Activities calendar

05 December 2016

21:37 - December 5, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలు పట్టు వీడడం లేదు...ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. తామిచ్చిన వాయిదా తీర్మానం ప్రకారం చర్చించి ఓటింగ్‌ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఓటింగ్‌ లేకుండా ఏ నిబంధన ప్రకారమైన చర్చకు సిద్ధమేనని అధికార పక్షం చెప్పడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే నిబంధన 184 ప్రకారం చర్చ జరిపి ఓటింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. నోట్ల రద్దుతో జీతాలు, పెన్షన్‌ తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. గత 50 రోజుల్లో లక్షా 28 వేల కోట్ల నష్టం వాటిల్లిందని... పది లక్షల మంది ఉపాధి కోల్పోనున్నట్లు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. చర్చ నుంచి ప్రభుత్వమే పారిపోతోందని ఖర్గే ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో యూపీలో ఇద్దరు మహిళలు మృతి చెందారని దేశ వ్యాప్తంగా మొత్తం 105 మంది మరణించారని ఎస్పీ సభ్యులు ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రతిపక్షాల సూచనలను తాము స్వీకరిస్తామని, నిబంధనలు పక్కన బెట్టి దీనిపై చర్చిద్దామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విపక్షాలకు సూచించారు. నల్లధనాన్ని అరికట్టి ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

రాజ్యసభలో..
అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చ సాగింది. రాజ్యసభ ప్రారంభంలోనే నోట్ల రద్దుతో పార్లమెంట్‌ ఎటిఎంలలోనే డబ్బులు లేవని, బయట పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని, ఉద్యోగులు జీతాలు అందుకోలేని స్థితి ఏర్పడిందని ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ సూచనను పట్టించుకోని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభను డిప్యూటి చైర్మన్‌ సోమవారానికి వాయిదా వేశారు.

21:32 - December 5, 2016

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలితకు ఎక్మో పై చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు ప్రకటించారు.. అసలు ఈ ఎక్మో చికిత్స అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

21:27 - December 5, 2016

చెన్నై : జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రం ప్రత్యేక ఆర్మీ బలగాలను తమిళనాడుకు పంపింది. చెన్నైలో 15 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. చెన్నైలో ఐటి సంస్థలు, విద్యాసంస్థలు, పెట్రోల్‌ బంకులు, షాపులను మూసివేశారు. చెన్నై మొత్తం ఆర్మీ, పోలీసు బలగాలతో నిండిపోయింది. శాంతి భద్రతలు కాపాడడానికి చెన్నైలో 15 వేల మంది ప్రత్యేక పోలీసుల బలగాలను మోహరించారు. జయలలిత నివాసం పొయెస్‌ గార్డన్‌ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

వదంతులు నమ్మవద్దు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులను నమ్మొద్దని ప్రజలకు చెన్నై పోలీసులు విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లపై నిఘా పెట్టినట్లు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. అమ్మ ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. కొందరు కార్యకర్తలు ఆస్పత్రిలోనికి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

హై డ్రామా..
ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీరియస్‌ కేసులను సైతం జాగ్రత్తగా అంబులెన్స్‌ల ద్వారా వేరే ఆస్పత్రులకు మారుస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బస్సులు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారు. ప్రజలు తమ ప్రయాణాలను సైత వాయిదా వేసుకుని తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తమిళనాడుకు బస్సు సర్వీసులు నడపవద్దని ఆర్టీసీని ఆదేశించింది. చెన్నై వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది.

21:18 - December 5, 2016

చెన్నై : అమ్మ జయలలిత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడం తమిళనాడు ప్రజలకు అంతుచిక్కని రహస్యం.. ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే అమ్మ ఇంతటి తీవ్ర అనారోగ్యం పాలవ్వడం ఏంటని తమిళులు చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగానూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ అమ్మ అనారోగ్యానికి కారణాలేంటి...? వాచ్‌ దిస్‌ స్టోరీ. 'అమ్మ' జయలలిత తమిళనాడు ప్రజల ఆరాధ్యదేవత.. అమ్మ మాటే అందరికీ వేదం.. అలాంటి అమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా ప్రాణాంతకంగా ఎందుకు మారింది..? ఆరోగ్యం తీవ్రంగా క్షీణించేవరకు అమ్మ ఎందుకు నిర్లక్ష్యం వహించారన్నది ప్రతి ఒక్కరి మదినీ కలచివేస్తోంది.

జయలలిత డయాబెటిక్ పేషెంట్‌..
జయలలిత డయాబెటిక్ పేషంట్‌.. ఎప్పటినుంచో అమ్మను ఈ వ్యాధి వేధిస్తోంది. కానీ డయాబెటిక్ ట్రీట్‌మెంట్ విషయంలో అమ్మ చాలా అశ్రద్ధ చూపించేవారని అత్యంత సన్నిహితులు చెబుతారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉండగా భోజనప్రియురాలైన జయలలిత ఆవిషయంలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించేవారు కాదు.

ఆప్తులు లేకపోవడంతో మానసిక కుంగుబాటు..
మరోవైపు ఒంటరితనం కూడా అమ్మను తీవ్రంగా కలచివేసిందంటున్నారు. అమ్మకు బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా పంచుకోవడానికి కనీసం ఆప్తులు కూడా లేకపోవడంతో మానసికంగా కుంగిపోయేవారన్నది సన్నిహితుల కథనం. దీంతో ఆమె ఆరోగ్యం విషయంలోనూ తీవ్రనిర్లక్ష్యం చూపించేవారని భోగట్టా.

నిత్యం ఏసీ రూముల్లోనే బసచేసే జయలలిత..
అమ్మది భారీ శరీరమైనా ఎప్పుడూ బరువు గురించి ఆలోచించేవారు కాదు. కనీసం బరువును అదుపులో పెట్టుకోవడానికి వ్యాయామం కూడా చేసేవారుకాదు. నిత్యం ఏసీ రూముల్లో బసచేయడం.. ఎప్పుడు కూర్చునే ఉండడం కూడా ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.

ఊటీ అంటే అమ్మకు అమితమైన ఇష్టం..
ఇవే కాకుండా అమ్మకు శీతల ప్రదేశమైన ఊటీ అంటే చాలా ఇష్టం.. ఏడాదిలో ఆరునెలలు ఊటీలోనే ఉండేవారు. దీంతో జయలలితకు శ్వాసకోశ వ్యాధి కూడా వచ్చింది. ఎప్పుడు ఏసీరూంల్లో ఉండడం... ఎండల్లో తిరగకపోవడం వల్ల ఆమెలో డీ విటమిన్ కూడా లోపించింది. వయసురీత్యానే కాకుండా విటమిన్‌ల లోపం వల్ల కూడా అమ్మకు కాళ్ల నొప్పులు కూడా బాగా పెరిగాయి. దీంతో ఆమె నడవడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల అడుగులో అడుగేయడమే కష్టంగా మారింది.

మిస్టరీగానే అమ్మ ఆరోగ్యం..
ఇన్ని అనారోగ్య సమస్యలున్నా ఎప్పుడు అమ్మ బయటపడేదికాదు. దీనికి కారణం తనకి ఆరోగ్యం బాగలేదని తెలిస్తే తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏమైపోతారోననే భయం ఆమెను నిత్యం వెంటాడేది. ఈ కారణంతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌కు ఆమె నిరాకరించేవారు. ఇంట్లోనే మందులు వాడుతూ వచ్చారు. అందుకే గత సెప్టెంబర్‌ 22న అపోలో ఆస్పత్రిలో చేరేవరకు అమ్మ ఆరోగ్యం ఇంతలా దెబ్బతిందని ఎవరికీ తెలీదు. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ ఉదాసీనతే ఆమె ఆరోగ్యం తీవ్రంగా విషమించడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

21:09 - December 5, 2016
20:43 - December 5, 2016

హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అపోలో వైద్యులు ప్రకటించారు. దీనితో దేశ వ్యాప్తంగా 'అమ్మ' అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొద్దిసేపటి క్రితం జయలలిత చనిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో తీవ్ర ఉద్విగ్నానికి గురయ్యారు. సికింద్రాబాద్ లో ఉంటున్న తమిళ సోదరులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలను తెలుసుకొనేందుకు నేరెడ్ మెట్ లో టెన్ టివి ప్రయత్నించింది. జయలలిత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అభిమానులు పేర్కొన్నారు. నగరంలో ఉన్న 150 డివిజన్ లలో తమిళ కార్పొరేటర్ ఇక్కడున్నారని, 'అమ్మ' ఆసుపత్రిలో ఉన్నప్పటి నుండి తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఓ వ్యక్తి తెలిపారు. జయలలిత హాయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని పేర్కొన్నారు.

పాత రూ. 500 నోట్లతో టోల్ రుసుం చెల్లింపు..

ఢిల్లీ: పాత రూ.500 నోట్లతో టోల్ రుసుం చెల్లింపులకు గడువు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 15 వరకు టోల్ రుసుం చెల్లించే అవకాశం కల్పించారు.

