Activities calendar

30 December 2016

21:57 - December 30, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో సాధారణ లావాదేవీలు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని పార్టీ పోలిట్‌ బ్యూరో కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నగదు లావాదేవీల్లో చిన్న, మధ్య తరగతి సంస్థలను ట్యాక్స్‌ల నుంచి మినహాయించాలని కోరింది. కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో లావాదేవీలపై ఉన్న నిబంధనలను తొలగించాలని కేంద్రానికి సూచించింది.

21:51 - December 30, 2016

ఢిల్లీ : డిజిటల్‌ లావాదేవీలను ప్రొత్సహించేందుకే లక్కీ డ్రా పథకాలు ప్రవేశ పెట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలో డిజీ ధన్‌ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. భీమ్‌ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు. రాబోయే రోజుల్లో డిజిటల్‌ లావాదేవీలకు ఇంటర్నెట్‌ అవసరం ఉండదని.. కేవలం వేలిముద్ర ద్వారానే లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. అంబేద్కర్‌ జయంతి రోజున మెగా లక్కీ డ్రా తీయనున్నట్లు వెల్లడించారు.

21:48 - December 30, 2016

ఢిల్లీ : ఎలాంటి వివరణ లేకుండా పాత నోట్ల డిపాజిట్‌కు చివరితేదీ ముగిసింది... అలాగే ప్రధాని మోదీ అడిగిన యాభైరోజుల గడువుకూడా పూర్తయింది.. ఈ రెండు డెడ్‌లైన్‌లు ముగిశాక... ఆర్బీఐ ముందు రద్దీ పెరగనుంది. 

రద్దయిన నోట్ల డిపాజిట్‌కు డిసెంబర్‌ 30 చివరితేదీ
దేశవ్యాప్తంగా పాతనోట్ల డిపాజిట్‌కు ఆఖరిరోజు కావడంతో... బ్యాంకులతో పాటు ఆర్బీఐ కార్యాలయాలు కిటకిటలాడాయి. రద్దయిన 500, వెయ్యి రూపాయల నోట్లను డిపాజిట్‌ చేసే కస్టమర్లతో రద్దీ కనిపించింది. ఎటువంటి వివరణ లేకుండా రద్దయిన నోట్ల డిపాజిట్‌కు డిసెంబర్‌ 30 చివరితేదీ కావడంతో రద్దీ పెరిగింది.. భారీగా ఖాతాదారులు తరలిరావడంతో వివిధ ప్రదేశాల్లో తోపులాటకూడా జరిగింది.. భద్రత పెంచినా చాలాచోట్ల జనాలు ఇబ్బందిపడ్డారు..

సైన్యంలో పనిచేసేవారు, విదేశాల్లో ఉంటున్నవారికి మార్చి 31వరకూ గడువు
అయితే సైన్యంలో పనిచేసేవారు, విదేశాల్లో ఉంటున్నవారు నోట్లు మార్చుకునేందుకు మార్చి 31వరకూ గడువు ఉంది.. అప్పటిలోగా ఆర్‌బీఐ కార్యాలయాల్లో డబ్బు జమ చేసుకోవాలి.... ఇతరులు కూడా డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉన్నా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది... 50రోజుల సమయం ఇచ్చినా ఎందుకు డబ్బు జమ చేయలేదన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.. అలాగే ఆ డబ్బు ఎక్కడిదోకూడా చెప్పాలి.. ఈ సమాధానాలపై అధికారులు ఏమాత్రం సందేహం వచ్చినా ఆ ఖాతాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.. ఇప్పటికే ఈడీ, ఐటీ అధికారులు బ్యాంకులపై నిఘా పెట్టారు.. పెద్దమొత్తంలో డబ్బు డిపాజిట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు..

బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల ముందు రద్దీ
ఇక పాతనోట్ల పరిస్థితి ఇలాఉంటే... సామాన్యుల నగదు కష్టాలు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి... నగదు కష్టాలకు ప్రధానిమోదీ డిసెంబర్‌ 30 డెడ్‌లైన్‌గా ప్రకటించారు.. అయినా బ్యాంకులు, ఏటీఎంలముందు జనాల క్యూలు అలాగేఉన్నాయి.. నిత్యావసరాలకు డబ్బు దొరక్క అవస్థలు పడుతున్నారు.. ఏటీఎంలముందు అవుట్‌ఆఫ్ సర్వీస్‌ బోర్డులే ఇంకా దర్శనమిస్తున్నాయి.. బ్యాంకులు వారానికి 24వేలు ఇస్తాయని కేంద్రం చెబుతున్నా ఆ హామీ అమలుకావడం లేదు.

డిసెంబర్‌ 31న మాట్లాడే అవకాశం
నోట్ల రద్దు తర్వాత ఈ నిర్ణయంపై చాలాసార్లు మాట్లాడిన మోదీ... మరోసారి ఇదే విషయంపై ప్రజలముందుకు రాబోతున్నారు. ఈ నెల 31న రాత్రి ఏడున్నర గంటలకు పీఎం ప్రసంగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.. యాభైరోజుల గడువు పూర్తయ్యాక ఈ విషయంపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.. 

21:47 - December 30, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వారం రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వివిధ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..సీఎం కేసీఆర్‌, గవర్నర్ నరసింహన్‌ దంపతులు, ప్రముకులు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి ఫోటోలు దిగారు. 

21:37 - December 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జనవరి 11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో స్పీకర్‌ మధుసూదనాచారి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలకే పరిమితమయింది. ఆ తర్వాత సభను జనవరి 3వ తేదీవరకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.
కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ జీతాలను 50శాతం మేర పెంపు : కడియం
హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి, తాగునీటి సరఫరా, మత్య్సశాఖ, విద్యా, వైద్యం, పరిశ్రమలు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమస్యలపై విపక్ష సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ..రాష్ట్రంలో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఇటీవలే కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ జీతాలను 50శాతం మేర పెంచుతూ జీవో విడుదల చేశామన్నారు.

గ్రానైట్‌, సోలార్‌ పరిశ్రమలపై తగిన రాయితీలు : కేటీఆర్
ఆ తర్వాత గ్రానైట్‌.. సోలార్‌ పరిశ్రమలపై విపక్ష సభ్యలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. గ్రానైట్‌, సోలార్‌ పరిశ్రమలపై తగిన రాయితీలందించి.. ప్రోత్సహిస్తామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని.. దానికోసం అనేక రాయితీలు అందిస్తామన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమల విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి..వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

చేపల మార్కెట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం: తలసాని

ఆ తర్వాత మత్స్యశాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సుధీర్ఘంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా చేపల మార్కెట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చేపల మార్కెట్లకు కావాల్సన స్థలాలను ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ..అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. విపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం అడ్డుపడుతోందని ఆరోపించారు. ఐకేపీ ఉద్యోగులకు కనీసవేతనంగా నెలకు 10వేలు ఇవ్వాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు. గత 4నెలలుగా ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

జనవరి 3, 4, 5, 6, 9, 11 తేదీల్లో సభా సమావేశాలు
ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను జనవరి 3వ తేదీవరకు వాయిదా వేస్తూ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. అంతకు ముందు ఉదయం స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను జనవరి 11వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రతిపక్ష సభ్యులు జానారెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, కిషన్‌రెడ్డి, సున్నం రాజయ్య హాజరై సభా సమావేశాలపై చర్చించారు. జనవరి 3, 4, 5, 6, 9, 11 తేదీల్లో సభా సమావేశాలు నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6 వరకు సభలో చర్చించాల్సిన అంశాలను మొదటగా ఖరారు చేశారు. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధి అంశం, 4న బోధన రుసుములపై, 5న సింగరేణి, 6వ తేదీన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులపై చర్చను చేపట్టనున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతిపాద‌న‌ల‌కు సానుకూల‌తతో తిరిగి స‌భ‌కు హాజ‌రు

వ‌రుస‌గా రెండో రోజు కూడా కాంగ్రెస్ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్కరించింది. నేరుగా బీఏసి స‌మావేశానికి వెళ్ళిన కాంగ్రెస్ స‌భ్యులు.. స‌భా నిర్వాహ‌ణ‌పై స‌ర్కార్‌ను నిల‌దీశారు. స‌భ‌లో ప్రతిప‌క్షాల‌కు అవ‌కాశం ఇస్తామంటేనే స‌భ‌కు హాజ‌ర‌వుతామ‌ని తేల్చి చెప్పారు. దీంతో అటు స్పీక‌ర్, ఇటు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతిపాద‌న‌ల‌కు సానుకూల‌త వ్యక్తం చేయ‌డంతో తిరిగి స‌భ‌కు హాజ‌రయ్యారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని బ‌హిష్కరించిన కాంగ్రెస్
అసెంబ్లీ స‌మావేశాల నిర్వాహ‌ణ‌పై గ‌రం గ‌రంగా ఉన్న కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం..శుక్రవారం కూడా అదే నిర‌స‌న‌ల ప‌ర్వం కొన‌సాగించింది. శుక్రవారం ఉద‌యం భేటి అయిన సీఎల్పీ వ‌రుస‌గా రెండో రోజు కూడా స‌భ‌కు హాజ‌రుకాకూడ‌ద‌ని నిర్ణయించింది. స‌భ‌లో జ‌రుగుతున్న వ్యవహారంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌,.ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని బ‌హిష్కరించి నేరుగా బీఏసి స‌మావేశానికి హాజ‌రైంది.

ప్రశ్నోత్తరాల స‌మ‌యం ముగియ‌గానే స్పీక‌ర్ బీఏసి స‌మావేశాన్ని ఏర్పాటు
ఉద‌యం ప్రశ్నోత్తరాల స‌మ‌యం ముగియ‌గానే స్పీక‌ర్ బీఏసి స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క హాజ‌రయ్యారు. ఈ భేటిలో స‌భ ఏక‌ప‌క్షంగా జ‌రుగుతున్న తీరుపై అటు ముఖ్యమంత్రి, ఇటు సభాప‌తిల‌పై త‌మ అభ్యంత‌రాల‌ను వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేక‌ర‌ణ చ‌ట్టం తాడుబొంగురం లేనిదంటూ సీఎం కేసిఆర్ గురువారం స‌భ‌లో చేసి వ్యాఖ్యలపై బీఏసిలో కాంగ్రెస్ లేవ‌నెత్తింది. సీఎం మాట్లాడిన భాష అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌న్నారు. ఇక శాస‌న‌స‌భా వ్యవహారాల మంత్రిగా ఉన్న హ‌రీశ్ రావు,.స‌భ‌ను స‌మ‌న్వయపర్చాల్సిందిపోయి,..ప్రతిప‌క్ష స‌భ్యుల‌ను రెచ్చగొట్టేలా మాట్లాడ‌టం ఏంట‌ని కాంగ్రెస్ నిల‌దీసింది. స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలో టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియా స‌మావేశాలు పెట్టడంపై జానారెడ్డి అభ్యంత‌రం వ్యక్తం చేయ‌గా ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఏకపక్షంగా జరుగుతున్న తీరుపై నిలదీత
అయితే కాంగ్రెస్ ప్రతిపాదించిన ప‌లు అంశాల‌కు అధికార పార్టీ సానుకూలంగా స్పందించింది. ప్రతిపక్ష పార్టీలు సభలో నిరసన తెలిపేందుకు సైతం అవకాశం ఇవ్వడంలేదన్న అంశాన్ని కాంగ్రెస్‌తో పాటు మిగ‌తా ప‌క్షాలు బీఏసీలో లేవనెత్తాయి. ఇందుకు సీఎం కేసీఆర్ స్పందిస్తూ..సభలో నిరసన తెలపడం పార్టీల హక్కు..దాన్ని ఎవరు కాదనలేరని..ఖచ్చితంగా విపక్ష పార్టీలకు నిరసన తెలిపే అవకాశం ఇస్తామన్నారు. ప్రతిప‌క్షాల అభ్యర్థనమేరకు అసెంబ్లీ స‌మావేశాల‌ను జ‌న‌వ‌రి 3 నుండి 11 వ‌ర‌కు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. 3వ తేదీనుండి 6వ తేది వ‌ర‌కు ఎజెండాను ఖ‌రారు చేసింది బీఏసీ. దీనిలో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్, సింగ‌రేణి ఓప‌న్ కాస్టింగ్‌, ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజ‌ర్వేష‌న్లపై చ‌ర్చించ‌నున్నారు. తిరిగి 6వ తేదీన మ‌రోసారి బీఏసీ స‌మావేశం కానుంది.

