Activities calendar

22 December 2016

21:56 - December 22, 2016

హైదరాబాద్ : 2016 సీజన్‌లో అశ్విన్‌ సాధించిన రికార్డ్‌లు నమోదు చేసిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌, ఇన్‌స్టంట్‌ టీ 20 ఫార్మాట్లలో అశ్విన్‌ రికార్డ్‌ల మోత మోగించాడు.2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌, బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డ్‌లు అశ్విన్‌కే  సొంతమయ్యాయి.    
నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌... 
నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌... నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌... ఆల్‌ ఇన్‌ వన్‌ అశ్విన్‌... ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో స్పిన్‌ సెన్సేషన్‌ అశ్విన్‌...ప్రస్తుత తరంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. టెస్టుల్లో నెంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా  ,నెంబర్‌ వన్‌  ఆల్‌రౌండర్‌గా  మోడ్రన్‌ క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్రను తిరగరాస్తున్నాడు.
విభిన్నమైన ఫార్మాట్లలో నిలకడగా రాణించిన అశ్విన్‌ 
2016 సీజన్‌లో అశ్విన్‌ సాధించిన రికార్డ్‌లు నమోదు చేసిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌, ఇన్‌స్టంట్‌ టీ 20 ఫార్మాట్లలో అశ్విన్‌ రికార్డ్‌ల మోత మోగించాడు. గత సీజన్‌లో ఈ రెండు విభిన్నమైన ఫార్మాట్లలో నిలకడగా రాణించిన ఏకైక క్రికెటర్‌ అశ్విన్‌ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ క్రికెటర్‌, బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డ్‌లు అశ్విన్‌కే సొంతమయ్యాయి. 
అంచనాలకు మించి అదరగొట్టిన అశ్విన్  
ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అవార్డ్‌లకు పరిగణించే 2015 సెప్టెంబర్‌ నుంచి 2016 సెప్టెంబర్‌ మధ్య కాలంలో  టెస్ట్‌, టీ 20 ఫార్మాట్లలో అశ్విన్ అంచనాలకు మించి అదరగొట్టాడు. ఈ సీజన్‌లో టెస్టుల్లో  అత్యుత్తమంగా 48 వికెట్లు తీయడంతో పాటు, 336 పరుగులు చేసి ....ఐసీసీ బెస్ట్‌ టెస్ట్‌ ప్లేయర్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదే క్యాలెండర్ ఇయర్‌లో ట్వంటీ ట్వంటీ  ఫార్మాట్‌లోనూ అశ్విన్‌ అదరగొట్టాడు. కేవలం 19 టీ20 మ్యాచ్‌ల్లోనే  27 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.టీ20ల్లో బౌలర్‌గా, టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా  అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్‌ ఐసీసీ బెస్ట్‌ క్రికెటర్‌గా, సర్‌గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ అందుకోనున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్ తర్వాత ఐసీసీ బెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డ్‌ నెగ్గిన 3వ భారత క్రికెటర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు.  
లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా కీలక ఇన్నింగ్స్‌ 
2016లోనే టెస్టు ఫార్మాట్‌లోనే 72 వికెట్లు పడగొట్టాడంటే అశ్విన్‌ ఎంతలా చెలరేగాడో తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ముగిసిన సిరీస్‌లో 3 సార్లు 5 వికెట్ల ఫీట్ నమోదు చేసిన అశ్విన్‌...ఓవరాల్‌గా 28 వికెట్లు పడగొట్టాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా కీలక ఇన్నింగ్స్‌ ఆడి మూడు హాఫ్‌ సెంచరీలతో 306 పరుగులు నమోదు చేశాడు.
సంచలనాలకు మారుపేరుగా అశ్విన్  
గత రెండేళ్లుగా కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొడుతోన్న అశ్విన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గా ఉన్న అశ్విన్‌...ఇదే స్థాయిలో రాణిస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియాకు తిరుగుడందనడంలో సందేహమే లేదు.

 

21:47 - December 22, 2016

ముంబై : మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు సన్నగిల్లడంతో స్టాక్ మార్కెట్ వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఇవాళ 263 పాయింట్లు నష్టపోయింది ఈ సూచి 27వేల కంటే దిగువకు పడిపోయి 26వేల 979 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టి 82 పాయింట్లు క్షీణించి 7వేల 9వందల 79 వద్ద క్లోజైంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, యూరప్ మార్కెట్ల నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు లేకపోవడం దేశీయంగా సెంటిమెంట్‌ను కరిగించింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో మొబైల్ కౌంటర్లలో అమ్మకాలు పెరిగాయి. నిఫ్టీలో హిండాల్కో అత్యధికంగా నాలుగున్నర శాతం నష్టపోయింది. అదానీ పోర్ట్స్, ఓఎన్ జీసీ, ఎయిర్‌ టెల్, టాటా స్టీల్ 3 శాతం వరకు క్షీణించాయి. 

 

21:45 - December 22, 2016

కర్నాటక : ఒక్కోసారి కొన్ని పదాలు రాసేప్పుడు ఒక్క అక్షరం కూడా తప్పుగా రాయకూడదు. రాస్తే... పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య చేసిన ట్వీట్‌ ఒకటి ఇలాగే తీవ్ర చర్చకు దారి తీసింది. పలు విమర్శలకు కారణమైంది. చైనాకి చెందిన 'సియాచిన్‌' ప్రావిన్స్‌ సీఎం లీ జంగ్‌ను కలిశానని.. సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా కొంతమంది వ్యంగ్యంగా స్పందించారు. వాస్తవానికి సియాచిన్‌ హిమాలయాల్లో ఉన్న భారత సరిహద్దు ప్రాంతం. 'సిచువాన్‌' అనేది చైనాలోని ఓ రాష్ట్రం. దీని స్పెల్లింగ్‌ పొరపాటుగా ట్వీట్‌ చేయడంతో అది కాస్త ముఖ్యమంత్రిపై విమర్శలకు కారణమైంది. 

 

21:42 - December 22, 2016

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానికి స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతికి... గవర్నర్‌ నరసింహాన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు  స్వాగతం పలికారు.  రాష్ట్రపతి రేపు ఆర్మీ కాలేజీ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌ స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 25న బెంగళూరు వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 30న రాష్ట్రపతి నిలయంలో జరిగే తేనీటి విందుకు గవర్నర్‌, సీఎం, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

 

21:40 - December 22, 2016

చెన్నై : తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా  జారీ చేసింది. ఇప్పటి వరకూ  ఆ పదవిలో కొనసాగిన రామ్మోహన్‌రావు పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు సీఎస్ రామ్మోహన్‌ రావుపై అవినితీ ఆరోపణలు రావడం, ఇంట్లో భారీగా నగదు లభించడంతో.. ఆయనను సీఎస్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ.. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
1981 బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్‌ 
ఈ నేపథ్యంలో  కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1981 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం భూపరిపాలన విభాగంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. వివిధ శాఖల్లో 15 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె చెన్నై ఐఐటీ నుంచి హెల్త్‌ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు.  గిరిజా వైద్యనాథన్‌ తండ్రి ..ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఎస్‌.వెంకటరమణన్‌ .. ఆమె భర్త రాజా వైద్యనాథన్‌ స్పిక్‌ గ్రూప్‌నకు చెందిన ఫోర్‌సైట్‌ ఫైనాన్షియల్‌లో పనిచేస్తున్నారు.
తొలి నుంచి తమిళనాడులోనే పనిచేస్తున్న గిరిజా వైద్యనాథన్‌
గిరిజా వైద్యనాథన్‌ తొలి నుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో  ఆమెకు విశేష అనుభవం ఉంది. ఆరోగ్య, విద్య, వ్యవసాయం వంటి వివిధ శాఖలలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో  ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆరోగ్య, పోషకాహారం, పర్యావరణ శాఖలలో ఆమె వివిధ స్థాయిల్లో పనిచేశారు. అలాగే  2013 భూ సేకరణ చట్టంలోని పలు నిబంధనల తయారీలో  గిరిజా వైద్యనాథన్‌ కీలక పాత్ర పోషించారు. 2005 నుంచి 2006 వరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగాను.. 2007 నుంచి 2008 వరకు ప్రభుత్వ ప్రణాళిక కమిషన్‌లో మెంబర్‌గాను  ఆమె కొనసాగారు. గిరిజా వైద్యనాథన్‌కు ముక్కు సూటిగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది. తమిళం, హింది, ఇంగ్లీష్ భాషాల్లో పట్టుంది. 1983లో సబ్‌-కలెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన గిరిజా వైద్యనాథన్‌ ..... గత సీఎస్‌ రామ్మోహన్‌ కంటే సీనియర్‌ కావడం విశేషం.

 

21:36 - December 22, 2016

చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుపై వేటు పడింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో  ప్రభుత్వం సిఎస్‌ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశముంది. రామ్మోహన్‌రావు ఇంట్లో భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు పదవి ఊడింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పన్నీర్‌ సెల్వం ప్రభుత్వం ఆయనను వెంటనే సీఎస్ పదవి నుంచి తొలగించింది. 
శేఖర్‌రెడ్డితో రామ్మోహన్‌రావుకు సంబంధాలున్నాయని ఆరోపణలు 
నల్లకుబేరుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహన్‌రావుకు సంబంధాలున్నాయని.. పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్‌రెడ్డికి ఆయన భారీస్థాయిలో బంగారం కొనుగోలు చేసేందుకు సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌రావు , ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 5గంటలకు ప్రారంభమైన సోదాలు గురువారం ఉదయం 6గంటల వరకు కొనసాగాయి. రామ్మోహన్‌రావు, ఆయన కుమారుడు, బంధువుల ఇళ్లతో పాటు  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 13 చోట్ల అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చిత్తూరులోని రామ్మోహన్‌రావు వియ్యంకుడు, దివంగత ఎంపీ ఆదికేశవులునాయుడు సోదరుడు భద్రీనారాయణ నివాసంలోనూ తనిఖీలు చేశారు. రామ్మోహన్‌రావు నివాసంలో 30లక్షలు విలువైన కొత్తనోట్లు, 5కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
ఐఏఎస్‌ అధికారులపైనా ఆరోపణలు 
రాష్ట్రంలోని మరికొంతమంది ఐఏఎస్‌ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయి. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నాగరాజన్‌ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఐటీ సోదాలపై తమిళనాడులోని విపక్షాలన్నీ ఏకమై విమర్శలు గుప్పించాయి. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఐటీ సోదాలు జరగడం రాష్ట్ర చరిత్రలో తొలిసారని.. ఈ చర్యతో రాష్ట్రం పరువు పోయిందని విమర్శించాయి. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి రామ్మోహన్‌రావుపై వేటు వేయక తప్పలేదు.

