Activities calendar

15 December 2016

22:08 - December 15, 2016

పశ్చిమ బెంగాల్ : కోల్‌కతాలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఉర్జిత్ పటేల్‌ను అడ్డుకొని దుర్భాషలాడటంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి కారులో ఉర్జిత్ పటేల్ వెళ్లిపోయారు.

22:06 - December 15, 2016

ఢిల్లీ : నోట్ల సమస్య రోజురోజుకు తగ్గిపోతోందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్‌ అన్నారు. అవసరమైన మేరకు 2 వేల నోట్లు అందుబాటులో ఉంచుతామని, ఇకపై 500 నోట్ల ముద్రణపై దృష్టి పెడతామని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రెండు పథకాలు ప్రవేశపెట్టినట్లు నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ వెల్లడించారు.

కొత్త నోట్లు పూర్తి సురక్షిత: శక్తి కాంత్ దాస్
కొత్త నోట్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆర్థిశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. తొలిసారిగా క‌రెన్సీ నోట్లను మ‌న దేశంలోనే అత్యంత ప‌క‌డ్బందీగా, ర‌హ‌స్యంగా రూపొందించామ‌ని, వాటికి న‌కిలీలు వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌న్నారు. అవసరమైన మేరకు 2 వేల నోట్లు అందుబాటులో ఉంచుతామని, ఇక నుంచి 5 వందల నోట్లను ఎక్కువగా ప్రింట్‌ చేస్తామని తెలిపారు. 50, వంద రూపాయల నోట్ల ముద్రణ కూడా కొనసాగుతోందని శక్తికాంత్‌దాస్‌ చెప్పారు.

కొత్త నోట్ల సరఫరా రోజు రోజుకు మెరుగవుతోంది : శక్తి కాంత్
కొత్త నోట్ల సరఫరా రోజు రోజుకు మెరుగవుతోందని శక్తికాంత్‌దాస్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త క‌రెన్సీ నోట్ల కొర‌త లేకుండా చేసేందుకు విమానాల ద్వారా నగదు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ‌త ఐదు వారాల్లో వంద నోట్లను భారీగా పంపిణీ చేశామ‌ని... ఆర్బీఐ మొత్తం ఏడాది పంపిణీ చేసేదాని కంటే ఇది మూడు రెట్లు అధిక‌మ‌న్నారు. జిల్లా కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో కూడా కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు.

ఒక‌ర‌కంగా ఇవి స‌ర్జిక‌ల్ దాడులే : శక్తి కాంత్
దేశంలోమొత్తం రెండు ల‌క్షల 20 వేల ఏటీఎంల‌ు ఉండగా... ఇప్పటికే రెండు లక్షల‌కుపైగా ఏటీఎంల‌ను కొత్త నోట్లకు అనుగుణంగా మార్పు చేశామన్నారు. అక్రమంగా కోట్ల కొద్దీ కొత్త నోట్లు పొందిన‌వారిపై ప‌క్కా స‌మాచారం మేర‌కే దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఒక‌ర‌కంగా ఇవి స‌ర్జిక‌ల్ దాడుల్లాంటివేన‌ని శక్తికాంత్‌దాస్‌ స్పష్టం చేశారు.

22:02 - December 15, 2016

ఢిల్లీ : కరెన్సీ కష్టాలపై.. సుప్రీం కోర్టు..కేంద్రానికి క్లాస్‌ తీసుకుంది. కొత్త కరెన్సీ కోసం సామాన్యులు నానా పాట్లు పడుతుంటే..మరికొంతమంది దగ్గర కట్టల కొద్దీ కొత్తనోట్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించింది. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితిపై విస్మయం వ్యక్తం చేసింది.

కరెన్సీ కష్టాలపై కేంద్రానికి సుప్రీం క్లాస్‌
నోట్ల రద్దు తర్వాత.. ప్రజలకు నగదు కష్టాలు మొదలయ్యాయి. కనీస అవసరాలు తీరక అవస్థలుపడుతున్నారు. వెయ్యి..రెండు వేల కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ...డబ్బు దొరుకుతుందో లేదోననే ఆందోళన.. ఇదే సమయంలో లక్షల రూపంలో కొత్తకరెన్సీ నల్లధనం రూపంలో పట్టుబడుతుంది. దీనిపై సుప్రీం కోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఇదేలా సాధ్యమవుతుందని కేంద్రాన్ని నిలదీసింది.

పెద్దనోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ
దేశంలో పెద్దనోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలు బ్యాంకుల్లో కనీసం రూ.24వేలు తీసుకోలేకపోతున్నారని.. ఈ తరుణంలో కొందరి వద్దకు లక్షలు లక్షలు కొత్త కరెన్సీ ఎలా వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ప్రజలు ఉన్నారనీ.. కట్టలకొద్దీ కొత్తనోట్లు ఉన్నవారు ఒకరైతే.. చేతిలో చిల్లిగవ్వలేని వారు మరొకరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని కేంద్రం వివరణ
సుప్రీం ప్రశ్నలకు వివరణ ఇస్తూ.. కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని అటార్నీ జనరల్‌ న్యాయస్థానానికి తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. అలాగే నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను రూపుమాపేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని నివేదించారు. 

21:59 - December 15, 2016

గుంటూరు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు పలికిన పవన్ ఇటీవల పలు ప్రజా సమస్యలపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను నీలదీస్తున్నారు. ఈ సారి ట్వీట్టర్ వేదికగా ఐదు అంశాలపై పవన్ స్పందించారు.

ఐదు ప్రధాన అంశాలపై ప్రశ్నిస్తానన్న పవన్
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కూటమికి మద్దతు పలికిన పవన్ ఇటీవల ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అనేక ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ప్రశ్నించిన పవన్ దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన అంశాలపై ట్వీట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నీలదీస్తానన్నారు. పవన్ గోవధపై బీజేపీకి తన మొదటి ప్రశ్నను సంధించారు.

మేధావులు, రాజకీయ నేతలు, జర్నలిస్టులతో ఆధ్యయనం చేసిన పవన్
మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులు, జర్నలిస్టులను తదితరులతో లోతుగా వీటి గురించి అధ్యయనం చేసిన తర్వాతనే పవన్ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలిపారు. తను అడిగే ప్రశ్నలకు బీజేపీ, టీడీపీలు సమాధానం చెప్పాలని పవన్ కోరారు.

ఐదు అంశాలపై వరుసగా ఐదురోజులు ప్రశ్నలు: పవన్
ఐదు అంశాలపై వరుసగా ఐదురోజులు తన ప్రశ్నలు ఉంటాయని చెప్పిన పవన్ మొదటి రోజు గోవధపై ప్రశ్నలు సంధించారు. గోవధ నిషేధంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం పట్ల నిజాయితీ ఉంటే లెదర్‌తో తయారుచేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలన్నారు. గోవులను రక్షించాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు. తను అడుగుతానన్న ఐదు అంశాల్లో గురువారం గోవధ గురించి ప్రశ్నించిన పవన్ శుక్రవారం వేమలు రోహిత్ ఆత్మహత్య అంశంపై ప్రశ్నిస్తానని ట్వీట్ చేశారు. 

21:56 - December 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు దేశానికే ఆదర్శంగా నిలవాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. సమావేశాలు పొడిగించేందుకు మాకు అభ్యంతరం లేదని...విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. డబుల్‌బెట్‌రూం ఇళ్లు, ఎన్నికల మెనిఫెస్టో, నయీం ఎన్‌కౌంటర్‌.. అంశం ఏదైనా చర్చకు సిద్ధమేనని హరీష్ రావు ప్రకటించారు. 

21:52 - December 15, 2016

అమరావతి : ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించి 8 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పుట్‌పాత్‌లపై చిరువ్యాపారులకు లైసెన్సులు ఇవ్వాలని...రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాలను స్మార్ట్‌సిటీలుగా తీర్చి దిద్దాలని నిర్ణయించారు. అలాగే జక్కంపూడిలోని 265 ఎకరాల్లో ఎకానమిక్‌ సిటీ నిర్మించాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయంతో పాటు.. పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు..
గుంటూరు జిల్లా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సుమారు 3 గంటల పాటు సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణాభివృద్ధికి సంబంధించిన 8 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పుట్‌పాత్‌లపై చిరువ్యాపారులకు ప్రత్యేకజోన్‌ ఏర్పాటు చేసి లైసెన్స్‌లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన స్మార్ట్‌ సిటీ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాలను స్మార్ట్‌సిటీలు చేయాలని నిర్ణయించారు.

జక్కంపూడిలోని 265 ఎకరాల్లో ఎకానమిక్‌ సిటీ
జక్కంపూడిలోని 265 ఎకరాల్లో ఎకానమిక్‌ సిటీ నిర్మించాలని నిర్ణయంతీసుకున్నారు. పట్టణాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసురూల్స్‌పై కీలక చర్చ జరిగింది. సెర్ఫ్‌లో పనిచేస్తున్న 538 మంది ఉద్యోగులకు 35 శాతం జీతాలు పెంచాలని నిర్ణయించారు. రాజధానికి సంబంధించిన 98 కి.మీ. మేర ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, 156 కి.మీ. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నెల్లూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం, కడప జిల్లాల్లో పలు భూ కేటాయింపులకు సంబందించి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

 

 

21:48 - December 15, 2016

హైదరాబాద్ : జానారెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై హైకమాండ్ సూచనలపై సీఎల్పీలో చర్చ జరిగింది. గత సమావేశాల మాదిరిగా సాఫ్ట్‌గా వ్యవహరిస్తే పార్టీకి నష్టం జరుగుతోందని...దీన్ని టీఆర్ఎస్ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉందని కొందరు ఎమ్మెల్యేలు, సీఎల్పీలో ప్రస్తావించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైన్, అంచనాల పెంపులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్...ఈ అంశాలపై సభావేదికగా సర్కార్‌ను తూర్పార బట్టాలని నిర్ణయించింది. ఈ అంశాలపై సభలో మాట్లాడేందుకు సభ్యులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకెళితే అవిశ్వాస అస్త్రం సంధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  

21:45 - December 15, 2016

హైదరాబాద్ : రేపటినుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ దళపతి నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేసినా.. ఒపిగ్గా... సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు గులాబీ దళం సిద్ధమైంది..
అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు గులాబీ దళం సిద్ధమైంది. ఇప్పటికే అనేక సమీక్షల ద్వారా సభలో ఎలా వ్యవహరించాలో సీఎం కేసీఆర్‌ నేతలకు క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నా.. దీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నామనే సంకేతాలిచ్చారు. శాసనసభ్యులు సంయమనంతో సమాధానమివ్వాలని సూచించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారొద్దని ఆదేశించారు.

సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి : కేసీఆర్
ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రశ్నించేందుకు నాలుగైదు అంశాలు తప్ప మరేవీ లేవని సీఎం అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని.. సభ్యులంతా ఏ అంశం చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశాన్ని స్వాగతిస్తూనే.. ఆచితూచి స్పందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్దామన్నారు.

ఈనెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నా.. విపక్షాల డిమాండ్‌ మేరకు మరికొన్ని రోజులు సమావేశాలను పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేసీఆర్. ఇక సమావేశాలు జరుగుతున్న అన్ని రోజులు సభ్యులంతా తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

21:42 - December 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలకు అధికార విపక్షాలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఈనెల 30 వ‌ర‌కు మొత్తం 12 రోజులపాటు సభ నిర్వహించాలని BACలో నిర్ణయించారు. 20 రోజులు సభ నిర్వహించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై సర్కార్‌ సానుకూలంగా స్పందించింది. మరోసారి సమావేశమై వారం రోజులపాటు సమావేశాలు పొడిగిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

16 నుంచి 30 వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల 16 నుంచి 30 వరకు సాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అసెంబ్లీ ఎజెండాపై సుదీర్ఘంగా చర్చించారు. స్పీకర్ మధుసూదనా చారి అధ్యక్యతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి,.. సీఎల్పీ నుంచి జానారెడ్డి, భ‌ట్టి విక్రమార్క,.. టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య, జీజేపీ నుంచి కిషన్‌రెడ్డి,.. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి సున్నం రాజయ్య హాజ‌ర‌య్యారు.

20 రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాల డిమాండ్‌
ఇక బీఏసి సమావేశం ప్రారంభం కాగానే కనీసం 20 రోజులపాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. అయితే ముందుగా ఈనెల 30 వరకు అసెంబ్లీని నిర్వహించుకుందామని.. ఆ తరువాత అవసరమైతే మళ్లీ సమావేశాలను పొడిగించుకోవచ్చని సీఎం సూచించడంతో అంతా అంగీకరించారు. దీంతో ఈనెల 30 వరకు మొత్తం 12 పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.

పెద్ద నోట్ల రద్దు అనంతర సమస్యలపై చర్చించాలన్న కాంగ్రెస్‌
ఇక అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపైనా బీఏసీలో చర్చించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయ‌గా.. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంపై మనం ఎలా చర్చిస్తామన్నట్లు తెలుస్తోంది. సీఎం వ్యాఖ్యల‌పై స్పందించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌.. నోట్ల రద్దు కేంద్రం పరిధిలోనిదైనా తెలంగాణలో సైతం సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని .. దానిపై చర్చిస్తే తప్పేంటని అన్నారు. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చించాలని నిర్ణయించారు.

సమావేశాలు పొడిగిద్దామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన జానా, భట్టి
జనవరి 2 నుంచి అసెంబ్లీ పొడిగిద్దామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై జానారెడ్డి, భట్టి విక్రమార్కలు కలగజేసుకున్నారు. గత బీఏసీలో కూడా ఇలాగే తేదీలను ఖరారు చేసి సభను ఒకరోజుకే పరిమితం చేసి అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడాన్ని ప్రస్తావించారు. గత అనుభవాలు ఇలావుంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటూ.. సీఎంను నిలదీశారు. దీంతో మధ్యలో కలగజేసుకున్న కేసీఆర్‌.. అసెంబ్లీని ప్రోరోగ్‌ చేసేముందు శాసనసభాపక్ష నాయకులకు స్పీకర్‌ సమాచారం ఇవ్వకపోవడం పొరపాటేనన్నారు. ఈసారి అలా జరగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ప్రశ్నోత్తరాల సమయం గంటన్నర పాటు పొడిగిస్తూ నిర్ణయం
గ‌త స‌మావేశాల‌కు భిన్నంగా ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని గంటన్నరపాటు పొడిగిస్తూ బీఏసీ నిర్ణయం తీసుకుంది. మొదటి రోజు పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ జరగనుంది. మిగతా రోజులకు ఎజెండాను ఇవ్వాలని స్పీకర్‌ అన్ని పక్షాలకు సూచించారు. ఈ నెలాఖరులో బీఏసీ మరోసారి సమావేశమై జనవరి రెండు నుంచి జరిగే సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.