బాబు బృందం విదేశీ పర్యటనల తేదీల ఖరారు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం విదేశీ పర్యటనకు బయలుదేరనుంది. ఈమేరకు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 10 నుండి 13వరకు కువైట్, యూఏఈలో బాబు పర్యటించనున్నారు. ఆయనతో పాటు 15 మంది వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఉత్కంఠ రేపుతున్న అన్నాడీఎం ఎల్పీ సమావేశం..

చెన్నై : అన్నాడీఎంకే ఎల్పీ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. కొత్తనేత ఎంపికపై ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగుతోంది. ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం.

19:37 - December 5, 2016

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆమెకు గుండెపోటు రావడంతో.. ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలెతో పాటు ఎయిమ్స్‌ వైద్యుల బృందం జయలలితకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. జయ ప్రాణాలు కాపాడేందుకు ఎక్మో, లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టంతో చికిత్స అందిస్తున్నారు. జయ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ అంశంపై నడింపల్లి సీతారామరాజు (విశ్లేషకులు) అభిప్రాయాలు తెలిపారు. అలాగే ఢిల్లీ, చెన్నైలో నెలకొన్న పరిస్థితి రిపోర్టలు..దీనిపై ఇన్ పుట్ ఎడిటర్ విశ్లేషణ అందించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

19:33 - December 5, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆమెకు గుండెపోటు రావడంతో.. ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలెతో పాటు ఎయిమ్స్‌ వైద్యుల బృందం జయలలితకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు. జయ ప్రాణాలు కాపాడేందుకు ఎక్మో, లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టంతో చికిత్స అందిస్తున్నారు. జయ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలించారు.

అత్యాధునిక చికిత్స..
గుండెపోటుకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మరింత విషమంగా మారింది. చెన్నై అపోలో ఆసుపత్రిలో లండన్‌ వైద్యుడు రిచర్డ్‌తో పాటు ఎయిమ్స్‌ వైద్యుల బృందం జయకు అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు. హృద్రోగ, శ్వాసకోశ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జయకు ఎక్మో, లైఫ్‌ సపోర్ట్‌ ద్వారా అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధుని వైద్యాన్ని జయకు అందించామని, ఇక మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలే ఆకాంక్షించారు.

పరిస్థితి ఉద్రిక్తం..
జయలలితకు గుండెపోటు వచ్చిందన్న పిడుగులాంటి వార్త.. అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మంత్రులు, పార్టీ నేతలు, అపోలో ఆసుపత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు హుటాహుటిన చెన్నైకి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జయ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌, కేంద్రమంత్రులు ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలించారు. అపోలో హాస్పిటల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రార్థనలు..
పెద్ద మొత్తంలో మహిళలు హాస్పిటల్ వద్దకు చేరుకుని.. అమ్మ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ వాజ్‌గా, పురచ్చి తలైవి వాజ్‌గా అంటూ... విప్లవ నాయకురాలు చిరకాలం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తున్నారు. హాస్పిటల్ వద్దకు వచ్చే అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జయ నివాసం పోయెస్ గార్డెన్ వద్ద సైనిక బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు వచ్చే బస్సుల సర్వీసులను నిలిపివేశారు. తమిళనాడులో ఉన్న కేఎస్‌ఆర్టీసీ బస్సులను కర్ణాటకకు తీసుకురావాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఇరు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన హోసూరుకు సమీపంలో అత్తిబలే వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. పారామిలటరీ బలగాలనూ పంపాలని కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జయలలిత వారుసుడు ఎవరన్న దానిపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. పన్నీర్‌ సెల్వంను సీఎంగా ప్రకటించేందుకు ఉద్దేశించిన డిక్లరేషన్‌పై ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

అపోలో వద్ద నెట్ వర్క్ సర్వీసుల నిలిపివేత..

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి పరిసరాల్లో అన్ని రకాల మొబైల్ నెట్ వర్క్ సర్వీసులు నిలిపివేశారు. ఎలాంటి వార్తలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం..

చెన్నై : ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి..రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జయ వారసుడిగా పన్నీర్ సెల్వంకు మద్దతుగా డిక్లరేషన్ పై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంకు 82 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతుండగా శశికళకు 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.

18:54 - December 5, 2016

చెన్నై : అపోలో ఆసుపత్రి వద్ద సోమవారం సాయంత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమిళనాడు సీఎం జయలలిత చనిపోయిందంటూ తమిళ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 75 రోజులుగా జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మృతి చెందారన్న వదంతులతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహానికి..ఉద్విగ్నానికి గురై వీరంగం సృష్టించారు. పోలీసులు..ఆసుపత్రి పైకి రాళ్లు రువ్వారు. హుటాహుటిన అపోలో ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ఇలాంటి వదంతులు ఎవరూ నమ్మవద్దని అపోలో ఎండీ పేర్కొన్నారు. కొన్ని ఛానెల్స్ నిరాధారణమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని, అమ్మ బతికే ఉందని వెల్లడించారు. వైద్యులు జయ ఆరోగ్యాన్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

తప్పును సరిదిద్దుకున్న ఏఐఏడీఎంకే నేతలు..
'జయ' ఛానెల్స్ లో సైతం 'అమ్మ' మృతి చెందారన్న వార్త ప్రసారం చేసిందని తెలుస్తోంది. ఏఐఏడీఎంకే నేతలు తప్పును సరిదిద్దుకున్నారు. సీఎం జయలలిత మృతి చెందారన్న తమిళ న్యూస్ ఛానెళ్ల కథనాలతో ప్రధాన కార్యాలయంలోని పార్టీ జెండాను అవనతం చేశారు. 'అమ్మ' బతికే ఉందని అపోలో వైద్యులు పేర్కొనడంతో తిరిగి పార్టీ జెండాను తిరిగి పైకి ఎత్తారు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఉన్నారు.

అపోలో ఆసుపత్రికి చేరుకున్న వెంకయ్య..

చెన్నై : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆయనతో పాటు గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఉన్నారు.

తప్పును సరిదిద్దుకున్న ఏఐఏడీఎంకే నేతలు..

చెన్నై : ఏఐఏడీఎంకే నేతలు తప్పును సరిదిద్దుకున్నారు. సీఎం జయలలిత మృతి చెందారన్న తమిళ న్యూస్ ఛానెళ్ల కథనాలతో ప్రధాన కార్యాలయంలోని పార్టీ జెండాను అవనతం చేశారు. 'అమ్మ' బతికే ఉందని అపోలో వైద్యులు పేర్కొనడంతో తిరిగి పార్టీ జెండాను తిరిగి పైకి ఎత్తారు.

18:19 - December 5, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో వదంతులు వ్యాపించాయి. ఆమె మృతి చెందిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి వదంతులు ఎవరూ నమ్మవద్దని అపోలో ఎండీ పేర్కొన్నారు. కొన్ని ఛానెల్స్ నిరాధారణమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని, అమ్మ బతికే ఉందని వెల్లడించారు. వైద్యులు జయ ఆరోగ్యాన్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ప్రెస్ నోట్ ను అపోలో వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్ నుండి వచ్చిన వైద్యుల పర్యవేక్షణలో జయకు చికిత్స అందించడం జరుగుతోందన్నారు.

ఉద్రిక్తత..
'అమ్మ' కన్నుమూసిందని వదంతులు వ్యాపించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి..ఉద్విగ్నానికి గురయ్యారు. ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. బారికేడ్లు తొలగిస్తూ ఆసుపత్రిలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. రాళ్లు..చెప్పులు..కుర్చీలు విసురుకుంటూ వెళుతుండడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లాఠీలకు పని చెప్పడంతో పరిస్థితిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు.

ఆదివారం గుండెపోటు..
ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. జయ పరిస్థితి మరింత విషమంగా ఉందని పేర్కొనడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే కూడా ఇలాంటి విషయాన్నే పేర్కొన్నారు.

 • సెప్టెంబర్ 22 : జ్వరం, డీ హైడ్రేషన్ తో సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరారు.
 • సెప్టెంబర్ 24 : జయలలిత సాధారణ భోజనం తీసుకుంటున్నారని అపోలో వైద్యులు వెల్లడించారు.
 • సెప్టెంబర్ 29 : జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని ప్రకటించారు.
 • అక్టోబర్ 1 : ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ఆమె ఆరోగ్యంగానే ఉందని ప్రకటించారు.
 • అక్టోబర్ 2 : అపోలో వైద్యులు లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే సహాయాన్ని కోరారు.
 • అక్టోబర్ 6 : ఢిల్లీ ఎయిమ్స్ బృందం అపోలో ఆసుపత్రికి చేరుకుంది.
 • అక్టోబర్ 7 : వెంటిలెటర్ పై ఉన్నట్లు ప్రకటన విడుదలైంది.
 • అక్టోబర్ 21 : జయలలిత కోలుకుంటున్నారని వైద్యుల వెల్లడి.
 • నవంబర్ 3 : జయ పూర్తిగా కోలుకున్నారని అపోలో వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
 • నవంబర్ 13 : త్వరలోనే జయ విధులు నిర్వహిస్తానని, పూర్తిగా కోలుకున్నట్లు జయ సంతకంతో కూడిన ఓ లేఖ బయటకు వచ్చింది.
 • నవంబర్ 19 : ఐసీయూ నుండి ప్రత్యేక వార్డుకు తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
 • నవంబర్ 25 : స్పీకర్ సాయంతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 • డిసెంబర్ 4 : త్వరలో జయ ఇంటికి వస్తారని అన్నాడీఎంకే ప్రకటించింది. కానీ సాయంత్రమే కార్డియక్ అరెస్ట్ తో ఆమె పరిస్థితి విషమంగా తయారైంది.
 • డిసెంబర్ 5 : ప్రాణాపాయం తప్పినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.
 • డిసెంబర్ 5 : ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు, లండన్ వైద్యుడు రిచర్డ్ ప్రకటించారు.
 • డిసెంబర్ 5 : సాయంత్రం జయ మృతి చెందినట్లు అనధికారికంగా తమిళ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
 • డిసెంబర్ 5 : అపోలో ఆసుపత్రి వద్ద కార్యకర్తలు వీరంగం సృష్టించారు.

