Activities calendar

28 December 2016

21:59 - December 28, 2016

ఉత్తరప్రదేశ్‌ : అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బాబాయ్‌-అబ్బాయ్‌ ఆధిపత్య పోరు నేపథ్యంలో మొత్తం 325 మంది అభ్యర్థుల జాబితాను ఎస్పీ చీఫ్‌ ములాయంసింగ్‌ యాదవ్‌ విడుదల చేశారు. అఖిలేష్‌ సన్నిహితులకు ములాయం మొండి చేయి చూపడం ద్వారా తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థిని ప్రకటించేది లేదని ములాయం స్పష్టం చేశారు.

325 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఎస్పీ
త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతగా 325 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న 176 మందికి మళ్లీ టికెట్లు లభించాయి. మిగతా 78 అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల లిస్టును పార్టీలో చర్చించి ప్రకటిస్తామని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు ములాయంసింగ్‌ యాదవ్‌ తెలిపారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సిఎం అఖిలేష్‌ యాదవ్‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆయన నిర్ణయానికే వదిలేసినట్లు చెప్పారు.

ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థిని ప్రకటించమన్న ములాయం

తమ పార్టీలో పూర్తి ప్రజాస్వామ్యం ఉందని...ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థిని ప్రకటించమని ములాయం పేర్కొన్నారు. పార్టీలో చర్చించాకే అభ్యర్థుల పేర్లను నిర్ణయించడం జరిగిందని...ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఎలాంటి మార్పులుండవన్నారు. టికెట్లు దొరకని కార్యకర్తలను నిరాశ పరచమని, వారికి పార్టీలో తగిన గౌరవమిస్తామన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని ములాయం స్పష్టం చేశారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో తనయుడికి ములాయం షాక్
బాబాయ్‌, అబ్బాయ్‌ల మధ్య పోరు నేపథ్యంలో ములాయం సోదరుడివైపే మొగ్గు చూపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తనయుడికి షాకిచ్చారు. అఖిలేష్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రి అరవింద్‌ సింగ్‌, పవన్‌ పాండేలకు టికెట్ నిరాకరించారు. పవన్‌పాండేను యుపీ పార్టీ అధ్యక్షుడు శివపాల్‌ యాదవ్‌ పార్టీ నుంచి బహిష్కరించినా అఖిలేష్‌ మంత్రిగా కొనసాగించిన విషయం తెలిసిందే. అలాగే అరవింద్‌సింగ్‌ను కాదని తనకు సన్నిహితుడై బేనీ ప్రసాద్‌ వర్మ కుమారుడు రాకేష్‌వర్మకు ములాయం టికెట్‌ ఇచ్చారు. తండ్రి ప్రకటించిన అభ్యర్థుల్లో చాలామంది పేర్లపై అఖిలేష్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యాదవుల టికెట్‌ వార్‌ ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. 

21:55 - December 28, 2016

ఢిల్లీ : ఆధార్‌ అనుసంధాన లావాదేవీలతో డిజిటల్‌ ఎకానమీని కొత్త పుంతలు తొక్కించేలా చర్యలు చేపడుతున్నట్లు డిజిటల్‌ లావాదేవీలపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. కేవలం ఆధార్‌ కార్డు ఉంటే సరిపోతోందని, ఆధార్‌తో అన్ని రకాల లావాదేవీలు జరుపుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

డిజిటల్‌ చెల్లింపులు చేసేలా చర్యలు : చంద్రబాబు
కనీసం మొబైల్‌ ఫోన్లు లేని పేదలు కూడా డిజిటల్‌ చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. డిజటల్‌ చెల్లింపులపై ఢిల్లీలో జరిగిన సీఎంల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే డిజిటల్‌ చెల్లింపులపై ఓ నివేదిక ఇవ్వనున్నట్లు బాబు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలపై నియమించిన సీఎంల కమిటీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపిందని చంద్రబాబు చెప్పారు.

కేంద్రానికి నివేదిక : చంద్రబాబు
కేవలం బయేమెట్రిక్‌ మిషన్‌ సాయంతోనే అన్నిరకాల ఆర్థిక లావాదేవీలు జరిగేలా త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. వినియోగదారులు డిజిటల్‌ కరెన్సీ, నగదు రహిత చెల్లింపులపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు. డిజిటల్‌ కరెన్సీ వినియోగించే వారికి ఎలాంటి ఇన్సెంటివ్‌లు ఇవ్వాలన్న దానిపై త్వరలోనే కేంద్రానికి ఓ నివేదిక ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. నీతిఅయోగ్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ సీఎంతో పాటు సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌, నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా, నీతిఅయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ హాజరయ్యారు. 

21:50 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ చట్టంపై విపక్షాలు మండిపడ్డాయి. 2013 భూ సేకరణ చట్టంలో సవరణలు అని చెప్పి.. ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఎలా తెస్తుందని విపక్ష నేతలు ప్రశ్నించారు. దీనిపై కేంద్రానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని విపక్షాలు నిర్ణయించాయి.

తాడు, బొంగరం లేని చట్టం వ్యాఖ్యలపై విపక్షాల మండిపాటు
తెలంగాణ భూసేకరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కేంద్ర భూసేకరణ చట్టాన్నితాడు, బొంగరం లేని చట్టంగా సీఎం అభివర్ణించడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కేసీఆర్‌.. 2013 భూసేకరణ చట్టానికి మద్దతు పలికి ఇప్పుడు పనికిమాలిన చట్టం అనడంలోని ఆంతర్యం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టీటీడీపీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని సీపీఎం పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యతిరేకించారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు యత్నాలు
మొత్తంగా అధికార పార్టీ మినహా అన్నీ పార్టీలు తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించాయి. 2013 భూసేకరణ బిల్లుకు సవరణలు అని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై ఎవరికివారుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 

21:46 - December 28, 2016

హైదరాబాద్ : సీపీఎంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ తీవ్రంగా మండిపడింది. రైతులను నిట్టనిలువునా దగా చేసేందుకే, తెలంగాణ భూసేకరణ చట్టాన్ని తెచ్చారంటూ పార్టీ నాయకులు విమర్శించారు. రైతుల జీవితాలను రోడ్డు పాల్జేసే భూసేకరణ బిల్లుకు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా, గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఎం పిలుపునిచ్చింది.

సీపీఎంని నిందించడం కేసీఆర్ అవివేకం
తెలంగాణ భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీపీఎంపై విరుచుకుపడడాన్ని, పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేసీఆర్‌వి అర్థం లేని మాటలని సీపీఎం నేతలు తిప్పికొట్టారు. సీపీఎం ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగానే ఆందోళనలు నిర్వహిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మల్లన్నసాగర్‌ లాఠీచార్జి, కాల్పులకు సీపీఎంని నిందించడం అవివేకమని తమ్మినేని ఆక్షేపించారు.

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపు
భూసేకరణ బిల్లుతో పాటు సీఎం విమర్శలకు వ్యతిరేకంగా, గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సీపీఎం పిలుపునిచ్చింది. సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ఓర్వలేక విమర్శలకు తెగబడ్డారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. మల్లన్నసాగర్‌లో జరిగిన కాల్పులకు సీపీఎం నేతలే కారణమన్న సీఎం, తగిన ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. సీఎం వీధిరౌడీలా మాట్లాడడం సరికాదన్నారు.

సీఎం ఒక్కసారైనా ఎందుకు వెళ్లలేదు : సీపీఎం
తన ఫామ్‌హౌజ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని మల్లన్నసాగర్‌కు సీఎం ఒక్కసారైనా ఎందుకు వెళ్లలేదని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఉసురు తీసేందుకే తెలంగాణ భూసేకరణ బిల్లు తెచ్చారని మండిపడ్డారు.

కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీపీఎం నేతలు
ప్రజల పక్షాన, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా.. సీపీఎం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం తన ధోరణి మార్చుకోకుంటే.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

21:42 - December 28, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌... మరోసారి సీపీఎంపై అక్కసు వెళ్లగక్కారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఎంపై.. అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసిత రైతుల పక్షాన నిలచిన సీపీఎం నేతలను, అక్కడి కాల్పులకు బాధ్యులను చేసే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో సీపీఎంను సూదిపార్టీ, గుండుసూది పార్టీ, దబ్బనం పార్టీ అంటూ తన కడుపులోని కసినంతా కక్కేశారు.

అసెంబ్లీ సాక్షిగా సీపీఎంపై అక్కసు వెళ్లగక్కిన సీఎం కేసీఆర్‌
ప్రజల పక్షాన నిలిచి నిరంతరం పోరాడే సీపీఎంను.. సీఎం కేసీఆర్‌ మరోసారి టార్గెట్‌ చేశారు. మహాజన పాదయాత్రకు ముందు వెళ్లగక్కినట్లే.. మళ్లీ అక్కసును బయటపెట్టుకున్నారు. ఈసారి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు.

సీపీఎం పార్టీని గుండుసూది, దబ్బునంతో పోల్చిన సీఎం
భూసేకరణ చట్టంపై చర్చ సందర్భంగా.. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్‌.. సీపీఎంపై విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్‌ వద్ద ప్రతిపక్షాలు చేసిన రభస అంతా ఇంతా కాదన్నారు. సంబంధం లేని పార్టీలు మల్లన్నసాగర్‌ వద్ద రాజకీయాలు చేశాయన్నారు. దిక్కుమాలిన వ్యూహాలతో రాజకీయాలు చేస్తున్న సీపీఎం పార్టీని గుండుసూది, దబ్బునంతో పోల్చారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో విపక్షాల రభస చేశాయన్న కేసీఆర్‌, ప్రపంచంలో ఏ సమస్య లేనట్టు విపక్షాలు మల్లన్నసాగర్ మీదనే పడ్డాయన్నారు. మల్లన్నసాగర్‌కు 75 శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్న కేసీఆర్‌.. అక్కడి ప్రజలను సీపీఎం నేతలే రెచ్చగొట్టాయని విమర్శల వర్షం కురిపించారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీపీఎం నేతలు
సీఎం వ్యాఖ్యలను.. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అసెంబ్లీలోనే ఆక్షేపించారు. తమ పార్టీని గుండుసూదితో పోల్చిన సీఎం వైఖరిపై ఆయన మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ కాల్పులకు సీపీఎంను బాధ్యులను చేసే కుట్రను సీఎం చేస్తున్నారని విమర్శించారు. సీపీఎంపై సీఎం విమర్శలపై.... రాష్ట్రవ్యాప్తంగా కామ్రేడ్స్‌ తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం వైఖరిని మార్చుకోవాలని హితవు పలికుతున్నారు. 

21:36 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ బిల్లు-2016కు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర చట్టం ఉన్నప్పుడు ఈ బిల్లు ఎందుకన్న విపక్షాల ప్రశ్న సర్కారు చెవికెక్కలేదు. బిల్లు తెస్తే తెచ్చారు.. దానికి మేము సూచించే సవరణలైనా చేయండని చెప్పినా ఖాతరు చేయలేదు. విపక్షాల అభ్యంతరాల నడుమే మూజువాణీ ఓటుతో బిల్లును ఆమోదింప చేసుకుంది కేసీఆర్‌ సర్కారు.

భూ సేకరణకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ భూసేకరణ బిల్లు-2016కు శాసనసభ ఆమోదం లభించింది. బిల్లును మంత్రి హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై విపక్ష సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని ఎందుకు బేఖాతరు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆ చట్టంలోని ఎన్నో ముఖ్యమైన అంశాలను రాష్ట్రప్రభుత్వం తెలంగాణ భూసేకరణ బిల్లులో తొలగించడాన్ని ఆపార్టీ తప్పుబట్టింది.

చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా : జానారెడ్డి
భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమి కోల్పోయిన దళితులకు ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు.2013 భూ సేకరణ చట్టంలో ఉన్నదానికంటే ఎక్కువ నష్టపరిహారం ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ విషయాన్ని కొత్తచట్టంలో పొందుపర్చాలని సీఎల్పీనేత జానారెడ్డి సూచించారు. అసలు కేంద్ర ప్రభుత్వం చేసిన 2013 భూ సేకరణ చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

టీడీపీ మండిపాటు
తెలంగాణ భూసేకరణ కొత్త చట్టంపై టీడీపీ మండిపడింది. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆపార్టీ ఆక్షేపించింది.

తీవ్రంగా స్పందించిన హరీష్ రావు
ప్రతిపక్షాల అభ్యంతరాలపై మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే..ప్రతిపక్షాలు భూసేకరణ చేయకుండా అడ్డుపడడం సమంజం కాదన్నారు. ఏటిగడ్డ, కిష్టాపూర్‌ ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూసేకరణ జరపలేదని.. రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి 123 జీవో ప్రకారం భూములిచ్చారన్నారు.

ఆర్టికల్ 254 ప్రకారం శాసన సభకు సంపూర్ణ అధికారం వుంది : కేసీఆర్
ఆ తర్వాత సీఎం కేసీఆర్ బిల్లు సవరణలపై మాట్లాడారు. భూసేకరణ చట్టం చేయడానికి ఆర్టికల్ 254 ప్రకారం శాసన సభకు సంపూర్ణ అధికారం ఉందని కేసీఆర్ తెలిపారు. 2013 భూసేకరణ చట్టానికి ఎన్నో రాష్ర్టాలు సవరణలు చేశాయని.. ఒక్క తెలంగాణ రాష్ట్రమే భూసేకరణ బిల్లుకు సవరణ చేయలేదన్నారు. భూసేకరణ చేయకుండానే నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు కట్టారా అంటూ నిలదీశారు. 2013 భూసేకరణ చట్టంలో లేని ఎన్నో అనుకూల అంశాలను తమ బిల్లులో పొందుపరిచామని కేసీఆర్‌ చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత పరిహారం ఇస్తున్నామన్నారు.

మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించిన స్పీకర్
ఆ తర్వాత... ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలను స్పీకర్‌ మూజువాణి ఓటు ద్వారా తిరస్కరించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపగా.. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకొని.. బిల్లు పాస్‌చేసేముందు ప్రతిపక్షాలు అభ్యంతరాలను వినాలని బిల్లును అందరూ ఆమోదించాలని కోరారు. దీంతో స్పీకర్‌ చివరి క్షణంలో బిల్లు పాస్‌ చేయకుండా ప్రతిపక్షాల అభ్యంతరాలను విన్నారు. ఆ తర్వాత స్పీకర్‌ మూజువాణి ఓటుతో.. తెలంగాణ భూసేకరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. 

21:29 - December 28, 2016

50రోజులు దాటాయి.. నిలబడ్డవాళ్లు నిలబడ్డట్టే ఉన్నారు..ఎదురు చూపుల కళ్లు ఎదురు చూస్తూనే ఉన్నాయి..బ్యాంకుల చుట్టూ తిరిగి నడుములు విరిగిపోతూనే ఉన్నాయి.. చేతిలో సొమ్ము లేదు. ఉన్నా చిల్లరలేదు. ఏంటీ కష్టం. ఎందుకీ సమస్య..ఎవర్ని బాగు చేయటానికి? ఏం సాధించటానికి? 50 రోజుల అచ్ఛేదిన్ చూసి దేశమంతా పరవశిస్తోందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. కుటుంబపెద్ద ఓ నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానాలు ఆలోచిస్తాడు.. మరి దేశానికి పెద్ద ఈ విషయం ఆలోచించలేదా? ఒక్కసారి ఇంతటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో గ్రహించలేకపోయారా? ప్రధాని మోడీ నిర్ణయం బెడిసికొట్టిందా? తాను ఫకీరునని చెప్పుకుంటున్న ప్రధాని ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? కూటి కోసం కూలి కోసం.. పట్టణంలో బతుకుదామని బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం.. ఎప్పుడో శ్రీశ్రీ రాసిన మాటలివి. ఇప్పుడు దేశం పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. చేద్దామంటే పనిలేదు. చేతిలో చిల్లగవ్వలేదు.. తినటానికి తిండిలేదు.. కుటుంబాన్ని సాకటానికి సొమ్ములేదు. రోగమొస్తే దిక్కులేదు. ఎంత కష్టం.. ఎంత కష్టం.. ఎన్నాళ్లీ కరెన్సీ సమస్య.. క్యాష్ లెస్ అంటూ సర్కారు చెప్తున్న మాటలు ఎంతవరకు సాధ్యం? భారత అర్ధిక వ్యవస్థపై ముఖ్యంగా అసంఘటితరంగంపై తీవ్రప్రభావం చూపింది.చెప్పిందొకటి జరుగుతున్నదొకటి.. 50 రోజులుగా సాధారణ జీవితం గడపటానికి నానా పాట్లు.. చెప్పిందొకటి జరుగుతున్నదొకటి.. మీటింగుల్లో హావభావాలతో వదిలిన డైలాగులు ఒకటి.. కళ్లముందున్న విషయం మరొకటి.. నల్లధనం.. నకిలీ నోట్లు అడ్రస్ లేవు.. ప్రజలు మాత్రం 50 రోజులుగా సాధారణ జీవితం గడపటానికి నానా పాట్లు పడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ లేదు..స్వైపింగ్ మెషీన్లు లేవు..స్మార్ట్ ఫోన్ ల వాడకం అంతంత మాత్రమే..ప్రశ్నార్థకంగా మారిన డెబిట్ కార్డుల సేఫ్టీ..క్యాష్ లెస్ భారతం అంత సులభంగా సాధ్యమౌతుందా? దేశ ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయాలుండాలి. గ్రామీణ ప్రజలు అధికంగా ఉన్నచోట, సాంకేతికంగా సవాళ్లు ఉన్నచోట క్యాష్ లెస్ గా మారటం అంత సులభ సాధ్యమేమీ కాదు. మరోపక్క ప్లాస్టిక్ కరెన్సీ మాత్రమే నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికడుతుందంటే నమ్మశక్యం కాని పరిస్థితి.. 50 రోజులుగా నరకం చూస్తోంది దేశం.. ఈ సిచ్యుయేషన్ మరెన్ని రోజులంటే సమాధానం లేని పరిస్థితి కనిపిస్తోంది. 

