Activities calendar

04 January 2017

22:18 - January 4, 2017
22:15 - January 4, 2017

ఢిల్లీ : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా,పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో, మణిపూర్‌లో రెండు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహిస్తారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధన నేటి నుంచే అమలులోకి రానుంది.
షెడ్యూలు ఖరారు 
ఐదు రాష్ట్రాలకు శాసనసభ గడువు ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గోవా,పంజాబ్‌, మణిపూర్‌ మార్చి 18, ఉత్తరాఖండ్‌ మార్చి 26, యూపీ మే 27తో అసెంబ్లీ గడువు ముగుస్తున్నందున షెడ్యూలు ఖరారు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో 
ఉత్తరప్రదేశ్‌లో 403 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి11, 15, 19, 23, 27...మార్చి 4, 8 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. తొలివిడత 73 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. రెండో విడతలో మొత్తం 67 సీట్లకు ఫిబ్రవరి 15న... ఫేజ్‌ త్రీలో 69 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 19న .... నాలుగో విడతలో 53 సీట్లకు ఫిబ్రవరి 23న.... ఐదో విడతలో 52 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 27న.....ఆరో విడతలో 49 అసెంబ్లీ సీట్లకు మార్చి 4న.... ఏడో విడతలో 40 సీట్లకు మార్చి 8 పోలింగ్‌ జరగనుంది.
గోవా, పంజాబ్‌ ల్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు 
గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు, పంజాబ్‌లో 117 సీట్లకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో జనవరి 11న నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. జనవరి 18 నామినేషన్లకు చివరి తేది కాగా... నామినేషన్ల ఉహసంహరణకు జనవరి 21వ తేదీగా ఈసీ నిర్ణయించింది.
మణిపూర్‌లో రెండు విడతల్లో 
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 38 సీట్లకు గాను మార్చి 4న...రెండో విడతలో 22 సీట్లకు గాను మార్చి 8న పోలింగ్‌ జరగనుంది.
ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 15న ఎన్నికలు  
ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 15న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 20 నోటిఫికేషన్‌ విడుదల కాగా...జనవరి 27న నామినేషన్లకు చివరి తేది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 30గా ఈసీ పేర్కొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మార్చి 11న జరగనుందని ఈసీ ప్రకటించింది. కులం, మతం, జాతి, వర్గం, భాష పేరుతో ఓట్లు అడగరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
లక్షా 85 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు 
మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 16 కోట్లమంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఈసీ తెలిపింది. లక్షా 85 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన వివరాలు కూడా ఈసీ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థుల ఖర్చు పరిమితి 28లక్షలు కాగా... గోవా, మణిపూర్‌లో అభ్యర్థుల ఖర్చు పరిమితి 20లక్షలుగా నిర్ణంయించింది. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోగా వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.

 

22:09 - January 4, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. సర్కార్‌ వైఖరి మారకపోతే లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను ముట్టడించి టీఆర్ ఎస్ సర్కారును గద్దె దించుతామని కాంగ్రెస్‌ హెచ్చరించింది. ఈజిప్టు నియంత హోస్సీ ముబారక్‌కు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాలని కాంగ్రెస్‌ హెచ్చరించింది. మరోవైపు ఈ పథకాన్ని ఉన్నది ఉన్నట్టుగా కొనసాగించడంతోపాటు పాత బకాయిలు కూడా సాధ్యమైంత తర్వగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కైరోలు, నీరోలు అవసరంలేదని స్పష్టం చేశారు. 
పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదన్న విపక్షాలు  
విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ పథకం కొనసాగుతుందని మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రకటనపై జరిగిన చర్చలో వివిధ పక్షాల సభ్యులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని.. ఫలితంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని విపక్షాలు ఆరోపించాయి. 
విద్యార్థులతో హైదరాబాద్‌ను ముట్టడిస్తాం : కాంగ్రెస్‌ 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న అంశంపై బాధ వ్యక్తం చేశారు. చేతిలో డిగ్రీ పట్టా లేకపోవడంతో ఉద్యోగాలకు దూరమవుతున్న విషయాన్ని ప్రస్తావించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ హెచ్చరించింది. ఈజిప్టు నియంత హోన్సీ ముబారక్‌ను  గద్దె దించేందుకు కైరోలో  ఇదే తరహా ఆందోళన చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరారు. 
కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్న బీజేపీ 
ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయపోవడం వలన కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని దీంతో.. చాలా మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ పథకాన్ని కొనసాగిస్తారో.. లేదో... తేల్చి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
బలహీన వర్గాల విద్యార్థులు మద్యలోనే చదువు మానేస్తున్నాన్న సీపీఎం 
ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మద్యలోనే చదువు మానేసే పరిస్థితి వచ్చిందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. 
ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం కొనసాగిస్తాం : సీఎం కేసీఆర్  
ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు సమాధానం ఇచ్చారు. ఈ పథకాన్ని కొనసాగించడంతోపాటు, బకాయిలను కూడా సాధ్యమైనంత తర్వగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 
అసెంబ్లీ హాలులో బైఠాయించి నిరనసన తెలిపిన విపక్షాలు  
ముఖ్యమంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు, వివరణలకు అవకాశం ఇవ్వాలని కోరాయి.  అయితే సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి... అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు. ఉప సభాపతి వైఖరిపై  కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు అసెంబ్లీ హాలులో బైఠాయించి నిరనసన వ్యక్తం చేశారు. 

 

21:59 - January 4, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ మండిపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానం సరిగా లేదని కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి విషయంలో ప్రతిపక్షాలను నిందించడం కేసీఆర్ కు  అలవాటుగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సీఎం సమాధానం  తర్వాత వివరణలు కోరేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకపోడాన్ని తప్పుపట్టారు. దీనిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై అసెంబ్లీ లోపల, బయట పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. 
 

21:56 - January 4, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ అసెంబ్లీలో బైఠాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా తరలించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ అనంతరం సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి స్పష్టమైన వివరణ ఇవ్వకుండానే సభవాయిదా వేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలంటూ కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు సభలోనే బైఠాయించారు. ఆందోళన విరమించాలని శాసనసభ కార్యదర్శి సదారాం సీఎల్పీనేత జానారెడ్డికి విజ్ఞప్తి చేసినా పట్టువీడలేదు. దీంతో స్పీకర్‌ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గాంధీభవన్‌కు, టీడీపీ ఎమ్మెల్యేలను ఎన్టీఆర్‌ భవన్‌కు తరలించారు.

 

21:52 - January 4, 2017

ఓ పక్క నిబురు గ్రహం... ఓ పక్క ఏలియన్స్.. ప్రళయ కాలగిడియలు సమీస్తున్నాయా..? మానవ జాతికి ప్రమాదం పొంచివుందా..? భూమికి అంతిమ గడియలు సమీపిస్తున్నాయా..? 2017.. ఇందుకు ముహూర్తం కాబోతోందా..? హోపీ తెగ ఏం చెబుతోంది..! ఏవీ నిజాలు, ఏవీ పుకార్లు...నాసా ఏమంటోంది...ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ.. చూద్దాం... అన్ని సర్దేసుకోవడమే..ప్యాకప్.. రేపటి గొడవ లేకుండా భూగ్రహం క్షణాల్లో అంతం. మరో గ్రహం వచ్చి ఢీకొట్టి.. అందరినీ సజీవ సమాధి చేస్తుంది. 2017 తో అంతా వినాశనం కాబోతుంది. ఇవన్ని పుకార్లో, గాలి మాటలో కావచ్చు... ఏవైతేనేం.. ఇప్పుడు అమెరికా నుంచి అండమాన్ దాకా... వినిపిస్తున్న విషయమిదే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:46 - January 4, 2017

50 రోజులు దాటి 60ల అడుగులు... ఐనా తీర్తలేవు పబ్లికు అరుపులు, కట్టెల ఫైటింగ్ చేయబోయిన కానిస్టేబుల్.. ఉత్తగా తన్నులువడ్డ టిప్పర్ డ్రైవర్, బాధితులను ఓదార్చుతున్న జగనన్న... అండ్లనేజొర్రిజేబులు ఓదార్చిన దొంగ, పంబా నదిదాక పాదయాత్రజేసిన కుక్కపల్లి.. యజమానితో నడిచిన భక్త శునకం, శబరిమలైకి పయనమైతున్న భక్తులు.. మంచిగ పొయిరావాలని మా సూక్తులు.. అయ్యప్పస్వాములకు దండలేసిన ముస్లీంలు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూడండి. 

 

21:38 - January 4, 2017

ఢిల్లీ : క్రికెట్ అభిమానులకు టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని షాక్ ఇచ్చారు. వన్డే, టీ.20 కెప్టెన్సీ నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకున్నారు. ఈమేరకు ధోనీ బీసీసీఐకి సమాధానం ఇచ్చారు. ఇంగ్లండ్ తో వన్డే, టీ.20 సీరీస్ లలో అడనున్నారు. 199 వన్డేలకు ధోనీ కెప్టెన్సీ వహించారు. 72 టీ.20 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించారు. ధోని సారధ్యంలో భారత్ వన్డే, టీ.20 వరల్డ్ కప్ సాధించింది. 

వన్డే, టీ.20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ...

ఢిల్లీ : వన్డే, టీ.20 కెప్టెన్సీ నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకున్నాడు. ఈమేరకు ధోనీ బీసీసీఐకి సమాధానం ఇచ్చారు. 

21:27 - January 4, 2017

ఐదు రాష్ట్రాల ఎన్నికలసై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీకాంగ్రెస్ నేత బెల్లయ్యనాయక్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. 'ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఎన్నిక‌ల సంఘం ప్రకటించింది. సీఈసీ న‌జీం అహ్మద్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు'. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం...

 

 

21:20 - January 4, 2017

విజయనగరం : వందేళ్లకు పైగా చరిత్ర.. వేలాది ఎకరాలకు సాగు నీరు అందించిన ఘనత.. రెండు రాష్ట్రాలను కలిపే బ్యారేజీ.. అలాంటి బ్యారేజీ ఇప్పుడు కనుమరుగువుతోంది..!బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి కూల్చివేతకు అధికారులు, ప్రభుత్వం పాటుపడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 
కనుమరుగవుతున్న తోటపల్లి బ్యారేజీ 
విజయనగరం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్యారేజీ నాగావళి నదిపై ఉన్న తోటపల్లి బ్యారేజీ.. ఒక్క విజయనగంలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే ఎంతో పేరు ప్రతిష్టలున్న బ్యారేజీ ఇప్పుడు కనుమరుగువుతోంది. పార్వతీపురానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యారేజీని అప్పటి బ్రిటీష్ వారు నిర్మించారు.. దీని ద్వారా పార్వతీపురం డివిజన్‌లోని 64వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణంతో పార్వతీపురం ప్రాంతమంతా సస్యశామలమైంది. ప్రతి ఏడాది రైతులు రెండు పంటలను పండించేవారు.. ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఈ బ్రిడ్జే దిక్కు.. అలాంటి బ్రిడ్జి ఇప్పుడు ఇప్పుడు చరిత్ర పుట్టల్లో కలిసిపోనుంది.
నాగావళి నదిపై మరో కొత్త బ్యారేజీ  
నాగావళి నదిపై మరో కొత్త బ్యారేజీ నిర్మించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం 2003లో నిర్ణయించింది. బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది. దాదాపు పదేళ్లకు పైగా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇటీవలే ఈ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 
పాత బ్రిడ్జిని కూల్చివేతకు అధికారులు సిద్ధం 
ఇంతవరకు బాగానే ఉన్న కొత్త బ్యారేజీ ఎంతో చారిత్రత్మక నేపథ్యం ఉన్న పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి అధికారులు సిద్ధపడ్డారు. దీనిపై అక్కడి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరి తోటపల్లి బ్యారేజీపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.. 

