Activities calendar

01 December 2016

21:45 - December 1, 2016

తమిళనాడు : డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి అస్వస్ధతకు గురయ్యారు. వయోభారం కారణంగా ఏర్పడిన ఇబ్బందులతో అనారోగ్యానికి గురైన ఆయన్ను కావేరి ఆసుపత్రిలే చేర్చారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు, యూరినరీ ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆయనకు న్యూట్రిషన్, హైడ్రేషన్ లకు సంబంధించిన చికిత్సలు చేస్తున్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల పాటు కరుణానిధి ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు.

21:42 - December 1, 2016

ఢిల్లీ : మీడియాలో బంగారంపై వస్తున్న వదంతలను ఎవరూ నమ్మొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను కోరారు. కొత్తగా బంగారంపై ఎలాంటి మార్పులు తీసుకురాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలవద్ద ఉన్న బంగారాన్ని జప్తు చేస్తారని...బంగారంపై కేంద్రం 75,85 శాతం పన్ను విధిస్తారని ...వంశపారపర్యంగా లభిస్తోన్న బంగారాన్ని కేంద్రం తీసుకుంటుందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని వెంకయ్య అన్నారు. పాత నిబంధనలు ఏమి ఉన్నాయో అవే కొనసాగుతాయని స్పష్టం చేశారు. 

21:40 - December 1, 2016

ఢిల్లీ : ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు ఇకపై వేగవంతం కానున్నాయి. నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇక స్పీడప్‌ కానున్నాయి. నిధుల మంజూరీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలివిడతగా 2వేల 981 కోట్ల రూపాయలకు ఆమోదం తెలుపుతూ..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతకం చేశారు. ఈ మేరకు ఆర్థికశాఖ కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం పంపింది. ఈ నిధులు నాబార్డు నుంచి మూడు రోజుల్లో విడుదలవుతాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరీ పేర్కొన్నారు. ప్రాజెక్టు పని వేగాన్ని ఆధారంగా విడతల వారీగా నిధులు మంజూరవుతాయని తెలిపారు. నాబార్డు నుంచి ప్రాజెక్టుకు నేరుగా నిధులొస్తాయని అనంతరం కేంద్ర ప్రభుత్వం నాబార్డుకు ఆ నిధులను చెల్లిస్తుందని వెల్లడించారు. 

21:37 - December 1, 2016

హైదరాబాద్ : ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమై చర్చించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి ఏఐటీయూసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రావు కూడా హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు భూ సేకరణ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. భావసారూప్యత కలిగిన ప్రజా సమస్యలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయం ఆలోచన చేసినట్లు రామకృష్ణ ప్రకటించారు. సీపీఎం నేతలతో కలిసి మరోసారి భేటీ అవుతామని పవన్‌ తెలిపారు.

21:35 - December 1, 2016

వెలగపూడి : వెలగపూడి కొత్త సచివాలయంలో తొలిసారిగా సమావేశమైన ఏపీ మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దనోట్ల రద్దు సమస్యల పరిష్కారం, పోలవరం, రాజధాని నిర్మాణాలపై పర్యవేక్షణతోపాటు కొత్తగా పెన్షన్ల మంజూరిపై నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రంలో నగదురహిత లావాదేవీల కోసం చర్యలు
వెలగపూడిలో తొలిసారి సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించింది. ఇప్పటివరకు నోట్ల రద్దు కారణంగా రాష్ట్రం 800కోట్లు నష్టపోయిందని మంత్రులు తెలిపారు. ఈ నెలాఖరుకు నష్టం 1500కోట్లకు చేరుకుంటుందని సమావేశంలో అంచనావేశారు. బంగారంపై పరిమితి విధించడాన్ని వ్యతిరేకించాలని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబుకు సూచించారు. అలాగే రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్లాన్‌ను రూపొందించారు. జిల్లా,డివిజన్‌, మండల, గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు జిల్లా ఇంచార్జిమంత్రి చైర్మన్‌గా , కలెక్టర్‌ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తారని మంత్రి పల్లె తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 3లక్షల మందికి పెన్షన్లు
రాష్ట్రంలో కొత్తగా 3లక్షల మందికి వృద్ధాప్య , వికలాంగ, వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తెలిపారు.

పోలవరం, అమరావతి పనులపై ప్రతిరోజు సమీక్ష
పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని ఇక నుంచి మరింత వేగవంతం చేయనున్నారు. కేంద్రం నుంచి నిధుల మంజూరి దగ్గర నుంచి.. కొత్త టెక్నాలజీ వాడుకుని పనుల్ని యుద్ధప్రాతిపథికన పూర్తి చేయడానికి నిర్ణంయ తీసుకున్నట్టు మంత్రి పల్లె చెప్పారు. ప్రాజెక్ట్‌ల పనులపై ఇక నుంచి ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తామన్నారు.

మేయర్లు, చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు జీతాలు పెంపు
కొత్త సచివాలయంలో జరిగిన తొలి సమావేశంలోనే మంత్రివర్గం పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపికబురు చెప్పింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో.. మేయర్లు, చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు.

పరిశ్రమల స్థాపనకోసం ఏపీఐఐసికి భూముల కేటాయింపు
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ..ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూములు కేటాస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అటు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు.. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలంవేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పల్లె. ఇటీవల మృతి చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.. మంగళంపల్లి బాలమురళికృష్ణ కు మంత్రివర్గం సంతాపం తెలిపింది. 

21:30 - December 1, 2016

గుంటూరు : డిజిటల్ లావాదేవీలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ గా ఏపీ సీఎం తొలిసారి తమ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉండవల్లి గ్రామంలో గల తన క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర సీఎం ఫఢ్నవీస్, ఒరిస్సా సీఎస్, నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పణగారియాలతో పలు విషయాలపై మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి అవలంబించాల్సిన పద్దతులపై చర్చించారు. 

21:24 - December 1, 2016

ఢిల్లీ : బంగారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం.. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని తేల్చి చెప్పింది. ఇంతకంటే ఎక్కువ ఉంటే టాక్స్‌ తప్పదు. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు కాదని గతంలో కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం
బంగారం అంటే ఎవరికి మోజుండదు. మహిళలు.. పురుషులు అనే తేడానే ఉండదు.. కొందరైతే నఖ శిఖ పర్యంతం బంగారం ధరించేందుకు ఇష్టపడుతారు. 600 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుందని... లేదంటే మీ బంగారం సంగతి అంతే... అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. బ్యాంక్‌ లాకర్‌లను సైతం తెరుస్తారని దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారనే వార్తలూ వచ్చాయి. దీంతో మహిళలు బంగారంపై బెంగ పెట్టుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బంగారంపై స్పష్టత ఇచ్చారు.

అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం ఉండొచ్చు
తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం.. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని తేల్చి చెప్పింది. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు కాదని గతంలో కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు.

సంపన్న వర్గాలను ఆందోళనకు గురిచేయనుందా?
మరోవైపు కేంద్ర నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. గోల్డ్‌ మాఫియా చేసే పనిని దేశ ప్రజలంతా చేసేలా కేంద్రం చర్యలు చేపట్టిందని అంటున్నారు. మొత్తానికి బంగారంపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకున్నా.. సంపన్న వర్గాలను ఆందోళనకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు.

పాక్ కు భారత్ మరో హెచ్చరిక..

ఢిల్లీ : భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని నిలిపివేస్తేనే చర్చలు జరుపుతామని పాకిస్థాన్ ను భారత్ మరోసారి హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్, ముందుగా తన తీరును మార్చుకుంటేనే చర్చలు సాధ్యమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో భారత్ ఎప్పుడూ సుముఖంగానే ఉందని, ఈ చర్చల కోసం పాక్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల రీత్యా చర్చలకు అంగీకరించలేమని పేర్కొన్నారు. 

20:40 - December 1, 2016

మరో సర్జికల్ స్ట్రైక్ జరగనుందా? నోట్ల రద్దు తర్వాత.. బంగారంపై పడనున్నారా? ఇంట్లో బంగారం సేఫ్ కాదా? సర్కారు బూతద్దం పెట్టి వెతకనుందా? గోల్డ్ హంట్ తో కేంద్రం ఏం తేల్చనుంది? జైట్లీ ప్రకటన మరింత గందరగోళాన్ని క్రియేట్ చేసిందా? ఈ రోజు వైడాంగిల్ స్టోరీలో చూద్దాం.. బ్యాంకు లాకర్లు తెరుస్తారా? బీరువాలు బద్దలు కొట్టి వెతుకుతారా? ఆపరేషన్ గోల్డ్ మొదలు కానుందా? ఈ మధ్య కొన్న బంగారానికేనా, గతంలో కొన్న బంగారానికి కూడా ఇది వర్తిస్తుందా? ఓ పక్క నోట్ల గందరగోళం కొనసాగుతోంది. ఇప్పుడు కొత్తగా బంగారం గరం గరమ్ గా మారుతోంది. కరెన్సీ నోట్ల లాగే ఇది కూడా దేశమంతా ప్రభావం చూపే అంశం కావటంతో కలకలంగా మారింది. బంగారం చుట్టూ ప్రపంచం ఎందుకు తిరుగుతోంది..బంగారం అంటే ఎందుకంత విలువ. బంగారం అంటే ఎందుకంత ఆసక్తి.. బంగారం చుట్టూ ప్రపంచం ఎందుకు తిరుగుతోంది. ఆయా దేశాల కరెన్సీలని, ఆర్ధిక వ్యవస్థలని ప్రభావితం చేసేలా బంగారం ఎందుకు మారింది? అస్పష్టత..సందిగ్ధం..గందరగోళం.. విమర్శలు..నోట్ల సంగతేమో కానీ బంగారం జోలికొస్తే ఊరుకునేది లేదని మహిళాలోకం నుండి వాదనలు.. కేంద్రం ప్రకటనతో కనిపిస్తున్న దృశ్యాలివి.. దీనికి ఇప్పటికైనా మోడీ సర్కారు స్పష్టత ఇస్తుందా? మరో వైపు నోట్ల రద్దుతో బంగారం మార్కెట్ కుదుపులకు లోనవుతోంది.భారత దేశం సంస్కృతికి బంగారానికి ఎనలేని అనుబంధం ఉంది. మరీ ముఖ్యంగా మహిళలకు ఇంకా దగ్గర సంబంధం ఉంది. ఈ సందర్భంలో బంగారం గురించి ఓ అస్పష్టతను కేంద్రం క్రియేట్ చేసింది. బంగారం ఎంత ఉండాలి అనేదానిపై లిమిట్ పెట్టడం మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అంశంపై సర్కారు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరింత సమాచారానికి వీడియో చూడండి..

 

20:26 - December 1, 2016

ఏటీఎంల కాడ..బ్యాంక్ ల కాడ మన మల్లన్న హల్ చల్ చేసాడుల్లా..ఏటీఎం ల తాన పైసల్లేవని బోర్డులెట్టినారు. జనాలు లొల్లి లొల్లి జేస్తన్నరు..నల్లనోట్లు తెత్తానన్న మోడీ మమ్మల్నే సంపుతున్నాడని కొంతమంది జెబుతుంటే..మోదీ సాబ్ జనాలకు మంచిజేయనీకి చేసినాడనీ..గిప్పుడు బ్యాంక్ ల కాడ..ఏటీఎం ల కాడ లైన్లను చూపెడతున్నారు గానీ..వైన్ షాపులల్ల వున్న లైన్లను మీడియావారు సూపించాలనీ డిమాండ్ చేసిండు..ఉన్నోడు..గస్సలు లేనోడు బాగానే బతుకుతాడు గానీ..మధ్యతరగతోల్లకే గీ తిప్పలని సెప్పిండు..ముందుగానే సెప్పి బంద్ చేస్తే మంచిదనీ ఒకాయనంటుంటే..ముందుగా జెప్తే వారు జర జాగర్తపడుతాడంటున్నాంటున్నారు జనాలు..బ్యాంకలల్ల ఆఫీసర్లని మంచిగా పనిజేయాలని చెప్పాలని ..ఇల్లు సూసుకోవాలా..పిల్లలకే సూసుకోవాలా? లైన్లల్ల నిలబడాల్నా? గని ఓ ఆడకూతురు గోడు ..గిట్ల ప్రతీవోల్లకీ ఏదోక కష్టమే పైసల కోసం..

నోట్ల రద్దు కమిటీతో బాబు వీడియో కాన్ఫరెన్స్..

అమరావతి : నోట్ల రద్దుపై ఐదు రాష్ట్రాల సీఎంలతో ఏర్పాటు కేంద్ర కమిటీతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్బీఐ నుండి నిధుల విడుదల వంటి అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలనీ..బ్యాంకులు తమ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నాయనీ..ప్రజలు ఇబ్బందుల్లో వున్నప్పుడు ఇటువంటి చర్యలు సరైనవి కానదని సూచించారు. నగదు రహిత లావాదేవీల కోసం కమిటీ సభ్యులను చంద్రబాబు సలహాలను కోరారు. నోట్ల రద్దు అనంతరం ఏపీలో చేపట్టిన చర్యలపై కమిటీ సభ్యులకు చంద్రబాబు వివరణ ఇచ్చారు. 

ఐటీ అధికారి నివాసంపై సీబీఐ దాడులు..

హైదరాబాద్ : ఐటీ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బొడ్డు వెంకటేశ్వరరావు నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ఆయన నివాసంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 5 కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వున్న అపార్ట్ మెంట్లను సీబీఐ అధికారులు గుర్తించారు. కూకట్ పల్లి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీల్లో ఆయనకు ఇళ్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 

గ్రూప్ 2 ప్రాధమిక కీ ఖరారు..