నిరసన తెలిపే అవకాశం ఇస్తామన్న కేసీఆర్
ఇక బీఏసీ స‌మావేశంలో సీఎల్పీనేత జానా రెడ్డి వేసుకున్న హాఫ్ షర్ట్‌పై ఆసక్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. ఆఫ్ ష‌ర్ట్‌లో జానా రెడ్డిగారు చాలా యంగ్‌గా కన్పిస్తున్నారని..సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన జానారెడ్డి ఈ మ‌ధ్య మోదీపై అభిమానం చూపిస్తున్నారు క‌దా.. అందుకే నేను కూడా అలాంటి ష‌ర్ట్ వేసుకున్నాన‌ని అన‌డంతో స‌మావేశంలో న‌వ్వులు విర‌పూశాయి. మొత్తానికి హాట్ హాట్ గా మొద‌లైన బీఏసీ మీటింగ్ నేత‌ల న‌వ్వుల‌తో ముగిసింది. 

యూపీ మ్యాజిక్ ఫిగర్ 202..

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలున్నాయి. సమాజ్ వాద్ పార్టీకి వున్న బలం 229 స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ 202 కాగా బీఎస్పీ బలం 80, బీజేపీ 41,కాంగ్రెస్ 29 గా ఉన్నాయి. 

అర్థరాత్రి నుండి క్యాబ్ సేవలు బంద్..

హైదరాబాద్ : శుక్రవారం అర్థరాత్రి నుంచి ఓలా-ఉబెర్ క్యాబ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఓలా- ఉబర్ ప్రైవేటు వాహనాల సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించక పోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి జనవరి 4వ తేదీ వరకు క్యాబ్ లు నిలిచిపోనున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు తెలిపారు. బంద్ ను విరమించాలంటే ఓలా, ఉబెర్ క్యాబ్ లు అమలుచేస్తున్న షేర్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ఓయూ పీహెచ్ బీ నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ అర్హత పరీక్ష నోటిఫికేషన్-2016 విడుదలైంది. జనవరి 9 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ అధికారులు తెలిపారు. 2014-15, 2015-16, 2016-17 అకాడమిక్ ఇయర్‌లో పీజీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అర్హులు. ఓసీ, బీసీ అభ్యర్థులకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం మార్కులు వస్తే పీహెచ్‌డీ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు WWW.OSMANIA.AC.IN వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

పార్టీని కాపాడుకోవటం నా బాధ్యత: ములాయం

ఉత్తరప్రదేశ్ : లక్నోలోని సమాజ్ వాద్ పార్టీ కార్యాలయం వద్ద హై డ్రామా చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో పాటు రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుండి ఆరేళ్ళ పాటు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సస్పెండ్ చేశారు. అఖిలేశ్ అభిమానులు పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేసుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవటమే తన బాధ్యతనీ..కొత్త సీఎం అభ్యర్థి పేరుతో త్వరలో ప్రకటిస్తానని ములాయం పేర్కొన్నారు. ఆదివారం నాడు పార్టీ సమావేశం అవుతుందని తెలిపారు.

పాక్ కాల్పుల్లో బాలుడు మృతి..

జమ్మూకశ్మీర్ : పాకిస్థాన్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. పూంఛ్ సెక్టార్‌లో భారత బలగాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పులకు పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధం: రామ్ గోపాల్

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీ నుంచి యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, పార్టీ సీనియర్‌ నేత రాంగోపాల్‌ యాదవ్‌లను ఆ పార్టీ అధినేత ములాయంసింగ్‌ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై రామ్‌గోపాల్‌ యాదవ్‌ స్పందించారు. షోకాజ్‌ నోటీసులు జారీచేసిన గంటల వ్యవధిలోనే పార్టీనుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. షోకాజ్‌ నోటీలపై తమ సమాధానాలు సైతం వినకుండా ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.

వ్యాపారి సుశీల్ కుమార్ ఆస్తులు జప్తు..

హైదరాబాద్ : నగరంలో బడా వ్యాపారి సుశీల్ కుమార్ కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సుశీల్ కుమార్ కు చెందిన రూ.70లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఫోర్జరీ పట్టాలతో భూములు విక్రయించినట్లుగా సుశీల్ కుమార్ పై అభియోగం వుంది. దీంతో మనీ లాండరింగ్ కేసు కూడా ఈడీ నమోదు చేసింది. 

మోదీకి సీపీఎం 16 డిమాండ్స్..!

ఢిల్లీ : సీపీఎం పోలిట్ బ్యూరో ప్రధాని నరేంద్ర మోదీకి 16 ప్రశ్నలతో కూడిన డిమాండ్స్ ను  సంధించింది. డిసెంబర్ 30 గడువు ముగిసినందున బ్యాంకుల్లో విత్ డ్రాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.

కాలువలో పడ్డ బస్..9మంది మృతి..

ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతాపూర్ సమీపంలోని శారదా కాలువలో ఓ బస్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందారు. మరో 10మందికి గాయాలయ్యాయి.

19:22 - December 30, 2016
19:16 - December 30, 2016

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీలో ముసలం ముదిరింది. తండ్రీ కుమారుల మధ్య పోరు ముదిరి పాకాన పడింది. సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు రాంగోపాల్ యాదవ్ పై ములాయం సింగ్ యాదవ్ వేటు వేశారు. ఇద్దరినీ ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లుగా ములాయం సింగ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడుతున్నారంటూ ములాయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఆదివారం నాడు పార్టీ నేతలతో అఖిలేష్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అఖిలేశ్ మద్ధతుదారులంతా ములాయం సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అఖిలేశ్ పై పడిన వేటుతో పార్టీ చీలిపోయే వాతావరణ కనిపిస్తోంది. దీంతో అఖిలేష్ వేరు కుంపటి పెట్టే యోచనకూడా లేకపోలేదు. కాగా బాబాయ్ శివపాల్ యాదవ్ కు అఖిలేష్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తిపై సస్పెండ్ వేటు పడటం గమన్హాం.ఈ ప్రభావం యూపీ ఎన్నికల్లో పడే అవకాశాలు కూడా లేకపోలేదు. బీజేపీ వంటి పార్టీలకు ఇది అనుకూల వాతావరణంగా కనిపిస్తోంది. త కొన్నాళ్లుగా సమాజ్ వాద్ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతేన్న నేపథ్యంలో తండ్రీ కొడుకులు ఉప్పు నిప్పులాగా వ్యవహరిస్తున్నారు. తమ్ముడి శివపాల్ యాదవ్ ను వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి పదవిలో వున్న అఖిలేశ్ ను సస్పెండ్ చేయటం ములాయం మూర్ఖత్వానికి నిదర్శనంగా కనిపిస్తోందనీ..అఖిలేష్ యాదవ్ మూర్ఖత్వపు ధోరణితో వ్యవహారంతో బీజేపీకి అనుకూల వాతావరణాన్నికల్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో వున్న అఖిలేశ్ యాదవ్ పై సస్పెండ్ వేటు పడటం పట్ల విస్మయాన్ని కలిగిస్తోంది. 

సమాజ్ వాద్ లో ముదిరిన పోరు..

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీలో ముసలం ముదిరింది. తండ్రీ కుమారుల మధ్య పోరు ముదిరి పాకాన పడింది. సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు రాంగోపాల్ యాదవ్ పై ములాయం సింగ్ యాదవ్ వేటు వేశారు. ఇద్దరినీ ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లుగా ములాయం సింగ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడుతున్నారంటూ ములాయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. 

19:02 - December 30, 2016

పశ్చిమగోదావరి : 70 ఏళ్ల ఆంధ్రుల కలకు మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా భావిస్తున్న ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు శంకుస్థాపన చేయడం తన పూర్వ జన్మసుకృతమని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వేద పండితుల మత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు ఏపీ చంద్రబాబు శ్రీకారం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు ఏపీ చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాబు శంకుస్థాపన చేశారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల ప్రారంభంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం కీలక దశలోకి అడుగుపెట్టింది. 52 బ్లాకులుగా స్పిల్‌వే నిర్మాణం జరగనుంది.

నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నా : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టులో స్పీల్‌ వే కాంక్రీట్‌కు శంకుస్థాపన చేయడం తన పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి అయ్యే వరకు ప్రజలందరూ ప్రార్ధనలు చేయాలని బాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో కరువే ఉండదని బాబు స్పష్టం చేశారు.

2019లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం
పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నామని చంద్రబాబు అన్నారు. 2019లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నేరుగా నీళ్లు వెళ్తాయని చెప్పారు.

నాబార్డు నుంచి సుమారు 2 వేల కోట్ల రూపాయల రుణం
విభజన చట్టం ద్వారా జాతీయ హోదా పోందిన పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి సుమారు 2 వేల కోట్ల రూపాయల రుణం అందింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

 

18:52 - December 30, 2016

హీరో నారా రోహిత్ సినిమాలు వరుసగా చేసేస్తున్నాడు. ఇటీవలే విడుదల అయిన జ్యో అచ్యుతానంద, శంకర చిత్రాలతో అలరించిన రోహిత్ ఇప్పుడు 'అప్పట్లో ఒకడుండేవాడు ' చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు. నారా రోహిత్, విష్ణు, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు రాని భిన్నమైన తరహా పాయింట్‌ ను టచ్ చేసినట్లుగా తెలుస్తోంది. నారా రోహిత్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తే, శ్రీ విష్ణు క్రికెటర్‌ పాత్రలో నటించారు. 'ప్రతినిధి' తర్వాత ఇద్దరూ కలిసి నటించిన చిత్రమిది. సాయికార్తీక్‌ అందించిన పాటలకు ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హైద్రాబాద్‍లోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన నిజ జీవిత వ్యక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేరణగా తీసుకొని రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మాజీకి చక్కటి నటనను ప్రదర్శించాడు. అయ్యారే చిత్రంతో ప్రశంసలను అందుకున్న దర్శకుడు సాగర్.కె. చంద్ర ద్వితీయ ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం అప్పట్లో ఒక్కడుండేవాడు. మూసధోరణికి భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేసే నారా రోహిత్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? అనే విషయం తెలుసుకోవాలన్నా..ఈ సినిమాకు 10టీవీ ఇచ్చిన రేటింగ్ తెలియాలన్నా వీడియో చూడాల్సిందే..

17:56 - December 30, 2016

జగిత్యాల: జిల్లా కేంద్రంలో టెన్‌టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. నాలుగు సంవత్సరాల వార్షికోత్సవ క్యాలేండర్‌ను జిల్లా ఎస్పీ అనంత్‌శర్మ ఆవిష్కరించారు. టెన్‌టీవీ మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

17:52 - December 30, 2016

భూపాలపల్లి : తెలంగాణ - మహారాష్ట్రలను కలిపే కాళేశ్వరం- సిరోంచ వారథి ప్రారంభమైంది. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ముఖ్య అతిధిగా హాజరై.... గోదావరిపై వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి అశోక్ నేతేతో పాటు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్దనున్న గోదావరి నదిపై 1620 మీటర్ల పొడవున్న ఈ వంతన నిర్మాణంతో... రెండు రాష్ర్టాల మధ్య రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి.

 

17:42 - December 30, 2016
17:40 - December 30, 2016
17:39 - December 30, 2016

హైదరాబాద్ : వామపక్షాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వామపక్షాలపట్ల కేసీఆర్ దిగజారుడు మాటలు ఆయన అహకార ధోరణికి నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చటం పార్లమెంట్ ను అవమానించటమేనన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది రైతుల ఆమోదం పొందాల్సివుందన్నారు. ఆనాడు పార్లమెంట్ లో సభ్యుడిగా వుండి ఈ చట్టాన్ని ఆమోదించిన వ్యక్తి ఈనాడు దాన్ని వ్యతిరేకించటం పట్ల ఆయన ధోరణి సరైంది కాదన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించటం అంటే ప్రజల పక్షం నుండి పెట్టుబడుదారి పక్షానికి కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని సురవరం విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో వుండి బాధ్యతారహితంగా వ్యవహరించటం..వ్యాఖ్యానించటం కేసీఆర్ అహంకారానికి ప్రతీకారపూరిత ధోరణికి ప్రతీకనీ.. సీపీఎం పట్ల చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ నిరంకుశత్వానికి..అజ్ఞానానికి నిదర్శనమని ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని దిక్కుమాలిన చట్టంగా సంభోదించటం పట్ల కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ లో రాజ్యాంగ బద్దంగా చేసిన చట్టం పట్ల కేసీఆర్ వ్యాఖ్యలు అహకారాన్ని తెలియజేస్తోందన్నారు. 

