Activities calendar

14 December 2016

22:04 - December 14, 2016

ఢిల్లీ : అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శాసనసభ, మండలి వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కడిగిపారేయాలని నిర్ణయించింది. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌ను నిలదీసి, ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా వ్యూహరచన చేసింది. అన్ని విషయాల్లో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడే విధంగా చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీపీ పెద్దలు ఢిల్లీలో దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ సిద్ధం
ఈనెల 16వ తేదీ నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను అజెండాగా చేసుకుని సర్కారును నిలదీయాలని ఏఐసీసీ నేతల సమక్షంలో ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశంలో నిర్ణయించారు.

దిగ్విజయ్‌ సింగ్‌ సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ సమక్షంలో ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లుభట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబీర్‌ అలీ, పార్టీ ఎంపీలు హాజరైన ఈ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహార్ని ఖరారు చేశారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు, భూసేకరణ అంశాలు మల్లు భట్టివిక్రమార్కకు అప్పగింత

డీకే అరుణకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యలు
అంశాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, భూసేకరణ సమస్యలను మల్లు భట్టివిక్రమార్కకు అప్పగించారు. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ను డీకే అరుణ ప్రస్తావిస్తారు. సంక్షేమ పథకాలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశాలను ఎమ్మెల్యే సంపత్‌ లేవనెత్తుతారు. రైతుల రుణమాఫీ, మిషన్‌ భగీరథ సబ్జెక్టులపై వంశీచంద్‌రెడ్డి మాట్లాడతారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే బాధ్యతలను ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి అప్పగించారు. రైతులు, విద్యార్థులు, ఎస్‌స్సీ, ఎస్టీల సమస్యలు, ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు హామీల అమల్లో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దళితుకు మూడెకరాల భూమి ఇస్తామన్న ఎన్నిల హామీ అమల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాన్ని ఎండగట్టేలా వ్యూహరచన చేశారు. మొత్తంమీద కాంగ్రెస్‌ వ్యూహం చూస్తుంటే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

21:59 - December 14, 2016

నెల్లూరు : జీవో నెంబర్ 279 ను వెంటనే రద్దు చేయకపోతే ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతారని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు విమర్శించారు. నెల్లూరు రూరల్ మండలం మట్టెంపాడు, నగరంలోని సత్యనారాయణపురం, బర్నాల గుంట, ధర్మశాలలో నిర్వహించిన పాద యాత్రలో ఆయన పాల్గొని.. ప్రజల సమప్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ జీవో వల్ల ప్రజా పాలన కాస్త నిరంకుశ కంపెనీల చేతికి వెళ్లిపోతుందని, దీని వల్ల పట్టణ అభివృద్ధి దెబ్బ తింటుందని మండిపడ్డారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు . 

21:55 - December 14, 2016

హైదరాబాద్ : లోపం ఎక్కడుందో గుర్తించాలి... ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి... పరిష్కారాలు వెతకాలి.. ఇదీ సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల చేసిన దిశానిర్దేశం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. గ్రీవెన్స్‌డేని మొక్కుబడిగా నిర్వహించకుండా.. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కొత్త జిల్లాల అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి
గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించినా సమాజంలో ఇంకా అసంతృప్తి మిగిలేవుందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. లోపాన్ని గుర్తించి, ప్రజాసమస్యల పరిష్కారానికి దారులు వెతకాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్ధ అమలు లక్ష్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్న కేసీఆర్‌.. అధికార యంత్రాంగం మరింత క్రియాశీలంగా పని చేస్తేనే లక్ష్యం సిద్ధిస్తుందన్నారు. డబ్బుతోనే అన్ని పనులు సాధ్యం కావని.. మంచి విధానాలు, పథకాలు తీసుకురావాలని.. వాటి ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నారు కేసీఆర్‌.

ఐపాస్‌ చట్టంతో రిశ్రామిక విధానం అద్భుతంగా ఉంది : కేసీఆర్
తెలంగాణలో ఐపాస్‌ చట్టం తేవడం వల్ల పారిశ్రామిక విధానం అద్భుతంగా ఉందని.. 2500 పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు కేసీఆర్‌. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు, హరితహారం ద్వారా పర్యావరణం మెరుగైందని, గుడుంబాను నిర్మూలించగలిగామని కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమ రంగానికి 30 వేల కోట్లకు పైగా కేటాయించడంతో.. నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు. అధికారులు మూస పద్ధతిని విడనాడి అభివృద్ధి వైపు దృష్టి సారించాలన్నారు కేసీఆర్‌. 'నో యువర్‌ డిస్ట్రిక్ట్‌.. ప్లాన్‌ యువర్‌ డిస్ట్రిక్ట్‌' విధానంలో... జిల్లాల స్వరూపం, స్వభావం, పరిస్థితుల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలి :కేసీఆర్
నోట్ల రద్దు ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ ఉందన్న కేసీఆర్‌... నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలని.. సిద్దిపేటలో క్యాష్‌లెస్‌ విధానం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై రాష్ట్రమంతా దృష్టి సారించాలన్నారు. బ్యాంకులు కూడా స్వైప్‌ మిషన్లు అందుబాటులోకి తేవాలన్నారు. జిల్లాల్లోని ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపడాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఇకపై ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద 3 కోట్ల మేర అత్యవసర నిధులు అందుబాటులో ఉంచుతామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో 33 శాతం అడవులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైవేలపై విధిగా మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

తమ అనుభవాలను సీఎం దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్లు
రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా మెరుగయ్యాయని.. షీ టీమ్స్‌ బాగా పని చేస్తున్నాయన్నారు కేసీఆర్‌. జిల్లాల్లో కూడా షీ టీమ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో స్మశానవాటికలు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉండేచోట బరియల్‌ గ్రౌండ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం నరేగా నిధులతో పాటు, దాతల విరాళాలనూ వినియోగించాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాల ఏర్పాటు అనంతరం గడచిన రెండునెలలుగా తాము ఎదుర్కొంటున్న అనుభవాలను కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. 

21:50 - December 14, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల కష్టాలు తగ్గకపోగా, రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఐదొందలు, వెయ్యి నోట్ల రద్దుపై పాలకులు చెబుతున్న మాటలన్నీ పచ్చిబూటకంగా మారుతున్నాయంటూ ప్రజల్లో ఆగ్రహావేశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన కొత్తలో పది రోజుల్లో సమస్యలు సర్దుకుపోతాయని పాలకులు చెప్పిన మాటలతో ఇంతకాలం సర్దుకుపోయిన ప్రజలు... తమ సహనానికి పరీక్ష పెట్టొందని ఆగ్రహంతో ఊగిపోతూ, కట్టలు తెంచుకున్న కోపంతో రగిలిపోతున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల దగ్గర చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

పెద్ద నోట్లు రద్దు చేసి 36 రోజులు
పెద్ద నోట్లు రద్దు చేసి 36 రోజులు గడిచిపోయింది. నల్లధన కుబేరుల భరతం పట్టే ఉద్దేశంలో ప్రధాని మోదీ తీసుకున్నఈ నిర్ణయాన్ని మొదట్లో సమర్ధించిన వారంతా ఇప్పుడు తప్పుపడుతున్నారు. కొద్ది రోజుల్లో సమస్య సర్దుకుపోతుందని చెప్పడంతో అందరూ పాలకుల మాటలు నమ్మారు. కానీ పరిస్థితిలో మార్పు రాకపోగా రోజు రోజుకూ తీవ్రమవుతోండటంతో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల దగ్గర జరుగుతున్న ఘర్షణలతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

మూడు రోజులు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుడు
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఇంతకాలం ఎంతో సహనంతో ఓపిక పట్టారు. రెండు వేల రూపాయల కోసం పనులన్నీ మానుకొని రెండు, మూడు రోజులు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా కొత్త నోట్లు చేతిక అందకపోవడంతో ఆవేశం కట్టలు తెచ్చుకుంటోంది. ఈ కష్టాలను ఎంతకాలం భరిస్తామంటూ బ్యాంకు అధికారులను, సిబ్బందిని నిలదీస్తున్నారు. పాకులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

కరెన్సీ కష్టాలకు హద్దువుంది : ప్రజలు
కరెన్సీ కష్టాలకు ఓ హద్దుందని ప్రజలు అంటున్నారు. వెయ్యో, రెండు వేల కోసమో పడరాని పాట్లు పడుతున్న జనం ఉదయం నుంచే బ్యాంకుల దగ్గర బారులు తీరుతున్నారు. గంటలపాటు ఓపిగ్గా నిలుచున్న ఖాతాదారులు బ్యాంకులు తెరిచిన వెంటనే లోపలకు ప్రవేశించే యత్నంలో తోపులాటలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎస్‌బీహెచ్‌ దగ్గర ఒక వ్యక్తి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. బ్యాంకు దగ్గర భద్రతా సిబ్బంది కూడా లేకపోవడంతో బ్రాంచి అద్దాలు పగిలిపోయాయి.

ధరణికోట ఎస్‌బీఐ దగ్గర ఖాతాదారుల మధ్య జరిగిన తోపులాట
గుంటూరు జిల్లా అమరావతిలోని ధరణికోట ఎస్‌బీఐ దగ్గర ఖాతాదారుల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాత్రులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగదు కోసం ఖాతాదారులు ఒక్కసారిగా బ్యాంకులోని దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో బ్యాంకు లావాదేవీలు కొద్దిసేపు నిలిచిపోయాయి. రెండు వేల కోసం బ్యాంకుల చుట్టూ ఇలా ఎంతకాలం తిరుగాలని జనం ప్రశ్నిస్తున్నారు.

వేల్పూరులో ఎస్‌బీఐ దగ్గర ఖాతాదారులు ఆందోళన
నోట్ల కష్టాలు భరించలేక సహనం కోల్పోయిన ఖాతాదారులు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఎస్‌బీఐ దగ్గర ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఇంకెన్నాళ్లీ నో క్యాష్‌ బోర్దులంటూ ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించారు. బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ కార్మికులు ట్యాంక్‌బండ్‌ ఎస్‌బీహెచ్‌ దగ్గర ఆందోళన
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులు ట్యాంక్‌బండ్‌ ఎస్‌బీహెచ్‌ దగ్గర ఆందోళనకు దిగారు. జీతాలు వచ్చినా డబ్బులు తీసుకోలేని పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కష్టాలపై వరంగల్‌ జిల్లా నర్సంపేపేటలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మానవహారాన్ని నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.

చిక్కడపల్లిలోని ఎస్‌బీహెచ్‌ దరగ్గ సీఐటీయూ కార్యకర్తల ధర్నా
పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ఎస్‌బీహెచ్‌ దరగ్గ సీఐటీయూ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు విఫలమయ్యాయని సీఐటీయూ నేతలు మండిపడ్డారు. కరెన్సీ కష్టాలపై ప్రజలు, ప్రజా సంఘాలు మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి.

 

21:44 - December 14, 2016

విజయవాడ : కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్లకుబేరులకు, కార్పొరేట్‌ల సంస్థలకు సహకరించేలా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ. రాఘవులు అభిప్రాయపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని రాఘవులు మండిపడ్డారు. 

21:42 - December 14, 2016

విజయవాడ : రెండు రోజుల్లో అన్ని రకాల పింఛన్ల చెల్లింపు పూర్తి కావాలని, వృద్ధులు, వితంతువులు... వికలాంగుల పింఛన్ల పంపిణీలో ఎటువంటి లోపం జరగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు అధికారులు బ్యాంక్‌ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని అన్నారు.

అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌
బ్యాంకర్లు, జిల్లాల కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలకు నగదు కష్టాలను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని.. దీని కోసం అందరూ అంకిత భావంతో పనిచేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ముఖ్యంగా బ్యాంక్‌లు.. ఏటీఎంల వద్ద రద్దీ పెరగకుండా చూసుకోవాలని.. బ్యాంకులు.. ఖాతాదారులకు ఇస్తున్న నగదు పరిమితిని క్రమంగా పెంచాలని అన్నారు. వృద్ధులు...వికలాంగులు.. బ్యాంకుల దగ్గర క్యూలైన్లలో నిలబడకుండా.. తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రతి రేషన్‌ డిపో బిజినెస్‌ కరస్పాండెంట్‌గా పనిచేయాలని.. ఒక్కో రేషన్‌ దుకాణం ద్వారా కనీసం రెండు లక్షల రూపాయలు నగదు పంపిణీ జరిగితే గ్రామాల్లో నగదు లభ్యత పెరుగుతుందన్నారు.

డిజిటల్‌ కరెన్సీ వినియోగంపై చైతన్య పరచాలని ఆదేశం
ప్రజలకు కరెన్సీ సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తూనే...మరోవైపు డిజిటల్‌ కరెన్సీ వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలని సీఎం అన్నారు. ఉద్యమస్ఫూర్తితో నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలను మళ్లించాలని సూచించారు. అన్ని వాపార దుకాణాలలో ఈపాస్‌, ఎంపాస్‌ మిషన్ల వినియోగం పెంచాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని రూపె కార్డులను నాలుగురోజుల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. మొబైల్‌ లావాదేవీలను 10 శాతానికి, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులను 15 శాతానికి పెంచాలని నిర్దేశించారు.

గత వారాంతంలో బ్యాంకులకు రూ.1448.40 కోట్లు పంపిన రిజర్వ్‌బ్యాంక్‌
గత వారాంతంలో 13 జిల్లాల్లోని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంకు రూ.1448.40 కోట్లు పంపిందని... వీటిలో రూ.1,220 కోట్లు 2 వేల రూపాయల నోట్లని, రూ.55 కోట్లు 500 రూపాయల నోట్లని సీఎం చెప్పారు. మిగతా కరెన్సీ అంతా రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లని ఆయన చెప్పారు. ఈ 36 రోజుల్లో చేసింది చాలా తక్కువని.. చేయాల్సింది చాలా ఎక్కువ ఉందని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని సంబంధిత అధికారులతో చంద్రబాబు అన్నారు. 

21:38 - December 14, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై గత నెల రోజులుగా లోక్‌సభలో తాము చర్చకు పట్టుబడితే ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఈ విషయాలు వెలుగు చూస్తే ప్రధాని బండారం బద్ధలవుతుందని, అందుకే తమను సభలో మాట్లాడనివ్వడం లేదని రాహుల్‌ అన్నారు. లోక్‌సభలో మాట్లాడే హక్కు తమకు ఉంటుందన్నారు. ప్రధాని మోది ఈ విషయంలో ప్రజా సభల్లో మాట్లాడుతున్నారే తప్ప సభకు వచ్చి చర్చలో పాల్గొనడం లేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు చర్చను అడ్డుకోవడం సహజమే కానీ... ప్రభుత్వమే చర్చను అడ్డుకోవడం పార్లమెంట్‌ చరిత్రలో ఇదే తొలిసారన్నారు.

 

నేను మాట్లాడితే ప్రధాని మోదీ భయం : రాహుల్
పార్లమెంట్‌లో, లోక్‌సభలో మేము మాట్లాడడం ప్రభుత్వానికి, ప్రధానికి ఇష్టం లేదు. ప్రధాని వ్యక్తిగతంగా భయపడుతున్నారు. నా దగ్గర కీలక సమాచారం ఉందని ప్రధాని బెదిరిపోతున్నారు...తాను మాట్లాడితే ప్రధాని గాలి బుడ‌గ పేలిపోతుంది...అందుకే ఆయన సభలో తమని మాట్లాడనివ్వడం లేదు... అన్ని రూల్స్‌ పక్కన బెట్టి కేవలం విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం...ఇది తమ రాజకీయ హక్కు. చర్చ తర్వాత ప్రధానికి సమాధానం చెప్పమనండి...ఎంత సమయం తీసుకున్నా ఇబ్బంది లేదు.

లోక్ సభలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజ్జుపై ఆరోపణలు..
పెద్దనోట్ల రద్దు, కేంద్రమంత్రి కిరణ్‌ రిజ్జుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పార్లమెంట్‌ అట్టుడికింది. దీనిపై చర్చకు అనుమతించాలని విపక్షాలు ఉభయసభల్లో గందరగోళం సృష్టించాయి. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. నాలుగు రోజుల విరామం తర్వాత శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే అరుణాచల్‌ ప్రదేశ్‌ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్చ జరపాలని విపక్షాలు హంగామా చేశాయి. ప్రతిప‌క్ష పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాల‌ను స్పీక‌ర్ సుమిత్రా మహాజన్ తిర‌స్కరించారు. కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు సభలో బిల్లు ప్రవేశ‌పెట్టిన‌ప్పుడు విప‌క్ష స‌భ్యులు ఆయ‌న‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరుణాచ‌ల్ ప్రదేశ్‌లో విద్యుత్తు ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రి రిజిజు అవినీతికి పాల్పడ్డార‌ని విప‌క్షాలు ఆరోపించాయి. విపక్షాల గందరగోళం నడుమ సభ 12 గంటలకు వాయిదా పడింది.

