Activities calendar

03 December 2016

22:37 - December 3, 2016
22:33 - December 3, 2016

క్యూబా : విప్లవవీరుడు ఫిడెల్ కాస్ట్రో చితాభస్మానికి వీడ్కోలు పలుకడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాస్ట్రో చితాభస్మాన్ని ప్రజలు పెద్దఎత్తున సందర్శించారు. ఆయన చితాభస్మానికి శాంటియాగాలో రేపు సమాధి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరు కానున్నారు.

కాస్ట్రో భౌతిక కాయానికి నవంబర్‌ 27న దహన సంస్కారాలు
క్యూబా విప్లవవీరుడు ఫిడెల్ కాస్ట్రో భౌతిక కాయానికి గత ఆదివారం నవంబర్‌ 27న దహన సంస్కారాలు నిర్వహించారు. కాస్ట్రో రాసుకున్న విల్లు మేరకే ఆయన మృతదేహాన్ని దహనం చేశారు.

చరిత్రాత్మక విప్లవ కూడలిలోని జోస్ మార్టిన్ స్మారక కేంద్రంలో చితాభస్మం
కాస్ట్రో చితాభస్మం ఉన్న పాత్రను ఒక అద్దాలపెట్టెలో ఉంచి, దానిపై క్యూబా జాతీయ జెండాను కప్పారు. కాస్ట్రో చితా భస్మాన్ని గ్రీన్‌ మిలటరీ వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రజల సందర్శనార్ధం రెండు రోజుల పాటు హవానాలోని చరిత్రాత్మక విప్లవ కూడలిలోని జోస్ మార్టిన్ స్మారక కేంద్రంలో ఉంచారు. అక్కడికి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు శోకతప్త హృదయంతో తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు.

హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు
హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు బుధవారం నుంచి ప్రారంభమైంది. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన క్యూబన్లు తమ నేతకు వీడ్కోలు పలికారు. నేనే ఫిడెల్ అంటూ నినాదాలు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ చితాభస్మం శాంటాక్లారాలోని ఆయన ఉద్యమ సహచరుడు చెగువెరా సమాధి మ్యూజియం ఉన్న సముదాయంలోకి చేరింది. ఇది క్యూబాతోపాటు మానవాళి చరిత్రను మార్చివేసిన ఇద్దరు విప్లవ వీరుల చారిత్రక సమావేశం అని ఓ వైద్య విద్యార్థి వ్యాఖ్యానించారు.

కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు ప్రస్థానం
కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు హవానా నుంచి పలు పట్టణాల మీదుగా నాలుగు రోజుల పాటు 8 వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి డిసెంబర్‌ 4, ఆదివారం శాంటియాగోకు చేరుకుంటుంది. శాంటాఐఫిజెనియా స్మశానవాటికలో చితాభస్మాన్ని ఖననం చేయనున్నట్లు క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 19వ శతాబ్దపు స్వాతంత్య్ర వీరుడు జోస్ మార్టి సమాధి పక్కన కాస్ట్రో చితాభస్మాన్ని సమాధి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధి నేతలు, అధికారులు హాజరుకానున్నారు.

2006లో అధికారాన్ని సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగింత
అమెరికా మద్దతుతో విర్రవీగిన క్యూబా నియంత ఫుల్జెన్సియో బాస్టియాను విప్లవోద్యమం ద్వారా కాస్ట్రో ఆయనను గద్దె దించారు. అమెరికా చేసిన హత్యాయత్నాలను కుట్రలను, విజయవంతంగా ఛేదిస్తూ 1959 నుంచి దాదాపు 50 ఏళ్ల పాటు క్యూబాను పరిపాలించారు. అనారోగ్యంతో 2006లో అధికారాన్ని తనకు విశ్వాసపాత్రుడైన సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగించి దేశ పాలనా వ్యవహారాలను చక్కదిద్దుతూ వచ్చారు. నవంబర్‌ 26న 90 ఏళ్ల కాస్ట్రో తుది శ్వాస విడిచారు.

22:24 - December 3, 2016

విజయవాడ : రామ్‌గోపాల్ వర్మ తెరకిక్కిస్తున్న వంగవీటి చిత్ర వివాదం రోజురోజుకు ముదరుతోంది. వంగవీటి ఆడియో ఫంక్షన్‌ కోసమని విజయవాడ వచ్చిన వర్మ వంగవీటి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. వంగవీటి కుటుంబసభ్యులు తనకు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారని వర్మ ట్వీట్ చేశారు. మరోవైపు వాస్తవాలకు భిన్నంగా సినిమా ఉంటే మాత్రం సహించేది లేదని రాధా హెచ్చరించారు.

వంగవీటి రంగాను అవమానించే సన్నివేశాలుంటే సహించం : వంగవీటి రాధా
దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడలో హల్‌చల్ చేశాడు. వంగవీటి ఆడియో ఫంక్షన్‌ కోసమని విజయవాడ వచ్చిన వర్మ వంగవీటి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. విజయవాడ రౌడీయిజం బ్యాక్‌డ్రాప్‌తో వంగవీటి సినిమా చేస్తున్నానని వర్మ ప్రకటించిన దగ్గర నుంచి ఈ చిత్రం హాట్ టాపిక్ అయింది. వంగవీటి సినిమాలో అభ్యంతకర సన్నివేశాలున్నాయని వంగవీటి రంగా తనయుడు రాధా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాధా కుటుంబసభ్యులను కలిసి వారికి ఉన్న అభ్యంతరాలపై వర్మ చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి.

మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశా: వర్మ
ఈ సమావేశంలో జరిగిన పరిణామాలను వర్మ ట్విట్టర్‌లో వివరించారు. తాను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగులు చూశాను గానీ.. మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని వర్మ చెప్పారు. మీటింగ్ అంత ఆశాజనకంగా సాగలేదని.. సినిమాకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని.. నేను మాత్రం వెనక్కి తగ్గనని.. ఏం జరుగుతుందో చూడాలన్నారు.

రాంగోపాల్ వర్మకు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరికలు
వంగవీటి చిత్రంలో వంగవీటి రంగాను అవమానపరిచేలా సన్నివేశాలుంటే సహించేది లేదని... రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ సినిమాలో తమ అభ్యంతరాలను ఇంతకుముందే వర్మకు వివరించామని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించేలా చిత్రం రూపొందిస్తే.. రంగా అభిమానులు మూవీని అడ్డుకుని తీరుతారన్నారు.

చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదు : కొడాలినాని
ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. వర్మ, రాధ ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదని.. కానీ అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మేనని ఆయన అన్నారు. లేదంటే వర్మ ఇబ్బంది పడతారన్నారు.. రాధాతో భేటీ అనంతరం టీడీపీ నేత దేవినేని నెహ్రుతో వర్మ భేటీ అయ్యారు. సినిమాలో తనను ఎలా చూపించినా అభ్యంతరం లేదని నెహ్రు అన్నారు. సామాజిక అంశాలపై సినిమాలు తీసే హక్కు దర్శకులకు ఉందన్నారు.

ఈ వివాదం ఎంత వరకు దారి తీయనుందో?
తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని రాధా, రత్నకుమారి చెబుతుంటే.. వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోనని వర్మ స్పష్టంచేశారు. మొత్తమ్మీద వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి తెరదీశారు. ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.. 

22:20 - December 3, 2016

విజయవాడ : ఏపీలో ఆరోగ్య శ్రీ అమలుతీరుపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సీఎం చంద్రబాబుకు బహిరంగలేఖ రాశారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యాన్ని చివరిరోజుల్లో చూసినట్లు ఈ పథకాన్ని చూస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ అమలు కోసం ఈ నెల 9న కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది
ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్‌ మరోసారి లేఖాస్త్రం సంధించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని లేఖలో ఆరోపించారు. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలాంటి పథకాలు అమలుకావడంలేదని మండిపడ్డారు.. సర్కారు నిర్లక్ష్యంతో విద్య, వైద్యంకోసం సామాన్యులు పొలాలు అమ్ముకోవాల్సివచ్చిందని విమర్శించారు.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోకూడా ఆరోగ్య శ్రీ అమలుకాకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. 2016-17 సంవత్సరానికి 9వేలకోట్లు కావాలంటే... ప్రభుత్వం 568కోట్లే ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు.

ఇసుకనుంచి బొగ్గుదాకా అక్రమాలు
చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకనుంచి బొగ్గువరకూ... రాజధాని భూములనుంచి సదావర్తి భూములవరకూ చేయని దుర్మార్గం ఏమైనా ఉందా? అని జగన్‌ ప్రశ్నించారు.. ఆరోగ్య శ్రీ నిధులు విడుదలకాక చాలా ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం చేయడంలేదని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆరోగ్యశ్రీకి నిధులు విడుదలచేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.. ఆరోగ్య శ్రీ రోగులు, వారి బంధువులతో ఈ నెల 9న ఏపీలోని అన్ని కలెక్టరేట్లముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.. 

22:17 - December 3, 2016

ఢిల్లీ : ఏపీలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టామని... సీఎం చంద్రబాబు ప్రకటించారు.. వర్షపు నీటిని నదులకు అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.. అమరావతిని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.. ఢిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన నాయకత్వ సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు.. నీటి సంక్షోభం- పరిణామాలు అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు..

22:14 - December 3, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతర్వాత తెలంగాణ ఆదాయం తగ్గిందని... మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు.. తక్షణమే కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్ని విడుదల చేయాలని కేంద్రమంత్రి జైట్లీని కోరామని చెప్పారు.. ఢిల్లీలో జీఎస్టీ మండలి రెండోరోజు సమావేశానికి ఈటెల హాజరయ్యారు.. 

22:11 - December 3, 2016

ఢిల్లీ : మోదీ పెద్ద నోట్ల నిర్ణయం వల్ల సంపన్నులకు, నల్లకుబేరులకు ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని, కేవలం పేద ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీకి కావల్సినవారిపై, ధనికులపై ఎలాంటి ప్రభావం పడకుండా కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఏచూరి విమర్శించారు. తాము సంపాదించిన డబ్బులను కూడా తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆయన అన్నారు. 

22:09 - December 3, 2016

ఢిల్లీ : బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేసినంత మాత్రానా నల్లధనం తెల్లధనంగా మారదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ జమ చేసిన డబ్బుకు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిఎస్టీ మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రెండో రోజుల పాటు జరిగిన జీఎస్టీ మండలి సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ డ్రాఫ్ట్‌ అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు జైట్లీ వెల్లడించారు. డిసెంబర్‌ 11, 12 తేదీల్లో మరోసారి జీఎస్‌టీ మండలి సమావేశం జరపాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. జిఎస్‌టిని ఏప్రిల్‌ 2017 నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

22:06 - December 3, 2016

ఉత్తరప్రదేశ్ : జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనాన్ని విత్‌ డ్రా చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోది ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని తెలిపారు. వాళ్లు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడతారు. మిమ్మల్ని వేడుకుంటారు. మీ కాళ్ల మీద పడతారు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తే.. ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ధైర్యంగా చెప్పండని సూచించారు. జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనం పేదలకే చెందుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నిర్వహించిన బిజెపి పరివర్తన్‌ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ....పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని.... నల్లధనం, అవినీతిపై పోరాడడం ద్వారా తానేమైనా నేరం చేశానా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. నేను మీ కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నాను. ఆ అవినీతిపరులు నన్నేమీ చేయగలరు? నేను ఫకీర్‌ను. జోలె సర్దుకొని ఏ క్షణమైన వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని మోది పేర్కొన్నారు.

గోల్కొండ పోస్టాఫీసులో సీబీఐ తనీఖీలు..

హైదరాబాద్ : గోల్కొండ పోస్టాఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 1.5 కోట్ల అవతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పోస్టాఫీసు సూపరింటెండెంట్ సుధీర్ కుమార్ పరారీలో ఉన్నారు. పోస్టల్ ఉద్యోగులు రవితేజ, గోవిందరావు, ఏతేమాద్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. వీరి నివాసాలలో మూడున్నర లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

క్రిస్మస్ కు పేదలకు దుస్తుల పంపిణీ..

హైదరాబాద్ : క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దుస్తుల పంపిణీకి రూ. 15 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అర్హులైన పేద క్రైస్తవులను ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దుస్తుల పంపిణీకి జీహెచ్‌ఎంసీ పరిధిలో 200 కేంద్రాలు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 95 కేంద్రాలను ఎంపిక చేశారు. డిసెంబర్ 16న దుస్తుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. 

స్కాలర్‌షిప్ లకు 31వరకు దరఖాస్తులు..

హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలో ఈ విద్యా సంవత్సరం స్కాలర్‌షిప్ కొరకు దరఖాస్తు చేసుకోదలచిన ఎస్సీ విద్యార్థులు, ఆయా కళాశాలలు తమ వివరాలను ఈనెల 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు ప్రభుత్వ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా శనివారం తెలిపారు. ఈ-పాస్ విధానంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్కాలర్ షిప్ మంజూరు కొరకు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

 

21:30 - December 3, 2016

సంగారెడ్డి : నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా జనం బ్యాంకుల బాటపట్టారు. బ్యాంకుల బారులు దీరి నిల్చోవటం..కొన్ని బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనం ఇవ్వటం..నిరాశతో ప్రజలు వెనుదిరగటం గత 25 రోజులుగా సర్వసాధరణంగా మారిపోయింది. కూడా.ఇటువంటి పరిస్థితుల్లో ఇందుకు భిన్నంగా సంగారెడ్డిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ (ఏపీజీవీబీ ) మాత్రం రంతరంగా ప్రజలకు సేవలందిస్తోంది. ఎందమంది వచ్చిన అందరికీ నగదును అందిస్తోంది. సంగారెడ్డిలోని అన్ని ఏటీఎంలు మూతపడినా ఈ శాఖ మాత్రం నిరంతరంగా పనిచేస్తోంది. దీంతో ఈ ఏటీఎం వద్ద ప్రజలు భారీగా బారులు తీరి నిలబడ్డారు. ఈ శాఖ పనితీరుపై ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. ప్రజలకు చిల్లర ఇబ్బందులు రాకుండా సాధ్యమైనంత వరకూ రూ.100నోట్లనే అందిస్తున్నామన్నారు. ప్రజల సౌకర్యార్థం 24గంటూ పనిచేస్తున్నామని తెలిపారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

తప్పిపోయిన విమానం..

ఇండోనేషియా : పశ్చిమ ఇండోనేషియాలోని బాటమ్ ఐలాండ్‌లో ఓ విమానం తప్పి పోయింది. ఈ విమానంలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఈమేరకు చైనా అధికార వార్తా సంస్త జిన్హువా వెల్లడించింది.

బ్యాంక్ సిబ్బందిని నిర్భంధించిన ప్రజలు ..

హర్యానా : పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసి 25 రోజుల‌యినప్పటికీ నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి డ‌బ్బు అంద‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అస‌హ‌నంతో ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. హర్యానాలోని జింద్‌ జిల్లా దరువానీ గ్రామంలో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ బ్యాంకు వచ్చినవారికి బ్యాంక్ సిబ్బంది రూ.2000 నోట్లు ఇచ్చారు. దీంతో వారు వీటితో ఏం చేసుకోవాలంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని బ్యాంకులోనే ఉంచి తాళం వేశారు. 

బంజారాహిల్స్‌ గోల్డ్‌ షాపులపై ఐటీ దాడులు..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు తమ డబ్బుని బంగారం రూపంలోకి మార్చుకొని నిల్వ చేసుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేసిన వ్యక్తులపై ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు నిఘా ఉంచారు.ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని గోల్డ్‌ షాపులపై ఐటీ దాడులు జరిగాయి. నవంబర్‌ 8, 9 తేదీల్లో పాతనోట్లతో రూ.100 కోట్లకు పైగా బంగారం అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఐటీ అధికారులు ఈడీకి అప్పగించారు. 

కేఎల్ యూనివర్సిటీలో 'వంగవీటి'ఆడియో వేడుక

విజయవాడ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా ఆడియో వేడుక విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతోంది.ఈ ఆడియో వేడుకకు రాంగోపాల్ వర్మ అభిమానులతో పాటు, వంగవీటి అభిమానులు కూడా హాజరుకావడం విశేషం. దీంతో కేఎల్ యూనివర్సిటీలో సందడి నెలకొంది. వేడుకకు రాంగోపాల్ వర్మతోపాటు చిత్ర యూనిట్, పలువురు ప్రముఖులు ఉండడం విశేషం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఝాన్సీ వ్యవహరిస్తోంది. దీంతో కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణం కేరింతలతో నిండిపోయింది.

21:21 - December 3, 2016

దేశ వ్యాప్తంగా 5లక్షల గ్రామాల్లో ఏటీఎం లు లేవు..80కోట్ల ప్రజలకు బ్యాంక్ ఎకౌంట్స్ లేవు..దేశంలో 6కోట్ల మందికి మాత్రమే నగదు రహిత లావాదేవీలపై అవగాహన వుంది. 40 శాతం మంది ప్రజలకు నిరక్ష్యరాస్యులు..అందని ఆన్ లైన్ పై సర్కార్ ఆరాటపడుతోంది...అవస్థల పాలవుతున్న ప్రజానీకం.. పాత పెద్ద నోట్ల రద్దు..కొత్త నోట్ల కొరతతో దేశవ్యాప్తంగా సామాన్యుడు తీవ్ర సంక్షోభంలో పడిపోయాడు. ఈ ఇబ్బందులు రోజురోజుకూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలు దృష్టిపెట్టాలంటూ అటు కేంద్రం ప్రభుత్వం..ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. స్వైపింగ్ మిషన్లు లేవు..డెబిట్ కార్డుల్లేవు..స్మార్ట్ ఫోన్ల వాడకం పెద్దగా లేని భారత్ లో క్యాష్ లెస్ లావాదేవీలు ఎంతవరకూ సాధ్యమేనా ? ఈ నేపథ్యంలో టెన్ టీవీ 'ఏది ముందు? ఏది వెనుక?'అనే శీర్షికతో బిగ్ డిబేట్ ను చేపట్టింది. ఈ చర్చలో హరగోపాల్ (సామాజిక రాజకీయ విశ్లేషకులు),సజ్జా ప్రసాద్ (విశ్లేషకులు),సుధాకర్ (టీఆర్ఎస్ చీఫ్ విప్),రామకృష్ణ (ప్రముఖ విశ్లేషకులు),రాంబాబు (అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి),రవి కుమార్ (సామాజిక విశ్లేషకులు), మైసూరారెడ్డి (సీనియర్ రాజకీయ నేత,మాజీ మంత్రి,ప్రస్తుత వైసీపీ నేత)ప్రభాకర్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న విశ్లేషకులు సజ్జా ప్రసాద్ మాట్లాడుతూ నోట్ల రద్దు అనంతరం కోట్లాదిమంది ప్రజలు బ్యాంకులు..ఏటీఎంల చుట్టూ తిరుగుతూ దేశ ప్రజానీకం రోడ్డుమీద పడిపోయిందన్నారు. ఆర్థిక మూలాలు..ఆర్బీఐ అటానమీ దెబ్బతిన్నాయన్నాయన్నారు. ప్రజలకు బ్యాంకులపై వున్న నమ్మకం పోతోందని తెలిపారు. ఈనేపథ్యంలో క్యాష్ లెస్ సొసైటీ..డిజిటల్ మౌలిక వసతులు లేకుండా భారత్ లో సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అలాగే చర్చలో పాల్గొన్న ప్రముఖులు, విశ్లేషకులు ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించారో తెలసుకునేందుకు ఈ వీడియో చూడండి.. 

21:20 - December 3, 2016

విశాఖ : పెద్ద నోట్ల రద్దుతో పెన్షనర్ల సమస్యలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. మూడో తేదీ వచ్చినా ఇంకా బ్యాంకుల వద్ద నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిలబడ్డా నగదు లభించే పరిస్థితి లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో పెన్షనర్ల కష్టాలు ఎలా వున్నాయో చూడండి..గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డా ప్రయోజనం లేదనీ..బ్యాంకులు, ఏటీఎంల దగ్గర నో క్యాష్‌ బోర్డులే కనిపిస్తున్నాయనీ..ఈ క్రమంలో ఎలా బతికేది అంటూ లబోదిబోమంటున్నారు పెన్షనర్లు.

నెల్లూరులో నోట్ల కష్టాలుళ
పెద్ద నోట్లు రద్దై 25 రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డ నగదు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా.. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని ప్రజలంటున్నారు.
ఏపీ, విశాఖ, నెల్లూరు, నోట్ల కష్టాలు, 

21:13 - December 3, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరులు తమ డబ్బుని బంగారం రూపంలోకి మార్చుకొని నిల్వ చేసుకునేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా బంగారం కొనుగోళ్లు చేసిన వ్యక్తులపై ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు నిఘా ఉంచారు.ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని గోల్డ్‌ షాపులపై ఐటీ దాడులు జరిగాయి. నవంబర్‌ 8, 9 తేదీల్లో పాతనోట్లతో రూ.100 కోట్లకు పైగా బంగారం అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ కేసును ఐటీ అధికారులు ఈడీకి అప్పగించారు. 

21:08 - December 3, 2016

విజయవాడ : వంగవీటి సినిమాలో తనను ఎలా చూపించినా అభ్యంతరం లేదని మాజీ మంత్రి దేవినేని నెహ్రు అన్నారు. సామాజిక అంశాలపై సినిమాలు తీసే హక్కు దర్శకులకు ఉందన్నారు. విజయవాడలో దేవినేని నెహ్రుతో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. సినిమాలు చూసి కొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని దేవినేని తెలిపారు. ఇప్పుడు అంద‌రూ బిజీబిజీగా జీవనం సాగిస్తున్నారనీ.. అటువంటి పరిస్థితుల్లో ప్ర‌జ‌లు సినిమాల్లో చూపించే వాటిని ప‌ట్టించుకోరని దేవినేని నెహ్రూ అన్నారు. దర్శకులకు ఏ క‌థ‌నైనా సినిమాగా తీసుకునే స‌ర్వ‌హ‌క్కులు ఉన్నాయ‌ని ఈ సందర్భంగా దేవినేని నెహ్రూ పేర్కొన్నారు.

 

21:07 - December 3, 2016

హైదరాబాద్ : రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు ఉదయం నగరంలో పర్యటించారు. కూకట్‌పల్లిలో జరుగుతున్న రోడ్ల రిపేర్ల పనులను పరిశీలించారు. జీహెచ్ ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్చే గాంధీ, ప్రభుత్వ అధికారులు మంత్రి వెంట ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవంద కిలో మీటర్ల జాతీయ రహదారుల్లో మెట్రో రైలు పనుల కారణంగా చాలా వరకు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటికి వెంటనే రిపేర్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జరుగుతున్న పనులను సత్వరం పూర్తి చయాలి కోరారు.

 

21:04 - December 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొషన్‌ స్టాడింగ్‌ కమిటీ 2017/18 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బల్దియా చరిత్రలో మొదటిసారి అధికారులు ప్రతిపాదించిన బడ్జెట్‌కు ప్రజాప్రతినిధులు ఒకే చెప్పారు. అంకెల గార‌డి చేయకుండా గతేడాది కంటే కేవలం 43కోట్లు పెంచి 5వేల 643కోట్లగా బడ్జెట్ రూపొందించారు.

జీహెచ్ఎంసీ 2017 - 18 బడ్జెట్ రూ.5643 కోట్లు
జీహెచ్ఎంసీ 2017-18 సంవత్సరానికిగానూ 5 వేల 643 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను బల్దియా పాలక మండలి ఆమోదించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు రూపొందించిన బడ్జెట్ కే పాలక మండలి ఒకే చెప్పింది. ఇక 2016- 17 కు 5వేల 600కోట్ల బడ్టెట్ ప్రతి పాదించ‌గా, ఈ సారి కేవ‌లం 43కోట్లు మాత్రమే పెంచిన అధికారులు 5 వేల 643కోట్లకు ఫిక్స్ చేశారు. గ‌త బ‌డ్జెట్ లో డ‌బుల్ బెడ్ రూంకూ ప్రాధాన్యతనిచ్చిన అధికారులు ఈ సారి రోడ్ల పై దృష్టి సారించారు. అత్యధికంగా 29 శాతం నిధుల‌ను రోడ్డపై ఖ‌ర్చు చెయ్యాల‌ని నిర్ణయించిన అధికారులు వెయ్యి 611కోట్ల రూపాయ‌ల‌ను ఇందు కోసం కేటాయిస్తూ ప్రతిపాదించారు. వీటిలో ఎస్ ఆర్టీపీ, వైట్ టాంపింగ్ రోడ్లతో పాటు జంక్షన్ల విస్తర‌ణ‌పై ఫోక‌స్ చేశారు.

రెవిన్యూ వ‌సూలు 2926.82కోట్లు
ఇక‌ ఏడాది బల్దియా బడ్జెట్ ముసాయిదాలో ఒకటైన రెవిన్యూ రాబడి 2 వేల 926 కోట్లు వ‌స్తుంద‌ని భావించిన అధికారులు 2 వేల 616 కోట్లు ఖ‌ర్చు చెయ్యాలని ప్రతిపాదించారు. ఇందులో 310 కోట్లు మిగులు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఆస్తి ప‌న్ను వల్ల వెయ్యి 285 కోట్లు ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేసిన అధికారులు.. ఫీజులు, ట్రేడ్ లైసెన్స్, ప్రక‌ట‌న‌ల ఫీజు, రోడ్డు క‌ట్టింగ్ ఫిజులు భ‌వ‌న‌ నిర్మాణ అనుమ‌తుల వంటి యూజ‌ర్ ఛార్జీల ద్వారా 962 కోట్ల 79 లక్షలు వ‌స్తుందని అంచ‌నా వేశారు. బ్యాంకు డిపాజిట్ల వ‌డ్డీల ద్వారా 30కోట్లు, భ‌వ‌నాలు, స్థలాల లీజు ద్వారా 17కోట్లు వ‌స్తుందని అంచనా వేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క‌చ్ఛితంగా రావాల్సిన 583కోట్ల నిధులను అంచ‌నా వేస్తున్నారు.

