Activities calendar

01 January 2017

21:44 - January 1, 2017

టర్కీ : న్యూ ఇయర్ వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 39 మంది మృతిచెందారు. 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడి కుమారుడు అబిస్‌ రిజ్వీ, గుజరాత్‌కు చెందిన కుషీ షా మృతిచెందినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు. మరోవైపు ఇది ఐసిస్ ఉగ్రవాదుల పనే అని ఇస్తాంబుల్‌ గవర్నర్‌ అభిప్రాయపడ్డారు.
అర్థరాత్రి నైట్‌క్లబ్‌లో బుల్లెట్ల వర్షం
ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునికిపోగా,.టర్కీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 39 మంది మృతిచెందగా,. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శనివారం నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు జరుగుతుండగా..అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్‌లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది.

నైట్‌క్లబ్‌లో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు
న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగిందని ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 600 మంది నైట్ క్లబ్‌లో ఉన్నారు. దుండగుడు నైట్‌క్లబ్‌లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత నైట్‌క్లబ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గవర్నర్ వివరించారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరిపింది ఎంతమంది అన్న దానిపై ఇంకా స్పష్టతలేదన్న గవర్నర్‌.. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని అభిప్రాయపడ్డారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణ రక్షణ కోసం నైట్ క్లబ్ నుంచి జనాలంతా బయటకు పరుగులు తీశారు. క్లబ్బులో కాల్పులకు తెగబడిన నిందితుడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు.

21:37 - January 1, 2017

ఢిల్లీ : ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రామాణిక రుణ రేటును 0.9శాతం తగ్గించింది. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే కొత్త వడ్డీరేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఏడాది కాలవ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8శాతం అవుతుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మూడేళ్ల కాల వ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేటును 9.05శాతం నుంచి 8.15శాతానికి తగ్గించింది. గతవారం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ 0.3శాతం, ఐడీబీఐ 0.6 శాతం రుణ రేట్లను తగ్గించింది. 

21:35 - January 1, 2017

విశాఖ : ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నో హమీలు ఇచ్చిన బాబు వాటిని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యాడని మండిపడ్డారు. సింహాచలం, పంచగ్రామాల సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

21:33 - January 1, 2017

విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలతో 2016 విషాదనామ సంవత్సరంగా మిగిలిపోయిందని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. పాలకులు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలతో 2017ను పోరాటనామ సంవత్సరంగా మారుస్తామని ప్రకటించారు. 

21:31 - January 1, 2017

సిద్ధిపేట : నగదు రహిత లావాదేవీల్లో సిద్దిపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 100శాతం నగదు రహిత లావాదేవీల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ సిద్ధిపేటలో మహిళా సంఘాలకు ఉచితంగా మినీ ఏటీఎంలు పంపిణీ చేశారు. అంతకుముందు సిద్ధిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో హ్యాక్‌ఐ యాప్‌ను ప్రారంభించారు.

సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల్లో...
నగదు రహిత లావాదేవీల్లో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సిద్ధిపేట నియోజకవర్గంలో అడుగులు పడుతున్నాయి. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఇందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌ను దేశంలోనే తొలి నగదురహిత గ్రామంగా నిలిపారు. అంతేకాదు.. మిషన్‌ భగీరథ, స్వచ్ఛ సిద్ధిపేట, హరితహారం లాంటి కార్యక్రమాల్లో సిద్దిపేట నియోజకవర్గం ముందుంది. అలాగే నియోజకవర్గంలో వందశాతం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు.

50 సంఘాలకు మినీ ఏటీఎంల పంపిణీ
సిద్ధిపేటలోని శివమ్స్‌ గార్డెన్‌లో 50 మహిళా సంఘాలకు మంత్రి హరీశ్‌రావు మినీ ఏటీఎంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణలో సిద్ధిపేట నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలుపుతామని హరీశ్‌రావు అన్నారు. నగదు రహిత సేవల కోసం ప్రతి గ్రామానికి ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీల దిశగా ప్రజలంతా ముందడుగు వేయాలని కోరారు. మహిళా గ్రూపుల్లో జరిగే లావాదేవీల్లో 50శాతం డిజిటల్‌ పద్ధతిలో నిర్వహిస్తే ఏటీఎంల చార్జీలను తానే భరిస్తానని హామీనిచ్చారు.

మోదీ ప్రసంగం నన్ను నిరాశ పర్చింది: హరీశ్‌
శనివారం నాటి మోదీ ప్రసంగం తనను నిరాశపర్చిందని హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు ఏమైనా లబ్ది చేకూరే ప్రకటనలు ఉంటాయని తాను ఆశించానని.. కానీ అవేమీ ఇవ్వలేదన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మోదీ 50 రోజలు గడువు కోరారని.. నేటికీ సమస్యలు మాత్రం తీరలేదన్నారు. అంతకుముందు సిద్దిపేట కమిషనరేట్‌ హాక్‌ఐ యాప్‌ను హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా ఆపదలో ఉన్నవారికి తక్షణ పోలీస్‌ సేవలు అందించనున్నట్టు చెప్పారు. 

21:25 - January 1, 2017

ఉత్తరప్రదేశ్‌ : అధికార సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తండ్రి ములాయంసింగ్‌, తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌ల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోయానుకుంటున్న తరుణంలో మళ్లీ రాజుకుని, తారా స్థాయికి చేరుకున్నాయి. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ స్థాయి సమావేశంలో అఖిలేశ్‌ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడుగా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి శివపాల్‌ యాదవ్‌ను తప్పించారు. సంక్షోభానికి కారకుడుగా భావిస్తున్న అమర్‌సింగ్‌ను కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. మరోవైపు ఈ నిర్ణయాలను ములాయంసింగ్‌ యాదవ్‌ తప్పుపట్టారు. అఖిలేశ్‌ యాదవ్‌ను వెనక నుంచి నడిపిస్తున్న రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ములాయంసింగ్‌ యాదవ్‌ మరోసారి ప్రకటించారు.

అంతర్గత కుమ్ములాటలు, వీధి పోరాటాలతో సమాజ్ వాద్ పార్టీ
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అంతర్గత కుమ్ములాటలు, వీధి పోరాటాలతో సతమతమవుతున్న ఎస్పీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి, తనయుని మధ్య తగాదాలు తారా స్థాయికి చేరి, ఒకవర్గం నేతలను మరో వర్గం బహిష్కరించుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ కాస్తా సమాజ్‌ వార్‌ పార్టీగా మారింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివపాల్‌ యాదవ్‌ తొలగింపు
లక్నోలో జరిగిన సమాజ్‌వాదీ పార్టీ జాతీయ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరైన ఈ భేటీలో అఖిలేశ్‌ను పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంసింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను తొలగించారు. అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు రామ్‌గోపాల్‌ యాదవ్‌ ప్రకటించారు. అయితే ములాయంసింగ్‌ మార్గ నిర్దేశంలోనే పార్టీ నడుస్తుందని రామ్‌గోపాల్‌ యాదవ్‌ ప్రకటించడం కొసమెరుపుగా భావిస్తున్నారు.

పార్టీని భ్రష్టుపట్టించే కుట్రదారులకు వ్యతిరేకం : -అఖిలేష్‌
చకచకా జరిగిపోయిన రాజకీయ పరిణామాల్లో పార్టీలో తన తండ్రికి ఇచ్చే గౌరవం మరే ఇతర నేతలకు ఇవ్వబోమని అఖిలేష్‌ తేల్చి చెప్పారు. పార్టీని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కుట్రదారులకు మాత్రమే తాను వ్యతిరేకినని ప్రకటించి, పార్టీ జాతీయ సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కుట్రదారుల నుంచి పార్టీని కాపాడే బాధ్యతల్లో భాగంగానే పార్టీ జాతీయ సమావేశాన్ని నిర్వహించి, అందరి నిర్ణయం మేరకు సమాజ్‌వాదీ పార్టీ పగ్గాలు చేపట్టినట్టు ప్రకటించారు. ఎన్నికల సమయంలో అంతర్గత కుమ్ములాటలు పార్టీ విజయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనిని నివారించేందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాయని చెప్పుకొచ్చారు.

జాతీయ సమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం : -ములాయం
మరోవైపు అఖిలేష్‌ నేతృత్వంలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్న వాదాన్ని లేవనెత్తారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. తనయుడుతో వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ను ఆరేళ్ల పాటు బహిష్కరించారు. తనను అవమానించడం ద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు పార్టీలోని ఒకవర్గం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే లక్నో సమావేశమన్న వాదాన్ని వినిపించారు. ఈనెల 5న లక్నోలో పార్టీ జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదం తెలిపారు. మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. క్షణక్షణం మారుతున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 

21:23 - January 1, 2017

ఢిల్లీ : నూతన సంవత్సరం కానుకగా దేశ ప్రజలపై మోదీ సర్కార్‌ పెట్రోవాత విధించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి పెంచింది. లీటర్‌ పెట్రోల్‌పై 1.29 పైసలు, డీజిల్‌పై 97 పైసలను పెంచింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 74.90పైసలకు చేరింది. డీజిల్‌ ధర 62.71 పైసలకు చేరింది. 2005 జూలై 1 తర్వాత పెట్రో ధరలు గరిష్టానికి చేరాయి. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

20:47 - January 1, 2017

జీపు లోయలో పడి 5గురు మృతి

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఓ జీపు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 16 మంది ఉన్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని చంపావతి జిల్లాలో జరిగింది. 

తల్లిని చంపినందుకు మనస్తాపంతో ఆత్మహత్య..

జగిత్యాల : మేడిపల్లి మండలం పోరుమల్లలో ఓ ఉన్మాది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నతల్లిని హత్య చేసిన ఉన్మాది శేఖర్ కొంతకాలం పరారీలో వున్నాడు. అనంతరం ఉన్మాదం దిగిపోవటంతో తల్లిని చంపినందుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తట్టుకోలేని మానసిక పరిస్థితుల్లో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శేఖర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చోరీ ముఠాను పట్టుకున్న పోలీసులు..

కామారెడ్డి : కాకతీయ నగర్‌లో భారీ చోరీ జరిగింది. నలుగురి నివాసాలలో చోరీకి పాల్పడిన దొంగలు భారీగా బంగారం..నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న తెలిపారు. నిందితుల నుంచి దోపిడీ సొత్తుతోపాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

పెరిగిన పెట్రోల్..డీజిల్ ధరలు..

ఢిల్లీ : పెట్రోల్‌.. డీజిల్ ధరలు మ‌రోసారి పెరిగాయి. పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.1.29 పైసలు పెర‌గ‌గా, డీజిల్‌ ధర లీటర్‌కు 97 పైసలు పెరిగింది. పెరిగిన ఈ ధరలు ఈరోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. తాజా పెంపుతో హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర 74.90 పైస‌లుగా ఉంది. లీట‌రు డీజిల్ ధ‌ర 62.71 పైస‌లుగా ఉంది.

