Activities calendar

07 December 2016

21:36 - December 7, 2016

ఢిల్లీ : ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టుల కోసం... కోటి 33 లక్షల రూపాయలను విడుదల చేసుకోవడానికి బీసీసీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. టెస్టు సిరీస్‌ అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు 3 కోట్ల 79 లక్షల విడుదలపై బీసీసీఐ పెట్టుకున్న అభ్యర్థనను మాత్రం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగే ఒక్కో మ్యాచ్‌కు 25 లక్షల రూపాయలను మాత్రమే ఖర్చు చేయాలని బీసీసీఐకి కోర్టు పరిమితి విధించింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ రెవెన్యూకు సంబంధించి అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా బీసీసీఐని కోర్టు ఆదేశించింది.

21:34 - December 7, 2016

చెన్నై : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంపాదకులు చో రామస్వామి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య కారణంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఆయన ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రామస్వామి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దివంగత సీఎం జయలలితకు చో రామస్వామి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆమెతో కలిసి అనేక సినిమాలు, నాటకాల్లో నటించారు. తుగ్లక్‌ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరిస్తూ రాజకీయ విశ్లేషణలు చేసేవారు. 

21:33 - December 7, 2016
21:31 - December 7, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం... విశాఖకు ఆగ్నేయంగా 11 వందల 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం మరింత బలపడి 24 గంటల్లో తీవ్రవాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో అన్ని ఓడరేవుల్లోనూ ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

21:30 - December 7, 2016

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలపై ఈనెల 9 నుంచి 45 రోజుల పాటు టీఎన్‌ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరుబాటు చేపట్టనున్నట్లు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా నేదునూరులో టీడీపీ జెండా ఆవిష్కరణకు ఆయన హాజరయ్యారు. ప్రజా ఉద్యమాలకు వేదికైన కరీంనగర్‌ నుంచే టీఆర్‌ఎస్‌పై దండయాత్ర మొదలు పెడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా...ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ ఆరోపించారు. 

21:27 - December 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల‌కు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వారం రోజుల పాటు సమావేశాల్ని నిర్వహించాలని సర్కారు భావిస్తోంది.. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నోట్ల రద్దుపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అటు రైతులకు రుణమాఫీ అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుపై ప్రతిపక్షాలు ఇప్పటికే పోరుబాటపట్టాయి.. నోట్ల రద్దుతో జనాలు ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నాయి.. ఈ సమస్యలపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశాయి. అసెంబ్లీ గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టాయి.

జీఎస్టీ బిల్లు..
ఆగస్టు 30న జీఎస్‌టీ బిల్లుకోసం అసెంబ్లీని ఒక్కరోజు సమావేశపరిచింది ప్రభుత్వం.. ఆ తర్వాత శాసనసభను ప్రోరోగ్‌ చేసింది.. ఇలా ఒక్కరోజు అసెంబ్లీని ముగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలు... శీతాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో వాడుకోవాలని చూస్తున్నాయి. ప్రధాన సమస్యలపై సర్కారు తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం కూడా రెడీ అయింది.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 15న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించబోతోంది. ఈ నెల 14న కలెక్టర్ల సమావేశం కూడా నిర్వహించబోతోంది. కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి రిపోర్ట్‌ తీసుకోవాలని చూస్తోంది.. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రతిపక్షాలను కట్టడిచేయాలని ఆలోచిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల కోసం అధికార, ప్రతిపక్ష సభ్యులు అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నాయి.

21:24 - December 7, 2016

విజయవాడ : ఏపీని అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2022 నాటికి మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా..2029 నాటికి దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా...2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఏపీని తీర్చిదిద్దాల్సిన అవసరముందని తెలిపారు. ఇందుకోసం ఏడు మిషన్స్‌ను పెట్టుకున్నట్లు చెప్పారు. గతేడాది ఏపీ వృద్ధి రేటు 10.99 శాతంతా నమోదైందని అన్నారు. అదే జాతీయ సగటు రేటు 7.5 శాతమేనని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

21:22 - December 7, 2016

మెదక్ : పెద్దనోట్ల రద్దు మరో వృద్ధురాలి ప్రాణం తీసింది.. పెన్షన్‌ డబ్బులకోసం క్యూలో నిలబడి మృతి చెందింది. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలానికిచెందిన లచ్చమ్మ పెన్షన్ డబ్బుల కోసం ఎస్ బీహెచ్ ముందు క్యూకట్టింది.. చాలాసేపు క్యూలో నిలబడ్డ లచ్చమ్మ అస్వస్థతకు గురైంది.. బ్యాంకులోపలికి వెళుతున్న సమయంలో స్పృహతప్పి కిందపడిపోయింది.. స్థానికులు ఆమెను అంబులెన్స్‌ద్వారా ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమించడంతో బాధితురాలిని సంగారెడ్డి ఆస్పత్రికి పంపాలని వైద్యులు సూచించారు.. అంబులెన్స్‌లో సంగారెడ్డికి వెళుతుండగా మార్గమధ్యలో ఆమె చనిపోయింది.. 

21:21 - December 7, 2016

హైదరాబాద్ : గాలి జనార్దన్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కూతురు పెళ్లికి కావాల్సిన 100 కోట్ల రూపాయల బ్లాక్‌ మనీనీ.. కమీషన్‌ పద్దతిలో వైట్‌గా మార్చుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ కమీషన్‌ దందాలో మధ్యవర్తిగా తలదూర్చిన.. ఓ డ్రైవరు.. ఆత్మహత్య నోట్‌ ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. క‌ర్నాట‌కు చెందిన రమేశ్‌గౌడ ఆత్మహ‌త్య ఇప్పుడు మైనింగ్‌ దిగ్గజం గాలిజనార్దనరెడ్డి మెడకు చుట్టుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా గాలి జనార్దనరెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లి ఎలా చేశాడనే ప్రశ్నకు..రమేశ్‌గౌడ సూసైడ్‌నోట్‌లో సమాధానాలు దొరుకుతున్నాయంటున్నారు. కొందరు మధ్యవర్తుల సాయంతో గాలిజనార్దనరెడ్డి సుమారు వందకోట్ల మేర పాతనోట్లను మార్చుకున్నట్లు ఈ సూసైడ్‌ నోట్‌ ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ రమేశ్‌గౌడ..? అతడికీ గాలి జనార్దనరెడ్డికీ సంబంధం ఏంటి..?

2018 ఎన్నికల్లో..
రమేశ్‌గౌడ, కర్నాటక ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి భీమానాయక్‌ దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ భీమానాయక్‌ ద్వారా గాలి జనార్దనరెడ్డి వంద కోట్ల రూపాయల బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకున్నారని.. డ్రైవర్‌ రమేశ్‌గౌడ తన సూసైడ్‌ నోట్‌లో రాశాడు. జనార్దనరెడ్డి కుమార్తె వివాహానికి అవసరమైన మొత్తాన్ని 20శాతం కమిషన్‌ తీసుకుని భీమానాయక్‌ మార్చి ఇచ్చినట్లు ఈ లేఖలో రమేశ్‌గౌడ పేర్కొన్నాడు. అంతేకాదు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటకలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్యే అభ్యర్థి నిలపాలనీ ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి భీమానాయక్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని రమేశ్‌గౌడ లేఖలో రాశాడు. భీమానాయక్‌తో గాలి జనార్దనరెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు కూడా పలు దఫాలు సమావేశమైనట్లూ లేఖలో పేర్కొన్నాడు. ఈ నోట్ల మార్పిడి క్రమంలో.. తమకు కొంత నగదు తక్కువగా వచ్చిందని గాలి జనార్దనరెడ్డి అనుచరులు తనను వేధించడంతో మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమేశ్‌గౌడ తన సూసైడ్‌ నోట్‌లో వెల్లడించాడు.

మలుపులు తిరుగుతుందా ? 
ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు గాలి ఇంట్లో సోదాలు మొద‌లు పెట్టిన త‌ర్వాత డ్రైవ‌ర్ రమేశ్‌కు..గాలి అనుచరుల నుంచి బెదిరింపులు మరీ ఎక్కువ‌య్యాయట. ఆ బెదిరింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రమేశ్ త‌న సూసైడ్ నోట్‌లో తెలిపాడు. డ్రైవర్‌ రమేశ్‌ సూసైడ్ నోట్‌లో రాసినవన్నీ నిజమని తేలితే గాలిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణాధికారులు ఏమేరకు కఠినంగా వ్యవహరిస్తారన్నదానిపైనే ఇది ఆధారపడి ఉంది. రమేశ్‌ సూసైడ్‌ నోట్‌ వ్యవహారం భవిష్యత్తులో ఎన్నెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.

21:19 - December 7, 2016

హైదరాబాద్ : ఐడీఎస్ పథకం క్రింద 9,800 కోట్ల ఆస్తులు ప్రకటించిన వ్యాపారి లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి మొదలయిన సోదాలు బుధవారం రాత్రిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి సమగ్ర వివరాలపై ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. లక్ష్మణరావు ప్రకటించినట్లుగా అతని దగ్గర నిజంగానే అంతధనం ఉందా.. ఉంటే మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటి. అతను ఎవరికైనా బినామీగా వ్యవహరిస్తున్నారా అన్న కోణంలో ఐటి అధికారులు విచారణ జరుపుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐడీఎస్‌ స్కీం నీరుగారుతోంది. భారీగా నల్లధనం ఉందని ఇటీవలే ప్రకటించిన ముంబై వ్యాపారి మహేశ్‌షా, తొలివిడత ట్యాక్స్‌ మొత్తాన్ని కట్టడంలో చేతులెత్తేశారు. తాజాగా.. 10వేల కోట్ల ఆస్తి ఉందని ప్రకటించిన హైదరాబాద్‌ వ్యాపారి లక్ష్మణ్‌రావు కూడా మొదటి ఇన్‌స్టాల్‌మెంటు చెల్లించకుండా ముఖం చాటేశాడు. దీంతో ఐటీ అధికారులు లక్ష్మణ్ రావు ఇళ్ళపై దాడులు మొదలు పెట్టారు. రెండు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నీరుగారిందా ? 
ఓ ప్రైవేటు కంపనీలో జనరల్ మేనేజరుగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మణరావు..ఆ తర్వాత రియల్ఎస్టేట్‌ వ్యాపారిగా స్థిరపడ్డాడు. 2008లో BLR బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల క్రితం ఫిల్మ్ నగర్‌లో 12 కోట్లు వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే లక్ష్మణ్‌రావుకు స్థిరాస్తి వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల లక్ష్మణ్‌రావుకు విలువైన ఆస్తులు ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో BLR వెంచర్ పేరుతో ఒక వెంచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోదాల్లో లక్ష్మణ్‌రావు ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే 10వేల కోట్ల ఆస్తులు ప్రకటించిన లక్ష్మణ్‌రావుకు నిజంగానే అంత ఆస్తి ఉందా..ఒకవేళ నిజంగానే అంత ఆస్తిపరుడయితే ఎందుకు మొదటి ఇన్‌స్టాల్‌మెంటు చెల్లించలేదు అనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆస్తులు లేని పక్షంలో అతను ఎవరికైనా బినామీగా ఉన్నాడా అనే కోణంలో ఐటి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో నల్లధనం ప్రకటించిన గుజరాతీలు, ముంబై వాలాలు చేతులెత్తేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌ వ్యాపారి లక్ష్మణ్‌రావు కూడా అదే జాబితాలో చేరారు. దీంతో ఐడీఎస్ పథకం అసలు లక్ష్యం నీరుగారిందన్న విమర్శలు వస్తున్నాయి. 

ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ పై స్పందన..

ఢిల్లీ : రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ పై స్పందన లభ్యమైంది. ట్విట్టర్ నుండి ఢిల్లీ సైబర్ పోలీసులకు సమాచారం అందింది. నిందితులు ఉపయోగించిన ఐపీ అడ్రస్ లను ట్విట్టర్ గుర్తించింది. రెండు ఖాతాలు ఐదు దేశాల నుండి నిర్వహించినట్లు గుర్తించారు. 

కేంద్ర కేబినెట్..పలు నిర్ణయాలు..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముంబై - పుణె మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ విధానంలో మార్పు, జౌళి రంగంలో 11 లక్షల మందికి ఉపాధి కల్పన..భారత్ - అప్ఘనిస్తాన్ మధ్య శాంతి ఒప్పందానికి ఆమోదం..భారత్ - థాయిలాండ్ మధ్యన మాదక ద్రవ్యాల నియంత్రణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది.  

టెన్ టివి వరుస కథనాలకు స్పందన..

హైదరాబాద్ : టెన్ టివి వరుస కథనాలకు అధికారులు స్పందించారు. అవినీతి ఆరోపణలతో రాజన్న సిరిసిల్ల జిల్లా పేరిట కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పై బదిలీ వేటు పడింది. పెద్దపల్లి జిల్లాకు అధికారులు బదిలీ చేశారు. 

20:42 - December 7, 2016

అమ్మ వారసత్వం ఎవరిది? అన్నాడీఎంకే సారధి ఎవరు? తాత్కాలికంగా ఈ అంశం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా...పరిస్థితి నివురుగప్పినట్టుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార కేంద్రాలు వేటికవే యాక్టివ్ గానే ఉన్నాయి. మరి రాబోయే కాలంలో ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరి చేతికి అన్నా డీఎంకె పగ్గాలు వెళ్లబోతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. శశికళ, పన్నీర్ సెల్వం, అజిత్ ఇప్పటికి అన్నాడీఎంకెలో వినిపిస్తున్న పేర్లు.. ఈ ముగ్గురిలో ఎవరు నిలబడతారు? ఎవరు పై చేయి సాధిస్తారు. జయ నెచ్చెలి శశికళ, నమ్మినబంటు పన్నీర్ సెల్వం, పాపులారిటీలో ముందున్న అజిత్ వీరిలో అమ్మ వారసుడెవరు?  మూడు అధికార కేంద్రాలు..ఓ పక్క అమ్మ పోయస్ గార్డెన్ నుండి జైలుకి.. అపోలో ఆస్పత్రికి వెళ్తున్న సందర్భం..వ్యక్తిగత సమస్యల్లో మునిగినప్పుడు ఇలా పలు సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులు సన్నిహితులయ్యారు. వేర్వేరు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. అంతిమంగా వీటిలో ఏది నిలబడనుంది ? ఇదే ఇక్కడ ప్రశ్న.. !!

మారిపోతున్న పరిణామాలు..
ఓ పక్క జయ అంత్యక్రియలు కాలేదు.. ఆ లోపే కొత్త క్యాబినెట్ కొలువుతీరింది. పన్నీర్ సెల్వం సీఎం పీఠంపై కూర్చుకున్నారు. పన్నీర్ అన్నా డీఎంకేను ఇకముందు కూడా నడిపించబోతున్నారా? లేక మరో కొత్త నేత వచ్చేవరకు మాత్రమే పన్నీర్ ఆ బాధ్యతలు తీసుకుంటారా? కొన్నేళ్ల క్రితం వరకు సామాన్య వ్యక్తిగా ఉన్న పన్నీర్ అమ్మకు ఎలా దగ్గరయ్యారు? సీఎం పీఠంపై ఎలా కూర్చున్నారు. అధికార అన్నాడీఎంకెలో రాజకీయ పరిణామాలు తెరవెనుక వేగంగా మారిపోతున్నాయి. జయలలిత తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతపై ఫోకస్ పెట్టింది ఆ పార్టీ. తెరవెనుక చాలామంది పేర్లు వెలుగులోకి వచ్చినా, డీఎంకెని బలంగా ఢీకొట్టే నేతలెవరు? రాజకీయపరంగా జయలలిత వారసుడిగా పన్నీరుసెల్వం ఓకే అయినా, ప్రజల్లో అంత అభిమాన నటుడు అజిత్ కావచ్చుననే వార్త తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.

ఆసక్తికరం..
దక్షిణాది రాజకీయాలు జనాకర్షక నేతల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తమిళనాట అలాంటి శూన్యం ఒకటి ఏర్పడింది. దానికి పరిష్కారం ఏమిటి అనేది ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నే. తన సుస్థిరత కోసం పార్టీల్లో నంబర్ టూలు లేకుండా చేసుకునే నేతలు దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఓ నేత నిష్క్రమణం తర్వాత ఏర్పడిన ఖాళీ ఎలా భర్తీ అవుతుందనే అనే అంశం ఆసక్తికరంగా మారింది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:33 - December 7, 2016

మిర్యాలగూడ దేశానికి అన్నం పెట్టే ప్రాంతం. రైసు మిల్లులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వివిధ దేశాలకు ఎగుమతి కూడా అవుతాయి. ప్రస్తుతం ఈ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఎట్ల ఉంది ? వారి జీవితాలు ఎలా సాగుతున్నయి అని తెలుసుకోవడానికి 'మల్లన్న' వెళ్లిండు. ఎందుకంటే పెద్దనోట్ల రద్దు ప్రభావం వారిపై ఎలా కొనసాగుతోంది ? చిల్లర సమస్య వల్ల వారు ఎలాంటి కష్టాలు పడుతున్నారనే దానిని 'మల్లన్న' తెలుసుకున్నాడు. మరి వారు ఎసొంటి ముచ్చట్లు చెప్పిండో తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే. 

