Activities calendar

11 January 2017

21:34 - January 11, 2017

నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని ఆరోపిస్తూ.. వైసీపీనేత కాకాణి గోవర్దన్‌రెడ్డి చూపిన పత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు. కాకాణి ఆరోపణలతో సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. కాకాణి చూపించిన డాక్యుమెంట్లలో నిజానిజాలను వెలికి తీయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కాకాణి చూపిన పత్రాలు నకిలీవని తేల్చారు. నకిలీ డాక్యుమెంట్ల తయారీలో ప్రమేయమున్న చిత్తూరు జిల్లాకు చెందిన మణిమోహన్‌ అలియాస్‌ చిరంజీవి, పి. వెంకటకృష్ణన్‌, హరిహరన్‌ను అరెస్ట్‌ చేశారు. నకిలీ పత్రాల తయారీకి ఉపయోగించిన ల్యాప్‌టాప్‌, రబ్బరుస్టాంప్స్‌, సెల్‌ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

21:31 - January 11, 2017

నిర్మల్ : సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణానికి 516 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు తెలిపారు. సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 26 గ్రామాలకు తాగునీరు..17 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హమీలను నెరవేర్చుతూ ఇచ్చిన మాట నిలెబట్టుకుంటున్నాడని హరీష్‌రావు కొనియాడారు. ఖానాపూర్ మండల కేంద్రోలని వ్యవసాయ మార్కెట్ గోదాంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

21:30 - January 11, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. అసలు దొంగలను వదలి.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ కరెన్సీని అరికట్టడంలో.. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. నల్లడబ్బు స్విస్‌ బ్యాంకుల్లోనే కాకుండా.. బంగారం, రియల్‌ ఎస్టేట్‌ రూపంలో ఉందన్నారు.

21:28 - January 11, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. పన్నెండో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో.. ఏపీకి చెందిన వారు.. చిన్నా పెద్ద సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

మహానగరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణీకుల కష్టాలు అన్నిఇన్నీ కావు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ట్రైన్లు లేక పోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దొరికిన రైళ్లు, బస్సులలో సీట్లు దోరకక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు జూబ్లి బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్ధితి ఉండటంతో మరిన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేయాలని డిమాండ్ చేసారు.

పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ఆంధ్రాప్రజలు...

హైదరాబాద్ మహానగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం వారివారి ప్రాంతాలకు తరలివెళతారు. వీరితో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళతారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులు నడపడంలో ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు రైల్వే శాఖ కూడా అదనపు రైళ్లను వేయకపోవడంతో సంక్రాంతి రద్దీ మరింతగా పెరిగింది.

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్....

సందేట్లో సడేమియాల్లా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు బస్సు ఛార్జీలు మూడింతలుగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీని అరికట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఆర్టీసీ , రైల్వే శాఖలు స్పందించి రద్దీకి తగ్గటుగా అదనపు బస్సులను, రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

'ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో వారసత్వ పాలన'

విశాఖ :ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో వారసత్వ పాలన కొనసాగుతోందని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్ ఆరోపించారు. 19న లోధా కమిటీకి గోకరాజు అవకతవకలపై ఫిర్యాదు చేస్తానని లోధా కమిటీకి ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి తన ఇష్ట ప్రకారమే గోకరాజు గంగరాజు వ్యవహరిస్తున్నారని ఆయనకు ఆస్తులు ఉన్న చోటే మైదానాలు ఏర్పాటుచేస్తున్నారు.గోకరాజు రాజకీయాలను ప్రశ్నించినందుకు ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, ప.గో జిల్లాల అసోసియేషన్ల పై వేటు వేశారన్నారు. గోకరాజు ఏపీ నుంచి ఒక్క క్రీడాకారుడినీ తయారు చేయలేదని పేర్కొన్నారు.

కర్నూలు లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ : కర్నూలు లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారు పటేకు చెందిన మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని కిరోసిన్ పోసుకుని బాధితురాలి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది.

కరీంనగర్ జిల్లాలో ఇసుకలారీలను అడ్డుకుంటున్న నేతలు

కరీంనగర్ : మహదేవ్ పూర్, కళేశ్వరంలో ఇసుకలారీలను అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర తిరోంచ ఇసుక క్వారీల నుంచి వస్తున్న లారీలను అధికారటీఆర్ ఎస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో రోడ్ల పై భారీగా లారీలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర ఇసుక రీచ్ లో గుత్తేదారుల మధ్య విభేదాలు తెలెత్తడంతో స్థానిక నేతలకు మామూళ్లు ఇవ్వలేదని లారీలను అడ్డుకుంటున్నారని యజమానులు ఆరోపించారు. ఓ అధికార పార్టీ నేత రూ.20లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఇసుక క్వారీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు :టీఎస్ ఆర్టీసి

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా రేపటి వరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సీబీఎస్ నుంచి కర్నూలు, కడప, చిత్తూరు,అనంతపురం, ఒంగోలు, నెల్లూరుకు, ఎల్బీ నగర్ నుంచి విజయవాడ, గుంటూరు వైపు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా 2,430 ప్రత్యేక బస్సులు వేశామని, ఏపీకి 750 ప్రత్యేక బస్సులు వేశామని ఎండీ రమణారావు తెలిపారు.

20:28 - January 11, 2017

వాయు కాలుష్యం.. గ్రీన్ పీస్ ఇండియా రిపోర్టు

ఢిల్లీ :వాయు కాలుష్యం వల్ల భారత్ లో ఏటా 12 లక్షల మంది చనిపోతున్నారని గ్రీన్ పీస్ ఇండియా రిపోర్టు ఇచ్చింది. గాలి కాలుష్యం వల్ల 3 శాతం జీడీపి దెబ్బతింటోందని డబ్ల్యూ హెచ్ వో ప్రమాణాల మేరకు 168 పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం లేదని తెలిపింది.

ప్రియాంక పక్కన డింపుల్ యాదవ్ ఫోటో

అలహాబాద్ : యూపీ కాంగ్రెస్ పోస్టర్ల మీద సీఎం అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఫోటో ప్రత్యక్షమైంది. ప్రియాంక పక్కన డింపుల్ యాదవ్ ఫోటో తో పోస్టలర్లు వెలిశాయి.

