Activities calendar

18 December 2016

22:04 - December 18, 2016

మేడ్చల్‌ : శామీర్‌పేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొంగలమైసమ్మ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ నుంచి శామీర్ పేట వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. 

22:00 - December 18, 2016

ఢిల్లీ : అంతరాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అంతరాష్ట్ర జల వివాదాల చట్టం సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నట్టు సమాచారం. కొత్త ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించనున్నారు.

21:57 - December 18, 2016

విజయవాడ : ఏపీలో కాపుల ఉద్యమం మళ్లీ మొదలైంది. వేలాది మంది ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి .. పళ్లెంతో దరువులేస్తూ.. ప్రభుత్వం తమ ఆకలికేకలు వినాలని నిరసనతెలిపారు. ఉద్యమనేత ముద్రగడతోపాటు ..రాష్ట్రవ్యాప్తంగా కాపులనేతల ఆధ్వర్యంలో ఆందోళనలు హోరెత్తాయి.

ఏపీలో కాపుఉద్యమ వేడి మళ్లీ వేడెక్కింది..
ఏపీలో కాపుఉద్యమ వేడి మళ్లీ వేడెక్కింది. కాపు జేఏసీ నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం విడతలవారీ నిరసనలో భాగంగా.. ఆదివారం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. పళ్లాలు కొడుతూ.. తమ ఆకలి కేకలు వినాలంటూ.. ఉద్యమకారులు నినాదలుచేశారు.

కాపునేత ముద్రగడ ఆధ్వర్యంలో నిరసన
పశ్చిమగోదావరి జిల్లా పిఠాపురంలో కాపునేత ముద్రగడ ఆధ్వర్యంలో నిరసన ఉధృతంగా సాగింది. పళ్లేలపై దరువులేదస్తూ.. ప్రభుత్వం తమ ఆకలి కేకలు వినిపించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చశారు. పాలకొల్లు, రావులపాలెం, కొత్తపేట,

తూర్పుగోదావరి జిల్లాలోనూ కాపుల నిరసన
అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ కాపుల నిరసన హోరెత్తింది. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఉద్యమకారులు.. రోడ్లపైకి వచ్చి ..పళ్లాలు కొడుతూ ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు బీసీరిజర్వేషన్లు కల్పించి.. వెయ్యికోట్లరూపాయల ప్రత్యకే నిధిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

అగ్గిపుట్టిస్తామంటున్నారు కాపునేతలు...
కాపు జేఏసీ నిర్ణయించిన ఉద్యమకార్యచరణ ప్రకారం.. విడతలవారీగా ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామంటున్నారు కాపునేతలు.ఇప్పటికైన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ డిమాండ్‌ను నెర్చకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా అగ్గిపుట్టిస్తామంటున్నారు కాపునేతలు.

21:53 - December 18, 2016

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వరంగ సంస్థలకు తీవ్ర విఘాతం కలగుతుందంటున్నారు అఖిలభారత బ్యాంక్‌ ఆఫీసర్ల అసోషియేషన్‌ నేతలు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏఐబీవోఏ 7వ జాతీయ సదస్సుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దనోట్లరద్దు ఎఫెక్ట్‌తో ప్రజలతో పాటు బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. డిజిటలైజేషన్‌ పేరుతో.. బ్యాంకు ఉద్యోగాల్లో కోతపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో ఉద్యోగాలు రాకపోవడంతో పాటు.. ఇప్పటికిపుడు చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపడానికి పాలకులు టెక్నాలజీ మంత్రాన్ని జపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక ఉద్యమాల్లో బ్యాంకు ఉద్యోగులు కూడా కలిసి నడవాలని వక్తలు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వామపక్ష కార్మిక ఉద్యమానికి ఏఐబీఏ, ఏఊబీఓఏ కలిసి నడుస్తాయని... మరో నాలుగేళ్ల తర్వాత జరగబోయే జాతీయ సదస్సును రెండు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు.. అసోసియేషన్‌ నేతలు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులతో పాటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కూడా మాట్లాడారు. 

21:45 - December 18, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దుతో 40 రోజులు గడుస్తున్నా ఏ మాత్రం సీన్‌ మారలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు అదే క్యూ రిపీట్‌ అవుతోంది. కరెన్సీ కష్టాలు ప్రజలను వీడడం లేదు. సండే రోజు సందడిగా ఉండే మార్కెట్లు సైతం సైలెంట్‌గా మారాయి. చిల్లర లేక అటు ప్రజలు..లావాదేవీలు జరగక ఇటు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

40 రోజులుగా అవే ఇబ్బందులు
ప్రజలను కరెన్సీ కష్టాలు వీడడం లేదు. 40 రోజులుగా అవే ఇబ్బందులు కొనసాగుతున్నాయి. దేశంలో 90 శాతానికిపైగా ఏటీఎంలు మూతపడ్డాయి. మరోవైపు తెరిచివున్న ఏటీఎంల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడ్డా నగదు లభిస్తుందో.. లేదోనన్న టెన్షన్‌ ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. బ్యాంకుల తీరుపై అనేకచోట్ల ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాన్‌వెజ్ మార్కెట్లు సైతం వెలవెల
సండేరోజు సందడిగా ఉండే నాన్‌వెజ్ మార్కెట్లు సైతం వెలవెలబోతున్నాయి. చిల్లర కష్టాలతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవురోజుల్లోనే బేరాలు లేకపోతే ఇక మామూలు రోజుల్లో తమ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెబుతున్నారు.

చిరు వ్యాపారానికి చిల్లర కష్టం
చిల్లర కష్టాలతో కూరగాయల వ్యాపారస్తులు కూడా లబోదిబోమంటున్నారు. వందరూపాయల కూరగాయలు కొని..రెండువేల నోటిస్తే...తామెక్కడ నుంచి చిల్లర తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యాపారానికి చిల్లరే ప్రధానమని..నోట్ల రద్దు రూపంలో తమకు పెద్ద దెబ్బ తగిలిందని అంటున్నారు.

చిల్లర లేక వ్యాపారం పోయిందంటున్న వ్యాపారులు
మరోవైపు చిల్లర వ్యాపారస్తులు సైతం తీవ్ర స్థాయిలో నష్టపోయామని చెబుతున్నారు. గతంలో లేని విధంగా వ్యాపారం కుదేలయ్యిందని మండిపడుతున్నారు. స్వైపింగ్‌ మిషన్స్ అంటే తెలియని తమకు ...వాటితో లావాదేవీలు జరపడం ఎలా తెలుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తనోట్లను మార్పిడి చేసే రెండు ముఠా అరెస్ట్
ఓవైపు చిల్లరలేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే..మరోవైపు నోట్ల మార్పిడి ముఠాలు యధాతథంగా తమ పని కానిచ్చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పాతనోట్లకు కమిషన్ మీద కొత్తనోట్లను మార్పిడి చేసే రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 17 లక్షల 80 వేల రూపాయలను స్పాధీనం చేసుకున్నారు.

కేంద్రం స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటున్న ప్రజలు
బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న తమకు డబ్బులు దొరకడం లేదని..మరి కోట్ల రూపాయల కొత్తనోట్లతో దొరుకుతున్న ముఠాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంచి జరుగుతుందని ఇంతవరకూ సహిస్తే ఇంకా కష్టాలెక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

21:41 - December 18, 2016

ఢిల్లీ : కొత్త ఆర్మీ చీఫ్‌ నియామకంపై రగడ మొదలైంది. సీనియారిటిని విస్మరించి... లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను సైనికదళాల ప్రధాన అధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని కాంగ్రెస్‌, వామపక్షాలు తప్పుబట్టాయి. సీనియర్లను కాదని మూడో కేడర్‌లో ఉన్న రావత్‌ను చీఫ్‌గా నియమించడం సైనిక దళాలకు తప్పుడు సంకేతం ఇచ్చినట్టవుతుందని విపక్షనేతలు విమర్శించారు.

లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌రావత్‌ను నియమించడంపై దుమారం
ఆర్మీ దళాల ప్రధాన అధికారిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌రావత్‌ను నియమించడంపై దుమారం రేగుతోంది. రావత్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయానికి విఘాతం కలిగించిందని.. విపక్షనేతలు విమర్శలు ఎక్కుపెట్టారు.

కేంద్రప్రభుత్వానిది తొందరపాటు నిర్ణయం- కాంగ్రెస్‌
అనుభవమున్న సీనియర్‌ అధికారులను కాదని.. మూడో ర్యాంకులో ఉన్న బిపిన్‌రావత్‌ను ఆర్మీచీఫ్‌గా నియమించడం సైనికపరంగా వ్యూహాత్మక తప్పిదమన్నారు కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారి. ఓవైపు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో నిత‌్యం ఘర్షణలు చెలరేగుతున్న సమయంలో కేంద్రం ప్రభుత్వ నిర్ణయం అనాలోచితమన్నారు.

భద్రతాపరంగా మోదీప్రభుత్వ తప్పిదం : లెఫ్ట్‌పార్టీలు
అటు వామపక్షాలు కూడా కొత్త ఆర్మీచీఫ్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి దురదృష్టకరమన్నాయి. ఇద్దరు సుపీరియర్‌ ఆఫీసర్లను కాదని. బిపిన్‌ రావత్‌ను ఎలా ఎంపిక చేస్తారని సీపీఐ లీడర్‌ డి.రాజా ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయం ఆర్మీదళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం దేశప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

మోదీ ప్రభుత్వ నిర్ణయం దేశానికి ప్రమాదం: రాజకీయ వర్గాలు
దేశభద్రతకు కీలకమైన ఆర్మీ చీఫ్‌తోపాటు .. ఇంటలిజెన్స్‌బ్యూరో, రా సంస్థల అధిపతుల నియామకంలో కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని కాంగ్రెస్‌ , వామపక్షాలు విమర్శించాయి. మోదీ ప్రభుత్వ నిర్ణయం దేశానికి ప్రమాదం కొనితెస్తుందని.. రాజకీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

21:39 - December 18, 2016

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ నాలుగోరోజూ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. ఈరోజు ప్రత్యేక హాదా అంశంపై బీజేపీని టార్గెట్‌ చేశారు. స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో బీజేపీ ఇచ్చిన హామీని విస్మరించింద‌ని...కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కేవ‌లం కంటి తుడుపు చ‌ర్యేనని ఆక్షేపించారు. మరోవైపు జనసేనాని ట్వీట్లపై కమలనాథులు కౌంటర్‌ ఇచ్చారు.

ఘాటైన ట్వీట్లతో వేడి పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్

ఘాటైన ట్వీట్లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పొలిటికల్‌ హీట్‌ను పెంచుతున్నారు. కమలం పార్టీని ఇరుకున పెట్టేలా వరుస ప్రశ్నలతో కాక పుట్టిస్తున్నారు. ఇప్పటికే గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి అంశాలపై ప్రశ్నించిన జనసేనానీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీని టార్గెట్‌ చేస్తూ ట్విట్ చేసారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బిజేపి ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. ద‌శాబ్దాలుగా ఆంధ్రులను అవ‌మానాలకు గురిచేసి రాజ‌ధాని లేని, ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ప్రత్యేక ప్యాకేజీగా మారిందని చెప్పారు. బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అన్న పదం తప్ప వేరే ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రులను వెన్నెముక లేని వారిగా పరిగణిస్తోందని.. జైఆంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరన్నారు పవన్‌. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో బీజేపీపై పవన్‌ నిప్పులు

పవన్ వరుస ట్వీట్లపై బీజేపీ ఏపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఏ విశ్వ విద్యాలయాల వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోవడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హ‌రిబాబు అన్నారు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనీ.. ప్రభుత్వానికి ఈ అంశంతో సంబంధం లేదని వివరించారు. సుప్రీం ఆదేశాలను పాటించేదీ లేనిది ప్రజల ఇష్టమన్నారు.

పవన్‌ ట్వీట్లపై కమలనాథుల కౌంటర్‌ బీజేపీ ఏ విశ్వ విద్యాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. పాటించేది..లేనిది ప్రజల ఇష్టమని, నగదు రహిత లావాదేవీలకు ప్రజలకు అలవాటుపడాలన్నారు. జనవరి 1 తరువాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై ప్రభుత్వం నిర్ణయం సరైనది కాకుంటే..రాబోయే ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారని తెలిపారు.
పెద్దనోట్ల రద్దు సోమవారం ట్వీట్ చేయనున్న పవన్
సోమవారం పెద్దనోట్ల రద్దు అంశంపై పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేయనున్నారు. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. కమలనాథుల అనాలోచిత నిర్ణయంపైనా పవన్‌ ఘాటుగా స్పందిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. 

