Activities calendar

03 January 2017

21:57 - January 3, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు ఇంకా కొలిక్కి రాలేదు. ములాయంసింగ్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటి అయ్యారు. తండ్రి ముందు కొన్ని షరతులు పెట్టారు. అఖిలేష్‌ షరతులకు ములాయం వర్గం ఆమోదం తెలుపుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
యూపీలో కీలక పరిణామాలు 
ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లక్నోలో ములాయం సింగ్‌‌ యాదవ్‌ ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ల మధ్య 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తండ్రి కొడుకులు ఎవరికి వారే తమ తమ షరతులపై పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
ములాయంకు అఖిలేష్‌ షరతులు
అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి ముందు కొన్ని షరతులు పెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్‌ యాదవ్‌ ఉండాలని... శివపాల్‌ యాదవ్‌ను యుపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి జాతీయ రాజకీయాలకే పరిమితం చేయాలని.... ఎన్నికల అభ్యర్థులను తానే నిర్ణయిస్తానని అఖిలేష్‌ షరతు విధించారు. ఇవి కాకుండా అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి తొలగించాలని, రాంగోపాల్‌ యాదవ్‌కు పార్టీ పదవితో పాటు అధికారం ఇవ్వాలని సూచించారు. కొడుకు విధించిన షరతులపై ములాయం రాజీ పడడం లేదు.
సయోధ్యకు అజంఖాన్ మధ్యవర్తిత్వం 
అంతకుముందు తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మధ్యవర్తిత్వం నిర్వహించారు. దీంతో ఉదయం అఖిలేశ్‌ తండ్రి ములాయంతో ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌ మాట్లాడిన తర్వాత ములాయం హుటాహుటిన ప్రత్యేక చార్టెడ్‌ విమానాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి లక్నోకు వచ్చి కొడుకుతో సమావేశమయ్యారు.
ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశం లేదన్న రాంగోపాల్‌   
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీలో ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశం లేదని పార్టీ సీనియర్‌ నేత రాంగోపాల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మా జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ నేతృత్వంలో ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీ గుర్తు కోసం రాంగోపాల్‌ యాదవ్‌ ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిశారు. 90 శాతం మంది ఎమ్మెల్యేలు సిఎం అఖిలేష్‌కు మద్దతు ఇస్తున్నారని...పార్టీలో ఎక్కువ మంది మద్దతు ఉన్న అఖిలేష్‌కు పార్టీ చిహ్నం సైకిల్‌ను కేటాయించాలని ఈసీని కోరినట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ తమకే ఉంచాలంటూ ములాయం సింగ్‌ ఎన్నికల కమిషన్‌ కలిసి కోరారు. అఖిలేష్ రాజీ ఫార్ములాకు ములాయం-శివపాల్ క్యాంప్ తలొగ్గుతుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

 

21:55 - January 3, 2017


కోల్ కతా : టిఎంసి, బిజెపిల మధ్య వార్‌ మొదలైంది. రోజ్‌ వ్యాలీ చిట్‌ స్కాంకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో టిఎంసికి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇందుకు నిరసనగా టిఎంసి బిజెపి కార్యాలయంపై దాడి చేసింది.
స్కామ్‌లతో టీఎంసీ ఉక్కరి బిక్కిరి 
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ స్కామ్‌లతో ఉక్కరి బిక్కిరి అవుతోంది. శారదా స్కాం నుంచి ఇంకా తేరుకోకముందే... ఇపుడు రోజ్‌ వ్యాలీ చిట్‌ ఫండ్‌ కుంభకోణం తృణమూల్‌ను పట్టి పీడిస్తోంది. తాజాగా రోజ్‌ వాలీ చిట్‌ ఫండ్‌ స్కాంకు సంబంధించి టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో సుదీప్‌ విచారణ జరిపిన అనంతరం కొన్ని గంటల త‌ర్వాత ఆయనను అరెస్ట్ చేసిన‌ట్లు సిబిఐ ప్రక‌టించింది. 
సుదీప్‌కు సిబిఐ సమన్లు జారీ
రోజ్‌వాలీ చిట్‌ఫండ్‌ స్కాంకు సంబంధించి సుదీప్‌కు డిసెంబర్‌లో రెండుసార్లు సిబిఐ సమన్లు జారీ చేసింది. పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతుండడంతో ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో మూడోసారి సమన్లు జారీ చేసి సిబిఐ విచారించింది.
17 వేల కోట్లు మోసం చేశాడని రోజ్‌ వ్యాలీపై ఆరోపణలు 
రోజ్ వాలీ చిట్‌ఫండ్ స్కామ్‌లో అరెస్ట్ అయిన రెండో తృణ‌మూల్ ఎంపీ సుదీప్‌. డిసెంబ‌ర్ 30న టిఎంసి ఎంపి త‌ప‌స్‌పాల్‌ను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. రోజ్‌ వ్యాలీ కంపెనీలో తపస్‌పాల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్‌ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. బందోపాధ్యాయ అరెస్ట్‌పై టిఎంసి భగ్గుమంది. ఆగ్రహోదగ్రులైన టిఎంసి కార్యకర్తలు కోల్‌కతాలోని బిజెపి కార్యాలయంపై దాడి చేశారు.
కేంద్రం కక్ష సాధింపు చర్యలు : మమతా బెనర్జీ  
ఈ ఘటనపై పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోది పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని టిఎంసి వ్యతిరేకించడం వల్లే కేంద్రం సిబిఐని అడ్డుపెట్టుకుని తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అరెస్ట్‌ల‌కు బెదిరేది లేద‌ని, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

21:38 - January 3, 2017

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీనీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల, ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కేకే లు కలిశారు. విభజన చట్టంలోని హామీల అమలు... రానున్న కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కేకే తెలిపారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ కి నిధుల కేటాయింపులు, ఐఐఎం ఏర్పాటుపై చర్చించినట్లు చెప్పారు. విభజన చట్టంలో లేకపోయినా ఐఐఎంను తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సి.ఎస్.టీ బకాయిలు దాదాపు వెయ్యి కోట్లను రెండు నెలల్లోగా చెల్లించాలని అడిగామన్నారు. తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కేకే చెప్పారు. 

21:36 - January 3, 2017
21:34 - January 3, 2017

హైదరాబాద్ : ఉన్నత ఆశయాల కోసం నిబద్ధులైన ఐఏస్ అధికారి ఎస్‌ఆర్‌ శంకరన్‌ పేరుతో హైదరాబాద్‌లో కొత్త ఐఏఎస్‌ అకాడమీ పురుడు పోసుకుంది. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజికవేత్త శ్రీమతి సావిత్రీభాయిపూలే 186 జయంతి సందర్భంగా ఈ అకాడమీ ప్రారంభమైంది. ఈ అకాడమీని   విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు కెఆర్‌ వేణుగోపాల్‌, కాకి మాధవరావు ప్రారంభించారు. ఐఏఎస్‌ అవ్వాలనే కోరిక మాత్రమే ఉంటే సరిపోదని.. ఆ లక్ష్యాన్ని  సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలని  వారు అభ్యర్ధులకు  సూచించారు. ఉత్తమ లక్ష్యాలతో ప్రారంభించిన ఈ అకాడమీకి ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని.. తెలిపారు. శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ నుంచి భవిష్యత్‌లో ఎంతోమంది  సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నామన్నారు. ఉత్తమ సాధన, పట్టుదలతో కృషి చేస్తే ఐఏఎస్‌ అవ్వడం కష్టమేమికాదని ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

 

21:31 - January 3, 2017

చిత్తూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 10 టివి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వేదిక వద్ద క్యాలెండర్‌ను విడుదల చేశారు. ప్రజాసమస్యలను బయటపెట్టడంలో టెన్‌ టీవీ నిర్వహిస్తున్న పాత్ర అపారమని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో కూడా ప్రజాసమస్యలపై టెన్‌టీవీ బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 

 

21:24 - January 3, 2017

ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది..? జనాలు పిట్లల్లా ఎందుకు రాలిపోతున్నారు.? కారణాలు ఎందుకు తెలియడం లేదు.? ప్రకృతి క్రూరంగా చూస్తోంది.. సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది.. వెరసి ఉద్దానం ప్రాంతమంతా విలవిల్లాడుతోంది. రోగాల బారిన ప్రజలతో, వేలాది మరణాలతో స్మశాన దృశ్యం కనిపిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా..? ప్రభుత్వాలు పట్టించుకోవా..? ఉద్దానానికి విముక్తి ఎప్పుడు..? ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం.. పూర్తి వివరాలను వీడియోలో చూడండి...

విద్యాశాఖపై మంత్రి కడియం సమీక్ష

హైదరాబాద్ : విద్యా శాఖపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

21:10 - January 3, 2017

ముదిరాజుల మీద వరాల వలేసిన సీఎం... వేరే కులాలొల్లకు కూడా తైలాలు తయ్యారు, ఉద్యమాల బాటవట్టిన జనసేనాధిపతి... పట్టాలే సారు ఇప్పడిసంది జనం సోపతి, తిరుపతి కాడ స్పీచ్ దంచిన మోడీ సారు.. 2030 వరకల్లా సమస్యలు పరార్, కేసీఆర్ నిండు నూరేండ్లు సల్లగ బతకాలే... మంటల మరీ నెయ్యి కోరిన అర్చుకులు, చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలే కేజ్రీవాల్ బలం.. .వడీ మీద తాకగల్లా జర్ర పైలం, సర్పంచ్ భర్తకు జనం చెప్పుల సన్మానం...ఆడివిల్లను చెడగొట్టిండని పబ్లిక్ అనుమానం,, మనసున్న మారాజు.. అసలైన శ్రీమంతుడు.. కష్టార్జితమంతా పేదల కోసం వెచ్చిస్తున్న మహానుభావుడు.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:52 - January 3, 2017

విజయవాడ : తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. అధ్యాపకుల ఆందోళన కొనసాగుతోంది. అధ్యాపకులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

20:46 - January 3, 2017

తిరుపతి : శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్‌ దూసుకుపోతోందని... సీఎం చంద్రబాబు అన్నారు.. వేలిముద్ర బ్యాంక్‌లా పనిచేసే సాంకేతిక అభివృద్ధి అయిందని చెప్పుకొచ్చారు.. ప్రధాని మోదీ నోట్ల రద్దుపై చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.. దీనివల్ల సామాన్యులకు చాలా మేలు జరుగుతుందని తెలిపారు.. తిరుపతిలో సైన్స్‌ కాంగ్రెస్‌ కొనసాగుతోంది.. ఈ కార్యక్రమానికి ప్రధానిమోదీతోపాటు.. గవర్నర్‌ నరసింహన్‌.. చంద్రబాబు.. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.. 

 

తిరుపతిలో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి : సైన్స్ కాంగ్రెస్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సైన్స్ కాంగ్రెస్ ను పురస్కరించుకుని తిరుపతిలో సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నామని సీఎం తెలిపారు. మ్యూజియం నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. 

 

సంగారెడ్డిలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్టులు అందజేసిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి : జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు మంత్రి హరీష్ రావు అక్రిడేషన్ కార్టులు అందజేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని చెప్పారు. 2, 3 రోజులలో స్థల పరిశీలన చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

10 టివి క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు : 10 టివి నూతన సంవత్సరం క్యాలెండర్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. తిరుపతిలో ఆయన ఆవిష్కరించారు. 

20:02 - January 3, 2017

విజయవాడ : వైసీపీ ఎంపీ కెవిపి రాంచంద్రరావుపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటు వ్యాఖ్యాలు చేశారు. 'నీవు.. ఇంటర్ నేషనల్ క్రిమినల్ వు' అని కెవిపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'నీవు రాజశేఖర్ రెడ్డి ఆత్మవు' అని అన్నారు. 'నీవు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నావా....? అని విమర్శించారు. మూటలు మూసిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో ఏం చేసారని... ఇప్పుడు ఉత్తరాలు రాస్తున్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు. నీ చిట్టా బయటికి తీస్తానని.. నీ కథ తేలుస్తామని హెచ్చరించారు. తమ కార్యశుద్ధిని ఆపలేరన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:52 - January 3, 2017
19:51 - January 3, 2017

ఉత్తరప్రదేశ్ : ములాయం సింగ్ యాదవ్ తో అఖిలేష్ యాదవ్ చర్చలు ముగిసాయి. అయితే తండ్రి ముందు అఖిలేష్ మూడు షరతులు ఉంచారు. షరతులను అంగీకరిస్తే సీఈసీకి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని అఖిలేష్ హామీ ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం ఉండాలన్నారు. శివపాల్ యాదవ్ ను ఢిల్లీకే పరిమితం చేయాలని షరతు విధించారు. ఎన్నికల అభ్యర్థులను తానే నిర్ణయిస్తానని అఖిలేష్ రెండో షరతు పెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ములాయం సింగ్ తో ముగిసిన అఖిలేష్ చర్చలు

ఉత్తరప్రదేశ్ : ములాయం సింగ్ యాదవ్ తో అఖిలేష్ యాదవ్ చర్చలు ముగిసాయి. అయితే తండ్రి ముందు అఖిలేష్ మూడు షరతులు పెట్టారు. షరతులను అంగీకరిస్తే సీఈసీకి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని అఖిలేష్ హామీ ఇచ్చారు. 

 

నాగపురి రమేష్ కు రూ.25 లక్షల పారితోషకం ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ కు రూ.25 లక్షల పారితోషకం ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. నాగపురి రమేష్ వరంగల్ జిల్లా వాసి. 

