Activities calendar

08 January 2017

22:57 - January 8, 2017

'సమాజిక న్యాయం...తెలంగాణ సమగ్రాభివృద్ధి', 'ప్రజా సమస్యల పరిష్కారం'.. లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్రను చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. 2150 కిలీమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 2016  అక్టోబర్ 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈసందర్భంగా తమ్మినేని వీరభద్రంతో 10 టివి వన్ టు వన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదని.. టీఆర్ఎస్ చెప్పినట్లు లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మెరుగైన జీవితం లేదని తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు లేదన్నారు. తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నారో... తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అలాగే ఉన్నారని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో ఏలాంటి వెలుగులు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో వ్యక్తిస్వామ్యం నడుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ చట్ట విరుద్ధ పరిపాలన చేస్తున్నారని, చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనుమతి తీసుకున్న పాదయాత్రను సైతం అడ్డుకోండని, నిబంధనలను ఉల్లంఘంచి సీఎం పిలుపు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్ చేయాల్సిన పనులు కావని.. వాటికి ప్రజలు హర్షించరని తెలిపారు. సీపీఎంపై సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు, అవాక్కులు చవాక్కులు పేల్చుతున్నారని.. ఉన్మాదంలో ఉన్న కేసీఆర్ కు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. టీఆర్ ఎస్ లాంటి ప్రజావ్యతిరేక పార్టీల పాలనకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ముందుకు రావాలన్నారు. సామాజిక తెలంగాణ కోరుకునే శక్తులందరు ఏకతాటిపైకి రావాలని కోరారు. పాదయాత్ర సానుకూల ఫలితాలను ఇస్తుందన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
ఆశించిన విధంగా టీ.ప్రభుత్వ పాలన లేదు...
'సీపీఎం మహాజన పాదయాత్ర సందర్భంగా 82 రోజుల్లో, 2,150  కిమీ.సుదూర ప్రయాణంలో మాకు తెలిసింది ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజలు ఆశించిన విధంగా లేదు. టీఆర్ఎస్ చెప్పినట్లు లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మెరుగైన జీవితం లేదని తెలిపారు. దళితుల పట్ల చిన్నచూపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం పరిష్కరించడం, ఇల్లు, తిండి, ఉపాధి, జీతం...ఇలాంటి కనీస సౌక్యఆలు నెవరేర్చడంలో అన్ని ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయి. ఆ బతుకు చిత్రం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలో కనపడుతుంది. కేసీఆర్ పాలనలో, గత రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రజల్లో బతుకుల్లో మార్పు లేదు. కుటుంబ, వ్యక్తిగత సమస్యల్లో ఏమాత్రం మార్పులేదు. సమాజానికి సంబంధించిన ఉమ్మడి సమస్యల్లో స్వల్పమైన మార్పు ఉండొచ్చు. 
తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే.. ప్రజలు బాగుపడాలి 
తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే.. రాష్ట్రంలోని ప్రజలు బాగుపడాలి. గతం కంటే మెరుగ్గా బతుకులు మారాలి. తెలంగాణ రాకముందు వచ్చాక ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. కూలీలు, రైతులు, నిరుద్యోగులు, వ్యవసాయదారులు, పేదల్లో ఎలాంటి మార్పులు లేదు. ఎక్కడ ఒక్క డబుల్ బెడ్ రూ ఇల్లు లేదు నిర్మించలేదు. ఎక్కడా మూడెకరాల భూమి పంచలేదు. 
కనీసం ఊరుకు ఒక ఉద్యోగం రాలేదు
ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామన్నారు. కనీసం ఊరుకు ఒక ఉద్యోగం రాలేదు. కాంట్రాక్టు ఉద్యగులను పర్మినెంట్ చేయలేదు. కనీస వేతనం అమలు చేయలేదు. కనీస వేతనం 18వేలు అమలు కావడం లేదు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. వారిని కార్మికులుగా గుర్తించడం లేదు. వారికి గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఏ ఒక్క విషయంలోనే ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరు. చాలా మందికి ఫించన్లు రావడం లేదు. సర్కార్ పై అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి. 
మిషన్ కాకతీయ పథకంలో అవినీతి..
మిషన్ కాకతీయ పథకం కాన్ సెప్టు మంచిది.. కానీ పథకంలో అవినీతి జరుగుతుంది. తెలంగాణ నీటి అవసరాలకు మిషన్ కాకతీయ మంచిది. కానీ మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గుంటలు తీసి వదిలివేశారు. చెరువుల్లోకి చుక్క నీరు రాలేదు. మిషన్ కాకతీయలో అవకతవకలు, అవినీతి పుష్కలంగా జరిగింది. ప్రజల బతుకు చిత్రం మారటం లేదు. ప్రజలకు కనీస అవసరాలైన తిండి, గూడు, అసరా ఉండాలి. ఉద్యోగం, వైద్యం ఉండాలని కోరుకున్నారు. తాము కోరుకున్న విధంగా తెలంగాణ.. లేదని ప్రజలు అనుకుంటున్నారు. 
వచ్చే తరాల కోసం పాదయాత్ర 
మేము చేసే పాదయాత్ర.. వచ్చే ఎన్నికలు కోసం కాదు.. వచ్చే తరాల కోసం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం.. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి... పేదలకు ఉచిత, వైద్యం రావాలి..అది ప్రభుత్వం రంగంలోనే ఉండాలి... 14 వేలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరు వేల స్కూళ్లను మూసివేశారు. విద్యాసంస్థలోకి ప్రైవేట్ శక్తులు వస్తే విద్యకు దూరం కావడమే జరుగుతుంది. సీఎం కేసీఆర్ చిన్న ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకం.... పెద్ద కార్పొరేట్ కు అనుకూలం. ప్రభుత్వం..ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. కొత్తగా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయడం లేదు. 
ప్రభుత్వంపై ఉన్న భ్రమలు అన్ని తొలగిపోతున్నాయి. పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాలేదు. మేము తీసుకున్న ఎజెండా అంటే సీఎం కేసీఆర్ కు భయం ఉంది. 
పాదయాత్ర చేపట్టాక... విజయాలు
పాదయాత్ర చేపట్టాక... సీఎం కేసీఆర్... మిషన్ భగీరథ పథకంలో భాగంగా దళితుల ఇళ్ల నుంచి మంచీ నీటి ప్రారంభించారు. బీసీ కమిషన్ వేశారు. మైనార్టీలకు సుధీర్ కమిషన్ వేశారు. పాదయాత్ర ప్రజల్లో చైతన్యం కలిగించింది.
ఇతర పద్దులను తగ్గించైన డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించాలి. వెనుకబడిన ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో గిరిజన, గోండు ప్రాంతాల్లో జ్వరం వస్తే ఇంజక్షన్ వేసే దిక్కులేదు. అడవి మీద గిరిజునుడికి హక్కు లేదని సీఎం కేసీఆర్ అన్నాడు. అది దారుణం.
రాష్ట్రంలో వ్యక్తిస్వామ్యం 
రాష్ట్రంలో వ్యక్తిస్వామ్యం నడుస్తోంది. చట్ట విరుద్ద పరిపాలన చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అనుమతి తీసుకున్న పాదయాత్రను సైతం అడ్డుకోండని నిబంధనలకు ఉల్లంఘంచి సీఎం పిలుపు ఇచ్చారు. ఉన్మాదంలో సీఎం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. టీఆర్ ఎస్ కు సీపీఎం ప్రత్యామ్నాయం శక్తిగా ఎదగాలి. సీపీఎం పెద్ద చరిత్ర కల్గిన పార్టీ. కొత్త భూసేకరణ చట్టం ఆమోదం పొందే అవకాశం లేదు. కేంద్రం ఆమోదం తెలిపే ప్రసక్తే లేదు. జిల్లాల విభజన అడ్డగోలుగా చేశారు. అభివృద్ధి చెందాలంటే జిల్లాలకు నిధులు, అధికారులు రావాలి. 
క్యాష్ లెస్ కాదు.. మైండ్ లెస్ చర్య...
పెద్ద నోట్ల రద్దు చేసి మోడీ ప్రజలను మోసం చేశాడు. క్యాష్ లెస్ కాదు.. మైండ్ లెస్ చర్య. రుణమాఫీపై రైతులు సంతృప్తిగా లేరు. ఒకే సారి రుణమాఫీ చేయాలి.
పాదయాత్రతో సానుకూల ఫలితాలు 
పాదయాత్రతో పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎక్కువగా ఉపయోగం జరుగుతుంది. పార్టీ బలంగా ఉన్నచోట్ల పాదయాత్ర గొప్పగా జరిగింది. గతంలో వర్గం మీద కేంద్రీకరించాం. కులంపై కేంద్రీకరించలేదు. మా తప్పును గుర్తించాం, అత్మవిమర్శ చేసుకుని...ఇప్పుడు కుల సమస్యపై కేంద్రీకరించాము. రాబోయే కాలంలో పోరాటలు ఉధృతంగా జరుగుతాయి. పాదయాత్ర సానుకూల ఫలితాలను ఇస్తుంది. 
వామపక్షాలే ప్రత్యామ్నాయం
ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ముందుకు రావాలి. సామాజిక తెలంగాణ కోరుకునే శక్తులందరు ఏకతాటిపైకి రావాలి. నేను ఆరోగ్యంగా ఉండి. చిరకాలం బతికి ప్రజలను సేవ చేయాలని ఉందని' అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

 

22:32 - January 8, 2017
22:31 - January 8, 2017
22:26 - January 8, 2017

యూపీ : సమాజ్‌వాదీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని తానేని ములాయం సింగ్‌ యాదవ్‌ చెప్పారు. శివపాల్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌ ఎస్పీ అధ్యక్షుడని, అఖిలేష్‌ యూపీ ముఖ్యమంత్రి మాత్రమే అని అన్నారు. జాతీయ స్థాయి సమావేశం నిర్వహించే అధికారం..  అఖిలేష్‌కు లేదన్నారు. సీఈసీకి అఖిలేష్‌ ఇచ్చిన జాబితాలో ఉన్నవి ఫోర్జరీ సంతకాలని చెప్పారు. రాంగోపాల్‌ యాదవ్‌పై ఎప్పుడో వేటు వేశామని ములాయం స్పష్టం చేశారు. అంతకుముందు రేపు పార్టీ గుర్తుపై ఈసీకి సమర్పించే నివేదికపై.. శివపాల్‌ యాదవ్‌, అమర్‌సింగ్‌.. ములాయం సింగ్‌ యాదవ్‌తో సమావేశం అయ్యారు. 

22:24 - January 8, 2017

ఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించేందుకు పబ్లిక్ అకౌంట్ కమిటీ సిద్ధమైంది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ.. కెవి.థామస్ ఆధ్వర్యంలోని కమిటీ... పటేల్‌ను ప్రశ్నించనుంది. ఆ మేరకు ఇప్పటికే తమ ప్రశ్నలను కూడా ఆర్బీఐ గవర్నర్‌కు పంపారు. ఈ వ్యవహారంపై... డిసెంబర్‌లోనే ప్రశ్నించాలని పీఏసీ భావించింది. అయితే.. నోట్లరద్దు సమస్యలు తీరేందుకు 50 రోజులు సమయం పడుతుందని ప్రధాని చేసిన ప్రకటన నేపథ్యంలో... ఇప్పుడు నోటీసులు జారీచేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో రెవెన్యూ సెక్రటరీ, ఫెనాన్స్ సెక్రటరీలకు కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నోటీసులు జారీచేసింది.

 

22:18 - January 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో గిరిజనులకు ఏక్కడైనా ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించారా అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో తెలంగాణ గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. జనాభా ప్రతిపాదికన గిరిజనులకు నిధులు కేటాయించాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తండాలన్నీటిని గ్రామ పంచాయతీలుగా మార్చాలని, మౌలిక వసతులు కల్పించాలని టీ.జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. 

