Activities calendar

06 December 2016

ముంబైలో రాష్ట్రాల సీఎంల భేటీ..

హైదరాబాద్ : ఈనెల 8వ తేదీన ముంబై లో రాష్ట్రాల సీఎంల కమిటీ సమావేశం జరగనుంది. నోట్ల రద్దు వ్యవహారంపై సీఎంలు సమావేశం కానున్నారు.

భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం..

ఢిల్లీ : భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో 8 కిలోలు, భువనేశ్వర్ లో 3 కిలోల బంగారాన్ని సీఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.

ఇండియా - ఇంగ్లండ్ టెస్టుపై సందేహాలు..

చెన్నై : ఇండియా - ఇంగ్లండ్ ఐదో టెస్టుపై సందేహాలు నెలకొన్నాయి. జయలలిత మృతితో చెన్నైలో జరగాల్సిన టెస్టుపై సందిగ్ధం నెలకొంది. మ్యాచ్ వేదిక మార్చాలా ? అక్కడే మ్యాచ్ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈనెల 16 నుండి 20 వరకు టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది.

మంత్రి పరిటాల అకస్మిక తనిఖీలు..

అనంతపురం : టవర్ బ్లాక్ సమీపంలో షాపులు, పెట్రోల్ బంక్ ల్లో మంత్రి పరిటాల సునీత అకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు నగదు రహిత సేవలు అలవాటు చేయాలని ఆదేశించారు.

21:29 - December 6, 2016

చెన్నై : భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక నాలుగో టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. తొలి టెస్ట్‌లో డ్రాతోనే సరిపెట్టుకున్న విరాట్‌ ఆర్మీ వైజాగ్‌, మొహాలీ టెస్ట్‌ల్లో నెగ్గి ఆధిక్యంలో నిలిచింది. ముంబై టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌ విజయం సాదించాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లో ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌..5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముంబైలో వాంఖడే స్డేడియంలో రంగం సిద్ధమైంది. రాజ్‌ కోట్‌ టెస్ట్‌లో పోరాడి డ్రాగా ముగించిన కొహ్లీ సేనకు ఆ తర్వాతి రెండు టెస్టుల్లో తిరుగేలేకుండా పోయింది. వైజాగ్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన విరాట్‌ ఆర్మీ...మొహాలీ టెస్ట్‌ను నాలుగు రోజుల్లోనే నెగ్గి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఇంగ్లండ్ 43 మ్యాచ్ ల్లో విజయం..
నాలుగో టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతుండగా జోరు మీదున్న విరాట్‌ ఆర్మీకి ఎలా అయినా చెక్‌ పెట్టాలని కుక్‌ అండ్‌ కో పట్టుదలతో ఉంది. ప్రస్తుత సిరీస్‌లో తేలిపోతున్న ఇంగ్లండ్‌ జట్టు...ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం భారత జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించిన జట్లలో ముందు వరుసలో ఉంది. భారత గడ్డపై సైతం ఇంగ్లీష్ టీమ్‌కు టెస్టుల్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇరు జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉంది. మొహాలీ టెస్ట్‌ వరకూ భారత్‌-ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకూ 115 టెస్టుల్లో పోటీపడగా ఇంగ్లండ్‌ జట్టు 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, భారత్‌ 23 టెస్టుల్లో మాత్రమే నెగ్గింది.

భారత్ నెగ్గుతుందా ?
సొంత గడ్డపై టెస్టుల్లో తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత్‌పై గత పదేళ్లలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన ఏకైక జట్టు ఇంగ్లండ్‌ మాత్రమే. తొలి టెస్ట్‌లో భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లీష్‌ టీమ్‌ ఆ తర్వాతి రెండు టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోయింది. దీంతో సిరీస్‌కే నిర్ణయాత్మకంగా మారిన ముంబై టెస్ట్‌లో అంచనాలకు మించి రాణించాలని ఇంగ్లీష్‌ టీమ్‌ ప్లాన్‌లో ఉంది. మరి టెస్టుల్లో గత 16 టెస్టుల్లో ఓటమంటూ లేని టీమిండియా...ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ముంబై టెస్ట్‌లో నెగ్గి కొహ్లీ అండ్‌ కో ఇంగ్లండ్‌పై బదులు తీర్చుకుంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

21:27 - December 6, 2016

గుంటూరు : జిల్లా తాడేపల్లిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన నాని అతని స్నేహితులు, నోట్ల మార్పిడి విషయమై శేషగిరిని కలిశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరి..10 శాతం కమిషన్‌లో తనకు ఒక శాతం ఇవ్వాలన్న డిమాండ్‌తో డీల్‌ కుదిరింది. నోట్ల మార్పిడి కోసం వెళుతున్న శేషగిరి పోలీసులకు చిక్కాడు. అతనితో ఉన్న మిగిలిన నలుగురు పరారయ్యారు. శేషగిరి దగ్గరున్న సుమారు 21 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

21:23 - December 6, 2016

హైదరాబాద్ : గోదావరి జలాల సద్వినియోగం పేరుతో పాలకులు వేలాది కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని....ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను రద్దు చెయ్యడం, కొన్నింటిని రీడిజైనింగ్‌ చెయ్యడం ద్వారా.. దాదాపు 14 వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు ఖర్చులపై తప్పుడు రిపోర్టులు చూపించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేశారు.

21:21 - December 6, 2016

విజయవాడ : నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ను తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంక్‌ సేవలన్నింటినీ వినియోగించుకోవచ్చన్నారు. మొబైల్ వాలెట్‌ ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ఏపీ పర్స్‌ మొబైల్ ఆన్‌ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని చంద్రబాబు తెలిపారు.

బంగాళాఖాతంలో వాయుగుండం..

చెన్నై : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 1320 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది. మరో 72 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

20:51 - December 6, 2016

ఒక శకం ముగిసింది.. దేశ రాజకీయాల్లో ఓ ఉక్కు మహిళ నిష్క్రమించింది. పురుషాధిక్య సమాజం.. ఓ మహిళ సమాజంలో నిలదొక్కుకోవటానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసిన సమయం.. కానీ, ఆమె అడ్డుగోడలను బద్ధలు కొట్టారు.. ప్రత్యర్ధులను చిత్తు చేశారు. గమ్యాన్ని చేరారు. తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో మలుపులు.. ఆ ప్రస్థానంపై వైడాంగిల్ ప్రత్యేక కథనం.. మామూలు నటి కదా అనుకున్నారు.. కానీ, పార్టీనే శాసించింది. ఓ మహిళ రాజకీయాల్లో ఏం చేస్తుందనుకున్నారు. నిండు సభలో అవమానాలు కూడా చేశారు. కానీ శపథం చేసి మరీ పీఠాన్ని అధిరోహించారు. నటిగా, పార్టీ నేతగా, సీఎంగా జయలలిత దశాబ్దాలపాటు తమిళనాడు రాజకీయాల్లో భాగమయ్యారు. అపారమైన ప్రతిభ..సాధించాలనే పట్టుదల..గమ్యంవైపు పరుగులు తీసే దృఢత్వం.. అంతులేని ఒంటరితనం..కరగని మొండితనం.. జయలలితలో కొట్టొచ్చినట్టు కనిపించే లక్షణాలు.. చిన్నతనం నుండి 75 రోజులు ఆసుపత్రిలో పోరాడేంత వరకు ఇదే తీరు కొనసాగింది.

రూటే సపరేటు..
నమ్మిన బంటుకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కటకటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సపరేటు. కరుణిస్తే అమ్మ...టార్గెట్ చేస్తే అపరకాళి. తమిళనాడు రాజకీయాల్లో అమ్మగా ఆదరణ పొందిన జయలలిత నిర్ణయాలు తీసుకోవటంలో సాహసి..ఎంత దూరమైనా వెళ్లటానికి వెనుకాడని మనస్తత్వం. ఆమె తీసుకునే నిర్ణయాలతో ప్రజలతో పాటు ప్రత్యర్థులు సైతం షాక్‌ తినేవారు. అమ్మ రాజకీయ జీవితంలో ఎదురైన సవాళ్లు.. వాటిని ఆమె ఎన్నో ఎదుర్కొన్నారు.

జయలలిత లేదు...
ఇప్పుడు జయలలిత లేదు.. తమిళ తంబిలు అమ్మా అని పిలుచుకునే వ్యక్తి భౌతికంగా లేదు. కానీ, ఆమె ఇచ్చిన స్ఫూర్తి పంచిన మంచితనం ఉంది. కానీ, ఒక్కటే సందేహం.. జయలలిత కేంద్రంగా సాగిన రాజకీయాలు ఇప్పుడొక్కసారిగా రాజకీయ శూన్యతలో పడే అవకాశముందా? తమిళనాడు పాలిటిక్స్ ఏ మలుపు తీసుకోబోతున్నాయి? మహాశక్తిలాంటి వ్యక్తి నిష్క్రమిస్తే కలిగే శూన్యాన్ని ఊహించటమే కాదు. దాన్ని నింపటం కూడా కష్టమే. పన్నీర్ సెల్వం జయకు ప్రత్యామ్నాయంగా ఎదగగలడా? లేక మరో నటుడు అవసరమౌతాడా? అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఇదంతా ఇప్పటికి ప్రశ్నే. కానీ, కాలం ఎవరికోసం ఆగదు. ఎవరి నిష్క్రమణతోనూ నిమిత్తం లేకుండా ప్రపంచం సాగుతూ ఉంటుంది. అలా ప్రపంచాన్ని వదిలిన వారి జ్ఞాపకాలు ..అందించిన స్ఫూర్తి మాత్రం ముందు తరాలకు అందుతూ ఉంటుంది.

20:41 - December 6, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన రీజనల్ మాథ్య్‌ ఒలంపియాడ్‌లో నారాయణ గ్రూప్ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 43 శాతం మంది విజయం సాధించడం పట్ల...ఆ సంస్థ ఎండీ సింధూర నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

20:40 - December 6, 2016

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో 'అమ్మ'గా ఆదరణ పొందిన జయలలిత-ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడేవారు కాదు. కరుణిస్తే అమ్మ...కక్ష కడితే అపరకాళిగా కఠినంగా ఉండేవారు. ఆమె తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలతో పాటు ప్రత్యర్థులు సైతం షాక్‌ తినేవారు. అమ్మ రాజకీయ జీవితంలో తీసుకున్న అతిముఖ్య నిర్ణయాలేంటో చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయాల్లో ఎన్నో ఆటు పోటు లెదుర్కొన్నారు. 1989లో తమిళనాడు అసెంబ్లీలో దుశ్శాసన పర్వం జరిగింది. జయపై డిఎంకె ఎమ్మెల్యేలు దాడి చేసి చీర లాగారు. చిరిగిన చీరతోనే బయటకు వచ్చిన ఆమె సిఎం అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1991 సిఎం అయ్యారు.

జైలుకు..
1996లో డిఎంకె ప్రభుత్వ హయాంలో అక్రమ ఆస్తుల కేసులో జయ జైలుకి వెళ్లారు. అనంతరం బెయిలుపై విడుదలయ్యారు. నేనెక్కడికి వెళ్లానో...తన ప్రత్యర్థులని కూడా అక్కడికే పంపిస్తానని శపథం చేశారు. 2001లో అధికారంలోకి వచ్చిన జయ ప్రతీకారం తీర్చుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి కరుణానిధిని అర్ధరాత్రి దాటాకా రెండు గంటలకు కరుణానిధిని జైలుకి పంపారు. అక్రమ ఆస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి ఐటి అధికారులు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విరక్తి చెందిన జయలలిత బంగారు ఆభరణాలకు దూరంగా ఉన్నారు. 2001లో ఆందోళనకు దిగిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఒకేసారి ఆందోళనకు దిగిన 2 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారు. జయ నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

పలు నిర్ణయాలు..పలు సంక్షేమ కార్యక్రమాలు..
2001లో తమిళనాడులో లాటరీ టికెట్లను రద్దు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌పై ఆంక్షలు విధించారు. ఆలయాల్లో జంతు బలులపై కూడా నిషేధించారు. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో రైతులు, జంతు బలుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తొలిసారి మహిళా పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన ఘనత జయలలితకే దక్కింది. మహిళా పోలీస్‌ స్టేషన్లలో కేవలం మహిళా పోలీసులు, అధికారులనే నియమించారు. అనాథ ఆడపిల్లల ఆలనా పాలనా చూసేందుకని 1992లో క్రెడిల్‌ బెబీ స్కీంను ప్రారంభించారు. 2013లో పేదల కడపు నింపేందుకు అతి చవకగా అమ్మ క్యాంటీన్‌ను జయలలిత ప్రారంభించారు. రూపాయికే ఇడ్లీ, మూడు రూపాలకు చపాతీ, ఐదు రూపాయలు ప్లేట్‌ భోజనం ఏర్పాటు చేశారు. మద్యపాన నిషేధంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 2016లో 5 వందల మద్యం షాపులను మూసివేస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు.

నగరంలో ఐటీ దాడులు..