 

'అమ్మ' బతికే ఉంది - అపోలో..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిందంటూ వస్తున్న ప్రచారాన్ని అపోలో వైద్యులు కొట్టిపారేశారు. కాసేపటి క్రితం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇలాంటి వదంతులు ఎవరూ నమ్మవద్దని అపోలో ఎండీ పేర్కొన్నారు. కొన్ని ఛానెల్స్ నిరాధారణమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని, అమ్మ బతికే ఉందని వెల్లడించారు. వైద్యులు జయ ఆరోగ్యాన్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

17:51 - December 5, 2016

చెన్నై : అపోలో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉద్విగ్నానికి గురవుతున్న అభిమానులు వీరంగం సృష్టిస్తున్నారు. బారికేడ్లను తొలగించి ఆసుపత్రిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు..చెప్పులు..వాటర్ బాటిళ్లు..కుర్చీలతో దాడులకు తెగబడ్డారు. ఒక్కసారిగా జరిగిన హాఠాత్ పరిణామంతో పోలీసులు వెంటనే తేరుకున్నారు. లాఠీలకు పనిచెప్పారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే కేంద్ర బలగాలు ఆసుపత్రి వద్ద మోహరించారు. రంగంలోకి దిగిన బ్లాక్ కమాండోస్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పారామిలటరీ ఆసుపత్రిని స్వాధీనం చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఉత్కంఠ నెలకొంది.

చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

చెన్నై: జయలలిత ఆమె ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా దిగజారిందని తెలుసుకుని భారీ సంఖ్యలో ఆమె అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. అంతే కాకుండా ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  అంతే కాకుండా అభిమానులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ, మీడియాపై దాడులకు పాల్పడుతున్నారు. మరో వైపు గరవ్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నారు.  అపోలో ఆసుపత్రిని సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుని పహారా కాస్తోంది.

చెన్నై వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

చెన్నై : జయలలిత ఆమె ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా దిగజారిందని, తమ వైద్యులు శ్రమిస్తున్నారని అపోలో ఆసుపత్రి కొంత సేపటి క్రితం ప్రకటించింది. దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అంతేకాక తమిళనాట పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడానికి తోడు, స్కూళ్లకు సెలవులు, వ్యాపార సముదాయాల మూసివేత, పోలీసులను భారీగా మోహరించడంతో అందర్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో సంప్రదింపులు నెరుపుతున్నారు.

అపోలో ఆసుపత్రికి కేంద్ర మంత్రి వెంకయ్య

చెన్నై : కాసేట్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అపోలో ఆసుపత్రికి చేరుకోనున్నారు. తమిళనాడు సీఎం జయలలిత(68) ఆరోగ్య పరిస్థితి తదనంతర పరిణామాలపై వైద్యులు, ఆ పార్టీ నేతలతో చర్చించన్నుట్లు సమాచారం.

17:14 - December 5, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నియమితులు కానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆరోగ్యం మరింత విషమించడంతో రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ అయ్యింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంకు మద్దతుగా 135 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లు, సాయంత్రం అధికారికంగా ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరామర్శించిన వైగో..
ఇదిలా ఉంటే జయ ఆరోగ్య పరిస్థితిపై లండన్ నుండి వచ్చిన వైద్యుడు రిచర్డ్ బేలే ఓ మెయిల్ పంపారు. జయను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రపంచంలోనే ఆధునాతన చికిత్స అందిస్తున్నామన్నారు. అయినా గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. జయను ఎండీఎంకే నేత వైగో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. అమ్మ కోలుకోవాలని ప్రజలు ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారీగా పోలీసులు...
రాష్ట్రం మొత్తం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కేంద్ర బలగాలు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సీఎం జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని అపోలో వైద్యులు ప్రకటించడంతో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పరిస్థితిపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. ఇప్పటికే పోలీసులకు సెలవులు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

అభిమానుల ఉద్వేగం..
జయ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తోందన్న వార్తలు వస్తుండడంపై అభిమానులు తీవ్ర ఉద్విగ్నానికి గురవుతున్నారు. జయ కోలుకోవాలంటూ రోదిస్తున్నారు. కొంతమంది అభిమానులు ఆసుపత్రి మెయిన్ గేట్ వైపుకు దూసుకొచ్చారు. పోలీసులు, జయ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంటోంది.

అమ్మ త్వరగా కోలుకోవాలి: గౌతమి

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత(68) త్వరగా కోలుకోవాలని నా దైవికమైన తల్లిని ప్రార్థిస్తున్నాను అని ప్రముఖ నటి గౌతమీ ట్వీట్ చేశారు. శక్తికి, దయకు మారురూపం జయలలిత’ అంటూ ప్రముఖ నటి గౌతమీ పేర్కొన్నారు.. 

అమ్మ కోలుకోవాలని పూజలు చేయండి: వైగో

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గడిచేకొద్ది విషమంగా మారుతుండటంతో పార్టీలు, రాజకీయాలకతీతంగా ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఎండీఎంకే అధినేత వైగో మాట్లాడుతూ అమ్మ కోలుకోవాలని ప్రజలంతా పూజలు చేయాలని పిలుపునిచ్చారు. అపోలో వైద్యులు జయలలితకు అధునాతన చికిత్సను అందిస్తున్నారని ఆయన చెప్పారు. 

16:47 - December 5, 2016

నగదు చెల్లింపులపై జైట్లీ కీలక ఆదేశాలు...

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐదువేల రూపాయలకు మించిన బిల్లులన్నింటికీ ఈ పేమెంట్ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేసి, ఈ-పేమెంట్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వశాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. కాగా, గత ఆగస్టులో నగదు చెల్లింపులపై రూ.10 వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం రూ.5 వేలకు కుదించడం గమనార్హం.

16:27 - December 5, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. తమ అభిమాన నేత కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. గత 73 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం జయకు గుండెపోటు రావడంతో తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయ పరిస్థితి విషమంగా ఉందని బులెటిన్ లో పేర్కొన్నారు. ఎక్మో సహాయంతో వైద్య చికిత్స చేయిస్తున్నారు. నలుగురితో కూడిన ఎయిమ్స్ బృందం అపోలోకి చేరుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. లండన్ నుండి వచ్చిన రిచర్డ్ బేలే కూడా ఆసుపత్రికి చేరుకుని చికిత్సను సమీక్షిస్తున్నారు. కాసేపటి క్రితం బేలే ఓ మెయిల్ విడుదల చేశారు. జయ ఆరోగ్యం మరింత క్షీణించిందని, అచేతన స్థితిలోకి వెళ్లిపోయారని మెయిల్ లో పేర్కొన్నారు. అద్భుతం జరిగితే తప్ప కోలుకోలేరని, ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన వైద్యం జయకు అందుతోందన్నారు. మరోవైపు అపోలో ఆసుపత్రి వద్ద అవే పరిస్థితులు నెలకొన్నాయి. జయ అభిమానులు..అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

భద్రతా వలయంలో అపోలో ఆసుపత్రి

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి భద్రతా వలయంలో చిక్కుకుంది. ఆసుపత్రి వద్ద 9 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ బలగాలు మోహరించాయి. ఆసుపత్రికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. జయ అభిమానులు భారీగా తరలి వస్తుండటంతో ఆసుపత్రి నుంచి ఇతర పేషెంట్లను పోలీసులు బయటకు పంపిస్తున్నారు.

అధునాత‌న వైద్య ప‌రిక‌రాలతో చికిత్స : రిచర్డ్ బేలె

చెన్నై: అపోలో ఆసుప‌త్రి వైద్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు లండ‌న్ నుంచి ఈ రోజు మ‌ధ్యాహ్నం స‌ద‌రు ఆసుప‌త్రికి వ‌చ్చిన వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బేలె జ‌య‌ల‌లిత ఆరోగ్య‌ ప‌రిస్థితిని ప‌రిశీలించి ఓ ప్ర‌క‌ట‌న చేశారు. జ‌య‌లలిత ఆరోగ్యం చాలా విష‌మంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ప్రస్తుతం మిగ‌తా వైద్యుల‌తో క‌లిసి తాను కూడా స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. అధునాత‌న వైద్య ప‌రిక‌రాల సాయంతో ఆమెకు చికిత్స అందుతోంద‌ని చెప్పారు. అపోలో వైద్యుల‌తో పాటు ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నార‌ని ప్ర‌క‌ట‌న చేశారు.

