Activities calendar

19 December 2016

22:22 - December 19, 2016

ప్రపంచ దేశాల్లో తెలంగాణకు అరుదైన గౌరవం

హైదరాబాద్ : ప్రపంచ దేశాల్లో తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. న్యూజిలాండ్, లండన్ లలో కవిత పోస్టల్ స్టాంపులు విడుదలయ్యాయి. 
న్యూజిలాండ్ లో డాలర్ విలువైన పోస్టల్ స్టాంపుపై, లండన్ లో ఫస్ట్ క్లాస్ స్టాంపుపై కవిత బొమ్మ ముద్రించారు. పోస్టల్ స్టాంపుపై తెలుగులో బతుకమ్మ శుభాకాంక్షాలు అని ఉండటం విశేషం.

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

సూర్యపేట : మేళ్ల చెరువు మండలం రామాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేయబోయి... ఎదురుగా వస్తున్న టిప్పర్ యువకుల బైక్ ఢీకొట్టింది. మృతులు దొండపాడు వాసులుగా గుర్తించారు.

21:53 - December 19, 2016

కోల్ కతా : ఓవైపు జాతీయగీతం గొప్పతనం చాటేందుకు సుప్రీం కోర్టు చర్యలు చేపడుతుంటే.. మరోవైపు జాతీయగీతాన్ని కించపరిచేలా కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వైశాలి దాల్మియా హౌరాలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. జాతీయ గీతాలాపన జరుగుతుండగా మౌనంగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతూ కెమెరాకు చిక్కారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ, బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరించిన జగ్‌మోహన్‌ దాల్మియాకు ఈమె కుమార్తె కావడం గమనార్హం.

21:50 - December 19, 2016

ఢిల్లీ : టాటా గ్రూపులోని అన్ని సంస్థలకు రాజీనామా చేస్తూ సైరస్‌ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిస్త్రీని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని అక్టోబర్‌ 24న జరిగిన బోర్డు సమావేశంలో టాటా సన్స్‌ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్పొరేట్‌ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది. అనంతరం రతన్‌ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగారు. ఈ క్రమంలో టాటా గ్రూపులోని వివిధ కంపెనీల్లోని పదవుల నుంచి మిస్త్రీని తప్పిస్తూ వచ్చారు. ఇందుకోసం అత్యవసర సర్వసభ్య  సైతం నిర్వహించారు. మిస్త్రీపై విశ్వాసం కోల్పోవడం వల్లే ఆయన్ను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించినట్లు రతన్‌టాటా ఆరోపించగా, టాటా గ్రూప్‌లో నిర్ణయాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. 

 

21:48 - December 19, 2016

అనంతపురం : దేశాన్ని కార్పొరేట్‌ శక్తులు పట్టిపీడిస్తున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. 'స్వాతంత్ర్య ఉద్యమంలో కమ్యూనిస్ట్‌  యోధులు' పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు అలుపెరుగని పోరాటం చేశారని మధు అన్నారు. ప్రస్తుతం భారత కార్పొరేట్‌శక్తులు దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అడ్డుకోడానికి నాటి పోరాటయోధులు చూపిన మార్గంలో వామపక్షాలు సంఘటితంగా ఉద్యమిస్తున్నాయని మధు అన్నారు. 

 

21:44 - December 19, 2016

ఢిల్లీ : పాత నోట్లను మార్చుకునే వారికి ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. డిపాజిట్‌ మొత్తాన్ని రోజుకు ఐదువేల రూపాయలకే పరిమితం చేసింది. అంటే డిసెంబర్‌ 30లోపు.. రోజూ ఐదు వేల చొప్పున ఒక్కొక్కరు యాభై వేలకు మించి డిపాజిట్‌ చేసే అవకాశం లేదన్నమాట. ఇప్పటికీ సుమారు రెండు నుంచి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉన్నాయని భావిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం తాజా నిబంధన విధించింది. 
డిపాజిట్లపై ఆంక్షలు
పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో లావాదేవీలపై రోజుకో నిబంధనను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం ..తాజాగా నగదు డిపాజిట్లపై ఆంక్షలు పెట్టింది. ఆర్బీఐ విధించిన కొత్త నిబంధనల ప్రకారం డిసెంబర్‌30 వరకు ఒక ఖాతాలో రోజుకు 5వేల రూపాయలు మాత్రమే డిపాజిట్‌ చేసే అవకాశంఉంటుంది. ఒకవేళ 5వేలకు మించి డిపాజిట్‌ చేయాల్సి వస్తే.. బ్యాంకు అధికారులకు తగిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పాతనోట్లు రద్దైన తర్వాత వెంటనే  ఎందుకు  డిపాజిట్‌ చేయలేదు,  ఎందుకు ఆలస్యం అయింది.. అనే ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అటు  కేవైసీ డాక్యుమెంట్స్‌ అన్నీ సక్రమంగా ఉంటే మాత్రం  50వేలకు పైబడిన డాపాజిట్లు తీసుకోవచ్చని ఆర్‌బీఐ.. బ్యాంకులకు సూచించింది. 
గరీబ్‌కళ్యాణ్‌ యోజన పథకం డిపాజిట్లకు ఆంక్షలు లేవు
నబంబర్‌ 8తర్వాత ..ఇప్పటివరకు రోజువారీ డిపాజిట్లపై పరిమితి విధించని కేంద్రం..కొత్తగా విధించిన ఆంక్షలతో నల్ల కుబేరుల గుండెల్లో గుబులు మొదలైంది. బ్యాంకుల దగ్గర హడావుడి తగ్గాక చివరి నిమిషంలో మెల్లగా నోట్లు మార్చుకోవచ్చనుకున్నవారికి ఇది నిజంగా షాకింగ్‌ న్యూసే. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం సుమారు 12 లక్షల కోట్ల రూపాయల పాత కరెన్సీ బ్యాంకుల్లో జమ అయింది. ఇంకో రెండున్నర లక్షల కోట్లు ప్రజల వద్ద చలామణిలో ఉన్నట్లు భావన. ఈ మొత్తం వచ్చే పది రోజుల్లో బ్యాంకుల్లోకి రావడమో.. లేక చెల్లని నోట్లుగా మిగిలిపోవడమో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో రోజుకు ఐదువేల రూపాయలే డిపాజిట్‌ చేయాలంటూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకంకింద డిపాజట్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని ఆర్బీఐ తెలిపింది.  

21:40 - December 19, 2016

హైదరాబాద్ : పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలిపామన్నారు మంత్రి కేటీఆర్‌. శాసనమండలిలో టీఎస్‌-ఐపాస్‌ అంశంపై ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్‌ సభలో వివరించారు.
పారిశ్రామిక అభివృద్ధికి కృషి 
పెట్టుబడులను ఆహ్వానించడం.. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తీసుకుంటున్నచర్యలను ఆయన శాసన మండలిలో వివరించారు. 
సింగిల్‌విండో ద్వారా అనుమతులు 
టిఎస్‌ ఐపాస్‌తో పారిశ్రామికవేత్తలకు సింగిల్‌విండో ద్వారా అనుమతులు జారీ చేస్తున్నామన్నారు కేటీఆర్‌. 200కోట్లు పెట్టుబడి లేదా వెయ్యిమంది కార్మికులను ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటుకు  15రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నారు. అవినీతి అస్కారం లేకుండా అనుమతుల వ్యవస్థను రూపొందించామన్నారు. టీప్రైడ్‌ పథకంద్వారా దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు కేటీఆర్‌. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంవల్ల ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్షాల సలహాలను కూడా తీసుకుంటామని.. మంచి ఆలోచలను చెప్పాలని .. మండలి సభ్యులను మంత్రి కేటీఆర్‌ కోరారు. 

 

21:36 - December 19, 2016

హైదరాబాద్ : నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ఎన్ ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2013 దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో.. ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు పట్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
ఉగ్రమూకలకు ఉరిశిక్ష 
హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుళ్లతో నరమేధం సృష్టించిన ఉగ్రమూకలకు ఉరిశిక్ష పడింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసానికి పాల్పడింది ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని న్యాయస్థానం ఈ నెల 13వ తేదీనే ఎన్‌ఐఏ న్యాయస్థానం నిర్ధారించింది. 2013, ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో రాత్రి 7 గంటలకు జరిగిన జంట పేలుళ్లలో 19 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. జంట పేలుళ్ల కేసులో అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఎర్‌ రెహమాన్‌ అలియాస్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోనూ, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌లను నేరస్థులుగా నిర్ధారించిన ఎన్‌ఐఏ కోర్టు.. వారికి ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. శిక్ష పడ్డ నిందితుల్లో ఏ1గా ఉన్న రియాజ్ భత్కల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రియాజ్‌ భత్కల్‌ పాకిస్థాన్‌లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్‌ఐఏ.. ఇంటర్‌పోల్‌ నోటీసు కూడా జారీచేసింది. దేశంలో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులపై నేరం రుజువైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. 
పలు సెక్షన్ల కింద కేసులు, అభియోగాలు 
జంటపేలుళ్ల కేసు నిందితులకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3,5 సెక్షన్ల కింద ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. పాకిస్థాన్‌కు చెందిన వకాస్‌పై విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 14,2 ఆఫ్‌ 3 కింద నేరం నిరూపణ అయింది. ఎన్‌ఐఏ న్యాయస్థానంలో తుది వాదనల అనంతరం నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది. 
ఎన్‌ఐఏ కోర్టులో చార్జిషీటు 
విచారణలో భాగంగా మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాలతో ఎన్‌ఐఏ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా కోర్టు నిర్ధారించింది. అసదుల్లా అక్తర్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌లు ప్రత్యక్షంగా సైకిళ్లపై బాంబులు పెట్టి పేల్చినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఆధారాలు సేకరించింది. యాసిన్‌ భత్కల్‌, ఇజాబ్‌ షేక్‌లు కుట్రలో కీలక పాత్ర పోషించినట్టు తేల్చింది. వకాస్‌ పాకిస్థాన్‌ జాతీయుడు కాగా, మిగిలినవారు కర్నాటక, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారుగా ఎన్‌ఐఏ గుర్తించింది. అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భక్తల్‌, ఇజాజ్‌ షేక్‌లు చర్లపల్లి జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో 502 ఫైళ్లు, 201 వస్తువులను పరిశీలించిన కోర్టు, ఐదుగురినీ దోషులుగా తేల్చింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా దోషులకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ వాదించింది. వీటన్నింటి నేపథ్యంలో కోర్టు దోషులకు ఉరిశిక్షను  ఖరారు చేసింది. 
ఉరిశిక్ష ఖరారు 
మరోవైపు ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శిక్షలకు సంబంధించి ఇరువర్గాల వాదనల్ని న్యాయస్థానం విన్నది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు, హత్యలకు పాల్పడినందుకు గాను దోషులందరికీ మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే, శిక్షపై దోషుల అభిప్రాయాన్ని కోరగా.. తాము చెప్పేదేమీ లేదని, ఏ శిక్ష విధించినా సిద్ధమేనని చెప్పడంతో న్యాయస్థానం వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది.  
తీర్పుపట్ల బాధిత కుటుంబాలు హర్షం 
కోర్టు తీర్పుపట్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు తీర్పు ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారికి గుణపాఠం కావాలని వారు వ్యాఖ్యానించారు. ఎన్‌ఐఏ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. చర్లపల్లి జైలువద్ద పోలీసులను భారీగా మోహరించింది. 

