Activities calendar

05 January 2017

నెల్లూరు జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం...

నెల్లూరు : పాదలకూరు మండలం తోడేరులో వెంకటేశ్వర్లు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు సంబంధించిన పొలాన్ని తాను చెప్పిన వ్యక్తికే అమ్మాలని స్థానిక ఎస్సై ప్రసాద్ రెడ్డి వేధిస్తున్నాడని ఆరోపించారు. 

 

దోపిడీ దొంగలు బీభత్సం

నెల్లూరు : ఉస్మాన్ సాహెబ్ పేటలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డు ప్రధానోపాధ్యాయురాలి నోట్లో గుడ్డలు పెట్టి హత్య చేశారు. నగదు, నగలను దుండగులు ఎత్తుకెళ్లారు.  

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో వ్యాపారులు, రైతుల మధ్య వివాదం

కర్నూలు : ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో వ్యాపారులు, రైతుల మధ్య కొనుగోళ్ల వివాదం నెలకొంది. పాత పద్ధతిలోనే కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

ఆర్థిక అభివృద్ధి రేటు తాత్కాలికంగా మందగిస్తోంది : రాష్ట్రపతి

ఢిల్లీ : నోట్ల రద్దు వల్ల ఆర్థిక అభివృద్ధి రేటు తాత్కాలికంగా మందగిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. పేదల సంక్షేమానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

 

21:58 - January 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్‌ ఇచ్చింది. ప్రాజెక్టుల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ 123 జీవో ద్వారా భూసేకరణ చేయరాదని స్పష్టం చేసింది.  హైకోర్టు వెలువరించిన 78 పేజీల సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు.. తెలంగాణ సర్కారును పునరాలోచనలో పడేలా చేశాయి. తాజా పరిణామాల దృష్ట్యా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
భూసేకరణ కుదరదని మధ్యంతర ఉత్తర్వులు  
ప్రాజెక్టుల కోసం భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. జీవోనెంబర్‌ 123 ప్రకారం..తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఎమ్మార్వోల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారానే ప్రభుత్వం భూములు తీసుకుంటోందన్న పిటిషనర్ల అభియోగాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. 
పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం  
గతంలో.. 123 జీవోపై మెదక్‌ జిల్లాకు చెందిన రుక్కమ్మ అనే నిర్వాసితురాలు వేసిన పిటిషన్‌పై..  జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి బెంచ్‌ స్టే విధించింది. అనంతరం దీనిపై సర్కార్‌ అప్పీలుకు వెళ్లింది. రమేష్‌రంగనాథన్‌, దుర్గాప్రసాద్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ అప్పీలును విచారించింది. మూడు జిల్లాల నుంచి దాఖలైన మొత్తం 16 పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిపింది. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఎమ్మార్వోల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని పిటిషనర్‌లు సవాల్‌ చేశారు. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారానే ప్రభుత్వం భూములు తీసుకుంటోందన్న పిటిషనర్ల వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం లేదని, స్వచ్ఛంధంగా ముందుకొచ్చిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లించిన తర్వాతనే భూసేకరణ చేస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. 
తుది వాదనలు వినిపించవచ్చన్న ధర్మాసనం 
భూములపై ఆధార పడి జీవనం సాగిస్తున్న వివిధ కులవృత్తులు, రైతు కూలీలకు జీవో నెంబర్‌ 190, 191 జారీ చేశామని ఏజీ తెలిపారు. అయితే..ఆర్టికల్ 298 ప్రకారం జీవో ద్వారా భూసేకరణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. కాంట్రాక్ట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 23 కి విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారని వాదించారు. ఇప్పటికే 3 వేల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని అడ్వకేటు జనరల్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం .. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశాలపై తుది వాదనలు వినిపించవచ్చని సూచించింది. 
ప్రభుత్వం ఏం చేయబోతుందన్న ఆసక్తి 
హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే 2013 భూసేకరణ చట్టానికి ప్రత్యామ్నాయంగా.. 2016 భూ సేకరణ చట్టాన్ని తీసుకొస్తున్న సర్కార్‌.. దానికి రాష్ట్రపతి ఆమోదాన్ని పొందాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో 2016 చట్టంపై రాష్ట్రపతిని కలిసి ఆమోదించవద్దని వేడుకునేందుకు ఆలిండియా లాయర్స్‌ అసోషియేషన్‌ సిద్ధమవుతోంది. 2016 చట్టం ఆమోదం పొందినట్లయితే.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఐలూ ఉంది. 
మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులు హర్షం 
న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సర్కార్‌  ప్రజలకు చెబుతున్నదొకటి, వాస్తవానికి అమలు చేస్తోంది మరొకటని వారు పునరుద్ఘాటిస్తున్నారు. రెండున్నరేళ్లుగా సర్కారు భూసేకరణ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, ఉన్నత న్యాయస్థానం తీర్పు తమకు ఎంతో నైతిక బలాన్నిచ్చిందని నిర్వాసితులు చెబుతున్నారు. 
నిర్వాసితులకు తగిని న్యాయం చేయాలి : నిపుణులు
న్యాయస్థానం పలు చురకలు వేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలకు పోతోంది. ఇకనైనా 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేస్తూ.. నిర్వాసితులకు తగిని న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

21:51 - January 5, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్ని ప్రస్తుత విద్యాసంవత్సరంలో పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఒక్కమార్పూ చేయకుండా యథాతథంగా అమలు చేస్తున్నామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా అనాథబాలలను ఎస్సీలుగా గుర్తించి ప్రభుత్వమే చదివిస్తుందని సీఎం తెలిపారు.
బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించడం సాధ్యం కాదన్న సీఎం 
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై.. తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు ఆర్‌ కృష్ణయ్య, లక్ష్మణ్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలోని నిబంధనలను యథాతథంగా కొనసాగిస్తున్నామన్న కేసీఆర్‌.. ఈ విద్యాసంవత్సరంలో బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే బకాయిలను వీలువెంబడి తప్పకుండా చెల్లిస్తామన్నారు. 
అది ముమ్మాటికి వాస్తవం : కేసీఆర్‌
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొన్ని ప్రైవేటు కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాయనడం ముమ్మాటికి వాస్తవమని కేసీఆర్‌ అంగీకరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు. అలాంటి విద్యా సంస్థల నుంచి సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని దుర్వినియోగం చేసే కాలేజీలన్నింటిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ హెచ్చరించారు. 
దళిత విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తింపు 
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో రిజర్వేషన్‌ కేటగిరిలో కాకుండా ఓపెన్‌కోటాలో సీట్లు పొందిన దళిత విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో అవినీతికి పాల్పడే కాలేజీలను తప్పకుండా మూసేస్తామని.. వాటి స్థానంలో కొత్త కాలేజీలకు అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి లేవనెత్తిన అనాథ బాలల అంశంపైనా సీఎం స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని అనాథ బాలల విద్యను ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో చేపడుతుందన్నారు. అనాథ పిల్లలకు ఎస్సీ హోదా ఇచ్చి..ఎస్సీలకు ఇచ్చే అన్ని రకాల వసతులను వారికి కల్పిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా ప్రభుత్వం సవివరంగా సమాధానం ఇచ్చినా, కాంగ్రెస్‌ పార్టీ వాకౌట్‌ చేయడం శోచనీయమన్నారు. 

 

21:46 - January 5, 2017

హైదరాబాద్ : సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట కాలపరిమితి విధించింది. ఉద్యోగం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా  భర్తీ చేయాలని ఆదేశాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. భూగర్భ బొగ్గు గనులను మూసివేయబోమని, కొత్తగా పదకొడు గనులు తెవరడం ద్వారా పన్నెండు వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్య కారణంతో ఉద్యోగాల నుంచి వైదొలగించిన 900 మంది ఉద్యోగులు కుటుంబాలకు వచ్చే మార్చి 31 లోగా ఉద్యోగాలు  ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.   
సింగరేణి కాలరీస్‌పై చర్చ 
తెలంగాణ కొంగు బంగారం సింగరేణి కాలరీస్‌పై అసెంబ్లీలో చర్చ జరిగింది. సంస్థ పూర్వాపరాలపై సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై  జరిగిన చర్చలో వివిధ పక్షాల సభ్యులు పాల్గొన్నారు. కంపెనీ మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు, వారసత్వ ఉద్యోగుల భర్తీ, ఓపెన్‌కాస్ట్‌ గనులతో పర్యావరణానికి ఎదురవుతున్న సమస్యలు విలువైన సూచనలు చేసి, సలహాలు ఇచ్చారు. ఉద్యోగి రిటైరైన తర్వాత ఆరు నెలల్లోగా ఖాళీని ఆ కుటుంబంలోని వ్యక్తితో భర్తీ చేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి చేసిన సూచనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. వారసత్వ ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం ఉన్న 35 ఏళ్ల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు నల్లాల ఓదేలు కోరగా, ముఖ్యమంత్రి అంగీకరించారు. సింగరేణిలో రిటైరవుతున్నకార్మికులకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి చేసిన సూచనపై కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. 
కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలి : సున్నం రాజయ్య 
క్రమశిక్షణా చర్యల పేరుతో సింగరేణి నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని సానుభూతితో పరిశీలించాలని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే సంస్థలో పని చేస్తున్న 20 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు.  
ఉద్వాసనకు గురైన ఉద్యోగుల కేసులను పరిశీలిస్తాం : సీఎం కేసీఆర్ 
అధికారుల తప్పులు, పొరపాట్ల కారణంగా ఉద్వాసనకు గురైన ఉద్యోగుల కేసులను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులు ప్రమాదాల్లో చనిపోతే 36 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్నిగుర్తు చేశారు. ఏకారణంగానైనా ఉద్యోగం తీసుకోపోతే మరో పన్నెండున్నర లక్షల రూపాయల పరిహారం అందేలా ఏర్పాటు చేసిన అంశాన్నిప్రస్తావించారు. అలాగే సహజ మరణానికి 26 లక్షల పరిహారంతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలిస్తున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఉద్యోగం వద్దనుకుంటే మరో పన్నెండున్నర లక్షల పరిహారం ఇస్తున్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. 
సింగరేణికి పూర్వవైభవం తీసుకొస్తాం : సీఎం కేసీఆర్‌  
ఉత్పత్తి నుంచి ఉద్యోగల నియామకాల వరకు సింగరేణికి పూర్వవైభవం తీసుకొస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ అంశంపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్‌ మధుసూదనాచారి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేశారు. 
 

 

21:39 - January 5, 2017
21:37 - January 5, 2017
21:36 - January 5, 2017

రేపు బీసీపీఐ సెలక్షన్ కమిటీ సమావేశం

ఢిల్లీ : రేపు బీసీపీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇంగ్లండ్ తో వన్డే, టీ.20 సిరీస్ లకు జట్లను ఎంపిక చేయనున్నారు. బీసీసీఐ నుంచి కోహ్లీకి పిలుపు వచ్చింది. ఈనెల 15 నుంచి ఇంగ్లండ్ తో వన్డే, టీ.20 మ్యాచులు జరుగనున్నాయి.