క్యాపిట‌ల్ రిసిప్ట్స్ 3,026.73కోట్లు
ఇక క్యాపిటల్ ఇన్ కమ్‌ 3వేల 26 కోట్ల 73 లక్షలు కాగా దానిని పూర్తి స్థాయిలో ఖ‌ర్చు చేసేలా ప్లాన్ రూపోందించారు. క్యాపిట‌ల్ రాబ‌డిలో అప్పుల‌పైనే న‌మ్మకం పెట్టుకుంది బ‌ల్దియా. 2 వేల 240కోట్లను అప్పుల రూపంలో స‌మీక‌రించేందుకు సిద్ధమ‌య్యారు. ఇప్పటికే ప్రయివేటు ఏజెన్సీతో రెటింగ్ ఫిక్స్ చేయించుకుంటున్న బ‌ల్దియా, మూడేళ్లలో 3 వేల 300కోట్లు అప్పుచేసేందుకు రెడీ అయ్యింది. వీటిలో మొద‌టి ఏడాది 2వేల 240కోట్ల అప్పుకు సిద్ధమయ్యింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల భారం ఉండదని సంకేతాలు
ఇక ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల భారం ఉండదని సంకేతాలు ఇస్తున్నాయి గ్రేటర్ వర్గాలు. ఆస్తి పన్ను లెక్కింపులో ఉన్న లోపాలు సవరించడం ద్వారా ఇప్పటికి పన్ను పరిధిలోకి రాని వేలాది ఆస్తుల నుండి పన్నులు వసూలు చెయ్యడం ద్వారా రాబడి పెంచుతామంటున్నారు. ఇక పాపర్టీ ఎలివేషన్ కోసం ఖర్చుచేయ్యాల్సిన నిధులను వారి కోసమే ఖర్చుచేస్తామన్నారు కమీషనర్

ప్రభుత్వం గ్రాంట్లతోపాటు అప్పుల రూపంలోనూ సేకరించాలని నిర్ణయం
ఇక క్యాపిటర్ ఎక్పెండెచర్ లో ప్రభుత్వం నుండి వచ్చేగ్రాంట్లతోపాటు అప్పుల రూపంలో కూడా సేకరించాలని డిసైడయ్యారు అధికారులు. అయితే గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం నుండి నామమాత్రంగానే ఆర్థిక సహయం అందింది. ఈ ఏడాది అయినా బల్దియాకు బాసటగా ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

 

21:02 - December 3, 2016

కామారెడ్డి : దేశానికి స్వాతంత్ర్యంవచ్చి 69ఏళ్లు దాటుతున్నా ఇంకా నిరుపేదలు అలాగేఉన్నారు.. ఇల్లిల్లు తిరుగుతూ బిక్షాటన చేసి జీవిస్తున్నవారి జీవితాలు అలాగే ఉన్నాయి.. సీపీఎం మహాజన పాదయాత్రలో సంచార జాతివారిని పాదయాత్ర బృందం సభ్యులు పరామర్శించారు.. ప్రభుత్వ పథకాలేవీ తమకు అందడంలేదని ఈ పేదలు పాదయాత్ర బృందానికి చెప్పుకున్నారు..తాము ఇక్కడకు వచ్చి దాదాపు 20సంవత్సరాలు దాటుతోందనీ..తమ పిల్లలకు ఇక్కడే పెండ్లిండ్లు అయ్యాయని ప్రభుత్వ సంక్షేమపథకాలు తమకు వర్తించేలా చేయాలని వారు కోరుతున్నారు. తమకు ఇండ్లు కట్టి ఇవ్వాలని వారు సీపీఎం పాదయాత్రకు వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. పోసమ్మల కులాలకు చెందిన వారిని బీసీలుగా ప్రభుత్వం గుర్తించింది గానీ వారి అభివృద్ది కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని..ఎంబీసీ కులాలకు చెందిన వారిని కులాలను ఆదుకోవాలని ఎంబీసీ నేత ఆశయ్య డిమాండ్ చేశారు. సామాజిక సర్వే నిర్వహించి వారికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా టీఆర్ఎస్ హామీలు నెరవేర్చలేదు : తమ్మినేని
అధికారంలోకివచ్చి రెండున్నరేళ్లయినా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని... సీపీఎ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌ ఏమైందని ప్రశ్నించారు.. సీపీఎం మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని బృందం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తోంది.. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటోంది..

17:15 - December 3, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రిపై ఎప్పుడూ విమర్శలు గుప్పించే జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌- మోదీని మెచ్చుకున్నారు. అమెరికా కొత్త రాష్ట్రపతి డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా ప్రధాని నరేంద్ర మోదే బెటరని కితాబిచ్చాడు. ముంబైలో జరిగిన టైమ్స్‌ లిస్ట్‌ ఫెస్ట్‌లో తాను రాసిన 'ఫ్రం బిహార్‌ టు తిహార్‌' పుస్తకంపై చర్చ సందర్భంగా కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేశాడు. మోదితో తనకు అభిప్రాయ భేదాలున్నప్పటికీ ట్రంప్‌ కన్నా ఎంతో మేలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా మహిళలు, ప్రవాసుల పట్ల ట్రంప్‌ ఉపయోగించిన భాష చాలా నీచంగా ఉందన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్హయ్యపై దేశద్రోహం కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.

17:12 - December 3, 2016

ఢిల్లీ : అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తన విధులకు మాత్రం ఆటంకం కలిగించడం లేదు. విదేశాంగ శాఖకు చెందిన పనులను ఆమె ఎయిమ్స్‌ నుంచే నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లకు అనుమతిస్తూ ఆసుపత్రి నుంచే చర్చలు జరుపుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న సుష్మా స్వరాజ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో అమృత్‌సర్‌లో జరుగుతున్న హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సమ్మేళనానికి మంత్రి హాజరు కాలేకపోయారు. దీంతో ఇద్దరు విదేశాంగ సహాయ మంత్రులు ఎంజె అక్బర్‌, వికె సింగ్‌ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి 40 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున అధికారులు పాల్గొంటున్నారు. 

17:06 - December 3, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అమెరికాకు చెందిన ఓ యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఆలస్యంగా వెలుగు చూసింది. కనాట్‌ ప్లేస్‌ సమీపంలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో తనపై ఐదుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో టూరిస్ట్‌ గైడ్‌ కూడా ఉన్నట్లు పేర్కొంది. గత మార్చిలో జరిగిన ఈ దారుణం గురించి బాధితురాలు ఈమెయిల్‌ ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి వాంగ్మూలం ఇస్తానని ఆ యువతి తెలిపింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ఢిల్లీ పోలీసులకు అమెరికా రాయబార కార్యాలయం ఈమెయిల్‌ ద్వారా తెలిపింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చిన అమెరికన్ యువతి కనాట్‌ ప్లేస్‌ దగ్గరలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బసచేసింది. ఆమె హోటల్‌ రూమ్‌లో ఉన్న సమయంలో రూట్‌ ప్లాన్‌ గురించి మాట్లాడాలంటూ గైడ్‌ మరో నలుగురితో కలసి వచ్చాడు. ఆమెకు బలవంతంగా డ్రింక్ తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణం జరిగిన తర్వాత బాధితురాలు వెంటనే భారత్‌ నుంచి అమెరికా వెళ్లిపోయింది. 

17:02 - December 3, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దుతో చిన్నతరహా పరిశ్రమల్లో,.. ముఖ్యంగా మహిళలు పని చేసే పరిశ్రమల్లో వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. పెద్దనోట్ల రద్దు తర్వాత సరైన సమయంలో వేతనాలు అందక కార్మికులు.. మరోవైపు బిజినెస్‌ లేక వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముత్తంగి గ్రామంలో చిన్నతరహా పరిశ్రమలో యాజమాన్యం, కార్మికుల పడుతున్న అవస్థలకు గురవుతున్నారు.నోట్ల రద్దుతో జీతాలు ఆలస్యంగా వచ్చాయని ముత్తంగిలో చెప్పుల తయారీ కేంద్రంలో పనిచేసే మహిళ కార్మికులు వాపోతున్నారు. కూరగాయల నుండి ఏది కొనాలన్నా చిల్లర లేమితో పలు అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చేవరకూ ఈ ఇబ్బందులు తప్పవని కార్మికులు పేర్కొంటున్నారు. 

16:59 - December 3, 2016

మంచిర్యాల : వేటగాళ్ల ఉచ్చుకు పెద్ద పులి బలైంది... కోటపల్లి మండలం పిన్నారం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్లు విద్యుత్‌ తీగలు అమర్చారు.. ఈ తీగలు తగిలి పులి మృతిచెందింది.. వేటగాళ్లు పులి కళేబరాన్ని అటవీప్రాంతంలో పూడ్చేశారు.. ఈ సమాచారం అటవీ అధికారులకు చేరింది.. గ్రామస్తులను విచారించిన పోలీసులు.... పులిని మృతదేహాన్ని బయటకుతీశారు.. ఈ పులి చర్మం, గోర్లు అలాగేఉన్నాయి.. ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అధికారులు పులిని చంపినవారిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. 

16:57 - December 3, 2016

నల్గొండ : దేవరకొండలో శిశు విక్రయాలు, బాల్యవివాహాలు ఎక్కువైపోతున్నాయని.. వీటిని అరికట్టేలా గిరిజనులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో అమ్మా నన్ను అమ్మకే అనే పేరుతో జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు చట్ట విరుద్ధమనీ..పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి విషయంలోనూ ఆడపిల్లలపై వివక్ష చూపడం మానుకోవాలని ఎస్పీ హితవు పలికారు. 

16:52 - December 3, 2016

కృష్ణా : పామర్రులో వైసీపీ- టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వ్యవసాయశాఖ కార్యాలయం శంఖుస్థాపనలో ప్రోటోకాల్‌ పాటించలేదని వైసీపీ ఎమ్మెల్యే కల్పన .. అధికారులపై సీరియస్‌ అయ్యారు. శంఖుస్థాపన విషయాన్ని మొక్కుబడిగా చివరి నిముషంలో తనకు చెప్పారని ఎమ్మెల్యే కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన వ్యక్తికి ఇచ్చిన ప్రాధాన్యత ఎమ్మెల్యేగా తనకు ఎందుకు ఇవ్వరనిఆమె ప్రశ్నించారు. దీంతో కొందరు టీడీపీ నేతలు ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. రెండు పార్టీల నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎంపి కొనకళ్ల నారాయణ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.  

16:50 - December 3, 2016

విజయవాడ : రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన.. వంగవీటి చిత్రంలో వంగవీటి రంగాను అవమానపరిచేలా సన్నివేశాలుంటే సహించేది లేదని... రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ సినిమాలో తమ అభ్యంతరాలను ఇంతకుముందే వర్మకు వివరించామని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించేలా చిత్రం రూపొందిస్తే.. రంగా అభిమానులు మూవీని అడ్డుకుని తీరుతారన్నారు. వాస్తవ ఘటనలతో సినిమా తీస్తే ఎలాంటి అభ్యంతరం లేదని టున్న వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. 

16:45 - December 3, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దు నిర్ణయం భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ జాతీయనేత డాక్టర్ అభిషేక్ సింఘ్వీ అన్నారు. రోజుకో రూల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు కేంద్రం గురిచేస్తోందని ఆరోపించారు. కేంద్రం విధానంతో ఇన్‌కంట్యాక్స్ అధికారులు కూడా తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. నల్లధనం నియంత్రణ అమలులో కేంద్రానికి సరైన ప్లానింగ్ లేదని.. దీంతో దాదాపు నెలరోజులుగా సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు బీజేపీ నేతలకు సంబంధించిన అకౌంట్లలో కోట్ల రూపాయల డబ్బు జమ అయినట్లు తమ దగ్గర ఆధాలున్నాయని సింఘ్వీ తెలిపారు.

మురదాబాద్ లో మోడీ ఎన్నికల ప్రచారం..

ఉత్తర్ ప్రదేశ్ : మురాదాబాద్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. తనకు హైకమాండ్ లేదని, ప్రజలే తనకు హై కమాండ్ అని తెలిపారు. జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేసిన వాళ్లు మళ్లీ అడిగితే ఆధారాలు చూపమని నిలదీయాలని, పేదల ఖాతాల్లో వేసిన డబ్బులు వారికే చెందుతాయన్నారు. నల్లధనం దాచుకున్న వారు తనను ఏమీ చేయలేరని, ఎన్నికల్లో తనను ఓడిస్తే బ్యాగు సర్దుకుని వెళ్లిపోతానని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. నిజాయితీ పరులంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిలుచుంటే అవినీతిపరులంతా ఇళ్లలో ఉన్నారన్నారు.

కేసీఆర్ తో విబేధాలు లేవన్న బాబు..

ఢిల్లీ : హిందుస్తాన్ టైమ్స్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు పోటీపడి పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ సీఎంతో ఎలాంటి విబేధాలు లేవని, టి.సర్కార్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం అవుతుందన్నారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకున్నట్లు, 2050 నాటికి ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో అభివృద్ధికి కావాల్సిన అన్ని వసతులున్నాయని, ఏపీలో 24గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు చెప్పారు.

బీజేపీపై సింఘ్వీ విమర్శలు..

హైదరాబాద్ : నోట్ల రద్దు అంశంలో బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు బీజేపీ నేతలు జరిపిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. నోట్ల రద్దు నిర్ణయంతో మోడీ సెల్ఫ్ గోల్ లో పడ్డారని, సభలో మాట్లాడేందుకు భయపడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నష్టమని, జీడీపీ పడిపోతుందన్నారు. 2 శాతం క్యాష్ లెస్ ఉన్న వ్యవస్థలో 100 శాతం ఎలా సాధ్యమన్నారు. ఆర్బీఐ ఐదు నిమిషాలకో ఓ విధానాన్ని ప్రకటిస్తోందని విమర్శించారు.

