Activities calendar

09 January 2017

21:41 - January 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో 32వ జిల్లాగా మిర్యాలగూడను ప్రకటించాల్సిందేనని ఆ ప్రాంత అఖిలపక్ష జిల్లా సాధన కమిటీ ఇందిరాపార్క్‌లో మహాధర్నా చేపట్టింది. జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలున్న మిర్యాలగూడపై కేసీఆర్ సర్కార్‌ వివక్ష చూపిందని మండిపడింది. మహాధర్నాకు మద్దతుగా అఖిలపక్ష నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. మిర్యాలగూడ వాసుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని నినదించారు.

మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌
మిర్యాలగూడ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలన్న నినాదాలు ఇందిరాపార్క్‌లో హోరెత్తాయి. మహాధర్నాతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మిర్యాలగూడ అఖిలపక్ష జిల్లా సాధన కమిటీ ఇందిరాపార్క్‌లో మహాధర్నా చేపట్టింది. 32వ జిల్లాగా మిర్యాలగూడను ప్రకటించాల్సిందేనని నినదించింది. మిర్యాలగూడను జిల్లాగా, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా, ఘట్టుప్పల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేసింది. మహాధర్నాకు హాజరైన అఖిలపక్ష నేతలు కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.

మిర్యాలగూడకు జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలువున్నాయి: జైపాల్ రెడ్డి
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయని.. అయితే ఏర్పాటు చేసిన తీరునే విమర్శిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడకు జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలున్నా..ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదో అర్థం కావడం లేదన్నారు.

ఇప్పటికైనా కేసీఆర్‌ కళ్లు తెరవాలి : జూలకంటి
మిర్యాలగూడ జిల్లా కావాలంటూ లక్ష సంతకాలు సేకరించిన పత్రాన్ని సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగా రెడ్డి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు. ప్రభుత్వం తలతోక లేకుండా జిల్లాలను విభజించిందని.. ఇప్పటికైనా కేసీఆర్‌ కళ్లు తెరవాలని ధ్వజమెత్తారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటుచేస్తాం : రమణ
2019లో టీడీపీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేస్తూ మొదటి జీవోను విడుదల చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. జిల్లాల ఏర్పాటు జరిగి 2 నెలలు గడిచినా విభజన సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకలేదంటే ఏ రీతిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చని చుక్కా రామయ్య అన్నారు. ఒక వ్యక్తి ఇష్టానుసారంగా పాలన చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయన్నారు. మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించేవరకు తమ పోరాటం ఆపమని మహాధర్నాకు హాజరైన అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. 

21:36 - January 9, 2017

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీ ప్రధానమంత్రి నరేంద్రమోదిని వివరణ కోరనుంది. 50 రోజులు దాటినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పీఏసీ ప్రధానికి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు పిఏసి ఇప్పటికే సమన్లు జారీ చేసింది.

నరేంద్రమోది పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కాక తప్పదా?
నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్రమోది పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కాక తప్పదా? ఈ విషయంలో కాంగ్రెస్‌ నేత పార్లమెంట‌రీ క‌మిటీ చీఫ్ వీకే థామ‌స్ ప్రధానికి సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏ కార‌ణంతో నోట్ల ర‌ద్దును చేప‌ట్టార‌ని తెలుసుకునేందుకు ప్రధానిని వివరణ కోరతామని వి.కె.థామస్‌ తెలిపినట్లు పీటీఐ పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ప్రధాని చెప్పారని...గడువు దాటినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని థామస్‌ అన్నారు.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఇప్పటికే పిఏసి సమన్లు
నోట్ల రద్దుపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు ఇప్పటికే పిఏసి సమన్లు జారీ చేసింది. జనవరి 20న తమ ముందు హాజరుకావాలని పటేల్‌ను ఆదేశించింది. నోట్లరద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు?...ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుందన్న విషయంపై పటేల్‌ను పిఎసి వివరణ కోరనుంది. నగదు రహిత లావాదేవీలపై ఎంతవరకు సన్నద్ధమయ్యారని కూడా ఆయను ప్రశ్నించనుంది. నగదు రహిత డిజిటల్‌ లావాదేవీలు భారత్‌లో ఎలా సాధ్యమని ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించే అవకాశముంది. నోట్ల రద్దు నిర్ణయం వెనక ఎవరెవరున్నారని పిఏసి ఆరా తీయనుంది.

నోట్ల ర‌ద్దు అంశంపై ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉంది : థామ‌స్
నోట్ల ర‌ద్దు అంశంపై ఎవ‌రినైనా ప్రశ్నించే అధికారం పీఏసీకి ఉంద‌ని థామ‌స్ తెలిపారు. అయితే జ‌న‌వ‌రి 20న ఉర్జిత్ పటేల్‌తో జ‌రిగే స‌మావేశం అనంత‌రం ప్రధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీఏసీ స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా నిర్ణయిస్తే నోట్ల ర‌ద్దు అంశంపై ప్రధానిపై కూడా విచారణ జరుపుతామని థామ‌స్ స్పష్టం చేశారు.

న‌వంబ‌ర్ 85వందలు, వెయ్యి నోట్లను ర‌ద్దు చేస్తూ ప్రధాని ప్రకటన
న‌వంబ‌ర్ 8న 5వందలు, వెయ్యి నోట్లను ర‌ద్దు చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులు, ఎటిఎంల ముందు జనాలు క్యూకట్టారు. ఇటీవల పరిస్థితి కొంత మెరుగైనా...పెద్దగా మార్పు లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్థికవ్యవస్థ మందగించనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిని విచారించే దిశగా పిఏసి అడుగులు వేస్తోంది.

ఏపీకి ఉగ్ర ముప్పు: చంద్రబాబు

విజయవాడ : ఏపీకి ఉగ్రవాద సంస్థ ఐసిస్ ముప్పు పొంచి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి కేంద్ర బలగాలను ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు. కాగా, చంద్రబాబు వినతిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ స్పందిస్తూ.. ఏపీకి సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను పంపిస్తామని హామీ ఇచ్చారు. 

ఎస్పీ ముసలానికి ముగింపు..

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీలో రగులుతున్న విభేదాలకు ములాయం ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఎస్పీ సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ యాదవ్ పేరును ప్రకటించారు. 

21:06 - January 9, 2017

విద్య వ్యాపారంగా మారితే ఇలాగే ఉంటుందా? లేత చిన్నారుల శారీరక మానసిక ఆరోగ్యాలపై తీరని ప్రభావం చూపుతోందా? కరెన్సీ కట్టలు, ర్యాంకులు తప్ప మరేదీ పట్టని ఈ వ్యాపార సంస్థలకు అడ్డుకట్ట వేయలేమా? ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటే చూస్తూ ఉండాల్సిందేనా? ఫీజులు ఆకాశంలో, సౌకర్యాలు పాతాళంలో.. ఒత్తిడి ఎవరెస్ట్ అంతఎత్తులో.. దీనివల్ల అంతిమంగా విద్యార్ధులు కుంగిపోతున్నారా? అసలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఏం జరుగుతోంది? ఈ రోజు వైడాంగిల్ స్టోరీలో చూద్దాం.. ప్రభుత్వం నియంత్రించాల్సిన విద్యారంగం కార్పొరేట్ సంస్థల్లోకి జారింది. చదువును అమ్ముకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్న సంస్థలు పుట్టగొడుల్లా బ్రాంచులు పెడుతూ సామ్రాజ్యాన్నే స్థాపించేశాయి. ఇప్పుడు చదువంటే ఒకటి రెండు సంస్థలకే పరిమితమౌతోందా? చదువంటే యమకూపంలో చిన్నారులను నెట్టడమౌతోందా? నిర్లక్ష్యమో లేక పర్యవేక్షణాలోపమో, లేదా.. నిజంగానే తేరుకోలేని అనారోగ్యమో.. ఏదయితేనేం ..ఆ చిన్నారి ఉసురు తీసింది. చివరికి ఆ కుటుంబాన్నే అంతం చేసింది. ఇదొక్కటేనా.. కొన్నేళ్ల చరిత్రలో ఎన్నో ఆత్మహత్యలు.. మరెన్నో దారుణాలు. విద్యాగంధాన్ని పంచుతామంటున్న కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్ధులపై కొండంత ఒత్తిడిని పెంచుతున్నాయా? విద్యా విధానంలో హింస.., ర్యాంకుల వేటలోహింస, అడుగడుగునా హింస.. చిన్న బ్రేక్ తర్వాత.. హింస.. అటు విద్యా విధానంలో హింస..ఇటు ర్యాంకుల వేటలో, విద్యా బోధనలోహింస..తోటి విద్యార్ధులతో ప్రవర్తనలో హింస..అడుగడుగునా ... హింస రాజ్యమేలుతోంది. కొన్ని మనసులు గాయపడుతున్నాయి. కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు.. కొందరు కోట్లలో వ్యాపారం చేస్తున్నారు.. కొందరు అమాయక విద్యార్ధులు బలవుతున్నారు. విద్యాసంస్కృతిలో విషం నిండుతోంది. సమాజం వికాసం చెందటానికి ఏది అవసరమో దాన్ని పూర్తిగా పక్కనపెట్టి, యంత్రాలను తయారు చేసే వ్యవస్థ నడుస్తోంది. మార్కులు, ర్యాంకులు తప్పమరేదీ పట్టని కార్ఖానాల్లో చిన్నారులు నలిగిపోతున్నారు. శారీరకంగా మానసికంగా దుర్బలులుగా అవుతున్నారు. విద్య వికాసాన్ని, బంగారం లాంటి భవితను అందించాలి తప్ప... వ్యాపారంలా మారి చిన్నారుల భవిష్యత్తుని కబళించకూడదు. కార్పొరేట్ కళాశాలలు అటు తల్లిదండ్రుల రక్తాన్ని, ఇట్లు విద్యార్ధుల ప్రాణాలను పీల్చే విష సంస్కృతికి సమాధి కట్టాలి.. ప్రభుత్వం నిద్రమత్తు వదిలించుకుని ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే, మరెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఊహించలేం.. 

20:56 - January 9, 2017

రాజన్న సిరిసిల్ల : వీర్నపల్లి ఆదర్శ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిలో కొంతమందిని వీర్నపల్లి ఆసుపత్రికి, కొంతమందిని ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ జరిపిన డీఈవో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకున్న డీఈవో విద్యార్థులను పరామర్శించారు.

20:54 - January 9, 2017

విజయవాడ : ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర పుస్తక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్నపిల్లలు, పెద్దలూ అన్న తేడా లేకుండా అనేక మంది ఈ బుక్‌ ఫెయిర్‌ను తిలకిస్తున్నారు. కథలు, నవలలు, కవితా సంపుటిలతో పాటు హర్రర్‌, కామిక్‌.. ఇలా రకరకాల పుస్తకాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలోనూ పుస్తకాలపై మక్కువ ఏ మాత్రం తగ్గలేదని పాఠకులు నిరూపిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఏదో ఒక పుస్తకాన్ని కొనుగోలు చేసి పుస్తకాలపై వారికున్న ప్రేమను చాటుతున్నారు.

విజయవాడలో 28వ పుస్తక మహోత్సవం
విజయవాడలో ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర పుస్తక సంబరాల మహోత్సవం.. పుస్తక ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. దేశంలోని 360 పుస్తక ప్రచురణ సంస్థలు ఈ 28వ పుస్తక మహోత్సవంలో పాల్గొంటున్నాయి. విజయవాడ బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ, భాషా సాంస్కృతికశాఖ, ఎన్టీఆర్‌ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. స్థానిక పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో జనవరి ఒకటో తేదీన ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను సాహిత్య అభిమానులు, పిల్లలు, పెద్దలు తిలకించి తమకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి పుస్తక ప్రచురణకర్తలు.. సాహిత్య, సంస్కృతిని పెంపొందించే రకరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు అవసరమైన పలురకాల పుస్తకాలతో పాటు.. ప్రొఫెషనల్‌ కోర్సులు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే అనేక రకాల పుస్తకాలను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. బుక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే చిన్నారుల ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో పిల్లలు పుస్తక ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. ఈ బుక్‌ ఫెస్టివల్‌లో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 11వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన నిర్వహణ
జనవరి 11వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఇక ఇలాంటి పుస్తక ప్రదర్శన నిర్వహించేందుకు అవకాశం ఉండదు. స్క్వేర్‌ సిటీ పేరుతో స్వరాజ్య మైదానంలో చైనా కంపెనీలు నిర్మాణాలు చేపట్టనున్నాయి. అయితే.. స్క్వేర్‌ సిటీని రద్దు చేయాలని ఇప్పటికే ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. నగరం నడిఒడ్డున ఉన్న ఈ మైదానాన్ని ఇలాంటి పుస్తక ప్రదర్శనలకు ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నాయి.  

20:50 - January 9, 2017

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్ధి వ్యతిరేఖ విధానాలపై ఎస్ఎఫ్ఐ మహాసభ 15 తీర్మానాలు చేసింది. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.

93 మందితో నూతన రాష్ట్ర కమిటి ఏర్పాటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ మహాసభ అభిప్రాయపడింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మూడు రోజుల పాటు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. మొత్తం 93 మందితో నూతన రాష్ట్ర కమిటి ఏర్పడింది. అధ్యక్షుడిగా నాగేశ్వరరావు, కార్యదర్శిగా కోటా రమేష్‌లు ఎన్నికయ్యారు.

హామీలన్ని చెత్త బుట్టలో వేసింది : ఎస్ఎఫ్ఐ నూతన రాష్ట్ర కార్యదర్శికోటా రమేష్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందుండి పోరాడిన విద్యార్ధుల కోసం ఎన్నో హామీలు గుప్పించిన తెలంగాణా రాష్ట్ర సర్కార్ ఇప్పుడా హామీలన్ని చెత్త బుట్టలో వేసిందని తెలంగాణా ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన కోటా రమేష్ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్ధి వ్యతిరేఖ విధానాలపై ఐక్యపోరుకు సిద్దమవుతున్నట్టు తెలిపారు.