 

22:16 - January 8, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాలో కాంగ్రెస్‌ కార్యకర్త తిరుపతిరెడ్డి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తిరుపతి రెడ్డిని అధికార పార్టీ నేతలే హత్య చేయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై మృతదేహంతో కాంగ్రెస్‌ శ్రేణులు బైఠాయించి.. ఆందోళన చేశారు. అధికార పార్టీ వేధింపులు తాళలేక కాంగ్రెస్‌ కార్యకర్త తిరుపతిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి  హత్యే అని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. అట్రాసిటీ కేసు వేధింపులు భరించలేక జైనథ్ మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి చెందిన కాటిపెల్లి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా మంత్రి అండదండలతో, స్థానిక ఎంపీటీసీ అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తిరుపతిరెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదుతో అటవీ శాఖ మంత్రి జోగురామన్న కుమారుడు జోగు ప్రేమేందర్‌ సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

22:13 - January 8, 2017

శ్రీలంక : ఏపీ రాజధాని అమరాతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు శ్రీలంక ఆసక్తి కనబర్చింది. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీలంక పర్యటనలో భాగంగా ఇవాళ కొలంబోలో పర్యటించారు. తీర ప్రాంతాల అభివృద్ధిలో ఆ దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతెన్నులను చంద్రబాబు బృందం పరిశీలించింది.  పర్యాటక, గృహనిర్మాణ, హోటళ్లు తదితర రంగాల్లో ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలపై చంద్రబాబు ఆక్కడి అధికారులతో చర్చించారు. వ్యాపారపరంగా విశాలమైన ఓడరేవు, పర్యాటకపరంగా మంచి పర్యావరణం, ఆర్థికాభివృద్ధికి దోహదపడే మౌలిక సౌకర్యాలు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి వరం అని శ్రీలంక పశ్చిమ ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి చంపిక రణవాక... బాబు బృందానికి వివరించారు. ఏపీలో కూడా కొత్త రాజధాని విషయంలో అనేక సవాళ్లు ఎదురువుతున్నా.. సంకల్పబలంతో ముందుకు వెళ్తున్నామని.. అమరావతి అభివృద్ధికి పశ్చిమప్రాంత అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌నూ పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు. 

 

22:02 - January 8, 2017

విజయవాడ : పోలవరం పనులు వేగవంతమవుతుంటే తల్లి, పిల్ల కాంగ్రెస్‌లకు కంగారు మొదలైందని మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు. జలయజ్ఞం పేరుతో కేవీపీ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని..అలాంటి వ్యక్తి ప్రాజెక్టులపై బహిరంగ చర్చలకు రమ్మనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ హయంలో పోలవరం అంచనాలు పెంచిన విషయం కేవీపీకి తెలియదా అని ప్రశ్నించారు. 

 

21:59 - January 8, 2017


హైదరాబాద్ : మీరు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు మీద పెట్రోలు పోయించుకుంటున్నారా..? అయితే మీకిది షాకింగ్‌ న్యూసే. సోమవారం నుంచి పెట్రోలు బంకుల యజమానులు ఏ కార్డునూ యాక్సెప్ట్ చేసేది లేదని స్పష్టం చేశారు. డబ్బులిస్తేనే పెట్రోలైనా డీజిలైనా పోస్తామని తెగేసి చెప్పారు. సో.. మీ జేబులో డబ్బుంటేనే పెట్రోలు బంకుకు వెళ్లండి. లేకుంటే తిప్పలు తప్పవు. 
ప్రజలకు మ‌రో షాక్ 
అస‌లే పెద్దనోట్ల ర‌ద్దుతో నానా ఇబ్బందులు ప‌డుతున్న దేశ ప్రజ‌ల‌కు మ‌రో షాక్ ఇవ్వడానికి సిద్ధమ‌య్యాయి పెట్రోల్ బంకులు. దేశ‌వ్యాప్తంగా సోమ‌వారం నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణయించింది. కార్డు ద్వారా జ‌రిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని బ్యాంకులు నిర్ణయించ‌డ‌మే దీనికి కార‌ణం. నగదు రద్దు తరువాత కార్డుల లావాదేవీలపై సర్ ఛార్జ్ ఎత్తేశారు. అయితే ఇప్పుడు మళ్లీ సర్‌ ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు.. దేశంలోని ప్రధాన బ్యాంకుల నుంచి పెట్రోలియం డీలర్లకు సమాచారం అందింది. ఈ ఆకస్మిక నిర్ణయంపై... పెట్రోల్ బంకుల య‌జ‌మానులు మండిప‌డుతున్నారు. 
పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు ఆందోళ‌న 
బ్యాంకులు విధించాల‌నుకున్న ఈ కొత్త చార్జీలు వినియోగ‌దారుల‌పై భారం మోప‌డం లేదని, దీంతో అదంతా త‌మ‌పై ప‌డుతుంద‌ని పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు ఆందోళ‌న చెందుతున్నాయి. దీనికి నిర‌స‌న‌గానే సోమ‌వారం నుంచి కార్డుల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని, కేవ‌లం న‌గ‌దు ఇస్తేనే పెట్రోలైనా డీజిలైనా పోస్తామని ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌మ్ డీలర్ల సంఘం స్పష్టం చేసింది. ఇది ల‌క్షలాది మంది వినియోగ‌దారుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగించే నిర్ణయ‌మే అని చాలామంది తప్పుపడుతున్నారు. 
మా ప‌రిస్థితి ఏంటి : డీలర్లు 
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త‌మ నెట్ ప్రాఫిట్‌ను 0.3 శాతం నుంచి 0.5 శాతంగా నిర్ణయించాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులు ఒక శాతం చార్జీ విధిస్తే మా ప‌రిస్థితి ఏంటి అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ స‌మ‌స్యను ప‌రిష్కరించాల్సిన ఓఎంసీలు త‌మ‌కు సంబంధం లేద‌న్నట్లు వ్యవ‌హ‌రిస్తున్నాయ‌ని, అందుకే అస‌లు కార్డులు తీసుకోకూడ‌ద‌ని నిర్ణయించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న అంద‌రు పెట్రోలియం డీల‌ర్లు స‌మ‌ష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నార‌ని, బ్యాంకులు ఈ ఒక శాతం చార్జీని తొల‌గించే వ‌ర‌కు కార్డుల‌ను అంగీక‌రించ‌బోమ‌ని ర‌వీంద్రనాథ్ స్పష్టం చేశారు. అస‌లే న‌గ‌దు కొర‌త వ‌ల్ల స‌త‌మ‌త‌మ‌వుతుండ‌టంతో పాటు కార్డుల ద్వారా పెట్రోల్ పోయించుకుంటే 0.75 శాతం క్యాష్‌బ్యాక్ అన్న ప్రభుత్వ ఆఫ‌ర్‌తో ఇప్పుడిప్పుడే ప్రజ‌లు భారీగా కార్డుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెట్రోల్ బంకులు వాటిని అంగీక‌రించ‌మంటే వాహనదారులకు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పవన్నది సుస్పష్టం.

ఈనెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళన : భూనిర్వాసితుల పోరాట కమిటీ

హైదరాబాద్ : జనవరి 12 నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ పిలుపు ఇచ్చింది. భూ నిర్వాసితుల పోరాట కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘాలు సంయుక్త నిరసనలకు సిద్ధం అయ్యాయి. భూ నిర్వాసితుల కేంద్రాల్లో సదస్సులు, సెమినార్లు, జీపు జాతాలు, సంతకాల సేకరణ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించాయి. 2013 భూసేకరణ చట్టం సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన భూములకు 2013 చట్టం ప్రకారం నస్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నేత టి.సాగర్ అన్నారు.

 

ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.నాగేశ్వర్ రావు, కోట రమేష్

రంగారెడ్డి : శంషాబాద్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభలు ఘనంగా ముగిశాయి. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.నాగేశ్వర్ రావు, కోట రమేష్ ఎన్నికయ్యారు. మహాసభలకు వివిధ జిల్లాల నుంచి మొత్తం 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 

 

21:10 - January 8, 2017
21:04 - January 8, 2017

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ మేరకు ఆర్.నారాయణమూర్తితో 10 టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తన సినిమా అనుభవాలను పంచుకున్నారు. కొత్త సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా విశేషాలు వివరించారు. సినిమా అందరికీ నచ్చుతుందని... అందరూ ఆదరించాలని కోరారు. జయసుధ పక్కన నటించడం తన అదృష్టమన్నారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం సినిమాకు తనకు మంచిపేరు తెచ్చిపెట్టిందని చెప్పారు. తనకు ఇంకా సినిమా పిచ్చి ఉందని.. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. 
నిర్మాతలు బాగుండాలని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు... ఆలోచన టాప్ అని... కానీ ఆచరణ అట్టర్ ప్లాప్ అని అన్నారు. తప్పుచేసిన వాన్ని శిక్షించాలన్నారు. ప్రజల కోసం మనం ప్రాణాలు పోగొట్టుకోకూడదని తెలిపారు. అందరూ బాగుండాలని కోరారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

శాతకర్ణి పతాకాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ

విశాఖ : నగరంలో శాతకర్ణి పతాకావిష్కరణ వేడుక జరిగింది. హీరో బాలకృష్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది పతాకావిష్కరణ మాత్రమే కాదు... రాబోయే విజాయానికి నాంది అని అన్నారు. శాతకర్ణి పాత్రను ఎన్ టీఆర్ పోషించాలనుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వల్లే ఈ పాత్ర చేయలేకపోయారని తెలిపారు.

 

కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత

సిద్ధిపేట : మిర్ దొడ్డి కస్తూర్బా బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 

ఏపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పొత్తుల మంతనాలు

హైదరాబాద్ : ఏపీలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పొత్తుల మంతనాలు జరుగుతున్నాయి. పొత్తులపై టీడీపీ, బీజేపీ మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ స్థానాన్ని తమకు కేటాయించాలని బీజేపీ.. టీడీపీని కోరుతోంది. ఇప్పటికే బీజేపీకి రాజ్యసభ, ఎమ్మెల్సీస్థానాలు ఇచ్చినందుకు రెండు స్థానాల్లోనూ పోటీకి దిగుతామని టీడీపీ అంటోంది. ఒత్తిడి ఎక్కువైతే నెల్లూరు..ఒంగోలు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.

19:38 - January 8, 2017

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు అంశం ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో కాక పుట్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతలు లేఖలు సంధించడం చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సవాల్‌ విసిరారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి బాబు సర్కార్‌ ప్రజాధనాన్ని దోచుకుంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రాజెక్టుల వద్దే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌  చేస్తూ చంద్రబాబుకు వేర్వేరుగా లేఖలు రాశారు. 
కాంగ్రెస్‌, టీడీపీల మధ్య జగడం 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ క్రెడిట్... కాంగ్రెస్‌, టీడీపీల మధ్య జగడానికి తెరలేపింది. ఆ క్రెడిట్‌ తమదే అంటూ ఇరు పార్టీలు వాదిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ నేత కేవీపీ  రామచంద్రరావు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖను రాస్తూ, దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని, బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్‌ చేశారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసిన  కేవీపీ, ప్రాజెక్టును తాము అడ్డుకుంటున్నానని మంత్రులు, చోటా నేతలతో చెప్పిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు స్థితిగతులు, గతంలో ఖర్చు చేసిన నిధులపై విజయవాడ లేదా మరెక్కడైనా చర్చించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. 
సీఎం చంద్రబాబుకు కేవీపీ బహిరంగ లేఖ 
పోలవరం ప్రాజెక్ట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి కృషి చేయలేదని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేవీపీ ఫైర్‌ అయ్యారు. అలాగే తనపై మంత్రి దేవినేని ఉమా పదేపదే ఆరోపణలు చేయడం సరికాదని, పోలవరంపై నిజానిజాలను ప్రజల  ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో దాదాపు 31 ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లపై ఆరోపణలు వచ్చినప్పుడు మేం బహిరంగ చర్చ పెట్టామని ఆయన లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబుకు రఘువీరా సవాల్ 
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం 16వేల కోట్ల నుంచి 40వేల కోట్లకు పెంచేశారని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు. అదేవిధంగా హంద్రీనీవా అంచనా వ్యయాన్ని 6వేల కోట్ల నుంచి 11వేల కోట్లకు  పెంచేశారని.. ప్రజా ధనాన్ని దోచుకునేందుకే సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచుతున్నారని ఆక్షేపించారు. ప్రాజెక్టుల వద్దే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేస్తూ రఘువీరా చంద్రబాబుకు లేఖ సంధించారు. 