20:14 - January 1, 2017

ఓ వైపు ఫుల్ జోష్ కలిగించే మాస్ సాంగ్స్ తో ఆల్బమ్స్..మరోవైపు సినిమా పాటలు పాటలు పాడుతూ అభిమానులను అలరిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ తో 10టీవీ స్పెషల్ షో.. క్లబ్ లకు పబ్ లకు వెళ్లి వేలకి వేలు తగలేసుకోవటం ఎందుకని..ఇంటిపైన ఓ గుడిసె వేసుకుని స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నామని రాహుల్ చెప్పాడు. రాహుల్ ఒక్క సింగరే కాదు..మల్టీ టాలెంటెడ్ పర్సన్..తన ఆల్బమ్ సాంగ్స్ పాటటం...రాయటం..మ్యూజిక్ కంపోజ్ ఒకటేమిటి మల్టీ టాలెంట్ తో ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ విశేషాలను తెలుసుకుందాం. మంగమ్మా..సాంగ్ తో రాహుల్ ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పనక్కరలేదు. మరి మంగమ్మా రాహుల్ 10టీవీ షోలో ఎటువంటి విశేషాలు పంచుకున్నాడు..తెలుసుకునేందుకు మంగమ్మా రాహుల్ షో ఈ వీడియోలో చూడండి..

టర్కీ కాల్పుల మృతుల్లో ఇండియన్స్..

ఇస్తాంబుల్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కాల్పుల్లో ఇద్దరు భారతీయులు చనిపోయారు. వీరిలో రాజ్యసభ మాజీ ఎంపీ కుమారుడు అబిస్ రిజ్వీ, గుజరాత్‌‌కు చెందిన కుషీ షా ఉన్నట్లుగా సమాచారం. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటోన్న నైట్ క్లబ్‌పై ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మొత్తం 39 మంది చనిపోయారు. 69 మంది గాయపడ్డారు. మృతుల్లో 15 మంది విదేశీయులున్నారు.

ఘోర ప్రమాదం..20మంది మృతి..

ఇండోనేషియా : జకర్తాలో ప్రయాణీకులతో వెళుతున్న ఓ పడవలో ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 20 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.. 17 మంది గల్లంతు అయ్యారు.మరో 20 మందికి గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నారు.

18:59 - January 1, 2017
18:58 - January 1, 2017
18:55 - January 1, 2017

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ నెల 3న ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్‌ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలుసుకోనున్నారు. ఇప్పటికే పవన్‌ కలుసుకోబోయే రోగుల జాబితాను పార్టీవర్గాలు సిద్ధం చేశాయి. అనంతరం పవన్‌ రోడ్‌ షో నిర్వహించే అవకాశాలున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. 

18:52 - January 1, 2017

శ్రీకాకుళం: రైతులు నానా పాట్లు పడుతుంటే..ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఏమిటని మాజీ మంత్రి, వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. పల్లె కన్నీరు పెడుతుంటే.. వేడుకలెలా జరుపుతున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా శ్రీకాకుళం నగరంలో ఆయన రైతు దీక్ష చేపట్టారు. జిల్లాలో 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంటే అధికారిక కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 7 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు. 

18:50 - January 1, 2017

విజయవాడ : నూతన సంవత్సరం కానుగా రాష్ట్ర ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో అనారోగ్యంతో ఏఒక్కరూ చనిపోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీ చరిత్రలోనే ఈ పథకం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

నూతన సంవత్సరంలో ఆరోగ్యరక్ష ఫైల్‌పై సీఎం తొలి సంతకం
రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆరోగ్యరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సంవత్సరంలో ఆరోగ్యరక్ష పథకంపై ఆయన తొలి సంతకం చేశారు. ఆరోగ్య రక్ష ప్రచార పోస్టర్‌ను , ఆడియో సిడీని ఆవిష్కరించారు. ఆరోగ్య రక్ష పథకంలో మొదట తన పేరును స్వయంగా వెబ్‌ సర్వీస్‌ ద్వారా నమోదు చేసుకున్నారు. రెండో సభ్యునిగా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఈ పథకంలో చేరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ పథకం ధ్యేయమన్నారు. ఆరోగ్య రక్ష ఏపీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

నెలకు 100 చొప్పున ఏడాదికి 1200 రూపాయలు చెల్లించాలి: చంద్రబాబు
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రజలంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చంద్రబాబు కోరారు. నెలకు 100 రూపాయల చొప్పున సంవత్సరాంతం 1200 చెల్లిస్తే ఆరోగ్యరక్ష పథకం కింద 2 లక్షల రూపాయల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఎలాంటి కార్డులు లేనివారికి ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. మన ఆరోగ్యం.. చుట్టూ ఉన్న పరిసరాలను బట్టే ఉంటుందని, అందుకే పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ప్రజల ఆరోగ్యానికి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు: కామినేని శ్రీనివాస్‌
రాష్ట్ర ప్రజల ఆరోగ్యపరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలు అందని కుటుంబాల వారంతా ఆరోగ్యరక్ష పథకంలో చేరాలని సూచించారు. ఆరోగ్య రక్ష పథకం మార్చి నుంచి అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రజలంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

కేజ్రీవాల్ పై బూటు ..

హర్యానా : రోహ్ తక్ జిల్లాలో ఆమ్ ఆద్మీ నిర్వహిస్తోంది. ర్యాలీలో పాల్గొన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి చేదు అనుభ‌వం ఎదుర‌యింది. ర్యాలీలో ఆయ‌న‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆయ‌న‌పై దుండగుడు షూ విసిరాడు. దీంతో ర్యాలీకి కాసేపు ఆటంకం ఏర్ప‌డింది. 

18:42 - January 1, 2017

నారా రోహిత్ సినిమా అంటే శ్రీవిష్ణు వుండాల్సిందే అన్నట్లుగా రోహిత్ సినిమాలన్నింటిలోనూ శ్రీవిష్ణు తప్పకుండా వుంటాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో కూడా నారా రోహిత్ తో పాటు క్రికెటర్ గా నటించాడు. ఈ సినిమా శ్రీవిష్ణు సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నటుడు శ్రీ విష్ణుతో టెన్ టీవీతో స్సెషల్ షో నిర్వహించింది. మరి ఈ షోలో శ్రీవిష్ణు ఎటువంటి విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడో.. తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

18:36 - January 1, 2017

నిజామాబాద్‌: పేద ప్రజల కడుపునింపే బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణాలోపంతో యథేచ్ఛగా రేషన్‌బియ్యం అక్రమార్కులకు చేరుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డిజిల్లాల్లో రేషన్‌ డీలర్లు ఆడిందే ఆటగా సాగుతోంది.

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
పేదప్రజల ఆకలి తీర్చాల్సిన రేషన్‌ బియ్యం అవినీతిపరుల పాలవుతున్నాయి. అధికారులు, రేషన్‌డీలర్లు కుమ్మక్కై రూపాయిబియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.

రెండు జిల్లాల్లో 6,22,321 ఆహార భద్రత కార్డులు
నిజామాబాద్‌ , కామారెడ్డిజిల్లాల్లో పరిధిలో మొత్తం 6,22, 321 ఆహారభద్రతా కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతి నెల 13,322 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతాయి. అయితే ప్రజలకు పంపిణీ మొదలు కాకముందే బియ్యం మాయమవుతున్నాయి. కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై బియ్యాన్ని పొరుగున్న ఉన్న మహరాష్ర్టకు తరలిస్తున్నారు.

అర్సపల్లిలో-50క్వింటాళ్లు , వర్నిలో 350బస్తాలు పట్టివేత
గత 10 రోజుల్లొ రెండు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పౌరసరపరాలశాఖ అధికారులు పట్టుకున్నారు. అర్సపల్లిలో 50 క్వింటాళ్లు, వర్ని మండలంలో ఓ ఇంట్లొ నిల్వచేసిన సుమారుగా 350 బస్తాల బియ్యం అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అమ్ముకుంటున్నారు.

రాజకీయనాయకులు అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
బోదన్ మండలం సాలూర రెంజల్, నవీపేట యంచ, కోటగిరి మండలాల నుంచి రాత్రివేళలో రేషన్‌ బియ్యం సరిహద్దులు దాటిపోతున్నాయి. బియ్యం పక్కదారిపట్ట కుండా ప్రభుత్వం పీడీఎస్‌ చట్టాన్ని ప్రయోగిస్తున్నా బియ్యం అక్రమార్కుల గోడౌన్లకు చేరుతూనే ఉన్నాయి. నిజామాబాద్‌ పట్టణంలో సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులకు కనిపంచడంలేదు.బియ్యం దందాలో కొందరు రైస్‌మిల్లర్ల హస్తంకూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయనాయకుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. హాస్టళ్లకు కేటాయించిన సన్నబియ్యం మిల్లులకు తరలించిన పాలిష్‌పట్టి.. ఎక్కువరేటుకు అమ్మకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రేషన్‌బియ్యం దందాను అడ్డుకోవాలని నిజామాబాద్‌, కామారెడ్డిజల్లాల ప్రజలు కోరుతున్నారు. 

18:33 - January 1, 2017

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న అవిభక్త కవలలు వీణా-వాణిలను తెలంగాణ ప్రభుత్వం స్టేట్‌హోంకు తరలించింది. ఇన్నాళ్లూ ఊహతెలిసినప్పటి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రిలోనే ఉన్న తమను ఉన్నఫలంగా స్టేట్‌హోంకు తరలించడంపై వీణా-వాణిలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము నీలోఫర్‌ ఆసుపత్రిలోనే ఉంటామని..స్టేట్‌హోంకు వెళ్లమని చెప్పినా..అధికారులు మాత్రం..వారిని స్టేట్‌హోంకు తరలించింది. అయితే వీరిని స్టేట్‌హోంకు తరలిస్తున్నారన్న సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇవ్వలేదు అధికారులు. 

18:30 - January 1, 2017
18:22 - January 1, 2017

ఖమ్మం : సీపీఎం మహాజన పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. భద్రాచలం జిల్లా ఇల్లందులో స్థానిక సీపీఎం నేతలు సంబురాలు చేసుకున్నారు. కేక్‌ కట్‌ చేసిన నేతలు, కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజల అండదండలు, ఆశీర్వాదంతో తమ్మినేని పాదయాత్ర లక్ష్యాన్ని పూర్తి చేస్తారని స్థానిక నేతలు, కార్యకర్తలు ఆకాంక్షించారు. పాదయాత్ర కార్యక్రమాలను ప్రసార సాధనాల్లో రాకుండా కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. 

18:20 - January 1, 2017

హైదరాబాద్ : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌లో 2 కె రన్‌ నిర్వహించారు. సికింద్రాబాద్ రసూల్‌పూరాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్‌టవర్ వరకూ రన్‌ కొనసాగింది. ఈ రన్‌లో సీపీఎం నాయకులు డీజీ నరసింహారావు, నంద్యాల నరసిసంహారెడ్డి, శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

18:18 - January 1, 2017

కరీంనగర్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర.. కరీంనగర్‌లో 77వ రోజు కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర ఇవాళ జిల్లాలోని చిలుకూరు, చిన్నరాజుపల్లి, రంగాపూర్‌, చిరతపల్లి, హుజురాబాద్‌ బెంచికలపేట ఎక్స్‌రోడ్డు, కోతులనడుమ, వీరనారాయణపూర్‌, దండేపల్లిలో కొనసాగనుంది.

