Activities calendar

02 December 2016

21:52 - December 2, 2016

ఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్ గా రాకేశ్ ఆస్థానా బాధ్యత‌లు స్వీక‌రించారు. అనిల్ సిన్హా పదవీ విరమణతో ఆయన స్థానంలో... ఆస్థానాను నియమించారు. గుజ‌రాత్ క్యాడ‌ర్‌ 1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ ఆస్థానా ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స‌న్నిహితంగా ఉన్నారు. వ‌డోద‌రా రేంజ్‌లో రాకేశ్ గ‌తంలో ఐజీ ఆఫీస‌ర్‌గా చేశారు. 2002లో జ‌రిగిన గోద్రా అల్లర్ల కేసులో విచార‌ణ టీమ్‌లో రాకేశ్ కీలకంగా వ్యవహరించారు.

21:50 - December 2, 2016

ఢిల్లీ : కోర్టుల్లో జాతీయగీతాలాపన తప్పనిసరి చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేసేలా ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌ సమగ్రంగా లేనందున దీనిపై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది. సమగ్ర పిటిషన్‌ కానందున అభిప్రాయం వెల్లడించలేమని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. 

21:48 - December 2, 2016

పశ్చిమ బెంగాల్ : ఆర్మీ మోహరింపు విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ అనుమతి లేకుండా రాష్ట్రంలో టోల్‌ ప్లాజాల వద్ద సైన్యాన్ని కేంద్రం మోహరించిందంటూ దీదీ చేసిన ఆరోపణలను సైన్యం తిప్పికొట్టింది. ప్రభుత్వ శాఖల అభ్యర్థన మేరకే తాము బలగాలను మోహరించామని, ఆయా విభాగాల నుంచి సంబంధిత అనుమతులు తీసుకున్నామని ఆర్మీ స్పష్టం చేసింది.

సీఎం మమతా బెనర్జీకి సైన్యం నుంచి అనుకోని షాక్‌
తమకు సమాచారం ఇవ్వకుండా పశ్చిమ బెంగాల్‌లో టోల్ గేట్ల వద్ద కేంద్రం భారీగా కేంద్ర బలగాల మోహరించిందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై సైన్యం నుంచి అనుకోని షాక్‌ తగిలింది. బెంగాల్ ప్రభుత్వ విభాగాల అభ్యర్థన మేరకే బలగాలను పంపించామని ఆర్మీ వెల్లడించింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన అన్ని అనుమతులను వారం రోజుల ముందే తీసుకున్నాకే బలగాలను పంపించామని బెంగాల్ జీఓసీకి చెందిన మేజర్ జనరల్‌ సునీల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నాలుగు లేఖలను ఆయన విడుదల చేశారు.

బెంగాల్‌లో నవంబర్‌ 28,29,30 నుంచి డిసెంబర్‌ 1,2 తేదీలకు తనిఖీ వాయిదా
రొటీన్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ప్రతియేటా సైనికులను పంపే ముందు స్థానిక అధికారులు, పోలీసుల అనుమతి తీసుకోవడం సర్వ సాధారణమేనని తెలిపారు. బెంగాల్‌లో 80 డేటా కలెక్షన్‌ పాయింట్లను ఎంపిక చేశామని, ఒక్కొక్క పాయింట్‌ వద్ద ఐదారుగురు సైనికులు ఉంటారని సునీల్‌ యాదవ్‌ చెప్పారు. వీరివద్ద ఎలాంటి ఆయుధాలు కూడా ఉండవన్నారు. ఇందులో భాగంగా యుపి, బీహార్‌, జార్ఖండ్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ ఒకటి వరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. బెంగాల్‌లో నవంబర్‌ 28,29,30 తేదీల్లో ఎక్సర్‌సైజ్‌ చేయాల్సి ఉండగా భారత్‌ బంద్‌ కారణంగా డిసెంబర్‌ 1,2 తేదీలకు వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఆర్మీ వివరణతో ఖంగుతిన్న మమత
ఆర్మీ వివరణతో మమత ఖంగుతిన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలు మొహరించారని హడావుడి చేసిన ఆమె సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్టైంది. ఇప్పుడెలా స్పందిస్తారో వేచి చూడాలి.

21:43 - December 2, 2016

విజయవాడ : అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజలకోసం తమ వాయిస్‌ వినపిస్తూనే ఉంటామన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సెప్టెంబర్‌ 8,910 తేదీల్లో ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై .. ప్రివిలైజ్‌ కమిటీ ఇచ్చిన నోటీసు ప్రకారం... ఆయన ఇవాళ కమిటీ ముందు హాజరయ్యారు.

ఏపీ అసెంబ్లీ ప్రివిలైజ్‌ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
ఏపీ అసెంబ్లీ ప్రివిలైజ్‌ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి హాజరయ్యారు.అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చారు. అధికార పార్టీ కక్షతోనే తమను విచారణ పేరుతో వేధిస్తోందని పిన్నెల్లి మండిపడ్డారు.

సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో హోదాపై చర్చలో వైసీపీ ఎమ్మెల్యేల హల్‌చల్‌
సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో ప్రత్యేక హోదా అంశం పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారంటూ మంత్రి యనమల.. ఆ సమావేశాల్లోనే 12 మంది పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ ఈ నోటీస్ ను ప్రివిలేజ్ కమిటీ కి పంపడంతో వైసిపి మ్మెల్యేలు 12 మందికి కమిటీ నోటీసులు పంపింది. అయితే ఇప్పటివరకు కమిటీ ముందు 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరై వివరణ ఇచ్చారు. కోడాలి నాని,చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ,పిన్నెల్లి రామ‌క్రిష్ణా రెడ్డి మాత్రం మొదట హాజ‌రు కాలేదు.దీంతో ఈ ముగ్గురిని శుక్రవారం హాజరు కావాల‌న్న ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశించింది.

వైసీపీ పేరుతోనే కమిటీ ముందు జ్యోతుల నెహ్రూ హాజరు
మరోవైపు టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ .. వైసీపీ పేరుతో ప్రివిలేజ్‌ కమిటీకి హాజరుకావడంపై పిన్నెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవారు నిజాయితీగా ప్రవర్తించాలన్నారు. జ్యోతుల నెహ్రూకు నీతి , నిజాయితీ ఉంటే.. తమ పార్టీ పేరుతో వ్యవహరించవద్దని పిన్నెల్లి డిమాండ్‌ చేశారు. అధికారపార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజల పక్షాన తమపార్టీ గళాన్ని వినిపిస్తూనే ఉంటామన్నారు.

కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరో అవకాశం
మరోవైపు ఎమ్మెల్యేలు కోడాలి నాని,చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తాము శుక్రవారం నాటి విచారణకు రాలేమని సమాచారం ఇవ్వడంతో.. వారికి మరో అవకాశం ఇవ్వాల కమిటీ నిర్ణయించింది. అలాగే విచారణ ఎదర్కొంటున్న మొత్తం 12 మంది ఎమ్మెల్యేలతో మరోసారి మాట్లాడాలని కూడా ప్రివిలైజ్‌ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

21:40 - December 2, 2016

సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దత్తత గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న పనుల గురించి ఆరా తీశారు. అలాగే అభివృద్ధి పనులపై గ్రామస్థుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన..నిర్మాణదశలో ఉన్న పనుల గురించి ఆరా
సిద్ధిపేట్‌ జిల్లా.. మార్కుక్‌ మండలంలోని దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. గ్రామాలలో పూర్తైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను.. అంతర్గత సీసీ రహదారులను.. వాటికి ఇరువైపుల నాటిన మొక్కలను ఆయన సందర్శించారు. అలాగే కూడవెల్లి వాగు వద్ద నిర్మించిన చెక్‌ డ్యామ్‌లను చూసి.. సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవరల్లిలో చివరి దశ నిర్మాణంలో ఉన్న ఫంక్షన్‌హాల్‌ పనులను పరిశీలించి.. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.

సంగారెడ్డి జిల్లాలోని పాండురంగ జలాశయం పరిశీలన
తన పర్యటనలో భాగంగా కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లాలోని పాండురంగ జలాశయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు. గోదావరి జలాలు 365 రోజులు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించినట్టు ఈ సందర్భంగా కేసీఆర్‌ చెప్పారు. అలాగే ఎర్రవల్లి, నరసన్నపేటలో ఈ నెల 23న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.గ్రామంలో పనులను పరిశీలించిన అనంతరం.. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు తిరిగి వెళ్లిపోయారు. 

21:36 - December 2, 2016

హైదరాబాద్ : నోట్ల మార్పిడి చేసే ముఠాల దందా కొనసాగుతూనే ఉంది...కమిషన్ల బేరంలో లక్షలు చేతులు మారుతున్నాయి.. ఇప్పటికే కోట్లకు కోట్లుహైదరాబాద్‌ నారాయణగూడ...రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పోలీసులు సాధారణంగా చెకింగ్ చేస్తుంటారు...రొటీన్‌లో భాగంగానే పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ క్యాబ్‌పై దృష్టి పడింది...వెంటనే ఆపిన పోలీసులు సోదాలు చేస్తే దొరికిన నోట్లను చూసి ఖంగుతిన్నారు...

క్యాబ్‌లో కొత్త కరెన్సీ...
హైదరాబాద్‌ నారాయణగూడ...రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పోలీసులు సాధారణంగా చెకింగ్ చేస్తుంటారు...రొటీన్‌లో భాగంగానే పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ క్యాబ్‌పై దృష్టి పడింది...వెంటనే ఆపిన పోలీసులు సోదాలు చేస్తే దొరికిన నోట్లను చూసి ఖంగుతిన్నారు...

పాతనోట్లు మారుస్తూ కమిషన్‌ దందా...
మినర్వాహోటల్, బ్లూ ఫాక్స్ హోటల్‌ వద్ద సాధారణ వెహికల్‌ చెకింగ్‌ లో క్యాబ్‌లో ఉన్న ఐదుగురిని విచారించారు..అందులో ఓ మహిళ కూడా ఉంది...వారి వద్ద 95 లక్షల 18 వేలు కొత్త కరెన్సీ నోట్లు ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాతనోట్లు మారుస్తూ 15 శాతం కమీషన్‌ తీసుకుంటున్నట్లు తేలింది...వెంటనే వారిని అరెస్టు చేశారు...

21:33 - December 2, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలను వీలైనంత త్వరగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ప్రజల ఉపశమనానికి తీసుకున్న చర్యలను కేంద్రం బహిర్గతపరచాలని సుప్రీం సూచించింది.

గ్రామీణుల కష్టాలు తొలగించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం
పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వ్యాఖ్యానించింది. సహకార బ్యాంకులపై ఆధారపడిన గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

సహకార బ్యాంకులకు సరిపడా నగదు పంపాలని సూచన
కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఖాతాదారులకు నగదు అందించలేకపోతున్నామని కోర్టుకు మహారాష్ట్ర, కేరళ సహకార బ్యాంకులు తెలిపాయి. మహారాష్ట్ర, కేరళ సహకార బ్యాంకుల సమస్యలు నిజమైనవేనని ధర్మాసనం అంగీకరించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్య ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల సమస్యలపై పరిష్కార మార్గాలు చూపాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

21:28 - December 2, 2016

హైదరాబాద్ : ఉద్యోగులు, పెన్షనర్లపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారీగా చూపుతోంది. జీతాల కోసం వేతనజీవులు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 10 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే నిబంధన విధించడంతో.. నెలంతా ఆ డబ్బుతో ఎలా గడపాలన్న ఆందోళన ఉద్యోగులు, పెన్షనర్లను పట్టి పీడిస్తోంది.

ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు..
ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు.. ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు... కొత్త నోట్లు విడుదలై మూడు వారాలు దాటినా... నగదు కొరత మాత్రం తీరడం లేదు. నెల ప్రారంభం కావడంతో.. ఖాతాల్లో జమైన డబ్బుల్ని ఎలా తీసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో సంబంధం లేకుండా కేవలం 10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో నగదు విత్ డ్రా కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉద్యోగులు క్యూలు కడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతన కష్టాలు
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి మున్సిపల్‌ కార్మికులు పోటెత్తారు. నెల జీతాలు తీసుకునేందుకు బారులు తీరారు. క్యూ లైన్లో వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. 10 వేల విత్‌ డ్రా నిబంధనపై పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్‌ ఎస్బీఐ శాఖలు... ఇచ్చే 10 వేలు డిపోల దగ్గరే చెల్లిస్తే.. తమకిన్ని కష్టాలుండవని ఉద్యోగులు వాపోతున్నారు.

జీతాల కోసం వచ్చిన ఉద్యోగులు, సామాన్యులతో బ్యాంకులు రద్దీ
ఇక మండలాల్లో పరిస్థితి ఇంక దారుణంగా ఉంది. జీతాల కోసం వచ్చిన ఉద్యోగులు, సామాన్యులతో బ్యాంకులు కిటకిటలాడాయి.ఉదయం నుంచే క్యూలైన్‌లో జనం బారులు తీరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినా..నగదు కొరతతో కొందరు ఉసురుమంటూ వెనుదిరిగారు. పలుచోట్ల వృద్ధులు, మహిళలు క్యూలైన్లలో నిల్చోలేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పలు బ్యాంకులు, ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిచ్చాయి.

వింత పద్ధతుల్లో వధూవరులకు పెండ్లి కానుకలు
పెద్ద నోట్ల రద్దుతో పెళ్లి కానుకలు వింత పద్ధతుల్లో వధూవరులకు సమర్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ పెళ్లికి హాజరైన కమాన్‌పూర్‌ మార్కెట్ కమిటీ కార్యదర్శి నూతన వధూవరులకు కానుకగా ఐదువేల రూపాయలను ఇవ్వడం ప్రాధాన్యత చోటుచేసుకుంది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చెక్కు రూపంలో కానుక ఇచ్చానని తెలిపారు.