 

18:50 - January 8, 2017

బ్యాంకు ఖాతాదారులకు ఇకపై పాస్ కార్డు లేదా ఫారం...60 తప్పనిసరి : కేంద్రం

ఢిల్లీ : బ్యాంకు ఖాతాదారులకు ఇకపై పాస్ కార్డు లేదా ఫారం...60 తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 28 లోపు బ్యాంకులు ఖాతాదారుల పాన్ కార్డు లేదా ఫారం..60 తీసుకోవాలన్నారు. 

నల్లకుంటలో వ్యక్తి అదృశ్యం

హైదరాబాద్ : నల్లకుంట పరిధిలో ఉపేందర్ అనే డ్రైవర్ అదృశ్యమయ్యాడు. ఉదయం ఇంటి నుంచి ఇద్దరు వ్యక్తులు ఉపేందర్ ను తీసుకెళ్లారు. అప్పు కట్టలేదని ఉపేందర్ ను తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
 

రేపటి నుంచి కర్ణాటక పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్టుల నిరాకరణ

బెంగళూరు : రేపటి నుంచి కర్ణాటక పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్టులను అంగీకరించకూడదని అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం నిర్ణయం తీసుకున్నారు. కార్డుల ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం ఛార్జీ వసూలు చేయనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

భద్రాద్రి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

భదాద్రి : భద్రాద్రి సీతారామచంద్రస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వేదమంత్రోచ్చరణతో పండితులు ఘనస్వాగతం పలికారు. గోదావరి  తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాది తరలివచ్చారు. 

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ఖమ్మం : ఎస్ ఆర్ ఎస్ గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ములాయంతో ముగిసిన అమర్ సింగ్ భేటీ

ఢిల్లీ : ములాయం సింగ్ యాదవ్ తో అమర్ సింగ్ భేటీ ముగిసింది. తాను సామాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడినని ములాయసింగ్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు.

18:03 - January 8, 2017

జనగామ : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. మహాజన పాదయాత్రకు ప్రజా గాయకుడు గద్దర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తన ఆటా పాటలతో అలరించాడు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమ గీతాలు పాడి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'మనది పాలకపక్షం కాదు.. ప్రతిపక్షం కాదని.. ప్రజల పక్షం' అని అన్నారు. ఇబ్రహీంపట్నంలో 2016అక్టోబర్ 8న సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర బృందానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వం వహిస్తున్నారు. తొమ్మిది మంది బృందంతో పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే పాదయాత్ర రెండు వేల కిలో మీటర్లకు పైగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పార్టీలకతీతంగా నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. అశేషజనవాహని పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బడుగు,   బలహీన వర్గాల ప్రజలు తమ సమస్యలను బృందానికి ఏకరువుతుపెడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 
 

17:51 - January 8, 2017

హైదరాబాద్ : చంపాపేట్‌లో ఎస్‌ఎస్ ఫైబర్‌టెక్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. ఆస్తినష్టం భారీగా జరిగినా.. ప్రాణనష్టం జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 

17:44 - January 8, 2017

భువనేశ్వర్ : ఒడిశాలో రైల్వే పోలీసుల దారుణం వెలుగుచూసింది. శారీరక వైకల్యం కలిగిన వ్యక్తిపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన వ్యక్తిని బాలాసోర్ జిల్లాలో రైల్వే పోలీసులు కాలుతో తన్నుతూ పైశాచికంగా ప్రవర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

17:38 - January 8, 2017

విజయవాడ : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం ఆంధ్రప్రదేశ్‌లో కన్నుల పండువగా జరిగింది. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల, సింహాచలం తదితర ప్రముఖ ఆలయాలు భక్తుల రద్దీతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. 
ఆలయాల్లో భక్తుల రద్దీ 
పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏపీలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠంలోని అన్ని క్యూ కాంప్లెక్స్‌లతో పాటు.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 16 కంపార్టమెంట్లూ భక్తులతో నిండిపోయాయి. రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు విఐపీలు శ్రీవారిని దర్శించుకోగా తెల్లవారుజామున 4 గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించారు. 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు 
వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, మృణాళిని, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, అవంతి శ్రీనివాస్‌, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు వివేక్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సినీనటుడు మోహన్‌బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుని.. ఉత్తర ద్వార ప్రవేశం కలగడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ 
ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విశాఖలోని సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆయన సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆయన నటించిన 150వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి అఖండ విజయం సాధించాలని ఆయన అప్పన్నను వేడుకున్నారు. కాగా..సింహాచలం అప్పన్న దర్శనానికి విచ్చేసిన బాలకృష్ణకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు   
చిన్న తిరుపతిగా పేరుగాంచిన పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారి దర్శనం ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి.  
గుంటూరు జిల్లాలో 
గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఏకాదశిరోజున ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులుతీరారు. పిడుగురాళ్ల, బాపట్లలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు వేలాది మంది భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 4గంటల నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో 
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు సత్యదేవుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరించారు. ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కల్పించారు. అటు నెల్లూరులోని వైష్ణవ ఆలయాలన్నీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు అనంతపురం జిల్లాలో అంగరంగవైభవంగా జరిగాయి. అనంతపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. కదిరిలోని లక్ష్మీనరసింహా స్వామిదేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ధర్మవరంలోని వేణుగోపాలస్వామి ఆలయం, తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలోవైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా క‌డ‌ప న‌గ‌రంలోని వెంక‌టేశ్వరస్వామి తొలి గ‌డ‌ప దేవుని క‌డ‌ప‌లోని వెంక‌న్న ఆల‌యానికి ఉద‌యం నుంచే భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. 
శ్రీ కూర్మనాథ ఆలయంలో 
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కూర్మనాథ ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకవటం వల్ల కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. కనీసం క్యూ లైన్లు పర్యవేక్షించేందుకు సిబ్బంది సైతం లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
విజయవాడలో  
అటు విజయవాడలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వెంకటేశ్వర ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలో భక్తులను ఆకట్టుకున్నాయి. 

 

17:31 - January 8, 2017

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు మైనార్టీలపై ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్థలు అమానుషమైన దాడులు చేస్తున్నాయని ఏపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత హక్కుల సాధన సమితి హైదరాబాద్ నగర సదస్సు జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనిర్శిటీలో రోహిత్ వేముల లాంటి దళిత విద్యార్థిని మతోన్మాద శక్తులు వేధించి ఆత్యహత్యకు పురికొల్పాయని ఆరోపించారు. గోరక్షక దళాలను తక్షణమే నిషేధించాలని, దేవాలయాల్లో అందరికీ పౌరోహితం కల్పించాలని వక్తలు డిమాండ్ చేశారు. దాడులకు వ్యతిరేకంగా జనవరి 22న ఇందిరాపార్క్ దగ్గర దళిత హక్కుల సాధన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. 

 

సీపీఎం మహాజనపాదయాత్రకు గద్దర్ సంఘీభావం

జనగామ : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. మహాజన పాదయాత్రకు ప్రజా గాయకుడు గద్దర్ సంఘీభావం తెలిపారు. 

17:12 - January 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన యాదాద్రి, వేములవాడ, ధర్మపురి పుణ్యక్షేత్రాలతో పాటు పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు తరలిరావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపించింది. 
కన్నుల పండువగా వైకుంఠ ఏకాదశి
పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం తెలంగాణలో కన్నుల పండువగా జరిగింది. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. భారీగా తరలివంచిన భక్తులు వైకుంఠ  ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి దేవస్థానంతో పాటు కొండ కింద కొలువైన పాతగుట్ట దేవాలయంలో కూడా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. యాదాద్రి పునర్నిర్మాణం దృష్ట్యా కొండపైన వైకుంఠ ద్వార దర్శనానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో స్వయంభూ అయిన పాతగుట్ట దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా... కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దేవతా మూర్తులను పూలతో అలంకరించి ఆలయ ఉత్తర ద్వారం దగ్గర దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో.. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనంకోసం భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శన పూజను పండితులు పూర్తిచేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ బాల్క సుమన్‌, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 
మహబుబ్ నగర్ జిల్లా వైష్ణవ ఆలయాల్లో     
మహబుబ్ నగర్ జిల్లా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు  భక్తజనం పోటెత్తారు.  
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో
అటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వట్టెంలోని వేంకటేశ్వర ఆలయం, అచ్చంపేటలోని ఉమామహేశ్వరాలయం, కల్వకుర్తిలోని వేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడాయి. పలు వైష్ణవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వనపర్తిలో
వనపర్తిలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌ గౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు. 
హైదరాబాద్‌ లో 
ఇక హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. స్వామి వారి దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించిన తర్వాత దర్శనానికి భక్తులను అనుమతించారు. పలువురు ప్రముఖులు  చిక్కడపల్లి బాలాజీని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  
మేడ్చల్‌ జిల్లాలో  
అటు మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన క్యూలైను ఏర్పాటు చేశారు. మరోవైపు కీసర మండలం చీర్యాలలోని శ్రీలక్ష్మీనరసిహ్మస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. సదాశివపేట నుంచి శంషాబాద్ వెళ్తున్న కారు మార్గంమధ్యలో నార్సింగి పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

17:08 - January 8, 2017

రంగారెడ్డి : జిల్లాలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. సదాశివపేట నుంచి శంషాబాద్ వెళ్తున్న కారు మార్గంమధ్యలో నార్సింగి పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:31 - January 8, 2017

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దీప ఆశాదీపంగా కనిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడులు దీప ఏఐఏడీఎంకే రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని విశ్లేష్తున్నారు. తన అత్త జయలలిత ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన దీప.. సరైన తరుణం కోసం వేచి చూస్తున్నారు. 
రాజకీయ ప్రకంపనలు 
దీప... తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సంచలన నేతగా మారుతున్నారు. జయలలితకు నిజమైన వారసురాలిని తానేనంటూ ప్రకటనలు చేస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏఐఏడీఎంకే నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్న జయకుమార్‌ కూతురు దీప. జయలలిత ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు కూడా అనుమతించకపోవడం దీపను కలిచివేసింది. దీంతో జయకు  అందించిన వైద్యంపై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శశికళ కనుసన్నల్లో జయకు జరిగిన వైద్యంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసి, కలకలం సృష్టించిన దీపకు ఏఐఏడీకే కార్యకర్తలు జేజేలు పలుకుతున్నారు. జయలలిత ఆశయసాధన కోసం రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. 
దీప నివాసానికి క్యూ కడుతున్న అన్నాడీఎంకే కార్యకర్తలు 
జయలలిత నెచ్చెలి శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాంతాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజువారీగా చైన్నైకి భారీగా తరలివస్తున్నఏఐఏడీకే కార్యకర్తలు, నేతలు నేరుగా దీప నివాసానికి వస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నారు.  దీప కూడా తన నివాసానికి తరలివస్తున్న కార్యకర్తలను నిరుత్సాహ పరచకుండా తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని హామీ ఇస్తున్నారు. అచ్చం జయలలిత తరహాలో హావభావాలు ప్రదర్శిస్తూ చేస్తున్నప్రసంగాలు అన్నా డీఎంకే కార్యకర్తలను  ఆకట్టుకుంటున్నాయి. 
అన్నాడీఎంకే శిబిరంలో ప్రారంభమైన కలవరం
జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నియోజకర్గం నుంచి శశికళ పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఓటర్ల మనోగతం మరోలా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అమ్మకు ఓట్లేసిన  తాము శశికళ పోటీ చేస్తే ఓట్లేయబోమని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే శిబిరంలో కలవరం ప్రారంభమైంది. దీనిని ప్రాతిపదికగా తీసుకుని దీపను రాజకీయల్లోకి తీసుకొచ్చేందుకు కొందరు అన్నా డీఎంకే నేతలు కూడా తెరవెనుక ప్రయత్నిస్తున్నారని తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.  దీప కూడా రోజువారీ రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ, సమయంలో కోసం వేచిచూస్తున్నారు. దీప రాజకీయ రంగప్రవేశం తర్వాత తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 

 

16:20 - January 8, 2017

చంపాపేట్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : చంపాపేట్ లోని ఎస్ ఎస్ ఫైబర్ టెక్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతోంది.

