Activities calendar

10 January 2017

21:49 - January 10, 2017

హైదరాబాద్ : సమస్యలను పరిష్కరించాలంటూ నెల రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బెదిరింపు దోరణికి దిగారు. సమ్మె చేస్తున్న వారిని పిలిపించి మాట్లాడాల్సింది పోయి... చెప్పింది వినకుంటే.. జీవో నెంబర్‌ 16 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయ సమ్మతం కాని డిమాండ్లతో రాజకీయ పార్టీల ప్రోద్బలంతో భవిష్యత్తులో సమస్యలు తెచ్చుకోవద్దని అన్నారు. 12వ తేదీల్లోపు విధుల్లో చేరకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు కడియం.

చెప్పింది వినకుంటే చర్యలు : కడియం
తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను పర్మినెంట్ చేస్తామన్న హామీని నెరవేర్చాలని.. ప్రభుత్వ లెక్చరర్స్ తరహాలో తమకు వేతనాలు చెల్లించాలని పది రోజులుగా సమ్మె చేస్తున్నారు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు. అయితే... సమ్మె సమస్యను పరిష్కరించకపోగా.. చెప్పింది వినకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్‌ విషయం కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మొత్తం 3వేల 687 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచామని తెలిపారు కడియం.

కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌తో చర్చించే ప్రసక్తే లేదు : కడియం
ఫ్రెండ్లీ ఎంప్లాయిస్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం... రెండు రోజులుగా బెదిరింపులకు దిగుతోంది. కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌తో చర్చించే ప్రసక్తే లేదని, అసలు చర్చలకు ఛాన్స్ లేదని కడియం స్పష్టం చేశారు. మొత్తం 3,687 మందిలో దాదాపు సగం మంది సమ్మెలో ఉన్నారని మంత్రిగారే ఒప్పుకోవడం విశేషం. సమస్య పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నప్పుడు.. దాన్ని పరిష్కరించాల్సింది పోయి.. మంత్రి కడియం బెదిరింపులకు పాల్పడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. కడియం వ్యాఖ్యలను తెలంగాణ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది.

కోర్టు పేరుతో కాలయాపన చేయడం సరికాదు : లెక్చరర్స్
హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నారు కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌. నిరుద్యోగులు అడ్డుకుంటున్నారనే కారణంతో రెగ్యులరైజేషన్ విషయంలో కోర్టు పేరుతో కాలయాపన చేయడం సరికాదంటున్నారు. ఒకవైపు ఈనెల 12వ తేదీలోపు విధుల్లో చేరకపోతే.. జీవో నెంబర్‌ 16 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కడియం హెచ్చరించారు. అంతేకాదు.. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘం పట్ల కూడా కడియం దురుసుగా వ్యవహరించారు. 

21:43 - January 10, 2017

నెల్లూరు : కుటుంబ వికాసమే..సమాజ వికాసం..సమగ్ర రాష్ట్ర వికాసమే..సంపూర్ణ దేశ వికాసమని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..తాను ఆలోచించేది రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబ వికాసం కోసమే అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో కన్నా ఈసారి వినూత్నంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో కన్నా వినూత్నంగా నిర్వహిస్తున్నామన్న చంద్రబాబు
నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో కన్నా వినూత్నంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి కాన్పు వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆ తర్వాత బిడ్డకు పోషకాహార లోపం లేకుండా చూస్తామని.. చదువు దగ్గర నుంచి ఉద్యోగం వచ్చే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి ఒక కుటుంబ వికాసం కోసమే ఆలోచిస్తాను : చంద్రబాబు
తాను ఆలోచించేది రాష్ట్రంలోని ప్రతి ఒక కుటుంబ వికాసం కోసమే అని చంద్రబాబు అన్నారు. సమాజ వికాసం కోసం ఇచ్చిన 10 సూత్రాలు అమలు కావాలంటే అధికార యంత్రాంగంలో బాధ్యత ఉండాలన్నారు.
చేపలు కూడా తింటున్నా : చంద్రబాబు
ఆరోగ్యానికి మంచివని చెప్పడంతో చేపలు కూడా తింటున్నానని తన ఆహార అలవాట్లను ప్రజలకు వివరించారు చంద్రబాబు. తాను పూర్తిగా సాధారణ ఆహారం తీసుకుంటానని, అందువల్లే, తాను ఆరోగ్యంగా వుండగలుగుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ తాను తీసుకునే డైట్ ప్లాన్ గురించి చెప్పారు.

కూచిపూడి నృత్యానికి మతం లేదు, కులం లేదు : చంద్రబాబు
అంతకుముందు సభలో యువతుల కూచిపూడి నృత్యాలు చూసి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..కూచిపూడి నృత్యానికి మతం లేదు, కులం లేదని.. కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ నృత్యం ప్రప్రంచ దేశాలకు వెళ్లిందని కొనియాడారు. మరోవైపు చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. గాలేరి, గండికోట ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీటిని పైడిపాలెం రిజర్వాయర్‌కు విడుదల చేయనున్నారు.

 

21:05 - January 10, 2017

శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత రంగుల ప్రపంచం సినిమా మెగా స్టార్ చిరంజీవి దూరమయ్యారు. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 10 సంవత్సరాల అనంతరం రైతుల సమస్యలను ఎలివేట్ చేసే సినిమాతో ' ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. 317 థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒవర్‌సిస్‌లో 300 థియేటర్లలో విడుదలవ్వనుంది, యూరోపియన్‌ కంట్రీస్‌లో అత్యధిక థియేటర్‌లో ఖైదీ నెంబర్‌ 150 మూవీ విడుదల కాబోతోంది. చిరు మూవీ కోసం గల్ఫ్‌ కంట్రీస్‌లో కొన్ని కంపెనీలకు సెలవులు ప్రకటించారంటే చిరు మేనియా ఎలావుందో చెప్పనక్కరలేదు.ఖైదీ నెంబర్‌ 150 చిత్రంలోని ఓ పాటకు కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయంటే మెగా మానియా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ఖైదీ నెంబర్‌ 150లో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ సినిమా అయినా తెలుగు నేటివిటీతో కనిపించనుందా? ఎలా వుందో చిరుమాటల్లోనే విందాం..ప్రజలకు ఉపయోగపడేవిధంగానే ప్రభుత్వాలుండాలని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమా గురించి తమ్ముడు నాగేంద్రబాబు రాగోంపాల్ వర్మ..యండమూరి వీరేంద్రనాద్ పై చేసిన వ్యాఖ్యలు..వర్మ గురించి చిరు ఏం చెప్పారు? యండమూరి వీరేంద్ర నాద్ కు కల్చర్ లేదని చిరంజీవి అన్నారు. ఇంకా చిరు ఏం అంశాలపై ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

20:34 - January 10, 2017

సమజ్ కాకపోయినా సవాల్ విసురుతానంటున్న అచ్చెన్నాయుడు..పాలకొల్లులో మద్యం షాపులు బంద్ చేయాలంటూ డిమాండ్ చేస్తన్న మహిళా లోకం..జవాన్ లకు నాసిరకం బువ్వ బెడుతున్నరంటూ ఓ జనాను ఆవేదన..గోడపక్క మూత్రం పోసిన అబ్బాయిని పైన్ కట్టమంటున్న అధికారులు..బంజారాహిల్స్ ల షాపింగ్ మాల్ అంతా మద్యం మాలేనుల్లా..గీ సేపలు తింటే గంతే పనంట..గంటే చేపల సెరువుల్ల పెరుగుతున్న సేపలు తింటే జబ్బులొత్తన్నయట..కోడిపందాలు ఎయ్యద్దంటే ఇనమంటున్న జనాలు..అమ్మపేరు నాయన పేరు రాత్తం రాని సర్కారు ఇస్కూలు పిల్లకాయలు..

19:57 - January 10, 2017

ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో ఫేస్‌ టూ ఫేస్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చింది..? టీడీపీలో బుద్ధప్రసాద్ సౌకర్యంగానే ఉన్నారా...? చంద్రబాబు పాలనపై ఆయన రియాక్షన్ ఏంటి..?ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో ఫేస్‌ టూ ఫేస్ లో ఎటవంటి విషయాలను తెలిపారో తెలుసుకునేందుకు ఈ వీడయో చూడండి..

19:51 - January 10, 2017

రేపే ఖైదీ నెంబర్‌ 150 మూవీ రిలీజ్ వేడుకలు..మెగా అభిమానులకు అసలైన సంక్రాంతి పండుగ రేపే..ఖైదీ నెంబర్‌ 150 సినిమా హైదరాబాద్‌లో 317 థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒవర్‌సిస్‌లో 300 థియేటర్లలో విడుదలవ్వనుంది, యూరోపియన్‌ కంట్రీస్‌లో అత్యధిక థియేటర్‌లో ఖైదీ నెంబర్‌ 150 మూవీ విడుదల కాబోతోంది. చిరు మూవీ కోసం గల్ఫ్‌ కంట్రీస్‌లో కొన్ని కంపెనీలకు సెలవులు ప్రకటించారంటే చిరు మేనియా ఎలావుందో చెప్పనక్కరలేదు కదా..తెలుగు సినీ చరిత్రలో ఇదో రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. మొదటి రోజు కలెక్షన్స్‌ రికార్డులను బద్దలు కొడుతుందన్న ఆశాభావం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. సినిమా హిట్‌ కావాలని తెలంగాణ, ఆంధ్ర సహా ఒవర్‌సిస్‌లో అభిమాన సంఘాలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖైదీ నెంబర్‌ 150 చిత్రంలోని ఓ పాటకు కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయంటే మెగా మానియా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ఖైదీ నెంబర్‌ 150లో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ అంశంపై థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం ఎలావుందో ఈ వీడియో చూడండి..

19:44 - January 10, 2017

విజయనగరం : పచ్చని పంట పొలాలు బూడిదవుతున్నాయి...బాంబుల మోతతో పల్లె ప్రజలు అల్లాడుతున్నారు... దుమ్ము, ధూళితో బతుకులు బుగ్గిపాలవుతున్నాయి.. ఇది విజయనగరం జిల్లాలో ఓ గ్రామ దీనగాథ.

కొంకిడివరంలో అక్రమ క్వారీ నిర్వహణ
ఎటు చూసినా.. బూడిద.. బాంబుల పేలుళ్లు.. ప్రమాదపు అంచున జీవిస్తున్న ప్రజలు.. విజయనగరం జిల్లా.. గురుగుబిల్లి మండలంలోని కొంకిడివరంలోనిదీ పరిస్థితి. గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ కొండపై అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారు. నిత్యం పేలుళ్లు.. బాంబుల మోత.. ఎగిసి పడే బూడిదతో గ్రామస్థులు ఇబ్బందిపడుతున్నారు. మరో మూడు గ్రామాలకు కూడా సమస్యగా మారింది.

అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు
బాంబుల పేలుళ్లతో ఎప్పుడు ఏ ఇంటిపై ఏ బండ వచ్చి పడుతుందోనని గ్రామస్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అలాగే బూడిద కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాసకోశ, ఉబ్బసం వంటి వ్యాధుల బారినపడుతున్నారు. అలాగే భారీ పేలుళ్ల శబ్దాలకు చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి భయపడుతున్నారు.

ప్రభుత్వ స్థలాల్లో గ్రానైట్‌ తవ్వకాలు
క్వారీ నిర్వాహకులు.. అనుమతులు లేకుండానే ప్రభుత్వ స్థలాలలో గ్రానైట్‌ తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండిపడుతోంది. అలాగే మూడు ఎకరాల చెరువు కబ్జా చేశారని గ్రామస్థులు అంటున్నారు. క్వారీకి అనుబంధంగా సర్వే నెంబర్‌ 4/3లో గల భూమిని కబ్జా చేసి అందులో క్రషర్ మిల్లు నడుపుతున్నారని...నిషిద్ధ పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అయినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని.. పార్వతీపురానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో ఈ క్వారీ నిర్వహించడంతో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే నిర్వాహకులు అక్రమంగా తీసుకున్న పేలుడు పదార్థాలను గ్రామస్థులు పట్టుకుని.. పోలీసులకు అప్పజెప్పారు. అయితే పోలీసులు ఇద్దరు కూలీలను మాత్రమే అదుపులోకి తీసుకుని చేతులు దులుపుకున్నారు.

ప్రజలు ధర్నాలు.. నిరసనలు
ఈ అక్రమ క్వారీ గురించి బాధిత గ్రామాల ప్రజలు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సైతం గ్రామస్థులు క్వారీ గురించి తెలియజేశారు. అయినా ఫలితం కనిపించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. క్వారీని వెంటనే మూయించి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

19:40 - January 10, 2017

విజయవాడ : నోట్ల రద్దు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం 7శాతం మేర తగ్గిందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీంతో రెవెన్యూ లోటు 14వేల కోట్ల రూపాయలకు చేరిందని.. ఆర్థికలోటు 24వేల కోట్ల రూపాయలకు పెరింగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కంటే అదనంగా 23వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వెలగపూడి సచివాలయంలో రెండో రోజు వాణిజ్య, పరిశ్రమశాఖకు చెందిన ప్రముఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహాకాలు ప్రతి మూడు నెలలకోకసారి అందించాలని చంద్రబాబు ఆదేశించారని యనమల అన్నారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమల రెన్యూవల్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని యనమల వెల్లడించారు. 

పార్లమెంట్ వద్ద జంటపేలుళ్లు..21మంది మృతి..

ఆఫ్ఘనిస్థాన్ : కాబూల్‌లోని పార్లమెంట్ కార్యాలయం వద్ద జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 21 మంది మృతి చెందగా, మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పార్లమెంట్ ఉద్యోగులే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక చోట ఆత్మాహుతి దాడి జరగ్గా, మరోచోట కారు బాంబు పేలింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

18:00 - January 10, 2017

సంగారెడ్డి: ఓ వింత వ్యాధి ఆ గ్రామాన్ని వణికిస్తోంది. వింత వ్యాధితో అభం శుభం తెలియని చిన్నారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వింత లక్షణాలతో చిన్నారుల చేతి వేళ్లు వికారంగా మారుతుండడంతో ఇప్పుడా ఆగ్రామం భయంతో వణికిపోతుంది. ఇంతకీ ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ వింత జబ్బేంటి ? వాచ్‌ దిస్‌ స్టోరీ.

సంగారెడ్డి జిల్లా శెల్గిరాలో వింతవ్యాధి
ఇక్కడ మీరు చూస్తున్న వంకర్లు తిరిగిన వేళ్లతో కనిపిస్తున్న ఈ చిన్నారులది సంగారెడ్డి జిల్లా శెల్గిరా గ్రామం. కొన్నేళ్లుగా ఈ గ్రామంలో అంతుచిక్కని ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడిన చిన్నారుల చేతి వేళ్లు ఇలా వంకర్లు తిరుగుతున్నాయి. ఈ రోజు ఆరోగ్యంగా ఉండే వారు మరుసటిరోజు కల్లా ఇలా మారిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ వింత జబ్బు ఇప్పుడు చిన్నారులకే కాదు పెద్దవారికి కూడా సోకడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

శ్రావణి , నిఖిత, అశ్విణిలకు సోకిన వింత వ్యాధి
ఈ వింత వ్యాధి మరింత మందికి వ్యాపిస్తోంది. శెల్గిరా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శ్రావణి , నిఖిత, అశ్విని అనే ఐదవ తరగతి విద్యార్ధులకు ఈ వ్యాధి వింత వ్యాధి సోకింది. దీనిపై స్ధానిక వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేశారు. కానీ ఈ వ్యాధి సోకడానికి కారణమేమిటో తెలుసుకోలేక పోయారు. దీంతో ఆందోళనకు గురైన పిల్లల తల్లిదండ్రులు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చుచేసుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఈ వ్యాధి ఏమిటో నిర్ధారణ కాలేదు.