 

21:25 - December 19, 2016
21:05 - December 19, 2016

ఎవరి బొక్కసాలు నింపబోతోంది ? ఎవరికి బరువు కాబోతోంది ? సర్వీస్ టాక్సుల బాదుడుకు అంతం లేదా ? క్యాష్ లెస్ ఎవరికి లాభం ? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:00 - December 19, 2016

బీపీ పెంచుకుంటున్న ప్రతిపక్షాలు...చలికాలం ఉడుకుతున్న అసెంబ్లీ, తిలాపాపం తలా పిడికెడన్నట్లున్నది... నయీం పంజాదీ నడుస్తనేవున్నది, ఆడ బిడ్డను అమ్మాలనుకున్న తండ్రి..రెండు, మూడు సొట్లు పెట్టొద్దాము పార్రీ, తిరుమల కొండమీద అలిగిన ఏనుగు... మావటి మోకాలు మీద గజరాజు పాదం, రైసు కూలింగల రాలుతున్న కేసులు.. ఎంత జెప్పినా మార్తలేరు ప్రజలు, నడిబజార్ల తిరుగుతున్న అడవిరాజు.. గుజరాత్ రాష్ట్రంలో సింహం చిత్రాలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:58 - December 19, 2016

గ్యాంగ్ స్టర్ నయీం కేసును సిబిఐకి అప్పగించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత బీఎన్ రెడ్డి, సీపీఎం నేత చెరుపల్లి సీతారాములు, టీఆర్ ఎస్ నేత రాకేష్ , కాంగ్రెస్ నేత కొనగళ్ల మహేష్ పాల్గొని, మాట్లాడారు. ఈ కేసును పారదర్శంగా దర్యాప్తు చేయాలన్నారు. నయీం డైరీలోని అంశాలను బహిర్గతం చేయాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్యకు ప్రతి నెల రూ.10 వేల పెన్షన్...

హైదరాబాద్ : ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్యకు ప్రతి నెల రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పెన్షన్ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. సత్తయ్య జీవనం సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. 

 

20:27 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌పై వాడీవేడి చర్చ సాగింది. ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేయగా.. రాష్ట్ర ఏజెన్సీతోనే అందరి బాగోతం బయటపెడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చర్చ సందర్భంగా.. నయీంతో సంబంధాలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. 
నయీంపై స్వల్పకాలిక చర్చ
మూడో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. సభ ప్రారంభం కాగానే, ఇటీవల మరణించిన శాసనసభ్యులకు సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌పై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌, రాష్ట్రంలో నయీం ముఠా దారుణ చర్యలకు పాల్పడిందని అన్నారు. అరాచక శక్తులను ఎక్కడ ఉన్న అణచివేస్తామని, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు : మంత్రి ఈటల 
గ్యాంగ్‌స్టర్‌ నయీం నేర చరిత్ర, బెదిరింపులు, సెటిల్‌మెంట్లపై ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర అన్నారు. తన డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేసి, తనను బెదిరిస్తున్నట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్లు ఎందుకు పట్టింది : జీవన్‌రెడ్డి 
నయీం లాంటి వ్యక్తిని మట్టుబెట్టేందుకు రెండేళ్ల సమయం ఎందుకు పట్టిందని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న సగంమంది ఇప్పుడు టిఆర్ ఎస్ లో ఉన్నారని వాళ్లకు బాధ్యత లేదా అని జీవన్‌రెడ్డి విమర్శించారు.  
జీవన్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ మండిపాటు
శాసనసభలో కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. నయీం ఇష్యూలో కాంగ్రెస్‌కు సంబంధం లేదా అని ప్రశ్నించారు. అసలు విషయాన్ని బయటకు తీస్తే చాలా మంది బాగోతాలు బయటకొస్తాయని మండిపడ్డారు. అంతపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని ప్రశంసించాలని.. ఇలాంటి విమర్శలు తగవని సీఎం అన్నారు.  
నయీం కేసును సిబిఐతో విచారణ జరిపాలి : విపక్షాలు 
నయీం నేరాలు, ఎన్‌కౌంటర్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో నయీంకు సంబంధాలు ఉన్నప్పుడు సిట్‌ దర్యాప్తు చాలదని జీవన్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. వెంటనే నయీం డైరీని  బయటపెట్టి, కోర్టుకు అందజేయాలని కోరారు. మరోవైపు.. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాలున్నవారి పేర్లు బయటపెట్టాలని... బిజెపి నేత చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నయీం బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో టిడిపి డిమాండ్‌ చేసింది. నయీం డైరీని బయట పెట్టడంతో పాటు, మొత్తం వ్యవహారాలపై సిబిఐతో విచారణ జరిపించాలని తెలుగుదేశం సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. నయీం డైరీలోని వివరాలన్నీ బయటపెట్టాలని సీపీఎం  ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. 
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రజలు ప్రశాంత జీవనం : రామలింగారెడ్డి 
నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పారు. నయీం బెదిరిస్తున్నాడని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సభ దృష్టికి తెచ్చారు.  చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ బదులిస్తూ... నయీంను పోలీసులు సజీవంగా పట్టుకునేందుకే ప్రయత్నించారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన్ని ఎన్‌కౌంటర్‌ చేయాల్సివచ్చిందని అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. 

20:15 - December 19, 2016
19:53 - December 19, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు సభ్యులు 2013 ఫిబ్రవరి 21న రాత్రి 7 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. 130 మందికి గాయాలయ్యాయి. ఈ కేసును ఎన్‌ఐఏ కోర్టు మూడున్నరేళ్లు విచారణ జరిపింది. నేరం కూడా రుజువుకావడంతో ఈనెల 13న న్యాయస్థానం ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో మొత్తం ఆరుమంది పాల్గొనగా..వీరిలో రియాజ్‌భత్కల్‌ పరారీలో ఉన్నాడు. దీంతో అసదుల్లా అఖ్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అఖ్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఎజాజ్‌ షేక్‌లకు ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది. తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

శ్రీవారి నిత్యన్నదానం పథకానికి రూ.కోటి విరాళం

తిరుమల : శ్రీవారి నిత్యన్నదానం పథకానికి సమర్పించిన సింగపూర్ హెలిక్స్ కంపెనీ ప్రతినిధులు రూ.కోటి విరాళం ఇచ్చారు. 

నోట్ల రద్దు, బంగారం ధరలపై రేపు నా ఆలోచనలు పంచుకుంటాం : ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : నోట్ల రద్దు, బంగారం ధరలపై రేపు తన ఆలోచనలను పంచుకుంటానని ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

 

ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ

ఢిల్లీ : ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. వార్ధా తుపాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని జయలలిత భారతరత్న ఇవ్వాలని సెల్వం కోరనున్నారు. పార్లమెంట్ లో జయలలిత కాంస్య విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. 

చెన్నైలో భారీగా నగదు, బంగారం పట్టివేత

తమిళనాడు : చెన్నైలో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రూ.10 కోట్ల పాత నోట్లు, 6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.  

 

ఈనెల 21న తిరుమలకు శ్రీలంక ప్రధాన దంపతులు

చిత్తూరు : శ్రీలంక ప్రధాన దంపతులు ఈనెల 21న తిరుమలకు రానున్నారు. 22న శ్రీలంక ప్రధాని రావిల్ విక్రమ సింఘే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీలంక ప్రధాని బస చేసే శ్రీకృష్ణ అతిథిగృహాన్ని జేఈవో శ్రీనివాసరాజు, శ్రీలంక హైకమిషన్ ప్రతినిధులు పరిశీలించారు. 

19:11 - December 19, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిలో తమ టూరిజం సేవలను విస్తృతం చేస్తున్నట్టు సదరన్‌ ట్రావెల్స్‌ ఎండీ కృష్ణమోహన్‌ అన్నారు. విజయవాడలోని బందరురోడ్డులో సదరన్‌ ట్రావెల్స్‌ నూతన కార్యాలయాన్ని ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.  అనంతరం మాట్లాడిన సదరన్‌ ట్రావెల్స్‌ ఎండీ కృష్ణమోహన్‌... ప్రతిఏటా దాదాపు లక్షమంది తమ ట్రావెల్స్‌ ద్వారా టూరిజం సేవలు పొందుతున్నారని చెప్పారు. తమ వద్దకు వచ్చిన కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించడం వల్లే తాము ఎన్నో విజయాలు సాధించగలుతున్నామన్నారు.

 

19:04 - December 19, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వెయ్యి 24 కోట్ల రూపాయలతో మండల కేంద్రాల్లో గోదాములు నిర్మించారని చెప్పారు. దీనిలో 512 కోట్లతో చేపట్టిన సివిల్‌ పనుల్లో 150 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

18:57 - December 19, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. పారదర్శకంగా దర్యాప్తు జరపాలన్నారు. అసెంబ్లీలో నయీంపై సీఎం ప్రకటన తర్వాత తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఏకపక్షంగా సభను వాయిదా వేశారని విమర్శించారు. సభను సంప్రదాయబద్దంగా నిర్వహించడంలేదని మండిపడ్డారు.

 

18:53 - December 19, 2016

హైదరాబాద్ : స్పీకర్ శాసనసభ నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఉత్తమ్ మాట్లాడారు. సభలో అధికార పార్టీకి అనుకూలంగా స్పీకర్  ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన అసెంబ్లీ అధికార పార్టీకి అడ్డాగా మారిందన్నారు. 

 

18:45 - December 19, 2016

కర్నూలు : శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ప్రమాదవశాత్తు జారిపడి దంపతులు మృతి చెందింది. మృతులు నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంట జెన్‌కోలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న క్రాంతి, అతని భార్యగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో ఈ జంట సరదాగా శ్రీశైలం ఎడమకాలువ వైపు నడుచుకుంటూ వెళ్తుండంగా ప్రమాదవశాత్తు వాటర్‌లో పడి మునిగిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిది హైదరాబాద్‌ కాగా మూడు నెలల క్రితం వీరికి వివాహం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

 

18:42 - December 19, 2016

కృష్ణా : విజయవాడలోని వేదిక ఫంక్షన్‌ హాల్‌లో మానవతావాదుల మహాసమ్మేళనం జరిగింది.. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, డాక్టర్‌ సమరంతోపాటు పలువురు హాజరయ్యారు.. వివిధ అంశాలపై ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన 14 రకాల పుస్తకాలను బుద్దప్రసాద్‌ ఆవిష్కరించారు. తెలుగునాట నాస్తిక, హేతువాద, అంబేద్కరిస్టు, బౌద్ధ ఉద్యమాల కృషి, వర్తమానం అనే అంశాలపై ఈ సదస్సులో చర్చ జరిగింది. ఆశయాల కోసం ముందుకు వెళ్లే కుటుంబాలు చాలా తక్కువని... అలాంటి కుటుంబాల్లో గోరా కుటుంబం ఒకటని విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరమని మండలి బుద్ద ప్రసాద్‌ అన్నారు. సభల్లో సభ్యుల తీరుపై ప్రజలు నేతల్ని నిలదీయాలన్నారు. అన్ని సమస్యలకు మూల కారణం నాస్తికవాదమే అని డా. సమరం అన్నారు. 'నా ఖర్మ అనుకోవడంవల్లే' ఏం చేయలేకపోతున్నారని తెలిపారు.