16:12 - December 5, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో పరిణామాలు మారుతున్నాయి. సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందన్న సంగతి తెలిసిందే. గత 73 రోజులుగా ఆమె చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు. దీనితో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు..అభిమానుల్లో ఉద్విగ్నానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే జయ వారసుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వారసుడిగా పన్నీర్ సెల్వంను ఎనుకున్నట్లు, ఇందుకు ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసినట్లు సమాచారం. దీనిపై సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పన్నీర్ సెల్వం అపద్మర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జయ ఆరోగ్య పరిస్థితిపై లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే ఓ ప్రకటన చేశారు. జయలలితను నిపుణులు పర్యవేక్షిస్తున్నారని, ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రిచర్డ్ బేలే పేర్కొన్నారు.

భారీగా పోలీసుల మోహరింపు..
జయ ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తే తలెత్తే పరిణామాలను ఎదుర్కొవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేసినట్లు సమాచారం. తమిళనాడు అంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. పెట్రోల్ బంక్ లు మూసివేయించారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే అపోలో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు తీవ్ర ఉద్విగ్నానికి లోనవుతున్నారు. తమ ప్రాణాలు తీసుకుని 'అమ్మ' ప్రాణాలు నిలబెట్టాలని కొంతమంది అభిమానులు కోరుతున్నారు.

జయ వారసుడిగా పన్నీరు సెల్వం పేరు ఖరారు!

చెన్నై: త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ప‌రిస్థితి విష‌మంగా ఉన్న నేప‌థ్యంలో వారసుడి ఎంపిక కసరత్తు ముగిసినట్లు తెలుస్తోంది. అమ్మ వారసుడిగా పన్నీర్ సెల్వం పేరు ఖరారు అయినట్లు వినికిడి. ఈ రోజు సాయంత్రం లోగా అధికారికంగా పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, తమిళనాడులో కీలక మంత్రిత్వ శాఖలన్నింటినీ పన్నీర్ సెల్వంకు ఇటీవలే అప్పగించారు. గతంలో రెండుసార్లు తాత్కాలిక సీఎంగా పన్నీరు సెల్వం వ్యవహరించిన విషయం తెలిసిందే.

15:49 - December 5, 2016

కాసేపట్లో గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : కాసేపట్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు..,నోట్ల రద్దు అనంతర పరిణామాలు, రేవంత్ రెడ్డి లేఖ వంటి అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

15:30 - December 5, 2016
15:25 - December 5, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, అన్నాడీఎంకే నేతలు..కార్యకర్తలు కోరుకుంటున్నారు. అపోలో ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వద్ద కొన్ని కిలోమీటర్ల మేర అభిమానులు..అన్నాడీఎంకే అభిమానులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. 'అమ్మ' ఆరోగ్యం కోసం వీరంతా పడిగాపులు పడుతున్నారు. 'జయలలిత' ఆరోగ్య సమాచారం వెంటనే తెలియచేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాణం తీసుకుని 'జయ' ప్రాణం నిలదొక్కుకొనేలా చేయాలని పలువురు అభిమానులు కోరుతున్నారు. భారీ సంఖ్యలో చేరుకుంటున్న అభిమానుల నిలువరించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 • గత 73 రోజులుగా అపోలో చెన్నై ఆసుపత్రిలో జయలలిత చికత్స పొందుతున్నారు.
 • ఆదివారం రాత్రి జయకు గుండెపోటు వచ్చిందన్న వార్త దావానంలా వ్యాపించింది.
 • సమాచారం అందుకున్న తమిళనాడు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
 • అనంతరం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడం..ఆసుపత్రిలోనే మంత్రివర్గం భేటీ కావడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది.
 • జయ ఆరోగ్య పరిస్థితిపై కేంద్రం ఆరా తీసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పరిస్థితిని సమీక్షించారు.
 • నలుగురితో కూడిన ఎయిమ్స్ బృందం అపోలో ఆసుపత్రికి చేరుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు.
 • లండన్ నుండి రిచర్డ్ అనే వైద్యుడు జయకు చికిత్స అందిస్తున్నారు.
 • ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
 • కేంద్రం తొమ్మిది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది.
 • సాయంత్రం 4..6 గంటలకు మరో హెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశముందని సమాచారం.

జయలలిత వారసుడి ఎంపికపై మల్లగుల్లాలు

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ప‌రిస్థితి విష‌మంగా ఉన్న నేప‌థ్యంలో వారసుడి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. డిక్లరేషన్ పై సంతకాలు చేయాలని ఎమ్మెల్యేలకు సమాచారం వచ్చింది. కాసేపట్లో అపోలో ఆసుపత్రికి గవర్నర్ విద్యాసాగర్ రావు రానున్నారు.

గరవ్నర్ నరసింహన్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఈ క్రింది విధంగా ఉంది. 18 మందికి అదనంగా కేబినెట్ హోదా ఇచ్చారు. అది రాజ్యాంగానికి, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164,1(ఎ) ప్రకారం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15శాతానికి మించి కేబినెట్ హోదాలు ఇవ్వకూడదు. వెంటనే కేబినెట్ హోదాలను రద్దు చేయాలని రేవంత్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన ఉభయ సభలు పెద్ద నోట్ల రద్దుపై తీవ్ర గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల సమస్యలను పరిష్కరించడం కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించాయి. దీంతో ఉభయ సభలను రేపటికి వాయిదా పడ్డాయి.

చెన్నై చేరుకున్న డాక్టర్ రిచ‌ర్డ్ బెల్లే

చెన్నై : అపోలో ఆసుప‌త్రిలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స తీసుకుంటున్న త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ప‌రిస్థితి విష‌మంగా ఉన్న నేప‌థ్యంలో లండ‌న్ వైద్య నిపుణుడు రిచ‌ర్డ్ బెల్లేను అపోలోకు రావాల్సిందిగా ఆ ఆసుప‌త్రి వైద్యుల పిలుపుతో రిచ‌ర్డ్ బెల్లే కొద్ది సేప‌టి క్రితం ఆసుపత్రికి చేరుకున్నారు. జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితిని ఆయ‌న పరీక్షిస్తున్నారు. మ‌రోవైపు ఆసుప‌త్రి వైద్య నిపుణుల బృందం జ‌య‌ల‌లిత ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తోందని వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆసుప‌త్రి మ‌రోబులిటెన్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

15:03 - December 5, 2016

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టి.కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు బైఠాయించారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో భద్రత మోహరింపు జానా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భయోత్పాతం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంతో జానా మాట్లాడారు. అనంతరం మీడియాతో జానా మాట్లాడారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అగౌరవ పరుస్తున్నారని, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావాల్సి ఉందని, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో ఉండవద్దా అని ప్రశ్నించారు. బీఏసీ మీటింగ్ లో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జానారెడ్డి పేర్కొన్నారు. డీకే అరుణ, సంపత్, పద్మావతి, ఎమ్మెల్సీలు షబ్బీర్, పొంగులేటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

 

చెన్నైకి బయలుదేరి అన్నాడీఎంకే ఎంపీలు

చెన్నై: అపోలో ఆసుప‌త్రిలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స తీసుకుంటున్న జ‌య‌ల‌లిత ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉంద‌ని ఆ ఆసుప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించిన వెంట‌నే ఢిల్లీ నుంచి హుటాహుటిన అన్నాడీఎంకే ఎంపీలు చెన్న‌య్‌కి బ‌య‌లుదేరారు. అన్నాడీఎంకేకు చెందిన‌ సుమారు 30 మంది ఎంపీలు పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ రోజు పార్ల‌మెంటుకు వ‌చ్చారు. అయితే, ఆసుప‌త్రి నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల కాగానే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. మ‌రోవైపు లోక్‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ తంబిదురై కూడా ఈ రోజు పార్ల‌మెంటులో త‌న ఆఫీసుకు గైర్హాజ‌ర‌య్యారు.

కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ గా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ గా సామా వెంకట్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. సలహా మండలి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

14:36 - December 5, 2016

ఢిల్లీ : రాజ్యసభలో గందరగోళ పరిస్థితులకు తెరపడడం లేదు. సభలు ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు వరకు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్లు రద్దు అంశంపై చర్చించాలని, చర్చ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభలోనే ఉండాలని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీనితో సభలు పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. సోమవారం నాడు ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం కొనసాగిన సభలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఉద్యోగస్తులు వేతనాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక మంత్రి జైట్లీ సభలో ఉన్నా సమాధానం చెప్పడం లేదని శుక్లా పేర్కొన్నారు. దీనిపై డిప్యూటి ఛైర్మన్ స్పందించారు. పోడియం వద్ద నిరసనలు తెలియచేస్తుంటే మంత్రి సమాధానం ఎలా చెబుతారని ప్రశ్నించారు. చివరకు మంగళవారం ఉదయం వరకు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు.

రాజ్యసభ మంగళవారానికి వాయిదా..

ఢిల్లీ : వాయిదా పడిన రాజ్యసభ కాసేపటి క్రితం తిరిగి ప్రారంభమైంది. విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. పెద్దనోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు.