21:24 - December 18, 2016

హైదరాబాద్‌: మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. పట్టపగలు తూటాల పేలుళ్లతో మసాబ్‌ట్యాంక్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అలజడి రేపింది. కేబీఎస్‌ బ్యాంకు మేనేజర్‌ మన్మథ దాలియా ఇంటికి వెళ్లిన ఆగంతకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. క్షణాల్లోనే నిందితుడు బైక్‌పై ఎస్కేప్‌ అయ్యాడు. ఆర్థిక లావాదేవీలే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది.

కేబీఎస్‌ బ్యాంక్‌ సీఈవో మన్మథ్‌ దాలియా ఇంట్లో చిందిన రక్తం
హైదారాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి... మసాబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌లో తుపాకీ పేలుడు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. కేబీఎస్‌ బ్యాంకు సీఈవో మన్మథ్‌ దాలియా శాంతినగర్‌లోని శ్రీదుర్గా కానుమిల్లి అపార్టమెంట్స్‌లో నివాసముంటున్నాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు అపార్టమెంట్‌కు ఓ ఆగంతకుడు బైక్‌పై వచ్చి.. బ్యాంకులో పనిచేసే వ్యక్తి కావాలంటూ వాచ్‌మెన్‌ను ఆరాతీశాడు. ఎవరూ లేరని చెప్పడంతో..అక్కడే పార్క్‌ చేసిన కారును చూపించి..ఆ కారు యజమానిని కలవాలన్నాడు. మన్మథ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వాచ్‌మెన్‌ సదరు అపరిచిత వ్యక్తిని ఆయన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో..ఒక్కసారిగా దుండగుడు తుపాకీ బయటకి తీశాడు. వెంటనే గాల్లోకి ఒక రౌండ్‌, మన్మథ్‌ దాలియా మోకాలిపై మరో రౌండ్‌ కాల్చాడు. దీంతో రక్తపుమడుగులో బాధితుడు కుప్పకూలిపోయాడు. క్షణాల్లో పై అంతస్తు నుంచి కిందకు వచ్చిన నిందితుడు బైక్‌పై పారిపోయాడు. కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు..అపస్మారస్థితిలో వున్న బాధితుడిని హుటాహుటిన బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

అపార్ట్‌మెంట్‌కు బైక్‌పై వచ్చిన దుండగుడు
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పులకు కారణం ఆర్థిక లావాదేవీలా లేక పాతకక్షలా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఎలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు? కాల్పులు జరిపిన వ్యక్తికి మన్మథ దాలియాకు ఉన్న సంబంధాలు ఏమిటి అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. పరిసరాల్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. 

'వర్శిటీలను ప్రయివేటుపరం చేయొద్దు'

కరీంనగర్ : ప్రజా సమస్యలపై ప్రశ్నించినంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు. యూనివర్శిటీలను ప్రరయివేటు పరం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. మిడిమానేరు పనులను కొత్త కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు.

20:43 - December 18, 2016

ఆడ శిశువుని విక్రయించేందుకు యత్నం..

నల్లగొండ : దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో అమానుషం చోటు చేసుకుంది. నిన్న పుట్టిన పసికందును విక్రయించేందుకు గిరిజన దంపతులు యత్నించారు. నాలుగో సంతానం కూడా ఆడపిల్ల పుట్టిందని పోలీసుల విచారణలో వారు తెలిపారు. తల్లిదండ్రులు...దళారులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు పోలీసులు..ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. పాపను పోషించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పసికందును నల్లగొండ శిశుగృహకు ఐసీడీఎస్ అధికారులు తరలించారు.

20:11 - December 18, 2016

వెన్నెల సినిమాతో పరిచయమైన నటుడు రవివర్మ. హీరో అవ్వాలని ఫారిన్ లో జాబ్ ను కూడా వదిలేసుకుని వచ్చేసానని రవివర్మ చెప్పాడు. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు. అనంతరం నెగిటివ్ క్యారక్టర్లతో కూడా మెప్పించాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ ప్రాణప్రదం పెంచుకున్న చెల్లెలి భర్తగా నెగిటివ్ రోల్ నటించి మెప్పించాడు. 'కాలింగ్ బెల్' సినిమాలో మంచి పేరొచ్చిందని రవివర్మ తెలిపారు. జయమ్ము నిశ్చయమ్మురా..అసుర..బూచమ్మా బూచాడు.. వంటి సినిమాలతో మంచి జోష్ మీదున్న నటుడు రవివర్మతో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఇద్దరు దర్శకులు నాగు గవర, దేవ కట్ట రవివర్మకు లైవ్ లో ఫోన్ చేసి ఆటపట్టించారు. మరి రవివర్మ ఎటువంటి విశేషాలు పంచుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

ఉరివేసుకుని ఏఎస్‌ఐ ఆత్మహత్య..

పెద్దపల్లి : జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ రామనాథం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఏఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జూ.హాకీ వర్డ్ కప్ లో భారత్ విజయం..

ఉత్తరప్రదేశ్ : జూనియర్ హాకీ ప్రపంచ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. లక్నోలో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెల్జియంపై తలపడ్డ భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. హాఫ్ టైం వరకు 2-0 స్కోరుతో భారత్ లీడ్ లో ఉంది. సిమ్రన్ జిత్ సింగ్ కొట్టిన గోల్ తో భారత్ స్కోరు 2-0కు చేరడం విశేషం. కాగా, జూనియర్ హాకీ ప్రపంచకప్ ను భారత్ సాధించడం ఇది రెండో సారి. తొలిసారి 2001లో హాకీ ప్రపంచకప్ ను భారత అండర్-21 జట్టు కైవసం చేసుకుంది. ఇన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఈ విజయాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకోవడంపై హాకీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

19:44 - December 18, 2016

గుంటూరు : ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశం కలిగి ఉండటాన్ని భారతీయులంతా గర్వించాల్సిన విషయమని మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. గుంటూరులోని కెవిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు అధ్వర్యంలో పలు పుస్తకాల అవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొణిజేటి రోశయ్యతోపాటు, సీపీయం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెయస్ లక్ష్మణరావు, ఆయన సతీమణి విజయకుమారిలు రచించిన భారత రాజ్యంగం, రాజకీయ వ్యవస్ధ, తెలుగు జాతికి చిరస్మరనీయులు అనే రెండు పుస్తకాలను రోశయ్య, రాఘవులు ఆవిష్కరించారు. పాలకులే భాషకు, చరిత్రకు విలువలు లేకుండా చేస్తున్న ప్రస్తుత పరిస్ధితుల్లో కాటన్, బ్రౌన్, మన్రో, మెకంజీలు అనాడు తెలుగు ప్రజలకోసం చేసిన కృషిని తెలియజేసేలా రచనలు చేయటం ప్రాధాన్యతతో కూడిన విషయమని బి.వి.రాఘవులు కొనియాడారు .

19:37 - December 18, 2016

కొమురం భీమ్ : ఇంటింటికి మంచినీరు ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సామాజిక న్యాయం సాధన కోసం తమ్మినేని చేపట్టిన మహా పాదయాత్ర కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రతి మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. దీంతో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. 

పవన్‌ కళ్యాణ్ పై ఫిర్యాదు..

హైదరాబాద్‌: సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓ న్యాయవాది సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌ కల్యాణ్‌.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జాతీయ గీతాన్ని అవమానించారని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుంకరి జనార్దన్‌గౌడ్‌ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. దేశంలోని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శించే ముందు తప్పనిసరిగా జాతీయగీతం ప్రదర్శింపచేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది.

18:46 - December 18, 2016

హైదరాబాద్ : బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్ హైదరాబాద్‌లో సందడి చేశారు. తన తాజా చిత్రం దంగల్‌ తెలుగు వెర్షన్ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ నెల 23న చిత్రం విడుదల అవుతుందని.. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డామని చిత్ర యూనిట్ తెలిపింది. వెయిట్ పెరగడం, వెంటనే తగ్గించుకోవడం పట్ల తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందేవారని అమీర్ చెప్పారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. తెలుగులో చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌.. తమిళంలో రజినీకాంత్‌తో నటించడానికి సుముఖత వ్యక్తంచేస్తానని అమీర్ తెలిపారు.  అమీర్‌ఖాన్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని దంగల్‌ సినిమాలో అమీర్‌ఖాన్ కూతురు పాత్ర పోషించిన ఫాతిమా తెలిపారు. దంగల్‌ తెలుగు వెర్షన్ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. సన్నివేశంలో ఎలా నటించాలి.. ఎలా హావభావాలు పలకాలో దగ్గరుండి తెలిపేవారని ఫాతిమా తెలిపింది.  

18:35 - December 18, 2016

హైదరాబాద్ : ట్విట్టర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా హామీ నుంచి బీజేపీ పక్కకు తప్పుకుందని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఆంధ్రా ప్రజలను వెన్నుముక లేని వారిగా, లెక్కలేని మనుషులుగా బీజేపీ ప్రభుత్వం ట్రీట్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా పై బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్రా వాళ్లను అవమానపరుస్తూ, బాధకు గురిచేస్తూ, కనీసం రాజధాని కూడా లేకుండా, ఆర్థిక లోటుతో వెళ్లగొట్టారు. బీజేపీ హయాంలో.. స్పెషల్ హోదా కాస్త స్పెషల్ ప్యాకేజీ మారిందని విమర్శించారు. స్పెషల్ ప్యాకేజీ ఓ కంటితుడుపు చర్య మాత్రమేనన్నారు. బీజేపీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఏ ప్రత్యేకం అనే మాట తప్పించి ఏ ప్రత్యేకతా లేదని మండిపడ్డారు. జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయిన 400మంది యువకుల... ప్రాణాత్యాగాలను ఆంధ్రులు ఎప్పటికీ మరిచిపోరన్న పవన్... వారి స్ఫూర్తితో... బీజేపీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, అందుకు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో హెచ్చరించారు.

18:23 - December 18, 2016

కారు ప్రమాదంలో 4గురు మృతి..

మేడ్చల్ : శామీర్‌పేట మండలం దొంగలమైసమ్మ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

18:17 - December 18, 2016

తిరుమల : తిరుమలలో శ్రీవారి పట్టపుటేనుగు బీభత్సం సృష్టించింది. మావటిపై దాడి చేసింది. దీంతో మావటికి గాయాలయ్యాయి. ప్రతీరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో శ్రీవారి ఊరేగింపు సేవ వుంటుంది. ఈ ఊరేగింపుకు ఏనుగులను గోశాల నుండి మావటీలు తీసుకువస్తారు. ఏనుగులను తీసుకువస్తున్న క్రమంలో శ్రీవారి మాడవీధుల్లో వున్న వరాహస్వామి ఆలయం వద్ద లక్ష్మి, అవనిజ అనే ఏనుగులు అవనిజ మావటిపై దాడిచేసింది. తొండంతో కొట్టి..కాలితో తన్ని నానా బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మావటికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమీపంలో వున్న ఇనుప గ్రిల్ ను కూడా ఏనుగు ధ్వంసం చేసింది. కాగా సమీపంలో భక్తులెవ్వరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

అదుపు తప్పిన ఏనుగు బీభత్సం ..

తిరుమల : తిరుమలలో శ్రీవారి పట్టపుటేనుగు బీభత్సం సృష్టించింది. మావటిపై దాడి చేసింది. దీంతో మావటికి గాయాలయ్యాయి. మావటిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై పవన్ కళ్యాణ్ విమర్శలు..

హైదరాబాద్ : ట్విట్టర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తాజాగా, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేవలం కంటితుడుపు చర్య. బీజేపీ చెబుతున్న ‘స్పెషల్ ప్యాకేజ్’ లో ‘స్పెషల్’ అనే పదం తప్పా ఎటువంటి ప్రత్యేకత లేదు. ఆంధ్రా ప్రజలను వెన్నుముక లేని వారిగా, లెక్కలేని మనుషులుగా బీజేపీ ప్రభుత్వం ట్రీట్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా పై బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని నిలబెట్టుకోవాలి.

కాల్పుల ఘటనలో దర్యాప్తు : డీసీపీ

హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం మాసాబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. వివరాలు.. ఇవాళ మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లో ఉన్న కేబీఎస్ బ్యాంకు ఎండీ మన్మథ్ దలై నివాసంలో కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. కాల్పుల్లో గాయపడిన మన్మథ్ దలైను బంజారా హిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మధ్యాహ్నం దుర్గా అపార్ట్‌మెంట్‌లో ఉన్న మన్మధ్ దలై ఇంటికి దుండగులు వచ్చారు. డబ్బుల విషయమై మన్మద్ దలై, దుండగుల మధ్య ఘర్షణ జరిగింది. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

17:46 - December 18, 2016

కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో సీఐ సస్పెండ్..

