Activities calendar

10 December 2016

22:19 - December 10, 2016

బెంగళూరు : కర్ణాటకలోని  బళ్లారిలో హవాలా డీలర్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. డీలర్‌ ఇంట్లోని బాత్‌రూంలో భారీగా నల్లధనాన్ని గుర్తించారు. మొత్తం 8 కోట్ల రూపాయల నల్లధనం,  32 కిలోల బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నారు.  ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్‌గా బాత్‌రూమ్‌లో దాచేశాడు హవాలా డీలర్. అయితే ఐటీ అధికారుల ఆకస్మిక తనిఖీలతో ఇవన్నీ బయటపడ్డాయి. 

 

22:16 - December 10, 2016
22:14 - December 10, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం రాష్ట్రంలో రాజకీయం కీలకమలుపు తిరిగింది. అమ్మ నిచ్చెలి, ప్రాణసఖిగా ఉన్న శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ వర్గాలు నిశ్చయించాయి. దీంతో జయలలిత మరణం తర్వాత పార్టీని చిన్నమ్మ శశికళ అన్నీ తానై ముందుండి నడిపించనుంది. మరోవైపు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది అన్నా డీఎంకే కార్యకర్తలు పోయస్‌గార్డెన్‌ ముందు ధర్నాకు దిగారు. 
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం 
తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మరణాంతరం రాష్ట్ర రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. జయలలిత మృతి తర్వాత పార్టీ పగ్గాల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై పార్టీ నేతలు కొద్దిరోజులుగా కీలకమంతనాలు జరిపారు. చివరకు అమ్మ నిచ్చెలి, ప్రాణసఖిగా ఉన్న శశికళకే  అన్నాడీఎంకే నేతలు పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పన్నీరు సెల్వం రెండుసార్లు పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లి శశికళతో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. జయలలితకు మొదటినుంచి సన్నిహితంగా ఉన్న శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపడితే బాగుంటుందని పార్టీ నేతలు భావించారు. 
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ 
అయితే అధికారికంగా శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునేందుకు పార్టీ సభ్యసమావేశం త్వరలోనే భేటీ కానుంది. ఈ సమావేశంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాతే శశికళ పార్టీ పగ్గాల్ని స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు కూడా అందుకు తగ్గ సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే  అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్ని స్వీకరించాలంటూ పార్టీ సీనియర్ నేతలంతా శశికళను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అమ్మ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ..గత 27 ఏళ్లుగా అమ్మ జయలలిత పార్టీని విజయవంతంగా ముందుండి నడిపించారని..అమ్మ మరణం తర్వాత ఆమె చూపిన మార్గంలోనే పార్టీని ముందుండి నడిపించాలని సీనియర్ నేతలు శశికళను కోరినట్లు సమాచారం. 
బాధ్యతలు స్వీకరించిన సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు 
ఇదిలా ఉంటే సచివాలయంలో సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. సుమారు గంటపాటు జరిగిన కేబినేట్ సమావేశంలో పలుకీలక నిర్ణయాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. జయలలిత మృతికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. మెరీనాబీచ్‌లో జయలలిత స్మారక మందిరం నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదించింది. అమ్మ ప్రవేశపెట్టిన పథకాలను ఇలాగే కొనసాగించాలని కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె వ్యతిరేకించిన మధురవాయల్‌-చెన్నై పోర్టు పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జయలలిత వ్యతిరేకించిన మధురవాయల్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి శశికళ పోటీ
మరోవైపు జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి శశికళ పోటీ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇంకెన్ని  కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయోనని రాజకీయపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

 

22:07 - December 10, 2016

హైదరాబాద్ : కొత్త భూసేకరణ బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో లావాదేవీలన్ని డిజిటలైజ్‌గా మార్చాలని నిర్ణయించిన మంత్రిమండలి... ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు.
కొత్త భూ సేకరణ చట్టానికి ఆమోదం 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలోని సీ బ్లాక్‌లో జరిగింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుపై విధివిధానాలు రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో సబ్‌కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ సలహాదారు రాజీవ్ శర్మలతో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. అలాగే రాష్ట్రంలో కొత్త భూసేకరణ చట్టంకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 
నగదు రహిత లావాదేవీల దృష్టి
ఇక పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలవైపు రాష్ట్ర ప్రజలంతా మళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ దిశగా తెలంగాణను క్యాష్ లెస్ స్టేట్‌గా మార్చటం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇకపై టీఎస్ వ్యాలెట్ ద్వారానే ప్రభుత్వం నుంచి చెల్లింపులు, తీసుకునేవన్నీ ఆన్ లైన్లోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. క్యాష్ లెస్ కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీలో అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా ఉండనుంది. క్యాష్ లెస్‌పై ఇప్పటికే మెదక్ జిల్లాలోని ఇబ్రహీంపూర్‌కు దేశవ్యాప్తంగా  ప్రశంశల వర్షం కురుస్తోందని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఇక కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. కృష్ణానదీ జలాలపై మంత్రి హరీష్‌రావు నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే నోట్ల రద్దుపై అసెంబ్లీలో ప్రజల పక్షాన ఓపిగ్గా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది. పనిభారం లేని శాఖల నుంచి పని ఉన్న శాఖలకు ఉద్యోగులను బదిలీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే దళిత, గిరిజన ఉప ప్రణాళిక పర్యవేక్షణ కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో 3 గంటలపాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో వీటితో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 

 

22:00 - December 10, 2016

ముంబై టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఆతిధ్య భారత జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రెండు రోజులు ఇండియాకు గట్టి పోటీనిచ్చిన ఇంగ్లండ్‌ ...మూడో రోజు మాత్రం భారత బ్యాట్స్‌మెన్‌ జోరు ముందు తేలిపోయింది. ఒక వికెట్‌ నష్టానికి 146 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌....మురళీ విజయ్,విరాట్‌ కొహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో నిలిచింది.విరాట్‌,పుజారాలతో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన విజయ్‌ ...231 బంతుల్లో టెస్టుల్లో 8వ సెంచరీ పూర్తి చేశాడు. 136 పరుగులకు విజయ్‌ ఔటైనా... మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుపోయిన కొహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సూపర్‌ సెంచరీ నమోదు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో జడేజా,జయంత్‌ యాదవ్‌లతో హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాలు జోడించిన కొహ్లీ...టెస్టుల్లో 15వ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్లకు 451 పరుగులు చేసింది.విరాట్‌ 147, జయంత్‌ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ,ఆదిల్‌ రషీద్‌, జో రూట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 51 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.... తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు పైగా ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్‌పై పట్టు బిగించగలుగుతుంది. 

 

21:54 - December 10, 2016

కళంకారి పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. కళంకారి పరిశ్రమ కళతప్పిన పరిశ్రమగా మారింది. కృష్ణా జిల్లా పెడనలోని కళంకారి పరిశ్రమ కార్మికులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా కార్మికులు టెన్ టివికి విన్నవించుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:51 - December 10, 2016

జగిత్యాల : జిల్లాలోని ఆత్మకూరులో దారుణం చోటుచేసుకుంది. యువకుడు ఓ యువతిని హత్యచేసి బావిలో పడేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరులో నివాసముంటున్న రాజం, నర్సవ్వ దంపతుల కూతరు రాణి అనే యువతి గత నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. రాజం, నర్సవ్వ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించిన తిరుమల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా విషయం తెలిసింది. ఆత్మకూరులో తిరుమల్ అనే యువకుడు.. రాణి అనే యువతిని హత్యచేసి ఇంటి సమీపంలోని బావిలో పడేశాడు. ఆపై బావిలో రాళ్లను వేశాడు. వివస్రంగా ఉన్న యువతిని చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిరుమల్ ను పోలీసులు అదుపులోరి తీసుకున్నారు. యువతిని ఒక్కడే హత్య చేశాడా..? లేదా ఇతరుల సహాయంతో హత  మార్చారా..?, యువతిది హత్యా, ఆమెపై అత్యాచారం చేసి హత మార్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా తిరుమల్, రాణి సమీప బంధువులని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:49 - December 10, 2016

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్య పాలనతో అశాంతిని సృష్టిస్తోందని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. విజయవాడలో జరిగిన 'శాంతి సౌభాగ్యం-ప్రజా ఎజెండాపై' రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దివీస్‌ నిర్వాసితులపై నిర్బంధాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్టయిన  180 మంది దివీస్‌ ప్రాంత రైతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ దౌర్జన్యం ఆగకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. 

21:47 - December 10, 2016

కాకినాడ : తూ.గో జిల్లాలో దివీస్ ఉద్యమకారుల పట్ల పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. దివీస్‌ ఆందోళనలో అరెస్టు చేసిన నిర్వాసితులు, సీపీఎం, ప్రజా సంఘాల నేతల పట్ల పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం అరెస్టైన వారికి పోలీసులు ఇప్పటివరకు ఆహారం అందించలేదు.  దీంతో కోటనందూరు పీఎస్‌లో సీఐటీయూ నేత బలరాం స్పృహ కోల్పోయారు. దీంతో బలరాంను ఆస్పత్రికి తరలించారు. 

21:39 - December 10, 2016

నిజామాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 55వ రోజు కొనసాగుతోంది. యాత్రలోభాగంగా సీపీఎం బృందం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటిస్తోంది. తమ సమస్యల్ని పాదయాత్ర బృందానికి ప్రజలు చెప్పుకుంటున్నారు. వీటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తామని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు. జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, వివక్షతపై ప్రజలు తమకు మెమొరండం ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే అతి తక్కువ జీతాలిచ్చి పంచాయితీ వర్కర్లతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు.

 

21:35 - December 10, 2016

హైదరాబాద్ : నానక్‌రాంగూడ ఘటనలో మరో ఇద్దరు టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై జీహెచ్ ఎంసీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆర్‌.రాజేందర్‌, పి.మధులను సస్పెండ్‌ చేస్తూ.. కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రమాదంపై జేఎన్టీయూ ప్రొ.రమణారావు. జీహెచ్‌ఎంసీకి నివేదిక అందజేశారు. అపార్ట్‌మెంట్ డిజైన్ సక్రమంగా లేదని నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్ల పిల్లర్లు, భూమిపై ఒత్తిడి పడి కూలిపోయిందన్నారు. పక్కపక్కనే భవనాలు ఉండటం కూడా ఓ కారణమే అని తెలిపారు. 