20:57 - December 28, 2016

బిచ్చమెత్తి..దేవుళ్లకు వెండి కిరీటాలు సేయించినాడు యాదిరెడ్డి అనే బిచ్చగాడు..పుట్టింది నల్లగొడ జిల్లాల..పెరిగింది విజయవాడల..40 ఏళ్ళనుండి బిచ్చమెత్తి రాములోరికి..లక్షనస్వాములోరికి వెండికిరీటాలు సేయించిండు.. 29నాడు ఇందిరాపార్క్ తాన 123 బిల్లును అడ్డుకుంటానంటున్న కోదండరామయ్య..రాష్ట్రపతికి..గవర్నర్ నరసింహన్ సారు దావత్తు ఇచ్చిండు..ఈ దావత్తుల రెండు రాష్ట్రాల చంద్రులు ముచ్చట్లు పెట్టుకుండ్రంట.. వెంటిలేషన్ మీద వున్నాడని.. సర్పంచ్ ఫార్మా కంపెనీ కార్మికులను కొట్టించ్చిండు..పెద్దాపురంలో సంద్రన్న బూడిద వరాలు..

20:50 - December 28, 2016

ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ పై.. ప్రతిపక్షాలు, హైకోర్టు నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర భూసేకరణ చట్టం-2013కు అనుగుణంగా... గుజరాత్ తరహలో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. ఇప్పటికే భూ సేకరణ ముసాయిదా బిల్లు తయారీకి అధికారులతో కమిటీ వేస్తూ కేసీఆర్ సర్కార్ సెప్టెంబర్ 12 న ఉత్తర్వులు జారీ చేసింది. 2013 భారత భూ పరిహర చట్టం కు అనుగుంగా కమిటీ ముసాయిదా బిల్లును తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ చట్టం ఆధారంగా తెలంగాణ ప్రత్యేక భూ సేకరణ చట్టం ఉంటుందని సమాచారం. కాగా భూసేకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదం పలికింది. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2013 భూసేకరణ చట్టం కంటే ఇప్పుడు సవరణ చేస్తూ రాబోతున్న చట్టం మెరుగైందేనా? ఈ చట్టం ద్వారా నిర్వాశితులకు మేలు జరుగుతుందా? విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కావాలనే నిర్వాశితులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయా? అడ్డుకుంటున్నాయా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టాయి. ఈ చర్చలో సారంపల్లి మల్లారెడ్డి ( జాతీయ కిసాన్ సంఘం అధ్యక్షులు, సీపీఎం నేత) ఇందిరా శోభన్ (టీ.కాంగ్రెస్ నేత),తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత),శ్రీధర్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. 2019లో టీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో సీపీఎం అసాంఘిక శక్తులు కనిపించలేదా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం దాటితే గుర్తుపట్టని పార్టీ నేత సీఎం పదవిలో వుండి..చట్టసభలో జాతీయ పార్టీ అయిన సీపీఎంను విమర్శించటమా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

జసాన్ లో భారీ భూకంపం..

జపాన్‌ : భారీ భూకంపం కుదిపేసింది. కుజీ జిల్లాలోని డైగోకు ఈశాన్యంగా 18 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9 గా నమోదైంది.

20:13 - December 28, 2016

శ్రీకాకుళం : జిల్లాలో పర్యటనకు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పర్యటన ఖారరైంది. జనవరి 3న పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్నారు. ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పవన్ పరామర్శించనున్నారు. అనంతరం పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. మణికంఠ థియేటర్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. సోంపేట, ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం, విశాఖలో ఈ లక్షణాలతో ఎక్కువమంది ఆస్పత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కిడ్నీ బాధితులను పరామర్శించేందుకు జనవరి 3న పవన్ కళ్యాణ్ రానున్నారు. 

19:59 - December 28, 2016

గుంటూరు : నరసరావుపేటలో శ్రీ డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన ఈరోజు ప్రారంభమైంది. స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి రావెల కిశోర్ బాబు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఒకటో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనకు అనేక రాష్ట్రాల నుంచి ఎద్దులను తీసుకువచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు సంబంధించిన వస్తువుల స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

19:57 - December 28, 2016

విజయవాడ : ప్రజలకు నిరంతరం సేవలందించే ఆర్టీసీలో విధులు నిర్వర్తించడం చాలా సంతోషకరంగా ఉందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బస్టాండ్‌లో ఆయన తనిఖీలు చేపట్టి.. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో ఉందని, సుమారు 250 కోట్ల రుపాయలు వడ్డీ నిమిత్తం సంస్థ కడుతుందని ఆయన అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీసి సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అద్దెలకు ఇచ్చి నష్టాలను తగ్గించే పనులు కూడా చేపడుతున్నట్టు మాలకొండయ్య చెప్పారు.

19:35 - December 28, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సీపీఎం పిలుపు ఇచ్చింది. కేసీఆర్‌ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సీపీఎం ఎప్పుడు ప్రజాస్వామ్య, శాంతియుతంగానే.. పోరాటాలు చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మల్లన్నసాగర్‌ లాఠీఛార్జి, కాల్పులకు సీపీఎంను నిందించడం అవివేకమన్నారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సీపీఎం ఎప్పుడు ప్రజాస్వామ్య, శాంతియుతంగానే..పోరాటాలు చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మల్లన్నసాగర్‌ లాఠీఛార్జి, కాల్పులకు ..సీపీఎంను నిందించడం అవివేకని తమ్మినేని పేర్కొన్నారు. కాగా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును సీపీఎం పార్టీ కావాలనే అడ్డుకుంటోందని అసెంబ్లీలో భూసేకరణ బిల్లు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. అసెంబ్లీలో భూ సేకరణ చట్టంపై చర్చలో భాగంగా సీపీఎం పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించారని చెప్పారు. మల్లన్న సాగర్‌తో సంబంధంలేని వారితో ఆందోళనలు చేశారని అందుకే వారిపై కేసులు పెట్టామనీ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. 

19:25 - December 28, 2016

తూర్పుగోదావరి : మెట్ట ప్రాంతానికి ముఖ‌ద్వారం మ‌సిగొట్టుకు పోతోంది. చారిత్రక ప‌ట్టణం ఇప్పుడు కాలుష్యం కోరలో విల‌విల్లాడుతోంది. నిబంధ‌న‌లు పాటించ‌ని సంస్థల నిర్లక్ష్యానికి బ‌ల‌వుతోంది. ఏకంగా డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా స‌మ‌స్యలు ప‌ట్టించుకోకపోవ‌డంతో ప‌ట్టు కోల్పోతుంది. న‌ల్లబూడిద‌తో స‌మ‌స్యలు ఎదుర్కొంటున్న తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం ప‌ట్టణ వాసుల ఇక్కట్లపై 10టీవీ రిపోర్ట్..!

తూ.గో జిల్లా పెద్దాపురంలో కోరలుచాస్తున్న కాలుష్యం
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని ప‌రిశ్రమ‌ల య‌జ‌మానులు లాభాలే ప‌ర‌మావ‌ధిగా వ్యవహరిస్తున్నారు. వాటి కోసం ప్రజ‌లేమ‌యినా ఫ‌ర్వాలేద‌నుకుంటున్నారు. నిబంధ‌న‌ల‌కు నీళ్లొదిలి య‌ధేచ్చగా ప్రవర్తిస్తున్నారు. జ‌నం ఏమైనా త‌మ జేబులు నిండితే చాల‌నుకుంటున్నారు. అందుకే ప‌రిశ్రమ వ్యర్థాల‌తో ప్రజ‌ల జీవ‌నం అస్తవ్యస్తమ‌వుతున్నా అస‌లు ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు.

పెద్దాపురం చుట్టూ రైస్ మిల్లు, అగ్రో ఆధారిత పరిశ్రమలు
పెద్దాపురం ప‌ట్టణం చుట్టూ రైసు మిల్లులు, ఇత‌ర ఆగ్రో ఆధారిత క‌ర్మాగారాలున్నాయి. కానీ అవేమీ నిబంధ‌న‌లు పాటిస్తున్న దాఖ‌లాలు లేవు. ముఖ్యంగా సుధా ఆగ్రో, బ్లూ వెన్సా బ‌యోటెక్, ల‌లిత రైస్ మిల్లుల యాజ‌మాన్యాల‌కు నిబంధ‌న‌లంటే లెక్కేలేదు. చ‌ట్టాలు వారికి అస‌లు ప‌ట్టిన‌ట్టు లేదు. కంపెనీ అవ‌స‌రాల కోసం సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప‌వ‌ర్ ఉత్పత్తి మూలంగా వెలువడుతున్న బూడిద పట్టణ ప్రజలను ఆవరిస్తోంది. క‌ళ్లల్లో దుమ్ము కొట్టి ఆరోగ్యం సమస్యలు ఎదుర్కోంటున్నారు. ఇళ్లు, వాకిళ్లలో నల్లటి బూడిదే దర్శనమిస్తుంది. ఆకు ప‌చ్చని చెట్లు సైతం న‌ల్లగా మారిపోయి క‌నిపిస్తున్నాయి. దీంతో స్ధానిక ప్రజలు భ‌య‌భ్రాంతుల‌కు గురవుతున్నారు. .

కాలుష్యంపై పట్టించుకొని అధికారులు
కంపెనీల నిర్లక్ష్యాలపై నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు మాముళ్లకు అలావాటు పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజ‌లు ఫిర్యాదు చేసినా ప‌ట్టన‌ట్లు వ్యవహరించడం ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. దీంతో పెద్దాపురం వాసులు తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యం, కంపెనీ యాజ‌మాన్యాల దౌర్జన్యాల‌పై ఆందోళ‌న‌కు దిగారు. పెద్దాపురం, సామార్ల కోట మ‌ధ్య రోడ్డును దిగ్భంధించారు.

డిప్యూటీ సీఎంని నీలదీసిన సీపీఎం పార్టీ కౌన్సిలర్
ఈ స‌మ‌స్య మీద ప్రజ‌లు అనేక మార్లు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. సీపీఎం పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ పెద్దాపురం మునిసిపల్ స‌మావేశంలో ఈ అంశంపై డిప్యూటీ సీఎంని కూడా నిల‌దీశారు. అయినప్పటికీ దీనిపై మంత్రి ప‌ట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిచకుంటే పెద్దఎత్తున ఉద్యమానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. 

19:21 - December 28, 2016

విజయవాడ : 279 జీవోను రద్దు.. సమాన పనికి.. సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఛలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. 279 జీవో అమలైతే కార్మికులకు ఇప్పుడు వస్తున్న జీతాలు కూడా రావని సీపీఎం నాయకుడు సీహెచ్‌ బాబూరావు అన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోపిడీ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నాయని అన్నారు. 

19:18 - December 28, 2016

కర్నూలు : హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..31వ తేదీన మద్యం షాపులు, బార్లను నియంత్రిస్తామని ఎస్పీ అన్నారు. నిబంధనలు అతిక్రమించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే బైక్‌ రేస్‌లు నిర్వహించినా..మద్యం తాగి వాహనాలు నడిపినా.. కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు.

19:15 - December 28, 2016

ఢిల్లీ : మద్యం ప్రవాహానికి బ్రేక్ పడింది. హైవేలపై ఏరులై పారే మద్యం జోరుకు సుప్రీం కోర్ట్‌ కళ్లెం వేసింది. ఇకపై జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్ల వద్ద మద్యం అమ్మకాలను సర్వోన్నత న్యాయస్థానం నిషేధించింది. దీంతో మద్యం సిండికేట్లకు, మందు బాబులకు, వ్యాపారవేత్తలకు షాక్ తగిలింది. హైవేలపై జరిగే మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు దిమ్మతిరిగే తీర్పునిచ్చింది. జాతీయరహదారులపై విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడానికి వీళ్లేదని ఆర్డర్‌ వేసింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని..వ్యాపారులకు కిక్కు దించేలా తీర్పునిచ్చింది.

హైవేలపూ 500 మీటర్ల వరకు మద్యం దుకాణాలు, బార్లు ఉండద్దు : సుప్రీంకోర్టు
హైవేలను ఆనుకొని 500 మీటర్ల దూరం వరకు ఎటువంటి మద్యం దుకాణాలు, బార్లు ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బార్ల వద్ద బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్రకటన బోర్డులు ఉండకూడదన్న నిబంధనను ఏనాడూ పట్టించుకోని వ్యాపారులు... ఇప్పుడు ఆ బోర్డులను తొలగించక తప్పడం లేదు. ఇంతకు ముందు హైవేలపై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగేవి. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో వ్యాపారులతో పాటు మద్యం ప్రియులకు షాక్‌ తగిలింది.

సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పుపై ప్రజల్లో హర్షం
రహదారులపై ప్రమాదాలను నివారించేందుకే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హైవేలపై జరుగుతున్న ప్రమాదాల్లోఎక్కువశాతం డ్రింక్ అండ్‌ డ్రైవ్ కారణంగానే జరుగుతున్నట్లు నివేదికలు అందాయి. దీంతో సుప్రీం కోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుతోనైనా కొంతవరకూ ప్రమాదాలు నివారించవచ్చునని...మేధావులు అభిప్రాయ పడుతున్నారు.

సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పుపై ప్రజల్లో హర్షం
అయితే ప్రస్తుతం నడుస్తున్న మద్యం షాపుల లైసెన్స్ లకు 2017 మార్చి 31వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో అప్పటి వరకు ఈ షాపులు యథావిధిగా నడవనున్నాయి. మొత్తమ్మీద సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పుపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇకనుంచైనా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

 

కేసీఆర్ వ్యాఖ్యలకు సీపీఎం నిరసనలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసనగా సీపీఎం నిరసనలకు పిలుపునిచ్చింది. కేసీఆరర్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం నిరసనలు..ఆందోళనలను చేయాలని పిలుపునిచ్చింది. మల్లన్నసాగర్ లాఠీ చార్జి, కాల్పులకు సీపీఎంను నిందించటం కేసీఆర్ అవివేకమని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం ఎప్పుడూ ప్రజాస్వామ్య యుతంగా..శాంతియుతంగానే పోరాటాలు చేస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 

19:01 - December 28, 2016

కర్నూలు : పెద్దనోట్ల రద్దు వల్ల నష్టపోయిన రైతులు.. వ్యవసాయ కార్మికులు.. చేతి వృత్తిదారులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ప్రజా సంఘాలు ధర్నా చేశాయి. పెద్దనోట్ల రద్దు వల్ల.. కష్టపడి పండించిన పంటలు మార్కెట్‌ యార్డ్‌ ద్వారా కొనుగోలు కాకపోవడంతో కర్నూలు జిల్లా. తీవ్రంగా నష్టపోయారని సీపీఎం నేత షెడ్రక్‌ అన్నారు. అలాగే డబ్బులు కోసం బ్యాంక్‌లు చుట్టూ తిరగడంతో పనులు కూడా కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం.. ఏపీ రైతు సంఘం, కేవీపీఎస్‌ నాయకలు పాల్గొన్నారు.

18:57 - December 28, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నేటికి 50 రోజులైంది. ప్రజల నగదు కష్టాలు తీరాలంటే 50 రోజులు పడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. మరి మోదీ చెప్పినట్టు ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పాయా? ప్రజలకు నగదు ఇబ్బందులన్నీ తొలగిపోయాయా? బ్యాంకులు, ఏటీఎంల ముందు జనాల బారులు కనిపించడంలేదా? ఏటీఎంలు అన్నీ పనిచేస్తున్నాయా? పెద్దనోట్లు రద్దై 50 రోజులైన సందర్భంగా కరెన్సీ కష్టాలపై 10టీవీ కథనం...

నవంబర్‌ -8 పెద్దనోట్లు రద్దు చేస్తూ మోదీ నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని నల్లధనం, అవినీతిపై యుద్ధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు తయారు చేస్తోన్న నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్లధనాన్ని నియంత్రించడం, ప్రజలను డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇబ్బందులు 50 రోజుల్లో సర్ధుకుంటాయని చెప్పారు.