బాబును కలిసిన సచిన్...

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిశారు. ఢిల్లీ ఏయిర్ పోర్టులో వీరి భేటీ జరిగింది. దత్తత గ్రామాల అభివృద్ధిపై సచిన్ వివరించారు. నెల్లూరు జిల్లా అధికారులు బాగా సహకరిస్తున్నారని సచిన్ పేర్కొనగా ఏపీలో ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సచిన్ ను బాబు కోరారు. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వివరాలు, రూ. 149 కే కేబుల్, ఇంటర్ నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు బాబు పేర్కొన్నారు.

మిషన్ భగీరథపై వేముల సమావేశం..

హైదరాబాద్ : మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశం జరిగింది. వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్, పైప్ లైన్, ఆఫ్టిక్ ఫైబర్ పై సమగ్ర చర్చ జరిగింది.

నవ్వుతూ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశా - వర్మ..

విజయవాడ : వంగవీటి కుటుంబంతో భేటీ జరిపిన అంశాలను రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆయన ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. వంగవీటి కుటుంబంతో సమావేశం ఆశాజనకంగా జరగలేదని, జీవితంలో ఇప్పటి వరకు సీరియస్ వార్నింగ్ లు చూశానని కానీ తొలిసారి నవ్వుతూ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని తెలిపారు.

ములుగులో మంత్రి హరీష్ పర్యటన..

సిద్ధిపేట : ములుగులో అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకు స్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు నిర్మించి తీరుతామని, ఈ రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు నీరందిస్తామన్నారు. 90 శాతం సాగుభూమిలోకి రావాలంటే 10 శాతం భూమి కోల్పోక తప్పదని, ఈ విషయంలో కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

స్వస్త్ కుటుంబ హెల్త్ కార్డుల పంపిణీ..

విజయవాడ : పార్లమెంట్ పరిధిలోని 265 గ్రామాల్లోని 10 లక్షల మందికి స్వస్త్ కుటుంబ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. టాటా ట్రస్టును ఒప్పించి తన నియోజకవర్గ ప్రజలకు స్వస్త్ కుటుంబం హెల్త్ కార్డులు ఇప్పించిన ఘనత నానిదని, రోజుకు రూపాయి చొప్పున కుటుంబానికి రూ. 250 ప్రీమియం కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకంలో లేని రోగాలకు కూడా ఈ ట్రస్టు కుటుంబం హెల్త్ కార్డులు ఉపయోగపడుతాయన్నారు.

బాబుకు జగన్ లేఖ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత జగన్ ఐదు పేజలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్య శ్రీతో పాటు సంక్షేమ పథకాల అమలులో లోపాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆరు కోట్ల మంది ప్రజలు నిద్రాహారాలు మాని ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రాయలసీమతో పాటు 13 జిల్లాల్లో కరువు నెలకొందని, పాలనపై ఏ ఒక్కరూ సంతృప్తికరంగా లేరని పేర్కొన్నారు.

15:31 - December 3, 2016

బాలమురళీకృష్ణ ఇకలేరు...

హైదరాబాద్ : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) కన్నుమూశారు. చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా కచేరీల్లో పాల్గొన్నారు. భక్తప్రహ్లాద చిత్రంలో నారదుని పాత్ర వేసి అందరినీ మెప్పించారు. 8 ఏళ్ల వయసులో కచేరీ చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్‌, మలేషియా, సింగపూర్ దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషాల్లో పాటలు పాడిన బాలమురళీకృష్ణ..

15:09 - December 3, 2016

విజయవాడ : బెజవాడ పేరుకే పెద్ద నగరం. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. చూడడానికి చక్కని రోడ్లున్నా.. ట్రాఫిక్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఎప్పుడు చూసినా.. ట్రాఫిక్‌ పద్మవ్యూహమే. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. సర్కార్ విధిస్తున్న డెడ్‌లైన్లు చూసి సంబరపడుతున్నా.. పనుల్లో పురోగతి చూసి ఉసురుమంటున్నారు.

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనుల్లో అంతులేని జాప్యం
విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులు ఈనెలాఖరుకు పూర్తవుతాయా? సీఎం చంద్రబాబు సహా స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నట్లు మరో 30 రోజుల్లో పనులు పూర్తవుతాయా? అంటే పనులు జరుగుతున్న తీరు ఇందుకు విభిన్నంగా కనిపిస్తోంది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి పనులన్నీ ముగించి, 2017 ఫిబ్రవరిలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

డిసెంబర్‌ చివరినాటికి పనులు పూర్తి చేసి.. పూర్తి కాని పిల్లర్ల పనులు
అయితే దుర్గగుడి పనుల్లో జాప్యం కారణంగా వాహనదారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. పనులు ఎప్పటిలోగా పూర్తిచేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2.5 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల్లో దుర్గగుడి ప్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 23 పిల్లర్లు పూర్తయ్యాయి. మిగతా పిల్లర్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. భవానీపురం నుంచి కుమ్మరిపాలెం, దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్క్ వరకు 2.5 కిలోమీటర్ల ప్లై ఓవర్, దాని కిందనే సమాంతరంగా ఐదు కిలోమీటర్ల పొడవైన రహదారిని నాలుగు వరుసల్లో కృష్ణలంక బ్రిడ్జ్ వరకు చేపడుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరాన్ని ఐదు భాగాలుగా చేసి పనులు సాగించారు. నిర్మాణపనులను సోమా సంస్థ చేపట్టింది.

2017 ఫిబ్రవరిలో ఫ్లైఓవర్‌ ప్రారంభించాలని సర్కార్‌ డెడ్‌లైన్‌
ప్రస్తుతం 28 పిల్లర్లు నిర్మాణం పూర్తి కాగా.. కాలువల్లో పిల్లర్ల పనులు 2017 మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరం ఆరు వరసలుగా ఉన్న ఈ వంతెన పూర్తయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుముఖం పట్టనుంది. పనుల వల్ల.. హైదరాబాద్, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. నగరంలో సుమారు గంటకుపైగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. మిల్క్ ప్రాజెక్ట్ నుంచి చిట్టినగర్ మీదుగా బస్టాండ్ చేరుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. నగర పరిధిలో 4 కిలోమీటర్లు దూరానికి.. 14 కిలోమీటర్లు పైగా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన దుర్గగుడి ఫై ఓవర్‌ పనులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. 

14:59 - December 3, 2016

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినా కొన్ని ప్రాంతాల్లో తాగడానికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి.. తాగడానికి నీరు లేక పంటలు పండక గ్రామాల ప్రజల విలవిలలాడిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దిక్కుతొచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యుత్‌ కొరత లేదని బల్ల గుద్ది చెబుతున్న నేతలు ఈ గ్రామానికి వెళ్తే ముక్కున వేలేసుకోకతప్పదు. భూగర్భ జలాలు పుష్కలంగ ఉన్నా తాగడానికి గుక్కెడు నీరు పొందలేని గ్రామస్ధుల ధీన గాధపై ప్రత్యేక కథనం.రాష్ట్రమంతటా పుష్కలంగా నీరు ఉన్నా ఈ గ్రామంలోని ప్రజల దాహాం తీరడం లేదు. రాజధాని హైదరాబాద్‌ కు కూత వేటు దూరంలో ఉన్న యాదాద్రి భువగిరి జిల్లా రాజాపేట మండలం కొండేరు చెర్వు మధిర గ్రామంలోని మారుమూల పుట్టగూడెం గిరిజన తండాలో మంచినీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

15 రోజులుగా విద్యుత్‌లో ఓల్టేజీ సమస్య
భూగర్భ జలాలు ఉన్నా విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. గత 15 రోజులుగా విద్యుత్‌లో ఓల్టేజీ సమస్యతో బోరు పంపు మోటరు పని చేయడం లేదని ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం అని గ్రామస్థులు వాపోతున్నారు. చేసేది లేక నిత్యావసరాలు, మంచినీటి కొరకు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నా యజమానులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తమ గోడును స్థానిక ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం
ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాగు నీటి సమస్యను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఫీడర్‌ ఛానల్‌ వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏదీ ఎమైనా విద్యుత్‌ సమస్యను పరిష్కరించి గ్రామస్థుల దాహర్తిని తీర్చాల్సిన అవసరం విద్యుత్‌ అధికారులపై ఎంతైనా ఉంది. 

ఫిల్మ్ నగర్ లో ఘరానా మోసం..

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. రూ. 18 వేలకు తులం బంగారం ఇప్పిస్తామని వ్యాపారస్తుల నుండి పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్త రూ. లక్షలు దోచుకున్నారు. తిరుమలేష్, పోలీసులపై కేసు నమోదైంది.

 

నగదు కోసం క్యూ..తోపులాట..

పశ్చిమగోదావరి : పాలకొల్లులోని ఎస్ బీఐ మెయిన్ బ్రాంచీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగదు కోసం భారీ క్యూలైన్ నెలకొనడంతో తోపులాట చోటు చేసుకుంది. బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి.

13:57 - December 3, 2016
13:56 - December 3, 2016
13:55 - December 3, 2016

కామారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు స్థానికులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ముస్లింల జీవన ప్రమాణాలు పెంచేందుకు.. మైనార్టీ కార్పొరేషన్‌కు వెంటనే 5 వేల కోట్ల నిధులు కేటాయించాలని మైనార్టీ నేత అబ్బాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మైనార్టీలకు నేరుగా రుణాలు అందించాలని కోరారు. పాదయాత్రలో మైనార్టీల కష్టాలు చూసి చలించిపోయామన్నారు. ప్రభుత్వం మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:51 - December 3, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారు. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుణ్ని దేవ్‌సర్‌కు చెందిన అసదుల్లా కుమార్‌గా గుర్తించారు. ఎదురు కాల్పుల్లో గాయపడ్డ అసదుల్లాను ముందు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా దళాలు కుల్‌గామ్‌ ప్రాంతాన్ని చుట్టుమట్టాయి. 
 

13:48 - December 3, 2016

చంఢీఘర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోహార్ట్‌ ఆఫ్‌ ఏషియా శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. భారత్‌, అఫ్గనిస్థాన్‌ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న సమావేశానికి  40 మందికిపైగా విదేశాంగ మంత్రులు, వారి ప్రతినిధులు హాజరవుతున్నారు.  అమెరికా, ఇరాన్‌, రష్యా, కెనడా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌తోపాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు చెందిన అతిథులను ఆహ్వానించారు. పాకిస్థాన్‌ తరుపున ఆదేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్ సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ హాజరుకానున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల అక్రమచొరబాట్లు, కశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడులు పెరుగుతున్న నేపథ్యలో జరుగుతున్న హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, అఫ్గన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ మంత్రుల స్థాయి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఉరి, నగ్రోటా ఉగ్రవాద దాడులను ప్రస్తావించడం ద్వారా  పాకిస్థాన్ను ఏకాకిని చేయాలని మన దేశం భావిస్తోంది. ఉగ్రవాదంతో చితికిపోయిన అఫ్గనిస్థాన్‌లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. 