21:29 - December 10, 2016

'జానకిరాముడు' సినిమా టీంతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం డైరెక్టర్ టీ.సతీష్ బాబు, హీరోయిన్ మౌర్య పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:28 - December 10, 2016

విశాఖ : ఏపీ ప్రభుత్వం వైద్యాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం ఆరోపించింది. విశాఖలో ఏపీ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విమ్స్‌ను ప్రైవేటుపరం చేయొద్దని ఆ పార్టీ నేతలు అన్నారు. పేద ప్రజల కోసం నిర్మించిన విమ్స్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విమ్స్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

21:26 - December 10, 2016

తూర్పు గోదావరి : దివీస్ నిర్వాసితులపై ఏపీ ప్రభుత్వం నిర్భందకాండ కొనసాగిస్తోంది. దివీస్ నిర్వాసితులపై మరోసారి పోలీసులు నిర్బంధకాండ ప్రదర్శించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాకినాడలోని తొండంగి మండలం పంపాదిపేటలో దివీస్‌ నిర్వాసితులపై మరోసారి పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. మహిళల పట్ల మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పనులను అడ్డుకున్న ప్రజలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పరిహారం చెల్లించకుండా రైతుల భూముల్లో చెట్ల తొలగింపుపై ఆందోళన చేపట్టిన 300 మంది సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారందరిని అన్నవరం, కోటనందూరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జితో పాటు పలువురు జిల్లా నేతలు కూడా ఉన్నారు. 600 మంది పోలీసులు మోహరించారు. పంపాదిపేటలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిశ్రమ ఏర్పాటును ఉప సంహరించుకోవాలని అన్నీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు దివీస్ ప్రాంతాన్ని మూడు సార్లు పర్యటించారు. వైసీపీ అధినేత జగన్ ఒకసారి పర్యటించారు. అయినా ప్రభుత్వం దివీస్ యాజమాన్యానికి మద్దతు పలుకుతోంది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:24 - December 10, 2016

చెన్నై : అన్నాడీఎంకే పగ్గాల్ని శశికళకు అప్పగించాలని ఆ పార్టీ నిర్ణయించింది. జయలలిత మృతి తర్వాత పార్టీ పగ్గాల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై పార్టీ నేతలు కొద్దిరోజులుగా కీలకమంతనాలు జరిపారు. చివరకు జయలలితకు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న శశికళకే అన్నాడీఎంకే పార్టీ బాధ్యతల్ని అప్పగిస్తూ పార్టీ నేతలందరూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ వ్యవహరించనున్నారు. గత 27 ఏళ్లుగా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా జయలలిత వ్యవహరించారు. అమ్మ మరణం తర్వాత ఆ అమ్మ చూపిన మార్గంలోనే నడవాలని ఈ సందర్భంగా శశికళను పార్టీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

శశికళకే అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు

చెన్నై : అన్నాడీఎంకే పగ్గాల్ని శశికళకు అప్పగించాలని ఆ పార్టీ నిర్ణయించింది. జయలలిత మృతి తర్వాత పార్టీ పగ్గాల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై పార్టీ నేతలు కొద్దిరోజులుగా కీలకమంతనాలు జరిపారు. చివరకు జయలలితకు మొదటి నుంచి సన్నిహితంగా ఉన్న శశికళకే అన్నాడీఎంకే పార్టీ బాధ్యతల్ని అప్పగిస్తూ పార్టీ నేతలందరూ నిర్ణయం తీసుకున్నారు.

 

ముగిసిన మూడో రోజు ఆట

ముంబై టెస్టు : మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్.. 45/7. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పై భారత్ 51 పరుగుల అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్... 400. భారత్ బ్యాటింగ్ : క్రీజులో కోహ్లీ..147, జయంత్..30, విజయ్...136, పుజారా...47, రాహుల్..24, పార్దివ్ పటేల్..15. ఇంగ్లండ్ బౌలింగ్ : అలీ, రషీద్, రూట్ లకు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 

 

 

ముగిసిన మూడో రోజు ఆట

ముంబై టెస్టు : మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్.. 45/7. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పై భారత్ 51 పరుగుల అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్... 400. భారత్ బ్యాటింగ్ : క్రీజులో కోహ్లీ..147, జయంత్..30, విజయ్...136, పుజారా...47, రాహుల్..24, పార్దివ్ పటేల్..15. ఇంగ్లండ్ బౌలింగ్ : అలీ, రషీద్, రూట్ లకు చెరో 2 వికెట్లు. 

16:26 - December 10, 2016

విజయవాడ : పెద్ద నోట్లు రద్దు చేసి 32 రోజులు దాటినా ప్రజలకు మాత్రం మనీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులు పెట్టడంతో కనీస అవసరాలకు డబ్బులు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో ఎక్కడా డబ్బు అందుబాటులో లేకపోవడంతో అరకొరగా అందుబాటులో ఉన్న ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో మనీ కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:18 - December 10, 2016
16:14 - December 10, 2016

తూర్పు గోదావరి : దివీస్ నిర్వాసితులపై ఏపీ ప్రభుత్వం నిర్భందకాండ కొనసాగిస్తోంది. దివీస్ నిర్వాసితులపై మరోసారి పోలీసులు నిర్బంధకాండ ప్రదర్శించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాకినాడలోని తొండంగి మండలం పంపాదిపేటలో దివీస్‌ నిర్వాసితులపై మరోసారి పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. మహిళల పట్ల మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పనులను అడ్డుకున్న ప్రజలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పరిహారం చెల్లించకుండా రైతుల భూముల్లో చెట్ల తొలగింపుపై ఆందోళన చేపట్టిన 300 మంది సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారందరిని అన్నవరం, కోటనందూరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జితో పాటు పలువురు జిల్లా నేతలు కూడా ఉన్నారు. 600 మంది పోలీసులు మోహరించారు. పంపాదిపేటలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరిశ్రమ ఏర్పాటును ఉప సంహరించుకోవాలని అన్నీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు దివీస్ ప్రాంతాన్ని మూడు సార్లు పర్యటించారు. వైసీపీ అధినేత జగన్ ఒకసారి పర్యటించారు. అయినా ప్రభుత్వం దివీస్ యాజమాన్యానికి మద్దతు పలుకుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

15:43 - December 10, 2016

రంగారెడ్డి : నెలరోజలు గడిచిపోయాయి.. బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం పడిగాపులు మాత్రం అలాగే ఉన్నాయి. అకౌంట్లో ఫుల్‌ .. చేతిలోనిల్‌ అన్నట్టు ఉంది పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి.. చిరు వ్యాపారులు, పింఛన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతున్నారు. గంటలకొద్దీ బ్యాంకుల ముందు నిల్చుంటే.. 2వేల రూపాయల నోటు చేతిలో పెడుతున్నారని.. జనం వాపోతున్నారు. 2వేల నోటుకు చిల్లర దొరకడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని ప్రభుత్వం చెప్పినా.. నెలరోజుల్లో కూడా  పరిస్థితిలో మార్పు రాలేదు. ఇంకెతకాలం ఈ కష్టాలు పడాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

15:42 - December 10, 2016

హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్టు, కవి, కాలమిస్టు, దివంగత అరుణ్‌సాగర్‌ పేరిట ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ నిర్ణయించింది. అరుణ్‌సాగర్‌ జయంతి సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నది. తెలుగు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో రాణించిన జర్నలిస్టులకు వచ్చే ఏడాది జనవరి 2న జర్నలిస్టులకు అవార్డులిస్తారు. తమ ఎంట్రీలను ఈనెల 20లోపు తెలంగాణ ప్రెస్‌ అకాడమీకి పంపించాలని కోరింది. వార్తా పత్రికల్లో పని చేసే జర్నలిస్టులు తమ పేరిట 2016లో ప్రచురితమైన వార్తా కథనాలు, విశ్లేషణాత్మక కథనాలు పంపించాలి. ఇవి సామాజిక అంశాలు, మానవీయ కోణాలను ప్రతిబింబించేవిగా ఉండాలి. పేరు లేకుండా ప్రచురితమైన కథనాలైతే సదరు పత్రిక ఎడిటర్‌ లేదా హెడ్‌ ధ్రువీకరణ జతపరచాలి. ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు తమ వీడియోలను సీడీ, డీవీడీల రూపంలో పంపించాలి. రాష్ట్రంలోని మీడియా ప్రముఖులతో కూడిన కమిటీ ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేస్తుంది. విజేతల ఎంపికలో జ్యూరీదే తుది నిర్ణయం. రెండు విభాగాల్లో విజేతలు మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందుకుంటారు. అరుణ్‌సాగర్‌ పేరిట ఎంపిక చేసిన కవి లేదా రచయితకు ప్రత్యేక పురస్కారం కూడా ఉంటుంది.
సుప్రభాతం పత్రికతో ఆరంభమైన అరుణ్‌సాగర్‌ పాత్రికేయ జీవితం ఆంధ్రజ్యోతి దినపత్రికతో పదును తేలింది. అనంతరం వివిధ ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థల్లో పాతికేళ్ల పాటు విజయవంతంగా కొనసాగింది. టీవీ9 తొలి పాత్రికేయ బృందంలో కీలకంగా వ్యవహరించిన ఆయన..అనంతరం 10టీవీ వ్యవస్థాపక సీఈఓగా పని చేశారు. టీవీ5 ఎడిటర్‌గా పని చేస్తున్న సమయంలో ఆకస్మికంగా మరణించారు. ఆయన ప్రత్యేక రచనా శైలితో మేల్‌కొలుపు, మియర్‌మేల్‌, మ్యాగ్జిమమ్‌ రిస్క్‌ పుస్తకాలను ప్రచురించారు. అరుణ్‌సాగర్‌ ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు స్పాన్పర్‌గా టీవీ5 యాజమాన్యం వ్యవహరిస్తోంది. 

