Activities calendar

11 December 2016

21:53 - December 11, 2016
21:51 - December 11, 2016
21:50 - December 11, 2016

ముంబై టెస్టు : నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా హవా కొనసాగుతోంది. రెట్టించిన ఉత్సాహంతో భారత బ్యాట్స్‌మెన్లు ఇరగదీస్తున్నారు. దీంతో అనేక రికార్డులకు ముంబై టెస్ట్‌ వేదికైంది. విరాట్‌ తన కెరీర్‌లో మూడో డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. మూడు డబుల్‌ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డ్‌ సృష్టించాడు. 
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 631 ప‌రుగుల
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా విజ‌యంపై క‌న్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 631 ప‌రుగుల భారీ స్కోరు చేసి.. 231 ప‌రుగుల ఆధిక్యం సంపాదించింది. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియ‌న్‌కు పంపి విజయంవైపు దూసుకెళ్తోంది. 
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 182 ప‌రుగులు 
నాలుగోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 182 ప‌రుగులు చేసింది. ఇంకా 49 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో రూట్, బెయిర్ స్టో మిన‌హా మిగిలిన వారంతా విఫ‌ల‌మ‌య్యారు. తొలి ఓవ‌ర్‌లోనే తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో కీట‌న్ జెన్నింగ్స్ డ‌కౌట‌య్యాడు. ఆ త‌ర్వాత టీ స‌మ‌యానికి ముందే కుక్, మొయిన్ అలీ కూడా ఔట‌వ‌డంతో ఇంగ్లండ్ 3 వికెట్ల‌కు 49 ప‌రుగుల‌తో క‌ష్టాల్లో ప‌డింది. నాలుగో రోజు చివ‌రి ఓవ‌ర్లో జేటీ.బాల్‌ను ఔట్ చేసి.. ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది టీమిండియా. భార‌త బౌల‌ర్లలో జ‌డేజా, అశ్విన్ చెరో రెండు వికెట్లు, భువ‌నేశ్వర్‌, జ‌యంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. 
విరాట్ కోహ్లి డ‌బుల్ సెంచ‌రీ
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి డ‌బుల్ సెంచ‌రీ, విజ‌య్, జయంత్‌లు సెంచరీలు చేయడంతో టీమిండియా.. మ్యాచ్‌ను శాసించే స్థాయికి చేరింది. తొలి సెష‌న్ మొత్తం విరాట్‌, జ‌యంత్‌.. ఇంగ్లండ్ బౌలర్లతో ఆడుకున్నారు. కోహ్లీ త‌న కెరీర్‌లో మూడో డ‌బుల్ సెంచ‌రీ చేయ‌గా.. జ‌యంత్ కెరీర్‌లో తొలి సెంచ‌రీ చేశాడు. అదేవిధంగా కొహ్లీ, జయంత్‌ యాదవ్‌ ఎనిమిదో వికెట్‌కు రికార్డ్‌ స్థాయిలో 240 పరుగులు జోడించారు. టీమిండియా తరపున ఎనిమిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ రికార్డ్‌. ఇంకో రెండు పరుగుల చేసి ఉంటే.. ప్రపంచ రికార్డ్‌ సృష్టించేవారు. అయితే.. గతంలో 1996లో అజార్‌, కుంబ్లే దక్షిణాఫ్రికాపై నెలకొల్పిన 161 పరుగుల భాగస్వామ్యం తెరమరుగైంది. 
కెప్టెన్‌గా కొహ్లీ అరుదైన రికార్డ్‌ 
మూడు డబుల్‌ సెంచరీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకున్నాడు కొహ్లీ. ఈ మూడు డబుల్‌ సెంచరీలు ఈ ఏడాదిలోనే చేయడం మరో విశేషం. క్రికెట్‌ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు. అదేవిధంగా టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ ఏడాదిలోనే వెయ్యి పరుగులు చేయడం విశేషం. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై తన బెస్ట్‌ స్కోర్‌ను నమోదు చేశాడు. ఇంతకుముందు 211 పరుగుల బెస్ట్‌ స్కోరును అధిగమించాడు. 340 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కోహ్లి 235 పరుగుల చేసి ఔటయ్యాడు. ఇక ఒక్కరోజు మాత్రమే మిగిలివుండడంతో భారత్‌ గెలుపు ఖాయంగా మారింది. ఇంకా 49 పరుగులు వెనకబడి ఉన్న ఇంగ్లండ్‌.. ఐదోరోజు నాలుగు వికెట్లను కాపాడుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 

 

21:45 - December 11, 2016

హైదరాబాద్ : బీసీ జాబితాలో మొదలియార్ పేరు ఖరారు చేస్తూ ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివసించే అగముద్దీన్, అగముదీర్, అగముదీవెల్లలార్ , అగముదీమొదిలియార్ సామాజిక వర్గాలకు మరింతగా లాభం చేకూరనుంది. ఇకపై బీసీ.. డీ కింద ఉండే ఈ సామాజిక వర్గాలను మొదలియార్ టైటిల్‌గా పరిగణించనున్నారు. 
బీసీ డిలోని 99వ సీరియల్ నెంబర్‌గా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివసించే అగముద్దీన్, అగముదీర్, అగముదీవెల్లలార్ , అగముదీమొదిలియార్ సామాజిక వర్గాలను ఇంతకు ముందు బీసీ డిలోని 99వ సీరియల్ నెంబర్‌గా పరిగణించే వారు. దీనికోసం 2008 ఏప్రిల్ 4న  వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖ జీ.వో ఎంఎస్ నెంబర్. 20 ను కూడా అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే  మొదలియార్ సంఘం తమ కులాలకు చెందిన వారిని మొదలియార్‌ను టైటిల్‌గా పరిగణించాలని ప్రభుత్వాలకు చాలాసార్లు విన్నవించారు. 
మొదలియార్ సంఘం వినతులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
గ్రూప్ డి సీరియల్ నెంబర్ 39 ఎదురుగా మొదలియార్ టైటిల్ చేర్చవలిసిందిగా సంఘ ప్రతినిధులు ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ..ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ సామాజిక వర్గాలకు మొదలియార్ పేరుతో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చేది.  ఆతర్వాత ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వానికి మొదలియార్ పేరును చేర్చడంపై బీసీ కమిషన్ సిఫార్సు చేసింది. 
మొదలియార్ ను బీసీ జాబితాలో చేర్చేందుకు ఏపీ సర్కార్ ఆమోదం 
ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ జూలై 17, 2016 న సమావేశం నిర్వహించి మొదలియార్ టైటిల్‌ను  గ్రూప్ - డీ నందు సీరియల్ నెంబర్ 39 మొదటి లైన్‌లో ఆయా సామాజికవర్గాల ఎదురుగా ఆ జాబితాలో పేర్కొనాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేయడం ద్వారా ఆయా సామాజికవర్గాల ప్రజలందరికీ న్యాయం చేకూర్చగలుగుతామని బీసీ కమిషన్ పేర్కొంది. బీసీ కమిషన్ సూచనలను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు మొదలియార్ నెంబర్ 39ను గ్రూప్ డీ బీసీ జాబితాలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ సామాజిక వర్గాలకు న్యాయం చేకూరే అవకాశం ఉంది. 

 

21:40 - December 11, 2016

హైదరాబాద్‌ : నానక్‌రాంగూడలో భవనం కూలిన ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. భవన యజమాని సత్యనారాయణ సింగ్‌ ఎ-1గా అతని కుమారుడు అనిల్‌సింగ్‌ ఎ-2, భవనం గుత్తేదారు ఎ-3, భవనం ప్లానర్‌ ఎ-4గా కేసులు నమోదయ్యాయి. వీరిలో సత్యనారాయణసింగ్‌, అతని కుమారుడు అనిల్‌సింగ్‌లను పోలీసులు ఆరెస్ట్ చేశారు.నానక్‌రాంగూడలో ఆరంతస్థుల భవనం కూలిన ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే.

 

21:38 - December 11, 2016

కర్నాటక : మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గాలిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కూతురు పెళ్లి కోసం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో జనార్దన్‌రెడ్డికి సహకరించిన కర్నాటక రెవిన్యూ అధికారి నాయక్‌ను గుల్బర్గాలో పోలీసులు అరెస్టు చేశారు. నల్లధనం మార్పిడికి గాలి ప్రయత్నించారంటూ నాయక్కు డ్రైవర్‌గా పనిచేసి ఆత్మహత్య చేసుకున్న రమేశ్‌ గౌడ్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని జనార్దన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వంద కోట్ల రూపాయల నల్లడబ్బును ఇరవై శాతం కమీషన్‌తో  తెల్లధనంగా మార్చినట్టు రమేశ్‌ గౌడ్‌ తన సౌసైడ్‌ లేఖలో పేర్కొన్నారు.  కూతురు పెళ్లి కోసం గాలి జనార్దన్‌రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న ప్రచారం జరగుతోంది. 

రాష్ట్రపతి భవన్ లో పుస్తకాల ఆవిష్కరణ

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ హాజరయ్యారు. 

ట్రాక్టర్, టాటా ఏస్ ఢీ...

జగిత్యాల : తిప్పన్నపేట వద్ద ట్రాక్టర్, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సిద్ధిపేట జిల్లా వాసులుగా గుర్తించారు. ధర్మపురి గోదావరి స్నానం చేసి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

వైసీపీ ఆరోపణలపై ఏవీ రమణ మండిపాటు

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు చేసిన వైసీపీ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యులు ఏవీ రమణ మండిపడ్డారు. తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డితో చంద్రబాబుకు సంబంధమున్నట్లు వైసీపీ నేతలు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. శేఖర్ రెడ్డిని పదవి నుంచి  చంద్రబాబు తక్షణమే తొలగించారని.. వేల కోట్ల అక్రమ ఆస్తులను సీజ్ చేసినా జగన్ సిగ్గు రాలేదన్నారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పార్టీ అధ్యక్షునిగా తప్పుకోవాలన్నారు. 

 

జగిత్యాల ఎస్సై రాజేశ్వర్ రావు పై వేటు

జగిత్యాల : ఎస్సై రాజేశ్వర్ రావు పై వేటు పడింది. ఓ యువకుడిని అకారణంగా చితకబాదారని వీఆర్ కు బదిలీ చేస్తూ ఎస్పీ అనంతశర్మ ఆదేశాలు జారీ చేశారు. 

అన్ని బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు

విజయవాడ : 16 వేల ఈ..పాస్ యంత్రాలను ఎపిఎస్ ఆర్టీసీ సమకూర్చుకుంటుంది. అన్ని బస్సుల్లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి.

20:47 - December 11, 2016
20:44 - December 11, 2016

వార్ధా తుపానుపై మంత్రి నారాయణ సమీక్ష

నెల్లూరు : వార్ధా తుపానుపై మంత్రి నారాయణ సమీక్ష చేపట్టారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 20 సెం.మీటర్ల వర్షం నమోదుకు అవకాశం ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో 150 తుపాను సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 450 స్కూల్స్ పునరావాస కేంద్రాలుగా మార్చామని చెప్పారు. 

 

20:34 - December 11, 2016
20:31 - December 11, 2016

కృష్ణా జిల్లా పెడనలో కళంకారి పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. కళంకారి పరిశ్రమ కళతప్పిన పరిశ్రమగా మారింది. కృష్ణా జిల్లా పెడనలోని కళంకారి సంక్షేమ సంఘం ప్రతినిధులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రతినిధులు.. కార్మికుల సమస్యలు, నోట్ల రద్దు వల్ల కలిగే ఇబ్బందులను టెన్ టివికి విన్నవించుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

20:24 - December 11, 2016

ఉత్తర్ ప్రదేశ్ : బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ ప్రసంగించి అరుదైన రికార్డులు సృష్టించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బహ్రేచ్‌లో ఇది ఘటన చోటు చేసుకుంది. ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రేచ్‌లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కావాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ బహ్రేచ్‌లో దిగిలేకపోయింది. దీంతో సభకు వచ్చని వారికి నిరుత్సాహపరచడంహ మంచిదికాదని భావించిన మోదీ.. హెలికాప్టర్‌ నుంచి సెల్‌ఫోన్‌ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. పెద్ద నోట్ల రద్దును అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షాలు వినిపించుకోవడంలేదన్నారు. పార్లమెంటు హాజరై పెద్ద నోట్ల రద్దుపై జరిగే చర్చకు సమాధానం చెప్పాలని ముందుగా డిమాండ్‌ చేసిన ప్రతిపక్షాలు... ఇప్పుడు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయని మండిపడ్డారు. 

