Activities calendar

26 December 2016

21:28 - December 26, 2016

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కాంగ్రెస్ స‌మ‌ర్పించాల‌ని బీజేపీ సీనియ‌ర్ నేత‌ సుబ్రమణ్యస్వామి వేసిన పిటిష‌న్‌ను పటియాలా హౌస్‌ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను వచ్చే ఏడాది ఫిబ్రవ‌రి 10కి వాయిదా వేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాతో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన అనుబంధ కంపెనీ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ను సోనియా అక్రమంగా కబ్జా చేశారని స్వామి ఆరోపించారు.

21:27 - December 26, 2016

హైదరాబాద్ : సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్‌ - అబ్బాయ్‌ మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో శివ్‌పాల్‌ యాదవ్‌, సిఎం అఖిలేష్‌ యాదవ్‌లు ఎవరికి వారే జాబితాలను సిద్ధం చేసుకున్నారు. తాజాగా అఖిలేష్‌ ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌కు 403 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను సమర్పించారు. శివ్‌పాల్‌ యాదవ్‌ తయారు చేసిన జాబితాలోని అభ్యర్థులకు నేరచరిత్ర ఉందని అఖిలేష్‌ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గెలిచే సామర్థ్యం ఆధారంగా 175 మందికి టిక్కెట్లు ఇచ్చినట్లు శివపాల్‌ పేర్కొన్నారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ట్వీట్‌లో ఆయన స్పష్టం చేశారు. దీనిపై ములాయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

21:24 - December 26, 2016

దరాబాద్ : కోడి పందేల రాయుళ్లకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. పందేల పేరుతో మూగజీవాలను హింసించడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఇకపై రాష్ట్రంలో కోడిపందేలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోడి పందేలతో మద్య వినియోగం, జూదం పెరుగుతోందన్న పిటిషనర్ల వాదనలతో ఉమ్మడి హైకోర్టు ఏకీభవించింది.

2013లో మొదటిసారిగా కోడిపందేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు....

కోడిపందాలపై 2013లో మొదటిసారిగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీపుల్ ఫర్ యానిమల్ అర్గనైజేషన్, యానిమల్ వెల్ఫేర్ సంస్థలు కోడి పందేలను నిషేధించాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే అంశంపై మరో రెండు స్వచ్ఛంద సంస్థలు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. కోళ్లకు కత్తులు కట్టి హింసను ప్రేరేపిస్తున్నారని సీనియర్ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ హైకోర్టు, కోడిపందేలను నిషేధిస్తూ తీర్పునిచ్చింది.

సుప్రీం కోర్టుకు వెళ్లి బిజెపి నేత రఘురామ కృష్ణంరాజు...

నిజానికి 2013 నుంచీ కోడిపందేల నిర్వహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. 2014లో హైకోర్టు స్టేటస్ కో పాటించాలని అదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై బీజేపి నేత రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టుకు వెళ్లారు. వారసత్వ సంప్రదాయ క్రీడలపై జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై వాదనలు విన్న..అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూ...హైకోర్టులో తేల్చుకోవాలని అప్పట్లో సూచించింది.

సుప్రీం కోర్టు సూచనతో.. సుదీర్ఘ విచారణ....

సుప్రీం కోర్టు సూచనతో.. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు చివరికి కోడిపందేలను నిషేధించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పందెం రాయుళ్లు యోచిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న క్రీడను అడ్డుకోవద్దని.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. హింసా, జూదానికి తావులేకుండా వేడుకలు నిర్వహిస్తామని, అందుకే కోడిపందేలకు అనుమతిని ఇవ్వాలని వారు సుప్రీంకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది.

21:20 - December 26, 2016

నెల్లూరు : టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు కాకాణి గోవర్థన్ రెడ్డి. 30 కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్న 'సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీలో సోమిరెడ్డి భార్య జ్యోతి భాగస్వామి అని విమర్శించారు. ఇప్పటికే మలేషియా, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌ల లావాదేవీలు ఆధారాలతో సహా బయటపెట్టినా..నకిలీ, ఫోర్జరీ పత్రాలు అనడం దుర్మార్గమన్నారు కాకాణి. తాను బయటపెట్టిన పత్రాలు నిరాధారమైనవి అయితే శాశ్వతంగా ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఇప్పటికైనా అవినీతి చేశానని సోమిరెడ్డి నిజాయితిగా ఒప్పుకోవాలన్నారు.

20:56 - December 26, 2016
20:17 - December 26, 2016

హైదరాబాద్: పెద్దలు జానాలను గదిరించిన కేటీఆర్.... అసెంబ్లీ అయ్యింది ఫిరాయింపు తీన్మార్, కళాకారులను రమ్మంటున్న చంద్రాలు..విఐపిలనే బొచ్చెడు మంది అసుంటోళ్లు, తెలంగాణ సర్కారు మీదికి సమరం...కోదండమేస్తానంటున్న కోదండసార్, జనాల్ని డిసెంబర్ ఫూల్స్ చేసిన నేతలు...గుంటూరు కాడ గోనుపోయిన పంచాయతీ, సంకురాత్రి కోడిపందాలు సాగనియద్దు...సర్కార్ పై హైకోర్టు ఆగ్రహావేశాలు, దళితులను బెదిరిస్తున్న నగరి సిఐ... దానికి తమరేమన్నా అర్హులా సారూ.... ఇత్యాది అంశాలతో ఆసక్తికరమైన హావభావాలతో మల్లన్న అందించే నేటి మల్లన్న ముచ్చట్ల కార్యక్రమం మన ముందుకు వచ్చింది. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

రద్దయిన నోట్లు రూ.10వేలకు పైగా ఉంటే నేరం

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు పై మరో కొత్త ఆర్డినెన్స్ తీసుకురానుంది. రద్దయిన రూ.500, 1000 నోట్లు రూ.10వేలకు పైగా ఉంటే నేరంగా పరిగణించాలని కేంద్రం నిర్ణియించింది. పట్టుబడిన సొమ్ముకు ఐదు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పురపాలక మెజిస్ర్టేట్ ఆధ్వర్యంలో విచారణ జరిపినున్నారు. డిసెంబర్ 30 తర్వాత రద్దయిన నోట్లను నేరుగా రిజర్వ బ్యాంక్ కౌంటర్లో జమ చేసుకునే అవకాశం కలిపించింది.

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నేటితో ముగిసిన బిడ్డింగ్

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నేటితో బిడ్డింగ్ ముగిసింది. రేపు హైకోర్టులో మధ్యాహ్నం బిడ్లను తెరవనుంది. కీసరలోని 391 ఎకరాల భూమితో పాటు విజయవాడలోని అగ్రిగోల్డ్ ఆస్తుల కలిపి 24 బిడ్లుగా వేలం వేయనున్నారు. 24 బిడ్లకు గానూ కనీసం ధర రూ.284 కోట్లుగా నిర్ణయించారు.

హుక్కా సెంటర్లో 60 గ్రాముల డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని వాటర్ హుక్కా సెంటర్లో 60 గ్రాముల డ్రగ్స్ ను పట్టుకుని... నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ముంబై వాసులు ఉన్నారు.

9 మంది మహిళలపై యాసిడ్ దాడి

హైదరాబాద్ : పంజాబ్ లో దుర్మార్గం జరిగింది. 9 మంది మహిళలపై యాసిడ్ దాడి జరింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో మైనర్ ఉన్నారు. పంచాయతీ స్థల విషయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది.

19:34 - December 26, 2016
19:27 - December 26, 2016

విజయవాడ : వంగవీటి సినిమాపై.. రాదా మండిపడ్డారు. వర్మకు భారీ వార్నింగే ఇచ్చారు. సినిమా ద్వారా తమ కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేసిన వర్మ తగిన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాదా ఇలా ప్రకటించారో లేదో.. వంగవీటి అభిమానులు రెచ్చిపోయారు. రంగా జీవితచరిత్రను వక్రీకరించారంటూ.. రామ్‌గోపాల్‌వర్మ దిష్టిబొమ్మను దహనం ద్వారా నిరసన తెలిపారు.

కొత్త మలుపు...

రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన వంగవీటి సినిమా వివాదం కొత్త మలుపు తిరిగింది. సినిమా రిలీజ్‌ అయిన రోజునుంచే వంగవీటి అనుచరులు.. వర్మపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పుడు వీరికి రాదా కూడా తోడయ్యారు.

రంగా జీవిత చరిత్రను వక్రీకరించారు...

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రంగా జీవిత చరిత్రను వక్రీకరించారని వంగవీటి రాదా మండిపడ్డారు. బెజవాడ రాజకీయాల గురించి అన్నీ తెలుసునంటూ కోతలు కోసే రామ్‌గోపాల్‌ వర్మ, వంగవీటిని అవమానించినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. డబ్బులే కావాలంటే రంగా అభిమానులు చందాలు వేసుకుని మరీ వర్మకు ఇచ్చేవారంటూ ఎద్దేవా చేశారు.

వంగవీటి సినిమాపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు....

ఇదిలా ఉండగా.. వంగవీటి సినిమా విడుదలైన తరువాత.. వంగవీటి అభిమానుల సంఘం వర్మపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో ఓ వర్గాన్ని రౌడీలుగా చూపించారని.. అది తమ మనోభావాలను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు. ఆ సన్నివేశాలను సినిమా నుంచి తక్షణమే తొలగించాలని లేకుంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్, జనవరి 16లోగా పూర్తి వివరాలను నివేదించాలని ఇప్పటికే సెన్సార్‌ బోర్డును ఆదేశించింది.

కోడిపందాలపై గైడ్ లైన్స్ విడుదల చేసిన హైకోర్టు

హైదరాబాద్ : కోడిపందాలపై హైకోర్టు గైడ్ లైన్స్ విడుదల చేసింది. కోడిపందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, జనవరి 7 లోగా మండల స్థాయిలో తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పందెం కోళ్లు, డబ్బులు ఎక్కడున్నా స్వాధీనం చేసుకోవాలి. కోడిపందాలు జరిగే మైదానాల్లో 144 సెక్షన్ విధించాలి. గ్రామస్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించాలి. ఈ అంశంలో తహశీల్దార్లు, పోలీసులు విఫలమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు హెచ్చరించింది.

'సమ్మెల ద్వారా ప్రభుత్వాన్ని బెదిరించాలనుకోవడం సరికాదు'

విజయవాడ : కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మెల ద్వారా ప్రభుత్వాన్ని బెదిరించాలనుకోవడం సరికాదని మంత్రి యనమల అన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచామని, కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పై న్యాయ సలహా తీసుకోవాలన్నారు. న్యాయమైన డిమాండ్లను తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు.

వర్మ పై కుషాయిగూడ పీఎస్ కేసు నమోదు

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాద్‌లోని కుషాయిగూడ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. త‌మ‌ మనోభావాలను కించ‌ప‌రచేలా ‘వంగవీటి’ టైటిల్ పెట్టి ‘కాపు కాసే శక్తి’ లాంటి పదాలను వారు ఉప‌యోగించార‌ని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వ‌ర్మ తీసిన వంగవీటి సినిమాలో కాపుల మనోభావాలను దెబ్బతీసేలా వారిని వ‌ర్మ‌ రౌడీలుగా చూపించారని వంగ‌వీటి మోహ‌న రంగా అభిమానులు కిర‌ణ్‌కుమార్‌, అశోక్‌, విజ‌య్‌లు ఈ ఫిర్యాదు చేశారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరారు.