17:37 - December 30, 2016

విజయవాడ : ప్రజాధనాన్ని మింగేసిన గంటాను మంత్రిగా ఎలా కొనసాగిస్తారని... సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.. బ్యాంకులదగ్గర అప్పులు తీసుకొని తిరిగి చెల్లించని వ్యక్తికి మంత్రిగా ఉండే అర్హతలేదని మండిపడ్డారు.. తన పాలనలో అవినీతి, అక్రమాలకు తావులేదన్న చంద్రబాబు.. గంటా విషయంలో స్పందించడం లేదని విమర్శించారు.. గంటాను వెంటనే మంత్రిపదవినుంచి తొలగించాలని మధు డిమాండ్ చేశారు. కాగా విశాఖలో గంటా శ్రీనివాసరావు డైరెక్టర్ గా వున్న ప్రత్యూష కంపెనీ ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. 141 కోట్ల 68 లక్షల రూపాయలు బకాయి పడటంతో ఆస్తులను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 

రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం

హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి వారం రోజుల క్రితం నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.

16:50 - December 30, 2016

హైదరాబాద్ : డిసెంబర్ నాటికి నోట్ల సమస్యలు తీరుతాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పినా...ఇప్పటికీ ఏమాత్రం పరిస్థితి మారలేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కొంతమంది స్వార్థం కోసం... 120కోట్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. నోట్ల రద్దుపై జనవరి నెలలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు. 

16:47 - December 30, 2016

కడప : గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. గ్రామాల్లోకి నీరు చేరే కొద్ది వారిలో ఆందోళన తీవ్రతరమైంది. పరిహారం కోసం గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులు రోడ్డెక్కారు.

రొడ్డెక్కిన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులు
గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం కోసం ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు పరిహారంపై హమీ ఇవ్వడంతో అప్పటి తమ ఆందోళనను విరమించారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. దీంతో మళ్లీ నిర్వాసితులు రోడ్డెక్కారు.

నిర్వాసితుల ఆందోళకు సంఘీభావం తెలిపిన మధు
గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల ఆందోళనకు సీపీఎం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు సంఘీబావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

నిర్వాసితులకు రూ. 490 కోట్లు మంజూరు
నిర్వాసితులకు 490 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది. 26.84 టీఎంసీలు నీటి సామర్థ్యం గల గండికోట రిజర్వాయర్ పూర్తయితే 22 గ్రామాలకు ముంపునకు గురవుతున్నాయి. సమీపకాలంలో ఈమేరకు నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో 14 గ్రామాల నిర్వాసితులకే మొదటగా పరిహరం పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 5 టీఎంసీలే నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుసమాచారం. ఈ మేరకు నీరు నిల్వ చేస్తే 8 గ్రామాలు మునుగుతాయి. ఈ 8 గ్రామాలకు మాత్రమే పరిహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

పునరావాసం కింద రూ. 6.75 లక్షలు
నిర్వాసితులకు పునరావాసం కింద ఆయా కుటుంబాలకు 6 లక్షల 75 వేల రూపాయలు, పునరావాసంలో ఉన్నవారికి 3 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 5 వేల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది.

పైడిపాలెం ప్రాజెక్టుకు 700 క్యూసెక్కుల నీరు విడుదల
ప్రస్తుతం పులివెందుల ప్రాంతంలోని పైడిపాలెం ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రస్తుతం రోజు 700 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం గండికోటలో 3.28 టీఎంసీల నీరు నిల్వచేయడంతో చౌటపల్లి, బొమ్మేపల్లి, గండ్లూరులకు నీరు చేరింది. ఓవనపల్లె, సీతాపురంతోపాటు మరో గ్రామానికి కూడా రేపోమాపో నీరు చేరనుంది. పరిహారం ఇవ్వకుండానే నీరు గ్రామాలకు చేరడం పట్ల ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం జనవరి 4 న నిర్వాసితులకు అందిస్తామంటున్న ప్రభుత్వం
ఇదీలా ఉంటే గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం జనవరి 4 వ తేదీన వారి అకౌంట్లలోకి జమచేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మబోమని ముంపు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ తమకు అందే వరకు ఆందోళన విరమించబోమని నిర్వాసితులు స్పష్టం చేశారు. 

బొగ్గు గని మృతులకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

ఢిల్లీ: ఝార్ఖండ్‌లోని లాల్మాటియా బొగ్గు గని ప్రమాద మృతులకుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గని లోపల ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

16:34 - December 30, 2016

పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి..పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీకి  పెద్ద షాక్ తగింది. టీఎంసీ ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్ కతాలో ఎంపీ తపస్ పాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. రోజ్ వాలీ స్కాం కేసులో తపస్ పాల్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కామ్ కు సంబంధించి పాల్ ను దాదాపు నాలుగు గంటలపాటు సీబీఐ ప్రశ్నించింది. కాగా కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లోనూ ముఖ్యంగా నోట్ల రద్దు అంశంలో మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీలో ఆందోళనలు కూడా చేపట్టారు. 17వేల కోట్ల కుంభకోణం విషయంలో ఇద్దరు తృణముల్ ఎంపీలను సుదీప్ బందోపాధ్యాయ, తపస్ పాల్ లకు గతంలో మూడు సార్లు నోటీసులు సీబీఐ ఇచ్చింది. దీనికి స్పందించి సుదీప్ జనవరి నెలలో హాజరవుతానని వివరణ ఇచ్చారు. కాగా ఈ కుంభకోణంలో సీబీఐ కార్యాలయానికి హాజరైన తపస్ పాల్ ను పలురకాలుగా విచారించిన అనంతరం సరైన సమాధాలు ఇవ్వలేకపోవటం అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దు గురించి మాట్లాడుతున్న తమ అభ్యర్థులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిన ఇరికించేందుకు కుట్ర పన్నుతోందని మమతా ఆరోపిస్తున్నారు. తన పార్టీ ఎంపీ అరెస్ట్ అయిన నేపథ్యంలో సంబంధించి మమతా బెనర్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లడనున్నట్లుగా సమాచారం. 

ఉస్మానియా మార్చురిలో మృతదేహం తారుమారు

హైదరాబాద్ : ఉస్మానియా మార్చురిలో మృతదేహం తారుమారు అయ్యింది. న్ని పాతబస్తీ బహుదూర్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో సాయమ్మ మృతి చెందింది. సాయమ్మ మృతదేహాన్ని వైద్యులు మరొకరికి అప్పచెప్పారు. సాయమ్మ మృతదేహాన్ని అప్పగించాలని బంధువులు ఉస్మానియా వద్ద ఆందోళనకు దిగారు.

యాప్ ను ప్రారంభించిన ప్రధాని

ఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు ప్రధాని మోడీ మరో యాప్ ను ప్రారంభించారు.  ఈ-లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌ధాని మోదీ 'భీమ్' మొబైల్ యాప్‌ను ఆవిష్క‌రించారు. ఢిల్లీలోని త‌ల్క‌తోరా స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. డిజిధ‌న్ ప‌థ‌కం ద్వారా లావాదేవీలు నిర్వ‌హించిన వాళ్ల‌కు మోదీ బ‌హుమ‌తులు అంద‌జేశారు.

16:07 - December 30, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో.. .రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్‌ బస్సు.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అగ్రికల్చర్‌ ఏఈవో వేణుగోపాల్‌ మృతి చెందారు. ఏఈవో రాంబాబుతో పాటు మరో ఎనిమిది మంది మహిళలకు గాయాలయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వే శంకుస్థాపనకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 1.2కిలోల పసిడి పట్టివేత

శంషాబాద్: జడ్డా నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు 1.2 కిలోల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

16:04 - December 30, 2016

పశ్చిమగోదావరి : దశాబ్దాల నాటి నుండి ఆంధ్రులు కలలు కంటున్న పోల'వరం' కల ఈనాటికి నెరవేరిందనీ..ఇది నా పూర్వజన్మ సుకృతమని  సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన స్పిల్ వే కాంక్రీటు పనులకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్ఛరణ మధ్య సీఎం చంద్రబాబు స్పిల్ వే కాంక్రీటు పనులను ప్రారంభించిన అనంతరం సర్వమత ప్రార్థనలతో పోలవరం ప్రాంతం మారుమ్రోగిపోయింది. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. చిన్నారులు జనగణమన గేయాన్ని ఆలపించారు. జీవితంలో నిజమైన పండుగ పోలవరం ప్రాజెక్టుకు కాంక్రీటు పనులు కన్నుల పండుగా జరిగాయన సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నరేంద్రమోదీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసినవారందరికీ అభినందనలు తెలిపారు. విదేశానికి చెందిన వ్యక్తి ఆంధ్రుల కోసం ధవళ్వేశ్వరం బ్యారేజ్ కట్టారనీ..గోదావరి జిల్లాలను సస్యశ్యామం చేసిన 'కాటన్ దొర'కు గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటికీ రుణపడివుంటాయన్నారు. పోలవరం సాధించాలంటే తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనం చేయటంతోనే పోలవరానికి శ్రీకారం చుట్టిన దినమనీ..దీనిపై ప్రధాని వద్ద పట్టుపట్టానని.. రాష్ట్రపతి సహాకారంతో అంత్యంత కీలక ఘట్టం పూర్తియిందన్నారు. గోదావరి తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానీ..ప్రాజెక్టుకు సహకరించిన గోదావరి జిల్లాల రైతాంగానికి ధన్యవాదాలు తెలిపారు. లక్షా 80వేల మంది నిర్వాశితులకు ఎటువంటి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విషయంలో పుకార్లు నమ్మవద్దని సూచించారు.

స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్‌... స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా హోమాలు.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున అధికారులు... మంత్రులు ..ప్రజలు పాల్గొన్నారు. కాగా స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల ప్రారంభంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం... కీలక దశలోకి అడుగుపెడుతోంద... 52 బ్లాకులుగా స్పిల్‌వే నిర్మాణం జరగనుంది. నాబార్డు నిధులు అందండంతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

15:51 - December 30, 2016

లాభాలతో 2016కు వీడ్కోలు చెప్పిన స్టాక్ మార్కెట్లు

హైదరాబాద్: స్టాక్ మార్కెట్లు 2016కు లాభాతో వీడ్కోలు చెప్పాయి. 260 పాయింట్లు లాభపడి 26,626 వద్ద సెన్సెక్స్, 71 పాయింట్లు లాభపడి 8175 వద్ద నిఫ్టీ ముగిసింది. 2016లో 2శాతం సెన్సెక్స్, 3 శాతం నిఫ్టీ లాభపడింది.

తెలంగాణ – మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర వంతెన ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ – మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర వంతెనను ప్రారంభించారు. మహారాష్ట్ర -సిరోంచ మధ్య గోదావరిపై వంతెననుయ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు గడ్కరీ, హన్స్ రాజ్, టీఎస్ మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయి: కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ఏఅంశంపై నైనా, ఎన్ని గంటలైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విప్ కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. గొంతు నొక్కేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు కోరిన అంశంపైనే చర్చ జరిపామని, విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని కొప్పులు తెలిపారు.

కేంద్ర సహకారం వల్లే పోలవరం ఈదశకు:సీఎం

ప.గో : కేంద్ర సహకారం వల్లే పోలవరం పనులు ఈ స్థాయికి చేరాయి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు స్పిల్ వే పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ.. పోలవరం పూర్తయితే కరువు అనేది ఉండదని తెలిపారు. ప్రధాని మోదీ మనకు అన్ని విధాన సహకరించారని ఏ పనులు చేపట్టినా నిరాటంకంగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు.

14:44 - December 30, 2016

పట్టరాని సంతోషం వచ్చినా..దు:ఖం వచ్చినా కష్టమేనని పెద్దలు అంటుంటారు. ఇది సత్యమని ఓ ఘటన రుజువు చేస్తోంది. పట్టరాని సంతోషంతో ఓ నేత గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసేసింది. రెండు రోజుల కిందట సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించారు. ఆగ్రా కంట్ స్థానానికి చండ్రసేన్ తప్లు అనే ఎస్పీ నేతకు టికెట్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న 'తప్లు' సంబరానినికి అవధులు లేకుండా పోయాయి. అందరితో కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ములాయం సింగ్ కు 'తపు' ధన్యవాదాలు చెబుతూ ఈ విషయాన్ని ప్రతొక్కరితో చెబుతూ సంతోషంగా గడిపారు. కానీ గురువారం ఉదయం తనకు ఛాతిలో నొప్పి వస్తోంది అంటూ 'చండ్రసేన్ తపు' కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మేదాంత ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో తీసుకెళుతున్నారు. కానీ మధుర టోల్ ప్లాజా దగ్గర 'చండ్రసేన్' కన్నుమూశారు. దీనితో కుటంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ములాయం సింగ్ యాదవ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

14:30 - December 30, 2016

పోలవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి.. పోలవరం ప్రాజెక్టుకు కీలక ఘట్టం ఆవిషృతమయ్యింది. ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలతో శంకుస్థాపన జరిగింది.  ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు,ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. కాగా 2017నాటి పోలవరం కుడి కాలువ ద్వారా నీటి సరఫరాను తరలించేలా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. దశాబ్దాల కాలంగా ఆంధ్రుల కలకు ఈనాటికి ముందడుగు పడింది. నాబార్డు నుండి పోలవరం ప్రాజెక్టుకు  కేంద్రం రూ.1981లను నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన పనులకు ఈరోజు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కీలక అడుగు పడింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. దీంతో నాబార్డు నుండి విడుదల అయిన రుణానికి  కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించింది. నిర్మాణ పనుల పరిశీలనను ఏపీ ప్రభుత్వం ఆధ్వరంలో కొనసాగనున్నాయి. 