19:35 - January 3, 2017
19:34 - January 3, 2017

గుంటూరు : మెగాస్టార్ చిరంజీవి నూతన చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమా ఆడియో రిలీజ్‌కు గుంటూరు జిల్లా చిన్నకాకానిలోని హాయ్‌లాండ్ వేదికవుతోంది. ఈ నెల 7న జరుగుతున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను నిర్మాత అల్లు అరవింద్ పర్యవేక్షిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ హీరోలందరూ హాజరై అభిమానును ఉత్తేజపరుస్తారని ఆయన తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ ఆసమయంలో విదేశాల్లో ఉండే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదన్నారు. అభిమానులు పెద్దఎత్తున పాల్గొనే అవకాశాలు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.   

 

19:30 - January 3, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తణుకులో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.  తణుకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆడపిల్లల ప్రాధాన్యత తెలియజేసేలా 10టీవీ క్యాలెండర్‌ తయారు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆడబిడ్డల  సంరక్షణకు  కృషి చేయాలని అరిమెల్లి రాధాకృష్ణ కోరారు.

 

19:29 - January 3, 2017

తూర్పుగోదావరి : ఈనెల 5న జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నట్టు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రామచంద్రపురంలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని.... నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.  పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి పిఠాపురంలో చంద్రబాబు శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో ఆయన బీచ్‌ఫెస్టివల్‌ వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

 

19:23 - January 3, 2017

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నెల్లూరు నగర పర్యటనలో ఓ దొంగ కలకలం సృష్టించారు. బాణాసంచా పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలను జగన్‌ పరామర్శిస్తుండగా... సందట్లో సడేమియాలాగా... ఓ దొంగ చేతివాటం ప్రదర్శించాడు.  ఒకరి నుంచి నగదు, సెల్‌ఫోన్‌ తస్కరించాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

 

19:21 - January 3, 2017

నెల్లూరు : డిసెంబర్‌ 31న నెల్లూరు నగరంలోని పొర్లుకట్టలో జరిగిన పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.  మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. వారికి  ప్రభుత్వమే భరోసా ఇవ్వాలని కోరారు. మృతుల ఇంటికి జగన్‌ చేరుకోగానే వారి కటుంబ సభ్యుల్లో  ఆవేదన పెల్లుబికింది. బాధితుల ఆర్తనాదాలు చూసిన జగన్‌ చలించిపోయారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 

 

19:17 - January 3, 2017

గుంటూరు : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆ ప్రాంత ప్రజలకు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో పూర్తి స్థాయిలో పరిశోధన చేయాల్సి ఉందన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించడంలో తప్పులేదన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మార్చే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు. 
 

19:14 - January 3, 2017

గుంటూరు : జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్లు జాబితా అధికారుల నుంచి అధికార పార్టీ కార్యకర్తలు లాక్కొన్నారు. తామె లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇస్తామంటూ చెప్పడంతో జన్మభూమికి వచ్చిన స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొత్తగా మంజూరైన వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు టీడీపీ నాయకులు ఇదంతా చేశారంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 

 

19:11 - January 3, 2017

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల కొరతతో అల్లాడుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే యూనివర్సిటీకి మహార్దశ వస్తుందని భావించిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హమీ నీటిపై రాతగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
రూసా నిదులకు నోచుకోని యూనివర్సిటీ
తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు వచ్చి ఏడాది గడిచినా.. విశ్వవిద్యాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. న్యాక్ గుర్తింపు లేని కారణంగా యూనివర్సిటీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రీయ ఉచ్చతర్‌ అభియాన్ రూసా నిదులకు నోచుకోలేదు. 2016 జనవరిలో యూనివర్సిటీకి న్యాక్ బీ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత న్యాక్‌ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్సిటీగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఖ్యాతి గడిచింది. ఇంతవరకు బాగానే ఉన్నా..నేటికీ రూసా నుంచి తెలంగాణ యూనివర్సిటీకి నయా పైసా రాలేదు. 
నిధులు రాబట్టడటం ప్రశ్నార్థకంగా 
2015 అక్టోబర్‌ నెలలో 50 కోట్ల రూసా నిధులకు డ్రాఫ్ట్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపినా ఫలితం లేకుండా పోయింది. న్యాక్ గుర్తింపు వచ్చిన తరువాత గతేడాది మార్చిలో 20 కోట్ల రూసా నిదులకు రెండోసారి ప్రతిపాదనలు పంపినా అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. రూసా సెమినారు నిర్వహించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కేవలం లక్ష రూపాయలు మంజూరు చేసినా..వాటినీ తెచ్చిన దాఖలాలు లేవు. దీంతో రాష్ర్టీయ ఉచ్చతర్‌ అభియాన్ నిధులు రాబట్టడటం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో నిదులు సమకూర్చుకొవటం విశ్వవిద్యాలయం అధికారులకు సవాల్‌గా మారింది. రూసా నిదులు వస్తాయన్న ఆశతో అప్పటి రిజిస్ట్రార్ వైస్ చాన్సలర్ బిక్కనూర్ నూతన కాలేజీ భవనానికి భూమి పూజా చేసారు.. నిధుల లేమితో ఈ పనులు అటకెక్కాయి. న్యాక్ గుర్తింపు ఉంటే రూసా నుంచి సుమారు 20 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.  ఈ నిధులు వస్తే క్యాంపస్‌లో కళాశాల భవనాలు,ప్రయోగశాలలు, ఆడిటోరియం, ఆరోగ్య  కేంద్రాల పనులు కార్యరూపం దాల్చుతాయని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రూసా నిధులు రాబట్టడంలో విశ్వ అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు. రూసా నిధులకు కేవలం ప్రతిపాదనలు పంపడంతో సరిపోదని..జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేల సమన్వయంతో కేంద్ర మానవ వనరుల శాఖపై ఒత్తిడి పెంచితే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

 

19:05 - January 3, 2017

వరంగల్ అర్బన్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర... వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో కొనసాగుతోంది. 79వ రోజు పాదయాత్ర బృందం కరీమాబాద్‌, శాయంపేట, అదాలత్‌, ఆర్‌ఈసీ, ఖాజిపేట, రాంపూర్‌, మడికొండ, పెదపెండ్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తమ్మినేని పాదయాత్రకు వివిధ పార్టీల స్థానిక నేతలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. వరంగల్‌ ఎన్‌ఐటీ వద్ద తమ్మినేని పాదయాత్ర బృందానికి.. బీసీ సబ్‌ప్లాన్‌ సాధన సమితి రాష్ట్ర ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌తో పాటు..నిట్‌  కార్మికులు, ఎఫ్‌సీఐ కార్మికులు  ఎర్ర డ్రెస్సులు ధరించి అపూర్వ స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎస్సీల వాస్తవ పరిస్థితిపై నిర్మాణాత్మక చర్చ జరగాలని ఈ సందర్భంగా తమ్మినేని డిమాండ్‌ చేశారు. దళితుల సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర రంగాలకు మళ్లించడం దారుణమని తమ్మినేని విమర్శించారు.  

 

19:02 - January 3, 2017

సూర్యాపేట : జిల్లాలోని కోదాడలోని పోస్టాఫీస్‌ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా తపాలా సిబ్బంది తమకు పింఛన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పోస్టాఫీస్‌ సిబ్బంది తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పెన్షన్‌ కోసం రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నామని వారు వాపోయారు. నగదు లేదంటూ తమను పోస్టాఫీస్‌ చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. వృద్ధులం, దివ్యాంగులమని కూడా చూడకుండా బయటకు గెంటివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

18:58 - January 3, 2017

కరీంనగర్ : సర్పంచిగా ఆ గ్రామానికి మహిళ ఎన్నుకోబడింది...ఆమె అంటే అందరికీ గౌరవమే...ఆమెతో పాటు భర్తకు కూడా సమాన గౌరవం ఇచ్చేవారు..దీంతో అతను ఎంతో హుందాగా ఉండాల్సింది పోయి పోకిరీగా మారాడు..కామాంధుడై కాటేయబోయాడు..జనం చేతికి చిక్కి పరువు బజారున పడేసుకున్నాడు...జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిని తలదించుకునేలా చేసింది...
సర్పంచ్ భర్తగా ఆడింది ఆట..
ప్రజాప్రతినిధి భర్తగా ఆడింది ఆట..తాను చెప్పినట్లు వినాలనే ధోరణి..మైనర్‌పై కన్నేసి దొరికిపోయిన దుర్మార్గుడు.. పంచాయితీ పెట్టించి శీలానికి వెలకట్టాడు.. మహిళల చేతిలో చావుదెబ్బలు తిన్న కామాంధుడు.. జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం.. ఇక్కడ మహిళల చేతిలో తన్నులు తింటున్న ఇతగాడు ఆ కొద్ది నిమిషాల ముందు సర్పంచ్ భర్తగా ఆడింది ఆట..పాడింది పాటగా ఉండేవాడు.. తాను చేసిన పెద్ద తప్పును కూడా పంచాయితీ పెద్దల మధ్య పెట్టి తాను చెప్పింది వినాలన్నట్లు చేశాడు..చివరకు శీలానికి వెలకట్టడంతో ఆగ్రహించిన మహిళలు చితగ్గొట్టారు...చేసిందే పెద్ద తప్పు...ఎంతో హుందాగా... ఆ గ్రామంలో పేరు సంపాదించాల్సినవాడు చివరకు ఇలా దొరికిపోయాడు...
మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం...
జగిత్యాల జిల్లా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో అధికారపార్టీ సర్పంచ్‌గా మహిళ ఉంది...ఆమె భర్తదే రాజ్యం... సత్యం చెప్పినట్లు అక్కడ అన్ని పనులు నడవాలి...ఇలా పల్లెలో తన పెత్తనం చెలాయిస్తున్న సత్యం మూడు రోజులక్రితం మైనర్‌ బాలికపై ఘోరానికి పాల్పడబోయాడు..ఈ విషయం ఆలస్యంగా తెలిసిన  బాలిక తల్లిదండ్రులు పంచాయితీపెట్టారు..పెద్దల పంచాయితీలో తాను చేసింది తప్పని ఒప్పుకోకుండా పెత్తనం చెలాయిస్తూ లక్ష రూపాయలు ఇస్తానంటూ సర్పంచ్‌ భర్త సత్యం ప్రకటించాడు...అంతే అప్పటివరకు సహనంతో చూస్తున్న మహిళలంతా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు...బాలిక శీలానికి వెలకట్టడంతో సున్నం సత్యంను అక్కడే చితకబాదారు.. కూతురు వయసున్న బాలికపై సత్యం ఇలాంటి అఘాయిత్యం చేయడం దారుణమని మండిపడ్డారు.. ఎంతో హుందాగా ఉండాల్సినవాడు ..బాధ్యత మర్చి కామాందుడిగా మారాడు..అధికారం చేతిలో ఉంది కదా..ఏదైనా చేయొచ్చనుకుంటే ప్రజల కఠిన నిర్ణయాన్ని చవిచూడాల్సి వచ్చింది......తగిన బుద్ది చెప్పారు...

18:53 - January 3, 2017

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసును అటకెక్కించే ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తున్నాయి. రాష్ట్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలు ఈ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. సిట్‌కు తెలియకుండానే హోంశాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించిందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నయీం కేసులో ఏం జరుగుతుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. 
నయీం కేసులో కొత్త చిక్కులు
నయీం కేసులో పోలీసులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. హోంశాఖ కార్యదర్శి హైకోర్టుకు సమర్పించిన నివేదికతో ఏం చేయాలో పోలీసులకు పాలు పోవడం లేదు. ప్రభుత్వ నుంచి ఆదేశాలు రావడంతో...నయీం కేసులో నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టమని సిట్ అధికారులు మీడియాకు చెప్పారు. మాజీ మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పాత్రలపై లీకులు కూడా ఇచ్చారు. ఈ కేసులో తాజాగా హోంశాఖ... రాజకీయ నాయకులకు, పోలీసు సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్ధితుల్లో సిట్ అధికారులు ఉన్నారు. ఈ విధంగా విచారణ కొనసాగిస్తే.. కేసులు నిలబడవని పోలీసులు భావిస్తున్నారు. 
ఏం చేయాలో అర్థంకాని పరిస్ధితిలో సిట్ 
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతని అనుచరులను  120 మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా మందిపై అక్రమ అయుధాలు కలిగి ఉండటంతో కేసులు నమోదు చేశారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఏలా దాచిపెట్టారు. అనే అంశాలపై రాజకీయ నాయకులను, పోలీసులను విచారిస్తే తప్పా అధారాలను సేకరించలేదని పరిస్ధితి. ఈ కేసులో ఇప్పటివరకు 700 మందికి పైగా పోలీసులు విచారించారు. మరో 218 మందిని విచారించాల్సిన అవసరం ఉంది. ఒక వైపు దర్యాప్తు కోనసాగుతోంది అని చెప్పుకుంటూనే మరో వైపు కొంత మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఎవరిని విచారించాలో అర్థంకాని పరిస్ధితిలో సిట్ అధికారులు ఉన్నారు. 
హోంశాఖ అఫిడవిట్‌తో కేసు నిబలడదంటున్న పోలీసులు
అయితే నయీం కేసులో దాఖలైన చార్జీషీట్‌లో ఎక్కువ మంది నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. నయీంకు  రైట్ హ్యాండ్‌గా ఉన్న శేషన్నను ఇప్పటీ వరకు పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. దీంతో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌తో అటు పోలీసుల్లో.. ఇటు ప్రజల్లో కేసు నిలబడదనే విశ్వాసం నెలకొంది. ఈ కేసులో పోలీసులు సాక్షాధారాలు సేకరించాలంటే గ్యాంగ్‌స్టర్ నయీంకు సహాకరించిన పోలీసులు, రాజకీయ నేతలను ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది. హోంశాఖ పోలీసులకు, రాజకీయ నాయకులకు క్లీన్ చీట్ ఇవ్వడంతో ఈ కేసుపై నీలినీడలు అలుముకున్నాయి. మొత్తానికి నయీం కేసు నత్తనడకన సాగేలా చేసి.. కొన్నాళ్ల తర్వాత చేతులు దులుపుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాదితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

 

కెవిపిపై మంత్రి దేవినేని ఆగ్రహం

విజయవాడ : వైసీపీ ఎంపీ కెవిపి రాంచంద్రరావుపై మంత్రి దేవినేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'నీవు.. ఇంటర్ నేషనల్ క్రిమినల్ వు' అని కెవిపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'నీవు రాజశేఖర్ రెడ్డి ఆత్మవు' అని అన్నారు. 'నీవు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నావు అని విమర్శించారు. 

