Activities calendar

27 December 2016

21:31 - December 27, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి ధ్వజమెత్తారు. తాను దళితురాలైనందుకే కేంద్రం టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. తమ పార్టీకిచ్చిన విరాళాలకు సంబంధించి ప్రతి పైసాకు లెక్క ఉందని ఆమె స్పష్టం చేశారు. నోట్ల రద్దుకు ముందు తర్వాత బిజెపి డిపాజిట్లను బయట పెట్టాలని మాయావతి డిమాండ్‌ చేశారు.

సోదరుడు ఆనంద్‌ కుమార్‌ పై ఆరోపణలపై స్పందించిన మాయావతి...

నోట్ల రద్దు త‌ర్వాత‌ బీఎస్పీ ఖాతాలో అక్రమంగా 104 కోట్లు, తన సోదరుడు ఆనంద్‌ కుమార్‌ ఖాతాలో 1.43 కోట్లు డిపాజిట్ అయ్యాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై మాయావ‌తి స్పందించారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని...యూపీలో బీఎస్పీ ప్రతిష్టను భంగం క‌లిగించే ప్రయ‌త్నం చేస్తోందని మండిపడ్డారు. మా పార్టీకిచ్చిన విరాళాలకు సంబంధించి ప్రతి ఒక్క పైసాకు లెక్క ఉందని, డబ్బులన్నీ బ్యాంకు ఖాతాలోనే జమ అయ్యాయని, అది నల్లధనం కాదని ఆమె స్పష్టం చేశారు. తాను ద‌ళితురాలిని కాబ‌ట్టే త‌న‌ను లక్ష్యంగా చేసుకున్నార‌ని ఆరోపించారు. మ‌రి బీజేపీ చేసిన డిపాజిట్ల సంగ‌తేంటని మాయావ‌తి ప్రశ్నించారు. నోట్ల రద్దుకు ముందు.. తర్వాత బీజేపీ చేసిన డిపాజిట్లు, అధిక మొత్తం చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టాలని మాయావ‌తి డిమాండ్ చేశారు.

మాయావతి ఆరోపణలను ఖండించిన బిజెపి .....

మాయావతి ఆరోపణలను బిజెపి ఖండించింది. అవినీతికి దళిత కార్డుతో ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. నోట్ల రద్దు త‌ర్వాత బీఎస్పీ ఖాతాలో 104 కోట్లు డిపాజిట్ చేసిన‌ట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.1.43 కోట్లు మాయావ‌తి సోద‌రుడు ఆనంద్‌ కుమార్‌ ఖాతాలో జ‌మైన‌ట్లు గుర్తించారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో సోదాలు నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఈ వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ విషయంలో మాయావతి, ఆమె సోదరుడు ఆనంద్‌కుమార్‌లపై ఈడీ విచారణ జరుపుతోంది.

21:28 - December 27, 2016

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో 8 పార్టీలు ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. నోట్ల రద్దుతో ప్రధాని చెప్పినట్లు నల్లధనం, అవినీతి నిర్మూలన కాకపోగా అది మరింత పెరిగిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పేదలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. చేతిలో డబ్బుల్లేక రైతులు, కార్మికులు విలవిలలాడిపోతున్నారని రాహుల్‌ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. డిసెంబర్‌ 30 వరకు మోది సమయమిచ్చారని...అయితే పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదన్నారు. సహారా డైరీకి సంబంధించి తాను చేసిన అవినీతి ఆరోపణలపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. నోట్ల రద్దును మెగా స్కాంగా పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. నోట్ల రద్దుతో దేశం 20 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. 'అచ్చే దిన్' పేరుతో మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, పేద ప్రజలను లూటీ చేసిందన్నారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేస్తే... మోది పేదల డబ్బును దోచి ఎన్‌పిఏ పేరిట కొంతమంది పెద్దలకు లాభం చేకూరుస్తున్నారని మమత ధ్వజమెత్తారు. 50 రోజుల గడవు తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోకపోతే ఇందుకు మోదీ బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తారా? అంటూ నిలదీశారు. మోది దేశ సమాఖ్య వ్యవస్థను ధ్వసం చేయడం ద్వారా సూపర్ ఎమర్జెన్సీ సృష్టిస్తున్నారని మమత నిప్పులు చెరిగారు.ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు తృణమూల్‌, డిఎంకె, ఆర్జేడి, జెఎంఎం, జెడిఎస్‌, తదితర 8 పార్టీలు హాజరయ్యాయి. వామపక్షాలు, జెడియు, ఎన్‌సిపి, బిఎస్‌పి పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనలేదు.

పురుగుమందు కొట్టిన మొక్కజొన్న తిని ఇద్దరు మృతి

భద్రాద్రి : ములకలపల్లి మండలం చింతపేటలో విషాదం నెలకొంది. పురుగుమందు కొట్టిన మొక్కజొన్న తిని ఇద్దరు మృతి చెందారు. మృతులు సున్నం చందు(14), సుజాత(15)గా గుర్తించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

రాజ్ భవన్ లో రాష్ట్రపతికి తేనీటి విందు

హైదరాబాద్: రాజ్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇరు రాష్ట్రాల గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీ ల నేతలు హాజరయ్యారు.

20:07 - December 27, 2016

హైదరాబాద్: రాజ్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇరు రాష్ట్రాల గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీ ల నేతలు హాజరయ్యారు.

ఏపీ ఖజానాకు చేరిన పోలవరం నిధులు

విజయవాడ: ఏపీ ఖజానాకు పోలవరం తొలిదశ నిర్మాణానికి నిధులు చేరాయి. తొలి విడతగా 1981 కోట్లు ర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కేంద్రం బదలాయించింది.

19:48 - December 27, 2016

ఆత్మకూరులోని పలు బ్యాంకులపై ఐటీ దాడులు

నెల్లూరు: ఆత్మకూరులోని పలు బ్యాంకులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఓ వ్యక్తి చెందిన ఖాతాలు, లావదేవీలు, లాకర్లను పరిశీలిస్తున్నారు. సదరు ఖాతాదారుడి పేరును అధికారులు గోప్యంగా వుంచారు.

డాక్టర్ గుణశేఖర్ ఇంటి పై ఐటీ దాడులు

తిరుపతి : డాక్టర్ గుణశేఖర్ ఇంటి పై ఐటీ దాడులు నిర్వహించింది. గతంలో ఎంసీఐ సభ్యుడుగా గుణశేఖర్ పనిచేశారు. నగదు మార్పిడి, బంగారం విక్రయం, తదితర అంశాలపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు ఐటీ దాడులు చేపట్టారు.

రాష్ట్రపతికి గవర్నర్ విందు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో రాష్ట్రపతికి గవర్నర్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్వామిగౌడ్, మంత్రులుకడియం, కేటీఆర్, ఎంపి,కవిత, టీసీఎల్పీ నేత జానారెడ్డి, బిజెపి నేత లక్షణ్ హాజరయ్యారు.

నిలిచిపోయిన వెలిగొండ ప్రాజెక్టు సొరంగ పనులు

ప్రకాశం: వెలిగొంగడ ప్రాజెక్టు సొరంగ పనులకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేదని వెలిగొండ ప్రాజెక్టు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

నాగోబా జాతరకు రూ.40 లక్షలు విడుదల

హైదరాబాద్: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1వరకు జరగనున్న జాతరకు ప్రభుత్వం తరుపున రూ.40 లక్షలు విడుదల చేస్తున్నట్లు మంత్రులు చందూలాల్, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేవాలయ పునరుద్దరణ, రాజగోపురం నిర్మాణం, మండపం ఆధునీకరణకు రూ.1.5 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారన్నారు.

18:45 - December 27, 2016

కడప :జిల్లాలోని నూతన రైల్వే సొరంగ నిర్మాణ ప్రాజెక్టు..దేశంలోనే ఉత్తమమైన ప్రాజెక్టు అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓబుల పల్లె నుంచి క్రిష్ణపట్నం ఓడరేవు వరకూ నిర్మిస్తోన్న నూతన రైల్వే సొరంగ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రకు ప్రయోజనకరమైన ఈ ప్రాజెక్టు 2017 నాటికి పూర్తిచేయనునన్నట్లు ఆయన తెలిపారు.

18:44 - December 27, 2016

గుంటూరు : కుటుంబంలో చిన్న, చిన్న సమ్యలు వస్తాయని .. వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటామని హోమంత్రి చినరాజప్ప అన్నారు. గుంటూరు జిల్లా చైర్మన్‌ జానీమూన్‌... మంత్రి రావెల కిషోర్‌ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ఈరోజు పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని.. కలిసి పనిచేయడానికి అంగీకరించారని చినరాజప్ప అన్నారు.వైసీపీ నేతలు తమ పార్టీ అంతర్గత అంశాలపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.

18:43 - December 27, 2016

నెల్లూరు : టీడీపీ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందులో భాగంగానే విద్య కోసం కేటాయించిన బడ్జెట్‌ను..గతంలో లేని విధంగా పెంచామని తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది నుంచి ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

18:41 - December 27, 2016

కృష్ణా : ప్రజలకు డబ్బు కష్టాలు తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి దేవినేని ఉమా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితిపై ఏపీ మంత్రులు బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితి అధ్యాయనం చేస్తారని మంత్రి తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు దేవినేని వెల్లడించారు.

18:39 - December 27, 2016

హైదరాబాద్ : విప్లవ సాహిత్యం.. పాతనోట్లు ఉన్నాయనే నెపంతో పోలీసులు అరెస్టు చేసిన ప్రజా సంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలని విరసం నేత కల్యాణరావు డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను.. అఘాయిత్యాల గురించి కోర్టుకు తెలియజేయాలని ప్రయత్నించిన వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ప్రస్తుతం చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని సక్మా కారాగారంలో ఉంచారని చెప్పారు.

18:36 - December 27, 2016

కడప : ప్రమాదాలు నివారించి... భద్రతకు పెద్దపీట వేయాల్సిన .. కడప జిల్లాలోని రాజంపేట... మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. రహదారి భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ప్రభుత్వశాఖ ఇది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు.. ఎల్‌ఎల్‌ఆర్‌లు.. వాహన రిజిస్ట్రేషన్‌లు తదితర సేవలు ఇక్కడ లభిస్తాయి. అయితే ప్రజలు నేరుగా ఆఫీస్‌కు వెళ్లి...తమ పని తాము చేసుకునే పరిస్థితే లేదు. ఇక్కడంతా దళారులదే రాజ్యం. ఈ కార్యాలయంలో పనులు చేసేపెట్టే దళారులు సుమారు ఇరవై మంది దాకా ఉన్నారు. వీరు వాహనచోదకులకు అధికారులకు మధ్య దళారులుగా వ్యవహరించి.. ప్రతి పనికీ.. ఓ రేటు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిభతో పనిలేదు.. పైసలిస్తేనే పనులవుతాయి.. పైసలిస్తే ఏ పనులైనా అవుతాయి. మధ్యవర్తులను కాదని.. నేరుగా చేసుకునే వీలు లేదు.

అక్రమ వసూళ్లపై ఫిర్యాదు.....

అయితే ఇక్కడ...అవినీతిపై కొందరు ఫిర్యాదు చేయడంతో కడప ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.. అయినా ఇక్కడ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. ఎల్‌ఎల్‌ఆర్‌కు వెయ్యి రూపాయలు.. డీఎల్‌ ట్రయిల్‌కు రెండు వేల రూపాయలు, ఎఫ్‌సీకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు.. ఇలా రేట్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. అక్రమ వసూళ్ల కారణంగా సాధారణ ప్రజలు తమ పనుల కోసం కార్యాలయానికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఇక్కడకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ సారు కన్నుసన్నల్లోనే అవినీతి అంతా జరుగుతుందని.. స్థానికులు గుసగుసలుపోతున్నారు. ఉన్నతాధికారులు రాజంపేట ఆర్టీఏ కార్యాలయం అవినీతిపై దష్టిసారించి, అక్రమార్కుల దందాను నిలువరించాలని కోరుతున్నారు.