ఖరగ్ పూర్ టీఎంసీ కార్యాలయంలో కాల్పులు

కోల్ కతా : ఖరగ్ పూర్ టీఎంసీ కార్యాలయంలో గన్ మెన్ కాల్పులు జరిపారు. కాల్పుల్లో టీఎంసీ కౌన్సిలర్ భర్త అతని స్నేహితుడు మృతి చెందాడు.

హజ్ యాత్రికులకు శుభవార్త

హైదరాబాద్ : హజ్ యాత్రికులకు సౌదీ అరేబియా శుభవార్త తెలిపింది. భారత్ హజ్ కోటాను సోదీ అరేబియా పెంచింది. 1.36 లక్షల మంది నుంచి 1.7లక్షల మందికి పెంచారు.

20:10 - January 11, 2017

హైదరాబాద్ : షురువైన సంకురాత్రి వాసనలు...తెగ ఆడుతున్న తెలుగు ఆడపడుచులు, కోణీదల కోడి.. నందమూరి నాటుకోడి... థియేటర్లలో షురూ అయిన కోడి పందాలు, పిచ్చి లేసే విధానాలు చెప్పిన చంద్రాలు...చెవుల పూలు పెట్టిన కాడికి చాలు, సాయం చేయమంటున్న సాంబ శివుని... బిడ్డె సర్కారే తీసుకోవాలే బుజ్జి లైఫ్ ను, డాక్టర్లను మోసం చేసిన చదువురానోడు... ఎట్టకేలకు పట్టుకొస్తున్న లష్కర్ పోలీసోళ్లు... తాత షహనాయి ఎత్తుకుపోయిన మనుమడు... బిస్మిల్లాఖాన్ కు అసలైన వారసుడు. ఈ అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న తీసుకొచ్చిన వాడి వేడీ న్యూస్. మరి మీరూ ఈ వార్తలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:41 - January 11, 2017

విజయవాడ : 2017 టెన్‌టీవీ నూతన క్యాలెండర్‌ను విజయవాడలోని ఆటోనగర్ స్టోర్స్ దగ్గర వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఆవిష్కరించారు. అన్నివర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చేలా 10టీవీ కృషి చేస్తుందని పలువురు ప్రముఖులు కొనియాడారు. 2016లో వివిధ వర్గాల ప్రజలకు 10టీవీ అండగా నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. 2017లోనూ 10టీవీ మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బి.సత్యనారాయణ, క్రాంతి ఆజాద్, గుడివాడ రామారావు, యార్లగడ్డ సుబ్బారావు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

19:38 - January 11, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు, భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి. రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు.

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ

ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు.

2013 చట్టాన్ని అమలు చేయాలంటున్న భూ నిర్వాసితులు....

భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 220 రోజులుగా ఇంకా రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు. వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి.

ఏపీలోనూ బలవంతపు భూసేకరణ

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది.

. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఫిలింనగర్ చౌరస్తాలో ఉద్రిక్తత

హైదరాబాద్: ఫిలింనగర్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విగ్రహావిష్కరణకు అనుమతి లేదంటూ దివంగత ప్రజానాయకుడు పీజేఆర్ విగ్రహావిష్కరణను అధికారులు అడ్డుకున్నారు. దీంతో పీజేఆర్ కూతురు విజయారెడ్డి వర్గం, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఉన్నతాధికారుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో విజయారెడ్డి పీజేఆర్ విగ్రహాన్నిఆవిష్కరించారు.

18:46 - January 11, 2017

ఆఫ్టర్ ఎ గ్యాప్... బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ 150వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పదేళ్ళ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందనగానే అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ అంచనాలన్నీ దృష్టిలో పెట్టుకుని తిరుగులేని మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దేందుకు హేమాహేమీ రచయితలంతా తలా ఓ చేయి వేశారు. తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి రీమేక్ గా దర్శకుడు వివి వినాయక్ తీర్చిదిద్దిన ఖైదీ నంబర్ 150... ఆ అంచనాలను అందుకోగలిగిందా? ప్రపంచాన్ని ఒక మార్కెట్ గా, మనుషుల్ని కేవలం వినియోగదారులుగా మార్చేసిన కార్పొరేట్ క్యాపిటలిస్ట్ వ్యవస్థలో గ్రామీణ జీవనం ఛిన్నాభిన్నం అయిపోతోంది. పల్లె రైతుల కాళ్ళ కింద నుంచి కార్పొరేట్ శక్తులు వాళ్ళ భూముల్ని కబళిస్తున్నాయి. ఈ అమానవీయ పరిణామాన్ని, దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ఉదాత్తమైన కథాంశంతో తీసిన చిత్రం ఖైదీ నంబర్ 150. కార్పొరేట్ శక్తుల దుర్మార్గాలకు రైతులు బలి అయిపోవడం చూసి కలత చెందిన... శంకర్, రైతుల భూముల్ని కాపాడడమే ధ్యేయంగా చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తాడు. అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. చిల్లర దొంగతనాలు చేస్తూ... సరదాగా బతికేందుకు స్నేహితుడితో కలిసి బ్యాంకాక్ వెళ్ళాలని దొంగ పాస్ పోర్టులు తయారు చేసుకున్న కత్తి శీను.. శంకర్ స్థానంలోకి వస్తాడు. డేరింగ్ డాషింగ్ అయిన శంకర్ ప్రవేశంతో... రైతులకు ఓ బలమైన అండ లభించినట్లవుతుంది. రైతు సమస్యలను ప్రభుత్వం, మీడియా, అందరూ పట్టించుకోవడం లేదని... వారి దృష్టిని మళ్ళించేందుకు ఆరుగురు రైతులు ఆత్మబలిదానం చేసుకుంటారు. చివరకు నీరూరు అనే ఆ గ్రామంలోని రైతుల ప్రాణాలను, వారి భూములను హీరో ఎలా కాపాడారు, అసలు ఉద్యమకారుడు శంకర్ ఏమయ్యారు.. అనే ప్రశ్నలకు సమాధానంగా కథ కొనసాగుతుంది.

 

ఓ హోల్సమ్ ఎంటర్ టైనర్ గా.....