18:40 - January 3, 2017

హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో టీ.సర్కార్‌ తదుపరి చర్యలు తీసుకునేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:37 - January 3, 2017

నిర్మల్‌ : జిల్లాలో కబ్జాదారుల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. కాసుల కోసం ఏకంగా చెరువులనే మాయం చేస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో దర్జాగా వెంచర్లు వేస్తూ రెచ్చిపోతున్నారు. అమాయకులకు ప్లాట్లు అంటగట్టి అందినకాడికి దండుకుంటున్నారు.  భూ బకాసురుల దెబ్బకు నిర్మల్‌ ధర్మసాగర్‌ చెరువు ఆనవాళ్లే లేకుండా పోయింది.  
చెరువుల ఆక్రమణ
నిర్మల్‌ జిల్లాలో చెరువుల ఆక్రమణ వ్యవహారం పరాకాష్టకు చేరింది. నీటి పారుదల, రెవెన్యూ, డ్వామా, అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు జరిపిన సర్వేలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. కబ్జాకోరుల ఆక్రమణల గుట్టురట్టయైంది. నిర్మల్‌ పట్టణాన్ని ఆనుకుని కాకతీయుల కాలంలో 11 గొలుసుకట్టు చెరువులుండేవి. వాటి కింద వందలాది ఎకరాలు సాగయ్యేవి. స్థానిక ప్రజలకు ఈ చెరువుల నుంచే తాగు నీరు అందేది. నిర్మల్‌  పట్టణం విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో కబ్జాదారుల కళ్లు చెరువులపై పడ్డాయి.  గాజులపేట, ధర్మసాగర్‌, మంజూలపూర్‌, కంచరోని, సూరన్నపేట ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులు మాయమై.. ఆ స్థానంలో ప్లాట్లు వెలిశాయి. 
చెరువు భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు 
చెరువు భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. చెరువు శిఖం భూములనే కాదు.. రైత్వారీ పట్టాలను చూపి ఏకంగా చెరువు భూముల్లోనే భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమార్కులు రెచ్చిపోతుంటే.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాదారులు తమ పని కానిచ్చేస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా చెరువు భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించాల్సిందేనని ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆక్రమణల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
అధికారులు చోద్యం 
నిర్మల్ భాగ్యనగర్ కాలనీలోని పెద్ద చెరువు గతంలో మంజులాపూర్‌తో పాటు నిర్మల్‌ ప్రాంతానికి సాగు నీరందించేది. ఈ భూములను కబ్జాకోరులు ప్లాట్లు చేసి విక్రయించడంతో.. చెరువు భూముల్లో దర్జాగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇటు భాగ్యనగర్ అటు ప్రియదర్శిని నగర్ వైపు ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. భైంసా రోడ్డు వైపు ఉన్న చెరువు శిఖంలో కూడా వ్యాపార సముదాయాలు నిర్మించారు. కబ్జాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మొత్తానికి చెరువు భూముల ఆక్రమణను సీరియస్‌గా పరిగణిస్తున్న ప్రభుత్వం.. కబ్జాదారులపై కొరడా ఝుళిపించేందుకు సమాయత్తమైంది. నిర్మల్‌ సర్కిల్‌ పరిధిలో 474 చెరువులు పునరుద్దరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏ మేరకు చెరువులను తమ ఆధీనంలోకి తీసుకుంటుందో చూడాలి. 

 

18:34 - January 3, 2017

ఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుధీప్‌ బందోపధ్యాయను సిబిఐ అరెస్ట్‌ చేసింది. రోజ్‌ వ్యాలీ చిట్‌ఫండ్‌ స్కాం కేసులో సిబిఐ ఆయనపై విచారణ జరుపుతోంది. సుధీప్‌ను 4 గంటల పాటు సిబిఐ ప్రశ్నించింది. ఇంతకు ముందు రోజ్‌ వ్యాలీ స్కాంకు సంబంధించి సిబిఐ టిఎంసి ఎంపి తపస్‌ను అరెస్ట్‌ చేసింది. వారం రోజుల్లో టిఎంసికి చెందిన ఇద్దరు ఎంపీలను సిబిఐ అరెస్ట్‌ చేయడం గమనార్హం. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదిని టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. 

 

18:08 - January 3, 2017

హైదరాబాద్ : వచ్చే బడ్జెట్‌లో మత్స్య పరిశ్రమకు నిధులు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో చేపల పెంపకానికి వసతులున్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఆ సమస్య తీరుస్తామన్న కేసీఆర్.. కొత్తగా 2 ఫిషరీస్ కాలేజీలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
మత్స్య పరిశ్రమకు నిధులు పెంచుతాం : సీఎం కేసీఆర్
రాబోయే బడ్జెట్‌లో మత్స్య పరిశ్రమకు నిధులు పెంచుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో మత్స్య పరిశ్రమపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన స్పందించారు. వచ్చే రెండేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. వచ్చే ఏడాదికే  చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మూడున్నర లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతాయని అంచనా వేశామన్నారు. 11 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.  
మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ.. తెలంగాణకు గొప్ప వరం : సీఎం కేసీఆర్     
మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ తెలంగాణకు ఉన్న గొప్ప వరమని కేసీఆర్‌ అన్నారు. రెడ్డి రాజులు, నిజాం ప్రభువులా పుణ్యమా అని తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నాయని, మత్స్య పరిశ్రమలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేపలను పెంచే అవకాశం ఉందన్నారు. జూరాల నుంచి పులిచింతల వరకు పలు రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపడుతామని సీఎం తెలిపారు. సింగూరు, ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి, నిజాంసాగర్, లంకా సాగర్, వైరా, పాలేరు దాకా రిజర్వాయర్లున్నాయని... వాటన్నింటిలో చేపల పెంపకం చేపట్టాలని సీఎం అన్నారు.  
చేప పిల్లల కొనుగోలుకు 24 కోట్లు ఖర్చు చేశాం : సీఎం 
చేప పిల్లల కొనుగోలుకు 24 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 3939 చెరువుల్లో 28 కోట్ల చేప పిల్లలను వదిలామని ఆయన చెప్పారు. ఫిషరీస్ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ముదిరాజ్‌లకు చేపలు పట్టేందుకు అవకాశం కల్పిస్తామని, త్వరలోనే మత్స్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాస్త్రీయ పద్ధతిలో చేప పిల్లల పెంపకం జరిగితే...మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. 

 

18:04 - January 3, 2017

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన గళం విప్పారు.  వ్యాధిగ్రస్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన బాధితుల సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించాలని డెడ్‌లైన్‌ విధించారు. సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. 
కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ ముఖాముఖి 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్దానం సమస్యలపై ఏపీ సర్కార్‌ 48 గంటల్లోగా స్పందించాలని డెడ్‌లైన్‌ విధించారు. సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితులతో స్వయంగా ముఖాముఖి నిర్వహించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో తాము బాధపడుతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉద్దానం బాధితులు అన్నారు. పవన్‌కల్యాణ్ తమ సమస్య గురించి రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పవన కల్యాణ్ తమను ఆదుకోవాలని కోరారు. 
ఉద్దానం సమస్య ఒక విపత్తన్న పవన్‌ ..
ఉద్దానం సమస్య ఒక విపత్తన్న పవన్‌ .. ప్రజలు కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నా..ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఉద్దానం సమస్య పరిష్కారం కోసం 100 కోట్లు కేటాయించాలని, తొలుత జబ్బును గుర్తించేందుకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. పుష్కరాలకు వందల కోట్లు .. రాజధానికి వేల కోట్లు ఖర్చు పెట్టే పాలక నేతలు... మనుషులు చనిపోతే మాత్రం నిధులు ఖర్చు పెట్టరా అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.  
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఖండించిన పవన్‌   
విభజన సమయంలో కిడ్నీ వ్యాధి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవటం.. సమస్యను ప్రస్తావించకపోవటాన్ని పవన్‌కల్యాణ్‌ తప్పు పట్టారు. దీనిపట్ల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని పవన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్దానం ప్రాంతంలోని సమస్యలపై ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక తయారు చేస్తుందని.. దాన్ని తానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రజాప్రతినిధుల వద్దకు తానే స్వయంగా వెళ్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కిడ్నీ వ్యాధి సమస్యపై పదిహేను రోజుల్లో కమిటీ తన నివేదిక ఇస్తోందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కమిటీ రిపోర్ట్‌ తర్వాత అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని పవన్‌ బాధితులకు హామీ ఇచ్చారు. 

17:58 - January 3, 2017

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రి గోల్డ్‌ ఆస్తుల వేలం కొనసాగుతోంది. రియల్టర్లు కొన్ని ఆస్తుల వేలంకు బిడ్డింగ్‌లో నిర్ణయించిన దానికంటే ఎక్కువ మొత్తం కోట్‌ చేశారు. మూడొంతుల ఎక్కువ రేట్లకు కొందరు ఆస్తులు దక్కించుకున్నారు. 

17:55 - January 3, 2017

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతో చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు.  పోలవరం అసలు పేరు ఏంటో చంద్రబాబు తెలుసా అని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు పోలవరానికి చంద్రబాబు అడ్డుపుల్ల వేశారని ఆరోపించారు. ఇప్పుడు పోలవరం తన కల అని, తన కలలు సాకారం అవుతున్నట్టు గొప్పలు పోతున్నారని ధ్వజమెత్తారు. 

 

కేంద్ర మంత్రి తోమర్ ను కలిసిన దత్తాత్రేయ

ఢిల్లీ : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని గ్రామ పంచాయతీల అంశం, ప్రధాని గ్రామ సడక్ యోజన, మన్ రేగా, పూరాప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణకు మన్ రేగా కింద 2016-17 సంవత్సరానికి గాను రూ.1666 కోట్లు విడుదల చేశామన్నారు. పెండింగ్ నిధులు రూ. 42 క6ట్లను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాని గ్రామ్ సడక్ యోజన నిధులు రూ. 142 కోట్లు పిండింగ్ నిధులు రూ. 56 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

17:52 - January 3, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న వివాదం ముగిసింది. తండ్రి కొడుకుల మధ్య రాజీ కుదిరింది. లక్నోలో అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి ములాయంతో జరిపిన సమావేశంలో కీలక ఒప్పందం కుదిరింది. పార్టీ అధ్యక్ష పదవిని తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌కు తిరిగి ఇచ్చివేశారు. ఎన్నికల్లో ప్రధాన ప్రచార సారథిగా ములాయంసింగ్‌ వ్యవహరించనున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో అఖిలేష్‌ యాదవ్‌ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంతకుముందు ఉదయం అఖిలేష్‌ తండ్రితో ఫోన్‌లో మాట్లాడగానే ములాయంసింగ్‌ హుటాహూటిన ఢిల్లీ నుంచి ప్రత్యేక చార్టర్డ్‌ విమానంలో లక్నోకు చేరుకున్నారు. పార్టీ గుర్తు కోసం ములాయం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ చేసిన యత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. 

 

17:30 - January 3, 2017

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' న్యూ మూవీ ఓపెనింగ్ పై క్లారిటి వచ్చేసింది. 'బాబీ' డైరెక్షన్ లో కొత్త సినిమా చేయబోతున్న బుడ్డోడు మరో క్రేజీ కాంబినేషన్ లో మూవీ చేస్తున్నట్లు సమాచారం. గత ఎడాది లాగే ఈ ఎడాది కూడా 'ఎన్టీఆర్' సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. దర్శకుడు బాబీతో పాటు మరో టాప్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు. గత ఎడాదిని 'ఎన్టీఆర్' సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేశాడు. చాలా కాలం తరువాత 2016లో ఈ హీరో రెండు హిట్స్ కొట్టి పుల్ ఫాంలోకి వచ్చేశాడు. ఈ ఫాంని కొనసాగించడానికి యంగ్ టైగర్ తనదైన ప్లాన్స్ తో ముందుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు చేయని దర్శకులతో పని చేస్తూ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే దిశగా ప్రణాళికలు వేస్తున్నాడు. 'టెంపర్' మూవీ నుంచి సినిమా సినిమాకి లుక్ పరంగా స్టోరీపరంగా డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. అంతేకాదు సక్సెస్ పుల్ దర్శకులతోనే కాకుండా టాలెంట్ ఉంటే చాలా సినిమా చేయాలని భావిస్తున్నాడు. అందుకే 'సర్ధార్ గబ్బర్ సింగ్' తో డిజాస్టర్ వెనుకపడ్డ బాబీతో సినిమా చేస్తున్నాడు.