గంటాపై చంద్రబాబు వైఖరి ప్రకటించాలి :మధు

అమరావతి : మంత్రి గంటా శ్రీనివాస్ పై సీఎం చంద్రబాబు నాయుడు తన వైఖరి ప్రకటించాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. మంత్రి గా ఉన్న వ్యక్తి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడం నేరం అని, బ్యాంకులకు ఎగనామం పెట్టే మోసగాళ్లను మంత్రివర్గంలో పెట్టుకొని నీతివంతమైన పాలన గురించి సీఎం మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. గంటాపై సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

సీపీఎం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి:సురవరం

హైదరాబాద్: సీపీఎంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రగంగా ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ నేత సురవరం తెలిపారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాలు, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులదని గుర్తు చేశారు.

కేసీఆర్ మోదీకి ప్రధాన అనుచరుడు : సురవరం

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ప్రధాన అనుచురుడిగా మారాడని సీపీఐ జాతీయ నేత సువరం విమర్శించారు. పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని కాదని తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని తేవడం పార్లమెంట్ ను అనుమానించడమేనని స్పష్టం చేశారు.

నోట్ల రద్దు సీపీఐ ఆందోళనలు : సురవరం

హైదరాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు అయినా నోట్ల ఇబ్బందులు తీరడం లేదని, నోట్ల రద్దుపై జనవరి లో సీపీఐ ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు.

సమితి సభ్యులపై మావోయిస్టులు దాడి

ఛత్తీస్ గఢ్ : మల్కన్ గిరి జిల్లా నిలపరిలో సమితి సభ్యులపై మావోయిస్టులు దాడి చేశారు. సహదేవ్ సిపా, పలువురు సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందిస్తున్నారని వీరి దాడి చేసినట్లు తెలుస్తోంది.

స్పిల్ వే కాంక్రీట్ పనులను ప్రారంభించిన సీఎం

ప.గో: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

14:07 - December 30, 2016

బాస్ ను ఆహ్వానిద్దాం రండి అంటూ మెగాస్టార్ తనయుడు 'రాంచరణ్ తేజ' అభిమానులకు పిలుపునిచ్చారు. 'చిరంజీవి' హీరోగా 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'చిరంజీవి' రానున్నారు. 'చిరు'కి 150వ సినిమా కావడం..కొన్ని సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్, టీజర్ విడుదలయ్యాయి. కానీ చిత్ర ఆడియో మాత్రం మార్కెట్ లోకి నేరుగా విడుదల చేస్తున్నారు. దీనితో అభిమానులు తీవ్ర నిరుత్సామానికి గురైనట్లు 'చిరు' తనయుడు, 'ఖైదీ నెంబర్ 150' సినిమా నిర్మాత 'రామ్ చరణ్' గ్రహించారు. అందులో భాగంగా జనవరి 4వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 'బాస్ కు వెల్ కం చెబుదాం..ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు..ఆహ్వానిద్దాం రండి' అంటూ 'రామ్ చరణ్' తన ఫేస్ బుక్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశారు.
వీడియోలో ఏమన్నారంటే..'అందరికీ హాయ్.. నాకు తెలిసి ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. నేను ఏం మీట్లాడినా మీరు వినేటట్టు లేరు. ఒక్కదాని కోసమే ఎదురుచూస్తున్నట్లు అర్థమైంది. అది నాన్నగారి 150 వ సినిమా 'ఖైదీ నంబర్‌ 150' ప్రీ-రిలీజ్‌ ఈవెంట్. మీరు అనుకున్నట్లుగానే విజయవాడలో గ్రాండ్ గా ఘనంగా జరుగబోతోంది. జనవరి 4వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నాం. మీరందరూ రావాలి. తిరిగి మీ అన్నయ్యను..మీ బాస్ ని..మన ఇండ్రస్ట్రీలో మళ్లీ రీ ఎంట్రీ అంటారో..లేకపోతే ఇన్వైట్ చేద్దామం. ఆ పాత రోజుల్లో మిమ్మల్ని ఎలా అలరించారో..తిరిగి అలాగే 'ఖైదీ నెం బర్ 150'తో మొదలై ఇంకా ఎన్నో సినిమాలు చేయబోతున్నారు. సో..ప్లీజ్ ఆల్ ఆఫ్ యు కమ్..జనవరి 4. ఖచ్చితంగా రండి..అందరం సెలబ్రేట్ చేద్దాం..కొత్త సంవత్సరంలో కొత్త ముగింపుతో..సెలబ్రేట్ చేద్దాం..ఐ లవ్ యూ'..అంటూ వీడియోలో 'చెర్రీ' పేర్కొన్నారు.

13:56 - December 30, 2016

సప్తగిరి ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ తో చిట్ చాట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమా హీరో సప్తగిరి, డైరెక్టర్ అరుణ్ పవార్ మాట్లాడారు. సినిమా విశేషాలను తెలిపారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:53 - December 30, 2016

హైదరాబాద్ : టీ.సెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. జనవరి 11వరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగింపు నిర్ణయించారు. జనవరి 3న ఫీజు రియింబర్స్ మెంట్, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చ చేపట్టాలని నిర్ణయించారు.

 

13:50 - December 30, 2016

కరీంగనర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌రావు విమర్శించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. పాదయాత్ర 75వ రోజుకు చేరుకుంది. కరీంగనర్ జిల్లాలోని అలుగునూరు, ఎస్‌ఎస్‌పల్లి ఎక్స్‌రోడ్‌, మాలకొండూరు, అన్నారం, లలితాపూర్‌, దేవంపల్లి, ఎర్దపల్లిలో పాదయాత్ర కొనపాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూడండి. 

 

13:48 - December 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్రాంతికి ముందే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికే 34 కేటగిరీల్లో 982, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫిషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ.. తాజాగా మరో 611 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు, మూడు రోజుల్లో మరిన్ని ప్రకటనలు విడుదల చేయనుంది. 
మరో 611 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  
నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ ను ఏపీపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది. ఆ ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్న నిరుద్యోగులకు సంక్రాంతికి ముందే మరో తీపి కబురు అందించింది. మరో 611 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ  నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు సహా వివిధ శాఖలకు చెందిన 611 పోస్టులు భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు నమూనాలు కమిషన్ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయని.. జనవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామ‌ని ఎపీపీఎస్సీ ప్రక‌టించింది. 
ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి 
తాజా నోటిఫికేషన్లతో పాటే గ్రూప్ 3 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసినా.. చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఈ పోస్టులకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండటంతో వడపోతతో కొత్త విధానాన్ని పాటించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. యూపీఎస్సీ తదితర సంస్థల తరహాలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లు పాటిస్తూ 1:12 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయడానికి తమకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తుందని కొంత కాలంగా ఏపీపీఎస్సీ ఎదురు చూస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు మాత్రం ఈ విధానం అమలు చేయ‌డం లేద‌ని ఎపీపీఎస్సీ స్పష్టం చేసింది.
2,000 పోస్టులు భర్తీకి కసరత్తు 
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 20 నోటిఫికేషన్లలో 2,000 పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వీటిలో గ్రూప్‌ 1 - 94 పోస్టులు,  గ్రూప్‌ 3 - 1,055 పోస్టులు భర్తీ చేయనుంది, వివిధ విభాగాల్లో వున్న పంచాయతీ కార్యదర్శులు 1,055, డిప్యూటీ సర్వేయర్లు - 259, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు - 100, స్పెషల్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు - 77, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు - 49, మెడికల్‌ ఆఫీసర్లు - 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వెంట వెంటనే ఏపీపీఎస్సీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

తెలంగాణ శాసనసభ సభ వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ను జనవరి 3 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. జనవరి 11 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

యాగంలో పాల్గొన్న సీఎం బాబు..

పశ్చిమగోదావరి : పోలవరం హెలిప్యాడ్ వద్ద నిర్వహిస్తున్న యాగంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కాసేపట్లో పోలవరం స్పిల్ వే పనులను బాబు ప్రారంభించనున్నారు.

13:45 - December 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం...  2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందా..? కొత్త చట్టంతో విచ్చలవిడిగా భూములను లాక్కొనే ప్రమాదం ఉండబోతుందా..? చట్టానికి సవరణ పేరుతో రైతులు, నిర్వాసితుల నోట్లో ప్రభుత్వం మట్టి కొట్టే అవకాశం ఉందా...? వీటన్నింటికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 
2013 భూసేకరణ చట్టానికి తీవ్ర విఘాతం 
తెలంగాణ సర్కార్‌ తీసుకొచ్చిన  కొత్త భూసేకరణ చట్టం ... 2013 భూసేకరణ చట్టానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఆంగ్లేయుల కాలంలో చేసిన 1894 భూ సేకరణ చట్టంలో రైతు వ్యతిరేకంగా ఉన్న అనేక నిబంధనలు మార్చి.. నిర్వాసితులు, రైతులకు ప్రయోజనం కలిగేలా చేసిన చట్టమే 2013 - భూ సేకరణ చట్టం. ఆ చట్టం ఉండగా.. మళ్లీ కొత్త చట్టం తేవాల్సిన అవసరం  ఏమొచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
2013 చట్టం ప్రకారం.. 
2013 చట్టం ప్రకారం.. ప్రభుత్వం రైతుల నుంచి భూముల్ని తీసుకునేటప్పుడు వారి ఆమోదం పొందాలి. మార్కెట్‌ విలువకంటే కూడా మెరుగైన పరిహారం చెల్లించాలి. నిర్వాసితుల భూములకు రిజిస్ట్రేషన్‌ ధరను రివైజ్‌ చేసి పరిహారం ఇవ్వాలని చట్టం సూచిస్తోంది. దీంతో పాటు సామాజిక ప్రభావం అంచనా, తప్పనిసరిగా గ్రామసభలో 70 నుంచి 80 శాతం ప్రజల ఆమోదం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం సూచిస్తోంది. రైతులతో పాటు ఆ భూములపై ఆధారపడ్డ ఇతర వర్గాల ప్రయోజనాలను సైతం ఈ చట్టం పరిరక్షించేలా ఉంది. స్థూలంగా చెప్పాలంటే... 2013 భూసేకరణ చట్టం.. భూ నిర్వాసితులు, రైతుల హక్కులను కాపాడేలా వారికి తగిన విధంగా రక్షణలు కల్పించబడ్డాయి. 
ప్రత్యామ్నాయం తర్వాతనే భూ సేకరణ 
రీ సెటిల్‌మెంట్, రీహాబిలిటేషన్‌ విషయంలో కూడా రైతులు, నిర్వాసితులకు తగిన ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే ప్రభుత్వం భూ సేకరణ చేయాలని 2013 చట్టం చెబుతోంది. కుటుంబంలోని వ్యక్తుల సంఖ్యను 18 సంవత్సారాలు నిండిన ప్రతి వ్యక్తిని కుటుంబంగా పరిగణించి వారికి ప్రయోజనం కలిగేలా ప్రత్యామ్నాయాలు చూపాలని చట్టం స్పష్టం చేస్తోంది.  
పాత చట్టానికి పూర్తిగా విఘాతం 
ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ, పునరావాసము, పునఃపరిష్కారంలో న్యాయమైన పరిహారము, పారదర్శకమైన హక్కు తెలంగాణ సవరణ బిల్లు 2016  చట్టం పాత చట్టానికి పూర్తిగా విఘాతం కలిగించేలా ఉందన్నది నిపుణుల వాదన. 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తిని మంట గలిపేలా ఈ చట్టం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త చట్టంతో.. రైతుల నుంచి ప్రభుత్వం విచ్చల విడిగా భూముల్ని లాక్కోనెలా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 
2016 సవరణ చట్టం ప్రకారం.. 
2016 సవరణ చట్టం ప్రకారం.. ప్రభుత్వం రైతులతో పరస్పర ఒప్పందం చేసుకుని భూముల్ని తీసుకోవచ్చు. 10 (ఏ) ప్రకారం సామాజిక ప్రభావ నివేదిక అవసరం లేకుండానే  భూములు తీసుకోవచ్చు. భూములు తీసుకునే సమయంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే వెసులుబాటుకూ ఈ కొత్త చట్టం తిలోదకాలిచ్చింది. అంటే ఎలాంటి ప్రజామోదం లేకుండానే ప్రభుత్వం రైతుల నుంచి భూముల్ని తీసుకునే వెసులుబాటు కొత్త చట్టం కల్పిస్తోంది.  భూసేకరణ సమయంలో రైతుల భూములకు అంచనా కడతామని ఈ సవరణ చట్టంలో పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రభుత్వం రైతులకు ఎంతో కొంత మొత్తాన్ని ఇచ్చి కావాల్సినంత భూమిని సేకరిస్తుంది. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వంతో బేరమాడే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం తనకు నచ్చిన రీతిలో నష్టపరిహారం చెల్లించి రైతు నోట్లో మట్టి కొట్టే ప్రమాదం ఈ కొత్త చట్టంలో ఉంది. 30 ఏ నిబంధన ప్రకారం వాలంటరీ అక్విజిషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌  కూడా..జీవో నెంబర్‌ 123 తరహాలో  ఉందని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం..

