Activities calendar

06 January 2017

అసంపూర్ణంగా రవాణశాఖ అధికారులు, యూనియన్ల నేతలు చర్చలు

హైదరాబాద్ : ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై రవాణ శాఖ అధికారులతో 20 యూనియన్ల నేతలు చర్చ జరిపారు. చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. తిరిగి రేపు మధ్యాహ్నం మరోసారి చర్చలు జరుపనున్నారు. 

వ్యక్తిపై అధికార పార్టీ నేత భరత్ కుమార్ దాడి

 రంగారెడ్డి : ఇబ్రహీంపట్నంలోని చేరిగూడలో నగర పంచాయతీ అధ్యక్షుడు భరత్ కుమార్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానిపై అధికార పార్టీ నేత భరత్ కుమార్ దాడి చేశాడు. కొట్టొద్దని యజమాని కుటుంబ సభ్యులు కాళ్ల మీద పడినా... భరత్ వదలకుండా చితకబాదాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

22:07 - January 6, 2017
22:06 - January 6, 2017
22:05 - January 6, 2017

గుంటూరు : మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం... ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు గుంటూరు జిల్లాలోని హాయ్‌ లాండ్‌లో జరగనుంది. ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెగా స్టార్ కుటుంబసభ్యులంతా తరలివస్తున్న ఈ స్టార్‌ షోనూ వీక్షించేందుకు అభిమానులు కూడా భారీగా తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వేడుకలో దేవీశ్రీ ప్రసాద్ మ్యుజికల్‌ షోలో మెగా కుటుంబసభ్యులు కనువిందు చేయనున్నారు. 

22:02 - January 6, 2017

యాదాద్రి : రానున్న రోజుల్లో యాదాద్రి దేవస్థానం ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మారుతుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.  ఈ ఉదయం గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.  వీరికి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత నరసింహన్‌ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా  అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి క్షేత్రాన్ని నగదు రహిత లావాదేవీల ఆలయంగా మార్చడానికి కలెక్టర్‌, ఈవో, ప్రభుత్వ విప్‌ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

 

21:59 - January 6, 2017

హైదరాబాద్ : ఒంటరిగా ఉన్న మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి జీవన భృతి పేరిట వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా గిరిజనులు, దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం రూల్స్‌ వెంటనే రూపొందించాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చ అనంతరం సభ 17వ తేదీకి వాయిదా పడింది. 
మరో సంక్షేమ పథకం
తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాల్లాగే మానవీయ కోణంలో ఒంటరిగా ఉన్న మహిళలకు.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్‌ ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో దాదాపు 3 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని సీఎం తెలిపారు. 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై స్వల్పకాలిక చర్చ
మధ్యాహ్నం సభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. చర్చకు ప్రారంభించిన మంత్రి జగదీష్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో దాదాపు 3వేల 671 మందికి మూడెకరాల భూమి పంపిణీ చేశామని.. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. 
దళితుల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న భట్టి విక్రమార్క  
అయితే.. ప్రభుత్వానికి దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. దోపిడీకి గురవుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాల తరపున కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు భట్టి.
దళిత సమాజం పట్ల ప్రభుత్వం వివక్ష : సండ్ర
దళిత సమాజం పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై దళిత ఎమ్మెల్యేల సలహా మండలిని ఏర్పాటు చేయాలన్నారు. అన్యాక్రాంతమైన దళిత భూములను రక్షించాలని సండ్ర డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో 25 శాతం అటవీ భూమి ఉన్నా.. వాస్తవంగా 12 శాతం భూమి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఎంతో ఉందో బడ్జెట్‌ సెషన్‌లో సభ ముందుంచుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లింపు : సున్నం రాజయ్య  
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మల్లుతున్నాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని రాజయ్య అన్నారు. 
మంత్రి వివరణ పట్ల విపక్ష సభ్యులు అసంతృప్తి 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రి వివరణ పట్ల విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో సీఎం సభలో లేకపోవడం, దళిత, గిరిజనులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ.. టీడీపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది.  
పారిశ్రామికరంగం అభివృద్ధికి కృషి : కేటీఆర్ 
అంతకుముందు ఉదయం సభలో మాట్లాడిన కేటీఆర్‌.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని యాదాద్రి, వరంగల్‌ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటివకే డీపీఆర్‌లు తయారు చేశామన్నారు . 
సభ 17వ తేదీకి వాయిదా 
అటవీప్రాంత భూములు, దళిత, గిరిజనుల సంక్షేమం, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు తదితర అంశాలపై అసెంబ్లీలో స్వలకాలిక చర్చలు జరిగాయి. అనంతరం స్పీకర్‌ సభను 17వ తేదీకి వాయిదా వేశారు. 

 

21:52 - January 6, 2017

 

ఎంట్రీలో అదరగొట్టారు...  కమీషన్లతో, ఆఫర్లతో ఆకట్టుకున్నారు. ఏడాది తిరిగేసరికి మ్యాటర్ రివర్స్ అయిందా..? కస్టమర్లకు, డ్రైవర్లకు బరువుగా మారుతున్నారా...? ఓలా, ఒబర్ క్యాబ్ ల తీరుపై ఇప్పుడు డ్రైవర్లంతా  భగ్గుమంటున్నారు. మాకు న్యాయం జరగాల్సిందే అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణలో బడా కంపెనీల ఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. జరుగుతున్న పరిణామాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దా.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:42 - January 6, 2017

జనం చెవుల పసుపు, కమలం పువ్వు... చంద్రాలు మాటలింటే తప్పకుంటొస్తది నవ్వు, తెలంగాణలో మసులుతున్న దళితులు... ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలకు అగ్గులు, తెలంగాణల కొలువుదీరవోతున్న కొత్త పార్టీ... భారీగా తయరైందంటున్న చెరుకు సార్, దమాక్ లేని పని జేసిన దక్షిణమద్య రైల్వే...సంకురాతిరి పండుగకు ప్లాట్ ఫామ్ మీద సురుకు, సావు కార్యలం బరాత్ దీసిన బంధువులు....ఓల్ డ్యాన్సుతోటి అంత్యక్రియలు పొల్లు పొల్లు, 
సీఎం కేసీఆర్ ను కలిసిన బాలి కాకయ్య.. జర్ర మాదిక్కు మాత్రం రాకయ్య.... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాంం....

 

21:20 - January 6, 2017
21:14 - January 6, 2017
21:11 - January 6, 2017

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో వన్డే, టీ 20 సిరీస్‌కు ఇండియన్‌ టీమ్‌ను ప్రకటించారు. బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్ కే ప్రసాద్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ ప్యానెల్‌ రెండు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించారు. వన్డే, టీ 20 జట్టులో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ రీ ఎంట్రీ ఇవ్వగా,వెటరన్లు సురేష్‌ రైనా, అశిష్‌ నెహ్రాలను టీ 20 జట్టుకు ఎంపిక చేశారు.ఇన్‌స్టంట్‌ వన్డే, టీ 20 ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొహ్లీ తొలి సిరీస్‌ ఆడబోతున్నాడు. వన్డే, టీ 20 కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన ధోనీకి రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. యంగ్‌ గన్‌ రిషబ్‌ పంత్‌ టీ 20 జట్టుకు ఎంపికయ్యాడు. వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
వన్డే సీరిస్ జట్టు 
విరాట్‌ కొహ్లీ, కే ఎల్‌ రాహుల్‌,శిఖర్‌ ధావన్‌, ధోనీ, మనీష్‌ పాండే,కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానే, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌ , జడేజా, అమిత్‌ మిశ్రా, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌. టీ 20 జట్టులో సేరేష్‌ రైనా, వెటరన్‌ అశిష్‌ నెహ్రా  రీ ఎంట్రీ ఇచ్చారు. యంగ్ గన్‌ రిషబ్‌ పంత్‌కు తొలిసారిగా టీ 20 జట్టుకు ఎంపికయ్యాడు.
టీ20 సిరీస్‌ జట్టు.. 
టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. విరాట్‌ కొహ్లీ, కే ఎల్‌ రాహుల్‌,రిషబ్‌ పంత్‌, ధోనీ, మనీష్‌ పాండే,సురేష్‌ రైనా , యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానే, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌ , జడేజా, యజ్వేంద్ర చహాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, అశిష్‌ నెహ్రా. 

 

21:03 - January 6, 2017

ఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అత్యున్నత న్యాయస్థానానికి బేషరుతుగా క్షమాపణ చెప్పారు. కేరళకు చెందిన సౌమ్యపై లైంగిక దాడి, హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును కట్జూ గతంలో తప్పుపట్టారు. సుప్రీం తీర్పును ఆయన తన బ్లాగ్‌లో విమర్శించడంతో కోర్టు ముందు హాజరై తన వాదనను వినిపించాలని సుప్రీంకోర్టు నవంబర్‌ 11న ఆదేశించింది. కోర్టును అవమానించినందుకు 6 వారాల్లోగా జవాబివ్వాలని ఆయనకు నోటీసు కూడా జారీ చేసింది. దీంతో బ్లాగ్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ కట్జూ బేషరుతుగా క్షమాపణ చెప్పారు. కట్జూ క్షమాపణను అంగీకరించిన కోర్టు విచారణను మూసివేసింది.  

 

20:59 - January 6, 2017

ఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలన్న పిటిషన్‌పై త్వరగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై విచారణ అంత అత్యవసరమేమీ కాదని చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ అన్నారు. న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఆనవాయితీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ను ఆపాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు కూడా ఈసీకి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

20:54 - January 6, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన్‌ సమాజ్‌ పార్టీ రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తాజాగా మరో వందమంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇందులో 27 మంది దళితులు, 23 మంది ముస్లిం అభ్యర్థులకు సీట్లను కేటాయించినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. 403 సీట్లకు గాను బిఎస్‌పి 2 వందల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సామాజిక సమీకరణకు ప్రాధాన్యత నిస్తున్న మాయావతి- అభ్యర్థుల ఎంపికలో ముస్లింలు, దళిత వర్గానికి పెద్ద పీట వేశారు. తొలి జాబితాలో వంద మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

20:52 - January 6, 2017

లక్నో : సమాజ్‌వాది పార్టీలో ఆధిపత్యం సాధించిన అఖిలేష్‌ యాదవ్‌- ఎన్నికల్లో భారీ విజయంపై దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి-బిఎస్‌పిలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో జతకట్టాలని భావిస్తున్నారు. వచ్చే వారం ఈ రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీపై అఖిలేష్ ఆధిపత్యం 
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నగారా మోగడంతోనే రాజకీయాలు వేడెక్కాయి. సమాజ్‌వాదీ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన అఖిలేశ్‌ యాదవ్‌..అధికారాన్ని తిరిగి కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.  దూకుడు మీదున్న బీజేపీని, బీఎస్పీని గట్టిగా ఎదుర్కొనేందుకు పొత్తులపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పొత్తు విషయంలో వచ్చేవారం కాంగ్రెస్‌-ఎస్పీలు ఓ అవగాహనకు వచ్చే అవకాశముందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ వారంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎస్పీ చీఫ్‌ హోదాలో అఖిలేశ్‌యాదవ్‌ జనవరి 9న ఢిల్లీకి వెళ్లి రాహుల్‌తో భేటీ కానున్నారని సమాచారం. 
భారీ మెజారిటీపై అఖిలేష్‌ దృష్టి 
సంప్రదాయ దళిత, మైనారిటీ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు తప్పక ఉత్తమ ఫలితాన్నిస్తుందని మొదటి నుంచీ నమ్ముతోన్న అఖిలేశ్‌.. ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేయనున్నారు. తద్వారా బీఎస్పీని, బీజేపీని ఒకేసారి దెబ్బకొట్టొచ్చన్నది ఆయన వ్యూహం. తనకున్న సొంత బలంతో సమాజ్‌వాది పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ... భారీ మెజారిటీపై అఖిలేష్‌ దృష్టి పెట్టారు.  కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే  3 వందల సీట్లు కైవసం చేసుకోవచ్చని అఖిలేష్‌ ధీమాతో ఉన్నారు.
28 ఏళ్లుగా అధికారానికి దూరంగా కాంగ్రెస్‌ 
ఉత్తరప్రదేశ్‌లో 28 ఏళ్లుగా కాంగ్రెస్‌ అధికారానికి దూరంగా ఉంది. గత ఎన్నికల్లో కేవలం 27 సీట్లకై పరిమితమైంది.  గత లోక్‌సభ ఎన్నికల్లో బాగా లాభపడ్డ బిజెపిని ఎదుర్కొనేందుకు ఎస్పీతో జతకట్టడానికి సిద్ధమైంది. మచ్చలేని నేతగా, నిజాయితీ పరుడిగా పేరున్న అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలో పోటీ చేస్తే తాము లాభపడనున్నామని కాంగ్రెస్‌ భావిస్తోంది. 
90 నుంచి 100 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ 
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్‌ పార్టీ 90 నుంచి 100 స్థానాల్లో పోటీ చేయనుంది. కొన్ని రోజుల కిందట అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ముఖ్య నాయకురాలు ప్రియాంకా గాంధీల మధ్య జరిగిన రహస్య భేటీలోనే పొత్తు ఖాయమైపోయిందని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనేది మాత్రం రాహుల్‌- అఖిలేశ్‌లు నిర్ణయించుకోనున్నారని సమాచారం.

 

20:47 - January 6, 2017

గుంటూరు : మున్సిపల్‌ స్కూళ్లలో తెలుగు మీడియాన్ని రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏపీ యూటీఎఫ్‌ నేతలు హెచ్చరించారు. మున్సిపల్‌  పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు వ్యవహారంపై  సచివాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీని కలిసి చర్చించారు. టీచర్లకు సరైన శిక్షణ లేకుండా ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు.  తెలుగు మీడియాన్ని కొనసాగిస్తూ... ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడితే తమకెలాంటి అభ్యంతరం లేదని యూటీఎఫ్‌ నేతలు వెంకటేశ్వరరావు, బాబురెడ్డి  స్పష్టం చేశారు.

 

20:36 - January 6, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో 10 టీవీ 2017 క్యాలెండర్‌ను హోప్ ఇంటర్నేషనల్ హస్పిటల్ అధినేత డాక్టర్ ఛార్లెస్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆకర్షణీయంగా ఉందని ఆయన అన్నారు. అనతికాలంలోనే గుర్తింపు పొందిన ఛానెల్ మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.  

 

20:33 - January 6, 2017

ప్రకాశం : ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తోన్న జన్మభూమికి జనాలు కరువయ్యారు. జనాలను రాబట్టేందుకు... వారిని ఆకర్షించేందుకు అధికారులు, స్థానిక నాయకులు పడుతున్న ఆరాటం విమర్శలకు తావిస్తోంది. ఖాళీ కుర్చీలను నింపుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో నృత్యాలు చేయించడంపై గ్రామస్థులు సైతం మండిపడతున్నారు.  గత మూడు జన్మభూమి కార్యక్రమాల్లోని సమస్యలను పరిష్కరించకుండా ఈ కొత్త తంతేంటని  పెదవి విరుస్తున్నారు. 
గ్రామసభలను బహిష్కరించిన జనాలు 
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్న చందంగా మారింది 'జన్మభూమి మా ఊరు'  కార్యక్రమం. ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల జనాలు గ్రామసభలను బహిష్కరిస్తే ... మరికొన్ని చోట్ల అధికారులే హాజరుకాని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఆర్భాటపు చర్యలు ... వెరసి జన్మభూమి కార్యక్రమం నిలువునా అబాసుపాలవుతోంది. 
జనం ఆశలు అడియాశలు
జన్మభూమి కార్యక్రమమంటే ఫించన్లు, రేషన్ కార్డుల సమస్యలు తీరుతాయని ఎంతో ఆశతో ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. అయితే వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. గతంలో ఇచ్చిన అర్జీలకు సమాధానం లేదు. ఫించన్లు, ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు తదితర విన్నపాలతో ముందుకొచ్చిన వారికీ నేటికీ సమాధానం లేదు. కానీ మళ్లీ పాతపాట పాడుతున్న అధికారుల తీరుకు జనాలు విసిగెత్తిపోతోన్న పరిస్థితి అంతటా కనబడుతోంది.  అర్జీలు ముందుకు నడవాలన్నా... వాటిని ఆమోదింపజేసుకోవాలన్నా అధికార పార్టీ దీవెనలు కావాల్సి రావడంతో కొంతమంది స్వచ్ఛందంగానే ప్రయత్నాలు విరమించుకుంటోన్న పరిస్థితి నెలకొంది. 
జన్మభూమి కార్యక్రమాల్లో డొల్లతనం
ఇక అధికారుల విషయానికి వస్తే... ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది మధ్యాహ్నమే ఉడాయించడం...తాజా జన్మభూమి కార్యక్రమాల్లోని డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వస్తేనో లేదా మంత్రి వస్తేనో  వారు ఉన్నంత వరకు జన్మభూమి నడుస్తోంది. ఆ ప్రజాప్రతినిధులు వెళ్లిపోయాక కార్యక్రమం బేలగా మారిపోతోంది. ఇది జిల్లాలోని ప్రతినియోజకవర్గంలోని పరిస్థితి. దీనికి తోడు నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్ల మధ్య ఏర్పడ్డ వివాదాలు కూడా జన్మభూమి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూసిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల పోలీసు పహారాల నడుమ కార్యక్రమాలు జరగాల్సి వస్తోంది. 

