్యాగాలు చేసి మరీ సాధించుకున్నారు. జాతిమెడలో మణిహారంలా వర్ధిల్లుతూ వేలాదిమందికి బతుకునిచ్చింది. కానీ, ఇప్పుడా హక్కుకు ప్రమాదం ఏర్పడిందా? సర్కారీ విధానాలు నష్టాలకు కారణం అవుతున్నాయా? అలనాటి ఉద్యమానికి ఇప్పుడు కొనసాగింపు అవసరం అవుతోందా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని చేసిన ఉద్యమానికి 50ఏళ్లయిన సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం..

ఒకప్పుడు పోర్ట్ సిటీగా పేరు బడ్డ విశాఖ నగరం ఇప్పుడు స్టీల్ సిటీగా పిలుస్తున్నారంటే ఈ పిలుపువెనుక ఓ చరిత్ర ఉంది. ఓ ఉద్యమం ఉంది. కొన్ని ఆకాంక్షలు, మరెన్నో ప్రాణత్యాగాలున్నాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన పోరాటానికి నేటితో 50 వసంతాలు..నిండింది.

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ కు దేశ విదేశాల్లో కస్టమర్లున్నారు. పలు రీజియన్ ఆఫీసులు, బ్రాంచీలు, రిటైల్‌ కేంద్రాలు, లక్షలమంది వినియోగదారులున్నారు. వేలకోట్ల నగదు నిల్వలున్నాయి. లక్షలకోట్ల అస్తులున్నాయి. దేశంలో వున్న అన్ని ఉక్కు కర్మాగారాలతో పోటీపడే సత్తా ఉన్న సంస్థగా నిలబడింది. అనేక అవార్డులను, రివార్డులను అందుకుంటూ ముందుకు నడుస్తోంది.

మళ్ళీ ఉద్యమిస్తాం.. కాపాడుకుంటాం.. భారీపరిశ్రమలు జాతిమెడలో మణిహారాలు. అలాంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అభివృద్ధికి ప్రయత్నించాలి. కానీ, చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలోని స్టీల్ ప్లాంట్ లలో అత్యంత ప్రత్యేకత కలిగి.. ఉత్పాదకతలో ముందంజంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడు సర్కారు విధానాలు నియంత్రిస్తున్నాయనే విమర్శలున్నాయి.ఎన్‌డిఎ, యుపిఎ అధికారంలో ఎవరున్నా.. అవే విధానాలు.. రత్న, నవరత్న , మహారత్న ఇలా కొత్త పేర్లు పెడుతున్నారు.. పరిశ్రమల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూలన పడేలా చేస్తూ, ప్రైవేటు సంస్థలను అందలం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కష్టాల్లో పడుతోందా? అలనాడు ఉద్యమించారు... ఆకాంక్షలను సాధించుకున్నారు. ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవలసిన సందర్భం వచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణలు, కార్పొరేట్ గద్దల ఆక్రమణలనుండి కాపాడుకోవలసిన సమయం వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని నాలుక్కాలాల పాటు నిలబెట్టుకోవాసిన అవసరం వచ్చింది. దీనికోసం ఎంతకైనా ఉద్యమిస్తాం.. ఇదే కార్మిక లోకం చెప్తున్న మాట....

 

20:37 - October 31, 2016

రోజుకి రెండు మందు బాటిల్సు..పిస్తాలు..బాదాంలు..జీడిపప్పులు..గిట్ల రోజుకి ఐదు కిలోల డ్రైఫ్రూట్సు..20 కిలోల పండ్లు..40 లీటర్ల పాలు..ఏసీల నిద్ర..జల్సాలు..గియ్యన్నీ ఈ దున్నగారి ఖరీదు రూ.9కోట్లు..భోపాల్ జైల ఉరికెల్లిపాయిన సిమీ ఉగ్రవాదులు..పట్టి సంపేసిన పోలీసోల్లు..గోదావరి ఖనిల సీఎం కేసీఆర్ కు గుడి..వెంకన్నబాబుకి తప్పని కిస్తీ తిప్పలు..కేబేరుని భయపడి కురుమూర్తి కొండపై దాక్కున్నడంట..శ్రీకృష్ణ రాయలవారికి ఉత్సవాల కోసం బిచ్చమెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు..డీజిల్ ట్యాంక్ బోల్తా..ఎగబడిన జనాలు.. తాగేటానికే కాదు తాగింది దింపనీకి తయారయిన ఓ బార్ షాపు..కుక్కను జంపు గోల్డ్ కాయిన్ పంచుతామంటున్న కేరళల జరుగుతాంది..కుక్కల సంపుడుపై కేరళ సర్కార్ పై గుస్సయిన సుప్రీంకోర్టు..

20:34 - October 31, 2016
20:30 - October 31, 2016

హైదరాబాద్ : ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని.. అందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని పట్టుకుని చంపడం దారుణమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పౌర హక్కులనేతలు పోలీసుల చర్యలను తప్పుపట్టారు. ఏవోబీలో కూంబింగ్‌ ఆపాలని ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

20:14 - October 31, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ తవ్వకం పనులను స్పీడప్‌ చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున తవ్వకం పనులకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాన్ని, నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని అధికారులను సూచించారు.

పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు.. మంత్రి దేవినేని, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. పనులు జరుగుతున్న తీరును, సాధించిన పురోగతినీ అధికారులు, ట్రాన్స్‌ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 37,544 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ వే, 30,242 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ చానల్, 14,832 క్యూబిక్ మీటర్ల చొప్పున పవర్‌హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు సాగుతున్నట్లు తెలిపారు. పోలవరం పనులకు ఇదే సరైన సమయమని..వర్షాలు తగ్గినందున వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష
ఈవారం అదనంగా 100 ట్రక్కులు, 7 భారీ ఎస్కవేటర్లు తెచ్చి పెద్దఎత్తున తవ్వకం పనులు చేపట్టినట్లు త్రివేణి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. పనుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నవంబర్‌లో చేపట్టాల్సిన స్పిల్ వే, స్పిల్ చానల్, పవర్‌హౌస్ ఫౌండేషన్‌ తవ్వకం పనుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

 

20:12 - October 31, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో.. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 3 గంటలుగా జరుగుతున్న ఈ సమావేశంలో.. కొత్త స్విస్‌ ఛాలెంజ్‌ నోటిఫికేషన్‌, హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగింత అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణకు భవనాల అప్పగింతపై కేబినెట్లో ఏకాభిప్రాయం కుదరలేదు. భవనాలు అప్పగిస్తే... హైదరాబాద్‌లో తమకు ఉనికి లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. 9,10 షెడ్యూల్ అంశాలు అమలయ్యే వరకు తెలంగాణ ప్రభుత్వంతో కఠినంగానే వ్యవహరించాలని పలువురు మంత్రులు పట్టుబడుతున్నట్టు సమాచారం. 

20:10 - October 31, 2016

నెల్లూరు : వీఆర్‌ఏ ఆందోళనలతో నెల్లూరు కలెక్టరేట్ దద్దరిల్లింది. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. చాలీచాలని జీతాలు ఇస్తూ విఆర్ఏల చేత ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి మోహన్ రావు మండిపడ్డారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించాలన్నారు. 010 పద్దుల కింద ప్రతి నెలా వేతనం ఇవ్వాని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముత్యారాజుకు వినతిపత్రం అందజేశారు.

కనీస వేతనం 18 వేలకు పెంచాలని డిమాండ్
గ్రామ సహాయకులకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ వీఆర్ఏ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరులోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ధర్నా జరిగింది. జిల్లా నలుమూలు నుంచి వచ్చిన వీఆర్ఏ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడో వేతనసంఘం సిఫార్సుల ప్రకారం నెలకు 18 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. గ్రామ సహాయకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని విలేజ్‌ రెవిన్యూ అసిస్టెంట్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది.

విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట వీఆర్ఏలు ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట వీఆర్ఏలు ధర్నా చేశారు. 010 పద్దు కింద జీతాలు చెల్లించాలన్న వీఆర్‌ఏలు.. కనీస జీతం 18 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెవిన్యూ ఉద్యోగులతో సమానంగా డీఏ చెల్లింపు తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

కడప కలెక్టరేట్‌ ఎదుట వీఆర్‌ఏలు ఆందోళన
తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ అధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ ఎదుట వీఆర్‌ఏలు ఆందోళనకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా డీఏ చెల్లింపు తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే... ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విశాఖలోకదం తొక్కిన వీఆర్‌ఏలు..
విశాఖలో వీఆర్‌ఏలు కదం తొక్కారు. జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల ఆందోళనకు మద్దతు పలికిన సీఐటీయూ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజా ప్రతినిధుల జీతాలు పెంచుకుంటున్న ప్రభుత్వానికి పేద వారి జీతాలు కనిపించవా అని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వీఆర్‌ఏలు ఆందోళన
గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వీఆర్‌ఏలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీఆర్‌ఏల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. తక్షణమే కనీస వేతనం 18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే నెల నుంచి 27 వేల మంది వీఆర్‌ఏలతో సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ: ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్రంలో4 ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీసిటీలో రెండు, విశాఖ, చిత్తురులో ఒక్కో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాయిలాపడిన టైక్స్‌టైల్‌ పరిశ్రమల పవర్‌ సబ్సిడీ 300 కోట్లను ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది.

బొగ్గు గనిలో పేలుడు..15మంది మృతి..

చైనా : ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 15 మంది చనిపోగా మరో 18 మంది ఆచూకీ గల్లంతయింది. సోమవారం చాంగ్‌క్వింగ్ నగరంలోని బొగ్గుగనిలో గ్యాస్ కారణంగా పేలుడు జరిగింది. ఆ సమయంలో గని లోపల 35 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 15మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ఇద్దరిని రెస్క్యూటీం రక్షించింది. గల్లంతయిన వారి కోసం 200 మంది రెస్క్యూ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి దేశాల్లో చైనాదే మొదటి స్థానం కాగా వినియోగంలోనూ చైనా ముందువరుసలో ఉంది.

20:02 - October 31, 2016

ఢిల్లీ : సులభతర వాణిజ్య విధానాలు అవలంభించడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ మొదటిస్థానంలో నిలిశాయి. గతేడాది మొదటిస్థానంలో ఉన్న గుజరాత్‌కు వెనక్కినెట్టాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఈసారి మూడో ర్యాంకు దక్కగా, ఛత్తీస్‌గఢ్‌ నాల్గో స్థానంలో నిలిచింది.

పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిన తెలంగాణ, ఏపీ
ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సంస్కరణల అమల్లో తెలంగాణ, ఏపీ ముందంజలో ఉన్నాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలు పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారాయని వెల్లడించింది. సులభతర వాణిజ్య విధానాల అమల్లో గతేడాది గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో నిలించింది. పదమూడో ర్యాంకులో ఉన్న తెలంగాణ ఇప్పుడు ఏపీతో పోటీ పడి మొదటి ర్యాంకును దక్కించుకుంది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 190 దేశాల్లో భారత్‌కు 130 ర్యాంకు
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 190 దేశాల్లో మన దేశం 130వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు, కేంద్ర పారిశ్రామిక విధాన ప్రోత్సహక శాఖ నిర్దేశించిన 340 వాణిజ్య సంస్కరణల కార్యచరణ ప్రణాళిక అమల్లో తెలంగాణ, ఏపీ ముందంజలో ఉన్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు 75 శాతం సంస్కరణలు అమల్లు చేశాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతేడాది ఒక్కరాష్ట్రం కూడా 75 శాతం సంస్కరణలను అమలు చేయలేకపోయాయి. సులభతర వాణిజ్య విధానం అములు కోసం 2015లో ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన 285 సంస్కరణల్లో కేవలం ఏడు రాష్ట్రాలు మాత్రమే యాభై శాతం సంస్కరణలు అమలు చేయాయి.

ఏకగవాక్ష పారిశ్రామిక, వ్యాపార అనుమతులు
సంక్లిష్టమైన అనుమతుల విధానాలను తెలంగాణ, ఏపీ సరళీకృతం చేశాయి. ఏకగవాక్ష పద్ధతి ద్వారా పారిశ్రామిక, వ్యాపార అనుమతుల కాలవ్యవధిని గణనీయంగా తగ్గించాయి. పన్నులను హేతబద్ధం చేశాయి. కార్మిక, పర్యావరణ సంస్కరణలు అమలు చేయడంతో పాటు పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తూ తెలంగాణ, ఏపీలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ముందంజలో ఉన్నాయి. సులభతర వాణిజ్య విధానాలను కొనసాగిస్తూ, సంస్కరణల అమల్లో మరింత ముందుకు దూసుకెళుతూ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు తెలంగాణ, ఏపీలు ప్రయత్నిస్తున్నాయి.

