Activities calendar

02 January 2017

21:47 - January 2, 2017
21:43 - January 2, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో సైకిల్‌ వార్‌ మొదలైంది. పార్టీ గుర్తు సైకిల్‌ కోసం ఇవాళ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసిన ములాయం.. రేపు సీఈసీని కలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సైకిల్‌ గుర్తు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయం కీలకంగా మారింది. ఎస్పీ ములాయం, అఖిలేష్‌ గ్రూపులుగా చీలిపోవడంతో ఇరువర్గాలు పార్టీ సింబల్‌ సైకిల్‌పై కన్నేశాయి. పార్టీ గుర్తు సైకిల్ కోసం రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

అపుడు మామ అళ్లుళ్ల మధ్య..ఇపుడు తండ్రీ కొడుకుల మధ్య వార్‌
ఎస్పీ అంతర్గత పోరు అప్పటి టిడిపి ఉదంతాన్ని గుర్తు తెస్తున్నాయి. అపుడు మామ అళ్లుళ్ల మధ్య జగడం కాగా...ఇపుడు తండ్రీ కొడుకుల మధ్య వార్‌ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరో సారూప్యమేమింటంటే ఇటు టీడీపీ, అటు ఎస్పీ గుర్తులు సైకిల్‌ కావడం గమనార్హం. 1995లో అప్పటి సిఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుపై సొంత అల్లుడు చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేశారు. 1995 ఆగస్టులో తొమ్మిదిరోజులపాటు నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం టీడీపీ అధ్యక్ష పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ను తప్పించి చంద్రబాబు పదవులు చేపట్టారు. యూపీలో పరిస్థితి వేరు. సిఎంగా అఖిలేష్‌ను తండ్రే స్వయంగా నియమించారు.

బాబాయ్‌-అబ్బాయ్‌, తండ్రి కొడుకుల మధ్య వార్‌
సమాజ్‌వాదీ పార్టీలో గత కొంతకాలంగా బాబాయ్‌-అబ్బాయ్‌, తండ్రి కొడుకుల మధ్య వార్‌ కొనసాగుతోంది. ములాయం ప్రకటించిన అసెంబ్లీ సీట్ల జాబితాలో అఖిలేష్‌ సన్నిహితులకు టికెట్లు లభించకపోవడంతో విభేదాలు మరింత భగ్గుమన్నాయి. ఆదివారంలో లక్నోలో నిర్వహించిన సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేశ్‌ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో సంక్షోభం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కుమారుడిపై ములాయం యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే పార్టీపై తనకు పట్టుందంటూ అఖిలేశ్‌ కూడా ఆధారాలు సమర్పించేందుకు రెడీ అవుతున్నారు. ఈసీ సైకిల్‌ గుర్తును ఎవరికి కేటాయిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

 

21:39 - January 2, 2017

గుంటూరు : స్విస్‌ ఛాలెంజ్‌పై ఏపీ సర్కార్ కొత్త జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సవరణలు చేస్తూ మరో జీవో విడుదల చేసింది. ఇందులో కొత్తగా టెండర్ ఎవల్యూయేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి అంతర్జాతీయ టెండర్లు పిలవటానికి రంగం సిద్ధమైంది.

అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ ఏకపక్ష ధోరణి
అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూములను సింగపూర్‌ కంపెనీలకు భూములు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏకపక్షంగా వ్యవహరించింది. దీనికి ఇటీవలే హైకోర్టు బ్రేక్‌ వేసింది. దీంతో ధర్మాసనం తప్పుపట్టిన అంశాలను సవరిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి విదేశీ కంపెనీలకు టెండర్లు పిలవనున్నారు. ఈ సవరణ ఉత్తర్వులతో మాస్టర్‌ డెలపర్‌ ఎంపికకు సీఆర్డీఏ మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. దీంతో రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లు మరోసారి పిలిచేందుకు మార్గం ఏర్పడింది. ఈసారి టెండర్‌ ఎవల్యూషన్‌ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అమరావతి నిర్మాణం 3దశల్లో పూర్తి చేస్తామన్న సింగపూర్‌ సంస్థలు
ఏపీ నూతన రాజధాని అమరావతిలో అభివృద్ధి ప్రాజెక్ట్‌ను మూడు దశల్లో పూర్తి చేస్తామని గతంలో సింగపూర్‌ కన్సార్టియం అసెండాస్‌ సిన్‌బ్రిడ్జ్‌ స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలో స్పష్టం చేసింది. 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 1691 ఎకరాలను మొత్తం మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తామని తెలిపింది. తొలిదశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాల్లో పూర్తి చేస్తామని పేర్కొంది. ప్రజోపయోగ మౌలిక సదుపాయాలను 20 ఏళ్లపాటు అందిస్తామని కన్సార్టియం స్పష్టం చేసింది.

అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌ విఫలమైతే పరిహారం బాధ్యత ప్రభుత్వానిదే
అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌ ఒకవేళ విఫలమైతే నష్టపరిహారం ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఏ కారణాలతోనైనా నిర్మాణం నిలిచిపోతే అప్పులతో పాటు పెట్టుబడి చెల్లించాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలో సింగపూర్‌ కన్సార్టియం స్పష్ట పరిచింది. ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన అప్పులను పూర్తిగా చెల్లించడంతో పాటు పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీతో పరిహారం అందజేయాలని పేర్కొంది. అంతేకాదు.. రాజకీయ కారణాలతో ప్రాజెక్టును నిలిపివేయాల్సి వస్తే పెట్టుబడిపై 16శాతం వడ్డీచొప్పున లెక్కట్టి.. దానిపై 150శాతం అదనంగా చెల్లించాలని మెలిక పెట్టింది. అయినా ఇవన్నీ ప్రభుత్వానికి పట్టలేదు.

సింగపూర్‌ సంస్థలవైపే మొగ్గుచూపిన ప్రభుత్వం
స్విస్‌ ఛాలెంజ్‌ ముసుగులో నామినేషన్‌పై సింగపూర్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. భవిష్యత్తులో పరిహారాలు చెల్లించాల్సి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం పణంగా పెట్టింది. ఎస్క్రో అకౌంట్‌ తెరిచేందుకు సింగపూర్ సంస్థలు అంగీకరించకపోయినా వీటిని ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోకుండానే విదేశీ కంపెనీలకు దాసోహమైంది.

సింగపూర్‌ సంస్థలు పెట్టే పెట్టుబడి రూ.306.40 కోట్లు మాత్రమే
రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ సంస్థలు పెట్టే మూలబడి కేవలం 306.40 కోట్లు మాత్రమే. రాజధాని భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణంగా మిగతా పెట్టుబడులు సేకరిస్తాయి. ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రాజధాని రైతుల భూములను తాకట్టుపెట్టి .. వాటితో వచ్చే రుణాలతో మాత్రమే రాజధాని నిర్మిస్తాయన్నమాట. ఇందుకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అందుకే ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. దీంతో స్విస్‌ ఛాలెంజ్‌ విధానానికి... ఉన్నతన్యాయస్థానం సూచనల ఆధారంగా సవరణలు చేసి కొత్తగా జీవో జారీచేసింది. దీంతో త్వరలోనే మాస్టర్ డెవలపర్ ఎంపికకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీకానుంది.

21:35 - January 2, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయానికి వచ్చింది. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తడకలపల్లిలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముందుగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. మూడు, నాలుగు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. కృష్ణానది మిగులు జలాలను కేసీ కాల్వకు తరలించేందుకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్మించింది.

అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించే విధంగా చర్యలు: చంద్రబాబు

ముచ్చుమర్రిలో జరిగిన సభలో ప్రసంగించిన స్థానిక ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో నిర్వాసితున్న వారికి అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ నిర్వాసితులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యంకాదని తెల్చి చెప్పారు. అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు.

చంద్రబాబుకు, వైపీసీ ఎమ్మెల్యే నాగిరెడ్డికి మధ్య సంవాదం

ముచ్చుమర్రి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైపీసీ ఎమ్మెల్యే నాగిరెడ్డికి మధ్య సంవాదం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు 2007లో శంకుస్థాపన చేసింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అని నాగిరెడ్డి చెప్పగా, పూర్తి చేసింది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు.

రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు
నదులు, కాల్వల అనుసంధానం ద్వారా రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం ఇదే జిల్లాలోని కల్లూరు మండలం తడకలపల్లిలో జరిగిన నాల్గో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలతో జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు సెల్‌ ఫోన్లు కొనుగోలు చేసే మహిళలకు వెయ్యి రూపాయల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గురించి చంద్రబాబు వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తడకలపల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

21:30 - January 2, 2017

నవంబర్8 నుంచి డిసెంబర్ 31 వరకు..రెండు ప్రసంగాలు.. 50 రోజులు.. అంతులేని గందరగోళం.. కోట్లాది ప్రజలకు నానా కష్టాలు.. కనీసం ఇప్పటికైనా కష్టాలు తీరతాయా అని ఆశపడ్డారు. కానీ, అసలు విషయం తప్ప పైపై మాటలు చాలా చెప్పి దాటవేశారనే విమర్శలు. అంటే పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదా? ఈ సమస్య ఎటు తీసుకెళ్లనుంది? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల పైన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అసలు సమస్యల పైన దాటవేత ధోరణి అవలంభించారా... అంటే, అవునే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ రైతులకు, పేదలకు అనేక వరాలు ప్రకటించారు. అయితే, అదే సమయంలో దాటవేత ధోరణి కూడా అవలంభించారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మాటలు చెప్పి దాటేయాలని ప్రయత్నించారా? కృతజ్ఞతలు, బెదిరింపులు తప్ప వాస్తవంలో చెప్పిందేం లేదా? 50 రోజులుగా నోట్ల కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం లేదా? చిన్నా చితకా హామీలతో సమస్యను దాటేయాలని ప్రయత్నిస్తున్నారా? ఈ నోట్లరద్దు గండం గట్టేక్కేదెలా? ఇకముందు కూడా కొనసాగవలసిందేనా? ప్రధాని గొప్ప నిర్ణయం తీసుకున్నారనే అనుకుందాం... మరి ప్రజల కష్టాలు ఎంత కాలం? దీనికి సమాధానం కావాలి కదా.. డిజిటల్ ఎకానమీగా మారే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించని సమయంలో ఈ నోట్లరద్దు గండం గట్టేక్కేదెలా? నవంబర్ 8నుంచి డిసెంబర్ 31 వరకు సాగిన గందరగోళం.. ఇకముందు కూడా కొనసాగవలసిందేనా?గర్భిణులకు ఎకౌంట్ లో సొమ్ము... రైతుల రుణాలు, హౌస్ లోన్ వడ్డీ తగ్గింపు.. ఇవన్నీ మామూలు సందర్భంలో చెబితే అది వేరే సంగతి.. కానీ, దేశమంతా కరెన్సీ నోట్ల సర్జికల్ స్ట్రైక్ లో విలవిల్లాడుతూ ఉన్నపుడు, ప్రధాని ఏం చెప్తారా అని ఆశగా చూస్తున్నపుడు చెప్పిన హామీలివి? దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.. ప్రజలేం ఆశిస్తున్నారు..బడ్జెట్ లో చెప్పాల్సిన కేటాయింపులు ప్రధాని మీటింగ్ లో వచ్చేశాయి. నోట్ల రద్దు గురించి చెప్పాల్సిన వివరాలు మాత్రం రాలేదా? మోడీ వ్యూహం విఫలమయిందా? అందుకే ఏ ప్రస్తావనా తీసుకురాలేదా? ప్రజల ఇబ్బందుల్ని అందుకే ప్రస్తావించలేదా? ప్రధాని స్పీచ్ ఇదే అంశాలను తెలియజేస్తోందా? దేశం పడుతున్న ఇబ్బందులను గుర్తించి మాట్లాడాల్సిన ప్రధాని ఆ అంశం గురించి పూర్తిగా విస్మరించటంపై సామాన్య ప్రజలనుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

20:32 - January 2, 2017

నవీన్ గౌతమ్, ప్రియాంక, సరయు, సమీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎవరో తానెవరో. ఎస్.బాబ్జీ దర్శకుడు. బషీరమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.కె.రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరూ కొత్తవారితో వచ్చిన ఈ సినిమా గురించి నటుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ.... చిన్న సినిమాలు ఆడాల‌ని కోరుకునే వాళ్ళ‌లో నేను ఒక‌డిని. అందుకే నిర్మాత రెహ‌మాన్ అడ‌గ్గానే సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. టీం అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డి చేసారని సీనియర్ నటుడు చలపతిరావు తెలిపారు. నిర్మాత ఎస్‌.కె.రెహ‌మాన్ మాట్లాడుతూ.... నాకు సినిమాలంటే ఉన్న ఆస‌క్తితోనే ఈ సినిమాకు నిర్మాత‌గా మార‌డ‌మే కాకుండా ఇందులో చిన్న పాత్ర‌లో న‌టించాను. హీరో హీరోయిన్లు కొత్త వారైన ఎంతో చ‌క్క‌గా యాక్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు బాబ్జీగారు సినిమాను బాగా తీశారు. చలపతిరావు గారిని వెళ్లి మా సినిమా కోసం అడగగా వెంటనే తాను చేస్తానని చెప్పి చేశారు. ఆ ఆనందానికి అవధులు లేవని రెహమాన్ తెలిపారు. ఈ సినిమాపై చిత్ర హీరో నవీన్..ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

 

20:21 - January 2, 2017
20:09 - January 2, 2017
20:07 - January 2, 2017

ఢిల్లీ : పెద్దనోట్లు రద్దై 50 రోజులు పూర్తవ్వడంతో ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు దాడికి దిగాయి. ఈ 50 రోజుల్లో మోదీ ఎంత నల్లధానాన్ని వెలికితీశారో చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం... పెద్దల కోసమేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. కేంద్రంపై తమ పోరును ఉధృతం చేయనుంది.

నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీప్రకటన
నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో... దేశవ్యాప్తంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పరిస్థితిని గమనించిన మోదీ ఇబ్బందులు తాత్కాలికమేనని, 50 రోజుల్లో పరిస్థితి అంతా సర్దుకుంటుందని చెప్పారు. పెద్దనోట్లు రద్దు చేసి 50 రోజులు దాటింది. ప్రజల ఇబ్బందులు మాత్రం ఇంకా తీరడం లేదు.

మోదీపై దాడికి దిగిన విపక్షాలు
ప్రధాని మోదీ చెప్పినట్టు 50 రోజులైనా ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పకపోవడంతో విపక్షాలు దాడిని పెంచాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ ప్రధాని మోదీపై ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. పెద్దనోట్లు రద్దు చేసి 50 రోజులు దాటినా ప్రజలకు కష్టాలు మాత్రం తప్పలేదన్నారు. ఎంత నల్లధనాన్ని వెలికితీశారో బహిర్గతం చేయాలన్నారు. నల్లధనాన్ని బయటపెట్టడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. పెద్దనోట్లను రద్దు చేసి అసలు మోదీ ఏం సాధించారో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

పెద్దనోట్ల రద్దు పెద్దల కోసమేనన్న వీహెచ్‌
కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు మోదీపై మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెద్దల కోసమన్నది స్పష్టంగా తెలిసిపోయిందని విమర్శించారు. నల్లధనం అరికట్టడంపై మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మోదీ ఎంత నల్లధనం వెలికితీశారో బయటపెట్టాలి : ఏపీ యువజన కాంగ్రెస్‌
మోదీ ఎంత నల్లధనం వెలికితీశారో బయటపెట్టాలని ఏపీ యువజన కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దుకు 6 నెలల ముందు 25 లక్షల రూపాయలకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారి వివరాలు బహిర్గతం చేయాలన్నారు. బ్యాంకుల దగ్గర క్యూలైన్‌లో నిలబడి చనిపోయిన వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో చెప్పాలని వారు ప్రశ్నించారు. పెద్దనోట్ల కష్టాలపై నేటి నుంచి ఈనెల 28 వరకు యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు. మొత్తానికి పెద్దనోట్ల రద్దు సందర్భంగా మోదీ కోరిన 50 రోజులు పూర్తికావడంతో ప్రతిపక్షాలు దాడిని ఉధృతం చేశాయి. మరి ఈ దాడిని మోదీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

 

20:03 - January 2, 2017

హైదరాబాద్ : మహానగరంలోనే గంజాయి సేద్యం మొదలుపెడుతున్నారా..? మత్తు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో రూటు మార్చిన స్మగ్లర్లు ఏకంగా అపార్ట్‌మెంట్లోనే సాగు చేస్తున్నారు..ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న పచ్చినిజం..ఇక్కడే పండించిన కిలోల కొద్దీ గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు..అత్యాధునీక పద్దతుల్లో గంజాయి సాగు కుండీల్లో చేస్తున్నారు..

హైదరాబాద్‌ నగరంలో గంజాయి సాగు..అపార్ట్‌మెంట్‌లోనే సేద్యం...
ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతాల్లోనే గంజాయి సాగు చేయడం..ఆ తర్వాత అక్కడి నుంచి తరలించడం చూశాం..కాని^ఇప్పుడు ఏకంగా మహానగరంలోనే గంజాయి సాగు మొదలుపెట్టారు స్మగ్లర్లు..మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతుండడంతో రూటు మార్చేస్తున్న డీలర్లు ఏకంగా నట్టింట్లోనే గంజాయి పెంపకం చేస్తున్నారు...హైదరాబాద్‌ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్లో గంజాయి పెంచుతున్నారన్న సమాచారం మొదట్లో పోలీసులను ఖంగుతినిపించినా..ఆ తర్వాత వెళ్లి చూస్తే నివ్వెరపోయారు...

ఇంక్యుబేటర్, ఏసీ, బ్లోయిర్స్ సాయంతో...
గంజాయి సాగులో కూడా కొత్త పద్దతి కనుగొన్నాడు సయీద్...హైదరాబాద్‌ మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్లో ఆధునీక పరిజ్క్షానంతో గంజాయి పెంపకం మొదలుపెట్టాడు..అమెరికాలోని ఓ స్నేహితుడి సహకారంతో అంతా హైటెక్‌ పద్దతిలో ఫ్లాట్‌లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు...ఇంక్యుబేటర్, ఏసీ, బ్లోయిర్స్ సహాయంతో గంజాయి సాగు చేస్తున్నట్లు రైడ్స్‌ చేసిన పోలీసులకు కన్పించింది..గంజాయి సాగు కోసం కావాల్సిన నాణ్యమైన మట్టిని విశాఖ నుంచి సేకరించారు...

మొక్కలు ఏపుగా పెరిగేందుకు కుండీలు..
ఇక సయీద్ గంజాయిని పెంచేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు..కుండీల్లో పెంచుతున్న గంజాయి మొక్కలకు నాణ్యమైన మట్టి తో పాటు వాటికి కావాల్సినంత వేడి...చల్లదనం అందేట్లు అన్ని ఏర్పాట్లు చేశాడు..ఇక ఎప్పటికప్పుడు గాలి వీచేందుకు గాను నాలుగు వైపులా స్టాండ్ ఫ్యాన్లు పెట్టాడు..వాతావరణంలో మార్పులకు అనుగుణంగా చెట్లు పెరిగేందుకు కావాల్సిన సహకారం తీసుకుని దానికి తగ్గట్లుగానే అన్నీ ఏర్పాటు చేశాడు...

దాడులు చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్
అపార్ట్‌మెంట్లో గంజాయి సాగు చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో దాడి చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు..12కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు...  

19:59 - January 2, 2017

ఢిల్లీ : భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను పదవుల నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయనందుకే వేటు వేసినట్టు స్పష్టం చేసింది. వీరి స్థానంలో కొత్తవారిని సుప్రీంకోర్టు ఎంపిక చేయనుంది.

బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై వేటు
లోధా కమిటీ సిఫారసుల అమల్లో వెనకడుగు వేస్తూ వచ్చిన బీసీసీఐకి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజయ్‌ షిర్కేలపై ఊహించని విధంగా వేటు వేసింది. తమ ఆదేశాల ప్రకారం లోధా సంస్కరణలు అమలు చేయనందుకు బీసీసీఐ అధ్యక్ష , కార్యదర్శులను ఆ పదవుల నుంచి తొలగించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని బీసీసీఐని ప్రశ్నించింది.

2016 జులై 18 సుప్రీంకు నివేదిక అందజేసిన లోధా కమిటీ
దేశంలో క్రికెట్‌ ప్రక్షాళనకు చేపట్టాల్సిన సంస్కరణలతో కూడిన నివేదికను లోధా కమిటీ గత సంవత్సరం జులై 18న సుప్రీంకోర్టుకు సమర్పించింది. 70 ఏళ్ల పైబడిన వారు, రాజకీయ నేతలు క్రికెట్‌ సంఘాల్లో పదవులు చేపట్టరాదని తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే లోథా కమిటీ సంస్కరణల్లో దాదాపు అన్నిటికీ అంగీకారం తెలిపిన బీసీసీఐ... ఒక రాష్ట్రం- ఒక ఓటు, కూలింగ్‌ ఆఫ్‌ పిరియడ్‌, మూడేళ్ల పదవీ కాలంలాంటి కీలక సూచనలను మాత్రం వ్యతిరేకించింది. వాటిని అమలు చేయడం కష్టసాధ్యమంటూ చెబుతూ వచ్చింది. అయినా సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు పదేపదే చెప్పినా, వాటిని అనురాగ్‌ ఠాకూర్‌ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాలను ధిక్కరించి మరీ అజయ్‌షిర్కేను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

సిఫార్సులను అడ్డుకుంటున్నారంటూ అనురాగ్‌పై సుప్రీంలో పిటిషన్‌
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడమే కాకుండా, ఆ సిఫార్సులను అడ్డుకునేందుకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ఠాకూర్‌ ఐసీసీని ఆశ్రయించారంటూ అతనిపై సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. బీసీసీఐలో కాగ్‌ అధికారి నియామకం ప్రభుత్వం జోక్యం కిందికి వస్తుందని తెలుపుతూ లేఖ రాయాలని ఐసీసీ సీఈవో డేవ్‌ రిచర్డ్‌సన్‌ను ఠాకూర్‌ కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే అనురాగ్‌ఠాకూర్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం కోర్టుకు ఆగ్రహం కలగడానికి కారణమైంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత డిసెంబర్‌ 16న జరిగిన విచారణ సందర్భంలోనే కఠినంగా హెచ్చరించింది. ఇవాళ్టి విచారణలో ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శిపైనే వేటు వేసింది.

సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు న్యాయవాదుల నియామకం
ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. బోర్డు సభ్యులుగా ఎవరు ఉండాలో కూడా ఆ రోజునే ప్రకటిస్తామని వెల్లడించింది. అధ్యక్ష, కార్యదర్శుల స్థానంలో కొత్తవారిని సుప్రీంకోర్టు ఎంపికచేసే అవకాశముంది. బీసీసీఐలో సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు న్యాయవాదులను సుప్రీంకోర్టు నియమించింది. 

మంత్రులతో శశికళ అత్యవసర భేటీ..

తమిళనాడు : చెన్నైలోని బోయిస్ గార్డెన్ లో మంత్రులతో శశికళ అత్యవసరంగా భేటీ అయ్యారు. శశికళను సీఎం చేయాలనే డిమాండ్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు చర్చిస్తున్నట్లుగా సమాచారం. కాగా దివంగత సీఎం జయలలిత మృతి అనంతరం ఆమె ప్రియ నెచ్చెలి శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. ఆమె సీఎం పీఠంపై కన్నేశారు అనే క్రమంలో ఈ చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

చేనేత చేయూతకు కేటీఆర్ విన్నూత్న యత్నం..

హైదరాబాద్ : చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు మంత్రికేటీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రతీ సోమవారం ఖచ్చితంగా కేటీఆర్ చేనేత దుస్తులే ధరిస్తానని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ పరిధిలోని ప్రతీ శాఖలో అటెండర్ల నుండి హెచ్ వోడీలు..అధికారుల వరకూ చేనేత వస్తాలు ధరించే విధులకు హాజరైన వారికి ఆయన అభినందనలుతెలిపారు. ప్రజాప్రతినిథులు చేనేత వస్త్రాలు ధరించాలని లేఖ రాశానని ఆయన తెలిపారు. అసెంబ్లీలో చేనేత శాఖ తరపున చేనేత వస్త్రాలను అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

విద్యామండలి చైర్మన్ గాప్రొ.విజయరాజు

అమరావతి : ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా..ప్రొఫెసర్ విజయరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయరాజు మూడేళ్ళపాటు పదవిలో కొనసాగనున్నారు. 

19:29 - January 2, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ నిర్విహించారు. ఈ సందర్భంగా సభలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం బందోబస్తులో భాగంగా ఓ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్పన్నకు గాయాలయ్యాయి. దీంతో అప్పన్నను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిచారు. కాగా చికిత్స పొందుతూ అప్పన్న మృతి చెందాడు.  

19:15 - January 2, 2017

వెలగపూడి : ఏపీ సచివాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం ఆదివారం రావడంతో, సోమవారం సచివాలయంలోని ఉద్యోగుల అసోసియేషన్ హాల్లో నూతన సంవత్సర వేడుకులు జరుపుకున్నారు. న్యూయర్ కేక్ ను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కట్ చేశారు. ఉద్యోగులు అందరూ కేక్ తినిపించుకుని న్యూయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సచివాలయం ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళతామని మరళీకృష్ణ తెలిపారు. 

19:13 - January 2, 2017

నెల్లూరు : పొర్లుకట్ట బాణాసంచా పేలుడు కేసును పోలీసులు వేగవంతం చేశారు. ప్రమాదానికి బాధ్యులైన నిర్వహకులు అమర వెంకటయ్య, పొన్నూరు భాస్కర్‌లను అరెస్ట్‌ చేశారు. అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహించినట్లు అడిషనల్‌ ఎస్పీ శరత్‌బాబు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య ఐదుకి చేరింది. నారాయణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చెంచయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏఎస్పీ శరత్‌బాబు తెలిపారు. 

19:01 - January 2, 2017

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధం అయ్యారు. మంగళవారం జిల్లాలోని ఇచ్ఛాపురంలో పవన్‌ పర్యటించనున్నారు. స్థానికంగా తీవ్రంగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్య పై అయన స్పందించనున్నారు. 20 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రాంత ప్రజలతో ఇచ్ఛాపురం మణికంఠ థియేటర్‌లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు జన సేన అధినేత పవన్‌ కల్యాణ్‌...!

మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పవన్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తూ.. వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్న పవన్‌.. ప్రాంతాల వారిగా ప్రజా సమస్యలపై పోరాడాలని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన సమస్యలపై పవన్ దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలపై గళం వినిపించేందుకు పవన్ సిద్ధమయ్యారు. 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 30 కి పైగా గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు సంబంధిత నిపుణులు వెల్లడించారు. ఈ కిడ్నీ వ్యాధుల వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన సమస్యలపై పవన్ దృష్టి
అనేక ఏళ్లుగా తమ ప్రాంతంలో ఉన్న సమస్య ను అభిమానులు.. పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇచ్ఛాపురం వెళ్లి కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలను సందర్శించేలా పవన్‌ అభిమానులు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్న.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై పవన్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాధితులతో మాట్లాడేందుకు స్థానిక మణికంఠ థియేటర్‌ వద్ద ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అనంతరం రోడ్‌ షో లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

స్థానిక మణికంఠ థియేటర్‌ వద్ద బాధితులతో పవన్‌ ముఖాముఖి
మరోవైపు పవన్ రాకపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని రాకతోనైనా తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు పెంచి.. ప్రాంతాల వారిగా ఉన్న ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించిన పవన్‌ కల్యాణ్‌.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

18:56 - January 2, 2017
18:55 - January 2, 2017

తూర్పుగోదావరి : ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి అధిక ప్రధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. కాకినాడ రమణయ్యపేటలో నాల్గో విడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం యనమల ఈ విషయాన్ని చెప్పారు. 