గుడివాడ క్లబ్ కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశం

కృష్ణా : గుడివాడ క్లబ్ లో కాల్పుల ఘటనపై ఎపి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 24 గంటల్లోగా విచారించి, నివేదిక అందజేయాలని ఏలూరు రేంజ్ డీఐజీని ఆదేశించింది. పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

21:19 - January 5, 2017
21:18 - January 5, 2017

ఉట్టికెగరలేనమ్మ.. ఇంకెక్కడికో ఎగురతానందంట... చేయాల్సినవి చేయకుండా ఆకాశానికి దూసుకుపోతానంటోంది మన సర్కార్.. కనీస సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించకుండా నోబెల్ వస్తే వందకోట్లు ఇస్తామంటున్నారు...నోబెల్ మాట తర్వాత ముందు కనీసం బాత్ రూములు, ల్యాబులు ఏర్పాటు చేయమని విద్యార్థులు అడుగుతున్నారు. మన విద్యా వ్యవస్థవున్న పరిస్థితికి పరిశోధనలు సాధ్యమా...? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం...
పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:50 - January 5, 2017

ఢిల్లీ : హస్తినలో ఘోరం ప్రమాదం జరిగింది. ఆల్టో కారు అతివేగంగా వచ్చి మొదటగా మహిళను ఢీకొట్టింది. ఆ తర్వాత వ్యాగన్..ఆర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ రెండు కార్ల మధ్య నలిగిపోయింది. ఆ తర్వాత మహిళపై కారు పడింది. వెంటనే స్పందించిన స్థానికులు కారు కింద పడిన మహిళను తీసేశారు. ఒల్లుగగురుపుట్టించే విధంగా జరిగిన ప్రమాదం నుంచి ఆ మహిళ మృత్యుంజయురాలిగా బయటపడింది. 

20:38 - January 5, 2017

హైదరాబాద్ : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో కష్టాలు పడి విద్యార్థులు కాలేజీలో చదువుతుంటే ఫీజు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని చెప్పారు. ప్రభుత్వమే ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని కోరారు.  

20:34 - January 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో నిరసన గోల చోటుచేసుకుంది.  ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ కొనసాగింది. సభలో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రయత్నం చేశారు. మళ్లీ అవకాశం ఇచ్చేదిలేదని స్పీకర్ ఆయనకు చెప్పారు. కావాలంటే నిరసన తెలుపుకోవచ్చని సూచించారు. నిరసన ఎప్పుడు ఎలా తెలపాలో మీరే చెబుతారా అని భట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

కొత్త భూసేకరణ చట్టం వేగవంతం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు మీడియాతో ముచ్చటించారు. కొత్త భూసేకరణ చట్టం వేగవంతం చేసినట్లు తెలిపారు. కొత్త భూసేకరణ చట్టంకు గవర్నర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపామని చెప్పారు. కేంద్ర హోం, న్యాయశాఖ పరిశీలన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందనుంది. 2013 భూ సేకరణ చట్టం వల్ల దేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదని చెప్పారు. 

 

జీవో 123 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : దామోదర

హైదరాబాద్ : జీవో 123 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా తెలిపారు. హైకోర్టు మధ్యంతర తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిందని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. భూసేకరణ పేరుతో భూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. 

అసెంబ్లీ సమావేశాలను రేపటితో ముగించే యోచనలో టీసర్కార్

హైదరాబాద్ : టీసర్కార్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రేపటితో ముగించే యోచనలో ఉంది. తిరిగి పండుగ తర్వాత వారం పాటు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. 

19:56 - January 5, 2017
19:55 - January 5, 2017
19:42 - January 5, 2017

నెల్లూరు : ఆ రైతన్నల పోరాటం ఫలించింది. పరిశ్రమలు పెడతామని భూములు తీసుకున్న సెజ్‌ యాజమాన్యం.. రెండు దశాబ్దాలుగా భూములను బీడుపెట్టింది. సెజ్‌ చెరబట్టిన భూములకు న్యాయస్థానం జోక్యంతో  స్వేచ్చ లభించే అవకాశం కలిగింది. దీంతో పాడుపడిన భూముల్లో తిరిగి బంగారుపంటలు పండిస్తామంటున్నారు నెల్లూరు జిల్లా అన్నదాతలు. 
ఇఫ్కో కిసాన్ సెజ్‌ యాజ‌మాన్యానికి హైకోర్టు మొట్టికాయ‌లు 
నెల్లూరు జిల్లా అన్నదాత‌ల పోరాటం ఫలించింది. ఇఫ్కో కిసాన్ సెజ్‌ యాజ‌మాన్యానికి హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. సెజ్ లో య‌ధాతథ స్ధితిని కోన‌సాగించాలంటూ హైకోర్టు  ఆదేశాలు ఇవ్వడంతో  వ్యవ‌సాయేత‌ర భూముల కేటాయింపున‌కు కళ్లెం ప‌డింది. 
యూరియా కర్మాగారం ఊసేలేదు.. 
నెల్లూరు జిల్లా రాచర్లపాడులో 1993లో ఇఫ్కో ఎరువుల కంపెనీ కిసాన్‌సెజ్‌  పేరుతో 2776 ఎకరాలను సేకరించింది. వీటిలో ప్రభుత్వ భూములతోపాటు, గ్రామానికి చెందిన రైతులు, దేవాలయ భూములు కూడా ఉన్నాయి. భూములైతే తీసుకున్నారు కాని.. 20ఏళ్లు గడిచినా యూరియా కర్మాగారం ఊసేలేకుండా పోయింది. బంగారుపంటలు పండే భూములను బీడుపెట్టింది ఇఫ్కో యాజమాన్యం. 
హైకోర్టులో రైతులు ప్రజాప్రయోజన వ్యాజ్యం 
ప‌రిశ్రమ‌లైనా పెట్టండి లేదా భూమ‌లు తిరిగిచ్చేయండి అని రైతులు ఒత్తిడి చేయడంతో.. ఎట్టకేలకు  ఈ భూముల్లో వెయ్యి కోట్లతో గ‌మేషా అనే కంపెనీ ఏర్పాటైంది. ఎరువుల కంపెనీ పెడతామని చెప్పిన సెజ్‌ యాజమాన్యం .. చివరికి ర‌సాయ‌న కంపెనీల‌కు భూములు కేటాయించింది. అంతటితోనే ఆగకుండా దేవాలయ భూములను కోకకోలా కంపెనీకి కట్టబెట్టారు అధికారులు. దీనిపై రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖ‌లు చూశారు.
భూ గంద‌రగోళంపై కోర్టు విచార‌ణ 
ఈ భూ గంద‌రగోళంపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు సెజ్ లో భూ కేటాయింపులు నిర్వహించ‌కుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నెల 24న ఇఫ్కో యాజ‌మాన్యం, గ‌మేషా, కోకోకోలా కంపెనీల ప్రతినిధులు త‌మ వాదన‌లు వినిపించాలని కూడా  కోర్టు ఆదేశించింది.
ఎలాంటి న‌ష్టప‌రిహారం లేదు... 
అయితే అప్పట్లో సెజ్‌ ఏర్పాటును రైతులు వ్యతిరేకించారు. తమ పోలాలు ఇచ్చేందుకు స‌సేమిరా అన్నారు. అయితే ఎరువుల క‌ర్మాగారంలో రైతుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని న‌మ్మబలికారు అధికారులు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో తమ భూముల‌ను అప్పగించామంటున్నారు రైతులు. మరోవైపు కోవూరులోని కోదండ రామస్వామి ఆల‌య భూములు 1154 ఎక‌రాలకు ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి న‌ష్టప‌రిహారం చెల్లించ‌లేదంటున్నారు. 
గ్రామం బీడుభూమిగా మారిందని రైతులు ఆవేదన
ఒకప్పుడు తమ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన తమ గ్రామం.. కిసాన్‌సెజ్‌ యాజమాన్య నిర్వాకంతో.. బీడుభూమిగా మారిందని రాచర్లపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు న్యాయస్థానం జోక్యంతో తమ భూములు తమకు దక్కుతాయని అన్నదాతలు సంతోషపడుతున్నారు. 

 

19:35 - January 5, 2017
19:33 - January 5, 2017

విజయనగరం : జిల్లా కేంద్రంలో 10టీవీ క్యాలెండర్‌ను జడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి ఆవిష్కరించారు. ఆడ పిల్లల ఫొటోలతో ముద్రించిన క్యాలెండర్‌ చూడముచ్చటగా ఉందని ఆమె ప్రశంసించారు. ఆడపిల్లల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న సమయంలో.. ఆడపిల్లల ఫొటోలతో 10 టీవీ క్యాలెండర్‌ ప్రచురించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. 

 

19:31 - January 5, 2017

విజయవాడ : ఏపీలోని మున్సిపల్‌ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియంగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రం భాషకు ప్రాచుర్యం కల్పిస్తుంటే.. మన రాష్ట్రంలో తెలుగును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఉపాధ్యాయులంటున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. 

 

19:25 - January 5, 2017

నెల్లూరు : పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్యులకు ముప్ప తిప్పలు తప్పడం లేదు. ఇదే పరిస్థితి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఎదురైంది. తన వాహనంలో 2500 రూపాయల డీజిల్‌ నింపుకుని.. ఎస్ బీహెచ్ కార్డు ద్వారా డబ్బు చెల్లించాడు. అయితే.. తన సెల్‌కు వచ్చిన మెసెజ్‌ చూసి శ్రీధర్‌రెడ్డి ఖంగుతిన్నాడు. 2500 రూపాయల డీజిల్‌కు.. తన అకౌంట్‌ నుంచి 23,100 డెబిట్‌ అయ్యాయి. ఇదేంటని.. పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని ప్రశ్నిస్తే తమ అకౌంట్‌లో 2500 రూపాయలు మాత్రమే క్రెడిట్‌ అయినట్లు రిసిప్ట్‌ చూపించారు. ఇదే విషయాన్ని బ్యాంక్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు శ్రీధర్‌రెడ్డి. ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందోనని శ్రీధర్‌రెడ్డి అన్నారు. మోదీ తొందరపాటు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

 

19:19 - January 5, 2017

హైదరాబాద్ : సమైక్యపాలనలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఅసెంబ్లీలో సింగరేణిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో సింగరేణి గనుల్లో కుంభకోణాలు జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అక్రమాలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. సింగరేణి భయంకరమైన సర్వీస్ అని.. కార్మికులకు దినదినగండం నూరేళ్ల అయుష్షుగా ఉందన్నారు. కార్మికులు తెలంగాణ వారు, అధికారులు ఆంధ్రవారుగా ఉన్నారని తెలిపారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో లక్ష రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే...రూ.36 లక్షల నష్టపరిహారం ఇస్తామని, అలాగే డిపెండెంట్ ఎంప్లాయింట్ ఇస్తామని చెప్పారు. ఒకవేల డిపెండెంట్ ఎంప్లాయింట్ తీసుకోని ఎడల రూ.12.5 లక్షలు ఇస్తామన్నారు. సహజ మరణానికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇస్తామని...అలాగే డిపెండెంట్ ఎంప్లాయింట్ కల్పిస్తామని చెప్పారు. ఒక వేల డిపెండెంట్ ఎంప్లాయిస్ కు తీసుకోని ఎడల రూ.12.5 లక్షలు చెల్లిస్తామన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని అభివర్ణించారు. సింగరేణి గొప్ప అద్భుతమైన సంస్థ అని కొనియాడారు. కొత్తగా 11 అండర్ గ్రౌండ్ మైన్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 1106 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. డిపెండెంట్ ఎంప్లాయ్ మెంట్ కు వయసు పరిమితిని 30 నుంచి 40 సం.లకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో కూడిన మెడికల్ కాలేజీ తీసుకొస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులకు, వారితోపాటు అక్కడ నివసించే ఇతర పనులు చేసుకునే ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు.

