Activities calendar

29 December 2016

22:00 - December 29, 2016

ఢిల్లీ : నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప‌న్ను వ‌సూళ్లు భారీగా పెరిగాయ‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు ప్రత్యక్ష ప‌న్ను వ‌సూళ్లు 14.4 శాతం, ప‌రోక్ష ప‌న్ను వ‌సూళ్లు 26.2 శాతం, కేంద్ర ఎక్సైజ్ 43.3 శాతం, క‌స్టమ్స్ 6 శాతం పెరిగాయన్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 13.6 శాతం వృద్ధి నమోదైందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే రబీ విత్తనాలు 6.3 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. ఆర్బీఐ వద్ద పెద్దమొత్తంలో కొత్త క‌రెన్సీ ఉంద‌ని, ఇప్పటికే చాలావ‌ర‌కు పాతనోట్ల మార్పిడి జరిగిందని, ప్రస్తుతం 500 నోట్లు భారీగా విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో అశాంతి అలజడికి సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని జైట్లీ స్పష్టం చేశారు. నోట్ల ర‌ద్దు నిర్ణయానికి మ‌ద్దతు తెలిపిన దేశ‌ ప్రజలకు కృత‌జ్ఞత‌లు తెలియ జేశారు. 

21:57 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ కొత్తగా భూసేకరణ చట్టాన్ని తీసుకురావడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని తెలంగాణలో నూతన భూసేకరణ చట్టాన్ని తీసుకురావడం వెనక కుట్ర ఉందని ఆరోపించాయి. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కరోజు శాసనసభా సమావేశాలను బహిష్కరించాయి.

తెలంగాణ భూసేకరణ చట్టాన్ని తీసుకురావడంపై విపక్షాల నిరసన
కొత్త భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ శాసనసభా సమావేశాలను కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం ఒక్కరోజు బహిష్కరించాయి. సీఎం కేసీఆర్‌ శాసనసభను తప్పుదోవపట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూసేకరణ విషయంలో సీఎం అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. భూసేకరణచట్టం-2013లో నిర్వాసితులకు ఉన్న హక్కులను సవరణ చట్టంలో లేకుండా చేశారని ఉత్తమ్‌ ఆరోపించారు.

భూసేకరణ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీపీఎం మండిపాటు
భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు సీరియస్‌గా స్పందించాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీపై సీఎం విషం కక్కారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మండిపడ్డారు. సభలో ప్రతిపక్షాల గొంతునొక్కేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌వైఖరికి నిరసనగా ఇవాల్టి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతిపక్షాల పట్ల మాకు గౌరవం ఉంది : సీఎం కేసీఆర్‌
విపక్షాలు సభను వాకౌట్‌ చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక విధానంలో ప్రతిపక్షాల పాత్ర ఘననీయమైనదని.. ప్రభుత్వ పరంగా వారి పట్ల మాకు గౌరవం ఉందని కేసీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు మంచి సూచన ఇస్తే తీసుకుంటామని... వారిని అవమానించేదేమి లేదని కేసీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ సభను వాకౌట్‌ చేయడమంటే పారిపోవడమే : హరీశ్‌రావు

మరోవైపు కాంగ్రెస్‌ సభను వాకౌట్‌ చేయడమంటే పారిపోవడమే అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సభలో మాట్లాడటం ఇష్టం లేకనే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్‌ చేశారని మండిపడ్డారు. సభను ఎన్ని రోజులైనా జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా..కాంగ్రెస్‌ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిందన్నారు.

21:52 - December 29, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు కీలకమలుపు తిరిగింది.. ఈ కేసుతో రాజకీయ నేతలకు సంబంధాలు లేవని తెలంగాణ హోంశాఖ స్పష్టం చేసింది.. ఈ కేసులో సీపీఐ జాతీయ నేత నారాయణ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హోంశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది.. నయీంకు మాజీ డీజీపీతోకూడా సంబంధాలులేవని హోంశాఖ ఇందులో తెలిపింది.. రాజకీయ దురుద్దేశంతోనే నారాయణ పిటిషన్‌వేశారని ఆరోపించింది.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది.. 175 కేసులో ఇప్పటివరకూ 16చార్జ్‌షీట్లు దాఖలు చేశామని తెలిపింది. .నయీం కేసులో ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్యను.. రిటైర్డ్‌ డీఎస్పీ రవీందర్‌రెడ్డితోసహా 11మంది పోలీసులను విచారించామని టీ.హోంశాఖ తెలిపింది. నయీంతో సంబంధాలున్న ఎవ్వరినీ వదలమని హోంశాఖ స్పష్టం చేసింది. 

21:45 - December 29, 2016

విశాఖ : విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాసరావు డైరెక్టర్ గా వున్న ప్రత్యూష కంపెనీ ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. 141 కోట్ల 68 లక్షల రూపాయలు బకాయి పడటంతో ఆస్తులను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యూష కంపెనీలో మంత్రి గంటా సహా డైరెక్టర్లుగా మరి కొందరు ప్రముఖులున్నారు. విశాఖలో 8 మందికి చెందిన 26 ప్రాంతాల్లోని ఆస్తులను జప్తు చేశారు. ప్రత్యూష కంపెనీకి బినామీగా వున్న గంటాకు చెందిన ఇల్లు,పార్టీ కార్యాలయాలను ఇండియన్ బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అక్టోబర్‌ 4న బ్యాంకు అధికారులు నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో ఈ నెల 21 నుంచి 26 వరకు అధికారుల దాడులు నిర్వహించి పలు ఆస్తులను స్వాధనం చేసుకున్నారు. 

గంటా రాజీనామా చేయాలి : సీపీఎం నేత నర్శింగరావు
ఇటువంటి అవినీతి మంత్రులు పదవిలో వుండటానికి ఎంతమాత్రం వీల్లేదని వెంటనే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని గంటాపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత నర్శింగరావు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులపై ప్రజల్లో నమ్మకం పోయే పరస్థితులు ఇటువంటి నాయకుల వల్ల కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. 

మంత్రి గంటా ఆస్తులు స్వాధీనం!..

విశాఖ : విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాసరావు డైరెక్టర్ గా వున్న ప్రత్యూష కంపెనీ ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఈ బ్యాంక్ కు రూ.141.68 కోట్లు ప్రత్యేష కంపెనీ బాకీ పడింది. ఈ కంపెనీలో గంటాతో సహా 8మంది డైరెక్టర్లు వండగా..26 ప్రాంతాల నుండి ఇండియన్ బ్యాంక్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ప్రత్యూష కంపెనీకి బినామీగా వున్న గంటాకు చెందిన ఇల్లు,పార్టీ కార్యాలయాలను ఇండియన్ బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

నయీంతో నేతలకు సంబంధాలు లేవు: టీ.హోంశాఖ

హైదరాబాద్‌: పోలీసుల చేతిలో హతమైన కరడుకట్టిన నేరస్థుడు నయీం కేసులో సీపీఐ నేత నారాయణ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై తెలంగాణ హోంశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది. నయీంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నిజంకాదని వెల్లడించింది. నయీంను వాడుకొని పోలీసులు లబ్ధి పొందారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టంచేసింది. నయీం కేసులో పోలీసులు, నాయకులను సిట్‌ కాపాడుతోందనడం సరికాదంది. నయీం వ్యవహారంలో 175 కేసులు, 16 ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. 10మంది పోలీసులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపినట్టు తెలిపింది.

సంక్షోభంలో సమాజ్ వాదీ..

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీ మరోమారు సంక్షోభం దిశగా పయనిస్తోంది. తండ్కీ కుమారులైన ములాయం, అఖిలేష్ ల మధ్య లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. ఇద్దరి మధ్యా టిక్కెట్ల విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆఖిలేష్ వర్గీయులకు మలాయిం టిక్కెట్లు ఇవ్వలేదు..దీంతో అఖిలేష్ ఆగ్రహించారు. దీంతో వివాదం ముదిరి పాకాన పడటంతో 167 మందితో కూడిన జాబితాను అఖిలేష్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

20:49 - December 29, 2016

పోలీసాయనకీ..ఎమ్మెల్యేకి జగడం వచ్చి పడిందబ్బా..గదేందనుకుంటన్నరా?చెప్తా ఇనుండ్రి..ఒకే బండిమీద ముగ్గురు పోరగాళ్లు పోతుండ్రు..పోరళ్లను ఆపిన పోలీసాయన రూ.100 లు జరిమానా ఏసిండు..గంతే గా పోరళ్లు మేమెవరనుకుంటున్నవ్..ఏనుగు రవీంద్రన్న మనుష్యులం మాకే ఫైనేస్తావా?అనంగనే కారులోంచి దిగిన ఎమ్మెల్యే పోలీసాయనతో జగడం పెట్టుకుండు..నువు కొలువు సేసేది మా సర్కార్ లోనే నని మమ్మల్యే ఆపేత్తావా? మామీదనే ఫైన్ రాస్తవా అని పోలీసాయన గల్లా పడ్డిండు..ఎవరానుకుంటున్నారా? గాయనే ఏనుగు రవీంద్రన్న సారు..మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీరందర్ రెడ్డి..నూనె తానం జేసిన రోడ్డు..టపా టపా అని బోల్తా పడతన్న బండ్లు..ముఖ్యమంత్రి సారు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్న సీఎం కేసీఆర్ వదుర్లపై మండిపడ్డ విపక్షాల వారు అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిండు..సీపీఎం పార్టీని సూదులు..దబ్బనం పార్టీ అంటూ కేసీఆర్ వదుర్లతో జనాల మండిపడ్డారు. తమిళనాడులో జయమ్మ జాగాలా మరో చిన్నమ్మ అవతరించింది. ఇసువంటి మస్తు ముచ్చట్ల కోసం గీ వీడియో సూడండి..మన మల్లన్న ముచ్చట్లు..

భక్తులందరికీ శ్రీవారి దర్శనం:ఈవో

తిరుమల : జనవరి 1, ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. జనవరి 1 భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. జనవరి 7 తేదీ ఉదయం 9 గంటల నుండి కంపార్ట్ మెంట్ లోకి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. 

మనదే 'ఫస్ట్ క్యాష్ లెస్' సిటీ':జనార్థన్ రెడ్డి

హైదరాబాద్ : రేపటి నుండి బల్దియాలో క్యాష్ లెస్ లావాదేవీలు అమలులోకి రానున్నాయి. ఈ సందర్బంగా కమిషన్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ..ఎస్బీహెచ్ సహకారంతో 19 సిటిజన్ సర్వీస్ సెంటర్ లలో స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్రెడిట్,డెబిట్ కార్డుల ద్వారా పన్నులు చెల్లించవచ్చన్నారు. దేశంలోనే మొదటిసారి క్యాష్ లెస్ లావాదేవీలను అమలు చేస్తున్న తొలి మున్సిపల్ కార్పొరేషన్ గా బల్దియా నిలవనుందన్నారు. 