 

20:00 - October 31, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో.. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 3 గంటలుగా జరుగుతున్న ఈ సమావేశంలో.. కొత్త స్విస్‌ ఛాలెంజ్‌ నోటిఫికేషన్‌, హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగింత అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణకు భవనాల అప్పగింతపై కేబినెట్లో ఏకాభిప్రాయం కుదరలేదు. భవనాలు అప్పగిస్తే... హైదరాబాద్‌లో తమకు ఉనికి లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. 9,10 షెడ్యూల్ అంశాలు అమలయ్యే వరకు తెలంగాణ ప్రభుత్వంతో కఠినంగానే వ్యవహరించాలని పలువురు మంత్రులు పట్టుబడుతున్నట్టు సమాచారం.భవనాలను ఇప్పుడే అప్పగించేస్తే హైదరాబాద్ పై పదిసంవత్సరాల పాటు వున్న హక్కును కోల్పోయే అవకాశాలున్నట్లుగా మంత్రులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విజయవాడతో పాటు విశాఖ పట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నట్లుగా స

19:19 - October 31, 2016

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు నమోదుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తన ఓటును నమోదు చేసుకోవాలని పవన్‌ నిర్ణయించారు. ఏలూరుకు చెందిన జనసేన నేతలు హైదరాబాద్‌ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ తన నిర్ణయాన్ని తెలిపారు. కాగా పవన్‌ సొంత జిల్లా పశ్చిమగోదావరి అనే విషయం తెలిసిందే. పవన్‌ కు ప్రస్తుతం హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్ లో కొటెదెల పవన్ కళ్యాణ్ పేరుతో ఓటు హక్కు ఉంది. హైదరాబాద్‌ లోనే ఓటు హక్కు ఇప్పటివరకూ వినియోగించుకున్నారు. కాగా రాష్ట్ర విభజన జరగడం, మారిన రాజకీయ పరిస్థితుల కారణాల వల్ల పవన్‌ ఈ నిర‍్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పోల్చుకుంటే సినిమా పరంగా చూస్తే రెండు రాష్ట్రాలలోనూ భారీ అభిమానులే వున్నారు. కానీ విభజనానంతరం ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని పవన్ తరచూ పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ పశ్చిమగోదావరి జిల్లా నుండి పోటీచేయవచ్చనే సంకేతాలు వినవస్తున్నాయి. కాగా జనసేన కార్యాలయానికి తన నివాసానికి రెండింటికీ భవనాలను వెదకాలని పవన్ అభిమానులకు పురమాయించటంతో ఈ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది. 

కిడ్నాప్ అయిన ప్రదీప్ మృతి..

విశాఖ : అనకాపల్లి వద్ద శారద నదిలో ఓ యువడికి మృతదేహం లభ్యమయ్యింది. సదరు మృతదేహం ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ గా గుర్తించారు. మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురయ్యిన ప్రదీప్ మృతదేహంగా కనిపించటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రదీప్ ప్రియురాలి బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారని కశింకోట పీఎస్ లో ప్రదీప్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

పోరాడినందుకే జైలు : ఆరేటి సత్యవతి

పశ్చిమగోదావరి : తణుకు జైలు నుండి ఆరేటి సత్యవతి విడుదలయ్యింది. 70 రోజుల పాటు తణుకు జైలులో వున్న సత్యవతి సోమవారం విడదల అయ్యింది. ఆక్వా ఫుడ్ ఫాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేసిన అందోలన నేపథ్యంలో సత్యవతిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విడుదల అయిన సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ..ఫాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినందుకు తనను అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎంత నిర్భంధం విదించినా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. 

ఏలూరులో పవన్ ఓటుహక్కు నమోదు..

హైదరాబాద్ : ఏలూరులో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును నమోదు చేసుకునే యోచనలో వున్నారు. జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా నుండి పోటీ చేయాలని అభిమానులు కోరుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఏలూరులో తన ఓటుహక్కును నమోదు చేసుకునేందుకు అభిమానుల కోరిక మేరకు సమ్మతించినట్లుగా తెలుస్తోంది. 

పోలవరంపై చంద్రబాబు సమీక్ష..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును ట్రాన్స్‌టాయ్‌, త్రివేణి సంస్థల ఇంజినీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

18:20 - October 31, 2016

సీపీఎం పాదయాత్రలో రేవంత్‌ రెడ్డి..

హైదరాబాద్‌: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం నాగర్‌ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటకు చేరుకుంది. తమ్మినేని వీరభద్రం బృందానికి సంఘీభావంగా తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. 

17:56 - October 31, 2016

నిజామాబాద్ : వైద్య కళాశాలకు బాలారిష్టాలు తప్పడం లేదు. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు సిబ్బంది కొరత మరోవైపు నిధుల లేమి కాలేజీ అభివృద్ధికి అవరోధంగా మారాయి. ఇది చాలదన్నట్లు.. ఇటీవలే ఆకస్మిక తనిఖీలు జరిపిన ఎంసీఐ బృందం కాలేజీలో లోపాల కారణంగా ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరానికి అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది. దీంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు.

కనీస వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నిజామాబాద్ వైద్య కళాశాల దుస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం..వైద్యాధికారుల నిర్లక్ష్యం వైద్య విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. ఇటీవల తనిఖీ నిర్వహించిన ఎంసీఐ బృందం కళాశాల అధికారుల లోపాన్ని వేలెత్తి చూపింది. నిబంధనలకు అనుగుణంగా వసతులు లేకపొవడాన్ని ఎంసీఐ బృందం గుర్తించింది. దీంతో పాటు మరిన్ని లోపాలను ప్రస్తావిస్తూ ఎంసీఐకి నివేదిక అందజేశారు. దీంతో నాలుగో సంవత్సరం కొనసాగేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఎంసిఐ ఆదేశాలు జారీ చేసింది. ఉన్న లోపాలను సరిదిద్దితేనే అనుమతి పునరుద్ధరిస్తామని మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా కరాకండిగా చెప్పేసింది.

నాలుగో సంవత్సరం రెన్యూవల్‌కు అనుమతి నిరాకరణ
బోధన ఆసుపత్రిలొ ఐసియు గది తప్పని సరిగా ఉండాలి. విలువైన ఐసియు పరికరాలు ఉన్నా సిబ్బంది లేకపొవటంతో ఈ గది నిరుపయోగంగా మారింది. ఐసీయూ గదికి తాళం ఉండటాన్ని ఎంసీఐ ప్రతినిధులు గుర్తించినట్లు సమాచారం. ఇక రోజూ 800 మంది ఉండాల్సిన ఓపీ సంఖ్య 700కు మించలేదని తెలిసింది. కొందరు వైద్యులు గైర్హాజరు కాగా.. మరికొందరు ఆలస్యంగా రావడంతో విధుల్లో ఉన్న డాక్టర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారట. ఎంసీఐ నిబందనల ప్రకారం 105 మంది వైద్యులు ఉండాలి.. అంతకంటే తక్కువగా ఉండటంతో అనుమతి నిరాకరించినట్లు సమాచారం. నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు మూడేళ్లుగా అనుమతిలిస్తూ వచ్చిన ఎంసిఐ ఇప్పుడు నాలుగో సంవత్సరం రెన్యూవల్‌కు అనుమతి నిరాకరించటంతో కాలేజీ అధికారులు ఇరకాటంలొ పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి నిజామాబాద్ మెడికల్‌ కాలేజీకి నాలుగో సంవత్సరానికి అనుమతులు వచ్చేలా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు. 

17:52 - October 31, 2016

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 15వ రోజు... మహబూబ్‌నగర్‌ జిల్లానుంచి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది.. జడ్చర్లనుంచి ఇవాళ మొదలైన యాత్ర నాగసాల, మరికల్‌, ఇందిరానగర్‌ తండాల్లో మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.. తిమ్మాజీపేటలో సీపీఎం పాదయాత్రకు తెలంగాణ టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై... తమ్మినేని యాత్రలో పాల్గొన్నారు. 

17:48 - October 31, 2016

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య శిరీష వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎన్‌కౌంటర్‌ కాకపోతే ఆర్కే ఎక్కడున్నాడో తెలపాలని... ఒక వేళ పోలీసుల అదుపులో ఉంటే ప్రాణహాని తలపెట్టవద్దని కోర్టు ఆదేశించినట్లు శిరీష తరపు లాయర్‌ రఘునందన్‌ తెలిపారు. మానవ హక్కులను కాలరాయొద్దందని రఘునందర్ పేర్కొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

భోపాల్ ఘటనపై సుప్రీం జడ్డితో విచారణ : ఒవైసీ

హైదరాబాద్: మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకుని.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ లో హతమైన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సిమి కార్యక్తరల ఎన్ కౌంటర్ పై సుప్రీం జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడివని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

పోలీస్ అధికారి ఇల్లు దగ్థం..

జమ్మూ కశ్మీర్: అనంత్‌నాగ్‌లో గుర్తు తెలియని కొందరు దుండగులు ఓ పోలీసు ఆఫీసర్ ఇంటిని దగ్దం చేశారు. గత రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు. 

భారీగా బంగారం పట్టివేత..

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు సోదా చేయగా 70 తులాల బంగారం బయటపడింది. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.

17:13 - October 31, 2016

మంచిర్యాల : సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో బెల్లంపల్లి వాసులకు దాదాపుగా శతాబ్ద కాలం నుంచి వారుంటున్నభూమి పై హక్కు లేకుండా పోతుంది. సింగరేణి లీజు భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతూనే ఉంది.

బెల్లంపల్లిలో భూమిపై హక్కులేని స్థానికులు
బెల్లంపల్లి ప్రాంతంలోని సింగరేణి లీజు భూముల్లో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న వారి బతుకులు ప్రశ్నార్ధకంగా మారాయి. ఎన్నోఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నా భూమిపై యాజమాన్యపు హక్కు లేకుండానే బతుకీడుస్తున్నారు. పట్టాలు లేకపోవడంతో నిర్మించుకున్న ఇంటిపై ఎలాంటి హక్కుకు నోచుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల పట్టాల సమస్య అపరిష్కృతంగానే ఉంది.

1926 ప్రాంతంలో బెల్లంపల్లిలో బొగ్గు గనుల ప్రస్థానం ఆరంభం
స్వాతంత్య్రానికి పూర్వం 1926 ప్రాంతంలో బెల్లంపల్లిలో బొగ్గు గనుల ప్రస్థానం ఆరంభమైంది. బ్రిటీష్‌ పాలనలో ఆంగ్లేయ భూగర్భ శాస్త్రవేత్త సర్‌ విలియం కింగ్‌ సర్వే చేయడంతో ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. "తాండూర్‌ కోల్‌మైన్స్‌' పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. 1927లో మార్గన్స్‌ఫిట్‌ గనితో బొగ్గు గనుల ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో గ్రామీణులను బలవంతంగా తీసుకొచ్చి మృత్యు గుహల్లాంటి బొగ్గు గనుల్లో దింపి పనులు చేయించేవారు. ఆ తీరుగా సింగరేణి కొలువుచేస్తున్న కార్మికులు, బతుకు దెరువు కోసం కాలరీ ఏరియాకు వలస వచ్చిన కార్మికేతరులు ప్రభుత్వం నుంచి కంపెనీ తీసుకున్న లీజు భూముల్లో పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటికి 90 ఏళ్లు గడుస్తున్నా స్థలాలకు పట్టాలు లేకుండా పోయాయి.

బి గ్రేడ్ మున్సిపాలిటీ బెల్లంపల్లిలో 34 వార్డులు
బెల్లంపల్లి బి గ్రేడ్‌ మున్సిపాలిటీ గా ఉంది. ఇక్కడ 34 మున్సిపల్‌ వార్డులు ఉండగా 56,369 జనాభా ఉంది. మున్సిపాలిటీలో 15,250 ఇండ్లు ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి లీజు భూమిలో నిర్మించుకున్న కట్టడాలకు పట్టాలు ఇవ్వకపోవడంతో పేదలకు భూమిపై ఏ మాత్రం హక్కు లేకుండా పోతోంది. దీంతో ఎన్నో ప్రయోజనాలు కొల్పోతున్నారు.