 

21:19 - January 4, 2017

విజయవాడ : ఒకప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే జనం జంకేవారు.. ఎందుకంటే అక్కడికి వెళితే కనీస సాకర్యాలు కూడా ఉండవు అని.. కానీ ఇప్పుడు అవే పోలీస్ స్టేషన్లు కార్పొరేట్ స్థాయిలో జనాలకు వెలకమ్ పలుకుతున్నాయి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. ఏంటీ నమ్మడం లేదా అయితే వాచ్ దిస్ స్టోరీ...
ఆధునాతన సౌకర్యాలు 
బెజవాడ ఆ పేరులో ఒక వైబ్‌రేషన్ ఉంది. ఒక పవర్ ఉంది. అలాంటి బెజవాడ ఇప్పుడు పోలీస్ పవర్ ఏంటో.. పోలీస్ మర్యాదలు ఏంటో చూపిస్తోంది..  విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాలను నూతన హంగులతో పోలీస్ ఉన్నతాధికారులు ఆధునీకరించారు. గత నెలరోజులుగా ఆధునికీకరణ పనులు చేపట్టిన సిబ్బంది పోలీస్ స్టేషన్లు సరికొత్తగా ఉండేలా తీర్చిదిద్దారు. ఒక్కో పీఎస్ కు రెండున్నర లక్షలు కేటాయించి ఆధునాతన సౌకర్యాలను పోలీసు బాస్‌లు ఏర్పాటు చేశారు. 
పెద్ద రిసెప్షన్ సెంటర్
గతంలో పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనీసం ప్రజలకు కూర్చుకునేందుకు కుర్చీలు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు  ప్రతి పోలీస్ స్టేషన్లో స్టార్ హోటల్స్ లో ఉండే విధంగా పెద్ద రిసెప్షన్ సెంటర్ తోపాటు సుమారు 10 మంది కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చే వృద్ధులు, నిరక్ష్యరాసులకు సహాయపడేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. 
ప్రజలు హర్షం 
పోలీస్ స్టేషన్ లో జరిగిన మార్పులను చూసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా మారిన తర్వాత బెజవాడలో అన్ని రంగాల్లో వినూత్న మార్పులు జరుగుతున్నట్లే పోలీస్ స్టేషన్లలోనూ హైటెక్ రూపురేఖలు సంతరించుకోవడం హర్షదాయకమని పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మొత్తమ్మీద పోలీస్ బాస్‌లు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని.. ఇలాగే రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంటే ప్రజలకు పోలీసులకు మధ్య  ఉన్న ఆగాంతం తగ్గు మోహం పట్టిందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 

 

21:13 - January 4, 2017

విజయవాడ : కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై మంత్రి దేవినేని ఉమా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ దగ్గర మహిళా కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు. దేవినేని ఉమా దిష్టిబొమ్మకు శిరోముండనం నిర్వహించారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే మహిళలే ఆయనకు సమాధానం చెప్తారని హెచ్చరించారు. తక్షణమే బేషరతుగా కేవీపీకి  దేవినేని క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ  డిమాండ్‌ చేశారు.

 

20:56 - January 4, 2017

అనంతపురం : రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో  పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలని వివిధ రంగాలపై శ్రద్ధపెట్టినట్లు తెలిపారు.  అనంతపురం జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. రాబోయే 3, 4 నెలల్లో మడకశిర వరకు నీళ్లు తీసుకెళ్తాం. బీపీటీ చెరువుకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. 

20:54 - January 4, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో పురుషోత్త ప‌ట్నం ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి గురవారం శ్రీకారం చుట్టబోతున్నారు. గోదావ‌రి, ఏలేరు న‌దుల అనుసంధానంలో భాగంగా ఈ లిప్ట్ నిర్మించ‌బోతున్నట్లు ప్రభత్వుం చెబుతోంది. ఈ సంద‌ర్భంగా భారీ బ‌హిరంగ‌స‌భ‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ 10టివితో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు చాలా తెలివైన నాయకుడని, ఒక్క పైసా కూడా వృథా పోకుండా ప్రాజెక్టులు కడుతున్నారని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ అన్నారు. పట్టిసీమ వద్దంటే జగన్‌ ఇక్కడికి వచ్చి మాట్లాడాలని వర్మ సవాల్‌ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కరెక్ట్‌ కాదన్నారు. 
 

20:53 - January 4, 2017

విజయవాడ : అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన కేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ-1 నిందితుడు నిమ్మకూరు సాయిరామ్‌కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరిచింది. మిగిలిన నిందితుల్లో దీపక్‌, అభిలాష్‌, మున్నాలకు 20 ఏళ్ల శిక్ష , మరో నిందితుడు దుర్గాప్రసాద్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమాన విధించారు. మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశించింది. మొత్తం 9 మంది బాధితుల్లో ఐదుగురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల నిరాహార దీక్ష భగ్నం

హైదరాబాద్ : ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇందిరా పార్కు వద్ద ఓలా క్యాబ్ డ్రైవర్లు నిరాహార దీక్ష చేపట్టారు. 

రవాణా శాఖ మంత్రి ఇల్లును ముట్టడిస్తాం : సలావుద్ధీన్

హైదరాబాద్ : రేపటిలోగా ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే రవాణా శాఖ మంత్రి ఇల్లును ముట్టడిస్తామని తెలంగాణ క్యాబ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్ధీన్ హెచ్చరించారు. ఆర్ టీఐ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ఓలా, ఉమర్ యాజమాన్యాలు స్పందించాలన్నారు. 

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం..

హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పురాలో దారుణం జరిగింది. 9 వ తరగతి విద్యార్థినిని కారులో అపహరించి.. రమేష్, శ్రీకాంత్ అనే యువకులు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు యువకులకు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. 

20:29 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేసిన ప్రదీప్‌చంద్ర అందరిలో తనదైన ముద్ర వేసుకున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎస్‌గా పదవి విరమణ పొందిన ప్రదీప్‌చంద్రకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రదీప్‌చంద్ర రెండేళ్లలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని.. కేటీఆర్‌ అన్నారు. పదవి విరమణ తర్వాత కూడా ఆయన సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కేటీఆర్‌ కోరుకున్నారు.

20:27 - January 4, 2017

హైదరాబాద్ : క్యాబ్ డ్రైవర్లు తమ ఆందోళన ఉధృతం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్క్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమను మోసం చేసిన ఉబర్, ఓలా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.. అలాగే కొత్త వాహనాకలు పర్మిషన్లు.. పర్మిట్లు ఇవ్వకూడదని.. షేరింగ్‌ అండ్‌ ఫూలింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పని గంటల సమయాన్ని రద్దు చేయాలని.. డ్రైవర్లకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, ఇన్య్సూరెన్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

20:26 - January 4, 2017

హైదరాబాద్ : నల్లధనాన్ని వెలికి తీయడంలో ప్రధాని మోడీ విఫలం అయ్యారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నోట్లరద్దుపై మోడీ తీరును నిరసిస్తూ హిసాబ్‌ దో.. జవాబ్‌ దో అంటూ హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. నోట్లరద్దుతో నల్లధనాన్ని అరికడతామని ప్రకటించిన మోడీ... దాన్ని నల్లకుబేరుల నుంచి రాబట్టడంలో విఫలం అయ్యారన్నారు. నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. చేసిన తప్పులపై మోడీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సురవరం డిమాండ్‌ చేశారు. 

20:21 - January 4, 2017

జనగామ : జిల్లాలో సీపీఎం మహాజనపాదయాత్ర కొనసాగుతోంది.. చిన్న పెండ్యాల, ఘన్‌పూర్‌, శివునిపల్లి, విప్పగూడెంలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. 80 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సీపీఎం బృందానికి స్థానికులు బోనాలు, బతుకమ్మలు, కోలాటం, డప్పులతో స్వాగతం పలికారు. యాత్ర చేస్తోంది సీపీఎం నాయకులే, నడుస్తున్నదీ సీపీఎం నాయకులే అయినా.. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల వారి సమస్యలపైనే ఈ పాదయాత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం పార్టీకి ఓటేయమని అడగటానికి తాము రాలేదని, సమస్యలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకే తాము వచ్చామని ఈ సందర్భంగా తమ్మినేని స్పష్టం చేశారు. 

 

20:18 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 13 యూనివర్సిటీలలో ఒక్క తెలంగాణ యూనివర్సిటీకి తప్ప మిగతా ఏ యూనివర్శటీకి న్యాక్ గుర్తింపు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. న్యాక్ గుర్తింపు లేకపోవడంతో యూనివర్సిటీలకు రావాల్సిన నిధులు రావటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో యూనివర్శిటీలలో మౌళిక వసతులు కొరత ఏర్పడిందని సంపత్ పేర్కొన్నారు.  ఈవిషయంపై అసెంబ్లీలో ప్రశ్నను లేవనెత్తితో వాయిదా వేసి చర్చకు రానీయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంపత్ కుమార్ మండిపడ్డారు.  

 

20:15 - January 4, 2017

హైదరాబాద్ : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే లక్షలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..వెంటనే సమస్యను పరిష్కరించాలని వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

 

20:13 - January 4, 2017

హైదరాబాద్ : ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్‌లను ఎందుకు చెల్లించడంలేదని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే పేద విద్యార్థులను విద్యను దూరం చేయడమా అని ఆయన ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.  

 

20:08 - January 4, 2017

బెంగళూరు : బెంగళూరు కీచకకాండపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. డిసెంబర్ 31రోజు ఘోరం మరవకముందే.. అదేరోజు రాత్రి జరిగిన మరో కీచకపర్వం వెలుగుచూసింది. నడిరోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై కామాంధుల అసభ్యప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. 
మరో కీచకపర్వం
తప్పతాగారు.. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ అంటూ రోడ్డుపై హంగామా చేశారు.. అంతటితో ఊరుకోకుండా యువతి వెంటపడ్డారు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వేధించారు.. అసభ్యంగా ప్రవర్తించి అవమానించారు.. భారత ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేకువజామున చోటుచేసుకున్న మరో కీచకపర్వం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. డిసెంబర్ 31 అర్థరాత్రి.. యువతులపై కుర్రాళ్ల లైంగిక వేధింపులపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే... జనవరి ఒకటిన తెల్లవారుజామున మరో ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కమ్మనహళ్లి ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెంబడించారు. తరువాత అందులో ఒకడు నేరుగా అమ్మాయి దగ్గరకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం.. అమ్మాయి ప్రతిఘటన తదితర దృశ్యాలన్నీ.... ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 
కామాంధుల బరితెగింపు 
బెంగళూరులో డిసెంబర్‌ 31 అర్ధరాత్రి కామాంధుల బరితెగింపు శృతిమించిపోయింది.. అందరూ చూస్తుండగానే మహిళల బట్టలు చించేశారు.. మరికొందరిపై దాడిచేశారు.. వీరి ఆగడాలు భరించలేక తమను రక్షించాలంటూ మహిళలు పరుగులుతీశారు.. చుట్టూ వందలాదిమంది పోలీసులున్నా మహిళలను రక్షించేవారే కరువయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 
మహిళలకు భద్రత కరువు 
బెంగళూరులో మహిళలకు భద్రత లేదని ఈ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది. ఇదే సమయంలో.. ఈ ఘటనపై నేతల మాటలు మరోలా ఉన్నాయి. యువతుల అర్ధనగ్న దుస్తులే ఈ అరాచకానికి కారణమంటూ నేతలు చేసిన వ్యాఖ్యలు మరింత మంటపుట్టిస్తున్నాయి.. బెల్లం ఉన్నచోటే ఈగలు ముసురుకుంటాయంటూ ఎస్‌పీ మహారాష్ట్ర కమిటీ చీఫ్‌ అబూ అజ్మీ వివాదాస్పదమయ్యాయి.. జరిగిన ఘటనను ఖండించాల్సిపోయింది అబ్బాయిల్ని, అమ్మాయిల్నీ కలిసి తిరగనీయొద్దంటూ ఈ లీడర్‌ ఉచిత సలహా కూడా ఇచ్చారు.... ఈ పోకిరీపర్వంపై సీరియస్‌గా స్పందించాల్సిన కర్ణాటక హోం మంత్రీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో ఇలాంటివి కామనే అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఇంతటి దురాగతానికి పాల్పడ్డ పోకిరీలను శిక్షించాలంటూ చెప్పాల్సిందిపోయి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన ఈ ఇద్దరు నేతలపై జాతీయ మహిళాకమిషన్‌కూడా ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చింది.. ఇద్దరికీ సమన్లు జారీ చేసింది. 

 

గుండె పోటుతో క్యాబ్ డ్రైవర్ మృతి

హైదరాబాద్ : పీర్జాదీగూడంలో విషాదం నెలకొంది. గుండె పోటుతో క్యాబ్ డ్రైవర్ మృతి చెందారు. ఫైనాన్సర్ వేధింపులే మృతికి కారణమని తెలుస్తోంది. 
 

అసెంబ్లీలో బైఠాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల తరలింపు

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో బైఠాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులు తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాంధీభవన్ కు తరలించారు. టీడీపీ సభ్యులను ఎన్ టీఆర్ భవన్ కు తరలించారు. బోధన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ గేటు వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆందోళన

హైదరాబాద్ : అసెంబ్లీ గేటు వద్ద తెలంగాణ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై ఉద్యమకారులు నిరసన తెలిపారు. 

 

19:22 - January 4, 2017

హైదరాబాద్ : విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలను సాధ్యమైనంత తర్వగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ఉన్నది ఉన్నట్టుగా కొనసాగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈవిషయంలో విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు క్షోభపడాల్సిన పనిలేదుని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండా అమలు చేస్తుందన్నారు. బకాయిలు కూడా విడతల వారీగా విడుదల చేస్తున్నామని..ఇప్పటివరకు 4,400 కోట్ల చిల్లర నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు.

 

19:19 - January 4, 2017

హైదరాబాద్ : కేజీ టు పీజీ ఉచిత విద్య అమలయ్యేవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయాలని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడంతో రాష్ట్రంలో అనేక కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయని అన్నారు. 