లోక్‌స‌భ‌లో బిజెపి అగ‌స్టా వెస్ట్‌ల్యాండ్ స్కాంను ప్రస్తావన
తిరిగిస‌మావేశ‌మైన లోక్‌స‌భ‌లో బిజెపి అగ‌స్టా వెస్ట్‌ల్యాండ్ స్కాంను ప్రస్తావించారు. యూపిఏ హయాంలోనే దీనిపై విచారణ ప్రారంభమైందని, కాగ్‌ పార్లమెంట్‌కు రిపోర్టు కూడా సమర్పించిదని చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్‌ త్యాగి అరెస్ట్‌ చేయడం ద్వారా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని బ‌ర్తృహ‌రి మెహ‌తాబ్ అన్నారు. అగస్టా స్కాంపై మాట్లేడేందుకు బిజెడి సభ్యుడినిని ఎలా అనుమతించారని స్పీకర్‌ను ఖర్గే నిలదీశారు. నోట్ల రద్దుతో పాటు అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు.

ఖర్గే స్పీకర్‌ను ఛాలేంజ్‌ చేయడాన్ని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం
అధికార విపక్షాల సభ్యుల మ‌ధ్య పోటాపోటీ నినాదాలు అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ లోక్‌స‌భ‌ను గురువారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అవినీతి అంశంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అంగ వైకల్యానికి సంబంధించిన బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.అరుణాచల్‌ ప్రదేశ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలను కాంగ్రెస్‌ సభ్యులు ఆనంద్‌ శర్మ ప్రస్తావించగా డిప్యూటి ఛైర్మన్ కురియన్‌ మాట్లాడేందుకు అనుమతివ్వలేదు.

గురువారానికి సభ వాయిదా
ఈ అంశంపై విపక్షాలు పట్టు వీడక పోవడంతో సభ్యుల గందరగోళం నడుమ సభను డిప్యూటి చైర్మన్‌ గురువారానికి వాయిదా వేశారు.

21:27 - December 14, 2016

హైదరాబాద్ : ఐదు వందలకు పైబడి ప్రభుత్వ శాఖల్లో జరిపే లావాదేవీలు.. ఇక నుంచి పూర్తిగా నగదు రహితం కానున్నాయా? అన్ని ప్రభుత్వ శాఖల్లో వందశాతం క్యాష్‌లెస్‌ విధానం అమల్లోకి రానుందా? నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోనుంది? క్యాస్‌లెస్‌ విధానం పెంపుకోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సురేష్‌చందా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రభుత్వానికి చేసిన సూచనలు ఏంటి.?

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే యోచనలో తెలంగాణ సర్కార్‌
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ క్యాష్‌లెస్‌ విధానాన్ని వందశాతం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్‌ లావాదేవీలపై ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సురేష్‌ చందా ఆధ్వర్యంలో టాస్కఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వానికి నిర్ధిష్ట సూచనలు చేసిన సురేష్‌చందా కమిటీ
పలు సంస్థలు, నిపుణులతో సురేష్‌ చందా కమిటీ సమావేశమైనంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. మొత్తానికి క్యాష్‌లెస్‌ విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి కొన్ని నిర్ధిష్ట సూచనలు చేసింది. ప్రభుత్వం చెల్లించే లేదా స్వీకరించే లావాదేవీలేవైనా 500 రూపాయలకంటే ఎక్కువైతే... పూర్తిగా నగదు రహితంగా జరగాలని తన నివేదికలో స్పష్టం చేసింది. తొలుత పెద్దమొత్తంలో లావాదేవీలను డిజిటల్‌ చెల్లింపు ద్వారా నగదు రహితం చేయాలని పేర్కొంది. ప్రభుత్వ శాఖల లావాదేవీలను 80శాతంపైగా నగదు రహితం చేయాలని సూచించింది. 5వేలకంటే తక్కువకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే కార్యకలాపాలపై లావాదేవీల రుసుమును ప్రభుత్వ శాఖలే భరించాలని స్పష్టం చేసింది. ఇక పీఓఎస్‌, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, నెట్‌ బ్యాంకింగ్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ, ఈవ్యాలెట్‌ ద్వారా చెల్లించే సౌకర్యాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నివేదికలో కోరింది.

ప్రైవేట్‌లో 60శాతానికిపైగా లావాదేవీలు నగదు రహితం చేయాలన్న కమిటీ
ఇక ప్రైవేట్‌ విభాగంలో అయితే.. 60శాతానికిపైగా లావాదేవీలను నగదు రహితం చేయాలని సురేష్‌చందా కమిటీ సూచించింది. చిన్నమొత్తంలో జరిగే లావాదేవీలకు నగదు రూపంలో అనుమతిచ్చి, పెద్దమొత్తంలో జరిగే లావాదేవీలను నగదు రహితంగా మార్చాలని నివేదికలో పేర్కొంది. వెయ్యి రూపాయలకు మించి వ్యాపార సంస్థల మధ్య జరిగే లావాదేవీలు, ఐదువేలకు మించి వినియోగదారుడికి -వ్యాపార సంస్థకు జరిగే ప్రతి లావాదేవీ నగదు రహితంగా ఉండాలని సూచించింది. చౌక ధరల దుకాణాల్లో ప్రజలు పీఓఎస్‌ , ఈ వ్యాలెట్‌ ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పించాలంది. ఇక మార్కెట్‌ యార్డుల్లో నగదురహిత పద్ధతిలోనే చెల్లింపులు జరపాలని స్పష్టం చేసింది. ఆస్పత్రులు, రవాణా వ్యవస్థలు, విద్యాసంస్థలు, వ్యాపారులు కూడా నగదురహిత చెల్లింపులకు అవకాశం కల్పించాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలో ఒక్కరికైనా రూపే డెబిట్‌ కార్డు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

21:17 - December 14, 2016

50రోజుల దిశగా దేశం పరిగెడుతోంది. ఇప్పటికి 35 రోజులు దాటాయి.. కానీ, ఫలితం ఏంటి? పరిస్థితి మరింత విషమిస్తోంది. క్యూలో నిలబడ్డ దేశం నిరాశగా చూస్తోంది. కరెన్సీ సర్జికల్ స్ట్రైక్స్ తో కూలిన బతుకులు అడుగడుగునా కనిపిస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేక ఎలా బతకాలో తెలియక అల్లకల్లోలమవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు..? ఈ దుస్థితి మారేదెపుడు? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. సర్కారుదేముంది ఓ ప్రయోగం చేసింది. రెండ్రోజుల్లో సర్దుకుంటుందని చెప్పింది. కానీ, నెలదాటినా మార్పులేదు. అసలెన్ని నెలలకు ఈ పరిస్థితి మారుతుందో తెలియక సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ ఇంకా ఎన్నాళ్లు తిరగాలా అని విలపిస్తుంటున్నాడు? నల్లధనం అన్నారు.. నకిలీ నోట్లన్నారు.. నాలుగు రోజులే అన్నారు. ఆఖరికి క్యాష్ లెస్ గా మారాల్సిందే అంటున్నారు. కానీ, బ్యాంకులు లేవు.. ఆన్ లైన్ పరిజ్ఞానం లేదు. చేతిలో పైసా లేదు. కనీస అవసరాలకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ప్రజలున్నారిపుడు. మరి ఇప్పుడు సాధించేదిమిటి? దేశానికి ఎలాంటి మేలు జరిగింది? వెనక్కి తీసుకున్న కరెన్సీ కొండంత.. రిలీజ్ చేసింది నలుసంత.. అక్రమార్కులతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కైన సందర్భాలు కనిపిస్తున్నాయి.మరో పక్క కమీషన్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. పాత నోట్లు మార్చటానికి కమీషన్.. కార్డు స్వైప్ చేస్తే కమీషన్.. ఇవన్నీ అడుగడుగునా.. సామాన్యుడిని నానాఇబ్బందులకు లోను చేస్తున్నాయి. అంతా మీ మంచికే అన్నారు. హామీలు ఇచ్చారు. కానీ జరుగుతున్నది శూన్యం.. రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు..రెండు వారాలన్నారు..యాభై రోజులంటున్నారు.. ఎంత కాలం? ఎన్నాళ్లకు పరిస్థితి మారుతుంది? ప్రభుత్వమే సృష్టించిన కరెన్సీ కొరత ఇప్పుడు దేశాన్ని ఏ పరిస్థితిలోకి తీసుకెళ్లనుంది? అంతా మీమంచికే అంటారు..హామీలు చాలా ఇస్తారు.. బ్యాంకుల్లో క్యాష్ రెడీ అవుతోంది అంటారు.. ఏటీఎంలు సిద్ధం చేస్తున్నామంటారు.. అన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో జరుగుతున్నది శూన్యం.. ఒకటి రెండు రోజులు కాదు.. 35 రోజుల వ్యధ ఇది. మరెన్ని రోజులు భరించాలో తెలియని బాధ ఇది. ఎందుకీ ఖర్మ అని ప్రశ్నలు.. తమ సొమ్ము తాము తీసుకోలేని పరిస్థితిలో, క్యాష్ లెస్ దిశగా సిద్ధంగా లేని సామాన్యులు సర్కారుకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ పక్క అక్రమార్కుల చేతిలో కొత్త నోట్ల కట్టలు, కమీషన్ దందాలు అడుగడుగునా కనిపిస్తుంటే ఈ డీమానిటైజేషన్ దేశాన్ని ఇంకెన్ని సమస్యల్లోకి నెట్టనుందో అనే ఆందోళన వ్యక్తమౌతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

21:00 - December 14, 2016

ప్రధాని మోదీ పాత పెద్దనోట్లు రద్దు చేసిన 36 రోజులు గడిచిపోయాయి. మోదీ పెట్టిన గడువుకు ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలివుంది. నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీ సరిగ్గా 50 రోజుల్లో కష్టాలన్నీ తీరిపోతాయనీ.. ప్రజలు అద్భుతాన్ని చూస్తారనీ..నల్లధనం లేని సమాజాన్ని చూస్తారనీ..దేశ ఆర్థిక రంగం ఉరుకులు పెడుతుందనీ ప్రధాని మోదీ నుంచి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుండి అందరూ చెబుతున్న మాటలు.. వారు చెప్పిన గడువు చూసుకుంటే ఇంకా పదిహేను రోజులే ఉంది.. పది హేను రోజుల తర్వాత అద్భుతాలు జరగబోతున్నాయా.. అందరూ క్యాష్ లెస్ వైపు పరుగులు తీస్తారా.. అనే అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఈ చర్చలో గఫూర్ (సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ) ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) ఇందిర (కాంగ్రెస్ నేత) జీ.ఎస్.రాంబాబు ( ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి) పాల్గొన్నారు. మరి వక్తలు ఎటువంటి అభిప్రాయాన్ని వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

20:51 - December 14, 2016

50 రోజుల్లో కష్టాలన్నీ తీరిపోతాయి... ఇక ప్రజలు అద్భుతం చూస్తారు.. దేశ ఆర్థిక రంగం ఉరుకులు పెడుతుంది.. ఇవీ ప్రధాని మోదీ నుంచి అందరూ చెబుతున్న మాటలు.. వారు చెప్పిన గడువు చూసుకుంటే ఇంకా పదిహేను రోజులే ఉంది.. పది హేను రోజుల తర్వాత అద్భుతాలు జరగబోతున్నాయా.. అందరూ క్యాష్ లెస్ వైపు పరుగులు తీస్తారా..

50 రోజులు ఓపిక పట్టమన్న ప్రధాని మోదీ
మొదట్లో కష్టాలుంటాయి.. ఆ తర్వాత అంతా పూలపాన్పే. 50 రోజులు ఓపిక పట్టండి.. నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీ నుంచి అరుణ్ జైట్లీ దాకా.. బీజేపీ నేతల నుంచి బిజెపిను సమర్థించే ఎన్డీఏ పెద్దలు ఒకటే ఏకరవు పెడుతున్న ప్రకటన ఇది. నేటికీ ఆ గడువులో 36 రోజులు అయిపోయాయి. ఇంకా మిగిలింది పదిహేను రోజులే... కష్టాలు క్రమంగా తగ్గుతాయన్నారు.. కానీ రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి తప్పా తగ్గడం లేదు. మనకున్న కొత్త నోట్ల సామర్థ్యం పరిధి మేరకే బ్యాంకులకు కొత్త నోట్లు వస్తున్నాయి.. అందుకే బ్యాంకుల్లో నోట్ల కొరత అంటూ చెబుతూ వచ్చారు. కానీ జరుగుతుందేంటీ.. అక్రమార్కుల ఇళ్లల్లో కొత్త నోట్ల కట్టలు కట్లపాముల్లా దొర్లుతున్నాయి.. సామాన్యుడు మాత్రం నాలుగు వేలు , రెండు వేల కోసం బ్యాంకులు, ఏటీఎంల చూట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలా చోట్ల నోట్ల కొరత మరికొన్ని చోట్ల బ్యాంకులు, ఏటీఎంలు మూత.. ఇది 36 రోజుల నుంచి కనిపిస్తోంది.. మరి రానున్న పది హేను రోజుల్లో పరిస్థితి మారిపోతుందా...

క్యాష్ లెస్ లావాదేవీలవైపు అడుగులు
మరో వైపు క్యాష్ లెస్ లావాదేవీలపై అందరూ దృష్టి పెట్టాల్సిందే అంటూ కొన్ని రాయితీలు, బంపర్ డ్రాలు ప్రకటిస్తోంది కేంద్రం. మనకున్న సామర్థ్యం, మౌళిక వసతులు, 75 శాతం వరకు ఉన్న గ్రామీణ భారతం నేపథ్యంలో ఇది సాధ్యమేనా.. ముందస్తు ఏర్పాట్లు లేకుండా దీన్ని అందుకోగలమా అసలు నగదు రహిత భారతం ఎంత వరకు సాధ్యం. పెద్ద నోట్ల రద్దు గ్రామీణ ప్రజలకు, రైతులకు, చిరు వ్యాపారులకు పెద్ద చిక్కులే తెచ్చిపెడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 68.84 శాతం ప్రజలు 6,40,867 గ్రామాల్లో జీవిస్తున్నారు. వీరిలో కేవలం 15.62 కోట్ల మందికి జన్‌ధన్‌ ఖాతాలున్నాయి. సుమారుగా 40 వేల గ్రామాల్లో మాత్రమే బ్యాంకులున్నాయి. అంటే...సగటున 16 గ్రామాలకు ఒకటే బ్యాంకు దిక్కు. ఈ గ్రామాల్లో వున్న మొత్తం జనాభా 83.31 కోట్లు. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కొక్క బ్యాంకు సుమారుగా 20 వేల మందికి సేవలు అందించాల్సి వుంది. బ్యాంకు ఖాతాలు, బ్యాంకుల అందుబాటే ఇంత అనామకంగా వుంటే... ఇంక నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా అన్నది జవాబు లేని ప్రశ్న.

95 శాతం నగదు రూపంలోనే నడుస్తున్న దేశ ఆర్థిక లావాదేవీలు
మన దేశ ఆర్థిక లావాదేవేల్లో 95 శాతం నగదు రూపంలోనే నడుస్తోంది. కేవలం 5 శాతం మాత్రమే కార్డుల ద్వారా జరుగుతోంది. చాలా మందికి కార్డులు లేకపోవడం, గతం నుంచి డబ్బే వాడుకలో వుండడం ప్రధాన కారణం. దాంతో పెద్ద, చిన్న నగదు బదిలీలన్నీ క్యాష్‌ ద్వారానే నడుస్తుంటాయి. దేశంలో చెలామణిలో వున్న కరెన్సీ నోట్ల సంఖ్య ఏటా 8000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వాటిలో 85శాతం నోట్లు చలామణీలో లేకుండా పోయాయి. ఈ పరిస్థితి పది హేను రోజుల్లో మారిపోతుందా...