పెద్దనోట్లు రద్దు చేసి నేటికి 50 రోజులు
పెద్దనోట్లను రద్దు చేసి నేటికి 50 రోజులైంది. మరి మోదీ చెప్పినట్టు ప్రజల ఇబ్బందులన్నీ తొలిగిపోయాయా అంటే లేదనే చెప్పాలి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అన్నివర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తోంది. నేటికీ సామాన్యులకు కరెన్సీ కష్టాలు తప్పలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతూనే ఉన్నారు. చాలాచోట్ల నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ సగానికిపైగా ఏటీఎంల్లో నగదు పెట్టకపోవడంతో జనానికి తిప్పలు తప్పడం లేదు. నగదు కోసం క్యూలైన్‌లో సామాన్యులకు గంటలకొద్దీ పడిగాపులు గాస్తున్నారు. సామాన్యుల నుంచి ఉద్యోగస్తుల వరకు నగదు తిప్పలు తప్పలేదు.

గ్రామీణ ప్రాంతాల్లో నగదు తిప్పలు అధికం
గ్రామీణ ప్రాంతాల్లోనైతే నగదు కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. పట్టణ, నగర ప్రజలు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి కనీస అవసరాలు తీర్చుకుంటోంటే... గ్రామీణ ప్రాంతాల్లో ఆ అవకాశం కూడా లేదు. దీంతో కరెన్సీ కోసం జనం బ్యాంకులచుట్టూ తిరుగుతున్నారు. పనులన్నీ మానుకొని మరీ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. రబీ సీజన్‌లో పంట వేయడానికి పెట్టుబడులు లేక ఇబ్బందిపడుతున్నారు. అప్పులిచ్చే వారులేక, చేతిలో నగదులేక అష్టకష్టాలు పడుతున్నారు. రైతులకు 24వేల రూపాయలు బ్యాంకులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అవి ఆచరణకునోచుకోవడం లేదు. దీంతో రైతులు నగదుకోసం పడరానిపాట్లు పడుతున్నారు.

చిల్లరలేక చిరు వ్యాపారాలు డీలా
ఆర్‌బీఐ కూడా ఎక్కువగా 2000 నోట్లనే ముద్రిస్తోంది. ఆ నోటును మార్చడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 100,500 నోట్లు ఎక్కువగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. దీంతో చిల్లరలేక చిరు వ్యాపారాలు డీలా పడ్డాయి. కూరగాయలు, పండ్ల దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు, కిరాణాకొట్టు, తోపుడుబండ్లు, నాన్‌వెజ్‌ మార్కెట్‌లతోపాటు ఇతర చిన్నచిన్న వ్యాపారులకు నేటికీ చిల్లరచింత తప్పలేదు. వినియోగదారులు 2000నోట్లు ఇస్తుండడంతో దానికి చిల్లర ఇవ్వలేక గిరాకీనే వదులుకోవాల్సి వస్తోంది. దీంతో చిరువ్యాపారాలు చితికిపోతున్నాయి.

మోదీ సర్కార్‌పై ప్రజల ఆగ్రహం
50రోజులైనా కరెన్నీ కష్టాలు తప్పక ప్రజలు విసిగిపోతోంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నీ సర్దుకుంటాయని చెప్తోంది. పెద్దనోట్లను రద్దుచేసి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడం అంతా సులువేమీ కాదని ఆర్ధికవేత్తలు చెప్తున్నారు. రద్దుచేసిన నోట్ల స్థానంలో కొత్త వాటిని మళ్లీ ప్రింట్‌ చేయడానికి అనుకున్న గడువుకంటే మరో ఆరునెలలు అధికంగా పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి వరకు జనాలకు నోట్లకష్టాలు తప్పవని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వమేమో మొదటి నుంచీ అంతా చక్కబడుతుందని చెప్తోంది. మరోవైపు 50 రోజులైనా పరిస్థితిలో మార్పులేకపోవడంతో ప్రజలు మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

18:52 - December 28, 2016

ఢిల్లీ : మొబైల్‌ ఫోన్లు లేని పేదలు కూడా డిజిటల్‌ చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులపై ఢిల్లీలో జరిగిన సీఎంల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే డిజిటల్‌ చెల్లింపులపై ఓ నివేదిక ఇవ్వనున్నట్లు బాబు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలపై నియమించిన సీఎంల కమిటీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపిందని చంద్రబాబు చెప్పారు. కేవలం బయేమెట్రిక్‌ మిషన్‌ సాయంతోనే అన్నిరకాల ఆర్థిక లావాదేవీలు జరిగేలా త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వినియోగదారులు డిజిటల్‌ కరెన్సీ, నగదు రహిత చెల్లింపులపై పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు. 

18:50 - December 28, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూ సేకరణ బిల్లును స్పీకర్‌ మధుసూధనాచారి మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. తొలుత తెలంగాణ భూ సేకరణ చట్టానికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రతిపాదించిన చట్ట సవరణలను స్పీకర్‌ మూజువాణి ఓటుతో తిరస్కరించారు. కొత్తచట్టంలో ప్రభుత్వం ప్రతిపాధించిన ప్రతిపాదనలను మూజువాణి ఓటు ద్వారా పరిగణలోకి తీసుకున్నారు. 2013 భూ సేకరణ చట్టానికంటే మెరుగైన చట్టాన్ని రూపొందించామని సీఎం కేసీఆర్‌ తెలపడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త భూ సేకరణ చట్టం బిల్లును చివరి క్షణంలో పాస్‌చేయకుండా స్పీకర్ ప్రతిపక్షాల అభ్యంతరాలను విన్నారు. ఆ తర్వాత తెలంగాణ కొత్త భూ సేకరణ బిల్లును స్పీకర్‌ మూజువాణి ఓటు ద్వారా పాస్‌ చేశారు. 

18:47 - December 28, 2016

హైదరాబాద్ : 2013 భూ సేకరణ చట్టంలో ఉన్నదానికంటే ఎక్కువ నష్టపరిహారం ఇస్తామంటే ఆ విషయాలన్నీ కొత్తచట్టంలో పొందుపర్చాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన 2013 భూ సేకరణ చట్టాన్ని సవరించే అధికారం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తచట్టంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సభకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జానారెడ్డి అన్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న పవన్

శ్రీకాకుళం : జిల్లా పర్యటనకు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పర్యటన ఖారరైంది. జనవరి 3న పవన్ కళ్యాణ్ జిల్లాకు రానున్నారు. ఇచ్ఛాపురంలో కిడ్నీ బాధితులను పవన్ పరామర్శించనున్నారు. 

బాంబు పేలి జవానుకు గాయాలు..

 ఛత్తీస్‌గఢ్‌ : దంతేవాడ జిల్లాలో నక్సల్స్ అమర్చిన బాంబు పేలడంతో ఓ సీఆర్పీఎప్ జవాను గాయపడ్డాడు. జిల్లాలోని బర్సూర్-నారాయణపూర్ మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. 

బ్యాంకుల్లో ఉన్న సొమ్ముపై 18% వడ్డీ ఇవ్వాలని:రాహుల్ గాంధీ

ఢిల్లీ : విత్ డ్రాలపై ఆంక్షలు ఉన్నంతకాలం బ్యాంకుల్లో ఉన్న సొమ్ముపై 18 శాతం వడ్డీ ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

17:37 - December 28, 2016

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక పండుగే పండుగ. న్యూ ఇయర్ సందర్భంగా 'కాటమరాయుడు' చిత్ర పోస్టర్స్ విడుదలవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఐదు పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు శరత్ మరార్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అనుకున్నట్లుగానే బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో 'పవన్ కళ్యాణ్' పూర్తిగా కనిపించడం లేదు. కేవలం నడుచుకుంటూ వెళుతున్నట్లుగా ఉంది. బాంబులు పేలిన అనంతరం వెదజల్లే పొగలో నుండి నడుస్తున్నట్లుగా ఫొటోలో ఉంది.

'శరత్ మరార్' నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

17:37 - December 28, 2016

కేసీఆర్ వి దిక్కుమాలిన చర్యలు : తమ్మినేని

హైదరాబాద్: భూసేకరణ చట్టానికి మార్పులు చేసి కేసీఆర్ దిక్కుమాలిన చర్యలకు పాల్పడ్డారుని, భూసేకరణ పై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉద్యమాలపై కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఉద్యమాలపై కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారని, భూనిర్వాసితులకు అండగా మరిన్ని ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భూసేకరణ చట్టం పై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సీపీఎం ఉద్యమాలపై చేసిన వాఖ్యలను తమ్మినేని తూర్పారబట్టారు.

17:36 - December 28, 2016
17:33 - December 28, 2016
17:29 - December 28, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 31 తర్వాత 5 వందలు, వెయ్యి నోట్లు కలిగి ఉండేవారిపై కఠినమైన చర్యలు తప్పవు. విచారణతో పాటు భారీగా జరిమాన చెల్లించాల్సి ఉంటుంది.

పెద్ద నోట్ల రద్దుపై కొత్త ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోది అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన కొత్త ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునే గడువు డిసెంబర్‌ 30తో ముగుస్తుంది. దీని తర్వాత కూడా అంటే ప్రత్యేక పరిస్థితుల్లో రద్దయిన పెద్ద నోట్లను ఆర్బీఐలో జమ చేసుకునేందుకు మార్చి 31, 2017 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. అప్పటికి కూడా బ్యాంకులో జమ చేయకుండా 5 వందలు, 1000 నోట్లు కలిగి ఉంటే మాత్రం విచారణ ఎదుర్కోక తప్పదు.

రూ. 50 వేలు జరిమానా
మార్చి 31 తర్వాత పది అంతకన్నా ఎక్కువ రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉంటే విచారణతో పాటు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 5 వందలు, వెయ్యి పాత నోట్లు పది ఉంటే ఐదింతలు అంటే 50 వేలు జరిమానా విధిస్తారు. వీటికి సంబంధించి స్థానిక కోర్టుల్లో విచారణ జరుగుతుంది.నవంబర్‌ 8న 5 వందలు, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. డిసెంబర్‌ 13 నాటికి 12.44 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు ఆర్బీఐ పేర్కొంది. నవంబర్‌ 8కి ముందు 15.44 లక్షల కోట్ల పెద్ద నోట్ల నగదు చలామణిలో ఉండేది.

గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

హైదరాబాద్: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజల్ పేరు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది.

17:06 - December 28, 2016

హైదారాబాద్ : సీపీఎం పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా ఖండించారు. సీపీఎం పార్టీ గుండులూ..సూదులు బ్యాచ్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బుధవారం శాసనసభలో భూ సేకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలో సీపీఎం పార్టీపై పలు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. సీపీఎం గుండులు గుచ్చే పార్టీ కాదని..ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో తమ పార్టీనీ..పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను విమర్శించటం కరెక్టు కాదని..దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. నిర్భందం ఉన్న సమయంలో తమ్మినేని బైక్ పై వెళ్లారని, 2013 భూ సేకరణ చట్టం అమలు జరపాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. 
మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూ సేకరణ అంశంపై మొదటి నుండి సీపీఎం పార్టీ పోరాడుతున్న విషయం తెలిసిందే. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, జీవో నెంబర్ 123ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అక్కడి రైతులకు అవగాహన కల్పిస్తూ వారి తరపున పోరాటం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య తీవ్రంగా ఖండించారు.

ఉభయసభలు రేపటికి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు శాసనసభలో తెలంగాణ భూసేకరణ చట్టం పై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఆ చట్టానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన సున్నంరాజయ్య

హైదరాబాద్: 'మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సీపీఎం నేతలు రైతులను రెచ్చగొట్టారని, సీపీఎం పార్టీకి దిక్కుమాలిన స్ట్రాటజీలు ఉంటాయి, ప్రజల ప్రాణాలను సైతం ఫణంగా పెడుతాని, పోలీసులను సూదులు, దబ్బడాలతో కుచ్చి రెచ్చగొడుతారని' అసెంబ్లీ భూసేకరణ బిల్లుపై జరిగిన చర్చలో కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్రంగా ఖండించారు. సీపీఎం ప్రజలపక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు.

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో సాంకేతికలోపం

ప్రకాశం: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ప్రకాశం జిల్లా చీరాలలో గంటకు పైగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ భూసేకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్ : విపక్షాల నిరసన మధ్య తెలంగాణ భూసేకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందినట్లు స్పీకర్ మదుసూధనాచారి తెలిపారు. అంతకముందు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇస్తూ విపక్షాలపై మండిపడ్డారు. ప్రత్యేకంగా సీపీఎం ప్రజలను రెచ్చగొట్టి మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటోందని విమర్శించారు.

కైలాష్ గుప్తాకు నాంపల్లి కోర్టులో ఊరట

హైదరాబాద్: ముసిద్దీలాల్ జ్యువెలరీ షాపు యజమాని కైలాష్ గుప్తాకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను అనుమతించింది. కైలాష్ గుప్తాను అరెస్టు చేయొద్దని సీసీఎస్ కు ఆదేశించారు. తదుపరి విచారణ జనవరి 2కు వాయిదా వేసినట్లు తెలిపింది.

16:34 - December 28, 2016

హైదరాబాద్ : దేశంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి ప్యాకేజీని భూసేకరణ నిర్వాశిత రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2013 చట్టంలో ఉన్నదానికంటే మెరుగైన పరిహారం ఇస్తామని హైకోర్టుకు తెలిపామన్నారు. 2013 భూసేకరణ బాధ్యతారహితంగా చేసిందనీ..2013 చట్టం కింద రూ.లక్షా 20 వేలు మాత్రమే ఇస్తారనీ..మా ప్రభుత్వం పరిహారంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇస్తామని తెలిపారు. ప్రాజెక్టులకు భూసేకరణ అంశంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. మల్లన్న సాగర్ కు 75 శాతంమంది రైతులు భూములిచ్చేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారని తెలిపారు. విపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. భూ సేకరణ చేయకుండానే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణ అధికారముందనీ..ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ సహా ఏడెనిమిది రాష్ట్రాలు ఈ చట్టం ప్రకారమే చేపట్టాయని తెలిపారు. ప్రాజెక్టులు కట్టకుండా ఓ ముఠా అడ్డుపడుతోందనీ..ప్రాజెక్టులపై స్టే తెచ్చుకుని రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ సూచనల మేరకే భూసేకరణ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసేందుకే 123 జీవో తీసుకొచ్చామన్నారు. ప్రజలను కష్టపెట్టే అవసరం ప్రభుత్వానికి లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖిరి మార్చుకోవాలన్నారు.

'ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణ అధికారం ఉంది'

హైదరాబాద్ : కేంద్రం చేసిన 2013 భూసేకరణచట్టం బాధ్యతా రహితం చేసిందని, భూసేకరణ పై రాష్ట్రప్రభుత్వానికి ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణ అధికారం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ సహా ఏడెనిమిది రాష్ట్రాలు చట్టాలు చేశాయని గుర్తు చేశారు. భూసేకరణ చేయకుండానే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కట్టారా అని కేసీఆర్ నిలదీశారు.

మల్లనసాగర్ ను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయ్'

హైదరాబాద్ :కుట్రలో భాగంగానే మల్లనసాగర్ ను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మల్లన్న సాగర్ ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టామని తెలిపారు. మల్లన్నసాగర్ కు 75శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగా ముదుకొచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రపదేశ్ లో ఏ ప్రభుత్వం రైతులకు ఇవ్వనటువంటి ప్యాకేజీని మేం ఇస్తున్నాం అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది:ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్ : కేంద్రం రూపొందించిన భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. భూసేకరణ పై ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్లి న్యాయస్థానాల చేత చివాట్లు తింటోందని ఎద్దేవా చేశారు. కేంద్ర భూసేకరణ చట్టంలోని అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తొలిగించిందని మండిపడ్డారు.

16:08 - December 28, 2016

హైదరాబాద్ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన భూ సేకరణ చట్టాన్ని ప్రజల పాలిట శాపంగా మార్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆరోపించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రాజెక్టుల పేరిట రైతులను నిలువునా ముంచేస్తున్నారని ఆయన అన్నారు. 123 జీవో పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. 123 జీవోను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెప్పారు.

16:04 - December 28, 2016

హైదరాబాద్ : బీసీ జాబితా నుంచి తొలగించిన బలిజ, ఇతర కులాల వారికి తగిన న్యాయం చేస్తామని మంత్రి జోగు రామన్న అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 54శాతం ఉన్న బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవలే కమిషన్‌ను కూడా నియమించిందని..త్వరలోనే కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని మంత్రి అన్నారు. నివేదిక వచ్చిన తర్వాత దానిపై విస్త్రతంగా ప్రభుత్వం చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు మంత్రి జోగురామన్న. 

16:03 - December 28, 2016

హైదరాబాద్ : చట్టం కలవారి చుట్టం కాకూడదని టీడీపీ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్‌కు కులాలకు సంబంధించిన అన్ని విషయాల్లో పూర్తి అధికారులు ఇవ్వాలని టీడీపీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని బీసీ కులాల మీద సంఘబహిష్కరణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వారి రక్షణ కొరకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కమిషన్‌కు పూర్తి అధికారాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ కొన్ని బీసీ కులాలు సంఘ బహిష్కరణకు గురవుతున్నాయన్నారు. 