20:29 - December 7, 2016

పెద్దనోట్లు రద్దు కూలీల బతుకులను అష్టకష్టాల పాల్జేస్తున్నయి. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పల్లెలో ఉంటున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఏం తినాలి..ఏం తాగాలి..ఎట్లుండాలని ప్రశ్నిస్తున్నారు. పేదలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నరో తెలుసుకొనేందుకు 'మల్లన్న' ప్రయత్నించాడు. మిర్యాలగూడ ప్రాంతంలో కార్మికుల సమస్యలను తెలుసుకొండు. ఓ మహిళా కార్మికురాలు తన గోడును వెళ్లబోసుకుంది. తనకు చదువు రాదని ఏటీఎం ఎలా గీకాలని పాలకులను సూటిగా ప్రశ్నించింది. ఆమె ఎలా తెలియచేసిందో వీడియో క్లిక్ చేయండి. 

కేసీఆర్ కు తమ్మినేని 43వ లేఖ..

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో సీపీఎం పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల బాలికలను జోగినీలుగా మార్చే దుష్ట సంప్రదాయ ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతోందని 43వ లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం భర్త చనిపోయినట్లు సర్టిఫికేట్ కావాలంటున్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పిల్లలు ఉన్నత విద్యకు దూరమౌతున్నారని పేర్కొన్నారు. దళితులకు అందే ప్రయోజనాలు ఒక్కటి అందడం లేదని వారు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

19:45 - December 7, 2016

ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం డొల్లేనా..? స్వచ్ఛందంగా బ్లాక్‌మనీని ప్రకటించేందుకు ఉద్దేశించిన ఐడీఎస్‌ తుస్సుమన్నట్లేనా..? 65వేల కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందన్న ప్రభుత్వ ప్రకటనలోనే వాస్తవమెంత..? అసలు ఈ పథకం ప్రవేశపెట్టి.. కేంద్రం ఏం ఉద్ధరించినట్లు..! ఏం లబ్దిపొందినట్లు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మేధావులు, ఆర్థిక నిపుణుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు..! ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శశికుమార్ (చార్టర్డ్ అకౌంటెంట్), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

19:19 - December 7, 2016

ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం డొల్లేనా..? స్వచ్ఛందంగా బ్లాక్‌మనీని ప్రకటించేందుకు ఉద్దేశించిన ఐడీఎస్‌ తుస్సుమన్నట్లేనా..? 65వేల కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందన్న ప్రభుత్వ ప్రకటనలోనే వాస్తవమెంత..? అసలు ఈ పథకం ప్రవేశపెట్టి.. కేంద్రం ఏం ఉద్ధరించినట్లు..! ఏం లబ్దిపొందినట్లు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మేధావులు, ఆర్థిక నిపుణుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు..! ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు తర్వాత దేశమంతటా బ్లాక్‌మనీ గుట్టలు గుట్టలుగా బయటపడుతోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడిలో పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 65వేల కోట్ల రూపాయలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఏలికల ప్రకటనలు సగటు భారతీయుడిలో భవిష్యత్‌పై కోటి ఆశలు చిగురింప చేశారు. కానీ ఇటీవల బయటపడుతున్న కొన్ని వాస్తవాలు ఈ స్కీం డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి.

బాంబు పేల్చిన మహేశ్‌ షా..
ఆమధ్యలో అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్‌ షా.. 13వేల కోట్ల సంపద తనవద్ద ఉందంటూ ఐడీఎస్‌ కింద వెల్లడించాడు. దీనికి సంబంధించిన ట్యాక్స్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకుండా ముఖం చాటేశాడు. తీరా ఇప్పుడేమో.. అది తన సొత్తే కాదని, కొందరు పెద్దలకు చెందినదని బాంబు పేల్చేశాడు. వాస్తవానికి ఆయన జీవన శైలిని చూసినవారు కూడా మహేశ్‌ షాకు అంతసీన్‌లేదనే అంటున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బాణాపురం లక్ష్మణరావు వంతొచ్చింది. ఆయన కూడా తన వద్ద అక్రమంగా పోగేసుకున్న పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయంటూ ఐడీఎస్‌ కింద ప్రకటించారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగానూ పెద్ద కలకలాన్నే రేపింది. ఈ మొత్తాన్ని ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు బినామీ అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తే.. జగనే ఆ మొత్తాన్ని ఐడీఎస్‌ కింద వ్యక్తీకరించాడని టీడీపీ ఆరోపించింది. తీరా ఆమొత్తానికి ట్యాక్స్‌ కట్టాల్సిన గడువు పూర్తయ్యే సరికి అసలు విషయం వెల్లడైంది. మొదటి విడత పన్ను మొత్తం 1125 కోట్లు చెల్లించకుండా లక్ష్మణరావు ముఖం చాటేయడంతో ఐటీ శాఖ ఆయన గుట్టును రట్టు చేసింది. లక్ష్మణరావు బిజినెస్‌ టర్నోవర్‌ 5 నుంచి 10 కోట్ల లోపే ఉంటుందని అంచనా వేశారు.

ఐడీఎస్‌ కింద వెల్లడైన మొత్తం రూ. 42 వేల కోట్లు..
ఐడీఎస్‌ కింద వెల్లడించిన నల్లధనం మొత్తంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైకి చెందిన మహేశ్‌షా, హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణరావు ప్రకటించిన మొత్తం 23వేల కోట్ల రూపాయల నల్లధనం బోగస్‌ అని తేలింది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్న 65వేల కోట్ల నల్లధనంలో సుమారు 40 శాతం బోగస్‌ అని స్పష్టమవుతోంది. ఐడీఎస్‌ పథకం కింద భారీ మొత్తాలను వెల్లడించిన వారంతా చేతులు ఎత్తేస్తుండడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మొత్తంలోంచి మహేశ్‌షా, లక్ష్మణరావులు ప్రకటించిన 23వేల కోట్ల మొత్తాన్ని తీసివేస్తే నికరంగా ఐడీఎస్‌ కింద వెల్లడైన మొత్తం 42 వేల కోట్లుగా తేలుతుంది. ఇందులోనూ ఎంత మొత్తానికి పన్ను వసూలైందన్న పరిశీలిస్తే గానీ, ఐడీఎస్‌ ఏ మేరకు సక్సెస్‌ అయిందో తేటతెల్లం కాదు.

ఐడీఎస్‌ కింద వెల్లడైన నల్లధనంపై సందేహాలు..
నల్లధనాన్ని రూపుమాపుతున్నామంటూ బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనమే బట్టబయలవుతోంది. ఐడీఎస్‌ తరహాలోనే పెద్ద నోట్ల రద్దు అంశంలోనూ ప్రభుత్వం మాట మార్చుతున్నట్లు స్పష్టమవుతోంది. నల్లధనం మొత్తాన్ని బయటకు తెచ్చేందుకే పెద్దనోట్ల రద్దు అంటూ ప్రధాని మోదీ ప్రకటిస్తే.. నెల తర్వాత ఇప్పుడు జైట్లీయేమో.. నగదు రహిత కార్యకలాపాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనల్లో నల్లధనం పక్కకు వెళ్తుండడాన్ని బట్టి చూస్తే.. ఈ అంశంపై వాస్తవాలు... నేతల ప్రకటనల మధ్య అంతులేని అంతరం ఉందన్నది తేటతెల్లమవుతోంది. మొత్తానికి ఐడీఎస్‌ పథకం పసలేనిదిగా.. అట్టర్‌ ఫ్లాప్‌ షోగా మిగిలిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

రైల్వే జోన్ సురేష్ ప్రభు పరిధిలో లేదు - సుజనా..

ఢిల్లీ : రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రైల్వే బోర్డు అధికారులతో ఏపీ టిడిపి నేతలు సమావేశమయ్యారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అమరావతికి రైల్వే అనుసంధానం, వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రైల్వే మార్గాలపై చర్చించడం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. రైల్వే జోన్ అంశం సురేష్ ప్రభు పరిధిలో లేదని, రైల్వే జోన్ పై కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడం జరిగిందన్నారు. పార్లమెంట్ సమావేశాలకు, రైల్వే జోన్ కు సంబంధం లేదన్నారు.

విద్యార్థులపైకి దూసుకెళ్లిన ప్యాసింజర్ ఆటో..

మేడ్చల్ : అత్వెల్లిలో ఓ ప్రైవేటు స్కూల్ వద్ద విద్యార్థులపైకి ప్యాసింజర్ ఆటో దూసుకెళ్లింది. ఈ ఘటనలో వివర్షిత, అక్షిత, మీనాకిక్షికి గాయాలయ్యాయి. 

బాబును కలిసిన గ్రానైట్ ప్రతినిధులు..

గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడిని గ్రానైట్ కంపెనీల ప్రతినిధులు కలిశారు. గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను బాబు దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలో గ్రానైట్ పరిశ్రమకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రానైట్ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా సీఎం స్పందించారు.

18:44 - December 7, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిసారి నూతన రాజధాని అమరావతి కేంద్రంగా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరగనుండడంతో కార్మిక సంఘాలైన ఎన్‌ఎంయూ, ఈయూ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. ఐదేళ్లకు ఓసారి జరిగే ఈ ఎన్నికలకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 127 డిపోలలో ఈ నెల 16 నుంచి కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడ జోన్ పరిధిలో కృష్ణా, గుంటూరు.. పశ్చిమగోదావరి రీజియన్ పరిధిలో సీసీఎస్ సభ్యులుగా ఉన్న 14,337 మంది డెలిగేట్లను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ డెలిగేట్స్ అంతా కలిపి 9 మంది సభ్యులతో కూడిన పాలకమండలి సభ్యులను డిసెంబర్ 30వ తేదీన ఎన్నుకుంటారు.

ఈ సొసైటీ ద్వారానే కార్మికులకు రుణాలు..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1952లో ఆర్టీసీ కార్మికుల కోసం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీను స్థాపించారు. అప్పట్లో రూ.1,800 కోట్ల టర్నోవర్ తో సీసీఎస్ పనిచేసేది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీసీఎస్ రూ.1,000 కోట్ల టర్నోవర్ తో ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, ఇంటి రుణాలు, పిల్లల పెళ్లిళ్లకు రుణాలు, స్థలాల కొనుగోలుకు రుణాలు వంటివి ఈ సొసైటీ ద్వారానే ఇవ్వటం జరుగుతోంది. అంతేకాకుండా ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్‌ ఫెడరేషన్‌, కార్మిక పరిషత్‌లు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా రీజియన్ లో మొత్తం 26 మంది డెలిగేట్లను.. గుంటూరు రీజియన్‌లో 22 మంది డెలిగేట్స్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. విజయవాడ జోన్ పరిధిలోకి వచ్చే పశ్చిమగోదావరి రీజియన్ పరిధిలో 10 మంది డెలిగేట్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 58 డెలిగేట్లను ఎన్నుకోవాల్సి ఉంది.

కూటమిగా ఈయూ, స్వతంత్రంగా ఎన్‌ఎంయూ..
కూటమిగా ఈయూ, స్వతంత్రంగా ఎన్ఎంయూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కృష్ణా, గుంటూరు రీజియన్‌లు కలిపి గుంటూరు 1, 2, తెనాలి, తిరువూరు పశ్చిమ గోదావరి రీజియన్ లో తణుకు, ఏలూరు డిపోలను ఎస్.డబ్ల్యు.ఎఫ్.కు ఈయూ కేటాయించింది. కార్మిక పరిషత్ కు గుంటూరు 1, 2, నరసారావుపేట డిపోలను కేటాయించారు.

నేషనల్ మజ్దూర్ యూనియన్..ఈయూ ల ధీమా..
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన విపక్ష కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలో పాలక మండలి పనిచేస్తోంది. ఇటీవల స్వల్ప మెజారిటీతో గుర్తింపును కైవసం చేసుకున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా సీసీఎస్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గుర్తింపు సంఘంగా ఎన్నికై ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించటం, యాజమాన్య అనుకూల విధానాలు అవలంభించడం ఆర్టీసీ కార్మికులలో అసంతృప్తిని రేపుతోందని దీంతో తమ విజయం ఖాయమని ఈయూ ధీమాగా ముందుకెళ్తోంది. సొసైటీకీ అన్ని అధికారాలు ఉండడంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

18:37 - December 7, 2016

ఏలూరు : ఏపీలో క్రీడాకారులకు కొదవలేదని మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరులో ఖేలో ఇండియా క్రీడా పోటీలను ప్రారంభించిన ఆమె.. క్రీడలను ప్రోత్సహించే సీఎం లభించడం ఆంధ్రప్రదేశ్‌ అదృష్టమన్నారు. ఏలూరులోని సీతారామరాజు స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో అనేక ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు మల్టీ పర్పస్ మినీ స్టేడియంలను నిర్మిస్తున్నామని క్రీడాకారులకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది పీతల సుజాత తెలిపారు.  

18:34 - December 7, 2016

నెల్లూరు : డబ్బుల కోసం ప్రజలు గంటలతరబడి బ్యాంకుల వద్ద వేచి చేస్తుంటే..బ్యాంకు అధికారులు ఏం చేస్తున్నారంటూ మంత్రి సిద్ధా రాఘవరావు మండిపడ్డారు. నెల్లూరులోని బ్యాంకు, జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకు అధికారుల చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నగదు చెల్లింపులో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

18:32 - December 7, 2016

విశాఖపట్టణం : కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చనందుకు కాపు నేతలు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. విశాఖలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.... ఈనెల 18న నల్లబ్యాడ్జ్‌లతో ఆందోళన చేపట్టనున్నట్లు కాపునేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈనెల 30న ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. కాపులకిచ్చిన హామీలను నెరవేర్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. 

18:30 - December 7, 2016

హైదరాబాద్ : జనాలంతా నగదు దొరక్క ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు ఈ పాస్‌లంటూ కాలక్షేపం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించించారు. తమ వ్యాపార భాగస్వాములును చూసుకునేందుకే విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు బొత్స విమర్శలకు టిడిపి చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు ఘాటుగా సమాధానమిచ్చారు. మాట్లాడేముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని బొత్సకు కౌంటర్ ఇచ్చారు. వారు ఎలా మాట్లాడారో వీడియోలో చూడండి. 

18:27 - December 7, 2016

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంత ముఖ్యమో.. ముంపు బాధితులను ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పర్యటించిన ఆయన.. నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబుకు ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ద నిర్వాసితులపై లేదన్నారు. ముంపు ప్రాంత బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని జగన్‌ అన్నారు.

బీసీసీఐ నిధులు ఖర్చు పెట్టుకోవచ్చన్న సుప్రీం

ఢిల్లీ : భారత్ - ఇంగ్లండ్ వన్డే, టీ 20 సిరీస్ లకు నిధులు ఖర్చు పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దీనితో ఆర్థిక ఇబ్బందులు తొలిగినట్లు అయ్యింది. రూ. 25 లక్షలు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చింది. 

టీమిండియాకు గాయల బెడద..

ముంబై : నాలుగో టెస్టుకు టీమిండియా జట్టుకు గాయాల బెడద తాకింది. గాయాలతో అజింకా రహానే దూరమయ్యాడు. కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ ఆడటంపైన అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రహానే, షమీ స్థానంలో మనీష్ పాండే, శార్దూల్ ఠాకూర్ లు ఆడే అవకాశం ఉంది. 

18:11 - December 7, 2016

ఢిల్లీ : పీకే 661 విమానం కొద్దిసేపటి క్రితం అదృశ్యమైంది. ఈ విమానం కూలిందా ? లేక క్షేమంగానే ఉందా అనే సమాచారం తెలియడం లేదు. చిత్రల్ నుండి ఇస్లామాబాద్ కు పీకే 661 విమానం వెళుతోంది. మొత్తం సిబ్బందితో సహా 46 మంది ఉన్నట్లు సమాచారం. అబోటా బాద్ వద్ద రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. దీనితో హవేలియన్ లోని పిప్లియన్ లో విమానం కూలిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. 

18:04 - December 7, 2016

హైదరాబాద్ : నగదు మార్పిడిలో మోసాలు జరుగుతున్నట్లు వెల్లడైతోంది. నగదు మార్పిడిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నగరంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 11 చోట్ల ఈ దాడులు జరిగాయి. చట్టవిరుద్ధంగా మోసాలకు పాల్పడుతున్న పోస్టల్ అధికారులను అరెస్టు చేశారు. అబ్దుల్ ఘనీ, రవితేజ, సురేష్ కుమార్, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. 2.95 కోట్ల రూపాయల నగదును అక్రమంగా మార్చారని సీబీఐ నిర్ధారించింది. అధికారుల ఇళ్లు, ఆఫీసులతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు సమాచారం. కమీషన్ల పేరిట వేరే వారికి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనే అరెస్టు చేసిన సూపరింటెండెంట్ సుధీర్ చెప్పిన సమాచారంతో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఇంకా మరికొంత సిబ్బంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

17:55 - December 7, 2016

మహబూబ్‌నగర్‌ : పాలమూరులో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లు ఎక్కువ అవుతున్నాయి. రోడ్లు, నాలాలను అక్రమించుకుని చాలా కాలంగా యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. దీంతో రోడ్లు కుచించుకుపోతున్నాయి. ఒక కారు వెళుతుంటే ఎదురుగా వస్తే మోటారు బైక్‌ అగిపోవాల్సిన దుస్థితి దాపురుంచింది. ఆక్రమణలకు గురైన నాలాలతో వర్షాకాలం వస్తే నీరంతా రోడ్లపైనే. ఈ పరిస్థితికి ముగింపు పలకాలనుకున్న మున్సిపల్‌ అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించారు.
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో పది కాదు, ఇరవై కాదు... వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు ఉన్నాయి. వీటిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఇళ్లు కూడా ఈ జాబితాలో చేరాయి.