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో బి. లక్ష్మణ రావు అనే వ్యక్తి ఇంటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించారు. ఐడీఎస్ కింద రూ. 9,800 కోట్లు లక్ష్మణరావు వెల్లడించారు. సెప్టెంబర్ 30 నాటికి తొలి విడతగా రూ. 1,125 కోట్లను లక్ష్మణరావు కట్టాల్సి ఉంది. లక్ష్మణరావుతో పాటు నల్లధనం వెల్లడించిన మరో ఇద్దరి ఇళ్లపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

20:21 - December 6, 2016

చెన్నై : తమిళనాట జయలలిత తర్వాత అంతే సమర్థంగా అన్నాడీఎంకేను నడిపించే నాయకుడెవరు? జయకు వారసులుగా ఎవరు ఉండబోతున్నారు? ప్రస్తుతానికి పన్నీరు సెల్వంను సీఎంగా ప్రకటించినా రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? పన్నీరు సెల్వం సీఎంగా కొనసాగేందుకు జయలలిత సహచరి శశికళ సహకరిస్తుందా? లేక అధికారపీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుందా? అన్నాడీఎంకేకు బలమైన నాయకత్వం కావాలంటే సినీ హీరో అజిత్‌ అమ్మకు వారసుడిగా రానున్నారా? అమ్మ మృతితో.. తమిళనాడు అంతటా ఇదే చర్చ సాగుతోంది.

సీఎంగా పన్నీర్ సెల్వం..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం.. ఆమె వారసుడెవరు అన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది. సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ..ఆయన జనాకర్షక నేత కాకపోవడంతో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే మూడు అధికార కేంద్రాలు నడిచాయనే ప్రచారం ఉంది. జయలలిత సహచరి శశికళ... నెంబర్‌ టూ గా వ్యవహరించారు. ఇప్పుడు, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది.

అనేక ప్రశ్నలు..
పోరాట యోధురాలిగా, అత్యంత ప్రజాకర్షణ ఉన్న నేతగా ఉన్న జయలలిత స్థానంలో.. ఆమె వారసుడిగా పన్నీరు సెల్వంను అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు ఎంత వరకూ అంగీకరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. కోర్టు కేసులు, వివిధ కారణాలతో జయ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు పన్నీరు సెల్వం రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు జయ మంత్రిత్వ శాఖల బాధ్యతలన్నీ ఆయనే చూశారు. రాష్ట్రంలో ప్రధాన అధికార కేంద్రంగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లకు గాను..136 స్థానాలతో అన్నాడీఎంకే పూర్తి మెజారిటీ సాధించింది. అయితే, శశికళ కోటరీలో 60 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీరు సెల్వంను శశికళ తాత్కాలికంగా సీఎంగా అంగీకరించినా, రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు భారీగా మారతాయని రాజకీయ విశ్లేషకుల భావన. ప్రధానంగా, శశికళ, పన్నీరు సెల్వం మధ్య పోరు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

షీలా బాలకృష్ణన్..
అన్నాడీఎంకే రథసారథి రేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్‌ పేరు వినిపిస్తోంది. జయలలిత సలహాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్‌.. పాలనపరంగా వ్యవహారాలన్నీ చూశారు. అదే సమయంలో, పన్నీరు సెల్వంను జయలలిత విశ్వసించినట్లుగా శశికళ ఏ మాత్రం నమ్మరు. పన్నీరు సెల్వం కంటే కూడా ఆమె మాజీ సీఎస్‌ షీలా బాలకృష్ణన్‌ తెరపైకి తీసుకురావడానికే మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినీ హీరో అజిత్..
జయలలిత వారసుడిగా సినీ హీరో అజిత్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. సినీ హీరో అజిత్‌ జయకు అత్యంత సన్నిహిత బంధువు. జయలలితను అమ్మగా పిలుస్తూ ఆమెతో ఆప్యాయంగా ఉండేవాడు. డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలన్నా..అజిత్ వంటి ప్రజాకర్షణ గల వ్యక్తిని వారసుడిగా తెరపైకి తీసుకు రావడమే మంచిదనే అభిప్రాయాలను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తన మరణానంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉండాలని, తదుపరి ఎన్నికలు వచ్చే నాటికి అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని పార్టీ వర్గాలను జయ ఆదేశించారన్న వార్తలు వస్తున్నాయి.

బీజేపీ బలం నామమాత్రమే..
రాబోయే ఆరు నెలల వరకూ పన్నీరు సర్కార్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో బీజేపీ బలం నామమాత్రమే. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. దక్షిణాదిలో పార్టీని బలపరచాలన్న కసరత్తులో తమిళనాడు మీద కమలనాథులు కన్నేశారు. ఓవైపు సీఎం జయలలితకు స్నేహ హస్తం అందిస్తూనే.. మరోవైపు తమిళనాడులో పార్టీకి బలమైన పునాదులు వేసే ప్లాన్‌ చేశారు. జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళిసై సౌందర్ రాజన్ దాకా బీజేపీ అగ్ర నేతలు జయకు అందుతున్న వైద్య సేవల పట్ల అత్యంత శ్రద్ధ కనపరిచారు. ఇలాంటి చర్యల ద్వారా అన్నాడీఎంకేకు చాలా దగ్గరై భవిష్యత్ రాజకీయాలు నడపాలన్నదే బీజేపీ వ్యూహం అని తెలుస్తోంది. ఈ సమీకరణల్లో భాగంగానే పన్నీర్ సెల్వంతో బీజేపీ పెద్దలు తరచూ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే 6 నెలల్లో అన్నాడీఎంకేలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారుతాయన్నది తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది.

కేసీఆర్ కు తమ్మినేని 42వ లేఖ..

కామారెడ్డి : సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. ఇది 42వ లేఖ. కామారెడ్డి జిల్లా గాంధారి (మం) నర్సాపురం గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. నర్సాపురం నుండి సమీప ప్రాంతాలకు అటవీ ప్రాంతం గుండా వెళ్లే క్రమంలో గ్రామస్తులపై జంతువులు దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇటీవలే ఓ గర్భవతి మార్గమధ్యంలోనే ప్రసవించిందని, ఐదో తరగతితోనే విద్యార్థులు చదువుకు స్వస్తి పలుకుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రోడ్డు వేయాలని ఆందోళన చేసిన గ్రామస్తులను స్థానిక ఎమ్మెల్యే పోలీసులతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

20:07 - December 6, 2016

కామారెడ్డిలో సైబర్ వల..

కామారెడ్డి : సైబర్ వలలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. ఇద్దరి ఖాతాల నుండి రూ. 1.79 లక్షలను అపహరించారు. ఆగంతకులకు ఫోన్ లో బ్యాంక్ ఖాతాలను జహంగీర్, యూసఫ్ లు చెప్పారు. కామారెడ్డి డీఎస్పీకి వీరిద్దరూ ఫిర్యాదు చేశారు.

నగరంలో నల్లధనం కలకలం..

హైదరాబాద్ : నగరంలో నల్లధనం కలకలం రేగింది. ఐడీఎస్ కింద రూ. 10 కోట్ల నగదు ఉందని ఓ వ్యక్తి వెల్లడించాడు. విచారణ చేసిన ఐటీ అధికారులు బోగస్ వార్తగా నిర్ధారించారు.

ఏపీ పర్స్ మొబైల్ వాలెట్ - బాబు..

విజయవాడ : నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్ మొబైల్ వాలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా బ్యాంక్ సేవలన్నీ వినియోగించుకోవచ్చన్నారు. మొబైల్ వాలెట్ ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చన్నారు. ఏపీ పర్స్ మొబైల్ ఆన్ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని తెలిపారు.

ఏపీ పర్స్ మొబైల్ వాలెట్ - బాబు..

విజయవాడ : నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్ మొబైల్ వాలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా బ్యాంక్ సేవలన్నీ వినియోగించుకోవచ్చన్నారు. మొబైల్ వాలెట్ ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చన్నారు. ఏపీ పర్స్ మొబైల్ ఆన్ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని తెలిపారు.

19:51 - December 6, 2016

జయలలిత కేవలం రాజకీయాల్లోనేకాదు... సినీమారంగంలోనూ ఆమె ఓ ప్రభంజనం. సినీవినీలాకాశంలో ధ్రువతారలా వెలుగొందారు. దక్షిణాది ప్రేక్షకుల మనస్సుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జయలలిత సినీ ప్రస్థానంపై 10టీవీ కథనం... మత్తెక్కించే కళ్లు.. కిర్రెక్కించే డ్యాన్స్‌... మళ్లీమళ్లీ చూడాలనిపించే హావభావాలతో నాటికుర్రకారు గుండెలను లయతప్పించిన అద్భుతనటి జయలలిత. అత్యద్భుత నటనా కౌశలంతో అశేష ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించారు. జయలలిత 1961 నుంచి 1980 వరకు దక్షిణ సినీరంగాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయే లక్షణం జయలలిత సొంతం. ఇచ్చిన పాత్రలో ఆమె జీవిస్తుంది. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అల్లరిపెట్టిస్తుంది. ఇలా అనేక పాత్రల్లో నటించి లక్షలమంది ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది జయ.

15వ ఏట..
జయలలిత తన 15వ ఏటనే సినీ రంగంలోకి ప్రవేశించారు. 1961లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. కన్నడ భాషలో శ్రీశైల మహాత్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి 1980 వరకు దాదాపు 140కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి అభిమానులను మెప్పించారు. నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను మైమరపింప జేసిన జయలలిత దక్షిణాది సినీరంగంలో క్వీన్‌గా నిలిచారు. కథక్‌, భరతనాట్యం, మోహినీఅట్టం, మణిపురివంటి నాట్యాలలో జయలలిత ప్రావీణ్యురాలు. సినిమాల్లోకి రాకముందే వీటిలో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. దేశ విదేశాల్లో ఆమె స్టేజీ షోలు చేశారు. బాల్యంలోనే అతిరథ మహారథులతో ప్రశంసలు అందుకున్నారు. అలా వచ్చిన పరిచయాలతోనే బాల్యనటిగా సినీరంగంలోకి ప్రవేశించారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళీ చిత్రాలతోపాటు హిందీభాషా చిత్రంలోనూ నటించి మెప్పించారు.

తెలుగు ప్రేక్షకులతో..
ప్రతిభ ఉన్న వారిని జయలలిత వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎంతో మందికి సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు. ఆమె ప్రోత్సహించిన వారు సినిమా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థానానికి ఎదిగారు. నేటీకీ కొంతమంది సినిమా రంగంలో కొనసాగుతున్న వారూ ఉన్నారు. నటనతోపాటు జయలలిత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మనసున్న మహారాణిగా వెలుగొందారు. తెలుగు ప్రేక్షకులతో జయలలితకున్న అనుబంధం విడదీయరానిది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆమె మంత్రముగ్దుల్ని చేసింది. అగ్ర శ్రేణిహీరోల సరసన నటించి మెప్పించింది. ఆమెతో నటించేందుకు హీరోలు పోటీపడేవారంటే అతిశయోక్తి కాదు. జయలలిత మనుషులు మమతలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తెలుగులో దాదాపు 30 సినిమాలకుపైగా నటించారు. తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నందమూరి తారక రామారావుతో జయలలిత అనేక సినిమాల్లో కలిసి చేశారు. బాగ్దాద్‌ గజదొంగ, దేవుడు చేసిన మనుషులు, కథానాయకుడు, తిక్క శంకరయ్య, శ్రీకృష్ణవిజయం, గండికోట రహస్యంలాంటి సినిమాల్లో ఆమె చూపిన నటన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది.

పోటీ పడి నటించిన జయ..
అక్కినేని నాగేశ్వరరావుతోనూ జయలలిత పోటీపడి నటించారు. ఏఎన్‌ఆర్‌తో చేసిన మనుషులు మమతలు చిత్రం ద్వారానే జయలలిత తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి చిత్రంలోనే జయ అత్యద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు. నవరాత్రి, ఆదర్శకుటుంబం, బ్రహ్మచారి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు అభిమానులైపోయారు. ఇక శోభన్‌బాబుతో చేసిన సినిమాలు తక్కువే అయిన తెరపై ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. డాక్టర్‌బాబు, గూడఛారి 116లో ఇద్దరూ పోటీ పడి నటించారు. 1967లో వచ్చిన చిక్కడు దొరకడు, గోపాలుడు భూపాలుడులోనూ జయలలిత అద్భుతంగా నటించారు. నవరాత్రి సినిమాలో మానసిక పాత్రలో జయలలిత ఒదిగిపోయిన తీరు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. జయలలిత నటనా పటిమకు అగ్రహీరోలు సైతం ఆశ్చర్యపోయేవారంటే అతిశయోక్తి కాదు. ఒకానొకదశలో అగ్రశ్రేణి హీరోలు సైతం జయతో నటించేందుకు పోటీపడేవారంటే ఆమె జీవితం ఎంతగా వన్నెలీనిందో అర్ధం చేసుకోవచ్చు. జయకున్న ప్రాముఖ్యత ఏ పాటిదో గ్రహించవచ్చు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జయలలిత చిరస్థాయిగా నిలిచిపోయారు.

