Activities calendar

23 December 2016

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం

చిత్తూరు : శాంతిపురం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుంజార్లపల్లి, గుండిశెట్టిపల్లిలో పంట పొలాలపై దాడి చేశాయి. ఇద్దరు రైతులపై ఏనుగులు దాడికి చేశాయి. స్థానికులు ఏనుగులను కర్నాటక వైపు తరుముతున్నారు. కర్నాటక రైతులు తమ భూభాగంతోకి రాయనీకుండా ఏనుగులను ఆంధ్రా వైపు తరుముతున్నారు. 

22:07 - December 23, 2016

హైదరాబాద్ : అవినీతి ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆ పార్టీ జాతీయ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల ప్రజల ఇబ్బందులపై వచ్చే నెల 3 నుంచి 10 వరకు దేశ వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనవరి 23న హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

21:55 - December 23, 2016

బెర్లిన్‌ : జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని క్రిస్మస్‌ మార్కెట్లో ఉగ్రదాడికి పాల్పడిన పాక్ యువకుడు అనిస్ అమ్రి అనే వ్యక్తిని పోలీసులు కాల్చిచంపారు. ఇటలీలోని మిలాన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అతడిని హతమార్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం మిలానీ రైల్వేస్టేషన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆమిర్‌ వారికి పట్టుబడ్డాడు. దీంతో గుర్తింపు పత్రాలు చూపించమని అడగటంతో అతను తుపాకీతో పోలీసులపై దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అతడిని హతమార్చినట్లు తెలిపారు. సోమవారం రాత్రి క్రిస్మస్‌ మార్కెట్లో ఉన్న పాదచారుల పైకి ఓ నలుపు రంగు ట్రక్కుతో అనిస్ బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. 

21:52 - December 23, 2016

ట్రిపోలీ : లిబియాలో విమానం హైజాక్‌ కథ సుఖాంతమైంది. హైజాకర్లతో 2గంటల పాటు చర్చల అనంతరం... 118 ప్రయాణికులను, విమాన సిబ్బందిని హైజాకర్లు విడుదల చేశారు. మాల్టా ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు. సబ నుంచి ట్రిపోలికి వెళ్తున్న ఆఫ్రిక్వయ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఇద్దరు హైజాకర్లు... దారి మళ్లించి... లిబియా పక్కనే ఉన్న మాల్టా విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. లిబియా మాజీ అధ్యక్షుడు గడాఫీ సానుభూతిపరులుగా చెప్పుకున్న హైజాకర్లు... విమానాన్ని పేల్చివేస్తామని హెచ్చిరంచారు. దీంతో మాల్టా అధికారులు... హైజాకర్లతో చర్చలు జరిపి.. ప్రయాణికులను విడిచిపెట్టేలా ఒప్పించారు. అనంతరం.. ఇద్దరు హైజాకర్లను అదుపులోకి తీసుకొన్నారు. 

 

21:50 - December 23, 2016

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 15న శ్వాస సంబంధమైన వ్యాధితో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం కొద్దిరోజులుగా నిలకడగా ఉండటంతో.. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సమయంలో కరుణ వెంట ఆయన కుమారుడు స్టాలిన్‌తో పాటు కుటుంబసభ్యులు, పార్టీ నేతలు ఉన్నారు. 

 

21:45 - December 23, 2016

ఉత్తరాఖండ్ : నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలించేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకోలేదని, ఇది ఓ ఆర్థిక దోపిడీ అంటూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌లో అల్మోరాలో జరిగిన బహిరంగసభలో రాహుల్‌ ప్రధానిని టార్గెట్‌ చేశారు. పెద్దనోట్ల రద్దు కారణంగా పేదలు,  రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఒక్కశాతం ఉన్న అత్యంత ధనికుల వద్దే నల్లధనం ఉందని, 99 శాతం ప్రజలు నిజాయితీపరులేనని రాహుల్‌ అన్నారు. గత రెండున్నరేళ్లలో మోది పేదలపై దాడి చేయడం తప్ప మరేమి చేయలేదని ఆరోపించారు. 

 

21:41 - December 23, 2016

గుంటూరు : నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో  అతిపెద్ద కుంభకోణం జరిగిందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. నోట్లరద్దుపై చలో వెలగపూడి పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రఘువీరా నిప్పులు చెరిగారు. బ్యాంకులకు టోపీపెట్టి వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన బడాబాబులకు మోదీ నిర్ణయం మరింత కలిసివచ్చిందన్నారు. నల్లకుబేరులు మరింత నల్లధనం కూడబెట్టుకోడానికి ప్రధాని పెద్దనోట్లు రద్దు చేశారని రఘువీరా ఆరోపించారు. 

 

ఉద్యోగుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ఉద్యోగుల సంక్షేమంపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల అంశాలపై చర్చించారు. 

21:37 - December 23, 2016

దత్తత గ్రామాలల దండిగైన ఇండ్ల పండుగ.. ఉండాలే సారు తతిమ్మఊర్లకు అండగ, పనిలేని పార్టీలను రద్దు చేసిన ఓట్ల సంఘం.. అన్నా టీడీపీకి ఇవే అంతిమ ఘడియలు, గజ్వేలును అనుకోవోతున్న హైద్రాబాద్ తొవ్వ... ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఇంకోటేస్తరంటనే అవ్వ, బీబీ నగర్ నీమ్స్ దావఖాన్ల తొండల గుడ్లు.. ఈ తరీకల తయారుజేసినోళ్లకు వెరీ గుడ్లు, పారిన్ పొల్ల.. కరీంనగర్ పొలగాడు.. కన్యాదానం జేసిన యూరప్ దిక్కోళ్లు, మైదాకువెట్టుకునుట్ల మనోళ్లదే రికార్డు...మాట ముచ్చట్ల గూడ ఇయ్యాలే అవార్డులు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:05 - December 23, 2016

విజయవాడ : టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో పాటు.. పలువురు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానని కల్పన తెలిపారు. 
ఉప్పులేటి కల్పన టీడీపీ తీర్థం 
కృష్ణా జిల్లాలో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు సమక్షంలో ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. ఉప్పులేటి కల్పనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప్పులేటితో పాటు.. 14 మంది వైసీపీ ఎంపీటీసీలు, ఇద్దరు జడ్పీటీసీతో పాటు 12 మంది సర్పంచులు, నాలుగు మండలాల వైసీపీ అధ్యక్షులు తెలుగుదేశంలో పార్టీలో చేరారు. 
రాష్ట్ర అభివృద్ధి కోసం అందరీ సహకారం : చంద్రబాబు 
అభివృద్ధిని చూసి అన్ని పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో కష్టాలు ఉండేవని.. అంచెలంచెలుగా సమస్యలన్నీ అధిగమిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరీ సహకారం కావాలన్నారు. 2019 వరకు పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. 
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి : ఉప్పులేటి 
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఉప్పులేటి కల్పన తెలిపారు. రికార్డ్‌ కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని.. దీంతో పామర్రు నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించారని ఆమె కొనియాడారు. ఉప్పులేటి కల్పనతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని వర్ల రామయ్య అన్నారు. మరి నిన్నటి వరకు కల్పన చేరికపై అసంతృప్తిగా ఉన్న వర్ల రామయ్య.. భవిష్యత్‌లో ఆమెతో కలిసి ఏ విధంగా పని చేస్తారో చూడాలి. 

 

20:52 - December 23, 2016
20:51 - December 23, 2016
20:50 - December 23, 2016

కరీంనగర్ : తొలిపరిచయంలో ఊసులు కలబోసుకున్నారు. స్నేహితులు కాస్తా ప్రేమికులుగా మారారు. ఇండియా అబ్బాయి-ఫ్రాన్స్‌ అమ్మాయి దండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. కరీంనగర్‌ జిల్లా వీణవంకమండలం బేతిగల్‌ గ్రామానికి చెందిన యువకుడు.. ఉన్నత విద్యకోసం ప్యారిస్‌ వెళ్లాడు. అక్కడే తన క్లాస్‌మేట్‌ సఖిరాగ్రిల్‌ను ప్రేమించాడు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకోడానికి నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు.  జమ్మికుంటలో జరిగిన వివాహానికి బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో హజరయ్యారు. 

 

లిబియాలో విమానం హైజాక్ కథ సుఖాంతం

ట్రిపోలీ : లిబియాలో విమానం హైజాక్ కథ సుఖాంతం అయింది. ప్రయాణికులందరినీ హైజాకర్లు విడుదల చేసినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది.

అడ్ హక్ టీచర్ల క్రమబద్దీకరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : అడ్ హక్ టీచర్ల క్రమబద్దీకరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న 18 మంది అడ్ హక్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సర్వీసును పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు.

20:22 - December 23, 2016

ఢిల్లీ : జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని కేంద్రం భరించే విషయంలో రేపు ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 7వ జీఎస్టీ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. 3 అంశాలు మినహా అన్ని అంశాలపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సీఎస్ టీ బకాయిల తరహాలో కాకుండా ప్రతి 3 నెలలకు ఓసారి జీఎస్టీ పరిహారం చెల్లించేలా చూడాలని ఈటల సూచించారు. పరిహారం చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. 

 

20:19 - December 23, 2016

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులకు మహర్దశ పట్టిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ రెండున్నరేళ్లలో 2 వేల 760 కిలోమీటర్ల జాతీయ రహదారులను సాధించుకున్నామని అన్నారు. అప్పుచేసైనా తెలంగాణ రాష్ర్టంలోని రహదారులను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి తుమ్మల. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామన్నారు.
రహదారుల విషయంలో తెలంగాణపై తీవ్ర వివక్షత : కేసీఆర్  
సమైక్య రాష్ట్రంలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ తీవ్ర వివక్షతకు గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొత్త జాతీయ రహదారులను సాధించుకున్నామని సభ దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులపై సీఎం కేసీఆర్ స్వల్ప కాలిక చర్చ చేపట్టారు. 
రెండున్నరేళ్లలో 19 జాతీయ రహదారులు కేసీఆర్   
గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో సాధించని హైవేల కన్నా తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 19 జాతీయ రహదారులను సాధించిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5వేల 303 కిలోమీటర్లకు పెరగనుందని తెలిపారు. జలరవాణాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో నేషనల్  హైవేలను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు వేస్తామని తెలిపారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని వివరించారు.
రహదారుల నిర్మాణంపై మాట్లాడిన విపక్షాలు 
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను హైదరాబాద్‌లో అనుసంధానం చేస్తూ నాలుగు లేన్ల రోడ్లను నిర్మించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరుకు రవాణ కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఏపీలోని ఓడ రేవులకు అనుసంధానం చేసే విధంగా ఈ డ్రై పోర్టు ఉండాలని సూచించారు. రోడ్ల నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన రాజీవ్‌ రహదారి కూడా కుంభకోణాల మయంగా మారిందన్నారు.
వారికి పరిహారం పెంపు పరిశీలన : మంత్రి పద్మారావు
ప్రమాదాల్లో మరణించిన కల్లుగీత కార్మిక కుటుంబాలకు చెల్లిస్తున్న పరిహారాన్ని పెంచే అంశం పరిశీలనలో ప్రమాదాల్లో మరణించిన కల్లుగీత కార్మిక కుటుంబాలకు చెల్లిస్తున్న పరిహారాన్ని పెంచే అంశం పరిశీలనలో ఉందని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రస్తుతం రెండు లక్షల రూపాయలుగా ఉన్న పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పద్మారావు హామీ ఇచ్చారు. 
హోం గార్డులను రెచ్చగొట్టొద్దు : హోంమంత్రి నాయిని 
సమ్మెలు, ధర్నాలు దిశగా హోం గార్డులను రెచ్చగొట్టొద్దని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు కాపాడ వలసిన పోలీసు శాఖలో ఆందోళనకు ఆస్కారంలేదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

 

20:15 - December 23, 2016

ట్రిపోలీ : లిబియా విమానాన్ని హైజాక్‌ చేశారు. ఆఫ్రికియా ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌బస్‌-ఎ320 పాసింజర్‌ విమానాన్ని హైజాక్‌ చేశారు. విమానంలో 118 మంది ప్రయాణికులున్నారు. ఈ విమానాన్ని మాల్టాలో నిలిపివేశారు. ఈ విషయాన్ని మాల్టా ప్రధాని జోసెఫ్‌ మస్కట్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. జోసెఫ్‌ మస్కట్‌ లిబియా ప్రధాని ఫైజల్‌ సెరాజ్‌తో దీనిపై మాట్లాడారు. సెక్యూరిటీ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులు విమానాన్ని హైజాక్‌ చేసినట్లు సమాచారం. హైజాకర్లు మహిళలను, పిల్లలతో సహా మొత్తం 65 మంది ప్రయాణికులను వదిలిపెట్టారు. సబా నుంచి ట్రిపోలికి వెళ్తూ మార్గమధ్యంలో విమానం హైజాక్‌కు గురైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:01 - December 23, 2016

గుంటూరు : జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి రావెల కిశోర్‌బాబు స్పందించారు. జాన్‌మూన్‌ చేసిన ఆరోపణలపై విచారించుకోవచ్చన్నారు. జానీమూన్‌ తనకు కూతురు లాంటిదని, కళ్లో కూడా తనకు ఏ హాని తలపెట్టనని మంత్రి రావెల చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, పార్టీ శాశ్వతమని.. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం జానీమూన్‌తో సమావేశమై పరిష్కరించుకుంటామన్నారు. రావెల వల్ల తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ తెలిపిన విషయం తెలిసిందే. 

 

19:56 - December 23, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌  చేస్తూ... కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల ప్రధాన కార్యదర్శి వినోద్ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:39 - December 23, 2016

గుంటూరు : జిల్లాలోని టీడీపీలో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి రావెల కిషోర్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమున్‌ ఆరోపించారు. తన అనుచరులతో చంపుతానని బెదిరిస్తున్నారని జానీమున్‌ విమర్శించారు. రావెల అనుచరులు తన ఇంటిపై దాడికి ప్రయత్నించారని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు జానీమున్‌ తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తన విధులకు రావెల అడ్డుతగులుతున్నారని పేర్కొన్నారు. రావెల ఆగడాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినా మార్పులేదన్నారు. రావెల దండు పేరుతో ఆయన అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పారు. తనకు అదనపు రక్షణ కావాలని పోలీసులను కోరానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

లిబియాలో కొనసాగుతోన్న టెన్షన్

ట్రిపోలీ : లిబియాలో ఎయిర్ బస్...ఎ 320 విమానం హైజాక్ అయిన నేపథ్యంలో టెన్షన్ కొనసాగుతోంది. విమానంలో 118 మంది ప్రయాణికులు ఉన్నారు. 

జానీమూన్ నా కూతరు లాంటిది : మంత్రి రావెల కిషోర్ బాబు

గుంటూరు : జడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తమని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. జానీమూన్ తన కూతురు లాంటిదని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని. పార్టీ శాశ్వతమన్నారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు. 

ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ ఏడో సమావేశం

ఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ ఏడో సమావేశం ముగిసింది. జనవరి 3, 4 తేదీల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సీజీఎస్ టీ, ఎస్ జీఎస్టీ ప్రాథమిక డ్రాఫ్టులు ఆమోదం పొందాయి. సీజీఎస్ టీ, ఎస్ జీఎస్టీ డ్రాఫ్టుల్లో కొన్ని మార్పులు చేయాలని అరుణ్ జైట్లీ అన్నారు. 