570 అక్రమ నిర్మాణాలు..
స్థలాన్ని బట్టి రెండు అంతస్తులకు అనుమతి ఇస్తే నాలుగైదు అంతస్తుల్లో భవనాలు వెలిశాయి. పట్టణంలో మొత్తం 570 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు మున్సిపల్‌ అధికారులు తేల్చారు. ఇప్పుడు వీటన్నింటిని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇవి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అక్రమ లే అవుట్లు వెలుస్తున్న ప్రాంతాల్లోనే అక్రమ కట్టడాలు కూడా ఎక్కువగా వెలుస్తున్నాయి.  మరోవైపు కట్టడాల కూల్చివేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలైతే పునాదులు, పిల్లర్ల దశలోనే అభ్యంతరం ఎందుకు చెప్పడం లేదని అడుగుతున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ఎందుకు మిన్నకుండిపోతున్నారని నిలదీస్తున్నారు. ముందుగానే నోటీసులు ఇచ్చి పనులు ఎందుకు ఆపివేయించడంలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారుల అవినీతే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణమైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

17:53 - December 7, 2016

కరీంనగర్ :  దేశానికి వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ప్రాణాలను అర చేతిలో పెట్టుకోని ఇంధన ఆధారిత కంపెనీలకు బొగ్గును అందిస్తూ పారిశ్రామిక రంగ అభివృద్దికి కారణం అవుతున్న వారికి వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. వేతన సవరణ జరగక పోవడం కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గని కార్మికులకు సరైన వేతన ఒప్పందం జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతన ఒప్పందాలు జరిగినప్పటికీ అవి కార్మికులకు అనుకూలంగా లేక పోవడం కార్మికులను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.

56వేల మంది విధులు..
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో 56 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మార్కెట్ ధరలు 100 శాతం పెరిగినా కార్మికులకు చెల్లించే వేతనాలు 25 శాతానికే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం జైపూర్ లో 10వ వేతన ఒప్పందం పై సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో వేతన సవరణ, గ్రాట్యుటీ పై చర్చించనున్నారు. ఈసారైనా ఆశించిన స్థాయిలో పెరుగుతాయా లేదా అనే బొగ్గు గని కార్మికులు చర్చించుకుంటున్నారు.

పలు ఒప్పందాలు..
కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ దేశంలోని నిత్యావసర ధరలను పరిగణనలోకి తీసుకొని ధరల సూచీని ప్రకటించడం జరుగుతుంది. ఈ ధరల సూచి ఆధారంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నియమించిన కోల్ ఇండియా లిమిటెడ్ కార్యదర్శి, ఆయా బోగ్గు కంపెనీల ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల వేజ్ బోర్డు సభ్యులతో కూడిన జెబిసిసిఐ సమావేశంలో చర్చించి బొగ్గు గని కార్మికుల వేతనాలు, అలవెన్సుల పై ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయ బొగ్గు గనుల సంస్థల కార్మికులకు వేతనాలు
చెల్లిస్తారు.

1975లో తొల వేజ్ బోర్డు ఒప్పందం..
బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా 1975 నవంబర్ 1 న తొలి వేజ్ బోర్డు ఒప్పందం ప్రారంభమైంది. ఆ తర్వాత 2016 జూన్ 30 వరకు తొమ్మిదవ వేజ్ బోర్డుల ద్వారా వేతన ఒప్పందాలు కుదిరాయి. మొదటి వేతన ఒప్పందంలో 1975 జనవరి 1 నుంచి 1979 డిసెంబర్ 31 నాటికి కార్మికుల కనీస వేతనం 443 రూపాయలు ఉండగా 9వ వేజ్ బోర్డు 2011 జులై 1 నాటికి అంటే 36 సంవత్సరాల్లో 17,565.86 రూపాయలకే పరిమితం అయింది. 36 యేళ్ల కిందట ఉన్న వస్తువుల ధరలు భారీగా పెరిగినా.. కార్మికుల వేతనాలు మాత్రం సరాసరి 20 నుంచి 25 శాతానికే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలతో పోల్చుకుంటే బొగ్గు గని కార్మికుల వేతనాలు మెరుగ్గా ఉన్నాయని కోల్ ఇండియా యాజమాన్యం అంటుండగా మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగటం లేదని కార్మికులు అంటున్నారు.

వేతనాలు పెంచుతారా ? 
వేతనాలను లెక్క కట్టడంలో శాస్త్రీయత పాటించడం లేదని కార్మికులంటున్నారు. కుటుంబ సభ్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వేతనాలు లెక్కకడుతున్నారని.. తమపై ఆధారపడే తల్లిదండ్రులు, సోదరులు, చెల్లెళ్లను పట్టించుకోవడం లేదని కార్మికులంటున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో వేతనాలు పెరగడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మిక సంక్షేమమే ధ్యేమమంటూ చెప్పుకుంటున్న సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వ 10 వేతన ఒప్పందం ప్రకారం కార్మికులకు జీతాలు అనుకున్నస్ధాయిలో పెంచుతుందో లేదో చూడాలి.

17:48 - December 7, 2016

నిజామాబాద్ : సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 52వ రోజుకు చేరుకుంది. ప్రతి గ్రామంలో ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి విన్నివించుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల సమస్యలను సీపీఎం బృందం అడిగి తెలుసుకుంటోంది. 

17:46 - December 7, 2016

మహబూబ్ నగర్ : నోట్ల ఎఫెక్ట్ వ్యక్తిగత సేవలను అందించే హాస్పిటాలిటీ రంగాన్ని కూడా వదలలేదు. పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు దొరక్క.. దొరికినా చిల్లర దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులలో రోగుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా తయారైంది. ప్రభుత్వాస్పత్రుల్లోని కరెన్సీ కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం. నోట్ల రద్దు నిర్ణయం ప్రతి రంగంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చివరికి హాస్పిటాలిటీ రంగాన్ని కూడా కరెన్సీ కష్టాలు వదలలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఉన్నా చిల్లర లేక రోగానికి అవసరమైన మందులు కొనలేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కరెన్సీ కొరతతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక సామాన్యుల ఆస్పత్రులైనా ప్రభుత్వాస్పత్రిల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది.

పరీక్షలు వాయిదా..
తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రాల్లో ఉన్న పెద్దసుపత్రులతోపాటు పలు హాస్పిటల్స్‌లో రోగులు చిల్లర కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్న చిన్న పరీక్షలకు కావాల్సిన డబ్బులు లేక పరీక్షలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రోగాలు ముదిరిపోయే ప్రమాదం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు కావడంతో నిత్యం వందలాది ఇన్ పేషంట్స్.. అవుట్ పేషంట్స్ తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మందులు కొన్నాలన్నా.. అవసరాలు తీర్చుకోవాలన్నా చిల్లర కొరతతో తీర్చుకోలేని దుస్థితి నెలకొంది. కొంత మంది రెండు వేల రూపాయలు ఇస్తున్నా చిల్లర లేకపోవడంతో ఎవరు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోలా కష్టాలు..
రోగుల కష్టాలు ఇలా ఉంటే ఆస్పత్రి నిర్వహణ కష్టాలు మరోలా ఉన్నాయి. కరెన్సీ కొరతతో జనరల్ ఆస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తుతోంది. జనరేటర్ ఆన్ చేద్దామన్నా.. డిజిల్ కొరతతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో పలు సర్జరీలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన వైద్య సిబ్బంది హుటాహుటిన డిజిల్ విక్రయదారుడికి నగదుని చెల్లించి సమస్యను పరిష్కరించరమని వైద్యాధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద చిల్లర కొరతతో అన్ని రకాలుగా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని.. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లర సమస్యను తీర్చాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

17:41 - December 7, 2016

నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నిజామాబాద్‌ జిల్లాలో కురగాయల రైతుల పై తీవ్ర ప్రభావం పడింది. కొత్త నోట్లకు సరిపడ చిల్లర లేకపొవటంతో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని వ్యాపారులు అంటుంటే.. పెట్టుబడులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. చిల్లర కష్టాలతో నిజామాబాద్‌ జిల్లా రైతులు, కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమ్మకాల్లేక కూరగాయల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నడుపుకునే వారికి పెద్ద నోట్ల రద్దు చాలా ఇబ్బందికరంగా మారింది. తాము పండించిన కూరగాయాలను ఏమి చేయలో తెలియక..తక్కువ ధరకే వ్యాపారులకు అప్పగిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. అసలే గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావంతో పంటలు సరిగా చేతికి రాలేదు. ఈ సంవత్సరం వర్షాలు బాగాపడటంతో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతులు విస్తృతంగా కూరగాయలను సాగు చేసారు. అయితే.. నవంబరు8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో తాము పూర్తిగా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్టాల పాలు..
పెద్దనోట్ల రద్దు రైతులనే కాదు.. కూరగాయల వ్యాపారులను కూడా నష్టాల పాలు చేసింది. చిల్లర లేకపోవడంతో పండించిన కూరగాయాలను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన 2వేల రూపాయల నోటుతోనే అసలు సమస్య వచ్చిందంటున్నారు. జిల్లా అధికారులు మాత్రం ..పైసలతో పనిలేకుండా వ్యాపారం చేయడానికి స్వైప్‌ మిషన్లు ఇస్తామంటున్నా వాటితో పెద్దగా ఉపయోగం లేదంటున్నారు వ్యాపారులు. పెద్దనోట్లకు సరిపడా 50, 20 రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకెంతకాలం ఈ చిల్లర సమస్యతో అమ్మకాలు బంద్‌ అవుతాయోనని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చిల్లర సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని రైతులు, కూరగాయల ప్యాపారులు కోరుతున్నారు. 

టెస్ట్ మ్యాచ్ ల్లో నిధుల ఖర్చుకు సుప్రీం అనుమతి

హైదరాబాద్ : భారత్ - ఇంగ్లండ్ రెండు టెస్ట్ ల కోసం నిధులు ఖర్చు పెట్టుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు టెస్టు మ్యాచ్ లకు రూ.1.33 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పింది. దీంతో వన్డే టీ20 సిరీస్ లకు ఆర్థిక ఇబ్బంది తొలిగినట్లేనని భావిస్తున్నారు.

17:30 - December 7, 2016

హైదరాబాద్ : 29 రోజులైనా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిత్యావసరాల కోసం డబ్బు దొరక్క ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చిల్లర సమస్యతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఏ ఏటీఎం చూసినా ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. పలు బ్యాంకుల్లో ఉద్యోగులు, సామాన్య ప్రజలు బారులు తీరుతున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ కళ్యాణమండపంలోని ఎస్బీహెచ్‌ బ్యాంకు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు.   

17.5లక్షల కొత్త రెండువేల నోట్లు స్వాధీనం

హైదరాబాద్ : నగరంలో 11 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 17.5 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోస్టల్ ఉద్యోగులు 2.95కోట్ల రూపాయలను మార్చారు. ఈఘటనలో అబ్దుల్ గనీ, రవితేజ, సురేష్ కుమార్, శ్రీనివాస్ ను అరెస్టు చేశారు.

17:12 - December 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సమావేశాల్లో రాజకీయ సెగ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుపోయి ఉన్నాయని, గతంలో సమావేశాలు నిర్వహించాల్సిన ఉన్నా ప్రభుత్వం మాట తప్పిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పెద్దనోట్లు రద్దుపై అనేక సమస్యలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని, కేంద్రానికి మద్దతుగా కేసీఆర్ నిలుస్తున్నారని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటితో పాటు అనేక అంశాలు ఇంకా ఉన్నాయి. ఇన్ పుట్ సబ్సిడీ, కరవు భత్యం, పెద్దనోట్ల రద్దు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీతో పాటు ఎన్నో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు సమావేశాలు జరపాలని డిమాండ్ చేస్తామని విపక్షాలు పేర్కొంటున్నా ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

16:42 - December 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 16 నుండి సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కార్యాలయం నుండి సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా విపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, వెంటనే అసెంబ్లీని సమావేశ పర్చాలని విపక్షాలు కోరుతున్నాయి. సంప్రదాయాలను అసలు పట్టించుకోవడం లేదని, శీతాకాల సమావేశాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. 16 నుండి ప్రారంభమయ్యే సమావేశాలు ప్రారంభం మాత్రం అవుతాయని సమాచారం. ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. పెద్దనోట్లు రద్దుపై అసెంబ్లీలో చర్చ జరగనుందని తెలుస్తోంది. 

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్ :2018 అక్టోబర్ 2 లోగా తెలంగాణ లో 100 శాతం స్వచ్ఛభారత్, ఉపాధి హామీ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్త్రీ నిధి బ్యాంకు ద్వారా అడ్వాన్స్ లోన్ ఇప్పించే ఆలోచన చేస్తున్నామని జూపల్లి స్పష్టం చేశారు.

16:38 - December 7, 2016

శ్రీకాకుళం : నిరుపేదలకు సర్కారీ ఆసుపత్రులు దేవాలయాయాలు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజులు పలుకుతుండడంతో చాలా మంది నిరుపేదలు ప్రభుత్వాసుపత్రులపైనే ఆధార పడుతుంటారు. అక్కడ పనిచేసే వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారనే పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. నిండు గర్భిణీ..ఇద్దరు కవలల మృతికి వైద్యులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి చెందిందంటూ శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.. జిసిగడం మండలం గెడ్డ కంచరాంకు చెందిన పట్నాన గౌరీ నిండు గర్భిణీ ప్రసవం కోసం ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. ఆమె కడుపులో కవల పిల్లలున్నారని వైద్యులు తెలిపారు. నొప్పులతో అవస్థపడుతున్న గౌరికి డాక్టర్లు రక్తం ఎక్కించారు. ఆ కాసేపటికే ఆమె మృతి చెందింది. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంవల్లే గౌరి మరణించారంటూ ఆస్పత్రిముందు బంధువుల నిరసన చేపట్టారు. 

16:32 - December 7, 2016

గుంటూరు : పదవీ..ఎంత పనిచేస్తుందో చూశారా..రాజకీయ నేతల్లో పదవీకాంక్షలు ఉంటుంటాయి. పదవీ దక్కించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కోసారి పదవీ ఒప్పందాలు కూడా జరుగుతుంటాయి. ఒకరి పదవీ కాలం ముగిసిన అనంతరం ఇతరులు పదవీలోకి ఎక్కుతుంటారు. పదవీ నుండి వెంటనే దిగిపోవాలని ఎంపీపీని ఓ ఎమ్మెల్సీ హెచ్చరించడం..ఆమె సృహ తప్పిపోవడం గుంటూరు జిల్లాలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి నేతల మధ్య పదవీ ఒప్పందాలు జరిగాయి. ఎంపీపీగా మానం విజేతగా నిలిచారు. రెండున్నర సంవత్సరాలు ఈమె పదవీలో ఉండే విధంగా ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయ బాపట్లకు వచ్చారు. అక్కడకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ చేరుకున్నారు. ఎంపీపీని అన్నం దూషించారు. ఒప్పందం ప్రకారం పదవి నుండి వెంటనే దిగిపోవాలని హెచ్చరించారు. తీవ్ర హెచ్చరికలు చేయడంతో ఎంపీపీ మానం అక్కడే సృహ కోల్పోయారు. వెంటనే ఇతరులు స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. గతంలో కూడా ఎమ్మెల్సీ అన్నం సతీష్ పై పలు ఆరోపణలు వచ్చిటన్లు, ఇందుకు పార్టీ పెద్దలు పలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. మరి తాజా ఘటనతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

16:24 - December 7, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తరువాత రూ. 100 కోట్లను మైనింగ్ కింగ్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి మార్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లధనాన్ని వైట్ గా మార్చుకొనేందుకు ప్రయత్నించారా ? అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఓ డ్రైవర్ ఆత్మహత్యతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నాటకలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. భీమా నాయక్ అనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర డ్రైవర్ గా రమేష్ గౌడ అనే వ్యక్తి పనిచేసే వాడు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో 'గాలి' జనార్ధన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశాడు. గాలి అనుచరులు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. గాలి కూతురు వివాహ సమయంలో రూ. 100 కోట్లను మార్చేందుకు భీమ్ నాయక్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ శ్రీరాములు, భీమా నాయక్ తో జరిగిన సమావేశంలో గాలి జనార్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు తెలిపాడు. 2018వ సంవత్సరంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌నకు సీటు ఇప్పించాల‌ని భీమా నాయక్ కోరడం..ఇందుకు గాలి కూడా హామీనిచ్చినట్లు ర‌మేశ్ త‌న సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తీవ్ర సంచలనం సృష్తిస్తున్న ఘటనలో పలు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

16 నుండి టీఎస్ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 16 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాన చర్చ జరగనుంది.

శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి

శ్రీకాకుళం : నగరంలో రిమ్స్ ఆసుపత్రిలో గౌరీ అనే గర్భిణీ డెలివరీ కోసం వచ్చి చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన గౌరికి కడుపులో కవల పిల్లలున్నారని వైద్యులు రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. రక్తం ఎక్కించిన కాసేపటికే గౌరి మృతి చెందింది. దీంతో బంధువులు డాక్టర్లు సకాలంలో స్పందించకపోవడం వల్లే ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్నారని ఆందోళన చేపట్టారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం గౌరి గుండె పోటు వల్లే మృతిచెందింది అని వాదిస్తున్నారు.

బాపట్లఎంపీపీ మానం విజేతకు బెదిరింపులు

గుంటూరు : బాపట్లఎంపీపీ మానం విజేతకు ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ దూషించి బెదిరించారు. ఒప్పందం ప్రకారం పదవి నుంచి దిగిపోవాలంటూ హుకూం జారీ చేశారు. ఈ ఘటన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయ సమంక్షలోనే జరిగింది. నివ్వెరపోయిన విజేత స్మృహతప్పి పడిపోయింది. వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డిసెంబర్ 18న నల్లబ్యాడ్జీలతో నిరసన: ముద్రగడ

విశాఖ : డిసెంబర్ 18న నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నట్లు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఆందోళన చేస్తున్నామని, 30న ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో జనవరి 10 లోపు 100% నగదు రహిత లావాదేవీలు జరిపేలా కార్యాచరణ సిద్ధం చేశామని, దీనికోసం బ్యాంకర్లు, అధికారులతో ప్రత్యేక కమిటీ వేశామని స్పష్టం చేశారు. ప్రతినెలా రాష్ట్ర వ్యాప్తంగా 35.96లక్షల ఆసరా ఫించన్ల పంపిణీ, మరో 4.52 లక్షల ఫించన్లు నగదు రూపలో ఇస్తున్నామన్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: ఆర్బీఐ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు తగ్గించకపోవడంతో 41 పాయింట్లు తగ్గి 8102 వద్ద నిఫ్టీ ముగిసింది. 156 పాయింట్లు తగ్గి 26237 వద్ద సెన్సెక్స్ ముగిసింది.

పెద్ద నోట్ల రద్దు విధానపరమైన నిర్ణయం : వెంకయ్య

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు విధానపరమైన నిర్ణయం అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. లోపాలు ఉంటే నిలదీయాలిగానీ.. సభను అడ్డుకోవడం సంస్కృతి కాదన్నారు. 44 మంది సభ్యులున్న పార్టీ... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయడం లేదని, తాము చెప్పినట్లు వినమనడం ఏ ప్రజాస్వామ్యమో వారే చెప్పాలన్నారు. కాంగ్రెస్, తృణమూల్, కమ్యూనిస్టులు సభలో బృందగానం వినిపిస్తున్నాయని, బెంగాల్ లో ఆ మూడు పార్టీలు రోడ్లపై కొట్టుకుంటాయన్నారు. ఇలాంటి వారి ప్రవర్తన ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రతిపక్షాలు పార్లమెంటు వ్యవస్థకే అపచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో విద్యారంగ సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ పోరు..

హైదరాబాద్ : తెలంగాణలో విద్యారంగ సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ పోరు జరపనుంది. డిసెంబర్ 9 నుండి జనవరి 26 వరకు అన్ని వర్సిటీలు, జిల్లాల్లో టీఎన్ఎస్ఎఫ్ బహిరంగసభలు జరపనుంది. డిసెంబర్ 9న కేయూలో విద్యార్థి పోరుసభ పోస్టర్ ను టిడిపి అధికార ప్రతినిధి నండూరి నర్సిరెడ్డి ఆవిష్కరించనున్నారు. 

15:48 - December 7, 2016

అనంతపురం : పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కృష్ణం డెంటల్‌ కేర్‌ ఆస్పత్రిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంభించారు. అనంతపురంలో అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. నిపుణులైన వైద్యులతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినందుకు యజమానులైన శివరాజ్‌, సిందూరలను ఆయన అభినందించారు. ఈ అవకాశాన్ని అనంతపురం జిల్లాలోని ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.

15:45 - December 7, 2016

రాజమండ్రి : నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తూ రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ జరిగింది. వై.జంక్షన్ నుంచి నన్నయ్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలకు ప్రజలందరూ సహకరించాలని యూనివర్సిటీ ఉపకులపతి ముత్యాలనాయుడు అన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:43 - December 7, 2016

విజయవాడ : నెల రోజులు కావొస్తున్నా..ప్రజలకు మాత్రం నోట్ల కష్టాలు తీరడంలేదు. దేశవ్యాప్తంగా డబ్బులు దొరక్క ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎక్కడ తిరిగినా...ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు రోజువారీ ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి. 

15:38 - December 7, 2016
15:35 - December 7, 2016

హైదరాబాద్ : పెద్దనోట్లు రద్దు నెల గడుస్తోంది. కానీ కష్టాలు మాత్రం తీరడం లేదు. బ్యాంకులు..ఏటీఎంల ఎదుట ప్రజలు పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల వద్దకు ప్రజల తాకిడి ఎక్కువైంది. దీనితో బ్యాంకు అధికారులు..సిబ్బందిపై పని భారం ఎక్కువైంది. సేవలందించాలనే ఉద్ధేశ్యంతో పని గంటలు పెంచుకుంటున్నారు. పీఓఎస్ యంత్రాలు ఉపయోగించడం వల్ల నగదు కష్టాలు తీరుతాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. క్యాష్ లెస్ ఎకనామిపై ప్రజలు దృష్టి సారించాలని హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపం ఎస్ బీ హెచ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆమె టెన్ టివితో పలు విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:28 - December 7, 2016

బెంగళూరు : మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకొనే అవకాశం ఉంది. పెద్ద నోట్లను మార్పిడిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సూసైడ్ నోట్ లో 'గాలి' పేరు ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గత కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సందర్భంలోనే గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అట్టహాసంగా నిర్వహించారు. సుమారు రూ. 600 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాకు చెందిన అధికారి భీమా నాయక్ డ్రైవర్ రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. వంద కోట్ల రూపాయల మార్పిడిలో రమేష్ గౌడ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. కరెన్సీ నోట్లు తక్కువగా వచ్చాయని గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు రమేష్ గౌడను బెదిరించినట్లు తెలుస్తోంది. తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇతని సూసైడ్ లో గాలి జనార్ధన్ రెడ్డి పేరు ఉందని, మొత్తం 30 అంశాలు పేర్కొన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనలో

ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

15:21 - December 7, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు జరుగుతున్న తీరు పట్ల బీజేపీ కురువృద్ధుడు..సీనియర్ పార్లమెంటేరియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దనోట్లు రద్దుపై ఉభయసభలూ వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం పార్లమెంట్ లాబీలో అద్వానీ కొంతమంది మిత్రులతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. సభ సజావుగా జరగాలని ఏ ఒక్క సభ్యుడు కూడా కోరుకోవడం లేదని, సభను పదే పదే వాయిదా వేసే కంటే మొత్తం సమావేశాలను రద్దు చేయాలని సూచించారు. స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి సభను సక్రమంగా జరగనివ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. సొంత పార్టీపైనే అద్వానీ పలు విమర్శలు చేశారని వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అద్వానీ పేర్కొన్నారు. సొంత పార్టీని అద్వానీ విమర్శించలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

15:16 - December 7, 2016

ముంబై : ద్రవ్యపరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష నిర్వహించింది. ముంబైలో జరిగిన సమావేశంలో జరిగిన అంశాలను ఉర్జిత్ పటేల్ మీడియాకు తెలియచేశారు. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు. రెపోరేటు 6.25 శాతమని రివ‌ర్స్ రెపోరేటు కూడా 5.75 శాతంగానే ఉంటుంద‌ని చెప్పింది. నాలుగో త్రైమాసికం నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2016-17 వృద్ధి రేటు అంచనాను 7.6 శాతం నుండి 7.1 శాతానికి తగ్గించింది. 

గాలి మెడకు మరో ఉచ్చు..

బెంగళూరు : గాలి జనార్ధన్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బిగియనున్నట్లు తెలుస్తోంది. ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని సూసైడ్ నోట్ లో గాలి జనార్ధన్ రెడ్డి పేరు ఉండడం కలకలం సృష్టిస్తోంది. 

ద్రవ్యపరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష..

ముంబై : ద్రవ్యపరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచనుంది. రెపోరేటు 6.25 శాతమని ప్రకటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని, నాలుగో త్రైమాసికం నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2016-17 వృద్ధి రేటు అంచనాను 7.6 శాతం నుండి 7.1 శాతానికి తగ్గించింది. 

కేసీఆర్ పై షబ్బీర్ ఆగ్రహం..

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ పై టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బుల్లెట్ ఫ్రూఫ్ ఇంటికి డబ్బులున్నాయి కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకొనేందుకే మోడీని కేసీఆర్ కలిశారని ఆరోపించారు. విద్యార్థుల కోసమే సోనియా తెలంగాణ ఇచ్చారని, విద్యార్థుల సమస్యలపై ఈనెల 20వ తేదీన హైదరాబాద్ లో ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

14:33 - December 7, 2016

ఢిల్లీ : రాజ్యసభలో బుధవారం కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుండి పలుమార్లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. పెద్దనోట్లు రద్దుపై విపక్షాలు పలు ప్రశ్నలు సంధించారు. సోదాల్లో కొత్త నోట్లు భారీ ఎత్తున లభ్యమౌతున్నాయని, దీనిపై విచారణ చేయిస్తారా అని సుఖోయ్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి సభకు వస్తే చర్చ జరుగుతుందని తిరుచ్చి శివ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు వస్తారని, చర్చలో పాల్గొంటారని అధికారపక్షం పేర్కొంటోందని డిప్యూటి ఛైర్మన్ పేర్కొన్నారు. వివిధ అంశాలు..సమస్యలపై సభ్యులు లేవనెత్తడం జరిగిందని, ఇందుకు సంబంధిత శాఖలకు చెందిన మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎంపీ కేకే పేర్కొన్నారు. ఇందుకు ఎవరు సమాధానం చెబుతారని విపక్ష సభ్యులు అడగడం జరుగుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాన మంత్రి నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటన చేయడం జరిగిందని ఆనంద్ శర్మ సభ దృష్టికి తెచ్చారు. దీనితో ప్రజలు డబ్బుల కోసం క్యూ లైన్ లో నిల్చుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. సభలో చర్చను విపక్షాలే అడ్డుకుంటున్నాయని విమర్శించారు. తాను ప్రసంగించే సమయంలో ప్రధాని ఉండాలని సభ్యులు ఉండాలని కోరుకోవడం తగదని, ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. సభలో చర్చ జరగాలని విపక్షాలు కోరుకుంటున్నాయా ? లేదా ? అని ప్రశ్నించారు. దీనిపై సీపీఎం సభ్యుడు ఏచూరి తగిన సమాధానం చెప్పారు. అనంతరం విపక్షాలు ఆందోళన చేయడంతో డిప్యూటి ఛైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. 

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని విపక్షాపట్టుబట్టి ఆందోళన చేపట్టాయి. డిప్యూటీ ఛైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడం సభను రేపటికి వాయిదా వేస్తున్న ప్రకటించారు.

రాజ్యసభలో కొనసాగుతున్న నోట్ల రద్దు రగడ

ఢిల్లీ : వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ కొనసాగుతోంది. నట్ల రద్దు పై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభలో నోట్ల రద్దు రగడ కొనసాగుతోంది.

బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1180 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 48 గంటల తర్వాత తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 48 గంటల్లో ఏపీలోని కోస్తా తీరం వెంబడి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కరుస్తాయని, తీరం వెంబడి గంటలకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

14:05 - December 7, 2016

విజయవాడ : బెజవాడ..విజయవాడ నగరంలో పనిచేసే మున్సిపల్ వర్కర్లు ఎస్ బీఐ కు బారులు తీరుతున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న ఎస్ బీఐ బ్యాంకుకు కార్మికులు పోటెత్తుతున్నారు. పెద్దనోట్ల రద్దు అయి నెల రోజులు అవుతున్నా ప్రజలు కష్టాలు మాత్రం వీడడం లేదు. విజయవాడలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులు నగదు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకులు..ఏటీఎంల ఎదుట క్యూ లైన్లు కడుతున్నారు. దీనితో కార్పొరేషన్ లోని బ్యాంకు కార్యాలయం కిక్కిరిసిపోయింది. 4వేల విత్ డ్రా నిబంధనతో కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ వదులుకొని వస్తున్నామని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. 

14:04 - December 7, 2016

హైదరాబాద్ : బతుకమ్మ పాటలతో హర్యానా రాష్ట్రం హోరెత్తనుందా? తెలంగాణ బోనాల సంబురాలు.. ఉత్తరాదిన సందడి చేయనున్నాయా? తప్పెటగుళ్లు, పేరిణీ నాట్యాలతో హరితరాష్ట్రం పులకరించనుందా? తెలంగాణ సాయుధ రైతాంగ వీరగాధలు, ఒగ్గు కథలు హర్యానా రాష్ట్రంలో కనువిందు చేయనున్నాయా?

రాష్ట్ర సంస్కృతి- సంప్రదాయాలు ఉత్తర భారతదేశంలో
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి- సంప్రదాయాలు ఉత్తర భారతదేశంలో కనువిందు చేయనున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాలు, కళలు.. హర్యానాలో వెళ్లివిరయబోతున్నాయి. బతుకమ్మ ఆటలు, బోనాల సంబురాలు అంబరాన్ని తాకనున్నాయి.

ఏక్‌ భారత్‌ కార్యక్రమాన్ని రూపొందించిన కేంద్రం
భారతదేశం ఒక్కటేనని చాటేలా... ఏక్‌ భారత్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దేశం నలుమూలల ఉన్న సాంస్కృతిక సంపద ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునేలా...ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఒక రాష్ట్రం మరో రాష్ట్రంతో అనుసంధానం చేయబడుతుంది. తన భాగస్వామ్య రాష్ట్రంతో సంస్కృతి, కళలు, వారసత్వ సంపద సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ, హర్యానా రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం
ఏక్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది తెలంగాణ, హర్యానా రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాలు సాంస్కృతికంగా సహకారం అందించుకుంటాయి. ఒక రాష్ట్రంలోని ఉత్సవాలు, పండుగలు మరో రాష్ట్రంతో పంచుకుని సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేసుకుంటాయి. ఏడాది మొత్తం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఒకరి పండుగలకు మరొకరిని ఆహ్వానించడం, తమ ప్రసిద్ధ వంటకాలను భాగస్వామ్య రాష్ట్రానికి రుచి చూపించేలా కార్యక్రమ రూపకల్పన జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ వేదికగా కైట్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక హర్యాణాలో ఈనెల రెండో వారంలో చారిత్రక కురుక్షేత్ర నగరానికి సంబంధించి భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తున్నప్పటికీ...సదుద్దేశంతో తలపెట్టిన ఏక్‌భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలంగాణ టూరిజంశాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటపాటలు, సంస్కృతి - సంప్రదాయాలు ఉత్తరభారతానికి పరిచయం కానుండడంపై కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

13:59 - December 7, 2016

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డిని పదవీ నుంచి తొలగించాలని రాజ్యసభ సభ్యులు ఇచ్చిన మహాభియోగ తీర్మానం నోటీసుపై చర్చకు ఛైర్మన్‌ హామీద్‌ అన్సారీ ఆమోదం తెలిపారు. మూడు ప్రధాన అభియోగాలను నోటీసులో పేర్కొన్నారు. దళిత జడ్జిపై దాడి చేయడం.. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇచ్చిన ఈ నోటీసుపై ఆయనతో పాటు మరో 61 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

నాగార్జున రెడ్డిని పదవీ నుంచి తొలగించాలంటూ 61 మంది ఎంపీల సంతకాలు
తనకు న్యాయం చేయాలంటూ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని మూడు నెలల క్రితం దళిత జూనియర్‌ సివిల్‌ జడ్జి రామకృష్ణ ఆశ్రయించారు. ఆధారాలను అన్నింటినీ పరిశీలించిన సీతారాం ఏచూరి.. ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్‌ నాగార్జున రెడ్డిపై రాజ్యసభలో మహాభియోగ తీర్మానం నోటీసు ఇచ్చారు. జస్టిస్‌ నాగార్జున రెడ్డిని పదవీ నుంచి తొలగించాలని ఇచ్చిన నోటీసుపై వివిధ పార్టీలకు చెందిన 61 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

రామానుజులును తెల్లకాగితంపై సంతకం చేయాలని పవన్ కుమార్ డిమాండ్‌
కడప జిల్లా రాయచోటి కోర్టులో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న పవన్‌ కుమార్‌ రెడ్డి హైకోర్టు జడ్జి జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి తమ్ముడు. 2012లో పవన్‌ కుమార్‌ రెడ్డి తన వద్ద పని చేస్తున్న రామానుజులు అనే వ్యక్తిని తెల్లకాగితం మీద సంతకం చేయాలని డిమాండ్‌ చేశారు. దానికి నిరాకరించడంతో రామానుజులుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత రామానుజులు చనిపోతూ దళిత జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. రామకృష్ణకు మరణ వాంగ్మూలాన్ని ఇచ్చారు. తన మరణానికి పవన్‌ కుమార్‌ రెడ్డినే కారణమంటూ వాంగ్మూలంలో స్పష్టం చేశాడు.