18:35 - December 27, 2016

తూ.గో : సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయులు చేసిన త్యాగాలకు చెదలు పడుతున్నాయి. స్వార్ధానికి చిక్కిశల్యమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో.. కోకనాడ అన్నదాన సమాజానికి కోటా లక్ష్మయ్యనాయుడు చేసిన దానం దారి తప్పడమే దీనికి నిదర్శనం.

1930లో ఏర్పాటు ......

పేదలు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చేవారికి నిత్యాన్నదానం చేసే ఉద్దేశంతో 1930లో కోకనాడ అన్నదాన సమాజం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కాకినాడ సమీపంలోని జి.వేమవరం గ్రామానికి చెందిన 600 ఎకరాల భూమిని కోటా లక్ష్మయ్యనాయుడు దానం చేశారు. ఆ కాలంలో ఎంతో గొప్పగా ఆ కార్యక్రమం చేపట్టారు. కొన్నాళ్ల తర్వాత కోటా వారసులంతా అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. దీంతో ఆ బాధ్యతలను ట్రస్ట్‌కు అప్పగించారు. కాలక్రమేణా ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన లక్ష్యం దారితప్పింది. సమాజం కింద ఉన్న భూములను కొంతమంది స్వార్ధపరులు అన్యాక్రాంతం చేశారు. చాలా కాలం తర్వాత రాష్ట్రానికి వచ్చిన కోటా వారసులు కోకనాడ అన్నదాన సమాజాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజం మొక్కుబడిగా నడవడం చూసి చలించిపోయారు.

భూములు అమ్మినట్లు తెలిపిన అధికారులు ....

పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడం చూసి వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. భూముల వివరాలపై కోటా వారసులు ఆరా తీయగా.. భూములన్నీ అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం కోటి రూపాయల విరాళం మాత్రమే ఉందని.. దానిపై వచ్చే వడ్డీతో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కలత చెందిన కోటా వారసులు.. మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజాన్ని మరింత విస్తృతపరచాలని నిర్ణయించుకున్నారు.

మిగిలిన ఆస్తుల రక్షించాలని నిర్ణయం....

ఇప్పటికే ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు కోటా వారసులు కంకణం కట్టుకున్నారు. అన్యాక్రాంతమైన భూముల లెక్కలపై ఆరా తీస్తామంటున్నారు. మొత్తానికి కొందరు స్వార్ధపరులు సాగిస్తున్న అరాచకాలకు దేవాదాయశాఖ అధికారులు అండగా నిలవడం వల్లే కోకనాడ అన్నదాన సమాజం ఆస్తులు పక్కదారి పట్టాయని స్థానికులంటున్నారు. దీని వెనుక పెద్ద అవినీతి భాగోతం ఉండి ఉంటుందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఉన్నతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమాజం ఆస్తులను రక్షించాలని కోరుతున్నారు.

రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలి: మల్లాది విష్ణు

విజయవాడ : దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎవరు చెబితే 'వంగవీటి' సినిమా తీశారో చెప్పాలని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వర్మతో బహిరంగ చర్చకు రంగా అభిమానులు సిద్ధంగా ఉన్నారని రంగా జీవితానికి ఈ సినిమా పూర్తిగా విరుద్ధమన్నారు. వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

3.5లక్షల మందికి కొత్తగా పింఛన్లు : మంత్రి దేవినేని

విజయవాడ : జన్మభూమి కార్యక్రమంలో 3.5లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇస్తామని మంత్రి దేవినేని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుపూర్ లో రూ.36లక్షల కొత్తకరెన్సీ స్వాధీనం...

హైదరాబాద్ : తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో పోలీసులు ఓ కారు నుంచి రూ.36 లక్షల విలువైన కొత్త రూ.2000 నోట్లను స్వాధీనం చేసుకుని ఆదాయ ప‌న్ను శాఖ అధికారులకు అప్ప‌గించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

పోలవరం పూర్తయితే వైసీపీకి పుట్టగతులు ఉండవ్

విజయవాడ: పోల‌వ‌రం పూర్తయితే వైసీపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వని మంత్రి దేవినేని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొద‌టి ద‌శ‌లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రూ.1981 కోట్లు చెక్కు అందింద‌ని చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టు 2018 చివ‌రిలోపు పూర్తి చేయాల‌నే మ‌హాసంక‌ల్పంతో తాముంటే సాక్షిప‌త్రిక‌లో పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

17:41 - December 27, 2016

నల్లగొండ : హాలియాలో విషాదం చోటుచేసకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. క్రిస్మస్ పండుగ సెలవులకి ఇంటికి వచ్చిన ముగ్గురు యువకులు...కాలువలో దూకారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతవగా..ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

17:39 - December 27, 2016

హైదరాబాద్ : భూ నిర్వాసితుల సమస్యలపై ఈనెల 29న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. కేంద్రం చేసిన 2013 భూసేకరణ చట్టాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టానికి అసెంబ్లీలో సవరణలు చేయడం తగదన్నారు. సంక్షేమ పథకాలు అందరి అందేలా చూడాలన్నారు. అన్నిగ్రామాల్లో కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను తీసుకురావాలని కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఫిబ్రవరిలో ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

17:24 - December 27, 2016

కిడ్నీలు..శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పని చేయమని మొరాయిస్తే...ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి కిడ్నీలను శుభ్రంగా ఉండాలంటే ?

  • ఉదయాన్నే నిమ్మరసం తాగాలి. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది.
  • గ్లాసు నీటిలో ఓ రెండు టీస్పూను ఆపిల్ సీడెడ్ వెనిగర్ కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే బాడిలో టాక్సిన్స్ ని బయటకి లాగవచ్చు.
  • పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్ ను ఉదయం లేవగానే సేవించడం వందరకాలుగా ఉపయోగంగా ఉంటుంది.
  • పైనాపిల్, ఆపిల్, ఆరెంజ్, పీచ్ తో కలిపి చేసిన జ్యూస్ కూడా బాగా పనికివస్తుంది.
  • బీట్ రూట్ లో పొటాషియం ఉండడం మూలాన మలీనాలని ఈజీగా బయటకి తెస్తుంది.
17:13 - December 27, 2016

చలికాలం..ఈ కాలం రాగానే రోగాలు విజృంభిస్తాయి. జలుబు..దగ్గు..శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. చలి ప్రభావం వల్ల గొంతునొప్పి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యకు కొన్ని చిట్కాలు..

  • దాల్చిన చెక్కను పొడి చేయాలి. ఈ పొడిలో తేనె కలుపుకుని తీసుకోవాలి.
  • వెల్లుల్లి రెబ్బలు మంచి ఔషధం. గొంతునొప్పి బాధనుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
  • మిరియాలను పొడి చేసి ఇందులో తేనే కలుపుకుని తీసుకోవాలి. టీలో అయినా కలుపుకుని తాగాలి.
  • గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె కలుపుకుని తాగితే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
  • ఉల్లిపాయ రసం.. అల్లం టీ తాగినా, అల్లం ఉడికించిన నీటిని తాగినా వెంటనే గొంతునొప్పి తగ్గుతుంది.
16:55 - December 27, 2016

మిల్కీ బ్యూటీ తమన్నాకు మళ్లీ ఆ సినిమానే దిక్కైంది. సక్సెస్ లతో దూసుకుపోతుందనుకున్న ఈ బ్యూటీ స్పీడ్ కి స్పీడ్ బ్రేక్స్ పడ్డాయి. దీంతో ఈ తెల్లకోడి పిల్ల చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న తమన్నా న్యూ ఇయర్ లో సర్ ప్రైజ్ చేస్తానంటూ బడాయి పోతోంది. వరుసగా సక్సెస్ లతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న 'తమన్నా' ప్లాప్స్ తో స్పీడ్ బ్రేక్స్ వేశాయి. అసలే 'అభినేత్రి' సినిమా నిరాశపరిచిందంటే ఇప్పుడేమో విశాల్ తో చేసిన 'ఒక్కడొచ్చాడు' కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో మిల్కీ బ్యూటీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేసింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా లేదు. అయితే ఈ బ్యూటీ మాత్రం కొత్త ఎడాది ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేబోతున్న అంటూ బడాయి మాటలు చెప్పుతోంది. 'తమన్నా' గత ఎడాది 'బాహుబలి', 'బెంగాల్ టైగర్', సక్సెస్ లతో హవా మొదలెట్టింది. దీనికి తోడు ఈ ఎడాది స్టార్టింగ్ లో 'ఊపిరి'తో సక్సెస్ జోరును కంటిన్యూ చేసింది. కోలీవుడ్ లో ఈ బ్యూటీ నటించిన 'ధర్మదురై' మూవీ కూడా సూపర్ హిట్టు అయింది.

గతంలోనూ..
దీంతో ఇక కోలీవుడ్ లో కూడా హవా సాగించాలని ఈ బ్యూటీ ఆశపడింది. కానీ తీరా చూస్తే 'అభినేత్రి'తో పాటు 'విశాల్' తో నటించిన 'ఒక్కడొచ్చాడు' మూవీస్ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ప్రస్తుతం 'తమన్నా' ఓ హిట్టు అర్జెంట్ గా పడాల్సిన టైం వచ్చింది. గతంలోనూ మిల్కీ కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నపుడు 'బాహుబలి'లో ఆఫర్ రావడం, అవంతిక కేరక్టర్ తో బౌన్స్ బ్యాక్ అయింది. ఊహించని స్థాయిలో బాహుబలితో ఈ బ్యూటీకి నేషనల్ లెవెల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు 'బాహుబలి ది కంక్లూజన్' రిలీజ్ కి రెడీ అవుతున్న సమయానికి 'తమన్నా' దగ్గర మళ్లీ ఒక్క ఆఫర్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మళ్లీ 'బాహుబలి2' నే తన కెరీర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తోందని ఈ బ్యూటీ ఆశపడుతోంది. అంతేకాదు వచ్చే వచ్చే ఏడాది సర్ ప్రైజింగ్ చాన్స్ లతో షాక్ ఇస్తానని ఈ బ్యూటీ సర్ ప్రైజ్ చేస్తోంది. ఆ చాన్స్ లేంటో కానీ ప్రస్తుతం మాత్రం 'తమన్నా' 'బాహుబలి2' తన కెరీర్ ని మరోసారి టర్న్ చేస్తోందని నమ్ముతోంది.

హైకోర్టులో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై విచారణ..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో మరోసారి నిరాశే ఎదురైంది. 24 బిడ్ లకు గాను 14 బిడ్ లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. రూ. 1580 కోట్ల ఆస్తులు కొనేందుకు ఓ విదేశీ కంపెనీ సిద్ధంగా ఉందని, వేలం పాటను వాయిద వేయాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం పేర్కొంది. ఈ వాదనలను హైకోర్టు తిరస్కరించి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

జయ మృతిపై హైకోర్టులో పిటిషన్..

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. అన్నాడీఎంకే కార్యకర్త పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనంతో విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

 

మీడియా ఎదుట అయూబ్ ఖాన్..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ అయూబ్ ఖాన్ ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అయూబ్ ఖాన్ ను అరెస్టు చేయడం జరిగిందని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. అయూబ్ ఖాన్ 72 కేసుల్లో నిందితుడని, నకిలీ పాస్ట్ పోర్టు ఆధారంగా ఖాన్ ను ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారని తెలిపారు.

పోలవరంపై రూ. 8683 కోట్లు ఖర్చు - చంద్రబాబు..

తిరుపతి : ఎస్వీ వర్సిటీలో 99వ ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ వార్షిక సదస్సును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2018 నాటికి పోలవరం ఫేజ్ 1 పూర్తి చేస్తామని, పోలవరంపై ఇప్పటికే రూ. 8683 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం ఇదివరకే రూ. 930 కోట్లు ఇచ్చిందని, నిన్న రూ. 1981 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో పోలవరం నిర్మాణం చేపడుతున్నట్లు, 27 శాతం వర్షపాతం లోటు ఉన్నా 24.5 శాతం వ్యవసాయ వృద్ధి రేటు సాధించడం జరిగిందన్నారు.