 

19:09 - December 23, 2016

భూపాలపల్లి : మిషన్ కాకతీయ పనులలో అధికారుల చేతివాటం మరోసారి బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఇరిగేషన్ డీఈ ఆంజనేయులు 15000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సింగార గ్రామ చెరువు కాంట్రాక్టర్ జగన్‌మ్మోహన్‌రావు తనకు రావాల్సిన 4లక్షల రూపాయలు బిల్ ఇవ్వాలని డీఈని అడగగా తనకు 50వేల రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ సాయిబాబాకు సమాచారం అందించాడు. దీంతో  డబ్బులు తీసుకుంటుండగా... ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 

 

19:01 - December 23, 2016

హైదరాబాద్ : కార్పొరేట్‌ స్కూల్‌ వైపే అందరి చూపు..ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు... సర్కారీ బడుల్లో అయితే చదువు 
వంటబట్టదని, ప్రైవేట్‌ విద్యకు పట్టంకడుతున్న రోజులివి. కానీ జామా-ఈ-ఉస్మానియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను..చూస్తే ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరిజ్ఞానానికి కొదవే లేదని అర్థమవుతుంది. 
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ 
ప్రతిభ విషయంలో... ఏ కార్పొరేట్ స్కూల్‌కి తీసిపోమని నిరూపిస్తున్నారు జామా ఈ ఉస్మానియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. సర్కారి బడిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. స్కూల్లో వీళ్లు ఏర్పాటు చేసిన సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌ దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా  పాఠశాలలో వారంరోజుల పాటు ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. 
కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు
పాఠశాలలో ఏర్పాటు చేసిన సైండ్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌లో పర్యావరణ కాలుష్యంపై అవగాహన కలిగేలా విద్యార్థులు  ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేశారు.... గతంలో మూసీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది... అడవులు ఎలా అంతరించి పోతున్నాయి... అన్నవాటిపై చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే సైన్స్‌కు సంబంధించిన అనేక విషయాలను వివరించారు. 
పెరుగుతున్న చెత్తకు చెక్‌ పెట్టిన విద్యార్థులు
ఇక పెరుగుతున్న చెత్తకు ఒక చక్కటి చిట్కాను చూపించారు ఈ విద్యార్థులు... వాడిపడేసిన వస్తువుల ద్వారా గృహలంకరణకి ఎలా ఉపయోగించుకోవచ్చో చేసి చూపించారు. అలాగే సో లార్‌ విద్యుత్‌తో నడిచే ఫ్యాన్, ఫుడ్‌ కోర్ట్ ఇవన్ని వారు స్వయంగా తయారు చేసి.. వాటి ఉపయోగాన్ని వివరించారు. ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం లభిస్తే మరిన్ని అద్భుతాలు చేసి చూపుతామని విద్యార్థులు అంటున్నారు. 

 

18:53 - December 23, 2016
18:50 - December 23, 2016
18:44 - December 23, 2016

భద్రాద్రి : కొత్తగూడెంలో సింగరేణి వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రకాశం గ్రౌండ్‌లో సింగరేణి జెండాను ఊపి 2కె రన్‌ను సింగరేణి డైరెక్టర్ పవిత్రన్ కుమార్ ప్రారంభించారు. అనంతరం సింగరేణి జెండాను ఎండీ శ్రీధర్ ఆవిష్కరించారు. సింగరేణి ప్రస్థానం, పురోభివృద్ధి, స్వాలంభన, సంక్షేమంకు సంబంధించిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. సింగరేణి వార్షికోత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

 

18:39 - December 23, 2016

చిత్తూరు : జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో మళ్లీ ఏనుగుల దాడులు మొదలయ్యాయి. కర్నాటక నుంచి వచ్చిన ఏనుగుల గుంపు అటవీ సరిహద్దు గ్రామాలపై దాడులకు పాల్పడుతోంది. పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఏనుగుల దాడులను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. 
ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు, ఏవైపు నుంచి ఏనుగుల గుంపు దాడి చేస్తుందో తెలియక స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుడుపల్లె, శాంతిపురం మండలాల పరిధిలో ఐదారు రోజులుగా ఏనుగుల గుంపు దాడులకు పాల్పడుతోంది. కర్నాటక ప్రాంతం నుంచి వచ్చిన గజరాజుల మంద  టమోటా, బీన్స్‌, అరటి , మొక్కజొన్న పంటలను ధ్వంసం చేస్తోంది. పంటలను ధ్వంసం చేయడమే కాకుండా, వ్యవసాయ పరికరాలనూ నాశనం చేస్తుండడంతో రైతులకు అపారనష్టం వాటిల్లుతోంది.
ఏనుగుల సంచారం
గుడుపల్లె మండలంలోని పొగురుపల్లి, గుడిచంబగిరి, శాంతిపురం మండలంలోని నాయనపల్లి, నాచికుప్పం, చౌడంపల్లిలో గజరాజుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. పంటపొలాల సమీపంలోని అడవుల్లో ఇవి సంచరిస్తున్నాయి. రాత్రి సమయంలో పొలాలను నాశనం చేస్తూ రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి.
సత్ఫలితాలు ఇవ్వని అధికారుల చర్యలు
ఏనుగుల గుంపును తరిమేందుకు అధికారులు కొద్దిపాటి చర్యలు తీసుకుంటున్నా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు.  గజరాజులను కర్నాటక అటవీప్రాంతానికి తరిమేందుకు ఆంధ్రా ఫారెస్ట్‌ , పోలీసు అధికారులు టపాసులు పేల్చుతున్నారు.  మరోవైపు కర్నాటక ఫారెస్ట్‌ అధికారులు, రైతులు సైతం తమ ప్రాంతంలోకి ఏనుగులు అడుగుపెట్టకుండా టపాసులు, డప్పులతో శబ్దాలు చేస్తున్నారు.  దీంతో ఎటు పోవాలో తెలియక ఏనుగులు తలోదిక్కు పరుగులు పెడుతున్నాయి. ఆంధ్రా, కర్నాటక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఏనుగుల సమస్య పరిష్కారం కావడం లేదు.
ఏనుగుల దాడిలో యువకుడికి గాయాలు
బుధవారం ఏనుగుల గుంపు శాంతిపురం మండలం చౌడంపల్లి వ్యవసాయక్షేత్రాల్లో ప్రత్యక్షమయ్యింది.  సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు గజరాజులను తరిమివేసేందుకు  టపాసులు కాల్చుతూ  పెద్దపెద్ద శబ్దాలు చేశారు. అయినా ఏనుగులు మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు.  పైగా అవి జనాలపైకి తిరగబడడంతో చౌడంపల్లికి చెందిన నాగరాజు అనే యువకుడు గాయపడ్డారు.  వెంటనే అతడిని కుప్పంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చౌడంపల్లికి అరకిలోమీటరు దూరంలోనే ఏనుగుల మంద సంచరిస్తుండడంతో  ప్రజలు హడలిపోతున్నారు.
నిత్యకృత్యమైన ఏనుగుల దాడి
కుప్పం ప్రాంతంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు గతంలో కోట్లాది రూపాయలు వెచ్చింది ఏర్పాటు చేసిన సోలార్‌ ఫెన్సింగ్‌ పనిచేయడం లేదు.  కుప్పం రిజర్వుఫారెస్ట్‌ చుట్టూ గతేడాది మొదలుపెట్టిన కందకాల తవ్వకం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఏనుగుల దాడులు నిత్యకృత్యమయ్యాయి.  ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతనిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.  మరి ఏనుగుల దాడులను ఎదుర్కొనేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

 

18:35 - December 23, 2016
18:33 - December 23, 2016

ముంబై : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తన సత్తా మరోసారి చూపించాడు. సుల్తాన్‌తో బాక్సాఫీసు రికార్డులు తిరగరాసిన సల్మాన్‌ ఫోర్బ్స్‌ 2016 ప్రముఖుల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ రెండో స్థానంలో, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మూడోస్థానంలో నిలిచారు. కాగా ఖ్యాతి పరంగా తొలి స్థానంలో కోహ్లి నిలిచాడు. గతేడాది ప్రముఖుల జాబితాలో షారుఖ్‌ తొలిస్థానంలో నిలవగా.. సల్మాన్‌ రెండు, కోహ్లి ఏడో స్థానంలో నిలిచారు. సల్మాన్‌, షారుఖ్‌ స్థానాలు మార్చుకోగా.. కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకాడు. ఈ ఏడాదికి సంబంధించి ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ టాప్‌ 100 భారతీయ ప్రముఖుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొణె ఆరో స్థానంలో, ప్రియాంక చోప్రా 8వ స్థానంలో నిలిచారు. దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 30వ స్థానంలో నిలిచారు. ఇక తెలుగు హీరోలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. మహేశ్‌బాబు-33 , అల్లుఅర్జున్‌ 43, ఎన్టీఆర్ 55, రాంచరణ్‌ 67 స్థానాల్లో నిలిచారు.

18:24 - December 23, 2016

ఢిల్లీ : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన నజీబ్‌జంగ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలుసుకున్నారు. సుమారు గంటన్నర సేపు వీరిద్దరు సమావేశమయ్యారు. మరోవైపు నజీబ్‌జంగ్‌ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. అంతకు ముందు ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నజీబ్‌జంగ్‌ను కలిసారు. వీరిద్దరి మధ్య సుమారు గంటసేపు సమావేశం జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే ఎల్జీ పదవికి జంగ్‌ రాజీనామా చేశారని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తెలిపారు. జంగ్‌ రాజీనామా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బిజెపి వత్తిడితోనే రాజీనామా చేశారన్న కాంగ్రెస్‌ ఆరోపణలను హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజ్జు ఖండించారు. ఢిల్లీ కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కేంద్రం ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.

 

17:55 - December 23, 2016

ట్రిపోలీ : లిబియాలో ఎయిర్ బస్ 320 ఏ విమానం హైజాక్ అయింది. లిబియా నుంచి ట్రిపోలీ వెళ్తున్న విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానాన్ని పేల్చివేస్తామని హైజాకర్లు బెదిరిస్తున్నారు. విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నారు. హైజాగ్ అయిన విమానం మాల్దాలో ల్యాడింగ్ అయింది. విమానంలో 118 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో విదేశాలకు చెందిన వారు అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే హైజాక్ చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:48 - December 23, 2016

చెన్నై : తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహనరావు ఐటీ శాఖకు ఎలా పట్టుబడ్డాడు? రామ్మోహనరావు అక్రమ మార్గంలో సంపాదించిన కోట్ల రూపాయల నగదు, బంగారం స్వాధీనం చేసుకునేందుకు ఐటీ అధికారులకు ఎవరు సమాచారం ఇచ్చారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డికి, రామ్మోహన్‌రావుకు ఉన్న సంబంధాలేమిటి? తమిళనాడు సీఎం జయలలిత చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది? 
ఐటీ శాఖకు చిక్కిన రామ్మోహనరావు, శేఖర్ రెడ్డి    
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డి, తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహనరావులు ఐటీ శాఖకు అడ్డంగా బుక్కవడం ఇటు తెలుగు, అటు తమిళ రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ ఇద్దరు ఐటీ అధికారులకు ఎలా పట్టుబడ్డారన్నది చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు సీఎం జయలలిత చనిపోయిన రోజు.. అప్పుడు సీఎస్‌గా ఉన్న రామ్మోహనరావు, చెన్నై కాంట్రాక్టర్‌ శేఖర్‌ రెడ్డి చాలా సేపు టెలిఫోన్లో మాట్లాడుకున్నారు. కొత్తగా మార్చిన కరెన్సీని భద్రపరచడంపై ఇద్దరూ చర్చించుకున్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో కరెన్సీని మారుస్తున్న వారిపై నిఘా పెంచిన ఐటీ శాఖ..శేఖర్‌రెడ్డి ఫోన్‌ సంభాషణలను ట్రాప్‌ చేశాయి. దీంతో శేఖర్‌ రెడ్డి సీఎస్‌ మధ్య జరిగిన సంభాషణలు వెలుగుచూశాయి. 
శేఖర్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు 
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు శేఖర్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. శేఖర్‌ రెడ్డి ఇంట్లో 177 కిలోల బంగారం, 132 కోట్ల కరెన్సీని సీజ్‌ చేశారు. ఆ తర్వాత రామ్మోహనరావు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహనరావు కుమారుడు వివేక్‌ ఇంట్లో 18లక్షల కొత్త కరెన్సీతో పాటు రెండు కిలోల బంగారాన్ని ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
రామ్మోహన్‌ రావు ఇళ్లలో ముగిసిన ఐటీ తనిఖీలు 
మరోవైపు రామ్మోహన్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిపిన సోదాల్లో 15 కేజీల బంగారం, 24 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, 3 హార్ట్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహనరావు ఆఫీస్‌ నుంచి మొత్తం 40 ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. వంద కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తిరువాన్మియూరులోని రామ్మోహన్‌ రావు కుమారుడు వివేక్‌ నివాసం, కార్యాలయం, వలసరవాక్కంలోని వివేక్‌ న్యాయవాది అమల్‌నాథన్‌ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. వివేక్‌ ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
నాగరాజన్‌ ఇంటిపై ఐటీదాడులు 
ఆదాయ లెక్కల్లో చూపని 17 కోట్లు తమ దగ్గర ఉన్నట్లు రామ్మోహనరావు కుమారుడు వివేక్‌ అంగీకరించారని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చెన్నైలో మరో ఐఏఎస్‌ అధికారి, ప్రభుత్వ గోదాముల సంస్థ ఎండీ నాగరాజన్‌ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించి 6 కేజీల బంగారం, 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. తవ్వేకొద్దీ అవినీతి అధికారుల అక్రమ ఆస్తుల బయటపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ఇంకా ఎంతమంది జాతకాలు బయటపడతాయో వేచిచూడాల్సి ఉంది. 

 

17:42 - December 23, 2016

గుంటూరు : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పండగలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రన్న కానుకలను అందజేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన చంద్రన్న క్రిస్మస్ కానుకల కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరకుండా చూడాల్సిన బాధ్యత ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలదేనని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరుకు పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. 

 

17:40 - December 23, 2016

విజయవాడ : అభిమానుల్లో ఉత్కంఠత రేపిన వంగవీటి సినిమా విడుదలైంది. అయితే సినిమాలో ప్రచారం జరిగినంతగా సంచలన విషయాలు ఏవీ లేవని అభిమానులు అంటున్నారు. వాస్తవాలు చెప్పడంలో డైరెక్టర్‌ వర్మ విఫలమయ్యారని అంటున్నారు. వర్మ ఓ వర్గం వారి కొమ్ముకాశాడని విమర్శించారు. దీనిపై మరిన్ని విషయాలను వీడియోలో చూద్దాం....

 

17:32 - December 23, 2016

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉప్పులేటి కల్పనతో పాటు.. 14 మంది వైసీపీ ఎంపీటీసీలు, ఇద్దరు జడ్పీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా 12 మంది సర్పంచులు, నాలుగు మండలాల వైసీపీ అధ్యక్షులు టీడీపీలో చేరారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ చేరుతున్నట్లు కల్పన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారని.. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో కష్టాలు ఉండేవని.. అంచెలంచెలుగా సమస్యలన్నీ అధిగమిస్తున్నామని చంద్రబాబు అన్నారు. 

 

సిజిఎస్టీ, ఎస్జీఎస్టీ డ్రాప్టులో కొన్ని మార్పులు చేయాలి: జైట్లీ..

ఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ 7వ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ జనవరి 3,4 తేదీల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిజిఎస్టీ, ఎస్జీఎస్టీ ప్రాథమిక డ్రాప్టులు ఆమోదం పొందాయని... అయినా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు.

17:21 - December 23, 2016

నల్గొండ : మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యలు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటుకు ఉండాల్సిన అన్ని అర్హతలు మిర్యాలగూడకు ఉన్నాయని తెలిపారు. మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని దీక్షలు, రాస్తారోకోలు, ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మిర్యాలగూడలో అన్ని రకాల భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. అఖిలపక్షం తరపున ప్రభుత్వానికి లెటర్ ఇచ్చామని తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

లిబియాలో ఎయిర్ బస్ 320ఎ విమానం హైజాక్

హైదరాబాద్: లిబియాలో ఎయిర్ బస్ 320ఎ విమానం హైజాక్ గురైంది. ఈ విమనాంలో 118 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. హైజాక్ అయిన విమానం మాల్దాలో ల్యాండింగ్ అయ్యిందని... దానిని పేల్చివేస్తామని హైజాకర్లు బెరిస్తున్నట్లు సమాచారం. లిబియా నుండి ట్రిపోలి వెళ్తున్న విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు లిబియా ప్రధాని వెల్లడించారు. 

మంత్రి రావెల వల్ల ప్రాణహాని ఉంది: జానీమున్

గుంటూరు : జిల్లా టిడిపిలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. మంత్రి రావెల వల్ల ప్రాణహాని ఉందని జడ్పీ ఛైర్ పర్సన్ జానీమున్ పేర్కొన్నారు. రావెల అనుచరులు నా ఇంటిపై దాడికి ప్రయత్నించారని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నా విధులకు మంత్రి రావెల అడ్డుతగులుగుతున్నారన్నారు. రావెల ఆగడాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినా మార్పులేదని, రావెల దండు పేరుతో రావెల అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తనకు అదనపు రక్షణ కావాలని పోలీసులను కోరినట్లు జానీమున్ తెలిపారు.