13:35 - December 3, 2016
13:24 - December 3, 2016
13:22 - December 3, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల్ని రోడ్డు పాల్జేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంటింటి బంగారంపైనా కన్నేసింది. బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించే కసరత్తు చేస్తోంది. ప్రజల నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయంపై కాస్తంత తగ్గినట్లు కనిపించినా.. భవిష్యత్తులో తన పంతాన్ని కేంద్రం నెగ్గించుకునే ప్రయత్నం చేయదన్న గ్యారెంటీ లేదు. అసలు బంగారంపై ప్రభుత్వానికి ఎందుకు అంత ఆసక్తి..? 
పసిడిపై కేంద్రం కన్ను 
కేంద్రం కన్ను పసిడిపై పడింది. ఎన్నో రోజులుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేసింది. ఒక్కొకరికి ఎంత బంగారం ఉండాలో పరిమితి విధించింది. అంతకంటే ఎక్కువ బంగారం ఉంటే టాక్స్‌ కట్టాల్సిందేనని ఖరాఖండిగా చెబుతోంది. మోదీ సర్కారు దృష్టి సగటు భారతీయుడి బంగారంపై పడింది. నల్లధనాన్ని వెలికితీస్తానంటూ.. పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ.. ఈ ప్రయత్నంలో సాధించేందేంటో ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఆయన కన్ను బంగారంపై పడింది. దీనిపై వెలువడ్డ వార్తలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. 
సోషల్‌ మీడియాలో ప్రచారం 
600 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుందని... లేదంటే మీ బంగారం సంగతి అంతే... అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. బ్యాంక్‌ లాకర్‌లను సైతం తెరుస్తారని దాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారనే వార్తలూ వచ్చాయి. దీంతో మహిళలు బంగారంపై బెంగ పెట్టుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బంగారంపై స్పష్టత ఇచ్చారు.
తాళిబొట్టుపై మినహాయింపు
తాళిబొట్టుపై ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం.. అవివాహిత మహిళల వద్ద 250 గ్రాముల బంగారం, వివాహిత మహిళల వద్ద 500 గ్రాముల బంగారం కంటే ఎక్కువ ఉండరాదని తేల్చి చెప్పింది. వారసత్వంగా వచ్చిన బంగారానికి అలాగే.. లెక్కచూపిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు కాదని గతంలో కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. వారసత్వం గా వచ్చిన బంగారంపైన, వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన స్వర్ణంపైనా,  పన్నులు చెల్లించిన డబ్బుతో కొన్న బంగారంపైనా ఎలాంటి టాక్స్ లు ఉండవని ప్రకటించారు. అరుణ్‌జైట్లీ ప్రకటన.. పైకి సందేహాలన్నింటినీ తీర్చేసినట్లు కనిపిస్తున్నా.. అసలు మెలిక అక్కడే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. మరోవైపు కేంద్ర నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
బంగారం పరిమితిపై ఆంక్షలు విధించడం సాధ్యమేనా..
ఇంతకీ బంగారం పరిమితిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సాధ్యమేనా..? పాత నిబంధనలు ఏమి చెబుతున్నాయి..? బంగారం అంటే మక్కువ ఉన్న మన దేశంలో ఇది సాధ్యమేనా ? ప్రతి ఇంట్లో పరిమితికి లోబడి బంగారం ఉందా .. అంతకన్నా ఎక్కువ ఉందా.. అనేది ఎలా తెలుస్తుంది ? ప్రతి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎలా లెక్కిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలావుంటే వారసత్వంగా వచ్చిన.. వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారానికి పరిమితి లేదని చట్టంలో చెప్పారు. మరి ఎక్కువ బంగారం ఉన్న ప్రతి ఒక్కరూ.. వారసత్వంగా వచ్చిన బంగారం అని చెబితే పరిస్థితి ఏంటి ? ఇక ఏళ్ల తరబడి కొనుగోలు చేసిన బంగారంపై ఇప్పుడు టాక్స్‌లు కట్టాలంటే ఎలా కడతామని మహిళంటున్నారు. 
రుజువులు ఎలా చూపించాలనే సందేహాలు 
మరోవైపు తమకు వారసత్వంగా వచ్చిన బంగారానికి రుజువులు ఎలా చూపించాలనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఒక్కో మహిళకు 500 గ్రాముల బంగారం మాత్రమే ఉండాలనే నిబంధన విధిస్తే.. ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న బంగారం ఆ పరిమితి దాటితే.. దానిని ఎలా రుజువు చేయాలో అర్ధం కావడం లేదని మహిళలంటున్నారు. పిల్లల భవిష్యత్‌, పెళ్లిళ్ల కోసం పొదపు చేసిన మొత్తం బంగారం మీదే పెట్టుబడి పెడతామని.. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు మహిళలు. 
మోదీ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత 
మోదీ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోదీకి ఆయన సలహాదారులు అర్ధంపర్ధం లేని సలహాలిస్తున్నారని టీడీపీ మహిళా నేతలు కూడా మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని తమ అధినేత దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. అయితే.. బంగారాన్ని పెట్టుబడి వస్తువుగా భావించవద్దని ప్రభుత్వం చెబుతోంది. దేశంలోని బంగారు నిల్వలు బయటకు వస్తే దేశం ఆర్థికంగా బలపడుతుందంటోంది. 
ప్రభుత్వ ఆలోచన సక్సెస్‌ అవుతుందా ? 
ప్రభుత్వ ఆలోచన సక్సెస్‌ అవుతుందా ? ప్రతి ఇంట్లో బంగారు లెక్కలు ప్రభుత్వానికి చెబుతారా ? విదేశాల నుంచి బంగారు దిగుమతులు తగ్గుతాయా ?  ప్రపంచంలో ఏ దేశ ప్రజల వద్ద లేనంత బంగారం మన ప్రజల వద్ద ఉందని అనేక అంచనాలు చెబుతున్నాయి. భారతీయుల వద్ద 20 వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అంటే దీని విలువ సుమారు 60 లక్షల కోట్లు. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు మూడున్నర రెట్లు ఎక్కువ. ఈ బంగారంతో మన దేశానికి మూడేళ్లపాటు ఏ ఆదాయం లేకపోయినా ఢోకా ఉండదని నిపుణులంటున్నారు. 
ఆలయాల్లో అధికంగా బంగారు నిల్వలు
ఇళ్లలో ఉన్న బంగారం పరిస్థితి ఇలా వుంటే.. ఆలయాల్లో కూడా బంగారు నిల్వలు అధికంగా ఉన్నాయి. దాదాపు నాలుగు వేల టన్నుల బంగారం దేవాలయాల్లో ఉంది. ఈ మొత్తం బయటకు వస్తే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుంది. మన ప్రభుత్వం వద్ద ఉన్న ఆదాయం అమెరికా బ్యాంకుల కన్నా రెండు మూడు రెట్లు పెరిగిపోతాయి. అందుకే ప్రభుత్వం ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. 
ప్రతి ఏడాది వెయ్యి టన్నుల బంగారం దిగుమతి
ఇక ప్రతి ఏడాది మన దేశం వెయ్యి టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీంతో 3 లక్షల కోట్లు విదేశాలకు పోతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న 40 శాతం బంగారాన్ని మనమే వాడేస్తున్నాం. దేశానికి వస్తున్న దిగుమతుల్లో బంగారం వాటా 12 శాతం ఉంది. ఈ ఆదాయాన్ని వేరే చోట పెట్టుబడి పెడితే ఏటా 30 వేల కోట్ల ఆదాయం వృద్ధి అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని నిపుణులంటున్నారు. ఇప్పటికే నోట్ల రద్దుతో ఆగ్రహంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం నిర్ణయం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటుందంటున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం ప్రజల దగ్గర ఉన్న బంగారం లెక్కలు చెప్పాల్సిందేనని అంటోంది. 
భారతీయులకు బంగారంపై మోజు ఎందుకు ? 
భారతీయులకు బంగారంపై మోజు ఎందుకు ? పొదుపులో ఎక్కువ మొత్తం బంగారంపైనే ఎందుకు పెడతారు ? ప్రభుత్వ తాజా నిర్ణయంతో బంగారం అమ్మకాలు ఎలా ఉంటాయి ? భారతీయులకు బంగారం అంటే ప్రాణం. సంపదకు, దర్పానికి పసిడి చిహ్నం. ఇది ఓ ఆర్థిక భరోసా. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా కొనడానికి సిద్దంగా ఉంటారు. అయితే రానురాను బంగారాన్ని ఆభరణాల దృష్టితోనే చూడటం కాదు.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పసిడిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. బంగారానికి డిమాండ్‌ ఎక్కువ ఉండడం.. డబ్బు అవసరమైనప్పుడు ఈజీగా మార్చుకునే వెసులుబాటు ఉండడంతో ప్రతి ఒక్కరూ బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే వేరే వస్తువులపై పెట్టుబడి పెడితే నష్ట భయంతో పాటు.. వెంటనే అమ్ముకునే వెసులుబాటు ఉండదు. అందుకే చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 
బ్యాంకుల్లో బంగారానికి రక్షణ 
ఇక ఏదైనా అత్యవసర పరిస్థితిలో కూడా బంగారంపై రుణం ఈజీగా పొందవచ్చని ప్రజల నమ్మకం. బంగారాన్ని బ్యాంకులు, ఇతర సంస్థలలో తనఖా పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. దీనిపై నెలనెల వడ్డీ చెల్లిస్తే.. మన బంగారం భద్రంగా ఉంటుంది. మొత్తం డబ్బు సమకూరినప్పుడు బంగారాన్ని విడిపించుకోవచ్చు. అంతేకాకుండా.. ఇంట్లో బంగారం ఉంటే రక్షణ భయం ఉంటుంది. అదే బ్యాంకుల్లో అయితే పూర్తి రక్షణ ఉంటుంది. అందుకే చాలామంది బంగారాన్ని పెట్టుబడి ఆదాయానికి ఉపయోగిస్తున్నారు. బంగారంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది బంగారంపైనే పెట్టుబడి పెడుతున్నారు. 
33 ఏళ్ల తర్వాత తగ్గిన డిమాండ్‌
ఇదిలావుంటే.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బంగారం అమ్మకాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రతి ఏడాది బంగారం అమ్మకాలు పెరగటమే కానీ.. తగ్గడం ఉండదు. కానీ.. గత కొంతకాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో 33 ఏళ్ల తర్వాత బంగారానికి భౌతిక డిమాండ్‌ పడిపోయిందని వర్తకులంటున్నారు. ధర కూడా రెండేళ్లలోనే గరిష్టంగా జులైలో 8 శాతం పతనమైందంటున్నారు. 
ప్రభుత్వ నిర్ణయంతో 650 టన్నుల అమ్మకాలు ?
ఈ ఏడాది 750 నుంచి 850 టన్నుల బంగారు అమ్మకాలు ఉంటాయని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో 650 టన్నులు అమ్మకాలు జరుగుతాయో లేదోనని కూడా వ్యాపారులంటున్నారు. బ్లాక్‌మనీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉండటం,.. ఐడీఎస్‌ పథకాలు తీసుకురావడంతో బంగారంలోకి మనీ ఫ్లోటింగ్‌ తగ్గింది. మరోవైపు వర్షాలు కూడా పడటంతో పెట్టుబడులన్నీ వ్యవసాయం వైపు మళ్లాయి. దీంతో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దివాళీ, ధంతేరాస్‌ సీజన్‌లో కూడా అనుకున్నంత కొనుగోలు లేవని.. ఆఫర్స్‌ ప్రకటించినా కొనుగోలుదారులు ముందుకు రాలేదని వ్యాపారులంటున్నారు. 1999 తర్వాత ఇంత దారుణంగా సేల్స్ పడిపోవటం చూడలేదని గోల్డ్ చైన్ బిజినెస్ మ్యాన్స్ అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో అమ్మకాలు భారీగా పడిపోయాయని.. బిజినెస్‌ లేక రోడ్డున పడే పరిస్థితి ఉందంటున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా వుంటే ముందు ముందు ఎలా ఉంటుందోనన్న టెన్షన్‌ వ్యాపారులను వెంటాడుతోంది. 
ప్రభుత్వానికి ఒనగూరే ప్రయోజనం ఏంటి..? 
ప్రభుత్వం కోరుకున్నట్లే ప్రజలంతా బంగారాన్ని బ్యాంకుల్లో జమచేస్తే ఏమి జరుగుతుంది..? ప్రభుత్వానికి ఒనగూరే ప్రయోజనం ఏంటి..? ప్రభుత్వం ప్రజల దగ్గరున్న బంగారాన్ని బ్యాంకుల్లో సమర్పించమని కోరడం వెనుక ఆంతర్యం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజలంతా బ్యాంకుల్లో తమ బంగారాన్ని ఇచ్చేస్తే దేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. అందుకే గతంలోనూ ఓసారి కేంద్రం, బంగారాన్ని కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే, బంగారంపై తీరని మమకారం ఉన్న భారతీయులు సర్కారు విన్నపాన్ని పట్టించుకోలేదు. 
దేశ పరిస్థితి మెరుగు అవుతుందని అంచనా 
ప్రజల వద్దనున్న బంగారం బ్యాంకుల్లోకి చేరితే.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. బ్యాంకులు తమ వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో నాలుగు శాతం రిజర్వు బ్యాంకు వద్ద ఉంచాలన్నది నిబంధన. మరో 22 శాతం సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. అనంతరం, మిగిలిన డబ్బులను రుణాలుగా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీని డిపాజిటర్లకు పంచి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. 
విదేశాలకు తగ్గనున్న భారత్‌ సంపద 
ప్రజలు బంగారాన్ని బ్యాంకులకు ఇస్తే.. అవి దాన్ని రిజర్వు బ్యాంకు వద్ద ఉంచి డబ్బులు తెచ్చుకుంటాయి. దీంతో బ్యాంకులకు ఎక్కువ డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఎక్కువ రుణాలు ఇచ్చే వీలుంటుంది. దేశంలోకి బంగారు దిగుమతులు తగ్గి, ఇక్కడి డబ్బు విదేశాలకు వెళ్లకుండా భారతీయ బ్యాంకుల్లోనే ఉండిపోతాయి. దీంతో దేశం ఆర్థికంగా పటిష్ఠమయ్యే అవకాశముంటుందన్నది ఆర్థిక వేత్తల అంచనా. ఈ చర్యల వల్ల భారతీయ రూపాయీ బలపడే వీలుంటుందని చెబుతున్నారు.
ఎంతవరకు సమర్ధిస్తారనేది ప్రశ్నార్ధకం 
అయితే.. బంగారంపై ప్రభుత్వం నియంత్రణ విధించడాన్ని ప్రజలు ఎంతవరకు సమర్ధిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. అత్యవసర సమయాల్లో.. ప్రభుత్వాలు బంగారంపై నియంత్రణ విధించడం మన దేశంలోనే కాదు.. గతంలో అమెరికాలోనూ జరిగింది. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకున్న సందర్భంలో.. అమెరికా, బంగారంపై ప్రత్యేక చట్టాన్ని తెచ్చి.. పరిస్థితిని చక్కదిద్దింది. అమెరికా 1933లో విపరీతమైన ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ప్రజలకు ఉపాధి కరవైంది. యువతకు ఉద్యోగాల కొరత ఏర్పడింది. ఫలితంగా అమెరికా ఆర్థిక వృద్ధిరేటు గణనీయ స్థాయిలో మందగించింది. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ దశలో.. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా అప్పటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌కు కనిపించిన ఏకైక ఆధారం.. బంగారమే.
పెను ప్రకంపనలు సృష్టించిన బంగారు చట్టం
రూజ్‌వెల్ట్‌ తెచ్చిన బంగారు చట్టం ఆదేశ పౌరుల్లో పెను ప్రకంపనలే సృష్టించింది. బంగారం పెద్ద మొత్తంలో ఉన్న పౌరులు దాన్ని తక్షణమే బ్యాంకుల్లో సమర్పించి.. దానికి సరిపడా నగదు తీసుకోవాలన్నది రూజ్‌వెల్ట్‌ బంగారు చట్టపు సారంశాం. దీనికి భిన్నంగా వ్యవహరించే వారికి జైలు శిక్ష, భారీ మొత్తం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో అమెరికన్లు బంగారాన్ని సమర్పించేందుకు అప్పట్లో బ్యాంకుల ముందు బారులు తీరారు. ఈ చర్యతో పాటు.. బంగారం ధరను కొంచెం పెద్ద మొత్తంలోనే పెంచారు రూజ్‌వెల్ట్‌. దీంతో విదేశాలు కూడా అమెరికాకు బంగారాన్ని ఎగుమతి చేసి డాలర్లు తెచ్చుకున్నాయి. దీంతో ఫెడరల్‌ రిజర్వు బ్యాంకుకు బంగారం నిల్వలు పెద్దఎత్తున చేరాయి. 
వరదలెత్తిన నిధులు 
బంగారాన్ని బ్యాంకులకు సమర్పించిన ఫలితంగా ప్రజల చేతికీ డబ్బులు భారీగా రావడం.. వారి వివిధ అవసరాలకు ఆ మొత్తాన్ని వెచ్చించడంతో.. ప్రభుత్వానికీ నిధులు వరదలెత్తాయి. ఈ బంగారం చట్టం తెచ్చాక 1933 నుంచి 1937 వరకు అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తి పది శాతంగా నమోదైంది. ఇలా జీఎస్ పీ పెరగడంతో.. అమెరికా అతి త్వరగానే ఆర్థిక మాంద్యం నుంచి  గట్టెక్కింది. ఇదే తరహాలో భారత్‌ ప్రజల నుంచి బంగారం సేకరించి జాతీయోత్పత్తి పెంచుకోవాలని చూస్తోంది. ఓవైపు పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతుండగానే ప్రభుత్వం బంగారు నిల్వలపై పరిమితులు విధించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇదిలావుంటే.. రానున్న రోజుల్లో కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ముగిసిన వర్మ - వంగవీటి ఫ్యామిలీ సమావేశం..