దేశంలో ఇప్పుడు చాలా చోట్ల రగులుతున్న భూమి సమస్యను కథాంశంగా ఎంచుకున్నందుకు చిరంజీవిని అభినందించాల్సిందే. ఆర్థిక సరళీకరణ పేరుతో మార్కెట్ సరిహద్దులు చెరిగిపోతున్న పెట్టుబడి దారీ వ్యవస్థలో, భూమి అత్యంత విలువైన సంపదగా మారింది. వ్యవసాయమే మెజారిటీ ప్రజల జీవికగా ఉన్న మనదేశంలో భూమితో రైతులకు ఉన్న సంబంధం చాలా ఆత్మీయమైనది. వాల్యూతో పాటు సెంటిమెంటల్ వాల్యూ కూడా ఉన్న భూములను అభివృద్ధి పేరుతో రైతుల నుంచి లాక్కోవడం మన కళ్ళ ముందే జరుగుతోంది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ వంచనను ప్రశ్నించడమే ప్రధాన ఇతివృత్తంగా ఉన్న ఈ కథలో.. చిరంజీవి మార్క్ డాన్సులు, కామెడీ సీనులు, ఫైట్స్ బాగా దట్టించారు దర్శకుడు వినాయక్. అయితే, చిరంజీవి ఇమేజ్ ను పదేళ్ళ గ్యాప్ ను దాటించి.. రీఎస్టాబ్లిష్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో, అసలు కథ తెరమరుగైంది. డిస్కస్ చేయాల్సిన ఇష్యూ తెరమరుగైపోయి...స్టార్ మార్కెట్ కోసం పడిన వెంపర్లాట్ డామినేట్ చేసింది. అయితే, చిరంజీవి సినిమాలో సీరియస్ కథేమిటి... బాస్ ఈజ్ బ్యాక్... ఆయనేం చేసినా మెస్మరైజ్ అయిపోతారు మాస్... అనుకునేవాళ్ళకు ఈ సినిమా ఓ హోల్సమ్ ఎంటర్ టైనర్.

నటీనటులు...

నటీనటులు విషయానికి వస్తే... మెగా స్టార్ చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది? నటుడిగా బలమైన పునాదిరాళ్ళ మీద స్వయంకృషితో ఎదిగిన 150 చిత్రాల స్టార్... ఎప్పట్లానే ఈ చిత్రంలో జోరుగా పర్ఫార్మ్ చేశారు. పదేళ్ళ గ్యాప్ తరువాత చిరంజీవి... గ్యాంగ్ లీడర్ లుక్ తో.. ఫిజిక్ తో మార్వలెస్ గా కనిపించారు. స్టెప్పుల్లో తనదైన రిథమ్ తో ప్రేక్షకులకు జోష్ ను పంచారు. రౌడీ అల్లుడి తరహా పాత్ర అయిన కత్తి శీనుగా మాస్ చేత చప్పట్ల మోత మోగించారు. కాజల్ పాత్ర పాటలకే పరిమితమైంది.. ఇందులో ఆమె నటనా కౌశలాన్ని ప్రదర్శించాల్సిన సన్నివేశాలేవీ లేవు. ఒక పాటలో నటిస్తే ఐటం సాంగ్ అంటారు, మూడు పాటల్లో కనిపిస్తే హీరోయిన్ అంటారు అన్నట్లే ఉంది కాజల్ పాత్ర చిత్రణ. ఇక, ఆలీ, బ్రహ్మానందం చేసిన పాత్రలు వారికి బాగా అలవాటైనవే. కామెడీ సన్నివేశాలను వారు బాగా పండించారు. విలన్ గా తరుణ్ అరోరా... ఎలా నటిస్తారో చూద్దామంటే.. దర్శకుడు ఆయనకంత స్కోప్ ఇవ్వలేదు.

 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే...

టెక్నీషియన్స్ విషయానికి వస్తే... శంకర్ దాదా ఎంబీబీఎస్ సిరీస్ లో చిరంజీవికి మూడో హిట్ ఆల్బమ్ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆర్ రత్నవేలు ఫోటోగ్రఫీ కథానుగుణంగా సాగింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లు చిరంజీవికి ఆకట్టుకునే మూమెంట్స్ డిజైన్ చేయగలిగారు. వైర్ వర్క్స్ మరీ ఎక్కువగా లేకుండా సింపుల్ మూమెంట్స్ తో రామ్ లక్ష్మణ్ లు ఫైట్స్ కొరియోగ్రఫీ ఇంప్రెసివగా ఉంది. ఇక, కాస్ట్యూమ్స్ డిజైనర్ కొణిదెల సుస్మిత పనితనం... పాటల్లో బాగా కనిపిస్తుంది. చిరంజీవిని అప్ టుడేట్ ఫ్యాషన్స్ తో ఆకట్టుకునే చూపించగలిగారు.

హేమాహేమీ రచయితలు...

పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, బుర్రా సాయిమాధవ్... వంటి హేమాహేమీ రచయితలు ఈ స్క్రిప్టు కోసం పని చేశారు. కానీ, ఇంత మంది కలిసినా పెద్దగా పంచ్ డైలాగులేమీ కనిపించలేదు. మీడియాతో కత్తి శీను సంభాషణలో పరుచూరి మార్క్ కనిపిస్తుంది. మొత్తంగా, చిరంజీవి మ్యాజిక్ ను ఎలివేట్ చేయడానికి చూపించిన శ్రద్ధలో... కొంత భాగమైనా కథను ఎలివేట్ చేయడానికి, చిరంజీవికి దీటైన విలన్ ను ఎలివేట్ చేయడానికి పెట్టి ఉంటే సినిమా ఇతివృత్తానికి న్యాయం జరిగేది. ముఖ్యంగా, కథలోని కీలక సమస్య మీద పోరాటానికి నడుం బిగించిన అసలు కథానాయకుడు పూర్తిగా అండర్ ప్లే అయిపోవడం ఈ నెరేషన్ లోని విషాదం. భూమి సమస్య ఒక కార్పొరేట్ ప్రతీకను హతమార్చితే పరిష్కారమయ్యేది కాదన్న వాస్తవం తెలిసి...దాని వెనుక ఉన్న మార్కెట్ వ్యూహాలను కొంతవరకైనా చూపించే ప్రయత్నం చేసి ఉంటే సినిమాకు ఒక పర్పస్ ఫుల్ మూవీ అన్న గౌరవం దక్కేది. ఫలితంగా... చిరంజీవి 150వ చిత్రం ఒక రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