 

నగరంలో భద్రత కట్టుదిట్టం : జాయింట్ సీపీ

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల తీర్పు నేపథ్యంలో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశామని జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హింసాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. 

ఉరిశిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్న అడ్వకేట్

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల నిందితులకు ఎన్ ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అడ్వకేట్ మహదేవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

ఆర్మీ చీఫ్ నియామకంపై సీపీఎం పొలిట్ బ్యూరో స్పందన

ఢిల్లీ : ఆర్మీ చీఫ్ నియామకంపై సీపీఎం పొలిట్ బ్యూరో స్పందించింది. సీనియార్టీని పట్టించుకోకుండా ఆర్మీ చీఫ్ ను నియమించడం వ్యవస్థీకృత సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. మోడీ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రభుత్వ ఉద్ధేశాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు. భారత సైన్యం రాజకీయ జోక్యాలకు అతీతంగా ఉండాలని తెలిపారు. 

 

17:24 - December 19, 2016

హైదరాబాద్ : ఎన్ ఐఏ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది. పేలుళ్ల కేసులో నిందితులు అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహసిన్ అక్తర్, జియాహుల్ రెహ్మాన్, యజాజ్ షేక్ లకు ఉరిక్షి విధించింది. తుది వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. శిక్ష గురించి ఏమైనా చెబుతారా అని కోర్టు దోషులను అడుగగా .. దోషులు ఓ లేఖను సమర్పించారు. ఈ విషయంలో ఎన్ ఐఏ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు చెప్పవచ్చు. కాగా మరో నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో రాత్రి 7 గంటలకు జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయపడ్డారు. 150 మంది సాక్షులను ఎన్ ఐఏ కోర్టు విచారించింది.  157 మంది నుంచి కోర్టు రికార్డు చేసింది. 3 చార్జీషీట్లు దాఖలు చేశారు. 502 డాక్యుమెంట్లు, 201 మెటీరియల్స్ స్వాధీనం చేశారు. ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. చర్లపల్లిలోని ఎన్ ఐఏ స్పెషల్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష

హైదరాబాద్ : ఎన్ ఐఏ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

16:45 - December 19, 2016

తమిళనాడు : చెన్నై టెస్ట్‌లో టీమిండియా మరో  రికార్డ్‌ బద్దలు కొట్టింది. చెపాక్‌లో కరుణ్‌ నాయర్‌ త్రిబుల్‌ సెంచరీతో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసింది. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో టాప్‌ టెన్‌లో టీమిండియా చోటు దక్కించుకుంది. 
టీమిండియా రికార్డ్‌ల మోత 
టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా చెన్నై టెస్ట్‌లో రికార్డ్‌ల మోత మోగించింది. చెపాక్‌లో కరుణ్‌ నాయర్‌ త్రిబుల్‌ సెంచరీతో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసింది.
2009లో భారత జట్టు 726 పరుగులు  
2009లో ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 726 పరుగులు నమోదు చేసింది.దాదాపు 8ఏళ్ల తర్వాత 726 పరుగుల మార్క్‌ను భారత్‌ అధిగమించింది. కరుణ్‌ నాయర్‌ అంచనాలకు మించి అదరగొట్టడంతో భారత్‌ అనూహ్యంగా అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేయగలిగింది. ట్రిపుల్‌ సెంచరీతో రికార్డ్‌ల మోత మోగించిన కరుణ్‌ నాయర్‌...భారత్‌ను పోటీలో నిలపడం మాత్రమే కాదు 700 పరుగుల మార్క్‌ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.
చెన్నె టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 759 పరుగులు 
చెన్నె టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 759 పరుగులకు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్‌ జట్టు...టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకుంది.ఓవరాల్‌గా  టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్‌ ప్రస్తుతం 7వ స్థానానికి చేరుకుంది. 
టెస్టులు...700 పరుగుల మార్క్‌.. 4వ సారి  
ఇదే ఇన్నింగ్స్‌లో 666 పరుగుల మార్క్‌ దాటి.... చెపాక్‌లో అత్యధిక ఇన్నింగ్స్‌ టోటల్‌  స్కోర్‌ చేసిన జట్టుగా భారత్‌ రికార్డ్‌ సృష్టించింది. ఓవరాల్‌గా టెస్టుల్లో భారత జట్టు 700 పరుగుల మార్క్‌ దాటం ఇది 4వ సారి కావడం విశేషం. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియా....ట్రెడిషనల్‌ ఫార్మాట్లో మరిన్ని ప్రపంచరికార్డ్‌లు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ త్రిపుల్ సెంచరీ

చెన్నై టెస్టు : భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న ఐదో, ఆఖరి టెస్టు మ్యాచ్ లో కోహ్లీ సేన ఇంగ్లాండ్ ను చితకబాదింది. టెస్టుల్లో భారత్ అత్యధిక పరుగులు చేసింది. గతంలో 726 పరుగుల రికార్డును టీమిండియా తుడిపేసింది. భారత్ బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ త్రిపుల్ సెంచరీ చేశాడు. 

16:28 - December 19, 2016

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు మరికాసేట్లో శిక్ష ఖరారు కానుంది. చర్లపల్లి స్పెషల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని మరోసారి ఎన్ ఐఏ వాధించింది. మరిన్ని కోర్టు మరికాసేట్లో దోషులకు శిక్ష ఖరారు చేయనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

దోషులకు ఉరిశిక్ష విధించాలని కోరిన ఎన్ ఐఏ

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు మరికాసేట్లో శిక్ష ఖరారు కానుంది. చర్లపల్లి స్పెషల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని మరోసారి ఎన్ ఐఏ వాధించింది. 

16:08 - December 19, 2016

ఆదిలాబాద్ : మహాజన పాదయాత్ర 64వ రోజుకు చేరింది. కొమురంభీమ్‌ జిల్లాలో మనెక్‌గూడ, జెండాగూడ, ఆసిఫాబాద్‌ ఎక్స్‌రోడ్‌, జన్కాపూర్‌, ఈదులవాడ, బూరుగూడ, మోతుగూడ, సైర్గాం, ఎరవెల్లి, కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్ ఇందిరానగర్‌ గుండా పాదయాత్ర కొనసాగుతోంది. అడ గ్రామం వద్ద తమ్మినేని వీరభద్రం బృందం కొమరంభీమ్‌ ప్రాజెక్టును సందర్శించింది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యుడు ఎంవి.రమణ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:57 - December 19, 2016

హైదరాబాద్ : నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని టీఆర్ ఎస్ ఎమ్మేల్యే సోలిపేట రామలింగారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. నయీం బెదిరిస్తున్నాడని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సభ దృష్టికి తెచ్చారు. 

15:53 - December 19, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంకేసులో పారదర్శకంగా విచారణ కొనసాగించాలని... సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నయీం ఎన్నో దౌర్జన్యాలు చేశాడన్నారు. నయీం డైరీలోని వివరాలన్నీ బయటపెట్టాలన్నారు. నయీంతో సంబంధాలన్నవారిపైకూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

 

15:50 - December 19, 2016

హైదరాబాద్ : నయీం బాధితులకు న్యాయం చేసేందుకు వీలుగా ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీలో నాయీం కేసు అంశంపై చర్చ జరిగినప్పుడు ఆయన మాట్లాడారు. నయీం డైరీని బయట పెట్డంతోపాటు, ఇతగాడి మొత్తం వ్యవహారాలపై సీఐబీతో విచారణ జరిపించాలని సండ్ర కోరారు. 

 

15:46 - December 19, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాలున్నవారి పేర్లు బయటపెట్టాలని... బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వివరాలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నయీం ఈ స్థాయికి ఎదిగేవరకూ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని విమర్శించారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మళ్లీ ఇలాంటివారు తయారు కాకుండా చూడాలని తెలిపారు. 

 

15:42 - December 19, 2016

హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. నయీం ఇష్యూలో కాంగ్రెస్‌కు సంబంధంలేదా అని ప్రశ్నించారు. అసలు విషయాన్ని బయటకుతీస్తే చాలా బాగోతాలు బయటకొస్తాయని మండిపడ్డారు. గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు కష్టపడి అంతమొందించారని తెలిపారు. అంతపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను ఎన్‌కౌంటర్‌చేయడాన్ని ప్రశంసించాలని.. ఇలాంటి విమర్శలు తగవని సూచించారు.

 

15:37 - December 19, 2016

కరుణ్ నాయర్ తొలి డబుల్ సెంచరీ

చెన్నై : కరుణ్ నాయర్ తొలి డబుల్ సెంచరీ చేశాడు. సెంచరీని డబుల్ సెంచరీగా మలిచిన మూడో భారత బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించని భారత్ 31 వ ఆటగాడు. 

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు.. ఐదుగురు నిందితులు కోర్టులో హాజరు

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను జైలు సిబ్బంది కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఎన్ ఐఏ తరపు న్యాయవాది వాదించారు. 

 

15:28 - December 19, 2016

విజయనగరం : ఎపిలో ఉద్యోగాల విప్లవం రావాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విజయనగరంలో నిర్వహించిన యువభేరీలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఉద్యోగాల విప్లవం ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నయీం అనే పిశాచి సృష్టికర్త ఎవరు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నయీం అనే పిశాచి సృష్టికర్త ఎవరని సీఎం కేసీఆర్ అన్నారు. నయీం నేరాలన్నీ గత ప్రభుత్వాల కాలంలోనే జరిగాయన్నారు. సాంబశివుడిని నయీం ముఠా చంపేసిందన్నారు. నయీంను చీరి చింతకు కడ్తామని ఆనాడే చెప్పానని పేర్కొన్నారు. 

తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. 

నయీం కేసు సీబీఐకి అప్పగించం - కేసీఆర్..

హైదరాబాద్ : నయీం కేసును రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తారని, సీబీఐకి అప్పగించమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నయీం ఎన్ కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఈ తరుణంలో సీబీఐకి అప్పగించడం కుదరదన్నారు. చీరి చింతకు కడ్తా ఆనాడే నయీంను బహిరంగంగా తాను వ్యాఖ్యానించడం జరిగిందని కేసీఆర్ తెలిపారు.

నయీం కేసు సీబీఐకి అప్పగించాలి - జీవన్ రెడ్డి..