18:52 - January 2, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో అన్ని ప్రాంతాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విధంగా అమరావతిని ఫ్రీ జోన్‌లో చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత చంద్రబాబు ప్రసంగిస్తూ ఫ్రీ జోన్‌ అంశాన్ని ప్రస్తావించారు. 

18:50 - January 2, 2017

విజయవాడ : స్విస్‌ చాలెంజ్‌పై ఏపీ సర్కార్ మరో జీవో జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సవరణలు ప్రభుత్వం సవరణలు చూస్తూ కొత్త జీవో విడుదల చేసింది. ఇందులో కొత్తగా టెండర్ ఎవల్యూయేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి అంతర్జాతీయ టెండర్లు పిలవటానికి రంగం సిద్ధమైంది. అమరావతిలో 6.84చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి విదేశీ కంపెనీల నుంచి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. త్వరలోనే మాస్టర్ డెవలపర్ ఎంపికకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేయనుంది.  

విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్..

విశాఖ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం చేరుకున్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించనున్న సందర్భంగా ఈరోజు పవన్ విశాఖకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీవ్యాధి గ్రస్తుల కష్టాలపై వారితో ముఖాముఖీ కార్యాక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబందించి అన్ని ఏర్పాట్లును జనసేన నాయకులు నిమగ్నమయ్యారు. 

18:29 - January 2, 2017
18:25 - January 2, 2017

పెద్దపెల్లి : జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో 10టీవీ 2017 సంవత్సర నూతన కాలెండర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. సమాజంలో 10టీవీ నిర్వహిస్తున్న పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ కొనియాడారు. మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా 10టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూడు సంవత్సరాల్లో ప్రజల సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజల పక్షాన నిలబడటంలో 10టీవీ ముందంజలో ఉందన్నారు కొప్పుల ఈశ్వర్‌. 

18:18 - January 2, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. పదవ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం బేసిక్‌ పేతో పాటు డీఏ  చెల్లించాలన్న డిమాండ్‌తో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలంటూ నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌ దగ్గర ధర్నా చేస్తున్నారు. ప్రతి నెలా క్రమంతప్పకుండా జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్‌ పాల్‌ అందిస్తారు. 

18:14 - January 2, 2017

వరంగల్ : తెలంగాణలోని 18 జిల్లాల్లో మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగిందని పాదయాత్ర రథసారథి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానమని తెలిపారు.యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

18:04 - January 2, 2017

హైదరాబాద్ : నగర శివారులోని స్థలాలకు, ఇళ్లకు నకిలీ పత్రాలు సృష్టిస్తూ అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఇళ్ల పత్రాలను తయారు చేస్తోన్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడని రాచకొండ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 1 లక్ష10 వేల రూపాయల నగదు, 655 రబ్బరు స్టాంపులు, వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ స్టాంపులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 332 నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్లు, 94 పాత నాన్ జుడీషియల్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ ఇళ్ల స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి నిందితులు అమ్మకాలు జరుపుతున్నారు.

18:01 - January 2, 2017

హైదరాబాద్ : నెల రోజుల సీఎస్ గా సేవలందించి పొడగింపు కోసం ఎదురు చూసిన ప్రదీప్ చంద్రకు అశాభంగమే ఎదురైంది. తనకు కావాల్సిన వారికోసం కేంద్రంపై ఒత్తిడి చేసిన సీఎం కేసిఆర్..ప్రదీప్ చంద్ర విషయంలో మాత్రం...నోటితో చెప్పి నోసటితో వెక్కిరించిట్లుగా వ్యవహరించారు. ప్రదీప్‌ చంద్ర పట్ల సీఎం అసక్తి చూపకపోవడంలో... సామాజిక కోణంతో పాటు, ప్రాంతీయ భావన కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది.

రెండో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర నెల రోజులకే రిలీవ్‌
తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర నెల రోజులకే రిలీవ్‌ అయ్యారు. కనీసం మూడు నెలల పాటు పొడగింపు ఆదేశాలు వస్తాయని ఆశించిన ఆయనకు చివరికి నిరాశే మిగిలింది. కేంద్రం నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఎటువంటి అదేశాలు రాకపోవడంతో పాటు... జనవరి ఒకటి నుంచి ఆయన స్థానంలో సీనియర్‌గా ఉన్న ఎస్పీ సింగ్ ను సీఎస్ గా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అయితే రాజీవ్‌శర్మ పట్ల కనబర్చిన ఆసక్తి కేసీఆర్‌.. ప్రదీప్ చంద్ర పట్ల చూపలేదన్న వార్తలు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఆయన సామాజిక వర్గం, పుట్టిన ప్రాంతం కూడా మైనస్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.

సామాజిక వర్గం, పుట్టిన ప్రాంతం ప్రదీప్‌ చంద్రకు మైనస్‌
సీఎం కేసిఆర్ గతంలో రాజీవ్ శర్మ విషయంలో స్వయంగా ఢిల్లీ వెళ్లి రెండుసార్లు ప్రధానితో చర్చించి రెండుసార్లు గడువు పొడగించారు. కానీ ప్రదీప్ చంద్ర విషయంలో మాత్రం.. ఢిల్లీలోనే ఉండి కూడా సీఎం కేవలం పార్లమెంటు సభ్యుల చేత లేఖ పంపారు తప్పా... అంతకు మించి ఎలాంటి శ్రద్ధ చూపలేదు. వాస్తవానికి సీఎం అడిగితే ప్రస్తుత పరిస్థితుల్లో కాదనే పరిస్థితి కూడా కేంద్రంలో లేదు. ప్రధాని మోదీతో ఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కేసీఆర్‌ విజ్ఞప్తికి కేంద్రం కాదనే ప్రసక్తే లేదు. కానీ అలా చేయలేదు. అదే సమయంలో ప్రదీప్‌ చంద్ర కంటే ముందు బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడగించిన కేంద్రం.. ప్రదీప్‌చంద్ర విషయంలో మాత్రం అలా చేయకపోవడంలో అంతర్గత కోణాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్ 27న పీఎంవోకు లేఖ పంపిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపు కోవడం వల్లే గడువు పొడగించలేదన్న విషయం స్పష్టమవుతోంది. ఈ లేఖ గత ఏడాది డిసెంబర్ 27న ప్రధానమంత్రి కార్యాలయానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రధానికి అందజేశారు. కానీ దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయమై డీవోపీటీతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయినట్లు సమాచారం.

ప్రదీప్‌చంద్ర కంటే ముందు..ఎస్పీసింగ్‌కు పదవి ఇవ్వాలని పట్టుబట్టిన కేటీఆర్‌
ప్రదీప్ చంద్ర దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఆయన పదవీకాలం పొడగింపు రాలేదన్న వాదన ఉంది. ఇదే సమయంలో ప్రదీప్‌చంద్రకు సీఎస్‌ పదవిని ఇచ్చేటప్పుడే... ఎస్పీసింగ్‌కు పదవి ఇవ్వాలని సీఎం తనయుడు పట్టుబట్టారు. ఇది కూడా.. ప్రదీప్ చంద్ర పొడిగింపునకు అడ్డుగా మారినట్లైంది. ఇదే సమయంలో వరుసగా పొడగింపులు చేస్తూ పోతే... తర్వాత వరుసలో ఉన్న వారు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్రం భావించడం వల్లే ప్రదీప్‌ చంద్రకు అవకాశం దక్కలేదన్న ప్రచారం జరుగుతోంది.

కేంద్రం, ఇటు రాష్ట్ర వ్యవహార శైలితో ప్రదీప్ చంద్ర అసంతృప్తి
అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహర శైలి పట్ల అసంతృప్తితో ఉన్న ప్రదీప్‌చంద్ర... కనీసం తన బాధ్యతలను ఎస్పీ సింగ్‌కి అప్పగించేందుకు కూడా సచివాలయం రాలేదంటే.. ఆయన ఎంత ఆవేదన చెందారో ఇట్టే తెలుస్తోంది.  

17:53 - January 2, 2017

హైదరాబాద్ : తిరుపతిలో రేపటి నుంచి జరిగే సైన్స్ కాంగ్రెస్‌లో ఆధ్యాత్మిక, మూఢనమ్మకాల పెంపు వంటి అంశాలపై చర్చించటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని సీసీఎంబీ వ్యవస్థాపకులు, ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో అశాస్త్రీయ, అసంబద్ధ అంశాలు చర్చించలేదన్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధాని కూడా హాజరవడం బాధాకరమని ఆయన అన్నారు. సదస్సులో సైన్స్, వైజ్ఞానిక అంశాలు వాటి పరిష్కారాలపై చర్చ జరగాలని కోరారు. ఆహారం, వ్యవసాయం, ప్రజారోగ్యం, సైన్స్ విద్యారంగం, జాతీయ సహజ వనరుల రక్షణ వంటి అంశాలను సైన్స్ కాంగ్రెస్ అజెండాలో చేర్చాలని భార్గవ డిమాండ్ చేశారు.

17:49 - January 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం.... టీ.జేఏసీ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. ఈ వెబ్ సైట్‌లో టీ.జేఏసీ కార్యక్రమాలు, నివేదికలు, పుస్తకాలు అన్ని వివరాలు పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు... ధర్నాలు, ఉద్యమాలను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే భవిష్యత్‌లో సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు... మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో చర్చించడం కోసం త్వరలో ప్రతిపక్షాలను కలిసి పూర్తి వివరాలను అందిస్తామన్నారు... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రతిపక్షాలు వ్యూహత్మకంగా వ్యవహరించాలని కోదండరాం సూచించారు. జనవరి 7న కామారెడ్డి నుంచి విద్యాపరిరక్షణ యాత్రను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు.  

ట్రాక్టర్, బైక్ ఢీ: ఇద్దరి మృతి

నిజామాబాద్: వేల్పూరు మండలం జానకంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు పచ్చానరుకుడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

17:27 - January 2, 2017

తమిళనాడు : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళా నటరాజన్‌ ఇక సీఎం పీఠంపై కన్నేశారా? ప్రస్తుతం తమిళనాట ఇదే అంశం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. శశికళ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తరహాలోనే సిఎం పదవిని చేపట్టేందుకు చిన్నమ్మ వర్గం పావులు కదుపుతోంది.

శశికళ పదవి చేపట్టడంపై పార్టీలో కొంత అసంతృప్తి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పదవి చేపట్టడంపై పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగిన అసమ్మతివాదులు ఆగ్రహంతో చిన్నమ్మ బ్యానర్లను సైతం చించివేశారు.

శశికళ సిఎం పీఠాన్ని చేపట్టాలనే వాదన
ఈ నేపథ్యంలో శశికళ సిఎం పీఠాన్ని చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సీఎంగా ఉన్నారని.. అదే తరహాలో అమ్మ వారసురాలిగా శశికళ జోడు పదవులు చేపట్టాలనే డిమాండ్‌ను చిన్నమ్మ వర్గం తెరపైకి తెస్తోంది.

ఆందోళనలో శశికళ వర్గం
త్వరలోనే 'చిన్నమ్మ' సీఎం అవుతారంటూ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, కడంబూర్‌ రాజు, చేవూర్‌ రామచంద్రన్‌, తంగమణి, ఓ.ఎస్‌.మణియన్‌లు కూడా వంత పాడుతున్నారు. శశికళను సీఎంగా చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శశికళకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టినందుకే కిందిస్థాయిలో అసంతృప్తి భగ్గుమనడంతో.... చిన్నమ్మకు సీఎం పదవిని అప్పగిస్తే ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందోనన్న భయాందోళనలో శశికళవర్గం కొట్టుమిట్టాడుతోంది.

జయలలిత మృతితో ఖాళీయైన ఆర్కేనగర్‌
శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే... జయలలిత మృతితో ఖాళీయైన ఆర్కేనగర్‌ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లేదా విరుదునగర్‌ జిల్లా సాత్తూర్‌ నియోజకవర్గం నుంచి శశికళను సులువుగా గెలిపించవచ్చని ఉదయ్‌కుమార్‌ పావులు కదుపుతున్నారు. మరోవైపు అమ్మ వారసురాలిని అంటూ తెరపైకి వచ్చిన దీప ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు. సరైన సమయంలో శశికళపై సమరం చేయాలని దీప పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

హంపన్న మృతిపై కానిస్టేబుళ్ల అనుమానాలు

కర్నూలు : సీఎం చంద్రబాబు పాల్గొననున్న సభలో మిస్ ఫైర్ కలకలం రేగుతోంది. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హంపన్న చేతిలో ఏకే-47 మిస్ ఫైర్ అయ్యి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కల్లూరు మండలం తడకనపల్లిలో చోటు చేసుకుంది. హంపన్న మృతిపై కానిస్టేబుళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో ఉద్రిక్తత

కృష్ణా : మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. స్టేడియం నిర్మానానికి స్థల పరిశీలన కోసం వచ్చిన అధికారులను తమ ఇళ్లను తొలగించొద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు, అధికారుల మధ్య తోపులాట జరగడంతో పలువురుని అరెస్టు చేశారు.

17:17 - January 2, 2017

ఉత్తరప్రదేశ్ : నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బిఎస్పీ, ఎస్పీ పార్టీలు ఒక్కటయ్యాయని ప్రధానమంత్రి నరేంద్రమోది విమర్శించారు. ఒక పార్టీ డబ్బులు కాపాడుకోవడంలో, మరో పార్టీ కుటుంబాన్ని రక్షించే పనిలో బిజీగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. లక్నోలో జరిగిన పరివర్తన్‌ ర్యాలీలో మోది మాట్లాడుతూ-అవినీతి, న‌ల్లధ‌నంపై పోరాటం చేయాలా వ‌ద్దా అని ప్రధాని ప్రజలను ప్రశ్నించారు. రైతుల కోసం కేంద్రం ఇచ్చిన రుణాలను అఖిలేష్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా బీజేపీ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌న్నా ఆశాభావాన్ని మోది వ్యక్తం చేశారు. కుల‌మ‌తాల‌కతీతంగా యూపీ అభివృద్ధి కోసం బిజెపికి ఓటేయాల‌ని విజ్ఞప్తి చేశారు. 