20:07 - December 29, 2016

2013 భూసేకరణ చట్టం ఎందుకూ పనికిరానిదనీ.. 2016 భూసేకరణ చట్టం చాలా మెరుగైందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నిర్వాశితులకు ఈ చట్టంతోనే న్యాయం జరుగుతుందన్నారు. రాబోతున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఈ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని విమర్శించారు. 2013 చట్టాన్ని తాడు, బొంగరం లేని చట్టంగా సీఎం అభివర్ణించడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కేసీఆర్‌.. 2013 భూసేకరణ చట్టానికి మద్దతు పలికి ఇప్పుడు పనికిమాలిన చట్టంగా అభివర్ణించటంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మరోపక్క బలవంతపు భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలనే డిమాండ్ తో టీజేఏసీ కన్వీనర్‌ కోదండరాం దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే సీపీఎంపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో అద్దంకి దయాకర్ (టీ.కాంగ్రెస్ నేత), జూలకంటి రంగారెడ్డి(సీపీఎం నేత),నరేశ్ ( టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. 

20:04 - December 29, 2016

హైదరాబాద్ : ఇవాల్టి శాసనసభా సమావేశాలను విపక్షాలు బహిష్కరించాయి. భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు సీరియస్‌గా స్పందించాయి. ప్రజాసమస్యలపై పోరాడుతున్న తమ పార్టీపై సీఎం విషంకక్కారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మండిపడ్డారు. సభలో ప్రతిపక్షాల గొంతునొక్కేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌వైఖరికి నిరసనగా ఇవాల్టి సమావేశాను బహిష్కరిస్తున్నట్టు వారు ప్రకటించారు.

19:54 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ కొత్త భూసేకరణచట్టం రాజ్యాంగ విరుద్ధమని....టీ.జేఏసీ కన్వినర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ధర్నాకార్యక్రమాన్ని విరమించుకున్నామని చెప్పినా.జేఏసీ నేతల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. కోదండరాం నిరహారదీక్ష చేపట్టారు. అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు.

భూనిర్వాసితుల సమస్యలపై టీ. జేఏసీ సమరశంఖం
భూనిర్వాసితుల సమస్యలపై తెలంగాణ జేఏసీ సమరశంఖం పూరించింది.... నిర్వాసితుల సమస్యపై ధర్నాకు పిలుపునిచ్చింది.. అయితే ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. ఈ అరెస్టులపై జేఏసీ కన్వినర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌ తార్నాకలోని తన ఇంట్లో మౌన, నిరాహారదీక్షలు చేపట్టారు..

ధర్నా రద్దుచేసుకున్నా అరెస్టులా : కోదండరాం
ధర్నా కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నామని చెప్పినా.. పోలీసులు జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారని కోదండరాం ఆరోపించారు.. అరెస్టుచేసినవారిని విడుదలచేసేవరకూ ఈ దీక్ష విరమించబోమని ప్రకటించారు..

విచ్చలవిడి భూసేకరణ సరికాదు : కోదండరాం
2013 భూసేకరణ బిల్లుకు సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్లు చట్టవిరుద్ధమని కోదండరాం విమర్శించారు..

కోదండరాం దీక్షకు కాంగ్రెస్‌ నేతలు సంఘీభావం
కోదండరాం దీక్షకు కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ సంఘీభావం తెలిపారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.. మొత్తానికి కొత్త భూసేకరణ చట్టంపై వివిధ వర్గాలనుంచి విమర్శలు కొనసాగుతున్నాయి.. కొత్త చట్టం ప్రకారం భూసేకరణ చేయొద్దన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి..  

రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది..

అనంతపురం : ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించటంలేదంటూ విద్యార్థినిపై హర్షకుమార్ అనే ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నిందుతుడు హర్షకుమార్ పరారీలో వున్నాడు. 

టీ.జెన్ కోకు బొగ్గుగనులు..

కరీంనగర్ : తాడిచర్ల, కాపురం బొగ్గు గనులను తెలంగాణ ప్రభుత్వం టీఎస్ జెన్ కోకు లీజుకిచ్చింది. 30ఏళ్ళ పాటు 910 హెక్టార్ల బొగ్గు గనులను లీజుకిస్తూ..ప్రభుత్వం ఒప్పంద ఉత్తర్వులు జారీ చేసింది. 

దీక్ష విరమించిన కోదండరాం..

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్ కోదండరాం దీక్ష విరమించారు. నిమ్మరసం అందించి చుక్కా రామయ్య దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వ భూముల్లో పార్మా సిటీ అవసరం లేదని ఈ సందర్భంగా కోదండరామ్ పేర్కొన్నారు. విచ్చలవిడి భూసేకరణ సరికాదన్నారు. వివాదంగా మారిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో పెద్దగా ఉపయోగం వుండదని ఇంజనీర్లే చెబుతున్నారనీ..ఈ విషయంలో ప్రభుత్వం నిర్భంధ విధానాలను అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలు పరిష్కారమయ్యే వరకూ..టీ.జేఏసీ పోరాడుతుందని కోదండరాం స్పష్టం చేశారు. 

18:59 - December 29, 2016
18:53 - December 29, 2016

విశాఖ : ఏడాది క్రితం పెళ్లయింది..అంతలోనే ఆ ఇల్లాలు ఉరితాడుకు వేలాడింది...ఏడాదిలోనే చిత్రహింసలు...మానసిక వేధింపులకు గురయిన ఇల్లాలి కేసులో పోలీసులేం చేస్తారు..? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు..? అదే విశాఖలో ఉరితాడుకు వేలాడిన బ్రమరాంబిక కేసులో ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు..? హాస్యనటుడు పొట్టి రమేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోయారు..? పరోక్షంగా కేసు నీరుగార్చేందుకు సహకరిస్తున్నారా..? లేక ఇంకా ఏదైనా కారణాలున్నాయా.???

హాస్యనటుడి కేసు నీరుగార్చే యత్నాలు..
సినీ హాస్య నటుడు పొట్టి రమేష్‌ భార్య మృతి కేసులో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందా..? కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారా..? బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఈ కేసులో తాత్సర్యం ఎందుకు చేస్తున్నట్లు..? ప్రధాన నిందితుడు పొట్టి రమేష్ దొరకడం లేదని ఎందుకు చెబుతున్నట్లు..? వీటన్నింటిపై వస్తున్న అనుమానాలు విశాఖ పోలీసుల పనితీరుపై కొత్త ఆలోచనలను కలిగిస్తుంది...

పొట్టి రమేష్‌ ఎక్కడ..?పరారీలో ఉన్నట్లు చెబుతున్న పోలీసులు..
హాస్య నటుడు పోట్టి రమేష్ భార్య బ్రమరాంభిక ఈ నెల 20వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించింది..బ్రమరాంభిక అత్తా మామ దీన్ని అత్మహత్యగా పోలీసులకు చెప్పారు..దీనిపై పోలీసులు కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు...అదే సమయంలో తమ కూతురు మరణంపై అనుమానాలున్నాయంటూ మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు..దీంతో పాటు భర్త రమేష్, ఆడబిడ్డ, ఆమె భర్త, అత్తమామలు వేధించారంటూ కేసు పెట్టారు..దీనిపై పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు..ఇందులో ఆడపడుచు,ఆమె భర్తలను అదుపులోకి తీసుకున్నా ప్రధాన నిందితుడు కేసులో ఏ1 గా ఉన్న పొట్టి రమేష్ మాత్రం దొరకడం లేదని చెబుతున్నారు...ఇక అత్తమామలను కూడా అరెస్టు చేయలేదు.. అయితే దీనిపై రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి...పొట్టి రమేష్ పరారీలో ఉన్నాడని చెప్పడం వెనక పరోక్షంగా సహకరిస్తున్నదెవరు..? కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు విన్పిస్తున్నా పోలీసులకు ఆచూకీ దొరకడం లేదా..?

గతేడాది పొట్టి రమేష్‌తో బ్రమరాంభిక పెళ్లి...
బ్రమరాంబిక, రమేష్ దగ్గరి బంధువులే...దీంతోనే వీరిద్దరి సంబంధం కుదిరింది.....పెళ్లయిన తరువాత రమేష్ దంపతులు గాజువాకలోని సాయి సధన్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు...ప్రతీ నిత్యం వేధింపులకు గురిచేసేవారని...దాంతోనే తమ కూతురు మనస్తాపం చెందిందంటున్నారు కుటుంబీకులు..అయితే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేంత పరికిది మాత్రం కాదంటున్నారు...

రమేష్ ను అదుపులోకి తీసుకోని పోలీసులు
రమేష్ ను మాత్రం పోలీసులు ఇప్పటికి అదుపులోకి తీసుకోలేదు..అతడు దోరకలేదని చెబుతున్నారు..ఇదే సమయంలో బ్రమరాంబిక కుటుంబీకులు మాత్రం అదనపు కట్నం కోసం శారీరకంగానూ మానసికంగా వేధించే వారని చెబుతున్నారు...కనీసం ఇంట్లో సోఫా సెట్ పై కూడా కూర్చోనిచ్చేవారు కాదని తన చెల్లితో వాట్స్ అప్ లో చాటింగ్‌లో చెప్పుకునేదంటున్నారు...

కేసులో ఎందుకు జాప్యం చేస్తున్నారంటున్యన మహిళా సంఘాలు
దగ్గరి బంధుత్వం ఉన్న వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చుకునేందుకు పంచాయితీ పెట్టాలనుకున్నారు..ఇదే సమయంలో బ్రమరాంబిక ఉరితాడుకు వేలాడింది...కేసులో ఏ వన్ గా ఉన్న రమేష్ ను ఇంత వరకూ అరెస్టు చెయ్యకపోవడంతో కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...ఏది ఏమైనా ఈ కేసులో పోలీసుల తీరు అనుమానాలను కలిగిస్తుంది.. ఎంటివారినైనా ఇట్టే పట్టుకునే పోలీసులు ఈ కేసులో ఎందుకు జాప్యం చేస్తున్నారని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి....

 

18:46 - December 29, 2016

విజయవాడ : కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందిన ఎమ్మెల్సీ ఎంఈ శర్మ...మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. వేతనాల పెంపు విషయంలో 28 రోజులుగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

18:42 - December 29, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పెంపును చంద్రబాబు లైట్‌గా తీసుకుంటున్నారా? నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిందా? నియోజకవర్గాలు పెరిగితే తమకూ అవకాశం వస్తుందని టీడీపీలో చేరుతున్న వారి పరిస్థితి ఏంటి ? నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు ?