15:41 - December 10, 2016

హైదరాబద్ : పెద్దనోట్ల రద్దుతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. నెలరోజులుగా పనిదొరక్క అవస్థలు పడుతున్నారు. దాదాపు నెలరోజులుగా పనిలేక పస్తులుంటున్నారు. అడ్డాపై పనికోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పనిచేస్తేనే పూటగడిచే పరిస్థితి ఉంది. పనిలేక, డబ్బు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఎవరో ఒకరు పనికిపిలిస్తే పదిమంది వెళుతున్నారు. పనికి ఎంతకూలీ ఇచ్చినా తీసుకుంటున్నారు. కూలీల అవస్థలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:37 - December 10, 2016

నిజామాబాద్ : పైసా లేనిదే ఏ పనీ జరుగదు.  ఇల్లు గడవాలన్నా.. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలన్నా పైసా కావాల్సిందే. అలాంటి నగదు కష్టాలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నోట్ల  రద్దుతో జనజీవనంలో పెను ప్రకంపనలు సృష్టించిన కేంద్రం.. అవసరాలకు సరిపడా నగదును పంపిణీ చేయడంలో మాత్రం విఫలమైంది.  గంటల తరబడి లైన్లలో నిలబడి పైసలో రామచంద్రా అంటూ  సామాన్యులు.. ఈ కష్టాలెప్పుడు తీరతాయా అని ఎదురు చూస్తున్నారు.
తీరని ప్రజల కష్టాలు  
పెద్ద నోట్ల రద్దు పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నెల రోజులు దాటినా ప్రజల కష్టాలు మాత్రం తీరటం లేదు.  బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి నిలబడినా అవసరాలకు డబ్బులు చేతికి అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల వద్ద లైన్లలో ఉన్నవారయితే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నిజామాబాద్‌, కామారెడ్డి  జిల్లాల్లో సామాన్యుల కష్టాలు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. గంటలు, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా.. పైసా దొరికన దాఖలాలు లేవు. ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు రోజూ వారి పనులను మానుకుని బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. 
ప్రజలు నానా కష్టాలు 
బ్యాంకులు ఎప్పటికప్పుడు ప్రజలకు సరిపడా నగదును సరఫరా చేయకపోవడంతో.. సామాన్యులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. నగదు లేక ఏటీఎంలన్నీ మూసి ఉండటం, ఒకవేళ నగదు నింపినా చూస్తుండడానే ఏటీఎంలు ఖాళీ అవడం జనాలను అసహనానికి గురయ్యేలా చేస్తోంది. ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు పడుతున్న అవస్థలకైతే లెక్కే లేదు. పింఛన్‌ సొమ్ములను తీసుకునేందుకు వస్తున్న వృద్ధులు క్యూల్లో నిలబడలేక నానా యాతన పడుతున్నారు. 
చిరు వ్యాపారులకు తీవ్రం 
పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బ్యాంకులు, ఏటీఎంలలో రెండు వేల రూపాయల నోట్లు ఇస్తుండటంతో సామాన్యులు వాటికి చిల్లర సంపాదించడం గగనమైపోతోంది. దీంతో చేతిలో డబ్బులున్నా.. ఏం కొనలేని పరిస్థితి తలెత్తుతోంది. మార్కెట్‌లో పాతనోట్లు చలామణి కాక.. ఉన్న కొత్త నోట్లకు చిల్లర దొరక్క కనీస అవసరాలు కూడా తీరని దయనీయ పరిస్థితి నెలకొంది. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. నగదు కష్టాలతో  రైతులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉద్యోగులు ఆవేదన 
జీతాలను ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసినా.. బ్యాంకుల్లో సరిపడా నగదు లేక జీతాల డబ్బులు కూడా విత్‌ డ్రా చేసుకునే పరిస్థితి లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీంతో  ఉద్యోగులకు 6 వేల నుంచి 10 వేలు మాత్రమే డ్రా చేసుకునే వీలున్నా... బ్యాంకుల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడితే 2 వేలు మించి దొరకటం లేదు.  ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తమ కష్టాలు తీర్చాలని సామాన్యులు కోరుతున్నారు. 

శశికళకు బాధ్యతలు..

చెన్నై : అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలను శశికళకు అప్పగించారు. అదే విధంగా సచివాలయంలో సీఎం పదవీ బాధ్యతలను పన్నీర్ సెల్వం స్వీకరించారు. మంత్రులు కూడా తమ బాధ్యతలను స్వీకరించారు. 

15:33 - December 10, 2016

హైదరాబాద్ : డిజిటల్ లావాదేవీల పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా టీ వాలెట్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ నిరంజన్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

15:30 - December 10, 2016

ఊబకాయంతో చాల మంది బాధ పడుతుంటారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయమే దొరకడం లేదని పలువురు పేర్కొంటుంటారు. అంతేగాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదు. దీనితో ఊబకాయంతో బాధ పడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. కానీ ఏడు రోజుల డైట్ ప్లాన్ ను అమలు చేస్తే ఖచ్చితంగా ఊబకాయం నుండి బయటపడే అవకాశం ఉందని డైటీషియన్లు పేర్కొంటున్నారు. మరి అవేంటో చూద్దామా..

  • ఫస్ట్ డే..పండ్లు తీసుకోవాలి. రోజు మొత్తంలో నాలుగు యాపిల్స్, రెండు ఆరెంజ్ లు, రెండు దానిమ్మ పండ్లను తీసుకోవాలి.
  • సెకండ్ డే..కూరగయాలు పచ్చిగా తీసుకోవాల్సి ఉంటుంది. అబ్బో పచ్చిగా తినలేం అనుకొనే వారు ఉడకబెట్టినవి తినాలి. బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టినవి ఆలుగడ్డ..లంచ్ లో పచ్చిగా ఉన్న కూరగాయాలు లేదా ఉడకబెట్టినవి తినాలి.
  • థర్డ్ డే..పది అరటి పండ్లు, మూడు గ్లాసుల పాలతో ఆ రోజు ముగించాల్సి ఉంటుంది. పది గ్లాసుల నీటిని 12 గ్లాసులకు పెంచుకోవాలి.
  • ఫోర్త్ డే.. ఇష్టమైనవి పండ్లు..కూరగాయాలు భుజించాలి. కూరగాయాలను పచ్చిగా తీసుకొంటేనే లాభం. 12 గ్లాసుల నీటిని తాగడం మరిచిపోవద్దు.
  • ఫిఫ్త్ డే.. పండ్లు, కూరగాయాలతో పాటు బ్రౌన్ రైస్, చిన్న కప్పు పప్పు, గాసు మజ్జిగ తీసుకోవాలి. ఆరు టమాటలు, రెండు ఆపిల్స్, ఆరెంజ్ పళ్లతో పాటు పండ్ల సలాడ్ తీసుకోవాల్సి ఉంటుంది.
  • సిక్త్ డే..ఏదో ఒక రోజు డైట్ ఫాలో కావాల్సి ఉంటుంది (పైన పేర్కొన్న వాటిలో) బ్రేక్ ఫాస్ట్ లో గ్రీన్ టీ తాగవచ్చు. సలాడ్స్ తినడం మాత్రం మరిచిపోవద్దు.
  • సెవన్త్ డే.. ఇష్టమైన కూరగాయలను ముక్కలుగా కోసుకోవాలి. ఓ కప్పు బ్రౌన్ రైస్ తో కలిపి ఉడికించుకోవాలి. షుగర్ లేకుండా జ్యూస్ ను లంచ్ టైంలో తీసుకోవాలి.
  • ఈ రోజుల్లో మొత్తం ఉదయం పూట గ్లాసు గొరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనే, కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
    ట్రై చేసి చూడండి..
15:26 - December 10, 2016

గుజరాత్ : పార్లమెంట్ సమావేశాల్లో తనని మాట్లాడకుండా విపక్షాలే అడ్డుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. అందుకే తాను జనసభలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లోని దీసాలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా రైతుల నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవడంపై తీవ్ర ఆవేదన చెందిన రాష్ట్రపతి విపక్షాలు తీరును తప్పు పట్టారని గుర్తు చేశారు. తాము చర్చకు సిద్ధమేనని, ప్రధాని కూడా మాట్లాడతారని కేంద్రం సభలో స్పష్టం చేసినా...విపక్షాలే చర్చ నుంచి పారిపోతున్నాయని దుయ్యబట్టారు. 

 

15:13 - December 10, 2016

టి. కేబినెట్ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎనిమిది ఆర్డినెన్స్ లకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పెద్దనోట్ల రద్దుపై నెలకొన్న పరిస్థితులపై కేబినెట్ చర్చించనుంది. అలాగే కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

సైదాబాద్ లో లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం..

హైదరాబాద్ : సైదాబాద్ పరిధిలో వినయ్ నగర్ కాలనీలో రూ. 29.75 లక్షల కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు.

15:05 - December 10, 2016

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి. ఆమె చెంపపై రంధ్రాలు ఎందుకు వచ్చాయి ? ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారని తదితర వార్తలు సోషల్ మాధ్యమాల్లో షికార్ చేస్తున్నాయి. 75 రోజుల పాటు అపోలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు చికిత్స అందించేందుకు అపోలో యాజమాన్యం భారీగానే డబ్బులు గుంజిందని వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా, అపోలోపై సెటైర్లు, విమర్శలు గుప్పిస్తోంది. ఏకంగా రూ. 80 కోట్లు తీసుకుందని తెలిసింది. సమాచార హక్కు చట్టం ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ తో ఈ విషయం ప్రపంచానికి వెల్లడైంది. అమ్మ మరణానికి అనంతరం మెడికల్ బిల్లు రూ. 80 కోట్లని..మిగిలిన ఖర్చు కలిపితే ఆ మొత్తం పెరిగే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో ఇప్పటికే రూ. 6 కోట్లు చెల్లించిందని సమాచారం. ప్రజాప్రతినిధులు అనారోగ్యానికి గురయితే ఆ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయనే సంగతి తెలిసిందే. జయ చేరిన అనంతరం ఆసుపత్రిలో ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారని, ఆ అంతస్తులో ఉన్న 30 గదుల అద్దెను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 

15:01 - December 10, 2016
15:00 - December 10, 2016

పాటియాల కోర్టులో ఎస్ పీ త్యాగీ..

ఢిల్లీ : ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్ పీ త్యాగీని పాటియాల కోర్టులో సీబీఐ హాజరు పరిచింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో త్యాగీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

దివీస్ నిర్వాసితులపై మరోసారి నిర్భందం..