2 వేల కిలోమీటర్లు పూర్తి
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఫలాలను అందించడమే ధ్యేయంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. అణగారిన వర్గాల ప్రజలను తట్టిలేపుతూ.. ప్రతివ్యక్తిలో చైతన్యాన్ని నింపుతూ సాగుతున్న పాదయాత్ర ఇవాల్టికి 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

పాద యాత్రకు తెలంగాణ జిల్లాల్లో లభిస్తున్న స్పందన

తెలంగాణలో ఉప్పెనై సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర తీరు. దాదాపు 15 జిల్లాల్లో.. వందలాది పల్లెల్లో ప్రజాచైతన్యాన్ని నింపుతూ తమ్మినేని బృందం 2 వేల కిలోమీటర్ల దూరం పయనించడం నిజంగా ప్రజా సమస్యల పట్ల సీపీఎం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. మేమున్నామంటూ.. ప్రజలతో మమేకమై సాగుతున్న యాత్రకు తెలంగాణ జిల్లాల్లో లభిస్తున్న స్పందన అపారం.

సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖలు
సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా తెలంగాణ పల్లెలు, తండాలు, వివిధ ప్రాంతాల్లో వెనుకబడిన వారందరినీ పాదయాత్ర బృందం పలకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటోంది. తండాలు, మండలాలు అన్న తేడా లేకుండా అడుగడుగునా పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. పాదయాత్రలో వెల్లువెత్తిన సమస్యలను ప్రస్తావిస్తూ... సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖలు రాస్తున్నారు.

2016 అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభం
2016 అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన మహాజన పాదయాత్ర. రెండు వేల మైలురాయిని చేరుకుంది. తమ్మినేని నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం.. ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించ తలపెట్టి ఆ దిశగా ముందుకు సాగుతోంది.

21 రోజున వనపర్తి జిల్లాలో 500 కిలోమీటర్లు పూర్తి
సీపీఎం మహాజన పాదయాత్ర ఐదో రోజున రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌ సమీపంలోని కోళ్లవంపు గ్రామం వద్ద 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అలాగే 21వ రోజున వనపర్తి జిల్లాలో 500 కిలోమీటర్లు చేరుకుంది. ఇక 40వ రోజు మెదక్‌ జిల్లాలో 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజాసంఘాల నేతలు పాదయాత్ర చేస్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మంబోజిపల్లిలో వెయ్యి కిలోమీటర్ల శిలాఫలకాన్ని తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు.

పాదయాత్ర ఆశయం నెరవేరాలి : తమ్మారెడ్డి
తమ్మినేని పాదయత్ర 2వేల కిలోమీటర్లు పూరైన సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు. తమ్మినేని ఏ ఆశయం కోసమైతే పాదయాత్ర చేపట్టారో.. ఆ ఆశయం నెరవేరాలని తమ్మారెడ్డి భరద్వాజ ఆకాంక్షించారు.

40 రోజు మెదక్‌ జిల్లాలో 1000 కిలోమీటర్లు మైలురాయిని దాటిన పాదయాత్ర
ప్రతి పల్లెలో సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. తమ్మినేని బృందం సీఎంకు లేఖలు రాస్తోంది. ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తట్టిలేపుతూ.. సమస్యల పరిష్కారం దిశగా అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఇప్పటికే సగ భాగం పూర్తైన పాదయాత్ర... ఇదే ఉత్సాహంతో 4వేల మైలురాయిని పూర్తి చేసేందుకు తమ్మినేని బృందం ముందుకు సాగుతోంది.  

18:09 - January 1, 2017
18:08 - January 1, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌.. తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికి మంచి జరగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోయి.. దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ సందర్భంగా తనను కలిసిన ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

ఆటో/లారీ ఢీ..9మందికి గాయాలు..

సంగారెడ్డి : ఆటో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం..

మహారాష్ట్ర : ఖంబల్‌పాడా వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త..

హైదరాబాద్ : స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కొత్త సంవ‌త్స‌రంలో తీపిక‌బురు అందించింది. ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుంద‌ని ఎసబీఐ తెలిపింది. మూడేళ్ల కాల వ్యవధి కలిగిన రుణాలపై 9.05 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించిన‌ట్లు పేర్కొంది. పెద్దనోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో బ్యాంకుల్లో ఖాతాదారులు పెద్ద మొత్తంలో డ‌బ్బు డిపాజిట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అమీర్ ఖాన్ పై పవన్ ప్రశంసలు..

హైదరాబాద్ : తొలిసారిగా సినిమాకు సంబంధించిన ట్వీట్ చేసిన పవన్.. బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. దంగల్ సినిమాతో అమీర్ బాలీవుడ్ లో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ సినిమా నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను పవన్ క‌ల్యాణ్ కొనియాడారు. ఇటీవల తాను దంగల్ సినిమా చూశాన‌నితన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నార‌ని పవన్ ట్వీట్ చేశారు. అమీర్ భారతీయుడు కావటం మనకు గర్వకారణమ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. 

పార్టీ ఆఫీస్ సీజ్ చేసేందుకు అఖిలేశ్ యత్నం: శివపాల్

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అఖిలేష్..బాబాయ్ శివపాల్ మధ్య హోరా హోరీ పోరాటం కొనసాగుతోంది.ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పోలీసులు సహకారంతో పార్టీ కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు అఖిలేశ్ యత్నిస్తున్నారని శివపాల్ ఆరోపిస్తున్నారు. 

ఎప్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

ఉత్తరప్రదేశ్ : లక్కోలోని సమాజ్ వాద్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్తత చోటుచేసుకుంది. అఖిలేశ్, శివపాల్ యాదవ్ వర్గీయులు భారీగా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయానికి అఖిలేశ్ వర్గీయులు తాళం వేసి శివపాల్ నేమ్ బోర్డు తొలగించారు. 

77వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన..

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 77వ అఖిలాభారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మెబైల్ ఏటీఎంలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

17:07 - January 1, 2017
17:01 - January 1, 2017

శ్రీకాకుళం: ఆ ప్రాంతం భయంకర మహమ్మారి చేతిలో చిక్కి విలవిల్లాడుతోంది. ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు... ఏకంగా మూడు దశాబ్దాలుగా అక్కడి జనాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాదిమంది జీవితాలతో చెలగాటమాడుకుంటోంది. ఆ మహమ్మారిని పారదోలుతామంటూ రాజకీయ నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ మహమ్మారిపై యుద్ధానికి సిద్ధమంటూ ఆ ప్రాంతానికి పయనమవుతున్నారు. ఇంతకీ ఎక్కడా ప్రాంతం.. ఏవరా మహమ్మారి... వాచ్‌ దిస్‌ స్టోరీ...

జీవచ్ఛవాల్లా బ్రతుకీడుస్తున్న అభాగ్యులు
వీరంతా కాలాతీతమై చనిపోయిన వారుకాదు. రోడ్డు ప్రమాదంలోనో, లేక కారణంచేతనో చనిపోలేదు. కేవలం ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇంకొంతమంది మంచాలకే పరిమితమయ్యారు. మరికొంతమంది ఆస్పత్రులచుట్టూ తిరుగుతున్నారు.

ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అంటేనే బాగా వెనుకబడిన ప్రాంతం. దీనికి తోడు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మూత్రపిండాల వ్యాధి అనే మహమ్మారి దశాబ్దాలుగా పట్టిపీడిస్తోంది. కవిటి, కంచిలి, సొంపేట, ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాలలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉంది. ఇంటికో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. ఇప్పటికే దీని బారినపడి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఎన్నో కుటుంబాల బతుకులు బుగ్గిపాలయ్యాయి. మూత్రపిండాల వ్యాధి తీవ్రతలోనే ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.

కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లో వ్యాధి తీవ్రత
ఉద్దానం ప్రాంత ప్రజలు ఏ చిన్నపాటి అనారోగ్యానికిగురైనా అది మూత్రపిండాల వ్యాధితో ముడిపడుతుండటంతో హడలిపోతున్నారు. జీవితంపై ఆశలు వదులుకుంటున్నారు. కిడ్నీ వ్యాధి సోకిందని తెలియగానే డయాలసిస్ తప్పనిసరి. వారానికి ఒకసారైనా డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం టెక్కలికిగానీ, శ్రీకాకుళం, విశాఖకుగానీ వెళ్లాల్సి వస్తోంది. డయాలసిస్‌తోపాటు మందులు, ఆపరేషన్లు, రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుంటే వారానికి 5వేల రూపాయలకు మించుతోంది. ఇది పేదలకు భారంగా మారింది. వారిదగ్గరున్న బంగారం, భూములు అమ్ముకొని మరీ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు.
మూడు దశాబ్దాలుగా ముప్పుతిప్పలు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నా ... ఈ వ్యాధి సోకడానికి కారణాలు గానీ.. ఎలా సోకుతుందన్న వివరాలుగాని తెలియడం లేదు. నివారణకు తీసుకోవాల్సిన చర్యలు , రోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. ఇది బాధితుల పాలిట శాపంలా మారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వేలల్లో మృతులు, లక్షల్లో రోగులు ఉన్నారన్నది అధికారిక గణాంకాలే తేల్చి చెబుతున్నాయి. గడచిన మూడు దశాబ్దాలుగా ఆరుసార్లు ముఖ్యమంత్రులు మారినా.. ఈ సమస్యకు కనీసం పరిష్కార మార్గాలు అన్వేషించాలన్న కనికరం కూడా ప్రభుత్వాలకు లేకపోయింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులకు ఇదొక ఎన్నికల అస్త్రంగా మారిపోయిందే తప్ప.. బాధితులకు ఎలాంటి ఓదార్పు, భరోసా కల్పించలేకపోయింది.

50 మందికిపైగా ఆస్పత్రుల్లో
ఉద్దాన ప్రాంతం లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు రెండువందల మంది దాకా సీరం కౌంటింగ్ టెస్ట్ లు చేయించుకుంటున్నారు. 50 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు.

ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లాం : ఎమ్మెల్యే అశోక్
ఉద్దానంలోని మూత్రపిండాల వ్యాధి సమస్యను ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక ఎమ్మెల్యే అశోక్‌ చెప్తున్నారు. స్థానికంగా డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు.