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ఇటీవలే నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ప్రాథమిక కీని ఖరారు చేసింది. రేపటి నుంచి వెబ్‌సైట్‌లో గ్రూప్-2 కీ లభ్యమవుతుందని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు తెలిపారు. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని వెల్లడించారు. అభ్యంతరాలు ఆంగ్లంలోనే, వెబ్‌సైట్ సూచించిన లింక్ ద్వారానే వెల్లడించాలని చెప్పారు.

19:25 - December 1, 2016

ఢిల్లీ : బంగారంపై ఐటీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చింది. అలాగే.. పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండరాదు, అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని మార్గదర్శకాలు జారీ చేసింది.  దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బంగారంపై  వివరణ ఇచ్చారు. తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుందని... అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉంటే పన్ను విధించనున్నారు. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి ప్రస్తుతం జారీ చేసిన మార్గదర్శకాలు కాదని.. గతంలో కూడా ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో వాసిరెడ్డి వేణుగోపాల్ (గోల్డ్ ఎక్స్ పర్ట్),ఇందిరా శోభన్ (టీ.పీసీసీ అధికార ప్రతినిధి),లత (టీడీపీ నేత), తుమ్మల పద్మ (బీజేపీ నేత) గోపీనాథ్ (గోల్డ్ మర్చంట్ ఈస్ట్ సిటీ ప్రతినిథి) , రేఖ (గృహిణి) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న విశ్లేషకులు,నిపుణులు,సామాన్య గృహిణి, వక్తలు  ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసారో తెలుసుకునేందుకు ఈ  వీడియో చూడండి..

19:20 - December 1, 2016

ప్రకాశం : ఒంగోలులో కారం మిల్లులపై విజిలెన్స్‌ మరియు ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు గుంటూరు రోడ్డులో ఉన్న కారం మిల్లుపై అధికారులు దాడిచేయడంతో బూజు పట్టిన పచ్చళ్లు, పురుగులతో నిండిన కారం పౌడర్లు, ఇతర ముడిసరుకులతో.... వందల కిలోల నిల్వలు బయటపడ్డాయి. ఈ మిల్లులో పచ్చళ్లను అనేక బ్రాండ్లతో మార్కెట్ లోకి సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా పదుల సంఖ్యలో రకరకాల బ్రాండ్ల పేరుతో కారం ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించి విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ కు పంపించారు. దీనిపై విచారణ చేపట్టి మిల్లు నిర్వహాకులపై చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. 

19:13 - December 1, 2016

పశ్చిమగోదావరి : నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇక స్పీడప్‌ కానున్నాయి. నిధుల మంజూరీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలివిడతగా 2981 కోట్ల రూపాయలకు ఆమోదం తెలుపుతూ..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతకం చేశారు. ఈ మేరకు ఆర్థికశాఖ కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం పంపింది. 

19:00 - December 1, 2016

విజయవాడ : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చి జరిగింది. బంగారంపై పరిమితిని వ్యతిరేకించాలని సీఎంకు మంత్రులు సూచించారనీ..ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు మంత్రులు సూచించారు. సమావేశం అనంతరం వీడియాతో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. నోట్ల రద్దుతో రాష్ట్రానికి రూ.800లకోట్లు ఆదాయం తగ్గిపోయిందని పల్లె పేర్కొన్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు..బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకూ మొత్తం 26 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గం నిర్మాణానికి భూసేకరణతో కలిపి రూ.7212 కోట్లు ఖర్చవుతున్నాయని మంత్రి తెలిపారు. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి రూ.800 కోట్లు నష్టం వాటిల్లిందనీ..ఈ నెలాఖరుకు ఇది రూ.1500లకు చేరుతుందని కేబినెట్ అంచనా వేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను వచ్చేనెల నుండి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయంచిందన్నారు. చిత్తూరు జిల్లా అపోలో టైర్లకంపెనీకి వంద ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ నిర్ణయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లకు వేతనాలు పెంచే నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది. అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలో ఇండ్రస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పల్లె పేర్కొన్నారు. 

18:42 - December 1, 2016

తూర్పుగోదావరి : ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు సంబంధించిన అనుచరులు ఓ ఇంటిపై దాడి చేశారు. కోర్డు వివాదంలో వున్నటువంటి ఓ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి అరాచకం సృష్టించారు. ఇంటిలోని ఫర్నీచర్ ను ఓ బైక్ ను ధ్వంసం చేశారు. పట్టపగలు జరిగిన ఈ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.చట్టాన్ని ఉల్లంఘించి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించినవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

ఎమ్మెల్యే అనుచరుల వీరంగం!..

తూర్పుగోదావరి : ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు సంబంధించిన అనుచరులు ఓ ఇంటిపై దాడి చేశారు. కోర్డు వివాదంలో వున్నటువంటి ఓ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి అరాచకం సృష్టించారు.

18:30 - December 1, 2016

నెల్లూరు : నోట్ల రద్దై 22 రోజులు గడుస్తున్న నెల్లూరులో కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. 1 వ తారీఖు రావడంతో ప్రజలు, ఉద్యోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్ది ఏటీఎం, బ్యాంక్ ల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

18:20 - December 1, 2016

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో గల జనసేన కార్యాలయంలో పవన్ తో వారు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ ను కలిసారు. దాదాపు గంట సేపు ఏపీ సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నోట్ల రద్దు, తదనంతరం ఏర్పడిన పరిస్థితులు..బలవంతపు భూసేకరణ చేస్తోందనీ..దీనిపై తీసుకోవాల్సిన అంశం వంటి పలు ప్రజాసమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా..ఇటీవల పాత పెద్ద నోట్ల విషయం..భూసేకరణ వంటి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తో చర్చించామని సురవరం పేర్కొన్నారు. దాదాపు రెండుగంటలపాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లుగా ఆయన పేర్కొన్నారు. 

పవన్ కళ్యాణ్ ను కలిసిన సీపీఐ రామకృష్ణ..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీపీఐ నేతలు భేటీ ఆయ్యారు. ఏపీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి..చంద్రశేఖరు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలో సీపీఐ నేతలను తీసుకొస్తానని పవన్ తో సురవరం తెలిపారు. జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ ను కలిసారు. దాదాపు గంట సేపు ఏపీ సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. 

17:58 - December 1, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నా.. పేదలకు కడతాన్న డబుల్‌ బెడ్‌రూంల సంగతే మర్చిపోయారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, పేదల పిల్లలకు కేజీ టూపీజీ విద్య, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ ఏమయ్యాయని పొన్నం ప్రశ్నించారు. ఎన్నికల టైంలో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన కేసీఆర్‌.. తన కుటుంబ సభ్యులకు మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించుకున్నారని పొన్నం విమర్శించారు.

17:56 - December 1, 2016

కరీంనగర్ : ఇల్లు గడవక ఒకరు.. స్కూలు ఫీజులు చెల్లించలేక మరొకరు.. నిత్యావసరాల సరుకులు కొనుక్కునేందుకు చిల్లర లేక ఇంకొకరు.. ఇలా బీడీ కార్మికులు పెద్ద నోట్ల రద్దుతో తిప్పలు పడుతున్నారు. బిల్లులు రాకపోవడంతో బీడీ కార్మికుల గుండెల్లో గుబులు పుడుతోంది. 500, వెయ్యినోట్ల రద్దు ప్రభావం బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలిచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న బీడీ కార్మికులు.. కేంద్ర నిర్ణయంతో ఆగాథంలో పడిపోయారు.

రోజంతా కష్టపడ్డా అరకొర ఆదాయం..పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన బీడీ పరిశ్రమ
రోజంతా పనిచేస్తేగానీ పొట్టగడని పరిస్థితి బీడీ కార్మికులది. రోజుకు 14 గంటలు పనిచేసినా.. వచ్చే ఆదాయం వీరి కడుపు నింపదు. నిత్య కష్టంలోనూ దోపిడీ, దౌర్జన్యమే! వీరి అమాయకత్వానికి కేంద్ర నిర్ణయం ఇప్పుడు వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బీడీ కార్మికులకు పెను శాపంగా మారింది. ఈ పరిశ్రమలో ఉన్నంత అతి తక్కువ వేతనం, అధిక శ్రమ దోపిడీ ఏ పరిశ్రమలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్ని బీడీలు చుడితే వాటి లెక్క ప్రకారమే కూలి ఇస్తారు.

చిల్లర దొరక్క ఇబ్బందుల్లో బీడీ కార్మికులు
అసలే అంతంత మాత్రంగా ఉన్న బీడీ పరిశ్రమలోని ఉపాధి అవకాశాలు..పెద్దనోట్ల రద్దుతో మరింత దయనీయంగా మారాయి. నెలంతా రెక్కలు ముక్కలు చేసుకొని బీడీలు చుట్టే కార్మికులు.. చిల్లర కష్టాలతో తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. బీడీ కంపెనీల ఆర్డర్లపై బీడీలు చుట్టే కార్మికులు..ఆ కంపెనీలు ఇచ్చే నెల జీతంపైనే ఆధారపడతారు. అలాంటిది కంపెనీలు రెండు వేల నోట్లు మాత్రమే చెల్లించడంతో..చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నామంటున్న బీడీ కార్మికులు. వంద రూపాయలకే చిల్లర కరువైన ఈ పరిస్థితుల్లో..రెండు వేల నోటుకు చిల్లర తామెక్కడ నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో దాదాపు 6 లక్షల మంది బీడీ కార్మికులు
తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కరీంనగర్, జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బీడీ పరిశ్రమపై ఆధారపడే వాళ్లు ఎక్కువ. అయితే నెలంతా కష్టపడి వచ్చిన మూడు వేల రూపాయలను పట్టుకొని మార్కెట్‌కి వెళితే..చిల్లర కోసం కష్టాలు తప్పడం లేదని చెబుతున్నారు. బ్యాంకుల్లో రోజుల తరబడి వేచిచేడాల్సి వస్తుందని..ఫలితంగా ఉన్న ఉపాధిని కోల్పోతున్నామని అంటున్నారు.

దాదాపు 2 నెలలుగా అందని డబ్బులు
పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా చోట్ల పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు చెల్లింపులు నిలిపివేశాయి. కొన్నిచోట్ల 2 నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి డబ్బులు రాకపోవడంతో పిల్లల ఫీజులు, ఇంటి కిరాయిలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీడీ కార్మికులు ఆవేదన
చివరకు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునేందుకు ఇబ్బందులు ఉన్నాయంటున్నారు బీడీ కార్మికులు. పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వెళ్తే.. 2 వేలే ఇస్తున్నారని, చిల్లర ఇవ్వడం లేదని వాపోతున్నారు. పనిచేస్తేగాని పొట్టగడవని తాము పని మానుకుని... గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే.. తాము బ్రతకడం కష్టంగా ఉంటుందని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

17:51 - December 1, 2016

నిజామాబాద్ : దాచుకున్న డబ్బుల కోసం బ్యాంకుకు వెళితే.. నోటికి వచ్చినట్టు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా డబ్బులు మేం తీసుకునేందుకు బ్యాంక్ కు వెళ్ళితే సచ్చిపొమ్మని బ్యాంక్ సిబ్బంది తిడుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బు బ్యాంకులో వేసుకుని ఆ డబ్బు తీసుకోవటానికి వెళి అడిగితే మేం ఎందుకు సచ్చిపోవాలని సదరు మహిళ ఆవేదనతో ప్రశ్నించింది. ఇంట్లో ఒక్క రూపాయిలేదు..పిల్లలకు ఏం పెట్టాలని ఆవేదన వ్యక్తం చేసింది. కరెన్సీ కష్టాలతో నిజామాబాద్‌జిల్లా బోధన్‌ లో ప్రజలు రోడ్డెక్కారు. బ్యాంకుల తీరుపై మండిపడుతున్నారు. నగదుకోసం గంటల కొద్ది నిల్చుని విసుగెత్తి ఉన్న కష్టమర్లకు బ్యాంకు అధికారుల తీరు ఆగ్రహాన్ని తెప్పించింది. బోధన్‌ ఎస్‌బీహెచ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ దురుసు ప్రవర్తనతో గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. 

17:43 - December 1, 2016

సంగారెడ్డి : మూడు వారాలు దాటుతున్న పెద్దనోట్ల సమస్య వెంటాడుతూనే ఉంది. కనీస అవసరాలు తీర్చకోలేక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ ప్రజలు ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. కొన్ని బ్యాంకుల్లో మా డబ్బులు మాకు ఇవ్వండి అని కోరుతుంటే మీ ఖాతాను మూసేసుకోమని సిబ్బంది బెదిరిస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. సంగారెడ్డి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వద్ద ఖాతాదారుల కష్టాలు పడుతున్నారు ..మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి..

17:39 - December 1, 2016

ఢిల్లీ : బంగారంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుందని... అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉంటే పన్ను విధించనున్నారు. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి ప్రస్తుతం జారీ చేసిన మార్గదర్శకాలు కాదని.. గతంలో కూడా ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు.

17:36 - December 1, 2016

హైదరాబాద్ : ఒకటో తారీఖు వచ్చింది. జీతాల కోసం ఉద్యోగులు బ్యాంకుల తలుపు తడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు...సామాన్య ప్రజానీకం డబ్బుల కోసం బ్యాంకుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. ఈ వారం అంతా భారీ క్యూలైన్లు తప్పేట్లు లేదు. మరోవైపు అధికారులు మంత్రా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. కానీ... పరిస్థితి చూస్తే మాత్రం అలా కనబడటం లేదు.