16:58 - December 23, 2016

విశాఖ : నగరంలో దొంగలు రెచ్చిపోయారు. నగర శివారు ప్రాంతంలోని మద్దిపాలెంలో అర్థరాత్రి స్థానిక కాంగ్రెస్‌ నేత చంద్రశేఖర్‌ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. పోలీస్‌ డ్రస్‌ల్లో వచ్చిన నలుగురు దుండగులు.. ఇంట్లో వారిని బంధించి 50 తులాల బంగారంతో పాటు 50వేల రూపాయల నగదును దోచుకెళ్లినట్టు బాధితులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం వెదుకుతున్నారు. 

 

16:56 - December 23, 2016
16:55 - December 23, 2016

గుంటూరు : పెద్దనోట్లు రద్దై 45 రోజులైనా సామాన్యుల కష్టాలు మాత్రం తీరలేదు. నోట్లరద్దుతో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చాలంటూ ఏపీ నూతన రాజధాని వెలగపూడిలో కాంగ్రెస్‌పార్టీ  ప్రజాధర్నా నిర్వహిస్తోంది. కరెన్సీ కష్టాలు తీర్చాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. తాను తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని మోదీ భావిస్తే.. పార్లమెంట్‌లో దానిపై మాట్లాడటానికి ఎందుకు భయపడ్డారని కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు. తక్షణమే ప్రజల కరెన్సీ కష్టాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వెలగపూడిలో కాంగ్రెస్‌ ప్రజాధర్నాపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:52 - December 23, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు సమస్యపై ప్రభుత్వం, బ్యాంకర్లు కృషి చేస్తున్నా.. ఇంకా సమస్య పరిష్కారం కావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో బ్యాంకర్లతో  సమావేశమైన చంద్రబాబు.. తాను ఒక్క సమస్యపై ఇంత సమయం ఎప్పుడూ వెచ్చించలేదన్నారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్‌లో అక్రమ లావాదేవీలన్నీ అదుపులోకి వస్తాయన్నారు. ఇక పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని బ్యాంకర్లను చంద్రబాబు ఆదేశించారు.

 

16:49 - December 23, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో పెన్షన్లకోసం పండుటాకులు అల్లాడిపోతున్నాయి.. నెలాఖరువచ్చినా డబ్బులు అందక వృద్ధులు కన్నీరు పెట్టుకుంటున్నారు.. నిత్యావసరాలకు డబ్బులేక అర్ధాకలితో అలమటిస్తున్నారు.. అనారోగ్య సమస్యలు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలతో అలసిపోతున్నారు. వృద్ధుల పెన్షన్‌ సమస్యలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:45 - December 23, 2016

ఢిల్లీ : హస్తినలో భారీగా నగదు మార్పిడికి ప్రయత్నించిన నలుగురిని ఐటీ అధికారులు అరెస్టు చేశారు. రూ.250 కోట్ల నగదు మార్పిడికి యత్నించిన నలుగురు బంగారం వ్యాపారులను అధికారులు అరెస్టు చేశారు. కరోల్‌బాగ్‌, చాందినీచౌక్‌లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:40 - December 23, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను.. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కలిశారు. కాపు ఉద్యమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు భూమన స్పష్టం చేశారు. తుని ఘటనలో తనపై తప్పుడు కేసులు బనాయించి.. అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని..  ఈ ప్రయత్నాన్ని మానుకోకపోతే.. ముద్రగడతో కలిసి కాపు ఉద్యమంలో పాల్గొంటానని భూమన హెచ్చరించారు. 

16:38 - December 23, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గుండాల, ఇల్లందు, బయ్యారం, వాజేడు, వెంకటాపురం, మునుగోడు లాంటి ప్రాంతాల్లో సామిల్, అటవీ అధికారులతో స్మగ్లర్లు కుమ్మకై కలపను అక్రమంగా తరలిస్తున్నారని ఆయన చెప్పారు. కలప స్మగ్లింగ్ కట్టడికి విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరచాలని పొంగులేటి సూచించారు. 

 

16:34 - December 23, 2016

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులకు మమర్దశ పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేప్పారు. ఈ రెండున్నరేళ్లలో 2,760 కి.మీ.జాతీయ రహదారులను సాధించుకున్నామని సభ దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులపై అసెంబ్లీలో లఘు చర్చను కేసీఆర్ ప్రారంభించారు. సమైక్య పాలనలో డెబ్బై ఏళ్లలో సాధించని జాతీయ రహదారులను ఇప్పుడు సాధించుకోగలిగామని చెప్పారు. రూ.2,690 కోట్ల రోడ్డు ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర రహదారుల నిధి కింది వెయ్యి కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా మార్చేందుకు రూ. 8 వేల కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 
జిల్లాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలి : చిన్నారెడ్డి 
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను హైదరాబాద్‌లో అనుసంధానం చేస్తూ నాలుగు లేన్ల రోడ్లను నిర్మించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ, రాష్ట్ర రహదారులపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న చిన్నారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. 
సత్తుపల్లిలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలి -వెంకటవీరయ్య 
సరకు రవాణ కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్‌ చేశారు. ఏపీలోని ఓడ రేవులకు అనుసంధానం చేసే విధంగా ఈ డ్రై పోర్టు ఉండాలని సూచించారు. 
నాలుగు లేన్ల రోడ్లు నిర్మించాలి : సున్నం రాజయ్య
తెలంగాణలోని అన్ని జిల్లాలను హైదరాబాద్‌తో అనుసంధానం చేసే విధంగా నాలుగు లైన్ల రహదారులను అభివృద్ధి చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజయ్య ఈ విషయాన్ని ప్రస్తావించారు.
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. తెలంగాణ రాష్ర్టంలోని రోడ్లు దుస్థితి, స్థితి గతులపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ సాగింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమాధానాలు ఇచ్చారు.  అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. 

 

నోట్ల రద్దు వెనక భారీ కుంభకోణం: రఘువీరా

విజయవాడ: నోట్ల రద్దు వెనక భారీ కుంభకోణం జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చలో వెలగపూడి కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

అన్ని నగరాలను స్వచ్ఛతవైపు మళ్లిస్తాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : స్వచ్ఛభారత్ పై కేంద్రం ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ ముందంజలో ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్‌ఎంసీ, ఐటీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్-వావ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నగరంలో 44 లక్షల డస్ట్ బిన్స్ పంపిణీ చేశామని, చెత్త తరలింపునకు 2 వేల ఆటోలు అందజేశామని పేర్కొన్నారు. మోదీ చెప్పినట్లు వ్యర్థాల నుంచి సంపద పెంచేలా చేస్తామని, రాష్ట్రంలో అన్ని నగరాలను స్వచ్ఛతవైపు మళ్లిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రజల సహకారంతోనే విజయవంతం: దత్తాత్రేయ

హైదరాబాద్ : ప్రజల సహకారంతోనే స్వచ్ఛభారత్ విజయవంతం అవుతుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. హెచ్‌ఎంసీ, ఐటీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్-వావ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం కేటాయిస్తుందని తెలిపారు.

స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలి : వెంకయ్యనాయుడు

హైదరాబాద్: స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హెచ్‌ఎంసీ, ఐటీసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షన్-వావ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరూ స్వచ్ఛాగ్రహి కావాలని సూచించారు. స్వచ్ఛభారత్ లో అందరూ వాలంటీర్లుగా మారాలన్నారు.

16:13 - December 23, 2016

కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్న సప్తగిరి తొలిసారిగా హీరోగా ఎంట్రి ఇచ్చిన కామెడీ మూవీ సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జనాన్ని మెప్పించిందా..? నవ్వులతో ముంచెత్తిందా ? తెలియాలంటే .. రివ్యూ లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ గా ప్రూవ్ చేసుకున్న సప్తగిరిని ప్రధాన పాత్రగా కామెడీ ని పండించి క్యాష్ చేసుకున్నాయి బోలెడన్ని సినిమాలు. అయితే సప్తగిరి కూడా అందరి కమెడియన్స్ లాగానే హీరోగా వస్తాడని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. హీరో అవ్వాలని తన సొంత డెసిషనో లేక బలవంతం మీద వచ్చాడా అనే విషయాలు పక్కన పెడితే సప్తగిరిని హీరోగా జనం చూస్తారు ఫర్వాలేదు అనిపించుకున్నాడు ఈ సినిమాతో. అయితే ఈ సినిమా అందరూ ఊహిస్తున్నట్టు పక్కా కామెడీ మూవీయే కాకుండా ఎమోషన్ ను కూడా బాగానే క్యారీ చేసారు. సీరియస్ కథతో వచ్చిన తమిళ్ సినిమా తిరుడన్ పోలీస్ కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం సప్తగిరి ఎక్స్ ప్రెస్. తమిళ్ సినిమా నుంచి మంచి కాన్సెప్ట్ ను మాత్రమే తీసుకొని దానికి కామెడీ తో కలరింగిచ్చి బాగానే తెరకెక్కించారు. అయితే అనవసరమైన కామెడీ సీన్స్ తో మంచి కథను స్పాయిల్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది కొన్ని కొన్ని సీన్స్ లో అయితే ఎమెషనల్ సీన్స్, కామెడీ సీక్వెన్సెస్ జనాన్ని బాగానే కూర్చోబెడతాయి. అయితే సినిమా బిగినింగ్ లో వచ్చే నాటకం సీన్, తండ్రి దగ్గర చెప్పే దానవీర శూరకర్ణ డైలాగ్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

కథ..
సినిమా నటుడౌదామని నాటకాలతోనూ, చిల్లర వేషాలతోనూ కాలక్షేపం చేస్తుంటాడు సప్తగిరి. అతడి తండ్రి సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్. తన లాగే తన కొడుకును కూడా పోలీస్ ను చేసి మురిసిపోదామనుకుంటాడు. కానీ సప్తగిరి చేష్టలు ఆయన్ను బాగా బాధపెడతాయి. ఇదిలా ఉండగా కొన్ని అనూహ్యపరిస్థితుల్లో సప్తగిరి తండ్రి మరణిస్తాడు. తండ్రి ఉద్యోగం కొడుక్కి ఇస్తారు. కానిస్టేబుల్ గా డ్యూటీ లో చేరతాడు. అప్పుడు ఆ ఉద్యోగంలో తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆయనది సహజ మరణం కాదని, తన తండ్రిని ఎవరో మర్డర్ చేసారని దానికి కారకులు కూడా ఎవరో తెలుసుకుంటాడు. తండ్రి గొప్పతనం తెలుసుకున్న సప్తగిరి చివరికి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడన్నదే మిగతా కథ. తమిళ్ సినిమాను యాజిటీజ్ గా తీసుకున్నా సరే తమిళ్ లో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎన్ని కష్టాలున్నాయో హీరో తెలుసుకునే క్రమంలో వచ్చే సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవనిపిస్తుంది. కొత్త దర్శకుడు అరుణ్ పవార్ అనుభవరాహిత్యం ఆ సీన్స్ లోనే తెలుస్తుంది. మొత్తం మీద సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని హిలేరియస్ గా నవ్విస్తాయి.

పాత్రల తీరుతెన్నులు...
కానిస్టేబుల్ సప్తగిరిగా సప్తగిరి బాగానే నటించాడు. అయితే అతి లేకుండా, హీరో బిల్డప్పుల్లేమీ లేకుండా మామూలు హీరోగానే నటించడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. హీరోయిన్ సంగతి అయితే చెప్పుకోడానికి ఏమీలేదు. అసలు ఆమె హీరోయిన్ మెటీరియలే కాదనిపిస్తుంది. అంతేకాదు, ఆమె పాత్రను ఈ సినిమాలో లైట్ తీసుకున్నారనిపిస్తుంది. ఇక ఇల్లీగల్ బిజినెస్ లు చేయించే సి.ఐ గా కన్నింగ్ విలన్ గా పోసాని కృష్ణమురళి పర్వాలేదనిపిస్తాడు. అజయ్ ఘోష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది. అసలు ఆయన్ను దర్శకుడు ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయాడనిపిస్తుంది. హీరో తండ్రి పాత్రలో డా.శివప్రసాద్ బాగా నటించారు. ఇక హీరో ఫ్రెండ్ గా మరో కానిస్టేబుల్ పాత్రలో షకలక శంకర్ ఈ సినిమాకు ఎంతో రిలీఫ్ గా అనిపిస్తాడు. అతడు పండించిన కామెడీ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక గేస్ గా నటించిన జబర్దస్త్ కమెడియన్స్ గ్యాంగ్ చేసే కామెడీ కూడా బాగానే నవ్విస్తుంది. టోటల్ గా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ నే హిలేరియస్ గా పేలాయి. అయితే తమిళ్ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేరు. కానీ బి, సి సెంటర్స్ జనం మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. మొత్తం మీద హీరోగా సప్తగిరి ఓకె అనిపించుకున్నాడు.

ప్లస్ పాయింట్స్
కామెడీ
సప్తగిరి నటన
మైనస్ పాయింట్స్
ల్యాగ్ సీన్స్
హీరో్యిన్
సంగీతం
రేటింగ్ : 2 / 5...

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన రజనీ చిన్న కుమార్తె

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య విడాకుల కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ను ఆశ్రయించారు. భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో తనకు విడాకులు ఇప్పించాలని శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసింది. 

16:06 - December 23, 2016

బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంలోనే కాదు, బోల్డ్ గా నటించడానికి కూడా 'రాధికా ఆప్టే' ఏ మాత్రం లెక్కచేయదు. ఫర్ చీద్ మూవీతో వరల్డ్ వైడ్ గా సన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ మరోసారి బోల్డ్ కామెంట్స్ తో బాలీవుడ్ లో సెంటఫ్ అట్రాక్షన్ గా మారింది. న్యూడ్ యాక్టింగ్ పై 'రాధిక ఆప్టే' చాలా డేర్ గా అన్సర్ ఇచ్చింది. 'రామ్ గోపాల్ వర్శ' 'రక్తచరిత్ర' మూవీతో 'రాధికా ఆప్టే' సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత 'బాలకృష్ణ' తో 'లెజెండ్’, 'లయన్' మూవీస్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే స్టార్టింగ్ లో సంప్రదాయ పాత్రలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ రేంజ్ స్క్రీన్ షో హాట్ హాట్ గా కవ్విస్తోంది. స్క్రీన్ పై బోల్డ్ గా కనిపించడమే కాదు అవసరమైతే అంతకన్న బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇస్తూ అందరి మతులు పొగొట్టుతోంది. రీసెంట్ గా న్యూడ్ గా నటించడమే బోల్డ్ గా మాట్లాడి అందరిని అవాక్కైయ్యేలా చేసింది.

డేరింగ్ బ్యూటి..
హంటర్, పర్ చీద్ మూవీస్ తో బాలీవుడ్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా ఫేం అయిన 'రాధికా ఆప్టే' ఇప్పుడు బాలీవుడ్ లో డేరింగ్ బ్యూటీగా బాలీవుడ్ ఫేం అయింది. 'ఫర్ ఛేద్' మూవీలో నగ్నంగా నటించి ఆడియన్స్ మతులు పొగొట్టిన ఈ బ్యూటీ అంతకన్న ఘాటుగా మాట్లాడుతూ తనను కామెంట్స్ చేసిన వారికి చెమటలు పట్టిస్తోంది. నగ్నంగా నటించడంపై 'రాధిక'పై కామెంట్స్ చేసిన వారికి కౌంటర్ గా 'నన్ను నగ్నంగా చూసి ఎంజాయ్ చేయండి. అలా కాకుండా నన్ను ప్రశ్నించాలనుకుంటే మాత్రం ముందుగా మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకోండి’ అంటూ ఘాటుగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సేమ్ ఇలాంటి అంశంపై రాధికా మరోసారి తనదైన స్టైల్ లో ఫైర్ అయింది.

నగ్నంగా కనిపించడం ఆర్ట్..
నగ్నంగా నటించడంపై ఇటీవల 'రాధికా ఆప్టే'ను ఓ మీడియా ప్రశ్నిస్తే నగ్నంగా కన్పించడం అనేది ఒక ఆర్ట్ అని, ఏదన్నా సినిమాలో నగ్నంగా కన్పించాల్సి వస్తే ముందుగా ఆ సినిమా కథ తనను కదిలించాలని చెప్పింది. అంతేకాదు కథ బాగా నచ్చడంతో పాటు సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉండడంతో నగ్నంగా కనిపించడానికి గల కారణం చాలా స్ట్రాంగ్ ఉండాలని కూడా క్లారిటి ఇచ్చింది. అలా స్ట్రాంగ్ స్టోరీతో ఎవరూ మెప్పించిన నగ్నంగా నటించి మెప్పించడానికి తనకు ఏ అభ్యంతరం లేదని ఈ బ్యూటీ డేర్ గా ఆన్సర్ చేసింది. అంతేకాదు ఇలాంటి మూవీస్ లో సోషల్ కంటెంట్ కూడా ఉండాలని మరో షరతు కూడా పెట్టింది. మొత్తానికి న్యూడ్ గా నటించడానికి డోర్స్ ఓపెన్ చేసి ఉంచానని 'రాధికా' ఇండికేషన్స్ ఇస్తోంది.