ఎల్ ఐసీ ప్రీమియం చెల్లింపులపై నోట్ల ప్రభావం
నోట్ల రద్దు ప్రభావం.. ఎల్ ఐసీ ప్రీమియం చెల్లింపులపై పడింది. సంగారెడ్డి ఎల్‌ఐసీ శాఖలో రోజువారీ కలెక్షన్ 30లక్షల నుంచి 2లక్షలకు పడిపోయింది. ఆర్బీఐ నుంచి నగదు రాక తగ్గడం వల్లే... చెల్లింపు సమస్యలు ఏర్పడ్డాయని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు.మొత్తం మీద... బ్యాంకులు, ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు కనిపించడం..జనాన్ని అసహనానికి గురిచేసింది. పెద్ద నోట్లు రద్దై 23 రోజులు కావొస్తున్నా...నగదు కొరత సమస్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 

20:52 - December 2, 2016

ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకున్నారు..ఎలుకను పట్టడం కోసం కొండను తవ్వారు..పిడికెడు అక్రమార్కుల భరతం పడతామంటూ దేశం మొత్తాన్ని పిల్లిమొగ్గలేయిస్తున్నారు.. నల్లధనం, నకిలీ నోట్లంటూ నిలువునా ప్రాణం తీస్తున్నారు.. ఇదే కామెంట్స్ అడుగడుగునా వినిపిస్తున్నాయి.. ఇదేనా నోట్ల రద్దు సాధించింది. సర్కారు చెప్పిన ప్రయోజనాలు ఎటుపోయాయి? నోట్ల రద్దు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోంది? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. ఇప్పుడు క్యూ మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు ఎదురు చూడటం మాత్రమే తెలుస్తోంది. ఇప్పుడు దేశమంతా ఒకేలా చూస్తోంది.. సొమ్ము తమదే..జీతం తమమే.. నూటికి నూరుపాళ్లు నిజాయితీగా సంపాదించిందే.. మరి ఎందుకీ కష్టాలు అని ప్రశ్నిస్తొంది.. ఇంతకూ సర్కారు చెప్పిందేమిటి? జరుగుతున్నదేమిటి? ఇప్పుడు లెక్కలన్నీ స్పష్టం.. చలమణీలో ఉన్న సొమ్మెంత? బ్యాంకుల దగ్గర ఉన్నదెంత? రిజర్వ్ క్యాష్ ఎంత? ప్రతీదీ స్పష్టంగా కనిపిస్తోంది? మరి సర్కారు చెప్పిన నల్లధనం లెక్కలేమయ్యాయి? ఎక్కడకు పోయాయి? ఈ సర్జికల్ స్ట్రైక్ లో గాయపడుతున్నదెవరు? ఇప్పుడు సాధించిందేమిటి?దేశమంతా కనిపిస్తున్న దృశ్యం ఏమిటి?ఆర్ధిక వ్యవస్థకు జరిగిన మేలేమిటి?ఉద్యోగాలు ఊడి రోడ్డున పడిన వారి పరిస్థితేంటి?పనులు లేక పస్తులుంటున్న వారికిచ్చే సమాధానమేంటి?పరిశ్రమలు కుదేలవుతున్నాయి.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉపాధి దెబ్బతింటోంది.. ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేనంత దిగజారిపోతోంది.. నోట్ల రద్దుతో సర్కారు చెప్పిన లాభాలకు భిన్నమైన పరిమాణాలు సంభవిస్తున్నాయా?మళ్లీ అదే ప్రశ్న..నోట్ల రద్దు సాధించిందేమిటి?ఒక్క నిర్ణయం దేశమంతా గగ్గోలు పెట్టేలా ఎందుకు మారింది? ఎవరి ప్రయోజనాలకోసం ఎవరు ఇబ్బందులు పడుతున్నారు?సర్కారు చెప్పిన ప్రయోజనలు ఏమయ్యాయి?నోట్లు రద్దు చేసిన 24 రోజుల తర్వాత వస్తున్న ప్రశ్న ఇది. క్యూలో నిలబడి నిలబడి కాళ్లు నొప్పెట్టిన వాళ్లు అడుగుతున్నారు..దేశభక్తి అంటే ఇదేనేమో అని భ్రమ పడిన వాళ్లూ నోరు తెరుస్తున్నారు.. అసహనం, నిస్సహాయత, అభద్రత, అన్నీ ఒక్కసారి దాడిచేస్తే ఆదుకునేదెవరని ప్రశ్నిస్తున్నారు. అదీ ఒకటే ప్రశ్న.. మీరు చెప్పిందే సాధిస్తున్నారా? మీరు స్పీచ్ ల్లో దంచినదే జరుగుతోందా? ఇదే ఇప్పుడు అడుగడుగునా వినిపిస్తున్న ప్రశ్న.. 

ఏపీ ఎస్‌ఐ రాతపరీక్ష ఫలితాలు విడుదల..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ పోస్టుల నియామక రాతపరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలు recruitment.appolice.gov.inలో చూడవచ్చని పోలీసు నియామకమండలి ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు. ఈనెల 4 నుంచి అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

జన్ ధన్ ఖాతాలపై ఐటీ దర్యాప్తు..

ఢిల్లీ : జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లపై ఐటీ శాఖ దృష్టిపెట్టింది. జన్ ధన్ ఖాతాలతో ఐటీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.పన్ను చెల్లించనిఆరు జన్ ధన్ ఖాతాల్లో భారీగా నగదు జమ చేసినట్లుగా ఐటీ గుర్తించింది. కోల్ కతా, బీహార్ కోచి, వారణాసి జన్ ధన్ ఖాతాల్లో రూ.1.64 కోట్లు వున్నట్లుగా గుర్తింపు. బీహార్ లో జన్ ధన్ ఖాతాల్లో జమ చేసిన రూ40 లక్షల నగదును అధికారులు జప్తు చేశారు. 

20:31 - December 2, 2016

నారాష్ట్రంల నా పర్మిషన్ లేకుండా ఆర్మీ గెందుకొచ్చిందని అలిగి సచివాలయంలో కూసుందంట దీదీఅని ముద్దుగా పిలుసుకునే సీఎం మమతా బెనర్జీ..శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెత..దీన్ని టీ.టీడీపోల్లు అమలు చేస్తున్నరు.తెలంగాణల సైకిల్ బెల్ మోగించేందుకు కోదండరామయ్య దండుకు టీ.టీడీపీ దోస్తానా చేస్తన్నట్లుగా వుంది వాతావరణం..కేసీఆర్ సార్ సర్కార్ కొలువెట్టి నేటితో 30 నెలలయ్యిందప్పా..మరి కేసీఆర్ ఏంసేసిండు..ముస్లిం రిజర్వేషన్ ముచ్చట ముగిసిపోయింది. క్రిస్టియన్ల భవనం ఆగిపోయింది. దళితుల భూపంపకం భూస్థాపితమయ్యింది. డబుల్ బెడ్ రూమ్ లు పడుకుండిపోయినయ్..కేసీఆర్ పాలనపై పొన్నం సేతులిరిసిపోసిండు..జనాల్ని బోల్తా కొట్టిస్తున్న సర్వేలు..నోట్ల రద్దు సూపరున్నదని సర్వేలో తేలిందంట..ఎంకయ్య సారు పంచెపై పంచె ఏసిన నారాయణ సారు కూడా పంచె గట్టుకోని కార్యక్రమానికొచ్చిన నారాయణ సారు..కారం..తొక్కులపై దాడులు..కామారెడ్డిలో బ్యాంకు కాడ బైకు దొంగని చితకొట్టిన జనాలు..భగవంతునికి భక్తునికి స్వైప్ సోపతి..హారతి పళ్లెంలో స్వైప్ మిషన్ తో కానుకలేస్తున్నరల్లా..నోట్ల రద్దుతో స్వైప్ మిసన్లను దేవాలయాల్లో కూడా ఇచ్చిండ్రు.. 

అపాజీ అమిన్ ఆస్తులపై ఐటీ దాడులు

ముంబై : చార్టెడ్ అకౌంట్ సంస్థ అపాజీ అమిన్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఐడీఎస్ కింద రూ.13,860 కోట్ల నగదు వున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించినట్లుగా ఆపాజీ అమిన్ సంస్థ ప్రకటించింది. నగదు ప్రకటన చేసిన మహేష్ షాను ఐటీ విచారించనుంది. మహేష్ వాంగ్ములాన్ని ఐటీ రికార్డు చేసింది. 

ముగిసిన బల్దియా స్టాండింగ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ ముగిసింది. అధికారులు ప్రతిపాదించిన రూ.5,643 కోట్ల బడ్జెట్ కే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి రూ.41 కొత్త రెండువేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

కరెన్సీ న్యూస్ ..

హైదరాబాద్ : పాత నోట్ల కథ ఈ అర్థరాత్రి నుండి ముగియనుంది. అర్థరాత్రి నుండి పెట్రోలు బంకులు..విమానయాన టిక్కెట్లకు పాతనోట్లు చెల్లవు. కాగా అర్థరాత్రి నుండి టోల్ ప్లాజాల్లో చార్జీలు తిరిగి వసూలు ప్రారంభంకానున్నాయి. కాగా పాత పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొన్ని కాలపరిమితుల రీత్యా కేంద్రం అమలు చేసిన సానుకూలత నేటి రాత్రితో ముగియనుంది. 

27మంది ప్రభుత్వ బ్యాంక్ అధికారులపై వేటు!.

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించిన 27 మంది ప్రభుత్వ బ్యాంకుల అధికారులను ఆర్థిక శాఖ సస్పెండ్ చేసింది. మరో ఆరుగురు అధికారులను బదిలీ చేసింది. బ్యాంక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ హెచ్చరిక జారీ చేసింది. కాగా పెద్దనోట్ల రద్దు అనంతరం ఆయా నోట్లను మార్పిడి చేసుకునేందుకు, చిన్న నోట్ల తీసుకునే నిమిత్తం బ్యాంకులకు వెళ్లిన ఖాతాదారులు పలు ఫిర్యాదులు చేస్తున్నారు.

23మంది ఊచకోత..

ఆఫ్గనిస్థాన్ : గత 48 గంటల్లో తాలిబన్లు 23 మంది పౌరులను హతమార్చారని ఆఫ్గనిస్థాన్ పోలీస్ అధికారులు తెలిపారు. కాందహార్ ప్రావిన్స్‌లో ఈ దారుణం జరిగిందని జనరల్ అబ్దుల్ రాజిఖ్ తెలిపారు. నాష్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ ఊచకోతలు జరిగినట్టు వివరించారు.

19:44 - December 2, 2016

ఢిల్లీ : మన దేశంలో ఎంత బంగారం వుంది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎంత వుంది? ప్రజల దగ్గర ఎంత వుంది? దేవుళ్ల దగ్గర ఎంత వుంది? మనకు ఇంత బంగారం ఎక్కడి నుంచి వస్తోంది?

ప్రపంచం ఉత్పత్తి చేస్తున్న బంగారంలో భారత్ వాటా కేవలం 0.75శాతం
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బంగారం చాలా స్వల్పం. ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తున్న బంగారంలో మన వాటా కేవలం 0.75శాతం మాత్రమే. అయితేనేం బంగారు నగలు ధరించడంలో మనమే టాప్. ఓ అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11శాతం మనదేశంలో వుంది.

భారత్ లో 20,000 టన్నుల బంగారం
మనదేశం మొత్తం మీద ఎంత బంగారం వుంది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన సమాచారమేదీ లేదు. ఎవరిదగ్గర ఎంతెంత బంగారం వుందన్న లెక్కలు ప్రభుత్వాలు ఎప్పుడూ సేకరించలేదు. కానీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం మన దేశంలో దాదాపు 20,000 టన్నుల బంగారం వుంది. ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు. 20వేల టన్నులంటే 2 కోట్ల కేజీల బంగారం. మన దేశ జనాభా 125 కోట్లు. మన దేశంలో వున్న బంగారం మొత్తాన్ని ఒక చోట కుప్పగా పోసి, అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కరి కి తులంన్నర చొప్పున ఇవ్వొచ్చట.

10 వ స్థానం భారత్ 557.7 టన్నులు
మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర వున్న బంగారం 557.7 టన్నులు. బంగారం నిల్వల విషయంలో మన దేశానిది పదవ స్థానం. అమెరికా దగ్గర అత్యధిక నిల్వలున్నాయి. 8133.5 టన్నుల నిల్వలతో అమెరికా మొదటి స్థానంలో వుంది. 3384.2 టన్నుల నిల్వలతో జర్మనీ రెండో స్థానంలో వుంది. 2451.8 టన్నులున్న ఇటలీది మూడో స్థానం. ఫ్రాన్స్ 4వ స్థానంలో, చైనా 5వ స్థానంలో, రష్యా 6వ స్థానంలో, స్విట్జర్లాండ్ 7వ స్థానంలో వున్నాయి. జపాన్, నెదర్లాండ్స్ కూడా మన పై స్థానాల్లో వున్నాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర 557.7 టన్నులు
మన రిజర్వ్ దగ్గర ప్రస్తుతం 557. 7 టన్నుల బంగారం నిల్వ వుంది. గత పదహారేళ్ల కాలం లెక్కలు తీస్తే, మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర సగటున 441.33 టన్నుల బంగారం నిల్వ వుంటోంది. కానీ, మన దేశం మొత్తం మీద వున్న బంగారం 20వేల టన్నులు. ఇందులో కొంత భాగం ఆలయాల్లో వుంది. దేశంలోని అన్ని ఆలయాలలో కలిపి 3000 నుంచి 4000 వేల టన్నుల బంగారం వుంటుందని అంచనా. కేరళ అనంతపద్మనాభ స్వామికి 1300 టన్నుల బంగారం వుంటే, తిరుమల వెంకన్నకు దాదాపు 300 టన్నుల బంగారం వుంది. గురువాయూర్ కిట్టయ్యకు 2 టన్నుల బంగారం వుంది. వైష్ణోదేవి టెంపుల్ కి 1200 కేజీల బంగారం వుంటే, షిర్డి సాయిబాబాకు 376 కేజీల బంగారం వుంది. పూరి జగన్నాధుడికి 208 కేజీలు, ముంబై సిద్ధి వినాయకుడికి 160 కేజీలు బంగారం వుందంటూ గతంలోనే లెక్కలేశారు. తిరుమల వెంకన్నకు ఏటా వంద కేజీల బంగారం వస్తోంది. ఈ లెక్కన ఏటేటా దేవుళ్ల బంగారం భారీగానే పెరుగుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ..ఆలయాలలో కలిపి దాదాపు 5000 టన్నుల బంగారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆలయాలలో కలిపి దాదాపు 5000 టన్నుల బంగారం వుందనుకుంటే, మిగిలినది దాదాపు 15000 టన్నుల బంగారం ప్రజల దగ్గరే వున్నట్టు లెక్క. మన దేశంలో వున్న మొత్తం బంగారంలో దాదాపు 75శాతం నగల రూపంలో వుంటే, పాతిక శాతం బిస్కట్లు, కడ్డీల రూపంలో వుంటోంది.

భారత్ ఏడాదికి దాదాపు 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి
బంగారం ప్రధానంగా మూడు రూపాల్లో లభ్యమవుతోంది. వీటిలో గనుల తవ్వకాల ద్వారా అయితే, రెండోది వ్యక్తులు తమ దగ్గర వున్న బంగారాన్ని అమ్ముకుని క్యాష్ రూపంలోకి మార్చుకోవడం ద్వారా, మూడోవది వివిధ దేశాలు తమ దగ్గర వున్న బంగారాన్ని విక్రయించడం వల్ల లభ్యమవుతోంది. మన దేశం ఏటా దాదాపు 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ నవంబర్ నెలలోనే వంద టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.

1986లో ప్రత్యేకంగా బంగారు నియంత్రణ చట్టం
బంగారాన్ని స్త్రీలు ధరించే అలంకార వస్తువుగానే కాకుండా, పెట్టుబడి సాధనంగా కూడా చాలామంది భావిస్తున్నారు. బంగారం మీద పెట్టే పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అందుకే బంగారానికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. అయితే, బంగారాన్ని భారీగా విదేశాల నుంచి కొనుగోలు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని అదే స్థాయిలో వెచ్చించాల్సి వస్తోంది. కరెంటు ఖాతా లోటు పెరగడానికి బంగారం దిగుమతులు కూడా కారణమవుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. దీంతో ఒకానొక దశలో బంగారం దిగుమతులను నిషేధించారు. 1986లో ప్రత్యేకంగా బంగారు నియంత్రణ చట్టం కూడా చేశారు. కానీ అది సత్ఫలితాలనివ్వలేదు. బంగారం స్మగ్లింగ్ పెరిగింది. దీంతో బంగారం నియంత్రణ చట్టాన్ని ఎత్తివేశారు. ఫలితంగా బంగారం దిగుమతులు పెరిగాయి.