ఏపీలో నియోజకవర్గాల పెంపు ..2026 వరకు పెంచబోమన్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగానే నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలోని 175 నియోజకవర్గాలను.. దాదాపు 225 వరకు పెంచడానికి అవకాశముంది. కానీ విభజన చట్టంలోని నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. 2026 వరకు నియోజకవర్గాలను పెంచే ప్రసక్తే లేదని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీలో నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్న అనేకమంది నేతల ఆశలు ఆవిరైపోయాయి.

నియోజకవర్గాల పెంపు ఉంటుందని భావించిన చంద్రబాబు
నియోజకవర్గాల పెంపు విభజన చట్టంలోనే ఉందని... కచ్చితంగా నియోజకవర్గాల పెంపు ఉంటుందని చంద్రబాబు కూడా చాలాసార్లు పార్టీ శ్రేణులకు చెప్పారు. కేంద్రంతోనూ నియోజకవర్గాల పెంపుపై సంప్రదింపులు జరిపారు. నియోజకవర్గాలను పెంచాల్సిందేనని కేంద్రాన్ని పలుమార్లు కోరారు కూడా. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. పైగా 2026 వరకు నియోజకర్గాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో నియోజకవర్గాల పెంపు అంశాన్ని చంద్రబాబు కూడా లైట్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు
కచ్చితంగా నియోజకవర్గాలు పెంచుతారన్న ధీమాతోనే వైసీపీకి చెందిన దాదాపు 21మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఏదో ఒక పదవి దక్కుతుందని గంపెడాశలు పెంచుకున్నారు. చంద్రబాబు కూడా వారికి ఎమ్మెల్యే టికెట్‌గానీ, అది కుదరకపోతే మరేదైనా పదవి ఇస్తానని హామీనిచ్చారు. దీంతో వైపీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు టీడీపీలో వరుసకట్టి మరీ చేరిపోయారు. టీడీపీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జీలు కూడా పదవులు ఆశిస్తున్నారు. నియోజకవర్గాలు పెరిగితే అందరికీ ఎమ్మెల్యే టికెట్‌లు ఇవ్వవచ్చని చంద్రబాబు అంచనావేశారు. పార్టీలో చేరిన వారితోపాటు ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జీలు ఉన్న టీడీపీ నేతలకు న్యాయం చేయవచ్చని భావించారు. 2026వరకు నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్రం స్పష్టం చేయడంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టినట్టు అయ్యింది.

నియోజకవర్గాల పెంపులేకపోవడంతో టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తులు
2026 వరకు నియోజకవర్గాల పెంపు ఉండదని తేలడంతో టీడీపీలో అసంతృప్తులు చెలరేగుతున్నాయి. దీంతో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది టీడీపీ నాయకత్వం. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఉన్న ప్రజాప్రతినిధుల బలం ప్రకారం 20వరకు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. వీటిని పార్టీలో అర్హులతోపాటు పార్టీమారిన చోట అసంతృప్తిగా ఉన్న ఇంచార్జులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి వారిని సంతృప్తిపర్చవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనిపై పార్టీ సీనియర్లతోనూ చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. మరి అసంతృప్తి నేతలకు వేసే ఎమ్మెల్సీ పదవుల ఎర ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో వేచి చూడాలి.

18:37 - December 29, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీగా మారుస్తామంటున్నారు సిటీ పోలీసులు. నగరంలో నేరాలను అదుపు చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. సీసీ కెమెరాలు, మొబైల్‌ యాప్స్‌తో అనుక్షణం అలెర్ట్‌గా ఉంటూ.. గతేడాది కంటే 8 శాతం నేరాలను తగ్గించామన్నారు. ఈ ఏడాది నగరంలో ఛేదించిన కేసులను యానువల్‌ మీట్‌ ద్వారా తెలిపారు.

అధునాతన టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట
భాగ్యనగరంలో లా అండ్‌ ఆర్డర్‌తో పాటు నేరాలను కంట్రోల్‌ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది నగరంలో జరిగిన నేరాలు.. ఛేదించిన కేసులపై యానువల్‌ మీట్‌ నిర్వహించారు. రానున్న రోజుల్లో సిటీని క్రైమ్‌ ఫ్రీ సిటీగా మారుస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

నగరమంతా సీసీ కెమెరాలు
నగరంలో ఏ మూలాన ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా నగరమంతా సిసీ కెమెరాలు అమర్చామన్నారు. నేరాలు జరిగితే.. వెంటనే స్పాట్‌కు వెళ్లేందుకు హై టెక్నాలజీతో పాటు.. అనేక రకాల యాప్స్‌ ఉపయోగిస్తున్నామన్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని అనేక నేరాలను ఛేదించినట్లు తెలిపారు. మరోవైపు షీటీమ్స్‌, భరోసా సెంటర్ల ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు చేయూతనిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది నమోదైన కేసుల్లో 34 శాతం కేసులను ఛేదించినట్లు తెలిపారు.

8 శాతం తగ్గిన నేరాలు ..17,403 కేసులు నమోదు
గతేడాదితో పోలిస్తే నగరంలో 8 శాతం నేరాలు తగ్గాయన్నారు మహేందర్‌రెడ్డి. ఈ ఏడాది 17,403 కేసులు రిజిష్టర్‌ కాగా.. అందులో 7 మర్డర్‌ ఫర్‌ గేయిన్‌ కేసులు, 98 దోపిడి కేసులు, 93 చైన్‌ స్నాచింగ్‌లు ఉన్నాయన్నారు. వీటితో పాటు 161 రేపు కేసులు రిపోర్ట్‌ కాగా.. మహిళలపై దాడులు, వేధింపులకు సంబంధించి 1,595 కేసులు నమోదయ్యాయన్నారు. ఇక నగరంలో నమోదైన కేసుల్లో 23 కోట్ల 58 లక్షల రూపాయలు ప్రాపర్టీ లాస్‌ కాగా.. అందులో 12 కోట్ల 2 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేశామన్నారు. ఇక 55 డ్రగ్‌ కేసుల్లో 10 మంది నైజీరియన్‌లతో పాటు.. మరో 170 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 496 కిలోల గంజాయి, 77 గ్రాముల కొకైన్‌, 2700 గ్రాముల ఓపియమ్‌ లాంటి మాదక ద్రవ్యాలు సీజ్‌ చేశారు.

283 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు..హాక్‌ ఐ యాప్‌ ద్వారా 22 కేసులు
నగరంలో నేరాలకు పాల్పడుతున్న 283 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్‌ యాప్‌ 'హాక్‌ ఐ'కి వచ్చిన ఫిర్యాదుల్లో 22 కేసులు నమోదు చేసి నేరాలకు పాల్పడినివారిని జైలుకు పంపారు. అదేవిధంగా షీటీమ్స్‌కు వచ్చిన 1,595 ఫిర్యాదుల్లో.. 848 మందిని అరెస్ట్‌ చేయడంతో పాటు.. 236 మంది మైనర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇక ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై.. 29 లక్షల 7 వేల 223 కేసులను నమోదు చేశారు. వీరి నుంచి 36 కోట్ల 87 లక్షల 66 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. మొత్తానికి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్‌ రేటు తగ్గించామంటున్నారు పోలీసులు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుని భవిష్యత్‌లోనూ నేరాలను తగ్గిస్తామని ప్రజలకు పోలీసులు భరోసా ఇస్తున్నారు.

 

18:30 - December 29, 2016

కరీంనగర్‌ : కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపట్ల గౌరవం లేదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఎంపార్టీపై చౌకబారు విమర్శలు మానుకుని..ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. 2013భూసేకరణ చట్టం ద్వారా నిర్వాసితులకు లభించిన రక్షణలను కేసీఆర్‌ ప్రభుత్వం హరించి వేస్తోందని తమ్మినేని అన్నారు. కొత్తగా తీసుకు వచ్చిన భూసేకరణ సవరణచట్టం నిర్వాసితులు, రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టన్నారు తమ్మినేని. దిగజారుడు మాటలు మానుకుని ముఖ్యమంత్రి కుర్చీకి తగిన విధంగా హుందాగా మాట్లాడ్డం నేర్చుకోవాలన్నారు. కేసీఆర్‌ బెదరింపులకు సీపీఎం అదిరిపోయే పార్టీకాదని తమ్మినేని ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి తప్పడు నిర్ణయాలపై భవిష్యత్తులో రాజీలేని పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు తమ్మినేని.  

కాల్వలో పడ్డ బస్..

ఛత్తీస్‌గఢ్ : సర్గూజ జిల్లాలో కాల్వలో బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారమందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సుష్మాకు నవాజ్ షరీఫ్ లేఖ..

ఢిల్లీ: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. ఇటీవలే ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు నవాజ్ షరీఫ్ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.

సీపీఎం కార్యాలయం ముట్టడి ..

తూర్పుగోదావరి : సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. కాకినాడ ఎజ్ పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం గురువారం నాడు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే నెపంతో సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. 

ఓలా కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని ఓలా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయంలోకి దూసుకెళ్లిన లోకల్ గా వుండే క్యాబ్ డ్రైవర్లు ఫర్నీచర్ ను..కార్యాయలం అద్దాలను ధ్వంసం చేశారు. ఓలా క్యాబ్ సర్వీసులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి కొత్త ఓలా క్యాబ్ లను అనుతించవద్దంటూ వారు డిమాండ్ చేశారు. 

ఉగాదికి ఎల్ఈడీ వెలగాలి : కేటీఆర్

హైదరాబాద్ : పురపాలక శాఖధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండేళ్ళల్లో చేపట్టబోయే అంశాలపై 15 రోజుల్లో ప్రాధాన్యత ఆధారంగా నివేదిక ఇవ్వాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. అందుబాటులో వున్న నిధులను..ఉద్యోగుల సేవలను సంపూర్ణయంగా వినియోగించుకోవాలని సూచించారు.ఉగాది నాటికి జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 

17:12 - December 29, 2016

విజయవాడ : ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా కౌలురైతులకైతే అన్యాయమే జరుగుతోంది. కౌలురైతును ఆదుకుంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరిస్తోంది. వారికి గుర్తింపు కార్డులు కూడా అందకపోవడంతో ఎక్కడా రుణాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. కౌలు రైతులకు బ్యాంకర్లు సైతం రుణం ఇవ్వడానికి విముఖత చూపుతున్నారు. దీంతో గత్యంతరం లేక అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకొని పంటను కాపాడుకునేందుకు వారు నానా తిప్పలు పడుతున్నారు.