నెల మొదటి వారంలో నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు
జీతాల వేళ బ్యాంకుల బాట పడుతున్న ఉద్యోగులు..బ్యాంకులను వేధిస్తున్న కరెన్సీ సరఫరా కొరత..ఈ వారం భారీగా పెరగనున్న క్యూ లైన్లు..సకల ఏర్పాట్లు చేశామంటున్న సర్కారు..పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కొంత కాలంగా రద్దీ మళ్లీ పెరుగుతోంది. జీతాల సమయం కావడంతో ఉద్యోగులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. దేశంలోని అనేక మంది ఉద్యోగులు, శ్రామికులకు ఒకటో తారీఖు నుంచి దశల వారీగా జీతాలు, వేతనాలు చెల్లిస్తారు. దీంతో బతుకు బండిని లాగేందుకు అవసరమైన ఖర్చుల కోసం వేతన జీవులు బ్యాంకులు, ఏటీఎంలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.

నెల మొదటివారం వచ్చిందంటే బ్యాంకుల్లో ఉద్యోగుల హడావిడి
సాధారణంగా నెల మొదటివారం వచ్చిందంటే బ్యాంకుల్లో ఉద్యోగుల హడావిడి కనిపిస్తుంది. ఇక మోదీ నోట్ల రద్దు నేపథ్యంలో..దేశవ్యాప్తంగా మరోసారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు కనిపించే అవకాశం లేకపోలేదు. ఉద్యోగుల రద్దీని తట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకు అధికారులు చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే
ఈ వారం అంతా నగదు కోసం వచ్చేవారి రద్దీని తట్టుకోవడం సాధ్యమయ్యే పని కాదని గణాంకాల విశ్లేషణ చూస్తే అర్ధం అవుతోంది. ఇప్పటికే సరపడా నగదు లేక అసహనంతో ఉన్న ప్రజలు బ్యాంకు సిబ్బందిని దూషిస్తున్నారని.. ఇప్పుడు కొత్తగా వేతన జీవుల డిమాండ్‌ కూడా తోడైతే ఎలాంటి సమస్యలు వస్తాయోనని బ్యాంకు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. డిసెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు ప్రజలందరినీ సంతృప్తి పరచడం అనేది కత్తిమీద సాములాంటిదేనని క్షేత్రస్థాయిలో పని చేసే బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

రూ. 500, 1000 నోట్ల రద్దుతో నగదు కొరత
మోదీ సర్కారు 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయంతో వ్యవస్థలో నగదు లభ్యత కొరత ఏర్పడి ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆంక్షలు, రద్దీ నేపథ్యంలోనూ నవంబరు 10 నుంచి బ్యాంకుల ద్వారా రోజు సగటున 12,742 కోట్ల రూపాయల నగదు వితరణలు జరుగుతున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలో నగదుకు సాధారణం కంటే కూడా 5-8 శాతం అధిక డిమాండ్‌ ఉంటోంది. ఈ లెక్కన డిసెంబరు ఒకటి నుంచి మొదలయ్యే వారంలో దాదాపు లక్ష కోట్ల నగదుకు డిమాండ్‌ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కరెన్సీ కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులకు ఈ పరిస్థితులను ఎదుర్కొవడం అంత సులభం కాదని బ్యాంకింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేవలం రూ. 2000 నోట్లు వస్తుండటంతో ప్రజలకు తప్పని తిప్పలు
కరెన్సీ కష్టాలు రాకుండా సర్కారు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లోని బ్యాంకులకు రోజూవారిగా అందాల్సిన నగదులో కేవలం 10 నుంచి 50 శాతం కరెన్సీ మాత్రమే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉన్న నగదునే సర్దేందుకు బ్యాంక్‌ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంక్‌ సిబ్బందిని ప్రజలు దుర్భాషలాడటం కనిపిస్తోంది. చాలా బ్యాంకుల్లో ఇప్పటికే 100 నోట్ల సరఫరా నిలిచిపోయింది. పెద్ద బ్యాంకు నుంచి కేవలం 2000 రూపాయల నోట్లు మాత్రమే వస్తుండటం ప్రజల కష్టాలను మరింతగా పెంచేస్తోంది. ప్రజల లావాదేవీలకు సరిపడా నగదు సరఫరా లేకపోవడమే ప్రజల కష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సరిపడా డబ్బులు లేకపోతే ప్రజలు తమ అసహనాన్ని బ్యాంకు ఉద్యోగుల పట్ల చూపించే ప్రమాదం ఉందని, రానున్న రోజుల్లో బ్యాంకు ఉద్యోగులకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు.  

17:27 - December 1, 2016

తూర్పుగోదావరి : సూర్యారావుపేట సమీపంలో భాగ్యనగర్‌ గ్యాస్‌ పైపులైను లీక్‌ కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గ్యాస్‌ లీకేజీని అదుపులోకి తెచ్చారు. అయితే ఇక్కడ గ్యాస్‌ లీక్‌కావడం ఇది రెండోసారి. మంటలు చెలరేగితే భారీ ప్రమాదం జరిగేదని... యాజమాన్యం సరైన నిబంధనలు పాటించడంలేదని స్థానికులు ఆరోపించారు. 

బంగారంపై జైట్లీ స్పందన..

ఢిల్లీ : బంగారంపై ఐటీ శాఖ ఆంక్షలపై ఆర్థిక మంత్రి జైట్లీ స్పందించారు. ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే పన్ను లేదని తెలిపారు. పన్ను మినహాయించిన డబ్బుతో బంగారం కొనుగోలు చేయవచ్చని, బంగారం వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను లేదన్నారు. పూర్తి సెక్యూర్టీతో నోట్లు తయారు చేయడం జరుగుతోందని, కొత్తనోట్ల తయారీకి కొంత సమయం పడుతుందని తెలిపారు. 

బంగారంపై కేంద్రం స్పష్టత..

ఢిల్లీ : బంగారంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. వివాహిత 500 గ్రాములు..అవివాహిత 250 గ్రాములు..పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని కేంద్రం పేర్కొంది. తాళిబొట్టుపై ట్యాక్స్ మినహాయింపునిచ్చింది. పన్ను మినహాయించిన డబ్బుతో బంగారం కొనుగోలు చేస్తే ఇబ్బంది లేదని ఐటీ శాఖ వెల్లడించింది. 

పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు లాభం - పనగరియా..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు. దేశంలో అవినీతి తగ్గుతుందని, రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలైయిందన్నారు. భూముల ధరలు 30 శాతం తగ్గాయన్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిధులకు కేంద్రం ఆమోదం..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిధులకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ. 2981 కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు ఆర్థిక శాఖ సమాచారం అందించింది. 

16:50 - December 1, 2016

శీతాకాలం రాగానే పలువురు అనారోగ్యాలకు గురవుతుంటారు. చర్మం కూడా పాడై పోతుంటుంది. చర్మం..అనారోగ్యాలకు గురికాకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికైతే జలుబు..దగ్గు...జ్వరం..కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అనారోగ్యానికి గురికాకుండా..సౌందర్యం దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని విటమిన్స్ లతో కూడిన పదార్థాలు తీసుకుంటే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

విటమిన్ బి..
విటమిన్ బి..శీతాకాలంలో ఈ విటమిన్ ప్రతొక్కరికీ అవసరం. చర్మం మృదువుగా ఉండేందుకు విటమిన్ బి కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. గుడ్లు..చేపలు..ఆకు కూరల్లో లభ్యమౌతుంది.
విటమిన్ సి...
విటమిన్ సి..ఆరెంజ్..నిమ్మతో పాటు పలు కూరగాయాల్లో లభ్యమౌతుంది. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ ఉండడంతో చర్మం కూడా పొడిబారకుండా ఉంటుంది. విటమిన్ డి..
విటమిన్ డి..
విటమిన్ డి.. పాలు..సూర్యరశ్మిలో పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి ట్యాబెట్లు కూడా అందుబాటులో కూడా ఉన్నాయి. చేపలు, వెన్న, కాలేయం, కోడిగుడ్డు నుంచి ఈ విటమిన్ లభిస్తుంది. కాడ్‌చేప కాలేయపు నూనెలో ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ ఈ..
విటమిన్ ఈ..పొడిబారిన చర్మం ఉన్న వారికి ఈ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. మాంసం..చేపలు..చింతపండుతో పాటు కూరగాయాల్లో పుష్కలంగా లభ్యమౌతుంది. సోయాబీన్స్, పొద్దు తిరుగుడు, వేరు శనగ, కుసుమ లాంటి నూనెల్లో ఈ విటమిన్ ఉంటుంది. 

విద్యుత్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించాలని, దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగులు రేపు మంత్రి జగదీష్ రెడ్డితో సమావేశమై చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 

16:37 - December 1, 2016

ఢిల్లీ : పాత పెద్దనోట్లను రద్దుచేసి 23రోజులు కొనసాగుతున్నాయి. దీనిపై సామాన్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు..ఇప్పుడు తాజాగా ఐటీ శాఖ ప్రజలను మరో సంకట స్థితిలోకి నెట్టింది..బంగారంపై ఐటీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వివాహం అయిన మహిళ వద్ద 500 గ్రాముల బంగారం..అవివాహిత మహిళల వద్ద 250 గ్రామలు.. అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా వివాహిత మహిళలు సంప్రదాయబద్ధంగా మెడలో వేసుకునే మంగళసూత్రాలపై ఐటీ శాఖ మినహాయింపునిచ్చింది. తాళిబొట్టుపై ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా తెలిపింది. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో కొనుగోలు చేసిన‌ బంగారంపై ప‌న్ను విధించే నేప‌థ్యంలో తాము తీసుకోనున్న చ‌ర్య‌ల్లో భాగంగా వార‌స‌త్వంగా వ‌చ్చిన‌, లెక్క‌చూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి ప‌న్నులు ఉండబోవ‌ని కేంద్ర ఆర్థిక ఖాల స్ప‌ష్టం చేస్తున్నట్లుగా సమాచారం..దీనిపై మహిళల వద్ద నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా వారసత్వంగా వచ్చిన బంగారంపై ఐటీ శాఖ ఏవిధమైన నిబంధనలు విధించనుందో వేచి చూడాలి. కాగా భారత దేశంలో మహిళలు ఎక్కువగా బంగారంపైనే ఖర్చుపెడుతుంటారు. ఇది కుటుంబావసరాలకు పలు విధాలుగా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. మరికొంతమంది బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

బంగారం కొనుగోలుపై ఐటీ శాఖ ఆంక్షలు..

ముంబై : బంగారం కొనుగోలుపై ఐటీ శాఖ ఆంక్షలు విధించింది. తాళిబొట్టుపై ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. పురుషుల వద్ద వంద గ్రాములకు మించి ట్యాక్స్ వర్తింపు చేయనున్నారు. అవివాహితుల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహితల వద్ద 500 గ్రాముల బంగారం..పన్ను మినహాయించిన డబ్బుతో బంగారం కొనుగోలు చేస్తే ఇబ్బంది లేదని ఐటీ శాఖ పేర్కొంది. 

16:12 - December 1, 2016

ప్రకాశం : కానిస్టేబుల్ పై ఓ రిమాండ్ ఖైదీ దాడికి యత్నించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండ్ లో చోటుచేసుకుంది. సంజీవరెడ్డి అలియాస్ బాలకృష్ణచౌదరి అనే రిమాండ్ ఖైదీ శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఖైదీ పలు దోపిడీ కేసుల్లో నిందితుడుగా వున్నాడు. ఇతను దాదాపు 60పేర్లతో చలామణీ అవుతన్నట్లుగా తెలుస్తోంది. ఓ కేసు నిమిత్తం గోప్యంగా విచారించేందుకు ఒంగోలు జైలు నుండి కడపకు తరలిస్తుండగా తప్పించుకునేందుకు యత్నించిన ఖైదీ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

అమరావతిలో మూడు సంస్థలకు భూ కేటాయింపులు..

విజయవాడ : అమరావతి రాజధానిలో మూడు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమృతవిశ్వవిద్యాలయానికి రెండు విడతల్లో 200 ఎకరాలు..రిజర్వ్ బ్యాంక్ ఇండియా కార్యాలయానికి 11 ఎకరాలు..సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు 28 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కానిస్టేబుల్ పై రిమాండ్ ఖైదీ దాడి..

ప్రకాశం : ఒంగోలు బస్టాండులో కానిస్టేబుల్ శ్రీణివాసులపై రిమాండ్ ఖైదీ అంజిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఒంగోలు జైలు నుండి కడపకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ముగిసిన టిడిపి సమన్వయ కమిటీ సమావేశం..

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సభ్యత్వ నమోదుపై చర్చ జరిగింది. ఇప్పటి వరకు 37 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, సభ్యత్వ నమోదు గడువును 15 వరకు పెంచినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 

15:41 - December 1, 2016
15:40 - December 1, 2016

హైదరాబాద్‌ : అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అములు చేయాల్సిన ప్రణాళికలపై వివిధ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. నాలాలపై ఆక్రమణల తొలగింపు, రోడ్ల విస్తరణ, చెరువుల సంరక్షణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే చార్‌మినార్‌ పరిసరాలను పాదచారులకు పరిమితం చేసే పథకం అమలును సమీక్షిస్తున్నారు. మూసీనది, హస్సేన్‌సాగర్‌, దుర్గం చెరువుల ప్రక్షాళన, శివారు మున్సిపాలిటీలకు మంచినీటి సరఫరా పైపులైన్ల విస్తరణ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. 