19:31 - December 2, 2016

ఢిల్లీ : బంగారంపై ఐటీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో దేశంలోని మహిళా లోకం తీవ్ర గందరగోళం పడిపోయారు. తమ వద్ద వున్న బంగారంపట్ల వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు..కానీ ఐటీ శాఖ బంగారంపై జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా వున్నాయి.. వివాహం అయిన మహిళ వద్ద 500 గ్రాముల బంగారం..అవివాహిత మహిళల వద్ద 250 గ్రామలు.. అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా వివాహిత మహిళలు సంప్రదాయబద్ధంగా మెడలో వేసుకునే మంగళసూత్రాలపై ఐటీ శాఖ మినహాయింపునిచ్చింది. తాళిబొట్టుపై ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా తెలిపింది.

బంగారంపై స్పష్టతనిచ్చిన మంత్రి జైట్లీ
బంగారంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుందని... అలాగే పురుషుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉంటే పన్ను విధించనున్నారు. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి ప్రస్తుతం జారీ చేసిన మార్గదర్శకాలు కాదని.. గతంలో కూడా ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. దీనిపై ఇంకా గందరగోళంలో పడిపోయిన మహిళా లోకం నుండి తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో సునీతా రావు(టీ.పీసీసీ సెక్రటరీ)ఉప్పల శారద (బీజేపీ నేత) మంజుల (అడ్వకేట్)పాల్గొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

ఉక్కునగరానికి మరో ముప్పు?..

విశాఖపట్టం : మరో తుపాను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సూపర్ సైక్లోన్ గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావం కొస్తాతీరంపై ఉంటుందని అంతర్జాతీయ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. గతంలో వచ్చిన హుద్ హుద్ తుపాను కోస్తా తీరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. హుద్ హుద్ చేసిన నష్టం నుంచి కోలుకున్న విశాఖ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకుంటోంది. అలాంటి విశాఖపై మరోసారి వాతావరణం కన్నెర్ర చేయనుందన్న వార్తలతో కోస్తావాసులు ఆందోళన చెందుతున్నారు.

విమలక్క కార్యాలయం సీజ్..

హైదరాబాద్ : ప్రజా గాయని, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయేఎఫ్) నాయకురాలు విమలక్క కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే చెందిన ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు హైదరాబాద్ దోమలగూడలోని విమలక్క కార్యాలయాన్ని సీజ్ చేశారు. 

పాండురంగ జలాశయాన్ని పరిశీలించిన కేసీఆర్..

సంగారెడ్డి: పాండురంగ జలాశయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. గ్రామాభివృద్ధికమిటీ సభ్యులతో కలిసి జలాశయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గోదావరి జలాలు 365 రోజులు నిల్వ ఉండేలా జలాశయం నిర్మించామని తెలిపారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ఈ నెల 23న సామూహిక గృహప్రవేశాలు జరుపుకుంటామని వెల్లడించారు.

ప్రధాని మోదీతో బ్రిటన్ మాజీ ప్రధాని భేటీ..

ఢిల్లీ: బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత్ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై నేతలు చర్చించారు.

18:55 - December 2, 2016

గుంటూరు : ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ సందర్భంగా గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీ విద్యార్థులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఎయిడ్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఎయిడ్స్‌ను తరిమికొట్టే బాధ్యత వైద్యులపై ఉందని కాలేజీ సూపరింటెండెంట్ ఏవీ రావు తెలిపారు. 

18:53 - December 2, 2016

విజయవాడ : దేవుడు దయతలిస్తే సంవత్సరంలో ఎన్నికలు వస్తాయని.. లేదంటే రెండు సంవత్సరాల్లో తాను ముఖ్యమంత్రి అవుతానని వైఎస్ జగన్‌మ్మోహన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి రావెల కిషోర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారన్నారు. తన పార్టీ భవిష్యత్ ఏమవుతోందనన్న భయంతో జగన్‌ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

18:52 - December 2, 2016

తూర్పుగోదావరి : కాపు రిజ‌ర్వేష‌న్లు సాధించేవ‌ర‌కూ పోరాటం కొన‌సాగిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగ‌డ ప‌ద్మనాభం స్పష్టం చేశారు. కాకినాడ‌లో జ‌రిగిన కాపు జేఏసీ సమావేశానికి ఆయ‌న అధ్యక్షత వహించారు. అనంతరం నాలుగు ద‌శ‌ల ఉద్యమ కార్యాచ‌ర‌ణ‌ ప్రక‌టించారు. ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ కంచెం, గ‌రిటెతో నిర‌స‌న.. 30న అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల‌కు విన‌తిప‌త్రాలు అందిస్తామ‌ని ప్రక‌టించారు. జ‌న‌వ‌రి 9న కాగ‌డాల ప్రద‌ర్శన చేపడతామని.. వ‌చ్చే నెల 25 నుంచి మ‌రోసారి పాద‌యాత్రకు స‌న్నాహాలు చేస్తున్నామని ముద్రగడ తెలిపారు. 

18:43 - December 2, 2016

అనతంపురం : గొడవ పెట్టుకోవడం చాలా సులభం..తెలివిగా వ్యవహరిస్తేనే అభివృద్ధిని సాధిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడంపై ఆయన అనంతపురం సభలో మరోసారి వివరణ ఇచ్చారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే.. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోవచ్చన్నారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రం మరింత నష్టపోతుందన్నారు ఏపీ సీఎం. పట్టిసీమను వ్యతిరేకించినవారి నోళ్లు మూతపడ్డాయిన ఏపీసీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం సభలో ఆయన గోల్లపల్లి రిజర్వాయర్‌ను ను ప్రారంభించారు. పట్టిసీమనుంచి వచ్చేఏడాది 80టీఎంసీలను తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు చంద్రబాబు.   

18:40 - December 2, 2016

విశాఖ : ఏజెన్సీ ప్రాంతంలో శీతాకాలం చలితో పాటు గిరిజనులకు మరో చిక్కు వచ్చి పడింది. అదే పెద్ద నోట్ల రద్దు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని.. పండించిన పంటలకు వారాంతపు సంతల్లో గిట్టుబాటు ధర రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాడేరు సంతలో 50 లక్షలకుపైగా లావాదేవీలు జరిగేవి. ప్రస్తుతం లావాదేవీలు పూర్తిగా పడిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

18:37 - December 2, 2016

విశాఖ : ఆంధ్రప్రదేశ్ ప్రజల కరెన్సీ అవసరాలు తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ 2వేల 420కోట్ల రూపాయలు పంపింది. ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ నగదు... ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కొత్త కరెన్సీని జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. అవసరాలను బట్టి కొన్ని జిల్లాలకు రూ.240 కోట్లు, కొన్ని జిల్లాలకు రూ.160 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

 

18:32 - December 2, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 7వ వర్ధతి సంస్మరణ సభ నిర్వహించారు. టీజాక్‌ ఛైర్మన్‌ ప్రొ. కోదండరామ్‌, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ కుమార్‌, విద్యార్థి సంఘాలు శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ యూనివర్సిటీ ఆవరణలో మొక్కను నాటారు. శ్రీకాంతాచారి త్యాగనిరతిని విద్యార్థులు స్వీకరించాలని కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షను తెలిపేందుకు శ్రీకాంతాచారి త్యాగం చేశాడన్నారు. అమరులను గుర్తించే విధంగా ప్రత్యేకంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  

18:30 - December 2, 2016

హైదరాబాద్ : తెలంగాణా రెసిడెన్షియల్ స్కూల్స్ ని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్‌తో లీడర్స్ మీట్ - 2016 వర్క్‌షాప్ ఏర్పాటుచేశారు. ఈ వర్క్‌షాప్‌లో రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్ అభ్యర్ధన మేరకు స్కూల్స్ ని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కడియం అంగీకారం తెలిపారు. మరోవైపు వసతులు సరిగ్గా లేని విద్యాసంస్థలు తమకు తెలపాలని.. వచ్చే ఏడాది కల్లా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు.

18:26 - December 2, 2016

ఖమ్మం : ఖమ్మంలో వైద్యులు రోగుల ప్రాణాలు తీస్తున్నారు.. డబ్బుల మీద ఉన్న ఆశ.. రోగుల ప్రాణాలను కాపాడ్డంలో లేదు. రోగులకు అసలు విషయం చెప్పకుండా... ఆపరేషన్‌ చేయడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పో యే పరిస్థితి వచ్చింది. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే గొడవచేస్తే ..మీ అంతుచూస్తామంటూ రౌడీలతో బెదిరస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగి బంధువులు. .స్పందన హార్ట్ కేర్ ఆసుపత్రి వైద్యులు నిర్వాకం బైటపడింది. గర్భసంచిలో గడ్డతో పాటు మరో ఆపరేషన్ ను ఒకేసారి చేశారని..ఆపరేషన్ సక్సెస్ కాలేదని మరోసారి ఆపరేషన్ చేయాలని వైద్యులు అంటున్నట్లుగా బంధువులు పేర్కొంటున్నారు. తొమ్మిదిరోజుల పాటు ఐసీయూలోనే వుంచినట్లుగా బంధువులు పేర్కొన్నారు. ఆపరేషన్ నిమిత్తం రూ.10లక్షల ఫీజ్ వసూలు చేశారని..తీరా ఆసుపత్రికి వచ్చిన తరువాత రౌడీలతో దాడిచేయిస్తామని వైద్యులు బెదిరిస్తున్నారని బంధువులు వాపోతున్నారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని..సదరు మహిళకు ఆపరేషన్ నిమిత్తం ఖర్చు వైద్యులే చెల్లించానలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

18:23 - December 2, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో ప్రజలంతా కష్టాలు పడుతున్నారు. సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఇబ్బందులెదుర్కొంటున్నారు . వీరికే కాదు.. కరెన్సీ కష్టాలు అమాత్యుల పర్యటనపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎంతో ముఖ్యమైన పనైతేతప్ప మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లడం లేదు. కరెన్సీ కష్టాలతో జిల్లాల పర్యటనలు రద్దు చేసుకుంటున్న మంత్రుల పరిస్థితిపై 10టీవీ కథనం...

పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందిపడుతున్న ప్రజలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో యావత్‌ భారతదేశ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో సరిపడ నగదు లేక అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నా వాటిని తమ అవసరాలకు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. నగదు కోసం బ్యాంకుకు వెళితే నో క్యాష్‌ బోర్డులు వారిని వెక్కిరిస్తున్నాయి. దీంతో ఉసూరుమంటూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. నగదు కోసం గంటలకొద్దీ ఏటీఎంల దగ్గర బారులు తీరుతున్నారు.

మంత్రుల పర్యటనలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం
తెలంగాణలో కరెన్సీ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. సామాన్యులకే కాదు.... మంత్రులకూ కరెన్సీ కష్టాల సెగ తగులుతోంది. వారి పర్యటనలపైనా నోట్లరద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అమాత్యుల పర్యటనలకు ఏర్పాట్లు చేయడం కోసం క్షేత్రస్థాయిలోని గులాబీ నేతలు పడరానిపాట్లు పడాల్సి వస్తోంది.ఇక కీలక మంత్రులు జిల్లాల పర్యటనకు వస్తే.. ఈ భారం మరింత ఎక్కువవుతోంది.

ప్రచారం, జనసమీకరణకు ఇబ్బంది
మంత్రుల జిల్లాల పర్యటనకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే జనసమీకరణ, ప్రచారం బాధ్యత లోకల్‌ క్యాడర్‌దే. నోట్లరద్దుతో గతంలో మాదిరిగా ఘనంగా ఏర్పాట్లు చేయడం సాధ్యంకావడం లేదని గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. జిల్లాల్లో రాష్ట్ర స్థాయి నేత పర్యటనకు వచ్చినప్పుడు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతే అది మరో సమస్యకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిధుల సమస్యే దీనికంతటికి ప్రధాన కారణమని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

జిల్లాల పర్యటనను రద్దు చేసుకుంటున్న అమాత్యులు
క్షేతస్థాయిలో క్యాడర్‌ పడుతున్న కరెన్సీ కష్టాలను గుర్తించిన మంత్రులు తమ జిల్లాల పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యమైన పనైతేనే జిల్లాలకు వెళ్తున్నారు. కరెన్సీ కష్టాలు తీరే వరకు మంత్రులు తమ పర్యటనలను ఆచితూచి ఖరారు చేస్తున్నారన్న చర్చ గులాబి దళంతో జరుగుతోంది.

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. 2017/18 సంవత్సరానికి గాను బడ్జెట్ పై సమావేశంలో చర్చ జరుగుతోంది. బడ్జెట్ పై చర్చించి మార్పులు..చేర్పులు చేసేందుకు కమిటీ చర్చలు జరుపుతోంది. నవంబర్ 17న రూ.5,643 కోట్ల బడ్జెట్ ను అధికారులు ప్రతిపాదించారు.

మార్కెట్ లోకి మరిన్ని రూ.500నోట్లు ..

ఢిల్లీ : చిల్లర దొరక్క ప్రజలు పడుతున్న కష్టాలను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..మార్కెట్‌ లోకి మరిన్ని కొత్త రూ.500 నోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రూ.500 నోట్లను మరింత సర్క్యులేషన్ లోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే నగదు కొరత తీరుతుందని వ్యాఖ్యానించారు. పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను గమనిస్తున్నామని, క్యాష్‌ రిజర్వు రేషియో (సీఆర్‌ఆర్‌)పై భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నెల 9న సమీక్షిస్తుందని తెలిపారు.

ఐటీ తనఖీల్లో భారీ ఆస్తులు స్వాధీనం..

కర్ణాటక : బెంగళూరులో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.5.7కోట్ల నగదుతోపాటు 9 కిలోల బంగారం, పలు డాక్యుమెంట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నగదులో 90 లక్షల విలువైన పాత నోట్లుండగా..మిగతావి రూ.2 వేల నోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

17:33 - December 2, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. 2017/18 సంవత్సరానికి గాను బడ్జెట్ పై సమావేశంలో చర్చ జరుగుతోంది. బడ్జెట్ పై చర్చించి మార్పులు..చేర్పులు చేసేందుకు కమిటీ చర్చలు జరుపుతోంది. నవంబర్ 17న రూ.5,643 కోట్ల బడ్జెట్ ను అధికారులు ప్రతిపాదించారు. గతంతో పోల్చుకుంటే కేవలం 5వేల 4వందల కోట్లను మాత్రమే పెంచినట్లుగా తెలుస్తోంది. నగదు రద్దు కారణంగా భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులపై స్టాండింగ్ కమిటీ చర్చిస్తుస్తోంది. 