కాకినాడ : తొండంగి (మం) పంపాది పేటలో దివీస్ నిర్వాసితులపై మరోసారి పోలీసులు నిర్భందం ప్రయోగించారు. పరిహారం చెల్లించకుండా రైతుల భూముల్లో చెట్ల తొలగింపుపై ఆందోళన చేపట్టిన 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నవరం, కోటనందూరు పీఎస్ కు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి శేషబాబ్జి కూడా ఉన్నారు. 

13:54 - December 10, 2016

నిజామాబాద్ : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఈరోజుతో 55వ రోజుకు చేరుకుంది. మొత్తం పది జిల్లాల గుండా సాగిన ఈ యాత్ర.. ఇవాళ 14 వందల కిలోమీటర్లకు చేరుకోనుంది. అలాగే నిజామాబాద్‌లోని పలు గ్రామాలలో పాదయాత్ర కొనసాగనుంది. ముఖ్యంగా పిప్రి, ఫతేపూర్‌, సుబ్రియాల్‌, కోమన్‌పల్లి, జలాల్‌పూర్‌, నాగారం, బస్వాపూర్‌ కిసాన్‌నగర్‌, ముప్కాల్‌, నల్లూరు, బస్వాపూర్‌లో పాదయాత్ర సాగనున్నది. ఈ సందర్భంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలపై... పాదయాత్రలో పాల్గొన్న శ్రామిక మహిళ నేత రమ టెన్ టివితో మాట్లాడారు. ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

13:47 - December 10, 2016

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు తలమునకలయ్యారు. మట్టి తవ్వకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైట్‌ కెనాల్‌ కాలువలో ఈనెల 19 నుంచి కాంక్రీట్‌ పనులు ప్రారంభించనున్నారు. పోలవరం పనుల్లో పురోగతిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

శేఖర్ రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు..

చెన్నై : శేఖర్ రెడ్డి ఇంట్లో మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శేఖర్ రెడ్డికి సంబంధించిన మరో రూ. 24 కోట్లు సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదు మొత్తం రూ. 2వేల కొత్త నోట్లే ఉండడం గమనార్హం. వేలూరు దగ్గర కారులో ఐటీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ. 174 కోట్ల కరెన్సీ లభ్యమైంది. 

జయ మృతితో 203 మంది మరణం - అన్నాడీఎంకే..

తమిళనాడు : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన అనంతరం రాష్ట్రంలో 203 మంది మృతి చెందినట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. మృతి చెందిన వారి కుటుంబానికి రూ. 3లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 

కాసేపట్లో టి. కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశం కానుంది. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ రచనపై చర్చించనున్నారు.

నానక్ రాంగూడ బాధ్యులను సస్పెండ్ చేశాం - పల్లా..

హైదరాబాద్: నానక్‌రాం గూడ ప్రమాదానికి కారకులైన వారిని వెంటనే సస్పెండ్ చేశామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను రాజకీయం చేయొద్దని, ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని విపక్షాలకు సూచించారు. 

టీ వాలెట్ పై మంత్రి కేటీఆర్ సమావేశం..

హైదరాబాద్ : టీ వాలెట్ పై ఐటీ శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. టీ వాలెట్ ఏర్పాటు వివరాలను సీఎంకు మంత్రి కేటీఆర్ అందించనున్నారు. ప్రాథమికంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎ మీ సేవలతో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెక్యూర్టీ, ప్రైవసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. దశల వారీగా అన్ని డిపార్ట్ మెంట్ లలో టీ వాలెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. 

మహాజన పాదయాత్ర 1400 కి.మీటర్లు..

నిజామాబాద్ : జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర బృందం ముందుకెళుతోంది. ఆయా సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు పాదయాత్ర బృంద రథసారథి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. 56వ రోజు శుక్రవారం సుబ్రియాల్ వద్దకు చేరుకుంది. మొత్తంగా 1400 కి.మీటర్ల మేర పాదయాత్ర జరిగింది. 

13:14 - December 10, 2016

పూరీ జగన్నాథ్.. గతంలో సక్సెస్ లు పొందిన ఈ దర్శకుడు ప్రస్తుతం పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే 'కళ్యాణ్ రామ్' తో తీసిన 'ఇజం' కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనితో ఆయన సైలంట్ అయిపోయారని టాక్ వినిపించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది. ఆయన సినిమా టైటిల్స్ విషయంలో ఎంతో వెరైటీగా ప్రవర్తించే 'పూరీ' ఈ సారి కూడా వ్యవహించాడని తెలుస్తోంది. 'ఇడియట్‌’, 'దేశముదురు', 'పోకిరి', 'లోఫర్‌' ఇలాంటి టైటిల్సే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆయన 'మూడు కోతులు.. ఒక మేక' అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారని సమాచారం. మరి మూడు కోతులు ఎవరో..? ఒక మేక ఎవరో ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

13:04 - December 10, 2016

విరాట్ కోహ్లీ..టీమిండియా టెస్టు కెప్టెన్..పరుగుల దాహం తీర్చుకుంటున్నాడు. గత మ్యాచ్ లలో 'విరాట్' రాణిస్తున్న సంగతి తెలిసిందే. రికార్డులు సృష్టిస్తూ వస్తున్న ఈ బ్యాట్స్ మెన్స్ మరో రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు పూర్తి చేసిన 'కోహ్లీ' ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలున్నాయి. విరాట్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 211గా ఉంది. అంతేకాకుండా కోహ్లీ టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఒక ఇయర్ లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్ గా నిలిచాడు. అంతకుముందు సచిన్ (1997), రాహుల్ ద్రవీడ్ (2006)లో ఈ ఘనతను సాధించారు. 

13:00 - December 10, 2016
12:58 - December 10, 2016
12:56 - December 10, 2016
12:55 - December 10, 2016

విజయవాడ : వార్థా తుపాన్‌ నేపథ్యంలో గల్ఫ్‌ పర్యటనను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రద్దు చేసుకున్నారు. కరెన్సీ కొరత.. తుపాన్‌ విపత్తుపై ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలైన ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కరెంటు స్తంభాలు, సిమెంటు, నగదు, రేషన్ సరుకులు సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే తాను కూడా గల్ఫ్ పర్యటన రద్దు చేసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

12:55 - December 10, 2016

తమిళనాడు : వందల కోట్ల అవినీతి ధనంతో ఆదాయపు పన్ను అధికారులకు అడ్డంగా దొరికిపోయి సంచలనం సృష్టించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన మరో రూ. 24 కోట్లును ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఐటీ దాడుల తరువాత, మరో ప్రాంతంలో ఉంచిన ఈ డబ్బును బయటకు తరలించే క్రమంలో సమాచారం అందుకున్న ఐటీ అధికారులు, వేలూరు వద్ద కారులో తీసుకు వెళుతున్న ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ పాలకమండలి సభ్యులుగా విధులు నిర్వహించే శేఖర్ రెడ్డికి సంబంధించిన 24కోట్ల రూపాయల కొత్త నోట్లను వేలూరులో ఐటీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు శేఖర్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి ఐటీశాఖ సిఫార్సు చేసింది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో 170 కోట్ల రూపాయల నగదు, 130 కోట్ల రూపాయల విలువైన బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల రద్దైన రోజు రాత్రి భారీగా బంగారం కొనుగోలు చేసినట్లు.. ఓ ఏజెంట్ ద్వారా 80 కోట్ల రూపాయల పాత నోట్లను మార్చినట్లు అధికారులు గుర్తించారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా శేఖర్‌రెడ్డిని తొలగించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

12:53 - December 10, 2016

అమరావతి : వందల కోట్ల అవినీతి ధనంతో ఆదాయపు పన్ను అధికారులకు అడ్డంగా దొరికిపోయి సంచలనం సృష్టించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ పదవుల నుండి తొలగిస్తూ ఏపీ దేవాదయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లకాసురుడు శేఖర్‌రెడ్డిపై వేటుపడింది. టీటీడీ బోర్డు సభ్యుడిగా శేఖర్‌రెడ్డిని తొలగిస్తూ ఏపీ దేవాదాయశాఖ ఉత్తర్వలు జారీచేసింది. ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడడంతో శేఖర్‌ రెడ్డిని తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. మరోవైపు శేఖర్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాల ని కేంద్రానికి ఐటీశాఖ సిఫార్సు చేసింది. శేఖర్‌రెడ్డి, అతని అనుచరులు, స్నేహితుల ఇళ్లు, ఆఫీసుల్లో రెండు రోజుల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో 170 కోట్ల రూపాయల నగదు, 130 కోట్ల రూపాయల విలువైన బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరులో మరో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరింత సమచారానికి వీడయో చూడండి.. 

శేఖర్ రెడ్డికి ఉద్వాసన..

అమరావతి : వందల కోట్ల అవినీతి ధనంతో ఆదాయపు పన్ను అధికారులకు అడ్డంగా దొరికిపోయి సంచలనం సృష్టించిన టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ పదవుల నుండి తొలగిస్తూ ఏపీ దేవాదయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

12:47 - December 10, 2016

'అక్కినేని నాగార్జున' ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన తనయుళ్లు ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారని, త్వరలో వివాహం చేసుకుంటారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిన్న 'నాగార్జున' తనయుడు 'అఖిల్' నిశ్చితార్థ వేడుక ప్రముఖ వ్యాపార వేత్త జీవీ కృష్ణారెడ్డి మనువరాలు 'శ్రియా భూపాల్'తో ఘనంగా జరిగింది. జీవీకే స్వగృహంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు 'సమంత' కూడా వచ్చింది. ‘నాగ చైతన్య' - ‘సమంత' మధ్య ఉన్న ప్రేమ పెళ్లికి దారి తీస్తోందని, త్వరలోనే వీరి వివాహం జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. వీరిపై సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వెలువడుతున్నాయి. ‘అఖిల్’ వివాహం తర్వాత జరిగే రిసెప్షన్‌ను గ్రాండ్‌ లెవల్‌లో చేసేందుకు 'అక్కినేని' ఫ్యామిలీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిసెప్షన్‌కు అందదరినీ ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఎప్పుడు జరగనుందో ? ఎక్కడ జరగనుందో తదితర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

స్కూల్‌ బస్సు బోల్తా..20మందికి గాయాలు..

విశాఖ: విశాఖ తొట్లకొండ వద్ద రహదారిపై పాఠశాల బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గీతమ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చంద్రబాబు గల్ఫ్ పర్యటన రద్దు..