31న ఏపీ కేబినెట్ భేటీ

విజయవాడ :ఈ నెల 31 ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నోట్లరద్దు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వివిధ పథకాలపై సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

18:50 - December 26, 2016

ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు...ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్‌ టీచర్స్ చేస్తున్న నిరసన 25వ రోజుకు చేరుకుంది. ఒప్పంద ఉపాద్యాయుల న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంపీ అన్నారు. కాంట్రాక్ట్‌ టీచర్స్ ధర్నాకు వైపీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

18:48 - December 26, 2016

విజయవాడ : రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించనున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కార్యక్రమాన్ని సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పది రాష్ట్రాల చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

18:47 - December 26, 2016

పశ్చిమగోదావరి : భీమవరంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడిన వారిని కనపడినట్టే కరిచింది. దీంతో 13 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు పిచ్చికుక్కను పట్టుకునేందుకు మున్సిపల్‌ సిబ్బంది గాలిస్తున్నారు.

18:46 - December 26, 2016

విజయవాడ : ఏపీలో చేపలు, రొయ్యల చెరువుల అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని... సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.. లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సివస్తుందని హెచ్చరించారు.. కృష్ణా, నెల్లూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల పంట పొలాలను చేపల చెరువుగా మారుస్తున్నారని విమర్శించారు.. చట్టాలను అతిక్రమిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు..

18:44 - December 26, 2016

తిరుపతి : సినీనటుడు నందమూరి బాలకృష్ణ తిరుపతికి చేరుకున్నారు. బాలకృష్ణ వందో చిత్రం ' గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియోను ఈరోజు సాయంత్రం తిరుపతిలో విడుదల చేయనున్నారు. తిరుపతి మున్సిపల్‌ మైదానంలో కాసేపట్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలకృష్ణ నగరానికి వచ్చారు. ఆడియో విడుదల వేడుకలో చిత్ర బృందంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, బాలకృష్ణ అభిమానులు హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై బాలకృష్ణ అభిమానులతో పాటు అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్: అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలపై సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. తర్వాత సభను స్పీకర్ రేపటికి వాయిదా వేస్తోన్నట్టు ప్రకటించారు.

పొదల్లో అప్పుడే పుట్టిన కవల శిశువులు..

తూర్పుగోదావరి : అప్పుడే పుట్టిన కవల శిశువుల్ని జిల్లాలోని తుని మార్కెట్‌ యార్డు వ‌ద్ద ఉన్న పొద‌ల్లో గుర్తుతెలియ‌ని వ్యక్తులు పడేసి వెళ్లారు. ఆ పొద‌ల నుంచి వ‌స్తోన్న‌ ఆ శిశువుల ఏడుపు విన్న అక్క‌డి స్థానికులు శిశువుల‌ను ర‌క్షించి, తుని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో ఆ శిశువుల‌కి వైద్యులు అత్యవసర చికిత్స అందజేస్తున్నారు

17:45 - December 26, 2016

హైదరాబాద్ : సీపీఐ 91వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లోని.. మక్దూం భవన్‌లో ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. పేదలు, కూలీల వేతనాల కోసం.. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంబిస్తుందని.. నోట్ల రద్దు నిర్ణయం కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉందన్నారు.

17:43 - December 26, 2016

నాగర్‌కర్నూలు : కల్వకర్తిలోని టీఎస్ యూటీఎఫ్ భవన్‌లో 10టివి క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌,బిజపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లాజి ఆచారి, టిఆర్ఎస్ నేత బాలాజీ సింగ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజితారెడ్డి పాల్గొన్నారు.. 10టివి ప్రజలపక్షాన పోరాడుతున్న ఛానల్‌ అని ప్రశంసించారు..

17:40 - December 26, 2016

హైదరాబాద్‌ :సక్రమమైన పద్ధతిలో ప్రాజెక్ట్‌లు నిర్మించాలని.. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. తెలంగాణ భూ సేకరణ చట్టం, పర్యవసనాలు అనే అంశంపై... వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ విమర్శించారు. . రైతులకు సరైన నష్టపరిహారాన్ని ఇవ్వాలని చంద్రకుమార్‌ సూచించారు.

17:38 - December 26, 2016

హైదరాబాద్‌ : నగరంలో రోడ్లు నరకకూపాలుగా మారాయని.. అభివృద్ధిలో హైదరాబాద్‌ బాగా వెనకబడిపోతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఆర్డీసీకి, జీహెచ్‌ఎంసీకి సమన్వయం లేకపోవడంతో నగరంలో బస్‌బేలు పూర్తి కాలేదని.. దీంతో బస్సులు ఎక్కడా ఆగట్లేదని విమర్శించారు. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ పనిచేయట్లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని మరో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సూచించారు. జీహెచ్‌ఎంసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు.

17:35 - December 26, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు హైకోర్టుకు చేరింది. ఉరిశిక్ష ధ్రువీకరణ కోసం తీర్పును ఎన్‌ఐఏ కోర్టు హైకోర్టుకు పంపింది. దీనిపై హైకోర్టు రెఫర్ ట్రయల్‌ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... నిందితులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

17:31 - December 26, 2016

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు హైకోర్టుకు చేరింది. ఉరిశిక్ష ధ్రువీకరణ కోసం తీర్పును ఎన్‌ఐఏ కోర్టు హైకోర్టుకు పంపింది. దీనిపై హైకోర్టు రెఫర్ ట్రయల్‌ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... నిందితులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

17:23 - December 26, 2016
17:17 - December 26, 2016

ఢిల్లీ :అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ స్కాం కేసులో మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగికి పటియాలా కోర్టు షరతులతో కూడిన బెయిలు ముంజూరు చేసింది. మిగతా సాక్ష్యులను కలవొద్దని, న్యాయస్థానం అనుమతి లేకుండా పట్టణం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో స్కాంకు సంబంధించి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఎస్పీ త్యాగితో పాటు గౌతమ్‌ ఖైతాన్‌, సంజీవ్‌ త్యాగిలను డిసెంబర్‌ 9న సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వం హయాంలో 3 వేల 600 కోట్లతో అగస్టా వెస్‌ల్యాండ్‌ కంపెనీకి చెందిన 12 వీవీఐపీ చాపర్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని సిబిఐ అభియోగం నమోదు చేసింది.

17:14 - December 26, 2016

ఢిల్లీ :వచ్చే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం అని కేంద్ర మంత్రి-ఉమాభారతి అన్నారు. పోలవరానికి తొలిదశ నిధులను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి అన్ని విధాల సాయం చేస్తాం-ఉమాభారతి నాబార్డు ద్వారా ప్రస్తుతం దాదాపు 2వేల కోట్ల రూపాయలు అందచేశామన్నారు.

హైకోర్టుకు దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు..

హైదరాబాద్ : దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు హైకోర్టుకు చేరింది. ఉరి శిక్ష ధృవీకరణ కోసం తీర్పును ఎన్ఐఏ హైకోర్టుకు పంపింది. రెఫర్ ట్రయల్ కేసుగా హైకోర్టు నమోదు చేసింది. మరోవైపు ఉరిశిక్ష సవాల్ చేస్తూ హైకోర్టులో నిందితులు పిటిషన్ దాఖలు చేశారు.

17:09 - December 26, 2016

హైదరాబాద్ :టీఎస్‌ ఐ పాస్‌ ద్వారా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. వామపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ద్వారా స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చని ఆయన సూచించారు.

17:05 - December 26, 2016

విశాఖ: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు నిర్వహించారు. బెల్లంలో హైడ్రాక్సైడ్‌ను కలుపుతున్నారన్న సమాచారంతో సోదాలు జరిపారు. బెల్లం శాంపిల్స్‌ సేకరించి.. ల్యాబ్‌కు పంపారు. బెల్లం రంగు హైడ్రాక్సైడ్ కలుపుతున్నారని ఇటీవల వార్తలు రావడంతో.. అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హైడ్రాక్సైడ్ ఉన్న బెల్లంతో... జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

17:03 - December 26, 2016

విజయవాడ : రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందని.. అవినీతి పెరిగిందని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండెంకల వృద్ధి రేటు అని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వృద్ధి రేటు లెక్కల్లో తప్ప.. వాస్తవంగా ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.

16:59 - December 26, 2016

హైదరాబాద్ :కన్యాకుమారినుంచి చెన్నైవరకూ తీరప్రాంతాల ప్రజలు కడలికి ప్రత్యేక పూజలు చేశారు... పాలాభిషేకం చేసి మళ్లీ సునామీతో విరుచుకుపడొద్దని వేడుకున్నారు.. సునామీ స్మారక దిన్నెకు పూలు, పసుపు, కుంకుమతో పూజలు జరిపారు.. సునామీ విలయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.. తమిళనాడు జాలర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.. పదకొండేళ్లక్రితం డిసెంబర్‌లో సునామీ విరుచుకుపడి వందలాది కుటుంబాలను అతలాకుతలం చేసింది..

16:58 - December 26, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని రావులపాలెంలో 105 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈతకోట జాతీయ రహదారిపై స్కోడా కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది.. తీవ్రగా గాయపడ్డ బాధితున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.. ఈ కేసు దర్యాప్తులోభాగంగా పోలీసులు కారును తనిఖీ చేశారు.. అందులో 105 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు.. ఈ గంజాయివిలువ మూడులక్షలవరకూ ఉంటుందని అంచనావేస్తున్నారు.. అలాగే వాహనంలోఉన్న 70వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.. పరారీలోఉన్న డ్రైవర్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు..

16:56 - December 26, 2016

హైదరాబాద్ : డిసెంబర్ 30 తర్వాత సామాన్యుల కష్టాలు తీరిపోతాయని ప్రధాని మోదీ పదేపదే గట్టిగా చెబుతున్నారు. అయితే 30 తర్వాత కూడా కష్టాలు కొనసాగనున్నాయని.. నోట్ల కష్టాలు తీరాలంటే మరో ఐదు నెలలు సమయం పట్టొచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. మరోవైపు డిసెంబరు 30 సమీపిస్తున్న కొద్దీ బ్యాంకర్లలో ఆందోళన పెరుగుతోంది. సరిపడా నోట్లు అందుబాటులోకి తీసుకురాకుండా విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తేస్తే ప్రజల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికీ రూ.24 వేలు ఇవ్వలేకున్న బ్యాంకులు....

వారానికి రూ.24 వేలు వరకు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. నగదు కొరత కారణంగా ఇప్పటికీ చాలా బ్యాంకులు ఇవ్వలేకున్నాయి. తమ వద్ద ఉన్న నగదును వచ్చిన కస్టమర్లందరికీ అవసరాలకు అనుగుణంగా పంచుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆంక్షలు ఎత్తివేస్తే ప్రజలు మళ్లీ బ్యాంకులపై విరుచుకుపడే ప్రమాదం ఉందని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. నగదు లభ్యత పెరిగే కొద్దీ.. ఆంక్షలను క్రమంగా సరళించాలని సూచిస్తున్నారు. ఇటీవల ఎస్బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య కూడా ఒక్కసారిగా ఆంక్షలు ఎత్తివేయలేమని.. ముందుగా బ్యాంకులకు సరిపడా నగదు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

సరిపడా కొత్త కరెన్సీ ముద్రణ ఉండదని స్పష్టంచేసిన జైట్లీ...