17:18 - December 2, 2016

పశ్చిమగోదావరి : సాధించాలన్న తపన, కష్టపడేతత్వం.. వెరసి పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారయన. ఒక వైపు రంగాలను విస్తరిస్తూనే, మరోవైపు సంపాదించిన సొమ్ములో కొంత శాతం సమాజక సేవా కార్యక్రమలకూ ఖర్చు చేస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిచెబుతున్నారు ప్రసాదిత్య గ్రూపు సంస్థ అధిపతి మోటపర్తి శివరామ ప్రసాద్‌ ....

మోటపర్తిని వరించిన పలు అవార్డులు
మనసుంటే మార్గం ఉంటుంది. కష్టపడేతత్వ అన్ని రంగాల్లో విజయం సాధ్యమవుతుందని నిరూపించారు ప్రసాదిత్య గ్రూపు సంస్థల అధిపతి మోటపర్తి శివరామ ప్రసాద్‌. మూతపడిన పరిశ్రమలను సొంతం చేసుకుని, లాభాలబాట పట్టించి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. పారిశ్రామిక, వ్యాపార రంగాలను బహుముఖంగా విస్తరించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. అవార్డులు సొంతం చేసుకుంటున్నారు.

1985లో పటాన్‌చెరులో మార్టో పెరల్‌ అల్లాయ్స్‌ కొనుగోలు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రసాద్‌... 1971లో వరంగల్‌ ఆర్‌ఈసీ నుంచి ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందారు. 1985లో మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో రాష్ట్ర ఆర్థిక సంస్థ సహకారంతో మూతపడిన మార్టో పెరల్‌ అల్లాయ్స్‌ పరిశ్రమను కొనుగోలు చేయడం ద్వారా పారిశ్రామికరంగంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత పటాన్‌చెరులోనే మూతపడిన డంకన్‌ అల్లాయ్స్‌ కంపెనీని సొంతం చేసుకుని లాభాట బాట పట్టించారు. హైదరాబాద్‌, అమెరికాలో పరిశ్రమలు స్థాపించిన మోటపర్తి శివరామ ప్రసాద్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ప్రణాళికులు రూపొందిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో పంట సాగు
ఏపీలో కోకో ఆధారంగా ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కోకో పంట సాగువుతోంది. ఆఫిక్రాలో ఈ రంగంలో పరిశ్రమలు నిర్వహిస్తున్న శివరామ ప్రస్తాద్‌.. ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే ఆటోమొబైల్‌ రంగంలోనూ విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టోలో వెస్ట్‌ ఆఫ్రిపక్‌ సిమెంట్‌ ఎస్‌ఏ వాసెమ్‌ కొనుగోలు
1991లో ఘనాలో టెమా స్టీల్‌ కంపెనీ కొనుగోలు చేయడం ద్వారా ప్రసాదిత్య గ్రూపు ఆఫ్రికా మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత టోగోలోని వెస్ట్‌ ఆఫ్రికన్‌ సిమెంట్‌ ఎస్‌ఏ వాసెమ్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరిన్ని దేశాలకు విస్తరించింది. ఆటోమొబైల్స్‌, ఐటీ, రసాయనాలు, వినోదం, మౌలికసదుపాయాలు... ఇలా బహుముఖ రంగాల్లో విజయం సొంతం చేసుకుంది.

భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య.. అసోచామ్‌ అవార్డు
విజయవంతమైన పారిశ్రామికవేత్తగా మోటపర్తి శివరామ ప్రసాద్‌ పలు అవార్డులు అందుకున్నారు. భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య.. అసోచామ్‌ నుంచి ప్రసాదిత్య గ్రూపు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.ప్రసాదిత్య గ్రూపు ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. నినూత్న ఆలోచనలు, నిరంతర సాధనతో విజయవంతమైన పారిశ్రామివేత్తగా గుర్తింపు పొందిన మోటపర్తి శివరామ ప్రసాద్‌ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

17:02 - December 2, 2016

హైదరాబాద్‌ : ఆర్టీసీ సిబ్బందికి వేతన కష్టాలు తప్పడం లేదు. జీతంతో సంబంధం లేకుండా 10 వేలు మాత్రమే చెల్లిస్తుండటంతో బ్యాంకుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలోని ఎస్బీహెచ్‌ కార్యాలయానికి ఆర్టీసీ ఉద్యోగులు పోటెత్తారు. ఆర్టీసీ ఉద్యోగుల వెతలపై వారేమంటున్నారో తెలుసుకోండి వీడియోలో..

ఏపీకి చేరిన రూ. 2,420 కోట్లు..

విజయవాడ : ఏపీకి నగదు చేరింది. ఏపీకి మొత్తం రూ. 2,420 కోట్లను ఆర్బీఐ పంపింది. విశాఖ, తిరుపతి, రేణిగుంట విమానాశ్రయాలకు నగదు చేరుకుంది. అవసరాలను బట్టి కొన్ని జిల్లాలకు రూ. 160 కోట్లు, కొన్ని జిల్లాలకు రూ. 240 కోట్లు కేటాయించినట్లు సమాచారం. 

17:00 - December 2, 2016

గుంటూరు : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఈరోజు ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించి.. చిరు వ్యాపారులతో.. చిల్లర సమస్యతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిస్టులు నల్లధనం వున్నవారిని మసర్థిస్తున్నారని బీజేపీ పేర్కొంటోందని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సమస్యను పక్కదారి పెట్టటానికి యత్నిస్తున్నారని నారాయణ విమర్శించారు. రాజకీయ అవినీతిని రూపు మాపకుండా ఎటువంటి నిర్ణయాలూ సఫలం కావని ఆయన పేర్కొన్నారు. 

16:57 - December 2, 2016

విజయవాడ : బంగారంపై పెట్టిన ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేయాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సూచించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అవినీతికి పాల్పడుతున్న బ్యాంక్ మేనేజర్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్ పర్యటన..

సిద్దిపేట : ఎర్రవెల్లి, నర్సన్నపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నిర్మాణమౌతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. 

16:53 - December 2, 2016

అనంతపురం : కష్టాలొచ్చాయని వ్యాపారాలు మానేస్తే నష్టపోతారు. చిల్లర సమస్యతో పనులు చేయడం మానేస్తే.. వెనుకబడిపోతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమాటలివి. అనంతపురం జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్‌ ప్రారంభోత్సవ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుసుకున్న నోట్ల రద్దు నిర్ణయం యాన్ని సమర్దించిన బాబు.. చిల్లర నోట్లు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఓపిక పట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెయ్యి, ఐదువందలు రద్దై ఇప్పటికే 25రోజులు గడిచిపోయాయి..మరో నెల రోజులు చిల్లర సమస్యలు ఉంటాయని .. అంతవరకు ఓపికపట్టాలన్నారు చంద్రబాబు. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 329 పాయింట్లు నష్టపోయి 26,230 వద్ద సెన్సెక్స్ ముగియగా 106 పాయింట్లు నష్టపోయి 8,086 వద్ద నిఫ్టీ ముగిసింది. 

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ..

ఢిల్లీ : నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నోట్ల రద్దుపై సమగ్ర వివరాలు అందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అన్ని పిటిషన్లపై ఈనెల 5న విచారణ చేపడుతామని సుప్రీం పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 5కి వాయిదా వేసింది.

16:28 - December 2, 2016

విజయవాడ : కరెన్సీ సమస్యలు కొనసాగుతున్నాయి.. రోజులకొద్దీ బ్యాంకులచుట్టూ తిరుగుతున్నా క్యాష్ దొరక్క స్థానికులు అవస్థలు పడుతున్నారు..మరోపక్క చిల్లర లేమితో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చిల్లర లేమితో వెలవెలబోతోంది. నిత్యం రోగులతో ఎంతో రద్దీగా వుండే ఈ ఆసుపత్రి రోగులు లేక వెలవెలబోతోంది. దీని ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఏమంటున్నారో చూద్దాం..అవినీతిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు మంచి పద్ధతేనని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో పాతనోట్లతోనే వైద్యం అందిస్తున్నామని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో పాతనోట్లను స్వీకరించి వైద్యం చేస్తేనే రోగులకు వైద్యం అందించే అవకాశం వుంటుందనీ.. పాతనోట్లను ఆసుపత్రిలో కొత్తే నోట్లే కావాలని పట్టుపడితే అది మానవత్వం కాదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. నోట్ల రద్దు అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిపోయిందని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. రోగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకుండా వారు తెచ్చిన క్రెడిట్ కార్డులతో వచ్చే వారు 20శాతం మంది వుంటే .. పాతనోట్లతో వచ్చేవారు 80శాతంమంది వున్నారనీ..రోగులు అవసరాన్ని బట్టి సానుకూలతను బట్టి వైద్యం అందిస్తున్నట్లుగా ప్రసాద్ తెలిపారు. దాదాపు 80 శాతం పాతనోట్లతోనే వైద్యం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆన్ లైన్ వ్యవహారాలు పూర్తిస్థాయి అమలు జరగటానికి సుదీర్ఘకాలం పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చిల్లర లేమితో 90శాతం కొనుగోలు ఆగిపోయిందనీ.. మెడికల్ షాపు యజమాన్యులు పేర్కొంటున్నారు.

16:27 - December 2, 2016

మెగా బ్రదర్స్ వెండి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులో 'చిరంజీవి'..'పవన్ కళ్యాణ్' కలిసి నటిస్తే ? ఇంకేముందు మెగా అభిమానులకు పండుగే పండుగ. కానీ కథ ఉండాలి కదా ? అని అనుకుంటుంటారు. అలాంటి కథ సిద్ధమైందని...వీరిద్దరూ నటించనున్నారని టాలీవుడ్ లో..సోషల్ మాధ్యమాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కోరిక త్వరలోనే నిజం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'చిరంజీవి' వెండితెరపై త్వరలోనే కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు 'పవన్' కూడా వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంతేగాకుండా 'పవన్' నిర్మాతగా మారి చిత్రాలు కూడా నిర్మించే యోచనలో ఉన్నారనే సంగతి తెలిసిందే. తొలిగా 'నితిన్'తో ఓ సినిమా కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంచితే...'చిరంజీవి'ని ఇటీవలే మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' కలిసినట్లు..ఓ చిత్రం కథ గురించి తెలియచేసినట్లు తెలుస్తోంది. 'పవన్' నిర్మాత అని 'తివిక్రమ్' పేర్కొనడం..'చిరు' సై అనడం జరిగిపోయాయని టాక్. 'తివిక్రమ్' తీసిన సినిమాలు ఎలాంటి విజయాలు నమోదు చేశాయో తెలిసిందే. దీనితో 'చిరు' కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఒకవేళ నిజమైతే 'చిరు' 151 లేదా 152వ సినిమా ఇదే అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. 

16:22 - December 2, 2016
16:08 - December 2, 2016

అనంతపురం : జిల్లా పెనుగొండ సమీపంలో నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గంగపూజ నిర్వహించి... జలాశయాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. దీంతో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న అనంత ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్టు అయ్యింది. ఈ జలాశయం ద్వారా పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు నీరు లభించనుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. రిజర్వాయర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. 

16:07 - December 2, 2016

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న షూటింగ్ లో 'చిరు' పాల్గొంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు 'చిరు'..చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందంట. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై పలు కథనాలు..వార్తలు వెలువడుతున్నాయి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'లక్ష్మీరాయ్‌' ఓ ఐటెం సాంగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. 'చిరు' తనయుడు 'రామ్ చరణ్' ఈ సినిమాలో గెస్ట్ ఎప్పిరియన్స్ ఇస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో 'చరణ్ ఓ పాటలో డ్యాన్స్ చేయడానికి వస్తాడని టాక్. 'చిరు' అంటేనే డ్యాన్స్ లు. 'చరణ్' కూడా జత కలుస్తాడన్న టాక్ తో ఈ సినిమా టాప్ లేపేస్తుందని అభిమానులు అనుకుంటున్నారంట. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే 'ఖైదీ' ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 

15:59 - December 2, 2016

పెద్దపల్లి : పెద్ద నోట్ల రద్దుతో పెళ్లిళ్లు వింత వింత పద్ధతుల్లో జరుగుతున్నాయి. కేంద్రం విధించిన రెండున్నర లక్షల రూపాయలతో పెళ్లిళ్లు చేసుకోలేక పెళ్లివారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ పెళ్లికి హాజరైన కమాన్‌పూన్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈర్ల సురేందర్ నూతన వధూవరులకు కానుకగా ఐదువేల రూపాయలను ఇవ్వడం ప్రాధాన్యత చోటుచేసుకుంది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చెక్కు రూపంలో కానుక ఇచ్చానని తెలిపారు.

15:52 - December 2, 2016

విజయవాడ : నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై చంద్రబాబు రూటు  మార్చారా..నియోజకవర్గాల పెంపు విషయంలో సరికొత్త వ్యూహానికి పదును పెడుతున్నారా..ఇటు సొంత పార్టీని బలోపేతం చేస్తూనే...అటు గ్రూపు తగాదాలకు చెక్‌ పెట్టేందుకు పక్కాప్లాన్‌ సిద్ధం చేశారా..అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు.

నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణపై రూటు మార్చిన బాబు
ఎన్నో రాజకీయ వ్యూహాలు..ప్రతివ్యూహాలు రచించడంలో అపర చాణక్యుడిగా పార్టీ వర్గాలు చెప్పుకునే చంద్రబాబు...మరో పదునైన అస్త్రాన్ని సంధించే యోచనలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగురాష్ట్రాల్లోనూ అధికార పార్టీలోకి భారీగా వలసలు వచ్చి చేరాయి. విభజన చట్టం పుణ్యమా అని..ఇరు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపు జరిగే అవకాశం ఉందని పార్టీలు భావించాయి. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెరిగిన స్థానాల్లో సీట్లు కేటాయించవచ్చనే ఆలోచనతో..అధికార పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాయి.

సీట్ల పెంపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకూడదని నిర్ణయించుకున్న బాబు
అయితే ప్రస్తుతం నియోజక వర్గాల పెంపు డిమాండ్‌ను తెరమరుగు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. సీట్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తేకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చాలా చోట్ల వైసీపీ అస్తిస్తత్వం గల్లంతయ్యే పరిస్థితి ఉందని టీడీపీ నేత అంచనా వేస్తున్నారు. అలాంటప్పడు నియోజకవర్గాల పెంపు వైసీపీకి అనుకూలంగా మారితే ప్రమాదమని భావిస్తున్నారు. అందుకే ఉన్న నియోజకవర్గాలోనే పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.

23 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
మరోవైపు రాష్ట్రంలో భారీగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక సంస్థలను కలుపుకొని 23 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. వీటిలో టీడీపీ అత్యధికంగా 20 స్థానాల వరకూ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటినీ పార్టీలోని అసంతృప్తి నేతలతో భర్తీ చేస్తే..సమస్య పరిష్కారమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో గ్రూప్‌ తగాదాలకు చెక్‌ పెట్టాలని యోచిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు, గ్రూప్‌ తగాదాలకు చెక్‌ పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు ప్లాన్‌ ఏ మేరకు విజయవంతమమవుతుందో వేచి చూడాలి. 