17:13 - January 2, 2017

హైదరాబాద్ : మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెద్దల కోసమేనని తేలిపోయిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. మెడీ చెప్పిన 50 రోజుల గడువు ముగిసిపోయినా ప్రజల కష్టాలు తీరడం లేదని మండిపడ్డారు. మోడీని గాంధీతో పోల్చడం సిగ్గుచేటన్నారు. చిత్తశుద్ది ఉంటే రాహుల్ గాంధీ లెవనెత్తిన మోడీ అవినీతిపై స్పందించాలని డిమాండ్ చేశారు. మోడీ తీరును ఊరువాడా తిరిగి ఎండగడతామని వీహెచ్ తెలిపారు. 

17:00 - January 2, 2017

హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ విధానంపై ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రాల మైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం జీవోకు సవరణలు చేసింది. అనంతరం కొత్త జీవోను జారీ చేసింది. స్విస్ చాలెంజ్ విధానంపై కొత్తగా టెంటర్ ఎవల్యూయేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. మరో అంతర్జాతీయ టెంటర్లను పిలిచేందుకు రంగం సిద్ధం అయ్యింది. అమరావతిలో 6.84 చదరపు కిలో మీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధి.. మాస్టర్స్ డెవలపర్స్ కోసం సీఆర్డీఏ నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ విధానంతో ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన జీవోలో సింగపూర్ కంపెనీకి అమరావతి నిర్మాణాన్ని కట్టపెట్టాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఏక పక్షంగా జీవో జారీ చేసిందనే ఆరోపణ హైకోర్టు సదు జీవోకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాత జీవోకు సవరణ చేసి కొత్త జీవోను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

ఫ్రీజోన్ గా అమరావతి :చంద్రబాబు

విజయవాడ : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతిని ఫ్రీజోన్ గా సీఎం చంద్రబాబబు నాయుడు ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. అమరావతిలో ఆంధ్రులందరికీ సమాన అవకాశం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అమరావతి ఇప్పటి వరకు జోన్ -3లో ఉంది. జోన్ -3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకే అవకాశం కల్పించింది. ఏపీపీఎస్సీ వరుస నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రాధాన్యత కల్పించారు.

సీఈసీని కలిసిన ములాయం

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్ ను ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ కలిశారు. ములాయం తో పాటు ఆ పార్టీ నేతలు శివపాల్ యాదవ్, అమర్ సింగ్, జయప్రద ఉన్నారు.

16:42 - January 2, 2017
16:37 - January 2, 2017

స్విస్ ఛాలెంజ్ పై మరో జీవో జారీ

విజయవాడ: స్విస్ ఛాలెంజ్ పై మరో జీవో జారీ అయ్యింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సవరణలు చేపట్టింది. కొత్తగా టెండర్ ఎవల్యూయేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. మరోసారి అంతర్జాతీయ టెండర్లు పిలవటానికి రంగం సిద్ధం చేసింది. అమరావతిలో 8.84 చ.కి.మీ స్టార్టప్ ఏరియా అభివృద్ధికి విదేశీ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించనుంది. మాస్టర్ డెవలపర్ ఎంపికకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేయనుంది.

16:30 - January 2, 2017

'చిరంజీవి' నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పలు ఫొటోలను విడుదల చేస్తూ వస్తోంది. ఆయన ఫొటో..టీజర్ పై దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. ఆయన చేసిన ట్వీట్స్ పై మెగా అభిమానులు కౌంటర్ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన 'వర్మ' తాజాగా ఓ ఫొటోపై ట్వీట్స్ చేశారు. ఈ ఫోజ్‌ కోసం మేడం టు సాడ్స్ మ్యూజియం వారు తమ దగ్గర ఉన్న సగం విగ్రహాల్ని అవతల పారేస్తారని ట్వీట్స్ లో పేర్కొన్నారు. మెగాస్టార్ ను ఈ ఫోజులో కూర్చోబెట్టిన డిజైనర్‌, దర్శకుడి పాదాలు తాకాలనుందని, జర్మన్‌ తత్వవేత్త హెగెల్‌ ఉంటే మెగాస్టార్‌ను ముద్దాడేవారన్నారు. ఈ పోస్టర్‌ డిజైనర్‌తో పాటు, మెగాస్టార్‌ని ఈ ఫోజులో కూర్చోడానికి ఒప్పించిన ఇతరుల ఫోను నంబర్లు, చిరునామాలు తనకి కావాలని 'వర్మ' పేర్కొన్నారు. మరి 'వర్మ' ట్వీట్స్ పై మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్: నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31.01 పాయింట్లు నష్టపోయి, 26,595.45 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 6.30 పాయింట్లు కిందకు జారి 8,179.50 వద్ద స్థిరపడింది.

16:17 - January 2, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ నిర్విహించారు. ఈ సందర్భంగా సభలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం బందోబస్తులో భాగంగా ఓ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్పన్నకు గాయాలయ్యాయి. దీంతో అప్పన్నను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

16:00 - January 2, 2017

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగా ఉండాలనే కొన్ని చిట్కాలు..మీ కోసం...

  • ఆహారం విషయంలో లోపం లేకుండా చూసుకోవాలి. 'జంక్ ఫుడ్'కి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • పడుకొనే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచింది.
  • ఒక నిర్ధిష్ట వేళలో నిద్రపోవాలి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీలైతే ఈవినింగ్ వాక్ మంచిది.
  • పెరుగు..నిమ్మరసం..తేనే కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా రాసుకుని అరగంట అనంతరం చల్లటి నీటితో కడుక్కోంటే ముఖంపై పడిన ఎండ ప్రభావం పోతుంది.
  • నేరేడు పండ్లు తినాలి. ఇందులో ఐరన్, కాల్షియం వంటి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. డయాబెటిక్ వ్యాధి ఉన్నవారు మొక్కజొన్నలు తినటం మంచిది. మొక్కజొన్నలోని విటమిన్ బి12, ఫోలిక్ ఆమ్లాలు రక్తలేమిని రానివ్వవు.
  • అరటిపండ్లు మిగతా పండ్లు కూరగాయలకంటే ఎక్కువ ఎంజైములు కలిగి తక్కువ క్యాలరీలతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • చందనం ముఖానికి రాసుకుని కాసేపటి అనంతరం కడుక్కొంటే ముఖం మీది మచ్చలు..మొటిమలు తొలగిపోతాయి.
15:56 - January 2, 2017

కడప : కడప జిల్లాలో దారుణం జరిగింది. పూసల వీధిలో కుటుంబం కలహాల కారణంగా కట్టుకున్న భార్యను కడతేర్చాడో ఓ దుర్మార్గపు భర్త. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి చెందిన సామిత్రమ్మ నర్సన్న దంపతులు కొంతకాలం క్రితం కడపకు జీవనోపాధి నిమిత్తం నెల రోజుల క్రితం వచ్చారు. కాగా వీరిద్దరి మధ్య గత కొతకాలంగా కుటుంబ కలహాలు తలెత్తటంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో సోమవారం తెల్లవారుఝామున రోకలిబండతో భార్య సావిత్మమ్మ తలపై మోదాడు దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నర్సన్న పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నర్సన్న కోసం గాలిస్తున్నారు. 

యూపీఎస్సీ చైర్మన్ గా ప్రొ.డేవిడ్ ఆర్.సైమ్ ల్లేను

ఢిల్లీ : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) తదుపరి ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఆర్‌.సైమ్‌ల్లేను భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం నియమించారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన డేవిడ్‌(63) 2012 జూన్‌ 25 నుంచి యూపీఎస్సీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఈ నెల 4న బాధ్యతలు స్వీకరించనున్న డేవిడ్‌ 2018 జనవరి 21 వరకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

15:50 - January 2, 2017

దోమ కాటుకు బీమానా..? ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బీమా వస్తుంది కానీ దోమ కుడితే బీమా వస్తుందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. దోమ కాటు ద్వారా మనిషి చనిపోతే అది కూడా ప్రమాదం కిందకే వస్తుందని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ మాత్రం కాదులెండి...పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మౌసమి భట్టాచార్జీ భర్త దేవాశిష్ దోమకాటుతో మలేరియా వచ్చి మృతి చెందాడు. దీనితో ఇది 2012లో జరిగింది. దీనితో ఆమె కేసు వేసింది. వినియోగదారుల కమిషన్ విచారణ చేపట్టింది. దోమకాటు మరణాలను ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా అంగీకరించడం కొంచెం కష్టమైనా దోమ కుడుతుందని ఎవరూ ముందు ఊహించలేరని, అది ప్రమాదం కిందకే వస్తుందని తేల్చింది. మరణానికి బీమా సొమ్ము చెల్లించాలని ఆదేశించింది. గతంలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా 2014 ఫిబ్రవరిలో అనుకూలంగా తీర్పు వచ్చింది. తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాన్ని ఫోరం కొట్టివేసింది.

15:40 - January 2, 2017

కర్నూలు : ముచ్చుమర్రిలో బైర్రెడ్డి రాజశేఖర్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రిలో సీఎం చంద్రబాబు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈనేపథ్యంలో బైర్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుకు నిరసనగా బైర్రెడ్డి తన నివాసంలోనే దీక్షను చేపట్టారు. కాగా ముచ్చుమర్రి ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడి నిర్మించినదేనని ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు ఎటువంటి ఉపయోగం లేదని బైర్రెడ్డి పేర్కొంటున్నారు. 

సీఎం సభలో మిస్ ఫైర్

కర్నూలు:తడకనపల్లెలో పోలీస్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. సోమవారం తడకనపల్లెలో నిర్వహించిన సీఎం సభ దగ్గర స్పెషల్ పార్టీ పోలీస్ చేతిలోని గన్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. సభలో పాల్గొన్న ప్రజలకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మిస్‌ పైర్‌పై చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కానిస్టేబుల్‌కు మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు.

15:35 - January 2, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన అభిమానులకు న్యూ ఇయర్ కానుక అందించారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు'కి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇటీవలే చిత్ర పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టర్స్ లో 'పవన్' పూర్తిగా కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. చివరకు 'పవన్' పూర్తిగా ఉన్న ఫొటోను విడుదల చేశారు. తాజాగా సినిమా సెట్ లో జరిగిన సన్నివేశాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. చిత్ర బృందం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు.
కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'శరత్ మరార్' నిర్మిస్తున్నారు. 'పవన్' సరసన మరోసారి 'శృతి హాసన్' నటిస్తోంది. 'పవన్' కు సోదరులుగా ఆలీ, శివ బాలాజీ, కమల్ కామరాజు, అజయ్ నటిస్తున్నారు. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

15:31 - January 2, 2017

హైదరాబాద్ : జోనల్‌ విధానాన్ని రద్దు చేయాలనే ఆలోచనను కేసీఆర్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. జోనల్‌ విధానం రద్దు అనే అంశం కేసీఆర్ జేబులో లేదంటూ ఎద్దేవా చేశారు. జోనల్‌ రద్దుపై రాష్ట్రపతిని కలుస్తామని, ఇతర పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామని అన్నారు. 

15:27 - January 2, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడుతున్నారని టి.టీడీపీ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులు ఏవీ పూర్తి చేయకుండా 2019 ఎన్నికల్లోకి వెళ్లేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. 

15:25 - January 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని ఎంపీ వినోద్ అన్నారు. కరీంనగర్ డెయిరీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ఉద్యోగులు పరుగెత్తలేకపోతున్నారని చెప్పారు. కరీంనగర్ డెయిరీ సామర్థ్యాన్ని 5 లక్షల లీటర్ల ఉత్పత్తికి పెంచాలని అన్నారు. 

రమేష్ రంగనాథన్ ను కలిసిన తెలంగాణ సీఎస్

హైదరాబాద్ : హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్ ను తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ కలిశారు.

15:18 - January 2, 2017

హైదరాబాద్ : సాధారణంగా గంజాయి సాగు అనేది మారుమూల ప్రాంతంలో రహస్యంగా సాగుచేస్తారు.కానీ నగరంలో రహస్యంగా గంజా సాగు చేస్తున్నట్లుగా తాజాగా బైటపడం కలకలం రేపింది. మణికొండలోని అర్కే రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో సయీద్ హుస్సేన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో వున్న ఒక స్నేహితుడి సహకారంతో గంజాయి సాగు చేస్తున్నట్లుగా తెలిసింది. గంజాయి సాగుకోసం విశాఖ నుండి మట్టిని తెప్పించి అత్యాధునిక పరిజ్ఞానంతో ఇంక్యుబేటర్, ఏపీ, బ్లోయిర్స్ సహాయంతో ఆఫ్రికా నుండి వచ్చి నగరంలో సెటిల్ అయిన సయాద్ హుస్సేన్ అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి గంజాయి సాగు గుట్టును రట్టు చేశారు. అనంతరం సయాద్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నాడు. 

యూపీలో భారీ మెజారిటీతో గెలుస్తాం: మోదీ

హైదరాబాద్ : యూపీలో భారీ మెజారిటీతో గెలుస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేౠరు. లక్నోలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆమట్లాడుతూ.. నన్ను ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ ఏకమవుతున్నాయని మోదీ ఆరోపించారు. యూపీలో 14 ఏళ్ల వనవాసం వీడనుందని, కుల, మతాల కోసం కాకుండా యూపీ అభివృద్ధి కోసం ఓటేయండని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుటుంబం కోసం పాకులాడే పార్టీతో అభివృద్ధి అసాధ్యం పేర్కొన్నారు.

అపార్ట్ మెంట్ లో గంజాయి: వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ : మణికొండలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆధునిక పరిజ్ఞానంతో గంజాయిని సాగు చేస్తున్న సయ్యిద్ హుస్సేని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని తన స్నేహితుడు సహకరాంతో ఇంక్యుబేటర్, ఎసీ, బ్లోయిర్స్ సహాయంతో గంజాయిని సాగు చేస్తున్నాడని పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. అతని వద్ద నుండి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, విచారిస్తున్నారు.