గతంలోఈ వ్యాధితో కొంతమందికి అంగవైకల్యం
గతంలో కూడా ఈ వ్యాధి సోకి కొంతమంది అంగవైకల్యానికి గురయ్యారు. ఇంకొంత మంది వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే మరికొంత మంది ఈ వింత వ్యాధితో మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని తాగునీటిపై నామమాత్రపు పరీక్షలు చేసిన అధికారులు ఈ నీరు పశువులు కూడా తాగడానికి పనికిరావని నిర్ధారించారు. కానీ ఇప్పటికీ కూడా ఈ నీటినే అధికారులు గ్రామంలో సరఫరా చేస్తున్నారు.

వింత వ్యాధిపై వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం
ఈ వింత వ్యాధి విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు ఈ గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేయలేదు. పోషకాహార లోపంతో ఇలా జరుగుతోందని స్ధానిక వైద్య సిబ్బంది కొన్ని మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ తంతు వార్తల్లో వచ్చినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారే...తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2016 లో జరిగిన ఉపఎన్నిక సమయంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి ఈ వింత వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపాలని శెల్గిరా గ్రామస్తులు కోరుతున్నారు.

 

17:57 - January 10, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఫిట్‌మెంట్‌ ఫార్ములా సమస్యను నాలుగు నెలల్లో పరిష్కరిస్తామన్న కేంద్రం ఆరు నెలలైనా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం తీరుతో 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 34 లక్షల మంది పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన ధర్నాలో పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

17:55 - January 10, 2017

వనపర్తి : చెరువులో చేపలు పెంచేటప్పుడు.. వాటికి మాంచి దాణా, ఫీడ్‌ వేయాలి. అప్పుడు అవి ఆరోగ్యంగా పెరిగి.. వాటిని ఆరగించిన వారికి కూడా ఆరోగ్యం చేకూరుతుంది. కానీ.. కొందరు చేపల పెంపంకందారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారుల అలసత్వాన్ని అసరాగా చేసుకుని ప్రభుత్వం నిషేధించిన ఆహారాన్ని చేపల పెంపకంలో వినియోగిస్తున్నారు. ఫంగస్ చేపల పేరిట నిషేధిత చేపలను పెంచుతూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వైనం మహబూబ్‌నగర్‌ జిల్లాలో యథేచ్చంగా సాగుతోంది.

చేపలు కదా అని లొట్టలేసుకుని తింటే అవి ఆరోగ్యానికే హానికరం..
ఇదీ.. కొందరు మత్స్యకారులు అత్యాశతో చేపలు పెంచుతున్న తీరు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రాంపురం, రంగాపురం, బునియాధిపురం, గుమ్మడం గ్రామ శివారుల్లో ఫంగస్‌ చేపల పెంపకం విపరీతంగా ఉంది. ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఆయా గ్రామాల శివారుల్లో చెరువులను ఏర్పాటు చేసి ఫంగస్‌ చేపలను పెంచుతున్నారు. అయితే.. ఈ చేపలకు దాణా, ఫీడ్‌కు బదులు మాంసం వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు.

వనపర్తి జిల్లాలో మాంసం వ్యర్థాలతో చేపల పెంపకం
ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ ఫిష్‌ను గతంలో కొందరు దొంగ చాటుగా పెంచుతూ చికెన్‌ వ్యర్థాలను వాటికి ఆహారంగా వాడేవారు. విషయం బయటకు పొక్కడంతో అప్పట్లో అధికారులు చేపల చెరువులపై దాడులు చేశారు. దీంతో చేపల పెంపకం దారులు సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. క్యాట్‌ఫిష్‌ నిషేధానికి గురవడంతో.. ఫంగస్‌ అనే మరో రకమైన చేపల పెంపకానికి తెరలేపారు. ఇలాంటి చేపల పెంపకానికి ఎలాంటి అనుమతులు లేకున్నా.. అనుమతులు ఉన్నాయని చెబుతూ.. ఫంగస్‌ ఫిష్‌ చేపలకు చికెన్‌ వ్యర్థాలను వాడుతున్నారు. ఈ మాంసం వ్యర్థాలను చేపలకు వేయడం వల్ల.. అవి విషపూరితంగా మారతాయని, వాటిని తినే మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

విషతుల్యమైన చేపలు పెంచుతున్నా.. పట్టించుకోని అధికారులు
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్చి.. చెరువులుగా తయారు చేసి చేపల పెంపకానికి రైతులు లీజుకు ఇస్తున్నారు. చేపల పెంపకం దారులు కూడా మొదట సాధారణ చేపలు పెంచుతామని చెప్పి... నిషేధిత చేపలు పెంచుతున్నారు. వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి చేపల పెంపకం దారులపై దృష్టి సారించి అక్రమంగా ఫంగస్ చేపలు పెంచుతున్న చెరువులపై దాడులు చేయాలని, ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

17:51 - January 10, 2017

హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రత్యక్ష క్రికెట్ కార్యకలాపాల్లోకి తిరిగి వచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి అజార్ నామినేషన్ దాఖలు చేశాడు. హెచ్‌ సీఏను ప్రక్షాళన చేయ‌డానికే తాను వచ్చానని, ఇక తన జీవితాంతం క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ఏ క్లబ్ నుంచి అజర్ నామినేష‌న్ దాఖ‌లు చేశాడ‌న్న విష‌యంపై సమాచారం లేదు. అజ‌ర్ ఎంట్రీతో ఈ ఎన్నిక‌లు హాట్ హాట్ గా సాగుతాయని క్రీడా పండితులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై, తన వందో టెస్టుకు ముందు అజర్ తన కెరీర్ ను ముగింపు పలికారు.

17:48 - January 10, 2017

హైదరాబాద్ : న్యూగ్రిడ్‌ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడానికి అనువైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో విద్యుత్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొరకు అవసరమైన వార్దా- డిచ్‌పల్లి లైన్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు. తెలంగాణలో ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంసిద్ధత వ్యక్తంచేసింది. 

17:46 - January 10, 2017

హైదరాబాద్ : పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని బ్రాంచ్‌తో పాటు... భువనగిరిలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సోదాల్లో చట్టవిరుద్ధంగా అద్దె గర్భం కేసులకు సంబంధించి.. పలు అక్రమ లావాదేవీలు బయటపడుతున్నాయి. గతంలో రెండు సంవత్సరాలుగా ఎటువంటి ట్యాక్స్ కట్టకపోవటంతో పద్మజ సంతాన సాఫల్య కేంద్రానికి ఐటీ నోటీసులు జారీ చేసింది. అయినా స్పందించకపోవటంతో దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. మూడు బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు. 

17:43 - January 10, 2017

గుంటూరు : మంత్రి రావెలపై సొంతపార్టీ కార్యకర్తలు తిరగడ్డారు. రావెల వున్న వేదికపైకి దూసుకొచ్చారు. దీంతో ఆప్రాంతంలో గందరగోళం నెలకొంది. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం పుసులూరు జన్మభూమి కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్యకర్తల గొడవతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత కొంతకాలంగా ప్రత్తిపాడు నియోజక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన మంత్రిపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను పట్టించుకోకుండా వేరే పార్టీ నుండి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కార్యకర్తల నిరసనపై మంత్రి ఏమాత్రం స్పందించలేదు.

17:39 - January 10, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నదేనని ఆర్బీఐ.. పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన ఓ నివేదికలో వెల్లడించింది. 500, వేయి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్రం సూచించిన మరుసటి రోజే ఓకే చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈమేరకు వీరప్పమొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ స్పష్టం చేసింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నదే: ఆర్బీఐ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నదేనని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. నల్లధనం వెలికితీత, టెర్రరిస్టుల ఆర్థిక నిధులపై వేటు వేసేందుకు.. 500, వేయి రూపాయాల నోట్ల రద్దు చేయాలని కేంద్రం సూచించిన మరుసటి రోజే ఆర్బీఐ నోట్ల రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని వీరప్పమొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటంరీ కమిటీకి సమర్పించిన ఏడు పేజీల నివేదికలో స్పష్టం చేసింది.

2016, నవంబర్‌ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచన
పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్‌ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు.. 500, వేయి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకును కేంద్రం కోరిందని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్‌ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్లు ఆర్బీఐ తన రిపోర్టులో పేర్కొంది. ఐదేళ్లలో నకిలీ 500, వేయి రూపాయల చలామణి పెరగడంతో.. తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయని వివరించింది.

ఐదేళ్లలో నకిలీ రూ.500, వేయి చలామణి పెరగడంతో సమస్యలు
కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్‌ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవని చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు.

 

17:35 - January 10, 2017

విజయవాడ : తొలిసారిగా ఎయిర్ షో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణానదీ తీరంలో ఎయిర్ షో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. లక్ష మందికిపైగా సందర్శకులు వచ్చినా ఎటువంటి లోటుపాట్లు, ఇబ్బందుల్లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పున్నమిఘాట్ నుంచి భవానీఘాట్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో ఐటీ సోదాలు

హైదరాబాద్:పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హబ్సిగూడ, భువనగిరిల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. సోదాలలో అక్రమలావాదేవీలు బయటపడుతున్నాయి. చట్టవిరుద్ధంగా అద్దె గర్భం కేసులు వెలుగు చూస్తున్నాయి.

రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు

అమరావతి : ఏపీ రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. అనంతవరం రైతులకు 2,222 నివాస స్థలాలు, 1,323 వాణిజ్య స్థలాలు పంపిణీ చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు.

'హింసలేని సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంలో తప్పులేదు'

హైదరాబాద్: తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రంలో బుల్ ఫైట్ పై ఇప్పుడే ఏం చెప్పలేమని కేంద్ర మంత్రి అనిల్ దవే స్పష్టం చేశారు. ఈ అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున తీర్పు కోసం వేచి చూస్తున్నామని అనిల్ దవే అన్నారు. హింసలేని సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంలో తప్పులేదని, ఏపీలో కోడిపందాల నిర్వహణ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదన్నారు. కుక్కల పెంపకం నిర్వహణ పై 1960 చట్టంలో సవరణలు చేస్తున్నామన్నారు. కుక్కలను పెంచుకునేవారు పశు సంక్షేమ మండలిలో నమోదు తప్పని సరి అని అనిల్ దవే స్పష్టం చేశారు.

17:00 - January 10, 2017

విజయవాడ : ఎస్వీఆర్ & సీవీఆర్ కాలేజిలో ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. అనుమతి లేకుండా చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. పూర్వ విద్యార్థులకు నిజంగా కళాశాలపై ప్రేమ ఉంటే కాలేజీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది వరకే నిర్మాణంపై ఉన్నతాధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారి నుంచి ఆదేశాలు రాగానే నిర్మాణాన్ని తొలగిస్తామని విద్యార్థులకు ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.

16:58 - January 10, 2017

నెల్లూరు : జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో కన్నా వినూత్నంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో నాల్గో విడత జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి కాన్పు వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. తల్లీబిడ్డలను ఎన్టీఆర్‌ కిట్‌ ఇచ్చి ఉచితంగా ఇంటిదగ్గర వాహనంలో దింపుతామన్నారు. ఆ తర్వాత బిడ్డకు పోషకాహార లోపం లేకుండా చూస్తామని.. చదువు దగ్గర నుంచి ఉద్యోగం వచ్చే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

చిరు వ్యాపారాలు 50 శాతం దెబ్బతిన్నాయ్: ఎస్ బీఐ సర్వే

ఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత రూ.25 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎస్ బీఐ తెలిపింది. ఈ సర్వే ప్రకారం డిజిటల్ ట్రాన్సక్షన్స్ మారాయని వెల్లడిచింది. 15శాతం లావాదేవీలు ఎలక్ట్రానిక్ పేమెంట్స్ లోకి మారాయి. నోట్ల రద్దు తర్వాత చిరు వ్యాపారాలు 50 శాతం దెబ్బతిన్నాయన్నాయి తెలిపింది.

మంత్రి రావెల పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం

గుంటూరు : కాకుమాను మండలం పుసునూరులో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం రసాభాస అయ్యింది. మంత్రి రావెల పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు కాకుండా పక్క పార్టీ వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

కందుల మద్దతు ధర రూ.5050 : మంత్రి హరీష్

హైదరాబాద్ : కందుల మద్దతు ధర రూ.5050గా నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదిలాబాద్ లో మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న పర్యటించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. రాష్ట్రంలో 53 కందుల కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హరీష్ రావు తెలిపారు.

16:23 - January 10, 2017
16:15 - January 10, 2017

సూర్యాపేట : వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డాడు ఓ రైతు. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ సిరులు కురిపిస్తున్నాడు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. బిందు సేద్యంతో అల్లం సాగు చేస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాడు. ఓ కొత్త ఆలోచన ఆ రైతుకు సిరులు కురిపిస్తోంది. నీళ్లు లేవని అధైర్యపడకుండా.. పరిస్థితులకనుగుణంగా సాగు చేస్తున్నాడు. దీంతో తక్కువ నీటితో సేద్యం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.

బిందుసేద్యంతో వ్యవసాయం
ఈయన పేరు శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో వ్యవసాయం చేస్తున్నాడు. తనకు సాగర్‌ కాలువ చివరలో ఐదెకరాల భూమి ఉంది. వర్షాభావ పరిస్థితులతో సాగు చేయడం కష్టంగా ఉండేది. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. పొలంలో బావులు తవ్వించాడు. ఉన్న కొద్దిపాటి నీటితో సేద్యం చేయాలంటే.. బిందు సేద్యం కరెక్ట్‌ అని భావించాడు. దానికనుగుణంగా పైపులు ఏర్పాటు చేసి.. వ్యవసాయం చేశాడు.

ఇతర వాణిజ్య పంటల గురించి ఆరా..అల్లం సాగుపై దృష్టి

ఇక అందరూ పండించే వరి కాకుండా.. వేరే ఇతర వాణిజ్య పంటలు పండించాలనుకున్నాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి తెలుసుకున్నాడు. మెదక్‌ జిల్లాలో సాగు చేసే అల్లం సాగుపై దృష్టి సారించాడు. అక్కడి రైతుల నుంచి వివరాలు సేకరించి.. కేరళ నుంచి మారన్‌ రకం విత్తనం తెచ్చి సాగు చేశాడు. డ్రిప్‌ సాయంతో పంట పండిస్తున్నాడు. అయితే.. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలించవు. దానికి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. ఇందుకోసం అల్లం పంటకు పక్కనే స్వీట్‌కార్న్‌ కూడా పండించాడు. దీంతో మొక్కజొన్నల ద్వారా ఆదాయంతో పాటు.. అల్లం సాగుకు నీడ కూడా లభించింది. అల్లం పంటకు 10 నెలల సమయం పడనున్న నేపథ్యంలో.. ఇప్పుడు వాటికి నీడ కోసం ఆముదం పండిస్తున్నాడు. అయితే.. 15 టన్నుల వరకు అల్లం దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి లాభం లేకపోయినా.. నష్టం వచ్చే ప్రసక్తే లేదంటున్నాడు శ్రీనివాసరెడ్డి. ప్రతి రైతూ వినూత్నంగా ఆలోచించి సేద్యం చేస్తే.. సిరులు పండించడం సాధ్యమే అంటున్నాడు.