15:39 - December 28, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు పూర్తిగా చట్టవిరుద్ధమని, యాభై రోజులైనా ప్రజల నోట్ల కష్టాలు తీరడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 50 రోజుల్లో అంతా చక్కదిద్దుకుంటుందన్న మోదీ మాటలు వాస్తవ దూరంగా ఉన్నాయని, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు గడవడమే గగనంగా మారిందని ఏచూరి అన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంటు సమాధానం ఇవ్వకుండా మోదీ ముఖం చాటేశారని ఆయన దుయ్యబట్టారు. ప్రజల్లో నెలకొన్న అనేక ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సహారా బిర్లా, జీఎస్‌పీఎస్‌ డీల్స్‌కు సంబంధించి మోదీ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ఏచూరి ప్రశ్నించారు. నోట్ల కోసం క్యూలైన్లలో నిలబడి 105 మంది మరణించారని, దీనికి మోదీ ఏం సమాధానం చెబుతారని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. 

15:34 - December 28, 2016

కరీంనగర్ : ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యమే కాదు.. కారుణ్యం కూడా ఉంటుంది. కర్కశంగా వ్యవహరించే పోలీస్ అధికారుల్లో అప్యాయతానురాగాలు కలగలిసిన మానవతావాదులు కూడా ఉంటారు. అలాంటి కొందరిలో విక్రంజిత్ దుగ్గల్ ఒకరు. పునర్జన్మ అనే కార్యక్రమం ద్వారా అభాగ్యులను, అనాధలను చేరదీసి వారికి ఆశ్రమం కల్పిస్తున్న రామగుండం కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ పై టెన్ టీవీ ప్రత్యేక కథనం

ఆదివాసీలతో కలిసి సంహఫంక్తి భోజనం
చట్టాల అమలులో కఠినంగా వ్యవహరిస్తారు పోలీస్ అధికారులు.. ఇదే మనకు తెలుసూ...కానీ అభాగ్యులు, అనాధల పట్ల కారుణ్యంతో వ్యహరించే పోలీస్‌ అధికారులు కూడా ఉన్నారు. వారిలో ఒకడు ప్రస్తుతం రామగుండం కమిషనర్‌గా పనిచేస్తున్న విక్రమ్‌జిత్ దుగ్గల్. ఐపీఎస్ అధికారి అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా ప్రజలతో చాలా తొందరగా కలిసిపోతాడు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో మారుమాలు అటవీప్రాంతంలోని ఆదివాసీలతో కలిసి సంహఫంక్తి భోజనం చేసి పోలీసులంటే వారిలో ఉండే భయాన్ని పోగొట్టాడు.

నాలుగేళ్లుగా అనాధలను, అభాగ్యులకు సౌకర్యాలు
రామగుండం కమిషనరేట్ పరిధిలో మతిస్థిమితం కొల్పోయిన వారిని, అందరూ ఉండి అనాధలుగా మారి రోడ్లపై తిరుగుతున్న వారిని చేరదీసి పునర్జన్మ అనే కార్యక్రమం ద్వారా ఆశ్రయం కల్పిస్తున్నాడు విక్రమ్‌జిత్ దుగ్గల్. నాలుగేళ్లుగా అనాధలను, అభాగ్యులను చేరదీసి వారికి వైద్యం, దుస్తులు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తూ తనలోని మానవత్వాన్ని విక్రమ్‌జిత్ చాటుతున్నాడు.

కమిషనరేట్ పరిధిలో అభాగ్యుల గుర్తింపు..పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 75 మంది
రామగుండం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట శాంతి భద్రతల పై ప్రత్యేక శ్రధ్ద వహించాడు. ఓ వైపు శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతునే మరో వైపు సామాజిక సేవ కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో పనిచేసే అధికారులకు రోడ్ల పై అనాధలు, మతిస్థిమితరం లేకుండా తిరిగే వారిని వెతకమంటూ వారం రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు రెండు జిల్లాల్లో కలిపి 75 మందిని అధికారులు గుర్తించారు. వీరిని కమిషనరేట్ కార్యాలయం తరలించి సామూహిక క్షౌర కార్యక్రమాలు, కొత్తబట్టలు అందించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. డీఐజీ రవివర్మతో కలిసి ఈ కార్యక్రమాన్ని కమిషనర్ దుగ్గల్ ప్రారంభించారు.

అభ్యాగ్యులను, అనాధలను అమ్మానాన్న అశ్రమంకు తరలింపు
ఇలా అభాగ్యులను, అనాధలను చేరదీసి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలిస్తున్నారు. ఇక్కడ వీరికి వైద్యంతో పాటు రోజు యోగాసనాలు వేయించి మానసిక పరివర్తనకు కృషిచేస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన వారికి ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత పూర్వపరాలు తెలుసుకొని వారి కుటుంబీకులకు అప్పగిస్తున్నారు. అమ్మానాన్న ఆశ్రమంలో ఉండి పునర్జన్మ పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారంతా అమ్మానాన్న ఆశ్రమానికి వాలంటీర్లుగా పని చేస్తున్నారు.

చేరదీసిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొ ధీనగాధ
పునర్జన్మ కార్యక్రమం ద్వారా చేరదీసిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొ ధీనగాధ. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో అభాగ్యులుగా మారి దుర్భర జీవితం గడిపినవారే. వీరిలో చాలామంది 30 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. కుటుంబంలో గొడవలు, ప్రేమ విఫలం, ఆర్థిక పరమైన ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురై మతిస్థిమిత కొల్పోయిన వారు. చెడు వ్యసనాలకు బానిసలైన వారంతా మానసికంగా కృంగిపోయిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పునర్జన్మ కార్యక్రమం ద్వారా చేరదీసిన వారిలో చాలామంది పునర్జన్మ పొందారని కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ చెబుతున్నారు.

అమ్మానాన్న ఆశ్రమ సేవలతో స్పూర్తి పొందిన దుగ్గల్
నిజామాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో దుగ్గల్‌ను అమ్మానాన్న ఆశ్రమం వారు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దీనస్థితిలో ఉన్నవారిని చూసి చలించిపోయిన దుగ్గల్ నిజామాబాద్‌లో 30 మందిని చేరదీసి అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు. నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో పునర్జన్మ కార్యక్రమం ద్వారా 150 మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం రామగుండం కమిషనర్‌గా 75 మందిని ఆశ్రమానికి పంపించారు. వీరందరిని పంపించడంతో తన బాధ్యత అయిపోయిందని అనుకోకుండా అమ్మానాన్న ఆశ్రమంలో అభాగ్యుల కోసం 15 లక్షలతో భవన నిర్మాణం చేపట్టాడు.
అన్న గుర్తుగా తమ్ముడి ఆరాటమే అమ్మానాన్న ఆశ్రమం
పునర్జన్మ పేరుతో కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్ అభాగ్యులు చేరదీస్తున్నప్పటికీ అమ్మానాన్న ఆశ్రమమే వారందరి బాగోగులు చూస్తోంది. ఈ ఆశ్రమం స్థాపించడానిక ఓ బలమైన కారణం ఉంది. చౌటుప్పల్ చెందిన గట్టు వెంకటేశం మతిస్థిమితం కోల్పోయి రోడ్ల పై తిరగడం అతని సోదరుడు శంకర్‌ను తీవ్రంగా భాధించింది. అప్పటి వరకు ముంబైలో ఉద్యోగం చేస్తున్న శంకర్ అన్న మరణం తరువాత ఉద్యోగం వదిలి వేసి అమ్మానాన్న ఆశ్రమాన్ని 2010 పిభ్రవరి1 న ప్రారంభించాడు. 6 యేళ్లుగా నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఇప్పటి వరకు 500 మంది అభాగ్యులను చేరదీయగా 100 మందిని మాములు మనుషులుగా మార్చి వారి కుటుంబాలకు అప్పగించారు. 2012 నుండి కమిషనర్ దుగ్గల్ ఆశ్రమంలో కీలక భాద్యతలు నిర్వహిస్తూ ఆశ్రమ నిర్వహణకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

మానవాతవాది విక్రంజిత్ దుగ్గల్‌కు 10 టీవీ సెల్యూట్ ...
పోలీస్ అధికారిగా శాంతిభద్రతల పరిరక్షిస్తూనే...మరో పక్క సమాజం పట్ల బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేస్తూ మానవాతవాదిగా నిలిచిన విక్రంజిత్ దుగ్గల్‌కు 10 టీవీ సెల్యూట్ .

ఎస్పీ అభ్యర్థులను ప్రకటించిన ములాయం

యూపి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తొలిజాబితా అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. 176 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి స్థానంకల్పించగా, 78స్థానాల అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. ఫిబ్రవరి 28న తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి పొత్తులేవని స్పష్టం చేశారు.

15:28 - December 28, 2016

ఢిల్లీ : కేంద్రం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పే సంస్థలు, పేదవాడికి అండగా నిలిచే స్వచ్ఛంద సంస్థలను కేంద్రం టార్గెట్ చేసింది. అక్రమాలు జరుగుతున్నాయనే నెపంతో దాదాపు 20వేల ఎన్జీవోలపై వేటు వేసింది.

కొనసాగుతున్న కేంద్రం నియంతృత్వ ధోరణి
కేంద్రం నియంతృత్వ ధోరణి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ గళం విప్పే సంస్థల్ని కేంద్రం టార్గెట్ చేసింది. ఆయా సంస్థలకు అక్రమంగా విదేశీ నిధులు అందుతున్నాయన్న నెపంతో నిధులపై వేటు వేసింది. దేశవ్యాప్తంగా 20వేల స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల నియంత్రణ చట్టం లైసెన్సులను రద్దు చేసింది.

పేదల బాగు కోసం విరాళాలు ఇవ్వడానికి విదేశీయులు ఆసక్తి
పేదల దగ్గర కాసింత డబ్బులు ఉంటే చాలు ఓర్చుకోలేరు. ఇక పేదల బాగు కోసం ఎలా నిధులు ఇస్తారు? అలాంటిది మన దేశంలో ఉండే పేదల బతుకులు బాగుండాలని, పర్యావరణం, విద్య, ఆర్థిక, సామాజిక రంగాల వారీగా చేయూతనివ్వడానికి కొంతమంది విదేశీయులు ముందుకువస్తారు. అలాంటి వారి కోసం ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి విరాళాలు సేకరిస్తుంటారు. కేంద్రం ఈ విరాళాలను విదేశీ నిధుల నియంత్రణ చట్టం పరిధిలోకి తెచ్చింది.

నిబంధనలు ఉల్లఘించడంతోనే లైసెన్సులు రద్దన్న కేంద్ర హోంశా
ఈ చట్టంకు సంబంధించి పలు నిబంధనలను ఉల్లఘించాయని కొన్ని సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. దీంతో ఇక నుంచి ఈ సంస్థలు విదేశీ విరాళాలను స్వీకరించే వెసులుబాటు లేకుండా చేసింది. ఒకేసారి 20వేల సంస్థలపై వేటు వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

బీజేపీ అనుకూల సంస్థలను పట్టించుకోని కేంద్రం
బీజేపీ మద్దతుదారుల నేతృత్వంలో నడిచే స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. ఈ సంస్థలకు వచ్చే విరాళాల లెక్కల గురించి కేంద్రానికి అనవసరం.. కేంద్రంపై ఎదురుదాడికి దిగే సంస్థలను మాత్రమే టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే 2015లో ఫైనాన్సియల్ ఇంటలిజెన్స్ యూనిట్ ను ఏర్పాటుచేసింది.

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఇందిరాజైసింగ్‌
ప్రభుత్వం నిర్ణయాలను విమర్శించే వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్ తెలిపారు. ఇందుకోసం విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని అస్త్రంగా మలుచుకుంటుందని విమర్శించారు. సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బకొడితే వాటి నిర్వహకులు తమ చెప్పుచేతుల్లో ఉంటారని కేంద్రం భావిస్తోందని పలు ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

15:22 - December 28, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కారు గుజరాత్‌ జపం చేస్తోంది. రైతుల నుంచి భూములు లాక్కునేందుకు గుజరాత్‌ నమూనాను ప్రయోగించాలని చూస్తోంది. కేంద్రప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని శాశ్వతంగా అటకెక్కించే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర చట్టానికి లోబడే తమ చట్టం ఉందని పైకి చెబుతున్నా.. అంతర్గతంగా, ఇష్టానుసారంగా రైతుల భూమిని కొల్లగొట్టే కుట్రలు చేస్తోంది. కేసీఆర్‌ సర్కారు భూసేకరణ చట్టం కొత్త రూపుపై.. విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఇంతకీ తెలంగాణ సర్కారు సరికొత్త భూసేకరణ చట్టం విధివిధానాలేంటి..? రైతులకు జరగబోయే నష్టం ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

కేంద్ర ప్రభుత్వ భూ సేకరణ చట్టాన్ని శాశ్వతంగా అటకెక్కించే ప్రయత్నం
జీవో నెంబర్‌ 123కి అనుగుణంగానే కొత్త చట్టం తెచ్చే యత్నం ..నిర్వాసితులకు అన్యాయం చేసేలా ఉంటే సహించేది లేదంటున్న ప్రతిపక్షాలు...భూసేకరణ చట్టంలో మార్పులు తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రత్యేక భూసేకరణ చట్టం ద్వారా భూమి సేకరించే క్రమంలో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకే ఈ చట్టం తేబోతుంది. కేంద్ర భూ సేకరణ చట్టం-2013 కు లోబడే ఉన్నప్పటికీ.. బిల్లులో మాత్రం కలెక్టర్లకే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉన్నట్లు సమాచారం.

భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయం
ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ పై.. ప్రతిపక్షాలు, హైకోర్టు నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర భూసేకరణ చట్టం-2013కు అనుగుణంగా... గుజరాత్ తరహలో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. ఇప్పటికే భూ సేకరణ ముసాయిదా బిల్లు తయారీకి అధికారులతో కమిటీ వేస్తూ కేసీఆర్ సర్కార్ సెప్టెంబర్ 12 న ఉత్తర్వులు జారీ చేసింది. 2013 భారత భూ పరిహర చట్టం కు అనుగుంగా కమిటీ ముసాయిదా బిల్లును తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ చట్టం ఆధారంగా తెలంగాణ ప్రత్యేక భూ సేకరణ చట్టం ఉంటుందని సమాచారం. అయితే కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా, నిర్వాసితులకు అన్యాయం జరిగేలా ఉంటే వాటిని వ్యతిరేకించి తీరతామని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు.

కేంద్ర భూసేకరణ చట్టం-2013కు అనుగుణంగా మార్పులు
జీవో నెంబర్‌ 123కి అనుగుణంగానే కొత్తగా తీసుకు రాబోయే చట్టం ఉండనుంది. అయితే..ఈ ప్రత్యేక భూసేకరణ చట్టంలో సాంఘిక ప్రభావ అంచన గల చట్టం - 2013, 1894 చట్టంలో సాంఘిక ప్రభావ అంచనా సోషల్ ఇంప్యాక్ట్‌ అసెస్ మెంట్ కు అవకాశం లేకపోవడం గమనార్హం. దీంతో పాటు భూ యాజమానితో ప్రభుత్వం కేవలం సంప్రదింపుల ద్వారానే భూమి సేకరించే విధంగా బిల్లులో పొందుపరిచారు. అయితే ప్రజల అంగీకారం ప్రకారమే ఈ చట్ట సవరణ చేయాలని ప్రజాసంఘాలు, మేధావులు డిమాండ్‌ చేస్తున్నారు.

భూ సేకరణ పై ప్రతిపక్షాలు, హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు
మొత్తానికి రాష్ట్రంలో మ‌ల్లన్నసాగర్‌, ముచ్చర్ల ఫార్మా సిటీ, నిమ్జ్‌ వంటి వాటికి భూసేకరణ నిర్ణయ సమయంలో ప్రభుత్వానికి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ఈ భూసేకరణ చట్టం అని, అయినా.. నిర్వాసితులకు అన్యాయం చేసేలా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.  

15:19 - December 28, 2016

తమిళానాడు : దివంగత ముఖ్యమంతి జయలలిత మృతి అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికోసం జయ ప్రియ నెచ్చెలి శశికళ పక్కాప్రణాళిక ప్రకారం పావులు కదుపుతున్నారు. మరోపక్క జయ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్న‌య్‌లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాల‌యం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అన్నాడీఎంకే బ‌హిష్కృత ఎంపీ శశికళపుష్ప లాయర్ పై అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో తీవ్రంగా ఉద్రిత్తత నెలకొంది. అన్నాడీఎంకే పార్టీ ప్రాధాన కార్యదర్శిగా శ‌శిక‌ళే బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న ప్ర‌చారం ఊపందుకుంటున్న వేళ అన్నాడీఎంకే బ‌హిష్కృత ఎంపీ శశికళ పుష్ప లాయర్ పార్టీ కార్యాల‌యాల‌నికి వ‌చ్చారు.లాయర్ ను అక్కడి నుంచి తరలించారు. కాగా, స‌ద‌రు లాయ‌రు పార్టీ కార్యాల‌యంలో ఓ లేఖ‌ను అందించ‌డానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యకర్తల దాడిలో లాయర్ కు తీవ్ర‌ గాయాలయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు రంగప్రవేశం చేసిన ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా శశికళను శశికళా పుష్ప మొదటినుండి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. 