15:45 - December 2, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదిపై మరోసారి మాటల దాడి చేసారు. సోనియా అస్వస్థత కారణంగా తొలిసారిగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాహుల్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ప్రధాని టిఆర్‌పి రాజకీయాలు కొత్త సంక్షోభానికి దారి తీస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రధానమంత్రులెవరూ టిఆర్‌పి ఆధారంగా పరిపాలన సాగించలేదన్నారు. పాకిస్తాన్‌ విషయంలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల విచిత్రమైన పరిస్థితి నెలకొందని రాహుల్‌ ఆరోపించారు. భారత్‌లో నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, చలామణిలో ఉన్న నగదంతా నల్లధనం కాదన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

15:43 - December 2, 2016

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ సుబ్బరామిరెడ్డికి కోపం వచ్చింది. బ్యాంకుల్లో నగదు కొరత లేదంటూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఇచ్చిన రాత పూర్వక సమాధానంపై ఆగ్రహ వ్యక్తం చేశారు. మంత్రి సమాధానం సభను తప్పుదోవపట్టించే విధంగా ఉందని జోరో అవర్‌లో మండిపడ్డారు. 

15:39 - December 2, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలు సైబర్‌ భద్రతకు ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. స్వైపింగ్‌ మెషీన్లు సరిగా పని చేయడంలేదని, దీంతో బ్యాకింగ్‌, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని జీరో అవర్‌లో సభ దృష్టికి తెచ్చారు.

15:36 - December 2, 2016

ఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో ఆర్మీ వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. ఉదయం వాయిదా అనంతరం.. మధ్యాహ్నం రెండున్నరకు సమావేశమైన సభలో... బెంగాల్‌లో సైన్యం మొహరింపుపై టీఎంసీ పెద్దనోట్లపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేసినా.. పరిస్థితి అలాగే ఉండటంతో.. సభను సోమవారానికి వాయిదా వేశారు. 

లోక్ సభలోనూ ఇదే తీరు 
లోక్ సభలో ప.బెంగాల్ రగడబెంగాల్‌లో ఆర్మీ మోహరింపుపై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగింది. సభ ప్రారంభంకాగానే పశ్చిమ బెంగాల్‌లో బలగాల మోహరింపుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆర్మీని ఎలా మోహరిస్తారని టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ ప్రశ్నించారు. రాజకీయాల కోసం సైన్యాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. మోహరించిన బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయాల కోసం ఆర్మీని వాడుకోవడం లేదని కేంద్రమంత్రి అనంతకుమార్‌ అన్నారు. దేశ రక్షణ కోసమే ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ తనిఖీలు నిర్వహిస్తోందని రక్షణశాఖ మంత్రి పారికర్‌ స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలను రాజకీయం చేయొద్దని ఆయన సూచించారు. నవంబర్‌లో జరగాల్సిన ఆర్మీ తనిఖీలు అనివార్య కారణాలరీత్యా డిసెంబర్‌కు వాయిదా పడ్డాయన్నారు. అయితే బలగాలను ఉపసంహరించాల్సిదేనని టీఎంసీ సభ్యులు పట్టుబట్టారు.

 

15:30 - December 2, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతో బ్యాంకులు విఫలమయ్యాయంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించడాన్ని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం తప్పుపట్టింది. చంద్రబాబు తన కోపతాపాలను కేంద్ర ప్రభుత్వంపై చూపితే మంచిదని సూచించింది.

బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య పెంచాలి : ఏబీఓఏ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు లిమిటెడ్‌గానే డబ్బు చెల్లింపులు చేసే పరిస్థితి నెలకొందని అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ ఖరే అన్నారు. ప్రజలకు సేవలు చేసేందుకు బ్యాంకు ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తూ తమవంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 5 వందలు, వంద నోట్ల కొరత తీవ్రంగా ఉందని, సరిపడా నోట్లు ముద్రించడంలో కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్‌ విఫలమయ్యాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బ్యాంకులను విస్తరించి ఉద్యోగుల సంఖ్య పెంచాలని ఆల్‌ ఇండియా బ్యాంకర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మనదేశంలో13 వేల మందికి ఒక బ్యాంకు ఉందని, అదే అమెరికాలో 3 వేల మంది ఒక బ్యాంకు ఉందని ఆయన అన్నారు.

'సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చర్యలు'...

అనంతపురం : ఆదాయం తగ్గినా సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీల కోసం కేంద్రం కమిటీ వేసిందన్నారు. 

కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం - ముద్రగడ..

తూర్పుగోదావరి : కాపుల రిజర్వేషన్ల కోసం నాలుగు దశల ఉద్యమం జరుగుతుందని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. డిసెంబర్ 18న ఖాళీ పళ్లెం, గరిటతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..30న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు..జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన..జనవరి 25న రావులపాలెం నుండి పాదయాత్ర ప్రారంభమౌతుందన్నారు. ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే తగిన రీతిలో సమాధానం చెబుతామని పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతికోరే ప్రసక్తే లేదన్నారు. 

కేసీఆర్ కు పాలనా అనుభవం లేదు - షబ్బీర్..

హైదరాబాద్ : కేసీఆర్ కు పాలన అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనలో రుజువైందని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. హామీలను గాలికొదిలేసి మాటలతో గడిపేస్తున్నారని, అబద్దాలు ధైర్యంగా, అందంగా చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం చెందారని, బంగారు తెలంగాణ కాదని..చీకటి తెలంగాణగా తయారైందని విమర్శించారు. 

నయీం కేసును నిర్వీర్యం చేస్తున్నారు - ఉత్తమ్..

హైదరాబాద్ : నయీం కేసును కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

నయీం అనుచరుడిపై వ్యక్తి ఫిర్యాదు..

యాదాద్రి : నయీం అనుచరుల నుండి ప్రాణభయం ఉందని, రాచకొండ కమిషనర్ కు నరేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. రాత్రి నయీం ముఖ్య అనుచరుడు సుధాకర్ అనుచరులు మారణాయుధాలతో ఇంటికి వచ్చి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫలాలు కేసీఆర్ కు..కష్టాలు ప్రజలకా - టి.టిడిపి..

హైదరాబాద్ : తెలంగాణ ఫలాలు కేసీఆర్ కుటుంబానికి...కష్టాలు ప్రజలకా ? అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కోర్టు ఆదేశాలు లెక్క చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఐదు పార్టీలను చీల్చిన ఘనత టీఆర్ఎస్ దేనని పేర్కొన్నారు. 

కేంద్రంపై రఘువీరా విమర్శలు..

హైదరాబాద్ : బంగారం జోలికొస్తే మోడీ భస్మంకాక తప్పదని, మోడీ నగదు, బంగారం రహిత భారత్ అంటే ప్రజలు బీజేపీ రహిత భారత్ చేస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. క్యాష్ లెస్ భారత్ అనడం మూర్ఖత్వం అని, పిచ్చోడి చేతిలో రాయి..మోడీ, బాబు చేతిలో పాలన ఒకటే అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులు వదిలి జీతాల కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారని రఘువీరా విమర్శించారు. జనాన్ని బ్యాంకుల ఎదుట క్యూ కట్టించిన ఘనత మోడీదేనని, అవినీతిపై యుద్ధం అంటున్న మోడీ ఎన్నికల ప్రచారానికి రూ. 5వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు.

 

మహాజన పాదయాత్ర 1200 కి.మీ..

కామారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర నిరాఘటంగా కొనసాగుతోంది. కాసేపటి క్రితం 1200 కి.మీ.పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేక్ ను కట్ చేశారు. 

13:56 - December 2, 2016

ఎయిడ్స్ నివారణలో ఆశావర్కర్ల పాత్ర కీలకమని ఆశావర్కర్స్ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ జయశ్రీ అన్నారు. 'డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సం' ఇదే అంశంపై మానవి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఎయిడ్స్ నివారణలో అశావర్కర్లు ఎనలేని సేవలు చేస్తున్నారని తెలిపారు. ఆశావర్కర్స్ ద్వారా ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో ఎయిడ్స్ నివారణలో అశావర్కర్ల పాత్ర కీలకమన్నారు. ఎయిడ్స్ పై అవగాహన చాలా అవసరమని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

'నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం'...

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దు అనాలోచిత నిర్ణయమని, ప్రజల డిమాండ్ కు తగ్గట్టు నగదు సరఫరా లేదని ఆలిండియా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. 86 శాతం పెద్దనోట్లే చలామణిలో ఉండగా వాటికి తగిన సంఖ్యలో నోట్లు సిద్ధం చేయడం లేదని, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకే నగదు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకులకు నగదు సరఫరా చేయడం లేదని, బ్యాంకు ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు సరికాదన్నారు. బ్యాంకు ఉద్యోగులు 14 గంటలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 

13:48 - December 2, 2016

కామారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 47 వ రోజు కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. నర్సన్నపల్లి, పాతరాజాంపేట, సారంపల్లి ఎక్స్ రోడ్ లో పాదయాత్ర సాగుతోంది. మహాజన పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. కామారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గిరిజనుల విద్య..వైద్యంపై దృష్టి పెట్టాలి - సీపీఎం మధు..

విశాఖపట్టణం : గిరిజనుల విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రూ. 40 కోట్లు కాఫీ పంట బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్ : నగరంలో పోలీసులు డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. 14 గ్రాముల కొకైన్, 7 గ్రాముల హెరాయిన్, 5 కిలోల గంజాయిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. 

13:45 - December 2, 2016

ఆయనో మంత్రి..బాధ్యాతయుతమైన పదవిలో ఉంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ పలు వ్యాఖ్యలు చేస్తుండడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా గోవా సాంస్కృతిక శాఖ మంత్రి దయానంద్ మంద్రేకర్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళలపై టీవీల్లో వచ్చే సీరియల్స్ ప్రభావం చూపెడుతున్నాయని, కష్టపడి వచ్చిన భర్తకు కనీసం కప్పు కాఫీ కూడా ఇవ్వడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సదరు మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టీవీల్లో ఎన్నో ప్రోగ్రామ్ లు వచ్చినా సీరియల్స్ పైనే మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని, గ్రామాల్లో నిర్వహించే ఎన్నో కార్యక్రమాలు..సంప్రదాయ పండుగల‌కు మహిళలు హాజ‌రు కావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా మంత్రి మంద్రేకర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి. మహిళలను కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మహిళలను అవమానపర్చడం బీజేపీ నేతలను కొత్తేమీ కాదని విమర్శిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

13:35 - December 2, 2016
13:30 - December 2, 2016

లోక్ సభ సోమవారానికి వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమైన 12వ రోజు కూడా అవే పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ బెంగాల్ లో ఆర్మీ మోహరింపుపై విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

13:28 - December 2, 2016
13:26 - December 2, 2016

టాలీవుడ్..కోలీవుడ్..మాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా నటించే హీరో..హీరోయిన్స్ ల విషయాలపై ఏన్నో గాసిప్స్..రూమర్స్ వస్తుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో పలువురు నటులు, నటీమణులు నిలుస్తుంటారు. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో 'నయనతార' ఒకరు. ఈ ముద్దుగుమ్మపై పలు గాసిప్స్..రూమర్స్ వచ్చిన సంగతి తెలిందే. తాజాగా 'నయన' సీక్రెట్ బయటపడిందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. గతంలో 'శింబు' తరువాత కొరియోగ్రాఫర్, దర్శకుడు 'ప్రభుదేవా'తో ప్రేమలో మునిగినట్లు ప్రచారం జరిగింది. తాజాగా 'విఘ్నేష్ శివన్' తో సీక్రెట్ గా 'నయన్' పెళ్లి చేసుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో దీనిపై తెగ చర్చ జరుగుతోందంట. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఒక ఖరీదైన ఇంటిని 'నయనతార' ఖరీదు చేసిందని..ఈ ఇంట్లోనే 'విఘ్నేష్' తో సహజీవనం చేస్తోందని...పెళ్లి కాకుండానే సహజీవనం మొదలు పెట్టారా ? అనే మరో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలు నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే 'నయన' నోరు విప్పల్సాందే. అప్పటి వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. 

13:23 - December 2, 2016

సంగారెడ్డి : 24 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కష్టాలు తీరడం లేదు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎమ్‌లు సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. కొన్ని చోట్ల పనిచేయని ఏటీఎంలతో జనం విసుగెత్తిపోతున్నారు. పలు ఏటీఎమ్‌ సెంటర్ల ముందు నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు బ్యాంకుల వద్ద వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు కూడా సామాన్యుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో సంగారెడ్డిలోని ఎల్ ఐసీ శాఖలో కలెక్షన్స్ రూ.2 లక్షలకు పడిపోయాయి. గతంలో సంగారెడ్డి ఎల్ ఐసీ శాఖలో ప్రతి రోజూ రూ.30 లక్షల కలెక్షన్స్ ఉండేవి. చాలా చోట్ల ఎస్ ఐసీ ప్రీమియంల చెల్లింపులు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆప్ ఎంపీ మాన్ ప క్రమశిక్షణ చర్యలు..

ఢిల్లీ : ఆప్ ఎంపీ భగవత్ మాన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వచ్చే వారం లోక్ సభకు హాజరు కావద్దని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో పార్లమెంట్ భద్రతా నిబంధనలు మాన్ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. 

హంద్రీ నీవా నుండి నీరు విడుదల..

అనంతపురం : గంగపూజ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీనివా నుండి నీటిని విడుదల చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ కు ఈ నీటిని విడుదల చేశారు. c

చైనాలో ఘోర బస్సు ప్రమాదం..

చైనా : హుబెయ్ ప్రాంతంలోని మావోలింగ్‌ టౌన్‌షిప్‌ వద్ద బస్సు అదుపు తప్పింది. న‌దిలో ప‌డిపోవడంతో 18 మంది మృతి చెందారు. మొత్తం బస్సులో 20 మంది ఉన్నారు. 