16:01 - December 23, 2016

'పవన్ కళ్యాణ్', 'త్రివిక్రమ్' ల న్యూ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. 'కాటమరాయుడు' షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్న 'పవర్' స్టార్ త్వరలోనే ఫ్రెండ్ 'త్రివిక్రమ్' తో చేయనున్న మూవీలో జాయిన్ కావాలని ప్లాన్ చేసుకున్నాడట. చాలా తక్కువ టైం ఉండడంతో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఈ టాలీవుడ్ ఎంపరర్ భావిస్తున్నాడు. 'పవర్' స్టార్ జెట్ స్పీడ్ తో సినిమాలు కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడట. పక్కా ప్లానింగ్ ఈ స్టార్ హీరో సినిమాలను చక చక స్టార్ట్ చేసేలా ప్రణాళికలు వేసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే 'కాటమరాయుడు' మూవీ కంప్లీట్ కాగానే 'త్రివిక్రమ్' తో చేయనున్న మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడానికి సిద్దమవుతున్నట్లు వినికిడి. ప్రస్తుతం 'కాటమరాయుడు' మూవీ షూటింగ్ కంప్లీట్ స్టేజ్ కి చేరింది. ఈ నెల చివరి లోగా టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. 'కాటమరాయుడు' మూవీని మార్చి లో రిలీజ్ చేయాలని 'పవన్' భావిస్తున్నాడట.

ఆ వెంటనే...
ఆ వెంటనే 'త్రివిక్రమ్' తో చేయనున్న సినిమా షూటింగ్ ని మొదలుపెట్టాలని చూస్తున్నాడట. ఆల్ రెడీ ఈ మూవీలో నటించే హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీలోని కీ రోల్ లో కన్నడ స్టార్ 'ఉపేంద్ర' నటిస్తున్నట్లు టాక్. 'అత్తారింటికి దారేది' లాగే ఈ న్యూ మూవీని కూడా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మాటల మాంత్రికుడు తెరకెక్కించబోతున్నాడట. అందుకే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్స్ 'కీర్తి సురేష్’, 'అను ఇమ్మాన్యూయేల్' ని తీసుకున్నట్లు తెలుస్తోంది. 'త్రివిక్రమ్'తో చేయనున్న మూవీని కూడా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లోగా రిలీజ్ చేయాలని 'పవన్' నిర్ణయించుకున్నాడట. ఆ తరువాత తమిళ డైరెక్టర్ నీసన్ డైరెక్షన్ లో మరో మూవీని స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేలా 'పవర్' స్టార్ ప్రణాళికలు రచిస్తున్నాడట. మొత్తానికి 'పవన్ కళ్యాణ్' పూర్తిస్థాయి పొలిటికల్ ఏంట్రీ కోసం చక చక సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడన్నమాట.

15:56 - December 23, 2016

వెంకీ, నాగ్, మధ్యలో నాని. ఇది కొత్త సినిమా టైటిల్ అనుకోకండి. సీనియర్ స్టార్స్ కి అటు ఇటు కాస్త గ్యాప్ ఇచ్చి మధ్యలో ఈ యంగ్ హీరో మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. 2016వ సంవత్సరం 'నాని'కి కలిసొచ్చినంతగా వేరే ఏ హీరోకి రాలేదేమో. వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేయడమే మూడు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అంతేకాదు నాలుగో సినిమాగా 'నేను లోకల్' ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ఈ యంగ్ హీరో శతవిధాల ప్రయత్నించాడు. బట్ లాస్ట్ మినిట్ లో ఈ మూవీని వచ్చే ఎడాదిలోనే తీసుకురావాలని ఫిక్స్ చేశారు. నిజానికి క్రిస్మస్ సందర్భంగా 'నేను లోకల్' విడుదల చేద్దామని 'దిల్' రాజు టీం ప్లాన్ చేసింది. కానీ షూటింగ్ పార్ట్ పెండింగ్ లో ఉండడంతో వచ్చే ఫిబ్రవరి షిప్ట్ చేశారు. అయితే సంక్రాంతికి రావాలనుకున్న 'దిల్' రాజు నిర్మాణంలో తెరకెక్కిన మరో మూవీ 'శతమానం భవతి' ఆల్ రెడీ సంక్రాంతి బరీలో నిలిచింది. దీంతో 'నేను లోకల్' ఫిబ్రవరి పోస్ట్ పోన్ కాకతప్పలేదు. ఇప్పుడు ఈ యంగ్ హీరోకి ఇద్దరు సీనియర్స్ తో పోటీ వచ్చేలా కనిపిస్తున్నారు.

ఫిబ్రవరిలో...
'నేను లోకల్' ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యాడట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది పెద్దగా పోటీ లేని టైమ్ లో వచ్చి హిట్స్ మీద హిట్స్ కొట్టాడు. తాజా రిలీజ్ డేట్ కారణంగా సీనియర్ హీరోలతో పోటీ తప్పదని తేలిపోయింది. జనవరి లాస్ట్ లో 'వెంకటేష్' 'గురు' రిలీజ్ కానుంది. ఫిబ్రవరి రెండో వారంలో 'నాగార్జున’, 'రాఘవేంద్రరావు'ల 'ఓం నమో వెంకటేశాయ' విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ డేట్స్ లాక్ అయిపోయాయి. ఈ రెండింటి మధ్య 'నాని' మూవీ రిలీజ్ అవుతుందా లేక వీరికి పోటీ రిలీజ్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే 'నేను లోకల్' ఫిబ్రవరిలో రావడం మాత్రం పక్కా.

15:53 - December 23, 2016

'నిఖిల్' న్యూ మూవీ 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' బాక్సాఫీసు వద్ద మెస్మరైజ్ చేస్తోంది. 50డేస్ కి దగ్గర పడుతున్న ఈ మూవీ మిరాకిల్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో కూడా 'నిఖిల్' సినిమా అద్భుతమైన వసూల్ తో బాక్సఫీసు ని షేక్ చేస్తోంది. కాలం కలిసొచ్చినప్పుడు కలెక్షన్స్ కురిపించుకోవడం పెద్ద విషయం కాదు. క్రిటికల్ సిట్యూవేషన్ లో కలెక్షన్లు కురిపించడం అసలు సిసలు హిట్టుకి నిదర్శనం అని చెప్పాలి. ఇలాంటి సినిమానే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అంతా ఓవర్ కాన్పిడెన్స్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ విధిలేని పరిస్థితుల్లో యూనిట్ ఈ మూవీ భయం భయంగానే రిలీజ్ చేసింది. కానీ కంటెంట్ ఉంటే కష్టం ఎక్కడిపోదన్నట్లు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ట్రేడ్ పండితులకు కూడా అందని రీతీలో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' అద్భుత కలెక్షన్లతో అదరగొట్టుతోంది. పెద్దనోట్లు రద్దు తరువాత తెలుగులో రిలీజైన మొదటి క్రేజీ మూవీ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా’. రాంగ్ టైమ్ లో ఎక్స్ లెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు ని షేక్ చేస్తోంది.

సూపర్ హిట్ టాక్..
బ్యాడ్ టైం లో రిలీజ్ అయింది కాబట్టి ప్రమోషన్స్ లో నా మూవీ బాగుంటుంది మిమ్మల్ని అస్సలు డిజ్పాయింట్ చేయదంటూ 'నిఖిల్' కూడా ఎమోషనల్ గానే ప్రమోట్ చేశాడు. 'నిఖిల్' చెప్పినట్లే గానే ఫస్ట్ షోకే ఈమూవీకి సూపర్ హిట్టు టాక్ వచ్చింది. ఆడియన్స్ మౌత్ టాక్ తో చిన్నవాడు ఎక్కడికి పోకుండా ఇంకా థియేటర్స్ లో పరుగులు పెడుతూ కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు.
'నిఖిల్' లాంటి చిన్న హీరో మూవీ నెల రోజుల్లో 38 కోట్ల వసూళ్లు రాబట్టిందంటే చిన్న విషయం కాదు. అవును 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఇప్పటి వరకు 40కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద హీరోల సినిమాలే తడబడుతున్న ఈ టైంలో 'నిఖిల్' సూపర్ కంటెంట్ తో అంతకంటే సూపర్ కలెక్షన్లను కొల్లకొడుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 'శంకరాభరణం' మూవీతో బ్యాక్ స్టేప్ వేసిన 'నిఖిల్' చిన్నవాడా సక్సెస్ తో తన క్రేజ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ మరో రెండు సక్సెస్ లు పడితే ఈ చిన్న హీరో కాస్త పెద్ద హీరోగా టర్న్ తీసుకున్నట్లే.

15:51 - December 23, 2016

అభివృద్ధిని చూసే టీడిపిలోకి: సీఎం చంద్రబాబు

విజయవాడ :టీడీపీ ప్ర‌భుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి పార్టీలోకి చేర‌డానికి పెద్ద ఎత్తున నేత‌లు వ‌చ్చార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజయవాడలో వైసీపీ నేతలను పచ్చ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

15:50 - December 23, 2016
15:49 - December 23, 2016

సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్త గ్రామాలు రెండూ సంపూర్ణ నగదు రహిత గ్రామాలయ్యాయి. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.  ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నసీఎం.. నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాలు స్వయం సహాయకంగా మారాలని సూచించారు. 
ఎర్రవల్లి, నర్సన్నపేటలలో ప్రారంభం 
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ ప్రజల సొంతింటి స్వప్నం నెరవేరింది. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రెండు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
మొత్తం 600 ఇళ్లు
మొత్తం 600 ఇళ్లలో వేదమంత్రోచ్ఛరణల మధ్య గృహప్రవేశాలు జరిగాయి. ఇరు గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. 7.53 గంటలకు గ్రామస్తులు గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, నర్సన్నపేటలను సీఎం కేసీఆర్ నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు. 
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం గొప్ప ముందడు : సీఎం కేసీఆర్
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఓ గొప్ప ముందడుగన్న సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణంలో ముందుకుపోదామని సీఎం పిలుపునిచ్చారు. గృహప్రవేశం చేసిన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలకు సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని.. స్వయం సహాయ గ్రామాలుగా నిలవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఉండాలన్నారు.
ప్రతి ఇంటికి తాగునీరు : సీఎం కేసీఆర్ 
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోని డబుల్ బెడ్‌రూం ఇళ్లకు..మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు..కల్యాణ మండపం, భోజనశాల నిర్మాణం, ఇంటర్నెట్‌ సేవలతో పాటు మరిన్ని ప్రత్యేకతలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. డబుల్‌ బెడ్‌ ఇళ్లలోకి గృహప్రవేశం చేసిన గ్రామస్తులు ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

నోట్ల రద్దు నిర్ణయం ఓ ఆర్థిక దోపిడి: రాహుల్ గాంధీ

ఢిల్లీ : నోట్ల రద్దు నిర్ణయం ఓ ఆర్థిక దోపిడి అని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఉత్తరాఖండ్ లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోట్ల రద్దు వల్ల 100 మంది చనిపోయారని, మృతులకు పార్లమెంట్ లో 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అవినీతిపై పోరాడేందుకు ప్రధాని వెంటే ఉంటానని,నోట్ల రద్దు సమాన్యులకు చెరగని గాయం చేసిందన్నారు.

15:42 - December 23, 2016

26న రాజ్యాంగ పరిరక్షణ దినం: సురవరం

హైదరాబాద్: వచ్చేనెల 26న రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తున్నట్లు సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి ప్రకటించారు. నగరంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ... నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పార్లమెంట్ లో మోదీ సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. నోట్ల రద్దు పై జనవరి 3 నుండి 10 వరకు దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా 23న భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. 

నాసిక్ లో రూ.1.5కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం...

మహారాష్ట్ర : నాసిక్ లో రూ.1.5 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15:23 - December 23, 2016

కడప : పోలీసుల అరెస్ట్‌తో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలో బెట్టింగ్‌ నిర్వహించారంటూ డిగ్రీ విద్యార్థి రవితేజను రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్‌తో మనస్తాపంచెందిన రవితేజ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తనపై అనవసరంగా కేసు బనాయించారని ఆరోపించారు. రవితేజను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అసెంబ్లీలో విపక్షాలు పూర్తిగా విఫలం: హరీష్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు పూర్తిగా విఫలం చెందాయని మంత్రి హరీష్ రావు అన్నారు. విపక్షాలు వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయని, మాది పూర్తిగా పై చేయి అయ్యిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన పనులను సమర్థవంతంగా చెప్పుకుంటున్నామని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే విషయాలేవీ ప్రతిపోఆల వద్దలేవని హరీష్ స్పష్టం చేశారు.

15:15 - December 23, 2016

కర్నూలు : జిల్లాలోని డోన్‌ దొరపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. దొరపల్లె వంతెన వద్ద ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:04 - December 23, 2016

ప్రతి చోటా పోలీసులు ఉండరు..ప్రతి గళ్లీలో పోలీసులు పెట్టలేరు. అందుకు ప్రత్యామ్నాయం ఏదో ఉండాలి..అందులో ప్రదానమైంది అప్రమత్తత..లేదంటే సీసీ కెమెరా..జనం ఉన్న చోట నిఘా నేత్రం తప్పనిసరి..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రక్షణ కోసం ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై ఎందుకు ప్రచారం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు. పబ్లిక్ సేఫ్టీ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎవరి వైఫల్యం ఉంది. నిర్లక్ష్యంగా వ్యహిస్తున్నది ఎవరు ? రాష్ట్రంలో వంద మంది పర్యటించే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నది ఈ చట్టం చెబుతోంది. మీ సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా ? లేదా ? 2016లో సంచలనంగా మారిన సీసీ కెమెరాలపై విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఉప్పులేటి కల్పన

విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

రూ.250 కోట్ల నగదు మార్పిడికి యత్నం.. అరెస్ట్

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రూ.250 కోట్ల నగదు మార్పిడికి యత్నించిన నలుగురు బంగారం వ్యాపారులను ఐటీ అధికారులు అరెస్టు చేశారు. కరోల్ బాగ్, చాందినీ చౌక్ లో ఐటి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

14:55 - December 23, 2016

ఓ కన్నతల్లి మోములో చిరునవ్వులు...ఓ హంతకుడిలో భయం..ఓ స్నాచర్లలో వణుకు...

ఓ తల్లి మురిసిపోయింది. తన పొత్తిళ్లలో పసిబిడ్డ మళ్లీ చేరింది. ఓ ఇళ్లాలి కళ్లలో ఆనందం..తాను ఎంతో సెంటిమెంట్ గా భావించే మంగళసూత్రం తిరిగి దొరికింది. ఓ కన్నవారిలో తీరిన కసి.. తమ బిడ్డ మరణానికి కారణమైన వాడు జైలు పాలయ్యాడు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది ? ‘సీసీ కెమెరా' వల్లే. ఒకప్పుడు పోలీసు దర్యాప్తుకు నేటి శోధనకు చాలా తేడా ఉంది. అత్యాధునికమైన పద్ధతుల్లో ప్రధాన మైంది మూడో కన్నే.. ప్రస్తుతం ఇది అనివార్యమైంది. అత్యాధునిక టెక్నాలజీ రావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు అనివార్యమైంది. నేరగాళ్లను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. మరి 2016 సంవత్సరంలో జరిగిన నేరాలు..ఘోరాల గురించి..అందులో సీసీ కెమెరాల పాత్ర గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కాకాని ఆరోపణలను తిప్పి కొట్టిన సోమిరెడ్డి

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే కాకాని చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌పై టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు త‌న‌పై చేస్తోన్న ఆరోపణలు అవాస్తమని, తనపై వారు చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ల‌కే పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించారు. తాను స‌ర్కారు త‌ర‌ఫునే విదేశాలకు వెళ్లాన‌ని, అంతేగాని త‌న‌ వ్యక్తిగత పనుల కోసం వెళ్లలేదని అన్నారు.