బాణసంచా పేలుడు ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు : పార్లుకట్ట బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు ఇవాళ మృతి చెందారు. మృతదేహంతో వీఆర్సీ సెంటర్ వద్ద యానాదుల సమాఖ్య ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

16:04 - January 8, 2017

బెంగళూరు : దేశ సామాజికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. హిందీ, ఇంగ్లీషులో ప్రసంగించిన మోడీ.. ఎన్ ఆర్ఐలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రవాస భారతీయులు ఏటా 69 బిలియన్‌ డాలర్లను దేశానికి పంపుతున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 

 

15:59 - January 8, 2017

గుంటూరు : అమరావతి మారధాన్‌ 21 కిలోమీటర్ల పరుగు పందెంలో విజయం సాధించిన అభ్యర్థులకు నగదు బహుమతులను అందచేశారు. 21 కిలోమీటర్ల మహిళా విభాగంలో మొదటి బహుమతి పొందిన రాహెల్‌కు లక్షా 20వేలు, రెండొవ బహుమతి సాధించిన నేహాసింగ్‌కు 80వేలు, మూడో బహుమతి పొందిన ఇజ్రాయల్‌కు 70వేలు చెక్కులను వారికి అందచేశారు. అలాగే 21 కిలోమీటర్ల పురుషుల విభాగంలో మొదటి బహుమతి బి. శ్రీనివాస్‌, రెండో బహుమతి దీపక్‌ కుమార్‌, మూడో బహుమతి కిరణ్‌కు కూడా చెక్కులను అందచేశారు. ఇక 10 కిలోమీటర్ల విభాగంలోనూ విజయం సాధించిన వారికి కూడా బహుమతులను అందచేశారు. 

 

15:57 - January 8, 2017

సిద్ధిపేట : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సిద్ధిపేట లోని మోహినిపుర వెంకటేశ్వర ఆలయంలో మంత్రి హరీష్‌రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయసిబ్బంది మంత్రి హరీష్‌రావుకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకుమజాము నుంచే ఆలయానికి బారులు తీరారు. 

 

15:13 - January 8, 2017

కాకినాడ : ఏపీలో బీచ్ ఫెస్ట్ సందడి మొదలవుతోంది. ఏటా సంక్రాంతికి.. నిర్వహించే సాగర సంబరాలకు.. తీరప్రాంతాలు సిద్ధమవుతున్నాయి. అయితే కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఫెస్ట్ పనులు నత్తనడకన సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ బీచ్ ఫెస్టివల్ పనుల్లో అలసత్వంపై టెన్ టీవీ ప్రత్యేక కథనం. 
నత్తనడకన సాగుతున్న పనులు  
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నెల రెండు పండుగలను తెస్తోంది. ఒకటి సంక్రాంతి అయితే.. రెండోది సాగరతీరంలో నిర్వహించే బీచ్‌ ఫెస్టివల్‌. సాగరతీర పండుగ కోసం.. సముద్రతీర ప్రాంతాలన్నీ ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ముఖ్యంగా కాకినాడలో బీచ్‌ ఫెస్ట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అయితే, పనులు నత్తనడకన సాగుతుండడమే, పండుగ సక్రమ నిర్వహణపై అనుమానాలను పెంచుతోంది. 
కాకినాడ బీచ్ కు పోటెత్తుతున్న పర్యాటకులు  
కాకినాడ బీచ్ నిత్యం పర్యాటకులతో పోటెత్తుతుంటుంది. ఇటీవల టూరిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా సాగరతీరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కాకినాడ బీచ్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా వచ్చిన 72కోట్ల రూపాయలనూ సాగరతీర అభివృద్ధికి కేటాయించారు. 
అట్టహాసంగా బీచ్ అభివృద్ధి పనులు ప్రారంభం
కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి కోసం అట్టహాసంగా పనులు ప్రారంభించారు. కానీ అధికార యంత్రాంగం అలసత్వంతో అది ఆరంభశూరత్వంగా మిగిలిపోయింది. 62 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. పర్యవేక్షణ లేకపోవడంతో పనులన్నీ తూతూమంత్రంగా సాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 12 వ తేదీన బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సివుంది. కానీ పనులు ఇప్పటికీ పది శాతం కూడా పూర్తి కాలేదు. 
నాణ్యత ప్రమాణాలను మరిచిపోయిన కాంట్రాక్టర్స్ 
టూరిజం అభివృద్ధిలో భాగంగా పార్క్‌లో లోల్యాండ్ స్కేప్, ఫౌంటేన్లు సహా పలు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన పనులు చూస్తే నాణ్యత లేమి ఏమేరకు ఉందో అర్థమవుతుంది. కాంట్రాక్టర్లు కనీస ప్రమాణాలూ పాటించకుండా నాసిరకం పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
నాసిరకంగా సాగుతున్న పనులపై విమర్శలు
పనుల నాణ్యతపై పలువురు పెదవి విరుస్తున్నారు. భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులే ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. 
పూర్తికాని బీచ్ అభివృద్ధి పనులు
మరో వైపు బీచ్ అభివృద్ధి పనులు పూర్తి కాకముందే ఈ ఏడాది బీచ్ ఫెస్టివల్‌ ను ఆడంబరంగా నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఏకంగా మూడు కోట్ల రూపాయల మేర వెచ్చించి ఫెస్ట్‌ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు మంత్రులు చెబుతున్నారు. అరకోరగా పూర్తయిన పనులకే ప్రారంభోత్సవం కూడా చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పూర్తి కాని పనులను చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అక్కరకు రాకుండా పోతోంది. ఇదే నాణ్యతా లోపాలు కొనసాగితే సుదీర్ఘకాలం అందుబాటులో ఉండాల్సిన పనులు స్వల్పకాలానికే పాడైపోయే పరిస్ధితి కనిపిస్తోంది. 

 

15:06 - January 8, 2017

హైదరాబాద్ : సంక్రాంతికి తెలంగాణకు 2వేల 430 ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగరాజు తెలిపారు. ఏపీకి 750 బస్సులు నడుస్తాయని ప్రకటించారు. ఇన్ని బస్సుల రాకపోకలతో ఎంజీబీఎస్ లో ట్రాఫిక్‌ జాంలుకాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. నల్లగొండ వెళ్లే బస్సులు ఎల్ బీనగర్‌ నుంచి వరంగల్‌ బస్సులు ఉప్పల్‌ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. 

 

నారాయణగిరి పార్కు క్యూలైన్లలో ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ

తిరుమల : నారాయణగిరి పార్కు క్యూలైన్లలో ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ భక్తుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అశ్విని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు వాపోయారు.

 

బ్యాంకుల డిపాజిట్ల వివరాలు కోరిన ఐటీ శాఖ

ఢిల్లీ : ఐటీ శాఖ అధికారులు బ్యాంకులను డిపాజిట్ల వివరాలు కోరారు. ఏప్రిల్..నవంబర్ మధ్య డిపాజిట్ అయిన డబ్బుల వివరాలు ఇవ్వాలని అధికారులు బ్యాంకులను కోరారు. 

 

వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

శ్రీలంక : వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో హోటళ్లు, గృహ నిర్మాణాలపై చర్చిస్తోన్నారు. 

తిరుమలలో ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ..

చిత్తూరు : తిరుమల నారాయణగిరి పార్కు క్యూ లైన్ లో ఇద్దరు భక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ భక్తుడి తలకు తీవ్రగాయం కావడంతో అశ్విని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు పేర్కొన్నాడు.

డిపాజిట్ల వివరాలు కోరిన ఐటీ..

ఢిల్లీ : డిపాజిట్ల వివరాలను తెలపాలని బ్యాంకులను ఐటీ శాఖ కోరింది. ఏప్రిల్ - నవంబర్ మధ్య డిపాజిట్ అయిన డబ్బుల వివరాలు ఇవ్వాలని పేర్కొంది.

స్వర్ణభారత్ ట్రస్టు ప్రథమ వార్షికోత్సవం..

కృష్ణా : జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారత్ ట్రస్టు ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాల్గొన్నారు.

బాబు శ్రీలంక పర్యటన..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీలంక పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై శ్రీలంకలో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.

13:39 - January 8, 2017
13:37 - January 8, 2017

విజయవాడ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని పలు దేవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రసిద్ధిగాంచిన శ్రీక్షీరభావన్నారయణస్వామి, శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. సూర్యలంక సముద్రతీరం వద్ద భక్తులు, పర్యాటకులుతో కిటకిటాడింది.

కడపలో...
ముక్కోటీ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. కడప నగరంలోని వెంకేటశ్వర స్వామి తొలిగడప దేవుని కడప వెంకన్న ఆలయానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:35 - January 8, 2017

~ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విశాఖలోని సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ కల్పించడం పట్ల ఆనంద వ్యక్తం చేస్తూ...సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ శాతకర్ణీపై సినిమా చేయాలనకున్నారని...కానీ ఆ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లడంతో వీలుకాలేదన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణీ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈరోజు సాయంత్రం జ్యోతి థియేటర్‌లో గౌతమీపుత్ర శాతకర్ణి పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. ఆంధ్ర తెలంగాణలోని 100 ధియేటర్లలో ఈరోజు నందమూరి అభిమానులు జెండా ఎగురవేస్తారని విశాఖ ఎమ్మెల్యే వెగపూడు రామకృష్ణ తెలిపారు.

13:33 - January 8, 2017

నల్గొండ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివంచిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. యాదాద్రి దేవస్థానంతో పాటు కొండ కింద కొలువైన పాతగుట్ట దేవాలయంలో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. యాదాద్రి పునర్నిర్మాణం దృష్ట్యా కొండపైన వైకుంఠం ద్వారా దర్శనానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో స్వయంభూ అయిన పాతగుట్ట దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

13:31 - January 8, 2017
13:30 - January 8, 2017

జనగాం : సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర 84వ రోజుకు చేరింది. జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. మైలారం, ధర్మపురం, విసునూరు, పాలకుర్తి, దరదెపల్లి, వావిలాల గ్రామాల్లో బృందం పాదయాత్ర చేస్తోంది. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాలకుర్తిలో జరిగే సభలో ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొననున్నారు. ప్రజలను ఉద్దేశించి తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భవించి రెండున్నరేళ్లు గడిచిపోయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని తమ్మినేని విమర్శించారు.