16:45 - December 27, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ హాయాంలోనూ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. అవకతవకలకు పాల్పడుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి పరులపై జరుగుతున్న విచారణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని జానారెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మన గౌరవాన్ని తగ్గించుకోడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిలో పాలపంచుకున్న అందరిపైన యాక్షన్‌ తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన 3వేల కోట్ల రూపాయల అవినీతి డబ్బును వారితోనే కట్టిస్తామని కేసీఆర్‌ అన్నారు. తప్పకుండా కేసు దర్యాప్తు వేగాన్ని పెంచి త్వరలోనే అవినీతి పరులను బయటకు లాగుతామన్నారు.

16:42 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇకముందు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉండదని..దాన్ని పూర్తిగా రద్దు చేశామన్నారు సీఎం కేసీఆర్‌. ఇకముందు నుంచి బలహీన వర్గాలకు కేటాయించే ఇండ్లన్నీ డబుల్‌ బెడ్‌రూంలేననిన్నారు. ప్రస్తుతం హౌసింగ్‌ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరని...ఇతర డిపార్ట్‌మెంట్లలోకి బదిలీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

16:41 - December 27, 2016

హైదరాబాద్ : అర్హత కలిగిన వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. శాసనసభలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై చర్చలో ఆయన ప్రసంగించారు. నిలువ నీడ లేని పేద ప్రజలకు ఇళ్లు అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అర్హత కలిగిన ప్రజల వివరాల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

16:39 - December 27, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంలో ఎదురైన నిరాశ ఎదురైంది. 24 బిడ్‌లకు గాను 14 బిడ్‌లకు మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి.10 ఆస్తులను కొనేందుకు దరఖాస్తుదారులు ముందుకురాలేదు. వేలంపాటను వాయిదా వేయాలన్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం వాదనలు హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

16:14 - December 27, 2016

మూడు రోజుల్లోనే మిస్టర్ ఫర్ పెక్ట్ సెంచరీ కొట్టేశాడు. అనుకుంటున్నట్టుగానే 'అమీర్ ఖాన్' తన న్యూ మూవీ 'దంగల్' తో రికార్డ్స్ మోత మోగిస్తున్నాడు. ఫస్ట్ షోకే సూపర్ హిట్టు టాక్ రావడంతో ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ వైపు పరుగులు తీస్తోంది. 'ఆమీర్ ఖాన్' మూవీ 'దంగల్' అనుకున్నట్టుగానే సూపర్ హిట్టు టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ తో 'దంగల్' భారీ కలెక్షన్లను కొల్లగొట్టుతోంది. ముఖ్యంగా క్రిస్మస్ తో పాటు వీకెండ్ లీవ్స్ కూడా కలిసి రావడంతో ఈ మూవీ జెస్ట్ త్రీ డేస్ లోనే 100కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లింది.

డీమానిటైజేషన్ లో కూడా...
డీమానిటైజేషన్ లో కూడా 'దంగల్' మొదటి రోజున 29 కోట్ల వసూళ్లను చేసింది. ఇక శనివారం 34 కోట్లు, క్రిస్మస్ రోజు అయితే ఏకంగా తెలుగు, తమిళం,హిందీ కలిసి 43 కోట్లు వసూల్ చేసి సంచనలం సృష్టించింది. ఇప్పటి వరకు మూడు లాగ్వేంజెస్ హిందీ, తెలుగు, తమిళ్ ల్లో కలిపి 106 కోట్లను రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో 'దంగల్' న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. 'పీకే'తో అమీర్ ఖాన్ వరల్డ్ వైడ్ గా 600కోట్లు సాధించాడు. మరి 'దంగల్' కూడా ఆ స్థాయిని మించి వసూల్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ పరిస్థితి చూస్తుంటే న్యూ ఇయర్ వరకూ ఈ వారంలో సెలవలేవీ లేకపోవడం 'దంగల్' కు మైనస్ పాయింట్ గా చెప్పాలి. నెక్ట్స్ వీకెండ్ ఎలాగూ మంచి వసూళ్లు వస్తాయ్ కానీ ఈ మధ్యలో 'దంగల్' కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. ఒకవేళ 'అమీర్ ఖాన్' మ్యాజిక్ రిపీట్ అయితే 'దంగల్' కూడా 'పీకే' రేంజ్ లోనే వసూల్ ప్రవాహం పారించవచ్చు.

నోట్ల రద్దుతో 20 ఏళ్లు వెనక్కి - రాహుల్..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో దేశం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి పెరిగిందని, రైతులు, కూలీల వద్ద నగదు లేని పరిస్థితి నెలకొందని, ఈనెల 30వ తేదీలోపు పరిస్థితి మెరుగవుతుందని మోడీ చెప్పారని కానీ అలాంటి పరిస్థితి లేదన్నారు. నోట్ల రద్దు పెద్ద కుంభకోణమని, నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని మమత బెనర్జీ పేర్కొన్నారు.

 

16:04 - December 27, 2016

మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150' సినిమాపై తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు పక్క రాష్ట్రాల ఇండస్ట్రీస్ లో ఓ రేంజ్ క్రేజ్ ఏర్పడుతోంది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ కి భారీ అమౌంట్ పలికింది. అయితే రీసెంట్ గా కర్ణాటకలో రైట్స్ ని కూడా ఓ డిస్టిబ్యూటర్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. 'ఖైదీ నెంబర్ 150' సినిమా హవా స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. మెగాస్టార్ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. అరవైలో కూడా 'చిరు' ఇరవైఏళ్ల కుర్రాడిలా కేక పెట్టించేలా కనిపిస్తున్నాడు. దీనికి తోడు యూనిట్ ఈ ఏజ్ లో కూడా 'చిరంజీవి' ఫైట్స్..డాన్స్ లతో మెస్మరైజ్ చేస్తున్నాడని చెప్పుతుండడంతో 'ఖైదీ నెంబర్ 150' మూవీ చూడాలని ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా చూస్తున్నారు. అందుకే ఈ మూవీ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేట్స్ కి అమ్ముడుపోతున్నాయంట. చిరంజీవి 9ఏళ్ల తరువాత చేస్తున్న రీ ఏంట్రీ మూవీ కావడంతో సహజంగానే 'ఖైదీ నెంబర్ 150'పై బోలెడు అంచనాలు ఉంటాయి. అయితే 9ఏళ్ల తరువాత వస్తున్నప్పటికి ట్రేడ్ వర్గాల్లో 'చిరు' మార్కెట్ స్టామినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని ఈ మూవీ ఫ్రూవ్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 13 కోట్లకి అమ్ముడయ్యాయంటే 'ఖైదీ నెంబర్' 150పై క్రేజ్ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక డిస్ట్రిబ్యూషన్..
అదే విధంగా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడయ్యాయని అంటున్నారు. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను 9 కోట్లకి అమ్మినట్టుగా సమాచారం. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులకి సంబంధించి ఇంతవరకూ ఏ తెలుగు సినిమాకి కూడా ఈ స్థాయి రేటు పలకలేదని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఈ విషయంలోను ఈ సినిమా రికార్డు సృష్టించిందని చెబుతున్నారు. వినాయక్ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తండ్రి లాంగ్ గ్యాప్ తరువాత నటిస్తుండడంతో రామ్ చరణే స్వయంగా నిర్మాతగా మారి ఈ మూవీని నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి బరీలో రిలీజ్ అవుతున్న 'ఖైదీ నెంబర్ 150' తో మెగాస్టార్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

16:03 - December 27, 2016

హైదరాబాద్ : ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఇప్పటివరకే కేవలం 1200 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మాత్రమే కట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఇండ్లు కట్టడం అసాధ్యమన్నారు. ఒకవేళ ప్రభుత్వం లక్ష ఇండ్లు కడితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయమని సవాల్‌ విసిరారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5లక్షలుగా నిర్ణయించి టెండర్లు పిలవడంవల్లే ఎవరూ ముందుకు రావడంలేదని కోమటిరెడ్డి విమర్శించారు.

16:00 - December 27, 2016

హైదరాబాద్ : పేద ముస్లింలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందటం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లపై చర్చలలో భాగంగా ఆయన శాసనసభలో ఆవేశపూరితమైన ప్రసంగం చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పేదలకు కాకుండా బడాబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. అవినీతి, నల్లధనం వెలికి తీత పేరుతో సామాన్య ప్రజలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు.

15:58 - December 27, 2016

హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా ఎనిమిది నెలల్లో 150 గదులతో సీఎం క్యాంప్‌ ఆఫీసు నిర్మించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. అలాగే గ్రామానికి కనీసం రెండు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లనైనా నిర్మించి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండేళ్లలో నియోజకవర్గానికి 400 ఇళ్లు కట్టించాలని కోమటి రెడ్డి కోరారు.

కేసీఆర్ కౌంటర్.....

పంజాగుట్టలో నిర్మించిన ముఖ్యమంత్రి కొత్త నివాసంలో 150 గదులుంటాయన్న కాంగ్రెస్‌ సభ్యులు చేసిన విమర్శలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రగతి భవన్లో 150 గదులు ఉంటాయనేది శుద్ధ అబద్దం అని..ఒకవేళ ఉంటే కాంగ్రెస్‌ సభ్యులు నిరూపించాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సకల వసతులతో అధికారిక నివాస భవనం లేకపోవడం శోచనీయమన్నారు సీఎం కేసీఆర్‌. సకల హంగులతో 36 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రగతి భవన్‌..రాష్ట్ర ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. ఉదయం ప్రశ్నోత్తరాలు అనంతరం జీరో అవర్ కొనసాగింది. ప్రశ్నోత్తరాలకు అడ్దు తగిలిన సభ్యులు సంపత్ కుమార్, వీరయ్య, రేవంత్ రెడ్డిలను ఒక రోజు పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అనంతరం విపక్ష సభ్యుల సూచనలతో సస్పెన్షన్ ను ఎత్తివేశారు. మధ్యాహ్నం డబుల్ బెడ్ రూం ఇళ్లపై స్వల్పకాలిక చర్చ జరిగింది.

15:46 - December 27, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.... గతంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల రుణాలు రద్దు చేస్తామని చెప్పినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మార్చిలోపు బకాయిలు చెల్లించాలని కోరారు.

15:43 - December 27, 2016

హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై సిఐడీ విచారణ జరుగుతోందని త్వరలో దెంగలెరవో బయటపెడతామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పై సహృద్భావ వాతావరణంలో చర్చ జరిగింది. ప్రభుత్వం చేపట్టిన పతిష్టాత్మకమైన ఇండ్ల పథకంపై విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పేదలకోసం నిర్మించే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇళ్ల నిర్మాణంలో రాజకీయ జోక్యం, అధికారుల అవితికి తావులేకుండా పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పజెప్పామని, జిల్లా కలెక్టరే ఇళ్ల మూంజూరు గానీ, నిర్మాణం గానీ చేయిస్తారని సీఎం చెప్పారు. ఇందులో ఒక్క రూపాయి అవినీతి జరిగినా, ఒక్క లబ్దిదారుని ఎంపికలో అవకతవకలు జరిగినా సంబంధిత అధికారి సస్పెండ్ అవుతాడని హెచ్చరించారు.
ఆలస్యం జరిగిందన్న మాట వాస్తవమే....
ఇండ్ల నిర్మాణం చెప్పట్టాలనే ఉద్దేశంతో కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అని సీఎం చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణ చేపట్టామని, వాటి నిర్మాణం మెరుపువేగంతో కొనసాగించనున్నట్లు చెప్పారు. దాదాపు.2.60 లక్షల ఇళ్ల నిర్మానం చేపట్టాలనే ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణానికి 650 ఎకరాలు సేకరించినట్టు చెప్పారు. గతంలో హౌసింగ్‌ సంస్థలో అంతులేని అవినీతి జరిగిందని, దానిపై సీబీసీఐడీ విచారణను వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. నూటికి నూరు శాతం గృహ నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు.