14:40 - December 23, 2016

ముఖానికి అందాన్ని ఇచ్చేవి ఏంటీ అంటే మొదటగా 'కళ్ళు’. అనే సమాధానం వస్తుంది. ఈ కళ్లను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. శరీరంలో అతి సున్నితమైన భాగాలలో ఒకటి చర్మం..తర్వాత కళ్ళు..చర్మం ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకుంటామో...అదే విధంగా కళ్లు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ?

  • సరైన ఆహారం తీసుకోవాలి. విటమిన్..మినరల్స్ కూడిన ఆహారం తీసుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్షణ అవసరం.
  • కళ్ళు ఎక్కువగా ఎండలో స్ట్రెయిన్‌ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
  • కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్‌ ఉపయోగపడుతుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ కోకనట్‌ పౌడర్‌ ను క్యారట్ జ్యూస్‌లో మిక్స్ చేయాలి. అంతే మోతాదులో తేనె కూడా కలుపుకుని తాగాలి.
  • మీ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆముదం నూనె కూడా ఉపయోగపడుతుంది. రెండు మూడు చుక్కల ఆముదం నూనెను చేతిలోకి తీసుకొని కళ్ళకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
  • వాటర్‌ మెలోన్‌, టమోటో, పాలు, గ్రేప్‌ ఫ్రూట్‌ వంటి వాటిలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు లేకుండా ఉంటాయి.
  • జామ, ఆరెంజ్‌, పైనాపిల్‌, రెడ్‌ మరియు గ్రీన్‌ చిల్లీ, బెల్‌ పెప్పర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
14:33 - December 23, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150’పై అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా షూటింగ్ ను శరవేగంగా కానిచ్చేస్తున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ ను వెరైటీగా తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఇప్పటికే చిత్ర టీజర్..పోస్టర్స్ విడుదలైన అభిమానులను ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర పాటను కూడా రిలీజ్ చేశారు కూడా. తాజాగా మరో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'సుందరి' అనే పాటను రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ సందర్భంగా ఓ స్టిల్ కూడా బయటకొచ్చింది. ఇందులో 'చిరు’ సైడ్ లుక్స్ తో కనబడుతుండగా పక్కనే ‘కాజల్’ కూడా కనిపిస్తోంది. సోవేనియాలో తీసిన స్టిల్ అని తెలుస్తోంది. 'కత్తి’ రీమెక్ ను ‘వి వి వినాయక్’ 'ఖైదీ నెంబర్ 150’గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి రిలీజ్ చేస్తే కొత్త పాటలో కాజల్..చిరు స్టెప్స్ కనిపిస్తాయా ? లేదా అనేది చూడాలి.

'వావ్ హైదరాబాద్ కార్యక్రమం':జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్: ఎల్బీస్టేడియంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ సర్వేక్షణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో పారిశుద్ధ్యంపై విస్తృత ప్రచారం కల్పించేందుకు 'వావ్ హైదరనాబాద్ కార్యక్రమం' నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీకమిషనర్ తెలిపారు.

న్యాయవాదుల సంఘం పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంపై స్టే విధించాలన్న న్యాయవాదుల సంఘం పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

రూ. 2690 కోట్ల ప్రాజెక్టులు - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 2690 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్రానికి మంజూరు చేసిందని సీఎం కేసీఆర్ శాసనసభలో వెల్లడించారు. రోడ్ల అభివృద్ధికి సెంట్రల్ ఫండ్ కింద రూ. 1021 కోట్లు మంజూరు చేసిందని, రెండున్నరేళ్లలో నిధులు మంజూరు చేసుకోవడంలో సఫలమయ్యామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి జాతీయ రహదారుల విషయంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నామన్నారు.

నాలుగు రోడ్ల నిర్మాణం ఎప్పుడు - చిన్నారెడ్డి...

హైదరాబాద్ : కొత్తగా జాతీయ రహదారులు మంజూరైనట్లు ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా పనులు జరగడం లేదని టి.కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి శాసనసభలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి నాలుగు రోడ్ల నిర్మాణ పనులు ఎప్పుడు చేపడుతారో తెలపాలని సూటిగా ప్రశ్నించారు. జాతీయ రహదారుల విషయంలో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం సరైన ప్రాధాన్యతనివ్వడం లేదని, హైవేల ప్రమాదాల్లో అమాకులు మరణిస్తున్నారని సభకు తెలిపారు.

 

13:56 - December 23, 2016

ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ విజేత అపూర్వతో మానవి ప్రత్యేక ఇంటర్వ్యూను చేసింది. ఎనిమిది సంత్సరాల వయసులో తాను ట్రైనింగ్ కు అసోసియేషన్ లో చేరి తీసుకున్నానని ఆమెతెలిపారు. దీనికి నాన్నగారి ప్రోత్సాం చాలా వుందన్నారు. స్పాన్సర్స్, గవర్నమెంట్ సపోర్ట్ వుంటే క్యారమ్స్ లో విజయం సాధించవచ్చను అపూర్వ తెలిపారు. మరి అపూర్వ ఇంకా ఎటువంటి విశేషాలను తెలిపారో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

13:50 - December 23, 2016

పెద్దపల్లి : తెలంగాణవచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. ఎన్నికలకుముందు ఇచ్చిన ఒక్క హామీనికూడా టీఆర్‌ఎస్‌ అమలు చేయలేదని విమర్శించారు.. పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని పర్యటిస్తున్నారు.. స్థానిక సమస్యల్ని పాదయాత్ర బృందం అడిగి తెలుసుకుంటోంది..

ఓపెన్‌ కాస్ట్‌ గ్రామాల ప్రజలను ఆదుకోవాలి : నగేశ్
పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది.. పలు గ్రామాల ప్రజలు పాదయాత్ర బృందానికి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.. ఓపెన్‌ కాస్ట్‌ గ్రామాల ప్రజలను ఆదుకోవాలని పాదయాత్ర బృందం సభ్యులు నగేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.. మరింత సమాచారానికి వీడియో చూడండి..

13:46 - December 23, 2016

హైదరాబాద్ : స్టీట్ వెండర్స్ హక్కుల పరిరక్షణకు తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉందని శాసనమండలిలో మంత్రి కేటీఆర్ అన్నారు. వీరి కోసం మూడు రకాల జోన్లను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. పాదచారుల హక్కుల పై కోర్టుల్లో ఉన్న కేసుల నేపధ్యంలో కొంత జాగ్రత్తగా స్ట్రీట్‌ వెండర్స్ న్యాయం చేస్తున్నామన్నారు. ఇప్పటికే వరంగల్‌లో హాకర్ జోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో హైదరాబాద్ , ఇతర మున్సిపాలిటీల్లో ఈ హాకర్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మరికొన్ని సెంటర్లు పెంచి 50 వేల మందికి అందిస్తాం: కేటీఆర్
హైదరాబాద్‌లో 5 రూపాయల భోజనంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ప్రస్తుతం 5 రూపాయల భోజనాన్ని 58 సెంటర్లలలో రెగ్యులర్ గా అందిస్తాన్నానవు కేటీఆర్ అన్నారు. మొత్తంగా 150 సెంటర్ల ద్వారా రోజుకు 15 వేల మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. మరికొన్ని సెంటర్లు పెంచి దీన్ని 50 వేల మందికి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

13:44 - December 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తక్కువ ధరలకే విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రజలపై భారం పడకుండా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ను నిరంతరాయంగా అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 

13:41 - December 23, 2016

హైదరాబాద్ : ప్రమాదాల్లో మరణిచిన కల్లుగీత కార్మిక కుటుంబాలకు చెల్లిస్తున్న పరిహారాన్ని పెంచే అంశం పరిశీలనలో ఉందని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రమాదాల్లో మరణించిన కల్లుగీత కార్మికులకు పరిహారం పెంచాలని టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. దీనికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు సమాధానం చెప్పారు. ప్రస్తుతం రెండు లక్షల రూపాయలుగా ఉన్న పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. 

13:35 - December 23, 2016
13:27 - December 23, 2016

హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న బీబీనగర్‌ నిమ్స్‌ ఆస్పత్రిని మెడికల్‌ కాలేజీ స్థాయికి పెంచే అంశం పరిశీలనో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం అవుట్‌ పేషెంట్‌ సేవలు అందిస్తున్న బీబీనగర్‌ నిమ్స్‌లో మూడు లేదా నాలుగు నెలల్లో ఇన్‌పేషెంట్‌ విభాగాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తెచ్చారు. 

13:24 - December 23, 2016

హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షతకు గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఇది ఈ ప్రాంత అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారిందని అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొళ్లి కొత్త జాతీయ రహదారులను సాధించుకున్నామని సభ దృష్టికి తెచ్చారు.

ప్రత్యేక రాష్ట్రం చ్చాక రహదారులకు మహర్ధశ: కేసీఆర్
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులకు మమర్దశ పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేప్పారు. ఈ రెండున్నరేళ్లలో 2,760 కి.మీ.జాతీయ రహదారులను సాధించుకున్నామని సభ దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులపై అసెంబ్లీలో లఘు చర్చను కేసీఆర్ ప్రారంభించారు. సమైక్య పాలనలో డెబ్బై ఏళ్లలో సాధించని జాతీయ రహదారులను ఇప్పుడు సాధించుకోగలిగామని చెప్పారు.

సిండికేట్ బ్యాంకులో తనిఖీలు..

నెల్లూరు : జిల్లాలోని దగదర్తిలోలని సిండికేట్ బ్యాంకుల్లో ఆర్బీఐ విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకుపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 255 పార్టీలను రద్దు చేసీన సీఈసీ

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 255 పార్టీలను సీఈసీ రద్దు చేసింది. 2005 నుండి 2015 వరకు పోటీ చేయని పార్టీల గుర్తింపును రద్దు చేసింది. తెలుగు ర్రాష్టాల్లో 12 పార్టీల గుర్తింపును రద్దు చేసింది. రద్దు చేసిన పార్టీల్లో అన్నా టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీ, జైతెలంగాణ పార్టీలు ఉన్నాయి.

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి సీఎం చంద్రబాబు

విజయవాడ: నగరంలో జరుగుతున్న 197వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగదు రహిత లావాదేవీలు, కలెక్టర్ల సదస్సు అంశాలపై చర్చించన్నుట్లు సమాచారం.

కంటైనర్ ను ఢీకొట్టిన ఇన్నోవా : ముగ్గురి మృతి

కర్నూలు: డోన్ దొరపల్లె వద్ద హైవేపై కంటైనర్ ను ఇన్నోవా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం:చిన్నారెడ్డి

హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆరోపించారు. హైవేలపై ప్రమాదాల్లో అమాయకులు మరిణిస్తున్నారని, హైవేలపై పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా పనులు జరగట్లేదని, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి 4 రోడ్ల నిర్మాణ పనులు ఎపుడు చేపడుతారో తెలపాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు.

12:52 - December 23, 2016
12:50 - December 23, 2016

హైదరాబాద్ : జాతీయ రహదారుల అంశంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. జాతీయ రహదారుల విషయంలో మహబూబ్ నగర్ కు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లాకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఎన్ హెచ్ లపై పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ..వీటిపై పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రహదారుల నిర్మాణంలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన సహకారమేనని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్ హెచ్ ల నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న నిధులపై ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు సభ ద్వారా తెలుపుతున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

'పట్టుబడ్డ 505 కోట్లలో 93 కోట్లు కొత్త నోట్లు'

న్యూఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా డిసెంబర్ 21 వరకు రూ. 505 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. పట్టుబడిన వాటిలో రూ. 505 కోట్లలో రూ. 93 కోట్లకు పైగా కొత్త నోట్లు ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్ 21 వరకు లెక్కలు చూపని రూ. 3,590 కోట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఇక 3,589 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పింది. నోట్ల రద్దు తర్వాత మొత్తం 400 కేసులు నమోదు కాగా, 215 కేసులు ఈడీకి, 185 కేసులు సీబీఐకి అప్పగించినట్లు ప్రకటించింది.

12:30 - December 23, 2016

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘మురుగదాస్' దర్శకత్వంలో 'మహేష్' ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ గుజరాత్ లో కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోని జైడస్ ఆసుపత్రిలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర డిప్యూటి సీఎం నితిన్ భాయ్ పటేల్ మూవీ సెట్ కు వచ్చారు. కుటుంబసమేతంగా వచ్చి 'మహేష్'ను కలుసుకున్నారు. అనంతరం 'మురుగదాస్'..చిత్ర యూనిట్ తో మాట్లాడారు. ఈ విషయాన్ని నితిన్ భాయ్ పటేల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.'మహేష్' నటిస్తున్న ఈ చిత్రంలో రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఓ బర్నింగ్ ప్రాబ్లెమ్ కు మురుగదాస్ తనదైన శైలిలో కమర్షియల్ గా సొల్యూషన్ చూపిస్తునే... థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేయబోతున్నాడు. ఈ సారి న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని పాయింట్ అవుట్ చేస్తూ కథ నడిపిస్తాడట. ఈ కథని మహేష్ బాబులాంటి సూపర్ స్టార్ తో ఎలా వర్కౌట్ చేయబోతున్నాడో చూడాలి. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోంది ? మహేష్ నటన ఎలా ఉంటుంది ? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

12:27 - December 23, 2016

హైదరాబాద్ : జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగంలో నిలిచిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎన్ హెచ్ ల నిర్మాణంలో వివక్ష కొనసాగిందన్నారు. రాష్ట్రం వచ్చిన ఈ రెండున్నరేళ్ళ కాలంలో అభివృద్ధి సాధించిందన్నారు. జాతీయ రహదారులు నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టుకోవటంలో రాష్ట్రం విశేష కృషి చేసిందనీ..గతంలో దక్షిణ భారతంతో తెలంగాణ జాతీయ రహదారుల విషయంలో అట్టడుగున వుందని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీటి నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. దీనిపై కేంద్రానికి సమగ్ర నివేదికలను అందించిన నేపథ్యంలో కేంద్రం ముందకొచ్చి తెలంగాణకు ఎన్ హెచ్ లను గ్రాంట్ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వాలు 70 సంత్సరాల కాలంలో నిర్మించినదానికంటే రాష్ట్రం వచ్చాక సాధించుకున్నదే ఎక్కువ శాతంగా వుందన్నారు. రాష్ట్రంలో 2,770 కిలో మీటర్లుగా వుందన్నారు. రానున్న కాలంలో మరింత పెరగనుందన్నారు. దేశంలోనే జాతీయ రహదారుల్లో తెలంగాణ అగ్రభాగంలో వుందన్నారు. ఎన్ హెచ్ ప్రమాణాలతో మరో రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. జాతీయరహదారుల నిర్మాణానికి కృషి చేసిన వారికి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2011లో ప్రారంభమైందని అనుకుంటారు కానీ కొంతమంది మిత్రులతో కలిసి 2001లోనే ప్రారంభించామని పేర్కొన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన అనతరం చెరువులను బాగుచేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకున్నామనీ..దానికి వర్షాలు కూడా తోడయి చెరువులు నిండాయనీ..ఇందుక చాలా సంతోషంగా వుందన్నారు. 

సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

చెన్నై: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మొత్తం 13 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కకు మించి ఉన్న ఆస్తులకు రూ.16 కోట్లు ట్యాక్స్ చెల్లించనున్నారు. రూ.23 లక్షలు కొత్త నోట్లు, రూ.6లక్షలు పాతనోట్లను,భారీగా బంగారం, వెండిని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుమారుడు వివేక్ స్థాపించిన ఆరు కంపెనీలకు నిధులు ఎలా వచ్చాయనే దానిపై ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో జాతీయరహదారులపై చర్చ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో జాతీయ రహదారులపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మంచి ఫలితాలు సాధిస్తాం. తెలంగాణ ఏర్పడేనాటికి రహదారుల సగటులో వెనకబడి ఉన్నాం. రెండున్నరేళ్లలో 2వేల776కి.మీ రహదారులు సాధించాం. జాతీయరహదారుల పొడవు 5303 కి.మీ. పెరగనుంది అని తెలిపారు.