15:24 - December 1, 2016

సంగారెడ్డి : 23 రోజులు గడుస్తున్నా.. నగదు కష్టాలు తీరడం లేదు. వృద్ధులు, పెన్షన్‌దారులు గంటల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద బ్యాంకుల్లో వృద్ధులకు కనీస సదుపాయలు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గంటల నుండి నిలబడటంతో బీపీ షుగర్..మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ..క్యూలో నిలబడినవారికి కనీసం మంచినీరు సదుపాయం కూడా కల్పించటంలేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మనీ వున్న వారు బైట..వైట్ మనీ వున్నవారు లైన్లలో నిలబడి నానా అగచాట్లు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీ వచ్చింది పలు రకాల ఖర్చులు వుంటే నేపథ్యంలో బ్యాంకు తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. 

15:15 - December 1, 2016

యంగ్ హీరో 'నిఖిల్' తో మరో యంగ్ హీరో 'నితిన్' మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు యంగ్ స్టర్స్ కాంబినేషన్ లో రానుంది మల్టీస్టారర్ మూవీ మాత్రం కాదండోయి. 'నిఖిల్' మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. క్రిటికల్ సిట్యూవేషన్ లో కూడా ఈ యంగ్ హీరో 'ఎక్కడిపోతావు చిన్నవాడా' సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు. ఈ మూవీ సక్సెస్ తో నిర్మాతలు 'నిఖిల్' వెంటపడుతున్నారు. తనతో సినిమా చేసి క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో 'నితిన్', 'నిఖిల్' తో మూవీ నిర్మించబోతుండడం వెరీ స్పెషల్ గా మారింది. హ్యట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న 'నిఖిల్' స్పీడ్ కి 'శంకరాభరణం' ప్లాప్ అడ్డకట్టవేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ఈ యంగ్ హీరో మరోసారి తనదైన శైలిలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి భిన్నమైన మూవీతో సర్ ప్రైజింగ్ సక్సెస్ కొట్టాడు.

నిఖిల్ కోసం క్యూ..
దాంతో ఒక్కసారిగా నిర్మాతలు 'నిఖిల్' తో సినిమాలు నిర్మించడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 'దిల్' రాజు ఈ యంగ్ హీరోకి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాడు. 'దిల్' రాజు తో పాటు అభిషేక్ పిక్చర్ కూడా 'నిఖిల్' తో ఓ మూవీని అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు లేటేస్ట్ గా 'నితిన్' కూడా ఈ యంగ్ హీరో తో మూవీ చేయడానికి కమిట్ మెంట్ తీసుకున్నట్లు వినికిడి. ఇప్పటికే 'నితిన్ - నిఖిల్' మధ్య చర్చలు జరిగాయని, ఇద్దరూ కలసి ఓ ప్రాజెక్టు చేయడానికి అంగీకారం కుదిరిందని అంటున్నారు. కాగా, పనిలో పనిగా తన పారితోషికాన్ని 'నిఖిల్' భారీగా పెంచేసినట్టు సమాచారం. 

15:15 - December 1, 2016

గుంటూరు : 23 రోజులుగా డబ్బుల్లేక అల్లాడుతున్న ప్రజలకు కొన్ని బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. డబ్బులున్నా.. నో క్యాష్‌ బోర్డులు పెడుతుండటంతో బ్యాంకు అధికారుల తీరుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలోని స్టేట్‌ బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో నగదు ఉన్నా.. నో క్యాష్‌ బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఒకటవ తారీఖు కావడంతో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మందడం గ్రామంలోని బ్యాంకు డబ్బులు తరలించారంటూ రోడ్డుపై బైఠాయించి.. ఆందోళన చేశారు. దీంతో సచివాలయంలో కేబినెట్‌ సమావేశానికి హాజరవుతున్న అధికారుల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలియగానే జిల్లా రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ బ్యాంకు అధికారులు, గ్రామస్తుల వద్దకు వచ్చి.. వారికి కొంత మొత్తంలో నగదు ఇచ్చేందుకు ఒప్పించారు. గ్రామస్తుల ఆందోళనతో సచివాలయానికి తరలించిన డబ్బును వెంటనే వెనక్కి తీసుకొచ్చారు. కూలీ పనులు చేసుకునే వారికి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సామాన్యులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనం మండిపడ్డారు.

 

15:11 - December 1, 2016

ముంబై : ఫేస్‌బుక్‌ కంటే వేగంగా జియో అభివృద్ధి చెందుతోందన్నారు ముకేష్‌ అంబానీ. వేగంగా సాంకేతికతను అందించే సంస్థ జియో అన్నారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకే లాంచింగ్‌ ఆఫర్‌ ఇచ్చామని చెప్పారు. కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకొచ్చామన్నారు. 50 మిలియన్ల వినియోగదారుల సంఖ్యను జియో అధిగమించిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉచిత ఫోన్‌ కాల్‌ సదుపాయాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రతిరోజూ 6 లక్షలమంది వినియోగదారులు జియోలో చేరుతున్నారని అంబానీ తెలిపారు. 

15:10 - December 1, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. నోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్ర..త్వరలో ఏపీలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు..నోట్ల రద్దు..క్యాష్ లెస్ లావాదేవీలపై కేంద్రం సీఎం చంద్రబాబును కన్వీనర్ గా నియమకం వంటి పలు కీలక అంశాలపై మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం.కాగా రాజధాని అమరావతిలో ఇదే తొలి కేబినెట్ సమావేశం కావటం విశేషం.

15:00 - December 1, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు తాము చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఏ నిబంధన ప్రకారం చర్చకైనా తాము సిద్ధమేనని, చర్చ అనంతరం ఓటింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై చాలా రోజులవుతున్నా ఎలాంటి చర్చ జరగకపోవడంపై కేంద్ర మంత్రి అనంతకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చర్చకు విపక్షాలే అడ్డు తగులుతున్నాయని, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సభ్యుల గందరగోళం మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్ లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.

14:54 - December 1, 2016

ఢిల్లీ : ఆర్థిక బిల్లులు, నగదు బిల్లులపై రాజ్యసభలో తీవ్ర వివాదం జరిగింది. ఆర్థిక బిల్లులను కూడా నగదు బిల్లులంటూ డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ రూలింగ్‌ ఇస్తున్నారంటూ కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించడం రభసకు దారితీసింది. సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారిపై నిందలు మోపడం తగదని అధికారపక్ష సభ్యులు వారించారు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. ఆర్థిక బిల్లులను కూడా నగదు బిల్లుగా మారుస్తున్నారని..డిప్యూటీ చైర్మన్‌ రూలింగ్‌లు ఏకపక్షంగా ఉంటున్నాయి కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.దీనికి నిబంధనల మేరకే ఆర్థిక, నగదు బిల్లులు విభజన వుంటుందని మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వచ్చే ఏడాది ఎన్నికలు రావచ్చు - జగన్..

కృష్ణా : సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌రో రెండేళ్లు మాత్ర‌మే అధికారంలో ఉంటుంద‌ని, దేవుడు గ‌ట్టిగా ద‌యత‌లిస్తే వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు రావ‌చ్చని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. జిల్లా బుద్ధాల‌పాలెంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. 

అప్పటిదాక జియో సేవలు ఉచితం - అంబానీ..

ముంబై : వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో సేవలు ఉచితంగా ల‌భిస్తాయ‌ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ప్ర‌క‌టించారు. నెంబరు పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని తెలిపారు. 

శుక్రవారానికి రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : గురువారం ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరయ్యారు. పలుమార్లు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు తిరిగి ప్రారంభమైంది. తిరిగి ప్రారంభమైనా సభలో విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన కొనసాగించాయి. దీనితో శుక్రవారానికి సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. 

రాజ్యసభలో అదే గందరగోళం..

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. సభలో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. 

14:06 - December 1, 2016
14:05 - December 1, 2016

 ఆకతాయిల నుంచి వేధింపులు, దాడులను అమ్మాయిలు ఎలా ఎదుర్కోవాలని విషయాలను ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

13:58 - December 1, 2016

కామారెడ్డి : చేనేత కార్మికులను ఆదుకోవాలని సీపీఎం మహాజన పాదయాత్ర బృందం సభ్యులు రమణ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర 46 వ రోజుకు చేరుకున్నారు. పాదయాత్ర బృందం గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటుంది. సీపీఎం బృందానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిసుస్తుంది. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:53 - December 1, 2016

ఫేస్ బుక్ కంటే వేగంగా జియో - అంబానీ..

ఢిల్లీ : ఫేస్ బుక్ కంటే వేగంగా జియో వృద్ధిలో ఉందని అంబానీ పేర్కొన్నారు. ఫేస్ బుక్, వాట్సప్, స్కైప్ కంటే వేగంగా జియో వృద్ధిలో ఉందని, వేగంగా సాంకేతికతను అందించే సంస్థ జియో అని తెలిపారు. తమను నమ్మినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, ఇది తమ ఖాతాదారుల విజయమన్నారు. 

13:51 - December 1, 2016

నగదు రహిత లావాదేవీలపై బాబు సమీక్ష..

విజయవాడ : వెలగపూడి నగదు రహిత లావాదేవీలపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాంకర్లకు..అధికారులు..ఉద్యోగులు..ప్రజలు సహకరించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. నగదు కోసం ఎదురు చూడకుండా వేరే మార్గాల వైపు మళ్లాలని, బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. 

13:46 - December 1, 2016

కృష్ణా : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. బందర్ పోర్టు భూ నిర్వాసితులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట భూములకు కాల్వల నీరు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు రాకుండా చేశారని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవడానికి వీలు కల్పించడం లేదని చెప్పారు. బందర్ పోర్టుకు మొదటగా ఐదు వేల ఏకరాలు సేకరించారని...  తర్వాత 30 వేల ఎకరాలు వసూలు చేశారని.. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మనకు ఇష్టం లేకన్నా.. మన భూములు భూమి తీసుకుని.. అందులో పావు భాగం తిరిగి ఇస్తారని చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. రాజధానికి భూముల సేకరణ విషయంలో కూడా ప్రజలు, రైతులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదన్నారు. బాబు పాలనకు మూడేళ్లు పూర్తి అయ్యాయని... ఇంక మిగిలింది రెండేళ్లని తెలిపారు. రాబోయేది మన ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వమని చెప్పారు. అప్పుడు ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:41 - December 1, 2016

హ్యట్రిక్స్ సక్సెస్ లతో 'నాగార్జున' ఫుల్ హ్యపీలో ఉన్నాడు. ఈ ఎడాది సంక్రాంతికి కానుక రిలీజైన సోగ్గాడే చిన్నినాయన విజయం ఈ రొమాంటిక్ కింగ్ కి మధురానుభూతినిచ్చింది. 50ప్లస్ లో 'నాగ్' 'సోగ్గాడి'గా యూత్ ని సైతం మెస్మరైజ్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇక 'ఊపిరి'తో మరో విజయం అందుకున్నాడు. 'నాగార్జున' రొమాంటిక్ స్టార్ గా ఎంత ఫేమ్ అయ్యాడో భక్తి చిత్రాలు చేసి అదే స్థాయిలో సక్సెస్ లు అందుకున్నాడు. 'అన్నమయ్య'గా, 'శ్రీరామదాసు'గా అద్భుత విజయాలు అందుకున్న 'నాగ్' ఇప్పుడు 'ఓం నమో వెంకటేశాయ'తో మరోసారి అలాంటి విజయాన్ని పునరావృత్తం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడే 'నాగ్' ఆడియన్స్ చిన్నపాటి నిరాశ కలిగిస్తున్నాడు.

సంక్రాంతి..
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడంట. అయితే ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు వినిపిస్తోంది. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడం ఒక కారణం అయితే బెస్ట్ గ్రాఫిక్స్ అందించాలనేది మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో 'ఓం నమో వెంకటేశాయ' మూవీని ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో 'అనుష్క ప్రగ్యా జైస్వాల్', 'విమలా రామన్' ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 

13:36 - December 1, 2016
13:35 - December 1, 2016

భూపాలపల్లి : జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీలో మావోయిస్టులు బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డారు. టాటా మ్యాజిక్ డ్రైవర్ కార్తీక్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. బోదాపురం గ్రామంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. గెరిల్లా సైన్యం వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలంటూ పోస్టర్లలో విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:32 - December 1, 2016

మలయాళంలో 'పులి మురుగన్' గా రికార్డ్స్ క్రియేట్ చేసిన 'మోహన్ లాల్' తెలుగులో 'మన్యం పులి'గా రానున్నాడు. మాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ 100కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రేపు తెలుగులో రిలీజ్ కానుంది. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మలయాళం స్టార్ 'మోహన్ లాల్' ఒకరు. 5పదుల వయస్సు దాటిన కూడా నటుడు మాలీవుడ్ లో ఇప్పటికి నెంబర్ వన్ స్టార్ గా వెలిగిపోతున్నాడు. లేటేస్ట్ గా తన కొత్త మూవీ 'పులి మురుగన్' తో 'మోహల్ లాల్' మలయాళ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. మలయాళ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'పులి మురుగన్' మాలీవుడ్ లో 100 కోట్ల వసూల్ చేసిన తొలి సినిమా రికార్డ్ కెక్కింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 'కమలినీ ముఖర్జీ' హీరోయిన్ గా..జగపతిబాబు మెయిన్ విలన్ గా నటించాడు. డిసెంబర్ 2 న ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 'జనతా గ్యారేజ్' లో 'మోహన్ లాల్' నటించడం..ఆ మూవీ భారీ హిట్టు కావడం 'మన్యం పులి'కి కలిసొచ్చే విషయం. ఈ మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

13:23 - December 1, 2016
13:22 - December 1, 2016
13:19 - December 1, 2016
13:18 - December 1, 2016

టీఆర్ఎస్ సర్కార్ మాయ చేస్తోంది - తమ్మినేని..