14:14 - December 5, 2016

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత...ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ? ఎప్పుడు కోలుకుంటారు ? తిరిగి పాలన ఎప్పుడు చేపడుతారు ? ఇలాంటి వాటిపై తమిళనాడులో చర్చ జరుగుతోంది. చెన్నై..తదితర ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 73 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సీఎం 'జయలలిత' కు వైద్య చికిత్స కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆదివారం గుండె పోటు..
అకస్మాత్తుగా ఆదివారం రాత్రి జయకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు దావానంలా వ్యాపించాయి. దీనితో అప్పటి నుండి ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అపోలో ఆసుపత్రి..తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్రం నుండి పలు బెటాలియన్లు బందోబస్తులో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ వార్త తెలుసుకున్న జయ అభిమానులు..అన్నాడీఎంకే నేతలు..కార్యకర్తలు అపోలో ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు నిలువరించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి నుండి అక్కడే అభిమానులు వేచి చూస్తూ 'అమ్మ' ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటున్నారు.

కేంద్రం ఆరా..
జయలలిత ఆరోగ్యంపై కేంద్రం ఆరా తీస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెన్నైకి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

జయ హెల్త్ బులెటిన్..
జయ ఆరోగ్యంపై కాసేపటి క్రితం చెన్నై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమని వైద్యులు పేర్కొంటుండడంపై అభిమానులు..ఏఐడీఎంకే నేతలు..కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురితో కూడిన ఎయిమ్స్ బృందం జయకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈసీఎమ్ ఓ, లైఫ్ సపోర్టు సిస్టమ్స్ ద్వారా చికిత్స కొనసాగుతోంది. నేటి సాయంత్రం మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టుపై బాబు సమీక్ష..

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి దేవినేని, ఇరిగేషన్ శాఖాధికారులు పాల్గొన్నారు. 19న పోలవరం కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయాలని ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఉమాభారతిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య..

విజయవాడ : ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ డౌన్ కావడంతో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. గడిచిన వారం నుండి సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ మొరాయిస్తోంది. వారం రోజుల్లో గ్రూప్ 2 దరఖాస్తు గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. దీనితో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

13:50 - December 5, 2016

తమిళనాడు : ఎయిమ్స్ వైద్యులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్ కిలానీ..రాజీవ్..అంజన్ తో పాటు మరో ఇద్దరు డాక్టర్లు అపోలో ఆసుపత్రికి చేరుకుని క్షణక్షణం జయలలిత ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు. ఎక్మో(ఈసీఎంవో) సిస్టం, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ ద్వారా జయకు చికిత్స చేస్తున్నామని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురైన జయను ఐసీయూలో ఉంచి జయకు చికిత్స అందిస్తున్న విషయం విదితమే. లండన్ వైద్యులు రిచర్డ్ బేలే సలహాలు, సూచనలతో ఎయిమ్స్ వైద్య బృందం, అపోలో డాక్టర్లను జయను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విషమంగా ఉన్న జయ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు సమీక్షిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల పనిని ఏకకాలంలో నిర్వహించే అత్యంత అధునాతన యంత్రం ఎక్మో(ఈసీఎంవో) ద్వారా చికిత్స అందిస్తున్నారు.

హెల్త్ బులెటిన్ తో కార్యకర్తల్లో ఆందోళన
హెల్త్ బులెటిన్ కోసం ఎదురుచూసిన అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని హెల్త్ బులెటిన్ వస్తుందనుకున్న అభిమానుల్లో నిరాశ నెలకొంది. అమ్మ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించడంతో ఆ విషయాన్ని జయ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

పోలీసుల దిగ్భంథంలో అపోలో ఆసుపత్రి
సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆపోలో ఆసుపత్రిని పూర్తిగా తమ అధీనంలోకి స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క కేంద్రం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. చెన్నైకి జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల తాకిడి గంటగంటకు పెరుగుతుండటంతో కేంద్రం మరిన్ని భద్రతా దళాలను రాష్ర్టానికి పంపించింది. కోయంబత్తూర్‌లో పోలీసుల భద్రతను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే కేంద్రం తొమ్మిది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది. ఈనేపథ్యంలో సాయంత్రం 4..6 గంటలకు మరో హెల్త్ బులిటెన్ ను విడుదల చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. జయలలిత ఆనారోగ్యం పరిస్థితి క్షణక్షణానికి విషమిస్తున్న క్రమంలో ఆమె అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశముండటంతో ప్రభుత్వం మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 

13:18 - December 5, 2016

ఏంటీ ? బీర్ 2 రూపాయలేనా..విస్కీ కూడా 49 రూపాయలేనా ఎక్కడ ? వంద రూపాయలు పలికే కేవలం రెండు రూపాయలకే ఎలా ఇస్తారు ? ఇందులో ఏదో మతలబు ఉంది అని అనుకుంటున్నారు కదా..ముందే పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నం. ఇంత చీఫ్ గా వస్తుందంటే కొంత నిల్వ చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలోనే కదా అని అనుకుంటున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. మందుబాబులకు నోరూరిస్తున్న ఈ ఆఫర్ అందిరికీ మాత్రం కాదు. కేవలం ముంబై వాసులకు మాత్రమే. ముంబై నగరంలోని ఓ పబ్ లో మందుబాబులకు ఇలాంటి ఆఫర్ ఇచ్చింది. జుహూ, లోయర్ పెరల్ లో ఉన్న మిస్టర్ బోజీ బీరు కేవలం రూ. 2 మాత్రమే అందిస్తున్నారంట. అంతేగాకుండా విస్కీ కేవలం రూ. 49లకే లభిస్తుందంట. డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 8వ తేదీ వరకు ఉంటుందని సదరు పబ్ పేర్కొంటోంది. అదండి సంగతి..

13:07 - December 5, 2016

టాలీవుడ్ లో పలువురు హీరోలు నటించిన చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ప్రముఖ హీరోలు నటించే సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనితో ఎవరో ఒకరు సినిమా రిలీజ్ డేట్ ను మారుస్తుంటారు. తాజాగా అలాంటిదే జరిగింది. 'రామ్ చరణ్' నటించిన 'ధృవ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధమంది. మరోవైపు 'సూర్య' నటించిన 'సింగం-3' సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈనెల 16వ తేదీన 'సింగం-3' రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఆ సమయంలో 'ధృవ' చిత్రం రిలీజ్ కానుంది. డిసెంబరు 16న 'ఎస్-3' రిలీజ్ అని నిర్మాత జ్నానవేల్ రాజా ప్రకటించాడు. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎస్3' సినిమాపై కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. దీంతో 'ధృవ' పోటీ వస్తే 'చరణ్' మూవీకి ఇబ్బందని అల్లు అరవింద్ భావించాడు. అందుకే తన సన్నిహితుడైన 'సూర్య'తో సంప్రదింపులు జరిపి 'సింగం3' కాస్త వాయిదా వేయించడానికి గట్టి ప్రయత్నమే చేశాడని టాక్. చివరకు 'సూర్య' ఓ నిర్ణయం తీసుకున్నాడు. విడుదల తేదీని ఈనెల 16 నుండి 23 వరకు మార్చడంపై 'సూర్య' స్పందించారు. 'రామ్ చరణ్' 'ధృవ' తమ ఫ్యామిలీ సినిమా వంటిదేనని, చిన్న అడ్జస్ట్ మెంట్ చేయడం జరిగిందన్నారు. 'సింగం' సిరీస్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రంలో అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

13:04 - December 5, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు.ఆమె ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా వుందనీ కోలుకోవటానికి ఎంత సమాయం పడుతుందో చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్ని క్లిష్టిపరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాంగా సర్వం సిద్ధంగా వున్నట్లుగా తెలుస్తోంది. అటు కేంద్రం కూడా  భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. చెన్నైకి జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల తాకిడి గంటగంటకు పెరుగుతుండటంతో కేంద్రం మరిన్ని భద్రతా దళాలను రాష్ర్టానికి పంపించింది. కోయంబత్తూర్‌లో పోలీసుల భద్రతను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే కేంద్రం తొమ్మిది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది. 

గత 73 రోజులుగా చికిత్స...
కాగా సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని హుటాహుటిన మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

జయలలిత కోలుకోవాలని పలువురి ఆకాంక్ష..
 సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో 8 మంది వైద్యుల బృందం ఎక్‌మో మిషన్‌పై జయకు చికిత్స అందిస్తున్నారు. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయకు సీరియస్‌గా ఉండడంతో మంత్రులంతా ఆస్పత్రి ఆవరణలోనే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి చైర్మన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు.. మంత్రులతో భేటీ అయ్యారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. 