రూ.3,920కోట్ల బకాయిలు మాఫీ...

గతంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రుణాలు తీసుకొని కట్టారనీ, దాంతో పేదలపై రూ.3,920 కోట్ల రుణభారం ఉందని చెప్పారు. అయితే ఆ రుణ భారం మొత్తాన్ని తొలగించేందుకు గాను ఆ మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ సభాముఖంగా ప్రకటించారు. గతంలో నెలకొన్న పథకాలను కొనసాగిస్తూనే వాటికీ నిధులు సమకూర్చినట్టు చెప్పారు. నోట్లరద్దుపై ప్రజల్లో భయోత్పాతం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. అనవసర ఆందోళనలు వద్దన్నారు.

తిరువంతపురంలో యూత్ కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్ నేతల ఆందోళన..

తిరువనంతపురం : యూత్ కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్ నేతలు రాష్ట్ర సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ర్యాంక్ ల లిస్టు వివాదంపై వీరు ధర్నా చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్ లను ప్రయోగించారు.

సీఎం ఆఫీస్ తెలంగాణ ప్రజల ఆస్తి - కేసీఆర్..

హైదరాబాద్ : కాంగ్రెస్ ధోరణి ఏంటో బయటపెట్టాలని, సీఎం నివాసం గురించి సభలో ఇలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. సీఎం అధికారిక నివాసంలో 150 గదులు ఎక్కడైనా ఉన్నాయా ? సీఎం నివాసం తన సొంత భవనం కాదని..అది ప్రజల ఆస్తి అని తెలిపారు. సీఎం నివాసం గురించి అసంబద్ధంగా మాట్లాడడం సరికాదన్నారు. కలెక్టర్లు అధికారుల కాన్ఫరెన్స్ నిర్వాహణకు ఉపయోగపడేలా ప్రగతి భవన్ ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని, త్వరలో దొంగలెవరో బయటపెడుతామన్నారు. జంటనగరాల్లో 650 ఎకరాల స్థలంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని వెల్లడించారు.

పరిపాలన ట్రైబ్యునల్ జీతభత్యాలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : పరిపాలన ట్రైబ్యునల్ జీతభత్యాలు నిర్వాహణపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 42:58 నిష్పత్తిలో జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన ఖర్చులు ఏపీ ప్రభుత్వం భరించాలని, ట్రైబ్యునల్ ఉద్యోగుల విభజన మూడు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంది. మూడు నెలల్లో పూర్తికాకపోతే కేంద్రం జోక్యం చేసుకోవాలని పేర్కొంది.

కేరళలో బస్సు ప్రమాదం..

కేరళ : మైసూర్ లోని కోజికోడ్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో 38 మంది కాలేజీ విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

14:28 - December 27, 2016

మెగా స్టార్ 'చిరంజీవి' చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ వేడుక కొద్ది రోజుల్లోనే జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును చిత్ర యూనిట్ చేస్తోందని తెలుస్తోంది. విజయవాడలో జనవరి 4వ తేదీన ఈవెంట్ జరగనుంది. కొన్ని సంవత్సరాల అనంతరం 'చిరంజీవి' నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాను 'కత్తి' రీమెక్ తో ఈ చిత్రం రూపొందుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో 'చిరు' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. 'చిరంజీవి' కి 150వ చిత్రం కావడంతో అభిమానులు..ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ వెరైటీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా సాంగ్స్ ను యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఆడియో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొనడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారంట. అభిమానులును తృప్తిపరిచేందుకు ప్రీ రిలీజ్ వేడుక చేయాలని భావించారు. ఈవెంట్ లో హోస్ట్ లు గా ఎవరు ? అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. టాలీవుడ్ కండల వీరుడు 'రానా, హీరో..కమ్ క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్న 'నవదీప్' లు హోస్ట్ లని టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా ? కాదా? అనేది తెలియాలంటే జనవరి 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

14:12 - December 27, 2016

మహిళలు, పిల్లలపై అరాచకాలు పెరుగుతున్నాయని వక్తలు అన్నారు. 'మహిళలు, పిల్లలపై పెరుగుతున్న దాడులు,.... శిక్షలు' అనే అంశంపై ఇవాళ్టి మానవి వేదికలో జరిగిన చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ నాగేశ్వర్ రావ్ పుజారి, పీఓడబ్ల్యు నేత సంధ్య పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

ప్రణబ్ ను కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఏపీ కాంగ్రెస్ నేతలు కలువనున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నారు.

 

కాసేపట్లో అగ్రిగోల్డ్ బిడ్డింగ్ పత్రాలు ఓపెన్..

హైదరాబాద్ : కాసేపట్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేల బిడ్డింగ్ పత్రాలను హైకోర్టును ఓపెన్ చేయనుంది. అమరావతిలోని కీసరలో భూములు, విజయవాడలోని కమర్షియల్ కాంప్లెక్స్ వేలం వేయనున్నారు.

14:08 - December 27, 2016

తిరుపతి : పోలవరం ప్రాజెక్టు నాబార్డు 1980 కోట్ల రుణం ఇచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సకాలంలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి చూపించామని తెలిపారు. 1940 లో పోలవరం ప్రాజెక్టు కడదామని చర్చ జరిగాయని చెప్పారు.  1981 లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరవు రహిత రాష్ట్రంగా ఏపీ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. 30 సం. ల నుంచి ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చిందన్నారు.

14:08 - December 27, 2016

నెలకు మీకు జీతం రూ. 5వేలు అనుకోండి..బ్యాంకు ఖాతాలో పడే ఈ డబ్బును జాగ్రత్తగా వాడుతుంటారు అనుకోండి..ఒకేసారి మీ ఖాతాలో వంద కోట్లు పడితే ఏం చేస్తారు? ఏం చేస్తాం..ఏ మాత్రం ఆలోచించకుండా మంచి ఇళ్లు కొంటాం..నగలు..ఇతరత్రా కొంటాం అని అంటున్నారా ? కానీ ఒకామె మాత్రం ఈ వంద కోట్లు తనకు వద్దు..తన జీతం తనకు ఉండాలని అంటోంది. అవును మీరు వింటున్నది నిజమే. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
పేద మహిళకు గజియాబాద్ లోని శారదారొడ్డులోని ఎస్ బీఐ బ్యాంకు లో జన్ ధన్ ఖాతా ఉంది. ఈమెకు నెలనెలా వచ్చే రూ. 5వేల జీతం బ్యాంకులో వేస్తుంటుంది. ఖర్చులకు డబ్బును అప్పుడప్పుడూ డ్రా చేస్తుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో డిసెంబర్ 18వ తేదీన సమీపంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం నుండి రూ. 2వేలు డ్రా చేసింది. డబ్బులతో పాటు స్లిప్ లో వచ్చిన బ్యాలెన్స్ అర్థం కాలేదు. దీనితో అక్కడున్న వారిని అడిగింది. అడిగిన వారంతా రూ. 99,99,99,394 ఉన్నాయని చెప్పడంతో ఆ పేద మహిళ ఆశ్చర్యపోయిందంట. వెంటనే మరో బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లి బ్యాలెన్స్ చూసుకుంది. అంతే రావడంతో నేరుగా ఎస్ బీఐ బ్యాంకుకు వెళ్లింది. క్యాషియర్ ను సంప్రదించింది. తన అకౌంట్ లో ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ప్రశ్నించింది. వెంటనే ఈ డబ్బును తొలగించాలని కోరింది. మేనేజర్ లేడు..రేపు రావాలని క్యాషియర్ చెప్పి పంపించాడు. ఇలా మూడు రోజుల పాటు బ్యాంకు చుట్టూ తిరిగిందంట. ఈ విషయం తెలిసిన వారు డబ్బులు డ్రా చేసుకోవాలని..వాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారంట. తన డబ్బు కానప్పుడు ఎలా వాడుకోవాలని ఆ పేద మహిళ భావించింది. స్థానికంగా ఉండే ఓ ఉపాధ్యాయుడి సహాయంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏకంగా ఈ-మెయిల్ చేసింది. తన అకౌంట్ ఉన్న రూ. 99,99,99,394 డబ్బు సంగతి తేల్చాలని కోరింది. తనవి కాని ఈ డబ్బు వద్దు..తన జీతం రూ.5వేలలో ఏ మాత్రం తగ్గినా ఊరుకోను అంటూ ఆ పేద మహిళ చెబుతోందంట.

13:59 - December 27, 2016

జగిత్యాల : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 72వరోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాల్లో పాయదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలతోపాటు, ప్రజాసంఘాలు కూడా యాత్రకు మద్దతుగా నడక సాగిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:57 - December 27, 2016

హైదరాబాద్ : డబుల్‌ బెడ్‌రూంలు కట్టిస్తారనే ఆశతోనే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే..ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ముచేసిందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు త్వరలో అన్నిజిల్లాల్లో పేదలకు ఇళ్లు కట్టించాలని ఆమె  డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతిపై సీబీసీఐడీ దర్యాప్తు పేరుతో  సీఎం కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆమె విమర్శించారు. ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై దర్యాప్తు జరగవలసిందేనని.. అయితే.. దర్యాప్తు పేరుతో పేదలకు ఇళ్లుదక్కకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

 

13:54 - December 27, 2016
13:53 - December 27, 2016
13:51 - December 27, 2016
13:51 - December 27, 2016

పనాజీ : గోవా ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌జెట్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. రన్‌వేపై విమానం జారిపడింది. సాంకేతిక లోపంతో రన్‌వేపై విమానం పక్కకు ఒరిగింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బందితో పాటు 154  మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం దిగేటప్పుడు 10 మందికి గాయాలయ్యాయి. దీంతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. 

 

13:47 - December 27, 2016

కరీంనగర్ : సీపీఎం మహాజన పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలోని అరుణకొండ, మల్లాపూర్, పత్తిపాక, ల్యాగలమర్రి, దీకొండ, నంచర్లలో పాదయాత్ర బృందం పర్యటించింది. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర బృందం.. నేటికి 1870 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం : తమ్మినేని 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్‌ సర్కార్‌ తీవ్ర వైఫల్యం చెందిందని తమ్మినేని విమర్శించారు. మహాజన పాదయాత్రకు అడుగడుగునా అన్నివర్గాల వారు సంఘీభావం తెలుపుతున్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలని ఆయన అన్నారు.  
లెదర్‌ పార్క్‌ అతీ గతి లేదు : జాన్ వెస్లీ
కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లో ఏర్పాటు చేస్తామన్న లెదర్‌ పార్క్‌ అతీ గతి లేదని పాదయాత్ర బృందం ఉపనాయకుడు జాన్‌వెస్లీ విమర్శించారు. చొప్పదండిలో దళితులకు, అగ్రకులాల వారికి వేర్వేరు వాటర్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారని ఆయన దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో దళితులకు, బడుగు, బలహీన వర్గాల యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన అన్నారు. 
జగిత్యాల జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశం
సీపీఎం పాదయాత్ర 71 వ రోజు కరీంనగర్ జిల్లాలోని అరుణకొండ, మల్లాపూర్, పత్తిపాక, ల్యాగలమర్రిలో పర్యటించి.. అక్కడి నుంచి జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించింది. జగిత్యాల జిల్లాలోని దీకొండ, నంచర్లలో పర్యటించిన పాదయాత్ర బృందం .. నేటికి 1870 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పత్తిపాక లెదర్‌ పార్క్‌పై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

13:43 - December 27, 2016

ఢిల్లీ : ఉత్తరభారతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోచలితీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరోవైపు ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో నిర్దిష్ట సమయం కంటే 32 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముందు జాగ్రత్తగా మూడు రైళ్లను రైల్వేశాఖ రద్దుచేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:41 - December 27, 2016