 

ఉర్జిత్ పటేల్ కు చేదు అనుభవం..

పశ్చిమ బెంగాల్ : సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు చేదు అనుభవం ఎందురైంది. పెద్దనోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వాస్తవ పరిస్థితులు వివరించేందుకు ఉర్జిత్ పటేల్ కోల్ కతా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉర్జిత్ పటేల్ పై పలువురు దాడికి యత్నించారు. నానా దుర్భాషలాడుతూ ఆయనపైకి దూసుకెళ్లారు. ఊహించని పరిణామంతో ఉర్జిత్ పటేల్ బిత్తరపోయారు. భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి, ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు.

20:53 - December 15, 2016
20:48 - December 15, 2016

పశ్చిమగోదావరి జిల్లాలోని భీవరం సమీపంలోని తుందుర్రు..బేతపూడి వంటి తదితర గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రాంత ప్రజలతోనూ..దాన్ని వ్యతిరేకిస్తూ పోరాడిన వ్యక్తులతోనూ మల్లన్న ముచ్చటించాడు. వారి బాధలను..ఇబ్బందులను..పోరాటంలో వారు ఎదుర్కొన్న కష్టాలను అడగి తెలుసుకున్నాడు. గ్రామాల్లో అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే దుస్థితిలో మా గ్రామాల్లో చోటు చేసుకున్నాయని ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంత వాసులు వాపోతున్నారు. మూడు గ్రామాల సమాధులపై ఫ్యాక్టరీ నిర్మిస్తారా? అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులేంటో ఈ వీడియోలో సమగ్రంగా తెలుసుకోండి..

20:44 - December 15, 2016

50రోజుల దిశగా దేశం పరిగెడుతోంది. ఇప్పటికి 35 రోజులు దాటాయి.. కానీ, ఫలితం ఏంటి? పరిస్థితి మరింత విషమిస్తోంది. క్యూలో నిలబడ్డ దేశం నిరాశగా చూస్తోంది. కరెన్సీ సర్జికల్ స్ట్రైక్స్ తో కూలిన బతుకులు అడుగడుగునా కనిపిస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేక ఎలా బతకాలో తెలియక అల్లకల్లోలమవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు..? ఈ దుస్థితి మారేదెపుడు? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. సర్కారుదేముంది ఓ ప్రయోగం చేసింది. రెండ్రోజుల్లో సర్దుకుంటుందని చెప్పింది. కానీ, నెలదాటినా మార్పులేదు. అసలెన్ని నెలలకు ఈ పరిస్థితి మారుతుందో తెలియక సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ ఇంకా ఎన్నాళ్లు తిరగాలా అని విలపిస్తుంటున్నాడు? నల్లధనం అన్నారు.. నకిలీ నోట్లన్నారు.. నాలుగు రోజులే అన్నారు. ఆఖరికి క్యాష్ లెస్ గా మారాల్సిందే అంటున్నారు. కానీ, బ్యాంకులు లేవు.. ఆన్ లైన్ పరిజ్ఞానం లేదు. చేతిలో పైసా లేదు. కనీస అవసరాలకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ప్రజలున్నారిపుడు. మరి ఇప్పుడు సాధించేదిమిటి? దేశానికి ఎలాంటి మేలు జరిగింది? వెనక్కి తీసుకున్న కరెన్సీ కొండంత.. రిలీజ్ చేసింది నలుసంత.. అక్రమార్కులతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కైన సందర్భాలు కనిపిస్తున్నాయి.

మరో పక్క కమీషన్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. పాత నోట్లు మార్చటానికి కమీషన్.. కార్డు స్వైప్ చేస్తే కమీషన్.. ఇవన్నీ అడుగడుగునా.. సామాన్యుడిని నానాఇబ్బందులకు లోను చేస్తున్నాయి. అంతా మీ మంచికే అన్నారు. హామీలు ఇచ్చారు. కానీ జరుగుతున్నది శూన్యం.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు..రెండు వారాలన్నారు..యాభై రోజులంటున్నారు.. ఎంత కాలం? ఎన్నాళ్లకు పరిస్థితి మారుతుంది? ప్రభుత్వమే సృష్టించిన కరెన్సీ కొరత ఇప్పుడు దేశాన్ని ఏ పరిస్థితిలోకి తీసుకెళ్లనుంది? అంతా మీమంచికే అంటారు..హామీలు చాలా ఇస్తారు.. బ్యాంకుల్లో క్యాష్ రెడీ అవుతోంది అంటారు.. ఏటీఎంలు సిద్ధం చేస్తున్నామంటారు.. అన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో జరుగుతున్నది శూన్యం.. ఒకటి రెండు రోజులు కాదు.. 35 రోజుల వ్యధ ఇది. మరెన్ని రోజులు భరించాలో తెలియని బాధ ఇది. ఎందుకీ ఖర్మ అని ప్రశ్నలు.. తమ సొమ్ము తాము తీసుకోలేని పరిస్థితిలో, క్యాష్ లెస్ దిశగా సిద్ధంగా లేని సామాన్యులు సర్కారుకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ పక్క అక్రమార్కుల చేతిలో కొత్త నోట్ల కట్టలు, కమీషన్ దందాలు అడుగడుగునా కనిపిస్తుంటే ఈ డీమానిటైజేషన్ దేశాన్ని ఇంకెన్ని సమస్యల్లోకి నెట్టనుందో అనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

20:06 - December 15, 2016

నోట్ల రద్దుపై ప్రధాని మోదీ ప్రకటన చేసి 37 రోజులు గడిచిపోయాయి.. రోజు రోజుకీ కష్టాలు తగ్గి ప్రజలు పెరుగతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గటంలేదు..దీంతో సామాన్యుల్లో అసహనం పెరిగిపోతోంది. నోట్ల రద్దును ప్రజలు స్వాగతిస్తున్నారనే ప్రధాని మోదీ మాటలు..50 రోజుల్లో ప్రజల కష్టాలు తీరిపోతాయని మోదీ చెప్పిన మాటలు.. నీటి మూటలుగా మారిపోతున్నాయనఏ నానాటికీ విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. మరో వైపు కొత్త నోట్ల కట్టలు కొందరి ఇళ్లల్లో స్వైర విహారం చేస్తున్నాయి.. బ్యాంకులు చేతివాటం ప్రదర్శిస్తున్నాయనీ..బడా నల్ల కుబేరులకు బాటగా నిలుస్తున్నాయనీ..సామాన్యులు మాత్రమే నానా కష్టాలు పడుతున్నాయనే విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్తనోట్ల కొరత వుందని ఒక పక్క అంటుంటే మరోపక్క దేశవ్యాప్తంగా రూ4వందల కోట్ల కొత్త కరెన్సీ పట్టుబడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిఘా వ్యవస్థ అనేది వుందా? వుంటే ఏం చేస్తోంది?..ఇది సామాన్యుడి ప్రశ్న.. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది ఈ చర్చలో వెంకట్రామయ్య (బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి),శ్రీధర్ రెడ్డి (బీజేపీ నేత) వినయ్( కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

19:41 - December 15, 2016

హైదరాబాద్ : బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. పోస్టాఫీసుల పనితీరుపై పెదవి విరుస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల పేరు ఎత్తితేనే జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న వ్యవహారాలపై మండిపడుతున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో పెల్లుబిక్కుతున్న అసహనానికి బ్యాంకులు, పోస్టాఫీసులే సాక్షమవుతున్నాయి.. మరో వైపు కొత్త నోట్ల కట్టలు కొందరి ఇళ్లల్లో స్వైర విహారం చేస్తున్నాయి.. అసలు ఉన్న వ్యవస్థ ఏం చేస్తోంది.. అసలు వ్యవస్థ ఉందా.. ఇది సామాన్యుడి ప్రశ్న..

నోట్ల రద్దు ప్రకటన చేసి 37 రోజులు
నోట్ల రద్దుపై ప్రధాని మోదీ ప్రకటన చేసి 37 రోజులు గడిచిపోయాయి.. రోజు రోజుకీ కష్టాలు తగ్గి ప్రజలు ఇష్టంగా మా నిర్ణయాన్ని స్వాగతిస్తారన్న మోదీ మాటలు నీటి మూటలుగా మారాయన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. కష్టాలు తగ్గకపోగా మరింత పెరగడం ఆందోళన కలించే అంశం. కొత్త నోట్ల కోసం పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. వెరసి ప్రజల్లో తీవ్ర అసహానం బయలుదేరుతోంది.

అక్రమార్కుల దగ్గర నాలుగు వందల కోట్ల కొత్త కరెన్సీ నోట్లు ..
నాలుగు వేల కోసం బ్యాంకుల ముందు.. రెండు వేల కోసం ఏటీఎంల ముందు జనం పడిగాపులు కాస్తుంటే... కొందరు అక్రమార్కుల వద్ద అక్షరాలా నాలుగు వందల కోట్ల కొత్త నోట్లు బయటపడటం చూస్తుంటే ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. కళ్లెదుట జరుగుతున్న ఈ అక్రమ దందాలను చూసి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి అక్రమాలను అరికట్టడంతో వ్యవస్థలు విఫలమయ్యాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలంటూ పాలకులపై ప్రజలు ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. కొత్త నోట్లు దారిమళ్లడం వ్యవస్థీకృతంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అసలు పాలనా వ్యవస్థ ఉందా? అని జనం ప్రశ్నిస్తున్నారు. వారంలో పొదుపు ఖాతాల నుంచి వారంలో 24 వేల రూపాయలు, కరెంట్ అకౌంట్ల నుంచి 50 వేల రూపాయలు తీసుకునే వెసులుబాటు ఉందన్న ఉద్దేశంతో నాలుగు గంటల పాటు బ్యాంకుల్లో వరుసలో నుంచున్నా నాలుగు వేలు కూడా ఇవ్వడంలేదు. ఏటీఎం దగ్గర నో క్యాష్‌ బోర్డులే దర్శనం ఇస్తుండటంతో జనం ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ పాలకులను శాపనార్థాలు పెడుతున్నారు.

సోదాల్లో బయటపడిన కొత్త కరెన్సీ నోట్లు రూ. 400 కోట్లు
కొన్నిచోట్ల కొందరు బ్యాంకు అధికారుల సహాయంతో బడా బాబులు పాత నోట్లను మార్చుకొని కోట్లాది రూపాయిల కొత్త నోట్లను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు 400 కోట్ల కొత్త నోట్లు అక్రమార్కుల ఇళ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన సోదాల్లో బయటపడ్డాయంటే, కరెన్సీ దారిమళ్లింపు వ్యవహారాలు ఎంత భారీగా జరగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో నిఘా వ్యవస్థల పనితీరుపైనా ప్రజలకు అనుమానం కలుగుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు తనకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నదా ? అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత పరిస్థితిని చక్కబెట్టాల్సిన ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కొత్త నోట్ల దారిమళ్లింపు వ్యవహారాలు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సడలేందుకు కారణమవుతున్నాయి. కేంద్రం తీసుకున్నతొందర పాటు నిర్ణయంతో బ్యాంకులు, పోస్టాఫీసులను దోషులుగా ప్రజల ముందు నిలబెట్టి, సర్కార్‌ చోద్యం చూస్తోందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. పాలక పెద్దలు, వ్యవస్థల నిర్వాహకుల్లో జవాబుదారీతనం లోపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ప్రజలు ఎదుర్కొనే నగదు సమస్యలపై కనీస అవగాహన కూడా లేకుండా ఉన్నపళంగా కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు 136 కోట్ల భారతీయులను ప్రభావితం చేస్తోంది.. సామాన్యుల సహనానికి పరీక్ష పెడుతోంది. కొందరి ప్రాణాలను తీస్తోంది. దీనికి సమాదానం చెప్పే దిక్కూమొక్కూ లేకుండా పోయింది.
బడా బాబులకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులు
చైన్నైలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో పట్టుపడ్డ 70 కోట్ల కొత్త నోట్ల కట్టలు నేరుగా సెక్యూరిటీ ప్రింట్రింగ్ ప్రెస్ నుంచి బ్యాంకులకు వెళ్లకుండా నేరుగా ఇతని నివాసానికే చేరాయంటే వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టంపై గౌరవం లేదన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఇలాంటి బడాబాబులకు కొందరు బ్యాంకు అధికారులు సహకరించవచ్చు. కానీ ఇటువంటి వారి భరతం పట్టే నిఘా లేకపోవడం వ్యవస్థలోని వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రధాని మోదీ చెప్పినట్లు నిద్రలేని రాత్రులు నల్ల కుబేరులకు కాదు.. సామాన్యులకు ఎదురవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసున్న నిర్ణయానికి ఇప్పటి వరకు 103 సవరణలు చేశారంటేనే తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని అర్థం కావడం లేదా అన్న ప్రశ్నకు పాలకుల నుంచి సమాధానం లేదు. మొత్తం భారతీయులకు ప్రభావితం చేసే నిర్ణయం తీసుకునే ముందు పూర్వాపరాలను ఆలోచించక పోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతోంది.

నెల 30 వరకే పాత నోట్ల డిపాజిట్‌కు అవకాశం
మరో వైపు పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి ఈ నెల 30 వరకు గడవుంది.. మార్చి 30 వరకు రిజర్వ్ బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటీ... కొంత మొత్తం డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసుకునేటప్పుడు ఎక్కువ మొత్తం చేతికందే పరిస్థితి లేదు. దీంతో కొత్త నోట్లను, వంద నోట్లను డిపాజిట్ చేయడం కంటే దొరికినవి దొరికినట్లు కొంత ఖర్చులకు వినియోగించడం మరికొంత ఇంట్లో బ్లాకు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు...ఇంకో వైపు ప్రైవేటు బ్యాంకులకు అధిక మొత్తంలో కొత్త నోట్లు చేరుతున్నాయని తాజాగా బయటపడుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో ఓ ప్రైవేటు బ్యాంకు లైసెన్సు రద్దు చేసే పరిస్థితి ఉత్పన్నమైందన్న వార్తలు గుప్పుమన్నాయంటే కొత్త నోట్ల దారిమళ్లింపు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నల్ల కుబేరులకు సహకరిస్తున్న వాళ్లలో ప్రైవేటు బ్యాంకుల సిబ్బంది చేతివాటం అధికంగా ఉంటుదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ తరహా అవినీతి, లెక్కలేనితనాన్ని నియంత్రించాల్సిన వ్యవస్థలు కళ్లు మూసుకు కూర్చుకున్నాయా ? అసలు ఏం చేస్తున్నాయంటూ... జనం నిలదీస్తున్నారు.