త్రివిక్రమ్..
దర్శకుడు బాబీ, ఎన్టీఆర్ ల మూవీ ఒపెనింగ్ కి సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. 'కళ్యాణ్ రామ్' నిర్మించబోతున్న ఈ మూవీ జనవరి 26 ముహుర్తం జరుపుకోబోతున్నట్లు వినికిడి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి త్రిబుల్ రోల్ ప్లే చేస్తుండడం విశేషం. మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు మరో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా 'ఎన్టీఆర్' మూవీ కన్ ఫర్మ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుతున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ లో రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి సెట్స్ కి వెళుతుందట. ఈ మూవీని జెస్ట్ త్రీ మంథ్స్ లో కంప్లీట్ చేయాలని యంగ్ టైగర్, మాటల మాంత్రికుడు స్కెచ్ వేసుకున్నారట. ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో సినిమా అంటే వినడానికి చూడాటానికి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తోంది. 'ఎన్టీఆర్' తో 'త్రివిక్రమ్' ఎలా పంచ్ డైలాగ్స్ పేలుస్తాడో అని ఇప్పటి నుంచే ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

17:27 - January 3, 2017

గుంటూరు : ఏపీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపుల్లో సీఆర్డీఏ అవకతవకలకు పాల్పడుతుందా? రైతులకు ప్లాట్ల పంపిణీ సమయంలోనే లోపాలు  ఎందుకు బయటకొస్తున్నాయి..? అందరి కంటే ముందుగా భూమలిచ్చిన  రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా జాప్యం చేయడంలో మతలబు ఏమటి? భూములు తీసుకునేటప్పుడు అంతా పక్కా అంటూ సర్టిఫికెట్ ఇచ్చి , తీరా రైతులకు ఫ్లాట్ల కేటాయింపులో మాత్రం  తిరకాసు ఎందుకు పెడుతున్నారు? రాజధాని ప్రాంత రైతులు ఆందోళనబాట పట్టడానికి కారకులు ఎవరు?
దిక్కుతోచని స్థితిలో రాజధాని రైతులు
ఎపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.  రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకునేప్పుడు తియ్యటి మాటలు చెప్పిన ప్రభుత్వం.. ప్లాట్లు అప్పగించడంలో మాత్రం.. అడ్డదారులు తొక్కుతోందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి, రైతులకు మద్య సంధాన కర్తగా పని చేస్తున్న సీఆర్ డిఏ..తమకు ఇవ్వాల్సిన ప్లాట్ల కేటాయింపులో మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
సీఆర్‌డీఏ అధికారులపై విమర్శలు 
ఇప్పటి వరకు 13 గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయించిన  సీఆర్ డిఏ అధికారులు.. ప్రతి గ్రామంలో  రైతుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. లాటరీ పద్దతిలో ప్లాట్లను కేటాయిస్తుండటంతో.. రైతులు ఆందోళ చెందుతున్నారు. సీఆర్‌డీఏకు అప్పగించిన భూమిపత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ ఆఖరునిముషంలో ప్లాట్ల కేటాయింపును అధికారులు ఆపేస్తున్నారు. లాండ్‌ డాక్యుమెంట్స్‌ తీసుకుని.. ఇంతకాలం తప్పొప్పులును సరిచూడకుండా ఏంచేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. లాటరీపద్దతిలో తమకు ప్లాట్లు వస్తాయో రావో అన్న సందేహాలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తోంది. 
చంద్రబాబు మాటలు నమ్మితే నట్టేట ముంచారంటున్న రైతులు  
చంద్రబాబు పిలుపుమేరకు తమ భూమిని ఇచ్చిన ఉద్దండరాయునిపాలెం  రైతులు వీరు. ప్రధాని నరేంద్రమోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో మొదటగా స్పందించి తమ భూములను అప్పగించారు. అందుకు ప్రతిఫలంగా వీరికి గత రెండేళ్లుగా కౌలు చెక్కులు  సక్రమంగానే అందాయి. కాని.. ప్లాట్ల కేటాయింపు విషయంలో మాత్రం సీఆర్‌డీఏ అధికారులు పేచీలు పెడుతున్నారని  రైతులు  వాపోతున్నారు. 
తారుమారవుతున్న భూముల కొలతలు
ప్లాట్ల కేటాయింపులు చేపడుతున్న చాలా గ్రామాల్లో భూముల లెక్కలు తారుమారు అవుతున్నాయి. గతంలో అనంతరవం, నెక్కల్లు, దొండపాడు, శాఖమూరు, వెంకటాపాలెం గ్రామాల్లో 10 సెంట్లు, 20 సెంట్లు లెక్కన భూముల లెక్కలు తారుమారు అయ్యాయి. ప్రతి గ్రామానికి కాంపిటెంట్ అథారిటీగా పని చేస్తున్న సీఆర్ డిఏ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల సహాయంతో వాటాల వారీగా భూముల లెక్కలు తారుమారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 
కోట్లు దండుకుంటున్నారు... 
భూములకొలతల్లో కోతలు పెట్టి.. కోట్లరూపాయలు దండుకోడానికి .. అధికారులు, అధికారపార్టీ నాయకలు కుమ్మక్కైయ్యారని.. రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా భూమిపత్రాల ప్రకారం.. తమకు పరిహారం అందించాలని రాజధాని ప్రాంతరైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

17:26 - January 3, 2017

ఎట్టకేలకు 'నారా రోహిత్' ఖాతాలో మరో సక్సెస్ పడింది. టైం కూడా కలిసిరావడంతో నారావారబ్బాయి బాక్సాఫీసు వద్ద సోలోగా కుమ్మేస్తున్నాడు. తక్కువ థియేటర్స్ దొరికినప్పటికి ఉన్నంతలో 'రోహిత్' న్యూ మూవీ 'అప్పట్లో ఒకడుండేవాడు' మంచి కలెక్షన్లను రాబట్టుతోంది. సినిమాలు రిలీజ్ చేయడమే తప్పా రిజల్ట్స్ పట్టించుకుని యంగ్ హీరోల్లో 'నారా రోహిత్' ఒకడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోకి సక్సెస్ లు మాత్రం పడడం లేదు. 'రోహిత్' చాలా సినిమాలకి మంచి టాక్ వచ్చినప్పటికి రిజల్ట్స్ మాత్రం తేడా వచ్చేస్తుంటాయి. కానీ ఈ యంగ్ హీరో లేటేస్ట్ మూవీ 'అప్పట్లో ఒకడుండేవాడు' టాక్ తో పాటు మంచి కలెక్షన్లను సాధిస్తోంది. దీంతో చాలా కాలం తరువాత 'రోహిత్' ఖాతాలో మరో సక్సెస్ పడినట్లైంది.

సాగర్ చంద్ర డైరెక్షన్..
సాగర్ చంద్ర డైరక్షన్ రూపొందిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం 1990లో హైదారాబాద్ లో జరిగిన ఓ రియల్ సంఘటనను ఆధారం చేసుకుని తెరకెక్కించారు. క్రికెటర్ కావాలనుకున్న వ్యక్తి జీవితంలో అనుకోని మలుపులు, ఒక పోలీస్ ఇనస్పెక్టర్ తాలూకు తెగువ ఇలాంటి నేఫథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెప్పాన్స్ తెచ్చుకుంది. సి సెంటర్స్ లో ఈ సినిమాకు థియేటర్స్ దొరకలేదు. కానీ మల్టీప్లెక్సుల్లో మాత్రం ఈ చిత్రం జోరు చూపిస్తోంది. దానికి తోడు శుక్రవారం మూవీ పికప్ అందుకోవడంతో శనివారం, ఆదివారం షోస్ హౌస్ పుల్స్ పడ్డాయి. ఆదివారం కలెక్షన్లను బట్టి ఈ మూవీ హిట్టు రేంజ్ కి వెళ్లిందనే చెప్పాలి. సంక్రాంతి వరకు సినిమాలు లేకపోవడం 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిన ఈ మూవీకి మరో పది రోజుల వరకు ఢోకా లేదు. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు అంటే ఇంకా పది రోజులకు వరకు ఈ మూవీ బాక్సాఫీసు కలెక్షన్లను ఎలాంటి అడ్డులేకుండా పోయింది. ఈ సమయాన్ని సరిగ్గా వాడుకుంటే ఈ మూవీకి భారీ లాభాలు దక్కినట్లే.

బీజేపీ ఆఫీసు పై టీఎంసీ కార్యకర్తల రాళ్ల దాడి

కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లో 15 వేల కోట్ల రోజ్ వాలీ గ్రూప్ చిట్‌ఫండ్ స్కామ్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ లోక్‌స‌భ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ‌ను మంగ‌ళ‌వారం సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకముందు మరో ఎంపీ తపస్ పాల్, ఆయన కుమార్తెను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని టీఎంసీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి టీఎంసీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు రాళ్లదాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

17:22 - January 3, 2017

'బాహుబలి 2' టార్గెట్ మిస్ అయింది. అయిన డెడ్ లైన్ విషయంలో ఏ మార్పు ఉండదని జక్కన్న టీం చెప్పుతోంది. దర్శకధీరుడు 'రాజమౌళి' వేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. అయిన కూడా ఈ టాప్ డైరెక్టర్ ముందు చెప్పిన మాటకే కట్టుబడినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల మోత మోగించిన బాహుబలి టార్గెట్ మిస్ కావడం ఏంటో ? 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం కోసం టాలీవుడ్ మాత్రమే కాదు యావత్తు దేశవ్యాప్తంగా సిని ప్రియులు ఎదురుచూస్తున్నారు. 2017 సమ్మర్ లో సెకెండ్ పార్ట్ ని రిలీజ్ చేస్తానని రాజమౌళి ఎప్పుడో ఆరునెలల కిందటే మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు బాహుబలి షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్ తొలివారంలో 'బాహుబలి 2' షూటింగ్ ని ప్రారంభించిన జక్కన్న 2016 డిసెంబర్ చివరికల్లా మొత్తం షూట్ కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ టార్గెట్ మిస్ అయింది.

ఆ డేట్ న రిలీజ్ ..
డిసెంబర్ 31 న 'బాహుబలి 2' షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయాలని రాజమౌళి అండ్ టీం ప్రణాళిక వేసుకుంది. టాకీ పార్ట్ కి ప్యాకప్ చెప్పేసి గ్రాఫిక్స్ వర్క్ పై కాన్సంట్రేట్ చేయాలని యూనిట్ భావించింది. కానీ ఎంత వేగంగా పనులు జరిపినా ఇప్పటికీ కొన్ని సీన్స్ మిగిలిపోయాయట. అలాగే ప్యాచప్ వర్క్స్ సంబంధించి కూడా ఇంకో నెల రోజుల షూటింగ్ చేయాల్సి ఉందట వినికిడి. క్వాలిటీ విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీపడకపోవడంతోనే షూట్ ఆలస్యం అవుతుందని యూనిట్ సభ్యులు చెప్పుతున్నారు. షూటింగ్ విషయంలో డెడ్ లైన్ మిస్ అయినా, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని 'రాజమౌళి' చెప్పుతున్నాడట. ముందుగా చెప్పిన ప్రకారమే ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీని ఏప్రిల్ 28 రిలీజ్ రిలీజ్ చేసి తీరుతామని 'రాజమౌళి' శపథం చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ఇంకా నాలుగు నెలల టైం ఉండడంతో సినిమాను చెప్పిన తేదీకల్లా రిలీజ్ చేస్తాడులే అని సిని ప్రియులు కూడా నమ్ముతున్నారు. మరి అద్భుతమైన అవుట్ పుట్ కోసం జక్కన్న రాజీ పడడనే విషయం ఆయన గత చిత్రాలను చూస్తే అర్ధం అవుతోంది. ఎంత లేట్ అయిన కూడా రాజమౌళి మాత్రం మరోసారి సెల్యూలాయిడ్ పై వండర్స్ క్రియేట్ చేస్తాడనడంలో ఆడియన్స్ కి ఎలాంటి సందేహం లేదు.

17:21 - January 3, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. బారాముల్లా జిల్లా హరితార్‌ తర్జూ ప్రాంతంలో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది హతమయ్యాడు. టెర్రరిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మరి కొందరు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాది నుంచి ఎకె 47తో సహా ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

 

17:16 - January 3, 2017

తిరుపతి : ప్రధాని మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వరా యూనివర్సిటీలో ఇండియన్‌  సైన్స్ కాంగ్రెస్‌ను‌ ప్రారంభం తర్వాత ప్రధాని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మోడీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు. దర్శనం తర్వాత  తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు. మోడీతోపాటు సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర మంత్రి సుజనాచౌదరి తదితరలు మోడీ వెంట ఉన్నారు. 

 

గ్రామీణ ప్రాంతాలకు 40% నోట్ల పంపిణీ: ఆర్బీఐ

హైదరాబాద్: నోట్ల రద్దు తరువాత ఆశించిన స్థాయిలో నోట్లు గ్రామీణ ప్రాంతాలకు నోట్లు చేరడం లేదని గుర్తించిన ఆర్బీఐ 40 శాతం నోట్లను పంపాలని నిర్ణయించింది. దీని ద్వారా నగదు కొరత సమస్యకు కొంత మేర అడ్డుకట్ట పడుతుందని ఆర్బీఐ భావిస్తోంది. అంతేకాదు రూ. 100 నోటు కన్నా చిన్న నోట్లను సైతం గ్రామీణ ప్రాంతాలకు పంపాలని ఆదేశించింది.