 

21:22 - December 22, 2016
21:19 - December 22, 2016
21:16 - December 22, 2016

అన్నాడీఎంకెలో లుకలుకలు మొదలయ్యాయా ? బీజేపీ తమిళనాడులో పావులు కదుపుతోందా ? డీఎంకే వ్యూహమేంటీ? తమిళనాడులో ఏం జరుగుతోంది ? ఐటీ దాడులు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? ఐటీ దాడులు రాజకీయ ఎత్తుగడల్లో మునిగిన తమిళనాడు.. సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు.. తమిళనాట ఊపందుకుంటున్న రాజకీయాలు, సీఎం పీఠంపై కూర్చోవడానికి శశికళ ప్రయత్నాలు... ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాపై కేజ్రీవాల్ ట్వీట్

ఢిల్లీ : గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాపై కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నజీబ్ రాజీనామా చూసి ఆశ్చర్య పోయాయని తెలిపారు. ఆయన భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

20:51 - December 22, 2016

హామీలన్ని పాతర ప్రచారాల జాతర... నిజాం డెక్కర్ షుగర్ కు తద్దిన కార్యం, తెలుగు రాష్ట్రాలల తెర్లుతెర్లైన పాలన... పోరాటాలు ఆరాటాలతోనే జనం పాట్లు, సర్కారును కోదండమేసిన కోదండరాం...ప్రభుత్వ ఉద్యోగాల కోసం సారు పరేషాన్, హైదరాబాదుల దిగిన ప్రణబ్ ముఖర్జీ సారు... విడివి కాలీ జేసిన కోతులు, పాములు, ఇంటికే ఏంటీఎం విమషన్లు పంపిస్తం.. కొత్త ఆఫర్ వెట్టిన స్నాప్ డీలొళ్లు, తాగి పోలీసొళ్లను పర్శాన్ జేసిన పిల్ల... కరీంనగర్ కాడ కాకమీదున్న పోరలు, అయ్యప్ప భక్తులకు ముస్లీంలు భిక్ష, అడ్రస్ అడినందుకు చేయివట్టి లాగారు....  జంటను చావబాదిన ఆకతాయిలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

కరీంనగర్ : జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. మూడేళ్ల బాలికపై వెంకటస్వామి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి.. ఆపై ఆమెను హత్య చేశాడు. 

20:31 - December 22, 2016

ప్రభుత్వ బ్యాంకుల నిర్వీర్యానికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు రామకృష్ణాప్రసాద్, బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ నేత వెంకటరామయ్య, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. బ్యాంకుల అస్తిత్వాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం... పేటీఎం, మోబీ క్విక్, ఓలా మనీ, ఉబర్ మనీ, ఫ్రీఛార్జ్, చిల్లర్, ఎయిర్ టెల్ మనీ ఇలా ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యం పెంచేస్తోందని విమర్శించారు. పేటీఎం... డిజిటల్ స్కాం లాంటిదన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారుల వైఫల్యంగా చూపుతున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

విద్యుత్ షాక్ తో ఇద్దరు మహిళలు మృతి

భద్రాద్రి : టేకులపల్లి మండలం తడకలపల్లి తండాలో విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 

20:11 - December 22, 2016

విజయవాడ : అభివృద్ధి ఎంత ముఖ్యమో...సంక్షేమం కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో 2 వ రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఆధార్ అనుసంధానంతో లావాదేవీలు శ్రేష్ఠమని చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై అధికారులు ఆసక్తి చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అకౌంటబులిటీ బిల్డప్ చేశామని చెప్పారు. కొన్ని డిపార్టుమెంట్లల్లో 25 సేవింగ్స్ వచ్చాయని తెలిపారు. కన్వర్జెన్స్ ఆఫ్ రిసోర్సెస్ తీసుకొచ్చామని తలిపారు. వీకర్ సెక్షన్స్ ను పైకి తీసుకురావాలన్నారు. 

 

19:58 - December 22, 2016

హైదరాబాద్ : నోట్ల రద్దుతో మోదీ సర్కార్ ... అనధికార బ్యాంకు కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చిందా.. ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించిన బ్యాంకులపై విశ్వాసం సన్నగిల్లేలా ప్రయత్నాలు చేస్తోందా.. 
పేటీఎం లాంటి సంస్థలకు ఊతమివ్వడం ఎలాంటి సంకేతం ...
బ్యాంకుల్లో కరెన్సీ కొరత
నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల అస్తిత్వానికి ప్రమాదం ముంచుకొచ్చిందా... నోట్ల కొరత.. అలాగే రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన పరిమితి కంటే తక్కువగా కరెన్సీ విడుదల చేయడంతో బ్యాంకుల్లో.. ఇప్పుడది నిజమే అనిపిస్తోంది. కరెన్సీ కొరత ఏర్పడి.. బ్యాంకులు, బ్యాంకు అధికారులే విలన్లు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. దీంతోనే అక్కడక్కడ దాడులు లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముందస్తు ఏర్పాట్లు లేకుండా తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రజలకు... బ్యాంకుల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ రిలేషన్ దెబ్బతింది... అక్కడితోనే కాదు బ్యాంకుల ఆస్తి అప్పులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.. ఇప్పుడు బ్యాంకులకు పోటీగా మరికొన్ని అనధికార బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి.
ఇప్పుడున్న బ్యాంకుల పరిస్థితి ఏంటి?
బ్యాంకుల అస్తిత్వాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం... పేటీఎం, మోబీ క్విక్, ఓలా మనీ, ఉబర్ మనీ, ఫ్రీఛార్జ్, చిల్లర్, ఎయిర్ టెల్ మనీ ఇలా ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యం పెంచేస్తోంది... నగదు రహిత లావాదేవీల పేరుతో చైనాకు చెందిన అలీబాబా సంస్థ పెట్టుబడులతో నడుస్తున్న పేటీఎం లాంటి సంస్థలను ప్రోత్సహిస్తోంది... అక్కడితో ఆగకుండా లక్షన్నర వరకు మనం ఈ తరహా వ్యాలెట్ లలో మనీ ఉంచుకుంటే.. ఆ సొమ్ముతో పేటీఎం లాంటి సదరు సంస్థలు గవర్న్‌మెంట్‌ బాండ్లు కొనుకోవచ్చని తాజాగా కేంద్రం ఇస్తున్న సడలింపు.. దేనికి సంకేతం... మనం పెట్టిన మొత్తానికి సదరు సంస్థేలు వడ్డీ ఇస్తాయో లేదో తెలియదు.. కానీ మన సొమ్ముతో వాళ్లు వ్యాపారం చేసుకోవచ్చన్నమాట... వడ్డీ కొంత ఇచ్చే పరిస్థితి వస్తే.. పేటీఎం లాంటి సంస్థలు అనధికార బ్యాంకులుగా మారినట్లే కదా... అంటే ఇప్పుడున్న బ్యాంకుల పరిస్థితి ఏంటీ. 
ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకులు
ఇప్పటికే దేశంలో కోట్లాది రూపాయిల నిరర్థక ఆస్తులతో వివిధ బ్యాంకులు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో రద్దయిన 500, 1000 రూపాయల నోట్లతో బ్యాంకులలో డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. 2016 నవంబరు 27వ తేదీకల్లా బ్యాంకులలో 8.45 లక్షల కోట్ల రద్దయిన నోట్లు డిపాజిట్‌ అయ్యాయని రిజర్వ్‌ బ్యాంకు పేర్కొంది. డిసెంబర్‌ 7వ తేదీకల్లా ఈ డిపాజిట్లు 11.55 లక్షల కోట్లకు పెరిగాయి. డిసెంబరు 10వ తేదీకల్లా బ్యాంకులలో రద్దయిన నోట్ల డిపాజిట్లు 12.44 లక్షల కోట్లకు పెరగగా విడుదల చేసిన కొత్త నోట్ల విలువ కేవలం 4.61 లక్షల కోట్లు మాత్రమే. అంటే రద్దయిన నోట్లలో డిపాజిట్‌ చేసిన 7.83 లక్షల కోట్లు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో స్వల్ప కాలంలో బ్యాంకులలో డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. ఇలా డిపాజిట్లు బ్యాంకులకు చేరటం వల్ల బ్యాంకులకు భారంగా మారుతుంది. ఎందుకంటే ఉపసంహరణలపై పరిమితులు ఉండటంతో ఈ డిపాజిట్లపై చెల్లించవలసిన వడ్డీ బ్యాంకులకు భారం అవుతుంది. 
తగ్గిన బ్యాంకులు ఇచ్చే అప్పుల పరిమాణం
మరోవైపు ఇలా డిపాజిట్ల రూపంలో వచ్చిన నగదును వడ్డీ కోసం హడావిడిగా అప్పుగా ఇస్తే అది బ్యాంకింగ్‌ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇప్పటికే నిరర్థక ఆస్తులతో సతమతమౌతున్న బ్యాంకులకు అవి మరింత ప్రమాదకారిగా తయారవుతాయి. పర్యవసానంగా బ్యాంకులు ఇచ్చే అప్పుల పరిమాణం బాగా తగ్గి పోయింది. రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసిన  సమాచారం ప్రకారం నవంబరు 11 నుంచి 25వ తేదీ మధ్యలో బ్యాంకులు అందజేసిన అప్పులు అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోల్చినప్పుడు 30-35 వేల కోట్లు పెరిగాయి. నోట్ల రద్దు తరువాత 15 రోజుల్లో బ్యాంకులు ఇచ్చిన అప్పులలో 65 వేల కోట్లు తగ్గాయి. ఒకవైపు డిపాజిట్లు విపరీతంగా  పెరుగుతుంటే మరొకవైపు ఇస్తున్న అప్పులు భారీగా పడిపోతుంటే డిపాజిట్లపై చేస్తున్న వ్యయానికి, ఇస్తున్న అప్పులపై వచ్చే ఆదాయానికి పొంతన ఉండదు.
అనధికార బ్యాంకులుగా పేటీఎం లాంటి సంస్థలు 
ప్రస్తుత ప్రభుత్వ, రిజర్వ్‌ బ్యాంకుల తీరును గమనిస్తే ప్రభుత్వం వల్ల కళంకితమైన బ్యాంకుల ప్రతిష్టను, ఆస్తి అప్పుల పట్టీలను సరిచేయటానికి మరింత ప్రయివేటు ఈక్విటీని ప్రభుత్వ రంగ బ్యాంకులలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ముందుకొస్తుంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువ కావటానికి కాలానుక్రమంలో ప్రైవేటీకరణ వైపు బ్యాంకులను తీసుకెళ్లేలా.. ప్రభుత్వ ప్రణాళికలున్నాయి.. వీటితో తోడు ఇలాంటి సంస్థలకు ఈ మధ్య కాలంలో ఇస్తున్న ప్రోత్సాహాక సడలింపులతో... ప్రస్తుతమున్న బ్యాంకుల హవా తగ్గి... పేటీఎం లాంటి సంస్థలు అనధికార బ్యాంకులుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు.

 

భూ బకాసురులపై వామపక్షాలు, టీడీపీ స్పందన

ఖమ్మం : 10 టివిలో ప్రసారమైన భూ బకాసురులు కథనంపై సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీ పార్టీ నేతలు స్పందించారు. బ్యాంక్ లను బురిడీ కొట్టించిన బకాసురులపై పీడీ యాక్టు నమోదు చేయాలని వామపక్షాలు, టీడీపీ అన్నారు. 

 

నోట్ల మార్పిడిపై కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్

తూర్పుగోదావరి : కాకినాడలో నోట్ల మార్పిడిపై కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రాఘువీరారెడ్డి, పల్లం రాజు, జేడీ శీలం పాల్గొన్నారు. 

