Activities calendar

24 December 2016

22:14 - December 24, 2016

మారుమూల తండాలో జీవనం సాగిస్తూ...పల్లె దాటిన ఓ అబల రాజధాని వరకు కాళ్ల చెప్పులు అరిగేలా.. అధికారులు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. తనకు జరిగిన అన్యాయంపై ఓ సామాన్యురాలు నిలదీసింది. న్యాయం జరిగే వరకు పోరాటం చేసింది. తన భర్త మరణంలో గుట్టును బయటపెట్టించింది. గుండెలోతుల్లోంచి వస్తున్న బాధను దిగమింగుకుని.. ఆ ఇల్లాలు చేసినా న్యాయ పోరాటం ఫలించింది. కేసు విషయంలో పోలీసుల నిర్లక్ష్యం చేసినా.. చివరకు అదే పోలీసుల శోధనలో నిజాన్ని బయటలకు రప్పించగలిగింది. ఓ అబలకు మరో మహిళా అధికారిణి అండగా నిలిచింది. ఆమె కన్నీటి వ్యథను అర్ధం చేసుకుంది. ఆమె గుండెల్లోని బాధకు బాసటగా నిలిచింది. ఓ సామాన్యురాలు జ్యోతి సాధించిన విజయం.. ఇదీ కథకాదు.. ఏ రియల్ స్టోరీ... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:59 - December 24, 2016

హైదరాబాద్ : మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మాజీ సైనిక ఉద్యోగి మరణిస్తే ఆయన భార్యకు పెన్షన్ వర్తింప చేస్తామన్నారు. యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు అందుతున్న సదుపాయాలు...సర్వీసులో ఉంటూ ఇతర కారణాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు వర్తిస్తాయని చెప్పారు.

 

21:47 - December 24, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. కాకినాడ‌లో ఓ కుటుంబం విన్నూత్న రీతిలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. స్థానికంగా ఉండే సైకాలజిస్ట్ విన్నూ తన ఇంట్లో క్రిస్మస్‌ వేడుకల కోసం ప్రకృతి సిద్ధమైన వ‌స్తువుల‌ను అందంగా అలంక‌రించారు. క్రీస్తు జ‌ననానికి సంబంధించిన అన్ని అంశాలను బొమ్మలతో వివరించారు. 

 

21:42 - December 24, 2016

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ మనీలాండరింగ్‌కు అడ్డాగా మారింది. 140 కోట్ల పాత నోట్లను బంగారంగా మార్చుకున్న వైనం ఐటి దాడుల్లో వెలుగు చూసింది. 430 కిలోల బంగారాన్ని ఐటి స్వాధీనం చేసుకుంది. పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ ఇదే అతి పెద్ద దాడి.
పెద్దఎత్తున నల్లధనం 
దేశరాజధాని ఢిల్లీ, నోయిడాలలో ఐటి అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దఎత్తున నల్లధనం వెలుగుచూసింది. శ్రీలాల్‌ మహల్‌ లిమిటెడ్‌ అనే కమొడిటీ ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం నివాసాలు, కార్యాలయాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోని లక్నో విభాగానికి చెందిన అధికారులు  ఏకకాలంలోఈ దాడులు నిర్వహించారు. డీఆర్‌ఐ జరిపిన దాడుల్లో సుమారు 430కేజీల బంగారం పట్టుబడింది. ఈ కంపెనీ 140 కోట్ల నల్లధనాన్ని 430 కేజీల బంగారంలోకి మార్చింది. 
ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో ఐటి దాడులు 
ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు గత రెండు రోజులుగా ఢిల్లీ, నొయిడా ప్రాంతాల్లో ఐటి దాడులు జరిపింది. ఈ దాడుల్లో బంగారంతో పాటు 2.60కోట్ల విలువైన పాతనోట్లు, 12 లక్షల విలువైన కొత్త నోట్లను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాక సుమారు 80కేజీల వెండి, మరో 15 కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఆన్‌లైన్‌ లావాదేవీలు 
పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దఎత్తున వారి కార్యాలయాల నుంచి ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రద్దయిన పాతనోట్లతో భారీగా బంగారం కొనుగోలు చేశారు.  ఈ మొత్తంతోనే బంగారు నాణేలు లేదా కడ్డీలను ప్రభుత్వం రంగ సంస్థ అయిన మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారని, అదికూడా పాతనోట్లలో ఎక్కువ విలువకు అమ్ముతున్నారని తెలిపారు. అధికారులు సంస్థ డైరెక్టర్లను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా అనారోగ్య కారణాలు చూపి తప్పించుకుంటున్నట్లు సమాచారం.
బులియన్‌ ట్రేడర్స్‌ స్థావరాలపై ఐటి దాడులు 
బులియన్‌ ట్రేడర్స్‌ స్థావరాలపై ఐటి దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 47.74 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, అలహాబాదులో కోటి 6 లక్షల విలువ చేసే బంగారం, వెండి...20 లక్షల నగదు జప్తు చేశారు. ఢిల్లీలోని కోటక్‌ మహీంద్రా బ్యాంకు 39 కోట్లు డిడి ద్వారా ఓ ఏజెంట్‌ మార్చే యత్నం చేస్తుండగా అధికారులు జప్తు చేశారు. లక్నోలో 11 చోట్ల నిర్వహించిన దాడుల్లో 12 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి.

 

21:36 - December 24, 2016
21:27 - December 24, 2016

సైనిక సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : క్యాంప్ ఆఫీస్ లో సైనిక సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హోమంత్రి నాయిని, సీఎస్, డీజీపీ మాజీ సైనికులు, వారి కుంటుంబ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయించామని చెప్పారు. డబుల్ పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

 

21:07 - December 24, 2016

జేఏసీకి జన్మదిన శుభాకాంక్షలు...నెరవేర్సాలే మీరు జనం ఆకాంక్షలు, సిత్తూరు శివప్రసాదుకు ఏమో అయిందట.. పాతది తక్కువైందా లేదా అని మిగిలిన ప్రశ్న, బరిగెలిరిగే దాక కొడ్తున్న శ్రీచైతన్య సారు.. ఇసోంటప్పుడే ఉండాలే మనమంత వుషారు, ఆఫీస్ లో సంతకం పెట్టిండ్రు... బారు షాపుల దేలిండ్రు... కడప జిల్లాల కుత్కే తడుపుకుంటున్న ఎమ్మార్వో, యాదాద్రి జిల్లాల దిరుగుతున్న వింత జీవి.. సూడాలే మరి దీనిది ఎక్కడి జీవో, మల్లన్నముచ్చట్లల డ్యాన్సు పోటీలు, 
ఇర్గదీసిన అరవై ఏండ్లు దాటినోళ్లు, కల్లీ కల్లుకు బలైన మహిళ... ఓ ఇంటివాడైన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

'దిల్ సుఖ్ నగర్' బాధితులకు సరైన పరిహారం చెల్లించలేదన్న ఎన్ ఐఏ కోర్టు

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తీర్పులో పలు కీలక అంశాలను ఎన్ ఐఏ కోర్టు ప్రస్తావించింది. బాధితులకు ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించలేదని తెలిపింది. తీవ్ర గాయాలైన 78 మందికి తగిన పరిహారం నిర్ణయించాలని న్యాయ సేవాధికార సంస్థను ఎన్ ఐఏ ఆదేశించింది. ఏ1 మిర్చి సెంటర్ యజమానికి రూ.లక్ష ఇవ్వాలని ఆదేశించింది. 

 

బాలికపై గ్యాంగ్ రేప్

అనంతపురం : పుట్లూరు మండలం బాలాపురంలో దారుణం జరిగింది. నాగమళ్లేశ్వరి (16) అనే బాలికపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మనస్తాపంతో నాగమళ్లేశ్వరి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

20:28 - December 24, 2016

           పైరసీ బూతం మరోసారి కోరలు చాచింది. ఇంకా రిలీజ్ కాని సినిమా సడెన్ గా ఫేస్ బుక్ లో ప్రత్యక్షమయ్యింది. పోస్టైన గంటల్లోనే లక్షల మంది చూసేశారు. చిత్ర యూనిట్ తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పైరసీ బూతానికి ఈ సారి బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ ఆమీర్ ఖాన్ చిత్రం బలయ్యింది. ప్రతిష్టాత్మకంగా చిత్రించిన దంగల్ చిత్రం పూర్తిగా ఫేస్ బుక్ లో అప్ లోడ్ అయ్యింది. 
దుబాయ్‌కి చెందిన హష్మీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో దంగల్‌ సినిమా పూర్తి వీడియోను పోస్ట్‌ చేశాడు.  వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారిపోయంది. పోస్ట్‌ చేసిన 14 గంటల్లోనే 8,33,000 మంది చూశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చిత్ర యూనిట్ కు తెలిసింది. వెంటనే అప్రమత్తమయిన ప్రొడ్యూసర్లు సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫేస్ బుక్ కు కంప్లైంట్ చేశారు. కాపీ రైట్స్ కారణంగా వీడియోను ఫేస్ బుక్ డిలీట్ చేసింది. పోస్టు చేసిన ప్రభుద్దుడిపై చర్యలు తీసుకోవాలని చిత్ర యూనిట్ కోరింది.
కాగా దీనిపై బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దంగల్ చిత్ర యూనిట్ కు బాసటగా నిలిచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల టాలీవుడ్ లోనూ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బాహుబలి-2’ చిత్రంలోని కొన్ని విజువల్స్ తో కూడిన వీడియో లీకైన విషయం తెలిసిందే. 
 పైరసీని నిర్మూలించే బాధ్యత సినీ ఇండస్ట్రీ, పోలీసులతో పాటూ.. ప్రతీ సినీ ప్రేక్షకునిపై కూడా ఉండాలి. లేదంటే నిర్మాణ విలువలతో కూడిన దంగల్ లాంటి ప్రతిష్టాత్మక భారీ చిత్రాలు తీసేందుకు ఏ నిర్మాత సాహసించడు. కాబట్టి సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరు ఇలాంటి చర్యను వ్యతిరేకించాలి. పైరసీ బూతాన్ని తరిమి కొట్టాలి. 

20:24 - December 24, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు తర్వలోనే ఊరట లభించనుంది. ఐదు వందల రూపాయల నోట్లను భారీగా ముద్రించి మార్కెట్‌లోని విడుదల చేసేందుకు రిజర్వు బ్యాంకు సన్నాహాలు ముమ్మరం చేసింది. వీటి ముద్రణను వేగవంతం చేసింది. 
చిల్లర కొరతతో ప్రజలు సతమతం 
పెద్ద నోట్ట రద్దు తర్వాత చిల్లర కొరతతో ప్రజలు సతమతమవుతున్నారు. గత నెల 8న ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను  ప్రభుత్వ రద్దు చేసింది. ఆ తర్వాత రెండు రోజులకు కొత్త రెండు వేల రూపాయల నోటును ప్రజకు అందుబాటులోకి తెచ్చింది. రద్దు  చేసిన పెద్ద నోట్లు మార్చుకున్న ప్రజలకు బ్యాంకులు ముందుగా రెండు వేల వేల రూపాయల నోట్లనే ఇచ్చాయి. దీంతో  మార్పిడి సమస్య ఏర్పడింది. కొంత కాలం తర్వాత కొత్త ఐదు వందల రూపాయల నోట్లను విడుదల చేసినా..   చాలినంతగా అందుబాటులోకి రాకపోవడంతో కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యాయి. 
ఈనెల 30 తర్వాత మార్కెట్‌లోని భారీగా రూ.500 కోట్లు 
రద్దు చేసిన పెద్ద నోట్ల మార్పిడికి మరో ఏడు రోజులు గడువు మాత్రమే ఉంది. ఈనెల 30 తర్వాత  మార్కెట్‌లోకి కొత్త ఐదు వందల రూపాయల నోట్లను భారీగా విడుదల చేసేందుకు  భారీతీయ రిజర్వు బ్యాంకు సన్నాహాలు చేస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రిటింగ్‌ ప్రెస్‌లో ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు రోజుకు 35 లక్షల నోట్లను ముద్రిస్తుండగా, ఇకపై దీనికి కోటి నోట్లకు పెంచనున్నారు. నాసిక్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారాంతపు సెలువులు రద్దు చేశారు. భోజన విరామం కూడా లేకుండా ప్రతి షిఫ్ట్‌లో పదకొండు గంటపాటు పని చేసేలా ఏర్పాటు చేశారు. 
ఆర్‌బీఐకి 82.8 కోట్ల కొత్త నోట్లు 
మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ప్రెస్‌ నుంచి  శుక్రవారం ఆర్‌బీఐకి భారీగా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల నోట్లు పంపారు.  వీటిలో కోటి పది లక్షల  500 రూపాయల నోట్లు, కోటి ఇరవై లక్షల వంద  నోట్లు ఉన్నాయి. కోటి వరకు యాభై రాపాయలు, ఇరవై రూపాయల నోట్లు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు 82.8 కోట్ల నోట్లను దేశవ్యాప్తంగాఉన్న ఆర్‌బీఐ శాఖలకు పంపారు. వీటిలో 25 కోట్లు 500 రూపాయల నోట్లు ఉన్నాయి. గత మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల ముప్పై లక్షల నోట్లను సరఫరా చేశారు. వీటిలో మూడు కోట్ల 75 లక్షలు ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి. 
జనవరి ఆఖరు నాటికి మరో 80 కోట్ల కొత్త నోట్లు 
జనవరి ఆఖరి నాటికి పెద్దనోట్ల ముద్రను భారీగా పెంచాలని నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌  అధికారులు నిర్ణయించారు.  అన్ని రకాల నోట్లు కలిపి మరో 80 కోట్ల వరకు ముంద్రించే విధంగా ఏర్పాట్లు చేశారు. వీటిలో నలభై కోట్ల వరకు ఐదు వందల రూపాయల నోట్లు ఉండేలా చూస్తున్నారు. దేశంలో ఉన్న నాలుగు నోట్ల ముద్రణాలయాల్లో మైసూరులో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. నాసిక్‌తోపాటు బెంగాల్‌లోని సల్బోనిలో ఇతర నోట్లు  మునోట్లు  ముద్రిస్తున్నారు. రిజర్వు బ్యాంకు ప్రయత్నాలు చూస్తుంటే మరి కొద్ది రోజుల్లోనే కరెన్సీ కొరత తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. 