పెద్ద నోట్ల రద్దుతో చిన్న, కౌలు రైతులు, కూలీలు నష్టాల సుడిగుండలో చిక్కుకున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత జమలయ్య అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'కరెన్సీ కష్టాలు తీరడం లేదు. సన్న, చిన్న, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రైతులు పంటలు అమ్ముకున్నా చేతిలోకి నగదు రావడం లేదు. దీంతో తాము చెల్లించాల్సినవి చెల్లించలేకపోతున్నారు. కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరే అవకాశం లేదన్న వార్తలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ సంగతి దేవుడెరుగు అసలు ఇవాళ నడిచేదెట్లా అన్న ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చితికిపోతున్నవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. సన్న, చిన్న, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుదారులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వృత్తిదారుల సంఘం, కెవిపిఎస్ లాంటి ప్రజాసంఘాలు ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపడుతున్నాయి'. వంటి అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:35 - December 27, 2016

నెల్లూరు : పులికాట్ సరస్సుకు వేల కిలోమీటర్ల దూరం నుంచి పక్షులు వలస వస్తాయి. ఆరునెలల పాటు ఇక్కడే విడిది చేసి సందడి చేస్తాయి.  ఈ సరస్సుకు వచ్చే అరుదైన పక్షి ఫ్లెమింగ్ పేరుతో ప్రభుత్వం ప్రతి ఏటా పండుగ నిర్వహిస్తోంది. గత ఏడాది ప్లేమింగో ఫెస్టివల్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం.. నేటినుంచి ఆ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 
నేలపట్టు, పులికాట్ సరస్సులకు అరుదైన పక్షులు
నెల్లూరు జిల్లాలోని నేలపట్టు, పులికాట్ సరస్సులకు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాలలో వివిధ దేశాల నుంచి అరుదైన పక్షులు వలస వచ్చి ఆరు నెలల పాటు విడిది చేస్తుంటాయి.  నైజీరియా, సైబీరియా, ఇండేనేషియా, థాయిలాండ్, బర్మా, కజికిస్తాన్, పాకిస్థాన్, చైనా , శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి సుమారు 20 దేశాల నుంచి లక్షల సంఖ్యలో పక్షులు పులికాట్ సరస్సుకు వలస వస్తాయి. 117 జాతులకు చెందిన పక్షులు  వలస వచ్చి ఇక్కడ విడిది తీసుకుంటాయి
వేలాదిగా వలసవచ్చిన ప్లెమింగోలు 
నేలపట్టుతో పాటు పులికాట్ సరస్సును కూడా విదేశీ విహంగాలు కలర్ ఫుల్ గా మార్చేస్తాయి. పొడవైన కాళ్ళు, పొడవైన మెడతో పాటు కలర్ ఫుల్ గా కనిపించే ఫ్లెమింగో లు వేలాదిగా పులికాట్ కు వలస వస్తాయి. ఇలా వలస వచ్చే ఫ్లెమింగో పేరిట ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. 
రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం 
1972 నుంచి వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చే పక్షులను సంరక్షించడంతో పాటు పులికాట్, నేలపట్టు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలు మార్చడానికి 2001లో పక్షుల పండుగను ప్రారంభించింది. పులికాట్ సరస్సుకు వచ్చే అరుదైన పక్షిగా చెప్పుకునే ఫ్లేమింగో పక్షి పేరుతో ప్రభుత్వం ప్రతి ఏటా పండుగలను అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తోంది. 14 సంవత్సరాల పాటు ఈ పండుగను కలెక్టర్ నిధులతో నామమాత్రంగా నిర్వహించేవారు. అయితే గత ఏడాది నుంచి  ఫ్లెమింగో ఫెస్టివల్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. దీంతో ఈసారి 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి.. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను అంగరంగవైభవంగా నిర్వహించబోతుంది. ఇప్పటికే ఫ్లెమింగో ఫెస్టివల్ సన్నాహక ర్యాలీలు నిర్వహించింది. 
నీళ్లు లేక తగ్గిన విదేశీ పక్షుల వలస
నెల్లూరు జిల్లాలో ప్రతి ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో పక్షులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేవి. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నేలపట్టులో నీళ్లు లేక పక్షులు రాక చాలా తగ్గింది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్షుల పేరుతో పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేలప్టటుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేయనున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్టాల్స్ పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. 

 

13:29 - December 27, 2016

కడప : జిల్లా పులివెందులలో నీళ్ల రాజకీయం మొదలైంది. ఒకవైపు అధికార టీడీపీ, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ...  పులివెందులకు నీటి కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జగన్‌ కోటను బద్దలు కొట్టాలన్నదే టార్గెట్‌గా  టీడీపీ పావులు కదుపుతోంది. అధికార పార్టీ ఎత్తుల్ని చిత్తు చేసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.  దీంతో పులివెందుల నీటి రాజకీయం రసకందాయంలో పడింది.
కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట
కడప జిల్లా వైసీపీకి  పెట్టని కోట. ఇక పులివెందులైతే వైఎస్‌ కుటుంబానికి శత్రుదుర్భేద్యమైనదిగా  చెప్పుకుంటారు.  అవసరమైతే తన మనుషుల్నే ప్రత్యర్ధులుగా చెలామణి చేసే రాజకీయ చాణక్యం వైఎస్‌ కుటుంబానిది.  పులివెందుల నియోజకవర్గంలో  రాజకీయంగా  దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానిదే పైచేయి. ప్రత్యర్ధికి డిపాజిట్లు కూడా దక్కని ఓటుబ్యాంక్‌ వైఎస్‌ కుటుంబానికుంది. ఒక రకంగా చెప్పాలంటే పులివెందులలో వైఎస్‌ కుటుంబం చెప్పిందే శాసనం.
వైఎస్‌ కుటుంబం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ వ్యూహాలు
శత్రుదుర్భేద్యమైన వైఎస్‌ కుటుంబం కోటను బద్దలు కొట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు  కృత నిశ్చయంతో ఉన్నారు. సాధ్యమైనంతగా వైఎస్‌ పాపులారిటీని తగ్గించాలని చూస్తున్నారు.  కడప జిల్లాకు ఆయన వచ్చినప్పుడల్లా  వైఎస్‌ కుటుంబంపై ఒంటికాలిమీద లేస్తున్నారు.  కడప జిల్లా వెనుకబాటుకు రాజశేఖరరెడ్డి కుటుంబమే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిననాటి నుంచే పులివెందులకు నీరు ఇస్తామనే రాగం ఎత్తుకున్నారు.  గండికోట రిజర్వాయర్‌ ద్వారా చిత్రావతి , పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి పులివెందులను నీటితో తడుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే గండికోట ముంపు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.  త్వరలోనే గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపనున్నారు.  ఎన్నోఏళ్లుగా వైఎస్‌ కుటుంబం చేయలేని అభివృద్ధిని తాము చేసి చూపిస్తామన్న కృత నిశ్చయంలో చంద్రబాబు ఉన్నారు.
టీడీపీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు జగన్‌ ప్రతివ్యూహాలు
కడప జిల్లాలో పట్టు సాధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు ప్రతిపక్షనేత జగన్‌ ప్రతివ్యూహాలను  రచిస్తున్నారు. పులివెందులకు నీళ్లిస్తామన్న చంద్రబాబు  హామీలను జగన్‌  ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.  అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లైనా ఇంత వరకు పులివెందులకు నీరు ఎందుకు ఇవ్వలేదో  చెప్పాలని నిలదీస్తున్నారు. నీటి కోసం పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయం ముందు వైసీపీ నిర్వహించిన ధర్నాలో జగన్‌ పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గండికోట నిర్వాసితులకు రూపాయి ఇవ్వలేదు : జగన్  
గండికోట నిర్వాసితులకు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదని జగన్‌ ఆరోపించారు. తుంగభద్ర నీళ్లు ఏమాత్రం పులివెందుల ప్రజలకు సరిపోవడం లేదన్నారు. చంద్రబాబు మాటలు చెబుతారు కానీ నిధులు ఇవ్వరని విమర్శించారు. ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలైనా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని ఎద్దేవా చేశారు. మొత్తానికి పులివెందుల నీటి రాజకీయాలు అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలతో రసకందాయంలో పడ్డాయి. ఇంతకీ పులివెందులకు నీరు వస్తుందా రాదా అన్న ప్రశ్న   స్థానిక ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.

 

13:20 - December 27, 2016

హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. డబుల్ బెడ్  రూం ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయిని తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.369.48 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రాజకీయ అవినీతి లేకుండా ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదల ఆత్మగౌరవానికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయి, ఎందరో అనర్హులు ఇళ్లు పొందినట్లు తేలిందన్నారు. 512 గృహ నిర్మాణ శాఖ అధికారులను ఉద్యోగాల నుండి తొలగించారని, 140 మందిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. 122 మందికి శిక్షలు పడ్డాయని, కొంత నగదు రికవరీని చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తాము 2014 జులై 26 సీబీసీఐడీ విచారణకు ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు. సర్వే చేసిన అనంతరం వాస్తవులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశించినట్లు, లక్షా 19వేల మంది బోగస్ లున్నారని తేలిందన్నారు. గత ప్రభుత్వ హాయంలో అనుమతి అయిన ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందన్నారు. రూ. 369.48 కోట్లు చెల్లించడం జరిగిందని, 2014కంటే ముందు మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. పేదల నిజమైన అవసరాలు తీర్చాలనే ఉద్ధేశ్యంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం కొంత ఇచ్చి..లబ్ధిదారుల కొంత అనే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికిందని, గ్రామాలు..పట్టణాలు, జీహెచ్ ఎంసీ..లకు కొంత డబ్బులు కేటాయించడం జరిగిందని, బడ్జెట్ లో దీనికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 17వేల 600 కోట్లను సమకూర్చడం జరిగిందన్నారు. కేంద్రం నుండి కూడా గృహ నిర్మాణ పథకాల కింద రూ. 333 కోట్లు వచ్చాయన్నారు. రెండేళ్లలో రూ. 17, 660 కోట్లు కేటాయించడం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

 

13:12 - December 27, 2016

ప్రేమ..తమ ప్రేమను దక్కించుకోవాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొంత మంది తమనే ప్రేమించాలంటూ ప్రేమోన్మాదులు దాడులకు దిగుతుండడం చూస్తునే ఉంటాం. కానీ ఓ ప్రియురాలు మాత్రం చేసిన పనిని చూస్తే ఆశ్చర్యపోతుంటారు. ప్రియుడి కోసం ఏకంగా ఆమె ఎలాంటి పని చేసిందో తెలుసుకోవాలంటే చదవండి...

నగరంలోని మలక్‌పేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని, యశ్వంత్ లు ప్రేమించుకున్నారు. యశ్వంత్ ఓ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. వీరు దిల్ సుఖ్ నగర్ లో వేర్వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. డబ్బుల కోసం తాను ఇబ్బందులు పడుతున్నానని యశ్వంత్ ఆమెతో పేర్కొన్నాడు. ఎలాగైనా ప్రియుడికి డబ్బులు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందుకు ఫేస్ బుక్ మార్గమని భావించి మహిళలను ఫ్రెండ్స్ గా చేసుకుంది. యూసుఫ్ గూడ చెక్ పోస్టు సమీపంలోని తాహెర్ విల్లా కాలనీకి చెందిన బోడ మమతతో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో నవంబర్ నెలలో మమత ఇంటికి ఆమె వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో తన బంగారు నగలు పోయాయని మమత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో యువతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. బంగారు నగలను యశ్వంత్ కి ఇచ్చినట్లు, విక్రయించిన డబ్బుతో అవసరాలు తీర్చుకున్నట్లు చెప్పింది. దీనితో యువతిని, యశ్వంత్ ను అరెస్టు చేశారు.