18:55 - January 4, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఏకపక్షంగా మాట్లాడి ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేయడం సరికాదన్నారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడిని ఈ అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరికాదని లక్ష్మణ్ ఫైరయ్యారు. రేపటి సమావేశంలో తప్పకుండా ఫీజు రీయింబర్స్ మెంట్‌ పైనే చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. 

18:53 - January 4, 2017

అనంతపురం : మత సామరస్యాన్ని కాపాడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లాలోని బుక్కపట్నంలో ఆయన మాట్లాడారు. ఆనందంగా ఉండాలంటే ఫిజికల్ లిట్రసీ చాలా ముఖ్యమన్నారు. భజనలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. పుట్టపర్తి సాయిబాబా మీద భక్తితో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారని పేర్కొన్నారు. పుట్టపర్తి సాయిబాబా మాట ఒక వేదమన్నారు. అనందంగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. దోమల వల్ల మలేరియా రోగాలు వస్తాయని చెప్పారు. పూర్వికుల నుంచి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఒకే సమస్యను ఒక్కొకక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారని పేర్కొన్నారు. సమస్యను పరిష్కారం దిశగా ఆలోచన చేస్తే.. కష్టతరం కాదని తెలిపారు. ఇతరులపై చూపే కోపం మనకు శాపంగా మారుతుందన్నారు. తిండి.. శరీరానికి ముఖ్యం, అనందం మనసుకు ముఖ్యమన్నారు. ఆరోగ్యం, ఆనందంగా ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పారు. అందుకే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్టమస్ కానుక ఇచ్చానని తెలిపారు. పేద వారు పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. అనునిత్యం ఆనందంగా ఉండి పనులు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

హన్మకొండలో విషాదం

వరంగల్ అర్బన్ : హన్మకొండలో విషాదం నెలకొంది. కాకతీయ కెనాల్ లో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం అయింది. మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు.

అసెంబ్లీ ముందు టీఎన్ ఎస్ఎఫ్ ఆందోళన..

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విపక్షాలు పట్టుపట్టాయి. అసెంబ్లీ రేపటికి వాయిదాపడ్డా సభ లోపలే కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు సర్కార్‌ వివరణ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది. సభలోనే ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఎమ్మెల్యేలకు మద్దతుగా అసెంబ్లీ ముందు టీఎన్ ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

 

17:32 - January 4, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విపక్షాలు పట్టుపట్టాయి. అసెంబ్లీ రేపటికి వాయిదాపడ్డా సభ లోపలే కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు సర్కార్‌ వివరణ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. సభలోనే ఎమ్మెల్యేలు బైఠాయించారు. అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది. ఆహారం తీసుకోకుండా రాత్రి సభలోనే ఉండాలని విపక్ష ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఎమ్మెల్యేలకు మద్దతుగా అసెంబ్లీ ముందు టీఎన్ ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అసెంబ్లీలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విపక్షాలు పట్టుపట్టాయి. అసెంబ్లీ రేపటికి వాయిదాపడ్డా సభ లోపలే కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు సర్కార్‌ వివరణ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన కొనసాగుతోంది. 

17:10 - January 4, 2017
17:06 - January 4, 2017

లక్నో : అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ తేదీలను ఖరారు చేసింది. 403 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని ప్రధాన ఎన్నికల అధికారి నసీం జైదీ తెలిపారు. తొలివిడత 73 సీట్లకు ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. రెండో విడతలో మొత్తం 67 సీట్లకు ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఫేజ్‌ త్రీలో 69 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 19న ఎన్నిక జరగనుంది. నాలుగో విడతలో 53 సీట్లకు ఫిబ్రవరి 23న ఎన్నిక జరగనుంది. ఐదో విడతలో 52 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆరోవిడతలో 49 అసెంబ్లీ సీట్లకు మార్చి 4న పోలింగ్‌ జరగనుంది. చివరగా ఏడో విడతలో 40 సీట్లకు మార్చి 8 ఎన్నిక జరగనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మార్చి 11న జరగనుందని ఈసీ ప్రకటించింది.

 

17:00 - January 4, 2017

ఢిల్లీ : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ తేదీలను ఖరారు చేసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 38 సీట్లకు గాను మార్చి 4న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరితేది ఫిబ్రవరి 15. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 18. మణిపూర్‌లో రెండో విడతలో 22 సీట్లకు గాను మార్చి 8న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి11న నోటిఫికేషన్‌ విడుదల కాగా నామినేషన్ల చివరి తేది ఫిబ్రవరి 18. ఫిబ్రవరి 22న నామినేషన్ల ఉపసంహరణ. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 20 నోటిఫికేషన్‌ విడుదల కాగా...జనవరి 27న నామినేషన్లకు చివరి తేది.  నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 30గా ఈసీ నిర్ణయించింది.

 

16:59 - January 4, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. గోవాలో 40 అసెంబ్లీ సీట్లుండగా...పంజాబ్‌లో 117 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జనవరి 11న నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. జనవరి 18 నామినేషన్లకు చివరి తేది కాగా... నామినేషన్ల ఉహసంహరణకు జనవరి 21వ తేదీగా ఈసీ నిర్ణయించింది.

 

16:55 - January 4, 2017

హైదరాబాద్ : రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది. ఈ రోడ్ల కోసం భూ సేకరణ ప్రక్రియ కూడా వేగవంతమైంది. భూసేకరణా, సమీకరణా అన్న అన్నది తేల్చుకొని ముందుకు సాగాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.. 
రాయలసీమ జిల్లాలు రాజధానికి అనుసంధానం 
ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి తేలిగ్గా రాకపోకలు సాగించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది.... ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తోంది.. విజయవాడ నుంచి అమరావతికి, అక్కడి నుంచి వివిధ జాతీయ రహదారుల్ని జిల్లాలకు అనుసంధానం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.. ముందుగా రాయలసీమ నాలుగు జిల్లాలను రాజధానికి కలిపాలని చూస్తోంది.. అనంతపురం నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్‌ హైవేను త్వరగా పూర్తిచేయాలని చూస్తోంది.. ఈ ప్రాజెక్ట్ కు 29వేల 557 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. 
621 కి.మీ. పొడవునా రోడ్ల నిర్మాణం
ఆరు వరుసలుగా నిర్మించే ఈ ఎక్స్ ప్రెస్ వే అనంతపురం నుంచి ప్రారంభమై అమరావతి వరకు వస్తుంది. కడప, కర్నూలు మీదుగా నిర్మించిన రోడ్లు ఎక్స్ ప్రెస్ వేలో కలిసేలా ప్లాన్ రూపొందించారు. ఈ రహదారులన్నీ కలిసి దాదాపు 621 కిలోమీటర్ల పొడవున ఉంటాయి... ఈ రోడ్ల నిర్మాణంకోసం దాదాపు 8వేల 692 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది.  అనంతపురం జిల్లాలో 1017 హెక్టార్లు, కర్నూలులో 1713 హెక్టార్లు, కడపలో 1108 హెక్టార్లు, ప్రకాశంలో 3239 హెక్టార్లు, గుంటూరులో 1614 హెక్టార్ల భూమి కావాల్సి ఉంటుంది. ఇవికాక 1603 హెక్టార్ల అటవీభూమి డీనోటిఫై చేయాలి. డీనోటిఫై చేసిన ఈ అటవీ భూమిని ఎక్స్ ప్రెస్ వేకు అప్పగించే ప్రక్రియకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.. 
భూ సమీకరణ కోసం కమిటీ ఏర్పాటు 
ఈ రోడ్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించిన అధికారులు భూసేకరణ దిశగా అడుగులు వేస్తున్నారు.. 2016 డిసెంబర్‌ 19న భూసమీకరణ కోసం సీఎం చంద్రబాబు చైర్మన్‌గా కమిటీ కూడా ఏర్పాటైంది.. రెవెన్యూ, ఆర్థిక, అటవీ, రవాణా శాఖమంత్రులు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. 
భూమి ధర తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూసమీకరణ
ఎక్స్‌ప్రెస్‌ వే కోసం భూమిని సేకరించేందుకు రాజధాని నిర్మాణానికి అనుసరించిన పద్దతినే పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది..... భూమిధర తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూసమీకరణ అయినా ఫరవాలేదని సర్కారు భావిస్తోంది.. ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో భూముల రేట్లు కనిష్టంగా ఉన్నాయి. ఇక్కడ భూసమీకరణ చేసే అవకాశముంది. ఇక గుంటూరు జిల్లాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి.. ఇక్కడ భూసమీకరణ ద్వారా భూమి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.. 
ఐదు జిల్లాల్లో ప్రత్యేక భూసేకరణ యూనిట్లు
రహదారుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ప్రస్తావించారు.. భూమిని సమీకరిస్తారా..? సేకరిస్తారా..? అనేది త్వరగా తేల్చుకొని ముందుకెళ్లాలని ఐదు జిల్లాల కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. ఐదు జిల్లాల్లో ప్రత్యేక భూసేకరణ యూనిట్లను వేగంగా ఏర్పాటు చేయాలని కూడా బాబు సూచించారు. అనుకున్న సమయానికి ఈ రోడ్లను పూర్తిచేసి ప్రజలు రాజధానికి తక్కువ సమయంలో సులువుగా చేరుకునేందుకు అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు.

 

16:41 - January 4, 2017

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దై 50 రోజులు దాటిపోయినా ఇంకా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐలకు కూడా  నోట్లరద్దు సెగ తగిలింది.  పాతనోట్లు డిపాజిట్‌ చేసి, కొత్త నోట్లు తీసుకోవాలని ఆర్బీఐ కేంద్రాలకు వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది.  ఆర్బీఐ  చెన్నై, ముంబై, ఢిల్లీ వెళ్లి మార్చుకోవాలని చెతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి....

 

16:28 - January 4, 2017

విజయవాడ : టీడీపీ నాయకులు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. స్థలాలే కాకుండా.. సొసైటీలను కూడా కబ్జా చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి పి.గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రి స్విస్‌ ఛాలెంజ్‌ అంటూ నిరుపేద రైతుల భూములను కొల్లగొట్టేస్తుంటే.. ఆయన కొడుకు బుక్‌ఫెస్టివల్‌ వంటి కార్యక్రమాలకు హైజాక్‌ చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని టీడీపీ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మాజీ సీఎస్ కు వీడ్కోలు సభ..

హైదరాబాద్ : మాజీ సీఎస్ ప్రదీప్ చంద్రకు వీడ్కోలు సభ జరిగింది. సీఎస్ ఎస్పీ సింగ్, డిప్యూటి సీఎం కడియం, హోం మంత్రి నాయినీ, మంత్రులు కేటీఆర్, పోచారం, డీజీపీ రాజీవ్ శర్మ, గద్దర్ లు హాజరయ్యారు.

 

ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..

ఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఉమ్మడి నియంత్రణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. జనవరి 16న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

 

ఇంకా అసెంబ్లీ లోపలే విపక్ష సభ్యులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోనే విపక్ష సభ్యులు ఉన్నారు. సభ వాయిదా పడినా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులు బైఠాయించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ వివరణ ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15:45 - January 4, 2017

అనంతపురం : జిల్లాలోని బుక్కపట్నంలో సీఎం చంద్రబాబు టూర్‌లో కలకలం చెలరేగింది. పుట్టపర్తి... బుక్కపట్నం మార్గంలో కాలం చెల్లిన 200 జిలెటిన్‌ స్టిక్స్‌ బయటపడ్డాయి. కొత్త చెరువు వంతెనకు 50 కి.మీ దూరంలో కాలం చెల్లిన జిలెటిన్‌ స్టిక్స్‌ గుర్తించారు. వీటిని డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది గుర్తించారు. అయితే ఈ జిలెటిన్‌ స్టిక్స్‌ హంద్రినీవా కాల్వ కోసం ఉపయోగించి పాడేసినట్టుగా భావిస్తున్నారు.

 

15:43 - January 4, 2017

ఆరోగ్యం..ఉదయం లేచినప్పటి నుండి ఉరుకుల పరుగులతో జీవనం సాగిపోతుంటుంది. వ్యాయామం..సరియైన ఆహారం తీసుకోకపోవడంతో పలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. కానీ ప్రతి రోజు కొన్ని చిట్కాలు పాటిస్తే అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు...