13:10 - December 2, 2016

అనుకున్నదే జరిగింది. డిజాస్టర్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ న్యూ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జనతా గ్యారేజ్ లాంటి బిలియన్ క్లబ్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ప్లాప్ డైరెక్టర్ తో మూవీ చేస్తుండడం హాట్ టాపిక్ మారింది. ఎన్టీఆర్ తో ఛాన్స్ పట్టేసిన ఆ ప్లాప్ డైరెక్టర్ ఎవరో ఆ మూవీ విశేషాలేంటో వాచ్ దీస్ స్టోరీ.
జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్టీఆర్  
జనతా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్టు ని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేయాడానికి ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడడు. వరుసగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ డైరెక్టర్ కథలు చెప్పినా వినేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా యంగ్ టైగర్ ని ఒప్పించలేకపోయాడనే టాక్ వినిపిస్తుంది. అయితే సర్థార్ తో ఖంగుతిన్న బాబీ చెప్పిన స్టోరీకి మాత్రం ఎన్టీఆర్ శాటిస్ఫై అయినట్లు సమాచారం.
ఎన్టీఆర్ కోసం పవర్ పుల్ స్టోరీ 
సర్థార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తో షాక్ అయిన బాబీ ఒక్క ఛాన్స్ అంటూ చాలా మంది హీరోలకు స్టోరీలు చెప్పాడు. రవితేజ కోసం క్రాక్ అనే కథ రెడీ చేసి బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఈ దర్శకుడు ఓ పవర్ పుల్ స్టోరీని సిద్ధం చేసి వినిపించినట్లు తెలుస్తుంది. ఈ స్టోరీ లైన్ విన్న ఎన్టీఆర్ వెంటనే పూర్తి స్టోరీని తీసుకురమ్మని చెప్పాడట.
బాబీ...కత్తిలాంటి స్క్రిప్ట్
సర్ధార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తర్వాత బాబీ ఎలాగైనా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక కత్తిలాంటి స్క్రిప్ట్ రెడీ చేశాడట. అది ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతోనే బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫీల్మ్ నగర్ లో వినిపిస్తుంది. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్లో ముందెకెళ్తున్నాడనేది పెద్ద సస్పెన్స్ గా మారిన తరుణంలో బాబీ డైరెక్షన్ లో మూవీ రెడీ అవుతుండడం ఫిల్మ్ సర్కిల్స్ లో సన్సేషన్ గా మారింది. మరి ఈ న్యూస్ నిజమవుతుందా లేక గాసిప్పా అనేది త్వరలోనే తెలిపోతుంది.

 

13:03 - December 2, 2016

పీవీపీ..మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమాలు నిర్మితమయ్యాయి. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాణంలో 'బ్రహ్మోత్సవం' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే నిర్మాత ప్రసాద్ వి పొట్లూరితో మరో సినిమా చేసేందుకు 'మహేష్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వెల్లువడ్డాయి. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పొస్టర్ పై 'మహేష్' స్పందించలేదు. తాజాగా పీవీపీ సంస్థ 'మహేష్' తో నిర్మించాల్సిన సినిమా మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' బిగ్ హిట్ అందించిన 'దిల్' రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్టు రూపొందుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం 'మహేష్' కోసం కథను తయారు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రిన్స్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే 'కొరటాల' శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేష్ అంగీకరించినట్లు టాక్. వీటి గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

13:01 - December 2, 2016

అల్వాల్ లో విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్ : అల్వాల్ లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గౌత‌మి కేఎంఆర్ క‌ళాశాల‌లో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఆటో డ్రైవర్ల వేధింపులతోనే గౌతమి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

12:59 - December 2, 2016
12:56 - December 2, 2016

టాలీవుడ్ ఆడియన్స్ ని రకూల్ ప్రీత్ సింగ్ థ్యాంక్స్ చెప్పుతుంది. ఎప్పటికి తెలుగు ఆడియన్స్ ప్రేమకి రుణపడి ఉంటానంటుంది. ఈ బ్యూటీ ఏంటీ పొలిటిషియన్ లా మాట్లాడుతుందనుకుంటున్నారా, రకూల్ మరి ఇంత ఎమోషనల్ గా మాట్లాడానికి రిజన్ ఏంటో మీరు ఓ లుక్కెయండి. 
దూసుకుపోతోన్న రకుల్   
తెలుగు తెరపై అందాల కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రకూల్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి చిన్న సినిమాతో కెరియర్ ను ఆరంభించిన ఈ సుందరి షార్ట్ టైంలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 
టాలీవుడ్ హీరోలకి ఫేవరేట్ హీరోయిన్ గా రకూల్  
రకూల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోలకి ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులే వున్నాయి. స్టార్ హీరోయిన్ స్థాయిని ఎంజాయ్ చేస్తోన్న రకుల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు పూర్తయింది. పూర్తయ్యాయి. ఈ విషయాన్నిట్విట్టర్ ద్వారా తెలిపిన ఈ చిన్నది కెరీర్ చాలా అందంగా, ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. ఇంతగా తనని ఆదరిస్తోన్న తెలుగు  ప్రేక్షకులకు ఎప్పటికి రుణపడి ఉంటానని, థ్యాంక్స్ అంటూ సంతోషాన్ని పంచుకుంది.
ముగ్గురు హీరోలతో రకూల్ 
ఈ ఎడాది నాన్నకు ప్రేమతో సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ తో మరోసారి నటించిన ధృవ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. దీంతో పాటు మురుగదాస్, మహేష్ బాబు మూవీతో పాటు సాయిధరమ్ తేజ్ విన్నర్ లోనూ రకూల్ హీరోయిన్ గా నటిస్తుంది.  

 

12:44 - December 2, 2016

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 6వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బాధితులను పవన్ పరామర్శించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

12:39 - December 2, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తన విలాసాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. విలాసవంతమైన అలవాట్లు కేసీఆర్ కు తగవని హితవు పలికారు. కేసీఆర్ భారత దేశంలో అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆధునిక సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నా.. విలాసవవంతమైన మరో క్యాంప్ కార్యాలయం నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుత కార్యాలయం కన్ స్ట్రక్చన్ విలువ  రూ.42 కోట్లని, భూమి విలువ 50 కోట్లు ఉంటుందన్నారు. తన విలాసాలకు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. విదేశాలకు సీఎం చార్టెడ్ విమానం తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రజాధనంతో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శ్రీకాకుళంలో పవన్ పర్యటన..

శ్రీకాకుళం : జిల్లాలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 6వ తేదీన పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో కలుషిత నీరు తాగి బాధ పడుతున్న కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న బాధితులను పవన్ పరామర్శించనున్నారు. 

12:17 - December 2, 2016

ఢిల్లీ : ప.బెంగాల్ లో ఆర్మీ మోహరింపు అంశం రాజ్యసభను కుదిపేసింది. ఆర్మీ బలగాల మోహరింపుపై ఉభయసభల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఆర్మీ మోహరింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్మీని ఎలా మోహరిస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆర్మీ బలగాల మోహరింపుపై టీఎంసీ నిరసన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్మీని ఎలా పంపిస్తారని నిలదీశారు. సైనికుల తనిఖీలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇది సాధారణ మాక్ డ్రిల్ అని కేంద్రప్రభుత్వం చెప్పింది. భారత్ బంద్ సందర్భంగా గత నెల 28న కూడా ఆర్మీని పంపామని తెలిపారు. ఆర్మీని పంపాలని కోల్ కతా, హౌరా కలెక్టర్లు లేఖలు రాశారని పేర్కొన్నారు. అధికార, విపక్షాలు వాగ్వాదానికి దిగాయి. సభల్లో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత వారించినా ఇరు పక్షాల సభ్యులు వినపించుకోలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం  2.30 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పుట్టపర్తికి చేరుకున్న బాబు..

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్నారు. ఇక్కడి నుండి గొల్లపల్లికి బయలుదేరారు. 

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో ఆర్మీ మోహరింపు రాజ్యసభను కుదిపేసింది. శుక్రవారం ప్రారంభమైన సభలో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తారు. అనంతరం దీనిపై విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తిరిగి ఆందోళన కావడంతో సభను మధ్యాహ్నం 2.30గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

సైనా పరాజయం..

మకావు ఓపెన్ క్వార్టర్ ఫైనల్ లో సైనా నెహ్వాల్ ఓటమి చెందారు. చైనా క్రీడాకారిణి జాంగ్ యిమన్ చేతిలో 21-12, 21-17 తేడాతో సైనా ఓటమి చెందారు. 

సుప్రీంలో జాతీయ గీతాలాపనపై విచారణ..

ఢిల్లీ : కోర్టులో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయాలనే పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టుల్లో జాతీయగీతాలాపన తప్పనిసరిగా అమలు చేయలేమని, పిటిషన్ సమగ్రంగా లేదని తెలిపింది. అటార్నీ జనరల్ అభిప్రాయం కోరింది. సమగ్ర పిటిషన్ కానందున వివరణ ఇవ్వలేమని ఏజీ పేర్కొంది. 

11:56 - December 2, 2016

ఢిల్లీ :  పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపుపై ఉభయసభల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఆర్మీ మోహరింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్మీని ఎలా మోహరిస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప.బెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపుపై టీఎంసీ నిరసన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్మీని ఎలా పంపిస్తారని నిలదీశారు. అధికార, విపక్షాలు వాగ్వాదానికి దిగాయి. సభలో గందరగోలం నెలకొంది. స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. 

 

తిరుమల రెండో ఘాట్ లో ప్రమాదం..

చిత్తూరు : తిరుమల రెండో ఘాట్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 9వ కి.మీ. వద్ద జీపును ఆర్టీసీ బస్సు ఢీకొంది. 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. 

11:52 - December 2, 2016

విద్యుత్ కార్మిక సంఘాల నేతలతో మంత్రి జగదీష్ సమావేశం..

హైదరాబాద్ : విద్యుత్ కార్మిక సంఘాల నేతలతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. విద్యుత్ కార్మికుల సమస్యలపై చర్చించారు. 

ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాల్లో సభలో జరిగిన ఘటనలపై కొడాలి నాని, చెవిరెడ్డి, పిన్నెల్లి వివరణనివ్వనున్నారు.

 

11:44 - December 2, 2016

లోక్ సభ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపుపై ఉభయసభల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఆర్మీ మోహరింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్మీని ఎలా మోహరిస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప.బెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపుపై టీఎంసీ నిరసన వ్యక్తం చేస్తోంది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్మీని ఎలా పంపిస్తారని నిలదీశారు. దీనిపై రక్షణ మంత్రి పారికర్ సమాధానం చెప్పారు. నవంబర్ లో జరగాల్సిన తనిఖీలు కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా పడ్డాయన్నారు. ఆర్మీ ఎప్పటిలాగానే ఇలాంటివి తనిఖీలు చేస్తుంటాయని, కానీ ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని రక్షణ మంత్రి పారికర్ పేర్కొన్నారు. భారత్ సైన్యంపై ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ సభ్యుడు అనంతకుమార్ అన్నారు. రాజకీయం కోసం ఆర్మీని వాడుకోవడం సరికాదని చెప్పారు. ఆర్మీ మోహరింపుపై రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన కొసానగుతోంది. కోల్ కతాలో ఆర్మీ మోహరింపు సరికాదని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. దేశ శ్రేయస్సు, రక్షణ కోసం సైన్యం కృషి చేస్తోందని అన్నారు. సరిహద్దులో రక్షణ చేస్తున్న వారు ప్రాణత్యాగాలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో పలు ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఆర్మీ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. కానీ ఆర్మీపై పలు ఆరోపణలు రాలేదని, కానీ బెంగాల్ లో 21 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలను ఆర్మీ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సీఎం మమత బెనర్జీ నిరసన చేపట్టడం జరిగిందని, ఆర్మీ ఎందుకు మోహరించారో తెలపాలంటూ గత రాత్రి నుండి సచివాలయంలో సీఎం మమత బెనర్జీ ఉండడం జరిగిందని వివరించారు. బెంగాల్ లో శాంతిభద్రతలు సజావుగానే ఉన్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసమే ఈశాన్య రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టామని మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బెంగాల్ లో ఆర్మీ మోహరింపులో దురుద్దేశం లేదని చెప్పారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే బెంగాల్ లో ఆర్మీ బలగాలను మోహరించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప.బెంగాల్ లో ఆర్మీ బలగాల మోహరింపు సరికాదని బీఎస్ పీ నాయకురాలు మాయావతి అన్నారు. 

 

ఆర్మీ మోహరింపు తగదు - మాయావతి..

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో ఆర్మీ మోహరింపు తగదని రాజ్యసభలో మాయావతి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఆర్మీ మోహరింపుపై టీఎంసీ ఆందోళన చేపట్టింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను గతంలో కొనసాగడం జరిగిందని, టోల్ ప్లాజా వద్ద ఆర్మీని మోహరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ ప్రకారం ఆర్మీ రావడం జరుగుతోందని, అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే ఆర్మీని మోహరించడం తగదన్నారు. 

పాదయాత్రలో మల్లు స్వరాజ్యం..సున్నం రాజయ్య..

కామారెడ్డి : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 47వ రోజు ప్రారంభమైన పాదయాత్రకు స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లు స్వరాజ్యం, ఎమ్మెల్యే సున్నం రాజయ్య సంఘీభావం తెలిపారు. కాసేపటి క్రితం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. 

బెంగాల్ ఆర్మీ మోహరింపుపై పారికర్ సమాధానం..

ఢిల్లీ : బెంగాల్ లో ఆర్మీ మోహరింపుపై లోక్ సభలో విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రక్షణ మంత్రి పారికర్ సమాధానం చెప్పారు. నవంబర్ లో జరగాల్సిన తనిఖీలు కొన్ని కారణాల వల్ల డిసెంబర్ కు వాయిదా పడ్డాయన్నారు. ఆర్మీ ఎప్పటిలాగానే ఇలాంటివి తనిఖీలు చేస్తుంటాయని, కానీ ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని రక్షణ మంత్రి పారికర్ పేర్కొన్నారు. 

బెంగాల్ లో ఆర్మీ మోహరింపు ఎందుకు - ఆజాద్..

ఢిల్లీ : దేశ శ్రేయస్సు..రక్షణ కోసం సైన్యం కృషి చేస్తోందని, సరిహద్దులో రక్షణ చేస్తున్న వారు ప్రాణత్యాగాలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో పలు ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆర్మీ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. కానీ ఆర్మీపై పలు ఆరోపణలు రాలేదని, కానీ బెంగాల్ లో 21 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలను ఆర్మీ స్వాధీనం చేసుకోవడం జరిగిందని సభకు తెలిపారు. సీఎం మమత బెనర్జీ నిరసన చేపట్టడం జరిగిందని, ఆర్మీ ఎందుకు మోహరించారో తెలపాలంటూ గత రాత్రి నుండి సచివాలయంలో సీఎం మమత బెనర్జీ ఉండడం జరిగిందన్నారు. బెంగాల్ లో శాంతిభద్రతలు సజావుగానే ఉందన్నారు. 

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో తొలుత జరగాల్సిన సభా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు కూడా పెద్దనోట్లు..ఇతర అంశాలపై విపక్షాలు ఆందోళన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

11:05 - December 2, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంట్ లో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఇవాళ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు లేవనెత్తనున్నాయి. 