ధోరణి ప్రబలితే కచ్చితంగా తిరుగుబాటు చేసే అవకాశం
పెద్దనోట్ల రద్దు అనంతర పరిణామాలపై ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ ధోరణి ప్రబలితే కచ్చితంగా తిరుగుబాటుకు కారణమమయ్యే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను పాలకులు అర్థం చేసుకుని, పరిస్థితిని చక్కదిక్కకపోతే ప్రజాస్వామ్యానికి అసలు అర్థాన్ని ప్రజలు చూపిస్తారనడంలో సందేహం లేదు.

 

19:32 - December 15, 2016

గుంటూరు : గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడు గంటలు పాటు సుదీర్ఘంగా మంత్రి వర్గం చర్చించింది. సమావేశం ముగిసిన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. పట్టణాభివృద్దికి సంబంధించిన ఎనిమిది అంశాలకు కేబినెట్ ఆమోదం పలికిందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్ర స్మార్ట్ సిటీల మాదిరిగానే  రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పలు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా శ్రీకాకుళం,ఒంగోలు, నెల్లూరు,కర్నూలు, అనంతపురం పట్టణాలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిందని మంత్రి నారాయణ తెలిపారు. 

19:17 - December 15, 2016

ఛత్తీస్ ఘడ్ : బీజా పూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కలంగూడ అంటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహిస్తుండగా మావోలు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఎనిమిదిమంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో వీరిలో ముగ్గురు మావో ఉన్నతస్థాయి కమాండర్లు వున్నట్లుగా సమాచారం. మృతిచెందిన వారినుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 

8మంది మావోలు మృతి..

ఛత్తీస్ ఘడ్ : బీజా పూర్ జిల్లాలోని కలంగూడ అంటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.ఈ కాల్పుల్లో 8మంది మావోయిస్టు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మావో కమాండర్లు వున్ననట్లుగా సమాచారం. మృతిచెందిన వారినుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

19:01 - December 15, 2016

విజయవాడ : ఆరు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడంలేదంటూ విజయవాడ కేర్ అండ్ షేర్ ట్రస్ట్ కార్యాలయం ఎదుట కార్మికులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేర్ అండ్ షేర్ ట్రస్ట్ పేరిట ఉన్న పలు విద్యాలయాల్లో అనాధ పిల్లలకు కావాల్సిన వసతి సౌకర్యాలు ఆరు నెలల నుంచి అందించడం లేదంటూ ట్రస్ట్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రస్ట్ మేనేజ్ మెంట్ సభ్యుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఈ పరిస్థితికి కారణమన్నారు. ట్రస్టులోని కొంతమంది తమకొచ్చే నిధులను పక్కదారి పట్టించి ట్రస్టును, దాని ఆధారంగా విద్యనభ్యసిస్తున్న వెయ్యి మంది విద్యార్థులను, వారికి సేవలందించే 200 మందికిపైగా కార్మికులను గాలికొదిలేశారంటూ మండిపడ్డారు. తక్షణమే తమకు న్యాయం చేయాలంటూ ట్రస్టు ముందు ధర్నా చేపట్టారు. 

18:58 - December 15, 2016

నెల్లూరు : కాంట్రాక్ట్ లెక్చరర్స్ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్ ముందు గత 14 రోజులుగా రీలే దీక్షలు చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు మధు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను క్రమబద్దీకరించి... పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబు అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ చేస్తున్న దీక్షకు సీపీఎం పార్టీ పూర్తి మద్ధతినిస్తోందని మధు తెలిపారు. 

18:56 - December 15, 2016

శ్రీకాకుళం : టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి.. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసి..పోరాడిన దువ్వాడ శ్రీనివాస్‌ను తప్పించి... ఇప్పుడు కొత్తగా పెడాడ తిలక్‌ను సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది. దీంతో ఇరు వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది.

నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పెడాడ తిలక్‌ నియామకం
ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి... కాకరాపల్లి పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన దువ్వాడ శ్రీనివాస్‌ సమన్వయకర్తగా.. వైసీపీని టెక్కలి నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్లారు...అయితే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలోకి వచ్చిన తర్వాత.. సంవత్సరంలో పెడాడ తిలక్‌ను ప్రోత్సహించడమే కాకుండా తాజాగా సింగిల్‌ కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు. దీనిపై టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇన్‌చార్జ్‌ల మార్పిడిని జీర్ణించుకోలేని నేతలు జగన్‌తో మాట్లాడి తాడో-పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కొత్త కన్వీనర్ పెడాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగే పార్టీ సమావేశాలకు దూరంగా ఉండాలని తీర్మానించుకున్నట్టు ఆ పార్టీ వర్గీయులే స్పష్టంచేస్తున్నారు. ఏది ఏమైనా టెక్కలి నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారని పలువురు అంటున్నారు.

టీడీపీకి ప్లస్ అయిన వైసీపీ టెక్కలి లొల్లి..
మొత్తం మీద టెక్కలి వైసీపీ బాధ్యులు విషయంలో మొదలైన లొల్లి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ ఘర్షణ మాత్రం అధికార టీడీపీకి పూర్తి ప్లస్‌గా మారిపోయింది.

18:53 - December 15, 2016

కడప : గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు జలాశయంలో దిగి ఆందోళన చేపట్టారు. చౌటపల్లెలోని జలాశయంలోకి నీరు పెరిగిపోతుండటంతో.. తమ గ్రామాలు ముంపునకు గురి కానున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరిహారం అందిస్తే గ్రామాలను స్వచ్చందంగా వదలిపోతామని తెలిపారు. పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఖాళీ చెయ్యాలని చూస్తే...నీటిలోనే ఆత్మహత్యలు చేసకుంటామని హెచ్చరిస్తున్నారు. 

18:50 - December 15, 2016

చిత్తూరు : జిల్లా పెద్దపంజాని జడ్పీటీసీ సులోచన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా పాత పెద్దనోట్ల ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద సంచలనాత్మక నిర్ణయం అనంతరం కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భారీగా ఆర్థిక లావాదేవీలపై పలువురు అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లా పెద్దపంజాని జడ్పీటీసీ సులోచన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. 

18:39 - December 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నోట్ల రద్దు సమస్యలపై సభలో ఆచితూచి స్పందించాలని కేసీఆర్ సూచించారు. డీమానిటేజేషన్‌పై ఆచితూచి స్పందించాలని ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. మన వల్ల మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం-కేసీఆర్‌ తెలిపారు. ప్రతిపక్షాలు కోరితే సమావేశాల తేదీలు పెంచుతామని కూడా తెలిపారు. సమర్థవంతమైన చర్చకు అందరూ సిద్ధం కావాలి-కేసీఆర్‌ మరోసారి సూచించారు. 

18:37 - December 15, 2016

హైదరాబాద్ : జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో వచ్చారు. ఐదు రోజులపాటు..ఐదు అంశాలపై పవన్ కళ్యాణ్ రోజుకొక అంశంగా ట్వీట్లు చేయనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న గోవధపై పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా స్పందంచారు. బీజేపీ పాలి రాష్ట్రాల్లో బీఫ్ ను ఎందుకు బ్యాన్ చేయటంలేదని బీజేపీపై ప్రశ్నలు సంధించారు. రేపు అంటే శుక్రవారం నాడు రోహిత్ వేముల అంశంపై ట్వీట్ చేయనున్నట్లుగా పవన్ తెలిపారు. ఐదు అంశాలపై బీజేపీపై ప్రశ్నలు సంధించనున్నారు. కాగా హెచ్ సీయూలో సీహెచ్ డీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం గోవధపై స్పందించిన పవన్ శుక్రవారం నాడు రోహిత్ వేముల అంశాలపై ట్వీట్ చేయనున్నట్లుగా తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, దేశభక్తి, నోట్ల రద్దు వంటి అంశాలపై రోజూ స్పందించనట్లు ఈ సందర్భంగా పవన్ తెలిపారు. 

బీజేపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు..

హైదరాబాద్ : జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మరోసారిబీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ట్విట్ట‌ర్‌లో ఆయ‌న బీజేపీ ముందు ఐదు ప్ర‌శ్న‌లు ఉంచారు. గోవ‌ధ‌, వేముల రోహిత్ ఆత్మ‌హ‌త్య‌, దేశభ‌క్తి, పెద్ద‌నోట్ల ర‌ద్దు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాల‌ అంశాలను కేంద్ర స‌ర్కారు ముందు ఉంచుతున్నానని అన్నారు. గోవ‌ధ నిషేధంపై బీజేపీకి చిత్త‌శుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవ‌ధ‌పై నిషేధం విధించ‌వ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నించారు. 

18:00 - December 15, 2016

ఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం లక్కీ గ్రాహక్‌ యోజన, డీజీ ధన్‌ వ్యాపారి యోజన అనే రెండు పథకాలు ప్రవేశపెట్టింది. లక్కీ గ్రాహక్‌ యోజన వినియోగదారులకు సంబంధించిన పథకం కాగా, డిజిధన్‌ వ్యాపారి యోజన వ్యాపారులకు ఉద్దేశించినది. ఈ పథకాలను ఈ నెల 25 నుంచి అమలు చేయనున్నట్లు నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రకటించారు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన కింద ప్రతిరోజు..15 వేల మంది విజేతల ఎంపిక చేసి వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు చెప్పారు. వందరోజుల పాటు డ్రా ఉంటుంది. అలాగే డిజి ధన్‌ వ్యాపారి యోజన కింద వారానికి ఒకసారి 7వేల మందిని ఎంపిక చేయనున్నట్టు ఆయన వివరించారు. వ్యాపారులకు 50 వేల ప్రోత్సాహకం ఉంటుంది. అంతేకాదు...2017, ఏప్రిల్‌ 14న మూడు మెగా డ్రాలు తీస్తారు. విజేతలకు కోటి, 50లక్షలు, 25 లక్షలు బహుమతి కింద ఇవ్వనున్నట్లు అమితాబ్‌ కాంత్‌ తెలిపారు.

17:56 - December 15, 2016

విజయవాడ : విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చెందిన గ్రామసర్పంచ్ కారును గుర్తు తెలియని దుండగలు దగ్థం చేశారు. టీడీపీకి చెందిన నిడమానూరు గ్రామ సర్పంచ్ దామెర్ల కోటేశ్వరరావు వైసీపీలో చేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఇంటిముందు పార్క్ చేసిన కారును గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. పార్టీ మారడం జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తనను భయబ్రాంతులకు గురిచేసేందుకు ఇలాంటి పనికి పాల్పడ్డారని కోటేశ్వరరావు ఆరోపిస్తున్నారు.సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మాజీ మంత్రి పార్థసారధితోపాటు పలువురు వైసీపీ నాయకులు పెద్దఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు నిడమానూరు నుంచి పడమట పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు.   

17:53 - December 15, 2016

యాదాద్రి : యాదాద్రి జిల్లాలోని మెత్కూర్ బ్యాంక్ ముందు నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఖాతాదారులు ధర్నాకు దిగారు. రైతులు, ఖాతాదారులు బ్యాంక్ ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బ్యాంక్‌లలో ఇచ్చే 4 వేల రూపాయలు తమకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌ కావడంతో విత్తనాలు, ఎరువులు కొనడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కరెన్సీ సమస్యలను పరిష్కరించిలాని డిమాండ్ చేశారు. 

17:51 - December 15, 2016

ఢిల్లీ : తెలంగాణను క్యాష్‌లెస్‌ స్టేట్‌గా తీర్చిదిద్దాలని తమ పార్టీ నిర్ణయించిందని.. అందువల్లే నోట్ల రద్దును సమర్థించామని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో చర్చిజరుపుదామని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఇది తనను బాధించిందని జితేందర్‌రెడ్డి అన్నారు. 

17:47 - December 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలకు సర్వం సిద్ధమైంది. వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలైన అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, సామాజిక న్యాయమే అజెండాగా సమావేశాలు నిర్వహించాలంటూ తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సగం కాలం సమాప్తం..మిగిలింది రెండున్నరేళ్లే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లయ్యింది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అంతే వయస్సుంది. కెసిఆర్ ప్రభుత్వ పదవీకాలంలో సగం కాలం పూర్తయ్యింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లే . వచ్చే ఎన్నికల్లో గెలిచి, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రెండున్నరేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా పనులు చేయాల్సి వుంటుంది.

సమస్యలు చర్చకు రావాలన్నది సామాన్య ప్రజల ఆకాంక్ష...
ప్రజా సమస్యలు చర్చించేందుకు, పరిష్కరించేందుకు శాసనసభ, శాసనమండలి చక్కని వేదికలు. అసెంబ్లీ సమావేశాలు ఎంత అర్ధవంతంగా జరిగితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. అయితే, దురదృష్టవశాత్తు, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు ప్రాధాన్యత పెరిగి, ప్రజాసమస్యలు పక్కకు పోతున్నాయి. ఈసారి సమావేశాలలోనైనా తమ సమస్యలు చర్చకు రావాలన్నది సామాన్య ప్రజల ఆకాంక్ష. టిఆర్ఎస్ ప్రభుత్వానికి సగం పదవీ కాలం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి.

దిక్కుతోచని స్థితిలో తెలంగాణ రైతులు
తెలంగాణలో రైతులు దిక్కుతోచని స్థితిలో వున్నారు. కొన్ని మండలాల్లో కరవు, కొన్ని మండలాల్లో అకాల వర్షాలతో రైతులు దెబ్బతిన్నారు. దీనికితోడు నోట్ల రద్దు సమస్య మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇలాంటి సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వైపు రైతులు ఆశగా చూస్తున్నారు. ఇది చెరకు క్రషింగ్ సీజన్. తెలంగాణలో ఏకైక భారీ సహకార చక్కెర కర్మాగారంగా పేరొందిన సారంగపూర్ ఫ్యాక్టరీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. నిజాంషుగర్ ఫ్యాక్టరీకి చెందిన బోధన్, మెదక్, మెట్ పల్లిలోని మూడు యూనిట్లు మూతపడడంతో చెరకు రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలేమిటో అసెంబ్లీ వేదికగా టిఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెబితే, బాగుంటుంది. చెరకు కు కేంద్రం ప్రకటించిన 2300 రూపాయల మద్దతు ధర సరిపోదన్నది రైతుల ఆవేదన. చెరకు రైతులను ఆదుకునే మార్గాలపై శాసనసభ, శాసనమండలి దృష్టి సారించాల్సిన అవసరం వుంది. పాదయాత్ర సమయంలో చెరకు రైతుల కష్టాలను స్వయంగా చూసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వీటిని ఏకరువు పెడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి, చెరకు రైతుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ఆయన చేసిన సూచనను ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తెలంగాణ లోని చెరకు రైతులకు మేలు జరుగుతుంది.