12:00 - December 23, 2016

అందరూ గర్వించేలా 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ఉంటుందని మెగాస్టార్ 'చిరంజీవి' పేర్కొన్నారు. ఆయన నటిస్తున్న చిత్రం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ‘కత్తి' రీమెక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 'వి.వి.వినాయక్' తెరకెక్కిస్తున్నారు. ‘చిరు'కు జతగా 'కాజల్' నటించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంవత్సర అధికారిక డైరీ 'మా డైరీ -2017’ ని గురువారం 'చిరంజీవి' తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'చిరు' పై వ్యాఖ్యలు చేశారు. ‘ఖైద నెంబర్ 150’ సినిమా అందరూ అలరించే సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టిస్టుల్లో ప్రతొక్కరూ మెచ్చుకొనేలా 'మా'ని నడిపిస్తున్నారని, అందరూ గర్వించే పనులు చేస్తున్నారని కొనియాడారు. 'మా' అసోసియేషన్‌ ఫౌండర్‌గా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని, అందరికీ క్రిస్మన్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. 'ఖైదీ నెం.150' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న తనను ఉత్సాహపరుస్తు 150 గులాబీలతో పుష్పగుచ్చాన్ని ఎంతో ప్రేమాభిమానాలతో తమ్ముళ్లంతా అందించినందుకు సంతోషంగా ఉంది అని ‘చిరు’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, శివకృష్ణ, బెనర్జీ, కాదంబరి కిరణ్‌, ఏడిద శ్రీరామ్‌, జాకీ, జయలక్ష్మి, హేమ, సురేష్‌ కొండేటి, 'మా' డైరీ స్పాన్సర్స్‌ అపోలో ప్రతినిధులు, శ్రీమిత్రచౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఎల్బీనగర్ లో నగదు మార్పిడి ముఠా అరెస్ట్

హైదరాబాద్: ఎల్బీనగర్‌లో నగదు మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు ముఠా సభ్యుల నుంచి రూ. 19.70 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులు నల్లగొండ జిల్లాకు చెందిన హాలీయా వాసులుగా పోలీసులు గుర్తించారు.

నేడు డిశ్చార్జి కానున్న కరుణానిధి

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్జి కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఆయనను డిశ్చార్జీ చేయనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఆయన ఈ నెల 15న ఆస్పత్రిలో గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

11:53 - December 23, 2016

హైదరబాద్ : అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా మత్స్య పరిశ్రమను అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకుంటోందో తెలపాలని విపక్ష సభ్యులు కోరారు. దీనికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో చేపల మార్కెట్లు నిర్మిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తలసాని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. వీలైనంత త్వరలో చేపల మార్కెట్ నిర్మాణాలు చేపడుతామన్నారు. చేప పిల్లల పెంకపంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తి చేస్తున్నారన్నారు. చెరువులు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అలాగే చేపలు కూడా చెరువుల్లో కళకళలాడాలని సీఎం కలెక్టర్ల సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం మత్స్య కారుల సంక్షేమానికి మార్కెట్ యార్డ్ లు కట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఏప్రిల్ మే నెలలు వచ్చేసరికి ఈ పనులు పూర్తయితే ఉపయోగకరంగా వుంటుదన్నారు. రాష్ట్రంలోనే చేపల షీడ్ లభించేలా భవిష్యత్తులో చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం యత్నిస్తోందని తెలిపారు. చేప పిల్లలను పెంచేందుకు ఓ పరిశ్రమ కావాలని.. సభ్యులు కోరారు. చేపపిల్లను పెంచే కార్యక్రమం మంచిదేననీ..వాటికి తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. తమ ప్రాంతంలో క్యాట్ ఫిఫ్ పెంపకాన్ని అరికట్టాలని కాంగ్రెస్ ఎమ్మల్యే డీకే అరుణ కోరుకున్నారు. పెంచిన చేపలను అమ్ముకునేందకు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలని బాబూ మోహన్ కోరారు. సభ్యులు కోరిన ప్రశ్నలకు మంత్రి తలసాని పైన పేర్కొన్న విధంగా సమాధానం తెలిపారు. 

ఫోర్బ్స్ జాబితిలో అగ్రస్థానంలో సల్మాన్

ముంబై: ఫోర్బ్స్ ఇండియ‌న్ సెల‌బ్రిటీల టాప్ 100 లిస్ట్‌లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇదే జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మూడోస్థానంలో నిలిచాడు. 

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐటీ దాడులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాడు గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ ఇంట్లో రూ.1.25 కోట్ల నగదు, 6 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. కోటెక్ మహీంద్ర బ్యాంకులో రూ.39 కోట్ల దొంగనోట్లను గుర్తించారు. నవంబర్ 8 తర్వాత భారీగా నకిలీ నోట్లు డిపాజిట్ల ను ఐటీ అధికారులు గుర్తించారు. సేలం సెం్రటల్ కార్పోరేషన్ బ్యాంకులనూఐటీ సోదాలు నిర్వహించింది. రాజస్థాన్ జోథ్ పూర్ లో ట్రక్ లో తరలిస్తున్న రూ.35 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు యూపీలోని సంబాల్ లో రూ.20లక్షల కొట్లు స్వాధీనం చేసుకున్నారు.

అహ్మదాబాద్ లోని యాక్సిస్ బ్యాంక్ లో ఐటీ సోదాలు

హైదరాబాద్ : అహ్మదాబాద్ లోని యాక్సిస్ బ్యాంక్ లో ఐటీ సోదాలు చేపట్టింది. 19 ఖాతాల్లో 89కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్న ఐటి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేస్తున్న హెచ్ఎండీఏ

సంగారెడ్డి : పటాన్ చెరు మండలం ముత్తంగా వద్ద అనుమతి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను హెచ్ ఎండీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో త్రీవ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

11:31 - December 23, 2016

ఢిల్లీ: ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీగా న్యూ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.58లక్ష కొత్త కరెన్సీని సీఐఎస్ ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్నవాటిలో రూ.53.78లక్షలు కొత్త నోట్లు కాగా..రూ.4.29లక్షలు పాత నోట్లున్నాయని అధికారులు తెలిపారు. నగదును సీఐఎస్‌ఎఫ్ అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎవరు ఎవరి వద్దకు చేరవేస్తున్నారు అనే కోణంలో అధికారులు నైజీరియా వ్యక్తి నుండి వివరాలు సేకరిస్తున్నారు. కాగా పాత పెద్ద నోట్లు రద్దు అయిన అనంతరం న్యూ కరెన్సీ అమలులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా కొత్త కరెన్సీ భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. 

తెలంగాణ పోలీసులకు పతకాల వెల్లువ

హైదరాబాద్: 60వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీసులకు వెల్లువలా పతకాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ 6 పతకాలు పొందింది.

నగరంలో ఘనంగా పీవీ వర్థంతి వేడుకలు

హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు నగరంలోని పీవీ ఘాట్‌లో ఘనంగా జరిగాయి. పీవీ 12వ వర్ధంతి వేడుకల్లో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారితో పాటు పలువురు పాల్గొన్నారు. పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు. 

10:57 - December 23, 2016
10:54 - December 23, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హోంగార్డుల సమస్యలపై చర్చ కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాలలో భాగంగా హోం గార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందనీ..వారి సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు.బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..హోం గార్డులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారనీ..మహిళా హోం గార్డుల సమస్యలు వర్ణనాతీతంగా వున్నాయని పేర్కొన్నారు. వారికి ప్రసూతి సెలవులు ప్రకటించాలని ఆయన కోరారు. కానిస్టేబుల్స్ కు ఇచ్చే అలవెన్స్ లను హోంగార్డులకు కూడా వర్తింపజేయాలని కోరారు. బస్ పాస్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరారు. దీనికి హోం మంత్రి నాయిని సమాధానమిస్తూ..హోం గార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో హోంగార్డులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వారికి జీవిన భీమా సౌకర్యం కల్పించామనీ..ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.30లక్షలు ..గాయపడినవారికి రూ.3 లక్షలు చెల్లించామని తెలిపారు. వారు చనిపోతే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నామనీ..వారి పిల్లలకు స్కాలర్ షిప్ లు చెల్లిస్తున్నామనీ విపక్ష సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి నాయిని సమాధానం చెప్పారు. 

హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తాం: నాయిని

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తున్నామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయిని మాట్లాడారు. హోంగార్డుల సంక్షేమానికి పాటు పడుతుందని,. వారి జీతభత్యాలు ఎప్పటికప్పుడూ పెంచుతున్నామని తెలిపారు. . రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని చెప్పారు. విధుల్లో హోంగార్డు మరణిస్తే వారి పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఉగ్రవాదుల దాడిలో హోంగార్డు మరణిస్తే రూ.

ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు

ప.గో: జర్నలిస్టుపై దాడి ఘటనలో ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెలే చింతమనేని ప్రభాకర్‌ పై కేసు నమోదైంది. జర్నలిస్టుల ఫిర్యాదుమేరకు టీడీపీ నేత చింతమనేనితో పాటు మరో ఇద్దరిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. జర్నలిస్టులపై చింతమనేని దాడి చేయడాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఖండించారు. చింతమనేని అరెస్ట్ చేయాలని కోరుతూ దశలవారిగా ఉద్యమం చేపట్టాలని జర్నలిస్టులు నిర్ణయించారు.

నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీయాక్టు కేసులు: మంత్రి పోచారం..

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలిలో వ్యవసాయంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ...రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు కావాల్సిన సబ్సిడీలను అందిస్తున్నామన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీల బకాయిలను చెల్లిస్తున్నామన్నామని, మైక్రోఇరిగేషన్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో స్పైస్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామని, రైతులకు సాయిల్ కార్డులను అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది :భట్టి

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. అధికార దాహంతో ప్రభుత్వం రాచరిక పోకడలకు పోతోందని, పుట్టిన రోజు ఫంక్షన్ ల కోసం సభను వాయిదా వేయడం దారుణం అని భట్టి విమర్శించారు.

10:32 - December 23, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్ధి సంఘాలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, టీవీవీకి చందిన విద్యార్ధి సంఘాల అసెంబ్లీ వైపు బయలుదేరగా.. వీరిని బషీర్‌బాగ్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్ధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.తమను ఎందుకు అడ్డుకుంటున్నారని విద్యార్ధులు పోలీసులను నిలదీశారు. దీంతో విద్యార్ధినేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఆందోళనలో పాల్గొన్న అమ్మాయిలను సైతం మగపోలీసులే అరెస్ట్‌ చేయడంపై విద్యార్ధినేతలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేందుకే ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రుల ఇళ్లనూ ముట్టడిస్తామన్నారు.  

కపడ ఫాతిమా మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ల స్కాం

కడప: ఫాతిమా మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ల భారీ స్కాం వెలుగు చూసింది. ఎంసీఐ అనుమతి లేకుండా 100 సీట్లకు అడ్మిషన్లు తీసుకుంది. 100 మంది నుండి డొనేషన్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు ఎన్టీఆర్ వర్శిటీ నిరాకరించడం ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో బాధిత విద్యార్తుల తల్లిదండ్రులు సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వచ్చారు.

10:26 - December 23, 2016

త్రిష...96 ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? చెన్నై పొన్ను 'త్రిష'కు 96కు మధ్య సంబంధం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఆమె వయస్సు కాదు..అదృష్ట సంఖ్య కాదు..ఏంటీ తెలుసుకోవాలంటే ఇది చదవండి....ఒకప్పుడు గ్లామరస్ చిత్రాల్లో 'త్రిష' నటించింది. అగ్ర హీరోలతో సైతం ఆడి..పాడింది..ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేగాకుండా ప్రముఖ హీరోలతో సైతం సినిమాలు చేస్తోంది. యువ హీరోలతో సైతం సై అంటోంది ఈ ముద్దుగుమ్మ. ‘నాయకి'..’కోడి' అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. త్వరలో 'మోహిని' అనే మరో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ‘అరవింద్ స్వామి'కి జంటగా 'చతురంగవేట్టే-2’ చిత్రంలో 'త్రిష' నటిస్తోంది. తాజాగా 'త్రిష' నటిస్తున్న మరో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుండగా, ఈ చిత్రానికి ‘96’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో 'విజయ్ సేతుపతి' హీరోగా నటిస్తున్నాడు. 'త్రిష'కు ఇది 59వ చిత్రం. 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతుందని టాక్.

10:23 - December 23, 2016

కృష్ణా : పరిటాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న కారు పరిటాల పైలాన్ సమీపంలో ఓ వ్యక్తిని ఢీకొని పల్టీలు కొట్టింది. కారు ఢీకొన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. 

ప్రతిపక్షాలు అవినీతికి మద్దతు ఇస్తున్నాయి: ప్రధాని మోదీ

వారణాసి: నోట్ల రద్దు మీద ప్రతిపక్షాలుపై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు. వారణాసిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు అవినీతికి మద్దతు ఇస్తున్నాని ఆరోపించారు. దేశంలో అవినీతి శుభ్రత కార్యక్రమం చేపట్టామని, ప్రతిపక్షాలు నేను విఫలం అయ్యానని అంటున్నాయని.. నేను ఎక్కడ విఫలమయ్యానో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారని.. రాహుల్ వ్యాఖ్యలతో భూకంపం ఎక్కడ వచ్చింది అని ప్రశ్నించారు.

10:22 - December 23, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమవేశాలు ఏడవరోజు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో నేడు ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమంపై కాంగ్రెస్ ..సంచారజాతులకు ప్రత్యేక చట్టంపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. డిసెంబర్ 3ను తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించాలని టీ.డీఎల్పీ డియాండ్ చేయనుంది. ఈ తీర్మానాలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..

10:21 - December 23, 2016

విశాఖ : తెలుగు రాష్ట్రాలను చలి వణికించేస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతల శాతం పడిపోతోంది. ఐదారు డిగ్రీలకు ఉష్ణోగ్రతల శాతం పడిపోతోంది. విశాఖ మన్యం చలి గుప్పెట్లో వణికుతోంది. విశాఖ ఏజెన్సీలో 10 డిగ్రీలకు మించి నమోదు కావటంలేదు. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగిలో '0' డిగ్రీ ఉష్ణోగ్రతలకు పడిపోయింది. చింతపల్లిలో 3, పాడేరు 5, మినుములూరు7 డిగ్రీలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలలో ఆదిలాబాద్ 6, మెదక్ 9, హైదరాబాద్ 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

10:20 - December 23, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటి స‌మావేశం వాడివేడిగా జ‌రిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో తమ ప్రవర్తనపై వైసీపీ ఎమ్మెల్యేలు తమ వాదన వినిపించారు. తామే తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. స‌మావేశం నుంచి వాకౌట్ చేసిన‌ట్లు చెవిరెడ్డి చెబుతుంటే... త‌న‌కు ఉద్దేశ పూర్వకంగానే నోటీసులు ఇచ్చార‌ని మ‌రో ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు.

ప్రివిలేజ్‌ కమిటీ విచారణ కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో ఆందోళన చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ విచారణను వేగవంతం చేసింది. వైసీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సభా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తూ.. ప్రివిలేజ్‌ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరుపుతున్న అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు తాజాగా ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు హాజరయ్యారు.

తాము సభలో అనుచితంగా ప్రవర్తించలేదంటూ వివరణ
అసెంబ్లీలో అనాడు జరిగిన పరిణామాలను ఎమ్మెల్యేలు కమిటీకి వివరించారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తెరలేపుతోందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము సభలో అనుచితంగా ప్రవర్తించలేదని, అయినా అధికార పార్టీ క్రమశిక్షణ చర్యల పేరుతో తమపై వేటు వేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

తమిళనాడు సీఎస్ ఇంట్లో ఐటీ సోదాలపై తెహల్కా కథనం

చెన్నై: తమిళనాడు సీఎస్ ఇంట్లో ఐటీ సోదాలపై తెహల్కా ఓ కథనాన్ని ప్రచురించింది. సీఎస్ రామ్మోహన్ ఇంట్లో రూ.154 కోట్ల నగదు, 167 కిలోల బంగారం దొరికినట్లు తెహల్కా వెల్లడించింది. పట్టుబడిన నగదులో రూ.34 కోట్ల కొత్తనోట్లు ఉన్నాయని.. రామ్మోహన్, శేఖర్ రెడ్డి కలిసి అక్రమాలు చేశారని పేర్కొంది.

10:19 - December 23, 2016

పెదపల్లి : టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవని తమ్మినేని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మార్గమేమిటన్న అన్వేషణలోంచి ఈ పాదయాత్ర మొదలైందని తమ్మనేని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని తమ్మినేని అన్నారు.

పాదయాత్రకు 67 రోజులు పూర్తి
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 67వ రోజు పూర్తి చేసుకుంది. 14 జిల్లాల్లో పర్యటించిన తమ్మినేని బృందం 67వ రోజు 15వ జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్రకు పలు ప్రజాసంఘాలు, న్యాయవాదులు మద్దతు తెలిపారు.