హైదరాబాద్ : నయీం ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ చేయించాలని టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నయీం ఎన్ కౌంటర్ పై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. నయీం అణిచివేయడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడం సంతోషంగా ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నయీంకు సృష్టికర్త ఎవరని ప్రశ్నించారు.

13:59 - December 19, 2016

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందులో ప్రముఖంగా 'అనసూయ', ‘రష్మీ' లు ఇప్పటికే వెండి తెరపై సందడి చేశారు. వీరు నటించిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి కూడా. అనసూయ పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే 'నాగార్జున’, 'సాయిధరమ్ తేజ్' లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడుతూ రెచ్చిపోతుంటే.. ఇటు 'రష్మీ' సోలో హీరోయిన్ గా దూసుకుపోతూనే స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లు అందుకోవడానికి రెడీ అయిపోతుందని సమాచారం. 'అవసరాల శ్రీనివాస్' హీరోగా తెరకెక్కుతున్న ‘బాబు బాగా బిజీ’ అనే అడల్ట్ కామెడీ సినిమాలో 'శ్రీముఖి' కీ రోల్ చేస్తోంది. తాజాగా మరో యాంకర్ కూడా వెండితెరపై కనిపించబోతోంది. ఆమెనే 'లాస్య'...అని టాక్స్ వినిస్తోంది. తన మాటలు..ఆటలతో తక్కువ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ బ్యానర్ నిర్మాణంలో నూతన దర్శకుడు కృష్ణ కిషోర్ తెరకెక్కిస్తున్న 'రాజా మీరు కేక' అనే సినిమాలో యాంకర్ 'లాస్య' కీలక పాత్ర చేస్తోందని టాక్. రేవంత్, నోయల్, హేమంత్, తారకరత్న మరియు శోభిత ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట.

 

13:58 - December 19, 2016

హైదరాబాద్ : నయీంను చీర చింతకడ్తా ఆనాడే బహిరంగంగా తాను వ్యాఖ్యానించడం జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నయీం ఎన్ కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష సభ్యులు మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఈ తరుణంలో సీబీఐకి అప్పగించడం కుదరదన్నారు. నయీంను ప్రోత్సాహించింది ఎవరు ? సాంబశివుడు పార్టీలో చేర్చుకోవడం జరిగిందని, అతని హతమారిస్తే తాను అతని ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు. నువ్వు చేసేది మేము చేయాలని అనుకుంటే చీరి చింతకడుతా అని ఆనాడు బహిరంగంగానే బెదిరించడం జరిగిందన్నారు. కేసీఆర్ బోన్ గిరి దాటుతడా అని చాలా మంది అన్నారని, అంత నేరం చేసే స్థాయి ఎవరి హాయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో నయీం అరాచకాలు సాగాయని, నయీంపై చర్యలు తీసుకోవాలని ఎంతో మంది కోరడం జరిగిందన్నారు. నయీం 2007లో కోర్టుకు హాజరు కాకుండా పోయాడని, అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఏ పార్టీ వారైనా సరే..ఏ అధికారి అయినా సరే ఉపేక్షించడం జరగదని, కఠినంగా శిక్షిస్తామన్నారు. సందర్భాన్ని..సమయాన్ని బట్టి బయటపెడుతామన్నారు. నయీం కేసులో విచారణ జరుగుతుండగా నిజాలు ఎలా బయటపెట్టాలని కేసీఆర్ తెలిపారు.

13:56 - December 19, 2016

హైదరాబాద్ : చింతల ఎవరు..ఉత్తమ్ ఎవరు..ఆయన ఎందుకు సీఎం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా ? బీజేపీ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యలకు ఇతర సభ్యులు నవ్వుకున్నారు. సోమవారం నాడు ప్రారంభమైన శాసనసభలో మధ్యాహ్నం నయీం ఎన్ కౌంటర్ ఘటనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడారు. దీనిపై ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడరని, గతంలో తాము ఫిర్యాదు చేయడం జరిగిందని తెలపినట్లు పేర్కొన్నారు. సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారని చింతల వ్యాఖ్యానిస్తూ నాలుక కర్చుకున్నారు. ఉత్తమ్ సీఎం కావాలని గడ్డం పెంచుకుంటున్నారని, సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారంటూ చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో వీడియోలో చూడండి.

13:41 - December 19, 2016

హైదరాబాద్ : నయీం ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ చేయించాలని టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నయీం ఎన్ కౌంటర్ పై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. నయీం అణిచివేయడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడం సంతోషంగా ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నయీంకు సృష్టికర్త ఎవరని ప్రశ్నించారు. నేరాలు చేసిన తరువాత బయటకు రావడం..వచ్చిన అనంతరం ఎలాంటి సామ్రాజ్యం సృష్టించాడో అందరికీ తెలిసిందేనన్నారు. వ్యాస్ లాంటి పోలీసు ఆఫీసర్ హత్యోదంతంలో ఉన్న నయీం న్యాయస్థానం నుండి ఎలా తప్పించుకోగలిగాడని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకుని నయీం సామ్రాజ్యాన్ని విస్తరింప చేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. 99-2004 మధ్య కాలంలో పాలనలో ఉన్న టిడిపి మంత్రివర్గ సభ్యులుగా ఉన్న వారు మీ కేబినెట్ లో ఉన్నారని, వాళ్లు వీరు కాదా ? అని ప్రశ్నించారు. 2015లో ఇమామ్ గూడ ఫంక్షన్ హాల్ జరిగిన ఓ ఫంక్షన్ ఆర్గనైజింగ్ చేశాడని, ఇక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఏ రాజకీయ నాయకుడు, ఏ పోలీసు ఆఫీసర్ హాజరయ్యారో తెలవదా అని తెలిపారు. కుటుంబసభ్యులను పట్టుకుని వచ్చి స్టేషన్ లో కూర్చొబెట్టారని, నయీంకు సన్నిహితంగా ఎంతోమంది ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులున్నట్లు వార్తలొచ్చాయన్నారు. ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణతో ఇది సాధ్యం కాదని, సీబీఐచే విచారణ చేయించాలని మరోసారి డిమాండ్ చేశారు. నయీం అక్రమాస్తుల చిట్టా బయటకు రావాలి...నయీం డైరీ, కంప్యూటర్, ల్యాప్ ట్యాప్ లోని అంశాలు బహిర్గతం చేయాలి. కోర్టులో సమర్పించాలి...శేషన్న ఎక్కడ ? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

పటాన్ కోట్ దాడిపై ఎన్ఐఏ ఛార్జీషీట్ దాఖలు..

ఢిల్లీ : పటాన్ కోట్ దాడి కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసింది. జైషే మహమ్మద్ అగ్రనేత అజహర్ సహా ఇతరులపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.

13:39 - December 19, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. సోమవారం మూడో రోజు శాసనసభా సమావేశాలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు నయీం ఎన్ కౌంటర్ పై చర్చ ప్రారంభమైంది. దీనిపై కేసీఆర్ ప్రకటన చేశారు. నయీం అరాచకాలకు ఎంతో మంది బలయ్యారని, నయీం నేర చర్యలను కొనసాగించాడని తెలిపారు. అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని నయీం బాధితులు మొర పెట్టుకున్నారని, దీనితో నయీంను కఠినంగా అణిచివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పోలీసు శాఖకు సంబంధిత ఆదేశాలు జారీ చేసిందన్నారు. అనంతరం పోలీసులు నయీం కదలికలపై నిరంతర నిఘా పెట్టారని, షాద్ నగర్ లోని మారణాయుధాలతో నయీం సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. జరిగిన ఎన్ కౌంటర్ లో నయీం హతమయ్యాడడని పేర్కొన్నారు. నేరాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం సిట్ ను నియమించడం జరిగిందని, సిట్ నేతృత్వంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 174 కేసులు నమోదయ్యాయని, 741 మంది సాక్షులను విచారించారన్నారు. 124 మంది నిందితులను అరెస్టు చేసినట్లు, పోలీసులు 21 తుపాకులు, 21 కార్లు, 26 ద్విచక్రవాహనాలు, 2.95 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 27 హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. నయీం ముఠాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించడం జరిగిందని, రెండు ఛార్జీషీట్లు కోర్టులో సమర్పించడం జరిగిందన్నారు. 15 ఛార్జీషీట్లు దాఖలు చేయాల్సినవసరం ఉందని, ప్రస్తుతం దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కేసీఆర్ వెల్లడించారు.

అసెంబ్లీలో నయీం ఎన్ కౌంటర్ పై చర్చ..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. సోమవారం మూడో రోజు శాసనసభా సమావేశాలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు నయీం ఎన్ కౌంటర్ పై చర్చ ప్రారంభమైంది. దీనిపై కేసీఆర్ ప్రకటన చేశారు. నయీం అరాచకాలకు ఎంతో మంది బలయ్యారని, నయీం నేర చర్యలను కొనసాగించాడని తెలిపారు. అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని నయీం బాధితులు మొర పెట్టుకున్నారని, దీనితో నయీంను కఠినంగా అణిచివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పోలీసు శాఖకు సంబంధిత ఆదేశాలు జారీ చేసిందన్నారు.

13:37 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పలు విమర్శలు గుప్పించారు. పేదల ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కడ ? అని ప్రశ్నించారు. నిమ్స్ ఉంది డబ్బులున్న ధనికుల కోసమా ? పేదల కోసమా ? అని ప్రశ్నించారు. మూడో రోజు సోమవారం శాసనసభ సమావేశాలు కొనసాగాయి. టీ బ్రేక్ అనంతరం ఆయన మీడియా పాయింట్ లో మాట్లాడారు. కల్వకుర్తిలో మెడికల్ లో 40 పోస్టులు ఉంటే కేవలం 15 శాతం భర్తీ చేశారని...22 ఖాళీలుంటే ముగ్గురు డిప్యూటైషన్ పై ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. తమ హాయాంలో ఏర్పాటైన పీహెచ్ సీలను కనీసం ప్రారంభోత్సవం కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లిలో రూ. 57 లక్షలతో పీహెచ్ సీ..రంగారెడ్డి ఆమన్ గల్, కర్తాన్ మండలం మైసీగండిలో రూ. 57 లక్షలతో ఆసుపత్రి నిర్మించడం జరిగిందని తెలిపారు. రెండు పీహెచ్ సీలను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ వారు తీసుకోవడం లేదన్నారు. తీసుకుంటే వైద్యులు నియమించాల్సి ఉంటుందని, మందులను సరఫరా చేయాల్సి ఉంటుందని కనుకే తీసుకోవడం లేదన్నారు.

ఢిల్లీకి చేరుకున్న పన్నీర్ సెల్వం..

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దేశ రాజధాని హస్తినకు చేరుకున్నారు. సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పన్నీర్ సమావేశం కానున్నారు.