 

20:29 - January 6, 2017

గుంటూరు : రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టామని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనప్లలి మండ్లిం బృగుబండలో జరిగిన జన్మభూమి- మా వూరు కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌ తో కలిసి చినరాజప్ప పాల్గొన్నారు. రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రజల సంఘటితంగా ముందుకు రావాలని స్పీకర్ కోడెల పిలుపునిచ్చారు. పంటలను బ్రతికించుకునేందుకు మరోసారి సాగర్ జలాల విడుదల కృషి చేస్తామని చెప్పారు.    

 

20:23 - January 6, 2017
20:21 - January 6, 2017

వేములవాడలో పాస్ పోర్టు కార్యాలయాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

 సిరిసిల్ల : వేములవాడలో పాస్ పోర్టు కార్యాలయాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ట్రావెల్స్ లో 15 పాస్ పోర్టులు, రూ.50 గల్ప్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. 

 

టీ.అసెంబ్లీ, మండలి ఈనెల 17 కి వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలను ఈ నెల 17 వ తేదీ వాయిదా వేస్తూ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ప్రకటించారు.
  

కాకుమాను జన్మభూమి కార్యక్రమంలో రసాభాస

గుంటూరు : కాకుమాను జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. జెడ్ పీ చైర్మన్ జానీమూన్ తో మంత్రి రావెల వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. 

 

ములాయంకు అఖిలేష్ యాదవ్ మరో షాక్

యూపీ : ములాయం సింగ్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ మరో షాక్ ఇచ్చారు. సమాజ్ వాదీ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని అఖిలేష్ వర్గం బ్యాంకులను కోరింది. శివపాల్ యాదవ్ చేతిలో ఎస్పీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.
సమాజ్ వాదీ పార్టీ ఖాతాల్లో రూ.500 కోట్లు ఉన్నట్లు అంచనా. 

 

18:38 - January 6, 2017

కామారెడ్డి : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమది. అక్కడ మూడు రాష్ట్రాల ప్రజలు విభిన్నంగా ఎవరి సంస్కృతులు, సంప్రదాయాల ప్రకారం వారు జీవిస్తున్నారు. మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ మూడు సరిహద్దులు కలిగిన ఓ ప్రాంతం అత్యంత వెనకబడింది. నాయకులు అటువైపే చూడకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. 
జుక్కల్‌ ప్రాంతం 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ప్రాంతం ఇది. గతంలో నిజామాబాద్‌ జిల్లాలో ఉండేది. నిజామాబాద్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జుక్కల్‌ ప్రాంతం త్రిభాష సంగమంగా పేరుగాంచింది. ఈ నియోజకవర్గం ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నా ఏ జిల్లాలో కలిసినా తనదైన శైలిని కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నారు ఇక్కడి ప్రజలు. జుక్కల్‌, బిచ్కుంద, మద్నూరు ప్రాంతాలు గతంలో మహరాష్ట్రలో ఉండటంతో ఇక్కడ అధిక శాతం మరాఠీ సంస్కృతి నెలకొంది. 1956వ సంవత్సరంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా ఈ ప్రాంతాలు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ లోని నిజామాబాద్‌ జిల్లాలో కలిశాయి. 
తెలుగులోకి అధికార లావాదేవీలు 
ఆ తర్వాత మరాఠీలో కొనసాగిన అధికార లావాదేవీలను తెలుగులోకి మార్చారు. ఇక 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా అవతరించటంతో జుక్కల్ మరోసారి తన రాష్ర్టం పేరు మార్చుకుంది. తాజాగా జిల్లాల పునర్విభజనతో ఈ సారి జిల్లా పేరును మార్చుకోక తప్పని సరైంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం కొన్ని ఆచార సంప్రదాయాల్లో మిగతా ఈ మూడు నియోజకవర్గాల కన్నా భిన్నంగా కనిపిస్తుంది.
సోపూర్ గ్రామస్తులు నానా అవస్థలు 
అయితే జుక్కల్ మండలంలోని సోపూర్ అనే గ్రామం ఉంది. మానూరు గ్రామం అనేది మహరాష్ర్టకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక, తెలంగాణకు మధ్య ఒక బ్రిడ్జి ఉంది. మూడు కోట్ల 45 లక్షలతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్రిడ్జి మీదుగానే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు కర్ణాటకలోని ఔరాద్, మహరాష్ర్టలోని దెగ్లూరు బస్సులు నడుస్తుంటాయి. పల్లెల్లో రోడ్ల సదుపాయాలు సరిగ్గా లేనందున చాలా ఇబ్బందికరంగా మారింది. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. కనీస సౌకర్యాలు లేక సరిహద్దు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 
అధ్వానంగా రోడ్లు  
మూడు రాష్ర్టాల కూడలి కావటంతో ఈ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ అధికారులు, నేతలు అటువైపే రాకపోవడంతో ప్రజల సమస్యలు ఎక్కువయ్యాయి. ఇక్కడి నుంచే మూడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగుతున్నా రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ తెలుగు మీడియం పాఠశాలలు ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్ధులు వాడుక భాషగా మరాఠీని వినియోగిస్తారు. ముఖ్యంగా హంగర్గా, చండేగావ్, మాదాపూర్, ఖరగ్, తడ్గూరు, అంతాపూర్ తదితర గ్రామాలలో పని చేసే టీచర్లు ఈ భాష సమస్యను ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయులు తెలుగు పాఠాలను మరాఠీలోకి అనువదించి చెబుతారు.
ప్రజలు నానా ఇబ్బందులు 
అన్ని రంగాల్లో వెనకబడిన ఈ ప్రాంతంలో అభివృద్ధి ఊసే ఎత్తకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిహద్దే శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. 

 

ఇంగ్లండ్ తో టీ.20మ్యాచ్ లకు భారత జట్టు ఎంపిక

హైదరాబాద్ : ఇంగ్లండ్ తో జరుగనున్న టీ.20మ్యాచ్ లకు భారత జట్టును ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ (కెప్టెన్), ధోనీ, యువరాజ్, రైనా, రాహుల్, మన్ దీప్,రిషబ్, పాండ్యా, అశ్విన్, జడేజ, చాహల్, బుమ్రా, మనీష్ పాండే, భువనేశ్వర్, అశిష్ నెహ్రాలు ఎంపికయ్యారు. 

 

ఇంగ్లండ్ తో వన్డే సీరిస్ కు భారత జట్టు ఎంపిక

హైదరాబాద్ : ఇంగ్లండ్ తో జరిగే వన్డే సీరిస్ కు సెలెక్టన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ (కెప్టెన్ ), ధోనీ, కేఎల్ రాహుల్, జాదవ్, యువరాజ్, రహానే, హార్థిక్ పాండ్యా, అశ్విన్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, జడేజా, మిశ్రా, బుమ్రా, ఉమేష్, భువనేశ్వర్ లను ఎంపిక చేశారు.

 

18:08 - January 6, 2017

హైదరాబాద్ : రైతులను ఆదుకునేలా వెంటనే పప్పుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పప్పు ధాన్యాలకు సరైన మద్దతు ధర లభించక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పప్పు ధాన్యాల మద్ధతు ధర'పై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. కర్నాటక ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘాన్ని నియమించి వరి, ధాన్యం, రాగులకు బోనస్‌ ఇస్తోందని వివరించారు. కర్నాటక తరహాలోనే తెలంగాణలోనూ మద్దతు ధరలపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడి పంటలను వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో నిల్వ చేసి కొరత సృష్టిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఒత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌ కందులకు ఏడువేల మద్ధతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

 

17:58 - January 6, 2017

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి కన్నుమూశారు. తెల్లవారు జామున గుండెపోటుతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఓం పురి హఠాన్మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఆయన అకాల మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వసుంధర రాజే సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పలువురు  సీనియర్ నటీ నటులు, దర్శకులు,  క్రీడాకారులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
సినీ అభిమానులను ఆకట్టుకున్న ఓంపురి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఓంపురి కన్నుమూశారు. విలక్షణమైన పాత్రల్లో తనదైన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకున్నారు ఓంపురి. నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ముద్రను వేసిన నటదిగ్గజం ఓంపురి. నిన్నరాత్రి ఓ షూటింగ్‌కు హాజరై తిరిగొచ్చిన ఓంపురి.. నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. వేకువ జామున ఆయన్ను నిద్రలేపేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌.. ఓంపురి మరణించినట్లు గుర్తించి ఆయన సన్నిహితులు, మిత్రులకు సమాచారం అందించారు. 
1976లో మరాఠీ చిత్రంతో సినీరంగ ప్రవేశం 
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓంపురి... 1976లో మరాఠీ చిత్రం ఘశీరాం కొత్వాల్‌తో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో అంకురం చిత్రంలో నటించారు. భారతీయ చిత్రాలతోపాటు హాలివుడ్, పాకిస్తానీ సినిమాల్లో నటించారు.  2014లో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా ది హండ్రెడ్‌ ఫుట్‌ జర్నీలో విలక్షణ నటనను కనబరిచారు. ఓంపురి రెండుసార్లు నేషనల్ అవార్డులు, నాలుగు సార్లు ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. 
18 అక్టోబర్ 1950 లో జననం
హర్యానాలోని అంబాలాలో 18 అక్టోబర్ 1950 న ఓంపురి జన్మించారు. మరో సీనియర్ నటుడు..దివంగత అమ్రేష్ పురికి ఓంపురి సోదరుడు. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఓంపురి గ్రాడ్యుయేషన్ చేశారు. స్కూల్‌ ఆఫ్ నేషనల్ డ్రామా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా ఓంపురికి క్లాస్‌మేట్. ఆక్రోష్ సినిమాలో నటనతో ఓంపురి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గాంధీ, అర్థసత్య, డిస్కోడాన్సర్, గుప్త్, ధూప్,  డర్టీ పాలిటిక్స్ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 
ఇండియన్ ఆర్మీపై సంచలన వ్యాఖ్యలు 
ఇటీవల అక్టోబర్ 2016లో ఐబిఎన్ 7 చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ఆర్మీపై సంచలన వ్యాఖ్యలు చేసి..వార్తల్లో నిలిచారు. సహనటుడిని కోల్పోయిన సినీజగత్తు తీవ్ర  దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, బాలీవుడ్ ప్రముఖులందరూ ప్రగాఢ సంతాపం తెలిపారు.  

 

17:53 - January 6, 2017
17:52 - January 6, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మల్లుతున్నాయని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో జరగలేదని.. వెంటనే భూములివ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని పేర్కొన్నారు. ట్రైకార్‌ రుణాలివ్వాలన్నారు. గిరిజన యువతీయువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, 
మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని కోరారు. 

 

17:36 - January 6, 2017

హైదరాబాద్ : 'దేశభాషలందు తెలుగు లెస్స' అంటూ శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాషను కీర్తిస్తే.. ఇప్పుడున్న టీడీపీ సర్కార్‌ మాత్రం మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు లెస్‌ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ మున్సిపల్‌ శాఖ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 
తెలుగు మీడియం రద్దు నిర్ణయంపై ప్రజాసంఘాల విమర్శలు  
తెలుగు జాతిని ఉద్ధరిస్తామని.. తెలుగు తేజాన్ని దశదిశలా వ్యాప్తి చేస్తామంటూ చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ పాలనలో మున్సిపల్ పాఠాశాలలలో తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న నిర్ణయంపై విద్యావేత్తలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తి కానున్న తరుణంలో అత్యవసరంగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్పు చేయాల్సిన అవసరం ఏ మొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే యూటీఎఫ్‌ ఆందోళనబాట పట్టింది..
నేడు ఉపాధ్యాయ సంఘాలతో మున్సిపల్‌ శాఖ సెక్రటరీ సమావేశం 
మున్సిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌ శాఖ సెక్రటరీ ఉపాధ్యాయ సంఘాలతో ఇవాళ విజయవాడలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు తమ వాణిని వినిపించబోతున్నాయి. ఉత్తర్వులు విడుదల చేసే ముందే ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై చర్చించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. 
మంత్రి నారాయణ నిర్ణయం వెనుక కుట్ర : ఉపాధ్యాయ సంఘాలు 
ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాల్లేకుండా, బోధించడానికి అధ్యాపకుల్లేకుండా రాత్రికి రాత్రే తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనే మంత్రి నారాయణ నిర్ణయం వెనుక కుట్ర దాగుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 
క్లాసులు ఇంగ్లీష్ మీడియంలో బోధించాలన్న మంత్రి నారాయణ 
కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కావాలనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మన విద్యార్థులు ఇంగ్లీష్‌లో వెనకబడడంతోనే జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో వెనబడిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు క్లాస్‌లను దశల వారిగా ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించామని నారాయణ తెలిపారు. దయచేసి ఉపాధ్యాయ సంఘాలు పేద విద్యార్థుల భవిష్యత్‌కు సహకరించాలని కోరారు. 
తె.మీ. మూసివేయటాన్ని విరమించుకోవాలి : ఉపాధ్యాయ సంఘాలు  
మున్సిపల్ శాఖ మంత్రి ఏకపక్షంగా తెలుగు మీడియంను మూసివేయటాన్ని వెంటనే విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు దిగబోతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

 

