Activities calendar

07 January 2017

నాగబాబు కామెంట్లపై స్పందించిన వర్మ

హైదరాబాద్ : నాగబాబు కామెంట్లపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. చిరంజీవి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. తాను  అందరిమీదా ట్వీట్లు చేస్తానని చెప్పారు. మోదీ నుంచి అమితాబ్‌ వరకు అందరిమీదా ట్వీట్లు చేశానని తెలిపారు.

 

22:36 - January 7, 2017

పోలీసుల నిర్లక్ష్యం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తోంది. ఎన్నో దారుణాలకు కారణమవుతోంది. చిన్న కేసు కదా అని కొట్టిపారేస్తున్న పోలీసులు..ఆ తర్వాత జరిగే పరిణామాలను చూసి ఖంగు తింటున్నారు. ఇలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోలీసుల నిర్లక్ష్యమో... ఆ కుటుంబం దురదృష్టమో.. మొత్తానికి పన్నెండేళ్లుగా ఓ కుటుంబం.. చిన్న ఆశతో బతుకుతోంది. వయసు మీద పడ్డ కన్న తల్లిదండ్రుల కన్నీటికి కారణం పోలీసులే. వారి అలక్ష్యమే. గల్లీ లీడరు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వెళ్లి.. కాళ్లావేల్ల పడ్డా కనికరించలేదు. చివరకు వాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి.. ఆ ముసలి తండ్రి కాళ్లు చచ్చుపడిపోయాయి. గడప దాటలేని స్థితిలో కన్నతల్లి ఉంది. ఇది నిన్న మొన్నటి కథ కాదు...పుష్కరకాలంగా ఓ కుటుంబం కన్నీటిలోనే తడిసిపోతోంది. ఇదీ కథకాదు.. ఏ రియల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దా...

22:32 - January 7, 2017

 కృష్ణా : విజయవాడలో 10టీవీ క్యాలెండర్‌ను బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బుద్దా నాగేశ్వరరావు, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఉత్తమ్‌చంద్‌ బండారీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటమహేష్‌ ఆవిష్కరించారు. విభిన్న చిత్రాలు.. కొత్త హంగులతో రూపొందించిన క్యాలెండర్‌ చూడ ముచ్చటగా ఉందన్నారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక చానల్‌ 10టీవీ అని నేతలు కొనియాడారు.  

 

22:16 - January 7, 2017
22:15 - January 7, 2017

హైదరాబాద్ :  'గౌతమిపుత్ర శాతకర్ణి' చరిత్రాత్మక సినిమా అని హీరో బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన శత చిత్ర యోధ శతమానం భవతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈనెల 12న విడుదల కానుంది. 

22:08 - January 7, 2017

ఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే సాక్షి మహరాజ్‌పై పోలీసు కేసు నమోదైంది. మీరట్‌లోని ఓ దేవాలయ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి మహరాజ్‌.. దేశంలో జనాభా పెరిగేందుకు వారే కారణమంటూ ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 'ట్రిపుల్‌ తలాక్‌'కు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని,.. ఉమ్మడి పౌరస్మృతి త్వరలోనే అమల్లోకి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షి మహరాజ్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసిని కోరారు. అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ.. ఆ వ్యాఖ్యలు సాక్షిమహరాజ్‌ వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీ అభిప్రాయం కాదని తెలిపింది. తాను ఏ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని.. దీనిపై విచారణకు సిద్ధంగా ఉన్నానని సాక్షి మహరాజ్‌ తెలిపారు. అయితే.. తాజగా మీరట్‌ పోలీసులు సాక్షి మహరాజ్‌పై 153బి, 295ఎ, 188, 503/3, 298 మరియు 171 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

 

22:03 - January 7, 2017

హైదరాబాద్ : ఒంటరి మహిళలకు పెన్షన్‌ ద్వారా చేయూతనివ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు.. ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి తమ సంతోషాన్ని  పంచుకున్నారు. అపూర్వ నిర్ణయం తీసుకున్నారంటూ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
తెలంగాణలో 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి మహిళలు
తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలు లక్షల్లోనే ఉన్నారు. భర్త నుంచి విడిపోయిన వారు,  కుటుంబ, ఆస్తి తగాదాలతో భర్తకు దూరంగా ఉంటూ మహిళలు ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. కారణాలేవైనా కావొచ్చు ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వీరు అడుగడుగునా అవమానాలు చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఇటు కుటుంబం, అటు సమాజం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు  అందక.. అష్టకష్టాలకోర్చి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.  ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న  సుమారు మూడు లక్షల మంది పేద ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు.
కేసీఆర్‌ నిర్ణయంపై సర్వత్రా హర్షం
ఒంటరిగా జీవిస్తున్న పేద మహిళలకు నెలనెలా వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది.  ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను పలువురు  మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.  మ్యానిఫెస్టోలో ప్రకటించకున్నా... తమ కష్టాలను తెలుసుకుని మానవీయ కోణంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు.  కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. పెన్షన్‌ మంజూరు చేయాలన్న నిర్ణయం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తమ సంతోషాన్ని కేసీఆర్‌తో పంచుకున్నారు.
సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసిన కేసీఆర్‌
తనను కలవడానికి వచ్చిన మహిళలతో సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్‌ ఆరా తీశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సరికొత్త పథకాలు చేపడుతోందని, కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని మహిళలు  కేసీఆర్‌తో చెప్పారు. హాస్టళ్లలో గుడ్లు, భోజన వసతి బాగున్నాయని వివరించారు.  మిషన్‌ కాకతీయతో చెరువులు నిండి పనిదొరుకుతోందన్నారు. ప్రభుత్వం మహిళలకు  ఎప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్‌ వారికి భరోసా ఇచ్చారు. ఒంటరి మహిళలకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.

 

21:57 - January 7, 2017

గుంటూరు : నవ్వుల బాద్‌షా నాగబాబుకు కోపం వచ్చింది. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా నాగబాబు ఫైరయ్యారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరిపై, అలాగే.. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై మండిపడ్డారు. రీమేక్ సినిమాలు తీస్తే తప్పేంటని ప్రశ్నించిన నాగబాబు, రీమేక్‌లు చేయడంలో తప్పులేదన్నారు. చిరంజీవి నటించిన పలు చిత్రాలు ఇతర భాషల్లో రూపొందాయన్నారు. చిరంజీవి ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పేంత వాళ్లు వీళ్లా అనిప్రశ్నించారు. యండమూరిని తప్పుపడుతూ.. 'ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు... కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతనొక మూర్ఖుడు. పైగా వ్యక్తిత్వ వికాసం కోర్సు చెబుతున్నాడు..సొంత వ్యక్తిత్వం లేనివారు ఇతరులకు చెబుతారు' అంటూ విరుచుకుపడ్డారు. రామ్‌గోపాల్‌ వర్మను తీరుపై మండిపడుతూ.. 'ఎప్పుడూ ఆయన ఆన్‌లైన్‌లోనే ఉంటాడు. ముంబైలో సినిమాలు చేసుకునే వాడు. ఇక్కడా చేస్తున్నాడు. అతనో అక్కుపక్షి. పిచ్చికూతలు కూస్తాడు. సరిగా సినిమా తీయడం కూడా రాదు. ముందు మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుంది' అంటూ నాగబాబు మండిపడ్డారు. 
చిరంజీవి కుటుంబానికి క్షమాపణలు చెప్పిన వర్మ
నాగబాబు కామెంట్లపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. చిరంజీవి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. తాను  అందరిమీదా ట్వీట్లు చేస్తానని చెప్పారు. మోదీ నుంచి అమితాబ్‌ వరకు అందరిమీదా ట్వీట్లు చేశానని తెలిపారు.

 

ఖైదీ నెంబర్‌ 150 సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగబాబు ఫైర్‌

గుంటూరు : మెగాస్టార్ చిరంజీతి నటిస్తున్న ఖైదీ నెంబర్‌ 150 సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగబాబు ఫైర్‌ అయ్యారు. రచయిత యండమూరి, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై మండిపడ్డారు. రిమేక్‌ సినిమాలు తీస్తే తప్పేంటని ప్రశ్నించారు. చిరంజీవి ఎలాంటి సినిమాలు తీయాలో వీళ్లు చెప్పాలా? అన్నారు. 

 

21:44 - January 7, 2017

చంఢీగర్ : పంజాబ్‌, గోవాలో ఎన్డీయే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? పంజాబ్‌లో ఎన్డీయే కూటమి హాట్రిక్‌ సాధిస్తుందా? అకాళిదళ్‌-కాంగ్రెస్‌-ఆప్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది... గోవాలో కూడా బిజెపికి ఆప్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
పంజాబ్‌ కమలానికి ముఖ్యమైన రాష్ట్రం
పంజాబ్‌ చిన్న రాష్ట్రమే అయినా కమలానికి ముఖ్యమైన రాష్ట్రమిది. ఎందుకంటే అకాలీదళ్‌ ప్రభుత్వంలో జూనియర్‌ భాగ స్వామిగా వుంది. 2007 నుంచి అధికారంలో ఉన్న  ఈ రెండు పార్టీలు హ్యాట్రిక్‌ సాధించాలని అత్యాశ పడుతున్నాయి. కొత్తగా అవతరించిన 'ఆప్‌' కూడా తన ప్రాభవం చాటుకోవాలని ఆరాట పడుతోంది. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ఎన్డీయే ముందున్న పెద్ద సవాలు. పంజాబ్‌లో అధికార కూటమిగా వున్న బిజెపి, అకాలీదళ్‌, ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార కూటమి పట్ల వున్న వ్యతిరేకత 'ఆప్‌'కు లాభించే అవకాశముంది. పురిటిబిడ్డగా వున్న 'ఆప్‌' ఇక్కడ విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. అనేక దశాబ్దాల తర్వాత ఇక్కడ గద్దెనెక్కేందుకు శక్తిమేరకు కృషి చేస్తున్న కాంగ్రెస్‌కు 'ఆప్‌' మోకాలడ్డుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు 
పంజాబ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 117 స్థానాలున్నాయి. శిరోమణి అకాళిదళ్‌కు 56 సీట్లుండగా... ఆ పార్టీకీ 34.73 ఓటింగ్‌ శాతం ఉంది. కాంగ్రెస్‌కు 46 సీట్లుండగా 40.09 శాతం ఓట్లున్నాయి. 12 సీట్లున్న బిజెపికి 7.18 ఓటింగ్‌ శాతం ఉంది. ఇతరులకు 3 సీట్లున్నాయి.
'ఆప్, బి.జె.పి' మధ్యే ప్రధాన పోటీ  
గోవాలో ఎన్నికలు ఫిబ్రవరి నాలుగున జరగనున్నాయి. బిజెపి అధికారంలో వున్న ఈ చిన్ని రాష్ట్రంలో 'ఆప్‌' సత్తా చాటాలనుకుంటోంది. అయితే ఈ ప్రయత్నం రాష్ట్రంలో 26 శాతం ఓటింగ్‌ వున్న కాథలిక్కుల అండతో గద్దెనెక్కాలనుకుం టున్న హస్తం ఆశలను ఆవిరి చేసేలా వుంది. తీరా ఎన్నికల తేదీలు ప్రకటించిన తరుణంలో అధికార పార్టీ కూటమిలో ఒకటైన 'మహా రాష్ట్రవాది గోమాంతక్‌ పార్టీ' (ఎం.జి.పి) మతతత్వ బి.జె.పికి మద్దతు ఉపసంహరించి దూరంగా జరగడం విశేషం. మొత్తం మీద పోటీ 'ఆప్‌-బి.జె.పి' మధ్యేకానీ కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదన్నది పరిశీలకుల భావన. 
గోవాలో మొత్తం 40 స్థానాలు 
ఇక్కడ మొత్తం 40 స్థానాలున్నాయి. బిజెపికి 21 సీట్లుండగా....ఓటింగ్‌ శాతం 34.68గా ఉంది. కాంగ్రెస్‌ 9 సీట్లుండగా ఓటింగ్‌ శాతం 30.78గా ఉంది. ఎం.ఎ.జికి 3 సీట్లు ఇతరులకు 7 సీట్లున్నాయి.

 

21:40 - January 7, 2017

ఇంపాల్ : ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లో అధికారాన్ని కాంగ్రెస్‌ తిరిగి కైవసం చేసుకుంటుందా? ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతి ఆ పార్టీపై ఎంతవరకు ప్రభావం చూపనుందన్నది ఆసక్తిగా మారింది. గత 14 ఏళ్లుగా మణిపూర్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం సవాల్‌గానే మారింది. 
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోటా పోటీ 
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోటా పోటీ నెలకొంది. 42 లక్షల మంది ఓటర్లు పాల్గొన్న 2012 ఎన్నికలలో మిత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయడంతో  గత మే మాసంలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన సీఎం హరీష్‌ రావత్‌కు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. కమలం మద్దతుతో కాంగ్రెస్‌ గూటి పక్షులే ఆయనను అస్థిర పరచే ప్రయత్నం చేశారు. 
 కాంగ్రెస్‌, బిజెపిలకు గెలుపు ప్రతిష్టాత్మకం 
అయితే రాష్ట్రంలో పోటీ మాత్రం సీఎం హరీష్‌, పీఎం మోదీ మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలన్నది కమలం ఆశ. పోతే అధికార కాంగ్రెస్‌ అసమ్మతి కాకతో అధికారానికి కొంతకాలం దూరమైనా కోర్టుల జోక్యంతో తిరిగి ఊపిరి పీల్చుకున్న వైనాన్ని మరువకూడదు. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ రాష్ట్రంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 
ఉత్తరాఖండ్ లో మొత్తం స్థానాలు 70 అసెంబ్లీ స్థానాలు
మొత్తం స్థానాలు 70 అసెంబ్లీ స్థానాలకు గాను బిజెపికి 31 సీట్లున్నాయి. కమలానికి 33.13 ఓటింగ్‌ శాతం ఉంది. 32 స్థానాలున్న కాంగ్రెస్‌కు 33.79 ఓటింగ్‌ శాతం ఉంది. 3 సీట్లున్న బిఎస్‌పీకి ఓటింగ్‌ శాతం 12.19గా ఉంది. ఇతరులకు 4 స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ చిట్టచివరి కోట మణిపూర్‌. సీఎం ఇబోబి సింగుకు ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద సవాల్‌గా మారింది. దీనికితోడు జాతి వైరాలు, ఆయుధ పోరుతో ఉడికిపోతున్న రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన హస్తానికి కఠిన పరీక్ష వంటిదే. 
ఇరోం షర్మిల ఎన్నికల అరంగేట్ర 
ఉక్కుమహిళ ఇరోం షర్మిల ఎన్నికల అరంగేట్ర ప్రభావం ఎలా వుంటుందనేది వేచి చూడాలి. గత 16 ఏళ్లుగా అఫ్సా చ‌ట్టానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరోమ్ షర్మిలా గత ఏడాది దీక్ష విరమించారు. 14 సంవత్సరాలుగా రాష్ట్రంలో సీఎం పీఠాన్ని అంటిపెట్టుకుని వున్న ఇబోబి సింగుపైనే పోటీ చేస్తానని ఆమె సవాల్‌ చేయడం విశేషం. మణిపూర్‌ గద్దెను ఎలాగైనా కైవసం చేసుకోవాలని కమలం ఉవ్విళ్లూరుతోంది.
మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు 
మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 42 సీట్లున్నాయి. ఓటింగ్‌ శాతం 42.42గా ఉంది. ఎఐటిసికి 7 సీట్లుండగా 17 శాతం ఓట్లున్నాయి. ఎం.ఎస్‌.సి.పి-5, ఎన్‌.పి.ఎఫ్‌కు 4, ఇతరులకు 2 ఓట్లున్నాయి.