13:28 - January 8, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించడానికి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం సూచించారు. నగరాలకు వలసలు తగ్గలాంటే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రెండో మహాసభలను కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేట్‌ విద్య, ప్రభుత్వ విద్యా విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రధానంగా ప్రస్తావించారు. అభివృద్ధి ఫలాలు గ్రామాలకు చేరాల్సిన అంశాన్ని కోదండరాం ప్రస్తావించారు.

13:26 - January 8, 2017

కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు కాపు నేత ముద్రగడ మరోసారి లేఖ రాశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఎన్నేళ్లు నిరీక్షించాలని ముద్రగడ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అందులో ప్రశ్నించారు. చావో బతుకో తప్ప తమ పోరాటానికి విరామం లేదన్నారు. రిజర్వేషన్లు ఇవ్వాలంటే మా నుంచి ఏమి ప్రతిఫలం కోరుకుంటున్నారని ముద్రగడ ప్రశ్నించారు.

13:25 - January 8, 2017

గుంటూరు : కార్పొరేట్‌ కళాశాలల నిర్లక్ష్యంవల్లే వంశీతో పాటు నవీన, చంద్రశేఖర్‌ దంపతులు మృతి చెందారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. గుంటూరులోని శ్రీచైతన్య కాలేజ్‌ముందు విద్యార్థి సంఘం నేతలు నిరసన చేపట్టారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
అనారోగ్యంతో కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు నవీన, చంద్రశేఖర్ లు ఆత్మహత్య చేసుకున్నారు. గత నవంబర్‌ 22న శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి వంశీ అనారోగ్యంతో కన్నుమూశాడు. కొడుకు లేడన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మనస్తాపంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

13:22 - January 8, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ ఘాటు లేఖ రాశారు. పోలవరంపై కేవీపీ పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవీపీపై తెలుగు తమ్ముళ్లు పలు విమర్శలు..ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనితో ఆదివారం బాబుకు లేఖ రాశారు. పోలవరంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి కేవీపీ డిమాండ్ చేశారు. ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారని..ఆ ఆరోపణలన్నీ నిరూపించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేవీపీ ప్రశ్నించారు.

13:20 - January 8, 2017
13:19 - January 8, 2017
12:56 - January 8, 2017
12:48 - January 8, 2017

మువ్వా పద్మావతి రంగయ్య పౌండేషన్, తానా సంయుక్తంగా ఖమ్మంలో సాహితీ సాంస్కృతిక సంబురాలు నిర్వహించారు. మువ్వా పౌండేషన్ అధ్యక్షులు మువ్వా శ్రీనివాస్ రావు, తానా అధ్యక్షులు జంపాల చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, గోరటివెంకన్నలతో పాటు పలువురు కవులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఆ సాహితీ మహోత్సవం విశేషాలేంటో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:42 - January 8, 2017

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యానికి ప్రజలకు మధ్య చైతన్య వారధిగా నిలుస్తుంది. ప్రతి దేశంలో కవులు కళాకారులే ఉద్యమాలకు ఊపునిచ్చారు. ప్రజలను పోరుబాట పట్టించారు. అలాంటి వారిలో తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వోద్యమానికి దిక్సూచిగా నిలిచిన కవి నగ్నముని. నగ్నముని..... ఈ పేరు వింటేనే దిగంబర సాహిత్యోద్యమం చప్పున గుర్తొస్తుంది. దివిసీమ ఉప్పెన నేపథ్యంతో నగ్నముని సృష్టించిన కొయ్యగుర్రం మహాకావ్యం కళ్లముందు కనిపిస్తుంది. దోపిడీ వ్యవస్థ కారణాలు ..కాలానికి తెలుసు.. కారల్ మార్క్స్ కు తెలుసంటూ నాడు కవితా ప్రభంజనాన్ని సృష్టించిన గొప్పకవి నగ్నముని. అతడొక తిరగబడ్డ అక్షరం. మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ సాహిత్య పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రఖ్యాత కవి నగ్నముని పై ప్రత్యేక కథనం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:31 - January 8, 2017

రాజమండ్రి : మళ్లీ కాపు ఉద్యమ నేత ముద్రగడ గళమెత్తారు. గత కొన్ని రోజులుగా ఆయన కాపు ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. గతంలో నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు కూడా చేశారు. వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలతో ముద్రగడ భేటీ కూడా అయ్యారు.
ఆదివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘చావో..రేవో తప్ప మా పోరాటానికి విరామం లేదు..మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తే మీరు ఓడిపోవడం ఖాయం. బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే మీకు మేం ఏమిచ్చుకోవాలని చెప్పాలి. బీసీలను రెచ్చగొట్టడం మానుకోవాలి. బీసీలతో పాటు గిరిజనులు, హరిజనులు అని కులాల వారు మద్దతు తెలుపుతున్నారు’. అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా కాపు నేతలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

 

ఆరోపణలు నిరూపించాలన్న కేవీపీ..

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖను రాశారు. దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలని ఇందుకు తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

12:21 - January 8, 2017

పంజాబీ బ్యూటీ 'రకూల్ ప్రీత్ సింగ్' ఇక నేనే నెంబర్ వన్ అంటోంది. గత ఎడాది వరుస విజయాలతో జోరు చూపించిన ఈ బ్యూటీ 2017 కూడా తనదే అంటోంది. అంతేకాదు ప్రస్తుతం ఈ పొడుగు సుందరికి పోటీ ఇచ్చే హీరోయిన్స్ కూడా లేరని చెప్పాలి. ఈ ఇయర్ కూడా తనదే అని 'రకూల్ ప్రీత్' ఇంత డేర్ గా చెప్పడానికి రిజన్ ఏంటీ ? 'రకూల్ ప్రీత్ సింగ్' ని ప్రజెంట్ టాలీవుడ్ లక్కీ మస్కట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని క్రేజీ సినిమాలన్నింటిని ఈ బ్యూటీనే కజ్జా చేసి చేతిలో పెట్టుకుంది. గత ఎడాది వరుస విజయాలతో టాప్ పొజిషన్ కి చేరుకున్న ఈ బ్యూటీ ఈ ఎడాది నెంబర్ వన్ ప్లేస్ ని చేజిక్కించుకుంటానని ఫుల్ కాన్పిడెంట్ గా ఉంది. ఇందుకు ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఉన్న బడా సినిమాలకే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.

2016లో..
2016 'రకుల్' కెరీర్‌కి మెమరబుల్ ఇయర్ గా మిగిలిపోయింది. గత ఎడాది 'ఎన్టీఆర్' తో నటించిన 'నాన్నకు ప్రేమతో’, 'బన్నీ'తో నటించిన 'సరైనోడు’, 'రామ్ చరణ్' కి జోడిగా చేసిన 'ధృవ' బిగ్ సక్సెస్ లు గా నిలిచాయి. ఇలా హ్యట్రిక్ సక్సెస్ లతో ఈ పంజాబీ బ్యూటీ ఒక్కసారిగా తారపథంలోకి దూసుకుపోయింది. లాస్ట్ ఇయర్ ఒక్క 'రకూల్' కి తప్పా వేరే ఏ హీరోయిన్ ఖాతాలో కూడా ఈ రేంజ్ హిట్స్ లేవని చెప్పాలి. 2016లో 'సమంత' కూడా 'అ..ఆ’, 'జనతా గ్యారేజ్' మూవీస్ తో బిగ్ హిట్స్ అందుకుంది. కానీ ఆమె నటించిన 'బ్రహ్మోత్సవం' మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో గత ఎడాదిలో 'రకూల్' పై చేయి సాధించింది. ఇక ఈ ఎడాది అయితే ప్రతి పెద్ద సినిమాలో 'రకూల్' నే హీరోయిన్ గా తీసుకోవడం విశేషం.

2017లో..
ఈ ఎడాదిలో 'రకూల్' నటించే 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇన్ని సినిమాలు మరే హీరోయిన్ చేతిలో లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ 'మహేష్ బాబు'తో జోడి కట్టుతున్న 'సంభవామి' మూవీ ఎప్రిల్ లో రిలీజ్ కానుంది. అదే విధంగా 'సాయిధరమ్ తేజ్' తో 'విన్నర్’, 'నాగచైతన్య' తో ఓ మూవీ, బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ లో నటిస్తోంది. వీటితో పాటు 'పవన్' కొత్త మూవీలో కూడా 'రకూల్' నే అనుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ అయిన 'సమంత' చేతిలో సినిమాలు లేవు. 'కాజల్' మాత్రం 'చిరంజీవి ఖైదీ నెంబర్ 150'లో నటిస్తోంది. ఇక కొత్త బ్యూటీ 'అనుపమ పరమేశ్వరన్' ఇప్పుడిప్పుడే చాన్స్ లు అందిపుచ్చుకుంది. దీన్ని బట్టి 'రకూల్' టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అనేదే ఫిక్స్ అయిపోవచ్చు.

బెంగళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్..

బెంగళూరు : రాష్ట్రంలో 14వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పోర్చుగల్ ప్రధాని ఆంటోనీయోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 30 మిలియన్ల మంది భారతీయులు నివాసం ఉంటున్నారని, భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, భారతీయులు కష్టజీవులని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐల సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యతనిస్తామని, త్వరలో ప్రవాసీ కౌశల్ పథకం ప్రారంభిస్తామన్నారు.

12:10 - January 8, 2017

గుంటూరు : 'శ్రీ చైతన్య స్కూల్ నిర్లక్ష్యం వల్లే మర్డర్స్ జరిగాయి. న్యాయం చేస్తామని చెప్పి చేయలేదు. తల్లిదండ్రుల మృతికి స్కూల్ యాజమాన్యమే కారణం' అని వివిధ ప్రజా సంఘాల నేతలు, పార్టీ నేతలు పేర్కొన్నారు. నవంబర్ 22వ తేదీన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న వంశీ తీవ్ర జ్వరంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి స్కూల్ యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు నవీనా, చంద్రశేఖర్ ఆందోళన చేపట్టారు కూడా. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీనా..చంద్రశేఖర్ లు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు.. పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారితో టెన్ టివి మాట్లాడింది. వెంటనే స్కూల్ యాజమ్యానాన్ని అరెస్టు చేయాలని, స్కూల్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఛైర్మన్ ను అరెస్టు చేయాలని వంశీ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు కోరారని, కానీ స్పందించ లేదని తెలిపారు. సుమారు ఏడు వందల మంది విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేత డిమాండ్ చేశారు.

12:01 - January 8, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' నాన్ 'బాహుబలి' రికార్డ్స్ ని తుడిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 'ఖైదీ నెంబర్ 150’ సినిమా థ్రియేట్రికల్ రైట్స్ తో అదరహో అనిపిస్తోంది. 'చిరు' 'ఖైదీ నెంబర్ 150’ మూవీని బిలియన్ క్లబ్ లో చేర్చాలని ప్లాన్ చేస్తున్నాడంట. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ 'ఖైదీ నంబర్ 150'కి ఆల్ టైం బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. 'ఖైదీ నంబర్ 150’ సూపర్ హిట్టు అనిపించుకోవాలంటే 100 కోట్లను రాబట్టాల్సిందే అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మెగాస్టార్ రీ ఏంట్రీ మూవీ కావడంతో అన్ని ఏరియాల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. 'ఖైదీ నంబర్ 150’ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ హక్కులను భారీ మొత్తానికి 90 కోట్లకు అమ్మినట్లు వినికిడి.