కామారెడ్డి : బీబీపేటకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బృంద రథసారధి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మాయ చేస్తోందని, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు కార్మికుల తరపున సీపీఎం పోరాడుతుందన్నారు. మోడీకి పెట్టుబడిదారులు, కేసీఆర్ కు కాంట్రాక్టర్లు..ఫార్మాసిస్ట్ కంపెనీలు కావాలన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, బీడీ కార్మికులకు ఫించన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.

11 మంది యువతులను మోసం చేసిన కానిస్టేబుల్..

రంగారెడ్డి : పెళ్లి పేరిట 11 మంది యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ హరిచరణ్ తేజపై మంచాల పీఎస్ లో కేసు నమోదైంది. వరంగల్ లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు పెళ్లి చేసుకబోయే యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మంత్రి పీతలకు అందని ఆహ్వానం..

పశ్చిమగోదావరి : ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మంత్రి పీతల సుజాతకు ఆహ్వానం అందలేదు. 

13:08 - December 1, 2016

'మహేష్ బాబు' కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే. ఎడాదిలో కనీసం రెండుసార్లు ఫ్యామిలీ తో కలిసి ఈ స్టార్ ఫారెన్ టూర్స్ వేస్తుంటాడు. అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న ఫంక్షన్ కూడా ప్రిన్స్ మిస్ కాడు. అలాగే ఫ్యామిలీ వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడంలో కూడా సూపర్ స్టార్ స్పెషాలిటీ సూపర్ అంతే. 2016 పూర్తి కావచ్చింది. ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకో నెల ఉంది. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి న్యూఇయర్ అంటే వెకేషన్స్, టూర్స్, ఎంజాయ్మెంట్స్ కంపల్సరీ. అలాంటిది సినీ స్టార్స్ అయితే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ 'మహేష్' సింపుల్ గా తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నాడట. కొత్త ఏడాది కోసం 'మహేష్ బాబు' భార్య 'నమ్రత', కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఈసారి యూకే ట్రిప్ ప్లాన్ చేశాడట. లండన్ తో పాటు పలు కంట్రీస్ చుట్టేయనున్నాడని తెలుస్తోంది. క్రిస్మస్ కి లండన్ చేరుకుని న్యూయర్ వరకూ అక్కడే ఉంటాడట. టోటల్ గా 10 రోజుల పాటు యూకే వెకేషన్ టూర్ ప్లాన్ చేశాడట. అనంతరం వచ్చీ రాగానే 'మురుగదాస్' తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నాడట.  

13:04 - December 1, 2016

'నేను శైలజ' మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన 'కీర్తి'కి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తరువాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఓమ్లీ బ్యూటీ 'నాని'తో 'నేను లోకల్' మూవీ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే కేవలం రెండు సినిమాలతోనే 'కీర్తీ' టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ని దక్కించుకున్నట్లు వినికిడి. హీరోయిన్ గా 'కీర్తి సురేష్' రైజింగ్ లో వుంది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫస్ట్ ఛాయిస్ 'కీర్తి'కే ఇస్తున్నారు.

గ్లామరస్..
తన తోటి హీరోయిన్లు లిమిట్ లేకుండా గ్లామరస్ గా కనిపించడానికి రెడీ అంటే 'కీర్తి' మాత్రం గ్లామర్ విషయంలో లిమిట్ దాటడం లేదు. అయినా సరే 'కీర్తి'ని క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. తమిళ్ లో కూడా 'కీర్తి సురేష్' హవా మొదలైంది. అక్కడ కూడా టాప్ హీరోలతో జత కడుతోంది. 'విజయ్' తో 'భైరవ' ఫినిష్ చేసిన ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ 'సూర్య', 'కార్తీ'లతో నటించే ఛాన్స్ అందుకుంది. 'సింగం' తరువాత 'సూర్య' చేయబోయే కొత్త సినిమాలో ఈ చెన్నై చిన్నదాన్ని హీరోయిన్ తీసుకున్నారు. ఇక 'సూర్య', తమ్ముడు 'కార్తీ' కొత్త సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు. మొత్తానికి సౌత్ న్యూ స్టార్ హీరోయిన్ 'కీర్తి సురేష్' కీర్తీ వెలిగిపోనుంది.

13:02 - December 1, 2016

హైదరాబాద్ : సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ బాలీవుడ్‌ బ్యూటీ హేజిల్‌ కీచ్‌ సంగీత్‌ వేడుక వైభవంగా జరిగింది. భారత మాజీ క్రికెటర్లు,టీమిండియా టెస్ట్‌ టీమ్‌ సభ్యులు,  బాలీవుడ్‌ సెలబ్రెటీలతో పాటు.....ఇంగ్లండ్‌ క్రికెటర్లు సైతం సంగీత్‌కు హాజరయ్యారు.  
పంజాబీ పెళ్లికొడుకు గెటప్‌లో యువీ 
సంగీత్‌ వేడుకలో బ్లాక్‌ వెల్వెట్‌ డిజైనర్‌ షేర్వాణీతో యువీ పంజాబీ పెళ్లికొడుకు గెటప్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవగా....హేజిల్‌ గోల్డెన్‌ బోర్డర్‌ వైట్‌ లెహంగాలో మెరిసిపోయింది.మరికొద్దిసేపట్లో చంఢీగర్‌లో యువరాజ్‌ నివాసంలో పంజాబీ సాంప్రదాయం పద్దతిలో పెళ్లి జరుగనుంది. రేపు హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి యువీ-హేజిల్‌ వివాహమాడనున్నారు. మొహాలీ టెస్ట్‌ ముగిసిన వెంటనే భారత క్రికెట్‌ టెస్ట్‌ జట్టు సభ్యులు సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌-బాలీవుడ్‌ బ్యూటీ హేజిల్‌ కీచ్‌ సంగీత్‌ వేడుకకు హాజరయ్యారు. సంగీత్‌లో యువరాజ్‌ సింగ్‌తో పాటు విరాట్‌ కొహ్లీ చేసిన బాంగ్రా డ్యాన్స్‌ మొత్తం వేడుకకే హైలైట్‌గా నిలిచిపోయింది. భారత క్రికెటర్లు సైతం స్టెప్పులేసి సందడి సందడి చేశారు.

 

12:57 - December 1, 2016
12:56 - December 1, 2016
12:53 - December 1, 2016

మెదక్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  విమర్శించారు. మంత్రి హరీష్‌రావుకు పేదల భూములను లాక్కోవడంలో ఉన్న ఆసక్తి.. వారి బతుకులను బాగు చేయడంలో లేదని తమ్మినేని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా 45వ రోజు  సిద్దిపేట జిల్లా ధర్మారంలో  ఆత్మహత్య చేసుకున్న బాలయ్య కుటుంబాన్ని తమ్మినేని బృందం పరామర్శించింది. 
పెద్దనోట్ల రద్దుతో రైతులు తీవ్ర ఇబ్బందులు : తమ్మినేని
పెద్దనోట్ల రద్దు నిర్ణయం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా ధర్మారంలో తమ్మినేని బృందం పర్యటించింది. ధర్మారంలో అప్పులపాలై.. భూమి అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకున్న బాలయ్య, గాలయ్య కుటుంబాన్ని తమ్మినేని పరామర్శించారు. బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులను, పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తున్నాయని తమ్మినేని మండిపడ్డారు.  మంత్రి హరీష్‌రావుకు భూములు లాక్కోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల బతుకులపై లేదని తమ్మినేని దుయ్యబట్టారు. 
తమ్మినేని లేఖపై స్పందించని సీఎం కేసీఆర్ : బి.వెంకట్ 
ప్రజా సమస్యలపై 38 లేఖలు రాసినా ఇంతవరకు సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదని పాదయాత్ర కోఆర్డినేటర్‌ బి. వెంకట్‌ అన్నారు. కుమార్తెను మంత్రిని చేసేందుకు  కేసీఆర్‌ బీజేపిని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 
పాదయాత్ర 1160 కి.మీ పూర్తి 
మహాజన పాదయాత్ర 45వ రోజు సిద్దిపేట జిల్లా దోర్నాల వద్ద ప్రారంభమై.. సాయంత్రం కామారెడ్డి జిల్లాలో ప్రవేశించింది.  ఇప్పటివరకు యాత్ర 1160 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.  పాదయాత్ర బృందానికి అడుగడుగునా.. ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోంది.  ఇప్పటికే 400 గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందం.. ప్రజల సమస్యలను ఆలకిస్తూ ముందుకు సాగుతోంది. ధర్మారంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబంపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. బాలయ్య కుటుంబం మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. అవి ప్రభుత్వ హత్యేలే అని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరవు సాయంపై తమ్మినేని సీఎంకు మరో లేఖ రాశారు. 

 

12:47 - December 1, 2016

విశాఖ : ఒకప్పుడు ఒకటో తారీఖు జీతాల కోసం ఎదురుచూసే మధ్య తరగతి ప్రజలు...ఇప్పుడు ఒకటో తేదీ అంటే భయపడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ప్రజలను వీడటం లేదు. ఇంటి అద్దె ఎలా కట్టాలి, కిరాణా సరుకులు ఎలా తెచ్చుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. అమ్మో ఒకటో తారీఖు అంటున్న విశాఖనగరంలోని మధ్యతరగతి మహిళల పరిస్థితులను వీడియోలో చూద్దాం....

 

12:47 - December 1, 2016

అసలే పెద్దనోట్ల రద్దు..కుదేలైన వ్యాపారాలు...ఈగలు..దోమలు కొట్టుకుంటున్న పలువురు వ్యాపారులు మోసాలకు పాల్పడే పనిలో పడిపోయారు. కొలతల్లో మోసాలు చేస్తూ వినియోగదారులను నిండే ముంచేస్తున్నారు. ఇలా చేస్తున్న వ్యాపారులపై నేరుగా వెళ్లి కేసు పెట్టవచ్చు. మోసం చేసిన దుకాణదారుడికి శిక్ష పడుతుంది. వినియోగదారులను మోసం చేస్తే ఐపీసీ సెక్షన్ 264..బరువు..పొడవు..కెపాసిటినీ తగ్గించి మోసాలు చేస్తే ఐపీసీ సెక్షన్ 265..తప్పుడు తూనికలు..కొలతలు కలిగి ఉంటే ఐపీసీ సెక్షన్ 266 ఉంటాయి. కేసు నిర్ధారణ అయితే వ్యాపారికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తారు. వ్యాపారి మోసాన్ని బట్టి శిక్ష..జరిమాన విధించే అవకాశాలున్నాయి. 

12:44 - December 1, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం అయింది. సభ ప్రారంభంగానే విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. స్పీకర్ వారించినా వినలేదు. దీంతో స్పీకర్ అమిద్ అన్సారీ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

12:40 - December 1, 2016

పాత నోట్లు తెస్తే కొత్త కరెన్సీ...బెజవాడలో బ్యాచ్ లు రంగంలోకి దిగాయి..రెండు కోట్ల రూపాయలున్నాయి..పాతనోట్లు తెస్తే కొత్త కరెన్సీ..

కమిషన్ పేరిట బ్యాచ్ లు పుట్టిముంచే ప్లాన్ లు చేస్తున్నాయి. నోట్ల రద్దుతో కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే నోట్ల మార్పిడి చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలు మోసాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తనోట్లు ఇస్తాం..పాత నోట్లు తీసుకరావాలంటూ ప్రచారం చేస్తున్నారు. పాతనోట్లతో వస్దే దోచేందుకు ఓ బ్యాచ్ ప్లాన్ చేసింది. ఈ బెజవాడ బ్యాచ్ ను పోలీసులు పట్టుకోవడంతో గుట్టురట్టైంది. పక్కా సమాచారంతో 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిని ఎలా దోచుకోవడానికి ప్రయత్నించారు ? తదితర వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:37 - December 1, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై లోక్ సభలో గందరగోళం నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్షాలు అంగీకరించాయి. అయితే ఓటింగ్ ద్వారానే చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. అందుకు అధికార పక్షం నిరాకరించింది. అధికార, ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత వారించినా సభ్యలు వినలేదు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను రేపటికి వాయివా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:27 - December 1, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నోట్ల రద్దుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే విపక్షాలు ఆందోళన చేస్తుంటే సభకు హాజరైన ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉండిపోయారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత నోట్ల రద్దుకై చర్చ చేపడతామని అధికార పక్షం తెలిపింది. కానీ విపక్షాలు మాత్రం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో చైర్మన్ సభను పావుగంటపాటు వాయిదా వేశారు. అంతకముందు పెద్దనోట్లు రద్దు అంశంపై కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ మాట్లాడారు. తాము నల్లధనానికి వ్యతిరేకమని, కానీ నోట్ల రద్దు అంశంపై తాము మాట్లాడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. విపక్షాలు మాట్లాడే అంశాలు ప్రధాన మంత్రి వినాలని కోరుకుంటున్నట్లు, కానీ నల్లధనం..నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి బయట, బీజేపీ ఎంపీలతో మాట్లాడడం జరుగుతోందన్నారు. నల్లధనం అంశంపై విపక్షాలపై ప్రధాని పలు ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

 

లోక్ సభలో గందరగోళం..వాయిదా..