హైదరాబాద్ : హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు ఆత్మహత్య కేసులో ఉన్నతాధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సూసైడ్ నోటు ఆధారం చేసుకుని సీఐ మహ్మద్ అలీపై సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానీ సీఐ మహ్మద్ అలీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా గన్నవరం పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వేవిడ్ రాజు శనివారం నాడు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

17:03 - December 18, 2016

దోశల్లో వందల రకాలుంటాయి కదా..అందులో కారం దోశ ఒకటి..అందరూ కొత్తవాళ్ళతో తీసిన సినిమా 'కారం దోశ' ..శీతాకాలంలో వేడి వేడి కారం దోశ తింటే ఆ రుచే మజానే వేరుకదా? యువ నూతన దర్శకుడు జి .త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న 'కారం దోశ'...పేరు భలే వినటానికి చిత్రంగా..ఆశ్చ్యరం గా ఉందికదూ..శివ, సూర్య హీరోలుగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ ,వై.కాశీవిశ్వనాథ్ లు ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఆసక్తి కలిగిన పంచ్ డైలాగులతో సాగే ఈ సినిమా టీమ్ తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సినిమాలో హీరోలు మరీ మంచోడు..వ్యూహాల వేమన..హీరోయిన్ కలల రాణి వాణి..ఇలా డిఫరెంట్ పేర్లతో నిక్ నేమ్ లతో వుంటారు. మరి పేల్చే పంచ్ డైలాగ్స్ ఏమిటో..ఈ టీమ్ ఈ సినిమా గురించి ఏమేమి విశేషాలు చెబుతున్నారె చూడండి..

16:50 - December 18, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి ప్రాంత కళాప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజూ పని ఒత్తిడితో గడిపే ప్రజలు వారాంతాల్లో కృష్ణానదీ తీరంలో హాయిగా సేదతీరేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో వారాంతపు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడలోని పద్మావతి ఘాట్‌ ఇందుకు వేదికగా నిలుస్తోంది.

నిత్యం పని ఒత్తిడితో సేదతీరేందుకు
ఏపీ రాజధాని ప్రాంతానికి ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. వచ్చే వారంతా విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంతోపాటు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ భాగం బెజవాడలోనే నివాసం ఉంటున్నారు. నిత్యం పని ఒత్తిడితో గడిపే ప్రజలు... వారాంతాల్లో హాయిగా సేదతీరి, ఆనందించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వ శ్రీకారం చుట్టింది.

పద్మావతీ ఘాట్‌ వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలు
విజయవాడలోని పద్మావతీ ఘాట్‌ వేదికగా నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్తంగా ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి శాశ్వత ప్రాతిపాదిన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆట, పాటలు, బృంద గానాలు, జానపద కళాకారులు ప్రదర్శనలు..
ఆట, పాటలు, బృంద గానాలు, జానపద కళాకారులు ప్రదర్శనలు.. ఇలా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కళాకారుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని జానపద కళాకారులు చెబుతున్నారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు
యువ కళాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆర్టిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ప్రయత్నం ఎంతో మంచిదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాంతపు సాంస్కతిక కార్యక్రమాలను మరింత మెరుగుపరిచి యువజన కళా సమ్మేళనాలతోపాటు, యువజనోత్సవాలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

16:44 - December 18, 2016

గుంటూరు : అసలే ఆర్థికలోటు.. దీనికితోడు నోట్ల రద్దు ఏపీ ఖజానాకు గండిపెట్టింది.. దాదాపు వెయ్యికోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది.. క్యాష్‌లెస్‌ అంటూ ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది.. ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ఎలా పూడ్చాలి? ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలియక ప్రభుత్వ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు.

పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో సతమతమౌతున్న ఏపీ ప్రభుత్వం
పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ఏపీ ప్రభుత్వం సతమతమైపోతోంది.. అసలే రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ ఆర్థికలోటును పూడ్చుకోలేక ఇబ్బందిపడుతుంటే ఇప్పుడు నోట్ల రద్దు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది.. ఈ ప్రభావం పదిరోజులకుమించి ఉండదని మొదట ప్రభుత్వం భావించింది.. ప్రస్తుత పరిస్థితిచూస్తే మరో నాలుగైదు నెలలపాటు ఈ భారాన్ని భరించకతప్పదని అంచనావేస్తోంది..

సగానికిసగం తగ్గిపోయిన ఏపీ రాష్ట్ర ఆదాయం
నోట్ల రద్దుతర్వాత ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.. రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలు నిలిచిపోయాయి.. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం సగానికిపైగా పడిపోయంది.. నోట్ల రద్దుకుముందు ప్రతి నెలా సర్కారుకు ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది.. ఖర్చు ఏడువేలకోట్లుగా ఉండేది.. ఈ నవంబర్లో గతంలోకంటే మరో 8వందలకోట్ల రాబడి తగ్గింది.. స్వయంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు.. తగ్గిపోయిన ఈ ఆదాయాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక టెన్షన్‌ పడుతుంటే... నోట్ల రద్దురూపంలో మరో పెద్ద దెబ్బ పడింది.. ఈ ఎఫెక్ట్‌తో ఆదాయం వెయ్యినుంచి 12వందలకోట్ల వరకూ తగ్గుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనావేస్తున్నారు..

వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్
పెద్ద నోట్లు రద్దయిపోయి 40రోజులు దాటుతోంది.. వాణిజ్యపన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాహన రిజిస్ట్రేషన్స్ విభాగాలపై ఈ రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది.. సీఆర్డీఏ పరిధిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి.. రాజధాని ప్రాంతంలో ఆదాయం పూర్తిగా పడిపోయింది.. అలాగే వ్యాపారలావాదేవీలు డీలాకావడంతో వాణిజ్యపన్నులశాఖ ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వరంగ సంస్థలకూ ఆదాయం లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.. ముఖ్యంగా ర‌వాణా శాఖ‌లో 10 కోట్లు... ఆర్టీసీ లో మ‌రో న‌ల‌భై కోట్లకుపైగా ఆదాయం త‌గ్గింది. ఎక్సైజ్ డిపార్టుమెంట్లో దాదాపు 12 శాతం త‌గ్గుద‌ల న‌మోదైంది.. అంటే దాదాపు 200 కోట్లకుపైగా ఆదాయాన్ని ఈ శాఖ కోల్పోయింది.. ప్రభుత్వరంగ సంస్థలైన టూరిజం, విద్యుత్‌, మున్సిప‌ల్ శాఖ‌ల లావాదేవీలూ చాలావరకూ నిలిచిపోయాయి..

సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్న ఏపీ సర్కార్
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఏపీకి ఆర్థికలోటును మరింత పెంచింది.. ఆదాయాన్ని పెంచుకునేందుక క్యాష్‌లెస్‌ లావాదేవీలంటూ ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం కనిపించడంలేదు.. ఈ సమస్యలనుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు..

16:40 - December 18, 2016

పశ్చిమగోదావరి : ఆడపిల్లలను రక్షించుకుందాం - భ్రూణ హత్యలను ఆపుదామంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2కె రన్‌ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్‌లో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధినులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆడపిల్లలను రక్షణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను గర్భంలోనే చంపివేయడం దారుణమన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.  

16:38 - December 18, 2016

నెల్లూరు : ఫ్లెమింగో ఫెస్టివల్‌ ర్యాలీని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. నెల్లూరు వీ ఆర్ సి నుంచి గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ జరిగింది. విదేశీ పక్షుల రాకతో నేలపట్టు సందడిగా మారనుందని, రాష్ట్రం నలుమూలల నుంచి వీటిని చూసేందుకు జనం తరలివస్తారని నారాయణ తెలిపారు. ఈ నెల 27,28,29 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని.. దీని కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఆసియా ఖండంలోనే పక్షుల సంతానోత్పత్తికి నేలపట్టు అనువైన చోటు అని, ప్రభుత్వం దీని కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. 

16:35 - December 18, 2016
16:30 - December 18, 2016

హైదరాబాద్‌ : వైద్యరంగంలో అరుదుగా జరిగే ఓ శస్త్ర చికిత్సను ఎన్ఈవో బీబీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ఫుల్‌ అయ్యింది. నిజామాబాద్‌కి చెందిన 7 నెలల మెర్సీ అనే బాలిక 5 నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల సలహామేరకు మెర్సీ తల్లిదండ్రులు ఆమెను న్ఈవో బీబీసీ చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో చేర్పించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు చివరకు మెర్సీ కడుపులో పిండం ఉన్నట్లు తెలుసుకున్నారు. శుక్రవారం ఆపరేషన్‌ ను నిర్వహించి పాప ప్రాణాలను కాపాడారు. ఇలాంటివి అరుదుగా 5 లక్షల పిల్లల జననాలలో ఒకరికి వస్తాయని తెలిపారు. 

16:26 - December 18, 2016

విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మరిచి... మాట మారుస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. అయితే... చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కౌంటర్‌ ఇచ్చారు. బాబు కృషి వల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో సాగుతోందని గాలి అన్నారు. 

16:25 - December 18, 2016

హైదరాబాద్‌ : మాసబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. సాయిదుర్గా కానుమిల్లి అపార్టమెంట్స్‌లో నివాసముంటున్న కేబీఎస్‌ బ్యాంకు ఎండీ మన్మథ్‌ దాలియాపై ఓ దుండగుడు కాల్పులు జరిపి బైక్‌పై పరారయ్యాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు అపార్టమెంట్‌కు వచ్చిన ఆగంతకుడు..బ్యాంకులో పనిచేసే వ్యక్తి కావాలంటూ వాచ్‌మెన్‌ అడిగాడు. అక్కడే పార్క్‌ చేసిన కారును గుర్తించి..కారు యజమానిని కలవలాని చెప్పగా..మన్మథ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వాచ్‌మెన్‌ సదరు అపరిచిత వ్యక్తిని ఆయన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. కాసేపటికే వారి మధ్య వాగ్వాదం జరగడంతో దుండగుడు తుపాకీతో మన్మథ్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

మోదీతో భేటీ కానున్న పన్నీర్ సెల్వం..

ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువనున్నారు. వార్ద తుపాను వల్ల చెన్నై నగరానికి కలిగిన నష్టాన్ని ప్రధానికి వివరించనున్నారు. ఇంకా తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు భారత రత్నతోపాటు ఆమె చిత్ర పటాన్ని పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసే విషయమై ప్రధానికి వినతి పత్రం సమర్పించనున్నారు.

యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి ..

జగిత్యాల : మూర్ఖపు ప్రేమతో కళ్ళు మూపుసుకుపోయిన ఓ ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తిమ్మాపూర్ లో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి క్రిటికల్ గా వున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.   

15:35 - December 18, 2016

జగిత్యాల : మూర్ఖపు ప్రేమతో కళ్ళు మూపుసుకుపోయిన ఓ ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తిమ్మాపూర్ లో చోటుచేసుకుంది. ఈ దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె పరిస్థితి క్రిటికల్ గా వున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రెండేళ్లుగా వెంటపడుతున్నా తనను ప్రేమించటంలేదనే కక్ష పెంచుకున్న రాకేశ్ యువకుడు వెన్నెలపై ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య తరచూ ఫోన్ మాట్లాడుతూ కనిపించిన వెన్నెల మరొకరితో ప్రేమలో పడిందనే అనుమానంతో రాకేశ్ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు గాలిస్తున్నాడు. 

15:25 - December 18, 2016

హైద‌రాబాద్‌ : నగరంలో ఆదివారం కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. న‌గ‌రంలోని మాస‌బ్‌ట్యాంక్‌ శాంతిన‌గ‌ర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి దుండగుడు బైక్ పై పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..మధ్యహ్నాం 12..ఒంటిగంట ప్రాంతంలో మాసబ్ ట్యాంక్ సమీపంలోని శాంతినగర్ లోని దుర్గ ఎన్ క్లేవ్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి వాచ్ మెన్ కి ఓ కారును చూపించి ఈ కారుగల వ్యక్తి తో మాట్లాడాలని అడిగాడు..వాచ్ మెన్ ఆ కారు యజమానికి ఫోన్ చేసి మీకోసం ఎవరో వచ్చారనీ చెప్పాడు. ఆ వ్యక్తిని పైకి పంపించమని చెప్పగా ఆ అంగంతకుడు పైకి వెళ్లాడు..అనంతరం అరగంటకు కాల్పుల శబ్దం వినిపించిందనీ వెంటనే సదరు వ్యక్తి బైటకు వచ్చి బైక్ పై పరారయినట్లుగా వాచ్ మెన్ పేర్కొన్నాడు.సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాగా కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మన్మధ దాలియాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన దాలియాను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ పుటేజ్ ను పరిశీలించి కాల్పులు జరిపిన వ్యక్తి గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా దాల్మియా కాల్పులు జరిగిన ఘటనతో షాక్ కు గురయ్యాడు. అతను కోలుకుంటేనే మరిన్ని వివరాలు బైటకొచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. డీసీపీ వెంకటేశ్వరావు  మాట్లాడుతూ..కేబీఎస్ బ్యాంక్ సీఈవో అని వాచ్ మెన్ చెప్తున్నాడనీ..బాంక్ కు సంబంధించిన వివారాలు..దాల్మియాకు కాల్పులు జరిపిన వ్యక్తికి ఎటువంటి విభేదాలు వున్నాయి? దీనికి కారణమేంటనే వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు.