బ్యాంకులలో డిపాజిట్ అయినా మొత్తం నోట్ల స్థానంలో కొత్త కరెన్సీ ముద్రణ ఉండదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. డిసెంబరు 30 తర్వాత నగదు విత్‌ డ్రా పరిమితులపై మరోసారి సమీక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లవాసా తెలిపారు. దీంతో కొత్త సంవత్సరంలోనూ విత్‌డ్రాలపై ఆంక్షలు కొనసాగుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి.. కొత్త కరెన్సీ ముద్రణలో జాప్యం చేసి... ఉన్న నోట్లతోనే సరిపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం వ్యూహంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

వైసీపీ కార్యాలయంలో వంగ వర్ధంతి..

విజయవాడ : వైసీపీ పార్టీ కార్యాలయంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేత బోత్స సత్యనారాయణ నివాళులర్పించారు. 2016లో టిడిపి పాలనలో అవినీతి మిన్న..అభివృద్ధి సున్నా అని బోత్స విమర్శించారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, రాష్ట్ర వృద్ధి రేటు కన్నా మంత్రుల వృద్ధి రేటు పెరిగిందన్నారు. వృద్ధి రేటు ప్రకటనలు బోగస్ అని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దోపిడి కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతున్నారని, వ్యవసాయంపై బాబు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు.

16:09 - December 26, 2016

న్యూ ఇయర్..ఇక కొద్ది రోజులే ఉంది. దీనితో సినీ హీరోలు కూడా తమ అభిమానులను సంతృప్తిపరచడానికి సిద్ధమౌతున్నారంట. తమ తమ చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్..టీజర్ లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇందులో పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కూడా ఉన్నట్లు టాక్. అభిమానులను అలరించడానికి భారీ ప్లాన్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 'డాలీ దర్శకత్వం లో 'పవన్' హీరోగా..'శృతి హాసన్' హీరోయిన్ గా 'కాటమరాయుడు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని లుక్స్ విడుదల చేసి చిత్రంపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన న్యూ పోస్టర్...టీజర్ ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'కాటమరాయుడు' షూటింగ్ పొల్లాచ్చి లో షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమా ను రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

బాబు చేతిలో రూ. 1981.54 కోట్ల చెక్కు..

ఢిల్లీ : దేశంలోని సాగునీటి ప్రాజెక్టులకు భారీగా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. నాబార్డు ద్వారా ఏపీ, గుజరాత్, మహారాష్ట్రలోని నీటి ప్రాజెక్టులకు రుణ సహాయాన్ని కేంద్రం అందించింది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 1981.54 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి ఉమా భారతి అందచేశారు.

పెద్ద ప్రాజెక్టుగా పోలవరం - చంద్రబాబు..

ఢిల్లీ : దేశంలోని పెద్ద ప్రాజెక్టుకుగా పోలవరం నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నా బార్డు నిధులు ఇవ్వడం సంతోషమని, 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, పోలవరం ప్రాజెక్టు ద్వారా 540 గ్రామాలకు తాగునీరు వస్తుందన్నారు.

 

పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు - వెంకయ్య..

ఢిల్లీ : పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల కల అని, రాష్ట్ర విభజన సమయంలో జైట్లీ అండగా నిలిచారని తెలిపారు. కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నల్లధనం, పోలవరంపై చర్చించినట్లు తెలిపారు. 1982లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు.

సోనియా, రాహుల్ కు ఊరట..

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.

పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఆదర్శం - కేటీఆర్..

హైదరాబాద్ : పారిశ్రామిక రంగంలో శరవేగంగా ముందుకెళుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఆదర్శంగా ఉందని తెలిపారు.

100 కోట్ల నిధుల హామీ ఏమైంది - ఉత్తమ్..

హైదరాబాద్ : 100 కోట్లు నిధులు సమీకరిస్తామన్న హామీ ఏమైందని టి.కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ ప్రశ్నించారు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి రైల్ కోచ్ లో ఒక్క రూపాయి పని కూడా ప్రారంభించలేదని తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించలేదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మార్కెటింగ్ చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమలలో ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారని, అనుమతులు ఇచ్చిన ఎన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించారని ప్రశ్నించారు. మూత పడిన పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు లేవన్నారు.

చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి - రాజయ్య..

హైదరాబాద్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్ పూర్ పేపర్ మిల్లుల వంటి 23 వేల చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య తెలిపారు. చేనేత పరిశ్రమ కుదేలైందని, ఎస్సీ, ఎస్టీల ఇండస్ట్రీల కోసం ఒక్క పైసా విడుదల చేయలేదన్నారు.

పెట్టుబడులు..ఉద్యోగాల కల్పనపై పరిశీలన లేదు - రేవంత్..

హైదరాబాద్ : పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై సరైన పరిశీలన లేదని టి.టిడిపి సభ్యుడు రేవంత్ పేర్కొన్నారు. టి. అసెంబ్లీలో టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ పై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. పెట్టుబడులకు అధికారులు గుడ్డిగా అనుమతులిస్తున్నారని, పరిశ్రమల్లో యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. ఎంతమంది ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలను తయారు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

15:36 - December 26, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు మొదటిదశ కింద 1980 కోట్ల రూపాయల రుణాన్ని కేంద్రం అందచేసింది. ఇందులో భాగంగా ఇందుకు సంబంధించిన చెక్కును కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి సీఎం చంద్రబాబుకు అందజేశారు. నాబార్డు ద్వారా ఏపీ, గుజరాత్‌, మహారాష్ట్రలోని నీటి ప్రాజెక్టులకు కేంద్రం రుణ సహాయాన్ని అందించింది. ఇండియా హెబిటిట్‌ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి, విజయ్‌గోయల్‌, సీఎం చంద్రబాబు, ఎంపీలు సుజనాచౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ..ఏపీ పునర్వవిభజన చట్టం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్రం తప్పకుండా నెరవేర్చుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రమే పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తిచేసి ఏపీ ప్రజల కలలను నేరవేరుస్తామని చంద్రబాబు అన్నారు.

15:32 - December 26, 2016
14:53 - December 26, 2016
14:43 - December 26, 2016

హైదరాబాద్: టీఎస్ ఐపాస్ ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. టీఎస్ ఐపాస్ ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడకు మైక్ ఇవ్వడం పై కాంగ్రెస్ నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ నేను ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ కూర్చోలేదని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి ప్రతిపక్షానికి ఇష్టంలేనట్టుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా మేం ప్రజలు కూర్చోబెడితే కూర్చున్న వాళ్లం వాళ్లకు బాధ్యులమని తెలిపారు. ప్రతిపక్ష నేతలు కూడా ఆ విషయాన్ని మరవరాదన్నారు. వాళ్లను కూడా అక్కడ కూర్చుండబెట్టింది ప్రజలేనని గుర్తించాలన్నారు. సభలో సభ్యులందరికి ఒకేరకమైన హక్కులుంటాయని గుర్తించాలన్నారు. స్పీకర్ హక్కులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ అధికారాలను ప్రశ్నించడం సబబు కాదని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇలా అయితే సభలో ఉండం - జానా..

హైదరాబాద్ : పువ్వాడ అజయ్ కు స్పీకర్ మైక్ ఇవ్వడంపై టి.కాంగ్రెస్ సభ్యుడు జానా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులకు కేటాయించిన సమయంలో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని, అధికార అహంకారాన్ని ప్రదర్శించవద్దన్నారు. అధికార పార్టీ సభ్యుల తీరును ఖండిస్తున్నట్లు, ఇలా వ్యవహరిస్తే సభలో మేం ఉండమని జానా ఆవేదన వ్యక్తం చేశారు.

14:32 - December 26, 2016

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. టీఎస్ ఐపాస్ ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఈ చర్చలో కాంగ్రెస్ సభ్యులకు కేటాయించిన సమయంలో ఎమ్మెల్యే పువ్వాడకు మైక్ ఇవ్వడం పై కాంగ్రెస్ నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులకు కేటాయించిన సమయంలో వేరే వాల్లకు అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. అధికార అహంకారాన్ని ప్రదర్శించవద్దని, అధికార పార్టీ సభ్యుల తీరును ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలా వ్యవహరిస్తే సభలో మేం ఉండలేం అని ఆవేశంగా మాట్లాడారు.

అనకాపల్లి బెల్లం మార్కెట్ లో సోదాలు..

విశాఖపట్టణం : అనకాపల్లి బెల్లం మార్కెట్ లో ఫుడ్ ఇన్స్ పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. బెల్లంలో హైడ్రాక్స్ డ్ కలుపుతున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించి బెల్లం శాంపిల్స్ ను సేకరించారు.

త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ - కడియం..

హైదరాబాద్ : తెలంగాణలో త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు డిప్యూటి కడియం శ్రీహరి వెల్లడించారు. త్వరలోనే టీఎస్ పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

నారాయణపురంలో విషాదం..

తమిళనాడు : విరుధ్ నగర్ జిల్లా నారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు మృతి చెందారు.

నోట్ల రద్దుతో ఎక్సైజ్ శాఖకు నష్టం - మంత్రి కొల్లు రవీంద్ర..

విజయవాడ : నోట్ల రద్దుతో ఎక్సైజ్ శాఖ నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. నవంబర్ నెలలో 13 శాతం నష్టం వచ్చిందని, మొత్తంగా ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం హైవేలకు 500 మీటర్ల దూరంలో ఉన్న మద్యం షాపులను ఏప్రిల్ లోపు తొలగిస్తామన్నారు.

మామిదాలపాడులో కేఈ పర్యటన..

కర్నూలు : మామిదాలపాడులో డిప్యూటీ సీఎం కేఈ పర్యటించారు. ఏపీ పొల్యూషన్ బోర్డు కార్యాలయ నిర్మాణానికి కేఈ భూమి పూజ చేశారు. జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, ఆర్థిక లోటున్నా ముందుకు పోతున్నారని తెలిపారు. పదవిలో ఉండగానే జిల్లా అభివృద్ధిని చూడాలన్నదే తన లక్ష్యమన్నారు. డోన్, పత్తికొండ, అలూరును సస్యశ్యామలం చేస్తామని తెలిపారు.

టి. అసెంబ్లీలో టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ పై చర్చ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. టీఎస్ ఐ పాస్ కాలపరిమితితో కంపెనీలకు అనుమతినివ్వడం జరుగుతోందని, ఇలాంటి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా కంపెనీలకు అనుమతినివ్వడం జరుగుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. 14 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులిస్తున్నట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నామన్నారు. ఇన్వెస్టిమెంట్ ఫ్లెండ్లీ రాష్ట్రంగా మార్చామని పేర్కొన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె సరికాదన్న మంత్రి గంటా..

విజయవాడ : కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మెకు వెళ్లడం సరికాదని మంత్రి గంటా పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె విరమించాలని సూచించారు. సీ 16 కరిక్యులమ్ పై చర్చించడం జరిగిందని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు ఉంటాయన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీ బస్ స్టేషన్ లో వసతులు కల్పించడం లేదడు - శ్రీనివాస్ గౌడ్..

హైదరాబాద్ : ఏపీ బస్ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ లు కేటాయించడం లేదని, కనీస వసతులు కూడా కల్పించడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

14:21 - December 26, 2016

కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలైనా దళితులకు ఇచ్చిన ఏ హామీలు నెరవేరలేదనీ పాదయాత్ర సభ్యులు జాన్ వెస్లీ విమర్శించారు. లెదర్ పార్క్ ఏర్పాటు చేసి దళితులకు ఉపాధి కల్పిస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. చొప్పదొండిలో దళితులకు..అగ్రవర్ణాలకు వేరు వేరుగా వాటర్ ట్యాంకర్లు నిర్మించారనీ దళితులను వచ్చే వాటర్ కలుషితమైపోగా..అగ్రవర్ణాలకు సరఫరా చేసే వాటర్ బాగుంటోందని ఇది దళితుల పట్ల వివక్షేనని పాదయాత్ర సందర్భంగా జాన్ వెస్టీ పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలోని అరుణకొండ, మల్లాపూర్, పత్తిపాక, ల్యాగలమర్రి, దివికొండ, నంచెర్లలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.