19:38 - December 22, 2016
19:37 - December 22, 2016

కడప : మరోవైపు కడప నగరంలోని ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫాతిమా కళాశాల గుర్తింపు రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

 

19:34 - December 22, 2016

కడప : ఫాతిమా వైద్యకళాశాలలో మెడికల్‌ సీట్ల స్కాం బయటపడింది.. మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కాలేజీ యాజమాన్యం 100 సీట్లకు అడ్మిషన్లు చేపట్టింది.. విద్యార్థుల తల్లిదండ్రులనుంచి డొనేషన్‌ పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేసింది.. ఎంసీఐ అనుమతిలేకపోవడంతో ఈ విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎన్ టీఆర్ యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది.. దీంతో ఆందోళనచెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎం చంద్రబాబను కలిసేందుకు విజయవాడ వచ్చారు.

19:31 - December 22, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని రణస్థలం మండలం కొవ్వాడ ప్రాంతంలో అణు విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా ప్లాంట్‌కు వ్యతరేకంగా పోరాడుతున్న ప్రజా సంఘాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. కొవ్వాడ, కోటపాలెం గ్రామాల్లో జరిగే గ్రామ సభలను అడ్డుకుంటారనే కారణంతోనే ముందస్తు అరెస్టులు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఉదయం శ్రీకాకుళం నగరంలోని సి.ఐ.టి.యు జిల్లా నాయకుడు గోవిందరావు ఇంటికి చేరుకొన్న పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కు వ్యతరేకంగా రణస్థలం మండలంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించేకొద్దీ.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిచారు. 

 

19:27 - December 22, 2016

కృష్ణా : జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుతున్నారు. రేపు మధ్యాహ్నం రెండున్నర సమయంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. పామర్రు నియోజకవర్గాన్ని తనకే కేటాయించాలని చంద్రబాబుతో హామీ పొందిన తర్వాతే ఆమె టీడీపీలోకి వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు కల్పన రాకను వర్ల రామయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మూడేళ్లుగా కల్పన.. వర్ల రామయ్య మధ్య పోరాటం సాగుతోంది. పార్టీ నిర్ణయంపై వర్ల రామయ్య ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్ల రామయ్యను బుజ్జగించేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

 

19:25 - December 22, 2016

విజయవాడ : ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శైలజానాథ్‌ విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీని గంగానది అంతటి పవిత్రుడని బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నోట్ల రద్దు అవినీతికి తల్లిలాంటిదన్నారు. బిర్లా, సహారా గ్రూప్‌ వద్ద మోదీ భారీగా ముడుపులు తీసుకున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించినా.. సమాధానం కూడా చెప్పుకోలేని స్థితిలో ఆయన ఉన్నారన్నారు. 

 

జనవరి 18న పార్లమెంటరీ కమటీ (ఫైనాన్స్ ) ఎదుట ఆర్బీఐ గవర్నర్ హాజరు

ఢిల్లీ : జనవరి 18న పార్లమెంటరీ కమటీ (ఫైనాన్స్ ) ఎదుట ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ హాజరు కానున్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో పార్లమెంట్ కమిటీ వివరణ కోరనుంది. 

 

నేను రాజకీయాల్లోకి రావడం లేదు : హర్బజన్ సింగ్

పంజాబ్ : నేను రాజకీయాల్లోకి రావడం లేదని.. వదంతులను ఆపండి అని క్రికెటర్ హర్బన్ సింగ్ అన్నారు. 

డేవిస్ కప్ లో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా మహేష్ భూపతి

హైదరాబాద్ : డేవిస్ కప్ లో భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా మహేష్ భూపతి నియామకమయ్యారు. అమృత్ రాజ్ స్థానంలో మహేష్ భూపతిని నియమించారు.

దక్షిణాఫ్రికా క్రికెటర్ అల్చిరో పీటర్సన్ పై రెండేళ్లు నిషేదం

కేఫ్ టౌన్  : దక్షిణాఫ్రికా క్రికెటర్ అల్చిరో పీటర్సన్ పై రెండేళ్లు నిషేదం విధించారు. 

18:54 - December 22, 2016

హైదరాబాద్ : శాస్త్రీయ నేరపరిశోధనా పద్ధతులను ప్రవేశపెట్టిన తర్వాత సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. నేరపరిశోధనల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. పోలీసులు శాస్త్రీయంగా నేరాలను రుజువు చేస్తుండటంతో  కోర్టు కేసుల విచారణలో వేగం పెరిగింది. అన్ని ఆధారాలతో కోర్టుల్లో నేరాలను రుజువు చేస్తుండటంతో  నేరస్థులకు శిక్షలు పడుతున్నాయని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. 
రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కీలకం 
పరిశ్రమలు, స్టాఫ్ట్‌వేర్‌ సంస్థల విస్తరణంలో రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కీలకంగా మారింది.  ఈ  కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే  2016లో నేరాల సంఖ్య తగ్గింది. జిల్లాల పునర్వస్థీకరణ తర్వాత  మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని పోలీసు స్టేషన్లు ఈ కమిషనరేట్‌లో చేరాయి. దీంతో అతిపెద్ద పోలీసు కమిషనరేట్‌  సైబరాబాద్‌ అవతరించింది. సిబ్బంది కొరత వేధిస్తున్నా.. శాస్త్రీయ పరిశోధనా విధానాలతో పోలీసుల సామర్థ్యం పెరిగి, నేరాల సంఖ్య తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. 
అన్ని పోలీసు స్టేషన్లలో నేరాలు తగ్గుముఖం 
కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో కూడా నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో 3058 కేసులు నమోదైతే, 2027  కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది  నమోదైన 2513 కేసుల్లో 1369 కేసులు పరిష్కరించారు. డబ్బు కోసం  ఎనిమిది హత్య కేసులు జరిగాయి. హత్య కేసులు 104 నమోదయ్యాయి. దారి దోపిడీ కేసులు 45, చైన్‌ స్నాచింగ్‌ కేసులు 146 నమోదయ్యాయి. ఇళ్లలో 609 చోరీలు జరిగితే, 741 వాహనాల దొంగతనం జరిగింది. ఈ కేసుల్లో మొత్తం 15  కోట్లు ఆస్తి నష్టం నమోదైతే, పది కోట్ల ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్స్‌, పేకాట  కేసులు 1629 జరిగాయి. ఈ కేసుల్లో 3175 మందిని అరెస్టు చేసి, కోటి 24 లక్షల 90 వేల రూపాయలను  స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన చోటే కేసు పంచనామా, పరిశోధనా పద్ధతులను అమలు చేస్తున్నారు. మొత్తం మీద సైబరాబాద్‌ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 
తగ్గిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు 
సైబరాబాద్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు కూడా తగ్గాయి. ఈ ఏడాది 11,631 మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి 10 కోట్ల 60 లక్షల రూపాయలను జరిమానగా వసూలు చేశారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో 9,478 మంది నుంచి 3.32 కోట్ల అపరాధ రుసుము వసూలు చేశారు. శిక్షా వ్యవధిని పెంచడంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళనకరం 
మరోవైపు సైబరాబాద్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళనకర పరిణామం. ఈ ఏడాది జరిగిన 3,656 రోడ్డు ప్రమాదాల్లో  988 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3447 మంది గాయపడ్డారు. నిఘా, నిరంతర పర్యవేక్షణతో నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్టు సైబరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. 

 

18:48 - December 22, 2016

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షన్-2017 కింద 'వాహ్..హైదరాబాద్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.  స్వచ్ఛ భారత్‌లో గతంలో హైదరాబాద్‌కు వచ్చిన ర్యాంకును నిలబెట్టుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఈసారి స్వచ్ఛ భారత్ ర్యాంకుల్లో కేంద్రం 500 నగరాలను పరిగణనలోకి తీసుకోనుందన్నారు. వ్యర్థాలను పున:వినియోగంలోకి తేవడంపై దృష్టి సారించాలని వారు అధికారులకు నిర్దేశించారు. స్వచ్ఛతను ఒక రోజు, ఒక వారానికే పరిమితం చేయొద్దని, నిరంతరం కొనసాగాలని నగరవాసులను కోరారు.

 

18:46 - December 22, 2016

సిద్ధిపేట : కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ ఆందోళనబాట పట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌ చేస్తూ "బతుకుపోరు పాదయాత్ర'' పేరుతో గజ్వేల్‌ నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్రగా బయలుదేరారు. రెగ్యులరైజేషన్‌పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా...సీఎం మా సమస్యలను పట్టించుకోలేదని.. దీంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టామని.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ అన్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

 

18:42 - December 22, 2016

రంగారెడ్డి : జిల్లాలోని పెద్ద అంబర్‌ పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 6 బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. 

 

18:41 - December 22, 2016

హైదరాబాద్ : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ నేత వెంకటేష్‌ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని అనేకసార్లు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పటి వరకూ ఆ వ్యవస్థను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు వ్యవస్థలో జరుగుతున్న శ్రమ దోపిడీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

 

18:34 - December 22, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదిపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మళ్లీ ఫైరయ్యారు. గుజరాత్‌లో తాను లేవనెత్తిన ముడుపుల అంశంపై ప్రధాని ఇంతవరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. ప్రధాని తనను గేలి చేసేలా మాట్లాడితే తనకేమి అభ్యంతరం లేదని...తాను అవినీతిపై అడిగిన ప్రశ్నలకు మోది సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత్‌లో అవినీతిని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.

 

18:31 - December 22, 2016
18:29 - December 22, 2016
18:27 - December 22, 2016
18:25 - December 22, 2016
18:15 - December 22, 2016

'ఒక్కడొచ్చాడు' మూవీ టీమ్ తో టోన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా హీరో హీరోయిన్లు విశాల్, తమన్నా, నిర్మాత పాల్గొని, మాట్లాడారు. సినిమా చిత్రీకరణకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చుందన్నారు. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చని హీరో విశాల్ చెప్పారు. విశాల్, తమన్నా తమ సినిమా అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:02 - December 22, 2016
18:00 - December 22, 2016

తమిళనాడు : గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే నేత స్టాలిన్ లేఖ రాశారు. శశికళను పది యూనిర్సిటీల వీసీలు కలవడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగపరమైన పదవిలోలేని శశికళను వీసీలు కలవడం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడమే అని మండిపడ్డారు. గవర్నర్ జోక్యం చేసుకుని విద్యా వ్యవస్థ పరువు కాపాడాలని లేఖలో కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ముంబై : స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుసుగా ఏడో రోజు స్టాక్ మార్కెట్ లో నష్టాలు వస్తున్నాయి. సెన్సెక్స్ 26 వేల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్.. 263 పాయింట్లు కోల్పోయి 25, 979 వద్ద ముగిసింది. నిఫ్టీ 82పాయింట్లు కోల్పోయి 7,979 వద్ద ముగిసింది. 

 

17:55 - December 22, 2016
17:50 - December 22, 2016

ఢిల్లీ : ఓ యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు. ప్రసంగాలు ఇస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో క్యాన్సర్‌ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన మోడీ.. అతను మాట్లాడటం తనకు చాలా సంతోషంగా ఉంది.. ఆయన మాట్లాడకపోతే భూకంపం వచ్చేది.. ఇప్పుడు ఆయన మాట్లాడారు కనుక భూకంపం వచ్చే అవకాశం లేదని.. రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా.. ఆయనపై ప్రధాని కౌంటర్లు వేశారు. 