విజయవాడ: వార్ధా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్ద తుపాను, నోట్ల రద్దు అంశాలను సమర్థంగా ఎదుర్కోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. విపత్తు నిర్వహణ, ఆర్థికశాఖ అధికారులు, బ్యాంకర్లతో శనివారం ఉదయం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

11:56 - December 10, 2016

నల్లగొండ : జిల్లాలో మొసలి మరోసారి కలకలం సృష్టించింది. అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలోకి ఓ మొసలు హల్ చల్ చేసింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాకచక్యంగా మొసలిని బంధించారు. ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. జిల్లాలోని చిట్యాల,నడిగడ్డ ముంపుగ్రామాలుగా వున్నాయి. రిజర్వాయర్ లో నీటిని స్టోర్ చేయటంతో చిట్యాల నడిగడ్డ గ్రామాలు తరచూ ముంపుకు గురవుతున్నాయి. దీంతో గ్రామ భూస్థాయికి నీరు చేరుకోవటంతో మొసళ్లు తరచూ ఈ గ్రామాలలోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొసళ్ళ బారిన పడి ఇప్పటివరకూ దాదాపు 15 జంతువులు ఈ మొసళ్ళకు బలి అయిన పరిస్థితి నెలకొంది. ఈరెండు గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలనే డిమండ్ తో పాదయాత్రను చేపట్టిన సీపీఎం పలుమార్లు డిమాండ్ చేసింది. కాగా తమ గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

11:54 - December 10, 2016

హైదరాబాద్ : గత 31 రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రజలు నగదు కష్టాలు పడుతూనే వున్నారు. కొంపాగోడూ వదిలేసిన బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే వున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కష్టాలు మరింతగా పెరగనున్నాయి..బ్యాంకులకు శనివారం నుండి సోమవారం వరకూ  మూడు రోజులు సెలవులు రానున్నాయి. అంతంత మాత్రగానే వున్న బ్యాంక్ సేవలు మూడు రోజుల పాటు లేకపోవటంతో జనాల పాట్లు చెప్పనలవికాకుండా వుండే అవకాశముంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే..ఎవరిని కదిపినా ఒక్కటే ఆవేదన. ఎక్కడ చూసినా పెల్లుబికుతున్న తీవ్ర ఆసహనం. కనీస అవసరాలకు కావాల్సిన డబ్బులు కూడా లేక ఎంతో మంది పేదలు పస్తులుండాల్సిన దుస్థితి. గంటల కొద్దీ క్యూలో నిలబడ్డా.. అవసరాలకు సరిపడా నగదు దొరకని పరిస్థితి. పెద్ద నోట్లు రద్దై నెల రోజులు పూర్తయినా... ప్రజల కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా... సరిపడా నిల్వలు లేక ఖాతాదారులు నగదు కోసం నానా తంటాలు పడుతూనే ఉన్నారు. నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. ఆర్బీఐ నుంచి అరకొర నగదు అందుతుండడంతో క్యాష్ కష్టాలు రోజు రోజుకు జఠిలమవుతున్నాయి. నెల జీతం కోసం ఎదురు చూసే వేతన జీవుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పండుటాకులు పింఛన్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచున్నా నగదు అందే పరిస్థితులు లేకుండా పోయాయి.  

వ్యాపారుల ఘర్షణ..ఒకరి మృతి

విశాఖ : మద్యం మత్తు పెను విషాదలను నింపుతోంది. దీనికి అలవాటు పడి విచక్షణను కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు..హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటంలేదు. ఇటువంటి ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పెందుర్తిలో వీధి వ్యాపారులు బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులు ఉన్న ఇద్దరు వ్యాపారులు ఒకరిపై ఒకరు దాడి చేసున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన మజీద్‌ అనే వ్యాపారి ఉత్తరప్రదేశ్ కు చెందిన దిలీప్‌ ధర్మదాస్‌ అనే మరో వ్యాపారిని కర్రతో కొట్టి చంపాడు. కాగా ఈ ఘటన జరిగిన అనంతరం మజీద్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

శేఖర్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..

తిరుమల : టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమయ్యిందని ఆపార్టీ నేత టీజీ వెంకటేశ్ తెలిపారు.శేఖర్ రెడ్డి స్వచ్ఛంధంగా రాజీనామా చేస్తే బాగుంటుందని సూచించారు. తమిళనాడులో 30 శాతంమంది తెలుగువారున్నారనీ..కానీ ఒకే ఒక్కరిరి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారన్నారు. అటు తెలంగాణలో కూడా సీమాంధ్రులకు మంత్రి పదవులు ఇచ్చేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. 

11:39 - December 10, 2016

సంగారెడ్డి : నోట్ల రద్దుతో సరకు రవాణా స్తంభించిపోయింది. ఆర్డర్‌లు లేక నెలరోజులుగా ట్రక్ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు తర్వాత 90శాతం వ్యాపారం పడిపోయిందని వాపోతున్నారు. దాదాపు 300 ట్రక్కుల యజమానులు లైన్లలో నిలబడినా పని దొరకటంలేదనీ..బతిమాలుకుని పని దొరికించుకున్నా .. దొరకిన పనికి కూడా సరైన రీతిలో కిరాయి గిట్టటంలేదని వారు వాపోతున్నారు. మరోపక్క ట్రక్ డ్రైవర్లు కూడా ట్రక్ యజమానులకు కిరాయి దొరికితేనే తమకు ఉపాధి వుంటుందనీ అరాకొరాగా పనిదొరికినా నోట్ల రద్దుతో బ్యాంకులు ఇచ్చే పరిమిత నగదుతో ఇంటి కిరాయిలకు..నిత్యావసర వస్తువులకు సరిపోవటంలేదని వాపోతున్నారు. 

11:39 - December 10, 2016

విశాఖ : పెనుతుపానుగా మారిన వార్థా తుపాను విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 910 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 12న నెల్లూరు-మచిలిపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రధాన ఓడరేవుల్లోరెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

11:38 - December 10, 2016

కృష్ణా : మొవ్వ మండలం నిడుమోలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా గుడ్లవల్లేరు మండలం..వేమవరం కొండాలమ్మ ఆలయానికి పెళ్లికి వెళ్తున్నారు. బాధితులందరూ ఘంటసాల మండలం...మల్లంపల్లి గ్రామానికి చెందినవారు. కాగా క్షతగాత్రులను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 1.30గంటలకు ఈ ఘటన జరిగింది. చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. కొల్లు రవీంద్ర ఆసుపత్రికి ఫోన్ చేసిన ఎప్పటికప్పుడు క్షత్రగాత్రుల వైద్యసేవలపై సమాచారం తెలుసుకుంటున్నారు. వారికి మెరుగైన చికిత్సనందించాలని వైద్యశాఖ మంత్రి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అత్యవసర చికిత్స అవసరమైన మరో ఆసుపత్రికి తరలించాలని కూడా మంత్రులు ఆదేశించారు. ఘంటశాల మండలం మల్లంపూడిలో వివాహానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ట్రాక్టర్ డ్రైవర్ మద్యం తాగి వున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు.

11:37 - December 10, 2016

మహబూబ్‌నగర్ : కన్నవారే పిల్లల పాలియ యముడుగా మారుతున్నారు. కన్నబిడ్డలకు క్షణికావేశంలో పొట్టనపెట్టుకుంటున్నారు. మద్యం మత్తులో కూడా కన్నబిడ్డలను కడతేరుస్తున్నారు. ఇటువంటి ఘటనే జడ్చర్ల మండలం బూరుగుపల్లిలో చోటుచేసుకుంది. పెద్దతండాలో కూతురు, కొడుకును తండ్రి హత్యచేశాడు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆరు నెలలుగా లింగయ్య నాయక్ అనే వ్యక్తి భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో భార్యతో వివాదాలు పెరగటంతో మద్యం మత్తులో చరణ్ ,లక్ష్మి అనే ముక్కపచ్చలారని తన ఇద్దరు పిల్లను హత్య చేశాడు. చంపివేసి గుట్టు చప్పుడు కాకుండా చెట్ల పొదల్లో పడేశాడు. వ్యవసాయ పనుల నినిమిత్తం వెళ్లిన గ్రామస్థులు చెట్ల పొదల్లో వున్న చిన్నారుల మృతదేహాలను గమనించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి లింగయ్య నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

నాంపల్లి వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు..

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు వేగంగా పనులు పూర్తి చేసేందుకు గాను శనివారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మెట్రో అధికారుల అభ్యర్ధ్యన మేరకు ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 నుంచి 17వ తేదీ వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు మినహా అబిడ్స్‌, కోఠి నుంచి వచ్చే అన్ని వాహనాలను నాంపల్లి టి జంక్షన్‌ వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లిస్తామన్నారు.

సెక్యూరిటీ గార్డ్ దారుణహత్య..

తిరుపతి : స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఇంటివద్ద సెక్యూరిటీ గార్డ్ శేషయ్య హత్యకు గురయ్యాడు. శేషయ్యను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. 

'18న పోలవరం నిర్వాశితులతో రౌండ్ టేబుల్'

విజయవాడ : పోలరవం నిర్వాశితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 18న పోలవరం నిర్వాశితులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరవుతో రాయలసీమ అల్లాడుతోందనీ..కరవు మండలాలలను ప్రకటించినా వాటికి చుక్క నీరు అందటంలేదన్నారు. ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలను ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో తెలిపేలా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ముర‌ళీ విజ‌య్ సెంచరీ..

ముంబై : ముర‌ళీ విజ‌య్ ముంబై టెస్ట్‌లో సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగ‌వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ విజ‌య్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 231 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స‌ర్ల సాయంతో విజ‌య్ సెంచ‌రీని పూర్తి చేశాడు. టెస్టుల్లో విజ‌య్‌కి ఇది ఎనిమిద‌వ సెంచ‌రీ కాగా, ఇదే సిరీస్‌లో ఇది రెండ‌వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం భార‌త్ 74 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 218 ర‌న్స్ చేసింది. విజయ్ 101, కోహ్లీ 40 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు.