 

19:02 - January 5, 2017

కరీంనగర్ : జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కుమారప్వామి అనే రైతు వద్ద నుండి 5 వేల రూపాయలను లంచం తీసుకుంటుండగా డిప్యూటి తహాశీల్దార్ రాజమల్లును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. మిడ్ మానేర్ ప్రాజెక్టు కెనాల్ కాలువ ల నిర్మాణం కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహరం చెల్లించేందుకు చెక్కులను మంజూరు చేసింది. అర్హులైన రైతులకు చెక్కులను అందించకుండా డిప్యూటి తహసీల్దర్ రాజమల్లు రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో రైతులంతా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కుమారస్వామి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు డబ్బులను తీసుకుంటుండగా  డిప్యూటి తహాశీల్దార్‌ను అవినీతి శాఖ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలో  తనిఖిలు నిర్వహంచి పలు పైళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

 

18:59 - January 5, 2017

నల్లగొండ : జిల్లా 10టీవీ ప్రతినిధి చంద్రశేఖర్‌కు ఉత్తమ జర్నలిస్టు పురస్కారం లభించింది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో చంద్రశేఖర్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. చంద్రశేఖర్‌కు డీఐజీ కల్పనా నాయక్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతో పాటు.. నగదు పురస్కారాన్ని అందజేశారు. 

 

18:57 - January 5, 2017

హైదరాబాద్‌ : నగరంలో 10టివి నూతన సంవత్సర క్యాలెండర్‌ను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆవిష్కరించారు. సమాజంలో టెన్‌ టీవీ పోషిస్తున్న పాత్ర  అపారమని ఈ సందర్భంగా మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. సమాజంలో మరింత చైతన్యం తెచ్చేలా భవిష్యత్‌లోనూ 10టివి గురుతరమైన బాధ్యత వహించాలని మేయర్‌ సూచించారు. 

 

18:52 - January 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కాలరీస్‌లో పని చేస్తున్న ఇరవై వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఎస్ తీసుకున్న కార్మికుల కుటుంబసభ్యులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. 

18:46 - January 5, 2017

హైదరాబాద్ : ప్రైవేటు కంపెనీలతో సింగరేణి ఓటీపీ ఒప్పందాలు చేసుకోవడంతో సంస్థ కోట్ల రూపాయలు నష్టపోయిందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న అప్పటి సింగరేణి ఎండీ నర్సింగ్‌రావు ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఓ ప్రైవేటు కంపెనీకి సీఈవోగా ఉన్న రామకృష్ణారావు ఇప్పుడు ఆర్థిక శాఖ ఆర్యదర్శిగా పని చేస్తున్న అంశాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఒప్పందం సమయంలో యాభై కోట్ల రూపాయల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లించినా, ఇంతవరకు పనలు ప్రారంభించలేదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 
 

సీఎం కేసీఆర్ పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన టీకాంగ్రెస్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఫీజు రియింబర్స్ మెంట్ పై సీఎం కేసీఆర్ సభను తప్పుదోవపట్టించారని పార్టీ నేతలు అభియోగం మోపారు. ఈమేరకు ఫీజు రియింబర్స్ మెంట్ పై సీఎం సభను తప్పుదోవపట్టించారని స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు.

 

2017 టెట్ పరీక్షలు ఆన్ లైన్ లోనే : మంత్రి గంటా

విశాఖ : 2017 టెట్ పరీక్షలు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఆన్ లైన్ పరీక్షలు ఏ విధంగా ఉంటాయో త్వరలోనే వెల్లడిస్తామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆన్ లైన్ లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

టీ.అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకముందు ఫీజు రియింబర్స్ మెంట్ పథకంపై వాడీవేడీ చర్చ జరిగింది. అనంతరం సింగరేణి కార్మికులపై స్వల్పకాలిక చర్చ జరిపారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. 

 

18:29 - January 5, 2017

కృష్ణా : గుడివాడ క్లబ్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు తన రివాల్వర్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. భయంతో జనం పరుగులు తీశారు. సంఘటనాస్థలికి చేరిన పోలీసులు విచారిస్తున్నారు. రావి వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి క్లబ్ కు వెళ్లారు. ఆయన రివాల్వర్ మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. గుడివాడ క్లబ్... మెట్రోపాలిటన్ కు చెందిన క్లబ్. దీనికి కమిటీ ఉంది. అధ్యక్షులు కూడా ఉన్నారు. అయితే గతంలో క్లబ్ లో అసాంఘీక కార్యక్రమాలు జరిగాయి. దీంతో క్లబ్ పై నిషేధం విధించారు. కానీ క్లబ్ అనధికారికంగా నడుస్తుంది. నిషేధం ఉన్న క్లబ్ ను ఎలా తెరిచారని..? అందులోకి ఎందుకు వెళ్లారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల ఘటనపై సమగ్రమైన విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

గుడివాడ క్లబ్ లో కాల్పుల కలకలం

కృష్ణా : గుడివాడ క్లబ్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు తన రివాల్వర్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. భయంతో జనం పరుగులు తీశారు. సంఘటనాస్థలికి చేరిన పోలీసులు విచారిస్తున్నారు. 

 

18:16 - January 5, 2017
18:15 - January 5, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌పై వార్‌ మొదలైంది. బడ్జెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ విపక్షాలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశాయి. బడ్జెట్‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని బిజెపి చెబుతోంది.
ఏకతాటిపైకి విపక్షాలు 
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన వెలువడగానే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఎన్నికల ముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్‌, ఎస్పీ, బిఎస్పీ, ఆర్‌ఎల్డీ, జెడియు, ఆర్జేడి, తృణమూల్‌, డిఎంకె తదితర 16 పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. ఎన్డీయే మిత్రపక్షం శివసేన కూడా ఈ బృందంలో ఉంది.
బడ్జెట్ ను వాయిదా వేయాలన్న విపక్షాలు  
ఫిబ్రవ‌రి 4 నుంచి మార్చి 8 వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ నెల 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి1న సాధారణ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశ పెట్టనుంది. అంటే బడ్జెట్‌ ప్రవేశపెట్టగానే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభం కానున్నందున దీన్ని వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ఎన్నికల అనంతరం అంటే మార్చి 8 తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టేలా కేంద్రానికి సూచించాలని విపక్షాలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు కేంద్రం బడ్జెట్‌లో జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టే అవకాశముందని...దీనివల్ల ఎన్నిక‌ల్లో బిజెపికి, దాని మిత్రపక్షాలకు ల‌బ్ధి చేకూరుతుంద‌ని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. 2012 ఎన్నికల సమయంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను మార్చిలో ఎన్నికలు పూర్తయ్యాక ప్రవేశపెట్టిన తీరును విపక్ష నేతలు ఈసీకి గుర్తు చేశాయి.
ఫిబ్రవరి1న బడ్జెట్‌ సరికాదు : సీతారాం
ఫిబ్రవరి1న బడ్జెట్‌ ప్రవేశపెట్టడం సరికాదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నికల ముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టడమంటే ఓటర్లను కొల్లగొట్టడమేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవ‌రి 1న బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టడానికి కేంద్రం సన్నద్ధం
మరోవైపు కేంద్రం ఫిబ్రవ‌రి 1నే బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టడానికి సన్నద్ధమ‌వుతోంది. పెద్దనోట్ల రద్దు ఓ విఫల ప్రయోగమన్న విపక్షాలు బడ్జెట్‌ను చూసి ఎందుకు భయపడుతున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రశ్నించారు. ఎప్పుడూ ఏదో ఓ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం సహజమని, 2014లో కూడా ఎన్నికల ముందే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించిన‌ట్లే : విపక్షాలు  
ఎన్నికల ముందు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్రప‌తి ప్రణ‌బ్ ముఖ‌ర్జీకి కూడా ఫిర్యాదుచేశాయి. ఎన్నిక‌లు మూడు రోజుల ముందు బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టవ‌చ్చా లేదా అన్నది ప్రస్తుతం ఎన్నిక‌ల సంఘం ప‌రిశీలన‌లో ఉంది. 

 

17:50 - January 5, 2017

హైదరాబాద్ : వాకిట్లో రంగుల ముగ్గులు...ఇంటి ముంగిట పచ్చని తోరణాలు.. ఇంటి నిండా బంధువులు... చిన్నపిల్లల ఆటపాటలు... పెద్దల సరదాలు... ఘుమఘుమలాడే పిండి వంటలు... వెరసి సంక్రాంతి సంబరాలు.. పది రోజుల్లో వచ్చే పెద్ద పండుగకు పల్లెలు... పట్టణాలు సన్నద్ధమవుతున్నాయి.  
వారం రోజుల పాటు సాగే సంబరాలు
తెలుగువాళ్ల సంస్కృతి.. సంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి పండుగ. ఏపీలో ఈ పండుగకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. రైతులు ఏడాది పాటు కష్టపడి...పండించిన పంట చేతికొచ్చే సమయాన ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు ఈ పండుగ సంబరాలు సాగుతాయి.  పెద్దలు.. పిల్లలు.. మహిళలు..యువతీయుకులు కొత్త బట్టలు ధరించి.. ఆనందంగా ఆటపాటల్లో మునిగితేలుతారు.ఎక్కడెక్కడో ఉండే బంధువర్గం ఒకచోట చేరుకుని.. తమ అనుభవాలను.. జ్ఞాపకాలను..నెమరవేసుకుంటారు.
పలు జిల్లాలో సంక్రాంతి శోభ
ఇప్పటికే కృష్ణా..గుంటూరు..తూర్పు..పశ్చిమగోదావరి..విజయనగరం జిల్లాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా నిన్నమొన్నటి వరకు వెలవెలబోయిన వస్త్ర దుకాణాలు.. నగల షాపులు.. మళ్లీ కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి సందర్భంగా..నెలరోజుల ముందు నుంచే సన్నాహాలు చేసుకుని.. ఎక్కడెక్కడో స్థిర పడినవారు...వారి గ్రామాలకు తరలుతారు..నాలుగు రోజుల పాటు హాయిగా గడుపుతారు. 

 

17:48 - January 5, 2017

కర్నూలు : వేరేవాళ్లు ప్రాజక్టులు కట్టినా తనకే పేరు రావాలని సీఎం చంద్రబాబుకు దుర్బుద్ధి ఉందని వైసీపీ అధినేత వైఎస్-జగన్‌ విమర్శించారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నింపుకోలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు.