ఢిల్లీ : లోక్ సభలో పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని అధికారపక్షం పేర్కొంది. కానీ దీనిపై ఓటింగ్ తో కూడిన చర్చ నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

రాజ్యసభకు హాజరైన మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభకు హాజరయ్యారు. పెద్దనోట్లు రద్దు అంశంపై కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ మాట్లాడుతున్నారు. తాము నల్లధనానికి వ్యతిరేకమని, కానీ నోట్ల రద్దు అంశంపై తాము మాట్లాడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. విపక్షాలు మాట్లాడే అంశాలు ప్రధాన మంత్రి వినాలని కోరుకుంటున్నట్లు, కానీ నల్లధనం..నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి బయట, బీజేపీ ఎంపీలతో మాట్లాడడం జరుగుతోందన్నారు. నల్లధనం అంశంపై విపక్షాలపై ప్రధాని పలు ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. 

సైనా విజయం..

మకావు ఓపెన్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించారు. ఇందోనేషియా క్రీడాకారిణి దివా ఆయుస్తిన్ పై సైనా గెలుపొందారు. 

11:58 - December 1, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. నగ్రోటా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు లోక్ సభ నివాళి అర్పించింది. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన అంశాన్ని సభల్లో విపక్ష సభ్యులు లేవనెత్తారు. విచారణ జరిపించాలని సభ్యులు డిమాండ్ చేశారు. బెంగాల్ విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. విమానం బయలుదేరే సమయంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ సభ్యురాలు మాయావతి డిమాండ్ చేశారు. విమాన ప్రమాద ఘటన విషాదకరమన్నారు. విచారణ జరిపించాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. 
ప్రమాద ఘటనపై రాజ్యసభలోనూ చర్చ
పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. విమానాల్లో ఇంధనం ఎంతుందో సమాచారం ఉందని, ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు. విమానంలో ప్రయాణించే వారి క్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:38 - December 1, 2016
11:37 - December 1, 2016
11:33 - December 1, 2016

తూర్పు గోదావరి : జిల్లాలో విషాదం నెలకొంది. ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రాజానగరంలోని జీఎస్ ఎల్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఎంబిబిఎస్ చదువుతోంది. రాత్రి కళాశాల భవనంపై నుంచి కిందికి దూకింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

బెంగాల్ విమాన ప్రమాదంపై విచారణ - జయంత్ సిన్హా..

ఢిల్లీ : విమానంలో ప్రయాణించే వారి క్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని రాజ్యసభలో గురువారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. విమానాల్లో ఇంధనం ఎంతుందో సమాచారం ఉందని, ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు. 

11:24 - December 1, 2016

హైదరాబాద్ : మలక్ పేట మిర్చిమార్కెట్ లో రైతులు ఆందోళన చేట్టారు. అన్ లైన్ లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డు కార్యాలయంపై రైతులు దాడి చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. మార్కెట్ యార్డు గేట్లు మూసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజ్యసభలో బెంగాల్ విమాన ప్రమాదం..

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం ప్రారంభమైన సభలో విపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ సభ్యురాలు మాయావతి డిమాండ్ చేశారు. విమాన ప్రమాద ఘటన విషాదకరమని, విచారణ జరిపించాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. 

పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలూ ప్రారంభమయ్యాయి. నగ్రోటా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు లోక్ సభ నివాళి అర్పించింది. బెంగాల్ విమాన ప్రమాదంపై విచారణ జరిపించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. విమానం బయలుదేరే సమయంలో ఇంధనం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందిన అనుమానం వ్యక్తం చేసింది.

11:15 - December 1, 2016

చెన్పై : తమిళనాడులో విషాదం నెలకొంది. తిరుచ్చిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. తిరుచ్చి జిల్లా మురుగమ్ గ్రామంలోని బాణసంచా, జిలెటెన్ టిక్స్ తయారీ పరిశ్రమలో తెల్లవారు జామున భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలో పని చేస్తున్న పది మంది కార్మికులు మృతి చెందారు. కార్మికుల మృతదేహాలు చెల్లాచెదరయ్యాయి. మృతుల శరీర భాగాలు పరిశ్రమ వెలుపల ఉన్న రోడ్డుపై పడ్డాయి. మరికొంతమందికి గాయాలయ్యాయి. పరిశ్రమలో 25 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తోంది. మంటలను పూర్తిగా ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:06 - December 1, 2016

ఢిల్లీ : పార్లమెంట్ లో విపక్షాలు భేటీ అయ్యాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు చర్చించారు.  పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే రోజు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పార్లమెంట్ లో విపక్షాల సమావేశాలు..

ఢిల్లీ : పార్లమెంట్ లో విపక్షాలు సమావేశమయ్యాయి. పెద్దనోట్ల రద్దు..ఇతరత్రా అంశాలపై పార్లమెంట్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగుల వేతన సమస్యలను లేవనెత్తాలని విపక్షాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

మావోయిస్టుల బాంబ్ బ్లాస్టింగ్..

జయశంకర్ : జిల్లా వెంకటాపరం మండలం విజయపురి కాలనీలో మావోయిస్టులు బాంబ్ బ్లాస్టింగ్ కు పాల్పడ్డారు. ఓ డ్రైవర్ కార్తీక్ కు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బోదాపురం గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలిసిన పోస్టర్లు తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గెరిల్లా సైన్యం వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలంటూ పోస్టర్లలో విజ్ఞప్తులు చేశారు. 

అర్బన్ మహిళా పీఎస్ డీఎస్పీపై ఆరోపణలు..

గుంటూరు : అర్బన్ మహిళా పీఎస్ డీఎస్పీ కమలాకర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు కేసులు బనాయించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సీఎం కార్యాలయం, ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆరోపణలపై దర్యాప్తుకు అర్బన్ ఎస్పీ త్రిపాఠి ఆదేశించారు. ఇద్దరు ఏఎస్పీలకు విచారణ బాధ్యతలు అప్పగించారు. 

22వ రోజు నోట్ల కష్టాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. నేటికి 22 రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఉదయం నుండే బ్యాంకులు..ఏటీఎంల ఎదుట ప్రజలు క్యూలు కడుతున్నారు. 

మలక్ పేట మిర్చీ మార్కెట్ పై రైతుల దాడి..

హైదరాబాద్ : మలక్ పేట మిర్చి మార్కెట్ లో రైతులు ఆందోళన నిర్వహించారు. ఆన్ లైన్ అమ్మకాల్లో అధికారులు మోసం చేస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహించారు. కార్యాలయంపై రైతులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మార్కెట్ యార్డ్ గేట్లను మూసివేశారు.

 

శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండైన విమానం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండైంది. లక్నో మీదుగా స్పెస్ జెట్ విమానం వారణాసి వెళ్లాల్సి ఉంది. వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమానం చేరుకుంది. 

పొగమంచుతో ఢీకొన్న వాహనాలు..

ఉత్తర్ ప్రదేశ్ : మధురలోని యుమన ఎక్స్ ప్రెస్ హైవే ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు వల్ల ఒకదానివెంట ఒకటి వాహనాలు ఢీకొన్నాయి. మొత్తం 12 వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పది మందికి పైగా గాయాలయ్యాయి.

కరుణ ఆరోగ్యం నిలకడ - వైద్యులు...

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరుణా ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కొంతకాలంగా కరుణానిధి అలర్జీతో బాధ పడుతున్నారని, న్యూట్రిషన్, హైడ్రేషన్ లకు సంబంధించిన చికిత్స చేయడం జరుగుతోందని తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స చేస్తామని పేర్కొన్నారు. 

09:39 - December 1, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, బీజేపీ నేత ఎస్.వినయ్ కుమార్, సీపీఎం నాయకురాలు రమాదేవి పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదైన అమలులో లోపాలున్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:34 - December 1, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి 23 రోజులవుతున్నా నగదు కష్టాలు తీరడం లేదు. డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల మందు ప్రజలు భారీ క్యూ కడుతున్నారు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎమ్ లు ఖాళీ అవుతున్నాయి. పలు ఏటీఎం సెంటర్ల ముందు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పని చేయని ఏటీఎంలతో జనం విసుగుచెందుతున్నారు. బ్యాంకుల వద్ద వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఫించన్ దారులకు తిప్పలు తప్పడం లేదు. నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకుల్లో అరకొరగా నగదు పంపిణీ 
చేస్తున్నారు. రూ. 2 వేల నోటుకు చిల్లర లభించక జనం ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:24 - December 1, 2016

పెద్ద నోట్ల రద్దు లారీలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు అన్నారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకుని రాకపోవడంతో రవాణా రంగం అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. సగం లారీలు షెడ్డుల్లోనే వుంటున్నాయి. కరెన్సీ కొరత కారణంగా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోవడంతో సరకు రవాణా సగానికి సగం పడిపోయింది. దీంతో లారీలకు కిరాయిలు దొరకడం లేదు. ఫలితంగా డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందంటున్నారు లారీ యజమానులు. మరోవైపు కిరాయిలు తగ్గిపోవడంతో బ్యాంక్ లకు కట్టాల్సిన లోన్ లు, ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుతో ట్రాన్స్ పోర్ట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈశ్వరరావు చర్చంచారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

ఏటీఎంలు, బ్యాంకుల మందు భారీ క్యూ

హైదరాబాద్ : పెద్ద నోట్టు రద్దు చేసి 23 రోజులవుతున్నా నగదు కష్టాలు తీరడం లేదు. డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల మందు ప్రజలు భారీ క్యూ కడుతున్నారు. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎమ్ లు ఖాళీ అవుతున్నాయి. 

 

09:17 - December 1, 2016

పెద్ద నోట్లు రద్దు..సామాన్యుడిని వణికించేస్తోంది. పేదోడి సమస్య వర్ణనాతీతంగా ఉంది. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వాహనదారులకు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ కట్టే బాధ తప్పినట్లైంది. చిల్లర సమస్స తలెత్తడం..పలు టోల్ గేట్ల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తడంతో కేంద్రం కళ్లు తెరిచింది. వెంటనే టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు..కొన్ని రోజుల వరకు ఇది అమల్లోఉ ఉంటుందని ప్రకటించడంతో వాహనదారులు ఊరట చెందారు. నవంబర్ 11వ తేదీ అర్ధరాత్రి నుండి టోల్ ట్యాక్స్ ను తాత్కాలికంగా రద్దు చేసిన అనంతరం పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరిగా డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి వరకు అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన గడువు ముగిసిపోవడంతో రేపటి నుండి టోల్ ట్యాక్స్ కట్టాలా ? అని వాహనదారులు ఆలోచిస్తున్నారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి అదే నెల 15 వరకు రూ. 500 పాత నోట్లతో టోల్ ట్యాక్స్ చెల్లింపునకు అవకాశం కల్పించారు. మరి మళ్లీ చిల్లర సమస్య ఏర్పడుతుందా ? ట్యాక్స్ రద్దు పొడిగిస్తారా ? అనేది వేచి చూడాలి. 

09:09 - December 1, 2016

రామ్ గోపాల్ వర్మ..వివాదాస్పదాలకు కేరాఫ్. ఆయన ఏదీ చేసినా సంచలనమే. ట్విట్టర్ లో పలు వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఆయన చేసే సినిమాలు కూడా వివాద్సాపదమౌతుంటాయి. తాజాగా 'వంగవీటి' సినిమా తీస్తున్నానంటూ 'వర్మ' ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ జరిపే సమయంలో 'వర్మ'కు కొన్ని బెదిరింపులు వచ్చినట్లు టాక్. ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను సినిమా చేసి తీరుతానని గతంలో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 'వంగవీటి' చిత్ర ఆడియో వేడుకను విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య కాలేజ్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 3న జరపనున్నట్టుగా 'వర్మ' ప్రకటించారు. దీనితో ఈ వివాదం మరింత ఎక్కువైంది. విజయవాడలో ఆడియో వేడుకలు జరిపితే అల్లర్లు జరగడం ఖాయమని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా 'వర్మ'తో పాటు చిత్ర నిర్మాత 'దాసరి కిరణ్ కుమార్' హైకోర్టు నుండి నోటీసులు అందాయని వార్తలు వెలువడుతున్నాయి. 'వంగవీటి రంగా'ను నెగటివ్ కోణంలో చూపే ప్రయత్నం జరిగిందని పిటిషన్ దాఖలైనట్లు టాక్. మరి ఈ పిటిషన్ దాఖలు నిజం అయితే ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి. 