11:14 - December 10, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. సోషల్ మాధ్యమాల్లో కూడా 'ఖైదీ'కి సంబంధించిన పలు విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ చిత్రంలో 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' నటిస్తున్నాడని..తండ్రితో కలిసి స్టెప్పులు వేశాడని టాక్స్ వినిపించిన సంగతి తెలిసిందే. వీటికి 'చెర్రీ' ఫుల్ స్టాప్ పెట్టాడు. ‘ధృవ' సినిమా ప్రమోషన్ లో భాగంగా 'చరణ్' క్లారిటీ ఇచ్చాడు. ‘చిరు' సినిమాలో తాను కామిక్ రోల్ పోషిస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇంట్రడక్షన్ సాంగ్ లో 'చిరు'తో కలిసి ఆడినట్లు పేర్కొన్నాడు. చిరు సినిమాలో 'రామ్ చరణ్' కు చెందిన ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. గతంలో చిరు, చరణ్ లు కలసి 'మగధీర’, 'బ్రూస్ లీ' చిత్రాలలో నటించారు. 'ఖైదీ నెం 150' తో మూడు చిత్రాల్లో నటించినట్లవుతుంది. 

జడ్చర్ల మండలంలో దారుణం!..

మహబూబ్ నగర్ : కన్నవారే పిల్లల పాలియ యముడుగా మారుతున్నారు. కన్నబిడ్డలకు క్షణికావేశంలో పొట్టనపెట్టుకుంటున్నారు. జడ్చర్ల మండలం పెద్దతండాలో దారుణం జరిగింది. ఓ తండ్రి పిల్లపట్ల కసాయిగా మారాడు. కుమారుడు, కుమార్తెలను హత్య చేశాడు. కాగా కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా సమాచారం.

09:58 - December 10, 2016

జగిత్యాల: కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మల్లెల క్రాస్ రోడ్డు వద్ద కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపై పడివుంది. ఆయల్ ట్యాంకర్ ను తప్పించబోయి ఓ కారు-అతి వేగంగా వచ్చి చెట్టు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలవ్వగా వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వీరు నిజామాబాద్ నుండి వరంగల్ కు వివాహ వేడుకలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదానికి కారు అతి అతివేగం కూడా కారణమని తెలుస్తోంది. మృతులు నాగిరెడ్డి రవితేజలు కాగా..గాయపడిన వారు కిషన్ రెడ్డి,సురేష్ , నాగార్జున, ఉదయ్ లుగా గుర్తించారు. వీరంతా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కోటగిరి వాసులుగా గుర్తించారు. వీరంతా సమీమబంధువులుగా తెలుస్తోంది. 

కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం..4గురు మృతి..

జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-కంటైనర్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి  చెందగా మరో  నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నిజామాబాద్ వాసులుగా  గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ సాంకేతిక లోపం..

తూర్పుగోదావరి : నర్సపూర్ ..నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఔరంగాబాద్ సమీపంలో నిలిపివేశారు. అటు పొగమంచు..ఇటు మధ్యలో నిలిచిపోయిన ప్రయాణంతో  ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

పొగమంచుతో పలు రైళ్లు రద్దు..

ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. 101 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరో 18 రైళ్ళ రాకపోకల సమసయంలో మార్పులు చేశారు. 7 రైళ్ళనుఅధికారులు రద్దు చేశారు. 

అక్రిడిటేషన్ దరఖాస్తుల గడువు పెంపు..

హైదరాబాద్ : వరుస సెలవుల కారణంగా అక్రిడిటేషన్ దరఖాస్తుల గడువును డిసెంబర్ 15 వరకు పెంచారు.ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.. 2017-18 సంవత్సరానికి గాను జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈ నెల 15 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ వెబ్‌సైట్ WWW.IPR.TG.NIC.IN నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకొవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను సంబంధిత డాక్యుమెంట్లతో జతచేసి గడువులోగా డీపీఆర్‌వో కార్యాలయంలో అందచేయాలని సూచించారు.  

నేటి నుంచి టీఎస్‌యూటీఎఫ్‌ మహాసభలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర ద్వితీయ మహాసభలు మహబూబ్‌నగర్‌లో శనివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని టీఎస్‌యూటీఎఫ్‌ సంఘం పేర్కొంది. 

08:42 - December 10, 2016

నిజామాబాద్ : ఎర్రజెండా చేతబట్టి.. ప్రజాబాట పట్టిన సీపీఎం పాదయాత్ర.. పల్లెపల్లెనూ పలకరిస్తోంది. అడుగడుగునా ప్రజల సమస్యలను ఆలకిస్తూ.. మీ వెంటే మేమున్నామని భరోసా కల్పిస్తోంది. 54వ రోజులు అలుపెరుగని పర్యటనతో పాదయాత్ర బృందం ఇప్పటివరకు 500 గ్రామాలను చుట్టేసింది. స్వరాష్ట్రం సిద్ధించినా తెలంగాణలో ప్రజల బతుకులు ఏ మాత్రం మారలేదని పాదయాత్ర రథసారధి తమ్మినేని వీరభద్రం అన్నారు.

ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల సమస్యలతో అల్లాడుతున్నారు : తమ్మినేని
తెలంగాణ వస్తే బతుకులు బాగు పడతాయని ఆశించిన వారిని ఒరిగిందేం లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్వరాష్ట్రం సిద్ధించినా... ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తమ్మినేని అన్నారు.

సీపీఎం అలుపెరుగని పోరాటం : జాన్ వెస్లీ
తెలంగాణ రాష్ర్టంలో సామాజిక న్యాయం జరిగే వరకూ సీపీఎం అలుపెరుగని పోరాటం కొనసాగిస్తుందని మహాజన పాదయాత్ర బృందం సభ్యులు జాన్‌వెస్లీ తెలిపారు. నిజామాబాద్‌లో జిల్లాలో ఉన్న జోగినీలను ఆదుకుని.. వారికి సాగు భూమి, పెన్షన్లు అందజేయాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ఈ నెల 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సామాజిక అంశాలపై అన్ని పార్టీల నేతలు చర్చించాలని ఆయన అన్నారు.

రైతాంగ, కార్మిక సమస్యలపై ఉమ్మడి పోరాటం : ఆకుల పాపయ్య
రైతాంగ, కార్మిక సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం పాదయాత్రకు మద్దతు తెలిపిన... న్యూడెమొక్రసీ నిజామాబాద్‌ జిల్లా నేత ఆకుల పాపయ్య అన్నారు.

54వ రోజులు.. 13 వందల 70 కిలోమీటర్లకు పాదయాత్ర
సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు నిజామాబాద్‌ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. 54వ రోజు వరకు పాదయాత్ర 13 వందల 70 కిలోమీటర్ల పూర్తి చేసుకుంది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. పాదయాత్ర బృందం 54వ రోజు నిజామాబాద్‌ జిల్లాలో దాస్‌నగర్‌, మానిక్‌బండార్‌, చిన్నాపూర్‌, కల్లెడి, ఆలూరు, పెగ్గుపల్లి తండాలతో పాటు ఆర్మూర్‌లో పర్యటించింది. సారంగాపూర్‌ సహకార చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. పలు సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రకు మద్దతు తెలిపారు.

08:37 - December 10, 2016

విశాఖ : వార్థా తీవ్ర తుపాన్‌గా మారిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 910 కి.మీ.ల దూరంలోనూ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1000 కి.మీ.ల దూరంలోనూ తుపాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. మచిలీపట్నం-నెల్లూరుల మధ్య ఈనెల 12వ తేదీ మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందన్నారు. గాలుల వేగం గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు.  

ఏపీకి 'వార్దా' గండం..

విశాఖ : వార్దా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకెళుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారిందని వెల్లడించారు. విశాఖకు 840 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నంకు 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైందని చెప్పారు. తీరం వైపు గంటకు 17 కి.మీ వేగంతో పయనిస్తుంది. ఎల్లుండి మధ్యాహ్నం నెల్లూరు-మచిలిపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అధికారులు అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరించారు.

08:00 - December 10, 2016

గురువారం రాత్రి నేతల అధికారుల నిర్లక్షానికి 11 మంది నిరుపేద కూలీల బతుకు శిథిలాలల్లో తెల్లవారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి నేతల అధికారుల నిర్లక్షానికి 11 మంది నిరుపేద కూలీల బతుకు శిథిలాలల్లో తెల్లవారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గత ఆరు నెలల్లో భవనాలు కూలిపోయిన ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా 47మంది తీవ్ర గాయాపాలయ్యారు. 2016లో గులాబీ దళం అధికారంలోకి వచ్చాక అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామనీ..అవినీతిపై యుద్ధం ప్రకటిస్తామంటూ..అయ్యప్ప సొసైటీ అంటూ.. ప్రగల్భాలు పలికారు. ప్రాణాలు పోగొట్టుకున్న పేదల బతుకులకు ఎవరు సమాధానం చెబుతారు? దీనికి ప్రభుత్వం బాధ్యత నిర్లక్షానికి కారణం కాదా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత),శ్రీనివాస్ రెడ్డి (సీపీఎం నేత), ఆచారి (బీజేపీ నేత) పాల్గొన్నారు. నగరంలో కొన్ని వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలున్నాయని సీపీఎం నేత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేసుకోండి..అనంతరం పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అని ప్రభుత్వమే చెబుతోందనీ..ఇటువంటి క్రమంలో అక్రమనిర్మాణాలు ఎలా ఆగుతాయని ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ లో 70 శాతం పోస్టులు ఖాళీగా వున్నాయన్నాయనీ..ఈ శాఖలో 412 సిబ్బందికీ..కేవలం 117 మంది మాత్రమే వున్నారని తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి.. 

07:47 - December 10, 2016
07:40 - December 10, 2016

ఢిల్లీ : నగదు రూపంలో కూలీ అందుకునే సగటు భారతీయుడి నిజాయితీని..పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగా గాయపరిచిందన్నారు మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్. నల్లధనాన్ని కూడబెట్టిన అక్రమార్కులు అడ్డదారుల్లో జారుకుంటున్నారని,.సామాన్యులే కష్టాలపాలవుతున్నారని మన్మోహన్‌సింగ్ ది హిందూ దినపత్రికలో విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. మన్మోహన్‌సింగ్ విశ్లేషణలోని ముఖ్యాంశాలు.