 

 

ప్లస్

చిరంజీవి యంగ్ లుక్,

సమకాలీన కథ

నేపథ్య సంగీతం

చిరంజీవి డాన్సులు

 

మైనస్

రొటీన్ కామెడీ

బలహీనమైన ఇతర పాత్రలు

విలన్ తేలిపోవడం

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ : Watch Video

పులివెందుల మున్సిపల్ ఆఫీసుపై ఏసీబీ దాడి

కడప: పులివెందుల మున్సిపల్ ఆఫీసు పై ఏసీడీ దాడి చేసింది. మున్సిపల్ కమిషనర్ సూర్యమోహన్ రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

బస్తర్ ప్రాంతంలో రెండు చోట్ల ఎదురుకాల్పులు

ఛత్తీస్ గఢ్ : బస్తర్ ప్రాంతంలో రెండు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను, ఐదుగురు మావోలు మృతి చెందారు.

భూకబ్జా ఆరోపణలపై అనకాపల్లి ఎమ్మెల్యే

విశాఖ : భూ ఆక్రమణ ఆరోపణలపై అనకాపల్లి ఎమ్మెల్యే తీల గోవింద్ స్పందించారు. రాజేష్ బాబు అనే వ్యక్తి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజేష్ బాబే 108 గజాల భూమిని ఆక్రమించాడని గోవింది ప్రత్యారోపణ చేశారు. రాజేష్ కుటుంబాన్ని నా కొడుకు బెదిరించలేదని, రాజేష్ పై పరువు నష్టం దావా వేస్తానని, కేసుపై కోర్టులో తేల్చుకుంటానని గోవింద్ తెలిపారు.

18:12 - January 11, 2017

కరీంనగర్‌ : జిల్లాలో జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు వేదికైంది. కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ కాలేజీలో ఈ పోటీలను ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ పోటీల్లో 15 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామని మంత్రి ఈటల అన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

17:50 - January 11, 2017

ఖమ్మం : భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలి సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేనివీరభద్రం డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాజన పాద యాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ... పార్టీ బలహీనంగా ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరధం పడుతున్నారని తెలిపారు. రీ డిజైన్లు అనేవి కాంట్రాక్టర్లకు డబ్బు చేకూర్చే విధంగా ఉంది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. చట్టాల పట్ల, ప్రజలకు వ్యతిరేఖంగా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు మదం తో కూడుకున్నవి తెలిపారు. భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తుపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు, 8వేల 600 ఎకరాలు సాగులోకి వస్తాయని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. సీపీఎం మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. తిరుమాలయపాలెం మండలం ఇస్లావత్ తండా వద్ద ఎస్ఆర్‌ఎస్‌పీ ప్రధాన కాలువ, భక్తరామదాసు ఎత్తుపోతల పథకం స్టోరేజీ కేంద్రాన్ని మహాజన పాదయాత్ర బృంద సభ్యులు సందర్శించారు.

17:46 - January 11, 2017

ఖమ్మం: '10 టీవీ' నూతన సంవత్సర క్యాలెండర్ 2017ను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 10టీవీ ప్రజల పక్షాన నిలిస్తోందని ఎమ్మెల్యే అజయ్‌ అన్నారు. ప్రజా సమస్యలను వెలికితీయడంలో 10 టీవీ కృషి అమోఘమన్నారు.

17:44 - January 11, 2017

హైదరాబాద్‌ : నారాయణగూడలోని జాహ్నవి ఉమెన్స్‌ కాలేజీలో సంక్రాంతి సంబరాలు కలర్‌ఫుల్‌గా సాగాయి. జాహ్నవి కాలేజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగోలి పోటీల్లో విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్ధులు వివిధ రకాల ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి - సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నేటి తరం విద్యార్ధులకు ఈ పండుగపై అవగాహన కల్పించడానికే రంగోలి పోటీలు నిర్వహించినట్టు కళాశాల యాజమాన్యం తెలిపింది. ముగ్గుల పోటీల్లో విజేతలైన విద్యార్ధినులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కోట రమేష్‌ను కళాశాల కరస్పాండెంట్‌ పరమేశ్వర్‌ ఘనంగా సత్కరించారు.

17:42 - January 11, 2017

హైదరాబాద్‌ :కర్మన్‌ఘాట్‌లో పేలుడు కలకలం చెలరేగింది. సాయిరామ్‌నగర్‌ కాలనీలోని పరశురాంరెడ్డి అనే ఆయిల్‌ వ్యాపారి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫర్నీచర్‌ ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. గ్యాస్‌ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు.

17:29 - January 11, 2017

హైదరాబాద్: లాభాలు లేని రూట్లలో బస్సులు నడపకుండా, లాభాలు వచ్చే ఆంధ్రా నాయకులు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ...పర్మిషన్ ఉన్నది కాంటాక్ట్ క్యారేజీ పర్మిషన్ అయితే.. స్టేజ్ క్యారేజ్ తో బస్సులను నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ బస్సుల వారు ఉన్న టిక్కెట్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. హైవేలపై బస్సులను చెక్ చేయాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. ఎక్కడైనా టిక్కెట్లను అధిక ధరకు అమ్ముతుంటే ఒక పోన్ చేయాలని ప్రయాణీకులకు సూచించారు. పండుగ సందర్భంగా 800 ఏపికి బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ఎండీని కోరినట్లు తెలిపారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీఏ చర్యలు తీసుకోవాలన్నారు.

సుప్రీంలో మోడీకి ఊరట..

ఢిల్లీ : సుప్రీంకోర్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. సహారా డైరీల కేసులో మోడీపై విచారణ జరపాలంటూ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. సహారా డైరీలను సాక్ష్యాలుగా పరిగణించలేమని పేర్కొంది.

ఎంపీ సుమన్ పై జీవన్ రెడ్డి ఫైర్..

పెద్దపల్లి : ఎంపీ సుమన్ పై టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై వాస్తవాలను సుమన్ వక్రీకరిస్తున్నారని, సుమన్ విద్యార్థి నాయకుడిగా ఎదిగి అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు. కేజీ టు పీజీ విద్య ఏమైందో సీఎంను అడగాలని సుమన్ కు సూచించారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 241 పాయింట్లు లాభపడి 25,140వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ 92 పాయింట్లు లాభ పడి 8,380 వద్ద ముగిసింది.