జయలలిత ఆరోగ్యం అత్యంత విషమం: అపోలో వైద్యులు

చెన్నై : సీఎం జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని అపోలో వైద్యులు స్పష్టం చేశారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు జయ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జయ ఎప్పుడు కోరుకుంటారో చెప్పాలేమని... ఈసీఎంవో ద్వారా చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

జయ ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ఆరా

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

నిజామాబాద్ లో అక్రమ కట్టడాల తొలగింపు: ఆందోళన

నిజామాబాద్ : నగరంలోని గాంధీ చౌక్ నుంచి గాంధీ గంజ్ వరకు అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం పై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12:45 - December 5, 2016

సూపర్ స్టార్ 'రజనీకాంత్' కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని చెన్నైలోని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 'కబాలి' సినిమా అనంతరం ఆయన '2.0' చిత్రీకరణలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. చెన్నైలోని ఓ సాప్ట్ వేర్ కంపెనీలో జరుగుతున్న షూటింగ్ లో 65 సంవత్సరాల 'రజనీ' పాల్గొంటున్నారు. ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం సాయంత్రం షూటింగ్ సమయంలో వర్షం పడుతుండడం..మెట్లపై నుండి నడుస్తున్న 'రజనీ' అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఎలాంటి పెద్ద గాయాలు ఏవీ కాలేదని, మోకాలు బెణకడంతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించినట్లు చిత్రీ యూనిట్ పేర్కొంటోంది. ప్రస్తుతం ఆయన పూర్తిగా కొలుకొంటున్నారని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం 'రజనీ' షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది.

కబాలికి వచ్చిన హైప్
రీసెంట్‌గా రజనీకాంత్ కబాలికి వచ్చిన హైప్ ఏ సినిమాకీ రాలేదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు చేసిన ప్రచారంతో సిని ఆడియన్స్ మొత్తం కబాలి ఫీవర్‌తో ఊగిపోయింది. అంతలా కబాలిని ప్రమోట్ చేశారు మేకర్స్. ఇప్పుడు రజనీ రోబో 2 మూవీని అంతకు మించిన రేంజ్ లో ప్రమోట్ చేయాలని శంకర్ తో పాటు యూనిట్ భావిస్తుందట.

1000 కోట్లు కలెక్ట్..
తరువాత వరుసగా మూవీపై హైప్ పెరిగేలా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేస్తారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా చేస్తున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రోబో 2తో బాక్సఫీసు వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేయాలనేది శంకర్ టార్గెట్ గా కనిపిస్తుంది. మరి రోబో 2 ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో చూడాలి.  

మహిళలపై చేయిచేసుకున్న బ్యాంక్ మేనేజర్

హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ఆంధ్రా బ్యాంక్ ఎదుట ఖాతాదారులు బారులు తీరడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటపై స్పందించిన బ్యాంకు మేనేజర్ ముగ్గురు మహిళలపై చేయిచేసుకున్నారు. దీంతో ఖతాదారులు మేనేజర్ చర్యకు నిరసనగా బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు.

12:37 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో 8 మంది వైద్యుల బృందం ఎక్‌మో మిషన్‌పై జయకు చికిత్స అందిస్తున్నారు. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల అయ్యే అవకాశాలున్ననట్లు సమాచారం. ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చిన క్రమంలో ఆమెకు కార్డియో అరెస్ట్ సర్జరీ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కోలుకోవాలని ప్రముఖులతోపాటు అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎనిమిదిమంది వైద్యుల బృందం లండన్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతూ ఆమెకు చికిత్సనందిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో ప్రమోద్ రావు (ప్రముఖ కార్డియాలజిస్ట్), నగేశ్ కుమార్ (ప్రముఖ విశ్లేషకులు) పాల్గొన్నారు.ఎటువంటి కండిషన్లో కార్డియో అరెస్ట్ సర్జరీ చేస్తారు? అనే విషయంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రమోద్ రావు పలు విషయాలను తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై విశ్లేషకులు నగేష్ కుమార్ విశ్లేషించారు. మరింత సమాచారం కోసం వీడియోను చూడండి..

12:31 - December 5, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు తరువాత ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయో తెలిసిందే. ఉదయం లేవగానే ఏటీఎంలకు పరుగులు తీస్తున్నారు. కానీ ఏటీఎంలు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. డబ్బులు లేకపోతుండడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. డబ్బులున్న ఏటీఎం వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. పెద్దనోట్లు రద్దు అయి 27 రోజులు గడుస్తున్నా బ్యాంకులు..ఏటీఎంలలో ప్రజలకవసరమన డబ్బులు ఉండడం లేదు. ఏటీఎం కేంద్రాల్లో 'నో క్యాష్' బోర్డులు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని జగత్ పురా ప్రాంతంలో ఏటీఎంలో ఖాతాదారులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఏటీఎంలకు పూజలు చేశారు. పూలమాలలు వేసి..డప్పు వాయిద్యాల నడుమ హారతి ఇచ్చారు. నోట్ల రద్దు నుండి డబ్బులు లేవని, దీనితో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అక్కడి వారు వాపోయారు. 

ముగిసిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష భేటీ

చెన్నై: అత్యవసరంగా అపోలో ఆస్పత్రిలో భేటీ అయిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి, జయలలితకు ఎక్కువ కాలం వైద్యం అవసరమైతే ప్రభుత్వ బాధ్యతలు ఎవరు చూడాలన్న అంశంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అగౌరవ పరుస్తున్నారు: జానారెడ్డి

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ వ్రిగహం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. అప్రమత్తమైన పోలీసుల అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంతో మాట్లాడుతూ ప్రభుత్వం భయోత్పాతం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఉండవద్దా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అగౌరవ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

11:54 - December 5, 2016

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన వాయిదా పడింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి దృష్ణ్యా పర్యటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నారు. పర్యటన తేదీని త్వరంలో ప్రకటిస్తామని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలోనే సోంపేట, ఇచ్చాపురం,కవిటి ప్రాంతాల్లోనే కిడ్నీ వ్యాధిగ్రస్థులతో ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో మంగళావారం సుమారు మూడు గంటలపాటు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని చర్యలూ పూర్తయ్యాయి. ఈ క్రమంలో జయలలితి ఆరోగ్యం విషమించింది అనే వార్తతో పర్యటన వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం.

11:46 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. చెన్నైకి జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల తాకిడి గంటగంటకు పెరుగుతుండటంతో కేంద్రం మరిన్ని భద్రతా దళాలను రాష్ర్టానికి పంపించింది. కోయంబత్తూర్‌లో పోలీసుల భద్రతను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే కేంద్రం తొమ్మిది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది. కాగా ఆమె ఆరోగ్యంపై మ.12గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం వున్నట్లుగా సమాచారం. ఏ క్షణంలోనైనా అవాంచనీయమైన ఘటనలు జరుగకుండా కేంద్రం అన్ని చర్యల్ని చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఆదివారం రాత్రి జయలలితకు సర్జరీ జరిగినట్లు కూడా సమాచారం. మరోవైపు జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. 

11:36 - December 5, 2016

కరీంనగర్ : విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిలను వేధిస్తున్నాడంటూ లెక్చరర్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థిని సమాచారం మేరకు తల్లిదండ్రులు సదరు లెక్చరర్ ను చితకబాదారు. అనంతరం కళాశాల ఎదుట వారు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా అమీన్ లెక్చరర్ విద్యార్థినిలను..మహిళా లెక్చరర్ లను వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అమీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లెక్చరర్ ను కఠినంగా శిక్షించాలనీ..విధుల నుండి తొలగించాలంటూ మహిళా లెక్చరర్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇతను సంవత్సరం క్రితం జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక దేవుడిదే భారం :ట్విట్టర్ లో అపోలో

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని తాము ప్రార్థిస్తున్నామని, ప్రజలు కూడా ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అపోలో ఆసుపత్రి, తన ట్విట్టర్ ఖాతాలో కోరింది. ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేసేలా ప్రత్యేక పరికరాలు వాడుతున్నట్టు చెప్పిన అపోలో, ఆమెకు క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఆమెకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న విషయమై లండన్ డాక్టర్ బాలేని కూడా సంప్రదించినట్టు తెలుపుతూ, ప్రజల ప్రార్థనలతోనే ఆమె తిరిగి కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వేధింపులు...

కరీంనగర్ : విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ ఓ లెక్చరర్ ను ఓ విద్యార్థిని తల్లిదండ్రులు చితకబాదారు. అంతే కాకుండా విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

11:26 - December 5, 2016

ఢిల్లీ : శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో గందరగోళం కొనసాగుతోంది. రాజ్యసభలో నోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి.ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ విపక్ష సభ్యులను కోరారు. అయివా వినన విపక్షాలు వినకపోవటంతో రాజ్యసభను 12గంటలకు కురియన్ వాయిదా వేశారు. లోక్ సభ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా విపక్షాల  గందరగోళం మధ్య సభ కొనసాగుతోంది. 

లోక్ సభలో గందరగోళం

ఢిల్లీ : లోక్ సభలో నోట్ల రద్దు అంశంపై చర్చను చేపట్టాలని విపక్షాల డిమాండ్ చేస్తూ వుండగా... అదే సమయంలో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

రాజ్యసభ వాయిదా

ఢిల్లీ : ప్రారంభమైన కొద్ది సేపటికే రాజ్యసభ వాయిదా పడింది. నోట్ల రద్దు పై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టి వెల్ లోకి వచ్చి ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభను నడిపేందుకు ఛైర్మన్ ప్రయత్నించినా విపక్షాలు పెడచెవిన పెట్టడంతో సభను మ.12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. లోక్ సభ లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.