 

16:08 - January 10, 2017

నిజామాబాద్ : అన్నదాతపై ప్రకృతి కరుణించినా...పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం..వ్యవసాయాన్ని కుదిపేసింది. ఓవైపు బ్యాంకుల నుంచి రుణాలు అందక..ఉన్న సంపాదనతో వ్యవసాయాన్ని కొనసాగించలేక..నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతులకు వెసులుబాటు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం
వ్యవసాయానికి ప్రకృతి కరుణించినా.. పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా వ్యవసాయ రంగాన్ని మరింత కుదేలు చేసింది. గతంతో పోల్చుకుంటే పంటసాగు తీవ్రస్థాయిలో తగ్గిపోయింది. బ్యాంకుల సాయం ఉంటేనే..వ్యవసాయం సరిగా సాగని పరిస్థితుల్లో...అసలు పెట్టుబడి పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వకూడా లేకపోతే పరిస్థితి ఇంతకెంత దారుణంగా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏడాది సాగయ్యే వ్యవసాయం 51,923 హెక్టార్లు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వ్యవసాయంపై నోట్ల రద్దు ప్రభావం పడింది. ప్రతి ఏడాది 51 వేల 923 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయం సాగయ్యేది. ఈ ఏడాది మాత్రం కేవలం 18వేల 306 హెక్టార్లకు మాత్రమే వ్యవసాయ సాగు పరిమితమైంది. వరితోపాటు జవార్ బజ్రా, మొక్కజొన్న 14వేల 722 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా...ఇప్పటి వరకు 6 వేల 397 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అసలే నష్టాల్లో ఉన్న తమకు నోట్ల రద్దుతో తీవ్ర నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోట్ల రద్దుతో రైతులకు అందని రుణాలు
నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకు రుణాలు సైతం రైతులకు అందకుండాపోయాయి. నిజామాబాద్ జిల్లాలో రైతులకు 654 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినటప్పటికీ... ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలుగా ఇచ్చారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 28వేల 352 మంది రైతులకు రుణాలు అందించారు. కామారెడ్డి జిల్లాలో 470 కోట్ల రూపాయల రుణాలివ్వాలని నిర్ణయించగా..ఇప్పటి వరకు కేవలం 173 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారు. రుణాలపై బ్యాంకు అధికారులను సంప్రదించినా రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సూచిస్తున్నారు. 

16:04 - January 10, 2017

అనంతపురం : ఈ నెల 12వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలనను పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అవసరమైతే పదిహేనో తేదీ వరకు కూడా సంక్రాంతి కానుకలు అందిస్తామన్నారు. అనంతపురంలో చంద్రన్న కానుకలను ఆమె అందించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఏడాది 8 లక్షల 59వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు ఆమె చెప్పారు. వచ్చే నెల నుంచి విలేజ్ మాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ముగిసిన ఈ -గవర్నెన్స్ 20వ జాతీయ సదస్సు

విశాఖ : నగరంలో జరుగుతున్న ఈ-గవర్నెన్స్ 20వ జాతీయ సదస్సు ముగిసింది. వివిధ రంగాల్లో ఐటీ సేవలందించిన ప్రభుత్వ విభాగాలు, ఎన్టీఓ లకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ -గవర్నెన్స్ లో టీఎస్ ప్రభుత్వానికి 4 అవార్డులు వచ్చాయి.

15:58 - January 10, 2017

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఫైర్‌ అయ్యారు. కర్నూల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..రాయలసీమలో కరువుకు తల్లీపిల్ల కాంగ్రెస్‌లే కారణమని ఆరోపించారు. కర్నూల్‌లో సున్నపురాయి, కడపలో బెరైటీస్ గనులు,ఓబులాపురంలో ఇష్టానుసారంగా మైనింగ్ చేసి భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ఆ రెండు పార్టీలే కారణమన్నారు. రైతు భరోసా పేరుతో అభివృద్ధి నిరోధకుడిగా జగన్ వ్యవహరిస్తున్నారని కేయీ మండిపడ్డారు. 

15:56 - January 10, 2017

కర్నూలు : టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరూ వైసీపీకి సహకరించాలని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. కర్నూలు జిల్లా గాజులపల్లిలో పర్యటించిన ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైడిపాలెం ప్రాజెక్టు కోసం చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, ఆ ప్రాజెక్టు కోసం టీడీపీ ప్రభుత్వం కేవలం 24 కోట్లు మాత్రమే విడుదల చేసిందని దుయ్యబట్టారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

ముంబై: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 173 పాయింట్లు లాభపడి 26,889 వద్ద సెన్సెక్స్, 52 పాయింట్లు లాభపడి 8288 వద్ద నిఫ్టీ ముగిసింది.

ప్రభుత్వ సలహా మేరకే నోట్ల రద్దుకు సిఫార్సు:ఆర్బీఐ

ఢిల్లీ : ప్రభుత్వ సలహా మేరకే నోట్ల రద్దుకు సిఫార్సు చేసినట్లు పార్లీమెంటరీ కమిటీకి ఆర్బీఐ వివరణ ఇచ్చిది. రూ.500, 1000 నోట్లు రద్దు చేయాలని నవంబర్ 7న ప్రభుత్వం సలహా ఇచ్చిందని, 2 వేల నోట్లు ముద్రించాలని మే నెలలో ప్రభుత్వం సూచించిందని తెలిపింది. జనవరి 20న పార్లమెంట్ కమిటీ ఎదుట ఆర్బీఐ గవర్నర్ హాజరు కానున్నారు.

క్యాబ్ డ్రైవర్ అధ్యక్షుడు దీక్ష తాత్కాలిక విరమణ

హైదరాబాద్: తెలంగాణ క్యాబ్ డ్రైవర్ అధ్యక్షుడు శివ ఆమరణ దీక్ష ను తాత్కాలిక విరమణ చేశాడు. అయ్యప్ప మాల ధరించడంతో దీక్ష తాత్కాలికంగా విరమించినట్లు తెలిపారు. 2నెల 16వ తేదీ నుంచి తిరిగి దీక్ష చేపడతామన్నాడు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్ష కొనసాగుతుందని శివ స్పష్టం చేశారు.

తమిళనాడును కరువు రాష్టంగా ప్రకటించిన పన్నీర్ సెల్వం

చెన్నై: తమిళనాడును కరువు రాష్ట్రంగా ఆ రాష్ట్ర సీఎం పన్నీర్ సెల్వం ప్రకటించారు. 33 శాతానికి పైగా పంట నష్టపోయిన రైతులుకు పరిహారం ఎకరాకు రూ.5,465 నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు ఆస్తి పన్ను రద్దు చేస్తామన్నారు.

చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీలేదు: జగన్

కర్నూలు: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని జగన్ విమర్శించారు. గాజులపల్లెలో జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలేదని, జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండి పడ్డారు. వైఎస్ ప్రతి రబీ పంటకు శ్రీశైలం నుండి నీళ్లు అందించారని, ఇప్పుడు ఆ నీళ్లు రాయలసీమకు ఇవ్వడంలేదని, పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ ల్లో రైతు సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలనే దానిపైనే చర్చిస్తున్నారని ఆరోపించారు.

చెన్నూరు జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

నెల్లూరు: గూడూరు మండలం చెన్నూరు 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

14:49 - January 10, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతీ రెండు రోజులకు ఒకసారి ఆందోళన కొనసాగుతోంది. పోలవరం పరిధిలోని మూలలంక రైతులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లో మట్టిని డంపింగ్ చేస్తున్నారని పనులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన 16 మంది రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమ సమస్యలు పరిష్కరించకుండా పనులు చేపట్టటంపై ఆ ప్రాంత నిర్వాశితులు..రైతులు ఆందోళన చేపడుతున్నారు. దీంతో ప్రాజెక్టు పనులు దాదారు ఆరు గంటలపాటు మిషనరీ నుండి మట్టి తరలించే లారీ సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత ఆరు నెలలలుగా మూలలంక ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తునే వున్నారు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి తవ్విన మట్టిని మూలలంక ప్రాంతానికి ప్రతీరోజూ 60వేల మెట్రిక్ టన్నుల మట్టిని తరలిస్తున్నారు. మూలలంక గ్రామంలోని 205 ఎకరాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనికి సంబంధించి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మట్టిని తరలించటంపై ఆప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని భూ నిర్వాశితులు ఆందోళన చేపడుతు డిమాండ్ చేస్తున్నారు.

'సిర్పూర్' పేపర్ మిల్లు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం...

సిర్పూర్ కాగజ్‌నగర్ : వచ్చే నెల 16న సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు వేలానికి రంగం సిద్ధమైంది. దీంతో మిల్లుపై ఆధారపడ్డ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. వివిధ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నరూ. 422 కోట్ల బకాయిలను యాజమన్యం చెల్లించకపోవడంతో ఆస్తుల వేలానికి బ్యాంకులు కన్సార్టియం తరఫున ఐడీబీఐ, ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 14 వరకు బిడ్ల దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. ఫిబ్రవరి 16న ఆస్తుల వేలాం జరగనుంది. పేపర్ మిల్లు మూతపడి రెండున్నరేళ్లు అయింది.

తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు

హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందన తెలిపారు. తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల్లో స్వర్ణం గెలుపొందింది. 12 కేటగిరీల్లో దేశవ్యాప్తంగా 261 నామినేషన్లు వేసింది.

హెచ్ సిఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ నామినేషన్

హైదరాబాద్: మాజీ క్రికెట్ అజారుద్దీన్ హెచ్ సిఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఓటుహక్కు లేకపోయినా పోటీ చేసే హక్కుందని పేర్కొన్నారు. లోథా కమిటీ సిఫార్సు మేరకే నామినేషన్ వేసినట్లు అజారుద్దీన్ స్పష్టం చేశారు.

14:38 - January 10, 2017

హైదరాబాద్ : కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీలోగా విధుల్లో చేరకపోతే జీవో 16 ప్రకారం చర్యలు తీసుకుంటామనిన హెచ్చరించారు. కొన్ని స్వార్ధ రాజకీయ పార్టీల మద్ధతుతో విధులు బహిష్కరించి సమ్మె చేపట్టటం సరికాదని సూచించారు. ఇప్పటికే కాంట్రాక్ట్ అధ్యాపకుల జీతాలను 50 శాతం పెంచేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఈ అంశంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించటంతో రెగ్యులరైజ్ కార్యాచరణకు తాత్కాలికంగా విరామం ఏర్పడిందన్నారు. ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందన్నారు. కాగా జూనియర్ లెక్చరర్స్ కు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని టీ. సర్కార్ గతంతో హామీ ఇచ్చింది. ప్రస్తుతం 50 శాతం మాత్రమే వేతనాలు ఇవ్వటం..ప్రస్తుతం వున్న కాంట్రాక్ట్ లెక్చరర్లును రెగ్యులైజ్ చేయాలనే డిమాండ్ తో డిసెంబర్ 16 నుండి సమ్మె చేపట్టారు. ఎంతకీ ప్రభుత్వం స్పందించకపోవటంతో 12వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ప్రకటించటంతో స్పందించిన ప్రభుత్వం 12వ తేదీలోగా విధుల్లోకి చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.

'సహకార బ్యాంకుల్లో రూ.16వేల కోట్లు డిపాజిట్'

ఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకుల్లో రూ.16వేల కోట్లు డిపాజిట్ అయినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని శాఖల్లో రూ.10,700 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. నవంబర్ 10 నుండి డిసెంబర్ 30 మధ్య రూ.25వేల కోట్లు జమైనట్లు ఐటీ శాఖ గుర్తించింది. సహకార బ్యాంకుల ద్వారా జరిగిన లావాదేవీలపై ఐటీశాఖ ఆరా తీసింది. నోట్ల రద్దుతో రూ. 50వేల కోట్ల రుణాలు చెల్లించినా ట్యాక్స్ చెల్లించని సొమ్ము విలువ రూ. 3 నుండి 4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది. 60 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ. 2లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది.

పోలవరం పనులను అడ్డుకున్న రైతుల అరెస్టు..

పశ్చిమగోదావరి : పోలవరం పనులను మూలలంక రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండా పొలాల్లో మట్టిని డంపింగ్ చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన చేస్తున్న 16 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె విరమించాలి - కడియం..

హైదరాబాద్ : కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మెపై మంత్రి కడియం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెను విరమించాలని, ఈనెల 12లోగా విధుల్లో చేరకపోతే జీవో 16 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను 50 శాతం పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, కొంతమంది హైకోర్టుకు వెళ్లడం వల్ల రెగ్యులరైజ్ కార్యాచరణకు బ్రేక్ పడిందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల సపోర్టుతో సమ్మె చేయడం తగదన్నారు.

14:07 - January 10, 2017

మద్యపానం సేవించండం వల్ల అనేక అనర్థాలు వస్తాయని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా  లో పీవోడబ్ల్యు నేత ఝాన్సీ, సైకాలజిస్ట్ శ్రీకాంతాచార్య పాల్గొని, మాట్లాడారు. పురుషులు మద్య సేవించడం స్త్రీలపై హింసకు దారి తీస్తుందన్నారు. శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మెట్రో రైలుపై అధికారులతో సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై అధికారులతో తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష నిర్వహించారు.

రెండో రోజు ఏపీ ప్రీ బడ్జెట్ సమావేశాలు..

విజయవాడ : అమరావతిలోని సచివాలయంలో రెండో రోజు ప్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. వాణిజ్య, పరిశ్రమల ప్రముఖులతో ఆర్థిక మంత్రి యనమల సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి, ఉపాధి సాధ్యమని యనమల పేర్కొన్నారు. కాలుష్య రహిత పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు, పరిశ్రమల స్థాపనకు నిత్యం ప్రోత్సాహాలు అందచేయడం జరుగుతుందని, పెండింగ్ లో ఉన్న రూ. 2500 కోట్ల ప్రోత్సాహాలు అందచేసినట్లు పేర్కొన్నారు.

14:02 - January 10, 2017

మహబూబాబాద్‌ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర 86వ రోజు మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర..జిల్లాలోని వివిధ గ్రామాల గుండా సాగుతోంది. ఇప్పటివరకు తిరిగిన 19జిల్లాల్లో ఉన్న సమస్యలే..20వ జిల్లా మహబూబాబాద్‌లో కన్పిస్తున్నాయని పాదయాత్ర బృందం సభ్యులు ఎస్‌ రమ అన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా..రాష్ట్రంలోని ఎక్కడ కూడా రైతులు, బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేరని రమ తెలిపారు. ఐకేపీ కార్యకర్తలు జీతాల్లేక తీవ్ర అవస్ధలు పడుతున్నారని చెప్పారు. మహిళా అభివృద్ధి కోసం సీఎం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

బీజేపీ ఆఫీసులో అర్జున్ రాంపాల్..