 

21:34 - January 7, 2017

లక్నో : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. మినీ రణరంగాన్ని తలపిస్తున్న ఈ ఎన్నికల్లో ఎవరికి వారే విజేతలుగా నిలవాలని... ప్రత్యర్థులను చిత్తు చేయాలని ఉవ్వీళ్లూరుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సెమీఫైనల్స్‌ లాంటివి. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో వివిధ పార్టీల బలాబలాలపై స్పెషల్‌ ఫోకస్...
ప్రధాన పార్టీలకు కీలకంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు  
ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాజకీయ సందడి ఊపందుకుంది. దేశంలోకెల్లా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. అతి త్వరలో సాధారణ ఎన్నికలు రానున్నందున కమలానికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 14 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కమలం- కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతున్న ఎస్పీని, బిఎస్పీని దెబ్బకొట్టి యూపీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని తహతహ లాడుతోంది. 
ఎస్పీతో జతకట్టేందుకు 'హస్తం' అడుగులు 
28 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ స్వతంత్రంగా ఉనికిని చాటుకునే స్థితిలో లేదు ఎస్పీతో జతకట్టి లాభపడాలని హస్తం ఆ దిశగా అడుగులు వేస్తోంది. బిఎస్పీ చీఫ్‌ మాయవతి ఇప్పటికే 2 వందల మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దళితులకు, మైనారీటీల ఓట్లతో గద్దనెక్కేందుకు మాయావతి పాచికలు వేస్తున్నారు. ఈ రెండువర్గాలకి భారీగా టికెట్లు కేటాయించారు.
ఎస్పీలో ముసలం..
అధికార పార్టీలో పుట్టిన ముసలం ములాయం పార్టీని ఏ తీరానికి చేరుస్తుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. ములాయం అఖిలేష్‌ వర్గాల మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలీక 'ములాయం అండ్‌ కో' డీలా పడింది. సమాజ్‌వాది పార్టీలో రోజుకో మలుపు తిరగుతున్న కుమ్ములాటలు ఎన్నికల తేదీలు వచ్చిన నేపథ్యంలో సర్దుకుంటాయని భావిస్తున్నారు. 
పార్టీ సింబల్‌ సైకిల్‌ కోసం ఇరువర్గాలు ప్రయత్నాలు 
మరోవైపు పార్టీ సింబల్‌ సైకిల్‌ కోసం ఇరువర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఎస్పీలో 229 మంది ఎమ్మెల్యేలకు గాను 212 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు, 56 మంది ఎమ్మెల్సీలు అఖిలేష్‌కు మద్దతుగా ఉన్నారని రాంగోపాల్‌ యాదవ్‌ తెలిపారు. పార్టీపై పట్టు సాధించిన ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. తాము సాధించిన 'అభివృద్ధి'ని చూపి, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది అఖిలేష్‌ పంతంతో వున్నారు. 
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీకి 224 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎస్పీకి ఓటింగ్‌ శాతం 29.13గా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఎస్‌పికి 80 మంది ఎమ్మెల్యేలున్నారు. బిఎస్‌పికి ఓటింగ్‌ శాతం 25.91గా ఉంది. బిజెపికి 47 మంది ఎమ్మెల్యేలుండగా...15 శాతం ఓట్లున్నాయి. కాంగ్రెస్‌కు 28 మంది ఎమ్మెల్యేలుండగా ఓటింగ్‌శాతం 11.65గా ఉంది. ఇతరులు 24 మంది ఉన్నారు.

 

21:14 - January 7, 2017

హైదరాబాద్ : కొత్త భూసేకరణ చట్టం విషయంలో.. 123 జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా...తదుపరి కార్యాచరణపై సర్కార్‌ పావులు కదుపుతూనే ఉంది. అందులో భాగంగా.. కొత్త భూ సేకరణ బిల్లును సాధ్యమైనంత త్వరలోనే రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించింది. ఇంతకీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారా..లేక తిరస్కరిస్తారా..అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 
బిల్లును వెనక్కి పంపుతారా..? లేక ఆమోదిస్తారా..? 
123 జీవో ద్వారా భూములు సేకరించవద్దని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా.. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్ర చట్టసభల ఆమోదం పొందిన కొత్త భూసేకరణ బిల్లును త్వరగా..రాష్ట్రపతికి పంపించేలా గవర్నర్‌ను కోరాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని ప్రతిపక్ష కాంగ్రెస్‌.. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి తన విశేష అధికారాలను వినియోగించుకుని బిల్లును వెనక్కి పంపుతారా..? లేక ఆమోదిస్తారా..? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 
గుజరాత్‌ తరహా చట్టం..!
హైకోర్టు తాజా ఉత్తర్వుల తర్వాత కూడా 2013 చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా... 123 జీవో చట్ట బద్ధత గురించి ముందుగానే ప్రభుత్వం ఊహించిందని, అందుకే గుజరాత్‌ తరహా చట్టం తీసుకురావాలని నిర్ణియించినట్లు తెలుస్తోంది. 123  జీవోలోని అంశాలే కొత్త బిల్లులో ఉన్నందున.. ఒకవేళ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందినా దాన్ని సవాల్‌ చేసే యోచనలో రైతులు ఉన్నారు. ఇప్పటికే కొందరు సీనియర్‌ న్యాయవాదులు దీనిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
నిర్వాసితుల హక్కులు కాలరాసే విధంగా కొత్త చట్టం 
2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న సామాజిక ప్రభావ మదింపు, గ్రామసభల ఆమోదం లేకుండానే భూములు కొనుగోలు చేసే అధికారం.. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీలకు అప్పగించే విధంగా కొత్త బిల్లులో నిబంధన చేర్చారు. భూసేకరణ చట్టంలో నిర్వాసితులకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కొత్త చట్టం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నిర్వాసితులు, భూమి లేని నిరుపేదలు, చేతివృత్తులు, గిరిజనులకు.. షెడ్యూలు 2, 3 లో పూర్తి సౌకర్యాలను కల్పించకుండా తప్పించుకునేందుకు  కొన్ని నిబంధనలను చేర్చిందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పునరావాసం, భూమికి భూమి, ఉపాధి, ఉద్యోగం వంటి అంశాల నుంచి తప్పించుకునేందుకే కొత్త చట్టం రూపొందించిందని, భూములు కోల్పోయే వారికి చట్టంలో పేర్కొన్న విధంగా 4 రెట్లు కాకుండా...మూడు రెట్ల నష్టపరిహారం మాత్రమే చెల్లించడానికి  ఈ చట్టాన్ని రూపొందించిందని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
సేకరించిన భూముల వ్యవహారంపై ప్రభుత్వం మల్లగుల్లాలు 
రైతులతో ఒప్పందాల పేరుతో 123 జీవో కింద ఇప్పటికే  సేకరించిన భూముల వ్యవహారంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ కింద ఇప్పటికే 7 వేల ఎకరాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతకం కింద 9 వేల ఎకరాలను సేకరించింది. 123 జీవోపై హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల నేపధ్యంలో ఇప్పటికే సేకరించిన భూములకు కూడా 2013 భూసేకరణ చట్టం వర్తింప చేయాలని రైతులు, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఇప్పటికే సేకరించిన భూములపై సర్కారు 3,000 కోట్లు చెల్లించింది. వీటిని మధ్యంతర ఉత్తర్వుల నుంచి మినహాయించాలని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌  హైకోర్టులో వాదించారు. అయితే ఈ అంశంపై తుది తీర్పులోనే కోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 123 జీవో కింద ఇప్పటికే జరిగిన లావాదేవీలు చెల్లకపోతే ఏమి చేయాలన్న తర్జన భర్జన జరుగుతోంది. భూసేకరణ వ్యవహారం న్యాయ వివాదాల్లో చిక్కుకోవడంతో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం ప్రభుత్వం సేకరించాలనుకున్న లక్ష ఎకరాల లక్ష్యానికి ఆదిలోనే అంతరాయం ఏర్పడినట్లయింది.  

 

తెలంగాణలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు

హైదరాబాద్ : తెలంగాణలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు నియామకం అయ్యారు. 12 జిల్లాల్లోని 437 పంచాయతీలకు విలేజ్ పోలీసు ఆఫీసర్లు నియామకం అయ్యారు. వారానికి 3 రోజులు గ్రామాల్లో పోలీసు ఆఫీసర్లు ఉండేలా ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజలతో సంబంధాలు ఇతర వ్యవహారం కోసం..విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు డీఐజీ అకున్ సబర్వాల్ తెలిపారు. 

 

20:49 - January 7, 2017

యాక్టర్, సింగర్ స్నిగ్ధతో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపింది. తను నటించిన సినిమాలు, పాటల గురించి వివరించింది. పలు పాటలు పాడి వినిపించింది. స్నిగ్ధ స్నేహితురాలు శ్వేత ప్రాంక్ కాల్ చేసి మాట్లాడారు. స్నిగ్ధ తెలిపిన మరిన్ని ఆసక్తరమైన విషయాలను వీడియోలో చూడండి.. 

20:28 - January 7, 2017

కాకినాడ జగన్నాథపురంలో దారుణం

పశ్చిమగోదావరి : కాకినాడ జగన్నాథపురంలో దారుణం జరిగింది. తల్లి పసికందును ఉప్పుటేరులో విసిరేసింది. పసికందు మృతి చెందింది. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

20:19 - January 7, 2017

చిత్తూరు : వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారి దేవస్థానం ముస్తాబైంది. నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. తిరుమలలో వైకంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈమేరకు 10 టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఏకాదసి, ద్వాదర్శి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. శ్రీవారిని లక్షా 70 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందన్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులకు కాఫీ, టీ, అన్నప్రసాదాల సరఫరా చేస్తామని చెప్పారు.

 

20:15 - January 7, 2017

విజయవాడ : సమ న్యాయాన్ని, రాజ్యాంగం హక్కులను రక్షించాల్సిన ప్రభుత్వం..పురుషాధిక్యత భావజాలంతో మహిళల్ని బలి పశువుల్ని చేస్తున్నాయని ఐద్వా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి ఆరోపించారు. వారధి సోషల్ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని జనశిక్షణా సంస్థాన్‌ కార్యాలయంలో మహిళల వెనుకబాటు తనం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉండడమే కాకుండా వారిపై దాడులు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల డ్రస్సుల గురించి వ్యాఖ్యానించిన మంత్రి పరమేశ్వర్‌కు మంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. అలాంటి దోషుల మీద కఠినమైన శిక్షలు తీసుకోవడానికి నిర్భయ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

20:08 - January 7, 2017

నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణల కేసులో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో జరిగిన విచారణకు హాజరయ్యారు. గోవర్దన్‌రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి తనపై అవినీతి ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తనను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించాలని కోరుతూ గోవర్దన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 వరకు గోవర్దన్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని నెల్లూరు జిల్లా పోలీసులు ఆదేశించిన హైకోర్టు, ఠాణాలో జరిగే విచారణకు హాజరు కావాలని కోరింది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ గోవర్దన్‌రెడ్డి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో జరిగిన విచారణకు హాజరయ్యారు.

 

19:27 - January 7, 2017

కృష్ణా : విజయవాడ 10టీవీ కార్యాలయంలో నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పలు పార్టీల నేతల సమక్షంలో కొత్త క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిరంతరం ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్తున్న 10టీవీ.. మరింత ముందుకు సాగాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 10టీవీ యాజమాన్యం, సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు. 

19:24 - January 7, 2017

శ్రీకాకుళం : ఉద్ధానం కిడ్నీ సమస్యలపై ప్రభుత్వాన్ని తట్టి లేపడంలో జనసేన సక్సెస్‌ అయింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విధించిన డెడ్‌లైన్‌పై ఏపీ ప్రభుత్వం స్పందించి.. సమస్యను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 
ఉద్దానం బాధితులపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 
శ్రీకాకుళం జిల్లాలో ఏళ్ల తరబడిగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యపై..ప్రభుత్వాన్ని తట్టి లేపడంలో... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు. మొన్న బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన ఆయన..స్వయంగా బాధితులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలని టీడీపీ సర్కార్‌కు డెడ్‌లైన్‌ విధించారు. దీంతో ఉద్దానం బాధితులపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
సమస్యలపై జనసేన పోరాటం : పవన్ కళ్యాణ్ 
ఉద్దానం కిడ్నీ రోగుల విషయంలోనే కాకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా అందుకు జనసేన పోరాడుతూనే ఉంటుందని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. కిడ్నీ బాధితుల సమస్య తీవ్రత జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కంటే మెరుగ్గా.. సీఎం చంద్రబాబుకు అర్థమైందని ట్విట్టర్‌లో  పేర్కొన్నారు. ఉద్దానం బాధితుల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశం ఉండాలని పిలుపునిచ్చారు. 
సానుకూల స్పందన రావడంపై పవన్‌ హర్షం 
ఉద్దానం బాధితులపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంపై పవన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని పవన్ ధీమా వ్యక్తంచేశారు. మొత్తానికి కిడ్నీ వ్యాధి సమస్యపై స్పందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన జనసేనకు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 

19:19 - January 7, 2017

విజయవాడ : ఖైదీ నెంబర్‌ 150 సినిమా ప్రీరిలీజ్‌ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అడుగడుగున చిరంజీవికి ఘన స్వాగతం పలికారు. చిరంజీవికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు అభిమానులు పోటీ పడ్డారు. చిరంజీవి ప్రతి ఒక్కరికీ అభివాదం చేశాడు. దీంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండాపోయింది. 

 

నానక్ రాంగూడ భవనం కూలిన ఘటనపై నివేదిక

హైదరాబాద్ : నానక్ రాంగూడలో భవనం కూలిన ఘటనపై జెఎన్ టీయూ ఇంజినీర్లు పూర్తిస్థాయి నివేదికను ఇచ్చారు. అసంబద్ధ డిజైన్, పిల్లర్లు, పునాదిపై అధిక బరువు, బలహీన నిర్మాణమే భవనం కూలడానికి కారణమని ఇంజనీర్ల బృందం చెప్పారు. డిజైన్ కు మించి ఎక్కువ అంతస్తులు వేయడం వల్లే ప్రమాదం సంభవించిందని తెలిపారు. సివిల్ ఇంజినీర్లు, కార్పొరేట్ కన్సల్టెన్సీలు సూచించిన ప్రమాణాలు పాటించలేదన్నారు. డిసెంబర్ 8న నానక్ రాంగూడలో భవనం కూలి 11 మంది మృతి చెందారు. 

 

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. రెండు క్యూ కాంప్లెక్స్ లో భక్తులతో 54 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నారాయణగిరివనంలోని తాత్కాలిక కంపార్టుమెంట్లు కూడా నిండటంతో మాడవీధుల్లోని గ్యాలరీలకు భక్తులను మళ్లించారు. 