నోట్ల రద్దుతో సమస్యల వలయంగా మారిన చేతివృత్తులు
నోట్ల రద్దు నేపథ్యంలో బడుగు, బలహీనవర్గాలు, చేతివృత్తులవారి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. అంతో ఇంతో కూడుబెడుతున్న ఉపాధికే ఎసరు వచ్చేలా వుంది. ఇటువంటి సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడం ద్వారా ఆయా వర్గాలను ఎంతోకొంత ఆదుకునే అవకాశం వుంది. ఎస్సీ సబ్ ప్లాన్ కింద 10,483 కోట్ల రూపాయలు కేటాయించగా, అందులో ఇప్పటికే 4వేల కోట్ల రూపాయలు దారిమళ్లాయి. మిగిలిన 6,483 కోట్లలో సగం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో దీన్నొక ప్రాధాన్యతాంశంగా చర్చించడం సందర్భోచితంగా వుంటుంది.

1700 కోట్ల రూపాయలు దారిమళ్లాయి : గిరిజన సంఘాల నేతలు
ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో ఇదే పరిస్థితి. 6170 కోట్ల రూపాయలు కేటాయిస్తే, 1700 కోట్ల రూపాయలు దారిమళ్లియాన్న ఆవేదన గిరిజన సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తున్న రుణాలు కూడా ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం లక్షన్నర మంది దరఖాస్తు చేసుకుంటే, 56వేలమందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో కేవలం 4వేల మందికి మాత్రమే రుణాలు విడుదల చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దీ అదే కథ. రుణాల కోసం లక్షన్నర మంది అప్లయ్ చేస్తే కేవలం 7వేల మందికే శాంక్షన్ లెటర్స్ ఇచ్చారు. 3500 కోట్ల రూపాయల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలా విభిన్నవర్గాల ప్రజలు అసెంబ్లీలో తమ సమస్యలు చర్చకు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

16:44 - December 15, 2016

పురాతన వస్తువులు..సెలబ్రిటీల వస్తువులు..చిత్రాలు..ఇతర వాటిని వేలం వేస్తుంటారనే సంగతి తెలిసిందే. వేలంలో చాలా మంది పాల్గొని వాటిని దక్కించుకోవడానికి పోటీ పడుతుంటారు. ప్రముఖమైనది అయితే వేలం లక్షలు..కోట్లలకు వెళుతుంది. అలాగే ఓ రాజముద్రను కూడా దక్కించుకొనేందుకు పోటీ పడ్డారంట. ఏకంగా రూ. 150 కోట్లు పలికింది. 18వ శ‌తాబ్దానికి చెందిన 'రాజ‌ముద్ర'కు వేలం నిర్వహించారు. పారిస్‌లో ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్ అండ్ వైట్ క‌ల‌ర్‌లో ఉన్న ఓ ఖ‌నిజంతో ఈ 'రాజ‌ముద్ర‌'ను త‌యారు చేశారు. రాజ‌ముద్ర‌పై తొమ్మిది డ్రాగ‌న్లు ఉంటాయి. చైనాను సుదీర్ఘ కాలం పాలించిన‌ చ‌క్ర‌వ‌ర్తి క్విన్‌లాంగ్ కు చెందిన రాజ‌ముద్ర‌గా దీన్ని గుర్తించారు. ఫ్రెంచ్ వ్య‌క్తి ఈ రాజ‌ముద్ర‌ను సొంతం చేసుకున్నాడు. అదీ 19వ శతాబ్దంలో. దీనిని వేలం వేయగా చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి రూ. 150 కోట్లకు కైవసం చేసుకోవడం విశేషం.

ముగిసిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.

శివసేన నేత ఇంట్లో రూ. కోటి నగదు..

ముంబై : శివసేన నేత ఇంట్లో రూ. కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదులో రూ. 40 లక్షల కొత్త నోట్లు, రూ. 60 లక్షలు పాతనోట్లుగా గుర్తించారు.

16:24 - December 15, 2016

మంచి ఆరోగ్యానికి చిట్కాలు..చూడండి…

 • రోజుకు ఒక నిమ్మకాయ రసం తాగడం వల్ల శరీరంలో కొవ్వును తీసేస్తుంది.
 • రోజుకు ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 • ప్రతి రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు.
 • రోజు ఒక కప్పు పాలు తాగితే ఎముకలు ధృడంగా ఉంటాయి.
 • రోజులో మూడు లీటర్ల నీరు తాగాలి. దీనివల్ల రోగాలు దరిచేరవు.
 • రోజు మంచినీరు ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని వేడి చాలా వరకూ పోతుంది.
 • తేనే పాలు కలిపి తాగడం చాలా మంచిది. ఒక టేబుల్ స్పూన్ తేనే వేసుకుని త్రాగడం వల్ల శరీరంలోని వేడి పోతుంది.
 • గసగసాలు శరీరంలోని వేడిని తొలగిస్తాయి.
 • ఒక టేబుల్ మెంతులని తీసుకుని తింటే చాలా మంచిది.
 • చల్లని నీరు లేదా చల్లని పాలల్లో కలిపి నుదుటికి రాసుకుంటే ఎంతో త్వరగా వేడి తగ్గిపోతోంది.
 • ఒక గ్లాస్ పాలులో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల వేడి పోతుంది.
 • రోజు ఉదయం పూట దానిమ్మ జ్యూస్ సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 • కరెక్టు సమయానికి మాత్రం ఖచ్చితంగా భోజనం చేయాలి. తినకపోవడం వల్ల శక్తి తగ్గి నరాలు నిస్సత్తువుగా మారిపోతాయి.
 • ప్రతి రోజు ఓ కప్పు ఉడకబెట్టిన బీన్స్ లేదా పప్పు ధాన్యాలు తీసుకోవాలి.
 • బయటకు వెళ్లే సమయంలో దోసకాయలు, క్యారెట్ తీసుకెళ్లాలి. ఆకలిగా అనిపిస్తే ఇవి తినాలి.
16:19 - December 15, 2016

రాజన్న సిరిసిల్లలో కల్తీ కల్లు..ఒకరి పరిస్థితి విషమం..

రాజన్న సిరిసిల్ల : వీర్నపల్లిలో కల్తీ కల్లు తాగి రూ. 10 మంది అస్వస్థతకు గురయ్యారు. మల్లయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి పథకాలు..

ఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రెండు పథకాలు ప్రవేశపెట్టినట్లు, ఈనెల 25 నుండి ఈ పథకాలు అమల్లోకి రానున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. లక్కీ గ్రామయక్ యోజన కింద ప్రతి రోజు డ్రా తీయడం జరుగుతుందని, 15వేల మంది విజేతలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వీరికి రూ. వెయ్యి ప్రోత్సాహాన్ని అందచేయడం జరుగుతుందన్నారు. అలాగే రెండో పథకమైన డీజీ ధన్ వ్యాపారి యోజన కింద వారానికొకసారి డ్రా తీయడం జరుగుతుందని, 7వేల మందిని ఎంపిక, గరిష్టంగా రూ. లక్ష ప్రోత్సాహాకాన్ని అందచేయనున్నట్లు వెల్లడించారు.

15:58 - December 15, 2016
15:56 - December 15, 2016

మధ్యప్రదేశ్ : భోపాల్‌లో నాలుగు రోజులు పాటు జరిగిన ఐద్వా మహాసభలు ముగిశాయి. 101 మందితో నూతన కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షురాలిగా మాలినీ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శిగా మరియం ధావలె ఎన్నికయ్యారు. నూతన కమిటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన చెరో నలుగురికి అవకాశం లభించింది. వీరిలో ఏపీ నుంచి రమాదేవి, ప్రభావతి, మాధవి, సావిత్రి,.. తెలంగాణ నుంచి హైమవతి, ఆశాలత, జ్యోతి, సమీనా అఫ్రోజ్‌లు ఉన్నారు. 

15:53 - December 15, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌.. గాంధీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారిని ప్రాణప్రాయ స్థితిలో పడేసింది. సాయి ప్రవళిక అనే ఆరేళ్ల బాలిక.. జ్వరంతో వారంరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఈరోజు సెలైన్‌ బాటిల్లో పురుగులున్నా.. చూసుకోకుండా చిన్నారికి ఎక్కించారు. ఈ విషయాన్ని పాప బంధువులు గుర్తించి.. ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు. అయితే అప్పటికే పాప శరీరం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై పాపకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు సెలైన్‌ బాటిల్‌ను బయట పారేయడానికి సిబ్బంది ప్రయత్నించారు. కానీ చిన్నారి కుటుంబ సభ్యులు బాటిల్‌ను తీసుకుని.. అందరికీ చూపించడంతో.. విషయం వెలుగుచూసింది.

ఏపీ కేబినెట్ సమావేశం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. నగదు రహిత లావాదేవీలు, రాజధాని నిర్మాణం డిజైన్, పోలవరం శంకుస్థాపన వేడుక, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, పేదల ఇళ్లు ఉచిత రిజిస్ట్రేషన్ లపై కేబినెట్ చర్చించనుంది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ కుడా సంక్రాంతి నుండి వేగవంతం, అసెంబ్లీ నిర్వాహణపై ఏపీ కేబినెట్ చర్చించనుంది.

 

ఖమ్మంలో రూ. 4.92 లక్షల నగదు స్వాధీనం..

ఖమ్మం : జిల్లాలోని కల్లూరులో వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. రూ. 4.92 లక్షల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు.

15:50 - December 15, 2016
15:48 - December 15, 2016

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలకు రాయితీలు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి పోచారం అన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు రాయితీలు పెంచడంతో పాటు బీసీలకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని కులాల రైతులకు కూడా 90 శాతం రాయితీ ఇస్తున్నామన్న ఆయన.. మిగతా రైతులకు 80 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. రైతన్న అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పోచారం స్పష్టం చేశారు.

15:46 - December 15, 2016

అనంతపురం : నోటుపోటుతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి.. రాశులుగా పోసిన ధాన్యం కళ్లాల్లోనే నిలిచిపోయింది. ఇంట్లో దాచుకునే చోటుకూడా లేక.. రోడ్లపైనే కుప్పలుగా పోశారు. నగదు కష్టాలతో వ్యాపారులు ముందుకు రావడంలేదు. ధాన్యాన్ని అమ్ముకోలేక అవస్థలు పడుతున్న అనంతపురం జిల్లా రైతుల దుస్థితిపై టెన్‌టీవీ ఫోకస్‌..

పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన అన్నదాతలు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్‌ మండలంలో ధాన్యం అమ్ముకోడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. హెచ్‌ఎల్‌ఎంసీ ఆయకట్టు కింద ఉన్న 15వేల ఎకరాల్లో వరిసాగు చేసిన రైతులు..వరికోతలు పూర్తిచేశారు. ధాన్యాన్ని ఇలా రోడ్డుపక్కన రాశులుగా పోసి..వ్యాపారస్తుల కోసం 20 రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే దళారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనంత రైతులు ఉసూరుమంటున్నారు.

రోడ్డుపై ధ్యాన్యాన్ని ఉంచడంతో.. పెరుగుతున్న దొంగల బెడద
రోడ్డుపై ధ్యాన్యాన్ని ఉంచడంతో.. దొంగల బెడద ఎక్కువైందంటున్నారు రైతులు. పోలీసులు కూడా రోడ్లపై ధాన్యం ఉంచొద్దని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నిల్వచేసుకోడానికి గోడౌన్లు లేకపోవడంతో ఇలా రోడ్లపైనే పడిగాపులు పడుతున్నామని అనంత రైతులు బాధపడుతున్నారు.

కళ్లాల వద్దనే రైతన్న పడిగాపులు
అటు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కర్షకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కళ్లాల వద్దనే పడిగాపులు పడుతున్నారు. కనీసం కూలీలకు డబ్బులు కూడా ఇవ్వలేక పోతున్నామంటున్నారు. రైతు చెడిపోతే ..కూలీలకు దుడ్లెట్టా..! ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

రైతుకు నోట్లరద్దు శాపం
పంట చేతికొచ్చిన ఆనందంలో ఉన్న రైతుకు నోట్లరద్దు శాపంగా మారింది. ఒకరిద్దరు వ్యాపారస్తులు ధాన్యం కొనేందుకు ముందుకొస్తున్నా.. పాత 500, వెయ్యిరూపాయల నోట్లు ఇస్తామంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి కళ్లాల్లోనే వేచిచూడలేక కొందరు రైతులు వ్యాపారులు పెట్టిన రెండు మూడు నెలల గడువుకు ధాన్యాన్ని అప్పగిస్తున్నారు.

న్యాయం చేయాలని కోరుతున్న అనంత రైతులు..
ఓ వైపు ప్రభుత్వం మాత్రం .. ప్రతి జిల్లాకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి... రైతుల ఖాతాల్లోకే డబ్బును వేస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కాని.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు.. ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అనంత రైతులు కోరుతున్నారు.

 

15:42 - December 15, 2016

చెన్నై బ్యూటీ 'సమంత' ఓ దర్శకుడి షాక్ ఇచ్చింది. సదరు దర్శకుడు పెట్టిన షరతుకి ఈ స్టార్ హీరోయిన్ నో అని చెప్పేసింది. దీంతో ఈ బ్యూటీ చేతిలోనుంచి ఓ లెజెండరీ మూవీ చేయిజారిపోయినట్లు వినిపిస్తుంది. ఇంతకీ 'సమంత'కి దర్శకుడు పెట్టిన షరతులేంటీ ? చెన్నై పొన్ను 'సమంత' ఈ ఎడాది కూడా టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో తన జోరు చూపించింది. అంతేకాదు త్వరలోనే ఈ బ్యూటీ 'నాగచైతన్య'ను పెళ్లాడబోతోంది. అయిన కూడా వరుసగా సినిమాలు చేస్తానని ఈ బ్యూటీ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే 'చైతూ'తో పెళ్లి అనే సరికి దర్శక నిర్మాతలు తనకు చాన్స్ లు ఇవ్వడంలేదని 'సమంత' ఆ మధ్య తెగఫీలైంది. కానీ ఓ గొప్ప అవకాశాన్ని 'సమంత' చేతులరా వదిలేసిందని టాక్.