13:07 - December 27, 2016

హైదరాబాద్ : జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ మధ్య బస్సుల వివాదం ముదిరింది. జేసీకి చెందిన బస్సుల రూట్‌ అనుమతులపై శ్రీనివాస్‌గౌడ్‌ ,చేసిన వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఆర్టీఏ ఆఫీసుకు వచ్చి తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు. జేసీ సవాల్‌తో శ్రీనివాస్‌గౌడ్‌ ఆర్టీఏ ఆఫీసుకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆర్టీఏ ఆఫీసుకు వస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

13:04 - December 27, 2016

చెన్నై : అన్నాడీఎంకే పగ్గాలను చిన్నమ్మ శశికళ ఇప్పట్లో చేపట్టే సూచనలు కనిపించడం లేదు. జయలలిత మృతితో  ఖాళీ ఏర్పడిన ఆ పదవిని చేపట్టేందుకు ఆమె ప్రజామోదం కోసం ఎదురు చూస్తున్నారు.  2019 ఎన్నికల తర్వాతే శశికళ ఆ పదవిని చేపట్టే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జయలలిత మృతితో జనరల్‌ సెక్రటరీ పదవి ఖాళీ 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని  శశికళ ఇప్పట్లో  చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. అమ్మ జయలలిత  తర్వాత చిన్నమ్మగా పేరు గడించింది శశికళ. అమ్మ మరణంతో ఖాళీ అయిన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళే చేపడుతుందని అందరూ భావించారు.  పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచీ పార్టీ పగ్గాలు చేపట్టాలని శశికళపై ఒత్తిడి వస్తోంది. త్వరలోనే ప్రధాన కార్యదర్శి పదవిని చిన్నమ్మ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగింది.  మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా ఇప్పటి వరకు  శశికళ మాత్రం ఈ విషయంలో తన అభిప్రాయమేంటో ఇంత వరకు చెప్పలేదు. చిన్నమ్మ మౌనంగా ఉండడం వెనక మతలబు ఏమిటో అర్ధంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. 
ప్రజామోదం కోసం ఎదురు చూస్తున్న శశికళ
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి శశికళ చేపట్టపోవడం వెనక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది.  జనరల్‌ సెక్రెటరీ పదవిని చేపట్టాలని ఇప్పటి వరకు పార్టీ శ్రేణులే కోరుతున్నాయి. అయితే చిన్నమ్మ మాత్రం ప్రజామోదం కూడా కావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసం 2019 ఎన్నికల వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించి ఆ పదవి చేపట్టే యోచనలో చిన్నమ్మ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అప్పటి వరకు ఆ పదవిని ఎవరూ చేపట్టకుండా ఖాళీగానే ఉంచాలని పార్టీలో కొంతమంది నేతలు భావిస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్లు
మరికొంత మంది సీనియర్‌ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు.  పార్టీ అధినేత లేకుండా అన్ని రోజులపాటు పార్టీ నడపడం కష్టమని, అందుకే తక్షణమే శశికళ ఆ పదవి చేపట్టాలని సూచిస్తున్నారు. జయలలిత మృతి కారణంగా ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్‌కు ఆరునెలల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ అధినేత తప్పనిసరని చెప్తున్నారు. 
29న అన్నాడీఎంకే కీలక సమావేశం
ఇక అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న జరగనుంది. మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడం, ఇప్పటివరకు పార్టీ పగ్గాల గురించి శశికళ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది. మరోవైపు పార్టీ సర్వసభ్య సమావేశంలోనే చిన్నమ్మను  పార్టీ కార్యదర్శిగా ప్రకటిస్తారన్న ప్రచారమూ సాగుతోంది. అయితే.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి శశికళ చేపడుతుందా లేదా అన్నది తేలాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

 

పార్టీలకతీతంగా పనిచేస్తున్నాం - హరీష్ రావు..

హైదరాబాద్ : తమ ప్రభుత్వం పార్టీలకతీతంగా పనిచేయడం జరుగుతోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై జరుగుతున్న చర్చలో టి.కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ చేసిన విమర్శలపై మంత్రి హరీష్ స్పందించారు. పార్టీలకతీతంగా పనిచేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 20 శాతం చెరువులు ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలని చూడకుండా గ్రామాలకు రోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మా నియోజకవర్గాల్లో రెండు ఇళ్లేవి - డీకే అరుణ..

హైదరాబాద్ : తమ నియోజకవర్గాల్లో రెండు ఇళ్లేవి అని టి.కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. ఓ పక్క ముఖ్యమంత్రి..మరో పక్క ఇరిగేషన్ మంత్రి..మరో మంత్రి కేటీఆర్ వారి వారి నియోజకవర్గాలకే అభివృద్ధి తీసుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టవద్దా అని ప్రశ్నించారు.

12:46 - December 27, 2016

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న వారిలో 'సుమ' అగ్రస్థానంలో ఉంటుందనే విషయంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె గురించి తెలిసిన వారు ఉండరు. తన అందనమైన నటనతో...చలాకీతనంతో ఈ కేరళ అమ్మాయి ఆకట్టుకొంటోంది. ఆమె బుల్లితెరను చాలాకాలమే అయ్యింది. ఆమె కళ్ల ముందే ఎంతో మంది వచ్చారు...పోయారు. కానీ 'సుమ' అప్పుడూ ఇప్పుడూ అలాగే..అంతే యాక్టివ్ గా ఉంటోంది. పలు చలన చిత్రాలకు సంబంధించిన వేడుకల్లో 'సుమ' యాంకర్ గా నిర్వహిస్తూ ఉంటోంది. తాజాగా 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకలో 'సుమ' యాంకర్ గా నిర్వహించింది. తిరుపతిలో జరిగిన ఈ వేడుకలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య 'సుమ'పై ప్రశంసలు కురిపించడం ఆకట్టుకుంది. సుమారు పది నిమిషాల పాటు ఆయన 'సుమ' గురించే మాట్లాడారు. ఇప్పుడు అంతా తెలుగు మాట్లాడటానికే ఇబ్బంది పడుతున్న సమయంలో వేరే రాష్ట్రం అమ్మాయి అయినప్పటికీ 'సుమ' తెలుగులో అద్భుతంగా మాట్లాడుతోందని..ఆమెను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మమ్మీ , డాడీ, కేడీ ఇలాంటి పదాలను వదిలేసి అమ్మ, నాన్న అని పలకాలని సూచించారు. ఈ సమయంలో 'సుమ' నేరుగా ఆయన వద్దకు వచ్చి 'వెంకయ్య'కు పాదాభివందనం చేసింది. చక్కగా తెలుగులో మాట్లాడుతున్నావమ్మా నీ ఆటా, పాటా, కట్టు బొట్టూ, తీరు, తెలుగు ఉచ్ఛారణ, సంప్రదాయం అన్నింటిలో చక్కగా ఉంటున్నావని నా అభినందనలని అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

12:44 - December 27, 2016

విశాఖ : నగరంలో నోట్ల మార్పిడి ముఠాలు హల్‌చల్‌ చేశాయి. కొన్ని రోజులుగా గాజువాక, అనకాపల్లి ముఠాల మధ్య వివాదం జరుగుతోంది. దీంతో రెండు ముఠాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండు ముఠాలకు చెందిన ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:36 - December 27, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం తుది అంకానికి చేరుకుంది. హైకోర్టు ఆదేశంతో చేపట్టిన అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం బిడ్స్ గడువు ముగిసింది. సీల్డ్‌ కవర్‌లో పంపించిన బిడ్‌లను ఈరోజు మధ్యాహ్నం తెరవనున్నారు. హైకోర్టు ఆదేశంతో సీఐడీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. 
హైకోర్టు ఆదేశంతో బిడ్స్ దాఖలు
అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో హైకోర్టు ఆదేశంతో బిడ్స్ దాఖలయ్యాయి. దాఖలైన బిడ్స్‌ను ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెరవనున్నారు. ఆయా ఆస్తులకు సంబంధించిన కనీస ధర కంటే అత్యధిక మొత్తాలకు కేటాయించే ప్రక్రియ చేపడతారు. హైకోర్టు ఆదేశంతో చేపట్టిన వేలం ప్రక్రియను సీఐడీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. 
కృష్ణా జిల్లా కీసర గ్రామం వద్ద 391 ఎకరాలు
కృష్ణా జిల్లా కీసర గ్రామం వద్ద 391 ఎకరాలను 11 భాగాలుగా, విజయవాడలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయంతో పాటు ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను 13 భాగాలుగా చూపించారు. 284 కోట్ల రూపాయల ప్రాధమిక ధరగా నిర్ణయించి మొత్తం 24 బిడ్‌లుగా పిలిచారు.  ఈనెల 11వ తేదీ నుంచి 18 వరకు స్వయంగా పరిశీలించుకునే వీలు కల్పించారు. అయితే సోమవారం సాయంత్రానికి  బిడ్స్ దాఖలుకు గడువు ముగిసింది. దాఖలైన బిడ్స్‌ను ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలు హైకోర్టులో తెరుస్తారు. 
ఇప్పటివరకు 99 మంది అగ్రిగోల్డ్ బాధితుల మృతి
అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసిన బాధితుల మనోవేదన వర్ణనాతీతం. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 99 మంది డిపాజిటర్లు, ఏజెంట్లు ప్రాణాలు విడిచారు. కాయకష్టం చేసి దాచుకున్న సొమ్ముకు దిక్కులేకపోవడం, వస్తుందో...రాదో తెలియక  చాలా మంది మృతిచెందారు.  హైకోర్టు ద్వారా నిర్వహిస్తున్న వేలంలో తమ సొమ్ములు ఎంతమేరకు వస్తాయోనన్న ఉత్కంఠతో డిపాజిటర్లు ఎదురుచూస్తున్నారు. 
డిపాజిటర్ల నుంచి రూ. 6,380.48 కోట్లు వసూలు
అగ్రిగోల్డ్ సంస్థ 33.07607 అకౌంట్లకు చెందిన 19 లక్షల18 వేల 882 మంది డిపాజిటర్ల నుంచి 6 వేల 380 కోట్ల 48 లక్షలు వసూలు చేసింది. వీరిలో రాష్ట్రంలోని 19 లక్షల 52 వేల 256 అకౌంట్లకు చెందిన 11 లక్షల 57 వేల 503 మంది డిపాజిటర్ల నుంచి 3 వేల 966 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అగ్రిగోల్డ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో 17 వేల ఎకరాలు, ఇతర రాష్ట్రాల్లో 3 వేల 200 ఎకరాల స్థిరస్తులున్నాయి. వీటితో పాటు బంగారం వెండి,  వాహనాలు, భవనాలు వంటి ఆస్తులున్నాయి. వీటిని మార్కెట్ ధరకు అమ్మితే కచ్చితంగా బాధితులకివ్వాల్సిన డిపాజిట్లు మొత్తానికంటే అదనంగా మిగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల వెనుకంజ – కేసీఆర్..

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో టెండర్లు పిలవడం జరిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. శాసనసభలో మంగళవారం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ చర్చను కేసీఆర్ ప్రారంభించారు. టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారని, మిషన్కాకతీయ..రహదారుల నిర్మాణ పనులు ఉధృతంగా సాగుతున్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ లాభాలు ఉండవని కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారని తెలిపారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సిమెంట్ అందించడం జురుగుతోందని, ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 31సిమెంట్ కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నామన్నారు.

12:24 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత సభలో జీరో అవర్ కొనసాగుతుంది. సభ్యులు పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ పేరుకే కల్వకుర్తి ఎత్తిపోతల పథకమని... కల్వకుర్తి నియోజకవర్గానికి చుక్క నీరు అందడం లేదన్నారు. కల్వకుర్తికి చుక్క నీరు అందనటువంటి ప్రాజెక్టు కెఎల్ ఐ పథకమన్నారు.
కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ : సున్నం రాజయ్య
అనంతరం సున్నం రాజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. హెచ్ ఆర్ ఏ పెంచాలన్నారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. 
డిజైన్ మార్పుతో అదనంగా 40 ఏకరాలకు నీరు : గువ్వల బాలరాజు 
డిజైన్ మార్పు ద్వారా అదనంగా 30 లేక 40 ఎకరాలకు నీరు అందుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. కెఎల్ఐ ద్వారా అచ్చంపేట నియోజకవర్గానికి నీరందించాలని కోరారు. 