హైదరాబాద్ : బీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. జనవరి 11 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 3,4,5,6,9,10,11 వరకు సమావేశాలు జరగనున్నాయి. 3న మత్య్సశాఖ, 4న ఫీజు రీయింబర్స్ మెంట్, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.

జీఎమ్మార్ ప్రజాభిప్రాయ సేకరణ..

తూర్పుగోదావరి : కాకినాడ సెజ్ లో జీఎమ్మార్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రైతుల భూములు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించిన ఓ రైతును పోలీసులు లాక్కెళ్లారు.

13:30 - December 30, 2016

హైదరాబాద్ : గ్రానైట్‌.. సోలార్‌ పరిశ్రమలకు తగిన రాయితీలందించి.. ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని.. దానికోసం అనేక రాయితీలు అందించడం జరుగుతుందని.. ఆయన అన్నారు. పరిశ్రమల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రాబడి విషయంలో రాజీ పడకుండానే.. వారికి రాయితీలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమల విషయంలో సమావేశం నిర్వహించి.. వారిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  

 

13:28 - December 30, 2016
13:24 - December 30, 2016
13:23 - December 30, 2016

తూర్పుగోదావరి : కాకినాడ సెజ్‌పోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాభిప్రాయసేకరణకు వెళ్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో సీపీఎం నేత బేబీ రాణికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంతం శివాజీ, సీపీఎం నేతలు సుబ్బారావు, శేషబాబ్జి సహా పలువురుని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా బేబి రాణి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సీపీఎం అంటే సీఎం వెన్నులో వణుకు పుడుతుందన్నారు. 

ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న జైట్లీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జైట్లీ పాల్గొననున్నారు. పెద్దనోట్లు రద్దు..అనంతరం తలెత్తిన పరిస్థితులపై మాట్లాడనున్నారో తెలియడం లేదు.

 

13:09 - December 30, 2016

విశాఖ : డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రయాణికులకు రైల్వే స్టేషన్‌లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి డబుల్ డెక్కర్ శీతల రైలును ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. రైల్వేశాఖకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఉండడం వల్ల ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు డైనమిక్‌గా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఏపీకి హామీ ఇచ్చిన అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. 

13:06 - December 30, 2016

విజయవాడ : నడికుడి..శ్రీకాళహస్తి కొత్త రైల్వే మార్గంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగనుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి డబుల్ డెక్కర్ శీతల రైలును ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థను జాతికి అంకితం చేశారు. అలాగే గుంటూరు రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సేవలు, అనంతపురం జిల్లాలోని రాయదుర్గం... కళ్యాణదుర్గం మధ్యలో నూతన రైల్వే లైనును ప్రారంభించారు. 

 

'పొలవరం' మంత్రి దేవినేనికి రూ.150 ముడుపులు : వైసీపీ

విజయవాడ: పోలవరం ప్రొజెక్టు కాంక్రీట్ పనుల్లో మంత్రి దేవినేని ఉమా రూ.150 కోట్లు ముడుపు దండుకున్నారని వైసీపీ నేతలు పార్థసారధి, పెద్ద రెడ్డి రాంచంద్రారెడ్డి ఆరోపించారు. పోలవరం ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం దురదృష్టకరమని, నిధులన్నీ పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. నాబార్డు నుంచి వచ్చిన నిధుల అప్పువడ్డీ భారం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

12:53 - December 30, 2016

హైదరాబాద్ : మరికాసేపట్లో ప్రారంభం కానున్న బీఏసీ సమావేశం హాట్‌హాట్‌గా సాగే అవకాశం కనిపిస్తోంది. సభలో ప్రతిపక్షాలపై సీఎం వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే విపక్షాలు సభను బహిష్కరించి నిరసన తెలిపాయి. ఇవాళ ప్రశ్నోత్తరాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ప్రారంభం కానున్న బీఏసీ సమావేశంలో.. అసెంబ్లీ సమావేశాల రెండో షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. 

 

ములాయం, అఖిలేష్ మధ్య విభేదాలు

హైదరాబాద్ : కాంగ్రెస్ తో పొత్తు అంశంలో ఎస్పీ చీఫ్ ములాయంసింగ్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ తో పొత్తు వద్దని ములాయం తేల్చి చెప్పినా రాహుల్ గాంధీతో అఖిలేష్ మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

12:49 - December 30, 2016

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరు కల్తీ మద్యం కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని.. అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని కాకాని గోవర్ధన్‌రెడ్డిపై డీజీపీ సాంబశివరావుకు సోమిరెడ్డి ఫిర్యాదుచేశారు. కాకాని సృష్టించిన నకిలీ పత్రాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. గౌరవం కలిగిన తన కుటుంబాన్ని వారం రోజుల నుంచి రోడ్డుపైకి లాగారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాకాని లాంటి వాళ్ల వల్ల నిజాయితీపరులైన రాజకీయ నాయకులకు చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. 

 

మెల్ బోర్న్ టెస్టులో పాక్ పై ఆస్ట్రేలియా విజయం

హైదరాబాద్: మెల్ బోర్న్ టెస్టులో పాక్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. మరో టెస్టు మిగిలి ఉండగానే అసీస్ సిరీస్ కైవసం చేసుకుంది.

12:45 - December 30, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ విమర్శించారు. ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రతిపక్షాలపై స్పీకర్ వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. 

కోలుకోవడానికి 10 నెలలు పడుతుంది: ప్రణబ్ సేన్

హైదరాబాద్ : నోట్ల రద్దు ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 10 నెలలు పడుతుందని జీడీపి 3 శాతం తగ్గుతుందని ప్లానింగ్ కమిషన్ మాజీ సలహాదారు ప్రణబ్ సేన్ పేర్కొన్నారు.

జగిత్యాల-మోర్తాడ్ మధ్య తొలి ప్యాసింజర్ రైలు...

హైదరాబాద్ :జగిత్యాల-మోర్తాడ్ మధ్య తొలి ప్యాసింజర్ రైలు సర్వీసును జెండా ఊపి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రైల్వే అభివృద్ధికి చూపుతున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు.

12:40 - December 30, 2016

అవును ఇది చదివితే సిగ్గు పడాల్సిందే..స్వచ్చ భారత్ అంటూ విపరీతంగా కేంద్రం ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ విమానసంస్థలు చేస్తున్న పనికి 'సిగ్గు' పడాల్సిందేనంట. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి...రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ సత్వంత్ సింగ్ దహియా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు వేయడంతో ఈ విషయం ఆలస్యంగా బహిర్గతమైంది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం...ఇక్కడ నివాసం ఉండే వారికి వింత సమస్య ఎదురౌతోందంట. ఆకాశం నుండి మల మూత్రాలు ఇళ్ల మీద పడుతున్నాయంట. ఎక్కడి నుండి పడుతున్నాయో అర్థం కావడం లేదంట. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. విమానాశ్రయంలో దిగే విమానాల్లో ఉండే టాయిలెట్ లను ఆకాశంలోనే ఖాళీ చేస్తున్నాయని, దీనితో ఈ సమస్య ఎదురౌతుందని గ్రహించారంట. స్వచ్ఛ భారత్ అంటూ గొప్పలు చెప్పుకుంటుండగా విమాన సంస్థలు ఈ విధంగా చేయడం అక్కడి వారికి చిరాకు కలిగించింది. ఈ వికారపు చేష్ట గురించి స్థానికంగా నివాసం ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ సత్వంత్ సింగ్ దహియా సాక్ష్యాధారాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను సంప్రదించారు. దీనికి ఆ ట్రిబ్యునల్ స్పందించింది. విమానయాన సంస్థలు ఈ విధంగా చేయడం దారుణమని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానం ల్యాండ్ అనంతరం తనిఖీలు చేయాలని, దారిలోనే ఖాళీ చేసిన విమానాల మీద రూ. 50వేలు ఫైన్ వేయాలని తీర్పునిచ్చారు. అదండి సంగతి...

 

ప్రారంభమైన తెలంగాణ బీఏసీ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ బీఏసీ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి స్పీకర్ మధుసూధనాచారి అధ్యక్షతన ఈ భేటీలో అసెంబ్లా సమావేశాల పెంపు అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ నేత జానారెడ్డి, భట్టివిక్రమార్క,ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బిజెపి నేత కిషన్ రెడ్డి, సీపీఎం నేత సున్నం రాజయ్య హాజరయ్యారు.

12:38 - December 30, 2016
12:37 - December 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తనకు మైక్ ఇస్తే సీఎం కేసీఆర్ బండారం బయటపెడుతానని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలనుకుంటే మైక్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ లాగా తనకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసే తత్వం తనది కాదని, పదవులు లేకున్నా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. సీఎం క్యాంపు నివాసం ఎంత వేగంగా కట్టుకున్నారో అంతే వేగంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు కట్టలేదనే దానిపై ప్రశ్నించాలని అనుకున్నట్లు తెలిపారు.

ఏపీ సీఎం డైనమిక్ గా పనిచేస్తున్నారు: సురేష్ ప్రభు

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైనమిక్ గా పనిచేస్తున్నారని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొనియాడారు. ఆయన నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. మరో ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రయాణీకులకు రైల్వే స్టేషన్స్ లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పార్ట్ కనెక్టివిటీకి తగినట్లుగా రైల్వే లైన్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

12:24 - December 30, 2016

మెగాస్టార్ 'చిరంజీవి' 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 150వ చిత్రం కావడంతో 'చిరు' ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమిళ సినిమాను 'కత్తి' రీమెక్ గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో 'చిరు' సరసన 'కాజల్' నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ వెరైటీగా విడుదల చేస్తున్నారు. ఆడియో విడుదల లేకుండానే పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. శ్రోతల నుండి అనూహ్య స్పందన వస్తోందని లహరి మ్యూజిక్ అధినేత పేర్కొంటున్నారు. 'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు' పాటను 7 మిలియన్‌ల మంది చూడగా 'సుందరీ..' పాట 4 మిలియన్‌ల వ్యూస్‌ చేరువవుతోంది. లేటెస్ట్ గా విడుదల చేసిన 'యు అండ్‌ మి' పాట అప్పుడే ఒక మిలియన్ వ్యూస్ దాటేస్తోంది. ఈ నెల 31న 'రత్తాలు.. రత్తాలు' అనే ఐటమ్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జనవరి 4వ తేదీన విజయవాడలో అట్టహాసంగా చేయనున్న సంగతి తెలిసిందే. కానీ విడుదలవుతున్న పాటల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. పూర్తిగా పాటలు విడుదలైన అనంతరం అభిమానుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. సంక్రాంతి బరిలో నిలుస్తున్న 'చిరు' సక్సెస్ కొడుతాడా ? లేదా ? అనేది చూడాలి.

బొగ్గుగని శిధిలాల నుండి 7 మృతదేహాల వెలికితీత...

జార్ఖండ్: లాల్‌మటియాలో బొగ్గు గనులు కూలిపోయిన ప్రాంతం నుంచి సహాయక సిబ్బంది 7మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న 40మందికిపైగా కార్మికులను కాపాడేందుకు పాట్నా నుంచి వచ్చిన మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని ఈసీఎల్, డబ్ల్యూసీఎల్ సీఎండీ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. జేసీబీలు, ప్రొక్లెయినర్ల సాయంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయన్నారు.

స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు : డీకే అరుణ

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. మంత్రులు గంటల తరబడి మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షాలు కోరుతున్న అంశంపై స్పీకర్ చర్చకు అంగీకరించడం లేదన్నారు. బీసీఏలో అన్ని అంశాలపై చర్చ జరిగిన తర్వాతే సభకు వెళ్లాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

పోలీసుల పై ఎర్ర స్మగ్లర్ల రాళ్లదాడి..