2009 లో జీ.వో 508 ప్రకారం గోదావరిఖనిలో 17 వేల ఇండ్లకు పట్టాలు
2009 లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీ.వో M.S నెంబర్ 508 తీసుకువచ్చి గోదావరిఖనిలో 17 వేల ఇండ్లకు పట్టాలు ఇచ్చారు. ఇల్లెందు, కొత్తగూడెంలో కూడా సింగరేణి లీజు స్ధలాలో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇచ్చింది అప్పటీ ప్రభుత్వం. ఆ జీవో ప్రకారమే తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బెల్లంపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు.

వాగ్దానాలకే పరిమితమైన నాయకులు
ఏ ఎన్నికలు వచ్చినా పురప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం, గెలిచాక విస్మరించడం పరిపాటిగా మారిపొయింది. మంచిర్యాల కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిన బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య కొలిక్కి వస్తుందనే ఆశతో ప్రజలు ఎదురూచూస్తున్నారు. 

17:09 - October 31, 2016

కామారెడ్డి : కామారెడ్డి కొత్త జిల్లాగా మారినా మున్సిపాల్టీ నిర్వహణ తీరులో మార్పు రాలేదు. మున్సిపల్‌ పాలన ఇంకా గాడిన పడలేదు. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మంచినీటి కటకట, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో పరిస్థితి అద్వాన్నంగా మారింది. పారిశుద్ధ్య చర్యలు పడకేయడంతో పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి.

కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పడినా మారని మున్సిపాల్టీ నిర్వహణ తీరు
కామారెడ్డి మండలం నుంచి జిల్లా స్థాయికి ఎదిగినందుకు ప్రజలు ఆనందపడాలో, బాధపడాలో ఆర్థం కాని పరిస్థితి. కొత్త జిల్లాలో మున్సిపాల్టీ సమస్యలు తీరిపోతాయని.. అభివృద్ధికి బాటలు వేస్తారని ఎంతో సంతోషించారు. వాస్తప పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపించడంతో జనం అవాక్కవుతున్నారు. మున్సిపల్‌ అధికారుల తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

నిలిచిపోయిన ఇంటింటికి చెత్త సేకరణ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య చర్యలు అటకెక్కడంతో వీధుల్లో చెత్త చెదారం పేరుకుపోయాయి. ఏ వీధిలో చూసినా పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, రోడ్లపై పారుతున్న మురుగు.. వాటి మధ్యే పందుల స్వైర విహారం. ఇంకోవైపు దోమల విజృంభణ. వెరసి జనం జ్వరాలతో అల్లాడిపోతున్నారు. దోమల నివారణకు పాగింగ్‌ను నామమాత్రంగా చేపడుతున్నారని జనం మండిపడుతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కోట్లాది అభివృద్ది పనులు నిలిచిపోయాయని..నూతన పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇద్దరు శానిటరీ ఎస్సైలకు ఒక్కరే పని చేస్తున్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ జరగటం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్త సేకరణ ట్రాలీలు మూలకు పడగా..నూతన వాహనాలకు ఇంకా మోక్షం కలగటం లేదు.

టౌన్ ప్లానింగ్ విభాగంపైన విమర్శల జడివాన
ఇక టౌన్ ప్లానింగ్ విభాగంపైన విమర్శల జడివాన కురుస్తోంది. ఇరుకు రోడ్లు, ట్రాపిక్ సమస్యతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రోడ్ల విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు కాగితాలకే పరిమతమవుతున్నాయి. మరోవైపు మున్సిపాల్టీ ఆదాయం పెంచేందుకు మార్గాలున్న వాటిపై యంత్రాంగం సరైన దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగితాలకే పరిమితమైన రోడ్ల విస్తరణ
సుమారు కోటి రూపాయల వరకు పనులు మున్సిపల్ నూతన కార్యాలయంలో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణ అనుమతులు పాత దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. పైపు లైన్ తవ్వకాలతో రోడ్లన్ని పాడైపోయినా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ట్యాంకర్ల నిర్వహణలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. కసాబ్ గల్లి, పెద్ద కసాబ్ గల్లి బతుకమ్మకుంట తదితర ప్రాంతాల్లో జంతువుల వధ ఇంకా రోడ్లపైనే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ పాలనను గాడిలో పెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. 

17:02 - October 31, 2016

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య శిరీష వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎన్‌కౌంటర్‌ కాకపోతే ఆర్కే ఎక్కడున్నాడో తెలపాలని... ఒక వేళ పోలీసుల అదుపులో ఉంటే ప్రాణహాని తలపెట్టవద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.ఈ సందర్భంగా ఆర్కే భార్య మాట్లాడుతూ..తను వేసిన  పిటీషన్ పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించిందని శిరీష్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో తనకు చాలా సంతోషంగా వుందన్నారు. గాయాలతో పోలీసులు చెరలో ఆర్కే వున్నాడని ఆమె మరోసారి స్పష్టం చేశారు. తాము డిమాండ్ చేసిన విషాయన్ని న్యాయస్థానం ఏపీ పభుత్వాన్ని ఆదేశించిందని మావో పార్టీ నేత పేర్కొన్నారు. బూటకపు ఎన్ కౌంటర్ కు బాధ్యడు ఏపీ సీఎం చంద్రబాబేనని ఈ సందర్భంగా ఆరోపించారు. 

16:58 - October 31, 2016

శ్రీకాకుళం : అద్భుత శిల్ప సంపద.. శతాబ్దాల చరిత్ర.. ప్రముఖ పుణ్యక్షేత్రాలో ఒకటిగా ప్రాధాన్యత.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా ఆ ఆలయం నిర్లక్ష్యపు నీడన శిథిలమైపోతోంది. దేవాదాయ, పురావస్తు శాఖల ఉదాసీనత కారణంగా దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన ఈ ప్రముఖ దేవాలయం కాలగర్భంలో కలిసిపోతోంది. ఇంతగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఆ దేవాలయం ఏది..? వాచ్ దిస్

శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీముఖలింగం శైవక్షేత్రం
కనిపిస్తోన్న ఈ ఆలయం...శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. శతాబ్దాల చరిత్ర ఈ పుణ్యక్షేత్రం సొంతం...బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లిన చారిత్రక స్థలం.. ఇదంతా పుస్తకాలకే పరిమితం...ఇప్పుడీ గొప్పతనమంతా ...కాలగర్భంలో కలిసిపోతోంది. అద్భుత శిల్పసంపద... పాలకుల, దేవదాయ శాఖ నిర్లక్ష్యంతో మరుగున పడిపోతోంది.

శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో శ్రీముఖలింగేశ్వరాలయం
చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీముఖలింగేశ్వరాలయం... శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇందులో ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. అయితే ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయం పై పిచ్చిమొక్కలు మొలిచి... ఆలయ గోపురానికి బీటలు పడ్డాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాందోళనలు .

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖంతో కూడిన శివలింగం
దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వర ఆలయం లో... ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ముఖంతో కూడిన శివలింగం ఉండటం ప్రత్యేకత. ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడు అన్న రాజు కట్టించాడని...అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని అభివృద్ధి చేశాడని చరిత్ర చెబుతోంది. శతాబ్దాల క్రితం నాటి ఈ ఆలయానికి అప్పట్లో భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చేవారు. ఇప్పటికీ కార్తీకమాసంలో దేశ, విదేశాల నుంచి లక్షల మంది శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయంలో ఏ ప్రమాదం జరిగినా అద్భుతమైన శిల్ప సంపద కనుమరుగయ్యే ప్రమాదముందంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు.

భక్తులు, ఆలయ అర్చకులు ఆగ్రహం
చరిత్రకు ఆధారమైన ఇలాంటి ఆలయాలను దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడంపై భక్తులు, ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందంటున్నారు. అటు ప్రభుత్వంగానీ..ఇటు ప్రజాప్రతినిధులుగానీ వీటిపై దృష్టి సారించడం లేదని ఆరోపిస్తున్నారు. దేవాలయంలో మౌలికసదుపాయాలు సైతం కల్పించడం లేదని మండిపడుతున్నారు.

చర్చలు తీసుకోవాలంటున్న భక్తులు
ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి...ఆలయాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. శతాబ్దాల చరిత్రకు ఆధారమైన ఇలాంటి పుణ్యక్షేత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెబుతున్నారు. 

16:51 - October 31, 2016

హైదరాబాద్ : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తనకు తాను ర్యాకింగ్‌ ఇస్తున్నారని తెలంగాణ టీపీసీసీ మండిపడిందివ్యవసాయ రుణాలు మాఫీ చేయనందుకు ప్రజాదరణ పొందారా ? లేక విద్యార్థులకు ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వనందుకు ప్రజాదరణా ? -అదీకాకుంటే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించనందుకు ప్రజాదరణ పొందారా ? టీపీసీసీ ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.సర్వేల పేరుతో ఇలా సొంతంగా ర్యాంకింగ్‌ ఇచ్చకోడాన్ని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తప్పు పట్టారు. కేసీఆర్ కు అంత ప్రజాదరణ ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడంలేదంటున్నారు. కాగా వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరో పక్క అయితే తెలంగాణా రాష్ట్ర బిజెపి అధికారి ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మాట్లాడుతూ .. అసలు మోడీ ఎలాంటి సర్వే నిర్వహించలేదని షాక్ కు గురిచేశారు. కేసీఆర్ ఏం చేశారని మొదటిర్యాంక్ వస్తుందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ ఎలాంటి సర్వే నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కు మొదటి ర్యాంక్ వచ్చిందన్న తప్పుడు వార్త పై మోడీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. అసలు ఈ ర్యాంకుల గోల ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

16:37 - October 31, 2016

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. జూబ్లీహాల్‌లో ఏపీభవన్‌ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించాలన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్‌ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని..ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు కలిసి పోరాడాలని ఆర్కే అన్నారు. 

16:35 - October 31, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రతం చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ టీడీపీ మద్దతు ప్రకటించింది. పాదయాత్రలో పాల్గొనాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. అలాగే గ్రామ గ్రామాన పాదయాత్రకు స్వాగతం పలకడంతోపాటు, తమ్మినేనితో కలిసి నడవాలని పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పిలుపు ఇచ్చింది. సీపీఎం పాదయాత్రలో పాల్గొనాలని టీడీపీ క్యాడర్ కు పిలుపునిచ్చామనీ రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ గ్రామాన తమ్మినేనికి స్వాగతం పలకాలని కార్యకర్తలకు టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

మరో జవాన్ వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : మరో జవాన్ వీరమరణం పొందాడు. రాజౌరి సెక్టార్ లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందాడు. పాక్ సైన్యం కాల్పులను భారత జవాన్లు తిప్పి కొడుతున్నారు. 