ఢిల్లీ : బాలీవుడ్ సినీ నటుడు అర్జున్ రాంపాల్ బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను రాజకీయ నాయకుడిని కాదని పేర్కొన్నారు.

13:55 - January 10, 2017

హైదరాబాద్ : కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని నాలుగు రాష్ట్రాలకు వర్తింప చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సర్కార్‌కు చెంపపెట్టు వంటిదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. పునఃపంపిణీ తెలంగాణ, ఏపీలకే పరిమితమంటూ గతంలో కృష్ణా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా పిటిషన్‌ వేసినందునే పిటిషన్‌ తిరష్కరణకు గురైందన్నారు. దీనిపై  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. 
 

13:51 - January 10, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. ఉత్పత్తి, ఉపాధి రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త ఉద్యోగాలు లేకపోగా, ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. దీంతో వేలాది కుటుంబాలకు వీధుల పాలువుతున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. 
అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం 
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మన దేశంలోని అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. పారిశ్రామిక, వ్యవసాయ, రవాణ, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ  రంగాలపై నిర్వీర్యం చేసింది. ఈ రంగాల్లో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ రంగాలు ఇప్పట్లో కోలుకునే అవకాశంలేదని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఏదైనా తేరుకునే అవకాశం ఉంటే అది మరో రెండు నెలల తర్వాతేనని ఆలిండియా మ్యానుఫ్యాక్చర్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. 
దెబ్బతిన్న ఉపాధి అవకాశాలు 
పెద్ద నోట్ల రద్దు  తర్వాత అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మోదీ నిర్ణయం తర్వాత మొదటి 34 రోజుల్లోనే కార్మికలోకం ఇప్పటికే 35 శాతం ఉద్యోగాలను కోల్పోయింది.  మరో రెండు నెలల్లో ... మార్చి చివరినాటికి ఇది 60 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అఖిల భారత ఉత్పత్తిదారులు సంఘం అంచనా వేసింది. ప్రధాని మోదీ నిర్ణయం ఉపాధి రంగాన్నే కాదు... ఆదాయాన్ని కూడా దారుణంగా దెబ్బతీసింది. ఇప్పటికే పారిశ్రామిక ఆదాయం  50 శాతం పాడిపోగా,  ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది  55 శాతానికి చేరుకుంటుందని ఏఐఎంవో  నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రెవిన్యూ నష్టం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని  ఈ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
ఉత్పత్తిపై ప్రభావం 
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉద్యోగాలు పోవడానికి, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడానికి, ఉత్పత్తి తగ్గడానికి కారణాలను కూడా అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం తమ నివేదికల్లో విశ్లేషించింది. నగదు కొరత, చలామణి లేకపోవడం, బ్యాంకులు, ఏటీఎంలలో ఉపసంహరణపై పరిమితులు విధించడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో పెట్టుబుడులు పెట్టేందుకు విదేశీయులు సంశయిస్తున్నఅంశాన్ని ఏఐఎంవో  ప్రధానంగా ప్రస్తావించింది.  వస్తుసేవల పన్ను అమలుపై కొనసాగుతున్న అస్థిరత, రూపాయి మారకపు విలువ తగ్గడం కూడా ఉత్పత్తి, ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపింది. తయారు చేసిన వస్తువులకు డిమాండ్‌ లేకపోవడంతో చాలా పరిశ్రమలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉత్పత్తి తగ్గించుకుని, కార్మికులను  తొలగించాయి. రుణాల కోసం కంపెనీలు పంపిన ప్రతిపాదనలను బ్యాంకులు   ఆమోదించకపోవడంతో ఉపాధి, ఆదాయ రంగాలను ప్రభావితం చేసింది. 
నిర్మాణ రంగం కుదేలు 
పెద్ద నోట్ల రద్దు తర్వాత అసంఘటిత రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగం కుదేలైంది. ఇళ్లు కొనేందుకు ప్రజల చేతిలో డబ్బులేకపోవడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, పెద్ద ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు రియల్లర్లు ముందుకు రావడంలేదు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలను ప్రభుత్వం ముందుగా గ్రహించకలేకపోవడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధం కాకపోవడం కూడా పారిశ్రామిక రంగాన్ని కుదిపేసిందని అఖిల భారత ఉత్పత్తిదారులు సంఘం విశ్లేషించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఏఐఎంవో ఇంత వరకు కేంద్రానికి మూడు నివేదికలు పంపించింది. వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని సంఘం ప్రతినిధిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తమిళనాడు, మహారాష్ట్రపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా ఉందని నివేదించింది.  నోట్ల రద్దు ప్రభావంపై అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం నాల్గవసారి అధ్యయనం చేపట్టబోతోంది. 
 

13:44 - January 10, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లండన్‌ నుంచి ఢిల్లీకి తిరిగొచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ఆయన సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు. రాహుల్‌ గాంధీ ఇంట్లో జరిగే సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పాల్గోనున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో పొత్తుపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. యూపి సిఎం అఖిలేష్‌, రాహుల్‌  కూడా ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. సెలవులపై కొన్ని రోజులు లండన్‌ వెళ్తున్నట్లు రాహుల్‌ గాంధీ డిసెంబర్‌ 31న ట్వీట్‌ చేశారు.

 

13:42 - January 10, 2017

ఢిల్లీ : కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకగాంధీని ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కలిశారు. ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో విజయవాడలో జరిగే మహిళా పార్లమెంటేరియన్‌ సమావేశాలకు హాజరుకావాలని కేంద్రమంత్రిని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆహ్వానించారు. ఏపీలో సదస్సు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మేనకగాంధీ..యూపీలో ఎన్నికలు ఉన్నందున వల్ల తాను సదస్సుకు హాజరుకాలేనని.. స్పీకర్‌కు వివరించారు. ఏపీలో జరిగే ఈ సమావేశాలకు వివిద దేశాల నుంచి సుమారు 12వేల మంది మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తెలిపారు. 

 

13:35 - January 10, 2017

విశాఖ : అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. గోవింద్ పై భూకబ్జా, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ ఆస్తి వివాదంలో ఎమ్మెల్యే గోవింద్ కలుగజేసుకుని తనను బెదిరించారని రాజేష్ బాబు సీపీకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు గోవింద్ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

13:34 - January 10, 2017

నీరు..అద్భుత వరం. నీరు లేకపోతే మనిషి మనుగడే లేదు. పరగడుపున నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వేడి నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం...

  • ఉదయాన్నే పర గడుపున వేడి నీరు తాగితే.. శరీరంలోని జీర్ణక్రియ వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.
  • శరీరం బరువు తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
  • గొంతు నొప్పి, జలుబు, కఫము వంటి సమస్యలు రావు. అంతేకాక సంబంధింత వ్యాధులు కూడా దూరమవుతాయి.
  • శరీరంలో ఉన్న వేడిని చెమట రూపంలో బయటకు పంపిస్తుంది.
  • చర్మంపై ఉన్న ముడతలు, మొటిమల సమస్యలు దూరమౌతాయి.
  • శ‌రీర మెట‌బాలిజం వేగవంత‌మ‌వుతుంది. క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసేందుకు ఉపయోగ‌ప‌డుతుంది. ప్రధానంగా కిడ్నీలకు చాలా మంచిది.
13:24 - January 10, 2017

ఢిల్లీ : ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. దేశంలో జనాభా పెరుగుదలుకు ముస్లింలే కారణమంటూ సాక్షి మహారాజ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ముస్లింకు నలుగురు భార్యలు, నలభై మంది పిల్లలు.. అన్న సాక్షి మహరాజ్‌ చేసిన విమర్శలపై తీవ్ర దుమారం చెలరేగింది. దేశంలో  హిందూ జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో సాక్షి మహరాజ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయంటూ కొంతమంది కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్‌.... వివాదాస్పద వ్యాఖ్యలపై ఈనెల 11 లోగా  వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సాక్షి మహరాజ్‌కు నోటీసులు జారీ చేసింది.

 

13:07 - January 10, 2017
12:58 - January 10, 2017

హైదరాబాద్‌ : నగరంలోని విన్‌ విజన్‌ కంటి ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన ఎన్ బీహెచ్ పురస్కారం లభించింది. కంటి చికిత్సలో రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందించినందుకు గాను ఈ అవార్డు లభించిందని సంస్థ కార్యనిర్వాహక డైరెక్టర్‌ ఎస్‌.వి రత్నం చౌదరి తెలిపారు. ఆసుపత్రి సేవలతో పాటు నాగర్‌కర్నూలు, శంషాబాద్‌ జిల్లాలోని పిరుట్‌వానిపల్లి, ముచ్చింతల గ్రామాలను దత్తత తీసుకొని ఉచిత కంటి పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు చేస్తున్నందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. భవిష్యత్తులో ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారం అందిస్తామని ఆయన అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే విన్‌ విజన్‌ ట్రైనింగ్‌ మరియు పరిశోధనశాలను ప్రారంభిస్తామని ఆసుపత్రి డాక్టర్‌ శ్రీలక్ష్మీ నిమ్మగడ్డ తెలిపారు. 

 

12:56 - January 10, 2017

పశ్చిమ గోదావరి : తణుకులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కాలేజీలో సంక్రాంతి సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. బొమ్మలకొలువు, సంక్రాంతి పిండివంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు అందరిని ఆకట్టుకున్నాయి. వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో గత 10 ఏళ్ల నుంచి ఈ సంక్రాంతి సంబరాల్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కాలేజీ ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో అమ్మాయిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఈ సందర్బంగా సరళాదేవి అన్నారు. 

12:53 - January 10, 2017

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కు అగ్నిపరీక్షగా మారుతున్నాయి. బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడంతో పార్టీని గెలిపించే బాధ్యత వీరిద్దరి మీదే పడుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 328 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఆధిక్యత ప్రదర్శించిన బిజెపి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం  సాధించేందుకు శ్రమిస్తోంది.
బిజెపికి యూపీ అత్యంత కీలక రాష్ట్రం 
బిజెపికి ఉత్తరప్రదేశ్ అత్యంత కీలక రాష్ట్రం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తర ప్రదేశ్ నుంచే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో ఆ పార్టీకి  ఏకంగా 71 లోక్ సభ స్థానాలు లభించాయి. యుపిలో ఇన్ని వచ్చి వుండకపోతే, బిజెపికి సొంతంగామెజార్టీ దక్కేది కాదు. 2019లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ లో తన బలాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవాల్సి వుంటుంది. 
నోట్ల రద్దు తర్వాత తొలి ఎన్నికలు 
పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. ఉత్తర ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్  రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 403 అసెంబ్లీ స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఫలితం కోసమే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను నోట్ల రద్దుకు రిఫరెండంగా భావిస్తున్నవారూ లేకపోలేదు. 
2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 71 స్థానాలు 
2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏకంగా 71 స్థానాలు గెలుచుకోవడానికి నరేంద్ర మోడీ క్రేజ్ తో పాటు అమిత్ షా రచించిన వ్యూహాలు కూడా కారణమయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి ప్రతిష్టకు అదే ఉత్తరప్రదేశ్ లో అగ్నిపరీక్ష తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్ లో బిజెపి దెబ్బతింటే, ప్రధాని నరేంద్రమోడీ ఇమేజ్ గ్రాఫ్ మీద కూడా దాని ప్రభావం పడుతుంది. 
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బలమైన సీఎం అభ్యర్థి లేరు 
ఉత్తరప్రదేశ్ లో బిజెపికి బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. ఒక వైపు ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మరో వైపు మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి,  వీరిద్దరిలా సొంత కరిస్మా వున్న నాయకుడు ఉత్తరప్రదేశ్ బిజెపిలో లేరు. బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉత్తరప్రదేశ్ కే చెందినవారే అయినా, రాష్ట్రం మొత్తాన్ని ఊపేయగల కరిస్మా  వున్న నాయకుడు కాదు. మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేనకాగాంధీలదీ అదే పరిస్థితి. కాబట్టి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భుజస్కందాల మీదనే వుంది. 
2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం 
2014 లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయాన్నే నమోదు చేసినా 1996 తర్వాత జరిగిన వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. 1996లో బిజెపికి 32.51 శాతం ఓట్లు లభించగా, ఆ తర్వాత 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాని బలం 20.12 శాతానికి పడిపోయింది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 17శాతానికి క్షీణించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఓట్లు 15శాతానికే పరిమితమయ్యాయి. అయితే 2014 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బిజెపి 43 శాతం ఓట్లు సాధించి, సునాయసంగా ఢిల్లీ సింహాసనం చేజిక్కించుకుంది. 
ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 41 మంది ఎమ్మెల్యేలు
ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి బలం 41 మంది ఎమ్మెల్యేలే అయినా, 2014 లోక్ సభ ఎన్నికల ప్రకారం 328 అసెంబ్లీ సెగ్మెంట్ లలో మెజార్టీ సాధించడం విశేషం. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 202 స్థానాలు గెలుచుకుంటే సరిపోతుంది. బిజెపి, ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగే ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే, 30శాతం ఓట్లు సాధిస్తే చాలన్నది ఓ అంచనా. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 94 స్థానాల్లో 50శాతానికి పైగా ఓట్లు సాధించింది. 253 స్థానాల్లో 40శాతం ఓట్లు సాధించింది. అయినా, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి పెను సవాలుగా మారుతున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు కొల్లగొట్టిన బిజెపి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఊపు కొనసాగించలేకపోయింది. 2014 సెప్టెంబర్ లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు పెడితే, బిజెపి 3 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. 2016లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిలపడింది. ఈ అంశమే బిజెపిని ఎక్కువగా కలవరపెడుతోంది. అయితే,  ఎన్నికల ముంగిట్లో ములాయం సింగ్, అఖిలేష్ మధ్య తలెత్తిన విభేదాలు తమకు మేలు చేస్తాయన్న ఆశతో వుంది కమలదళం.  