కృష్ణా, గుంటూరులో ఖరీఫ్‌ సీజన్‌లో 11.45 లక్షల హెక్టార్లలో పంటసాగు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్‌లో 11.45 లక్షల హెక్టార్లలో పంట సాగైంది. గుంటూరు జిల్లాలో 5,77,827 హెక్టార్లు సాగవ్వగా... కృష్ణాజిల్లాలో 2,43,254 హెక్టార్లలో వరి, కంది, మొక్కజొన్న, మినుము, జొన్న, శనగ, పెసర తదితర పంటలను సాగుచేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చేసిన రైతులు కూడా సమీప మండలాల్లో భూములు కౌలుకుతీసుకుని పంటసాగు చేస్తున్నారు. పంట రుణాలు తీసుకుందామని వెళితే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. అయినా ఖరీప్‌ సీజన్‌ను అప్పోసప్పో చేసి నెట్టుకొచ్చారు. ఇప్పుడు రబీ సీజన్‌ ప్రారంభమైంది. బ్యాంకుల దగ్గరికి రుణాల కోసం వెళ్లిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతుల రుణాల గురించి పట్టించుకోకపోవడంతో వారికి ఆర్ధిక ఇబ్బందులు తప్పడం లేదు.

కృష్ణా, గుంటూరు జిల్లాలో రెండు లక్షల మందికిపైగా కౌలురైతులు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు లక్షల మందికి పైగా కౌలు రైతులున్నారు. గతేడాది వీరిలో కేవలం 32,428 మందికి మాత్రమే ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందజేసింది. పోనీ గుర్తింపు కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలు అందాయా అంటే అదీలేదు. కేవలం 2193 మందికి 11.29 కోట్ల రుణ సౌకర్యం కల్పించి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. గుర్తింపు కార్డులు అందని కౌలు రైతులకు వ్యవసాయాధికారి మంజూరు చేసిన ధ్రువపత్రాన్ని ప్రామాణికంగా తీసుకొని రుణాలివ్వాలనీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

కృష్ణా జిల్లాలో 3294 రైతుమిత్ర గ్రూపులు
కృష్ణా జిల్లాలో 32,940మంది కౌలురైతులు 3294 రైతుమిత్ర గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. రైతుమిత్ర గ్రూపుల ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 65 కోట్ల రుణం మాత్రమే అందింది. ఈ జిల్లాలో కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలంటే భూమి యజమాని అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంగీకార పత్రాన్ని ఇవ్వడానికి భూ యజమానులు ముందుకు రావడంలేదు. ఒకవేళ ఇచ్చినా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించి పంట నష్టం వాటిల్లితే పరిహారం భూమి యజమానికే అందుతుంది. నష్టపోయిన కౌలు రైతుకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది.

ఏడాది 10 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయం
ఈ ఏడాది 10 లక్షల మంది కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్‌ ముగిసి రబీలోకి అడుగుపెట్టినా.. ఇప్పటి వరకు కేవలం 5.9 లక్షల మందికే ప్రభుత్వం కార్డులు జారీ చేసింది. ఇందులోనూ 70,666 మందికి మాత్రమే రుణాలు అందాయి. మిగిలిన వారి పరిస్థితి అంతేసంగతులు. ఇక కౌలుగుర్తింపు కార్డులు లేని 30,877 మందికి వ్యవసాయాధికారులు ధ్రువపత్రాలు జారీ చేయగా.. వీరికి బ్యాంకులు కేవలం 5.91 కోట్ల రుణం మాత్రమే ఇచ్చాయి. దీంతో గత్యంతరం లేక కౌలుదారులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికైనా కౌలురైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

 

కొత్తపల్లిలో దారుణం..41గొర్రెలు మృతి..

మహబూబ్‌నగర్: మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తోన్న లారీ ఓ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో 41 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. 

17:01 - December 29, 2016
16:58 - December 29, 2016

తూర్పుగోదావరి : సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించే ఫైబర్‌ గ్రిడ్ కనెక్టివిటీ మోరి గ్రామం నుంచి ప్రారంభం కావడం ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగదు రహిత గ్రామంగా మోరి మారడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని అన్నారు.

ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్టెవిటీని 332 కోట్ల రూపాయలకే పూర్తి చేశాం
5 వందల కోట్ల రూపాయలతో పూర్తవ్వాల్సిన ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్టెవిటీని 332 కోట్ల రూపాయలకే పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఫైబర్‌ గ్రిడ్‌ సేవలను మోరిలో ప్రారంభిడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 145 రూపాయలకే ఇంటర్నెట్‌, ఫోన్‌, టీవీ సేవలను అందిస్తున్నామని తెలిపారు.

16:54 - December 29, 2016

హైదరాబాద్ : ఆదర్శంగా మొక్కలు పెంచుతున్న వారికి పారితోషికం అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. హరితహారంపై చర్చలో భాగంగా శాసనసభలో ఆయన అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నియోజకవర్గంగా పెద్దపెల్లి ఎంపికైనట్లు చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటిగా సిద్ధిపేటను కేసీఆర్‌ ప్రకటించారు. ఉత్తమ గ్రామం, జిల్లా, సర్పంచ్‌, ఉపాధ్యాయుడు అవార్డులను సీఎం ప్రకటించారు.

మొక్కలు పెంచుతున్న స్కూల్‌ విద్యార్ధులకు ప్రతి నెల 5 రూపాయలు: కేసీఆర్
మొక్కలు పెంచుతున్న స్కూల్‌ విద్యార్ధులకు ప్రతి నెల 5 రూపాయలు ఇస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. హరితహారంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే 8 కోట్ల టేకు మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 15 కోట్ల టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో హరితహారం కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. 

కొనసాగుతున్న కూల్చివేతలు..

మేడ్చల్ : అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దమ్మాయిగూడెంలోని ఎల్ఆర్ కాలనీలో అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. 

'అమ్మ' మేనకోడలి కీలక ప్రకటన!..

తమిళనాడు : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు కీలక ప్రకటన చేశారు.రాజకీయాల్లోకి వచ్చే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అమ్మమేనకోడలు దీపా జయకుమార్ పేర్కొన్నారు. అతి త్వరలోనే రాజకీయ ప్రవేశం వంటుందనీ..ప్రస్తుతం వున్న విపత్కర పరిస్థితుల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు సమన్వయంతో ఉండాలని దీపా సూచించారు. 

అందుబాటులోకి ఐదొందల నోట్లు : జైట్లీ

ఢిల్లీ : నోట్ల రద్దుకు సహాకరించిన దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. భారీ మొత్తంలో కొత్త రూ.500ల నోట్లను తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. నోట్ల రద్దు అనంతరం దేశంలో ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు. దేశ ఆదాయం వేగంగా పెరుగతోందన్నారు. నవంబర్ 2015 కంటే ఈ ఏడాది ఎక్కువ పన్ను వసూలైందని తెలిపారు.ప్రత్యక్ష పన్ను వసూళ్ళలో 14.4 శాతం ఆదాయం..పరోక్షంగా 26.2 శాతం ఆదాయం పెరిగిందని తెలిపారు. రబీ సీసన్ లో 6.3 శాతం వృద్ధి పెరిగిందని జైట్లీ పేర్కొన్నారు.

 

16:38 - December 29, 2016

ఇద్దరు జవాన్లకు గాయాలు..

జమ్మూకశ్మీర్‌ : బందిపొరా జిల్లా హైజిన్‌ గ్రామంలో సైనికులకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఉదయం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. ప్రస్తుతం తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.లష్కరే తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాదితో పాటు, ఈ మధ్యే ఉగ్రవాద సంస్థలో చేరిన ఓ యువకుడు ఇటీవల జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించిన రెండు వారాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

నగదు రహిత గ్రామంగా మోరి: బాబు

తూర్పుగోదావరి : సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించే ఫైబర్‌ గ్రిడ్ కనెక్టివిటీ మోరి గ్రామం నుంచి ప్రారంభం కావడం ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగదు రహిత గ్రామంగా మోరి మారడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని అన్నారు. సఖినేటిపల్లి మండలం మోరిలో ఫైబర్‌గ్రిడ్‌ ఇంటర్నెట్‌ సేవల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

16:02 - December 29, 2016
16:00 - December 29, 2016

తూర్పుగోదావరి : చేనేత పరిశ్రమకు, చేనేత వృత్తిపై జీవిస్తున్న నేతన్నలకు సంక్రాంతి పండుగ ఆమడదూరంగా నిలుస్తోంది. అటు సరైన ప్రోత్సహకాలు లేక, ఇటు ఎగుమతులు లేక అయోమయ పరిస్థితుల్లో చేనేత కార్మికులు డీలాపడిపోతున్నారు. పక్షంలో రోజుల్లో సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా వారికి పండుగ కాంతులు ఇనుమడింపజేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

నోట్లరద్దు, మార్పిడి నిర్ణయంతో చేనత పరిశ్రమపై పెద్ద దెబ్బ
నూతన ఏడాది.. ఆపైన సంక్రాంతి నాడు.. కొత్త వస్త్రాల శోభతో కాంతులు విరబోయాల్సిన ఇంట.. పండగ వాతావరణం ఆమడ దూరంగా నిలుస్తోంది. కొత్త వస్త్రాల కళ ఒక్కసారిగా మాయమైంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో.. చేనేత పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో సంక్రాంతి పండుగపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

గుంటూరు, తు.గో జిలాల్లో చేనేత కార్మికులు పస్తులు
పెద్దనోట్ల ర్దదుతో చేనేత వ్యాపారం పడకేయడంతోపాటు.. ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తూ పొట్ట పోసుకునే నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు, తూర్పుగోదావరి తదితర జిల్లాలలో లారీల్లో ఇసుక నింపడమే నేతన్నలకు దిక్కవుతోంది. మొత్తమ్మీద చేనేత రంగం దాదాపు స్తంభించింది. వ్యాపారం 60 శాతం వరకు పడిపోయిందని అంచనా. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి రోడ్డులో ఉన్న చేనేత వస్త్ర దుకాణాల వీధి పూర్తిగా వెలవెలబోతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షకు పైగా మగ్గాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షకుపైగా మగ్గాలున్నాయి. వీటిపై పనిచేసే నేత కార్మికులకు రోజుకు సరాసరి రూ.150 కూలీ దక్కుతుంది. నూలు, రంగులు, మగ్గాల నిర్వహణ ఖర్చులు అదనం. వ్యాపారాలు, ఎగుమతులు పడిపోవడంతో మాస్టర్ వీవర్స్ కూలీ చెల్లించలేకపోతున్నారు. ఇల్లు గడిచేందుకు విధిలేక మగ్గాన్ని వదిలి నేతన్నలు కూలీ పనులకు వెళుతున్నారు.