ఏరియాల వైజ్..
ఏరియాల వైజ్ గా చూస్తుంటే నైజాంలో 'ఖైదీ' మూవీని 23 కోట్లకు తీసుకున్నారట. ఇక సీడెడ్ లో 11 కోట్లు, ఉత్తరాంధ్రలో 7 కోట్లు, గుంటూరు 6కోట్లు, కృష్ణాలో 4కోట్లు, ఈస్ట్ లో 5 కోట్లు, వెస్ట్ లో 4 కోట్లు, నెల్లూరు ఏరియాకు 3 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. అంటే టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే 66 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్నమాట. ఇక కర్నాటకలో 8 కోట్లు, తమిళనాడులో కోటొ, రెస్టాఫ్ ఇండియాలో కోటి బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అదే విధంగా ఓవర్సీస్ హక్కులను 12 కోట్లకు విక్రయించారంట. టోటల్ గా 89 కోట్లు థియేట్రికల్ రైట్స్ వచ్చాయి. ప్రింట్స్, పబ్లిసిటీ ఖర్చులు కూడా కలుపుకుంటే మొత్తం 92 కోట్లు అవుతోంది. దీంతో మెగాస్టార్ మూవీ 'వంద కోట్లు' కలెక్ట్ చేస్తేనే సూపర్ హిట్టు కేటగిరీలోకి చేరుతుంది.

రూ. 150 కోట్లు..
'ఖైదీ నెంబర్ 150’ మూవీ టార్గెట్ నాన్ బాహుబలి రికార్డ్స్ గా కనిపిస్తోంది. 'బాహుబలి' మినహాయించి 'శ్రీమంతుడు’, 'జనతా గ్యారేజ్’, సినిమాలు సెకెండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. అంటే 'చిరు' మూవీ మ్యాగ్జిమం 150కోట్లు కలెక్ట్ చేస్తేనే సెకెండ్ ప్లేస్ లోకి వస్తోంది. వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ ఈమూవీకి దర్శకత్వం వహించడం ప్లస్. గతంలో 'చిరంజీవి’, 'వినాయక్' 'ఠాగూర్' లాంటి బిగ్ హిట్టు అందించారు. ఆ సెంటిమెంట్ ని 'ఖైదీ' నెంబర్ తో రిపీట్ చేస్తారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ బట్టి చూస్తుంటే సూపర్ హిట్టు టాక్ వస్తే 150 కోట్లు పెద్ద కష్టమేమి కాదు. మరి టాక్ అటు ఇటు అయితే మాత్రం అందరికి భారీ నష్టాలు తప్పవు.

11:56 - January 8, 2017

సౌత్ లో ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరో మాట్లాడానికే ఈగో తో ఫీలవుతారు. కానీ బాలీవుడ్ అందుకు మినహాయింపు. బాలీవుడ్ కండలవీరుడు 'సల్మాన్ ఖాన్' మరో స్టార్ హీరో 'అక్షయ్ కుమార్' తో మూవీ చేస్తున్నాడు. అయితే ఇది మల్టీస్టార్ మూవీ మాత్రం కాదు. 'అక్షయ్ కుమార్' హీరో నటించే ఈ సినిమాను 'సల్మాన్ ఖాన్' నిర్మిస్తుండడం విశేషం. సౌత్ లో మల్టీస్టార్ మూవీస్ లో నటించడానికి మన స్టార్స్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ సాకుతో తప్పించుకు తిరుగుతారు. రీజనల్ మూవీస్ హీరోలు ఫోజులు కొడుతారు కానీ నేషనల్ లెవల్ హీరోలు అదే బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎలాంటి ఈగోస్ లేకుండా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. బాలీవుడ్ లో బిలియన్ క్లబ్ హీరోగా ట్యాగ్ వేసుకున్న 'సల్మాన్ ఖాన్' మరో స్టార్ హీరో 'అక్షయ్ కుమార్' తో మూవీ నిర్మిస్తుండడం బాలీవుడ్ లో ఇంట్రెస్ట్ గా మారింది. 'సల్మాన్ ఖాన్' ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కి క్లాప్ కొట్టాడు. ఈ సినిమా కోసం ఓ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా చేతులు కలపడం విశేషం. బాలీవుడ్లో 'సల్మాన్ ఖాన్' నిర్మాణంలో 'అక్షయ్' హీరోగా ఓ సినిమా మొదలవుతోంది. కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాడు. పంజాబీ దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది రిలీజ్..
బాలీవుడ్ ఖాన్ త్రయం 'సల్మాన్’, 'షారుక్’, 'అమీర్' లతో 'అక్షయ్ కుమార్' మామూలుగా అంటీముట్టనట్లు ఉంటాడు. అలాంటి వాడు 'సల్మాన్' నిర్మాణంలో సినిమా చేయడం వెరీ ఇంట్రెస్టింగ్ మారింది. 'సల్మాన్' ఇంతకుముందు సూరజ్ పంచోలి హీరోగా ‘హీరో’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనురాగ్ పంజాబీలో అరడజనుకు పైగా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. అప్పట్లో రాణీముఖర్జీ దిల్ బోలే హడిప్పా సినిమాను అనురాగ్ డైరెక్టర్ చేశాడు. ఆ మూవీ ప్లాప్ కావడంతో ఇన్నాళ్లకు మళ్లీ 'అక్షయ్' తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పంజాబ్ నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఎడాది రిలీజ్ చేయాలని 'సల్మాన్' ప్లాన్ చేస్తున్నాడంట.

11:52 - January 8, 2017

ఫైనల్ గా 'అక్కినేని' యంగ్ బాయ్ 'అఖిల్' సెకెండ్ మూవీకి ముహుర్తం కుదిరింది. ఈ నెలలోనే ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి కింగ్ 'నాగార్జున' అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. క్లాస్ డైరెక్టర్ విక్రమ్ కూమార్ డైరెక్షన్ చేయనున్న ఈ మూవీకి ఓ క్యాచీ టైటిల్ ని కూడా కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం. 'నాగార్జున' రెండో వారసుడు 'అక్కినేని అఖిల్' రెండో సినిమాకు ఎట్టకేలకు ముహూర్తం ఖాయమైంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. 'అఖిల్' అంటూ తన పేరునే టైటిల్ గా పెట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకున్న ఈ అక్కినేని అందగాడికి మొదటనే భారీ షాక్ ఇచ్చింది. 'అఖిల్' మూవీ డిజాస్టర్ తో డిస్పాయింట్ కి గురైనా 'అఖిల్' ఎడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ ఈ నెలలోనే ముహుర్తం జరుపుకోనుందని టాక్.

సంక్రాంతి..
జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా 'అఖిల్' సెకండ్ మూవీని గ్రాండ్ లాంచ్ చేయడానికి 'నాగార్జున అన్ని పర్మాలిటీస్ కంప్లీట్ చేశాడట. మూడు నెలల కిందటే ఈ మూవీ సెట్ అయినా అటు విక్రమ్ కుమార్ పెళ్లి చేసుకోవడం, 'అఖిల్' ఎంగేజ్ మెంట్ తో ఈ మూవీ కాస్త లేట్ గా ఇప్పుడు ముహుర్తం జరుపుకోనుంది. కావాల్సినంత టైం కూడా దొరకడంతో దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా స్టోరీని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని లాక్ చేశాడట. ఇష్క్, మనం, 24 సినిమాలతో డిఫరెంట్ జోనర్ డైరెక్టర్ గా హ్యట్రిక్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ గా దర్శకుడు విక్రమ్ కుమార్ ఫేం అయ్యాడు. ఇప్పుడు 'అఖిల్' తో చేయబోయే మూవీని కూడా దర్శకుడు చాలా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. క్యాచీ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అక్కినేని యంగ్ బాయ్ కి జోడిగా తమిళ హీరోయిన్ 'మేఘా ఆకాష్' ను ఖాయం చేసేశారు. సినిమా ఒపెనింగ్ రోజే టైటిల్ ని కూడా అనౌన్స్ మెంట్ చేస్తారని వినికిడి. బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టుకోవద్దని 'నాగార్జున' నుంచి సంకేతాలు రావడంతో ఈ సినిమాను హై బడ్జెట్ లో రిచ్ క్వాలిటీతో తెరకెక్కించాలని దర్శకుడు పిక్స్ అయ్యాడట. మరి 'అఖిల్' మొదటి మూవీ కాస్ట్ పెల్యూర్ అనేది తెలిసిందే. అయిన ఈ కూడా ఈమూవీకి హై బడ్జెట్ పెట్టుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి విక్రమ్ కుమార్ అయిన 'అఖిల్' కి బ్లాక్ బస్టర్ ఇచ్చి నిలపెట్టుతాడో చూడాలి.

'శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'..

గుంటూరు : శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత రామారావు, వైసీపీ నేత అప్పిరెడ్డిలు డిమాండ్ చేశారు. నవంబర్ 22వ తేదీన 9వ తరగతి విద్యార్థి వంశీ మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమారుడి మరణం తట్టుకోలేక వంశీ తల్లిదండ్రులు చంద్రశేఖర్, నవీనా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

11:44 - January 8, 2017

గుంటూరు : కార్పొరేట్ స్కూల్స్..కాలేజీల్లో ఆత్మహత్యలు ఆగడం లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు అనంతలోకాలకి వెళ్లిపోవడం..దీనికి కారకులైన స్కూల్ యాజమాన్యాన్ని..ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా స్పందన లేదు..దీనితో ఆ దంపతులు తనువు చాలించారు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. చైతన్య టెక్నో కళాశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి వంశీ తీవ్ర జ్వరంతో మృతి చెందాడు. నవంబర్ 22వ తేదీన జరిగిన ఈ ఘటనపై తల్లిదండ్రులు చంద్రశేఖర్..నవీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లాడి మృతదేహంతో ఆందోళన చేశారు. తమ కుమారుడి అనారోగ్యం విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, మృతికి చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. న్యాయం చేస్తామన్న అధికారులు స్పందించకపోవడంపై దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అప్పటి నుండి ఆ దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ప్రభుత్వం..యాజమాన్యం కూడా స్పందించకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. అల్లారు ముద్దుబిడ్డ అనంతలోకాలకు వెళ్లిపోవడానికి ఆ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. దీనితో తనువు చాలించాలని నిర్ణయం తీసుకుని ఆ దంపతులిద్దరూ ఉరి వేసుకుని మృతి చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, ప్రజ సంఘాల నేతలు స్పందించారు. వంశీ మృతికి కారకులైన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని, వంశీ తల్లిదండ్రుల మృతికి యాజమాన్యమే బాధ్యులని సీపీఎం నేత రామారావు, వైసీపీ నేత అప్పిరెడ్డిలు పేర్కొన్నారు.

11:29 - January 8, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్..కాలేజీల్లో కనీస వసతులు లేవని జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం విమర్శించారు. శంషాబాద్ ఎస్ఎఫ్ఐ మహాసభల ముగింపు వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...తెలుగు భాష మీద పట్టు ఉండడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుందని, తెలుగుతో పాటు ఇంగ్లీషు కూడా నేర్చుకోవడం చాలా అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న అలాంటి పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ చుట్టూ కాలేజీలు కేంద్రీకృతమై ఉన్నాయని, జిల్లాల్లో డిగ్రీ కాలేజీలు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. బీఏ, బీకాం..తదితర కోర్సులు చదువుకోవడానికి విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారని, టెక్నికల్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇలాంటి అంతరాలు తొలగించాలని సూచించారు. గ్రామాల్లో ఉండే స్కూళ్లు..కాలేజీల్లో కనీస వసతులు లేవని, వర్సిటీల్లో కూడా మౌలిక సదుపాయాలు లేవన్నారు. క్లాస్ రూంలో ఒక మంచి బోర్డు, కూర్చొవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని, స్కూళ్లలో టాయిలెట్స్ కూడా లేవని దీనితో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదండరాం పేర్కొన్నారు.

ఎస్ఎఫ్ఐ ముగింపు సభలో పాల్గొన్న కోదండరాం..