17:26 - January 6, 2017

గుంటూరు : ఏపీ రాజధాని గ్రామాల్లో మరోసారి భూసేకరణ సెగలు పుట్టించబోతోంది. అటు భూములు ఇచ్చేదిలేదని కొన్ని గ్రామాల రైతులు... ఇటు  ఆరు నెలల్లోగా భూసేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నాయి.. భూసేకరణపై పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న సర్కారు దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు అడుగులు వేస్తోంది.  
జూన్‌లోగా భూసేకరణ పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ 
అమరావతి నిర్మాణానికి ఈ జూన్‌లోగా భూసేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ పెట్టుకుంది.. భూములివ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. ఇప్పటికే భూసేకరణకోసం నేలపాడు, కృష్ణాయపాలెం, ఐనవోలు, అబ్బరాజు పాలెం, బోరుపాలెం గ్రామాల్లో అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు..  జిల్లా కలెక్టర్, రెవెన్యూ , సీఆర్డీఏ అధికారులు ఈ పనుల్లో బిజీబిజీగాఉన్నారు.. 
ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,500 ఎకరాల సేకరణ 
రాజధానికోసం 29 గ్రామాల్లో 33,500 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించింది.. ఇక్కడ ఇంకా 4వేల 150 ఎకరాలను సేకరించాల్సిఉంది.. ఈ భూముల్ని ఇచ్చేదిలేదంటూ రైతులు తేల్చిచెప్పడంతో భూసేకరణకు బ్రేక్‌ పడింది.. రైతుల్ని బుజ్జగించి ఒప్పించాలని అధికారులు ప్రయత్నించినా అన్నదాతలు ఒప్పుకోలేదు. రాయపూడి, ఉద్దండ్రాయినిపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది.. భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పిన రైతన్నలు ఇంకా ఆ భూముల్లో వ్యవసాయం కొనసాగిస్తూనేఉన్నారు.... ఈ రైతులు తమ నిర్ణయం మార్చుకుంటారని రెండేళ్లపాటు వేచిచూసిన సర్కారు... ఇక భూసేకరణలో ఆలస్యం చేయొద్దని   భావిస్తోంది.. తాజాగా నాలుగు గ్రామాలకు భూసేకరణ  నోటిఫికేషన్ విడుదలచేసింది.. 60రోజుల్లోపు ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు స్వీకరిస్తారు.. 
2,500 ఎకరాల సేకరణకు అధికారులు ప్రయత్నాలు
అయితే మొదటి దశ నోటిఫికేషన్‌ గ్రామాల్లో భూసేకరణకు పెద్దగా అడ్డంకులు రావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, భేతపూడి గ్రామాలనుంచి భూసేకరణకు ఎక్కువ వ్యతిరేకత వస్తోంది.. ఈ నాలుగు గ్రామాలనుంచి సుమారు 2వేల 500ఎకరాల  భూమిని తీసుకోవాల్సిఉంది.. ఈ భూముల్ని ఎట్టిపరిస్థితిల్లో ఇవ్వబోమంటూ రైతులు మొదటినుంచీ ఆందోళన చేస్తూనేఉన్నారు.. మూడుపంటలుపండే తమ 
భూములు తీసుకోవడం చట్టవ్యతిరేకమంటూ సుప్రీంకోర్టుతోపాటు... జాతీయ హరిత ట్రిబ్యునల్‌నుకూడా ఆశ్రయించారు..  జనసేన అధినేత  పవన్‌ కల్యాణ్  ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రెండుసార్లు పర్యటించారు..    పవన్‌కు తమ బాధల్ని చెప్పుకున్న రైతన్నలు.... తమ చావైనా బతుకైనా ఈ భూముల్లోనే అని స్పష్టం చేశారు.
భూసేకరణపై పక్కా ప్రణాళికలు
రైతుల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం భూసేకరణపై పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.
భూసేకరణకుముందు చేపట్టాల్సిన సామాజిక అంచనాకమిటీ అధ్యయనం పూర్తయిందని తెలుస్తోంది.. ఎలాంటి హడావుడిలేకుండా... సామాజిక ప్రభావ అంచనాకమిటీ గ్రామాల్లో పర్యటించిందని... సర్కారుకు నివేదికకూడా అందించిందని సమాచారం..... రైతులనుంచి  పెద్ద ఎత్తున నిరసనలు రాకుండా ముందు చిన్న గ్రామాలు, తక్కువ భూమిఉన్న ప్రాంతాల్లో భూమిని సేకరించాలని చూస్తోంది.. ఆ తర్వాత మిగతా గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది.. అన్ని గ్రామాల్లో ఈప్రక్రియ పూర్తయ్యాక ఉండవల్లిలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేయాలని ప్లాన్‌ చేస్తోంది.. అప్పుడుకూడా  ఆ గ్రామాల్లో రైతుల ఆందోళన చేస్తే పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకోవాలని  ఆలోచిస్తోంది.. ప్రభుత్వం సంధిస్తున్న ఈ ఆఖరి భూసేకరణ అస్త్రం ఫలిస్తుందా? రైతుల పోరాటం గెలుస్తుందా? అనేది కొద్ది నెలల్లో తేలనుంది.. 

 

వెంకయ్యనాయుడు ప్రతిపాదనకు గడ్కరీ మద్దతు

ఢిల్లీ :కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు సర్టిఫికెట్ ఉంటనే వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదనకు అనుకూలం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

వేములవాడలో పాస్ పోర్టు కార్యాలయంపై టాస్క్ ఫోర్స్ దాడి

సిరిసిల్ల : వేములవాడలో పాస్ పోర్టు కార్యాలయంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఓ ట్రావెల్స్లో 15 పాస్ పోర్టులు, రూ.50 వేల గల్ఫ్ కరెన్సీ తో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సీఎం పర్యటన

విజయనగరం : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ద్వారపూడి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రూ.130 కోట్ల విలువైన అభివృధ్ధి పనులను ప్రారంభించారు.

టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ హేమలతకు జరిమానా....

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లు ఏర్పాటు బన్సీలాల్‌పేట టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ హేమలతకు గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ - జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెకు ఏకంగా రూ. 10 వేల జరిమానా విధించింది. 

16:43 - January 6, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని  కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీనిచ్చారు. జిల్లాలోని రాజాంలో నిర్వహించిన 'జన్మభూమి...మా ఊరు' కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు..  కిడ్నీ సమస్యకు మూలాలు తెలుసుకుని, దాన్ని నివారించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సోంపేట, పలాసలో వెంటనే డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆ గ్రామాలన్నింటికీ ఉచితంగా మినరల్‌ వాటర్‌ను సప్లై చేయడంతోపాటు... మొబైల్‌ డిస్పెన్సరీలను నడుపుతామన్నారు.

 

16:39 - January 6, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో 11శాతం కంటే రిజర్వ్‌ ఫారెస్ట్‌ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రికార్డుల్లో రిజర్వ్‌ ఫారెస్ట్‌ అని ఉన్నా.. వాస్తవంగా ఆ పరిస్థితి లేదని తెలిపారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ వివరాలన్నీ బడ్జెట్‌ సెషన్‌లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. 

 

వన్డేలు, 3 టీ-20 మ్యాచ్ లకు భారత్ జట్లు ఎంపిక

ముంబై: ఇంగ్లండ్‌తో జనవరి 15 నుంచి జరగనున్న మూడు వన్డేలకు భారత జట్టును ప్రకటించారు. టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు.  వన్డే జట్టులోకి యువరాజ్ సింగ్, వన్డే టీ-20 మ్యాచ్ లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. వన్డే జట్టు లో విరాట్ కోహ్లీ(కెప్టెన్) ధోనీ, కేఎల్ రాహుల్, జావద్, యువరాజ్, రహానే, హార్దిక్, పాండ్యా, అశ్విన్, జడేజా, మిశ్రా, బుమ్రా, ఉమేష్ , భువనేశ్వర్ ఉన్నారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 119 పాయింట్లు నష్టపోయిన 26,759 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 30 పాయింట్లు నష్టపోయి 8,243 వద్ద నిఫ్టీ ముగిసింది.

యువతిగొంతు కోసి పరారయిన యువకుడు

నాగర్ కర్నూలు: వంగూరు మండలం వెలగపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని బైక్ పై ఎక్కించుకొని పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి పరస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా పిల్లికుంటకు చెందిన యువతిగా గుర్తించారు.

నితీశ్, లాలూ మధ్య బయటపడ్డ మనస్పర్థలు

హైదరాబాద్: నితీశ్, లాలూ మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ఆశీనులైన గురుగోవింద్ సింగ్ జయంతి ఉత్సవాల వేదికపైకి లాలూని ఆహ్వానించకపోవడంపై ఆర్జేడీ గుర్రుగా ఉంది. లాలూను ఎందుకు పిలవలేదు? మోదీ, నితీశ్ సరసన లాలూను ఎందుకు కూర్చోబెట్టలేదు? ఇది గ్రామండ్ అలయన్స్ ప్రభుత్వమా, జేడీయూ ప్రభుత్వమా? అని ఆర్జేడీ సీనియన్ నేత రఘువంశ ప్రసాద్ సింగ్ ప్రశ్నిస్తున్నారు. లాలూ ప్రసాద్ ను పిలవకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని తెలిపారు.

16:07 - January 6, 2017

పరీక్షలు రాసే విద్యార్థులకు ఎన్నో కండీషన్లు పెడుతుంటారు. ఒక్క నిమిషం నిబంధన..సెల్ ఫోన్, షూలు..వేసుకుని రావద్దు..ఇలాంటి ఎన్నో నిబంధనలు పెడుతుంటారు. కానీ ఒక దగ్గర మాత్రం 'పేపర్ తొడుగు' లేనది పరీక్ష హాల్ లోకి పంపించరంట. చైనాలో ఈ వింతఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలో చుజుహౌ ఎక్సైరిమెంటల్ స్కూల్ వింతైన నిబంధన విధించింది. తల మీదుగా 'పేపర్ తొడుగు' వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్ వత్తిడికి గురవ్వరని, కాపీ కొట్టే ఛాన్స్ కూడా లేదని అక్కడి టీచర్లు పేర్కొంటున్నారంట. స్టూడెంట్స్ గౌరవానికి భంగం కలుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గుర్తు తెలియని కొంతమంది పరీక్షలు రాస్తున్న వారి ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు తెలిసొచ్చింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు సీరియస్ అయ్యారంట. ఎంత చేసినా 'పేపర్ తొడుగు'పద్ధతిని మాత్రం వదిలేదని లేదని టీచర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. మరి ఎంత మందికి వత్తిడి తగ్గిందో..మార్కెలెక్కువ ఎంతమందికి వచ్చాయో అక్కడి టీచర్లు చెప్పాలి.

15:54 - January 6, 2017

ప్రారంభమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం

ముంబై : బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది. కాసేపట్లో ఇంగ్లండ్ తో వన్డే టీ-20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక చేయనున్నారు.

15:49 - January 6, 2017

నాగర్ కర్నూలు : జిల్లాలోని వంగూరు మండలంలో దారుణం జరిగింది. యువతి గొంతుకోసి ఓ యువకుడు పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా పిల్లిగుంట గ్రామానికి చెందిన యువతి, కడ్తాల్ మండలానికి చెందిన దాసర్లపల్లి నరేష్.. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి గ్రామ సమీపంలో ఉదయం 10 గంటల సమయంలో బైక్ పై వెళ్తున్నారు. ఉన్నటుండి ఉద్వేగానికి గురైన నరేష్ యువతిని పంటపొలాల్లోకి తీసుకెళ్లి కత్తితో దాడి చేసి, పరాయ్యాడు. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రథమ చికిత్స నిమిత్తం యువతిని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

15:46 - January 6, 2017

హైదరాబాద్ : దళితుల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లీస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందన్నారు. దళితులు మూడెకరాల భూమి కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

 

15:43 - January 6, 2017

ఢిల్లీ : కోడి పందాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్ రఘురాం కృష్ణమరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోళ్లకు కత్తులు కట్టకుండానే కోడి పందాలు నిర్వహిస్తామని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈమేరకు కోర్టు విచారణ చేపట్టింది. కోళ్లను అదుపులోకి తీసుకోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోళ్లను అదుపులోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులు ప్రభుత్వం, జంతు సంరక్షణ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుంటే కోడి పందాల నేపథ్యంలో వందాలది కోళ్లు చేతులు మారుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:31 - January 6, 2017

ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి ఆహారం..జ్యూస్ లు..విటమిన్స్ కూడిన వాటిని తినాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 15 ఉత్తమమైన ఆహారాలు మీ కోసం...

 1. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధిని ఆపడానికి దోహద పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లను దాల్చిన చెక్క కలిగి ఉంటుంది.
 2. సోయాలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఐసోఫ్లవోన్లు అధికంగా ఉంటాయి.
 3. కొబ్బరినీరు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ ను పెంచి యాక్టీవ్ గా ఉండటానికి దోహదం చేస్తుంది.
 4. తృణధాన్యాలు ఆహారంలో అధిక భాగాన్ని ఆక్రమించుకుంటాయి. పెరుగుదలకు సహాయ పడుతుంది.
 5. మామిడి..బొప్పాయి వంటి ఆకర్షణీయమైన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ మరి అనేక పోషక అంశాలుంటాయి.
 6. వెల్లుల్లి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు.
 7. బ్లాక్ టీ..ఇందులో పొలిఫెనోల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
 8. వేరుశనగలు తీసుకోవడం వల్ల చర్మం..వంధత్వం..మెదడు కణాల నష్టం..పేలవమైన రోగ నిరోధక పనితీరు నిరోధించడానికి సహాయ పడుతుంది.
 9. పాలు మరియు పాల ఉత్పత్తులు ఆవు పాలతో పాటు రోజు వారీ ఆహారంలో తీసుకోవాలి.
 10. రాగిలో కాల్షియం ప్రధాన వనరుగా దొరుకుతుంది. ఎముకల ధృడత్వానికి దోహద పడుతుంది.
 11. విరోచనాలకు..కడుపులో మంట..తలనొప్పి..నోటి పూత కంటిచూపుకు మునగాకు చక్కగా పనిచేస్తుంది.
 12. క్యారట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
 13. క్యారెట్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి దృష్టి లోపాలు తలెత్తవు.
 14. క్యాప్సికం ఆహారంలో తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది.
 15. తినే ఆహారం..శుచిగా..శుభ్రంగా ఉండడం చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.

దళిత సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన: రసమయి

హైదరాబాద్ : దళిత సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన నడుస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆయన టీఎస్ అసెంబ్లీలో మాట్లాడుతూ...దేశానికి వ్యవసాయాన్ని పరిచయం చేసింది దళితుడేనని, దళితులను ఓటు బ్యాంకుగా పార్టీలు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత వాడలంటే సమస్యలకు నిలయమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 24శాతం అటవీ భూములు ఉన్నాయి: కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 24 శాతం అటవీ భూములు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై మాట్లాడుతూ.. ఆర్ వోఎఫ్ ఆర్ పట్టాలు భూమి పట్టాలు కావన్నారు. అటవీ భూములను ప్రజలు సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

దళిత సమాజం పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది: సండ్ర

హైదరాబాద్: దళిత సమాజం పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.1400 కోట్లకు పైగా సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. ప్రభుత్వం వల్లే నేను రనౌట్ అయ్యానని మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర ప్రకటించారని, దళిత అధికారులెవరూ నిరుత్సాహపడొద్దని, ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలని గుర్తు చేశారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై దళిత ఎమ్మెల్యే చేత కమిటీ వేయాలని సండ్ర సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ ఇప్పటి వరకు అందలేదన్నారు.

15:11 - January 6, 2017

టాలీవుడ్ లో పలు చిత్రాలు పూర్తయిన తరువాత గుమ్మడి కాయలు కొడుతున్నారు. ఇటీవలే పలు చిత్రాలు పూర్తికాగానే గుమ్మడి కాయ కొట్టామంటూ ఫొటోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'బాహుబలి -2’ కి కూడా గుమ్మడికాయ కొట్టారంట. ఈ విషయాన్ని స్వయంగా 'రాజమౌళి' ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. 2016 డిసెంబర్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఈ టార్గెట్ మిస్ అయ్యింది. జనవరి ఆరో తేదీన షూటింగ్ పూర్తయ్యింది.

ఏప్రిల్ నెలలో రిలీజ్..
'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం కోసం టాలీవుడ్ మాత్రమే కాదు యావత్తు దేశవ్యాప్తంగా సిని ప్రియులు ఎదురుచూస్తున్నారు. 2017 సమ్మర్ లో సెకెండ్ పార్ట్ ని రిలీజ్ చేస్తానని 'రాజమౌళి' ఎప్పుడో ఆరునెలల కిందటే మాట ఇచ్చాడు. క్వాలిటీ విషయంలో 'రాజమౌళి' ఏ మాత్రం రాజీపడకపోవడంతోనే షూట్ ఆలస్యం అయ్యిందని తెలుస్తోంది. షూటింగ్ విషయంలో డెడ్ లైన్ మిస్ అయినా, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని 'రాజమౌళి' చెప్పుతున్నాడట. ముందుగా చెప్పిన ప్రకారమే ఎట్టిపరిస్థితుల్లో ఈ మూవీని ఏప్రిల్ 28 రిలీజ్ రిలీజ్ చేసి తీరుతామని 'రాజమౌళి' శపథం చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ఇంకా నాలుగు నెలల టైం ఉండడంతో సినిమాను చెప్పిన తేదీకల్లా రిలీజ్ చేస్తాడులే అని సిని ప్రియులు కూడా నమ్ముతున్నారు. మరి అద్భుతమైన అవుట్ పుట్ కోసం జక్కన్న రాజీ పడడనే విషయం ఆయన గత చిత్రాలను చూస్తే అర్ధం అవుతోంది. ఎంత లేట్ అయిన కూడా రాజమౌళి మాత్రం మరోసారి సెల్యూలాయిడ్ పై వండర్స్ క్రియేట్ చేస్తాడనడంలో ఆడియన్స్ కి ఎలాంటి సందేహం లేదు.