విసన్నపేట తహశీల్దార్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు

కృష్ణా : విసన్నపేట తహశీల్దార్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కార్డుల్లో అవకతవకలు జరిగాయని ఆరోణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

18:45 - January 7, 2017
18:44 - January 7, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు దర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు మట్టి పనులు నిలిచిపోయాయి. ఆందోళనలో సీపీఎం నాయకులు మిడియం బాబురావు, మంతెన సీతారాం పాల్గొన్నారు. 500 లారీలను నిర్వాసితులు రోడ్డుపై నిలిపి వేశారు. శాశ్వత పరిష్కారం తెలిపే వరకు కదిలేది లేదని నిర్వాసితులు బైఠాయించారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళనను విరమించేదిలేదని తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితుల ధర్నా

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు దర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు మట్టి పనులు నిలిచిపోయాయి. 

18:28 - January 7, 2017

హైదరాబాద్ : అనాథ పిల్లల సంక్షేమం కోసం... డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. కారా ఫెస్టివల్ ఆర్ట్ షో- 2016 పేరిట
మాదాపూర్‌లో... గ్యాలరీ స్పేస్ మరియు సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్ ఈ షోను నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రతిభావంతులైన ఆర్టిస్టులు 24మంది తమ పెయింటింగ్స్‌ను గ్యాలరీలో ఏర్పాటుచేశారు. వీటిని విక్రయించగా వచ్చిన నగదును.. అనాథ పిల్లల సంక్షేమం కోసం ఖర్చుచేయనున్నట్టు రెడ్డీస్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. 

18:27 - January 7, 2017

హైదరాబాద్ : దుమ్ముగూడెంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిజనిర్ధారణ బృందంపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని టీడీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు అప్పగించిన ఆ ఏడుగురినిని.. విడిపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని వరవరరావు అన్నారు. చత్తీస్‌గఢ్‌లో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని.. టీడీఎఫ్‌ సభ్యులను విడుదల చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఈనెల 11న బహిరంగ సభ,.. 21న ఇందిరాపార్క్‌ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నట్లు వరవరరావు తెలిపారు. 

 

5 ఐఐటీలకు డైరెక్టర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ : దేశంలోని 5 ఐఐటీలకు డైరెక్టర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

17:43 - January 7, 2017

జనగాం : దళితులు, గిరిజనుల పట్ల కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని సీపీఎం మహాజన పాదయాత్ర బృందం సభ్యుడు జాన్ వెస్లీ అన్నారు. జనగాంలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈమేరకు 10టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హామీలన్నింటినీ తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. రూ.24 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులను మిషన్ కాకతీయకు దారి మళ్లించారని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దొంగలాగా సభ నుంచి పారిపోయాడని ఘాటుగా విమర్శించారు. దళితులు గ్రామాలకు దూరంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలు, దోపిడీదారులు పాలకులుగా ఉంటే దళితులు, గిరిజనులు, మైనార్జీలు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగదన్నారు. సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఉపాధి కల్పన, శిక్షణ జేడీ ఇంటిపై ఏసీబీ దాడులు

విజయవాడ: ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగంపై రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ జేడీ ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. గోపురం ముని వెంకటనారాయణ, బంధువుల ఇళ్లలో ఒకే సారి 7 చోట్ల ఏసీబీ డీజీ ఠాకూర్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో బ్యాంక్ ఖాతాల్లో రూ.26లక్షల నగదు, ఇంకా నాలుగు బ్యాంక్ లాకర్లను ఏసీబీ తెరవనుంది. హైదరాబాద్ కొత్తపేటలోని వెంకటరమణ నివాసంలో రూ.25లక్షల నగదు, కిలో బంగారాన్ని గురించారు. పట్టుబడ్డ నగదులో రూ.22లక్షల విలువైన 2 వేలనోట్లు ఉన్నాయి.

17:24 - January 7, 2017

ఉత్తరప్రదేశ్ : అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదనే వుంది. అఖిలేష్‌, మాయావతి, బిజెపి మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఈ మూడు పార్టీలకు ఎన్ని బలాలున్నాయో అన్ని బలహీనతలూ వెన్నాడుతున్నాయి. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ ది కీలకపాత్ర. అత్యధిక సంఖ్యలో లోక్ సభ స్థానాలుండడమే ఇందుకు కారణం. 403 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ అతిపెద్ద రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 202 స్థానాలు గెలుచుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం అధికారంలో వున్న సమాజ్ వాదీ పార్టీకి 229 స్థానాలున్నాయి. బిఎస్పీకి 80, బిజెపికి 41, కాంగ్రెస్ కి 29 స్థానాలున్నాయి. అయితే, గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గాలి బలంగా వీయడంతో బిజెపి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 
కుటుంబ కలహాలు.. అఖిలేష్ కు మైనస్ పాయింట్ 
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి క్లీన్ ఇమేజ్ వున్నప్పటికీ కుటుంబ కలహాలు పెద్ద మైనస్ పాయింట్ గా మారుతున్నాయి. ఎన్నికల ముంగిట్లో గత నాలుగైదు నెలలుగా రచ్చ కెక్కుతున్న కుటుంబ కలహాలు ఆ పార్టీ పరువు తీస్తున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్, ఆయన తండ్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య తలెత్తిన విబేధాలు రోజుకో రకంగా రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరూ సైకిల్ గుర్తు తమదేనంటూ ఎన్నికల కమిషన్ ఆశ్రయించడంతో జనవరి 9లోగా మెజార్టీ నిరూపించుకోవాలంటూ రెండు వర్గాలకీ నోటీసులు జారీ చేసింది ఈసీ.  ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 11 మొదటి విడత పోలింగ్ మొదలైతే, మార్చి 8న చివరి విడత ముగుస్తుంది. ఈలోగా సమాజ్ వాదీ పార్టీ విబేధాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో. ఇప్పటికైతే, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అఖిలేష్ ఆధిపత్యమే స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ కలహాలతో పాటు ఇంకా అనేక అంశాలు అఖిలేష్ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. పరిపాలనాపరంగా, క్రిమినల్స్ ను అణచివేసే విషయంలో అఖిలేష్ కి మంచి పేరున్నా, ఆయన మంత్రివర్గ సహచరులంతా సచ్ఛీలురు కారు. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. యాదవ్ లు, ముస్లింలు, కుర్మిలలో కొంతభాగం, రాజపుట్ లు తమకు ఓటేస్తారన్న నమ్మకం అఖిలేష్ వర్గంలో కనిపిస్తోంది.  కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరితే కనీసం 300 స్థానాలు గెల్చుకుంటామన్నది అఖిలేష్ ధీమా.  నేరచరితులను దూరంగా పెడతారన్న పేరుకు అఖిలేష్ కు ఎంత వరకు ఓట్ల వర్షం కురిపిస్తోందో చూడాలి.
సీఎం అభ్యర్థి లేకపోవడం బిజెపికి మైనస్ పాయింట్ 
2012 అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బిజెపి 2014 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని నెంబర్ 1గా నిలిచింది. 2012లో కేవలం 15.3శాతం ఓట్లు మాత్రమే సాధించిన బిజెపి 2014 ఎన్నికల్లో 42.63శాతం ఓట్లు పొంది, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్ ఎస్ ఎస్ అండదండలు, అమిత్ షా వ్యూహాలు, బలమైన కేడర్ బిజెపికి అనుకూలించే అంశాలు. అయితే, ముఖ్యమంత్రి అఖిలేష్ ను ఎదుర్కోగలిగే బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ఉత్తరప్రదేశ్ లో బిజెపికి పెద్ద మైనస్ పాయింట్. మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ, రాజ్ నాధ్ సింగ్ కుమారుడు పంకజ్ కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, అఖిలేష్ కి సరితూగలేరు. నోట్ల రద్దు వ్యవహారం బిజెపి నెత్తిన పాలు పోస్తుందో పుట్టి ముంచుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం. 
బీఎస్పీకి ప్రధాన ఆకర్షణ శక్తి మాయావతే.. 
సమాజ్ వాదీ పార్టీ కుటుంబ కలహాలు, బిజెపి బలహీనతలు తమకు లాభిస్తాయన్నది బీఎస్పీ ఆశ. ఈ పార్టీకి ప్రధాన ఆకర్షణ శక్తి మాయావతే. రాజకీయ వ్యూహాల్లో ఆమెది ప్రత్యేక శైలి. బ్రాహ్మణులకు అత్యధిక సీట్లిచ్చి, ఒకసారి అనూహ్య విజయం సాధించిన నేర్పరి. దళితులతో పాటు బ్రాహ్మణ, ముస్లిం ఓట్ల మీద ఆమె ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.  100 మంది అభ్యర్థుల పేర్లతో విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ లో 34 మంది ముస్లింలకు టిక్కెట్లివ్వడం ఇందుకు నిదర్శనం. అయితే ఆమె అధికారంలో వున్నప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించారన్న పేరున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకుండా, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్, బిజెపి ఈ రెండు పార్టీలలో ఎవరి మద్దతైనా పొందగల నేర్పరి మాయావతి.
శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తోన్న కాంగ్రెస్  
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తోంది. చానాళ్ల క్రితమే షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేసి, బ్రాహ్మణ ఓట్లకు గాలం వేసింది. ఉత్తరప్రదేశ్ లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా వుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా దూసుకురాగలిగే బలమైన నాయకుడెవరూ ఆ పార్టీకి లేరు. సీనియర్ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఇవన్నీ కాంగ్రెస్  పార్టీకి శాపాలే. రాహుల్, సోనియా గాంధీ నిర్వహించే రోడ్ షోలు, బహిరంగ సభలే ఆ పార్టీకి పెద్ద దిక్కు. అఖిలేష్ తో పొత్తు పెట్టుకుంటే ఎన్నోకొన్ని సీట్లు వస్తాయన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

 

ప్రారంభమైన ఆల్ ఇండియా ఫారెస్టు స్పోర్ట్స్ మీట్‌

హైదరాబాద్:భాగ్యనగరం ఆల్ ఇండియా ఫారెస్టు స్పోర్ట్స్ మీట్‌కు వేదికైంది. గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో 23వ ఆలిండియా ఫారెస్టు స్పోర్ట్స్ మీట్‌ను మంత్రులు కేటీఆర్, జోగు రామన్న కలిసి ప్రారంభించారు.

ఆర్బీఐని అడ్డుపెట్టుకుని కేంద్రం అధికార దుర్వినియోగం:మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్: ఆర్బీఐని అడ్డుపెట్టుకుని కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పుడుతుందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుందని, తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఆర్బీఐ భారీగా కొత్త నోట్లు పంపుంతుందని పేర్కొన్నారు. నవంబర్ 9 తర్వాత ఎన్ని కొత్త నోట్లు ముద్రించారో ఆర్బీఐ వెల్లడించడం లేదని మర్రి మండిపడ్డారు. స.హ చట్టాన్ని ఆర్బీఐ అవహేళన చేస్తుందని విమర్శించారు.

16:51 - January 7, 2017

చిత్తూరు : తిరుపతిలో ఐదు రోజులుగా జరుగుతున్న ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ముగింపు దశకు చేరుకుంది. సైన్స్‌ కాంగ్రెస్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శను చూసేందుకు విద్యార్థులు వెల్లువలా తరలివస్తున్నారు. ఎగ్జిబిషన్‌ ఎంతో విజ్ఞానదాయకంగా, స్ఫూర్తినిచ్చేలా ఉందంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:47 - January 7, 2017

హైదరాబాద్ : ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ లో లేబర్ ఆండ్ ఎంప్లాయిమెంట్ శాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పని చేస్తున్న గోపురంముణి వెంకటనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు నిర్వహించారు. హైదరాబాద్ కొత్తపేటలోని తన ఇంటిలో సోదాలు నిర్వహించగా కళ్లు చెదిరే అస్తులు బయటపడ్డాయి. దాదాపు కిలో బంగారు ఆభరణాలు, నాలుగు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే భూమి పత్రాలు, రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతనికి సంబంధించిన తిరుపతి, విజయవాడ, కొత్తపేట, బోరబండలోని నివాసాలలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

16:34 - January 7, 2017

పశ్చిమగోదావరి : తమ సమస్యలను పరిష్కరించాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఆందోళనలో సీపీఎం నాయకులు మిడియం బాబురావు, మంతెన సీతారం పాల్గొన్నారు. ఆందోళనకారులు ప్రాజెక్టు పనులును నిలిపివేశారు. ఆందోళనలో సీపీఎం నాయకులు మిడియం బాబురావు, మంతెన సీతారం పాల్గొన్నారు. రోడ్డుపై లారీలను  నిలిపివేశారు. పోలీసులు ఆదోళనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:24 - January 7, 2017

గుంటూరు : సుదీర్ఘ విరామం తర్వాత అభిమానులను అలరించేందుకు చిరంజీవి సెంకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారని  సినీ నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పారు. ఖైదీ నెంబర్‌ 150 విదుడలకు ముందు అభిమానులు, ప్రజల ఆశీస్సులు అందుకునేందుకు గుంటూరు జిల్లా హాయ్‌లాండ్‌కు రానున్నారు. వేడుకకు వెల్లువలా వస్తున్న అభిమానాలు క్రమశిక్షణతో మెలగాలని కోరారు. హాయ్‌లాండ్‌కు రాలేకపోతన్న ప్రజలు, అభిమానాలు నిరాశ చెందాల్సిన పనిలేదని, అందరూ కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశామని అరవింద్‌ చెబుతున్నారు. 

 

'ఖైదీ' ఫంక్షన్ లో అభిమానులపై లాఠీ ఛార్జి

గుంటూరు : హాయల్ లాండ్ వద్ద చిరు అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం150 మూవీ ఫ్రీ రిలీజ్ వేడుక సందర్భంగా బారికేడ్లను తోసుకుని లోపలికెళ్లేందుకు అభిమానులు యత్నించారు. అభిమానుల చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. హాయ్ లాండ్ నుండి ఎన్ ఆర్ ఐ ఆస్పత్రి వరకు ట్రాఫిక్ జాం అయ్యింది.

16:18 - January 7, 2017

నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టీజేఏసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతిపక్ష నేతల సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలో బోదన్‌, సారంగపూర్‌లోని చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 

16:14 - January 7, 2017

జగిత్యాల : పెద్ద నోట్లు రద్దు చేసిన 60 రోజులు పూర్తైనా బ్యాంకుల్లో డబ్బు అందుబాటులో లేక రైతులు అల్లాడుతున్నారు. రబీ సీజన్‌లో వ్యవసాయ పనులకు నదగు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు జగిత్యాలలో బ్యాంకుల మందు ఆందోళనకు దిగారు. రైతుల నిరసనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులకు అవసరమైన డబ్బును అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ఆర్ బీఐ, కేంద్ర ప్రభుత్వంపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేక ఇబ్బందులు రైతులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదు అందుబాటులో ఉంచాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితుల ధర్నా

ప.గో : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఆందోళన కారులు ప్రాజెక్టు పనులు నిలిపివేసి, రోడ్డుపై లారీలను నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకోడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బాబూరావు, మంతెన సీతారం పాల్గొన్నారు.