 

లాజీ క్యాష్ సిబ్బంది భారీ మోసం

హైదరాబాద్ : లాజీ క్యాష్ సిబ్బంది భారీ మోసం జరిగింది. ఎస్ బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదును పూర్తిగా పెట్టకుండా రూ.1.88 కోట్లు లాజీ క్యాష్ ఉద్యోగులు కాజేశారు. లాజీ క్యాష్ మేనేజన్ సీపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23 మంది లాజీ క్యాష్ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు చేశారు. 

ఆ స్టంట్లకు ఎంఆర్ పీ నిర్ణయించాలని హైకోర్టు ఆదేశాలు

ఢిల్లీ : గుండె చికిత్సలో వినియోగించే స్టంట్లకు ఎంఆర్ పీ నిర్ణయించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 1లోగా ఎంఆర్ పీ నిర్ణయించాలని సూచించింది. 

 

కడప ఫాతిమ మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం

అమరావతి : కడప ఫాతిమ మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫాతిమా కాలేజీ విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించే అంశంపై ఎంసీఐతో సంప్రదింపులు జరపాలని ఎన్ టీఆర్ మోడికల్ యూనివర్సిటీ వీసీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫాతిమా మెడికల్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

 

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం ప్రణబ్ నగరానికి వచ్చారు. 

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ట్రాన్స్ కో ఏఈఈ

మహబూబ్ నగర్ : రూ.15 వేలు లంచం తీసుకుంటూ నవాబ్ పేట ట్రాన్స్ కో ఏఈఈ జాకబ్ ఎసిబికి చిక్కారు. 
 

ఇంద్రాణికి ఒకరోజు బెయిల్ మంజూరు

ఢిల్లీ : ఇంద్రాణికి ఒక రోజు బెయిల్ మంజూరైంది. తన తండ్రి అంత్యక్రియల నేపథ్యంలో ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. కూతురి హత్య కేసులో ఇంద్రాణిపై ఆరోపణలున్నాయి. 

 

17:11 - December 22, 2016

హైదరాబాద్ : జంటనగరాల్లో మంచినీటి సరఫరా అస్తవ్యస్థంగా ఉందన్న విపక్షాల ఆరోపణలపై అసెంబ్లీలో తీవ్ర రగడ జరిగింది. ఆంధ్రా ప్రాంత ప్రజలున్న ప్రాంతాలకు మంచినీరు సక్రమంగా సరఫరా చేస్తూ, తెలంగాణ వాసులున్న ఏరియాను నిర్లక్ష్యం చేస్తున్నారన్న మజ్లిస్‌ సభ్యుల ఆరోపణలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మజ్లిస్‌ సభ్యులు చేసిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచింది. మంచినీటి  సరఫరాలో ప్రాంతీయ వివక్షత లేదని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ సభ దృష్టికి తెచ్చారు. 
హాట్‌ హాట్‌గా ప్రశ్నోత్తరాల సమయం  
తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం హాట్‌ హాట్‌గా జరిగింది. జంట నగరాలకు మంచినీటి సరఫరా, ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేటు బస్సుల నియంత్రణ, సంస్థలను లాభాల్లో నడిపించేందుకు తీసుకుంటున్న చర్యలు,  రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల ఏర్పాటు, కాలుష్యకారక పరిశ్రమ తరలింపు, వంటి అంశాలపై  సభ్యులు చర్చించారు. జంటనగరాలకు మంచినీటి సరఫరాలో ప్రాంతీయ వివక్షత చూతున్నారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోపణలపై వాగ్వాదం జరిగింది. 
ఆర్టీసీలో నష్టాలపై చర్చ
ఏపీ నుంచి హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వస్తున్న ప్రైవేటు బస్సులతో ఆర్టీసీకి వస్తున్న నష్టాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ లేవనెత్తిన ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టీసీకి వస్తున్న నష్టాల సమస్యలపై కూడా అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న వివిధ పక్షాల సభ్యులు నష్టాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా 
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలతోపాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ పార్టీల సభ్యులు సర్కారు దృష్టికి తెచ్చారు. ఒక ప్రాంతానికి మంజూరైన గురుకుల పాఠశాలను మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్‌ మధుసూదనాచారి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేశారు. 
 

16:56 - December 22, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ప్రలోభపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తానూ, ముఖ్యమంత్రి ఒకే జిల్లా, ఒకే నియోజకర్గానికి చెందిన వారమని.. 2001సం.లో తాను జెడ్ పీటీసీ గా గెలిచినప్పుడే తనను ప్రలోభపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం చేశారని తెలిపారు. కాంగ్రెస్ కు 33 జెడ్ పీటీసీలు,  టీడీపీకి 32 జెడ్ పీటీసీలు వచ్చినప్పుడు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో తనకు రెండు కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టినా లొంగ లేదని చెవిరెడ్డి చెప్పారు. 2001 సెప్టెంబర్ 21న అసెంబ్లీలో ఆ విషయంపై వాకౌట్ కూడా చేయడం జరిగిందని చెప్పారు. తాము ఏ తప్పు చేయకున్నా.. తప్పు చేసినట్లు అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ చెప్పడం సరికాదన్నారు. అసెంబ్లీలోని వీడియో ఫుటేజిలో ఎక్కడా తాను అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు లేదని చెవిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజి కమిటీ సమావేశానికి చెవిరెడ్డితో మరో ఎమ్మెల్యే కోడాలి నాని హాజరయ్యారు. 

16:50 - December 22, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో ఉత్పత్తి అవుతున్న మురుగులోవచ్చే ప్రమాదకరమైన లీచెట్‌ను శుద్ధి చేసేందుకు బల్దియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డలోంచి వస్తున్న మురుగు శుద్ధికి శాస్త్రీయ పద్దతులను అధ్యాయనం చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన బయోకెమిస్ట్రీ విభాగం రూపోందించిన స్పెషల్‌ ప్రొగ్రామ్‌ను బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులు పరిశీలించారు.
ప్రతిరోజు 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రతిరోజు 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దాన్ని నిర్మూలించడానికి నగరానికి సమీపంలో ఉన్న జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. 330 ఎకరాల్లో ఉన్న ఈ డంపింగ్‌ యార్డు పెద్ద కొండను తలపిస్తుంది. మొదట అల్వాల్‌, ఉప్పల్‌, కాప్రా మున్సిపలిటీల్లో వచ్చే చెత్తను నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తర్వాత బల్దియా చెత్తను అక్కడికి తరలించడం మొదలుపెట్టింది. దీంతో ప్రస్తుతం డంపింగ్‌ యార్డు భాగా విస్తరించింది. నగరంలోని కోటి మంది జనాభా ఉత్పత్తి చేస్తున్న చెత్తను మొత్తం జవహర్‌ నగర్‌కు తరలిస్తున్నారు. 
జవహర్‌ నగర్‌ ప్రాంత వాసులకు 'చెత్త' కష్టాలు 
అప్పటి నుంచి జవహర్‌ నగర్‌ ప్రాంత వాసులకు చెత్త కష్టాలు మొదలయ్యాయి. డంపుయార్డు పరిసర ప్రాంతాల్లో ఉండే పదుల సంఖ్యలోని గ్రామాల ప్రజలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏళ్ల తరబడి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త నుంచి మురుగు.. పరిసరాలను కలుషితం చేస్తోంది. నీటి వనరులు, చెరువులు, బావులు మురుగు నీటితో కలుషితం అయ్యాయి. ఎంతగా అంటే అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ కూడా కలుషితం అయ్యింది. దీంతో దానిని శుద్ధి చేసే మార్గాలను జీహెచ్‌ఎంసీ అన్వేషిస్తోంది. 
68 కోట్ల లీటర్ల లిచెట్‌ ఉత్పత్తి 
జవహర్‌ నగర్‌లో ఇప్పటికే ఉత్పత్తి అయిన లిచెట్‌ 68 కోట్ల లీటర్లు ఉంటుంది. ప్రతి రోజు మరో 50 వేల లీటర్ల వరకు లీచెట్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులో భయంకరమైన విషవాయువులు, రసాయనాలైన అమ్మోనియం సల్ఫైడ్‌, అమ్మోనియా ఫాలీ సల్ఫైడ్‌, అమ్మోనియా, కార్బన్‌డై ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్పైడ్‌, మెర్‌ కాఫ్టీన్స్‌లు ఉన్నాయి. ఈ మురుగు నీటిని ఎలా శుద్ధి చేయవచ్చో.. శాస్త్రవేత సి. వెంకటేశ్వర్‌ తన బృందంతో కలిసి లిచెడ్‌ శుద్ధి ప్రక్రియను డెవలప్‌ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇలాంటి ప్రక్రియ లేదంటున్నారు. సిటీలోని చెత్త సమస్యను అధికమించడానికి అధికారులు, పాలకులు చేసిన పని సమస్య మరింత పెంచింది. అంతే కాకుండా కొత్త సమస్యలు తీసుకువచ్చింది. ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్ధితో ఆలోచించి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

 

16:44 - December 22, 2016

భద్రాద్రి : జిల్లాలోని మణుగూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజయదుర్గా లాడ్జి కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి లక్ష రూపాయాల ఆస్తి నష్టం జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రియా షాప్‌లో ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమైంది. ష్టార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు భవన యజమాని చెబుతున్నారు. 

 

16:43 - December 22, 2016

ఢిల్లీ : హస్తిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రానికి సమర్పించారు. రాజీనామాకు గల కారణాలను పేర్కొనలేదు. రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సివుంది. తనకు సహకరించిన ప్రధాని నరేంద్రమోడీ, డిల్లీ సీఎం కేజ్రీవాల్ లకు నజీబ్ జంగ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేజ్రీవాల్, నజీబ్ జంగ్ ల మధ్య గతంలో భేదాభిప్రాయాలు వచ్చిన విషయం తెలిసిందే. నజీబ్ జంగ్ తిరిగి టీచింగ్ వృత్తికి వెళ్లే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా

ఢిల్లీ : హస్తిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రానికి సమర్పించారు. 

 

శశికళను 10యూనిర్సిటీల వీసీలు కలవడంపై స్టాలిన్ ఆగ్రహం

తమిళనాడు : గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్టాలిన్ లేఖ రాశారు. శశికళను పది యూనిర్సిటీల వీసీలు కలవడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకుని విద్యా వ్యవస్థ పరువు కాపాడాలన్నారు.

 

16:14 - December 22, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ డిమాండ్ చేశారు. నేడు దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈమేరకు ఢిల్లీలోని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్ ఎదుట సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో తపన్ సేన్ పాల్గొని, మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 15 వ తేదీ లోపు కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనం ఇవ్వకపోతే.. ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

16:04 - December 22, 2016

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 నానాటాకి అంచనాలను పెంచేసో్తంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు వీడియోలు ఇప్పటికే యూట్యూబ్ లోసంచలనాలు నెలకొల్పాయి. అయితే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ మధ్యలో ’తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు‘ అనే లిరిక్స్ వస్తాయి. వెంటనే అదరిపోయే మ్యూజిక్ ఓ రేంజీలో దంచేశాడు దేవీ శ్రీ . దీన్ని బట్టి ఆ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ 
తళుక్కుమననున్నాడనిసినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నా తమ్ముళ్ల మధ్య గ్యాప్ వచ్చిందన్న రూమర్లను కొట్టి పడేయడానికైనాఈ సినిమాలో 
పవన్ కనిపిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలతో మన ముందుకు వస్తున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అదనపు ఆకర్షణ అవుతాడన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏం జరుగుతుందో మరికొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. 