తమ్ముడి పేరును మరణ వాగ్మూలం నుంచి తొలగించాలని రామకృష్ణకు ఫోన్
2012 నవంబర్‌ 30న జస్టిస్‌ నాగార్జున రెడ్డి రామకృష్ణకు ఫోన్‌ చేసి తన తమ్ముడి పేరును మరణ వాగ్మూలం నుంచి తొలగించాలని ఆదేశించారు. అందుకు రామకృష్ణ నిరాకరించడంతో రాయచోటిలోని తన నివాసంలో జస్టిస్‌ నాగార్జున రెడ్డి, అతని తమ్ముడు పవన్‌ కుమార్‌ రెడ్డి రామకృష్ణను దుర్భాషలాడటమే కాకుండా బూటు కాలుతో తన్ని అవమానించారు. ఈ సంధర్భంలో వారి సంభాషణ అంతా రామకృష్ణ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న రామకృష్ణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసి రశీదు తీసుకున్నారు.

తప్పుడు ఆరోపణలతో రామకృష్ణపై కేసులు..సస్పెండ్..
రామకృష్ణ తమ దారికి రాకపోవడంతో ఆగ్రహించిన జస్టిస్‌ నాగార్జున రెడ్డి.. తప్పుడు ఆరోపణలతో రామకృష్ణపై కేసులు పెట్టించారు. దీనిపై నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోగా.. రామకృష్ణను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ మొత్తం వ్యవహరాన్ని రామకృష్ణ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా చట్టపరంగా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పింది. ఒక జడ్జిని పదవీ నుంచి తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉండటంతో రాజ్యసభ సభ్యులైన సీతారాం ఏచూరిని రామకృష్ణ ఆశ్రయించారు.

చర్చకు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదం
రామకృష్ణ ఇచ్చిన రికార్డులన్నింటినీ పరిశీలించిన సీతారాం ఏచూరి.. మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. ప్రధానంగా మూడు అభియోగాలను నోటీసులో పేర్కొన్నారు. దళిత జడ్జిపై దాడి చేయడం.. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై చర్చకు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదం తెలిపారు. 

పార్లమెంట్ జరుగుతున్న తీరుపై అద్వానీ అసహనం

ఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల తీర్పు బిజెపి సీనియర్ నేత ఎల్ కే అద్వానీ అసహనం వ్యక్తం చేశారు. ఏ ఒక్క సభ్యుడు కూడా సభ సక్రమంగా జరగాలని కోరుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి సభను సక్రమంగా జరగనివ్వడం లేదని సీనియర్ బిజెపి నేత ఎల్ కే అద్వాని ఆరోపించారు. సభను పదే పదే వాయిదా వేసే బదులు మొత్తానికే వాయిదా వేస్తే సరిపోతుందని మండిపడ్డారు.

13:48 - December 7, 2016

మహిళలు చీరలు కొనుకోవటం ఒక ఎత్తు అయితే ఆ శారీ మీదికి మాచింగ్ బ్లౌజ్ కొనుకోవటం మురో ఎత్తు. ఇప్పుడు లేటెస్ట్ గా పలు రకాల డిజైన్లతో బ్లౌజ్ లు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇవి మల్లీ కలర్ లో కూడా దొరుకుతున్నాయి. దీంతో ఏ కలర్ శారీ మీదికైనా ఈ బ్లౌజ్ లు మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు అటువంటి డిజైనర్ బ్లౌజులపై ఓ లుక్ వేద్దాం..

సంక్షేమ పథకాలకు గండికొట్టే కుట్ర : పొంగులేటి

హైదరాబాద్ : క్యాస్ లెస్ లావాదేవీలపై సీఎం కేసీఆర్ కు అవగాహన లేదని కాంగ్రెస్ పొంగులేటి ఆరోపించారు. రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులను కేసీఆర్, చంద్రబాబులు కేంద్రానికి చెప్పడం లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దును సాకుగా చూపి కేసీఆర్, చంద్రబాబులు సంక్షేమ పథకాలకు గండికొట్టేందుకు కుట్ర చేస్తున్నారని, రైతుల రుణాలపై మారిటోరియం విధించాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

13:44 - December 7, 2016

ఢిల్లీ : దేశవ్యాప్తంగా నల్లధనంపై ఈడీ కొరడా ఝుళిపించింది. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేశారన్న సమాచారంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 50 పైగా బ్యాంకుల్లో సోదాలు చేపట్టింది. ప్రముఖుల ఖాతాలను పరిశీలించనుంది. కాగా పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యాంకు సిబ్బంది కమిషన్ తీసుకుని పాత నోట్లను భారీ ఎత్తున మారుస్తున్నారనే సమాచారంతో ఈడీ ఈ దాడులు చేపట్టినట్లుగా తెలుసో్తంది. ఈ క్రమంలో, డబ్బులు బ్యాంకులకు వస్తున్నప్పటికీ, సామాన్యులకు మాత్రం అందుబాటులోకి రాకుండా పోతోంది. నగదు రవాణా, మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి.

13:41 - December 7, 2016

కామారెడ్డి : పదండి ముందుకు..పదండి పల్లెకు అంటూ..సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్ర తెలంగాణలోని పల్లెల్లో పర్యటిస్తోంది. సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర 52వ రోజుకు చేరుకుంది. ప్రతి గ్రామంలో ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి విన్నివించుకుంటున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని రుద్రూర్ గ్రామంలో పాదయాత్ర కొనసాగుతోంది. కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు చిన్న పరిశ్రమలను పాదయాత్ర బృందం దర్శించింది. 

13:39 - December 7, 2016

విశాఖ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరో 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతానికి 1180 కిలోమీటర్లు దూరంలో విశాఖకు దక్షిణ ఆగ్నేయంగాను.. గోపాల్ పూర్‌కు 1280కిలోమీటర్ల దూరంలోనూ.. అండమాన్‌కు 250 కిలో మీటర్లు దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందన్నారు. వాయుగుండం గంటకు 14 కిలోమీటర్లు వేగంతో పయనిస్తుందని తెలిపారు. వాయుగుండం తుపాన్ గా మారితే పాకిస్థాన్ సూచించిన వరదగా నామకరణం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:32 - December 7, 2016

అన్నయ్య 'మెగాస్టార్ చిరంజీవి'ని తెరపై ఎప్పుడెప్పుడు చూడాలని మెగా ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' మేకప్ వేసుకుని 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ఆయన ఎలాంటి ఫైట్లు..ఎలాంటి డ్యాన్స్ వేశారోనని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారంట..దీనికి తోడు సోషల్ మాధ్యమాల్లో ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త తిరుగుతోంది. ఓ పాటకు డ్యాన్స్ వెరైటీగా ఉండాలని 'చరణ్' చెప్పడంతో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వెరైటీ డ్యాన్స్ ను పరిచయం చేస్తున్నాడంట. ఈ పాటను 'మౌలిన్ రోజ్' శైలిలో తెరెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పేరొందిన నైట్ క్లబ్..
'మౌలిన్ రోజ్' అనేది పారిస్ లో నృత్యాలకు పేరొందిన నైట్ క్లబ్. మరో వారం రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. ఈ పాట చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. త్వరలోనే చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగా వారసుడు 'రామ్ చరణ్' నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్టు 'కత్తి'కి రీమేక్ గా తెరకెక్కుతోంది. 'వినాయక్' డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'చిరంజీవి' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాకి మేసేజ్ ని జోడించి ఈ మూవీని వెరీ ఇంట్రెస్ట్ గా వినాయక్ మలుస్తున్నట్లు సమాచారం. 

అక్రమకేసులతో ప్రభుత్వం వేధిస్తోంది: విమలక్క

హైదరాబాద్ : తమపై అక్రమకేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క ఆరోపించారు. ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం సీజ్ చేయండంపై హైకోర్టులో పిటీషన్ వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

13:08 - December 7, 2016
13:02 - December 7, 2016

ఢిల్లీ : లోక్ సభలో గందరగోళం కొనసాగుతోంది. జీరో అవర్ లో విపక్ష సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రశ్నోత్తరాల కార్య్రమాన్ని కొనసాగిస్తున్నారు.లోక్ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధాని సమక్షంలోనే విపక్ష సభ్యులు నోట్ల రద్దుపై ప్రధానికి వ్యతరేకంగా నినాదాలు చేశారు. కేంద్రమంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ..నిబంధన 193 ప్రకారం చర్చకు తాము సిద్ధమేనని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ స్పష్టం చేశారు. దీనిపై చర్చ అవసరం లేదని ప్రపంచమే ప్రధానిని గుర్తించిందని టైమ్‌ మ్యాగ్జైన్‌లో మోదికి మొదటి స్థానం దక్కడం ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ..ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ కల్పించాలని కోరారు. నోట్ల రద్దుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య పలు బిల్లులకు సభ ఆమోదం పలికింది. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక..వై.వీ.సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హామీపై రెండున్న‌ర ఏళ్లుగా కాల‌యాప‌న చేస్తున్నార‌నీ..ఈ అంశంపై హోదా కోసం నిర‌స‌న‌లు తెలుపుతున్న ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని ఉద్ఘాటించారు. అనంతరం లోక్ సభను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. 

12:52 - December 7, 2016

నారా రోహిత్..టాలీవుడ్ నవతరం హీరోల్లో ఒకరు. వరసుగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ రావడం లేదు. బొద్దు బొద్దుగా ఉండే ఈ హీరోకు అత్యధిక సినిమాలు చేసే హీరోగా గుర్తింపు ఉంది. పలు సినిమాలు వరుసగా బాక్సాపీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సినిమాల్లో మరీ బరువెక్కిపోయి ఎబ్బెట్టుగా తయారయ్యాడనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు కారణం తన శరీర బరువు అనుకున్నాడే ఏమో కానీ బరువు తగ్గించాలని అనుకున్నాడంట. అంతేగాక సిక్స్ ప్యాక్ హీరోస్ క్లబ్ లో చేరాలని అనుకున్నాడంట ఈ బొద్దు హీరో. ఇప్పటికే 'అప్పట్లో ఒకడుండేవాడు'తో పాటు, రాజకుమారి' సినిమాల్లో కూడా 'రోహిత్' లావుగా కనిపిస్తాడని టాక్. దీని తరువాత యాక్షన్..డ్రామాతో ఓ చిత్రం తెరకెక్కుతోందంట. ఈ సినిమా కోసం 'రోహిత్' న్యూ లుక్ ట్రై చేస్తున్నాడట. అతను జిమ్ లో చెమటోడుస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. స్పెషల్ ట్రైనర్ సమక్షంలో రోజుకు ఆరు గంటలు జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమౌతుందని తెలుస్తోంది. అప్పటి వరకు సిక్స్ ప్యాక్..లేదా ఫిజిక్ మారుస్తాడా ? అనేది వేచి చూడాలి. 

డబుల్ బెడ్ రూం ఇళ్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష

నిర్మల్ : కలెక్టరేట్ లో డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హౌసింగ్ ముఖ్యకార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

సుకుమా జిల్లాలో 5 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత

ఛత్తీస్ ఘడ్ : సుకుమా జిల్లాలో 5 కిలోల పేలుడు పదార్థాలను సీఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

లోక్ సభ మ.2గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం పై విపక్షాల ఆందోళనల మధ్యే లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం, జీరో అవర్ కొనసాగింది. దీంతో సభలో గందరగోళం నెలకొడంతో సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

12:38 - December 7, 2016

మరో పోకిరీ మాస్టరు...వీళ్లు మారరా..ఏడాదిగా వేధిస్తున్నాడు..ఫిర్యాదులు చేస్తున్నా నో యాక్షన్..వారం రోజులుగా ఆ పోకిరీ మాస్టరు చేష్టలు పెరిగిపోయాయి..

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టర్లు తప్పటుడుగు వేస్తున్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయుడు వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలంలో ఆం.ప్ర.ఆదర్శ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా సాగర్ పనిచేస్తున్నారు. ఇతను ఏడాదిగా విద్యార్థులను వేధిస్తున్నాడు. దీనితో విద్యార్థులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ మాస్టర్ మాత్రం మారలేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. చివరకు విద్యార్థుల తల్లిదండ్రులు...విద్యార్థుల సంఘాలు ఆందోళన చేశారు. ఏకంగా రాస్తారోకోల వరకు వెళ్లిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు అధికారులు దిగొచ్చారు. కమిషనర్ కు అధికారులు నివేదిక పంపించారు.

రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడి

కాకినాడ : ఇంద్రపాలెంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ జయరాజ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.

నల్లధనం పై ఈడీ కొరడా

ఢిల్లీ : నల్లధనంపై ఈడీ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో 50 బ్యాంకుల్లో ప్రముఖుల ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేశారన్న సమాచారంతో బ్యాంకుల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

12:26 - December 7, 2016

పెద్ద నోట్ల రద్దుతో పెరిగిన నేరాలు..సరికొత్త నేరగాళ్లతో పోలీసుల పరేషాన్...అధికారం ముసుగులో దందాలు..

నోట్ల రద్దు ఎందరో కొత్త కొత్త నేరగాళ్లను తయారు చేస్తోంది. అధికార ముసుగులో దందా చేస్తున్న వారి గుట్టు బయటపడుతోంది. ఇప్పటికే ఎందరో దొరికిపోగా మరెందరిపైనో నిఘా ఉంది. ఇంకా ఎందరో అధికారుల వద్ద కొత్తనోట్లు ఉన్నాయని అనుమానాలున్నాయి. రాత్రికి రాత్రి మాయం చేసిన నోట్లను నల్ల బజార్ కు తరలించేస్తున్నారు. కమిషన్లు మాట్లాడుకుని భారీగా దందాలు చేస్తున్నారు. బ్యాంకులు..పోస్టాఫీసుల్లో నిఘా పెరిగింది. నియంత్రించేందుకు బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసుల్లో కొందరు మార్పిడి చేస్తున్నారు. ఇలా ఎవరికి అవకాశం దొరికితే వారు నోట్ల రద్దుతో దందాకు తెరలేపారు. కోట్లు సంపాదించే పనిలో పడ్డారు. వీరికి తోడు ముఠాలు కూడా జత కలవడంతో నల్లధనం కాస్తా కొత్త కరెన్సీతో..నల్లధనంగా ఉండిపోతుంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే క్యాష్ బయటికొస్తోంది. నిబంధనలు పట్టించుకోని కొందరు బ్యాంకు అధికారులు..పోస్టాఫీస్ సిబ్బంది నల్లకుబేరులకు అండగా నిలిచారు. లక్షల్లో సొమ్మును రాత్రికి రాత్రే మార్చేశారు. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అక్రమాలకు చెక్ పడుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దందా చేస్తున్న ముసుగు తొలగిస్తున్నారు...మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

లోక్ సభలో విపక్షాల ఆందోళన

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై చర్చించాలని లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనల మధ్యే పలు బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

12:09 - December 7, 2016

చెన్నై బ్యూటీ 'రెజీనా' రూట్ మార్చింది. తెలుగులో సాధ్యం కానిది తమిళంలో సాధించాలని కసిగా ఉంది. అందుకే తగ్గట్టే కోలీవుడ్ ఈ బ్యూటీకి ఎర్రతివాచీ పరుస్తోంది. 'రెజీనా' తమిళంలో జోరు పెంచింది. మొదట్లో తెలుగు సినిమాలపై దృష్టి పెట్టిన ఈ చిన్నది ఇక్కడ ఎడాపెడా సినిమాలు చేసేసింది. ఇప్పుడు తమిళం నుంచి మంచి ఆఫర్లు వస్తుండడంతో వరుసగా అక్కడ సంతకాలు చేసేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ బ్యూటీ ఏకంగా ఐదు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అనుకోని విధంగా తమిళంలో ఇలా వరుసగా క్రేజీ ఛాన్స్ లు రావడంతో తన కల నేరవేర్చుకోవాలని 'రెజీనా' భావిస్తుంది.తెలుగులో ఎంత ట్రై చేసినా 'రెజీనా' ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క బడా స్టార్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. 'రవితేజ', 'సాయిధరమ్ తేజ్' లాంటి క్రేజీ స్టార్స్ తో నటించింది. కానీ బిగ్ స్టార్స్ తో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. దీంతో 'రెజీనా' సెకెండ్ స్టేజ్ హీరోయిన్స్ గ్రూప్ లోనే ఉంది. 'రెజీనా' తమిళంలో దర్శకుడు 'ఎస్ జె సూర్య'తో 'నెంజం మరప్పదిల్లె' చిత్రంలో నటిస్తోంది. ఇక 'శరవణన్ ఇరుక్క భయమేన్', 'జెమిని గణేశనుంసురులి రాజనుం', 'రాజ తందిరం 2', 'మానగరం' ఈ చిత్రాలన్ని కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఈ సినిమాలతో సక్సెస్ లు కొట్టి తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని 'రెజీనా' కలలు కంటుంది. 