 

రాష్ట్రాన్ని చేపల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తాం : తలసాని

హైదరాబాద్: రాష్ట్రాన్ని చేపల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపతు, గొర్రెలు, మేకల పెంపకంపై తలసాని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనువైన ప్రాంతాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చేపల మార్కెటింగ్‌కు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చేపల పెంపకం ఒక కులానికే పరిమితం చేయడం అని స్పష్టం చేశారు. ఫిషరీస్ సొసైటీలు ఏర్పాటు చేసి మత్స్య కుటుంబాలకు సభ్యత్వాలు కల్పిస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి సభ్యత్వం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

శ్రీవారిని దర్శించుకున్న రాజ్ నాథ్ సింగ్

తిరుమల : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిరుమలలో శ్రీవారి దర్శ‌నం చేసుకున్నారు. వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ‌స‌మేతంగా శ్రీ‌వారి సేవ‌లో పాల్గొన్నారు. రంగ‌నాయ‌కులు మండ‌పంలో పండితుల ఆశీర్వ‌చ‌నాలు తీసుకున్నారు. ఆల‌య అర్చకులు ఈ సంద‌ర్భంగా రాజ్‌నాథ్‌ను స‌త్క‌రించారు. స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

12:21 - January 10, 2017

హైదరాబాద్ : నల్లబంగారానికి నష్టాల మసి అంటుతోంది... లాభాలపంట పండించిన సింగరేణిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి... టార్గెట్‌కు తగినంత ఉత్పత్తిలేకపోవడం.... దీనికితోడు అమ్మకాలు తగ్గడం సంస్థకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది.. ఈ నష్టాలనుంచి సంస్థను బయటపడేదిశగా అధికారులు చర్యలు చేపట్టినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు.. సింగరేణిలో నష్టాలకు కారణమేంటి? స్పెషల్ ఫోకస్..
తిరోగమన దిశగా సంస్థ
సిరులగని సింగరేణి సంస్థ నష్టాలబాటలో ప్రయణిస్తోంది.. సంస్థ నిర్వహణ ఖర్చులకూ... ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం డేంజర్‌ బెల్స్ మోగిస్తోంది.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ నష్టాల్లో కూరుకుపోకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. విదేశీబొగ్గుతోపోటీ... భూగర్భ గనులనుంచి బొగ్గు వెలికితీసే వ్యయం పెరిగిపోవడంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. ఒకప్పుడు భారీలాభాలతో కాసులపంటపండించిన సంస్థ ఇప్పుడు తిరోగమనందిశగా సాగుతోంది.. 
అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోన్న సింగరేణి 
బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోంది.. 2016 17 సంవత్సరంలో దాదాపు 66 మిలియన్ టన్నుల బోగ్గు ఉత్పత్తి  చేయాలని సంస్థ టార్గెట్‌గా పెట్టుకుంది.. 2016 డిసెంబర్‌లోగా 46 మిలియన్‌ టన్నుల నల్లబంగారాన్ని వెలికితీయాలని భావించినా .... 42 మిలియన్‌ టన్నుల బొగ్గును మాత్రమే బయటకు తీయగలిగింది.. దాదాపు నాలుగున్నర మిలియట్‌ టన్నులు తక్కువగా బొగ్గును ఉత్పత్తిచేసింది... ఇలా ఆశించిన స్థాయిలో బొగ్గును వెలికితీయలేకపోవడం కూడా నష్టాలకు ఒక కారణమవుతోంది.. 
బొగ్గు అమ్మకాల్లోనూ సమస్యలు
బొగ్గుగనులనుంచి బయటకుతీసిన నల్లబంగారం అమ్మకాల్లోనూ సంస్థకు సమస్యలు ఎదురవుతున్నాయి... బహిరంగ మార్కెట్లో విదేశాలనుంచి దిగుమతిచేసుకున్న బొగ్గు సింగరేణికి గట్టి పోటీ ఇస్తోంది... విదేశీ బొగ్గు మంచి నాణ్యతతోఉండటం... పైగా తక్కువ ధరకు రావడంతో సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యత తగ్గుతోంది.. 
బొగ్గు వెలికితీత ఖర్చు మరింత భారం 
సింగరేణిలో భూగర్భ గనుల నుంచి బొగ్గు వెలికితీత ఖర్చు సంస్థకు మరింత భారమవుతోంది.. మొత్తం సింగరేణి బోగ్గు పరిశ్రమలో  33 భూగర్భ గనులు, 18 ఉపరితల గనులున్నాయి... ఇందులో 56 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.. ఉపరితల బోగ్గు గనులనుంచి బొగ్గును వెలికితీయాలంటే టన్నుకు 1355 రూపాయలు ఖర్చవుతోంది.. ఈ బొగ్గును 1749 రూపాయలకు అమ్మడంద్వారా సంస్థకు 399 రూపాయల లాభం వస్తోంది.. అదే భూగర్భ గనుల్లో టన్ను బొగ్గును బయటకుతీయాలంటే 4వేల 596రూపాయలు ఖర్చుచేయాల్సివస్తోంది.. ఈ బొగ్గు అమ్మకంద్వారా కేవలం 2వేల 211 రూపాయలు సంస్థ ఖాతాలోకివస్తున్నాయి.. అంటే టన్ను బొగ్గుకు 2వేల 385రూపాయల నష్టం వస్తోంది. ఈ భూగర్భ గనులనుంచి వెలికితీస్తున్న బొగ్గుద్వారా మొత్తంగా 1308 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు.. ఈ నష్టాన్ని ఉపరితల గనుల్లోవచ్చే లాభాలతో పూడ్చుకుంటూ సంస్థ తాత్కాలికంగా ఈ సమస్యనుంచి బయటపడుతోంది.. 
నష్టనివారణ చర్యలు 
భారీలాభాల్లో ఉన్న సింగరేణి నష్టాలబాట పట్టడంతో అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు.. ఉత్పత్తి ఖర్చును తగ్గించి... మిగతా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ప్రత్యేక ప్రణాళికద్వారా ముందుకు సాగాలని భావిస్తున్నారు.. 
సమస్య పరిష్కారంపై దృష్టి 
భూగర్భ గనులతో నష్టాలనుచూసిన అధికారులు... సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు.. ఈ గనుల్ని మూసేసి వాటిని ఓపెన్‌ కాస్ట్‌మైనింగ్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. అలాగే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందంటూ... భూమిలోపలున్న గనుల్లో యంత్రాల వాడకాన్ని పెంచారు... అయినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడంలేదు.. 
నిలిచిన బొగ్గు వెలికితీత...సంస్థపై తీవ్ర ప్రభావం 
2016 డిసెంబర్‌నాటికి భూగర్భగనుల్లో 9 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... 7 మిలియన్‌ టన్నుల నల్లబంగారాన్నిమాత్రమే వెలికితీశారు.. దాదాపు 2 మిలియన్‌ టన్నులలోటు ఉండిపోయింది... గత ఏడాదికురిసిన వర్షాలుకూడా బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందిగామారాయి... 30రోజులపాటు బొగ్గు వెలికితీత నిలిచిపోవడంకూడా సంస్థపై తీవ్రప్రభావంచూపింది.. 
సంస్థ పుంజుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు
సింగరేణి బొగ్గుకు ప్రాధాన్యత తగ్గడం.... భూగర్భ గనులనుంచి బొగ్గు వెలికితీతకు ఖర్చు పెరిగిపోవడం.... సంస్థ అభివృద్ధికోసం పెట్టే ఖర్చు అధికమవడం.... వినియోగదారుల బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో నష్టాలు మరింత పెరిగిపోతున్నాయి.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఒక వెయ్యి ఆరు కోట్ల లాభాలను ఆర్జించింది.. 2016-17లోమాత్రం 300కోట్లుమాత్రమే లాభాలు వస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు.. గత అక్టోబర్‌నాటికి 307కోట్ల నష్టాలతోఉన్న సంస్థ డిసెంబర్లో కాస్త పుంజుకుంది.. మార్కెట్‌లో బొగ్గు డిమాండ్‌ పెరగడంతో నష్టాలు తగ్గాయి.. అయినా లాభాలు సగానికి సగం పడిపోతాయన్న అంచనాతో.... అధికారులు నష్టనివారణపై దృష్టిపెట్టారు.. సంస్థను ఆర్థికంగా పుంజుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు..

 

12:07 - January 10, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు విడుదల కావడం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ చిత్రాలు విడుదలవుతుంటాయి. అందులో కొందరివి హిట్టు కాగా..మరికొందరివి ఫట్టవుతుంటాయి. ఈసారి సంక్రాంతికి మాత్రం టాప్ హీరోస్ 'చిరంజీవి'..'బాలకృష్ణ' చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ఆ హీరోలకు ప్రతిష్టాత్మకమే. దీనితో వారి అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన పోటీ మళ్లీ రసవత్తరమైన పోటీ జరుగుతుండడం విశేషం. 'బాలకృష్ణ' 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'...'చిరంజీవి' 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. 11వ తేదీ 'ఖైదీ' సినిమా విడుదలవుతుండగా 'గౌతమి..' 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గతంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ జరిగిందో తెలుసుకుందాం...
1987లో 'చిరంజీవి' 'దొంగమొగుడు'తో రాగా 'బాలకృష్ణ' 'భార్గవరాముడు'తో ముందుకొచ్చారు. వసూళ్ల పరంగా 'చిరు' చిత్రం పై చేయిగా నిలిచింది. తరువాత ఏడాది 'చిరంజీవి'..'మంచిదొంగ' తో...'బాలకృష్ణ' 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' పోటీ పడింది. ఈ రెండు చిత్రాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరిదిగా పై చేయిగా సాగాయి. 1997 సంక్రాంతి 'చిరంజీవి' 'హిట్లర్'..'బాలకృష్ణ' 'పెద్దన్నయ్య'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండూ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. వసూళ్ల మొత్తంగా 'పెద్దన్నయ్య' పై చేయి సాధించిందని టాక్. 1999లో 'స్నేహం కోసం' అంటూ 'చిరంజీవి'...'సమరసింహారెడ్డి' గా 'బాలకృష్ణ' ముందుకొచ్చారు. ఈ రెండింటి మధ్య పన్నెండు రోజుల తేడా ఉంది. 2000 సంక్రాంతి పోరులో 'బాలకృష్ణ' 'వంశోద్దారకుడు'తో...'అన్నయ్య' గా 'చిరంజీవి' ముందుకొచ్చారు. ఇందులో 'అన్నయ్య' పై చేయి సాధించాడు.

13 ఏళ్లకు..
2001లో 'చిరంజీవి' 'మృగరాజు' అంటూ ముందుకొచ్చారు. జనవరి 11న ఈ సినిమా విడుదలైంది. అదే రోజున 'బాలకృష్ణ' 'నరసింహనాయుడు' చిత్రం రిలీజైంది. 'మృగరాజు' పరాజయం చెందగా 'నరసింహనాయుడు' పై చేయిగా నిలిచింది. 2004లో 'బాలకృష్ణ' 'లక్ష్మీ నరసింహ'గా..'చిరంజీవి' 'అంజి' చిత్రాలు పోటీ పడ్డాయి. ఈసారి కూడా 'బాలయ్య'దే పై చేయిగా నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు..అంటే 13 ఏళ్లకు సంక్రాంతి బరిలో 'చిరంజీవి'..'బాలకృష్ణ' చిత్రాలు నిలువనున్నాయి. 'బాలకృష్ణ' చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చారిత్రక కథాంశంతో తెరకెక్కగా 'చిరంజీవి' రీమెక్ చిత్రం కావడం విశేషం. మరి ఈ బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి.

11:57 - January 10, 2017

చిత్తూరు : టిటిడి కాంట్రాక్ట్‌ కార్మికులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయడంతో పాటు వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. టిటిడి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించారు. చైర్మన్‌ చదలవాడ ఇంటి ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:54 - January 10, 2017

కెరీర్ పరంగా సంప్ల్ లో ఉన్న శ్రీనువైట్ల రెమ్యూనరేషన్ విషయంలో న్యూ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే ఈ దర్శకుడిపై ఇండస్ట్రీలో కొత్త కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీనువైట్ల ప్రస్తుతం అంత సీన్ లేదని కేవలం ప్రొడ్యూసర్సే ఇలా కండిషన్ పెట్టారని వినిపిస్తోంది. అసలు శ్రీనువైట్ల స్ట్రాటజీ ఏంటీ ఈ దర్శకుడికి నిర్మాతలు పెట్టిన కండీషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కొత్తదనం లేని కథలతో చిరాకు 
రోజు తింటే వేపఆకు కూడా తియ్యగా అనిపిస్తోంది. అలాగే రోజు తిపి తింటే కూడా చేదవుతోందని తెలిసిందే. శ్రీనువైట్ల సినిమాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతోంది. రెడీ దూకుడు లాంటి సినిమాలు సక్సెస్ అయ్యే సరికి, ఈ దర్శకుడు వరుసగా ఇలాంటి మూవీసే చేశాడు. ఏ మాత్రం కొత్తదనం లేని కథలతో ఆడియన్స్ కి చిరాకు తెప్పించాడు. చివరికి బ్రూస్ లీ తో అయిన తన పంథా మారుస్తాడేమో అనుకుంటే పరమరోటీన్ మూవీ తీసి మరో డిజాస్టర్ ని చవిచూశాడు. దీంతో ఆయన సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాలేందంటే శ్రీనువైట్ల కెరీర్ ఎలాంటి ఊహించలేని స్థితికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.
కొత్తదనం ఆశిస్తున్న ఆడియన్స్ 
శ్రీనువైట్ల తీసిన కింగ్ సినిమాలో బ్రహ్మనందం నాగార్జునతో మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారని అర్ధం అవుతోందని ఓ డైలాగ్ చెప్పుతాడు. సేమ్ ఇప్పుడు ఆడియన్స్ కూడా ఈ దర్శకుడి నుంచి కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. ఇది గమనించిన శ్రీనువైట్ల కూడా మిస్టర్ తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ కూడా చాలా ప్రెష్ గా ఉంది. లావణ్య త్రిపాఠీ,హెబ్బాపటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ మూవీనే శ్రీనువైట్ల కెరీర్ ఎలా ఉండబోతోందో నిర్ణయించబోతోంది. 
మిస్టర్ సక్సెస్ బట్టి రెమ్యూనరేషన్  
శ్రీనువైట్ల, నాగచైతన్య కాంబినేషన్ లో ఓ మూవీకి సన్నాహాలు జరుగున్నాయి. దర్శకుడు శ్రీనువైట్ల మిస్టర్ సినిమా సక్సెస్ బట్టి చైతూ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకోవాలని భావిస్తున్నాడట. కానీ ఇది శ్రీనువైట్ల తీసుకున్న నిర్ణయం కాదని ప్రొడ్యూసరే, దర్శకుడితో ఈ కండిషన్ పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చైతూ మూవీ కోసం శ్రీనువైట్ల భారీ రెమ్యూనరేషన్ అడిగాడట. కానీ ఈ దర్శకుడు ప్రస్తుతం ప్లాప్స్ లో ఉండడంతో అంత భారీ అమౌంట్ ఇవ్వడం కుదరదని సదరు నిర్మాత చెప్పాడట. దీంతో మిస్టర్ సక్సెస్ బట్టి రెమ్యూనరేషన్ ఇస్తానని ఆ ప్రొడ్యూసర్ చెప్పాడట. అన్నట్లు నాగార్జునతో పలు సక్సెస్ పుల్ చిత్రాలు నిర్మించిన శివప్రసాద్ రెడ్డి ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

 

విద్యుత్ షాక్ తో చర్చి ఫాదర్ మృతి

యాదాద్రి : నారాయణపురం మండలం జనగామ గ్రామంలోని కడపగాంధీ తండాలో విద్యుత్ షాక్‌తో నగేష్(35) అనే చర్చి ఫాదర్ మృతి చెందాడు. అంతే కాకుండా తండాలోని అన్ని ఇళ్లలో విద్యుత్ షాక్ వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఫాదర్ మృతికి విద్యుత్ అధికారులే బాధ్యులని సబ్ స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన నిర్వహించారు.