  • ప్రతి రోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం అవశేషాలు నోట్లో మిగలకుండా ఉంటాయి. అంతేగాకుండా మంచినీటితో పుక్కిలించాలి.
  • ఒక గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, కొద్దిగా మిరియాలు వేసి మరిగించాలి. ఈనీటిని ఉదయాన్నే తాగాలి.
  • ఉదయం..సాయంత్రం వేళల్లో పూట కొద్దిసేపు తప్పనిసరిగా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ అదుపులోకి వస్తుంది.
  • ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి.
  • నిత్యం గోధుమ జావా తీసుకోవాలి. ఈ జావా తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.
  • ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీనిని తీసుకుంటే రక్తప్రసరణ మెరవడమే కాకుండా రక్త వృద్ధి జరుగుతుంది. అంతేగాకుండా చర్మానికి మెరుపు వస్తుంది.
  • రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిమంతమవుతుంది.
  • ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు.
  • రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్ని మింగడం వల్ల శరీరానికి మంచిది.
15:42 - January 4, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విపక్షాలు పట్టుపట్టాయి. అసెంబ్లీ రేపటికి వాయిదాపడ్డా సభ లోపలే కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు సర్కార్‌ వివరణ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. సభలోనే ఎమ్మెల్యేలు బైఠాయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:23 - January 4, 2017

హైదరాబాద్ : గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్  ప్రభుత్వ హయాంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ నమోదయ్యాయని టీడీపీ శాసనసభ పక్షనేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ సెకండ్‌ ప్లేస్‌లో ఉందని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఇప్పటికైనా కేసీఆర్ పరామర్శించాలని...ఒక్కో కుటుంబానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. 

 

15:21 - January 4, 2017

హైదరాబాద్ : ఓవైపు వ్యవసాయం కోసం చేస్తున్న అప్పులు.. మరోవైపు నష్టాలు మిగిలిస్తున్న పంటలు రైతులకు శాపంగా మారాయి. రుణమే రైతుల పాలిట మరణ పాశంగా మరింది. జాతీయ నేర గణాంకాల మండలి తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలే వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 2015 లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల జాబితాలో మహారాష్ట్ర దేశంలోనే తొలిస్థానంలో ఉండగా... తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 
మారని రైతుల బతుకులు 
కాలం మారుతున్నా రైతుల బతుకులు మారడం లేదు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తామన్న నేతల మాటలు... అన్నదాతల్లో భరోసా నింపడం లేదు. ఫలితంగా మరణమే రైతన్నలకు శరణ్యమవుతోంది. వ్యవసాయ సాగుకోసం రైతులు చేసిన రుణాలు వారి పాలిట మరణపాశంగా మారుతున్నాయి. జాతీయ నేర గణాంకాల మండలి తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అంశాలనే వెల్లడించింది. 
రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో తెలంగాణ
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర తరువాత అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రెండోస్థానంలో ఉంది. 2015లో మహారాష్ట్రలోని  3వేల 30 మంది, తెలంగాణలో 13వందల 58 మంది, కర్ణాటకలో 11వందల 97 మంది,ఆంధ్రప్రదేశ్‌లో 516 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రాల్లోనే మొత్తం 94 శాతం ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలున్న దక్షిణభారతంలో రైతుల ఆత్మహత్యలు భారీగా ఉండగా...బీహార్, జార్ఖండ్, మిజోరాం, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌లలో అసలు ఆత్మహత్యలే లేకపోవడం విశేషం.
రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం బ్యాంకు రుణాలే
రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం బ్యాంకు రుణాలే అని నివేదిక తేల్చింది. బ్యాంకుల అప్పులు లేదా ఇతర అప్పులు 38 శాతం ఉండగా.. వ్యవసాయపరమైన కారణాలు 19 శాతం, కుటుంబ కారణాలు 11 శాతమైతే, అనారోగ్యం కారణాలు 10 శాతం వరకు ఉన్నాయి. మద్యం లేదా మాదక ద్రవ్యాల అలవాటుతో  4 శాతం  మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అప్పుల ఊబితో రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో కర్ణాటక 79 శాతం, తెలంగాణ 46 శాతంతో మొదటి  రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో 30 నుంచి 60 ఏళ్లలోపు రైతులే 71 శాతం ఉన్నారు. 

 

15:14 - January 4, 2017

గుంటూరు : రాజధాని మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అమరావతిలోని అబ్బరాజు పాలెంలో 9.75 సెంట్లు, బోరుపాలెంలో 33.58 సెంట్లు, ఐనవోలులో 13.25 సెంట్లు, కృష్ణాయపాలెంలో 25.28సెంట్లు సేకరించనున్నారు. మొత్తం 6.84 చదరపు కిలోమీటర్ల సీడ్‌ క్యాపిటల్‌కు సీఆర్‌డీఏ మాస్టర్‌ డవలపర్‌ను ఎంపిక చేయనుంది. టెండర్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 21వ వరకు గడువు ఇచ్చింది. బిడ్డింగ్‌ ప్రక్రియలో రెండు స్టేజీలను సీఆర్‌డీఏ ఎంపిక చేసింది. మొదటి దశలో అర్హతలను నిర్ధారించనుంది. పోటీ సంస్థల అర్హత నిర్ధారించాకే అసలైన బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వనుంది. అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఒరిజినల్‌ ప్రాజెక్టు వివరాలను సీఆర్‌డీఏ అందిస్తుంది. 

 

15:12 - January 4, 2017

~!వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాలతో బయోపిక్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బయోపిక్ లు అధికంగా తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాలు సంచలన విజయాలు నమోదవుతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత 'జయలలిత' జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోంది. ప్రముఖ దర్శకులు 'జయ' బయోపిక్ ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంచలన దర్శకుడు 'రాంగోపాల్ వ‌ర్మ' 'అమ్మ' నెచ్చెలి 'శ‌శిక‌ళ' పేరిట సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'అమ్మ' రోల్ ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుంద‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో 'దాసరి నారాయణ రావు' రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై సోషల్ మాధ్యమాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ 'అమ్మ' పేరిట రిజిష్టర్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో 'జయ' పాత్రకు ఎవరిని సెలక్ట్ చేసుకుంటారనే దానిపై అప్పుడే కథనాలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ మధ్య సోషల్ మాధ్యమాల్లో 'జయ' వేషధారణలో 'రమ్యకృష్ణ' ఫొటోలు హల్ చల్ చేశాయి. ‘బాహుబలి' సినిమాలో 'శివగామి'గా అలరించిన 'రమ్య కృష్ణ'ను 'అమ్మ' మాదిరిగా ఫొటోషాప్‌ చేసి రూపొందించిన పోస్టర్‌ వైరల్‌గా మారిపోయింది. ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

14:59 - January 4, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్' సరసన నటించాలని పలువురు హీరోయిన్లు ఆశ పడుతుంటారు. వీరిలో కొద్దిమంది మాత్రమే అవకాశం దక్కుతుంది. ఆయన నటించిన సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లు సైతం రాబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 'టైగర్ జిందా హై, ‘ట్యూబ్ లైట్' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న 'ట్యూబ్ లైట్' చిత్రంలో ఓ కీలక పాత్రలో 'ఇషా తల్వార్' ఎంపికైందంట. అనుకోకుండా ఈ చాన్స్ 'ఇషా తల్వార్' కి రెండో మూవీతోనే రావడం గమనార్హం. తొలి చిత్రం అక్షత్ వర్మ తెరకెక్కించిన చిత్రంలో 'సైఫ్ అలీఖాన్' సరసన నటించింది. తనకి ఎప్పటి నుండో 'సల్మాన్' తో కలిసి పని చేయాలని ఉందని 'ఇషా' పేర్కొందంట. తాను అభిమానించే 'కబీర్ ఖాన్', ‘సల్మాన్' లతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడంతో 'ఇషా' ఆనందం వ్యక్తం చేస్తోంది. 'ట్యూబ్ లైట్' చిత్రంలో 'జూజూ' కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

14:59 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఏనాడూ చెప్పలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంగా 3లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలను రిక్రూట్‌మెంట్ల ద్వారా భర్తీచేస్తాము తప్పితే లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు. 

 

14:56 - January 4, 2017

హైదరాబాద్ : ఫీజురీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీ రగడ మొదలైంది. ప్రభుత్వం పథకాన్ని నీరుగార్చిందని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఇదే సమయంలో కోమటిరెడ్డికి కేటాయించిన సమయం ముగిసిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి బెల్‌ మోగించారు. అయితే బెల్‌ మోగిస్తే మాట్లాడకుండా కూర్చుంటానని వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. చేతిలోని పేపర్లను స్పీకర్‌ పైకి విసిరేయడంతో కోమటిరెడ్డి తీరుపై సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి డిప్యూటీ స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత జానారెడ్డి జోక్యంతో కోమటిరెడ్డి స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో సభలో గొడవ సద్దుమణిగింది. 

 

14:55 - January 4, 2017

మెదక్ : పటాన్‌చెరు ముత్తూట్‌ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. నిందితులు ముంబై పారిపోతుండగా లాతూర్‌లో సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు దోపిడీచేసిన బంగారంతో పాటు ఓ వాహనంకూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టి.అసెంబ్లీ వాయిదా..అయినా సభలోనే విపక్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ గురువారానికి వాయిదా పడింది. అయినా కాంగ్రెస్, టిడిపి, బిజెపి సభ్యులు సభలోనే ఉన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ వివరణ ఇవ్వలేదని పేర్కొంటూ సభ్యులు సభలోనే బైఠాయించారు.

బాబు మార్గంలో జిలెటిన్ స్టిక్స్ లభ్యం..

అనంతపురం : పుట్టపర్తి విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ కలకలం రేపాయి. పుట్టపర్తి - బుక్కపట్నం మార్గంలో కాలంచెల్లిన 200 జిలెటిన్ స్టిక్స్ లను డాగ్ స్వ్కాడ్ గుర్తించింది. కొత్త చెరువు బ్రిడ్జ్ కు 50 కి.మీటర్ల దూరంలో ఇవి లభ్యమయ్యాయి. ఇదే మార్గంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణించనున్నారు. హంద్రీనీవా కాల్వ తవ్వకంలో ఉపయోగించి మిగిలినవి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ పై కేసీఆర్ ప్రకటన..

హైదరాబాద్ : ప్రజాప్రతినిధులు, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడవద్దని సీఎం కేసీఆర్ సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను యదాతథంగా కొనసాగిస్తామని సభకు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 1880 కోట్లు ఉందని, ప్రతి ఏడాది రూ. 2వేల నుండి రూ. 2500 కోట్లు అవసరమవుతున్నాయన్నారు. ఈ ఏడాది రూ. 1487 కోట్లు విడుదల చేసినట్లు, కాంగ్రెస్ హాయాంలో ప్రతి ఏడాది ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో పెట్టారని తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ కు కోమటిరెడ్డి క్షమాపణలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫీజు రీయింబర్స్ మెంట్ పై రగడ చెలరేగింది. ప్రభుత్వం పథకాన్ని నీరుగార్చిందని కోమటిరెడ్డి విమర్శించారు. సమయం ముగిసిందని డిప్యూటి స్పీకర్ వెల్లడించడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని పేపర్లను డిప్యూటి స్పీకర్ పైకి విసిరేశారు. స్పీకర్ కు కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. జానారెడ్డి జోక్యంతో కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పారు. దీనితో వివాదం సద్దుమణిగింది.

రాజకీయాల్లోకి జుకర్ బర్గ్..?

అమెరికా : రాజకీయాల వైపు ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2017లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది అమెరికా అంతటా తిరిగి ప్రజల జీవితాలు పరిశీలించాలని జుకర్ బర్గ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతానని పేర్కొన్నారు.

కాంగ్రెస్ తరపున సిద్ధూ పోటీ..

పంజాబ్ : ఎన్నికల్లో ప్రముఖ క్రికేటర్, మాజీ బీజేపీ ఎంపీ సిద్ధూ కాంగ్రెస్ నుండి పోటీ చేయనున్నారు. అమృత్ సర్ తూర్పు నియోజవకర్గం నుండి సిద్ధూ పోటీ చేయనున్నారు.

ఆర్బీఐ ఆఫీసు ఎదుట సీపీఐ ఆందోళన..

హైదరాబాద్ : నోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆర్ బీఐ కార్యాలయం ఎదుట ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. నోట్లు రద్దు 50 రోజులు దాటినా ప్రజలు కష్టాలు తీరలేదని, మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇందిరాపార్కు వద్ద క్యాబ్ డైవర్ల ఆమరణ దీక్ష..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష చేస్తున్నారు. 18 పని గంటల సమయాన్ని రద్దు చేయాలని, కనీసం ఒక్కో క్యాబ్ కు 12 ట్రిప్పులు ఇవ్వాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

13:42 - January 4, 2017
13:41 - January 4, 2017
13:40 - January 4, 2017

హైదరాబాద్ : క్యాబ్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు '10టివి'తో మాట్లాడుతూ...గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా,వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. అనేక అంశాలను క్రోడీకరించి 11 డిమాండ్లను గత నెలలో ఒక కంపెనీకి, ఈ నెలలో ఇంకో కంపెనీకి ఇచ్చామని తెలిపారు. 5వ రోజుకు సమ్మె చేరుకున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వెహికల్స్, లీజ్ వెహికిల్స్ ఇవ్వవద్దు, ఇప్పటి వరకు ఉన్న వెహికిల్స్ కి 5 సంవత్సరాల బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలి, డ్రైవర్లకు భద్రత కల్పించాలి పూల్ అండ్ షేర్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలి, స్టార్ రేటింగ్ విధానాన్ని రద్దు చేయాలి అనే అంశాలపై ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు.