జన్ ధన్ ఖాతాల్లో 143శాతం పెరిగిన నిల్వ

ఢిల్లీ: డిసెంబర్ 28 నాటికి జన్ ధన్ ఖాతాల్లో మొత్తం 71,036.58 కోట్ల జమ అయ్యింది. ఏడాది క్రితం జన్ ధన్ ఖాతాల్లో మొత్తం నిల్వ రూ.29,225.56 కోట్లు వుంది. ఏడాదిలో జన్ ధన్ ఖాతాల నిల్వ143 శాతం పెరిగింది.

సుప్రీం కోర్టు కు మార్కెండేయ కట్జూ క్షమాపణలు

ఢిల్లీ : సుప్రీం కోర్టు కు మార్కెండేయ కట్జూ క్షమాపణలు చెప్పారు. గతంలో బ్లాగులో వివాదాస్పద చేసిన కట్జూ క్షమాపణ చెప్పడంతో సుప్రీం కోర్టు కేసును మూసివేసింది.

 

15:05 - January 6, 2017

వాళ్లు కేబినెట్ మంత్రులు..ఆ దేశ ప్రధాని వారందరికీ వీధి భోజనం పెట్టించాడు. పెట్టడం సరే..మరి ఆ మంత్రులు తిన్నారా ? సుష్టుగా తిన్నారు. మన దేశంలో మాత్రం జరగలేదు ఈ ఘటన. ఇండోనేషియాలో చోటు చేసుకుంది. జోకో విడొడో దేశానికి అధ్యక్షుడు. స్టేట్ ప్యాలెస్ లో కేబినెట్ మంత్రులతో సమావేశాలు జరుగుతుంటాయి. సమావేశాల్లో ఖరీదైన రెస్టారెంట్ల నుండి భోజనం తెప్పిస్తుంటారు. లేక అక్కడే ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తుంటారు. ఇటీవలే సమావేశం జరిగింది. రెస్టారెంట్ల నుండి కాకుండా వీధి భోజనం వడ్డించారు. స్టేట్ ప్యాలెస్ కు తోపుడు బండ్ల వారిని జోకో పిలిపించారు. వాళ్లు వండిన వంటకాలను మంత్రులకు పెట్టించారు. ఈ విషయాన్ని జోకో ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. భోజనానికి మీట్ బాల్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ బీన్ స్ప్రోట్స్ ఆర్డర్ ఇచ్చామని, వీధుల్లో అమ్మే వంటకాలు చౌకగా, చాలా రుచికరంగా ఉంటాయంటూ ట్వీట్ చేశారు. స్టేట్ ప్యాలెస్ ప్రజలందరికీ చేరువగా ఉండాలన్న ఆలోచనతోనే ఇలాంటి భోజనం పెట్టించారంట.

15:00 - January 6, 2017
14:59 - January 6, 2017

 హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో పోలీసుల అకృత్యాలు పెరిగిపోతున్నాయని సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రాపురంలో ఓ గిరిజనున్ని పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపేశారని శాసనసభలో తెలిపారు. సారా ఉందంటూ కొట్టారని శాసనసభలో తెలిపారు. ఆ కుటుంబానికి పదిలక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

 

14:57 - January 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో చెరుకు, పసుపు, పత్తి, మొక్కజొన్న పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. చెరుకు రైతులకు టన్నుకు 5వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపైన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

14:54 - January 6, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ సర్కార్‌ దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వమని టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ విమర్శించారు. దళిత, గిరిజనులకు సంబంధించిన సబ్‌ ప్లాన్‌ శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సీఎం, మంత్రులు ఎవ్వరూ లేకపోవడాన్ని దళితులు అందరూ గమనిస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

 

14:53 - January 6, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీల కోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్‌పై శాసనసభలో స్వల్పకాలిక చర్చను మంత్రి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ నిరంతర కార్యక్రమమని చెప్పారు. రెండున్నరేళ్లలో దాదాపు 3వేల 671 మందికి మూడెకరాల భూమి పంపిణీ చేశామని ప్రకటించారు. 

 

కోడి పందాలపై సుప్రీం కోర్టులో విచారణ

హైదరాబాద్: కోడి పందాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై బిజెపి నేత రాఘురాం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం కోళ్లను నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోడి పందాలకు వాడే ఆయుధాలను సీజ్ చేయాలని ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం నోటీసులు జారీ చేసింది.

కేరళలో నోట్ల రద్దు పై కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్: నోట్ల రద్దు ను నిరసిస్తూ కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత శశిధరూర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

14:28 - January 6, 2017

చావు యాత్రలో బికినీ డ్యాన్స్ ఏంటీ ? అందరూ దు:ఖసాగరంలో ఉంటే గీ డ్యాన్స్ లు ఏంటీ పాడు అంటూ ఈసడించుకుంటున్నారా ? కానీ కొంతమంది చనిపోయిన అనంతరం జరిగే ఊరేగింపులు డ్యాన్స్ వేస్తుండడం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఓ రాజకీయ నాయకుడి అంత్యక్రియల్లో బికినీ డ్యాన్స్ వేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇక్కడ జరిగింది మాత్రం కాదు.

తైవాన్ లో కౌన్సిలర్ గా తంగ్ హ్సింగ్ (76) ఉండేవారు. డిసెంబర్ లో ఇతను మృతి చెందాడు. అనంతరం అతని కుటుంబసభ్యులు ఊరేగింపు నిర్వహించారు. ముందు జీపులు వెళుతున్నాయి. ఒక్కసారిగా జీపులపైకి బికినీలు ధరించిన ముద్దుగుమ్మలు ప్రత్యక్షమయ్యారు. దాదాపు 50 మంది డ్యాన్సర్లు బికినీలు ధరించి జీపుల మీదకు ఎక్కి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. వీరి నృత్యానికి దరువు కూడా ఉంది. ఇంకే ముంది జోరుగా డ్యాన్స్ లు చేస్తున్నారు. పెండ్లి బారాత్ ను తలిపించిన ఈ చావు యాత్రను పలువురు తమ సెల్ ఫోన్ లో బంధించారు. దీనితో అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ జాం అయ్యిందంట. తన అంత్యక్రియలను ఫుల్ జోష్ తో నిర్వహించాలని తంగ్ హ్సింగ్ చనిపోయే ముందు చెప్పారని, అందుకే ఇలా నిర్వహించామని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అందండి సంగతి...

కొత్త చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించరు: జానారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ తెచ్చిన కొత్త భూసేకరణ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తారనుకోవడం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలోగత పాలకులు లోపభూయిష్టమని కేసీఆర్ అనడం హాస్యాస్పదం అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మా హయాంలో తెచ్చినవే అని టీఆర్ ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవని తెలిపారు. కేసీఆర్ ఎర్రరొయ్యల కోసమే ప్రాజెక్టులు కడుతున్నట్లుందని కొందరు మంత్రులు సభలో మాట్లాడుతున్న తీరు బాగో లేదని జానారెడ్డి విమర్శించారు. సభలో పాండువల మాదిరి కాంగ్రెస్ ధర్మం వైపు ఉందన్నారు.

సీఎం హోదాలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తా - జగన్..

ప్రకాశం : డోర్నాలలో జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టును సీఎం హోదాలో తానే ప్రారంభిస్తానని జగన్ పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచి టిడిపిలో చేరడం సిగ్గు చేటన్నారు.

14:09 - January 6, 2017

కలలు..నిద్రలో కలలు వస్తుంటాయి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయని పెద్దలు అంటుంటారు. అలాగే ఓ మహిళకు కల వచ్చింది. ఆ కల 30 ఏళ్ల తరువాత నిజమయ్యింది. ఎక్కడా ఏమిటీ ? తెలుసుకోవాలంటే చదవండి...కెనాడాలోని నోవావ స్కాటియాకు చెందిన ఒల్గా బెనో అనే మహిళకు కల వచ్చింది. అది 1989లో. ఈమెకు క్యాన్సర్ వ్యాధి ఉంది. తాను లాటరి టికెట్ కొన్నట్లు కల వచ్చింది. కలలో లాటరీ టికెట్ నెంబర్ గుర్తు ఉంచుకుంది. ఆ నంబర్ కోసం వెతుకులాట ప్రారంభించింది. క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం తన ఇంటిని కూడా అమ్మేసింది. రోగం తగ్గుముఖం పట్టినా ఆర్థికంగా మాత్రం నష్టపోయిందంట. కానీ లాటరీపై ఉన్న ఆశ మాత్రం చావలేదు. ఇటీవలే ఆ నంబర్లతో కూడిన లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. అనూహ్యంగా ఓల్గాకు లాటరీ తగిలింది. ఇందులో 5.3 మిలియన్ డాలర్లు అంటే రూ. 36కోట్లు గెలుచుకుంది. తాను నిద్రలో కన్న కల ఇప్పటికి నిజమైందని అనుకుంటూ తెగ సంతోష పడిపోతోంది. లాటరీ బహుమతిలోని కొంత సొమ్ముతో ఇంటిని కొనుక్కొని మనవళ్లు..మనవరాళ్లతో హాయిగా షికారు చేస్తానని ఓల్గా అంటోందంట.

14:08 - January 6, 2017

జనగాం : విద్యావ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 82వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాఠశాలల సమస్యలపై తమకు అందిన వినతులను పాదయాత్ర బృందం స్వీకరించింది. యశ్వంతాపూర్, ధర్మకంచె, జనగామ, కుందారం, చీటూరు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతోంది. 

14:04 - January 6, 2017

హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో పోలీసుల అకృత్యాలు పెరిగిపోతున్నాయని...సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.. ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రాపురంలో ఓ గిరిజనున్ని పోలీసులు చిత్ర హింసలు పెట్టి చంపేశారని శాసనసభలో తెలిపారు.. సారా ఉందంటూ కొట్టారని శాసనసభలో తెలిపారు.. ఆ కుటుంబానికి పదిలక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.. 

ప్రకాశం బ్యారేజీని సందర్శించిన బాబు..రివర్ బోర్డు ఛైర్మన్..

విజయవాడ : ప్రకాశం బ్యారేజీని సీఎం చంద్రబాబు నాయుడు, కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ సందర్శించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బోర్డు బృందంతో చంద్రబాబు మాట్లాడారు.

13:59 - January 6, 2017

హైదరాబాద్ : ఓలా, ఉబర్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని... మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు.. మధ్యాహ్నం మూడుగంటలకు వారితో చర్చలు జరుపుతామని ప్రకటించారు.. ఈ డ్రైవర్ల ఆందోళనను బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి శాసనసభలో ప్రస్తావించారు..సమస్యలమధ్య ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారనీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. రోజుకు 18నుంచి 20గంటల పని చేయిస్తున్నారనీ.. క్యాబ్‌లను పెంచి డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.ఆదాయం లేక డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని తెలిపారు. దీనికి సమాధానంగా మంత్రి మహేందర్ రెడ్డి ఓలా, ఉబర్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

13:58 - January 6, 2017

హైదరాబాద్ : వికలాంగులకోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని... టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు 4శాతం కోటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ప్రస్తుతం వికలాంగులశాఖను మహిళా, శిశుసంక్షేమశాఖలో విలీనం చేశారని అసెంబ్లీలో గుర్తుచేశారు.. రేవంత్‌ రెడ్డి సూచనను పరిశీలిస్తామని మంత్రి కడియం సమాధానమిచ్చారు.. 

13:49 - January 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో కలిశారు. తాను నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణ ప్రాంతంలో వినోదపు పన్ను మినహాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. అలాగే చిత్ర ప్రివ్యూ షోకు కుటుంబసమేతంగా హాజరై చిత్రాన్ని తిలకించాలని బాలకృష్ణ సీఎం కేసీఆర్‌ను కోరారు. బాలయ్యకు రేవంత్ రెడ్డి పుష్ప గుచ్చాన్ని అందించి తన కార్యాలయానికి తీసుకెళ్లి గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా గురించి ముచ్చటించారు. అనంతరం టీఆర్ఎస్ నేతలతో కూడా ముచ్చటించారు. అనంతనం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ తో బాలకృష్ణ భేటీ అయ్యారు. కాగా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభసమయంలో కేసీఆర్ క్లాప్ కొట్టారు. ఆ సమయంలో కేసీఆర్ నాకు ఈ సినిమాను చూపించాలని కోరారు. తెలంగాణ కు సంబంధించి చరిత్రను సినిమాగా తీస్తున్నందుకు శాతకర్ణి టీమ్ కు సినిమాకు క్లాప్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. 

13:45 - January 6, 2017

పశ్చిమగోదావరి : ఉండి అసెంబ్లీ నియోజకవర్గ 10 టీవీ క్యాలెండర్‌ను స్థానిక ఎమ్మెల్యే కలవపూడి శివ ఆవిష్కరించారు. సామాన్యుల కష్టాలను వెలుగులోకి తీసుకురావటంతో 10టీవీ ఎప్పుడూ ముందుంటుందని కలవపూడి శివ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 10టీవీ సిబ్బందికి, ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. ప్రకృతి రమణీయ దృశ్యాలు, మహిళా మూర్తులతో క్యాలెండర్‌ను అందంగా తీర్చిదిద్దిన 10 టీవీ యాజమాన్యం, సిబ్బందిని శివ అభినందించారు. క్యాలెండర్‌ బాగుందని ప్రశంసించారు. 

13:41 - January 6, 2017

అనంతపురం : 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను అనంతపురం జిల్లా హిందూపుంలో విద్యార్థుల మధ్య ఆవిష్కరించారు. సువర్ణభారతి కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాసా సందేష్, కళా ట్రేడర్స్ యజమాని, సువర్ణభారతి కరస్పాండెంట్ నీలకంఠారెడ్డి, కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు.

13:39 - January 6, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమరవంలో సోనో విజన్ షో రూమ్‌ ప్రారంభమైంది. సోనో విజన్‌కు ఇది 31 బ్రాంచి. భీమవరం జేపీ రోడ్‌లో నటరాజ్‌ థియేటర్‌ దగ్గర ఏర్పాటు చేసిన షో రూమ్‌ను ఏపీ మహిళ సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, నరసాపురం పార్లమెంటు సభ్యుడు గోకరాజు రంగరాజు కలిసి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల విక్రయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద షాపు. 1969లో పొట్లూరి జనార్దనమూర్తి ప్రారంభిచిన సోనో విజన్‌ క్రమక్రమంగా విస్తరించి, దక్షిణ భారతదేశంలో ఐదవ పెద్ద గొలుసుకట్టు సంస్థగా గా ఎదిగింది. 2016లో 3.20 లక్షల మంది కొలుగోలు ద్వారా 850 కోట్ల టర్నోవర్‌ సాధించింది. వివిధ కంపెనీలకు చెందిన ఏసీలు, ఎల్ ఈడీ టీవీలు, వాషింగ్‌ మిషన్లు, గృహోపకరణాలు తక్కువ ధరలకు విక్రయిస్తున్న సోనో విజన్‌ యాజమ్యాన్ని ప్రముఖులు అభినందించారు. 

13:36 - January 6, 2017

ఆ యువతికి తెలిసినవాడే..ఆమెను రోజు చూస్తున్న వాడే. ఆ రాత్రి కనిపించడంతో దుర్మార్గం..

బెంగళూరు నగరంలోనే కాదు..మన హైదరాబాద్ మహానగరంలో కూడా కామ పిశాచులు సంచరిస్తున్నారు. బెంగళూరులో కామపిశాచులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. వీరి దురాగాతాన్ని చూస్తూనే ఎవరూ అడ్డుకోలేదు. కానీ సిసి టివి ఫుటేజ్ మాత్రం కామాంధుల దుశ్చర్యలను రికార్డు చేసింది. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుర్మార్గులను గుర్తించారు. అందులో ఓ వ్యక్తి యువతి వెళ్లే దుకాణంలో పనిచేసే వాడే. బెంగుళూరు నగంరలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:35 - January 6, 2017

పశ్చిమగోదావరి : సమరానికి పందెం కోళ్లు సై అంటున్నాయి. సంక్రాంతి పండుగ సమయం దగ్గర పడుతుండటంతో నువ్వా-నేనా అంటూ కోళ్లు సమర శంఖారావం పూరిస్తున్నాయి. బెట్టింగ్‌కు పుంజులు కాలు దువ్వుతున్నాయి. మరోవైపు పొట్టేళ్లు సైతం సమరానికి సై అంటున్నాయి. పందెం రాయుళ్లు భారీ ఎత్తున బెట్టింగ్‌లు పెట్టేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.