15:59 - October 31, 2016

ఉన్నత విద్య అభ్యసించినా ఉన్నతోద్యోగంలో స్థిరపడే అవకాశం వచ్చినా వాటిని కాదనుకుని మట్టి పరిమళాల కోసం అది పిల్లలకు చేరువ కావాలే సంకల్పం కోసం మహిళలకు తోడుగా ఉండాలనే లక్ష్యం కోసం..ముందుకు సాగుతోంది. బియ్యం ఏ చెట్టు నుండి వస్తాయి ? మనం తినే ఇతర ఆహార పదార్థాలు ఎక్కడ కాస్తాయి ? అనే ఈతరం పిల్లల ప్రశ్నలకు విసుగుకోక్కుండా సమాధానం చెప్పే వారెందరు ? వారిని క్షేత్రపర్యటనకు తీసుకెళ్లి ప్రకృతి ఒడిలో సేద తీర్చే వారెందరు ? సమాజానికి మంచి సహజ ఆహారాన్ని అందించాలనే తపన పడే వారెందరు ? ఇలాంటి పనులన్నింటిలో నిమగ్నమైన మహిళే 'దీప్తి'.. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:53 - October 31, 2016
15:49 - October 31, 2016

మిల్కీ బ్యూటీకి తెలుగులో కొత్త ఛాన్స్ లు లేవీ లేవు. కావాలనే 'తమన్నా' తెలుగు కాస్త గ్యాప్ ఇవ్వాలనుకుంటుందా లేక ఈ బ్యూటీకి న్యూ ఛాన్స్ లు రావడం లేదా అనేది తెలియడం లేదు. ఎట్ ది సేమ్ టైం తమిళంలో మిల్కీకి ఛాన్స్ ల మీద ఛాన్స్ లు వచ్చిపడుతున్నాయి. వైట్ స్కీన్ బ్యూటీ తమన్నా హ్యట్రిక్ సక్సెస్ అందుకున్న తెలుగులో కొత్తగా ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. గత ఎడాది 'బాహుబలి'లో వీరనారిగా ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఇదే సినిమాలో ధీవరా అంటూ కేక పెట్టించే గ్లామర్ తో సిని యూత్ ని కవ్వించింది. టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న 'తమన్నా'కు తెలుగులో కొత్త ఛాన్స్ లు రావడం లేదు. 'బాహుబలి', 'బెంగాల్' 'టైగర్', 'ఊపిరి' సినిమాలతో వరుసగా మూడు హిట్స్ అందుకున్న ఈ బ్యూటీకి న్యూఛాన్స్ లు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో 'తమన్నా'నే ఛాన్స్ లను వదులుకుంటుందా లేక నిజంగానే ఈ బ్యూటీకి దర్శక నిర్మాతలు కొత్తగా ఛాన్స్ లు ఇవ్వడం లేదనేది తెలియడం లేదు. ప్రస్తుతం 'తమన్నా' చేతిలో 'బాహుబలి 2' మాత్రమే ఉంది. ఇందులో కూడా ఈ బ్యూటీ క్యారెక్టర్ పెద్దగా ఉండదనే ప్రచారం సాగుతుంది. అయితే ఇదే సమయంలో మిల్కీబ్యూటీ తమిళంలో వరుసగా ఛాన్స్ లు అందుకుంటుంది. కోలీవుడ్ లో విశాల్, శింబులతో కూడా సినిమాలు చేస్తోంది. వరుస సక్సెస్ ఉన్న 'తమన్నా'కు ఛాన్స్ లు రావడం లేదు కానీ ప్లాప్స్ లో ఉన్న 'కాజల్' కి కొత్తగా ఛాన్స్ లు ఇస్తున్నారు. 'తమన్నా' రెమ్యూనరేషన్ పెంచడమే ఛాన్స్ లు తగ్గడానికి కారణంగా కనిపిస్తుంది. 

15:33 - October 31, 2016

యంగ్ టైగర్ నెక్ట్స్ మూవీ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న సీక్వెల్ ని 'ఎన్టీఆర్' త్వరలో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ 'జనతా గ్యారేజ్' భారీ సక్సెస్ తరువాత యంగ్ టైగర్ చేయబోతున్న ఆ సీక్వెల్ ఏంటీ ? రెండు యావరేజ్ మూవీస్ తరువాత 'ఎన్టీఆర్' 'జనతా గ్యారేజ్' తో భారీ సక్సెస్ కొట్టాడు. మొదట ఈ మూవీకి కూడా నెగటివ్ టాకే వచ్చింది. కానీ వన్ వీక్ తరువాత 'జనతా గ్యారేజ్' ఒరిజినల్ టాక్ తో దుమ్ముదులుపే కలెక్షన్లతో బాక్సఫీసు హిట్టు గా నిలిచింది. ఈ భారీ సక్సెని నిలబెట్టుకునే క్రమంలో 'ఎన్టీఆర్' నెక్ట్స్ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడట.

అదుర్స్ సూపర్ హిట్...
'ఎన్టీఆర్ - వినాయక్' కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'అదుర్స్' సూపర్ హిట్టు అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని అటు 'ఎన్టీఆర్' ఇటు 'వినాయక్' కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. ఇప్పుడు ఈ సీక్వెల్ పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 'అదుర్స్ 2' చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును 'వినాయక్' పూర్తి స్థాయిలో ఇప్పటికే సిద్ధం చేశాడట. ప్రస్తుతం 'వినాయక్' 'చిరంజీవి'తో చేస్తున్న 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని డిసెంబర్ లో కంప్లీట్ చేసి 'అదుర్స్' సీక్వెల్ ని పట్టాలెక్కించాలని 'వినాయక్' ఆలోచనగా కనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా 'అదుర్స్ 2' ఉండబోతుందని సమాచారం. సీక్వెల్ స్క్రీప్ట్ విన్న 'ఎన్టీఆర్' తెగ ఎంజాయ్ చేశాడట. బాహుశా డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ ఈ సీక్వెల్ పై అఫిషియల్ స్టేట్ మెంట్ రావొచ్చు.

నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే. 

15:16 - October 31, 2016
15:12 - October 31, 2016

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పరుగులే..పరుగులు. కాలంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భార్య..భర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీనితో వారి శక్తిసామర్థ్యాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల నీరసించిపోయి అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాంటపుడు మహిళలు కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే చాలు...తగ్గిపోయినా ఎనర్జీ లెవల్స్‌ మళ్ళీ పుంజుకుని చురుగ్గా ఉంటారు.
ఆకు కూరలు: పాలకూర, మెంతికూర వంటి వాటిలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మహిళల ఎనర్జీకి చాలా అవసరం అయ్యే విటమిన్‌ ఎ, విటమిన్‌ సి లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
ఆపిల్స్: ఇందులో ఫైబర్‌, విటమిన్‌ సి, యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. ఈ పండుని మహిళలు తమ రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
గుడ్లు: ప్రోటీనులు అధిక మోతాదులో ఉంటాయి. మాంసాహారంలో ఉండే ప్రోటీన్లు, బి విటమిన్స్, ఐరన్‌ కంటే గుడ్లలో అధికంగా ఉంటాయి. గుడ్లను మహిళలు ప్రతిరోజూ బ్రేక్‌ ఫాస్ట్ గా తీసుకుంటే కావల్సిన ఎనర్జీని పొందుతారు.
అరటి పండ్లు: పొటాషియం, బి విటమిన్‌ అధిక మోతాదులో నిల్వ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను నిదానం చేయడంతోపాటు బ్లడ్‌ షుగర్‌ను స్థిరంగా ఉంచుతాయి.
వీటితో పాటు పుచ్చకాయ, గుమ్మడి, సాల్మన్‌ ఫిష్‌, అల్లం టీ, సిట్రస్‌ పండ్లు, నట్స్, డార్క్‌ చాక్లెట్‌, పప్పులు, బ్రౌన్‌ రైస్‌, పెరుగు, లీన్‌ మీట్‌ తదితరాలు మహిళల్లో ఎనర్జీని పెంచడానికి దోహదపడతాయి. 

15:10 - October 31, 2016

హైదరాబాద్ : ఆర్కే భార్య శిరీష వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది. అనంతరం ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి పూర్తిస్థాయి అఫిడవిజ్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు వచ్చే గురువారం నాటికి విచారణను వాయిదా వేసింది. గురువారానికి వాయిదా వేసింది. మావోయిస్టు ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని..... అతన్ని వెంటనే కోర్టుముందు ప్రవేశపెట్టాలని ఆదేశించాలంటూ ఆర్కే భార్య శిరీష హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.. శిరీష వేసిన ఈ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోర్టుముందు విచారణకు రానుంది.. కాగా ఏవోబీలో మూడు రోజుల పాటు కొనసాగిన భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు 34మంది మవోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఆర్కే తప్పించుకున్నాడు. కాగా ఎన్ కౌంటర్ లో ఆర్కే తప్పింకున్నాడనీ పోలీసులు..కాదు పోలీసుల అదుపులోనే వున్నాడని మావో ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులో వున్న ఆర్కేని కోర్టులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ హైకోర్ట్ లంచ్ మోషన్ ఆర్కే భార్య శిరీష పిటీషన్ వేశారు. కాగా ఎన్ కౌంటర్ అయి వారంరోజులు గడుస్తున్నా పోలీసులు ఎటువంటి సమాచారాన్ని అందించలేదని అందుకే కోర్టులో పిటీషన్ వేశామని ఆర్కే భార్య పేర్కొన్నారు.

ఆర్కే సతీమణి పిటిషన్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఆర్కే సతీమణి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్కే ఆచూకీపై అతని భార్య శిరీష దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఆర్కే గ్రే హౌండ్స్ అదుపులో ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు చేశారు. కేసును సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పూర్తిస్థాయి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్కేకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని సూచించింది. 

14:59 - October 31, 2016

హైదరాబాద్ : మావోయిస్టు ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని..... అతన్ని వెంటనే కోర్టుముందు ప్రవేశపెట్టాలని ఆదేశించాలంటూ ఆర్కే భార్య శిరీష హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.. శిరీష వేసిన ఈ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోర్టుముందు విచారణకు రానుంది.. కాగా ఏవోబీలో మూడు రోజుల పాటు కొనసాగిన భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు 34మంది మవోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఆర్కే తప్పించుకున్నాడు. కాగా ఎన్ కౌంటర్ లో ఆర్కే తప్పింకున్నాడనీ పోలీసులు..కాదు పోలీసుల అదుపులోనే వున్నాడని మావో ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులో వున్న ఆర్కేని కోర్టులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ హైకోర్ట్ లంచ్ మోషన్ ఆర్కే భార్య శిరీష పిటీషన్ వేశారు.

14:52 - October 31, 2016

విజయవాడ : మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం కాబోతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో 27 ప్రధాన అంశాలపై చర్చించనుంది. డాట్ భూములు, డీకేటీ భూములతో పాటు పరిశ్రమలు, ప్రాజెక్టులకు భూముల కేటాయింపుపై చర్చ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌ తెలంగాణకు అప్పగింత, పోలవరం పనులు, నాబార్డ్‌ రుణాలకు కేంద్రంపై ఒత్తిడి, ఆక్రమణలోని భూముల క్రమబద్దీకరణ, పలు సంస్థలకు భూముల పంపిణీ వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.. 

14:48 - October 31, 2016

ఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాదులను భోపాల్‌ శివార్లలోని ...హెయింతీ కేదీ నుంచి పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదుల పేర్లు సాదిక్, సాలిక్, మహబూబ్ గుడ్డు, సలీం, అమజాద్, మజీద్, అఖీల్ ఖిల్జీ,మజీబ్ షేక్‌. నిన్న అర్థరాత్రి ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డ్‌ను హతమార్చి జైలు నుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భోపాల్‌లోని బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఉగ్రవాదుల పరారీ ఘటనతో మధ్యప్రదేశ్‌లో కేంద్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటించింది. కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ ఘటనపై ఆరా తీశారు. దీంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. అయితే ఇంతకుమందు కూడా ఇదే తరహాలో సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు. 2013లో ఏడుగురు సిమీ ఉగ్రవాదులు ఖాంద్వా జైలు మరుగుదొడ్డి కిటికీ ఇనుప రాడ్డులను తొలిగించి పరారయ్యారు. 

14:45 - October 31, 2016

ఢిల్లీ : కేంద్ర వాణిజ్య శాఖ ర్యాంకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాలకు అగ్రస్థానం దక్కింది.. సింగిల్ విండో విధానం, పన్ను సంస్కరణలు, నిర్మాణ అనుమతులు, పర్యావరణం, కార్మిక సంస్కరణలు, తనిఖీ సంస్కరణలు, వాణిజ్య వివాదాలు, పేపర్ రహిత కోర్టులు అంశాల్లో సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు.. తెలుగు రాష్ట్రాల తర్వాత రెండో ర్యాంక్‌లో గుజరాత్, మూడో స్థానంలో చత్తీస్‌గఢ్, నాలుగో స్థానాన్ని మధ్యప్రదేశ్ దక్కించుకున్నాయి.. గత ఏడాది ర్యాకింగ్‌లో గుజరాత్‌ టాప్ ర్యాంక్‌లో నిలవగా... ఏపీ రెండో స్థానం... తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.. 98.78 పాయింట్లతో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వున్నాయి. వ్యాపార సులభతర విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర వాణిజ్య శాఖ ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది.ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2016 ర్యాంకింగ్స్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు టాప్‌ ర్యాంక్ దక్కింది. 12 ర్యాంక్ లను దాటుకుని మొదటి స్థానానికి తెలంగాణా రాష్ట్రం దక్కించుకుంది. పర్యావరణ కార్మిక, పర్యవేక్షణ సంస్కరణలతో పాటు మొత్తం 340 అంశాల్లో తెలంగాణ, ఏపి లకు మొదటి స్థానం దక్కింది.