 

20:20 - December 11, 2016

అబుజా : నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్వా ఇబోమ్ రాష్ట్రంలోని ఉయోలో నిర్మాణంలో ఉన్న.. ది రెయినర్స్ బైబిల్ చర్చ్ అనూహ్యంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 160 మంది మరణించారు. బిషప్ నియామక కార్యక్రమం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఐరన్ రాడ్లు, సిమెంటు, రాళ్ళ క్రింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు గవర్నర్‌ ఉడోమ్‌ తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. 

 

20:16 - December 11, 2016
20:13 - December 11, 2016

హైదరాబాద్ : రైతులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి లేదనే విషయం మరోసారి స్పష్టమైందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రైతులకు మేలు చేసే.. 2013 భూసేకరణ చట్టాన్ని కాదని కొత్త చట్టం చేస్తామనడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. రైతులకు అన్యాయం చేయాలని.. తక్కువ ధరతో భూములను లాక్కోవాలని.. ప్రభుత్వమే స్వయంగా ప్రయత్నాలు చేస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు.  సామాజిక సమస్యలపై సీపీఎం చేస్తున్న మహాజన పాదయాత్ర పట్ల ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు మార్గదర్శకాల రూపకల్పనకు మంత్రివర్గ  ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని జాలకంటి అన్నారు.  

20:10 - December 11, 2016

హైదరాబాద్ : మైనార్టీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని 9శాతానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సుధీర్‌ కమిషన్‌తో  ముస్లింలకు 9శాతం రిజర్వేషన్‌ కల్పించాలని  ప్రభుత్వమే చెప్పిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 12శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

20:04 - December 11, 2016
20:03 - December 11, 2016
20:02 - December 11, 2016
19:59 - December 11, 2016

చిత్తూరు : తిరుమలలో రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుమంది గాయపడ్డారు. కర్నాటక రాష్ట్ర హుబ్లీకి చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరిగివెళ్తుండగా తిరుమల పాపవినాశనం పార్వేటి మండపం సమీపంలో సుమో చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో నలుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహిళకు గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు ప్రమాదాల్లో డ్రైవర్ల అతివేగమే కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

19:48 - December 11, 2016

విజయవాడ : పెద్ద నోట్లు రద్దు చేసి 33 రోజులు దాటినా ప్రజలకు మాత్రం మనీ కష్టాలు తీరడం లేదు. డబ్బులు లేక ఒకవైపు.. రెండు వేల రూపాయల నోటుకు చిల్లర దొరక్క మరోవైపు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కొనుగోలు దారులతో కిటకిటలాడే మార్కెట్లు వెలవెలబోతున్నాయి. విజయవాడలో కోళ్ల మాంసం విక్రయాలు భారీగా పడిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం...

 

బీజేపీ పై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీ : బీజేపీ పై కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ ను విభజించేందుకు పాక్ కుట్ర పన్నుతుందని హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అంటున్నారని.. బీజేపీ కూడా భారత్ ను విభజించేందుకే యత్నిస్తోందని ఆరోపించారు.

 

ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ : శేషగిరి బాబు

విజయవాడ : కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వార్ధా తుపాను తీరుపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ శేషగిరి బాబు తెలిపారు. ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించామని చెప్పారు. చెన్నై..శ్రీహరికోట మధ్యలో రేపు సాయంత్రం వార్ధా తుపాను తీరం దాటవచ్చని ఇస్రో వర్గాలు వెల్లడించాయని పేర్కొన్నారు.

 

ముదురుతున్న టాటా, సైరస్ మిస్త్రీ వివాదం

హైదరాబాద్ : టాటా, సైరస్ మిస్త్రీ వివాదం ముదురుతోంది. మరోసారి సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ విమర్శలు చేశారు. సైరస్ మిస్త్రీ తప్పుదోవపట్టిస్తున్నారని టాటా సన్స్ తెలిపారు. 

 

చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నెల్లూరు : చిత్తూరు, నెల్లూరు  జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో చెదురుముదురు వర్షాలు, కడప జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని శేషగిరిబాబు అన్నారు.  

 

బైకును ఢీకొన్న స్వార్పియో.. దంపతులకు తీవ్రగాయాలు

హైదరాబాద్ : ప్రగతినగర్ లో మైనర్లు ర్యాష్ కారు డ్రైవింగ్ చేశారు. స్వార్పియో బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ఆరుగురు విజ్ఞాన్ స్కూల్ 10 వ తరగతి విద్యార్థులు ఉన్నారు. 

తిరుమలలో సుమో బోల్తా

చిత్తూరు : తిరుమల పాపవినాశనం పార్వేటి మండపం సమీపంలో సుమో బోల్తా పడింది. ఈప్రమాదంలో నలుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు కర్నాటకకు చెందినవారుగా గుర్తించారు. 

 

18:59 - December 11, 2016

సూర్యాపేట : జిల్లాలోని కోదాడలో దారుణం జరిగింది. వైష్ణవి స్కూళ్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లోహిత హాస్టల్‌ నాల్గో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థిని రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనిని గమనించిన తోటి విద్యార్థినులు లోహితను వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. లోహిత ఆత్మహత్యాయత్నంపై ప్రిన్సిపాల్‌ చెబుతున్న పొంతనలేని సమాధానాలు అనుమానానికి తావిస్తున్నాయి. బాత్‌రూమ్‌కు వెళ్లి కాలుజారి పడిపోయిందని ప్రిన్సిపాల్‌ అంటున్నారు. లోహిత స్వగ్రామం మిర్యాలగూడ మండలంలోని అప్పిరెడ్డిగూడెం. 

 

18:53 - December 11, 2016

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 56వరోజు కొనసాగుతోంది. యాత్రలోభాగంగా పాదయాత్ర బృందం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తోంది. పాదయాత్రలో బీసీల పరిస్థితులను నేతలు పరిశీలించారు. తమ సమస్యల్ని పాదయాత్ర బృందానికి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈమేరకు బీసీ నేత ఎం.వీ రమణ  మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల పరిస్ధితుల దారుణంగా మారిపోయాయని అన్నారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 2 శాతం కేటాయింపులేనా? అని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 52 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

 

18:47 - December 11, 2016

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్ర నిర్మల్‌లో కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నీల్‌, లాల్‌ జెండాలు ఏకమైతేనే పేద ప్రజలకు హక్కులు సాధ్యమవుతాయన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు.

 

18:23 - December 11, 2016
18:16 - December 11, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకుముందే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. స‌భ‌లో విపక్షాలను కడిగేస్తామంటున్న గులాబీ నేతల వ్యాఖ్యలపై హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరిని ఎవరు కడిగేస్తారో తేల్చుకుందామంటూ సవాల్‌ విసురుతున్నారు. 
ముందే మాటల యుద్ధం
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. శాసనసభ సమావేశాలకుముందే రెండు పార్టీల నేతలు మాటలయుద్ధానికి దిగాయి.. అసెంబ్లీ సమావేశాల్ని ఏర్పాటు చేయాలంటూ తాము రోడ్డెక్కితే గానీ ప్రభుత్వంలో చలనం రాలేదని కాంగ్రెస్‌ నేతలు అంటుంటే... కాంగ్రెస్‌కు అంత సీన్‌లేదని గులాబీ నేతలు సమాధానమిస్తున్నారు.. హస్తం నేతల్ని కడిగిపారేస్తామన్న మంత్రి హరీశ్‌ రావు కామెంట్స్‌పై కాంగ్రెస్‌ లీడర్లు సీరియస్‌ అవుతున్నారు...ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌లుపై అసెంబ్లీలో ఒక రోజు చర్చకు సిద్ధమా అని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ... హరీశ్‌ రావుకు సవాల్‌ విసిరారు..
అవినీతి మంత్రులు తమను ఏం చేస్తారన్న భట్టి విక్రమార్క 
అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ మంత్రులు తమను ఏం చేస్తారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. 
అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్‌
అటు టీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు అన్ని అస్త్రాలను కాంగ్రెస్‌ సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలతో పాటు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తోంది. మోడ‌ల్‌గా కట్టిన హైద‌రాబాద్ ఐడీహెచ్‌ కాలనీలోనూ అక్రమాలకు తెరతీశారని ఆరోపిస్తోంది.. ఈ అక్రమాల్లో మంత్రి తలసాని పాత్ర ఉందని... వెంటనే మంత్రిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆ పార్టీ నేత మర్రి శశిధర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు... అసెంబ్లీ సమావేశాలకు ముందే పొలిటికల్‌ హీట్ పెంచుతున్నారు.. ప్రస్తుత వాతావరణం చూస్తే శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

18:00 - December 11, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్ధితులు దారుణంగా మారిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని ఆరువేల జనాభా గల ఫసల్ వాడి గ్రామంలో బ్యాంకు కానీ, ఏటీఎం లేకపోవడంతో గ్రామస్తుల ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా మారాయి. డబ్బుల కోసం పడరాని పాట్లు పడుతున్న ఫసల్ వాడి గ్రామస్తులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:58 - December 11, 2016

ఖమ్మం : జిల్లాలో కల్తీకారం దందాలు కొనసాగుతున్నాయి. మధిర, ముదిగొండల్లోని కల్తీకారం తయారు చేస్తున్న 13 మందిని కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నగరంలోని అల్లిపురం దగ్గర సాగర్‌ కాల్వ గట్టుపై పడేసిన రెండువేల బస్తాల కల్తీకారం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కల్తీకారం దందా వెనుక టీఆర్‌ఎస్‌ నేత హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీకారం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:38 - December 11, 2016

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను దిశను మార్చుకుంటోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకుని తుపాను కేంద్రీకృతమైంది. చెన్నైకి తూర్పు దిశగా 440 కిలోమీటర్ల దూరంలో.. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 490 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. తుపాను రేపు మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రకు వర్ష సూచన ఉంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 80...90 కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:12 - December 11, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని చూస్తున్నారు. అలాగే ప్రతిపక్షాల డిమాండ్‌ ప్రకారం ఈ నెలాఖరువరకూ సమావేశాల్ని నిర్వహించేందుకు రెడీ అన్న సంకేతాలు పంపుతున్నారు.
ఈ నెల 16నుంచి శీతాకాల సమావేశాలు 
ఈ నెల 16నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బీఏసీ సమావేశం తర్వాత సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయో స్పష్టత రానుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం సమావేశాల్ని రెండువారాలపాటు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.
నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం
అటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారపార్టీ సీరియస్‌గా దృష్టిపెట్టింది. ఉభయ సభల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పేలా టీఆర్‌ఎస్‌ నేతల్ని సీఎం కేసీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 15న జరగబోయే శాసనసభాపక్ష సమావేశంలో నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.
కరెన్సీ కష్టాలపై ప్రధానంగా చర్చ 
సమావేశాల్లో విపక్షాల ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ్యూహం సిద్ధంచేస్తోంది.. విపక్షాలు సభలో ప్రస్తావించబోయే అంశాల వివరాల్ని సేకరిస్తోంది.. రైతు రుణమాఫీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, జిల్లాల విభజన, కరెన్సీ కష్టాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.. 
శాఖలవారీగా నివేదికల రూపకల్పన
ఈ సమావేశాల్ని పూర్తిగా వినియోగించుకునేందుకు గులాబీ బాస్‌ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తికావడంతో శాఖలవారీగా నివేదికల్ని రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. వీటి ఆధారంగా తాము చేసిన అభివృద్ధిని సభలో వివరించాలని సీఎం భావిస్తున్నారు. అటు ప్రజాసమస్యల్ని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశంఉన్నా. కాంగ్రెస్‌ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ సమావేశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రెండువారాలపాటు ఉభయ సభల నిర్వహణకు తమకు ఎలాంటి అభ్యంతరంలేదన్న సంకేతాలను పంపుతున్నారు. అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్ష నేతలు సహకరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

 

ముంబై టెస్టు.. ముగిసిన నాలుగోరోజు ఆట

ముంబై టెస్టు : నాలుగో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 182/6. క్రీజులో బెయిర్ స్టో (50) ఉన్నాడు. ఇంగ్లండ్ 49 పరుగుల వెనుకంజలో ఉంది. 