36 రోజులుగా అయోమంగా మారిన ప్రజల పరిస్థితి
గత 36 రోజులుగా ప్రజల పరిస్థితి అత్యంత అయోమయంగా మారింది. పొద్దున్నే పాల ప్యాకెట్‌ మొదలుకొని ఉప్పు, పప్పు, కూరగాయలు... ఇలా ఏం కొందామన్నా పైసలు లేకపోవడంతో ఊపిరాడని పరిస్థితి. కూరగాయలు, పళ్లు అమ్ముకునే వారి నుంచి చిన్న చిన్న దుకాణాదారుల వరకు బేరాల్లేక ఖాళీగా ఉంటున్నారు. తమ కింద పని చేసేవారికి ఇచ్చేందుకు కూలీ లేక కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు. ఇక గింజలు మొదలుకొని ఎరువుల వరకు జేబు డబ్బుతో కొనుగోలు చేసే రైతులు బేజారవుతున్నారు. తోపుడు బళ్లు, రోడ్‌సైడ్‌ టిఫిన్‌ సెంటర్లు నడుపుకునే వారిదీ ఇదే గోడు. ఇప్పుడే ఇలా వుంటే రేపు వీరు డబ్బు రూపంలో కాకుండా కార్డు ద్వారా చెల్లించగలరా? కొనగలరా?

90 శాతం అసంఘటిత రంగానికి చెందిన కార్మికులే
ఇక అసంఘటిత రంగం పరిస్థితి మరింత ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తం కార్మికశక్తిలో 10 శాతం మాత్రమే సంఘటిత రంగంలో వున్నారు. 90 శాతం అసంఘటిత రంగానికి చెందినవారే. వీధుల్లో బళ్ల మీద వ్యాపారం చేసేవారు, ఎలక్ట్రిక్‌ పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, రంగులు వేసేవారు, రైతులు ... వీరందరి లావాదేవీలన్నీ డబ్బు రూపంలోనే జరుగుతాయి. ఏది కొన్నా నగదు రూపేణా వుంటుంది. వారికి అందే కూలి సైతం అంతే. వీరికి చెక్కుల రూపంలోనో, ఆన్‌లైన్లోనో డబ్బు ఇచ్చే అవకాశాలెంత?

దేశంలో 70 కోట్లు డెబిట్‌ కార్డులు, 2.5 కోట్ల క్రెడిట్‌ కార్డులు
దేశంలో 70 కోట్లు డెబిట్‌ కార్డులు, 2.5 కోట్ల క్రెడిట్‌ కార్డులున్నాయి. ఇంటర్నెట్‌ సౌకర్యం లేనివారు 95 కోట్లుంటే, స్మార్ట్‌ఫోన్లు వున్నవారు -23కోట్లమంది ఉన్నారు. అసలు కరెంటు సౌకర్యమే లేనివారు దేశ జానాభాలో 19శాతం ఉన్నారు. మరి ఈ గణాంకాల ప్రకారం చూస్తే క్యాష్ లెస్ భారతం ఎప్పటికి సాధ్యమౌతుంది? మరోపక్కన స్వైపింగ్ మెషిన్ల సమస్య అలాగే ఉంది. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ స్వైపింగ్‌ మిషన్లు వున్న దేశం భారత్‌. ఎందుకంటే ఒక్కో మిషన్‌ పెట్టడానికి 4 నుంచి 8 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 10 లక్షల మందికి 690 విక్రయ కేంద్ర టెర్మినళ్లు వున్నాయి. వీటిలో అత్యధికం 70 శాతం దేశంలోని 14-15 నగరాలలోనే వున్నాయి. 75 శాతం నగదు రహిత లావాదేవీలు ఈ 15 నగరాలలోనే నడుస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం క్యాష్ లెస్ గా ఎప్పటికి మారుతుందో సర్కారుకు అంచనాలున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరో 15 రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దోరుకుతాయా?
బ్లాక్ మనీ బయటకు రావాలి.. మంచి విషయమే.. నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడాలి. ఇదీ మంచి విషయమే. కానీ, ఈ లక్ష్యం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలనిస్తున్నాయి? దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నాయి? ఏటీఎంలనే పూర్తిగా ఉపయోగించటం అలవాటు కాని ప్రజలను పూర్తిగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల వైపు నెట్టడం సాధ్యమేనా? మరో పది హేను రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దోరికిపోతాయా... లెట్ అజ్ వెయిట్ అండ్ సీ

 

20:45 - December 14, 2016

మా నియోజక వర్గ ఎమ్మెల్యే అంజిబాబును మేము కూలిపనికి పెట్టుకున్నామనీ..కానీ అతను ఎమ్మెల్యే అంటే హోదా అనుకుంటున్నాడని ఓ సాధారణ గృహిణి..ఇంట్లోంచి బైటకు కాలుపెట్టని ఓఅతి సాధారణ గృహిణి పేర్కొంది.  ఇది ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో ప్రభుత్వం నిర్మించబోయే ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిత ప్రాంతంలో మల్లన్న ముచ్చటించాడు. ఆ ప్రాంత బాధిత మహిళలతో మన మల్లన్న  ముచ్చటించాడు. మరి ఆ ప్రాంత మహిళలు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం.. మా నియోజకవర్గ ఎమ్మెల్యే అంజిబాబుని ఓట్లు వేసి గెలిపించి మా ప్రాణాలమీదికి తెచ్చుకున్నామని ఆక్వా ఫ్యాక్టరీ ప్రాంత మహిళలు పేర్కొంటున్నారు. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ పెట్టి మా పిల్లలు మాకు కూలిపని పని కల్పిస్తామని మా ఎమ్మెల్యే..చంద్రబాబు అంటున్నారనీ..ఈ ఫ్యాక్టరీలో పనిచేసే దుస్థితిలో తమ పిల్లలు లేరని ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులు చేస్తున్నారని ఆ ప్రాంత మహిళలు తెలిపారు. మాకు కూలిపని అంటే సేవ చేసేందుకు అంజిబాబు ఓట్లు వేసి గెలిపిస్తే మాకే కూలిపని కల్పిస్తామని అంజిబాబు అంటున్నాడనీ..అవసరమైతే ఎమ్మెల్యే అంజిబాబుకు తాము కూలిపని కల్పించే స్థాయిలో మా ప్రాంత ప్రజలు వున్నారని ఓ ధీర వనిత ధీమా వ్యక్తం చేసింది. పోలీసులు రక్షక భటు కాదనీ..తమను హింసించే భక్షక బటులని ఆమె పేర్కొన్నారు. మరి మాటల తూటాలు పేలుస్తున్న ధీర వనితల పోరాట పటిమ కోసం చూడండి మల్లన్న ముచ్చట్లు..

ఎగ్జిబిషన్ లో పేలుడు..

విశాఖ : ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలోని సాయిగణపతి పాలిటెక్నిక్‌ కళాశాలలో పేలుడు సంభవించింది. మూడు రోజులుగా సాయిగణపతి పాలిటెక్నిక్‌ కళాశాలలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో జల విద్యుత్‌ కేంద్ర నమూనాలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

జీపుబోల్తా పడి 12మందికి గాయాలు..

గుంటూరు : గొల్లపల్లి మండలం బండ్లమోట వద్ద జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 12మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

వీపీ సింధు మరో విజయం..

దుబాయ్  :  ప్రపంచ సూపర్ సీరీస్ ఫైనల్స్ తొలిరౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. తొలిరౌండ్‌లో జపాన్ షట్లర్ యమగూచిపై సింధు గెలుపొందింది. యమగుచిపై పీవీ సింధు 21-12, 8-21, 15-21 తేడాతో నెగ్గింది.

19:48 - December 14, 2016

గుంటూరు : జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్‌.. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. రాబోయే 25 ఏళ్లు కూడా టీడీపీనే అధికారంలో ఉంటుందన్నారు. ప్రతి విషయాన్ని విమర్శిస్తున్న జగన్‌.. తిమ్మాపురం వచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. 

19:45 - December 14, 2016

విశాఖ : నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే ప్రకటనలు చేస్తున్నా...... విశాఖలోని ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లకు అవి చెవికెక్కడం లేదు. నగదు ఇస్తేనే వైద్య పరీక్షలు చేస్తామంటూ తెగేసి చెప్తున్నాయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులున్నాయని రోగులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ప్రాణాపాయ స్థితిలో వస్తున్న రోగులకు... వైద్యపరీక్షలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి

విశాఖకు పెద్ద సంఖ్యలో రోగులు
విశాఖ నగరానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వైద్యం కోసం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కేజీహెచ్‌, అపోలో, కేర్‌లాంటి పేరున్న ఆస్పత్రులు అందుబాటులో ఉండడంతో అంతా ఇక్కడికే వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలైతే వైద్యం కోసం విశాఖకే ప్రయాణమవుతారు. అంతేకాదు... ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఒడిషా నుంచి కూడా రోగులు వస్తుంటారు.

విశాఖలో ఇబ్బడి ముబ్బడిగా వెలసిన డయాగ్నస్టిక్‌ సెంటర్లు
విశాఖకు రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో అక్కడ ఎన్నో ఆస్పత్రులు వెలిశాయి. వైద్య పరీక్షల కోసమంటూ ఇబ్బడి ముబ్బడిగా డయాగ్నస్టిక్‌ సెంటర్లూ పుట్టుకొచ్చాయి. అవసరం ఉన్నా లేకపోయినా రోగులకు మెడికల్ టెస్టులు చేస్తూ నిలువునా దోచుకుంటున్నాయి.

వైద్యరంగంలో స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్న కేంద్రం
పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులు పడుతున్న ఇబ్బందులైతే అన్నీఇన్నీ కావు. బ్యాంకులు, ఏటీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిలో కొందరికి నగదు దొరికితే మరికొందరికి అదీకూడా లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కోరుతోంది. ప్రత్యేకంగా వైద్యరంగంలో దీన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించింది. నగదులేక రోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి ఆస్పత్రి స్వైపింగ్‌ మిషన్లను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వాల ఆదేశాలు పాటించని డాల్ఫిన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌
క్యాష్‌లెస్‌ విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతోంటే విశాఖ కేజీహెచ్‌ సమీపంలోని డాల్ఫిన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు ఏమాత్రం పట్టడం లేదు. శ్రీకాకుళం నుంచి వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులపై నగదు కట్టాలని ఒత్తిడి తీసుకొచ్చింది. లేదంటే టెస్ట్‌లు చేయబోమని తెగేసి చెప్పింది. తమ దగ్గర క్రెడిట్‌, డెబిట్‌ కార్డులున్నాయని రోగులు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. తమ దగ్గర స్వైపింగ్‌ మిషన్లు లేవని నగదే కట్టాలని తేల్చిచెప్పడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరి ఈ కష్టాలకు అంతం ఎప్పుడో... వేచి చూడాల్సిందే...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాష్‌లెస్‌ విధానాన్ని పోత్సహించాలని ఒకవైపు ప్రయత్నిస్తోంటే... మరోవైపు డాల్ఫిన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ లాంటివి వాటిని పట్టించుకోవడమే లేదు. దీంతో సామాన్యుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. మరి ఈ కష్టాలకు అంతం ఎప్పుడో... వేచి చూడాల్సిందే.

19:42 - December 14, 2016

పశ్చిమగోదావరి : నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన రోజా.. నకిలీ నోట్లు,.. నల్లధనాన్ని వెలికితీస్తానని పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పబ్లిసిటీ కోసం మోదీ నోట్లను రద్దు చేశారని.. పెద్దలకు రెడ్‌ కార్పెట్‌ వేసి.. పేదలకు కష్టాలను మిగిల్చారన్నారు రోజా. 

ఆరు కిలోల మందు పాతర స్వాధీనం..

ఛత్తీస్‌గఢ్‌ : భద్రతా బలగాలను అంతమొందించేందుకు నక్సలైట్లు పన్నిన కుట్రను భద్రతా బలగాలు గుట్టు రట్టు చేశాయి. పోలీసు వాహనాలను పేల్చేందుకు అమర్చిన 6 కిలోల మందుపాతరను భద్రతా బలగాలు వెలికితీశాయి. సీఆర్పీఎఫ్ బలగాలు ఈ బాంబును నిర్వీర్యం చేయటంతో పెను ప్రమాదం తప్పింది. 

19:25 - December 14, 2016

విజయవాడ : నోట్ల రద్దుపై ఏపీ బీజేపీ నేత..ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పందించారు. గత 36 రోజులుగా ప్రజలు నగదు కోసం నానా అగచాట్లు పడుతూ..సామాన్యులు సహనం కోల్పోతున్నారనీ..అలాగే తాను కూడా నగదు విషయంలో సహనం కోల్పోయానని బీజేపీ నేత..ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆయన తెలిపారు. నోట్ల రద్దుపై బీజేపీ నేత..ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పందించారు. పాత పెద్దనోట్ల రుద్ద చేసిన ప్రధాని మోదీ నిర్ణయం సరైందే కానీ అమలులో లోపం వుందని ఆయన పేర్కొన్నారు. 

19:17 - December 14, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దేందుకు బల్దీయా వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. డంపింగ్‌ యార్డ్‌ల వద్ద ముగ్గులు వేసి వినూత్న ప్రచారం చేసినా.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి...గృహిణులకు బొట్టు పెట్టి వీధుల్లో చెత్త వేయవద్దని చెబుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఓపెన్‌ డంప్‌లను తొలగించేందుకు.. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణను బల్దియా తప్పనిసరి చేస్తుంది. ఇందులో భాగంగా బయట చెత్త వేయవద్దని..ఇళ్లకు వచ్చే రిక్షా కార్మికులకు చెత్త ఇవ్వాలని ప్రచారం చేస్తోంది. 

19:14 - December 14, 2016

నాగర్‌కర్నూల్‌ : కల్వకుర్తిలోని సీబీఎమ్‌ ప్రజా వైద్య శాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.. ఓ వృద్ధురాలి కడుపులోంచి దాదాపుగా ఐదు కిలోల కణితిని తొలగించి.. ఆమె ప్రాణాలను నిలబెట్టారు.

4 కిలోల 750 గ్రాముల కణితి తొలగింపు
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని విద్యానగర్‌కు చెందిన 73 ఏళ్ల లింగమ్మ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పితో పాటు కడుపు కూడా ఉబ్బడంతో స్థానికంగా ఉన్న సీబీఎం ప్రజావైద్యశాలలో పరీక్ష చేయించుకుంది. సంబంధిత పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు లింగమ్మ కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించారు. దీంతో మంగళవారం ఉదయం శస్త్రచికిత్స చేసి లింగమ్మ కడుపులోంచి 4 కిలోల 750 గ్రాముల బరువున్న కణితిని.. ఎడమ భాగంలోఉన్న మరో చిన్న కణితిని తొలగించారు.

మహిళల్లోనే ఇలాంటి సమస్యలు వస్తాయి : డాక్టర్‌ వంశీకృష్ణ
లింగమ్మకు తలెత్తిన సమస్యను మల్టీ లాక్‌లేటెడ్‌ ఒబేరియన్‌ షిప్ట్‌ అంటారని శస్త్రచికిత్స నిర్వహించిన సీబీఎం ప్రజావైద్యశాల వైద్యులు వంశీకృష్ణ చెప్పారు. ముఖ్యంగా మహిళల్లోనే ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. కణితిని బయాప్పీకి పంపి.. ఆ ఫలితాల ఆధారంగా తదుపరి లింగమ్మకు చికిత్స అందిస్తామని, ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సను నిర్వహించి ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ వంశృకృష్ణకు.. లింగమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

19:09 - December 14, 2016

నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఖరీదైన వైద్యాన్ని, ఉచితంగా నాణ్యంగా అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ఉస్మానియా, గాంధీ తరహాలో అన్ని రకాల వైద్యసేవలు పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు నిజామాబాద్‌ జిల్లా దవాఖానకు ఈ ఆస్పత్రి హోదా కల్పించింది. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తూనే డాక్టర్లు విధుల్లో అలసత్వం వహించకుండా నిరంతర పర్యవేక్షణతో చెక్‌ పెట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఈ ఆసుపత్రిగా జిల్లా ఆసుపత్రి
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద ఆసుపత్రిగా ఉన్న జిల్లా ఆసుపత్రిని ఈ ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ- ఆస్పత్రి విధానం అమలులోకి రావడంతో జిల్లా దవాఖాన తీరు మారనుంది. హైదరాబాద్ కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా జిల్లా ఆస్పత్రి మారుతుంది. సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే జిల్లా దవాఖానకు అధునాతన భవన సముదాయంతో పాటు నిష్ణాతులైన వైద్యులు పూర్తిస్థాయిలో ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి ఈ ఆస్పత్రి హోదా
ఈ ఆస్పత్రి విధానంతో అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. ఒక్కసారి రోగి పేరు ఇతర వివరాలు రిజిస్ర్టేషన్ చేసుకున్న తర్వాత అన్ని విభాగాలు ఆ సమాచారాన్ని వీక్షించే వీలుంటుంది. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచే వీక్షించే సదుపాయం ఉంటుంది. ఈ ఆసుపత్రి సేవల్లో మొదటి దశలో భాగంగా ఇన్ పేషంట్‌, ఔట్‌ పేషంట్‌ విభాగాలతో ప్రారంబించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. రోగి కేష్‌ షీట్‌ వివరాలు, వైద్యులు రాసిచ్చిన మందులు, రోగికి చేయాల్సిన పరీక్షలు తదితర వివరాలు నమోదు చేస్తారు.