కేజి టు పీజి ఏమైంది : ఎస్ఎఫ్ఐ
రాష్ట్ర ఏర్పాటు తరువాత కేజి టు పీజి అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఈ ఊసే ఎత్తడం లేదని వారు విమర్శించారు. మరోవైపు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్ధులను చదువులకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు యూనివర్శిటీలకు వేలాది ఎకరాలు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం గురుకుల కాలేజీలను మాత్రం అద్దె భవనాల్లో నడుపుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈనెల 17, 18, 19 తేదిల్లో అన్ని యూనివర్శిటీల్లో నిరసన కార్యక్రమాలు
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూత్వ భావజాలాలను పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా ఈనెల 17, 18, 19 తేదిల్లో అన్ని యూనివర్శిటీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 

20:43 - January 9, 2017

'తూర్పుగోదావరి : నిర్మించతలపెట్టిన దివీస్‌ కంపెనీ ప్రాంతాల్లో న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు పర్యటించారు. తొండంగి మండల పరిసరాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల గోడు వినే నాధులే లేరని అన్నారు. పంటలు పండే భూములను అన్యాయంగా లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివీస్‌ కంపెనీ ప్రాంతాల్లో ప్రజా హక్కులు కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

20:27 - January 9, 2017

సీపీఎం పాదయాత్రలో గజ్జెకట్టి గంతులేసిన గద్దరన్న..ఇస్కూలుకెల్లాలంటే వాగు దాటాల్సిందే..కేజీ లు పీజీలు ఎలాగున్నా..ఇస్కూలుకెల్లాలంటే వాగులు వంకలూ దాటి కిలో మీటర్లకొద్దీ నడిసి ఎల్తన్న ఈ పిలకాయలకు ఓ బ్రిడ్జీ కట్టీయమని దీనంగా వేడుకుంటున్నరు...మరి సర్కారు ఏమంటదో ఏందో.. మోదీ ఏసిన నోట్ల రద్దు బాణం జనాలకే గాదు దేవుళ్లకు కూడా తగిలిందయ్యా..

125 క్వింటాళ్ళ రేషన్ బియ్యం స్వాధీనం..

సూర్యాపేట : మేళ్లచెరువు మండలం కందిబండలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిలువ ఉంచిన 125 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు.

ఆదర్శ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థత..

రాజన్న సిరిసిల్ల : వీర్నపల్లి ఆదర్శ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు వాంతులయ్యాయి. కొంతమంది బాధిత విద్యార్థులను వీర్నపల్లి ఆసుపత్రికి, కొంతమందిని ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించారు.

19:47 - January 9, 2017
19:46 - January 9, 2017

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కృష్ణానది జలాలను పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది.

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు..
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. కృష్ణాజలాల పంపిణీపై జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్ర పునర్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89(ఎ), (బి) ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు, నీటి లభ్యత రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేస్తూ గతంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది.

సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ
జలాల పంపిణీ రెండు రాష్ట్రాలకేనని కేంద్ర జలవనరుల శాఖ గతంలో ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణా జలాల వివాదంపై ఏర్పడిన ట్రిబ్యునల్‌ 2013 నవంబరు 29న తుది తీర్పు చెప్పింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను కొనసాగిస్తూనే 65 శాతం నీటి లభ్యత, సరాసరి నీటి లభ్యత కింద మిగులు జలాలను కూడా కేటాయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ 2016లో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2014లో సుప్రీంను ఆశ్రయించిన ఉమ్మడి ఏపీ
ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకే సెక్షన్ 89ని చట్టంలో చేర్చారని, ట్రిబ్యునల్ దానికి ప్రాధాన్యతలేదని తోసిపుచ్చిందని విన్నవించారు. అయితే ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదానికి సెక్షన్ 84, ఎఫెక్స్ కౌన్సిల్ ఉన్నాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. దీన్ని ధర్మాసనం కొట్టివేస్తూ మిగతా పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

 

18:59 - January 9, 2017

కడప : ఓబులవారిపల్లె మండలంలోని ఏపీఎండీసీ బెరైటీలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్‌ డిమాండ్‌ చేశారు. కార్మికులందరికీ ఆసుపత్రి సౌకర్యం కల్పించాలన్నారు. ఏపీఎండీసీలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటీ వెంటనే భర్తీ చేయాలన్నారు. ఏడేళ్లుగా ట్రైనీలుగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఏపీఎండీసీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి హాజరైన గపూర్‌.. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

18:56 - January 9, 2017

పశ్చిమ గోదావరి : ఆచంట మండలంలోని మంగలిపుంతలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీధి దాపాల వెలుగులో కోడి పందాలు నిర్వహిస్తుండగా 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కోడిపుంజులు, 9 బైకులు, 13 సెల్‌ఫోన్లు, 12 కత్తులతో టు నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 

18:53 - January 9, 2017

శ్రీకాకుళం : ఉద్దానంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీజీహెచ్ ఎస్  వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు మూలకారణాల అన్వేషణకు ప్రత్యేక బృందాన్ని త్వరలోనే అక్కడికి పంపిస్తామని నడ్డా స్పష్టం చేశారు.  

18:51 - January 9, 2017

విజయవాడ : పరిపాలనలో పూర్తి పాదర్శకత కోసం ఏపీలోని అన్ని ఆఫీసులను పేపర్‌లెస్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఫైళ్ల పర్యవేక్షణతోపాటు, ఈ-కేబినెట్‌ విధానాలను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... కాగిత రహిత కార్యాలయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ-గవర్నెన్స్‌పై విశాఖలో జరుగుతున్న జాతీయ సదస్సులో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.

రెండు రోజుల సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌
ఏపీలో టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో 20వ ఈ-గవర్నెన్స్‌ సదస్సు జరుగుతోంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సును కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి వెంకయ్యనాయుడు, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

కాగిత రహిత పాలనతో అమల్లో జాప్యం తగ్గుతుంది : చంద్రబాబు
సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేపర్‌లెస్‌ ఆఫీసు విధానాన్ని ప్రస్తావించారు. కాగిత రహిత పాలనతో ఉన్న లాభాలను వివరించారు. కాగిత ఫైళ్ల ప్రక్రియలో విధాన నిర్ణయాల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని వివరించారు. కొందరు అధికారలు అకారంగా ఫైళ్లను తొక్కిపెడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్‌ ఫైల్‌ మానెటరింగ్‌ విధాన్ని తీసుకొచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చినందన్న విషయాన్ని గుర్తు చేశారు. పేపర్‌లెస్‌ ఆఫీసుతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చంద్రబాబు చెబుతున్నారు.

పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి: వెంకయ్య
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సమాజంలోఆర్థిక అసమానతలు తొలగిపోయేందుకు దోహదం చేస్తుందని సదస్సుకు హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో మొబైల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో బొటనవేలుతో ట్రాశాక్షన్లు జరిపే స్థాయికి భారత్‌ ఎదుగుతుందన్నారు. ఈ-గవర్నెన్స్‌లో ఆంధప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని సదస్సుకు హాజరైన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ చెప్పారు. 

18:46 - January 9, 2017

అనంతపురం : ఏపీలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో నగదు స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్ట్‌ చేశారు.

అనంతపురం, చిత్తూరు, నెల్లూరు,శ్రీకాకుళం చెక్‌పోస్టుల్లో సోదాలు
ఏపీలోని పలు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలెం చెక్‌పోస్ట్‌లో తనిఖీలు
నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలెం చెక్‌పోస్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వారి దగ్గర నుంచి 58 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య పన్నుల సిబ్బంది పేరుతో నిందితులు డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే అనంతపురం జిల్లా హిందూపురం కొడికొండ చెక్‌పోస్ట్‌పై కూడా దాడులు జరిపి... ఓ ప్రైవేట్‌ వ్యక్తినుంచి 15 వేల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తురు జిల్లా పలమనేరులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసులోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఇక్కడ 35వేల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమల్లి వద్ద ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ఆర్టీఏ చెక్‌పోస్టు లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి... లెక్కల్లో చూపని కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.
లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం తెల్లవారు జాము నుంచి ఉదయం 9గంటల వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడులు జరిపారు.ఈ సందర్భంగా అక్కడ అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న 8 మంది దళారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది పనిచేసే కౌంటర్లలో అక్రమంగా డబ్బులు వసూళ్ళు చేస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం 64వేల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. దాడులకు సంబంధించి పూర్తి నివేదికను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళతామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తానికి ఏపీలోని పలుచోట్ల జరిపిన ఈ ఆకస్మిక దాడులతో రవాణా శాఖ ఉలిక్కిపడినట్లయింది.  

18:39 - January 9, 2017

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న రోబోటిక్ సర్జరీలకు మన దేశంలోనూ ఆదరణ పెరగాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యశోద హాస్పిటల్‌లో రోబోటిక్ సర్జరీలపై అంతర్జాతీయ వర్క్‌షాప్ జరిగింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతో సులువైన పద్దతిలో సర్జరీలు చేసే ఆధునాతనమైన పరికరాలతో కొత్త ప్రయోగాలను ప్రారంభించింది. ఈ సదస్సులో రోబోటిక్ సర్జరీలకు ఆధ్యుడు ప్రొఫెసర్ నామ్‌ కిమ్ లైవ్ సర్జరీ తో వర్క్‌షాప్ లో పాల్గొన్నారు. వైద్యశాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నూతన చికిత్స విధానాలను మన రాష్ట్రంలో అందుబాటులోకి రావడం ఆనందంగా వుందని యశోద ఎండి జిఎస్‌ రావు అన్నారు. 

18:36 - January 9, 2017

నిజామాబాద్‌ : బోధన్‌ మున్సిపాలిటీ అవినీతి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పైసలు ఇవ్వనిదే ఏపనీ పూర్తికాదన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. పాలకవర్గం, సిబ్బంది, అధికారులు కుమ్మక్కై ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.

బోధన్‌... నిజామాబాద్‌ జిల్లాలో ఒక పెద్ద పురపాలక సంఘం.
బోధన్‌... నిజామాబాద్‌ జిల్లాలో ఒక పెద్ద పురపాలక సంఘం. ఈ మున్సిపాలిటీకి ఇప్పుడు అవినీతి జబ్బు పట్టుకుంది. అవినీతికి అలవాటుపడ్డ సిబ్బంది, అధికారులు, పాలకమండలి సభ్యులు ఏకమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ కలిసి అన్ని విషయాల్లో కచ్చితంగా ఉంటున్న కమిషనర్‌కు పనిచేయలేని పరిస్థితి కల్పించారన్న విమర్శలు వస్తున్నాయి. అందరూ ఏకమై అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి పని పూర్తి చేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి నిర్ణయం
బోధన్‌ మున్సిపాలిటీలో ప్రతి పనికి వెల నిర్ణయించారు.. అధికారులు, పాలకవర్గం అవినీతికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాలరంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పౌరసేవల పట్టిక ప్రకారం ప్రతి పని పూర్తి చేయడానికి నిర్ధిష్టకాలవ్యవధి నిర్ణయించారు. కాని ఇది పేరుకే. ఏదో ఒక వంకతో నెలల తరబడి పెండింగ్‌లో పెడతారు. అదే పైసలు ఎరగా చూపితే, నిబంధనలు బలాదూర్‌ అంటారు. రెండు లేదా మూడు నెలలు అపరిష్కృతంగా ఉన్న పనులు కూడా కాసులు చూపితే ఇట్టే అయిపోతున్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

అవినీతి ఇంజినీర్‌పై దాడికి యత్నించిన కౌన్సిలర్లు
బోధన్‌ మున్సిపల్‌ సివిల్‌ ఇంజనీర్‌ అవినీతి వ్యవహారాలు పురపాలక సంఘానికి పెద్ద మచ్చ తెచ్చిపెట్టాయి. కౌన్సిల్‌ సమావేశాల్లో పాలకవర్గ సభ్యులే సివిల్‌ ఇంజినీర్‌పై దాడికి ప్రయత్నించారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.మున్సిపల్‌ ఇంజనీర్‌పై జిల్లా కలెక్టర్‌తోపాటు, మున్సిపల్‌ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు లేకపోవడంతో మిగిలిన అధికారులకు ఇది అలసత్వంగా మారింది. దీంతో ఎవరి స్థాయిలో వారు దోపిడీకి తెరతీశారన్న ఆరోపణలు వెల్లువుతున్నాయి.

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు బొక్కిన ఇద్దురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు
అవినీతే కాదు నిధుల స్వాహా కూడా బోధన్‌ మున్సిపాలిటీకి పెద్ద జాడ్యంగా పరిణమించింది. షాపులు పెట్టుకునే వ్యాపారాల నుంచి వసూలు చేసే ట్రేడ్‌ లైన్స్‌ ఫీజును బొక్కిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పురాలేదు. ఇందులో అధికారుల నుంచి పాలకవర్గం వరకు అందరిపాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధన్‌ మున్సిపాటీ అవినీతి గురించి చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద గ్రంథమే అవుతుందని అంటున్నారు. ప్రజలను పట్టిపీడిస్తున్నఅవినీతి జలగలపై ఇకనైనా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 

18:35 - January 9, 2017

నిజామాబాద్ : అధికారంలో ఉన్నాం కదా అని కొందరు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ మాట వినకుంటే అధికారులపై సైతం దాడులకు దిగుతున్నారు. అలాగే పదవి ఒకరిదైతే..పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారు. నిజమాబాద్ కార్పొరేషన్‌లో కొందరు కార్పొరేటర్ల అధికార దుర్వినియోగంపై 10TV ప్రత్యక కథనం...

అధికారం అండతో ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం
నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల దూకుడు రోజురోజుకు పెరిగిపోతోంది. కొందరు మహిళా కార్పొరేటర్లకు బదులు వారి కుటుంబసభ్యులు పెత్తనం చెలాయించడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధికి పాటు పడాల్సిన ప్రజాప్రతినిధులే అధికారులను అడ్డుకుని దాడులకు పాల్పడుతూ.. అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల హవా
జిల్లా కేంద్రంలోని డివిజన్‌లకు వెళ్లాలంటేనే కార్పొరేషన్‌ అధికారులు భయపడుతున్నారు. తమ అనుమతి లేనిదే డివిజన్‌కు రావొద్దంటూ కార్పొరేటర్లు హుకుంలు జారీ చేస్తున్న పరిస్థితి నిజామామాబాద్‌ కార్పొరేషన్‌లో ఉంది. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు సదరు భవనాలకు నోటీసులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు కార్పొరేటర్లు.. అధికారులు, సిబ్బందిని అడ్డుకుని.. అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేశారు.

అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టకుండా.. అడ్డుకున్న కార్పొరేటర్లు..!
నగరంలో ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా..అక్కడ సంబంధిత కార్పొరేటర్ల అనుచరులు వాలిపోతున్నారు. అన్ని సక్రమంగా ఉన్నా... నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఎంతో కొంత డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అక్రమ కట్టడాలను కూల్చి వేసేందుకు వెళ్లిన అధికారులపై అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ దాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది.