మసాబ్ ట్యాంక్ వద్ద కాల్పుల కలకలం..

హైద‌రాబాద్‌ : ఆదివారం  మ‌ధ్యాహ్నం కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. న‌గ‌రంలోని మాస‌బ్‌ట్యాంక్‌ శాంతిన‌గ‌ర్‌లోకి తుపాకీతో వ‌చ్చి న ఓ వ్య‌క్తి కాల్పులు జ‌రిపి అనంత‌రం బైక్‌పై ప‌రార‌య్యాడు. ఈ కాల్పుల్లో ఓ వ్య‌క్తికి తీవ్ర‌ గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని గాయాల‌పాల‌యిన వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి గురించి గాలింపు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. 

15:01 - December 18, 2016

హైదరాబాద్ : దేశంలో జాతీయ ర‌హ‌దారుల్ని రెండులక్షల కిలోమీటర్లకు పెంచుతామన్నారు.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్లు అత్యున్నతంగా ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరైన గడ్కరి.. తెలంగాణకు 8వేల కోట్ల రూపాయల విలువైన రోడ్లను మంజూరుచేశారు..

ఇండియ‌న్ రోడ్ కాంగ్రెస్ స‌మావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ
హైదరాబాద్లో ఇండియ‌న్ రోడ్ కాంగ్రెస్ స‌మావేశం ముగిసింది.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ హాజ‌ర‌య్యారు.. రోడ్లు ఉన్నతంగా ఉంటేనే ఆయా ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు.. మెరుగైన రహదారుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఇంజనీర్లకు సూచించారు..

2 లక్షల కి.మీ.వరకూ పెంచుతున్నట్లు ప్రకటన
జాతీయ ర‌హ‌దారుల ప‌రిధిని రెండు లక్షల కిలోమీటర్లకు పెంచుతున్నట్లు గడ్కరీ ప్రకటించారు.. తెలంగాణలో జాతీయ రహదారులను 2వేల 600 కిలోమీటర్లు పెంచుతామని స్పష్టం చేశారు.. 8కోట్ల రూపాయల విలువైన అయిదు రోడ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చామని గడ్కరీ ప్రకటించారు..

ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌లో గడ్కరీ పాల్గొనడం సంతోషం : తుమ్మల
ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌లో గడ్కరీ పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు.. తెలంగాణలో జాతీయ రహదారుల పరధి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు..ఇండియ‌న్ రోడ్ కాంగ్రెస్ లో రోడ్ల నిర్మాణంలో ఆధునిక టెక్నాల‌జీ పై నిపుణులు చ‌ర్చించారు...

14:56 - December 18, 2016

విజయవాడ : ఆకలి కేక పేరుతో ఏపీలో కాపులు నిరసనోద్యమాన్ని నిర్వహిస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో గరిటెలతో కంచాలను మోగించారు. కాపుల ఆకలి కేకలను వినాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజమండ్రి,విజయవాడ,జగ్గయ్యపేట, ఏలూరు, నరసాపురం, తని... ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన తెలిపారు. 

14:53 - December 18, 2016

విజయవాడ : నోట్లు రద్దై 40రోజులు గడుస్తున్నా ఇంకా సమస్యలు కొనసాగుతూనేఉన్నాయన్నారు.. టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. కేంద్రం రోజుకో ప్రకటనచేస్తూ సామాన్యులను గందరగోళంలోకి నెట్టేస్తోందని విమర్శించారు.. సీఎం చంద్రబాబుతో ముఖ్యమంత్రుల కమిటీ వేసిన కేంద్రం కమిటీ  నివేదిక రాకుండానే పలు ప్రకటనలు చేసిన ప్రజలను గందరగోళం పడేస్తోందన్నారు. ఈ ఇబ్బందులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలోలేరని చెప్పుకొచ్చారు.. 

ఆత్మాహుతి దాడిలో 30మంది సైనికులు మృతి..

యెమెన్ : ఏడెన్ పట్టణంలో ఉగ్రవాదులు రక్తపాతాన్ని సృష్టించారు. ఆదివారం ఉదయం ఆత్మాహుతి దాడిలో 30 మంది వరకు సైనికులు మృత్యువాతపడ్డారు. అలాగే, మరింత మంది గాయపడినట్టు సమాచారం. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 50 మంది సైనికులను బలి తీసుకున్న వారం రోజుల్లోనే మరోసారి దాడి చోటు చేసుకోవడం గమనార్హం.

మహిళను ఢీకొని లాకెల్లిపోయిన కారు..

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న మహిళ ఎగిరి కారుపై పడింది. అయినప్పటికీ కారు డ్రైవర్‌ ఆపకుండా మహిళ మృతదేహాన్ని దాదాపు 2కి.మీ మేర తీసుకెళ్లాడు. గమనించిన గ్రామస్థులు కారును నిలిపివేయగా.. సదరు వ్యక్తి పారిపోయాడు.

త్వరలో జగన్ జైలుకు - వర్ల రామయ్య..

విజయవాడ : జగన్ పై ఉన్న కేసులు తుది దశకు చేరుకున్నాయని, జగన్ త్వరలోనే జైలుకు వెళ్లకతప్పదని టిడిపి నేత వర్ల రామయ్య జోస్యం చెప్పారు. ఈడీ నిన్ననే భారతి సిమెంట్స్ కు సంబంధించిన రూ. 170 కోట్లు జప్తు చేసిందని తెలిపారు. ఈ నిర్ణయమే తుది తీర్పుకు కారణం అవుతుందన్నారు. వైసీపీ నేతలు జగన్ పై ఆశలు పెట్టుకోవడం మంచిది కాదన్నారు.

13:42 - December 18, 2016

హైదరాబాద్ : పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ఇలాంటి అనుభూతి పొందాలంటే నగరవాసులు ఎంతో శ్రమకోర్చి పార్కులకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కాంక్రీట్‌ జంగిల్‌ అయిన హైదరాబాద్‌లో గ్రామీణ అనుభూతిని పొందుతుంది ఓ కుటుంబం. ఆ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే వీడియో క్లిక్ చేయండి.

13:41 - December 18, 2016

ఆదిలాబాద్ : సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేట్టిన మహా పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. మొత్తం 1600 కి.మీ. పూర్తి చేసుకుంది. కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లోపించిందంటున్న పాదయాత్ర బృందం సభ్యురాలు, శ్రామిక మహిళా నేత ఎస్‌ రమతో టెన్ టివి ముచ్చటించింది. రమ ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి.

13:39 - December 18, 2016

ఆదిలాబాద్ : ఇంటింటికి మంచినీరు ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సామాజిక న్యాయం సాధన కోసం తమ్మినేని చేపట్టిన మహా పాదయాత్ర కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రతి మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. దీంతో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.

13:37 - December 18, 2016

శ్రీకాకుళం : శతాబ్దాలుగా చేతబట్టిన వల చేజారి పోయింది. బతుకుదెరువును అందించిన చేపలవేట చేదును పంచింది. తాతల కాలం నుంచి తెలిసిన పని ఆకలిని మిగిల్చింది. బతుకుదెరువుకోసం కొత్త ఉపాధిని వెదుక్కున్నాడు సిక్కోలు మత్స్యకారుడు. వలలు అల్లిన చేతులతో ఊయలలు రూపాందిస్తున్న శ్రీకాకుళం గంగపుత్రులపై టెన్‌టీవీ ఫోకస్‌...అభివృద్ధి పేరుతో కనిపించని కుట్రలు.. వలలను ఛిద్రం చేశాయి. వల విసిరిన ప్రతిసారి చేతులకు తీపునొప్పులే మిగిలాయి. హైలెస్సపాటలు ఉత్త అరుపులుగా మారడంతో.. కొత్తగా జోలపాటకు సైదోడు అందిస్తున్నాడు సిక్కోలు మత్స్యకారుడు.

198 కి.మీ.ల సముద్రతీరం
వేట సాగక... పూట గడవక... సిక్కోలుమత్స్యకారులు కొత్త ఉపాధిని వెదుక్కున్నారు. విస్తృతమైన సముద్రతీరం కల్గిన శ్రీకాకుళంజిల్లాలో ..గంగపుత్రులు ప్లాస్టిక్, నైలాన్ తాళ్ళ అల్లికలతో జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 198 కిలో మీటర్ల పొడవైన సముద్రతీరం ఉంది . ఓడిస్సా సరిహద్దు ఇచ్చాపురం మండలం డొంకూరు నుండి.. రణస్థలం మండలం కోవ్వాడ తీరం వరకు 17 మండలాల పరిధిలో దాదాపు 3 లక్షల మంది మత్స్యకారులు చేపల వేట పై ఆధారపడి బతుకు పోరు సాగిస్తున్నారు.. తాతముత్తాతల కాలం నుండి గంగపుత్రులు సముద్రం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.. అయితే రోజులు మారుతున్నాయి, ప్రాణాలు ఫణంగా పెట్టి చేపల వేట సాగించే వీరికి శ్రమ తప్ప ఫలితం దక్కడంలేదు. దీంతో ప్రత్యామ్నాయఉపాధి మార్గాన్ని వెదుక్కొన్నారు.

శాండ్‌మైనింగ్‌తో కాలుష్యం..తరిగిపోయిన మత్స్య సంపద..
గతంలో ఈ మత్స్యకార కుటుంబాలకు చేపలు వేట తప్పా మరే ఇతర ఉపాధి అవకాశాలు లేవు. వీరికి రేయింబవళ్ళూ సముద్రం మీద సవారీ తప్పా మరొక్కటి తెలియదు. మగవాళ్ళు వేట ద్వారా తెచ్చిన చేపలను ఆడవాళ్ళు ఊరూరా తిరిగి అమ్మేవారు. అయితే సముద్రంలో నాటు పడవలు స్టానంలో మరబోట్లు, ట్రాలర్లు రావడంతో చిన్న చిన్న మత్స్యకారులు బ్రతుకుదెరువు లేకుండాపోతోంది. మరోవైపు తీరంలో శాండ్ మైనింగ్ పర్యావరణ కాలుష్య కారక కర్మాగారాలు రావడంతో మత్స్యసంపద తరిగి పోటింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిల్లో చేపల వేటకు దూరమైనామంటున్నారు ఈ గంగపుత్రులు. వీరు తయారుచేసిన ఊయలలు ఓడిస్సా, తమిళనాడు, తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక, జమ్మూ కాశ్మీర్, గోవా లాంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటం విశేషం. ఊయలల తయారీతో తమకు బతుకుదెరువు దొరికిందంటున్నారు..మత్స్యకారులు. నాటుపడవల స్థానంలో వచ్చిన మరబోట్లు వేటను కష్టతరం చేస్తే... తీరప్రాంతంలో జరుగుతన్న మైనింగ్‌ అసలు చేపలనే లేకుండా చేసింది. శతాబ్దాలుగా చేస్తున్న వృత్తికి దూరమైయ్యామనే ఆవేదన ఉన్నా.. కొత్తగా చేపట్టిన ఊయలల తయారీ తమకు బతుకుదెరువు ఇచ్చిందన ఆనందపడుతున్నారు శ్రీకాకుళం మత్స్యకారులు.

13:35 - December 18, 2016

హైదరాబాద్ : ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ దిట్ట అని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏహామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపర్చగాపోగా.. ఇప్పుడు మాటమారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు.... కనీసం ప్రైవేట్‌రంగంలోనూ ఒక్కజాబ్‌ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు కోసం ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి తీసుకొస్తుందని ఆయన హెచ్చరించారు.

13:28 - December 18, 2016

కరీంనగర్ : అవినీతిని నిర్మూలించి.. ఏసీబీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌లో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించతలపెట్టిన ఏసీబీ కార్యాలయ భవనం నిర్మాణ పనులకు ఈటెల శంకుస్థాపన చేశారు. లంచాల కారణంగా ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుందని.. ఈ తరుణంలో.. ప్రజలకు నమ్మకం పెరిగేలా ఏసీబీని బలోపేతం చేస్తున్నామన్నారు. లంచాలు తగ్గాలంటే నగదురహిత లావాదేవీలు పెరగాల్సిన అవసరముందన్న ఈటెల అభిప్రాయపడ్డారు.