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ప్రొ. వీ ఆచార్య

ముంబై : భారతీయ రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా ప్రొఫెసర్ విరాల్ వీ ఆచార్య నియమితులయ్యారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన ఆచార్యను మూడేళ్ళ పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

15:16 - December 28, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' సినిమా ఇదే కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'శరత్ మరార్' నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా 'శరత్ మరార్' చిత్రానికి సంబంధించిన విషయాలను ట్వీట్స్ చేశారు. నూతన సంవత్సరం 'కాటమరాయుడు'తో జరుపుకుంటున్నామని, చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ బుధవారం సాయంత్రం 5గంటలు రిలీజ్ చేయనున్నామని ట్వీట్స్ చేశారు. మరి ఆ పోస్టర్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.

15:06 - December 28, 2016

'ఖుష్బూ'..సీనియర్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. తన నటనతో అలరించింది. తెలుగు సినిమాలో నటించి చాలా కాలమైంది. మురుగదాస్ - చిరంజీవి కలయికలో వచ్చిన 'స్టాలిన్' సినిమాలో 'ఖుష్బూ' 'చిరు'కు సోదరిగా నటించింది. అనంతరం తెలుగు సినిమాలకు సైన్ చేయలేదు. 9 ఏళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు కనిపించబోతోంది. తాను తెలుగు ప్రేక్షకులకు కనిపించబోతున్నట్లు స్వయంగా 'ఖుష్బూ' ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. అప్పుడు అన్నయ్యతో నటించగా ఇప్పుడు సోదరుడితో నటించబోతున్నట్లు తెలిపింది. పవర్‌ స్టార్ 'పవన్‌ కళ్యాణ్', 'త్రివిక్రమ్' కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తాను ప్రధాన పాత్ర పోషించనున్నట్లు 'ఖుష్బూ' తెలిపింది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నానని, త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నానంటూ ట్వీట్ చేసింది. స్ర్కిప్ట్ బ్రిలియంట్ గా ఉందని, చాలా పవర్ పుల్ క్యారెక్టర్ అని తెలిపింది. మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని 'ఖుష్బూ' పేర్కొంది. మరి 'పవన్' చిత్రంలో 'ఖుష్బూ' పాత్ర ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్య

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ఓ తుగ్లక్ చర్య అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... మరో 6 నెలలు ఈ నోట్ల సమస్యలు ఇలానే ఉంటాయని, అవినీతి పరులకు అండగా ఉండే మోడీకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దేశంలో కార్పొరేట్ అనుకూల పాలన జరుగుతోందని బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టిన వారి బకాయిలు మాపీ చెయ్యడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.

పలు బిల్లులను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్: తెలంగాణ భూసేకరణ బిల్లును మంత్రి హరీశ్ రావు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతులు కోరిన విధంగా పరిహారం అందిస్తామన్నారు. ల్యాండ్ ఓనర్ 2013 చట్ట ప్రకారం పరిహారం కోరితే అలాగే చెల్లిస్తామన్నారు. బీసీ కమిషన్ సవరణ బిల్లుకు, తెలంగాణ వ్యాట్ సవరణ బిల్లుకు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో ఉన్న పెండింగ్ కేసుల బదిలీ బిల్లుకు, జీహెచ్ఎంసీ రెండో సవరణ బిల్లుకు, తెలంగాణ యాక్ట్స్ బిల్లుకు, ఖమ్మం మెట్రోపాలిటన్ ఏరియా పోలీసు బిల్ 2016కు, శాసనసభ ఆమోదం తెలిపింది.

15:01 - December 28, 2016

హైదరాబాద్‌ : దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ సిబ్బంది నిరంతర పరిశ్రమవల్ల 2016సంవత్సరంలో సిటీలో నేరాల శాతం తగ్గిందన్నారు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రజల సహకారంతో.. హైదరాబాద్‌లో నేరాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే విధంగా రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థను మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు సీపీ. శాంతిభద్రతను కాపాడ్డంతోపాటు పౌరులతో స్నేహంగా మెలిగేలా .. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందింస్తున్నామని మహేందర్‌రెడ్డి అన్నారు. 

శశికళాపుష్ప లాయర్ పై అన్నాడీఎంకే కార్యకర్తల దాడి

చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత ఎంపి శశికళాపుష్ప లాయర్ పై అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఘటన జరిగింది. శిశకళ నాయకత్వాన్ని శశికళాపుష్ప తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేసేందుకు పార్టీ ఆఫీసుకు లాయర్ తో శశికళాపుష్ప భర్త లింగేష్ వచ్చారు. లాయర్, లింగేష్ను అన్నాడీఎంకే కార్యకర్తలు చితకబాదారు.

సైబర్ భద్రతపై అందరికంటే ముందున్నాం:చంద్రబాబు

ఢిల్లీ : డిజిటల్ లావాదేవీలపై ఉపసంఘం భేటి ముగిసింది. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... డిజిటల్ లావాదేవీల్లో ఆధార్ నమోదు కీలకం అని తెలిపారు. సైబర్ భద్రతపై అందరికంటే ముందున్నామన్నారు. నగదు రహిత లావాదేవీల పెంపుదలకు ప్రోత్సాహకాలు, మొబైల్ లావాదేవీలపై అందరూ ఆసక్తి చూపాలని తెలిపారు. విడతల వారీగా పీవోఎస్ యంత్రాల పంపిణీకి నిర్ణయించిట్లు పేర్కొన్నారు. ఆధార్ ఆధారిత చెల్లింపులు ఇప్పటి వరకు 4 బ్యాంకులే నిర్వహిస్తున్నామన్నారు.

13:58 - December 28, 2016

హైదరాబాద్ : నగరంలో అక్రమకట్టడాలపై టీఅసెంబ్లీలో చర్చ జరిగింది. భవన నిర్మాణాలకు అనుమతుల ఇవ్వడంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ విఫలమైందని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలకు సంబంధించి తప్పులను సరిదిద్దుకోవడానికి కాస్తా టైం ఇచ్చి తదనంతరం అక్రమ నిర్మాణ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

 

13:54 - December 28, 2016
13:50 - December 28, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుపై ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2017 సం. మార్చి 31 తర్వాత పాత రూ.1000, రూ.500 నోట్లు కలిగివుంటే 4 సం.లు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. పాత నోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఆర్డినెన్స్ లోని అంశాలను న్యాయశాఖ పరిశీలించాల్సివుంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత చట్ట రూపుంలో రానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తిరుమలలో రాష్ట్రపతి ప్రణబ్..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయం వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికారు. వరహాస్వామిని రాష్ట్రపతి, గవర్నర్ దర్శించుకున్నారు.

 

మహాజన పాదయాత్ర 1900 కి.మీ..

జగిత్యాల : సీపీఎం మహాజన పాదయాత్ర 1900 కి.మీ.పూర్తి చేసుకుంది. మల్యాల వద్ద కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, పలువురు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు.

13:45 - December 28, 2016

రక్షించాల్సిన భటులే అమ్మాయిల పాలిట శాపాలుగా మారుతున్నారు. 2016 సంవత్సరంలో ఎందరో పోలీస్ లవ్ గేమ్ లు బయటపడ్డాయి. డబ్బు ఎంతకావాలో చెప్పు ఇచ్చేస్తా..నువ్వు నా నుండి దూరం కావడమే..అధికారులు మందలించలినా ఓ ఎస్ఐ వినలేదు..

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఇన్స్ పెక్టర్..కానిస్టేబుల్ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఆమె డబ్బుతోనే ఉద్యోగం కూడా సంపాదించుకుని ఎస్ఐ గా చేరిన అనంతరం ప్రియురాలిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నతాధికారుల సమక్షంలో పెళ్లైనా భార్యను విడిచి మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. శివకుమార్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లా కేవీపురం ఎస్ఐగా విధులు నిర్వరిస్తున్నాడు. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన షేక్ నగీనా కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంచి ఉద్యోగం వచ్చే వరకు చదువుకుంటానని శివ కుమార్ చెప్పడంతో నగీనా డబ్బులు ఖర్చు చేస్తూ అతడిని చదివించింది. మధ్యలో వీఆర్ఓ గా ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం కావాలని చెప్పడంతో ఎస్ఐ గా పరీక్షలు రాశాడు. అనంతరం ఉద్యోగం వచ్చింది. రెండు..మూడు రోజుల కాపురం చేసిన శివ..నగీనాను వదించుకోవాలని సిద్ధమయ్యాడు. మరో పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తనకు న్యాయం చేయాలని నగీనా కోరుతోంది. ఇంకా మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి....

టి.అసెంబ్లీలో బిల్డింగ్ ట్రైబ్యునల్ బిల్లు..

హైదరాబాద్ : బిల్డింగ్ ట్రైబ్యునల్ బిల్లును అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టారు. నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సూచనతో బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

పోలవరంలో భూ నిర్వాసితుల ఆందోళన..

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరంలో భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. రహదారిని దిగ్భందించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలని ఆందోళన నిర్వహించారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

8 శాతం నేరాలు తగ్గాయి - సీపీ..

హైదరాబాద్ : ఈ ఏడాది 8 శాతం నేరాలు తగ్గాయని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. వేధింపుల కేసులు 18 శాతం, మహిళలపై నేరాలు 12 శాతం తగ్గాయన్నారు. ఛైన్ స్నాచింగ్ లు 66 శాతం తగ్గాయని, ఆస్తి సంబంధ నేరాలు 16 శాతం, హహత్యలు 25 శాతం, తీవ్ర నేరాలు 31 శాతం తగ్గాయన్నారు. 2016 లో 23 మందికి జీవితఖైదు శిక్ష పడిందని, పీడీ యాక్టు కింద 283 కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 16,602, రూ. 2.92 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 7017 మందికి జైలు శిక్ష పడిందని, ఎన్ఐఏ సహకారంతో ఏడుగురు ఐసీసీ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

పోలవరంలో భూ నిర్వాసితుల ఆందోళన..

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరంలో భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలని ఆందోళన నిర్వహించారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

12:41 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాట్ బిల్లు సవరణలకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ వ్యాట్ బిల్లు సవరణల బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభలో ప్రవేశపెట్టారు. మొబైల్ ఫోన్లపై 14.5శాతం ఉన్న వ్యాట్ ను 5 శాతానికి తగ్గించారు. సెల్ ఫోన్ పై వ్యాట్ తగ్గింపును బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు స్వాగతించారు. బీజేపీ నేత మాట్లాడుతూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లపై వ్యాట్ తగ్గింపును స్వాగతిస్తున్నామని తెలిపారు. సాధారణ ప్రజలు ఒకరోజు ఉపవాసం ఉండైనా రిచార్జ్ చేసుకుంటున్నారన్నారు. సెల్ ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మొబైల్ ఫోన్లపై వ్యాట్ ను తగ్గించడం సంతోషదాయకమన్నారు. 

 

 

నోట్ల రద్దుపై ఆర్డినెన్స్

ఢిల్లీ : నోట్ల రద్దుపై ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 31 తర్వాత పాత నోట్లు ఉంటే 4 సంవత్సరాల జైలు శిక్ష పడనున్నట్లు తెలిపింది. అంతే కాదు పాత నోట్లతో లావాదేవీలు జరిగితే రూ.5వేలు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. కొద్ది సేపటి క్రితం ముగిసిన కేబినెట్ లో ఈ నిర్ణయాలు తీసుకుంది.

వ్యాట్ సవరణ బిల్లుకు ఆమోదం

హైదరాబాద్ :తెలంగాణ వ్యాట్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్లపై 14.5 శాతం ఉన్న వ్యాట్ ను 5 శాతానికి తగ్గించారు. వ్యాట్ తగ్గింపును బిజెపి, కాంగ్రెస్, టీడీపీ స్వాగతించింది.

చైన్ స్నాచింగ్లు66శాతం తగ్గాయి:సీపీ

హైదరాబాద్ : చైన్ స్నాచింగు లు 66శాతం తగ్గాయని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన కొద్దిపేటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తిసంబంధ నేరాలు 16శాతం, హత్యలు 25% తగ్గాయన్నారు. తీవ్ర నేరాలు 31శాతం తగ్గాయన్నారు. 2016 లో 23 మందికి జీవితఖైదు శిక్షపడిందని, పీడీయాక్టు కింద 283 కేసులు నమోదు చేశామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 16,602, రూ.2.92 కోట్లు వసూలుయ్యాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 7017 మందికి జైలు విధించినట్లు తెలిపారు. ఎన్ఐఏ సహకారంతో ఏడుగురు ఐసీసీ ఉగ్రవాదులను అరెస్టు చేశామని, ఈ ఏడాది 2393 ప్రమాదాలు జరిగాయన్నారు.

12:16 - December 28, 2016

పాలు.. అత్యంత బలవర్ధకమైన ఆహార పదార్థాలలో పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్ధాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయసు పెరిగే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి. పాలను నిత్యం మరీ ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదని, ఒక గ్లాస్ పాలతోనే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

  • నిత్యం ఒక గ్లాస్ పాలు తాగాలి. దీనితో శరీరానికి కావాల్సిన కాల్షియం..ఇతర పోషకాలు లభిస్తాయి.
  • శరీరానికి కావాల్సిన మేలు జరుగుతుంది. ఎముకలు బాగా ఎదిగేందుకు దోహద పడుతుంది.
  • దంత సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం ఒక గ్లాస్ పాల‌ను తాగాలి.
  • ఎదిగే వ‌య‌స్సులో పిల్ల‌ల‌కు పాల‌ను రోజూ తాగించ‌డం వ‌ల్ల వారిలో దంత సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
  • ఎక్కువగా బయటతిరిగే వారికి ఎదురయ్యే డీ హైడ్రేషన్ సమస్య పాలతో పోతుంది.
  • నిత్యం ఒక గ్లాస్ పాల‌ను తాగితే రోజంతా హుషారుగా ఉండ‌వ‌చ్చు. ఒత్తిడి మాయ‌మ‌వుతుంది.
  • రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగితే దాంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
  • రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌లో రుతు స‌మ‌యంలో క‌లిగే స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి.
  • పాలలో 87 శాతం నీరు, 4 శాతం కొవ్వు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి.
  • పాలలో లాక్టోజ్‌ అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఏ, బి, సి, డి విటమిన్లు కూడా లభిస్తాయని వారు అంటున్నారు.
  • చిన్న వయసు అంటే 7-10 వయసు గల అమ్మాయిలు రోజుకు సుమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయసులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కువ పాలు, పాతికేళ్ళ వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
12:14 - December 28, 2016

తూర్పుగోదావరి : ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజం లక్ష్యం నెరవేరడం లేదు. కొందరి స్వార్థపరుల అక్రమ దాహానికి ఆస్తులన్నీ హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. కాపాడాల్సిన దేవాదాయ శాఖ అధికారులు సైతం అక్రమమార్కులకు అండగా నిలుస్తుండడంతో.. మంచి లక్ష్యం పక్కదారి పడుతోంది. 
మహనీయుల త్యాగాలకు చెదలు 
సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయులు చేసిన త్యాగాలకు చెదలు పడుతున్నాయి. స్వార్ధానికి చిక్కిశల్యమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో.. కోకనాడ అన్నదాన సమాజానికి కోటా లక్ష్మయ్యనాయుడు చేసిన దానం దారి తప్పడమే దీనికి నిదర్శనం. 
1930లో అన్నదాన సమాజం ఏర్పాటు
పేదలు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చేవారికి నిత్యాన్నదానం చేసే ఉద్దేశంతో 1930లో కోకనాడ అన్నదాన సమాజం ఏర్పాటు చేశారు. ఇందుకోసం కాకినాడ సమీపంలోని జి.వేమవరం గ్రామానికి చెందిన 600 ఎకరాల భూమిని కోటా లక్ష్మయ్యనాయుడు దానం చేశారు. ఆ కాలంలో ఎంతో గొప్పగా ఆ కార్యక్రమం చేపట్టారు. కొన్నాళ్ల తర్వాత కోటా వారసులంతా అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. దీంతో ఆ బాధ్యతలను ట్రస్ట్‌కు అప్పగించారు. కాలక్రమేణా ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన లక్ష్యం దారితప్పింది. సమాజం కింద ఉన్న భూములను కొంతమంది స్వార్ధపరులు అన్యాక్రాంతం చేశారు. చాలా కాలం తర్వాత రాష్ట్రానికి వచ్చిన కోటా వారసులు కోకనాడ అన్నదాన సమాజాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజం మొక్కుబడిగా నడవడం చూసి చలించిపోయారు. 
వడ్డీతో సేవలు 
పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడం.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడం చూసి వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. భూముల వివరాలపై కోటా వారసులు ఆరా తీయగా.. భూములన్నీ అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం కోటి రూపాయల విరాళం మాత్రమే ఉందని.. దానిపై వచ్చే వడ్డీతో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కలత చెందిన కోటా వారసులు.. మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన సమాజాన్ని మరింత విస్తృతపరచాలని నిర్ణయించుకున్నారు. 
భూముల లెక్కలపై ఆరా 
ఇప్పటికే ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం కాగా.. మిగిలిన వాటిని రక్షించుకునేందుకు కోటా వారసులు కంకణం కట్టుకున్నారు. అన్యాక్రాంతమైన భూముల లెక్కలపై ఆరా తీస్తామంటున్నారు. మొత్తానికి కొందరు స్వార్ధపరులు సాగిస్తున్న అరాచకాలకు దేవాదాయశాఖ అధికారులు అండగా నిలవడం వల్లే కోకనాడ అన్నదాన సమాజం ఆస్తులు పక్కదారి పట్టాయని స్థానికులంటున్నారు. దీని వెనుక పెద్ద అవినీతి భాగోతం ఉండి ఉంటుందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఉన్నతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమాజం ఆస్తులను రక్షించాలని కోరుతున్నారు. 