టాటా స్టీల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నస్లీ వాడియాకు ఉదాస్వసన

ముంబై : టాటా స్టీల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నస్లీ వాడియాకు ఉదాస్వసన పలికారు. ఈమేరకు టాటా స్టీల్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మిస్త్రీకి మద్దతుగా నిలిచినందుకు నస్లీ వాడియాపై వేటు వేశారు. వాడియా తొలగింపు నిర్ణయానికి 90 శాం వాటాదారులు మద్దతు తెలిపినట్లు ముంబై స్టాక్ ఎక్సేంజ్ రెగ్యులేటరీకి పంపిన ఫైల్ లో టాటా స్టీల్ పేర్కొంది. 

 

15:38 - December 22, 2016

'సప్తగిరి ఎక్స్ ప్రెస్' మూవీ టీంతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సినిమాతో సప్తగిరి హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా హీరో సప్తగిరి, డైరెక్టర్ అరుణ్ పవార్, నిర్మాత రవి కిరణ్ పాల్గొని, మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రానికి ప్రమోషన్ చేయడానికి కారణాలను సప్తగిరి చెప్పుకొచ్చారు. తన డ్యాన్స్ చూసి ప్రభుదేవా ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా మురిసిపోతూ వెల్లడించారు.  సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీ ఎందుకు తీస్తున్నామనే వివరాలు చెబుతూ.. చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలు తెలిపారు. సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఆసక్తిగా సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియోలో చూడొచ్చు..

 

సంస్థల విభజనపై అధికారుల ఉప సంఘం ఏర్పాటు

 ఢిల్లీ : విభజన చట్టం షెడ్యూల్ 9లోని సంస్థల విభజనపై కేంద్రప్రభుత్వం అధికారుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఈనెల 27న అధికారుల ఉప సంఘం భేటీ కావాలని నిర్ణయించారు. షెడ్యూల్ 9లోని సంస్థల పూర్తి వివరాలతో హాజరు కావాలని ఇరు రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

 

ఆస్కార్ ఫీచర్ జాబితాలో అర్హత సాధించిన ఎంఎస్ ధోని, సరబ్ జిత్ సినిమాలు

ఢిల్లీ : ఆస్కార్ ఫీచర్ జాబితాలో ఎంఎస్ ధోని, సరబ్ జిత్ సినిమాలు అర్హత సాధించాయి. అర్హత సాధించిన మొత్తం 336 చిత్రాల్లో ఎంఎస్ ధోని, సరబ్ జిత్ సినిమాలకు చోటు లభించింది. 

శేఖర్ రెడ్డి అనుచరులకు జనవరి 4 వరకు రిమాండ్

చెన్నై : శేఖర్ రెడ్డి అనుచరులు ప్రేమ్ కుమార్, రత్నం, రామచంద్రన్ ను సీబీఐ కోర్టులో అధికారులు హాజరు పరిచారు. కోర్టు వారికి జనవరి 4 వ తేదీ వరకు రిమాండ్ విధించారు. 

14:26 - December 22, 2016
14:17 - December 22, 2016
14:11 - December 22, 2016

తమిళనాడు : టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌...విరాట్‌ కొహ్లీ ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా,బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. ఒకే సీజన్‌లో మూడు డబుల్‌ సెంచరీలు నమోదు చేసిన విరాట్‌....ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో అరుదైన రికార్డ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన విరాట్‌ ఇంగ్లండ్‌ సిరీస్‌లో క్రియేట్‌ చేసిన రికార్డులెన్నో....ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో విరాట్‌ వీరవిహారంపై టెన్‌ స్పోర్ట్స్‌ స్పెషల్‌ ఫోకస్‌....

ఎదురులేని యాంగ్రీ యంగ్‌ గన్‌....
ప్రస్తుతం ఫార్మాట్‌ ఏదైనా సరే...విరాట్‌ ఫార్ములా మాత్రం ఒక్కటే....నిలకడగా రాణించడం, పరుగులు
సాధించడం..టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌, విరాట్‌ కొహ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో నిలకడగా నిలబడి స్థిరంగా ఆడటానికి కేరాఫ్‌ అడ్రెస్‌లా మారాడు. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం మాత్రమే కాదు...బ్యాట్స్‌మెన్‌గానూ కొహ్లీ రికార్డ్‌ల మోత మోగిస్తూనే ఉన్నాడు.ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో అరుదైన రికార్డ్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన విరాట్‌ ఇంగ్లండ్‌ సిరీస్‌లో లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్‌ చేశాడు.

8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 655 పరుగులు
సిరీస్‌ ఆధ్యంతం అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఫైటింగ్‌ సెంచరీ,డబుల్‌ సెంచరీలతో టీమిండియాను పోటీలో నిలిపాడు. సిరీస్‌లో నిలకడగా రాణించిన కొహ్లీ...రెండు హాఫ్‌ సెంచరీలు, రెండు సెంచరీలతో సిరీస్‌కే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 655 పరుగులు స్కోర్‌ చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు.

కెరీర్‌లో 15 టెస్ట్‌ సెంచరీలు పూర్తి
కెరీర్‌లో 15 టెస్ట్‌ సెంచరీలు పూర్తి చేసిన కొహ్లీ ...ఇదే సిరీస్‌తో 3వ డబుల్‌ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై టెస్ట్‌లో 4వేల పరుగుల మార్క్‌ దాటాడు. కేవలం 89 ఇన్నింగ్స్‌ల్లోనే 4వేల పరుగుల మార్క్‌ దాటిన అతికొద్ది మంది బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో కొహ్లీ చోటు దక్కించుకున్నాడు.భారత టెస్ట్‌ కెప్టెన్‌గా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 2వేల పరుగుల మైలురాయిని సైతం కొహ్లీ అధిగమించాడు.

టెస్టుల్లో మూడు డబుల్‌ సెంచరీలు
ప్రస్తుత సీజన్‌లో విరాట్‌ నమోదు చేసిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే టెస్టుల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన యాంగ్రీ యంగ్‌ గన్‌.....ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

18 మ్యాచ్‌ల్లో కోహ్లీ జైత్రయాత్ర
గత ఆరు టెస్ట్‌ సిరీస్‌లలో కొహ్లీ నాయకత్వంలోని భారత్‌...18 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండా జైత్రయాత్ర కొనసాగించింది. టీమిండియాకు ఓటమంటూ లేకుండా 14 టెస్టుల్లో వరుసగా విజయాలందించిన టెస్ట్‌ కెప్టెన్‌గా కొహ్లీ చరిత్ర సృష్టించాడు. 2016 సీజన్‌లో కొహ్లీ అండ్‌ కో వరుసగా వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లపై ఓటమంటూ లేకుండా సిరీస్‌ విజయాలు సాధించింది. కొహ్లీ కెప్టెన్సీ భారత్‌ ఇప్పటివరకూ ఆడిన 22 టెస్టుల్లో 14 విజయాలు సాధించడంతో పాటు 2 మ్యాచ్‌ల్లో ఓడింది.6 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

41 అంతర్జాతీయ సెంచరీలు నమోదు
భారత జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్‌ ర్యాంక్‌లో నిలబెట్టిన కొహ్లీ....టీమిండియాకు టెస్టు ఫార్మాట్‌లో మరెన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. 28 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్లలో కలిపి 41 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసి ప్రస్తుత జెనరేషన్‌లో తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. మరి యాంగ్రీ యంగ్‌ గన్‌ ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో ఇదే స్థాయిలో చెలరేగితే 2017 సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా మరిన్ని అరుదైన ఘనతలు, ప్రపంచ రికార్డ్‌లు నమోదు చేస్తాడు అనడంలోనూ అనుమానమే లేదు. 

14:00 - December 22, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీముందు హాజరయ్యారు.. వైసీపీ నేత కొడాలి నాని... తాను ఏపీ అసెంబ్లీలో ఎలాంటి గొడవా చేయలేదని స్పష్టం చేశారు.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన తర్వాత అసెంబ్లీలో నిరసన తెలిపిన వీడియోలో తాను లేనని తేల్చిచెప్పారు.. కావాలనే తనను ఈ విషయంలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..

13:58 - December 22, 2016

మంచిర్యాల : సీపీఎం మహాజన పాదయాత్ర 67వ రోజు మంచిర్యాల జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల ద్వారా పాదయాత్ర బృంద సభ్యులకు విన్నవించుకుంటున్నారు. కోల్ బెల్ట్‌లో సింగరేణి కుటుంబాలు ఎదుర్కొంటున్నారని పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్‌నాయక్‌ పేర్కొన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కూతుళ్లకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

13:35 - December 22, 2016

ఢిల్లీ : నగదు రహిత ఆర్థిక వ్యవస్థను, డిజటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంకు, ఏటీఎం నుంచి తీసుకునే నగదుపై సర్‌ఛార్జి విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది 0.5-2 శాతం మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30 తరువాత ఇది అమల్లోకి రానుందని తెలుస్తోంది. కనీస పరిమితికి మించి నగదు తీసుకుంటే ఈ సర్‌ఛార్జి వర్తిస్తుంది. కనీస మొత్తం ఎంతన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాంకుల నుంచి రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ.15 వేలు మించి విత్‌డ్రా చేసుకుంటే సర్‌ఛార్జి విధించే అవకాశం ఉంది. 

13:21 - December 22, 2016

ఉత్తరప్రదేశ్ : దేశంలో నల్లధనాన్ని నివారించేందుకు తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. మరోవైపు అవినీతిపరులను కాపాడేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించిన మోదీ.. మదన్‌ మోహన్‌ మాలవ్య క్యాన్సర్‌ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల వైద్యుల పని మరింత సులువుగా మారుతుందని మోదీ తెలిపారు.

13:15 - December 22, 2016
13:14 - December 22, 2016
13:04 - December 22, 2016

హైదరాబాద్ : ఏపీ నుంచి హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వస్తున్న ప్రైవేటు బస్సులతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతున్న వైనంపై అసెంబ్లీలో ఆందోళన వ్యక్తమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సమాధానం చెబుతూ.. ఏపీ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులను నియంత్రిస్తామని సభ దృష్టికి తెచ్చారు. 

13:01 - December 22, 2016

హైదరాబాద్ : భద్రాచలంకు మంజూరైన గురుకుల పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అసెంబ్లీలో కోరారు. అలాగే చర్లలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, భద్రాచలంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తెచ్చారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. 

12:58 - December 22, 2016

ఢిల్లీ : డిజిటల్‌ లావాదేవీలతో చాలా ఉపయోగాలున్నాయన్నారు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు... డిజిటల్‌ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం చాలా సులభంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.. వేలిముద్రతో కావాల్సింది కొనుగోలు చేసేలా... బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి తెస్తున్నామని ప్రకటించారు.. అవినీతి, నల్లధనం దేశాన్ని పట్టిపీడిస్తున్న జబ్బులుగా అభివర్ణించారు. ఈ జబ్బుల నిర్మూలనకు మేజర్‌ సర్జరీ అవసరమని పేర్కొన్నారు.