ఆప్ కాబ్ మొబైల్ ఏటీఎం సేవలను ప్రారంభించిన చంద్రబాబు

విజయవాడ: ఆప్ కాబ్ మొబైల్ ఏటీఎం సేవలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సహకార బ్యాంకింగ్ రంగంలో ఈ తరహా సేవలను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏపి అని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు తో రావి వెంకటేశ్వరరావు భేటీ

విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడుతో రావి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. గుడివాడ క్లబ్ కాల్పుల ఘటనపై రావి సీఎం కు వివరించారు. ఇక పై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని రావి సీఎం కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా ఉండాలని సూచించినా పట్టించుకోకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీలంక టూర్ కు బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు శ్రీలంక టూర్ కు బయలుదేరారు. ముందు చెన్నై వెళ్లి అక్కడ నుండి శ్రీలంక వెళ్లనున్నారు. రాత్రికి శ్రీలంక అధ్యక్షుడు ఏర్పాటు చేసిన విందుకు చంద్రబాబు హాజరు కానున్నారు.

15:43 - January 7, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో నిర్వహించిన 'జన్మభూమి...మా ఊరు' కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రజా సమస్యలను అడిగేందుకు వచ్చిన వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు బయటికి తోసేశారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ నేతలను బయటకు తోసేయమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పాడు. రౌడీలను పెట్టి జన్మభూమి నిర్వహిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే దుర్గేష్ ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:21 - January 7, 2017

శ్రీకాకుళం : ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై 10 టీవీ రాజీ లేని పోరాటం చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో 10 టివి క్యాలెండర్‌ ను మంత్రి  ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌతు శిరీష ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు పాల్గొన్నారు. 

 

బీసీ సంక్షేమ శాఖపై మంత్రి జోగు రామన్న సమీక్ష

హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖపై మంత్రి జోగు రామన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతు.. బీసీ గురుకులాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని, స్టడీ సర్కిళ్ల భవన నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, విదేశీ విద్యకు ఉపకార వేతన పథకాల్లో జాప్యంలేకుండా చూడాలని సూచించారు.

గన్నవరం నుండి హాయ్ ల్యాండ్ కు బయల్దేరిన చిరంజీవి

గుంటూరు : హైదరాబాదు నుంచి గన్నవరం చేరుకున్న మెగా ఫ్యామిలీ అక్కడ నుండి గుంటూరులోని చినకాకానిలో ఉన్న హాయ్ ల్యాండ్ కు బయల్దేరారు. అంతకు ముందు గన్నవరంలో చిరంజీవికి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం వద్దకు మెగా అభిమానులు భారీ ఎత్తున చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. సాదర స్వాగతం అందుకున్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనున్న హాయ్ ల్యాండ్ కు పయనమయ్యారు. ఆయన వెంట ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఇతర మెగా'స్టార్స్' ఉన్నారు.

 

15:13 - January 7, 2017

హైదరాబాద్ : ఖైదీ నెంబర్‌ 150 సినిమాపై హీరో పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హీరో చరణ్‌, వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రం ఖైదీ నెంబర్‌ 150 కావడం ఆనందంగా ఉందని ట్విట్టర్ లో అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రంలోని నటినటులకు.. సాంకేతిక నిపుణులకు.. ఆయన ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 

 

15:09 - January 7, 2017

కరీంనగర్‌ : జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల సర్పంచి రవి మృతి చెందాడు. 4రోజుల క్రితం ఓ ఏటీఎం వద్ద జరిగిన తోపులాటలో సర్పంచ్‌ రవిపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన సర్పంచ్‌ రవిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ సర్పంచ్‌ రవి మృతి చెందాడు. 

 

15:02 - January 7, 2017

వరంగల్‌ : జిల్లాలోని ఎనుమామూల మార్కెట్‌ సమీపంలో గోడకూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ మరో కూలీని  వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పల్లి మిల్లులో ఈ ఘటన జరిగింది. మృతులు సంగి స్వరూప, స్వరూపగా పోలీసులు గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించాల్సిఉందని తెలిపారు. 

 

కోల్‌కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

పశ్చిమబెంగాల్ : రాజధాని కోల్‌కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. 

15:00 - January 7, 2017

విజయవాడ : బాపట్ల సూర్యలంక బీచ్‌ రిసార్ట్స్‌లో నిన్న రాత్రి బాపట్ల టిడిపి ఎమ్మెల్సీ అన్నం సతీష్‌, అతని అనుచరులు రిసార్ట్స్‌ మేనేజర్‌పై దాడిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌,.గుడివాడ టిడిపి నేత రావి వెంకటేశ్వరరావు వెంటనే తనను కలవాలని ఇద్దరికి చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. 

 

సంక్రాంతికి 138 ప్రత్యేక రైళ్లు:దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీకి 138 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, కాగజ్‌నగర్, ఖాజీపేట నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరుకు అదనపు రైళ్లను ఏర్పాటు చేశారు. రద్దీ దృష్ట్యా ఈ నెల 19 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇంకా రద్దీ అధికంగా ఉంటే సాధారణ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక రైళ్లకు సైతం రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

దండేపల్లిలో సీఎస్ఐ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కృష్ణా :దండేపల్లిలో సీఎస్ఐ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన 8 మందికి అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

శ్రీలంక నేవీ అదుపులో 8మంది భారత జాలర్లు...

చెన్నై: నెడుంతీవు తీరంలో భారత జాలర్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. తమ జలాల్లోకి ప్రవేశించారంటూ 8 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక నావికాదళం ప్రకటించింది. జాలర్లకు సంబంధించిన ఒక బోటును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్

అనంతపురం : పుట్టపర్తి సత్యసాయి సమాధిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. 

తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: ముక్కోటి ఏకాదశి దర్శనం కోసం వచ్చే భక్తులతో వైకుంఠం-2లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కంపార్ట్‌మెంట్లలోని భక్తులను అనుమతిస్తున్నారు. ఏకాదశి దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో సాంబశివరావు తెలిపారు.

13:33 - January 7, 2017

జనగాం : ప్రత్యేక మైన డ్రస్ కోడ్ తో కళాకారులు చేస్తున్న నాట్యం చూపరులను ఉత్తేజులను చేస్తోంది. పాదయాత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. దళితుల కోసం పోరాడుతున్న తమ్మినేనిగారి ఆశయం పట్ల ఆకర్షితులమై 13 మంది కళాకారులం నాట్యం నేర్చుకుని పాదయాత్రలో పాల్గొంటున్నామని కళాకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలిపారు. జనగాం జిల్లా దాటేవరకూ తమ నాట్యాలద్వారా మద్ధతు తెలిపుతామని కళాకారులు పేర్కొంటున్నారు. సామాజిక, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణలో సీపీఎం పార్టీ తలపెట్టిన మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జనగాం జిల్లాలో పాదయాత్ర బృందానికి స్థానిక కళాకారులు నీరాజనం పడుతున్నారు. డప్పు దరువులతో పాదయాత్రకు మద్దతుగా పాల్గొంటున్నారు. పాదయాత్రలో పాల్గొనడం గర్వంగా ఉందంటున్న కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

13:30 - January 7, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వెనక పెద్దన్న పాత్ర ఉందా..? నోట్ల రద్దుకు అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికి తీతకు సంబంధం లేదా..? అసలు తెర వెనక నడిపించింది ఎవరూ..? తెరపైకి వస్తున్న కొత్త ప్రయత్నాలు దేనికి సంకేతం..? డిజిటల్‌ లావాదేవీలే లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు జరిగిందా..? అంటే అవుననే అంటున్నాయి సర్వే సంస్ధలు. ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌ విడుదల చేసిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నోట్ల రద్దు వెనుక పెద్దన్న హస్తం?
పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా దేశం అస్తవ్యస్తమైంది. ప్రజలందరూ రోడ్డుపాలయ్యారు. కనీస అవసరాలకు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల ముందు క్యూలో నిలబడి ప్రాణాలు విడిచారు. సామాన్యుడి నడ్డి విరిచిన పెద్ద నోట్ల రద్దు వెనక పెద్ద కుట్రే దాగి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా జరిగిన ఈ వ్యవహారంలో అగ్రరాజ్యం ప్రధాన పాత్ర పోషించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

'నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనం
అమెరికా లాభాపేక్ష కోసమే పెద్ద నోట్ల రద్దు జరిగిందని ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది. 'నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏడాది కాలంగా దీనిపై కసరత్తు జరిగినట్లు పేర్కొంది. డిజిటల్‌ లావాదేవీలపై భారత్‌ను మళ్లించేందుకు సంవత్సరం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పింది. అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవల్‌పమెంట్‌ పెద్ద నోట్ల రద్దులో కీలక పాత్ర పోషించిందని వెల్లడించింది.

భారత్‌లో ఆధార్‌ కార్డు డెవలప్‌ చేయడంలో కూడా అమెరికా పాత్ర
ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్‌ ఒబామా మధ్య స్నేహబంధంలో భాగంగా తమ విదేశాంగ విధానంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెద్ద పీట వేయనున్నట్లు ఒబామా గతంలో చెప్పారు. దీనిని ప్రధానంగా తెరపైకి తీసుకువస్తూ కథనం ప్రచురించింది. ఒబామా ప్రకటన నేపథ్యంలో రంగంలోకి దిగిన యుఎస్‌ఏయిడ్‌ వ్యూహాత్మకంగా పెద్ద నోట్ల రద్దులో కీలక పాత్ర పోషించిందని కథనంలో పేర్కొన్నారు. నగదు వ్యవస్థను రద్దు చేసి డిజిటల్‌ లావాదేవీలను పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భారత్‌లో ఆధార్‌ కార్డు డెవలప్‌ చేయడంలో కూడా అమెరికా పాత్ర ఉందని రిసెర్చ్‌ సంస్థ గుర్తు చేసింది.

భారత్‌ను మళ్లించేందుకు సంవత్సరం నుంచి ప్రయత్నాలు
ఆయుధాల రంగంలో ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్న అమెరికా తాజాగా ఐటీ, ఐటీ అధారిత రంగాలపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా ఆర్థిక రంగంపై పూర్తి పట్టు సాధించాలనే లక్ష్యంలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు జరిగిందని రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. తెరపైకి నల్లధనం, అవినీతి తీసుకువచ్చి.. తెర వెనక డిజిటల్‌ లావాదేవీలను డెవలప్‌ చేసి ఒక్కసారిగా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనేది అమెరికా టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా డిజిటల్‌ చెల్లింపుల పరిధిలోకి తీసుకురాగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్‌ పెరుగుతుంది. డిజిటల్‌ లావాదేవీల వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశాలపై పట్టు సాధించడమే కాకుండా అంతర్జాతీయ అర్థిక లావాదేవీలపై నిఘావేయడం అమెరికా గూఢచార వ్యవస్థకు సులభమవుతుంది.  

ధవళేశ్వరంలో జన్మభూమి కార్యక్రమం రసాభాస

రాజమండ్రి: ధవళేశ్వరంలో జన్మభూమి - మాఊరు కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రజా సమస్యలను అడిగేందుకు వచ్చిన వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వైసీపీ నేతలను బయటికి తోసేమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆదేశించారు. రౌడీలను పెట్టి జన్మభూమి నిర్వహిస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దుర్గేష్ ఆరోపించారు.

తిరుమలలో పెరుగుతోన్న భక్తుల రద్దీ....

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠ రెండో క్యూకాంప్లెక్స్ లోని క్యూలైన్లు నిండిపోయాయి. అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గాన తిరుమలకు కాలినడకన భక్తులు భారీ చేరుకుంటున్నారు.

ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేక్షించం:చంద్రబాబు

విజయవాడ : బాపట్ల ఎమ్మెల్సీ అన్నం సతీష్, గుడివాడ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనను కలవాలని ఇరువురికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేక్షించవద్దని ముఖ్య నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

13:23 - January 7, 2017

అమరావతి : ఏపీ రాజధాని గ్రామాల్లో మరోసారి భూసేకరణ సెగలు పుట్టించబోతోంది. అటు భూములు ఇచ్చేదిలేదని కొన్ని గ్రామాల రైతులు... ఇటు ఆరు నెలల్లోగా భూసేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నాయి.. భూసేకరణపై పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న సర్కారు దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు అడుగులు వేస్తోంది.

నేలపాడు, కృష్ణాయపాలెం, ఐనవోలు, అబ్బరాజు పాలెం, బోరుపాలెం
అమరావతి నిర్మాణానికి ఈ జూన్‌లోగా భూసేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ పెట్టుకుంది.. భూములివ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. ఇప్పటికే భూసేకరణకోసం నేలపాడు, కృష్ణాయపాలెం, ఐనవోలు, అబ్బరాజు పాలెం, బోరుపాలెం గ్రామాల్లో అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు.. జిల్లా కలెక్టర్, రెవెన్యూ , సీఆర్డీఏ అధికారులు ఈ పనుల్లో బిజీబిజీగాఉన్నారు..

29 గ్రామాల్లో 33,500 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం
రాజధానికోసం 29 గ్రామాల్లో33,500 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించింది.. ఇక్కడ ఇంకా 4వేల 150 ఎకరాలను సేకరించాల్సిఉంది.. ఈ భూముల్ని ఇచ్చేదిలేదంటూ రైతులు తేల్చిచెప్పడంతో భూసేకరణకు బ్రేక్‌ పడింది.. రైతుల్ని బుజ్జగించి ఒప్పించాలని అధికారులు ప్రయత్నించినా అన్నదాతలు ఒప్పుకోలేదు. రాయపూడి, ఉద్దండ్రాయినిపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది.. భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పిన రైతన్నలు ఇంకా ఆ భూముల్లో వ్యవసాయం కొనసాగిస్తూనేఉన్నారు.... ఈ రైతులు తమ నిర్ణయం మార్చుకుంటారని రెండేళ్లపాటు వేచిచూసిన సర్కారు... ఇక భూసేకరణలో ఆలస్యం చేయొద్దని భావిస్తోంది.. తాజాగా నాలుగు గ్రామాలకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదలచేసింది.. 60రోజుల్లోపు ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు స్వీకరిస్తారు..

ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, భేతపూడి
అయితే మొదటి దశ నోటిఫికేషన్‌ గ్రామాల్లో భూసేకరణకు పెద్దగా అడ్డంకులు రావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, భేతపూడి గ్రామాలనుంచి భూసేకరణకు ఎక్కువ వ్యతిరేకత వస్తోంది.. ఈ నాలుగు గ్రామాలనుంచి సుమారు 2వేల 500ఎకరాల భూమిని తీసుకోవాల్సిఉంది.. ఈ భూముల్ని ఎట్టిపరిస్థితిల్లో ఇవ్వబోమంటూ రైతులు మొదటినుంచీ ఆందోళన చేస్తూనేఉన్నారు.. మూడుపంటలుపండే తమ భూములు తీసుకోవడం చట్టవ్యతిరేకమంటూ సుప్రీంకోర్టుతోపాటు... జాతీయ హరిత ట్రిబ్యునల్‌నుకూడా ఆశ్రయించారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రెండుసార్లు పర్యటించారు.. పవన్‌కు తమ బాధల్ని చెప్పుకున్న రైతన్నలు.... తమ చావైనా బతుకైనా ఈ భూముల్లోనే అని స్పష్టం చేశారు..