రంగారెడ్డి : ఎస్ఎఫ్ఐ మహాసభలు ఈ రోజుతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం పాల్గొని ప్రసంగించారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను ఆయన ప్రస్తావించారు.

11:15 - January 8, 2017

విశాఖపట్టణం : నక్కపల్లి వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇనుప కడ్డీలు కుచ్చుకుని దంపతులు మృతి చెందారు. వేంపాడు వద్ద జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ఐదుగురు చిన్నారులు అనాథలయ్యారు. వినుకొండకు వెళ్లడానికి దంపతులు..ఐదుగురు చిన్నారులతో కలిసి ఇనుప రాడ్ ల లోడ్ తో వెళుతున్న లారీ (ఎపి 03 ఎక్స్ 9549)లో బయలుదేరారు. లారీ క్యాబిన్..ఇనుప రాడ్స్ మధ్య దంపతులు కూర్చొగా చిన్నారులు ఇనుప కడ్డీలపై కూర్చొన్నారు. వేంపాడు టోల్ గేట్ వద్దకు రాగానే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. నిద్రిస్తున్న దంపతులపై కడ్డీలు పడి గుచ్చుకున్నాయి. దీనితో వారు అక్కడికక్కడనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వినుకొండకు చెందిన వీరు గంగిరెద్దులు ఆడిస్తూ జీవనం సాగిస్తుంటారని తెలుస్తోంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఐదుగురు చిన్నారులు అనాథలయ్యారు.

నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

విశాఖపట్టణం : నక్కపల్లి (మం) వేంపాడు టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐరన్ రాడ్స్ తో వెళుతున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో ఇనుప కడ్డీలు గుచ్చుకుని దంపతులు మృతి చెందారు. ఐదుగురు చిన్నారులు ప్రమాదం నుండి బయటపడ్డారు.

11:03 - January 8, 2017

లక్నో : నిద్రిస్తున్న కూలీలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈఘటనలో నలుగురు కూలీలు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నైట్ షెల్టర్ లో పలువురు కూలీలు నిద్రిస్తున్నారు. లక్నోలో ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ కారు రోజు వారి కూలీలపైకి దూసుకెళ్లింది. దీనితో నలుగురు కూలీలు మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఇద్దరూ మద్యం సేవించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

10:32 - January 8, 2017
10:28 - January 8, 2017

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన 5కే రన్‌లో ఉత్సాహంగా పెద్ద ఎత్తున నగరవాసులు పాల్గొన్నారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్డేడియం నుండి ప్రారంభమైన మారథన్‌ పరుగులో పెద్ద ఎత్తున అన్ని వయసుల వాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌, ఎంపీ కేసినేని నాని, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబుతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 5 విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్‌లో దాదాపు 10వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. 21, 10, 5, 3 కిలోమీటర్ల విభాగాల్లో విడివిడిగా పరుగు పోటీలు నిర్వహించారు. ఈ మారథాన్‌లో విజేతలుగా నిలిచిన వారికి 20 లక్షల నుండి లక్ష వరకు నగదు బహుమతులను అందచేయనున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తెలిపారు.

10:25 - January 8, 2017

తూర్పుగోదావరి : తాము ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్న స్థలంలో గుడిసెలను కూలిస్తే ఎక్కడకు పోవాలని పేదలు పేర్కొంటున్నారు. కాకినాడ పాతబస్టాండ్ సమీపంలోని పేదల కాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన స్థలంలో గత కొన్ని సంవత్సరాలుగా పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈసారి మాత్రం అధికారులు తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి చేరుకుని వ్యతిరేకించే వారిని ముందుగానే అరెస్టు చేసి జేసీబీలతో గుడిసెలను తొలగించారు. డీఎస్పీతో ఐదుగురు సీఐలు, ఇతర ఎస్ఐలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది సహాయంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలను చేపట్టారు. తమకు ప్రత్యామ్నాయం చూపెట్టాలని, గుడిసెలు కూలిస్తే ఎక్కడకు పోవాలని పేదలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా కూల్చివేతలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

10:14 - January 8, 2017
10:13 - January 8, 2017

చెత్తతో ఈస్ట్ ఢిల్లీలోని లక్ష్మీనగర్ రోడ్లు..

ఢిల్లీ : ఈస్ట్ ఢిల్లీలోని లక్ష్మీనగర్ రోడ్లు చెత్తతో నిండిపోతున్నాయి. అక్కడి శానిటేషన్ సిబ్బంది సమ్మె చేపట్టడంతో చెత్త పేరుకపోయింది. దీనితో ఆయా ప్రాంతాల్లో దుర్ఘందం వెదజల్లుతోంది.

ధాన్యం బస్తాలకు నిప్పు..

శ్రీకాకుళంం : మిళియకుట్టి (మం) గోవిందపురంలో పొలం వద్ద ఉన్న ధాన్యానికి దుండగులు నిప్పటించారు. దీనితో 150 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.

మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ..

తమిళనాడు : రాష్ట్రానికి చెందిన పది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పేదల కాలనీలో అక్రమ కట్టడాల కూల్చివేతలు..

తూర్పుగోదావరి : కాకినాడ పాతబస్టాండ్ సమీపంలోని పేదల కాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు.

09:43 - January 8, 2017
09:40 - January 8, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని శ్రీకూర్మనాథ ఆలయంలో ఉద్రిక్తత ఏర్పడింది. ముక్కోటి ఏకాదశికి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదంటూ భక్తులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజామునుంచే దర్శనంకోసం పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. క్యూలైన్లను పర్యవేక్షించేందుకు సిబ్బంది కూడా లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 6గంటలకు తీరిగ్గా ఈవో శ్యామల రావడంతో భక్తులు మండిపడ్డారు. ఈవోను నిర్భందించి ఏర్పాట్లు సరిగా లేవంటూ నిలదీశారు. ఆలయానికి పూర్తిస్థాయి ఈవో ను నియమించాలని సర్పంచ్‌, జడ్పీటీసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

09:38 - January 8, 2017

చిత్తూరు : ముక్కోటి ఏకాదశి పర్వదినం..ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలివస్తుండడంతో తిరుమల కిక్కిరిసిపోతోంది. శనివారానికే లక్ష మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. నారాయణగిరి ఉద్యానవనం వద్దనున్న క్యూ లైన్ లలో భక్తులు కిక్కిరిసిపోయారు. శనివారం మధ్యాహ్నం వీరు క్యూ లైన్ లో ప్రవేశించారు. ఆదివారం ఉదయం 9గంటలవుతున్నా వీరికి శ్రీవారి దర్శనం కలుగలేదు. దీనితో రాత్రి చలిలోనే భక్తులు పడిగాపులు పడ్డారు. తాము చలికి తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడ్డామని భక్తులు పేర్కొన్నారు. క్యూ లైన్..ఇతర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టిటిడి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.

09:35 - January 8, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజామునుండే భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 4గంటల నుండి ఉత్తర ద్వార పూజా కార్యక్రమాలు జరిగాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుండే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారని ఆలయ పేర్కొన్నారు. సాయంత్రం స్వామి వారి ఊరేగింపు..ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

09:33 - January 8, 2017

జనగాం : కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా... బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ ఎత్తున ఖాళీలున్నా.. ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని తమ్మినేని ప్రశ్నించారు. పేదవారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ఒక్క దళితుడికి భూమి కానీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కానీ కేటాయించలేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు చాలా మంది ఉన్నారని, లక్షల కొద్దీ ఖాళీలు ఉంటే ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని తమ్మినేని ప్రశ్నించారు.

దుర్భర జీవితం..
దళితులు గ్రామాలకు దూరంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని పాదయాత్ర బృందం ఉపనాయకులు, సీపీఎం నేత జాన్‌ వెస్లీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ప్రవేశ పెట్టే సమయంలో మంత్రులు, సీఎం సభలో కూడా లేకపోవడం దారుణమని దుయ్యబట్టారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలను కేసీఆర్‌ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని జాన్‌వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జనగాం జిల్లాలో పాదయాత్ర బృందానికి స్థానిక కళాకారులు నీరాజనం పట్టారు. డప్పు దరువులతో పాదయాత్రకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా కళాకారులు ఆనందం వ్యక్తం చేశారు. జనగాం జిల్లాలో పర్యటిస్తున్న మహాజన పాదయాత్ర 83వ రోజులు పూర్తి చేసుకుంది. 83వ రోజు పాదయాత్ర బృందం కోలుకొండ, పెద్దతండా,కడవెండి, కామారెడ్డిగూడెం, చిప్పరాలతండా, సీతారాంపురం, దేవరుప్పుల గ్రామాల్లో పర్యటించింది. కడవెండిలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్థూపాన్ని తమ్మినేని బృందం ఆవిష్కరించింది. కామారెడ్డి గూడెంలో.. దేశ్‌ముఖ్‌లను ధిక్కరించిన షేక్‌ బందగీ సమాధిని పాదయాత్ర బృందం సభ్యులు సందర్శించి నివాళులు అర్పించారు. జనగాం జిల్లాలోని యురేనియం తవ్వకాలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. జిల్లాలో అత్యధికంగా గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదని తమ్మినేని అన్నారు.

09:19 - January 8, 2017

ఓ పక్క కన్న కూతురు చనిపోయిన వేదన..కనికరం లేని ఆసుపత్రి సిబ్బంది..వెరసి చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకుని ఏకంగా 15 కిలోమీటర్ల మేర నడిచాడు. ఈ అమానవీయ ఘటన ఒడిసాలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదని ఈఘటన రుజువు చేస్తోంది. అంగుల్ జిల్లా పల్లహరా సమీప గ్రామంలో సుమీ ధిబర్ (5) కు జ్వరం వ్యాధి వచ్చింది. దీనితో ఆమె తండ్రి గటి ధిబర్ పల్లహరా హెల్త్ కమ్యూనిటీ సెంటర్ లో చేరిపించాడు. చికిత్స పొందుతూ సుమీ కన్నుమూసింది. దీనితో మృతదేహాన్ని తన స్వగ్రామానికి తరలించాలని ధిబర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరాడు. కానీ అక్కడి సిబ్బంది ససేమిరా అన్నారు. చివరకు చేసేది ఏమీ లేక కూతురు పోయిందన్న బాధ దిగమింగుతూ మృతదేహాన్ని భుజన వేసుకుని కాలినడకన స్వగ్రామం చేరుకున్నాడు. ఈ విషయం సోషల్ మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేశారు.

మంగళగిరిలో ఐశ్వర్య ధనుష్..

గుంటూరు : రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ మంగళగిరిలోని లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కాసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

నెల్లూరులో మళ్లీ స్వల్ప ప్రకంపనాలు..

నెల్లూరు : జిల్లాలో స్వల్ప ప్రకంపనాలు మళ్లీ చోటు చేసుకున్నాయి. దుత్తలూరు, వింజమూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.

ఢిల్లీలో దట్టంగా పొగమంచు..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కురుస్తోంది. దట్టంగా పొగమంచు అలుముకోవడంతో 7 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఓ అంతార్జాతీయ విమానం రద్దెంది. అదేవిధంగా 41 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 14 రైళ్ల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. 5 రైళ్లను మొత్తంగా రద్దు చేశారు.

08:18 - January 8, 2017
08:13 - January 8, 2017

హైదరాబాద్ : చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలు తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీనితో ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారు దర్శనమిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం విచ్చేశారు.

గుంటూరులో..
గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.

ద్వారకా తిరుమలలో..
పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా పోటెత్తారు. ఆదవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభయమాననంగా అలంకరించారు.