తమిళ చిత్ర సీమలో..
జయలలిత తమిళ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిపోయారు. విభిన్నపాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను మైమరపించారు. ఎంజీఆర్‌తో కలిసి ఆమె చేసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తమిళ సినీ రంగాన్ని ఏలిన క్వీన్‌గా జయను చెప్పుకుంటారు. 1965లో శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వెన్నిరాడై చిత్రంతో తమిళ సినిమా రంగంలో జయ అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పురచ్చి తలైవర్‌, ఎంజీఆర్‌ సరసన తొలిసారిగా అయిరత్తిల్‌ ఒరువన్‌ సినిమాలో నటించారు. ఇలా తమిళంలో మొత్తం 80పైగా సినిమాల్లో నటించారు. అగ్ర హీరోలందరితో నటించి దశాబ్దల పాటు తిరుగు లేని తారలా రాణించారు.

ఎంజీఆర్ తో..
జయలలిత తన సినీ ప్రస్థానంలో ఎంజీఆర్‌తో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్‌ వంటి అగ్రనాయకుడికి అప్పట్లో జోడీ ఎవరంటే.. జయలలిత పేరే ప్రధానంగా వినిపించేది. వీరి జోడీ అంతలా ప్రేక్షకాదరణ పొందింది. వీరిద్దరి కాంబినేషన్‌లో 28 సినిమాలు వచ్చాయి. ఇందులో ఒకటి అర తప్పా అన్ని హిట్‌లే. ఎంజీఆర్‌తో చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. అరసకట్టాలి, పుదియభూమి, ముహరాసి, నీరుమ్‌ నిరుప్పుమ్‌, ఓలి విలక్కు, ఎంగల్‌ తంగమ్‌, కుమారి కొట్టమ్‌లాంటి సినిమాలు జయలలిత కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఎంజీఆర్‌కు వెండితెరపై పూర్తిస్థాయిలో జోడీ కుదిరే నాయికగా జయకు గుర్తింపు లభించింది. ఇక శివాజీగణేషన్‌తోనూ అధిక సినిమాల్లో జయలలిత నటించారు. సాంఘిక, భక్తిరస చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. 1966లో యార్ని అనే తమిళ సినిమాలో జయ మొదటిసారి ద్విపాత్రాభినయం చేశారు. సంధ్యా, మోహిని అనే రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన నీ కందన్‌ కరుణై చిత్రాల్లోనూ... జయలలిత డబుల్‌ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. అడిమైపెన్‌ అనే తమిళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అలరించిన జయ.. ఆ చిత్రంలో ప్రదర్శించిన నటకు ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. తంగాగోపురం అనే తమిళ సినిమాలో నటనకు గాను జయ తమిళనాడు సినిమా ఫాన్‌ అవార్డును కైవసం చేసుకున్నారు.

పురస్కారాలు..
జయలలిత నటనతోనే కాదు తన గాత్రంతోనూ ఎంతోమంది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. వినసొంపైన గాత్రంతో ఎన్నో తమిళ చిత్రాల్లో పాటలు పాడి అలరించారు. పదికిపైగా సినిమాలు 5కుపైగా ఆల్బమ్స్‌లో పాటలుపాడి అలరించారు. అడిమైపెన్‌, సూర్యకాంతి, తిరుమాంగళ్యం లాంటి చిత్రాల్లో ప్లేబాక్‌ సింగర్‌గా జయ తన ప్రతిభను చూపారు. జయలలిత నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు నటనకు రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సొంతమయ్యాయి. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. వీటితోపాటు అనేక అవార్డులు ఆమెకు లభించాయి.

19:35 - December 6, 2016

విజయవాడ : కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించడం అంటే అంబేద్కర్‌ను వ్యతిరేకించడమేనని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. అంబేద్కర్‌ 60వ వర్ధంతి సంధర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆయన నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమేనన్న ఆయన.. ఇతర పార్టీలు అధికారంలోకి రావడంతో ప్రతిసారి దేశం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని రఘువీరా రెడ్డి విమర్శించారు.

19:33 - December 6, 2016

హైదరాబాద్ : కులరహిత సమాజమే అంబేద్కర్ ఆశయమని సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. శ్రీనివాస్‌రావు అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్వీకేలో అంబేద్కర్ 60 వర్థంతి సందర్భంగా సెమినార్ జరిగింది. ఈ సదస్సులో మతోన్మాదం-బీఆర్ అంబేద్కర్ అంశంపై చర్చించారు. హిందుత్వ శక్తులు అంబేద్కర్‌ను హైజాక్ చేస్తున్నాయని శ్రీనివాస్ చెప్పారు.

19:31 - December 6, 2016

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత మరణం పట్ల టీ.టిడిపి నేతలు సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో జయలలిత చిత్రపటానికి టీ.టిడిపి నేతలు నివాళులర్పించారు. తెలుగు, తమిళ ప్రజల అభిమానాన్ని పొందిన గొప్ప నాయకురాలిగా జయలలిత నిలిచారన్నారు. సమకాలీన రాజకీయాల్లో మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నేతగా జయలలితను అభివర్ణించారు.

19:29 - December 6, 2016

చెన్నై : తమిళుల అమ్మ జయలలిత అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ముగిసింది. చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాలు నుంచి మెరీనా బీచ్‌ వరకు సాగింది. జయ అంతిమయాత్రలో పలువురు ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత భౌతిక కాయానికి ఆమె నిశ్చెలి శశికళ అంతిమ సంస్కారం నిర్వహించారు. తమిళుల అమ్మ, ఎందరో అభిమానుల పాలిట ఆరాధ్య దైవం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాలులో జయలలిత మృతదేహానికి నివాళులు అర్పించారు. జయ స్నేహితురాలు శశికలను, తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వంను ఓదార్చారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోరాట యోధురాలని, అన్ని పోరాటాల్లో ఆమె గెలిచారని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశం ఒక మంచి నేతను కోల్పోయిందని అన్నారు.

రాష్ట్రపతి, మోడీ శ్రద్ధాంజలి..
సంక్షేమ కార్యక్రమాలతో జయలలిత పేదలకు దగ్గరయ్యారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జయలలిత మృతదేహానికి ప్రధాని మోదీ శ్రద్దాంజలి ఘటించారు. మోదీతోపాటు గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు నేతలు ఉన్నారు. అనంతరం ఆయన అన్నాడీఎంకే నేతలను కూడా కలిసి ఓదార్చారు. మోదీని చూసి అన్నాడీఎంకే నేతలు కన్నీరుమున్నీరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జయలలిత భౌతిక ఖాయానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

పలువురు సంతాపం..
జయలలిత మృతి పట్ల సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం ప్రకటించింది. జయ మృతితో విషాదంలో మునిగిన తమిళ ప్రజలు త్వరగా తేరుకోవాలని ఆయన సంతాప ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జయలలిత మృతిపట్ల నివాళులు అర్పించారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాల్‌కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్‌, కుమార్తెలు ఉన్నారు. జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించిన రజనీ.. ఆమె స్నేహితురాలు శశికళను పరామర్శించారు. రజనీ కటుంబ సభ్యులు కూడా శశికళను ఓదార్చారు. జయలలిత పార్థివదేహం పక్కన ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో రజనీకాంత్‌ కాసేపు మాట్లాడారు. జయలలితను చివరిసారి చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.

అంతిమయాత్ర..
అనంతరం రాజాజీ పబ్లిక్‌ హాల్‌ నుంచి మెరీనా బీచ్‌ వరకు జయలలిత అంతిమయాత్ర సాగింది. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు.. శోక తప్త హృదయాలతో జయలలితకు అంతిమ వీడ్కోలు పలికారు. తమిళుల అమ్మ జయలలిత అంతిమయాత్ర చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాలు నుంచి మెరీనా బీచ్‌ వరకు సాగింది. జయ అంతిమయాత్రలో పలువురు ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, పలువురు సినీ ప్రముఖులు, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత భౌతిక కాయానికి ఆమె నిశ్చెలి శశికళ అంతిమ సంస్కారం నిర్వహించారు.

19:22 - December 6, 2016

తమిళుల అమ్మ...పురుచ్చితలైవి.... తమిళనాడు సీఎం జయలలిత మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ నటులంతా జయలలిత మృతిపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. తమిళంతో పాటు, తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటి జయలలిత అని కీర్తించారు. తమిళుల ఆరాధ్య నాయకి...కథానాయిక నుంచి ప్రజా నాయికగా దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన జయలలిత మృతిపై...అటు ప్రజలతో పాటు..ఇటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాక తెలుగులోనూ అగ్రకథానాయికగా అభిమానుల గుండెల్లో నిలచిపోయిన జయలలిత మృతిపై పలువురు తెలుగు చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకున్న గొప్ప నాయకురాలు జయలలిత అని అలనాటి సినీ నటి జమున అన్నారు. జయలలిత మరణంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయంగాను ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి అని సీని ప్రముఖులు కొనియాడారు.
  • పేద ప్రజల కోసం సరికొత్త పథకాలు అమలు చేసి...వారి గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన వ్యక్తి జయలలితని ప్రముఖ సినీనటులు కృష్ణ అన్నారు. ఆమెతో పాటు కలిసి నటించిన అనుభవాలను కృష్ణ గుర్తుచేసుకున్నారు.
  • కథానాయకులే కాదు..కథా నాయికలు కూడా ప్రజా నాయకులుగా ఎదగగలరని జయలలిత నిరూపించారని సినీ నటులు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ధీర వనితగా నిలిచిన..ఆమె మృతి తీరని లోటని దర్శకరత్న దాసరి చెప్పారు.
  • జయలలిత మృతి పట్ల జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, దేశ రాజకీయాలపై ఆమె చెరగని ముద్ర వేశారన్నారు. తమిళ ప్రజలు అమ్మగా కొలుచుకునే జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా జీవించారని కొనియాడారు.

రేపు ఉదయం ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం ఏపీ సీఎం వెళ్లనుండగా సాయంత్రం కేసీఆర్ వెళ్లనున్నారు.

కొత్త రూ. 100 నోట్లు..

ఢిల్లీ: కొత్త రూ. 100 నోట్లు వస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటికే రూ. 20, రూ. 50 నోట్లు కొత్తవి వస్తాయని ఆర్బీఐ ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. పాత 500, వెయ్యి నోట్లు ర‌ద్దు చేసి కొత్త‌గా 500, 2000 నోట్లను ఆర్బీఐ రిలీజ్ చేసింది.

పూర్తయిన 'జయ' అంత్యక్రియలు...

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎంజీఆర్ సమాధి పక్కనే ఈమె అంత్యక్రియలు జరిగాయి. పార్థీవ దేహానికి 'జయ' స్నేహితురాలు శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చందనపు శవ పేటికలో 'జయ' పార్థీవ దేహాన్ని ఉంచారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

అంతిమ సంస్కారం నిర్వహించిన శశికళ..

అంతిమ సంస్కారం నిర్వహించిన శశికళ.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహానికి శశికళ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. చందనపు పేటికలో జయ పార్థీవ దేహాన్ని ఉంచారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

 

ప్రారంభమైన జయ అంత్యక్రియలు

చెన్నై : అశేష జనవాహిని మధ్య మెరీనాబీచ్ చేరుకున్న జయలలిత పార్థీవ దేహానికి అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ విద్యాసాగరరావు జయ పార్ధీవ దేహానికి పుష్పగుచ్చం వుంచి నివాళులు అర్పించారు. అనంతరం సైనిక వందన స్వీకరించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో 3సార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ రోశయ్య, సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు నివాళులు అర్పించారు.

కాసేపట్లో జయ అంత్యక్రియలు

చెన్నై : అశేష జనవాహిని మధ్య జయలలిత అంతిమ యాత్ర మెరీనాబీచ్ చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కాసేపట్లో జయ అంత్యక్రియలు జరగనున్నాయి.

మెరీనా బీచ్ కు చేరుకున్న అంతిమ యాత్ర

చెన్నై : అశేష జనవాహిని మధ్య జయలలిత అంతిమ యాత్ర మెరీనాబీచ్ చేరుకుంది. దాని పొడువునా అమ్మకు అభిమానులు నివాళుర్పించారు.

అశేష జనవాహిని మధ్య జయ అంతిమయాత్ర

చెన్నై : అశేష జనవాహిని మధ్య జయలలిత అంతిమ యాత్ర కొనసాగుతోంది. దాని పొడువునా అమ్మకు అభిమానులు నివాళుర్పిస్తున్నారు. జయలలిత అంత్యక్రియలకు హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ విద్యాసాగర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, గులాంనబీ అంజాద్, పలు రాష్ట్రాల గవర్నర్ లు, సీఎంలు, మంత్రులు హాజరయ్యారు.

కొనసాగుతున్న జయలలిత అంతిమయాత్ర

చెన్నై : రాజాజీ హాల్ నుంచి జయలలిత అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమయాత్ర సా.4.19 నిమిషాలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. మెరీనా బీచ్ లో ఎంజీఆర్ సమాధికి 20 అడుగుల దూరంలో అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగే జయ అంత్యక్రియలకు ప్రజలు, అభిమానులు తిలకించేందుకు మెరీనాబీచ్ మార్గంలో భారీ ఎల్ ఈడీ స్ర్కీన్ లు ఏర్పాటు చేశారు.