ఫోన్ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగం

యూపీ : ఫోన్ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగం పంపారు. వాతావరణం అనుకూలించక మోడీ బహిరేచ్ చేరుకోలేకపోయారు. దీంతో ఫోన్ లోనే ప్రసంగించి సందేశం పంపారు. 

 

16:29 - December 11, 2016

సంగారెడ్డి : పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు దాడిపోయినా ప్రజల కష్టాలు తీరలేదు. ఏటీఎంలలో అసలు డబ్బులే అందుబాటులో లేవు. బ్యాంకుల్లో రోజంతా నిలుచున్నా రెండు వేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నోట్ల కోసం ప్రజలు పడుతున్న పాట్లపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:26 - December 11, 2016

కర్నూలు : జిల్లాలోని ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆత్మకూరు నుంచి నంద్యాల వైపు ఇన్నోవా వాహనంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 పర్సంటేజి కమీషన్‌తో పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేందుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 12.2 లక్షల కొత్త కరెన్సీతో పాటు ఇన్నోవా వాహనం, కౌంటింగ్‌ మిషన్‌ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నోట్ల మార్పిడి ముఠాను పట్టుకున్న పోలీసులు

కర్నూలు : జిల్లాలోని ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆత్మకూరు నుంచి నంద్యాల వైపు ఇన్నోవా వాహనంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 

16:13 - December 11, 2016

చెన్నై : తమిళుల ఆరాధ్య దైవం జయలలిత.. అమ్మ నచ్చితే వరాలు, ఆగ్రహిస్తే శిక్షలు తప్పవు. సామాన్యుడి దగ్గర నుంచి మంత్రి వరకు అందరూ అమ్మ ముందు దాసులే. అలాంటి అమ్మకు ప్రతి ఒక్కరూ నీరాజనం పట్టేవారు. జయలలితను అమ్మగా భావించి పాదాలకు నమస్కరించే వాళ్లు. మరి జయలలిత చనిపోయాక ఇప్పుడు అక్కడి మంత్రులు ఎవ్వరికి మొక్కుతున్నారో..
చిన్నమ్మ కాళ్లకు దండం
75 రోజుల పాటు చెన్నై ఆపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి జయలలిత కన్నుమూశారు. ఆ తర్వాత తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారాయి. జయలలిత ఆప్తురాలు శశికళ నటరాజన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తూ అన్నాడీఎంకే నేతలు నిర్ణయం తీసుకున్నారు. జయలలిత వారసురాలుగా శశికళ ఉండాలని... అమ్మ చనిపోయినప్పటి నుంచే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో శశికళకు అన్నాడీఎంకే నేతలు నెత్తిన పెట్టుకుంటున్నారు. 
జయలలితకు ఇచ్చిన మర్యాదనే శశికళకు 
అన్నాడీఎంకే నేతలు జయలలితకు ఇచ్చిన మర్యాదనే శశికళకు కొనసాగిస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్దకు చేరుకున్న అన్నాడీఎంకే నేతలు శశికళకు పాదాభివందనాలు చేశారు. జయలలిత బతికి ఉన్నప్పుడు మంత్రులు కూడా జయకు పాదాభివందనాలు చేశారు. ఇప్పుడు జయలలిత చనిపోయాక.. శశికళకు సేవ చేసుకుంటున్నారు. జయలలిత చిత్ర పటానికి నివాళులర్పించిన నేతలు.. తిరిగి శశికళ పాదాలకు నమస్కారాలు పెట్టి చిన్నమ్మకు సేవ చేసుకున్నారు. సామాన్యుల దగ్గర నుంచి మంత్రుల వరకు అమ్మగా భావించి జయలలితకు పాదాభివందనాలు చేసిన వాళ్లు.. జయ చనిపోగానే పార్టీ పగ్గాలు చేపట్టకముందే చిన్నమ్మ పాదాలకు నమస్కారాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

 

16:09 - December 11, 2016

 సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేముల వాడ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన పోన్న ప్రశాంత్‌ అనే యువకుడు నూకలమర్రి గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రశాంత్‌ ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు యువతికి వేరోకరితో వివాహం జరిపించారు. అప్పటి నుంచి ప్రశాంత్‌ కుటుంబం, అమ్మాయి కుటుంబం మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేములవాడ మండలం ఎదురుగట్ల వద్ద అర్ధరాత్రి ప్రశాంత్‌ ను దుండగులు కొట్టి చంపారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతుడి బంధువులు అంటున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులే తన తమ్ముడిని ఇనుపరాడ్లతో కొట్టి చంపారని మృతుడి తమ్ముడి ఆరోపిస్తున్నారు.

 

15:58 - December 11, 2016

విశాఖ : పెద్దనోట్ల రద్దుతో వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. సండేరోజు జనాలతో కిటకిటలాడే మటన్‌, ఫిష్, మార్కెట్లు సైతం బోసిపోయాయి. లాభాలు లేక వ్యాపారస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిల్లర కోసం నానా ఇక్కట్లు పడుతున్నామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

'మొదిలియార్' గా ఆ కులాలు...

హైదరాబాద్ : బీసీ..డీలోని అగముద్దీన్, అగముదీర్, అగముదీ వెల్లలార్, అగమునీ మొదిలియార్ కులాలను మొదిలియార్ గా పరిగణిస్తూ ఎపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు : దత్తాత్రేయ

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నిజాం లా కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాను దత్తాత్రేయ ప్రారంభించారు.స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్ సీఎస్ సీ పోర్టల్ నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

 

15:44 - December 11, 2016

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీవ్ర తుపానుగా మారి దూసుకొస్తోంది. తుపాను  ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరుకు 520 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 490  కిలోమీటర్లు.. .చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీరంవెంట గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రధాన ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వార్ధా తుపాను ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోలం నెలకొంది. అలలు రెండు మీటర్లమేర ఎగిసిపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

కోదాడలోని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

సూర్యపేట : కోదాడలోని శ్రీవైష్ణవి స్కూల్ లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నాలుగో అంతస్తు నుంచి దూకి లోహిత అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు.

 

14:08 - December 11, 2016
14:04 - December 11, 2016

విజయవాడ : అక్షరాన్ని ఆయుధంగా మార్చే కొత్త గొంతుకలను ప్రోత్సాహించాలనే ప్రధాన ఉద్దేశంతోనే సాహితీ స్రవంతి పనిచేస్తుందని....ప్రమఖ జర్నలిస్టు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి అన్నారు. విజయవాడలోని ఎం.బీ. విజ్ఞాన వేదికలోని కవితలు, కథలపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వేచ్ఛాస్వరం అనే నూతన సాహితీ సంచికను తెలకపల్లి రవి ఆవిష్కరించారు. 

14:02 - December 11, 2016

గుంటూరు : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని... ఎఫట్రానిక్స్ సంస్థ అధినేత డాక్టర్‌ రామకృష్ణ అన్నారు.. పరిశ్రమకుల అనుగుణంగా సిలబస్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్శిటీలో ఎలైడ్ ఎలక్ట్రికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.. ఈ కార్యక్రమానికి రామకృష్ణతోపాటు... కులపతి రామ్మూర్తినాయుడు... వీసీ తంగరాజ్‌... 15దేశాలనుంచి 22మంది ప్రతినిధులు, విద్యారంగనిపుణులు హాజరయ్యారు.. 

13:56 - December 11, 2016

నిర్మల్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర నిర్మల్‌ జిల్లాకు చేరుకుంది. ఇప్పటివరకు 1420 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సీపీఎం బృందం నిర్మల్‌లోని పలు గ్రామాల గుండా పర్యటించనుంది. వచ్చే ఏడాది మార్చి 19న హైదరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

మార్చి 19న హైదరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సభ: తమ్మినేని
నిర్మల్‌లో సీపీఎం మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. ఇప్పటివరకు 1420 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకుంది. మార్చి 19న హైదరాబాద్‌లో పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని తమ్మినేని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకే ఈ పాదయాత్ర- చేపట్టామని తమ్మినేని మరోసారి స్పష్టం చేశారు. 

13:47 - December 11, 2016

కరీంనగర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది.తమకు నిధులు ఇవ్వడం లేదంటూ ముందు భిక్షాటన చేస్తూ సభకు వచ్చిన కాంగ్రెస్ సభ్యులు... సభను అడ్డుకున్నారు. నిధులుపై స్పష్టత ఇవ్వాలని ఆందోళనకు దిగడంతో... సమావేశం రసాభాసగా మారింది. జడ్పీ చైర్ పర్సన్ ఎంత చెప్పిన వినకపోవడంతో... కాంగ్రెస్ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు. దీనిని నిరసిస్తూ.. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఒక్కొక్క జడ్పీటిసికి కోటి రూపాయల నిధులు వచ్చాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు జాప్యం చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

13:44 - December 11, 2016

నెల్లూరు : వార్ధా తుపాను నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని విశాఖ వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వార్దా తుపాను రేపు చెన్నై-నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం ఉంది. అయితే తీరందాటే ఐదు గంటల వ్యవధిలో..అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం ప్రధానంగా నెల్లూరులోని ఆరు మండలాల్లో తీవ్రంగా ఉంటుంది. ముతుకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, తడ, సూళ్లూరుపేట..దొరవారిసత్రం మండలాల్లో అత్యధిక ప్రభావం ఉంటుంది. ఇక సూళ్లూరుపేట మండలంలో 27 సెం.మీ వర్షపాతం కురిసే అవకాశం అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వార్ధా తుపాను నేపథ్యంలో 151 తుపాను రక్షిత కేంద్రాలను ఏర్పాటు చేశామిన జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. ఇప్పటికే రేషన్‌, నిత్యావసర సరుకుల్ని సిద్ధంగా ఉంచామన్నారు. 1.90 లక్షల మందిని పునరావాస కేంద్రాల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. తక్షణ అవసరాల నిమిత్తం 30 లక్షల రూపాయల్ని కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు జిల్లా కలెక్టర్‌. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 18004252499 ని ఏర్పాటు చేశారు. 

13:40 - December 11, 2016
13:38 - December 11, 2016

తమిళనాడు : దివంగత సీఎం జయలలిత కోడలు దీప తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. శశికళ పన్నిన కుట్రవల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు అత్తతో కలిసి పోయెస్‌ గార్డెన్‌లోనే ఉండేవారని, తాను అక్కడే పుట్టానని గుర్తుచేసుకున్నారు.. శశికళ ప్రవేశంతో పోయెస్‌ గార్డెన్‌ నుంచి తాము బయటకు రాక తప్పలేదని తెలిపారు.. అత్త అనారోగ్య సమయంలో సరైన వైద్య చికిత్సలు, సపర్యలు అందలేదని దీప ఆవేదన వ్యక్తం చేశారు. జయలలితను కలిసేందుకు అపోలోకు వెళ్లినప్పుడు, అత్త సమాధి వద్ద అంజలి ఘటించినప్పుడు శశికళ తమను అవమానించారని చెప్పారు. 

13:37 - December 11, 2016

నిజామాబాద్ : నవ నాగరికత కొత్త పుంతలు తొక్కి.. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న ఈ కాలంలోనూ కొన్ని గ్రామాల్లో దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరక్షరాస్యత, అమాయకత్వంతో పాటు సమాజంలో కూడగట్టుకున్న చైతన్యలోపాన్ని ఆసరాగా చేసుకుని.. కొందరు బడుగు బలహీన వర్గాలపై ఎక్కడలేని పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. అంతటితో ఆగకుండా...సాంఘిక బహిష్కరణలకు ఒడిగడుతున్నారు.