13:35 - December 19, 2016

ఢిల్లీ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దేశ రాజధాని హస్తినకు చేరుకున్నారు. సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పన్నీర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ప్రధాని దృష్టికి పన్నీర్ సెల్వం తేనున్నారు. వర్ధా తుపాన్ తో రాష్ట్రం అతలాకుతలమైందని, రూ. వేయి కోట్లు సహాయం చేయాలని పన్నీర్ కోరనున్నారు. గతంలో రూ. వేయి కోట్లు సహాయం అందించాలని లేఖలో కోరినా కేంద్రం స్పందించకపోవడంతో విపక్షాలు పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే మృతి చెందిన ముఖ్యమంత్రి జయకు భారత రత్న బిరుదు ఇవ్వాలని మోడీకి ఆయన విజ్ఞాపన పత్రాన్ని అందించనున్నారు. అంతేగాకుండా పార్లమెంట్ లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని పన్నీర్ సెల్వం కోరనున్నారు. జయ మృతి అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూడా పన్నీర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

13:35 - December 19, 2016

జానా, అక్బరుద్దీన్ వాకౌట్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆదాయం..బడ్జెట్ పై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటెల సరిగ్గా సమాధానం చెప్పలేదని, అంతా గందరగోళంగా ఉందని పేర్కొంటూ టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు.

13:33 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆదాయం..బడ్జెట్ పై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటెల సరిగ్గా సమాధానం చెప్పలేదని, అంతా గందరగోళంగా ఉందని పేర్కొంటూ టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. మూడో రోజు సోమవారం సమావేశాలు కొనసాగాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఈటెల సమాధానం చెప్పారు. ఆదాయం 22 శాతం..స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 56 శాతం పెరిగిందన్నారు. రుణమాఫీ మూడో విడతలో రూ. 4086 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. రెవెన్యూ రీసెట్స్ లో 13 శాతం గ్రౌత్ ఉందన్నారు. నోట్ల రద్దు వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఆర్థిక లోటును కేంద్రం గట్టెక్కిస్తుందని నమ్మకం ఉందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. దీనిపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు రాష్ట్రానికి ఒరిగిందేమిటీ అని సూటీగా ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్కాలర్ షిప్ విషయంలో ప్రభుత్వం స్పందించం లేదని, ఆసరా ఫించన్లు రావడం లేదని అంతా సమాధానం గందరగోళంగా ఉందన్నారు. 2016-17 సంవత్సరానికి మైనార్టీ నిధులు ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. దీనికి నిరసనగా నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేస్తున్నట్లు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. మంత్రి సమాధానికి నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ తరపున తాను వాకౌట్ చేస్తున్నట్లు జానారెడ్డి వెల్లడించారు.

తణుకు ఎస్ బీఐ మెయిన్ బ్రాంచ్ ఏజీఎం సస్పెన్షన్..

పశ్చిమగోదావరి : తణుకు ఎస్ బీఐ మెయిన్ బ్రాంచ్ ఏజీఎం ను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. నోట్ల మార్పిడిలో అవకతవకలకు పాల్పడ్డారని ఏజీఎం కృష్ణారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

13:31 - December 19, 2016

హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయాలని టి.కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కోరికపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మూడో రోజు సోమవారం సమావేశాలు కొనసాగాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో నల్గొండ జిల్లాలో బత్తాయి ఎక్కువగా పండుతుందని, ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బత్తాయి మార్కెట్ కోసం 15 ఎకరాల భూమి కేటాయించడం జరిగిందని, ఆధునిక సౌకర్యాలతో మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్థలం దొరక్కపోవడం వల్ల ఆలస్యమైందని, ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బత్తాయి మార్కెట్ లో ఎలాంటి సదుపాయాలు ఉండాలనే దానిపై మహారాష్ట్రకు తమ అధికారులు వెళ్లి చూసివచ్చారని తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని మంత్రి హరీష్ సభకు పేర్కొన్నారు.

కరుణ్ నాయర్ సెంచరీ..

చెన్నై : భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 435 పరుగుల వద్ద మురళి విజయ్ (29) ఔటయ్యాడు. మరోవైపు కరుణ్ నాయర్ సెంచరీ నమోదు చేశాడు. టెస్టు కెరీర్ లో నాయర్ తొలి సెంచరీ చేశాడు.

13:29 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మూడో రోజు కొనసాగింది. సభలో ఎంసెట్ లీక్ పై చర్చ జరిగింది. లీక్ లో రూ. 100 కోట్ల కుంభకోణం జరిగిందని టి.కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సీఐడీ విచారణ సరిగ్గా లేదని కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం భవిష్యత్ బాగుంటుందని విద్యార్థులు భావించారని కానీ ఎంసెట్ రెండుసార్లు లీక్ కావడంతో విద్యార్థులు మానసికంగా బాధ పడ్డారని కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. వంద కోట్ల కుంభకోణం జరిగిందని, ఇంత స్కాంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలేదని స్పష్టం చేశారు. దీనిపై సీఐడీ విచారణ జరుగుతోందని, నివేదిక అందిన అనంతరం చర్యలుంటాయన్నారు. తప్పు చేసిన వారిలో ఎంతటి పెద్దవారున్నా శిక్షిస్తామని పేర్కొన్నారు. సీఐడీ నివేదిక అందిన తరువాత ప్రభుత్వం తీసుకొనే చర్యలపై విపక్షాలకు ఏదైనా సందేహాలుంటే నిర్ణయం తీసుకుంటామని మంత్రి కడియం పేర్కొన్నారు.

మండలి నుండి కాంగ్రెస్ వాకౌట్..

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి నుండి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఎంసెట్ లీకేజ్ పై సర్కార్ వివరణ సరిగ్గా లేదని కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

13:14 - December 19, 2016

గోదాంల నిర్మాణాలపై విపక్షాల ప్రశ్నలు..

హైదరాబాద్ : రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం మూడో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గోదాంల నిర్మాణాలపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రం ఏర్పడకముందుకు 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు ఉండేవని, నిల్వ చేయడానికి అనుకూలంగా లేవన్నారు.

నిమ్స్ లో ఎలాంటి అవినీతి జరగలేదు - మంత్రి లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 'నిమ్స్'ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, ఎలాంటి అవినీతి జరగలేదని రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మూడో రోజు జరిగిన శాసనసభ సమావేశాల్లో నిమ్స్ పై విపక్షాలు పలు ప్రశ్నలు వేశాయి. దీనిపై మంత్రి సమాధానం ఇచ్చారు.

 

ఇబ్బందికర పరిస్థితులు - సంపత్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన నిమ్స్ లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ పేర్కొన్నారు.

నిమ్స్ పై విపక్షాల ప్రశ్నలు..

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి..అక్రమాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. సోమవారం మూడో రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అంతకంటే ముందు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. ఉపాధి హామీ కూలీల నిధులు విడుదల చేయాలని సీపీఎం..రైతు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధరపై బీజేపీ వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టింది. నిమ్స్ పై విపక్ష సభ్యులు మాట్లాడారు.

13:09 - December 19, 2016

ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సామాజిక న్యాయం సాధన కోసం తమ్మినేని చేపట్టిన మహా పాదయాత్ర కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇంటింటికి మంచినీరు ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జిల్లాలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రతి మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. దీంతో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లోపించిందని పాదయాత్ర బృందం సభ్యురాలు, శ్రామిక మహిళా నేత ఎస్‌ రమ అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. రాష్ట్రంలో కనీసం మంచినీటి సదుపాయం లేని గ్రామాల్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె దుయ్యబట్టారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహా పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. 63వ రోజు పాదయాత్ర ఆదిలాబాద్‌ జిల్లాలో బూసిమెట్ల క్యాంప్‌, ఘాట్‌రోడ్డు, కేస్లాగూడ, కెరామెరీ, ఝరీ, తుర్దాపూర్‌, దనోరా, శివగూడా, గోయగాం, అంబరావుగూడ, కొలాన్‌కొఠారీ, అడ గ్రామాల్లో పర్యటించింది. ఏజేన్సీ, గిరిజన గూడేల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది.

13:03 - December 19, 2016

హైదరాబాద్ : రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోమవారం మూడో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గోదాంల నిర్మానాలపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాష్ట్రం ఏర్పడకముందుకు 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు ఉండేవని, నిల్వ చేయడానికి అనుకూలంగా లేవన్నారు. లేదన్నారు. గోదాంల కొరత వల్ల ఇబ్బందులు తలెత్తవద్దని ప్రతి మండల కేంద్రాల్లో గోదాంలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ. 1024 కోట్లతో అన్ని మండలాల్లో గోదాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కేంద్రం నుండి నిధులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, గ్రామీణ భండారీ యోజన కింద కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి వచ్చిన సమయంలో కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ కు సమస్య తెలియచేయడం జరిగిందన్నారు. దాదాపు రూ. 400 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో గోదాంలకు కేంద్రం సహాయం ఇచ్చే అవకాశం ఉందని మంత్రి హరీష్ సభకు తెలిపారు.

13:02 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష సభ్యులు మెచ్చుకున్నారు. అంతేకాదు అభినందించారు కూడా. ఎవరా నేతలు అనుకుంటున్నారా ? ఎప్పుడూ కేసీఆర్..హరీష్ రావు..కేటీఆర్ లపై విరుచకపడే రేవంత్..ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించే టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమవారం మూడో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తారాలను చేపట్టారు. గోదాంల విషయంపై విపక్ష సభ్యులు మాట్లాడారు. 330 గోదాంలకు పై కప్పులు..ఇతరత్రా సరఫరాకు టెండర్లు పిలిచారా. ? లేక నామినేషన్ ద్వారా పిలిచారా అని టిడిపి సభ్యుడు రేవంత్ ప్రశ్నించారు. నామినేషన్ ద్వారా పిలిస్తే కంపెనీ వివరాలు చెప్పాలని కోరారు. గోదాంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. గోదాంల నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయం అభినందనీయమని టి.కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో బత్తాయి పండుతుందని, బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీనిచ్చారని మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించాలని కోరారు.

13:01 - December 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 'నిమ్స్'ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, ఎలాంటి అవినీతి జరగలేదని రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మూడో రోజు జరిగిన శాసనసభ సమావేశాల్లో నిమ్స్ పై విపక్షాలు పలు ప్రశ్నలు వేశాయి. దీనిపై మంత్రి సమాధానం ఇచ్చారు. నిమ్స్ లో జరిగిన అవినీతి..ఆక్రమాలపై ఏసీబీ ఛార్జీషీట్ లను దాఖలు చేయడం జరిగిందన్నారు. కోర్టులో కేసు విచారణ ఉంది కనుకే తాను అలా సమాధానం చెప్పాల్సి వచ్చిందన్నారు. నిమ్స్ లో ఎమర్జెన్సీ బెడ్లు 40 నుండి 100కు పెంచామని, 1140 నుండి 1500 బెడ్స్ పెంచడం జరిగిందన్నారు. 47 కోట్లతో ఆధునీకరణ చేపట్టడం, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలు 10 కోట్లతో స్పెషల్ రూంలు, మూలకణాల పరిశోధన భవనాల ఏర్పాటు..2 కోట్లతో కొత్త పర్నీచర్ కొనడం జరిగిందన్నారు. నెఫ్రాలజీ టవర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు, మొత్తం 10 పోస్టులు రావడం జరిగిందన్నారు. 43 సీట్ల కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు. నోటిఫికేషన్ ద్వారా పలువురిని తీసుకోవడం జరిగిందని, 100 మంది స్టాఫ్ నర్స్ గా నియమించినట్లు తెలిపారు. పలువురికి ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు. ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నట్లు, ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

13:00 - December 19, 2016

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి..అక్రమాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. సోమవారం మూడో రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అంతకంటే ముందు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. ఉపాధి హామీ కూలీల నిధులు విడుదల చేయాలని సీపీఎం..రైతు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధరపై బీజేపీ వాయిదా తీర్మానాలు ప్రవేశ పెట్టింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టింది. నిమ్స్ పై విపక్ష సభ్యులు మాట్లాడారు.