 

12:04 - December 28, 2016

హైదరాబాద్ : అయూబ్ ఖాన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 30 ఏళ్లుగా హత్యలు, హత్యాయత్నాలు..కిడ్నాప్‌లు, దోపిడీలు..కబ్జాలకు పాల్పడుతూ  పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. అనంతరం విదేశాలకు పారిపోయి స్మగ్లర్‌గా అవతారమెత్తిన ఈ గ్యాంగ్ స్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నగరాన్ని గడగడ లాడించిన అయూబ్ ఖాన్ నేర చరిత్రపై టెన్ టీవీ ప్రత్యేక కథనం...
కరుడుగట్టిన నేరస్తులు అయూబ్ ఖాన్  
అయూబ్ అనే పేరు వినబడితే చాలు పాతబస్తీవాసులకు కంటిమీద కునుకు ఉండదు. అతని అడుగుల శబ్దం వింటే పోలీసులుకు సైతం వెన్నులో వణుకు పుడుతోంది. అయూబ్ కనుసైగ చేశాడంటే చాలు అవతలివాడి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే...హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, మతఘర్షణలు, కబ్జాలతో సిటీని అట్టుడికించాడు. 
అయూబ్‌పై 72 కేసుల నమోదు 
ఓ న్యాయవాదిని నడిరోడ్డులో నరికిచంపాడు. అయూబ్ పై 72 కేసులు నమోదయ్యాయి. తన నేరచరిత్రతో పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా నిలిచిన అయూబ్ పోలీసుల నిఘా పెరగడంతో విదేశాలు పారిపోయాడు.. నేరస్థుడి నుంచి స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. 
అయూబ్‌ది పాతబస్తీలోని కాలాపత్తర్‌
పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఆయుబ్ ఖాన్ అలియాస్ అయూబ్ పహిల్వాన్..16వ యేటనే నేర సామ్రాజ్యం వైపు అడుగుపెట్టాడు. 1989లో మొట్టమొదటిసారి డబ్బుల కోసం దోపిడీ చేసి పోలీసులకు అడ్డంగా దొరికి జైలుకి వెళ్లివచ్చాడు.  ఆతర్వాత నేరాల మీద నేరాలకు పాల్పడ్డాడు. 1990లో ఓ హత్య చేశాడు. ఆ తరువాత పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించాడు.. ఇతని ఆగడాలు పెరిగిపోవడంతో కలాపత్తార్ పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. 
విదేశాల్లో స్మగ్లర్‌గా అవతారమెత్తిన అయూబ్ 
ఇక విదేశాల్లో స్మగ్లర్‌గా అవతారమెత్తిన అయూబ్  గుట్టుచప్పుడు కాకుండా బంగారం రవాణా చేశాడు. అందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌నే డెన్‌గా మార్చుకున్నాడు. తరచూ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారులు దాడులు చేసి పట్టుకున్న బంగారం వెనుక అయూబ్ హాస్తం ఉందని తెలిసిన పోలీసులు ఖంగుతిన్నారు. అయూబ్‌పై సిటీలో 6 మర్డర్లు, 8 హత్యయత్నాలు, 2 దోపిడీ కేసులు, 2 డ్రగ్స్ కేసులు, 9 ఆయుధాల కేసులు, 35 కబ్జా కేసులతో పాటు 72 కేసులు ఉన్నాయంటే అతను ఎంత కరుడు గట్టిన నేరస్తుడో తెలుస్తోంది. 
ముంబైలో అయూబ్‌ను అరెస్ట్
విదేశాల్లో ఉంటూ పెద్ద నెట్‌వర్క్‌ను రన్ చేస్తున్న అయూబ్ పై పాతబస్తీ పోలీసులు మరోసారి నిఘా పెట్టారు. ఇంటర్‌పోల్ సహాయంతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసి భారీ బందోబస్తు నడుమ ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు.
ఫేక్‌ పాస్‌పోర్ట్ కింద కేసులు 
ప్రస్తుతం పట్టుబడిన అయూబ్ పై కలాపత్తార్ పోలీసులు ఫేక్‌ పాస్‌పోర్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఫేక్‌ పాస్‌పోర్ట్ కేసులు అయూబ్ పై 9కి పైగా నే ఉన్నాయి. 30 ఏళ్లుగా ముప్పతిప్పలు పెట్టిన అయూబ్ దొరికాడని తెలియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. 

 

11:58 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. వరంగల్‌ కాకతీయ యూనివర్శిటీకి చెందిన భూములు అన్యాక్రాంత అయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అసెంబ్లీ ప్రస్తావించారు. యూనివర్శిటీకి చెందిన భూముల కబ్జాలపై విచారణ జరిపి..భూములు కబ్జాలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వినయ్‌ భాస్కర్‌ కోరారు. 
వరంగల్‌లోనే విద్యాసంస్థల ఏర్పాటు : కడియం 
రానున్న రోజుల్లో ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థలను వరంగల్‌లోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్‌ కాకతీయ యూనివర్శిటీకి చెందిన భూముల కబ్జాపై విచారణ కమిటీ వేసి.. భూములు కబ్జాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : వంశీచందర్‌ రెడ్డి
సోలార్‌ పంపు సెట్లను వినియోగించుకోవడంలో తెలంగాణ రాష్ర్టం చివరస్థానంలో ఉందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డి. దీనికి కారణం రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. కేంద్ర నుంచి వస్తున్న నిధులను కూడా రాష్ర్ట ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. 

 

కొటక్ మహీంద్రా బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్

న్యూడిల్లీ : కొటక్ మహీంద్రా ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్‌ను ఈడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. నోట్ల మార్పిడికి సహకరించినట్లు కస్తూర్బాగాంధీ మార్గ్‌లోని కొటక్ మహీంద్రా బ్రాంచ్ మేనేజర్‌పై ఆరోపణలు వచ్చాయి. లాయర్ రోహిత్ టాండన్, వ్యాపారవేత్త పరాస్‌మాల్ లోధాకు డబ్బుమార్చుకోవడంలో ఆయన సహకరించినట్లు అధికారులు గుర్తించారు.

11:54 - December 28, 2016

ఢిల్లీ : ప్రధాని మోడీ విధానాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దుతో రైతులు, కూలీలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేవలం 50 కుటుంబాల కోసం దేశప్రజలను బలిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని ఆరోపించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ 130వ ఆవిర్భావ దినోత్సవ  వేడుకల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. 

 

11:52 - December 28, 2016

సంగారెడ్డి : జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పట్టపగలే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి భారీ దోపిడీ చేశారు. ఆర్సీపురం మండలం బీరంగూడ కమాన్ వద్ద ముంబాయి జాతీయ రహదారి పక్కనున్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి కార్యాలయంలోని రూ.8 కోట్ల 22 లక్షల విలువైన బంగారం అపహరించుకుని పోయారు. స్కార్పియోలో ఐదుగురు దుండగులు వచ్చారని సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

11:52 - December 28, 2016

టాలీవుడ్ లో రెండు చిత్రాలపై తెగ చర్చ జరుగుతోంది. ఈ రెండు చిత్రాలపై సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'..చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'....ఈ రెండూ చిత్రాలు వెరైటీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మొన్న 'శాతకర్ణి' ఆడియో విడుదల కాగా 'ఖైదీ' చిత్ర ఆడియోను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు చిత్రాల పాటలు యూ ట్యూబ్ లో విడుదలయ్యాయి కూడా. ఇటీవలే విడుదల చేసిన 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు', 'సన్నజాజిలా పుట్టేసిందిరో సుందరి'... గీతాలతో పాటు టీజర్‌కు ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాత పేర్కొన్నారు. బుధవారం 'యు అండ్ మీ' అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేయనున్నట్లు, జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నామన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం 'కత్తి' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కాజల్ అగర్వాల్' కథానాయిక. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బీసీల సంక్షేమానికి పెద్దపీట:జోగురామన్న

హైదరాబాద్ : బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. ముదిరాజ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

డిజిటల్ లావాదేవీలపై ఉపసంఘం భేటీ

ఢిల్లీ : డిజిటల్ లావాదేవీలపై ఉపసంఘం భేటీ అయ్యింది. నీతిఆయోగ్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో పెద్దనోట్ల రద్దు, పరిస్థితులపై చర్చించి ప్రధానికి ఉపసంఘం నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు సిక్కిం సీఎం, నీతిఆయోగ్ ఉపాధ్యక్షులు పనగారియా, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, అధికారులు హాజరయ్యారు.

11:45 - December 28, 2016
11:42 - December 28, 2016

ఢిల్లీ : డిసెంబర్‌ 30 తర్వాత 10 వేలకు మించి పాత 500, వెయ్యి నోట్లు కలిగివుంటే జరిమానా విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 50 వేల జరిమానా లేదా.. ఉన్న సొమ్ముకు ఐదు రెట్లు ఫైన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనిని ఖరారు చేసి ఆర్డినెన్స్‌ తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 
పెద్దనోట్ల రద్దుపై ఆర్డినెన్స్‌..?
పెద్దనోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి రెడీ అయ్యింది.  జనానికి మరో షాక్‌ను ఇచ్చేందుకు సిద్ధమైంది. పెద్దనోట్ల రద్దుపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే యోచనలో  కేంద్ర సర్కార్‌ ఉంది.  కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేయనున్నారు. 
ఈనెల 30లోపు పాతనోట్ల డిపాజిట్‌కు ఛాన్స్‌
ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం  ఈనెల 30  తర్వాత నిషేధిత 500, 1000 నోట్లు.. పదివేల రూపాయలకు మించి  ఎవరి దగ్గరా ఉండకూడదు. పదివేల నగదుకు మించి ఉంటే దాన్ని  నేరంగా పరిగణిస్తారు. 10వేలకు పైగా రద్దైన పాతనోట్లను కలిగి ఉంటే భారీ జరిమానా కూడా విధించాలనే యోచనలో కేంద్ర సర్కార్‌ ఉన్నట్టు తెలుస్తోంది. పట్టుబడిన నగదు విలువకు  ఐదురెట్లు   జరిమానా విధించనున్నారు.  కొన్ని ప్రత్యేక సందర్భాలలో పురపాలక మెజిస్ట్రేట్‌ ఆధ్వర్యంలో విచారించి జరిమానాను నిర్ణయిస్తారు.
దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు 
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా పలుచోట్ల విస్తృత సోదాలు జరిపిన ఐటీశాఖ ఇప్పుడు కార్ల అమ్మకాలపై దృష్టిసారించింది. నవంబర్‌ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు అమ్ముడయ్యాయనే వివరాలను సంబంధిత డీలర్ల నుంచి ఆరాతీసే పనిలో పడింది. దేశవ్యాప్తంగా కార్ల డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే కార్లు కొనుగోలు చేసిన వారికి మాత్రం జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య నోటీసులు జారీ చేసేందుకు ఐటీశాఖ కసరత్తు చేస్తోంది.  మోదీ నిర్ణయం ప్రకటించిన తర్వాత జరిగే అమ్మకాలకు సంబంధించిన వివరాల కోసం ఐటీశాఖ అధికారులు తమకు నోటీసులు జారీ చేసినట్టు డీలర్లు చెప్తున్నారు.  8వ తేదీ తర్వాత కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సమర్పిస్తున్నట్టు తెలిపారు.

 

రద్దయిన నోట్లు కలిగి వుంటే చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్!

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ లో ఆర్డినెన్స్ జారీ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రద్దయిన నోట్లు కలిగి వుంటే చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు సమాచారం. రద్దయిన నోట్లు ఆర్డినెన్స్ ద్వారా వెనక్కి వస్తాయని కేంద్రం భావిస్తోన్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్డినెన్స్ బడ్జెట్ రూపకల్పనలో కీలకం కానున్నదని సమాచారం.

11:37 - December 28, 2016

జగిత్యాల : ఎర్రజెండా చేబూని... కదం తొక్కుతూ..పదం పాడుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర దిగ్విజయంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పాదయాత్ర 1890 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 
ప్రజలకు పయోగకరమైన చర్చలు జరగలేదన్న తమ్మినేని  
ఈ పదిరోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగకరమైన చర్చలు జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విఫలమయ్యాయని తమ్మినేని అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదని తమ్మినేని అన్నారు. 
అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల పరిస్థితి అత్యంత దారుణం : ఎస్.రమ 
రాష్ట్రంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కార్మికులకు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఈ ప్రభుత్వ హయాంలో నెరవేరడం లేదని పాదయాత్ర బృందం సభ్యురాలు ఎస్‌ రమ అన్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం పాదయాత్రకు మద్దతు తెలపుతున్నారని ఆమె తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో.. ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని రమ అన్నారు. 
పాదయాత్ర బృందానికి విశేష స్పందన : బి.వెంకట్  
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా పాదయాత్ర బృందానికి విశేష స్పందన లభిస్తోందని పాదాయాత్ర కోఆర్డినేటర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన కుటుంబ పాలనను తలపిస్తోందని, కేసీఆర్‌ పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎలాంటి కొత్తదనం లేదని, గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని వెంకట్‌ అన్నారు. 
పాదయాత్రకు అపూర్వ స్వాగతం 
తెలంగాణ ప్రజల సమస్యలపై సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 72వ రోజు పూర్తి చేసుకుంది. జగిత్యాల జిల్లాలో పాదయాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రజలతోపాటు, ప్రజాసంఘాలు కూడా యాత్రకు మద్దతుగా నడక సాగిస్తున్నాయి. 
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ 
జగిత్యాల జిల్లా రంగదామ్‌పల్లి ఎక్స్‌రోడ్‌, తిర్మలాపూర్‌, గుంజపడుగ, గొల్లపల్లి, రాఘవపట్నం మీదుగా పాదయాత్ర జగిత్యాల వరకు సాగింది. భూసేకరణ సవరణపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

 

11:31 - December 28, 2016

విశాఖ : తెలుగు కాశ్మీరం.. తెలిమంచు అందాలను సింగారించుకుంది..చలిపొద్దులో సూరీడు సైతం గిలిగింతలు పోతున్నాడక్కడ..మంచుకురిసేవేళ..ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. కమ్ముకున్న పొగమంచులో నులివెచ్చగా ఒదిగిపోయింది విశాఖజిల్లా  ఏజెన్సీలోని లంబసింగి ప్రాంతం..   
తొలిపొద్దు వెలుగులు
ఇదిగో చూడిండి..వాకిళ్లలో మెల్లగా పరుచుకుంటున్న తొలిపొద్దు వెలుగులు..  ఇదిగో ఇలా చూడండి..  మంచుతెరల్లో కనిపించీ కనిపించకుండా చిరుసిగ్గులు పోతున్న పూబాలలు.. ఎగిసిపడుతున్న చలినెగళ్లను వేడివేడి కాఫీలాగా కొద్దికొద్దిగా సిప్‌చేస్తున్న తెలిమంచు ప్రకృతి సోయగం పలువన్నెలు పోతోంది లంబసింగిలో..
లమ్మసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 
విశాఖ జిల్లా లమ్మసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4డిగ్రీలకు లోపునే ఉగ్రతలు ఉండటంతో.. ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 10గంటల వరకు సూర్యుడు మంచు తెరలచాటునే ఉండిపోతున్నాడు. వొణికించే చలిలో .. రెండు చెవులకూ నులివెచ్చగా కండువాకట్టుకుని .. తూరుపువాకిట్లో ఇంకా పూర్తిగా వెలుగు పరుచుకోకముందే ఇలా పనిపాటల్లో సాగుతున్నారు విశాఖ ఏజెన్సీ వాసులు.
లంబసింగిలోని నేచర్‌ నెచ్చెలి
పువ్వులు.. నవ్వులు పులకిస్తున్న వేళ.. కిలకిలలు..కువకువలు వింటూ..అలా అలా చలిమంచుతెరలను చీల్చుకుంటూ.. నడవాలని కోరుకోని వారు ఉండరేమో..! అందుకే  స్వర్గమంటే ఎక్కడో ఉంటుందని ఊహాలోకంలోనే ఉండేకంటే.. ఓసారి నన్ను చూడరమ్మంటోంది.. లంబసింగిలోని నేచర్‌ నెచ్చెలి. 