నవ నాగరికత సమాజంలో... సభ్యసమాజం తలదించుకునే ఘటనలు
ఎక్కడికి పోతున్నాం మనం... ఎటు పోయింది మనలో చైతన్యం..నవ నాగరిక సమాజంలో పెడపోకడల మాటేమిటి..? అంతరిక్షంలో అడుగు పెట్టి... అభివృద్ధి ఫలితాలను అందిపుచ్చుకుంటున్న నవ నాగరికత సమాజంలో... సభ్యసమాజం తలదించుకునే ఘటనలు పొడచూపుతూనే ఉన్నాయి. కులహంకారం తలకెక్కిన కొన్ని ప్రదేశాల్లో బడుగులపై బహిష్కరణ పిడుగులు కురిపిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల మాటున సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రజకులు, దళితులు, బెస్తవారు, కింది స్థాయి వర్గాలపై వీడీసీ దాష్టికాలు
విలేజ్‌ డెవలప్‌మెంట్ కమిటీ-వీడీసీల పెత్తనంతో నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా రజకులు, దళితులు, బెస్తవారు, కింది స్థాయి వర్గాల వారు వీడీసీల వేటుకు బలయై పోతున్నారు. గ్రామాల్లో వీడీసీలు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం అన్నట్లు తయారైంది పరిస్థితి. ఒకవేళ ఎవరైనా వీడీసీలకు ప్రతికూలంగా వ్యవహరిస్తే.. వారికి సాంఘిక బహిష్కరణకు గురి చేస్తున్నారు.

పెచ్చుమీరి పోతున్న అగ్రవర్ణ కులాల ఆధిపత్యం
గ్రామాల్లోని కమిటీల్లో అగ్రవర్ణ కులాల ఆధిపత్యం పెచ్చుమీరి పోతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం ఉత్సవ విగ్రహాల వలే మారి అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తుతున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

భూమి ఇవ్వడం కుదరదన్న 90 దళిత కుటుంబాల వెలి
జిల్లాలోని ఆర్మూర్‌ మండలం సుర్బిర్యాల గ్రామంలో గ్రామ నడిఒడ్డున దళితులకు చెందిన భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన అగ్రవర్ణాల వీడీసీలు గుడికి, బ్యాంకుకు ఆ భూమిని ఇవ్వాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా... అక్కడ అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న 90 దళిత కుటుంబాలను వెలి వేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో బడుగులపై బహిష్కరణ పిడుగులు
నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఇలాంటి దురాచారాలు తరచుగా జరుగుతున్న ఘటనలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కూడా సాంఘిక బహిష్కరణల గురించి ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాలు, దళితులపై ఇలాంటి అణచివేత దోరణులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. 

13:35 - December 11, 2016

ప్రపంచ దేశాల కవిత్వానికి వేల ఏళ్ళ చరిత్ర వుంది. మాతృభాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లో కవిత్వాలను పరికించాలనే తపన అనేకమంది పాఠకుల్లో వుంటుంది. అటువంటి వారికోసం ప్రముఖ అనువాద రచయిత 'ముకుంద రామారావు అనే గాలి పేరుతో వివిధ దేశాల కవిత్వాన్ని అనువాదం చేశారు. అవేంటో చూద్దాం..

13:34 - December 11, 2016

తెలుగులో ఎందరో గజల్స్ రాస్తున్నారు. కానీ తెలుగు గజల్స్ ను ఇంగ్లీషులో రాయటం మరో అరుదైన విషయం. ఈ విశేష గజల్స్ రచయిత ఎవరనుకుంటున్నారా? చెన్నై లో వుంటూ గజల్స్ రాస్తున్న విజయవాడకు చెందిన లోజిస్ మాన్ పై ప్రత్యేక కథనం ఈ వారం అక్షరం..

13:32 - December 11, 2016

తెలంగాణ పోరాటాల రణగడ్డ..ఉద్యమాల ముద్దుబిడ్డ..భూమి కోసం..భుక్తి కోసం..బానిసల బతుకుల విముక్తి కోసం ఎందరో వీరులు ఈ గడ్డపై పోరాటాలు చేశారు. ఎందరో రచయితలు కలం యోధులుగా ఎగిసిపడ్డారు. అందులో నల్లగొండకు చెందిన 'రాచకొండ రంగన్న'ఒకరు. నూనూగు మీసాల యవ్వనంలోనే ఉద్యమాల బాట పట్టినకలం యోధుడతడు..పేదల బాధల విషాదాలను అక్షరాల రూపంలో మలచిన కవి రాచకొండ రంగన్నతో ఈనాటి అక్షరం మనముందుకు వచ్చింది. మరి ఆయన పాటలు వినండి..

అడ్వకేట్ కార్యాలయంలో రూ.13కోట్లు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం విదితమే. ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ఏరియాలో ఓ న్యాయవాది కార్యాలయంపై ఐటీ శాఖ అధికారులు..పోలీసులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ. 13.56 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఇందులో రూ. 2.5 కోట్లు కొత్త 2000 నోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ. 7 కోట్ల నగదు పాత వెయ్యి నోట్లు, మరో రూ. 3 కోట్లు వంద నోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నగదును కార్యాలయంలోని కప్‌బోర్డ్స్, సూట్‌కేసులలో ఉంచినట్లు చెప్పారు. కార్యాలయం తనిఖీ చేసినప్పుడు అన్ని గదులు తాళం వేసి ఉన్నాయని అధికారులు తెలిపారు.

13:06 - December 11, 2016

ప్రకాశం : వార్ధా తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తరుముకొస్తుండడంతో కొత్తపట్నం తీరం వద్ద అనుహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సముద్రంలో 3 నుంచి 5 మీటర్ల మేర అలలు ఎగసిపడుతున్నాయి. దీనికితోడు 30 నుంచి 40 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు వార్దా తుపాను నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. తీరప్రాంతాల్లో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ పర్యటిస్తున్నారు. 

13:03 - December 11, 2016

జోగులాంబ గద్వాల : జిల్లా రాజోలి మండంలో ఓ మటన్‌ దుకాణంలో 3 గ్యాస్‌ సిలిండర్లు అకస్మాత్తుగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న మూడు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షలమేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలియరాలేదు. 

'నల్ల'శేఖరుడి ఇంట్లో రూ.వెయ్యి కోట్ల పత్రాలు..

తమిళనాడు: పారిశ్రామికవేత్త ..మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు..ఇసుకమాఫియా..శేఖర్‌రెడ్డి ఆస్తుల విలువ చూస్తుంటే ఐటీ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా తనిఖీలు చేస్తున్నా ఆస్తుల ఎంతకీ అంతూదారీ లేకుండా పోతోంది. నాలుగోరోజు కూడా కొనసాగిస్తున్న తనిఖీల్లో రై.వెయ్యి కోట్ల ఆస్తిపత్రాలు బైటపడ్డాయి. సోదాల్లో భాగంగా ఇప్పటివరకు 170 కిలోల బంగారం, రూ.131కోట్ల నగదు, రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వేలూరులో శేఖర్‌రెడ్డి, ఆయన సంబంధీకుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

40 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం..

ప్రకాశం : కొత్తపట్నం తీరం వద్ద అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వార్ధా తుపాను ప్రభావంతో కొత్తపట్నం తీరం వద్ద అలలు మూడు నుండి ఐదు మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. 30 నుండి 40 మీటర్ల మేరకు సముద్రం తీరం ముందుకు దూసుకొచ్చింది. దీంతో ఆ తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

12:15 - December 11, 2016

తూర్పుగోదావరి : దివీస్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తొండంగి మండలం పంపాదిపేటలో నిర్వాశితులు మరోసారి ధర్నా చేపట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా రైతుల పొలాల్లో అధికారులు పనులు చేపట్టారు. దీంతో గ్రామస్థులు ఆ ప్రాంతంలో వంటా వార్పులు చేసి తమ నిరసననువ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులకు గ్రామస్థులకు మధ్య వాగ్వాదం ఏర్పడ్డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా గత నాలుగు నెలలుగా దివీస్ ప్రభావిత ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో వున్న సంగతి తెలిసిందే.. 

దివీస్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : దివీస్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తొండంగి మండలం పంపాదిపేటలో నిర్వాశితులు మరోసారి ధర్నా చేపట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా రైతుల పొలాల్లో అధికారులు పనులు చేపట్టారు. దీంతో గ్రామస్థులు ఆ ప్రాంతంలో వంటా వార్పులు చేసి తమ నిరసననువ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. 

వార్ధా ముప్పు తప్పినట్లేనా?..

విశాఖ : తీవ్ర తుపాను వార్దా తన దిశను మార్చుకుంది. ఇప్పటి వరకు ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటుతుందునుకున్న వార్దా కాస్తా దిశ మార్చుకుని చెన్నై వైపు వేగంగా కదులుతోంది. దీంతో కోస్తాంధ్ర ప్రాంతం కాస్త తేలికపడింది. ఆదివారం ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దా తూర్పు దిశవైపు కదులుతోంది. అదే సమయంలో ఇది నెల్లూరుకి 520కిమీ దూరంలో ఉంది. సోమవారం మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనాలు వెల్లడించింది. 

మరోసారి పెట్రో మంట?..

ఢిల్లీ : పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరోసారి భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడేళ్లకు పైగా పడకేసిన ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 53 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది కనుక 60 డాలర్లకు చేరితే... దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 80 రూపాయలు, 68 రూపాయల స్థాయికి చేరతాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. 

మృత్యు ఘంటికలు.. 124మంది మృతి..

హైదరాబాద్ : ఆదివారం ఉదయం నుండి ప్రపంచ వ్యాప్తంగా మృత్యుఘంటికలు వినిపిస్తున్నాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జంట పేలుళ్లు సంభవించాయి. మానవ బాంబులు సాగించిన ఈ మారణ హోమంలో 29 మంది బలయిపోయారు.కెన్యాలో కొన్ని వాహనాలను ఓ పెట్రోల్ ట్యాంక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11వాహనాలు పూర్తిగా ధ్వంసం అయిపోగా దాదాపు 30మంది కాలి బూడిదైపోయారు. మరోపక్క నైజీరీయాలో స్థానిక రీగనర్స్‌ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా పైకప్పు కూలి 60మంది మృతి చెందారు. బీహార్ లో బస్ బోల్తా పడి ఐదుగురు మృతి చెందారు. మరో 25మందికి గాయాలయ్యాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయి. 

11:47 - December 11, 2016
11:44 - December 11, 2016

కర్నాటక : పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునేందుకు.. పాత నోట్లను మార్చుకునేందుకు నల్ల కుబేరుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుడి రోజుకు రెండు వేల రూపాయలు దొరకడం లేదు. కానీ బడాబాబులకు మాత్రం కోట్లకు కోట్లు కొత్త నోట్లు దొరకుతున్నాయి. వాటిని దాచుకునేందుకు నల్ల కుబేరుల ఉపాయాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కర్ణాటకలో బయట పడ్డ భారీ నగదును చూసి ఐటీ అధికారులే విస్మయపోయారు.

బాత్‌రూం గోడ వెనక రహస్యంగా దాచిన 6కోట్ల 60లక్షలు
ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారుల దాడులతో నల్లకుబేరులు ఒక్కొక్కరిగా బయట పడుతున్నారు. అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని దాచిపెట్టేందుకు బడా బాబులు వేసిన ఎత్తులు తెలిసి.. అధికారులే ఆశ్చర్యపోతున్నారు. నల్ల కుబేరులు పట్టుబడకుండా పకడ్భందిగా ఏర్పాట్లు చేసుకున్నా.. అధికారులు మాత్రం నల్లధనం ఎక్కడ దాచినా గుట్టలు గుట్టులుగా వెలికితీస్తున్నారు. కర్ణాటక చిత్రదుర్గలోని ఓ ఇంటి బాత్‌రూం గోడ వెనక రహస్యంగా దాచిన 6కోట్ల 60లక్షల నగదును అధికారులు సీజ్‌ చేశారు.