రోగి వివరాలు ఒకసారి నమోదు చేస్తే చాలు..అన్ని విభాగాలకు రోగి వివరాలు
తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈఎన్టీ ఆసుపత్రి, సరోజిని దేవి ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి, వరంగల్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ హాస్పటల్‌ సేవలు అందుతున్నాయి. ఈ జాబితాలోకి కొత్తగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి చేరింది. ఈ విధానం అమలు చేయటం వలన పారదర్శకతతో పాటు ఆస్పత్రుల్లో జరిగే అక్రమాలకు చెక్‌పెట్టొచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు.

ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈఎన్టీ, సరోజిని దేవి ఆసుపత్రి
ఇకపై సీరియస్ కేసులను హైదరాబాద్ తరలించే అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే వైద్య సేవలు అందించే వీలుంటుంది. నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిని ఈ ఆస్పత్రిగా మార్చడం పట్ల జిల్లావాసులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 

18:59 - December 14, 2016

ఆదిలాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన గిరిజనులతో తమ్మినేని పాదయాత్ర బృందం స్టెప్పులేశారు. గిరిజనుల సాంప్రదాయ నెమలి కిరీటం ధరించి.. గిరిజనులతో గుస్సాడీ నృత్యం వేశారు తమ్మినేని బృందం.తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 60వ రోజు కొనసాగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశించిన తమ్మినేని బృందానికి గిరిజనులు.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తమ్మినేని బృందాన్ని వికలాంగులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు తమ్మినేని. 

18:56 - December 14, 2016

హైదరాబాద్‌ : జరుగుతున్న వరుస భవన ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఒకవైపు నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతుండగా... మరోవైపు పురాతన బిల్డింగ్‌లూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన బల్దియా అధికారులు తగు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో హైదరాబాదీయులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

హైదరాబాద్‌లో కుప్పకూలుతున్న పురాతన భవనాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. దేశంలోని వివిధ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌కు పలు సౌకర్యాలు అదనంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ పదేపదే చెప్తోంది. హబ్‌లు, స్కైవేలంటూ ఊదరగొడుతోంది. ఒకవైపు ప్రభుత్వం విశ్వనగరి కోసం ప్రణాళికలు రచిస్తోంటే మరోవైపు కుప్పకూలుతున్న భవనాలు హైదరాబాద్‌ను కలవరపెడుతున్నాయి.

నిర్మాణంలో ఉండగానే కుప్పకూలుతున్న బిల్డింగ్‌లు
నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలుతున్న ఘటనలు హైదరాబాద్‌లో అనేకం. మొన్న పాతబస్తీ, నిన్న ఫిలింసిటీ, నేడు నానక్‌రామ్‌గూడ. నిర్మాణంలో భవనాలకు తోడు పురాతన భవనాలు సైతం పేకమేడలా కూలుతూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్మికులు చనిపోగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయాలపాలవుతున్నారు.

సిటిలైట్‌ దుర్ఘనతో వెలుగులోకి పురాతన భవన ప్రమాదాలు
రెండేళ్ల క్రితం కూలిన సిటిలైట్‌ హోటల్‌ దుర్ఘనతో గ్రేటర్‌లో పాతభవనాల ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి పురాతన భవనాలు కూలుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. సోమవారం సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ సెంటర్‌లోని చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ రెలింగ్‌ కూలి ఒకరు చనిపోయారు. దాదాపు 40ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం క్రాక్స్‌ మూలంగానే రెలింగ్‌ పడిపోయినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్దారించారు. దీంతో దానిని సీజ్‌ చేశారు. జేఎన్టీయూ నిపుణుల బృందం ఆ భవనాన్ని పరిశీలించి టాప్‌పై నీరు మళ్లడం వల్లే నిర్మాణ సామర్ధ్యం తగ్గి కూలిపోయిందని గుర్తించింది. మెయింటెన్స్‌ కూడా సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు.

హైదరాబాద్‌లో వందల సంఖ్యలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు
ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో వందల సంఖ్యలో కమర్షియల్‌ భవనాలు ఉన్నాయి. ముఖ్యంగా 1970 నుంచి నగరంలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ మొదలైంది. అప్పటి నుంచి ముఖ్యంగా మార్కెట్‌ ప్రాంతాలైన సికింద్రాబాద్‌, బేగంబజార్‌, మోజాంజాహీమార్కెట్‌, కింగ్‌కోఠి, కోఠి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో కమర్షియల్‌ నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు 30 నుంచి 35 ఏళ్లకు పైబడినవే ఎక్కువ. ఈభవనాల్లో వివిధ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు ఉంటాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ రెలింగ్‌ పడిపోవడంతో ఎట్టకేలకు బల్దియా అధికారులు మేల్కొన్నారు. కమర్షియల్‌ కాంప్లెక్స్‌ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిసైడ్‌ అయ్యారు.పురాతన భవనాల మెయింటనెన్స్‌ కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్‌ రూపొందించే పనిలో పడింది బల్దియా. అంతేకాదు.. పురాతన భవనాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరించాలని యోచిస్తోంది. పురాతన భవనాల ప్రమాదాలను నివారించేందుకు జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాల్సిందే..

18:46 - December 14, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సామాన్యుని సాధారణ కష్టాలకు....ఇప్పుడు కరెన్సీ కష్టాలు తోడయ్యాయి. 36 రోజులు గడుస్తున్నా ఇక్కట్లు తీరకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం.

నెల దాటినా తీరని చిల్లర కష్టాలు
వారం రోజులు..పదిరోజులు..నెలరోజులు...ఇలా రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజులే కదా అని సహనం వహించారు. నెలరోజులు గడుస్తున్నా చిల్లర కష్టాలు తీరకపోవడంతపై సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నల్లధనం నిరోధించేదుకు సహకరిస్తుంటే...ఉన్న ధనాన్నే అవసరానికి లేకుండా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు కూలీలు పనికి వెళ్లలేక...ఇటు ఉద్యోగులు ఆఫీసులకు పోలేక.. క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ డబ్బు తాము తీసుకోవడానికే గంటల తరబడి పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడింది.

బడాబాబుల కోసమే నోట్ల రద్దంటున్న సామాన్యులు
నల్లకుబేరులని బయటకు తీసుకొస్తామన్న మోదీ...దాన్ని ఎంతవరకూ అమలు చేస్తున్నారంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల మందు పేద, మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఒక్క కుబేరుడు కూడా కనిపించడం లేదంటూ మండిపడుతున్నారు. ఇదంతా బడాబాబుల మంచి కోసమే తప్ప..సామాన్యుల బాగుకోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వేలకు చిల్లర ఎక్కడ నుంచి తీసుకు రావాలి
పెద్దనోట్ల రద్దుతో తాము నానా అవస్థలు పడాల్సి వస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంట తరబడి వేచి చూసి బ్యాంకుల ముందు నిలబడితే రెండు వేల రూపాయల నోటే వస్తోందని చెబుతున్నారు. ఐదు వందల రూపాయలకే చిల్లర కరువై చస్తుంటే..రెండు వేలకు చిల్లర ఎక్కడ నుంచి తీసుకు రావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా డబ్బు మాకివ్వటానికి ఇవ్వడానికి ఇన్ని కష్టాలు పెట్టాలా?
బ్యాంకుల్లో దాచుకున్న తమ డబ్బులను తాము తీసుకోవడానికి ఇన్ని అడ్డులేంటంటూ సామాన్యులు మండిపడుతున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న తమ పిల్లల్ని బాగుచేసుకుందామంటే చిల్లర లేదంటూ ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపుతున్నారని..తీరా బ్యాంకులకు వస్తే 'నోక్యాష్' అంటూ బోర్డులు పెడుతున్నారని చెబుతున్నారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవని చెబుతున్న అధికారులు....కోట్ల రూపాయల కొత్త నోట్లతో దొరుకుదున్న నల్ల కుబేరులకు ఆ నోట్లు ఎలా వచ్చేయో చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

నగదు కష్టాలు తీరాలంటే క్యాష్ లెస్ విధానమే నంటున్న బ్యాంక్ సిబ్బంది
మరోవైపు బ్యాంకు అధికారుల మాత్రం తమకు అందుబాటులో ఉన్న నగదును మాత్రమే అందిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న నగదును ప్రజలకు ఇవ్వడానికే ప్రయత్నిస్తామని...అసలు బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోతే తామేమి చెయ్యలేమని చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజల్లో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అంటున్నారు.

తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తప్పదంటూ హెచ్చరికలు
ఇన్నాళ్లు సహనంతో ఉన్నామని ... 36 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నోట్ల విషయంలో ప్రత్యామ్నాయం చూపడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. 

జగన్ కు సవాల్ విసిరిన లోకేష్...

గుంటూరు : వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని... టైమ్, ప్లేస్ డిసైడ్ చేసుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి జగన్ కు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. సాక్షి పత్రికకు, జగన్ కు అభివృద్ధి ఎంతమాత్రం కనపడదని అన్నారు. తెలంగాణలో ఉంటూ విమర్శలు చేయడం మానుకోవాలని... ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి, అభివృద్ధిని చూడాలని చెప్పారు. ఈ రోజు గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై విమర్శలు కురిపించారు.

గుంటూరు..కాచిగూడ రైల్లో మంటలు..

గద్వాల: మానవపాడు మండలం సమీపానికి గుంటూరు-కాచిగూడ రైలు చేరుకుంది. అంతలోనే రైలులో మంటలు చెలరేగాయి. మానవపాడు రైల్వేస్టేషన్‌లో అధికారులు రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

'నోట్ల రద్దు మంచిదే..అమలులో లోపం'

విజయవాడ : నోట్ల రద్దుపై బీజేపీ నేత..ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు స్పందించారు. పాత పెద్దనోట్ల రుద్ద చేసిన ప్రధాని మోదీ నిర్ణయం సరైందే కానీ అమలులో లోపం వుందని ఆయన పేర్కొన్నారు. గత 36 రోజులుగా ప్రజలు నగదు కోసం నానా అగచాట్లు పడుతూ..సామాన్యులు సహనం కోల్పోతున్నారనీ..అలాగే తాను కూడా నగదు విషయంలో సహనం కోల్పోయానని ఆయన తెలిపారు. 

18:13 - December 14, 2016

ప్రకాశం : వర్ధా తుపాన్‌ ప్రభావంతో.. ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు..ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అలాగే కనిగిరిలో పురాతన పెంకుటిల్లు కూలి వృద్ధురాలి మృతి చెందింది. టంగుటూరు మండలం రాయవారిపాలెం వద్ద పాలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా కనిగిరి పట్టణంలోని 4వ వార్డులో భాదుల్లవా వారి వీధిలో ఉన్న పెంకుటిల్లు వర్షాలకు నాని ఈరోజు తెల్లవారుజామున కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రపోతున్న ఖైరూన్‌బీ అనే వృద్ధురాలు మృతి చెందింది. 

18:11 - December 14, 2016
18:07 - December 14, 2016

నిజామాబాద్ : ఇప్పటికైనా బ్యాంకులకు ప్రభుత్వం ఇప్పటికైనా కరెన్సీని డిమాండ్ మేరకు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. పెద్దవారికి కోట్లకి కోట్లు లభిస్తుంటే ..సామాన్యులకు మాత్రం రూ.2వేలు దొరకకపోవటం దారుణమంటున్నారు. రెండు వేల కోసం రోజుల తరబడి లైన్ల లో నిలబడి నానా అగచాట్లు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 36 రోజులు కావస్తున్న ప్రజలకు నోట్ల కష్టాలు తీరడం లేదు. బ్యాంకులకు మూడు రోజులపాటు సెలవులు కావడంతో.. ఏటీఎం సెంటర్లలో నగదు నిల్వ చేయలేదు. దీంతో బుధవారం నాడు నిజామాబాద్‌లోని ఏటీఎంల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నామని..అయినా రెండు వేలు మాత్రమే వస్తున్నాయని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.  

18:02 - December 14, 2016

హైదరాబాద్ : సంక్షేమ రంగంలో 30వేల కోట్లకుపైగా ఖర్చు పెడుతూ.. నంబర్‌వన్‌గా నిలిచామన్నారు సీఎం కేసీఆర్‌. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు కావడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశమైన కేసీఆర్‌.. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు రావాలన్నారు. సిద్ధిపేట తరహాలో రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు జరపాలని.. కలెక్టర్లు పోటీపడి కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్‌ సూచించారు.  

18:01 - December 14, 2016

హైదరాబాద్ : సచివాలయంలోని సమతా బ్లాక్ వద్ద టీవీయూవీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. సమతా లోపలికి చొచ్చుకుపోయేందుకు విద్యార్ధులు యత్నిస్తుండగా సెక్యూరిటీ అడ్డుకుని వారిని ఆరెస్ట్ చేశారు. అనంతరం సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. ప్రయివేటు యూనివర్శిటీ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని..విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీవీయూవీ విద్యార్ధులు ధర్నా చేపట్టారు. 

17:57 - December 14, 2016

విజయవాడ : బ్యాంకర్లు, కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు బ్యాంక్‌ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని చంద్రబాబు అన్నారు. బాధ్యతాయుతమైన పనితీరుతో ప్రజల్లో విశ్వాసం పొందాలన్నారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు పెంచడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ పెరిగిందంటే మన పని తీరులో లోపం ఉన్నట్లే భావించాలని చంద్రబాబు అన్నారు. ఏ ఒక్క వృద్ధుడు, వికలాంగుడు బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడకుండా చూడాలన్నారు. వారికి తగిన వసతులు కల్పించాలని.. కుర్చీలు, టెంట్లు వేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

17:56 - December 14, 2016

హైదరాబాద్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుకు తానెప్పుడూ అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీలో తనకు భాగముందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అది నిరూపిస్తే నిరంజన్‌రెడ్డికే రాసిస్తానన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను.. టీఆర్‌ఎస్‌ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని చిన్నారెడ్డి అన్నారు. 

17:53 - December 14, 2016
17:51 - December 14, 2016
17:49 - December 14, 2016

ప్రకాశం : నగరాల్లో పారిశుద్ధ్య సమస్యలతో పాటు గృహ నిర్మాణం, కార్మిక విధానాల పరిరక్షణ తదితర అంశాలపై సీపీఎం పార్టీ పోరుబాట పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తోంది. ఈ పాదయాత్రలను ప్రకాశం జిల్లా ఒంగోలులో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు జెండా ఊపి ప్రారంభించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అప్పజెప్పేందుకు ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. దీన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల విధానంతో పేద ప్రజలపై మరితం భారం వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మధు విమర్శించారు. దీంతో మున్సిపల్ కార్పొరేటర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే దుస్థితి నెలకొంటుందని మధు పేర్కొన్నారు. 