14:19 - December 26, 2016

గుజరాత్ : నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల వద్ద గంటల కొద్ది క్యూలలో నిలుచుంటున్నారు. ఒక పెద్ద నోటు చేతికి దొరికితే చిల్లర కోసం నానా తిప్పలు పడుతున్నారు. కానీ...గుజరాత్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. గుజరాత్‌లోని నవ్సారిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో నోట్ల వర్షం కురిసింది. సుమారు 40 లక్షల రూపాయల విలువచేసే.. 10, 20 రూపాయల నోట్లను సంగీతకారులపై విసిరారు. సంగీత కార్యక్రమంలో గాయకుల వద్దకు చేరుకున్న మహిళలు, పురుషులు పోటీపడి డబ్బులు విసురుతున్న దృశ్యాలు చూస్తే.. ఇంత మొత్తంలో చిల్లర డబ్బు వీరి చేతికి ఎలా చేరింది అనే సందేహం కలుగక మానదు!

14:17 - December 26, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వడం శుభపరిణామమని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా.. 2018 కల్లా ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేకూర్చేలా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.

14:15 - December 26, 2016

హైదరాబాద్ : పోలవరం ఆపాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో కేసు వేసినట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శాసన మండలిలో కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌ సమాధానం చెప్పారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల భద్రాచలం పట్టణంతోపాటు ఆలయానికి కూడా ముంపు ప్రమాదం ఉందని.. దీనిపై విచారణ జరిపించాలని ఎన్‌జీటీలో ఫిర్యాదు చేశామన్నారు. పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై ఒక స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని కోరామన్నారు. అధ్యయనం పూర్తయ్యేవరకు ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆపేలా ఆదేశించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను కోరినట్టు చెప్పారు. 

13:40 - December 26, 2016

హైదరాబాద్ : బాలీవుడ్‌ బాద్‌షా... షారూక్‌ఖాన్‌కు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ.. డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈరోజు జరిగిన కాన్వోకేషన్‌లో షారూక్‌కు యూనివర్సిటీ వీసీ డాక్టరేట్‌ పట్టాను అందజేశారు. నేను అర్హుడునో..కాదో నాకు తెలియదు కాని... డాక్టరేట్‌ను పొందినందుకు చాలా ఆనందంగా ఉందని షారూఖ్‌ఖాన్‌ అన్నారు. తన తల్లి పుట్టిన హైదరాబాద్‌లో డాక్టరేట్‌ను పొందండం సంతోషంగా ఉందని..అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

13:38 - December 26, 2016

హైదరాబాద్ : కోడిపందాలరాయుళ్లకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కోడిపందాలపై నిషేధం విధించింది. పందాలపేరుతో మూగజీవాలను హింసించడం సరికాదని.. పందాల్లో భారీగా మద్యప్రవాహం, జూదం పెరుగుతోందని వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కోడిపందాల నిర్వాహకులపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 42 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు . కోడిపందాలను నిషేధించాలని పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్‌, యానిమల్ వెల్ఫేర్ హైకోర్టులో పిటిషన్ వేశాయి. కోడి పందాలకు కోనసీమ పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. కోడి పందాలపై కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. దీనికి ప్రజాప్రతినిథులు కూడా పాల్గొంటారు. ఈ క్రమంలో కోడి పందాలను నిషేధించాలని ..దానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వెంటనే అప్రమత్తమైన ఏపీ సర్కార్ కోడి పందాలపై దాడులు చేపట్టింది.

13:35 - December 26, 2016

ఒడిస్సా: ఐదు వేల కిలో మీటర్ల వరకు అణు ఇంధన పేలుడు పదార్థాలను మొసుకెళ్లే సామర్థ్యం గల అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఒడిస్సాలోని బాలాసోర్‌ వీలర్‌ ఐలాండ్‌ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణిని డీఆర్‌డీవో పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఖండాంతర క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్ల గలదు. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది ఐదోసారి. తాజా పరీక్షల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వివిధ ప్రాంతాల్లోని రాడార్లలో నమోదైన డేటాను సమీక్షించిన తర్వాత పూర్తి అంచనాకు వచ్చే వీలుంది. మూడంచెల్లో ఉండే ఈ అగ్ని-5 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు ఉంటుంది. ఇప్పటికే భారత్‌ అమ్ముల పొదిలో అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 క్షిపణులున్నాయి.  

13:06 - December 26, 2016

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తిచేసి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు కృషిచేస్తామని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు మొదటి దశ కింద నాబార్డు 1980 కోట్ల రూపాయల రుణాన్ని ఇవాళ అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై నిందలు వేసేందుకే ప్రతిపక్ష నేత జగన్ ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్రాంతికి ముందే పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని ఉమ వెల్లడించారు.

13:04 - December 26, 2016

నిమ్మ కాయ...వంటింట్లో వంటకాలకు వాడుతుంటారు. అంతేకాదు ఇది సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అన్ని రుతువులలో నిమ్మకాయ దొరుకుతుందనే విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా ఖనిజ లవణాలు ఉంటాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు తీసుకోపోనివ్వడంలో సహాయం చేస్తుంది. నిమ్మకాయ షర్బత్ కడుపులోని ఇబ్బందులను తొలగిస్తుంది. ఉదయమే పరగడుపున రెండు గ్లాసుల నిమ్మకాయ రసం తాగితే ఎంతో కాలంగా పీడిస్తున్న అజీర్ణం పోతుంది.

  • ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి దాంతో పుక్కిలిస్తుంటే కొన్నిరోజులకు దుర్వాసన పోతుంది.
  • పలువరుసలు చక్కగా వుండి దంతాలు మెరవాలంటే ఒక అర టీ స్పూన్ వేప పొడిలో కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ చక్కెర పొడి, పావు టీ స్పూన్ కర్పూరం పొడి, నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. వారానికి రెండుసార్లు దీనితో పళ్లు తోముకుంటే చిగుళ్లకు బలం వస్తుంది. అంతే గాకుండా దంతాలపై గార పోతుంది.
  • లవంగాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి పళ్లకూ, చిగుళ్లకూ రాస్తే పళ్లనొప్పి తగ్గుతుంది.
  • అజీర్ణం సమయంలో నిమ్మ, అల్లపు రసాలను సమానంగా కలిపి ఒకో చెంచా చొప్పున ఉదయం, సాయంకాలం తీసుకుంటే సరిపోతుంది.
  • ఒక గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మ చెక్క పిండి, చిటికెడు ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి పోతుంది.
  • గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి కొన్నాళ్లుపాటు పెదవులకు పూసుకుంటే పగిలిన పెదవులు మెత్తబడి కోమలంగా తయారవుతాయి.
  • అర టీ స్పూన్ నిమ్మరసంలో 5 చుక్కల తేనె, 1 టీ స్పూన్ బార్లీపొడి కలిపి ముఖానికి రాసుకుని ఐదు నిముషాల తరువాత కడిగేయాలి. నిమ్మరసం ముఖ చర్మంలో అదనపు జిడ్డును తొలగిస్తుంది.
  • దోమలు కుట్టిన చోట నిమ్మరసం రాసుకుంటే మంట తగ్గుతుంది.
  • రెండు టీ స్పూన్‌ల దోసగింజల పొడికి, అర టీ స్పూన్ నిమ్మరసం, తగినన్ని పాలు పోసి దీన్ని కళ్లకింద రాసుకుని ఆరిపోయిన తరువాత కడిగేయాలి. కళ్లకింద నల్లదనం పోగొట్టటంతోపాటు, చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
  • నిమ్మ ఆకులతో నేచురల్ ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. 4 నిమ్మ ఆకులు, 1 టీ స్పూన్ చొప్పున పెసరపప్పు, పెరుగు, అర టీ స్పూన్ కస్తూరి పసుపు వీటిని రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని పది నిముషాల తరువాత కడిగేయాలి.
13:01 - December 26, 2016

విజయవాడ : వంగవీటి రంగా 28వ వర్ధంతి సందర్భంగా విజయవాడ బందర్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధాకృష్ణ...సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై నిప్పులు చెరిగారు. డబ్బు కోసం వంగవీటి రంగా జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ఇచ్చేవారన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. రంగాను హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బెజవాడ రాజకీయాల గురించి అన్ని తెలుసంటూ కోతలు కోసే వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటారని రాధాకృష్ణ హెచ్చరించారు.

12:56 - December 26, 2016
12:41 - December 26, 2016

కోల్ కతా : విధ్వంకర బ్యాటింగ్ ఎప్పుడైనా చూశారా ? టీ20, ఇతర వన్డేల్లో చూస్తూనే ఉంటాం అని అంటారు కదా..కానీ ఇతను చేసిన బ్యాటింగ్ చూసి ఉండరు. ఎందుకంటే ఆకాశామే హద్దు అన్నట్లు బంతిని బాదాడు. ఏకంగా 44 ఫోర్లు..23 సిక్సర్లు సాధించాడంటే అతను బ్యాటింగ్ ఎలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ మూడు రోజుల టోర్నమెంట్ జరుగుతోంది. బారిషా క్లబ్ తో దక్షిణ్ కాలికటా సంసాద్ తలపడింది. బారిషా క్లబ్ తరపున పంకజ్ షా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇతను సెంచరీతో సత్తా చాటాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆదివారం 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పంకజ్ చెలరేగిపోయాడు. 44 ఫోర్లు..23 సిక్సర్లతో 413 పరుగులు పూర్తి చేసి నాటౌట్ గా మిగిలాడు. 192/2 ఓవర్ నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ ఆరంభించిన బారిషా క్లబ్ జట్టు 708/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. గత సీజన్ లో రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా రంజీల్లో పంకజ్ అరంగ్రేటం చేశాడు. బెంగాల్ తరపున ఇప్పటి వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు.

12:39 - December 26, 2016

కడప : పులివెందులలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేపట్టారు. పులివెందులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్ తహశీల్దార్ కార్యాలయం ముందు జగన్ ఈ ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతు..తలా తోకా లేని..అవగాహన లేని పాలన వల్లనే నీటి కొరత ఏర్పడుతోందని జగన్ ఎద్దేవా చేశారు. చిత్రావతి, శ్రీశైలంలో నీరున్నా పులివెందులకు నీరు ఎందుకివ్వటంలేదని ప్రశ్నించారు. పులివెందులకు సరిపడేంత నీరు తుంగభద్రలోలేవనీ..దీంతో ఈ ప్రాంతంలో సాగునీటి కొరత తీవ్రంగా వుందన్నారు. గండి కోట ప్రాజెక్టు కట్టనందువల్లనే ఈ దుస్థితి దాపురించిందన్నారు. పట్టిసీమ నీరు రాయలసీమకు ఇస్తానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ..ఎటువంటి స్టోరేజ్ లేకుండా ఈ ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. 16 వందల కోట్ల రూపాయలను మిగతా ప్రాజెక్టులపై పెట్టి వుంటే ఈ దుస్థితి దాపురించేది కాదన్నారు. డబ్బు పిచ్చి పట్టిన చంద్రబాబుకు రైతుల సమస్యల ఏమాత్రం పట్టటం లేదని తీవ్ర విమర్శలు చేశారు. 