ఉప్పాడ చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ
ఉప్పాడ చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఇక్కడ పెద్ద, సామాన్య వస్త్ర దుకాణాలు 70 వరకు ఉండగా గతంలో రోజుకు రూ.40 లక్షల వరకు వ్యాపారం చేసేవారు. ఇపుడు కేవలం రూ.4 లక్షలు రావడమే గగనంగా మారింది. నెలకు రూ.కోట్లలో ఉన్న ఎగుమతుల విలువ నేడు భారీగా పడిపోయింది. ఇదే పరిస్థితి ధర్మవరం, వెంకటగిరి, ఎమ్మిగనూరులలో నెలకొంది.

బ్యాంకుల్లో నగదు విత్ డ్రా గరిష్ఠి పరిమితి ఇవ్వాలి : నేతన్నలు
గ్రామీణ బ్యాంకుల్లో నగదు విత్ డ్రా గరిష్ఠి పరిమితి వరకు వీవర్స్ కు ఇచ్చేలా చూడాలని చేనేతపై ఆధారపడే కార్మికులు, వ్యాపారులు కోరుతున్నారు. రాయితీపై విక్రయించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం, ప్రోత్సహకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తయారైన వస్త్రాలు పాడైపోతే నష్టపోతామని, ఈ సమస్య నుంచి ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించి ఆదుకోవాలంటున్నారు. స్వైపింగ్ మిషన్లు వ్యాపారులకు అందజేయడంతోపాటు బ్యాంకులతో సమస్య లేకుండా సమన్వయం చేయాలని ఆశిస్తున్నారు.

15:56 - December 29, 2016

సిద్దిపేట : అసెంబ్లీలో సీపీఎంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధకరమన్నారు.. సిద్ధిపేట్‌ జిల్లా పార్టీ కార్యదర్శి మల్లారెడ్డి.. 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ మళ్లీ కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రజలను ఇబ్బందిపెట్టేలాఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్‌ కామెంట్స్‌కు నిరసనగా సిద్ధిపేట్‌ పాత బస్టాండ్‌ దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలు నోటికి నల్లబట్ట కట్టుకొని నిరసన తెలిపారు..

సీపీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : జబ్బార్
సీపీఎంపై ... సీఎం కేసీఆర్‌ చేసిన వాఖ్యలకు నిరసనగా వనపర్తి జిల్లాలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నా.. సీపీఎంపై .. అనుచితంగా మాట్లాడడం సరికాదని.. జిల్లా కార్యదర్శి జబ్బార్‌ అన్నారు. అలాగే సీపీఎం ఎప్పుడూ పేద ప్రజల పక్షాన నిలబడుతుందని..ప్రజల సమస్యలపై పోరాటం ఆపదని...ఆయన అన్నారు. 

 

15:48 - December 29, 2016

హైదరాబాద్ : మొక్కలు పెంచుతున్న స్కూల్‌ విద్యార్ధులకు ప్రతి నెల 5 రూపాయలు ఇస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. హరితహారంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే 8 కోట్ల టేకు మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 15 కోట్ల టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో హరితహారం కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ వెల్లడించారు.

33 శాతం పచ్చదనం పెంచడమే హరితహారం లక్ష్యం : కేసీఆర్
తెలంగాణలో 33 శాతం పచ్చదనం పెంచడమే హరితహారం లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలో పచ్చధనాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాల్లో.. హరితహారం మూడో అతి పెద్ద ప్రయత్నమని సీఎం కేసీఆర్ అన్నారు. చైనాలో గోబి ఎడారి విస్తరణ నిలుపుదలకు 4500 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటి గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ చైనా నిర్మించినట్లు పేర్కొన్నారు. బ్రిజిల్‌లో ఆమేజాన్‌ నది పరిరక్షణకు వన్‌ బిలియన్‌ ట్రీస్ ఫర్‌ ఆమేజాన్ 100 కోట్ల మొక్కల పెంపకం చేపట్టారన్నారు. 

'బాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు'

తూర్పుగోదావరి : కాపు కులస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని అన్నారు.  

ఫైబర్‌గ్రిడ్‌ సేవల్ని ప్రారంభించిన చంద్రబాబు..

తూర్పుగోదావరి : రాష్ట్రంలో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఫైబర్‌గ్రిడ్‌ సేవలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.  సఖినేటిపల్లి మండలం మోరిలో ఫైబర్‌గ్రిడ్‌ ఇంటర్నెట్‌ సేవల్ని చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రారంభించారు. ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ సేవల్ని ప్రారంభించారు.

కోర్డులో ఎంపీ అసదుద్దీన్‌కు ఊరట..

సంగారెడ్డి : సంగారెడ్డి కోర్టులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌కు ఊరట లభించింది. ముత్తంగి వద్ద జరిగిన ప్రార్థనా మందిరం కూల్చివేత కేసులో అసదుద్దీన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 2005లో పటాన్‌చెరు మండలం ముత్తంగి మండలం వద్ద ప్రార్థనా మందిరం కూల్చివేత కేసులో అసదుద్దీన్ సహా ఇతర నాయకుల ప్రమేయం లేదని కోర్టు తేల్చింది. దీంతో అసదుద్దీన్ కు ఊరట లభించింది. 

రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి..

హైదరాబాద్‌: టీ.టీవీపీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డి ఇంటిని మాల మహానాడు నేతలు గురువారం ముట్టడించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసానికి మాల మహానాడు నేతలు పెద్దఎత్తున చేరుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

15:00 - December 29, 2016

తమిళనాడు : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. జయ మరణంపై తమకు సందేహాలున్నాయనీ..దీనికి సంబంధించి పూర్తి వివరణతో కూడిన వివరణను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.జ‌య‌ల‌లిత మృతిపై సందేహాలు వ్య‌క్తం చేస్తూ మ‌ద్రాసు హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌లు బుధవారం విచార‌ణ‌కు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాదిని హైకోర్టు న్యాయ‌మూర్తి ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై అంత‌గోప్య‌త పాటించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌భుత్వ‌ న్యాయ‌వాదిని ప్ర‌శ్నించారు. కాగా న్యాయవాది ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని కోర్టు జ‌య‌ల‌లిత మృతిపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాలని ఆదేశించింది. జ‌య‌ల‌లిత మృతదేహాన్ని మ‌ళ్లీ ప‌రీక్షించాల‌ని ఎందుకు ఆదేశించ‌కూడ‌దని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశ్నించటం గమన్హాం. 

14:50 - December 29, 2016

ఉత్తరప్రదేశ్‌ : ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. తొలి జాబితాలో తన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవసరమైతే తన అభ్యర్థులను రెబెల్స్‌గా నిలబెట్టే యోచనలో అఖిలేశ్‌యాదవ్‌ ఉన్నట్లు సమాచారం. కాగా బాబాయ్ తో అఖిలేస్ యాదవ్ కు విభేధాలు రావటం..అఖిలేష్ లేని సమయంలో ములాయం ఎన్నికల అభ్యర్థుల్ని ప్రకటించటం..ప్రకటించిన అభ్యర్ధుల్లో తను సంబంధించినవారు లేకపోవటంతో అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహంతో వున్న తరుణంలో పార్టీకి రెబల్ గా పోటీ చేసే యోచనలో యువనేత వున్నట్లుగా సమాచారం. సమాజ్ వాద్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని గతంలో ములాయమే స్వయంగా ప్రకటించారు. తమ్ముడు శివపాల్ కు తనయుడు అఖిలేష్ కు వున్న విభేదాలను రూపు మాపటంలో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ఆ క్రమంలో తాత్కాలికంగా సమస్య తొలగిపోయినా..ఎన్నికల అభ్యర్థుల ఎన్నిక విషయంలో మరోమారు పార్టీలో ముసలం రాజుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో యువనేత రెబల్ గా పోటీచేస్తే పార్టీ ప్రతిష్టకు తీవ్రంగా ముప్పు వాటిల్లవచ్చు..

14:38 - December 29, 2016

హైదరాబాద్ : అడవుల పరిరక్షణను గత పాలకులు విస్మరించారనీ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం రూ.14 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని కేసీఆర్ విమర్శించారు. పచ్చదనం లేక ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతం పెంచాలనీ హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొదటి యేడు 15.86 మొక్కలు నాటామన్నారు. రెండో యేడు 31.67 కోట్ల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో 120 కోట్ల మొక్కలను రహదారుల వెంట..ఖాళీ ప్రదేశాలలో నాటి పెంచాలని నిర్ణయించామని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 100కోట్ల నర్సరీలు ఉన్నాయన్నారు. అటవీశాఖలో పలు పోస్టులను భర్తీ చేశామన్నారు. హరితహారం కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అసెంబ్లీలో హరితహారం లఘ చర్చలో సీఎం కేసీఆర్ తెలిపారు. 

13:52 - December 29, 2016

మధుమేహం (షుగర్) ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వచ్చిన షుగర్ ను ఎలా తగ్గించుకోవాలి, షుగర్ వచ్చిన తరువాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే అంశాలను ప్రముఖ న్యూట్రీషియనిస్టు జానకీ తెలియజేశారు. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

13:43 - December 29, 2016

హైదరాబాద్ :కాలం మారింది. పూర్వపు రోజుల్లో పెళ్లి సంబంధాల కోసం పెళ్లిళ్ల పేరయ్యల మీద ఆధారపడేవారు. ఇప్పుడు వారితో పనిలేదు. అంతా ఆన్ లైన్లోనే జరిగిపోతోంది. మార్టిమోనియల్స్ ఆ పని చేస్తున్నాయి. ఇలా జరిగిన పెళ్ళిళ్లు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి. దీంతో కేంద్రం మార్టిమోనియల్స్ పై డేగ కన్ను వేసింది. దీని పై మరిన్ని వివరాల తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

13:33 - December 29, 2016

హైదరాబాద్ : హెల్త్‌ కార్డులున్నా... హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేసినా.. జర్నలిస్టులకు వైద్య సదుపాయం అందడం లేదని.. ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జర్నలిస్టులకు వైద్యం అందకపోగా.. అవమానాలే మిగులుతున్నాయని అన్నారు. వారికోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని రామలింగారెడ్డి కోరారు.

13:31 - December 29, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో విషజ్వరాల బారిన పడి ప్రానాలు కోల్పోయిన వారి సంఖ్యను ప్రభుత్వం దాస్తుందని...కావాలనే వెల్లడించడం లేదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. చాలా మంది పేదవారు డెంగ్యూ బారిన పడి.. వైద్యం అందక చనిపోతున్నారని.. డెంగ్యూను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని అసెంబ్లీలో ఆయన డిమాండ్‌ చేశారు.