17:36 - December 14, 2016

హైదరాబాద్ : కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

17:35 - December 14, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో భారీ మార్పులు సంభవించనున్నాయి. బల్దియాలో భారీ ప్రక్షాళనకు కమిషనర్ జనార్థన్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. అక్రమార్కులను లక్ష్యంగా చేసుకుని వారిపై బదిలీల వేటు వేయనున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కమిషనర్ జనార్థన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎన్నో ఏళ్లు పాతుకుపోయిన అధికారులపై కమిషనర్ జనార్థన్ రెడ్డి బదిలీల వేటు పడనుంది. నగరంలో పలు భవనాలు కూలి కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటువంటి ఘటనల్లో ప్రాణాలు పోగొట్టుకునేవారు పొట్టకూటికోసం కాయకష్టం చేసే నిరుపేద కూలీలే కావటం గమనించాల్సిన విషయం. ఇటీవల నానక్ రామ్ గూడలో నిర్మాణంలో వున్న ఓ భవనం కూలి పలువురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం సికింద్రాబాద్ లోని చంద్రలోక్ కాంప్లెక్స్ లో ఓ రైలింగ్ కూలి ఓ వ్యక్తి మరణించాడు. దీంతో జీహెచ్ ఎంసీలో పాతుకుపోయి వున్న అవినీతి అధికారులపై వేటు వేయనున్నట్లుగా తెలుస్తోంది. బల్దియా అధికారులు అవినీతికి కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారనీ..దీంతో యజమానులు అక్రమ నిర్మాణాలు కొనసాగిసుతన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

17:33 - December 14, 2016

వరంగల్ : రద్దుచేసిన పెద్ద నోట్ల స్థానంలో చిన్ననోట్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో జరిగిన ఈ ధర్నాలో మానవ హారాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ధర్నాలో పాల్గొన్న నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిన్ననోట్లను విడుదల చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

17:32 - December 14, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్మికులు ట్యాంక్‌బండ్‌ ఎస్బీహెచ్ కార్యాలయంముందు ఆందోళనకు దిగారు.. జీతాలువచ్చినా డబ్బుతీసుకోలేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. తెల్లవారుజామున 5గంటలనుంచే బ్యాంకుముందు క్యూకట్టారు.. మధ్యాహ్నం 12దాటినా బ్యాంకు తెరవకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.. తెల్లవారుజాము నుంచే కార్మికులు ఎస్బీహెచ్ ముందు లైను కట్టారు. జీతాలు వచ్చినా ఒక్కరూపాయికూడా ఇంటి ఖర్చుల కోసం తీసుకోలేని పరిస్థితుల్లేవని వారు మండిపడుతున్నారు. చావు ఖర్చులకూ డబ్బులేని దుస్థితి నెలకొంటున్నాయంటూ వారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

17:30 - December 14, 2016

కృష్ణా : పెద్దనోట్ల రద్దు ప్రభావం చేతివృత్తులపై తీవ్రంగా పడింది. బంగారాన్నే నమ్ముకుని జీవించే స్వర్ణకారుల జీవితాలను అల్లకల్లోలం చేసింది. పాత పెద్దనోట్లు రద్దు చేసిన నేటికి 36 రోజులయ్యింది. కానీ దేశ వ్యాప్తంగా ఇంతవరకూ నోటు కష్టాలు, చిల్లర కష్టాల కొరత కొనసాగుతూనేవుంది. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. చిరు వ్యాపారులు గిరాకీలు లేక అల్లాడిపోతున్నారు. ఇంట్లో కనీసం ఉప్పు కొనాలన్నా చిల్లర లేని పరిస్థితి..ఇలా వుంటే పులిమీద పుట్రలాగా కేంద్ర ఆర్థిక శాఖ బంగారంపై ఆంక్షలు విధించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బంగారం కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. ఆర్థిక శాఖ ఆంక్షలతో అది దాదాపు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బంగారు వస్తువులు తయారు చేసే స్వర్ణకారులు చేసేందుకు పనులు లేక ఖాళీగా కూర్చుంటున్నారు. దీంతో కుటుంబాలు గడుపుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే స్వర్ణకారులు ఈ దెబ్బతో ప్రత్యామ్నాయ పనులకు మళ్లుతున్నారని ఓ స్వర్ణకారుడు తెలిపారు. విజయవాడలోని బీసెంట్ రోడ్ 5వేలమంది స్వర్ణకారులు తమ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా కులవృత్తినే నమ్ముకున్న మేం ఇప్పుడు ఏం చేయాలంటున్నారు. గత 34 ఏల్లుగా కులవృత్తితో ముడిపడి పనిచేసుకుంటున్నామనీ..ఇటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని..చేసేందుకు పనుల్లేవ్ ఎలా బతకాలి కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఓ స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారంపై ఆర్థిక శాఖ ఆంక్షలతో తాము రోడ్డుపడే పరిస్ధితులొచ్చాయని వారు వాపోతున్నారు. పరిస్థితులు ఇలాగే వుంటే సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చేసుకునేందుకు కూడా వెనుకాడమని వారు పేర్కొంటున్నారు. ఆర్డర్లు లేవు..ఆదాయం లేదు ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు.

17:27 - December 14, 2016

ఢిల్లీ : ఐటీ అధికారులదాడుల్లో దేశ వ్యాప్తంగా భారీగా డబ్బు పట్టుబడుతోంది.. తాజాగా ఢిల్లీ కరోల్‌బాగ్‌ హోటల్‌లో 3కోట్ల 25లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఛండీగఢ్‌లో 2కోట్ల 18 లక్షల కొత్తనోట్లు... పనాజీలో 68 లక్షలు... కలంగుట్‌లో 24 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ముగ్గురిని అరెస్ట్‌కూడా చేశారు.. అలాగే బెంగళూరులో 2కోట్ల 25 లక్షల కొత్తనోట్లు... జైపూర్‌లో 16లక్షల 94వేల నగదును పట్టుకున్నారు.. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.. రాయ్‌గఢ్‌లోకూడా 13 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.. పుణేలో 15లక్షల నగదును సీజ్‌ చేశారు.. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు..

సుప్రీంకోర్టులో టి.సర్కార్ పిటిషన్ దాఖలు..

హైదరాబాద్ : కృష్ణా నది జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బీఎస్ ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె..

హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ టవర్లను ప్రయివేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె నిర్వహించడం జరుగుతుందని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శి సంపత్ రావు పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ దెబ్బతీసే రిలయన్స్, ఎయిర్ టెల్ లాంటి కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే సబ్సిడరీ కంపెనీ పేరిట ప్రత్యేక సంస్థ ఉందన్నారు. 

14:05 - December 14, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై గత నెల రోజులుగా లోక్‌సభలో తాము చర్చకు పట్టుబడితే ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. ఈ విషయాలు వెలుగు చూస్తే ప్రధాని బండారం బద్ధలవుతుందని రాహుల్‌ అన్నారు. లోక్‌సభలో మాట్లాడే విషయంలో తమకు హక్కు ఉందన్నారు. ప్రధాని మోది ఈ విషయంలో భయపడతున్నారని, ప్రజా సభల్లో మాట్లాడుతున్నారే తప్ప సభకు వచ్చి చర్చలో పాల్గొనడం లేదని రాహుల్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వమే చర్చను అడ్డుకోవడం ఇదే తొలిసారన్నారు.

 

14:03 - December 14, 2016

ముస్లీంల విడాకుల చట్టం.. తీరు తెన్నులపై లాయర్ పార్వతి మాట్లాడారు. మానవి మైరైట్ కార్యాక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. తలాక్ గురించి వివరించారు. ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలను చూద్దాం..  తలాక్.... ముస్లీం పురుషులు భార్యకు విడాకులు ఇచ్చే విధానం. తలాక్.... ఏక పక్షంగా, అకారణంగా, ఎప్పుడంటేఅప్పుడు విడాకులు ఇచ్చే పద్ధతిని తలాక్ అంటారు. ఇది మహిళలకు సంబంధించిన విషయం. మహిళల హక్కులు కాలరాసే విధంగా జరుగుతున్నాయని చెప్పవచ్చ. తలాక్ చాలా రకాలు.. ఇందులో ముఖ్యంగా త్రిపుల్ తలాక్.. చాలా క్రూరమైన చర్య.. మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అంటే చాలు.. అంటే విడాకులు ఇచ్చినట్లే అవుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:56 - December 14, 2016

హైదరాబాద్ : బాహుబలి-2 సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే బాహుబలి టీమ్‌ కూడా మరింత ఆసక్తిని పెంచేందుకు...తాజాగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. బాహుబలిలో ప్రభాస్ కి పోటీగా కీలకపాత్ర పోషిస్తున్న రాణా న్యూలుక్‌ను ట్విట్టర్ లో విడుదల చేసింది. రాణా పుట్టిన రోజు సందర్భంగా.. రిలీజైన ఈ లుక్ ప్రేక్షకుల్లో మరింత అంచానాలను పెంచేస్తోంది. 

 

13:55 - December 14, 2016

ఢిల్లీ : కేంద్రమంత్రి కిరణ్‌ రిజ్జుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై లోక్‌సభ అట్టుడికింది. సభ ప్రారంభం కాగానే అరుణాచల్‌ ప్రదేశ్‌ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్చ జరపాలని విపక్షాలు హంగామా చేశాయి. దీంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో కిరణ్‌ రిజ్జు అవినీతిపై కాంగ్రెస్‌ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. బిజెడి సభ్యుడు అగస్టా స్కాం... త్యాగి అరెస్ట్‌ను రాజకీయం చేయొద్దని కోరారు. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మాట్లేడేందుకు బిజెడిని ఎలా అనుమతించారని స్పీకర్‌ను ఖర్గే నిలదీశారు. నోట్ల రద్దుతో అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వమే అనుమతించడం లేదన్నారు. విపక్షనేత ఖర్గే స్పీకర్‌ను ఛాలేంజ్‌ చేయడాన్ని కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసమే ప్రధాని పెద్దనోట్ల రద్దు చేశారని అన్నారు.   

 

13:53 - December 14, 2016
13:51 - December 14, 2016

ఆదిలాబాద్‌ : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 60రోజులుగా పాదయాత్రచేస్తున్న ఈ బృందానికి గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మూవీల, ఆదిలాబాద్‌, అంకోలిలో పాదయాత్ర కొనసాగుతోంది.  ఈ సందర్భంగా పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్ నాయక్ టెన్ టివితో మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:46 - December 14, 2016
13:45 - December 14, 2016

తూర్పుగోదావరి : తణుకు మండలం వేల్పూలులోని  ఎస్‌బీఐ దగ్గర ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఇంకెన్నాళ్లు నో క్యాష్‌ బోర్డులు పెడతారంటూ ధర్నా నిర్వహించారు. ఖాతాదారులకు  నగదు కోసం  వారం క్రితమే  బ్యాంకు సిబ్బంది కూపన్లు ఇచ్చారు. నిన్న ఒక్కొక్కరికి పదివేల నగదు ఇచ్చారు. ఈరోజు మాత్రం బ్యాంకు తెరవగానే నో క్యాష్‌ బోర్డు పెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన ఖాతాదారులు.. రోడ్డుపై బైఠాయించారు. బ్యాంకు మేనేజర్‌ తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. బ్యాంకు మేనేజర్‌ను వెంటనే బదిలీచేయాలని డిమాండ్‌ చేశారు. 

 

13:42 - December 14, 2016

ఢిల్లీ : నాలుగు రోజులు సెలవులు తరువాత ప్రారంభమైన రాజ్యసభ సమావేశంలో... ఇవాళ కూడా విపక్షాలు పెద్దనోట్ల రద్దుపై చర్చకు డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేత గులాంనబీ ఆజాద్‌, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ చర్చకు పట్టుబట్టారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత దానిపై చర్చిద్దామని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ కురియన్ అన్నారు. మధ్యాహ్నం సభకు ప్రధాని వస్తారని అప్పడు చర్చిద్దామని..అంతవరకూ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. 

 

13:37 - December 14, 2016
13:35 - December 14, 2016

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్ చెరు ఎస్ బీహెచ్ వద్ద తోపులాట జరిగింది. డబ్బుల కోసం పటాన్ చెరులోని ఎస్ బీహెచ్ వద్దకు భారీగా జనం తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది క్యూలో నిల్చున్నారు. అయితే బ్యాంక్ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా జనం దూసుకెళ్లారు. దీంతో బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈనేపథ్యంలో కిందపడి ఒకరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:22 - December 14, 2016
13:16 - December 14, 2016

హరీష్ వ్యాఖ్యలు బాధాకరం - షబ్బీర్..

ఢిల్లీ : ప్రతిపక్షాన్ని కడిగేస్తామని టి. మంత్రి హరీష్ రావు కించపరిచేలా మాట్లాడడం బాధాకరమని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీల కాళ్లు కడగాలని, మేనిఫెస్టో అంశాలపై అధికార పార్టీని కడిగేస్తామన్నారు. సాయంత్రం ఏఐసీసీలో టి.కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సమావేశం కానున్నారని, కొత్త జిల్లాల అధ్యక్షులు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించడం జరుగుతుందన్నారు. 

13:15 - December 14, 2016
13:14 - December 14, 2016

ఢిల్లీ : టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌...విరాట్‌ కొహ్లీ ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. ఒకే సీజన్‌లో మూడు డబుల్‌ సెంచరీలు నమోదు చేసిన విరాట్‌....ముంబై టెస్ట్‌తో  అరుదైన రికార్డ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 51వ ఇంటర్నేషనల్‌ టెస్ట్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన విరాట్‌ ముంబై టెస్ట్‌లో క్రియేట్‌ చేసిన రికార్డులెన్నో....ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో విరాట్‌ వీరవిహారంపై టెన్‌ స్పోర్ట్స్‌ స్పెషల్‌ ఫోకస్‌.... 
ఎదురులేని యాంగ్రీ యంగ్‌ గన్‌....
ప్రస్తుతం ఫార్మాట్‌ ఏదైనా సరే...విరాట్‌ ఫార్ములా మాత్రం ఒక్కటే....నిలకడగా రాణించడం, పరుగులు సాధించడం టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌, విరాట్‌ కొహ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో కాన్సిస్టెన్సీకి కేరాఫ్‌ అడ్రెస్‌లా మారాడు. ముంబై  టెస్ట్‌లోనూ యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ అంచనాలకు మించి అదరగొట్టాడు.అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేశాడు.డబుల్‌ సెంచరీతో ఇంగ్లండ్‌ జట్టుకు ధీటుగా బదులిచ్చాడు. 
కొహ్లీ రికార్డ్‌ల మోత 
ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం మాత్రమే కాదు...బ్యాట్స్‌మెన్‌గానూ కొహ్లీ రికార్డ్‌ల మోత మోగిస్తూనే ఉన్నాడు.ప్రస్తుత సీజన్‌లో మూడు నెలల గ్యాప్‌లోనే మూడు డబుల్‌ సెంచరీలు నమోదు చేసిన విరాట్‌ ముంబై టెస్ట్‌తో నమోదు చేసిన రికార్డులెన్నో...  మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫమలైనా....ఒత్తిడిలోనూ ఏ మాత్రం తడబడకుండా బ్యాటింగ్‌ చేసిన  కొహ్లీ...ఫైటింగ్‌  సెంచరీతో భారత్‌ను పోటీలో నిలిపాడు.క్రీజ్‌లో పాతుకుపోయిన విరాట్‌....ట్రేడ్‌మార్క్ మార్క్‌ షాట్లతో అలరించాడు. 
187 బంతుల్లో  సెంచరీ 
187 బంతుల్లో  కొహ్లీ 15వ టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన కొహ్లీ ...ఆ తర్వాత కూడా ఏ మాత్రం తడబడకుండా బ్యాటింగ్‌ చేసి కెరీర్‌లో 3వ డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు.వ్యక్తిగత స్కోర్‌ 41 పరుగుల వద్ద విరాట్‌ టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు.కేవలం  89 ఇన్నింగ్స్‌ల్లోనే 4వేల పరుగుల మార్క్‌ దాటిన అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో కొహ్లీ చోటు దక్కించుకున్నాడు.భారత టెస్ట్‌ కెప్టెన్‌గా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 2వేల పరుగుల మైలురాయిని సైతం కొహ్లీ అధిగమించాడు. 
టెస్టుల్లో 3డబుల్‌సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌ కోహ్లీ 
ప్రస్తుత సీజన్‌లో విరాట్‌ నమోదు చేసిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే టెస్టుల్లో మూడు డబుల్‌సెంచరీలు చేసిన  తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన యాంగ్రీ యంగ్‌ గన్‌.....ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు డబుల్‌సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత నాలుగు  సిరీస్‌లతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్‌ సిరీస్‌తో సహా కొహ్లీ నాయకత్వంలోని భారత్‌...17 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా దూసుకుపోతోంది. టీమిండియాకు ఓటమంటూ లేకుండా 14  టెస్టుల్లో వరుసగా విజయాలందించిన టెస్ట్‌ కెప్టెన్‌గా కొహ్లీ చరిత్ర సృష్టించాడు. భారత జట్టును  ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌ ర్యాంక్‌లో నిలబెట్టిన కొహ్లీ....టీమిండియాకు టెస్టు ఫార్మాట్‌లో మరెన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.  
41 అంతర్జాతీయ సెంచరీలు 
28 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్లలో కలిపి 41 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసి ప్రస్తుత జెనరేషన్‌లో తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. మరి యాంగ్రీ యంగ్‌ గన్‌ ట్రెడిషనల్‌ టెస్ట్‌  ఫార్మాట్‌లో ఇదే స్థాయిలో చెలరేగితే ప్రస్తుత సీజన్‌లోనే  ట్రిపుల్‌ సెంచరీ సైతం నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి కెప్టెన్‌గా,బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ టెస్టుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

 

కొనసాగుతున్న టి.కలెక్టర్ల సదస్సు..