పులివెందులకు సాగునీరందించాలి - జగన్..

అనంతపురం : చిత్రావతి, శ్రీశైలంలో నీరు ఉన్నా ఎందుకు వదలడం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోని పులివెందుల తహశీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ ధర్నా నిర్వహించింది. పులివెందులకు సాగునీరు అందచేయాలని జగన్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సభలో జగన్ మాట్లాడారు. గండికోట కట్టని కారణంగానే సమస్యలు ఏర్పడుతున్నాయని, తుంగభద్ర నీళ్లు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. పట్టిసీమ నుండి రాయలసీమకు నీళ్లు ఎక్కడి నుండి తీసుకొచ్చావ్ ? పట్టిసీమ నుండి కెనాల్ వేశారా ? అని సూటిగా ప్రశ్నించారు.

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

విజయవాడ : వెలగపూడి పట్టణాభివృద్ధి సంస్కరణలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి మంత్రులు యనమల, నారాయణ, మృణాళిని, శిద్ధా రాఘవరావు హాజరయ్యారు.

మగ్దుం భవన్ లో సీపీఐ 91వ ఆవిర్భావ వేడుకలు..

హైదరాబాద్ : మగ్దుం భవన్ లో సీపీఐ 91వ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ జెండాను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజా సమస్యలప ఉధృతంగా పోరాడుతామని, కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నో అటుపోట్లను ఎదుర్కొందన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విమర్శించారు.

కోదండరాంపై మండిపడిన బాల్క సుమన్..

హైదరాబాద్ : టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. కోదండరాం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేయడం తగదని, రైతులపై కోదండరాం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని, కోదండరాం తన తీరును మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

 

ముగిసిన ప్రశ్నోత్తరాలు..కొనసాగుతున్న జీర్ అవర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం ప్రశ్నోత్తరాలు ముగిశాయి. అనంతరం స్పీకర్ జీరో అవర్ కొనసాగిస్తున్నారు.

ఐదు గ్రామాల ప్రజల సమస్యలు తీర్చాలి - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : భద్రాచలం పట్టణం ఆనుకుని ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని శాసనసభలో కోరారు.

12:02 - December 26, 2016

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రూపాయి కూడా ఖర్చుపెట్టడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పాఠశాలలో పనిచేసే సిబ్బందికి కనీసం జీతాలు కూడా ఇవ్వలేనప్పుడు.. డిజిటల్ తరగతులు ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిజిటల్ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఎంత బడ్జెట్‌ కేటాయించిందో చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. 

11:59 - December 26, 2016

హైదరాబాద్‌: రోడ్లు నరకకూపాలుగా మారాయని.. సోషల్ మీడియాలో నగర రోడ్లపై జోకులు వేసే దుస్థితికి నగరంలో రోడ్ల పరిస్థితి వుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ బాగా వెనకబడిపోతుందని హైదరాబాద్ సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఆర్డీసీకి, జీహెచ్‌ఎంసీకి సమన్వయం లేకపోవడంతో నగరంలో బస్‌బేలు పూర్తి కాలేదని.. దీంతో బస్సులు ఎక్కడా ఆగట్లేదని విమర్శించారు. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ పనిచేయట్లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని మరో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సూచించారు. జీహెచ్‌ఎంసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. 

11:39 - December 26, 2016
11:36 - December 26, 2016

హైదరాబాద్ : కోడి పందాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించింది. కోడి పందాలను నిషేధించాలని పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్.. యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్డులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచరాణ చేపట్టిన కోర్టు పేరుతో మూగ జీవాలను హింసిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. కోడి పందాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిషేధం విధించింది. పందాల పేరుతో మూగజీవాలను హింసించటం తగదని కోర్టు పేర్కొంది. పందాల్లో భాగంగా భారీగా మద్యం ప్రవహిస్తోందనీ జూదం పెరుగుతోందని అభిప్రాయపడింది. న్యాయస్థానం కోడి పందాలపై నిషేధం విధించాలని..దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల న్యాయస్థానం  ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పుంజులతో పందాలు వేస్తారనే విషయం తెలిసిందే. ఈ సంప్రదాయం ఏపీలో భారీగా కొనసాగుతోంది. 

11:25 - December 26, 2016

బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' నగరానికి రానున్నారు. ఏ సినిమా షూటింగ్ నిమిత్తం రానున్నారు ? ఏదైనా వేడుకల్లో పాల్గొననున్నారా ? అని అనుకోకండి. డాక్టరేట్ అందుకోవడానికి 'షారూఖ్' ఇక్కడకు వస్తున్నారు. బాలీవుడ్ లో తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను 'ఖాన్' సంపాదించుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన పలు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే 'షారూఖ్' కు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ డాక్టరేట్ ను అందుకోవడానికి యూనివర్సిటీకి రానున్నారు. యూనిర్శిటీ ఆరవ స్నాతకోత్సవం సందర్భంగా ఈ డాక్టరేట్ ఇవ్వనుంది. షారుఖ్ తో పాటు 'రేఖ పౌండేషన్' వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్ కు కూడా డాక్టరేట్ ఇవ్వనుంది. ఉర్దూ భాష, సంసృతిని ప్రోత్సహిస్తున్నందుకు వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరు డాక్టరేట్లు అందుకోనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ హైదరాబాదులో ఉన్న సంగతి తెలిసిందే.

11:22 - December 26, 2016

ఢిల్లీ : డిసెంబర్ 30న 13 జిల్లాలకు చెందిన వేలాదిమంది రైతుల మధ్య పోలవరం కాంక్రీటు పనులు పండుగ వాతావరణంలో చేపడుతున్నామని దేవినేని తెలిపారు. కాంక్రీటు పనులుప్రారంభించేందుకు కేంద్ర మంత్రి ఉమాభారతిగారిని ఆహ్వానిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని దేవినేని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సేకరించిన నిర్వాశితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని, రాష్ట్రపతిని ఒప్పించి తెలంగాణలోని పోలవరం ప్రాంతాలైన ఏడు ముంపు మండలను ఏపీలో కలిసేలా ఒప్పించామని ఇది పోలవరం ప్రాజెక్టుకు ముందడుగన్నారు. కాగా ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ. 1981 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ చెక్ ను ఉమాభారతి చేతుల మీదుగా చంద్రబాబు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని పాల్గొననున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా కానున్నాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో నాబార్డు ద్వారా మంజూరైన ఈ రుణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తున్న విషయం తెలిసిందే. 

వర్మపై వంగవీటి ఆగ్రహం..

విజయవాడ : దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కోసమే వంగవీటి జీవిత చరిత్రను కించపరిచేలా చిత్రీకరించారని, డబ్బులు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ఇచ్చేవారని వంగవీటి రాధ పేర్కొన్నారు. రంగాను హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నారని తెలిపారు. వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

30న పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభం - దేవినేని..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నామని, ఈనెల 30వ తేదీన కాంక్రీట్ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి  కేంద్ర మంత్రి ఉమాభారతిని ఆహ్వానించనున్నట్లు, లక్ష మంది రైతులు, ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారని, పండుగ వాతావరణంలో కాంక్రీట్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఓ కీలక ఘట్టానికి చేరుకోబోతున్నట్లు తెలిపారు. పోలవరం పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.

ఎస్పీ త్యాగికి బెయిల్ మంజూరు..

ఢిల్లీ : ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఎస్పీ త్యాగికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

సంక్రాంతికి కోళ్ల పందేలు లేవ్..

హైదరాబాద్ : పందేల పేరిట మూగజీవులను హింసించడం సరికాదని, కోళ్ల పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పందేల పేరిట కోళ్లను హింసిస్తున్నారని కోర్టును పిటిషనర్ ఆశ్రయించారు.

11:02 - December 26, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలలో బాగంగా శాసనమండలి కొనసాగుతోంది. సాగునీటి ప్రాజెక్టులలో శాసనమండలిలో చర్చ కొనసాగుతోంది. తెలంగాణ నీటి హక్కుల కోసం ట్రిబ్యునల్ తో పోరాడతామన్నారు. ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నీటి కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి కరవు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే దుగ్థతో విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఈ సందర్భంగా హరీష్ రావు ఆరోపించారు. 5 వేల కోట్ల టెండర్లు పిలిచి కేవలం రూ. 35 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన గత ప్రభుత్వాలను విమర్శించారు. 

ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే అడ్డంకులు - హరీష్..

హైదరాబాద్ : ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని విపక్షాలనుద్దేశించి మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఉద్ధేశ్యపూర్వకంగా అడ్డు పడుతున్నారని పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో రూ. 1.65 వేల కోట్ల టెండర్లు పిలిచారని, ఇందులో కేవలం 39వేల కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. ప్రాణహిత 2008లో శంకుస్థాపన చేశారని, నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు.

10:53 - December 26, 2016

ఈ మధ్య ఎంగేజ్ మెంట్ చేసుకున్న 'అఖిల్' సెకెండ్ ఫిల్మ్ పై ఫోకస్ చేశాడు. ఈ మూవీకి సంబంధించి ముహుర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ మూవీని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'నాగార్జున' రెండో వారసుడు 'అఖిల్' ఫస్ట్ మూవీ 'అఖిల్' రిలీజై ఎడాది గడిచిపోయింది. ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ గత ఎడాది భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 'అఖిల్' మొదటి మూవీ ఇంతటి ప్లాప్ గా నిలువడానికి బడ్జెట్ తో పాటు స్టోరీనే మొయిన్ రీజన్ అనేది అందరికి తెలిసిందే. దీంతో పాటు అసలు 'అఖిల్' ఫెర్మామెన్స్ పై కూడా బోలెడు విమర్శకులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కొడుకు రెండో సినిమా విషయంలో 'నాగార్జున' చాలా కేర్ తీసుకున్నాడు. అందుకే తన ఫ్యామిలీకి మరిచిపోలేని మూవీ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో 'అఖిల్' రెండో మూవీ సెట్ చేశాడు.

లవ్ స్టోరీ..
'అఖిల్' రెండో సినిమా జనవరి 4న ఒపెనింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ కాంబినేషన్ ని 'నాగ్' ఎప్పుడో నాలుగు నెలల కిందటే కన్ ఫర్మ్ చేశాడు. కానీ మూవీ స్టార్ట్ చేద్దామనుకునేలోపే దర్శకుడు విక్రమ్ కుమార్ పెళ్ళి చేసుకుని బిజీ అయ్యాడు. ఇక ఆ తరువాత 'అక్కినేని' యంగ్ బాయ్ లవ్ వ్యవహారంతో మరికొంతకాలం డీలే అయింది. ఇటీవలే 'అఖిల్' నిశ్చితార్థం కూడా కంప్లీట్ కావడంతో ఇక రెండో సినిమాపై ఫోకస్ చేయాలని 'నాగార్జున' ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీని దర్శకుడు విక్రమ్ కుమార్ చాలా డిఫరెంట్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.ఈ మూవీలో 'అఖిల్' కి జోడిగా మేఘా ఆకాశ్ ని ఎంపిక చేసినట్లు వినికిడి. చాలా కాలం తరువాత ఎ.ఆర్.రెహమాన్ తెలుగులో ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. 'నాగార్జున' అన్నీ తానై ఈ ప్రాజెక్టుని సూపర్ హిట్టుగా తీర్చిదిద్దాడానికి శ్రమిస్తున్నాడు. పెద్దకొడుకు 'నాగచైతన్య' కెరీర్ ఇప్పటికి సెట్ కాలేదు. దీంతో 'అఖిల్' కెరీర్ రెండో సినిమాతోనే గాడిలో పెట్టడానికి 'నాగార్జున' తనదైన ఆలోచనలు చేస్తున్నాడట. మరి సెకెండ్ మూవీతో అయిన 'అఖిల్' తనదైన యాక్టింగ్ తో సత్తా చాటుతాడో చూడాలి.