విజయవాడ : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - వంగవీటి రాధాకృష్ణ కుటుంబం మధ్య జరిగిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. సినిమాపై తమకున్న అభ్యంతరాలను తెలియచేసినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించామని, సినిమా చూశాఖ మరోసారి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. 

అడ్డాకుల టోల్ గేట్ లో వాగ్వాదాలు..

మహబూబ్ నగర్ : అడ్డాకుల టోల్ గేట్ లో ట్యాక్స్ చెల్లింపునకు వాహనదారులు రూ. 2 వేల నోట్లు ఇస్తున్నారు. చిల్వర ఇవ్వడానికి టోల్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, టోల్ గేట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంటోంది. అడ్డాకుల టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

12:32 - December 3, 2016
12:31 - December 3, 2016
12:28 - December 3, 2016

కృష్ణా : విజయవాడలో వంగవీటి కుటుంబసభ్యులతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సమావేశం అయ్యారు. వంగవీటి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో భేటీ అయ్యారు. వంగవీటి రాధ, రత్నకుమారిని రామ్ గోపాల్ వర్మ కలిసాడు. వంగవీటి సినిమాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. గంట నుంచి సమావేశం కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:15 - December 3, 2016

హైదరాబాద్ : నోటు క‌ష్టాలు బ‌ల్దియా కార్మికుల‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తమ నెల జీతం అకౌంట్‌లో ఉన్నా చేతికందని పరిస్థితి. నెల ప్రారంభంలోనే త‌మకు వచ్చే డ‌బ్బులన్నీ ఖ‌ర్చు అయ్యేలా ప్లాన్ చేసుకున్న వేత‌న జీవుల‌కు బ్యాంకులు ఇస్తున్న త‌క్కువ నగ‌దుతో సతమతమౌతున్నారు. దీంతో బల్దియా బ్యాంకు ద్వారా కాకుండా నగదు రూపంలో డబ్బులు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సామాన్యులకు ఆర్థిక కష్టాలు 
దేశంలో పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దై 24 రోజులు పూర్తి అవుతున్నా సరిపడా నగదు అందక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో తక్కువ డబ్బులు ఇవ్వడం..ఏటీఎంల్లో కూడా డబ్బులు అందుబాటులో లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నెల ప్రారంభం అవడంతో రెగ్యులర్ గా చెల్లించాల్సిన ఇంటి అద్దె, నెలవారి కిరాణాసరుకులు, స్కూల్ ఫీజులు, విద్యుత్, నీటి బిల్లులు, పాలు. కేబుల్ వంటి బిల్లుల చెల్లింపు క‌ష్టంగా మారింది. తమ తమ అకౌంట్లలో వేతనాలు జీతాలు జమ ఐనా వాటిని తీసుకోలేక, సౌకర్యాలు సమకూర్చుకోలేక సిటిజన్స్ ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు 
ఇక గ్రేటర్ పరిధిలో రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులు, నెలసరి జీతంపై ఆధారపడ్డ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు చేతికందడం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం వారంలో 24 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా ఒక్కో బ్యాంకు నుంచి,..ఒక్కో బ్రాంచిలో  వేరు వేరుగా డబ్బులు వస్తున్నాయి. ఇక బల్దియాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిందరికి బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లదొంగల ఆటకట్టించడానికంటూ ప్రభుత్వ పెద్దలు మాటలు చెబుతున్నారు. నల్లకుబేరులు దొరుకుతారో లేదో కానీ సామాన్యుల కష్టాలు మాత్రం మరింత పెరుగుతున్నాయి. 

 

12:11 - December 3, 2016
12:10 - December 3, 2016
12:08 - December 3, 2016

పర్హాన్ అక్తార్, శ్రద్దాకపూర్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ జంట డేటింగ్ కోసం రెడీ అయినట్లు బీటౌన్ కోడైకూస్తుంది. ఈ బ్యూటీ కోసమే ఫర్హాన్ ఖరీదైన బంగ్లా తీసుకున్నాడట. ఇంతకీ వీరి సమ్ థింగ్ సమ్ థింగ్ మ్యాటరేంట్ చూడండి...
వీరి రిలేషన్ పై హాట్ హాట్ న్యూస్ 
ఇప్పుడు ఫర్హాన్ అక్తర్, శ్రద్దాకపూర్ లకు సంబంధించి రిలేషన్ పై బాలీవుడ్ లో హాట్ హాట్ న్యూస్ వినిపిస్తుంది. ఓ సినిమాలో కలిసి నటిస్తున్నపుడు హీరో, హీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు రావడం కామనే. కానీ ఆ తర్వాత కూడా ఇలాంటి వార్తలే హల్ చల్ చేస్తోందంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. రాక్ఆన్2లో కలిసి నటించిన శ్రద్ధాకపూర్, ఫరాన్ అక్తర్ లపై ఇప్పుడు అలాంటి వార్తలే షికార్లు చేస్తున్నాయి. 
ఫరాన్ తో శ్రద్ధా కపూర్  
ఫర్హాన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని శ్రద్ధా కపూర్ చెబుతోంది కానీ వారి బిహేవియర్ మాత్రం అలా లేదని బాలీవుడ్ లో వినిపిస్తుంది. రాక్ఆన్2 కంటే ముందే వీరి బంధం మొదలైందని, బాఘీ సక్సెస్ అయినపుడు పార్టీ ఇచ్చిన శ్రద్ధా ఆ పార్టీలో ఫరాన్ అక్తర్ తో కలిసి శృతి మించి వేసిన చిందులను ఎవరూ మర్చిపోలేదని బీటౌన్ కామెంట్స్ . రీసెంట్ గా ముంబైలో జరిగిన సిటిజెన్ ఫెస్టివల్ లో కూడా  ఈ బ్యూటీ ఫరాన్ తో కలిసి కనిపించి మరింత క్లారిటి ఇచ్చినట్లు చేసింది.
ఫర్హాన్ అక్తార్, శ్రద్దాకపూర్ ల బంధం బలపడుతుందా..? 
ఫర్హాన్ అక్తార్, శ్రద్దాకపూర్ ల బంధం బలపడుతున్న విషయాన్ని ఈ జంట రోజు రోజుకు స్పష్టం చేస్తుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా ఈ బ్యూటీ ఫర్హాన్ ఇంటికి వెళ్లుతుందట.లేటేస్ట్ గా తన రిలేషన్ ని దాచడం ఎందుకని ఈ జోడి డిసిషన్ తీసుకుందట.అందుకే డేటింగ్ చేయడానికి ఫర్హాన్ బాంద్రాలో ఓ ఖరీదైన ఓ ఇల్లు కొనుక్కున్నాడట. త్వరలోనే ఈ ఇంట్లోకి శ్రద్దాకపూర్ రాబోతున్నట్లు హాట్ న్యూస్ వినిస్తుంది. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కు ఇద్దరు పిల్లలున్నారు. ఈ డైరెక్టర్ కమ్ హీరో 2000 సంవత్సరవంలో అధున అనే అమ్మాయి పెళ్లి చేసుకుని ఈ ఎడాది డైవర్స్ తీసుకున్నాడు. 

 

ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాజ్ నాథ్..

ఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

వికలాంగుల వికాసం కోసం కార్యక్రమాలు - మంత్రి తుమ్మల..

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు హాజరయ్యారు. వికలాంగుల వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు అనేక పథకాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

11:51 - December 3, 2016

మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీని ఎవరితో చేయబోతున్నాడనేది ఇంట్రెస్ట్ గా మారింది. వరుసగా మురుగదాస్, కొరటాల శివ లతో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రిన్స్ 25 వ సినిమా ఏ దర్శకుడితో కమిట్ అవుతాడా అని ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తోంది. మరి ప్రిన్స్ 25 వ సినిమా ఎవరితో చేయబోతున్నాడో మీరు ఓ లుక్కెయండి.
రాజకుమారుడు సినిమాతో మహేష్ ఏంట్రీ 
1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా ఏంట్రీ ఇచ్చాడు. ఈ పదిహేడేళ్ల కెరీర్ లో ప్రిన్స్ ఇప్పటికీ  వరకు 22 సినిమాలు చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ తో 23 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీమంతుడు కాంబోలో 24 వ మూవీని కూడా స్టార్ట్ చేసాడు. వరుసగా 23,24 సినిమాలకు క్రేజీ డైరెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్న ప్రిన్స్ ల్యాండ్ మార్క్ లాంటి 25 సినిమాకి ఏ దర్శకుడిని ఎంచుకుంటాడనేది సన్పెన్స్ గా మారింది.   
25వ సినిమాపై భారీ అంచనాలు 
25వ సినిమా ప్రిన్స్ కి ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ గా వుండాలని మహేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. 25వ సినిమా కోసం మహేష్ బాబు వంశీ పైడిపల్లి లైన్ లో పెట్టినట్లు సమాచారం. ఈ దర్శకుడు ఇప్పటికే ప్రిన్స్ కోసం కత్తిలాంటి స్ర్కిప్ట్ రెడీ చేసాడని టాక్. 
పివిపి బ్యానర్ లోనే మహేష్ 25 సినిమా 
పివిపి బ్యానర్ లోనే మహేష్ 25 సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఎడాది ఇదే బ్యానర్ లో ప్రిన్స్ బ్రహ్మోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నష్టాలను పూడ్చడానికే పొట్లూరి వరప్రసాద్ నిర్మాతగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు దర్శకుడు వంశీపైడిపల్లిని ఈ సినిమా కోసం ఎంచుకోవడానికి కూడా పీవీపీ బ్యానర్ ఊపిరి లాంటి మొమరబుల్ మూవీ ఇవ్వడమే రిజన్ గా కనిపిస్తుంది. మొత్తానికి మహేష్ బాబు 25 వ సినిమాకి వంశీనే డైరెక్టర్ అనేది ఫిక్స్ అయిపోవచ్చు.

రెండో రోజు జీఎస్టీ మండలి సమావేశం..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన రెండో రోజు జీఎస్టీ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. 