నోటీసులు ఎందుకిచ్చారంటూ ఓ మహిళా కార్పొరేటర్‌ భర్త ఆగ్రహం
గతంలో నగరంలోని ద్వారకానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఓ భవన యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ ఆ డివిజన్‌కు చెందిన మహిళా కార్పొరేటర్‌ భర్త అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే.. పదో డివిజన్‌లోని కెనాల్‌ కట్ట వద్ద ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారిపై 26వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ చేయి చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. అదేవిధంగా అనర్హులకు ఫెన్షన్‌ మంజూరు చేయాలంటూ అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటర్‌ అధికారులపై ఒత్తిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరపాలక సంస్థలో మేయర్‌తో సహా 26 మంది మహిళా కార్పొరేటర్లు
ఇక నగరంలో మహిళా కార్పొరేటర్ల పరిస్థితి మరోలా ఉంది. పేరుకే కార్పొరేటర్లు కానీ.. పెత్తనం అంతా వారి భర్తలదే. నగరపాలక సంస్థలో మేయర్‌తో సహా 26 మంది మహిళా కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తే.. ఇందులో చాలా మంది కార్యాలయాల్లో వారి భర్తలే దర్శనమిస్తున్నారు. మేయర్‌, కమిషనర్‌ సమక్షంలో సమావేశాలు జరిగినా.. మహిళా కార్పొరేటర్లకు బదులుగా వారి భర్తలు లేక కొడుకులు హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌ జోక్యం చేసుకుని అధికార పార్టీ కార్పొరేటర్లకు కల్లెం వేయాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. 

18:26 - January 9, 2017

మహబూబ్‌నగర్‌ : 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 10 టీవీ ప్రతినిత్యం ప్రజలపక్షాన పోరాడుతున్న ఛానల్‌ అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

18:22 - January 9, 2017

భద్రాద్రి కొత్తగూడెం : అశ్వరావుపేటలో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మండల తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆడపిల్లల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ 10టీవీ క్యాలెండర్‌ తీసుకురావడం సంతోషకరమని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ప్రశంసించారు. ఆడ పిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజా సమస్యలను వెలికితీయడంలో 10టీవీ ముందు వరుసలో ఉందని... భవిష్యత్‌లోనూ ఇదే ఒకవడి కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట సర్పంచ్‌ పుల్లయ్య, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బండి పుల్లారావుతోపాటు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

18:15 - January 9, 2017

హైదరాబాద్ : నానక్‌రామ్‌గూడ భవనం కుప్పకూలిన దుర్ఘటనకు నిర్మాణలోపమే కారణమని జేఎన్టీయూ నిపుణుల బృందం తేల్చింది. డిసెంబర్ 8న నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై నెలరోజుల పాటు స్టడీ చేసిన విచారణ కమిటీ బల్దియా అధికారులకు తమ రిపోర్టును సమర్పించింది.

2016 డిసెంబర్ 6 నానక్‌రామ్‌గూడలో కూలిన భవనం
నెలరోజుల క్రితం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ భవనం కూల్చివేత ఘటనకు నిర్మాణంలో లోపమే కారణమని తేలింది. బలహీన నిర్మాణం, అసంబద్ద డిజైనింగ్, నాణ్యతలేని పిల్లర్ల నిర్మాణం కారణంగానే ప్రమాదం జరిగిందని జేఎన్టీయూ నిపుణులు తేల్చారు. దీనిపై డాక్టర్ ఎన్‌.వి. రమణారావు ఆధ్వర్యంలోని సివిల్‌ ఇంజనీర్ల కమిటీ బల్దియాకు నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నింపిన ఈ ఘటనలో 11 మంది భవన నిర్మాణ కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

నానక్‌రాంగూడలో ఐదంస్తుల భవనం నిర్మించిన సత్యనారయణ సింగ్‌
నానక్‌రాంగూడలోని లోదా బస్తీలో సత్యనారాయణ సింగ్‌ అనే వ్యక్తి 250 గజాల స్థలంలో ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్‌లను పరిశీలించిన కమిటీ ..ప్లానుకు భిన్నంగా నిర్మాణం జరిగిందని తేల్చింది. ప్లాన్‌ అమల్లో మాత్రమే కాకుండా నిర్మాణంలో కూడా లోపముందని తేల్చింది. మొత్తం భవన నిర్మాణంలో పాటించాల్సిన నిర్మాణ ప్రమాణాలన్నింటినీ గాలికి వదిలేశారని కమిటీ స్పష్టం చేసింది.

సంబంధిత అధికారులపై సస్పెన్షన్
అయితే ఈ ఘటనపై సీరియర్‌గా స్పందించిన ప్రభుత్వం ...సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందుకు కారణమైన మరో ముగ్గురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. ఇక జేఎన్టీయూ బృందం నివేదిక ఆధారంగా నిందితులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

18:12 - January 9, 2017

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించిన వనపర్తి జిల్లా ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. విద్యార్ధులు చదువుకోవడానికి కష్టాలు తప్పడం లేదు. విద్యార్ధులు వాగు,వంకలు దాటాల్సిన పరిస్ధితి. వర్షాకాలంలో పరిస్ధితి మరీ దారుణం..ఈ సమస్యతో భావిభారత పౌరులు చదువులకు దూరమవుతున్నారు.

వనపర్తి జిల్లా శేరుపల్లిలో నిత్యం నరకం
చదువుకునేందుకు ఈ విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.. స్కూల్‌కువెళ్లాలంటే ఈ వాగు దాటాలి.. అబ్బాయిలైతే ఇలా ప్యాంట్‌ చేత్తోపట్టుకొని వాగును దాటేస్తారు.. ఆ తర్వాత మళ్లీ బట్టలు వేసుకుంటారు.. అమ్మాయిలపరిస్థితి అయితే దారుణం... వాగుదాటితే డ్రెస్‌మొత్తం తడిచిపోతుంది.. ఒడ్డుకువచ్చాక బట్టలు మార్చుకోవాలంటే చాలా ఇబ్బందులు.. కేవలం ఈ సమస్య వల్లే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని స్కూల్‌కే పంపడంలేదు.. ఊర్లోఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతోనే సరిపెట్టేస్తున్నారు..

వాగు దాటలేక ఇంతగా కష్టపడుతున్న విద్యార్ధులు
విద్యార్థులు వాగు దాటలేక ఇంతగా కష్టపడుతున్న ఈ ఊరుపేరు శేరుపల్లి.. వనపర్తి జిల్లాలోఉంది.. ఈ గ్రామంలో 500 ఇళ్లున్నాయి.. ఇందులో పదివేహను వందల మంది నివాసం ఉంటున్నారు.. ఈ పల్లెవాసులపిల్లలకోసం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.. ఈ స్కూల్‌లో చదువు పూర్తయ్యాక చిన్నారులకు అసలు సమస్య మొదలువుతంది.. ఉన్నత చదువులకోసం 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీరంగాపురం జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లాలి.. ఈ గ్రామానికి రోడ్డులేదు.. పొలాలు, అడవి మధ్యలోని జింకలోనిబావివాగు దాటి నడక సాగిస్తేనే బడికి వెళ్లడం సాధ్యమవుతుంది..

పై చదువులకు శ్రీరంగాపురంకు వెళ్లే విద్యార్ధులు
జింకలోనిబావివాగు దాటే సమయంలో విద్యార్ధులు తమ ప్యాంట్ విప్పేసి వాగు దాటతారు.. ఆ తర్వాత మళ్లీ డ్రెస్‌ వేసుకొని స్కూల్‌కువెళతారు.. ఆడపిల్లల అవస్థలుమాత్రం చెప్పలేనివి.. కేవలం ఈ వాగు కారణంగానే చాలామంది చదువుకు దూరమవుతున్నారు... చదువు ఎలాగూ ఆపేశామని ఆడ పిల్లలకు తల్లిదండ్రులు చిన్న వయసులోనే వివాహాలు కానిచ్చేస్తున్నారు.. చదువుకోవాలన్న ఆసక్తి బలంగాఉన్నారు.. తల్లిదండ్రుల ప్రోత్సాహంఉన్నవారుమాత్రం ప్రమాదకరమైన వాగును దాటుతూ స్కూల్‌కు వెళుతున్నారు.. మామూలు సమయాల్లో ఎలాగో వాగు దాటి స్కూల్‌కు వెళ్లొచ్చు.. వర్షాకాలంవస్తే వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.. అలాంటి టైంలో పాఠశాలకు వెళ్లడం సాధ్యంకానిపని..

పొలం పనులకు వెళ్లాలంటే రైతులు, కూలీలకు తిప్పలు
ఒక్క విద్యార్థులేకాదు.. శేరిపల్లి, శ్రీరంగపురం గ్రామాల మధ్య నివసిస్తున్న స్థానికులందరికీ ఇవే తిప్పలు.. పొలాలు దున్నేటప్పుడు... పంటలు కోతలకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాగు దాటించడానికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగేళ్ల క్రితం ఈ వాగుకు బ్రిడ్జ్ మంజూరు
ఈ గ్రామస్తుల సమస్య తీర్చడానికి గతంలో ప్రభుత్వం బ్రిడ్జ్‌ నిర్మాణానికి అనుమతి మంజూరుచేసింది.. ఇక తమ కష్టాలు తీరాయని ప్రజలంతా సంతోషించారు.. అయితే వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. ఏళ్లుగడుస్తున్నా బ్రిడ్జ్ నిర్మాణపనులు ఇంకా ప్రారంభం కాలేదు.. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వనిత అనే నిర్మాణ సంస్ధ... ఫిల్లర్ గుంతలు తీసి వదిలేశారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము ఎదుర్కోంటున్న వాగు కష్టాలకు పరిష్కారం చూపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  

సీపీఎం నేతలపై ఎమ్మెల్సీ బుద్ధా అనుచరుల దాడి..

విజయవాడ : వన్ టౌన్ గ్రామసభలో ఎమ్మెల్సీ బుద్ధా అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన సీపీఎం నేతలపై బుద్ధా వెంకన్న అనుచరులు దాడికి దిగారు. మాజీ కార్పొరేటర్ సత్తిబాబుతో సహా మరో ముగ్గురు సీపీఎం కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాడి చేసిన టిడిపి నేతలను వదిలేసి తమ నేతలను అరెస్టు చేశారంటూ సీపీఎం నేతలు పీఎస్ ఎదుట ఆందోళన నిర్వహించారు.

కేసీఆర్ కు తమ్మినేని 70వ లేఖ..

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి 70వ లేఖ రాశారు. తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వాన్ని ప్రపంచాన్ని చాటుతామంటూ కళాకారులకు ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చిందని లేఖలో పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో వారి ఉనికి, కళల అస్థిత్వం ప్రమాదంలో పడిందన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి పేరిట 550 మందికి మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, ప్రోత్సాహం అంటే కళాకారులందరికీ గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాకారులకు గుర్తింపు కార్డులు..డబుల్ బెడ్ రూం ఇళ్లు..భూమి, వృద్ధ కళాకారులకు రూ.

మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి - మోత్కుపల్లి..

హైదరాబాద్ : జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని మోత్కుపల్లి, రావుల డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తలా..తోక లేకుండా పనిచేస్తోందని, కొత్త జిల్లాల పేరిట ప్రభుత్వం కుంపటి రాజేసిందన్నారు. కేసీఆర్ వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజనపై శ్వేతపత్రం విడుదల చేయాలని, 2019 లో ఏర్పాటయ్యే ప్రభుత్వం మిర్యాలగూడను జిల్లా చేస్తూ తొలి జీవో ఇస్తుందని జోస్యం చెప్పారు.

బడ్జెట్ పై మంత్రి యనమల ముందస్తు ప్రణాళిక సమావేశం..

విజయవాడ : అమరావతిలో రాష్ట్ర బడ్జెట్ పై ముందస్తు ప్రణాళిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులతో మంత్రి యనమల సమావేశం కానున్నారు.

17:04 - January 9, 2017

ఢిల్లీ : పంజాబ్‌ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ ఇవాళ మెనిఫెస్టోను విడుదల చేసింది. పంజాబ్‌ మెనిఫెస్టోను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పంజాబ్‌ మాజీ సిఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. పంజాబ్‌కు కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ అవసరం ఎంతైనా ఉందని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. పంజాబ్‌ నీరు పంజాబ్‌కే చెందుతాయని అమరిందర్‌సింగ్‌ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఇల్లు లేని పేదవారికి ఉచిత ఇళ్లు, నీటి పంపకం, నిరుద్యోగం, డ్రగ్స్‌, పరిశ్రమలు, వ్యవసాయరంగానికి మెనిఫెస్టోలో పెద్దపీట వేశారు.

17:00 - January 9, 2017

నెల్లూరు : ఎస్పీ గ్రీవెన్సుహాల్ లో ముక్తార్ అహ్మద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని స్థల వివాదంలో పోలీసులు తమకు న్యాయం చేయలేదంటూ ఎస్పీ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతనని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

16:57 - January 9, 2017

హైదరాబాద్‌ : తార్నాకలో టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ విద్యార్థి జేఏసీ విఫలయత్నం చేసింది. ఫ్ల కార్డులు చేతబట్టి కోదండరామ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కోదండరామ్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

16:54 - January 9, 2017
16:51 - January 9, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ వైపు తుపానులతో.. మరోవైపు లోటు వర్షపాతంతో తీవ్రంగా సతమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా గ్రేహోండ్స్ ఏర్పాటుకు కృషిచేస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. వరదాలు, విపత్తుల సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల కృషి అభినందనీయమని చెప్పారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్, 10వ బెటాలియన్ భవనాలకు రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి పాల్గొన్నారు.

16:40 - January 9, 2017

ఉత్తరప్రదేశ్ : బిఎస్‌పి చీఫ్‌ మాయావతిపై బిజెపి ఈసీకి ఫిర్యాదు చేసింది. కులం, మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మాయావతిపై ఆరోపణలు చేసింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, పార్టీని రద్దు చేయాలని బిజెపి తన ఫిర్యాదులో పేర్కొంది. యూపీకి చెందిన బిజెపి నేత శంకర్‌ సక్సేనా ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మాయావతి ఉల్లంఘింస్తున్నారని ఆయన ఆరోపించారు. బిఎస్‌పి అభ్యర్థుల జాబితాలో దళితులు, ముస్లింలకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే.

16:38 - January 9, 2017

విజయవాడ : కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల మరణ మృదంగం కొనసాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి మూడు నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోతున్నారన్నారు. విద్యార్థుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా స్కూళ్లకు, కాలేజీలకు గుర్తింపు లేదని.. ప్లే గ్రౌండ్‌, క్వాలిఫైడ్‌ టీచర్లు లేకపోయినా విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. 

16:36 - January 9, 2017

నెల్లూరు : జిల్లా వెంకటగిరి రూరల్‌ మండలం పాళెంకోటలో జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామంలోకి రాకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లు, చెట్లు నరికి వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత జన్మభూమి కార్యక్రమంలో పెట్టుకున్న దరఖాస్తులకు ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. అప్పటి చెప్పిన సమస్యలు ఇప్పటికీ పరిష్కరించని అధికారులు మళ్లీ జన్మభూమి పేరుతో వచ్చి ఏం ఉద్దరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు చెట్లు నరికి అడ్డంగా వేయడంతో అధికారులు మూడు గంటలపాటు గ్రామంలోకి వెళ్లలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పి.. జన్మభూమి కార్యక్రమం జరిగేలా చూశారు.