16:43 - January 3, 2017

ఢిల్లీ : కోడి పందేలపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రఘురామ కృష్ణరాజు...సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సంప్రదాయబద్దమైన క్రీడను రూపుమాపేందుకు జరుగుతున్న చర్యగా దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోడి పందేలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. కత్తులు కట్టకుండా కోడి పందేల నిర్వహణకు అనుమతించాలని కోరారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికే కొన్ని కోడి పందేలు జరగకుండా..పోలీసులు అదుపులోకి తీసుకున్న కోళ్లను తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన కోరారు. అయితే జనవరి 5న కోడిపందేలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనున్నది. 

 

అరెస్ట్ లతో బెదరేదిలేదు..సీఎం మమత

కోల్‌క‌తా: 15 వేల కోట్ల రోజ్ వాలీ గ్రూప్ చిట్‌ఫండ్ స్కామ్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ లోక్‌స‌భ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ‌ను మంగ‌ళ‌వారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈరోజు ఆయ‌న‌ను విచార‌ణ‌కు పిలిచిన సీబీఐ కొన్ని గంట‌ల త‌ర్వాత అరెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. రోజ్ వాలీ చిట్‌ఫండ్ స్కామ్‌లో అరెస్ట్ అయిన రెండో తృణ‌మూల్ ఎంపీ సుదీప్‌. డిసెంబ‌ర్ 30న త‌ప‌స్ పాల్‌ను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఈ అరెస్ట్‌ల‌కు బెదిరేది లేద‌ని స్ప‌ష్టంచేశారు.

16:38 - January 3, 2017

హైదరాబాద్ : భద్రాచలంలో నగలు ఎలా మాయం అయ్యాయి..? ఎలా దొరికాయో..? ప్రభుత్వం వివరణ ఇవ్వాలని టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. భక్తులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. దేవాలయ కమిటీ లేక ఆలయ నిర్వహణలో లోపాలు వస్తున్నాయని ఆయన అన్నారు. 

 

16:35 - January 3, 2017

హైదరాబాద్‌ : గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. వారందరినీ రెగ్యూలరైజ్‌ చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

'పాలమూరు ఎత్తిపోతల' తెలంగాణ సర్కార్ కు ఊరట

హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఊరట లభించింది. ఎన్జీటీ స్టే ను హైకోర్టు ఎత్తివేసింది

16:30 - January 3, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ప్రైవేటు డైరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయినా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు లాభపడి 26,643 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,192 వద్ద ట్రేడ్ అయింది.

16:01 - January 3, 2017

ఈ ఫొటో చూశారా ఏదో కుస్తీలు పడుతున్నట్లుగా ఉంది. కదా..అవును వీళ్లు కుస్తీలు పడుతున్నారు. వీరు ఎవరో కాదు. మెగాస్టార్ 'చిరంజీవి' మనువరాళ్లు. సుస్మిత కూతుళ్లు. బాలీవుడ్ 'అమీర్ ఖాన్' నటించిన 'దంగల్' సినిమా ప్రభావం పడిందని సుస్మిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన 'దంగల్' భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఎంతో స్పూర్తిని రగిలించిందని, ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండుసార్లు చూడడం జరిగిందని సుస్మిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ఇద్దరు కుమార్తెలు కులిసి కుస్తీ పడుతున్న ఫొటోను పోస్టు చేసింది. చాలా మంది ప్రముఖులు 'దంగల్' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కోర్టులో కొనసాగుతున్న అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం

హైదరాబాద్: హైకోర్టులో అగ్రి గోల్డ్ ఆస్తుల వేలం కొనసాగుతోంది. కొన్ని ఆస్తులకు బిడ్డింగ్ లో వేసిన మొత్తం కంటే మూడొంతులు ఎక్కువ రేటుకు రియల్టర్లు వేలం పాడారు.

15:53 - January 3, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' 2017 సంవత్సరంలో పలు చిత్రాల్లో నటించనున్నాడు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో 'మహేష్' పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నట్లు, ఈ చిత్రానికి 'సంభవామి' టైటిల్ యోచిస్తున్నట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ స్టేజ్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే కొరటాల శివతో రెండో సినిమా ప్రారంభమైంది. కొరటాలతో ఇది రెండో సినిమా. దీనిని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మించనున్న మరో చిత్రంలో కూడా 'మహేష్' నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే మళ్లీ మరోమారు మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' కాంబినేషన్ లో 'ప్రిన్స్' నటించనున్నాడు. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందనుందని ప్రిన్స్ చెప్పాడు. గతంలో 'అతడు', 'ఖలేజా' సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే.

తండ్రీ కొడుకుల మధ్య కుదిరిన సమోధ్య

లక్నో:ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ మధ్య సమోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ములాయంకు, అభ్యర్థుల ఎంపిక అఖిలేష్ కు అప్పగించినట్లు సమాచారం.

ఎంపి సుదీప్ బందోపాధ్యాయను అరెస్ట్ చేసిన సీబీఐ

కోల్ కతా: రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో టీఎంసీ ఎంపి సుదీప్ బందోపాధ్యాయను సీబీఐ అరెస్ట్ చేసింది. ఎంపీ సుదీప్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు.

15:31 - January 3, 2017

కృష్ణా : విజయవాడ సెంటిని ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులు భయంలో బయటికి పరుగులు తీశారు. రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

వెలగపూడి రైతులకు ప్లాట్ల కేటాయింపు..

అమరావతి: తుళ్లూరులో సీఆర్‌డీఏ సిటీ కార్యాలయంలో వెలగపూడి రైతులకు ప్లాట్ల ఎంపికను పూర్తిచేశారు. ఈ పంపిణీలో 1834 నివాస సముదాయ ప్లాట్లు, 1,265 వాణిజ్య సముదాయ ప్లాట్లను రైతులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో ఎంపిక చేశారు.

15:23 - January 3, 2017

మద్యంలోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా...

చిత్తూరు: తిరుపతి నుంచి కనకమ్మసత్రంలోని మద్యం దుకాణాలకు మద్యాన్ని తీసుకెళ్తున్న వ్యాన్‌ ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి పుత్తూరు బైపాస్‌ వద్ద బోల్తా పడింది. బైపాస్‌ సమీపంలోని కొండల్‌ చెరువు క్రాస్‌ రోడ్డు వద్ద అడ్డుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల విలువైన మద్యం ధ్వంసమైంది.

చంద్రబాబుకు అల్జీమర్ వ్యాధి ముదిరింది: ఎంపీ కేవీపీ

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు పై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అల్జీమర్ వ్యాధి ముదిరిందని ఎద్దేవా చేశారు. పోలవరంలో చంద్రబాబుది కానీ, టీడీపీ నేతలది కాని ఏమైనా పాత్ర ఉందా అని ప్రశ్నించారు. పోలవరంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. జీవో నెం67తో పోలవరం ఇందిరా సాగర్ ప్రాజెక్టును పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారు అని ఆరోపించారు.

ములాయంతో భేటీ అయిన అఖిలేష్

లక్నో: ములాయంసింగ్ యాదవ్ తో తనయుడు అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి శివపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. పార్టీలో చిచ్చుకు కార‌ణంగా భావిస్తున్న శివ‌పాల్ యాద‌వ్‌ను కేంద్ర రాజ‌కీయాల‌కు పంపిస్తే.. తాను జాతీయ అధ్య‌క్షుడి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని అఖిలేష్ చెప్పినట్లు స‌మాచారం.

భారత ఈశాన్య రాష్ట్రాలో భూకంపం

హైదరాబాద్ :భారత ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. అసోం, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయ్యింది.

క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు కోదండరామ్ సంఘీభావం

హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు టి.జేఏసీ నేత ప్రొ.కోదండరామ్ సంఘీభావం తెలిపారు.

15:00 - January 3, 2017

టాలీవుడ్ మెగాస్టార్ 'చిరంజీవి' ఎన్నో ఏళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' సినిమా సంక్రాంతి పండుగకు వస్తోంది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక విషయంపై సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తున్నాయి. మొదట విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫంక్షన్ నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాత 'రామ్ చరణ్' ఓ వీడియోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేదిక మారింది. గుంటూరు జిల్లాలోని హాయ్ లాండ్ లో వేదిక జరగనుంది. అనుకోకుండా వేదిక మార్చడంతో ఏర్పాట్లను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పర్యవేక్షిస్తున్నారు. వేదిక ఎందుకు మార్చాల్సి వచ్చిందో 'చిరంజీవి' తెలుపుతారని 'అల్లు అరవింద్' వెల్లడించారు. ఇందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మెగా అభిమానులు అనుకుంటున్నట్లు టాక్.
చిత్ర షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకొంటోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన పాటలను డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. 'కత్తి' రీమెక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్వకత్వం వహిస్తున్నారు. 'చిరు' సరసన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభలో మత్స్య పరిశ్రమపై సీఎం కేసీఆర్ మాట్లాడగా, మండలిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు వివరించారు. అనంతరం ఉభయ సభలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్, ఛైర్మన్ ప్రకటించారు.

వైద్యులను చితకబాదిన ఎమ్మెల్యే

హైదరాబాద్ :అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ ముగ్గురు వైద్యులను కర్ణాటక ఎమ్మెల్యే అనంత్ కుమార్ హెగ్డే చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంత జరిగినా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం కొసమెరుపు.

'అనుమతిలేని స్టడీ సెంటర్లపై నియంత్రణకు చట్టం'

హైదరాబాద్ :అనుమతిలేని స్టడీ సెంటర్లను నియంత్రించేందుకు త్వరలో చట్టం తెస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ మండలిలో ఆయన ప్రసంగించారు. అనుమతిలేని ఈ సెంటర్ల అంశం ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోందని, యూజీసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు.

నెల్లూరుకు జగన్

హైదరాబాద్:  నెల్లూరు జిల్లాలో పోర్లుకట్ట బాణా సంచా పేలుడు సంఘటనా స్థలాన్ని కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సందర్శించి, ఈఘటన లో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్ :రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్య రంగంలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నామని.. వచ్చే రెండేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ఫిషరీష్‌ కార్పోరేషన్‌ జవజీవాలు లేకుండా ఉందని.. త్వరలోనే ఈ కార్పోరేషన్‌లో 500 నియామకాలు చేపడతామన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తిరుమల : ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎంచంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వున్నారు.

సెంటిని ఆసుపత్రిలో ఫైర్ ఆక్సిడెంట్..

విజయవాడ : సెంటిని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతుండడంతో రోగులు, వారి బంధువులు బయటకు పరుగులు తీస్తున్నారు.

13:47 - January 3, 2017

అమ్మాయిల అక్రమ రవాణ...పేదరికం..నిరక్షరాస్యతతో అమ్మాయిలు మోసపోతున్నారు. ఈ ట్రాఫికింగ్ లో ఎక్కువగా చిన్నారులే బలౌతున్నారు. ఉద్యోగాల పేరిట ఇతర దేశాలకు అమ్మాయిలు ఎగుమతి అవుతున్నారు. నయవంచనకు గురై అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. అమ్మాయిల అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అంశంపై మానవి 'వేదిక' చర్చను చేపట్టింది. ఈ చర్చలో శ్యామలాదేవీ (ఛైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్), మురళీ మోహన్ (సాధన స్వచ్చంద సంస్థ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. మరి వారు ఎలాంటి అంశాలు పేర్కొన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

13:43 - January 3, 2017

వరంగల్ : తెలంగాణ వస్తే బతుకులు బాగు పడుతాయని ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశ తప్పలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 79వ రోజుకు చేరుకుంది. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్, ఉరుసు, కాజిపేట, పెద్ద పెండ్యాలలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. తెలంగాణ సమస్య కోసం పోరాటం చేసిన వారిపై గత ప్రభుత్వాలు కాల్పులకు తెగబడ్డాయని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వాలపై విరుచుకపడిన కేసీఆర్..ఇప్పుడు తన పాలనలో కూడా మల్లన్న సాగర్ బాధితులపై కాల్పులకు తెగబడ్డారని విమర్శించారు.

13:37 - January 3, 2017

హైదరాబాద్ : మత్స్యశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన మత్స్యశాఖపై మాట్లాడారు. తెలంగాణకు ఉన్న మైనర్, ఇరిగేషన్ లు గొప్ప వరాలు అని పేర్కొన్నారు. 70-75 వేల చెరువులు నాశనమయ్యాయని, రాష్ట్రంలో ప్రస్తుతం 46,500 చెరువులున్నాయని ఇన్ని చెరువులు ఎక్కడా లేవన్నారు. మిషన్ భగీరథ గొప్ప పథకాన్ని తీసుకోవడం జరిగిందని, 15-16వేల చెరువులు కంప్లీట్ చేశారని తెలిపారు. ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన వారు శ్రీశైలంలో చేపలు పట్టుకుంటూ ఉంటారని, దాడులు కూడా చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ నది..వాగులపై చెక్ కం డ్యామ్ కట్టాలని, బ్రిడ్జీ కట్టవద్దని సూచించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం అద్భుతమైన పెట్టుబడులు పెడుతామని, వచ్చే బడ్జెట్ సమావేశంలో అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం మత్స్యకారులకు అందించాలంటే పకడ్బందీ ప్రణాళికలు అవసరమన్నారు. రెండు ఫిషరీస్ కాలేజీలు, చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, అంతరాష్ట్ర ప్రాజెక్టుల్లో ఉన్న చేపల శాతం లెక్క తేలాలని, మరబోట్లను సమకూరుస్తామన్నారు. వచ్చే నెలల్లో ఫిషరీస్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.