17:36 - January 5, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఫీజు రియింబర్స్ మెంట్ పై సీఎం కేసీఆర్ సభను తప్పుదోవపట్టించారని పార్టీ నేతలు అభియోగం మోపారు. ఈమేరకు ఫీజు రియింబర్స్ మెంట్ పై సీఎం సభను తప్పుదోవపట్టించారని స్పీకర్ మధుసూదనాచారికి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్... ఫీజు రియింబర్స్ మెంట్ పై సభలో తప్పుడు లెక్కలు చెప్పారని, సభను తప్పుదోవపట్టించారని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:57 - January 5, 2017

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టు తెలుగు జాతికి జీవనాడి వంటిదని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం పూర్తి అయితే ఉభయగోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో నీరు సమృద్ధిగా ఉంటుందన్నారు. జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ. 1638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రూపొందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విపక్షాల మాటలతో ఏకీభవించి.. కేంద్రంతో వ్యతిరేకిస్తే పోలవరం నిర్మాణం పూర్తయ్యేనా...? ప్రశ్నించారు. కేంద్రంతో విభేదిస్తే పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలి ఉండేదన్నారు. పోలవరాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలని దేవుడు తనను ఆశీర్వదించాడని భావిస్తున్నట్లు తెలిపారు. పోలవరం నిర్మాణం చేయడం ఒక అవకాశమన్నారు. మొదటి సంవత్సరమే పట్టిసీమ పూర్తి చేశామని చెప్పారు. సముంద్రంలోకి పోయే నీరు కృష్ణా డెల్టాకు ఇచ్చామని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే నీటిని కృష్ణా డెల్టాకు తీసుకెళ్తామంటే రాజకీయ పార్టీలు, సంస్థలు రకరకాల విన్యాసాలు చేశారని మండిపడ్డారు. రాజకీయం తెలిసిన వ్యక్తిని కాబట్టే స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగిందని, ప్రత్యేక హోదాకు వచ్చే అంశాలన్నీ ప్యాకేజీలో ఉండ బట్టే ఒప్పుకోవడం జరిగిందన్నారు. తాను రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కుల కోసం పని చేయడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు తనకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. సీలేరు నీరు తీసుకొచ్చి రెండు పంటలకు నీరు ఇచ్చామని తెలిపారు. నీరు ప్రాణమని ... నీరు లేకపోతే అభివృద్ధి లేదని స్పష్టం చేశారు. ప్రకృతిని ఆరాధించాలి, ప్రార్థించాలన్నారు. ధవళేళ్వరం ప్రాజెక్టు వల్ల ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దిశ మారిందన్నారు. దాన్ని నిర్మించిన సర్ అర్దన్ కాటన్ కు ప్రజలు పూజలు చేస్తున్నారని తెలిపారు. సర్ అర్దన్ కాటన్ ధవలేశ్వరాన్ని నిర్మించారు.. అప్పుడే పోలవరం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉన్నది.. కానీ డబ్బులు లేకపోవడం వల్ల నిర్మించలేదని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణం ఒక అవకాశమన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరీ, తెలుగు గంగ, పెనుగంగ వంటి అన్నీ ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. రాయలసీమను రతనాలసీమగా తయారు చేస్తామని చెప్పారు. కరువు నివారణ, రైతు సమస్యలు పరిష్కారం లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. తనకు రాజకీయం తెలుసునని.. రాష్ట్ర అవసరాలు కూడా తెలుసునని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నడూ విస్మరించనని తెలిపారు. 'మీ అభిమానాన్ని దుర్వినియోగం చేయనని ప్రజలనుద్ధేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలు, పేదవారు, రైతు ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. తన మీద, తన విజ్ఞత మీద ప్రజలు నమ్మకం ఉంచారని తెలిపారు. 

 

16:36 - January 5, 2017

హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సింగరేణి సంస్థను ఆదుకోవాలన్నారు. సీఎస్ ఆర్ కు సంబంధించిన డబ్బు.. సింగరేణేతర ప్రాంతాలకు పోవద్దన్నారు. కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. రెగ్యులర్ కార్మికులకు ఉన్న విధంగా సెలవులు లేవన్నారు. కష్టానికి కావాల్సిన ప్రతిఫలం అందడం లేదని చెప్పారు. కార్మికుల కష్టాన్ని దోపిడి చేయొద్దని పేర్కొన్నారు. సింగరేణిలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. కోల్ ఇండియాలాగా రియింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు తీసుకున్న భూపాపల్లి జింగేడిపల్లి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. విశ్రాంత బొగ్గు గని కార్మికులకు న్యాయం జరగాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:19 - January 5, 2017

తూర్పుగోదావరి : రాష్ట్రంలో 43 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. త్వరలో మరో 4 లక్షల మందికి పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. రూ.24 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని వివరించారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 

కేంద్రంతో వ్యతిరేకిస్తే పోలవరం వచ్చేనా - బాబు..

తూర్పుగోదావరి : కేంద్రంతో వ్యతిరేకిస్తే పోలవరం నిర్మాణం పూర్తయ్యేనా అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ. 1638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రూపొందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాజకీయం తెలిసిన వ్యక్తి కాబట్టే స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగిందని, ప్రత్యేక హోదాకు వచ్చే అంశాలన్నీ ప్యాకేజీలో ఉండడం బట్టే ఒప్పుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం..ప్రజల హక్కుల కోసం పనిచేయడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు.

బీజాపూర్ లో మావోయిస్టు మృతి..

ఛత్తీస్ గఢ్ : బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు మృతి చెందగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జగన్ అక్రమాస్తులపై ఈడీ అప్పీళ్లపై కోర్టు తీర్పు..

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులపై ఈడీ అప్పీళ్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. అప్పీలేటింగ్ అథార్టీలో తేలే వరకు ఆస్తులు స్వాధీనం చేసుకోవద్దని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించిన సంగతి తెలిసిందే. తమ వాదన వినకుండా ఏకపక్షంగా ఆదేశాలిచ్చారని ఈడీ అప్పీల్ చేసింది. తీర్పును పున:సమీక్షించాలని సింగిల్ జడ్జికి హైకోర్టు ఆదేశించింది. ఈనెల 31 వరకు ఆస్తులపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది.

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి బాబు శంకుస్థాపన..

తూర్పుగోదావరి : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ. 1638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రూపొందనుంది. జిల్లాలోని 5నియోజకవర్గాల మెట్టప్రాంత రైతులకు సాగునీరు, 87వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు, విశాఖ జిల్లాలో తాగునీరు పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

123 జీవోపై కోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం - సీపీఎం..

హైదరాబాద్ : 123 జీవో పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, బి.వెంకట్ లు పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టం సవరణలు ఉపసంహరించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. సీపీఎంపై కేసీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరి 24న సీపీఎం మహాజన పాదయాత్రకు వంద రోజుల సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారంలో జరిగే సభకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రదీప్ చంద్ర పదవి కాలం పొడిగించకుండా ఆయన పట్ల ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు.

15:58 - January 5, 2017

హైదరాబాద్ : స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లు ప్రభుత్వ కనుసన్నల్లో కాకుండా తమ అధికారాలను ఉపయోగించి సభను నడపాలని టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 15 లక్షల మంది విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. పేద విద్యార్ధులు చదువుకోకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఫీజు బకాయిలపై తెలంగాణ సర్కార్‌ స్పష్టత ఇవ్వకపోవడం వల్లే సభ నుంచి వాకౌట్‌ చేశామని చెప్పారు.

15:56 - January 5, 2017

హైదరాబాద్ : గత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యధాతధంగా అమలు చేస్తున్నా..పథకంలో అన్ని లోసుగులున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించడం అన్యాయమన్నారు సీఎం కేసీఆర్‌. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం సవివరంగా సమాధానం ఇచ్చినా తర్వాత కూడా..కాంగ్రెస్‌ పార్టీ వాకౌట్‌ చేయడం శోచనీయమన్నారు. 

 

15:54 - January 5, 2017

హైదరాబాద్ : ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.. కాలేజీల్లో తనిఖీలుచేసి తయారుచేసిన రిపోర్టును సభలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు.. ఈ రెండు అంశాలపై నిరసనగా తాము సభనుంచి వాకౌట్‌ చేస్తున్నామని ప్రకటించారు.

 

15:33 - January 5, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకోవడం సరికాదన్నారు సీఎం కేసీఆర్‌. అలాంటి విద్యా సంస్థల నుంచి విద్యార్థుల సర్టిఫికెట్లను తప్పకుండా ప్రభుత్వం వారికి అందచేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనాథ పిల్లల విద్యను ప్రభుత్వం పూర్తి ఖర్చులతో చేపడుతుందన్నారు. అనాథ పిల్లలకు ఎస్సీ హోదా ఇచ్చి..ఎస్సీలకు ఇచ్చే అన్ని రకాల వసతులను వారికి కల్పిస్తామన్నారు. 

15:30 - January 5, 2017

హైదరాబాద్ : 2015-16 విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్ని మార్చి 31లోగా పూర్తిగా చెల్లిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. అలాగే హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో రిజర్వేషన్‌ కేటగిరిలో కాకుండా ఓపెన్‌కోటాలో సీట్లు పొందిన దళిత విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఖచ్చితంగా వర్తింపచేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో అవినీతికి పాల్పడే కాలేజీలను తప్పకుండా మూసేస్తామని..వాటి స్థానంలో కొత్త కాలేజీలకు అనుమతి ఇస్తామన్నారు. 

15:25 - January 5, 2017

కృష్ణా : జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపలల్లి మండలం రాజేశ్వరం గ్రామానికి చెందిన అన్నవరపు వీణ ( 18) అనే విద్యార్థిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో త్రిపుల్ ఈ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలీజే హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది. ఈనేపథ్యంలో హాస్టల్ లోని తోటి విద్యార్థులు వీణ గది తలుపులు తెరిచి చూడగా వీణ ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెంది ఉంది. తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ హాస్టల్, పోలీసులు హాస్టల్ చేరుకుని మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని విద్యార్థిని తల్లితండ్రులు చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలపాలని చెప్పారు. వీణ ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందిపడుతుందని..దాంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసు ప్రాథమికంగా విచారణలో తెలిపారు. ఆత్మహత్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ గదిలోని మంచం ఉన్న పరిస్థితికి, ఫ్యానుకు ఉరేసుకున్న పరిస్థితికి అనుమానం ఉందని పోలీసులు అన్నారు. తోటి విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. విద్యార్థిని ఏమైనా సూసైడ్ నోట్ దాచిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీణ అందరితో కలిసి మెలిసి ఉండేదని తోటి విద్యార్థులు తెలిపారు. కానీ రెండు రోజుల నుంచి వీణ ముబావంగా ఉంటుందని విద్యార్థులు చెప్పారు. 

 

'సింగరేణి' కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : దేశంలో బొగ్గు ఉత్పత్తి బాగా పెరిగిందని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా ఉందంటే అది బొగ్గు కార్మికుల ఘనతేనని బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి అంశంపై ఆయన మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని, 1.16 లక్షల ఉద్యోగుల సంఖ్య 56వేలకు చేరిందన్నారు. 'సింగరేణిలో హరితహారానికి ప్రాధాన్యతనివ్వాలి. రోగాల బారిన పడిన కార్మికులను ఆదుకోవాలి. కుంభకోణాల నుండి సింగరేణిని రక్షించాలి. సింగరేణిలో 1100 టిప్పర్ల బొగ్గు దొంగతనం జరిగింది. సింగరేణిలో వస్తువుల అక్రమ రవాణాను నివారించాలి. సింగరేణి పరివాహక ప్రాంతాల్లో కాలుష్యం నివారించాలి.

15:11 - January 5, 2017

అత్తగారింట్లో అల్లుడి హత్య..మామ..బావమరుదులే హంతకులు..ఆ ఇంటి ఆడబిడ్డ తాళి తెంచేసిన దుర్మార్గం..ఆవేశంలో దారుణానికి ఛిద్రమైన కుటుంబం..

ఇంటి అల్లుడు చెడ్డవాడు అయితే...మార్చుకోవడానికి ఎన్నో మార్గాలుంటాయి కదా..పెద్ద వయస్సులో ఉన్న కన్నతండ్రి ఆలోచించలేదు..తోడబుట్టిన సోదరులు కూడా ఆవేశంతో ఊగిపోయారు. అందరూ కలిసి ఆ ఇంటి అల్లుడిని అంతమొందించారు. దారుణంగా కొట్టారు. చివరకు మెడకు తాడు బిగించి చంపేశారు. వీరి ఆవేశం ఆ కూతురి తాళి తెంపేసినట్లైంది. వారి ఆవేశం ఆమె బతుకును ప్రశ్నార్థకం చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని వంగరలో చోటు చేసుకుంది. వీరయ్య..పద్మలకు 14 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. మరి వీరయ్య ఎలా హత్యకు గురయ్యాడు...తదితర వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

టెన్ టివి ప్రతినిధికి ఉత్తమ జర్నలిస్టు పురస్కారం..