కోళ్ల పందాలకు బ్రేక్ పడుతుందా..?
సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ సారైన కోళ్ల పందాలకు బ్రేక్ పడుతుందా..? లేదంటే ప్రతి ఏడాది జరిగినట్టే పందాలు యథేచ్ఛగా జరిగిపోతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. కత్తులతో తెగబడే కోళ్ల పందాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోడిని తినడానికి, కోళ్ల పందేలకు ఎంతో వ్యత్యాసం ఉందని 2016 డిసెంబర్ 26న తీర్పు వెలువరించింది. పందెం పోరుకు కళ్లెం వేసేందుకు స్వయంగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. పందెంరాయుళ్లు మాత్రం కత్తుల కోలాటమాడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున డబ్బును కూడగట్టి బరులు సిద్ధం చేస్తున్నారు.

గతేడాది 900 కోట్ల రూపాయలకు పైగా కోడి పందాల బెట్టింగులు
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 900 కోట్ల రూపాయలకు పైగా కోడి పందాల రూపంలో చేతులు మారాయని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. వీటిలో అత్యధికంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 150 కోట్లు పైబడి పందెం కోళ్లతో రాబట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే చాలు విజయవాడ సమీపంలోని గన్నవరం, పెనమలూరు, కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు, దివిసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. మిగతా జిల్లాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా పకడ్బందీగా నిర్వహిస్తుంటారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నేరుగా టెంట్లు, పందిళ్లు వేసి కోట్లాది రూపాయలు చేతులు మారుస్తూ పందాలు నిర్వహిస్తుంటారు. కొందరు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, సిబ్బంది పందెపు కోళ్లకు కత్తులు కట్టడంతోపాటు దగ్గరుండి ధూంధాంగా జరుపుతుంటారు.

అరటి, చెరుకు, మామిడి తోటల్లో కోళ్ల పందాలు
ముఖ్యంగా అరటి తోటలు, చెరుకు తోటలు, మామిడి తోటల్లో అత్యధికంగా కోళ్ల పందాలు సైలెంట్ గా జరిగిపోతుంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో నిఘా పర్యవేక్షణ లేకుండా బెట్టింగ్ బాబులు జాగ్రత్తలు పడుతుంటారు. వందలాది ఖరీదైన కార్లు, బైక్ లపై హంగూ ఆర్భాటాల మధ్య దొరబాబుల్లా, బడాబాబుల్లాగా పందెం కోళ్ల సమరానికి క్యూ కడుతుంటారు. పందాలు జరిగే ప్రాంతాల్లోనే విందు, వినోదం, ఇతర వసతి సౌకర్యాలు, ఎటువంటివి ఏర్పాటు చేసి.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సిద్ధం చేస్తారు. సాధారణంగా కోడి పందాలకు చిన్నపిల్లలను తీసుకెళ్లకూడదు. ఇవేవీ పట్టని సదరు వ్యక్తులు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి చెక్కేస్తారు. పెద్దవాళ్లు కోడి పందాలలో పాల్గొంటే, పిల్లలు అక్కడే జరిగే వినోదపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంత తతంగం జరుగుతున్నా అసలేం తెలియదన్నట్టుగా అధికారులు సైలెంటైపోతుంటారు.

కొన్ని జిల్లాల్లో ఉదృతంగా సాగుత్ను పందాలు
ఇక గుంటూరు జిల్లా బాపట్ల, కోటప్పకొండ, కవులూరు, కారంపూడి, దాచేపల్లి, వట్టి చెరుకూరు, కృష్ణాజిల్లాలోని వెంట్రప్రగడ, డోకుపర్రు, భుజబలపట్నం, భైరవపట్నం, పెందుర్తు, వాడవల్లి, పులపర్రు, ప్రొద్దువాక, వడాలి, కొరగుంటపాలం, చిగురుకోట వంటి ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా పందాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మాత్రం గతేడాది కంటే ఆయా పార్టీ నాయకుల అండదండలతో, అధికారుల ఆశీస్సులతో భారీగా బరులకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది కోడి పందాల నిర్వహణకు అనుమతివ్వాలని బీజేపీ నేత రఘురామరాజు హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జనవరిలో హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఆదేశాలంటూ భయపెట్టినా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు అదురుబెదురు లేకుండా దగ్గరుండి విచ్చలవిడిగా కోడి పందేలు జరిపారు. కోడి పందేలకు సేఫ్ జోన్ కొల్లేరు ప్రాంతం. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పలు పార్టీలకు చెందిన నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు.

రూ.20 వేలతో ప్రారంభమై రూ.75 వేల వరకు ఒక పుంజు ధర
ఇదిలా ఉంటే పందెం కోళ్ల ధర ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కనీసంగా రూ.20 వేలతో ప్రారంభమై రూ.75 వేల వరకు ఒక పుంజు అమ్ముడుపోతుంది. గోదావరి జిల్లాల్లో లక్షకుపైబడి పుంజులు విక్రయిస్తారు. ఇక బ్రీడింగ్ కోళ్లయితే రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతాయి.

 

13:21 - January 6, 2017

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో ఐక్య సంఘాలై కలిసి వచ్చిన అధికారులు..ఇప్పుడు అధికార పార్టీ నేతలకే తలనొప్పిగా మారుతున్నారు. అధికారుల ఐక్యత గులాబి పార్టీలో ముళ్లులా గుచ్చుకుంటుండటంతో...సీనియర్ నేతలంతా అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఇంతకీ అధికారులు నేతల మాటలు ఎందుకు వినడం లేదు ..?

అధికారులు, నేతల మధ్య లోపించిన సమన్వయం
కరీంనగర్‌ జిల్లా అధికారుల తీరుతో.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అధికారులతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ అభివృద్ధిలో పురోగతి కనిపించక పోవడంతో నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపనీయంగా ఉందని.. స్వయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులే చెప్పడం పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధరం అవుతోంది. ప్రగతిని పక్కన పెట్టి స్వాహాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు పోస్టింగ్‌ కోసం తమ ఇళ్ల చుట్టూ తిరిగిన అధికారులు.. ఇప్పుడు తమ మాట పెడచెవిన పెడుతున్నారని..సాక్షాత్తు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెల్లడిస్తున్నారు.

ఎమ్మార్వో తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే బొడిగె శోభ
గతంలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మొదటిసారి ఎమ్మార్వో తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక.. అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు కూడా పిర్యాదు చేశారు. కానీ శోభ పిర్యాదుపై ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఒకానొక దశలో ఎమ్మెల్యే శోభ తీరునే తప్పుపట్టారు.

అధికారులపై సీరియస్‌ అయిన మంథని ఎమ్మెల్యే
ఆ తర్వాత అటవీశాఖ అధికారులు సామాన్యులను వేధిస్తున్నారనే ఆవేదనతో మంథని ఎమ్మెల్యే అధికారులపై సీరియస్‌ అయ్యారు. అప్పట్లో మధు అధికారులను చీవాట్లు పెడుతున్న వీడియో సంచలనం రేపింది. అప్పుడు కూడా మధును తప్పు పడుతూ దూకుడు తగ్గించుకోవాలని సీనియర్‌ నేతలు హెచ్చరించారు. అధికారులు ప్రజాభివృద్ధికి సహకరించడం లేదంటూ మధు సమీక్షా సమావేశాల్లోనూ పలుమార్లు చెప్పినప్పటికీ కనీస స్పందన కరువైంది.

నేతలు, అధికారుల మధ్య సయోధ్య కుదిర్చిన మంత్రి ఈటెల
అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యేలు తరచుగా పిర్యాదులు చేయడంతో.. ఆర్థికశాఖ మంత్రి జోక్యం చేసుకుని అధికారులు, నేతల మధ్య రాజీ కుదిర్చి అందరూ కలిసి పనిచేయాలంటూ సూచించారు. జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్‌ నేతలు, అధికారుల మధ్య సయోధ్య కుదర్చడంతో వివాదం సద్దుమణిగింది. కానీ కొన్ని రోజులకే మళ్లీ కథ మొదటికొచ్చింది. ఏకంగా పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ సమీక్షా సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌తో పాటు అధికారులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పద్ధతి మార్చుకోవాలని రెవిన్యూ సమావేశంలో కేసీఆర్ హెచ్చరికలు
జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఈటల సైతం అభివృద్ధికి సహకరించాలంటూ.. పలు కార్యక్రమాల్లో అధికారులకు సూచించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో.. పద్ధతి మార్చుకోవాలని రెవిన్యూ సమావేశంలో హెచ్చరికలు కూడా చేశారు. కేసీఆర్‌ బంధువు, కరీంనగర్‌ ఎంపీ మాటే చెల్లుబడి అయ్యేలా... రాజకీయంగా అధికారులు తన మాట వినేలా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై అధికారులు నోరు మెదపాలంటే.. కేసీఆర్‌కు వినోద్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని మిన్నకుండిపోతున్నారు. అయితే.. చివరకు వినోద్‌కు సైతం అధికారులు కొరకరాని కొయ్యలా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చివరకు వినోద్‌ కూడా అధికారుల తీరుపై మండిపడటమే అందుకు నిదర్శనం. ఓవైపు బంగారు తెలంగాణ కోసం పాటు పడుతుంటే.. అధికారులు సహకరించకపోవడం దారుణమని, ఉద్యమస్ఫూర్తితో అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్‌ సూచించారు.

ఈ కోల్డ్ వార్ తో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదనలు
కరీంనగర్ జిల్లాలోని అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు జరుగుతున్న కోల్డ్ వార్‌తో.. జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులను ఐక్యం చేసిన గులాబీ పార్టీ వారి ఐక్యతను సహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

13:15 - January 6, 2017

'అమీర్ ఖాన్' 'దంగల్' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజైన ఈ మూవీ కలెక్షన్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కలెక్షన్ల ప్రవాహం ఈ మూవీ బాలీవుడ్ టాప్ 5 హిట్స్ లో ప్లేస్ దక్కించుకుంది. 'దంగల్' హవా చూస్తుంటే 'సల్మాన్ ఖాన్' మూవీ ఎర్త్ పెట్టేలా కనిపిస్తోంది. 2016ఇయర్ ఎండింగ్ లో వచ్చిన 'అమీర్ ఖాన్' 'దంగల్' మూవీతో ఇయర్ మొత్తం గుర్తుంచుకునేలా చేశాడు. రెండు వారాల కిందట రిలీజైన ఈ మూవీ ఇప్పటికి స్టడి కలెక్షన్లతో కొత్త రికార్డ్స్ వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సరైన సినిమాలు లేకపోవడం కూడా 'దంగల్' కి బాగా కలిసొచ్చింది. కలిసొచ్చిన టైంతో 'అమీర్ ఖాన్' టాప్ హిట్టు గా నిలపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

తొలి రోజు రూ. 29 కోట్లు..
ప్రస్తుతం మనం బాలీవుడ్ బాక్సాఫీస్ చూసుకుంటే పెద్ద ఇంట్రెస్ట్ కలిగించే సినిమాలేవీ లేవు. దీంతో అద్భుతమైన కంటెంట్ తో వచ్చిన 'దంగల్' మూవీకి బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్ పట్టం కట్టేశారు. తొలిరోజు 29 కోట్లు కలెక్ట్ చేసిన 'దంగల్' 10వ రోజు 31 కోట్ల కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ హవా ఏ రేంజ్ లో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. 'అమీర్ ఖాన్' మెస్మరైజ్ పర్మామెన్స్ దర్శకుడు నితీష్ తివారి అద్బుతమైన టేకింగ్ ఈ మూవీ బాక్సపీసు పై బాగానా నిలపెట్టాయి.

టాప్ 5 ప్లేస్ లో..
'దంగల్' సినిమా ఇప్పటికే బాలీవుడ్ టాప్ 5 హిట్స్ క్లబ్ లో చేరిపోయింది. పికె (340.8 కోట్లు)తో ప్లస్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుండగా, 'సల్మాన్ ఖాన్' 'భజరంగీ భాయిజాన్ ‘(321 కోట్లతో) రెండో ప్లేస్ తో 'సల్లు' భాయ్ మరో మూవీ 'సుల్తాన్' (301 కోట్లతో) థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక అమీర్ ఖాన్ ధూమ్ 3 (284 కోట్లు) తో నాలుగవ స్థానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు 270 కోట్ల కలెక్ట్ చేసిన 'దంగల్' టాప్ 5 ప్లేస్ లోకి వచ్చేసింది. మరో వారం రోజులు ఇదే రోజును సాగిస్తే దంగల్ సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' మూవీ రికార్డ్ 301కోట్లను అధిగమించడం పెద్ద విశేషమేమి కాదు . మొత్తానికి మరోసారి బలమైన కంటెంట్ తో మిస్టర్ పర్ పెక్ట్ బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేస్తున్నాడు.

ఎస్సీ,ఎస్టీల అభివృద్ధికి కృషి: మంత్రి జదీష్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు వారి అభివృధ్ధికే ఖర్చు చేస్తున్నామన్నారు. నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి పంపినణీ చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు మైక్రో ఇరిగేషన్ లో 100 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. 

13:10 - January 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా వెనకబడి ఉన్న ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్తనందించారు. రాష్ట్రంలో వెనకబడి ఉన్న దాదాపు 3లక్షల మంది ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల పించన్‌ను అందివ్వనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే మార్చి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. 2 నుండి 3 లక్షల మంది ఒంటరి మహిళలు వున్నట్లుగా అంచానా వేశామన్నారు. మార్చి నెలలో బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఒంటరి మహిళలంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

13:07 - January 6, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక త్వరలోనే జరగబోతోంది. గుంటూరులో ఈ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వస్తారా ? లేదా ? అనే దానిపై సోషల్ మాధ్యమాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఆయన రాకుంటే 'పవన్' అభిమానులు రెచ్చిపోవడం ఖాయమని టాక్స్ వినిపిస్తున్నాయి. మెగా ఫంక్షన్ లలో 'పవన్' అరుపులతో అభిమానులు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో 'పవన్ కళ్యాణ్' ను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ‘పవన్' ఈ వేడుకకు రావడం లేదని స్యయంగా 'అల్లు అరవింద్' పేర్కొన్నా చిత్ర నిర్మాత, మెగా తనయుడు 'రామ్ చరణ్' తన ప్రయత్నాలను మానడం లేదని తెలుస్తోంది. ఇందుకు 'చిరంజీవి' సతీమణి 'సురేఖ' రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘సురేఖ' స్వయంగా 'పవన్' వద్దకు వెళ్లి ఆయన్ను ఫంక్షన్ కు పిలవనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వేడుకకు తాను రానవసరం లేదని 'పవన్' తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది. మరి 'పవన్' వస్తారా రారా అనేది రేపటితో తేలిపోతుంది.

'బ‌డ్జెట్‌ సమావేశాల వాయిదా' పిటిష‌న్‌ విచారణకు నిరాకరించిన సుప్రీం...

ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూలు విడుదల దృష్ట్యా పార్లమెంట్ బ‌డ్జెట్‌ సమావేశాల వాయిదా వేయాల‌న్న పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు స్వీక‌రించ‌డానికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది. అందులో అత్య‌వ‌స‌రం ఏమీ లేద‌ని, పిటిష‌న్ వ‌చ్చిన‌పుడు దానిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని చీఫ్ జ‌స్టిస్ జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టంచేసింది. ఈ పిటిష‌న్ వేసిన‌ అడ్వొకేట్ ఎంఎల్ శ‌ర్మ‌.. దీనికి అత్య‌వ‌స‌ర విచార‌ణ కింద స్వీక‌రించాల‌ని కోరారు.

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ

హైదరాబాద్: క్రిష్ దర్శకత్వంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్ది సేపటి క్రితం సీఎం కేసీఆర్ ను కలిశారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు వినోదనపు పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రివ్యూ చూసేందుకు రావాలని సీఎం కేసీఆర్ నుకోరారు.