సీఎం ర్యాంకింగ్స్ పై గాలి సెటైర్లు..

విజయవాడ : ముఖ్యమంత్రుల ర్యాకింగ్స్ లపై ఏపీ ఎమ్మెల్సీ గాలి సెటైర్లు వేశారు. కేసీఆర్ ఏం చేశారని నెం.1గా ఎంపిక చేశారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడికి ఏడో ర్యాంకు, ఫాం హౌస్ లో పడుకొనే కేసీఆర్ కు మొదటి ర్యాంకా అని పేర్కొన్నారు. చంద్రబాబు బాగా పనిచేస్తున్నారని మోడీయే మెచ్చుకున్నారని తెలిపారు. భవనాల అప్పగింతలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉన్నట్లు తెలిపారు. 

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. పోలవరం నుల వేగవంతం..నాబార్డ్ రుణాలకు కేంద్రంపై ఒత్తిడి..ఆక్రమణలోని భూముల క్రమబద్దీకరణ, పలు సంస్థలకు భూముల పంపిణీపై చర్చించనున్నారు. 

రాష్ట్రాలకు కేంద్ర వాణిజ్య శాఖ ర్యాంకింగ్స్...

వ్యాపార సులభతర విధానాలు అవలింబిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర వాణిజ్య శాఖ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2016 ర్యాంకింగ్స్ లో తెలంగాణ రాష్ట్రాలకు టాప్ ర్యాంకులు దక్కాయి. 12వ ర్యాంకులు ఎగబాకి మొదటిస్థానానికి తెలంగాణ చేరింది. 2వ ర్యాంకు నుండి తొలి స్థానానికి ఏపీ చేరింది. 2015 సంవత్సరంలో అగ్రస్థానంలో గుజరాత్, రెండో స్థానంలో ఏపీ రాష్ట్రాలు కొనసాగాయి. గతేడాది తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో ఉంది. సింగిల్ విండో, పన్నుల సంస్కరణలు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ కార్మిక, పర్యవేక్షణ సంస్కరణలతో పాటు మొత్తం 340 అంశాల్లో తెలంగాణ, ఏపీలకు మొదటి స్థానం దక్కాయి.

ఎన్జీటీలో అమరావతి నిర్మాణంపై విచారణ..

ఢిల్లీ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. విచారణ రేపటికి వాయిదా పడింది. కొత్త న్యాయమూర్తుల బెంచ్ ఉండడంతో రేపు వాదనలు వినిపిస్తామని పిటిషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 

13:51 - October 31, 2016

పేయింటింగ్...ఎన్నో రకాల పేయిటింగ్ అందుబాటులో ఉంటాయి. పలువురు ఈ రంగంలో రాణిస్తున్నారు. కానీ ఓ విభిన్నమైన పెయింటింగ్ ను ఓ అతివ చూపుడుతోంది. కొద్దిగా కాస్ట్ల్ తో కూడుకున్న పెయిటింగ్ ను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:38 - October 31, 2016
13:35 - October 31, 2016

నాగర్ కర్నూలు : సీపీఎం మహాజన పాదయాత్ర 15వ రోజుకు చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లానుంచి నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. జడ్చర్ల నుంచి సోమవారం మొదలైన యాత్ర నాగసాల, మరికల్‌, ఇందిరానగర్‌ తండాల్లో మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. తిమ్మాజీపేటలో సీపీఎం పాదయాత్రకు తెలంగాణ టిడిపి నేతలు సంఘీభావం తెలపనున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నేత అబ్బాస్ టెన్ టివితో మాట్లాడారు. 15 రోజులుగా పాదయాత్ర కొనసాగుతోందని, ఇప్పటి వరకు వెలుగు చూడని సమస్యలు బహిర్గతమవుతున్నాయన్నారు. వేలాదిగా సమస్యలతో కూడిన వినతిపత్రాలు ఇస్తున్నారని, ప్రభుత్వ పథకం కోసం, పెన్షన్..ఇతరత్రా కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడడం దారుణమన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మైనార్టీలు అధికంగా ఉన్నారని, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. బీసీ కమిషన్ ఎంతసేపు కాలయాపన చేస్తుందో అనే ఆందోళన నెలకొందన్నారు. వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యారని, ఇలాంటి అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, 7వేల షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అబ్బాస్ పేర్కొన్నారు. 

13:31 - October 31, 2016

మధ్యప్రదేశ్‌ : భోపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాదులను భోపాల్‌ శివార్లలోని హెయింతీ కేదీ నుంచి పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదుల పేర్లు సాదిక్, సాలిక్, మహబూబ్ గుడ్డు, సలీం, అమజాద్, మజీద్, అఖీల్ ఖిల్జీ,మజీబ్ షేక్‌. నిన్న అర్థరాత్రి ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డ్‌ను హతమార్చి జైలు నుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భోపాల్‌లోని బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఉగ్రవాదుల పరారీ ఘటనతో మధ్యప్రదేశ్‌లో కేంద్ర హోం శాఖ హై అలర్ట్ ప్రకటించింది. కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ ఘటనపై ఆరా తీశారు. దీంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. అయితే ఇంతకుముందు కూడా ఇదే తరహాలో సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు. 2013లో ఏడుగురు సిమీ ఉగ్రవాదులు ఖాంద్వా జైలు మరుగుదొడ్డి కిటికీ ఇనుప రాడ్డులను తొలిగించి పరారయ్యారు. 

13:29 - October 31, 2016

మేడ్చల్ : జిల్లా కుషాయిగూడలో కీచక టీచర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు. డీఏఈ కాలనీలోని అటామిక్ ఎనర్జి పాఠశాలలో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి విద్యార్థినిని టీచర్‌ వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. టీచర్‌ చేష్టలతో తమ బిడ్డకు జ్వరంకూడా వచ్చిందని ఆరోపించారు. ఉపాధ్యాయున్ని చితకబాదిన పేరంట్స్... పోలీసులకు అప్పగించారు.

13:22 - October 31, 2016

ఓ మహిళా బ్యాంకు ఉద్యోగిని అతి నెమ్మదిగా క్యాష్ కౌంటింగ్ చేయడాన్ని ఈ వీడియోలో మనం గమనించవచ్చు. అందుకే ఈ వీడియోకు వ్యంగ్యంగా ఫాస్టెస్ట్ క్యాషియర్ అని పేరుతో నెట్ లో చక్కర్లు కొడుతోంది. . ఎంతోమంది చూసి సెటైరికల్ కామెంట్స్ చేశారు కానీ ఒక్కరైనా ఆమె ఎందుకలా ప్రవర్తించిందనే విషయాన్ని తెలుసుకున్నారా. అసలు విషయం తెలుసుకుంటే ఆమె పట్ల చేసిన కామెంట్లకు సిగ్గుపడక తప్పదు. . బ్యాంకులో పనిచేస్తున్న మహిళ క్యాష్ కౌంట్ చేస్తున్న వీడియో అది. 14 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 2లక్షల మందికి పైగా షేర్ చేశారు. బాలరాజు సోమిశెట్టి అనే వ్యక్తి అక్టోబర్ 24న ఈ వీడియో పోస్ట్ చేశాడు. . ఆమె అలా నెమ్మదిగా నోట్లు లెక్కపెట్టడం వెనుక కారణాన్ని సామాజిక కార్యకర్త కుందన్ శ్రీనివాస్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. అది చదివిన తర్వాత కామెంట్స్ చేసినవారిలో చాలామంది ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ అసలు విషయమేంటంటే, ఆమె పేరు ప్రేమలత. పూణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదు. ఈ మధ్యనే రెండుసార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది.పెరాలసిస్ వల్ల ఆమె అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న ఆమె తిరిగి విధుల్లో చేరింది. ఆ తర్వాత విధుల్లో చేరిన ఆమె నోట్లు లెక్కపెడుతుండగా తీసిన వీడియో అది. ఆమెకు చాలా సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకుకు రావాల్సిన పని కూడా లేదు. కానీ అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అంకిత భావంతో ఆమె విధులకు హాజరైంది. 2017 ఫిబ్రవరిలో ఆమె రిటైర్ కానున్నారు. ప్రేమలత భర్త లేరు. కొడుకు అబ్రాడ్‌లో ఉంటున్నాడు. ఆమెకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా పని పట్ల నిబద్ధతతో ఆమె ఆఫీస్‌కు హాజరవుతోంది. ఆమె సిన్సియారిటికీ సెల్యూట్ చేయాల్సింది పోయి ఇలాంటి కామెంట్స్ చేయడం నెటిజన్లకు ఎంతవరకూ సబబని కుందన్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, ఎదుటి వ్యక్తుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఫన్నీ కామెంట్స్ చేయడం, సెటైర్లు వేయడం సోషల్ మీడియా యూజర్లకు తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ కు తమ్మినేని లేఖ..

మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కేంద్రం 90 శాతం..రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను ఉపాధి పథకానికి ఖర్చు చేయాలని కోరారు. 

ప్రొ.లక్ష్మీ బెయిల్ పై విచారణ..

గుంటూరు : మెడికల్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ నవంబర్ 3కు వాయిదా పడింది. 

12:47 - October 31, 2016
12:21 - October 31, 2016

విశాఖపట్టణం : 1966 సంవత్సరంలో 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' పేరిట ఓ ఉద్యమం జరిగింది. ప్లాంట్ కోసం నేతలు ఉద్యమించారు. ఎంపీ తెన్నీటి విశ్వనాథం స్వయంగా రంగంలోకి దిగారు. కలెక్టరేట్ వద్ద విద్యార్థి నేత అమృతరావు ఆమరణదీక్ష చేశారు. పోలీసుల కాల్పుల్లో 12 మంది మృతి చెందగా ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. కర్మాగార స్థాపనను కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం ఆగింది. 1971 లో ప్రధానమంత్రి ఇందిరా గాంధి కర్మాగారానికి శంకుస్థాపన చేసారు. ఈ ఉద్యమానికి 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా అప్పటి ఉద్యమకారులతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:11 - October 31, 2016
12:10 - October 31, 2016

మధ్యప్రదేశ్ : భోపాల్ సెంట్రల్ జైలు నుండి పరారైన ఉగ్రవాదులు హతమయ్యారు. యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ బృందం వీరిని ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆదివారం అర్ధరాత్రి సెంట్రల్ జైలు నుండి 8మంది ఉగ్రవాదులు జైలు గార్డును హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ బృందం రంగంలోకి దిగింది. గాలింపులు చేపడుతుండగా భోపాల్ కు పది కిలోమీటర్ల దూరంలోని అంత్ ఖేడీ గ్రామ సమీపంలో వీరిని కాల్చివేశారు. సరిహద్దులు దాటకుండానే వీరిని హతమార్చడం గమనార్హం. కానీ ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆరు గంటల సమయంలో ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం. ఘటన జరిగిన అనంతరం జైలు సూపరిటెండెంట్ తో పాటు నలుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
సిమీ ఉగ్రవాదులు పరారైన సంగతి తీవ్ర కలకలం సృష్టించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఘటనపై నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.
ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 5లక్షలు ఇస్తామని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకే సెల్ లో వీరంతా ఉండడం, పరారీకి వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. బ్లేడ్, ప్లేట్లను ఆయుధాలు మలుచుకుని సెక్యూర్టీ గార్డును హత్య చేసి పరారయ్యారు.

ఉగ్రవాదులు వీరే..
జాకీర్, అహ్మద్, మహబూబ్, అంజద్, సలీఖ్, మజీద్, ఖలీబ్, ముజీబ్ లు పరారైన వారిలో ఉన్నారు. జాకీర్, అహ్మద్ ఖాన్ లపై పది లక్షల రివార్డు ఉంది. 

పరారైన ఉగ్రవాదుల కాల్చివేత..

మధ్యప్రదేశ్ : రాజధాని భోపాల్ సెంట్రల్ జైలు నుండి పరారైన 8మంది సిమీ ఉగ్రవాదులను పోలీసులు కాల్చివేశారు. అంత్ ఖేడీ గ్రామ సమీపంలో ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు పరారైన సంగతి తెలిసిందే. 