11:49 - January 10, 2017

చెన్నై బ్యూటీ సమంత ప్రెస్టిజియస్ మూవీలో నటించబోతుంది. ఇప్పటి వరకు చిలిపి పాత్రలతో కవ్వించిన ఈ బ్యూటీ ఫస్ట్ టైం డిఫరెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీపై సమంత స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ చెన్నైబ్యూటీ కొత్త సినిమా కోసం చేస్తున్న ఆ డిఫరెంట్ రోల్ ఏంటో మీరే చూడండి.
కొత్త సినిమాకి సమంత సైన్ 
జనతా గ్యారేజ్ తరువాత సమంత నటించబోతున్న కొత్త సినిమా ఏంటో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే లేటేస్ట్ ఈ బ్యూటీ ఓ కొత్త సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలోనే సమంత డిఫరెంట్ రోల్ ప్లే చేయబోతున్నట్లు వినికిడి.
కీలక పాత్రలో సమంత 
మహానటి అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్ర కోసం విద్యాబాలన్, నిత్యామీనన్, సమంత ఇలాంటి పరువురు క్రేజీ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ ఆఖరి ఆ అద్భుత అవకాశం మరో చైన్నై చిన్నది కీర్తిసురేష్ ని వరించింది. మహానటి చిత్రంలో సావిత్రిగా కీర్తిసురేష్ నటించబోతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో సమంత నటించనుందని తెలిసింది. మహానటి సావిత్రి జీవితకథను రాసే జర్నలిస్టు పాత్రలో ఈ బ్యూటీ కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ పాత్రలో నటించడానికి శామ్ తన అంగీకారం కూడా తెలిపినట్లు సౌత్ లో టాక్ వినిపిస్తోంది. 
లీడ్ క్యారెక్టర్ లో సమంత
సావిత్రిగా కీర్తిసురేష్ నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలో లీడ్ క్యారెక్టర్ మాత్రం సమంతదే అని తెలుస్తోంది. సమంత చేయనున్న జర్నలిస్ట్ పాత్ర కోణంలోనే సావిత్రి మూవీ సాగుతోందని చిత్రవర్గాల సమాచారం. అందుకే అబెక్షన్ చేయకుండా శామ్ ఈ పాత్రకు ఒకే చెప్పిందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటులు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, జెమినీ గణేషన్‌ల పాత్రలు కూడా ఉంటాయని వినిపిస్తోంది. వీరి పాత్రలే ఈ సినిమాకు కీలకమని తెలుస్తోంది. మరి ఈ పాత్రలను ఇప్పుడున్న యంగ్ స్టర్స్ లో ఎవరూ కనిపించబోతున్నరనేది ఇంట్రెస్ట్ గా మారింది.

 

11:41 - January 10, 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ డైరెక్షన్ లో న్యూ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. అంతేనా ఈ క్రేజీ సినిమాకి పెద్ద ఎన్టీఆర్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిన ఓ మూవీ టైటిల్ ని కన్ ఫర్మ్ చేసినట్లు వినికిడి. యంగ్ టైగర్ న్యూ మూవీ టైటిల్ ఏంటో ఈ స్టోరీ చూడండి.
ఎన్టీఆర్ తొలిసారి త్రిబుల్ రోల్  
దర్శకుడు బాబీ, ఎన్టీఆర్ ల మూవీ ఒపెనింగ్ కి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్న ఈ మూవీ జనవరి 26 ముహుర్తం జరుపుకోబోతున్నట్లు వినికిడి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి త్రిబుల్ రోల్ ప్లే చేస్తుండడం విశేషం. మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి పెట్టిన టైటిల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పెద్ద ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా తెలుగు పరిశ్రమలో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన లవకుశ టైటిల్ ని ఈ మూవీకి ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే టైటిల్ కి ముందు మరో పదం యాడ్ చేసినట్లు టాక్.
త్వరలో ముగ్గరు హీరోయిన్స్ ఫైనల్ 
బాబీ డైరెక్షన్ ఓ ఎన్టీఆర్ నటిస్తున్న న్యూ మూవీకి జయ్‌.. లవ.. కుశ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కళ్యాణ్ రామ్ ఫీల్మ్ ఛాంబర్ లో రిజిటర్ చేయడం విశేష. తమన్నా, కాజల్, సమంత, కీర్తిసురేష్ ఈ నలుగురు హీరోయిన్స్ లో ముగ్గరు హీరోయిన్స్ ను త్వరలోనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 ముహుర్తం జరిపినాక వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి రెగ్యూలర్ షూట్ కి వెళ్లేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమాపై ఎన్ టీఆర్ ప్రత్యేక దృష్టి
నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ ల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. దీనికి తోడు హీరో కమ్ ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ కోసమే ఈ మూవీని చేస్తున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. హీరోగా కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టి నిర్మాతగా కంటిన్యూ అయ్యేలా మూవీని సూపర్ హిట్టు చేసి తీరాలని యంగ్ టైగర్ పట్టుదలగా ఉన్నాడు. మరి అన్నదమ్ములు తొలిసారి కలిసి పని చేస్తున్న ఈ మూవీ ఎలా రిజల్ట్ అందిస్తుందో చూడాలి.

 

కంది జైల్లో ఖైదీ ఆత్మహత్య

సంగారెడ్డి : కందిలోని జైలులో ఖైదీ కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ దొంగతనం కేసులు కరుణాకర్ శిక్ష అనుభవిస్తున్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కేంద్ర మంత్రి మేనకా గాంధీని కలిసిన కోడెల

ఢిల్లీ : కేంద్ర మంత్రి మేనకా గాంధీని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 10,11,12 తదేఈల్లో విజయవాడలో జరగనున్న మహిళా పార్లమెంటేరియన్ సమావేశాలకు ఆహ్వానించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ సమావేశాలకు హాజరు కాలేనిని తెలిపింది.

భూకబ్జా కేసులో అనకాపల్లి ఎమ్మెల్యే

విశాఖ : అనకాపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పై కేసు నమోదు అయ్యింది. పెందుర్తి ఎమ్మెల్యే భూకబ్జాకు పాల్పడ్డాడని ఒమన్ నుంచి మెయిల్ ద్వారా బాధితుడు రాజేశ్ ఫిర్యాదు చేశారు.

కేంద్ర మంత్రి మేనకా గాంధీని కలిసిన కోడెల

ఢిల్లీ : కేంద్ర మంత్రి మేనకా గాంధీని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలిశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 10,11,12 తదేఈల్లో విజయవాడలో జరగనున్న మహిళా పార్లమెంటేరియన్ సమావేశాలకు ఆహ్వానించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ సమావేశాలకు హాజరు కాలేనిని తెలిపింది.

నకిలీ నోట్ల ముద్రణ .. ఇద్దరి అరెస్ట్....

ఢిల్లీ: దేశ రాజ‌ధానిలో న‌కిలీ నోట్ల‌ను ముద్ర‌ణ చేస్తున్న ఇద్ద‌ర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్ద‌రూ కొత్త‌గా వ‌చ్చిన రూ.500, 2వేల నోట్ల‌ను ప్రింట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు ఆరు ల‌క్ష‌ల ఫేక్ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఎదురు కాల్పుల్లో నలుగురు మావోల మృతి

ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్‌లో మావోయిస్టులకు -పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక జవాను మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలు కూబింగ్ కొనసాగిస్తున్నాయి.

11:08 - January 10, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులు సంక్రాంతి ముగ్గులతో సందడి చేశారు.. ఆధునికత పెరిగినా తమ సంప్రదాయాలు మారవంటూ ముచ్చట గొలిపే ముగ్గులు వేస్తున్నారు... భీమవరంలో జరుగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:05 - January 10, 2017
10:55 - January 10, 2017

హైదరాబాద్‌ : నగరంలోని సోమాజిగూడ  కత్రియా హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది హోటల్‌లో బస చేసిన వారిని బయటకు తీసుకొచ్చింది. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

10:51 - January 10, 2017

చిత్తూరు : టిటిడి కాంట్రాక్ట్‌ కార్మికులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయడంతో పాటు వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. టిటిడి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించాలని కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో చైర్మన్‌ చదలవాడ ఇంటి ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:48 - January 10, 2017

విశాఖ : మేము పక్కా లోకల్ అంటూ విశాఖ కళాకారులు గళం విప్పుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన విశాఖ ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో తమను గుర్తించాలని కళాకారులు డిమాండ్‌ చేస్తున్నారు. లోకల్‌వారిని కాదని నాన్ స్టేట్ కళాకారులను ఎలా ప్రోత్సహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 
కళాకారులు ఆందోళన బాట
ఓవైపు విశాఖ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంటే...మరోవైపు కళాకారులు ఆందోళన బాట పట్టారు. తమను కాదని ఇతర రాష్ట్రాల వారిని తెప్పించడం సరికాదంటున్నారు. అసలే ఆకలి బాధలతో అలమటిస్తున్న కళాకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ...ఇలా చేస్తే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుభవమున్న సంస్థలను కాదని...తమకు నచ్చిన సంస్థలకే అధికారులు....ఉత్సవాల నిర్వహణను అప్పగిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
ఈనెల  27 నుంచి విశాఖ ఉత్సవ్
విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు   నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గతంలో విశాఖకు చెందిన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకే ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. ఈవెంట్ నిర్వహణలో లోపాలు ఎలా ఉన్నా...ఆ సంస్థలు లోకల్ కళాకారులనే తీసుకున్నారు. అయితే ఇప్పుడు లోకల్‌ టాలెంట్‌ను కాదని ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకోవడానికి ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో కళాకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలకు ముందు లోకల్‌ టాలెంటన్‌నే వాడుకుంటామని చెప్పే నాయకులు...ఆ సమయం వచ్చేసరికి మాత్రం లోకల్ కళాకారులను పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. 
విశాఖ ఉత్సవ్‌కు రూ. 2.75 కోట్లు మంజూరు
ఇదిలా ఉంటే విశాఖ ఉత్సవ్  నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.75 కోట్లు మంజూరు చేసిందని అధికారులు చెబుతున్నారు. కానీ అంచనా వ్యయం మాత్రం రూ.3.50 కోట్లుగా అధికారులు  లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఉత్సవాలకు టూరిజం శాఖ టెండర్‌ పిలవగా రెండే రెండు టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వైబ్రీ ఈవెంట్స్‌ సంస్థ, మరొకటి పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్‌ ఈవెంట్స్‌ అండ్‌ ప్రమోషన్స్‌. అయితే  సైమా అవార్డుల ఫంక్షన్‌ వంటి భారీ ఈవెంట్లు నిర్వహించిన అనుభవం వైబ్రీ సంస్థకు  ఉంది. కానీ అధికారులు దాన్ని కాదని పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ కట్టబెట్టినట్టు తెలుస్తోంది... దీని వెనుక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న చినబాబు ఒత్తిళ్లు పనిచేశాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
ఈవెంట్స్‌ అండ్‌ ప్రమోషన్‌కు అప్పగింత 
ఇటీవలే అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విండ్‌ ఫెస్టివల్‌ కాంట్రాక్టును కూడా కౌశిక్‌ ముఖర్జీయే చినబాబు ద్వారా మంత్రాంగం జరిపి ఈ ఫ్యాక్టర్‌ ఈవెంట్స్‌ అండ్‌ ప్రమోషన్‌కు అప్పగించారు. కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టిన ఈ విండ్‌ ఫెస్టివల్‌ ఎవ్వరినీ ఆకర్షించలేకపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు సైతం ఈవెంట్‌ నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అదే సంస్థకు విశాఖ ఉత్సవాల కాంట్రాక్టు కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. కేవలం చినబాబు సిఫార్సు మేరకే చేసేది లేక కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా కమిటీ కూడా ఓకే చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

లాభాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 170 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 50 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

10:38 - January 10, 2017
10:35 - January 10, 2017

చెన్నై : తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమినాడు ప్రజలంతా ఒక్కటయ్యారు. ఆర్డినెన్స్ తెచ్చి అయినా ఈసారి ఈ క్రీడను నిర్వహించాలని ఆ రాష్ట్ర సీఎం పన్నీరు సెల్వం భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రానికి లేఖ రాశారు. చెన్నైలో నిన్న ప్రజలందరూ జల్లికట్టుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు జల్లికట్టు అంశంపై సినీ హీరో కమల్ హాసన్ స్పందించారు. జల్లికట్టు అంటే ఇష్టం లేనివారు బిర్యానీ తినడం కూడా మానేయాలని సూచించారు. తమిళులు సంప్రదాయమైన జల్లికట్టు క్రీడంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. స్పెయిన్‌లో ప్రజలు పశువులను గాయపర్చడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతాయనీ... అయితే తమిళనాడులో ఎద్దులను దేవుడిగా కొలుస్తారని, తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావిస్తారని గుర్తుచేశారు.

అధికారులతో జీహెచ్ ఎంసీ కమిషనర్ భేటీ

హైదరాబాద్ : ఉన్నతాధికారులతో జీహెచ్ ఎంసీ కమిషనర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆదాయం పెంపు, స్వచ్ఛ్ సర్వేక్షణ్, అక్రమ నిర్మాణాలు, కోర్టు కేసులు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అభయ్, సురేష్ కల్మాడి నియామకాన్ని రద్దు చేసిన ఐఓఏ

ఢిల్లీ : ఇండియా ఒలింపిక్ సంఘం శాశ్వత అధ్యక్షులు అభయ్ చౌతాలా, సురేష్ కల్మాడి నియామకం రద్దు అయ్యింది. అభయ్, సురేష్ నియామకాన్ని ఐఓఏ రద్దు చేసుకుంది.

10:28 - January 10, 2017

మహబూబాబాద్‌ : కేసీఆర్‌ ప్రభుత్వం పేదల సంక్షేమం వదిలి.. ఆలయాలకు కోట్లు ఖర్చు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పల్లెపల్లెలో చైతన్యం నింపుతూ.. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలుస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 85 రోజులు పూర్తి చేసుకుంది. జనగాం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని మహబూబాబాద్‌ జిల్లాలో ప్రవేశించింది. మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది.
నెరవేరని కేసీఆర్‌ హామీలు 
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని, పేదల సంక్షేమం వదిలేసి ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. ముందు ప్రజల సమస్యలు పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.  
రాష్ట్రంలో ఎవ్వరూ సంతోషంగా లేరని తమ్మినేని ఆవేదన
ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా.. రాష్ట్రంలో ఎవ్వరూ సంతోషంగా లేరని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, కాంట్రాక్టర్లు ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ వంటి సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించని కేసీఆర్‌ ఉత్తి మాటలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని తమ్మినేని దుయ్యబట్టారు. 
పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం 
ఇప్పటికే 19 జిల్లాల్లో పర్యటించిన తమ్మినేని బృందం.. 85వ రోజు జనగాం జిల్లా నుంచి మహబూబాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించింది. మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర బృందానికి స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి విశ్వేశ్వరరావు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కళాకారుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. మేనిఫెస్టోలో ఎన్నో మాటలు చెప్పిన కేసీఆర్‌.. కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా కళాకారులకు ఫించన్‌ సౌకర్యం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.  