దర్శకుడు నాగ అశ్విన్
'ఎవడే సుబ్రమణ్యం' ఫేం దర్శకుడు 'నాగఅశ్విన్' మహానటి 'సావిత్రి' జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమాలో 'సావిత్రి' పాత్రకి గాను దర్శకుడు 'సమంతా'ను సంప్రదించినట్లు వినికిడి. అయితే ఈ సినిమాకి చెన్నై బ్యూటీ నో చెప్పినట్లు తాజా సమాచారం. 'సావిత్రి' పాత్ర కోసం దర్శకుడు 'సమంత'ను బరువు పెరగవలసి ఉంటుందని చెప్పాడట. 'సావిత్రి' పాత్రలో నటించడానికి తాను సిద్ధమనీ, అయితే బరువు మాత్రం పెరగనని చెన్నై చిన్నది తేల్చి చెప్పిందని టాక్. 'సమంత' మాటలకు దర్శకుడు 'నాగ్ అశ్విన్' షాక్ అయినట్లు సమాచారం.

గట్టీ రీజనే..
'సమంత' బరువు పెరగను అనడానికి గట్టి రీజనే ఉన్నట్లు సమాచారం ఆ మధ్య అలర్జీ ప్రాబ్లమ్స్ తో ఈ బ్యూటీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. దీంతో పాటు వచ్చే త్వరలోనే 'నాగచైతన్య' తో ఈ బ్యూటీ మ్యారేజ్ ఉంటుందని వినిపిస్తోంది. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే 'సమంత' దర్శకుడు నాగ్ అశ్విన్ కి క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. 'సమంత' నో చెప్పడంతో 'నిత్యామీనన్' తో 'సావిత్రి' సినిమా చేసేందుకు ఈ దర్శకుడు ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్..

15:38 - December 15, 2016

ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్న తీరుపై బీజేపీ సీనియ‌ర్ నేత ఎంపీ ఎల్‌కే అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. పార్లమెంట్‌ కార్యకలాపాలు జరిగే తీరు చూస్తున్నా..తరచూ వాయిదాలు పడటం..సభ స్తంభించడం పట్ల బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేయాలన్పిస్తోందన్నారు. లోక్‌సభ వాయిదా పడ్డ తర్వాత కూడా అద్వాని సభలోనే కూర్చున్నారు. చివరి రోజైనా లోక్‌సభ సమావేశం కొనసాగాలన్నా ఆకాంక్షను కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతీ ఇరానీల ముందు వెలిబుచ్చారు. స్పీకర్‌ ఇరుపక్షాల నేతలతో మాట్లాడి సభను సజావుగా కొనసాగించేందుకు యత్నించాలని సూచించారు. పార్లమెంట్‌ స్తంభించడంపై అద్వాని ఆవేదన చెందడం శీతాకాల సమావేశాల్లో ఇది రెండోసారి. నోట్ల రద్దు...అగస్టా స్కాంపై అధికార విపక్షాల సభ్యులు నినాదాలు చేయడంతో ఎలాంటి చర్చ జరగకుండానే లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.

15:37 - December 15, 2016

'జనతా గ్యారేజ్' సక్సెస్ మూడ్ లోంచి 'ఎన్టీఆర్' బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం ఈ హీరో, దర్శకుడు 'బాబీ'తో చేయబోతున్న కొత్త సినిమాకి సంబంధించిన పనుల్లో పుల్ బిజీగా ఉన్నాడు. తొలిసారి అన్న 'కళ్యాణ్ రామ్' బ్యానర్ లో నటిస్తుండడంతో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీలో త్రిబుల్ రోల్ చేస్తున్న 'ఎన్టీఆర్' కోసం ముగ్గురు హీరోయిన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పక్కా లోకల్ పక్కా లోకల్ అంటూ 'జనతా గ్యారేజ్' సినిమాకి 'కాజల్ అగర్వాల్' తన వంతు గ్లామర్ హంగులు అద్దింది. ఇప్పటికే 'ఎన్టీఆర్' తో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త సినిమా కోసం యంగ్ టైగర్ తో మరోసారి జోడి కట్టబోతుందట. 'కాజల్' తో పాటు మరో ఇద్దరు కేరళ కుట్టిలు 'నివేదా థామస్', 'అనుపమా పరమేశ్వరన్' 'ఎన్టీఆర్' తో నటించే బంఫర్ ఛాన్స్ లు కొట్టేశారట.

జనవరి లో షూటింగ్..
ఎన్టీఆర్ - బాబీ మూవీ జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసి జూన్ నాటికి సినిమాను రిలీజ్ చేయాలని నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావిస్తున్నారట. అదుర్స్ లో డ్యూయల్ రోల్ చేసిన యంగ్ టైగర్ ఇప్పుడు త్రిబుల్ రోల్స్ చేస్తుండడం విశేషం. అన్నట్టు అదుర్స్ మూవీ మాదిరే ఈ మూవీ కూడా పుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ రూపొందనుందట.

15:35 - December 15, 2016

నందమూరి నటసింహాం 'బాలకృష్ణ’, మాస్ డైరెక్టర్ 'బోయపాటి' కాంబినేషన్ లో మరో మూవీ రానున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ పవర్ పుల్ కాంబినేషన్ లోనే నెక్ట్ మూవీ చేయాలని 'బాలయ్య' థింక్ చేస్తున్నాడట. ఇందుకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. మాస్ హీరోగా 'బాలకృష్ణ' ఇమేజ్ ని దర్శకుడు 'బోయపాటి శ్రీను' మరింత పెంచడనడంలో ఎలాంటి సందేహం లేదు. 'బాలయ్య' స్టార్ డమ్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో 'సింహా' లాంటి బ్లాక్ బస్టర్ తో ఆయన ఇమేజ్ ని అమాంతం పెంచాడు. ఇక 'లెజెండ్' సినిమాతో 'బోయపాటి' రికార్డ్స్ మోత మెగించాడు. కర్నూల్ లో 'లెజెండ్' సినిమా ఏకంగా 1000 రోజులు ఆడిన సంగతి తెలిసిందే. ఇంతటి పవర్ పుల్ హిట్స్ ఇచ్చిన 'బోయపాటి'తో మరో సినిమా చేయాలని బాలయ్య ఆలోచన చేస్తున్నాడట.

క్రిష్ దర్శకత్వంలో..
ప్రస్తుతం 'క్రిష్' దర్శకత్వంలో 'బాలకృష్ణ' నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' రిలీజ్ కి రెడీగా ఉంది. చారిత్రాక నేఫథ్యంలో రూపొందిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' 'బాలయ్య' 100వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తరువాత బాలయ్య 101వ సినిమాను కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీనికి తోడు బోయపాటి, చిరంజీవి 151వ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వుందనే టాక్ వచ్చింది. దీంతో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ ఇప్పట్లో ఉండదని అనుకున్నారు.

సమ్మర్ లో..
కానీ అనుకోని విధంగా ఈ కాంబినేషన్ లో మరో మూవీ రూపొందనుంది. బోయపాటి శ్రీను ఆల్ రెడీ బాలయ్య కోసం ఓ పవర్ పుల్ స్టోరీ సిద్దంగా చేసి ఉంచాడట. నిజానికి ఈ స్టోరీని బాలయ్య 100వ సినిమా చేయాలని ప్లాన్ చేశాడట. కానీ అనుకోని విధంగా 100వ సినిమా అవకాశం దర్శకుడు క్రిష్ కి దక్కింది. దీంతో ఇప్పుడు అదే పవర్ పుల్ స్టోరీని 101 సినిమా చేయడానికి ఈ దర్శకుడు ప్లాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సమ్మర్ లోగా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. ఆ వెంటనే బాలయ్య సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. మరి ఈ దర్శకుడు బాలయ్యను ఈసారి ఎంత పవర్ పుల్ గా చూపించబోతున్నాడో చూడాలి.

15:33 - December 15, 2016

'బాహుబలి' ఇక బుల్లితెర మీద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మూవీ టీవీ సిరీస్ రూపంలో బుల్లితెర ఆడియన్స్ ని మురిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నో సంచనాలు సృష్టించిన ఈ మూవీని ప్రస్తుతం టీవీ సిరియల్ గా తీసుకురావడానికి 'రాజమౌళీ' టీం కసరత్తులు చేస్తోంది. 'బాహుబలి' తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. రిలీజై ఎడాది గడిచినా కూడా ఇప్పటికి ఈ మూవీ వైబ్రేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నో అరుదైన రికార్డ్స్ ని సెట్ చేసిన 'బాహుబలి' త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి ముస్తాబవుతున్నట్లు సమాచారం. ఈ మూవీని టీవీ సిరీస్ గా రూపొందించడానికి 'రాజమౌళి' రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది బాహుబలి 2
వచ్చే ఏడాది 'బాహుబలి ది కన్ క్లూజన్' విడుదల కానుంది. హాలీవుడ్ మూవీ ది గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహాలో ఈ రెండు భాగాలూ టీవీ సీరియల్ గా వచ్చే సూచనలున్నాయని, అయితే రెండో భాగం విడుదల అయ్యాకే ఈ విషయాన్ని ధృవీకరిస్తామని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక 'బాహుబలి' సెకండ్ పార్ట్ తరువాత థర్డ్ పార్ట్ కూడా ఉండవచ్చునని ఆయన హీరో 'ప్రభాస్' అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చారు.

అరుదైన ఘనత..
'బాహుబలి' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం పోర్టల్ ఫిల్మ్ కంపానియన్ సంస్థ వచ్చే ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ పై పోలింగ్ నిర్వహించింది. ఇందులో 51 శాతం మంది 'బాహుబలి' ది కంక్లూజన్ కే ఓటు వేయడం ఓ రికార్డ్ గా చెప్పాలి. మిగతా సినిమాలన్నీ కలిపి 49 శాతం ఓట్లే తెచ్చుకోవడం గమనించదగ్గ అంశం. 'షారుఖ్ ఖాన్' 'రాయీస్' 21 శాతం 'గోల్ మాల్ 4’ మూవీకి 14 శాతం 'సల్మాన్ ఖాన్' 'ట్యూబ్ లైట్' మూవీకి 6 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పోలింగ్ బట్టి దేశవ్యాప్తంగా సిని ప్రియులు 'బాహుబలి-2’ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

15:31 - December 15, 2016

అమరావతి :  వెలగపూడిలోని తాత్కాలిక సచివాయంలో కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతి డిజైన్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పోలవరం కాంక్రీట్‌ డామ్‌ నిర్మాణ పనుల ప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం వంటి అంశాలపై చర్చ జరగనుంది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం, బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకం అమలు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే ఏపీ బ్రాండ్‌ పథకం పురోగతి తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. వెలగపూడిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

15:31 - December 15, 2016

'యే దిల్ హై ముస్కిల్' మూవీలో 'రణబీర్ కపూర్' తో హాట్ హాట్ సీన్స్ నటించిన 'ఐశ్వర్యరాయ్' మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రం కాశ్మీర్ బ్యాప్ డ్రాప్ లో సాగుతుందని బీటౌన్ టాక్. 40ప్లస్ లో 'ఐశ్వర్యరాయ్' 'యే దిల్ హై ముస్కిల్' మూవీలో తన కన్న చిన్నవాడైన 'రణబీర్ కపూర్' తో హాట్ రోమాన్స్ రచ్చ ఇంకా చల్లారలేదు. ఇంతలోనే మాజీ ప్రపంచసుందరి మరో ప్రేమకథ చిత్రానికి పచ్చజెండా ఊపడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐశ్వర్యరాయ్ ని ఎంతగానో ఆరాధించే బాలీవుడ్ దర్శకుడు 'సంజయ్ లీలా భన్సాలీ' ఈ లవ్ స్టోరీని రూపొందంచనున్నాడట. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథను 'ఐష్' కోసమే తయారు చేశాడని వినికిడి. ఈ దర్శకుడు ప్రస్తుతం 'దీపికా పదుకొనే' తో 'పద్మావతి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాగానే 'ఐశ్వర్య' సినిమాపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి స్టోరీ ?
'యే దిల్ హై ముస్కిల్' లో 'ఐశ్వర్యరాయ్' చేసిన స్క్రీన్ రోమాన్స్ పై అత్తామామలు చాలా సీరియస్ గా ఉన్నారని టాక్. అలాంటిది ఇప్పుడు మరో లవ్ స్టోరీ అంటే 'ఐష్' మరోసారి ఆన్ స్క్రీన్ పై రెచ్చిపోనుందా అని బాలీవుడ్ ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. 'సంజయ్ లీలా'తో 'ఐశ్వర్య' 'దేవదాస్' తో పాటు 'గుజారిస్' మూవీస్ చేసింది. 'గుజారిస్' తరువాతే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తన ఆరాధ్య దేవత కోసం దర్శకుడు 'సంజాయ్ లీలా భన్సాలీ' ఎలాంటి స్టోరీ రెడీ చేశాడో చూడాలి.

15:25 - December 15, 2016

పశ్చిమగోదావరి : కాళాశాల వేధింపులకు మరోవిద్యార్థిని బలైపోయింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ ఘటన జరిగింది. స్థానిక ఎన్నారై కళాశాలో ఇంటర్ చదువుతున్న జ్యోతిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా రోజు కాలేజీకి వెళ్లి వచ్చిన తరువాత జ్యోతిక మౌనంగా వుండేదని దీనికి కారణం కాలేజీ యాజమాన్యమేని..వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని  వారు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

11 లక్షలను ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు బ్యాంకులో దోపిడికి పాల్పడ్డారు. జిల్లా రాట్నిపారా బ్రాంచిలోకి చొరబడిన ఉగ్రవాదులు రూ.11 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

కాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : కాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు.

నకిలీ విత్తనాలపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యవహారంపై టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, విత్తన సంస్థల యజమానులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆయన పిల్ లో కోరారు.

15:18 - December 15, 2016

ప్రకాశం : ఒంగోలు సంతపేటలోని ఓ బ్యాంక్ వద్ద డబ్బుల కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. డబ్బుల గురించే వచ్చినా గానీ రోజుల తరబడి లైన్లలోనే సమయం అంతా గడిచిపోతోందని ప్రజలు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితి నుండి బైట పడే దారి లేదనీ..దీనికి ఎవరినీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు నిస్సహాయతను వెలిబుచ్చుతున్నారు. నోట్ల రద్దు ప్రకటన వచ్చి ఈరోజుకు సరిగ్గా 36 రోజులు గడిచాయి. అయిన సామాన్యుల కష్టాలకు అంతూ దారీ లేకుండా పోతోంది. అన్ని పన్లనూ వాయిదా వేసుకుని బ్యాంకుల వద్ద డబ్బు తీసుకోవటమే పనిగా గత 36 రోజుల నుండి కొనసాగుతోంది. ప్రధాని మోడీ పెట్టిన గడువు ఇంకా 14 రోజులు మాత్రమే వుంది. ఈ క్రమంలో రానున్న 14రోజుల్లో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే. 