16:35 - January 11, 2017

హైదరాబాద్: హెచ్ సీఏ (హైదరాబాద్ క్రికెట్ సంఘం) ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ తెలిపింది. హెచ్‌సీఏ ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం హెచ్‌సీఏ ఎన్నికలు ఆపేందుకు నిరాకరించింది. ఈ నెల 17న జరగాల్సిన ఎన్నికలు యధాతదంగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. కానీ ఫలితాలు మాత్రం వెంటనే ప్రకటించినవద్దని ఆదేశాలు జారీ చేసింది.

దేశ ఆర్థిక వృద్ధి రేటును తగ్గించిన వరల్డ్ బ్యాంక్..

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును 7 శాతానికి వరల్డ్ బ్యాంక్ తగ్గించింది. ఆర్థికాభివృద్ధిపైన నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపిస్తోందని బ్యాంక్ పేర్కొంది.

16:28 - January 11, 2017

హైదరాబాద్: వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ వైసీపిని ఓఎల్ ఎక్స్ లో పెట్టక తప్పదని, ఆ పార్టీ నేత జగన్ ను అవినీతి కేసులో ఈడీ వదలదని టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన మీడియాతో ఆమట్లాడుతూ.. చేసిన తప్పులకు ఎన్ని గుడులకు వెళ్లినా నీ పాపం ప్రక్షాళన కాదని ఎద్దేవా చేశాడు. ఏ గుడికి వెళ్లినా నీగుండె మీద చెయ్యి వేసుకుని నిజాల్ని చెప్పాలని కోరారు. ముచ్చిమొర్రు ప్రాజెక్టు ప్రారంభించినా, పులివెందులకు నీరు అందించినా సీఎం చంద్రబాబు కృషి కనపడుతుందన్నారు. కరువును చూసిన రాయలసీమ వాసులకు నీరుని చూసి ఆనందభాష్పాలు వస్తున్నాయన్నారు. దాన్ని సహించలేని జగన్ ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు.

16:07 - January 11, 2017

నల్లగొండ : జిల్లాలో దారుణం జరిగింది. నందకుమార్‌ అనే వ్యక్తి ఆరుగురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పిడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన టీచర్లు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు నందకుమార్‌ను చితకబాదారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థినులు గిరకబావిగూడెం సుందరయ్య కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.

16:04 - January 11, 2017

హైదరాబాద్ : న్యూగ్రిడ్‌ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్‌ను ఇచ్చిపుచ్చుకునేందుకు అనువైన లైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ప్రగతిభవన్‌లో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఉత్తరాద్రి రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యమవుతుందన్నారు.

వార్ధా-డిచ్‌పల్లి లైన్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి....

ఇక ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ తెచ్చుకునేందుకు అవసరమైన వార్ధా-డిచ్‌పల్లి లైన్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అయితే.. ఈ లైన్‌ను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 4500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 765 కేవీ డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకోవచ్చని కేసీఆర్‌ తెలిపారు. అదేవిధంగా వరంగల్‌-వరోరా లైన్‌ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ రెండు లైన్లు పూర్తయితే... న్యూగ్రిడ్‌, సదరన్‌ గ్రిడ్‌ మధ్య విద్యుత్‌ ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యం కానుందని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణలోని ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు పీజీసీఐఎల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో.. విద్యుత్‌ శాఖ అధికారులు చర్చలు జరపాలని కేసీఆర్‌ సూచించారు.

హెచ్ సీఏ ఎన్నికలకు కోర్టు పచ్చజెండా..

హైదరాబాద్ : క్రికెట్ సంఘం ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 17న జరగాల్సిన ఎన్నికలు యధాతదంగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. కానీ ఫలితాలు మాత్రం వెంటనే ప్రకటించినవద్దని ఆదేశాలు జారీ చేసింది.

15:58 - January 11, 2017

హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిచారిత్రక నేపథ్యంలో తెరకెక్కించి గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ- శ్రేయ జంటగా, డైరెక్టర్ క్రిష్ తో చిట్ చాట్. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

15:55 - January 11, 2017

కడప : భవిష్యత్ లో పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. . పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు నాయుడికి చప్పట్లు అవసరం లేదని, 2019 వరకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేస్తే కృష్ణా నీళ్లు కాదు..గోదావరి నీళ్లు వస్తాయన్నారు. కన్న కలలు సాకారం కావాలంటే సపోర్టు చేయాల్సిందేనన్నారు. రెడ్ల కులం అధిపత్యంపై కూడా ఆయన మాట్లాడారు. కులం..వర్గం ఇవేమి పెట్టుకోవద్దని..బాబుకు సమస్యలు పెట్టే వారు ఎవరూ లేరని ఎంపీ జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

 

15:51 - January 11, 2017

కడప : భవిష్యత్ లో పులివెందులలో టిడిపి అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేయాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల ప్రజలకు పిలుపునిచ్చారు. . పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు నాయుడికి చప్పట్లు అవసరం లేదని, 2019 వరకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని మళ్లా ముఖ్యమంత్రిని చేస్తే కృష్ణా నీళ్లు కాదు..గోదావరి నీళ్లు వస్తాయన్నారు. కన్న కలలు సాకారం కావాలంటే సపోర్టు చేయాల్సిందేనన్నారు. రెడ్ల కులం అధిపత్యంపై కూడా ఆయన మాట్లాడారు. కులం..వర్గం ఇవేమి పెట్టుకోవద్దని..బాబుకు సమస్యలు పెట్టే వారు ఎవరూ లేరని ఎంపీ జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

15:40 - January 11, 2017

కడప : 'నీ ఇంటికి వస్తా..నీ నట్టింటికి వస్తా' అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అదే డైలాగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పలికితే ఎలా ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ఎంపీ జేసీ తనదైన శైలిలో విమర్శలు..ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ జేసీ మాట్లాడుతూ..సీఎం బాబు చొరవతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'బూట్లు నాకే వ్యక్తి అని అయితే ఎప్పుడూ మంత్రిగా ఉండేవాడిని..మా ఇంట..వంట..సారాయి తాగే అలవాటు లేదు..నాలుక చీరుస్తావా..అంత మొగడివా..నీ ఇంటికి వస్తా..పులివెందులకు వస్తా' అంటూ డైలాగ్స్ పలికారు. 1981లో మొట్టమొదటిసారిగా తాడిపత్రికి పిలిపించి రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