కన్నడ సినీ నటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర ఇంట్లో ఐటీ సోదాలు
కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, చిత్రదుర్గ నగరాల్లో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. చిత్రదుర్గ జిల్లా చల్లకెరెలో కన్నడ సినీ నటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 5 కోట్ల 70 లక్షలు విలువ చేసే కొత్త రెండు వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును బాత్‌రూం గోడలో రహస్యంగా ఏర్పాటు చేసిన చిన్నపాటి గదిలో స్టీల్‌ బాక్సుల్లో దాచి ఉంచారు. నగదుతో పాటు 28 కిలోల బంగారు బిస్కెట్లు, నాలుగు కిలోల బంగారు, వెండి ఆభరణాలు సీజ్‌ చేశారు. 90 లక్షలు విలువ చేసే 100, 20 రూపాయల నోట్లనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సమందర్‌ సింగ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ దందాలు
వీరేంద్రకు రాష్ట్రంలో పలుచోట్ల రిక్రియేషన్‌ క్లబ్బులు ఉన్నాయి. దీంతో అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. వీరేంద్ర స్నేహితుడు సమందర్‌సింగ్‌ ఇంటితో పాటు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తే కోటి రూపాయల సొమ్ము బయట పడింది. ఇందులో నకిలీ నోట్లూ ఉన్నట్లు సమాచారం. సమందర్‌ సింగ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ దందా చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటిపై దాడి చేసిన అధికారులు బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

రహస్య గదిని ఆంగ్లంలోని ఎల్‌ అక్షర ఆకారంలో నిర్మాణం
వీరేంద్ర ఏర్పాటు చేసుకున్న రహస్య ప్రదేశాన్ని చూసి ఐటీ అధికారులే నోరెళ్లబెట్టారు. బాత్‌రూం గోడకు మధ్యలో ఎడమవైపున చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ప్రత్యేక లోహంతో తయారు చేసిన తాళాన్ని ఉంచి, ఎడమవైపునకు రెండు సార్లు తిప్పాలి. తర్వాత ఆ గోడకు కుడివైపున రెండు సార్లు బలంగా కొడితే సీక్రెట్‌ లాక్‌ తెరుచుకుంటుంది. ఆ రహస్య గదిని ఆంగ్లంలోని ఎల్‌ అక్షర ఆకారంలో నిర్మించారు.

11:40 - December 11, 2016

తమిళనాడు : చెన్నై శేఖర్‌రెడ్డి ఇళ్లలో నాలుగోరోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కాట్పాడి గాంధీనగర్‌లో నిన్న రాత్రి నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో కోటి 20 క్షల నగదుతో పాటు, మూడు లాకర్లలో ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శేఖర్ రెడ్డి భార్యనూ అధికారులు విచారిస్తున్నారు.
టీటీడీ బోర్డు సభ్యుడిగా శేఖర్‌రెడ్డిని తొలగిస్తూ ఏపీ దేవాదాయశాఖ ఉత్తర్వులు..
నల్లకాసురుడు శేఖర్‌రెడ్డిపై వేటుపడింది. టీటీడీ బోర్డు సభ్యుడిగా శేఖర్‌రెడ్డిని తొలగిస్తూ ఏపీ దేవాదాయశాఖ ఉత్తర్వలు జారీచేసింది. ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడడంతో శేఖర్‌ రెడ్డిని తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. మరోవైపు శేఖర్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి ఐటీశాఖ సిఫార్సు చేసింది. శేఖర్‌రెడ్డి, అతని అనుచరులు, స్నేహితుల ఇళ్లు, ఆఫీసుల్లో రెండు రోజుల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో 170 కోట్ల రూపాయల నగదు, 130 కోట్ల రూపాయల విలువైన బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరులో మరో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

11:38 - December 11, 2016

ముంబై : ముంబై టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. కెప్టెన్స్ ఇన్నింగ్స్ తో కోహ్లీ అలరించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. డబుల్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు విరాట్. 302 బంతుల్లో కోహ్లీ 200 పరుగులు చేశాడు. 23 ఫోర్లతో చెలరేగిన కోహ్లీ ఇంగ్లండ్ ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు. జయంత్ తో కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ. కోహ్లీకి ఇది టెస్టుల్లో మూడో డబుల్ సెంచరీ.

11:37 - December 11, 2016

హైదరాబాద్ : దేశంలోనే బడా కార్పొరేట్‌ సంస్థ తెలంగాణలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయబోతోందా ? ఇప్పటికే వీధివీధినా విస్తరించిన కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలకు దీటుగా రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ రాబోతోందా ? విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ వస్తే తెలంగాణ విద్యావ్యవస్థకు పెద్ద ప్రమాదమే పొంచివుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లో రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌
విద్యాసంస్థల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌లో రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీలో అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే కార్పొరేట్‌ విద్యాసంస్థలు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధిక ఫీజులతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్‌ అకాడమీ వస్తే ఈ దందా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కేజీ టూ పీజీ... ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌
రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో భారీ పెట్టుబడతో సమీకృత ప్రాంగణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేజీ టూ పీజీ... వరకు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇలా అన్నికోర్సులు ఒకే క్యాంపస్‌లో బోధించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని తమకు అనుకూలంగా జీవోలు ఇప్పించుకునేందుకు రిలయన్స్‌ ప్రతినిధులు పావులు కదుపుతున్నారు. రాయితీపై భూములు ఇవ్వాలని కోరుతున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలల క్రింత ముంబై వెళ్లిన కేటీఆర్‌ రిలయన్స్‌ ప్రతినిధులతో జరిపిన భేటీలో ఇదే విషయాన్ని చర్చించినట్టు సమాచారం. పదివేల కోట్ల రూపాయల వ్యయంతో వెయ్యి ఎకరాల్లో భారీ ప్రాంగణం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తమ సంస్థలో ఇటు విద్యార్థుల ప్రవేశాలు, అటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియమాకాల్లో రిజర్వేషన్లు ఉండవని ముందలికాళ్లకు బంధం వేసింది. ప్రతిభే ప్రాతిపదకని తేల్చి చెప్పడంతో ఇది పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది.

రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ కోసం ప్రత్యేక చట్టం ?
ఇప్పటి వరకు ఉన్న అన్ని విద్యాసంస్థలను తలదన్నేలా ఏర్పాటయ్యే రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ కోసం తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక చట్టాన్నితెచ్చే యోచన చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లు రూపకల్పనపై మంత్రి కేటీఆర్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యా ప్రమాణాలతో సమానంగా తమ సంస్థలో విద్యాబోధన ఉంటుందని రిలయన్స్‌ చెప్పడంతో ప్రభుత్వం కూడా మొగ్గుచూపినట్టు సమాచారం. రిలయన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ వస్తే తెలంణాలో ప్రభుత్వ విద్య ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కార్పొరేట్‌ విద్యాసంస్థల రాకతో పేదలకు ఉన్నత విద్య దూరం
కేజీ టూ పీజీ ఉచిత విద్యా బాధ్యతల నుంచి తప్పించుకునే క్రమంలోనే ప్రభుత్వం రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలను ముందుకు తెస్తోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే కార్పొరేట్‌ విద్యాసంస్థల రాకతో ఉన్నత విద్య పేదలకు అందకుండా పోయింది. రిలయన్స్‌ వస్తే ఇది మరింత దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల బిల్లును తీసుకొస్తే ఉద్యమం తప్పదని విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

11:36 - December 11, 2016

తూర్పుగోదావరి : నిన్న మొన్నటి వరకు మన్యం తప్ప మరేమీ తెలియని అబలలు వారు. ఇప్పుడు ఆధునికత వైపు పరుగులు తీస్తున్న సబలలుగా మారారు. రంపచోడవరం వేదికగా ఆధునిక ప్రపంచానికి వెలుగులు పంచుతున్నారు. సాంకేతికను ఒడిసిపట్టుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తూర్పుమన్యం సిగలో ఎల్‌ఈడీ బల్బులై ప్రకాశిస్తున్న గిరిపుత్రికలపై 10టీవీ ప్రత్యేక కథనం..

సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం
తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం. ప్రశాంతమైన జీవనానికి, ఆహ్లాదకర వాతావరణానికి పెట్టింది పేరు. గిరిజన సంప్రదాయాలకు ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం. అంతేకాదు.. ఎంతో అమూల్యమైన వనమూలికా సంపదకు ప్రసిద్ధి. అలాంటి ప్రకృతి మాత ఒడిలో జీవనం సాగిస్తున్న ఆదివాసీలంటే.. అభిమానించని వారంటూ ఉండరేమో.

మన్యంలో మహిళల పాత్ర మరువలేనిది
తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల జీవన గమనంలో.... మహిళల పాత్ర ఎంత చెప్పినా తక్కువే. పోడు వ్యవసాయంలో పురుషులతో సమానంగా కష్టపడతారు. ఇంటి పనుల నుంచి పొలం పనుల వరకు వారి పాత్ర మరువలేదని. భర్తతో సమానంగా వ్యవసాయం చేయడంలో గిరిపుత్రికలు ఏమాత్రం తీసిపోరు. తమ పిల్లలను భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత సైతం వారిదే.

అటవీ ఉత్పత్తులకు ఏజెన్సీ నిలయం
ఏజెన్సీ ప్రాంతం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి అటవీ ఉత్పత్తులు. తేనె, కొండచీపురు, చింతపండు, జీడిపిక్కలు మన్యంలో దొరుకుతాయని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఎందుకుంటే గిరిపుత్రికలు ఇప్పుడు ఆధునికతవైపు అడుగులు వేస్తున్నారు. సాంకేతికరంగంలో దూసుకుపోతున్నారు. నిన్న మొన్నటికి భిన్నంగా నవీన ప్రపంచానికి వెలుగులు పంచుతున్నారు.

మన్యంలో ఎల్ఈడీ బల్బుల తయారీ కేంద్రం
ఇటు చూడండీ. ఇది ఎల్‌ఈడీ బల్బలు తయారీ కేంద్రం. ఇందులో పనిచేస్తున్న వారంతా ఉన్నత చదువులు చదివిన సంపన్నుల పిల్లలు కారు. వీరంతా మామూలు ఆదివాసీ కుటుంబాలకు చెందిన గిరిపుత్రికలు. ఐటీఐ, ఇంటర్‌, ఇంజనీరింగ్‌లాంటి చదువులు చదవిన ఆదివాసీ యువతులు, మహిళలే ఇక్కడ పనిచేస్తున్నారు. ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లతోపాటు ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్లను తయారు చేస్తున్నారు. కలిసి కట్టుగా శ్రమిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం ఏర్పాటు
రంపచోడవరం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం స్థాపించారు. దీన్ని 50 మంది గిరిజన మహిళలు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. తక్కువ సమయంలోనే ఈ ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం అంచెలంచెలుగా ఎదిగి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ తయారయ్యే ఎల్‌ఈడీ బల్బులు బ్రాండెడ్‌ కంపెనీలకు ఏమాత్రం తీసిపోవు. మార్కెట్‌లో దొరికే ఎల్‌ఈడీ బల్బులకన్నా ఇవి తక్కువ ధరకే లభిస్తున్నాయి.

గిరిజన మహిళలకు సహకారం అందించిన ఐటీడీఏ ఆఫీసర్‌
గిరిజన మహిళల్లో దాగున్న టాలెంట్‌ను గుర్తించిన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి... ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం గురించి వారికి వివరించారు. అందుకోసం కావలసినవన్నీ సమకూర్చారు. అందుకు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ సైతం సహకారం అందించారు. దీంతో ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం ఏర్పాటైంది. అటవీ ఉత్పత్తుల స్థానంలోనే ఆధునిక ఎల్‌ఈడీ బల్బులూ విక్రయిస్తున్నారు.

ఏపీలోనే మొట్టమొదటి ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం
రంపచోవడవరంలో గిరిజన మహిళలు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం ఏపీలోనే మొట్టమొదటిది. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఉత్పత్తి అంతకంతకూ పెంచుతూ పోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు గురించి నలుమూలలా తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్టును చూడటానికి పలువురు ఏజెన్సీకి తరలి వస్తున్నారు. గిరిపుత్రికల నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.

ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న గిరిపుత్రికలు
ప్రోత్సాహం ఉంటే ఏరంగంలోనైనా ధీటైనా విజయాలు సాధించగలమని ఈ ప్రాజెక్టుతో గిరిపుత్రికలు నిజం చేసి చూపుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందిస్తే సాంకేతికరంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

పైకప్పు కూలి 60 మంది మృతి..