అక్రమార్కులు జారుకుంటున్నారు,సామాన్యులే కష్టపడుతున్నారు : మన్మోహన్
ది హిందూ పత్రికలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. అజాత శత్రువు లాంటి మన్మోహన్ సింగ్ పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ పార్లమెంటులో చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా ఈ విశ్లేషణ సాగింది. పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా తీవ్రంగా పార్లమెంటులో తీవ్ర స్థాయిలో అభివర్ణించిన ఈ ఆర్థిక నిపుణుడు, ఇది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేసిన మహాపరాధమని తేల్చి చెప్పారు.

నోట్ల రద్దుపై 'ది హిందూ' పత్రికలో మన్మోహన్‌సింగ్‌ విశ్లేషణాత్మక వ్యాసం
డబ్బు అన్నది మనిషికి ఆత్మవిశ్వాసాన్నిచ్చే ఒక భావన. నవంబర్ 8 అర్థరాత్రి నుంచి కోట్లాది దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చలామణిలో ఉన్న డబ్బులో 85 శాతం 500, వేయి రూపాయల నోట్ల రూపంలోనే ఉందని ఆనాడు మోదీ ప్రకటించారు. భారత ప్రభుత్వం తమను, తమ డబ్బును కాపాడుతుందని దేశ ప్రజలు విశ్వసిస్తారు. మోదీ తన నిర్ణయంతో ప్రజలు ప్రభుత్వం మీద పెంచుకున్న నమ్మకాన్ని తునాతునకలు చేశారన్నారు మన్మోహన్ సింగ్.

ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మోదీ ధ్వంసం చేశారు
సరిహద్దు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, అవినీతితో పెరుగుతున్న నల్ల ధనాన్ని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఆ రెండు ఉద్దేశాలూ మంచివే. నకిలీ ధనం, నల్ల ధనం దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించిన మాట అక్షర సత్యమే. కానీ, ఆ లక్ష్యాలను ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికార యంత్రాంగాన్ని ప్రయోగించి అదుపు చేయాలి. మరి మోదీ ఏం చేశారు? మంచి ఉద్దేశంతో మార్గం వేస్తున్నానని చెబుతూ నరకానికి బాటలు వేశారు. అయిదు వందలు, వేయి రూపాయల నోట్లను రాత్రికి రాత్రి చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించిన మోదీ, మొత్తం నగదు అంతా నల్లధనమేనని, నల్లధనమంతా నగదు రూపంలోనే ఉందని భ్రమించినట్లు స్పష్టమైంది. కానీ, ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఎలాగో చూద్దాం.

అధికార యంత్రాంగాన్ని అదుపు చేయాలి
భారతదేశంలోని 90 శాతం కష్టజీవులు తన జీతాలను నగదు రూపంలోనే అందుకుంటారు. వీరిలో కోట్ల సంఖ్యలో ఉన్న రైతులు, రైతు కూలీలు, నిర్మాణ కార్మికులు మొదలైనవారున్నారు. 2001 తరువాత పల్లె ప్రాంతాలలో బ్యాంకు శాఖల సంఖ్య రెట్టింపు అయ్యాయి. కానీ, ఇప్పటికీ 60 కోట్ల మంది భారతీయులు ఏ బ్యాంకూ లేని పల్లెలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. వీళ్ళ జీవనానికి నగదే ఆధారం. వారు ఏమైనా సొమ్ము దాచుకుంటే అది 500, 1000 రూపాయల నోట్లలోనే దాచుకుంటారు. ఈ డబ్బు మీద 'బ్లాక్ మనీ' అనే ముద్ర వేసి, అలా లక్షలాది జీవితాలను సంక్షోభంలోకి నెట్టడం మహా విషాదం.

90 శాతం మంది జీతాలను నగదు రూపంలోనే అందుకుంటారు
ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? ప్రజల హక్కులను, వారి జీవనాధారాన్ని కాపాడడం. కానీ, మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ బాధ్యతను పూర్తిగా తుంగలో తొక్కింది. బ్లాక్ మనీ ఎవరికైనా ఆందోళన కలిగించే విషయమే. ఎన్నో ఏళ్ళుగా అక్రమ మార్గాల నుంచి వక్రమార్కులు పోగు చేసుకున్న డబ్బు వివిధ రూపాల్లోకి మారిపోయింది. నల్లధనాన్ని మూటగట్టే వారికి ఆ డబ్బును కాపాడుకునే మార్గాలు చాలానే ఉంటాయి. దాన్ని బంగారంగా, భూమిగా లేదంటే విదేశీ సొమ్ముగా మార్చే శక్తి వారికి ఉంటుంది. కానీ, కష్టపడి సంపాదించుకున్న డబ్బులో రేపటి అవసరాల కోసం కొంత మొత్తాన్ని దాచుకునే పేదలు, మధ్య తరగతి ప్రజలకు అలా చేయలేరు. కానీ, వారిప్పుడు తమ దగ్గరున్న కొద్ది పాటి డబ్బును పట్టుకుని బ్యాంకులకు పరుగెట్టి, పడిగాపులు పడాల్సి వస్తోంది.

బ్యాంకులకు పరుగులు పెడుతున్న సామాన్యులు
నల్లధనాన్ని కూడబెట్టిన అసలైన అక్రమార్కులపై నిర్దిష్టంగా దాడులు జరగాలి. గత ప్రభుత్వాలు ఐ.టి, ఈడీ ద్వారా ఆ పని చేశాయి. స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథకాలను అమలు చేశాయి. గతంలో జరిపిన ఆ దాడుల్లో తేలిన సత్యం ఒక్కటే. అదేమంటే, నగదు రూపంలో ఉన్న నల్ల డబ్బు అత్యల్బం. బ్లాక్ మనీ అంటే క్యాష్ మాత్రమే కాదు. ఈ సత్యం తెలిసిన వివేకవంతులెవరూ సామన్యుడి మీద అస్త్రాలు సంధించరు. కానీ, మోదీ సగటు భారతీయులను, నిజాయితీ కలిగిన పౌరులను అవమానించారు. నల్ల కుబేరులను మాత్రం అరచేతిలో బెత్తంతో కొట్టినట్లు కొట్టి వదిలేస్తున్నారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, ఇంతా చేసి భవిష్యత్తులో నల్ల దొంగలకు బాగా వెసులుబాటుగా ఉండేలా రెండు వేల నోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఈ విచ్ఛిన్నకర విధానంతో ఆయన నల్ల డబ్బును బయటకు తీయలేకపోయారు, నల్ల డబ్బుకు అడ్డుకట్ట కూడా వేయలేకపోయారు. వెరసి ఆయన ఏం సాధించారు.. అని సూటిగా ప్రశ్నించారు మన్మోహన్ సింగ్.....

నల్లధన అక్రమార్కులపై ఐటీ, ఈడీ ద్వారా దాడులు జరగాలి
పాత నోట్లను తీసేసి లక్షల కోట్లను కొత్తగా ముద్రించడమన్నది మామూలు విషయం కాదు. ఏ దేశానికైనా అదొక పెను సవాలు. ఇక, వైవిధ్యమే భూషణమైన బారతదేశంలో ఇది ఆషామాషీ వ్యవహారం కానే కాదు. అందుకే, చాలా దేశాలు ఇలాంటి సాహసాలకు ఒడిగట్ట లేదు. కానీ, మోదీ దేశ ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. కోట్లాది మంది పేద ప్రజానీకం ఈరోజున తమ డబ్బు కోసం రేషన్ షాపుల ముందు క్యూ కట్టినట్లు రోజుల తరబడి నిల్చుని అవస్థలు పడుతుంటే గుండె పగిలిపోతోంది. నా దేశ ప్రజలు ఇలా ఒకరోజున రేషన్లో తమ డబ్బు కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఏనాడూ ఊహించలేదన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇది ఒక అనాలోచిత నిర్ణయానికి విషాదకర పర్యవసానమని వ్యాఖ్యానించారు.

కొత్త నోట్లను ముద్రించడం అతిపెద్ద సవాలు
పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతూ, ఉపాధి అవకాశాలు బలహీనపడుతూ, ఆర్థిక వ్యవస్థ ప్రతికూలాంశాలతో సతమతముతున్న సందర్భంలో మోదీ తీసుకున్న నిర్ణయం దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర దుష్ప్రభావం చూపిస్తంది. మోదీ వేసిన వేటుతో జీడీపీ పడిపోతుంది. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. రాబోయే కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి అందరూ సంఘటితంగా ఉండాల్సిందేనని నేను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానన్నారు మన్మోహన్.

దేశ ఆర్ధిక వ్యవస్థమీద తీవ్ర దుష్ప్రభావం..పడిపోతున్న జీడీపీ
బ్లాక్ మనీ.. ఈ సమాజానికి పట్టిన చీడ. దాన్ని నిర్మూలించాల్సిందే. కానీ, ఆ లక్ష్యం కోసం తీసుకునే నిర్ణయం కోట్లాది సామాన్యులను, నిజాయతీ కలిగిన పౌరులను సమస్యల్లోకి నెట్టేయకూడదు. సకల సమస్యలను ఒక్క బాణంతో కొట్టేయాలనే ఆలోచన వినడానికి మురిపెంగానే ఉంటుంది. అలాంటి ఉబలాటం దేశాన్ని సంకటంలో పడేస్తుంది. నల్ల ధననాన్ని నిర్మూలించడంలో గత ప్రభుత్వాలు నిస్సత్తువగా వ్యవహరించాయని ఆరోపించడం కూడా సరైనది కాదు. గత ప్రభుత్వాలు సామాన్య పౌరులను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. నిజానికి, పాలనాపరమైన విధానాల్లో రామబాణాల్లాంటివేవీ ఉండవు. ప్రతి విధానం వెనుక సమస్యాత్మక కోణాలు కూడా ఉంటాయి. ఆశిస్తున్న ప్రయోజనాలు, రిస్కులను బేరీజు వేసుకున్న తరువాత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. నల్ల ధనం మీద యుద్ధం చేయాల్సిందే, కానీ, ఆ యుద్ధంలో నిజాయతీ కలిగిన పౌరులు ఒక్కరు కూడా గాయపడకూడదు. అర్థవంతమైన విధానం అంటే అదే.

మన్మోహనుడి అంతరంగానికి ప్రతీక ఈ విశ్లేషాణాత్మక సారాంశం
ఇదీ ఆర్థిక వేత్తగా, ఆర్థిక మంత్రిగా, ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మనోగతం. వర్తమాన విషాదంపై ఆవేదనంతో పెల్లుబికిన అంతరంగానికి ప్రతీక ఈ విశ్లేషాణాత్మక సారాంశం.