16:35 - December 6, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాయినీ నర్సింహరెడ్డి, హరీష్ రావు నివాళులర్పించారు. సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయ అస్తమయం చెందిన సంగతి తెలిసిందే. గత 75 రోజులుగా ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జయ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయలలిత అంత్యక్రియలకు హాజరు కావాలని మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనితో నాయినీ, హరీష్ లు చెన్నైకి చేరుకుని రాజాజీ హాల్‌లో ఉంచిన జయ భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

అంతిమ యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రులు

చెన్నై : రాజాజీ హాల్ నుండి సీఎం జయలలిత అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. మెరీనా బీచ్ వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎం లు పాల్గొన్నారు.

జనసంద్రమైన చెన్నై నగరం

చెన్నై: జయలలితను కడసారి చూసుకునేందుకు రాజాజీ హాల్ వద్దకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. దీంతో చెన్నై నగరం జనసంద్రమైంది. మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధికి 20 అడుగుల దూరంలో జయలలిత అంత్యక్రియలు జరగనున్నాయి.

'తమిళ ప్రజలు ఓ దేవతను కోల్పోయారు'

చెన్నై: తమిళ ప్రజలు ఓ దేవతను కోల్పోయారని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. జయలలిత మరణం తమిళ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.

మెరీనా బీచ్ మార్గంలో భారీ ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు చెన్నైలోని మెరీనా బీచ్ లో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జయ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. జయలలిత అంత్యక్రియల సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

15:55 - December 6, 2016

'నాగార్జున' కాస్త అడ్వాన్స్ అయ్యాడు. అందుకే తెలివిగా వెనక్కి తగ్గాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే 'పవర్' స్టార్ డైలాగ్ ని 'కింగ్' అక్షరాల పాటిస్తున్నాడు. వరుస సక్సెస్ లతో పుల్ స్వింగ్ లో ఉన్న ప్రస్తుతం 'నమో వెంకటేశాయ' మూవీ చేస్తున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'నాగ్' హథీరాం బాబాగా నటిస్తున్నాడు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'సంక్రాంతి' కానుక రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కాస్త అడ్వాన్స్ అయిన 'నాగార్జున' ఈ మూవీ పోస్ట్ పోన్ చేసినట్లు వినిపిస్తోంది. 'నమో వెంకటేశాయ' సినిమాను 'నాగార్జున' సంక్రాంతి బరీ నుంచి తప్పించాడు. కొత్త డేట్ ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు 'నాగ్' అండ్ టీం సన్నాహాలు చేస్తోంది. ఈ సీనియర్ స్టార్ విడుదల తేదీని వాయిదా వేయడానికి మాంఛి రీజనే ఉంది.

నమో వెంకటేశాయా..
సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితి కూడా ఎమంత బాగా లేదు. అందుకే 'నమో వెంకటేశాయ'ను వెనక్కి జరిపాడు. సంక్రాంతికి 'చిరంజీవి' 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో పాటు 'బాలకృష్ణ' 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి రెండు బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'శర్వానంద్' సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో జనం కూడా సినిమా చూసే మూడులో లేరు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 'నాగార్జున' తన సినిమాను కాస్త లేట్ గా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెలలో పెద్దగా రిలీజ్ లు కూడా ఉండవు కాబట్టి కలిసొస్తుందని 'నాగ్' మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి.

జయకు నివాళులర్పించిన మన్మోహన్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ నివాళులర్పించారు. అంతేకాక వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా అక్క‌డ‌కు చేరుకొని జ‌య‌ల‌లిత‌కు నివాళుల‌ర్పించారు. డీఎంకే నేత స్టాలిన్ కూడా జ‌య‌ల‌లిత పార్థివదేహాన్ని సంద‌ర్శించుకున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయ‌డు, క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామయ్య జ‌య‌ల‌లిత పార్థివ‌దేహాన్ని సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

15:40 - December 6, 2016

హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడం బాధాకరమని టాలీవుడ్ నటులు పేర్కొన్నారు. జయలలిత అపోలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పలువురు తమ సంతాపాన్ని తెలియచేశారు.
పేద ప్రజల, రాజకీయ నేతల హృదయాల్లో మహా నాయకురాలిగా నిలిచిపోతోందని సీనియర్ నటులు జమున పేర్కొన్నారు. సాహసానికి మారు పేరని, ధైర్యవంతురాలని కొనియాడారు.
సీఎం అంటే ఇలా ఉండాలని, భారతదేశాన్ని పాలించే శక్తి జయకు ఉందని, బ్లాక్ మెయిల్ చేసే వారు ఉండరని సుమన్ పేర్కొన్నారు.
జయ స్త్రీ శక్తి అని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కథా నాయికలు ప్రజా నాయకులు అవతారని జయ నిరూపించారని తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడం బాధాకరంగా ఉందని టాలీవుడ్ సినీ దంపతులు విజయనిర్మల, కృష్ణ పేర్కొన్నారు. ఆమె మృతి చెందడంతో నలుగురు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు.
ఆమె పాట పాడినా..డ్యాన్స్ లు ఉర్రూతలూగించేవని, మహిళా రాజకీయ శక్తి అని సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు పేర్కొన్నారు.

15:25 - December 6, 2016
15:23 - December 6, 2016

'ఇజం' ప్లాప్ తో షాక్ అయిన 'కళ్యాణ్ రామ్' ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసినట్లు వినికిడి. తన కొత్త మూవీలో తండ్రి 'హరికృష్ణ'తో పాటు తమ్ముడు 'ఎన్టీఆర్' కీ రోల్స్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'కళ్యాణ్ రామ్' కి హిట్టు ఇచ్చిన ఓ యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ చేయబోతున్నట్లు టాక్. 'ఫటాస్' బంపర్ హిట్టు తో ఫాంలోకి వచ్చిన 'కళ్యాణ్ రామ్' కాలం కలిసిరాలేదు. 'పూరీ జగన్నాథ్' డైరెక్షన్ లో ఈ నందమూరి హీరో నటించిన 'ఇజం' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కానీ 'ఇజం' రిజల్ట్ 'కళ్యాణ్ రామ్' ని షాక్ కి గురి చేసింది. దీంతో సెలైంట్ అయిపోయిన ఈ హీరో ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్ లో కొత్త మూవీకి రెడీ అవుతున్నట్లు వినిపిస్తుంది.

యువ దర్శకుడు అనిల్ రావిపూడి..
కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో కొత్త మూవీకి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను పూర్తిచేసే పనిలో ఓ యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్లు సమాచారం. ఈ దర్శకుడు 'కళ్యాణ్ రామ్' 'ఫటాస్' లాంటి సూపర్ హిట్టు తీసిన సంగతి తెలిసిందే. ఈ దర్శకుడే 'కళ్యాణ్' కోసం మరోసారి కత్తి లాంటి స్టోరీ రెడీ చేశాడట. అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో చేయనున్న ఈ కొత్త చిత్రంలో 'హరికృష్ణ' ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నాడట. ఈ పాత్రను దర్శకుడు చాలా వైవిధ్యంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు టాక్. అలాగే మరో ముఖ్యపాత్రలో యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' కూడా కనిపించబోతున్నాడని టాక్. ఇలా క్రేజీ కాంబినేషన్ సెట్ చేసి సినిమా ఓపెనింగ్ కి ముందే 'కళ్యాణ్ రామ్' సినిమాపై ఆకస్తి కలిగేలా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను 'కళ్యాణ్ రామ్' త్వరలోనే వెల్లడించనున్నట్లు వినిపిస్తుంది.

15:19 - December 6, 2016

'కాజల్ అగర్వాల్' మరోసారి 'మహేష్ బాబు' పక్కన నటించే ఛాన్స్ పట్టేసిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే రెండు సార్లు 'ప్రిన్స్' తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రోమాన్స్ చేయబోతుంది. క్రేజీ మూవీలో 'మహేష్' పక్కన ఈ బ్యూటీ సెట్ అయినట్లు టాక్. 'సర్ధార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత తెలుగులో 'కాజల్ అగర్వాల్' కి కొత్త సినిమా రాలేదు. మధ్యలో 'ఎన్టీఆర్' కోసం 'జనతా గ్యారేజ్' లో ఐటం సాంగ్ చేసింది. ఆరు నెలల పాటు తెలుగులో ఒక్క ఛాన్స్ రాకపోవడంతో ఇక 'కాజల్' పని అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ లేటేస్ట్ ఈ బ్యూటీ మరోసారి 'మహేష్' తో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుందని వినికిడి.

ప్రిన్స్ మూడో సినిమాలో..
'కాజల్' ఇంతకు ముందు 'మహేష్ బాబు' 'బిజినేస్ మేన్', 'బ్రహ్మోత్సవం' సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో 'బిజినేస్ మేన్' హిట్టు కాగా ఈ ఎడాది రిలీజైన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా 'ప్రిన్స్' తన కొత్త మూవీ కోసం మరోసారి ఈ బ్యూటీ వైపే మొగ్గుచూపాడట. ప్రస్తుతం 'ప్రిన్స్' మురుగదాస్ తో పాటు కొరటాల శివతో సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఈ స్టార్ హీరో వంశీపైడిపల్లితో న్యూ మూవీ కమిట్ అయ్యాడట. ఈ మూవీలోనే 'మహేష్' పక్కన 'కాజల్' ని ఫిక్స్ చేసినట్లు వినిపిస్తుంది. ఒక హిట్టు ఒక్క ప్లాప్ అందుకున్న కాంబినేషన్ థర్డ్ టైం ఎలాంటి రిజల్ట్ ని చవిచూస్తారో చూడాలి.

జయ మృతికి సీపీఎం పొలిట్ బ్యూరో సంతాపం..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతికి సీపీఎం పొలిట్ బ్యూరో సంతాపం తెలియచేసింది. సంక్షేమ పథకాలతో సామాన్యులకు జయ ఆసరా ఇచ్చారని, తమిళ రాజకీయాల్లో జయ చెరగని ముద్ర వేశారని సంతాప సందేశంలో పొలిట్ బ్యూరో పేర్కొంది.

 

రాజాజీ హాల్ వద్ద లాఠీఛార్జీ..

చెన్నై : రాజాజీ హాల్ వద్ద జయ మద్దతుదారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. హాల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.

14:34 - December 6, 2016

హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూయడం బాధాకరమని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జయలలిత తనకు అమ్మలాంటిదని పేర్కొన్నారు. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గొప్ప ధీరవనిత అని అభివర్ణించారు. మూవీ ఆర్టిస్టు అసోసయేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు వారికి జయ ఎంతో ఆత్మీయురాలని, తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతుందన్నారు. పోరాటాల నుండి విజయాలు చూసిన గొప్ప వనిత అని కొనియాడారు. కడసారి పార్థీవదేహాన్ని చూడటానికి ఎంతో మంది వస్తున్నారంటే ఆమె ప్రేమ ఎలాంటిదో తెలియచేస్తోందన్నారు.

14:33 - December 6, 2016

చెన్నై : తమిళనాడు తల్లిడిల్లుతోంది. సీఎం జయలలిత అస్తమయం చెందిన సంగతి తెలిసిందే. దీనిత్న జయ అభిమానులు..అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. జయ మరణం జీర్ణించుకోలేని పలువురు అభిమానులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయి ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మౌంట్ రోడ్డు సమీపంలోని జయ భౌతికకాయాన్ని రాజాజీ హాల్ కు తరలించారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు జయ పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

డైనమిక్ లీడర్ జయ: ఎంపీ కవిత

హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో జయలలిత డైనమిక్ లీడర్ అని టీఆర్ ఎస్ ఎంపీ కవిత అన్నారు. జయలలిత మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇందిరాగాంధీ తర్వాత అంతటి గొప్ప నేత జయలలిత అని కొనియాడారు.

రాజాజీ హాల్ వద్ద లాఠీ విరిగింది

చెన్నై: దివంగత సీఎం జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, జయ మద్దతుదారులు రాజాజీ హాల్ ల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జి చేసిన చెదరగొట్టారు.

14:01 - December 6, 2016

తమిళనాడు : పార్టీలో ఆమె హైకమాండ్ ఆమె లో కమాండ్ అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ రోశయ్య పేర్కొన్నారు. ఆమె ఏ కార్యక్రమాల పట్ల అమలుకు పోరాడారో వాటిని కొనసాగించాలని రోశయ్య సూచించారు. పార్టీలో రాష్ట్ర స్థాయి నుండి దిగువస్థాయి వరకూ అన్నీ ఆమె ఆజ్ఞానుసారంగానే కొనసాగేవని తెలిపారు. ఆ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన సమయంలో ఆమె సహకారం మరువలేదన్నారు. తమిళ ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. జయలలితకు ఆయన ఈ సందర్భంగా నివాళులర్పించారు.

13:55 - December 6, 2016
13:53 - December 6, 2016

తమిళనాడు : అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలకడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నయ్ చేరుకున్న విషయం తెలిసిందే. రాజాజీహాల్ కు చేరుకొని జయలలిత భౌతిక కాయానికి శిరస్సు వంచి  నివాళులర్పించారు. మోదీ వెంట కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు కూడా ఉన్నారు. మోదీ అక్కడకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ప‌న్నీరు సెల్వం, శ‌శిక‌లలు ఉద్వేగానికిలోనయ్యారు. వారికి మోదీ ఓదార్చారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు జయలలిత పార్థివదేహానికి జరగనున్న అంత్య‌క్రియ‌లకు కూడా మోదీ హాజ‌రుకానున్నారు. మ‌రోవైపు మ‌రికాసేప‌ట్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అక్క‌డ‌కు చేరుకోనున్నారు.

జయకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాళి

చెన్నై : రాజాజీ హాల్ లో ఉన్న తమిళనాడు సీఎం జయలలిత పార్ధీవ దేహానికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాళులర్పించారు.

13:41 - December 6, 2016

కామారెడ్డి : 50 రోజులు కాదు 500ల రోజైనా రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకునేందుకు సరిపోవని ఆస్థాయిలో సమస్యలు పేరుకుపోయాయన్నారు. అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళగురించి ప్రజలు ఎంతగానో ఆశపడుతున్నారనీ..ఈ హామీ నెరవేర్చకపోవటంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని..ఈ విషయంపై ప్రజలు వందల వేలాదిగా వినతిపత్రాలు పాదయాత్ర సభ్యులు ఇస్తున్నారని తెలిపారు. మరో సమస్యలు దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తానని మూడెకరాల భూమి కూడా మరొకటని తెలిపారు. ప్రభుత్వం ఇస్తానన్న భూమి ఎలాగున్నా ఆదివాసీ, దళితుల వద్ద నుండి పోడు భూములను హరిత హారం పేరుతో లాక్కుంటున్నారని విమర్శించారు. మెదక్, మహబూబ్ నగర్ వంటి దళితులపై వివక్ష తీవ్రంగా వుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దిగువ వర్గాలకు బడ్జెట్ లో కేటాయించకుండా ప్రభుత్వం ఎంగిలిమెతుకులు విదిలిస్తోందని విమర్శించారు. రానున్న కాలంలో అట్టడుగువర్గాల నుండి తీవ్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే వాతావరణం కనిపిస్తోందన్నారు. సీపీఎం పాదయాత్ర రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోందని సర్కార్ లో ఒక రకమైన కదలిక కలిగిస్తోందన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రభుత్వానికి సీపీఎం రాస్తున్న లేఖలు సర్కార్ లో కలవరం సృష్టిస్తోందని తెలిపారు. దానికి ప్రభుత్వం ప్రకటలే తార్కాణమన్నారు. లేఖల్లో లేవనెత్తిన సమస్యలపట్ల సర్కార్ లో కదలిక వస్తోందని తెలిపారు. పార్టీ లేని ప్రాంతాల్లో కూడా పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని ఈ సందర్భంగా తమ్మినేని పేర్కొన్నారు.

50రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర
మహాజన పాదయాత్ర 50రోజులు పూర్తి చూసుకుంది. యాత్రలో ఊరూరా లాల్‌జెండా-నీల్‌జెండాలు రెపరెపలాడుతున్నాయి. యాత్రలో ప్రజలు తమ బాధల్ని వాపక్షనేతలతో చెప్పుకుంటున్నారు. తెలంగాణరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ప్రజాసమస్యలు పరిష్కారం కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంటున్నారు. సామాజిక న్యాయసాధనలో లెఫ్ట్‌పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతాయన్నారు.

13:38 - December 6, 2016

తమిళనాడు : చాలా కాలం పాటు ఇటు సినిమాల ద్వారా, అటు రాజకీయాల ద్వారా ప్రజా జీవితానికి దగ్గరగా గడిపిన జయలలిత గురించి ఎవరికీ తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. తమిళ సినిమాల్లో గొప్ప తారగా వెలిగిపోయారు కాని.. చిన్నతనంలో భారత మాజీ క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ అంటే ఆమెకు చాలా ఇష్టం అని చెప్పేవారు. ఆయన్ను చూడటానికే కొన్ని టెస్టు మ్యాచ్‌లకు కూడా జయ వెళ్లారు. బాలీవుడ్‌లో అలనాటి స్టైలిష్ హీరో షమ్మి కపూర్ అన్నా కూడా తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో జయ తెలిపారు. షమ్మీకపూర్‌ నటించిన జంగ్లీ సినిమాలోని 'చాహే కోయీ ముఝే జంగ్లీ కహే' పాట అంటే తనకు చాల ఇష్టమని చెప్పేవారు. తెలుగు  సినిమాలలో గయ్యాళి ప్రాతలకు పెట్టింది పేరుగా వున్న నటి సూర్యాకాంతం  చేత్తో చేసిన పులిహోర అంటే తనకు చాలా ఇష్టమని ఓ సందర్భంగా ఆమె తెలిపారు.  కాగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె ఇటు రాజకీయాల్లోనూ..అటు సినిమా చరిత్రలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఇవే కాకుండా విద్య..నృత్యం..గానం వంటి పలు అంశాల్లో తనకు తానే సాటిగా నిలబడింది..తన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించారు పురుచ్చితలైవి..

జయలలితకు ప్రధాని మోదీ నివాళులు

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత పార్థీవ దేహానికి రాజాజీ హాల్ లో ప్రధాని మోడీ నివాళులర్పించారు. అనంతరం జయ స్నేహితురాలు శశికళను ఓదార్చారు.ప్రధానితో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం సెల్వం, గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రులు వున్నారు.

13:33 - December 6, 2016

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి తీవ్ర సంతాపం తెలిపారు.. ప్రముఖ టాలీవుడ్‌ నటులు , కృష్ణ -విజయ నిర్మల. నిరంతరం ఆమె పేదప్రజల సంక్షేమం కోసమే తపించారని విజయ నిర్మల అన్నారు. జయలలిత మృతితో అభిమానులు షాక్‌కు గురైయ్యారని కృష్ణ అన్నారు.

13:31 - December 6, 2016

పురుగుల ముందు డబ్బాతో యువతి..తన భర్తను అప్పగించకపోతే ఛస్తానంటూ బెదిరింపులు..అత్తారింటి ముందు ఆందోళన చేస్తోంది..

ప్రేమించానన్నాడు..పసుపు కొమ్ము కట్టేశాడు..ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో కాపురం పెట్టారు..ఆ తరువాత ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా మెట్టినిళ్లు ఒప్పుకోకపోవడంతో నగదు..నగలు..ఫొటోలతో ప్రియుడు పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ మెట్టినిళ్లు ఎదుట ఆ యువతి పోరాడుతోంది. ఇదంతా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన వైశాలి అనే యువతి హన్మకొండలోని శ్యామలా గార్డెన్స్ లో ఉండగా హుజూరాబాద్ కేసీ క్యాంపుకు చెందిన క్రాంతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రూ. పది లక్షలు ఇవ్వాలని అత్తింటి వారు బెదిరిస్తున్నారని వైశాలి వాపోయింది. తన భర్తను అప్పగించాలంటూ పోరాటం చేస్తున్న వైశాలికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జయ అంత్యక్రియలకు ఏర్పాట్లు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు మెరీనా బీచ్‌‌ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. ‘అమ్మ’ రాజకీయ గురువు ఎంజీఆర్ సమాధికి ఎదురుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా ఎంజీఆర్ సమాధికి కూతవేటు దూరంగా అమ్మకు సమాధి తవ్వుతున్నారు. మెరీనా బీచ్‌‌ తమిళనాడు ప్రజలకు చాలా ఫేమస్. ప్రస్తుతం జయ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీహాల్‌‌లో ఉంచారు. అక్కడ్నుంచి అంతిమ యాత్రగా మెరీనాబీచ్‌ తీసుకొస్తారు. రాజాజీహాల్ నుంచి బీచ్‌‌కు ఒకటిన్నర కి.మీ దూరం ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలు సాయంత్రం 4.30 గంటలకు జరగనున్నాయి.

13:19 - December 6, 2016

ఒక్కరు కాదు..ఇద్దరు కాదు...ఉన్నతాధికారులు రిఫార్స్ బాధితులు కూడా కాదు. కోర్టు నుండి వచ్చిన కేసులు కాదు. ఇక్కడంతా సమాంతర పాలననే. వారు అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఆ న్యాయం కూడా కాసులు కురిపించన వారికి మాత్రమే దొరుకుతుంది. కష్టాల్లో ఉండి..కన్నీళ్లు కారుస్తూ అక్కడకు వెళితే..వారి బతుకు బుగ్గిపాలే. ఇది గుంటూరు మహిళా పీఎస్ లో కొనసాగిన అరాచకం. మహిళా కమిషన్ స్వయంగా పరిశీలిస్తే అక్రమాలు బయటపడ్డాయి. గుంటూరు మహిళా పీఎస్ వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆరా తీశారు. స్వయంగా పీఎస్ కు వెళ్లి పరిశీలించారు. మహిళా పోలీసులపై సీరియస్ అయ్యారు. నన్నపనేని ప్రశ్నలతో సమాధానం చెప్పలేక ఎస్ఐ నాగకుమారి నీళ్లు నమిలారు. డబ్బుల కోసం ఇంత కక్కుర్తి ఎందుకు అంటూ నన్నపనేని ఘాటు వ్యాఖ్యానాలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జయలలిత మృతిపట్ల దాసరి సంతాపం

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత మృతి పట్ల దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపం తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె మనసు చాలా సున్నితమైందని దాసరి పేర్కొన్నారు.

చెన్నై బయలుదేరిన రాష్ట్రపతి

ఢిల్లీ : తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరారు. బయలుదేన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెతెత్తింది. దీంతో తిరిగి మరమ్మత్తుల అనంతరం చెన్నైకి బయలుదేరినట్లు తెలుస్తోంది.

12:51 - December 6, 2016

తమిళనాడు : తమిళనాడు రాష్ట్రానికి డిసెంబర్ నెల శాపంగా తయారైందా? ఈనెలలోనే తమిళనాడులో ప్రముఖుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే నిజమే అనుకోవాల్సిన వస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన విషాద ఘటనలన్నీ డిసెంబర్ లోనే జరుగుతుండటం యాదృచ్ఛికమా? లేక కాలప్రభావమా? లేదా ఇంకేదైనా కారణమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఎంతో మంది ప్రజా నేతలు..నేతలు..కవులు.. డిసెంబర్ లో మరణించారు. జయలలిత రాజకీయ గురువు, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూయగా, ఆయన ప్రియ శిష్యురాలు నేడు అదే నెలలో నింగికేగడం గమనార్హం. ఇక చివరి భారత గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి 1972 డిసెంబర్ 25న, పెరియార్ రామస్వామి అదే సంవత్సరం డిసెంబర్ 24న మరణించారు. 2004 డిసెంబర్ 26న సుమత్రా దీవుల్లో భూకంపం కారణంగా వచ్చిన సునామీ ఎలాంటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక గత సంవత్సరం డిసెంబర్ లో చెన్నై, ఇతర ప్రాంతాలను వరద చుట్టుముట్టి ఎంతో ఆస్తి నష్టానికి కారణమైంది. ఈ వరద ప్రభావం చెన్నై ఐటీ కంపెనీలపై పెను ప్రభావాన్ని చూపగా, వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.

ఇద్దరు మహిళా సీఎంలు ఒకే తీరుగా మరణం??
తమిళనాడు రాష్ట్రాన్ని ఇద్దరు మహిళలు జయలలిత, జానకి రామచంద్రన్ లు పరిపాలించారు. జయలలిత ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగా... జానకి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ పదవిని అలంకరించారు. 1988 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు... అంటే 23 రోజులు ముఖ్యమంత్రిగా ఆమె వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సతీమణే జానకి. అయితే, ఈ ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు ఒకే రీతిలో చనిపోవడం గమనార్హం. వీరిద్దరూ కార్డియాక్ అరెస్ట్ తోనే ప్రాణాలు వదిలారు.

తొలుత జయలలిత గుండెపోటుకు గురైందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారంటూ ఆ తర్వాత వైద్యులు స్పష్టం చేశారు. అనంతరం, వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ జయను బతికించలేకపోయారు. జానకి రామచంద్రన్ కూడా ఇదే రీతిలో తుదిశ్వాస విడిచారు. 1996 మే 19న ఆమె కూడా కార్డియాక్ అరెస్ట్ కు గురై, మృతి చెందారు.

డిసెంబరు 16న మరణించిన మద్రాసు ప్రెసిడెన్సీ సీఎం పానగల్ రాజా
పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన సర్ పానగంటి రామారాయణింగారు (జూలై 9, 1866 – డిసెంబరు 16, 1928), కాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు మరియు జూలై 11, 1921 నుండి డిసెంబరు 3, 1926 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రామారాయణింగారు 1866, జూలై 9న కాళహస్తి లో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఈయన జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు.

డిసెంబర్ 30న కన్నాభిరాన్ మరణం..
కె.జి.కన్నబిరాన్ కన్నాభిరాన్ గా సుపరిచితులుగా వున్న పౌరహక్కుల ఉద్యమనేత మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది.ఆయన "పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్" సంస్థకు సహ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు కూడా డిసెంబర్ 30,2010 మరణించారు.

రాష్ట్రంలో రెండో మహిళా సీఎం జయలలిత..
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి జయలలిత అనే విషయం తెలిసిందే.ఇలా కారణం ఏదైనా డిసెంబర్ నెలలో తమిళనాడు ప్రముఖులు మృతి చెందటం గమనించదగిన విషయం.