15:00 - January 2, 2017

కర్నూలు : వైసీపీ నేత జగన్‌ను నమ్ముకుంటే సర్వ నాశనమే అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. జగన్‌ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతడికే తెలియదన, తిట్టడం తప్పా వేరే తెలియదని జేసీ అన్నారు. జగన్‌ కులం కులం అంటూ.. ఓట్ల కోసం పాకులాడటం విడ్డూరమని జేసీ వ్యాఖ్యానించారు. జగన్ ఏ సమయంలో ఏం మాట్లాడతాడో తనకే తెలిదనీ..అటువంటి వ్యక్తిని నమ్ముకుంటే సర్వనాశనం అయిపోతామని ముచ్చుమర్రి ఎత్తిపోతల సభలో మాట్లాడుతూ జేసీ ఇలా వ్యాఖ్యానించారు.

సుప్రీం తీర్పు క్రికెట్ క్రీడ సాధించిన విజ‌యం: జస్టిస్ లోథా

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

ఢిల్లీ:బీసీసీఐ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శుల తొలిగిస్తూ సుప్రీం కోర్టు ఇవాళ జారీ చేసిన ఆదేశాల‌పై జ‌స్టిస్ లోథా స్పందించారు. సుప్రీం తీర్పు క్రికెట్ క్రీడ సాధించిన విజ‌య‌మ‌న్నారు. ప‌రిపాల‌న నిర్వహించే వాళ్లు వ‌స్తూపోతుంటార‌ని, కానీ సుప్రీం తీసుకున్న నిర్ణ‌యం క్రికెట్ క్రీడ‌కు లాభం చేస్తుంద‌న్నారు. క్రికెట్ బోర్డుపై సుప్రీం ఇచ్చిన తీర్పును ఇత‌ర క్రీడాశాఖ‌లు కూడా ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు.

 

సైన్స్ కాంగ్రెస్ కు ఏర్పాటు షురూ...

తిరుపతి : రేపటి నుంచి ఐదు రోజుల పాటు తిరుపతిలో జరిగే 104వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ (ఐఎస్‌సీ) సమ్మేళ నానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛ నంగా ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీవేంక టేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో జరగనున్న నేపధ్యంలో యూనివర్సిటీ దారు లన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికే ఫ్లెక్సీలతో నిండిపో యాయి.

రేపు శ్రీకాకుళం పర్యటనకు పవన్ కల్యాణ్

హైదరాబాద్ : రేపు జనసేన అధినేత శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. మొదటిగా ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్‌ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప‌రామ‌ర్శించనున్నారు. త‌రువాత అక్క‌డ నిర్వ‌హించ‌నున్న రోడ్ షో లోనూ పవన్ క‌ల్యాణ్ పాల్గొనే అవకాశాలున్నట్లు జ‌న‌సేన శ్రేణులు మీడియాకు తెలిపారు.

మెగాస్టార్ పోస్టర్ పై వర్మ కామెంట్స్...

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' సినిమా కు సంబంధించి తాజాగా విడుదలైన పోస్టర్‌ను వర్మ ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు. ఈ పోజ్‌ కోసం మేడం టుసాడ్స్‌ మ్యూజియం వారు తమ దగ్గర ఉన్న సగం విగ్రహాల్ని అవతల పారేస్తారన్నారు. మెగాస్టార్‌ను ఈ పోజులో కూర్చోబెట్టిన డిజైనర్‌, దర్శకుడి పాదాలు తాకాలనుందని ట్వీట్‌ చేశారు. స్వానురక్తి, స్వయంప్రేమకు పరాకాష్ఠగా దీన్ని పేర్కొన్నారు. జర్మన్‌ తత్వవేత్త హెగెల్‌ ఉంటే మెగాస్టార్‌ను ముద్దాడేవారన్నారు. ఈ పోస్టర్‌ డిజైనర్‌తో పాటు, మెగాస్టార్‌ని ఈ పోజులో కూర్చోడానికి ఒప్పించిన ఇతరుల ఫోను నంబర్లు, చిరునామాలు తనకి కావాలని వర్మ ట్వీట్ చేశారు.

'రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాదే'

కర్నూలు : ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని, చెరువల్లో పూడిక తీసి నీటిని నిల్వ ఉంచాలన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనేదే నని చంద్రబాబు స్పష్టం చేశారు.

పోలీసుల తీరుకు నిరసనగా బైరెడ్డి దీక్ష

కర్నూలు: సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటారనే నెపంతోముచ్చుమర్రిలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఇంట్లో నే బైరెడ్డి దీక్షకు దిగారు.

14:34 - January 2, 2017

కర్నూలు : రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాదేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకా చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో వున్ కరువును పారద్రోలతామనీ..11న గండికోట నుండి పులివెందులకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమకు జీవనాడన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలు మార్చుకోవాలనీ..చెరువుల్లో పూడిక తీసి నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. లక్ష ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెయిన్‌గన్ల ద్వారా సాగునీరు అందించినట్లు చెప్పారు. 

కీసర ఎస్ఐ సస్పెన్షన్

మేడ్చల్‌ : గ్రేవ్‌ కేసును నాన్‌ గ్రేవ్‌ కేసుగా మళ్లించిన కేసులో కీసర పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై విష్ణువర్ధన్‌రెడ్డిని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సస్పెండ్‌ చేశారు.

14:23 - January 2, 2017

మహిళల సమస్యలపై తక్షణ స్పందన..ఉద్యమాల్లో ప్రత్యేక గొంతుక. ఆపదలో ఉన్న మహిళలకు భరోసా..బాధిత మహిళలకు ఆలంబన..ఒక రచయిత్రి..ఒక జర్నలిస్టు..ఒక స్త్రీ వాది..విశాల ప్రపంచాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించే మనస్సు..స్నేహశీలి..ఆత్మీయ నేస్తం..స్వశక్తిని నమ్ముకొనే మహిళ. ఇవన్నింటికీ మారుపేరుగా నిలిచిన ఓ అతివ కథనం...భూమిక హెల్ప్ లైన్..వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:14 - January 2, 2017

హైదరాబాద్ : న్యూఇయర్‌ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మద్యం అమ్మకాలపై ఏ మాత్రం లేదు. డిసెంబర్‌ 31 సాయంత్రం నుంచే వైన్‌ షాపులు, బార్లు కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున మందు బాబులు మద్యం కోసం ఎగబడ్డారు. అర్ధరాత్రి వరకు బార్లు, వైన్‌ షాపులు తెరిచి ఉండటంతో ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయం వచ్చింది. కొత్త సంవత్సరం వేడుకలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని అందరూ భావించారు. కానీ అలాంటిదేమీ జరగకపోగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. మద్యం అమ్మకాల్లో న్యూఇయర్‌ జోష్‌ కనిపించింది. 2016కు వీడ్కోలు పలుకుతూ..2017 సంవత్సరానికి స్వాగతం చెబుతూ మందుబాబులు వేడుకను ఘనంగా నిర్వహించారు.
డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద భారీ క్యూలే కనిపించాయి. డిసెంబరు 31న ఏకంగా 74 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. స్వైపింగ్‌ మిషన్లు ఉన్న మద్యం షాపుల్లో కొంత ఎక్కువ అమ్మకాలు జరిగినట్ల్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. పెద్ద నోట్లను రద్దు చేయకుంటే మద్యం అమ్మకాలు ఇంకా ఎక్కువగానే ఉండేవని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2,144 మద్యం షాపులు, 853 బార్లు, 27 క్లబ్బులు ఉన్నాయి. ఈసారి ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపుల్లో రాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు, టూరిజం కార్పొరేషన్ హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతించింది. దీంతో రాత్రి 7.30 గంటల నుంచి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వాస్తవానికి గత ఏడాది డిసెంబరు 31న కూడా 74 కోట్ల విక్రయాలే సాగాయి. కానీ, ఈసారి పెద్ద నోట్లు రద్దయిన తర్వాత విక్రయాలు కొంత మందగించాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో కూడా ఇలాగే ఉంటుందని అధికారులు భావించారు. ఇందుకు భిన్నంగా గతేడాది రికార్డునే కొనసాగిస్తూ విక్రయాలు సాగడం విశేషం.

ఏపీలో..
అటు ఏపీలోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకల్లో మద్యం కొనుగోలుకు మందు బాబులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. గతేడాదితో పోలిస్తే ఈ సారి భారీగా పెరిగాయి. డిపోల నుంచి మద్యం దుకాణాలకు 2016 డిసెంబరు 30, 31వ తేదీల్లో 162.51 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. డిసెంబరు 31వ తేదీ రాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాల ద్వారా సుమారు 120 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖాధికారుల అంచనా వేశారు. మొత్తం 4.26 లక్షల కేసుల ఐఎంఎల్‌, 1.32 లక్షల కేసుల బీర్లు మద్యం డిపోల నుంచి దుకాణాలకు గడిచిన రెండు రోజుల్లో సరఫరా అయ్యాయి. రాష్ట్రంలోని 23 మద్యం డిపోల నుంచి 2015 డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.151.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా 2016 డిసెంబరు 30, 31వ తేదీల్లో రూ.162.51 కోట్ల మేర జరిగాయి. తెలంగాణలో మందు బాబులు గతేడాదిని కొనసాగిస్తే..ఏపీలో గతేడాదితో పోలిస్తే 11 కోట్ల 11లక్షల మేర విక్రయాలు పెరగడం గమనార్హం.

14:08 - January 2, 2017

వరంగల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 78 వ రోజుకు చేరుకుంది. 17 జిల్లాలను పూర్తి చేసుకొని 18వ జిల్లాలోకి పాదయాత్ర బృందం ప్రవేశించింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోవడం లేదని ఎంబీసీ నేత ఆశయ్య పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

14:06 - January 2, 2017

వరంగల్ : తెలంగాణలోని 18 జిల్లాల్లో మహాజన పాదయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యిందని సీపీఎం తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేసి విద్యార్ధుల సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

14:04 - January 2, 2017

హైదరాబాద్ : నూతన సంవత్సర ప్రసంగంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించలేదని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. కేవలం కేసీఆర్‌ను పొగడటానికే మాట్లాడారని అన్నారు. కేసీఆర్‌ను డైమనిక్ అని గవర్నర్‌ పొగిడారని...ఏ విషయంలో కేసీఆర్ డైనమిక్ అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చని కేసీఆర్ డైనమిక్‌ ఎలా అవుతారని షబ్బీర్‌ అలీ అన్నారు. ఒక్క మెగా వాట్ విద్యుత్ పెరిగిందా ? భద్రాద్రి..యాదాద్రి ఏమైందని సూటిగా ప్రశ్నించారు. కళ్లకు కనబడడం లేదా, పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయని గవర్నర్ ఎవరైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అని షబ్బీర్ విమర్శించారు.

13:58 - January 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల కొరతతో అల్లాడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే యూనివర్సిటీకి మహార్దశ వస్తుందని భావించిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హమీ నీటిపై రాతగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు వచ్చి ఏడాది గడిచినా.. విశ్వవిద్యాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. న్యాక్ గుర్తింపు లేని కారణంగా యూనివర్సిటీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రీయ ఉచ్చతర్‌ అభియాన్ రూసా నిదులకు నోచుకోలేదు. 2016 జనవరిలో యూనివర్సిటీకి న్యాక్ బీ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత న్యాక్‌ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్సిటీగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఖ్యాతి గడిచింది. ఇంతవరకు బాగానే ఉన్నా..నేటికీ రూసా నుంచి తెలంగాణ యూనివర్సిటీకి నయా పైసా రాలేదు.

2015 అక్టోబర్ లో...
2015 అక్టోబర్‌ నెలలో 50 కోట్ల రూసా నిధులకు డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపినా ఫలితం లేకుండా పోయింది. న్యాక్ గుర్తింపు వచ్చిన తరువాత గతేడాది మార్చిలో 20 కోట్ల రూసా నిదులకు రెండోసారి ప్రతిపాదనలు పంపినా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. రూసా సెమినారు నిర్వహించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కేవలం లక్ష రూపాయలు మంజూరు చేసినా..వాటినీ తెచ్చిన దాఖలాలు లేవు. దీంతో రాష్ర్టీయ ఉచ్చతర్‌ అభియాన్ నిధులు రాబట్టడటం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో నిదులు సమకూర్చుకొవటం విశ్వవిద్యాలయం అధికారులకు సవాల్‌గా మారింది. రూసా నిదులు వస్తాయన్న ఆశతో అప్పటి రిజిస్ట్రార్ వైస్ చాన్సలర్ బిక్కనూర్ నూతన కాలేజీ భవనానికి భూమి పూజా చేసారు.. నిధుల లేమితో ఈ పనులు అటకెక్కాయి. న్యాక్ గుర్తింపు ఉంటే రూసా నుంచి సుమారు 20 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నిధులు వస్తే క్యాంపస్‌లో కళాశాల భవనాలు, ప్రయోగశాలలు, ఆడిటోరియం, ఆరోగ్య కేంద్రాల పనులు కార్యరూపం దాల్చుతాయని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రూసా నిధులు రాబట్టడంలో విశ్వ అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు.