రాయితీలు పెంచాం - పోచారం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన అనంతరం రాయితీలు పెంచడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాయితీలు పెంచిన ఘనత తమదేనన్నారు. బీసీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు.

అక్రమ కట్టడాల కూల్చివేతలు..

హైదరాబాద్ : ఉపాలగూడ, బోడుప్పల్, చెంగిచర్ల, జల్ పల్లిలో అక్రమ నిర్మాణాలను హెచ్ఎండీఎ అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి.

15:14 - December 15, 2016

మేడ్చల్ : జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. గుండ్ల పోచంపల్లిలో పాత ఇల్లు కూలుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాత ఇల్లు కూలుస్తుండగా గోడ కూలింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాగా గుండ్ల పోచంపల్లిలో పాత భవనాలకు కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతోంది ఈ క్రమంలో మధ్యహ్నాం 12గంటల ప్రాంతంలో 10మంది కూలీలు పురాతన ఇంటిని కూలుస్తున్న సయమంలో కూలిన గోడ కింద ఆరుగురు కూలిలు చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. చికిత్సపొందుతున్నవారికి ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

దిలీప్ కుమార్ డిశ్చార్జ్...

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎడమ కాలికి తీవ్రమైన నొప్పి, వాపు రావడంతో వారం రోజుల క్రితం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కోలుకోవడంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.

15:11 - December 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 30 వరకూ ఎజెండాను ఖారారు చేసింది. 21 పనిదినాలు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 2 నుంచి మరో వారంరోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. రేపు పెద్దనోట్ రద్దు, ప్రజల ఇబ్బందులపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రాంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో గంటన్నరపాటు ప్రశ్నోత్తరాల సమయం జరగనుంది. శనివారం కూడా అసెంబ్లీ జరగనుంది. ఈనెల 24 న తెంగాణ అసెంబ్లీకి హాలిడే, 25న క్రిస్మస్. నోట్లు రద్దుపై చర్చించాలని కాంగ్రెస్, ఎంఐఎం తెలిపాయి. కేంద్ర పరిధిలోని అంశాన్ని అసెంబ్లీలో చర్చించనవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:47 - December 15, 2016

అద్వానీ మళ్లీ అసంతృప్తి..

ఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు అద్వానీ మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల తీరు చూస్తుంటే రాజీనామా చేయాలనిపిస్తోందని, ఒకరిపై ఒకరు గెలవాలని అనుకుంటున్నారే తప్ప చర్చ జరగాలని ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. చివరి రోజు చర్చ జరిగే విధంగా కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడాలని మంత్రులు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీలకు అద్వానీ సూచించారు.

13:44 - December 15, 2016

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి విమర్శించారు. సీఎల్ పీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన టెన్ టివితో మాట్లాడారు. టీసర్కార్. ప్రజా వ్యతిరేకంగా వ్యవరిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. రైతుల రురణామాఫీ, స్కాలర్ షిప్స్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్, మహిళలకు రుణాల వంటి పలు అంశాలపై లేవనెత్తుతామని చెప్పారు. టీసర్కార్ ప్రజా పక్షం కాదన్నారు. ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తుందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 20 పని దినాలకు తగ్గకుండా అసెంబ్లీ సెషన్ నడపాలని కోరారు.

 

గోడ కూలి ఇద్దరు మృతి..

మేడ్చల్ : గుండ్లంపోచంపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. గోడకూలి ఇద్దరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాత ఇళ్లు కూల్చివేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

13:39 - December 15, 2016

ఆదిలాబాద్ : తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఆదిలాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించింది. తమ్మినేని బృందానికి ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్యాలతో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది. పాదయాత్రకు భద్రత కల్పించడలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 
తమ్మినేని బృందానికి ప్రజలు ఘన స్వాగతం 
సీపీఎం మహాజన పాదయాత్ర 60వరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో కొనసాగింది. మావలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర అంతోలీ వరకు కొనసాగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో తమ్మినేని బృందానికి గిరిజనులు, ఆదివాసీలు.. సాంప్రదాయ నృత్యాలు.. బోనాలతో స్వాగతం పలికారు. 
తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఎలాంటి ప్రయోజనం లేదన్న తమ్మినేని
తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించినా అది జరగడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
ఆదివాసీలకు న్యాయం జరగడం లేదన్న శోభన్‌ నాయక్‌ 
తెలంగాణ వచ్చినా ఆదివాసీలకు న్యాయం జరగడం లేదని పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్‌ నాయక్‌ అన్నారు. గిరిజనులకు భూములు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. సాగు చేసుకుంటున్న భూములను కూడా లాక్కుంటున్నారన్నారు. టైగర్‌ జోన్‌ పేరుతో గ్రామాల్లోని ఆదివాసీలను ఖాళీ చేయిస్తున్నారని విమర్శించారు. 
చికిత్స పొందుతున్నవారిని పరామర్శించిన తమ్మినేని బృందం  
మంగళవారం పాదయాత్ర బృందంపైకి లారీ దూసుకెళ్లి.. రిమ్స్‌లో చికిత్స పొందుతున్నవారిని తమ్మినేని బృందం పరామర్శించింది. మహాజన పాదయాత్రకు ప్రభుత్వం కనీస సహకారం అందించడం లేదని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. యాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నా.. కనీస పోలీసు భద్రత కల్పించకపోవడం విచారకరమన్నారు. గతంలో తనకు గన్‌మెన్లకు కేటాయించిన ప్రభుత్వం పాదయాత్ర ప్రకటించగానే గన్‌మెన్లను ఉపసంహరించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిగిలిన యాత్రలోనైనా భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని తమ్మినేని కోరారు. 

 

19న విజయనగరంలో జగన్ యువభేరీ..

విజయనగరం: వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19న విజయనగరంలో యువభేరీ జరగనుంది. పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు.

13:26 - December 15, 2016

పోలీసు ఆఫీసర్ పాత్రలో గెలిచాడు. కానీ నిజజీవితంలో మాత్రం ఓడిపోయాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు..

'క్రైమ్ పెట్రోల్' షో గుర్తుండే ఉంటుంది కదా..టీవీ షో పాత్రలో గెలిచాడు. కానీ నిజజీవితంలో ఓడిపోయాడు. 'క్రైం పెట్రోల్' ఇన్స్ పెక్టర్ 'కమలేష్' సూసైడ్ చేసుకున్నాడు. ఇతను పాత్రలో జీవించే వాడు. తనకు నచ్చిన వేషాలు వేశేవాడు. పోలీసు ఆఫీసర్ పాత్రలో గెలిచిన 'కమలేష్' మాత్రం జీవితంలో మాత్రం ఓడిపోయాడు. తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసమైన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:25 - December 15, 2016

హైదరాబాద్ : బీఎస్ ఎన్ ఎల్ టవర్లను విభజించి అమ్మకానికి ప్లాన్‌ చేస్తున్నారంటూ ఆ సంస్థ ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగారు.. తెలుగు రాష్ట్రాలనుంచి 21వేలమంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.. లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు.. సంస్థకుచెందిన 65వేల టవర్లను విడగొట్టి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.. సబ్సిడియారి టవర్‌ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టామని తెలిపారు.. 

 

13:24 - December 15, 2016

ఢిల్లీ : ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఢిల్లీలో ఫార్మాసిటికల్‌ ప్రొడ్యూసర్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హెల్త్‌కేర్‌ ఇండియా రిసార్ట్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి కేటీఆర్‌.. హెల్త్‌కేర్‌ ఇండియా రిసార్ట్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఫార్మసి రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..హెల్త్‌కేర్‌ రంగంలో అనేక సంస్కరణలను ప్రభుత్వం చేపడుతుందని..వాటి ఫలితాలు త్వరలోనే రాష్ట్రంలో కన్పించబోతున్నాయన్నారు.  

 

13:21 - December 15, 2016

కృష్ణా : నిత్యవసరాలు తీర్చుకునేందుకు రెండు వేల రూపాయల కోసం సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు గాస్తుంటే.... మరోవైపు అడ్డదారిలో కొత్త కరెన్సీ భారీగా బయటపడుతోంది. తాజాగా కృష్ణా జిల్లా పెదపారుపూడి దగ్గర పోలీసుల తనిఖీలో 15లక్షల నగదు పట్టుబడింది.. విజయవాడ నుంచి గుడివాడ వెళుతున్న కారులో ఈ కొత్త కరెన్సీ దొరికింది..... ఈ డబ్బంతా కొత్త రెండు వేల రూపాయల నోట్ల రూపంలో ఉంది.. ఈ కారులో గుడివాడ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో ఈ డబ్బు తరలింపులో పోలీసుల పాత్ర ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:15 - December 15, 2016

37వ రోజు కరెన్సీ కష్టాలు..

హైదరాబాద్ : కరెన్సీ కష్టాలు తీవ్రతరమౌతున్నాయి. 37వ రోజు బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. ఉపాధిపై కరెన్సీ కొరత ప్రభావాన్ని చూపిస్తోంది. ఉపాధి హామీ పథకంలో 20 శాతం మందికి పని దొరకడం లేదు. కరెన్సీ కష్టాలతో చిరు వ్యాపారులు సతమతమౌతున్నారు. బిల్లులు వసూలు కావడం లేదని పాల వ్యాపారులు పేర్కొంటున్నారు. రైతులకు బిల్లులు చెల్లించలేకపోతున్నారు.

ముగిసిన బీఏసీ సమావేశం..

హైదరాబాద్ : కాసేపటి క్రితం తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 30 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. జనవరి 2 నుండి మరో వారం రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. 20 పనిదినాల పాటు శాసనసభ నిర్వాహణకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. మొదటి రోజు నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులపై శాసనసభలో చర్చ జరగనుంది. 18, 24, 25 తేదీల్లో అసెంబ్లీకి సెలవు.

12:56 - December 15, 2016
12:54 - December 15, 2016

సూర్యాపేట : జిల్లాలోని ముకుందాపురంలో దారుణం జరిగింది. మద్యంమత్తులో తండ్రి వెంకన్న 5 నెలల బాలుడిని బండకేసి కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత తన భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం భర్త వెంకన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:51 - December 15, 2016

రంగారెడ్డి : ప్రేమపేరుతో వేధింపులు తాళలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌ మండలం లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన శరణ్య... కేశవరంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అదేగ్రామానికి చెందిన నర్సింగ్, నర్సింగరావు ఇద్దరు యువకులు ఒకరితెలియకుండా మరొకరు శరణ్యను ప్రేమించారు. నర్సింగ్ (ఆటో డ్రైవర్), కాగా నర్సింగరావు అదే కాలేజీకి చెందిన విద్యార్థి. అయితే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో శరణ్యను వేధించారు. ఇదే విషయంపై కాలేజీ వద్ద కొంత వివాదం నెలకొంది. అనంతరం ఊర్లో ఆ ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీంతో యువతి మనస్తాపం చెందింది. వేధింపులు భరించలేక విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించారు. ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:42 - December 15, 2016
12:41 - December 15, 2016

హైదరాబాద్ : ఇవాళ అర్ధరాత్రితో పాత నోట్ల చెల్లింపు గడువు ముగుస్తోంది.. అప్పటిలోగా ఆస్పత్రులు, విద్యుత్‌ బిల్లులు, మొబైల్‌ రీచార్జ్‌కు ఈ నోట్లను వాడేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.. ఆ తర్వాతకూడా నోట్లుఉంటే కేవలం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాల్సిఉంటుంది.. అదికూడా డిసెంబర్‌ 31వరకూ మాత్రమే... ఆ తర్వాతకూడా నోట్లు మార్చుకోవాలంటే ఆర్ బీఐ కౌంటర్లకు వెళ్లాల్సిఉంటుంది..  మరోవైపు నోట్ల కష్టాలు 36వరోజుకు చేరాయి.. నగదు దొరక్క రోజువారీ అవసరాలు తీర్చుకోలేక సామాన్యుల అవస్థలు కొనసాగుతున్నాయి... దాదాపు 90శాతం ఏటీఎంలు పనిచేయకపోగా... మిగతావాటిల్లోకూడా డబ్బు నింపిన రెండు గంటల్లోనే క్యాష్ అయిపోతోంది.. అప్పటివరకూ చాంతాండంత క్యూకట్టినా డబ్బు దొరుకుతుందన్న గ్యారంటీలేకుండాపోతోంది.. ఇన్నిరోజులుగా ఇబ్బందులు తీరకపోవడంతో కేంద్రం తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ఎన్నిరోజులు ఇలా బ్యాంకులు, ఏటీఎంలచుట్టూ తిరగాలని ప్రశ్నిస్తున్నారు.

 

12:36 - December 15, 2016

చెన్నై : టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించింది. నివాసంలో రూ.131 ఇంట్లో నగదు, 170 కిలోల బంగారం పట్టుబడింది. కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి 34 కోట్ల కొత్త నోట్లు నేరుగా శేఖర్ రెడ్డి ఇంటికి చేరాయి. కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎస్ బిఐ కార్యాలయానికి తరలించకుండా శేఖర్ రెడ్డికి తరలించారు. ఎస్ బిఐకి చేరాల్సిన డబ్బులు శేఖర్ రెడ్డి ఇంటికి చేరినట్లు నిర్ధారించారు. దీనిలో తెలంగాణ, ఎపికి చెందిన 10 మంది బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే బ్యాంకు అధికారులను అరెస్టు చేయనున్నట్లు సిబిఐ, ఈడీ అధికారులు తెలిపారు. అలాగే శేఖర్ రెడ్డికి ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, తేజ్ రెడ్డిలు సహకరించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:26 - December 15, 2016

ఢిల్లీ : జాతీయ రహదారులపై బార్లు, వైన్ షాపులను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ స్వచ్చంధ సంస్థ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. హైవేలపై బార్లు, వైన్ షాపులను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతమున్న బార్లు, వైన్ షాపులకు లైసెన్స్ గడువు ముగిసేవరకు అనుమతి ఇచ్చారు. ఏప్రిల్ నెలతో షాపులకు లైసెన్స్ గడువు ముగియనుంది. ఆ తర్వాత బార్లు, వైన్ షాపుల లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ఆదేశించింది. అలాగే రోడ్డు, భద్రత ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించాలని సూచించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లోక్ సభ శుక్రవారానికి వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ అదే గందరగోళం నెలకొంది. విపక్ష, అధికార పక్ష సభ్యులు నినాదాలు చేశారు. వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం 12గంటలకు సభ ప్రారంభం కాగానే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీనితో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

12:20 - December 15, 2016

04-12-2016 ఆదివారం...ఉదయం 9గంటలకు పీవీ ఎక్స్ ప్రెస్..పిల్లర్ నెంబర్ 120...మూసీ నదిలో డెడ్ బాడీ...