పూర్తయిన సామాజిక అంచనాకమిటీ అధ్యయనం
రైతుల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వంమాత్రం భూసేకరణపై పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.. భూసేకరణకుముందు చేపట్టాల్సిన సామాజిక అంచనాకమిటీ అధ్యయనం పూర్తయిందని తెలుస్తోంది.. ఎలాంటి హడావుడిలేకుండా... సామాజిక ప్రభావ అంచనాకమిటీ గ్రామాల్లో పర్యటించిందని... సర్కారుకు నివేదికకూడా అందించిందని సమాచారం..... రైతులనుంచి పెద్ద ఎత్తున నిరసనలు రాకుండా ముందు చిన్న గ్రామాలు, తక్కువ భూమిఉన్న ప్రాంతాల్లో భూమిని సేకరించాలని చూస్తోంది.. ఆ తర్వాత మిగతా గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తోంది.. అన్ని గ్రామాల్లో ఈప్రక్రియ పూర్తయ్యాక ఉండవల్లిలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేయాలని ప్లాన్‌ చేస్తోంది.. అప్పుడుకూడా ఆ గ్రామాల్లో రైతుల ఆందోళన చేస్తే పరిస్థితినిబట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది.. ప్రభుత్వం సంధిస్తున్న ఈ ఆఖరి భూసేకరణఅస్త్రం ఫలిస్తుందా? రైతులపోరాటం గెలుస్తుందా? అనేది కొద్ది నెలల్లో తేలనుంది..

ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇవ్వాలి: మధు

విజయవాడ :ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని, సీఎం ప్రకటనపై తక్షణమే కార్యాచరణ చేపట్టాలన్నారు. కిడ్నీ వ్యాధికి గల కారణాలు, పరిష్కారాలకు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసి, నిధులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఖాళీగా ఉన్న నెఫ్రాలజీ పోస్టులను భర్తీ చేయాలని, ఉద్దానం పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని మధు కోరారు. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందించాలని మధు డిమాండ్ చేశారు.

అభిమానులు హద్దు మీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు:ఏపీ డీజీపీ

విజయవాడ : చిరంజీవి, బాలకృష్ణ సినిమాల విడుదల సందర్భంగా ఏపీ డీజీపీ సాంబశివరావు సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభిమానులు హద్దు మీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో హీరోలను కించపరిస్తే సహించమని, బ్యానర్లు, పోస్టర్లు చించితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వరంగల్ లో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ సమీపంలో పల్లి మిల్లులో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం చంద్రబాబుకు సీఎం పన్నీర్ సెల్వం లేఖ

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం లేఖ రాశారు. చెన్నై తాగునీటి అవసరాలకు తెలుగుగంగ పథకం ద్వారా కృష్ణా జలాలు విడుదల చేయాలని ఆ లేఖ లో పన్నీర్ సెల్వం కోరారు. తెలుగు గంగ పథకం కింద కండలేరు జలాశయానికి నీటిని విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

13:08 - January 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వైకుంట ఏకాదశి ఉత్తరద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముక్కోటి ఏదాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలు, ప్రత్యేక పూల అలంకరణతో శోభయమానంగా తీర్చిదిద్దారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆగమ శాస్త్రయుక్తంగ ఉత్తరముఖ ద్వారా దర్శనం రేపు తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం, అందులోనూ ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారనే అంచనాలతో దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.  

13:02 - January 7, 2017

ఆదిలాబాద్ : కోడి పందేలకు కోస్తా ప్రాంతం పెట్టింది పేరు. సంక్రాంతి సీజన్‌ వచ్చిందంటే పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగ్‌లు పెడుతారు. కానీ ఇక్కడ మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా కోడి పందేలకు కేరాఫ్‌గా మారుతోంది. కాకులు దూరని కారడవిలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. సంవత్సరం పొడువునా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.

తెలంగాణాకు పాకిన కోడిపందేల సంస్కృతి
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రాంతం అది. అడవుల జిల్లాలుగా పేరుగాంచిన వెనుకబడిన ప్రాంతాలు అవి. ఇక్కడ పల్లెల అభివృద్ధి ఊసే ఉండదు. అలాంటి ప్రాంతంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కోడి పందేలను, పందెం కోళ్లను సినిమాలో తప్ప నేరుగా చూడని ఈ ప్రాంతంలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి గ్రామాల్లో కోడి పందేలు జరుగుతున్నాయి.

కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కోడి పందేలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని పది గ్రామాలు, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలో గోదావరి సరిహద్దు పరివాహక ప్రాంతాల గ్రామాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో కోడి పందేలు సాగుతాయి. గ్రామంలోని యువకులు, పెద్దలు పనులు ఎగొట్టి పందెం కాస్తున్నారు. పండగ సందర్భాల్లో, దసరా, సంక్రాంతి సీజన్లలో పందెం రాయుళ్ల హవా కొనసాగుతుంది. గ్రామాల్లోని యువకులు, పెద్దలు ఇదే పనిగా పందేలకు బానిస కావడంతో సంసారాలు గుల్లవుతున్నాయి. కూలీ డబ్బులు సైతం కోడి పందేల్లో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు.

సంవత్సరం మొత్తం పందెం కాస్తున్న వైనం
పోలీసులు కోడిపందేల స్థావరాలపై అప్పుడప్పుడు దాడులు చేసి కేసులు పెట్టినా.. ఆ గ్రామాల్లో కోడిపందేల సంస్కృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని గోదావరి నది ప్రాంతంలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు ఆటోలు, ఆరు బైకులు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.సంక్రాంతి సీజన్‌ నేపథ్యంలో ఈ కోడి పందేల స్థావరాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కోడి పందేలను అడ్డుకొని గ్రామస్తులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కోమటిరెడ్డి నోరు తెరిస్తే నిత్యం అబద్ధాలే:గుత్తా

నల్గొండ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి నోరు తెరిస్తే నిత్యం అబద్ధాలే చెప్తారని విమర్శించారు. తాను టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న రోజు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే మద్దతిస్తున్నానని గుత్తా తెలిపారు. డిండి రిజర్వాయర్‌కు నీటి విడుదలను మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. దీనిపై నల్లగొండ కాంగ్రెస్ నేతలు స్పందించాలని కోరారు.

క్యాబ్ డ్రైవర్ల దీక్ష భగ్నం..

హైదరాబాద్ : ఈసీఐఎల్ వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం ఉబర్‌,ఓలా క్యాబ్‌ డ్రైవర్లు చపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఓలా క్యాబ్‌ డ్రైవర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు శివను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మ‌రోవైపు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేవ‌ర‌కు పోరాడ‌తామ‌ని క్యాబ్ డ్రైవ‌ర్లు అంటున్నారు.

12:57 - January 7, 2017

హైదరాబాద్ : టీం కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్‌గా తాను దాటిగా ఆడి విక్టరీ సాధిస్తానని.. అలా అని ప్రతిసారి తానే ఆడాలంటే సాధ్యం కాదు. టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పిరిట్‌తో ఆడితేనే గెలుపు సొంతమవుతుంది. ఇదంతా ఏదో క్రికెట్‌ టీం జట్టు గురించి అనుకుంటే పొరపాటే. అసెంబ్లీ సమావేశాల్లో తమ టీం ఫెర్ఫామెన్స్‌పై పెద్దలు జానారెడ్డి విశ్లేషణ చేశారు. అదేంటో వాచ్‌ దిస్‌ స్టోరీ

తనదైన స్టైల్లో స్పందించిన జానారెడ్డి
అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులపై ప్రధాన ప్రతిపక్ష నేత జానా రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన జానా చాలా అంశాలను ప్రస్తావించారు. సమావేశాలకు వేదాంతం, క్రికెట్, చ‌రిత్రను జోడించి త‌న‌దైనా శైలిలో విశ్లేషించారు జానారెడ్డి. స‌భ‌లో తాను దూకుడు వ్యవ‌హ‌రించ‌డం లేద‌ని పార్టీలో వినిపిస్తున్న గుస‌గుస‌ల‌పై జానా ప‌దునైన సెటైర్లు విసిరారు. జ‌ట్టు ఆప‌ద‌లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి టీంను గెలిపిస్తానన్న ఆయన.. అలా అని ప్రతిసారి తానే బ్యాటింగ్ చేయాలంటే స‌రికాద‌న్నారు. జ‌ట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత‌గా ఆడాల‌ని క్రికెట్ ను మిక్స్ చేసి చుర‌క‌లంటించారు.

వేదాంతం, భార‌తం, క్రికెట్ ను మిక్స్ చేసిన జానా
అంతేకాదు తాము స‌మావేశాల్లో ఎలా వ్యవ‌హ‌రించాల‌నే దానిపై మ‌హా భారతాన్నికూడా జోడించారు జానా. స‌భ‌లో తాము పాండ‌వుల‌మ‌ని దానిలో త‌న‌ది ధ‌ర్మరాజు పాత్ర అని వివరించిన జానారెడ్డి.. మిగతా ఎమ్మెల్యేలు ఒకరు భీముడిలా సర్కారుపై గధ ఎత్తాలని, మరొకరు అర్జునిడిలా మాటల బాణాల‌ను సందించాల‌ని అన్నారు. అవ‌స‌ర‌ం వస్తే తాను భార‌తంలో ధ‌ర్మరాజులా వ్యవ‌హ‌రిస్తానన్నారు. మిగతా సభ్యులు త‌మ పాత్రల‌ను స‌మ‌ర్థవంతంగా పోషించాల‌ని చ‌మ‌త్కరించారు.

ఎర్రరొయ్యల కోసం ప్రాజెక్టులా? :జానారెడ్డి
జానారెడ్డి స‌ర్కార్ ను కూడా వ‌ద‌ల‌లేదు. స‌భ‌లో సిఎం కెసీఆర్ వ్యవ‌హ‌రిస్తున్న తీరుపై ఆయ‌న ఘాటైన విమ‌ర్శలు చేశారు. ఎర్రరొయ్యల కోస‌మే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు క‌డుతున్నామ‌న్నట్లుగా సిఎం మాట్లాడ‌టాన్ని జానా తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. కెసీఆర్ మాటలు ఆశ్చర్యాన్నే కాదు అయోమ‌యానికి గురిచేస్తున్నాయ‌న్న జానా... తాను ఈ అంశాన్ని స‌భ‌లో లేవ‌నెత్తాల‌నుకున్నా త‌న‌ స్థాయి స‌రిప‌డ‌ద‌ని చెప్పుకొచ్చారు.

మంత్రులపై విరుచుకుపడ్డ జానారెడ్డి
ఇక మంత్రుల తీరును కూడా జానారెడ్డి త‌ప్పుబ‌ట్టారు. స‌మ‌యం సంద‌ర్భం లేకుండా నా తెలంగాణ బిడ్డల‌ని నా బిడ్డలను క‌డుపులో పెట్టుకుంటామ‌ని మంత్రులు సంబోధించ‌డంపై రుస‌రుస‌లాడారు. మాకు తెలంగాణ బిడ్డలే మేమేమ‌న్నా వారిని బ‌య‌ట పారేస్తున్నామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ‌న్నీ స‌భ‌లో ఏకిపారేయాల‌ని ఉన్నప్పటికీ త‌న స్థాయి స‌భ‌పై త‌న‌కున్న గౌర‌వం అడ్డొస్తుంద‌న్నారు జానా. మొత్తానికి జానా త‌న అనుభ‌వంతో వేదాంతం, చ‌రిత్ర, క్రికెట్ ను మేళ‌వించి విశ్లేషించ‌డంపై సొంత‌పార్టీ స‌భ్యులు జానారెడ్డిని పెద్దలు అని ఎందుకు అంటారో అర్థమ‌వుతోంది.

12:51 - January 7, 2017

విశాఖ : పెట్టుబడులు అన్నారు...పరిశ్రమలన్నారు.. ఒప్పందాలంటూ హడావిడి చేశారు. ఏడాదైనా...ఫ్యాక్టరీలు లేవు...సంస్థలు లేవు.. కాకి లెక్కలతో టీడీపీ ప్రభుత్వం కాలం వెళ్లదీసింది.. విశాఖవాసులకు అరచేతిలో వైకుంఠం చూపించింది.

గతేడాది విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులు
పారిశ్రామిక దిగ్గజాలు...వ్యాపారాల్లో నిష్ణాతులైనవారితో గత ఏడాది విశాఖలో చురుగ్గా సమావేశాలయ్యాయి. సీఐఐ సదస్సులు పేరుతో గతేడాది జనవరిలో మూడు రోజుల పాటు హాడావుడి సాగింది. ఈ సదస్సుల్లో కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి. నగరానికి భారీ పరిశ్రమలు రానున్నాయని..టీడీపీ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితే ఇప్పటి వరకూ ఒక్క పరిశ్రమ కూడా స్థాపన జరగలేదు. ఏపీ ప్రత్యేక హోదా వస్తుందని.. పెట్టుబడులు పెడితే తిరుగు లేదని బాబు చెప్పుకొచ్చారు..కానీ అది కాస్త బెడిసి కొట్టడంతో పరిశ్రమల స్థాపనకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.

సదస్సులో పాల్గొన్న 41 దేశాల ప్రతినిధులు
సీఐఐ సదస్సులో 41 దేశాల నుంచి సుమారుగా 16 వందల మంది హాజరయ్యారు. దీంతో 4 కోట్ల 76లక్షల విలువలైన ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకాలు కూడా చేశారు. అయితే సదస్సుల్లో ప్రకటించిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ట్రినా సోలార్‌ , రిలయన్స్‌ అధినేత అంబానీ రాంబిల్లిలో నిర్మించతలపెట్టిన నేవల్‌ షిప్‌ బిల్డింగ్‌ నేటికీ రాలేదు. అప్పటి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు కంపెనీలు వాటంతట అవే డ్రాప్‌ అయిపోయాయి. సదస్సులో జరిగిన ఒప్పందాలన్నీ పేరుకే పరిమితమయ్యాయి.

విశాఖలో ప్రారంభమైన పలు ఫార్మాకంపెనీలు
విశాఖలో కేవలం ఫార్మా కంపెనీలే తిష్ఠ వేస్తున్నాయి తప్ప... మాన్యుఫ్యాక్చర్‌ రంగ ప్రాధాన్యాన్ని పెంచే పరిశ్రమ ఒక్కటి రాలేదు. లారస్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పరవాడలో ఉన్న యూనిట్‌-వి రాంకీ బల్క్‌ డ్రగ్స్‌ ఫార్మా కంపెనీలు ప్రారంభించినట్టు జిల్లా పారిశ్రామిక సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. అలాగే అరబిందో ఫార్మా లిమిటెడ్‌ ప్లాట్‌ నెంబర్‌ 17ఎ, రాంకీ సెజ్‌ పరవాడలో రూ.159 కోట్ల అంచనాతో 500 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉంది. నేక్టో ఫార్మా, సిప్రా ల్యాబ్స్‌ తదితర కంపెనీలు అండర్‌ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అయితే చాలా కంపెనీలకు ప్రభుత్వం అక్రమంగా భూసేకరణ చేస్తూ ఇటు వ్యవసాయానికి..పరిశ్రమలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నారు. గతేడాది అత్యంత ఆర్భాటంగా నిర్వహించిన సదస్సుల్లో ఫలితం కనిపించకపోయినా.. మళ్లీ ఈ నెలలో 25 తర్వాత సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే పాత ఒప్పందాలు సంగతి ఏమిటో పెద్దలు చెప్పాల్సి ఉంది.  

బీఎస్పీ మూడో విడత అభ్యర్థులు వీరే...