చెన్నై చేరుకున్న ప్రధాని

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చెన్నై చేరుకున్నారు. ముందుగా రాజీజీ హాల్లో ఉన్న జయ మృతదేహానికి నివాళులర్పించనున్నారు.

12:42 - December 6, 2016

సినిమా అంతా ఒక్క చీరతోనే ఆ హీరోయిన్ కనిపించనుంది. ఏం పాపం..డబ్బులు లేవా ? పెద్దనోట్లు రద్దు కష్టాలా ? ఏ హీరోయిన్ ఇలా చేస్తోంది ? అని అనుకుంటున్నారా మీరను అనుకున్నట్లు మాత్రం కాదులేండి..ఇందుకు ఓ కారణం ఉంది...

నయనతార..టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించింది. టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచిన ఈ తార గ్లామర్ తోనే కాక నటనతోనూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా తన కెరియర్ లో 55వ చిత్రంగా 'అరం' అనే సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇందులో 'నయన్' కలెక్టర్ పాత్రలో కనిపించబోతోంది. మొత్తం లేడీ ఓరియెంటెండ్ మూవీగా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం మొత్తం ఒకే ఒక చీరతో 'నయనతార' కనిపించనుందంట. ఈ సినిమాలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసే కలెక్టర్ పాత్రలో నటిస్తోంది. అందుకే ఒకే కాస్ట్యూమ్ లో కనిపించనుందట. నీటి సదుపాయం లేని ఓ గ్రామానికి లేడీ కలెక్టర్ ఒక్క రోజులో నీరు ఎలా తెప్పించింది అన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'నయన్' మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించనుంది. మింజూర్ గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. 

'జయ పోరాటయోధురాలే కాదు మానవత్వం ఉన్న మనిషి'

అమరావతి : జయలలిత మృతికి సంతాపంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బాబు మాట్లాడుతూ కొందరు నాయకులు మాత్రమే ప్రజల గుండెల్లో ఉంటారని... అందులో జయలలిత ముందుంటారని పేర్కొన్నారు. జయ పోరాటయోధురాలే కాదు మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. తెలగు గంగ విషయంలో చాలా సహకరించారని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని తెలిపారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. తాను కూడా త‌మిళ‌నాడుకు వెళుతున్నానని, జ‌య‌ల‌లిత‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లుకుతాన‌ని,ఆవిడ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

12:28 - December 6, 2016
12:25 - December 6, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయానించే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాజీ హాల్లోని జయలలిత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు ప్రణబ్ తమిళనాడుకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. కాగా ప్రయాణం మధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తటంతో తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. కాగా ముఖ్యమంత్రి జయలలిత చికిత్స తీసుకుంటూ చెన్నై అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

12:16 - December 6, 2016

విజయవాడ : తమిళనాడు సీఎం ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..ఆమెకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఆమె మృతికి ఏపీ రాష్ట్ర ప్రజలు రెండునిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించాలని కోరారు. ఆమె జీవితంలో ఆమె ఎంతో పోరాటం చేశారని..రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఒక ప్రభంజనం సృస్టించారన్నారు. ఆమెకు తెలుగు రాష్ట్రాలకు ఎంతో అవినావభావ సంబంధముందని తెలిపారు. ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారనీ..తనపై నక్సల్స్ దాడి జరిగినప్పుడు తనకు ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. జయలలితో కూడిని కొంతమంది సీఎంలతో కలిసి ఓ సంస్థను స్థాపించినట్లుగా తెలిపారు. తెలుగు గంగ నీటి విషయంలో కూడా ఆమె సహకారం అందించారన్నారు. ఆమె ఆసుపత్రిలో వున్న సమయంలో కూడా సహకారం అందించి నీటిని విడుదల చేయించారని తెలిపారు. పేదలపట్ల..మహిళలపట్ల ఆమె ఎంతో సహృదయంతో వ్యవహరించేవారన్నారు. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేదుకు తమిళనాడు వెళుతున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా తమిళ ప్రజలకు ఆయన సంతాపం తెలిపారు. ఆమె ఏ ఆశయాల కోసం పోరాడిందో..వాటిని రాష్ట్ర మంత్రులు..ప్రజలు నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పలువురు పాల్గొన్నారు.

చెన్నైకు చేరుకున్న మోడీ..

ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజాబీహాల్ లో జయ పార్థీవదేహానికి మోడీ నివాళులర్పించనున్నారు.

రాష్ట్రపతి విమానంలో సాంకేతిక సమస్య..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణీస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చెన్నై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

11:53 - December 6, 2016

తమిళనాడు : చెన్నైలోని రాజాజీ హాలులో ప్రజాసందర్శనార్థం ఉంచిన జయలలిత పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.ముఖ్యమంత్రి జయలలిత మృతితో రాష్ట్ర వ్యాప్తంగా శోక సముద్రంలో మునిగిపోయింది. దీంతో పలువురు ఆమెకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్రమంలో తమిళనాడు సినీ పరిశ్రమ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో వచ్చి జయలలితకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో రజనీకాంత్ మాట్లాడారు. అమ్మకు నివాళులర్పించేదుకు ప్రముఖులు తరలివస్తున్నారు. ఆమె అభిమానులు అమ్మను చివరిసారిగా చూసుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. కాగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. దీంతో రాష్ట్రంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

రాజాజీహాల్ వద్ద ఉద్రిక్తత...

చెన్నై :అనారోగ్యంతో బాధపడుతూ గత రాత్రి క‌న్నుమూసిన త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీహాల్ వ‌ద్ద ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఆమెను క‌డ‌సారి చూసేందుకు అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. భారీగా ప్ర‌జ‌లు రావ‌డంతో అక్క‌డ ఏర్పాటు చేసిన బారికేడ్లను అమ్మ అభిమానులు తోసేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో కొన్ని బారికేడ్లు విరిగిపోయాయి.జ‌నాన్ని నియంత్రించే క్ర‌మంలో పోలీసులు అష్టకష్టాలు ప‌డుతున్నారు. కొన్ని బారికేడ్లను పడేసిన ప్రజలు వాటిపై నుంచే నడుచుకుంటూ వెళుతున్నారు.

'ప్రజాభిమానం పొందిన ఏకైక మహిళా నేత జయలలిత'

ఢిల్లీ: ప్రజాభిమానం పొందిన ఏకైక మహిళా నేత జయలలిత అని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. జయ మృతి దేశ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. తమిళనాడు ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే అని జరగాల్సిన నష్టం జరిగింది... అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది : ఆజాద్

ఢిల్లీ : తమిళనాడు సీఎం జయలలిత మృతి తీరనిది అని దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.

చెన్నై బయలుదేరిన మంత్రుల నాయిని, హరీష్

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియలకు తెలంగాణ సర్కార్ తరుపున మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, హరీష్ రావులు పాల్గొననున్నారు. ఈ మేరకు వారు హైదరాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరారు.

11:19 - December 6, 2016

తమిళనాడులో వారం రోజుల పాటు సంతాపదినాలు

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న అర్థర్రాతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి సంతాప సూచకంగా ఆరాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. మరో వైపు 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జయ మృతి పట్ల ఒకరోజు సంతాప దినంగా కేంద్రం ప్రకటించింది. కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక్క రోజు సెలవు ప్రకటించాయి.

11:13 - December 6, 2016

ఢిల్లీ :

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన సమావేశమైన రాజ్యసభలో.. జయలలిత నాయకత్వ పటిమను ప్రశంసించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమెకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన లోక్‌సభ సమావేశమైంది. జయ ఆత్మకు శాంతి కలగాలంటూ లోక్‌సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత జయలలితకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు పలువురు ఎంపీలు పార్లమెంటు వెలుపల కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

జయలలితకు పలువురి సంతాపం..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూతపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయలలిత మృతితో దేశం ఒక శక్తివంతమైన నాయకురాలని పోల్పోయిందని సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన నేతను కోల్పోవడం దురదృష్టకరమంటూ సానుభూతి తెలిపారు. ఇంకా పలు రాష్ట్రాల సీఎంలు... పార్టీ అధినేతలు..నాయకులు, ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.

సోమవారం రాత్రి 11.30గంటకు మృతి చెందిన జయలలిత..
ముఖ్యమంత్రి జె.జయలలిత మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో యావత్‌ తమిళ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. జ్వరం, డీ హైడ్రేషన్‌ కారణంగా సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయ.. గడచిన 75 రోజులుగా మృత్యువుతో పోరాడారు. అమ్మ కోలుకున్నారని.. ఏ క్షణంలోనైనా ఇంటికి తిరిగొస్తారని ఎదురు చూస్తున్న అన్నాడిఎంకే శ్రేణులకు అమ్మ లేరన్న వార్త పిడుగుపాటే అయింది. తమిళనాడు వీధివీధినా.. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యకర్తలు, జయలలిత అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. జయ ఆరోగ్యం కుదుటపడిందని.. ఏ క్షణంలోనైనా ఆమె ఇంటికి వెళ్లొచ్చంటూ వైద్యులు చేసిన ప్రకటనలు.. అంతలోనే కల్లలయ్యాయి. తమిళప్రజలను కన్నీటి సంద్రంలో ముంచి అమ్మ మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు.

దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది : లోక్ సభ స్పీకర్

ఢిల్లీ : తమిళనాడు సీఎం జయలలిత మృతికి ఉభయసభలు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశాయి. అనంతరం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది అని పేర్కొన్నారు.

జయలలిత మృతికి సంతాపం తెలిపిన ఉభయసభలు

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. తమిళనాడు సీఎం జయలలిత మృతి పట్ల ఉభయసభలు నివాళులుర్పించాయి. అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

ఆధార్ ఉంటేనే రాయితీ టికెట్: రైల్వే

న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రైల్వే టికెట్ ధర రాయితీకి ఏప్రిల్ 1, 2017 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. వయోవృద్ధులమంటూ రైల్వే టికెటింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ చైర్మన్, ఎండీ ఏకే మనోచా తెలిపారు. ఆధార్ లింకును రెండు విడతల్లో అమలు చేయనున్నారు.

10:57 - December 6, 2016

తమిళనాడు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూయడంతో అర్థరాత్రి 1:30 గంటలకు రాజ్‌భవన్‌లో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 15 మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్ సెల్వంతో ప్రమాణస్వీకారం చేయించారు. జయలలిత మృతి పట్ల ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమిళనాడులో సీఎం మృతితో ఏడు రోజులు సంతాప దినంగా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పన్నీరు సెల్వం కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మకు వీరాభిమాని..వీర విధేయుడు అయిన పన్నీర్ సెల్వం మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెల్వంతో పాటు 31మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

అమ్మకు శ్రద్ధాంజలి ఘటించనున్న పలువురు ప్రముఖులు
రాజాజీ హాలుకు నేడు ప్రధాని మోదీ,కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, జాతీయ నేతలు..పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..పలు పార్టీల నాయకులు అమ్మకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఆమె అభిమానులు కూడా ఆమె పార్థీవదేహాన్ని కడసారి సందర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సోమవారం నుండి భారీగా వున్న పోలీసులు బలగాల నుండి కేంద్ర భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించిన సంగతి తెలిసిందే. నేడు కూడా అభిమానుల సందర్శనార్థం వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యే అవకాశముండటంతో కేంద్రం నుండి మరింతగా బలగాలు తమిళనాడుకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాపదినాలను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

జయలలితను పేదలంటే అమితమైన ప్రేమ : రోశయ్య

హైదరాబాద్ :తమిళనాడు మాజీ సీఎం జయలలితకు పేదలంటే అమితమైన ప్రేమ అని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఆమె మృతి పట్ల రోశయ్య విచారం వ్యక్తం చేశారు. జయలలిత రాజభభవన్ కు ఎప్పుడు వచ్చినా నాతో తెలుగులోనే మాట్లాడేవారని రోశయ్య గుర్తుచేసుకున్నారు.

10:34 - December 6, 2016
10:28 - December 6, 2016

తమిళనాడు : ఎన్నో సంచనాలకు మారు పేరైన తమిళనాడు సీఎం జయలలిత శకం ముగసింది. జయలలిత అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలుకా మేలుకోటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. జయలలిత తల్లి పేరు వేదవల్లి . జయలలితకు ఆమె తల్లిదండ్రులు కోమలవల్లిగా నామకరణం చేశారు. 1981లో జయ రాజకీయాల్లోకి వచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ పనిచేశారు. 1991లో ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా సీఎంగా జయ రికార్డును నెలకొల్పారు. 2006లో మళ్లీ ఆమె సీఎం పదవి చేపట్టారు. 15వ ఏట సినీ పరిశ్రమలోకి జయ అడుగుపెట్టారు. హీరోయిన్‌గా ఆమె తొలిచిత్రం 'చిన్నడగొంబె' కన్నడ సినిమా, మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారాన్ని ఇచ్చి జయలలితను గౌరవించింది.

మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం
1972లో జయకు కలైమామణి పురస్కారంతో సత్కరించన తమిళనాడు ప్రభుత్వం ..తమిళుల గుండెల్లో అమ్మగా చిరస్థాయిగా నిలిచిపోవడానికి జయ చేసిన పోరాటం అసాధారణమైనది. పురుషాధిక్య రాజకీయాలను, . కరడుగట్టిన ద్రవిడ రాజకీయాలను సవాలు చేసి తనకంటూ సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు ఇవన్నీ ఆమె మొక్కవోని ధైర్యం ముందు తలవంచాయి. సడలని సంకల్పం ముళ్లబాటను పూలబాటగా మార్చింది. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకుంది.

ముగిసిన జయ శకం
ఓ శకం ముగిసింది. పడిలేచిన కెరటం నింగికెగిసింది. వెళ్తూ వెళ్తూ అమ్మా అన్న ఆప్యాయతను గుండెలనిండా నింపుకొని, అభిమానులను అనాథలను చేసి వెళ్లిపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో యావత్‌ తమిళ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. జ్వరం, డీ హైడ్రేషన్‌ కారణంగా సెప్టెంబర్‌22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయ.. గడచిన 75 రోజులుగా మృత్యువుతో పోరాడారు. అమ్మ కోలుకున్నారని.. ఏ క్షణంలోనైనా ఇంటికి తిరిగొస్తారని ఎదురు చూస్తున్న అన్నాడిఎంకే శ్రేణులకు అమ్మ లేరన్న వార్త పిడుగుపాటే అయింది. తమిళనాడు వీధివీధినా.. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యకర్తలు, జయలలిత అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. జయ ఆరోగ్యం కుదుటపడిందని.. ఏ క్షణంలోనైనా ఆమె ఇంటికి వెళ్లొచ్చంటూ వైద్యులు చేసిన ప్రకటనలు.. అంతలోనే కల్లలయ్యాయి. తమిళప్రజలను కన్నీటి సంద్రంలో ముంచి అమ్మ మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు.

చెన్నైకి బయటలుదేరిన ప్రధాని, రాష్ట్రపతి

ఢిల్లీ : గత రాత్రి కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ నుండి బయలుదేరారు.

సా.4.30 గంటలకు జయ అంత్యక్రియలు...

చెన్నై: గుండెపోటుతో కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో నిర్వహిచనున్నారు. నగరంలోని మెరీనా బీచ్‌లో ఎంజీర్ సమాధి పక్కనే రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాని ప్రధానితో పాటు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరుకానున్నారు. జయ మృతి పట్ల తమిళనాడు ప్రభుత్వం వారం రోజులు, కేంద్ర ప్రభుత్వం ఒకరోజు సంతాపదినాలుగా ప్రకటించారు. ప్రజాసందర్శనార్థం జయలలిత పార్థివదేహాన్ని రాజాజీ హాలు వద్ద ఉంచడంతో పెద్దఎత్తున ప్రజానీకం ఆమెను చివరిసారి దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు.

09:58 - December 6, 2016

తమిళనాడు : దక్షిణాది సినిమాల్లో అగ్రతారగా వెలుగొందిన జయలలిత.. అప్పటి మైసూర్‌ రాష్ర్టంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అమె చదువంతా బెంగళూరు, మైసూరులోనే సాగింది. తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించిన జయ..తొలి సినిమా చిన్నడ గొంబె పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది.

1948 ఫిబ్రవరి 24న జయలలిత జననం
సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జననం..జయ తల్లిదండ్రులు జయరామ్‌, వేదవల్లి జయలలిత తొలి పేరు కోమలవల్లి.పాఠశాలలో చేరినప్పుడు జయలలితగా మార్పు..1950 -1958 వరకు బెంగళూరు, మైసూరులో విద్యాభ్యాసం..బెంగళూరులో బిషప్‌ గర్ల్స్‌ స్కూల్‌లోజయ విద్యనభ్యసించారు.చురుకైన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు.పలు భాషలపై జయకు పట్టుంది.చిన్నప్పుడే సంగీతం, నృత్యంలో జయలలిత శిక్షణ పొందారు.భరతనాట్యం, కథక్‌, మణిపురి, మోహినీఆట్టంలో ప్రావీణ్యం సాధించారు. విద్యార్థి దశలోనే నృత్య కళాకారిణిగా ఖ్యాతిగాంచారు.1960లో జయ నృత్య ప్రదర్శనకు ఎంజీఆర్‌ ప్రశంసలు కురిపించారు. 1961లో శ్రీశైల మహత్యం అనే కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో జయ నటన అమోఘం..సామాజిక, పౌరాణిక, జానపద సినిమాల్లో అద్భుత నటన కనబరిచారు. 1961-1980 మధ్య 125 సినిమాలు చేసిన జయ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారామె..1972లో కలైమామణి పురస్కారం అందుకున్నారు జయలలిత..

రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ ఆమె ప్రభంజనం
రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ జయలలిత ఓ ప్రభంజనం. అనాడు అగ్ర హీరోలందరితోనూ నటించారు. సినీవినీలాకాశంలో ధ్రువతారలా వెలుగొందిన జయలలిత దక్షిణాది ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్రవేశారు. అమె నటకు ముగ్ధులైన నాటి హీరోలు జయతో నటించడానికి పోటీపడేవారు. గాత్రంతోనూ అభిమానులను జయ మంత్ర ముగ్ధులను చేశారు.

అగ్ర హీరోలందరితోనూ నటించిన జయలలిత
సినీవినీలాకాశంలో ధ్రువతారలా వెలిగిన జయలలిత..దక్షిణాది ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్రవేశారు. జయతో నటించడానికి ఉత్సాహం చూపిన అలనాటి హీరోలు పోటీపడేవారు. నటనతోనూ కాదు గాత్రంతోనూ అభిమానులను మంత్రముగ్ధులను చేశారామె. వైవిధ్యభరితమైన పాత్రల్లో గుర్తింపు ..నాట్యంలో కూడా ఆమె తనదైన ముద్రవేశారు జయ. తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా ఏలిన ధృవతార ఆమెను..పురట్చితలైవిగా..అమ్మగా అభిమానులు పిలుచుకుంటారు. ఎంజీఆర్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటు ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా జయలలిత నిలిచిపోయారు. జయ తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు..దక్షిణాది సినిమాల్లో ఆమె చూడని ఎత్తులు లేవు. అందం..అభినయం..అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం.

09:56 - December 6, 2016

తమిళనాడు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూతపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయలలిత మృతితో దేశం ఒక శక్తివంతమైన నాయకురాలని పోల్పోయిందని సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన నేతను కోల్పోవడం దురదృష్టకరమంటూ సానుభూతి తెలిపారు.

జయలలిత కృషి ఆదర్శనీయం : ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి
జయలలిత కన్నుమూతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలకు సానుభూతి తెలియజేశారు. జయలలితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలు, పేదల సంక్షేమానికి ఈమె చేసిన కృషి ఆదర్శనీయమన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి తమిళనాడు ప్రజలకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, జయ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దేశం ఒక రాజకీయ ధృవతారను కోల్పోయింది : రాష్ట్రపతి ప్రణబ్
జయలలిత మరణంతో దేశం ఒక రాజకీయ ధృవతారను కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహానాయకురాలని పేర్కొన్నారు. జయలలిత మృతి దేశానికి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు.

జయలలిత మహోతన్న నాయకురాలు : రాహుల్

భారత రాజకీయాల్లో జయలలిత మహోతన్న నాయకురాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సంతాప సందేశంలో పేర్కొర్నారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానాయకురాలని, జయలలిత మరణం దేశానికి తీరనిలోటని సంతాపం ప్రకటించారు.

జయలలిత పెదల పెన్నిధి : పలు సీఎంలు
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. జయలలిత పెదల పెన్నిధి అని కేజ్రీవాల్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జయలలిత అత్యంత ప్రజాదరణ పొందిన, జనాకర్షణ కలిగిన నాయకురాలని నిజాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే సమర్థవంతమైన నాయకురాలని మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

రాజకీయాల్లో రాజీలేని జయలలిత : కనిమొళి
డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి.... జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో రాజీలేని ధోరణి అవలంభించిన జయలలిత మరణంతో ప్రత్యేక గుర్తింపు, ప్రతిభావంతమైన నాయకురాలిని కోల్పోమయని సంతాప సందేశంలో పేర్కొన్నారు. క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, నటుడు సిద్ధార్థ జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు.

ఒక సాహస పుత్రికను దేశంకోల్పోయింది: నటుడు రజనీకాంత్

చెన్నై: తమిళ ప్రజల ఆరాధ్యదేవత, 'పురచ్చి తలైవి' జయలలిత మృతికిసూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక సాహస పుత్రికను కోల్పోయిందని తమిళనాడుకు మాత్రమే కాదు, ఇండియాకే ఆమె సాహస పుత్రిక అంటూ అభివర్ణించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు రజనీకాంత్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

09:55 - December 6, 2016

తమిళనాడు : అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారని అపోలో ఆస్పత్రి వైద్యలు ప్రకటించారు. సెప్టెంబర్‌ 22న జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయ అప్పటి నుంచి మరణించే వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు.

సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస
జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని, ఆమె ఎప్పుడైనా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోవచ్చని అపోలో యాజమాన్యం ఇటీవలే ప్రకటించింది. దీంతో జయ క్షేమంగా తిరిగి వస్తారంటూ ప్రజలంతా ఆనందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తమ అభిమాన నేత జయలలిత హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారనే వార్తలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తమ ప్రియతమ నేత కోలుకోవాలని ప్రజలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేశారు. కానీ తమిళనాడు ప్రజల ఆశలు, నోములు ఫలించలేదు. సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడించారు.

ఆరోగ్యం నిలకడంగా ఉందని సెప్టెంబర్‌ 24 ప్రకటించిన డాకర్టర్లు
జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కన్నుమూసే వరకు జరిగిన పరిణామక్రమాన్ని ఓసారి పరిశీలిద్దాం... ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 తీవ్ర జ్వరం, డీహ్రైడ్రేషన్‌ సమస్యలతో జయలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని సెప్టెంబర్‌ 24న అపోలో వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 25న చికిత్స కోసం జయలలితను విదేశాలకు తరలిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. అయితే ఈ వదంతుల్ని అపోలో ఆస్పత్రి వర్గాలు తోసిపుచ్చాయి. చికిత్సకు జయ స్పందిస్తున్నారని సెప్టెంబర్‌ 29న అపోలో వైద్యులు ప్రకటించారు. అయితే ఆరోగ్యం మరింత కుందుపడే వరకు మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఆమె ఉండాలని సూచించారు.

అక్టోబర్‌ 1 జయ ఆరోగ్యంపై వస్తున్న వందతులను ఖండించిన అపోలో
జయలలిత ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల్నిగత అక్టోబర్‌ 1న అన్నాడీఎంకే వర్గాలు, ఆస్పత్రి యాజమాన్యం ఖండించాయి. ఆమె ఆస్పత్రి నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ప్రకటించాయి. అక్టోబర్‌ 2నజయలలితకు యాంటీబయోటిక్స్‌తో చికిత్స అందిస్తున్నట్టు లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలే ఆధ్వర్యంలోని వైద్య బృందం ప్రకటించింది. జయలితకు మెరుగైన వైద్యం అందించేందుకు అక్టోబర్‌ 6నఎయిమ్స్‌ నుంచి ప్రత్యేక వైద్య బృందం చెన్నైకి చేరుకుంది. వెంటిలేటర్‌పై ఉన్నట్లు అక్టోబర్‌ 7న ప్రకటించారు. అక్టోబర్‌ 21న జయలలిత కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇది పునర్జన్మ అంటూ నవంబర్‌ 13 లేఖపై జయలలిత సంకతం
జరుగుతున్న విషయాలను అర్థం చేసుకుంటున్నారని నవంబర్‌ 7న ప్రకటన ..తనకు ఇది పునర్జన్మ అంటూ నవంబర్‌ 13న లేఖపై జయలలిత సంకతం ..నవంబర్‌ 19న అత్యవసర చికిత్సా విభాగం నుంచి ప్రైవేటు గదికి తరలింపు ..జయలలిత మాట్లాడుతున్నారని గత నెల 25న ప్రకటించిన అన్నా డీఎంకే వర్గాలు

జయలలిత పూర్తిగా కోలుకున్నారు : అపోలో వైద్యులు

జయలలిత పూర్తిగా కోలుకున్నారనీ, తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నారని గతనెల 7న అపోలో వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మ లభించిందని జయలలిత నవంబర్‌ 13న లేఖపై సంతకం చేశారు. అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వేచి ఉన్నట్లు తెలిపారు. నవంబర్‌ 19న అత్యవసర చికిత్సా విభాగం నుంచి ప్రైవేటు గదికి తరలించారు. వెంటిలేటర్‌ లేకుండా జయలలిత శ్వాస తీసుకుంటున్నారని అపోలో డాక్టర్లు వెల్లడించారు. జయలిత స్పీకర్‌ సాయంతో మాట్లాడినట్లు గత నెల 25న పార్టీ వర్గాలు తెలిపాయి.జయ పూర్తిగా కోలుకున్నారనీ, ఆస్పత్రి నుంచి ఎప్పుడైనా డిశ్చార్జి కావచ్చని అన్నాడీఎంకే ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మళ్లీ పరిస్థితి విషమించింది.