హైదరాబాద్ : టెన్ టివి ప్రతినిధికి ఉత్తమ జర్నలిస్టు పురస్కారం దక్కింది. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరిగిన పోటీల్లో సూర్యాపేట టెన్ టివి ప్రతినిధి గెలుపొందారు. సూర్యపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)లో జరిగిన ఓ హత్య కేసుపై టెన్ టివి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. సాంకేతిక ఆధారాలతో పోలీసులు దోషులను పట్టుకున్నారు. సూర్యాపేట టెన్ టివి ప్రతినిధికి ప్రశంస పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని డీఐజీ కల్పనా నాయక్ అందించారు.

గాంధీ భవన్ చేరుకున్న కాంగ్రెస్ ర్యాలీ..

హైదరాబాద్ : గాంధీ భవన్ కు కాంగ్రెస్ ర్యాలీ చేరుకుంది. నోట్ల రద్దుపై నిరసన ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, పొన్నాల, వీహెచ్, షబ్బీర్ ఆలీ లు పాల్గొన్నారు.

రూ. 24వేల కోట్ల రైతు రుణాలు మాఫీ - బాబు..

తూర్పుగోదావరి : జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 24వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో 43 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నట్లు, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో 4ల మందికి పెన్షన్లు అందచేయడం జరుగుతుందని వెల్లడించారు.

 

13:53 - January 5, 2017

జనగాం : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మహాజన పాదయాత్రలో భాగంగా జనగాం జిల్లాలో 81వ రోజు సీపీఎం పాదయాత్ర సాగింది. కుర్చపల్లి, రాఘవాపూర్‌, గోవర్ధనగిరి, కోమల్ల, రఘునాథపల్లిలో పాదయాత్ర బృందం పర్యటించింది. స్థానికులు సీపీఎం నేతలకు ఘన స్వాగతం పలికారు. 

13:51 - January 5, 2017

కొంతకాలంగా వరుస ప్లాఫ్ లతో 'రాంగోపాల్ వర్మ' ఇమేజ్ కోల్పోతున్నారని..తిరిగి ఆయన ఫాంలోకి రావాలని భావిస్తున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలే పలు చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని వివాదాస్పదమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' లీడ్ రోల్ లో 'సర్కార్ -3’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 'వర్మ' తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. గతంలో రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్ రూపొందుతోంది. తాజాగా 'సర్కార్ -3’కి సినిమా లుక్ విడుదలైంది. ‘సర్కార్' గెటప్ లో 'అమితాబ్' కనిపిస్తున్నారు. ఇందులో సాసర్ లో టీ తాగుతున్న 'అమితాబ్' ఫొటో అభిమానులను ఆకట్టుకొంటోంది. ఇక్కడ 'వర్మ' పనితనం కనపడుతోంది. 'అమితాబ్' లుక్ తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ 'సర్కార్' అలరిస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.

13:50 - January 5, 2017

హైదరాబాద్ : 50 రోజులు దాటిన తరువాత నోట్ల కష్టాలుండవని ప్రధాని మోదీ చెప్పినా...ఇప్పటికీ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చార్మినార్ నుంచి గాంధీభవన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

13:44 - January 5, 2017

సల్మాన్ ఖాన్ కు ఇంకా పెళ్లే కాలేదు...తండ్రిగా మారడం ఏంటీ ? ఆయన వివాహం చేసుకున్నారా ? అని ఏవోవో ప్రశ్నలు వేసుకోకండి..ఇది నిజం కాదు. నిజ జీవితంలో కాదు గాని తెరపై తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు హీరో పాత్రల్లో ఈ కండల వీరుడు ఆకట్టుకుంటున్నాడు. గతంలో 'జబ్ ప్యార్ కిసిసే హోతా హై' చిత్రంలో 'సల్మాన్' తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే డ్యాన్స్ నేపథ్య చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు 'రెమో డి సౌజా' మరో డ్యాన్స్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో వయస్సు మళ్లిన తండ్రికి...13 ఏండ్ల కూతురికి మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో తండ్రిగా 'సల్మాన్' నటించనున్నారు. హాలీవుడ్ చిత్రం 'స్టెప్ అప్ ఫ్రాంచైజీ' తరహాలో సినిమా సాగనుందని 'సల్లూ' పేర్కొన్నాడు. ఇందులో డ్యాన్స్ ట్రైనర్ గా కనిపించబోతున్నట్లు, తండ్రి పాత్రలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక డ్యాన్స్ చిత్రం 2018లో విడుదల కానుందంట. ప్రస్తుతం 'కబీర్ ఖాన్' ‘ట్యూబ్ లైట్' చిత్రంలో 'సల్మాన్' నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి 'సల్మాన్' కూతురిగా ఎవరు నటించనున్నారో ? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

వెస్ట్ బెంగాల్ లో రోడ్డు ప్రమాదం..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలోని అసన్ సోల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా 19 మందికి గాయాలయ్యాయి. చిత్తరాంజన్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.

13:35 - January 5, 2017

'నా ఇష్టం.. నాకు నచ్చినట్లుగానే ఉంటా' అని అంటోది బాలీవుడ్ ముద్దుగుమ్మ 'విద్యా బాలన్'. బాలీవుడ్ లో మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ 'విద్యా బాలన్' నిలిచిన సంగతి తెలిసిందే. ఇతర కథానాయికులకు భిన్నంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ విషయంపైనే స్పందించంట. నాజూగ్గా కనిపించడం కోసం బరువు తగ్గుతుంటారని, కానీ తాను మాత్రం నాకెలా ఉండాలనిపిస్తే అలానే ఉంటానని స్పష్టంగా చెప్పేసింది. మనం ఎలా ఉండాలనే దానిపై చాలా మంది రకరకాలుగా సలహాలిస్తుంటారని, ఈ విషయంలో ఎవరేం చెప్పినా తాను పట్టించుకోనని కుండబద్ధలు కొట్టింది. రెండు దశబ్దాల సినీ కెరీర్ లో ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నట్లు, అందుకే ఇష్టమైన దుస్తులు వేసుకుంటున్నట్లు పేర్కొంది. తనకు నచ్చినట్లుగానే ఉంటానని, ఇకపై కూడా అలానే ఉండాలని అనుకుంటున్నట్లు 'విద్యా బాలన్' తెలిపింది. ఈమె త్వరలో 'బేగమ్ జాన్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

13:31 - January 5, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో సింగరేణిపై స్వల్ప కాలిక చర్చను చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు..సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని పేర్కొన్నారు. సింగరేణిలో 56,866మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే వెలుగులు పంచుతోందన్నారు. 1249 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసారనీ..ఓపెన్ కాస్ట్ లో 10,427 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. భూగర్బ గనుల్లో నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది 600లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తోందని తెలిపారు.

ఒక్కో టన్నుకు రూ. 1758 నష్టం - కేసీఆర్..

హైదరాబాద్ : భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చు రూ. 4,118 అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సింగరేణి బొగ్గు అంశంపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో అమ్మకం ధర రూ. 2,360 అని, ఒక్కో టన్నుకు రూ1758 నష్టాన్ని సంస్థ భరిస్తోందని కేసీఆర్ వెల్లడించారు.

ఓపెన్ కాస్టు గనుల్లో ఉత్పత్తి అధికం - కేసీఆర్..

హైదరాబాద్ : సింగరేణి బొగ్గు అంశంపై సీఎం కేసీర్ చర్చను ప్రారంభించారు. సింగరేణిలో మొత్తం 56, 866 మంది కార్మికులున్నారని, బొగ్గు గనుల్లో 34,764 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో 10,427 మంది కార్మికులున్నారని తెలిపారు. 2015-16లో మొత్తం ఉత్పత్తి లక్ష్యం 600 లక్షల టన్నులు కాగా ఓపెన్ కాస్టు గనుల్లో నుండి 497 లక్షల టన్నుల భూగర్భ గనుల నుండి 106 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు.

13:20 - January 5, 2017

'సింగరేణి' పై కేసీఆర్ ప్రసంగం..

హైదరాబాద్ : సింగరేణి బొగ్గు అంశంపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ ప్రారంభమైంది. చర్చను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..కార్మికుల కఠోర శ్రమతో బొగ్గును తీస్తున్నారని, జాతీ సంపదను పెంచడానికి కార్మికులు స్వేదాన్ని చిందిస్తున్నారని తెలిపారు. వీరు ప్రమాదపు అంచుల్లో పనిచేయడం జరుగుతోందన్నారు. తెలంగాణ మహోద్యమంలో కార్మికుల కృషి అమోఘమన్నారు. ప్రతి సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోందని, ఇందులో 78.71 శాతం బొగ్గు థర్మల్ విద్యుత్ అవుతోందన్నారు. తదితర పరిశ్రమలకు బొగ్గు అందిస్తోందని, ప్రస్తుతం సింగరేణిలో 46 గనులున్నాయని తెలిపారు.

13:16 - January 5, 2017

హైదరాబాద్‌ : ఫీజుల కోసం స్కూలు యాజమాన్యాలు విద్యార్ధుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు అక్రమంగా వసూలు చేస్తున్న ఫీజులపై ఒక పక్క పోరు కొనసాగుతూనే వున్నాయి. మరో పక్క విద్యార్థులపై వేధింపులు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పాతబస్తీలో ప్రిన్సిపాల్‌ వేధింపులు తట్టుకోలేక 9వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హఫీజ్‌ బాబానగర్‌లోని ఇఫ్తార్‌ టాలెంట్‌ స్కూల్ లో చదువుతున్న మీర్జా సల్మాన్‌ బేగ్‌ రెండు నెలలుగా స్కూల్‌ ఫీజు కట్టడం లేదు. దీంతో ప్రిన్సిపాల్‌ విద్యార్ధిపై వత్తిడి పెంచడంతో తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

విజయవాడ : నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని వీణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

‘ఉదయ్' స్కీం మంచి పథకం - కేసీఆర్..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఉదయ్' మంచి పథకం అని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం, టిడిపి పార్టీలు సభ నుండి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ వాకౌట్ చేయడం సబబు కాదని, కాంగ్రెస్, టిడిపి రాష్ట్రాలు అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. రూ. 12వేల కోట్ల డిస్కంల భారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా ఓప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందన్నారు. బడుగు, బలహీన, దళితులు, మైనార్టీ వారికోసం రూ. 35వేల కోట్ల స్కీంలు కొనసాగిస్తున్నామన్నారు.

‘ఉదయ్' స్కీం మంచి పథకం - కేసీఆర్..

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఉదయ్' మంచి పథకం అని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం, టిడిపి పార్టీలు సభ నుండి వాకౌట్ చేశాయి. కాంగ్రెస్ వాకౌట్ చేయడం సబబు కాదని, కాంగ్రెస్, టిడిపి రాష్ట్రాలు అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. రూ. 12వేల కోట్ల డిస్కంల భారాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా ఓప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందన్నారు. బడుగు, బలహీన, దళితులు, మైనార్టీ వారికోసం రూ. 35వేల కోట్ల స్కీంలు కొనసాగిస్తున్నామన్నారు.

ఏ ఏడాది 'ఫీజు'బకాయిలు చెల్లించడం కుదరదు - కేసీఆర్..