మూసీ నదిలో డెడ్ బాడీ...రక్తపు మడుగులో ఉన్న శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా ప్రదేశానికి వెళ్లారు. ఆ పక్కనే నీళ్ల డ్రమ్ము ఉంది. దానికి కూడా రక్తపు మరకలున్నాయి. దీనిని బట్టి కిరాతకులు ఎక్కడో చంపేసి డెడ్ బాడీని డ్రమ్ములో తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. మరి ఆ వ్యక్తిని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? మిస్టరీ ఏంటీ ? మృతి చెందింది రంగారెడ్డి జిల్లా కుల్కచర్లకు రవీందర్ గా గుర్తించారు. భర్త డెడ్ బాడీ చూసి ఇల్లాళ్లు కన్నీళ్లు పెట్టింది. కొడుకు తల్లడిల్లాడు. కానీ ఈ ఇద్దరే హత్యకు పాల్పడ్డారు. వీరు హత్య చేయడానికి కారణాలు చెప్పారు. ఆ వివరాలేంటో వీడియో క్లిక్ చేయండి.

12:19 - December 15, 2016

తవ్విన కొద్దీ బయటపడుతున్న ఎముకలు..దుర్వాసనతో తట్టుకోలేకపోయారు. వారిద్దరూ తప్పు చేస్తున్నారు. పెద్దమనిషిగా వారించాల్సింది పోయి క్యాష్ చేయాలని అనుకున్నాడు. డబ్బులివ్వాలని బెదిరించాడు. దీనితో ఆ జంట అతడిని కిరాతకంగా హత్య చేసింది. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురంలోని లక్కవరంలో ఈ ఘటన కలకలం రేపింది. హతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానం వచ్చి జంటను విచారించింది. దీనితో నిజాలు బయటపడ్డాయి. ఘోర ఘటనపై మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:18 - December 15, 2016

ఆడపిల్లలంటే ఎందుకు వివక్ష ? వారసుడు కావాలని కొందరు పురిటిలోనే పసిబిడ్డలను వదిలేస్తున్న వారు కొందరు. ఎంతకాలం ఈ అమానుషాలు.. స్త్రీ అవనిలో సగం..ఆకాశంలో సగం..మహిళల ప్రాధాన్యత గురించి చెప్పడానికైనా ఈ మాటలు.. పేగు తెంచుకుని పుట్టిన ఆడబిడ్డలు..ప్రేమను పంచడానికి కూడా కన్నవారు ఇష్టపడడం లేదు. వారసుడు కావాలన్న కోరిక కొందరిని దుర్మార్గులు చేస్తోంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మరికొందరినీ పేగు బంధాన్ని తెంచుకొనేలా చేస్తున్నాయి. ఆడ పసికందులను ఏ చెట్టుకో..ఏ పుట్టకో పడేస్తున్నారు. ఆడపిల్లలంటే ఎందుకంత వివక్ష..మన ఇంట్లో తల్లి..చెల్లి..భార్య అందరూ ఆడవారే కదా..కూతురు వివక్షలో ఎందుకంత వివక్ష..
కర్నూలు నగరంలోని దర్వేసీ కాలనీలోని దర్గా నగర్ ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ రవికృష్ణ శిశువును హత్తుకుని ఛైల్డ్ సెంటర్ వారికి సమాచారం అందించారు. కామారెడ్డిలో జరిగిన మరో ఘటన కోసం వీడియో క్లిక్ చేయండి.

12:16 - December 15, 2016

ప్రముఖ ప్రఖ్యాత సంగీత దర్శకుడు 'ఏ.ఆర్. రెహ్మాన్' ఆస్కార్ రేసులో మళ్లీ నిలిచాడు. గతంలో 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాకు 'రెహ్మాన్' రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరు పొందిన ఇతను మరోసారి ఆస్కార్ రేసులో నిలిచారు. బ్రెజిల్ పుట్‌బాల్ క్రీడా దిగ్గజం పీలే బయోపిక్ ‘పీలే: బర్త్ డే ఆఫ్ ఏ లెజెండ్’ మూవీకిగాను రెహమాన్ ఆస్కార్ బరిలో నిలిచారు. ఇందులో ఆయన కంపోజ్ చేసిన 'జింగా' పాట అవార్డు బరిలో నిలిచింది. ఒరిజినల్ స్కోర్ విభాగంలో 145 మంది పోటీ పడుతున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో 91 పాటలు పోటీ పడుతున్నాయి. వీటిలో రెహమాన్ సాంగ్ 'జింగా' కూడా చోటు దక్కించుకుంది. ఆస్కార్ నామినేషన్ల తుది జాబితాను జనవరి 24న ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 26న అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగనుంది. మరి మరోసారి 'రెహ్మాన్' ఆస్కార్ అవార్డు అందుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.

12:14 - December 15, 2016

ఇంపాల్ : మణిపూర్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.  పోలీసు కాన్యాయ్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  మరో ఆరుమంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా... 

 

12:14 - December 15, 2016

పిచ్ పై బొగ్గులు మండడం ఏంటీ ? ఎవరైనా పిచ్ పై క్రికెట్ ఆడుతారు కానీ బొగ్గులకు మంటల పెట్టడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? పూర్తి వివరాలకు ఇది చదవండి..చెన్నై లో మొన్న వర్ధా తుపాన్ ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలిసిందే కదా. బలమైన గాలులు వీచేసరికి కొన్ని కార్లు..బస్సులు బోల్తా కూడా పడ్డాయి. ఈ గాలికి కొంతమంది పడిపోయారు కూడా. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ - భారత్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ఇక్కడ జరగాల్సి ఉంది. చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందా ? లేదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వర్షం వల్ల పూర్తిగా తడిసిపోయిన పిచ్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పిచ్ ను ఆరబెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది మండించిన బొగ్గులను దానిపై ఉంచుతున్నారు. పిచ్ ను ఆరబెడుతున్న ఫొటోలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. బుధవారం కూడా ఎండ రావడంతో పిచ్ ఆరుతుందని గ్రౌండ్ సిబ్బంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. డిసెంబర్ 16 నుండి 20వ తేదీన వరకు మ్యాచ్ జరగనుంది.

గాంధీ విగ్రహం ఎదుట టీఎంసీ ధర్నా..

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఎంసీ సభ్యులు ధర్నా నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుపై లోక్ సభలో టీఎంసీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

12:07 - December 15, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు అంశం పై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నోట్ల రద్దుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. నోట్ల రద్దకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. పేదల వ్యతిరేక ప్రభుత్వమన్నారు. విపక్షాలకు వ్యతిరేకంగా మరో వైపు అధికార పక్షం ఆందోళన చేసింది. ఇరు పక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభను ఎలా కొనసాగించాలన్నారు. నోటీసు ఇస్తే దానిపై చర్చిద్దామని సూచించారు. కానీ సభ్యులు వినలేదు. దీంతో సభను డిప్యూటీ చైర్మన్ పీజే.కురియన్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

12:03 - December 15, 2016

మెగాస్టార్ 'రామ్ చరణ్ తేజ' ఖాతాలో హిట్టు పడింది. ఆయన నటించిన తాజా చిత్రం 'ధృవ' మంచి టాక్ ను తెచ్చుకుంది. భారీ కలెక్షన్ల దిశగా పరుగులు తీస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చిత్రం విజయం సాధించడంతో 'చెర్రీ'తో పాటు చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. ‘ధృవ' చిత్రం విడుదలవుతుండగా 'చెర్రీ' చిత్ర యూనిట్ తో అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రమోషన్ లో పాల్గొన్నారు. ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి తిలకించారు. ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్‌లో చ‌ర‌ణ్ యాక్టివ్‌గా పాల్గొని అభిమానుల‌తో స‌క్సెస్‌ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ‘రామ్ చరణ్' వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 'చెర్రీ'కి ఘన స్వాగతం పలికారు. అందరితో షేక్ హ్యాండ్ ఇస్తూ అభివాదం చేస్తూ 'చెర్రీ' ముందుకు కదిలాడు.
జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా 'చ‌ర‌ణ్' నిర్మించిన 'ఖైదీ నంబ‌ర్ 150’ రిలీజ‌వుతోంది. ఇటీవ‌లే లాంచ్ చేసిన టీజ‌ర్‌తోనే సెల‌బ్రేష‌న్స్ మొద‌లైపోయాయి. టీజ‌ర్‌లో 'మెగాస్టార్ చిరంజీవి' చూపించిన గ్రేస్‌, ఎన‌ర్జీ లెవ‌ల్స్‌కి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

హైవేలపై మద్యం షాపులు..బార్లపై నిషేధం..

ఢిల్లీ : జాతీయ రహదారులపై ఉన్న బార్లు..వైన్స్ షాపులపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్ గడువు ముగిసే వరకు మద్యం..బార్ల షాపులకు సుప్రీం అనుమతినిచ్చింది.

గాంధీ విగ్రహం ఎదుట టీఎంసీ ధర్నా..

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీఎంసీ సభ్యులు ధర్నా నిర్వహించారు. పెద్దనోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుపై లోక్ సభలో టీఎంసీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

ఒక రోజు సమ్మెలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు..

హైదరాబాద్ : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఒక రోజు సమ్మెలో పాల్గొంటున్నారు. బీఎస్ఎన్ఎల్ టవర్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు.

అంకోలి నుండి పాదయాత్ర ప్రారంభం..

ఆదిలాబాద్ : 60వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం అంకోలి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. లోకారి, కండాల, ఇంద్రవెల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది.

తిరుమల సన్నిధానం అతిథి గృహంలో చోరీ..

చిత్తూరు : తిరుమల సన్నిధానం అతిథి గృహం రూం 30లో చోరీ జరిగింది. నంద్యాలకు చెందిన భక్తుల నుండి రూ. 2.30 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

కృష్ణాలో రూ. 15లక్షల కరెన్సీ స్వాధీనం..

కృష్ణా : పెదపారుపూడి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో రూ. 15లక్షల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ. 15 లక్షలు రూ. 2వేల నోట్లున్నాయి. విజయవాడ నుండి గుడివాడకు వెళుతున్న ఈ కారులో గుడివాడ పీఎస్ కు చెందిన కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

 

నేడు సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల దిగ్బంధనం

విజయవాడ : నేడు సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల దిగ్బంధనం జరుగనుంది. 279 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

శేఖర్ రెడ్డి ఆస్తుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..

చిత్తూరు : శేఖర్ రెడ్డి ఆస్తుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ నుండే రూ. 34 కోట్ల కొత్త నోట్లు శేఖర్ రెడ్డికి నేరుగా చేరాయి. ఎస్ బీఐకి చేరాల్సిన ఈ డబ్బులు నేరుగా శేఖర్ ఇంటికి పంపించినట్లు నిర్ధారించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పది మంది అధికారులకు సంబంధం ఉందని తెలుస్తోంది. బ్యాంకు అధికారులను త్వరలోనే సీబీఐ అరెస్టు చేయనున్నట్లు సమాచారం. శేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 131 కోట్ల నగదు, 170కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే.

నేటి నుంచి 77వ ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సదస్సు

హైదరాబాద్ : నేటి నుంచి నాలుగు రోజులపాటు హైటెక్స్ లో 77వ ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సదస్సు జరుగనుంది. ప్రమాద రహిత రోడ్ల నిర్మాణాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

 

11:42 - December 15, 2016

ఢిల్లీ : లోక్ సభలో అదే సీన్ రిపీట్ అయింది. మళ్లీ సభ వాయదా పడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సుమిత్రమహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

07:40 - December 15, 2016

కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్ నేత నాగబ్రహ్మచారి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న 23వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చలో విజయవాడ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 19న విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి పోరాటానికి కారణం ఏమిటి? ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? వీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి'?....వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:34 - December 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలకు సర్వం సిద్ధమైంది. వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలైన అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, సామాజిక న్యాయమే అజెండాగా సమావేశాలు నిర్వహించాలంటూ తెలంగాణలో పాదయాత్ర  నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లయ్యింది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అంతే వయస్సుంది. కెసిఆర్ ప్రభుత్వ పదవీకాలంలో సగం కాలం పూర్తయ్యింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లే . వచ్చే ఎన్నికల్లో గెలిచి, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రెండున్నరేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా పనులు చేయాల్సి వుంటుంది. 
టీప్రభుత్వానికి సగం పదవీ కాలం 
ప్రజా సమస్యలు చర్చించేందుకు, పరిష్కరించేందుకు శాసనసభ, శాసనమండలి చక్కని వేదికలు. అసెంబ్లీ సమావేశాలు ఎంత అర్ధవంతంగా జరిగితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. అయితే, దురదృష్టవశాత్తు, రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు ప్రాధాన్యత పెరిగి, ప్రజాసమస్యలు పక్కకు పోతున్నాయి. ఈసారి సమావేశాలలోనైనా తమ సమస్యలు చర్చకు రావాలన్నది సామాన్య ప్రజల ఆకాంక్ష. టిఆర్ఎస్ ప్రభుత్వానికి సగం పదవీ కాలం ముగిసిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. 
దిక్కుతోచని స్థితిలో రైతులు  
తెలంగాణలో రైతులు దిక్కుతోచని స్థితిలో వున్నారు. కొన్ని మండలాల్లో కరవు, కొన్ని మండలాల్లో అకాల వర్షాలతో రైతులు దెబ్బతిన్నారు. దీనికితోడు నోట్ల రద్దు సమస్య మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇలాంటి సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వైపు రైతులు ఆశగా చూస్తున్నారు. ఇది చెరకు క్రషింగ్ సీజన్. తెలంగాణలో ఏకైక భారీ సహకార చక్కెర కర్మాగారంగా పేరొందిన సారంగపూర్  ఫ్యాక్టరీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. నిజాంషుగర్ ఫ్యాక్టరీకి చెందిన బోధన్, మెదక్, మెట్ పల్లిలోని మూడు యూనిట్లు మూతపడడంతో చెరకు రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.  మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను  తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలేమిటో అసెంబ్లీ వేదికగా టిఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెబితే, బాగుంటుంది. 
రూ.2300 మద్దతు ధర సరిపోదంటున్న రైతులు 
చెరకుకు కేంద్రం ప్రకటించిన 2300 రూపాయల మద్దతు ధర సరిపోదన్నది రైతుల ఆవేదన. చెరకు రైతులను ఆదుకునే మార్గాలపై శాసనసభ, శాసనమండలి దృష్టి సారించాల్సిన అవసరం వుంది. పాదయాత్ర సమయంలో చెరకు రైతుల కష్టాలను స్వయంగా చూసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వీటిని ఏకరువు పెడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రికి  లేఖలు రాశారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి, చెరకు రైతుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ఆయన చేసిన సూచనను ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తెలంగాణలోని చెరకు రైతులకు మేలు జరుగుతుంది. 
నోట్ల రద్దుతో సమస్యలు మరింత తీవ్రం 
నోట్ల రద్దు నేపథ్యంలో బడుగు, బలహీనవర్గాలు, చేతివృత్తులవారి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. అంతో ఇంతో కూడుబెడుతున్న ఉపాధికే ఎసరు వచ్చేలా వుంది. ఇటువంటి సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడం ద్వారా ఆయా వర్గాలను ఎంతోకొంత ఆదుకునే అవకాశం వుంది.  ఎస్సీ సబ్ ప్లాన్ కింద 10,483 కోట్ల రూపాయలు కేటాయించగా, అందులో ఇప్పటికే 4వేల కోట్ల రూపాయలు దారిమళ్లాయి. మిగిలిన 6,483 కోట్లలో సగం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో దీన్నొక ప్రాధాన్యతాంశంగా చర్చించడం సందర్భోచితంగా వుంటుంది.
ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు
ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో ఇదే పరిస్థితి. 6170 కోట్ల రూపాయలు కేటాయిస్తే, 1700 కోట్ల రూపాయలు దారి మళ్లియాన్న ఆవేదన గిరిజన సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తున్న రుణాలు కూడా ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం లక్షన్నర మంది దరఖాస్తు చేసుకుంటే, 56వేలమందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో కేవలం 4వేల మందికి మాత్రమే రుణాలు విడుదల చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ దీ అదే కథ. రుణాల కోసం లక్షన్నర మంది అప్లయ్ చేస్తే కేవలం 7వేల మందికే శాంక్షన్ లెటర్స్ ఇచ్చారు. 
పెండింగ్ లో రూ.3500 కోట్ల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు 
3500 కోట్ల రూపాయల ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలా విభిన్నవర్గాల ప్రజలు అసెంబ్లీలో తమ సమస్యలు చర్చకు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