12:08 - December 7, 2016

ఢిల్లీ : వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నోట్ల రద్దు రగడతో వాయిదా పడిన లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొంతసేపటికే మళ్లీ గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని నినాదాలుచేపట్టారు. సభకు సహకరించాలని చైర్మన్ హమీద అన్సారీ  సభ్యులను కోరారు. సభ్యులు వినకపోవటంతో సభను మ.2.00 గంటలకు వాయిదా వేశారు.లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 

రాజ్యసభ మ.2గంటల వరకు వాయిదా

ఢిల్లీ : కొద్ది సేపటి క్రితం వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నోట్ల రద్దు అంశం పై ప్రధాని చర్చకు రావాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నాయి. ఛైర్మన్ సభ్యులు ఎంత వారించినా వినకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ కొనసాగిస్తున్నారు.

రాజ్యసభలో గందరగోళం

ఢిల్లీ : కొద్ది సేపటి క్రితం వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నోట్ల రద్దు అంశం పై ప్రధాని చర్చకు రావాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నాయి.

12:04 - December 7, 2016

'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే'. షార్ట్ కట్ లో 'డీడీఎల్ జే' ఈ మూవీ తెలియని సినీ లవర్ ఉండడేమో. 21 ఏళ్ల క్రితం రిలీజైన 'డీడీఎల్ జే' సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ సినీ ఇండస్ట్రీలో అప్పటి వరకున్న రికార్డులు తుడిచేసి కొత్త రికార్డ్స్ సెట్ చేసింది. ఈ మూవీ సక్సెస్ తో హీరోగా 'షారుక్' జీవితం మారిపోయింది. డీడీఎల్ జే లాంటి క్లాసిక్ చిత్రం తీసిన ఆదిత్య చోప్రా ఇప్పుడు 'బేఫికర్' అంటూ బోల్డ్ కంటెంట్ తో హంగామాకు రెడీ అయ్యాడు. 23ఏళ్ల కెరీర్ దర్శకుడు ఆదిత్య చోప్రా తీసింది మూడే సినిమాలు. ఇప్పుడు నాలుగవ సినిమాగా 'బేఫికర్' తెరకెక్కించాడు. ఎలాంటి కాన్సెప్ట్ అయినా హీరో.. హీరోయిన్స్ పద్దతిగా కనిపిస్తారు. కానీ 'బేఫికర్' మూవీలో మాత్రం 'రణవీర్ సింగ్', 'వాణికపూర్' ను అల్ట్రా మోడ్రన్ జంటగా చూపిస్తున్నాడు.

9న రిలీజ్..
'బేఫికర్' ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తే 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' లాంటి క్లీన్ మూవీ తీసిన దర్శకుడేనా ఈ మూవీ తీసింది అనే అనుమానం కలుగుతుంది. ఇలాంటి వాటికి దర్శకుడు ఆదిత్య తనదైన స్టైల్ లో అన్సార్ ఇస్తున్నాడు. 23 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు. ఈ జనరేషన్ వేరు. 2O ఏళ్ల ఉన్నప్పుడు 'డీడీఎల్ జే' నా ఏజ్ కి తగ్గ సబ్జెక్ట్. నా ఆలోచనలు అందరికీ నచ్చాయ్. ఇప్పుడు నేను ట్వంటీ త్రీలో ఉంటే డీడీఎల్ జే కథ ఆలోచించలేను. కాలం మారిపోయింది. థాట్స్ మారిపోయాయ్. ఇప్పుడున్న యూత్ లా ఆలోచిస్తే 'బేఫికర్' కరెక్ట్ మూవీ అంటూ ఆదిత్య చోప్రా సినిమాపై క్లారిటి ఇచ్చాడు. 20 ఏళ్లలో ప్రేమ నిర్వచనం మారిపోయింది. దానికి తగ్గట్టే 'బేఫికర్' ఉంటుందట. మరి 'డీడీఎల్ జే'లో రాజ్, సిమ్రాన్ తో యూత్ ని కట్టి పడేసిన ఈ దర్శకుడు ఈ నెల 9 రిలీజ్ కానున్న 'బేఫికర్' మూవీలోని ధరమ్, షైరా గిల్ తో ఎలా మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

12:01 - December 7, 2016

ఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు ఉత్తరాది రాష్ట్రాలు హిమ కౌగిట్లో ఒదిగిపోతాయి. దేశ రాజధాని ఢిల్లీకి కూడా తుషారపు మత్తులో ఒదిగిపోయింది. ఢిల్లీని పొగమంచు దుప్పటిలా చుట్టేసింది. ఉత్తరాది రాష్ట్రాలలో మంచు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఢిల్లీ వాసులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరోవైపు పొగమంచు ప్రభావంతో పలు అంతర్జాతీయ విమానాలతోపాటు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మూడు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. 5 దేశీయ విమాన సర్వీసులు, 8 అంతర్జాతీయ విమాన సర్వీసులను విమానయాన సంస్థ అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. పరిస్థితి అనుకూలించకుంటే మరిన్ని సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రధాని వెంటనే సభలో సమాధానం చెప్పాలి:మాయావతి

ఢిల్లీ: ప్రజలు తీవ్రఆందోళనలో ఉన్నారని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో నోట్ల రద్దుతో 29 రోజులుగా ప్రజలు బాధలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని వెంటనే సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్లతో జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి సమావేశం

హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి సమావేశం అయ్యారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూసేకరణపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు కూడా హాజరయ్యారు.

లోక్ సభ మ.12గంటల వరకు వాయిదా

ఢిల్లీ : మోడీ నిరంకుశత్వం నశించాలంటూ లోక్ సభలో ఎంపీలు నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

11:29 - December 7, 2016

ఢిల్లీ : శీతాకాల సమావేశాలలో భాగంగా పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. మంగళవారం తమిళనాడు జయలలిత మృతికి సంతాపం తెలిపిన ఉభయసభలు అనంతరం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి బుధవారం ఉదయం ప్రారంభమైన ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు..నటుడు..జయలలితకు వ్యక్తిగత సలహాదారుడు..బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన చో.రామస్వామికి రాజ్యసభలో చైర్మన్ ఆధ్వర్యంలో రాజ్యసభలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించాయి. లోక్ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈక్రమంలో లోక్ సభలో 16వ రోజు కూడా విపక్ష సభ్యులు నోట్ల రద్దుపై ఆందళనను కొనసాగించాయి. మోదీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం స‌రికాదంటూ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారు. గంద‌ర‌గోళం మ‌ధ్యే స‌భ‌ కొన‌సాగుతోంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు తరువాత ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం గైడ్‌లైన్స్ కూడా ప్ర‌క‌టించ‌లేద‌ని విప‌క్ష‌నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రాజ్యసభలో నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేత ఆజాద్ మాట్లాడుతూ..ఏటీఎం ల వద్ద బ్యాంకుల వద్ద నిల్చుని దేశంలో 84 మంది మృతి చెందారనీ..ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పాతనోట్లను రద్దు చేసిన ప్రధాని ఎంతవరకూ నల్లధనాన్ని వెలికి తీశారు చెప్పాలని డిమాండ్ చేశారు. డిమాండ్ కు సరిపడా నగదు బ్యాంకుల్లో వున్నాయని ప్రభుత్వం చెబుతోందని మరి ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారని ఆజాద్ ప్రశ్నించారు. అటు లోక్ సభలో నోట్ల రద్దుపై ఇప్పటికే చర్చించామనీ..విపక్షాలు సభను అడ్డుకునేందుకు పదే పదే యత్నిస్తున్నాయని మంత్రి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మీడియాను ఆకర్శించేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుపై ప్రభుత్వం సిద్ధంగా వుందనీ..ప్రజలపై విపక్షాలకు నిజంగా అభిమానముంటే చర్చకు సిద్ధమవ్వాలన్నారు. రాజ్యసభలో నోట్ల రద్దుపై మాయావతి మాట్లాడుతూ..ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టటంలేదని విమర్శించారు. సభలో గందరగోళం నెలకొనటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ మ.12గంటలకు వాయిదా వేశారు. గందరగోళంతో  మధ్య లోక్ సభను కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ మ.12గంటలకు వాయిదా వేశారు.  

లోక్ సభలోనూ గందరగోళం

ఢిల్లీ : మోడీ నిరంకుశత్వం నశించాలంటూ లోక్ సభలో ఎంపీలు నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల నిరసనల మధ్యే లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

రాజ్యసభ మ.12గంటల వరకు వాయిదా

ఢిల్లీ : నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు టీవీ కవరేజ్ కోసం వాడుకుంటున్నాయి కేంద్ర మంత్రి జైట్లీ ఆరోపించడంలో విపక్షాలు భగ్గుమన్నాయి. వెంటనే ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

టీవీ కవరేజ్ కోసం నోట్ల రద్దు ఇష్యూని వాడుకుంటున్నారు:జైట్లీ

ఢిల్లీ : విపక్షాలు టీవీ కవరేజ్ కోసం నోట్ల రద్దు అంశాన్ని వాడుకుంటున్నాయని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. విపక్షాలకు దమ్ముంటే మేం చర్చకు ఇప్పుడే సిద్ధం అని, విపక్షాలు ఏదో ఒక సాకుతో రోజూ సభను అడ్డుకుంటున్నాయి ఆరోపించారు.

నోట్ల రద్దు తర్వాత 80 మంది చనిపోయారు : ఆజాద్

ఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత మొత్తం 80 మంది చనిపోయారని కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ పార్లమెంట్ లో తెలిపారు. ఏయే రాష్ట్రంలో ఎంత మంది చనిపోయారో లెక్క ఉందని, 5గురు బ్యాంకు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు అని తెలిపారు. నోట్ల రద్దు వల్ల మరణాలకి కారకులు ఎవరు అన్ని ప్రశ్నించారు. దీనికి రాజ్యసభలో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బు అంతా వచ్చేసిందని కేంద్రం చెబుతోందని, మరి కేంద్రం చెప్పినట్లు నల్లడబ్బు ఏది? పది రోజులుగా సమాచారం ఎదుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటే భారీ క్యూలు ఎందుకుంటున్నాయి వాటనికి సమాధానం చెప్పాలని ఆజాద్ డిమాండ్ చేశారు.

తెలంగాణకు ఐఐఎం కేటాయించాలి: సీతారాం నాయక్

ఢిల్లీ :తెలంగాణకు ఐఐఎం, ఇరత కేంద్ర సంస్థలను కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ కోరారు. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి మధ్య నిధుల వివక్ష వద్దని సూచించారు.

లోక్ సభకు హాజరైన ప్రధాని

ఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై సభలో చర్చించాలని విపక్షాలు ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. మరో వైపు ప్రధాని లోక్ సభకు హాజరయ్యారు.

16వ రోజు కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

ఢిల్లీ : ఉభయ సభలు కొద్దిసేపటి కిత్రం ప్రారంభం అయ్యాయి. 16వ రోజుకు చేరుకున్న ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది.

11:01 - December 7, 2016

ఖమ్మం : పెద్దనోట్ల రద్దుతో పేదల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నగరవాసులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతుంటే... గ్రామీణ ప్రాంతీయులు కనీస అవసరాలు తీరక.. అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పల్లెవాసుల జీవితాలు అంధకారంగా మారాయి.

పండితాపురం సంతకు పెద్దనోట్ల ఎఫెక్ట్‌
నోట్ల రద్దు వ్యవహారంతో.. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వారం వారం జరిగే సంతల్లో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మం జిల్లా... కామేపల్లి మండలం పండితాపురం సంతలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి బుధవారం.. ఇక్కడ జరిగే సంతలో కోటి 50 లక్షల రూపాయల వ్యాపారం జరిగేది. నోట్ల రద్దుతో ఇప్పుడది లక్ష రూపాయలకు పరిమితమైంది. కరెన్సీ కొరతతో సంతలో సరుకులు అమ్ముడుకావడం లేదు. సంతలో ఐదు వేలకుపైగా వచ్చేవని.. ఇప్పుడు కేవలం ఐదు వందల రూపాయలలోపే వస్తుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

ఖాళీగా దర్శనమిస్తున్న స్టాళ్లు..
నోట్ల రద్దుతో సంతలో కూరగాయలు.. పశువులు..పువ్వులు.. నిత్యావసరాలు.. దుస్తులు.. ప్లాస్టిక్‌ వస్తువులు.. వచ్చిపోయే వారికోసం పెట్టే టీ..టిఫిన్‌ స్టాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కూరగాయలు..పువ్వులు కొనేవారు లేక పాడైపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేసేదిలేక ఎంతోకంతకు వినియోగదారులకు ఇచ్చేస్తున్నారు. రూ.10, 20, 50, వంద రూపాయల నోట్లు కనిపిస్తే చాలు..బతిమాలి మరీ ధర తగ్గించి రైతులు అమ్ముకుంటున్నారు.

పూట గడవడం కష్టంగా ఉందంటున్న వ్యాపారులు
ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్‌ వాహనాల్లో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇక్కడ సంతకు సరుకులు తీసుకు వస్తుంటారు. తెచ్చినవి అమ్ముడుపోక..కనీస రవాణా ఖర్చులు కూడా రాక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో ఒక్కపూట గడవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.  

10:49 - December 7, 2016

నెల్లూరు : అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో... ఇప్పుడు మరో ప్రయోగించింది. ఉదయం 10.25 నిమిషాలకు కక్ష్యలోకి విజయవంతంగా దూసుకెళ్ళింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ వాహకనౌక ద్వారా... రిసోర్స్ శాట్-2A ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. భూమిపై వాతావరణ పరిస్ధితుల పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.

రిసోర్స్‌శాట్‌ -2సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
పీఎస్ ఎల్వీ సీ 36 రాకెట్‌ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందిన 1235 కేజీల బరువు కలిగిన రిసోర్స్ శాట్-2ఏ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. రిసోర్స్ శాట్-2ఏ ఉపగ్రహం ఐదేళ్ళపాటు భూ వాతావరణ పరిస్ధితులను ఛాయాచిత్రాలతో సహా పూర్తి వివరాలను అందించనుంది. అంతేకాదు... వాతావరణ పరిస్ధితులను అధ్యయనం చేయడానికి, విలువైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడనుంది.

ఇస్రోకు పాశుపతాస్త్రంలా పీఎస్ ఎల్వీ సీ 36 వాహకనౌక
ఇస్రోకు పీఎస్ ఎల్వీ సీ 36 వాహకనౌక పాశుపతాస్త్రం లాంటిది. ఇప్పటికే స్వదేశానికి చెందిన ఉపగ్రహాలతోపాటు... విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి వాణిజ్యపరంగానూ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెడుతోంది. ఇప్పటి వరకు పీఎస్ ఎల్వీ సీ 36 సిరీస్‌లో 37 ప్రయోగాలను ఇస్రో ప్రయోగించింది. ఇందులో మొదటి ప్రయోగం పీఎస్ ఎల్వీ సీ 36 డీ 1 తప్ప మిగతావన్నీ విజయవంతమవ్వటం విశేషం. వాతావరణం, భూగర్భ పరిశోధనలు, నావిగేషన్ వ్యవస్థ, రేడియో, గ్రహాలపై స్ధితిగతులకు సంబంధించిన 121 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ఇస్రో కక్ష్యలోకి చేర్చి.... అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికి తన సత్తా చాటింది. ఇప్పుడు 38 వ ప్రయోగాన్ని కూడా పీఎస్ ఎల్వీ సీ 36 ద్వారా చేపట్టనుంది. పీఎస్ ఎల్వీ సీ 36 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావటంతో ఇస్రోలో పండగవాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకున్నారు. తోటి శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందనలు..ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగం విజయవంతం కావటానికి టీమ్ వర్క్ తోడ్పడిందని తెలిపారు. 

పీఎస్ ఎల్ వీ సీ36 రాకెట్ ప్రయోగం విజయవంతం

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ36(పీఎస్‌ఎల్వీ-సీ36) వాహకనౌక విజయంతం అయ్యింది. కేవలం 17 నిమిషాల్లోనే రిసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహాన్ని పీఎస్ ఎలవీ సీ36 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన వివరాలను అందించనుంది. ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

10:35 - December 7, 2016

కామారెడ్డి : పదండి ముందుకు..పదండి పల్లెకు అంటూ.. మహాజన పాదయాత్ర తెలంగాణలోని పల్లెల్లో పర్యటిస్తోంది. సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న పాదయాత్ర 51వ రోజు పూర్తి చేసుకుంది. ప్రతి గ్రామంలో ప్రజలు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి విన్నివించుకుంటున్నారు. ఇప్పటివరకు 440 గ్రామాల్లో పర్యటించిన పాదయాత్ర బృందం 1290 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

సర్కార్ పై ధ్వజమెత్తిన తమ్మినేని..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం.. సీపీఎం పాదయాత్ర కొనసాగిన 440 గ్రామాల్లో ఎక్కడా కనబడలేదని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలకు వాగ్ధానాలిచ్చి మోసం చేసిందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తమ్మినేని ధ్వజమెత్తారు.