11:38 - October 31, 2016
11:37 - October 31, 2016

హైదరాబాద్ : తన భర్త ఎక్కడున్నాడని, తన భర్త ఏపీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య ఆరోపిస్తోంది. ఈనెల 24 నుండి 26 వరకు ఏవోబీలో జరిగిన వరుస ఎన్ కౌంటర్ లలో 33 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్కే కనిపించడం లేదని, పోలీసులు పట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో హైకోర్టులో ఆర్కే భార్య పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజులుగా తన భర్త కనిపించకుండా పోలీసులు దాచి పెట్టారని, ఏపీ పోలీసులు దీనికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఆర్కేకు సెక్యూర్టీగా ఉండే వారిలో ముగ్గురు మృతి చెందారని, మిగతా సెక్యూర్టీ సిబ్బంది ఆచూకి తెలియడం లేదని తెలుస్తోంది. 

11:32 - October 31, 2016

గుంటూరు : మెడికల్ పీజీ విద్యార్థిని సంధ్య ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. గుంటూరు జిల్లా కోర్టులో నేడు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈనెల 24వ తేదీన సంధ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రొ.లక్ష్మీ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో సంధ్య పేర్కొంది. భార్య మృతి చెందడంతో తీవ్ర మనస్థాపంతో సంధ్య భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో కొలుకుంటున్నాడు. సంధ్య ఆత్మహత్య అనంతరం ప్రొ.లక్ష్మీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈమె కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రొ.లక్ష్మీని అరెస్టు చేయాలంటూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రొ.లక్ష్మీని ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆందోళనలు విరమించాలని ప్రభుత్వం సూచించడంతో విద్యార్థులు సోమవారం నుండి విధులకు హాజరవుతున్నారు. ప్రొ.లక్ష్మీకి బెయిల్ వస్తుందా ? రాదా ? అనేది కాసేపట్లో తేలనుంది. 

ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్..

గుంటూరు : మెడికల్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. గుంటూరు జిల్లా కోర్టులో నేడు బెయిల్ పిటిషన్ కు విచారణకు రానుంది. 

పాక్ లో మరో మారణ హోమం..

పంజాబ్ : పాక్ లో మరో మారణ హోమం జరిగింది. బహావల్ నగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లోకి తుపాకులతో ప్రవేశించిన ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 

పూర్ణామార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం..

విశాఖపట్టణం : పూర్ణామార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

భారత జవాన్లపై పాక్ సైన్యం కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : మేండర్ లో మోటార్ లతో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. బాలాకోట, మన్ కోటలలో భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది. ఈ కాల్పులను భారత జవాన్లు తిప్పి కొడుతున్నారు. 

గోపాలపట్నం పీఎస్ లో వ్యక్తి మృతి..

విశాఖపట్టణం : గోపాలపట్నం పీఎస్ లో వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం భార్య భర్తల వివాదం కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

 

11:12 - October 31, 2016

మధ్యప్రదేశ్ : భోపాల్ సెంట్రల్ జైలు నుండి పరారైన 8మంది సిమీ ఉగ్రవాదులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మర గాలింపులు చేపడుతున్నారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులు దాటకుండా ఉండేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి సెంట్రల్ జైలు నుండి 8మంది ఉగ్రవాదులు జైలు గార్డును హత్య చేసి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు 5 మంది జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ. 5లక్షలు ఇస్తామని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదుల పరారీపై కేంద్రం ఆరా తీస్తోంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకే సెల్ లో వీరంతా ఉండడం, పరారీకి వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. బ్లేడ్, ప్లేట్లను ఆయుధాలు మలుచుకుని సెక్యూర్టీ గార్డును హత్య చేసి పరారయ్యారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో కీలక భేటీ జరగనుంది.

ఉగ్రవాదులు వీరే..
జాకీర్, అహ్మద్, మహబూబ్, అంజద్, సలీఖ్, మజీద్, ఖలీబ్, ముజీబ్ లు పరారైన వారిలో ఉన్నారు. జాకీర్, అహ్మద్ ఖాన్ లపై పది లక్షల రివార్డు ఉంది. 

సిమీ ఉగ్రవాదుల కోసం గాలింపులు...

మధ్యప్రదేశ్ : భోపాల్ సెంట్రల్ జైలు నుండి పరారైన సిమీ ఉగ్రవాదుల కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. జాకీర్, అహ్మద్, మహబూబ్, అంజద్, సలీఖ్, మజీద్, ఖలీబ్, ముజీబ్ లు పరారైన వారిలో ఉన్నారు. జాకీర్, అహ్మద్ ఖాన్ లపై పది లక్షల రివార్డు ఉంది. 

10:31 - October 31, 2016

విశాఖపట్టణం : గుట్టు చప్పుడు కాకుండా మావోయిస్టుల మృతదేహాలను ఖాకీలు ఖననం చేస్తున్నారు. ఈనెల 24 నుండి 26 వరకు ఏవోబీలో జరిగిన వరుస ఎన్ కౌంటర్ లలో 33 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసింది. ఈ ఎన్ కౌంటర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. బూటకపు ఎన్ కౌంటర్ అని మృతి చెందిన మావోయిస్టు కుటుంబసభ్యులు ఆరోపించారు. మావోయిస్టు అగ్ర నేత ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 16 మృతదేహాలను వారి బంధువులకు పోలీసులు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించకపోవడంతో 29వ తేదీన మల్కన్ గిరిలో ఖననం చేశారు. నేడు పాడేరులో మరో రెండు మృతదేహాలను ఖననం చేయనున్నారు. 

10:25 - October 31, 2016

చిత్తూరు : ఆయనో పారిశ్రామిక వేత్త..ఏపీ నుండి వెళ్లిపోయి బెంగళూరులో స్థిరపడ్డారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరు గడించారు. అకస్మాత్తుగా ఆయనను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టిస్తోంది. ఏపీకి చెందిన పరుచూరి సురేంద్రనాథ్ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి వెళ్లిన గుర్తు తెలియని దుండగులు సురేంద్ర నాథ్ పై కాల్పులకు తెగబడ్డారు. సుమారు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కుప్పకూలిపోయిన సురేంద్రనాథ్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందారు. హత్యకు కారణం ఏంటో తెలియడం లేదు. ఫౌండేషన్ మాజీ మేనేజర్ పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈయన హత్యకు గురి కావడం తెలుసుకున్న కర్నాటక వాసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు గన్ మెన్ లుగా ఉన్న వారు ఘటన జరిగిన సమయంలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మావోయిస్టుల మృతదేహాలు ఖననం..

విశాఖపట్టణం : ఇటీవల ఏవోబో ఎన్ కౌంటర్ లో చనిపోయిన కొంతమంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ఖననం చేశారు. 16 మృతదేహాలను వారి బంధువులకు పోలీసులు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించకపోవడంతో 29న మల్కన్ గిరిలో పోలీసులు ఖననం చేశారు. పాడేరులో నేడు మరో రెండు మృతదేహాలకు ఖననం చేయనున్నారు. 

10:16 - October 31, 2016

మధ్యప్రదేశ్ : రాజధాని భోపాల్ లో సెంట్రల్ జైలు అతి పెద్దదిగా పేరు గాంచింది. ఈ జైలు వద్ద హై సెక్యూర్టీ ఉంటుంది. కానీ 8 మంది సిమీ ఉగ్రవాదులు ఈ జైలు నుండి పరార్ కావడం సంచలనం కలిగిస్తోంది. దేశ సరిహద్దులో ఉగ్రవాదులు చొరబాట్లు..భారత సైన్యం తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిమీ ఉగ్రవాదులు పరార్ కావడం పట్ల పలు విమర్శలు ఎదురవుతున్నాయి. ఎనిమిది మంది ఉగ్రవాదులను ఒకే సెల్ లో ఉంచడంతో పారిపోవడానికి ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. వీరు పారిపోవడానికి ఎవరైనా సహకరించారా ? ఎవరి పాత్ర ఉంది ? అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన జైలు సూపరిటెండెంట్ తో పాటు మరో నలుగురిని సస్పెండ్ చేశారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. బస్, రైల్వే స్టేషన్ లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ ఉగ్రవాదుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందిస్తే రూ. 5లక్షల రూపాయలు అందిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించినట్లు తెలుస్తోంది. 2013లో జైలు నుండి నలుగురు సిమీ ఉగ్రవాదులు పరార్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దీనిపై ఓ నివేదికను అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

  • సోమవారం తెల్లవారుజామున 8మంది ఉగ్రవాదులు జైలు గార్డు రాంశంకర్ ను స్టీల్ పేట్లు, స్టీల్ గ్లాసుల సహాయంతో హతమార్చారు.
  • అనంతరం దుప్పట్ల సహాయంతో పెద్ద ఎత్తున ఉన్న ప్రహారీగోడ దూకి పారిపోయారు.
  • రంగంలోకి దిగిన పోలీసులు భోపాల్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బస్, రైల్వే స్టేషన్ లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు.
  • హోం మంత్రి భూపేందర్ సింగ్ ఈఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 

సిమీ ఉగ్రవాదులు పరార్..అధికారుల సస్పెండ్..

మధ్యప్రదేశ్ : 8మంది ఉగ్రవాదులు పారిపోవడం పట్ల ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించి ఐదుగురు జైలు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. 

45 ఎర్రచందనం దుంగల స్వాధీనం..

కర్నూలు : రుద్రవరం మండలం శ్రీరంగాపురం వద్ద రూ. 60 లక్షల విలువైన 45 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

పటేల్ కు మోడీ నివాళులు...

ఢిల్లీ : సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యతా దివాస్ రన్ జరిగింది. నేటి నుండి వారం పాటు ఐక్యతా దివాస్ కొనసాగనుంది. 

09:42 - October 31, 2016

WTA ఫైనల్స్‌లో భారత మహిళా టెన్నిస్ డబుల్స్ క్వీన్‌ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సానియా, స్విస్‌ వెటరన్‌ మార్టినా హింగిస్‌ జోడీకి క్వార్టర్‌ఫైనల్‌లోనూ పోటీనే లేకుండా పోయింది. క్వార్టర్స్‌లో తైవాన్‌కు చెందిన హో చింగ్‌ చాన్‌ ,చాంగ్‌ యంగ్ జాన్‌ జోడీపై పోరాడి విజయం సాధించారు. మహిళల డబుల్స్ క్వార్టర్‌ ఫైనల్‌లో తైవాన్‌కు చెందిన హో చింగ్‌ చాన్‌ ,చాంగ్‌ యంగ్ జాన్‌ జోడీపై సానియా-హింగిస్‌ జోడీ సంచలన విజయం సాధించింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సానియా జోడీ దూకుడు ముందు అన్‌సీడ్‌ తైవాన్ జోడి పోరాడి ఓడారు. పోటీ ఆరంభంలో సానియా జోడీకి....చాన్‌,జాన్‌ జోడీ గట్టి పోటీనిచ్చారు.

డబుల్స్ టైటిల్స్ సాధిస్తారా ? 
ఒత్తిడిలోనూ తమ అనుభవాన్నంతా ఉపయోగించి ఆడిన సానియా-హింగిస్‌.....తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గి పోటీలో నిలిచారు.  సెకండ్‌ సెట్‌లో సానియా జోడీ అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టడంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ కాస్తా... ఏకపక్షంగా ముగిసింది.ఆరంభంలో కాస్త తడబడ్డ సానియా జోడీ ....నాలుగో గేమ్‌ తర్వాత జోరు పెంచారు. ఆఖర్లో ప్రత్యర్ధులకు అసలే మాత్రం అవకాశమివ్వలేదు. హింగిస్‌ ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అభిమానులను అలరించగా మరోవైపు సానియా మీర్జా పవర్‌ఫుల్‌ రిటర్న్స్‌తో ప్రత్యర్ధులపై విరుచుకుపడింది.ఆఖర్లో మరింత దూకుడుగా ఆడిన సానియా జోడీ...7-5తో సొంతం చేసుకున్న సానియా జోడీ...సెమీస్‌కు దూసుకెళ్లారు. స్విస్‌ వెటరన్‌ మార్టినా హింగిస్‌ జోడీగా మూడు గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన సానియా మీర్జా.... WTA ఫైనల్స్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గి 2016 సీజన్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించాలని పట్టుదలతో ఉంది. ప్రతిష్టాత్మక WTA ఫైనల్స్‌లో సానియా జోడీ జోరు చూస్తుంటే....మహిళల డబుల్స్‌ టైటిల్‌ సాధించడం ఈ టాప్‌ సీడ్‌ జోడీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

09:39 - October 31, 2016

శ్రీకాకుళం : రాజకీయ నేతలు కీలక పాత్ర పోషించారు.. ప్రజా ప్రతినిధులు ప్రోత్సహించారు.. రెవెన్యూ అధికారులు సై అన్నారు.. అక్రమ వ్యవహారం యథేచ్చగా కొనసాగించారు. 420 ఎకరాలకు నకిలీ డి-పట్టాలు సృష్టించారు. అంతేనా ఆ పాసు పుస్తకాలపై దర్జాగా రుణాలు పొందారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్రమార్కులంతా ఒక్కటై సాగించిన రుణాల దందాపై 10 టీవీ ప్రత్యేక కథనం..! శ్రీకాకుళం జిల్లా నందిగాం తహశీల్దార్ కార్యాలయం పరిధిలోని రెవెన్యూ భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దాదాపు 420 ఎకరాల కొండ పోరంబోకు భూములను డీ-పట్టాలుగా మార్చి... భూ దందా సాగించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందిగాం మండలంలోని కొండతెంబూరు, తోట నీలాపురం, సొంటినూరు, కణితూరు ప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు దర్జాగా కొనసాగాయి. పలు సర్వే నంబర్లతో 420 ఎకరాల భూములకు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి... దర్జాగా కోట్ల రూపాయలు రుణాలు కూడా పొందారు. ఈ తతంగానికి నందిగాం తహశీల్దారు కార్యాలయం ఉద్యోగులు అన్నీ తానై నడిపించారనే ఆరోపణలు వస్తున్నాయి.