ఇబ్బందికర పరిస్థితులు - సంపత్..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన నిమ్స్ లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్ లలో ..టేబుళ్లలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల మచ్చ ఏర్పడే అవకాశం ఉందన్నారు. టెండర్ల ప్రక్రియలో లోపాలు వచ్చాయి కనుక వైద్య శాఖను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోకపోవడం బాధాకరం - రామ్మోహన్ రెడ్డి..నాణ్యమైన సేవలందించే ఆసుపత్రుల్లో ఒక్కటైన నిమ్స్ లో అవినీతి జరగడం, మంత్రి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధకరమని కాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్కు పెద్ద ఎత్తున్న నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో నిమ్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఎయిమ్స్ ఏర్పాటు చేయాలి - వంశీచంద్ రెడ్డి...
బీబీనగర్ లో నిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించి నిధులు కేటాయించడం జరిగిందని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. నిమ్స్ ను ఏయిమ్స్ గా అప్ గ్రేడ్ గా చేయాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారని, ఇలా చేయడం వల్ల వివిధ సౌలభ్యాలు..సౌకర్యాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన భూమి ఉంటే ఎయిమ్స్ వస్తుందని, నిమ్స్ లో రిటైర్డ్ అయిన వారిస్థానంలో పోస్టులను భర్తీ చేయడం లేదనే మాటలు వినిపిస్తున్నాయన్నారు. నిమ్స్ లో శ్రమ దోపిడి జరుగుతోందన్నారు.

11:17 - December 19, 2016

హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించింది. అక్కడే మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట..వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు లాక్కొని వెళ్లారు. వ్యాన్ లలో పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

09:45 - December 19, 2016

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో తుదితీర్పు వెలువడనుంది. దీనితో ఉత్కంఠ నెలకొంది. ఐదుగురు దోషులకు ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు శిక్షను ఖరారుచేయనుంది. ఈ కేసును ఎన్‌ఐఏ కోర్టు మూడున్నరేళ్లు విచారణ జరిపింది. నేరం కూడా రుజువుకావడంతో ఈనెల 13న న్యాయస్థానం ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో మొత్తం ఆరుమంది పాల్గొనగా.... వీరిలో రియాజ్‌భత్కల్‌ మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో అసదుల్లా అఖ్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అఖ్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఎజాజ్‌షేక్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నిందితులుగా తేల్చింది. ఈ ఐదుగురు దోషులకు మరణశిక్ష లేదా.. యావజ్జీవ కారాగార శిక్షపడే అవకాశముంది.

ఆనాడు ఏం జరిగింది ?
2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. దీనికి ఇండియన్ ముజాహుద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సూత్రధారిని ఎన్ఐఏ నిర్ధారించింది. అసదుల్లా అక్తర్ వికాస్, తెహసీన్ అక్తర్, ఐజాక్ షేక్, యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ లు ఈ ఘటనలో కీలకపాత్ర పోషించారని ఎన్ఐఏ నిర్ధారించింది. ఇప్పుడు వీళ్లంతా చర్లపల్లి జైలు లో ఉండగా రియాజ్ భత్కల్ ఒక్కడే పరారీలో ఉన్నాడు.

విచారణ క్రమం..

 • ఫిబ్రవరి 21, 2013న సాయంత్రం 7 గంటలకు జరిగిన ఘటన.
 • పేలుళ్లలో 18 మంది మృతి. 131 మందికి గాయాలు.
 • రంగంలోకి దిగిన ఎన్ఐఏ.
 • ఇండియన్ ముజాహిదీన్ కారణమని తేల్చిన దర్యాప్తు సంస్థ.
 • మూడేళ్ల పాటు కొనసాగిన విచారణ.
 • 157 మంది సాక్షుల స్టేట్ మెంట్ నమోదు.
 • 502 కీలకమైన డాక్యుమెంట్ ల సేకరణ.
 • ఈ కేసులో మూడు ఛార్జ్ షీట్ దాఖలు.
 • ఏ1 రియాజ్ భత్కల్, ఏ2 అసదుల్లా అక్తర్, ఏ3 అక్తర్ అలియాస్ మోను, ఏ4 వకాస్, ఏ5 యాసిన్ భక్తల్, ఏ6 ఎజాజ్ తో పాటు మరికొందరి పేర్లు.
 • నిందితులపై ఐపిసి 302, 307, 324, 326, 316, 121, 121ఏ, 201 రెడ్ విత్ 120బి సెక్షన్ల కింద కేస్ నమోదు.
 • దేశద్రోహం ప్రకారం . 18,19, 20, 38(2), 39,(2 ) సెక్షన్ పై ఎన్ఐఎ అభియోగ పత్రం దాఖలు.
 • భద్రత కారణాల దృష్ట్యా చర్లపల్లి జైల్లోనే కోర్ట్ ఏర్పాటు – అక్కడే విచారణ.
09:12 - December 19, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు దోషులకు ఇవాళ శిక్ష ఖరారుకానుంది. ఐదుగురు దోషులకు ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు శిక్షను ఖరారుచేయనుంది. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు సభ్యులు 2013 ఫిబ్రవరి 21న పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ కేసును ఎన్‌ఐఏ కోర్టు మూడున్నరేళ్లు విచారణ జరిపింది. నేరం కూడా రుజువుకావడంతో ఈనెల 13న న్యాయస్థానం ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో మొత్తం ఆరుమంది పాల్గొనగా.... వీరిలో రియాజ్‌భత్కల్‌ మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో అసదుల్లా అఖ్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అఖ్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఎజాజ్‌షేక్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం నిందితులుగా తేల్చింది. ఈ ఐదుగురు దోషులకు మరణశిక్ష లేదా.. యావజ్జీవ కారాగార శిక్షపడే అవకాశముంది.

09:11 - December 19, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ శీతకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉభయసభల్లో జరిగే షెడ్యూల్ ఇలా ఉంది..శాసనసభలో ఉదయం 10 నుండి 11.30 వరకు ప్రశ్నోత్తరాలు..11.30 నుండి 12 గంటల వరకు జీవరో అవర్, ఇటీవలే మృతి చెందిన రాజకీయ నేతలు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు..ఇటీవలే మృతి చెందిన తమిళనాడు సీఎం జయలలిత, మాజీ ఎమ్మెల్యేలలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు గ్యాంగ్ స్టర్ నయీం, అతని అనుచరుల నేర కార్యకలాపాలపై చర్చ. దీనిపై విపక్షాలు, స్వపక్షం మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలను ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు శాసనమండలిలో...ఉదయం శాసనసభలో ఉదయం 10 నుండి 11.30 వరకు ప్రశ్నోత్తరాలు..11.30 నుండి 12 గంటల వరకు జీవరో అవర్, సంతాప తీర్మానాలు..ఇటీవలే మృతి చెందిన తమిళనాడు సీఎం జయలలిత..మాజీ ఎమ్మెల్సీ మల్ కుద్ మాణిక్ రావల మృతికి సభ సంతాపం తెలుపనుంది. మధ్యాహ్నం 12గంటలకు టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాలపై లఘు చర్చ జరగనుంది.

సీబీఐ ఎంక్వయిరీ జరపాలి - సంపత్..
నయీం ఎన్ కౌంటర్ పై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేశారు. ప్రతి రోజు ప్రతి ఒక్కో సమస్యపై వాయిదా తీర్మానాలు ఇవ్వాలని అనుకోవడం జరిగిందని తెలిపారు. సోమవారం ఉదయం మీడియా పాయింట్ వద్ద టెన్ టివితో ఆయన మాట్లాడారు. నయీం ఎన్ కౌంటర్ పై ప్రధానంగా చర్చిస్తామని, పెద్ద పెద్ద తిమింగలాలు ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు ఇందులో ఉన్నారని మీడియా కోడై కూస్తోందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని, ఎన్ కౌంటర్ డబ్బు అనంతరం డబ్బులు ఎక్కడ పోయాయి ? ఆస్తులను ఎంత స్వాధీనం చేసుకున్నాయో అనే దానిపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేస్తామని స్ఫష్టం చేస్తామన్నారు.

08:57 - December 19, 2016

ఢిల్లీ : ఉత్తర భారతదేశం చలితో గజగజలాడుతోంది. జమ్మూ కాశ్మీర్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లేహ్ లో మైనస్ 9 డిగ్రీల ఉష్ణోగ్రత, జమ్మూ కాశ్మీర్ లో మైనస్ 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జలాశయాలు, నదులు గడ్డకడుతున్నాయి. దీనితో నీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉంది. భారీగా పొగమంచు కమ్ముకోవడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. సమీపంలో ఏముందో కనిపించకపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు ప్రభావం విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

 

08:47 - December 19, 2016

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై బీజేపీ మహిళా యువ మోర్చా ఉపాధ్యక్షులు పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఆమె పాల్గొని పలు విమర్శలు గుప్పించారు. గత కొన్ని రోజులుగా 'పవన్' పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై టెన్ టివిలో చర్చ జరిగింది. ఏదో ఒకటి నిర్ణయించుకుని వస్తున్నారని..రెండు కాళ్లపై నిలబడితే మునిగిపోతాడని వ్యాఖ్యానించారు. జాతీయ గీతం ఆలపించే సమయంలో నిలబడాలనే విషయం తెలిసిందే కదా అని తెలిపారు. రోహిత్ వేముల అంశాన్ని మరలా తెరపైకి తీసుకరావాలని పవన్ చూస్తున్నారని విమర్శించారు. దేశభక్తి..దేశ జెండాను అవమానపరిస్తే కఠినంగా శిక్షించాలని చట్టంలో ఉందన్నారు. పవన్ కు నిలకడ లేదూ అంటు విమర్శలు గుప్పించారు. ఇంకా ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేశారో వీడియో క్లిక్ చేయండి.