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన తమ్మినేని
అంబేద్కర్‌ 60వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తమ్మినేని నివాళులర్పించారు. అంబేద్కర్‌ సూచించిన పోరాట బాటలోనే కమ్యూనిస్టు పార్టీ ముందుకు వెళుతోందని తమ్మినేని అన్నారు.

అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలి : తమ్మినేని
125 అడుగుల ఎత్తు అంబేద్కర్‌ విగ్రహంతో పాటు ఆయన ఆశయాలను కూడా అంతే ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఎం కార్మిక సంఘం నాయకుడు... వ్యవసాయ కార్మిక సంఘం నేత నగేష్‌ కోరారు. అనేక గ్రామాల్లో కనీస వసతులు కూడా లేక ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం ఆ గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని నగేష్‌ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

51వ రోజు పూర్తి చేసుకున్న పాదయాత్ర
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 51వ రోజు పూర్తి చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, సోమేశ్వర్‌, దేశాయిపేట, దుర్కి, ఆంకోల్ క్యాంపు, నెమ్లి, రామ్‌శెట్టిపల్లి, బొమ్మన్‌దేవ్‌పల్లి, నస్రుల్లాబాద్, మల్లారం, వర్ని వరకు కొనసాగింది. ఇప్పటివరకు పాదయాత్ర మొత్తం 1290 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈరోజు వరకు 9 జిల్లాలు పూర్తి చేసుకుని 10 వ జిల్లాలోకి ప్రవేశించింది.  

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ ఎల్ వీ సీ36

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుండి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ36(పీఎస్‌ఎల్వీ-సీ36) వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది

10:29 - December 7, 2016

ఇండోనేషియా : మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సునామీ ప్రమాదమేమి లేదని యూఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మొదటగా వెల్లడించినట్లు 6.4గా కాకుండా 6.5గా నమోదైంది. మసీదులు, ఇళ్లు, దుకాణాలు నేలకూలాయి. పలు సముదాయాలు నేలకుంగాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. సునామీ భయంతో సముద్రతీర ప్రాంతాలైన సిల్గి, తెజూ నుంచి స్థానికులు నివాసాలను ఖాళీ చేసి దూరప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్ ఎల్ వీ సీ36

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి36‌ను నింగిలోకి దూసుకెళ్తోంది. రిసోర్స్‌ శాట్-2ఎ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్‌వీ లాంచ్ వెహికల్ నింగిలోకి మోసుకెళ్లనుంది. వ్యవసాయానికి సంబంధించిన వివరాలను రీసోర్స్ శాట్-2ఎ అందిస్తుందని ఇస్రో అధికారులు తెలిపారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం కొనసాగుతోంది.

10:27 - December 7, 2016

అండమాన్ : అండమాన్ లో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ దీవుల్లో 800ల మంది ప్రయాణీకులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అటు నావికా దళాలు, విమాన దళాల సహాయాన్ని అండమాన్ అధికారులు కోరారు. దీంతో  నావికా..విమాన రంగాలు ప్రయాణీకులకు రక్షించేందుకు  రంగంలోకి దిగాయి. కాగా ఈ తుపాను ప్రభావరం ఏపీకి తాకే అవకాశమున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

అండమాన్ లో తుపాను బీభత్సం

విశాఖ : అండమాన్ నికోబార్ దీవుల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అక్కడ చిక్కుకున్న 800 మంది టూరిస్టులను రక్షించేందుకు పోర్ట్ బ్లేయర్ నుంచి నావిదళం షిప్ లు బయలుదేరాయి.

కాసేపట్లో పీఎస్ ఎల్ వీ సీ36 ప్రయోగం

శ్రీహరికోట : కాసేపట్లో పీఎస్ ఎల్ వీ సీ36 ప్రయోగం జరగనుంది. రీసోర్స్శాట్ -2ఎ ఉపగ్రహాన్ని నిలింగిలోకి మోసుకెళ్లనుంది.

ఇది వ్యవసాయానికి సంబంధించిన వివరాలను అందించనుంది.

10:09 - December 7, 2016

తమిళనాడు : నున్నటి గుండు, నుదుటన విభూది బొట్టు,నిరంతరం సఫారీ డ్రెస్, పెద్ద కళ్లజోడుతో చో రామస్వామి ఆహార్యం గుర్తుకొస్తుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆయన సన్నిహితుడు..ప్రముఖ విశ్లేషకులు..నటుడు ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు స్వయానా మేనమామ అయిన రామస్వామి మృతి చెందారు. 82 ఏళ్ల చో రామస్వామి అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1968 లో 'తుగ్లక్' అనే నాటకాన్ని రచించి... దాన్ని దాదాపు2000 సార్లు రామస్వామి ప్రదర్శించారు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం చో రామస్వామి వ్యక్తిత్వం. ఈ లక్షణాలే ఆయనను సీఎం జయకు చేరువ చేశాయి. చో రామస్వామి సినిమా నటుడే కాదు... దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, నాటక రచయిత కూడా.మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు మీద 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించారు. తన సన్నిహితురాలు జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ రామస్వామి కన్నుమూశారు. కాగా రిజర్వేషన్లను రామస్వామి వ్యతిరేకించేవారు. ఎవరిమాటా వినని జయలలిత రామస్వామి మాటలపై నమ్మకముంచేవారని తమిళనాడ వార్తలు వినిపిస్తుంటాయి. రామస్వామి మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. 

చో రామస్వామి మృతిపట్ల ప్రధాని సంతాపం

చెన్నై : రాజకీయ విశ్లేషకుడు, దివంగత నేత జయలలిత కు వ్యక్తిగత సలహాదారుడు చో రామస్వామి మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. సినీ నటి రమ్యకృష్ణకు మేనమామ అయిన రామస్వామి తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మృతి చెందారు. ఈయన జయలలితతో పలు నాటికలు, సినిమాల్లో నటించారు.

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు అస్వస్థత..

ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. కుడికాలు వాపు, జ్వరంతో బాధపడుతున్న దిలీప్ ని నిన్న ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈ లెజండరీ యాక్టర్ కి వైద్యులు పరీక్షలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే దిలీప్ తన 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. 

09:57 - December 7, 2016

విజయవాడ : నక్కలరోడ్డులోని శ్రీదేవి కంటి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రిలోని 5 ఫోర్లకు ఒకే మార్గం వుండంతో మంటలకు ఆర్పేందుకు అగ్నిమాపక అధికారులు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా వుంటుందో ఇప్పుడు శ్రీదేవి ఆసుపత్రి పరిస్థితి కూడా అలాగే వుంది. సమాచారం అందుకున్న డీసీపీ బాలరాజు సంఘనాస్థలికి చేరుకుని పరిస్థితని సమీక్షించారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ బాలరాజు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల 5 లక్షల ఆస్తినష్టం జరిగిందని చెప్పారు. శ్రీదేవి కంటి ఆస్పత్రిలో ఫైర్‌ సేఫ్టీ సక్రమంగా లేదని, దానిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. 

మల్లన్నకో ఛానల్..

కర్నూలు : తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి టీటీడీ చానల్ ఉన్నట్టుగానే, శ్రీశైల మల్లన్న కోసం ఓ ప్రత్యేక టీవీ చానల్ ఏర్పాటు చేయనున్నామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. దీనికోసం పనులు కొనసాగుతున్నాయనీ..ఆరు నెలల్లో చానల్ ప్రారంభమవుతుందని తెలిపారు. కాగా టీటీడీ చానల్ తమిళ వర్షన్ మొదలైందని, త్వరలోనే హిందీ, ఇంగ్లీష్ చానళ్లు ప్రారంభమవుతాయని మాణిక్యాలరావు వెల్లడించారు.

09:56 - December 7, 2016

రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్క చెల్లెలు గొడవ పడిన ఘటనలో చెల్లెలు మమత సూపర్ వస్మొల హేర్ ఆయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చెల్లెలు మరణవార్త తెలిసిన అక్క అశ్విని ఫినాయిల్ తాగింది. పరిస్థితి విషమించటంతో ఆమెను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతురాలు తుక్కుగూడాలోని విజ్ఞాన్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అక్క ప్రగతి పేపర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లుగా సమాచారం. 

ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు

హైదరాబాద్ : దేశరాజధానిలో పొగమంచు కమ్ముకుంది. దీంతో 8 అంతర్జాతయ విమానాలు, 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 21 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 3 రైళ్లను రద్దు చేసి, 3 అంతర్జాతీయ విమానాలు దారి మళ్లించారు. 5 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అక్కా, చెల్లి గొడవ..చెల్లి మృతి, అక్కకు సీరియస్

రంగారెడ్డి : మహేశ్వరం మండలం రవిరాల గ్రామంలో దారుణం జరిగింది. అక్కతో గొడవపడి చెల్లులు హెయిర్ ఆయిల్ తాగింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలిస్తుండగా మమత(17) మృతి చెందింది. చెల్లెల మరణవార్త విని అక్క అశ్విని ఫినాయిల్ తాగింది. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

09:53 - December 7, 2016

హైదరాబాద్ : కేంద్రం స్వచ్ఛంధంగా ఆదాయం వెల్లడి కార్యక్రమం నేపథ్యంలో ఐడీఎస్ కింద బిల్డర్ లక్ష్మణరావు తన ఆస్తులను ప్రకటించారు. దీంతో జూబ్లీహిల్స్ లోని లక్ష్మణరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. బీఎస్ ఆర్ బిల్డర్ పేరుతో నిర్వహిస్తున్న సంస్థ యజమాని బాణాపురం లక్ష్మణరావు బిల్డర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్,ఆర్టీసీ క్రాస్ రోడ్, రామంతపూర్ లోని లక్ష్మణరావు నివాసాలపై ఐదు బృందాలుగా ఏర్పడి అధికారులు ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. కేంద్రం ప్రటించిన ఐడీఎస్ కింద రూ.9,800 కోట్లను లక్ష్మణరావు వెల్లడించారు. సెప్టెంబర్ 30 నాటికి తొలి విడతగా రూ.1,125 కోట్లు పన్ను లక్ష్మణరావు కట్టాల్సి వుంది. కాగా లక్ష్మణరావు,ఆయన ఆడిటర్ తోపాటు మరో ఇద్దరి బిల్డర్ల నివాసాలలో కూడా ఏసీబీ దాడులు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నుండి ప్రారంభమైన ఈ దాడులు కొనసాగుతున్నాయి. 

09:51 - December 7, 2016

కర్నూలు : ఫ్యాక్షన్ కక్షలకు కేంద్ర బిందువుగా వుండే రాయలసీమలో మరోసారి పాతకక్షల నేపథ్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలు బైటపడ్డాయి. టీడీపీ నేతను ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్నూలు నగర శివారులోని హంద్రినీవా కాలువ వద్ద చోటుచేసుకుంది. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ ఇన్ చార్జ్ ముఖ్య అనుచరుడిగా వుండే కురువ రాముడు అనే వ్యక్తిని ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి అనంతరం రాడ్డులతో మోది.. దారుణంగా హత్య చేశారు. రాముడు పనిమీద కర్నూలు వెళ్లి స్వగ్రామం రుద్రవరానికి వస్తుండగా దారిలో కాపుకాసిన ప్రత్యర్ధులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. రాముడి హత్యతో రుద్రవరంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా రాముడు కల్లూరు మండలం రుద్రవరం గ్రామ జడ్పీటీసీ మాధవికి మామ అవుతాడు. ప్రత్యర్ధులు హత్యచేసిన ప్రమాదంగా మార్చటానికి యత్నిస్తున్నారని హతుడి బంధువులు పేర్కొంటున్నారు. 

09:50 - December 7, 2016

తమిళనాడులో ఎటువంటి పరిణామాలు మారనున్నాయి? తమిళనాడు సీఎం జయలలిత మృతి అనంతరం అమ్మ ప్రియనెచ్చెలి భర్త నటరాజన్ మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సోమవారం ఆయన జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్‌కు చేరుకుని అంజలి ఘటించడం ఇందుకు బలం చేకూరుస్తోందని చెబుతున్నారు. జయలలితకు శశికళ ఆప్తురాలిగా మారక ఐఆర్ఎస్ అధికారి అయిన ఆమె భర్త నటరాజన్ ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవటంతో జయ అతడిని దూరంగా పెట్టారు. శశికళను కూడా ఇంటినుంచి పంపించివేశారు.జయ మృతి తర్వాత ముఖ్యమంత్రి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన శశికళ.. ఇప్పుడు భర్తతో కలిసి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. మరో పక్క దేశంలో నోట్ల రద్దు..ప్రజలు పడుతున్న ఇబ్బందులు..కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజల ఇక్కట్లు అనే అంశాలపై ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ నిర్వహించింది. ఈ చర్చలో విజయ్ కుమార్ (టీడీపీ నేత),కొండారాఘవరెడ్డి (వైసీపీ నేత)విల్సన్ (బీజేపీ నేత) ఉమామహేశ్వరరావు( సీఐటీయూ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

09:49 - December 7, 2016

ఆటో డ్రైవర్ల జీవితాల మీద నోట్ల రద్దు తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. చిల్లర అందుబాటులో లేకపోవడం ఆటో డ్రైవర్లకు పెను సమస్యగా మారింది. ఇప్పటికే క్యాబ్ ల కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నోట్ల రద్దు మరో పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. ఒకవైపు గిరాకీలు పడిపోవడం, మరోవైపు ఫైనాన్సర్లు నెలవాయిదాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో చిక్కుకున్నారు ఆటో డ్రైవర్లు. నోట్ల రద్దు, కరెన్సీ కొరత నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించేందుకు ఆటో డ్రైవర్స్ యూనియన్ నేత ఎం. వెంకటేష్  10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

శ్రీదేవి కంటి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..

విజయవాడ : నక్కలరోడ్డులోని శ్రీదేవి కంటి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మైలవరంలో నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్

కృష్ణా : మైలవరంలో నోట్ల మార్పి ముఠాను పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. వీరితో పాటు మామిడితోటలో నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేడు హస్తినకు సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం జరిగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూతురి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. శుక్రవారం వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశమున్నది. ఢిల్లీ పర్యటనలో భాగంగా వీలునుబట్టి కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది.

 

పట్టాలు తప్పిన క్యాపిటల్ ఎక్స్ ప్రెస్

పశ్చిమబెంగాల్ : క్యాపిటల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. నముక్తల స్టేషన్ సమీపంలో ఎక్స్ ప్రెస్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 12మందికి గాయాలయ్యినట్లుగా తెలుస్తోంది. 

09:47 - December 7, 2016

ప్రకాశం : పెద్ద నోట్ల రద్దుతో పాతనోట్లకు దేవుని హుండీయే సరైన స్ధావరంగా మారింది. దీంతో దేవాలయాల్లో హుండీల స్థానంలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలన్నడిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తాజా పరిణామాలు దేవాలయాల్లో స్వైపింగ్‌ ప్రాధాన్యతను ప్రస్తావిస్తున్నాయి. దేవాలయాల్లో స్వైపింగ్ యంత్రాల ఏర్పాటు డిమాండ్ పై ప్రత్యేక కథనం.

దేవుడికి విరాళాలు, కానుకల రూపంలో నగదు, నగలు
దేవుడు చేసిన మనుషులు దేవుడికే కష్టాలు తెచ్చిపెట్టారు. దేవుడికి విరాళాలు, కానుకల రూపంలో ఇచ్చే నగదు, నగలకు లెక్కలు తేలేది ఎలా? ఈ డబ్బులు ఈ నగలు భక్తితో ఇస్తున్నారా... లేదా పాపం దేవుడిదే అని తలచి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా దేవాలయాల్లో వెలుగు చూస్తోన్న పరిణామాలు నూతన ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు పెద్దనోట్ల రద్దు వివాదం దేవాలయాల చూట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.

దేవుడిని సైతం వదలని నోట్ల రద్దు..దేవాలయాల్లో పెరిగిన ఆదాయాలు
మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సంఘటిత, అసంఘటిత రంగాలు ఇప్పటికే కుదేలైపోయాయి.వ్యాపార లావాదేవీలు చతికిలబడిపోయాయి. ఇలా ప్రతిరంగాన్ని విలవిలలాడించిన రద్దు వ్యవహారం దేవుడిని సైతం వదలడంలేదు. నల్లధన భారం దేవుడే మోయాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా దేశ వ్యాప్తంగా వున్న దేవాలయాల్లో పెరిగిన ఆదాయాలు.... అందునా రద్దైన నోట్ల వరద మిన్నంటింది.

హుండీల స్థానంలో స్వైపింగ్ యంత్రాలు పెట్టాలంటున్న హేతువాదుల
ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఇదే విషయమై హేతువాదులు, ఆలయ పరిరక్షకుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దేవాలయాల్లో హుండీల స్థానంలో స్వైపింగ్ యంత్రం పెడితే నల్లకుబేరులు చాలామంది వలలో చిక్కుకుంటారని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు.