అడంగల్ కాపీలతో భారీగా రుణాలు..
ఇటు సవర సోమనాథపురం గ్రామంలో సర్వే నంబర్ 28/3, 9/1, 9/3, 9/4 లలో భూములను, కొండ తెంబూరులో సర్వే నంబర్ 29లో భూమిని రెవెన్యూ, విఆర్వో, పంచాయితీ కార్యదర్శుల పేరిట దొంగ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పాటు నందిగాం మండలంలో కామదేవును, తురకలకోట, సోమనాధపురం గ్రామాల్లో వందలాది ఎకరాలకు పాసు పుస్తకాలు, అడంగల్ కాపీలు పెట్టి... భారీగా రుణాలు పొంది.. ఆ తర్వాత రుణమాఫీ కూడా వర్తించేలా లబ్ది పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంపై కొండ తెంబూరుతో పాటు పలు గ్రామాల ప్రజలు నోరు మెదపడం లేదు. రెవెన్యూ శాఖలో కొంతమంది ఉద్యోగులు ఈ నకిలీ దందాలో భాగస్వామ్యం ఉండటంతో ఈ వ్యవహారమంతా గోప్యంగా సాగినట్లు తెలుస్తోంది. అయితే... ఈ నకిలీ బాగోతంపై మీడియా ఆరా తియడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పలు గ్రామాల్లో నకిలీ పాసుపుస్తకాలు డీ-పట్టా, దొంగ అడంగల్ కాపీలపై దృష్టి సారించి... విచారణ చేపడుతున్నట్లు చెబుతున్నారు.

420 ఎకరాల్లో కోటిన్నర రూపాయల రుణాలు..
దాదాపు 420 ఎకరాల్లో కోటిన్నర రూపాయల రుణాలు పొందినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు.. అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి... ఒక ప్రైవేటు బ్యాంకులో 38 లక్షల లోను పొందినట్లు వెలుగుచూసింది. లేని భూములకు పాసుపుస్తకాలు, రుణాలు పొందిన వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయితీ కార్యదర్శులు, గ్రామ వీఆర్‌ఓల నుండి తహశీల్దార్ వ్యక్తుల వరకూ సంబంధమున్న ఈ భూబాగోతంలో తీగ లాగితే భారీ డొంక కదిలే అవకాశముంది. వందలాది ఎకరాల్లో కోట్లాది రూపాయలు రుణాలు, రుణ మాఫీలు, నకిలీ పాసు పుస్తకాలు సృష్టించిన ఈ వ్యవహారం పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. 

09:23 - October 31, 2016
09:21 - October 31, 2016
09:19 - October 31, 2016

హైదరాబాద్ : దీపావళి కొందరి ఇంట విషాదం నింపింది. టపాసులు కాలుస్తూ పలువురికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రులకు పరుగులు తీశారు. చికిత్స నిమిత్తం మెహిదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. మొత్తంగా 20 మంది గాయపడ్డారని, వీరికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. అయితే గతేడాది కంటే ఈసారి బాధితులు సంఖ్య చాలా వరకు తగ్గిందని చెబుతున్నారు. 

09:13 - October 31, 2016

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో సిమీ ఉగ్రవాదులు పరార్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా జైలు గార్డును హతమార్చి పారిపోయారు. ఈ ఘటన భోపాల్ సెంట్రల్ జైలులో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున 8మంది ఉగ్రవాదులు జైలు గార్డు రాంశంకర్ ను స్టీల్ పేట్లు, స్టీల్ గ్లాసుల సహాయంతో హతమార్చారు. అనంతరం దుప్పట్ల సహాయంతో పెద్ద ఎత్తున ఉన్న ప్రహారీగోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భోపాల్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బస్, రైల్వే స్టేషన్ లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. హోం మంత్రి భూపేందర్ సింగ్ ఈఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జైలు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఈఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. గతంలో కాట్వా జైలు నుండి నలుగురు ఉగ్రవాదులు పారిపోయిన సంగతి తెలిసిందే. 

08:25 - October 31, 2016

అమరావతి రాజధానిలో పరిపాలన విభాగాలకు కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. జైట్లీ ప్రసంగంపై వైసీపీ పలు విమర్శలు చేసింది. మరో వైపు కేసీఆర్ కు నెంబర్ వన్ ర్యాంకు అంశంపై టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడిపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ముళ్లపూడి రేణుక(టిడిపి), నాగార్జున (వైసీపీ), తెలకపల్లి రవి (విశ్లేషకులు), మన్నె గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.  

విశాఖలో సింగపూర్ యుద్ధ నౌక..

విశాఖపట్టణం : సింగపూర్ నావికాదళానికి చెందిన యుద్ధ నౌక ఆదివారం విశాఖకు చేరుకుంది. భారత్ - సింగపూర్ నౌకాదళం సంయుక్తంగా నిర్వహించే విన్యాసాల్లో యుద్ధ నౌక పాల్గొననుంది. 

06:48 - October 31, 2016

ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులు మరోసారి పోరుబాట పట్టారు. మజూరి పెంచాలంటూ నవంబర్ 2న చేనేత కార్మికులు ప్రదర్శన నిర్వహించబోతున్నారు. ప్రస్తుత మజూరి విధానం ఎలా వుంది? మజూరి విషయంలో చేనేత కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్స్ ఏమిటి? ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ విశ్లేషించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:47 - October 31, 2016

మన దేశ చేతి వృత్తుల నైపుణ్యానికి చేనేత చక్కటి ఉదాహరణ. కానీ, చేనేతకు చేయూతనిచ్చేవారు కరువయ్యారు. దీంతో ఈ రంగం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మరికొన్నేళ్లలో చేనేతరంగం అంతరించి పోతుందేమోనన్న సందేహాలూ నిద్రపోనివ్వడం లేదు. గత మెంతో ఘనకీర్తి అన్న మాట అక్షరాల మన చేనేత రంగానికి వర్తిస్తుంది. వర్తమానమే అత్యంత ఆందోళనకరంగా వుంది. భవిష్యత్ ఊహించుకుంటేనే భయమేస్తోంది. పత్తి ఉత్పత్తిలో మన దేశానిది 3వ స్థానం. వస్త్రాల ఉత్పత్తిలో రెండో స్థానం. కానీ, ఏం లాభం? దినదినగండం నూరేళ్ల ఆయుష్షులాగా తయారైంది చేనేత కార్మికుల పరిస్థితి. మన దేశంలో రెండున్నర కోట్ల మందికి చేనేత జీవనాధారం. వీరికి బతుకుదెరువునిచ్చే దారపు పోగు తెగిపోతోంది . ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చేనేత రంగం నుంచి ఏటా ఏడు శాతం మంది తప్పుకుంటున్నారు. అంతే సంఖ్యలో చేనేత మగ్గాలు తగ్గిపోతున్నాయి. వలసలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొద్ది సంవత్సరాలలో చేనేత అంతరించి పోయిన వ్రుత్తుల జాబితాలో చేరే ప్రమాదం వుంది. చేనేతరంగం మరింత దెబ్బతింటే దానికి అనుబంధంగా పనిచేస్తున్న 27 వృత్తుల వారిని కష్టాలు, కన్నీళ్లూ వెంటాడుతాయి.

తక్కువ ఆదాయం...
చేనేత కార్మికులు రోజంతా శ్రమిస్తున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు శ్రమించకతప్పదు. రోజుకి 18 గంటలు కష్టపడ్డా దక్కే ప్రతిఫలం చాలా స్వల్పం. మన దేశంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల సగటు వేతనం 4500 రూపాయలైతే, చేనేత రంగంలో అది 3400 రూపాయలు మాత్రమే వున్నట్టు గతంలో జరిగిన ఓ అధ్యయం బయటపెట్టింది. నెలకు వెయ్యి రూపాయల కంటే తక్కువ ఆదాయం వున్నవారు చేనేతరంగంలో చాలామంది వున్నారు. అందుకే కుటుంబాల్లో పోషకాహారలోపం, రక్తహీనత లాంటి సమస్యలు ఎక్కువ. చేనేత కుటుంబాల్లోని 97శాతం మంది మహిళలు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుండడం వీరు ఎదుర్కొంటున్న దుస్థితికి నిదర్శనం. చేనేతరంగం ఇంతటి సంక్షోభంలో చిక్కుకోవడానికి ఏకైక కారణం ప్రభుత్వ విధానాలే. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యం చేనేతకు పెద్ద శాపం. పారిశ్రామికరంగానికి ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలు చేనేత రంగాన్ని చావు దెబ్బ తీశాయి. చేనేతరంగానికి కల్పించిన రక్షణలను అమలు చేసే విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం మరో లోపం. పత్తి, నూలు, ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం చేనేతకు భారంగా మారింది. క్రుత్రిమ దారాలు చేనేతకు ఉరితాళ్లై వెక్కిరిస్తున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కడ ? 
చేనేత కార్మికులకు ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహకారం లభించకపోవడతో, ప్రయివేట్ ఫైనాన్స్ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అప్పులు చేసి, వాటికి వడ్డీల మీద వడ్డీలు కడుతూ నేసిన బట్టలకు మార్కెటింగ్ లేకపోవడం మరో శాపం. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. సహకార సంఘాలను బలహీనపర్చడంతో చేనేతకు పెద్ద దిక్కన్నదే లేకుండా పోతోంది. తక్కువ సమయంలో, తక్కువ ధరతో, మరింత ఆకర్షణీయంగా వస్త్రాలు నేసే నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా ఏవిధమైన పరిశోధనలూ జరగడం లేదు. 

06:41 - October 31, 2016

ఇటలీ : మళ్లీ భూకంపం సంభవించింది. సెంట్రల్‌ ఇటలీలోని నార్సియా ప్రాంతానికి సమీపంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.6గా నమోదైంది. భూకంపం ధాటికి వందల ఇళ్లు, భవనాలు, చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. సెంట్రల్‌ ఇటలీ ప్రాంతంలోనే వరుసగా రెండు సార్లు భూమి కంపించినట్లు సమాచారం. భూకంపం ధాటికి పలు కట్టడాలు, వందల ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.6 గా నమోదైనట్లు అమెరికా భూ భౌతిక పరిశోధనా సంస్థ వెల్లడించింది. ప్రకంపనల వరుసగా చోటు చేసుకోవడంతో పెద్ద పెద్ద కట్టడాలు ధ్వంసమయ్యాయి.

ఇదో పెద్ద విపత్తు..
రోమ్‌లోనూ భూమి కంపించింది. పెరుగ్వియాకు 68 కిలోమీటర్ల దూరంలో.. నోర్సియా సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సెంట్రల్‌ ఇటలీ ప్రాంతంలో రెండు సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. నార్సియా ప్రాంతంలోని సెయింట్ బెనడిక్ట్‌ బసిలికా పూర్తిగా ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు. ఇదో పెద్ద విపత్తు అని ఉషిత మేయర్‌ మార్కో రినాల్డి తెలిపారు. ఆదివారం సంభవించిన భూకంపం ధాటికి కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు దెబ్బతిన్నాయని, సహాయక చర్యల్లో ఇటలీ సివిక్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నిమగ్నమైంది. కూలి పోయిన భవనాల శిథిలాలను తొలగించి... పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు. 