జనవరి 3న ఉద్దానంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన
ఉద్దానం ప్రాంతంలో ప్రజలను పట్టిపీడిస్తున్న మూత్రపిండాల వ్యాధి మహమ్మారిపై ప్రభుత్వంలో కదలిక తీసుకురావడానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. జనవరి 3న ఈ ప్రాంతంలో పర్యటించి వ్యాధిగ్రస్తులలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారని జనసేన నేతలు చెప్తున్నారు.మూత్ర పిండాల వ్యాధి సమస్యకు జనసేనాని పరిష్కారం చూపుతారా. ప్రభుత్వంపై సమస్య పరిష్కారానికి ఒత్తిడి పెంచుతారా. అసలు ఆ రోజు పవన్‌ ఏం చేస్తారు. ఆయన యాక్షన్‌ ప్లాన్‌ ఏంటో వేచి చూడాలి.

16:50 - January 1, 2017

టర్కీ: టర్కీలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పెను విషాదం జరిగింది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో అర్థరాత్రి ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 39 మంది మృతిచెందగా... 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది ఐసిస్ ఉగ్రవాదుల పనే అని ఇస్తాంబుల్‌ గవర్నర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

న్యూ ఇయర్‌ వేడుకల్లో టర్కీలో విషాదం ..అర్థరాత్రి నైట్‌క్లబ్‌లో బుల్లెట్ల వర్షం..
క్షణాల్లో 39 మంది మృతి, 40మందికి తీవ్రగాయాలు..ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునికిపోగా,.టర్కీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. ఇస్తాంబుల్‌లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 39 మంది మృతిచెందగా,. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శనివారం నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు జరుగుతుండగా..అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్‌లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది.

నైట్‌క్లబ్‌లో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు
న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగిందని ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 600 మంది నైట్ క్లబ్‌లో ఉన్నారు. దుండగుడు నైట్‌క్లబ్‌లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత నైట్‌క్లబ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గవర్నర్ వివరించారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరిపింది ఎంతమంది అన్న దానిపై ఇంకా స్పష్టతలేదన్న గవర్నర్‌.. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని అభిప్రాయపడ్డారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణ రక్షణ కోసం నైట్ క్లబ్ నుంచి జనాలంతా బయటకు పరుగులు తీశారు. క్లబ్బులో కాల్పులకు తెగబడిన నిందితుడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు.

16:40 - January 1, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం ప్రకటించిన నూతన సంవత్సర కానుకలను ప్రతిపక్షాలు తప్పుపట్టడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింది వడ్డీ రాయితీ, రైతులు, మహిళలు, వృద్ధులను ఆదుకునేందుకు ప్రధాని ప్రకటించిన వరాలపై ప్రతిపక్షాలు పెదవి విరవడం వారి దివాలాకోరు రాజకీయాలను నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:37 - January 1, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల ర‌ద్దుపై కాంగ్రెస్ సమ‌ర శంఖం పూరించింది. మోదీ చెప్పిన యాబై రోజుల గ‌డువు ముగియ‌డంతో.. ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి దిగాలని హస్తం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ అంతటా నిర‌స‌న‌ల‌తో ఊరు-వాడ‌ను ఏకం చేసేందుకు యాక్షన్‌ ప్లాన్ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఈ పోరులో రాహుల్‌ను రంగంలోకి దించేందుకు వ్యూహం రూపొందిస్తోంది.

పెద్ద నోట్ల ర‌ద్దుపై కాంగ్రెస్ స‌మ‌ర భేరీ
మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌.. కేంద్ర ప్రభుత్వ తీరునే తీవ్రంగా తప్పుపడుతోంది. ఇప్పటికే దీనిపై మోదీ తీరును రాహుల్‌గాంధీ ఎండగడుతూ వస్తున్నారు. దీనిపై ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్‌.. మోదీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ ఆక్రోష్‌ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు కూడా కొనసాగిస్తూ వస్తోంది.

జ‌వ‌వ‌రి 6 ,7 తేదీల్లో కలెక్టరేట్ల ముందు ఆందోళనలు
నోట్ల ర‌ద్దుపై మోదీ చెప్పిన 50 రోజుల గడువు ముగిసింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. చిల్లర కోసం ఇంకా సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీటన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా పోరును ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ రెఢీ అయింది. గాంధీభవన్‌లో పీసీసీ ఛీప్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయి విస్తృత సమావేశం జరిగింది. పెద్ద నోట్ల రద్దుపై మోదీ తీరుకు నిరసనగా సమర శంఖం పూరించింది. జనవరిలో నిరసనలతో హోరెత్తించేందుకు కార్యాచరణను ప్రకటించింది. జనవరి 6,7 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళనలు, 9న మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు పీసీసీ ప్రకటించింది. పనిలో పనిగా ఈ నిరసనల్లో రాహుల్‌ గాంధీ కూడా పాల్గొనేలా తెలంగాణ కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్న కాంగ్రెస్‌
నిరసన కార్యక్రమాలతో గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మోదీ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఏకం చేసి.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్‌ కొన్ని డిమాండ్లను ఉంచింది. తక్షణమే క్యాష్‌ విత్‌ డ్రా ఆంక్షలను ఎత్తివేయాలని, ప్రతి సామాన్యుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మోదీ...కనీసం 25 వేలు అయినా డిపాజిట్‌ చేయాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో చిరు వ్యాపారులకు టాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని, రబీలో పంట నష్ట పోయిన రైతులకు మద్దతు ధరపై 25 శాతం బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. మొత్తానికి ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు అండగా ఆక్రోష్‌ను వినిపించిన కాంగ్రెస్‌.. మోదీ పెట్టిన యాభై రోజుల గడువు దాటిపోవడంతో.. ఇక పూర్తి స్థాయి పోరుకు కాలు దువ్వేందుకు సన్నద్ధమవుతోంది. 

16:32 - January 1, 2017
16:30 - January 1, 2017

విజయవాడ : సాహిత్య రచనలను ప్రభుత్వం ప్రోత్సహించేందుకు విధాన నిర్ణయాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సాహితీ రచనల ప్రచురణకు ప్రభుత్వం ఆర్థిక సహాయ, సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన 28వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈనెల 11 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ప్రజల్లో నూతన ఆలోచనలను రేకెత్తించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.  

16:28 - January 1, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. లక్నోలో ఈరోజు పార్టీ జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలేష్‌ యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ , పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. జాతీయస్థాయి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వెళ్లొద్దని ఆయన లేఖ రాశారు. అయితే ములాయం ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ..శివపాల్‌సింగ్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధినేత ములాయం సింగ్‌ను సంప్రదించకుండా శివపాల్‌ యాదవ్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావడం శివపాల్‌కు ఇష్టంలేదన్నారు. అఖిలేశ్‌ జాతీయ అధ్యక్షుడు కావాలని జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అయితే రాంగోపాల్‌ యాదవ్ నిర్వహించిన ఈ సమావేశంపై గుర్రుగా ఉన్న శివపాల్‌ యాదవ్‌..కాసేపటి క్రితమే ములాయంసింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలు, తాజా పరిణాలపై ములాయంతో చర్చిస్తున్నారు. అఖిలేష్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేతతో ఎస్పీలో పరిస్థితి సద్దుమణిగినట్లు కన్పించిన తరుణంలో తాజా పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఆ కుటుంబం డ్రామాలాడుతోంది : వెంకయ్య

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ : ములాయం కుటుంబ నాట‌కం జ‌రుగుతోందని కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు వ్యాఖ్యానించారు. స‌మాజ్‌వాదీ పార్టీలో జ‌రుగుతున్న ఈ కుటుంబ డ్రామా కామెడీగా ఉంద‌ని, కొన్ని సార్లు మెలోడీగా అనిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. కానీ, చివ‌రికి ఓ విషాదంగా ముగుస్తుంద‌ని జోస్యం చెప్పారు. 

బంగారు తెలంగాణ కోసం కృషి : సీఎస్

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్ బాధతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నాపై నమ్మకం వుంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞలు తెలుపుతున్నానన్నారు. బంగారు తెలంగాణకోసం కృషి చేస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలుస్తుందని ఆశాభావరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర పదవీకాలన్నీ పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం స్పందించకపోవడంతో కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఎస్‌పీ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

శ్రీవారి సేవలో ప్రముఖులు..

తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్, ఎంపీ రాయపాటితోపాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.

15:48 - January 1, 2017

పొర్లుకట్ట ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య..

నెల్లూరు : పొర్లుకట్ట బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. కాగా ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా శనివారం నాడు నెల్లూరు జిల్లాలోని పొర్లుకట్టలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు  మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 14మందికి గాయాలయ్యాయి.వీరిని నారాయణ ఆసుపత్రికి తరలించి చికిత్సందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగురు పెరిగింది. 

15:16 - January 1, 2017

బ్రిటన్ : భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యంకు ప్రతిష్టాత్మక నైట్ హుడ్ పురస్కారం లభించింది. డీఎన్ఏ నిపుణుడిగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బాలసుబ్రహ్మణ్యం తమ సేవలు అందిస్తున్నారు. నెక్ట్స్ జనరేషన్ పై పరిశోధనల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. బాలసుబ్రహ్మణ్యంతో పాటు రియో ఒలింపిక్‌లో పతకాలు తెచ్చిన టెన్నిస్ స్టార్ ఆండి ముర్రే, అథ్లెట్ మో ఫెరాకు నైట్‌ హుడ్ పురస్కారానికి ఎంపికయ్యారు. నిన్న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్‌.. ఈ అవార్డులను అందించారు.

15:04 - January 1, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం ఏడు లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ నాయకుల్లో ఇది నూతనోత్సాహాన్ని నింపింది. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు పట్ల ఆసక్తి చూపని నేతలను పదవుల నుంచి తొలగించే అంశాన్ని తెలంగాణ టీడీపీ నాయకత్వం పరిశీలిస్తోంది.

భారీ సభ్యత్వ నమోదుతో నేతల్లో నూతనోత్సం
2016లో పార్టీ ఫిరాయింపులతో ఆటుపోట్లు ఎదుర్కొన్న తెలంగాణ టీడీపీకి చివర్లో సంతోషం మిగిల్చింది. పార్టీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలో టీడీపీ ముగిసిన అధ్యాయం అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్న తరుణంలో నమోదైన ఏడు లక్షల సభ్యత్వమే వీరికి సమాధానం చెప్పే విధంగా ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ ప్రాబవం కోల్పోయిందనుకుంటున్న తరుణంలో జరిగిన భారీ సభ్యత్వ నమోదు నేతల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది.

గతంలో జంట నగరాల్లోనే ఎక్కువ సభ్యత్వం
సాధారణ ఎన్నికలకు ముందు 2014లో జరిగిన సభ్యత్వ నమోదులో ఏడు లక్షల మంది సభ్యులుగా చేరారు. జంటనగరాల్లోనే ఎక్కువ సభ్యత్వం నమోదైంది. ఎన్నికల్లో ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో 15 మంది ఎమ్మెల్యేలు, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి పార్టీ ఫిరాయించి, టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో తెలంగాణ టీడీపీ కుదేలైంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ చరిత్ర ముగిసినట్టేనని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌ 1 నుంచి చేపట్టిన సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వచ్చింది. నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత పార్టీ నభ్యత్వ నమోదు కార్యక్రమం మందగించింది. అదే నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంతో సభ్యత్వ నమోదు వేగం పుంజుకుంది.

నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి
అయితే సభ్యత్వ నమోదు పట్ల పార్టీలోని కొందరు సీనియర్లు ఆసక్తి చూపలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్లు ఈ విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే జంటనగరాల పార్టీ ఇన్‌చార్జ్‌లుకూడా పార్టీ సభ్యత్వ నమోదులో పూర్తి స్థాయిలో శ్రద్ధపెట్టలేదని తెలంగాణ టీడీపీ నాయకత్వం గమనించింది. దీంతో వీరిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. మొత్తంమీద సభ్యత్వ నమోదు కార్యక్రమం కొన ఊపిరితో ఉన్న తెలంగాణ టీడీపీలో కొత్త జవసత్వాలు నింపినట్టు అయ్యిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. 

15:00 - January 1, 2017

అనంతపురం : రాయదుర్గం సమీపంలో పైతోట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శివప్ప, వన్నూరు స్వామిలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మహేష్‌, తిమ్మప్ప, రవిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో.. పైతోటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

14:58 - January 1, 2017

హైదరాబాద్ : నూతన సంవత్సరం తొలిరోజు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయం వద్ద గోవుకు పూజ నిర్వహించారు. ఈ గోవును స్థానిక కార్పొరేటర్‌ అత్తిలి అరుణ శ్రీనివాస్‌ దేవాలయానికి దానమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అనేక మంది అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

వేములవాడ రాజన్న ఆలయం భక్తుల రద్దీ..
దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా.. రాజన్న దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా ఆలయంకు చేరుకున్నారు. జిల్లా నుంచే కాకుండే రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 

14:55 - January 1, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. లక్నోలో ఈరోజు పార్టీ జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలేష్‌ యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ , పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. జాతీయస్థాయి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వెళ్లొద్దని ఆయన లేఖ రాశారు. అయితే ములాయం ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ..శివపాల్‌సింగ్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధినేత ములాయం సింగ్‌ను సంప్రదించకుండా శివపాల్‌ యాదవ్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావడం శివపాల్‌కు ఇష్టంలేదన్నారు. అఖిలేశ్‌ జాతీయ అధ్యక్షుడు కావాలని జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అయితే రాంగోపాల్‌ యాదవ్ నిర్వహించిన ఈ సమావేశంపై గుర్రుగా ఉన్న శివపాల్‌ యాదవ్‌..కాసేపటి క్రితమే ములాయంసింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలు, తాజా పరిణాలపై ములాయంతో చర్చిస్తున్నారు. అఖిలేష్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేతతో ఎస్పీలో పరిస్థితి సద్దుమణిగినట్లు కన్పించిన తరుణంలో తాజా పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

8.7 కిలోల పసిడి పట్టివేత..

హైదరాబాద్ : శ్రీలంకలోని మండపం నుంచి ఇండియాకు చేరవేస్తుండగా రూ.2.44 కోట్ల విలువ చేసే 8.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని రామేశ్వరం వద్ద సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 

నాపై ఎన్నో ఆరోపణలు చేశారు : అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ : తనపై ఎన్నో ఆరోపణలు చేశారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. కొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ ములాయంకే తన మద్దతు ఉన్నట్లు తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'మా తండ్రీకొడుకుల బంధాన్ని ఎవరూ విడదీయలేరని' చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వరుస ఉదంతాలతో పార్టీ నష్టపోతోందని వాపోయారు. ఎస్పీ అధికారంలోకి వస్తే ములాయం సంతోషిస్తారని తెలిపారు. ఈ ప్రభుత్వం మళ్లీ రావాలా... వద్దా ..? కార్యకర్తలే చెప్పాలన్నారు. 

 

13:54 - January 1, 2017

హైదరాబాద్ : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సికింద్రాబాద్‌లో 2 కె రన్‌ నిర్వహించారు. సికింద్రాబాద్ రసూల్‌పూరాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్‌టవర్ వరకూ రన్‌ కొనసాగింది. ఈ రన్‌లో సీపీఎం నాయకులు డీజీ నరసింహారావు, నంద్యాల నరసిసంహారెడ్డి, శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

13:53 - January 1, 2017

కరీంనగర్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర..కరీంనగర్‌లో 77వ రోజు కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర ఇవాళ జిల్లాలోని చిలుకూరు, చిన్నరాజుపల్లి, రంగాపూర్‌, చిరతపల్లి, హుజురాబాద్‌ బెంచికలపేట ఎక్స్‌రోడ్డు, కోతులనడుమ, వీరనారాయణపూర్‌, దండేపల్లిలో కొనసాగనుంది. 

 

13:50 - January 1, 2017

విజయవాడ : అనారోగ్య రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సర కానుకగా 'ఆరోగ్య రక్ష' పేరుతో కొత్త పథకాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించి.. ఫైల్‌పై  సంతకం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ పథకం కోసం ఫిబ్రవరి 28వరకు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనిలో నమోదైన ప్రతి వ్యక్తి నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద వ్యక్తిగతంగా రూ.2లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు. 

13:45 - January 1, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. లక్నోలో ఈరోజు పార్టీ జాతీయస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలేష్‌ యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ , పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. జాతీయస్థాయి సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వెళ్లొద్దని ఆయన లేఖ రాశారు. అయితే ములాయం ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఈ సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ..శివపాల్‌సింగ్‌ యాదవ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అధినేత ములాయం సింగ్‌ను సంప్రదించకుండా శివపాల్‌ యాదవ్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావడం శివపాల్‌కు ఇష్టంలేదన్నారు. అఖిలేశ్‌ జాతీయ అధ్యక్షుడు కావాలని జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అయితే రాంగోపాల్‌ యాదవ్ నిర్వహించిన ఈ సమావేశంపై గుర్రుగా ఉన్న శివపాల్‌ యాదవ్‌..కాసేపటి క్రితమే ములాయంసింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. సమావేశం వివరాలు, తాజా పరిణాలపై ములాయంతో చర్చిస్తున్నారు. అఖిలేష్‌, రాంగోపాల్‌ యాదవ్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేతతో ఎస్పీలో పరిస్థితి సద్దుమణిగినట్లు కన్పించిన తరుణంలో తాజా పరిణామాలు ఈ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారు : అఖిలేష్
తనపై ఎన్నో ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ ములాయంకే తన మద్దతు ఉన్నట్లు తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'మా తండ్రీకొడుకుల బంధాన్ని ఎవరూ విడదీయలేరని' చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వరుస ఉదంతాలతో పార్టీ నష్టపోతోందని వాపోయారు. ఎస్పీ అధికారంలోకి వస్తే ములాయం సంతోషిస్తారని తెలిపారు. ఈ ప్రభుత్వం మళ్లీ రావాలా... వద్దా ..? కార్యకర్తలే చెప్పాలన్నారు. 

13:42 - January 1, 2017

హైదరాబాద్ : తెలంగాణభవన్‌లో.. కొత్త సంవత్సర వేడుకలు సందడిగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత... ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు.. తెలంగాణ భవన్‌కు విచ్చేసి... సందడి చేశారు. ఈసందర్భంగా... రాష్ట్రప్రజలకు కవిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

13:40 - January 1, 2017

ప్రకాశం : ప్రజలకు వాస్తవాలను అందించడంలో వార్తాపత్రికలు, టీవీ చానళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన 10 టీవీ క్యాలెండర్‌ ను ఆవిష్కిరించారు. 

 

13:38 - January 1, 2017

రంగారెడ్డి : సామాజిక సమస్యలను ప్రజల దృష్టికి తేవడంలో 10 టీవీ ముందంజలో  ఉంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ అతిథి గృహంలో ఆయన 10 టీవీ 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 

 

'ఆరోగ్య రక్ష' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కృష్ణా : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'ఆరోగ్య రక్ష' పథకాన్ని ఆయన ప్రారంభించారు. గత సం.రాష్ట్రానికి సుస్థిరత తీసుకొచ్చిందన్నారు. 2017 సం.దాని కంటే మంచిగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. 

సమాజ్‌వాదీ పార్టీలో మరింత ముదిరిన వివాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు గంట గంటకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ లక్నోలో జరిగిన ఎస్పీ జాతీయస్థాయి సమావేశం నిర్ణయమించింది. 

13:33 - January 1, 2017

'నేను పుట్టకముందే దేశ ద్రోహుల జాబితాలో నమోదైఉంది నా పేరు. కన్నబిడ్డను సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర'.. అంటూ తెలుగులో ఓ కవితోద్యమానికి నాంది వాక్యం పలికిన కవి ఖాదర్ మొహిద్దీన్. 'పుట్టుమచ్చ' అనే కవితా సంకలనంతో తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయిగా నిలిచారు. ఆ సంకలనం వచ్చి పాతికేళ్లు అవుతున్న సందర్భం ఒకటైతే... ఆయన ఆరుణ్ సాగర్ అవార్డు అందుకోకపోవడం మరో విషయం. ఈ సందర్భంగా టెన్ టివి అక్షరం ఆయన్ను పలకరించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

13:20 - January 1, 2017
12:55 - January 1, 2017

విజయవాడ : పాజిటివ్ గా ఆలోచించే తత్వాన్ని అలవరుచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'ఆరోగ్య రక్ష' పథకాన్ని ఆయన ప్రారంభించారు. గత సం.రాష్ట్రానికి సుస్థిరత తీసుకొచ్చిందన్నారు. 2017 సం.దాని కంటే మంచిగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. మన శరీరాన్ని దుర్వినియోగం చేస్తే త్వరగా చనిపోతామన్నారు. వైద్యంలో అనేక రకమైన డెవలప్ మెంట్స్ లు వచ్చాయని తెలిపారు. జాగ్రత్తగా ఉంటే ఎక్కువ రోజులు బతుకుతామని... ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటామని అన్నారు. జెనటిక్ వల్ల క్యాన్సర్, బీపీ, షుగర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎక్కువగా బ్లడ్ రిలేషన్ పెళ్లిళ్లు చేసుకుంటే ఆరోగ్యం పరంగా సమస్యలు వస్తయన్నారు. లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమని చెప్పారు. ఆలోచనా విధానంలో టెన్షన్ వస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. పాజిటివ్ గా ఆలోచించే తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు.

12:41 - January 1, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు గంట గంటకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ లక్నోలో జరిగిన ఎస్పీ జాతీయస్థాయి సమావేశం నిర్ణయమించింది. రాంగోపాల్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అఖిలేష్‌తో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం అనంతరం అఖిలేష్‌ యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ..రాంగోపాల్‌యాదవ్‌ ప్రకటించారు. దాంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న శివపాల్‌ యాదవ్‌ను కూడా తొలగిస్తున్నట్లు రాంగోపాల్‌యాదవ్ ప్రకటించారు. అయితే అఖిలేష్‌ నిర్వహించిన జాతీయస్థాయి సమావేశాన్ని పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అఖిలేష్‌ నిర్వహించిన సమావేశానికి హాజరుకావొద్దంటూ పార్టీ నేతలకు ములాయం లేఖ రాశారు.  