కోల్‌బెల్ట్‌ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి : శోభన్ నాయక్
కోల్ బెల్ట్‌లో సింగరేణి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్‌నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్‌బెల్ట్‌ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని శోభన్‌నాయక్‌ కోరారు.

కేసీఆర్ కు తమ్మినేని మరో లేఖాస్త్రం
67వ రోజు మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన సీపీఎం పాదయాత్ర నత్‌పూర్‌, అరుణక్కనగర్‌, ఇందారం ఎక్స్‌రోడ్‌, ఇందారం, గోదావరి, గంగానగర్‌ వరకు కొనసాగింది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది. పాదయాత్రకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు పాదయాత్ర మొత్తం 1770 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సింగరేణి కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.  

10:18 - December 23, 2016

విజయవాడ : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి చిత్రం థియేటర్లరో సందడి చేయనుంది. తాను తెలుగులో చేసే చివరి సినిమా ఇదేనని వర్మ ప్రకటించడం...వివాదాస్పద అంశాలు ముడిపడి ఉండటంతో మూవీపై అంచానాలు నెలకొన్నాయి. అయితే మూవీ రిలీజ్ కి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకపోవడంతో ఇవాళ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ని ఇప్పటికే ఆర్జీవీ సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను మూటగట్టుకున్న ఈ సినిమా..విడుదల తర్వాత ఎలాంటి కొత్త వివాదాలను సృష్టిస్తుందో చూడాలి. 

10:17 - December 23, 2016

మెదక్ : కేసీఆర్ దత్తత గ్రామాల్లో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. సామూహిక గృహప్రవేశాలు చేసేందుకు నర్సంపేటకు చేరుకున్న కేసీఆర్ దంపతులకు వేదపండితులు వేద మంత్రోచ్ఛరణ మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాలలో సామూహిక గృహప్రవేశాలను సీఎం కేసీఆర్ దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ఎర్రవెల్లిలోని కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన . అనంతరం వాస్తు హోమం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులను కేసీర్ శుభాకాంక్షలను తెలిపారు. క్యాష్ లెస్ గ్రామాలుగా ఎర్రవెల్లి, నర్సంపేటలను ప్రకటిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణకు బాట వేసేలా..స్వయం సహాయక గ్రామాలుగా మారాలని సూచించారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ గా ఈ రెండు గ్రామాలు నిలవాలని పిలుపునిచ్చారు. నర్సంపేటలో పైలాన్ ను ఆయన ప్రారంభించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఆయన పరిశీలించారు.

600 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు..
600 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు..సత్యనారాయణస్వామి వ్రతాలు ఇరు గ్రామాలలోనూ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతిఇంటికి రెండు పాడి గేదెలు, పది దేశీయ కోళ్లు అందజేస్తారు. ప్రతీ ఇంటికీ ఐదు మొక్కలు అందిస్తున్నారు. వైఫై సేవలు.. ఎల్‌ఈడీ విద్యుత్ కాంతులు రెండు గ్రామాలలోనూ కాంతులీననున్నాయి.

 

10:14 - December 23, 2016

రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో .. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. కానీ రాహుల్ గాంధీ అనేపేరు ప్రస్తావించకుండా 'ఓ యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు... ప్రసంగాలు ఇస్తున్నారు... అతను మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేది.. ఇప్పుడు మాట్లాడారు కనుక భూకంపం వచ్చే అవకాశమే లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.మరో పక్క నోట్ల రద్దుపై మాట్లాడుతున్న ప్రతిపక్షాలను పాకిస్థాన్ తో పోలుస్తున్న మోదీ మాటలతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య మాట్లాడుతూ..అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్ లో మాట్లాడటానికి కూడా సిద్ధపడని ప్రధాని మోదీ కోట్లాదిమంది ప్రజల ఇబ్బందులకు ప్రజాప్రతినిథులుగా పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతుంటూ వారిని పాకిస్థానీయులతో పోల్చటం సరికాదన్నారు. ప్రజల కోసం మాట్లాడితే పాకిస్థాన్ కోసం మాట్లాడినట్లా? అని ప్రశ్నించారు. ఆయన చేసే ప్రతి పనీ అమెరికా కోసం చేస్తున్నట్లుగా వుందన్నారు. ఈ చర్చలో బీజేపీ నేత పాతూరి కరుణ పాల్గొన్నారు. మరి బీజేపీ నేత కరుణ ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో ఈ వీడియో చూడండి..

 

10:13 - December 23, 2016

ఇప్పటికే కార్పొరేట్‌ సంస్థల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్న సంప్రదాయ క్షౌరవృత్తిదారుల నోట్ల రద్దు తర్వాత మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. డిజిటల్‌ యుగంలో అత్యధికంగా ప్రభావితమయ్యే వృత్తుల్లో క్షౌరవృత్తి కూడా వుండబోతోంది. సొంతంగా చిన్నచిన్న సెలూన్‌ లు నడుపుకుంటున్నవారి భవిష్యత్‌ ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

క్షౌరవృత్తిలో మార్పులు..2020 నాటికి లక్ష కోట్ల టర్నోవర్
క్షవరం... క్షురకులకు ఇది జీవనాధారం. మన తెలుగు రాష్ట్రాల్లో పాతిక నుంచి 30 లక్షల మంది జీవితాలు ఈ వృత్తితో అనుసంధానమై వున్నాయి. అత్యంత ప్రాచీన వృత్తి. చేతిలో చిన్న సంచి, అందులో ఒక కత్తెర, చిన్న చాకు, దానిని సానపెట్టేందుకు చిన్నరాయి, ఒకట్రెండు దువ్వెనలు ఇవి వుంటే చాలు ఈ వృత్తి సాఫీగా సాగిపోయేది. ఇప్పుడు కాలం మారింది. ప్రతి వృత్తి హైటెక్ సొగసులు అద్దుకుంటోంది. క్షౌరవృత్తిలోనూ మన కళ్లెదుటే చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు మరిన్ని మార్పులు రాబోతున్నాయి. నోట్ల రద్దు, డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ ఈ వృత్తిని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. బహుశా, ఇప్పుడున్న స్వతంత్రత క్షురకులకు ఇక భవిష్యత్తులో ఉండకపోవచ్చు.

వ్యాపారంగా మారిపోయిన హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్
హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ ఇప్పుడో ఆకర్షణీయ వ్యాపారంగా మారిపోయింది. హెయిర్ అండ్ బ్యూటీ కేర్ పేరుతో క్షౌరానికి గ్లామర్ సొగసులు అద్దిన పది పన్నెండు పెద్ద సంస్థలు ఇప్పుడు ఈ వ్రుత్తిని శాసిస్తున్నాయి. విదేశీ బహుళజాతి సంస్థలు వేల సంఖ్యలో హెయిర్ సెలూన్ లు నడుపుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ వ్యాపారం ప్రతి ఏటా 20 నుంచి పాతిక శాతం వ్రుద్ధిని సాధిస్తోంది. 2020 నాటికి ఇది లక్ష కోట్ల టర్నోవర్ వున్న వ్యాపారంగా మారుతుందన్నది బహుళజాతి సంస్థల అంచనా. అందుకే నగరాలు, మహానగరాలతో పాటు ఇప్పుడు పెద్ద పట్టణాల్లో సైతం ఈ రంగంలో కార్పొరేట్ సంస్థల బ్రాంచీలు వెలుస్తున్నాయి. మన దేశంలో నాలుగైదు వేల బ్రాంచీలు నిర్వహిస్తున్న బడా సంస్థలు సైతం వున్నాయి.

హెయిర్ అండ్ బ్యూటీ కేర్ లో కార్పొరేట్ సంస్థలు
హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతున్న తీరు స్వతంత్రంగా, సంప్రదాయబద్దంగా వృత్తి నిర్వహించే క్షురకుల ఉపాధి అవకాశాలను ఘోరంగా దెబ్బతీస్తోంది. నగరాలు పట్టణాల్లో సెలూన్ అద్దెలు పెరిగిపోతున్నాయి. భారీగా అడ్వాన్స్ లు చెల్లించాల్సి వస్తోంది. యాభై వేల నుంచి మూడు లక్షల దాకా అడ్వాన్ లు కట్టాల్సి వస్తోంది. నగరాలు, పట్టణాల్లో కనీసం పది లక్షల రూపాయలు పెట్టకుండా ఒక మోస్తారు సెలూన్ ప్రారంభించలేని పరిస్థితిని క్షురకులు ఎదుర్కొంటున్నారు. హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ బిజినెస్ లోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడంతో తరతరాలుగా క్షౌర వ్రుత్తినే నమ్ముకున్న కొన్ని లక్షల కుటుంబాలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

పెరుగుతున్న సెలూన్ అద్దెలు.. సంక్షోభంలో క్షురకుల కుటుంబాలు
కార్పొరేట్ సంస్థలకు ధీటుగా సెలూన్ లు పెట్టుకునే ఆర్థిక స్థోమతలేక , సెలూన్ల అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేక విలవిలాడుతున్న పరిస్థితి. నోట్ల రద్దు, కరెన్సీ కరెత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ కి ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో క్షురకులు ఎదుర్కొంటున్న సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుని, కార్పొరేట్ సంస్థల ధాటి నుంచి వారిని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. 

సభలో అసభ్యకరంగా ప్రవర్తించలేదు: కొడాలి నాని

హైదరాబాద్: సభాహక్కుల సంఘం సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ సభలో అసభ్యకరంగా ప్రవర్తించలేదని... తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సభాహక్కుల సంఘాన్ని కొడాలినాని కోరారు.

10:11 - December 23, 2016

చిల్లర లేని కారణంగా కటింగ్‌ వాయిదా వేసుకున్నవారు చాలామందే వున్నారంటే ఆశ్చర్యపోకండి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత అత్యంత తీవ్రంగా ప్రభావితమైన వృత్తుల్లో క్షౌరవృత్తి ఒకటి. నవంబర్‌ 9 నుంచి చాలా బార్బర్‌ షాపుల్లో గిరాకీ తగ్గిపోయింది. నోట్ల రద్దు తర్వాత బార్బర్స్‌ ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు తెలంగాణ బార్బర్స్ అసోసియేషన్‌ నేత మల్లేష్ 10టీవీ స్టూడియోకి వచ్చి నోట్ల రద్దు తర్వాత బార్బర్స్‌ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? గిరాకీలు ఏమేరకు ప్రభావితమయ్యాయి? అనే అంశాల్ని తెలిపారు. మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

10:11 - December 23, 2016

కర్నూలు : ఆ గ్రామం పేరువింటేనే ప్రజల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యేవి... ఆ గ్రామంలోని ఫ్యాక్షనిజం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫ్యాక్షన్‌కు ఒకప్పుడు అడ్డాగా ఉండే ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు మారుపేరుగా మారింది. ఇంతగా మార్పు చెందిన ఈ గ్రామమేంటి...ఈ గ్రామంలో పూర్తి మార్పులు రావడం వెనుక ఎవరున్నారు...వాచ్‌ దిస్ స్టోరీ..

ఒకప్పుడు ఫ్యాక్షనిజానికి అడ్డాగా కప్పట్రాళ్ల
ఈ విజువల్స్‌లో మీకు కనిపిస్తున్నది కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామం. ఒకప్పుడు ఫ్యాక్షనిజానికి అడ్డాగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధి బీజాలు పడుతున్నాయి. స్కూళ్ల నిర్మాణం, మౌలికవసతుల కల్పన ఇలా పలు కార్యక్రమాలతో ఈ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఇది గమనించిన తానా...తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.

కప్పట్రాళ్ల రూపు రేఖలను మార్చిన ఎస్పీ రవికృష్ణ
అభివృద్ధికి దూరంగా ఉండే కప్పట్రాళ్ల రూపు రేఖలను కర్నూలు ఎస్పీ రవికృష్ణ పూర్తిగా మార్చేశారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని..పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే తానా...ఎస్పీ సేవలను గుర్తించింది. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తానా జాయింట్‌ సెక్రటరీ పోట్లూరి. రవి తెలిపారు.

గ్రామ అభివృద్ధికి సాయమందిస్తాం : తానా జాయింట్‌ సెక్రటరీ రవి
కప్పట్రాళ్ల గ్రామ ప్రజల్లో మార్పును గమనించిన తాము..గ్రామ అభివృద్ధికి సాయమందిస్తామని తానా జాయింట్‌ సెక్రటరీ రవి అన్నారు. కప్పట్రాళ్ళ ప్రాథమికోన్నత పాఠశాలలో లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

10:10 - December 23, 2016

హైదరాబాద్ : ముందేమో ఆహా.. ఓహో అంటారు..! వెన‌కేమో నింద‌లు మోపుతారు..! ఇలాగైతే ఎలా..? అంటూ కాంగ్రెస్‌లో ఆ పెద్దాయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముందో మాట‌.. వెన‌కో మాట మాట్లాడుతూ పార్టీ ప‌రువు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాల‌ని చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండటం సొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఎవరా నేత..! ఏంటా స్టోరీ..!

జానారెడ్డిపై అసంతృప్తిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..!
సీఎల్పీ నేత‌ జానారెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో జానారెడ్డి తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టడం లేదని కాంగ్రెస్‌పై ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సభలో పార్టీని ముందుండి నడపాల్సిన బాధ్యత సీఎల్పీ నేత జానారెడ్డిదే అంటూ సొంత పార్టీలు చర్చించుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

జానారెడ్డిపై స్వపక్ష నేతల విమర్శలు
పెద్ద నోట్ల ర‌ద్దుపై జ‌రిగిన చ‌ర్చలో జానారెడ్డి రాష్ర్ట స‌ర్కార్‌ను ఇరుకున పెట్టలేకపోయార‌ని, దీంతో సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులదే పై చేయిగా నడుస్తోందని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జానారెడ్డి ఆగ్రహాంతో ఊగిపోతున్నారట..! తనను చాటుగా కాంగ్రెస్‌ నేతలే నిందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట..!

తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆవేదన
తన ముందు పొగుడుతూ.. తాను లేనప్పుడు ఎందుకిలా తనపై నిందలు వేస్తున్నారని సన్నిహితుల వద్ద జానారెడ్డి వాపోయారని సమాచారం. సభలో ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో జానా విఫలమవుతున్నారని సొంత పార్టీ నేతలు ప్రచారం చేస్తుండటంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాజ‌కీయ అవ‌గాహ‌న, ప‌రిణ‌తిలేక ప్రచారం చేస్తున్నారా..? లేక త‌న‌ను ఇబ్బందుల్లో పడేయాలని చేస్తున్నారో తెలియక జానా సందిగ్ధంలో పడ్డారని టాక్..! ఇదే విష‌యంపై పిల్ల చేష్టలు మానుకోవాల‌ని, మిగ‌తా వారికి అర్థం అయ్యేలా ఓ ఎమ్మెల్యేకు జానారెడ్డి క్లాస్ ఇచ్చార‌ని తెలుస్తుంది. ' మీ చేష్టల‌తో నాకు మాత్రమే కాదు.. పార్టీకి కూడా న‌ష్టం జ‌రుగుతుంద‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాలి' అని ఆగ్రహంతో ఆ ఎమ్మెల్యేను గట్టిగా హెచ్చరించారట..! అసెంబ్లీ సమావేశాల్లో అధికార సభ్యులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన కాంగ్రెస్.. ఇప్పుడు సీఎల్పీనేత జానా వ‌ర్సెస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలుగా మార‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.

నేటి వాయిదా తీర్మానాలు....

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేటి వాయిదా తీర్మానాలు ఈ విధంగా ఉన్నాయి. సంచార జాతుల సమస్యలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. సంచార జాతులన్నింటిని ఒక తాటిపైకి తెచ్చి వారికి గుర్తింపు కల్పించాలని బీజేపీ కోరనుంది. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని...డిసెంబర్‌ 3ను తెలంగాణ అమరవీరుల దినంగా ప్రటించాలని...టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది.

10:09 - December 23, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబర్‌ 9 నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు గుర్తించిన మొత్తం నల్లధనం అక్షరాలా 3,300 కోట్ల రూపాయలు. ఇందులో 421 కోట్లు నగదు మిగిలినది బంగారం రూపంలో ఉంది. అయితే పట్టుబడ్డ నగదులో 92కోట్ల రూపాయల కొత్తనోట్లు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 734 దాడులు నిర్వహించినట్లు ఐటీ అధికారవర్గాలు పేర్కొన్నాయి. హవాలా వ్యాపారం, పన్నుఎగవేత కేసుల్లో మొత్తం ఇప్పటి వరకు 3,200 మందికి నోటీసులు జారీచేసినట్లు తెలిపాయి. ఈ దాడుల్లో పట్టుబడిన మొత్తంలో 500 కోట్లు విలువైన నగదు, బంగారాన్ని సీజ్‌ చేసినట్లు ఐటీశాఖ పేర్కొంది. మరోవైపు ఐటీశాఖకు అనుబంధంగా దేశవ్యాప్తంగా నల్లధనాన్ని వెలికి తీసేందుకు సీబీఐ, ఈడీ కూడా విస్త్రతంగా దాడులు కొనసాగిస్తున్నాయి.