తిరుపతి : తిరుమల రెండవ ఘాట్ రోడ్డు దిగువ భాగంలోని అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కుంబింగ్ చేస్తుండగా టూరిజం కాలేజి దగ్గర యాబై మంది ఎర్రచందనం స్మగ్లర్లు కన్పించారు. దీంతో వారిని పట్టుకునేందుకు టాస్కుపోర్సు ఎస్ఐ వాసు బృందం ప్రయత్నించగా స్మగ్లర్లు రాళ్లతో దాడిచేసి పారిపోయారు. అయితే... స్మగర్లలో ఒకరు పట్టుబడ్డాడు. కాగా... స్మగ్లర్లు పట్టుబడిన ప్రదేశంలో ఓ వాహనం, 40 ఎర్రచందనం దుంగలతోపాటు భారీగా ఆహార పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

12:06 - December 30, 2016

టీమిండియా స్టార్ ఆటగాడు 'విరాట్ కోహ్లీ'..బాలీవుడ్ నటి 'అనుష్క శర్మ' లు ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. గత కొద్ది రోజులుగా వీరు ప్రేమలో మునిగిపోతున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఉత్తరాఖండ్ కు వెళ్లిన ఈ జంట త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో తెగ ప్రచారం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా కోహ్లీ - అనుష్కలు ఉంగరాలు మార్చుకొననున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలోని ప్రముఖ ఛానల్స్ ఈ న్యూస్ ను ప్రచారం చేశాయంట. ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ లోని ఆనంద హోటల్ ఇందుకు వేదిక కానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అంబానీ..బచ్చన్..కపూర్ కుటుంబాలు..బాలీవవుడ్..క్రికెట్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రచారంతో 'కోహ్లీ' స్పందించాల్సి వచ్చింది. 'అనుష్క శర్మ'తో ఎంగేజ్ మెంట్ వార్త‌లు అవాస్త‌వం అని ట్విట్ట‌ర్ ఖాతాలో 'కోహ్లీ' ట్వీట్ చేశాడు. తాను ఎంగేజ్ మెంట్ వేడుక చేసుకుంటే అన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాను క‌దా? అని 'కోహ్లీ' ప్రశ్నించాడు. కోహ్లీ చేసిన ట్వీట్స్ తో ఎంగేజ్ మెంట్ లేదనే విషయం స్పష్టమైంది.

11:56 - December 30, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద రైతుబజార్‌గా పేరుగాంచిన విజయవాడ స్వరాజ్య మైదానం వివాదాలకు నిలయంగా మారుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారంతో కొంతమంది దళారీలు రైతులకు అందాల్సిన షాపులను కాజేస్తున్నారు. బందర్‌రోడ్ లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ లోని రైతుబజార్లలో 350 స్టాల్స్ ఉండగా, 250 స్టాల్స్ మాత్రమే రైతులకు అధికారికంగా కేటాయిస్తున్నారు. మిగతా 100 స్టాల్స్ డ్వాక్రా గ్రూపులకు, వికలాంగులకు, స్వయం సహాయక సంఘాలకు కేటాయిస్తున్నారు. ఈ 100 షాపుల కేటాయింపులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల అనుచరులు తమకు అనుకూలమైన వారికి కేటాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి.. 

 

11:53 - December 30, 2016

జార్ఖండ్‌ : గొడ్డా జిల్లా లాల్‌మటియా ప్రాంతంలో బొగ్గు గనులు కూలిపోయాయి. ఈ ఘటనలో మొత్తం 60 మంది కార్మికులు బొగ్గుగనుల్లో చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక సిబ్బంది కొంతమందిని రక్షించారు. ప్రాణాలతో బయటపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:48 - December 30, 2016

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సహా ఏడుగురు నేతలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ లతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాథమిక సభ్యత్వాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా నిన్న రాత్రి ప్రకటించారు. గత సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.... పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి, ఎన్డీఏ మిత్రపక్షమైన పీపీఏలో చేరారు. అప్పటి నుంచి పెమా ఖండూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

11:36 - December 30, 2016

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు కీలకమలుపు తిరిగింది.. ఈ కేసుతో రాజకీయ నేతలకు సంబంధాలు లేవని తెలంగాణ హోంశాఖ స్పష్టం చేసింది.. ఈ కేసులో సీపీఐ జాతీయ నేత నారాయణ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హోంశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది.. రాజకీయ దురుద్దేశంతోనే నారాయణ పిటిషన్‌ వేశారని ఆరోపించింది.
నారాయణ పిటిషన్‌పై హోంశాఖ కౌంటర్‌ దాఖలు
పోలీసుల చేతిలో హతమైన కరడుకట్టిన నేరస్థుడు నయీం కేసులో సీపీఐ నేత నారాయణ హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై తెలంగాణ హోంశాఖ కౌంటర్‌ దాఖలు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే నారాయణ కౌంటర్‌ దాఖలు చేశారని పేర్కొంది. నయీంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నిజంకాదని వెల్లడించింది.  నయీంకు మాజీ డీజీపీతోకూడా సంబంధాలు లేవని హోంశాఖ ఇందులో తెలిపింది.. రాజకీయ దురుద్దేశంతోనే నారాయణ పిటిషన్‌ వేశారని ఆరోపించింది.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది.
కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరంలేదన్న హోంశాఖ
ఇతర రాష్ట్రాల నక్సల్స్‌, దావూద్‌ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. నయీంను వాడుకొని పోలీసులు లబ్ధి పొందారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. నయీం కేసులో పోలీసులు, నాయకులను సిట్‌ కాపాడుతోందనడం సరికాదంది. నయీం కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరంలేదని హోంశాఖ తెలిపింది. 
16చార్జ్‌షీట్లు దాఖలు చేశాం : హోంశాఖ
గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారంలో 175 కేసులు, 16 ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. 10మంది పోలీసులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపినట్టు తెలిపింది. విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఏసీపీ సీతారాం, సీఐలు బి.కిషన్‌, పి.శ్రీనివాస్‌ నాయుడు, నరేందర్‌గౌడ్‌, బల్వంతయ్య, మహ్మద్‌ మజీద్‌, కె.వెంకట్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, ఇ.రవీందర్‌, శ్రీనివాస్‌లను ప్రశ్నించినట్టు వివరించింది. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యను సైతం విచారించినట్టు పేర్కొంది. నయీం కేసును సిట్‌ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోందని తెలంగాణ హోంశాఖ కోర్టుకు తెలిపింది. నయీంతో సంబంధాలున్న ఎవ్వరినీ వదలబోమని హోంశాఖ స్పష్టం చేసింది. 

 

నగరంలో ఏడుగురు దొంగల అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఏడుగురు దొంగ‌ల‌ను పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట పరిధిలో వీరిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వారి వ‌ద్ద నుంచి ఏడు కార్లతో పాటు 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు చెప్పారు. కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

11:30 - December 30, 2016
11:29 - December 30, 2016
11:22 - December 30, 2016

హైదరాబాద్ : కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిస్తూ మాట్లాడారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఫర్మిచర్ ఇస్తామని చెప్పారు. కంప్యూటర్స్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 50 శాతం పెంచిందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ లెక్టరర్లకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల గౌరవ వేతనం రూ.18వేల నుంచి రూ.27వేలకు పెంచామని తెలిపారు.

 

 

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన

విజయవాడ : ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న నడికుడి -శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టుశంకుస్థాపన జరిగింది.  పిడుగురాళ్లలోని శిలాఫలకాన్ని వీడియో లింక్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. రాష్ట్రంలోని కొత్త రైల్వే మార్గాలకు సురేష్ ప్రభుత్వ శంకుస్థాపన చేశారు. అనంతరం గుంటూరు రైల్వేస్టేషన్ లో వైఫై సేవలను ప్రారంభించారు. విజయవాడలోని రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థను జాతికి అంకితం చేశారు.

11:07 - December 30, 2016

అడవులను ధ్వంసం చేస్తున్నది గిరిజనులు కాదని... మైనింగ్ మాఫియా, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలు అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ డా.రాకేష్, కాంగ్రెస్ నేత బెల్లయ్యనాయక్ పాల్గొని, మాట్లాడారు. అడవులపై గిరిజనులకు హక్కు లేదనడం అర్ధరహితమన్నారు. అడవుల్లో వ్యవసాయం చేసుకునే అధికారం గిరిజనులకు ఉందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:06 - December 30, 2016

2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని హైకోర్టు అడ్వకేట్ అర్జున్ అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. '2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలో చేస్తూ 2016 భూసేకరణ బిల్లు తీసుకొచ్చి, ఆమోదించింది.  అసెంబ్లీలో విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోలేదు.  భూ నిర్వాసితుల కడుపు కొట్టేలా, 2013లో వున్న రక్షణలను తొలగించిన 2016 భూ సేకరణ చట్టంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జెఏసి కన్వీనర్ ఇప్పటికే నిరాహార దీక్ష చేపట్టారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అసలు 2016 భూ సేకరణ బిల్లులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలేమిటి? 2013 భూ సేకరణ చట్టానికి, 2016 భూ సేకరణ బిల్లుకు తేడాలేమిటి?  భారత పార్లమెంట్ ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టానికి ఒక రాష్ట్ర అసెంబ్లీ చేసిన సవరణలు చెల్లుతాయా? ఇది కోర్టులో నిలబడుతుందా? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎంగేజ్ మెంట్ వార్తలను ఖండించిన కోహ్లీ

హైదరాబాద్ : బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ఎంగేజ్ మెంట్ జరుగుతున్నట్లు వచ్చిన వార్తలను క్రికెట్ విరాట్ కోహ్లీ ఖండించారు. ఎంగేజ్ మెంట్ జరిగితే వివరాలు వెల్లడిస్తానని కోహ్లీ ట్వీట్ చేశారు.

 

10:59 - December 30, 2016

విజయవాడ : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఎదురుదెబ్బ తగిలింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను ఇండియన్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. 141 కోట్ల 68 లక్షల రూపాయలు బకాయి పడటంతో ఆస్తులను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యూష కంపెనీలో మంత్రి గంటా సహా డైరెక్టర్లుగా మరికొందరు ప్రముఖులున్నారు. విశాఖలో 8 మందికి చెందిన 26 ప్రాంతాల్లోని ఆస్తులను జప్తు చేశారు. 
ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం 
చివరి అస్త్రంగా ఆస్తులు స్వాధీనం...
రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువులు, వ్యాపార భాగస్వాములు రుణ ఎగవేతదారులుగా ముద్రపడ్డారు. బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో.. ఇండియన్‌ బ్యాంక్‌ అధికారులు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు, ప్రతికా ప్రకటనలు జారీ చేశారు. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించాలని ఎన్నిసార్లు డిమాండ్‌ నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో.. చివరి అస్త్రంగా వారు హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంక్‌ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. అయితే ఇందులో మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ఆస్తులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. 
ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రారంభం
విశాఖపట్నం వన్‌టౌన్‌లో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2005 ఆగస్టు 18న కంపెనీల చట్టం కింద రిజిస్టర్‌ చేసుకున్నారు. సంస్థ యాక్టివ్‌ డైరెక్టర్లుగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు.. తోడల్లుడు పరుచూరి వెంటక భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావులు వ్యవహరిస్తున్నారు. సంస్థ విస్తరణ పేరుతో ఇండియన్‌ బ్యాంక్‌ డాబా గార్డెన్స్‌ శాఖ నుంచి 141 కోట్ల 68 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే ఒక్క వాయిదా కూడా చెల్లించకపోవడంతో.. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి వడ్డీతో కలిపి 196 కోట్ల 51 లక్షలు అయినట్లు బ్యాంక్‌ లెక్కకట్టింది. వెంటనే వడ్డీతో సహా రుణం చెల్లించాలని అక్టోబర్‌లో బ్యాంక్‌ డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే గడువు దాటినా సంస్థ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో.. విశాఖ నగరంతో పాటు. గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడల్లోని ప్రత్యూష కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని ఆదేశించారు. ఈ ఆస్తుల్లో గంటా శ్రీనివాసరావుకు చెందిన ఇల్లు, పార్టీ కార్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది. 
ఆస్తులు స్వాధీనం చేసినట్లు ప్రకటించిన బ్యాంక్‌ అధికారులు 
పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు డైరెక్టర్‌గా కొంత కాలం కొనసాగారు. ఇప్పుడు ఈ ఆస్తులను బ్యాంక్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటన జారీ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇదిలావుంటే.. ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. నేను గ్యారంటర్‌గా మాత్రమే ఉన్నానని మంత్రి గంటా తెలిపారు. ఒకప్పుడు డైరెక్టర్‌గా వ్యవహరించానే తప్ప.. తనకు ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. అయితే.. రుణ బకాయిలు చెల్లింపుల విషయంలో డైరెక్టర్లతో మాట్లాడి బకాయిలు చెల్లించే విధంగా చూస్తానని గంటా తెలిపారు. బ్యాంక్‌కు రుణ బకాయిలు ఉన్న కంపెనీతో మంత్రి గంటాకు సంబంధాలున్నాయని.. బ్యాంక్‌ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో ఆయనకు సంబంధించిన ఆస్తులు కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. 