07:30 - December 10, 2016

ఢిల్లీ : సింగల్‌ యాప్‌ ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటే బ్యాంకులో డబ్బు సరక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో రెండో రోజు నగదు రహిత లావాదేవీల కమిటీ సమావేశం జరిగింది. ఆన్‌ లైన్‌ లావాదేవీలపై ప్రజలు దృష్టి పెట్టాలన్న ఆయన.. రూపీ కార్డుల ద్వారా క్రయ, విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి లావాదేవీలో జాగ్రత్తగా ఉంటే బ్యాంకులో డబ్బు తారుమారు అయ్యేందుకు అవకాశం ఉండదని సూచించారు.

07:28 - December 10, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథపై యూనిసెఫ్ సంస్థ సర్వే చేపట్టనుంది. ఈ పథకానికి సంబంధించిన రాష్ట్రవ్యాప్త సర్వే బాధ్యతను తెలంగాణ సర్కారు యూనిసెఫ్‌ ప్రతినిధులకు అప్పగించింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సాంకేతిక సహకారంతో యునిసెఫ్ ఈ సర్వే జరపనుంది. సర్వేలో ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలన్న దానిపై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం జరిగింది.

మిషన్ భగీరథ పై సమగ్రస్థాయి సర్వేకు సర్కారు యోచన
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథపై సమగ్రస్థాయి సర్వే జరగనుంది. తెలంగాణ సమాజంపై మిషన్ భగీరథ కలిగించే సామాజిక, ఆర్థిక ప్రభావాలపై సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో గతంలో పలు సర్వే సంస్థలతో RWS ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. చివరకు సర్వే బాధ్యతను యూనిసెఫ్ ప్రతినిధులకు ప్రభుత్వం అప్పగించింది. సర్వేలో ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి... సర్వేలో తెలుసుకున్న విషయాలను ఎలా విశ్లేషించాలన్న దానిపై అడ్వైజరీ గ్రూప్ సమావేశంలో చర్చించారు.

మిషన్‌ భగీరథ ప్రాధాన్యతపై యూనిసెఫ్ ప్రతినిధులకు వివరణ
మిషన్ భగీరథ ప్రాధాన్యత, లక్ష్యాలను యూనిసెఫ్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఒక వెయ్యి 44 ఆవాసాల్లోని ప్రజలు ఫ్లోరైడ్, ఇతర రసాయనాలతో కలుషితమైన నీళ్లే తాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 98 మండలాల్లో 25 శాతం ఇళ్లకు మాత్రమే సురక్షిత మంచినీరు అందుతుందన్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 33 శాతం గృహాలకు మాత్రమే మంచినీటి సౌకర్యం ఉందన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రంలో కేవలం 45 శాతం ఇళ్లకే తాగునీటి సౌకర్యం ఉందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తాము సర్వే అంశాలను నిర్ణయించామన్నారు.

సర్వే చేపట్టనున్న యూనిసెఫ్
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సాంకేతిక సహకారంతో యునిసెఫ్ ఈ సర్వే చేపట్టనుంది. మిషన్ భగీరథతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని యునిసెఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ సర్వేతో మిషన్ భగీరథ ప్రాధాన్యతను దేశమంతా గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

07:25 - December 10, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై మళ్లీ దర్యాప్తు చేయాలన్న ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేసింది.... చట్టప్రకారం ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు ఉండవని స్పష్టం చేసింది..

ఏసీబీ కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు
ఓటుకు నోటు కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది . చంద్రబాబు పాత్రపై మళ్లీ దర్యాప్తు చేయాలన్న ఏసీబీ కోర్టు తీర్పును కొట్టివేసింది. ఈకేసులో తన పాత్రపై దర్యాప్తు చేపట్టాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టులో కొద్దినెలలక్రితం పిటిషన్‌ వేశారు... ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది..... సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ సునీల్ చౌదరీ బెంచ్.... బాబు తరపు లాయర్‌ వాదనతో ఏకీభవించారు....... ఏసీబీ కోర్టు తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు..

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించే అర్హత ఆయనకు లేదని తెలిపింది. కేసుకు సంబంధించిన బాధితులు గాని, ఫిర్యాదుదారులు గానీ వాదనలు వినిపించాలని.. మీకేం సంబంధమని రామకృష్ణారెడ్డిని కోర్టు ప్రశ్నించింది.. కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది..

కోర్టుతీర్పుపై చంద్రబాబు హర్షం
కోర్టుతీర్పుపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు.. ఈ కేసు తన విశ్వసనీయతను మరోసారి నిరూపించిందని వ్యాఖ్యానించారు..

మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైసీపీ రామకృష్ణారెడ్డి
అటు హైకోర్టు తీర్పుపై మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతానని.. రామకృష్ణారెడ్డి ప్రకటించారు.. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించేలా పోరాడుతామని స్పష్టం చేశారు..

07:21 - December 10, 2016

హైదరాబాద్ : ఈనెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో ఇవాళ తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యుహంతో పాటు పలు బిల్లుల‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది. ప్రధానంగా నయీం కేసు, న‌గ‌దు ర‌హిత లావాదేవీల అంశాల‌పై కేబినెట్లో చ‌ర్చ జ‌ర‌గునుంది.

.3 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ
అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో సభలో అనుస‌రించాల్సిన వ్యూహాలపై ఇవాళ తెలంగాణ మంత్రి మండ‌లి స‌చివాల‌యంలో స‌మావేశం కాబోతోంది. మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

పెద్దనోట్ల రద్దు తర్వాత పరిణామాలపై చర్చించే ఛాన్స్
సభలో ప్రధానంగా పెద్దనోట్ల ర‌ద్దు నేప‌ధ్యంలో ప్రజ‌ల‌ సమస్యలపై చర్చించే ఛాన్స్ ఉంది. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని త‌మిళ‌నాడు త‌ర‌హాలో నేరుగా ఇళ్ల వ‌ద్దకే స్వైపింగ్ మిష‌న్లు పంపి... అక్కడే న‌గ‌దు అందించే విషయంపై కూడా కేబినెట్లో చ‌ర్చించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నయీం కేసుపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం
గ్యాంగ్ స్టర్ నయీం కేసు కూడా మంత్రిమండలిలో చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సమావేశాల్లో విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉండటంతో ముందుగానే ఈ అంశంపై సభలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై వ్యూహరచన చేయబోతోంది. నయీం కేసులో పీకల్లోతులో ఇరుక్కుపోయిన టీఆర్ఎస్ నేత మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ పై చర్యలు తీసుకునే అంశంపై కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది.

గత నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర
ముఖ్యంగా ఈనెల 23న ఎర‌వెల్లి, న‌ర‌స‌న్నపాలెంలోడ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల సామూహిక గృహ‌ప్రవేశంపై కూడా కేబినెట్లో చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ ఇచ్చే అంశంపై కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితోపాటు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌నుంది.

 

07:15 - December 10, 2016

హైదరాబాద్ : ఒక్క నిర్లక్ష్యం.. ఆరు నిండు ప్రాణాలను బలిగొంది. అదే నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలిగొంటున్నా...దున్నపోతు మీద వానపడ్డట్లు పదే పదే..అదే నిర్లక్ష్యం.. అక్రమంగా అంతస్తులు నిర్మించి సొమ్ము చేసుకోవాలన్న దురాశకు.. 11మంది బలైపోయారు. పొట్టచేతబట్టుకొని నగరానికి వచ్చిన కూలీలు... శిథిలాలకింద సజీవ సమాధి అయ్యారు. హైదరాబాద్‌ నగర శివారులోని నానక్‌రాంగూడలో 7 అంతస్తుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకూ మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనాస్థలిలోనే వుండి పర్యవేక్షించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కమిటీ వేశామని 15రోజుల్లో నివేదిక వస్తుందనీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసిన ప్రగల్భాలు పలికే నేతలు..అధికారులు ఆచరణలో ఏ మాత్రం కనిపించకపోవటం గమనించాల్సిన విషయం. వీరి నిర్లక్ష్యానికి నిరుపేదలు బలైపోతూనేవున్నారు..వీరిలో మాత్రం ఏమ్రాతం చిత్తశుద్ధి అనేది మాత్రం కాగడావేసినా కానరావటంలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అక్రమ క‌ట్టాడాల‌కు అడ్డుక‌ట్ట వేయాలంటున్న నగరవాసులు
గ్రేటర్‌లో భారీ ఎత్తున అక్రమనిర్మాణాలు పుట్టుకొస్తున్నా..వీటిని అరిక‌ట్టాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జ‌రిగినప్పుడు తెగ‌హ‌డావుడి చేసే ప్రభుత్వం..ఆ త‌రువాత రాజకీయ నేతలవత్తిడితో చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అందువల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ క‌ట్టాడాల‌కు అడ్డుక‌ట్ట వేయాలని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. 

ఏపీ భవన్ విభజనపై 16న చర్చ..

ఢిల్లీ : ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై చర్చించేందుకు ఈ నెల 16న సమావేశం జరుగనున్నది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, రెసిడెంట్ కమిషనర్లు పాల్గొంటారు. ఈ మేరకు గురువారమే రెండు రాష్ర్టాల సీఎస్‌లకు కేంద్రం నుంచి లేఖలు పంపింది. రెండు రాష్ర్టాలకు ఉమ్మడిగా ఉన్న ఈ ఆస్తిని ఏ ప్రాతిపదికన విభజించాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. 

పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా..

కృష్ణా : మొవ్వ మండలం నిడుమోలు వద్ద పెళ్లిబృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా తెలంగాణలోని సిద్ధిపేటలో కూడా ఓ పెళ్ళిబృందం వాహనాన్ని లారీ ఢీకొంది. కొండపాక వద్ద పెళ్లి బృందంతో వెళుతున్న బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలవ్వగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న లారీ..

సిద్ధిపేట: కొండపాక గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక వద్ద పెళ్లి బృందంతో వెళుతున్న బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలవ్వగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పెరిగిన మృతుల సంఖ్య..

హైదరాబాద్ : గురువారం రాత్రి నానక్ రామ్ గూడలో ఏడంతస్థుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. 

Don't Miss