 

10:08 - December 23, 2016

ఉత్తరప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సెటైర్లు వేశారు. ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నారని...ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేదని ఎద్దేవా చేశారు. ప్రధాని తనను గేలి చేసేలా మాట్లాడినా.. తనకేమి అభ్యంతరం లేదని...ముడుపుల వ్యవహారంపై తాను అడిగిన ప్రశ్నలకు మోది సమాధానం చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోది తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా ఆయనపై కౌంటర్లు వేశారు. ఓ యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు... ప్రసంగాలు ఇస్తున్నారు... అతను మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేది.. ఇప్పుడు మాట్లాడారు కనుక భూకంపం వచ్చే అవకాశమే లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై మోది విమర్శలు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై కూడా మోది విమర్శలు సంధించారు. 50 శాతం పేదలున్న భారత్‌లో నగదు రహిత చలామణి ఎలా చేస్తారని మన్మోహన్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. మన దేశంలో ఎక్కువ మందికి విద్య అందుబాటులో లేదని చెప్తున్నారని, వాళ్ళు చూపించేది ఎవరి రిపోర్టు కార్డు? అని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ నిష్కళంకితుడని, అయితే ఆయన హయాంలో స్కాంలు వెలుగు చూశాయని మోది విమర్శించారు.

అవినీతిపై అడిగిన ప్రశ్నలకు మోది సమాధానం చెప్పాలని డిమాండ్‌
ప్రధాని మోది చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ యూపీలోని బహరాయిచ్‌ ఎన్నికల సభలో స్పందించారు. గుజరాత్‌లో తాను లేవనెత్తిన ముడుపుల అంశంపై ప్రధాని ఇంతవరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. ప్రధాని తనను గేలి చేసేలా మాట్లాడితే తనకేమి అభ్యంతరం లేదని...తాను అవినీతిపై అడిగిన ప్రశ్నలకు మోది సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సహారా, బిర్లా గ్రూపుల నుంచి 52 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ సహారా, బిర్లా గ్రూపుల నుంచి 52 కోట్లు ముడుపులు తీసుకున్నారని బుధవారం గుజరాత్‌లో జరిగిన ఓ సభలో రాహుల్ ఆరోపించారు. నోట్ల ర‌ద్దుకు సంబంధించి త‌న‌ను లోక్‌స‌భ‌లో మాట్లాడ‌నివ్వడం లేద‌ని... తాను మాట్లాడితే భూకంపం వ‌స్తుంద‌ని రాహుల్ పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో స‌మావేశాల స‌మ‌యంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే.

10:07 - December 23, 2016

తమిళనాడు : నూతన సీఎస్ రామ్మోహన్‌ రావుపై అవినితీ ఆరోపణలు రావడం, ఇంట్లో భారీగా నగదు లభించడంతో.. ఆయనను సీఎస్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ.. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

1981 బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్‌ సీఎస్‌గా నియామకం
ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1981 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం భూపరిపాలన విభాగంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. వివిధ శాఖల్లో 15 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె చెన్నై ఐఐటీ నుంచి హెల్త్‌ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. గిరిజా వైద్యనాథన్‌ తండ్రి ..ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఎస్‌.వెంకటరమణన్‌ .. ఆమె భర్త రాజా వైద్యనాథన్‌ స్పిక్‌ గ్రూప్‌నకు చెందిన ఫోర్‌సైట్‌ ఫైనాన్షియల్‌లో పనిచేస్తున్నారు.

ప్రభుత్వ పథకాల రూపొందించడంలో గిరిజా వైద్యనాథన్ కు విశేష అనుభవం
గిరిజా వైద్యనాథన్‌ తొలి నుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రూపొందించడంలో ఆమెకు విశేష అనుభవం ఉంది. ఆరోగ్య, విద్య, వ్యవసాయం వంటి వివిధ శాఖలలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆరోగ్య, పోషకాహారం, పర్యావరణ శాఖలలో ఆమె వివిధ స్థాయిల్లో పనిచేశారు. అలాగే 2013 భూ సేకరణ చట్టంలోని పలు నిబంధనల తయారీలో గిరిజా వైద్యనాథన్‌ కీలక పాత్ర పోషించారు. 2005 నుంచి 2006 వరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగాను.. 2007 నుంచి 2008 వరకు ప్రభుత్వ ప్రణాళిక కమిషన్‌లో మెంబర్‌గాను ఆమె కొనసాగారు.

ముక్కు సూటిగా వ్యవహరించే వ్యక్తిగా గిరిజకు పేరు
గిరిజా వైద్యనాథన్‌కు ముక్కు సూటిగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది. తమిళం, హింది, ఇంగ్లీష్ భాషాల్లో పట్టుంది. 1983లో సబ్‌-కలెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన గిరిజా వైద్యనాథన్‌ ..... గత సీఎస్‌ రామ్మోహన్‌ కంటే సీనియర్‌ కావడం విశేషం.

 

10:05 - December 23, 2016

తమిళనాడు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుపై వేటు పడింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ప్రభుత్వం సిఎస్‌ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశముంది. రామ్మోహన్‌రావు ఇంట్లో భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

రామ్మోహన్‌రావును సీఎస్‌ పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు పదవి ఊడింది. మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పన్నీర్‌ సెల్వం ప్రభుత్వం ఆయనను వెంటనే సీఎస్ పదవి నుంచి తొలగించింది.

నల్లకుబేరుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహన్‌రావుకు సంబంధాలు
నల్లకుబేరుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహన్‌రావుకు సంబంధాలున్నాయని.. పెద్దనోట్ల రద్దు అనంతరం శేఖర్‌రెడ్డికి ఆయన భారీస్థాయిలో బంగారం కొనుగోలు చేసేందుకు సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రామ్మోహన్‌రావు , ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 5గంటలకు ప్రారంభమైన సోదాలు గురువారం ఉదయం 6గంటల వరకు కొనసాగాయి. రామ్మోహన్‌రావు, ఆయన కుమారుడు, బంధువుల ఇళ్లతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 13 చోట్ల అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చిత్తూరులోని రామ్మోహన్‌రావు వియ్యంకుడు, దివంగత ఎంపీ ఆదికేశవులునాయుడు సోదరుడు భద్రీనారాయణ నివాసంలోనూ తనిఖీలు చేశారు. రామ్మోహన్‌రావు నివాసంలో 30లక్షలు విలువైన కొత్తనోట్లు, 5కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పలువురి ఐఏఎస్ లపై అవినీతి ఆరోపణలు
రాష్ట్రంలోని మరికొంతమంది ఐఏఎస్‌ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయి. వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నాగరాజన్‌ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఐటీ సోదాలపై ఏకమైన విపక్షాల విమర్శలు
ఐటీ సోదాలపై తమిళనాడులోని విపక్షాలన్నీ ఏకమై విమర్శలు గుప్పించాయి. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఐటీ సోదాలు జరగడం రాష్ట్ర చరిత్రలో తొలిసారని.. ఈ చర్యతో రాష్ట్రం పరువు పోయిందని విమర్శించాయి. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి రామ్మోహన్‌రావుపై వేటు వేయక తప్పలేదు.

తమిళనాడు సీఎస్ గా గిరిజా వైద్యనాథన్

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్ నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు సర్కార్ ఈ చర్యలు చేపట్టింది.

10:04 - December 23, 2016

విజయవాడ : వర్షాభావ పరిస్థితులలోనూ రికార్డు స్థాయిలో పంట దిగుబడులు పెరగడం సమిష్టి కృషికి దక్కిన ఫలితమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పంట రుణాలపై పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విజయవాడలో రెండవరోజు జరగిన కలెక్టర్ల సదస్సులో..ప్రాథమిక రంగం సమీక్షలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు.

రైతులకు సరైన సమయంలో నీరు అందించాలి : చంద్రబాబు
అనావృష్టి పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు వినియోగించే రెయిన్‌గన్ల నిర్వహణకు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రెయిన్‌గన్లను నిరంతరం పర్యవేక్షించడానికి వీలుగా నిర్వహణ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానాల్లో నీటి నిర్వహణ అత్యంత ముఖ్యమని సీఎం అభిప్రాయపడ్డారు. అధిక దిగుబడులు సాధించేందుకు సరైన సమయంలో నీరు అందించాలని చెప్పారు.

కృష్ణాజిల్లా కలెక్టర్‌ ను అభినందించిన చంద్రబాబు
కృష్ణాజిల్లాలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను సమర్ధంగా ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆ జిల్లా కలెక్టర్‌ను ఏపీ సీఎం అభినందించారు. రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల్లో అమలు చేస్తున్న ఇ-పోస్ విధానం ఉత్తమమైనదిగా దేశమంతా కొనియాడుతోందన్నారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియతో సాధ్యమైనంత త్వరగా రైతులకు రుణాలు అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మొక్కజొన్న దిగుబడిలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ
వ్యవసాయరంగంలో ఈ ఏడాది సాధించిన పురోగతిని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సదస్సులో వివరించారు. మొక్కజొన్న దిగుబడుల్లో దేశంలోనే మొదటిస్థానం..వరి దిగుబడుల్లో మూడోస్థానంలో ఉన్నామని వ్యవసాయ శాఖ కమిషనర్ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 77 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. రికార్డు స్థాయి దిగుబడులు సాధించినందుకు సీఎం అధికారులను అభినందించారు.

పట్టణ సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్ కోసం ప్రత్యేక సంస్థ- బాబు
విశాఖ తీరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు సాగర మాలకు తోడు సౌందర్యమాల పేరుతో మరో ఔటర్‌ రింగ్‌ రోడ్డును అత్యంత సుందరంగా నిర్మిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. పట్టణ సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం లక్షా 10 వేల ఇళ్లను పట్టణ మురికివాడలలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇవికాకుండా 92 వేల వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్ల వెల్లడించారు. ఎర్ర చందనం నిల్వలను మంచి ఆదాయ వనరుగా మార్చుకోవాలని సీఎం సూచించారు. అటవీ ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని అన్నారు.

 

కారు బాంబు పేలుళ్లు.. 23 మంది మృతి

ఇరాక్‌ : ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. రద్దీగా ఉన్న మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని మూడు కారు బాంబులను పేల్చారు. దీంతో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 15మంది ప్రజలు, 8మంది పోలీసులు ఉన్నారు. ఇరాక్‌లోని మోసుల్ సమీపంలో ఉన్న గాగ్జలీ మార్కెట్‌లో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పేలుళ్లు సంభవించిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

09:57 - December 23, 2016

వరల్డ్ కప్ గెలిస్తే ఆయా సంస్థలు..ఇతరులు క్రీడాకారులకు..కోచ్ లకు ఎంత బహుమానం ఇస్తారు ? ఏముంటుంది..లక్షలు..కోట్లు..ఉద్యోగం..ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తారు అంటారు..కదా...తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు పలువురి క్రీడాకారులకు..కోచ్ లకు ఎలాంటి బహుమానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ హాకీలో ప్రపంచకప్ గెలిపించిన కోచ్ కు వచ్చిన నజరానాపై చర్చ జరుగుతోంది. భారత్ అతిథ్యమిచ్చిన జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి కోచ్ గా ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులైన చీఫ్ కోచ్ గా హరేంద్ర సింగ్ వ్యవహరించారు. విజేతగా ఆవిర్భవించిన సందర్భంగా ఎయిరిండియా నజరానా ప్రకటించింది. చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌కు రూ.25 వేలు, స్ట్రయికర్‌ అర్మాన్‌ ఖురేషీకి రూ. 10 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు ఎయిరిండియా చైర్మన్‌ అశ్వని లోహని ప్రకటించారు. ఇంత తక్కువ మొత్తాన్ని గొప్పగా ప్రకటించడంపై పలువురిని విస్మయానికి గురి చేసిందంట.

09:53 - December 23, 2016

ఓ వైపు నోట్ల కష్టాలు..మరోవైపు చిల్లర కష్టాలు..ప్రస్తుతం సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలు. ఈ తరుణంలో సినిమాలు విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా ? అని టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ ఇవేమీ ఆలోచించకుండా మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ'..’ధృవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ధృవ' చిత్రం డిసెంబర్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ చిత్రం 'తనీ ఒరువన్' కి రీమెక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలైన అనంతరం సంచనాలు సృష్టిస్తూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు అనే సమస్య ఈ చిత్రానికి రాలేదంట. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకెళుతోందంట. ప్రస్తుతం ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లోకి చేరిందని చెబుతున్నారు. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవి రావడం లేదు. దీనితో 'ధృవ' చిత్రం మరిన్ని కలెక్షన్లు సాధించడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. 'రామ్ చరణ్' సరసన 'రకుల్ ప్రీత్ సింగ్' కథానాయికగా నటించింది. 'అరవింద్ స్వామి' ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించాడు. ‘చెర్రీ' తన తదుపరి చిత్రం 'సుకుమార్' దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. 

09:51 - December 23, 2016

బాలీవుడ్ లో ఖాన్ త్రయం..అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్...ఎంతో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. కానీ 'ఐ హేట్ అమీర్' అని 'సల్మాన్' ఎందుకంటారు ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడా ? అని ఆలోచిస్తున్నారా..అయితే ఇది చదవండి...ఈ మధ్య ఖాన్ త్రయం ఒకరి సినిమాలు ఒకరు బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' నటించిన 'దంగల్' చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కండలవీరుడు 'సల్మాన్ ఖాన్' తన ఫ్యామిలీతో 'దంగల్' సినిమా చూశాడంట. స్వయంగా ఈ విషయాన్ని 'సల్లూ' తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. తన సినిమా 'సుల్తాన్' కంటే చాలా బాగుందని కితాబిచ్చాడు. అంతేగాకుండా 'అమీర్'ను తాను పర్సన్ గా ప్రేమిస్తానని పేర్కొంటూనే పర్సనల్ గా మాత్రం 'హేట్' చేస్తానంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘సల్మాన్' ప్రస్తుతం 'ట్యూబ్ లైట్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా నేడు (శుక్రవారం) విడుదలవుతున్న 'దంగల్' ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. లెజండరీ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత నేపథ్యంలో 'దంగల్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

07:03 - December 23, 2016

మెదక్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామంలో సందడి మొదలైంది. కాసేపట్లో కేసీఆర్ ప్రారంభించనున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గృహ ప్రవేశానికి అంతా సిద్ధమైంది. ఏకకాలంలో సామూహిక గృహ ప్రవేశాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. ..
సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. మొన్నటిదాకా పాత పెంకులతో..మట్టిగోడలతో.. ఇరుకుగా ఉన్న నివాసాలు..ఇప్పుడు పక్కా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లుగా మారాయి. పదీ ఇరవై కాదు.. ఏకంగా 580 ఇండ్లు ఫల పుష్పాల మొక్కలతో తన పల్లె వాతావరణం ఛాయలు కోల్పోని ఒక అద్భుతం.. ఆవిష్కారానికి సిద్ధమయ్యింది. కాసేపట్లో ఈ గృహాలన్నీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

కాసేపట్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేసీఆర్
దత్తత గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం గృహ ప్రవేశాలకు సీఎం కేసీఆర్ కాసేపట్లో లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. 600 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించబోతున్నారు. ప్రతిఇంటికి రెండు పాడి గేదెలు, పది దేశీయ కోళ్లు అందజేస్తున్నారు. ఇంటింటికీ ఐదు ఫల పుష్ప మొక్కలు అందిస్తున్నారు. వైఫై సేవలు.. ఎల్‌ఈడీ విద్యుత్ కాంతులు వెల్లివిరియనున్నాయి.

ఉదయం 7గంటల 53 నిమిషాలకు ప్రారంభం
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం కేసీఆర్ ఉదయం 7గంటల 53 నిమిషాలకు ప్రారంభించనున్నారు. ఎర్రవల్లిలోని ఫంక్షన్ హాల్‌లో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ఇప్పటికే ఎర్రవెల్లిలో ఉన్న తన ఫాంహౌస్‌ కు చేరుకున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Don't Miss