 

ఎస్‌వీఆర్‌ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్‌...8 మందికి అస్వస్థత

విశాఖ : జిల్లాలోని పరవాడలోని ఎస్‌వీఆర్‌ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్‌ అయ్యాయి. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

12:38 - January 1, 2017

విశాఖ : జిల్లాలోని పరవాడలోని ఎస్‌వీఆర్‌ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్‌ అయ్యాయి. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్ పీ సింగ్ నియామకం

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్ పీ సింగ్ నియామకం అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ప్రదీప్ చంద్ర పదవీకాలాన్నీ కేంద్రం పొడిగించలేదు. నిన్నటితో ప్రదీప్ చంద్ర పదవీకాలం పూర్తి అయింది. 

12:12 - January 1, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజకీయ కుంపటి ఇంకా రగులుతూనే ఉంది. సీఎం అఖిలేష్‌ యాదవ్‌పై విధించిన సస్పెన్షన్‌ను ములాయంసింగ్‌ యాదవ్‌ ఎత్తివేసినా...ఇంకా పరిస్థితి చల్లారలేదు. కాసేపట్లో లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ కన్వెన్షన్‌ సమావేశం కానుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇదే వేదికగా...సీఎం అఖిలేష్‌ బలనిరూపణను సిద్ధమయినట్లు తెలుస్తోంది. అఖిలేష్‌ తీరుపై పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

 

12:05 - January 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ కొత్త చీఫ్‌ సెక్రటరీగా ఎస్‌పీ సింగ్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర పదవీకాలన్నీ పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై కేంద్రం స్పందించకపోవడంతో కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఎస్‌పీ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రస్తుత సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర కేవలం నెలరోజులు పనిచేసిన సీఎస్‌గా రికార్డు సృష్టించారు. అలాగే తెలంగాణ ఏసీబీ డీజీగా ఉన్న ఏకే ఖాన్‌ పదవీకాలం ముగియడంతో..ఆయన్ని మైనార్టీ సంక్షేమశాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా అరవింద్‌కుమార్‌ను నియమించింది. 

రాజ్ భనవ్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

హైదరాబాద్ : రాజ్ భనవ్ లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ కు డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.  

 

11:49 - January 1, 2017
11:46 - January 1, 2017

శ్రీకాకుళం : వేకువను కౌగిలించుకునే  శ్వేత వర్ణం...మంచు చాటున సూర్యోదయం... వణికించే చలి...పువ్వుల రేకులపై సందడి చేసే నీటి బిందువులు...మంచు తెరల్లో దోబూచులాడే చెట్లు.. ఎటుచూసినా.. హిమ సొగసులు.. శ్రీకాకుళం జిల్లాలో ఎటుచూసినా...ఈ దృశ్యాలు తారసపడుతున్నాయి. మనసులను మైమరిపిస్తున్నాయి. 
చలి గాలి 
చలి గాలి చూడు.. చంపేస్తుంది.. పొగమంచు చూడు తెగ మంచిది..అన్నాడో ఒక కవి.. మంచు దుప్పటిలో జోగుతున్న ఈ విభాతను చూస్తే  ఆ మాటలు కాదనలేమనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో దట్టమైన పొగమంచు కురుస్తోంది.. దీంతో చెట్లు.. పక్షులు...కొండలు.. కోనలు..మంచు తెరల్లో ఒదిగిపోతున్నాయి. చలి విజృంభణకు జిల్లావాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. మొత్తానికి మంచు.. చలితో కలగలిసిన.. ప్రకృతి సొబగులు అందరినీ అలరిస్తున్నాయి.  
పడిపోయిన ఉష్ణోగ్రతలు
జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి..  రెండు రోజుల నుంచి పట్టణ ప్రాంతంలో 16 డిగ్రీలు.. ఏజెన్సీ ప్రాంతంలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది... చలిపులి పంజా విసురుతోంది. దీంతో పొద్దున్న ఎనిమిది గంటల వరకు ఉదయాన్ని చూడలేని పరిస్థితి ఏర్పడింది. మంచుతెరలు కారణంగా పది అడుగుల దూరంలో ఉన్న వ్యక్తులు.. వాహనాలు  కూడా కనబడడం లేదు. దీంతో వాహన చోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి కారణంగా పిల్లలు.. వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మంచు కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని మార్నింగ్‌ వాకింగ్‌ వెళ్తున్న స్థానికులు అంటున్నారు.  
మాడిపోతున్న పంటలు
మంచు విపరీతంగా పడుతుండడంతో మామిడి, జీడి తోటలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. పూత దశలో ఉన్న పంటలు మాడిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఇప్పుడే ఇలా ఉంటే.. జనవరి, ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.

 

11:41 - January 1, 2017
11:36 - January 1, 2017

కృష్ణా : నేటి నుంచి విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు పేరుతో స్వరాజ్‌ మైదానంలో జరిగే బుక్‌ ఎగ్జిబిషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుస్తక ప్రియులకు ఇదో పెద్ద పండుగ.
పుస్తక ప్రదర్శనకు ముస్తాబైన స్వరాజ్‌ మైదానం 
బెజవాడ బందర్‌ రోడ్డులోని స్వరాజ్‌ మైదానం పుస్తక ప్రదర్శనకు ముస్తాబైంది. ఇరవై ఎనిమిదవ పుస్తక మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. బుక్‌  ఫెస్టివల్‌ సొసైటీతోపాటు, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, ఏపీ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా బుక్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి. పది రోజుల పాటు పుస్తకాల పండుగ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రదర్శనను   ప్రారంభిస్తారు. 
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మేథోమధన సదస్సులు 
ఈసారి నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. బాలల సాహిత్యాన్ని ప్రత్యేక అంశంగా చేర్చారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు మేథోమధన సదస్సులు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రముఖులు, రచయితల ఉపన్యాసాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సాహితీ సమాలోన చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావుతోపాటు, సాహితీవేత్త కొలకలూరి ఇనాక్‌ వంటి ప్రముఖలు హాజరు కానున్నారు. మొత్తం 360 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో 170 ప్రచురుణ సంస్థల స్టాళ్లు ఉన్నాయి.  బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు  మరికొన్ని స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పుస్తక ప్రదర్శన వేదికకు ప్రముఖ  సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పేరు పెట్టారు.  పుస్తక పఠనం పట్ల యువతకు ఆసక్తి కల్పించేందుకు పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహిస్తారు. 
పుస్తక ప్రదర్శనలు మాకు బాగా ఉపయోగం : విద్యార్థులు 
ఇలాంటి పుస్తక ప్రదర్శనలు తమకు బాగా ఉపయోగపడతాయని విద్యార్థులు చెబుతున్నారు. అన్నిరకాల పుస్తకాలు ఒకే చోట లభించే విధంగా ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి ఈనెల 11 వరకు జరిగే బుక్‌ ఫెస్టివల్‌కు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. 

11:32 - January 1, 2017

అనంతపురం : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనంతపురంలో స్వీట్లతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఏడాది స్వీట్లతో దేవతల విగ్రహాల తయారు చేయడం ఇక్కడ ఆనవాయితీ. నగరంలోని క్లాక్‌ టవర్‌ సమీపంలో షిరిడి సాయి స్వీట్‌ స్టాల్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల నుంచి ఇలా కొనసాగుతోంది. అయితే ఈ స్వీట్‌ దేవుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. 

 

11:06 - January 1, 2017

హైదరాబాద్‌ : న్యూ ఇయర్ వేళ... మందుబాబులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చెకింగ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు మందు బాబులను అదుపులోకి తీసుకున్నారు. 

 

11:03 - January 1, 2017

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న అవిభక్త కవలలు వీణా, వాణిలను తెలంగాణ ప్రభుత్వం స్టేట్‌హోంకు తరలించింది. ఇన్నాళ్లూ ఊహతెలిసినప్పటి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రిలోనే ఉన్న తమను ఉన్నఫలంగా స్టేట్‌హోంకు తరలించడంపై వీణా వాణిలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము నీలోఫర్‌ ఆసుపత్రిలోనే ఉంటామని..స్టేట్‌హోంకు వెళ్లమని చెప్పినా..అధికారులు మాత్రం..వారిని స్టేట్‌హోంకు తరలించింది. అయితే వీరిని స్టేట్‌హోంకు తరలిస్తున్నారన్న సమాచారాన్ని అధికారులు తల్లిదండ్రులకు ఇవ్వలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:01 - January 1, 2017
10:58 - January 1, 2017

చిత్తూరు : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు పోటెత్తారు. దీంతో తిరుమల గిరులు భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. టిటిడి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఇతర ప్రముఖులు దర్శించుకున్నారు. మరోవైపు నూతన సంవత్సరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో భక్తుల రద్దీకి తగ్గట్లుగా టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. 

 

అవిభక్త కవలలు వీణ, వాణీలను స్టేట్ హోంకు తరలింపు

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణ, వాణీలను స్టేట్ హోంకు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా వారిని తరలించింది. అధికారులు తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు. నీలోఫర్ ను వదిలి వెళ్లలేమని గతంలో వీణ, వాణీలు కన్నీరుపెట్టుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీణ, వాణి నీలోఫర్ లోనే ఉంటున్నారు. 

నిన్నటితో ముగిసిన తెలంగాణ సీఎస్ ప్రదీప్ చంద్ర పదవీకాలం

హైదరాబాద్ : నిన్నటితో తెలంగాణ సీఎస్ ప్రదీప్ చంద్ర పదవీకాలం ముగిసింది. కేంద్రం నుంచి పదవి పొడిగింపు నిర్ణయం రాలేదు.   

09:35 - January 1, 2017

ఢిల్లీ : కరెన్సీ కోసం కష్టాలు పడుతున్న ప్రజలకు.. స్వల్ప ఊరట లభించింది. ఇవాల్టి నుంచి ఏటీఎంలో 4,500 విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ నిబంధన అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. అయితే..వారానికి 24 వేలు విత్‌ డ్రా చేసుకునే  పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. 