 

10:25 - January 10, 2017

హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు యాదాద్రి జిల్లా వలిగొండ వాసి. రాష్ట్ర వ్యాప్తంగా 112 మందికి ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. స్వైన్ ఫ్లూ సోకిన రోగులు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ఆర్యోగశాఖ అప్రమత్తం అయింది. పెద్దాస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. చలి తీవ్రత ఎక్కువగా స్వైన్ ఫ్లూ తొందరగా వ్యాపిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:22 - January 10, 2017

1971లో భారత్ - పాక్ మధ్య ఓ యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో సబ్ మెరైన్ నీట మునిగిపోయింది. ఈ ఘటనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'ఘాజీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కండలవీరుడు 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. హాలీవుడ్ స్టాండర్స్ తో, భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. చిత్రానికి సంబంధించిన ఇప్పటి వరకు పలు లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో లుక్ విడుదలైంది. ఇందులో సబ్ మెరైన్ లోపలి భాగం చూపిస్తూ 'మీకు తెలియని మరో యుద్ధం గురించి తెలియ చెప్పబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ భారీ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్, పీవీపీ సినిమాలు కలిసి నిర్మించాయి. ఫిబ్రవరి 17న విడుదలవుతున్న సినిమా ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయన్నుట్లు తెలుస్తోంది. 'ఘాజీ' చిత్రం ఇండస్ట్రీల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉందంట. 'తాప్సీ' పాక్ శరణార్థి పాత్ర పోషించింది.

గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో మహిళ మృతి

హైదరాబాద్: తెలంగాణ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు యాదాద్రి జిల్లా వలిగొండ వాసిగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 112 మందికి స్వైన్ ఫ్లూ సోనికనట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం.

10:13 - January 10, 2017

తూర్పుగోదావరి : పి.గన్నవరంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహిచారు. ఈ ర్యాలీలో కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు భారీగా పాల్గొన్నారు. కాపుల జీవితాల్లో కొవ్వొత్తుల వెలుగునైనా నింపాలని ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం కోరారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా  జనవరి 25న కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి కాపు ఉద్యమం యాత్ర ప్రారంభమై వయా అమలాపురం మీదుగా జనవరి 30వ తేదీనాటికి అంతర్వేదికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.  

 

బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ కు ఈసీ నోటీసులు

ఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం సృష్టించింది.ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడి నుంచి 0.32 లైవ్ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్యే పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్ చేసిన షానవాజ్ అనే వ్యక్తి మైలార్ దేవ్ పల్లి పీఎస్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాటేదాన్ లో షానవాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సోమాజీగూడ కత్రియా హోటల్ లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్: సోమాజీగూడ కత్రియా హోటల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. 4 వంతస్థులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన

తిరుపతి : సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటి ముట్టడికి సీఐటీయూ పిలుపునిచ్చింది. చదలవాడ ఇంటికి కార్మికులు చేరుకున్నారు. చదలవాడ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల : రెండవ ఘాట్ రోడ్డులో 15 కిమీ వద్ద ప్రమాదం జరిగింది. కారు పిట్టగోడను ఢీకొనడంతో కారులోని నలుగురు గాయపడ్డారు. 

 

చెన్నూరులో 'జన్మభూమి..మా ఊరు'లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

నెల్లూరు : గూడూరు మండలం చెన్నూరులో జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 

 

నేడు ఓన్జీసీ ఆఫ్ షోర్ టెర్మినల్ ను సందర్శించనున్న కేంద్రబృందం

హైదరాబాద్ : నేడు ఓన్జీసీ ఆఫ్ షోర్ టెర్మినల్ ను కేంద్రబృందం సందర్శించనుంది.

09:33 - January 10, 2017

పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికరంగం రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత టి.ఆచారి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ రావు పాల్గొని, మాట్లాడారు.వ్యవసాయం, ఉపాధి రంగాలు దెబ్బతిన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బు బయటికి రాలేదని పేర్కొన్నారు. డబ్బులు తీసుకోవడంపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:31 - January 10, 2017

2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికే 2016 బిల్లు తూట్లు పొడుస్తోందని నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ టి.సాగర్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం న్యాయబద్ధంగా ఉందని..కానీ 2016 భూసేకరణ చట్టం నష్టదాయకంగా ఉందన్నారు. 2016 భూ సేకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 భూ సేకకరణ బిల్లు పై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2013 భూ సేకరణ చట్టం స్పూర్తికే 2016 బిల్లు తూట్లు పొడుస్తోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా జనవరి 12 నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 2016 భూ సేకరణ బిల్లును ప్రజా సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? 2013 భూ సేకరణ చట్టానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 బిల్లుకి వున్న తేడాలేమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల భూ నిర్వాసితులు ఏవిధంగా నష్టపోతున్నారు? అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:28 - January 10, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 11వ తేదీన చిత్రం విడుదల కానుంది. తమిళ సినిమా 'కత్తి' సినిమా రీమెక్ గా ఈ చిత్రం రూపొందింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. 'చిరు' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటించింది. ఇక చిత్రంలో 'చిరు' ఫైట్స్..డ్యాన్స్ ఎలా చేశాడనే దానిపై అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తున్నాయి. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'రత్తాలు..రత్తాలు' అనే పాటకు 'లారెన్స్' కొరియోగ్రఫీ అందించారు. ఈ మాస్ సాంగ్ లో 'చిరు' మరోసారి వీణ స్టెప్ వేశారని టాక్. 'ఇంద్ర' సినిమాలో 'చిరు' వీణ స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 'సర్దార్ గబ్బర్ సింగ్' లో 'పవన్' వీణ స్టెప్ వేసి అభిమానులను అలరించాడు. 'చిరంజీవి' మరోసారి ఈ స్టెప్ ను అభిమానుల ముందుకు తీసుకొస్తుండడం విశేషం. 'లక్ష్మీ రాయ్' తో 'చిరు' ఎలాంటి స్టెప్పులు వేశారో చూడాలంటే 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

09:28 - January 10, 2017

జమ్మూకాశ్మీర్‌ : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు పని చేస్తున్నారు. వీరోచితంగా పోరాడి.. తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి.. శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడుతున్నారు. దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పోరాడుతున్న సైనికులకు నాణ్యమైన ఆహారం దొరకండం లేదు. దేశంలోని రాజకీయనేతలు, అవినీతి పరులు, బడా వ్యాపారవేత్తలు మాత్రం నాణ్యమైన, పౌష్టికాహారం లభిస్తుంది. కానీ దేశాన్ని కాపాడుతున్న సైనికులకు మాత్రం తిండి కరువైంది. వారికి నాణ్యమైన భోజనాన్ని అందించడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశాన్ని రక్షించే బృహత్తరమైన కార్యాన్ని సైనికులపై పెట్టిన కేంద్రం.. వారికి నాణ్యమైన, సరిపడ తిండి పెట్టడంపై  దృష్టి పెట్టడం లేదు. సైనికులపై పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. దేశ రక్షణలో అత్యంత కీలకమైన సైన్యానికి ప్రతి ఏడాది అధిక నిధులు కేటాయిస్తున్నా.. సరిహద్దుల్లో సైనికులకు మాత్రం సరైన తిండి దొరకడం లేదు. కంటిమీద కునుకు లేకుండా కాపాలా కాస్తున్న జవాన్లకు మంచి భోజనం పెట్టడం లేదు. జమ్మూకాశ్మీర్‌ సరిహద్దు భద్రతాదళంలోని 29వ బెటాలియన్‌కు చెందిన తేజ్‌ బహదూర్‌యాదవ్‌ అనే సైనికుడు నాణ్యత లేని ఆహారాన్ని షూట్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దేశంలో అవినీతి పెరిగిపోవడం వల్లే.. తమకు సరైన ఆహారం దొరకడం లేదంటున్నాడు. పసుపు నీళ్లు, ఉప్పు తప్ప మరేమీ ఉండని పప్పు తిని 11 గంటలు నిలబడి ఎలా డ్యూటీ చేస్తామని ప్రశ్నిస్తున్నాడు. దీనిపై కేంద్రం స్పందించే వరకు ఇలాగే వీడియోలు పోస్ట్‌ చేస్తానన్నాడు తేజ్‌ బహదూర్‌. అయితే.. దీనిపై స్పందించిన బీఎస్‌ఎఫ్‌ విచారణకు ఆదేశించింది. 

09:26 - January 10, 2017

విజయవాడ : టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో నీరసించిన పార్టీలో ఉత్తేజం నింపేందుకు వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట కొత్తనాయకత్వాన్ని పెంచడంతోపాటు అధికారపార్టీకి చెందిన కంచుకోటల్లోకి దూసుకుపోయేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతున్నారు. వైసీపీ అధినేత జగన్‌ స్పీడ్‌పెంచారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ద్విముఖవ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతూ..పార్టీక్యాడర్‌లో ఉత్తేజం నింపుతున్నారు. 
2019 అసెంబ్లీ ఎన్నికలకు పావులు కదుపుతోన్న వైసీపీ  
2019 అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష వైసీపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీడీపీ అమలుచేసిన ఆపరేషన్‌ ఆర్ష్‌తో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టిపెట్టారు వైసీపీ అధినేత జగన్‌ . శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతోపాటు ఎంపీలు కూడా  పచ్చపార్టీ తీర్థపుచ్చుకోవడంతో.. పలు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్‌కు దిశానిర్దేశంలేకుండా పోయింది. దీంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు జగన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుండటంతో..ప్రతిపక్ష పార్టీ నేతలు  వాయిస్ పెంచారు. ప్రజాసమస్యలపై స్పందిస్తూనే.. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త నాయత్వాన్ని ప్రోత్సహించే పనిలో జగన్‌ బిజీగా గడిపేస్తున్నారు. 
రాయలసీమ జిల్లాలపై జగన్‌ ప్రత్యేక దృష్టి
అటు రాయలసీమ జిల్లాలపై జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. పార్టీకి బలంగా ఉన్న కర్నూల్ జిల్లాల్లో   ఓ ఎంపీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కడంతో ..అక్కడ పూర్వవైభవం తెచ్చుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కర్నూల్ జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టినట్లు పార్టీ నేతలు అంటున్నారు. ఈ  యాత్ర ద్వారా  పార్టీ  క్యాడర్ లో ఆత్మవిశ్వాసం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
టీడీపీ జిల్లాల్లోనూ బలపడేందుకు పక్కా వ్యూహం  
అటు అధికార పార్టీకి బలమైన జిల్లాల్లోనూ బలపడేందుకు జగన్‌ పక్కా వ్యూహంతో ముందుకెళ్లుతున్నారు. టీడీపీకి బలమైన జిల్లాలుగా ఉన్న ప్రాంతాల్లో ముందుగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను నియమించే  పనిచేపట్టారు. ఆయా  నియోజక వర్గాల్లో  బలమైన మాజీ  శాసనసభ్యులుంటే వారికి  పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. క్రిష్ణా, విజయనగరం లాంటి జిల్లాల్లో ఇప్పటికే  పలువురు మాజీలు వైసీపీ అధినేతకు టచ్‌లోకి వచ్చేశారనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన లీడర్లను ఆహ్వానించేందుకు తనదైన వ్యూహాన్ని జగన్‌ అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. 
ప్రభుత్వంపై విమర్శల దాడి 
రైతుభరోసా యాత్రలో ఓ వైపు ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను రగిలిస్తూనే.. పార్టీక్యాడర్ ను  కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు. ప్రభుత్వంపై విమర్శల దాడిచేస్తూ.. కాంగ్రెస్‌, టీడీపీల్లో అసంతృప్తిగా ఉన్న బలమైన నాయకులను పార్టీలో ఆహ్వానించే వ్యూహాన్ని వైసీపీ అధినేత అమలు చేస్తున్నారు.

 

09:25 - January 10, 2017

హైదరాబాద్ : ప్రజావాణి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది కాదా..? అది జీహెచ్‌ఎంసీ నినాదం. ప్రజా సమస్యల పరిష్కారమే దీని ఉద్దేశ్యం. ఉన్నతాధికారులు తమ తమ విభాగాల్లో ఉన్న సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించే విధంగా గతంలో రూపొందించారు. దీనిలో  క్షేత్రస్థాయి అధికారులు స్పందించ‌ని అన్ని స‌మస్యలపై ఉన్నతాధికారులు నేరుగా ఆదేశాలు జారీ చేయ్యాలి. కానీ బ‌ల్దియా ప్రజావాణిలో ఉన్నతాధికారులు క‌నీసం క‌నిపించడం లేదు. అధికారులు ఎన్ని ఆర్డర్లు వేసినా క్రింది స్థాయిలో ప‌నులు కావ‌డం లేదు. దీంతో బ‌ల్దియాలో ప్రజావాణి అలంకార ప్రాయంగా మారింది.
కాళ్లు అరిగేలా తిరిగినా ప‌నులు కావడం లేదంటున్న సిటిజ‌న్స్
గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని వివిధ అంశాలపై క్షేత్రస్థాయి అధికారులు స్పందించ‌క‌పోయినా, స‌మ‌స్యలు ప‌రిష్కరించ‌క‌పోయినా, వాటిని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమమే ప్రజావాణి. ఈ కార్యక్రమంలో ప్రతి సోమ‌వారం ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజ‌లు ఎదుర్కొంటున్న సమస్యల‌ తీవ్రత, అవకాశాన్ని బట్టి అక్కడికక్కడే వాటిని ప‌రిష్కరించాలి లేదా క్రింది స్థాయి అధికారులకు పనులు పూర్తి చేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేయాలి. అయితే గ్రేట‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మాత్రం అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కాళ్లు అరిగేలా తిరిగినా త‌మ ప‌నులు మాత్రం కావడం లేదంటున్నారు సిటిజ‌న్స్.
ప్రజల ఆవేదన పట్టించుకోని ప్రజావాణి 
అన్ని విభాగాల  ఉన్నతాధికారులందరూ ఒకేచోట ఉండటం కారణంగా సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం కావడానికి వీలుంటుందనే అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి 2012లో ప్లాన్‌ చేశారు. దీని లక్ష్యం బాగానే ఉంది. కానీ ఆచరణాస్త్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రారంభ దశలో సత్ఫలితాలనిచ్చిన ప్రజావాణి... ఇప్పుడు ప్రజల ఆవేదనను పట్టించుకోవడం లేదనే విమ‌ర్శలున్నాయి. 
ఫిర్యాదుల ప‌రిష్కారం అంతంత మాత్రమే 
పాలనలో పారదర్శకత ఉండటంతోపాటు.. అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి రూపొందించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వ‌ర‌కు 5వేల‌ 500వ‌ర‌కు ఫిర్యాదులు వ‌చ్చాయి. అయితే వాటిలో ప‌రిష్కారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 
ప‌రిష్కారం కాని స‌మ‌స్యలు 
ఇక త‌మ వ‌ద్దకు వ‌చ్చిన స‌మ‌స్యలు బాగానే ప‌రిష్కరిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు అధికారులు. త‌మ‌కు వ‌చ్చిన ఫిర్యాదుల్లో కేవ‌లం 500 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. అయితే సిటిజ‌న్ చార్టర్ ప్రకారం గ్రేట‌ర్ ప‌రిధిలో స‌మ‌స్యలు ప‌రిష్కారం కావ‌డం లేద‌నేది మాత్రం లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు సమస్యలపై ఏ అధికారిని క‌లిసినా ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు. అక్రమ నిర్మాణం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నా ఈ సిటిజ‌న్ కు ఎలా సమాధానం చెబుతున్నారో మీరే చూడండి.
అధికారుల్లో స్పందన కరువు 
ఇక ఎక్కువగా ఫిర్యాదులు హెల్త్ అండ్ శానిటేషన్, వీధిదీపాలు, దోమలు, కుక్కలు, టౌన్ ప్లానింగ్, ఆస్తిపన్ను, ఐటి, ఇంజనీరింగ్ విభాగాల్లో వస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన వాటిలో టౌన్ ప్లానింగ్, ఎస్టేట్స్ కార్పొరేషన్ స్థలాల రక్షణ, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల రక్షణ, రోడ్ల అక్రమణ వంటి ఆంశాలు ఇందులో ఉన్నాయి. వీటిపై పదులు సంఖ్యలో ఫిర్యాదులు అందినా అధికారుల్లో స్పందన కరువైందని గ్రేటర్‌ వాసులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారానికి నోచుకోని ఫిర్యాదులు
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుల్లో సగం కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇందుకు ప్రధాన‌ కార‌ణం బల్దియా బాస్ గా ఉన్న క‌మీష‌న‌ర్ ప్రజావాణికి హ‌జ‌రుకాక‌పోవ‌డ‌మే కారణమని పలువురంటున్నారు. అంత‌ర్జాతీయ న‌గ‌ర‌మంటూ చెబుతున్న పాల‌కులు ప‌బ్లిక్ గ్రీవెన్స్ ప‌రిష్కారానికి ఆ స్థాయిలో కృషి చేస్తారా లేదా అన్నది వెయ్యి డాల‌ర్ల ప్రశ్నగా మిగిలింది.