యూపీ: రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను బీఎస్పీ నేడు ప్రకటించింది. ఇప్పటికే రెండు విడతల్లో రెండు వందల మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత మాయావతి నేడు తాజాగా మరో వంద మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 300 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను బీఎస్పీ ప్రకటించినట్లైంది. మిగతా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

దుండిగల్ పీఎస్ పరిధిలో ఆటోడ్రైవర్ హత్య...

మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతిరావ్ పూలే స్టేడియం సమీపంలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఆదిలాబాద్‌కు చెందిన అశోక్ కుమార్(40)గా గుర్తించారు.

12:28 - January 7, 2017

తొమ్మిది సంవత్సరాల తరువాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన 'ఖైదీ నంబ‌ర్‌ 150' సినిమా విడుద‌లకు సిద్ధ‌మ‌యిన సందర్భంగా సినీన‌టి, ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిరంజీవి అన‌గానే ముందుగా గుర్తొచ్చేది ఆయ‌న చేసే డ్యాన్సేన‌ని ఆమె అన్నారు. తాను ఆయ‌న‌తో క‌లిసి ముఠామేస్త్రీ, ముగ్గురు మొన‌గాళ్లు, బిగ్‌బాస్ సినిమాల్లో న‌టించాన‌ని అన్నారు. ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేసేట‌ప్పుడు డ్యాన్స్ చేసేట‌ప్పుడు చాలా కాంపిటీష‌న్‌గా అనిపించేద‌ని, ఆయ‌న‌తో చేసిన ప‌లు సాంగ్స్ చాలా హిట్ అయ్యాయ‌ని అన్నారు. 'ఖైదీ' సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో... ఈ సినిమా కూడా చిరంజీవికి అంత పేరు తీసుకురావాల‌ని తాను మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు రోజా తెలిపారు. 

సముద్రాల సర్పంచ్ రవి మృతి

సిద్ధిపేట : కోహెడ మండలం సముద్రాల సర్పంచ్ రవి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఏటీఎం వద్ద తోపులాటలో రవిపై ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాంత్ దాడిచేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు రవి మృతి చెందాడు.

ఏపీ ఎంసెట్ కన్వీనర్ గా జెఎన్టీయూ రిజిస్ట్రార్

తూ.గో : ఏపీ ఎంసెట్ 2017 కన్వీనర్ గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ సాయిబాబు ను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

రంగారెడ్డి : జిల్లా కలెక్టర్ కార్యలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు వ్యతిరేకంగా వీరు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జైపాల్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

12:12 - January 7, 2017

హైదరాబాద్ : ఉద్దానం బాధితుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉద్దానం బాధితుల క‌ష్టాలపై చంద్రబాబు స్పందించటం హర్షణీయమనీ..ఇది జనసేన పార్టీ తొలివిజయం అని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ బాధ్యత పట్ల అన్ని రాజ‌కీయ పార్టీలు స్పందిచాలని కోరారు.రాష్ట్ర‌ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప‌డిన‌ మొద‌టి అడుగుగా అభివ‌ర్ణించారు. నిస్స‌హాయులుగా ఉన్న బాధితుల ప‌క్షాన నిల‌బ‌డి వారి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించ‌డానికి కృషి చేసిన మీడియాకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వారికి మీడియా స‌పోర్ట్ ఇలాగే కొన‌సాగాల‌ని ఆయ‌న ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

ఉద్దానం కిడ్నీ బాధితులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖీ
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం వారి కష్టాలపై జనసేన పార్టీనుండి ఓ డాక్టర్ సారధ్యంలో ఓ కమిటీని కూడా వేశారు. కిడ్నీ బాధితుల విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని వారి సమస్యలపై అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని పవన్ డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నా చంద్రబాబు వారి సమస్యలకు తీసుకోవాల్సిన చర్యల పట్ల అధికారులకు..ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి డెడ్ లైన్..
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్నవారిని పరామర్శించి, వారి బాధలను వారితోనే ప్రభుత్వానికి వినిపించిన విషయం తెలిసిందే. ఆయ‌న ఉద్దానంలో చేసిన పర్య‌ట‌న ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించి ఉద్దానం బాధితుల‌కు అండగా నిలుస్తామని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన పట్ల ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందించారు. బాధితుల స‌మ‌స్య తీవ్ర‌త‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అర్థం చేసుకున్నారని ఆయ‌న అన్నారు. ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌పై స్పందిస్తూ చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : చంద్రబాబు
జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీనిచ్చారు. జిల్లాలోని రాజాంలో నిర్వహించిన 'జన్మభూమి...మా ఊరు' కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. కిడ్నీ సమస్యకు మూలాలు తెలుసుకుని, దాన్ని నివారించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సోంపేట, పలాసలో వెంటనే డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆ గ్రామాలన్నింటికీ ఉచితంగా మినరల్‌ వాటర్‌ను సప్లై చేయడంతోపాటు... మొబైల్‌ డిస్పెన్సరీలను నడుపుతామన్నారు.

నా సినిమాకు థియేటర్లు దొరకడం లేదు: నారాయణమూర్తి..

హైదరాబాద్: ఆర్.నారాయణమూర్తి నటించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా ఈ నెల 14న రీలీజ్ కానుంది. ఈ చిత్రంలో జయసుధ కథానాయికగా నటించారు. విడుదలకు అన్ని సన్నాహకాలు చేసుకున్న తర్వాత, థియేటర్లు దొరకడం లేదని దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లు దక్కకపోవడంతో ఏడుపొస్తోందని చెప్పారు. తామేమీ వందల థియేటర్లు అడగడం లేదని... నాలుగు థియేటర్లు ఉన్న ఊర్లో ఒక థియేటర్ మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నామని అన్నారు. తమ సినిమా విడుదలకు ప్రభుత్వం, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి సహకరించాలని కోరారు.

కార్మికశాఖ జేడీ నివాసంలో ఏసీబీ సోదాలు...

హైదరాబాద్: ఉపాధి, కార్మికశాఖ జేడీ గోపురంముని వెంకటనారాయణ నివాసంలో ఏపీ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని కొత్తపేట రామలింగేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఆయనఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.25లక్షలు, కిలో బంగారం, 4 కోట్లకుపైగా విలువైన భూములు వెంకటనారాయణ కలిగి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌, తిరుపతిలోని వెంకట నారాయణకు సంబంధించిన ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు:ప్రొ.కోదండరాం

నిజామాబాద్: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీ.జాక్ నేత ప్రొ.కోదండరాం ఆరోపించారు. నిజామాబాద్ లో జేఏసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవడం లేదని, బోధన్, సారంగపూర్ లోని చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మతిస్థిమితం లేని యువతిపై..

కరీంనగర్ : రామడుగు మండలం గోపాల్ రావు పేటలో దారుణం చోటుచేసుకుంది. మతిస్థితిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు, ఇద్దరు యువకులు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. స్థానికులు సమాచారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

11:46 - January 7, 2017

గుంటూరు : నిరుపేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు అప్పటి వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంపై ఏపీ ప్రభుత్వం అశ్రద్ధ చూపుతోంది. మెల్లగా మెల్లగా ఈ పథకానికి మంగళం పాడేందుకు పావులు కదుపుతోంది. ఫీజు బకాయిల విడుదలలో జాప్యం చేయడంతో.. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి.
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి ఏపీ ప్రభుత్వం తూట్లు?
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి ఏపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలను గ్రేడ్‌లుగా విభజించారు. ఏ గ్రేడ్ కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజు ఎంతైనా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే ఫీజుకు, కాలేజీలు వసూలు చేసే ఫీజుకు చాలా వ్యత్యాసం ఉంటోంది. దీంతో పేద విద్యార్థులు మిగిలిన ఫీజును చెల్లించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

కృష్టా,గుంటూరు జిల్లాల్లో అర్హులైన విద్యార్థులు 67,113
కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఫీజు రీయింబర్స్ మెంట్ కు అర్హులైన ఈబీసీ విద్యార్థులు 67,113 మంది ఉన్నారు. జనవరి 2వ తేదీ నాటికి 58,808 దరఖాస్తులు మాత్రమే పరిశీలించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి రూ.154.08 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 26,998 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.36.45 కోట్ల నిధులను మాత్రమే ప్రభుత్వం విడుదలచేసింది. దీనిపై ప్రభుత్వ స్పందన మాత్రం మరోలాగా ఉంది.

ఫీజు బకాయిల విషయంలో ప్రభుత్వ తీరుపై సీపీఎం ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయం ఈబీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం కల్గించేలా ఉందని సీపీఎం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఫీజు బకాయిల విడుదలలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందని.. నెమ్మదిగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలలో జాప్యం చేయడంతో.. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్‌ స్పందించి తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

11:42 - January 7, 2017

చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నాం : పవన్

హైదరాబాద్ : ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఉద్దానం బాధితుల క‌ష్టాలపై చంద్రబాబు స్పందించటం హర్షణీయమన్నారు.  ఉద్దానం ప్రాంత వాసుల కష్టాలపై  అన్ని రాజ‌కీయ పార్టీలు స్పందిచాలని పవన్ కళ్యాణ్  కోరారు.రాష్ట్ర‌ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప‌డిన‌ మొద‌టి అడుగుగా ఆయన అభివ‌ర్ణించారు.

11:19 - January 7, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరోసారి భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. వెంకటపాలెం, వెలగపూడి, మల్కాపురం, శాఖమూరు గ్రామాల్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 329 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 33 వేల ఎకరాలు సమీకరించారు. మరోసారి భూసేకరణ పేరుతో భూములు తీసుకుంటున్న ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేయొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అధికారం ప్రదర్శించి భూసేకరణకు ప్రభుత్వం సిద్ధపడితే ఉద్యమం చేపడతామని రైతులు పేర్కొంటున్నాట్లుగా సమాచారం. కాగా ఇప్పటి వరకూ సేకరించిన భూముల మధ్యలో వున్న ప్రాంత భూములకు సంబంధించిన రైతులు ప్రభుత్వానికి ఇవ్వటానికి అంగీకరింకలేదు. దీంతో ప్రభుత్వం మధ్యలో వున్న భూములను సేకరించేందుకు ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 

11:15 - January 7, 2017

కాయగూరల్లో క్యాబేజీలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు.

అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి.

క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది.

క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే.

నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి.

వాపులను తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది.

శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.

థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది.

పాలిచ్చే తల్లులకు ఒక్కోసారి వక్షోజాలు, నిపుల్స్‌లో నొప్పి, మంట కలుగుతాయి. దీన్ని నివారించాలంటే కొన్ని క్యాబేజీ ఆకులను రాత్రంతా వాటిపై ఉంచితే చాలు.

శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది.

ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.

పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి.

పోషక విలువలు, ప్రతి 100 గ్రాముల్లో...

పిండిపదార్థాలు 5.8 g చక్కెరలు 3.2 g పీచుపదార్థాలు 2.5 g కొవ్వు పదార్థాలు 0.1 g మాంసకృత్తులు 1.28 g థయామిన్ (విట. బి1) 0.061 mg 5% రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.040 mg 3% నియాసిన్ (విట. బి3) 0.234 mg 2% పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.212 mg 4% విటమిన్ బి6 0.124 mg 10% ఫోలేట్ (Vit. B9) 53 μg 13% విటమిన్ సి 36.6 mg 61% కాల్షియమ్ 40 mg 4% ఇనుము 0.47 mg 4% మెగ్నీషియమ్ 12 mg 3% భాస్వరం 26 mg 4% పొటాషియం 170 mg 4% జింకు 0.18 mg 2%

సో ఇన్ని ఉపయోగాలున్న క్యాబేజీని రోజువారీ వంటల్లో చేర్చుకుంటే సరిపోతుంది.

ప్రతిఘటించిన యువతి నాలుక కొరికేశాడు...

బెంగళూరు: సిలికాన్ సిటీలో మరో కీచకుడి బాగోతం బయటపడింది. కేజీహళ్లిలో ఆఫీస్ కు వెళ్తున్న ఓ యువతిని దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికాడు. ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం 6.30 గంటల సమయంలో యువతి బస్‌స్టాప్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

వరంగల్ లో అయ్యప్ప భక్తుల ఆందోళన

హైదరాబాద్ : వరంగల్ రైల్వేస్టేషన్‌లో అయ్యప్ప భక్తుల ఆందోళనకు దిగారు. నిన్నటి నుంచి కేరళ వెళ్లే రైలు రావట్లేదంటూ పేర్కొంటూ అయ్యప్ప భక్తుల ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా గూడ్సు రైలును నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

మరో నాలుగు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు

గుంటూరు: అమరావతి రాజధాని ప్రాంతంలోని మరో నాలుగు గ్రామాల్లో భూసేకరణ జరిపేందుకు గుం టూరు జిల్లా యంత్రాంగం నోటిఫి కేషన్లను ప్రకటించింది. వెలగపూడి, మల్కాపురం, శాకమూరు, వెంక టపాలెంలో భూసమీకరణ పథకంలో భాగాస్వామ్యం కాని రైతుల నుంచి భూ సేకరణ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 9 గ్రామాల్లో భూసేకరణ చేపట్టారు. మార్చి నెలా ఖరు లోపు ప్రక్రియ పూర్తి చేసి భూ ములను సీఆర్‌డీఏకి అప్ప గించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

10:38 - January 7, 2017

విదేశీయులు అమెరికా నిరుద్యోగుల కడుపుకొడుతున్నారని ఆరోపిస్తూ హెచ్-1బీ వీసాల జారీని మరింత కఠినతరం చేయాలని కోరుతూ అమెరికా సెనెట్ ముందుకు (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్) ఓ బిల్లు వచ్చింది. ఆ బిల్లులో దాదాపు 20 కంపెనీల్లో ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకూడదని ఆ కంపెనీలను నిషేధించాలని ఆ బిల్లు సారాంశం. అమెరికన్లకే అమెరికా ఉద్యోగాలు అంటూ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న ట్రంప్ నినాదం మెల్లగా కార్యరూపం దాల్చనుంది. ఈ వీసా జారీ చేయడానికి కనీస వార్షిక వేతనాన్ని ప్రస్తుతమున్న 60 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచాలని, మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించాలని ఈ బిల్లులో ప్రధానంగా నిర్దేశించారు. రిపబ్లికన్ ప్రతినిధి డారెల్ ఇస్సా, డెమోక్రటిక్ సభ్యుడు స్కాట్ పీటర్స్ ఈ బిల్లును బుధవారం అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. వీరిద్దరూ యూఎస్ లో భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. 

10:27 - January 7, 2017
10:24 - January 7, 2017

కర్నూలు : ఎస్ఏపీ క్యాంప్ లో ఎస్సై సెలక్షన్స్ లో అపశృతి చోటుచేసుకుంది. సెలక్షన్స్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 5కే రన్ లో పాల్గొన్న కానిస్టేబుల్ దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అప్పటికే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాలాజీ నాయక్ ఎస్సై అవ్వాలనే కోరికతో సెలక్షన్ టెస్ట్ లో భాగంగా ఏర్పాటు చేసిన పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం ఆసుపత్రికి తరించారు. చికిత్స పొందుతూ అనంతపురానికి చెందిన బాలాజీ నాయక్ మృతి చెందాడు. కాగా కానిస్టేబుల్..ఎస్సై పరుగు పందాలలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.