13:34 - January 4, 2017

హైదరాబాద్ : నేడు అనేక అంశాలపై డైవర్స్ రేటు పెరుగుతోంది. అస్సలు కన్సంట్ డైవర్స్ కు సంబంధించిన అనేక న్యాయ సలహాలు, సందేహాల కోసం 'మైరైట్' ప్రోగ్రాంలో నివృత్తి చేసేందుకు ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి వివరాల కోసం వీడియోను క్లిక్ చేయండి.

13:30 - January 4, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 2వేల మెగావాట్లకుపైన రాష్ట్రంలో విద్యుత్‌ లోటు ఉందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై నిలదీసిన రైతులపై ఆనాటి ప్రభుత్వం కాల్పులకు పాల్పడిందని..ఆ కాల్పుల్లో ఇద్దరు రైతులు చనిపోవడం ఓ చీకటిదినంగా సీఏం కేసీఆర్‌ అభివర్ణించారు. 

13:28 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 30 కోట్ల 80లక్షల రూపాయలతో స్పైస్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పసుపు పండించే అన్ని జిల్లాల్లోని జాతీయ రహదారుల పక్కన స్పైస్పార్క్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

ఉత్తర్ ప్రదేశ్ లో ఏడు దశల్లో ఎన్నికలు..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ లో 403 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. తొలి దశలో 73 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 11న, రెండో దశల్లో 67అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 15న, మూడో దశలో 69 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 19న, నాలుగో దశలో 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 23న, ఐదో దశలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న, ఆరో దశలో 49 అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 4న, ఏడో దశలో 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 8న ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

మణిపూర్ లో రెండు ఫేజ్ ల్లో ఎన్నికలు..

ఢిల్లీ : మణిపూర్ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. ఫేజ్ 1లో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని, నోటిఫికేషన్ 8 ఫిబ్రవరిన విడుదలవుతుందన్నారు. నామినేషన్లకు చివరి తేదీ 15 ఫిబ్రవరి అని, నామినేషన్ల పరిశీలన 16 ఫిబ్రవరి అని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 18 ఫిబ్రవరి, మార్చి 4వ తేదీన ఎన్నిక జరుగుతుందన్నారు.

ఉత్తరాఖండ్ లో 15 ఫిబ్రవరి ఎన్నికలు..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 స్థానాలకు 15 ఫిబ్రవరిన ఎన్నికలు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. జనవరి 20వ తేదీన నామినేషన్ విడుదల చేయడం జరుగుతుందని, నామినేషన్లకు చివరి తేదీ 28 అని పేర్కొన్నారు. నామినేషన్ల పరిశీలన 28 జనవరి, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 30 చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, ఒకే ఫేజ్ లో ఎన్నిక జరుగుతుందన్నారు.

పంజాబ్ లో ఫిబ్రవరి 4న ఎన్నికలు..

ఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో 117 స్థానాలకు ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. జనవరి 11వ తేదీన నామినేషన్ విడుదల చేయడం జరుగుతుందని, నామినేషన్లకు చివరి తేదీ 18 అని పేర్కొన్నారు. నామినేషన్ల పరిశీలన 19 జనవరి, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని, ఒకే ఫేజ్ లో ఎన్నిక జరుగుతుందన్నారు.

 

గోవాలో ఫిబ్రవరి 4న ఎన్నికలు..

ఢిల్లీ : గోవా రాష్ట్రంలో 40 స్థానాలకు ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. జనవరి 11వ తేదీన నామినేషన్ విడుదల చేయడం జరుగుతుందని, నామినేషన్లకు చివరి తేదీ 18 అని పేర్కొన్నారు. నామినేషన్ల పరిశీలన 19 జనవరి, నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21 చివరి తేదీ అని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

12:35 - January 4, 2017

సంక్రాంతి వార్ డిసైడైయింది. సంక్రాంతి పోటీ పడుబొతున్న మెగాస్టార్ 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'శర్వానంద్' కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ కన్ ఫర్మ్ అయ్యాయి. మరి పొంగల్ బరీలో నిలుస్తున్న ఈ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ పై...సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ 'చిరంజీవి' 150వ సినిమా 'ఖైదీ నెం 150'. 'బాలకృష్ణ' 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఈ సీజన్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. వీరితో పాటు 'శర్వానంద్' 'శతమానం భవతి' సినిమా కూడా వస్తోంది. అయితే ఇంతవరకు రిలీజ్ డేట్లపై క్లారిటీ లేదు కాని ఈ సినిమాలకు సంబంధించి అఫిషియల్ రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు. సంక్రాంతి బరీలో మెగాస్టార్ ముందుగా దూకేస్తున్నాడు. జనవరి 11న 'చిరు' ఖైదీ నెంబర్ 150తో రానున్నాడు. 9ఏళ్ల తరువాత రీ ఏంట్రీ ఇస్తుండడంతో పాటు తమిళ సూపర్ హిట్టు 'కత్తి' రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ పై యూనిట్ కాన్పిడెంట్ గా ఉంది.

బాలయ్య 12న శర్వానంద్ 14న..
ఇక 'బాలయ్య' జనవరి 12న 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా రావడానికి సిద్దమైపోయాడు. సంక్రాంతి పండుగను మరింత కలర్ పుల్ చేయడానికి 'శర్వానంద్' 'శతమానం భవతి' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత 'దిల్' రాజు ప్రకటించాడు. మూడు సినిమాలు మూడు ఢిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కడంతో సక్సెస్ పై అందరూ కాన్పిడెంట్ గా ఉన్నాడు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఆడియన్స్ 'బాలయ్య' 'గౌతమిపుత్ర' వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తెలుగు చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాను దర్శకుడు 'క్రిష్' ఎలా హ్యండిల్ చేశాడనేది చూడాలని ఆడియన్స్ ఉబ్బలాటపడుతున్నారు. మరి సంక్రాంతి బరీలో రారాజుగా ఎవరు నిలుస్తారో చూడాలి.

12:24 - January 4, 2017

ఢిల్లీ :ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఎన్నిక‌ల సంఘం ప్రకటించింది. సీఈసీ న‌జీం అహ్మద్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. జనవరి 11న నోటిఫికేషన్‌ జారీ అవుతుండగా... మార్చి 11న ఐదు రాష్ట్రాలకు కౌంటింగ్ జరగనుంది.
గోవా, పంజాబ్‌ల‌లో ఒకే ద‌శ‌లో జ‌ర‌గ‌నుండ‌గా.. మ‌ణిపూర్‌లో రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నుంది. ఇక 403 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో... ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవాళ్టి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వచ్చిన‌ట్లు జైదీ చెప్పారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఆయన ప్రకటించారు.
ల‌క్షా 85 వేల పోలింగ్ కేంద్రాలు.....
ఈ నెల 5 నుంచి ఈ రాష్ట్రాల ఎల‌క్టోర‌ల్ రోల్స్‌ను ప్రకటించనున్నారు. 16 కోట్లకు పైగా ఓట‌ర్లు ఈ ఎన్నిక‌ల ప్రక్రియలో పాల్గొనున్నారు. మొత్తం ల‌క్షా 85 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈసారి ఎన్నిక‌ల సంఘ‌మే ఓట‌రు స్లిప్పుల‌తో పాటు ఎన్నిక‌ల స‌మ‌యం, పోలింగ్ స్టేష‌న్లు, గుర్తింపు కార్డుల వివ‌రాలు చెప్పే క‌ర‌ప‌త్రాన్ని కూడా అందించ‌నున్నట్లు సీఈసీ న‌జీం అహ్మద్ జైదీ చెప్పారు. ఓటును మ‌రింత ర‌హ‌స్యంగా ఉంచ‌డం కోసం వోటింగ్ కంపార్ట్‌మెంట్ల ఎత్తును 30 అంగుళాల మేర పెంచిన‌ట్లు తెలిపారు.
అన్ని రాష్ట్రాల్లోనూ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలే...-------------------
అన్ని రాష్ట్రాల్లోనూ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌నే ఉప‌యోగించ‌నున్నారు. ఓట‌ర్లు తాము ఎవ‌రికి ఓటు వేశామో తెలుసుకునే వీలు క‌ల్పించిన‌ట్లు సీఈసీ జైడీ తెలిపారు. అభ్యర్థుల అఫిడ‌విట్‌లోనూ మార్పులు చేసిన‌ట్లు చెప్పారు. అభ్యర్థి భార‌త పౌరుడిన‌ని ధృవీక‌రించాల‌ని, ఫొటోను నామినేష‌న్ పత్రాల‌కు అటాచ్ చేయాల‌ని, నో డిమాండ్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని జైదీ వెల్లడించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో... అభ్యర్థుల ఖ‌ర్చు రూ.28 లక్షలుగా, మ‌ణిపూర్, గోవాల‌లో రూ.20 లక్షలుగా నిర్ణయించారు. విరాళాలు రూ.20 వేల‌ైతే బ్యాంకుల నుంచి జ‌ర‌గాల‌ని, అది కూడా చెక్కుల ద్వారానే అని ఎన్నిక‌ల సంఘం స్పష్టం చేసింది. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు..ముఖ్యాంశాలు..

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. మధ్యాహ్నం సీఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. ఈ రోజు నుండే ఎన్నికల నియామవళి అందుబాటులోకి రానుంది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఎన్నికలు జరగనున్నాయి.

11:54 - January 4, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరతను అధిగమించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నేడు అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సీఎం సమాధానాలు చెప్పారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినపుడు ఉన్న విద్యుత్ కొరతను అధిగమించగలిగామన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ముందడుగు వేసిందని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 7371 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపిన సీఎం రాష్ర్టానికి 8284 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని పేర్కొన్నారు. రైతులకు 9 గంటలపాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించామని వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు భద్రత లభిస్తుందని తెలిపారు.

విద్యుత్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ – కేసీఆర్..

హైదరాబాద్ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ అంశంపై ఆయన మాట్లాడారు. 20 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1175 మంది కాంట్రాక్టు జేఎల్ ఎంలను రెగ్యులరైజ్ చేయడం జరిగిందని, భవిష్యత్ లో నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. విద్యుత్ లో మిగులు రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని, రాష్ట్ర ప్రజల్లో విద్యుత్ కాంతులు నింపుతామని కేసీఆర్ వెల్లడించారు.

11:51 - January 4, 2017

హైదరాబాద్ : డ్రెస్సింగ్‌ టేబుల్‌ కింద చిక్కుకుపోయిన తన కవల సోదరుడిని రక్షించి రెండేళ్ల బుడతడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అబ్బురపరిచే ఈ ఘటన అమెరికాలోని యూటాలో చోటు చేసుకుంది. బ్రోక్‌, బౌడీషోఫ్‌ ఇద్దరూ కవల సోదరులు. ఇద్దరూ గదిలో ఆడుకుంటున్న సమయంలో డ్రెస్సర్‌ పైకి ఎక్కే ప్రయత్రం చేయగా... అది బ్రోక్‌ మీద పడిపోయింది. దీంతో అతడు దానికింద చిక్కుకుపోయాడు. బాధతో విలవిల్లాడుతున్న బ్రోక్‌ను చూసిన బౌడీషోఫ్‌... సోదరుడిని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. ఏం చేయాలో చాలాసేపు తికమక పడి సోదరుడిని రక్షించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చివరకు 52 కిలోల బరువున్న డ్రెస్సర్‌ను పక్కకు నెట్టి తన సోదరుడిని కాపాడుకోగలిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

11:49 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వాళ్లందరికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 51వేల రూపాయలు అందచేస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ..యువతి పెండ్లిరోజే ఆ డబ్బును ఇచ్చేట్లుగా ఇప్పటివకే అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. అర్హతలున్న ప్రతిఒక్కరికి కళ్యాణలక్ష్మి పథకం వర్తింస్తుందని..ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. 

ఉదయ్ పథకంలో టి.రాష్ట్రం - కేసీఆర్..

హైదరాబాద్ : విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధించడం కోసం..డిస్కంలను అభివృద్ధి చేయడం కోసం 'ఉదయ్' పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంటోందని తెలిపారు. గత పాలకుల లోపభూయిష్ట కారణంగా రెండు డిస్కంలు కూడా 11,897 కోట్ల అప్పుల ఊబిలో కూరుకపోయాయని సభకు తెలిపారు. ‘ఉదయ్' పథకంలో చేరడం ద్వారా ఈ అప్పుల్లో 75 శాతం 8, 923 కోట్ల రూపాయలను రాష్ట్రం చెల్లిస్తుందని, మిగిలిన డబ్బుకు ప్రభుత్వ గ్యారెంటీతో బాండ్స్ ఇచ్చే వెసుబాటు వస్తుందని ఫలితంగా డిస్కంలకు రుణభారం నుండి విముక్తి కలుగుతుందన్నారు.