13:29 - December 29, 2016

హైదరాబాద్ : పార్లమెంటరీ ప్రజాస్వామిక విధానంలో ప్రతిపక్షాల పాత్ర ఘననీయమైనదని.. ప్రభుత్వంగా వారి పట్ల మాకు ఆ గౌరవం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వారు మంచి సూచన ఇస్తే తీసుకుంటామని... ప్రతిపక్షాలను అవమానించేదేమి లేదని కేసీఆర్‌ అన్నారు. అలాగే పార్టీలకు అధికారాలు.. రావడం..పోవడం సహజమని.. దానిని స్పోర్టీవ్‌ తీసుకోవాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినంత మాత్రాన వేరేవాళ్లు అసూయ పడాల్సిందేమి లేదని కేసీఆర్‌ అన్నారు.

13:27 - December 29, 2016

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళతో సీఎం పన్నీర్‌ సెల్వం భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు శశికళ అంగీకరించారని.. పార్టీ తీర్మానాలను ఆమే ఆమోదించినట్లు పేర్కొన్నారు. చెన్నైలోని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ.. జనవరి 2వ తేదీన అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్లమెంట్‌లో దివంగత నేత జయ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని..భారతరత్నను ఇవ్వాలనే తీర్మానాలను ఆమోదించారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పార్టీ నేతలు.. కార్యకర్తలు పోయేస్‌గార్డెన్‌కు చేరుకున్నారు.

అటవీశాఖలో 2058 పోస్టులుభర్తీ: కేసీఆర్

హైదరాబాద్ : అటవీశాఖలో కొత్తగా 2058 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కలప స్మగ్లింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

భూసేకరణ బిల్లు చట్టవిరుద్ధం: తమ్మినేని

కరీంనగర్ : తెలంగాణ భూసేకరణ బిల్లు చట్టవిరుద్ధం అని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన చేపట్టిన మహాజనపాద యాత్ర 73 రోజులు చేరుకుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2013 బిల్లు అమల్లో ఉండగా కొట్ట చట్టం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం 2013 చట్టాన్ని నీరుగార్చే విధంగా ఉందని విమర్శించారు. 2013 చట్టం బిల్లు ఆమోదించినపుడు పార్లమెంట్లోనే ఉన్న కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న సీపీఎంను విమర్శించడం సరికాదని హెచ్చరించారు.

కాంగ్రెస్ సభకు రాకపోవడం మంచిదికాదు: కేసీఆర్

హైదరాబాద్ : పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో అధికారాలు రావడం పోవడం రోటీన్ ప్రక్రియ అని తెలిపారు. కాంగ్రెస్, మరో పార్టీ సభకు రాకపోవడం మంచిది కాదన్నారు. ఎన్ని రోజులైనా సభను జరపడానికి , ఏ అంశంపైనైనా చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పాక వివాదం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. సభకు రండి, ప్రభుత్వానికి మంచి సూచనలిస్తే స్వీకరిస్తుందని తెలిపారు. నిన్న తన స్పీచ్ విన్నాక మల్లన్నసాగర్ రైతులు తనకు ఫోన్ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వారిలో కొందరు తనకు తెలిసిన వారుంటే వారితో తాను మాట్లాడానని వివరించారు.

12:30 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేదవారందరికీ గ్యాస్‌ కనెక్షన్లు అందిచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈ మేరకు పది లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశామని.. మరో పది లక్షల కనెక్షన్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. దీనికోసం తానే స్వయంగా అన్ని జిల్లాలలో దీపం పథకాన్ని ప్రారంభించానని.. కాకపోతే ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు.

12:28 - December 29, 2016

హైదరాబాద్: కాంగ్రెస్‌ సభను వాకౌట్‌ చేయడమంటే పారిపోవడమే అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సభలో మాట్లాడటం ఇష్టం లేకనే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్‌ చేశారని మండిపడ్డారు. సభను ఎన్ని రోజులైనా జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా..కాంగ్రెస్‌ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిందన్నారు. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందనీ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకే భూసేకరణ బిల్లు-2016కు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు.

12:26 - December 29, 2016

హైదరాబాద్ : బలవంతపు భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని టీజేఏసీ కన్వీనర్‌ కోదండరాం అన్నారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా తన ఇంట్లోనే దీక్షకు దిగిన కోదండరాం.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనివార్యమైతే తప్ప భూసేకరణ చేయరాదన్నారు. 2013 చట్టాన్ని అనుసరించి నిర్వాసితుల హక్కులు కాపాడాలని చెప్పారు. రేపు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు తెలిపారు.

12:22 - December 29, 2016

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయ మృతిపై మద్రాస్‌ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ఆమె మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత మృతదేహాన్ని ఎందుకు వెలికితీయకూడదని హైకోర్టు ప్రశ్నించింది. కేసును వెకేషన్‌ బెంచ్ రెగ్యూలర్‌ కోర్టుకు బదిలీ చేసింది.

12:19 - December 29, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభను తప్పుదోవపట్టిస్తున్నారని కాంగ్రెస్‌ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూసేకరణవిషయంలో సీఎం అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. భూసేకరణచట్టం-2013లో నిర్వాసితులకు ఉన్న హక్కులను సవరణచట్టంలో లేకుండా చేశారని ఉత్తమ్‌ అన్నారు. శాసనసభను ముఖయమంత్రి తన పార్టీ ప్రచారం కోసం వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సభలో సీఎం అబద్దాలు మాట్లాడుతున్నారు: ఉత్తమ్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని టీ.పీసీస చీఫ్ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వం చెబుతున్న పదింతల పరిహారం ఇవ్వడంలేదని తెలిపారు. ప్రభుత్వం మార్కెట్ రేట్ ను అప్ డేట్ చేయడం లేదని ఆరోపించారు.

జయ మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వండి: హైకోర్ట్

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయ మృతిపై మద్రాస్‌ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ఆమె మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత మృతదేహాన్ని ఎందుకు వెలికితీయకూడదని హైకోర్టు ప్రశ్నించింది.

పాడిపరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి తలసాని

హైదరాబాద్: రాష్ట్రంలో పాడిపరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్బంగా ఆయన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ పరిశ్రమపై 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, ముఖ్యంగా గొల్ల, కురుమ కులాల వారు ఇదే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారని తెలిపారు. వీరి అభివృద్ధి కోసం సీఎం అనేక కార్యక్రమాలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. విజయడైరీని బలోపేతం చేశారని పేర్కొన్నారు. ఇంకా ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పశువుల వైద్యం కోసం ప్రతి నియోజకవర్గంలో మొబైల్ వెటర్నరీ ఆస్పత్రిని ఏర్పాటు చేశామన్నారు.

11:40 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులకు, ప్రజాస్వామ్య హక్కులకు విలువలేదని.. శాసనసభలో సభ్యులకు విలువలేదని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో సీపీఎం పై విషం కక్కుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలని కోరుతూ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రాజయ్య ధర్నాకు టి.టిడిపి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజనపాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుండటంతో అక్కసుతోనే సీపీఎం పార్టీని దూషించారని విమర్శించారు. ఈ అంశంపై స్పీకర్ స్పందించడం లేదు... కేసీఆర్ వైఖరి మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సీఎం 2009 సీపీఎంతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న జేఏసీ నేతలను అరెస్టు చేయడం దారుణం అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే అవకాశం లేకుండా ప్రభుత్వం అహంకార పూరితంగా పనిచేస్తోందని, నిరసనతెలపకుండా గాంధీనీ.. అంబేద్కర్ ను కూడా తాళాలు వేసి నిర్బంధించారని ఆరోపించారు.

11:23 - December 29, 2016

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్‌ బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులు జరిపారు. షహగుంద్‌ హజిన్ గ్రామంలో సైనికులపై ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో.. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కంటిన్యూ అవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు:కోదండరాం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూనిర్వాసితుల సమస్యలపై ఐకాస ఆధ్వర్యంలో నేడు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా కు నేతల అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండలకేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని టీ.జాక్ నేత కోదండరాం పిలుపునిచ్చారు. ఉద్యమ విలువలను గౌరవించాలని, ప్రబుత్వం పట్టింపులకు పోకుండా చర్చలు జరపాలని, అభివృద్ధి పేరుతో ప్రజలను ఆగం చేసే చట్టాలకు మేం వ్యతిరేకం కాదన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు.

11:05 - December 29, 2016

అరెస్ట్ చేసిన జేఏసీ నేతలను విడుదల చేయాలి:కోదండరాం

హైదరాబాద్ : అరెస్ట్ చేసిన జేఏసీ నేతలను విడుదల చేయాలని టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. నేతల విడుదలపై అధికార సమాచారం వచ్చే వరకు నిరసన దీక్షను విరమించం అని స్పష్టం చేశారు. విచ్చలవిడిగా భూసేకరణ మంచిది కాదని, ప్రభుత్వం జీవోల ద్వారా భూసేకరణకు దిగిందని ఆరోపించారు. బలవంతపు భూసేకరణ ప్రభుత్వం ఆపాలని, అనివార్యమైతేనే భూసేకరణ చేయాలని, పార్లమెంట్ తెచ్చిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించడానికి వీల్లేదని హెచ్చరించారు.

10:51 - December 29, 2016

చెన్నై : అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ శశికళ ఎన్నికైంది. చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 23 మంది కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యేలు పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరనున్నారు.

10:43 - December 29, 2016

విజయవాడ : ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్ల తొలగింపునకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కళాశాలల ప్రిన్సిపల్స్‌ ద్వారా నోటీసులు జారీ చేస్తోంది. సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు 27రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే ఆందోళన విరమించాలని దశలవారీగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. విరమించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన విరమించకపోవడంతో తొలగింపునకు నోటీసులు జారీచేసింది.

10:42 - December 29, 2016

విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనల్లో విశాఖ జిల్లాలో ఇద్దరు.. కడప జిల్లాలో ముగ్గురు.. కర్నూలులో ముగ్గురు చనిపోయారు. విశాఖ జిల్లాలో లారీని.. స్కార్పియో వాహనం ఢీకొనగా.. కడపలో గొర్రెల మందపై లారీ దూసుకెళ్లింది.. కర్నూలులో ట్రాక్టర్‌ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదాల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆర్టీసి బస్సు బీభత్సం: ఇద్దరి మృతి

కడప : ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పులివెందుల మండలం.. తుమ్మలపల్లిలో గొర్రెల మందపైకి ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గొర్రెల కాపర్లు మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరిరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. ఈ ప్రమాదంలో వంద గొర్రెలు కూడా మృత్యవాతపడ్డాయి. చనిపోయిన గొర్రెలను రోడ్డుపై వేసి స్థానికులు ఆందోళనకు దిగారు. చీకటి.. మంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

10:41 - December 29, 2016

హైదరాబాద్ :గడువు ముగిసింది..నగదు కష్టాలు మాత్రం తీరలేదు. కేంద్ర ప్రభుత్వం 50రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పినా.. బ్యాంకులు, ఏటీఎంల ముందు సామాన్యుడి పడిగాపులు మాత్రం ఆగలేదు. రోజులతరబడి క్యూలో నిల్చుని విసుగెత్తిన జనం ధర్నాలకు దిగుతున్నారు. పింఛన్‌కోసం వృద్ధులు బ్యాంకుల ముందు నానా తిప్పలు పడుతున్నారు. బ్యాంకు తెరిచిన గంటలోపునే నోక్యాష్‌ బోర్డులు పెడుతుండటంపై ఖాతాదారులు మండిపడుతున్నారు.