10:49 - December 26, 2016

'వెంకటేష్' న్యూ మూవీకి బ్రేక్ పడింది. ఇందుకు ప్రస్తుతం సిట్యూవేషనే రీజన్ గా కనిపిస్తోంది. 'గురు' తో రాబోతున్న 'వెంకీ' ఆ తరువాత మూవీని కూడా త్రీమంథ్స్ లో పట్టాలెక్కించాడు. కానీ ప్రస్తుతం ఈ మూవీ ఆగిపోయినట్లు సమాచారం. కేవలం డబ్బుల కొరత వల్లే ఈ మూవీ డీలే అవుతున్నట్లు తెలుస్తోంది. 'బాబు బంగారం'గా బాక్సఫీసు వద్ద హడావిడి చేయాలనుకున్న 'వెంకటేష్' కి నిరాశ తప్పలేదు. దీంతో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తనకు అచ్చొచ్చిన రీమేక్స్ తో మరోసారి సక్సెస్ పట్టేయాలని డిసైడైయ్యాడు. అందుకే బాలీవుడ్ లో విజయం సాధించిన 'సాలా ఖద్డూస్' మూవీని 'గురు'గా రీమేక్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ స్టేజ్ కి చేరింది. పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు. అయితే ఈ మూవీ తరువాత 'వెంకీ' 'ఆడాళ్లు మీకు జోహర్లు' అనే మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు ఆగిపోయినట్లు సమాచారం.

ఆడాళ్లు మీకు జోహర్లు...
ఈ ఎడాది 'నేను శైలజ' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు కిశోర్ తిరుమల వెంకటేష్ హీరోగా 'ఆడాళ్లు మీకు జోహర్లు' అనే మూవీ చేస్తున్నాడు. రెండు నెలల కిందటే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ పస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. అయితే సడన్ గా ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వినిపిస్తోంది. ఇందుకు బడ్జెట్ ప్రాబ్లమ్ కారణం అని తెలుస్తోంది. కేవలం పెద్ద నోట్ల రద్దే ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందట. నిజానికి 'గురు' సినిమా కంప్లీట్ అయిన తరువాత 'ఆడాళ్లు మీకు జోహర్లు' మూవీ చేద్దామని 'వెంకీ' చెప్పాడట. అయితే ఈలోగా పెద్ద నోట్ల రద్దు కావడంతో ఇప్పుడు సినిమాకి బడ్జెట్ అడ్జెట్ చేయడం కష్టంగా ఉండడంతో సినిమా డీలే అవుతోందట. 'గురు' మూవీ రిలీజ్ తరువాత ఆడాళ్లు మీకు జోహర్లు సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నారట. ఆలోగా సినిమాకు కావాల్సిన మొత్తం బడ్జెట్ ని సమకూర్చుకుని రంగంలోకి దిగాలని యూనిట్ ప్లాన్ చేస్తోందట. గతంలో వెంకటేష్ ఆడవారి మాటలకు అర్దాలు వేరులే అంటూ సూపర్ హిట్టు అందుకున్నాడు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆడాళ్లు మీకు జోహర్లు అంటూ మళ్లీ సెంటిమెంట్ తో హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలా రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.

10:48 - December 26, 2016

హైదరాబాద్ : ప్రజలకు సుపరిపాలన అందించేందుకే 100 రోజుల ప్రణాళిక చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ్ హైదరాబాద్ పై బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతూ..హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా వున్నామనీ విపక్షాల సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా వున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా కొన్ని పనులను పూర్తి చేశామన్నారు. ఈ ప్రణాళిక ఎవరో చెబితే చేసింది కాదని తెలిపారు. మై జీహెచ్ ఎంసీ పేరుతో యాప్ ను తీసుకొచ్చామన్నారు. ఆన్ లైన్ బిల్డింగ్ అప్రూల్ పూర్తి చేశామని తెలిపారు. అలాగే రోడ్ల నిర్మాణంలో ఇబ్బందులు కొంతమేరకు వున్నమాట వాస్తమేన్నారు.రోడ్లపై నీరు నిల్వ వుండే 200ల ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. హైదరబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధంగా వున్నాయనీ..రాత్రికి రాత్రే విశ్వనగరాలు తయారవ్వవన్నారు. త్వరలోనే 370 పెట్రోలు బంకుల్లో పబ్లిక్ టాయ్ లెట్స్ నిర్మించేదుకు యత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చేందుకు సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ సంస్కరణలకు బిల్డింగ్ ట్రిబ్యునల్ బిల్లును తెస్తామన్నారు. జీహెచ్ ఎంసీలో నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం బీజేపీ సభ్యులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ. స్వచ్ఛ హైదరాబాద్ పనులు ఎంతకీ ముందుకు సాగటంలేదనీ..హైదరాబాద్ ను కాపాడుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికి అర్థముండదన్నారు. విశ్వ నగరంగా తీర్చి దిద్దుతామన్న ప్రభుత్వం దీని కోసం ఏం చర్యలు తీసుకుంటోదో తెలపాలని బీజేపీ సభ్యులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ప్రశ్నించారు. 

లక్ష్యాలు పూర్తి చేశాం..ఇంకా ఉన్నాయి - కేటీఆర్..

హైదరాబాద్ : వంద రోజుల ప్రణాళికలో చాలా పూర్తి చేశామని, ఇంకా పూర్తి చేయాల్సినవి ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో స్వచ్ఛ హైదరాబాద్ అనే అంశంపై విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మై జీహెచ్ఎంసీ యాప్..పోర్టల్..ఈ ఆఫీస్..ఆన్ లైన్ బిల్డింగ్ అప్రూవల్.. 14లక్షల 22 వేల ఇళ్లకు పెండింగ్ బిల్లుల పంపిణీ..200 కోట్ల రూపాయలతో 2000 స్వచ్ఛ ఆటోల పంపిణీ...నగర వ్యాప్తంగా 1100 చెత్త ప్రాంతాలను తొలగించి చెత్త వేయకుండా చేస్తున్నామన్నారు. 370 పెట్రోల్ బంక్ లో పబ్లిక్ టాయిలెట్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

10:26 - December 26, 2016

ఢిల్లీ : అవినీతిపై పోరాటంలో నోట్ల రద్దు నిర్ణయం ఆరంభం మాత్రమేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్‌-కీ-బాత్‌లో మాట్లాడిన ఆయన.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ గ్రాహక్‌ యోజన, డిజి - ధన్‌ వ్యాపార యోజన పథకాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటి ద్వారా చిన్న చిన్న వ్యాపారులు, వినియోగదారులు లబ్ది పొందుతారన్నారు. నోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రకటించినట్లు మోదీ చెప్పారు.

నగదు రహిత లావాదేవీలతో చిన్న వ్యాపారులకు లబ్ది: మోదీ
అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవినీతి, నల్లధనంపై తమ ప్రభుత్వం యుద్ధం ప్రారంభించిందని.. పెద్ద నోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించారన్నారు. మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని నగదు రహిత లావాదేవీలను ప్రొత్సహించడం ద్వారా చిన్న, చిన్న వ్యాపారులు, వినియోగదారులు లబ్ది పొందుతారన్నారు.

100రోజుల పాటు లక్కీ డ్రాల ద్వారా లక్షల రూపాయల బహుమతులు
దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోదీ అన్నారు. దీనిలో భాగంగానే లక్కీ గ్రాహక్‌ యోజన ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాపారుల కోసం డిజి- ధన యోజన్‌కు శ్రీకారం చుట్టామన్నారు. 100రోజుల పాటు ఈ లక్కీ డ్రాల ద్వారా లక్షల రూపాయలు గెలుచుకోవచ్చన్న ఆయన.. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న బంపర్‌ డ్రా తీస్తామన్నారు. అందులో కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చన్నారు.

30 కోట్ల రూపే కార్డులు ఉంటే జన్‌ధన్‌ ఖాతాలన్న వారి వద్దే 20 కోట్ల రూపే కార్డులు..
దేశంలో కొద్దిరోజుల నుంచి రెండు వందల నుంచి మూడు వందల శాతం నగదు రహిత లావాదేవీలు పెరిగాయన్న మోదీ.. దేశవ్యాప్తంగా 30 కోట్ల రూపే కార్డులు ఉండగా, జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నవారి వద్దే 20 కోట్ల రూపే కార్డులున్నాయన్నారు. డిజిటల్‌ మార్పు యువత సహా స్టార్టప్ సంస్థలకు సువర్ణావకాశం లాంటిందన్నారు. త్వరలో రూ.100, రూ.10నోట్లను కూడా రద్దు చేస్తారన్న పుకార్లు నమ్మవద్దని మోదీ కోరారు. అవినీతిపై యుద్ధం ఇప్పట్లో ఆగదన్న ఆయన.. నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

క్రీడాకారులను అభినందించిన ప్రధాని మోదీ
క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులను మన్‌ కీ బాత్‌లో మోదీ అభినందించారు. అంతకుముందు దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

అధికార కార్పొరేటర్ పనులు అడ్డుకుంటారా ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్...

హైదరాబాద్ : తన నియోజకవర్గంలోని నిర్మాణమవుతున్న మార్కెట్ యార్డును అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ అడ్డుకుని పనులను ఆపివేయించారని బీజేపీ సభ్యుడు ఎన్ విఎస్ఎస్ ప్రభాకర్ శాసనసభకు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. స్వచ్చ హైదరాబాద్ పై పలు ప్రశ్నలు అడిగారు. జీహెచ్ఎంసీలో 26 పనుల విషయంలో...హెచ్ఎండీఏ 9 అంశాలపై..మెట్రో వాటర్ వర్క్స్ మరియు సివరేజ్ బోర్డు అంశాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించారని తెలిపారు. 2000 మందికి స్కిల్ డెవలప్ మెంట్ కింద శిక్షణ ఇస్తామని ఆ వంద రోజుల ప్రణాళికలో పేర్కొన్నారని, అలాంటివి చేశారా ? లేదా ? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.

10:24 - December 26, 2016

కరీంనగర్‌ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ పల్లెల్లో సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 70 రోజులు పూర్తి చేసుకుంది. 70వ రోజు పాదయాత్ర బృందం పెద్దపల్లి జిల్లా నుంచి కరీంనగర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. సింగరేణి ప్రాంతంలో రైతుల భూముల్ని లాక్కొని బొందలగడ్డలుగా మారుస్తున్నారని ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

కేసీఆర్‌ చరిత్రలో అబద్దాల సీఎంగా మిగిలిపోతారు : తమ్మినేని
కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి చరిత్రలో అబద్దాల సీఎంగా మిగిలిపోతారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కరీంనగర్‌ జిల్లాను అద్దం తునకలా చేస్తానన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితిలో ఉందని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తీవ్రంగా విఫలమయ్యాయని తమ్మినేని ఆరోపించారు.