 

ఇళ్లు లేని పేదలు ఉండద్దు - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో మంగళవారం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ చర్చను కేసీఆర్ ప్రారంభించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయి, ఎందరో అనర్హులు ఇళ్లు పొందినట్లు తేలిందన్నారు. 512 గృహ నిర్మాణ శాఖ అధికారులను ఉద్యోగాల నుండి తొలగించారని, 140 మందిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. 122 మందికి శిక్షలు పడ్డాయని, కొంత నగదు రికవరీని చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తాము 2014 జులై 26 సీబీసీఐడీ విచారణకు ఆదేశించడం జరిగిందని గుర్తు చేశారు.

12:12 - December 27, 2016

బాలీవుడ్ కండల వీరుడు అభిమానులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ఆయన 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన జన్మదిన సందర్భంగా అభిమానులకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ట్విటర్ లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే ఆయన రిటర్న్ గిఫ్ట్ ప్రకటించారు. ఏంటా గిఫ్ట్ ? అని అనుకుంటున్నారు. 'సల్లూ' భాయ్ సొంత దుస్తుల బ్రాండ్ అయిన 'బీయింగ్ హ్యూమన్' పై స్పెషల్ డిస్కౌంట్లు..బీయింగ్ హ్యూమన్ ఫ్లాట్ పై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా ఆన్ లైన్ మింత్రాలో కూడా ఈ డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపాడు. సామాజిక సేవలో భాగంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బర్త్ డే సందర్భంగా బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్, స్టైయిల్ క్వాటియంట్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బీయింగ్ హ్యుమన్ ఫ్యాషన్ జువెల్లరీని 'సల్మాన్ ఖాన్' లాంచ్ చేస్తున్నాడు.

12:07 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభంకాగాగే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాలను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తిరస్కరించారు.

12:03 - December 27, 2016

హైదరాబాద్ : విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేశారు. విపక్ష సభ్యుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ సభ్యులు సంపత్ కుమార్, టీడీపీ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డిలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈనేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ ఆందోళన చేస్తున్న ముగ్గురు విపక్ష సభ్యులపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈమేరకు స్పీకర్ కాంగ్రెస్ సభ్యులు సంపత్ కుమార్, టీడీపీ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డిలపై సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అయితే విపక్షసభ్యుల విజ్ఞప్తి మేరకు సంపత్ కుమార్, టీడీపీ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డిలపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు. అనంతరం ఆ ముగ్గురు సభ్యులు సభలోకి ప్రవేశించి.. సమావేశాల్లో పాల్గొన్నారు. 

 

పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి - సున్నం రాజయ్య..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. డీఏ, హెచ్ఆర్ఏ లేదని, వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కీలకమైన వైద్యం అందిస్తున్న పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

11:51 - December 27, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యలను అడుగుతుంటే సభ నుంచి తమను సస్పెండ్ చేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలో రాసిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని సభలో అడిగామని చెప్పారు. మాదిగ, మాదిగ ఉప కులాల వర్గీకరణ కోరుతూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరుతూ తన సీట్లులో నిల్చున్నందుకు తనను సస్పెండ్ చేశారని పేరొన్నారు.

 

11:45 - December 27, 2016

హైదరాబాద్ : అవినీతి భయటపడుతుందనే విపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యులు సస్పెండ్ అవుతున్నారేమోననే అనుమానం కలుగుతుందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. విపక్షాలు పదే పదే ఆందోళన చేయడం సరికాదని చెప్పారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ సమయాన్ని వృధా చేయరాదని సూచించారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కొనసాగుతున్న జీరో అవర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన సమవేశాల్లో ముగ్గురు సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ కొనసాగుతోంది.

11:24 - December 27, 2016

చెన్నై : తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని..తన ప్రాణానికి ముప్పు ఉందన్నారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన రామ్మోహన్ రావు ఇవాళా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కక్షతోనే తనపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని పేర్కొన్నారు. తనను గృహ నిర్బంధం చేశారని వాపోయారు. ఇప్పటికీ తమిళనాడు రాష్ట్ర సీఎస్ ను తానేనని..
ప్రస్తుత సీఎస్ గిరిజా వైద్యనాథన్ ఇంచార్జీ మాత్రమేనని తేల్చి చెప్పారు. తన ఇంట్లో రూ.1.12 లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. చీఫ్ సెక్రటరీ చాంబర్ లో సోదాలు చేయడం దారుణమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఐటీ దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తన జీవితం ప్రమాదంలో ఉందన్నారు. తమిళనాడు ప్రజలకు భద్రత లేదని వాపోయారు. శేఖర్ రెడ్డితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఆయనతో తాను ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయలేదని స్పష్టం చేశారు. అమ్మ ఉండి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. కేంద్రప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లఘిస్తోందని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:22 - December 27, 2016

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్..ఇతర వుడ్ లలో నిర్మితమయ్యే పలు చిత్రాలు విజయంతం అవుతుంటాయి. కొన్ని చిత్రాలు ప్రేక్షకాదరణ పొంది విశేషంగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లలో ఎన్నో రోజుల పాటు సినిమా ఆడుతుంటుంది. గతంలో ముంబైలోని ఓ థియేటర్ లో 'దిల్ వాలే దుల్హనియా లేజాయింగే' చిత్రం వేయి రోజుల పాటు ఆడిన సంగతి తెలిసిందే. మరి ఈ రికార్డును 'బాలకృష్ణ' చిత్రం బద్ధలు గొడుతుందా ? ఎందుకంటే ఈ సినిమా వేయి రోజుల పాటు ఆడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 'బాలకృష్ణ' నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర ఆడియో వేడుక తిరుపతిలో జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయడు, సీఎం చంద్రబాబు నాయుడు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...మహిళలకు గౌరవం ఇవ్వాలని చరిత్రలో తొలిసారి తల్లిపేరును తన పేరు ముందు పెట్టుకున్న వ్యక్తి శాతకర్ణి అని, ఆయన చరిత్రని సిన్మాగా అందిస్తున్న క్రిష్‌కు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నుంచి అఖండ భారతదేశాన్ని పరిపాలించిన శాతకర్ణి తెలుగు జాతికి గర్వకారణమన్నారు. హేమా మాలిని, త్రిషలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది.

కక్షతోనే దాడులు..ఏమి దొరకలేదు - రామమోహన్ రావు..

తమిళనాడు : తన ఇంట్లో తనిఖీల సందర్భంగా ఏమి దొరకలేదని, కక్షతోనే తనపై ఐటీ దాడులు నిర్వహించారని రాష్ట్ర మాజీ సీఎస్ రామ మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఐటీ అధికారుల దాడుల్లో భారీగా నగదు..బంగారం దొరికినట్లుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను సీఎస్ పదవి నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడారు. తనను గృహ నిర్భంధం చేశారని, తన కొడుకు పేరిట సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారని, వారెంట్ లో తన పేరు లేదన్నారు.

11:00 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు సభ్యులపై సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడింది. ఒకరు కాంగ్రెస్ సభ్యుడు, ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మంత్రి టి.హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి.. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డిలను ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈనేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేయొద్దని విపక్ష సభ్యులకు సూచించారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. ఏ అంశంపైనైనా చర్చించేందకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత వారించినా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఈనేపథ్యంలో మంత్రి టి.హరీష్ రావు ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులపై సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేవంత్ రెడ్డిలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేశారు. సస్పెండ్ చేయడం దారుణమన్నారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.

 

జనవరి 3న సిక్కోలులో పవన్ పర్యటన..

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన ఖరారైంది. జనవరి 3వ తేదీన సిక్కోలులో పర్యటించనున్నారు. బహిరంగసభలో పవన్ మాట్లాడనున్నారు.

10:53 - December 27, 2016

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'కి ఏమైంది ? స్టాండ్ పట్టుకుని నడుస్తున్నట్లు ఉంది. ఎలాంటి గాయమైంది. ఆయనకు సంబంధించిన ఒ ఫోటో సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రిలో కాలికి గాయమై స్టాండ్ పట్టుకుని నడుస్తున్నట్లుగా ఉంది. చాలా కష్టంగానే నడుస్తున్నట్లుగా ఉంది. ఏమైంది అని అభిమానులు ఆరా తీస్తే సినిమాకు సంబంధించిన షూటింగ్ అని తేలింది. దీనితో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారంట.
మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కు జతగా రకూల్ ప్రీతి సింగ్ నటిస్తోంది. ఆసుపత్రికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. విలన్‌గా ఎస్‌జే సూర్య నటిస్తుండగా ప్రేమిస్తే హీరో భరత్‌ ఓ నెగిటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

10:46 - December 27, 2016

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న తారల్లో 'అనుష్క' ఒకరు. కేవలం ప్రేమ కథా చిత్రాలలోనే కాక ఇటు చారిత్రాత్మక చిత్రాలు అటు భక్తిరస చిత్రాలలోను నటిస్తూ ప్రశంసలు అందుకొంటోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామరస్ పాత్రలూ చేస్తోంది. 'అరుంధతి'లో జేజమ్మగా...'రుద్రమదేవి'లో రాణి రుద్రమ్మగా..'బాహుబలి'లో దేవసేనగా ఆకట్టుకుంది. ఈమె వివాహంపై సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. వివాహం జరిగిందని..ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం జరిగిందని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై 'అనుష్క' స్పందించింది. ఓ తమిళ మీడియాతో 'అనుష్క' పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు టాక్. ఇలాంటి వార్తలు విని నవ్వుకోవడం జరిగిందని, పెళ్లి వయస్సు మాత్రం వచ్చిందని..కానీ తగ్గ వరుడు ఇంతవరకు తారసపడలేదని అన్నదంట. 'పెళ్లి మనం అనుకున్నప్పుడు జరగదు..ఆ ఘడియలు రావాలి..అప్పుడే జరుగుతుంది..నాకింకా ఆ ఘడియలు రాలేదేమో...' అంటే వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 'ఓం నమో వేంకటేశాయ'..'బాహుబలి-2', 'భాగమతి', 'సింగం-3' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ జేసీ..

హైదరాబాద్ : జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మధ్య వివాదం ముదిరింది. బస్సుల వివాదం ఆర్టీఏ ఆఫీస్ కు చేరుకుంది. జేసీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీఏ ఆఫీస్ వద్దకు రమ్మని శ్రీనివాస్ గౌడ్ కు జేసీ సవాల్ విసిరారు. దీనితో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఏ ఆఫీసుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు.

టి.అసెంబ్లీ..ముగ్గురు సభ్యుల సస్పెన్షన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరోమారు సస్పెన్షన్ కు తెరలేపింది. సస్పెన్షన్ తీర్మానాన్ని మంత్రి హరీష్ ప్రకటించగా స్పీకర్ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని టిడిపి, బీజేపీ వాయిదా తీర్మానాలిచ్చాయి. దీనిపై చర్చించాలంటూ సభ్యులు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల కొనసాగాలని, చర్చకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని స్పీకర్ వెల్లడించారు. కానీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీనితో మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకున్నారు.

10:35 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈనేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేయొద్దని విపక్ష సభ్యులకు సూచించారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. ఏ అంశంపైనైనా చర్చించేందకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

రైల్వే కోడూరులో వెంకయ్య పర్యటన..

కడప : రైల్వే కోడూరు (మం) చెర్లోపల్లిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పర్యటించారు. ఓబుళవారిపాలెం - కృష్ణపట్నం రైల్వే సొరంగ మార్గం పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విశాఖలో నోట్ల మార్పిడి గుట్టు రట్టు..

విశాఖపట్టణం : నోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టైంది. గాజువాక ముఠా, అనకాపల్లి ముఠా మధ్య వివాదం చెలరేగింది. పరసర్పం దాడులు చేసుకున్నారు. రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు.