10:40 - December 29, 2016

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఖైధీనెంబర్ 150 చిత్రానికి సంబంధించిన మూడవ పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. పాట రిలీజ్ కావడంతో చిరంజీవి అభిమానులు ఆ సాంగ్‌ను నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ మూడవ పాటకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ ఖుషిగా ఉంది.

10:39 - December 29, 2016

కడప: జిల్లాలోని ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పులివెందుల మండలం.. తుమ్మలపల్లిలో గొర్రెల మందపైకి ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు.. వంద గొర్రెలు చనిపోయాయి. దీంతో చనిపోయిన గొర్రెలను రోడ్డుపై వేసి స్థానికులు ఆందోళన చేపట్టారు.

10:37 - December 29, 2016

హైదరాబాద్: టీజేఏసీ కన్వీనర్ భూసేకరణ పై తన పోరాటాన్ని ఉధృతం చేశారు. భూసేకరణ పై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన నివాసంలో దీక్షకు దిగారు. దీంతో టీజేఏసీ కార్యకర్తలు కోదండరాం నివాసానికి భారీ తరలివస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూనిర్వాసితుల సమస్యలపై ఐకాస ఆధ్వర్యంలో నేడు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేపట్టనున్నారు. దీనికోసం జిల్లాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లకు తరలించినట్లు తమ దృష్టికి వచ్చిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. అరెస్ట్‌ చేసిన ఐకాస నేతలను బేషరతుగా విడుదల చేసి ధర్నాలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కోదండరామ్‌ మౌనదీక్ష చేపట్టారు.

తన నివాసంలో దీక్షచేపట్టిన కోదండరాం

హైదరాబాద్: టీజేఏసీ కన్వీనర్ భూసేకరణ పై తన పోరాటాన్ని ఉధృతం చేశారు. భూసేకరణ పై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన నివాసంలో దీక్షకు దిగారు. దీంతో టీజేఏసీ కార్యకర్తలు కోదండరాం నివాసానికి భారీ తరలివస్తున్నారు.

బందిపోర్ లో ఎన్ కౌంటర్

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ లోని బందిపోర్ లో ఎన్ కౌంటర్ జరుగుతోంది. హాయ్ జన్ ప్రాంతంలో ఓ గదిలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు కాల్పులు జరుపుతున్నాయి. ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులకు గాయాలయ్యాయి.

ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు

హైదరాబాద్ : దేశరాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకున్నది. దీంతో పైలు రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 70 రైల్లు ఆలస్యం, 13 రైళ్ల వేళల్లో మార్పులుచేయగా, 15 విమానాలను ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్ల తొలగింపుకు నోటీసులు జారీ...

హైదరాబాద్: ఏపీలో కాంట్రాక్టు లెక్చరర్ల తొలగింపునకు నోటీసులు జారీ అయ్యాయి.కళాశాలల ప్రిన్సిపల్స్ ద్వారా ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 27 రోజులుగా కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె చేస్తున్నారు.

లాయర్ రోహిత్ టాండన్

ఢిల్లీ : లాయర్ రోహిత్ టాండన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల రోహిత్ టాండన్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.14 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.రూ.4కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన కాంగ్రెస్

హైదరాబాద్: నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు స్పీకర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ లేఖ రాశారు. సభలో తమకు మైక్ ఇవ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.

సీపీఎంపై కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీపీఎం పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పీకర్ కు లేఖ ఇచ్చారు.

అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ

చెన్నై : అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ శశికళ ఎన్నికైంది. పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ఎన్నుకుంటూ తీర్మానం చేశారు.

10:18 - December 29, 2016

 

హైదరాబాద్ : పల్లెపల్లెనూ పలకరిస్తూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 73 రో జులు పూర్తి చేసుకుంది. పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపారు. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర బృందానికి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు తెచ్చే ఆలోచన మానుకోవాలని సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర లేఖ రాశారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆయన అన్నారు. నోట్ల రద్దు తర్వాత తన దగ్గరున్న పెద్దనోట్లను మార్చుకోవడానికి కేసీఆర్‌ మోదీ దగ్గరకు వెళ్లాడని తమ్మినేని దుయ్యబట్టారు.

సీపీఎం మహాజన పాదయాత్ర 73 రోజులు పూర్తి చేసుకుంది. 73వ రోజు జగిత్యాల జిల్లా రాజారం, మల్యాల ఎక్స్‌రోడ్ ముత్యంపేట, కొండగట్టు, పూడూరు, నెమలికొండ, గంగాధర గ్రామాల్లో పర్యటించింది. ఈరోజు పాదయాత్రకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చే ఆలోచన మానుకోవాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

తెలంగాణ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్త భూసేకరణ చట్టంపై చర్చకు టీడీపీ, నగరంలో రోడ్ల మరమ్మతులు, ట్రాఫిక్ జామ్,నగరంలో మురుగునీటి పారుదల, కాలుష్య నియంత్రణపై బిజెపి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

తెలంగాణ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్త భూసేకరణ చట్టంపై చర్చకు టీడీపీ, నగరంలో రోడ్ల మరమ్మతులు, ట్రాఫిక్ జామ్,నగరంలో మురుగునీటి పారుదల, కాలుష్య నియంత్రణపై బిజెపి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

07:38 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ బిల్లు-2016కు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర చట్టం ఉన్నప్పుడు ఈ బిల్లు ఎందుకన్న విపక్షాల ప్రశ్న సర్కారు చెవికెక్కలేదు. బిల్లు తెస్తే తెచ్చారు.. దానికి మేము సూచించే సవరణలైనా చేయండని చెప్పినా ఖాతరు చేయలేదు. విపక్షాల అభ్యంతరాల నడుమే మూజువాణీ ఓటుతో బిల్లును ఆమోదింప చేసుకుంది కేసీఆర్‌ సర్కారు. ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిపీసీసీ అధికార ప్రతినిధి కోశం శ్రీనివాసయాదవ్, తెలంగాణ రైతు సంఘం నేత సాగర్,

టిఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

07:17 - December 29, 2016

హైదరాబాద్ :సీపీఎంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ తీవ్రంగా మండిపడింది. రైతులను నిట్టనిలువునా దగా చేసేందుకే, తెలంగాణ భూసేకరణ చట్టాన్ని తెచ్చారంటూ పార్టీ నాయకులు విమర్శించారు. రైతుల జీవితాలను రోడ్డు పాల్జేసే భూసేకరణ బిల్లుకు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా, ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఎం పిలుపునిచ్చింది.

కేసీఆర్ వి అర్థం లేని మాటలు....

తెలంగాణ భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీపీఎంపై విరుచుకుపడడాన్ని, పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేసీఆర్‌వి అర్థం లేని మాటలని సీపీఎం నేతలు తిప్పికొట్టారు. సీపీఎం ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగానే ఆందోళనలు నిర్వహిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మల్లన్నసాగర్‌ లాఠీచార్జి, కాల్పులకు సీపీఎంని నిందించడం అవివేకమని తమ్మినేని ఆక్షేపించారు.

భూసేకరణ బిల్లుతో పాటు సీఎం విమర్శలకు వ్యతిరేకంగా....

భూసేకరణ బిల్లుతో పాటు సీఎం విమర్శలకు వ్యతిరేకంగా, గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సీపీఎం పిలుపునిచ్చింది. సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతుంటే.. సీఎం కేసీఆర్‌ ఓర్వలేక విమర్శలకు తెగబడ్డారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. మల్లన్నసాగర్‌లో జరిగిన కాల్పులకు సీపీఎం నేతలే కారణమన్న సీఎం, తగిన ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. సీఎం వీధిరౌడీలా మాట్లాడడం సరికాదన్నారు.

మల్లన్నసాగర్‌కు సీఎం ఒక్కసారైనా రాని కేసీఆర్....

తన ఫామ్‌హౌజ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని మల్లన్నసాగర్‌కు సీఎం ఒక్కసారైనా ఎందుకు వెళ్లలేదని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఉసురు తీసేందుకే తెలంగాణ భూసేకరణ బిల్లు తెచ్చారని మండిపడ్డారు.

ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక....

ప్రజల పక్షాన, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా.. సీపీఎం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం తన ధోరణి మార్చుకోకుంటే.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

07:03 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కేంద్ర భూసేకరణ చట్టాన్నితాడు, బొంగరం లేని చట్టంగా సీఎం అభివర్ణించడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. అప్పట్లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కేసీఆర్‌.. 2013 భూసేకరణ చట్టానికి మద్దతు పలికి ఇప్పుడు పనికిమాలిన చట్టం అనడంలోని ఆంతర్యం ఏంటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించారు.

వ్యతిరేకించిన టిటిడిపి...

తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టీటీడీపీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

వ్యతిరేకించిన సీపీఎం.....

తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని సీపీఎం పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. 2013 భూ సేకరణ చట్టాన్ని కాదని కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వ్యతిరేకించారు.

అధికార పార్టీ మినహా....

మొత్తంగా అధికార పార్టీ మినహా అన్నీ పార్టీలు తెలంగాణ భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించాయి. 2013 భూసేకరణ బిల్లుకు సవరణలు అని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై ఎవరికివారుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

06:59 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ ఇవాళ ఉదయం 9గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. శాసనసభలో జానారెడ్డికి మైక్‌ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. స్పీకర్‌ను కలిసి సమావేశాలను బహిష్కరించాలనే యోచన చేస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌ను కలిసి భూసేకరణ చట్టంను..ఆమోదించవద్దని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోరనున్నట్లు తెలుస్తోంది.

నేడు సీఎల్పీ అత్యవసర భేటీ

హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ ఇవాళ ఉదయం 9గంటలకు అత్యవసరంగా సమావేశం కానుంది. శాసనసభలో జానారెడ్డికి మైక్‌ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. స్పీకర్‌ను కలిసి సమావేశాలను బహిష్కరించాలనే యోచన చేస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌ను కలిసి భూసేకరణ చట్టంను..ఆమోదించవద్దని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోరనున్నట్లు తెలుస్తోంది.