08:46 - December 19, 2016

శరీరం ధృడత్వంగా ఉండలంటే ఏం చేయాలి ? ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కొవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ధృడమైన శరీరం గల వారు ఎలాంటి రోగాలనైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. పండ్లు..తాజా కూరగయాలు..విటమిన్స్ తో కూడిన భోజనం తీసుకుంటూ ఉండాలి. శరీరం ధృడంగా ఉండేందుకు వివిధ ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా 'రాగులు'. వివిధ రోగాలకు రాగులు బాగా పనిచేస్తాయి. రాగి మాల్ట్ ను రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో కలిపి తాగాల్సి ఉంటుంది. మొలకెత్తిన ధ్యానపు పిండిని రాగి మాల్ట్ అంటారు. రాగులని నీళ్లలో నానబెట్టి నాలుగు గంటల అనంతరం తరువాత తీయాలి. అనంతరం ఓ బట్టలో వేసి మూటగట్టి దీనిపై బరువు ప పెట్టాలి. రెండు, మూడు రోజుల తరువాత చిన్న చిన్న మొక్కలొస్తాయి. మొలకలొచ్చిన తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత నూనె వేయకుండానే దోరగా వేయించాలి. వేగిన రాగులని మర పట్టించాలి. ఈ పిండినే రాగి మాల్ట్ అంటారు.

08:45 - December 19, 2016

'అమ్మడు..లెట్స్ డు కుమ్ముడు'..అంటూ 'చిరు' అభిమానులను ఉర్రూతలూగించనున్నాడు. ఆయన నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150’ సినిమా సాంగ్ ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటలో వెరైటీ డ్రెస్ లో 'చిరు' కనిపిస్తున్నాడు. ఈ పాటను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ స్వయంగా రచించి గాత్రం అందించాడు. ఈనెల 25వ తేదీ. చిత్ర ఆడియో, కొత్త ఏడాది జనవరి తొలి వారంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో వచ్చిన 'కత్తి'కి రీమెక్. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షక్షకుల ముందుకు రానుంది.
కొన్ని సంవత్సరాల తరువాత మెగా స్టార్ 'చిరంజీవి' వెండి తెరపై కనిపించబోతున్నాడు. దీనిపై సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి డ్యాన్స్..ఫైట్స్ ఉంటాయోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే పోస్టర్స్..టీజర్స్ విడుదలయ్యాయి. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

 

08:42 - December 19, 2016

పవన్ కళ్యాణ్ ట్వీట్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన మరో ప్రశ్న సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన ట్వీట్ చేశారు. ఇందులో స్పెషల్ తప్ప ఏమి లేదని ఘాటుగా విమర్శించారు. మరోవైపు ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ఈసీ వ్యాఖ్యలు..నది జలాల వివాదాల పరిష్కారానికై శాశ్వత ట్రిబ్యునల్... టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తులసీరెడ్డి (ఏపీ పీసీసీ), దినకర్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), తిరుమల్ పెద్దమ్మ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

08:12 - December 19, 2016

పవన్ కళ్యాణ్ ట్వీట్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన మరో ప్రశ్న సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన ట్వీట్ చేశారు. ఇందులో స్పెషల్ తప్ప ఏమి లేదని ఘాటుగా విమర్శించారు. మరోవైపు ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ఈసీ వ్యాఖ్యలు..నది జలాల వివాదాల పరిష్కారానికై శాశ్వత ట్రిబ్యునల్... టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తులసీరెడ్డి (ఏపీ పీసీసీ), దినకర్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), తిరుమల్ పెద్దమ్మ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:59 - December 19, 2016

తెలంగాణ చేనేత కార్మికులు మరోసారి ఉద్యమబాట పట్టారు. ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ ఇందిరాపార్క్ వందలాది మగ్గాలతో నిరసనోద్యమం చేపడుతున్నారు. చేనేత కార్మికుల తాజా ఆందోళనకు కారణం ఏమిటి? తెలంగాణ చేనేత కార్మికులు ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? తెలంగాణలో చేనేత పట్ల ప్రభుత్వ విధానాలు ఎలా వున్నాయి? ప్రభుత్వ విధానాల్లో రావాల్సిన మార్పులేమిటి? అసలు చేనేత రంగానికి భవిష్యత్ వుందా? ఈ అంశంపై జనపథంలో తెలంగాణ చేనేత సంఘాల జెఏసి కన్వీనర్ కూరపాటి రమేష్, కో కన్వీనర్ చిక్కా దేవదాసు విశ్లేషించారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

07:41 - December 19, 2016

ఇంగ్లండ్ భారీ స్కోరుకు టీమిండియా ఏమాత్రం బెద‌ర‌లేదు. కెప్టెన్ కోహ్లీ నిరాశపరిచినా... ఓపెనర్ కేఎల్ రాహుల్ వీరవిహారంతో మూడో రోజు భారత్ ఆధిపత్యం కనిపించింది. ఉద్వేగంతో రాహుల్ తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా... ముగిసే నాటికి భారత్‌ 4 వికెట్లకు 391 ప‌రుగులు చేసింది. చెపాక్‌లో భారత్‌ ఇంగ్లాండ్‌కు దీటుగా బదులిస్తోంది. యువ ఓపెన‌ర్ లోకేష్ రాహుల్ ఒక్క ప‌రుగుతో కెరీర్‌లో డ‌బుల్ సెంచ‌రీ మిస్సయినా.. టీమ్‌ను మాత్రం పటిష్ట స్థితిలో నిలిపాడు. అత‌నికి వికెట్ కీపర్ పార్థివ్ ప‌టేల్, మ‌రో యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ మంచి స‌హ‌కారం అందించ‌డంతో మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల‌కు 391 ప‌రుగులు చేసింది.

లంచ్ సమయానికి..
ప్రస్తుతం క‌రుణ్ నాయ‌ర్ 71, విజ‌య్ 17 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకా 86 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ పుజారా 16, మెన్‌ ఇన్ ఫామ్, కెప్టెన్ కోహ్లి 15 నిరాశపరిచారు. 60 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన టీమిండియాకు ఓపెన‌ర్లు రాహుల్‌, పార్థివ్ ప‌టేల్ సెంచ‌రీ ఓపెనింగ్ పార్ట్‌న‌ర్‌షిప్ అందించారు. తొలి వికెట్‌కు 152 ప‌రుగులు జోడించిన త‌ర్వాత‌.. పార్థివ్ ఔట‌య్యాడు. దీంతో లంచ్ స‌మ‌యానికి భార‌త్‌.. వికెట్ న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది.

భారత్ పై చేయి..
లంచ్ త‌ర్వాత కాసేప‌టికే రాహుల్ టెస్టుల్లో నాలుగో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంట‌నే పుజారా, కోహ్లి త‌క్కువ వ్యవ‌ధిలోనే వెనుదిర‌గ‌డంతో మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. అయితే కాసేపట్లోనే రాహుల్‌తో, యువ బ్యాట్స్‌మ‌న్ క‌రుణ్ నాయ‌ర్ జ‌త క‌లిసి కుక్ సేన ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ఈ ఇద్దరూ క‌లిసి ఐదో వికెట్‌కు 161 ప‌రుగులు జోడించ‌డంతో టీమిండియా ప‌టిష్ఠ స్థితికి చేరింది. ఈ క్రమంలో మంచి ఊపు మీదున్న రాహుల్ డ‌బుల్ సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. ఉద్వేగంతో చివ‌రికి ఒక్క ప‌రుగు దూరంలో ఉండ‌గా ర‌షీద్ బౌలింగ్‌లో బ‌ట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తమ్మీద మూడో రోజు ఆటలో భారత్‌ పైచేయి సాధించింది.

07:35 - December 19, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ యమపురికి షార్ట్ కట్‌గా మారుతోంది. ఒక్కసారి రింగ్‌రోడ్‌ ఎక్కాక గమ్యస్థానికి చేరుతామా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జంటనగరాలకు మెడలో మణిహారంలా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్‌రోడ్డు నిత్యం ప్రమాదాలతో నెత్తురోడుతోంది. పోలీసుల పర్యవేక్షణలోపం, వాహనచోదకులు మితిమీరిన వేగం..వెరసి ప్రాణాలు బలితీసుకుంటోంది. హడలెత్తిస్తున్న అవుటర్‌ రింగ్‌రోడ్‌ ప్రమాదాలపై 10టీవీ ప్రత్యేక కథనం..! గ్రేటర్‌ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై తరచూ ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయ. హైటెక్‌ హంగులతో నిర్మించిన అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిత్యం ప్రమాదాలకు నిలయమైంది. ఎంతో మంది కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనాదారులు హడలెత్తిపోతున్నారు. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతామోలేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.

వేగం..
ఔటర్‌రింగ్‌రోడ్డుపై సూచిక బోర్డుల ఏర్పాటులో శాస్త్రీయ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగ పరిమితితో నిర్మించిన ఔటర్‌పై సూచికబోర్డు చూసి అప్రమత్తమయ్యే సరికే.. వాహనం 150 నుంచి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోతుంది. ఫలితంగా అయోమయానికి గురవుతున్న వాహనదారులు వేగంగా వెళ్తున్నామన్న విషయాన్ని విస్మరించి అకస్మాత్తుగా వెహికిల్‌ను టర్న్ చేస్తున్నారు. దీంతో అదుపు తప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. నిబంధనలు పాటించక పోవడమూ ప్రమాదాలకు మరో కారణం.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ఈ రోడ్డుపైనే ప్రాణాలు వదిలారు. మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు కూడా రింగ్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. వీరితో పాటు ఎంతో మంది సామాన్యులు ఔటర్‌పై మృత్యువాత పడ్డారు. ట్రాఫిక్‌ను నియంత్రించే భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రింగ్‌రోడ్‌ ఇలా మృత్యుదారిగా మారడంతో దీనిపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. ఇటీవల పెద్ద అంబర్ పేట్ ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. తాజాగా శామీర్‌పేట మండలం దొంగలమైసమ్మ చౌరస్తా వద్ద జరగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

నివారణేది ?
శాస్త్రీయ విధానంలో ఉండాల్సిన సూచికబోర్డుల నుంచి.. వేగ నిర్ధారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, నిబంధనలు అమల్లో అధికారులు చూపుతున్న అశ్రద్ధ వాహనదారుల పాలిట మరణశాసనంలా మారుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సర్వీస్ రోడ్లు, ఔటర్ మార్గానికి అనుసంధానం సరిగా లేకపోవడంతో ఓఆర్‌ర్‌పైకి అకస్మాత్తుగా వాహనాలు వస్తున్నాయి. దీంతో అప్పటికే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనంతో ఒకదానికొకటి ఢీకొట్టే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగిన ప్రతీసారి వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటామంటున్న అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డుపై ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రేటర్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

07:23 - December 19, 2016

నల్గొండ : ఆడపిల్ల ఇప్పటికీ భారంగానే మారుతోంది. కన్న తండ్రికే కాదు.. నవమాసాలు మోసి కన్న తల్లికి కూడా ఆడపిల్ల అంటే చులకన అవుతోంది. పేగు పంచి జన్మనిచ్చిన తల్లి కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కొందరు ఆడపిల్లను మహాలక్ష్మిగా భావిస్తే.. మరికొందరు భారంగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందంటే చాలు చెత్తకుప్పలు, మురికి కుంటల్లో పడేయటమో.. లేకుంటే అమ్మకానికి పెట్టడమో చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓ దంపతులు శిశువును అమ్మకానికి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా దూసుకెళ్తున్న ఆడవాళ్లపైన ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లను భారంగా భావించి బేరానికి పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేక ఆడపిల్ల పుట్టగానే కనుమరుగు చేస్తున్నారు. శిశువు అన్న కనికరం లేకుండా కన్నవాళ్లే కాటేస్తున్నారు. రాక్షసంగా వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా నలుగురూ ఆడపిల్లలు పుట్టారని ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు ఓ దంపతులు.