13:03 - January 6, 2017

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లాలో నెలకొల్పే ఐటీ పార్క్‌ వల్ల దాదాపు లక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాగే జిల్లాలో నెలకొల్పే దేశంలోనే అతిపెద్దదైన టెక్స్‌పార్క్‌ను 2018లోగా పూర్తిచేసేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. అతి త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి: కేటీఆర్
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని యాదాద్రి, వరంగల్‌ జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటివకే డీపీఆర్‌లు తయారు చేశామన్నారు మంత్రి కేటీఆర్‌. జాతీయ పెట్టుబడి తయారీ జోన్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందని త్వరలోనే వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం ఇప్పటికే 10వేల ఎకరాల భూమిని సేకరించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

సీఎం చంద్రబాబుకు కట్టదిట్టమైన భద్రత

శ్రీకాకుళం : ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజాం వెళ్లే బస్సులను పోలీసులు నిలుపుదల చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని షాపులను కూడా మూసివేయించారు. 

12:56 - January 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ నలుమూలలా పరిశ్రమలు రావాలని... అంతటా అభివృద్ధి విస్తరించాలని... సీఎం కేసీఆర్‌ అన్నారు.. ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని శాసనసభలో ప్రకటించారు.. రాష్ట్ర అభివృద్ధికోసం ప్రతిపక్షాలనుకూడా కలుపుకొని ముందుకుసాగుతామని స్పష్టం చేశారు.. తెలంగాణ రాష్ట్రానికి నలుమూలలా పరిశ్రమలు వ్యాపించాలన్నారు.అలాగే రాష్ట్రం అంతాటా అంతటా అభివృద్ధి జరగాలనీ..వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌పార్క్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇన్నర్‌ రింగ్‌రోడ్‌కు కేంద్రం అనుమతులు కోరుతున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

తెలంగాణ తిరుపతిగా యాదాద్రి: గవర్నర్

యాదాద్రి :  తెలంగాణ తిరుపతిగా యాదాద్రి అభివృద్ధి చెందుతుందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆయన ఈరోజు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ఆలయన పనులపై సమీక్ష నర్విహించారు. .పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యాదాద్రి అభివృధ్ధి పనుల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి డిజిటల్ టౌన్ గా అవతరిస్తుందని, క్యాష్ లెస్ లావాదేవీలు యాదాద్రిలో ఊపందుకోవడం అభినందనీయం అని గవర్నర్ పేర్కొన్నారు.

12:52 - January 6, 2017

విజయవాడ : ప్రకాశం బ్యారేజీని కృష్ణా బోర్డు ఛైర్మన్‌, ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. బ్యారేజీలో నీటి మట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చూడాలని ఈ సంధర్భంగా ఏపీ చంద్రబాబు కృష్ణ బోర్డు ఛైర్మన్‌ను కోరారు. 

రాజాంకు చేరుకున్న సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం : సీఎం చంద్రబాబు నాయుడు రాజాంకు చేరుకున్నారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

తెలంగాణ అసెంబ్లీకి బాలకృష్ణ

హైదరాబాద్: కాసేపట్లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న గౌతమి పుత్రశాతకర్ణి సినిమాకు పన్ను మినహాయించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారు.

ఉబర్ డ్రైవర్లు ఆ కంపెనీకి ఉద్యోగులే : స్విస్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ

ఢిల్లీ: ఉబర్ డ్రైవర్లు ఆ కంపెనీకి ఉద్యోగులేనని, ఉబర్ డ్రైవర్లకు సామాజిక భద్రత కల్పించాలని స్విస్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీర్పునిచ్చింది. ఉబర్ డ్రైవర్లను ఫ్రీలాన్సర్స్ గా కంపెనీ అభివర్ణించడాన్ని స్విస్ ఇన్సూరెన్స్ కంపెనీ తప్పుపట్టింది. వారిని కంపెనీ కార్మికులుగా గుర్తించి సెలవు రోజు వేతనం ఇవ్వాలని గత అక్టోబర్ లోనే బ్రిటీష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. 

12:21 - January 6, 2017

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల న్యాయస్థానం హైకోర్టులో కారెం శివాజీకి చెక్కెదురైంది. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కారెం శివాజీ నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పును వెలువరించింది. నియమ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నియామకం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కారెం శివాజీ వేసిన పిటీషన్ ను డివిజన్ బెంచ్ సమర్ధిస్తూ కొట్టివేసింది. కాగా నోటిఫికేషన్ విడుదల చేయకుండానే కారెం శివాజీని నియామకం చెల్లదంటూ జ్యోతిప్రసాద్ అనే సీనియర్ న్యాయవాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

12:07 - January 6, 2017

హైదరాబాద్ : గ‌తేడాది ఆర్ధిక ఇబ్బందులు స‌హా ప‌లు స‌మ‌స్యల‌తో స‌త‌మ‌త‌మైన జీహెచ్‌ఎంసీ, కొత్త ఏడాదిలో మాత్రం స‌రికొత్త ప్రణాళికలతో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. గ్రేట‌ర్ వాసుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంతో ఆర్థికంగా బలపడేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కొత్త సంవ‌త్సరంలో స‌రికొత్త ప్రణాళిక‌ల‌తో బల్దియా
గ‌త ఏడాదికి.. ఈ ఏడాదికి త‌మ ప‌నితీరులో, పాల‌న‌లో మౌలిక‌మైన మార్పులు చేస్తామంటోంది బ‌ల్దియా. కొత్త సంవ‌త్సరంలో స‌రికొత్త ప్రణాళిక‌ల‌తో ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు సిద్ధమౌతున్నారు అధికారులు. స్వచ్ఛ స‌ర్వేక్షణ్ ర్యాంకింగ్ లో జీహెచ్ఎంసిని ముందు వ‌రుస‌లో నిలప‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో కార్పొరేట్ సంస్థల‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ కింద భారీ ఎత్తున నిధులు రాబ‌డుతున్నారు. రాంకీ సంస్థ రెండు కోట్లు, కామినేని సంస్థ కోటి, ఆంధ్రాబ్యాంకు 25 ల‌క్షల రూపాయ‌లు ఇచ్చాయి.

స్వచ్ఛ స‌ర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానమే టార్గెట్‌
స్వచ్ఛ్‌ న‌గ‌ర‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న బ‌ల్దియా... గ్రేటర్‌లో పూర్తిస్థాయిలో టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న టాయిలెట్లను మెరుగుప‌రుచ‌ర‌డంతో పాటు న‌గ‌రంలో తొలిసారిగా ఈ-టాయిలెట్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్ మొద‌టి ద‌శ‌లో మూడు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు అంగీకారం తెల‌ప‌గా, కిమ్స్ హాస్పిట‌ల్ రెండు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.

ఐదు స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎన్‌.టి.పి.సి
ఎన్‌.ఎం.డి.సి ఐదు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు ఓకే చెప్పగా .. ఐటీసీ సంస్థ వంద కేంద్రాల ద్వారా డ్రైవేస్ట్ సేక‌ర‌ణ‌.. గోద్రేజ్ సంస్థ ప‌ది కేంద్రాల ద్వారా డ్రైవేస్ట్ సేక‌ర‌ణకు ప్లాన్ చేశాయి. ఎన్‌.టి.పి.సి సంస్థ ఐదు స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఉచితంగా అందించ‌నుంది. సిటిలో పారిశుద్ధ్యం మెరుగుదల చేయడమే ల‌క్ష్యంగా ప్రతిరోజు స్వచ్ఛ ఆటోల‌కు చెత్తను అందించే మ‌హిళ‌ల‌కు న‌గ‌దు లేదా బంగారం రూపంలో ప్రోత్సాహ‌క‌ బ‌హుమ‌తులు అందించనుంది బ‌ల్దియా.

స్వైపిగ్ యంత్రాలు సమకూర్చేందుకు బల్దియా ప్రణాళికలు
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత వేగంగా నగదు రహిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లలో ఇప్పటికే స్వైపింగ్ యంత్రాలను సమకూర్చింది. బల్దియా నిర్వహిస్తున్న 19 సిటిజన్ సర్వీస్ కేంద్రాల్లోనూ స్వైపింగ్ యంత్రాల ద్వారా పన్నులు చెల్లించే వీలు క‌ల్పించింది. గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న350 మంది బిల్ కలెక్టర్లుకు కూడా త్వరలో బల్దియా స్వైఫింగ్ యంత్రాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.పాల‌న‌లో లోపాల‌ను త‌గ్గించుకోవ‌డం.. అధికారుల‌కు ప్రజ‌లు నిత్యం అందుబాటులో ఉండ‌టం వంటి విష‌యాల్లో పూర్తి స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టింది జీహెచ్‌ఎంసీ.

12:05 - January 6, 2017

సినీ నటుడు 'ప్రభాస్' ను విడుదల చేశారు. ఆయన ఏం నేరం చేశాడని విడుదల చేశారు ? అని అనుకుంటున్నారా అదే కాదు. ఆయన్ను రిలీజ్ చేసింది 'రాజమౌళి'. ఇప్పటికే అర్థం అయ్యిదనుకుంటాం...అవును గత కొన్ని సంవత్సరాలుగా 'ప్రభాస్' ఒకే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'బాహుబలి' టాలీవుడ్ పవర్ ఏంటో ప్రపంచానికి యావత్తు తెలియచేసింది. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి -2’ షూటింగ్ కొనసాగుతోంది. దాదాపు షూటింగ్ నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఒక్క సినిమాకే 'ప్రభాస్' పరిమితమయ్యాడు. 'ప్రభాస్' కనిపించే షూటింగ్ పూర్తవడంతో ఆయన్ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని 'బాహుబలి' సోషల్ మీడియా పేజ్ లో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులందరూ 'బాహుబలి'తో పాటు వేరే సినిమాల్లో కూడా నటించారు. కానీ ప్రభాస్ మాత్రం మరో సినిమా అంగకీరించకుండా 'బాహుబలి'కే పరిమితమయిన సంగతి తెలిసిందే. భారీగా కండలు, పొడవాటి జుట్టుతో 'ప్రభాస్' మారిపోయినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఫొటోలు మాత్రం బయటకు విడుదల కావడం లేదు. ఇప్పుడు 'బాహుబలి -2' కూడా పూర్తవ్వటంతో 'ప్రభాస్' ఇక నార్మల్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీనిపై 'రాజమౌళి' కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘థాంక్యూ డార్లింగ్' అంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్ర బడ్జెట్ లో అధికభాగం సంక్షేమానికే: సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ లో అధికభాగం సంక్షేమానికే కేటాయించామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలకు రూ.1000 పెన్షన్ అందిస్తామని, వెంటనే ఒంటరి స్త్రీలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

11:56 - January 6, 2017

దేవుడా...అనే ఓ డైలాగ్ ఇటీవలే పాపలర్ అయ్యింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' ఓ సినిమా ఈ డైలాగ్ పలికాడు. ఇదే డైలాగ్ తో కొద్దిగా వెరైటీగా 'ద్యావుడా' అనే చిత్రం రూపొందుతోంది. సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైంది. టీజర్ లో మతపరమైన అంశాలను ప్రస్తావించారు. హిందూ దేవుళ్లను అభ్యంతకరంగా చూపించారంటూ కొంతమంది గళమెత్తుతున్నారు. అంతేగాకుండా కోర్టు మెట్లు ఎక్కినట్లు టాక్. దేవుడి పటాన్ని నేలకేసి కొట్టడం..శివలింగానికి మద్యంతో అభిషేకం..సిగరేట్లతో దూపం చేయడం లాంటి సీన్స్ ఉండడం వివాదానికి కారణమైంది. హిందూ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న ఈ టీజర్ ను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. శాన్వీ క్రియేషన్స్, అమృతసాయి ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'తాను దేవుడితో పర్సనల్ గా మాట్లాడి తీసిన చిత్రం' అంటూ దర్శకుడు ప్రకటించు కోవడం విశేషం. మరి ఈ వివాదం పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

11:54 - January 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లను అందచేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం 29 లక్షల మందికి ఇస్తే..తమ ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇస్తుందన్నారు. ఏడాదికి 4వేల 7వందల 29 లక్షల రూపాయల్ని పెన్షన్లకు ఖర్చుచేస్తున్నామని...ఐదేళ్ల కాలానికి మొత్తం 25వేల కోట్లు వ్యయం అవుతుందని ప్రకటించారు. ఇప్పటికి ప్రతినెలా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని...అర్హతలున్న వారందకి పెన్షన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి జూపల్లి ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు అగడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 

11:51 - January 6, 2017

హైదరాబాద్ : గిరిజన గ్రామాల్లో యాభైఏళ్లుదాటిన వృద్ధులందరికీ పెన్షన్ ఇవ్వాలని... సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...వేలిముద్రలు సరిపోవడంలేదంటూ పెన్షన్‌ ఇవ్వడంలేదని... ఈ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. వృద్ధులకు సకాలంలో పెన్షన్ అందేలా చూడాలని పెన్షన్ ఆలస్యం కావటంతో వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సున్నం రాజయ్య కోరారు. కాగా ప్రశ్నోత్తరా కార్యక్రమం కొనసాగుతోంది. 

కారెం శివాజీ అప్పీల్ ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్ : కారెం శివాజీ అప్పీల్ ను హైకోర్టు కొట్టేసింది. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించడంపై అప్పీల్ చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని గతంలో సింగిల్ బెంచ్ తీర్పుఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది.

11:46 - January 6, 2017

జనగాం : తెలంగాణ వచ్చినా.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, ప్రజల బతుకులు ఏ మాత్రం మారలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తమ్మినేని చెప్పారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి : తమ్మినేని
రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే.. ఇంకా వారి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తమ్మినేని అన్నారు.

పాదయాత్రకు సీపీఐ చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి సంఘీభావం
81వ రోజు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగుతున్న సీపీఎం పాదయాత్ర పూర్తి అంకితభావంతో కూడుకున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. భవిష్యత్‌లో వామపక్షాలు ఐక్యతతో ముందుకు వెళతాయనేందుకు ఇదే నిదర్శనమని చాడ చెప్పారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిగా దుర్వినియోగం: నగేశ్
ఎస్సీ సబ్‌ప్లాన్‌ వచ్చి ఐదేళ్లయినా.. ఎస్సీలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, ఎస్సీలకు కేటాయించిన ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయని సీపీఎం పాదయాత్ర బృందం సభ్యులు నగేష్‌ విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా దళితుల అభివృద్ధికే ఉపయోగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీపీఎం పాదయాత్ర 81 రోజులు పూర్తి
ప్రజలను చైతన్య పరుస్తూ కొనసాగుతున్న సీపీఎం పాదయాత్ర 81 రోజులు పూర్తి చేసుకుంది. 81వ రోజు యాత్ర జనగాం జిల్లాలోని కుర్చపల్లి, రాఘవాపూర్‌, గోవర్ధనగిరి, కోమల్ల, రఘునాథపల్లి, నిడిగొండ గ్రామాల్లో పర్యటించింది. జనగాం జిల్లాలోని నాగుల చెరువుకు దేవాదుల నుంచి నీరందించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. ఇప్పాగూడలో పీహెచ్‌సీని ప్రారంభించాలని, స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించాలని లేఖలో పేర్కొన్నారు.  

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీల భేటీ

ఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీనడ్డాతో తెలంగాణ ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఎయిమ్స్ ఏర్పాటును త్వరితగతిన చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీలు తెలిపారు. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు కూడా మేలు జరుగుతుందని వెల్లడించారు.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడి విడుదల చేసింది. టీటీడి వెంబ్ సైట్ లో ఏప్రిల్ నెలకు సంబంధించిన 50,974 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసింది.

11:13 - January 6, 2017

ఉత్తర్ ప్రదేశ్...లో మృగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. గత కొన్ని రోజులుగా మహిళలపై కామాంధులు బరి తెగిస్తున్నారు. పెద్ద రాష్ట్రంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయనడానికి గత ఘటనలే ఉదాహరణ. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. సహకరించలేదని ఏకంగా అమ్మాయి చెవులు కోసేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాఘ్ పట్ లో జనవరి 4వ తేదీన ఓ యువతి ఇంట్లోకి నలుగురు కామాంధులు చొరబడ్డారు. సామూహిక అత్యాచారానికి ప్రయత్నించగా అమ్మాయి ప్రతిఘటించి కేకలు వేసింది. చివరకు ఆమె లొంగకపోవడంతో చెవులను కోసేసిన దుర్మార్గులు పారిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని, ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

ఉద్ధానం బాధితులకు వికలాంగుల పింఛన్లు:ఏపీ సీఎం

శ్రీకాకుళం : ఉద్ధానంలో కిడ్నీలు దెబ్బతిన్నవారికి వికలాంగుల పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం ఆయన ఆయాశాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఉద్ధానం సమస్యను ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు సవాల్‌గా తీసుకోవాలన్నారు. 