హైదరాబాద్ : ఏ ఏడాది 'ఫీజు' బకాయిలు ఆ ఏడాది చెల్లించడం కుదరదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఆయన మాట్లాడారు. గత సంవత్సరం బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చెల్లిస్తుందని, మార్చి 31 వరకు బకాయిలు చెల్లించే పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దాచి పెట్టేది ఏమీ లేదన్నారు. 70 శాతం అటెండెన్స్ ఉన్నవారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామన్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తయితే తప్ప 70 శాతం అటెండెన్స్ పూర్తైన విషయం తెలియదన్నారు. 2011-12 టోటల్ డిమాండ్ రూ.2906 కోట్లు అవసరమైతే రూ.1492 కోట్లు విడుదల చేశామని వివరించారు.

12:48 - January 5, 2017

సిద్ధిపేట : చిన్న చిన్న విషయాలకే విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకునే ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. పుల్లూరులోని సాయి చైతన్య కళాశాలలో సీఈసీ ఇంటర్ చదువుతున్న భవానీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం కళాశాలకు వచ్చిన భవాని భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు చేసుకుంది. భవానీతో కలిసి చదువుకుంటున్న మరో విద్యార్థినికి సంబంధించిన రూ.100 కనిపించకుండా పోయాయి. దీంతో ప్రిన్సిపల్ కు సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపల్ భవానీని పిలిచి డబ్బు గురించి ప్రశ్నించాడు. దీంతో మనస్తాపం చెందిన భవానీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

12:43 - January 5, 2017

అర్థం కాలేదా...తన చిత్రంలో రైతుల కంట కన్నీరు..అంటూ 'చిరు' గళమెత్తనున్నాడు. ఆయన తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని పాటలు నేరుగా మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ అయ్యాయి కూడా. ఈ పాటలకు విశేష ఆదరణ లభిస్తోంది. చిత్ర ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో గ్రాండ్ గా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 'నీరు..నీరు' అంటూ పాట విడుదలైంది. రైతుల గోస..బాధను ఈ పాటలో వినిపించే ప్రయత్నం చేశారు. 'నీరు నీరు నీరు.. రైతు కంట నీరు.. చూడనైన చూడనెవ్వరూ' పాట ప్రారంభం అయ్యింది. ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. రైతుల నీటి సమస్యపై చిత్ర కథ ఉంటుందనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాట రానుంది. పాట రచయిత రామజోగయ్య శాస్త్రీ ఈ పాటను రచించాచరు. రైతుల చావుల గురించి ఇంకా ఎలాంటి అంశాలు..సమస్యను ఎలా పరిష్కరించారో చూడాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
తమిళ 'కత్తి' సినిమా రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 'చిరంజీవి'కి 150వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో ‘చిరు’ సరసన ‘కాజల్’ నటిస్తోంది.

12:40 - January 5, 2017

హైదరాబాద్ : అసెంబ్లీలో విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పెడింగ్ లో వున్న బకాయిలను ఇప్పటికే రూ.1800ల బకాయిలను చెల్లించామని కేసీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టిన 2015/16 సంవత్సరపు బకాయిలను మార్చి 31లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4687 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం కింద చెల్లించామని..ఇది కాకుండా చరిత్రలో ఎప్పుడూ లేకుండా విద్యార్థులకు రూ.8లక్షల స్కాలర్ షిప్ లు కూడా ఇస్తున్నామని తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న విద్యాసంస్థలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో ఈ పథకంలో గత ప్రభుత్వ విధానాలే కొనసాగిస్తున్నామని కేసీఆరర్ తెలిపారు. గత ప్రభుత్వ విధానాలే కొనసాగిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సంఘం పేరిట టిడిపి నేతలు ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. కళాశాలలో అనుమతులు లేకుండా రాజకీయ నేతల విగ్రహాలు నెలకొల్పనడం అమానుషమని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.

12:29 - January 5, 2017

హైదరాబాద్ : 123 జీవోపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై సీపీఎం హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. చట్టంపట్ల ప్రజల పట్ల గౌరవించాలని సీఎం కేసీఆర్ కు సీపీఎం నేత వెంకట్ సూచించారు. సీపీఎం పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా సీపీఎం నేత వెంకట్ డిమాండ్ చేశారు. 

12:19 - January 5, 2017

హైదరాబాద్ : 123 జీవోతో భూసేకరణపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ జారీ చేసింది. ఈ అంశంపై మల్లన్న సాగర్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు పట్ల మల్లన్న ప్రాంత వాసి..ఉద్యమ కారుడు అయిన హయత్ మాట్లాడుతు..తమకు అండగా వున్న 10టీవీకి ధన్యవాదాలు తెలిపారు. తన సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి తమకు నిరంతరం అండగా వున్నవారందరికీ ఈ సందర్భంగా హయత్ ధన్యవాదాలు తెలిపారు. భూమి కోసం న్యాయబద్దంగా పోరాడిన తమకు న్యాయం జరిగిందనీ..ఈ విషయంలో ఇప్పటికైనా సీఎం తన వైఖరి మార్చుకోవాల్సిన అవుసరముందని హయత్ పేర్కొన్నారు. 

పాతబస్తీలో 9వ తరగతి విద్యార్థి సూసైడ్..

హైదరాబాద్ : పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్స్ పాల్ వేధింపులు చేయడంతో విద్యార్థి సల్మాన్ సూసైడ్ చేసుకున్నాడు. హఫీజ్ బాబానగర్ లోని ఇఫ్తార్ టాలెంట్ స్కూల్ లో సల్మాన్ 9వ తరగతి చదువుతున్నాడు.

రామచంద్రాపురంలో బాబు పర్యటన..

తూర్పుగోదావరి : జిల్లాలోని రామచంద్రాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆర్డీవో కార్యాలయాన్ని బాబు ప్రారంభించారు. పలు భవనాలు..వంతెనలను కూడా ప్రారంభించారు.

కాంగ్రెస్ నిరసన ర్యాలీ..

హైదరాబాద్ : నోట్ల రద్దుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. చార్మినార్ నుండి గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, పొన్నాల, వీహెచ్, షబ్బీర్ ఆలీ లు పాల్గొన్నారు.

బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల..

ఉత్తర్ ప్రదేశ్ : బీఎస్పీ వంద మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 31 మంది ముస్లీం అభ్యర్థులకు మాయావతి టికెట్లు కేటాయించింది.

 

 

సిద్ధిపేటలో కాలేజీ విద్యార్థిని సూసైడ్..

సిద్ధిపేట : సాయిచైతన్య కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.

ఎన్నికల సంఘాన్ని కలిసి విపక్ష నేతలు..

ఢిల్లీ : ఎన్నికల సంఘాన్ని విపక్ష నేతలు కలిశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఉన్నందున కేంద్ర బడ్జెట్ ను వాయిదా వేయాలని విపక్షాలు కోరాయి.

11:48 - January 5, 2017

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శాసనసభలో గురువారం కూడా దుమారం రేగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాతే ప్రశ్నోత్తరాలను చేపట్టాలని విపక్షాలు ఆందోళన చేశాయి. అయితే దీనిపై సభా అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ..ప్రశ్నోత్తరాల తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా..ప్రతిపక్షాలు ఇలా ఆందోళన చేయడం తగదన్నారు. 

అఖిలేష్..ములాయంలకు ఈసీ లేఖ..

ఉత్తర్ ప్రదేశ్ : సీఎం అఖిలేష్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ లకు ఈసీ లేఖ రాసింది. ఈనెల 9లోగా పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధు

కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత..

తిరుపతి : పుత్తూరు వెంకటసుబ్బయ్య డిగ్రీ కాలేజీ హాస్టల్ లో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

11:45 - January 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై  విపక్షాలు గురువారం కూడా పట్టుపట్టాయి. ఈ సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన  ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై  క్లారిటీ ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు సమయం ఇస్తామని సభా అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేయడం తగదన్నారు. విద్యార్థుల పీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. 

11:41 - January 5, 2017

హైదరాబాద్ : ఫీజ్‌రీయింబర్స్‌మెంట్‌పై సీఎం సమాధానంతర్వాత ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తప్పుబట్టారు.. ప్రభుత్వస్పందన నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు ప్రతిపక్ష సభ్యులకు ఉంటుందని స్పష్టం చేశారు.. సీఎం సమాధానం తర్వాత ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వలేదని సున్నం రాజయ్య ఆరోపించారు.

11:36 - January 5, 2017

హైదరాబాద్‌ : అసెంబ్లీలో జరిగిన చర్చపై వివరణ ఇచ్చే అవకాశం ప్రతిపక్షాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కోరారు. ప్రతిపక్షాలకు అన్ని అంశాలపై మాట్లాడడానికి సరైన అవకాశం ఇవ్వాలని బీజేపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. ప్రతి అంశంపైనా ప్రతిపక్షాలు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి సమస్యలపై సమగ్రంగా చర్చింద్దామని ప్రభుత్వాన్ని కోరారు. 

11:32 - January 5, 2017

హైదారబాద్ : ప్రతిపక్షాలకు సభలో అవకాశం ఇవ్వడం లేదనే వాదన అవాస్తవమని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రతిపక్షాలే సభలో అధికంగా మాట్లాడాయనీ..విపక్ష సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకూ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పిందన్నారు. తెలంగాణ శాసనసభలు సమావేశాలు ఏపీ కంటే బాగా జరుగుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. 

11:28 - January 5, 2017

విజయవాడ : ఏపీలో టీడీపీ ప్రజాప్రతినిధులంతా ఒక్కసారిగా బిజీబిజీ అయ్యారు. మొన్నటి వరకు జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదుతో క్షణం తీరికలేకుండా గడిపిన నేతలు... ఇప్పుడు జన్మభూమి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలన్న చంద్రబాబు సూచనలతో.... క్షేత్రస్థాయికి బయలుదేరారు. మరోవైపు జనచైనత్య యాత్రల్లో ఇచ్చిన ఫిర్యాదులకే దిక్కుమొక్కూలేదని.. ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంతో సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారు.

ప్రజా సమస్యల కోసం వరుస కార్యక్రమాలు రూపొందిస్తున్న చంద్రబాబు
ప్రజా సమస్యల పరిష్కారమంటూ ఏపీ సీఎం చంద్రబాబు వరుసపెట్టి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వ నమోదును పూర్తి చేశారు. గత 50 రోజులుగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు అంతా క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాస్త రిలాక్స్‌ అవ్వొచ్చని భావిస్తుండగా ఇంతలోనే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సరిగ్గా 10 రోజుల వ్యవధితో జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో నేతలంతా మళ్లీ జనంబాట పట్టారు.

టీడీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు
గ్రామస్థాయి స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అంతా ప్రజల్లోనే ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ... వాటిని పరిష్కరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే జనచైతన్య యాత్రలు జరిగాయి. ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం నడుస్తోంది.

జనచైతన్య యాత్రల్లో టీడీపీ నేతలకు సమస్యలు మొరపెట్టుకున్న జనం
ప్రజా సమస్యలు పరిష్కరించేలా చంద్రబాబు వరుసగా కార్యక్రమాలు రూపొందించడం వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. జనచైతన్య యాత్రల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. పెన్షన్‌, కొత్త రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంలాంటి సమస్యలపై అర్జీలు ఇచ్చారు. అప్పుడు టీడీపీ నేతలంతా సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పించారు. ఆ తర్వాత వాటి గురించి మరిచారు. ఇంతలోనే మళ్లీ జన్మభూమి కార్యక్రమంతో టీడీపీ యంత్రాంగమంతా ప్రజల్లోకి వెళ్తోంది. జనచైతన్య యాత్రల్లో ఇచ్చిన అర్జీల పరిస్థితి ఏంటని ప్రజలు వారిని నిలదీస్తున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, కాస్త సమయం పడుతుందని చెబుతున్నా ప్రజలు వినిపించుకోవడం లేదు. దీంతో టీడీపీ నేతలకు ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తానికి వరుస యాత్రలతో టీడీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్తోంటే.. పరిష్కారం కాని ప్రజా సమస్యలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. 