హైదరాబాద్ : తెలంగాణ కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. జిల్లాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, రహదారులు, రైలు మార్గాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం తదితర 20 అంశాలపై చర్చ జరుగుతోంది. 

శ్రీవారి హుండీ లెక్కింపులో చేతివాటం..

తిరుమల : శ్రీవారి హుండీ లెక్కింపులో చేతివాటం బహిర్గతమైంది. శివకాశికి చెందిన కృష్ణన్ ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

టెక్కలి వైసీపీలో ముసలం..

శ్రీకాకుళం : టెక్కలి వైసీపీలో ముసలం పుట్టింది. రేపు జరగనున్న నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని బహిష్కరించాలని నాలుగు మండలాల సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు. 

అమీన్ పూర్ కూల్చివేతలు..రాస్తారోకో చేస్తున్న ఇళ్ల యజమానులు..

మెదక్ : అమీన్ పూర్ లో అనుమతులు లేని వెంచర్లలో నిర్మించిన భవనాలను హెచ్ఎండీఏ, రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై నిరసిస్తూ ఇళ్ల యజమానులు రాస్తారోకోకు దిగారు. 

కూకట్ పల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేతలు..

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని ప్రగతి నగర్, మధురానగర్ లలో అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. 

అమరావతి పర్యావరణ అనుమతులపై ఎన్జీటీలో విచారణ..

ఢిల్లీ : అమరావతి పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణనను జనవరి 11కి వాయిదా వేసింది. 

మోడీపై రాహుల్ తీవ్ర ఆరోపణలు..

ఢిల్లీ : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రధాని వ్యక్తిగత అవినీతి సమాచారం తన వద్ద ఉందని, తాను మాట్లాడితే ప్రధాని ఇబ్బంది పడుతారని పేర్కొన్నారు. అందుకే తనను మాట్లాడనివ్వడం లేదని, కాంగ్రెస్ ను చూసి మోడీ పారిపోతున్నారని విమర్శించారు. 

13:03 - December 14, 2016

మేడ్చల్‌ : చిన్నారి కిడ్నాప్‌ సుఖాంతమైంది. మేడ్చల్‌ పీఎస్ పరిధిలోని ఉమావెంకట్రామ కాలనీలో 18 నెలల దీక్షిత  కిడ్నాప్‌కు గురైంది. నిన్న సాయంత్రం మార్కెట్‌కి వెళతామని పక్కింటివాళ్లు పాపను పట్టుకెళ్లారు. ఇంతవరకూ ఆచూకీ కనిపించకపోవడంతో దీక్షిత తల్లిదండ్రులు శ్రీను, శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో పాప ఉన్నట్లు గుర్తించారు. చిన్నారి కిడ్నాప్ సుఖాంతం అయింది. అందరూ ఊపరిపీల్చుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:57 - December 14, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలపై టీఆర్‌ఎస్‌ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. అర్ధవంతమైన చర్చ అంటూనే విపక్షాలకు బ్రేకులు వేసే ప్రణాళికలు రచిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలపై ముందస్తు కసరత్తు మొదలు పెట్టిన గులాబీ దళపతి... సమావేశాల్లో విపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చేందుకు తమ పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు. 
అధికార పార్టీ కసరత్తు 
మరో రెండు రోజుల్లో మొదలు కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అధికార పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. సభలో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై సమగ్రంగా వివరణ ఇవ్వాలని కేసీఆర్‌ ఇప్పటికే  మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సమావేశాలకు పూర్తి స్థాయిలో అధికార పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారులతో పలు సమావేశాలను నిర్వహించిన కేసీఆర్‌.. కీలక నేతలకు పలు సూచనలు కూడా చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయి నివేదికలను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. విపక్షాలు లేవనెత్తే అంశాలపై ప్రస్తుతం గులాబీ దళంలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పరంగా అమలు కాని హామీలపై ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో అధికార పార్టీగా సమర్ధవంతంగా వ్యవహరించేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది.
ఈ నెలాఖరు వరకూ సభను నడిపించాలని ప్లాన్‌
సమావేశాలను ఈ నెలాఖరు వరకు కూడా జరిపేందుకు వెనుకడుగు వేయరాదనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుడంతో సమావేశాలు రెండు వారాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమావేశాల్లో ప్రభుత్వ పరంగా గరిష్టంగా సమయం తీసుకుంటూ ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలకు దీటైన సమాధానం ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అవుతోంది. 
విపక్షాలను మానసికంగా దెబ్బతీసేందుకు ప్లాన్‌
అర్ధవంతమైన చర్చ జరగాలంటూ సూచనలు ఇస్తూనే.... విపక్షాలు చేసే విమర్శలను కూడా అదే స్థాయిలో తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇప్పటికే  ఆ పార్టీ నేతలు విపక్షాలను మానసికంగా దెబ్బతీసే పనిలో పడ్డారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై తమ సమాధానాలు వింటే సరి లేదంటే... ఎదురుదాడే లక్ష్యం అన్న వ్యూహాన్ని అమలు చేసేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు.

12:28 - December 14, 2016

ఢిల్లీ : రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అంతకముందు వర్ధా తుపానుపై రాజ్యసభలో చర్చ జరిగింది. వర్ధా తుపాను తమిళనాడును అతలాకుతలం చేసిందని తిరుచ్చిశివ అన్నారు. దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని తిరుచ్చిశివ తెలిపారు.  సహాయక చర్యల కోసం కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం మాట్లాడుతూ వర్ధా తుపానుతో దెబ్బతిన్న తమిళనాడుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. తమిళనాడుతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

 

12:24 - December 14, 2016

ఢిల్లీ : లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.  వాయిదా అనంతరం ప్రారంభం లోక్ సభలో అరుణాచల్ ప్రదేశ్ లో విద్యుత్ ప్రాజెక్టు కుంభకోణంపై చర్చను చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రమంత్రి కిరణ్ జిజుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. అధికార, ప్రతిపక్షాలు మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పిన వినకుండా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈనేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజ్యసభ 2.00గంటలకు లోక్ సభ రేపటికి వాయిదాలు..

ఢిల్లీ : నాలుగు రోజుల సెలవు అనంతరం ప్రారంభమైన ఉభయసభల్లో సేమ్ సీన్ నెలకొంది. సభలు ఉదయం ప్రారంభం కాగానే లోక్ సభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది. ఇటీవలే మృతి చెందిన సభ్యులకు రాజ్యసభ నివాళి ఆర్పించింది. అనంతరం వివిధ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను 2గంటలకు డిప్యూటి ఛైర్మన్ వాయిదా వేశారు. లోక్ సభ మధ్యాహ్నం 12గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. కిరణ్ రిజుజు కుటుంబ సభ్యుల స్కాంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు, త్యాగి అరెస్టుపై చర్చకు బీజేపీ పట్టుబడుతోంది.

విపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహం..

ఢిల్లీ : లోక్ సభలో విపక్షాల తీరుపై స్పీకర్ సుమిత్రా మహజన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12గంటలకు సభ ప్రారంభం కాగానే కిరణ్ రిజుజు కుటుంబ సభ్యుల స్కాంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసు, త్యాగి అరెస్టుపై చర్చకు బీజేపీ పట్టుబడుతోంది. 

12:16 - December 14, 2016

ఢిల్లీ : వర్ధా తుపానుపై రాజ్యసభలో చర్చ జరిగింది. వర్ధా తపాను తమిళనాడును అతలాకుతలం చేసిందని తిరుచ్చిశివ అన్నారు. దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం జరిగిందని తిరుచ్చిశివ తెలిపారు.  సహాయక చర్యల కోసం కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుడు చిందబరం మాట్లాడుతూ వర్ధా తుపానుతో దెబ్బతిన్న తమిళనాడుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. అమిళనాడుతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

 

11:59 - December 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిరోజులుగా గజగలాడించిన చలి కాస్త తగ్గుముఖం పట్టింది. చాలాచోట్ల సాధారణంకంటే 5డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. హైదరాబాద్‌తోసహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్దా తుఫాన్‌వల్లే ఈ మార్పులని వాతావరణ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 20 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌ జిల్లాల్లో చలితీవ్రత కొనసాగుతోంది.. 

 

ఇండ్ల చెరువులో విషాదం..

ప్రకాశం : దొనకొండ (మం) ఇండ్ల చెరువులో విషాదం చోటు చేసుకుంది. రైలు కిందపడి వీరవెంకట రామయ్య యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముక్కలు ముక్కలైన కుమారుడి మృతదేహం చూసి తట్టుకోలేక రైలు కిందపడి తండ్రి పెద్దరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తిందని తెలుస్తోంది. 

జయ మృతిపై సుప్రీంలో పిటిషన్..

ఢిల్లీ : జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో ప్రజప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ విచారణ, వైద్య నివేదికలు స్వాధీనం చేసుకోవాలని స్వచ్చంద సంస్థ పిల్ దాఖలు చేసింది.
 

11:55 - December 14, 2016

హైదరాబాద్ : ఆర్బీఐ నుంచి తెలంగాణకు 20 వేల కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 17,500 కోట్ల కరెన్సీ మాత్రమే వచ్చిందని ఆర్ధిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.  దేశవ్యాప్తంగా ఆర్బీఐ 4 లక్షల  కోట్లు పంపిణీ చేసింది. అయితే జిఎస్‌డిపీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వాటా 5 శాతం కాగా... ఈ లెక్కన 20 వేల కోట్లు రావాలని ఆయన అన్నారు. వచ్చిన కరెన్సీలోనూ 96 శాతం కొత్త రెండువేల రూపాయల నోట్లే వచ్చాయన్నారు. తెలంగాణలో కరెన్సీ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈటెల అన్నారు.
తెలంగాణకు తక్కువగా వచ్చిన రూ. 2,500 కోట్ల కరెన్సీ
తెలంగాణ రాష్ట్రానికి ఆర్బీఐ నుంచి రావాల్సిన కరెన్సీలో 2 వేల 500 కోట్ల రూపాయలు తక్కువగా వచ్చాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆర్బీఐ అధికారులకు తెలిపారు. జీఎస్‌డీపీ ప్రకారం రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయల కరెన్సీ రావాలని అయితే.. కేవలం 17 వేల 500 కోట్ల రూపాయల కరెన్సీ మాత్రమే వచ్చిందని చెప్పారు.  ఇందులో  96 శాతం 2000 రూపాయల నోట్లు వచ్చాయని కేవలం 4 శాతం మాత్రమే చిన్న నోట్లు వచ్చాయని ఈటల తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో చిల్లర సమస్య తీవ్రంగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఇబ్బందుల దృష్ట్యా మరో 5 వేల కోట్ల చిన్న నోట్లు ఇస్తే సమస్యల నుంచి బయటపడగలమని అధికారులకు తెలిపారు.  
తెలంగాణలో 1.03 లక్షల కుటుంబాలు
తెలంగాణలో 1 కోటి 3 లక్షల కుటుంబాలు ఉండగా 83 లక్షల 37 వేల కుటుంబాలకు మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి. అందులో చాలావరకు ఆక్టివ్‌గా లేవు. ఇంకా 30 లక్షల కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్స్ లేని పరిస్ధితి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. దీంతో 500, 1000 రూపాయల నోట్లకు 200 నుంచి 300 వరకు కమీషన్ ఇచ్చి నోట్లు మార్చుకుంటున్నారని అధికారులు ఈటల తెలిపారు. ఇప్పటికైనా అకౌంట్ లేని ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకోని కొత్త నోట్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులను ఈటల కోరారు.
నగదు దొరక్క సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు 
ఓవైపు  పేద ప్రజలు డబ్బులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరో పక్క వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ కొంతమంది దగ్గర దొరకడంపై అధికారులను ఈటల ప్రశ్నించారు. బ్యాంక్ అధికారుల హస్తం లేకుండా ఇలాంటివి జరిగే అకాశమే లేదన్నారు. దీంతో మళ్లీ వేల కోట్ల రూపాయలు బ్లాక్ అవుతాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ వేల కోట్లు బ్లాక్ అయితే ప్రధాని ఆలోచనకు అర్థం ఏముందని ఈటల... ఆర్బీఐ అధికారులను అడిగారు. కరెన్సీ విషయంలో తప్పులు చేస్తున్న బ్యాంక్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలానే కొనసాగితే చేతికి డబ్బుల అందక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. 
గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చర్చ జరగాలి- ఈటల 
నోట్లరద్దుపై గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా లోతైన చర్చ జరగాలని ఈటల ఆకాంక్షించారు. ఏదో ఒక దశలో ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్యాష్‌లెస్ విధానానికి పూర్తి మద్దతు తెలుపుతోందని ఈటల అన్నారు. దీని కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు కేంద్రం , ఆర్బీఐ సహకరించాలని ఈటల కోరారు.  

11:48 - December 14, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని  36 రోజులైన పేదలకు కష్టాలు తప్పడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. మరోవైపు ఏటీఎంల్లో క్యాష్‌ నింపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. ఏటీఎంల దగ్గరికి ఆశగా వచ్చిన జనానికి నో క్యాష్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక చిరు వ్యాపారులు నగదు కోసం పడుతున్న కష్టాలైతే అన్నీ ఇన్నీకావు. కూరగాయల వ్యాపారుల, టిఫిన్‌సెంటర్స్‌,తోపుడుబండ్లు, బడ్డీకొట్టు,చిన్నచిన్న షాపులు నడిపేవారి వ్యాపారాలు డీలా పడ్డాయి. 2000 నోటుకు చిల్లర లేకపోవడంతో వ్యాపారాలు సాగడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:42 - December 14, 2016
11:40 - December 14, 2016

తూర్పుగోదావరి : కాకినాడ సెజ్‌ తీరంలో అన్నదాతల పొట్ట కొట్టే మరో ప్రయత్నం జరుగుతోంది. జీఎంఆర్‌ యాజమాన్యం పోర్ట్‌ నిర్మాణ సన్నాహాలు చేస్తుండటంతో తీర ప్రాంతంలోని రైతులు, మత్స్యకారుల్లో తీవ్ర అలజడి రేకెత్తుతోంది. సముద్రాన్ని న‌మ్ముకుని జీవిస్తున్న త‌మ‌కు అన్యాయం చేస్తారా అంటూ మత్స్యకారులతో పాటు రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. ఇప్పటికే దివీస్‌ ఉద్యమంతో ఎరుపెక్కిన తూర్పు తీర ప్రాంతం మరో ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారనుంది. 
సస్యశ్యామల భూముల్లో సెజ్‌ సెగలు
పచ్చని ప్రశాంత పల్లెల్లో జీఎంఆర్‌ పోర్టు చిచ్చు..సస్యశ్యామల భూముల్లో సెజ్‌ సెగలు...గతంలో కాకినాడ సెజ్‌  పేరుతో 10 వేల ఎకరాల భూసేకరణ...పదేళ్లు గడిచినా ఇప్పటికీ మొదలుకాని పరిశ్రమలు... తూర్పు తీరంలో పరిశ్రమల కోసం అన్నదాతల నుంచి భూసేకరణ చేసిన ప్రభుత్వం.. పదేళ్లు గడుస్తున్నా... పెద్దగా పరిశ్రమల ఊసే ఎత్తలేదు.   కేవలం ఓ పది ఎకరాల్లో చిన్న బొమ్మల పరిశ్రమను స్థాపించారు. గతంలో దివీస్‌ పేరుతో ఓ ఫార్మా కంపెనీకి అనుమతులిచ్చిన చంద్రబాబు... తాము అధికారంలోకి వస్తే తిరిగి భూములన్నీ రైతులకు పంచేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా కాలుష్య పరిశ్రమలకు అనుమతులివ్వడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దివీస్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తూ.. రైతులు, రొయ్యల పెంపకం దారులు, మత్స్యకారులు సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమ బాట పడుతున్నారు. 
మరో నిర్ణయంతో షాక్ 
ఇప్పటికే దివీస్‌ వ్యతిరేకిస్తున్న తూర్పు తీర వాసులకు.. ప్రభుత్వం మరో నిర్ణయంతో షాకిచ్చింది. తాజాగా జీఎంఆర్‌ కంపెనీ ఆధ్వర్యంలో పోర్ట్‌ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలు కావడంతో మరోసారి తొండంగి మండలంలోని గ్రామాల్లో వేడి రాజుకుంటోంది. జీఎంఆర్‌ పోర్ట్‌ పేరుతో 1500 ఎకరాల పోర్టు నిర్మాణం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పాటు.. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణకి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో తొండంగి మండలంలోని పెరుమాళ్‌పురం, గడ్డిపేట, బుచ్చియ్యపేట వంటి గ్రామాల్లో తీవ్ర అలజడి నెలకొంది.  
స్థానిక రైతుల్లో బెంగ  
పోర్ట్ నిర్మాణంతో త‌మ భూములు కోల్పోతామ‌న్న బెంగ స్థానిక రైతులను పీడిస్తోంది. పచ్చని పంటలు పండే భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. 
రైతులపై జీఎంఆర్‌ ఒత్తిడి
రైతన్నలు పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండటంతో... జీఎంఆర్‌ యాజమాన్యం సర్కారు సాయంతో రైతులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. పోలీసులను ఉపయోగించి బలవంతంగానైనా భూ సేకరణ చేయాలన్న పట్టుదలకుపోతోంది. అయితే.. దేన్నైనా ఎదురించి తీరతామని స్థానికులు చెబుతున్నారు. రైతులు, మత్స్యకారుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నా.. జీఎంఆర్‌ యాజమాన్యం మాత్రం వారి అభిప్రాయాన్ని పరిగిణనలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. జీఎంఆర్ పోర్ట్ బాధిత రైతాంగానికి అండ‌గా ఉంటామ‌ని సీపీఎం నేత‌లు  చెబుతున్నారు. ఖాళీగా ఉన్న సెజ్ భూముల‌ను వ‌దిలేసి రైతుల భూముల‌ను కాజేయ‌డం కుద‌ర‌దంటున్నారు. ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని, అప్పుడే ప్రజలు ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. చ‌ట్ట విరుద్ధంగా సామాన్యుల‌ను ఖాళీ చేయించాల‌ని చూస్తే సహించ‌బోమని సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు. రైతుల‌కు అండ‌గా ఉంటామని, అన్నదాతల నోట్లో మట్టికొట్టే చర్యలను ప్రభుత్వం విడనాడాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.  