13:20 - December 18, 2016

'రెజీనా' ఇప్పుడు ఆ దర్శకుడి పైనే బోలెడు ఆశలు పెట్టుకుంది. ఆ డైరెక్టర్ కూడా హ్యండిస్తే ఇక బై బై చెప్పేయాలనే డిసిషన్ కి వచ్చేసింది. ఎంతోకాలంగా ఒపికగా వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ ఆ దర్శకుడు కనుక తన కలను నేరవేర్చకపోతే ఇక అక్కడికే చెక్కేయాలని చూస్తుందట. తెలుగు స్టార్ డమ్ కోసం 'రెజీనా' నానాతంటాలు పడుతుంది. తెలుగులో మెగా మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్' తో నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం’, 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలు తప్పా, 'రెజీనా' ఖాతాలో వేరే హిట్స్ లేవు. దీంతో ఎన్ని సినిమాలు చేసిన హీరోయిన్ గా ఈ బ్యూటీ రేంజ్ మాత్రం పెరగలేదు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తన హోప్స్ మొత్తం ఓ దర్శకుడి మీదే పెట్టుకుంది.ఆ దర్శకుడు కనుక తన ఫేట్ మార్చేయకపోతే టాలీవుడ్ నుంచి చెక్కేయాలని ప్లాన్ చేసుకుందట. 'రెజీనా' ఆశలన్ని ప్రస్తుతం 'నక్షత్రం' సినిమాపైనే ఉన్నాయట. దర్శకుడు కృష్ణవంశీ ఈ మూవీతో తన ఫేట్ ని మార్చేస్తాడని చెన్నై పొన్ను నమ్ముతుందట. కెరీర్ లో ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ రోల్ ని 'నక్షత్రం' మూవీలో చేస్తున్నట్లు చెప్పుతుంది. క్యారెక్టర్ ని దర్శకుడు కృష్ణవంశీ పుల్ గ్లామరైజ్డ్ గా క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీతో తెలుగులో తనకు బ్రేక్ ఖాయమని 'రెజీనా' పుల్ హోప్స్ పెట్టుకుంది.
'నక్షత్రం' మూవీ కనుక బోల్తా కొట్టితే టాలీవుడ్ కి బై బై చేప్పేయాలని 'రెజీనా' డిసైడైయిందట. ఈ బ్యూటీ తెలుగులో ఇప్పటికే 10పైగా సినిమాలు చేసింది. అయిన కూడా కెరీర్ పరంగా గ్రోత్ లేదు. దీనికి తోడు తమిళంలో డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయట. ఇక్కడ ప్లాప్స్ మీద ప్లాప్స్ అందుకునే బదులు కోలీవుడ్ లో పర్మామెన్స్ ఒరియెంటెడ్ మూవీస్ చేస్తే కెరీర్ గ్రోతింగ్ ఉంటుందని రెజీనా భావిస్తుందట. మరి కృష్ణవంశీ అయిన ఈ బ్యూటీ డ్రీమ్ ని తీరుస్తాడో చూడాలి.

13:08 - December 18, 2016

స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' లేటేస్ట్ గా ఓ చిన్నదర్శకుడి తో మూవీ చేయడానికి కమిట్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న 'బన్నీ' ఇటీవల చిన్న సినిమాతో సర్ ప్రైజ్ సక్సెస్ కొట్టిన దర్శకుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. టాలెంట్ ని పసిగట్టడంతో 'అల్లు అర్జున్' తరువాతే ఎవరైనా అని చెప్పాలి. అంతేకాదు సక్సెస్..ప్లాప్స్ ని పట్టించుకోకుండా దర్శకులతో సినిమాలు చేస్తుంటాడు. 'సరైనోడు' భారీ హిట్టు తరువాత 'బన్నీ' హరీశ్ శంకర్ డైరెక్షన్ లో 'దువ్వాడ జగన్నాథమ్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీతో పాటు అల్లువారాబ్బాయి తమిళ డైరెక్టర్ లింగుస్వామితో మరో మూవీ కమిట్ అయ్యాడు. రెండింటితో పాటు 'బన్నీ' లేటేస్ట్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సినిమా చూసిన బన్నీ..
రీసెంట్ గా 'అల్లు అర్జున్' 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేశాడు. ఆ వెంటనే ఫోన్ చేసి మరీ దర్శకుడు వీ ఐ ఆనంద్ ని అభినందించాడట. అంతేనా వెంటనే తన తమ్ముడు 'అల్లు శిరీష్' తో సినిమా చేసేలా ఆ దర్శకుడిని సెట్ చేశాడు. అయితే 'శిరీష్' కోసం ఓ స్టోరీని రెడీ చేసిన ఈ దర్శకుడు పనిలో పనిగా 'బన్నీ'కి కూడా తన వద్ద ఉన్న స్టోరీని లైన్ ని రఫ్ గా చెప్పాడట. వీ ఐ ఆనంద్ చెప్పిన స్టోరీ లైన్ కి ఫిదా అయిన అల్లుఅర్జున్, శిరీష్ మూవీ కంప్లీట్ కాగానే సినిమా చేద్దామంటూ ఈ దర్శకుడి మాట ఇచ్చాడట. ప్రస్తుతం 'అల్లుఅర్జున్' 'దువ్వాడ జగన్నాథ్' షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నాడు. ఆ తరువాత లింగుస్వామి సినిమాను సెట్స్ పైకి తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కాగానే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు వీ ఐ ఆనంద్ తో సినిమాకి ప్రిపేర్ కానున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే చిన్న దర్శకుడి 'బన్నీ' పెద్ద చాన్సే ఇచ్చాడు.

13:00 - December 18, 2016

తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి పరిచయం అక్కర్లేదు. తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆయనతో 'అక్షరం' ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:37 - December 18, 2016

హైదరాబాద్ : నిత్యం ఒకటే ఆందోళన... ఉదయం లేచింది మొదలు చిల్లర కోసం పడరాని పాట్లు..గత 40రోజుల నుంచి ఎవ్వరిని కదిలించినా ఒకటే మాట..క్యూ లైన్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద వేచి వుండటం ఇదే పరిస్థితి.. ఆటోవాలాలు అయితే గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు క్యాబ్ లు వచ్చి తమ పొట్టగొడుతున్నాయని ఆందోళన చెందుతుంటే... ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నోటి కాడి ముద్దను కూడా లాగేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆటో డ్రైవర్ల కష్టాల గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:34 - December 18, 2016

ముంబై : దేశంలో కీలక పదవులకు అధిపతులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌గా రాజీవ్‌ జైన్‌ను నియమించగా, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ అధిపతిగా అనిల్‌ దస్మన పేరును ప్రకటించింది. ఎయిర్ చీఫ్ మార్షల్‌గా అరూప్ రాహ బిఎస్ ధనోవా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశంలో కీలకమైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐబీ, రా అధిపతుల నియామకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుత ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో సైనిక పునర్వ్యవస్థీకరణ, ఈశాన్య భారతంలో నెలకొన్న పరిస్థితులు, పశ్చిమ భారతంలో పరోక్ష యుద్ధం, కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు వంటి సవాళ్లను రావత్ సమర్థవంతంగా ఎదుర్కోగలరని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

రెండేళ్ల పాటు..
ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్‌జైన్ ఎంపికయ్యారు. అలాగే రిసెర్చ్ అండ్ అనాల్సిస్ వింగ్ అధిపతిగా మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనిల్ దస్‌మనా నియమితులయ్యారు. వీరివురు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాజీవ్‌జైన్ ప్రస్తుతం ఐబీ ప్రత్యేక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జనవరి 1న ప్రస్తుత ఐబీ చీఫ్ దినేశ్వర్‌శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980వ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ జైన్ ఐబీలోని పలు విభాగాలలో పని చేశారు. రాష్ట్రపతి పోలీసు పతాకం సైతం అందుకున్నారు. 1981వ బ్యాచ్‌కు చెందిన అనిల్‌ దస్‌మనా రాలో గత 23ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత రా అధిపతి రాజిందర్ ఖన్నా పదవీకాలం ఈ ఏడాది ఆఖరుతో ముగియనుంది. జనవరి 1న అనిల్ దస్‌మనా బాధ్యతలు స్వీకరించనున్నారు.  భారత వైమానిక దళ(ఐఏఎఫ్) నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవాను నియమించారు. 2013 డిసెంబర్ 31న బాధ్యతలు స్వీకరించిన అరుప్ రహా మూడేళ్లపాటు సేవలందించారు. ఈ డిసెంబర్ చివర్లో అరుప్ రహా రిటైర్ కానున్నారు. మూడేళ్లపాటు సేవలందించిన అరుప్ రహా అనంతరం 22వ ఐఏఎఫ్ చీఫ్ గా బీఎస్ ధనోవా ఈనెల 31న బాధ్యతలు స్వీకరిస్తారు.

12:30 - December 18, 2016

ఆదిలాబాద్ : మార్పు అనివార్యం. అది తెలిసినప్పుడు.. మార్పు దిశగా ప్రయాణం అవశ్యం. తద్వారా విజయమూ సాధ్యం. ఇదీ ఆదిలాబాద్‌ జిల్లా ముక్రాకే గ్రామస్థుల నవ్య నినాదం. ఇంతకీ ఏంటా మార్పు..? ఏదిశగా వారి పయనం.? వారు సాధించిన ఘన విజయం ఏంటి..? వాచ్‌ దిస్ స్టోరీ. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్థుల్లో వెల్లివిరిసన నవ చైతన్యం. నగదు కష్టాల నుంచి ఉపశమనానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమన్న ఏలికల అంతరంగాన్ని అర్థం చేసుకున్న ఈ గ్రామస్థులు విప్లవాత్మక మార్పును స్వాగతించారు. అందరూ బాగుండాలి.. అందులోనూ మేము ముందుండాలి అన్న భావనతో ఈ గ్రామస్థులంతా నగదు రహిత లావాదేవీలపైపు మళ్లారు.

సిద్ధిపేట స్పూర్తి..
పెద్ద నోట్ల రద్దు దరిమిలా.. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతూ.. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ ఖర్చులకు కూడా చేతిలో నగదు లేక సతమతమవుతున్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన కొత్తల్లో ముక్రాకే గ్రామస్థులూ ఇదే తరహా వేదనను అనుభవించారు. అదే తరుణంలో ప్రభుత్వ సూచనతో.. చిల్లర కష్టానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమని గట్టిగా నమ్మారు. ఆ దిశగా అడుగులు వేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం గ్రామాన్ని స్పూర్తిగా తీసుకుని.. ముక్రాకేని సంపూర్ణ నగదు రహిత లావాదేవీల గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు అక్కడి ప్రజలు.

నగదు రహిత లావాదేవీలపై సంపూర్ణ అవగాహన పెంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ముక్రాకేవాసులు. 650 మంది జనాభా గల ముక్రాకే ప్రజలది ముందునుంచీ ఒకేమాట ఒకేబాట. గ్రామంలో ఏ సమస్య వచ్చినా.. అంతా కలిసి చర్చించి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునే వారు. ఇప్పుడు చిల్లరకు కష్టమొచ్చిన వెంటనే.. ప్రత్యామ్నాయ నగదు రహితంపై దృష్టి సారించారు. వీరికి స్వచ్చంద సంస్థ- సీఎస్‌సీ సంపూర్ణ సహకారాన్ని అందించింది. ఈ సంస్థ ప్రతినిధులు నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించడమే కాకుండా.. వారం రోజుల పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ దీనిపై అవగాహన కల్పించారు. స్వైపింగ్ మిషన్ వాడకం, మొబైల్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు, పేటీఎం వాడకం వంటి నగదు రహిత లావాదేవీ విధానాలను నేర్పారు.