డిసెంబర్‌ 4 సాయంత్రం 6 గంటలకు జయకు గుండెపోటు
ఈనెల 4న సాయంత్రం 6గంటల సమయంలో జయకు గుండెపోటు వచ్చింది. దీంతో అత్యవసర చికిత్సా విభాగానికి తరలించడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్‌ 5 మధ్యాహ్నం 12.30గంటలకు అపోలో వైద్యులు జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ప్రకటించారు . గత రాత్రి 11.30 గంటలకు జయలలిత కన్నమూసినట్టు ఆపోలో ఆస్పత్రి ప్రకటించడంతో తమిళనాడు ప్రజల్లో ఒక్కసారిగా విషాఛాయలు అలముకున్నాయి.

75 రోజులుగా మృత్యువుతో పోరాడిన అమ్మ
జయలలిత 75 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. అమ్మ మృతితో అన్నా డీఎంకే శ్రేణుల శోకసముద్రంలో మునిగిపోయి. రాష్ట్ర మంతటా విషాఛాయలు అలముకున్నాయి. అమ్మ ఇకలేరన్న వార్త తెలుసుకుని తమిళులు దుఖఃసాగరంలో మునిపోయారు.

09:53 - December 6, 2016

తమిళనాడు : సోమవారం రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. కొద్దిసేపు అక్కడ ఉంచిన అనంతరం దివంగత నేత పార్థివ దేహాన్ని ప్రఖ్యాత రాజాజీ హాల్‌కు తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఈ రోజు మొత్తం రాజాజీ హాల్లోనే వుంచనున్నారు. ‘అమ్మ’ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. దీంతో అప్పుడే ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రేపు సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయలలిత రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ డీఎంకేతో ఆమె చేసిన పోరాటం, ఆ పార్టీ వల్ల పడిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. తనను తీవ్రంగా అవమానించిన కరుణానిధి ప్రభుత్వాన్ని గద్దె దింపుతా అని డీఎంకేపై సవాలు విసిరారు. తదుపరి ఎన్నికల్లో గెలిచాక అంతకంతా ప్రతీకారం తీర్చుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కరుణానిధిని పోలీసులతో ఇంటి నుంచి బరబరా బయటికి ఈడ్పించి అరెస్ట్ చేయించి తన ప్రతీకారాన్ని ధీశాలి..అమరకాళి జయలలిత. ఆమె సినీ రాజకీయ ప్రస్థానంలో ఆమెచూడని ఎత్తులు లేవంటే అతిశయోక్తి కాదేమో..ఇటువంటి జయమ్మ జీవితంలో ఎన్నో పోరాటాలు..ఆఖరికి మృత్యువుతో కూడా పోరాడి పోరాడి అలసిపోయిన ఓ మహిళా మకుటం సెలవంటూ వెళ్ళిపోయి అభిమానుల గుండెల్లో..చిరస్థాయిగా మిగిలిపోయింది. కోమలవల్లి నుండి అమ్మగా ఆమె ప్రస్థానం అజరామరం.తనకు నచ్చినవారిని అందలం ఎక్కించే అమ్మ తనకు చెడు తలపెట్టేవారిని పాతాళంలోకి తొక్కేయగల సత్తావున్న రాజకీయ చతురతలో ఆరితేరిన జయలలిత మరలిరాని లోకాలకు తరలిపోయింది.

జయమృతి పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జయలలిత ఓ విప్లవ నాయకురాలని... ఆమె మరణం తమిళనాడుకు, తమిళ ప్రజలకు తీరని లోటు అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళ రాజకీయాల్లో జయలలితది ఓ ఘన చరిత్ర అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

అమ్మకు పలువురి ప్రముఖుల సంతాపం..

హైదరాబాద్ : తమిళనాడు సీఎం జయలలిత మృతి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రధాని మోదీ..కేంద్ర మంత్రులు..ఇంకా పలు రాష్ట్రాల సీఎంలు..కేంద్ర మంత్రులు..కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ..పలు పార్టీల అధినేతలు తమ సంతాపాన్ని తెలిపారు. అమ్మ మృతి సందర్భంగా రాష్ట్రంలో వారంరోజుల పాటు సంతాపదినాలను ప్రకటించారు. విద్యాసంస్థలకు బంద్ ప్రకటించారు. అమ్మ అభిమానుల శోకానికి అంతులేకుండా పోయింది. కాగా జయలలిత అసలు పేరు కోమలవల్లి అనే విషయం తెలిసిందే..

 

09:50 - December 6, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రిగా..సినీ వినీలాకాశంలో ధృవతారగా..తమిళ రాజకీయాల్లో ధీశాలిగాగా..అవమాలను..ఆటుపోటులను తట్టుకుని మేరుపర్వతంలా నిలిచి.. ప్రత్యర్థి పార్టీని ముప్పుతిప్పలు పెట్టి..ప్రజల గుండెల్లో 'అమ్మ'గా శాస్వతంగా నిలిచిపోయిన తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూశారు. ఆమె ఈ రాత్రి గం 11.30 లకు కన్నుమూసినట్టు అపోలో ఆసుపత్రి యాజమాన్యం తన ప్రెస్ నోట్ ద్వారా ధృవీకరించింది. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురైన ఆమెను మళ్లీ ఐసీయూకు తరలించి స్వదేశీ, విదేశీ వైద్యులతో చికిత్సను కొనసాగించినా ఫలితంగా లేకుండాపోయింది. ధైర్యానికి..ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా మహిళా లోకంలో మణికిరీటం నేలరాలిపోయింది. దీంతో తమిళనాడు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. సందర్శనార్థం జయలలిత పార్థివ దేహాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌కు తరలించారు. జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల శోకానికి అంతులేకుండాపోయింది. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో నగేష్ కుమార్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), నడిపంపల్లి సీతారామరాజు (విశ్లేషకులు),కుమార్ (బీజేపీ నేత),శర్మ (ఏపీ సీసీ లీగల్ సెల్ కన్వీనర్) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

జయలలిత అంత్యక్రియలకు ప్రధాని

హైదరాబాద్: గత రాత్రి కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి రానున్నారు. 9:30 గంటలకు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరే మోదీ, ఉదయం 11:30 గంటలకు చెన్నై చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజాజీ హాల్ కు వెళ్లే ఆయన, జయలలితకు నివాళులు అర్పించి అక్కడే కాసేపు గడపనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉదయం 12 గంటల సమయానికి చెన్నై చేరుకుంటారని సమాచారం. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులై సైతం చెన్నై రానున్నట్టు సమాచారం.

టీ షాప్ నుండి సీఎం వరకూ..

తమిళనాడు : పన్నీర్‌సెల్వం దక్షిణాది తమిళనాడులో బలమైన థేవార్స్ - మారవార్ సామాజిక వర్గానికి చెందిన వారు. థేనీజిల్లాలోని పెరియాకులంలో 1970వ దశకంలో స్నేహితుడు విజయన్‌తో కలిసి రోజీ క్యాంటిన్ పేరిట టీ షాప్ ప్రారంభించారు. దీన్ని పీవీ క్యాంటిన్ అని కూడా పిలిచేవారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎంజీఆర్‌కు సెల్వం వీరాభిమాని. ఈయన ఆధ్వర్యంలోనే సెల్వం రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ మృతి అనంతరం చీలిపోయిన అన్నాడీఎంకేలో తొలుత జానకీ రామచంద్రన్‌కు మద్దతు పలికారు. తర్వాత జయకు మద్దతు పలికారు పన్నీర్ సెల్వం..మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

09:45 - December 6, 2016

తమిళనాడు : ముఖ్యమంత్రి జె.జయలలిత మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో యావత్‌ తమిళ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. జ్వరం, డీ హైడ్రేషన్‌ కారణంగా సెప్టెంబర్‌22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయ.. గడచిన 75 రోజులుగా మృత్యువుతో పోరాడారు. అమ్మ కోలుకున్నారని.. ఏ క్షణంలోనైనా ఇంటికి తిరిగొస్తారని ఎదురు చూస్తున్న అన్నాడిఎంకే శ్రేణులకు అమ్మ లేరన్న వార్త పిడుగుపాటే అయింది. తమిళనాడు వీధివీధినా.. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యకర్తలు, జయలలిత అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. జయ ఆరోగ్యం కుదుటపడిందని.. ఏ క్షణంలోనైనా ఆమె ఇంటికి వెళ్లొచ్చంటూ వైద్యులు చేసిన ప్రకటనలు.. అంతలోనే కల్లలయ్యాయి. తమిళప్రజలను కన్నీటి సంద్రంలో ముంచి అమ్మ మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు.

తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూత
ఎన్నో సంచనాలకు మారు పేరైన తమిళనాడు సీఎం జయలలిత శకం ముగసింది. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు జయలలిత మృతిచెందినట్లు అపొలో హాస్పిటల్‌ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా తమిళనాడులోని అమ్మ అభిమానులు కన్నీమున్నీరయ్యారు. జయలలిత అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలుకా మేలుకోటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. జయలలిత తల్లి పేరు వేదవల్లి . జయలలితకు ఆమె తల్లిదండ్రులు కోమలవల్లిగా నామకరణం చేశారు. 1981లో జయ రాజకీయాల్లోకి వచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ పనిచేశారు. 1991లో ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా సీఎంగా జయ రికార్డును నెలకొల్పారు. 2006లో మళ్లీ ఆమె సీఎం పదవి చేపట్టారు. 15వ ఏట సినీ పరిశ్రమలోకి జయ అడుగుపెట్టారు. హీరోయిన్‌గా ఆమె తొలిచిత్రం 'చిన్నడగొంబె' కన్నడ సినిమా, మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారాన్ని ఇచ్చి జయలలితను

జయలలిత పార్థివ దేహాన్ని పోయెస్‌గార్డెన్‌కు తరలింపు
జయలలిత పార్థివ దేహాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌కు తరలించారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్ధం రాజాజీ హాల్‌కు తరలించారు. ఈరోజు జయలలిత భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. బుధవారం సాయంత్రం జయలలిత అంత్యక్రియలు నిర్వహిస్తారు. జయలలిత అంత్యక్రియలకు జాతీయ నాయకులు హాజరుకానున్నారు.

తమిళనాడు సీఎం పన్నీర్‌ సెల్వం ప్రమాణస్వీకారం
జయలలిత మృతితో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా పన్నీరు సెల్వాన్ని ఎన్నుకున్నారు. సోమవారం అర్ధరాత్రి పన్నీర్‌ సెల్వం చేత గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్‌ సెల్వంతో పాటు.. 15 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు జయ మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

దక్షిణాది సినిమాల్లో అగ్రతారగా జయలలిత
దక్షిణాది సినిమాల్లో అగ్రతారగా వెలుగొందిన జయలలిత.. అప్పటి మైసూర్‌ రాష్ర్టంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అమె చదువంతా బెంగళూరు, మైసూరులోనే సాగింది. తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించిన జయ..తొలి సినిమా చిన్నడ గొంబె పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది.

రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ జయలలిత ప్రభంజనం...
రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ జయలలిత ఓ ప్రభంజనం. అనాడు అగ్ర హీరోలందరితోనూ నటించారు. సినీవినీలాకాశంలో ధ్రువతారలా వెలుగొందిన జయలలిత దక్షిణాది ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్రవేశారు. అమె నటకు ముగ్ధులైన నాటి హీరోలు జయతో నటించడానికి పోటీపడేవారు. గాత్రంతోనూ అభిమానులను జయ మంత్ర ముగ్ధులను చేశారు.

రాజాజీహాల్లో సందర్శనార్థం అమ్మ భౌతికకాయం..

తమిళనాడు : ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌లో ఉంచనున్నారు. ప్రస్తుతం జయ నివాసం పోయెస్ గార్డెన్‌కు పార్ధీవదేహాన్ని తరలించారు. రేపు సాయంత్రం మెరీనా బీచ్‌లో జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయ అంత్యక్రియలకు జాతీయ నాయకులు హాజరుకానున్నారు. జయలలిత పార్థీవదేహాం తరలిస్తున్న వాహనం దగ్గర అభిమానులు భోరున విలపిస్తున్నారు. జయ భౌతికకాయం కాన్వాయ్‌లో సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారు. జయ పార్థీవదేహాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

జయలలితకు ప్రముఖుల సంతాపం..

తమిళనాడు: ముఖ్యమంత్రి జయలలిత మృతితో ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు కేంద్రమంత్రులు, నాయకులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీనటులు తమ సంతాపం తెలిపారు. పేదల సంక్షేమానికి జయ చేసిన కృషి ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు తమిళ ప్రజలకు ఇవ్వాలని కోరుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. జయ మృతితో దేశం ఓ శక్తిమంతమైన నాయకురాలిని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మ మృతి..శోకసముద్రంలో రాష్ట్రం..

తమిళనాడు : ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (68) కన్నుమూశారు. ఆమె ఈ రాత్రి గం 11.30 లకు కన్నుమూసినట్టు అపోలో ఆసుపత్రి యాజమాన్యం తన ప్రెస్ నోట్ లో ధృవీకరించింది. జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)కు తరలించిన సంగతి తెలిసిందే. ఆమెను బతికించేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ... ఫలితం దక్కలేదు.

Don't Miss