 

11:36 - December 14, 2016

మెగా స్టార్ చిరంజీవి చాన్నాళ్ల తరువాత మేకప్ వేసుకున్నారు. 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో వి. వి.వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా ఆయన సినిమానే విడుదల కాలేదు. అప్పుడే దర్శకత్వం కూడా వహిస్తున్నారా ? అనే సందేహాలు రావచ్చు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ చిత్రంలో 'వినాయక్' ఓ చిన్న పాత్రలో మెరువనున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశానికి 'చిరు' దర్శకత్వం వహించాచరు. చిరు - వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'ఠాగూర్' చిత్రంలో 'వినాయక్' ఓ చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మరి వినాయక్ పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

అభిమానుల ఎదురు చూపులు..
తమిళ మాతృకను తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేయించారు. ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు 150వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిరు సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ హీరోగా చిరంజీవికి చివరి చిత్రం. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మధ్యలో తనయుడు రామ్ చరణ్ చిత్రాలు మగధీర, బ్రూస్‌ లీ సినిమాల్లో గెస్ట్ రోల్‌లో అభిమానులను అలరించారు చిరు. 

11:33 - December 14, 2016

ఆదిలాబాద్ : ఎర్రజెండా చేతబట్టి... పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ ముందుకు సాగుతున్న మహాజన పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 58వ రోజు  పాదయాత్ర బృందానికి ఆదిలాబాద్‌ జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా తమ్మినేని బృందానికి ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. 
గోడు వెల్లబోసుకుంటున్న ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు 
సీపీఎం మహాజన పాదయాత్ర 58వ రోజు పూర్తి చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటోంది..  తమకు అతి తక్కువ జీతం ఇస్తున్నారని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాదయాత్ర బృందానికి  గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన తమ్మినేని బృందం సభ్యులు సమస్యల పరిష్కారంపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. 
విద్యారంగాన్ని విస్మరించింన ప్రభుత్వం : తమ్మినేని  
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో హాస్టళ్ల విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు సరిగా లేవని తమ్మినేని అన్నారు.  
వృత్తి కులాల వారిని అణగదొక్కుతున్న పెత్తందారులు : ఆశయ్య 
వృత్తి కులాల వారిని పెత్తందారులు, అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నాయని ఎంబీసీ నేత ఆశయ్య ఆరోపించారు. ఎంబీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  కుమ్మరి, చాకలి, మంగళి వంటి కులవృత్తులవారిపై బహిష్కరణలకు పాల్పడుతుండటం దారుణమని ఆశయ్య విమర్శించారు. గ్రామ కమిటీల ఆగడాలు శృతిమించుతున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  
సీపీఎం పాదయాత్రలో అపశృతి
సీపీఎం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో యాత్ర పర్యటనలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న పాదయాత్ర పైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పాదయాత్ర గురించి పూర్తి సమాచారం ఇచ్చినా..ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా తమ్మినేని ఆరోపించారు. 58వ రోజు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో ప్రారంభమైన మహాజన పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్ర బృందానికి ప్రజలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.  

 

రాజ్యసభ లో వర్ధా తుపాన్ పై విపక్షాల ప్రశ్నలు..

ఢిల్లీ : వర్ధా తుపాన్ తో తమిళనాడుకు దాదాపు రూ. 10 వేల కోట్ల నష్టం జరిగిందని తిరుచ్చి శివ రాజ్యసభలో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని, వర్ధా తుపాన్ తమిళనాడును అతలాకుతలం చేసిందన్నారు. వర్ధా తుపాన్ తో దెబ్బతిన్న తమిళనాడుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చిదంబరం సూచించారు. 

11:13 - December 14, 2016

ఢిల్లీ : నాలుగు రోజుల తర్వాత  పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కొద్ది సేపటికే లోక్ సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. మాజీ సభ్యుల మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం....

 

ఎన్ కౌంటర్ ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : సోపోర్ లోని ఓ ఇంట్లో ఉగ్రవాది ఉన్నాడనే సమాచారం మేరకు భద్రతాదళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. బిజిహరాలోనూ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఓ హిజ్బుల్ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపులు చేపట్టాయి. 

డీఎంఅండ్ హెచ్ వో నివాసంపై ఏసీబీ దాడులు..

కర్నూలు : డీఎంఅండ్ హెచ్ వో స్వరాజ్యలక్ష్మి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం, విశాఖపట్టణం, కర్నూలులో ఏకకాలంలో సోదాలు జరిగాయి. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల సెలవుల అనంతరం ఉభయసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. లోక్ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. 

నగదు రహిత లావాదేవీలు పెంచాలి - బాబు..

విజయవాడ : బ్యాంకర్లు..జిల్లాల కలెక్టర్లు..ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు సహకరించాలని, ఉద్యమ స్పూర్తితో నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను మళ్లించాలని సూచించారు. రేపటి నుండి ప్రతి రేషన్ డిపో బిజినెస్ కరస్పాడెంట్ గా పనిచేయాలన్నారు. ఒక్కో రేషన్ దుకాణం ద్వారా కనీసం రూ. 2లక్షలు పంపిణీ జరిగితే గ్రామాల్లో నగదు లభ్యత పెరుగుతుందని, జన్ ఖాతాల వినియోగం 16 నుండి 30 శాతానికి పెరగాలని సూచించారు. మొబైల్ లావాదేవీలు 8 నుండి 25 శాతానికి పెరగాలని, పెండింగ్ లో ఉన్న రూపె కార్డులను నాలుగు రోజుల్లో పంపిణీ చేయాలన్నారు.

చిన్నారి దీక్షిత క్షేమం..

మేడ్చల్ : ఉమా వెంకట్రావ్ కాలనీలో కిడ్నాపైన 18 నెలల చిన్నారి దీక్షిత క్షేమంగానే ఉంది. తూప్రాన్ లోని ఓ టైలర్ షాప్ వద్ద చిన్నారిని పోలీసులు గుర్తించారు. 

37వ రోజు నోట్ల కష్టాలు..

హైదరాబాద్ : కరెన్సీ కష్టాలు 37వ రోజుకు చేరుకున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య మానవుడు పడిగాపులు పడుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర కొరత తీవ్రమౌతోంది. రబీ సీజన్ కావడం..బ్యాంకులు రుణాలివ్వకపోతుండడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. నెల రోజులు దాటుతున్నా బ్యాంకులు, ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఫించన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. 

దేశ వ్యాప్తంగా పట్టుబడుతున్న కొత్త నోట్లు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా భారీగా కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. ఢిల్లీ కరోల్ బాగ్ హోటల్ లో రూ. 3.25 కోట్లు..పనాజీలో రూ. 68 లక్షల నగదు..బెంగళూరులో రూ. 2.25 కోట్లు..జైపూర్ లో రూ. 16.94 లక్షలు..ఇందులో ఐదుగురు అరెస్టు..కలంగుట్ లో రూ. 24 లక్షల నగదు...ముగ్గురి అరెస్టు..రాయ్ గఢ్ లో రూ. 13లక్షలు..ఇందులో ఇద్దరిని అరెస్టు చేశారు.

10:49 - December 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వాతావరణం మారింది. చలి స్వల్పంగా తగ్గింది. చాలా చోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. భద్రాచలం వద్ద చలి కొనసాగుతుంంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:45 - December 14, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 36 రోజులైన పేదలకు కష్టాలు తప్పడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. మరోవైపు ఏటీఎంల్లో క్యాష్‌ నింపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. ఏటీఎంల దగ్గరికి ఆశగా వచ్చిన జనానికి నో క్యాష్‌బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక చిరు వ్యాపారులు నగదు కోసం పడుతున్న కష్టాలైతే అన్నీ ఇన్నీకావు. కూరగాయల వ్యాపారుల, టిఫిన్‌సెంటర్స్‌,తోపుడుబండ్లు, బడ్డీకొట్టు,చిన్నచిన్న షాపులు నడిపేవారి వ్యాపారాలు డీలా పడ్డాయి. 2000 నోటుకు చిల్లర లేకపోవడంతో వ్యాపారాలు సాగడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

10:43 - December 14, 2016

చెన్నై : వర్దా తుఫాన్‌నుంచి తేరుకోకముందే తమిళనాడుకు మరో ముప్పు ముంచుకొస్తోంది.. వచ్చే 24గంటల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.. ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. మరోవైపు వర్దానుంచి చెన్నై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చెన్నై నుంచి రైళ్లు, విమానాల రాకపోకల పునరుద్ధరణ జరుగుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో నాలుగైదు రోజుల సమయం పట్టనుంది. రోడ్లపై అడ్డంగా విరిగిపడిన నాలుగు వేల వృక్షాలను సిబ్బంది తొలగిస్తోంది. కూలిపోయిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. కొన్ని చోట్ల మగ్గుతున్న ప్రజలు ఇంకా అంధకారంలోనే ఉన్నారు. తుపాను వల్ల రూ.6749 కోట్ల నష్టం వాటిల్లిందన్న అసోచామ్ తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:39 - December 14, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, గంగారాం పాల్గొని, మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లకుభేరులు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదని.. సామాన్యులే ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విధానం మంచిదైనా... అమలు తీరు సరిగ్గా లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:34 - December 14, 2016

ప్రయివేట్‌ యూనివర్సిటీలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ప్రమాదమని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. 'తెలంగాణలో ప్రయివేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ప్రయివేట్‌ యూనివర్సిటీలకు ఆమోదం తెలిపింది. విధివిధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటయ్యింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది . ఒకవైపు ప్రయివేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంటే, మరోవైపు అంతే తీవ్రంగా విద్యార్థి సంఘాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో యూనివర్సిటీల పరిస్థితి ఏమిటి? ప్రయివేట్‌ యూనివర్సిటీల రాకను విద్యార్థి సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రయివేట్‌ యూనివర్సిటీలు నెలకొల్పితే  జరిగే నష్టం ఏమిటి? యూనివర్సిటీలలో ప్రమాణాలు పెరగాలంటే ఏం చేయాలి? వంటి అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:28 - December 14, 2016

ఢిల్లీ : దేశంలో నల్లధనాన్ని ఆరికడుతానని.. నల్లకుబేరుల ఆటకట్టిస్తానని.. సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతానని ప్రగల్భాలు పలుకుతూ ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. మరి అనుకున్నట్లే నల్లకుబేరుల ఆటకట్టిస్తున్నారా..? సామాన్యుల కష్టాలు తీరుస్తున్నారా.. ? నోట్ల రద్దు నిర్ణయంతో మోదీ అనుకున్నది సాధించారో లేదో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.. 
నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయం
నల్లధనం ఆట కట్టిస్తానని ప్రధాని మోదీ నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలోనే ఇది కీలక నిర్ణయమని ప్రకటించారు. సామాన్యులు, నిజాయితీపరులు గుండెల మీద చేయి వేసుకుని దర్జాగా బతకవచ్చని చెప్పారు. నల్లకుబేరులు మాత్రం నోట్ల మార్పిడి చేసుకోవడంలో తలకిందులవుతారని తెలిపారు. అయితే ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. 
మెడీ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత
నోట్ల రద్దు నిర్ణయం జరిగిన రోజు సామాన్యులందరూ మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశసించారు. కానీ రోజులు గడిచే కొద్దీ సామాన్యుల దగ్గర అవసరాలకు కూడా తమ డబ్బును తాము తీసుకోవడానికి నానా కష్టాలు ఎదుర్కోవడంతో ప్రజలు రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర కిలోమీటర్ల మేర నిలబడడంతో జనాల్లో తీవ్ర అసహనం పెరిగిపోయింది. 

 

10:23 - December 14, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్లాట్‌ ఫాంపై ఆడుకుంటున్న ఓ రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడ్డాడు. ఇదే సమయంలో పట్టాలపై నుంచి వెళ్తున్న ట్రైన్‌.. బాలుడిపై నుంచి వెళ్లింది. దీంతో అందరూ చూస్తుండగానే పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన స్థానికులందర్నీ తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదం జరుగుతున్నప్పుడు పక్కనే తల్లిదండ్రులు ఉన్నా.. ఏమీ చేయలేని పరిస్థితి. అప్పటికే రైలు కదులుతుండటంతో చూస్తు ఉండిపోయారు. పట్టాలపై పడ్డ పిల్లాడిని కాపాడేందుకు ప్రయత్నించినా.. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు గుండెలావిసేలా రోదిస్తుండడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది. 

 

10:21 - December 14, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కేసుల యుద్ధం ప్రారంభం కాబోతోందా? అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్‌ మరింత ముదరనుందా? ఓటుకు నోటు కేసును పదే పదే ప్రస్తావిస్తూ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు అండ్ టీం జగన్ కేసుల పురోగతిని ప్రశ్నించనుందా? ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్నాయా? 
టీడీపీ, వైసీపీ మధ్య ముదురుతున్న వార్‌ 
ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంటుంది. ఇరు పక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత అంశాలపై ఈ రెండు పార్టీలు చేసుకుంటున్న పరస్పర విమర్శలు పొలిటికల్‌ హీట్‌ను పెంచుతున్నాయి. లోకేశ్ విదేశీ టూర్ నుంచి మొదలై విజయసాయి రెడ్డికి వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వడం వరకు రెండు పార్టీల మధ్య పదే పదే వ్యక్తిగత ఆరోపణలు సంధించుకుంటున్నాయి. ప్రత్యేక హోదా, భూసేకరణ తదితర ప్రజా సమస్యలపై ఏపీలో విపక్షాలు గళమెత్తుతున్నాయి. వీరితో వైసీపీ గొంతు కలుపుతూనే..మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఓటుకు నోటు కేసు దర్యాప్తును ప్రశ్నిస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటీషన్‌ వేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరింది. అయితే ఆళ్ల పిటిషన్‌ హైకోర్టు కొట్టివేయడంతో.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని..అందుకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయనేది ఆళ్ల వాదన. 
వైసీపీకి కౌంటర్‌ ఇచ్చేందుకు టీడీపీ మైండ్‌గేమ్‌ 
మరోవైపు వైసీపీ పదే పదే ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ చంద్రబాబును టార్గెట్ చేయడాన్ని టీడీపీ మండిపడుతోంది. జగన్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు అక్రమాస్తుల కేసులో దర్యాప్తు పురోగతిని ప్రశ్నించేందుకు సమాయత్తమవుతోంది. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కడానికి ప్లాన్‌ చేస్తోంది. ముళ్లును ముళ్లుతోనే తీయాలన్న వ్యూహంతో చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారట. అందుకే జగన్‌పై ఉన్న కేసులను కేసులతోనే తిరగదొడేందుకు ఆ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ముందు కోర్టును ఆశ్రయించడమా? లేక జగన్ అక్రమాస్తుల కేసు, క్విడ్ ప్రోకో కేసుల దర్యాప్తు మందగించడంపై కేంద్రాన్ని ప్రశ్నించడమా అన్న విషయంపై టీడీపీ మల్లగుల్లాలు పడుతుందట. మొన్నటి ఢిల్లీ టూర్‌లో చంద్రబాబు కేంద్రంలోని పెద్దల వద్ద జగన్ కేసుల ప్రస్తావన తీసుకువచ్చినట్లు సమాచారం.. మరో వైపు ఇదే కేసుల దర్యాప్తునకు సంబంధించి విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. శుక్రవారం జరిపే విచారణను సీబీఐ కోర్టు ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించడంతో జగన్ వర్గం కంగుతింది. 
మరింత వేడేక్కనున్న రాజకీయాలు 
తాజా పరిస్థితులు, టీడీపీ కొత్త వ్యూహం నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడేక్కనున్నాయనేది విశ్లేషకుల మాట. ఒకవేళ చంద్రబాబు ఒత్తిడి మేరకు జగన్‌ కేసులపై కేంద్రం దర్యాప్తును వేగవంతం చేస్తే జగన్‌కు చిక్కులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీ ప్రయత్నాలకు జగన్‌ పార్టీ ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి. 