10:19 - January 7, 2017

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ రావడం లేదని సమాచారం. చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రంలో అభిమానుల ఫోకస్ అంతా ఆయన మీదే ఉండాలని... తాను ఫంక్షన్ కు వస్తే ఫోకస్ డివైడ్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫంక్షన్ కు హాజరుకాకూడదనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ఈ రోజు 'ఖైదీ' ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. పవన్ మినహా మెగా హీరోలంతా ఈ ఫంక్షన్ కు హాజరవుతున్నారు. మరోవైపు, పవన్ కల్యాణ్ చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ హైదరాబాదులోని గోల్కొండ కోటలో జరుగుతోంది. 

మేఘాలయలో ఎమ్మెల్యే అరెస్ట్...

గౌహతి: మేఘాలయలోని మహతి నియోజకవర్గ ఎమ్మెల్యే జూలియస్ కె దోర్‌పాంగ్‌ను ఆ రాష్ట్ర పోలీసులు నేడు ఉదయం అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టు జనవరి 4వ తేదీన నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేయడంతో అప్పటినుంచి సదరు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లాడు. సమీప రాష్ర్టాలకు సైతం సమాచారం అందించిన పోలీసులు దోర్‌పాంగ్‌పై లుక్‌ఔట్ నోటీసులు జారీచేశారు. ఎమ్మెల్యే ఆచూకీకి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నేడు ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు.

10:12 - January 7, 2017

హైదరాబాద్: బుల్లి తెరపై వివిధ ప్రోగ్రాంలకు యాంకర్ గా చేస్తున్న లాస్య హీరోయిన్ గా తేరంగ్రేటం చేయబోతోంది. నిజానికి అనసూయ, రష్మితో పోలిస్తే ట్రెడిషనల్‌గానే ఎక్కువగా కనిపించే లాస్య ఆకట్టుకునే స్మయిల్, ఎట్రాక్ట్ చేసే ఫిజిక్‌తో హీరోయిన్ అవకాశం కొట్టేసింది. ఆ సినిమా పేరు ‘రాజా మీరు కేక’. రేవంత్, నోయల్, మిర్చి హేమంత్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం తరువాత యాంకర్ లాస్యకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ణ కిషోర్.టి వహిస్తున్నారు, ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్, డీఓపి : రామ్ పి. రెడ్డి, సంగీతం: శ్రీచరణ్, ఆర్ట్: మారేష్ శివన్, స్టంట్స్: జాషువ.యాంకర్ నుంచి హీరోయిన్‌గా రష్మి, అనసూయ తర్వాత వస్తున్న లాస్య ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

 

10:11 - January 7, 2017

గుంటూరు : టీటీడీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. బాపట్లలోని సూర్యలంక బీచ్ రిసార్ట్స్ లో మేనేజర్ తో పాటు రిసార్ట్స్ సిబ్బందిపై అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నిర్మాత పుట్టినరోజు వేడుకలను అన్నం సతీష్ రిసార్ట్స్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో మేనేజర్..సిబ్బందిపై ఎమ్మెల్సీ అనుచరులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అన్నం సతీష్ తో పాటు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వారి అనుచరులతోకలిసి సూర్యలంక బీచ్ లో మద్యంతాగి చిందులేసారు. అనంతరం రిసార్ట్స్ మేనేజర్..సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా అన్నం సతీష్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. కాగా మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

10:09 - January 7, 2017

ముంబై : డిసెంబర్‌ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచక పర్వంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ అగ్ర నటుడు అక్షయ్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ట్విటర్ వేదికగా ఘోరాన్ని ఖండించారు. బెంగళూరులో జరిగింది నిజంగా దారుణమైన విషయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బెంగళూరు ఘటనపై కోహ్లీ, అక్షయ్ స్పందన
బెంగళూరులో డిసెంబర్‌ 31న జరిగిన కీచక పర్వంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ అగ్ర నటుడు అక్షయ్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఇద్దరు వ్యక్తులు ఓ యువతిని పైశాచికంగా హింసించడంపై నిప్పులు చెరిగారు. ఆమె జీవితం.. ఆమె ఇష్టాయిష్టాలు.. ఆమె నిర్ణయాలు.. అన్నీ ఆమె ఇష్టం. వారి విషయాల్లో బయటివారికి ఏమి పని? అలా ప్రవర్తించేవారిని మనుషులని ఎలా అంటామని కోహ్లీ ట్విట్టర్‌లో ఫైర్‌ అయ్యాడు.

ఘటన నిజంగా దారుణమని ట్వీట్‌
బెంగళూరులో జరిగింది నిజంగా దారుణమైన విషయమని, జరుగుతున్నది చూసి కూడా అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన వారిని మనుషులని అనగలమా అంటూ కోహ్లి ఆవేశంతో ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనే మన కుటుంబసభ్యులకు జరిగితే చూస్తూ వూరుకుంటామా, సాయం చేయమా? మనదాకా వచ్చేదాకా నోరు తెరవకపోతే ఎలా? ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్లు, అడ్డుకునేవాళ్లు లేరు కాబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అని కోహ్లి ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

కీచక పర్వంపై తీవ్రంగా స్పందించిన అక్షయ్‌కుమార్
యువతిపై మగోన్మాదుల దురాగతాన్ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని పేర్కొన్నాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్విటర్‌ లో వీడియో పోస్టు చేశాడు. మనుషుల కంటే జంతువులే నయమనిపించేలా బెంగళూరు ఘటనలు ఉన్నాయని.. మానవజాతి తిరోగమనంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోందని వాపోయాడు. మగాళ్లకు భయపడాల్సిన అవసరం మహిళలకు లేదని.. ధైర్యంగా ఉండండి, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించాడు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ప్రభుత్వాలు, సమాజం పాటుపడాలని కోహ్లీ, అక్షయ్‌ విజ్ఞప్తిచేశారు.

 

09:58 - January 7, 2017

నల్లగొండ : నల్లగొండ జిల్లాను మంచుదుప్పటి కప్పివేసింది. జిల్లాలోని పలుప్రాంతాల్లో తీవ్రమైన మంచు ప్రభావం కనిపిస్తోంది. కనీసం 50 మీటర్ల దూరంలో ఏం జరుగుతుందో కూడా కనపడకుండా మంచు కప్పివేసింది. దీంతో వాహనదారులు, ప్రజలు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 9 గంటలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు రైళ్ల రాకపోకలపై మంచు ప్రభావం పడింది. నల్లగొండ రైల్వే స్టేషన్ లో హౌరా నుంచి వస్తున్న ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ రైల్ ను అరగంట పాటు నిలిపివేశారు. జిల్లాలో మంచు ప్రభావంపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

ఎస్సై నియామకాల పరుగుపందెంలో అపశృతి

కర్నూలు : ఎస్సై నియామకాల పరుగుపందెంలో అపశృతి చోటు చేసుకుంది. 5కె రన్ లో పాల్గొన్న కానిస్టేబుల్ బాలాజీ అస్వస్థత కు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలాజీ నాయక్ మృతి చెందాడు. మృతుడు బాలాజీ నాయక్ అనంతపురం జిల్లా వాసిగా గుర్తించారు.

09:54 - January 7, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. విశాఖ, లంబసింగిలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలోనూ చలి పెరిగిపోయింది. సాధారణం కన్నా 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. మెదక్‌లో 10, హైదరాబాద్‌ రామగుండంలో 11 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర భారతంలో పశ్చిమ అస్థిర గాలులు అధికంగా పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోలు...

ఛత్తీస్‌గఢ్: రోడ్డు పనుల్లో ఉన్న 6 వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పఖంజేర్ వద్ద చోటుచేసుకుంది. మావోయిస్టుల దుశ్చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీలో దట్టంగా అలముకున్న పొగమంచు

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో పలు రైళ్లు రద్దు చేయగా, 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

09:50 - January 7, 2017

తిరుమల : పెద్దనోట్ల రద్దు ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయంపై పడింది. రద్దైన నోట్లు ఇప్పటికీ శ్రీవారి హుండీలో భక్తులు కానుకగా వేస్తుండటంతో రద్దయిన పెద్ద నోట్లు మార్చకోవడం ఎలా అంటూ టిటిడి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు గత నెల 31 వరకు పాత నోట్లను శ్రీవారి ఖాతాల్లో జమ చేసుకున్న బ్యాంకులు... ఆ తర్వాత నుంచి వాటిని స్వీకరించడంలేదు. దీంతో టిటిడి వద్ద సుమారు 4 కోట్లవరకూ పెద్దనోట్లు జమయ్యాయి.
శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఆరాటం
తిరుమల..నాలుగు అక్షరాల ఈ పేరు వింటేనే చాలు.. ఏడు కొండలపై వెలసిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కళ్ల ముందు కదలాడుతాడు.గోవింద నామస్మరణ, అన్నమయ్య కీర్తనలు ఇంపుగా చెవులకు తాకుతాయి.భక్తుల హృదయాలు ఆధ్యాత్మికతతో పులకరించిపోతాయి.

నిత్యం స్వామివారిని దర్శించుకుంటున్న దాదాపు 80వేల మంది
దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలలోని ఆ శ్రీవేంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. నిత్యం స్వామివారిని 60 నుంచి 80వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రత్యేక రోజుల్లో లక్షమందికి పైగా శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయంలోని హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ కానుకలు నిత్యం రూ.2.50 కోట్లనుండి, 3.50 కోట్లవరకూ ఉంటాయి.

పెద్ద నోట్ల రద్దుతో తగ్గుతున్న శ్రీవారి ఆదాయం
పెద్ద నోట్ల రద్దుతో శ్రీవారి ఆదాయం తగ్గుతోంది. పెద్ద నోట్ల రద్దు తరవాత డిసెంబరు 30 వరకూ హుండీ ఆదాయం బాగానే ఉండేది. ఆ తరువాత డిసెంబరు 31 నుంచి హుండీ ఆదాయం తగ్గుతోంది. కారణం రద్దు నోట్లను బ్యాంకులు స్వీకరించక పోవడమే..! ఇప్పటి వరకు కూడా నిత్యం 30 నుంచి 50 లక్షల వరకు పాత నోట్లు కానుకలుగా వస్తున్నాయి. వీటిని బ్యాంకులు జమ చేసుకోకపోవడంతో అవి టిటిడి వద్దే ఉండిపోతున్నాయి. గత నెల 31న కానుకలుగా వచ్చిన 30 లక్షల పాత పెద్ద నోట్లు కూడా టీటీడీ వద్దే ఉన్నాయి. ఈ సమస్యపై టీటీడీ అధికారులు రిజర్వు బ్యాంకుకు గతంలోనే లేఖ రాశారు. ఆలస్యంగా స్పందించిన రిజర్వ్ బ్యాంకు అధికారులు రద్దు నోట్లు తాము చేప్పెంత వరకూ టీటీడీ వద్దనే ఉంచకోవాలని సూచన చేశారు. 

నోట్ల రద్దు తరువాత తగ్గిన శ్రీవారి ఆదాయం

రద్దు నోట్లను కానుకలుగా వేయవద్దని భక్తులకు టిటిడి అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా కొందరు పురాతన కాలం నాటి చెల్లుబాటు కాని నాణేలను హుండీలో సమర్పిస్తున్నా.. స్వీకరిస్తూనే ఉన్నారు. ఈ తరహా నాణేలు గుట్టల కొద్దీ నిల్వలున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం స్వామివారి హుండీ ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోతోంది. సాధారణంగా నిత్యం 3 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుండగా.. కొద్దిరోజులుగా ఈ రాబడిలో తగ్గుదల కనిపిస్తోంది. జనవరి 1న హుండీ ద్వారా 2.74 కోట్లు, 2న 2.47 కోట్లు, 3న 1.10 కోట్లు, 4న 1.24 కోట్లు, 5న 1.90 కోట్ల ఆదాయం లభించింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే చాలు హుండీ ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, దీని వల్ల టిటిడికి పెద్ద సమస్యలేదని చెబుతున్నారు. మరోవైపు టిటిడి ఏర్పాటు చేసిన ఈ-హుండీకి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. గత నెలలో రూ.2.10 కోట్లు ఈ-హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు టిటిడి ఈఓ డి.సాంబశివరావు తెలిపారు.మొత్తంగా హుండీలో జమ అయిన పెద్ద నోట్లను ఎలా మార్పిడి చేయాలో అర్థంకాక టీటీడీ అధికారులు హైరానపడుతున్నారు. ఇటు నోట్ల రద్దు ప్రభావంతో శ్రీవారి ఆదాయంపై పడింది. 

09:47 - January 7, 2017

జనగాం : కులాల మధ్య అసమానతలు తొలగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జనగామ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు విద్యార్థులు, ఐద్వా నేతలు ఘన స్వాగతం పలికారు.

విద్యావ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం : తమ్మినేని
విద్యావ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రకు జనగామలో కాలేజీ, పాఠశాలల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు.

రాజకీయాల్లోని చెడు మాత్రనే వ్యతిరేకించాలి : తమ్మినేని
తెలంగాణ రాష్ట్రం బాగుండాలని.. అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలతో పాటు.. అన్ని సౌకర్యాలు కలగాలనే లక్ష్యంతో సీపీఎం పాదయాత్ర చేస్తున్నట్లు తమ్మినేని తెలిపారు. అయితే.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజల్లో చాలామందికి రాజకీయాలంటే చెడు అభిప్రాయం ఉందని.. కానీ దేశ అభివృద్ధికి రాజకీయాలు ముఖ్యమని విద్యార్థులతో మాట్లాడిన తమ్మినేని తెలిపారు. అయితే.. రాజకీయాల్లోని చెడు మాత్రనే వ్యతిరేకించాల్సిన అవసరముందని తమ్మినేని సూచించారు.

82వ రోజు జరిగిన పాదయాత్రకు ఐద్వా నేతల స్వాగతం
జనగామ జిల్లాలోని యశ్వంతాపూర్‌, ధర్మకంచె, నెల్లుట్ల, కిష్టగూడెం, చీటూరు గ్రామాల్లో 82వ రోజు జరిగిన పాదయాత్రకు ఐద్వా నేతలు స్వాగతం పలికారు. జిల్లాలు ఏర్పాటు చేయగానే సరిపోదని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే సార్ధకత ఉంటుందన్నారు తమ్మినేని.

50 ఏళ్లకు పైబడిన గొర్రెల కాపరులకు ప్రభుత్వం పింఛన్‌ ఇవ్వాలి : తమ్మినేని
గొర్రెల పెంపకందారుల సమస్యలపై తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. గొర్రెల కాపురుల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. 50 ఏళ్లకు పైబడిన గొర్రెల కాపరులకు ప్రభుత్వం పింఛన్‌ అందించాలని తమ్మినేని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

09:42 - January 7, 2017

హైదరాబాద్: సంక్రాంతి పండుగ పది రోజుల ముందు నుంచే మహత్మాగాంధీ బస్టాండ్‌ ప్రయాణీకులతో రద్దీగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంక్రాంతి పండగ వాతావరణం ఏ మాత్రం కనిపించడం లేదు. ఎటూ చూసినా ప్రయాణీకులు లేక ప్లాట్‌ ఫామ్స్‌ వెలవెలబోతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.