 

09:23 - January 10, 2017

విజయవాడ : ఆధార్ కార్డ్ కొత్తది కావాలన్నా.. ఆధార్ కార్డ్‌లో లోపాలు సవరించుకోవాలన్నా.. నిమిషాల్లో పని అయిపోతోంది. విజయవాడలో ఏర్పాటు చేసిన డిజిధన్ మేళా ఇందుకు వేదికైంది. డిజిమేళాలో ఆధార్ కౌంటర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. 
వేచిచూసే ధోరణికి యూఐడీఏ స్వస్తి
ఆధార్ కార్డ్ కోసం గంటల తరబడి కౌంటర్ల ముందు వేచిచూసే ధోరణికి యూఐడీఏ స్వస్తి పలికింది. ఇందుకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిజిధన్ మేళాను వేదికగా చేసుకుంది. ఈ మేళాలో ఆధార్‌ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ ఆకర్షణగా నిలిచింది. ప్రజలకు ఆధార్ సంబంధింత సేవలను ఈ స్టాల్ ద్వారా అందిస్తున్నారు. ఈ మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరిశీలించారు. 
ప్రజలకు అందుబాటులోకి ఆధార్ సేవలు                  
రెండు రోజుల పాటు లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధార్ కార్డ్ కొత్తది కావాలన్నా.. ఆధార్ కార్డ్‌లో లోపాలు సవరించుకోవాలన్నా.. నిమిషాల్లో పని అయిపోతోంది అంటున్నారు ఆధార్ అధికారులు. కొత్త ఆధార్ కార్ట్ అయితే ఉచితంగానూ.. కార్డులో మార్పులకు అయితే 25 రూపాయలను చెల్లించాలి.. ఇక నమోదు ప్రక్రియలో పాల్గొనేందుకు వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. 
మొత్తం 80 స్టాళ్లు ఏర్పాటు 
నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన డిజిధన్ మేళాలో మొత్తం 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాళ్లను ఏర్పాటు చేసిన వాటిలో 26 బ్యాంకులు, 10 ప్రభుత్వ ఏజెన్సీలు, 11 ఫెర్టిలైజర్స్ కంపెనీలు, 5 వ్యవసాయ సొసైటీలు, ఎన్ పీసీఐ, ఐటీ, చమురు, ఇంధన కంపెనీలున్నాయి. ఈ స్టాళ్ల సందర్శనకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. 
క్యాష్ లెస్ లావాదేవీపై అవగాహన పెంచుకోవాలి : సీఎం చంద్రబాబు 
రాష్ట్రంలో క్యాష్ లెస్ లావాదేవీపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీని డిజిటల్ లావాదేవీల్లో ముందు ఉంచడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు. డిజిధన్ మేళాలో జరిగిన లావాదేవీలపై నిర్వహించిన లాటరీలో విజేతను చంద్రబాబు ఎంపికచేశారు. 

09:22 - January 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాల నిర్వహణకు సర్కార్‌ సమాయత్తమవుతోంది. ఉత్సవాలను ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిచేందుకు కసరత్తు చేస్తోంది. అన్నీ యూనివర్శిటీల వైస్ చాన్స్‌లర్లతోపాటు,.. పూర్వ విద్యార్దులూ పెద్దసంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 
ఉత్సవాల ఏర్పాట్లపై కడియం శ్రీహరి సమీక్ష 
చదువుల కోవెల.. ఉద్యమాలఖిల్లా.. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్దిఉత్సవాలకు సిద్ధం అవుతోంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉత్సవాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  
1918లో ప్రారంభమైన ఉస్మానియాయూనివర్సిటీ
తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్నిశిఖలా ఎగిసిన వేదిక ఉస్మానియా యూనివర్సిటీ.  దశాబ్దాల ఉద్యమమేకాదు విద్యా , సాంస్కృతిక సంబంధం కూడా  ఈ విద్యానిలయంతో పెనవేసుకుని ఉంది. 1918లో ఏడవ నిజాం మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌.. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రముఖులుగా ఎదిగిన ఎందరో ఈ విద్యాలయ విద్యార్థులే. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతోపాటు... అప్పటి నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన ఎందరో ప్రముఖులు ఇక్కడనే ఉద్యమపాఠాలు దిద్దుకున్నారు. స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత తెలంగాణలో సాగిన రైతాంగపోరాటాలకు ఇక్కడ నుంచే కార్యాచరణ సాగింది. 
విద్యాకుసుమాలు విరబూసిన ఓయూ
నాటి హైదరాబాద్‌ రాజ్యంలో విద్యాకుసుమాలు విరబూయించిన యూనివర్సిటీ ప్రస్తుతం శతాబ్ధి ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. యూనివర్సిటీ తొలిశతాబ్ది పండుగను  ఎప్పటికీ గుర్తుండిపోయేలా సంబురంగా జరుపుతామంటోంది తెంగాణ ప్రభుత్వం. 
ఏప్రిల్‌ 26 నుంచి ఉత్సవాలు
ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో ప్రారంభం కానున్న ఉత్సవాలను ఏడాదిపాటు జరపడానికి తెలంగాణ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల ప్రారంభం నుంచి మొదటి మూడు రోజులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తెంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. భారీ ఎత్తున జరపనున్న ఈ ఉత్సవాల నిర్వహణకు 30కమిటీలు వేసినట్టు మంత్రి కడియం తెలిపారు.  
ఉత్సవాలకు హాజరుకానున్న ప్రముఖులు 
ఉత్సవాలకు ప్రముఖ సంస్థలకు ఆహ్వానం 
ఈ ఉత్సవాలకు అటు జాతీయస్థాయిలో ప్రముఖ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యామండలితోపాటు యూనివర్సిటీ గ్రాంట్‌కమీషన్‌ నుంచి కూడా ప్రముఖులు హాజరవుతారు. ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 27న ఆల్‌ఇండియా వీసీల సమావేశంకూడా ఏర్పాటు చేస్తున్నారు. 28వ తేదీన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెయిర్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర అంగీకరించిందని మత్రి తెలిపారు. 
ఉత్సవాలకు వంద పబ్లికేషన్స్‌తో పుస్తకం 
ఉస్మానియాలో చదివి వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వారిపై ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించనున్నట్టు తెలిపారు. ఓయూ చరిత్రను భావితరాలకు అందించేలా వీడియో రూపొందిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ ప్రారంభం నుంచి నేటివరకు ప్రచురణ అయిన వంద పబ్లికేషన్స్‌తో ఓ పుస్తకం తీసుకువచ్చి.. విశ్వవిద్యాలయం ఖ్యాతిని ఘనంగా చాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో 3 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు ఆలస్యంగా నడువనున్నాయి. 21 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 7 రైళ్లను రద్దు చేశారు. 

నేటి నుంచి రాష్ట్ర స్థాయి చెకుముకి సంబురాలు

హైదరాబాద్ : నేటి నుంచి జేఎఫ్ ట్రస్టు, జెవివి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెకుముకి సంబురాలు జరుగనున్నాయి. మూడు రోజులపాటు సంబురాలు కొనసాగనున్నాయి.

 

సోమాజిగూడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సోమాజిగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. కత్రియా హోటల్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మహిళ మృతి

హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో మహిళ మృతి చెందింది. మృతురాలు యాదాద్రి జిల్లా వలిగొండ వాసి. రాష్ట్ర వ్యాప్తంగా 112 మందికి ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు.

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బందిపోర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. 

09:16 - January 10, 2017

అజిత్..తమిళ స్టార్ ఈ హీరో చిత్రం వస్తుందంటే చాలు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటుటారు. ఆయన చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా ఆయన ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆయనకు 57వది. ఇంతకుముందు వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'అజిత్' ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనుండగా 'కాజల్ అగర్వాల్', 'అక్షరా హాసన్' హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు 'వివేక్ ఒబెరాయ్' నెగెటివ్ షేడ్ లో కనిపించనున్నాడు. ఇందులో 'అజిత్‌' గెటప్‌ గురించి, చిత్ర వివరాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంత కాలంగా తన వయసుకు తగ్గ పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్న 'అజిత్' ఈ సినిమాలో మాత్రం స్కిన్ టైట్ టీషర్ట్ లో కండలు తిరిగిన బాడీతో కనిపించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు దాటిందని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేమని కోలీవుడ్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్ర వర్గాలు నిర్ణయించినట్లు తాజా సమాచారం.

నేడు కోనసీమలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన

తూర్పుగోదావరి : నేడు కోనసీమలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించనుంది. అల్లవరం మండలం ఓడరేవులో కమిటీ పర్యటించనుంది.

నేడు కోనసీమలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన

తూర్పుగోదావరి : నేడు కోనసీమలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించనుంది. అల్లవరం మండలం ఓడరేవులో కమిటీ పర్యటించనుంది.

నేడు కోనసీమలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన

తూర్పుగోదావరి : నేడు కోనసీమలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించనుంది. అల్లవరం మండలం ఓడరేవులో కమిటీ పర్యటించనుంది.

నేడు భారత్, ఇంగ్లండ్ వార్మస్ మ్యాచ్

ముంబై : నేడు భారత్, ఇంగ్లండ్ వార్మస్ మ్యాచ్ జరుగనుంది. ఇంగ్లండ్ ఎలెవన్ తో ధోనీ నాయకత్వంలోని భారత్ ఏ జట్టు ఢీ కొట్టనుంది. 

07:03 - January 10, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌కల్లా  నీరు ఇచ్చేలా అధికారులంతా కృషి చేయాలన్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లకు చెందిన డిజైన్‌లను టాప్‌ ప్రయార్టీగా సమర్పించాలని ఆదేశించారు.  జలసౌధలో  కాళేశ్వరం ప్రాజెక్టు  పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుని.. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు సృష్టించాలని సూచించారు. కాలేశ్వరంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీపైనా హరీశ్‌ సమీక్షించారు.

 

07:01 - January 10, 2017

ఉత్తరప్రదేశ్ : సమాజ్‌వాదీ పార్టీలో ముసలం ముగిసిపోయిందా..? తండ్రి ములాయం పట్టవీడి కొడుకు చెంతకు చేరారా..? గత కొద్ది రోజులుగా ములాయం, అఖిలేష్‌ మధ్య జరుగుతున్న వార్‌కు తెరపడిందా..? తాజాగా ములాయం వ్యాఖ్యలు అలానే అనిపిస్తున్నాయి. కుమారుడు అఖిలేష్‌కు ములాయం జేజేలు కొట్టడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో గతంలో పోటాపోటీగా మద్దతు కూడగట్టిన తండ్రికొడుకుల మధ్య యుద్ధం ముగిసిందని ఎస్పీ కార్యకర్తలు భావిస్తున్నారు. 
ముసలానికి ముగింపు పలికిన ములాయం  
'తిరగబడినా నా కొడుకే కదా..! వచ్చే ఎన్నికల్లో అఖిలేష్‌ యాదవే సీఎం అభ్యర్ధి..! సమాజ్‌వాదీ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు..!' ఇవి సాక్ష్యాత్తు ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన ముసలానికి ములాయం ముగింపు పలికారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకే ములాయం మొగ్గు చూపారు. 
వారు ఒక్కటయ్యేందుకు సిద్ధం 
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, ఉత్తర ప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఇద్దరూ తండ్రీ కొడుకులు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో రెండుగా చీలిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ తనదంటే తనది అంటూ పోటాపోటీగా పావులు కదిపారు. పార్టీ గుర్తుకోసం దేశ రాజధానిలో హడావుడి చేశారు. చివరికి కొడుకు అఖిలేష్‌ యాదవ్‌ మెజార్టీ ముందు అధినేత ములాయం వెనక్కి తగ్గారు. ఎంతైనా కొడుకే కదా అని పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. 
వివాదాలకు స్వస్తి పలికిన ములాయం  
ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ సమాజ్‌వాదీ పార్టీలో ముసలానికి తెర పడిందనే చెప్పవచ్చు. దేశంలో సంచలనం రేపిన ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. తండ్రీ కొడుకులు రోజుకో ప్రకటనతో పార్టీ కార్యకర్తల్లో గుబులు రేపారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలను ఆయోమయంలో పడేశారు. చివరికి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివాదాలకు అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ స్వస్తి పలికారు. 
అఖిలేష్‌ కు మరోసారి పట్టంకట్టేందుకు సిద్ధం 
పట్టువీడిన అధినేత ములాయం.. పార్టీలో సంక్షోభానికి తెరదించారు. కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌కు మరోసారి పట్టంకట్టేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే మరోసారి కూడా అఖిలేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. ఇక పార్టీలో చీలిక అనేది లేదని, సమాజ్‌ వాది పార్టీ అంతా ఒక్కటేనని తేల్చేశారు. ఎన్నికల ప్రచారంలో దూకుతామని ములాయం సింగ్‌ చెప్పారు. ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహం రచించేందుకు ములాయంసింగ్‌తో ఇవాళ అఖిలేష్‌ భేటీ కానున్నాడు. గత కొద్ది రోజులుగా నెలకొన్న వివాదాలకు ములాయం పులిస్టాప్‌ పెట్టడంతో సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. 

 

06:57 - January 10, 2017

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌ ఎల్వీ ప్రసాద్‌ ల్యాబ్‌ సమీపంలో మద్యం మత్తులో యువతులు హల్‌చల్‌ చేశారు. కారుతో నాలుగు వాహనాలను ఢీకొట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరు మద్యం తాగినట్లు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ ద్వారా నిర్ధారించారు. కారులో మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్‌ ఏసీపీ మురళి తెలిపారు.

 

నేడు గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటన

గుజరాత్ : నేడు ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. 

నేడు నెల్లూరు జిల్లా సీఎం చంద్రబాబు పర్యటన

నెల్లూరు : నేడు సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. జన్మభూమి కార్యక్రమలో ఆయన పాల్గొననున్నారు.

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి హరీస్ రావు పర్యటన

ఆదిలాబాద్ : నేడు మంత్రి హరీస్ రావు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. 

Don't Miss