 

10:20 - December 14, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల కేసులో ఎన్ ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ ఈ పేళ్లకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. నేరం రుజువుకావడంతో ఈ కేసులో ఐదుగురి నిందితులను ఎన్ ఐఏ కోర్టు దోషులుగా ప్రకటించింది. వచ్చే సోమవారం వీరికి శిక్షలు ఖరారు చేయనుంది. దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేళ్లు కేసు తీర్పు వెలువడింది.  మూడున్నరేళ్లుగా ఈ కేసుపై విచారణ జరిపిన  ఎన్‌ఏల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.  
జంట బాంబు పేలుళ్లలో 19 మంది మృతి
2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్‌ థియేటర్‌ సమీపంలో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనలో 19 మంది మరణించారు. మరో 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో సరూర్‌నగర్‌, మలక్‌పేట పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు రియాజ్‌ భక్తల్‌ ఈ కేసులో ప్రధాన సూత్రధారని నిర్ధారించింది. అసదుల్లా అక్తర్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌లు ప్రత్యక్షంగా సైకిళ్లపై బాంబులు పెట్టి పేల్చినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఆధారాలు సేకరించింది. యాసిన్‌ భక్తల్‌, ఇజాబ్‌ షేక్‌లు కుట్రలో కీలక పాత్ర పోషించినట్టు తేల్చింది. వకాస్‌ పాకిస్థాన్‌ జాతీయుడు కాగా, మిగిలినవారు కర్నాటక, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారుగా ఎన్‌ఐఏ గుర్తించింది. అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భక్తల్‌, ఇజాజ్‌ షేక్‌లు చర్చపల్లి జైల్లో ఉంటున్నారు. పరారీలో ఉన్న రియాజ్‌ భక్తల్‌ పాకిస్థాన్‌లో ఉండొచ్చని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ కేసులో 502 ఫైళ్లు, 201 వస్తువులను కోర్టు పరిశీలించిన కోర్టు, ఈ ఐదుగుర్ని దోషులుగా తేల్చింది. ఈనెల 19న రెండు పక్షాల వాదనలువిని  శిక్ష ఖరారు చేయనుంది. మొత్తంమీద దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు ఐదుగుర్ని దోషులుగా తేల్చడంతో విచారణ కొలిక్కి వచ్చినట్టు అయ్యింది. 

10:18 - December 14, 2016

రాజమౌళి..దర్శక ధీరుడు అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి. వరుస సక్సెస్ లతో దూసుకపోతున్న దర్శకుడు. ‘బాహుబలి' సినిమాతో టాలీవుడ్ స్టామినా ప్రపంచానికి తెలియచెప్పాడు. ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ లో 'రాజమౌళి' బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు ఇందులో ఆన్సర్ దొరుకుతుందంట. వచ్చే వేసవి అంటే ఏప్రిల్ నెలలో 'బాహుబలి -2’ సినిమా విడుదల చేసేందుకు 'రాజమౌళి' ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం అనంతరం ఆయన ఏ చిత్రం తీస్తారు ? ఎవరు హీరో ఉంటారు..తదితర ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి. ‘ఈగ-2’, ‘మహాభారతం'...ఇలా చిత్రాలు తీస్తారని టాక్ వినిపించింది. తాజాగా మరో వార్త బయటకొచ్చింది. ‘రాజమౌళి' నెక్ట్స్ సినిమా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' తో ఉంటుందని సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ మంచి స్టోరీ లైన్ తో 'అమీర్' తో సినిమా తీసే ఆలోచనలో 'రాజమౌళి' ఉన్నట్లు బాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా ? కాదా ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు..

10:17 - December 14, 2016

చెన్నై : వర్దా తుపాను తమిళనాడు రాష్ట్రాన్ని తీవ్రంగా కకావికలం చేసింది. తుపాను వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. తుపాను సృష్టించిన వియలంతో అతలాకుతలమైన చెన్నై నగరం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తేరుకుంటోంది. రాష్ట్రంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
రూ.6749 కోట్ల నష్టం వాటిల్లిందన్న అసోచామ్ 
వర్దా తుపాను ధాటికి తమిళనాడులో 6,749 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అసోచామ్ నివేదిక తెలిపింది. తమిళనాడులో ఆస్తి నష్టం బాగానే జరిగిందని, దాన్ని నుంచి తేరుకోవడానికి కూడా కొంత సమయం పట్టవచ్చని అసోచామ్ వెల్లడించింది. మరోవైపు వర్దా తుపానుతో చిన్నాభిన్నమైన చెన్నై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కూలిపోయిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. స్తంభించిన రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. 
అస్తవ్యస్థంగా మారిన చెన్నై   
తుపాను దెబ్బకు చెన్నై నగరం అస్తవ్యస్థంగా మారింది. ఎక్కడ చూసినా కూలిన వృక్షాలు, విత్యుత్‌ స్తంభాలే దర్శనం ఇస్తున్నారు.  నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై అడ్డదిడ్డాలుగా పడిన నాలుగువేల వృక్షాలను ముక్కులు కోసి రవాణ చేసేందుకు నాలుగువేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. చెట్లు తొలగించిన ప్రాంతాల్లో రవాణ వ్యవస్థను పురుద్ధరించినా... పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు పడుతుందని భావిస్తున్నారు. చెన్నై హైకోర్టు ఆవరణలో పడిపోయిన భారీ వృక్షాలను తొలగించే పనిని జాతీయ విపత్తు స్పందన బృందాలు చేపట్టాయి.  
చెన్నైలో నేలకూలిన 482 విద్యుత్‌ స్తంభాలు 
విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో చెన్నైతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా అంధకారం నెలకొని ఉంది. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించినా, మరికొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. చెన్నైలో 482, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వేల విద్యుత్‌ స్తంభాలు పడిపోయినట్టు అధికారులు లెక్కలు తేల్చారు. వీటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరించేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో అప్పటివరకు ప్రజలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి తప్పడం లేదు. 
285 లోతట్టు ప్రాంతాల్లో నిల్చివున్న నీరు 
వర్దా తుపాను తీరం దాటిన తర్వాత కురిసిన కుంభవృష్టితో చెన్నైలోని 23 సబ్‌ జైళ్లలోకి చేరిన  వర్షం నీటిని విద్యుత్‌ మోటార్ల సాయంతో తొలగిస్తున్నారు. నగరంలోని 285 లోతట్టు  ప్రాంతాల్లో ఇంకా వర్షపు నీరు నిలిచే ఉంది. తుపానులో మూతపడిన పెట్రోలు బంకులను తెరిశారు. చెన్నై-గూడూరు రైలు మార్గాన్ని పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. తుపానుతో మూసివేసిన విమానాశ్రయాన్ని తెరవడంతో జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వర్దా తుపాను ప్రభావంతో తమిళనాడుకు మరో 24 గంటలపాలు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా 
చెన్నైలో చిన్నాభిన్నమైన సమాచారం వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు.  తుపానుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మొత్తం మీద వర్దా పెను తుపాను సృష్టించిన  విధ్వంసం నుంచి  చెన్నై వాసులు పూర్తిగా తేరుకోడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. 

 

10:15 - December 14, 2016

హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, నగదు రహిత లావాదేవీలు వంటి 24 అంశాల ప్రధాన అజెండాగా ఇవాళ తెలంగాణ జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కొత్త క్యాంప్‌ ఆఫీసు  ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి 31 జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కొత్త జిల్లాల పాలన, నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల వంటి అంశాలపై  కలెక్టర్లకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు భేటీ 
కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం జరుగనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ భేటీలో సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సమీక్షిస్తారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర... సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. 
నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహంపై సమీక్ష 
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యేకంగా చర్చిస్తారు. నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. దీనిలో భాగంగా రూపొందించిన టీఎస్‌ వ్యాలెట్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. రాష్ట్ర ప్రజలందరికీ బ్యాంకు అకౌంట్లు ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. ఆయా జిల్లాల్లో చేపట్టిన సాగునీటి  ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు, వ్యవసాయరంగ విస్తరణలో భాగంగా  కూరగాయల తోటలను ప్రోత్సహించడం, రైతులకు నష్టం లేకుండా  పంటలు పండించడంలో సర్కారు తోడ్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రణాళిక శాఖ జిల్లాలవారీగా ప్రణాళికలు సిద్ధంచేసింది. కలెక్టర్లు, జిల్లా అధికారులకు కరదీపికలుగా ఉపయోపడే వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేస్తారు. విధులు నిర్వర్తించే అధికారులకు హ్యాండ్‌బుక్‌లా ఉపయోగపడే విధంగా వీటిని  రూపొందించారు. 
సామాజిక, ఆర్థిక  పరిస్థితులపై సమీక్ష
రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక  పరిస్థితులపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షిస్తారు.  రైల్వే ప్రాజెక్ట్‌లు,  సాగునీటి పథకాలకు  భూసేకరణ చర్యలపై చర్చిస్తారు.  మిషన్ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల అమలును సమీక్షిస్తారు.  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతి, పరిశ్రమల ఏర్పాటుపై చర్చిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు,   విద్యారంగం సమస్యలను అజెండాలో చేర్చారు.  మధ్యాహ్న భోజన పథకం అమలు, గురుకుల విద్యాలయాల ఏర్పాటు, నిర్వహణ అంశాలపై సమీక్ష జరుపుతారు.  ప్రభుత్వ భూములు, అటవీ భూముల పరిరక్షణ, అడవుల పునరుద్ధరణ, సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ,   భవన నిర్మాణాల అనుమతులు, విద్యుత్ సరఫరా, సబ్‌ స్టేషన్ల నిర్మాణం  తదితర అంశాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమీక్షిస్తారు. జిల్లా పునర్వస్థీకరణ తర్వాత మొదటిసారి నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 

తమిళనాడును వెంటాడుతున్న కష్టాలు

చెన్నై : తమిళనాడును కష్టాలు వెంటాడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ధా తుపాను ప్రభావం నుంచి చెన్నై క్రమంగా కోలుకుంటుంది. 

 

బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు

హైదరాబాద్ : కరెన్సీ కష్టాలు 37 వ రోజు కొనసాగుతన్నాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య జనం పడిగాపులుగాస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన చిల్లర కొరత ఉంది. బ్యాంకులు రుణాలివ్వడం లేదు. రబీ సీజన్ కావడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. నెల రోజులు దాటినా బ్యాంకులు, ఏటీఎంలలో 
నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ సభ్యులకు విప్ లు జారీ

ఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ లు జారీ చేశారు. సభలకు తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేశారు. సమావేశాలు ఇంకా మూడు రోజులే ముగిలివున్నాయి. నేడు అగస్టా కుంభకోణం, త్యాగి అరెస్టుపై చర్చకు డిమాండ్ చేసే యోచనలో బీజేపీ ఉంది. నోట్ల రద్దుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టనుంది.

ఢిల్లీలో రూ.3 కోట్ల నగదు సీజ్

ఢిల్లీ : హస్తినలో 3 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. కరోల్ బాగ్ హోటల్ లో క్రైం బ్రాంచ్, ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 

ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు

ఢిల్లీ : హస్తినలో పొగమంచు కమ్ముకుంది. 61రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 13 రైళ్లను రద్దు చేశారు. 7 రైళ్ల వేళల్లో మార్పు చేశారు. 

09:47 - December 14, 2016

శరీరంలోని ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ధృడంగా ఉంటేనే పనులు చేయగలం..ఏదైనా చేయగలం. ఎముకలు ధృడంగా లేకపోతే పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి ? సరైన డైట్ పాటించకపోవడం..వ్యాయామం చేయకపోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉండవు. ఎప్పుడు ఎముకలు బలహీనం అవుతాయో కదలికలు ఇబ్బందిగా మారుతాయి. ఎముకలకు విటమిన్‌ డి క్యాల్షియం అవసరం ఉంటుంది.

  • గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే ఎముకలకు తగిన క్యాల్షియం లభిస్తుంది.
  • తాజా పండ్ల రసాలను తీసుకోవడం ద్వారా విటమిన్‌ 'డి' లభిస్తుంది.
  • పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, నట్స్ తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సిన శక్తి లభిస్తుంది.
  • తాజా కూరగాయలు తీసుకోవడం ఎముకలకు చాలా మంచిది.
  • బీట్ రూట్, క్యారెట్, దోసకాయ, బీన్స్ వంటివి తీసుకుంటే 'ఎ' విటమిన్ లభిస్తుంది. కాలీ ఫ్లవర్ కూడా తీసుకోవాలి. ఇందులో 'కే' విటమిన్ లభిస్తుంది.
  • వీటితో పాటు ప్రతి రోజు వాకింగ్, తదితర వ్యాయామాలు చేయాలి.
  • తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది. ఎప్పటికీ ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది. 
09:21 - December 14, 2016

కృష్ణా హారతి..విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్కరాల నుండి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సూర్యస్తమయ సమయంలో నది ఒడ్డు నుంచి వేద పండితులు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారీ సెట్టింగ్ ల మధ్య విద్యుత్ దీపాల ధగధగల మధ్య పండితులు ఇచ్చే హారతిని వీక్షిచేందుకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. కానీ మంగళవారం మాత్రం కృష్ణా హారతి ఇచ్చే ప్రాంతంలో అంధకారం నెలకొంది. హారతి కార్యక్రమానికి కొద్దిసేపటి ముందే ఏపీ విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. బిల్లు చెల్లించనందుకే కరెంట్ కట్ చేశామని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 12 లక్షల బిల్లు బకాయి ఉందని తెలుస్తోంది. దీనితో జనరేటర్ సహాయంతో హారతి కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. మరి బిల్లు చెల్లిస్తారా ? హారతి కార్యక్రమం యదావిధిగా కొనసాగుతుందా ? ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

09:08 - December 14, 2016

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేషమియా కంపెనీ హెచ్ఆర్ మ్యూజిక్ లిమిటెడ్ సీఈవో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. గత ఆరేళ్లుగా హిమేష్ రేషమియా మ్యూజిక్ కంపెనీలో ఈయన పనిచేస్తున్నాడు. ముంబైలోని ఓషివారాలో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లి, ప్రియురాలు మాట్లాడుకుంటున్న సమయంలో ఇంట్లోని ఓ గదిలోకి ఆండీ సింగ్ వెళ్లాడు. తల్లి చీరతో ఉరివేసుకున్నాడు. కుర్చీ కిందపడ్డ శబ్దం విన్న ఆండీ సింగ్ తల్లి, ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలుస్తోంది. ఓ యువతి..సింగ్ మధ్య వాగ్వాదం జరిగిందని, దీనితో అతను తీవ్ర మనోవేదనకు గురయినట్లు వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత ఒత్తిడిల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆండీ సింగ్ కి తల్లి, భార్య.. ఇంకా తొమ్మిది ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. అయితే భార్యతో విభేదాల కారణంగా భార్యతో దూరంగా ఉంటున్నట్టు తరుచూ తనతో గొడవపడుతున్నాడని కూడా తెలుస్తోంది. ఆండీ సింగ్ ఆత్మహత్య తో ముంబై సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

బీసీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

హైదరాబాద్ : తెలంగాణలో బీసీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై నేటి నుంచి 4 రోజుల పాటు బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. 

నేడు తెలంగాణ కలెక్టర్ల సదస్సు

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు తెలంగాణ కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, రహదారులు, రైలు మార్గాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం తదితర 20 అంశాలపై చర్చించనున్నారు. 

నేడు పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

ఢిల్లీ : నేడు పార్టీ సీనియర్ నేతలతో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

Don't Miss