16:33 - January 9, 2017

కృష్ణా : జిల్లాలో కార్మికుల మరణాలు కలకలం రేపుతోంది. కంచికిచర్ల మండలం గరిడేపల్లిలో ఓ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆదివారం విధులకు వెళ్ళిన కార్మికుడు సైదులు మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఫ్యాక్టరీ సమీపంలోని చెరువులో సైదులు మృతదేహం లభ్యమయ్యింది. దీంతో సైదులు మృతదేహంలో ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెంటిని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ కార్మికులు మరణిస్తున్నా యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవటంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతంలో కూడా పలువురు కార్మికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

16:14 - January 9, 2017

హైదరాబాద్ : కాంట్రాక్ట్ లెక్చరర్లతో ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు జరిపేదిలేదంటూ మంత్రి కడియం శ్రీహరి తెగేసి చెప్పారు. కాంట్రాక్స్ లెక్చరర్ల సమ్మెపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికే వేతనాలకు రూ.18 వేల నుండి 27వేలకు పెంచామన్నారు. జీవో 14 ప్రకారం మాత్రమే వేతనాలను చెల్లిస్తామని స్పష్టం చేశారు. మీరు చేసే సమ్మె వెనుక ఎటువంటి రాజకీయ శక్తులున్నాయో మాకు తెలుసని మండపడ్డారు. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరిపే ప్రసక్తిలేదని కడియం తెగేసి చెప్పారు. 

ఈసీని కలిసిన అఖిలేష్ వర్గం..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వర్గం ఈసీని కలిసింది. నామినేషన్ తేదీ సమీపిస్తున్నందున సైకిల్ గుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అఖిలేష్ వర్గం కోరింది.

సెంటిని ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో బంధువుల ధర్నా..

కృష్ణా : సెంటినీ ఫ్యాక్టరీ వద్ద ఓ కూలీ మృతి చెందాడు. కంపెనీ ఎదుట మృతుడి బంధువులు ధర్నా చేపట్టారు. కంచికచర్ల (మం) గరిడేపల్లిలో నిన్న సెంటిని ఫ్యాక్టరీ లో పనికి వెళ్లిన సైదులు అనే యువకుడు ఇంటికి తిరిగి రాలేదు. ఈ రోజు చెరువులో సైదులు మృతదేహం లభ్యమైంది. నెల రోజుల వ్యవధిలో ఇదే తరహాలో ఇద్దరు కార్మికులు మృతి చెందినా యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

పీఏసీ ఎదుట హాజరు కానున్న ఉర్జిత్ పటేల్..

ఢిల్లీ : నోట్ల రద్దు వ్యవహారంపై ఈనెల 20వ తేదీన పీఏసీ ఎదుట ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ హాజరు కానున్నారు. ఉర్జిత్ ను విచారించిన తరువాత ప్రధాన మంత్రి మోడీ వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'ఆయిల్ కంపెనీలు..బ్యాంకుల మధ్య చర్చలు'..

ఢిల్లీ : పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదేవీలపై అదనపు ఛార్జీల భారం వినియోగదారులపై వేయమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీలు, బ్యాంకుల మధ్య చర్చలు నడుస్తున్నాయన్నారు.

ప్రజల విశ్వాసం చూరగొన్న ఎన్డీఆర్ఎఫ్ - రాజ్ నాథ్..

కృష్ణా : తక్కువ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రజల విశ్వాసం చూరగొందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్డీఆర్ఎఫ్ గురించి చర్చ జరుగుతోందని, నేపాల్ లో భూకంపం వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కు మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సినవసరం ఉందని, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ ఉందన్నారు.

చెత్త విమాన సంస్థల్లో ఏయిరిండియాకు మూడో స్థానం..

ఢిల్లీ : 2016 సంవత్సరానికి గాను విమానయాన సంస్థలకు ఫ్లైట్ స్టాక్స్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. చెత్త విమానయాన సంస్థల్లో ఏయిరిండియాకు మూడో స్థానం లభించింది.

ఎన్డీఆర్ఎఫ్ భవనాలకు శంకుస్థాపన..

కృష్ణా : కొండపావులూరు వద్ద ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొన్నారు.

 

15:49 - January 9, 2017
15:46 - January 9, 2017

దక్షిణ కొరియా : స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి అంతా ఉత్సాహంగా సిద్ధమవుతారు. సందడిగా చేపల వేటకు పోటీ పడతారు. ఈ పోటీలను చూడటానికి లక్షల మంది వస్తుంటారు. పార్టిసిపెంట్‌ ఒక్క చేపను పట్టినా కేరింతలు కొడతారు...ఎందుకంటే ఈ చేపల వేట సాగేది పూర్తిగా మంచులో కాబట్టి. ఇంతకీ మంచులో చేపలు పట్టే తతంగం ఎక్కడ అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూడండి. మీకే తెలుస్తోంది. !

దక్షిణ కొరియాలో జరిగే ఐస్‌ ఫెస్టివల్‌ ఎంతో ప్రత్యేకత
మంచుపై స్కేటింగ్‌, మంచు శిల్పాలు మలచడం లాంటి ఎన్నో వెరైటీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ దక్షిణ కొరియాలో జరిగే ఐస్‌ ఫెస్టివల్‌కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. హ్వాచియాన్‌ సాంచియోనియోలో ఏటా జనవరి 7 నుంచి 29 వరకు జరిగే ఈ ఫెస్ట్‌లో మంచులో చేపలు పడుతారు. అదేంటి.. నీళ్లలో చేపలు పట్టడం తెలుసు కానీ ఈ మంచులో చేపలు పట్టడం ఏంటీ అని అనుకుంటున్నారా...? ఇక్కడి గాంగ్వన్‌ డూ అనే ప్రావిన్స్‌లో చలికాలంలో గడ్డకట్టుకుపోయే నది ఉంటుంది. ఈ నది దగ్గరికి స్థానికులు చేరి చేపలు పడుతుంటారు. మంచులో చేపలు పారదర్శకంగా కనిపిస్తుంటాయి. వీటిని చాకచక్యంగా పట్టుకోవడమే పోటీ. ఈ నదిలో ఉన్న చేపలే కాకుండా నిర్వాహకులు కూడా కొన్ని చేపల్ని ఉంచుతారు.

మంచునదిలో 12 వేలకు పైగా రంధ్రాలు
చేపల వేటకు అనుకూలంగా ఈ మంచునదిలో రెండు మీటర్ల లోతు వరకు పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తుంటారు. ఇలా మొత్తం 12వేలకు పైనే రంధ్రాలుంటాయి. వీటిల్లోంచి చేపల్ని కర్రల్లాంటి వాటితో బయటకు తీస్తారు. ఈ పోటీలో ఎవరు ఎక్కువ చేపలు పడితే వారే విజేతగా నిలుస్తారు. ఈ ఫెస్టివల్‌ను మౌంటెన్‌ ట్రౌట్‌ ఔస్‌ ఫెస్టివల్‌ అని కూడా అంటారు. దీంతో పాటు ఐస్‌ స్కేటింగ్‌, నీటి కొలనులో చేతులతో చేపల వేట వంటి ఇతర పోటీలు ఉంటాయి. ప్రతి ఏటా ఈ ఫెస్టివల్‌ చూడటానికి లక్షల మంది సందర్శకులు వస్తుంటారు.  

15:44 - January 9, 2017

అమెరికా : దేశ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు ఆగడం లేదు. సీనియ‌ర్ హాలీవుడ్ న‌టి, మూడుసార్లు ఆస్కార్ అవార్డు గెలిచిన మెరిల్ స్ట్రీప్ ట్రంప్‌ను టార్గెట్‌ చేశారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల కార్యక్రమంలో సెసిల్ బీ.డీమెలె లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న త‌ర్వాత స్ట్రీప్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. మెక్సిక‌న్లు, ఇత‌ర విదేశీయులు, ముస్లింల‌పై చేసిన కామెంట్స్‌ను ఆమె తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. అస‌లు హాలీవుడ్‌లోఉన్నవాళ్లంతా విదేశీయులే క‌దా.. వారే లేక‌పోతే అస‌లు ఇక్కడ ఏముంటుందని ప్రశ్నించారు. తన ఎన్నికల ప్రచారంలో వికలాంగుడైన ఓ న్యూయార్క్‌ టైమ్స్‌ విలేకరిని ట్రంప్‌ అనుకరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. ఒక వికలాంగుడిని వెక్కిరిస్తూ.. దేశంలోని అత్యంత గౌరవ స్థానంలో కూర్చోవటానికి అనుమతి ఇవ్వాలని ట్రంప్‌ ప్రజలను కోరిన సందర్భమదన్నారు. దానిని చూడగానే నా హృదయం ముక్కలైపోయిందని స్ట్రీప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

15:39 - January 9, 2017

కృష్ణా : కొండపావులూరులో 10వ బెటాలియన్ భవనాలకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు..ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేస్తున్న సేవలు విశిష్టనమనవనీ..కీలకమైనవనీ రాజ్ నాథ్ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తంమీద ఎన్డీఆర్ఎఫ్ ప్రజల అభిమానాన్ని చూరగొందని తెలిపారు. నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అందించిన చేవలు అసామాన్యవని ప్రశంశించారు. అలాగే వారి సంఖ్య పెంచాలనే డిమాండ్ కూడా వుందనీ..డిమాండ్ ను పరిశీలిస్తున్నామన్నారు. వారికి మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా రాజ్ నాథ్ పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి పాల్గొన్నారు.

15:07 - January 9, 2017

బిర్యానికి...జల్లికట్టుకు లింక్ ఏంటీ ? అది ప్రముఖ సినీ నటుడు 'కమల్ హసన్' పెట్టారా ? అని అనుకుంటున్నారా.. తమిళనాడు రాష్ట్రంలో 'జల్లికట్టు' ఆటను నిషేధించిన సంగతి తెలిసిందే. 2004లో సంవత్సరంలో ఈ నిషేధాన్ని విధించారు. తమిళుల వీరత్వాన్ని, సంప్రదాయాన్ని చాటే సాహసక్రీడగా 'జల్లికట్టు' ప్రఖ్యాతి గాంచింది. 'సంక్రాంతి' పర్వదినం సందర్భంగా ఈ క్రీడ సాగనుంది. అయితే, ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ పలువురి వాదననను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జల్లికట్టుకు 2014లో తమిళనాట బ్రేక్ పడింది. ఈ విషయంపై తాజాగా 'కమల్' ఘాటుగానే స్పందించారు. 'బిర్యాని'పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. చెన్నైలో జరుగుతున్న ఓ మీడియా సంస్థ సౌత్ కన్‌క్లేవ్ కు ఆయన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడులో నిషేదించిన జల్లికట్టు ఆటపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతిలో ఎద్దులను దేవుళ్లుగా పూజిస్తామని...వేరే దేశంలో ఎద్దుల పోరాటాన్ని చూసి మనదేశంలో 'జల్లికట్టు'ను రద్దు చేయడం ఏంటనీ ప్రశ్నించినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. జల్లికట్టుపై నిషేధం విధించాలనుకుంటే 'బిర్యానీ'పై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. 'జల్లికట్టు' తమ సంస్కృతిలో భాగం అని, స్పెయిన్ లో ఎద్దులను గాయపరుస్తారని దాన్ని చూసి ఇక్కడ కూడా అలాగే చేస్తారని అనుకోవద్దని పేర్కొన్న్నారు. 'కమల్' డిమాండ్ లపై ఎలాంటి స్పందన వెలువడుతుందో చూడాలి.

14:57 - January 9, 2017

పెద్దపల్లి : జిల్లా మంథనిలో 10 టీవీ క్యాలెండర్‌ను మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆష్కరించారు. 10 టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన 10 టీవీ... అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని ప్రశంసించారు.. 

మోడీకి పన్నీర్ సెల్వం లేఖ..

చెన్నై : భారత దేశ ప్రధాన మంత్రికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం లేఖ రాశారు. జలికట్టుపై ఆర్డినెన్స్ ఇవ్వాలని సెల్వం లేఖలో కోరారు.

శ్రీవారి బూందీపోటులో ఫైర్ ఆక్సిడెంట్..

చిత్తూరు : తిరుమల శ్రీవారి బూందీపోటులతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

మద్రాసు హైకోర్టులో జయ మృతి పిటిషన్ పై విచారణ..

చెన్నై : జయలలిత మృతిపై సందేహాలున్నాయని దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. జయకు అందించిన చికిత్సపై నివేదికను ఇచ్చేందుకు సిద్ధమని అపోలో ఆసుపత్రి న్యాయవాది వెల్లడించారు. తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది.

14:50 - January 9, 2017

విశాఖ : పెద్ద నోట్ల రద్దు సమాజంలోఆర్థిక అసమానతలు తొలగిపోయేందుకు దోహదం చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. అవినీతి నిర్మూన జరుగుతుందని విశాఖలో జరుగుతున్న డిజిటల్‌ ఇండియా సదస్సులో చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో మొబైల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో బొటనవేలుతో ట్రాశాక్షన్లు జరిపే స్థాయికి భారత్‌ ఎదుగుతుందన్నారు. 

కర్నూలులో ఐదో రోజు జగన్ పర్యటన..

కర్నూలు : జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఐదో రోజు పర్యటిస్తున్నారు. బండి ఆత్మకూరు (మం) లింగాపురం, ఓంకారం, కడమకాలువ, వెంగల్ రెడ్డి పేట, బి.కోడూరు, తిమ్మాపురం, బుక్కాపురం గ్రామాల్లో రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.

నోట్ల ఇబ్బందులపై యాత్ర - వీహెచ్..

హైదరాబాద్ : నోట్ల ఇబ్బందులపై 18 నుండి 21 వరకు జిల్లాల్లో పర్యటిస్తానని కాంగ్రెస్ నేత వీహెచ్ వెల్లడించారు. తన రథంపై ఏఐసీసీ, పీసీసీ, వర్కింగ్ పీసీసీ వ్యక్తుల ఫొటోలున్నాయని, జానారెడ్డి ఫొటో అవసరం లేదనే పెట్టలేదన్నారు. తన పర్యటన పార్టీ కోసమేనని, వ్యక్తిగతం కోసం కాదన్నారు. నోట్ల రద్దు మోడీ అనాలోచిత నిర్ణయమని, ఈ నిర్ణయం వల్ల దేశం మూడేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

14:47 - January 9, 2017

విజయవాడ : క్యాష్‌లెస్‌ విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏపీ ప్రభుత్వం విజయవాడలో డీజీ ధన్‌మేళా ఏర్పాటుచేసింది.. రెండురోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని మంత్రి దేవినేని, ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు.. ఈ ధన్‌మేళాపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.