రాజ్యసభలో గందరగోళం

ఢిల్లీ : రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నోట్ల రద్దు పై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టి వెల్ లోకి వచ్చి ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

జయలలిత త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : తమిళనాడు మాజీ సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు అపోలో వైద్యులతో జయల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

 

తమిళ కేబినెట్ అత్యవసర భేటీ

చెన్నై :జయలలిత ఆరోగ్య పరిస్థితి పై అపోలో ఆసుపత్రిలో కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై చర్చిస్తున్నట్లు సమాచారం.

మ.12 గంటలకు జయ హెల్త్ బులెటిన్

చెన్నై: తమిళనాడు సీఎం జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో ఆపార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు అపోలో ఆస్పత్రికి మంత్రులు, ఇతర నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అంతే కాకుండా జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తూ ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు యత్నింస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆస్పత్రి వద్ద 9 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ బలగాలు మోహరించాయి.

విద్యార్థినిలను వేధిస్తున్న లెక్చరర్?..

కరీంనగర్ : విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిలను వేధిస్తున్నాడంటూ లెక్చరర్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులు సదరు లెక్చరర్ ను చితకబాదారు. అనంతరం కళాశాల ఎదుట వారు ఆందోలన చేపట్టారు. 

జయలలిత ఆరోగ్యం మరింత విషమం

చెన్నై: సీఎం జయలలిత ఆరోగ్యం మరింత విషమించినట్లు సమాచారం. హృద్రోగ, శ్వాసకోశ వైద్య నిపుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స జరగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి చెన్నైకి ప్రత్యేక బృందాలు వచ్చి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు చెన్నైకి కేంద్ర బలగాలను తరలిస్తున్నారు. అంతేకాకుండా కర్ణాటక నుండి బస్సులను నిలిపివేశారు.

11:03 - December 5, 2016

జయలలిత ఆరోగ్యంపై వెంకయ్యనాయుడు ఆరా

చెన్నై : తమిళనాడు గవర్నర్, సీఎస్ తో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫోన్ లో మాట్లాడి సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి పై వెంకయ్యనాయుడు ఆరా తీశారు.

రేపటి పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటన వాయిదా

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధినేత రేపటి నుంచి తలపెట్టిన శ్రీకాకుళం జిల్లా పర్యటన వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

నేటి నుంచి తమిళనాడులో పోలీసులకు సెలవులు రద్దు

చెన్నై: నేటి నుంచి తమిళనాడులో పోలీసులకు సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వాళ్లు వెంటనే విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.

10:48 - December 5, 2016

జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కరుణానిధి

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని మాజీ సీఎం, డీఎంకే కరుణానిధి ఆకాంక్షించారు.

10:47 - December 5, 2016
10:45 - December 5, 2016

కాసేపట్లో అపోలోకి మోడీ...

చెన్నై: గుండెనొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపట్లో చెన్నై చేరుకోనున్నారు. ఇప్పటికే అపోలోకు చేరుకున్న కేంద్ర మంత్రి నడ్డా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం రాత్రి నుంచి అక్కడే ఉంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. జయలలిత కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జయకు మెరుగైన వైద్యం అందించేందుకు నలుగురు వైద్యులను పంపామని తెలిపారు.

10:42 - December 5, 2016

గుంటూరు : మానవత్వం రోజురోజుకీ మంటగలిసిపోతోంది. ప్రేమకు ప్రతిరూపం అమ్మ అంటారు. కానీ చిన్నారులను గొంతుకోసి చంపిన అమ్మను ఏమనాలి.. నాదెండ్ల మండలం కనపర్రులో దారుణ చేటుచేసుకుంది. తొమ్మిది నెలల బాలుడ్ని తల్లి గొంతుకోసి చంపింది. జమీలా మస్తాన్ వల్లీ అనే దంపతులకు తొమ్మిది నెలల బాలుడు వున్నాడు. గత కొంతకాలంగా భార్యా భర్తలిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 10గంటల సమసయంలో భర్తతో గొడవపడిన కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశానికి లోనైన తల్లి బాలుడి గొంతుకోసినట్లుగా తెలుస్తోంది. కాగా జమీలాకు మతిస్థిమితల లేదని స్థానికులు పేర్కొంటున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. 

10:41 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చెన్నై అపోలో ఆస్పత్రిలో 8 మంది వైద్యుల బృందం ఎక్‌మో మిషన్‌పై జయకు చికిత్స అందిస్తున్నారు. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయకు సీరియస్‌గా ఉండడంతో మంత్రులంతా ఆస్పత్రి ఆవరణలోనే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి చైర్మన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు.. మంత్రులతో భేటీ అయ్యారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

జ్వరం, డీ హైడ్రేషన్‌తో ఆసుపత్రిలో చేరిన జయలలిత
జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ జయలలిత సెప్టెంబ‌రు 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. అప్పటి నుంచి అంటే 73 రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలోనే జయ చికిత్స పొందుతున్నారు. జయ పూర్తిగా కోలుకున్నారని ఈ మధ్యే అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. చికిత్సలో భాగంగా జ‌య‌ల‌లిత‌కు ప్రతిరోజూ కొద్ది స‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, కొద్దిరోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని కూడా చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అపోలో వైద్య బృందంతో పాటు లండన్‌ ప్రత్యేక వైద్య నిపుణులు, ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో జయలలిత చికిత్స పొందారు. అయితే ఇంతలోనే జయకు మళ్లీ గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

రాష్ట్ర రాజకీయాల్లో కీలకపరిణామం
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జయకు అత్యంత విధేయుడైన ఆర్ధికమంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగిస్తూ రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీచేసింది. అర్టికల్‌ 166 ప్రకారం కేబినెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్‌ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జయలలిత నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరని విపక్షాలు ఆరోపించాయి. జయలలిత సూచన మేరకే ఆమె వద్ద ఉన్న పోర్టుఫోలియోలను పన్నీర్‌సెల్వానికి కేటాయించినట్లు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొనడంపై డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు.మరోవైపు అమ్మ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో రూమర్లు సృష్టించే వారిపై పోలీసులు చాలామంది అరెస్ట్‌ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు.

అమ్మ కోలుకోవాలని అభిమానుల పూజలు
అమ్మ త్వరితగతిన కోలుకోవాలంటూ అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు పూజలు, హోమాలు, యాగాలు, సామూహిక ప్రార్ధనలు కొనసాగిస్తున్నారు. ఆమెకోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం జయలలిత అనారోగ్యం బారిన పడటంతో తమిళనాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తమిళ రాకీయాల్లో విప్లవ నాయకిగా
పురట్చితలైవి..! తమిళ రాకీయాల్లో విప్లవ నాయకిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ధీరవనిత. ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించినా.. తన నిర్ణయాలతో విపక్షాల ప్రశంసలనూ అందుకున్న అద్వితీయ నేత జయలలిత. డేరింగ్‌ ..డాషింగ్‌ పర్సనాలిటీతో తమిళ పాలిటిక్స్‌ కు రాకెట్‌ స్పీడ్‌ను నేర్పిన నాయకురాలు. ద్రవిడ పార్టీల పాలిటిక్స్ లో ఓ మిస్సైల్లా దూసుకొచ్చిన జయలలిత.. ప్రధాన ప్రత్యర్థి .. రాజకీయ దురంధరుడు కురుణానిధిని గిరిగీసి నిలువరించిన పొలిటికల్‌ చతురత ఆమెది. పెరియార్‌ రామస్వామి నాయకర్‌ ప్రారంభించిన ద్రవిడ మున్నేట్ర కళగం వేదికను.. మలిదశలో పరుగులు పెట్టించిన ఎంజీఆర్‌కు.. రాజకీయ వారసురాలిగా 1982లో ఘనంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు జయ. ఆమె ఎంట్రీతో ద్రవిడపార్టీల ప్రాభవం ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కామరాజ్‌ నాడార్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఉనికే లేకుండా చేసిన చరిత్ర ద్రవిడ పార్టీలది. అందులోనూ జయలలిత ఎంట్రీ తర్వాత జాతీయ పార్టీలంటేనే తమిళ ప్రజలు మర్చిపోయే స్థాయి వచ్చింది. 1991లో మొదటిసారిగా సీఎం పగ్గాలు చేట్టిన జయ..ఎప్పటికపుడు కొత్తకొత్త ప్రజాకర్షక పథకాలతో విపక్షాలను .. ముఖ్యంగా డీఎంకే అధినేత కరుణానిధిని ఉక్కిరిబిక్కిరి చేశారు. 1996లో అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న జయలలితపై డీఎంకే.. కక్షసాధింపుకు అసెంబ్లీనే సాక్షిగా నిలిచింది. అవమానాలు ఎదురైనా.. ధైర్యంగా ముందుకు సాగిన ధీశాలి. ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి.. అభాగ్యులను అన్నార్తులను .. ఆదుకోవడంలో జయ అందరికంటే ముందుంటారు. పవర్‌లో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆమె తమిళ రాజకీయాలను శాసించారు. అందుకే తమిళ ప్రజలు ఆమెను పురట్చితలైవి...అని సగర్వంగా చెప్పుకుంటారు.