 

10:53 - December 30, 2016

తూర్పుగోదావరి : నోట్ల రద్దు తర్వాత ప్రజల ఇబ్బందులను చూసి తాను చాలా ఆవేదన చెందానని... ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదరికంలేని సమాజనమే తన జీవితాశయమని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఫైబర్‌గ్రిడ్‌ సేవల్ని చంద్రబాబు ప్రారంభించారు.. 
మోరీ గ్రామంలో ఫైబర్‌గ్రిడ్‌ సేవలు
నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్‌ దిశగా ఏపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్‌ సేవల్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నగదురహిత లావాదేవీల్లో మోరి తొలిగ్రామంగా నిలిచినందుకు సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ స్తంభాలద్వారా ఫైబర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజలంతా వినూత్నంగా ఆలోచించాలని, కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాపుల విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టామని వివరించారు. జన్మభూమి కార్యక్రమం కింద కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. బుడగ జంగాలను ఎస్సీల్లో కలిపేందుకు కమిటీని వేశామని, త్వరలోనే నివేదిక వస్తుందని సీఎం చెప్పారు. 
పేదరికంలేని సమాజమే జీవితాశయం : చంద్రబాబు
తనది పేదల కులమని చంద్రబాబు చెప్పారు.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రజలే దేవుళ్లని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పేదరికంలేని సమాజమే తన జీవితాశయమని ప్రకటించారు.. నోట్లరద్దు నిర్ణయంతో ప్రజలు ఇబ్బందిపడ్డారని.. ఇదిచూసి తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో డిజిటల్‌ లావాదేవీల్లో తొలి గ్రామమైన మోరిలో ప్రజలంతా నగదులేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని సీఎం అభినందించారు.

 

వారి గౌరవవేతనం 50 శాతం పెంచాం:కడియం

హైదరాబాద్: కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 50 శాతం పెంచిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిస్తూ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ లెక్టరర్లకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల గౌరవ వేతనం రూ.18వేల నుంచి రూ.27వేలకు పెంచామని తెలిపారు.

10:49 - December 30, 2016
10:47 - December 30, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో వామపక్షాలపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది. సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చౌకబారు విమర్శలు మానుకుని...ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని సీపీఎం నేతలు హితవుపలికారు. మరోవైపు సీపీఎం నిరసనకు విపక్షాలు మద్దుతు తెలిపాయి. 
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వామపక్షాలు ఆందోళన 
సీపీఎంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. 
రాజయ్య నిరసన 
శాసనసభలో సీపీఎంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆపార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరసనకు దిగారు. అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మల్లన్న సాగర్‌ భూనిర్వాసితుల తరపున గట్టిగా మాట్లాడినందుకే  కేసీఆర్‌ తమపార్టీపై నోటికి వచ్చినట్టు మాట్లాడరని సున్నం రాజయ్య మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
రాజయ్యకు టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు 
అసెంబ్లీ గాంధీవిగ్రహం వద్ద నిరసనకు దిగిన సున్నం రాజయ్యకు టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు.  పేదప్రజల తరపున రాజీలేని  పోరాటాలు చేస్తున్న సీపీఎం పార్టీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వారు ఖండించారు. 
కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదన్న తమ్మినేని 
కేసీఆర్ వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని విమర్శించారు. సీపీఎం పార్టీపై చౌకబారు విమర్శలు మానుకుని.. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా నిర్వాసితులకు లభించిన రక్షణలను కేసీఆర్‌ ప్రభుత్వం హరించి వేస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ దిగజారుడు మాటలు మానుకుని ముఖ్యమంత్రి కుర్చీకి తగిన విధంగా హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని తమ్మినేని తెలిపారు. 
కేసీఆర్‌ బెదరింపులకు అదిరిపోయే పార్టీకాదు : సీపీఎం నేతలు  
కేసీఆర్‌ బెదరింపులకు సీపీఎం అదిరిపోయే పార్టీకాదని సీపీఎం నేతలు ఘాటుగా స్పందించారు. సీఎం  తప్పడు నిర్ణయాలపై భవిష్యత్తులో రాజీలేని పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బస్సు ఆపడంలేదని అడ్డంగా వెళ్లి.....

యాదాద్రి: భువనగిరి మండలం చందుపట్లలో బస్సు ఆపడంలేదని ఆర్టీసి బస్సుకు మహేష్ అనే యువకుడు అండ్డంగా వెళ్లాడు. మహేస్ పై నుంచి బస్సు దూసుళ్లింది. ప్రస్తుతం మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ పరారు అవడంతో కండక్టర్ ను గ్రామస్తులు నిర్బంధించారు.

10:42 - December 30, 2016

చెన్నై : తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై మద్రాస్‌ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని, తనకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరినప్పడు ఆమె బాగానే ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారని గుర్తు చేశారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడి కావాలన్నారు.
జయలలిత మృతిపై మద్రాస్‌ హైకోర్టు అనుమానాలు
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై మద్రాస్‌ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని, తనకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యలింగం అన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరినప్పడు ఆమె బాగానే ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారని గుర్తు చేశారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసును రెగ్యులర్‌ బెంచ్‌కి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.  
జయ మృతిపై హైకోర్టులో పిటిషన్‌ 
అరుంబాక్కంకు చెందిన జోసెఫ్‌ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో జయ మృతిపై పిటిషన్‌ వేశారు. సెప్టెంబర్‌ 22న  జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలు వెల్లడించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జయలలిత  మృతికి కారణాలు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోరారు. తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందని జోసెఫ్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

ఉద్రిక్తతంగా కాకినాడ సెజ్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ

తూ.గో: కాకినాడ సెజ్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న అఖిలపక్షం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తోపులాటలో సీపీఎం నేత బేబీరాణికి తీవ్ర గాయాలుకాగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పంతం నానాజీ, సీపీఎం నేతలు సుబ్బారావు, శేషబాబ్జి సహా పలువురు నేతలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు.

10:40 - December 30, 2016

చెన్నై : తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శశికళ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. తమిళనాడు అధికార పార్టీ అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎంపికపై సస్పెన్స్‌కు తెరవీడింది. అందరూ ఊహించినట్లుగానే అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికయ్యారు.
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ 
చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా మొత్తం 23 మంది కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో శశికళ పాల్గొనలేదు. పార్టీ సర్వసభ్య సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా నలుగురు మంత్రులు పోయెస్‌ గార్డెన్‌కు చేరుకుని శశికళకు అందజేశారు. 
శశికళ పదవికి పన్నీర్‌ సెల్వంతో పాటు సీనియర్‌ నేతలు మద్దతు 
జయలలిత మృతి తర్వాత జరిగిన తొలి పార్టీ సర్వసభ్యసమావేశమిది. శశికళ పదవికి పన్నీర్‌ సెల్వంతో పాటు సీనియర్‌ నేతలంతా మద్దతిచ్చారు. ఈ సమావేశంలో 14 తీర్మానాలను ఆమోదించారు. జయలలితకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంట్‌ ఆవరణలో ఆమె కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
3 దశాబ్దాలుగా పార్టీ కార్యదర్శిగా కొనసాగిన జయలలిత
తుదిశ్వాస విడిచేదాకా గత మూడు దశాబ్దాలుగా జయలలిత అన్నాడిఎంకె పార్టీ కార్యదర్శిగా కొనసాగారు. ఈ 30 ఏళ్లలో జయలలితకు నమ్మకస్తురాలైన నెచ్చెలిగా శశికళ వెన్నంటే ఉన్నారు. శశికళ జనవరి 2, 3 తేదీల్లో అధికారికంగా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ పదవి శశికళకు తాత్కాలికమే : పార్టీ వర్గాలు 
చిన్నమ్మ శశికళకు ఈ పదవి తాత్కాలికమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తీర్మానం ద్వారా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే వెసులుబాటు పార్టీ నియమావళిలో ఉంది. దీంతో మరోసారి ఓటింగ్‌ ద్వారా ఎన్నుకునే అవకాశముంది.
అధికారికంగా పార్టీని నడపనున్న శశికళ 
ఇన్నాళ్లూ తెర వెనక రాజకీయాలు నడిపిన శశికళ ఇకపై అధికారికంగా పార్టీని నడపనున్నారు. వీడియో షాపు ఓనర్‌గా ఉన్న శశికళ 1980లో జయలలితకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి క్రమంగా జయలలిత జీవితంలో, పోయెస్‌ గార్డెన్‌లో ఆమె పర్మనెంట్‌గా స్థిరపడ్డారు. 

 

10:38 - December 30, 2016

ఉత్తరప్రదేశ్ : యూపీ సీఎం అఖిలేష్‌యాదవ్‌.. తన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌కు షాక్‌ ఇచ్చారు. ములాయం ప్రకటించిన జాబితాలో తన అనుచరులకు సీట్లు దక్కకపోవడంతో.. అఖిలేష్‌ సొంతంగా జాబితాను ప్రకటించారు. దీంతో యూపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అఖిలేష్‌ తీరుపై శివపాల్‌యాదవ్‌, ములాయంసింగ్‌ గురువారం రాత్రి అత్యవసరంగా భేటీ అయ్యారు. దీంతో ఎస్పీలో ఎలాంటి పరిణామలు చోటు చేసుకుంటాయోనన్న టెన్షన్‌ నెలకొంది. 
యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు 
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ పై రెబల్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అఖిలేశ్‌ యాదవ్ సమాజ్వాదీ పార్టీ టికెట్లు రాని వారికి రెబల్స్గా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ జాబితాను ప్రకటించారు. 
అఖిలేష్‌ 235 మంది అభ్యర్థులతో సమాంతర జాబితా ప్రకటన 
సమాజ్‌వాదీ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 325 మంది అభ్యర్థుల పేర్లను ములాయంసింగ్‌ యాదవ్‌, ఆయన సోదరుడు శివపాల్‌యాదవ్‌లు బుధవారం ప్రకటించారు. అయితే ఈ జాబితాలో అఖిలేష్‌ వర్గానికి చెందిన వారికి స్థానం దక్కలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న అఖిలేష్‌.. గురువారం తన అనుచరులతో సమావేశమయ్యారు. టికెట్లు లభించని వారిని రెబల్స్‌గా బరిలోకి దించాలని నిర్ణయించారు. అందుకోసం అఖిలేష్‌ యాదవ్‌ సొంతంగా 235 మంది అభ్యర్థులతో సమాంతర జాబితాను ప్రకటించారు. ఇందులో 171 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు..  64 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. 
శివపాల్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌తో అత్యవసర భేటీ 
అఖిలేష్‌యాదవ్‌ తన జాబితాను ప్రకటించగానే శివపాల్‌యాదవ్‌.. ములాయంసింగ్‌ యాదవ్‌తో గురువారం రాత్రి అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అఖిలేశ్‌యాదవ్‌ తీరుపై భేటీలో చర్చించారు. మొత్తానికి ఎన్నో రోజులుగా తండ్రి కొడుకుల మధ్య కొనసాగుతున్న వార్‌.. ఎమ్మెల్యేల జాబితాతో బయటపడింది. మరి ఇవే పరిస్థితులు కొనసాగితే సమాజ్‌వాదీ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న టెన్షన్‌ నేతలు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి. 

 

10:36 - December 30, 2016

ఢిల్లీ : పాత నోట్లు డిపాజిట్‌ చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశప్రజలనుద్ధేశించి రేపు సాయంత్రం ఏడున్నరకు మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ప్రకటనలు చేసే అవకాశముంది. 50 రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని విపక్షాల నుంచి విమర్శలు రావడంతో సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతులకు మోది పలు రాయితీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

10:35 - December 30, 2016

ఢిల్లీ : పాత నోట్లను జమ చేసేందుకు నేటితో గడువు ముగియనుంది. దీంతో బ్యాంకుల వద్ద మళ్లీ రద్దీ పెరిగింది. బ్యాంకుల్లో పాత నోట్లు జమ చేసేందుకు నిన్న బ్యాంకుల వద్దకు ప్రజలు బారులు తీరారు. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అయితే.. ఎంపిక చేసిన కొన్ని ఆర్బీఐ శాఖల్లో మాత్రం మార్చి 31 వరకు పాత నోట్లను డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఇందుకు కేంద్రం కఠిన నిబంధనలు విధించింది. ఇప్పటివరకు ఎందుకు డిపాజిట్‌ చేయలేదో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు ఉదయం నుంచే బారులు తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

 

అరుణాచల్ సీఎం కు సస్పెన్షన్ షాక్

హైదరాబాద్ :పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తో పాటు ఏడుగురు నేతలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ లతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాథమిక సభ్యత్వాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా నిన్న రాత్రి ప్రకటించారు. గత సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.... పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి, ఎన్డీఏ మిత్రపక్షమైన పీపీఏలో చేరారు.