 

09:32 - January 1, 2017
09:31 - January 1, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో వివాదం సర్దు మణిగింది. తండ్రి, కొడుకుల మధ్య వార్‌ ముగిసింది. అధినేత ములాయం, సీఎం అఖిలేష్‌ యాదవ్‌లు మళ్లీ ఏకమయ్యారు. కొడుకు, తమ్ముడిపై విధించిన వేటును ములాయం ఎత్తేశారు. దీంతో గత కొద్ది రోజులుగా సమాజ్‌వాదీ పార్టీలో నేతల మధ్య 24గంటలుగా సాగిన డ్రామాకు తెరపడింది.
అధికార పార్టీలో హైడ్రామా
ఉత్తర ప్రదేశ్‌ అధికార పార్టీలో హైడ్రామాకు తెర పడింది. ఆజాం ఖాన్‌ మధ్యవర్తిత్వం ఫలించింది. సీఎం అఖిలేష్‌  యాదవ్‌, రాంగోపాల్‌  యాదవ్‌లపై సస్పెన్స్ ఎత్తివేశారు. ములాయం ఆదేశాల మేరకు ఇరువురిపై బహిష్కరణ ఎత్తివేస్తున్నట్లు  ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌ పాల్ యాదవ్ ప్రకటించారు. అఖిలేష్‌, రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి 24గంటలు గడవక ముందే ఫ్యామిలీ డ్రామాకు ఎండ్ కార్డు పడింది. 
షోకాజ్ నోటీస్ ఎత్తివేత 
సీఎం అఖిలేష్‌ యాదవ్‌, ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రకటించారు. పార్టీ నుంచి బహిష్కరణ నేపథ్యంలో అఖిలేశ్‌ తన నివాసంలో.. శనివారం ఉదయం అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయగా 229 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీంతో పార్టీ నేత ఆజాం ఖాన్‌ రంగంలోకి దిగి చర్చలు జరిపారు. షోకాజ్ నోటీస్ ఎత్తేసేందుకు ములాయం అంగీకరించడంతో... సమస్య టీకప్పులో తుపానుగా చల్లబడింది. 
గత కొద్ది రోజులుగా తండ్రి, కొడుకుల మధ్య వార్‌  
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి, కొడుకుల మధ్య వార్‌ గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను ములాయం సింగ్‌ రెండు రోజుల క్రితం విడుదల చేశారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేశ్‌ సొంతంగా గురువారం రాత్రి 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం షోకాజు నోటీసులు పంపించారు. మీడియా ఎదుట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌కు షోకాజ్‌ నోటీసులు పంపించారు. మొత్తం మీద నాటకీయ పరిణామాల మధ్య అనిశ్చితికి తెరపడటంతో... పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపరి పీల్చుకున్నారు. 

 

రాయదుర్గం పైతోట వద్ద రోడ్డు ప్రమాదం

అనంతపురం : రాయదుర్గం పైతోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బళ్లారి నిమ్స్ కు తరలించారు. 

 

నేటి నుంచి గుంటూరు జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు

గుంటూరు : నేటి నుంచి జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సహృదయ ట్రస్టు, ప్రభుత్వ ఆధ్యర్యంలో ఆపరేషన్లు చేయనున్నారు. 

08:45 - January 1, 2017

చెన్నై : జయలలిత ఆశయం కోసం పని చేస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళానటరాజన్‌ అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జయలలిత మరణంతో అనాథలా మారామాని శశికళ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితం అమ్మకోసమేనని ఆమె స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్‌ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. పోయెస్‌ గార్డెన్‌ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి.. ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య నేతల సమక్షంలో పార్టీ చీఫ్ కుర్చీలో ఆమె కూర్చున్నారు.
'అమ్మ' ఆశయాలను నెరవేరుస్తాం : శశికళ 
జయలలితతో తన బంధం 33 ఏళ్లనాటిదని చిన్నమ్మ గుర్తు చేసుకున్నారు. జయలలిత మరణంతో అనాథలా మారామని శశికళ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల కోసమే అన్నాడీఎంకే ఉందన్నారు. జయలలిత మరణానంతరం శశికళ తొలిసారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితం అమ్మకోసమేనని.. 'అమ్మ' ఆశయాలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. 'అమ్మ' మనతో లేకపోయినా అన్నాడీఎంకే పార్టీ వందేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తుందన్నారు. అమ్మే మన ధైర్యం, శక్తి అని శశికళ అన్నారు. జయలలిత ఎప్పటికీ పార్టీ కార్యకర్తల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆమె స్థానం మరో వెయ్యేళ్లైనా ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ఆమె మరణాన్ని వూహించలేదని అమ్మ కోలుకుంటున్న సమయంలో గుండెపోటు వచ్చిందని వివరించారు.
జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికైన రెండో మహిళ శశికళ
అన్నాడీఎంకే ఆరో జనరల్‌ సెక్రెటరీగా ఎన్నికైన శశికళ ఆ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ. ఆమె వయసు 62 సంవత్సరాలు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రులు, ఎమ్మెల్యేలు హారజయ్యారు. 

 

08:41 - January 1, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది. అలిపిరి తరహాలో బాబుపై దాడికి కుట్ర జరుగుతోందన్న అనుమానాలకు బలం పెరుగుతోంది. గత కొద్ది కాలంగా మౌనంగా ఉన్న మావోయిస్టులు భారీ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా..? చంద్రబాబు టార్గెట్‌గా మావోయిస్టులు ప్లాన్‌ చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చంద్రబాబుపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. 
చంద్రబాబుపై మవోయిస్టులు రెక్కీ 
ఏపీ సీఎం చంద్రబాబుపై మవోయిస్టులు రెక్కీ నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం బాబుపై దాడిచేసేందుకు ప్రయత్నించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనిపై ఢిల్లీ పోలీసుల నుంచి ఏపీ పోలీసులకు ఓ నివేదిక వచ్చింది. ఇప్పటికే ఏపీ భవన్‌‌లో ఆరు సార్లు మావోయిస్టులు రెక్కీ నిర్వహించినట్లుగా ఆ నివేదికలో  పేర్కొన్నారు. మీడియా పేరుతో చంద్రబాబుపై దాడి చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. 
ఏపీ భద్రతా లోపాలున్నట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు  
చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు భద్రతా సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ పోలీసులు పదే పదే హెచ్చరించారు. భవన్‌లో భద్రతా లోపాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఇకపై చంద్రబాబును కలవడానికి వచ్చే మీడియా మిత్రులు, పార్టీ నేతలను ఏపీ భవన్‌‌లోనికి రానివ్వకూడదని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.
ఆ మాట వాస్తవమే : డిజిపి 
చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం వచ్చిన మాట వాస్తవమేనన్నారు డిజిపి సాంబశివరావు. ఢిల్లీలోని ఏపీ భవన్ పరిసరాల్లో చంద్రబాబు టార్గెట్‌గా మావోయిస్టులు రెక్కీ నిర్వహించిన సమాచారం మాత్రం తమకు అందలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంటామని... అవసరమైతే సెక్యూరిటీని పెంచుతామన్నారు డిజిపి. ఇటీవల ఏవోబీలో ఎన్ కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నెలరోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.
చంద్రబాబు టార్గెట్‌ చేసిన మావోయిస్టులు 
ఎప్పటి నుంచో మావోయిస్టులు చంద్రబాబును టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇటీవల సీమ జిల్లాల్లో పర్యటించిన బాబు ప్రతి కదలికను మావోయిస్టులు పరిశీలించినట్లు నిఘా వర్గాలు తేల్చేశాయి. తాజా నివేదికలతో... ఇక నుంచి మీడియా మిత్రులను ఏపీ భవన్‌‌లోకి అనుమతించొద్దని అధికారులకు సూచించారు. ఇకపై ఏం జరిగినా మాకు సంబంధం లేదని... తాము చెప్పాల్సి చెప్పామంటూ ఢిల్లీ పోలీసులు తేల్చేశారు.

 

08:35 - January 1, 2017

విజయవాడ : నూతన సంవత్సరం కానుకగా... ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించడానికి  ఏపీ ప్రభుత్వం  కొత్త ఆరోగ్య పథకాలు తీసుకొస్తోంది. అందరికీ ఆరోగ్యం కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.  మార్చి నుంచి ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కేంద్రం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాదికి ఒక్కొక్కరికి 1200 రూపాయల చొప్పున వైద్య బీమా సౌకర్యం కల్పిస్తూ క్యాబినెట్‌ నిర్ణయించింది. ఆరోగ్య రక్షా పథకంలో కుటుంబంలోని ప్రతిఒక్కరు నెలకు 100 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే ఒక్కొక్కరికి 2లక్షల రూపాయల వైద్యబీమా సౌకర్యం పొందవచ్చారు. విజయవాడలో ఆదివారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 
చుక్కల భూముల సమస్యకు ప్రత్యేక చట్టం 
ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చుక్కల భూముల సమస్యకు ప్రత్యేక చట్టం తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూ సేకరణ చట్టానికి సవరణ చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. గండికోట నిర్వాసితులకు 479 కోట్లు పరిహారం చెల్లించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూ సేకరణ చేసినా.. ఇంకా కొంత భూమిని సేకరించాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ఇక తిరుపతిలో ఉన్న కొన్ని స్లమ్‌ ప్రాంతాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో..ప్రభుత్వం పీపీపీ పద్దతిలో సూపర్‌ మోడల్‌ కాలనీలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది.  
2016.. ఏపీ చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం 
ఇక 2016 సంవత్సరంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2016 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మర్చిపోలేని,.ఏడాదిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 
అమరావతి..ఓ శక్తిపీఠం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి..ఓ శక్తిపీఠంగా తయారైందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర జలాలు, మట్టిని తీసుకురావడంవల్ల అమరావతి పునీతమైందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 
దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఏపీ : సీఎం చంద్రబాబు  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలుపుతామన్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమిస్తుందన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమకు ఉన్న కరవును శాశ్వతంగా పారద్రోలతామని హామీ ఇచ్చారు. 

08:28 - January 1, 2017

కృష్ణా : విజయవాడలో ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సమ్మెకు మద్దతుగా శర్మ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. షుగర్‌, బీపీ లెవల్స్‌ పడిపోయాయి. దీంతో అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను కాంట్రాక్ట్‌ లెక్చరర్లు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. శర్మను ఆస్పత్రికి తరలించారు. అయితే.. సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులు చేస్తే.. ఊరుకునేది లేదని.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు హెచ్చరించారు. 