11:00 - December 2, 2016
10:59 - December 2, 2016
10:58 - December 2, 2016

విశాఖ : కొత్త కరెన్సీ దొరక్క సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉన్న 2వేల నోటుకు చిల్లరకోసం అష్టకష్టాలు పడుతున్నారు. విశాఖ రైతు బజార్లలో గిరాకీ లేక వ్యాపారులు నష్టాలపాలవుతున్నారు. ఈమేరకు ప్రజలు టెన్ టివితో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదన్నారు. రద్దు చేసిన కరెన్సీకి సరిపడు చిల్లరను ముందే ఏర్పాటు చేసి ఉండాల్సిందని చెప్పారు. ముందుగా కొత్త 2వేల నోటును ముద్రించడం తప్పు అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:54 - December 2, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 24 రోజులైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.  ప్రజల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.  చిల్లర లేక ప్రజలు పడుతున్న కష్టాలైతే అన్నీఇన్నీ కావు. కనీసం కూరగాయలు కొనుక్కోవడం కూడా సామాన్యులకు ఇబ్బందిగా మారింది. రైతు బజార్లలో అత్యంత దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి రైతుబజార్‌లో ప్రజలు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి మాటల్లోనే...
'మోడీది తుగ్లక్ పాలన. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిగ లేదు. రూ.2 వేల నోటు ప్రవేశపెట్టడం అతి మూర్ఖత్వం. చిల్లర కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. నోట్లు రద్దు చేస్తే ఎట్ట బతకాలి. చిల్లరలేక అష్టకష్టాలు పడుతున్నాం.  సరుకులు కొనలేక పోతున్నాం' అని అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పాలేరులో నేడు గిరిజనుల బహిరంగసభ..

విశాఖ : నేడు పాలేరు ఐటీడీఏ ఎదుట గిరిజనుల బహిరంగసభ జరగనుంది. ఈపాస్ విధానం రద్దు చేయాలని, కాఫీ, సిల్వర్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శివర్గసభ్యుడు నర్సింగరావులు పాల్గొననున్నారు. 

కమ్మేసిన పొగమంచు..

ఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీని దట్టమైన పొగమంచు అలుముకోవడంతో 70 రైళ్లు, 19 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. లక్నో, అమృత్ సర్ ఎయిర్ పోర్టులలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 

10:46 - December 2, 2016
10:45 - December 2, 2016

హైదరాబాద్ : 24 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కష్టాలు తీరడం లేదు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. నగదు పెట్టిన కొద్దిసేపట్లోనే ఏటీఎమ్‌లు సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. కొన్ని చోట్ల పనిచేయని ఏటీఎంలతో జనం విసుగెత్తిపోతున్నారు. పలు ఏటీఎమ్‌ సెంటర్ల ముందు నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇటు బ్యాంకుల వద్ద వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు కూడా సామాన్యుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఢిల్లీ బయల్దేరిన మంత్రి ఈటెల

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ బయల్దేరారు. జీఎస్ టీ సమావేశంలో ఈటెల పాల్గొననున్నారు. నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలోని పరిణామాలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ఈటెల నివేదిక ఇవ్వనున్నారు. 

 

ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు

ఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీని దట్టమైన పొగ అలుముకుంది. 70 రైళ్లు, 19 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. లక్నో, అమృత్ సర్, ఎయిర్ పోర్టులలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

10:34 - December 2, 2016
10:33 - December 2, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో రద్దైన నగదు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. వన్ టౌన్ లోని సూర్య అపార్ట్ మెంట్ లో పాత నోట్లను మార్పిడి చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.19 లక్షల విలువైన కొత్త రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, విచారణ ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏలూరులో రద్దైన నగదు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు

పశ్చిమగోదావరి : ఏలూరులో రద్దైన నగదు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. వన్ టౌన్ లోని సూర్య అపార్ట్ మెంట్ లో పాత నోట్లను మార్పిడి చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

10:28 - December 2, 2016
10:27 - December 2, 2016

ముహూర్తం సమయంలో పోలీసుల ఎంట్రీ...బాధితురాలి ఫిర్యాదుతో దొరికిన 'ఖాకీ'..

పోలీస్..అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఖాకీలు పలు అన్యాయాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఖాకీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏజ్ బార్ కావడంతో పెళ్లి కావాలని ఎక్కడెక్కడో తిరిగాడు. చివరకు ఓ మ్యాట్రిమోనీ ద్వారా ఓ సంబంధం ఖాయం చేసుకున్నాడు. అమ్మాయి చూసిన మరుక్షణమే ఒకే చెప్పేశాడు. పెళ్లి తొందరగా చేయాలని పట్టుబట్టాడు. కట్నం డబ్బుల్లో సగం అప్పటికే తీసేసుకున్నాడు. పెళ్లి ముహుర్తాన ఆ కానిస్టేబుల్ ను ఇతర పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కారణం ఏమై ఉంటుంది.
ఏలూరుకు చెందిన హరిహరణ్ తేజ్..ఏఆర్ కానిస్టేబుల్ గా వరంగల్ లోని బెటాలియన్ లో పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాలని మోజు కలిగి ఉన్నవాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఇతడిని ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఇతడిని కటకటాల వెనక్కి నెట్టారు. 

నోట్ల కష్టాలు..

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దు చేసి 23 రోజులు పూర్తయ్యాయి. 24వ రోజు కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తెల్లవారుజామున నుండే ప్రజలు బ్యాంకులు..ఏటీఎంల ఎదుట క్యూ లైన్లు కడుతున్నారు. 

కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పెద్దనోట్లు రద్దు..ఇతరత్రా అంశాలపై విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. నేడు కూడా సభలు సజావుగా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. 

10:17 - December 2, 2016

గుంటూరు : పెద్దనోట్లు రద్దు చేసి 23 రోజులు పూర్తయ్యాయి. 24వ రోజు కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలో దారుణమైన పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దు పేద..సామాన్యుడు..మధ్యతరగతి వారిని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. గత 23 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. 24వ రోజు జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. తెల్లవారుజామున నుండి ఏటీఎంల ఎదుట పడిగాపులు పడుతున్నామని, డబ్బులు లేక పంటలు ఎండిపోతున్నాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఆపరేషన్ జరిగిందని డబ్బుల కోసం పది రోజుల నుండి తిరుగుతున్నానని ఓ టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంత మంది తమ బాధను టెన్ టివికి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:13 - December 2, 2016

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 11 రోజులు పూర్తయ్యాయి. ఉభయసభల్లో ప్రతిష్టంభన వరుసగా కొనసాగుతోంది. పెద్దనోట్లు రద్దుపై విపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సభలు పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. 12వ రోజు సభ సజావుగా జరుగుతుందా ? లేదా ? అనే సందిగ్ధత నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చర్చ జరిగే సమయంలో మోడీ సభలోనే ఉండాలని పట్టుబడుతున్నాయి. పెద్దనోట్లు రద్దు..నల్లధనంపై మోడీ బయట మాట్లాడుతున్నారే కానీ సభలో ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దుతో క్యూ లైన్ లో మృతి చెందిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బంగారంపై కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కాంగ్రెస్ సభ్యులు చర్చిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన విమాన ఘటనపై లోక్ సభ దద్దరిల్లిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎంసీ సభ్యులు నేడు కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కోల్ కతాలో ఆర్మీ దళాల మోహరింపుపై ప్రశ్నించే అవకాశం ఉంది. 

09:55 - December 2, 2016

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీ.బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ, టీకాంగ్రెస్ నేత ఇందిరా, నవ తెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య పాల్గొని, మాట్లాడారు. బంగారంపై పన్ను విధించినంత మాత్రాన నల్లధనాన్ని అరికట్టలేమని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులపై మోడీ దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఒక్క నల్లకుబేరునిపై ఇప్పటివరకు దాడులు జరగలేదన్నారు. పెద్దోళ్లు దాచుకునేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దళ్లోను రక్షించడానికి పెద్ద పెద్ద వ్యాపారులను కొనసాగించాలని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అంబానీ, అదానీల కోసం ప్రజలను వేధించడం సరికాదని హితపుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:53 - December 2, 2016

సంప్రదాయ రిటైల్ వ్యాపారం మీద పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత తీవ్ర ప్రభావమే చూపిస్తోందని ఏపి ట్రేడర్స్ కన్వీనర్ కొణిజేటి రమేష్ అన్నారు. ఇవాళ్టి జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో రిటైల్ వ్యాపానికి నష్టం కలుగుతుందన్నారు. 'సంప్రదాయ రిటైల్ వ్యాపారం మీద పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిటైల్ వ్యాపారులు, చిల్లర కొట్ల వర్తకులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:52 - December 2, 2016

సంప్రదాయ రిటైల్ వ్యాపారం మీద పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిటైల్ వ్యాపారులు, చిల్లర కొట్ల వర్తకులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఏపి ట్రేడర్స్ కన్వీనర్ కొణిజేటి రమేష్ 
చిల్లర కొట్ల వ్యాపారానికి ఆశనిపాతంలా పెద్ద నోట్ల రద్దు 
పెద్ద నోట్ల రద్దు చిల్లర కొట్ల వ్యాపారానికి ఆశనిపాతంలా మారింది. బిజినెస్ లు పడిపోవడంతో సంప్రదాయ కిరాణా దుకాణాలు కళతప్పుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేయడంతో కిరాణా వర్తకులకు, చిల్లర కొట్ల వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఓ వైపు కరెన్సీ కొరత, మరోవైపు చిల్లర సమస్య, ఇంకో వైపు క్యాష్ లెస్ ఎకానమీ పేరుతో మోడ్రన్ మార్కెట్లకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు చిల్లర కొట్టు వ్యాపారానికి పెద్ద సవాలు విసురుతున్నాయి. మన దేశంలో   కిరాణా వ్యాపారం  సైజు 60 నుంచి 70 లక్షల కోట్ల దాకా వుంటుందన్న అంచనాలున్నాయి.  కిరాణా వ్యాపారాన్ని చేజిక్కించుకోవడానికి పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతుండగా, వాల్ మార్ట్ లాంటి విదేశీ సంస్థలు సైతం ఉవ్విల్లూరుతున్నాయి.
నష్టపోతోన్న కిరాణా వ్యాపారం 
ఇప్పటిదాకా మన దేశంలో కిరాణా వ్యాపారంలో చిల్లర కొట్ల ఆధిపత్యం నడుస్తోంది. స్కూళ్లు, బ్యాంక్ లు, ఆస్పత్రులు, రోడ్లు, బస్సులు, కరెంటు లేని గ్రామాలున్నాయి కానీ చిల్లర కొట్టు లేని గ్రామం మనదేశంలో ఒక్కటి కూడా వుండదు. కోడికూసే వేళకే మేల్కొని, ఊరంతా నిద్రపోయే వరకు దుకాణం తెరచి వుంచడం చిల్లర కొట్టు వర్తకుల లక్షణం. అసలు ఆ మాటకొస్తే ఇల్లే కొట్టు. కొట్టే ఇల్లు. ఏదైనా అత్యవసర సమయంలో అర్ధరాత్రి వెళ్లి నిద్ర లేపినా అడిగిన సరుకు తీసుకొచ్చి ఇవ్వడం మన చిల్లర వర్తకుల లక్షణం. మన ఇంట్లో ఎవరు ఏ బ్రాండ్ వస్తువులు వాడతారో అవన్నీ గుర్తు పెట్టుకుని చిన్న పిల్లలను పంపినా మనకు కావాల్సింది ఇచ్చి పంపడంలో నిష్ణాతులు మన చిల్లర కొట్టువ్యాపారులు. తమ కస్టమర్లందరి పేర్లనూ గుర్తు పెట్టుకుని, పేరుపేరునా పలకరిస్తూ, అందరితో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించడం చిల్లర కొట్టు వ్యాపారుల విశిష్టత. తమ దగ్గర ఉన్న సరుకుకు పబ్లిసిటీ ఇచ్చి, అవసరం వున్నా లేకపోయినా మనతో కొనిపించడం మోడ్రన్ మార్కెట్ల లక్షణమైతే, మనకు అవసరమైన ప్రతి వస్తువునీ, పదార్ధాన్ని సిద్ధంగా వుంచడం, మనం ఏది అడిగినా లేదు అనకుండా తెచ్చి ఇవ్వడం చిల్లర కొట్లవారి లక్షణం. ఇన్ని సుగుణాలు వుండబట్టే, సూపర్ మార్కెట్ లు, హైపర్ మార్కెట్ లు, పెద్ద పెద్ద మాల్స్ ఎన్ని వచ్చినా చిల్లర కొట్టు వ్యాపారాలు తట్టుకొని నిలబడ్డాయి. ఈ వ్యాపారాన్ని కైవసం చేసుకునేందుకు విదేశీ సంస్థలు సైతం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. పెద్దపెద్ద మాల్స్ బిజినెస్ ఏటా 3 నుంచి 5 శాతం చొప్పున పెరుగుతుంటే ఆ మేరకు సంప్రదాయ కిరాణా వ్యాపారం నష్టపోతోంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చిల్లర కోట్ల వ్యాపారానికి పెద్ద గండే కొడుతోంది. జనం చేతిలో డబ్బు లేకపోవడంతో చాలా చోట్ల చిల్లర కొట్టు వ్యాపారాలు సగానికి పైగా పడిపోయాయంటున్నారు. దీంతో మన దేశంలో చిల్లర కొట్లు నిర్వహిస్తూ జీవనయానం సాగిస్తున్న దాదాపు 5 కోట్ల కుటుంబాల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. 

 

09:51 - December 2, 2016

అనంతపురం : నేడు సీఎం చంద్రబాబు అనంతపురంలో పర్యటించనున్నారు. హంద్రీనీవా ద్వారా నీరందించే గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించి...జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం పుట్టపర్తికి చేరుకుని హంద్రీనీవా, జీడిపల్లి, చిత్రావతి రిజర్వాలయర్లను ఏరియల్ సర్వేద్వారా పరిశీలించనున్నారు. తరువాత మడకశిరలోని డ్వాక్రా సదస్సులో పాల్గొని ...జిల్లాలోని వివిధ కార్యక్రమాలు నిర్వహించి..సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు. 