10:39 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని హుటాహుటిన మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయకు సీరియస్‌గా ఉండడంతో మంత్రులంతా ఆస్పత్రి ఆవరణలోనే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి చైర్మన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు.. మంత్రులతో భేటీ అయ్యారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. జయలలిత ఆరోగ్యాన్ని 8మంది డాక్టర్లతో కూడిన వైద్యం బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో జయ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలో వున్నారు.ఆస్పత్రికి భారీగా అభిమానులుచేరుకున్నారు.ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు అభిమానులు, కార్యకర్తల యత్నం...అడ్డుకున్న పోలీసులు..ఆపోలో ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సెప్టెంబ‌రు 22 అపోలో ఆసుప‌త్రిలో చేరిన జయలలిత
జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ జయలలిత సెప్టెంబ‌రు 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. అప్పటి నుంచి అంటే 73 రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలోనే జయ చికిత్స పొందుతున్నారు. జయ పూర్తిగా కోలుకున్నారని ఈ మధ్యే అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. చికిత్సలో భాగంగా జ‌య‌ల‌లిత‌కు ప్రతిరోజూ కొద్ది స‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, కొద్దిరోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని కూడా చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అపోలో వైద్య బృందంతో పాటు లండన్‌ ప్రత్యేక వైద్య నిపుణులు, ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో జయలలిత చికిత్స పొందారు. అయితే ఇంతలోనే జయకు మళ్లీ గుండెపోటు రావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

అమ్మ కోలుకోవాలంటూ అభిమానులు..
అమ్మ త్వరితగతిన కోలుకోవాలంటూ అన్నాడిఎంకె నేతలు, కార్యకర్తలు పూజలు, హోమాలు, యాగాలు, సామూహిక ప్రార్ధనలు కొనసాగిస్తున్నారు. ఆమెకోసం ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఆందోళనతో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆస్పత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం జయలలిత అనారోగ్యం బారిన పడటంతో తమిళనాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 

అమ్మ కోలుకోవాలని పలువురి ఆకాంక్ష..

తమిళనాడు : సీఎం జయలలిత మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఐసీయూ నుండి వార్డుకుతరలించిన ఆమెకు ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను ఐరసీయూకు తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఆమె ఆరోగ్యం తీవ్ర విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నట్లుగా తెలుపుతున్నారు. ప్రధాని మోదీ..రాష్ట్రపతి ప్రణబ్..మాజీ సీఎం కరుణానిధి ఆమె కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరో పక్క కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమె ఆరోగ్యంపై తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ..ఇంకా పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

తమిళ కేబినెట్ అత్యవసర భేటీ..

తమిళనాడు : మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం విదితమే. గుండెపోటు వచ్చిన జయకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, అమ్మ ఆరోగ్యం పరిస్థితిపై మంత్రివర్గం సమీక్షిస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆ రాష్ట్రానికేమయ్యింది?!..

తమిళనాడు : సీఎం..అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కరుణానిధి.. ప్రస్తుతం వీరిద్దరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రాన్ని శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీల నేతలు ఆస్పత్రి పాలవడంపై ఇరు పార్టీల కార్యకర్తులు, అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. సెప్టెంబరు 22 నుంచి చెన్నైలోని అపోలో ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించిన విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. తమిళనాడు విషాదంలో మునిగిపోయింది.

పోలీసుల దిగ్భంధంలో తమిళనాడు..

తమిళనాడు : ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. టోల్‌ప్లాజాలు, జాతీయ రహదారిపై బలగాలను భారీగా మోహరించారు. పోలీసుల సెలవులను రద్దు చేసిన ఉన్నతాధికారులు అత్యవసరంగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటూ తమిళనాడులో ప్రస్తుతం హై అలెర్ట్ ఉంది. మరోవైపు ఒక్క అపోలో అస్పత్రి వద్దే దాదాపు మూడువేల మంది పోలీసులను మోహరించారు. ఆస్పత్రికి దారితీసే అన్ని మార్గాలను మూసివేశారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీ: ఢిల్లీ రితాల ప్రాంతంలోని ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మురికివాడలో ఉన్న సామాగ్రి భారీ మొత్తంలో దగ్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 30 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.

హుటాహుటిన అపోలోకి చేరుకున్న గవర్నర్..

తమిళనాడు : సీఎం జయలలితకు గుండె పోటు వచ్చిన విషయం తెలియగానే మహారాష్ర్ట, తమిళనాడు గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు హుటాహుటిన ఆదివారం రాత్రి ముంబయి నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ముంబయిలో నేవీ డే ఉత్సవానికి హాజరైన విద్యాసాగర్ రావుకు ఈ విషయం తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే చెన్నైకి బయలుదేరి వెళ్లారు. అటు కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుకు ఫోన్‌ చేసి జయలలిత ఆరోగ్య స్థితి గురించి వాకబు చేశారు.

తొమ్మిదేళ్ల బాలుడు దారుణ హత్య..

రంగారెడ్డి: జిల్లా పరిధిలోని మొయినాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడి ఇంటి పక్కనున్న ఓ వ్యక్తి అతన్ని అపహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

తమిళనాడు : చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు నెలలకు పైగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలిసిన పలు పార్టీల నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇక వేలాదిమంది ‘అమ్మ’ అభిమానులు ఆస్పత్రికి చేరుకుని రాత్రంతా ఆస్పత్రి ఎదుట జాగారం చేశారు. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

07:10 - December 5, 2016

కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంక్ ల దగ్గర, ఏటిఎంల దగ్గర క్యూలు తగ్గడం లేదు. ఫస్ట్ వీక్ కావడంతో పరిస్థితి ఒత్తిడి పెరిగింది. పెద్ద నోట్లు రద్దు చేసి, 27 రోజులైనా కరెన్సీ అందుబాటులోకి రాకపోవడానికి కారణం ఏమిటి? బ్యాంక్ ల్లో, ఏటిఎంలలో డబ్బులు ఎందుకని లేవు? నోట్ల రద్దు తర్వాత బ్యాంకింగ్ రంగం, బ్యాంక్ ఉద్యోగులు ఫేస్ చేస్తున్న సవాళ్లేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత వెంకట్రామయ్య 10టీవీ స్టూడియోకి వచ్చారు. 

07:07 - December 5, 2016

హైదరాబాద్ : పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేవిధంగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలుండాలని దిశా నిర్దేశం చేశారు. ఈనెల 4న హైదరాబాద్ లో కలెక్టర్ల సదస్సు నిర్వహించి జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాధాన్యతలను నిర్దారించుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

ఉన్నతాధికారులకు సూచించిన సీఎం కేసీఆర్ -
కలెక్టర్లు జిల్లా గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడంతోపాటు అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో జిల్లా పునర్‌వ్యవస్థీకరణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు

ప్రభుత్వ శాఖల పని తీరులో గణనీయమైన మార్పు రావాలి-: కేసీఆర్
ప్రభుత్వ శాఖల పని తీరులో గణనీయమైన మార్పు రావాలన్నారు. ఆయా జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలుండాలని చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒకే రకమైన పద్దతి అవలంభించాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్లకు ఇప్పటికే జిల్లాలపై కొంత అవగాహన వచ్చి ఉంటుంది. మరికొన్ని అంశాల్లో అధ్యయనం చేసేలా మార్గదర్శకం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 14న హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలి. జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాధాన్యతలను నిర్ధారించుకోవాలని ఆదేశించారు.

07:04 - December 5, 2016

తమిళనాడు : సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 73 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని హుటాహుటిన మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆస్పత్రికి బారులు తీరారు. రాత్రంతా ఆస్పత్రి వద్దనే వేచివున్నారు. అభిమనులు అమ్మ కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయకు సీరియస్‌గా ఉండడంతో మంత్రులంతా ఆస్పత్రి ఆవరణలోనే కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. జయ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నైకు హుటాహుటిన తరలివచ్చారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి చైర్మన్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు.. మంత్రులతో భేటీ అయ్యారు. జయ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. గవర్నర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. ఈరోజు కేంద్రమంత్రులు నడ్డా, నితిన్‌ గడ్కరీలు చెన్నైకు రానున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా డీజీపీ.. పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారిని విధుల్లో చేరాలని ఆదేశించారు. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇక జయ ఆరోగ్యంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. 

07:03 - December 5, 2016

హైదరాబాద్ : పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆల్టోకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో వున్న నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. TS 03EL3551 నంబర్ గల కారుగా గుర్తించారు. సోమవారం తెల్లవారు ఝూమున 5గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి వస్తున్న కారు డివైడర్ ను ఢీకొని సుమారు అరకిలోమీలరు దూరం దూసుకుపోయినట్లుగా తెలుస్తోంది. బస్ లో వున్నవారు తప్పించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. మృతులు పూర్తిగా సజీవదహనం అయిపోవటంతో గుర్తించేందుకు వీలు లేకుండా పోయినట్లుగా సమాచారం.

కారులో మంటలు..4గురు సజీవదహనం..

హైదరాబాద్ : పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆల్టోకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలతో కారులో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు గుర్తించారు.

సీఎం జయలలితకు గుండెపోటు..

తమిళనాడు : అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి ఐసీయూకు తరలించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హృద్రోగ, శ్వాసకోశ నిపుణులు జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు తరలివచ్చారు.

Don't Miss