 

20:16 - December 24, 2016

ముంబాయి : ముంబాయిలో ఛత్రపతి శివాజీ స్మారకస్తూపం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అరేబియా సముద్రంలో నిర్మించనున్న ఈ భారీ విగ్రహానికి... ప్రత్యేక ఓడలో నుంచి మోదీ జలపూజ చేశారు. 3వేల 600 కోట్ల వ్యయంతో నిర్మించే స్మారక నిర్మాణంలో శివాజీ విగ్రహంతో పాటు... మ్యూజియం నిర్మించనున్నారు. 

 

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక సంచలనం : మంత్రి ఈటెల

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక సంచలనమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 70 ఏళ్ల తరువాత కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజల ఇబ్బందులు త్వరలోనే తీరుతాయని పేర్కొన్నారు. చట్టం ఉన్నోళ్ల చుట్టం కాకూడదన్నారు. పేదలను మోసం చేయకుండా చూడాల్సిన బాధ్యత సివిల్ సప్లై డిపార్టుమెంటుపై ఉందన్నారు.

 

ప్రజల సహకారంతో అవినీతిని నిర్మూలిస్తాం : ప్రధాని మోడీ

ఢిల్లీ : ప్రజల సహకారంతో అవినీతిని నిర్మూలిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 50 రోజుల తర్వాత అవినీతిపరులకు కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 

19:33 - December 24, 2016
19:25 - December 24, 2016

తూర్పుగోదావరి : ఆధ్యాత్మిక క్షేత్రం అక్రమాలకు ఆలవాలమవుతోంది. దైవ దర్శనం కోసం వస్తే.. దోపిడీకి గురికావాల్సి వస్తోంది. భక్తుల అవసరాలను.. సొమ్ము చేసుకుంటూ..జేబులకు చిల్లు పెడుతున్నారు. 
నిబంధనలు పాటించని అధికారులు
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవ. చుట్టూ కొండలు.. మధ్యలో కొలువైన ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు.. గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి.. కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. అయితే ఇక్కడ అధికారులకు నిబంధనలు పట్టవు. ఆలయ పరిధిలో షాపులను కొంతమంది దళారులకు కేటాయించి వారి ద్వారా భక్తుల నుంచి భారీగా దోచుకుంటున్నారు. నిబంధనలకు నీళ్లోదిలి రేట్లు పెంచేసి కోట్లు గడిస్తున్నారు. 
రెట్టింపు ధరలకు వస్తువుల విక్రయాలు
ఆలయ ప్రాంగణంలో ఉన్న షాపులలో వస్తువులు అసలు ధర కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారు. రెట్టింపు ధరలకు అమ్ముకుంటూ జనాలను దగా చేస్తున్నారు. మంచినీళ్ల బాటిల్‌ బయట ఇరవై రూపాయలుంటే .. ఇక్కడ 30 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీని గురించి అధికారులకు తెలియజేసినా...పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.  
ఆలయ నిర్వహణపై ఉన్నతస్థాయి అధికారులు కన్నెర్ర 
గతంలో ఆలయ నిర్వహణపై ఉన్నతస్థాయి అధికారులు కన్నెర్ర చేశారు. పలు అక్రమాల గుర్తించి చర్యలు తీసుకున్నారు. అయినా ఇక్కడ మార్పు రాలేదు. అయితే ధరల పెంపు విషయం తన దృష్టికి రాలేదని.. అలాంటిదేమన్న ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో అంటున్నారు. అక్రమాలను అడ్డుకుంటామని చెప్పారు. తలుపులమ్మలోవ దేవస్థానం సాగుతున్న దందాపై ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు చెక్‌పెట్టి సామాన్య భక్తులకు ఉపశమనం కల్పించాల్సి ఉంది. 

 

19:19 - December 24, 2016

అనంతపురం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు పరిపాలన చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి, అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలో రెట్టింపు స్థాయిలో పార్టీ సభ్యత్వం నమోదైందని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా  జిల్లాలోని అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చినందుకు చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో జరిగిన జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత పాల్గొన్నారు. 

 

19:16 - December 24, 2016

పశ్చిమగోదావరి : పోలవరం భూనిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం, వైసీపీ నేతలు అన్నారు. పోలవరం జంక్షన్ లో సీపీఎం, వైసీపీ నేతలతో పాటు పోలవరం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. 41 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పోలవరం నిర్మాణం చేపడుతున్నారని.. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ప్రాజెక్ట్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.

 

19:11 - December 24, 2016

కర్నూలు : ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ కేబినెట్లో మంత్రిగా తానేదైనా చెబితే ఎస్‌ ఆర్‌ నో అని స్పాట్ డెసిషన్స్‌ తీసుకునేవారని..అదే మాబాస్‌కు ఏదైనా చెబితే ఎక్కువగా ఆలోచిస్తారన్నారు. న్యాయవాదుల సదస్సులో పాల్గొన్న ఆయన పై విధంగా మాట్లాడారు. కర్నూలులో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నా.. ఎందుకు మొదలు కావడం లేదో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారే తప్ప ఎప్పుడు ప్రారంభిస్తారన్నది చెప్పడం లేదన్నారు. 

 

19:09 - December 24, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోయి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో రాజకీయ విలువలు లేకుండా ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రజలు మెచ్చుకోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు మొత్తం 175 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్న బాబుకు.. 17 సీట్లకంటే ఎక్కువ రావని భూమన జోస్యం చెప్పారు. 

 

 

19:04 - December 24, 2016

హైదరాబాద్ : టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి విదేశాల్లో వెయ్యికోట్ల అక్రమ ఆస్తులు కల్గి ఉన్నారని ఆరోపించారు. ఈమేరకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. గోవర్థన్‌రెడ్డి ఆరోపణలను సోమిరెడ్డి ఖండించారు. తనకు విదేశాల్లో ఆస్తులు లేవన్నారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి.. ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులపై మాట్లాడుతున్నందుకే తనను టార్గెట్‌ చేశారని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లతో అంతర్జాతీయ స్కాంలో ఇరికించడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విషయంపై ఏపీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆరోపణలు రుజువు చేయకపోతే గోవర్థన్‌రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్నారు. ఇప్పటి వరకూ తనకు చిన్న ఫ్లాట్‌ కూడా లేదని స్పష్టం చేశారు. తనకు ఇప్పటి వరకూ సొంత ఇళ్లు కూడ లేదని, తండ్రి నుంచి వచ్చిన ఇంట్లోనే ఉంటున్న అని చెప్పారు.

 

18:56 - December 24, 2016

గుంటూరు : జిల్లా తెలుగుదేశంలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలపై అధినేత చంద్రబాబు దృష్టిసారించారు. మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ల వివాదంపై చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. ఇద్దరి మధ్య గొడవలకు కారణాలేంటో తెలుసుకుని.. నివేదిక ఇవ్వాలని ఏపీ రాష్ర్ట అధ్యక్షులు కళావెంకట్రావును ఆదేశించారు. 
అధినేతకు కొత్త తలనొప్పులు 
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు పార్టీ అధినాయకత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి. ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ల మధ్య కొనసాగుతున్న వివాదంపై అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇద్దరి మధ్య గొడవలకు కారణాలేంటో తెలుసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ వివాదంపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి నిజానిజాలు తేలుసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్యచౌదరి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ పార్టీ అధ్యక్షులు కళావెంకట్రావును ఆదేశించారు.
మంత్రి రావెల, జానీమూన్‌ల మధ్య విభేదాలు 
మంత్రి రావెల, గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్‌ల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్‌ నడుస్తోంది. గతేడాది నుంచి అభివృద్ధి పనులకు మంత్రి రావెల తనకు సహకరించడం లేదని జానీమూన్‌ ఆరోపించారు. తమకు రాజకీయ జీవితం లేకుండా చేస్తానని రావెల హెచ్చరించారని ఆరోపించారు. గతంలో రావెల అనుచరులు కొందరు తమ ఇంటికి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసే ప్రయత్నం చేశారని జానీమూన్‌ ఆరోపించారు. మంత్రి రావెల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని జానీమూన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ వివాదంపై ప్రతిపక్షం వైసీపీ టీడీపీ తీరుపై విమర్శలు చేస్తోంది. తెలుగుదేశంలో మహిళలకే రక్షణ లేనప్పుడు రాష్ర్టంలోని మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 
ఎంపీపీ సీతామహాలక్ష్మీకి రావెలకు విబేధాలు
ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెలపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నాయకులను రావెల కలుపుకొనిపోరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు.. గుంటూరు రూరల్‌ మండలం ఎంపీపీ సీతామహాలక్ష్మీకి రావెలకు ఇప్పటికే విబేధాలు ఉన్నాయి. మంత్రి తీరుతో గతంలో ఆమె ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. అధినేత సర్ది చెప్పటంతో వివాదం సద్దుమణిగింది. ఇటు వట్టి చెరుకూరి జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ, రావెల వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంతేకాదు.. కిశోర్‌బాబు రావెల దండు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీలోని నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి.

 

18:50 - December 24, 2016
18:49 - December 24, 2016

హైదరాబాద్ : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ చిత్రం టీజర్‌ విడుదలైంది. టీజర్‌ను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున, ఎం.ఎం. కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న భక్తిరస చిత్రమిది. ఈ మూవీలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, సౌరభ్‌, జగపతిబాబు, విమలా రామన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

18:47 - December 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జోనల్‌ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల ఒత్తిడికి తలొగ్గి సీఎం కేసీఆర్‌ జోనల్‌ వ్యవస్థను రద్దు చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. దీనిపై టీడీపీ లీగల్‌ సెల్‌ స్టడీ చేసి.. పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

 

18:44 - December 24, 2016

కర్నూలు : ఆరుగాలం శ్రమ వృథా అయింది. దిగుబడి లేదు.. పెట్టుబడి రాలేదు...అప్పులపాలై..ఆవేదన మిగిలింది. నాసిరకం విత్తనాలతో మిరప రైతులు నష్టాలుపాలయ్యారు. నకిలీ విత్తనాల కారణంగా మిర్చి రైతులు.. దారుణంగా మోసపోయారు.
కాలాష్‌ కంపెనీ విత్తనాలు కంపెనీ మోసం
గద్వాల జిల్లా... గట్టు మండలానికి చెందిన చిన్నోని పల్లె  రైతులు కర్నూలులోని ఇండియన్ సీడ్స్ షాపులో.. కాలాష్ కంపెనీకి చెందిన బీఎస్ఎస్ 606 హైబ్రిడ్ మిర్చి విత్తనాలు 20 మంది రైతులు 125 ప్యాకెట్లు కొనుగోలు చేశారు. వాటితో సాగుబడి చేసినా..పంట చేతికి రాలేదు. నకిలీ విత్తనాలు కలిపి ఇవ్వడంతోనే మిరప పంట పూర్తిగా దెబ్బతిందంటూ షాప్‌ ముందు రైతులు ఆందోళనకు దిగారు. షాప్‌ యజమానిని నిలదీశారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.అయితే కంపెనీవాళ్లు.. షాపు యజమానులు నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలలో ఎలాంటి సమస్యలేదని వివరణ
రైతుల ఆవేదన ఇలా ఉండగా.. ఇండియన్‌ షీడ్స్‌ షాపు యజమాని మాత్రం విత్తనాలలో ఎలాంటి సమస్య లేదని, నీటిలో తేడా ఉండడం వల్లే పంటకు పురుగు పట్టిందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారని అంటున్నారు. ఈ అంశాన్ని మరోసారి కంపెనీకి దృష్టికి తీసుకువెళ్లామని రెండు మూడు రోజుల్లో వచ్చి పంటను పరిశీలించి చూస్తామని చెప్పారని షాపు యజమాని సుల్తాన్ సాహెబ్‌ చెబుతున్నారు.  ఏది ఏమైనా రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి కల్తీ విత్తనాలతో నిలువునా మోసపోయిన రైతులకు  అధికారులు జోక్యం చేసుకుని న్యాయం  చేయాల్సిన అవసరం ఉంది.