15:40 - January 11, 2017

కడప : పైడిపాలెం ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు సాక్షిగా దివంగత రాజశేఖరరెడ్డిని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పొగిడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ శంకుస్థాపన చేసి, 650 కోట్లతో పనుల్ని ఇంచుమించు పూర్తిచేశారు. మిగిలిన పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయడంతో రాజశేఖరరెడ్డి కల నెరవేరిందని అన్నారు. అలాగే 2012-13 శనగపంట బీమా గురించి చాలా సార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. అలాగే ఎస్సీఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. వెంటనే సీఎం కల్పించుకుని, దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో ఎస్సీఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని వెంటనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

జగన్ పై ఎంపీ జేసీ ఘాటు వ్యాఖ్యలు..

కడప : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్ష పార్టీపై పలు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత జగన్ నుద్ధేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సుందరయ్య కాలనీలో దారుణం..

నల్గొండ : గిరకబావిగూడెం సుందరయ్య కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరుగురు చిన్నారులపై నందకుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

14:57 - January 11, 2017

హైదరాబాద్ : ముంబాయి చెందిన సాజిద్‌ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి వచ్చి పనిచేసుకునేవాడు..ఈ క్రమంలోనే ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన సాజిద్‌ ఆ తర్వాత మోసాలు చేయడం మొదలుపెట్టాడు... 2004లో నకిలీ వీసాలు ...పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో నకిలీ వీసాలు సృష్టించి తాను దుబాయి చెందినవాడిగా పరిచయం చేసుకుని వీసాలు ఇస్తూ మోసాలకు పాల్పడ్డాడు...సాజిద్ చీటింగ్ బయటపడ్డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు....

2012లో మరో కొత్త వేషం..

ఇక సాజిద్ మరో వేషం కట్టాడు...తనకు తంత్రాలు వస్తాయని నమ్మించి బ్లాక్‌ మేజిక్ పేరుతో ఇంట్లో శని ఉందని... సైతాన్‌ ను పంపిస్తానంటూ మోసాలు చేయడం మొదలుపెట్టాడు..మూఢనమ్మకాల్లో ఉన్నవారిని మరింతగా భయపెట్టి దండుకునేవాడు..ఇలా సాజిద్ వేషం ఎన్నో రోజులు లేదు... అప్పట్లోనే టప్పాచబుత్ర, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు...

సరికొత్త ఆలోచనలతో బయటకు...

రెండు,మూడు సార్లు జైలుకు వెళ్లొచ్చిన సాజిద్‌ బయటకు వచ్చిన ప్రతీ సారి కొత్త ఆలోచనతో వస్తున్నాడు..ఈసారి ఏకంగా వైద్యులను టార్గెట్ చేసుకున్నాడు..తనకు తాను నాందేడ్ చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ నంటూ ఫోన్ చేసి మీ వైద్యం వల్ల ఓ మనిషి చనిపోయాడంటూ టార్గెట్ చేసిన డాక్టర్‌కు ఫోన్ చేసి సెటిల్ చేస్తాడు...అకౌంట్ నంబర్ చెప్పి డబ్బులు జమ చేయించుకుంటాడు...సాజిద్ ఎలా మోసం చేస్తాడో పోలీసుల సమక్షంలోనే జరిగింది....ఇలా ఎందరో వైద్యులను నమ్మించి మోసం చేసిన సాజిద్‌పై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి పట్టుకున్నారు...ఫోన్లలోనే మాట్లాడుతూ రకరకాలుగా మోసాలు చేసే సాజిద్‌ లాంటివారెందరో ఉన్నారు..తస్మాత్ జాగ్రత్తా...

14:54 - January 11, 2017

జగిత్యాల : కొడిమ్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండ గుట్ట వద్ద బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతులు కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన వారుగా గుర్తించారు. భూమి రిజస్ట్రేషన్ నిమిత్తం వేములవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

14:51 - January 11, 2017

ఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్‌ గీతేను తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, జోగురామన్న కలిశారు. ఈసందర్భంగా ఆదిలాబాద్‌ లో మూతబడిన సిమెంట్‌ పరిశ్రమను తెరిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. కొత్త పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని ఈ సిమెంట్‌ పరిశ్రమకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాఉందని కేంద్రమంత్రి దృష్టికితెచ్చారు.. అనంత్‌ గీతే సానుకూలంగా స్పందించారని కేటీఆర్‌ తెలిపారు..

అడుసుమల్లిలో మా ఊరు గ్రామ సభ రసాభాస..

ప్రకాశం : పర్చూరు (మం) అడుసుమల్లిలో జన్మభూమి మా ఊరు గ్రామ సభ రసాభాసగా మారింది. తాగునీటి విషయంలో టిడిపి నేతల మధ్య ఘర్షణ చెలరేగింది.

రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా - బాబు..

కడప : పులివెందుల బ్రాంచి కెనాల్ కు సీఎం చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. పైడిపాలెం ప్రాజెక్టు వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు. గండికోట ద్వారా 26 టీఎంసీల నీరు సరఫరా చేయవచ్చని, గండికోటను త్వరగా పూర్తి చేయాలని ఇక్కడే నిద్రపోయాయన్నారు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని, తాను సీఎం అయ్యాక తాగునీటి ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని నీటి భద్రత రాఊంగా తీర్చిదిద్దుతామని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నట్లు తెలిపారు. పోలవరం ను 2019 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.

14:38 - January 11, 2017

భర్త పనిచేయడం లేదు..కుటుంబ పోషణ భారంగా మారింది..డబ్బు లేదు..అత్తారింటికి రానివ్వడం లేదు..దీనితో ఆ ఇళ్లాలు ఉద్యోగం చేస్తోంది..సంసార భారాన్ని మోస్తోంది. అయినా ఆ కట్న పిశాచులు వదలలేదు. డబ్బు కావాలంటూ వేధిస్తున్నారు. భర్తను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటనీ అత్తారింటికి వెళితే..వాళ్లు ఏం చేశారు ? విజయవాడకు చెందిన పద్మకు శిఖామణి ప్రాంతానికి చెందిన సందీప్ తో మూడేళ్ల కింద వివాహం జరిగింది. మరి వీరి కాపురం ఇలా ఎందుకు అయ్యింది. కారణం ఎవరు ? తదితర వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

ముగిసిన ఏపీ ప్రీ బడ్జెట్ సమావేశాలు..