హర్షణీయం..
మార్పును స్వాగతించడంలో ముక్రాకే ప్రజలు ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారు. గతంలో కూడా గ్రామస్థులంతా కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించి.. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు కంప్యూటర్‌ విద్యపైనా గతంలోనే గ్రామస్థులందరూ అవగాహన పెంచుకున్నారు. దీంతో ముక్రాకే వందశాతం డిజిటల్‌ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి పెద్దగా శ్రమ అవసరం లేకుండాపోయింది. గ్రామంలోని కిరాణ షాపులో కూడా మొబైల్‌ ద్వారా చెల్లింపులు చేసేలా నగదు రహిత లావాదేవిలపై చక్కగా అవగాహన పెంచుకున్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవిలు జరిపేలా గ్రామంలో ఉన్న 160 కుటుంబాలు అండ్రాయిడ్‌ ఫోన్‌ సదుపాయంతో లావాదేవిలు జరుపుతుండటం విశేషం. నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు ముగింపు కార్యక్రామానికి హాజరైన స్థానిక ఎంపీ నగేశ్‌ సైతం గ్రామస్తుల ముందుచూపు, చైతన్యం, సామాజిక స్పృహను అభినందించారు. అంతటా నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ముక్రాకే గ్రామస్తులంతా ఏకతాటిపై నిలిచి మార్పును స్వాగతించడం నిజంగా హర్షనీయం.

12:28 - December 18, 2016

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన 170 కోట్ల నగదు డిపాజిట్లను ఈడీ సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకుంది. దీంతో భారతీ సిమెంట్స్‌ తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశముంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ దూకుడు పెంచింది. 2014 నుంచి దపదఫాలుగా జగన్‌కు చెందిన పలు కంపెనీల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్‌మెంట్‌ చేస్తూ వస్తోంది. తాజాగా భారతీ సిమెంట్స్‌కు చెందిన 170 కోట్ల నగదు డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌మెంట్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ 2524 కోట్ల రూపాయలకు చేరింది. భారతీ సిమెంట్స్‌కు 170 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తమ అకౌంట్‌లోకి బదిలీ చేస్తున్నట్టు కొద్ది రోజుల కిందటే జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రమే సొత్తు స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసింది.

అసాధారణ రీతిలో ఈడీ నిర్ణయం..
వాస్తవానికి ఈడీ అటాచ్‌మెంట్‌ చేసినప్పటికీ ఆస్తులన్నీ ఆయా కంపెనీల పేరుమీదే ఉంటాయి. వాటిని ఇతరులకు బదిలీ చేసే అవకాశముండదు. వాటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించరాదు. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి ఈడీ అటాచ్‌మెంట్‌ చేసిన 170 కోట్ల నిల్వల పరిస్థితి కూడా అంతే. అయితే ఈసారి ఈడీ అసాధారణ రీతిలో భారతీసిమెంట్స్‌కు చెందిన 170 కోట్లను తన ఖాతాల్లోకి బదలీచేసింది. అటాచ్‌మెంట్‌లో ఉన్న డిపాజిట్లను దుర్వినియోగం చేసే అవకాశముందని, అలాంటి అసాధారణ పరిస్థితులు ఎదురవుతాయని నిర్ధిష్టంగా తెలిస్తే ఆస్తులను ప్రభుత్వ ఖాతాల్లో జమచేసుకునే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఉంటుంది. దీనికి లోబడే జగన్‌ కంపెనీల ఖాతాలో ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఈడీ తన అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీని కోరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే బ్యాంకులకు, జగన్‌కు నోటీసులు ఇవ్వడం, ఆ వెంటనే భారతీ సిమెంట్స్‌ ఖాతాలోని నగదును ఈడీ తన ఖాతాలోకి బదిలీ చేయడం వెనువెంటనే జరిగిపోయాయి.

న్యాయవాదులతో చర్చించిన జగన్‌..
తమ ఖాతాల్లోని 170 కోట్లను ఈడీ తన ఖాతాల్లోకి మళ్లించడంపై భారతీ సిమెంట్స్‌ కంపెనీ శనివారం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ శనివారం అందుబాటులో లేరు. విశాఖలో ఉండడంతో ... హౌస్‌మోషన్‌ పిటిషన్‌కు అనుమతి లభించలేదు. దీంతో వాజ్యం సోమవారం హైకోర్టులో రెగ్యులర్‌ మోషన్‌లో విచారణకు రానుంది. అసలు అటాచ్‌మెంట్‌లే అవసరంలేదని వాదిస్తుండగా... జప్తు చేసిన నగదును ఈడీ పూర్తిగా మళ్లించడంతో జగన్‌ శిబిరంలో కలకలం చెలరేగింది. వెంటనే జగన్‌ న్యాయవాదులతో చర్చించినట్టు తెలుస్తోంది. తాను దేశాన్ని విడిచి పారిపోవడం లేదని... అలాంటప్పుడు బ్యాంకుల్లో ఉన్న నగదును ఈడీ మళ్లించేందుకు ఆస్కారమేలేదని హైకోర్టులో వాదించాలని న్యాయవాదులకు జగన్‌ స్పష్టం చేశారు.

టీమిండియా ఓపెనర్ల అర్ధ సెంచరీలు..

చెన్నై : భారత్ - ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌, పార్థివ్ ప‌టేల్‌ అర్ధ సెంచ‌రీలు సాధించారు. మొద‌టి ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ ఉంచిన 477 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 60/0 ఓవర్ నైట్ స్కోరుతో భారత్ ఆటను కొనసాగించింది.

12:15 - December 18, 2016

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న ట్వీట్స్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు స్పందించారు. ఆదివారం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారని, తన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ ఏ విశ్వ విద్యాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. పాటించేది..లేనిది ప్రజల ఇష్టమని, నగదు రహిత లావాదేవీలకు ప్రజలకు అలవాటుపడాలన్నారు. జనవరి 1 తరువాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై ప్రభుత్వం నిర్ణయం సరైనది కాకుంటే..రాబోయే ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారని తెలిపారు.

పవన్ ఏమన్నారు ?
గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నీలదీస్తానన్నారు. పవన్ గోవధపై బీజేపీకి తన మొదటి ప్రశ్నను సంధించారు. ప‌వ‌న్ గోవ‌ధ, రోహిత్ వేముల ఆత్మహత్య, తాజాగా దేశభక్తితో బీజేపీ ప్రభుత్వంపై ప్రశ్నల బాణాలు ఎక్కుపెట్టారు.

1వ ప్రశ్న..గోవధ..గోవధ నిషేధంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించవచ్చు కదా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఈ అంశం పట్ల నిజాయితీ ఉంటే లెదర్‌తో తయారుచేసిన పాదరక్షలు, బెల్టులను వాడకూడదని తమ కార్యకర్తలకు సూచించాలన్నారు. గోవులను రక్షించాలంటే ప్రతి బీజేపీ కార్యకర్త ఒక్కో ఆవుని పెంచుకోవాలని సూచించారు.

2వ ప్రశ్న..రోహిత్ వేముల..
లక్షలాది ఇతర భారతీయుల్లాగే రోహిత్‌ బీజేపీను వ్యతిరేకించారు. అంతమాత్రాన బీజేపీ అతడిని వేధించాలా? అని ప్రశ్నించారు. ఓ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించనంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్సు వారికి ఎవరిచ్చారు? అని పవన్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. పైగా అతడు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలుపుతున్నపుడు ఎలా జోక్యం చేసుకుంటారు? అని తన ప్రశ్నలను సంధించారు. ఇది బీజేపీకే కాదు ఏ పార్టీకైనా వర్తిస్తుందని పవన్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.

3వ ప్రశ్న..దేశభక్తి..
కుల‌, మ‌త, వ‌ర్గ, ప్రాంత‌, భాషా భేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకు వెళ్లడ‌మే దేశ‌భ‌క్తి అని ఆయ‌న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశభ‌క్తి అనేది ఓ రాజ‌కీయ‌ పార్టీకి చెందిన అంశంగా ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. లువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమని ప‌వ‌న్ అన్నారు. అధికారంలోని పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడినంత మాత్రాన దేశభక్తి లేనట్టు కాదని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలు సమావేశాలను జాతీయ గీతాలాపనతో ఎందుకు ప్రారంభించ‌డంలేద‌ని ప‌వ‌న్ ప్రశ్నించారు. కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమా చూడటం కూడా దేశభక్తికి పరీక్షావేదిక కాకూడ‌ద‌న్నారు. చ‌ట్టాలను చేసేవారు.. వాటి గురించి ప్రచారం చేసేవారు.. వాటిని ఆచ‌రించరా అంటూ ప్రశ్నించారు. ముందు వారు ఆచ‌రించి అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు కదా అని పవన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కాపులు..

తూర్పుగోదావరి : ముద్రగడ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా గరిటెలతో కంచాలను కొడుతూ కాపులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో జేఏసీ నేత వాసిరెడ్డి దాసు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

11:37 - December 18, 2016

సహజీవనం..పెళ్లి కాకుండానే యువతీ..యువకులు కలిసి జీవించడం..ఇది ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తూంటుంది. ఈ సంస్కృతి భారతదేశంలో కూడా ప్రవేశించింది. కొన్ని సార్లు సహజీవనం చేసిన వారు కొంతకాలం తరువాత వివాహ బంధంతో ఒక్కటవుతారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తారలు సహజీవనం చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలో 'నికిషా పటేల్' చేరింది. ‘పులి' సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టింది. ‘తలైవన్' తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ‘ఎన్నమో ఏదో', ‘కరైఓరం', ‘నారదన్' చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. గౌతం దర్శకత్వంలో 'శక్తి' హీరోగా నటిస్తున్న '7 నాట్కల్' చిత్రంలో ప్రస్తుతం 'నికిషా' నటిస్తోంది. చాలా అవకాశాలు వచ్చినా తాను నటించలేదని, చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు నటిస్తున్నట్లు పేర్కొంది. భార్య భర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదని, పెళ్లితో ప్రతొక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదని పేర్కొంది. తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని 'నికీషా' పేర్కొంది.

11:33 - December 18, 2016

కర్నూలు : జిల్లా ఎస్పీ రవికృష్ణ నగరంలో అర్ధరాత్రి దుప్పట్లు పంచారు. తానా, పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ, రైల్వే ప్రాంతాల్లో పుట్ పాత్ లపై పడుకొంటూ చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లలో ఈనెల 23వ తేదీ నుండి వైద్య ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ రవికృష్ణ మీడియాకు తెలియచేశారు.

11:20 - December 18, 2016

అమీర్ ఖాన్...ప్రస్తుతం బయోపిక్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. వైవిధ్యం కనిపించేందుకు ఇష్టపడమే ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ మల్లయోధుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా 'దంగల్' చిత్రం తెరకెక్కింది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా మరో బయోపిక్ చిత్రంలో 'అమీర్' నటించనున్నాడు. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన 'రాకేష్‌శర్మ' పాత్రలో 'అమీర్‌' కనిపించబోతున్నారు. అంతరిక్షయానం చేసే క్రమంలో ఎదురైన ఆటుపోట్లు..వ్యక్తిగత జీవితం..ఇలా పలు కోణాలను తెరపైన ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి 'సారే జహాసే అచ్ఛా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ మథాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ నటించిన దంగల్ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది.

11:18 - December 18, 2016

గుంటూరు : పెద్దనోట్ల రద్దు... అమరావతిని అతలాకుతలం చేసింది. కొత్త రాజధాని ప్రాంతంలో ఇప్పుడు సెంటు భూమి కూడా అమ్ముడుపోవడం లేదు. మొన్నటివరకు కళకళలాడిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో... ఇప్పుడు ఈగలు తోలుకునే పరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు దెబ్బతో రియల్టర్లే కాదు.. రైతులూ లబోదిబోమంటున్నారు. కొత్త రాజధాని అమరావతిపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. నలభై రోజుల క్రితం వరకు రాజధాని ప్రాంతంలో రియల్‌ భూం ఆకాశమే హద్దు అన్నట్లుగా సాగింది. కోట్లాది రూపాయల రియల్‌ వ్యాపారం జరిగింది. అయితే నవంబర్‌ 8 నుంచి పరిస్థితి ఒక్కసారిగా కుదేలైపోయింది. ఇప్పుడక్కడ సెంటు భూమి కూడా అమ్మకం జరగని పరిస్థితి నెలకొంది.

ముందుకు రావడం లేదు..
రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఎకరం, అర ఎకరం అంటూ రియల్‌ వ్యాపారం బాగానే సాగేది. నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత.. ఇక్కడి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఎక్కడ కూడా భూమి క్రయవిక్రయాలు జరగడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్‌ వ్యాపారాన్నే నమ్ముకున్న వారు తీవ్ర నష్టాలపాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో చాలా మంది రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించారు. దీనికి బదులుగా ప్రభుత్వం తమకు ప్లాట్లు కేటాయించి ఇస్తుందని, వాటిని అమ్ముకోవచ్చని రైతులు భావించారు. కానీ అదీ జరగలేదు. రైతులు తమ అవసరాల కోసం భూములు అమ్మడానికి సిద్ధంగా ఉన్నా... పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

దిక్కుతోచని పరిస్థితి..
నోట్ల రద్దు నేపథ్యంలో... కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తక్కువ ధరలకే భూములు ఇవ్వాలని అడుగుతున్నారు. అంతకుముందు జరీబు పొలం కోటీ ఎనభై లక్షల వరకు ధర పలికింది. కానీ ప్రస్తుతం కోటీ నుంచి కోటీ ఇరవై లక్షల లోపైతేనే కొంటామని రియల్టర్లు బేరాలు పెడుతున్నారు. ఇలాగే వదిలేస్తే పరిస్థితి మరింత దిగజారి.. లక్షల్లోపే భూములు అమ్ముకోవాల్సి ఉంటుందని రైతులను భయపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మరో ఆరు నెలల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నెలన్నర క్రితం జోరుగా సాగిన రియల్‌ వ్యాపారం ఉన్నపళంగా ఢమాల్‌ అనడంతో వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

విద్యుత్ పొదుపు వారోత్సవాల ప్రారంభం..