12:54 - December 22, 2016

తమిళనాడు :

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1981బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం భూపరిపాలన విభాగంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. శేఖర్‌రెడ్డితో రామ్మోహన్‌రావుకు సంబంధాలున్నాయని.. పెద్ద నోట్ల రద్దు అనంతరం శేఖర్‌రెడ్డి బంగారం కొనుగోలు చేసేందుకు రామ్మోహన్‌రావు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో నిన్నటి నుంచి రామ్మోహన్‌రావు ఇంటితో పాటు.. ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారం స్వాదీనం చేసుకున్నారు. రామ్మోహన్‌రావుపై ఆరోపణలు రావడంతో.. ప్రతిపక్షాలన్నీ ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశాయి. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఐటీ సోదాలు జరగడం రాష్ట్ర చరిత్రలో తొలిసారని.. ఈ చర్యలో రాష్ట్రం పరువు పోయిందని ఆరోపించాయి. దీంతో అన్ని పరిణామాలను పరిశీలించిన ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. సహచర మంత్రులతో చర్చించి.. రామ్మోహన్‌రావును పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాష్ట్రంలోని మరికొంతమంది ఐఏఎస్‌ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయి. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నాగరాజన్‌ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

 

12:44 - December 22, 2016

విజయవాడ : డిజిటల్‌ లావాదేవీలపై అధికారులు ఆసక్తి చూపించడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో నిన్న రాత్రి నిర్వహించిన డిజిటల్‌ లావాదేవీలపై ఆరా తీశారు. తన ఆదేశాలను పదిశాతం మంది అధికారులు కూడా పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్‌ అనుసంధానంతో లావాదేవీలు శ్రేష్ఠమైనవని.. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

12:40 - December 22, 2016

కడప : ఫాతిమా వైద్యకళాశాలలో మెడికల్‌ సీట్ల స్కాం బయటపడింది.. మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కాలేజీ యాజమాన్యం 100 సీట్లకు అడ్మిషన్లు చేపట్టింది.. విద్యార్థుల తల్లిదండ్రులనుంచి డొనేషన్‌ పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేసింది.. ఎంసీఐ అనుమతిలేకపోవడంతో ఈ విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎన్టీఆర్ యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది.. దీంతో ఆందోళనచెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎం చంద్రబాబను కలిసేందుకు విజయవాడ వచ్చారు.. 

12:36 - December 22, 2016

ఖమ్మం : అటవీ భూములను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ఏకంగా 225 ఎకరాల భూమికే ఎసరు పెట్టారు. గ్రామంలో లేని భూమికి సర్వే నెంబర్లు సృష్టించి..తమవిగా మార్చుకున్నారు. ఇంతటితో ఆగకుండా భూమి పేరుతో..బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు పొందారు..పట్టాలు, పహాణీలు ఇచ్చిన రెవిన్యూ , ఫారెస్టు అధికారులకు కబ్జాదారులు ఝలక్ ఇచ్చారు. తమ భూమి ఎక్కడోందో చూపించాలని హైకోర్టును ఆశ్రయించిన భూ బాకాసురులపై 10టీవీ ప్రత్యేక కథనం....

అటవీ భూములపై బకాసుల కన్ను..
ఈ విజువల్స్‌లో మీకు కనిపిస్తున్నది ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం తాళ్లపెంట గ్రామం. ఈ గ్రామాన్ని ఆనుకుని రెవెన్యూ భూమితో పాటు అటవీ భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. కొందరు గ్రామస్తులు ఈ భూముల్లో కొంత భాగాన్ని గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా సరిగా వర్షాలు లేకపోవడంతో చాలా వరకు భూమిని గ్రామస్తులు సాగు చేయకుండానే వదిలేశారు. దీంతో వందల ఎకరాల్లో ఉన్న ఈ భూమిపై సత్తుపల్లి ప్రాంతానికి చెందిన భూబకాసురుల కన్ను పడింది.

దాదాపు 225 ఎకరాల భూమి ఆక్రమణ
సాగులోలేని ఈ పోడుభూమలుపై భూకబ్జాదారులు దాదాపు 225 ఎకారాల భూమిని తమ పేరిట రాసుకొన్నారు. రెవెన్యూ, అటవీ అధికారులతో కుమ్మక్కయ్యి పాస్‌ పుస్తకాలను సంపాదించుకున్నారు. రెవెన్యూ రికార్డు ప్రకారం 1 నుంచి 375 వరకు మాత్రమే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆయా సర్వే నెంబర్లలో మొత్తం 8,4,40 ఎకరాల విస్తీర్ణం భూమి ఉంది. ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి 1 నుంచి 375 వరకు మాత్రమే సర్వే నెంబర్లు ఉన్నాయి. అయితే అధికారులు పహణీలో 376 నుంచి 578 వరకు నెంబర్లు సృష్టించారు. 2013-14 మధ్యకాలంలో పాస్ పుస్తకాల్లో కొత్త సర్వే నెంబర్లు పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారు.

ఖంగుతిన్న అధికారులు

ఈ భూ అక్రమదారులు ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ భూమి కనిపించడం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు..ఆ భూములపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు అసలు విషయం అర్థమైంది. ప్రజాభిప్రాయ సేకరణలో తామా పేర్లను ఎప్పుడూ వినలేదని, వారికి ఇంతవరకూ చూడలేదని గ్రామస్తులు చెప్పడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. మరోవైపు అటవీ అధికారులు కూడా తమ సర్వేలో అలాంటి భూములేవి కనిపించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఉంటే తమకు చూపించాలని చెప్పినా ఎవరూ ముందుకు రాలేదని స్పష్టం చేశారు.

భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనుల డిమాండ్
ఇదిలా ఉండగా తమపై అన్యాయంగా కేసులు పెట్టారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తామీ భూమిని సాగుచేసుకుంటున్నామని చెబుతున్నారు. అన్యాయంగా భూమిని ఆక్రమించిన భూకబ్జాదారులపై కేసులు పెట్టకుండా...అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. 

12:24 - December 22, 2016

హైదరాబాద్ : కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని... సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీల్ని నెరవేర్చాలన్నారు..

12:19 - December 22, 2016

హైదరాబాద్ : తెలంగాణతోపాటు, హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా పైపు లైన్ల కాంట్రాక్టులకు ఏపీ కాంట్రాక్టర్లకు అప్పగించాలని మజ్లిస్‌ సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. మంచినీటిని కూడా ఆంధ్రా పజలు ఉన్న ప్రాంతాలకే ఎక్కుగా సరఫరా చేస్తున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తెచ్చారు. జంటనగరాలకు మంజీరా, సింగూరు జలాలను నిలిపివేయడం పట్ల అభ్యంతర వ్యక్తం చేశారు. నగరంలో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ఆయన ఆరోపించారు.  అక్బరుద్దీన్‌ ఆరోరణలను కేటీఆర్ తోసిపుచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలంతా తెలంగాణ వారేనని పేర్కొన్నారు. 

కళ్యాణ కట్టవద్ద పసిబిడ్డను వదిలేసిన వైనం..

తిరుమల : పేగు బంధం భారమైందో లేదా మరేదైనా కారణమో.. తెలియదు కానీ, ఈ ఉదయం తిరుమలలోని కల్యాణకట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల వయసున్న బాలుడిని వదిలి వెళ్లారు. గమనించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. బాబు గురించి ఎవరూ రాకుంటే..టీటీడీ నిర్వహిస్తున్న శిశు సంరక్షణాలయానికి తరలిస్తామని అధికారులు తెలిపారు. కల్యాణకట్ట ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

12:08 - December 22, 2016

హైదరాబాద్: శానససభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కాలుష్య కంపెనీలను సిటీ అవుట్ కట్స్ లో పెడతామని అసెంబ్లీలో మంత్రి తెలిపారని..దీనిపై షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య అభ్యంతరం తెలిపారు. కాలుష్య రహిత ప్రాంతాలు ఈ కంపెనీలకు తరలిస్తే ఆ ప్రాంతాలు కూడా కలుషితమైపోతాయని అందుకని జనావాసాలను దూరంగా ఈ కాలుష్య కంపెనీలను తరలించాలని కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ సమాధానమిస్తూ హైదరాబాద్  నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనీ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేశామని తెలిపారు. ఈ క్రమంలో నగరంలో 1500ల కాలుష్య పరిశ్రమలను గుర్తించామని కేటీఆర్ తెలిపారు. అర్బన్ నోట్ కింద షాద్ నగర్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రెండ్ అండ్ ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలకు ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలిస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన భూమిని కూడా గుర్తించాం. కాలుష్య రహితంగా ఉండేలా చర్యలు తీసుకున్నాకే పరిశ్రమల తరలింపు ఉంటుందని వెల్లడించారు. 1960 పరిశ్రమలను మొదటి దశలో తరలిస్తాం. ఓఆర్‌ఆర్ లోపల 1545 పరిశ్రమలు గుర్తించాం. షాద్‌నగర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

11:49 - December 22, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో జోగులాంబ గద్వా ల జిల్లాలో ఉమెన్స్ రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించటమే ప్రభుత్వ ధ్యేమని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. కేజీ టూ పీజీ విద్యావిధానంలో భాగంగానే రాష్ట్రంలో 487 గురుకుల పాఠాశాలను మంజూరు చేశామని కడియం తెలిపారు. వీటిలో 266 పాఠశాలలను ఇప్పటికే ప్రారంభించామనీ వచ్చే ఏడాది 221 పాఠశాలను ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్ కులాలకు చెందిన బాలికలకు 30 గురుకుల పాఠశాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

11:35 - December 22, 2016
10:59 - December 22, 2016
10:58 - December 22, 2016

హైదరాబాద్ : కొత్త క్యాష్ పంపిణీ పెరిగిందనీ..రోజుకు కనీసం 300 మంది లైన్ లో వుండేవారనీ..ఈరోజు కనీసం 50మంది ఖాతాదారులు కూడా లేరనీ ఆయన తెలిపారు. ప్రతీ బ్యాంకుకు సంబంధించిన ప్రతీ ఏటీఎం లలో నగదు అందుబాటులోవుంచాలనీ లేని పక్షంలో వివరణతో కూడిన లెటర్ ఇవ్వాలనే నిబంధన వుండటంతో ప్రతీ బ్యాంక్ సిబ్బంది అప్రమత్తం అయినట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆంధ్రా బ్యాంక్ ఏటీఎంలలో నగదును అందుబాటులో వుంచుతామని విద్యానగర్ ఆంధ్రా బ్యాంక్ తెలిపారు. రూ.500,100 నోట్లు వచ్చాయనీ..మరో నాలుగు రోజుల్లో నగదు చిల్లర కష్టాలు తీరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. పాత పెద్దనోట్ల రద్దు చేసి నేటికి 44 రోజులయ్యాయి.. గత 43 రోజులుగా సామాన్యులు బ్యాంకులు ఏటీఎం ల చుట్టూ ప్రదక్షిణలు చేసి అలసిపోయి అల్లాడిపోయారు. 50 రోజుల్లో నగదు కష్టాలను తీర్చేస్తామని కేంద్రం చెబుతోంది. ప్రతీరోజు ఉదయం 7 గంటల కల్లా లైన్లలో పడిగాపులతో క్రిక్కిరిసిపోయే బ్యాంకులు 43వరోజు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంటే సామాన్యులకు నగదు కష్టాలు తీరే రోజులు దగ్గరపడినట్టుగా తెలుస్తోంది. 