విశాఖ ఆర్ ఆండ్ బీ డిప్యూటీ ఈఈ రూ.4 కోట్లకుపైగా అక్రమాస్తులు

విశాఖ : ఆర్ ఆండ్ బీ డిప్యూటీ ఈఈ సుభాష్ చంద్రకు చెందిన రూ.4 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. ఆంధ్రా బ్యాంక్ లో లాకర్లను ఎఇసిబి అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో సుభాష్ ఆస్తుల విలువ రూ.50 కోట్లుగా ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో కలిపి మొత్తం 15 ప్లాట్లు, 600 గ్రాముల బంగారం, రూ.29 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, రూ.19 లక్షల చీటీలు, రూ.10 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్, రూ.6 లక్షల ఎల్ ఐసీ పాలసీలు, రూ.1.5 లక్షల నగదును అధికారులు గుర్తించారు. 

 

18:23 - December 24, 2016
18:22 - December 24, 2016
17:36 - December 24, 2016
17:30 - December 24, 2016

వరంగల్‌ : నిట్‌ విద్యార్థులకు ఫుడ్‌ ఫాయిజన్‌ ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం క్షిద్ర అనే హోటల్‌లో నిట్‌ విద్యార్థులు బిర్యానీ తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 20మంది రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు. మొదటగా 8 మంది, తర్వాత మరో12 మంది ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:12 - December 24, 2016

కడప : క్రిస్మస్ వేడుకల సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు షర్మిల, బ్రదర్ అనిల్ ఇతర కుటుంబసభ్యులు వైఎస్‌ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ వెంట వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. 

సైనిక సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : సీఎం క్యాంపు ఆఫీసులో సైనిక సంక్షేమం పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి, సీఎస్, డీజీపీలు పాల్గొన్నారు.

17:10 - December 24, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు ఘనత తనదే అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆయనకు పదవులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీని ఎన్టీఆర్‌ భవన్‌లా మార్చేశారని విమర్శించారు. 

 

17:08 - December 24, 2016

హైదరాబాద్ : ప్రధాని మోడీ దేశ ప్రజలతో ఆటలాడుతున్నారని మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ అన్నారు. నోట్ల రద్దుతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇకనైనా మోడీ భజన మానుకోవాలని హితవు పలికారు. బడాబాబులకు రుణాలు మాఫీ చేస్తున్న మోదీ..  ప్రజలు దాచుకున్న చిన్న మొత్తాలపై వడ్డీని తగ్గించడం దారుణమని శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. ఫోర్భ్స్‌ పత్రిక నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిందని తెలిపారు. 

 

17:03 - December 24, 2016

ముంబయి : ఛత్రపతి శివాజీ స్మారకస్తూపం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అరేబియా సముద్రంలో నిర్మించనున్న ఈ భారీ విగ్రహానికి... ప్రత్యేక ఓడలో నుంచి మోదీ జలపూజ చేశారు. 3వేల 600 కోట్ల వ్యయంతో నిర్మించే స్మారక నిర్మాణంలో శివాజీ విగ్రహంతో పాటు... మ్యూజియం నిర్మించనున్నారు. 

 

16:58 - December 24, 2016

కడప : కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంసీఐ అనుమతి లేకుండా 100 మంది విద్యార్థులను కాలేజీలో చేర్చుకుని వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ ఫాతిమా మెడికల్‌ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక ఠాణాకు తరలించారు. 

 

16:50 - December 24, 2016

ముంబై : దేశంలో రెండో విడత ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ముంబైలోని ఎన్ ఐఎస్ ఎంను మోడీ ప్రారంభించారు. నగదు ఇబ్బందులు తాత్కాలికమే అని అన్నారు. జీఎస్ టీ త్వరలో వాస్తవరూంలోకి వస్తుందన్నారు. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 

 

బిచ్కుంద ప్రభుత్వాసుత్రికి శంకుస్థాపన

కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద ప్రభుత్వాసుత్రికి ఈ రోజు మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.3,600 కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టినట్టు వెల్లడించారు.

16:35 - December 24, 2016

తూర్పు గోదావరి : పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తరచూ వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. ఎమ్మెల్యే దూకుడు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. తాజాగా కాకినాడ జీజీహెచ్‌ వైద్యులతో కయ్యానికి దిగారు. తూర్పు గోదావరి జిల్లాలో సెంటర్‌ ఆఫ్‌ ది కాంట్రవర్సీగా మారుతున్న ఎమ్మెల్యే తీరుపై 10టీవీ కథనం...
ఎమ్మెల్యే వర్మది ఓ ప్రత్యేక శైలి 
పిఠాపురం ఎమ్మెల్యే వర్మది ఓ ప్రత్యేక శైలి. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత  అధికారపార్టీలో చేరి ఆ తరువాత పసుపు కండువా కప్పుకున్నారు. పాలకపక్షంలో తానూ ఓ సభ్యుడైపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 
వివాదాలకు కేంద్ర బిందువుగా వర్మ
చిన్న చిన్న ఉద్యోగుల నుంచి మండల స్థాయి అధికారులంతా తన కనుసన్నల్లోనే నడవాలన్నట్టు ఎమ్మెల్యే వ్యవహారశైలి సాగుతోంది. వర్మ తీరుతో ఓ మండల స్థాయి విద్యాధికారికి గుండెపోటు వచ్చిందన్న ప్రచారం బహిరంగంగానే జరుగుతోంది. అయినా ఎమ్మెల్యే తీరు మాత్రం మారలేదు. అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటూ అందరినీ నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ  వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.  
జీజీహెచ్‌ వివాదంలోనూ తలదూర్చిన వర్మ
కాకినాడ జీజీహెచ్‌లో ఓ రోగికి వైద్యం అందలేదన్న విషయంలోనూ వర్మ వ్యవహారశైలి వివాదానికి దారితీసింది. రోగికి వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంపై ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే... సిబ్బందిపై ఆయన దాడికి యత్నించారు. తమ తప్పేమి లేదని.. సిటీస్కాన్‌ మిషన్‌ పనిచేయకపోవడంతోనే వైద్యం  ఆలస్యమైందని డాక్టర్లు వివరించినా ఆయన వినిపించుకోలేదు. వైద్యులపై దుర్భాషలకు దిగారు. దీంతో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డాక్టర్లంతా నినదించాల్సి వచ్చింది.
వర్మ తీరును తప్పుపడుతున్న ఇతర పార్టీలు
ఎమ్మెల్యే వర్మ తీరును ఇతర పార్టీల నేతలు కూడా తప్పుపడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేనే  మరో కొత్త సమస్యను సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి పిఠాపురం ఎమ్మెల్యే తీరుతో సామాన్యుల నుంచి ఉద్యోగస్తుల వరకూ అందరూ ఇబ్బంది పడాల్సి వస్తోంది.  ఇలాంటి వారిని పార్టీనేతలే కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

వచ్చే నెల 12 నుండి ఐనవోలు బ్రహ్మోత్సవాలు....

వరంగల్ : వచ్చేనెల 12 నుంచి 16 వరకు ఐనవోల్లు మల్లన్న బ్రహ్మోత్సవాలకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. ఐనవోలు మల్లన్న క్షేత్రాన్ని తెలంగాణలో మంచి పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతామని కడియం తెలిపారు.

తెలుగు ప్రజలకు క్రిస్ మస్ శుభాకాంక్షలు :పవన్ కల్యాణ్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఈ క్రిస్ మస్ వెలుగులు నింపాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్ మస్ శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్...సర్వమానవాళికి ప్రేమను పంచినప్పుడే శాంతి, ఆనందం, సమానత్వం అందుతాయని జీసస్ చెప్పారని అన్నారు. నీతి, నిజాయతీ లేని వ్యక్తులు ఎంత సాధించినా నిష్ఫలమేనని పవన్ కల్యాణ్ తెలిపారు.

నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

వరంగల్ : నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. అస్వస్థతకు గురైన 20 మంది విద్యార్థులకు రోహిణి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 5గురు విద్యార్థినులు ఉన్నారు. క్షిద్ర అనే హోటల్ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

16:05 - December 24, 2016

రంగారెడ్డి : జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శంషాబాద్‌ మండలం మదనపల్లిలోని ఓ ఫాంహౌస్‌పై డీఆర్‌ఐ అధికారుల దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అధికారులు ఒక లారీని సీజ్‌ చేశారు. ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

'వంగవీటి' సినిమా పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్: 'వంగవీటి' సినిమా పై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ వంగవీటి చిత్రంలో కాపుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు తొలగించి సినిమా టైటిల్ మార్చాలని ఫిర్యాదు చేశారు. జనవరి 18 లోగా నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హెచ్ ఆర్సీ ఆదేశించింది.

15:57 - December 24, 2016

విశాఖ : జిల్లాలోని సింహాచలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అధికారులు ఈ సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది.

 

15:56 - December 24, 2016

హైదరాబాద్ : విదేశాల్లో తనకు వెయ్యికోట్ల ఆస్తులున్నాయంటూ కాకాని గోవర్దన్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో  వాస్తవంలేదని టీడీపీనేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విదేశాల్లో తనకు రూపాయి ఆస్తికూడా లేదన్నారు.  అత్యున్నత విచారణ సంస్థలకు తనపై ఫిర్యాదు చేయవచ్చని కాకానికి సూచించారు.  వారికే తాను సమాధానం చెప్పుకుంటానన్నారు.  కాకాని చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజమున్నా బహిరంగంగా తాను ప్రజలకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు.   మరి ఆరోపణలు అవాస్తవమని తేలితే కాకాని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న కుట్రగా ఆయన కొట్టిపారేశారు. తనపై  కాకాని సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లపై విచారణ జరపాలని డీజీపీని కోరుతానన్నారు. 

 

పెద్దపల్లిలో హోంగార్డు ఆత్మహత్య

పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లిలో హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

15:32 - December 24, 2016

శివాజీ స్మారక స్థూప నిర్మాణానికి మోడీ జలపూజ

మహారాష్ట్ర :ఛత్రపతి శివాజీ స్మారక స్థూప నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ జలపూజ చేశారు. అరేబియా సముద్రంలో రూ.3600 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివాజీ స్మారకం నిర్మించేందకు కేంద్రం నిర్ణయించింది. 192 అడుగుల ఎత్తులో శివాజీ స్మారక స్థూప నిర్మాణం చేపట్టనున్నారు.

15:29 - December 24, 2016

గుంటూరు : జిల్లా లింగయపాలెంలో ప్లాట్ల కేటాయింపుపై వివాదం నెలకొంది. తుళ్లూరులోని సీఆర్ డీఏఏ కమిషనర్ కార్యాలయం దగ్గర దళిత రైతులు నిరసన తెలిపారు. అందరికీ ప్లాట్లు కేటాయిస్తూ తమకు మాత్రం ఇవ్వడం లేదని దళిత రైతులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లింగాయపాలెం రైతులకు ప్లాట్ల పంపిణీ

అమరావతి: ఏపీ రాజధాని ప్రాంతంలో లింగాయపాలెంలో రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. 1554 మంది రైతులకు 1,034 ఎకరాల్లో 748 నివాస స్థలాలు, 526 వాణిజ్య స్థలాలను పంపిణీ చేసింది.

తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల వేతానాలు పెంపు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్ల వేతానాలను భారీగా పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రూ.18వేలుగా ఉన్న వారి వేతనాన్ని రూ.27వేలకు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన వేతనాలు ఈ నెలనుంచే వర్తిస్తాయని తెలిపింది.

రాజకీయ పార్టీలకు భారీగా తగ్గిన విరాళాలు

హైదరాబాద్ : రాజకీయ పార్టీల విరాళాలపై సర్వే రిపోర్టును డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసింది. 2015 616లో కేవలం 16 శాతం మాత్రమే రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించినట్లు సర్వే రిపోర్టు తెలిపింది. నోట్ల రద్దు తర్వాత విరాళాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించడంతో రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు తగ్గినట్లు పేర్కొంది.

మరో రెండు వారాల పాటు చలితీవ్రత

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు వారాలపాటు చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరభారత్ నుంచి వీస్తున్న పొడిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలుగా నమోదు అయ్యింది. ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ అని తెలిపింది. ఆదిలాబాద్ లో అతి తక్కువ 6 డిగ్రీలు, ఖమ్మంలో రికార్డు స్థాయిలో సాధారణం కంటే 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్లు తెలిపింది.

విజయవాడ నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ : నగరంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోడ్లు, డివైడర్ల మరమ్మతులను పరిశీలించారు. అనంతరం బందర్ రోడ్డులోని స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్ లో డిజిటల్ షాపింగ్ చేశారు.