 

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుపతి : పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దర్శించుకున్నారు. అంతకముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

11:25 - December 28, 2016

మెగాస్టార్ చిరంజీవి..తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో సైతం అభిమానులున్నారు. ఆయన చిత్రాన్ని చూడటానికి పక్క రాష్ట్రాల వారు ఆసక్తి చూపుతుంటారు. కొన్ని సంవత్సరాల తరువాత 'చిరు' చిత్రం వస్తుండడంపై ఇతర రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ద్వారా ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ సినిమా 'కత్తి' రీమెక్ గా ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ రూపొందిస్తున్నారు. 'చిరు' సరసన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 4వ తేదీన విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నారు. రెండు సాంగ్స్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ మరో సాంగ్ ను ఈ రోజు విడుదల చేయనున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాపై కర్ణాటక రాష్ట్ర అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే అక్కడ 'ఖైదీ' ఫీవర్ నెలకొంది. తమ అభిమాన హీరో కోసం థియేటర్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. మరో ప్రక్క 'చిరు' ఫోటోతో భారీ ర్యాలీలు కూడా చేసేస్తున్నారు. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రూ. 13 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్తలు వెలువడుతున్నాయి. సినీ పరిశ్రమతో పాటు అభిమానులలో నెలకొన్న అంచనాలను 'మెగాస్టార్' ఏ మేరకు నిలబెడతాడు అనేది వేచి చూడాలి.

రేపటి నుండి కాంగ్రెస్ ఆందోళన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతిపై ఆరోపణలు, నోట్ల రద్దే ప్రధానాంశాలుగా కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది. గురు, శుక్రవారాల్లో జాతీయ, రాష్ట్రస్థాయుల్లో నేతలు విలేకరుల సమావేశాలు పెట్టి కేంద్రంపై విరుచుకుపడతారు. జనవరి 2న జిల్లా స్థాయిలో ప్రెస్‌మీట్లు పెడతారు. రెండో దశలో ఐదో తేదీన జిల్లా కేంద్రాల్లో, 8న మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు.

11:22 - December 28, 2016
11:21 - December 28, 2016

తిరుచానూరు అమ్మవారి దర్శనానికి రాష్ట్రపతి

తిరుపతి: కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. తిరుమలలో రాష్ట్రపతి నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో ఇతర వాహనాలకు అనుమతి లేదని టిటిడి తెలిపింది.

11:19 - December 28, 2016

'బిచ్చగాడు' ఫేం 'విజయ్ ఆంటోనీ' తెలుగు సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ తంబీ లేటేస్ట్ మూవీ 'బేతాళుడు' కూడా మంచి కలెక్షన్లే సాధించడంతో తెలుగు నిర్మాతలు అతడితో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఆంటోనీ ఓ తెలుగు మూవీని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు 'విజయ్ ఆంటోనీ'. అంతకుముందు 'నకిలీ', 'సలీమ్' లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ పలకరించినా ఈయన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'బిచ్చగాడు' సంచలన విజయంతో మాత్రం తెలుగులో 'విజయ్ ఆంటోనీ' మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు మూవీ ఏకంగా 20కోట్లు వసూలు చేయడంతో 'విజయ్' అతడి సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ వచ్చేసింది. అందుకే ఆయన రీసెంట్ మూవీ 'భేతాళుడు' డబ్బింగ్ హక్కులను మన నిర్మాతలు 3కోట్ల పెట్టి మరీ తీసుకున్నారు.

రాడాన్ పిక్చర్స్..
దీంతో ఏకంగా ఈ హీరో తెలుగులో కూడా ట్రై చేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశాడట. సినిమా 'భేతాళుడు' ఇక్కడ పెద్దగా ఆడలేదు. అయితే 'బిచ్చగాడు' సినిమా వల్ల ఈ మూవీ ఒపెనింగ్స్ బాగానే వచ్చాయి. దీనికి తోడు శాటిలైట్ రేట్ కూడా బాగానే పలుకడంతో అక్కడిక్కడికి సరిపోయాయి. ఇప్పుడు ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ హీరో తమిళంతో పాటు తెలుగులో ఓ మూవీని ఏకకాలంలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు వినికిడి. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. రాధికా, శరత్ కుమార్ రాడాన్ పిక్చర్స్ బేనర్ మీద 'విజయ్ ఆంటోనీ' హీరోగా తెలుగు అండ్ తమిళ్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా దర్శకుడు ఖరారు కానీ మూవీలో 'విజయ్ ఆంటోనీ'ని సంగీత లైకా ప్రొడక్షన్స్ వారు కూడా పార్టనర్ గా చేరినట్లు సమాచారం. దర్శకుడు ఫిక్స్ కాగానే ఈ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో తమిళ, తెలుగు భాషల్లో స్టార్ట్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారట. మొత్తానికి 'విజయ్ఆంటోనీ' సూర్య, విక్రమ్, విశాల్ రేంజ్ లో ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీ నోట్ల రద్దు పై ఆర్డినెన్స్ జారీపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రద్దయిన నోట్లు కలిగివుంటే చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

11:15 - December 28, 2016

ఎడ్యుకేషనల్ హబ్‌గా వరంగల్ : కడియం

హైదరాబాద్ : వరంగల్‌ను విద్యాసంస్థల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. వరంగల్‌కు వెటర్నరీ కాలేజీ, సైనిక్ స్కూల్ మంజూరు చేశామని ప్రకటించారు. 2016-17లో అగ్రికల్చర్ కళాశాల ప్రారంభిస్తామని తెలిపారు.

10:57 - December 28, 2016

ఉత్తరప్రదేశ్ : కాన్పూర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కాన్పూర్ సమీపంలోని రూరా అనే ప్రాంతంలో 12988 నంబర్ గల సేల్దా..అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 15 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ఇంజన్ దగ్గరున్న ఐదు బోగీలు, చివరలో ఉన్న బోగీలు మినహా మధ్యలో ఉన్న 15 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాన్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించి వారి వారి ఇళ్లకు పంపిస్తున్నారు. గాయపడిన వారిని కాన్పూర్ ఆప్పత్రికి తరలిస్తున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఘటనాస్థలికి వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా వెళ్లే రైళ్లను నిలిపి వేశారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:49 - December 28, 2016

పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తమేనని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, బీజేపీ నేత అద్దెపల్లి శ్రీధర్, టీడీపీ నేత విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం:ఒకరి మృతి

యాదాద్రి :పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్యాత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు స్వాతి మృతి చెందగా, ప్రియుడు బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.అప్రమత్తమైన స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈఘటన యాదాద్రి భువనగిరి భూధాన్ పోచంపల్లి మండలం రేవన్ పల్లిలో జరిగింది.

10:45 - December 28, 2016

కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత వాసుదేవరావు పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇవాళ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ధర్నాకు తరలివస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానవేతనం ఇవ్వాలన్న డిమాండ్ తో పాటు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలన్నది వీరి డిమాండ్'. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:43 - December 28, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నేటికి 50 రోజులైంది. ప్రజల నగదు కష్టాలు తీరాలంటే 50 రోజులు పడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. మరి మోదీ చెప్పినట్టు ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పాయా? ప్రజలకు నగదు  ఇబ్బందులన్నీ తొలగిపోయాయా? బ్యాంకులు, ఏటీఎంల ముందు జనాల బారులు కనిపించడంలేదా? ఏటీఎంలు అన్నీ పని చేస్తున్నాయా? పెద్ద నోట్లు రద్దై 50 రోజులవుతున్నా.. ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రత్యేక కథనం.
నవంబర్‌ 8న పెద్దనోట్లు రద్దు 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని నల్లధనం, అవినీతిపై యుద్ధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు తయారు చేస్తోన్న నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్లధనాన్ని నియంత్రించడం, ప్రజలను డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లించడం  కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇబ్బందులు 50 రోజుల్లో  సర్ధుకుంటాయని చెప్పారు.
పెద్దనోట్లు రద్దు చేసి నేటికి 50 రోజులు
పెద్దనోట్లను రద్దు చేసి నేటికి 50 రోజులైంది. మరి మోదీ చెప్పినట్టు ప్రజల ఇబ్బందులన్నీ తొలిగిపోయాయా అంటే లేదనే చెప్పాలి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అన్నివర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తోంది. నేటికీ సామాన్యులకు కరెన్సీ కష్టాలు తప్పలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు  జనం బారులు తీరుతూనే ఉన్నారు.  చాలాచోట్ల నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ సగానికిపైగా ఏటీఎంల్లో నగదు పెట్టకపోవడంతో జనానికి తిప్పలు తప్పడం లేదు.  నగదు కోసం క్యూలైన్‌లో సామాన్యులకు గంటలకొద్దీ పడిగాపులు  గాస్తున్నారు. సామాన్యుల నుంచి ఉద్యోగస్తుల వరకు నగదు తిప్పలు తప్పలేదు. 
గ్రామీణ ప్రాంతాల్లో నగదు తిప్పలు అధికం
గ్రామీణ ప్రాంతాల్లోనైతే నగదు కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి.  పట్టణ, నగర ప్రజలు  క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి కనీస అవసరాలు తీర్చుకుంటోంటే... గ్రామీణ ప్రాంతాల్లో ఆ అవకాశం కూడా లేదు. దీంతో కరెన్సీ కోసం జనం బ్యాంకులచుట్టూ తిరుగుతున్నారు. పనులన్నీ మానుకొని మరీ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. రబీ సీజన్‌లో పంట వేయడానికి పెట్టుబడులు లేక ఇబ్బందిపడుతున్నారు. అప్పులిచ్చే వారులేక, చేతిలో నగదులేక అష్టకష్టాలు పడుతున్నారు. రైతులకు 24వేల రూపాయలు బ్యాంకులు  ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అవి ఆచరణకునోచుకోవడం లేదు.  దీంతో రైతులు నగదుకోసం పడరానిపాట్లు పడుతున్నారు.
చితికిపోతున్న చిరు వ్యాపారులు
ఆర్‌బీఐ కూడా ఎక్కువగా 2000 నోట్లనే ముద్రిస్తోంది. ఆ నోటును మార్చడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 100,500 నోట్లు ఎక్కువగా లేకపోవడంతో  ఈ సమస్య తలెత్తింది. దీంతో చిల్లరలేక చిరు వ్యాపారాలు డీలా పడ్డాయి.  కూరగాయలు, పండ్ల దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు, కిరాణాకొట్టు,  తోపుడుబండ్లు, నాన్‌వెజ్‌ మార్కెట్‌లతోపాటు ఇతర చిన్నచిన్న వ్యాపారులకు నేటికీ చిల్లరచింత తప్పలేదు. వినియోగదారులు 2000నోట్లు ఇస్తుండడంతో దానికి చిల్లర ఇవ్వలేక గిరాకీనే వదులుకోవాల్సి వస్తోంది. దీంతో చిరువ్యాపారాలు చితికిపోతున్నాయి.
మోదీ సర్కార్‌పై ప్రజలు ఆగ్రహం
50రోజులైనా కరెన్నీ కష్టాలు తప్పక ప్రజలు విసిగిపోతోంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నీ సర్దుకుంటాయని చెప్తోంది. పెద్దనోట్లను రద్దుచేసి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దడం అంతా సులువేమీ కాదని ఆర్ధికవేత్తలు చెప్తున్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త వాటిని మళ్లీ ప్రింట్‌ చేయడానికి అనుకున్న గడువుకంటే మరో ఆరునెలలు అధికంగా పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి వరకు జనాలకు నోట్లకష్టాలు తప్పవని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వమేమో మొదటి నుంచీ అంతా చక్కబడుతుందని చెప్తోంది. మరోవైపు 50 రోజులైనా పరిస్థితిలో మార్పులేకపోవడంతో ప్రజలు మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

10:42 - December 28, 2016

ఆదిలాబాద్ : తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోభా జాతర. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా గిరిజనులు ఈ నాగోభా జాతరకు తరలివస్తారు. ఈ జాతర నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జాతర 
తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ లో నాగోబా జాతర జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు  జరుగనుంది. ఈ నేపథ్యంలో  జాతరను  ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ  జాతర ఏర్పాట్ల పై సెక్రటేరియట్ లో మంత్రులు  జోగు  రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి , అదిలాబాద్ ఎంపీ నగేష్ ఎమ్మెల్యేలు బాబురావు,రేఖ నాయక్,రసమయి బాలకిషన్, ఆయా శాఖల  ఉన్నతాధికారులతో పాటు అదిలాబాద్ ,మంచిర్యాల జిల్లాల కలెక్టర్ల తో గిరిజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ  మంత్రి చందులాల్  సమీక్ష నిర్వహించారు.
40 లక్షల విడుదల చేసిన సర్కార్ 
ఆదివాసీల ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలిరానుండడంతో అడవి తల్లి  పులకరించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత పెద్దగా జరిగే నాగోబా జాతరకు ప్రాధాన్యత ఉందని మంత్రులు అన్నారు. వచ్చే జనవరి 27 నుండి ఫిబ్రవరి ఒకటి తేది వరకు జరిగే ఈ జాతర కు ప్రభుత్వం  40 లక్షల విడుదల చేస్తున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు.
జాతరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు 
ఈ జాతరకు తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్ ,చత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇంద్రవల్లి మండలంలోని నాగోబా జాతరకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టామని మంత్రులు తెలిపారు. 
రూ. 2 కోట్లతో ధర్మసత్రం, దర్బార్ హాల్, ఇతర ఏర్పాట్లు
గిరిజనాభివృద్ది శాఖ నుంచి 2 కోట్ల రూపాయలతో ధర్మ సత్రం, దర్బార్ హల్ ,ఇతర ఏర్పాట్లును చేయనున్నట్లు మంత్రి చందూలాల్ తెలిపారు. మండల ఆధునీకకరణ, రాజగోపురం నిర్మాణాలు, దేవాలయ పునరుద్ధరణ కోసం కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న తెలిపారు.

 

10:40 - December 28, 2016

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్‌ బాధితులకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అస్తుల వేలానికి విశేష స్పందన వస్తుందనే ఆశలపై బిడ్డర్లు నీళ్లు చల్లారు. విజయవాడలోని వాణిజ్య భవనాలకు బిడ్డింగ్‌లు పిలువగా... అత్యంత విలువైన 10 ఆస్తులకు ఎవ్వరూ దరఖాస్తు చేసుకోలేదు. మిగతా 14 ఆస్తులకు ఎవరెవరూ ఎంత బిడ్‌ చేశారో వచ్చే మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
నిరాశా జనకంగా అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకాలు  
అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకాలు నిరాశా జనకంగా సాగాయి. అమరావతి ప్రాంతంలోని కీసర లేఅవుట్‌కు చెందిన 80 ఎకరాల భూమికి 60 కోట్ల నిర్ధిష్ట ధర కేటాయించారు. మిగిలిన 103 ఎకరాలు ఉన్న భూమికి 75 కోట్లు, అగ్రిగోల్డ్‌ ఆర్గానిక్‌ లోని 60 ఎకరాలకు 44 కోట్లు, నందిగామ కంచెల గ్రామంలో ఉన్న 32 ఎకరాలకు 3కోట్ల 20లక్షలుగా ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఈ అత్యంత విలువైన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. కీసరలో తక్కువ ధర ఉన్న 6 ఆస్తులకు 47 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారు.
వెయ్యి 455 చదరపు అడుగుల భవంతి ధర రూ. 12 కోట్లు 
ఇక విజయవాడలోని 6 ఆస్తులను 13 విభాగాలు చేశారు. ఇందులో అత్యంత విలువైన గాంధీనగర్‌లోని వెయ్యి 712 చదరపు అడుగుల భవనం 13 కోట్లుకు ఎవ్వరూ బిడ్‌ వేయలేదు. వెయ్యి 455 చదరపు అడుగుల భవంతి ధర రూ. 12 కోట్లుగా నిర్ణయించారు. మరో 600 చదరపు అడుగుల విస్తీణ భవనాన్ని 4 కోట్ల 20 లక్షలుగా నిర్ధిష్ట ధర కేటాయించారు. ఈ విలువైన ఆస్తుల కోసం ఏ ఒక్కరూ బిడ్‌ దాఖలు చేయలేదు. గాంధీనగర్‌లోని విశాఖ కోల్డ్‌ స్టోరేజీకి ఎవ్వరూ బిడ్డింగ్‌ వేయలేదు. ఇలా వాణిజ్య సముదాయ భవంతులోని 13 విభాగాల్లో తక్కువ ధర కల్గిన 5 ఆస్తుల్లో 13 మంది పాల్గొన్నారు. 
తక్కువ ధర ఉన్న 14 ఆస్తులకు మాత్రమే స్పందన 
మొత్తంగా తక్కువ ధర ఉన్న 14 ఆస్తులకు మాత్రమే స్పందన వచ్చింది. మిగతా విలువైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే కీసరలోని భూములు ధీనా, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు బ్యాంకు తరుపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అమ్ముడు పోని ఆస్తుల్లో తనఖా గురించి అవసరం లేదని ధర్మాసనం తోసిపుచ్చింది.
నోట్ల ప్రభావంతో తక్కువ ధరకు బిడ్డింగ్‌లు 
వచ్చే నెల 17 వరకు వేలం వాయిదా వేస్తే విదేశీ కంపెనీ 1580 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని అగ్రిగోల్డ్‌ తరుపు న్యాయవాది రవిచంద్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. చెల్లించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ప్రశ్నించడంతో ఎలాంటి సమాధానం చెప్పలేదు. నోట్ల ప్రభావంతో తక్కువ ధరకు బిడ్డింగ్‌లు వేశారని అగ్రిగోల్డ్‌ సంస్ధ తెలిపింది. మరోవైపు వేలం వాయిదా వేయాలని సీఐడీ తరుపు న్యాయవాది వేడుకున్నారు. 
తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా 
సీల్డ్‌ కవర్‌లోని బిడ్‌లను తెరిచి ఎన్ని ఆస్తులకు ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో కోర్టు ప్రకటించింది. అయితే ఎంత మొత్తం బిడ్డింగ్‌ వస్తున్నాయో ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేయలేదు. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 3కు వాయిదా వేసింది.