స్వైపింగ్ యంత్రాలపై స్పందించిన దేవాదాయ శాఖ
దేవాదాయ శాఖ కూడా స్వైపింగ్ పై స్పందిస్తోంది. దేశంలో నగదు రహిత లావాదేవీలు అమలు చేస్తోన్న నేపధ్యంలో..... హుండీ విరాళాలు మినహా అన్ని లావాదేవీలకు స్వైపింగ్ వర్తించేలా నగదురహిత విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు దేవాదాయ అధికారులు చెబుతున్నారు. అయితే కానుకల విషయంలో స్వైపింగ్ కష్టమని, అది అనవసరమని అంటున్నారు. ఏది ఏమైనా దేవునికి సమర్పించే కానుకలపై జరుగుతోన్న స్వైపింగ్ చర్చకు స్వస్థి పలకాల్సిన అవసరముంది. లేకుంటే మోడీ నోట్ల రద్దు డొల్లతనం మరింతగా దారితప్పే ప్రమాదం పొంచివుందనేది మేధావుల భావన.

 

09:46 - December 7, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చడానికి బల్దియా అన్ని రకాలుగా ప్లాన్ చేస్తోంది. తడి, పొడి చెత్తను వేరు చెయ్యడంతో పాటు పొడి చెత్తను పూర్తిగా రిసైకిల్ చెయ్యడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్ అందాలను కాపాడేందుకు అసరమైతే కఠినమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

గ్రేటర్‌లో పారిశుద్ద్యాన్ని పెంచడానికి జీహెచ్ఎంసీ కసరత్తు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ద్యాన్ని పెంచడానికి జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమం కొనసాగింపుగా స్పెషల్ ప్రోగామ్స్‌తో స్వచ్ఛ్ భారత్ సర్వేక్షన్ ర్యాంకింగ్ లో మెరుగైన స్ధానం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి జనవరి 12 వరకు స్పెషల్ ప్రోగ్రాం డిజైన్ చేసింది.

స్వచ్ఛ్ హైదరాబాద్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యం : మేయర్
హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆర్గనైజెషన్స్‌ను సచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతిలో వేరుచేసిన పొడి చెత్తను కొనుగోలు చేయడానికి ఐటీసీ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛ్ హైదరాబాద్‌కు సహకరిస్తున్నాయన్నారు. దీంతో చెత్త సేకరణపై ఆధారపడ్డవారికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు.

హైదరాబాద్ అందాలను మరింతగా పెంచేలా చర్యలు
హైదరాబాద్ అందాలను మరింతగా పెంచేలా చర్యలు తీసుకోవడంతో పాటు విచ్చలవిడిగా వెలుస్తున్న ప్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్స్ లను తొలగిస్తామని బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి గోడలపై రాతలు, పోస్టర్లు వెయ్యడాన్ని నిషేధిస్తామని డిఫేస్ మెంట్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విజిలెన్స్ కోసం డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో మెడికల్ అధికారులు, అసిస్టెంట్ సిటి ప్లానర్, శానిటరీ సూపర్ వైజర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన మొబైల్ కోర్టు ద్వారా నగరంలో బహిరంగ స్థలాల్లో చెత్త వేయడం, మలమూత్ర విసర్జన చేసేవారిని గుర్తించడం, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలను నిర్వహించేవారిని గుర్తించి అక్కడికక్కడే జరిమానాలు విధించడం ద్వారా సిటీలో పారిశుద్ద్యాన్ని రక్షిస్తామంటుంది బల్దియా..

 

09:45 - December 7, 2016

నెల్లూరు : అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో... ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. మరికొన్ని గంటల్లో పీఎస్ ఎల్వీ సీ 36 రాకెట్ ను ప్రయోగించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ వాహకనౌక ద్వారా... రిసోర్స్ శాట్-2A ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. భూమిపై వాతావరణ పరిస్ధితుల పరిశోధనలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. నేడు పీఎస్ ఎల్వీ సీ 36 రాకెట్‌ ప్రయోగించనున్న ఇస్రో..ఉదయం 10.25కు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్‌

ప్రయోగానికి సిద్ధమైన శ్రీహరికోట ఇస్రో
నెల్లూరు
: శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ ఎల్వీసీ 36 రాకెట్ ను ప్రయోగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 10 గంటల 25 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి 5వ తేదీ నుంచి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది.

రిసోర్స్‌శాట్‌ -2ఏ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
పీఎస్ ఎల్వీ సీ 36 రాకెట్‌ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందిన 1235 కేజీల బరువు కలిగిన రిసోర్స్ శాట్-2ఏ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. రిసోర్స్ శాట్-2ఏ ఉపగ్రహం ఐదేళ్ళపాటు భూ వాతావరణ పరిస్ధితులను ఛాయాచిత్రాలతో సహా పూర్తి వివరాలను అందించనుంది. అంతేకాదు... వాతావరణ పరిస్ధితులను అధ్యయనం చేయడానికి, విలువైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడనుంది.

ఇస్రోకు పాశుపతాస్త్రంలా పీఎస్ ఎల్వీ సీ 36 వాహకనౌక
ఇస్రోకు పీఎస్ ఎల్వీ సీ 36 వాహకనౌక పాశుపతాస్త్రం లాంటిది. ఇప్పటికే ఇస్రో స్వదేశానికి చెందిన ఉపగ్రహాలతోపాటు...విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి వాణిజ్యపరంగానూ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెడుతోంది. ఇప్పటి వరకు పీఎస్ ఎల్వీ సీ 36 సిరీస్‌లో 37 ప్రయోగాలను ఇస్రో ప్రయోగించింది. ఇందులో మొదటి ప్రయోగం పీఎస్ ఎల్వీ సీ 36 డీ 1 తప్ప మిగతావన్నీ విజయవంతమయ్యాయి. వాతావరణం, భూగర్భ పరిశోధనలు, నావిగేషన్ వ్యవస్థ, రేడియో, గ్రహాలపై స్ధితిగతులకు సంబంధించిన 121 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ఇస్రో కక్ష్యలోకి చేర్చి.... అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికి తన సత్తా చాటింది. ఇప్పుడు 38 వ ప్రయోగాన్ని కూడా పీఎస్ ఎల్వీ సీ 36 ద్వారా చేపట్టనుంది. పీఎస్ ఎల్వీ సీ 36 రాకెట్‌ ప్రయోగంపై అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

09:43 - December 7, 2016

హైదరాబాద్ : సొంత పార్టీ నేతలను వైఎస్‌ జగన్‌ సీరియస్‌గా హెచ్చరించారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు సూచించారు. ఎన్నికలు ముందే వచ్చే అవకాశాలున్నాయని.. నేతలంతా ప్రజల్లోనే ఉండాలన్నారు. మంచి పేరు ఉన్నవాళ్లకే వచ్చే ఎన్నికల్లో సీట్లు అని స్పష్టం చేశారు.

నేతలకు జగన్ దిశా నిర్ధేశం
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ చేపట్టిన 'గడపగడపకు వైసీపీ' కార్యక్రమం కొన్ని జిల్లాల్లో నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నా.. మరి కొన్ని జిల్లాల్లో అనుకున్నస్థాయిలో నిర్వహించడం లేదని పార్టీ అధినేత జగన్‌ అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయంలో పలు జిల్లాలో నేతలతో జగన్‌ విడివిడిగా సమావేశమయ్యారు. నేతలంతా సగం రోజులైనా ప్రజల్లో ఉండాలని జగన్‌ సూచించారు. కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకుంటే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు త్వరలో అన్ని జిల్లాల నేతలకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.ప్రజల సమస్యలపై నేతలు స్పందించే తీరుపైనే పార్టీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందన్నారు జగన్‌. గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకాన్ని చేపడుతూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల్లో నేతలకు ఉన్న పట్టు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ఎన్నికలకు సిద్ధంగా వుండాలి : జగన్ పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్ని నిర్ణయంతో ఎన్నికలు ముందుగా జరిగే సంకేతాలున్నాయని జగన్‌ నేతలకు
స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు నేతలంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ పథకంపై అవేదన వ్యక్తం చేసిన జగన్

ఇక పేదల పాలిట సంజీవని అయిన ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నీరుగారుస్తుందని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయాల ముందు జరిగే ధర్నాల్లో నిరుపేద రోగులను, ప్రజలను భాగస్వాములను చేయాలని నేతలకు సూచించారు. జగన్‌ ప్రకాశం జిల్లాలో జరిగే ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించారు. 

09:42 - December 7, 2016

గుంటూరు : రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ పర్స్ పేరుతో మొబైల్‌ వ్యాలెట్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రస్తుతం 23 సంస్థల సేవలు వినియోగించుకోవచ్చు. త్వరలోనే మరో ఆరు సంస్థలు చేరబోతున్నాయి. భవిష్యత్‌తో ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ను మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ఏపీ సర్కార్
పె
ద్ద నోట్ల రద్దు తర్వాత ఏపీ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ఏపీ పర్స్‌ పేరుతో ప్రవేశపెట్టిన మొబైల్‌ వ్యాలెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. మార్పు నేస్తం పేరుతో ఏపీ పర్స్‌ మొదటి లావాదేవీని చంద్రబాబు వినియోగించుకున్నారు. ఏపీ పర్స్‌ ద్వారా బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు.

నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల దగ్గర నగదు అందుబాటులో లేకుండా పోయింది. ఆర్‌బీఐ నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన నగదులో ఎక్కువ భాగం రెండు వేల రూపాయల నోట్లు వచ్చాయి. వీటికి చిల్లర సమస్య ఎదురవుతోంది. దీంతో నగదు రహిత లావాదేవీలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రజలు తమ దగ్గర ఉన్న కరెన్సీని బ్యాంకుల్లో జమచేసి, ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు, ఆన్‌లైన కొనుగోళ్లను ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. ఏపీ పర్స్‌ ద్వారా అన్ని రకాల పన్నులు చెల్లించొచ్చు. ఆర్టీసీ రిజర్వేషన్ల టికెట్లను తీసుకునే అవకాశం కల్పించారు. తర్వలోనే దీనిని ప్రభుత్వ శాఖలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు.

మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా ఏపీ పర్స్‌
ప్రజలు బ్యాంకులకు వెళ్లకుండా లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా కలుగుతుంది. ఏపీ పర్స్‌ మొబైల్‌ వ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించి, మానసికంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

09:41 - December 7, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిజిటల్‌ రూపంలో ఆర్థికలావాదేవీలన్నీ జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం డిజిటల్‌ మనీ ట్రాన్సఫర్‌ పద్ధతిని అవలంబించడం అనివార్యమని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

నగదు రహిత లావాదేవీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సన్నాహాలు
కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్రంలో నగదు లావాదేవీలన్నీ అతి సులభంగా జరిగేలా సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతాధికారులు సిద్ధార్థ మిశ్రా, వినీత్‌ బల్హోత్రా, అవిజిత్‌ షా, జితా మిత్రాతో... ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల ట్రెండ్‌ను సీఎంకు... బ్యాంకర్లు వివరించారు. అలాగే డిజిటల్‌ బ్యాంక్‌ సేవలను అందించేందుకు ఐసీఐసీఐ ముందుకొచ్చింది.

డిజిటల్‌ ఫైనాన్షియల్‌ లిటరేచర్‌ పట్ల అవగాహన కల్పించాలన్న సీఎం
మార్పుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని అయితే...డిజిటల్‌ ఫైనాన్సియల్‌ లిటరేచర్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. దీనికోసం ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో సాంకేతికపరమైన అంశాలను గ్రామీణ యువతకు, రైతులకు..వృత్తిపనులు చేసుకునేవారికి నిపుణులతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. త్వరలో..పూర్తిస్థాయిలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలు జరిగే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం అన్నారు.

రాష్ట్రంలో డెబిట్‌ కార్డుల వాడకం సమాచారాన్ని సేకరించాలని ఆదేశం

నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో .. బ్యాంకర్లు సమన్వయం.. వారి సహాయం ఏ విధంగా ఉంటుందనే అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం వాడకంలో ఉన్న డెబిట్‌ కార్డులు.. వాటి వాడకం ఏ విధంగా ఉన్నదనే సమాచారాన్ని బ్యాంక్‌ల నుంచి సేకరించాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా తయారు చేసి మొబైల్‌ యాప్ టీఎస్‌ వాలెట్‌ను త్వరలో జరగబోయే కలెక్టర్ల సమావేశంలో విడుదల చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు.డిజిటల్‌ మనీ ట్రాన్సాక్షన్‌ పద్ధతిని ఒక్కసారిగా అమలు చేయకూడదని.. దీనికి ప్రజలు కొంత అలవాటుపడాలని సీఎం అభిప్రాయపడ్డారు. మొదటగా ప్రభుత్వంలో నడిచే ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ మనీ ట్రాన్సాక్షన్‌ పద్ధతిలో నడిపించాలని సూచించారు. 

07:16 - December 7, 2016

తమిళనాడు : జయలలిత అంత్యక్రియల్లో క్రియాశీలక పాత్రను పోషించారు..ఆమె నెచ్చెలి శశికళ నటరాజన్‌. జయలలిత మృతదేహం పక్కనే ఉండి అన్నీ తానై ముందుకు నడిపించారు. జయకు నివాళులర్పించడానికి వచ్చినవారు సైతం శశికళనే పరామర్శించారు. చివరకు అంత్యక్రియలు కూడా ఆమెనే నిర్వహించారు. జయలలిత స్థానంలో శశికళ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పనున్నారా?

పాతికేళ్లుగా జయలిత..శశికళల మధ్య స్నేహం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ నటరాజన్‌ల మధ్య స్నేహ బంధం పాతికేళ్లుగా కొనసాగుతోంది. మధ్యలో విభేదాలు తలెత్తినా...జయలలిత నెచ్చెలి లేకుండా ఉండలేకపోయారు. పార్టీలో...ప్రభుత్వంలో తెరచాటు రాజకీయాలు నడుపుతూ శశికళ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరి వరకు జయలలితకు నీడలా వెన్నంటే ఉన్నారు.

జయలలిత అంత్యక్రియల్లో కేంద్ర బిందువుగా శశికళ
జయలలిత అంత్యక్రియల్లో శశికళే కేంద్ర బిందువయ్యారు. ప్రజల సందర్శనార్థం జయలలిత మృత దేహాన్ని రాజాజీ పబ్లిక్‌ హాలులో ఉంచారు. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు జయలలిత మృతదేహం పక్కనే ఉన్నారు.

జయకు ప్రముఖుల నివాళి
రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు, విఐపిలంతా జయలలితకు నివాళులర్పించారు. వచ్చిన ప్రముఖులంతా శశికళను ఓదార్చారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోది సైతం శశికళను ఓదార్చడం కనిపించింది.

జయలలిత అంత్యక్రియలు కూడా శశికళే నిర్వహించారు.
జయలలిత మరణించినట్లు ప్రకటించిన తర్వాత నమ్మిన బంటు పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పన్నీర్‌ సెల్వం సిఎం ఎంపిక వెనక శశికళ హస్తం ఉన్నట్లు సమాచారం. పన్నీర్‌ సెల్వం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోంది.పాతికేళ్ల పాటు జయలలిత కనుసన్నలలో మెలిగిన శశికళ- అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ ఎలాంటి పదవి చేపట్టకపోవడం గమనార్హం. కేవలం సలహాలకై పరిమితమయ్యారు. ఇన్నాళ్లూ తెర వెనక రాజకీయాలు నడిపిన శశికళ- అధికారాన్ని హస్తగతం చేసుకునేందు జయ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

శశికళను వెంటాడిన అవినీతి కేసులు
అయితే శశికళను కూడా అవినీతి కేసులు వెంటాడం రాజకీయంగా ఇబ్బంది కలిగించేదే. భూ ఒప్పందాలు, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆరోపణల దృష్ట్యా పార్టీలో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశముందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా శశికళతో పాటు పన్నీర్‌ సెల్వం, ప్రభుత్వ సలహాదారు, మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్‌ పవర్‌ సెంటర్‌గా మారడంతో మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.

1980లో జయలలితకు పరిచయం అయిన శశికళ
వీడియో షాపును నడిపే శశికళ 1980లో జయలలితకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి జయలలిత జీవితంలో, పోయెస్‌ గార్డెన్‌లో ఆమె పర్మనెంట్‌గా స్థిరపడ్డారు. 1995, 2011లో అభిప్రాయ భేదాలు రావడంతో జయలలిత శశికళను కుటుంబంతో సహా ఇంటి నుంచి పంపేశారు. నాలుగు నెలల్లోనే తిరిగి శశికళను జయలలిత ఇంటికి రప్పించుకున్నారు.

నటుడు..జర్నలిస్ట్.. చో.రామస్వామి మృతి..

తమిళనాడు : ప్రముఖ పాత్రికేయుడు, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత వ్యక్తిగత సలహాదారుడు చో.రామస్వామి(82) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయలలితకు అత్యంత సన్నిహితుడు అయిన రామస్వామి నటుడు కూడా. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామస్వామి కూడా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం.

ఇండోనేషియాలో భూకంపం..

ఇండోనేషియా : ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో నేటి తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లుగా ఇంతవరకు అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. 21మైళ్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది.

Don't Miss