సీఆర్డీఏ కమిషనర్ కు అసైన్డ్ లంక రైతుల విజ్ఞప్తి

వెలగపూడి : సమస్యలు పరిష్కరించాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ కు అసైన్డ్ లంక రైతులు వినతిపత్రం సమర్పించారు. జరీబుకు సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని కమిషనర్ తెలిపారు. సాధారణ రైతుల మాదిరిగానే వారికి ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక క్వారీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని.. రాజధాని ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసిందని తెలిపారు.

ఎన్ కౌంటర్లో నక్సల్ మృతి

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలోనిఅటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ సంఘటన చోటచేసుకుంది. ఈ ఘటనలో ఒక నక్సలైటు మృతిచెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13:56 - December 24, 2016

పెద్దపల్లి : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి..గిరిజనుల పరిస్థితి కడు దయనీయంగా వుందని గిరిజన నేత నైతం రాజు పేర్కొన్నారు.వారికి కనీసం రోడ్ల సదుపాయం కూడా సరైనరీతిలో లేదన్నారు. వైద్య సేవల పరిస్థితి చెప్పనే అక్కరలేదన్నారు. మూడు నాలుగు కిలో మీటర్ల నుండి త్రాగునీరు తెచ్చుకుంటారనీ అదికూడా కలుషితమై వారు అనారోగ్యానికి గురవుతున్నాని తెలిపారు. వున్న ఇళ్ళను కూల్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించే కంటే పూరి గుడెల్లో కడు దయనీయమైన స్థితుల్లో బతుకులు వెళ్ళదీస్తున్న ఆదివాసీలకు..గిరిజనులకు ఇండ్లు కట్టించాలని ఈ సందర్భంగా గిరిజన నేత నైతం రాజు డిమాండ్ చేశారు.

69వరోజు సీపీఎం పాదయాత్ర
సీపీఎం మహాజన పాదయాత్ర 69వరోజు కొనసాగుతోంది..15 జిల్లా పెద్దపల్లి జిల్లాలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.. పలు గ్రామాల్లో పాదయాత్రచేస్తున్న సభ్యులు... స్థానికులను అడిగి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.. 1800 కిమీ పూర్తి చేసుకున్న మహాజన పాదయాత్ర కొనసాగుతోంది..

13:40 - December 24, 2016

హైదరబాద్ : కార్పొరేట్‌ కాలేజీల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యాబుద్దులు నేర్పి విద్యార్ధులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన లెక్చరర్సే .. సహనం కోల్పోయి విద్యార్ధులపట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌ దొరబాబు... విద్యార్ధులను చితక్కొట్టాడు. రక్తం వచ్చేలా చితకబాదాడు. కొట్టొద్దని విద్యార్ధులు వేడుకుంటున్నా ఆయన వినిపించుకోలేదు. బెత్తంతో ఇష్టానుసారంగా కొట్టాడు. దీంతో ఓ విద్యార్ధి చేతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. విషయం బయట చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని కళాశాల యాజమాన్యం మొదట లెక్చరర్‌కు వత్తాసు పలికింది. ఆ తర్వాత విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ తెలిపారు.

13:37 - December 24, 2016

గుంటూరు : జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు.. త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి నిజానిజాలు తేలుసుకోవాలని ఆదేశించారు.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్యచౌదరి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావును ఆదేశించారు.. ఇప్పటికే రావెలపై పలు వివాదాలు రావటంతో చంద్రబాబు గతంలో రావెలను మందలించారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ జానీ మూన్ పై వచ్చిన వివాదంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు: మోదీ

హైదరాబాద్ :దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు చేశామని.. నోట్ల రద్దు వల్ల వచ్చిన ఇబ్బందులు తాత్కాలికమే అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మేనేజ్ మెంట్ ప్రాంగణాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అవృద్ధి చెందుతోందని తెలిపారు.

తూళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

గుంటూరు : తూళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అందరికీ ప్లాట్లు ఇస్తూ తమకు మాత్రం ఇవ్వడంలేదని దళిత రైతులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా ప్రశ్నించేందుకు వెళ్లిన సీపీఎం నేతలపై పోలీసులు దాడి చేసి వారిని ఈడ్చుకెళ్లారు. రైతులకు న్యాయం చేయాలని కోరితే అరెస్టులు చేస్తారా అని సీపీఎం నేతలు మండిపడుతున్నారు.

పూర్ణహుతితో ముగిసిన భవానీ దీక్ష విరమణలు

విజయవాడ : పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగిశాయి. ఈ సందర్భంగా దుర్గ గుడి ఈఓ సూర్యకుమారి మాట్లాడుతూ... 5 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో నాలుగు లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 9లక్షల లడ్డూలు విక్రయించామని ఈవో పేర్కొన్నారు.

12:56 - December 24, 2016

ప్రకాశం:ప్రజాసమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమిస్తామని...ఏపీ సీపీఎం పాదయాత్ర బృందం హెచ్చరించింది..ప్రకాశం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి  ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని సర్కారును డిమాండ్ చేసింది.. జిల్లాలకు కేటాయించిన ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తిచేయాలన్నారు. ఇంటిలో పశువులను కూడా అమ్ముకునే పరిస్థితి జిల్లాలో నెలకొందని పాదయాత్ర సభ్యులు పేర్కొన్నారు. వచ్చే జూన్ జులై వరకూ నిత్యావసర వస్తువులను కరవు ప్రాంతంలో పంపిణీ చేయాలనీ..కరవు నుండి బైటపడేందుకు నీటి సరఫరాపై స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలలోపు ఈ చర్యలన్నీ చేపట్టాలని లేకుండా ఆందోళన ఉదృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

12:51 - December 24, 2016

ఢిల్లీ : బ్యాంకు, ఏటీఎంల నుంచి తీసుకునే నగదుపై సర్‌ఛార్జి విధించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నెల 30 తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సర్‌ఛార్జీల మోతకు కేంద్రం యోచన
నగదు రహిత ఆర్థిక వ్యవస్థను, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంకు, ఏటీఎం నుంచి తీసుకునే నగదుపై సర్‌ఛార్జి విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సర్‌ఛార్జిలు 0.5 నుంచి 2 శాతం మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30 తరువాత ఇది అమల్లోకి రానుందని తెలిసింది. కనీస పరిమితికి మించి నగదు తీసుకుంటే ఈ సర్‌ఛార్జి వర్తించనున్నాయి. ఎంత మొత్తంపై ఈ సర్‌ఛార్జీలు ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాంకుల నుంచి రోజుకు రూ.50 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ.15 వేలు మించి విత్‌డ్రా చేసుకుంటే సర్‌ఛార్జి విధించే అవకాశం ఉంది. 'నిర్వహణ వ్యయం' పేరుతో దీన్ని వసూలు చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో సర్‌ఛార్జీల ప్రతిపాదన
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌కు సన్నిహితంగా ఉండే వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. డిసెంబరు 30 తరువాత ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500, బ్యాంకు నుంచి వారానికి రూ.24,000 తీసుకోవచ్చన్న నిబంధన ముగుస్తుంది. ప్రజలు మునుపటి మాదిరిగానే నగదు ద్వారా లావాదేవీలు జరపడానికి ఉత్సాహం చూపుతారు. అయితే బ్యాంకుల వద్ద తగినంతగా నగదు నిల్వలు లేవు. ఫిబ్రవరి చివరినాటికిగానీ రిజర్వు బ్యాంకు అవసరమైన నగదును పంపించలేదు.అందువల్ల నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్‌ ఎం.బి.షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటైన సర్‌ఛార్జి విధింపును పరిశీలిస్తున్నారు. ఈ నిబంధనను 4-6 నెలలపాటు అమలు చేయాలని ప్రస్తుతానికి భావిస్తున్నప్పటికీ, ఇది శాశ్వతంగా ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

రూ. 3 లక్షల మించిన నగదురూప లావాదేవీలు నిషేధం
నగదు లావాదేవీలపై మరికొన్ని ఆంక్షలు విధించేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా మరికొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రూ. 3 లక్షల రూపాయలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో జరపడాన్ని పూర్తిగా నిషేధించడం. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సి ఉంది. ప్రతి కుటుంబమూ 15 లక్షల రూపాయలకు మించి నగదు ఉంచుకోవడాన్ని నిషేధించడం వంటి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలకు రూ.లక్షకు మించిన నగదు చెల్లింపులపై సర్‌ఛార్జి విధించడం . అన్ని కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలను చెక్కులు, డిజటల్‌ మార్గాల్లోనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

మంత్రి రావెల, జానీమున్ వివాదంపై బాబు ఆగ్రహం

విజయవాడ : గుంటూరు జిల్లా మంత్రి రావెల కిశోర్ బాబు, జెడ్సీ ఛైర్ పర్సన్ జానీమూన్ మధ్య వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కమిటీని నియమించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

12:43 - December 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో ఉత్పత్తి అవుతున్న మురుగులోవచ్చే ప్రమాదకరమైన లీచెట్‌ను శుద్ధి చేసేందుకు బల్దియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డలోంచి వస్తున్న మురుగు శుద్ధికి శాస్త్రీయ పద్దతులను అధ్యాయనం చేస్తోంది.

330 ఎకరాల్లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రతిరోజు 4వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దాన్ని నిర్మూలించడానికి నగరానికి సమీపంలో ఉన్న జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. 330 ఎకరాల్లో ఉన్న ఈ డంపింగ్‌ యార్డు పెద్ద కొండను తలపిస్తుంది. మొదట అల్వాల్‌, ఉప్పల్‌, కాప్రా మున్సిపలిటీల్లో వచ్చే చెత్తను నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తర్వాత బల్దియా చెత్తను అక్కడికి తరలించడం మొదలుపెట్టింది. దీంతో ప్రస్తుతం డంపింగ్‌ యార్డు బాగా విస్తరించింది. నగరంలోని కోటి మంది జనాభా ఉత్పత్తి చేస్తున్న చెత్తను మొత్తం జవహర్‌ నగర్‌కు తరలిస్తున్నారు.

జవహర్‌ నగర్‌ ప్రాంత వాసులకు చెత్త కష్టాలు
అప్పటి నుంచి జవహర్‌ నగర్‌ ప్రాంత వాసులకు చెత్త కష్టాలు మొదలయ్యాయి. డంపుయార్డు పరిసర ప్రాంతాల్లో ఉండే పదుల సంఖ్యలోని గ్రామాల ప్రజలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏళ్ల తరబడి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త నుంచి మురుగు.. పరిసరాలను కలుషితం చేస్తోంది. నీటి వనరులు, చెరువులు, బావులు మురుగు నీటితో కలుషితం అయ్యాయి. ఎంతగా అంటే అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ కూడా కలుషితం అయ్యింది. దీంతో దానిని శుద్ధి చేసే మార్గాలను జీహెచ్‌ఎంసీ అన్వేషిస్తోంది.

ఉత్పత్తి అయిన లిచెట్‌ 68 కోట్ల లీటర్లు
జవహర్‌ నగర్‌లో ఇప్పటికే ఉత్పత్తి అయిన లిచెట్‌ 68 కోట్ల లీటర్లు ఉంటుంది. ప్రతి రోజు మరో 50 వేల లీటర్ల వరకు లీచెట్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులో భయంకరమైన విషవాయువులు, రసాయనాలైన అమ్మోనియం సల్ఫైడ్‌, అమ్మోనియా ఫాలీ సల్ఫైడ్‌, అమ్మోనియా, కార్బన్‌డై ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్పైడ్‌, మెర్‌ కాఫ్టీన్స్‌లు ఉన్నాయి. ఈ మురుగు నీటిని ఎలా శుద్ధి చేయవచ్చో.. శాస్త్రవేత సి. వెంకటేశ్వర్‌ తన బృందంతో కలిసి లిచెడ్‌ శుద్ధి ప్రక్రియను డెవలప్‌ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇలాంటి ప్రక్రియ లేదంటున్నారు. సిటీలోని చెత్త సమస్యను అధికమించడానికి అధికారులు, పాలకులు చేసిన పని సమస్య మరింత పెంచింది. అంతే కాకుండా కొత్త సమస్యలు తీసుకువచ్చింది. ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్ధితో ఆలోచించి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

ఎక్స్ గ్రేషియా ప్రకటించిన యూపీ సీఎం

యూపీ : నోట్ల రద్దుతో క్యూలైన్లలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం అఖిలేష్ యాదవ్ నష్టపరిహారం ప్రకటించారు. 14 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళి

కడప: ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం చర్చిలో జగన్ కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

12:37 - December 24, 2016

హైదరబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల విషయంపై సీపీ మహేష్ భగవత్ వివరాల్ని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. 2016 లో25.3 కేసులు నమోదయాయ్యాయనీ..ఈ ఏడాది 152 చైన్ స్నాచింగ్ లు, ఇళ్లలో 706 దొంగతనాలు..జరిగాయనీ తెలిపారు.షీటీమ్స్‌ విజయవంతంగా పనిచేస్తున్నాయనీ..ఆకతాయిలకు కౌన్సిలింగ్‌ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామనీ..సేఫ్‌ సిటీగా మార్చేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు.యాదాద్రిలో త్వరలో మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లుగా సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు.