14:46 - January 9, 2017

హైదరాబాద్ : మిర్యాలగూడను జిల్లాగా... హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలంటూ అఖిలపక్ష జిల్లా సాధన కమిటీ ఆందోళనకు దిగింది.... ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టిన ఈ నిరసనలో కాంగ్రెస్‌ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.. ముసాయిదాలో ప్రకటించినట్లుగా ఘట్టుప్పలను మండలంగా చేయాలని డిమాండ్ చేశారు..

14:41 - January 9, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ధర్నాకు దిగారు. అనుమతులు లేకుండా రోడ్లను తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన పట్టించుకోవడం లేదంటు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితిని అధికారులు పట్టించుకోవటంలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో వచ్చిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితులు అధ్వాన్యంగా వున్నాయి. కానీ రిలయన్స్ వారు రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారనీ..దీంతో వాహనదారులు..ప్రయాణీకులు, పాదచారులు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ..దీనిపై జీహెచ్ ఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదనీ..సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైటాయించారు. గతంలో తవ్విన వాటినే ఇప్పటివరకు పూడ్చలేదనీ..ఇప్పుడు నా ఒక నియోజకవర్గంలోని రోడ్డును 6 ట్రాక్టర్లతో తవ్వేస్తున్నారని అదేమని అడిగితే ఏ ఒక్క అధికారీ పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మెపై మంత్రి కడియం ఆగ్రహం..

హైదరాబాద్ : కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మెపై మంత్రి కడియం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మెను విరమించాలని, కేవలం కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమేనని పేర్కొన్నారు. చర్చలకు పిలిచేది లేదని, ఏ రాజకీయ శక్తులున్నాయో తమకు తెలుసని పేర్కొన్నారు. ఇప్పటికే వేతనాలను రూ. 18 వేల నుండి రూ. 27వేలకు పెంచడం జరిగిందన్నారు. జీవో 14 ప్రకారమే వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో విద్యార్థుల గల్లంతు..

కరీంనగర్ : మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో ఎస్ఆర్ ఎస్పీ కెనాల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపులు చేపట్టారు.

 

14:18 - January 9, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీలో సింబల్ వార్ కొనసాగుతోంది. సైకిల్ గుర్తును తమ పార్టీకే కేటాయించాలని ఇరు వర్గాలు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ములాయం సింగ్, శివపాల్ యాదవ్ ఈసీతో భేటీ అయ్యారు. సైకిల్ గుర్తును తమ పార్టీకే కేటాయించాలని ఈసీని ములాయం విజ్ఞప్తి చేశారు. బల నిరూపణకు సంబంధించిన అఫిడవిట్లను ములాయం సిగ్ ఈసీకి సమర్పించారు. ఎన్నికల గుర్తుపై మరికాసేపట్లో ఈసీతో అఖిలేశ్ యాదవ్ కూడా భేటీ కానున్నారు. కాగా ఎస్పీ పార్టీలో చెలరేగిన సంక్షోభంతో తండ్రీ కుమారుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సైకిల్ గుర్తుకోసం కసరత్తులు కొనసాగుతున్నాయి. తమ పార్టీకే సైకిల్ గుర్తును కేటాయించారలని ఇరు వర్గాలు ఈసీని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తు ఈసీ ఎవరికి కేటాయిస్తారనే విషయంపై ఆసక్తి కొనసాగుతోంది. 

పెట్రోల్ బంకుల్లో నో సర్ ఛార్జీ...

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో డెబిట్..క్రెడిట్ కార్డుల లావాదేవీలపై సర్ ఛార్జీలను కేంద్రం ఎత్తివేసింది. పెట్రోల్ బంక్ ల యజమానుల ఆందోళన నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది.

టి.టిడిపి నేతల సమావేశం..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి నేతల భేటీ జరిగింది. ఎల్.రమణ, రేవంత్, పెద్ది రెడ్డి, రావుల, శోభారాణి తదితరులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై చర్చించనున్నారు.

ఈసీతో ముగిసిన ములాయం భేటీ..

ఢిల్లీ : ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈసీతో జరిపిన భేటీ ముగిసింది. కాసేపట్లో అఖిలేష్ యాదవ్ కూడా భేటీ కానున్నారు. సింబల్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ గుర్తు తమకే కేటాయించాలని ములాయం ఈసీని కోరారు. ప్రమాణ పత్రాన్ని ఈసీలో దాఖలు చేశారు. బలనిరూపణకు సంబంధించిన అఫిడవిట్లను కూడా దాఖలు చేశారు.

13:45 - January 9, 2017

ఢిల్లీ :సమాజ్‌వాది పార్టీలో సైకిల్‌ గుర్తు కోసం ఇరువర్గాల బలప్రదర్శన కొనసాగుతోంది. పార్టీ గుర్తు తమకే కేటాయించాలంటూ ములాయంసింగ్‌ యాదవ్‌ ఎన్నికల కమిషన్‌ను మరికొద్దిసేపట్లో కలవనున్నారు. బల నిరూపణకు సంబంధించిన అఫిడవిట్లను ఈసీకి సమర్పించనున్నారు. ములాయంతో పాటు శివపాల్‌ యాదవ్‌ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అఖిలేష్‌ వర్గం శనివారంనాడే ఈసీని కలిసింది. 90 శాతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమకు మద్దతుగా ఉన్నారని ఈసీకి అఫిడవిట్లు సమర్పించారు. పార్టీ అధ్యక్షుడిని తానేనంటూ ఆదివారం నాడు ములాయంసింగ్‌ మరోసారి ప్రకటించారు. అఖిలేష్‌ యాదవ్‌ యూపీ సిఎం మాత్రమేనని తెలిపారు.

13:43 - January 9, 2017

మహబూబాబాద్: పేదల సంక్షేమం వదిలేసి ఆలయాలకు కోట్లకు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండి పడ్డారు. ముందు ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే 19 జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసిన బృందం... మైబాద్‌లోకూడా స్థానికులు సమస్యలు తెలుసుకుంటోంది.... జిల్లాలో ప్రవేశించిన సీపీఎం బృందానికి స్థానిక నేతలు, కార్యకర్తలనుంచి అపూర్వ స్వాగతం లభించింది..

13:34 - January 9, 2017

విజయవాడ : ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మెట్రో నిర్మాణ పనులు చేపట్టి తీరుతాం..త్వరలోనే బెజవాడ ప్రజల మెట్రో కల నెరవేరుస్తాం.. ఇవీ.. తరచూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే మాటలు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రజల చిరకాల స్పప్నం అయిన బెజవాడ మెట్రోను సాధ్యమైనంత త్వరలోనే చేపడతామని చెబుతూ వస్తున్న సర్కార్‌.. ఆ దిశగా కనీసం ఓ ప్రణాళిక, కార్యాచరణను కూడా రూపొందించడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా..ఇంతవరకు విజయవాడ మెట్రో నిర్మాణ పనులకు సంబంధించి ఏ ఒక్క పని మొదలు కాలేదు. తొలి నుంచి ఈ ప్రాజెక్టుకు అనేక చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి.

కేవలం 300 కోట్లే ప్రభుత్వం మంజూరు ...

ప్రధానంగా భూసేకరణ దశలోనే అడ్డంకులు ఎదురు కావడం, భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అనడంతో ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు కదడం లేదు. ప్రాజెక్టు నిర్మాణానికి 7200 కోట్ల రూపాయలు అవసరం కాగా.. కేవలం 300 కోట్లే ప్రభుత్వం మంజూరు చేయడం కూడా మెట్రో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకోవడానికి కారణమవుతున్నాయి. ఓ వైపు నిధుల కొరత, మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన భూముల కొరత ప్రధాన అవరోధాలుగా మారాయి.

రైతులనుండి తీవ్ర వ్యతిరేక...

విజయవాడలో బందరు, ఏలూరు రోడ్డులో మెట్రో రైల్‌ మార్గం నిర్మాణానికి 75 ఎకరాల భూమి అవసరమని తొలుత అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు భావించారు. చివరకు 68.32 ఎకరాలకు కుదించారు. ఇందులో 61.23 ఎకరాలు నిడమానూరులో కోచ్ డిపోల కోసం, 2.57 ఎకరాలు పెనమలూరులో ఎలక్ట్రికల్ స్టేషన్ కోసం సేకరించాలని, మిగిలిన 4.52 ఎకరాలు నగర పరిధిలో సేకరించాలని భావించారు. ఈ క్రమంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేశారు.

60 శాతం ఏఎంఆర్సీ అప్పుల రూపంలో

మెట్రో నిర్మాణానికి అవసరం అయ్యే 7,200 కోట్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం భరిస్తాయి. మిగిలిన 60 శాతం ఏఎంఆర్సీ అప్పుల రూపంలో సేకరిస్తుంది. కానీ, కేంద్రం ఇప్పటి వరకు తమ వాటా కింద ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే మంజూరు చేయడం ఏ మాత్రం సరిపోతాయన్న ప్రశ్నకు దారితీస్తోంది. ఏఎంఆర్సీ వాటా 60 శాతం నిధుల కోసం జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ లోని ఆర్థిక సంస్థల ప్రతినిధులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. టెండర్లు పూర్తయ్యేనాటికి ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు పూర్తై నిధులు ఎంత మేరకు వస్తాయనేది అనుమానమే. ఈ తరుణంలోనే వచ్చే ఎన్నికల నాటికి సాగతీత ధోరణిని అవలంభిస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

నిరుద్యోగులకు రూ. 2500 స్టైఫండ్ - కాంగ్రెస్..

ఢిల్లీ : పంజాబ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు రూ. 2500 స్టైఫండ్ కింద అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 

జీహెచ్ఎంసీ వద్ద కిషన్ రెడ్డి ధర్నా..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ నేత కిషన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. అనుమతులు లేకుండా రోడ్లను తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. 

పంజాబ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

ఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విడుదల చేశారు. గ్రామ గ్రామం తిరిగి మేనిఫెస్టోను వివరిస్తామని, పంజాబ్ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యను నాలుగు వారాల్లో పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ వెల్లడించారు. 

ఎలక్షన్ కమిషన్ ను కలువనున్న ములాయం..

ఢిల్లీ : ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులను కలువనున్నారు. ఆయనతో పాటు అమర్ సింగ్, శివ్ పాల్ సింగ్ యాదవ్ లు కూడా ఉన్నారు. 

ధోనీ రాజీనామాపై ఆసక్తికర కథనం.

ఢిల్లీ : ధోనీ కెప్టెన్సీ రాజీనామాపై హిందూస్థాన్ టైమ్స్ లో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. సెలక్టర్లు సూచించడం వల్లే ధోనీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నారని కథనం. 

కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి - బాబు..

విశాఖపట్టణం : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో మనం ముందుండాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు చేయాలన్నారు. పోలవరం పనులను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్ వైపు ప్రజలను మళ్లించడం చాలా కష్టమన్నారు. 

పన్ను వసూళ్లు పెరిగాయి - జైట్లీ..

ఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు అనంతరం పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారు. సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు 12.4 శాతం పెరిగాయని, ఏప్రిల్ -డిసెంబర్ డైరెక్ట్ ట్యాక్స్ 12.1 శాతం వృద్ధి చెందిందన్నారు. ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లలో 25 శాతం వృద్ధి చెందిందన్నారు.

 

కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి - బాబు..

విశాఖపట్టణం : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలో మనం ముందుండాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు చేయాలన్నారు. పోలవరం పనులను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామన్నారు. డిజిటలైజేషన్ వైపు ప్రజలను మళ్లించడం చాలా కష్టమన్నారు. 

12:48 - January 9, 2017

గుంటూరు :మూతబడిన భజరంగ్‌ జూట్‌ మిల్లును తెరిపించాలంటూ గుంటూరు కలెక్టరేట్‌ముందు కార్మికులు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.. 'ఆకలిదీక్ష' పేరుతో నిరసన చేపట్టాయి.. జూట్‌మిల్లును తెరిపించి సీఎం తన హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేశాయి... 18నెలలుగా మిల్లును మూసివేసిన యాజమాన్యంపై కఠిన చర్యలుతీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయుగు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే పరిశ్రమ మూతపడిందని ఆరోపించారు. మేనేజ్ మెంట్ కు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మికులకు మద్దతు ఉంటామని న్యాయవాదులు స్పష్టం చేశారు.

12:43 - January 9, 2017

ఢిల్లీ : సుప్రీం కోర్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా కృష్ణా నదీజలాలను నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని టీసర్కార్ వాదించింది. తెలంగాణ సర్కార్ వాదానలపై మహారాష్ట్ర, కర్ణాటక సర్కార్ లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రిబ్యునల్ తీర్పును జస్టిస్ మదన్, బి.లోకుర్ తో కూడిన ధర్మాసనం ట్రిబ్యునల్ తీర్పును సమర్ధించింది.

12:39 - January 9, 2017

భారత ఆఫ్ స్పిన్నర్ 'రవి చంద్రన్ అశ్విన్' తన బౌలింగ్ మాయతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెడుతుంటాడు. అంతేగాకుండా భారత్ కు పలు విజయాలు అందించాడు కూడా. మరణానంతరం తన నేత్రాలను దానం చేసేందుకు 'అశ్విన్' ముందుకొచ్చాడు. ఈ మేరకు హమీపత్రం మీద సంతకం కూడా చేశాడు. నేత్ర దానం చేయడం అనేది తన భార్య చిరకాల వాంఛ అని 'అశ్విన్' చెప్పుకొచ్చాడు. ఇటీవలే 'అశ్విన్' తండ్రి అయిన విషయం తెలిసిందే. కళ్లను దానం చేయడం ద్వారా.. అంధులకు చూపును ప్రసాదించవచ్చనే మంచి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్న 'అశ్విన్‌'పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అభిమానులు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరాడు. భవిష్యత్తులో తాను రోడ్డు భద్రతను పెంపొందించేందుకు, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని 'అశ్విన్' ఈ సందర్భంగా వెల్లడించాడు.

కిడ్నీ వ్యాధులపై నడ్డా స్పందన..

విశాఖపట్టణం : శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై జనసేన అధినేత 'పవన్' డిమాండ్స్ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డా స్పందించారు. వ్యాధులకు మూల కారణాల అన్వేషనకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, కిడ్నీ సమస్య కారణాలు తెలుసుకుంటామన్నారు. 

12:19 - January 9, 2017

విశాఖ : డిజిటల్ ఇండియాలో మొబైల్ మనీకే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ నగరంలో ఈ గవర్నెన్స్ పై 20వ జాతీయ సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీలో పేపర్ లెస్ ఆఫీసు విధానం తీసుకువస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని, ప్రస్తుతం 34శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. 2017 చివరి నాటికి డిజిటల్ లావాదేవీలు 55-60 శాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. స్టార్టప్ లకు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామన్నారు.