10:42 - December 22, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు అవసరమైన కొత్త నోట్లను అందుబాటులో ఉంచడంలో ఆర్బీఐ విఫలమైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విమర్శించారు. ప్రజల కష్టాలు రిజర్వు బ్యాంకుకు తెలియడంలేదున్నారు. బ్యాంకు అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. కాగా పాత కొత్త నోట్లు రద్దు అయిన 44 రోజులయ్యింది. కానీ ఇంతవరకూ నగదు కష్టాలలో సామాన్యులు కొట్టుమిట్లాడుతూనే వున్నారు. 

10:38 - December 22, 2016

తమిళనాడు : దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాడు గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోటి 25 లక్షల నగదు, 6 కిలోల బంగారం సీజ్‌ చేశారు. కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌లో 39 కోట్ల దొంగనోట్లు గుర్తించారు. సేలం సెంట్రల్‌ కార్పొరేషన్‌ బ్యాంక్‌లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో ట్రక్కులో తరలిస్తున్న 35 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే యూపీ సంబాల్‌లో 20 లక్షల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 31 లక్షల పాత 500, వెయ్యి నోట్లను పట్టుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కోల్‌కతాకు చెందిన వ్యాపారి పర్సమల్‌ లోధాను అరెస్ట్‌ చేశారు. దేశం విడిచిపోయేందుకు లోధా యత్నిస్తుండగా అరెస్ట్‌ చేశారు. 25 కోట్ల నగదు మార్పిడికి యత్నించారని లోధాపై అరోపణలున్నాయి. 

దేశవ్యాప్తంగా భారీగా నగదు పట్టివేత ..

ఢిల్లీ : రైల్వే స్టేషన్ లో రూ.31లక్షలు ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నదదులో రూ.500,1000 నోట్లు వున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో తమిళనాడు గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ నివాసంలో ఐటీ దాడులు చేపట్టారు. రూ.1.25 కోట్ల నగదు, 6 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. కోటక్ మహేంద్ర బ్యాంక్ లో రూ.39 కోట్ల దొంగనోట్లను గుర్తించారు. నవంబర్ 8వ తేదీ అనంతరం భారీగా నకిలీ నోట్లను డిపాజిట్ చేసినట్లుగా గుర్తింపు..సేలం సెంట్రల్ బ్యాంకులోనూ ఐటీ సోదాలు జరిపారు.

బడా వ్యాపారి లోధా అరెస్ట్..

ముంబై : కోల్‌కతాకు చెందిన బడా వ్యాపారవేత్త పరేష్‌మాల్‌ లోధాను ఈడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శేఖర్‌రెడ్డి, రోహిత్‌ టండన్‌కు సంబంధించిన దాదాపు రూ.25కోట్లు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు లోధా సహాయం చేసినట్లు ఈడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఐటీ,ఈడీ అధికారులు పలువురు ఇళ్లపై దాడులు చేసి కోట్లాది రూపాయలు నల్లధనాన్ని, కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. శేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన మరుసటి రోజే లోధాను కూడా అరెస్టు చేయడం గమనార్హం.

ఆరు బస్ లపై ఆర్టీఏ కొరడా..

రంగారెడ్డి: హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆరు బస్సులను అధికారులు జప్తు చేశారు. స్టేజ్ క్యారేజీల పేరుతో పర్మిషన్లు తీసుకుని ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా ఫైన్ వేస్తామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.

నగరానికి రానున్న రాష్ట్రపతి ప్రణబ్..

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పది రోజుల శీతాకాల విడిది కోసం గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 31 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా..గురువారం సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రపతి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఆయనకు స్వాగతం పలుకనున్నారు. 

వారణాశి కార్యకర్తలతో మోదీ ముఖాముఖి..

ఢిల్లీ : ప్రధాని మోదీ గురువారం వారణాశికి వస్తున్నారు. 20వేల మంది పార్టీ కార్యకర్తలతో ఆయన ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించనున్నారు. డీజిల్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ ఆవరణలో జరిగే కార్యకర్తలతో భేటీ కార్యక్రమం ఆయన వారణాశి పర్యటనలో ఓ కీలక అంశం. కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వారణాశి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వద్ద క్యాన్సర్‌, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు.

జీఎస్‌టీపై నేడు ఢిల్లీలో మండలి సమావేశం..

ఢిల్లీ : నమూనా వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు రూపకల్పనపై గురువారం జీఎస్‌టీ మండలి సమావేశం కానుంది. పన్ను చెల్లింపుదారులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన ఉన్న ఈ మండలి ఇప్పటి వరకూ ఏడు సార్లు సమావేశమయింది. నమూనా చట్టంలోని 20 అధ్యాయాలకు ఇప్పటికే ఆమోదం లభించింది. మిగిలిన ఏడు అధ్యాయాలపై చర్చ జరగాల్సి ఉంది. శుక్రవారం ద్వంద్వ నియంత్రణ సమస్యపై చర్చలు జరుపుతారు.

09:52 - December 22, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికించేస్తోంది. బైటకు రావాలంటేనే ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏపీలోని విఖాఖలో ఏజెన్సీలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా ఊటీగా..ప్రకృతి రమణీయతతో మైమరపించే పేరుగాంచిన లంబసింగిలో 3, చింతపల్లిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

09:50 - December 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈరోజు అసెంబ్లీలో టీఎస్..ఐసాప్ పై చర్చ జరుగనుంది. టీఎస్సీ నోటిఫికేసన్ పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ..గిరిజన తండాలను పంచాయితీలుగా మార్చటం పట్ల టీడీపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ తో సీపీఎం వాయిదా తీర్మానం ఇవ్వనుంది. వీటిపై అధికార పక్షం ఎలా స్పందించనుందో వేచి చూడాలి..

09:49 - December 22, 2016

విజయవాడ : నగరంలోని ఏ కన్వెన్షన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రెండోరోజు సమావేశంలో భాగంగా హెల్త్ స్కిల్ డెవలప్ మెంట్, విద్యాశాఖ, ఇంధన శాఖ, మౌలిక వసతులు అగ్రి బిజినెస్, టూరిజం, రాష్ట్రంలో శాంతి భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు చర్చించనున్నారు. మంగళవారం వృద్ధిరేటుపై చర్చించిన క్రమంలో ఈరోజు అంటే బుధవారం వృద్ధిరేటుపై మధ్యహ్నాం కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 

09:48 - December 22, 2016

విజయవాడ : వైసీపీ లో మరో వికెట్ డౌన్ అయ్యింది. కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పామర్రు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. రేపు మధ్యాహ్నం కల్పన టీడీపీ తీర్థం పుచుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పామర్రు నియోజకవర్గాన్ని తనకే కేటాయించాలని చంద్రబాబుతో కల్పన హామీ తీసుకున్న తరువాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే వర్ల రామయ్య ఉప్పులేటి రాకనుతీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత మూడేళ్ళుగా కల్పన..వర్ల రామయ్య మధ్య పోరాటం సాగుతోంది. తన అసంతృప్తిని పార్టీ అధిష్టానానికి తెలిపినా కల్పనను పార్టీలోకి చేర్చుకోవటం పట్ల వర్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వర్లను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తెదేపా తరపున రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె నిడుమోలు, పామర్రు నియోజకవర్గాల నుంచి రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో వైకాపా తీర్థం పుచ్చుకున్న ఆమె ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆ సమయంలో ఎన్నికల్లో తెదేపా నేత వర్ల రామయ్యపై కల్పన విజయం సాధించారు. దీంతోనే వర్ల రామయ్య పార్టీలోకి ఆమె రాకను వ్యతిరేకిస్తున్నాట్లుగా తెలుస్తోంది. 

09:47 - December 22, 2016

నల్లగొండ: జిల్లాలోని న్యూ ప్రకాశం బజార్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు యువకులు మృతి చెందారు. నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనానికి నలుగురు యువకులు ఫ్లంబర్ వర్క్ చేస్తుంటారు. వర్క్ పూర్తి అయిన అనంతరం భోజనం చేసేందుకు ముగ్గురు భవనం పైకి వెళ్లారు. భోజనం అయిన అనంతరం చేతులు కడుగుకునే క్రమంలో విద్యుత్ వైర్లను తాకటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఒకరిని కాపాడేందుకు వెళ్ళి మరో ఇద్దరు యువకులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భవనం పైనుండి కేకలు వినిపించటంతో లింగస్వామి అనే వ్యక్తి పైకి వెళ్ళి చూసేసరికి ముగ్గురు మృతిచెందినట్లుగా తెలిపారు. విజయ్, శివ, మరో యువకులు కంచెనపల్లి వాసులుగా గుర్తించారు. డిగ్రీ చదువుకుంటూ వీరు పార్ట్ వర్క్ చేస్తున్నారు. ముగ్గురూ ఇకే గ్రామం వారు కాగా వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన ముగ్గురు మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

09:46 - December 22, 2016

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటి నుండో ఓ మాట చెప్తానంటూ ఊరిస్తున్నాడు..నేను ఆ మాట చెప్తే భూకంపం  వస్తుందనీ..సంచలనమైపోతుందంటూ ఊదరగొట్టాడు..ఎట్టకేలకూ తను బాంబు అనుకుంటున్న ఆ మాటను బైటపెట్టాడు..అదే ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత అవినీతి చిట్టా బైటపెడితే ఆయనకు ఇబ్బంది కలుగుతుందనీ అన్నమాటలు.. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహారా, బిర్లా గ్రూపుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అక్టోబర్‌ 2013 ఫిబ్రవరి 2014 మధ్య 9 వాయిదాలలో సహారా గ్రూపు 40 కోట్లు మోదికి ఇచ్చినట్లు ఐటీ రికార్డుల్లో ఆధారాలున్నాయని ఆరోపించారు. బిర్లా గ్రూపు మోదికి 12 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. మోదికి ఇచ్చినట్లు ఐటీ రికార్డుల్లో ఆధారాలున్నాయని మోది సొంత రాష్ట్రం గుజరాత్‌లోని మహసాణాలో జరిగిన సభలో రాహుల్‌ మోదీపై ఆరోపణలు గుప్పించారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో శ్రీనివాస్ (బీజేపీ నేత) పున్నం కైలాష్ (కాంగ్రెస్ నేత) లక్ష్మణరావు ( విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ) పాల్గొన్నారు. 