12:34 - December 24, 2016

మహారాష్ట్ర : గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సూరజ్ ఘడ్ అటవీప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహానాలన్నీ కాలి బూడదయిపోయాయి. రూ3కోట్ల వరకూ ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. మావోలు నిప్పు పెట్టిన వాహనాల్లో 47 లారీలు,4జేసీబీలు,2 ట్రాక్టర్లు,4 రోడ్డు రోలర్లు వున్నాయి. మావోల స్థావరంగా వున్న గతంలో ఈ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. దీనికి ప్రతీకార చర్యగా ..పోలీసులకు హెచ్చరికగా మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

శ్రీచైతన్య కాలేజీలో లెక్చరర్ దాష్టీకం

హైదరాబాద్ : ఎస్సార్ నగర్ శ్రీచైతన్య కాలేజీలో దొరబాబు అనే లెక్చరర్ మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను రక్తం కారేలా కొట్టాడు. ఎస్సార్ నగర్ పీఎస్ లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దొరబాబు పై కేసు నమోదు చేశారు.

ఐదు శాతం నేరాలు తగ్గాయి: రాచకొండ సీపీ

హైదరాబాద్: ఈ ఏడాది ఐదు శాతం నేరాలు తగ్గాయని రాచకొండ సీపీ తెలిపారు. ఈ ఏడాది 2503 కేసులు నమోదయ్యాయని, 2 ఏడాదిలో 152 చైన్ స్నాచింగ్స్, 706 ఇళ్లలో దొంగతనాలు నమోదయినట్లు తెలిపారు. ఈ ఏడాది దోపిడీ కేసులు పెరిగాయని, షీటీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయని, ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకొచ్చినట్లు భగవత్ తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, సేఫ్ సిటీగా మార్చేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

12:04 - December 24, 2016

విశాఖ : ఏసీబీ కి మరో అవినీతి తిమింగళం చిక్కింది.. విశాఖ ఆర్‌అండ్‌బీ డీప్యూటీ ఈఈ సుభాష్‌చంద్ర ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది.. సుభాష్‌చంద్ర బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు జరిపారు... శ్రీకాకుళం, విజయనగరం, హైదరాబాద్‌ జిల్లాల్లోని ఆయన బంధువుల ఇళ్లలోకూడా అధికారులు సోదాలు చేస్తున్నారు.. ఇప్పటివరకూ పదికోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.. ఆంధ్రా బ్యాంక్‌ లాకర్‌ను ఇంకా తెరవాల్సిఉందని అధికారులు చెప్పారు.. 

12:01 - December 24, 2016

అక్కినేని అఖిల్ రెండవ చిత్రంపై కొంత కాలంగా ఉన్న సందిగ్దత తొలగిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ యువ హీరో నటించనున్న కొత్త చిత్రం ఎట్టకేలకు జనవరి 4న పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకి నాగార్జున ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియో లోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటించనుండగా కాగా ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా తమిళ నటి మేఘా ఆకాష్ నటించనుంది. ఈమె పస్తుతం తమిళంలో రూపొందుతున్న ఎనై నోకి పాయుమ్ తోట, ఒరు పక్కా కథై చిత్రాల్లో నటిస్తోంది.

12:00 - December 24, 2016

కరీంనగర్ : ఓ దుర్మార్గుడి పాపం పండింది...ఆడుకుంటున్న పసిమొగ్గకు చాక్లెట్‌ ఆశచూపి నిండు ప్రాణం బలితీసుకున్న రాక్షసుడికి ఉరి శిక్ష పడింది.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది...కేవలం పది నెలల్లో జరిగిన విచారణ మానవమృగానికి శిక్ష పడేలా చేసింది...

పసి మొగ్గపై పైశాచికం...మానవమృగానికి ఉరిశిక్ష వేసిన న్యాయస్థానం...
కరీంనగర్ జిల్లా పరిధి కాటారం మండలం దామెర కుంటలో సరిగ్గా పది నెలల క్రితం ఫిబ్రవరి చివర్లో దారుణం చోటు చేసుకుంది.. ఇదే గ్రామానికి చెందిన మూడున్నరేళ్ల వినయశ్రీని ఇంట్లో ఉంచిన కన్నవారు పనులకు వెళ్లారు..సాయంత్రం తిరిగి వచ్చిన కన్నవారికి పాప కన్పించలేదు..వెంటనే గాలిస్తే దొరకలేదు...పక్కింట్లో ఉండాల్సిన జక్కుల వెంకటస్వామి కన్పించలేదు....

లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ
పక్కింటి వెంకటస్వామి ఇంట్లో గంప కింద రక్తం మడుగులో పడి జీవశ్చవంలా ఉన్న పాపను చూసి కన్నవారు బోరుమన్నారు.. పోస్టుమార్టం నివేదికలో పాపను చంపడానికి ముందు లైంగిక దాడి జరిగినట్లు తేలింది...

మార్చి 4న దొరికిన క్రూరమృగం
వాయిస్...ఇంటి ఎదుట ఆడుకుంటున్న వినయశ్రీ ని చాక్లెట్ ఆశ చూపి పిలిచి లైంగిక దాడి చేసి హత్య చేసినది వాస్తవమే తేలడంతో అతని పై ఐపిసి 302,376, ఫోక్స్ యాక్ట్ ఆప్ 6 కింద కేసును నమోదు చేశారు. 

క్రూరమృగానికి నాలుగు రకాల సెక్షన్లపై శిక్షలు
.వెంకటస్వామిపై నేరం రుజువు కావడంతో బాలికల పై జరిగే లైంగిక వేదింపుల కేసులను ప్రత్యేకంగా విచారించే జిల్లా మొదటి కోర్టు న్యాయమూర్తి సురేష్ సాక్ష్యాధారాలను పరిశీలించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు...దీంతో పాటు వెంకటస్వామి పై పోలీస్ లు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం వేర్వేరు శిక్షలు న్యాయ మూర్తి విధించారు.అభం శుభం తెలియన పసి పాపను పాశవికంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన దుర్మర్గున్ని వెంటనే ఉరి తీయాలని చిన్నారి తల్లిదండ్రులు కోర్టును కోరారు... 

11:53 - December 24, 2016

ప్రకాశం:కరవు ప్రాంతాల్లో బిందుసేద్యంద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు..డ్రిప్‌ ఇరిగేషన్‌ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి అమ్మినేని సూర్యప్రకాశ్..ప్రకాశం జిల్లాలోని బిందుసేద్యం ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.. జిల్లాలో ఈ పద్దతిద్వారా సాగుకు సహకారం కొనసాగుతోందని స్పష్టం చేశారు.. సాగునీరు తక్కువగా వున్న ప్రాంతాలలో 1.50 లక్షల హెక్లార్లలో బిందుసేద్యం ద్వారా సాగు చేయాలని చంద్రబాబు గారి ఆకాంక్షించారనీ ఇప్పటి వరకూ 73వేల హెక్టార్లలో బిందుసేద్యం ద్వారా సాగు చేపట్టామని  తెలిపారు. రైతుల నుండి కూడా మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుల నుండి వస్తున్న అప్లికేషన్ లే దీనికి నిదర్శనమన్నారు. 

11:49 - December 24, 2016

చిత్తూరు : తిరుపతిలో ఓ టూరిస్ట్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కొర్లగుంట జంక్షన్‌లో అదుపుతప్పి ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలూ ధ్వంసం అయ్యారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదారు వాహనాలు ధ్వంసం అయ్యాయి. కాగా టూరిస్ట్ వ్యాన్ బ్రేక్ ఫెయిల్ అయి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ పరారీలో వున్నాడు.

బోన్ లో చిక్కిన ఓ వింత జంతువు

యాదాద్రి : మోత్కూరు మండలం మంగళగడ్డలో ఓ వింత జంతువు బోన్ లో చిక్కింది. గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని జంతువు రాత్రిపూట కోళ్లను తినడంతో గ్రామస్తు ఓ బోన్ ఏర్పాటు చేశారు. హైనాను పోలి వున్న జంతువు ఆ బోన్ లో చిక్కుకుంది. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

11:45 - December 24, 2016

తమిళనాడు : ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. రామ్మోహన్‌రావును ఐసీయూ లో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రామ్మోహన్‌రావు పెద్ద ఎత్తన బంగారం కొనుగోలు చేశారు. రామ్మోహన్‌రావు ఇంటిపై దాడులు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు భారీగా బంగారం, కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రామ్మోహన్‌రావును ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. 

మాసబ్ ట్యాంక్ కాల్పుల కేసులో పురోగతి

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజమండ్రికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు నిందితులుగా గుర్తించారు. రాజమండ్రి కేబీఎస్ బ్యాంకులో యువకులకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి టీ దుకాణం నిర్వహించారు. బ్యాంకు సీఈవో వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయని దోపిడీకి యత్నించాడు. సీఈవో డ్రైవర్ సహకారంతో ఎప్పటికప్పుడు యువకులు సమాచారం తెలుసుకునేవారు పోలీసులు చెప్పారు.

11:42 - December 24, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై భారీ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఈనెల 27న ఢిల్లీలోని కాంస్ట్యూషన్‌ క్లబ్‌లో భేటీ కావాలని సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ, ఆప్‌ సహా ఇతర పార్టీల నేతలు నిర్ణయించారు. పెద్దనోట్లు రద్దై 46 రోజులవుతున్నా కరెన్సీ కష్టాలు తీరకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. ఈ సమావేశంలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నాయి. మోదీ సర్కార్‌కు డెడ్‌లైన్‌ కూడా విధించనున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

గడ్చిరోలి జిల్లాలో మావోల ఘాతుకం

మహారాష్ట్ర : గడ్చిరోలి జిల్లా సూరజ్ గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఘాతుకానికి ఒడిగట్టారు. 47 లారీలు, 4 జేసీబీలు, 2 ట్రాక్టర్లు, 4 రోడ్డు రోలర్లకు మావోయిస్టులు నిప్పుపెట్టారు.

'స్వాస్థ్వ విద్యావాహిని' ని ప్రారంభించిన సీఎం

విజయవాడ : వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో 'స్వాస్థ్వ విద్యావాహిని' కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

11:33 - December 24, 2016

తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. కేవలం నటుడుగానే కాకుండా సినిమాలకు కథా మాటలు కూడా అందించే సత్తా ఉన్న నటుడు అవసరాల. ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి బ్రేక్ కూడా సాధించాడు. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి విజయాలు సాధించాడు. ఇటీవల విడుదలైన జెంటిల్ మన్ సినిమాతో విలన్ గానూ మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బాగా బిజీ' రిలీజ్ కు రెడీ అవుతోంది.

బాలీవుడ్ అడల్డ్ కామెడీ హంటర్రర్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సెక్స్ అడిక్ట్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ వున్నాయి.చాలా ఎమోషన్స్ ఉన్నాయని...అందుకే చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు అవసరాల.ఇది కేవం అడల్ట్ కామెడీ సినిమాగానే చూస్తున్నారు అందరూ,నావరకైతే స్టోరీ, నా కేరెక్టర్ కు లోతైన అర్థం ఉందని నేను భావిస్తున్న అందుకే ఈ సినిమాకు అంగీకరించా అంటున్నాడు అవసరాల. తాజాగా విజయ్ అనే కొత్త దర్శకుడి సినిమాలో హీరోగా నటించేందుకు ఓకె చెప్పాడు. బాబు బాగా బిజీ రిలీజ్ తరువాత దర్శకుడిగా నానితో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత., తను హీరోగా విజయ్ తెరకెక్కించే సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్..

మైదుకూరు డీఎస్పీ సస్పెన్షన్

కడప: మైదుకూరు డీఎస్సీ రామకృష్ణయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో రామకృష్ణయ్యను సస్పెండ్ చేసినట్లు డీజీపీ తెలిపారు.

అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ గా మారుస్తున్నారు : రోజా

విశాఖ: అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ గా మారుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ... అధికార పార్టీ నేతలు శాసనసభలో ఏం మాట్లాడినా స్పీకర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రివిలేజ్ కమిటీ ద్వారా మా పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు.

సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయ్యింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు పేర్కొంది.

11:03 - December 24, 2016

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' సినిమాకి ఉత్తర్‌ ప్రదేశ్‌లో వినోదపు పన్ను మినహాయించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా లో యూనిట్‌ సభ్యులను ప్రశంసించిన సంగతి తెలిసిందే.

 

11:03 - December 24, 2016

విశాఖ : అర్థరాత్రి ఓ ఇంటి తలుపులు తట్టారు...ఉలిక్కిపడి లేచిన యజమాని ఎవరని ప్రశ్నిస్తే పోలీసులమన్నారు..కిటికీలోంచి చూస్తే పోలీసు డ్రస్‌లో ఉన్నవారు కన్పించారు..పోలీసులు ఎందుకు వచ్చారంటూ తలుపులు తెరిచాడు..అంతే..ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేశాడు..వచ్చినవారెవరు..? ఏం చేశారు..??