10:31 - December 30, 2016

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో నేడు విపక్షాలు వివిధ తీర్మానాలను ఇవ్వనున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై బీజేపీ, దివ్యాంగులకు 3శాతం రిజర్వేషన్లకై టీడీపీ, ఖమ్మం జిల్లాలో కల్తీ కారం ఘటనపై చర్యలకు సీపీఎం వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. సమావేశాలు వాడీవేడిగా జరుగనున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్...
'తెలంగాణ సమాజం ఆశించిన విధంగా సభ జరగడం లేదు. నియమనిబంధనలకనుగుణంగా సభ జరగడం లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చించడం లేదు. మంత్రి హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. చేపలు, పాములు, కప్పలపై మాట్లాడుతున్నారు తప్ప.. ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదు.
సభ్యుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని' అని అన్నారు. 
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 
ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. సబ్జెక్టు లేకనే ప్రతిపక్షాలు పారిపోతున్నాయి. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చామని' తెలిపారు.

 

 

టీజీవోఏ డైరీ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ : తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం(టీజీవోఏ) 2017 డైరీ, కేలండర్‌ను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్ని జిలాల్లో టీజీవోఏ కార్యాలయాలకు 500 గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.10 లక్షల సాయమందించాలని నేతలు కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసినవారిలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌, మమతాబాయి, మధుసూదన్‌, రవీందర్‌రావు, విష్ణు తదితరులు ఉన్నారు.

10:29 - December 30, 2016

మహారాష్ట్ర : పూణేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బేకరిలో మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:27 - December 30, 2016

తిరుపతి : తిరుపతిలోని.. రిలయన్స్‌ స్మార్ట్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓ దుండగుడు రిలయన్స్‌ స్మార్ట్‌లో దోపిడికి ప్రయత్నించాడు. షాపింగ్‌ మాల్‌కు నిప్పుపెట్టి.. లోపల నక్కాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. కాగా లోపలే ఉన్న దుండగుడిని పట్టుకునేందుకు  పోలీసులు ప్రయత్నించారు. కాని దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.    

 

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు....

ఢిల్లీ: ఉత్తరాదిన పొగ మంచు కమ్మేస్తుంది. రాజధాని నగరం ఢిల్లీలో వేకువ జాము నుంచే పలు ప్రాంతాలను పొగ మంచు కప్పేసింది. పొగ మంచు ప్రభావంతో ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టు నుంచి 11 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగ మంచు ధాటికి 12 విమాన సర్వీసుల పనివేళల్లో మార్పులు చేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. రెండు విమానాలను రద్దు చేశారు. మరోవైపు 54 రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులు 12 రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

జానా ఇంటిని ముట్టడించిన మాలమహానాడునేతలు

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి ఇంటిని మాలమహానాడు నేతలు ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణపై జానారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

నేడు రాష్ట్రపతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టి.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నాయకులు కలవనున్నారు. ఈ సందర్బంగా కొత్త భూసేకరణ చట్టంపై రాష్ట్రపతికి వారు ఫిర్యాదు చేయనున్నారు.

10:20 - December 30, 2016

జార్ఖండ్ : రాష్ట్రంలోని బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గొడ్డు జిల్లాలో బొగ్గు గని కుప్పకూలింది. శిథిలాల కింద 60 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఉదయం 11.45కు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగనుంది.

10:14 - December 30, 2016

చలికాలం రాగానే వివిధ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. .జలుబు, శ్వాసకోశ సంబంధ సమస్యలు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇంట్లో ఆహారం కాకుండా బయట ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. చలికాలంలో మరింతగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్..

  • పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు కూడా తీసుకోవాలి.
  • చలికాలంలో వ్యాయామాలు చేయాలి. శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి వెచ్చగా ఉంటుంది. అంతేగాకుండా రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
  • చలికాలంలో ఎక్కువగా వేడి ఆహార పదార్థాలు భుజించాలి. పండ్లు..కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
  • చలికాలంలో పరిశుభ్రంగా ఉండాలి. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం..తీసుకొనే ఆహారాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి.
  • చలికాలంలో చాలా మంది నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం పొడిగా కూడా మారుతుంది. దాహం కాకున్నా ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది.

కుప్పకూలిన బొగ్గుని :చిక్కుకున్న60మందికార్మికులు

రాంచీ: ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని లాల్మాటియా వద్ద శుక్రవారం ఉదయం బొగ్గు గని కుప్పకూలింది. శిథిలాల కింద సుమారు 60 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ సహాయ చర్యలను చేపట్టాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. సహాయబృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నాయి.

10:12 - December 30, 2016

పెరుగు...తినడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సూచిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు నివారించవచ్చు. పెరుగులో చర్మానికి..జుట్టుకు ప్రయోజనం కలిగించే అనేక అంశాలున్నాయి. మరి అవేంటో చూద్దామా...

  • ఒక చెంచా పెరుగులో అర స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి ముఖానికి పట్టించాలి. కొద్దిసేపటి తరువాత కడుక్కొవాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య నుండి దూరం కావచ్చు.
  • నాలుగు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కొకో పౌడర్ మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి..మెడకు పట్టించాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
  • అరకప్పు పెరుగు..రెండు మూడు స్పూన్ల మెంతి పొడి కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. దీని వల్ల జుట్టు రాలే సమస్య తీరుతుంది.
  • రెండు నుండి నాలుగు స్పూన్ల పెరుగు లో కొద్దిగా ఓట్స్ తీసుకోవాలి. ఒక చెంచా నిమ్మరసం..తేనే కలుపుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. అనంతరం ముఖానికి పట్టించి స్ర్కబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలిగిపోతాయి.
  • పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ప్ కి పట్టించి.. శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ ని వారానికి రెండుసార్లు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

 

కోరుకొండ ఎయిర్ పోర్టు వద్ద ఘర్షణ : ఇద్దరి మృతి

రాజమండ్రి : కోరుకొండ మండలం ఎయిర్ పోర్టు సమీపంలో స్థలవివాదంలో నలుగురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈఘర్షణలో ఇద్దరు మృతి చెందరగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

బేకరిలో అగ్నిప్రమాదం ఆరుగురు సజీవదహనం

ముంబై : పుణేలోని ఓ బేకరిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బేకరిలో పనిచేస్తున్న ఆరుగురు సజీవదహనం అయ్యారు.

10:04 - December 30, 2016

ప్రముఖ క్రికేటర్ 'విరాట్ కోహ్లీ' నిశ్చితార్థం చేసుకోబోతున్నాడా ? ఇక దాగుడుమూతల స్టోరికీ చెక్ పెట్టనున్నాడా ? ఈ మేరకు ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయా ? దీనిపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా టీమిండియా కెప్టెన్ 'విరాట్ కోహ్లీ'..బాలీవుడ్ నటి 'అనుష్క శర్మ' లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనితో వీరి వివాహంపై ప్రచారం జరిగింది. కానీ వివాహం ఎప్పుడనేది ప్రకటించలేదు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఈ ప్రేమ జంట ఉత్తరాఖండ్ కు వెళ్లారు. న్యూ ఇయర్ డే నాడు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ ఆనందా హోటల్ లో ఈ వేడుక జరగనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఇద్దరి ఎంగేజ్ హెంట్ కు బాలీవుడ్..క్రికెట్ సెలబ్రిటీలంతా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 'అనుష్క' కుటుంబీకులు..స్నేహితులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతి రిలయన్స్ మార్ట్ లో ఉద్రిక్తత

తిరుపతి: రిలయన్స్ మార్ట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత అర్థరాత్రి రిలయన్స్ మార్ట్ లో దోపిడీకి ఓ దుండగుడు యత్నించారు. దాన్ని గమనించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించి మార్ట్ కు నిప్పు పెట్టి లోపలే దాక్కున్నాడు. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాకానిపై డీజీపీకి ఫిర్యాదు చేశా : సోమిరెడ్డి

విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డిపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారం రోజుల నుంచి కాకాని తప్పుడు ఆరోపణలు చేస్తూ నా కుటుంబాన్ని నడిరోడ్డుపై ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కాకానిపై చర్యలు తీసుకోవాలని 30 డాక్యుమెంట్లలో ఒక్కటి నిజమని తేలినా ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం అని తెలిపారు. కాకాని నిన్నటి వరకు నకిలీ మద్యం ముఠా నాయుకుడు అని, ఇప్పుడు అంతర్జాతీయ నకిలీ పత్రాల నాయకుడు అని ఎద్దేవా చేశాడు.

09:43 - December 30, 2016

'సూర్య' సతీమణి 'జ్యోతిక' హీరోయిన్ గా నటించనుందా ? మరోసారి హీరోయిన్ గా సత్తా చాటాలని భావిస్తోందా? దీనిపై సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. 'సూర్య'తో వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమైంది. ఈ మధ్యనే కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'విజయ్' సరసన ఓ చిత్రం రూపొందనుంది. 'అట్లీ'తో సినిమా రూపొందనుంది. వీరి కాంబినేషన్ లో 'థెరి' చిత్రం ఘన విజయం సాధించింది. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది 'విజయ్' కు 61వ చిత్రం. ఈ చిత్రంలో విజయ్ సరసన ముగ్గురు భామలు నటించనున్నట్టు తెలుస్తోంది. 'కాజల్', 'సమంత' ఇద్దరు హీరోయిన్ లని, మరొకరు 'జ్యోతిక' అని ప్రచారం జరుగుతోంది. కాజల్..సమంతలు గ్లామరస్ హీరోయిన్స్ కావడంతో 'జ్యోతిక' పాత్ర ఎలా ఉంటుందనేది తెలియడం లేదు. 'కాజల్‌ అగర్వాల్‌' 'తుపాకీ', 'జిల్లా' చిత్రాల్లో 'విజయ్‌'తో నటించగా, 'సమంత' 'కత్తి', 'తెరి' చిత్రాల్లో 'విజయ్‌'తో జత కట్టింది. ఇక 'జ్యోతిక' విషయానికి వస్తే గతంలో 'విజయ్' సరసన 'ఖుషి', 'తిరుమలై' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం వస్తున్న ఈ వార్తపై ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. ఈ విషయంపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది.

09:33 - December 30, 2016

'పవన్ కళ్యాణ్' అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారా ? ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' పోస్టర్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా ? ఎందుకంటే 'కాటమరాయుడు' కు సంబంధించిన పోస్టర్స్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలో 'పవన్'ను పూర్తిగా చూపించకపోవడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయినట్లు టాక్. 'గోపాల గోపాల' ఫేం 'డాలీ' దర్శకత్వంలో 'కాటమరాయుడు' చిత్రం రూపొందుతోంది. 'శృతి హాసన్' కథానాయికగా నటిస్తోంది. తమిళ సినిమా 'వీరమ్' కి రీమెక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఉగాది కానుకగా ఈ చిత్రం రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. పండుగలను పురస్కరించుకుని పోస్టర్స్ లను విడుదల చేస్తూ వస్తోంది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా 'కాటమరాయుడు' మూడు పోస్టర్స్ ను విడుదల చేసింది. విడుదల చేసిన కూడా ఒక్క పోస్టర్ లోను 'పవన్' ని పూర్తి గా చూపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30వ తేదీన మరో పోస్టర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో 'పవన్' ను పూర్తిగా చూపించే ఫొటో ఉండనున్నట్లు తెలుస్తోంది.
'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' సినిమా ఇదే కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'శరత్ మరార్' నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కి తమ్ముళ్లుగా అజయ్, శివ బాలాజీ మరియు కమల్ కామరాజు నటిస్తున్నారు. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

కాకినాడ సెజ్ పోర్టు అభివృద్ధి నిర్మాణంపై నేడు ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణ

తూర్పుగోదావరి : కాకినాడ సెజ్ పోర్టు అభివృద్ధి నిర్మాణంపై నేడు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.  

నేడు బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్ : నేడు బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై మంత్రులు జోగు రామన్న ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. 

Don't Miss