09:07 - December 1, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు ప్రభావం నిత్యావసరాలపై పడింది. చిల్లర సమస్యతో కూరగాయల అమ్మకాలు పడిపోవడంతో రేట్లు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 500నోటు తీసుకుని మార్కెట్‌కు వెళ్లితే సంచి నిండని పరిస్థితి. కానీ ప్రస్తుతం చిల్లర సమస్యతో కొనేవారు కరువవడంతో కూరగాయల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉండే రైతుబజార్‌లు నేడు వెల వెల బోతున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు భారీగా తగ్గిపోవడంతో సామాన్యులు ఖుషీగా ఉన్నారు. 
తీవ్ర చిల్లర సమస్య  
పెద్దనోట్ల రద్దు కూరగాయల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కూరగాయాల మార్కెట్‌కు వెళ్లాలంటే జేబులో 20,10, 5 రూపాయల లాంటి చిల్లర ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దువల్ల చిల్లర సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కొత్త 500, 2వేల నోటుకు చిల్లర దొరక్కపోవడంతో కూరగాయల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లు, రైతు బజార్‌లు కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. 
భారీగా తగ్గిన కూరగాయల రేట్లు  
పెద్ద నోట్ల రద్దుతో కూరగాయల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోవడంతో..అటు కూరగాయల రేట్లు కూడా  భారీగా తగ్గాయి. కొనేవాళ్ళు రాక పోవడమే రేట్లు దిగిరావడానికి కారణంగా తెలుస్తోంది. టమాటా , చిక్కుడు, బీన్స్, కాకర ఇలా అన్ని రకాల కూరగాయలు కిలో 20 నుంచి 25రూపాయల లోపే దొరుకుతున్నాయి. దీంతో ఒకప్పుడు 500 నోటు ఖర్చుపెట్టందే సంచినిండని పరిస్థితి నుంచి ఇవాళ..100, 200 రూపాయలతో సంచి నిండా వారానికి సరిపడా కూరగాయల్ని తీసుకెళ్తున్నారు. 
రైతులు ఆవేదన 
పెద్ద నోట్లను తీసుకుని ఇబ్బందులు పడటం ఎందుకని వ్యాపారులు వాటిని తీసుకోవడం మానేసారు. దీంతో కొనేవాళ్ళు లేక రేట్లు పడిపోయాయాని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రూపాయలకు కిలో కూరగాయాలు కొనేవారు 2వేల కొత్తనోటు ఇస్తే చిల్లర ఎలా ఇవ్వాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. చిల్లర సమస్యతో అమ్మకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు సగానికి సగం తగ్గడంతో అటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి కూరగాయల్ని పండించి తీరా అమ్ముకుందామని మార్కెట్‌కు తీసుకొస్తే..ధరులు లేక చివరకు కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
వ్యాపారులు ఆందోళన 
మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూరగాయల మార్కెట్‌పై పడడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చిల్లర కొరతతతో కొనేవాళ్ళు లేక కూరగాయల రేట్లు  పడిపోవడంతో గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులు మాత్రం కూరగాయల ధరలు తగ్గడంతో ఆనందంగా ఉన్నారు. 

 

08:41 - December 1, 2016
08:40 - December 1, 2016

మహబూబ్ నగర్ : ఫేస్‌బుక్‌లో కిడ్నీల వ్యాపారం మొదలుపెట్టాడో మోసగాడు..దీనికి దానం చేస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చాడు..అమాయకులను బుట్టలో వేసుకుని వారి కిడ్నీలను లక్షలకు విక్రయించేందుకు బేరం పెట్టాడు..ఇలా పాలమూరు కుర్రాడు లైన్లోకి రాగానే ఆశలు పెట్టి మోసం చేయబోయాడు. చివరకు దొరికిపోయాడు.
కిడ్నీ దానం చేసేవారితో చాటింగ్‌...
ఇతనే ఆ నకిలీ డాక్టర్‌ హనీఫ్‌షాన్...అనంతపురం జిల్లా గుంతకల్లు చెందిన హనీఫ్‌ డబ్బు సంపాదించేందుకు రకరకాల వేషాలేస్తాడు. అందులో ఒకటి ఈ వైద్యుడి అవతారం. తనకు తాను మూత్రపిండాల డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్ చేశాడు.. అందులో కిడ్నీలు కావాలంటూ చేసే పోస్టులు ఎక్కువ...ఎవరైనా లైన్లోకి వచ్చారంటే వారితో చాటింగ్....డబ్బుకు ఆశపడేవారే టార్గెట్...చాటింగ్‌లోకి వచ్చారంటే చీటింగే...పాలమూరు కుర్రాడికి గాలం...
బయటపడ్డ హనీఫా బాగోతం...
కిడ్నీలు దానం చేస్తే లక్షల్లో సొమ్ము వస్తుందని ఆశపెడతాడు...హనీఫా చెప్పే మాటలకు బోల్తా కొట్టేవారు అతన్ని కలిసేలా చేస్తాడు...అంతకు ముందే వారితో కొన్ని డాక్యుమెంట్లు సిద్దం చేసుకునేందుకు డబ్బు కావాలంటూ ఖాతాలో జమ చేయించుకుంటాడు.. ఇలా పాలమూరు వల్లభనగర్ చెందిన కిరణ్‌కుమార్ హనీఫా బుట్టలో పడ్డాడు...లక్షల్లో వస్తుందని ఆశించాడు.
కిడ్నీ దానం చేసేందుకు సిద్ధం 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వల్లభనగర్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ ఫేస్‌ బుక్‌ ద్వారా హనీఫ్‌సాన్‌ ను సంప్రదించాడు. లక్షల్లో సోమ్ము వస్తుందని చెప్పడంతో తన మూత్రపిండాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యాడు. వైజాగ్‌లో ఉద్యోగ శిక్షణ వెళ్తున్నట్లు కన్నవారిని నమ్మించిన కిరణ్‌ పదివేలు ఖర్చుల కోసం తీసుకుని ఈ నెల 24న తిరుపతి బయల్దేరాడు. ఇంట్లో ఫోన్ మర్చిపోవడంతో ఆ నంబర్ ఆధారంగా పేరెంట్స్‌ ఫోన్ చేస్తే అసలు కథ తెలిసింది. అయితే కిరణ్‌ కిడ్నీ తీసుకోకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని హనీఫా డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు గుట్టురట్టయింది. హనీఫాలాంటి వారెందరో ఫేస్‌బుక్ ఆధారంగా మోసాలు చేస్తూనే ఉన్నారు. ఆశలెన్నో కల్పించి పుట్టిముంచేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తా...

08:24 - December 1, 2016

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. డిసెంబర్‌ 2న తమిళనాడులోని కడలూరు వద్ద ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపానుకు ' నాదా ' అని నామకరణం చేశారు. ప్రస్తుతం చెన్నైకు ఆగ్నేయంగా 1010 కి.మీల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. 
'నాదా' తుపానుగా నామకరణం 
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు నాదా అని నామకరణం చేశారు. ఈ తుపానుతో దక్షిణ కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలుతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. 
చెన్నైకు ఆగ్నేయంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతం 
ప్రస్తుతం చెన్నైకు ఆగ్నేయంగా 710 కి.మీలు, పుదుచ్చేరికి 670 కి. మీల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. తుపాను హెచ్చరికలతో దక్షణ కోస్తా లో ఉన్న తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
కేరళను తాకనున్న తుపాను
నాదా తుపాను ప్రభావం కేరళనూ తాకనుంది. తీరం దాటే సమయంలో కేరళలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్‌ 2న పుదుచ్చేరి లేదా కేరళ రాష్ట్రాల మధ్య ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

 

08:19 - December 1, 2016

ఒడిశా : నయా ఉదారవాద విధానాలు, మతతత్వ పోకడల కారణంగా ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని సీఐటీయూ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. కార్మిక, కర్షక, సామాన్య ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తోందని, ఇలాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. ఒడిశా రాష్ర్టం పూరిలో 5 రోజుల పాటు జరిగిన 15వ అఖిల భారత సీఐటీయూ మహా సభలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు సంస్థ నూతన కార్యవర్గాన్ని, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించింది. 
పూరీలో మహాసభలు
ఒడిశా రాష్ర్టం పూరీలోని కామ్రేడ్‌ సరూర్‌ ముఖర్జీ నగర్‌ ప్రాంగణంలో 5 రోజుల పాటు జరిగిన సీఐటీయూ అఖిలభారత మహాసభలు దిగ్విజయంగా ముగిశాయి. గడిచిన అనుభవాలు, భవిష్యత్తు పోరాటాలపై మహాసభ లోతుగా చర్చించింది. ప్రజలు, కార్మికులపై పడుతున్న భారాలు, దీర్ఘకాలిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేసి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మహాసభలో నేతలు నిర్ణయించారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయం
ప్రజా సమస్యలు ఉన్న చోట... సీఐటీయూ బాధితుల పక్షాన నిలబడి.. న్యాయం జరిగేలా చూడాలని నేతలు పిలుపునిచ్చారు. ఉత్సాహంగా ఉద్యమాల్లో పాల్గొనేందుకు సమాయత్తం కావాలని సూచించారు. ధరల పెరుగుదల, సామాజిక అణిచివేతలు, స్థానిక సమస్యలపై సవాళ్లను అధిగమించి.. సమిష్టిగా ముందుకెళ్లాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. సీఐటీయూను మరింత విస్తరించి.. కార్మికుల పోరాటాల్లో, సామాన్యులకు గొంతుకగా నిలవాలని పలువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. స్వతంత్ర కార్యచరణతో నయా ఉదారవాద విధానాలు, మతతత్వం రాజకీయాలు నడిపే పాలకులపై నిరంతరం పోరాటం చేయాలని సీఐటీయూ 15వ మహాసభ తీర్మానించింది. 
డిసెంబర్‌ 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలు 
కార్మిక, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ..డిసెంబర్‌ 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని సీఐటీయూ నేతలు నిర్ణయించారు. కార్మికుల పోరాటాలపై ప్రభుత్వ నిర్బంధనాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మహాసభ పిలుపునిచ్చింది. ఇక అన్ని ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న స్కీమ్‌ వర్కర్లు తమ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా జనవరి 28వ తేదీన చేస్తున్న సమ్మెకు  సీఐటీయూ మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. 
అధ్యక్ష్య, ప్రధాన కార్యద కె. హేమలత, తపన్‌ సేన్‌ 
సీఐటీయూ 15వ జాతీయ మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలుగా కే. హేమలత, ప్రధాన కార్యదర్శిగా తపన్‌సేన్‌, కోశాధికారిగా ఎం ఎల్ మాల్కోటియా ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 32 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 16 మంది ఉపాధ్యక్షులు, మరో 16 మంది కార్యదర్శులు ఉన్నారు. సుకొమల్‌ సేన్‌ను ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని పలువురికి కౌన్సిల్‌లో అవకాశం కల్పించారు. ఏపీ నుంచి సీహెచ్‌ నర్సింగరావుతోపాటు మరో ఏడుగురికి, తెలంగాణలో ఐదుగురికి స్థానం కల్పించారు. అఖిల భారత కార్యవర్గంలో ఏపీ నుంచి కార్యదర్శిగా గఫూర్‌, వైఎస్‌ ప్రెసిడెంట్‌గా బేబిరాణి, కార్యదర్శిగా సాయిబాబాను ఎన్నుకున్నారు. మొత్తంగా సీఐటీయూ అఖిలభారత మహాసభలు విజయవంతంగా ముగిశాయి.

08:13 - December 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విద్యారంగ ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుకుని ఉన్నత విద్య వరకు అన్ని విభాగాలతో విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి సమీక్షలు ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్ రద్దకు సమాలోచనలు చేస్తున్నట్లు కడియం తెలిపారు. 
మంత్రి కడియం శ్రీహరి వర్క్‌షాప్ 
తెలంగాణాలో విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే విద్యాప్రమాణాలు పెంచేందుకు విడతల వారిగా సమీక్షలు ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని సర్వశిక్షా అభియాన్‌లో డీఈఓలు, ఆర్‌జేడీలతో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచి ప్రమాణాలు పెంచేందుకు డీఈఓలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా శ్రమించాలని సూచించారు. ఆయా జిల్లాల్లో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే చర్యలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉందని అధికారులకు తెలిపారు. 
వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ రద్దు..? 
మరోవైపు ఈ సమీక్షా సమావేశం... అనంతరం మీడియాతో కడియం తన మనోగతాలను పంచుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ రద్దుకు సంబంధించి సమాలోచనలు చేస్తున్నట్లు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న 162 ప్రైవేటు స్కూల్స్ కు నోటీసులు జారీ చేసి చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇవ్వడం కష్టమేనని స్పష్టంచేశారు. మొత్తంగా స్కూల్స్ నుంచి హయ్యర్‌ ఎడ్యుకేషన్ వరకు అన్నింటిలో తాము సంస్కరణలు చేస్తున్నామని అందుకు అధికారులనూ సిద్ధం చేస్తున్నట్లు కడియం పేర్కొన్నారు. 

 

08:05 - December 1, 2016

విజయవాడ : విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తొందా ? సరఫరా నష్టాలను అధిగమించడంలో చంద్రబాబు సర్కార్ సక్సెస్ అయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ విద్యుత్ పంపిని సంస్ధల లెక్కలు ఏం చెప్తున్నాయి. విద్యుత్‌ పంపిణీలో ఏపీ మిగులు రాష్ట్రంగా అవతరిస్తుందా లేదా ? వాచ్ దిస్ స్టోరీ..
దూసుకుపోతున్న రాష్ట్రం 
రాష్ట్ర విభజనానంతరం..విద్యుత్ కోతలులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. కేంద్రప్రభుత్వ సహకారంతో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా పథకం కింద ఎంపికై..వ్యవసాయ, గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతరం విద్యుత్ వెలుగులను అందిస్తొంది. అయితే విద్యుత్ ట్రాన్మిషన్ నష్టాలను అధిగమించడంతో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని భావించిన చంద్రబాబు..ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశ్యం చేశారు. అధునాతన సాకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని పంపిణీ నష్టాలను అధిగమించారు. ఫలితంగా విద్యుత్ మిగులు సాధించడంలో రాష్ట్రం దూసుకుపోతుంది. 
విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు ఖర్చు నివేదిక 
2017...18 నాటికి వార్షికాదాయ ఖర్చు నివేదికను డిస్కంలు విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు సమర్పించాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు వచ్చే ఏడాదికి 30వేల 69 కోట్ల రూపాయల అవసరం ఉంటుందని అంచనా వేసిన అధికారులు,..ఆదాయం మాత్రం 22 వేల 892 కోట్ల  రూపాయలే ఉంటుందని తెలిపారు. సుమారు 7,177 కోట్ల మేర లోటు ఉండొచ్చని డిస్కం అధికారులు స్పష్టం చేశారు. అటు అన్ని వనరుల నుంచి రాష్ట్రంలో 67వేల 948 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని వెల్లడించిన విద్యుత్ సంస్థలు,..వినియోగం మాత్రం 57 వేల 18 మిలియన్‌ యూనిట్లు ఉండొచ్చని తెలిపారు. అయితే గతంలో ఎన్నాడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చే ఏడాదిలో 10 వేల 930 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఏర్పడుతుందని డిస్కాంలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి మిగులు విద్యుత్ సాధించడంపై ఏపీ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది. కొత్త రాష్ట్రంలో నూతన పారిశ్రామిక అవసరాలకోసం ఈ విద్యుత్‌ను ఉపయోగించుకుంటామనీ ఆనందం వ్యక్తం చేస్తొంది.