10:38 - December 28, 2016

హైదరాబాద్ : అప్పడిదాకా అసెంబ్లీలో మాట‌ల తూటాలు పేలాయి. విమ‌ర్శలు, ప్రతి విమ‌ర్శల‌తో సెగ‌లు రేపాయి. ఉన్నట్టుండి స‌భ‌లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. క‌త్తులు దూసుకున్ననేత‌లు..క‌డుపారా న‌వ్వుకున్నారు. సీఎం, ప్రతిప‌క్ష నేత‌లే కాదు..స‌భ‌లో స‌భ్యులంద‌రూ మ‌నసారా న‌వ్వుకున్నారు. ఇంత‌కు స‌భ‌లో ఏం జ‌రిగింది..?
సభలో భిన్నమైన వాతావ‌రణం 
అసెంబ్లీ అంటే..అధికార, ప్రతిప‌క్షాల‌కు క‌ద‌న రంగం. ప్రజా స‌మస్యల‌పై స‌ర్కార్‌ను విప‌క్షాలు ఇరుకున పెట్టేందుకు ప్రయ‌త్నించ‌డం..దాన్ని అధికార ప‌క్షం తిప్పికొట్టడం..వెర‌సి ఇరు ప‌క్షాల‌నుండి..ఆరోపణలు, ప్రత్యారోప‌ణ‌లు..స‌భ్యుల నిర‌స‌న‌లు..స‌ర్కార్ హూంక‌రింపులు ఇవ‌న్ని స‌భ‌లో సాధారణంగా క‌నిపించే దృశ్యాలు. ప్రస్తుతం కొన‌సాగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌లో కూడా నిత్యం ఇవే దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. కాని మంగ‌ళ‌వారం స‌భ‌లో దీనికి భిన్నమైన వాతావ‌రణం సాక్షాత్కరించింది. 
టెన్షన్‌ టెన్షన్‌గా మొద‌లైన స‌భ‌ 
ఉద‌యం అసెంబ్లీ ప్రారంభంకాగానే స‌భలో సెగ‌లు రేగాయి. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్న వాయిదా తీర్మాణంపై చ‌ర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప‌ట్టుబట్టాయి. దీంతో స‌భలో ఒక్కసారిగా అల‌జడి రేగింది. విప‌క్ష స‌భ్యులు నిర‌స‌న‌లకు దిగడంతో ఉడికి పోయిన స‌ర్కార్ ఎమ్మెల్యేలు సంప‌త్‌కుమార్‌, రేవంత్‌రెడ్డి, సండ్రపై స‌స్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో ఒక్కసారిగా స‌భ‌లో టెన్షన్‌ వాతావార‌ణం.
ఎజానారెడ్డి జోక్యంతో స‌భ్యుల‌పై స‌స్సెన్షన్‌ ఎత్తివేత 
అయితే సీఎల్పీ నేత జానారెడ్డి జోక్యంతో స్పీక‌ర్ స‌భ్యుల‌పై స‌స్సెన్షన్‌ వెన‌క్కి తీసుకున్నారు. అయినా స‌భలో వాతావ‌ర‌ణం అంతా సీరియ‌స్‌గానే ఉంది. ఇక గృహ‌నిర్మాణం, డ‌బుల్ బెడ్ రూంపై చ‌ర్చ మొద‌లైంది. అంతే గంభీరంగా చ‌ర్చ సాగుతున్న సమయంలో స‌భ‌లో ఒక్కసారిగా  వాతావ‌ర‌ణం మారింది. చ‌ర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..సీఎల్పీ నేత జానా రెడ్డి ఇంటికి భోజ‌నానికి వెళ్ళాల‌నుంద‌ని..మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు ప‌చ్చిపులుసుతో పెట్టినా...పప్పన్నంతో పెట్టినా స‌రే అంటూ న‌వ్వడంతో.. స‌భ‌లో న‌వ్వులు విర‌బూసాయి.
మన‌సారా న‌వ్వుకున్న ఎమ్మెల్యేలు 
సీఎం కేసీఆర్‌, జానారెడ్డి, అధికార, విప‌క్ష ఎమ్మెల్యేలు అంద‌రు మన‌సారా న‌వ్వుకున్నారు. దీంతో స‌భ‌లో అప్పడి వ‌ర‌కు ఉన్న గంభీర‌మైన వాతావర‌ణం..ఒక్కసారిగా ఆహ్లాద‌క‌రంగా మారిపోయింది. అయితే కేసీఆర్ కోరికపై ..న‌వ్వుల‌తోనే స‌రిపెట్టారు జానారెడ్డి. అయితే స‌భ ముగిసిన త‌ర్వాత మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో జానా కేసీఆర్ కోరిక‌పై స్పందించారు. కేసీఆర్ త‌న ఇంటికి వ‌స్తే జొన్న సంక‌టి పెడ‌తాన‌ని చెప్పారు జానారెడ్డి. మొత్తానికి సీరియ‌స్‌గా ప్రారంభమైన స‌భ‌..స‌భ్యుల న‌వ్వుల‌తో కూల్ కూల్‌గా ముగిసింది.

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడి

సంగారెడ్డి: ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడి జరిగింది. స్కార్పియోలో వచ్చిన ఐదుగురు దుండగులు సిబ్బందిని రివాల్వర్ తో బెదిరించి రూ.8కోట్ల 22 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం బీరంగూడ కమాన్ వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

10:35 - December 28, 2016

హైదరాబాద్ : డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా..ఇప్పటివరకు 1200 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఇదే అంశంపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. వచ్చే రెండున్నరేళ్లలో 2లక్షల 60వేల డబుల్‌ బెడ్‌రూంలు కట్టితీరతామని ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల పాత బకాయిలు..3 వేల 980 కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. 
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలి : డీకే.అరుణ  
డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సిద్ధిపేటలో రెండు వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేశారని, అల్లుడు హరీష్‌రావు నియోజకవర్గం వైపు మాత్రమే దృష్టి సారిస్తే సరిపోదని,. తాను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూతురు లాంటి దాన్నేనని కాంగ్రెస్‌ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం సాకులు చెబుతోందని,. వెంటనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. 
అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆవేశపూరిత ప్రసంగం 
చర్చలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పేదలకు కాకుండా బడాబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. అవినీతి, నల్లధనం వెలికితీత పేరుతో సామాన్య ప్రజలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. 
1200 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మాత్రమే నిర్మాంచారు : కోమటిరెడ్డి  
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లైనా..ఇప్పటివరకు కేవలం 1200 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మాత్రమే నిర్మించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఇండ్లు కట్టడం అసాధ్యమన్నారు. ఒకవేళ ప్రభుత్వం లక్ష ఇండ్లు కడితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా కేసీఆర్‌ను గెలిపిస్తానని కోమటిరెడ్డి సవాల్‌ విసిరారు. 
ప్రతిపక్షాలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ధీటైన జవాబు 
డబుల్‌ బెడ్‌రూం అంశంపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ధీటైన జవాబు ఇచ్చారు. వచ్చే  రెండున్నర ఏళ్లలో 2లక్షల 60వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టి తీరతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌రూంలే కాకుండా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను 1500 కోట్ల రూపాయలతో పూర్తిచేస్తున్నామన్నారు. కోమటిరెడ్డి తన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కొత్తగా నిర్మించిన సీఎం నివాసంలో 150  గదులు ఉన్నాయని కాంగ్రెస్‌ సభ్యులు అనడం సరికాదన్నారు సీఎం కేసీఆర్‌. ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సకల వసతులతో కూడిన అధికారిక నివాసభవనం లేకపోవడం శోచనీయమన్నారు. 36 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రగతి భవన్‌.. రాష్ట్ర ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. 
3,920 కోట్ల గృహ రుణాలు మాఫీ 
హైదరాబాద్‌ పరిధిలో 650 ఎకరాలు సేకరించామని..ఇందిరమ్మ ఇళ్లకు పేదలు చెల్లించాల్సిన 3,920 కోట్ల గృహ రుణాలను మాఫీ చేస్తామని, అలాగే రాజీవ్ గృహ కల్ప రుణాలు కూడా మాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఇళ్ల అక్రమాలపై విచారణ జరిపి దొంగలను శిక్షిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం ప్రకటించారు. 
కలెక్టర్ల ఆధ్వర్యంలో బలహీనవర్గాల గృహ నిర్మాణం 
బలహీనవర్గాల గృహ నిర్మాణం మొత్తం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల ఎంపికను ఎమ్మెల్యేలు చూస్తారనీ, అంతేకానీ లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోరన్నారు. జనవరి మొదటి వారం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయని కేసీఆర్‌ చెప్పారు. నోట్లరద్దుపై ప్రజల్లో భయోత్పాతం సృష్టించవద్దని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. అనవసర ఆందోళనలు వద్దన్నారు. 

10:33 - December 28, 2016

ఉత్తరప్రదేశ్ : కాన్పూర్ లో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. కాన్పూర్ సమీపంలోని రూరా అనే ప్రాంతంలో 12988 నంబర్ గల సేల్దా..అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గార్డ్ సహా 40 మందికి గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మార్గం గుండా వెళ్లే రైళ్లను నిలిపి వేశారు. హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఘటనాస్థలికి వెళ్లే అవకాశం ఉంది. 

 

10:31 - December 28, 2016

హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. గగన్ పహాడ్ లోని సాంజిమ్ మీ కెమికల్ ఫ్యాక్టరీలో తెల్లవారు జాము 2.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శంకర్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
పరిస్థితి విషమించడంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఫ్యాక్టరీలో మొత్తం 14 మంది కార్మికులు పని చేస్తున్నారు. రియాక్టర్ పేలుడు ప్రాంతంతో ఏడుగురు కార్మికులు ఉన్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో శంకర్, శ్రీనివాస్ లకు తీవ్ర గాయాలైన మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయడ్డారు. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రైలు ప్రమాదం దురదృష్టకరం :సురేష్ ప్రభు

యూపి : కాన్పూర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరం అని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఆయన ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...క్షతగాత్రులకు వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.

10:30 - December 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సభలో ఇవాళ హరితహారంపై చర్చ జరుగనుంది. విపక్ష పార్టీలు పలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం, ఫీజు రియింబర్స్ మెంట్ పై బీజేపీ, జర్నలిస్టులు, లాయర్లకు ఇచ్చిన హామీలపై టీడీపీ వాయిదా తీర్మానాలను ఇవ్వనున్నాయి. సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

'భయాన్ని ఎదిరించండం కాంగ్రెస్ ప్రజలకు నేర్పించింది'

ఢిల్లీ : ఐఏసీసీ కార్యాలయలంలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భయాన్ని ఎదిరించండం కాంగ్రెస్ ప్రజలకు నేర్పించిందని పేర్కొన్నారు. మోదీ విధానాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని తెలిపారు. నోట్లరద్దుతో సామానులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

10:16 - December 28, 2016

మేడ్చల్ : జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్న టిప్పర్ మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టింది. అదుపు తప్పి ఎదురుగా ఉన్న దుకాణాంలోకి దూసుకెళ్తింది. ఆపై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒకరిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం స్మశాన వాటిక గోడను ఢీకొట్టి ఆగిపోయింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మేడ్చల్ లో లారీ ఢీకొని వ్యక్తి మృతి

మేడ్చల్ : రహదారిపై ఉన్న రెండు ఆటోలతో సహా వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నోట్ల రద్దు పై ఆర్డినెన్స్ తేనున్న కేంద్రం

ఢిల్లీ : కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశంకానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ బేటీలో నోట్ల రద్ద పై కేంద్ర ఆర్డినెన్స్ తేనున్నట్లు సమాచారం. మరో వైపు డిసెంబర్ 30 తరువాత పాత నోట్లను బ్యాంకులో జమచేసేందుకు సైనికులకు వెసులుబాటు కల్పించారు.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు.

తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : నేటి తెలంగాణ అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు ఈ విధంగా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై బీజేపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. జర్నలిస్టులు, న్యాయవాదులకు ఇచ్చిన హామీలపై టిడిపి, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని సీపీఎం వాయిదా తీర్మానం ఇవ్వనున్నాయి.

08:35 - December 28, 2016

'గుంటూరు టాకీస్'..బుల్లితెర యాంకర్ 'రేష్మీ' ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యూత్ నుండి మంచి రెస్సాన్సే వచ్చింది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. నూతన దర్శకుడు రాజ్ కుమార్ సువీయ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలో విడుదల చేయాలని చిత్ర యోనిట్ యోచిస్తోంది. ఇందులో 'సన్నీ లియోన్' నటిస్తోందని టాక్. తాజాగా ఈ చిత్రంలో 'నమిత' కూడా నటిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. తమిళంలో స్టార్ హీరోస్ కు ఉన్న క్రేజ్ 'నమిత'కు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈమె నటించింది. 2010లో విడుదలైన 'సింహ'లో ఈమె నటించింది. అనంతరం ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం 'గుంటూరు టాకీస్ -2'లో లో 'నమిత' ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. 'నమిత'తో ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందని, ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతుందని తెలుస్తోంది. మరి 'నమిత' రీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

07:14 - December 28, 2016

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఇచ్చిన తేనేటి విందు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో విడిది చేస్తున్న రాష్ట్రపతికి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ నరసింహన్‌  తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబుతో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందులో ఇద్దరు చంద్రులు.. రాష్ట్రాల సమస్యలపై ఏకాంతంగా చర్చించారు. 
రాష్ట్రపతికి గవర్నర్ తేనేటీ విందు 
గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ మంగళవారం సాయంత్రం అతిథులతో కళకళలాడింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్దం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ తేనేటీ విందు ఇచ్చారు. ఈ విందు ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘన స్వాగతం 
విందుకు విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పూలమాలతో ఘన స్వాతగం పలికారు.  అక్కడి నుంచి విందుకు తీసుకెళ్లారు.ఏపీ సీఎం చంద్రబాబు కూడా వీరితో జతకలిశారు. రాష్ట్రపతికి చంద్రబాబు పూలమాలతో స్వాగతం తెలిపారు. 
సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఇద్దరు చంద్రులు  
విందు కార్యక్రమంలో ఇద్దరు చంద్రులు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇరువురు పరస్పరం పలకరించుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. ఆతర్వాత  రాష్ట్రపతికి ఇరువైపులా ఇద్దరు ఆసీనులయ్యారు.  కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇద్దరు సీఎంలతో కాసేపు ముచ్చటించారు.
కాసేపు ఏకాంతంగా ఇద్దరు చంద్రులు 
విందు మధ్యలో ఇద్దరు చంద్రులు కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వీరి మధ్య పలు అంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. పోలవరం నిధులు, నోట్లరద్దు పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం. డిజిటల్‌ మనీతో కొంతవరకు సమస్యలు తగ్గాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య  సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రపతి, గవర్నర్‌తో చర్చజరిపారు. 
ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ సందడి 
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ విందులో సందడి చేశారు. శర్మిష్టా ముఖర్జీ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. పలువురు నేతలు రాష్ట్రపతితో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. ఈ విందులో మాజీ గవర్నర్‌ రోశయ్య, తెలుగు  రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు, ఉపముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలతోపాటు అధికారులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు సానియామీర్జా, పీవీ సింధు కూడా విందుకు హాజరయ్యారు. 

 

కాన్పూర్ లో పట్టాలు తప్పిన రైలు

ఉత్తరప్రదేశ్ : కాన్పూర్ లో రైలు పట్టాలు తప్పింది. సేల్దా..అజ్మీర్ ఎక్స్ ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గార్డ్ సహా 13 మందికి గాయాలయ్యాయి. 

సీఎంల కమిటీ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఉదయం 11 గంటలకు నీతి ఆయోగ్ ఆఫీస్ లో సీఎంల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనన్నారు. మ.2.15 గంటలకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. 

నేడు కేంద్ర కేబినెట్ సమవేశం

ఢిల్లీ : నేడు కేంద్ర కేబినెట్ సమవేశం జరుగనుంది. నోట్ల రద్దుపై కొత్త ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రద్దైన నోట్లు కలిగి ఉంటే చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. 

06:49 - December 28, 2016

హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గగన్ పహాడ్ లోని ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో తెల్లవారు జాము 2.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శంకర్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. మరో కార్మికుడు గాయపడ్డారు. శ్రీనివాస్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో 12 నుంచి 16 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

 

కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఒకరు మృతి

హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

 

శంషాబాద్ మెట్రో సమీపంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : శంషాబాద్ మెట్రో సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది మంటలార్పుతున్నారు. 

Don't Miss