11:09 - January 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పెద్ద ఝలక్ ఇచ్చింది. జీవో నెంబ‌రు.123 ద్వారా భూములు తీసుకోవ‌ద్ద‌ని టీ. స‌ర్కారుకి హైకోర్టు స్ప‌ష్ట‌మైన‌ ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2013 చట్టం ద్వారా భూములను సేకరణకు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది. రాష్ట్రంలో నిర్మించబోయే సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో కాకుండా జీవో నెంబ‌రు 123ను తీసుకొచ్చి రైతుల నుండి భూముల‌ను సేక‌రించేందుకు యత్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో 123 జీవో ప‌ట్ల తీవ్ర అభ్యంరాలు వ్య‌క్తం చేస్తూ వంద‌ల మంది రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. కొన్ని నెల‌లుగా ఈ కేసులో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. అధికారులు బ‌ల‌వంతంగా భూములు లాక్కుంటున్నార‌ని రైతుల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టులో వాదించిన‌ట్లు తెలుస్తోంది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు 123 జీవో ద్వారా భూసేకణ ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా 190/191 జీవో జారీ చేశామని గతంలో హైకోర్టు ప్రభుత్వానికి జారి చేసిన విషయాన్నికూడా మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో కోర్టులో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని లెదర్ పార్క్ కోసం సేకరించిన భూసేకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్క్ కు సంబంధించి 123 జీవోతో  భూసేకరణతో కుల వృత్తిదారులకు నష్టం కలిగేలా వుందని కూడా కోర్టు పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బ తగినట్లుగా తెలుస్తోంది. కాగా  మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టిన  123 జీవో ను వ్యతిరేకిస్తూ విపక్షాలు ముఖ్యంగా సీపీఎం పార్టీ భూసేకరణ ప్రాంతంలో పాదయాత్ర చేపట్టి బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేసిన విషయం తెలిసిందే. 

పవన్ డెడ్ లైన్ తో పర్యటించడం లేదు - కామినేని..

శ్రీకాకుళం : జిల్లాలో మంత్రి కామినేని పర్యటిస్తున్నారు. పవన్ డెడ్ లైన్ కు స్పందించి పర్యటించడం లేదని, తన పర్యటన నెల రోజుల ముందే ఖరారైందని మంత్రి కామినేని పేర్కొన్నారు. 22 ఏళ్లుగా ఉ్నన కిడ్నీ రోగాన్ని 48గంటల్లో ఎలా పరిష్కరిస్తారని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సూచనలు స్వీకరిస్తామన్నారు.

 

జీవో 123పై సర్కార్ కి గట్టిదెబ్బ..

హైదరాబాద్ : జీవో 123 ద్వారా భూములు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. భూ సేకరణ జీవో 123పై కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.

పగిలిన భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్..

మేడ్చల్ : బాలాజీనగర్ గోదావరి పైప్ లైన్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ తగిలి రెండు చోట్ల భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలింది. సమాచారం తెలుసుకున్న అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. దీనితో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

చర్చ లేదు..క్లారిఫికేషన్స్ మాత్రమే - కేసీఆర్..

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ లేదని..సభ్యులు క్లారిఫికేషన్స్ మాత్రమే ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి సింగరేణి అంశాన్ని ప్రస్తావించారని, దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

10:19 - January 5, 2017

హైదరాబాద్ : టీ.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రజా సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని క్వశ్చన్ అవర్ సమయం వున్నా సభను వాయిదా వేయటం ఎంతవరకూ సమంజసం అని కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. సభను సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరిస్తున్నా..బుధవారం నాడు ఫీజ్ రీయింబర్స్ మెంట్ తీర్మానంపై చర్చ పూర్తి కాకుండానే సభను వాయిదా వేయటం ఎంతవరకూ సమంజసం అని జానారెడ్డి ప్రశ్నించారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెబుతు..ప్రతిపక్షాలకు చర్చకు అవకాశం ఇవ్వటంలేదనీ అవాస్తవమనీ..అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నామని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్ష సభ్యులు హరించేలా వ్యవహరించవద్దని కేసీఆర్ సూచించారు. కాగా బుధవారం నాడు విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం వివరణ ఇవ్వకుండానే సభను వాయిదా వేయటం పట్ల విపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. 

'మాకు అవకాశం ఇవ్వరా'..

హైదరాబాద్ : తమకు అవకాశం ఇవ్వరా అని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్, బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బుధవారం రగడ చెలరేగిన అంశంపై ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తిరిగి ప్రశ్నోత్తరాలు చేపడుతున్నట్లు స్పీకర్ వెల్లడించడాన్ని సభ్యులు తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడడం కరెక్టు కాదని, అందరికీ అవకాశం ఇవ్వాలని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు.

ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నాం - కేసీఆర్..

హైదరాబాద్ : ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తలేమని అనడం సబబు కాదని, అందరికీ అవకాశం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టి.కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి మాట్లాడిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి సభలో ఉన్నా తాను సమాధానం చెప్పడం జరిగిందని సభకు తెలిపారు. 'ఉదయ్' ప్రకటనకు సంబంధించినవసరం లేదని ప్రతిపక్ష నేత జానారెడ్డి చెప్పారని, రూ. 12వేల కోట్ల రుణం కీలకమైందని..అందులో భాగంగా ఢిల్లీలో ఒప్పందం జరుగుతోందన్నారు. సభ జరుగుతోందని అందువల్లే తాను ప్రకటన చేయాల్సినవసరం ఉందని భావించినట్లు దీనిని వక్రీకరించడం తగదన్నారు.

సభకు హుందాతనమా ? - జానారెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడారు. సభకు హుందాతనమా ? స్పీకర్ గైడ్ లైన్ చేయాల్సినవసరం లేదా ? ప్రభుత్వం గైడ్ చేయాల్సిన అవసరం ఉందా ? లేదా ? అని గమనించుకోవాలని సూచించారు. ప్రశ్నోత్తరాలు సమయానికి ఇంకా 20 నిమిషాల ఉండగానే వాయిదా వేసి సీఎం చేత ప్రకటన చేయించడం సబబు కాదన్నారు.సభ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నామని పేర్కొన్నారు.

టి.అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ జరగాలని..ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలు వాయిదా తీర్మానాలిచ్చాయి.

09:19 - January 5, 2017

హైదరాబాద్ : ఎంసెట్ స్కాంలో ఏ1 కీల‌క నిందితుడు క‌మిలేశ్వ‌ర్  మృతి చెందాడు. కమలేశ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత మూడు రోజులుగా సీఐడీ కస్టడీలో వున్న  కమలేష్ కుమార్ మృతి చెందటంతో గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తిచేసినట్లుగా సమాచారం. కాగా ఎంసెట్ 2 ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన క‌మిలేశ్వ‌ర్ బీహార్ రాజ‌ధాని ప‌ట్నాకు చెందిన‌వాడు. నిందితుడి మృతదేహానికి ఆస్ప‌త్రిలో గుట్టుచ‌ప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వ‌హించ‌డం ..పోలీసు క‌స్ట‌డీలో ఉన్న వ్య‌క్తి అక‌స్మాత్తుగా మృతి చెంద‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. విచారణలో వున్న సమయంలో గుండె నొప్పి వస్తోందని కమలేశ్ చెప్తున్నా వినకుండా అధికారులు విచారణ పేరుతో అతడ్ని వేధించారనీ..వేధింపులు తట్టుకోలేక మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.  కమలేశ్ హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడని ఉస్మానియా వైద్యులు పేర్కొంటున్నారు. కాగా సంచలనం కలిగించిన ఎంసెట్ 2 స్కామ్ సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసు నిమిత్తం  గత నాలుగు నెలలుగా అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు.ఈ కేసులో ఇప్పటివరకూ 50మందిని ఎంసెట్ స్కామ్ లో అధికారులు అరెస్ట్ చేశారు. కాగా కమలేశ్ మృతితో సాక్ష్యాధారాలన్ని బైటపడే అవకాశాలు దాదాపుగా మరుగున పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదంతా పెద్దవారిని కాపాడేందుకే అధికారులు యత్నించారనే అనుమానాలు..విమర్శలు తలెత్తుతున్నాయి. 

నేటి టీ.అసెంబ్లీలో వాయిదా తీర్మానం..

హైదరాబాద్ : నేడు తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై చర్చ కొనసాగించాలని..బకాయిలు విడుదల చేయాలనీ.. టీడీపీ ,బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం వాయిదా తీర్మానం ఇవ్వనున్నాయి. 

మాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ల‌పై కేంద్రం కొర‌డా..

ఢిల్లీ : వ‌ర క‌ట్నాన్ని ప్రోత్స‌హించే మాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ల‌పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. క‌ట్నాన్ని ప్రోత్స‌హించేలా ఉన్న మాట్రిమోనియ‌ల్ వెబ్‌సైట్ల‌పై నిషేధించాల‌ని కోరుతూ అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

ఎంసెట్ స్కాం నిందితుడు అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : ఎంసెట్ స్కాంలో ఏ1 కీల‌క నిందితుడు క‌మిలేశ్వ‌ర్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. గత మూడు రోజులుగా సీఐడీ కస్టడీలో కమలేష్ కుమార్ మృతి చెందటంతో గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తిచేసినట్లుగా సమాచారం. కాగా ఎంసెట్ 2 ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన క‌మిలేశ్వ‌ర్ బీహార్ రాజ‌ధాని ప‌ట్నాకు చెందిన‌వాడు. కాగా నిందితుడి మృతదేహానికి ఆస్ప‌త్రిలో గుట్టుచ‌ప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వ‌హించ‌డంపై పలు  అనుమానాలకు తావిస్తోంది. 

08:18 - January 5, 2017

ఢిల్లీ: దేశరాజధానిని పొగమంచు వీడటంలేదు. దీంతో పలు ప్రయాణ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుతో రైళ్ళ రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతోంది. దీంతో రైల్వే అధికారులు చర్యలు చేపట్టి రైళ్ల సర్వీసు వేళ్లల్లో మార్పులు చేశారు. 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 22 రైళ్ల వేళ్లల్లో మార్పులు జరిగాయి. కాగా 7 రైళ్లను మొత్తంగా రద్దు చేశారు.

08:14 - January 5, 2017

హైదరాబాద్ : నగరంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పాత నేరస్థుల కదలికలపై పాతబస్తీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో 200మంది పోలీసులతో పాతబస్తీ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్భంధ తనిఖీలు చేపట్టారు. చాంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక వంటి పలు కీలక ప్రాంతాలలో నిర్భంధ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలలో భాగంగా గతంలో నేరాలు చేసిన సుమారు 50మందికి అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మూడు తల్వార్లు, మూడు గ్యాస్ సిలిండర్లు, 20 ద్విచక్ర వాహానాలను నిందితుల వద్దనుండి  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నేరాలు చేసి తప్పించుకు తిరుగుతూ..నగరంలో దొంగతానాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఏపీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం..

విజయవాడ : ఏపీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నోట్ల రద్దు, నల్లధనం వెలికితీత వంటి పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు. 

ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న ఉత్తరాఖండ్ సీఎం ..