 

కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ను కలవనున్న విపక్షాలు

ఢిల్లీ : కాసేపట్లో విపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కలవనున్నాయి. నోట్ల రద్దు వల్ల తలెత్తిన అంశాలను రాష్ట్రపతికి వివరించనున్నారు.

07:50 - December 1, 2016

కృష్ణా : బందర్‌ పోర్ట్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సమీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలకు వైసీపీ అధినేత జగన్ అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ మచిలీపట్నం బందర్ పోర్ట్  బాధిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. భూ స‌మీక‌ర‌ణ‌కు భూములు ఇచ్చేంద‌కు సిద్దంగాలేని బుద్దలపాలెం, కోన గ్రామాల ప్రజ‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. 
బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ కోసం 
కృష్ణా జిల్లాలో బందర్‌ పోర్ట్‌, పారిశ్రామిక కారిడార్ కోసం 33వేల ఎక‌రాల భూమిని స‌మీక‌రించేందుకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కి నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఆయితే లాండ్ పూలింగ్‌కి భూములు ఇచ్చేందుకు బంద‌ర్ పోర్టు పరిస‌ర గ్రామాల ప్రజ‌లు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం భూసమీకరణ చర్యలు చేపట్టడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే రైతులకు అండగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ, వామ పక్షాలు బాధిత  ప్రజలు తరుపున పోరాటం చేస్తున్నారు . రైతుల ఆందోళనకు అండగా నిలిచేందుకు ఇవాళ బాధిత గ్రామాల్లో వైఎస జగన్  పర్యటించనున్నారు. పోర్ట్‌ పరిసర గ్రామాలకు వెళ్లి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.జగన్‌ పర్యటన నేపథ్యంలో ఆపార్టీ శ్రేణులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. 
బందర్‌ పోర్టు భూసమీకరణను వ్యతిరేకి ప్రజలు 
బందర్‌ పోర్టు భూసమీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. ఓవైపు భూసమీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా దూకుడు ప్రదర్శించడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్,.క‌ర ఆగ్రహారంతో పాటు మ‌రికొన్ని గ్రామాల్లో పర్యటించారు. అయితే తాజాగా బుద్దలపాలెం, కోన గ్రామాల్లో జ‌గ‌న్ ప‌ర్యటించనున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్నివిపక్ష పార్టీల నాయకులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. వెయ్యి గజాల ఇంటిస్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాట్ కోసం తమ విలువైన భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతలు తెగేసి చెబుతున్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అని పార్టీలతో కలిసి బందర్‌ పోర్ట్‌ భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వైసిపి భావిస్తోంది. అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైసిపి వ్యూహరచన చేస్తోంది. 

 

07:46 - December 1, 2016

విజయవాడ : ఏపీ పాలన ఇక వెలగపూడి సచివాలయం నుంచే పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలోని తన కార్యాలయంలో అమరావతి నిర్మాణంపై సమీక్ష జరిపారు. రాజధాని నిర్మాణంలో కీలక రింగ్‌రోడ్ల నిర్మాణంపై చర్చిఆంచారు. వెలగపూడి నుంచి పూర్తి స్థాయి పాలన సాగిస్తామని ఆయనీ సందర్భంగా చెప్పారు.
కొత్త శకం మొదలైంది : సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వెలగపూడిలో సచివాలయానికి వచ్చారు. ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. రాజకీయ కారణాలతో హేతుబద్ధత లేకుండా తమను అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజించి వెళ్లగొట్టారని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. తక్కువ కాలంలోనే సచివాలయాన్ని నిర్మించుకున్నామని, ఇదే స్ఫూర్తితో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెలగపూడి కేంద్రంగా అమరావతి నిర్మాణంలో ఉద్యోగులంతా కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వేలకోట్ల లోటు బడ్జెతో.. హైదరాబాద్‌ నుంచి  వచ్చామన్నారు చంద్రబాబు. హైదరాబాద్‌ ను అభివృద్ధి పథంలో నడిపిన విధంగానే... అమరావతిని ప్రపంచమే ఆశ్చర్యపడేలా నిర్మిస్తామన్నారు. నవ్యాంధ్ర చరిత్రలో కొత్త శకం మొదలైంది అన్నారు  ఏపీ ముఖ్యమంత్రి.
అమరావతికి అవకాశాలు : సీఎం చంద్రబాబు 
ప్రపంచంలో ఏ రాజధానికి లేనన్ని అకర్షణలు, అవకాశాలు అమరావతికి ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు  ఆహ్లాదంగా వుండే పర్వత శ్రేణులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం  కష్టమనిపించినా.. భవిష్యత్తులో సుందరమైన రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు సీఎం. రాజధానిలో అంతర్గత రహదారులు.. రింగ్‌ రోడ్లు ఎలా ఉండాలన్న అంశంపై కూడా ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని చుట్టూ మూడు రింగ్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను  అధికారులు సీఎంకు అందించారు. మొదటి రింగ్‌రోడ్డు ప్రధాన రాజధానికి  15 కిలోమీటర్ల దూరంలో 94 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందన్నారు. ఇక రెండవ రోడ్డు రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలో 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. అలాగే మూడవ రింగ్‌రోడ్డు  34కిలోమీటర్ల దూరంలో పలు గ్రామీణప్రాంతాలను కలుపుతూ 210 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.  
ఉద్యోగులను ప్రశంశించిన సీఎం
సచివాలయ ఉద్యోగులు ఎన్ని సమస్యలు ఉన్నా కష్టపడి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రజలకు శక్తివంచన లేకుండా సేవచేయాలన్నారు సీఎం  చంద్రబాబు.  సచివాలయంలో జరిగిన సమీక్షలో  ముఖ్యమంత్రితోపాటు మంత్రులు యనమల రామకృష్ణడు, నారాయణతోపాటు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

 

07:37 - December 1, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిత్యవసర వస్తువులు, ఆహార ఉత్పత్తులపై పెద్ద ఎత్తున పడింది. నోట్ల రద్దు తర్వాత ఇప్పటికే 30 శాతం మేర ఆహార ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ మార్కెట్లకు.. కూరగాయలు వంటి నిత్యవసరవస్తువులు రావడం తగ్గిపోయింది. దీనివల్ల దాదాపు 45 శాతం ఆదాయానికి గండి పడింది. అంతేనా చాక్లెట్లు, ఐస్‌క్రీం తదితరాల ఉత్పత్తి సంస్థలు సైతం అమ్మకాలు లేక నష్టాల బాటన సాగుతున్నాయి. 
తగ్గిన 45 శాతం ఆదాయం 
ఉప్పు, పప్పు, చింతపండు మొదలు.. సబ్బులు, నూనెలవరకు ఏ ఒక్క నిత్యావసర వస్తువు లేకపోయినా ఇల్లు గడవడం కష్టం. అయితే.. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు నిత్యవసర వస్తువులను అత్యంత పొదుపుగానే కొంటున్నారు. చిల్లర లోటు దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఫలితంగా నిత్యావసర వస్తువుల అమ్మకాలు తగ్గి... మార్కెట్లు డీలా పడిపోయాయి. నోట్ల రద్దు నేపథ్యంలో చాక్లెట్లు, ఐసీక్రీం వంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల అమ్మకాలు 30 శాతం మేర పడిపోయి కుదేలయ్యాయి. సూపర్‌ మార్కెట్లకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా ఆగిపోయి.. దాదాపు 45 శాతం ఆదాయం తగ్గింది. 
వెలవెల బోతున్న మార్కెట్లు 
సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, బాడీ క్రీమ్‌లు, బాడీ ఆయిల్స్‌, షాంపూల వంటి వస్తువుల అమ్మకాలు తగ్గి... కిరాణ దుకాణ యజమానులు ఆందోళన చెందుతున్నారు.  తినుబండారాల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నప్పటికీ... చాలామంది డబ్బులు లేక వాటిని కొనలేకపోతున్నారు. దీంతో  విక్రయాలు పడిపోయి మార్కెట్లు డీలా పడ్డాయి.  గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధికంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడతారు. వారిలో అత్యధికులకు ఆన్‌లైన్‌, నగదు రహిత లావాదేవీలంటే ఏంటో కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితుల్లో కొనేందుకు గ్రామీణుల వద్ద నగదు లేక.. ఆహార సంబంధిత మార్కెట్లు క్రయవిక్రయాలు లేక వెలవెల బోతున్నాయి. 
కళ తప్పిన బంగారం మార్కెట్‌  
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అటు బంగారం మార్కెట్‌ కళ తప్పింది. నగదు కొరతతో భారీ ఎత్తున బంగారం అమ్మకాలు పడిపోవడంతో ...నవంబర్‌ తర్వాత క్రమంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముంబైలోని జవేరీ బజార్‌ ప్రతిరోజు సగటున 125 కోట్ల వ్యాపారంతో తణుకులీనేది. అలాంటిది పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజుకు 13 కోట్లకు పడిపోయింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అత్యవసరమైతే తప్పా... ఎవరూ బంగారం కొనుగోళ్లు చేయడం లేదు.  నగదు అందుబాటులో లేక చాలా మంది వివాహాలు, శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండటంతో బంగారం  మార్కెట్లు కళ తప్పి.. వ్యాపారులు నష్టాల బారిన పడుతున్నారు. 

 

07:31 - December 1, 2016

విజయవాడ : ఇవాళ ఒకటో తారీఖు. ఒకటో తారీఖు కష్టాలను అధిగమించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికి ఇవాళ 10వేల రూపాయల నగదు ఇస్తామని ప్రకటించారు. పెద్ద నోట్ల లాంటి సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే నగదు రహిత లావాదేవీలే పరిష్కారమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే తాను బ్యాంకింగ్‌ వ్యవహారంలో జోక్యం చేసుకున్నానన్న సీఎం..చిల్లర కష్టాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలనే అన్వేషిస్తున్నామని స్పష్టం చేశారు.    
రూ.10 వేలు తీసుకునేందుకు చర్యలు 
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు తీపి కబురు అందించింది. ఇవాళ ఒకటో తారీఖు కావడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ప్రాంతాల్లో పదివేల రూపాయలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రేషన్‌ షాపుల్లో డబ్బులు లేకున్నా సరుకులు కొనుకోవచ్చన్నారు. బ్యాంక్ అకౌంట్‌ లేని వారు త్వరగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని బాబు సూచించారు. 
మోడల్ డిజిటల్ వ్యవస్థ
దేశంలోనే మోడల్ డిజిటల్ వ్యవస్థను రాష్ట్రంలో రూపొందిస్తున్నామని సీం చంద్రబాబు అన్నారు. కొద్ది రోజుల క్రితం బ్యాంక్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కరెన్సీ సమస్యను అధిగమించడం కోసం బ్యాంక్‌ అధికారులు తీసుకుంటున్న  చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. 
నగదు రహిత లావాదేవీలు
కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వ శాఖలన్నింటినీ సమీకృతం చేసి..ప్రభుత్వ  కార్యక్రమాలను  ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు.  నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్రంలో 40 వేల 150 స్వైప్‌  మిషన్లను సరఫరా చేశామని తెలిపారు. వీటిలో  27వేల 215 యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి... ఇంకా 12 వేల 935 స్వైప్‌మిషన్లను  త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్వైప్‌మిషన్లను  వినియోగించుకుంటూనే కొత్తవాటిని సమకూర్చాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం సాంకేతికంగా ముందంజలో ఉందని...ఏది ఏమైనా సాధ్యమైనంత వరకూ నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం కూడా నెలజీతాల విషయంలో ఇబ్బందులు రాకుండా  పెద్దమొత్తంలో ఏటీఎంలలో..నగదును అందుబాటులో ఉంచాలని ఆర్బీఐకి సూచించింది. 

 

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరించారు. 

 

నేడు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన

విజవాయడ : నేడు జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. బందరుపోర్టు భూనిర్వాసితులో ఆయన ముఖాముఖి నిర్వహించన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. 

 

నేడు సరిహద్దు భద్రతాదళ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్ : నేడు సరిహద్దు భద్రతాదళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

నేడు రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు

ఢిల్లీ : నోట్ల రద్దుపై విపక్షాలు నేడు రాష్ట్రపతిని కలవనున్నారు. సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చారు. 

Don't Miss