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆర్థిక వేత్తలతో ఆర్థిక మంత్రి యనమల సమావేశమయ్యారు. ఈ ఏడాది ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా సమయానుకూలంగా నిధులు విడుదల చేయడం జరిగిందని, వెనుకబడదిన జిల్లాల్లో కొందరు కలెక్టర్లు నిధులు ఖర్చు చేయలేదన్నారు. 15 శాతం వృద్ధి రేటు కోసం కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెంట్ లో కొంత బలహీనంగా ఉన్నామన్నారు. రూ. 1200 వేల కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

14:25 - January 11, 2017

కడప : కృష్ణ జలధార పులివెందులకు ప్రాణాధారం అవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు క‌డ‌ప‌ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌.. జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుద‌ల చేసిన అనంత‌రం మాట్లాడారు. 2018కి గ్రావిటీతో నీరు ఇవ్వాలని సంకల్పించానని ఈ ఏడాది కృష్ణా కి నీరు రాలేదని... గోదావరి నుంచి 500 టీఎంసీల నీటిని తెచ్చుకోగలగితే రాయలసీమ రతనాల సీమే అవుతుందన్నారు. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ‌గా మార్చ‌డ‌మే త‌న‌ ధ్యేయమ‌ని నాయుడు అన్నారు. రాయ‌ల‌సీమ‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వేగంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. పోల‌వ‌రం ముంపున‌కు గుర‌య్యే ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌ల‌పాల‌ని అడిగాన‌ని, లేదంటే తాను ప్ర‌మాణ స్వీకారం చేయ‌నని, త‌న‌కి ఈ ప‌ద‌వి అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వంతో అన్నాన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చివ‌రికి ఆ ఏడుమండ‌లాలను ఏపీలో క‌లిపార‌ని, లేదంటే ఇప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ముందుకు సాగక‌పోయేవ‌ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరవు అనే సమస్యే ఉండబోదని చెప్పారు. కరువు రహిత రాష్ట్రంగా చేయాలని సకల్పించినట్లు స్పష్టం చేశారు. నీరందని సమయంలో రైతన్నలు నిరాశపడకుండా ప్రత్యామ్నాయ పంటలకు వారిని ప్రోత్సహించారు. ఇప్పుడు పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా 41 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌, జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, ముఖ్య అధికారులు తదితరులు హాజరయ్యారు. కాగా పులివెందుల ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడంతో మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి చేపట్టిన జలదీక్షను విరమించారు.

అశోక్ గజపతి రాజుతో కేటీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై విమానయాన శాఖతో టి.సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

కలిసి ఉండాలి - ములాయం..

లక్నో : వివాదాల్లోకి వెళ్లవద్దని...అందరూ కలిసి ఉండాలని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. లక్నోలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు శివపాల్ సింగ్ యాదవ్ కూడా ఉన్నారు.

పెద్ద నోట్లు..ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం - మన్మోహన్ సింగ్..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్ లో మంరిత గడ్డుకాలం రానుందని పేర్కొన్నారు.

 

13:53 - January 11, 2017

పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని లాయర్ పార్వతి తెలిపారు. 'పేదలకు ఉచిత న్యాయసహాయం' అనే అంశంపై మానవి మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమో పాల్గొని, మాట్లాడారు. ఫోన్ కాలర్స్ అడిగిన సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:52 - January 11, 2017
13:45 - January 11, 2017

మహబూబాబాద్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 87వ రోజు మహబూబాబాద్‌ జిల్లాలోని అబ్బాయిపాలెం వద్ద పాదయాత్ర 2300 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర బృందం అబ్బాయిపాలెం గ్రామం వద్ద 2300 కిలోమీటర్ల మైలురాయి వద్దకు చేరుకోగానే..గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని గాలివారిగూడెం, ఎల్లారిగూడెం, పురుషోత్తమగూడెం, తండధర్మారం, లక్ష్మాతండా, సిరోలు ఎక్స్‌రోడ్డు, రామచంద్రు దండా, రేకుల తండా, కాంపల్లి, పెరుమాళ్లసంకీత గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగుతోంది. తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టు పనులను పాదయాత్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...భక్తరామ దాసు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని తమ్మినేని ఆరోపించారు. వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి గోదావరి నీళ్లను పాలేరులోకి తీసుకురావాలని...కానీ పాలేరు నీళ్లను తీసుకొచ్చి గోదావరిలోకి కలుపుతుందని తమ్మినేని పేర్కొన్నారు.

 

13:43 - January 11, 2017

'బాక్సింగే నా ప్రపంచం..ముందు బేసిక్ నేర్చుకో..' అంటూ 'వెంకీ' డైలాగ్స్ తో కూడిన 'గురు' ట్రైలర్ విడుదలైంది. రీమెక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన 'వెంకీ' ఈసారి వైవిధ్యమైన కథతో ముందుకొస్తున్నాడు. హిందీలో ఘన విజయం సాధించిన 'సాలా ఖదూస్' కు రీమెక్. ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ లో 'రితికా సింగ్' నటిస్తోంది. సుధా కొంగర ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. ఇటీవలే టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు. 'మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు..ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి'.. అంటూ వెంకీ డైలాగ్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని జనవరి నెలలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
'వెంకటేష్' ఎంతో ఊహించుకున్న 'బాబు బంగారం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బడ్జెట్ ని రాబట్టగలిగింది కానీ ఈ చిత్రం వల్ల 'వెంకటేష్' కి ప్రత్యేకంగా ఒరిగింది మాత్రం ఏం లేదని చెప్పాలి. అందుకే 'గురు' రీమేక్ తో అయినా బాక్సాఫీసు వద్ద విక్టరీ నమోదు చేయాలని ఈ సీనియర్ స్టార్ కసిగా ఉన్నాడు. ఈ రీమేక్ తో అయిన 'వెంకీ' సోలోగా సూపర్ హిట్టు కొడుతాడో చూడాలి.