నైజీరియా: ప్రార్థనలు చేస్తుండగా చర్చి పైకప్పు కూలి 60 మంది మృతిచెందిన ఘటన నైజీరియాలోని ఉయో నగరంలో చోటుచేసుకుంది. స్థానిక రీగనర్స్‌ చర్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పెద్దఎత్తున క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్వా ఇబోమ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఉడోం ఇమ్మానియేల్‌ కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

పెట్రోల్ ట్యాంక్ పేలి ..30మంది మృతి..

కెన్యా: నైవిషా పట్టణంలోని నైరోబి - నాకూరు రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 30 మంది కాలి బూడిదయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్లలో ఉన్న పలువురు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 

చెలరేగిపోతున్న కోహ్లీ డబుల్ సెంచరీ..

ముంబై : ముంబై టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. కెప్టెన్స్ ఇన్నింగ్స్ తో కోహ్లీ అలరించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. డబుల్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు విరాట్. 302 బంతుల్లో కోహ్లీ 200 పరుగులు చేశాడు. 23 ఫోర్లతో చెలరేగిన కోహ్లీ ఇంగ్లండ్ ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు. జయంత్ తో కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ. కోహ్లీకి ఇది టెస్టుల్లో మూడో డబుల్ సెంచరీ.

శేఖర్‌రెడ్డి నివాసాల్లో 4వరోజు ఐటీ తనిఖీలు..

తమిళనాడు : చెన్నై శేఖర్‌రెడ్డి ఇళ్లలో నాలుగోరోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కాట్పాడి గాంధీనగర్‌లో నిన్న రాత్రి నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో కోటి 20 క్షల నగదుతో పాటు, మూడు లాకర్లలో ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శేఖర్ రెడ్డి భార్యనూ అధికారులు విచారిస్తున్నారు.

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్ష తెలిపిన కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ 80వ పడిలోకి అడుగుపెట్టారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు జీవితం గడపాలని సీఎం ఆకాంక్షించారు. దేశానికి మరింత సేవలందించే శక్తిని ప్రణబ్‌కు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి సీఎం లేఖ రాశారు. లేఖతో పాటు రాష్ట్రపతి కార్యాలయానికి పుష్పగుచ్ఛం పంపించారు.

10:14 - December 11, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు కంపెనీ భూముల విక్రయానికి ఏపీ పోలీసులు టెండర్ల ప్రక్రియ జారీ చేశారు. ముందుగా కృష్ణా జిల్లా కీసరలో గుర్తించిన 381 ఎకరాలతోపాటు, విజయవాడలోని ఎనిమిది ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు. టెండర్లలో పాల్గొనేవారు ఈనెల 18లోగా ఆస్తులను పరిశీలించుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 26 నాటికి సీల్డు కవర్లలో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఏపీ డీజీపీ సాంబశివరావు చెబుతున్నారు. 

నెల్లూరు జిల్లాకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు..

నెల్లూరు : పీవైపు దూసుకొనస్తున్న వార్ధా తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై పడనుంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం ఓడ రేవులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహయక చర్యల కోసం రెండుఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. ప్రాణ ఆస్థినష్టం జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

09:59 - December 11, 2016
09:58 - December 11, 2016
09:39 - December 11, 2016

సిద్ధిపేట్ : ప్రస్తుతం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర రోజుల తరబడి నిలబడడం కామన్‌గా మారింది. మరోవైపు చిల్లర కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇదిలావుంటే.. నగదు రహిత లావాదేవీలే మేలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే.. సగానికిపైగా ప్రజలకు బ్యాంక్‌ అకౌంట్లు లేని గ్రామాల్లో.. నగదు రహిత లావాదేవీలు సాధ్యమా ? అంటే.. ఖచ్చితంగా సాధ్యమేనని నిరూపిస్తోంది ఆ గ్రామం. ఇంతకీ ఆ గ్రామం ఏంటి ? అని ఆలోచిస్తున్నారా..? అయితే పదండి.. చూసొద్దాం.

ఎన్నో ప్రయోగాలకు నియలయం ఆ గ్రామం
ఆ గ్రామంలో దోమలు కనిపించవు..డ్రైనేజీలు పొంగిపొర్లవు..ఏ ఇంట్లో చూసినా పచ్చదనమే కనిపిస్తుంది..ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత తప్పనిసరి వుంటాయి..తడి, పొడి చెత్త విడివిడిగా సేకరిస్తారు...చెత్తతో అవసరమైన సేంద్రీయ ఎరువుల తయారీ చేస్తారు...ఇలా ఒక్కటేంటి... ఎన్నో ప్రయోగాలను నిలయం ఆ గ్రామం. అందుకే ఆ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అదే సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌.

తెలంగాణలో మొదటి గ్రామం
ఇప్పుడు అదే గ్రామం మరో ఘనతను దక్కించుకుంది. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా ప్రజలు అవస్థలు పడుతుంటే ఈ గ్రామ ప్రజలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దేశంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్న రెండో గ్రామంగా పేరు సంపాదించుకుంది. తెలంగాణలో మొదటి గ్రామంగా నిలిచింది.

స్వైపింగ్‌ మిషన్ల పట్ల ప్రజలకు అవగాహన
మంత్రి హరీష్‌రావు స్వయంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా.. గ్రామంలోని ప్రతి వ్యాపారస్తునికి స్వైపింగ్‌ మిషన్‌ అందజేశారు. గ్రామస్తులందరికీ స్వైపింగ్‌ మిషన్ల పట్ల అవగాహన కల్పించారు. దీంతో ఆ గ్రామంలో ఏ షాపులో చూసినా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు.

సమిష్టి కృషితోనే తామంతా విజయం సాధించామంటున్న గ్రామస్థులు
అలాగే గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు బ్యాంక్‌ ఖాతాలు తెరిపించారు. అందరికీ రూపే కార్డులు అందజేశారు. ఏటీఎంల ద్వారానే లావాదేవీలు జరిగేలా చూస్తున్నారు. మరోవైపు అన్ని లావాదేవీలను క్యాష్‌లెస్‌ విధానం ద్వారా నిర్వహించేలా చూస్తున్నారు. దీంతో ఎలాంటి చిల్లర కష్టాలు లేకుండా.. ప్రతిరోజు వారి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సమిష్టి కృషితోనే తామంతా విజయం సాధించామని గ్రామస్తులు గర్వంగా చెబుతున్నారు.ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో.. ప్రతి గ్రామం.. ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు. 

09:24 - December 11, 2016

హైదరాబాద్ : ప్రజలకు నగదు కష్టాలు మరింత పెరగనున్నాయి. శనివారం నుండి సోమవారం వరకూ వరుసగా మూడు రోజులు పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో జనాలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు..బ్యాంకుల్లో నో క్యాష్ తో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు రకరకా నాన్ వెజ్ లతో వంటలు చేసుకుని సుష్ణుగా తినేందుకు అందరూ రెడీ అయిపోతారు. దీంతో ఆదివారం నాన్ వెజ్ మార్కెట్లకు మంచి గిరాకీ వుంటుంది. కానీ నోట్ల రద్దు అనంతరం చేతిలో డబ్బులు లేక..వున్న వాటికి చిల్లర దొరకక సామాన్యులు అన్ని అవసరాలనూ కుదించుకుంటూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. దీంతో ఆదివారం నాడు ముక్కలేందే ముక్క దిగనివారికి గొప్ కష్టమే వచ్చిందబ్బా..బోయగూడ మార్కెట్ చిల్లర లేమితో వెలవెలబోతోంది. సాధారణ రోజుల్లో కూడా రద్దీగా వుండే ఈ మార్కెట్ ఆదివారమైతే చాలు మరింతగా రద్దీ వుంటుంది..కానీ నోట్ల దెబ్బ..చిల్లర లేమితో వెలవెలబోతోంది.

09:10 - December 11, 2016

విశాఖ : వార్దా తుపాను దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ప్రధాన ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గంటకు 20 కి.మీ వేగంతో పశ్చియ వాయువ్య దిశగా పయనిస్తోంది.నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 580. కి.మీ..మచిలీపట్నానికి 530 కి.మీ,మద్రాస్‌కు 550 కి.మీ దూరంలో వార్థా కేంద్రీకృతమైవుంది.తీరంవెంట గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. వార్దా తుపాను ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోలంగా వుండటంతో అలలు ఎగిసిపడుతన్నాయి.

09:02 - December 11, 2016

ఆదిలాబాద్ : శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 6, మెదక్‌లో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్‌లో తాజాగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత.. తెలంగాణ జిల్లాల్లో మూడో అతి తక్కువదిగానూ రికార్డుల్లోకి ఎక్కింది. తెలంగాణ వాతావరణ చరిత్రలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 1995 జూన్‌ 5న 3.9 డిగ్రీలుగా రికార్డుల్లో ఉంది. చలితో ఆదిలాబాద్, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ కొమురం భీం జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు... ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో బయటకురావాలంటేనే భయపడిపోతున్నారు.. సాయంత్రం 6దాటకముందే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

08:49 - December 11, 2016

ఢిల్లీ: ఉత్తరాదిని పొగ మంచు కప్పేసింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 76 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల రాకపోకలకూ అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ నుంచి వెళ్లే 8 విమానాలను నిలుపుదల చేశారు. 4 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

08:44 - December 11, 2016

టర్కీ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగాయి. తెల్లవారజామున ఓ ఫుట్ బాల్ స్టేడియం సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 29 మంది మృతిచెందగా...170 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడితో పాటూ అదే ప్రాంతానికి సమీపలో ఓ ఆత్మాహుతి దాడి జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. బెసిక్‌టాస్ స్టేడియంలో అభిమానులు ఫుట్ బాల్ మ్యాచ్‌ను తిలకించి వెళ్లిన రెండు గంటలకే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు..క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయాలైన వారిలో చాలా మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కుర్దిష్ తీవ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గతకొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారుబాంబు, ఆత్మాహుతి దాడి వెనుక కుర్దిష్ తీవ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. 

08:40 - December 11, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు చలితో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత కనిపిస్తోంది. గత 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. లంబసింగిలో టెంపరేచర్ 4 డిగ్రీలకు పడిపోయింది. ఆదిలాబాద్‌లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. మెదక్‌లోనూ కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు రికార్డయింది. అటు ఏపీలోనూ వార్దా పెను తుఫానుగా మారడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోస్తాంధ్రలో చలి వణికిస్తోంది. మరోవైపు తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

అమ్మకు భారతరత్న ఇవ్వాలి..

తమిళనాడు : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తమిళనాడు కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శనివారం భేటీ అయిన కేబినెట్ మరికొన్ని తీర్మానాలను ఆమోదించింది. జయకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంతోపాటు పార్లమెంటులో జయ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. అలాగే ఎంజీఆర్ మెమోరియల్ పేరును ఇక నుంచి భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ జయలలిత మెమోరియల్‌గా మార్చాలని తీర్మానించారు. దీంతోపాటు జయ స్మారక మందిరాన్ని రూ.15 కోట్లతో నిర్మించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

మంచు దుప్పట్లో ఢిల్లీ..పలు రైళ్లు రద్దు..

ఢిల్లీ : ఉత్తరాదిని పొగ మంచు కప్పేసింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలో రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 75 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 28 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. మరో నాలుగు రైళ్లను రద్దు చేశారు. విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్ లో చలిపంజా.

ఆదిలాబాద్‌ : తెలంగాణ జిల్లాల్లో మూడో అతి తక్కువ ఉష్ణాగ్రతల జిల్లాగా ఆదిలాబాద్ రికార్డుల్లోకి ఎక్కింది. తెలంగాణ వాతావరణ చరిత్రలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 1995 జూన్‌ 5న 3.9 డిగ్రీలుగా రికార్డుల్లో ఉంది. దీని తర్వాత నిజామాబాద్‌లో 2005 మే 22న 4.4 డిగ్రీలు నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రిపూట సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తుపాను తీరం దాటిన తరవాత 12 నుంచి తెలంగాణలో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

08:08 - December 11, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భరోసాలేని బతుకులను, ఆలనాపాలనాలేని అభాగ్యులను అక్కున చేర్చుకుంటోంది బల్దియా. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, తినడానికి తిండిలేక యాచకులుగా మారిన వారికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పునరావాసం కల్పిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో రెస్క్యూచేసి నిజమైన బెగ్గర్స్‌ను గుర్తించి, వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు రెడీ అయ్యింది.