13:31 - January 3, 2017

ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ తేదీలు ఖరారయ్యాయి. గత సంప్రదాయానికి కేంద్రం తెరదించుతోంది. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి జనవరి 31న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో బడ్టెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ జనవరి 31వ తేదీ నుండే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నారు. అంతేగాకుండా మొదటగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం సాధారణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టే సంప్రదాయం ఉంది. దీనికి కేంద్రం చెక్ పెట్టింది. సాధారణ బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ ను ఒకే బడ్జెట్ లో రూపొందించనున్నారు. మార్చి చివరి వారంలో ఏప్రీల్ - మే నెల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.

కోడిపందాలపై సుప్రీంను ఆశ్రయించినరాఘుమకృష్ణంరాజు

హైదరాబాద్: కోనసీమ సంప్రదాయంలో కలసిపోయిన సంక్రాంతి కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని ఏపీ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కోళ్లను పెంచుకోవడం ప్రతి ఒక్కరి హక్కని, అది తప్పెలా అవుతుందని, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్ పై 5 లేదా 6న విచారణ జరుగుతుందని సమాచారం.

13:09 - January 3, 2017

కరీంనగర్ : స్నేహితుడి కూతురిపైనే ఓ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త కన్నేశాడు..అంతేగాకుండా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు..నష్టపరిహారం చెల్లిస్తా..కేసు పెట్టవద్దని అతను చెప్పడంతో బాధిత మహిళలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీపట్నం మండలం వేములకుర్తిలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త సత్యం. నూతన సంవత్సరం సందర్భంగా గ్రామానికి చెందిన స్నేహితుడితో విందు చేసుకున్నారు. అనంతరం మిత్రుడి కూతురు (మైనర్) పై సత్యం కన్నేశాడు. ఇంటి ధాబాపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు వేసింది. అనంతరం సత్యం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మంగళవారం కుల పెద్దలతో పంచాయతీ ఏర్పాటు చేశారు. బాలిక కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తానని, కేసు పెట్టవద్దని సత్యం పేర్కొన్నాడు. దీనికి ఆగ్రహించిన బాధిత కుటుంబీకులు అతనిపై దాడి చేశారు. చెప్పులతో కొట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్నికల బరిలో ఒంటరిగానే మాయావతి

యూపీ: ఒంటరిగానే ఎన్నికలబరిలోకి దిగుతున్నామని బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ)అధినేత మాయావతి స్పష్టం చేశారు. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు. 403 స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేశామన్నారు. అందులో ఎస్పీ-87, మైనార్టీ-97, ఓబీసీ-106, ఓసీ -113 స్థానాలను కేటాయించినట్లు చెప్పిన మాయావతి పేర్కొన్నారు.

31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

న్యూఢిల్లీ : జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ, రాజ్యసభను ఉద్దేశించి జనవరి 31న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించనున్నారు. 31న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

గూగుల్ డూడుల్‌లో సావిత్రిబాయ్ పూలే

హైదరాబాద్: గూగుల్ డూడుల్‌లో సావిత్రిబాయ్ పూలేకు గౌరవందక్కింది. నేడు ఆమె జన్మ దినోత్సవం సందర్భంగా గూగుల్ సంస్థ తన డూడుల్‌లో ఆమెను ఫోటోను ఉంచి నివాళులర్పించింది. కాగా, సావిత్రి బాయ్ పూలే జనవరి 3, 1831న జన్మించిన విషయం తెలిసిందే. ఆమె సామాజిక కార్యకర్త, కవి. ఆమె తన భర్త జ్యోతిరావ్ పూలే తో కలిసి ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

ఇచ్చాపురంలో పవన్ రోడ్ షో

శ్రీకాకుళం : ఉద్ధానం కిడ్నీ వ్యాధి బారిన పడిన బాధితుల తో ముఖాముఖి నిర్వహించిన అనంతరం ఇచ్చాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.

 

12:39 - January 3, 2017

చిత్తూరు : దేశం ముందు ఎన్నో సవాళ్లున్నాయని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుపతి బాలాజీ సన్నిధిలో ఈ సదస్సు జరగడం ఆనందంగా ఉందని, సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2016 నవంబర్ లో ఈ దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని, ఎన్జీకే మీనన్ మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. వేగంగా మారుతున్న పరిస్థితులకనుగుణంగా మారాల్సినవసరం ఉందని, శాస్త్ర సాంకేతిక రంగంలో సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 2030 నాటికి ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ టాప్ 3లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సైబర్ భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ కు సముద్ర విపణి కీలకమన్నారు. శాస్త్ర సాంకేతిక సంస్థలు ప్రపంచ స్థాయికి చేరుకొనేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధ్వంసాలకు టెక్నాలజీ ఉపయోగించడంపై అప్రమత్తంగా ఉండాలని, శాస్త్ర సాంకేతిక రగం అభివృద్ధికి ఎన్ఆర్ఐల సాయం కోరుతున్నట్లు తెలిపారు. దేశానికి శాస్త్ర సాంకేతికత అందించడంలో నీతి ఆయోగ్ మార్గదర్శిగా ఉంటుందన్నారు. శుభ్రమైన నీరు, విద్యుత్ అందించడానికి సైన్స్ సహకారం అవసరమని, 12 కీలక రంగాలపై దృష్టి సారించాల్సినవసరం ఉందన్నారు. పర్యావరణం, నీటి శుద్ధి రంగాలు ఎంతో కీలకంగా మారాయన్నారు. దేశంలోని ప్రతి కొనకూ సాంకేతికత అందుబాటులోకి రావాలని, మరిన్ని ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు నాంది పలకాలన్నారు. సైబర్, రోబోటిక్ రంగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. వ్యవసాయం, విద్య, సాంకేతికత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది : మోదీ

తిరుపతి : 104 వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తిరుపతిలో ఈ సదస్సు జరపడం ఆనందకరమని, 2016 నవంబర్ ఈ దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిన ఎన్జీకే మీనన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో శాస్త్రసాంకేతికతే ప్రధానమైందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీని స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవాలన్నారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని, పిల్లలో సృజనాత్మకత పెంచితే దేశ భవిష్యత్ కు ఢోకా ఉండదన్నారు.

12:08 - January 3, 2017
12:07 - January 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో పాడి పరిశ్రమపై మంత్రి తలసాని ఇచ్చిన సమాధానం తప్పుగా ఉందని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తిరిగి ప్రారంభమైన సభలో జీవన్ రెడ్డి పాడి పరిశ్రమపై ప్రశ్నలు సంధించారు. దీనిపై తలసాని మాట్లాడారు. ఆగస్టు వరకు పాడి రైతులకు ప్రోత్సాహకాలు చెల్లించామని, పాడి రైతులకు చెల్లించాల్సిన మిగతా ప్రోత్సాహకాల బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. నీకున్న అనుభవం లేదు..అవకాశం ఉన్నప్పుడు చేసుకునే పరిస్థితి లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 60 సంవత్సరాలు కనీసం బడుగు, బలహీన వర్గాల వారిపై ఆలోచించారా అని ప్రశ్నించారు. 9 మాసాలు ఏరియర్స్ లేవని, ఆగస్టు వరకు ఇవ్వడం జరిగిందన్నారు. రూ. 51 కోట్లను విడుదల చేయడం జరిగిందని, ఇన్సెంటివ్ లో కొంత సమస్య ఉంటుందని అప్పుడే చెప్పడం జరిగిందన్నారు. నాలుగు నెలల కాలానికి సంబంధించిన డబ్బులను త్వరలో విడుదల చేస్తామన్నారు. దీనిపై జీవన్ రెడ్డి మాట్లాడారు. సభను మంత్రి తలసాని తప్పుదోవ పట్టిస్తున్నారని, మౌఖికంగా చెబుతున్నది ఒకటి..రాతపూర్వకంగా ఇచ్చింది మరొకలాగా ఉందన్నారు.

12:03 - January 3, 2017

శ్రీకాకుళం : ఎన్నో ఏళ్లుగా నానుకుని ఉన్న ఓ సమస్యను పరిష్కరించేందుకు జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' నడుం బిగించారు. తమ సమస్య ఇప్పటికైనా తీరుతుందా అని కిడ్నీ రోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత రెండు దశాబ్ధాలుగా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధితో ఎంతో మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో రోగులతో 'పవన్' నేరుగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రోగులు తమ సమస్యలు తెలుసుకున్నారు. అంతకంటే ముందు 'పవన్' మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నా సరియైన విధంగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై ఎవరూ స్పందించలేరని, ఎన్నో వేల రూపాయలు ఖర్చు అవుతాయని రోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నామని కన్నీళ్లతో తెలిపారు. కూలి చేసుకుని బతికేవాళ్లమని ఒకరు పేర్కొనగా కిడ్నీ వ్యాధితో అమ్మా..నాన్నలు చనిపోయారు..అనాథలు అయిపోయాయని ఓ చిన్నారి పేర్కొన్నారు.

11:58 - January 3, 2017
11:58 - January 3, 2017

ప్రారంభమైన సైన్స్ కాంగ్రెస్ సదస్సు

తిరుపతి: సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం అయ్యింది. తిరుపతి వేదికగా ప్రారంభమైన 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ హాజరయారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వేల మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విదేశాల నుంచి నోబెల్‌ బహుమతి గ్రహీతలు తరలివచ్చారు. ‘జాతీయాభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతికం’ అనే ప్రధాన దృక్పథంతో సాగుతున్న ఈ ఐదు రోజుల సైన్స్‌ సమ్మేళనం జరగనుంది.

పవన్ సూచనలను పాజిటివ్ గా తీసుకుంటాం : మంత్రి పత్తిపాటి

గుంటూరు: ఉద్దానం కిడ్నీ వ్యాధిపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటామని, కిడ్నీ బాధితుల సమస్య పరిష్కరిస్తామని మంత్రి ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చాలన్న సంకల్పంతో ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమంగా మార్చుతా: పవన్

శ్రీకాకుళం : ఉద్ధానం కిడ్నీ వ్యాధిపై అధ్యయనం కోసం కమిటీ వేశామని... ఈ సమస్య పై ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమంగా మార్చుతా అని పవన్ హెచ్చరించారు. ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదు, బడ్జెట్ లో రూ.100 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. ఇది చాలా ఘోరమైన విపత్తని, ఉద్దానం కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఏ ప్రజాప్రతినిధి జాతీయ స్థాయికి తీసుకెళ్లలేదు ఎందుకు అని ప్రశ్నించారు. నేనే స్వయంగా సీఎంకు సమస్య తీవ్రతను వివరిస్తానన్నారు. ఈ సమస్యల ప్రభుత్వం స్పందించకుంటే ప్రజాఉద్యమంగా మార్చుతా అని పవన్ హెచ్చరించారు.

11:42 - January 3, 2017
11:38 - January 3, 2017

శ్రీకాకుళం : సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' మళ్లీ గళం విప్పారు. గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా..ఇతర అంశాలపై స్పందించిన పవన్ తాజాగా కిడ్నీ రోగుల ఇబ్బందులపై స్పందించారు. గత రెండు దశాబ్ధాలుగా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధితో ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఇచ్చాపురం పర్యటనకు శ్రీకారం చుట్టారు. మంగళవారం మణికంఠ థియేటర్ లో కిడ్నీ వ్యాధి గ్రస్తులతో ముఖాముఖి నిర్వహించారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు, వైద్యులు మాట్లాడిన అనంతరం ఆయన సర్కార్ ఎదుట డిమాండ్స్ ఉంచారు.

చాలా బాధేస్తోంది..
ఈ వ్యాధి విషయం తెలిసి చాలా బాధ కలిగిందన్నారు. సమస్యను పరిష్కరించే విధంగా ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు. ప్రజలను ఓటు బ్యాంకుగా తాను చూడడం లేదన్నారు. కిడ్నీ వ్యాధి ఒక విపత్తు అని అభివర్ణించారు. వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నా ప్రజాప్రతినిధి ఎందుకు స్పందించలేదన్నారు. పుష్కరాలకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఉద్దాన్నంలో చనిపోతున్నా..అనాథలవుతున్నా పట్టించుకోకపోవడం చాలా బాధిస్తోందన్నారు. నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేవలం ఓట్ల కోసం ఎందుకు ముందుకు వస్తారని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఎంతో డబ్బు బ్యాంకుల్లో వేశారని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద పుష్కలంగా నిధులున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 6వేల కోట్ల మెడికల్ బడ్జెట్ ఉందన్నారు. డయాలీసిస్ సెంటర్లు పెట్టించామని మంత్రి పేర్కొంటున్నారని, డయాలిసీస్ అనేది చివరిగా వాడుతారని తెలిపారు.