ఢిల్లీ : నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ దీక్ష చేపట్టనున్నారు. ఉత్తరాఖండ్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపణతో రావత్ దీక్ష చేపట్టనున్నారు. కాగా ఓ రాష్ట్ర సీఎం కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా దీక్ష చేపట్టటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

నేడు తూ.గోదావరిలో బాబు పర్యటన..

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రామచంద్రాపురంలోని ఆర్డీవో కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించానున్నారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతరువాత పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథాకానికి శంకుస్థాపన చేయనున్నారు.   

07:43 - January 5, 2017

విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ బకాయిలు పేరుకుపోవడంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు సంధించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగించడంతోపాటు, బకాయిలను కూడా సాధ్యమైనంత తర్వగా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు, వివరణలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. కాగా విపక్ష సభ్యుల మాటలు ఏమాత్రం పట్టించుకోని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి... అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు. ఉప సభాపతి వైఖరిపై కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు అసెంబ్లీ హాలులో బైఠాయించి నిరనసన వ్యక్తం చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం పారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. చర్చలో రాకేశ్ (టీఆర్ఎస్ నేత),జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింతసమాచారానికి ఈ వీడియో చూడండి..

బంద్ కు పిలుపునిచ్చిన టీ.విద్యార్థి సంఘాలు..

హైదరాబాద్ : తెలంగాణ విద్యాసంస్థలు నేడు బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్ఎస్ యూఐ,టీఎన్ఎస్ ఎఫ్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి.ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చాయి. కాగా బుధవారం నాడు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై అసెంబ్లీలో చర్చ కొనసాగిన విషయం తెలిసిందే.

వీడని పొగమంచు..7రైళ్లు రద్దు..

ఢిల్లీ: దేశరాజధానిని పొగమంచు వీడటంలేదు. దీంతో పలు ప్రయాణ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుతో రైళ్ళ రాకపోకలకు తవ్రంగా ఇబ్బంది కలుగుతోంది. దీంతో రైల్వే అధికారులు చర్యలు చేపట్టి రైళ్ల సర్వీసు వేళ్లల్లో మార్పులు చేశారు. 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 22 రైళ్ల వేళ్లల్లో మార్పులు జరిగాయి. కాగా 7 రైళ్లను మొత్తంగా రద్దు చేశారు.

పరిగణాలలో భారీ అగ్రి ప్రమాదం..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలోని పరిగణాల జిల్లాలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. మధ్యంగ్రామ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 38 ఫైరింజన్లు మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ఫైర్ సిబ్బందికి కాలిన గాయాలయినట్లుగా సమాచారం.

07:13 - January 5, 2017

హైదరాబాద్ లో ఓలా, ఉబర్ లను నమ్మిన క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఓలా, ఉబర్ లలో చేరి, అప్పులు చేసి క్యాబ్ లకు కొనుకున్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ లో ఏడాది క్రితం కేవలం పాతిక వేలు వున్న క్యాబ్ ల సంఖ్య ఇప్పుడు 70వేలు దాటింది. మరోవైపు డ్రైవర్లకు ట్రిప్పులివ్వడంలో ఓలా, ఉబర్ యాజమాన్యాలు వివక్ష ప్రదర్శిస్తున్నాయన్న విమర్శలున్నాయి. తమ సంస్థల ద్వారా ఫైనాన్స్ తీసుకున్నవారికి ఎక్కువ ట్రిప్పులిస్తూ, ఇతర సంస్థల దగ్గర ఫైనాన్స్ తీసుకున్నవారికి అతి తక్కువ ట్రిప్పులిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉబర్ , ఓలా యాజమాన్యాల తీరు మీద్ర తీవ్ర అసంతృప్తితో వున్న క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు పోరుబాటపట్టారు. ఇందిరాపార్క్ దగ్గర నిరాహారదీక్షలు ప్రారంభించారు. హైదరాబాద్ లో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు నాయకులు ఈశ్వరరావు ఎటువంటి అభిప్రాయాలు తెలిపారో ఈ వీడియో చూడండి..

07:01 - January 5, 2017

జార్ఖండ్ : ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని 2017 ఆరంభంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టీ20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం టెస్ట్‌మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్‌కోహ్లికే వన్డేలు, టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు
భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. దేశ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకునిగా మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ మరోసారి సంచలనానికి వేదికయ్యాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆస్ర్టేలియాతో సిరీస్‌లో అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన 35 ఏళ్ల ధోనీ... తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేశాడు.

వన్డేలు, టీ 20లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం
భారత వన్డే, టీ20 ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలు, టీ 20లకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ధోనీ నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు పట్టుమని పదిరోజుల ముందు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు. ధోని నిష్క్రమణతో టెస్ట్‌లకు ప్రస్తుతం సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీకి పూర్తి పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా జట్టుతో కలిసి కొనసాగుతానని మహీ తెలిపాడు. టీం ఇండియా ఈ నెల 15 నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు ధోని అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.

199 వన్డేలు, 72 టీ 20 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు
మహేంద్రసింగ్ ధోనీ 199 వన్డేలు, 72 టీ 20 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ధోని కెప్టెన్సీలో వన్డేల్లో 110 విజయాలతో 59.57 శాతం సక్సెస్ రేట్‌తో భారత్ దూసుకుపోయింది. పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. టీ-20 మ్యాచ్‌లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్‌గా ధోనీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. మిస్టర్ కూల్ ధోనీ సారథ్యంలోనే 2007లో టీ-20, 2011లో వన్డే ప్రపంచకప్పు భారత్ కైవసం చేసుకుంది. 2007 సెప్టెంబర్ నుంచి టీ 20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ధోనీ, 2007 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ నుంచి వన్డేలకు బాధ్యతలు చేపట్టాడు. 49 టెస్టుల్లో 21 విజయాలు సాధించిన గంగులీ రికార్డును ధోని అధిగమించాడు.

ధోనీ నిర్ణజీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
ధోనీ అనూహ్య నిర్ణయానికి గల కారణమేమిటనేది అభిమానుల మదిలో మెదలుతున్న ప్రశ్న. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయన్నది క్రికెట్‌ విశ్లేషకుల మాట. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌గా ధోనిని ప్రముఖ క్రికెటర్లు కొనియాడారు. క్రికెట్ వన్డే, టి20 ఫార్మట్లలో కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. షాక్‌కు గురైనా ధోనీపై అభిమానం కురిపించారు. ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ధోనీపై కామెంట్ల వర్షం కురిపించారు. ధోనీ లాంటి కెప్టెన్ మరొకరు లేరంటూ ప్రశంసలు కురిపించారు. ధోనీ ఫొటోలు పెట్టి అభిమానం చాటుకున్నారు. మొత్తంగా ధోనీ కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది.

06:53 - January 5, 2017

ఢిల్లీ : జీఎస్టీపై కేంద్రం-రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండ్రోజుల పాటు జరిగిన జీఎస్టీ పాలకమండలి సమావేశం ముగిసింది. దీనిలో కేంద్రం, రాష్ట్రాలు తమతమ వైఖరులకే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించాయి. పన్ను అమలును సెప్టెంబరుకు వాయిదా వేయడం అనివార్యంగా కనిపిస్తోంది. పన్ను చెల్లింపుదారులపై నియంత్రణ, నౌకా వాణిజ్యంపై పన్ను వేసే అధికారం వంటి విషయాల్లో ఉభయపక్షాలూ తమ వాదనల నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ నెల 16న జరిగే తదుపరి సమావేశంలో ఈ రెండు అంశాలపైనా చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పన్ను కట్టే ఒకే డీలర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సరికాదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కొలిక్కిరాని అంశాలు వచ్చే సమావేశంలో పరిష్కృతమవుతాయని జైట్లీ చెప్పారు. 

06:50 - January 5, 2017

విజయవాడ : మైనర్ బాలికలను ట్రాప్ చేసి ఆ తర్వాత దుర్మార్గానికి పాల్పడ్డ గ్యాంగ్‌ పాపం పండింది... రెండున్నరేళ్ల పాటు కొనసాగిన దర్యాప్తు.. విచారణ తర్వాత బెజవాడ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది...అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడమేగాకుండా బ్లూఫిలిం తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసింది గ్యాంగ్..తప్పుదారి పట్టిన యువకులు చేసిన దారుణానికి వారిని జైలుపాలు చేసింది...
మైనర్‌ బాలికలను ట్రాప్ ..అత్యాచారం వీడీయో..బ్లాక్‌మెయిలింగ్
విద్యార్థులను ప్రలోబపెట్టి వారిపై అత్యాచారం చేసి ఆ ఘటనను వీడియో రహస్యంగా చిత్రీకరించి తదుపరి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన కేసులో విజయవాడలోని 3వ అదనపు జిల్లా కోర్టు సంచలనం తీర్పునిచ్చింది....రెండున్నరేళ్లుగా సాగిన వాదోపవాదాలు.. సాక్ష్యాల సేకరణ..విచారణ తర్వాత ఐదుగురు నిందితులకు శిక్ష ఖరారు చేసింది...

1 నిమ్మకూరు సాయిరాంకు జీవితఖైదు
నిందితులకు న్యాయమూర్తి శిక్షలు ఖరారు చేయడంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి...దీంతో పాటు వారికి జరిమానా విధించారు..

2014 ఆగస్టు 22 ముఠా అరెస్టు...
విజయవాడ చెందిన నిమ్మకూరు సాయిరాం తన మిత్రులతో కలిసి ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకున్నాడు..వీరంతా కలిసి విద్యార్థినీలను ట్రాప్ చేసి వారితో ప్రేమ..లేదంటే మరో ఆశ చూపించి ట్రాప్ చేసేవారు..ఇలా వారిని తీసుకెళ్లి అత్యాచారం చేయడమేగాకుండా ఆ వీడియోను తీసేవారు..వాటిని వారికి చూపించి బెదిరింపులకు పాల్పడేవారు...ఈ ముఠా బారిన పడ్డ ఎందరో అమ్మాయిలు వేధింపులు తట్టుకోలేకపోయారు...దీంతో దాదాపు పది మంది అమ్మాయిల్లో ఒకరు అప్పటి పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వర్‌రావును కలిసి వివరించారు..దీంతో ఆయన ఈ కేసును సీరియస్‌గా తీసుకుని మహిళా స్టేషన్‌లో కేసు నమోదు చేయించి దర్యాప్తు చేయించారు....

2014 ఆగస్టు 22న ముఠా అరెస్టు...
ఈ కేసులో ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో కేసు విచారణ జరిపిన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సహేరా బేగం నిందితులెవరూ తప్పించుకోకుండా వారికి బెయిల్ కూడా రాకుండా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులకు శిక్ష ఖరారవడంతో బెజవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

నిందితులందరూ చాలా క్రూరంగా వ్యవహారించారు : సీపీ ఏబీ వెంకటేశ్వరరావు
నిందితులందరూ చాలా క్రూరంగా వ్యవహారించారని, కేసు విచారించిన ఆనాటి విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు నిందితులు వ్యవహరించిన తీరుతెన్నులపై ఏం మాట్లాడారో చూద్దాం....

ప్రేమ ముసుగుతో  ట్రాప్
దుర్మార్గంగా వ్యవహరించిన ఐదుగురు ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు..బెదిరింపులతో లొంగదీసుకుని వారి బతుకులను చిద్రం చేశారు..ఇలాంటి వారెందరో ప్రేమ ముసుగేసుకుని ఇప్పటికీ ట్రాప్ చేస్తూనే ఉన్నారు.... 

Don't Miss