09:45 - December 22, 2016

తెలంగాణలో అర్చకులు బాధాతప్త హృదయంతో వున్నారు. తెలంగాణ అర్చక ఉద్యోగుల విషయంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తీపి కబుర్లు చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇంకా నెరవేర్చలేదు. ఈ బాధే కొన్ని వేల మంది అర్చకులను బాధిస్తోంది. జనవరిలో నిరాహారదీక్షలు చేస్తామంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ కు నోటీసులిచ్చారు. తెలంగాణలో దేవాదాయ శాఖ దగ్గర రిజిష్టర్ అయిన ఆలయాలు 12,240 దాకా వున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకేరకమైన ఆదాయం రావడం లేదు. ఆదాయాన్ని బట్టి జీతాలిస్తున్నారు. 010 పద్దు తో ట్రెజరీల ద్వారా జీతాలివ్వాలంటూ కొన్నేళ్లుగా అర్చకులు కోరుతున్నారు. కానీ, ఇది తీరని కోరికగానే మిగిలింది. తెలంగాణ అర్చకులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు తెలంగాణ అర్చక ఉద్యోగుల జెఏసి కన్వీనర్ గంగు భానుమూర్తి 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు. 

09:44 - December 22, 2016

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌ రానున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. సాయంత్రం 5.30గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహాన్‌ స్వాగతం పలుకనున్నారు. 23న ఆర్మీ కాలేజీ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌ స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో ఫ్యాఫ్సీ అధ్యర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. 24న మహిళా దక్షత సమితి కార్యక్రమంలో పాల్గొంటారు.

09:43 - December 22, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియ‌ర్లు మ‌రోసారి కారాలు మిరియాలు నూరుకున్నారు. అసెంబ్లీ వేదిక‌గా గ్రూపు త‌గాదాల‌తో హీట్ పుట్టించారు. అసెంబ్లీ లాబీల్లో ఆ ఇద్దరి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. ఇంత‌కీ ఎవ‌రా ఇద్దరు ..? ఎవ‌రిని ఎవ‌రు టార్గెట్ చేశారు.. వాచ్‌ దిస్‌ స్టోరీ..

అసెంబ్లీలాబీలో చిటపటలాడిన కాంగ్రెస్‌ తాలింపు..
న‌ల్గొండజిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మాట‌ల తూటాలు పేల్చారు. అటు అధికార పార్టీని .. ఇటు స్వంత పార్టీనీ టార్గెట్ చేశారు. లాబీల్లో మీడియా ప్రతినిధుల‌తో చిట్ చాట్ చేసిన ఆయ‌న .. మంత్రి హ‌రీశ్ రావును పొగడ్తలతో ముంచెత్తారు.. తర్వాత సొంతపార్టీ నాయకులపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

హరీశ్‌ పోరాటయోధుడు.. టీఆర్‌ఎస్‌ పనికిరాని పార్టీ
మంత్రి హ‌రీశ్ రావు తెలంగాణ పోరాట యోధుడుగా అభివ‌ర్ణించిన కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి... టీఆర్‌ఎస్‌పై మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో టీఆర్ఎస్ ఐదు సీట్లకు మించి గెల‌వ‌లేద‌ని రాజ‌కీయ జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్, ఈటలతో పాటు మరో ముగ్గురు తప్ప ముఖ్యమంత్రి కూడా గెలిచే పరిస్థితి లేదని హాట్ కామెంట్స్‌ చేశారు.

జానారెడ్డి నిర్వాకంవల్లే తెలంగాణ క్రెడిట్‌ టీఆర్‌ఎస్‌కు దక్కింది
అధికార పార్టీనే కాదు.. సొంతపార్టీని వదల్లేదు కోమటిరెడ్డి. కాంగ్రెస్‌ నాయకుల నిర్వాకంవల్లే.. తెలంగాణ తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కిందన్నారు. జానారెడ్డి వల్లనే అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రాకుండా పోయిందన్నారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినపుడు.. మిగతా నాయకులెవరూ రాజీనామా చేయకుండా జానారెడ్డే అడ్డుకున్నారని కోమటిరెడ్డి విమర్శించారు.

మోటార్‌సైకిల్‌ యాత్ర చేస్తానన్న కోమటిరెడ్డి
రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తాను మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపడతానని కోమటిరెడ్డి ప్రకటించారు. అయితే యాత్రకు పార్టీపరంగా అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నిస్తే.. భగ్గున మండిపడ్డారు. తనకు ఎవరి అనుమతి అక్కరలేదని పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌నే టార్గ్‌ చేశారు.

కోమటిరెడ్డి యాత్ర ప్రస్తావనపై భగ్గుమన్న పాల్వాయి
కోమటిరెడ్డి ఇలా రెచ్చిపోతున్న సమయంలో అసెంబ్లీలాబీలోకి సీనియర్‌ నేత పాల్వాయి ఎంటరయ్యారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. యాత్రలు చేస్తే.. కోమటిరెడ్డి వైస్‌ఆర్‌ అవుతాడా అని ఎద్దేవాచేశారు పాల్వాయి. అంతటితోనే ఆగలేదు. కోమటిరెడ్డి పగటికలలు కనడం మానుకోవాలని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి పీసీసీ పీఠాన్ని డబ్బుపెట్టి కొనాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డే కొనసాగుతారని పాల్వాయ్ స్పష్టం చేశారు. మరోవైపు పాల్వాయి సొంత నియోజవర్గం మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాగావేస్తున్నారన్న వాదనపై పాల్వాయి కస్సుబుస్సులాడారు. మునుగోడు కోమటిరెడ్డి జాగీరుకాదన్నారు. మొత్తానికి అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకున పెట్టాల్సిన ప్రధాన‌ప్రతిప‌క్ష పార్టీ నేత‌లే .. ఉప్పునిప్పులా చిటపటలాడారు. ఇదంతా చూసిన మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు మాత్రం నవ్వుకుంటున్నారు. ఒకరినొకరు విమర్శించుకుని.. పార్టీపరువును రచ్చకీడుస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. 

09:41 - December 22, 2016

ఢిల్లీ : పూటకో మాట.. రోజుకో నిర్ణయం.. నగదు కష్టాలతో సామాన్యుడు మాత్రం తిప్పలు పడుతూనే ఉన్నాడు. క్యాష్‌లెస్‌ ఎకానమీ పేరుతో.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. చిరుద్యోగుల జీతాల చెల్లింపులు ఇక నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారానే జరగాలని ..కొత్త నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం.

రోజుకో నిర్ణయంతో సామాన్యుడు తికమక
పెద్దనోట్ల రద్దుతో విలవిల్లాడుతున్న సామాన్యుణ్ని రోజుకో కొత్త నిర్ణయంతో.. మరింత తికమక పెడుతోంది మోదీ ప్రభుత్వం. క్యాష్‌లెస్‌ ఎకానమీ మోజుతో కేంద్ర పాలకులు అటు బ్యాంకులను, ఇటు ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు.

కనీస వేతనాల చట్టం- 1936కు కేంద్రం సవరణ
నగదు రహిత లావాదేవీల మోజులో ఉన్న కేంద్ర సర్కారు.. కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల చట్టం-1936ను సవరించింది. దీనిపై ఆర్డినెన్సును త్వరలోనే వెలువరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటిదాకా 18వేల రూపాయల లోపు వేతనం పొందుతున్న కార్మికులకు.. నగదు రూపంలోనే జీతాలు చెల్లిస్తున్నారు. అయితే రానున్న ఆర్డినెన్సుతో.. కార్మికుల కనీస వేతనాల మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం, లేదా చెక్‌ల రూపంలోనో చెల్లిస్తారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన చట్ట సవరణ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. 

ఈనె 15 నే లోక్‌సభలో వేతనాల చట్టం-1936 సవరణ బిల్లు
కనీస వేతనాల చట్టం-1936 సవరణకు సంబంధించి .. ఈనెల 15వ తేదీనే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం. అయితే.. సభాకార్యక్రమాలు సజావుగా సాగకపోవడంతో బిల్లు సభ్యుల ఆమోదం పొందలేక పోయింది. ప్రస్తుతం జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. అలోగా అంటే ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల వేతనచెల్లింపుల చట్టం-2016 బిల్లును ఆమోదింప చేసకునే యోచనలో ప్రభుత్వం ఉంది.

డిపాజిట్లపై ఆర్బీఐ యూటర్న్‌
మరోవైపు బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆంక్షలు పెట్డడాన్ని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆర్‌బీఐ యూటర్న్‌ తీసుకుంది. దీంతో డిసెంబర్‌ 30 వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు చేసే వీలు కలిగింది. అటు ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌డ్రాపై విధించిన 2500 రూపాయల పరిమితిని కూఆ ఆర్‌బీఐ వెనక్కు తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు.

కేంద్ర నిర్ణయాలతో సామాన్యుడు గందరగోళం
మొత్తానికి నగదు కష్టాలపై పూటకో నిర్ణయంతో సామన్యుణ్ని మరింత గందరగోళంలో పడేస్తోంది. మోదీ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.  

07:15 - December 22, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ర్యాంకులు ప్రకటించారు. 14 అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం..నియోజక వర్గాల వారిగా ర్యాంకులను ప్రకటించారు. ఒక్క రోజు వర్క్‌షాపులో టీడీపీ ప్రజాప్రతినిధులకు ర్యాంకులు ఇచ్చిన సీఎం..నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. దీనిలో ప్రథమ స్థానాన్ని నాలుగు నియోజకవర్గాలు కైవసం చేసుకోగా..చివరి మూడు స్థానాల్లో రాజమహేంద్రవరం, సింగనమల, విశాఖ వెస్ట్‌ నిలిచాయి.

మరోసారి ర్యాంకులను ప్రకటించిన చంద్రబాబు
రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో రెండంకెల వృద్ధి, వివిధ అభివృద్ధి సూచీలపై ఏపీలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా 14అంశాలను పరిగణలోకి తీసుకుని టాప్ 12 నియోజకవర్గాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రాస్ వాల్యూ ఆడిట్, తలసరి ఆదాయం, నీరు-ప్రగతి, మీకోసం ఫిర్యాదుల పరిష్కారం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ల పంపిణీ, రహదారులపై అధ్యయనం అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు.

ర్యాంకుల్లో పశ్చిమగోదావరి జిల్లా టాప్‌
చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో పశ్చిమగోదావరి జిల్లా టాప్‌లో నిలిచింది. జిల్లాలోని గోపాలపురం, భీమవరం, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అదే జిల్లాకు చెందిన నిడదవోలు, తణుకు నియోజకవర్గాలు 8,9 స్థానాల్లో నిలిచాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండపేట 5వ స్థానంలో నిలువగా.. రాజమండ్రి 10వ స్థానాన్ని కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. 6వ స్థానంలో కృష్ణా జిల్లా గన్నవరం ఉండగా..గుంటూరు జిల్లా చిలకలూరిపేట 7వ స్థానం దక్కించుకుంది. అనంతపురం జిల్లాలోని శింగనమల 11వ స్థానంలో..విశాఖ వెస్ట్‌ 12వ స్థానంలో నిలిచాయి. టీడీపీ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలు, ఇన్‌ చార్జీల పనితీరుపై ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు.. నియోజకవర్గాలకు ర్యాంకులు ఇవ్వడంతో మంత్రులు ,ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలయింది.

కారు చెట్టును ఢీకొని ఇద్దరు మృతి..

వరంగల్ : రూరల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సంపేట మండలం మహేశ్వరం వద్ద అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రగా గాయపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి..

నల్లగొండ: జిల్లాలోని న్యూ ప్రకాశం బజార్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఓ బిల్డింగ్‌లో ఫ్లంబర్ వర్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Don't Miss