రూసా నిధులకు కేవలం ప్రతిపాదనలు పంపడంతో సరిపోదని..జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల సమన్వయంతో కేంద్ర మానవ వనరుల శాఖపై ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

13:54 - January 2, 2017

ఢిల్లీ : ఎన్నికలు...ఓట్లు...ఓట్లను సంపాదించుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఎంతటిస్థాయికైనా దిగజారుతాయనేది తెలిసిందే. తాజాగా ఈ అంశంపై సుప్రీం సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. హిందుత్వ అంశంపై దాఖలైన పిటీషన్లపై సోమవారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం..మతం..ప్రాంతం ప్రాతిపదికగా ప్రజలను ఓట్లను అడగవద్దని సూచించింది. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని పేర్కొంది. మనిషికి దేవుడికి మధ్యనున్న సంబంధం వ్యక్తిగతమైందని తెలిపింది. కొద్ది రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అంతేగాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ తరుణంలో పలు సంచలనాత్మక తీర్పులు వెలువడుతున్నాయి. ఎన్నికల సమయంలో పలు పార్టీలు ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇది మానుకోవాలని సుప్రీం ఈ రోజు సంచలనాత్మక తీర్పును చెప్పింది. ఓట్లను రాబట్టుకోవడం సమజసం కాదని తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, సమాజంలో ఉన్న వారందరినీ ఒకేవారీగా చూడాలని సుప్రీం సూచించింది. ఈ తీర్పుపై రాజకీయ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

 

13:53 - January 2, 2017

ఢిల్లీ : భారతదేశంలోని క్రికెట్ చరిత్రలో సంచలనం చోటు చేసుకుంది. బీసీసీఐపై సుప్రీం కొరడా ఝులిపించింది. ఏకంగా అధ్యక్ష పదవి నుండి అనురాగ్ ఠాకూర్ పై సుప్రీం వేటు పడింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాకూర్ తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగించింది. 2016 జులై 18వ తేదీన లోథా కమిటీ పలు సిఫార్సులను తెలియచేసింది. కానీ లోథా సిఫార్సులను బీసీసీఐ ఏమాత్రం అమలు చేయలేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక ఒక ప్యానెల్ కూడా ఏర్పాటు చేసింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై బీసీసీఐ పూర్తిగా విఫలం చెందిందని, కోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకో లేదని అనురాగ్ ఠాకూర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. రాజకీయ నేతల జోక్యం ఉండకూడదని, మూడేళ్ల అనంతరం పదవిలో ఉండకూడదని, నిధుల విషయంలో పారదర్శకత పాటించాలని పలు సిఫార్సులను లోథా కమిటీ సూచించింది. కానీ ఈ సిఫార్సులను అమలు చేయలేదు. దీనిపై విచారించిన సుప్రీం పై నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో సహాయకులుగా సీనియర్ న్యాయవాదులు పాలీ నారీమన్, గోపాల సుబ్రమణ్యంలను కోర్టు నియమించింది. బోర్డు సభ్యుల ఎంపికపై సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.

13:49 - January 2, 2017

తూర్పుగోదావరి : గుర్రం మీద రైడింగ్ చూశారు.. గాడిద మీద రైడింగ్ చూశారు.. కానీ పంది మీద రైడింగ్ ఎప్పుడైనా చూశారా? పంది మీద రైడింగ్ ఏంటీ అనుకుంటున్నారా? అది కూడా ఓ బుడతడు ఎంచక్కా పంది మీద రైడింగ్ చేస్తున్నాడు.. నమ్మడం లేదా ?బుడతడు అంటే పందులకు ఎంతో ప్రేమ.. బడికి వెళ్తుంటే గేటు వరకు తోడుగా వస్తాయి. బడి వదిలే టైంకి గేటు దగ్గరకు వచ్చేస్తాయి. ఆ వరాహాలకు బుడతడు అంటే అంత ఇష్టం.. బుడతడు కూడా పందులతో ఆడతాడు.. పాడతాడు... అంతేకాదు పందుల మీద ఎక్కి ఏకంగా స్వారీ చేస్తు విన్యాసాలు చేస్తాడు. తూర్పుగోదావరి జిల్లాలోని కొండవరం గ్రామంలో ఈ విచిత్రమైన సన్నివేశం కనిపిస్తోంది. గ్రామంలో పందులు పెంచే అమలదాసు వెంకన్న, సత్యవతి దంపతులకు ఇద్దరు కొడుకులు.. పెద్ద కొడుకు మహేష్‌కు చిన్నప్పటి నుంచి పందులతో ఆడుకోవడం సరదాగా మారింది. అవి కూడా ఇతడితో స్నేహంగా మెలుగుతున్నాయి. గ్రామస్తులందరూ ఇతడిని వరాహ బాహుబలి అని పిలుస్తారు. తనకు చిన్నప్పటి నుంచి పందుల మీద రైడింగ్ చేయడం అలవాటనీ.. ఇంత వరకు ఎప్పుడు రైడింగ్ చేస్తు కింద పడలేదని బుడతడు చెబుతున్నాడు. తనను తప్పితే ఇంకెవరనీ పందులు దగ్గరికి రానివ్వవని పిల్లగాడు తెలిపాడు.

13:47 - January 2, 2017

ఢిల్లీ : కొత్త సంవత్సరం వచ్చిందంటే వ్యాపార వాణిజ్యాల్లో నూతనుత్తేజం మొదలవుతుంది. గతేడాది ఒడిదుడుకులను మర్చిపోయి..కొత్త ఏడాది అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రణాళికులు రచిస్తాయి వ్యాపార వర్గాలు. అయితే 2017 పై ప్రభావం చూపగల కొన్ని సంఘటనలు 2016 లోనే జరిగాయి. 2017 దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల సంఘటనలేంటి ? కొత్త ఏడాదిలో కొత్తపుంతలు తొక్కేందుకు వ్యాపార వాణిజ్య వర్గాలు ఉత్సాహంగా ఉరకలేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగలిగే సంఘటనలు ఈ ఏడాదిలోనూ కొనసాగనున్నాయి. గతేడాది ట్రంప్‌ ఎన్నిక మన ఐటీ రంగంపై ప్రభావం చూపించనుంది. ఇక పెద్దనోట్ల రద్దు, రిలయన్స్ జియో వంటి ప్రధాన ఘటనలు ఈ ఏడాది తీరుతెన్నులను నిర్దేశించనున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మరిన్ని చర్యలు ఈ ఏడాదిలో ఆవిష్కృతం కానున్నాయి. మరోవైపు నగదు రహిత దేశం దిశగా దూసుకెళ్లేందుకు 2017 కీలకం కానుందనడంలో సందేహం లేదు.

ఈ ఏడాదిపైనా పెద్దనోట్ల రద్దు ప్రభావం..
గతేడాది భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న అతి పెద్ద పరిణామం ఏదైనా ఉంది అంటే అది పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే. మొత్తం 2017పై ప్రభావం చూపగల వ్యవహారాల్లో ఇది మొదటిస్థానంలో ఉంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు మున్ముందు ప్రధాని ప్రకటించబోయే చర్యలు ఆ ఏడాదంతా ప్రభావం చూపనున్నాయి. మరోవైపు ఆన్‌లైన్ విక్రయాలు, డిజిటల్‌ చెల్లింపులకు 2017 చిరునామాగా మారునుంది.

మరోవైపు ఆర్థిక వ్యవస్థపై జీఎస్‌టీ ప్రభావం..
ఈ ఏడాది ఎక్కువ ప్రభావం చూపగల మరో అంశం బడ్జెట్. ఈసారి నెలముందుగానే దీన్ని ప్రవేశ పెడుతుండటం విశేషం. రైల్వేబడ్జెట్‌ను, సాధారణ బడ్జెట్‌తో కలిపే చారిత్రక ఘట్టమూ ఈ ఏడాదే జరగనుంది. ఇక 2016లో చాలా వరకు బిల్లులు పార్లమెంట్‌లోనే ఉండిపోయాయి. అందులో జీఎస్‌టీ బిల్లులు ఉన్నాయి. జీఎస్‌టీ అమలుకు ప్రభుత్వం సాకారం చెయ్యగలిగితే.. దేశ ఆర్థిక వృద్ధిరేటు పెరిగేందుకు అవకాశముంటుంది.

జియో ధాటికి దిగివచ్చిన ఇతర నెట్‌వర్క్‌లు..
టెలికాం వ్యవస్థలో సంచలనం సృష్టించింది రిలయన్స్ జియో నెట్‌వర్కింగ్. దేశంలో అట్టడుగుస్థాయికి సైతం ఇంటర్నెట్‌ వెళ్లిందంటే అది జియో మహిమే. జియో ధాటిని తట్టుకోలేక ఇతర నెట్‌వర్క్‌లు తక్కువ ధరకే నెట్‌సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసుందుకు జియో ఉపయోగపడనున్నది అనడంలో సందేహం లేదు.

ఈ ఏడాది కాస్త పెరగనున్న ముడిచమురు ధరలు..
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపగలిగే మరో అంశం ముడిచమురు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన సమావేంలో ఓపెక్ ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించింది. ఓపెక్‌ యేతర దేశాలు సైతం ఈ నిర్ణయానికి అంగీకరించాయి. దీంతో ముడిచమురు ధరలు ఈ ఏడాది కాస్త పెరగనున్నాయి. మరోవైపు అమెరికాతో ఆర్థిక సంబంధాలు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోదీ మధ్య ఎలాంటి చర్చలు చోటు చేసుకుంటాయి అవి ఏ దిశగా దారితీస్తాయన్న దానిపై మన దేశ ఆర్థిక వ్యవస్థ ధోరణి ఆధారపడనుంది. దేశ ఐటీ రంగంలో అధిక భాగం ఎగుమతులు అమెరికాకే ఉండటంతో మన కంపెనీల ఆదాయాన్ని ఆ దేశ అధ్యక్షుడి అలోచనలు శాసించే అవకాశం లేకపోలేదు.

గతేడాది ఆన్‌లైన్ రిటైల్‌ మార్కెట్‌ మందగమనం
గతేడాదిలో ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్ మందగమనం పాలైంది. ప్రభుత్వ విధానాల్లో మార్పులు, డిస్కౌంట్లు తగ్గడం, పెద్దనోట్ల రద్దు ఇలా పలు అంశాలు కారణమయ్యాయి. అయితే గతేడాది పండుగల సీజన్‌లో భారీ విక్రయాలు నమోదుకావడం విశేషం. ఈ నేపథ్యంలో 2017లో ఈ పరిశ్రమ 40 శాతం వృద్ధి చెందనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

13:43 - January 2, 2017
13:42 - January 2, 2017

మంచిర్యాల : అటవీ జంతువులకు రక్షణ కరువైంది...ఒకపక్క జింకలు, దుప్పులు, అడవి పందులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుంటే... మరో పక్క వేటగాళ్ల ఆగడాలకు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. మంచిర్యాల, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాల అడవుల్లో జరుగుతున్న మారణహోమంపై ప్రత్యేక కథనం.. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది దట్టమైన అడవీ ప్రాంతం. జిల్లాలో కొండలు, కోనల మధ్య ఉండే సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, దహేగాం, సిర్పూర్ (టీ), కౌటాల, పెంచికల్, చింతమానె పల్లి మండలాలు దట్టమైన అడవుల మధ్య ఆనుకొని ఉంటాయి. ప్రాణహిత, పెన్‌గంగా, పెద్దవాగు నదులు ఈ మండలాల్లోని గ్రామాలను ఆనుకొని ప్రవహిస్తాయి. దాదాపు సగానికి పైగా గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. అటు మహారాష్ట్రలో దట్టమైన అడవులు కల్గి ఉండటంతో అడవి జంతువులు గ్రామాల్లోకి, పొల్లాల్లోకి తరచుగా వస్తుంటాయి.

కరెంట్‌ తీగలకు బలవుతున్న జంతువులు..
అడవి జంతువులు గ్రామాల్లోకి రావడంతో వేటగాళ్ల కళ్లు అడవి జంతువులపై పడింది. జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. పొలాలు, అడవులలో వేటగాళ్లు విద్యుత్ తీగలను అమర్చుతున్నారు. రాత్రి వేళల్లో అడవి జంతువులు అటువైపుకు వచ్చి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడుతుంటాయి. అడవి పందులు, దుప్పులు, జింకల వాటిని వేటాడి వాటి మాంసాన్ని ఇతర ప్రాంతాల్లో అమ్మి క్యాష్‌ చేసుకుంటున్నారు.

వేటగాళ్ల ఉచ్చుకు ఆరుగురు బలి..
ఇదీలా ఉంటే మరో పక్క పొలాల్లో వేటగాళ్ళు ఏర్పాటు చేసిన కరెంటు తీగలకు అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. వేటగాళ్లు అటు వన్యప్రాణులతో పాటు ఇటు మనుషుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. కుమ్రంభీం మంచిర్యాల జిల్లాలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు.