 

టి. అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్, టిడిపి, బిజెపి వాయిదా తీర్మానాలిచ్చాయి. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అండ్ పారా మెడికల్ రెగ్యులర్ చేయాలని సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది.

జగిత్యాల మండలంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం..

జగిత్యాల : వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో ఐదు గ్రామాల్లో 36 గంటల్లో 820 మరుగుదొడ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. జగిత్యాల (మం) అంర్గాం, పెగడపల్లి (మం), వెంగళాయిపేట, మల్లాపూర్ మండలం ఓబులాపూర్, నడికుడ, రాయికల్ (మం), భూపతిపూర్ లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

 

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం..

~ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు స్పీకర్ నిర్ణయించారు. కానీ విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారు.

09:53 - December 27, 2016

పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టుల పేరుతో వారికి అన్యాయం చేయొద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, టీఆర్ ఎస్ నేత నరేందర్ గౌడ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొని, మాట్లాడారు. బలవంతపు భూసేకరణ సరికాదన్నారు. రైతులను భూమి నుంచి దూరం చేయొద్దని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:52 - December 27, 2016

విజయవాడ : కోడి పందేల రాయుళ్లకు హైకోర్టు షాక్‌నిచ్చింది. ఏపీలో ఇకపై కోడి పందేలపై నిషేధం విధించింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో పందెం రాయుళ్ల గుండెల్లో రాయిపడినట్లైంది. అయితే వారసత్వ ఆటవిడుపును ఎట్లా నిషేధిస్తారంటూ... సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. 
కోడి పందేల రాయుళ్లకు హైకోర్టు ఝలక్‌ 
కోడి పందేల రాయుళ్లకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. పందేల పేరుతో మూగజీవాలను హింసించడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. ఇకపై రాష్ట్రంలో కోడిపందేలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోడి పందేలతో మద్య వినియోగం, జూదం పెరుగుతోందన్న పిటిషనర్ల వాదనలతో ఉమ్మడి హైకోర్టు ఏకీభవించింది. 
2013లో కోడిపందేలపై హైకోర్టులో పిటిషన్ 
కోడిపందాలపై 2013లో మొదటిసారిగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీపుల్ ఫర్ యానిమల్ అర్గనైజేషన్, యానిమల్ వెల్ఫేర్ సంస్థలు కోడి పందేలను నిషేధించాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే అంశంపై మరో రెండు స్వచ్ఛంద సంస్థలు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. కోళ్లకు కత్తులు కట్టి హింసను ప్రేరేపిస్తున్నారని సీనియర్ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ హైకోర్టు, కోడిపందేలను నిషేధిస్తూ తీర్పునిచ్చింది. 
2014లో స్టేటస్ కో పాటించాలని సుప్రీంకోర్టు అదేశాలు 
నిజానికి 2013 నుంచీ కోడిపందేల నిర్వహణపై వివాదం కొనసాగుతూనే ఉంది. 2014లో హైకోర్టు స్టేటస్ కో పాటించాలని అదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై బీజేపి నేత రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టుకు వెళ్లారు. వారసత్వ సంప్రదాయ క్రీడలపై జోక్యం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై వాదనలు విన్న..అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూ...హైకోర్టులో తేల్చుకోవాలని అప్పట్లో సూచించింది. 
కోడిపందేలను నిషేధించిన హైకోర్టు   
సుప్రీం కోర్టు సూచనతో.. సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు చివరికి కోడిపందేలను నిషేధించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పందెం రాయుళ్లు యోచిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న క్రీడను అడ్డుకోవద్దని.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. హింసా, జూదానికి తావులేకుండా వేడుకలు నిర్వహిస్తామని, అందుకే కోడిపందేలకు అనుమతిని ఇవ్వాలని వారు సుప్రీంకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. 

 

09:51 - December 27, 2016

విశాఖ : స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లారు. తిరుగు ప్రయాణమయ్యారు. కొద్ది సమయంలో ఇళ్లకు చేరుకుంటారు. ఇంతలోనే పెను విషాదం నెలకొంది. అతివేగం రూపంలో మృత్యువు వారిని కబలించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మణం చెందారు. అనకాపల్లిలో నివాసముంటున్న చిన్నిసాయిరాం, తేజలు సబ్బవరంలో ఉంటున్న స్నేహితుడి బర్త్ డే పంక్షన్ కు వెళ్లి చిన్నిసాయిరాం, తేజలు మరో స్నేహితుడితో కలిసి ముగ్గురూ బైక్ పై తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో అనకాపల్లి పెరుగు సెంటర్ వద్ద అతివేగంగా వస్తున్న బైకు అదుపుతప్పి తోపుడు బండిని ఢీకొట్టింది. దీంతో చిన్నిసాయిరాం, తేజ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:47 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నేడు ప్రతిపక్షాలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ టీడీపీ, బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు, పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:40 - December 27, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును కేంద్ర సహకారంతో వచ్చే మూడేళ్లలో పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు..కేంద్రం ఏపీకి 1981 కోట్ల రూపాయల నాబార్డు రుణాన్ని అందచేసింది. దీంతో నెలాఖరుకు...
ప్రాజెక్టు కీలక పనులు ప్రారంభం కానున్నాయి. 
పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో ముందడుగు 
పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో ముందడుగు పడింది. నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసింది. మొదటి విడతగా 1981 కోట్ల రూపాయల నాబార్డు రుణం విడుదల చేసింది. ఈ మొత్తం చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి.. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోనుందని బాబు అన్నారు. ఈ  నెల 30 నుంచి పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభం కానున్నాయి. అత్యంత ప్రధానమైన స్పిల్ వే, డయా ఫ్రం వాల్ నిర్మాణం డిజైన్లకు కేంద్ర జలసంఘం అనుమతులు లభించాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, ఏపీ మంత్రి దేవినేని ఉమ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించారు. అభివృద్ధికి నీటివనరులు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.
2019 నాటికి పోలవరం పూర్తి : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న కోరిక అని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి రాష్ట్ర ప్రజల చిరకాల కోరకను నెరవేరుస్తామన్నారు చంద్రబాబు. 
హామీలు నెరవేరుస్తాం : ఉమాభారవతి, వెంకయ్య 
కేంద్రం ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని... కేంద్రమంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తొలివిడత నిధులు మంజూరు చేయడంతో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడినట్లయింది. 2వేల కోట్ల రూపాయల నాబార్డు రుణంతో... ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. 

 

09:38 - December 27, 2016

హైదరాబాద్ : తెలంగాణా శాసనసభా సమావేశాలు   కొత్త సంవత్సరంలో కూడా  నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు  పూర్తి చేయాలనుకున్నా........ మరో పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించేందుకు అధికార పార్టీ రెడీగా ఉన్నాయన్న సంకేతాలు ఇస్తోంది. దీంతో మరికొన్ని రోజులపాటు శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి.
మరిన్ని రోజులు పొడిగించేందుకు గులాబి పార్టీ సిద్ధం
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు మరిన్ని రోజులు పొడిగించేందుకు గులాబి పార్టీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రెండున్నరేళ్ల పాలన కూడా పూర్తి చేసుకోవడంతో అసెంబ్లీ వేదికగానే ప్రగతి నివేదికలను పూర్తిగా వెల్లడించేందుకు గులాబి పార్టీ పావులు కదుపుతోంది. బీఏసీ భేటీలో ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే విపక్షాలు కోరితే మరో వారం కూడా సమావేశాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధికారపార్టీ వ్యూహాలకు ప్రతిపక్షాలు చెక్‌
ఈనెల 16న ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు    ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి.  సమావేశాలను పూర్తిగా  తమ కనుసన్నల్లో నిర్వహించాలని భావించిన అధికారపార్టీ వ్యూహానికి ప్రతిపక్షాలు చెక్‌ పెడుతున్నాయి.  ముఖ్యమంత్రి సభలో  ఎక్కువ సమయం గడపక పోవడంతో  దాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సోమవారం సభలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం.
ఆత్మరక్షణలో గులాబి పార్టీ 
ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌ రావ్ లు సభలో లేకపోవడంతో ఆ  బాధ్యతలను మంత్రి కెటిఆర్ మోయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇదే అదనుగా మంత్రిపై వత్తిడి తేవడంలో సభలో గులాబి పార్టీ ఆత్మరక్షణలో పడినంత పనైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అజయ్ టీఎస్ ఐపాస్ బిల్లుపై  ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకుంది. స్పీకర్ ఇచ్చిన సమాధానం ప్రతిపక్ష పార్టీకి మరో అస్త్రంగా మారింది. దీనిపై మంత్రి  కేటీఆర్‌ స్పందించిన తీరును విపక్ష నేతలు తమ అనుభవంతో  అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుంచి గులాబి పార్టీ మొదటి సారి సభలో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంది. సభలో పరిణామాలు మంత్రి హరీష్ రావ్ దృష్టికి వెళ్లడంతో.. తన టూర్ ను రద్దు చేసుకుని శాసనసభకు  హాజరుకావాల్సి వచ్చింది.

 

09:37 - December 27, 2016

హైదరాబాద్ : పారిశ్రామికరంగంలో సర్కార్‌ పోటీ పక్క రాష్ట్రాలతో కాదని ప్రపంచంతోనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ భూసేకరణ, వ్యాట్ సవరణతో కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. చర్చ జరిగింది. మధ్యలో పార్టీ ఫిరాయింపుదారులపై వేటు వేయాలంటూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం చెలరేగింది.
అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు 
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్‌ మధుసూదనచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో మంత్రి కేటీఆర్ భూసేకరణ, వ్యాట్ సవరణ, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు, ఖమ్మం పోలీస్ కమిషనరేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. అనంతరం హైదరాబాద్‌లో రోడ్లపై బీజేపీ సభ్యులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీజేపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మై జీహెచ్‌ఎంసీ పేరిట యాప్ తీసుకొచ్చామన్న ఆయన... దాదాపు 1100కు పైగా చెత్త వేసే ప్రాంతాలను తరలించామన్నారు.
టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లపై చర్చ 
అసెంబ్లీలో ప్రధానంగా టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ తదితర అంశాలపై సభలో చర్చ జరిగింది. టీఎస్‌ ఐ పాస్‌ విధానాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీనే అభినందించారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి దారులకు ఎర్ర తివాచీలు పరిచిందని చెప్పారు. 
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి : సున్నం రాజయ్య 
టీఎస్‌ ఐ పాస్‌ ద్వారా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. వామపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. 
శాసనసభలో గందరగోళం 
తెలంగాణ శాసనసభలో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన చేశారు. మరోవైపు స్పీకర్‌పై ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ సభ్యులను అదుపు చేయడంలో స్పీకర్‌ విఫలమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో నీటి పారుదల రంగానికి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదని శాసన మండలిలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు కచ్చితంగా కట్టి తీరుతామన్న ఆయన... బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ రాష్ర్టానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని చెప్పారు.

 

నేడు డెహ్రాడూన్ లో ప్రధాని మోడీ పర్యటన

ఉత్తరప్రదేశ్ : డెహ్రాడూన్ లో నేడు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లోని మండి ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకపం తీవ్రత 3.2 శాతంగా నమోదు అయింది. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విశాఖ : అనకాపల్లి పెరుగుబజారు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బైకు.. తోపుడు బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

09:23 - December 27, 2016

నేడు రాష్ట్రపతి ప్రణబ్ కు గవర్నర్ విందు

హైదరాబాద్ : నేడు రాజ్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. విందుకు సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. 

నేడు రాష్ట్రపతి ప్రణబ్ కు గవర్నర్ విందు

హైదరాబాద్ : నేడు రాజ్ భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. విందుకు సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. 

నేడు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం

ఢిల్లీ : ఆర్థికవేత్తలతో నేడు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం వృద్ధి వేగవంతంపై చర్చించనున్నారు. 

 

Don't Miss