07:54 - January 8, 2017

నెల్లూరు : జిల్లాలో వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా విష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి వారు దర్శనమిస్తున్నారు. జిల్లాలో ఉన్న రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు. ప్రముఖ ఆలయం కావడంతో ఉదయం నుండే భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా భక్తులను అనుమతినిస్తున్నారు. ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల మేలు కలుగుతుందని భక్తులు..ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

 

07:45 - January 8, 2017

గుంటూరు : జిల్లాలోని మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రముఖ ఆలయం కావడంతో భక్తులు తెల్లవారుజామునుండే క్యూలు కడుతున్నారు. ఆలయంలోని బంగారు శంఖు తీర్థం తీసుకుంటే పుణ్యం వస్తుందని ఇక్కడ నమ్మకం. దీనితో తీర్థం కోసం భక్తులు పోటీ పడ్డారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయ నిర్వాహకులు..పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. గోవిందా..గోవిందా..నామస్మరణలతో ఆలయం మారుమోగింది. క్యూ లైన్ లో కొంత తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆలయ నిర్వాహకులు..అర్చకులు..భక్తులతో మాట్లాడింది.

 

07:40 - January 8, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వార్లు ఉత్తరద్వార దర్శనం గుండా దర్శనమిస్తున్నారు. ప్రముఖ ఆలయాలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉదయం నుండే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్ లు అన్నీ నిండిపోతున్నాయి. ముక్కోటి ఏకాదశి, ద్వాదశి విశిష్ట పర్వదినోత్సవాల సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి శ్రీవారి దర్శించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.

విజయవాడలో...
విజయవాడలోని చిట్టినగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయాన్నే భక్తులు పోటెత్తడడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. చెరుకుగడలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు టెన్ టివికి నిర్వాహకులు పేర్కొన్నారు. సాయంత్రం స్వామి..అమ్మవారి విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

07:38 - January 8, 2017

హైదరాబాద్ : వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునుండే ఆలయాలకు తరలివచ్చారు. దీనితో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడు క్యూ లైన్ ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నట్లు, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సరైన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు టెన్ టివితో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి....

పోటెత్తుతున్న భక్తులు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారి ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మూలవిరాట్ లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు.

చిక్కడపల్లిలో ఏకాదశి పర్వదినం..

హైదరాబాద్ : చిక్కడపల్లిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామునుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. మూడు క్యూ లైన్ ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నట్లు, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సరైన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు..

చిత్తూరు : శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ప్రముఖులు పోటెత్తారు. కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి, ఏపీ రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణ‌మూర్తి, గంటా శ్రీ‌నివాస‌రావు, మృణాళిని, శిద్దా రాఘ‌వ‌రావు, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, ఏపీ మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి, డిప్యూటీ చైర్మ‌న్ స‌తీష్‌రెడ్డి లు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు క‌డియం శ్రీ‌హరి, మ‌హేంద‌ర్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. సినీ నటుడు మోహ‌న్‌బాబు, వ్యాపార వేత్తలు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌, గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

06:57 - January 8, 2017
06:37 - January 8, 2017

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా గుంటూరులో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు జిల్లాలో పేరుగాంచిన మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి కావడంతో తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. భక్తులు భారీగా వస్తారని ముందే ఊహించిన అధికారులు సరిపడా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు టెన్ టివితో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి నుండి భక్తులు ఇక్కడే వేచి ఉన్నారని, మూడు గంటల అనంతరం ఉత్తర ద్వార దర్శనానికి అనుమతినిచ్చినట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఈ ఆలయం ప్రముఖమైందని, అందుకే భక్తులు భారీగా తరలివస్తుంటారని పేర్కొన్నారు. విజయవాడ..తిరుమలకు సంబంధించిన సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

06:35 - January 8, 2017

చిత్తూరు : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. దీంతో తిరుమలలో 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏకాదశి, ద్వాదశి... ఈ రెండు రోజుల్లో లక్షా 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనావేస్తున్న టీటీడీ ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్‌లో ఉన్న భక్తులను ఉత్తర ద్వారం నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలతో వైకుంఠ ఏకాదశి వైభవం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినోత్సవాల సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముక్కోటి ఏకాదశి, ద్వాదశి విశిష్ట పర్వదినోత్సవాల సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి శ్రీవారి దర్శించుకుని తరించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.

పోటెత్తుతున్న భక్తులు..
వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలకు పోటెత్తుతున్న భక్తులను కంపార్ట్‌మెంట్లలో కూర్చోపెడుతున్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని 54 కంపార్ట్‌మెంట్లను ఏకాదశి భక్తులకు కేటాయించారు. ఇప్పటికే కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో నారాయణవనంతో ఏర్పాట్లు చేసిన 16 ప్రత్యేక కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివుండే ఏర్పాట్లు చేశారు. వీరికి కంపార్ట్‌మెంట్లలోనే కాఫీ, టీలు, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. ఏకాదశి ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకాదశి భక్తులకు దర్శనం ఆలస్యంగా కాకుండా చూసేందుకు వీలుగా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే వీఐపీలకు మాత్రమే పాస్‌లు జారీ చేశారు. ఏకాదశి, ద్వాదశి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

విస్తృత ఏర్పాట్లు..
ఏకాదశి, ద్వాదశి పర్వదినోత్సవాల్లో లక్షా 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్న టీడీపీ అధికారులు, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఏకాదశి రోజు 80 నుంచి 85 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. దర్శనానికి వస్తున్న భక్తులందరికీ ప్రసాదాలకు కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాలను భారీగా తయారు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా తిరుమలలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

06:33 - January 8, 2017

విజయవాడ : టీడీపీలో క్రమశిక్షణ గాడి తప్పుతుందా ? నిన్న మొన్నటివరకు బహిరంగ విమర్శలకే పరిమితమైన నేతలు.. తాజాగా వివాదాస్పద ఘటనలకు పాల్పడడాన్ని దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చా.? తెలుగు తమ్ముళ్ల తీరుపై అధినేత చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారా ? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన పార్టీగా తెలుగుదేశానికి ఎంతో గుర్తింపు ఉంది. ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబు పదేపదే అనేక సందర్భాల్లో చెప్పేవారు. నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండకూడదని.. అందరూ కలిసి పని చేయాలని ఎన్నోసార్లు చెప్పేవారు. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా.. తెలుగు తమ్ముళ్లు బయటపడకుండా చూసుకునేవారు. కానీ.. తాజాగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే క్రమశిక్షణ గాడి తప్పుతోందన్న భావన కలుగుతోంది.

నేతల వ్యవహారాలతో టీడీపీకి తలనొప్పులు..
తాజాగా.. ఇద్దరు నేతల వివాదాస్పద వ్యవహారాలు టీడీపీకి కొత్త తలనొప్పిని తీసుకువచ్చాయి. రెండు రోజుల క్రితం గుడివాడ క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తుపాకీ కాల్పుల వ్యవహారం పెద్ద కలకలమే రేపింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌ను రెన్యువల్‌ చేసుకోకుండా ఉంచుకున్నారని తేల్చారు. అయితే ఈ వ్యవహారం స్థానికంగా రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక తాజాగా గుంటూరు హరితా హోటల్‌లో ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ అనుచరులు చేసిన హంగామా కూడా వివాదాస్పదమైంది. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు నేతలు వివాదాస్పద ఘటనలకు పాల్పడడంతో క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటున్న టీడీపీకి పరువుపోయినంత పనైంది.

ఇద్దరిపై చర్యలు తీసుకునే యోచనలో చంద్రబాబు
అయితే.. వరుస ఘటనలపై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై ఆయన సీరియస్‌ అయ్యారు. వెంటనే తనను కలవాలని వారిద్దరిని చంద్రబాబు ఆదేశించారు. దీంతో వెంటనే.. రావి వెంకటేశ్వరరావు చంద్రబాబును కలిసి ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో రావిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ సతీష్‌ తిరుపతిలో ఉన్నందున తక్షణమే రాలేనని అధినేతకు సమాచారం ఇచ్చారు. ఈ రెండు ఘటనలపై సీరియస్‌గా ఉన్న చంద్రబాబు.. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

యాక్షన్‌ తీసుకోకపోతే పునరావృతమవుతాయనే భావన..
మొత్తానికి పార్టీలో ఎంతో క్రమశిక్షణ ఉందని చెప్పుకుంటున్నప్పటికీ.. కొంతమంది నేతలు ఆ లైన్‌ దాటుతున్నారని తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా స్పందించకపోతే.. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉన్నాయని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధినేత చంద్రబాబు కూడా పార్టీ నాయకుల తీరుపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చాక.. క్రమశిక్షణను ఉల్లంఘిస్తోన్న నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

06:29 - January 8, 2017

గుంటూరు : ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై విరుచుకుపడ్డాడు. వెంటనే నాగబాబు వ్యాఖ్యలపై వర్మ, యండమూరి తీవ్రంగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాట్‌ కామెంట్లతో వేడెక్కింది. నాగేంద్రబాబు యండమూరి, వర్మపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రీమేక్ సినిమాలు తీస్తే తప్పేంటని, రీమేక్‌లు చేయడంలో తప్పులేదని వర్మపై కామెంట్‌ చేశాడు. అతనో అక్కుపక్షి...పిచ్చికూతలు కూస్తాడు అంటూ రామ్‌గోపాల్ వర్మపై నాగబాబు ఫైరయ్యాడు. సరిగా సినిమా తీయడం కూడా రాదు...ముందు ఆయన మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. సినిమాలు తీయడం చేతకానప్పుడు ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడన్నారు. యండమూరిని తప్పుపడుతూ.. 'ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు... కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. అయితే అతనొక మూర్ఖుడు. పైగా వ్యక్తిత్వ వికాసం కోర్సు చెబుతున్నాడు..సొంత వ్యక్తిత్వం లేనివారు ఇతరులకు చెబుతారు' అంటూ విరుచుకుపడ్డారు.

ఘాటుగా స్పందించిన వర్మ..
నాగబాబు కామెంట్లపై వర్మ ఘాటుగా స్పందించారు. అంతకు ముందు సారీ చెప్పినట్లుగా ఉన్న ట్వీట్లు తాను చేయలేదని స్పష్టం చేశారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ఎవడో ఇడియట్‌ హ్యాక్‌ చేశాడని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. నేను ఎప్పుడూ తెలుగులో ట్వీట్‌ చేయలేదన్న వర్మ ఇంతకు ముందు చేసిన ట్వీట్లు తనవి కావన్నారు. ఇంగ్లీషులో తాను చేసే ట్వీట్లు అర్ధం చేసుకోలేకపోతే తెలుగులోకి అనువాదం చేసుకునేందుకు ఒక అనువాదకుడిని పెట్టుకోవాలని వర్మ నాగబాబుకు సూచించారు. తనకు సలహా ఇచ్చేముందు ఆలోచించుకోవాలని వర్మ నాగబాబుకు చురక అంటించారు.

స్పందించిన యండమూరి..
నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ స్పందించారు. తాను ఆరేడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు సరైన వేదికను ఎంచుకోలేదన్నారు. చరణ్ గురించి తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. చరణ్ తండ్రి చిరంజీవి, దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని యండమూరి గుర్తు చేశారు. మొత్తమ్మీద వర్మ, యండమూరిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై జనాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 'ఖైదీ నంబర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికగా మొదలైన ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి..

గుంటూరు : జిల్లాలో పేరుగాంచిన మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.

ద్వారకా తిరుమలకు ఈసీ భన్వర్ లాల్..

పశ్చిమగోదావరి : ద్వారకా తిరుమల దిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ముఖ ద్వార దర్శనం ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి కావడంతో తెల్లవారుజామునుండే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వారిని ఈసీ భన్వర్ లాల్ దర్శించుకున్నారు.

వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ..

హైదరాబాద్ : వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా అలంకరించారు.

Don't Miss