 

09:50 - December 2, 2016

హైదరాబాద్ : నగరంలోని సమస్యల పరిష్కారానికి నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 12 గంటలపాటు జరిగిన సమావేశంలో నగర మౌలిక సమస్యలపై కూలంకశంగా చర్చించారు. నగరంలో నాలాల విస్తరణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, శివారు ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా వంటి అంశాలతోపాటు పలు కీలక అంశాలపై మంత్రి కేటీఆర్‌ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం 
గతేడాది స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ సందర్భంగా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తాజాగా మున్సిపల్‌శాఖా మంత్రి కేటీఆర్ నగర ప్రజా ప్రతినిధులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నిపార్టీల నేతలు హజరయ్యారు. 
12 గంటల పాటు సుధీర్ఘంగా సమావేశం 
దాదాపు 12గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమవేశంలో పలు కీలకనిర్ణయాలు ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఇటీవల నగరంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో నాళాల అక్రమణల నిర్మాణ గుర్తింపు సర్వే వేగంగా జరుగుతుందన్నారు. మొత్తం 390 కిలో మీటర్ల నాళాల్లో 216 కిలో మీటర్ల నాళాలపై ఉన్న 8,239 అక్రమ నిర్మా ణాలను గుర్తించామన్నారు. ప్రజలకు తక్కువ నష్టం ఉండే రీతిలో నాళాల పునరుద్ధరణ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఇక నాలాల్లో పేరుకుపోతున్న పూడికతీతను శాస్త్రీయపద్దతిలో తియ్యడానికి ఏడాదంతా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. అవినీతి లేకుండా ఉండేలా చర్యలుతీసుకోవడంతోపాటు.,ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు అవకాశం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 
15వేల ఇళ్ల నిర్మాణాలకు త్వరలో టెండర్లు 
ఇక నగరంలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామన్నారు ఇప్పటికే కొన్ని ఇళ్లకు టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలో మరో 15వేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వనిస్తామన్నారు. ఇప్పటికే సగం నిర్మించబడి ఉన్న ఇందిరమ్మ, జెఎన్ ఎన్ యూఆర్ ఎం పథకంలోని దాదాపు 30వేల ఇళ్లు సిద్దంగా ఉన్నాయని వాటిని పూర్తి చేసి పేదలకు అందుభాటులోకి తెస్తామన్నారు. ఇందుకోసం అవసరం అయిన 300కోట్లరూపాయలను ప్రభుత్వం సమకూరుస్తుందన్నరు. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా శివారు ప్రాంతాల్లో 1900కోట్లతో 2700కిలో మీటర్లమేర పైపులైన్ పనులు చేపడుతున్నామని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వేగంగాపనులు పూర్తి అయ్యేలా ప్లాన్ రూపొందించామన్నారు మంత్రి కేటిఆర్. వివిధ విభాగాలు చేస్తున్న పనులను సిటిజన్స్ కు తెలియజేసేలా పనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించామన్నారు.
పోస్టర్లు, బ్యానర్లు, ప్లెక్సీలు, వాల్ రైటింగ్‌లపై కఠిన చర్యలు 
నగర అందాలను పెంచేలా సిటీలో విచ్చలవిడిగా పోస్టర్లు, బ్యానర్లు, ప్లెక్సీలు, వాల్ రైటింగ్ లేకుండా చూస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ముందుగా అధికార పార్టీ నేతలపైనే కేసులు నమోదు చెయ్యాలని..ఆ తరువాతే ఇతరులపై చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో త్వరలో 900వరకు టాయిలేట్స్ పెంచుతామన్నా మంత్రి,.పారిశుద్ధ్యం విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై ఫైన్‌ వేసేందుకు అధికారులకు మెజిస్ట్రీయల్ పవర్స్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఇక జిల్లాల అభివృద్ధిపై చర్చించడానికి గతంలో ఉన్న జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం మాదిరిగానే ప్రతి మూడు నెలలకొకసారి ఈ సమావేశాలు నిర్వహించాలని కోరారు బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నగర సమస్యలపై సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందన్న ఆయన,..గతంలో చేసిన నిర్ణయాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో జరిగిన నిర్ణయాలు ఇప్పటికి అమలు కావడంలేదన్నారు. 
మరో 100 ప్రాంతాల్లో రూ.5 భోజన పథకం 
ఇక హైదరాబాద్‌ నగరంలో అతి తక్కువ ధరకే పేదలకు భోజనం అందించేలా మరో 100 ప్రాంతాల్లో 5రూపాయల భోజనపథకాన్ని అమలు చెయ్యాలని నిర్ణయించింది సమావేశం.

 

09:46 - December 2, 2016

కామారెడ్డి : పేదల సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 46వ రోజు పలు గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందానికి ప్రజలు తమ సమస్యలను వెల్లబోసుకున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. 
హామీలను నెరవేర్చని కేసీఆర్‌ ప్రభుత్వం : తమ్మినేని 
సామాజిక తెలంగాణ సాధించేవరకు సీపీఎం అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చని కేసీఆర్‌ ప్రభుత్వం సామాజిక తెలంగాణ నిర్మిస్తుందన్న నమ్మకం లేదన్నారు. వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు రాజకీయ ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగలన్నారు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వంపై తమ్మినేని ధ్వజమెత్తారు.  
కామారెడ్డి జిల్లాలో తమ్మినేని బృందం పర్యటన 
సీపీఎం మహాజన పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లాలో తమ్మినేని బృందం పర్యటించింది. పాదయాత్ర బృందానికి స్థానికులు తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు. 46వ రోజు కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో పాదయాత్ర ప్రారంభమై తుజాల్‌పూర్, బీబీపేట, జనగాం, అంచనూరు, దోమకొండ, లింగుపల్లి, సౌత్‌క్యాంప్‌, జంగంపల్లి, నర్సన్నపల్లి వరకు యాత్ర కొనసాగింది. పాదయాత్రకు పలు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వివిధ సామాజిక సంఘాల నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.  బీడీ కార్మికుల సమస్యలపై తమ్మినేని సీఎంకు లేఖ రాశారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. 

 

09:42 - December 2, 2016

మెగా కుటుంబం నుండి పరిచయమైన హీరోల సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటుంటారు. ప్రధానంగా మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' చిత్రాల గురించి ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా మిగలడంతో 'రామ్ చరణ్' ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన 'తనీ ఒరువన్' తెలుగు రీమెక్ 'ధృవ'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మ‌గ‌ధీర' వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో 'ధృవ' వస్తోంది. ఇటీవలే చిత్ర ఫస్ట్ లుక్..పోస్టర్..టీజర్..థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే 'ధృవ' చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 'రామ్ చరణ్' పోలీసు ఆఫీసర్ గా నటిస్తుండడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను పోలీస్ స్టేషన్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించిందని టాక్. యూసుఫ్ గూడ పోలీస్ లైన్ లో ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. 'రామ్ చరణ్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటించగా అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. 

07:09 - December 2, 2016

హైదరాబాద్ : నల్లధనం కట్టడి కోసం మోదీ తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణయంతో సాధారణ ప్రజలు, చిరువ్యాపారులు, ఉద్యోగులతో పాటు కష్టజీవులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ.. అసలు నల్లధనం ఎక్కడ పోగవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్నది ఈ నల్లధనమేనా...? లేక నల్ల ఆర్థిక వ్యవస్థనా...? నల్లధనం పేరుకుపోవడానికి అసలు కారకులెవరు..? చూద్దాం.... 
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు 
పెద్ద నోట్ల రద్దు వల్ల.. దేశంలోని కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కడ లేని కష్టాలకు గురవుతున్నారు. మోదీ నల్లధనం కట్టడికి తీసుకున్న నిర్ణయం అధికంగా పేదలు, సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అసలు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నల్లధనమేనా.. లేక నల్ల ఆర్థిక వ్యవస్థా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిరువ్యాపారులు, కార్మికులు, కష్టజీవుల వద్ద నల్లధనం ఉండదనేది వాస్తవం. బడా వ్యాపారులు, సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు, బూర్జువా రాజకీయ నాయకుల వద్దే భారీగా నల్లధనం ఉంటుందనేది విశ్లేషకుల వాదన. 
నల్లధనానికి మూలాలు ఇవే 
దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న స్మగ్లింగ్‌, అక్రమ వ్యపారాలు, అక్రమ లావాదేవీలతో పాటు మాదక ద్రవ్యాల ఎగుమతి, దిగుమతులు, అక్రమ ఆయుధ వ్యాపారాలు, మనీ లాండరింగ్‌, అక్రమ నిధులను విదేశీ సంస్థల నుంచి సేకరించడం.. ఇవే నల్లధనానికి మూలాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు... చట్టబద్ధ వ్యాపారాల్లో కూడా పన్ను ఎగవేతతో నల్ల ధనం పోగవుతుంది. నల్లధనం కట్టడి చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... విజయ్‌మాల్యా వంటి బడా బాబులకు చెందిన 7016 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది. మరో 31 మంది పన్ను బకాయిల ఎగవేత దారులకు పాక్షిక రుణమాఫీ ప్రకటించింది. బడా కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ప్రతి లక్ష పెద్ద నోట్లలో 250 వరకు నకిలీ కరెన్సీ
ప్రతి లక్ష పెద్ద నోట్లలో 250 వరకు నకిలీ కరెన్సీ ఉంటుంది. అంటే పెద్ద నోట్ల చలామణిలో ఇది 0.00025 శాతం మాత్రమే. దీనిని అరికట్టాలంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నియంత్రించ వచ్చు. కానీ పాలక వర్గాలకు నిజాయితీ, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆ పని చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాలను విడనాడకపోవడమే దొంగనోట్ల వ్యవహారాన్ని నిర్మూలించలేక పోవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
స్తంభించిన రిటైల్డ్‌ మార్కెట్‌ 
నోట్ల రద్దుతో రిటైల్డ్‌ మార్కెట్‌లో కార్యకలాపాలు స్తంభించాయి. ప్రజలు దైనందిన కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితి ఏర్పడింది. మరోవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. హవాలా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నోట్ల మార్పిడికి మధ్య దళారీ వ్యవస్థ మరింత క్రియాశీలంగా ముందుకొచ్చింది. ఆర్థికాభివృద్ధి వృద్ధిరేటు తగ్గి.. ఉపాధి అవకాశాలు మరింత దిగజారాయి.  పెద్ద నోట్ల రద్దుతో.. సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రజల పొదుపు ఖాతాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది.  జనజీవనం చిన్నాభిన్నమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యధిక శాతం నగదు రూపంలోనే  నిర్వహించబడుతుందనే విషయాన్ని.. మోదీ ప్రభుత్వం పట్టించున్నట్లు లేదు.  
నల్లధనం ఉత్పత్తికి అక్రమ వ్యాపారాలే పునాది  
నల్లధనంలో ప్రధాన భాగం బంగారం, వజ్రాలు, స్తిరాస్తులేనని, నల్లధనం ఉత్పత్తికి పునాది అక్రమ వ్యాపారాలేనని రిజర్వ్‌బ్యాంక్‌ గణాంకాల వివరాలు చెబుతున్నాయి. కరెన్సీ కల్లోలంలో ఎక్కడా నల్ల కుబేరులు కన్పించరు. కష్టాలన్నీ సామాన్యులకే తప్పా.. బడా బాబులకు కాదన్నది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్ధం అవుతోంది. విదేశీ ప్రయాణాలు, విందులు, విలాసాలు, దళారీ దందాలు, షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు, జీరో వ్యాపారాలు, హవాలా మార్పిడులు వంటి అక్రమ కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రాలతో సహా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు.. ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్న ద్రవ్య లోటును తగ్గించడం, స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడి సంస్థల్లోకి ప్రజల సొమ్మును సమీకరించేందుకే బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

 

07:02 - December 2, 2016

హైదరాబాద్ : నగరంలోని నారాయణగూడ పరిధిలో భారీగా కొత్త నగదు పట్టుబడింది. మినర్వాహోటల్, బ్లూ ఫాక్స్ హోటల్‌ వద్ద సాధారణ వెహికల్‌ చెకింగ్‌ చేస్తున్న పోలీసులు..ఓ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురిని అనుమానించారు. వారి వాహనం చెక్‌ చేయగా 95 లక్షల 18 వేలు నగదు.. కొత్త కరెన్సీ నోట్లు ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మహిళ కూడా ఉన్నారు. వీరంతా పాతనోట్లు మారుస్తూ 15 శాతం కమీషన్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

07:00 - December 2, 2016

హైదరాబాద్ : నిన్న ఒకటో తారీఖు రావడంతో.. వేతన జీవులు బ్యాంకులకు క్యూ కట్టారు. ఎక్కడ చూసినా ఏటీఎంల వద్ద భారీ లైన్లు కనిపిస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో జమ అయిన జీతం డబ్బులను తీసుకునేందుకు ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇళ్లు గడిచేందుకు సరిపడా సొమ్ముల్ని సమకూర్చుకోవడం ఎలా..అన్న ఆందోళన అందరినీ పట్టి పీడిస్తోంది. 
80 శాతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు 
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. 80 శాతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి  మూడు వారాలు దాటినా... ఇంకా నగదు కొరత మాత్రం తీరడం లేదు. ప్రజల అవసరాలకు తగిన నగదు లభించట్లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలా..? లేక బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితుల నేపథ్యంలో అవసరాలకు తగిన సొమ్మును.. ఎలా విత్‌డ్రా చేసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులు  ఉన్నారు. ఒకటో తారీఖు రావడంతో... ఖాతాల్లో జమైన డబ్బుల్ని ఎలా తీసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు. నగదు విత్ డ్రా కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉద్యోగులు క్యూలు కడుతున్నారు. 
బ్యాంకుల్లో పరిస్థితి దారుణం
ఇంటి అద్దె, పాల ఖర్చులు, కూరగాయల కొనుగోలు, పిల్లల ఫీజులతో పాటు ఇతర ఖర్చులకు చేతిలో డబ్బులుంటేనే అవసరాలు తీరుతాయి.  ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.  ఫస్ట్‌ తారీఖు కావడంతో బ్యాంకులకు నగదు విత్‌డ్రాకోసం సామాన్యులతో పాటు ఉద్యోగులు భారీగా పోటెత్తుతున్నారు. బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులు, ఆర్‌బీఐ అధికారులు ఉద్యోగులకు నగదు తీసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరిపడా కొత్తనోట్లు ఆర్బీఐ నుంచి బ్యాంకులకు రాకపోవడంతో... ఉన్న నగదుతోనే సర్దుబాటు చేసేందుకు బ్యాంకర్లు సతమతమవుతున్న పరిస్థితి ఉంది. 
ఉద్యోగులు హైరానా 
ఇంటి అవసరాలకు సరిపడా నగదు లభించకపోవడంతో ఉద్యోగులు హైరానా పడుతున్నారు.  ఎక్కడ చూసినా చాంతాడంత క్యూ లైన్లు ఉండటంతో కనీస అవసరాలకైనా డబ్బులు దొరుకుతాయా అన్న ఆందోళన ఉద్యోగులను వేధిస్తోంది. తక్షణమే భారీ మొత్తంలో కొత్త నోట్లను సరఫరా చేసి.. ఏటీఎంల్లో నింపితే కానీ.. పరిస్థితి సద్దుమణిగేలా లేదని సామాన్యులు, ఉద్యోగులు వాపోతున్నారు. 
  

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి ఈటెల

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లనున్నారు. జీఎస్టీ మండలి సమావేశంలో ఈటెల పాల్గొననున్నారు. 

 

నేడు ఆర్థికాభివృద్ధి మండలి సమావేశం

విజయవాడ : నేడు 10 దేశాల కాన్సుల్ జనరల్స్ తో ఆర్థికాభివృద్ధి మండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. 

నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనంతపురం : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. తిరిగి విజయవాడకు బయల్దేరనున్నారు. 

నేడు అమలాపురం బంద్

తూర్పుగోదావరి : నేడు అమలాపురం బంద్ నిర్వహించనున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల అనుచరులు కోర్టు పరిధిలోని ఓ ఇంటిని ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి టోల్ ఛార్జీల వసూలు మినహాయింపులు ఎత్తివేత

ఢిల్లీ : నేటి అర్ధరాత్రి నుంచి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు మినహాయింపులు ఎత్తివేశారు. 

నేటితో పాత రూ.500 నోట్ల చెట్లుబాటు గడువు ముగింపు

ఢిల్లీ : నేటితో పాత రూ.500 నోట్ల చెట్లుబాటు గడువు ముగియనుంది. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లకు పాత రూ.500 నోట్ల చెల్లవు. ఈనెల 15 వరకు ఉన్న గడువును కేంద్రం కుదించింది. 

Don't Miss