వివిధ కారణాలతో భిక్షాటన
తల్లిదండ్రుల నుంచి దూరమైన పిల్లలు.. కన్నబిడ్డలే గెంటేసిన తల్లిదండ్రులు..విధి వక్రీకరించి కొందరు... వృద్ధాప్యంలో చేతకాక మరికొందరు. ఇలా జీవితాలు తలకిందులైన వారెందరో యాచకులుగా మారుతున్నారు. వీధి వీధి తిరుగుతూ అన్నమో రామచంద్రా అంటూ అడుక్కుంటున్నారు. కొంతమంది భిక్షాటననే వృత్తిగా మార్చుకుంటున్నారు.

హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో బెగ్గర్స్‌
హైదరాబాద్‌లో ఏ కూడలిలో చూసినా మనకు ధర్మం చెయ్యండి బాబూ అంటూ బెగ్గర్స్ కనిపిస్తారు. ప్రధాన కూడళ్లలోనే కాదు... బస్‌స్టాపులు, ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు, మసీదులు, పార్క్‌లు ఇలా ఎక్కడ చూసినా భిక్షగాళ్లు పదుల సంఖ్యలో దర్శనమిస్తుంటారు. కొంతమంది దిక్కూమొక్కూలేకుండా యాచక వృత్తిని ఎంచుకుంటే... మరికొందరు ధనార్జనే ధ్యేయంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు... హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలోనే బెగ్గర్స్‌ ఉన్నారు.

హైదరాబాద్‌ను బెగ్గర ప్రీ-సిటీగా మార్చాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం
హైదరాబాద్‌ను బెగ్గర్‌ ఫ్రీసిటీగా మార్చాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి యాచకులకు పునరావాసం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే దిల్‌సుఖ్‌నగర్‌లో అమ్మ -నాన్న అనే స్వచ్చంద సంస్థతో కలిపి ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. బిచ్చగాళ్ల ముసుగులో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మేయర్‌ అన్నారు. వారిని నిరోధించేందుకు చేపట్టిన బెగ్గర్‌ ప్రీ- హైదరాబాద్‌కు సహకారం అందించాలని కోరారు.

బెగ్గర్స్‌ను గుర్తించిన స్వచ్ఛంద సంస్థ
ఈ సందర్భంగా కొంతమంది నిజమైన బెగ్గర్స్‌ను స్వచ్చంద సంస్థ గుర్తించింది. వారిని అక్కడే నీట్‌గా తయారు చేశారు. కటింగ్‌, సేవింగ్‌ చేసి కొత్తబట్టలు ఇచ్చారు. ఇక నుంచి వారికి వసతితోపాటూ ఆహారం అందజేయనున్నట్టు మేయర్‌ తెలిపారు. మరి జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ సరికొత్త కార్యక్రమం ఏమేరకు విజయంతమవుతుందో వేచి చూడాల్సిందే..

07:54 - December 11, 2016

ఢిల్లీ : వివిఐపి అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంలో అరెస్ట్‌ అయిన మాజీ వైమానికదళ అధిపతి ఎస్పీ త్యాగికి పటియాలా కోర్టు రిమాండ్‌ విధించింది. త్యాగితో పాటు సోదరుడు జూలీ, న్యాయవాది గౌతం ఖేతాన్‌లను నాలుగు రోజులు సిబిఐ కస్టడీకి పంపింది. చాపర్‌ స్కాం కేసులో త్యాగితో పాటు జూలీ, గౌతం ఖేతాన్‌లను సిబిఐ శుక్రవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 2010లో యూపిఏ హయాంలో వివిఐపిల కోసం 3 వేల 6 వందల కోట్లతో 12 హెలిక్యాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ కోసం 450 కోట్లు ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో సీబీఐ వీరిని అరెస్ట్ చేసింది.

07:50 - December 11, 2016

గుజరాత్ : పార్లమెంట్ సమావేశాల్లో తనని మాట్లాడకుండా విపక్షాలే అడ్డుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోది విమర్శించారు. అందుకే తాను జనసభలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని మోది స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవడంపై తీవ్ర ఆవేదన చెందిన రాష్ట్రపతి విపక్షాలు తీరును తప్పు పట్టారని గుర్తు చేశారు. తాము చర్చకు సిద్ధమేనని, ప్రధాని కూడా మాట్లాడతారని కేంద్రం సభలో స్పష్టం చేసినా...విపక్షాలే చర్చ నుంచి పారిపోతున్నాయని దుయ్యబట్టారు. గుజరాత్‌లోని దీసాలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా రైతుల నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

07:47 - December 11, 2016

తిరుమల : ఆయనో పవిత్ర పుణ్యక్షేత్రంలో సభ్యుడు. ఇంతకుముందు ఆయనెవరో చాలామందికి తెలియదు. కానీ.. భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆయనే భారీ ఎత్తున నగదు, బంగారం నిల్వలు పట్టుబడ్డ కేసులో కీలక వ్యక్తి అయిన శేఖర్‌రెడ్డి. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారంలో శేఖర్‌రెడ్డిని ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుడి బాధ్యతల నుంచి తప్పించింది. అక్రమ నగదు నిల్వలపై కేసు నమోదు చేసిన ఐటీ శాఖ అధికారులు శేఖర్‌రెడ్డి కేసును ఈడీకి అప్పగించనున్నట్లు సమాచారం.

ఐటీ సోదాల్లో భారీ ఎత్తున నగదు, నగలు
నిన్న మొన్నటి వరకు శేఖర్‌రెడ్డి అంటే ఎవరో తెలియదు. కానీ.. ఐటీ సోదాల్లో భారీ ఎత్తున నగదు, నగలు పట్టుబడటంతో శేఖర్‌రెడ్డి పేరు మారుమోగుతోంది. ఓ పక్క సామాన్యులకు రెండువేలు దొరకడమే గగనమై పోయిన ఈ తరుణంలో దాదాపు 174 కోట్ల రూపాయల నగదు పట్టుబడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శేఖర్‌రెడ్డి వద్ద పట్టుబడ్డ కోట్ల రూపాయాల్లో మొత్తం అధిక మొత్తం కొత్త నోట్టే కావడం గమనార్హం. ఇంతటి విపత్కర సమయంలోనూ.. శేఖర్‌రెడ్డికి అంత పెద్ద మొత్తాన్ని చేరవేసిందెవరన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

సోదాల్లో రూ. 174 కోట్ల నగదు, 127 కిలోల బంగారం
కోట్ల రూపాయల కొత్త నోట్లు శేఖర్‌రెడ్డి వద్ద పట్టుబడటం నల్ల కుబేరులు ఎలా డబ్బుల్ని సర్దుకుంటున్నారో తేటతెల్లం చేసింది. ఐటీ సోదాల్లో దాదాపు 174 కోట్ల రూపాయలు, 127 కిలోల బంగారం బయట పడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో శేఖర్‌రెడ్డితో పాటు అతని అనుచరులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో 90 కోట్ల నగదు, కడ్డీల రూపంలో ఉన్న 100 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల విలువ 400 కోట్లుగా లెక్కకట్టినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో 24 కోట్ల కొత్త కరెన్సీని వేరే చోటుకి తరలించాలని ప్రయత్నిస్తుండగా వేలూరులో అధికారులు పట్టుకున్నారు. శేఖర్‌ రెడ్డి నివాసం వద్ద ఆగివున్న కారులో 12 బాక్సుల్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకో బాక్సులో 2 కోట్ల మేరకు కొత్త కరెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

శేఖర్‌రెడ్డి నివాసాలకు ఐటీ సీజ్
చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డి టీ నగర్‌ బజుల్లా రోడ్డులో నివాసం ఉంటున్నాడు. వేలూరు, కాట్పాడిలోనూ ఇళ్లున్నాయి. కాట్పాడి గాంధీనగర్‌లోని రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో ఐటీ అధికారులు ఇళ్లను సీజ్‌ చేశారు. శేఖర్‌రెడ్డి సహా నలుగురినీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంత మొత్తంలో కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి.. ఎలా వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత
శేఖర్‌రెడ్డి తల్లిదండ్రులు జగన్నాథరెడ్డి, నీలవేణిలు వేలూరు జిల్లా కాట్పాడి సమీపం తొండన్‌తులసి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. శేఖర్‌రెడ్డి చెన్నైలో ప్రైవేటు పబ్లికేషన్‌ను ప్రారంభించి చాలాకాలం క్రితమే ఇక్కడ స్థిరపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్‌రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. ఈయన తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. సుమారు వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు కూడా చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో శేఖర్‌రెడ్డి ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే జయలలిత మరణించిన నాలుగోరోజే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శేఖర్‌రెడ్డి పై ఏపీ సర్కార్ వేటు..
ఇక ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో పట్టుబడ్డ శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుకు శేఖర్‌రెడ్డి అత్యంత ఆప్తుడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేతే టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమితుడైన శేఖర్‌ రెడ్డి ఇంట్లో భారీగా కొత్త కరెన్సీ, బంగారం బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తన ఆస్తులేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీశాఖ నిర్ధారించింది.

చంద్రబాబు అధికారం తర్వాత టీటీడీ సభ్యుడిగా శేఖర్‌రెడ్డి
శేఖర్‌రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ ప్రముఖ హోటల్‌లో టీడీపీ ముఖ్య నేతతో భేటీ అవుతారన్న ఆరోపణలూ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనను టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమించారని చెబుతున్నారు.  

07:41 - December 11, 2016

హైదరాబాద్ : నెల రోజులు దాటినా.. ప్రజలకు నగదు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే చేతిలో డబ్బుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్యులకు మరిన్ని రోజులు మనీ కష్టాలు తప్పేట్టు లేదు. వరుసగా 3 రోజులకు బ్యాంకులకు సెలవు కావడం, ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులతో .. అన్ని వర్గాల ప్రజలు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

ఏటీఎంలల్లో నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో క్యాష్ లేదు
ఎవరి నోట విన్నా..నోట్ల కష్టాలే. ఎక్కడ చూసినా డబ్బులు కావాలని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలే. ఇళ్లు గడవడానికి కూడా డబ్బులు లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు డబ్బులో రామచంద్రా అంటూ... నానా యాతన పడుతున్నారు. ఒక్కొక్కరికి వారంలో 24 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నా... స్థానికంగా మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ఏటీఎంలల్లో నో క్యాష్‌ బోర్డులు, బ్యాంకుల్లో డబ్బులేదనే సమాధానమే ఎదురవుతోంది.

అంతులేకుండాపోతున్న కష్టాలు
కొన్ని బ్యాంకుల వద్ద అడపా దడపా డబ్బులు చెల్లిస్తున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఉన్న డబ్బులను ఎక్కువ మందికి సర్దే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాదారులకు పదివేల వరకు నగదు ఇస్తుంటే.. కొన్ని బ్యాంకుల్లో రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో జనం కష్టాలకు అంతులేకుండా పోయింది.

నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు
డిసెంబర్‌ 5వ తేదీ నుంచి 15 వరకు హైదరాబాద్‌లో వేతనాలు, జీతాలు తీసుకునే అవకాశం ఉన్నా బ్యాంకులు, ఏటీఎంల్లో డబ్బులు లేక ఇళ్లు గడవని పరిస్థితి తలెత్తిందని ఉద్యోగులు వాపోతున్నారు. నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు రోజులు పాటు బ్యాంకులు సెలవులు
ఇక మూడు రోజులు పాటు బ్యాంకులు సెలవులు రావడంతో జనాలు ఇబ్బందులు మరిన్ని పెరగనున్నాయి. ఇప్పటికే ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమివ్వడంతో వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నోట్ల రద్దుతో కుదైలైన మార్కెట్ రంగం
నోట్ల రద్దుతో మార్కెట్ రంగం కుదైలైంది. కనీవినీ ఎరుగని రీతిలో కోట్లలో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. నిత్యం బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులు తీరుతూనే ఉన్నారు. ఖాతాదారులకు సరిపడా నగదు సరఫరా లేక గ్రామీణ స్థాయి బ్యాంకుల సేవలు పూర్తిగా స్తంభించాయి. ఏటీఎం కేంద్రాలు కూడా పేలవమైన సేవలు అందిస్తుండడంతో ఖాతాదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. హైదరాబాద్‌ నగరంలో అడ్డా కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. అటు చేతిలో డబ్బుల్లేక.. ఇటు ఎవరూ పనులకు పిలవక కూలీలు తీవ్రంగా కుమిలిపోతున్నారు.

కుటుంబాలు గడవక మహిళల ఆవేదన
రోజుల తరబడి బ్యాంకుల్లో క్యూలు కడుతున్న చిల్లిగవ్వ అందడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిల్చునే ఓపిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని మహిళలు చెబుతున్నారు.

మరింత ఆందోళనలో సామాన్యులు
నోట్ల కష్టాలు తీరే మార్గం కనిపించకపోవడంతో.. పేదలు, సామాన్యులు రోజురోజుకు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అవసరాలకు సరిపడా నగదును సరఫరా చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. 

07:35 - December 11, 2016

హైదరాబాద్ : నానక్‌రామ్‌గూడ ఘటనలో మరో ఇద్దరు అధికారులపై జీహెచ్ఎంసీ వేటు వేసింది. దీంతో సస్పెండైన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. పరిమితికి మించి ఎక్కువ అంతస్తుల్లో నిర్మాణం చేయడంతోపాటు, నాసిరకం ఇనుము, ఇసుక, సిమెంట్‌ వాడడం వల్లే భవనం కూలినట్లు జేఎన్టీయూ నిపుణుల బృందం అధ్యయనంలో తేలింది. మరోవైపు భవన జయమాని సత్తుసింగ్‌ను కేరళలో అరెస్టు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి దేహాలకు పంచనామా తర్వాత స్వస్థలాలకు తరలించారు.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పని చేసిన రాజేందర్‌ సస్పెండ్‌
హైదారాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బాధ్యులపై జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నలుగురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. పట్టణ ప్రణాళిక విభాగంలో గతంలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన రాజేందర్‌, ప్రస్తుతం పని చేస్తున్న మధులను సస్పెండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషన్‌ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ మనోహర్‌, పట్ణణ ప్రణాళికా విభాగం అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ కృష్ణమోహన్‌లపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు ఇంకెవరెవరు బాధ్యులనే అంశంపై విచారణ జరుపుతున్నారు.

జీహెచ్‌ఎంసీకి ప్రాథమిక నివేదిక అందించిన జేఎన్‌టీయూ నిపుణులు
మరోవైపు భవన యజమాని సత్యనారాయణ సింగ్‌ను పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. భవనం కుప్పకూలడానికి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం ఇనుము, ఇసుక, సిమెంట్‌, కంకర వాడినట్టు జేఎన్‌టీయూ నిపుణుల అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను బల్దియాకు అందించింది. ఈ భవనం ఆకృతి సరిగాలేదని గుర్తించారు. కొద్దిపాటి స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మించడం ప్రమాదానికి కారణమని తేల్చారు. కుప్పకూలిన భవనానికి చుట్టు పక్కల లోతుగా తవ్వకాలు జరపడం కూడా ప్రమాదానికి దారి తీసిందని విశ్లేషించారు. శిథిలాలను పూర్తిగా తొలగించిన తర్వాత మరోసారి ఇనుము, ఇసుకు, సిమెంటు, కంకర నమూనాలు సేకరించి పరీక్షించాలని జేఎన్‌టీయూ నిపుణుల బృందం నిర్ణయించింది. పూర్తి నివేదిక అందిన తర్వాత మరికొందరు అధికారులపై వేటుపడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీలో చర్చ జరుగుతోంది. నానక్‌రామ్‌గూడ భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృత దేహాలను అంబులెన్స్‌ల ద్వారా వారి వారి స్వస్థలాలకు పంపారు. సహాయ చర్యల్లో ఇద్దరి ప్రాణాలను రక్షించారు.  

07:29 - December 11, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలకుముందే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. స‌భ‌లో విపక్షాలను కడిగేస్తామంటున్న గులాబీ నేతల వ్యాఖ్యలపై హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు.. ఎవరిని ఎవరు కడిగేస్తారో తేల్చుకుందామంటూ సవాల్‌ విసురుతున్నారు.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం రాజుకుంది.. శాసనసభ సమావేశాలకుముందే రెండు పార్టీల నేతలు మాటలయుద్ధానికి దిగాయి.. అసెంబ్లీ సమావేశాల్ని ఏర్పాటు చేయాలంటూ తాము రోడ్డెక్కితే గానీ ప్రభుత్వంలో చలనం రాలేదని కాంగ్రెస్‌ నేతలు అంటుంటే... కాంగ్రెస్‌కు అంత సీన్‌లేదని గులాబీ నేతలు సమాధానమిస్తున్నారు.. హస్తం నేతల్ని కడిగిపారేస్తామన్న మంత్రి హరీశ్‌ రావు కామెంట్స్‌పై కాంగ్రెస్‌ లీడర్లు సీరియస్‌ అవుతున్నారు.... ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌లుపై అసెంబ్లీలో ఒక రోజు చర్చకు సిద్ధమా అని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ... హరీశ్‌ రావుకు సవాల్‌ విసిరారు..

ప్రభుత్వంపై మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు
అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ మంత్రులు తమను ఏం చేస్తారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు.... నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోకపోవడం దుర్మార్గమని

మంత్రి తలసానిపై క్రిమినల్‌ కేసు పెట్టాలంటున్న హస్తం నేతలు
అటు టీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టేందుకు అన్ని అస్త్రాలను కాంగ్రెస్‌ సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలతో పాటు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేస్తోంది. మోడ‌ల్‌గా కట్టిన హైద‌రాబాద్ ఐడీహెచ్‌ కాలనీలోనూ అక్రమాలకు తెరతీశారని ఆరోపిస్తోంది.. ఈ అక్రమాల్లో మంత్రి తలసాని పాత్ర ఉందని... వెంటనే మంత్రిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆ పార్టీ

వాడివేడిగా తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు
విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు... అసెంబ్లీ సమావేశాలకు ముందే పొలిటికల్‌ హీట్ పెంచుతున్నారు.. ప్రస్తుత వాతావరణం చూస్తే శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.. 

07:21 - December 11, 2016

విశాఖ : వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఏపీ వ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలను , అధికారులను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత నాలుగు జిల్లాలకు పర్యవేక్షణాధికారులుగా నలుగురు ఐఏఎస్‌లను కేటాయించింది. వార్ధా తుపాను నేపథ్యంలో చంద్రబాబు తన దుబాయ్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

తీరందాటే సమయంలో గంటకు 90 -100 కి.మీ వేగంతో గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను ఏపీవైపుగా దూసుకొస్తోంది. ఇది సోమవారం సాయంత్రం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట - కృష్ణపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. వార్థా తుపాను తీరం దాటే ముందు విశాఖ నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి వర్షాలు కురిసే అవకాశముంది.

వార్ధా తుపానుపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు
వార్ధా తుపాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని కమాండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ నుంచి సమీక్ష నిర్వహించారు. వార్థా తుపాను వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భారీగా ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశముండడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గాలివేగం, దాని వల్ల జరిగే నష్టాన్ని ఇస్రో ముందే అంచనావేసి జిల్లా యంత్రానికి తెలియజేయాలని కోరారు. ఈసారి నష్టం జరిగే పరిస్థితే తలెత్తితే కొన్ని గంటల్లోపే అక్కడ పునరుద్ధరణ చర్యలు పూర్తి చేయాలన్నారు. తుపానును ఎదుర్కోవడం అధికారులందరికీ పరీక్షా సమయమని.... ఏ అధికారైన బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. వరద నీటిని ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలు పెరగటానికి, చెరువులు నింపడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో తుపాను ప్రభావం
వార్ధాతుపాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు,కడప, అనంతపురం జిల్లాల్లో చూపనుంది. దీంతో ఈ జిల్లాల అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ఈ నాలుగు జిల్లాలకు నలుగురు ఐఏఎస్‌లను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తుపాను ఎమర్జెన్సీగా భావించి ఆయా జిల్లాల్లోని అధికారులు సెలవులు రద్దు చేసుకుని విధులకు హాజరవ్వాలని సీఎం ఆదేశించారు. 3 రోజులు సెలవులు, పెద్దనోట్ల సమస్య వీటికి తోడు తుపాను ఒకేసారి కలిసి రావడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సమయాల్లోనే అధికారులు ప్రజలకు భరోసా అందించేవిధంగా పనిచేయాలన్నారు.

నెల్లూరు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్‌ ముత్యాలరాజు
వార్థా తుపానును ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం 12 మండలాల్లో ఉంటుందని అక్కడి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. మొత్తం 872 మంది గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టామన్నారు.

సర్వ సన్నద్ధమయిన ఏపీ సర్కార్
మొత్తంగా వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సర్వ సన్నద్ధమయ్యింది. అధికార యంత్రాగాన్ని సమాయత్తం చేసింది. సీఎం చంద్రబాబు తన దుబాయ్‌ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. 

జంట పేలుళ్లలో 15మంది మృతి..

ఇస్తాంబుల్‌ : ఇస్తాంబుల్ లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 69 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఫుట్ బాల్ స్టేడియం వెలుపల పేలుళ్లు జరగగా.. రెండోది స్టేడియంకు సమీపంలోని పార్క్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. స్టేడియం వద్ద ఉన్న పోలీసుల వాహనం లక్ష్యంగా పేలుళ్లు జరిగినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఫుట్ బాల్ మ్యాచ్ ముగిసిన వెంటనే బాంబు పేలుళ్లు జరగడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

గ్యాస్ సిలిండర్లు పేలి 4దుకాణాలు దగ్థం..

గద్వాల : రాజోలి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున మటన్ దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ధాటికి 4 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. రూ. 4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధిత దుకాణ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉగ్రహోమానికి 45మంది బలి..

నైజీరియా : బోకోహారమ్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు మహిళలు రద్దీగా ఉన్న ఓ మార్కెట్‌లో శుక్రవారం నాడు మానవ బాంబులుగా మారి పేల్చుకోవడంతో దాదాపు 45మంది మృతిచెందారు. 33 మంది గాయపడ్డారు. నైజీరియాలో ఈ ఉగ్రవాద సంస్థ తరచూగా మహిళలను మానవబాంబులుగా ఉపయోగిస్తూ మారణహోమం సృష్టిస్తున్నదని పేర్కొన్నాయి.

సీబీఐ కస్టడీకి ఎస్పీ త్యాగి..

ఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో భారత వాయుసేన మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని నాలుగు రోజుల కస్ట్టడీ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. హెలికాప్టర్లను కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై శుక్రవారం త్యాగితోపాటు ఆయన సమీప బం ధువు సంజీవ్ అలియాస్ జూలీత్యాగి, న్యాయవాది గౌతమ్ ఖేతాన్‌లను అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడికి అప్పగించాలని సీబీఐ కోరగా నాలుగురోజుల కస్టడీకి ధర్మాసనం అనుమతించింది. 

కరుణకు రజనీ పరామర్శ..

తమిళనాడు : ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. తమిళనాడు రాజకీయాల్లో చోలుచేసుకుంటున్న పరిణామాల మధ్య చెన్నైలోని గోపాలపురలోని కరుణానిధి ఇంటికెళ్లి వెళ్లి రజనీకాంత్ పరామర్శ తమిళనాట ఆసక్తి రేపుతోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, డిశ్చార్జ్ అయిన కరుణానిధిని రజనీ కలవడం వెనుక ఎలాంటి రాజకీయాంశాలు లేవని ఇరు వర్గాలు చెబుతున్నాయి.

Don't Miss