పేపర్ లెస్ ఆఫీసు విధానం తీసుకొస్తాం - బాబు..

విశాఖపట్టణం : ఏపీ రాష్ట్రంలో పేపర్ లెస్ ఆఫీసు విధానం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ గవర్నెన్స్ పై 20వ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని, ప్రస్తుతం 34 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. 2017 చివరి నాటికి డిజిటల్ లావాదేవీలు 55 -60 శాతానికి చేరుకొనే అవకాశం ఉందన్నారు. 

సుప్రీంలో టి. సర్కార్ కు చుక్కెదురు..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. నీటి కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును జస్టిస్ మదన్ బి లోకుర్ తో కూడిన ధర్మాసనం సమర్థించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. కృష్ణా నది జలాలను నాలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని టి.సర్కార్ వాదించగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భవిష్యత్ లో తెలంగాణ ఎ, తెలంగాణ బి..గా విడిపోతే మళ్లీ నీటి కేటాయింపులు మొదటి నుండి జరపమంటారా ? అని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. 

నీటి పారుదల శాఖాధికారులతో మంత్రి హరీష్ భేటీ..

హైదరాబాద్ : జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై చర్చిస్తున్నారు. 

ఓయూ శతాబ్ది ఉత్సవాలపై మంత్రి కడియం సమీక్ష..

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలపై అధికారులతో మంత్రి కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. 

గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆకలి దీక్షలు..

గుంటూరు : కలెక్టరేట్ ఎదుట ఆకలి దీక్ష పేరిట భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు, ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం హామీ ప్రకారం జూట్ మిల్లును తెరిపించాలని డిమాండ్ చేశాయి. మిల్లును తెరిపించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. 

మహబూబాబాద్ లో పాదయాత్ర..

మహబూబాబాద్ : జనగాం పర్యటించిన పాదయాత్ర కాసేపటి క్రితం మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఔతాపురంలో పాదయాత్ర బృందానికి సీపీఎం జిల్లా కమిటీ ఘన స్వాగతం పలికింది. ఇప్పటి వరకు 19 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసింది. 

11:40 - January 9, 2017

విజయనగరం : జిల్లాలోని గురుగుబిల్లి మండలం కొంకడివరంలో అక్రమక్వారీపై గ్రామస్తులు తిరగబడ్డారు.. క్వారీ రాయిని పేల్చేందుకు బాంబులు అమర్చడంపై ఆందోళనకు దిగారు.. అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు.. తాము ఆందోళనచేస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులనుంచి ఎలాంటి స్పందనా రావడంలేదని ఆరోపించారు.. గ్రామస్తుల సమాచారంతో అక్కడికివచ్చిన పోలీసులు... పేలుడు పదార్థాలను తెచ్చిన ఇద్దరు కూలీలను అరెస్ట్‌ చేశారు..

అక్రమ క్వారీ తవ్వకాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..

విజయనగరం : కొంకడివరంలో అక్రమంగా జరుగుతున్న క్వారీ తవ్వకం పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. క్వారీలో రాయిని పేల్చేందుకు బాంబులను అమర్చారు. ఇద్దరు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 

రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు - వెంకయ్య..

విశాఖపట్టణం : రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు జరుగుతాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ గవర్నర్నెస్ 20వ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్ ఆర్థికంగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయని, అభివృద్ధిలో చైనా కన్నా భారత్ దూసుకెళుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దును దేశ ప్రజలు సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు పెద్దనోట్ల రద్దు దోహదం చేస్తుందని, మోడీ నిర్ణయాన్ని అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలన్నారు. 

11:31 - January 9, 2017

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

విశాఖ : పరిపాలనలో ఈగవర్నెన్స్ కు కేంద్రం పెద్ద పీట వేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విశాఖ నగరంలో ఈ గవర్నెన్స్ పై 20వ జాతీయ సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులతో పాటు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దును దేశ ప్రజలందరూ సమర్ధిస్తున్నారని, ప్రధాని నిర్ణయాన్ని అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల అనుమతులకు ఆన్ లైన్ విధానాలను ప్రవేశ పెట్టామన్నారు. పెద్ద నోట్ల రద్దు అవినీతి నిర్మూలనకు దోహదం చేస్తుందని, దీన్ని ప్రపంచమంతా హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుతున్నాయని పేర్కొన్నారు.

పెద్దనోట్ల రద్దును ప్రజలు స్వాగతించారు - వెంకయ్య..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును దేశ ప్రజలు సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ గవర్నర్నెస్ 20వ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి నిర్మూలనకు పెద్దనోట్ల రద్దు దోహదం చేస్తుందని, మోడీ నిర్ణయాన్ని అందరూ సానుకూలంగా అర్థం చేసుకోవాలన్నారు. 

11:12 - January 9, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' నటించిన 'దంగల్' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ వసూళ్లతో రికార్డులను తిరగారాస్తోంది. 'పీకే' సినిమా రికార్డులను బద్దలు కొడుతూ స్వదేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'దంగల్' నిలిచింది. 'పీకే' లో కూడా 'అమీర్ ఖాన్' నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 'దంగల్' రూ. 341 కోట్లు సాధించింది. గత డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. భారత రెజ్లింగ్‌ యోధుడు మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవితగాథ ఆధారంగా రూపొందించారు. మహావీర్ సింగ్ తన కుమార్తెలని ఎలా తీర్చిదిద్దారు అనే కథాంశంతో దంగల్ తెరకెక్కింది. నిజ జీవితంలో గీతా, బబిత అనే ఇద్దరు మహిళా కుస్తీ యోధుల పాత్రలను తెర మీద సాన్యా మల్హోత్రా, ఫాతిమా సనా అనే కొత్త తారలు అభినయించగా.. వీరి తండ్రిగా 'అమీర్ ఖాన్', తల్లిగా టీవీ నటి 'సాక్షి తన్వర్' నటించారు. రెజ్లింగ్‌ క్రీడాకారుడిగా, తన కూతుళ్లకు రెజ్లింగ్ నేర్పించే తండ్రిగా.. రెండు విభిన్నమైన పాత్రలో 'అమీర్' ఆకట్టుకొన్నాడు.
2014లో విడుదలైన 'పీకే' సినిమా రూ. 300 కోట్ల మైలురాయిని దాటింది. బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన 'భజరంగి భాయిజాన్' చిత్రం రూ. 320.34 కోట్లు, 'సుల్తాన్' రూ. 300.67 కోట్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు 'దంగల్‌' రూ.341.96 కోట్ల వసూళ్లతో టాప్‌ పొజిషన్‌కు చేరి గత రికార్డులను బద్దలు గొట్టింది. 

11:01 - January 9, 2017

'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' సినిమాలతో ఈ తరం ప్రేక్షకుల్లో తనదైన స్థానం సంపాదించుకున్న 'నాగార్జున' భక్తిరస ప్రధానమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ దర్శకుడు 'రాఘవేంద్ర రావు' తెరకెక్కించిన 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో హథీరాం బాబాగా 'నాగార్జున' నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో వినూత్నంగా జరిగింది. హైటెక్స్ లో ఆదివారం సాయంత్రం జరిగింది. శంఖు, చక్రాల ఆకృతిలో ఉంచిన ఆడియో సీడీలను 'నాగార్జున' తనయులు 'అఖిల్', 'నాగచైతన్య'లు లాంచ్ చేశారు. కీరవాణి స్వరపరిచన గీతాలు 'నాగ్' అభిమానులను అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉంది. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకం పై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ తదితరులు పాటలు రాశారు.

సీజీహెచ్ఎస్ వెల్ నెస్ ప్రారంభం..

విశాఖపట్టణం : చిన్నవాల్తేరులో సీజీహెచ్ఎస్ వెల్ నెస్ ను కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

టెలీకాన్ఫరెన్స్ లో బాబు..

విశాఖపట్టణం : టెలీకాన్ఫరెన్స్ ద్వారా జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మోరీ గ్రామ నమూనా అన్ని గ్రామాలకు విస్తరించాలని, బర్కిలీ విశ్వవిద్యాలయం తరహాలో మన వర్సిటీలు కూడా గ్రామాలను దత్తత చేసుకుని అభివృద్ధి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఫైబర్ నెట్, ఎల్ ఈడీ బల్బులు నగదు రహిత లావాదేవీలను విద్యార్థులను ప్రోత్సాహించాలన్నారు. రైతులకు రబీ రుణాల మంజూరులో జాప్యం చేయవద్దని, ఫించన్లు..కార్డులు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించారు. 

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు...

ఢిల్లీ : 74వ అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా 'లా లా లాండ్', బోస్ట్ మోషన్ పిక్చర్ సెక్షన్ లో 'డ్రామా' చిత్రాలకు అవార్డులు వచ్చాయి. 

గూగుల్, యాపిల్ సంస్థలకు రష్యా సీరియస్ వార్నింగ్..

ఢిల్లీ : ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ లకు రష్యా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. లింక్ట్ ఇన్ సర్వీసులను వెంటనే తొలగించాలని, గూగుల్, యాపిల్ ఇన్ లైన్ల స్టోర్లలో లింక్డ్ ఇన్ సర్వీసుల యాప్ ఉండకూడదని హెచ్చరించింది. తమ దేశ పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు నిల్వ ఉంచడం తమ దేశ చట్టాలకు విరుద్ధమని రష్యా తేల్చి చెప్పింది. 

రైతుల కష్టాలు జగన్ కు ఏం తెలుసు - ప్రత్తిపాటి..

విజయవాడ : రైతుల కష్టాలు వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏం తెలుసని మంత్రి ప్రత్తిపాటి విమర్శించారు. రూ. 24 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే రైతులకు వడ్డీ కూడా చెల్లించలేదని జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చర్యలతోనే రైతు ఆత్మహత్యలు తగ్గాయని, కాంగ్రెస్ పాలనలో 24వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. మిల్లర్లు మద్దతు ధర చెల్లించకుంటే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించారు. 

85వ రోజు పాదయాత్ర..

జనగాం : సీపీఎం మహాజన పాదయాత్ర 85వ రోజుకు చేరుకుంది. జనగామ నుండి మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించనుంది. రేగుల, ఆవుతాపురం, వంగర, నాంచారిమడూర్, వెలికట్టే, తొర్రూర్, మాటేడు, దంతాలపల్లి గ్రామాల్లో పాదయాత్ర జరగనుంది. 

పొందుగుల వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టుపై ఏసీబీ దాడి..

గుంటూరు : పొందుగుల వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

రూర్కెల స్టీల్ ప్లాంట్ పై సీబీఐ దాడి..

ఒడిశా : రూర్కెల స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీపీ బర్మను సీబీఐ అరెస్టు చేసింది. ఓ టెండర్ ను పాస్ చేసే విషయంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. అంతేగాకుండా రూ. 20 లక్షలను స్వాధీనం చేసుకుంది. ఇందులో రూ. 2వేల కొత్తనోట్లున్నాయి. 

10:06 - January 9, 2017

ఈ కాలంలో విరివిగ కాసే కాయలు చిక్కుళ్లు. గ్రామసీమల్లో ప్రతి ఇంటి పెరట్లో చిక్కుడు పాదు కనువిందు చేస్తుంటుంది. చిక్కుడుకాయల్లో మంచి పోషకాలు ఉన్నట్లు న్యూట్రిషన్లు చెబుతుంటారు. చిక్కుడు కాయలతో చేసే ప్రతివంటకం అత్యంత రుచికరంగా ఉండి శరీరానికి కావల్సిన వివిధ పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. అందుకే చిక్కుడు కాయల్ని 'పేదవాని మాంసం'గా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు సంవత్సరం పొడువునా కొన్ని రకాల చుక్కుడు కాయలు కాస్తూనే ఉన్నాయి. పండించే నేలతీరూ నీరూ విత్తనాలను బట్టి చిక్కుడుకాయల్లో రకాలకూ కొదవలేదు. గింజ తక్కువగా ఉండే తప్పరకం, ఎరుపు రంగు గింజలతో కనిపించే డిక్సీ, గింజ ఎక్కువగా ఉండే కణుపు చిక్కుడు రకాలతోబాటు సన్నగా పొడవుగానూ, పొట్టిగా వెడల్పుగా ఉండే రకాలు కూడా ఉంటాయి. అదే చిక్కుడు... అలాగే ఆకుపచ్చరంగుతో బాటు వంకాయ వర్ణంతో కలిసిన ఆకుపచ్చా, ముదురు వంకాయ వర్ణమూ, ఎరుపూ, ముదురు గులాబీ... ఇలా విభిన్న రంగుల్లో కాసే రకాలూ ఉన్నాయి. ఈ కాయల్నీ గింజల్నీ అన్ని ప్రాంతాల్లోనూ వంటల్లో విరివిగా వాడుతుంటారు. మనదగ్గర వీటిని వేయించీ ఉడికించీ లేదా టొమాటో, వంకాయ... వంటి ఇతర కూరగాయలతో కలిపి అనేక రకాల కూరలు వండుతుంటారు. కానీ చిక్కుడు గింజల్ని పచ్చిగా మాత్రం తినకూడదు. ఎందుకంటే వీటిల్లో ట్రిప్సిన్‌, సైనోజెనిక్‌ గ్లైకోసైడ్‌ అనే హానికరమైన పదార్థాలు ఉంటాయి. అదే ఉడికించినప్పుడయితే వాటిల్లోని హానికర పదార్థాలు పూర్తిగా నశించిపోతాయి. సో విరివిగా దొరికే చిక్కుడు కాయల్ని ప్రతిరోజూ వంటకాల్లో చేర్చుకుందాం.