11:46 - January 4, 2017

బెంగళూరు : భారత ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేకువజామున చోటుచేసుకున్న ఓ కీచకపర్వం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. నగరంలోని కమ్మనహళ్లి ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెంబడించారు. తరువాత అందులో ఒకడు నేరుగా అమ్మాయి దగ్గరకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం.. అమ్మాయి ప్రతిఘటన తదితర దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా యువతిపై లైంగికదాడి చేసిన యువకులపై గత రాత్రి కేసు నమోదుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

11:44 - January 4, 2017

తిరుపతి : చిన్న ఆలోచనతో పెద్ద ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని పద్మావతి కాలేజీలో చిల్డ్రన్‌ సైన్స్ కాంగ్రెస్‌ ను ఆయన ప్రారంభించారు. ఒక్క ఐడియా మొత్తం వ్యవస్థనే మార్చేస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రతి స్కూళ్లోను డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశానికి యువత, శాస్త్రవేత్తలు ఎంతో అవసరమని చెప్పారు. 

11:41 - January 4, 2017

అమరావతి : ఏపీ రాజధాని ప్రాంతం రాజధాని ప్రాంతంలోని మూడు గ్రామాలకు ఏపీ సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అబ్బరాజుపాలెం-9.75 సెంట్లు, బోరుపాలెం-33.58 సెంట్లు,..ఐనవోలులో 13.25 సెంట్లు భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ 2013 భూసేకరణ చట్టం ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అందుబాటులో 5039 మెగావాట్ల విద్యుత్ - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ప్రసంగింస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..భూపాలపల్లి కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, థర్మల్ పవర్ టెక్ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రోపవర్ 240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా 30 మెగావాట్లు, సోలార్ పవర్ ద్వారా 1080 మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా 99 మెగావాట్లు..మొత్తంగా 5039 మెగావాట్లు విద్యుత్ ను రెండున్నరేండ్లలో అందుబాటులో తేవడం జరిగిందన్నారు.

11:33 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూధనాచారి తరిస్కరించారు. పెద్దనోట్ల రద్దు వల్ల యాసంగి సాగుపై ప్రభావం పడిందని.. అందువల్ల రైతుకు రూ.20వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ పార్టీ, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.6లక్షల పరిహారం ఇవ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు భరోసా యాత్ర నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా, విధుల్లో పోలీసులు, హోంగార్డుల సమస్యలపై భాజపా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి.జానారెడ్డి, కిషన్ రెడ్డి, సండ్రవెంకటవీరయ్య, సున్నం రాజయ్య ఇచ్చిన వాయిదా ప్రతిపాదనలను స్పీకర్ తిరస్కరించారు.

విద్యుత్ కొరతను అధిగమించాం - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ సంక్షోభం ఉందని, అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జెన్ కో ద్వారా గణనీయంగా విద్యుత్ పెంచినట్లు, ఇందుకు పలు ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సరఫరా..పంపిణీలో జరుగుతున్న నష్టాలను 16.83 శాతం నుండి 15.9 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు.

గుంటూరు రాజధానిలో భూ సేకరణకు మరో నోటిఫికేషన్..

గుంటూరు : జిల్లా రాజధాని ప్రాంతంలోని మూడు గ్రామాలకు 2013 భూ సేకరణ చట్టం ద్వారా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఐనవోలు గ్రామంలో 13.25 సెంట్లు, అబ్బరాజుపాలెంలో 9.75 సెంట్లు, బోరుపాలెంలో 33.58 సెంట్లకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.

10:44 - January 4, 2017

ఢిల్లీ :సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్‌ సింగ్‌ ఖేహర్ ప్రమాణం చేశారు. జస్టిస్‌ ఖేహర్‌ చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్ ఖేహర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ పదవీ కాలం నిన్నటితో ముగియటంతో... కొత్త సీజేగా జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నియమితులయ్యారు. 64 సంవత్సరాల జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్,.సిక్కు మతం నుంచి చీఫ్ జస్టిస్ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పైన, ఎన్‌.జె.ఏ.సి. చట్టంపైన, సహారా అధిపతి సుబ్రత రాయ్ కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ ఖేహర్ కూడా ఉన్నారు. గతంలో కర్ణాటక, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఖేహర్‌ పనిచేశారు. 

10:42 - January 4, 2017

ఢిల్లీ :కోట్లకు కోట్ల రూపాయల మొండి బకాయిలను వసూలు ఆలస్యంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్‌ అయింది.. ఈ డబ్బు ఎలా వసూలు చేస్తారో తెలపాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.. అసలు ఈ బకాయిలు వసూలు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించింది. look

మొండి బాకీల వసూలుకు మౌలిక యంత్రాంగం సరిపోతుందా?

బ్యాంకుల్లో పేరుకుపోయిన లక్షల కోట్ల మొండి బకాయిల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ బాకీలను వసూలు చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక యంత్రాంగం సరిపోతుందా అని కేంద్రాన్ని నిలదీసింది. మొండి బకాయిల వసూలుకు చేపడుతున్న చర్యలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మొండి బకాయిలతోపాటు నిరర్ధక ఆస్తుల అంశాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలని చూస్తోందో మరింత స్పష్టత ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ కేంద్రాన్ని వివరణ కోరింది.

నిర్దిష్ట కాలపరిమితిలో మొండి బకాయిల వసూలు చేయడం సాధ్యమేనా?

నిర్దిష్ట కాలపరిమితిలో మొండి బకాయిల వసూలు చేయడం సాధ్యమేనా అన్న అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సుప్రీం బెంచ్‌ సూచించింది.. రాని బాకీల వసూలుకు మౌలిక యంత్రాంగం, డెబిట్‌ రికవరీల మెరుగుదలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాలని కోరింది. ఇదే అంశంపై గత విచారణలోనూ డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ దగ్గర అవసరానికి తగినంత మౌలిక వసతులు లేవని సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌ దగ్గర ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో ఆ వివరాలను కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఇక ఇదే కేసుపై గతంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ బకాయిల వసూలుకు డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్స్‌, డెబిట్‌ రికవరీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్స్‌కు ఎదురవుతున్న ఆటంకాలపై అధ్యయనం చేయాలని నేషనల్‌ లా స్కూల్‌, ఐఐఎం బెంగుళూర్‌లను కోరతామని తెలిపారు. 500 కోట్లకు పైబడి రుణాలు తిరిగి చెల్లించని వారి పేర్లను ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు గతంలో ఆర్‌బీఐతో పాటు కేంద్రాన్ని ఆదేశించింది. సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

10:39 - January 4, 2017

విజయవాడ : ఒకప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే జనం జంకేవారు.. ఎందుకంటే అక్కడికి వెళితే కనీస సాకర్యాలు కూడా ఉండవు అని.. కానీ ఇప్పుడు అవే పోలీస్ స్టేషన్లు కార్పొరేట్ స్థాయిలో జనాలకు వెలకమ్ పలుకుతున్నాయి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. ఏంటీ నమ్మడం లేదా అయితే వాచ్ దిస్ స్టోరీ.

బెజవాడ ఆ పేరులో ఒక వైబ్‌రేషన్...

బెజవాడ ఆ పేరులో ఒక వైబ్‌రేషన్ ఉంది. ఒక పవర్ ఉంది. అలాంటి బెజవాడ ఇప్పుడు పోలీస్ పవర్ ఏంటో.. పోలీస్ మర్యాదలు ఏంటో చూపిస్తోంది.. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాలను నూతన హంగులతో పోలీస్ ఉన్నతాధికారులు ఆధునీకరించారు. గత నెలరోజులుగా ఆధునికీకరణ పనులు చేపట్టిన సిబ్బంది పోలీస్ స్టేషన్లు సరికొత్తగా ఉండేలా తీర్చిదిద్దారు. ఒక్కో పీఎస్ కు రెండున్నర లక్షలు కేటాయించి ఆధునాతన సౌకర్యాలను పోలీసు బాస్‌లు ఏర్పాటు చేశారు.

ప్రతి పోలీస్ స్టేషన్లో స్టార్ హోటల్స్ లో ఉండే విధంగా...

గతంలో పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనీసం ప్రజలకు కూర్చుకునేందుకు కుర్చీలు కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో స్టార్ హోటల్స్ లో ఉండే విధంగా పెద్ద రిసెప్షన్ సెంటర్ తోపాటు సుమారు 10 మంది కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చే వృద్ధులు, నిరక్ష్యరాసులకు సహాయపడేలా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

ప్రజలు కూడా హర్షం వ్యక్తం...

పోలీస్ స్టేషన్ లో జరిగిన మార్పులను చూసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా మారిన తర్వాత బెజవాడలో అన్ని రంగాల్లో వినూత్న మార్పులు జరుగుతున్నట్లే పోలీస్ స్టేషన్లలోనూ హైటెక్ రూపురేఖలు సంతరించుకోవడం హర్షదాయకమని పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మొత్తమ్మీద పోలీస్ బాస్‌లు చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని.. ఇలాగే రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంటే ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న ఆగాంతం తగ్గు మోహం పట్టిందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 

10:36 - January 4, 2017

అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల హాజరు నమోదుకు ఈనెల 2 నుంచి బయో మెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెలగపూడికి తరలి వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నాయో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఆఫీసుకు వచ్చిన సమయం, వెళ్లే సమయం నమోదు చేయాలని జారీ చేసిన ఆదేశాలపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు.

ఉద్యోగుల కోసం వారంలో ఐదు రోజుల పని విధానం

సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెలగపూడి తరలివచ్చినా, వీరి కుటుంబాలు చాలా వరకు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. ఉద్యోగుల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది సెప్టెంబర్‌ నుండి డిసెంబర్‌ వరకు ఎంప్లాయీస్‌ వచ్చి, వెళ్తున్న వేళల గురించి అంతగా పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగుల్లో కొంత అలసత్వం ప్రబలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిని సరిదిద్దేందుకు, హాజరీని క్రమబద్ధం చేసేందుకు.... ప్రవేశపెట్టిన బయో మెట్రిక్‌ విధానంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని అనుసరించే విషయంలో ఉద్యోగులు వంకలు చెబుతున్నారు. కొత్త రాజధాని అమరావతికి ఉద్యోగుల కుటుంబాలు ఇంకా పూర్తిగా తరలిరాని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నన్ని సౌకర్యాలు వెలగపూడిలో లేవన్న వితండ వాదాన్ని వినిపిస్తున్నారు. కుటుంబాలు ఇక్కడకు పూర్తిగా తరలిరావడానికి మరో ఏడాది లేదా ఏడాదిన్నర కాలం పడుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు బయో మెట్రిక్‌ విధానాన్ని వాయిదా వేయాలన్న డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు. వెలగపూడి సచివాలయానికి చేరుకోడానికి సరైన రహదారులు లేవన్న వాదాన్ని వినిపిస్తున్నారు. తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాలను ప్రస్తావిస్తున్నారు. మెట్రిక్‌ హాజరీ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించాలని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం నిర్ణయించింది.  

10:33 - January 4, 2017

శ్రీకాకుళం :మానవ సేవే మాధవ సేవ అన్న మాటలను నిజం చేస్తున్నాడు శ్రీకాకుళానికి చెందిన జగన్నాధస్వామి. పేదోళ్ల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకున్నాడు. ఆకలి బతుకుల్లో ఆనందాలు నింపుతున్నాడు.

సుమారు 30మంది కడుపు నింపుతున్న..

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం వావివలసలో జగన్నాధ స్వామి....పేరు చెబితే పేదల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. రోజూ సుమారు ముప్పై మందికి...నెలలో చివరి ఆదివారం సుమారు మూడు వందల మంది పేదలకు కడుపు నింపుతాడీ మనసున్న మారాజు. అందుకే ఈయనంటే అక్కడివారికి అభిమానం.

తనకున్న స్థలంలో ఓ చిన్న గదిని నిర్మించి...

తనకున్న స్థలంలో ఓ చిన్న గదిని నిర్మించి...అందులో అన్నదాన కార్యక్రమమే కాదు...రామాయణ, మహాభారతం గాధలను వినిపించే ఏర్పాట్లు చేసాడు. ఇంత చేస్తున్న ఇతనేదో ధనవంతుడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో సైకిల్‌ మీద అప్పడాలు, ఒడియాలు అమ్ముకుంటూ వచ్చే డబ్బులతోనే...16 సంత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.

మాత్రం గొప్పలు చెప్పుకోని జగన్నాధ స్వామి...

అయితే తాను చేస్తున్న సేవపై జగన్నాధ స్వామి మాత్రం గొప్పలు చెప్పుకోడు. పెద్దలు, గురువుల హితబోధతోనే తానీ సేవ చేస్తున్నానని అంటున్నాడు. పరుల సేవతో వచ్చే తృప్తి ఎంత సంపాదించినా రాదని గర్వంగా చెప్తున్నాడు. తాను బతికున్నంత వరకూ ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాడు.

గ్రామంలోని పేదలంతా హర్షం....

జగన్నాధ స్వామి అన్నదానం కార్యక్రమంపై ఈ గ్రామంలోని పేదలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తేనే మంచి ఇంకా బతికుందనే విషయం గుర్తుకొస్తుందని అంటున్నారు. స్వార్థపు ఆలోచనలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఎంతోమంది స్వార్థపరులకు.. జగన్నాధస్వామి సేవే ఆదర్శం కావాలి. 