పోలీసు డ్రస్‌లో దోపిడీ గ్యాంగ్..అర్థరాత్రి ఇంటిపై అటాక్..
విశాఖ నగరంలో ఇప్పటివరకు చాలా రకాల దోపిడీలు జరిగాయి..కాని .. పోలీసు డ్రస్‌లో ఏకంగా ఇంటిపై అటాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది... అర్థరాత్రి దాటాక పోలీసు డ్రస్‌లో వచ్చిన దుండగులు ఇంట్లోకి చొరబడి భారీగా దోపిడీకి పాల్పడ్డారు...

కిన్నెర ధియోటర్ సమీపంలో చైతన్య నగర్ లో దోపిడీ
నగరంలోని మద్దిలపాలెం వద్ద గల కిన్నెర ధియోటర్ సమీపంలో చైతన్య నగర్ ఉంది..వీఐపీలు ఎక్కువ మంది ఇక్కడే నివాసం ఉంటారు...రాత్రి రెండు గంటల సమయంలో ఓ ఇంటి తలుపులు బాదిన శబ్దంతో యజమానులు ఉలిక్కి పడ్డారు..ఎవరని అడిగితే పోలీసులమనడంతో కిటికీలోంచి చూశారు..వచ్చినవారు పోలీసుల డ్రస్ లో నలుగురు కన్పించడంతో ఏం కావాలంటూ పోలీసులం వస్తే ప్రశ్నిస్తావా అంటూ దబాయించారు..ఆ తర్వాత సమాచారం తెలుసుకునేందుకు వచ్చామన్నారు..దీంతో యజమాని చంద్రశేఖర్ ఇంటి తలుపులు తెరిచారు...నలుగురు దుండగులు ఒక్క సారిగా ఇంట్లోకి వచ్చి కత్తులతో వారిని బెదిరించారు..ఆ తర్వాత కట్టేసి ఇంటిని లూటి చేశారు.. ఇంట్లోని దాదాపు 50 తులాల బంగారంతో పాటుగా 50 వేల క్యాష్ ను ఎత్తుకు పోయినట్లుగా బాదితులు చెబుతున్నారు..పోలీసు డ్రస్‌లో రావడం కలకలం రేపుతోంది... దుండగులు రూటు మార్చి దోచుకునేందుకు వేసిన స్కెచ్ ఏ ముఠాదని పోలీసులు ఆరా తీస్తున్నారు...

10:58 - December 24, 2016

ఐదుగురిని ఢీకొన్న వ్యాన్ :ఒకరి మృతి

తిరుపతి: కోర్లగుంట జంక్షన్ వద్ద వ్యాను ఐదుగురిని ఢీకొని బీభత్సం సృష్టించింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. అంతే కాకుండా రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

10:54 - December 24, 2016

నవధాన్యాలలో ఒకటైన అసందల్లో అమోఘమైన పోషక విలువలు ఉంటాయి. వీటిలో పీచుపదర్థాం ఎక్కువగా వుండడం వల్ల జీర్ణ క్రియకు తోడ్పతుంది. అంతే కాదు ఇది షుగర్ వ్యాధి గ్రస్తులకి అద్భుతమైన ఆహారం. రక్తపోటును అదుపులో ఉంచగలిగిన శక్తి అలసందలకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలోనూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచడంలోనూ సహాయపడతాయి.

శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను కూడా నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. నరాలకు కూడా బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం మన ఎనర్జీలెవల్స్ పెరిగేలా చేస్తాయి.

ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.ఒంట్లో కొవ్వు తగ్గాలి అనుకునే వాళ్ళు రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన అలసందలు తింటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం .

ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తినటం వల్ల కడుపు బరువుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. లావుగా ఉంది సన్నగా తయారనుకునేవారు కూడా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు గమనించవచ్చు.

10:49 - December 24, 2016

తూర్పుగోదావరి : పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ చర్చలు జరుపుతున్నారు. రోగులకు సేవలు కొనసాగించాలని కోరుతున్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి ఎమ్మెల్యే వర్సెస్‌ డాక్టర్లుగా మారింది.. నిన్న మధ్యాహ్నం ప్రాణాపాయ స్థితిలోఉన్న రోగిని ఆస్పత్రికి తీసుకువచ్చారు.. రాత్రివరకూ ఆ రోగికి వైద్యం అందలేదు.. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదుచేశారు.. బాధితుల సమాచారంతో ఎమ్మెల్యే ఆస్పత్రికి వచ్చారు.. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు. రోగులకు సేవలు నిలిపివేశారు. దీంతో జిల్లా కలెక్టర్‌ వారితో చర్చలు జరుపుతున్నారు. 

27న నోట్ల రద్దు పై విపక్షాల భేటీ

ఢిల్లీ: నోట్ల రద్దు పై మరోసారి విపక్షాలు ఏకమవ్వనున్నాయి. ఈ నెల 27 కానిస్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. నోట్ల రద్దుపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి.

తమిళనాడుమాజీ సీఎస్ రామ్మోహన్ రావుకు గుండెపోటు

చెన్నై: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు కు గుండె పోటు వచ్చింది. ఐసీయూలో రామ్మోహన్ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఆదాయానికి మించి అక్రమస్తుల కేసులో ఆయన్ని, ఆయన కుమారుడ్ని ఐటీ శాఖ విచారిస్తున్న విషయం తెలిసిందే.

10:28 - December 24, 2016

మెదక్ : ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మెదక్‌ జిల్లాలోని... సీఎస్‌ఐ చర్చ్‌ క్రిస్మస్‌ సంబరాలకు సిద్ధమవుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీస్తు జననంపై నాటకాలు.. బొమ్మల కొలువులు ప్రదర్శించనున్నారు.

క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమవుతున్న మెదక్‌ సీఎస్‌ఐ చర్చ్‌
జిల్లాలో దక్షిణ భారత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న....సీఎస్‌ఐ చర్చ్‌కు ఎంతో చరిత్ర ఉంది. చర్చ్‌ సుమారు వందేళ్ల నాటి కట్టడం. దీనిని చూస్తే అప్పటి నిర్మాణ శైలి ఉట్టిపడుతుంది. 12 వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి ఈ చర్చ్‌ను నిర్మించారు. 1914 సంవత్సరంలో ప్రారంభించి 1924లో పూర్తి చేశారు. ఆసియా ఖండంలోనే ఉన్నతమైనదిగా ఈ చర్చ్‌ గుర్తింపు పొందింది. ఈ చర్చ్‌కు 175 అడుగుల ఎత్తున్న శిఖరం ప్రత్యేక ఆకర్షణ.

చర్చ్‌లో 8 లక్షల మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం
చర్చ్‌లో ఐదు లక్షల నుంచి 8 లక్షల మంది వరకు ప్రార్థనలు చేసుకునే వీలుంది. మెదక్‌ జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ ఇండియా మహాదేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరంలో చాలామంది భక్తులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. తాగునీటి..భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్‌ కోసం... ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడకుండా కూడా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు.

చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
పండుగ సందర్భంగా చర్చ్‌లో క్రీస్తు జన్మవృత్తాంతం గురించి పిల్లలతో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ ఇవ్వనున్నారు. అలాగే ప్రభువుకు సంబంధించిన పలు బొమ్మల కొలువులను ఏర్పాటు చేయనున్నారు. 

10:21 - December 24, 2016

మహిళా కానిస్టేబుల్ పై యాసిడ్ దాడి

తమిళనాడు : వెల్లూరు జిల్లా తిరుప్పతూర్ లో ఓ మహిళా కానిస్టేబుల్ పై కొందరు గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గత అర్థర్రాతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమె ముఖం, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నేడు ముంబైకి ప్రధాని మోడీ

ముంబై: నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం ముంబైకి రానున్నారు. అరేబియా సముద్రంలోని ఓ ద్వీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారకానికి శంకుస్థాపన చేయనున్నారు. శివాజీ స్మారకానికి సమీపంలోని ఓ ద్వీపంలో రూ. 3,600 కోట్లతో ఈ అద్భుతాన్ని నిర్మించనున్నారు.

10:13 - December 24, 2016

హైదరాబాద్ : కార్పొరేట్‌ స్కూల్‌ వైపే అందరి చూపు..ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు... సర్కారీ బడుల్లో అయితే చదువు వంటబట్టదని, ప్రైవేట్‌ విద్యకు పట్టంకడుతున్న రోజులివి. కానీ జామా-ఈ-ఉస్మానియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను..చూస్తే ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరిజ్ఞానానికి కొదవే లేదని అర్థమవుతుంది.

అద్భుతాలు సృష్టిస్తున్న జామా--ఉస్మానియా స్కూల్ స్టూడెంట్స్‌
ప్రతిభ విషయంలో... ఏ కార్పొరేట్ స్కూల్‌కి తీసిపోమని నిరూపిస్తున్నారు జామా-ఈ-ఉస్మానియా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. సర్కారి బడిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. స్కూల్లో వీళ్లు ఏర్పాటు చేసిన సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌ దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా పాఠశాలలో వారంరోజుల పాటు ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు
పాఠశాలలో ఏర్పాటు చేసిన సైండ్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌లో పర్యావరణ కాలుష్యంపై అవగాహన కలిగేలా విద్యార్థులు ప్రత్యేక స్టాల్‌ని ఏర్పాటు చేశారు.... గతంలో మూసీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది... అడవులు ఎలా అంతరించి పోతున్నాయి... అన్నవాటిపై చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే సైన్స్‌కు సంబంధించిన అనేక విషయాలను వివరించారు.

పెరుగుతున్న చెత్తకు చెక్‌ పెట్టిన విద్యార్థులు
ఇక పెరుగుతున్న చెత్తకు ఒక చక్కటి చిట్కాను చూపించారు ఈ విద్యార్థులు... వాడిపడేసిన వస్తువుల ద్వారా గృహలంకరణకి ఎలా ఉపయోగించుకోవచ్చో చేసి చూపించారు. అలాగే సో లార్‌ విద్యుత్‌తో నడిచే ఫ్యాన్, ఫుడ్‌ కోర్ట్ ఇవన్ని వారు స్వయంగా తయారు చేసి.. వాటి ఉపయోగాన్ని వివరించారు. ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం లభిస్తే మరిన్ని అద్భుతాలు చేసి చూపుతామని విద్యార్థులు అంటున్నారు. 

నగరంలో ఆర్టీసి బస్సుడీకొని యువకుడి మృతి

హైదరాబాద్ : శ్రీనగర్ కాలనీలోని ఆర్‌బీఐ క్వార్టర్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఓ యువకుడిని ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

10:06 - December 24, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల స‌మ‌స్యల‌పై యూత్ కాంగ్రెస్ క‌దం తొక్కింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్‌ ఇందిరాపార్క్ దగ్గర మ‌హాధ‌ర్నా నిర్వహించింది. ఈ వేదికగా కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భవిష్యత్ మనదే అంటూ క్యాడర్‌లో ఉత్సాహం నింపారు.

ఇందిరాపార్క్ వ‌ద్ద యూత్ కాంగ్రెస్ మ‌హాధ‌ర్నా
కొంత‌కాలంగా ఫీజు రీయంబ‌ర్స్ మెంట్, నిరుద్యోగ స‌మ‌స్యల‌పై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తోన్న యూత్ కాంగ్రెస్ ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద మ‌హాధ‌ర్నా నిర్వహించింది. ఈ ధ‌ర్నాకు కాంగ్రెస్ ముఖ్య నేత‌లంతా హాజ‌ర‌య్యారు. ప్రభుత్వం విద్యార్ధులు, నిరుద్యోగుల ప‌ట్ల అనుస‌రిస్తున్న వైఖ‌రిని నేతలు ఎండగట్టారు.

టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో అడ్రస్ వుండదు : జైపాల్ రెడ్డి
ధ‌ర్నాలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల‌ను నేరుగా మోసం చేసిన చ‌రిత్ర కేసీఆర్‌దేనని ఆరోపించారు. త‌ప్పుడు హామీలతో కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చార‌ని.. వచ్చే ఎన్నిక‌ల్లో అడ్రస్ లేకుండా పోతార‌ని జైపాల్ జోష్యం చెప్పారు.

స‌మ‌స్యల‌ను పరిష్కరించడంలో కేసీఆర్ విఫలం : ఉత్తమ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యువ‌త‌, విద్యార్ధుల పోరాటపటిమే కారణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అలాంటిది ఇప్పుడు వారి స‌మ‌స్యల‌ను పరిష్కరించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమ‌ర్శలు గుప్పించారు. 3వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుద‌ల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

నోట్ల రద్దు వెనక పెద్ద స్కామ్ ఉంది : భట్టి
కాంగ్రెస్ దయతోనే తెలంగాణ వచ్చిందని.. రెండున్నర సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ఏ ఒక్కహామీ నెరవేర్చలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నోట్ల రద్దు వెనక పెద్ద స్కామ్ ఉందని భట్టి తెలిపారు. మ‌హాధ‌ర్నా అనంత‌రం అదే వేదిక‌నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాద‌వ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా కార్యకర్తలు అసెంబ్లీ వైపు ప‌రుగులు పెట్టారు. ముట్టడికి బ‌య‌లుదేరిన కార్యక‌ర్తల‌ను, నేత‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ప్రముఖ డాక్టర్, పద్మా అవార్డు గ్రహీత అరెస్ట్

ముంబై : ప్రముఖ డాక్టర్, పద్మా అవార్డు గ్రహీతను సీబీఐ అరెస్టు చేసింది. రూ. 10 కోట్ల కుంభకోణంలో డాక్టర్ ను సీబీఐ అరెస్టు చేసింది.