11:48 - December 3, 2016

యంగ్ కాంబినేషన్ రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ ముచ్చటగా మూడోసారి జోడి కట్టుతుంది. ఇప్పటికే రెండు సక్సెస్ లు అందుకున్న ఈ జోడి మరో సక్సెస్ కి రెడీ అవుతున్నారు. లేటేస్ట్ ఈ కుర్రజోడి నటిస్తున్న న్యూ మూవీ విశేషాలను చూద్దాం..
రాజ్ తరుణ్, హేభా పటేల్ సక్సెస్ ఫుల్ జోడీ
రాజ్ తరుణ్, హేభా పటేల్ సక్సెస్ ఫుల్ జోడీ అనే విషయం రెండు సార్లు ప్రూవ్ అయింది. ఫస్ట్ టైం కుమారి 21ఎఫ్ కోసం జతకట్టి బ్లాక్ బస్టర్ కొట్టారు. కూమారి సక్సెస్ తో యంగ్ స్టర్స్ ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకంలో కలిసి ఈ జోడి మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో సక్సెస్ కోసం ఈ యంగ్ కాంబినేషన్ రెడీ అయింది. 
ఈ జోడికి మంచి క్రేజ్
బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ ల జోడి మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ హిట్టు పెయిర్ మళ్లీ సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అందగాడు మూవీ కోసం హెబ్బాపటేల్ మూడోసారి రాజ్ తరుణ్ తో స్క్రీన్ రోమాన్స్ కి రెడీ అయింది.
శరవేగంగా అందగాడు షూటింగ్ 
అందగాడు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సక్సెస్ పుల్ రైటర్ గా పేరుతెచ్చుకున్న వెలిగొండ శ్రీనివాస్ ఈ మూవీ తో దర్శకుడిగానూ అరంగేట్రం చేయనున్నాడు. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. అందగాడు సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

 

11:46 - December 3, 2016

ఆయనో యువ ఇంజినీర్..తెలివైన వాడు కూడా. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఇతను ప్రతిభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. అంతేగాకుండా ప్రసంసించారు. కానీ ఇతనే కటకటాలపాలయ్యాడు. వివరాలు తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి..అభినవ్ వర్మ చండీఘడ్ కు చెందిన వాడు. యువ ఇంజినీర్. పెద్దనోట్లు రద్దు..రూ. 2వేల నోటుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకున్న అభినవ్ వర్మ రూ. 2 వేల దొంగనోట్లను ముద్రించి..చలామణీ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. వీవీఐపీలు మాత్రమే వాడే ఎర్రబుగ్గ ఆడీ కారులో వెళుతున్న అభినవ్ వర్మను పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. దీనితో రూ. 42 లక్షల దొంగనోట్లు బయటపడ్డాయి. అభినవ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకుని 30 శాతం కమిషన్ తో నకిలీ రూ. 2000 నోట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. నోట్లు దొంగనోట్లు తెలియక చాలా మంది మోసపోయినట్లు తెలుస్తోంది. ఎంతమందికి పంచారో..ఎవరెవరికి ఇచ్చారో..ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారో పోలీసుల విచారణలో తెలియనుంది.

మోడీ ఎందుకు మెచ్చుకున్నారో తెలుసా ?
అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అభినవ్ తయారుచేశాడు. కర్రకు ముందు ఏముందో అంధులు తెలుసుకోవడానికి వీలుంటుంది. గోతులు..రాళ్లు..ఇతరత్రా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోడీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. చండీగఢ్‌లోని అతని కార్యాలయంలో ఇప్పుడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

11:24 - December 3, 2016

చిత్తూరు : బంగారంపై పన్ను విధించడంపై మహిళలు మండిపడుతున్నారు. మోడీ సర్కార్ పై మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాళి బొట్టు కూడా తెంచేస్తారా... అని ఆవేశపూరితంగా మాట్లాడారు. తాళి బొట్టు తెంపి., పసుపు తాడు మిగిలిస్తారా..అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడలో తాళి బొట్టు కూడా ఉండనివ్వరా.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. బంగారంపై పన్నుకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గంగమ్మ గుడి వద్ద ధర్నా చేపట్టారు. 'బంగారంపై దాడి.. పసుపుతాడే ఉరి' అంటూ కేంద్రప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆందోళనలో వైసీసీ నేత భూమన కరూణకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బంగారంపై పన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:23 - December 3, 2016

ప్రముఖ క్రికేటర్ 'యువ రాజ్ సింగ్' మళ్లీ పెళ్లి చేసుకున్నాడా ? మొన్ననే గదా ప ఎళ్లి చేసుకుంది. అంటూ ఏవోవో అనుకుంటున్నారా ? అవేమీ కాదండి. మూడు రోజుల క్రితం సిక్కుల సంప్రదాయం ప్రకారం టీమిండియా ఆట‌గాడు యువరాజ్‌ సింగ్‌, బాలీవుడ్‌ నటి హజల్‌ కీచ్‌ ల పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు ప్రముఖులు విచ్చేశారు. తాజాగా 'యువీ' హిందూ సంప్రదాయం ప్రకారం 'హజల్ కీచ్'ను మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ తంతు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో వధూ వరుల కుటుంబసభ్యులు కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. సిక్కు సంప్రదాయంతో పాటు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగిందన్నమాట. ఇదిలా ఉంటే ఈనెల 7వ తేదీన ఢిల్లీలో 'యువీ' పెళ్లి విందు నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం హాజరు కానున్నట్లు సమాచారం. 

11:08 - December 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో వార్డు కమిటీలకు రంగం సిద్ధమైంది. ప్రతి 5 వేల మందికి ఒక సభ్యున్ని ఎన్నుకోనున్నారు. ప్రతివార్డుకు 8 నుంచి 12 మంది వరకు ఉండే అవకాశం ఉంది. వార్డు కమిటీ సభ్యుల కోసం 5, 600 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4600 మంది అర్హత పొందారు. ఇప్పటికే వార్డు కమిటీల ఎంపిక రెండుసార్లు వాయిదా పడింది. ఉదయం 10.30 గంటలకు జీహెచ్ ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. బల్దియా.. 150 వార్డులకు కమిటీలను ఎన్నుకోనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:48 - December 3, 2016
10:45 - December 3, 2016

డిజిటల్ నగదుకే భవిష్యత్ - బాబు..

విజయవాడ : రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల పురోగతిపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ క్యాష్ హ్యాండింగ్ ఛార్జీలను రద్దు చేసిన బ్యాంకర్లను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న బ్యాంకు సిబ్బంది..అధికార యంత్రాంగం శ్రమ వృధాగా పోదన్నారు. భౌతిక నగదుకు కాలం చెల్లిందని..డిజిటల్ నగదుకే భవిష్యత్ ఉంటుందన్నారు. సీఎస్ఆర్ కింద గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తయారు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. 

గుంటూరులో ఖాతాదారుల ఇబ్బందులు..

గుంటూరు : నగదు లేక జిల్లా వ్యాప్తంగా ఏటీంఎలు మూతపడ్డాయి. దీనితో ఖాతాదారుల ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుకు వెళుతున్న వృద్ధులకు చుక్కెదురవుతోంది. ఆన్ లైన్ లో పేర్లు కాలేదని వృద్ధులను బ్యాంకు అధికారులు తిప్పి పంపుతున్నారు. వివరాల నమోదుకు గుంటూరు కార్పొరేషన్ ఎదుట వృద్ధులు, వికలాంగులు పడిగాపులు పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించడం లేదు. 

10:36 - December 3, 2016

హైదరాబాద్ : 25 రోజులు గడుస్తున్నా తెలుగురాష్ట్రాల్లో నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల దగ్గర ఉదయం నుంచే జనం పడిగాపులు కాస్తున్నారు. అటు ఏటీఎంల దగ్గర నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కూరగాయల వ్యాపారులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. మరోవైపు 10 వేల విత్‌డ్రా నిబంధనతో ఉద్యోగుల పాట్లు పడుతున్నారు. మరిన్ని వివరాలను  వీడియోలో చూద్దాం...

 

బంగారంపై పన్నుకు వైసీపీ ధర్నా..

తిరుపతి : బంగారంపై పన్నుకు వ్యతిరేకంగా గంగమ్మ గుడి వద్ద వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. బంగారంపై దాడి..పసుపు ఉరి తాడే అంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. 

10:20 - December 3, 2016

విశాఖ : పెట్రోల్‌ బంకుల్లో పాత 500, 1000 నోట్ల చెల్లుబాటు గడువు ముగియడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లర లేక అష్టకష్టాలు పడుతున్నారు. మరికొంతమంది 2000 నోట్లు ఇస్తున్నా.. వాటికి పెట్రోల్‌ బంక్‌ యజమానులు దగ్గర చిల్లర దొరకడం లేదు. దీంతో కొంతమంది క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పెట్రోల్‌ పోయించుకుంటున్నారు. పెట్రోల్‌ బంక్‌ యజమానులు కూడా స్వైపింగ్‌ మిషన్‌లను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:15 - December 3, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దుతో ప్రజల కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.  ఈ రోజు నుంచి పెట్రోల్‌ బంక్‌ల దగ్గర కూడా పాత 500, 1000 నోట్లు తీసుకోకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  రెండువేల రూపాయల నోటుకు పెట్రోల్ బంక్‌ల దగ్గర చిల్లర ఉండడం లేదు. దీంతో అటు వాహనదారులు, ఇటు పెట్రోల్‌ బంక్‌ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:08 - December 3, 2016

ఢిల్లీలో దట్టమైన పొగమంచు..

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. రైళ్లు..విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 9 అంతర్జాతీయ, 4 దేశీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ - లక్నో విమాన సర్వీసును రద్దు చేశారు. 

కోటపల్లిలో పెద్దపులి మృతి..

మంచిర్యాల : కోటపల్లి (మం) పిన్నారంలో పెద్దపులి మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించింది. ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలానికి బయలుదేరారు.

 

ఏటీఎంల దగ్గర నో క్యాష్‌ బోర్డులు

హైదరాబాద్ : 25 రోజులు గడుస్తున్నా తెలుగురాష్ట్రాల్లో నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల దగ్గర ఉదయం నుంచే జనం పడిగాపులు కాస్తున్నారు. అటు ఏటీఎంల దగ్గర నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కూరగాయల వ్యాపారులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. మరోవైపు 10 వేల విత్‌డ్రా నిబంధనతో ఉద్యోగుల పాట్లు పడుతున్నారు. 

 

09:28 - December 3, 2016
09:27 - December 3, 2016
09:26 - December 3, 2016

హైదరాబాద్ : 25 రోజులు గడుస్తున్నా తెలుగురాష్ట్రాల్లో నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల దగ్గర ఉదయం నుంచే జనం పడిగాపులు కాస్తున్నారు. అటు ఏటీఎంల దగ్గర నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కూరగాయల వ్యాపారులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. మరోవైపు 10 వేల విత్‌డ్రా నిబంధనతో ఉద్యోగుల పాట్లు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

09:24 - December 3, 2016

రాత్రికి రాత్రి పట్టాలిచ్చేశారు..ఈ పట్టాలను యజమాని రద్దు చేయించాడు..అయినా పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు చేశారు.

కోట్ల రూపాయల విలువ చేసే భూమి పేరు మారిపోయింది. అందుకు రెవెన్యూ ఉద్యోగులు సహకరించారు. లక్షలు చేతులు మారాయి..బాధితులు గ్రహించి ఫిర్యాదు చేస్తే పాస్ పుస్తకాలను రద్దు చేసేశారు. రద్దైన పాస్ పుస్తకాలతోనే రిజిస్ట్రేషన్ చేశారు. తిలా పాపం తలా పడికెడు అన్నట్లు రెవిన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు పంచుకుని మోసం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ భూ వివాదంపై కేసులు నమోదయ్యాయి. ఇదంతా మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మత్తెల్లిగూడలో జరిగింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:24 - December 3, 2016

హైదరాబాద్ : జాతీయ రహదారులపై టోల్‌గేట్‌ల దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్థరాత్రి  నుంచి కేంద్రం విధించిన గడువు ముగియడంతో టోల్‌ వసూలు చేస్తున్నారు. అయితే పాత 500 నోట్లను టోల్‌గేట్‌ దగ్గరి సిబ్బంది తీసుకోవడం లేదు. తమ దగ్గర కొత్తనోట్లు లేవంటూ వాహనదారులు లబోదిబోమంటున్నారు. పాతనోట్లు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో పలుచోట్ల వాహనదారులకు టోల్‌గేట్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పాతనోట్లను టోల్‌గేట్‌ సిబ్బంది అనుమతించకపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మరికొన్ని రోజులు టోల్‌ వసూలు నిలిపివేయాలని వాహనదారులు కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:19 - December 3, 2016

భర్త నుండి నిత్యం వేధింపులు..అయినా అన్నీ భరిస్తూ వచ్చింది. తన కల నెరవేర్చుకొనేందుకు కష్టపడింది. చివరకు ఎస్ఐ పరీక్ష రాసింది. రిజల్ట్ మాత్రం రాలేదు. ఈమె మాత్రం జీవితంలో ఓడిపోయింది. రాక్షసుడిగా మారిన మొగుడు అరాచకానికి బలైంది.

హరిణి..భరత్ కుమార్ అనే దంపతులు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. వీరికి ఐదేళ్ల క్రితం పెళ్లైంది. హరిణి అనే గృహిణి కొన్నాళ్ల క్రితమే ఎస్ఐ పరీక్ష రాసింది. అప్పటికే ఆలు మగల మధ్య కలహాలున్నాయి. పరీక్ష తరువాత మరింతగా గొడవలు పెరిగినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద స్థితిలో హరిణి నిర్జీవమై కనిపించింది. కట్నం కోసం వేధింపులు చేసే వాడని కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. మరి హరిణిని ఎవరు చంపారు ? అనేది తేలాల్సి ఉంది. 

09:09 - December 3, 2016

హంతకుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్..అనుమానంతో అంతం చేసిన దుర్మార్గుడు..ప్రేమించి పెళ్లాడి..కట్నం కోసం కాటేసిన కిరాతకుడు..అబలలపై ఆగని ఆరాచకాలు..