వారసత్వ ఉద్యోగాల ప్రకటన బోగస్‌ తమ్మినేని
పెద్దపల్లి జిల్లాలో రైతుల భూములు లాక్కొని బొందలగడ్డలుగా మారుస్తున్నారని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకిచ్చిన ఓ ఒక్క హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. వారసత్వ ఉద్యోగాల ప్రకటన కూడా బోగస్‌ అని తమ్మినేని దుయ్యబట్టారు.
కరీంనగర్‌ జిల్లాలోకి ప్రవేశించిన సీపీఎం మహాజన పాదయాత్ర
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ పల్లెల్లోని సమస్యలను ఎలుగెత్తి చాటుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 70 రోజులు పూర్తి చేసుకుంది. 70వ రోజు పాదయాత్ర బృందం పెద్దపల్లి జిల్లా నుంచి కరీంనగర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. కరీంనగర్‌ జిల్లా సీపీఎం, సీపీఐ నేతలు కార్యకర్తలు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర పెద్దూర్‌లో పర్యటించింది. అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లాలోకి ప్రవేశించి.. భూపాలపట్నం, చొప్పదండిలో పర్యటించింది. తర్వాత రుక్మాపూర్‌లో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్న లెదర్‌ పార్క్‌ను సందర్శించింది.  

10:23 - December 26, 2016

హైదరాబాద్ : కేంద్రం పాత పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి 47 రోజులయ్యాయి. అయినా సామాన్యులకు నగదు కష్టాలు తీరేదారి కనుచూపుమేరలో కనిపించటంలేదు. 50 రోజుల్లో నగదు కష్టాలు తీరిపోతాయని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. మరోవైపు రిజర్వు బ్యాంక్ మాత్రం డిసెంబర్ 30 తరువాత కూడా నగదు విత్ డ్రాపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. డిమాండ్ కు తగినట్లుగా నోట్లు అందుబాటులో లేని పరిస్థితుల్లో విత్ డ్రా పరిమితులు ఎత్తివేస్తే మరిన్ని ఇబ్బందులు తెలత్తుతాయని రిజర్వు బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు. బ్లాక్ మనీ దారులు మాత్రం కట్టకట్టల నగదును దాచుకునేందుకు పలు యత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడి నగదుకష్టాలు మరింత కాలంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద సామాన్యులు పడిగాపులు కాసే కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో రామాంతపూర్ లోని ఆంధ్రా బ్యాంక్ వద్ద సామాన్యుల కష్టాలు ఎలా వున్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలో .. 

10:22 - December 26, 2016

పాత పెద్దనోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేటికి 47 రోజులయ్యింది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిసెంబ‌రు 30 లోపు క‌రెన్సీ క‌ష్టాలు పూర్తిగా తొల‌గిపోతాయ‌ని..ఇందుకు తాను హామీ ఇస్తున్నానని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. మ‌రో నాలుగు రోజుల్లో 30వ తేదీ రానుంది. ఈ క్రమంలో నగదు కష్టాలు తొలగిపోయే వాతావరణం మాత్రం కనిపించటంలేదు..ఇంతవరకూ జమ అయిన నోట్ల డిమాండ్ మేరకు నోట్లను ముద్రించలేమని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ కూడా ఈనెల 30 త‌ర్వాత కూడా న‌గ‌దు విత్ డ్రాపై ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని రిజ‌ర్వు బ్యాంకు స్ప‌ష్టం చేసింది. స‌రిప‌డా నోట్లు అందుబాటులోకి లేకుండా న‌గ‌దు విత్‌డ్రాపై ఉన్న ప‌రిమితులు ఎత్తేస్తే ప్ర‌జ‌లు మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని రిజ‌ర్వు బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో డిసెంబర్ 30 అనంతరం ప్రజల నగదు కష్టాలు కొనసాగుతాయా? లేదా సామాన్యుల కష్టాలు తీరుతాయా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది ఈ చర్చలో జూపూడి ప్రభాకర్ (ఏపీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్),ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) గౌతం రెడ్డి (వైసీపీ నేత) పాల్గొన్నారు. 

10:21 - December 26, 2016

పెద్ద నోట్ల రద్దు విభిన్న వర్గాల మీద, వ్యాపారాల మీద, ఆదాయాల మీద తీవ్ర ప్రభావమే చూపుతోంది. గత 45 రోజుల్లో చిరువ్యాపారాలు చితికిపోయాయి. చేతివృత్తులవారూ దెబ్బతిన్నారు. నోట్ల రద్దు తర్వాత తమతమ బిజినెస్ లు ఎంత శాతం పడిపోయాయో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం లెక్కలేసి చెబుతున్నాయి. ఓ వైపు వున్న బిజినెస్ దెబ్బతింటోందంటూ విభిన్నవర్గాలు ఘోషిస్తుంటే, స్టార్టప్ కంపెనీలకు కాలం కలిసివస్తుందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఊరిస్తున్నారు. స్టార్టప్ ల సంగతేమోకానీ, కొన్ని సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోతలు కోయడం, సిబ్బంది సంఖ్యను కుదించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. మొత్తానికి నోట్ల రద్దు నేపథ్యంలో కార్మికుల పొట్టలు కొట్టే కుయుక్తులు మొదలయ్యాయి. సంస్థను రక్షించుకోవడానికి మరో మార్గం లేదంటూ కార్మికులను బలివ్వడానికి సిద్ధమవుతున్నాయి కొన్ని యాజమాన్యాలు. నోట్ల రద్దు తర్వాత కార్మికులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో చర్చించేందుకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

10:19 - December 26, 2016

యాదాద్రి : పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లోని ప్రజలకు డెంగ్యూ వాధ్యి సోకి మంచాన పడుతున్నారు. పారిశుద్ద్యం లొపించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్నారు.

మక్తఅనాంతరంలో సీజన్ వ్యాధుల విజృంభణ
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్తఅనాంతరం గ్రామంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లెల్లో సరైన పారిశుద్ద్యం లేక మురికికాలువలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇరవై రోజులుగా సీజనల్ వ్యాధులు సోకి చాలామంది గ్రామస్తులు మంచానపడ్డారు.

హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలంటున్న గ్రామస్తులు
సీజనల్ వ్యాధులు సోకి తీవ్ర అస్వస్తతకు గురైన గ్రామస్తులను ఘట్‌కేసర్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందించారు. అక్కడి వైద్యులు రక్త పరీక్షలు చేసి డెంగ్యూ అని నిర్థారించారు. డెంగ్యూ వ్యాధి అని నిర్థారణ కావడంతో చాలామంది భయంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిరుపేదలు చాలామంది అప్పులపాలవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులకు తగిన వైద్యం అందించాలని కోరుతున్నారు.

 

 

10:18 - December 26, 2016

వనపర్తి : కాల్వలకు నీరొచ్చింది ఇకపై పంటల సాగుకు నీటి కొరత ఉండని భావించిన రైతన్నలకు ఆశాభంగమే ఎదురైంది. వనపర్తి జిల్లాలోని బీమా ఫేజ్-2 ద్వారా 22 రోజుల నుంచి చుక్క నీరు రావడం లేదు. దీంతో నీరులేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

వనపర్తి జిల్లాలో రైతులకు నీటి కష్టాలు
వనపర్తి జిల్లాలో రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. బీమా ప్రాజెక్టు ఫేజ్-2కు నీరు రావడంతో తమ కష్టాలు తీరుతాయని ఆశించిన రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి. భీమా ఫేజ్-2 కింద పంటలు వేసుకున్న రైతులు నీటి కోసం దిగాలుగా

బీమా ఫేజ్-2 కాలువ ద్వారా 49 వేల ఎకరాలకు నీరు
కృష్ణసముద్రం బీమా ఫేజ్-2 కింద 92 కి.మీటర్లు పారుతుంది. ఈ కాలువ ద్వారా 49 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ప్రస్తుతం బీమా ఫేజ్-2 కాలువ కింద 14 వేల ఎకరాల్లో రైతులు వెరుశెనగ, మినుములు, కూరగాయలు లాంటి పంటలు సాగుచేస్తున్నారు. అయితే గత 22 రోజులుగా ఒక చుక్క నీరుకూడా రాకపోవడంతో బీమా ఫేజ్-2 కాలువ వట్టిపొయింది.

కాలువకు నీరు విడుదల చేయాలని రైతుల డిమాండ్
బీమా ఫేజ్ -2 కింద సాగు చేసిన ఆరుతడి పంటలకు నీరు అందక పంటలు ఎండిపోయే దశకు చేరుకోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంటల సాగుకోసం తెచ్చిన అప్పులు కట్టడం కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వేసిన పంటలు మరో మూడు, నాలుగు తడులు నీరందితేనే పంటలు చేతికందే పరిస్ధితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బీమాఫేస్-2 కు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

తిరుపతిలో బాలయ్య..

చిత్తూరు : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తిరుపతికి చేరుకున్నారు. నేడు ఆయన నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ఆడియో విడుదల కానుంది. సాయంత్రం మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఆడియో వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

10:17 - December 26, 2016

హైదరాబాద్ : మియాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. వైభో రెసిడెన్సీలో చీరెల వ్యాపారం చేసే అరుణ-శ్రీనివాసస్వామి దంపతుల ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. క్రిస్మస్ పండగ కొసం ఊరెళ్లడంతో దొంగలు ఇంట్లోకి చొరబడి ఇంట్లోని బంగారు ఆభరణాలు, 72 వేల రూపాయల కొత్త కరెన్సీ అపహరించారు. ఇదే తీరులో మరో రెండిళ్లలో చోరీలు జరిగాయి. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 

10:16 - December 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై సమరభేరికి టీ జేఏసీ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతోంది. గులాబీ పార్టీపై కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్ణయించింది.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై పోరు టీ జేఏసీ రెడీ
తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ గులాబీ సర్కార్‌పై పోరుకు రెడీ అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై ఆందోళనకు ప్రణాళికలు రచిస్తోంది. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వంపై సూచనలతో కూడిన విమర్శలు మాత్రమే చేసిన టీజేఏసీ.... ఇప్పుడు ప్రజాందోళనకు సిద్ధమవుతోంది. ఆదివారం జరిగిన టీజేసీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమనే సంకేతాలను ఇచ్చారు.

ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరుకు టీజేఏసీ నిర్ణయం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ సర్కార్‌ పాలన కొనసాగడం లేదన్న అభిప్రాయానికి టీజేఏసీ వచ్చింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైనట్టుగా అది భావిస్తోంది. అందుకే ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమవ్వాలని నిర్ణయించింది. భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈనెల 29న భారీ ధర్నాకు శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థల పరిరక్షణకు జనవరి నెలంతా అధ్యయన యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది ఉద్యోగ- ఉపాధి అంశాలపై ఫిబ్రవరిలో నిరసనలు తెలుపనున్నట్టు టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం చెప్పారు. మార్చి నెలలో మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ లో కులవృత్తులు, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం చేయనున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని వెంటనే అమలు చేయాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. జోనల్ విధానాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.

రాజకీయ పరిణామాలపైనా స్పదించిన టీజాక్‌
ప్రభుత్వం తీసుకొస్తునన భూసేకరణ బిల్లును టీజేసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈనెల 29న భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పరిణామాలపైనా టీజాక్‌ మొదటి సారి నోరు విప్పింది. అధికార పార్టీ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. మొత్తంగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీజేఏసీ నిర్ణయించింది. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత - లక్ష్మణ్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, సిబ్బందిని నియమించకుండా అధికారులను బాధ్యత చేయడం సబబు కాదని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. నగర బ్రాండ్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అధికారుల వ్యవహార శైలిపై స్వయంగా మంత్రి కేటీఆర్ నిస్సహాయిత వ్యక్తం చేశారని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. మంత్రిగా కేటీఆర్ వంద రోజుల ప్రణాళిక ప్రకటించారని, ఎన్నికల సమయంలో ఆదరాబాదరాగా కొన్ని ప్రకటించారని కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు.