10:05 - January 9, 2017

ఇదేమి చోద్యం అనుకుంటున్నారా ? కానీ ఇది నిజం. తల్లి గర్భం నుండి పిల్లలు జన్మిస్తుంటారు. అది ప్రకృతి సిద్ధం. కానీ బ్రిటన్ లో ఓ చోద్యం జరుగుతోంది. అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ వ్యవహారాన్ని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం హెడెన్ క్రాస్...బ్రిటెన్ కు చెందిన వాడు. పుట్టుకతో స్త్రీ. అయితే స్త్రీగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. లింగమార్పిడి కోసం హార్మోన్ చికిత్స కూడా తీసుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం చట్టపరంగా మగవాడిగా జీవనం సాగిస్తున్నాడు. కానీ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఓ బిడ్డకు తానే తండ్రి..తల్లి అవ్వాలని అనుకున్నాడు. భవిష్యత్ లో పిల్లలకు జన్మనిచ్చేందుకు వీలుగా తన అండాలను భద్రపరచాలని జాతీయ ఆరోగ్య సేవల సంస్థ (ఎన్ హెచ్ఎస్)కు విజ్ఞప్తి చేసుకున్నాడు. ప్రసవంతో బ్రిటన్‌లో బిడ్డకు జన్మనివ్వనున్న తొలి మగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్‌ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. ఇందుకు ఎన్ హెచ్ఎస్ నిరాకరించింది. తన లింగమార్పిడి చికిత్సను తాత్కాలికంగా నిలిపివేసుకున్నారు. కానీ చికిత్స ముగియడానికి ముందే బిడ్డకు జన్మనివ్వాలని హెడెన్ నిర్ణయం తీసుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియచేశాడు. వీర్యదానం చేసేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. అంతే గర్భం దాల్చాడు. ప్రస్తుతం ఇతడు 16 వారాల గర్భంతో ఉన్నాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కనుక అంతకుముందే బిడ్డను కనాలనుకున్నాడు. మరికొన్ని నెలల్లో ప్రసవించనున్నాడు. బ్రిటన్ లో బిడ్డకు గర్భం ద్వారా జన్మనిచ్చిన తొలి తండ్రిగా హెడెన్ క్రాస్ చరిత్ర సృష్టించనున్నారు. తన బిడ్డకు గొప్ప తండ్రిని కావాలని కోరుకుంటున్నట్లు క్రాస్ పేర్కొంటున్నాడు. మరి అతని ఆశ నెరవేరుతుందా ? అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. 

ఛత్తీస్ గడ్ లో రోడ్డు ప్రమాదం..

ఛత్తీస్ గడ్ : సుర్ గుజా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం రాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

09:47 - January 9, 2017

ఢిల్లీ: జమ్ము-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుపడ్డారు. అక్నూర్‌లోని జనరల్‌ రిజర్వు ఇంజనీర్‌ ఫోర్స్‌ క్యాంపు దాడి చేశారు. ఈ ఘటనలో జిఆర్ఈఎఫ్ కు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భారత్‌-పాక్‌ సరిహద్దు నియంత్రణ రేఖకు రెండు కి.మీ. దూరంలోనే ఈ దాడి జరిగింది. ఉగ్రవాదల దాడి తర్వాత జిఆర్ఈఎఫ్క్యాంపును పోలీసులు, భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. 2017లో ఇది మొదటి దాడి. ఉగ్రవాదులు బతల్‌ గ్రామం నుంచి జిఆర్ఈఎఫ్ క్యాంపులోకి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు.

09:44 - January 9, 2017

అమరావతి : చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.. నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాలెం చెక్‌పోస్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు... అక్రమంగా డబ్బు వసూలుచేస్తున్న ముగ్గురు ప్రైవేట్‌ వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.. వారి దగ్గరనుంచి 58 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు... వాణిజ్య పన్నుల సిబ్బందిపేరుతో నిందితులు డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే అనంతపురం జిల్లా హిందూపురం కొడికొండ చెక్‌పోస్ట్‌పైకూడా ఏసీబీ దాడులు చేసింది.. ఓ ప్రైవేట్‌ వ్యక్తినుంచి 15వేల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. చిత్తురు జిల్లా పలమనేరులోని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసులోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. 35వేల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

సింహాచలంలో పోటెత్తిన భక్తులు..

సింహాచలం : ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుండే భక్తులు బారులు తీరారు. మహా విష్ణువు అవతారంలో స్వామి వారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 

09:41 - January 9, 2017

నర్సరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట స్టేడియలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు, సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడేలా రంగవల్లులు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఒంగోలు జాతి గిద్దల ప్రదర్శనతోపాటు, జాతీయ స్థాయి ఎండ్ల పందేలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ పోటీలను ప్రారంరభించారు.

09:34 - January 9, 2017

ఢిల్లీ: ఉత్తర భారతం భారీ హిమపాతంతో అలరిస్తోంది. ఎక్కడ చూసినా పేరుకపోయిన మంచుగడ్డలు దర్శనమిస్తూ మనసుకు ఆహ్లాదిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్ని మంచు వానతో స్వాగతం పలుకుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

వివిధ ప్రాంతాలకు తెగిన సంబంధాలు....

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం కారణంగా సిమ్లా, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లా, కిన్నార్ రీజియన్లలో ఈ సీజన్‌లో తొలిసారి మంచు కురిసింది. టూరిస్ట్ ప్రాంతాలైన కుఫ్రి, ఫాగు, నర్కండా ప్రాంతాల్లో 45-55 సెంటీమీటర్ల మంచు కురిసింది. మంచు కారణంగా రహదారులపై వాహనాలు జారిపోయే పరిస్థితులు ఉండటంతో కులు-మనాలీకి వెళ్లే నేషనల్ హైవే-21ని మూసివేశారు. దీంతో 20 కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేశారు.

కశ్మీర్‌లోయలో రెండు రోజులుగా...

కశ్మీర్‌లోయలో రెండు రోజులుగా భారీ హిమపాతం కురుస్తోంది. కొన్నిచోట్ల మైనస్ 8.4 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. మంచుదుప్పటి కప్పేయడంతో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని వరుసగా రెండోరోజూ మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, మసూరీ, కుమోన్, గర్హాల్ తదితర ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసిందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ముస్సోరీ ప్రాంతంలోని చార్‌ధామ్ పర్వత శ్రేణులపై పూర్తిగా మంచు కప్పివేసిందని చెప్పారు. మొత్తమ్మీద భారీ హిమపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది.

09:10 - January 9, 2017

జనగాం : డీసీపీఎం మహాజన పాదయాత్ర 85వ రోజుకు చేరుకుంది. జనగాం జిల్లాలో సీపీఎం పాదయాత్ర కొనసాగుతోంది. వరంగల్‌ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడుతున్న సీపీఎంకు ఎప్పడూ తమ మద్దతు ఉంటుందని టెన్ టివితో రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

08:36 - January 9, 2017

జనగాం : ఎర్రజెండా చేబూని పల్లెపల్లెనూ చైతన్య పరుస్తూ సీపీఎం మహాజన ముందుకు సాగుతోంది. జనగాం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ప్రజాగాయకుడు గద్దర్‌ పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులను చిన్నచూపు చూస్తోందని, వారికి గుర్తింపు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్య సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర 84 రోజులు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర 84వ రోజు.. మైలారం, ధర్మపురం, విసునూరు, పాలకుర్తి, దరదెపల్లి, మల్లంపల్లి ఎక్స్‌రోడ్‌, వావిలాల గ్రామాల్లో పర్యటించింది. పాలకుర్తిలో జరిగిన సభలో డీసీసీబీ ఛైర్మన్‌ జంగారాఘవరెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొన్నారు. పొడుస్తున్న పొద్దుమీద.. అంటూ తన గళం విప్పి యాత్రకు మద్దతు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించి రెండున్నరేళ్లు గడిచిపోయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినా ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ బతుకు చిత్రం మారాలంటే... వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. మార్క్స్‌, అంబేద్కర్‌, పూలేల సిద్ధాంతాల మేళవింపే ఈ దేశానికి విముక్తి ప్రసాదిస్తోందని తమ్మినేని అన్నారు. సామాజిక మార్పు కోరే ప్రతిఒక్కరూ ఈ మహాకర్మ యుద్ధంలో పాల్గొనాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

కళాకారుల పాత్ర కీలకం..
తెలంగాణ సమాజంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమైందని తమ్మినేని అన్నారు. పేద కళాకారులను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని, కళాకారులందరినీ ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కళాకారులకు ఫించన్‌లు, గుర్తింపు కార్డులు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు పాదయాత్ర 850 గ్రామాల్లో పర్యటించింది. పందొమ్మిది జిల్లాల్లో 2200 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. విస్నూర్‌గడీని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల ప్రాణాలను నిలబెట్టే దవాఖానాను నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 

ఏపీ - ఒడిశా చెక్ పోస్టుపై ఏసీబీ దాడి..

శ్రీకాకుళం : ఇచ్చాపురం పురుషోత్తపురం వద్ద ఏపీ - ఒడిశా సమీకృత చెక్ పోస్టు వద్ద ఏసీబీ దాడులు నిర్వహించింది. 8మంది ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అరెస్టు చేసింది. వారివద్ద రూ. 64వేలను స్వాధీనం చేసుకుంది. 

07:59 - January 9, 2017

హైదరాబాద్ : నోట్ల రద్దు వ్యతిరేకించిన వారు నల్లకుబేరులు అని బెంగళూరులో నిర్వహించిన 14వ ప్రవాస్ భారతీయ దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తప్పు మీద తప్పు చేస్తున్నారా, నోట్ల రద్దు అంశం ఆచరణలో విఫలం అయ్యిందా? పోలవరంపై స్వేతపత్రం విడుదల చేయాలని, బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపి కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. అంతే కాక స్థలం మీరే ఎక్కడో చెప్పండి అని సీఎం చంద్రబాబుకు సూచించారు. సీఎం చంద్రబాబుకు కేవీపీ లేఖ రాయడం దిగజారుడు రాజకీయాలే అని మంత్రి దేవినేని విమర్శించారు. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో దినకర్ టిడిపి నేత, అద్దేపల్లి శ్రీధర్ బిపిపి నేత, తులసి రెడ్డి కాంగ్రెస్ నేత లక్ష్మణరావు ఎమ్మెల్సీ పాల్గొన్నారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ ను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏపీలో పలుచోట్ల చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు

అమరావతి : ఏపీలో పలు చకక్ పోస్టులపై ఏసీబీ దాడులు చేస్తోంది. అనంతపురంలోని కొడికొండ చెక్ పోస్టుపై ఏసీబీ దాడి చేసింది. ఓప్రైవేట్ వ్యక్తి నుంచి రూ. 15వేలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాభీములవారిపాలెం చెక్ పోస్టుపై ఏసీబీ దాడి చేసి రూ.58వేలు స్వాధీనం చేసుకుని ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వాణిజ్యపన్నుల కార్యాలయంపై దాడి చేసి రూ.35 వేలు స్వాధీనం చేసుకుంది.

ఇంజనీరింగ్ ఫోర్స్ క్యాంప్ పై ఉగ్రవాదులు కాల్పులు

జమ్మూకశ్మీర్ : అఖ్నూర్ జీఆర్ ఈఎఫ్ క్యాంప్ పై ఉగ్రదాడి జరిగింది. ఎల్ వోసీ సెక్టార్ లోని బాటల్ గ్రామం వద్ద ఘటన జరిగింది.ఇంజనీరింగ్ ఫోర్స్ క్యాంప్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. అన్ని క్యాంపుల్లో అలర్ట్ ను ఆర్మీ ప్రకటించింది.

పలమనేరులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంపై ఏసీబీదాడి

చిత్తూరు: పలమనేరులోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.35 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.

07:16 - January 9, 2017

ఢిల్లీ : దేశంలో ప్రతివ్యక్తి సంబంధించిన నగదు లావాదేవీలపై నజర్‌ వేసేందుకు కేంద్రం రెడీ అయింది. కొత్తగా ఐటీచట్టాన్ని అమల్లో పెడుతోంది. ఐటీచట్టం 144బీ ప్రకారం అకౌంట్లలో జమ అయ్యే ప్రతిపైసాకు లెక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందేనంటోంది. దీంతో అకౌంట్లకు సంబంధించిన వివరాలన్నీ అందించాలని ఐటీశాఖ బ్యాంకులను ఆదేశించింది. మరోవైపు నవంబర్‌ 8 నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో పోగుపడిన 15లక్షల కోట్లరూపాయల డిపాజిట్ల వివరాలను విశ్లేషించేందుకు ఆదాయపన్నుశాఖ సిద్ధమైంది.

ఐటీ శాఖ తాజా నోటిఫికేష‌న్ ప్రకారం..

దేశంలో జరిగే నగదు లావాదేవీల వివరాలన్నీ ఇక నుంచి ఐటీశాఖకు చేరనున్నాయి. ఐటీ శాఖ తాజా నోటిఫికేష‌న్ ప్రకారం.. అన్ని జాతీయ బ్యాంకులు, కో ఆప‌రేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు తమ డిపాజిట్ల వివ‌రాల‌ను ఐటీ అధికారులకు అందించాల్సి ఉంటుంది. దీంతో దేశంలో ప్రతి ఖాతాదారుడి నగదు లావాదేవీలన్నిటిపై సమగ్ర సమాచారం ఐటీశాఖ చేతిలోకి వెళ్లనుంది.

పాన్‌కార్డులేని వారు ఫార్మ్‌60తో డిక్లరేషన్‌....

బ్యాంకుల్లో కొత్త అకౌంట్‌ తీసుకునే సమయంలో పాన్‌కార్డు లేదా ఫార్మ్‌60ఇవ్వాల్సిఉంది. పాన్‌కార్డు లేనివారు ఫార్మ్‌60రూపంలో బ్యాంకులకు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఐటీశాఖ తాజా నోటిఫికేషన్‌తో పాన్‌కార్డు లేనివారు ఫిబ్రవరి 28లోగా వాటిని.. అందజేయాల్సిఉంది. ఇప్పటికే పాన్‌కార్డు ఉన్న ఖాతాదారులు వెంటనే తమ ఖాతాకు అనుసంధానించుకోవాలని ఐటీశాఖ సూచింది.

07:09 - January 9, 2017

ఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించేందుకు పబ్లిక్ అకౌంట్ కమిటీ సిద్ధమైంది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ.. కె.వి. థామస్ ఆధ్వర్యంలోని కమిటీ... పటేల్‌ను ప్రశ్నించనుంది. ఆ మేరకు ఇప్పటికే తమ ప్రశ్నలను కూడా ఆర్బీఐ గవర్నర్‌కు పంపారు. ఈ వ్యవహారంపై... డిసెంబర్‌లోనే ప్రశ్నించాలని పీఏసీ భావించింది. అయితే.. నోట్లరద్దు సమస్యలు తీరేందుకు 50 రోజులు సమయం పడుతుందని ప్రధాని చేసిన ప్రకటన నేపథ్యంలో... ఇప్పుడు నోటీసులు జారీచేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో రెవెన్యూ సెక్రటరీ, ఫెనాన్స్ సెక్రటరీలకు కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నోటీసులు జారీచేసింది.

07:07 - January 9, 2017

హైదరాబాద్ :ఆత్మహత్యకు పాల్పడిన హెచ్‌సీయూ స్టూడెంట్‌ రోహిత్‌ వేముల పేరుతో చట్టం రూపొందించాలన్న విద్యార్థి, దళిత సంఘాల డిమాండ్‌కు సీపీఎం పూర్తి మద్దతు ప్రకటించింది. గత సంవత్సరం జనవరి 17న పాలకులు, యూనివర్సిటీ అధికారుల అణిచివేత వైఖరితోనే రోహిత్‌ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని.. తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. రోహిత్‌ వేముల సిద్ధాంతాలతో విభేధించిన పాలకులు వీసి ద్వారా వేధించిన తీరు అత్యంత హేయమని సీపీఎం నేతలు మండిపడ్డారు.