డిమాండ్స్..
ఇందుకు ప్రత్యేకమైన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్థితిగతులను పరిశీలించాలన్నారు. ఎంత మంది ప్రజలు బాధ పడుతున్నారు ? చికిత్స ఏ విధంగా ఆదుకోవాలో చూడాలన్నారు. ఇందుకు ఒక కమిటీ వేయడం జరుగుతుందని, డా.హరిప్రసాద్, సందీప్, అశోక్ యాదవ్..మిగతా ఇద్దరు కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. వైద్యులు దుర్గా ప్రసాద్, కృష్ణమూర్తిలు కమిటీతో పనిచేయాలని సూచించారు. సహాయ సహకారాలు అందించాలన్నారు. పదిహేను రోజుల అనంతరం వచ్చిన నివేదికను సీఎంకు..ప్రజాప్రతినిధులకు తానే స్వయంగా అందచేయడం జరుగుతుందన్నారు. 48గంటల్లో అనాథలైన వారికి ఏదో రకమైన ప్రభుత్వం సహాయం చేయాలని, మంత్రివర్గం నుండి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నివేదిక అనంతరం కూడా స్పందించకపోతే తానే స్వయంగా దీనిపై ప్రజా ఉద్యమంగా చేస్తానని పవన్ హెచ్చరించారు.

11:21 - January 3, 2017

శ్రీకాకుళం : ఉద్దాన్నం కిడ్నీ బాధితులను పట్టించుకోవాలని వైద్యుడు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో కిడ్నీ రోగులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రోగులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం వైద్యుడు కృష్ణమూర్తి మాట్లాడారు. అక్కడ నెలకొన్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. సోంపేటలో 1992లో ప్రాక్టీస్ చేయడం జరుగుతోందని, 1995లో ఒక ఫిజీషీయన్ తో మాట్లాడి రక్తహీనతో బాధ పడుతున్నారని తెలుసుకోవడం జరిగిందన్నారు. ఏ కారణంతో వ్యాధి వస్తుందో తెలియడం లేదని, ఇక్కడి యువకులకు వివాహాలు జరగడం లేదన్నారు. రాజకీయ నేతలు, ప్రభుత్వం సరియైన విధంగా స్పందించ లేదన్నారు. కిడ్నీ వ్యాధితో ఎంతో మంది చనిపోయారని చాలా బాధగా ఉందన్నారు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని, సరియైనటువంటి మందులు ఇవ్వడం..రోగులకు సరియైన అవగాహన కల్పిస్తే బాగుండేదన్నారు. ఏఎన్ఎం, ఆర్ఎంపీలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఎక్కువ నీరు సేవించాలని సూచించారు. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో సమగ్రమైనటువంటి రీసెర్చ్ టీం పెట్టాలని, స్థానికంగా క్లినీక్ టెస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిపుణులైన వైద్యుల సలహాలతో ట్రీట్ మెంట్ ప్రారంభించాలని సూచించారు. డయాలీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకోవడం కరెక్టు కాదన్నారు. చనిపోయిన కుటుంబీకులను ఆదుకోవాలని, సరియైన విధంగా స్పందించాలని సూచించారు. ఆర్థిక వనరులు ఉంటే ఏదైనా సాధ్యమని, ఈ సందర్భంగా తాను ఒక నివేదిక పవన్ కు అందచేస్తున్నట్లు పేర్కొన్నారు.

కర్ణాటక మంత్రి హెస్ ఎస్ మహాదేవ్ ప్రసాద్ హఠాన్మరణం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర కార్పోరేషన్ శాఖ మంత్రి హెచ్‌ఎస్ మహాదేవ్ ప్రసాద్ కన్నుమూశారు. ఉదయం హార్ట్‌ఎటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. గుండ్లుపేట్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐదు సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు.

కలిగిరిలో భారీ అగ్నిప్రమాదం

నెల్లూరు : కలిగిరిలో ఈరోజు వేకువజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 షాపులు దగ్ధమయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే షాపులు కాలిపోయి భారీ నష్టం సంభవించింది. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిదని అధికారులు ప్రాథమిక అంచానాకు వచ్చినట్లు సమాచారం.

కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ ముఖాముఖి

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల జనసేన అధినేత పవన్ కల్యాన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నీ వ్యాధితో తాము పడున్న బాధలను బాధితులు వివరిస్తున్నారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. తిండికే లేని తమకు చికిత్స తలకుమించి భారమవుతోందని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఇక్కడికి రాలేదన్నారు.

ఎల్బీనగర్ లో 10ప్రైవేట్ బస్సుల సీజ్

హైదరాబాద్: ఎల్బీనగర్‌లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 ప్రైవేటు బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మరో ముడు బస్సులను జప్తు చేశారు. స్టేజ్ క్యారేజీ అనుమతులతో, తేదీ ముగిసిన పర్మిట్లతో బస్సుల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేటి ఉదయం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. 43 పాయింట్ల లాభంతో బీఎస్‌సీ సెన్సెక్స్26,638 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.

10:41 - January 3, 2017

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు...

హైదరాబాద్: పదమూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. శాసనసభలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.

10:40 - January 3, 2017

శ్రీకాకుళం : సిక్కోలుకు సినీనటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' చేరుకున్నారు. కాసేపట్లో ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ లో కిడ్నీ రోగులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే పలు ఏర్పాట్లు జరిగిపోయాయి. 'పవన్' పై రోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి కిడ్నీ రోగులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎంతో మంది మృతి చెందిన కుటుంబీకులను ఆదుకోవాలని కిడ్నీ రోగులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా కిడ్నీ రోగులు ఎంతో మంది మృతి చెందారని, వీరికి ప్రభుత్వం సహాయం అందచేయాలని కోరుతున్నారు. 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 30 కి పైగా గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు సంబంధిత నిపుణులు వెల్లడించారు. ఈ కిడ్నీ వ్యాధుల వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈసీని కలవనున్న అఖిలేష్ వర్గం...

హైదరాబాద్ : ఢిల్లీలో సమాజ్ వాదీ పార్టీ సమరం జరుగుతోంది. సైకిల్ సింబల్ కోసం తండ్రీ కొడులు ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు ఈసీని అఖిలేష్ వర్గం కలవనుంది.

రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 104వ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

10:31 - January 3, 2017

హైదరాబాద్ : మానవత్వం మంటకలుస్తోంది. ఆడపిల్ల అని తెలియడంతోనే గర్భంలో చిదిమేస్తున్నారు. ఆడపిల్లలను కర్కశంగా వదిలేస్తున్నారు. ఇలా ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎల్ బినగర్ లో ఓ ఆడపసికందును రోడ్డుపై వదిలేశారు. సరస్వతి నగర్ లోని రోడ్డు నెంబర్ 12 వద్ద ఒక నెల పసికందు ఉండడం గమనించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ పసికందును షన్ సైన్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టెన్ టివి షన్ సైన్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడింది. ఆడ పసికందు ఎంతో ఆరోగ్యంగా ఉందని 2.8 కిలోల బరువు ఉందని తెలిపారు. దీని గురించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

10:30 - January 3, 2017

బఠాణీలను ఆహారంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. వేయించిన వాటితో పోలిస్తే ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే తాజా ఆకుపచ్చ బఠాణీలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే కూరలూ బిర్యానీలూ ఇతరత్రా చిరుతిళ్ల రూపంలో పచ్చిబఠాణీల వాడకం బాగా పెరిగింది. బఠాణీల్లో ఆకుపచ్చ, పసుపు రకాలతోబాటు వూదారంగువీ కనిపిస్తుంటాయి. చలికాలంలో ఎక్కువగా పండే బఠాణీలను ఆ కాలంలో తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వంధ్యత్వాన్ని నివారించడానికి బఠాణీలు బాగా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. కణాల్లోని డీఎన్‌ఏ తయారీకి ఫోలేట్లు అవసరం. ఇవి సమృద్ధిగా ఉండే బఠాణీలను తీసుకోవడం ద్వారా గర్భం ధరించడం సులువవుతుంది. గర్భిణులు బఠాణీలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలో నాడీ సంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

బఠాణీల్లో బీటా సైటో స్టెరాల్‌ లభ్యమవుతుంది. ఈ రకమైన స్టెరాల్స్‌ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. తాజా బఠాణీల్లో కె-విటమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.

ఆల్జీమర్స్‌, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధుల నివారణకు బఠాణీలతో తయారు చేసిన ఆహారం తోడ్పడుతుంది. బఠాణీల్లో యాంటీ యాక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్‌ జియాక్సాంథిన్‌, ల్యూటెన్‌, విటమిన్‌-ఎ వంటి కెరొటినాయిడ్లూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికీ ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

10:27 - January 3, 2017
10:26 - January 3, 2017

హైదరాబాద్ : ప్రముఖ ఆసుపత్రి ఎంఎన్ జే ఆసుపత్రిలో రాజకీయాలు నడుస్తున్నాయని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తిరిగి మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఎంఎన్ జే ఆసుపత్రిలో జరుగుతున్న అవతవకలపై విపక్ష సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఆసుపత్రిలో పేద రోగులు చికిత్స తీసుకుంటూ ఉంటారని, 1.20 వేల మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ ఆసుపత్రిలో నాణ్యత..ప్రమాణాలు లేని పరికరాలున్నాయని తెలిపారు. ప్రమాణాలు..నాణ్యత లేని మెషిన్ ను కొనుగోలు చేశారని, 14 కోట్ల 50 లక్షల ఖరీదు చేసి ఉంటుందని మంత్రి పేర్కొన్నారని తెలిపారు. తన దగ్గర ఆధారాలున్నాయని, వెంటనే దీనిపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు.

అణు ఇంధన శాఖ అనుమతి ఉందా - లక్ష్మారెడ్డి...
రేడియేషన్ మిషన్ 14 లక్షల 50 వేలతో కొనడం జరిగిందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారని, అణు ఇంధన శాఖ అనుమతి ఉందా అని టి.కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రశ్నించారు. 2013లో ఆసుపత్రి వారు మిషన్ కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి కోరారని, అనుమతి వచ్చిన అనంతరం మిషన్ కొన్నారా ? మంత్రి సమాధానం చెప్పాలని కోరారు. అసలు 2.5 ఎంఎం బీమ్ తో పనిచేస్తుందా ? లేక 5.5 ఎంఎం బీమ్ తో పనిచేస్తుందా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మిషన్ వినియోగంలో ఉందా - జీవన్ రెడ్డి..
రేడియేషన్ మిషన్ విషయంలో అణు ఇంధన శాఖ అనుమతి తీసుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారని టి.కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మిషన్ వినియోగంలో ఉందా మంత్రి సమాధానం చెప్పాలని సూచించారు.

మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం..
విపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో చాలా సంవత్సరాలుగా పేదలకు ట్రీట్ మెంట్ అందించడం జరుగుతోందన్నారు. ఈ మిషన్ విషయంలో సంవత్సరం ఆలస్యం జరిగిందని, ఆసుపత్రిలో రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. 2013లో మిషన్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, అనంతరం టెండర్ పిలిస్తే సింగిల్ టెండర్ రావడంతో కమిటీ వేశారని తెలిపారు. అనంతరం మిషన్ ను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అవకతవకలు ఆరోపణలు రావడంతో అధికారంలోకి వచ్చిన అనంతరం తాము ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగిందని, పలువురు నిపుణులు ఈ కమిటీలో ఉన్నారని తెలిపారు. అన్ని పరిశీలించిన అనంతరం ఓ నివేదిక ఇవ్వడం జరిగిందని, ఎలాంటి అవకతవకలు జరగలేదని ఇంత మంచి మిషన్ ఎందుకు ఉపయోగించలేదని నివేదికలో వారు ప్రశ్నించడం జరిగిందన్నారు. 2.0 బదులు 2.5 అప్ డేట్ వర్సన్ ఉందని సూచించారు.

నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం...

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఢిల్లీలో ప్రారంభం కానున్నది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ర్టాల నుంచి ఆర్థిక మంత్రులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ఆరు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే అవకాశం వుంది.

తెలంగాణ కు కొత్త గవర్నర్ శంకరమూర్తి!

హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు ఆయన స్థానంలో శంకరమూర్తి నియామకానికి మోదీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ గా సేవలందిస్తున్న డీ హెచ్ శంకరమూర్తి సేవలు అందించారు. శంకరమూర్తి నియామకంపై మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని తెలుస్తోంది.

దేశరాజధానిని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా 55 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 22 రైళ్ల టైంటేబుల్ మార్చారు. ఆరు రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఏడు అంతర్జాతీయ, ఆరు జాతీయ ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు డొమస్టిక్ ఫ్లైట్లను పూర్తిగా రద్దు చేశారు.

ఇద్దరు యువకుల దారుణ హత్య

నిజామాబాద్: బోధన్‌లో లంగ్దాపూర్ బ్రిడ్జి కింద ఇద్దరు యవకులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు యువకుల తలలు నరికి హత్య చేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిండు ప్రాణాన్ని బలికొన్న మంత్రి కారు

లక్నో: ఓ మంత్రి కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. అతడి కారులో మద్యం సీసాలు కూడా లభించడంతో మద్యం తాగి అతడు వాహనం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిళ్లు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. ఘాట్ లోని 30వ మలుపు వద్ద ఓ బైకు ప్రమాదవశాత్తూ డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, మలుపును అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

చిత్తూరు : తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.