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో విద్యుత్ పొదుపు వారోత్సవాలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. విద్యుత్ ను పొదుపు చేయడమంటే పర్యావరణాన్ని రక్షించడమేనని, అవసరాల మేరకు మాత్రమే విద్యుత్ వాడుకోవాలని మంత్రి జగదీష్ సూచించారు. పొదుపు నియమాలలను ప్రతొక్కరూ పాటించాలన్నారు.

ఖమ్మంలో రూ. 7లక్షల కొత్త కరెన్సీ స్వాధీనం..

ఖమ్మం : రైల్వే స్టేషన్ లో జీఆర్ పి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద రూ. 7లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన వ్యాపారస్తులదని తెలుస్తోంది.

కత్తులతో బెదిరించి..

రంగారెడ్డి : గగన్ పహాడ్ లో వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ. 8500, సెల్ ఫోన్ ను నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు. పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

పపువాలో కూలిన విమానం..

ఇండోనేషియా : పపువాలో వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు పైలెట్లు ఉండగా మిగతా 10 మంది సైనికులే.

10:56 - December 18, 2016
10:54 - December 18, 2016

ఢిల్లీ : ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వైమానికదళానికి చెందిన ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పైలెట్లు కాగా మిగతా వారందరూ సైనికులే. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. తక్కువ కెపాసిటీ గల ఈ విమానంలో ఆహార పదార్థాలు..ఇతరత్రా తరలిస్తుంటారు. ఇలాగే ఆహార పదార్థాలు తీసుకెళుతుండగా పపువాలోని ప్రావిన్స్ కొండల మధ్య విమానం కూలిపోయింది. భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2015 లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. 130 మంది మృత్యువాత పడ్డారు. కొండ ప్రాంతంలో కూలిపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. బ్లాక్ బాక్స్ దొరికిన అనంతరం ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

10:30 - December 18, 2016

ఖమ్మం : సామాన్య మానవుడు నగదు కోసం గంటలు..గంటలు బ్యాంకులు..ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతుంటే పెద్దోళ్లకు మాత్రం లక్షలు..కోట్లు.. నగదు వచ్చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలో ఓ వ్యక్తి వద్ద రూ. 7లక్షలు నగదు స్వాధీనం చేసుకోవడం కలకలకం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో జీపీఆర్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. ఈ నగదు జిల్లాలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన వ్యాపారస్తులదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నెక్లెస్ రోడ్డులో బైక్ ర్యాలీ..

హైదరాబాద్ : నిబంధనలకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను నడిపించడంపై అవగాహన కల్పిస్తూ హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సినీ నటుడు నాగ చైతన్య పాల్గొని సందడి చేశారు.

సోమవారం వైఎస్ జగన్ యువ భేరీ..

విజయవాడ : విజయనగరంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ యువభేరీ నిర్వహించనున్నారు. పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి జరగనుంది.

విశాఖ ఏజెన్సీల్లో చలి తీవ్రత..

విశాఖపట్టణం : ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతోంది. లంబసింగిలో 2, చింతపల్లి, మినుములూరుల్లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

09:18 - December 18, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యలు..ఇబ్బందులు ఇంకా తీరడం లేదు. గత 40 రోజులుగా పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నారు. 90 శాతం ఏటీఎంలలో డబ్బులు ఉంచకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగదు లభ్యమౌతున్న ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. ఆదివారం కూడా పలు ఏటీఎంల వద్ద సామాన్యుడు క్యూ కడుతున్నాడు. ఇదిలా ఉంటే నల్లకుంట ఎస్ బీహెచ్ ఎప్పుడు తెరుచుకుంటుందా ? అని ఎదురు చూస్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. గత పది రోజులుగా ఈ బ్యాంకు తెర్చుకోవడం లేదని, బ్యాంకు తెరిస్తే కొంతైనా సమస్యలు తీరే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రెండువేల నోటు తెస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నల్లకుంటలోని ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు పేర్కొంటున్నారు.

09:09 - December 18, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను పొగమంచు దుప్పటి కప్పేసింది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పొగమంచు కప్పేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఢిల్లీ రావాల్సిన 26 రైళ్లను ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో తొమ్మిది రైళ్ల సమయం మార్చారు. దాదాపు మూడు వారాలుగా ఉత్తరాదిలో ఇదే పరిస్థితి నెలకొంది. అతిసమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. తీవ్ర చలితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఉదయం 8గంటల డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యింది. పొగమంచు రైల్వే వ్యవస్థను స్తంభింప చేస్తోంది. ఉత్తరాదిన 204 రైళ్లను రద్దు చేశారంటే పొగమంచు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య రైల్వేపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణీకులు రైల్వే స్టేషన్ లలో పడిగాపులు పడుతున్నారు. కాజిపేట -విశాఖపట్టణం రైలు సమయాల్లో పలు మార్పులు చోటు చేసుకుంది.

08:36 - December 18, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను పొగమంచు దుప్పటి కప్పేసింది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పొగమంచు కప్పేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఢిల్లీ రావాల్సిన 26 రైళ్లను ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో తొమ్మిది రైళ్ల సమయం మార్చారు. దాదాపు మూడు వారాలుగా ఉత్తరాదిలో ఇదే పరిస్థితి నెలకొంది. అతిసమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.

 

08:32 - December 18, 2016

ఆదిలాబాద్ : ప్రజల దగ్గరున్న పెద్ద నోట్లను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వారి అవసరాలకు సరిపడా నగదును అందుబాటులోకి తీసుకురావడంలో తీవ్రంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బ్యాంకుల్లో డబ్బులున్నా.. ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితి నెలకొందని, ఇది అనాలోచిత చర్య అని తమ్మినేని అన్నారు. కదం తొక్కుతూ..పదం పాడుతూ.. పల్లెపల్లెనూ పలకరిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 62 రోజులు పూర్తి చేసుకుంది. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర కొమురంభీం జిల్లాలోకి ప్రవేశించింది. 62వ రోజు ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూర్‌ మండలం అస్నాపూర్‌లో ప్రారంభమైన పాదయాత్ర ఆసేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద కుమ్రంభీం జిల్లాలోకి ప్రవేశించింది. ఆసేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద 1600 కిలోమీటర్ల మైలురాయిని పూర్తిచేసుకుంది. అక్కడి నుంచి జైనూర్‌, బుషిమెట్ట క్యాంప్‌వరకు కొనసాగింది.

హామీల అమలేది ?
అడవుల నుంచి గిరిజనులను దూరం చేసే కుట్ర జరగుతోందని.. అభివృద్ధిలో, బడ్జెట్‌లో ఆదివాసీలకు భాగస్వామ్యం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీల హక్కుల కోసం పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలకు సరిపడా నగదును అందుబాటులోకి తీసుకురాకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని తమ్మినేని విమర్శించారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పిన టీఆర్‌ఎస్‌ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని తమ్మినేని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చినా... రైతుల రుణాలు మాఫీ కాలేదని, కేజీటూ పీజీ విద్య, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం అమలు కాలేదని తమ్మినేని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. అట్టడుగు వర్గాల వారంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని తమ్మినేని అన్నారు. నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టం వాటిల్లిందని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. చిరువ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

08:13 - December 18, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి 40 రోజులు దాటుతోంది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. 40వ రోజు ఆదివారం సెలవైనా సామాన్యులు మాత్రం ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. చిల్లర లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. 90 శాతం ఏటీఎంలు పనిచేయక పోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆబిడ్స్ ఏస్ బీ హెచ్ ఏటీఎం వద్ద డబ్బులు తీసుకోవడానికి ప్రజలు క్యూ కట్టారు. ఇదిలా ఉంటే ఏటీఎంలలో నగదు పెట్టకపోవడం పట్ల జోనల్ బ్యాంకు అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం నుండి ఏటీఎంలలో డబ్బులు పెట్టాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జోనల్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

08:10 - December 18, 2016

హైదరాబాద్ : నగరంలో మరో రోడ్డు ప్రమాదం చేసుకుంది. నాగోల్ ఆర్టీఏ ఆఫీసు దగ్గర వెళుతున్న కారును వెనుకనుండి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలాయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వారు ఏపీ 28 డిడి 3355 కారులో వెళుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున నాగోల్ ఆర్టీఏ ఆఫీసు దగ్గరకు రాగానే వెనుకనుండి లారీ ఢీకొంది. దీనితో కారులో ఉన్న వెంకటేష్ అక్కడికక్కడనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా ? మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా అనేది తెలియరాలేదు. లారీకి సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతను పట్టుకున్న తరువాతే ఇతర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

07:36 - December 18, 2016
07:35 - December 18, 2016

బ్యాడ్మింటన్ వరల్డ్‌ సూపర్ సిరీస్‌ ఫైనల్స్‌‌ టోర్నీలో తెలుగు తేజం, ఏస్ షట్లర్ పీవీ సింధూ ప్రయాణం ముగిసింది. సెమీఫైనల్లో సింధూను సౌత్ కొరియా క్రీడాకారిణి సంగ్ జు హ్యూన్ ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. తొలిసారి బ్యాడ్మింటన్‌ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆడుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తడబడింది. ఇక్కడ నేటి రాత్రి జరిగిన సెమిఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన షట్లర్ సుంగ్‌ జీ హున్‌ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. గ్రూపు-బీ నుంచి రెండు విజయాలతో సెమిఫైనల్స్ చేరుకున్న సింధుకు నిరాశే ఎదురైంది.

రెండో గేమ్‌లో పుంజుకున్న సింధు..
మ్యాచ్‌ సాంతం హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం పదేపదే చేతులు మారింది. నువ్వానేనా అన్నట్లు సాగిన గేమ్‌లో సంగ్‌హ్యూన్‌.. సింధును కోర్టుకు ఇరువైపులా తిప్పించి 21-15తో విజయం పొందింది. అయితే కీలకమైన రెండో గేమ్‌లో సింధు పుంజుకొంది. 10-10, 14-14, 18-18తో సమం చేస్తూ ప్రత్యర్థి ప్రతిఘటించినా అద్భుత స్మాష్‌లతో 21-18తో రెండో గేమ్‌ గెలుచుకొంది. మూడో గేమ్‌లోనూ ఇద్దరూ పోటాపోటీగా ఆడినా సింధు కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో హ్యూన్‌ 21-15తో మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు చేరుకొంది. సింధుపై తన గెలుపోటముల రికార్డును 4-6కు మెరుగు పర్చుకుంది. సెమీఫైనల్‌కు ముందు మ్యాచ్‌లో టాప్ ప్లేయర్ కరోలినా మరిన్ ఓడించింది సింధూ. రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో కరోలినా చేతిలో ఓడినందుకు ఈ సూపర్ సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల జరిగిన హాంగ్‌కాంగ్, చైనా ఇప్పుడు డీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్‌లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది పీవీ సింధూ.

మానవతావాదుల మహా సమ్మేళనం..

విజయవాడ : ఉదయం పది గంటలకు వేదిక ఫంక్షన్ హాల్ లో ప్రజాశక్తి బుక్ హౌస్, నాస్తిక కేంద్రం ఆధ్వర్యంలో మానవతావాదుల మహా సమ్మేళనం జరగనుంది.

06:39 - December 18, 2016
06:38 - December 18, 2016

భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంచలన విజయం సాధించారు. డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా విజేందర్ నిలిచాడు. ప్రత్యర్థి టాంజానియాకు చెందిన ప్రముఖ బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాపై విజేందర్ ఘన విజయం సాధించాడు. విజేందర్‌ సింగ్‌ పంచ్‌కు ఎదురులేకుండా పోయింది. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో అజేయ రికార్డును కొనసాగిస్తూ అతడు మరోసారి అదరగొట్టాడు. టాంజానియాకు చెందిన ప్రపంచ మాజీ ఛాంపియన్‌ ఫ్రాన్సిస్‌ చెకాకు చెక్‌ పెడుతూ విజేందర్‌ డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు.