07:05 - January 9, 2017

p { margin-bottom: 0.21cm; }

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దివంగత సీఎం జయలలిత మరణానంతరం తమిళనాట తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన అత్త ఆశయాలను నెరవేరుస్తానని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మరోసారి గొంతెత్తారు. తాను రాజకీయాల్లోని వస్తానని బహిరంగంగా తెలియజేయడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. వందలాది అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమెకు మద్దతు తెలిపేందుకు ఇంటిముందు బారులు తీరడంతో... తమిళనాట రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

శశికళపై దీపా ఆగ్రహం ...

జయలలిత మరణానంతరం తనను దూరంగా పెట్టిన శశికళపై దీపా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అత్త ఆసుపత్రిలో ఉండేటపుడు కనీసం చూడటానికి అనుమతించకపోవడంపై మండిపడ్డారు. జయలలిత చికిత్సపై సామన్య ప్రజల్లో నెలకొన్న సందేహాలే దీపాను కలిచివేస్తుండటంతో ఆమె సహించలేకపోయింది. తన అత్త మరణం వెనుక ఎన్నో అనుమానాలున్నాయని గొంతెత్తింది. జయలలిత మరణంపై జవాబు చెప్పాల్సిందేనని ప్రభుత్వాన్ని, శశికళను హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని..తన నిర్ణయాన్ని ఎంజీఆర్ జయంతి తర్వాత ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

దీపా జయకుమార్‌కు ప్రజల నుంచి మద్దతు...

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండటంతో ఇప్పుడు తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆమెకోసం మద్దతుగా వచ్చిన కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరియగా...శశికళ వర్గంలో కలవరపాటు మొదలైంది. ఈ పరిణామాలు ఏ పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి మరి.

07:02 - January 9, 2017

గుంటూరు : భూటాన్‌ మహారాణి తల్లి అశిడోర్జీ వాంగ్మోవాంగ్‌ చుక్‌.. పలువురు బౌద్ధమత పెద్దలతో కలిసి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు. నాగార్జునకొండను చూసి గొప్ప అనుభూతికి లోనయినట్లు తెలిపారు. తన మనవడు గత జన్మ స్మతులతో.. నాగార్జునకొండకు తీసుకెళ్లమని చెప్పడంతో ఇక్కడకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రముఖుల రాక కారణంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

విజయవాడలో కోటిన్నర విలువైన గంజాయి పట్టివేత

కృష్ణా: విజయవాడలో కోటిన్నర విలువైన గంజాయిని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. క్యాబేజి లోడుతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా బెంజి సర్కిల్‌లో పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

06:57 - January 9, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వాదశి వేడుకలకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దైవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ద్వాదశి సంధర్భంగా క్యూ కాంపెక్స్‌లు నిండిపోయాయి. భద్రాచలంలో ఏకాదశి పురస్కరించుకొని తెప్పొత్సవం కన్నుల పండువగా జరిగింది.

హిందువులకు అత్యంత ప్రవిత్రమైన రోజు....

ముక్కోటి ఏకాదశి హిందువులకు అత్యంత ప్రవిత్రమైన రోజు. దీంతో ఆదివారం ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల తాకిడి నెలకొంది. ద్వాదశి పురస్కరించుకొని వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.

తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు ...

తిరుమలలో శ్రీవారి ఆలయంతో పాటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, యాదాద్రిలోని లక్ష్మి నరసింహాస్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం, భద్రాద్రిలోని రాముల వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ద్వాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ...

తిరుమలలో క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. ద్వాదశిని పురస్కరించుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నారాయణగిరిలో ఏర్పాటు చేసిన 16 తాత్కాలిక షెడ్లతో పాటు నాలుగు మాడవిధుల్లో భక్తులు నిండి పోయారు. తిరుమలకు 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడితో తిరుమల స్వామివారి నామ స్మరణతో మార్మోగిపోతోంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ సోమవారమూ కొనసాగుతోంది.

భద్రాద్రిలో రాముల వారి తెప్పొత్సవం...

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాద్రిలో రాముల వారి తెప్పొత్సవం కన్నుల పండువగా జరిగింది. సీతా సమేతుడై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకాదశి సందర్భంగా రాముల వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ద్వాదశి పురస్కరించుకొని భద్రాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీరామచంద్రుడి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సంధర్భంగా ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాల్లో భద్రతను పెంచి పర్యవేక్షిస్తున్నారు.

06:54 - January 9, 2017

తూ.గో : సీతానగరం వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారుతోంది. ఓవైపు పోలవరానికి కాంక్రీటు పండుగలు చేసి..మరోవైపు లిఫ్ట్‌ స్కీమ్‌లు దండగగా నిర్మిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ లిఫ్ట్‌ పథకంతో చంద్రబాబు అవినీతికి ఆజ్యం పోస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంటే...పురుషోత్తపట్నం వల్ల ప్రయోజనం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడుతున్నారు.

విమర్శలను పట్టించుకోని సర్కార్...

అయితే ఈ విమర్శలను ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరు అందనుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తవ్వి వదిలేసిన కాలువల్లో రైతుల కన్నీరు పారుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

లిఫ్ట్‌ నిర్మాణం కోసం భూసేకరణ ప్రయత్నాలు....

మరోవైపు పురుషోత్తపట్నం లిఫ్ట్‌ నిర్మాణం కోసం భూసేకరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో తమకు పట్టిసీమ తరహా ప్యాకేజీ చెల్లిస్తేనే భూములిస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సర్వేబృందాలను అడ్డుకున్న నిర్వాసితులు...2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

06:52 - January 9, 2017

కడప : జిల్లాలో నీళ్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్‌కు పెట్టనికోట అయిన కడపలో పాగా వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పులివెందులకు కృష్ణానీళ్లు తరలిచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈనెల 11న ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు.

వైసీపీకి శత్రుదుర్బేద్యమైన కోట....

కడప జిల్లా పులివెందుల. ఇది వైసీపీకి శత్రుదుర్బేద్యమైన కోట. అలాంటి కోటలో అడుగుపెట్టేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నీటి సమస్యను అస్త్రంగా వాడుకుంటోంది. జిల్లాలో నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులు అరకొరగా ఉన్న నేపథ్యంలో గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను టీడీపీ పూర్తి చేసింది. దీంతోపాటు పులివెందులలోని పైడిపాలెం రిజర్వాయర్‌ పనులను కూడా పూర్తయ్యాయి. వీటిద్వారా నీళ్లు అందిస్తే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా.. పులివెందులలో తాము పాగా వేసేందుకు అవకాశం దక్కుతుందనే లక్ష్యంతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.

వైఎస్‌ కుటుంబాన్ని టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఢీ ...

పులివెందులలో మొదటినుంచి వైఎస్‌ కుటుంబాన్ని టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఢీ కొడుతున్నారు. ఎలాగైనా పులివెందుల ప్రజల మనసుల్లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నారు. అందుకోసం ఎలాగైన పులివెందులకు కృష్ణా నీళ్లు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పులివెందులకు నీళ్లు తరలించే వరకు తన గడ్డం, మీసాలు తీయనని 2015లో ప్రతిజ్ఞ పూనారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రాజెక్టుల పనులపై దృష్టి సారించి పూర్తి చేయించారు. తాజాగా గంటికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈనెలలో సీఎం చంద్రబాబు గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయనున్నారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్న వైసీపీ...

అయితే.. వైసీపీ నేతలు టీడీపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. గాలేరు-నగరి, గండికోట రిజర్వాయర్‌ పనులన్నీ వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయని.. కేవలం 10 శాతం పనులు పూర్తి చేసిన టీడీపీ ఇది తమ ఘనతగా చెప్పుకుంటుందని విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండే.. గండికోట రిజర్వాయర్‌లో దాని కెపాసిటీ మేర నీటి నిల్వ ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే..

గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే.. పులివెందుల బాగుపడడం అటుంచితే.. సతీష్‌రెడ్డికి గడ్డం, మీసాల బాధ తీరుతుందని జిల్లావాసులు సరదాగా చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా పులివెందులకు నీళ్లు ఇచ్చి బలం పెంచుకోవాలని టీడీపీ చూస్తుండగా.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ నేతలంటున్నారు. అయితే.. ప్రజలకు ప్రభుత్వం ఏ మేరకు నీళ్లుస్తుంది ? అవి ఎంతమేరకు ఉపయోగపడతాయో దాన్ని బట్టి అధికార పార్టీ వ్యూహం సఫలమా ? విఫలమా ? తేలుతుందని విశ్లేషకులంటున్నారు.

06:47 - January 9, 2017

హైదరాబాద్ : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు చేస్తున్నారు. విభిన్నవర్గాలు తమ కోరికలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 20న స్కీమ్ వర్కర్లు ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ఈ సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్టు అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్స్ ప్రకటించాయి. ఈ నెల 20 స్కీమ్ వర్కర్లు సమ్మె చేపట్టడానికి కారణం ఏమిటి? ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? అంగన్ వాడీ కేంద్రాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేమిటి? అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధికి రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు చేయాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నేత సుబ్బరామమ్మ విజయవాడ 10టీవీ స్టూడియోకి వచ్చారు. వారు ఏఏ అంశాలపై చర్చించాలో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

06:38 - January 9, 2017

ఢిల్లీ: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇంధనం పోయించుకుంటే సేవా రుసుము వసూలు చేయాలన్న నిర్ణయంపై బ్యాంకులు వెనక్కి తగ్గాయి. దీంతో ఈనెల 13 వరకు పెట్రోల్‌ బంక్‌లలో కార్డులను అనుమతిస్తామని పెట్రో డీలర్ల సంఘం ప్రకటించింది. కార్డు స్వైపింగ్‌పై బ్యాంకులు విధించే ఒక శాతం సర్‌చార్జీ ఎత్తివేయకపోతే.. ఆ తర్వాత కార్డులపై లావాదేవీలకు ఒప్పుకునేది లేదని ప్రకటించింది.

13వ తేదీ నుంచి పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ నిలిపివేత...

అస‌లే పెద్దనోట్ల ర‌ద్దుతో నానా ఇబ్బందులు ప‌డుతున్న దేశ ప్రజ‌ల‌కు పెట్రోల్ బంకులు మ‌రో షాక్ ఇచ్చాయి. దేశ‌వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణయించింది. కార్డు ద్వారా జ‌రిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని బ్యాంకులు నిర్ణయించ‌డ‌మే దీనికి కార‌ణం. నగదు రద్దు తరువాత కార్డుల లావాదేవీలపై సర్ ఛార్జ్ ఎత్తేశారు. అయితే ఇప్పుడు మళ్లీ సర్‌ ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు దేశంలోని ప్రధాన బ్యాంకుల నుంచి పెట్రోలియం డీలర్లకు సమాచారం అందింది. దీంతో ఈ ఆకస్మిక నిర్ణయంపై పెట్రోల్ బంకుల య‌జ‌మానులు మండిప‌డుతున్నారు.

ప్రకటించిన పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్

బ్యాంకులు విధించాల‌నుకున్న ఈ కొత్త చార్జీలు వినియోగ‌దారుల‌పై భారం మోప‌డం లేదని, దీంతో అదంతా త‌మ‌పై ప‌డుతుంద‌ని పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు ఆందోళ‌న చెందుతున్నాయి. దీనికి నిర‌స‌న‌గా తొలుత ఈరోజు నుంచి పెట్రోల్‌ బంక్‌లలో ఎలాంటి కార్డులను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అయితే.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గారు. ఈనెల 13వ తేదీ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ కార్డులను అంగీకరించకూడదని నిర్ణయించారు. 13వ తేదీ తర్వాత కేవ‌లం న‌గ‌దు ఇస్తేనే పెట్రోలు, డీజిలు పోస్తామని ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌మ్ డీలర్ల సంఘం స్పష్టం చేసింది. ఇది ల‌క్షలాది మంది వినియోగ‌దారుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగించే నిర్ణయ‌మే అని చాలామంది తప్పుపడుతున్నారు.

కార్డు ద్వారా జ‌రిపే ప్రతి లావాదేవీపై చార్జీ వ‌సూలుకు సిద్ధమైన బ్యాంకులు...

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త‌మ నెట్ ప్రాఫిట్‌ను 0.3 శాతం నుంచి 0.5 శాతంగా నిర్ణయించాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులు ఒక శాతం చార్జీ విధిస్తే మా ప‌రిస్థితి ఏంటి అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ స‌మ‌స్యను ప‌రిష్కరించాల్సిన ఓఎంసీలు త‌మ‌కు సంబంధం లేద‌న్నట్లు వ్యవ‌హ‌రిస్తున్నాయ‌ని, అందుకే అస‌లు కార్డులు తీసుకోకూడ‌ద‌ని నిర్ణయించిన‌ట్లు చెప్పారు. కార్డులపై సర్‌చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. 13వ తేదీ వరకు ఇంకెన్ని బ్యాంకులు ఎత్తివేస్తాయో వేచి చూడాల్సిందే.

తాడికల్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా : ఒకరి మృతి

కరీంనగర్ : తాడికల్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ నుంచి గద్దపాక వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

 

క్యాబ్ డ్రైవర్లపై పంజాగుట్ట పీఎస్ లో కేసులు

హైదరాబాద్ : ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, వారిని అడ్డుకున్న క్యాబ్‌ డ్రైవర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులు, వివిధ సంఘాల నాయకులు రవాణా శాఖ కార్యాలయానికి శనివారం వెళ్లారు. చర్చలకు అని వచ్చిన వారు రవాణా శాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు అక్కడే బైఠాయించారు. సుమారు 60 మందిపై ఐపీసీ సెక్షన్‌ 341, 186 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు.

సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన బ్యాంకులు

న్యూఢిల్లీ :బ్యాంకులు తమపై చార్జీలు వేయనున్నాయనే ఆందోళనతో సోమవారం నుంచి బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు తీసుకోబోమన్న పెట్రో డీలర్లు ఆదివారం రాత్రి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చార్జీల నిర్ణయాన్ని బ్యాంకులు ఈ నెల 13కు వాయిదా వేసుకోవడంతో అప్పటివరకు కార్డులను తీసుకుంటామని ప్రకటించారు. లావాదేవీలపై చార్జీలను జనవరి 13 వరకు వాయిదావేసినట్లు ఆయిల్ కంపెనీల నుంచి మాకు అధికారిక సమాచారం వచ్చింది.

భద్రాద్రిలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం

 భద్రాచలం : భద్రాచల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అశేష భక్తజని స్వామివారి దివ్యస్వరూపాన్ని కనులారావీక్షించి తరించారు. వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య విశేషాలంకృతమైన స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

 

Don't Miss