 

08:25 - January 1, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల ర‌ద్దుపై కాంగ్రెస్ సమ‌ర శంఖం పూరించింది. మోదీ చెప్పిన యాబై రోజుల గ‌డువు ముగియ‌డంతో.. ఇక పూర్తి స్థాయిలో గ్రౌండ్ లోకి దిగాలని హస్తం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ అంతటా నిర‌స‌న‌ల‌తో ఊరు-వాడ‌ను ఏకం చేసేందుకు యాక్షన్‌ ప్లాన్ ప్రకటించిన కాంగ్రెస్‌.. ఈ పోరులో రాహుల్‌ను రంగంలోకి దించేందుకు వ్యూహం రూపొందిస్తోంది.  
దేశవ్యాప్తంగా నిరసనలు
మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌.. కేంద్ర ప్రభుత్వ తీరునే తీవ్రంగా తప్పుపడుతోంది. ఇప్పటికే దీనిపై మోదీ తీరును రాహుల్‌గాంధీ ఎండగడుతూ వస్తున్నారు. దీనిపై ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్‌.. మోదీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ ఆక్రోష్‌ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు కూడా కొనసాగిస్తూ వస్తోంది.  
పోరు ఉధృతం 
నోట్ల ర‌ద్దుపై మోదీ చెప్పిన 50 రోజుల గడువు ముగిసింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతూనే ఉన్నారు. చిల్లర కోసం ఇంకా సామాన్యులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వీటన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా పోరును ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్‌ రెఢీ అయింది. గాంధీభవన్‌లో పీసీసీ ఛీప్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయి విస్తృత సమావేశం జరిగింది. పెద్ద నోట్ల రద్దుపై మోదీ తీరుకు నిరసనగా సమర శంఖం పూరించింది. జనవరిలో నిరసనలతో హోరెత్తించేందుకు కార్యాచరణను ప్రకటించింది. జనవరి 6,7 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళనలు, 9న మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో  ధర్నాలు నిర్వహించనున్నట్లు పీసీసీ ప్రకటించింది. పనిలో పనిగా ఈ నిరసనల్లో రాహుల్‌ గాంధీ కూడా పాల్గొనేలా తెలంగాణ కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది.  
కాంగ్రెస్‌ డిమాండ్లు
నిరసన కార్యక్రమాలతో గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మోదీ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఏకం చేసి.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్‌ కొన్ని డిమాండ్లను ఉంచింది. తక్షణమే క్యాష్‌ విత్‌ డ్రా ఆంక్షలను ఎత్తివేయాలని, ప్రతి సామాన్యుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న మోదీ...కనీసం 25 వేలు అయినా డిపాజిట్‌ చేయాలని  డిమాండ్ చేసింది. అదే సమయంలో చిరు వ్యాపారులకు టాక్స్‌ మినహాయింపు ఇవ్వాలని, రబీలో పంట నష్ట పోయిన రైతులకు మద్దతు దరపై 25  శాతం బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. మొత్తానికి ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు అండగా ఆక్రోష్‌ను వినిపించిన కాంగ్రెస్‌.. మోదీ పెట్టిన యాభై రోజుల గడువు దాటిపోవడంతో.. ఇక పూర్తి స్థాయి పోరుకు కాలు దువ్వేందుకు సన్నద్ధమవుతోంది.  

 

08:20 - January 1, 2017

హైదరాబాద్ : నూతన సంవత్సరానికి ప్రపంచం ఘనంగా స్వాగతం పలికింది. 2016కు వీడ్కోలు పలుకుతూ పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అదే జోష్‌తో న్యూఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కం చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా  న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. బాణాసంచా కాంతుల్లో ప్రముఖ నగరాలు వెలిగిపోయాయి.
ఆస్ట్రేలియా
కొత్త ఆశలు, కొత్త కలలను మోసుకొస్తున్న 2017 సంవత్సరానికి ప్రపంచం ఘన స్వాగతం పలికింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ప్రారంభవేడుకలు అంబరాన్నంటాయి. సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జిపై ఎగిసిన భారీ బాణాసంచా కాంతులతో ఆకాశం సప్తవర్ణశోభితంగా మారింది. ఈ మధుర క్షణాల్లో భాగస్వాములయ్యేందుకు, ఉత్సాహంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు దాదాపు 15 లక్షల మంది ఒక్కచోటికి చేరారు. 
జపాన్‌లో 
జపాన్‌లో 2017కు ప్రజలు తమదైన శైలిలో స్వాగతం పలికారు. వీధుల్లో చేరి గాలి బుడగలు ఆకాశంలోకి విడిచారు. భారీ టపాసులు ఏల్చుతూ సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు కలర్‌ఫుల్‌గా సాగాయి.
రష్యాలో
న్యూఇయర్‌ సెబ్రేషన్స్‌ను రష్యా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మాస్కో నగరంలో భారీగా జనం గుమిగూడారు. ఒకరికొకరు విషెస్‌ చెప్పుకున్నారు. బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
న్యూజిలాండ్‌లో
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో న్యూఇయర్‌ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.  ఆక్లాండ్‌లోని స్కై టవర్‌పై పేల్చిన బాణాసంచా కనువిందు చేసింది. అందరినీ కట్టిపడేసింది.  500 కిలోల బాణాసంచాను కేవలం 5 నిమిషాల్లోనే కాల్చారు. 
చైనాలో
ఇక చైనాలోని షాంఘై నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. అత్యంత ఎత్తైన భవనంపై భారీగా బాణాసంచా కాల్చారు.  అత్యంత అద్భుతంగా బాణాసంచా  మిరుమిట్లు గొలుపుతూ అందరినీ కట్టిపడేసింది. బాణసంచా కాంతులు చూడడానికి రెండు కళ్లు చాలవన్నట్టుగా సాగింది.
సింగపూర్‌ లో 
ఇక సింగపూర్‌ ప్రజలు న్యూఇయర్‌ జోష్‌లో మునిగితేలారు. నూతన సంవత్సరానికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం చెప్పారు. పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ న్యూఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కం చెప్పారు. సాగర తీరాన్న పేల్చిన బాణసంచా నయనానందంగా సాగింది.

08:15 - January 1, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో  నూతన సంవత్సర  వేడుకలు అంబరాన్నంటాయి.  న్యూఇయర్‌కు తెలుగు ప్రజలు గ్రాండ్‌గా వెల్‌కం పలికారు.  యూత్‌ డ్యాన్సులు, కేరింతలతో హోరెత్తించారు.  కేక్‌ కట్‌చేసి, పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. అర్ధరాత్రి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
హైదరాబాద్‌లో 
కోటి ఆశలతో  తెలుగు రాష్ట్రాల ప్రజలు 2017 సంవత్సరానికి స్వాగతం పలికారు. 2016కు వీడ్కోలు పలికారు.  హైదరాబాద్‌లో పార్టీలు, పబ్‌లలో యూత్‌ న్యూఇయర్‌ను తెగ ఎంజాయ్‌ చేసింది. ఆటపాటలతో హోరెత్తించింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్‌ చేశారు.  అర్ధరాత్రి ఎక్కడ చూసినా న్యూఇయర్‌ జోషే కనిపించింది. నగర రోడ్లపై తిరుగుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి యూత్‌ బైక్‌లపై తిరుగుతూ సందడి చేశారు.  బాణాసంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీలు, పబ్బులు, రిసార్ట్స్‌, హోటల్స్‌ న్యూఇయర్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాయి.
విజయవాడలో
విజయవాడలో న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. పలుచోట్ల న్యూఇయర్‌ పార్టీలు గ్రాండ్‌గా జరిగాయి. బెంజిసర్కిల్‌లాంటి ప్రధాన  కూడళ్ల దగ్గర చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా చిందేశారు. బాణసంచా కాల్చుతూ న్యూఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కం చెప్పారు. హోటల్స్‌, రిసార్ట్స్‌, ఫంక్షన్‌హాల్స్‌లోనూ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ హుషారుగా సాగాయి. కొత్త సంవత్సరం సందర్భంగా  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
గుంటూరులో
గుంటూరులోనూ న్యూఇయర్‌ జోష్‌ కొనసాగింది.  2016కు వీడ్కోలు పలుకుతూ 2017కు ఘనంగా స్వాగతం పలికారు.  చిన్నాపెద్దా న్యూఇయర్‌ సంబరాల్లో మునిగిపోయారు.  రాక్‌ మ్యూజిక్‌, డీజే సౌండ్స్‌తో కేక పుట్టించారు. పాటలకు చిందేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలుచోట్ల న్యూఇయర్‌ పార్టీలు కలర్‌ఫుల్‌గా సాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విశాఖలో 
విశాఖలో న్యూఇయర్‌ వేడుకల్లో యూత్‌ సందడి చేసింది. అర్ధరాత్రి రోడ్లపై భారీగా చేరిన యువకులు... ఒకరికొకరు విషెస్‌ చెప్పుకున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతూ కేరింతలతో హోరెత్తించారు. న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతూ పేల్చిన బాణాసంచా కనువిందు చేసింది.
తిరుపతిలో 
ఇక తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. పలుచోట్ల నిర్వహించిన న్యూఇయర్‌ పార్టీల్లో ఆడ-మగ, చిన్నా- పెద్దా అన్న తేడాలేకుండా కలిసి చిందేశారు.  ఆనందోత్సాహాల మధ్య న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కం పలికారు.  కొత్త సంవత్సరం అందరికీ విజయాలను అందించాలని ఆకాంక్షించారు.
శ్రీకాకుళంలో
శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించారు.  ముఖ్యంగా జిల్లా కేంద్రం లో వేడుకలు ఘనంగా జరిగాయి. పలు హోటల్లలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్టిసి కాంప్లెక్స్, డే అండ్ నైట్ జంక్షన్.. ఏడు రోడ్ల కూడలి, పాత బస్టాండు, రామలక్ష్మణ జంక్షన్ ల వద్ద కుర్రకారు  హోరేత్తించింది.  ద్విచక్ర వాహానాలతో యువకులు కేరింతలతో పట్టణమంతా కలియతిరిగారు. పలు స్కూళ్ళలో విద్యార్ధులు నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ముగ్గుల పోటీలతో హుషారుగా నూతన ఆంగ్ల సంవత్సరాదిని ఆహ్వానం పలికారు. 
అనంతపురంలో
అనంతపురంలో క్లాక్ టవర్ సమీపంలో షిరిడి సాయి స్వీట్ స్టాల్  న్యూఇయర్‌ సందర్బంగా స్వీట్లతో దేవతల విగ్రహాలను తయారు చేయటం ఆనవాయితి. ఈ సంవత్సరం కూడా  8 రకాల స్వీట్లతో.. 45 కిలోల బరువు కలిగిన 4 అడుగుల అయ్యప్ప స్వామి ని తయారు చేశారు. గత 14 ఏళ్లుగా స్వీట్లతో దేవతామూర్తులను తయారుచేస్తున్నామని స్వీట్‌ షాపు యజమాని భవానీకుమార్‌ తెలిపారు. కరవుసీమ అయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడాదైనా వర్షాలు బాగా పడి.. పంటలు బాగా పండే విధంగా అయ్యప్పస్వామి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు. 

 

08:06 - January 1, 2017

టర్కీ : ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునికిపోగా, టర్కీలో విషాదం చోటుచేసుకుంది. ఇస్తాంబుల్ లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35మంది మృతిచెందగా, మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్‌లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 500 మంది నైట్ క్లబ్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. శాంతాక్లాజ్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు నైట్‌క్లబ్‌లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కూడా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం నైట్‌క్లబ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరిపింది ఎంతమంది అన్న దానిపై ఇంకా స్పష్టతలేదు. అయితే ఇది కచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ అభిప్రాయపడ్డారు. నిందితుడి కోసం పోలీసులు విస్త్రతగా గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నేటి నుంచే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచులు

రాజ్కోటి : నేటి నుంచే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచులు. ముంబైలో తమిళనాడు, గుజరాత్ తో జార్ఖండ్ అమీతుమీకి సిద్ధమైంది. 

ఇస్తాంబుల్ లో న్యూఇయర్ వేడుకల్లో విషాదం

టర్కీ : ఇస్తాంబుల్ లో న్యూఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నైట్ క్లబ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. శాంతాక్లాజులో రూపంలో వచ్చి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. 

 

Don't Miss