10:28 - January 4, 2017

చెన్నై : డీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.. స్టాలిన్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో తీర్మానించారు.. స్టాలిన్‌కు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రకటనతో డీఎంకే నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.. అయితే ఈ సమావేశానికి కరుణానిధి కుమార్తె కనిమొళి హాజరు కాలేదు.. 

కళ్యాణ లక్ష్మీ పథకంపై కొండా సురేఖ ప్రశ్నలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు ప్రారంభమైన సభలో తొలుత స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కళ్యాణలక్ష్మీ పథకంపై టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ ప్రశ్నించారు. ముస్లింలో ఓసీలుంటారని, వారికి ఆన్ లైన్ లో కుల సర్టిఫికేట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాల అంశంలో సమస్యలను పరిష్కరించారా ? లేదా ? అనేది తెలపాలని కోరారు. సాఫ్ట్ వేర్ కొంత స్లోగా ఉందని సభ దృష్టికి తెచ్చారు. కళ్యాణ లక్ష్మీ అనే పథకం కుటుంబంలో ఉండే ఎంత మంది ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది ?

ముగిసిన డీఎంకే సర్వసభ్య సమావేశం..

చెన్నై : డీఎంకే సర్వసభ్య సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిండెంట్ గా స్టాలిన్ ఎంపికయ్యారు.

 

10:09 - January 4, 2017

హైదరాబాద్: కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టింది. కల్యాణ లక్ష్మి పథకం పై అధికార పక్షం నేత కొండా సురేఖ పలు సూచనలు చేశారు. కళ్యాణ లక్ష్మీ అనే పథకం కుటుంబంలో ఉండే ఎంత మంది ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది ? అబ్బాయిలు రెండు..మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసే పరిస్థితి ఉందని, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందా ? లేదా ? అనేది తెలపాలని కోరారు. మరో వైపు విపక్షాలు తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు.

సీజేగా జే.ఎస్.ఖేహర్ ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జే.ఎస్.ఖేహర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఖేహర్ చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ ఖేహర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 27 వరకు సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ జేఎస్ ఖేహర్ కొనసాగనున్నారు.

భీమదేవరపల్లి వంగరలో దారుణం..

వరంగల్ అర్బన్ : భీమదేవరపల్లి వంగరలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అల్లుడు వీరస్వామిని చెట్టుకు కట్టేసి రాళ్లతో అత్త..మామ..బావమరదులు కొట్టి చంపేశారు.

లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్టు..

జమ్మూ కాశ్మీర్ : హంద్వాడలో లష్కరే తోయిబా ఉగ్రవాది ఆషిక్ అహ్మద్ ను భారత బలగాలు అరెస్టు చేశాయి. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

09:30 - January 4, 2017

విశాఖపట్టణం : ప్రజావైద్యుడు, జనవిజ్ఞానవేదిక వ్యవస్థాపకుల్లో ఒకరు డాక్టరు హరిప్రసాద్ మరణించారు. తీవ్ర అస్వస్థతతో 10రోజుల క్రితం విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నమ్మిన విలువలతో బతికిన మనిషి..డాక్టర్ హరి మృతి వార్త తెలిసిన వెంటనే..ప్రజా సంఘాల నేతల, వామపక్షాల నేతలు, జనవిజ్ఞాన వేదిక నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. డాక్టరు హరిప్రసాద్ ప్రజాసైన్సు ఉద్యమకారుడు,. సామాన్యుల వైద్యుడుగా ప్రజల్లో చెరగని ముద్రవేశారని వామపక్షాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.

విడుదల కానున్న 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు శాసనసభ గడువు ముగియడంతో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా,పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయనుంది.

09:28 - January 4, 2017

ఎర్రజెండా చేతబట్టి.. పల్లెపల్లెనూ పలకరిస్తూ సీపీఎం మహాజన పాదయాత్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపుతోంది. 79వ రోజు వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో పర్యటించిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం 2100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. 79వ రోజు తమ్మినేని బృందం కరీమాబాద్‌, శాయంపేట, అదాలత్, ఆర్‌ఈసీ, ఖాజిపేట, రాంపూర్‌, మండికొండ, పెదపెండ్యాల వరకు కొనసాగింది.

2100 కి.మీటర్లు..
ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎస్సీల వాస్తవ పరిస్థితిపై నిర్మాణాత్మక చర్చ జరగాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. దళితుల సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర రంగాలకు మళ్లించడం దారుణమని తమ్మినేని విమర్శించారు. తెలంగాణ రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని తమ్మినేని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వంచించడంలో టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒకటే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయని తమ్మినేని దుయ్యబట్టారు. పెదపెండ్యాల వద్ద పాదయాత్ర 2100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర బృందం కేక్‌ కట్‌ చేసింది. పాదయాత్రకు వివిధ పార్టీల స్థానిక నేతలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. వరంగల్‌ ఎన్‌ఐటీ వద్ద పాదయాత్ర బృందానికి బీసీ సబ్‌ప్లాన్‌ సాధన సమితి రాష్ట్ర ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌తో పాటు ఎన్‌ఐటీ కార్మికులు, రైల్వే కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు.

09:26 - January 4, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులపై తెలంగాణ టిడిపి నేతలు పెదవి విరుస్తున్నారు. అన్నింటా అధికారపక్షం ఆధిపత్యమే కొనసాగుతోందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుదారులకు అసెంబ్లీ కమిటీల్లో స్థానం కల్పిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు సముచిత సమయం కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని పోరాడేందుకు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాలో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. ప్రజా సమస్యలపై అటు అసెంబ్లీలో ఇటు బయట వాడీవేడీగా తమ వాణి వినిపిస్తున్నతరుణంలో... టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ వైపు మొగ్గు చూపారు. ఏడాది కాలంలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. చివరకు రేవంత్‌రెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మిగిలారు. ఉన్న ముగ్గురూ తమ అసెంబ్లీ వేదికగా తమ వాణి విపినించేందుకు ప్రయత్నిస్తున్నా... అధికారపక్షం అసెంబ్లీలో తమకు తగిన సమయం కేటాయించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయంతో పాటు, జీరో అవర్‌ ప్రస్తావనలు, లఘు చర్చలు జరిగే సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్న వాదాన్ని లేవనెత్తున్నారు.

అనైతికం అంటున్న టిడిపి..
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీల్లో స్థానం కల్పించడాన్ని తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులు తప్పుపడుతున్నారు. ఇది అనైతికమన్న వాదాన్ని లేవనెత్తుతున్నారు. రేవంత్‌రెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలకు ఏ కమిటీలో కూడా స్థానం కల్పించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పీకర్‌ మధుసూదనాచారికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీలో తమకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్‌, బీజేపీ, మజ్లిస్‌ ఎమ్మెల్యేలను కలుపుకుని పోరాటానికి సిద్ధమవుతున్నారు.

09:25 - January 4, 2017

మహబూబాబాద్ : డోర్నకల్ వద్ద రైలు పట్టా విరిగింది. రాత్రి 2 గంటల సమయంలో... రైల్వే గార్డులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆ మార్గంలో రైళ్లు నిలిపివేసి.. మరమ్మత్తులు చేపట్టారు. దీంతో సుమారు 10 రైళ్లు నిలిచిపోయాయి. 

09:24 - January 4, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సమరశంఖం పూరించడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు చేయకుండా ప్రైవేటు విద్యా సంస్ధలను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రైవేటు కాలేజీల పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యపై తెలంగాణ ప్రైవేటు కాలేజీల ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, టీ- జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, బీసీ సంఘ నేత ఆర్. కృష్ణయ్యలతో పాటు పలువురు విద్యావేత్తలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల పాల్గొన్నారు.

బకాయిలతో మూసివేతకు దగ్గరగా ప్రైవేటు కాలేజీలు..
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలకు దాదాపు 4 వేల కోట్ల 410కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇందులో దాదాపు 1 వెయ్యి 365 కోట్ల రూపాయలు మూడేండ్ల కిందటి బకాయిలు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలతో పలు ప్రైవేటు కాలేజీలు మూసివేతకు దగ్గరపడ్డాయంటే తెలంగాణలో వీటి పరిస్ధితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

బకాయిలతో చదువులకు దూరమయ్యే ప్రమాదం..
తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల 50 వేల మంది పేద విద్యార్ధులు ఫీజు రియంబర్స్ మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. బకాయిలు పేరుకుపోవడంతో పేద బి.సి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్ధితి ఏర్పడింది. బకాయిలు చెల్లిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. కాని ఆ పని జరగలేదు. 2016 అక్టోబర్‌లో 258 కోట్లు డిసెంబర్‌లో 300 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో 2017 జనవరికి అన్ని రకాల బకాయిలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కాలేజీలకు 4 వేల 410 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.

కాంట్రాక్టర్ల ప్రభుత్వమా ?
టీఆర్ఎస్ సర్కార్ కాంట్రాక్టర్ల ప్రభుత్వంగా మారిందని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నేతలు మండిపడ్డారు. విద్యార్థి గర్జన పేరుతో ఇప్పటికే ఫీజు రియంబర్స్ మెంట్ పై కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టామని ఉత్తమ్ తెలిపారు. ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే చెల్లించాలని సదస్సులో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీలు చేసే ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని నేతలు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని వక్తలు డిమాండ్ చేసారు. లేకుంటే పెద్దఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

09:22 - January 4, 2017

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల్లో నగదు కష్టాలు ఇంకా తీరలేదు. 3నెలలు కావొస్తున్నా... ఆశించిన స్థాయిలో నగదు అందడం లేదు. పదిశాతం ఏటీఎం మెషిన్లలోనే నగదు ఉంచుతుండటంతో.. మూడు గంటల్లోనే క్యాష్‌ అయిపోతోంది. ఏటీఎంలలో రోజుకు 4,500 రూపాయలు తీసుకునే వెసలుబాటు కల్పిస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. చాలా ఏటీఎంలు డబ్బులు లేక మూతబడి ఉంటున్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను పరిశీలించండి...

09:21 - January 4, 2017

విశాఖ : షార్ట్‌ఫిలిం పేరుతో విశాఖలో నిఖిల్‌ అనే బీటెక్‌ విద్యార్థి మోసానికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకొని.. ఆ తర్వాత వారితో షార్ట్‌ఫిలిం పేరుతో అమ్మాయిలతో నిఖిల్‌ రాసలీలలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు యువతుల నగ్న దృశ్యాలను తీసిన నిఖిల్‌ వారిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకుంటే..ఆ వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెడతానని అమ్మాయిలను బెదిరించాడు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన ముగ్గురు అమ్మాయిలు కంచరపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఖిల్‌ కోసం గాలిస్తున్నారు. 

09:19 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో పలుపార్టీలు వాయిదా తీర్మానాల్ని ప్రవేశపెట్టాయి. రైతు ఆత్మహత్యలపై టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలీసులు, హోంగార్డుల సమస్యలపై బీజేపి వాయిదా తీర్మానం ఇచ్చింది. పెద్దనోట్ల రద్దుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని...వడ్డీలేని కొత్తరుణాలు అందించాలని కాంగ్రెస్‌ వాయిదా తీర్మానాలిచ్చింది. మరోవైపు కందిపప్పుపై ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. 

సైన్స్ మ్యూజియానికి బాబు శంకుస్థాపన..

తిరుపతి : జూపార్కు రోడ్డులో సైన్స్ మ్యూజియం నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి హాజరయ్యారు. 140 ఎకరాల స్థలంలో రూ. 1300 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేశారు.

టి.అసెంబ్లీ వాయిదా తీర్మానాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వాయిదా తీర్మానాలు ఇలా ఉన్నాయి...రైతు ఆత్మహత్యలపై టి.టిడిపి...పోలీసులు, హోంగార్డుల సమస్యలపై బీజేపీ..పెద్దనోట్ల రద్దుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని..వడ్డీలేని కొత్త రుణాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి.

డోర్నకల్ వద్ద విరిగిన రైలు పట్టా..

వరంగల్ : డోర్నకల్ రైలు పట్టా విరిగిపోయింది. అర్ధరాత్రి 2గంటలకు రైల్వే గార్డులు గుర్తించారు. పది రైళ్లు నిలిచిపోయాయి. మరమ్మత్తులు కొనసాగుతున్నాయి.

నేడు మధ్యాహ్నం సీఈసీ ఎన్నికల సమావేశం..

ఢిల్లీ : నేడు మధ్యాహ్నం సీఈసీ ఎన్నికల సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒక దశలోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

09:04 - January 4, 2017

హైదరాబాద్ : మొండిబకాయిలు... నిరర్థక బకాయిలు ఎలా వసూలు చేస్తారు, పోలవరం ప్రాజెక్టు పై కేవీపీ చేసిన కామెంట్స్, టీడిపికి పోలవరం పై చిత్త శుద్ధి ఎంత, గతంలో జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం జరిగిందా?, ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నట్లు 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా? కేంద్రం విదిలిస్తున్న అరకొర నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం అవుతుందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, గుంటూరు టిడిపి నేత మన్నం సుబ్బారావు, కాంగ్రెస్ నేత నరశెట్టి నర్శింహారావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

గౌతమి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం

ఖమ్మం: గౌతమి ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం తలెత్తింది. పందిళ్ల పల్లివల్లి వద్ద నిలిచిపోయింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.