మహత్మాగాంధీ బస్టాండ్‌లో కనిపించని సంక్రాంతి వాతావరణం
సంక్రాంతి పండగంటే ఆ సందడే వేరు.. దూర ప్రాంతాల్లో ఉన్నవారు పండక్కి తమ సొంతుళ్లకు పయనమవుతారు. ప్రతి ఏడాది సంక్రాంతి పది రోజుల ముందుగానే బస్టాండ్లన్నీ ప్రయాణీకులతో రద్దీగా ఉంటాయి. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఓవైపు పెద్దనోట్ల రద్దు, మరోవైపు ప్రైవేటు బస్సుల పోటీ, ఇవన్నీ చాలవన్నట్లు అవసరానికి మించిన సర్వీసులు... వెరసి ఆర్టీసీ బస్సులలో ప్రయాణీకులు వెళ్లకుండా చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా చిల్లర సమస్య అందర్నీతీవ్రంగా వేధిస్తోంది. దూర ప్రయాణాలు చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఈ ఎఫెక్ట్‌ ఆర్టీసీపై చూపుతోంది.

ప్రైవేటు ట్రావెల్స్‌ పోటీని తట్టుకోలేకపోతున్న ఆర్టీసీ సంస్థ
ప్రైవేటు ట్రావెల్స్ పోటీని కూడా ఆర్టీసీ తట్టుకోలేకపోతుందననేది మరో వాదన. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఆర్టీసీ కంటే టికెట్‌ రేటు ఎక్కువే ఉన్నా... ప్రయాణీకులు మాత్రం ప్రైవేటు బస్సులకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ప్రైవేటు బస్సు ట్రావెల్స్‌ ఆఫర్ల మీదా ఆఫర్లు ఇచ్చి ప్రయాణీకులను ఆకర్షించడంలో ముందుంటున్నాయి.

గతంతో పోల్చితే ఏడాది తగ్గిన ప్రయాణీకుల రద్దీ
సంక్రాంతి పండగ రోజున సొంత ఊర్లో పిల్లాపాపలతో గడపాలని చాలామంది కోరుకుంటారు. ఎన్ని ఇబ్బందులున్నా పండగను మాత్రం ఊర్లోనే జరుపుకోవడానికే ఇష్టపడుతారు. వారం రోజుల ముందైనా ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణీకులతో కళకళలాడుతాయన్న ఆశాభావంతో ఆర్టీసీ అధికారులున్నారు.

09:37 - January 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టీడీపీ వాయిస్‌ పెంచిందా? పార్టీ తరపున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వున్నా... ప్రజా సమస్యలపై తమ వాయిస్‌ వినిపించటంలో సక్సెస్ అయ్యిందా? గత మూడు అసెంబ్లీ సమావేశాలకంటే..ఈసారి టిడిఎల్పీ నేత రేవంత్ రెడ్డికి అసెంబ్లీ సమావేశాల్లో పరిణతితో వ్యవహరించారా..? శాసనసభలో టీడీపీ దూకుడు చూస్తే ఈ ప్రశ్నలే వస్తున్నాయి.

వాయిస్ పెంచిన టీ.టీడీపీ
టీ-టీడీపీ మళ్ళీ పట్టాలెక్కుతోంది... ఇటీవల కాలంలో పార్టీ ఫిరాయింపులతో కీలక నేతలంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో .. కోలుకోలేని స్థితికి చేరిన టీటీడీపీ.. మళ్లీ తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. అటు ప్రజాక్షేత్రంలోనూ..ఇటు అసెంబ్లీ సమావేశాల్లోనూ టీ-టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. నిన్నటిదాకా వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత యిచ్చిన రేవంత్ రెడ్డి .. తన పంథా మార్చుకున్నారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పూర్తి సమాచారంతో సభలో ప్రభుత్వాన్ని నిలదీశే ప్రయత్నం చేశారు.
ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నా అసెంబ్లీలో పెరిగిన వాయిస్‌
అసెంబ్లీలో టీ-టీడీపీకి ఉన్నది ముగ్గురే ఎమ్మెల్యేలు అయినా.. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్‌ అయ్యారని ఆపార్టీనేతలు అంటున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు సండ్ర వెంకటవీరయ్య, ఆర్‌.కృష్ణయ్య కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ పార్టీతోపాటు అసెంబ్లీలో ధర్నా చేయటం... డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద నోట్ల రద్దు లాంటి అంశాలపై చర్చలలో తమ ఎమ్మెల్యేలు క్రియాశీలంగా పనిచేడంపై టీడీపీ నాయకత్వం సంతోషపడుతోంది.

అటు ప్రజాక్షేత్రంలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ పెరిగిన టీ-టీడీపీ గళం
గత ఎన్నికల్లో కారుపార్టీ స్పీడ్‌ను అందుకోలేక చతికిలపడిన టీ-టీడీపీ.. ఎన్నికల అనంతరం ఉన్న ప్రజాప్రతినిధులను కూడా కాపాడుకోలేక పోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగట్టి గులాబీగూటికి చేరడంతో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా డీలా పడింది. దీంతో పార్టీలో తిరిగి ఉత్సాహం నింపడానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్న చంద్రబాబు సూచనలతో ..టీ-టీడీపీనేతల్లో మళ్లీ కదలిక వచ్చింది. రైతు సమస్యలు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఆపార్టీ నేతలు.. రేవంత్‌రెడ్డి, ఎల్‌రమణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రజాసమస్యలపై వేగం పెంచిన టీ-టీడీపీ
మొత్తంమీద తెలంగాణలో పూర్వవైభవం సాధించేందుకు టి-టిడిపి తన అడుగుల వేగాన్ని పెంచింది. తమకు అందివచ్చిన అన్ని వేదికల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు టీ-టీడీపీనేతలు. 

టీటీడీ ఎమ్మెల్సీ అనుచరుల వీరంగం..

గుంటూరు : టీటీడీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. బాపట్లలోని సూర్యలంక బీచ్ రిసార్ట్స్ లో మేనేజర్ తో పాటు రిసార్ట్స్ సిబ్బందిపై అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నిర్మాత పుట్టినరోజు వేడుకలను అన్నం సతీష్ రిసార్ట్స్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో మేనేజర్..సిబ్బందిపై ఎమ్మెల్సీ అనుచరులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

నటుడు కమల్ హాసన్ వదిన మృతి..

తమిళనాడు : ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ పెద్దన్న‌య్య చంద్ర‌హాస‌న్ స‌తీమ‌ణి గీతామ‌ణి(73) అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు. శుక్ర‌వారం ఆమె భౌతిక కాయానికి స్థానిక అళ్వార్‌పేట‌లోని చంద్ర‌హాస‌న్ నివాసంలో క‌మ‌ల్‌హాస‌న్‌, చారుహాస‌న్, ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

భారత్ లో పోర్చుగల్ ప్రధాని..

ఢిల్లీ: పోర్చుగల్ ప్రధానమంత్రి అంటానియో కోస్టా భారత్‌ లో పర్యటించనున్నారు. ఏడు రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్ ప్రధానమంత్రి అంటానియో కోస్టా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీలతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి. పర్యటనలో భాగంగా అంటానియో రేపు బెంగళూరులో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

07:46 - January 7, 2017

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం శుక్రవారం అసెంబ్లీలో చర్చ హాట్ హాట్ గా జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోవలేదనీ..కనీసం మార్గదర్శకాలను కూడా రూపొందించలేదని విపక్షాలు ఆరోపించాయి. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా వున్న సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంపై చర్చకు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించాయి.ఈ అంశంపై మంత్రి వివరణ పట్ల విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో సీఎం సభలో లేకపోవడం, దళిత, గిరిజనులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ.. టీడీపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయ్ కుమార్ (ప్రముఖ విశ్లేషకులు) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) విద్యాసాగర్ (టీ.టీడీపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

07:33 - January 7, 2017
07:30 - January 7, 2017

హైదరాబాద్‌ : బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ ఒక విలక్షణమైన చిత్రకళాప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. గ్యాలరీలో ఈరోజు వివిధ చిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో సీనియర్‌ చిత్రకారుల పెయింటింగ్స్‌తో పాటు.. ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులైన వారి చిత్రాలకు స్థానం కల్పించింది. ప్రదర్శనలో ఏర్పాటు చేసేందుకు చిత్రాల ఎంపికలో...క్యూరేటర్‌ కోయలీ ముఖర్జీ.. ఒక విశిష్టమైన పద్ధతిని అనుసరించారు. ఈ ప్రదర్శన ఈ నెల 27 వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.  

07:24 - January 7, 2017

విజయవాడ : వైసీపి అధినేత చేస్తున్న రైతు భ‌రోసా యాత్రల్లో రాజ‌కీయ అంజెండా ఉందా...? పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ మైలేజ్‌ పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారా? ఇటీవ‌ల వరుస పర్యటనల వెనక మతలబు అదేనా? రైతు భ‌రోసా యాత్రల పేరుతో పొలిటిక‌ల్ స‌మీక్షలు నిర్వహిస్తున్నారా? అంటే పార్టీ వ‌ర్గాల‌ నుంచి ఔననే స‌మాధాన వినిపిస్తోంది.

జగన్ పొలిటికల్‌ భరోసా..!
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రలు .. తన పార్టీని బలోపేతం చేసుకోడానికే చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతు భరోసా యాత్ర పేరుతో పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో పర్యటిస్తున్నారు జ‌గ‌న్. రైతు సమస్యలపై గళం విప్పుతూనే.. ప‌నిలోప‌నిగా పార్టీ నేతలతో స‌మీక్షలు నిర్వహిస్తున్నారు. కర్నూల్ జిల్లాలో ఇటీవల తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీగూటికి చేరుకోవడంతో..జిల్లాలో వైసీపీని నడిపించే కీలక నాయకత్వం లేకుండా పోయింది. దీనిపై దృష్టిపెట్టిన జగన్‌.. రైతు భరోసాయాత్రలో పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

రైతు భరోసాయాత్రలో పార్టీ పనులు చక్కబెడుతున్న జగన్‌
గ‌తంలో రైతు భ‌రోసా యాత్రలు అంటే కేవ‌లం రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శకే పరిమితమయ్యేవి. కాని ఇప్పుడు అవ‌కాశాన్ని బ‌ట్టి రోడ్ షో ను కూడా నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ రోజు సాయంత్రం నియోజ‌క‌ర్గాల వారీగా స్థానిక నేతలతో మాట్లాడుతూ పార్టీలో లోటు పాట్లను తెలుసుకుంటున్నారు జగన్‌. పార్టీ బలోపేతం చేసే దిశగా స్థానిక నేతలకు డైరెక్షన్ ఇవ్వడానికి వైసీపీ అధినేత సిద్ధమైనట్టు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై జగన్‌ వ్యూహాత్మక అడుగులు
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బల‌హీనంగా ఉన్న ప్రాంతాల్లో వివిధ రకాల యాత్రలు చేయ‌డానికి రెడీ ప్లాన్స్‌ రూపొందించారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ, పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజ‌కవ‌ర్గాల్లోనూ కొత్తగా లీడర్‌షిప్‌ను త‌యారు చేయడంపై జగన్‌ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాదార‌ణ ఉన్న నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డం వంటి అంశాల‌పై క్షేత్ర స్థాయి నేత‌ల‌కు నేరుగా త‌గు సూచ‌న‌లు ఇవ్వడానికి రెడీ అయ్యారు జగన్‌. 

07:19 - January 7, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణ పనులను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పరిశీలించారు. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను పరిశీలించిన ఆయన.. శీతాకాల సమావేశాలతో పాటు బడ్జెట్‌ సమావేశాలు వెలగపూడిలో జరుగుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి అయిన దాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్‌ కోడెల తెలిపారు.

అమరావతిలో మరో కీలక ఘట్టం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వెలగపూడి నుంచి పూర్తిస్తాయి పాలన సాగిస్తున్న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలనూ వెలగపూడి నుంచే ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో పనులను స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు పరిశీలించారు. జనవరి నెలాఖరు కల్లా భవన నిర్మాణం పూర్తి చేస్తే, ఫిబ్రవరి మొదటి వారంలో శాసనసభ శీతాకాల సమావేశాలు, మూడో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి కాకపోతే శీతాకాల, బడ్జెట్‌ సమావేశాలు కలిపి నిర్వహిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

వెలగపూడిలోనే తదుపరి అసెంబ్లీ సమావేశాలు!
వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఆవరణలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే భవనం శ్లాబ్‌ నిర్మాణం పూర్తయింది. సీఎం, స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ కార్యాలయాల పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. సమావేశమందిరాల్లో స్పీకర్‌, చైర్మన్ల పోడియం నిర్మాణాలు పూర్తయ్యాయి. మండలిలో సీటింగ్‌ కోసం మార్కింగ్‌ కూడా ఇచ్చారు. నమూనా సీట్లను కూడా మండలిలో ఏర్పాటు చేశారు. శాసన మండలిలో ఎరుపు రంగు సీట్లు, శాసన సభలో ఆకుపచ్చ రంగు సీట్లను ఏర్పాటు చేయబోతున్నారు. సచివాలయ పార్కింగ్‌తోపాటు సచివాలయం ఆవరణ బయట 5 ఎకరాల్లో ప్రత్యేకంగా అసెంబ్లీకి వచ్చిన వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ మొత్తానికి నాలుగు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. స్పీకర్‌, మండలి ఛైర్మన్‌, మంత్రులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులకు విడివిడిగా ప్రవేశ మార్గాల సిద్ధం చేస్తున్నారు. 

07:11 - January 7, 2017

హైదరాబాద్ : గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ప్రివ్యూ షోకు హాజరవ్వాలని సీఎం కేసీఆర్‌ను హీరో బాలకృష్ణ ఆహ్వానించారు. దీనికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణ ప్రాంతంలో వినోదపు పన్ను మినహాయించినందుకు సీఎంకు కేసీఆర్ ను ప్రత్యేకంగా కలిసిన బాలకృష్ణ కృతజ్ఞతలు తెలపారు.

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంపై కేసీఆర్‌కు ఆసక్తి
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంపై కేసీఆర్‌ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని ఆనాడు కేసీఆర్‌ కోరారు.

వాస్తవ రూపం దాల్చనున్న కేసీఆర్ కోరిక
గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్‌ ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్ కోరిన కోరిక నేడు వాస్తవరూపం దాల్చుతోంది. బాలయ్య... కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు ముందుగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి అప్పటికే క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లడంతో... అక్కడకు వెళ్లారు. ముఖ్యమంత్రిని కలుసుకొని... గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రీమియర్‌ షోకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్‌ అంగీకరించారని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా... మూవీ విశేషాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి
సంక్రాంతి కానుకగా... ఈనెల 12న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఇప్పటికీ ట్రైలర్‌కు వస్తున్న ఆదరణ , సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికెట్ రావడంతో... మూవీ సూపర్‌ హిట్ అవుతుందని బాలయ్య అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. 

ఫై ఓవర్ పై తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ :ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై అదుపు తప్పిన ఓ కారు వంతెన రైలింగ్‌ను ఢీకొంది. కాగా కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 

కానిస్టేబుల్ దాడిలో సర్పంచ్ బ్రెయిన్ డెడ్..

క‌రీంన‌గ‌ర్ : కోహెడ్ మండ‌లం స‌ముద్రాల స‌ర్పంచ్ పై ఓ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సర్పంచ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం ఏటీఎం వ‌ద్ద క‌రీంన‌గ‌ర్ జిల్లా కోహెడ్ మండ‌లం స‌ముద్రాలలో జరిగింది. 

Don't Miss