 

07:13 - December 15, 2016

హైదరాబాద్ : కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు న్యాయ సమ్మతంగా లేదని పిటిషన్‌లో తెలంగాణ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ఈ ఉత్తర్వులు లేనందున వీటిని అమలు చేయకుండా స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది.
కృష్ణా వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ స్పెషల్ లీవ్ పిటిషన్
కృష్ణా వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు న్యాయ సమ్మతంగా లేదని పిటిషన్‌లో తెలంగాణ అభిప్రాయపడింది. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలన్నింటినీ ఒకే యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ఈ పిటిషన్‌లో కోరింది. అన్ని రాష్ట్రాలకు ఒకే రీతిన కృష్ణా జలాల కేటాయింపులు జరగాలని తెలంగాణ రాష్ట్రం వాదించింది. అశాస్త్రీయమైన కేటాయింపులతో ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రల నుంచి దిగువన ఉన్న తెలంగాణకు నీరు రావని పేర్కొంది. కేవలం ఆంధ్ర, తెలంగాణ కే పరిమితం చేయరాదని నాలుగు రాష్ట్రాలకు న్యాయబద్ధమైన పంపిణీ జరగాలని ప్రభుత్వం వాదించింది.  
కృష్ణా జలాలను ప్రాజెక్టు వారీగా కేటాయింపులు జరపాలి : ప్రభుత్వం 
కృష్ణా జలాలను ప్రాజెక్టు వారీగా కేటాయింపులు జరపాలని ఎస్ఎల్‌పి లో ప్రభుత్వం వాదించింది. పునర్విభజన చట్టం స్ఫూర్తి కె.డబ్ల్యు.డి.టి. తీర్పులో ప్రతిఫలించలేదని తెలంగాణ సర్కార్ తెలిపింది. ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన సమస్యలు పరిష్కరించడంలో ట్రిబ్యునల్ విఫలమైనందున సుప్రీంకోర్టు న్యాయం చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 
కృష్ణా జలాల పంపిణీ సమంగా జరగాలి : ప్రభుత్వం
నదీ పరివాహక ప్రాంతం ,  సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు, కరవు పీడిత ప్రాంతాలు, జనాభా, సామాజిక ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు వారీ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కృష్ణా జలాల పంపిణీ సమంగా జరగాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్ష  అని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది. తెలంగాణకు  నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాలు సరిదిద్దాలని కోరింది.
170 టీఎంసీల ప్రాజెక్టులు కోల్పోయిన మహబూబ్ నగర్ జిల్లా
కృష్ణా బేసిన్లోని మహబూబ్ నగర్ జిల్లాకు 170 టీఎంసీల సాగునీరందించే ప్రాజెక్టులు కోల్పోయామని తెలంగాణ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ 512 టిఎంసీలలో 350 టిఎంసీల కు పైగా  బేసిన్ వెలుపల ప్రాంతాలకు వాడుకుంటున్నట్టు తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ తరువాత 40 సంవత్సరాల్లో సాంకేతిక పురోగతి వల్ల పంటలకు అందించే నీటి పరిమాణం విషయంలో, ఇరిగేషన్ పద్దతుల్లో మార్పు వచ్చిందని తెలిపింది. 
కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలి..
బేసిన్లోని కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని కోరింది. వీటన్నింటి దృష్ట్యా నాలుగు రాష్ట్రాలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ తన పిటిషన్ లో కోరింది. కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే అయితే తెలంగాణకు న్యాయం జరగదని స్పష్టం చేసింది.

07:11 - December 15, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుతో నల్లనోట్లు..గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. నోట్ల రద్దుతో ఓవైపు సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతుంటే..మరోవైపు నల్లధన కుబేరుల దగ్గర కొత్త నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. ఆదాయపు పన్నుశాఖ అధికారుల్లో దిమ్మతిరిగే మొత్తాల్లో నల్లనోట్లు దొరుకుతున్నాయి. 
సామాన్యుల అవస్థలు..
క్యూలైన్లలో ఓ వైపు సామాన్యుల అవస్థలు.. మరోవైపు శ్రీమంతుల ఇళ్లలో బయటపడుతున్న కోట్లకొద్ది కొత్త కరెన్సీ కట్టలు...పెద్ద నోట్ల రద్దు తర్వాత గుట్టలు గుట్టలుగా బయట పడుతున్న నల్లకట్టలు.. ఐటీదాడుల్లో దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న వందలకోట్ల నల్లకరెన్సీ.. పెద్దోడికి ఓ న్యాయం..పేదోడికి ఓ న్యాయం అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి దేశంలోని కొన్ని  బ్యాంకులు. పెద్దనోట్ల రద్దుతో ఒకవైపు సామాన్యులు పడరాని పాట్లు పడుతుంటే..మరోవైపు కొన్ని బ్యాంకులు మాత్రం..కమీషన్ల కక్కుర్తితో గుట్టుచప్పుడు కాకాండా పెద్దోళ్లకు కోట్లకు కోట్లు కొత్త కరెన్సీని మార్చి ఇస్తున్నాయి. దీంతో శ్రీమంతుల ఇళ్లలో కొత్త కరెన్సీ కట్టలు గుట్టలు గుట్టలుగా చేరిపోయాయి. 
ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న కొత్త కరెన్సీ
పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధన కుబేరులు.. తమ వద్దనున్న బ్లాక్‌మనీని ఏరేంజ్‌లో కొత్తనోట్లతో మార్చుకున్నారో.. ఇటీవల ఐటీ దాడుల్లో వెలుగు చూస్తోంది. ఇప్పటికే టిటిడి మాజీ బోర్డు మెంబర్‌, చెన్నై పారిశ్రామికవేత్త రాజశేఖర్‌రెడ్డి నల్లధనాన్ని చూసి షాక్‌ అయిన ఐటీ అధికారులకు..దేశవ్యాప్తంగా అదేరేంజ్‌లో పట్టుబడుతున్న కొత్త కరెన్సీ కట్టలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ కరోల్‌బాగ్‌ హోటల్‌లో 3కోట్ల 25లక్షల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చండీగఢ్‌లో 2 కోట్ల 18 లక్షల కొత్తనోట్లు.. పనాజీలో 68 లక్షలు..కలంగుట్‌లో 24 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్‌కూడా చేశారు. అలాగే బెంగళూరులో 2కోట్ల 25 లక్షల కొత్తనోట్లు..జైపూర్‌లో 16 లక్షల 94వేల నగదును పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. రాయ్‌గఢ్‌లో కూడా 13 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు..పుణేలో 15లక్షల నగదును సీజ్‌ చేశారు.. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. 
శేఖర్‌రెడ్డి నివాసాల్లో బయటపడుతున్న నగదు నిల్వలు  
ఇప్పటికే చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి నివాసాల్లో నగదు నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి. శేఖర్‌రెడ్డికి చెందిన నివాసం, కార్యాలయాల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఇప్పటి వరకు 131 కోట్ల నగదు, 177 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో వెయ్యికోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లనూ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోనూ 13.50 కోట్ల రూపాయలను ఐటీశాఖ, పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని కైలాస్‌ ప్రాంతంలో ఐటీశాఖ, పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రోహిత్‌ టండన్‌ యాజమాన్యం నుంచి 13.50 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.61 కోట్ల కొత్త కరెన్సీ ఉండడం కలకలం రేపుతోంది.
ఆర్బీఐ అధికారి నుంచి కోటిన్నర కొత్త 2వేల నోట్లు స్వాధీనం 
కమీషన్‌కు కక్కుర్తి పడిన బెంగళూరు రిజర్వు బ్యాంకు అధికారి మేఖేల్‌ ఓ నగల వ్యాపారి నుంచి కోటిన్నర విలువైన కొత్తనోట్లను మారుస్తుండగా సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. చేసిన నేరాన్ని మైఖేల్‌ ఒప్పుకోవడంతో విధుల నుంచి తొలగిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది. ఇక క్యాసినో యజమాని కె.వి వీరేంద్ర ఇంటిలోని బాత్‌రూంలోనుంచి 5కోట్ల 70 లక్షల కొత్త 2వేల నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో పాతనోట్లకు బదులుగా కొత్తనోట్లను మార్చుతుండగా..ఈడీ అధికారులు వారిదగ్గరనుంచి 93లక్షల విలువైన కొత్త 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వడోదరాలోని ఓ వ్యాపారి నివాసంలో గోనెసంచిలో దాచిన 19లక్షల 67వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో 13 లక్షల మేర కొత్త 2వేల నోట్లు ఉన్నాయి. 
తెలంగాణలోనూ భారీ ఎత్తున నల్లడబ్బు 
తెలంగాణలోనూ భారీ ఎత్తున నల్లడబ్బు బయటపడుతోంది. రాజధాని హైదరాబాద్‌లో కమీషన్‌పై నోట్లు మారుస్తామంటూ నమ్మించి ఆపై బెదిరించి దోపిడి చేసిన ఫిలింనగర్‌ కరెన్సీ కేసులో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరినుంచి 52 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక మెదక్‌ జిల్లాలోనూ కొత్తనోట్లు బయటపడ్డాయి. రామాయంపేటలో కారులో తరలిస్తున్న 16 లక్షల విలువచేసే కొత్తనోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు ఎవరిది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఏపీలోని కర్నూలు జిల్లాలోనూ 12.2 లక్షల విలువైన రెండువేల నోట్లు పట్టుబడ్డాయి. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో నోట్ల మార్పిడికి పాల్పడుతున్న  ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా 10శాతం కమీషన్‌తో పాతనోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇవే కాకుండా..పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉన్న ప్రధాన విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 60 కోట్ల కరెన్సీ, 245 కిలోల బంగారం అధికారుల దాడుల్లో పట్టుబడింది. 
సామాన్యులు అష్టకష్టాలు 
పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. కనీస అవసరాలకు నగదు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటలకొద్దీ ఏటీఎం, బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసినా.. చివరికి రెండువేలే లభిస్తున్నాయి. ఇంకొందరికీ అవికూడా దొరకడం లేదు. ఒకవైపు నగదు కోసం సామాన్యులు పడరానిపాట్లు పడుతుంటే... మరోవైపు నల్లకుబేరుల దగ్గర మాత్రం కొత్త కరెన్సీ కట్టలు గుట్టలుగా దొరుకుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు దిమ్మతిరిగేలా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయం ఎవరి తాట ఒలిచింది..? నల్లకుబేరులను నడిరోడ్డుపై నిలిపిందా..? సామాన్యుణ్ణి కష్టాలపాల్జేసిందా..? ఈ ప్రశ్నలకు సమాధానం సుస్పష్టం. 

 

06:48 - December 15, 2016

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పట్ల సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నేతలు అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా ఈ నిర్ణయంపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం మంచిదే అయినా ఆచరణలో మాత్రం లోపాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.
నోట్ల రద్దు నిర్ణయంపై బీజేపీ నేతల విమర్శలు 
నోట్ల రద్దు నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్షాల నేతల దాకా అందరూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీ నిర్ణయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని.. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.. ఇది అందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు మోదీ సొంత పార్టీ నేతల నుంచే నోట్ల రద్దు నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 
నేనూ సహనం కోల్పోయానన్న విష్ణుకుమార్‌
నోట్ల రద్దుపై ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు స్పందించారు. ప్రధాని మోదీ నిర్ణయం సరైనదే కానీ.. అమలులో లోపం ఉందని విష్ణుకుమార్‌రాజు అభిప్రాయపడ్డారు. రోజురోజుకు పెరుగుతున్న ఇబ్బందులు దృష్ట్యా.. ప్రజలు సహనాన్ని కోల్పోతున్నారని.. తాను కూడా సహనం కోల్పోయానన్నారు. సామాన్యులు సహనం కోల్పోనంత వరకు బాగానే ఉంటుందని.. కానీ పబ్లిక్ సహనం కోల్పోయారని ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని హితవు పలికారు. సామాన్యులకు కనీస అవసరాలకు డబ్బు అందకుండా ఉంటే.. నల్ల కుబేరులకు మాత్రం కోట్లకు కోట్ల రూపాయలు అందుతున్నాయని విమర్శించారు. మొత్తమ్మీద నోట్ల రద్దు నిర్ణయంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు రావడం చూస్తుంటే ఈ నిర్ణయం భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందో వేచి చూడాలి.

 

నేడు దేశవ్యాప్త సమ్మెకు బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల పిలుపు

హైదరాబాద్ : నేడు దేశవ్యాప్త సమ్మెకు బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు పిలుపు ఇచ్చారు. బీఎస్ ఎన్ ఎల్ ప్రయివేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టనున్నారు. 

Don't Miss