08:47 - January 4, 2017

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినను పొగమంచు వీడడం లేదు. గత కొన్ని రోజులుగా దట్టంగా పొగమంచు కమ్ముకొంటుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. ప్రధానంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తోంది. దీని కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 8 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తుండడగా ఒక దేశీయ విమానం రద్దు చేశారు. పొగమంచు కారణంగా వాహదారులు, నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న 112 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. రన్ వే కనిపించకపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు రైళ్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పొగమంచు కారణంగా కాలుష్యం అధికంగా నమోదవుతోంది. శ్వాసకోశ వ్యాధులున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉప్పుగుండూరులో ఎన్టీఆర్ విగ్ర‌హానికి చెప్పుల దండ

ప్రకాశం :జిల్లాలోని నాగులుప్ప‌ల‌పాడు మండ‌లం ఉప్పుగుండూరులో టీడీపి వ్యవస్థాపకుడు, మాజీ సీఎంఎన్టీఆర్ విగ్ర‌హానికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెప్పుల దండ వేసి అవ‌మానించారు. దీంతో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ఆందోళ‌న‌కు దిగారు. దండ వేసిన వారిని వెంట‌నే అరెస్ట్ చేసి చ‌ర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. న‌ల్ల బ్యాడ్జీల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. జ‌న్మ‌భూమి ప‌నులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన‌డంతో పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి వారికి స‌ర్దిచెప్పారు. అనంత‌రం ఎన్టీఆర్ విగ్ర‌హానికి ఆయ‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్తలు పాలాభిషేకం చేశారు.

నేటి నుండి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో క్యాబ్‌డ్రైవర్లు, యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపైన నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. క్యాబ్‌ యాజమాన్యాలు, ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం నుంచి ఇందిరా పార్క్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షలు చేయనున్నట్లు అసోషియేషన్‌ అధ్యక్షుడు శివ తెలిపాడు. 

రేపటి నుండి విజయపాల ధర పెంపు

హైదరాబాద్: తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ పాల ధర గురువారం నుంచి పెరుగనున్నది. లీటర్ పాలపై రూ.2 పెంచినట్లు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల తెలిపారు. పెరిగిన ధర గురువారం నుంచి అమల్లోకి రానున్నదన్నారు. ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.38 కాగా, పెరిగిన ధరతో అది రూ. 40కు చేరుకోనున్నది. 

06:53 - January 4, 2017

హైదరాబాద్ : ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి. దీంతో దళితుల సంక్షేమం కుంటుపడుతోంది. తెలంగాణలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద 13,125 కోట్ల రూపాయలు కేటాయించినా అందులో 7875 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించినట్టు దళఇతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ సబ్ ప్లాన్ కి కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించాలంటూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలోని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేయబోతున్నారు. ఇదే అంశంపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో మాట్లాడేందుకు తెలంగాణ కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:41 - January 4, 2017

హైదరాబాద్ : ముంబై వరుస పేలుళ్ళ సూత్రధారి, అండర్ వరల్డ్ కింగ్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 వేల కోట్లు ఉంటుందని అంచనా. దుబాయ్‌లో దావూద్‌ సోదరుడు గోల్డెన్‌ బాక్స్‌ పేరుతో ఓ కంపెనీని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. డాన్ దావూద్ ఇబ్రహీంకు ఇండియా, పాకిస్థాన్‌తో పాటు దుబాయ్, మొరాకో, స్పెయిన్, సింగపూర్, థాయిలాండ్, సైప్రస్, టర్కీలో పలు ఆస్తులున్నాయి. దుబాయ్‌లో ఉన్న దావూద్‌ స్థలాలను యూఏఈ అధికారులు సీజ్‌ చేశారు. భారత్‌ నుంచి దావూద్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు దుబాయ్‌కు పంపించడంతో అక్కడ ప్రభుత్వం ఇటీవల విచారణ చేపట్టింది.

దుబాయ్‌ ప్రభుత్వానికి దావూద్‌ అక్రమాస్తుల వివరాలు అందజేత

అయితే దుబాయ్‌లోని రూ.15,000 కోట్ల ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత ఏడాది దుబాయ్ వెళ్ళిన ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, దావూద్‌కు సంబంధించిన అక్రమాస్తుల వివరాలను ఆ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేసిన యూఏఈ అధికారులు దావూద్‌కు చెందిన గోల్డెన్ బాక్స్ కంపెనీ ఆస్తులు, షేర్లతోపాటు పలు హోటల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

దావూద్ ఇబ్రహీం ఆస్తులు స్వాధీనం

హైదరాబాద్ : ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను దుబాయ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దావూద్‌కు చెందిన దాదాపు 15 వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం ధ్రువీకరించింది. 

06:38 - January 4, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లక్నోలో ములాయం సింగ్‌‌ యాదవ్‌ ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ల మధ్య 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తండ్రి కొడుకులు ఎవరికి వారే తమ తమ షరతులపై పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

తండ్రి ముందు కొన్ని షరతులు....

అఖిలేష్‌ యాదవ్‌ తండ్రి ముందు కొన్ని షరతులు పెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్‌ యాదవ్‌ ఉండాలని... శివపాల్‌ యాదవ్‌ను యుపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి జాతీయ రాజకీయాలకే పరిమితం చేయాలని.... ఎన్నికల అభ్యర్థులను తానే నిర్ణయిస్తానని అఖిలేష్‌ షరతు విధించారు. ఇవి కాకుండా అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి తొలగించాలని, రాంగోపాల్‌ యాదవ్‌కు పార్టీ పదవితో పాటు అధికారం ఇవ్వాలని సూచించారు. కొడుకు విధించిన షరతులపై ములాయం రాజీ పడడం లేదు.

సయోధ్య కుదిర్చేందుకు పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మధ్యవర్తిత్వం ...

అంతకుముందు తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మధ్యవర్తిత్వం నిర్వహించారు. దీంతో ఉదయం అఖిలేశ్‌ తండ్రి ములాయంతో ఫోన్లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌ మాట్లాడిన తర్వాత ములాయం హుటాహుటిన ప్రత్యేక చార్టెడ్‌ విమానాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి లక్నోకు వచ్చి కొడుకుతో సమావేశమయ్యారు.

ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశం లేదు.....

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీలో ఎలాంటి సయోధ్య కుదిరే అవకాశం లేదని పార్టీ సీనియర్‌ నేత రాంగోపాల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మా జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ నేతృత్వంలో ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీ గుర్తు కోసం రాంగోపాల్‌ యాదవ్‌ ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిశారు. 90 శాతం మంది ఎమ్మెల్యేలు సిఎం అఖిలేష్‌కు మద్దతు ఇస్తున్నారని...పార్టీలో ఎక్కువ మంది మద్దతు ఉన్న అఖిలేష్‌కు పార్టీ చిహ్నం సైకిల్‌ను కేటాయించాలని ఈసీని కోరినట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌ తమకే ఉంచాలంటూ ములాయం సింగ్‌ ఎన్నికల కమిషన్‌ కలిసి కోరారు. అఖిలేష్ రాజీ ఫార్ములాకు ములాయం-శివపాల్ క్యాంప్ తలొగ్గుతుందా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

06:36 - January 4, 2017

అమరావతి : భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రమది.. ప్రముఖ కవులకు పురిటిగడ్డ అది. తెలుగు భాషకు పట్టం కట్టిన ఎందరో మహానుభావులు నడయాడిన నేల అది. అంతటి ఖ్యాతిగడించిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు అవమానం జరుగుతోందా..? పరభాష వ్యామోహంలో తెలుగు భాషను విద్యార్థులకు దూరం చేస్తున్నారా..? మున్సిపల్‌ శాఖ మాత్యులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం చూస్తే ఇవే ప్రశ్నలు మేథావుల్లో ఉత్పన్నమవుతున్నాయి.

జీవో నెంబర్ 14ను ఏపీ ప్రభుత్వం విడుదల ...

తెలుగు భాష.. తేనెలొలుకు కమ్మదనం.. 56 అక్షరాల సమాహారం.. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించారు. యునెస్కో అంచనా ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు ఉంది. తెలుగు ప్రభుత్వాలు మేల్కొని తెలుగును బతికించే విస్తృత కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే... ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయాలని జీవో నెంబర్ 14ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కవులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు, భాషకోవిదులు మంత్రి నారాయణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2,118 మున్సిపల్ పాఠశాలల్లో సుమారు 2 లక్షల 51 వేల 774 మంది విద్యార్థులు...

ఆంధ్రప్రదేశ్‌లో 2,118 మున్సిపల్ పాఠశాలల్లో సుమారు 2 లక్షల 51 వేల 774 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో తెలుగు మీడియాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. ఆంగ్ల మాధ్యమంలో పుస్తకాల్లేకుండా, బోధించడానికి ఉపాధ్యాయులు లేకుండా రాత్రికే రాత్రి హడావుడిగా తెలుగు మీడియాన్ని రద్దు చేయాలనుకోవడం.. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ హఠాత్పారిణామంతో చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

కార్పొరేట్ విద్యా వ్యాపారాలు పెంచుకోవడం కోసం ....

కార్పొరేట్ విద్యా వ్యాపారాలు పెంచుకోవడం కోసం ఆంగ్ల భాష తప్ప మరో భాష చదవరాదనే వాతావరణం మంత్రి నారాయణ సృష్టిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు ఏ మీడియంలో చదవాలో మంత్రులు నిర్ణయించడంకాదని, విద్యార్థులకే ఆ ఆప్షన్ ఇవ్వాలని సూచిస్తున్నాయి.

మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు

2015 అక్టోబర్ 4న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో 94 శాతం మంది ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని, ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలు ఉండాలని నిర్ణయించారు. అయితే మున్సిపల్ శాఖ మంత్రి ఏకపక్ష నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్‌ 14ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.

మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని రద్దుచేసిన మంత్రి నారాయణ

అమరావతి : భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రమది.. ప్రముఖ కవులకు పురిటిగడ్డ అది. తెలుగు భాషకు పట్టం కట్టిన ఎందరో మహానుభావులు నడయాడిన నేల అది. అంతటి ఖ్యాతిగడించిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు అవమానం జరుగుతోందా..? పరభాష వ్యామోహంలో తెలుగు భాషను విద్యార్థులకు దూరం చేస్తున్నారా..? మున్సిపల్‌ శాఖ మాత్యులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం చూస్తే ఇవే ప్రశ్నలు మేథావుల్లో ఉత్పన్నమవుతున్నాయి. 

06:31 - January 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన స్టే ఉత్తర్వులు రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతానికి తాగునీటి అవసరాలకే ప్రాజెక్టును ఉపయోగిస్తామని, అమ్రాబాద్‌ రిజర్వ్‌ భూముల్లో ప్రాజెక్టు నిర్మించబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఉన్న స్టేను తొలగించింది.

రెండేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు :కేసీఆర్

హైదరాబాద్ :రాబోయే బడ్జెట్‌లో మత్స్య పరిశ్రమకు నిధులు పెంచుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాసనసభలో మత్స్య పరిశ్రమపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన స్పందించారు. వచ్చే రెండేళ్లలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. వచ్చే ఏడాదికే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మూడున్నర లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతాయని అంచనా వేశామన్నారు. 11 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.  

ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన గళం విప్పిన జనసేనాని

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన గళం విప్పారు. వ్యాధిగ్రస్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన బాధితుల సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించాలని డెడ్‌లైన్‌ విధించారు. సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. కిడ్నీ బాధితుల సమస్యలపై తాను నివేదిక సమర్పించిన తర్వాత సర్కార్‌ స్పందించకపోతే ప్రజా ఉద్యమం తథ్యమని ఆయన అన్నారు. కిడ్నీ బాధితులతో ముఖాముఖి అనంతరం పవన్‌ కల్యాణ్‌.. ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్‌ షోలో పాల్గొన్నారు. 

శాస్త్ర, సాంకేతిక పరిశోధనల వాసి పెరగాలి: మోదీ

తిరుపతి : ప్రపంచ పోటీని తట్టుకుని నిలిచే విధంగా మన శాస్త్ర, సాంకేతిక పరిశోధనల వాసి పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు పిలుపు ఇచ్చారు. దేశాభివృద్ది, ప్రజాభ్యున్నతికి తోడ్పడే పరిశోధనలకు ప్రభుత్వ ప్రోత్సహం, సహయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మోదీ ప్రకటించారు. 2030 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపచంలోనే మూడో స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తిరుపతిలో జరుగుతున్న ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చెప్పారు.

Don't Miss