అతనో సాఫ్ట్ వేర్ ఇంజినీర్..అతని ఆలోచనలు మాత్రం హాట్ గా ఉంటాయి. మద్యం సేవించాడంటే చాలు కిరాతకుడు అవుతాడు. భార్యను కొడుతాడు..అపస్మారకస్థితికి చేరుకొనే వరకు కొట్టి వదిలేస్తాడు..ఇలా శాడిస్టుగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్యను పది హేను సార్లు పొడిచి పొడిచి చంపేశాడు.
ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దమ్మాయిగూడకు చెందిన చక్రపాణి హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మాధవితో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషాద ఘటన గురించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

పంతంగి టోల్ ప్లాజాలో పాత రూ.500 నోటు నిరాకరణ

యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాలో పాత రూ.500 నోటును టోల్ ప్లాజా సిబ్బంది నిరాకరిస్తోంది. చిల్లరలేక వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది. 

08:46 - December 3, 2016

గుంటూరు : పెట్రోల్ బంకుల్లో పాత నోట్ల స్వీకరణ గడువు ముగిసింది. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ సిబ్బంది పాత నోట్లు తీసుకోలేదు. కోత్త నోట్లు ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. పాత నోట్లు తీసుకోకపోవడంతో పలు చోట్ల పెట్రోల్ బంకు సిబ్బందితో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. పాత నోట్లు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు. పాత నోట్ల స్వీకరణ గడువు పెంచాలని వాహనదారులు డిమాండ్ చేశారు. మరిన్ని వివరానలు వీడియోలో చూద్దాం...

 

పాతనోట్ల స్వీకరణకు పెట్రోల్ బంక్ సిబ్బంది నిరాకరణ

హైదరాబాద్ : పెట్రోల్ బంకుల్లో పాత నోట్ల స్వీకరణ గడువు ముగిసింది. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ సిబ్బంది పాత నోట్లు తీసుకోలేదు. కోత్త నోట్లు ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. పాత నోట్లు తీసుకోకపోవడంతో పలు చోట్ల పెట్రోల్ బంకు సిబ్బందితో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. 

08:40 - December 3, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత శ్రీనివాస్, టీకాంగ్రెస్ నేత బెల్ల నాయక్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ఒక్క నల్లకుబేరులపై దాడులు జరగలేదని తెలిపారు. కానీ సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:35 - December 3, 2016

శ్రీకాకుళం : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరో జిల్లా సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి పవన్‌ ఉత్తరాంధ్రపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధి సమస్యపై ఆయన స్పందించనున్నారు. 
జిల్లాలవారీగా ఉన్న ప్రజా సమస్యలపై పవన్‌ దృష్టి
ప్రజా సమస్యలపై అధ్యయనం 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాంతాల వారీగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ...వాటిపై అధ్యయనం చేస్తున్నారు. బహిరంగ సభల ద్వారా .. ఆ సమస్యల పరిష్కారమెప్పుడంటూ  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ.. తిరుపతి.. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రజల బాధల గురించి ఇప్పటికే మాట్లాడిన జనసేనాని, తాజాగా శ్రీకాకుళంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆరో తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. 
ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధి సమస్యపై మాట్లాడనున్న పవన్‌
పవన్‌కల్యాణ్‌ ఈసారి శ్రీకాకుళం జిల్లా.. ఇచ్ఛాపురం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న ప్రజల గురించి మాట్లాడనున్నారు. 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం నియోజక వర్గం నాలుగు మండలాల్లో దాదాపు 30కి పైగా గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.  వ్యాధికారణంగా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు నిపుణులు కూడా వెల్లడించారు. అయినా ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వం ముందుకు రాలేదు. 
పవన్‌కు సమస్య గురించి తెలిపిన అభిమానులు
అనేక ఏళ్లుగా తమ ప్రాంతంలో ఉన్న ఈ సమస్య గురించి అభిమానులు పవన్‌కు తెలియజేశారు. దీంతో స్పందించిన ఆయన ఆరో తేదీన ఇచ్ఛాపురం వెళ్లి  కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే ఆ ప్రాంత ప్రజలతో స్థానిక మణికంఠ థియేటర్ వద్ద ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల పార్టీ కార్యకలాపాలను  పెంచిన పవన్ ప్రజా సమస్యలే ప్రధానంగా ముందుకు కదులుతున్నారు. 

08:25 - December 3, 2016

సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దత్తత గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న పనుల గురించి ఆరా తీశారు. అలాగే అభివృద్ధి పనులపై గ్రామస్థుల అభిప్రాయాలను కూడా  తెలుసుకున్నారు.  
అభివృద్ధి పనుల పరిశీలన
సిద్ధిపేట్‌ జిల్లా.. మార్కుక్‌ మండలంలోని దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. గ్రామాలలో పూర్తైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను.. అంతర్గత సీసీ రహదారులను.. వాటికి ఇరువైపుల నాటిన మొక్కలను  ఆయన సందర్శించారు. అలాగే కూడవెల్లి వాగు వద్ద నిర్మించిన చెక్‌ డ్యామ్‌లను చూసి.. సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవరల్లిలో చివరి దశ నిర్మాణంలో ఉన్న ఫంక్షన్‌హాల్‌ పనులను పరిశీలించి.. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో  సమావేశమయ్యారు. 
సంగారెడ్డి జిల్లాలో పాండురంగ జలాశయం పరిశీలన
తన పర్యటనలో భాగంగా  కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లాలోని పాండురంగ  జలాశయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు. గోదావరి జలాలు 365 రోజులు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించినట్టు  ఈ సందర్భంగా  కేసీఆర్‌ చెప్పారు. అలాగే ఎర్రవల్లి, నరసన్నపేటలో ఈ నెల 23న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు  ఆయన వెల్లడించారు. గ్రామంలో పనులను పరిశీలించిన అనంతరం.. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు తిరిగి వెళ్లిపోయారు. 

 

08:19 - December 3, 2016

మెదక్ : జిల్లాలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. విజయపౌండ్రీలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

08:16 - December 3, 2016

అనంతపురం : అవాంతరాలెన్ని వచ్చినా ..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి.. రాష్ట్రానికి నిధులు రాబడుతున్నామన్నారు. అనంతపురం పర్యటనలో ఆయన గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉత్సహాంగా సాగింది. ముందుగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై భాగమైన గొల్లపల్లి రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. తొలుత కృష్ణా జలాలకు పూజలు నిర్వహించిన ఆయన రిజర్వాయర్‌లోకి నీటికి విడుదల చేశారు.
రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తాం : చంద్రబాబు 
ఎన్ని అవాంతరాలు ఎదురైనా... రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాకు కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపి... జిల్లాలో చెరువులను నింపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే రోజుల్లో మడకశిర నియోజకవర్గానికి కూడా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ నుంచి వచ్చేఏడాది 80టీఎంసీలను రాయలసీమకు తరలించి సస్యశ్యామలం చేస్తామన్నారు.   
అనంతపురం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సంతోషం : బాలకృష్ణ 
అనంతపురం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నాడు ఎన్టీఆర్‌ చూపించిన దారిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సాగుతున్నారని.. రాయలసీమ అభివృద్ధికి   టీడీపీ ప్రభుత్వం విరామమెరుగని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు మరోసారి వివరణ
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడంపై ఆయన అనంతపురం సభలో మరోసారి వివరణ ఇచ్చారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే.. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోవచ్చన్నారు. జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు వాతావరణ బీమాతో కలుపుకొని హెక్టారుకు 15వేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని బాబు ప్రకటించారు.
పెద్దనోట్ల రద్దుతో వందల కోట్లు నష్టం : చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు సమస్యతో రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వస్తోందన్నారు చంద్రబాబు. కష్టాలొచ్చాయని..వ్యాపారాలు మానేస్తే.. అభివృద్ధిలో వెనుకబడతామన్నారు.  నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలు తీరడానికి మరికొంత సమయం పడుతుందని..  అప్పటిదాకా ఓపికపట్టాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో యువత పాల్గొనాలని చంద్రబాబు సభలో పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత యువతదేనని తెలిపారు. 

 

07:57 - December 3, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలను వీలైనంత త్వరగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ప్రజల ఉపశమనానికి తీసుకున్న చర్యలను కేంద్రం బహిర్గతపరచాలని సుప్రీం సూచించింది. 
పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ 
పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వ్యాఖ్యానించింది. సహకార బ్యాంకులపై ఆధారపడిన గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 
సహకార బ్యాంకులకు సరిపడా నగదు పంపాలని సూచన
కో...ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఖాతాదారులకు నగదు అందించలేకపోతున్నామని కోర్టుకు మహారాష్ట్ర, కేరళ సహకార బ్యాంకులు తెలిపాయి. మహారాష్ట్ర, కేరళ సహకార బ్యాంకుల సమస్యలు నిజమైనవేనని ధర్మాసనం అంగీకరించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్య ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల సమస్యలపై పరిష్కార మార్గాలు చూపాలని కేంద్రానికి  సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

07:49 - December 3, 2016

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలు వేగవంతం చేసేందుకు ఏపీ సర్కారు ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బ్యాంకు అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు..దీని విషయమై  కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ 2వేల 420కోట్ల రూపాయలు పంపింది. దీంతో నగదు రహిత లావాదేవీల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం 
నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా ఏపీ సర్కారు చర్యల్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. మరోవైపు ప్రజల అవసరాలకు సరిపడ నగదును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2వేల 420కోట్ల రూపాయలను రాష్ట్రానికి పంపింది. ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ నగదు... ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానాల్లో విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి కొత్త కరెన్సీని జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.  అవసరాలను బట్టి కొన్ని జిల్లాలకు రూ.240 కోట్లు, కొన్ని జిల్లాలకు రూ.160 కోట్లు కేటాయించినట్లు సమాచారం. 
నగదు రహిత లావాదేవీలు వేగవంతం : నెల్లూరు కలెక్టర్
సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో నగదు రహిత లావాదేవీలను వేగవంతం చేస్తున్నట్లు నెల్లూరు కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనంతరం జిల్లాలో ఇప్పటివరకూ 2800 కోట్లు డిపాజిట్ రూపంలో...మరో 698 కోట్ల రూపాయల నగదు చెల్లింపులు అయ్యాయన్నారు. బ్యాంకుల్లో నగదు లేదని ..జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 160 కోట్ల రూపాయల కొత్తనోట్లు వచ్చాయని...ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంకుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు వేగవంతం చేసేందుకు ఏపీ సర్కారు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోన్న సర్కారు..మరిన్ని చర్యలతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెడీ అవుతోంది. 

 

తిరుమల రింగ్ రోడ్డు కంచిమఠం వద్ద కూలిన చెట్టు

తిరుమల : రింగ్ రోడ్డు కంచిమఠం వద్ద చెట్టు కూలింది. భక్తుల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అటవీశాఖ అధికారులు చెట్టును తొలగిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...మరో 9మందికి గాయాలు

తూర్పుగోదావరి : రాజానగరం మండలం దివాన్ చెరువులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనరును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. వారిని 
ఆస్పత్రికి తరలించారు.

నేడు వరంగల్ అర్బన్ జిల్లాల్లో మంత్రులు కడియం, మహమూద్

వరంగల్ : వరంగల్ అర్బన్ జిల్లాల్లో నేడు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

నేటి నుంచి టోల్ గేట్లు, పెట్రోల్ బంక్ రూ.500 నోట్లు రద్దు

హైదరాబాద్ : నేటి నుంచి టోల్ గేట్లు, పెట్రోల్ బంక్ రూ.500 నోట్లు రద్దు చేయనున్నారు.  

 

07:29 - December 3, 2016

కృష్ణా : విజయవాడలోని టోల్‌ గేట్‌ల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్థరాత్రి  12 గంటల నుంచి జాతీయరహదారులపై టోల్‌ వసూలు చేస్తున్నారు. అయితే గడువు ముగియడంతో పాత 500 నోట్లను టోల్‌ సిబ్బంది తీసుకోవడం లేదు. తమ వద్ద కొత్త నోట్లు లేవంటూ వాహనదారులు లబోదిబోమంటున్నారు. దీంతో వాహనదారులు-టోల్‌గేట్‌ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్‌గేట్‌ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

 

07:28 - December 3, 2016

హైదరాబాద్ : నగరంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సాహినయత్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. 33 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సరైన ఆధారాలు లేని 48 వాహనాలు, 20 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

విజయవాడలో టోల్‌ గేట్‌ల వద్ద ఘర్షణ వాతావరణం

కృష్ణా : విజయవాడలోని టోల్‌ గేట్‌ల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అర్థరాత్రి  12 గంటల నుంచి జాతీయరహదారులపై టోల్‌ వసూలు చేస్తున్నారు. అయితే గడువు ముగియడంతో పాత 500 నోట్లను టోల్‌ సిబ్బంది తీసుకోవడం లేదు. తమ వద్ద కొత్త నోట్లు లేవంటూ వాహనదారులు లబోదిబోమంటున్నారు. దీంతో వాహనదారులు-టోల్‌గేట్‌ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్‌గేట్‌ల వద్ద భారీగా వాహనాలు
నిలిచిపోయాయి. 

సాహినయత్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో పోలీసుల సోదాలు

హైదరాబాద్ : నగరంలో పోలీసులు కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సాహినయత్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. 

జమ్మూకాశ్మీర్ లో స్వల్ప భూకంపం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5 శాతంగా నమోదు అయింది. భూమి నుంచి పది కిమీల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ : నేడు ఎమ్ఆర్ పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా అధికార, ప్రతిపక్ష నేతలను ఆయన కోరనున్నారు.

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై ప్రధాని మోడీకి చంద్రబాబు వివరించనున్నారు. 

Don't Miss