06:57 - December 29, 2016

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 31 తర్వాత 5 వందలు, వెయ్యి నోట్లు కలిగి ఉండేవారిపై కఠినమైన చర్యలు తప్పవు. విచారణతో పాటు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం...

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోది అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన కొత్త ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునే గడువు డిసెంబర్‌ 30తో ముగుస్తుంది. దీని తర్వాత కూడా అంటే ప్రత్యేక పరిస్థితుల్లో రద్దయిన పెద్ద నోట్లను ఆర్బీఐలో జమ చేసుకునేందుకు మార్చి 31, 2017 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. అప్పటికి కూడా బ్యాంకులో జమ చేయకుండా 5 వందలు, 1000 నోట్లు కలిగి ఉంటే మాత్రం విచారణ ఎదుర్కోక తప్పదు.

మార్చి 31 తర్వాత...

మార్చి 31 తర్వాత పది అంతకన్నా ఎక్కువ రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉంటే విచారణతో పాటు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 5 వందలు, వెయ్యి పాత నోట్లు పది ఉంటే ఐదింతలు అంటే 50 వేలు జరిమానా విధిస్తారు. వీటికి సంబంధించి స్థానిక కోర్టుల్లో విచారణ జరుగుతుంది.

బ్యాంకుల ముందు క్యూకట్టిన జనం...

నవంబర్‌ 8న 5 వందలు, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. డిసెంబర్‌ 13 నాటికి 12.44 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు ఆర్బీఐ పేర్కొంది. నవంబర్‌ 8కి ముందు 15.44 లక్షల కోట్ల పెద్ద నోట్ల నగదు చలామణిలో ఉండేది.

06:53 - December 29, 2016

సంగారెడ్డి : మళ్లీ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ లూటీ జరిగింది...ఇది జరగడం రెండోసారి... సంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ చోరీ కలకలం రేపుతోంది..సీబీఐ ఆఫీసర్లమంటూ వచ్చి తనిఖీలు చేస్తున్నట్లు చేస్తూనే లాకర్లలో కిలోల కొద్దీ బంగారాన్ని దోచుకెళ్లారు... అడ్డుకున్న సిబ్బందిపై మారణాయుధాలు గురిపెట్టి బెదిరించారు.. ఐదుగురు ఐదు నిమిషాల్లోనే మొత్తం లూటీ చేసి వెళ్లడం వెనక ఉన్న గ్యాంగ్‌ ఎక్కడిది..???

క్షణాల్లో పనిపూర్తి చేసిన దుండగులు .....

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ ఎత్తున లూటీ జరిగింది...అంతా క్షణాల్లో పనిపూర్తి చేసిన దుండగులు కిలోల కొద్దీ బంగారాన్ని ఎత్తుకెళ్లారు...ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ఐదుగురు వస్తూనే సీబీఐ ఆఫీసర్స్‌ మంటూ చెప్పారు..దీంతో ఒక్కసారి ఖంగుతిన్న కార్యాలయం సిబ్బంది వారు చెప్పినట్లు రికార్డులు చూపించారు..ఆ తర్వాత లాకర్లు ఓపెన్ చేయాలన్నారు...అందుకు వారు నిరాకరిస్తే అదిరించారు.. సీబీఐ వస్తే చూపించరా అంటూ హుంకరించడంతో వెంటనే లాకర్లను తెరిచారు...

తనిఖీలు చేస్తున్నట్లుగా డ్రామా..

లాకర్లు తెరిచి బంగారాన్ని సంచుల్లో వేసుకుంటుండటాన్ని సిబ్బంది గమనించి ప్రశ్నించారు. దీంతో ఆయుధాలతో వారిని బెదిరించి బాత్‌రూమ్‌లోకి నెట్టి గడియపెట్టారు. అనంతరం లాకర్లలో ఉన్న 46 కిలోల బంగారాన్ని సంచుల్లో నింపుకుని అక్కడి నుంచి పరారయ్యారు...దుండగులు వెళ్తూ వెళ్తూ తమ జాడ తెలియకుండా తెలివిగా కార్యాలయంలోని సీసీ కెమెరా పుటేజీని కూడా తమ వెంట తీసుకెళ్లారు...

దోపిడీకి గురైన బంగారం విలువ 12కోట్లు....

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు....దోపిడీకి గురైన బంగారం విలువ 12కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు..భారీగా లూటీ చేసిన గ్యాంగ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు నగరంలోని ప్రతీ చోటా ఉన్న సీసీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు...చాకచక్యంగా వచ్చిన వారు దోచుకుని పోయిన తీరుచూసి సిబ్బంది తేరుకోలేకపోతున్నారు..గతంలో కూడా ఇలానే దోపిడీ జరిగింది.. రెండో సారి జరగడం వెనక అసలు కథేంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది...

పోలీసుల తనిఖీలు ముమ్మరం ......

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జహీరాబాద్‌తో పాటు తెలంగాణ-కర్ణాటక సరిహద్దు కూడలి గంగ్వార్‌ వద్ద అంతర్రాష్ట్ర రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌-ముంబయి, బీదర్‌-జహీరాబాద్‌ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు...అయితే ఈ దోపిడీ చేసింది లోకల్ గ్యాంగ్ కాదని...పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినట్లు అనుమానిస్తు ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం కోసం సమాచారం అందించారు,...

06:52 - December 29, 2016

హైదరాబాద్ : ప్రతి ఏడాది సంక్రాంతికి హైదరాబాద్‌లో నిర్వహించే పతంగుల పండుగ ఈ ఏడాది మరింత శోభాయానంగా జరగనుంది. ఆగాఖాన్ ఫౌండేషన్ మరియు తెలంగాణ టూరిజం శాఖ కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ఈ ఫెస్టివల్‌లో 40 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో అత్యంతం అద్భుతంగా పతంగుల పండుగ జరుగుతుంది. దీని కంటే గొప్పగా పండుగ నిర్వహించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయంగా కైట్ ప్లేయర్స్‌తో పాటు హైదరాబాద్‌లో 10 స్కూళ్లలో కూడా పతంగుల పండుగ చేయనున్నారు.

4 రోజుల పాటు జరగనున్న కైట్ ఫెస్టివల్....

హైదరాబాద్‌లో ఈ కైట్ ఫెస్టివల్ నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కైట్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమాన్ని జనవరి 17 న వరంగల్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇదే స్ధాయిలో వరంగల్‌లో కూడా పతంగుల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో టూరిజంను అభివృద్ధి చేయడంలో భాగంగా ఆగాఖాన్ ఫౌండేషన్, తెలంగాణ టూరిజం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

జనవరి 14 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ డ్యాన్స్ ఫెస్టివల్ .....

పతంగుల పండుగతో పాటుగా వచ్చే నెల 14 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ డ్యాన్స్ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఏషియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనిట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శిల్పారామంలో జరగనుంది. వివిధ దేశాలు వారి సాంప్రదాయ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తాయి. అంతర్జాతీయ డ్యాన్స్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ టూరిజం శాఖ చేస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి నాలుగు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్టివల్స్ అలరించనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ అన్ని ఏర్పాట్లు చేయనుంది.

06:50 - December 29, 2016

హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళికి సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే రాజకీయ పార్టీలు, నేతలపై కఠినచర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

5 రాష్ట్రాల్లో వచ్చే వేసవిలో ఎన్నికలు ....

ఎన్నికల కమిషన్ వచ్చే వేసవికాలంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పాటించాలని గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు..ఈసీ

ఎన్నికల నియమావళిని ప్రకటించిన 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల గోడలపై వాల్‌పోస్టర్లను, హోర్డింగ్‌లను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్, విమానాశ్రయాలు, ప్రభుత్వ బస్సులు, స్థానిక సంస్థల భనాలు ప్రభుత్వ ఆస్తులపై అంటించిన వాల్‌పోస్టర్లు, హోర్డింగ్‌లు, జెండాలు, బ్యానర్లను నియమావళిని ప్రకటించిన 48 గంటల్లో తొలగించాలని నిర్దేశించింది. ప్రైవేటు ఆస్తులను ప్రచారానికి వినియోగించే విషయంలో ఎన్నికల ప్రకటన విడుదల చేసిన 72 గంటల్లో తొలగించాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు కానీ ప్రత్యక్ష పాత్ర పోషించే వ్యక్తులు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించేందుకు వీల్లేదని ఈ నిబంధనను సమర్థవంతగా అమలుచేయాలని ఎలక్ట్రోరల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మీడియాలో ప్రచారాలను నిలిపివేయాలి- ఈసీ

ఎన్నికల ప్రకటన విడుదల చేసిన అనంతరం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ఎన్నికల ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పథకాలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ నేతల ఫోటోలు, పార్టీ వివరాలను తొలగించాలని పేర్కొంది. వీటికి అదనంగా ప్రభుత్వం రంగ సంస్థల భవనాల ప్రాంగణాల్లోనూ రాజకీయ పార్టీల హోర్డింగ్‌లు, గోడపత్రికలు జెండాలు ఎగరేసేందుకు వీలులేదని ఈసీ ఆదేశాలు జారీచేసింది.

చర్యలు తీసుకోవాలని ఈ సీ ఆదేశాలు...

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించేవిధంగా 5 రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఈ సీ ఆదేశాలు జారీచేసింది. మరి రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన సూచనలను ఎంతమేరకు పాటిస్తాయో వేచి చూడాలి.

06:41 - December 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యమం తీవ్రమవుతోంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలలో పనిచేస్తున్న అధ్యాపకులను క్రమబద్దీకరించాలంటూ 27 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా అండగా కదిలారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ కాంట్రాక్ట్ లెక్చరర్లకు మద్దతుగా నిరాహార దీక్ష దిగారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరాహార దీక్షలు చేపట్టడానికి దారితీసిన పరిస్థితులపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేత గాంధీగారు విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఆయన ఏఏ అంశాలను ప్రస్థావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

 

లారీని ఢీకొన్న కారు: మహిళ మృతి

రంగారెడ్డి: హయత్‌నగర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-కారు ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం ఆందోళన

హైదరాబాద్ : అసెంబ్లీలో సీపీఎంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఆ పార్టీ పిలుపు ఇచ్చింది. కేసీఆర్‌ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సీపీఎం ఎప్పుడు ప్రజాస్వామ్య, శాంతియుతంగానే.. పోరాటాలు చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మల్లన్నసాగర్‌ లాఠీఛార్జి, కాల్పులకు సీపీఎంను నిందించడం అవివేకమన్నారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరి గొర్రెలకాపురులు మృతి

కడప:పులివెందుల మండలం తుమ్మలపల్లిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గొర్రెల మందపైకి ఆర్టీసి బస్సు దూసుకెళ్లడంతో వందకు పైగా గొర్రెలు, ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు.

Don't Miss