నల్గొండ..
ఏ పాపం తెలియని ముక్కుపచ్చలారని ఈ పసికందుకు తల్లిదండ్రులు పెద్ద శిక్ష వేయాలనుకున్నారు. నాలుగో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో అమ్మకానికి పెట్టారు. కళ్లు కూడా తెరవని ఆ పసికందును కర్కషంగా వదిలించుకోవాలని చూశారు. సంతలో బొమ్మను అమ్మకానికి పెట్టినట్లు శిశువును విక్రయించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు.. ఆ తల్లిదండ్రుల అరాచకాన్ని అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా జాటవత్‌ తండాకు చెందిన బలా, లక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నాలుగో సంతానంలోనూ లక్ష్మి దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో బలా, లక్ష్మి దంపతులు పుట్టిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు.. శిశువు అమ్మకాన్ని అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి.. ఆడ శిశువును శిశు గృహానికి తరలించారు. శిశువు విక్రయంలో మధ్య వర్తిగా వ్యవహరించిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. 20వ శతాబ్దంలోనూ ఆడపిల్లపై కొనసాగుతున్న వివక్ష మీద ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

07:18 - December 19, 2016

హైదరాబాద్ : ప్రజలు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగడం లేదని టీ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. పౌరసమాజం బలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తాయని.. ప్రజల తరపున జేఏసి ఎప్పుడూ పోరాటం చేస్తుందని అయన స్పష్టంచేవారు. ప్రజా సమస్యయలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వానికి వ్యతిరకం కాదన్నారు. కరీంనగర్‌లో తెలంగాణా విద్యావంతుల వేదిక కార్యవర్గ సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. విద్య అందరి హక్కు అని, నాణ్యమైన విద్యను ప్రజలకు అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

07:15 - December 19, 2016

హైదరాబాద్ : విపక్షాలకు బ్రేక్‌ వేసేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మరో అస్త్రాన్ని సిద్ధం చేసింది. గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌ కౌంటర్‌ కేసు అంశాన్ని తెరపైకి తీసుకురానుంది. నయీంకు, నేతలకు మధ్య సంబంధాలను అసెంబ్లీలో చర్చించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ చర్చ ద్వారా కాంగ్రెస్‌, టీడీపీలను ఆత్మరక్షణలో పడేసేందుకు గులాబీ బాస్‌ ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని సెటిల్‌మెంట్లు చేసిన గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం పరిణామాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నేతలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. విపక్షాలు ఎన్‌కౌంటర్‌ తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసినా..ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసింది.

రాజకీయాల్లో వేడి..
ప్రభుత్వం నియమించిన సిట్‌కు నయీం ముఠా ఆగడాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. నయీంతో సంబంధాలు పెట్టుకున్న నేతలపై ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లు రోజుకొకటి అప్పట్లో బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు కొన్ని ఆరోపణలు చేసుకున్నా..సిట్‌ విచారణలో కొన్ని అనుమానాలకు తెరపడింది. కానీ గతంలో ఓ రాజకీయ పార్టీలో ఉంటూ ప్రస్తుతం అధికార పార్టీలో ఉంటున్న నేతలపై కూడా సిట్‌ చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. దీంతో ఆ నేతలపై చర్యలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన గులాబీ దళం..నయీం ఎన్‌కౌంటర్‌తో ప్రభుత్వానికి వచ్చిన ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో గ్యాంగ్‌స్టర్‌ ముఠాకు సంబంధాలున్నా.. నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించింది. దీంతో 20 ఏళ్ల గ్యాంగ్‌ స్టర్‌ ఆరాచకాలకు తెరదించామనే క్రెడిట్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. నయీంను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్‌లేనని సభలోనే పూర్తి ఆధారాలతో బయటపెట్టాలని ఎత్తులు వేస్తోంది. ఏది ఎమైనా గులాబీ పార్టీ ఎన్ కౌంటర్ అంశాన్ని శాసనసభలో చర్చకు తీసుకురావాలనే నిర్ణయం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి.

07:13 - December 19, 2016

హైదరాబాద్ : విపక్షాలకు బ్రేక్‌ వేసేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మరో అస్త్రాన్ని సిద్ధం చేసింది. గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌ కౌంటర్‌ కేసు అంశాన్ని తెరపైకి తీసుకురానుంది. నయీంకు, నేతలకు మధ్య సంబంధాలను అసెంబ్లీలో చర్చించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ చర్చ ద్వారా కాంగ్రెస్‌, టీడీపీలను ఆత్మరక్షణలో పడేసేందుకు గులాబీ బాస్‌ ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని సెటిల్‌మెంట్లు చేసిన గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం పరిణామాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నేతలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. విపక్షాలు ఎన్‌కౌంటర్‌ తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్‌ చేసినా..ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసింది.

రాజకీయాల్లో వేడి..
ప్రభుత్వం నియమించిన సిట్‌కు నయీం ముఠా ఆగడాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. నయీంతో సంబంధాలు పెట్టుకున్న నేతలపై ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతల పేర్లు రోజుకొకటి అప్పట్లో బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు కొన్ని ఆరోపణలు చేసుకున్నా..సిట్‌ విచారణలో కొన్ని అనుమానాలకు తెరపడింది. కానీ గతంలో ఓ రాజకీయ పార్టీలో ఉంటూ ప్రస్తుతం అధికార పార్టీలో ఉంటున్న నేతలపై కూడా సిట్‌ చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. దీంతో ఆ నేతలపై చర్యలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన గులాబీ దళం..నయీం ఎన్‌కౌంటర్‌తో ప్రభుత్వానికి వచ్చిన ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలతో గ్యాంగ్‌స్టర్‌ ముఠాకు సంబంధాలున్నా.. నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించింది. దీంతో 20 ఏళ్ల గ్యాంగ్‌ స్టర్‌ ఆరాచకాలకు తెరదించామనే క్రెడిట్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. నయీంను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్‌లేనని సభలోనే పూర్తి ఆధారాలతో బయటపెట్టాలని ఎత్తులు వేస్తోంది. ఏది ఎమైనా గులాబీ పార్టీ ఎన్ కౌంటర్ అంశాన్ని శాసనసభలో చర్చకు తీసుకురావాలనే నిర్ణయం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి.

07:09 - December 19, 2016

ఢిల్లీ : అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఒకే ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు శాశ్వత ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేసింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నూతన శాశ్వత ట్రైబ్యునల్ ఏర్పాటు చేసింది. 1956లో అమల్లోకి వచ్చిన అంతరాష్ర్ట నదీ జలాల వివాదాల చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రం అభిప్రాయపడుతోంది. చట్ట సవరణ కోసం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నిర్ణయించారు. ఈ ట్రిబ్యునల్‌కు అనుబంధంగా కొన్ని బెంచ్‌లను కూడా ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.

3 సంవత్సరాల కాలపరిమితిలో సమస్య పరిష్కారం...
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి, నీటి కేటాయింపులకు ఇప్పటికే పనిచేస్తున్న ట్రిబ్యునళ్లను కొత్తగా ఏర్పాటు చేసే శాశ్వత ట్రిబ్యునల్‌ పరిధిలోకి తెచ్చే అవకాశమున్నది. సుప్రీం కోర్టు విశ్రాంత జడ్జి ఈ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని కేంద్రం తెలిపింది. రాష్ర్టాల మధ్య నదీ జలాల వివాదాలు తలెత్తినప్పుడు అవసరం మేరకు బెంచ్‌లు ఏర్పాటు చేస్తారు. సమస్య పరిష్కారం కాగానే బెంచ్‌లను ఎత్తివేస్తారు. ఇకపై నదీ జలాల వివాదాలను మూడు సంవత్సరాల కాలపరిమితిలో పరిష్కరించే విధంగా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.

వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు..
1956లో చేసిన అంతరాష్ర్ట నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ర్టాలు కేంద్రాన్ని కోరినప్పుడు కేంద్రం కూడా అవసరమని భావిస్తే ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తున్నది. దేశంలో ప్రస్తుతం ఎనిమిది అంతరాష్ర్ట వివాదాల ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో పాటు వివాదాల పరిష్కార కమిటీని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ర్టాల మధ్య జల వివాదాలు తలెత్తినప్పుడు వీటిని పరిష్కరించడానికి ముందుగా ఈ కమిటీ ప్రయత్నిస్తుంది. కమిటీలో పరిష్కారం కాని అంశాలతో పాటూ కమిటీ నిర్ణయాలపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది. కేంద్ర జలసంఘం అధికారులు, జలవనరుల నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఇంఫాల్ లో కర్ఫ్యూ..

మణిపూర్ : రాజధాని ఇంఫాల్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఓ ప్రార్థనా మందిరంపై బాంబు దాడి జరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో వదంతలు వ్యాపించడంతో ముందస్తు చర్యగా తూర్పు ఇంఫాల్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

టి. అసెంబ్లీలో నేడు..

హైదరాబాద్ : అసెంబ్లీ శీతకాల సమావేశాల్లో మూడో రోజు సోమవారం ఉభయసభలు కొనసాగనున్నాయి. శాసనసభలో ఉదయం 10 నుండి 11.30 వరకు ప్రశ్నోత్తరాలు..11.30 నుండి 12 గంటల వరకు జీవరో అవర్, ఇటీవలే మృతి చెందిన రాజకీయ నేతలు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు..ఇటీవలే మృతి చెందిన తమిళనాడు సీఎం జయలలిత, మాజీ ఎమ్మెల్యేలలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు గ్యాంగ్ స్టర్ నయీం, అతని అనుచరుల నేర కార్యకలాపాలపై చర్చ.

నేడు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో శిక్ష ఖరారు..

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ లోని 2013లో సంభవించిన జంట పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేయనున్నది. నేరం రుజువు కావడంతో ఈనెల 13న న్యాయస్థానం ఐదుగుర్ని దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు నిందితులు కాగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

23న ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ ఎంపిక పరీక్ష..

హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీస్ 2017 పరీక్ష శిక్షణను రాష్ట్ర గిరిజన శాఖ స్టడీ సర్కిల్ ఇవ్వనున్నది. ఈనెల 23న మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 300 మంది ఎస్టీ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

Don't Miss