టి.అసెంబ్లీ వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సంక్షేమ శాఖలో విలీన ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సీపీఎం..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు..నిధుల దుర్వినియోగంపై కాంగ్రెస్..1998, 2008, 2012 డీఎస్సీ నోటిఫికేషన్లపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

09:33 - January 3, 2017
09:30 - January 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిని డైన‌మిక్ సీఎం అన్న గ‌వ‌ర్నర్‌పై కాంగ్రెస్‌ నిప్పులు చెరుగుతోంది. ఇప్పటికే న‌రసింహన్‌ వ్యవహరశైలిపై గుర్రుగా ఉన్న హ‌స్తం నేత‌లు.. తాజా ప్రశంసల‌తో గ‌వ‌ర్నర్‌పై ముప్పెట దాడికి దిగారు. రాజ్యాంగబద్ద ప‌ద‌విలో ఉండి ..సీఎం భ‌జ‌న చేయ‌డం ఏంట‌ని మడిప‌డుతున్న నేత‌లు.. మాకొద్ది గ‌వ‌ర్నర్ అంటున్నారు. తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. న‌రసింహన్‌ను గవర్నర్‌గా త‌మ హ‌యాంలో నియ‌మించినా.. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత ఆయ‌న వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ గవర్నర్‌ను కలిసి సర్కార్‌పై ఫిర్యాదు చేసినా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

గవర్నర్ స్పందిస్తారా ?
తాజాగా గ‌వ‌ర్నర్‌...నూతన సంవత్సరం సందర్భంగా కేసీఆర్ డైన‌మిక్ సీఎం అంటూ ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్‌ నేతలు మరింత ఉడికిపోతున్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో.. హోదాను మరిచి సీఎంను పొగుడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏ అంశంలో కేసీఆర్ డైన‌మిజం క‌న‌బ‌డిందో చెప్పాలంటున్న హ‌స్తం నేత‌లు.. సీఎంకు గ‌వ‌ర్నర్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారార‌ని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్, రైతుల ఆత్మహ‌త్యలు, ఎన్నికల హామీలు, వీసీల నియామ‌కాలు.. ఇలా చాలా అంశాల‌పై గ‌తంలో కాంగ్రెస్‌ నేతలు గ‌వ‌ర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. ఒక్కసారి కూడా గ‌వ‌ర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్నిమంద‌లించకపోవ‌డాన్నిజీర్ణించుకోలేక‌పోతున్నారు హ‌స్తం నేత‌లు. అంతేకాదు.. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని గవర్నర్‌ను విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఇక నుంచి ఫిర్యాదులు చేయకుండా.. బాయ్‌కాట్‌ చేస్తామంటున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్‌ నేతల కామెంట్లపై గవర్నర్‌ నరసింహన్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

09:25 - January 3, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కరెన్సీ కష్టాలు వీడడం లేదు. రూ. 500, రూ. 1000 నోట్లను నవంబర్ 8వ తేదీ రాత్రి రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ రోజు వరకు సామాన్యుడు కష్టాలు పడుతూనే ఉన్నాడు. బ్యాంకులు..ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. మొదట రూ. 2500 వరకు పరిమితి విధించిన కేంద్రం దానిని రూ. 4500 పరిమితి పెంచింది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. వృద్ధులు, పెన్షనర్లు ఇంకా కష్టాలను ఎదుర్కొంటున్నారు. డబ్బులు లేకపోవడంతో పలు ఏటీఎంలు మూతపడుతున్నాయి. హబ్సిగూడలో టెన్ టివి పర్యటించింది. ఈ సందర్భంగా డబ్బులున్న ఏటీఎం వద్ద ఉన్న వారితో పలకరించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:24 - January 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ వరకు కొనసాగిన సమావేశాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు ప్రారంభమయ్యే సమావేశాల్లో పలు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సంక్షేమ శాఖలో విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చింది. బీసీ సబ్ ప్లాన్ హామీ విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది. 1998-2008-2012 డీఎస్సీ నోటిఫికేషన్లపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. మహిళా విశ్వవిద్యాలయం హామీ అమలు ఎక్కడ వరకు వచ్చిందని టిడిపి ప్రశ్నించనుంది. అంతేగాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిందని, రెండున్నర సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టారనే దానిపై విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. జిల్లాల పునర్ విభజనపై ఎలాంటి విధి విధానాలు ఖరారు చేశారనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రోజుకో అంశంపై సభలో చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. చేపల పెంపకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

09:23 - January 3, 2017

వరంగల్ అర్బన్ : ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తూ.. తెలంగాణలో పర్యటిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 78 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పాదయాత్ర 2070 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ ముందుకు సాగుతోంది. కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే వరకూ సీపీఎం పోరాటం ఆగదని తమ్మినేని హెచ్చరించారు. 78వ రోజు సీపీఎం పాదయాత్ర వరంగల్‌ జిల్లా బావుపేట, ఎల్లాపూర్‌, హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ చౌరస్తా, ఎంజీఎం, పాచమ్మమైదాన్‌, కిలా వరంగల్‌ లో పర్యటించింది. యాత్రకు వరంగల్‌ అర్బన్‌ కమిటీ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో పూలవర్షంతో స్వాగతం పలికారు.

సీఎంకు లేఖలు..
తెలంగాణ టీఆర్ఎస్‌ ది కాదని, తెలంగాణ అంటే ఎర్రజెండా అని ఎర్రజెండా అంటే తెలంగాణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధన కోసమే తాము ప్రయత్నం చేస్తున్నామని తమ్మినేని అన్నారు. ఎర్రజెండాతో పాటు మిగతా జెండాలు కలిసి వస్తేనే తెలంగాణలో అట్టుడుగు వర్గాలకు న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. వరంగల్‌ నగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంఖుస్థాపన చేశారని, కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా మొదలు కాలేదని తమ్మినేని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేరే దాకా.. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు జమిలి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తమ్మినేని పిలుపునిచ్చారు. పాదయాత్ర దృష్టికి వచ్చిన అనేక సమస్యలపై సీఎంకు లేఖలు రాస్తున్నామని, ఈ మధ్య వాటికి కొంత స్పందన వస్తోందని తమ్మినేని అన్నారు.

ఐక్యంగా పోరాడాలన్న ఆశయ్య..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోవడం లేదని, అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు కనీసం స్థిరనివాసం కూడా లేదని ఎంబీసీ నేత, పాదయాత్ర బృందం సభ్యుడు ఆశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల గురించి అసెంబ్లీ చర్చించకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అసెంబ్లీలోనే బీసీ సబ్‌ప్లాన్‌ పెట్టాలని ఆశయ్య డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణం అయ్యేవరకు అట్టడుగు వర్గాల ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆశయ్య పిలుపునిచ్చారు.

2017 కి.మీటర్లు..
78వ రోజు మహాజన పాదయాత్ర 2017 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు జి రాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జి నాగయ్య, బి. వెంకట్‌, సుధాభాస్కర్‌, సీఐటీయూ నేతలు సాయిబాబు, పాలడుగు భాస్కర్‌, సీపీఎం అర్బన్‌ కార్యదర్శి వాసుదేవరెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు. వరంగల్‌ నగరంలోని పలు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

09:21 - January 3, 2017

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నారు. జగన్‌ పర్యటన కోసం జిల్లా పార్టీనాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రైతుభరోసా యాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్‌.. జనం సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. వరుసగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన ఇవాళ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు నిర్వాకంతో వ్యవసాయ రంగం కుదేలవుతోందని ఆయన విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని జగన్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

బాణా సంచా ప్రమాదం..
నెల్లూరు జిల్లా పర్యటనలో బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను జగన్‌ పరామర్శించనున్నారు. జిల్లాలోని పోరుకట్ల దగ్గర ఓ ఇంట్లో బాణాసంచా తయారీకోసం నిల్వచేసిన పదార్థాలు పేలడంతో ఐదుగురు మృతిచెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తన పర్యటనలో భాగంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జగన్‌ పరామర్శించనున్నారు. ఈ నెల 4 నుంచి కర్నూలు జిల్లాలో రైతుభరోసా యాత్రకు జగన్‌ రెడీ అవుతున్నారు. నెల్లూరుజిల్లా పర్యటన అనంతరం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించడానికి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

09:20 - January 3, 2017

చిత్తూరు : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 104వ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ప్రధానికి తిరుపతిలో ఘన స్వాగతం పలకనున్నారు. తిరుపతికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు చేసే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటు సైన్స్‌ కాంగ్రెస్‌లో.. అటు తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేయనున్నారు. ఇస్కా కార్యక్రమానికి తరిలవచ్చే ప్రముఖ నోబెల్‌ బహుమతి గ్రహీతలతోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీకానున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధానమంత్రి పర్యటన దాదాపు ఆరు గంటల పాటు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టిసారించారు.

భారీ భద్రత..
ఎస్వీయూలో నిర్వహించే సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు 9 మంది నోబెల్ గ్రహీతలతో పాటు సుమారు 12 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. 34 ప్లీనరీ సమావేశాల్లో సుమారు 40కు పైగా అంశాలపై ఈ ఐదు రోజుల్లో చర్చించనున్నారు. అగ్ని-5 క్షిపణి నమూనా ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఏడు వేల మంది పోలీసులు ఈ వేడుక భద్రతలో పాలుపంచుకుంటున్నారు.

10.30 గంటలకు...
ప్రధాని మోదీ ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అక్కడ నుంచి ప్రధాని హెలికాప్టర్‌ ద్వారా ఎస్వీ యూనివర్సిటీ మైదానానికి చేరుకుంటారు. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ప్రధాని మోదీ, చంద్రబాబు ప్రారంభిస్తారు. ప్రారంభోపన్యాసం తర్వాత , వివిధ దేశాల నుంచి సమావేశాలకు వచ్చిన నోబెల్ బహుమతి గ్రహీతలను మోదీ సత్కరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతి నుంచి మోదీ,చంద్రబాబు తిరుమలకు పయనం అవుతారు. శ్రీవారిని దర్శించుకొని తిరిగి సాయంత్రం ప్రధాని ఢిల్లీకి బయర్దేరుతారు. రేణిగుంట విమానాశ్రయంలో మోదీకి చంద్రబాబు వీడ్కోలు పలుకుతారు.

09:19 - January 3, 2017

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధం అయ్యారు. ఇవాళ జిల్లాలోని ఇచ్ఛాపురంలో పవన్‌ పర్యటించనున్నారు. స్థానికంగా తీవ్రంగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్య పై అయన స్పందించనున్నారు. 20 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రాంత ప్రజలతో ఇచ్ఛాపురం మణికంఠ థియేటర్‌లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌...!

కిడ్నీ వ్యాధులు..
ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తూ.. వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్న పవన్‌.. ప్రాంతాల వారిగా ప్రజా సమస్యలపై పోరాడాలని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజాసమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన సమస్యలపై పవన్ దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలపై గళం వినిపించేందుకు పవన్ సిద్ధమయ్యారు. 20 ఏళ్లుగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 30 కి పైగా గ్రామాల్లో ప్రజలు కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నీటి కాలుష్యం వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు సంబంధిత నిపుణులు వెల్లడించారు. ఈ కిడ్నీ వ్యాధుల వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇచ్చాపురం..
అనేక ఏళ్లుగా తమ ప్రాంతంలో ఉన్న సమస్య ను అభిమానులు.. పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇచ్ఛాపురం వెళ్లి కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలను సందర్శించేలా పవన్‌ అభిమానులు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్న.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై పవన్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాధితులతో మాట్లాడేందుకు స్థానిక మణికంఠ థియేటర్‌ వద్ద ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అనంతరం రోడ్‌ షో లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు పవన్ రాకపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని రాకతోనైనా తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు పెంచి.. ప్రాంతాల వారిగా ఉన్న ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించిన పవన్‌ కల్యాణ్‌.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

09:18 - January 3, 2017

నల్గొండ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోల్తా పడిన ట్రాక్టర్ వద్ద సహాయక చర్యలు చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు మృతి చెందారు. నాగార్జునసాగర్ దయ్యాల గండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ సహాయక చర్యలు చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీనితో ఇద్దరు పోలీసులతో సహా మరో ఇద్దరు అక్కడికక్కడనే మృతి చెందారు. గాయాలైన పది మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒక కానిస్టేబుల్, ఒక హోం గార్డులున్నారు.విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాష్ రెడ్డి పరిశీలీఇంచారు.

09:16 - January 3, 2017

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో చలి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా పొగమంచు కమ్ముకొంటోంది. దీని కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 200 మీటర్ల వరకు మాత్రమే కనిపిస్తుండడంతో వాహనదారులు, పాదచారులు ఇక్కట్లకు గురవుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 13 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా రెండు విమానాలను అధికారులు రద్దు చేశారు. 77 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విమానాలు..రైళ్లు రద్దు కావడంతో ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు.

 

నేడు నెల్లూరులో జగన్..

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నారు. జగన్‌ పర్యటన కోసం జిల్లా పార్టీనాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

నేడు నెల్లూరులో జగన్..

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నారు. జగన్‌ పర్యటన కోసం జిల్లా పార్టీనాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

నేటి నుండి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్..

తిరుపతి : 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు తిరుపతి వేదిక కానుంది. నేటి నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ప్రధానికి తిరుపతిలో ఘన స్వాగతం పలకనున్నారు. 

నేడు కిడ్నీ బాధితులతో పవన్..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు సిద్ధం అయ్యారు. నేడు జిల్లాలోని ఇచ్ఛాపురంలో పవన్‌ పర్యటించనున్నారు. స్థానికంగా తీవ్రంగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్య పై అయన స్పందించనున్నారు. 20 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆ ప్రాంత ప్రజలతో ఇచ్ఛాపురం మణికంఠ థియేటర్‌లో పవన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ఘోర రోడ్డు ప్రమాదం..

నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్ దయ్యాలగండి వద్ద జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ మరియాదాస్, హోంగార్డు బాలునాయక్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయపడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులపైకి వేగంగా వస్తున్న లారీ దూసుకెళ్లింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Don't Miss