06:35 - October 31, 2016

అనంతపురం : జిల్లాలో.. జనసేన సభ ఫీవర్‌ మొదలైంది. ఈ వేదికపై ఏ అంశాల గురించి పవన్‌ తన ప్రశ్నలను సంధిస్తాడోనని పవన్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లా సమస్యల గురించి జనసేన అధినేత దృష్టికి తీసుకువెళ్లడానికి ఆయన అభిమానులు ప్రయత్నిస్తున్నారు. అనంతలో నవంబర్‌ పదో తేదీన జనసేన సభను నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం గ్రౌండ్‌కు అనుమతులు కూడా లభించాయి. ఈ సభా ప్రాంగణానికి సోషలిజం భావాలు కలిగిన తరిమెల నాగిరెడ్డి, కల్లూరు సుబ్బారావుల పేర్లు పెడుతున్నట్టు జనసేన వర్గాలు ప్రకటించాయి. అయితే అనంతపురం జిల్లాలో ఉన్న ఏఏ సమస్యలను పవన్‌ ప్రస్తావిస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో అభివృద్ధి ఆశించినస్థాయిలో జరగలేదంటూ అనంత నుంచి ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్‌ సభ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మేరకు అనంతపురానికి సంబంధించిన అనేక అంశాలను పవన్ ప్రస్తావించనున్నట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు.

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి గురించి ప్రశ్నలు..
అనంతలో కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల గురించి పవన్‌ తన వాణిని వినిపించే అవకాశాలున్నాయి. కరువు రైతులకు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీ, శాశ్వత కరువు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న సమస్యలపై స్పందించనున్నారు. అలాగే హంద్రీనీవా రెండో దశ పనుల జాప్యం, మొదటి దశ ఆయకట్టుపై కూడా పవన్‌ ప్రశ్నించే అవకాశం ఉంది. జిల్ల్లాలో ఎన్పీ కుంట సోలార్‌ భూముల విషయం కూడా పెద్ద వివాదంగా మారింది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి గురించి పవన్‌ మాట్లాడునున్నట్టు తెలుస్తోంది.

సామాజిక సమస్యలపై మాట్లాడే అవకాశం..
ఇప్పటికే జనసేన కార్యకర్తలు జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లి అక్కడ సమస్యలు గురించి తెలుసుకున్నారని అభిమానులు చెబుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న చేనేత పరిశ్రమ గురించి పవన్ ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అలాగే కదిరి తండాలలో మహిళల అక్రమ రవాణా లాంటి సామాజిక సమస్యలపై కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. హంద్రీనీవా ద్వారా అనంతకు వంద టీఎంసీల నీటిని అధికారికంగా కేటాయించేలా ఒత్తిడి తేవడంపై కూడా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు అనంతపురం యువకులు చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే వెనుకబడిన అనంతపురం జిల్లా పారిశ్రామికంగా పరుగులు తీసే అవకాశాలున్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌, తన ప్రసంగంలో ఏ ఏ అంశాలను స్పృశిస్తారు..? ఆయన మాటల ప్రభావం జిల్లాకు ఏమేలు చేకూరుస్తుంది..? అన్న అంశాలపై జిల్లాలో హాట్‌హాట్‌ చర్చ సాగుతోంది. 

06:33 - October 31, 2016

హైదరాబాద్ : పార్టీ పటిష్టతపై కేసీఆర్‌ దృష్టి సారించడంతో.. కేబినెట్‌లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాలకు సమన్యాయం కల్పించే ఉద్దేశంతో కేబినెట్‌లో కొత్తవారికి ఛాన్స్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరిగితే ఎవరికీ ఉద్వాసన పలుకుతారోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది. తెలంగాణ కేబినెట్‌లో మార్పులు జరుగుతాయనే ప్రచారం గత ఏడాది నుంచి కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో ఆ ప్రచారం మరింత ఉధృతమైంది. ప్రస్తుత మంత్రివర్గంలోని ఐదారుగురు మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో మరికొంతమంది నేతలకు కేబినెట్‌ చోటు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం కొంతమందికి మంత్రివర్గంలో ఉద్వాసన తప్పదు.

కేబినెట్ లో అవకాశం ఎవరికి ? 
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి కేబినెట్‌లో అవకాశం దక్కుతుంది ? ఎవరికి ఉద్వాసన తప్పదోనన్న టెన్షన్‌ పార్టీలో కొనసాగుతోంది. జిల్లాల విభజన నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు.. కేబినెట్‌లోకి తీసుకునే నేతలపై కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నారు. భవిష్యత్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతలకు వారి సమర్ధత ఆధారంగా అవకాశమిచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా.. ఇప్పటికి ఇంకా కొంతమంది మంత్రులు తమ శాఖపై పూర్తిస్థాయిలో పట్టు సాధించకపోవడంతో కేసీఆర్‌ వారిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మరికొంత మందికి కేబినెట్‌లో అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ హామీ ఇవ్వడంతో.. ఇటీవల పార్టీలో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు.. సీనియర్‌ నేత కొప్పుల ఈశ్వర్‌, స్వామిగౌడ్‌, ఓ మహిళకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలక్షన్‌ టీమ్‌ను సిద్దం చేసుకునేందుకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని కీలకనేతలంటున్నారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. 

06:31 - October 31, 2016

విజయవాడ : ప్రతిపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లడమే కాకుండా.. వాటిని ప్రజలకు వివరించేందుకు జనచైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. నెల రోజుల పాటు ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించనున్నారు. యాత్రలో మంత్రులతో సహా నేతలంతా పాల్గొననున్నారు. సంక్షేమ పథకాల్లో ప్రజల నుంచి వచ్చే సూచలన మేరకు మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు టీడీపీ జనచైతన్య యాత్రలను చేపట్టబోతుంది. ప్రతిపక్షాలు నిత్యం యాత్రలు, పర్యటనల పేరుతో ప్రజల్లో పర్యటిస్తుండటం.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ యాత్రలు ఎంతో ఉపయోగపడతాయని టీడీపీ భావిస్తోంది.

స్వాగతం పలుకుతారా ? 
ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏం అనుకుంటున్నారు.. చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతమేరకు చేరుతున్నాయనే అంశాలను ఈ జనచైతన్య యాత్రలో తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇన్‌చార్జ్‌లు పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నారు. యాత్రలో పాల్గొనే నాయకులంతా రాత్రిపూట గ్రామాల్లోనే బస చేయాలని నిర్ణయించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ యాత్రలను యువనేత లోకేశ్‌ పర్యవేక్షించనున్నారు. అయితే అధికార పార్టీ చేపట్టబోయే జనచైతన్య యాత్రలను ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లోకి ఎలా వెళ్తారని మండిపడుతున్నారు. మరి.. జనచైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలకు ప్రజలు ఎలా స్వాగతం పలుకుతారో చూడాలి. 

06:29 - October 31, 2016

విజయవాడ: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. పేదలకు గృహ నిర్మాణం, పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, జన చైతన్య యాత్ర, రాజధాని నిర్మాణం, స్విస్ ఛాలెంజ్ విధానం, మాస్టర్ డెవలపర్ ఎంపిక, రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి పెంపు, పేదలు, మధ్య తరగతి వర్గాల ఆధీనంలోని స్థలాల క్రమబద్ధీకరణ అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను అప్పగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. భవనాల అప్పగింతపై సుముఖంగా ఉన్నప్పటికీ కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గవర్నర్‌కు చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి ప్రత్యేక భవనం నిర్మించి ఇచ్చాకే సచివాలయ భవనాలు అప్పగించాలని కేబినెట్‌ సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ జనచైతన్య యాత్రలపై కేబినెట్ లో చర్చ..
నవంబర్ 1 వ తేదీ నుంచి జనచైతన్య యాత్రలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఈ యాత్రలో పార్టీ నాయకులతోపాటు ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు.ఈ యాత్రలో మంత్రుల పాత్ర ఎలా ఉండాలన్న దానిపై ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేయనున్నారు.

06:27 - October 31, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. టపాసుల వెలుగుల మాదిరిగా తమ జీవితాలతో కొత్త వెలుగులు నిండాలని ప్రజలు ఎంతో సంతోషంగా పండగ జరుపుకున్నారు. ఉదయమంతా లక్ష్మీదేవి పూజలు చేసిన ప్రజలు.. రాత్రి చిన్నా పెద్ద తేడా లేకుండా మతాబులు కాల్చి సంబరాల్లో మునిగిపోయారు. ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలను ముస్తాబు చేసిన ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసినవారు.. రాత్రి పూట చిన్నా పెద్ద తేడా లేకుండా మతాబులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. 

హైదరాబాద్ లో...
హైదరాబాద్‌లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. బంధుమిత్రులంతా సంతోషంగా పండగను జరుపుకున్నారు. ఈ ఏడాది తమ వ్యాపారాలు మంచి లాభాలు సాధించాలని పూజలు నిర్వహించారు. కొంతమంది బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా మతాబులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

విశాఖ..విజయవాడలో..
విశాఖపట్టణంలో దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కయాంత్‌ తుపానుతో సంబరాలు జరుపుకుంటామో లేదోనన్న టెన్షన్‌ పడ్డ ప్రజలు.. ఆ ముప్పు తప్పడంతో మరింత ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంతో టపాసులు కాల్చారు.

కామారెడ్డి..కర్నూలులో..
కామారెడ్డి జిల్లాలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇళ్లు, షాపులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇంటి ముందు దీపాలు వెలిగించారు. పిల్లలు, పెద్దలతో సహా కుటుంబ సభ్యులంతా రకరకాల టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేశారు. కర్నూలులో దీపావళి వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. సి.క్యాంప్‌ అనాధ ఆశ్రమంలో జిల్లా ఎస్పీ రవికృష్ణ, పోలీసులు అధికారులు దీపావళి పండగ నిర్వహించారు. ఏడాది క్రితం కర్నూలు ఆస్పత్రిలో వదిలివెళ్లిన శిశువుకు తన్మయగా నామకరణం చేసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. అనాధ ఆశ్రమంలోని పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. చిన్నారులు భారం అనుకుని వదిలించుకోవాలనుకునే వాళ్లు.. వారిని రోడ్ల మీద పడేయకుండా.. ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకున్న దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. పిల్లలు, పెద్దలు సంతోషంతో టపాసులు కాల్చి ఎంజాయ్‌ చేశారు. 

15వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర...

మహబూబ్ నగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లాల్లోకి ప్రవేశించిన యాత్రలో నేడు టి.టిడిపి నేతలు పాల్గొననున్నారు. 

నేటి నుండి కార్తీక మాసం..

హైదరాబాద్ : నేటి నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ నెలకొంది. భక్తులు తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించారు. 

ముంబై లో అగ్నిప్రమాదం..

ముంబై : గిర్గామ్ లోని డ్రీమ్ ల్యాండ్ థియేటర్ సమీపంలోని మెహతా మ్యాన్సన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ...

విజయవాడ : ఏపీ మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. సాయంత్రం మూడు గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పేదల స్థలాల క్రమబద్దీకరణ..సాగునీటి ప్రాజెక్టుల పురోగతి..సచివాలయ భవనాల అప్పగింతపై టీఎస్ సర్కార్ రాసిన లేఖ..ఇతరత్రా అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. 

సీపీఎం పాదయాత్రలో పాల్గొననున్న టి.టిడిపి నేతలు..

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీ పేటలో సీపీఎం పాదయాత్రలో టి.టిడిపి నేతలు పాల్గొననున్నారు. పాదయాత్రకు ఎల్.రమణ, రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. 

అమరవీరుల స్థూపం వద్ద డీజీపీ నివాళులు..

హైదరాబాద్ : సమాజ రక్షణలో ముందుండి పోరాడిన పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరణీయమని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. దీపావళి సందర్భంగా ఆదివారం రాత్రి గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద అనురాగ్‌శర్మ అమరవీరులకు నివాళులర్పించారు.

 

Don't Miss