పెద్దపులి సైతం విద్యుత్ తీగలు తగిలి మృతి..
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పశువులు, మేకలు లెక్కలేనన్ని బలయ్యాయి. నెలరోజుల క్రితం మచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పెద్దపులి మరణించింది. ఈ విషయం బయటకు పొక్కకుండా పులి శవాన్ని వేటగాళ్లు అడవిలోనే పూడ్చిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులు..
వారం రోజుల క్రితం కుమ్రంభీం జిల్లా బెజ్జూర్ మండలం మద్దిగూడ గ్రామంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి శంకర్ అనే వ్యక్తి మృతిచెందాడు. గుట్టుచప్పుడు కాకుండా శంకర్ మృతదేహాన్ని వేటగాళ్లు దగ్గరలోని పెద్దవాగు ఒడ్డున పూడ్చిపెట్టి భయంతో పోలీసులకు లొంగిపోయారు. గత వారం రోజులుగా వణ్య ప్రాణులను వేటాడడానికి విద్యుత్ తీగలను అమర్చే క్రమంలో మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాలలో కొత్తపల్లి పాపయ్య, ముత్తయ్య అనే వ్యక్తులు మృతిచెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే వారంలో ముగ్గురు వ్యక్తులు విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల ఉచ్చులకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్ధానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

13:36 - January 2, 2017

కామారెడ్డి : నల్లబెల్లానికి పెట్టింది పేరు కామారెడ్డి. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల కారణంగా నల్లబెల్లం తయారుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ బెల్లం తయారీ, రవాణాపై అధికారులు పలు ఆంక్షలు విధించడంతో రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. నల్లబెల్లానికి పెట్టింది పేరైనా కామారెడ్డి జిల్లాలో నల్లబెల్లం కొనుగోలు కిరికిరి వీడటం లేదు. సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో నల్లబెల్లానికి బాగా డిమాండ్ ఉన్నా ప్రభుత్వ నిబంధనల కారణంగా లాభాలు పొందలేకపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, తాడ్వాయి, బిక్కనూరు మండలాల్లో గతేడాది తయారు చేసిన నల్లబెల్లం నిలువలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నల్లబెల్లం రవాణాపై ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో బెల్లం కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారం పడిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆదుకోవాలంటున్న రైతులు..
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నల్లబెల్లం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగించడం ఏంటనీ రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా మద్దతు ధర వస్తుందని భావించిన తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. సీజన్ చివరలో మార్క్‌ఫెడ్‌ ద్వారా బెల్లం కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. ఈ సారైనా సీజన్ ప్రారంభంలో మార్క్ పెడ్ ద్వారా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందని రైతులు భావించారు. కానీ ఇప్పటి వరకు బెల్లం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మార్క్ పెడ్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, దళారులు కుమ్మక్కు అయ్యారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జనవవరి నెలలో బెల్లం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

13:31 - January 2, 2017

కరీంనగర్ : అపుడు రమ్మని ఆహ్వానించారు.. ఇప్పుడు వద్దు పొమ్మంటున్నారు. మంచోడని పిలిచి గద్దెనెక్కిస్తే.. అవినీతి కంపులేపాడని ఆ మంత్రిగారు కస్సుబుస్సులాడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నగర పంచాయతీ ఛైర్మన్‌ వ్యవహారంలో మంత్రి ఈటలపై సొంతపార్టీ నేతలే విమర్శల దాడి పెంచారు. కరీంనగర్‌ జిల్లా హుజారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతో.. గులాబీపార్టీలో రాజకీయం వేడెక్కింది. మంత్రి ఈటల రాజేందర్‌ - టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు వర్గాల మధ్య ఆధిపత్యపోరు గులాబీపార్టీలో చిచ్చుపెడుతోంది. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

స్థానికుల మండిపాటు..
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్ల విస్తరణలో ఛైర్మన్‌ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చేస్తున్నారని ఓ వర్గం వారు మండిపడుతున్నారు. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారి అండచూసుకునే మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ నిధులను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రి ఈటల చేసిన ప్రయత్నం బెడిసికొడుతోంది. ఛైర్మన్‌తో తమ పార్టీకి సంబంధంలేదని మంత్రి ఈటల తాజాగా పేపర్‌ ప్రకటనలివ్వడం మరింత వివాదస్పదంగా మారింది.

ఈటెలపై వ్యతిరేకత..
హుజూరాబాద్‌ ఛైర్మన్‌గా ఉన్న వడ్లూరి విజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే మంత్రి ఈటల రాజేంద్రర్‌ ప్రోత్సాహంతోనే విజయ్‌కుమార్‌ గులాబీపార్టీలోకి వచ్చారని.. స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అంటున్నారు. మురిపెంతో తీసుకొచ్చిన నేత..చివరికి.. మున్సిపాలిటీ నిధులకే ఎసరు పెట్టారనే ఆరోపణలొచ్చాయి. దీంతో ఛైర్మన్‌ వడ్లూరితో తమపార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ.. మంత్రి ఈటల తన బాధ్యతను దులపరించుకుంటున్నారనే హుజూరాబాద్‌ ప్రజలు మండిపడుతున్నారు. మొత్తానికి కోరి తీసుకొచ్చిన మున్సిపల్‌ ఛైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ వ్యవహారం హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌లో చిచ్చుపెడుతోంది. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు వర్గంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌ పై విమర్శల దాడి పెంచారు. దీంతో తన సొంత ఇలాఖాలోనే మంత్రి ఈటలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

13:28 - January 2, 2017

కరీంనగర్ : ప్రజాసమస్యలను తెలుసుకుంటూ... ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ సీపీఎం మహాజన పాదయాత్ర కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. 77 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల బతుకులు మారకుండా తెలంగాణ అభివృద్ధి అసాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే ప్రజలకు బతుకులు బాగున్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగాలు కూడా రావడం లేదని తమ్మినేని అన్నారు. సంపద ఒకే చోట కేంద్రీకృతం కారాదని, సమాజంలోని బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజలు సమాన అవకాశాలు పొందాలని రాజ్యాంగం చెబుతోందని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. సమాజంలో జరిగే పరిణామాలపై యువత ఆలోచన చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగు పడతాయనుకుంటే.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు తెలుసుకుంటూ..
జనాభాలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాదయాత్రకు మద్దతు తెలిపిన పలువురు నేతలు అన్నారు. ఇప్పటికే 77 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రతిపల్లెలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ఎప్పటికప్పడు ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ ముందుకు సాగుతోంది. 77వ రోజు తమ్మినేని బృందం చిలుకూరు, చిన్నరాజుపల్లి, రంగాపూర్‌, చింతపల్లి, హుజురాబాద్‌, బెంచికలపేట ఎక్స్‌రోడ్డు, కోతులనడుమ, వీరనారాయణపూర్‌, దండేపల్లి, బావుపేట వరకు కొనసాగింది.

అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతం

హైదరాబాద్:అగ్ని-4 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఇవాళ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి పరీక్ష నిర్వహించారు. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని క్షిపణి సునాయసంగా ఛేదించగలిగింది. ఈ క్షిపణికి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంటుంది.

13:15 - January 2, 2017

ఢిల్లీ : సమాజ్ వాదీ పార్టీలో ఏం జరుగుతోంది. తండ్రి ములాయం..తనయుడు లోకేష్ లలో ఎవరు పై చేయి సాధిస్తారు ? పార్టీ గుర్తు ఎవరికి చెందుతుంది ? అనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. తండ్రి...కొడుకుల మధ్య ప్రచ్చన్నయుద్ధం నడుస్తోంది. గత కొంతకాలంగా ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్..ఆయన తనయుడు సీఎం అఖిలేష్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను సీఎం అఖిలేష్ ప్రకటించడంతో ములాయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుండి ఆయన్ను సస్పెండ్ చేశారు. కొద్దిసేపటి అనంతరం దానిని ఉపసంహరించుకున్నారు. జాతీయ అధ్యక్ష పదవి నుండి శివపాల్ సింగ్ యాదవ్ ను తొలగించిన సంగతి తెలిసిందే. అమర్ సింగ్, శివపాల్ సింగ్ యాదవ్ చేస్తున్న చర్యలతో పార్టీకి నష్టం కలుగుతోందని అఖిలేష్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ సదస్సుకు పిలుపునిచ్చిన ములాయం వెనక్కి తగ్గారు. పార్టీ గుర్తు 'సైకిల్' ఎవరికి దక్కుతుందనే దానిపై అఖిలేష్..ములాయం వర్గాలు న్యాయవాదులను సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు వెళ్లి అక్కడి అధికారులతో ములాయం మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలకు సిద్ధం కావాలని రాంగోపాల్ యాదవ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. మరి సైకిల్ గుర్తు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

గన్నవరం ఎయిర్ పోర్టు పనులను పరిశీలించిన ఎంపి కేశినేని

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టులో రెండో టెర్మినల్ పనులను ఎంపి కేశినేని నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈనెల 12న రెండో టెర్మినల్ ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రారంభిస్తారని తెలిపారు. 12న నూతన రన్ వేకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన, 12 నుండి అంతర్జాతీయ ఎయిర్ ఫోను నిర్వహిస్తున్నామని తెలిపారు.

13:13 - January 2, 2017

హైదరాబాద్ : న్యూస్ ఈజ్ పీపుల్ అంటూ ప్రజల సమస్యల కోసం 10టీవీ చానల్ పాటుపడడం అభినందీయమని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10టీవీ 2017 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను నిష్పాక్షితంగా వెలుగులోకి తెస్తోందని కొనియాడారు. ఇలాగే ప్రజల తరపున 10టీవీ నిరంతరం పోరాడాలని సూచించారు.

13:11 - January 2, 2017
13:09 - January 2, 2017

గవర్నర్ సీఎం భజన చేయడం మానుకోవాలి : షబ్బీర్ అలీ

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్ భజన చేయడం మానుకోవాలని టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సూచించారు. పదవిని కాపాడుకునేందుకే సీఎం పై గవర్పర్ ప్రశంసలు కురిపిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ తన హోదాను మరిచి మాట్లాడుతున్నారని, ఫిరాయింపులను కట్టడి చేయడం మరిచి గవర్నర్ ప్రోత్సహిస్తుండటం దారుణం అని ఆదేవన వ్యక్తం చేశారు.

13:02 - January 2, 2017

సూర్యాపేట : మునగాల (మం) ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. కోదాడ మండలం కోమరబండకు చెందిన ఉపేందర్, లక్ష్మణ్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వీస్ రోడ్డును నిర్మించాలని కోరుతున్నా జీఎమ్మార్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

13:01 - January 2, 2017

విశాఖపట్టణం : ఓ శుభకార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కే కోట మండలం మర్రివలసలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన సంఘటనపై మంత్రి కామినేని స్పందించారు. వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులకు మంత్రి కామినేని ఆదేశించారు. మర్రివలసలో ఓ శుభకార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకలో వారి వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. భోజనంలో మాంసాహారం తిన్న వారికి వాంతులు..విరోచనాలు మొదలయ్యాయి. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అస్వస్థతకు గురైన వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. మూడు వందల మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

12:59 - January 2, 2017

హైదరాబాద్ : ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల సమ్మె ఇంకా కొనసాగుతోంది. వీరు చేస్తున్న ఆందోళన నేటికి మూడో రోజుకు చేరుకుంది. గత మూడు రోజులుగా ఆందోళన చేస్తుండడంతో 60వేల కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమస్య పరిష్కారానికి ఓలా, ఉబెర్ సంస్థలు ముందుకు రావడం లేదు. దీనిపై క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ క్యాబ్య డ్రైవర్ల అసోసియేషన్ హెచ్చరించింది.

12:58 - January 2, 2017
12:58 - January 2, 2017

హైదరాబాద్ : కొత్త సంవత్సరంలో కూడా 'కరెన్సీ' కష్టాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 రోజుల అనంతరం పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని, అంతవరకు కష్టాలు తప్పవని స్వయంగా ప్రధాని పేర్కొన్నారు. కానీ 50 రోజులు దాటినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. సోమవారం ఉదయం బ్యాంకులు..ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విత్ డ్రా పరిమితిని రూ. 2500 నుండి రూ. 4500 కు పెంచిన సంగతి తెలిసిందే. డబ్బులున్న ఏటీఎంలలో రూ. 500, రూ.2000 వస్తుండడంతో చిల్లర దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కష్టాలు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సోమవారం ఉదయం విద్యానగర్ వద్దనున్న బ్యాంకుల వద్దనున్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంది. మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

12:56 - January 2, 2017

7వ తేదీన 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్

హైదరాబాద్ : ఈనెల 7వ తేదీన మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముహూర్తం ఖారారయింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు.  

12:48 - January 2, 2017

కొత్త సంవత్సరంలో కూడా కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం సామాన్య మానవుడు అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 తేదీన ప్రధాన మంత్రి మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి మోడీ చేసిన ప్రసంగంపై పలు విమర్శలు వెలలువెత్తుతున్నాయి. ఇది పసలేని ప్రసంగమని, నోట్ల రద్దుపై ప్రధాని మాట్లాడకపోవడం విచారకరమని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ప్రజలు క్యూ లైన్ లో నిలుస్తున్నారని, కష్టాలు పడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పేర్కొన్న విషయం తెలిసిందే. నవంబర్ 8వ తేదీ వరకు ఉన్న ఉత్సాహం ఇప్పుడు బీజేపీ నేతల్లో కొరవడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పాదూరి కరుణ (బీజేపీ), బెల్యా నాయక్ (కాంగ్రెస్), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

 

సుప్రీకోర్టును ఆశ్రయించండి : ఎన్జీటీ

ఢిల్లీ : పోలవరం పర్యావరణ అనుమతులు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ పేలుళ్లు పూడ్చివేతలకు పాల్పడుతున్నారని ఎన్జీటీ దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లాడు. సుప్రీం కోర్టులో ఉన్న కేసుల జాబితాను పిటీషనర్ ఎన్జీటీకి సమర్పించాడు. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

 

12:46 - January 2, 2017

50 రోజులు దాటినా కరెన్సీ సమస్య కుదురుకోలేదు. నోట్ల రద్దు తర్వాత దెబ్బతిన్న బిజినెస్ లు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అసలే నష్టాలతో కుంటుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారినట్టే కనిపిస్తోంది. ఈ యాభై రోజుల్లో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు మరింత పడిపోయింది. నోట్ల రద్దు కారణంగా ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలన్న సూచనలొస్తున్నాయి. ఇదే డిమాండ్ పై ఎస్ డ బ్ల్యు ఎఫ్ (SWF) జనవరి3న అంటే రేపు నల్లబ్యాడ్జీలతో నిరసనకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఎస్ డబ్ల్యు ఎఫ్ నేత విఎస్ రావు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:44 - January 2, 2017

ఉత్తర్ ప్రదేశ్ : తండ్రీకొడుకులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ల మధ్య ఏర్పడిన వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. పార్టీ గుర్తు కోసం ములాయం, అఖిలేష్‌ గ్రూపులు పోరాడుతున్నాయి. సైకిల్‌ గుర్తును తమకు కేటాయించాల్సిందిగా కోరుతూ ఇరు వర్గాలు ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, వీధి పోరాటాలతో సతమతమవుతున్న ఎస్పీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రి, తనయుని మధ్య తగాదాలు తారా స్థాయికి చేరి, ఒకవర్గం నేతలను మరో వర్గం బహిష్కరించుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ కాస్తా సమాజ్‌ వార్‌ పార్టీగా మారింది.