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

యాదాద్రి:శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృధ్ధి పనులను గవర్నర్ పరిశీలించారు.

11:02 - January 6, 2017

విద్యా బాలన్..బాలీవుడ్ లో వైవిధ్యమైన కథాలు చిత్రాలు ఎంచుకుంటూ ముందుకుపోతున్న నటీమణుల్లో 'విద్యా' ఒకరు. ఇతర కథానాయికులకు భిన్నంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్న 'విద్యాబాలన్' ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'బేగంజాన్' చిత్రంలో 'విద్యా' నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రోతల్ హౌజ్ నడిపే పాత్రంలో నటిస్తున్నట్లు టాక్. డర్చీ పిక్చర్ తో ఒక ఊపు ఊపిన విద్యా మళ్లీ ఈ చిత్రంలో అందాల ఆరబోత ఖాయమని టాక్. మంచం పై పడుకొని 'విద్యా బాలన్' హుక్కా తాగుతుంటే పక్కనున్న పరిచారికలు మసాజ్ చేస్తున్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. వేశ్యా గృహాన్ని నడిపే భామగా నటిస్తుండటం తో 'బేగం జాన్' పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మరి 'విద్యా' నటన ఎలా ఉందో తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

10:58 - January 6, 2017

విజయవాడ : బెజవాడ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ వివాదాలకు నిలయం అవుతోంది. ఇందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహం వేదిక అవుతోంది. కాలేజీలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో పలు విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టాయి. 30 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న కాలేజీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ చరిత్ర
విజయవాడ మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీకి ఎంతో చరిత్ర ఉంది. ఎన్టీఆర్‌, జంధ్యాల, విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఎంతో మంది గొప్పవాళ్లు ఈ కాలేజీలో చదువుకున్నారు. అలాగే విద్యార్థుల గ్రూపులు, ఉద్యమాలు, గొడవలు, పార్టీలు ఈ కాలేజీలోనే పురుడుపోసుకున్నాయి.

కాలేజీలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదం
30 సంవత్సరాల నుంచి ఎంతో ప్రశాంతంగా ఉన్న కాలేజీలో ఇప్పుడు ఒక్కసారిగా అలజడి మొదలైంది. కాలేజీలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో పలు విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఒక వర్గం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పనులు మొదలు పెడితే.. మరో వర్గం నిర్మాణ పనులకు అడ్డుపడుతోంది. దీంతో కాలేజీలో రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి.

కాలేజీలో విగ్రహాలు ఏర్పాటు వద్దని కోరుతున్న విద్యార్థులు
కాలేజీలో చదివినంత మాత్రాన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కంటే గొప్పవాళ్లు అనేకమంది ఇక్కడ చదువుకున్నారని, వాళ్ల విగ్రహాలు పెట్టకుండా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం.. భవిష్యత్‌లో మరో పార్టీ అధికారంలోకి వస్తే వారి నేతల విగ్రహాలను ఏర్పాటు చేస్తారని.. అసలు కాలేజీలో విగ్రహాలు ఏర్పాటు వద్దని విద్యార్థులు కోరుతున్నారు. 

10:53 - January 6, 2017

హైదరాబాద్ : ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ స్కాంలో ఏం జరుగుతోంది..? తెలంగాణ సి.ఐ.డీ. విచారణ చేస్తున్న ఎంసెట్‌ కేసును ఏదో సెట్‌ చేస్తుందా..? లేక తప్పిదాలతో అపవాదాలను మూటగట్టుకోబోతుందా..?? నాలుగు రాష్ట్రాలకు మోస్టు వాటెండ్ క్రిమినల్ గా ఉన్న ఏ1 నిందుతుడు కమిలేశ్వర్ కస్టడియల్ డెత్ పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి..వాటితోనే అనేక అరోపణలు వినిపిస్తున్నాయి...అసలు 6 నెలలుగా ఎంసెట్ స్కాంలో ఏం జరుగుతోంది....? ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు కొలిక్కి వస్తుందా..? లేక ఇంతటితోనే ముగించేస్తారా..??

మలుపులు తిరుగుతున్న ఎంసెట్‌-2 కేసు...
తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఎంసెట్ 2 పరీక్ష పత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది...ఆరు నెలల్లో 50 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసిన సి.ఐ.డీ. తెలుగు రాష్ట్రాల నుంచి 22 మందిని అదుపులోకి తీసుకుంది... మొదటి నుంచి ఎంసెట్ నిర్వహించిన ఉన్నతాధికారుల పాత్ర పై సి.ఐ.డీ. దాగుడు మూతలు అడుతుందనే అరోపణలు ఉన్నాయి. ఇందుకు ముఖ్యమంత్రికి దగ్గర బంధువయిన ఓ మంత్రి సూచించిన ప్రింటింగ్ ప్రెస్ కు పేపరు ప్రింట్ చేయించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పేపరు లీక్ అయింది...పేపర్ ప్రిటింగ్ ప్రెస్ నుంచి మాత్రమే లీకయిందని సి.ఐ.డీ గుర్తించింది...3 సెట్లు ఒకే ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఎందుకు ముద్రించారోనన్న కీలక పాయింట్ ను మాత్రం రాబట్టలేక పోయారు...కన్వీనర్ ను నిందుతుల జాబితాలో చేర్చకపోవడం పై అనుమానాలు ఉన్నాయి....

-1 కమిలేశ్వర్‌ కస్టోడియల్‌ డెత్...
వారం రోజుల క్రితం ఎంసెట్ 2 పరీక్ష పత్రాల లీకేజీ కేసు లో అత్యంత కీలక నిందుతుడైన ఏ1 కమిలేశ్వర్ పాట్నాలో పోలీసులు అరెస్ట్ చేశారు...అక్కడ కోర్టు నుంచి వారెంట్ పై నగరానికి తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు...ప్రతి నిందుతుడు అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ నోట్ పంపించే సి.ఐ.డి. కమిలేశ్వర్ అరెస్ట్ సమయంలో ఎలాంటి చడీ చప్పుడు లేదు...పైగా మీడియా ప్రకటన కూడా చేయలేదు....

కోర్టు అనుమతితో కస్టడీకి....
ఆ తర్వాత కోర్టు నుంచి అనుమతితో సీఐడీ కస్టడి తీసుకున్నారు...కస్టడిలో భాగంగా నాలుగు రోజులుగా విచారించారు. చాతీనోప్పి ఉందని చెప్పిన వినిపించుకోలేదని తెలుస్తోంది....తట్టుకోలేక పోతున్నా అని విన్నవించుకున్నా.. సి.ఐ.డీ. పోలీసులు కనీస ట్రీట్ మెంట్ చేయించిన దాఖలాలు లేవు...పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కమిలేశ్వర్ మృతి చెందాడు...ఈ మరణంతో ఈ కేసులో ఎన్నో మలుపులు తిరుగుతున్నట్లయింది...

దేశవ్యాప్తంగా ఎన్నో పేపర్ల లీకేజీల్లో నిందితుడు..
దేశంలోని ఢిల్లీతో పాటు కర్నాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ లోని పలు పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక నిందుతుడిగా ఉన్న కమిలేశ్వర్ మృతి చెందడంతో తెలంగాణ పోలీసులకు ఉచ్చు బిగుసుకుంటుందా...? కోర్టులో హాజరుపర్చే సమయంలో అరోగ్యంగా ఉన్న నిందుతుడు ఆ తర్వాత ఎలా అనారోగ్యానికి గురయ్యాడు...?? అలసత్వం వెనక ఏదైన మతలబు ఉందా..? అనే అనుమానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది...కమిలేశ్వర్ నోరు విప్పితే ఎవరి జాతకాలు బయటపడేవి...ప్రశ్నాపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఉంది..? వారిని కాపాడేందుకు జరుగుతున్నాయా..? లేక లీకేజీలో వ్యవహారం బయటకు రాకుండా చూస్తున్నారా..?? మొత్తానికి కమిలేశ్వర్ మరణంతో ఎంసెట్ లీకేజ్ స్కాం మొత్తం నీరుగారి పోతుందని న్యాయనిఫుణులు చెప్పుతున్నారు....

10:49 - January 6, 2017

హైదరాబాద్ : 10టీవి అతి కొద్ది సమయంలోనే ఎక్కువ మంది ప్రేక్షకుల మన్ననలు పొందగలిగిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 10 టీవి ఛానల్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లోని ఛానల్స్‌లో 10టీవికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. 10టీవి మరింత ప్రజాధరణ పొందాలన్న కడియం.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ఢిల్లీ లో స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది

10:45 - January 6, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో సైకిల్‌ వార్‌ మొదలైంది. అసలైన పార్టీ ఎవరిదో, సైకిల్ గుర్తు ఎవరికి వెళ్లాలో తేల్చుకోవాలని ఈసీ ఆదేశించడంతో..ములాయం, అఖిలేష్‌లు అప్రమత్తమయ్యారు. సైకిల్‌ గుర్తును దక్కించుకోవడానికి ఇరువర్గాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. బల నిరూపణలో వెనకబడ్డ ములాయం, శివపాల్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. అఖిలేష్‌కే పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

ములాయం, అఖిలేష్‌లకు ఈసీ నోటీసు
సమాజ్‌వాదీ పార్టీ గుర్తు సైకిల్‌ కోసం అఖిలేశ్‌ యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌ గ్రూపులు హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ములాయం, అఖిలేష్‌లకు నోటీసు జారీ చేసింది. పార్టీని, ఎన్నికల గుర్తుని కోరుకుంటున్న ఈ రెండు గ్రూపులు ఈ నెల తొమ్మిదో తేదీలోగా పిటిషన్లను తమకు దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. తమ తమ మద్దతుదారులకు సంబంధించిన అఫిడవిట్లను సమర్పించాలని ఈసీ ఆదేశించడంతో ఇరువర్గాలు బల నిరూపణకు సిద్ధమయ్యాయి.

సమాజ్‌వాది పార్టీకి 229 మంది ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన వర్గీయులైన ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరి నుంచి తనకు మద్దతుగా అఫిడవిట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. వారి సంత‌కాలు తీసుకొని వాటిని ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించ‌నున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి యూపీ అసెంబ్లీలో మొత్తం 229 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలో 220 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్సీలు అఖిలేష్ వెంటే ఉన్నారు. మరోవైపు పార్టీ గుర్తును దక్కించుకునేందుకు ములాయంసింగ్‌ యాదవ్‌, ఆయన సోదరు శివపాల్‌ యాదవ్‌ ఢిల్లీకి వెళ్లారు. తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అఫిడవిట్లను ఈసీకి సమర్పించనున్నారు.

వర్గ పోరులో వెనక్కి తగ్గిన ములాయం, శివపాల్‌ ?
సమాజ్‌వాదీ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా.. మరో వర్గానికి ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ములాయం మద్దతు తమ్ముడికే ఉండటం.. ఎన్నికలు కూడా సమీపించడంతో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. బల నిరూపణలో వెనకబడ్డ ములాయం, శివపాల్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అఖిలేష్‌కే పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్‌ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోరుకు తలపడే అవకాశం ఉంది. ఎస్పీ వివాదం ఓ కొలిక్కి వస్తే కాంగ్రెస్‌తో జత కట్టే అవకాశం లేకపోలేదు.

10:41 - January 6, 2017

హైదరాబాద్ : ఈ యేడాది తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ యథావిధిగా కొనసాగనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఎంసెట్ రద్దు విషయంపై పరిశీలనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతుండటంతో ఇప్పుడు ఎంసెట్ రద్దు చేస్తే... విద్యార్ధులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే... వచ్చే విద్యా సంవత్సరంలో ఎంసెట్‌ను రద్దు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈసారి ఎంసెట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవు : చైర్మన్ పాపిరెడ్డి
రాష్ర్టంలో ఈ సంవత్సరం ఎంసెట్‌ పరీక్షను రద్దు చేయడం లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ రద్దుపైన ఇప్పటికే ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతుండటంతో త్వరలోనే ఎంసెట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉన్నత విద్యామండలి డైరీని ఆవిష్కరించిన మండలి ఛైర్మన్ పాపిరెడ్డి.. ఈసారి ఎంసెట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడి
ఈ యేడాది అన్నీ సెట్స్ షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. టెన్త్ షెడ్యూల్ ప్రకారం రాష్ర్టంలో ఉన్న విద్యాసంస్థలు తెలంగాణకే చెందుతాయని సుప్రీంకోర్టు పేర్కొందని, ఇప్పుడు కొత్తగా ఫైన్ ఆర్ట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం వివాదం చేయడం సరైన పద్ధతి కాదని పాపిరెడ్డి అన్నారు. 

10:38 - January 6, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో విభేదాలు అసెంబ్లీ సాక్షిగా మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అంశంపై ప్రభుత్వ వైఖ‌రికి నిర‌స‌న తెలిపే క్రమంలో నాయకుల మధ్య సఖ్యత లేదనే విషయం బయటపడింది. ఎమ్మెల్యే భ‌ట్టి విక్రమార్కకు ముఖ్య నాయ‌కులెవరూ స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం పార్టీలో హాట్ హాట్‌ చర్చకు దారితీసింది.

జానారెడ్డి మాట‌లు నీట‌మూట‌లేనా?
అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార‌పార్టీని ఐక్యంగా ఎదుర్కోవాల‌న్న సీఎల్పీ నేత జానారెడ్డి మాట‌లు నీట‌మూట‌ల‌ని తేలిపోయాయి. అంశాల‌వారీగా సీఎల్పీ లీడ‌ర్ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు బ‌ట్టబ‌య‌ల‌వుతున్నాయి. ప‌లు సంద‌ర్భాల్లో సీఎల్పీ లీడ‌ర్ వైఖ‌రిని ఎమ్మెల్యేలు త‌ప్పుబ‌డుతూ మాట్లాడుకోవ‌డం స‌ర్వసాధార‌ణంగా మారింది. అయితే గురువారం జ‌రిగిన స‌మావేశాల్లో మాత్రం రోటీన్‌కు భిన్నంగా జానాకు బ‌దులు భ‌ట్టి విక్రమార్క టార్గెట్ అయ్యారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ తీరును ఎండగట్టిన భట్టి
ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పై బుధవారం సభలో జరిగిన ఎపిసోడ్‌కు కొన‌సాగింపుగా నిన్నజ‌రిగిన చ‌ర్చలో ప్రభుత్వ వైఖ‌రిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన స‌మాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భ‌ట్టి విక్రమార్క.... ప్రొటెస్ట్ కోసం మైక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంలో స‌భ‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశం చోటు చేసుకుంది. భ‌ట్టి విక్రమార్క ప్రొటెస్ట్‌ అంశంపై క‌లుగ‌జేసుకున్న శాస‌న‌స‌భ వ్యవ‌హారాల మంత్రి హ‌రీష్ రావు... ఈ ప్రొటెస్ట్ మీ వ్యక్తిగ‌త‌మా..? లేక పార్టీ నిర్ణయ‌మా..? సీఎల్పీ లీడ‌ర్‌ను మార్చారా..? అని అన‌డంతో ఒక్కసారిగా స‌భ‌లో వేడి రాజుకుంది.

అసెంబ్లీలో భ‌ట్టి విక్రమార్క వ‌ర్సెస్ జానారెడ్డి
మంత్రి హ‌రీష్ వ్యంగ్యంగా భ‌ట్టి విక్రమార్కను ఉద్దేశించి మాట్లాడినా... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అటు సీఎల్పీ లీడ‌ర్ జానారెడ్డిగానీ, పీసీసీ చీఫ్‌ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగాని నోరుమెద‌ప‌క‌పోవ‌డంతో భ‌ట్టి విక్రమార్క సభలో ఒంట‌ర‌య్యారు. దీన్ని గ‌మ‌నించిన సీనియ‌ర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి జానారెడ్డి లేవాల‌ని ఒత్తిడి తీసుకురావడంతో అనాస‌క్తిగానే లేచిన జానా... భ‌ట్టి విక్రమార్క ప్రొటెస్ట్ చెబుతార‌ని ప్రకటించారు. దీంతో భట్టి వెంట‌నే ప్రొటెస్ట్ చెప్పి స‌భ నుంచి వాకౌట్ చేశారు.

అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ నేతల విబేధాలు
అధికార‌ప‌క్షం స‌భ‌ను బుల్డోజ్ చేస్తోంద‌ని మీడియా ముందు ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... త‌మ‌లో తాము ఐక్యత ప్రద‌ర్శించి స‌భ‌లో అధికార పార్టీని ఎదుర్కోవ‌డంలో బిన్న వైఖ‌రి ప్రద‌ర్శిస్తున్నార‌నే చ‌ర్చ హాట్ టాఫిక్‌గా మారింది.

10:34 - January 6, 2017

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజుని గవర్నర్ గా నియమిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను ఒకే రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. కానీ కృష్ణం రాజును మాత్రం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. కేంద్రం కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. గత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగియడంతో.. తాత్కాలిక గవర్నర్ గా విద్యాసాగర్ రావు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి పూర్తి గవర్నర్ ను నియమించాలని కేంద్రం యోచిస్తున్నట్లు, అందులో భాగంగా కృష్ణం రాజును పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి' సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన 'ప్రభాస్' కి 'కృష్ణంరాజు' పెదనాన్న అనే విషయం తెలిసిందే. మరి ఈ వార్తలు పుకార్లేనా ? నిజమా ? అనేది తెలియాల్సి ఉంది.

10:33 - January 6, 2017

హైదరాబాద్ : శివారులోని హయత్‌నగర్ ఆత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బాలికను ఇద్దరు యువకులు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని ఆత్యాచారం చేయబోయారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు బాలికను రక్షించారు. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆత్యాచారయత్నంతో పాటు, కిడ్నాప్, నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. 

ప్రకాశం బ్యారేజిని సందర్శించిన సీఎం చంద్రబాబు

విజయవాడ : నగరంలో ప్రకాశం బ్యారేజిని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ ఈ రోజు సందర్శించారు.

82వ రోజు ప్రారంభమైన మహాజన పాదయాత్ర

జనగామ: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చేస్తున్న 82వ రోజు మహాజనపాద యాత్ర ప్రారంభం అయ్యింది. యశ్వంతాపూర్, ధర్మకంచె, జనగామ, వెల్లుట్ల, కుందారం,కిష్టగూడెం, చీటూరు గ్రామాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది.

10:29 - January 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో గ్రామ పంచాయితీ కార్మికులకు ,మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీపీఎం వాయిదా తీర్మానం ఇవ్వనుంది. ఓలా,ఉబర్ క్యాబ్ ల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మరింత సమాచారానికి వీడియో చూడండి..

10:25 - January 6, 2017

ఆసిఫాబాద్‌ : వీర్గాం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నండర్ల ప్రకటించారు. సికింద్రాబాద్- 04027786170, 27700868, 27786539, 27788889, ఖమ్మం-08742234541, కాజీపేట్- 08702576430, 2576266, 2576430, వరంగల్-08702426232, సర్పూర్ కాగజ్‌నగర్-08738238717 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. దీంతో సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. కాగజ్‌నగర్‌లో దర్బంగా, నాగపూర్‌ ప్యాసింజర్‌, మంచిర్యాలలో చెన్నై-ఢిల్లీ జీటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీకి నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్: నేటి మధ్యాహ్నాం 12 గంటల సమయంలో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు తెలంగాణ అసెంబ్లీకి నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రానున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సిమాకు వినోదపు పన్ను మినహాయించినందుకు కేసీఆర్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలపనున్నారు.

10:17 - January 6, 2017

ముంబై : ప్రముఖ బాలీవుడ్  నటుడు ఓంపురి (66)మృతి చెందారు. పలువిభిన్న పాత్రలు చేసిన ప్రేక్షకులను అలరించిన ఓంపురి గుండెపోటుతో మృతి చెందారు. ఈయన పూర్తి పేరు ఓం రాజేశ్ పురి అయినా ఓంపురి అనే పేరుతో పేరుపొందారు. ఈయన ప్రముఖ నటుడు అమ్రిష్ పురికి సోదరుడు అనే విషయం తెలిసిందే. ఓంపురికి భార్య కుమారుడు వున్నారు. 1972లో సినిరంగ ప్రవేశం చేసిన ఓంపురికి 1993లో నందితాతో ఆయనకు వివాహం జరిగింది. 1950 అక్టోబర్ 15న హర్యానాలో ఓంపురి జన్మించారు. ఓంపురిని నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డులు ..రెండు నేషనల్ అవార్డులు వరించాయి. 1990లో దేశం అయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పలు భాషల్లో ఓంపురి నటించారు. భారతీయ భాషల్లోనే కాక బ్రిటీష్, పాకిస్థాన్,హాలివుడ్ సినిమాలో కూడా ఆయన నటించారు. తెలుగులో సి.ఉమామహేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన అంకురం సినిమాలో విలక్షణ పాత్రలో నటించి విమర్శకుల మెప్పు పొందారు. ఓంపురి మృతి పట్ల సిని పరిశ్రమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించేందుకు ఓంపురి నివాసానికి చేరుకుంటున్నారు. 

10:16 - January 6, 2017

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి..రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిలపై సీఐడీ  చార్జ్ షీట్ నమోదు చేసింది. 2014 ఎన్నికల సమయంలో నకిలీ మద్యం పంపిణీ చేయటంపై సీఐడీ  చార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో పొదలకూరు, ముత్తుకూరు,పిడతాపూర్ లలో కొందరు వ్యక్తులు కల్తీ మద్యం తాగి మృతి చెందారు. దీనిపై విచారణ చేపట్టిన ఎక్సైజ్..ప్రొహిబిషన్ వారు విచారణచేపట్టారు. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించారు. అప్పటి నుండి కొనసాగిన ఈ కేసుపై ఈనాటికి కాగా వీరు తాగిన మద్యం ఎక్కడి నుండి తెప్పించారనే కోణంలో దర్యాప్తు జరిగింది. ఈ విచారణలో భాగంగా ఎస్పీ అమ్మిరెడ్డి ఆరు బృందాలతో విచారణ జరిపించారు. కావలికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి లకు సంబంధించిన అనుచరులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డిలు కర్నాటక, గోవాల నుండి తెప్పించి సరఫరా చేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో వీరిపై సీఐడీ చార్జ్ షీట్ నమోదు చేసింది. 

వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని, రామిరెడ్డి పై సీఐడీ ఛార్జిషీటు

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాపరెడ్డిపై సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2014 ఎన్నికల సమయంలో నకిలీ మద్యం పంపిణీ చేయడం పై సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

ప్రారంభమైన టీఎస్ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

10:01 - January 6, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది . మున్సిపల్ స్కూల్స్ ఉన్నఫళంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ జీవో నెంబర్ 14 జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడమెందుకన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇంగ్లీషు మీడియంలో బోధించే ఉపాధ్యాయులను నియమించకుండా, అందుకు సంబంధించిన ట్రైనింగ్ ఏదీ ఇవ్వకుండా పరీక్షల ముంగిట్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదస్పదమైంది. ఆంధ్రప్రదేశ్ లో 2118 మున్సిపల్ పాఠశాలలుండగా, రెండు లక్షల 68 వేల మంది విద్యార్థులున్నారు. జీవో నెంబర్ 14 వీరందరి జీవితాలను ప్రభావితం చేయబోతోంది. ఈ జీవో వివాదస్పదమైన నేపథ్యంలో ఇవాళ మున్సిపల్ శాఖ డైరెక్టర్ తో ఉపాధ్యాయ సంఘాలు సమావేశమవుతున్నాయి. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలతో పాటు జీవో నెంబర్ 14పై కూడా చర్చ జరిగే అవకాశం వుంది. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) చైర్మన్ బాబురెడ్డిగారు విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు.

10నుండి 16వ తేదీ వరకు ఫ్లాట్ ఫాం టికెట్ ధర పెంపు..

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్, కాచీగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం ధర పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌ఫాం ధరను తాత్కాలికంగా రూ.10 నుంచి 20కి పెంచనున్నట్లు వెల్లడించారు. ఈ ధరలు ఈ నెల 10 తేదీ నుంచి 16 తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

09:59 - January 6, 2017

ప్రాజెక్టుల కోసం భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సేకరించే భూసేకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవోనెంబర్‌ 123 ప్రకారం..తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఎమ్మార్వోల పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారానే ప్రభుత్వం భూములు తీసుకుంటోందన్న పిటిషనర్ల అభియోగాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో 123 జీవో ప్రకారం సేకరించిన భూముల రిజిస్ట్రేషన్లు కూడా చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. కాగా 2013 చట్టం ప్రకారం తీసుకున్న భూములపై ఎటువంటి అభ్యంతరం ఉండదనికూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై డిఫెన్స్ లో పడిన తెలంగాణ సర్కార్ ఎలా ముందుకు కొనసాగనుందో వేచి చూడాలి..ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సాగర్ (రైతు సంఘం నేత) ,ఇందిర (టీ.కాంగ్రెస్ నేత), గోవర్థన్ రెడ్డి (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి...

 

యాదాద్రి వెళ్ళనున్న గవర్నర్..

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ పరిశీలించనున్నారు. ఉదయం 10.20 గంటలకు యాదాద్రికి చేరుకుని 10.30 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. అర్చకుల ఆశీర్వచనం అనంతరం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న నిర్మాణ పనులు తీరు తెన్నులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉదయం 10.30 నుంచి 11.30 వరకు గంటపాటు కొండపై కలియతిరిగి పనులను పరిశీలించనున్నారు.

ఎదురు కాల్పుల్లో మహిళా మావోమృతి..

మహారాష్ట్ర : గడ్చిరౌలి గ్యారపత్తి అటవీప్రాంతంలో పోలీసులుకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతురాలు సుర్ఝాగఢ్ ఎల్వోఎస్ కమాండర్ జ్యోతిగా పోలీసులు గుర్తించారు.  

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

ఓంపురి కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి(66) ఇక లేరు. తన అసమాన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి, ప్రేక్షకులను మెప్పించిన ఓంపురి గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. 1950 అక్టోబర్ లో ఆయన హర్యాణాలో జన్మించారు. 1976లో సినీరంగ్ర ప్రవేశం చేసిన ఆయన బాలీవుడ్ లోనే కాకుండా... మన దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఆయన నటించారు. పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో అంకురం, రాత్రి తదితర చిత్రాల్లో ఆయన నటించారు.

09:05 - January 6, 2017

మళ్ల లైన్లకొచ్చిన ఎగ్జిట్ పోల్ యేశకాళ్లు... ఎటూ సుతిగల్వని సంస్థల సర్వేలు, రెండువేల నోటు మీద గాంధీ తాత మాయం... మోడీతోటే అయితది ఇసొంటి ఉపాయం, దేవినేని ఉమాను ఆడామెను చేసిన ఆడోళ్లు.. నీళ్ల మంత్రి బొమ్మకు నిప్పువెట్టి నిరసన, వ్యవసాయ కార్యాలయానికి తెగులు... రైతుల పైకం పీల్చేస్తున్న పరుగులు, దేశనేతల బొమ్మలకు దేహశుద్ధి.... ఉన్నదా చేసినోళ్లకు అసలు బుద్ధి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

08:30 - January 6, 2017

విజయవాడ : దేశభాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాషను కీర్తిస్తే.. ఇప్పుడున్న టీడీపీ సర్కార్‌ మాత్రం మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు లెస్‌ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ మున్సిపల్‌ శాఖ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంపై విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఆందోళనలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
తెలుగు జాతిని ఉద్ధరిస్తామని.. తెలుగు తేజాన్ని దశదిశలా వ్యాప్తి చేస్తామంటూ చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ పాలనలో మున్సిపల్ పాఠాశాలలలో తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న నిర్ణయంపై విద్యావేత్తలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తి కానున్న తరుణంలో అత్యవసరంగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్పు చేయాల్సిన అవసరం ఏ మొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే యూటీఎఫ్‌ ఆందోళనబాట పట్టింది..

ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
మున్సిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌ శాఖ సెక్రటరీ ఉపాధ్యాయ సంఘాలతో ఇవాళ విజయవాడలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు తమ వాణిని వినిపించబోతున్నాయి. ఉత్తర్వులు విడుదల చేసే ముందే ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై చర్చించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాల్లేకుండా, బోధించడానికి అధ్యాపకుల్లేకుండా రాత్రికి రాత్రే తెలుగు మీడియంను రద్దుచేస్తూ ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనే మంత్రి నారాయణ నిర్ణయం వెనుక కుట్ర దాగుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఉపాధ్యాయ సంఘాలు కావాలనే ఆందోళన చేస్తున్నాయి:మంత్రి నారాయణ
కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కావాలనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మన విద్యార్థులు ఇంగ్లీష్‌లో వెనకబడడంతోనే జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో వెనబడిపోతున్నారని ఆరోపించారు.

దశల వారిగా ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి : నారాయణ
విద్యార్థులకు క్లాస్‌లను దశల వారిగా ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించామని నారాయణ తెలిపారు. దయచేసి ఉపాధ్యాయ సంఘాలు పేద విద్యార్థుల భవిష్యత్‌కు సహకరించాలని కోరారు.

తెలుగు మీడియంను మూసివేయటం విరమించుకోవాలి : యూటీఎఫ్
మున్సిపల్ శాఖ మంత్రి ఏకపక్షంగా తెలుగు మీడియంను మూసివేయటాన్ని వెంటనే విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు దిగబోతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

07:06 - January 6, 2017

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన 123 వ నెంబర్‌ GOతో భూసేకరణ చేపట్టొదని ఉమ్మడి హైకోర్టు ఆదేశించడం పట్ల తెలంగాణ జేఏస ఈ చైర్మన్‌ కోదండరామ్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. నల్గొండ టౌన్‌ హాల్లో జరిగిన ఆట, పాట కార్యక్రమంలో పాల్గొన్న కోదండరామ్‌ హైకోర్టు ఆదేశాలపై స్పందించారు. ప్రజా సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వ వ్యాపార సంస్థగా మారకూడదని సూచించారు. 

123 జీవో ద్వారా భూసేకరణ చేయరాదు : హైకోర్టు
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్‌ ఇచ్చింది. ప్రాజెక్టుల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ 123 జీవో ద్వారా భూసేకరణ చేయరాదని స్పష్టం చేసింది. హైకోర్టు వెలువరించిన 78 పేజీల సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు.. తెలంగాణ సర్కారును పునరాలోచనలో పడేలా చేశాయి. తాజా పరిణామాల దృష్ట్యా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.

07:01 - January 6, 2017

ఆసిఫాబాద్‌ : ఆసిఫాబాద్ వీర్గాం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. కాగజ్‌నగర్‌లో దర్బంగా, నాగపూర్‌ ప్యాసింజర్‌.. మంచిర్యాలలో చెన్నై-ఢిల్లీ జీటీ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశారు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దైంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్- 04027786170, 27700868, 27786539, 27788889, ఖమ్మం-08742234541, కాజీపేట్- 08702576430, 2576266, 2576430, వరంగల్-08702426232, సర్పూర్ కాగజ్‌నగర్-08738238717 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. 

పట్టాలు తప్పిన గూడ్స్..హెల్ప్ లైన్ నంబర్స్ ..

మహారాష్ట్ర : గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్- 04027786170, 27700868, 27786539, 27788889, ఖమ్మం-08742234541, కాజీపేట్- 08702576430, 2576266, 2576430, వరంగల్-08702426232, సర్పూర్ కాగజ్‌నగర్-08738238717 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. 

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ వీర్గాం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. కాగజ్‌నగర్‌లో దర్బంగా, నాగపూర్‌ ప్యాసింజర్‌.. మంచిర్యాలలో చెన్నై-ఢిల్లీ జీటీ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశారు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దైంది. 

Don't Miss