10:00 - December 24, 2016

హైదరాబాద్ : స్నేహితులకు పార్టీ ఇవ్వాల్సి వస్తోందని... హోటల్‌ బిర్యానీలో కుక్కల మాంసం కలుపుతున్నారంటూ వదంతులు పుట్టించిన చంద్రమోహన్‌ అనే యువకుడిని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని రీకాబ్‌గంజ్‌లో నివాసముండే వలబోజు చంద్రమోహన్‌ ఎంబీఏ చదువుతున్నాడు. చంద్రమోహన్‌ అతని స్నేహితులు అప్పుడప్పుడు శాలిబండలోని షాగౌస్‌ హోటల్‌కు బిర్యాని తినడానికి వెళ్లేవారు. అయితే ఈనెల మొదటి వారంలో బిర్యానీ తినిపించాలని చంద్రమోహన్‌పై స్నేహితులు ఒత్తిడి చేశారు. దీని నుంచి తప్పించుకునేందుకు చంద్రమోహన్‌ ఓ ప్లాన్‌ వేశాడు. కుక్కమాంసంతో ఉన్న చిత్రాలను సేకరించి... హైదరాబాద్‌లోని హోటళ్లలో కుక్కమాంసం కలుపుతున్నారు, తస్మాత్‌ జాగ్రత్త అంటూ 8వ తేదీన వాట్సాప్‌లో పోస్ట్‌ చేశాడు. అదేరోజు రాత్రి షాగౌస్‌ హోటల్‌ యజమానిని అరెస్ట్ చేశారంటూ మరోపోస్టు పెట్టాడు. వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌గురించి తెలుసుకున్న షాగౌస్‌ హోటల్‌ యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రమోహన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఆర్ అండ్ బీ డీఈ సుభాష్ చంద్ర ఇంట్లో ఏసీబీ సోదాలు

విశాఖ : ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఆర్ అండ్ బీ డీఈ సుభాష్ చంద్ర ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

కాకినాడ జీజీహెచ్ లో వైద్యుల ఆందోళన

తూ.గో: కాకినాడ జీజీహెచ్ లో వైద్యుల ఆందోలన కొనసాగుతోంది. తమను దుర్భాషలాడిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల ఆందోళనకు సీపీఎం మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో వైద్యులతో జాయింట్ కలెక్టర్ చర్చలు జరుపుతున్నారు.

మంబైలో పర్యటించనున్న ప్రధాని మోదీ..

ముంబై : ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మహారాష్ట్రకు ఒకరోజు పర్యటన నిమిత్తం వస్తున్నారు. ఆరేబియా సముద్రంలోని ఓ ద్వీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్మారకానికి శంకుస్థాన చేస్తారు. శివాజీ స్మారకాన్ని సమీపంలోని ఓ ద్వీపంలో రూ.3,600 కోట్లతో అద్భుతంగా నిర్మించనున్నారు. ఇక్కడ 192 మీటర్ల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అదికాక రెండు మెట్రోరైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 

పద్మ అవార్డు గ్రహీత డాక్టర్ అరెస్ట్..

ముంబై : ప్రముఖ డాక్డర్ ..పద్మా అవార్డు గ్రహీత డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.రూ.10కోట్ల కుంభకోణంలో సీబీఐ పోలీసులు డాక్టర్ నుఅరెస్ట్ చేశారు. 

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు కారణంగా 52 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 5 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. మరొక రైలును రద్దు చేశారు. విమానాల రాకపోకల్లో కూడా ఆలస్యం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక చలి మంటలు కాచుకుంటున్నారు ఉత్తరాది ప్రజలు. జనాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

వంగవీటి అభిమానల ఆందోళన..

విజయవాడ : వంగవీటి సినిమాలో దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వంగవీటి అనేపేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని.. సినిమాను  వెంటనే నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం వంగవీటి రాధారంగా అభిమానులు పాయకాపురంలోని రవీంద్ర థియేటర్‌ వద్ద ఆందోళన చేశారు. నేతలు కంచి ధనశేఖర్‌, సురేష్‌, నిజాంపట్నం సుధాకర్‌, దాసరి దుర్గారావు ఆధ్వర్యంలో రాధారంగా అభిమానులు రాంగోపాల్‌వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగా అభిమానులు మాట్లాడుతూ చరిత్ర తెలియకుండా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఇష్టానుసారం చిత్రాన్ని నిర్మించారని ఆరోపించారు.

09:19 - December 24, 2016

నల్లగొండ : కట్టంగూరు మండలం ఈదులూరులో అత్యంత విషాదమైన సంఘటన చోటుచేసుకుంది. ఈదులూరు ప్రాథమిక పాఠశాలలో  ఈ ఘటన జరిగింది. విద్యార్ధులకు మధ్యహ్నాం భోజన సమయంలో జయవర్ధన్ అనే ఐదేళ్ళ బాలుడు ఆటలాడుకుంటూ వచ్చి ప్రమాదవశాత్తు సాంబారు గిన్నెలో పడిపోయాడు. వెంటనే ఈదులూరు  ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. కానీ ఫలితం లేకపోపోయింది. ఈ సమాచారం అందుకుని స్పందించిన కలెక్టర్ మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న బాలుడు జయవర్థన్ శనివారం నాడు మృతి చెందాడు. దీంతో ఈదులూరులోని జయవర్థన్ కుటుంబంలో  విషాదం నెలకొంది. 

08:56 - December 24, 2016
08:53 - December 24, 2016

తూర్పుగోదావరి : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి ఎమ్మెల్యే వర్సెస్‌ డాక్టర్లుగా మారింది.. నిన్న మధ్యాహ్నం ప్రాణాపాయ స్థితిలోఉన్న రోగిని ఆస్పత్రికి తీసుకువచ్చారు.. అయితే అతనికి రాత్రివరకూ వైద్యం అందలేదు.. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదుచేశారు.. బాధితుల సమాచారంతో ఎమ్మెల్యే ఆస్పత్రికి వచ్చారు.. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై డాక్టర్లుకూడా అసంతృప్తి వ్యక్తం చేశారు..

డాక్టర్ల తీరిలా వుంది..
కాకినాడ ఎమ్మెల్యే వర్మ తీరుపై జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పేదేమి వినిపించుకోకుండా అందరి ముందూ తమను తమ తల్లిదండ్రులను కడా దుర్భాషలాడారని డాక్టర్లు వాపోతున్నారు. తన ఫోన్ ను కూడా పగులగొట్టేశారని ఓ డాక్టర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన నియోజయవర్గ ఓట్ల కోసం ఎమ్మెల్యే అనవసరంగా ఆసుపత్రిలో హంగామా చేశారని వారు ఆరోపించారు. తమ లప్పేమీ లేకపోయినా నిందించటం..లూజ్ లెస్ ఫోలోస్ అంటూ పై అధికారులు పరుష పదాలు ఉపయోగించటం పట్ల వారు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టరు పేర్కొంటున్నారు. జూనియర్ డాక్టర్లుగా వర్క్ నేర్చుకోండి అంతే తప్ప మరేమి చేయవద్దని పై అటెండర్ యూజ్ లెస్ ఫెలోస్ అని దుర్భాషలాడారని వారు చెప్తున్నారు. 

08:41 - December 24, 2016

హైదరాబాద్‌ : పాతబస్తీలో అర్ధరాత్రి కొందరు వ్యక్తులు హంగామాచేశారు.. ఆసిఫ్‌నగర్‌ మురాద్‌నగర్‌లో రెండు వర్గాలమధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.. ఆరుకార్లు, ఐదు షాపులు ధ్వంసమయ్యాయి. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అల్లరిమూకల్ని చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకితెచ్చారు.. 

08:37 - December 24, 2016

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ మంచుదుప్పటి గుప్పిట చిక్కుకుంది. హస్తినలో పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా రైళ్లరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 52 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 5 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఒక రైలును రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. విశాఖ మన్యం గజగజవణికిపోతోంది. లంబసింగిలో సున్నీ డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. పాడేరు, చింతపల్లి, మినుములూరులో కనిష్ట ఉష్ణోగ్రతలు10 డిగ్రీలకు మించి నమోదు కావడం లేదు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లోనూ 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఐదారు డిగ్రీలు పడిపోయాయి.

సాంబార్లో పడిన బాలుడు మృతి..

నల్లగొండ : కట్టంగూరు మండలం ఈదులూరులో విషాదం నెలకొంది. శుక్రవారం నాడు మధ్యహ్నాం భోజన సమయంలో జయవర్ధన్ అనే ఐదేళ్ళ బాలుడు సాంబారులో పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. కాగా చికిత్స పొందుతూ జయవర్ధన్ మృతి చెందాడు. 

భారీగా డ్రగ్స్ పట్టివేత..

సంగారెడ్డి : గుమ్మ‌డిద‌ల మండ‌లం అనంతారంలోని వెంక‌ట‌రాఘ‌వ ల్యాబ్‌లో డీఆర్ ఐ అధికారులు నిర్వ‌హించిన సోదాల్లో కోట్లాది రూపాయ‌ల విలువైన డ్ర‌గ్స్ వెలుగుచూశాయి. రూ.3.5 కోట్ల విలువైన అల్ఫాజోలం డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. 

కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం..

ఉత్తర్‌ప్రదేశ్‌ : గోరఖ్‌పూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి మనోజ్‌సిన్హాకు స్వల్ప గాయాలయ్యాయి. మనోజ్‌సిన్హా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

టైర్ల కంపెనీలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : చేవెళ్ల మండలం చెన్వెల్లి శివారులోని కోహినూరు టైర్ల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంతో కోట్ల రూపాయాల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

07:58 - December 24, 2016
07:55 - December 24, 2016

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దత్తత తీసుకున్న గ్రామాలైన ఎర్రవెల్లి.నర్సంపేట గ్రామాల్లో 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సామూహిక గృహప్రవేశాలు చేశారు. ప్రతీ పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేవలం రెండు గ్రామాలలో ఈ హామీ నెరవేరినంత మాత్రాల రాష్ట్ర ప్రజలంతా సంబురాలు చేసుకోవాలా? అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయ్ కుమార్ (ప్రముఖ విశ్లేషకులు) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) మహేష్ గౌడ్ (కాంగ్రెస్ నేత) రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రదేశంలోనే చేపట్టని ఈ హామీని కేసీఆర్ దత్తత గ్రామాల్లోనే చేపట్టటం కేవలం కంటి తుడుపు చర్యగా చర్చలో పాల్గొన్న ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్ పేర్కొన్నారు. మరి చర్చలో పాల్గొన్న వక్తలు ఇంకా ఎటువంటి విషయాలను వెల్లడించారో తెలసుకునేందుకు ఈ వీడియో చూడండి..

07:44 - December 24, 2016

హైదరాబాద్ : ఉనికిలో లేని 255 రాజకీయ పార్టీలను భారత ఎన్నికల సంఘం రద్దుచేసింది. పది సంవత్సరాలుగా ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనక పోవడంతో పలు పార్టీలను గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12పార్టీలు కూడా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 12పార్టీల గుర్తింపు రద్దు
రాజకీయపార్టీ అంటే.. ప్రజల్లో ఉండాలి.. ప్రజల్తో పనిచేయాలి.. అన్నీటికంటే ముఖ్యంగా ఎన్నికల్లో పాల్గొనాలి. దశాబ్దం పాటు ఎటు వంటి ఎన్నికల్లో పాల్గొనకుండా .. ఎటువంటి ఉనికిని చాటుకోని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 12పార్టీల గుర్తింపు రద్దు
దేశవ్యాప్తంగా 255పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు భారత ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. 2005 నుంచి 2015 వరకు ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని ఈ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 పార్టీలు కూడా ఉన్నాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులకు చెందిన రెండు పార్టీలు ఇందులో ఉన్నాయి. నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగు దేశం, లక్ష్మీపార్వతి ప్రారంభించిన ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీలు ఈసీ నిర్ణయంతో ఇకపై ఉనికిలో లేకుండా పోయాయి.

1996లో ఎన్టీఆర్‌ మృతితో టీడీపీలో రగిలిన అసమ్మతి
1996లో ఎన్టీఆర్‌ మరణానంతరం టీడీపీలో రగిలిన అసమ్మతి నేపథ్యంలో హరికృష్ణ అన్న టీడీపీ పేరుతో 1999లో పార్టీని స్థాపించారు. మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరిపిన హరికృష్ణ.. తర్వాత పార్టీని నడిపించడంలో అంతగా ఆసక్తిని కనబరచలేదు. ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో కొనసాగారు. ప్రస్తుతం ఆపార్టీతోనూ అంటీముట్టనట్లుగా ఉన్నారు. 2005 తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనక పోవడంతో.. నిబంధనల మేరకు అన్నటీడీపీని రద్దు చేసింది ఎన్నికల సంఘం.

ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన లక్ష్మీపార్వతి
అటు ఎన్టీరామారావు సతీమణి లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టీఆర్‌టీడీపీ కూడా మొదట్లో ఉధృతంగానే జనంలోకి దూసుకెళ్లింది. 1996లో ఈ పార్టీ మొత్తం 42 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీచేసి.. దాదాపు 32న్నర లక్షల ఓట్లను కూడా పొందింది. రాష్ట్రస్థాయిలో 10.66 శాతం ఓట్లను కూడా పొందింది. కాని.. ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేక పోయింది. దీంతో పార్టీలో ఉత్సాహంగా చేరిన చాలా మంది నాయకులు తిరిగి చంద్రబాబు దగ్గరకి చేరడంతో.. లక్ష్మీపార్వతి నేతృత్వంలోని అన్నటీడీనీ క్రమంగా కనుమరుగైంది. తాజాగా ఈపార్టీని కూడా ఈసీ రద్దు చేసింది.

1998లో పి.ఇంద్రారెడ్డి స్థాపించిన జైతెలంగాణ పార్టీ
ఇక తెలంగాణ మలిదశ ఉద్యమపార్టీల్లో ప్రధాన మైనది జైతెలంగాణ పార్టీ. ఈపార్టీని 1998లో టీడీపీ మాజీ నేత పి.ఇంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. 1996లో ఎన్టీఆర్‌ మరణానంతరం .. లక్ష్మీపార్వతి పక్షం వహించిన ఇంద్రారెడ్డి.. తర్వాత తెలంగాణ ఉద్యమంవైపు మొగ్గారు. ప్రత్యేక రాష్ట్రంకోసం తెలంగాణవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. తర్వాత జనం నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో.. 1998లో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు ఇంద్రారెడ్డి.

ఆల్‌ఇండియా సద్గుణపార్టీ, ఆంధ్రనాడు పార్టీ, బహుజన రిపబ్లికన్‌ పార్టీ
ఇక ఆల్ ఇండియా సద్గుణ పార్టీ, ఆంధ్రనాడు పార్టీబహుజన రిపబ్లికన్ పార్టీ.. భారతీయ సేవాదళ్, ముదిరాజ్ రాష్ట్రీయ సమితి, నేషనల్ సిటిజన్స్ పార్టీతోపాటు సత్యయుగ్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజాపార్టీల గుర్తింపును కూడా రద్దు చేసినట్టు ఈసీ ప్రకటించింది. 

07:37 - December 24, 2016

పెద్దపల్లి : అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కొనసాగిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్రను అడ్డుకునేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో సభను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై తమ్మినేని ఫైర్‌ అయ్యారు. బెదిరింపులకు భయపడేది లేదని తమ్మినేని హెచ్చరించారు.

రాష్ట్రం వచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పులేదు
తెలంగాణ వచ్చి రెండున్నరేళ్లయినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో 68వ రోజు కొనసాగింది. గోదావరిఖని నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దపల్లి వరకు కొనసాగించి. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.

అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి : తమ్మినేని
తాను అధికారంలోకి వస్తే సింగరేణిలో ఓపెన్‌కాస్ట్‌లను మూసివేస్తామని చెప్పిన కేసీఆర్‌.. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదన్నారు. జిల్లాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజల బతుకులు బాగు పడవని.. ప్రజలకు ఏం కావాలో పాలకులు తెలుసుకోవాలన్నారు. 93 శాతం ఉన్న అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు తమ్మినేని.

పాలకుల బెదిరింపులకు భయపడేది లేదు : తమ్మినేని
మరోవైపు సభ జరుగుతుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సభను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల తీరుపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నా.. అక్కడక్కడ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాలకుల బెదిరింపులకు భయపడేది లేదని తమ్మినేని హెచ్చరించారు.

సింగరేణి ప్రాంతంలోని ప్రజలను ఆదుకోవాలి : నగేష్
సింగరేణి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని పాదయాత్ర బృంద సభ్యుడు నగేష్‌ అన్నారు. తక్షణమే ప్రభుత్వం సింగరేణి ప్రాంతంలోని ప్రజలు ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

గోలివాడలో పంపు హౌస్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి : తమ్మినేని
రామగుండం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ఎన్టీపీసీ , రామగుండం ఎరువుల ఫ్యాక్టరీల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తమ్మినేని కోరారు. గోలివాడలో పంపు హౌస్‌ నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారమివ్వాలన్నారు. ఈరోజు పాదయాత్రలో అంబేద్కర్‌ సంఘ నేతలు, సీపీఐ నేతలు, ఓపెన్‌కాస్ట్‌ నిర్వాసితులు కలిసి తమ సమస్యలను పాదయాత్ర బృంద సభ్యులకు విన్నవించుకున్నారు. 

07:30 - December 24, 2016

కర్నూలు : ఎస్పీ రవి కృష్ణ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా బృందం పలు కార్యక్రమాలు చేపట్టింది. బసవ తారకం క్యాన్సర్‌ హస్పటల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కాన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. గ్రామంలోని వికలాంగులకు త్రిసైకిళ్లను తానా జనరల్‌ సెక్రటరీ పొట్లూరి రవి పంపిణీ చేశారు. 

07:23 - December 24, 2016

హైదరాబాద్ : స్వచ్ఛ భారత్‌ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ను ముందుంచేందుకు బల్దియా యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛ సర్వేషన్ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా...ఎల్బీ స్టేడియంలో స్టేక్ హోల్డర్స్ అందరికీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంక‌య్యనాయుడు, బండారుద‌త్తాత్రేయ‌ ...రాష్ట్ర మంత్రులు, నగర ప్రజాప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

నగరాన్ని స్వచ్ఛహైదరాబాద్‌గా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ కృషి
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో పరిశుభ్రత పై దేశవ్యాప్తంగా ఆలోచన మొదలైంది. గతేడాది కేంద్రప్రభుత్వం సచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటినుంచి న‌గ‌రాల్లో పారిశుధ్యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక గ్రేట‌ర్ హైదారాబాద్ ప‌రిధిలో పారిశుధ్యాన్ని కాపడేందుకు బల్దియా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోంది. పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఎల్బీ స్టేడియంలో స్టేక్ హోల్డర్స్ అందరికీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించింది.

పారిశుధ్యాన్ని కాపాడేందుకు కృషి : మేయర్ బొంతు రామ్మోహన్
గ్రేటర్‌ హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి హైదరాబాదీ భాగస్వామి కావాలని చెప్పారు.ఐటీసీ సహకారం తో రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛ్ హైద‌రాబాద్ ల‌క్ష్యాన్ని చేరవేస్తామ‌న్నారు.

రాష్ట్రాన్ని స్వచ్ఛతవైపు మరలిస్తున్నాం: మంత్రి కేటీఆర్
స్వచ్ఛభారత్‌ పై కేంద్ర ప్రభుత్వ పిలుపును తెలంగాణ సర్కారు అందిపుచ్చుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛభారత్‌లో హైదరాబాద్‌ను మొదటి ఐదు ర్యాంకింగ్స్‌లో ఉండేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నగరాణాలను, పట్టణాలను స్వచ్ఛతవైపు మల్లిస్తున్నామ‌ని తెలిపారు.

పారిశుధ్యంలో మార్పుకు అందరూ పాటుపడాలి: వెంకయ్యనాయుడు
కీన్లీనెస్ ఈజ్ గాడ్లీ నెస్ అన్న గాంధీ మాట‌ల‌ను ఆచరణలో పెట్టాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. న‌గ‌రాలు, పట్టణాల్లో టాయిలెట్స్‌ను విస్తృతంగా ఏర్పాటు చెయ్యాలని తెలిపారు. పారిశుధ్యంలో మార్పు రావాలంటే అందరూ పాటుపడాలని చెప్పారు. హైదరాబాద్‌ను స్వచ్ఛ భారత్‌లో మరింత ముందుంచేందుకు పలు సంస్థలు సహకరిస్తున్నాయి. ఇందుకోసం ఆర్థిక విరాళాలను సైతం ప్రకటించాయి. 

07:17 - December 24, 2016

కొమురం భీమ్ : వందేళ్ల చరిత్ర ఉన్నా కాలిబాట కూడా దిక్కులేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో సంబంధంలేని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే అతి మారుమూల గ్రామం అది. అక్కడ ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలీదు. అలాంటి గ్రామం రూపురేఖలు మారిపోయాయి. కలలో కూడా ఊహించని ఆర్టీసీ బస్సు గ్రామానికి వస్తుంది. కాలిబాట లేని గ్రామానికి కార్లు సైతం సులువుగా వెళ్లగలుగుతున్నాయి. ఇంతటి మార్పుకు కారణం ఎంటో వాచ్‌ దిస్‌ స్టోరీ..

గూగుల్‌ మ్యాప్‌లో వెతికిన కూడా దొరకని గ్రామం
ఇది కొమురంభీం అసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం లోహ గ్రామం. ఈ పేరు దాదాపు జిల్లా వాసులకు కూడా తెలియదు. గూగుల్‌ మ్యాప్‌లో వెతికిన కూడా దొరకని గ్రామం ఇది. నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులకు కూడా తెలియని మారుమూల గ్రామం. కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ గిరిజన గ్రామానికి నిన్న, మొన్నటి వరకు కనీస సౌకర్యాలు లేవు. ఊళ్లోకి వెళ్లాలంటే కాలి నడకే శరణ్యం. విద్యార్ధులు చదువుకోవాలన్నా.. ఆసుపత్రికి వెళ్లాలన్నా ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి ఎదైనా వాహనం ఎక్కాలి. అలాంటి గ్రామం ఇప్పుడు చరిత్ర పుటల్లోకి వెళ్లింది. వందేళ్ల తర్వాత ఈ గ్రామానికి దారి ఏర్పడింది. ఇప్పుడు ఈ ఊరికి రోడ్డు వచ్చింది. ఏకంగా ఆర్టీసీ బస్సే వస్తోంది.

గ్రామాన్ని దత్తతు తీసుకున్న ఎస్ఐ రమేష్, కాగజ్ నగర్ రూరల్ సిఐ
అసలు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలియని లోహ గ్రామానికి పోలీసులు కొత్తరూపం తీసుకొచ్చారు. స్థానిక దహెగాం ఎస్ఐ ధీకొండా రమేష్, కాగజ్ నగర్ రూరల్ సిఐ రమేష్ బాబులు లోహ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆరు కిలోమీటర్లు రోడ్డు వేయించారు. జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్ సహాయంతో వారం రోజుల్లో రోడ్డు వేయించారు. కనీసం రోడ్డు లేని గ్రామానికి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఏళ్లుగా అస్సలు అభివృద్ధి అనే మాట ఎరుగని ఆ ఊర్లోకి నేడు బస్సును రప్పించారు. అక్కడి నిరుపేద గిరిజనులకు దుప్పట్లు, బియ్యం,ఇతర సామాగ్రిని కూడా అందించారు.

లోహ గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి
రోడ్డు, బస్సు సౌకర్యం వచ్చిన వేళ గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. రోడ్డు సౌకర్యాన్ని ప్రారంభించడానికి వచ్చిన జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్ కు ఘన స్వాగతం పలికారు. బాజా భజంత్రులతో, బతుకమ్మలతో కొత్తగా స్వతంత్ర్యం వచ్చినట్లు బాణా సంచా పేలుస్తూ సంబరాల్లో మునిగి పోయారు లోహ గ్రామస్థులు. జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్ సైతం గిరిజనుల సంబరాల్లో పాలు పంచుకున్నారు. గ్రామస్థులతో కలిసి డాన్స్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. వారితో పాటు సహపంక్తి భోజనం చేశారు.

హ్యాట్సాఫ్ టు పోలీస్ అంటున్నారు లోహ గ్రామస్థులు
పోలీసులు ప్రజల సౌకర్యం కోసం ఇలా ఒక మారుమూల గిరిజన గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించడంపై ప్రజలు, వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు పోలీస్ అంటున్నారు. 

గ్రూపు తగాదాల్లో ఇద్దరికి గాయాలు..

హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ ప్రాంతంలోని మురాద్ నగర్ లో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. దీంతో ఇరు గ్రూపులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆరు కార్లు,పలు షాపులు ధ్వంసం అయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. 

తెలుగు రాష్ట్రాల్లో 12 పార్టీలు రద్దు..

హైదరబాద్‌ : ఎన్నికలకు దూరంగా ఉన్న నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కొరడా ఝుళిపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 12 రాజకీయ పార్టీల నమోదును రద్దు చేసింది. 2005 సంవత్సరం నుంచి జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను గుర్తించాలని ఎన్నికల సంఘం భావించి కసరత్తు చేసింది. ఆయా పార్టీల నమోదు సందర్భంగా పేర్కొన్న చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ పేర్కొంది.

Don't Miss