ఎస్పీలో సైకిల్‌ గుర్తు కోసం రగడ
ఎస్పీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుకోవడంతో ఎన్నికల కమిషన్ ముందే అమీతుమీకి ఇటు అఖిలేష్, అటు ములాయం సింగ్ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. అఖిలేష్-రామ్‌గోపాల్ మద్దతుదారులు ఒకవైపు, ములాయం - శివలాల్ యాదవ్ వర్గీయులు మరోవైపు ఈసీ ముందు తమ వాదన వినిపించనున్నట్టు తెలుస్తోంది. రామ్‌గోపాల్ యాదవ్ ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ములాయం సింగ్ స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్ యాదవ్‌ను తొలగిస్తూ మరో తీర్మానం చేయడం సంచలనమైంది. దీంతో భగ్గుమన్న ములాయం సింగ్ యాదవ్...రామ్‌గోపాల్ యాదవ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం రాజ్యాంగవిరుద్ధమని, అందులో తీసుకున్న నిర్ణయాలు చెల్లవంటూ ప్రకటించారు. అఖిలేష్ విధేయులుగా ఉంటూ సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలైన కిరణ్మయి నందా, నరేష్ అగర్వాల్‌పై కూడా వేటు వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్పీలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందుకు చేరబోతోంది. పార్టీలోని పరిణామాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈసీ ముందుంచి...రాబోయే ఎన్నికల పార్టీ సింబల్ తమకే కేటాయించాలని రెండు వర్గాలు ఎన్నికల సంఘాన్ని కలుస్తాయని తెలుస్తోంది.

ఈ నెల 5న లక్నోలో పార్టీ జాతీయ సమావేశం..
ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ఎన్నికైనందున పార్టీ గుర్తు తమదేనని అఖిలేష్ వర్గాలు, అసలు సమావేశమే రాజ్యాంగ విరుద్ధమైనందున పార్టీ నుంచి పలువురిని బహిష్కరించినట్టు వివరించడం ద్వారా ఎన్నికల గుర్తును క్లెయిమ్ చేయాలని ములాయం వర్గాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా తమతమ అనుచరణగణంతో విస్తృత మంతనాలు సాగిస్తున్నాయి. మరోవైపు అఖిలేష్‌ నేతృత్వంలో జరిగిన పార్టీ జాతీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ములాయంసింగ్‌ యాదవ్‌ తప్పుపట్టారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఈనెల 5న లక్నోలో పార్టీ జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఆమోదం తెలిపారు. మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తంగా ఇరు వర్గాలు పార్టీ గుర్తు సొంతం చేసుకోవడంపై దృష్టిసారిస్తున్నాయి. క్షణక్షణం మారుతున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.

12:39 - January 2, 2017

విజయవాడ : మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ఆస్తుల జప్తు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. గంటా అండ్‌ కో.. బ్యాంకులకు ష్యూరిటీ కింద చూపిన ఆస్తుల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూములను తనఖా కింద పెట్టారని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే మంత్రి పదవికి గంటా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యూష సంస్థతో గంటాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. గంటా శ్రీనివాసరావు రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. ఏపార్టీ అధికారంలోకి వస్తే.. అక్కడ వాలిపోవడం గంటాకు అలవాటు. 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. తనే కాకుండా తన అనుచరులైన చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, అవంతి శ్రీనివాస్‌ను గెలిపించుకున్నారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో గంటా శ్రీనివాస్‌ కూడా కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మానవ వనరులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధికారంలో ఏపార్టీ ఉన్నా తాను మంత్రిగా ఉండేటట్లు చూసుకుంటారు.

ప్రత్యూష సంస్థకు ఎండీగా పనిచేసిన గంటా..
ఎప్పుడూ పార్టీలు మారే గంటా శ్రీనివాస్‌కు వివాదాలు కూడా కొత్తేంకాదు. గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ భూముల విషయంలో గంటాకు చెందిన ప్రత్యూష సంస్థ పేరు వినిపించింది. అప్పుడు ప్రత్యూష సంస్థతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పుకున్న గంటా ఇప్పుడు తన ఆస్తుల జప్తు విషయంలోనూ పాతపాటే వినిపిస్తున్నారు. గంటా శ్రీనివాసరావును ప్రత్యూష శ్రీనివాసరావు అనికూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన ప్రత్యూష సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశారు కాబట్టి.


బ్యాంకు పంపిన నోటీసులకు నో రెస్పాన్స్‌...
ప్రత్యూష సంస్థ విస్తరణ పేరుతో ఇండియన్‌ బ్యాంక్‌ డాబా గార్డెన్స్‌ శాఖ నుంచి 2005 ఆగస్టు నెలలో 141 కోట్ల 68 లక్షలు రుణం తీసుకుంది. అప్పటి నుంచి ఒక్క వాయిదా కూడా చెల్లించకపోవడంతో ఈ ఏడాది చివరి నాటికి వడ్డీతో కలిపి 196 కోట్ల 51 లక్షలు అయినట్టు బ్యాంక్‌ లెక్కకట్టింది. వెంటనే అసలు, వడ్డీ చెల్లించాలని బ్యాంక్‌ పంపిన నోటీసులకు ఎలాంటి రెస్పాన్స్‌లేకపోవడంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో గంటాకు చెందిన ఇల్లు, పార్టీ కార్యాలయం కూడా ఉంది.

కొత్త మలుపు తిరిగిన ఆస్తుల స్వాధీనం వ్యవహారం..
ఆస్తుల స్వాధీనం వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. బ్యాంకు ష్యూరిటీ కింద ఆనందపురం మండలం వేములవలస గ్రామంలోని 122/9, 10,11,12,13,14,15 సర్వేనంబర్లలోని భూమిని తనఖా పెట్టారు. అయితే ఇందులో సర్వేనంబర్స్‌..122/9, 10,11,12లోని భూమి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్నది. అంటే ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగబద్దమైన మంత్రి పదవిలో ఉన్న గంటా శ్రీనివాసరావు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఎక్కడి దాక వెళుతుందో ?
మంత్రి గంటా అండ్ కో చేసిన దందాపై సీపీఎం, వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. గంటా శ్రీనివాసరావు వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గంటా అక్రమాలపై ముఖ్యమంత్రి మౌనం వీడాలని వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ గంటా శ్రీనివాస్‌రావుకు మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయాలు వేరని, వ్యాపారం వేరని దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు. ప్రత్యూష సంస్థతో గంటాకు ఎలాంటి సంబంధంలేదన్నారు. రోజుకో కొత్తమలుపు తిరుగుతున్న గంటా అండ్‌ కో దందా వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే.

దిల్ షుఖ్ నగర్ పేలుళ్ల కేసులో అప్పీల్ స్వీకరణ

హైదరాబాద్ : దిల్‌షుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో అప్పీల్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అప్పీల్, రీట్రయల్ కలిపి తుది విచారణను చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. కాగా, ఈ కేసును హైకోర్టుకు రిఫర్ చేయాలని ఎన్‌ఐఏ కోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈకేసులో నలుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించడంతో వాళ్లు కూడా హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు.

12:36 - January 2, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తీరును మార్చుకున్నారా...? ఇప్పటికీ హైటెక్ జపం చేస్తున్న ఆయన... తాజాగా వ్యవసాయం కూడా ముఖ్యమేనని గుర్తించారా...? అందుకే ఇప్పుడు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టారా.. ? తన తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ, టూరిజం జపం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో తెగ హడావిడి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న రోజుల్లో వ్యవసాయ రంగాన్ని అంతగా పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిన్న పట్టిసీమ, ఇపుడు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నిధులు రాబట్టడంతో పాటు పనులను యుద్ధప్రాతిపధికన చేస్తున్నారు.

చాలా తేడా ?
అయితే.. నేటి చంద్రబాబుకు.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారానికి చాలా తేడా కనిపిస్తోందంటున్నారు ఏపీ ప్రజలు. ఒకపుడు ఆయన వ్యవసాయం దండగ అన్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. నిజానికి బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. అయినా ఏనాడూ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల ఊసే ఎత్తని చంద్రబాబు తాజాగా నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం స్విల్‌వేకు కాంక్రీట్‌ పనులు ప్రారంభించడం.. అంతకు ముందు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్టా-గోదావరి నదుల అనుసంధానంలో ముందడుగేయడం లాంటివి చూస్తుంటే బాబు ఆలోచన మారిందంటున్నారు ఏపీ ప్రజలు. దాంతోపాటు కరువుజిల్లా అనంతపురంలో పంటకుంటలను ఏర్పాటు చేసి.. రెయిన్‌గన్లతో వేరుశనగ పంటలను కాపాడాలంటూ ఆయన కొంత ఎక్కువగానే హడావుడి చేశారు.

ఆసక్తికర చర్చ..
విజయనగరం జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ ను కూడా వేగవంతంగా పూర్తి చేయించిన చంద్రబాబు, ఆ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేశారు. ఇక వంశధార, నాగవళి నదులను కూడా అనుసంధానం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇంతకాలం తాను ఆచరిస్తూ వచ్చిన పాలసీని పక్కకు పెట్టి .. వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయడంపై ఏపీ ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఘనంగా ముక్కోటి ఉత్సవాలు..

కొత్తగూడెం : భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దశావతారాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు నేడు నరసింహావతారంలో దర్శనమిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. నేడు సాయంత్రం మిథిల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఢిల్లీకి చేరిన సమాజ్ వాది పార్టీ పంచాయతీ

యూపి: సమాజ్ వాది పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సైకిల్ గుర్తు కోసం తండ్రి, కొడుకుల మధ్య వార్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు ములాయం సింగ్ వర్గం ఈసీని కలవనుంది. ములాయంసింగ్ వెంట అమర్ సింగ్, శివపాల్ యాదవ్ కూడా ఉన్నారు.

12:32 - January 2, 2017

కర్నూలు : జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్నీ, వినతుల్నీ సత్వరమే పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇవాళ నుంచి జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి కర్నూలు జిల్లా తడకనపల్లె గ్రామంలో సీఎం శ్రీకారం చుడుతున్నారు. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని.. లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేయనున్నారు. ప్రజలకు పలురకాల ప్రయోజనాలు అందించడం.. వారి ఫిర్యాదులను స్వీకరించడం.. అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడం.. మొత్తంగా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లడం లక్ష్యాలుగా 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే మరో పెద్దపండుగగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. నేటి నుంచి 12వతేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహిస్తారు. కొత్తగా మూడున్నర లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రైతులకు 2015-16 ఇనపుట్‌ సబ్సిడీ పంపిణీ, కార్మిక కుటుంబాలకు చంద్రన్న బీమా లబ్ది అందించడం, అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ ఈ సభల్లోనే చేపట్టనున్నారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం కోసం రూపొందించిన మార్గనిర్దేశాలపై చర్చించనున్నారు. ప్రతి కుటుంబ, గ్రామ అభివృద్ధికి ఏమేం చేయాలో సభల్లో చర్చ జరగనుంది. మరోవైపు.. అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, తనతో కలిసి అడుగులు వేయాలని కోరుతూ చంద్రబాబు ఇచ్చిన ఆడియో సందేశాన్ని కూడా జన్మభూమి కోసం సిద్ధం చేశారు. అన్ని మౌలిక సదుపాయాలతో గ్రామాలను అభివృద్ధి చేయడంపై జన్మభూమిలో దృష్టిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలస్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్లు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో సభల నిర్వహణను పర్యవేక్షించాలి. అన్ని శాఖల సమన్వయం ఎంపీడీవోకి అప్పగించారు.

12:28 - January 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ కొత్త చీఫ్‌ సెక్రటరీగా ఎస్‌పీ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్‌ ప్రదీప్‌ చంద్ర పదవీకాలన్నీ పొడిగించాలని సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై కేంద్రం స్పందించకపోవడంతో కొత్త సీఎస్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఎస్‌పీ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు తెలంగాణ ఏసీబీ డీజీగా ఉన్న ఏకే ఖాన్‌ పదవీకాలం ముగియడంతో..ఆయన్ని మైనార్టీ సంక్షేమశాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా అరవింద్‌కుమార్‌ను నియమించింది.

 

బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీంకోర్టు వేటు

ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీంకోర్టు వేటు వేసింది. అధ్యక్ష, కార్యదర్శుల పదవి నుంచి అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. 2016, జులై 18న లోథా కమిటీ నివేదికను అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. కోర్టు ఉత్తర్వులు పాటించనందుకు కోర్టు చర్యలు చేపట్టింది. లోథా కమిటీ ఇచ్చిన అన్ని సిఫార్సులను కోర్టు ఆమోదించింది. కమిటీ సిఫారుసుల అమలుకు ప్యానల్ ను కోర్టు ఏర్పాటు చేసింది. పారదర్శక చర్యల్లో బీసీసీఐ విఫలమైందని లోథా కమిటీ నివేదికలో వెల్లడి అయింది.

కుల, మత, భాషలపై రాజకీయాలు చేయొద్దు:సుప్రీం

ఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఏ రాజకీయపార్టీ, నాయకుడు కులం, మత విశ్వాసాల ఆధారంగా ఓట్లు అడగకూడదని ఆదేశాలు జారీ చేసింది. మతానికి ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి పాత్ర లేదని పేర్కొంది. ఎన్నికలు లౌకిక ప్రక్రియ కావడంతో దాని ప్రకారమే వెళ్లాలని పేర్కొంది. భగవంతుడు, వ్యక్తి మధ్య సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. ఎన్నికల్లో ఇటువంటి విషయాల జోక్యం తగదని సూచించింది.

ప్రొ.రెజ్లింగ్ లీగ్ మ్యాచ్ లు..

న్యూఢిల్లీ : నేటి నుండి ప్రొ. రెజ్లింగ్ లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ఫ్రైజ్ మనీ రూ. 15 కోట్లుగా నిర్ణయించారు. నేడు హర్యానా - ముంబై జట్లు ఢీకొననున్నాయి.

సుప్రీంలో బీసీసీ చీఫ్ ఠాకూర్ పిటిషన్లపై తుది తీర్పు..

ఢిల్లీ : బీసీసీఐ చీఫ్ ఠాకూర్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.

నేడు కర్నూలులో సీఎం బాబు పర్యటన..

హైదరాబాద్ : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తడకనపల్లెలో జన్మభూమి - మా ఊరులో సీఎం బాబు పాల్గొననున్నారు.

Don't Miss