ఏడో నాకౌట్ విజయం..
తొలి రౌండ్‌లోనే దూకుడు ప్రదర్శించిన విజేందర్‌.. చెకాపై 3 పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాతి రౌండ్‌లో బలంగా 7 పంచ్‌లు విసిరి ప్రత్యర్థిని డస్సిపోయేలా చేశాడు. ఇక మూడో రౌండ్‌లో 2 నిమిషాల్లోనే చెకాను టెక్నికల్‌ నాకౌట్‌ చేసి విజేతగా నిలిచాడు. పోరులో మొత్తం 10 రౌండ్లు ఉండగా.. చెకాను మూడో రౌండ్లోనే నాకౌట్‌ చేశాడు. ఇది వరసగా విజేందర్‌కు ఏడో నాకౌట్ విజయం. శనివారం జరిగిన పోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విజేందర్‌.. బలమైన ప్రత్యర్థిగా భావించిన చెకాను తన పంచ్‌లతో బెంబేలెత్తించాడు. ప్రత్యర్థి మాటల్ని నమ్ముకుంటే తాను బలమైన తన పంచ్‌ల్నే నమ్ముకున్నాని మ్యాచ్ అనంతరం విజేందర్ తెలిపాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

06:36 - December 18, 2016

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన కంటిన్యూ అవుతోంది. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. ప్రత్యేక డాక్టర్లబృందం పర్యవేక్షణలో కరుణానిధికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు కావేరి ఆస్పత్రికి రాజకీయ ప్రముఖుల తాకిడి పెరిగింది. కరుణానిధిని పరామర్శించేందుకు కావేరి ఆస్పత్రి వచ్చిన వైగోను డీఎంకే కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. గొంతు, ఊపిరితిత్తుల సమస్యతో కొన్నిరోజులుగా ఆయన బాధపడుతున్నారు. మరోవైపు కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో... చెన్నైలోని కావేరి ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. కరుణానిధిని పరామర్శించేందుకు వెళ్లిన ఎండీఎంకే నేత వైగోను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వైగోను ఆసుపత్రిలోకి వెళ్లనీయకుండా ఆయన వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కావేరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

రాహుల్ పరామర్శ..
మరోవైపు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వాకబు చేశారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు, కేరళ గవర్నర్లు కూడా కరుణానిధి ఆరోగ్య స్థితిని వాకబు చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కరుణానిధిని కావేరి ఆస్పత్రిలో పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్‌.. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని వైద్యులు తెలిపారని రాహుల్‌ అన్నారు.

కౌన్సిల్ సమావేశం వాయిదా..
కరుణానిధి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఈనెల 20న జరగాల్సిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలతో పాటు పార్టీలో మరికొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. పార్టీ కీలక సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది మళ్లీ తెలియజేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున ఆయనను చూసేందుకు దయచేసి ఎవరూ ఆసుపత్రికి రావద్దని కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు పార్టీ విజ్ఞప్తి చేసింది.

06:31 - December 18, 2016

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురంలోని పెన్నారు పరిశ్రమ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. సమీప టీఆర్ఎస్ కేవీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై సీఐటీయూ అభ్యర్థి చుక్కారాములు 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీఐటీయూ ఘన విజయంతో పెన్నారు పరిశ్రమ ముందు కార్మికులు సంబరాలు చేసుకున్నారు.

06:29 - December 18, 2016

హైదరాబాద్ : నల్లకుబేరుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వ్యవస్థలోని లోపాన్ని.. ప్రభుత్వ నిర్లక్ష్యపు నిర్వాకాన్ని ఎత్తిచూపుతున్నాయి. కొందరు బ్యాంకర్లకు కమీషన్లు చెల్లించడం ద్వారా.. నల్లకుబేరులు పాత నోట్లను మార్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కుల నల్లధనం కొత్తనోట్ల సింగారాన్ని సంతరించుకుంటోంది. ఐటీ అధికారుల దాడుల్లో ఈ కఠోర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్రమార్కుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఈనెల 30 వరకే గడవు ఉంది. దీంతో ఇంతకాలం గుంభనంగా ఉన్న నల్ల కుబేరులు అక్రమ మార్గాలు పడుతున్నారు. వందల కోట్ల పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నిఘా వర్గాలు, ఆదాయపన్ను శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ఎనిమిది బ్యాంకు లాకర్లు తెరిచిన ఐటీ అధికారులు..
గుజరాత్‌లోని సూరత్‌లో వడ్డీ వ్యాపారి భజియావాలా నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి 400 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను పట్టుకున్నారు. ఈ మొత్తంలో 150 కోట్ల రూపాయల నగదు ఉంది. మిగిలిన 250 కోట్ల బంగారం, స్థిరాస్తుల రూపంలో ఉందని గుర్తించారు. భజియావాలాకు చెందిన ఎనిమిది బ్యాంకు లాకర్లను కూడా అధికారులు తెరిచారు. ఇతను 13 మంది స్థిరాస్తి వ్యాపారులతో లావాదేవీలు నడిపేవాడని ఐటీ అధికారులు గుర్తించారు. సూరత్‌లో టీ అమ్ముకునే భజియావాలా వడ్డీ వ్యాపారంతో అపర కుబేరుడుగా అవతరించాడు.

మరో రెండున్నర కిలోల బంగారం పట్టివేత..
కొత్త రెండువేల రూపాయల నోట్ల అక్రమ చలామణి కేసులో బెంగళూరులో మూడు రోజుల క్రితం ఆర్‌బీఐ అధికారిని అరెస్టు చేసిన పోలీసులు, ఇప్పుడు మరో ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు. భారత ఆర్థిక రాజధాని ముంబైలో కోటి 40 లక్షల విలువైన రెండువేల రూపాయాల నోట్లను తరలిస్తున్న నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా సీఎస్‌టీ రైల్వే స్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ దగ్గర పాత నోట్లు మారుస్తున్న రైల్వే ఆఫీసర్‌ బోయర్‌ నుంచి సీబీఐ అధికారులు 8.22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ రెండువేలు, వంద రూపాయల నోట్లే. ముంబైలోనే బంగారం వ్యాపారులకు చెందిన నాలుగు ఖాతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ఖాతాల్లో ఉన్న 120 కోట్ల రూపాయలను జప్తు చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో ఒక టైలర్‌ దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన 30 లక్షల రూపాయల కొత్త నోట్లు, రెండున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోనిబులంద్‌షహర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు దగ్గర నగదు కోసం బ్యాంకు దగ్గర క్యూ కట్టిన ఖాతాదారులపై పోలీసులు కానిస్టేబుల్‌ విరుచుకుపడిన ఘటనలో మహిళలు అతనిపై చేయి చేసుకున్నారు. దీనికి ప్రతీకారంగా కానిస్టేబుల్‌ తిరగబడటంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 4 లక్షలు స్వాధీనం..
హైదరాబాద్‌ మలక్‌పేటలో ఆరుగురు సభ్యుల దోపిడీ ముఠాను పోలీసులు అరెస్టు చేసి, 5.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రం సూర్యాపేటలో రెండు వేర్వేరు ముఠాల నుంచి పోలీసులు పది లక్షల విలువైన రెండు వేల రూపాయల నోట్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపు కొత్త నోట్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు వీటిని దర్జాగా పొందుతున్న వైనంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

06:26 - December 18, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమవేశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలను రచించిన అధికార పార్టీ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది. రాజకీయ చర్చలకు శాసనసభ వేదిక కారదన్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన అధికార పార్టీ... రాబోయే రోజుల్లోనూ కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలను పంపిస్తోంది.!

కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు వైఖరి ప్రతిపక్షాల్లో కలవరం రేపుతున్నాయి. విపక్ష పార్టీలకు పగ్గాలు వేసి సభను పూర్తిస్థాయిలో నిర్వహించాలనుకున్న గులాబీ పార్టీ అందుకు అనుగుణంగానే సభలో వ్యవహరిస్తోంది. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికార పక్షం పావులు కదుపుతోంది. ప్రతిపక్షపార్టీలకు సభలో బ్రేకులు వేస్తూ... తమ వ్యూహంపై క్లారిటీ ఇస్తోంది. సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. రాజకీయ అంశాలపై సభలో చర్చ జరగరాదనే అభిప్రాయంతో అధికార పార్టీ... ప్రతిపక్ష పార్టీల సభ్యులపై చర్చలకు ఉపక్రమించింది.

పీపీఏల్లో అవినీతి జరిగిందంటున్న ప్రతిపక్షాలు..
విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న అంశాల్లో రెండోరోజూ జరిగిన చర్చల్లో విద్యుత్ అంశం కూడా ఉంది. విద్యుత్ నిరంతరాయంగా ఇస్తున్న పీపీఏల్లో అవినీతి జరిగిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్లతో ఈ వ్యవహరంపై సభలో చర్చను సమర్దవంతంగా నిర్వహించామని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే... పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోర్టు విధించిన గడువు కూడా ఈ నెల 20వ తేదీ నాటికి ముగిస్తుండటంతో... ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యేల వలసలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఎలా వ్యవహరిస్తాయన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ..
అధికార పార్టీని ఇరుకున పెట్టాలని విపక్ష పార్టీల నేతలు కసరత్తు చేసి సభకు వస్తున్నా....అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయోమయంలో పడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. సోమవారం సభలో నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చకు అధికార పార్టీ తెరపైకి తెస్తోంది. ఈ చర్చతో ప్రతిపక్ష నేతలకు పూర్తిస్థాయిలో బ్రేకులు వేసేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. పాలకపక్షం వ్యూహాలకు ప్రతిపక్షాలు ఎలా చెక్‌ పెడతాయన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

నేడు ప్రత్యేక హోదాపై 'పవన్' ట్వీట్..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మరో ట్వీట్ చేయనున్నారు. ప్రత్యేక హోదాపై ఆయన ట్వీట్ చేయనున్నారు. గురువారం నాడు గోవధ, శుక్రవారం నాడు హెచ్ సీయూ ఆత్మహత్య చేసుకున్న స్కాలర్ విద్యార్థి రోహిత్ వేములపై స్పందించిన విషయం తెలిసిందే.

నేడు బెల్జియంతో భారత్ అంతిమ సమరం..

లక్నో : నేడు జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ టైటిల్ పోరుకు జట్లు సిద్ధమయ్యాయి. బెల్జియంతో భారత్ జట్టు ఢీకొననుంది.

నేడు నిజాంగ్రౌండ్స్ లో ముదిరాజ్ సింహగర్జన..

హైదరాబాద్ : ముదిరాజ్ లను బీసీ డీ నుండి బీసీ ఎ లోకి మార్చే ప్రక్రియను బీసీ కమీషన్ ద్వారా వెంటనే చేపట్టాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఆదివారం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో సింహగర్జన జరగనుంది.

 

నేటి నుండి ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం..

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఎట్టకేలకు నగదు రహిత కార్పొరేట్ వైద్యానికి అడుగు పడింది. ఆదివారం నుండి రాష్ట్రంలోని ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఆయా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

నేటి నుండి విద్యుత్ పొదుపు వారోత్సవాలు..

హైదరాబాద్ : విద్యుత్ పొదుపు వారోత్సవాలు ఆదివారం ఉదయం నుండి ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వరకు ఇవి జరుగుతాయి. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మార్నింగ్ వాక్ ను ప్రారంభించనున్నారు.

 

కేరళ వర్సెస్ కోల్ కతా...

కొచ్చి : రెండున్నర నెలలుగా పుట్ బాల్ అభిమానులను అలరిస్తున్న ఇండియన్ లీగ్ (ఐఎస్ఎల్) ఆఖరి దశకు చేరుకుంది. ఆదివారం అటైటికో డీ కోల్ కతా, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.

శరద్ పవార్ రాజీనామా..

ముంబై : బీసీసీఐలో లోధా కమిటీ సిఫార్సుల ప్రభావం కనిపిస్తోంది. 70 ఏండ్లు నిండిన ప్రతొక్కరూ బీసీసీఐ పదవులు ఖాళీ చేయాల్సిందేనన్న సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్ సీపీ చీఫ్, మాజీ ఐసీసీ, బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇంగ్లండ్ 477 ఆలౌట్, భారత్ 60/0..

చెన్నై : లోయర్ ఆర్డర్ విజృంభణతో చెన్నై టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది. రషీద్ (155 బంతుల్లో 60, 8 ఫోర్లు), డావసన్ (148 బంతుల్లో 66 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్ ) ల కీలక భాగస్వామ్యంతో శనివారం రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 157.2 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 60 పరుగులు చేసింది.

Don't Miss