10:15 - December 26, 2016

విజయవాడ : ఏపీలో నాట్యానికి పట్టం కట్టారు. కళకు న్యాట్యమణులు జీవం పోశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేల మంది ఒకే సారి కూచిపూడి న్యాట్యాన్ని ప్రదర్శించి గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు ఉత్సవాల్లో ఈ అరుదైన రికార్డు నమోదైంది.

నాట్య సమ్మేళనంలో పాల్గొన్న 6వేల 117 మంది కళాకారిణులు
విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు కెక్కింది. 6వేల 117 మంది కళాకారిణులు ప్రదర్శించిన మహా బృందనాట్యం ఆధ్యంతం ఆకట్టుకుంది. నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు.

సీఎం చంద్రబాబుకు ధ్రువీకరణ పత్రాన్ని అందించిన గిన్నీస్‌ బుక్‌ ప్రతినిధి
గిన్నిస్‌బుక్‌ ప్రతినిధి రిషినాథ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లయిన 'కూచిపూడి' గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని కళాకారులు ముందుకెళ్లాలని బాబు సూచించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుకెక్కడం గర్వకారణమన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన నాట్యాల్లో కూచిపూడి ఒకటిగా నిలుస్తుందన్నారు. కూచిపూడి నృత్యానికి గతంలో రూ.100కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

కార్యక్రమానికి హాజరైన పలువురు
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, నారా లోకేశ్‌, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

10:14 - December 26, 2016

గుంటూరు : టీడీపీలో తలెత్తిన వివాదాలు సమసిపోయాయి. కొద్ది రోజులుగా మంత్రి రావెల కిషోర్‌బాబు, జడ్పీ చైర్మన్ జానీమూన్ మధ్య గొడవ ముగిసిపోయింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు ప్రత్తిపాటి, పల్లె రఘునాథరెడ్డిలు సమావేశం నిర్వహించి...రావెల, జానీమూన్ మధ్య అభిప్రాయ బేధాలను తొలగించారు.

సద్దుమణిగిన గుంటూరు విభేదాలు..
గుంటూరు జిల్లా టీడీపీలో భగ్గుమన్న గ్రూపు విభేదాలు సద్దుమనిగాయి. మంత్రి రావెల కిషోర్‌బాబు, జెడ్పీ ఛైర్మన్ జానీమూన్ మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు తొలగిపోయాయి. మంత్రులు ప్రత్తిపాటి, పల్లె రఘునాథ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు.. ఇరువురు నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.

మంత్రి రావెలతో కలిసి పనిచేస్తా : జానీమూన్
తనపై
దాడికి యత్నించిన వారి వెనుక మంత్రి రావెల లేరన్న విషయం సమావేశంలోనే తనకు తెలిసిందని...జడ్పీ చైర్‌పర్శన్ జానీమూన్ చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు తొలగిపోయాయన్నారు. రానున్న రోజుల్లో మంత్రి రావెలతో కలిసి పనిచేస్తామన్నారు.

మంత్రి రావెల/జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ల మధ్య వివాదం
ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ల మధ్య కొద్దిరోజులుగా కోల్డ్‌వార్‌ నడిచింది. గతేడాది నుంచి అభివృద్ధి పనులకు మంత్రి రావెల తనకు ఏమాత్రం సహకరించడం లేదని జానీమూన్‌ గతంలో ఆరోపించారు. తమకు రాజకీయ జీవితం లేకుండా చేస్తానని రావెల హెచ్చరించినట్లు ఆమె ఇంతకు ముందు తెలిపారు. అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని జానీమూన్ స్పష్టం చేశారు.

అభిప్రాయ బేధాలను తొలగించుకోవటంలో జాప్యం: రావెల
తమమధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను తొలగించుకోవటంలో కొంత జాప్యం జరిగిందని మంత్రి రావెల అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా వివాదం తలెత్తిందని ఆయన తెలిపారు. ఇక ముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా అందరితో కలిసి పనిచేస్తూ... నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తామని అన్నారు.

ఇక ముందు ఇటువంటి సమస్యలు రాకుండా చర్యలు : ప్రత్తిపాటి
స్థానిక సమస్యలపై దృష్టి సారించకపోవటంతో జిల్లాలో విబేధాలు తలెత్తిన మాట వాస్తవమేనని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇక ముందు ఇటువంటి సమస్యలు రాకుండా అందరం కలిసి పనిచేస్తామన్నారు.నేతల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోవడంతో..గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కలసి పనిచేస్తామని అంటున్నారు.

 

 

10:12 - December 26, 2016

హైదరాబాద్ : రెండు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రారంభం కాబోతుంది. వాయిదాపడుతూ వస్తున్న టీఎస్-ఐపాస్‌పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరనుంది. అసెంబ్లీ ఈనెల 30 వరకు విరామం లేకుండా కొనసాగనుంది.

ఇవాళ అసెంబ్లీలో టీఎస్-ఐపాస్‌పై చర్చ
రెండురోజుల సెలవుల అనంతరం తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 16వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ అనేక ప్రజాసమస్యలపై చర్చించింది. ఇవాళ రెండు అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కాగానే జీరో అవర్ ఆ తర్వాత రెండు అంశాలపై షార్ట్ డిస్కషన్‌ జరగనుంది. గత శుక్రవారం నుంచి వాయిదా పడుతూ వస్తున్న టీఎస్-ఐపాస్‌తో పాటు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌గృహకల్ప, డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణంపై సభ చర్చించబోతోంది.

మండలిలో టీఎస్-ఐపాస్,కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లపై చర్చ
పెద్దల సభలో టీఎస్-ఐపాస్‌తో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సభ్యులు చర్చించబోతున్నారు. పెండింగ్‌లోని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు క్లియర్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజీవ్ స్వగృహ పథకంలో నిర్మించిన గృహసముదాయాలు ప్రభుత్వానికి భారంగా మారాయి. వీటిపై ప్రభుత్వం మరింత క్లారిటీ ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

టీఎస్-ఐపాస్ చర్చలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

టీఎస్-ఐపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. సింగిల్ విండో ద్వారా రాష్ట్రంలో కొత్త కంపెనీల నిర్మాణానికి రెడ్ కార్పెట్ పరిచిన ప్రభుత్వం...రెండున్నర సంవత్సరాల కాలంలో ఏర్పాటైన ప్రాజెక్టులెన్ని..ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అనే అంశంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు.

ఈనెల 30 వరకు సాగనున్న అసెంబ్లీ సమావేశాలు
ఇప్పటివరకు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాలు వ్యూహం లేకుండా, అంశాలపై సరైన సమాచారం లేకుండా సభకు వస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 30 వరకు విరామం లేకుండా సాగనున్న అసెంబ్లీ సమావేశాలు మ

10:11 - December 26, 2016

హైదరాబాద్ : బేగంబజార్‌లోని అజీజ్ ప్లాజాలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో ఫైర్‌ సిబ్బంది స్పందించడంతో.. సమీప భవనాలకు మంటలు వ్యాపించలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

పాలనలో ఎలాంటి మార్పు రాలేదు - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో ఎలాంటి మార్పు రాలేదని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. నగరంలో రోడ్లన్నీ పూర్తిగా అధ్వాన్నంగా తయారయ్యాయని, లారీల వల్ల డెబ్రీస్ సమస్య నెలకొందన్నారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు జీహెచ్ఎంసీలో డబ్బులు ఉండేవని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత జీహెచ్ఎంసీ దివాళా తీసిందని, వర్షాల వల్ల తూతు మంత్రంగా నిధులు ఇచ్చారని పేర్కొన్నారు.

10:09 - December 26, 2016

జగిత్యాల : జల్లాలో దారుణం జరిగింది. కథలాపూర్ మండలం దూంపేట గ్రామంలో వరకట్నం వేధింపులతో భార్య, అత్తమామలపై అల్లుడు మల్లేష్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మామ భూమయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్య, అత్తల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

టి.అసెంబ్లీ ప్రారంభం..వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమయ్యాయి. నేటి వాయిదా తీర్మానాలు ఇలా ఉన్నాయి..జోనల్ వ్యవస్థ రద్దుపై టిడిపి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, సమస్యలపై బీజేపీ, ఐకేపీ ఉద్యోగుల బకాయి వేతనాలపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. 

ప్రేమ పేరిట ఎస్ఐ మోసం..

అనంతపురం : ప్రేమ పేరిట మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ శివకుమార్ మోసం చేశాడు. న్యాయం చేయాలని హిందూపురం వన్ టౌన్ లో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కేవీవీపురంలో శివకుమార్ ఎస్ఐ గా పనిచేస్తున్నాడు.

గగన్ పహాడ్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి : గగన్ పహాడ్ లో రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఐదు బస్సులను సీజ్ చేశారు.

 

కివు ప్రాంతంలో అల్లర్లు..

కాంగో : కివు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 22 మంది మృతి చెందారు. రెండు ఏళ్లుగా చెలరేగుతున్న హింసాకాండలో వందలాది మంది మృతి చెందారు. 

10:05 - December 26, 2016

హైదరాబాద్: రెండు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రారంభం కానుంది. వాయిదాపడుతూ వస్తున్న టీఎస్-ఐపాస్‌పై నేడు అసెంబ్లీలో చర్చ జరనుంది. అసెంబ్లీ ఈనెల 30 వరకు విరామం లేకుండా కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్‌రూమ్‌పై.. మండలిలో టీఎస్-ఐపాస్, కల్యాణలక్ష్మిలపై చర్చ జరగనుంది. విపక్షాలు సర్కార్‌పై మరింత దూకుడు పెంచనున్నాయి. 

10:00 - December 26, 2016

ఢిల్లీ : జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో కీలక మలుపు తిరిగింది. నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఈరోజు తొలివిడత రుణం అందనుంది. కేంద్రమంత్రి ఉమాభారతి చేతుల మీదుగా సీఎం చంద్రబాబు ఈ చెక్ ను అందుకోనున్నారు. దీని నిమిత్తం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరనున్నారు. 1981 కోట్ల రూపాయలకు చెక్ ను ఉమాభారతి చేతుల మీదుగా చంద్రబాబు అందుకోనున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా కానున్నాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో నాబార్డు ద్వారా మంజూరైన ఈ రుణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తోంది. కాగా రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అంశంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందని కేంద్రం తెలిపింది. నిర్మాణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. 

07:22 - December 26, 2016

నాగర్‌కర్నూలు : అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీబస్సు, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హైదరాబాద్‌కు తరలించారు. మృతులు లిఫ్టు ఇరిగేషన్‌లో కాంట్రాక్టర్‌, సూపర్‌వేజర్‌లుగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, రాము, అనిల్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బొలేరో వాహనం నుజ్జునుజ్జయ్యింది.

నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

నాగర్‌కర్నూల్ : అచ్చంపేట మండలం నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరులో భూప్రకంపనలు..

నెల్లూరు : సోమవారం తెల్ల‌వారుజామున భూమి కంపించింది. భూ ప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు పరుగులు తీశారు. జిల్లాలోని వింజ‌మూరు, వ‌రికుంట‌పాడులో మూడు సెక‌న్ల‌పాటు భూమి కంపించింది. భూకంపం మ‌ళ్లీ వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్న ఆయా గ్రామాల ప్రజ‌లు ఇళ్ల‌లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. 

Don't Miss