13:40 - January 11, 2017

ఢిల్లీ : చిన్నపట్టణాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోందని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రితో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని విమానయానశాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి అశోక గజపతిరాజుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్కిల్ అకాడమి స్థాపనకు విమానయానశాఖ అంగీకారం తెలిపిందని కేటీఆర్ తెలిపారు. 

 

13:37 - January 11, 2017

తూర్పుగోదావరి : కొత్తపేట జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమం ప్రారంభంకాగానే వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, టీడీపీ నేత బండారు సత్యానందరావు మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:35 - January 11, 2017

విజయనగరం : బోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. వామపక్ష, ప్రజాసంఘాల నేతల ముందస్తు అరెస్ట్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌లకు నిరసనగా ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్తులు బహిష్కరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

13:28 - January 11, 2017
13:26 - January 11, 2017
13:24 - January 11, 2017

హైదరాబాద్ : చంద్రబాబుకు గండికోటపై ఎందుకంత భయమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తిచేసి ప్రాజెక్టులను తాను పూర్తిచేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. రిజర్వాయర్‌ల వద్దకు వెళ్తుంటే ప్రజాప్రతినిధులను ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. 12ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని బాబు ప్రశ్నించారు. హంద్రనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించారని విమర్శించారు. 

 

13:22 - January 11, 2017

గుజరాత్ : వస్తు, సేవల పన్ను విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ఈవిషయంలో ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని గాంధీనగర్‌లో జరుగుతున్న ఉజ్వల గుజరాత్‌ సదస్సులో చెప్పారు. జీఎస్ టీకి సంబంధించిన చాలా సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకొస్తామన్నారు. పన్నుల సంస్కరణల్లో ఇది విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుందని అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. 

 

13:17 - January 11, 2017

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మాస్ రాజా న్యూ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓ తమిళ సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. రవితేజ ప్లాప్స్ లో ఉన్నప్పుడు సక్సెస్ అందించిన ఓ మాస్ దర్శకుడు ఈ రిమేక్ ని హ్యండిల్ చేస్తున్నాడు. మరి మాస్ రాజా రవితేజ న్యూ మూవీ విశేషాలను ఇప్పుడు చూద్దాం...
నిరాశపరిచిన బెంగాల్ టైగర్, కిక్ 
రెండేళ్ల కిందట 2015లో రవితేజ నటించిన రెండు సినిమాలు బెంగాల్ టైగర్, కిక్ లతో నిరాశపరిచాయి. బెంగాల్ టైగర్ కాస్త ఒకే అనిపించిన బడ్జెట్ తో పోలిస్తే బెంగాల్ టైగర్ ప్లాప్ కిందే లెక్క. ఇక కిక్ 2 గురించి చెప్పాల్సిన పనిలేదు. మాస్ రాజా కెరీర్ లో కిక్ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. కానీ కిక్2  మాత్రం అందుకు భిన్నంగా భారీ డిజాస్టర్ గా నిలిచిది. ఇలా రెండు సినిమాలు బెడిసికొట్టడంతో రవితేజ గత ఎడాది ఒక్క సినిమాకు సైన్ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఎడాది తరువాత ఇప్పుడు ఓ రిమేక్ లో నటించేందుకు ఒకే చెప్పాడట.
సేతుపతి రిమేక్ లో నటించేందుకు సన్నాహాలు 
రవితేజ తమిళ సూపర్ హిట్టు సేతుపతి రిమేక్ లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిమేక్ ని దర్శకుడు మలినేని గోపీచంద్ హ్యండిల్ చేయనున్నాడట. ఇంతకు ముందు ఈ దర్శకుడు రవితేజతో డాను శీను,బలుపు లాంటి సక్సెస్ పుల్ చిత్రాలు అందించాడు. రవితేజ ప్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో దర్శకుడు మలినేని గోపీచంద్ బలుపు తో మాస్ రాజాకి భారీ హిట్టు ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి అలాంటి హిట్టు కోసమే ఈ స్టార్ హీరో ఈ దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోసారి పోలీస్ ఆఫీసర్ గా 
ఈ తమిళ రిమేక్ లో మాస్ రాజా మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కిక్ ఇవ్వబోతున్నడట. విక్రమార్కుడు తరహాలో ఈ మూవీలో రవితేజ క్యారెక్టరైజైషన్ సరదాగా ఉండడంతో పాటు పవర్ పుల్ గా సాగుతోందని తెలుస్తోంది. అయితే ఇదే తమిళ సినిమాను దర్శకుడు జయంత్ పర్జానీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కొడుకు గంటా రవితేజతో సినిమా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి మాస్ రాజా సేతుపతి సినిమానే రిమేక్ చేస్తున్నాడా లేక వేరే సినిమాను రిమేక్ చేస్తున్నాడా అనేది త్వరలోనే తెలిసిపోతుంది.

 

13:13 - January 11, 2017

బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ నెల 12రిలీజ్ కానుంది సంగతి తెలిసిందే. దీంతో ఫిల్మ్ సర్కిల్స్ లో బాలయ్య నెక్ట్స్ ఏ దర్శకుడితో కమిట్ అవుతాడనే దానిపై ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. అయితే ఈ నందమూరి స్టార్ కోసం నలుగురు డైరెక్టర్స్ కథలు రెడీ చేసుకుని క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్న ఆ డైరెక్టర్స్ ఎవరో ఈ స్టోరీ చూడండి.
బాలయ్య న్యూ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర ప్రచారం 
నందమూరి నటసింహాం బాలయ్య న్యూ ప్రాజెక్ట్స్ పై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ ఖాయం కావడంతో ఈ సినియర్ స్టార్ నెక్ట్స్ ఎవరి డైరెక్షన్ లో ఎలాంటి మూవీ చేస్తాడని ఫీల్మ్ నగర్ జనాలు ఎవరి వారే ఓ అంచనాకు వస్తున్నారు. కానీ బాలయ్య డిసిషన్స్ ఎప్పుడు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిస్తోంది.
దర్శకుల జాబితాలో కృష్ణవంశీ పేరు... 
బాలయ్యతో నెక్ట్స్ మూవీ చేయబోతున్న దర్శకుల జాబితాలో కృష్ణవంశీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ దర్శకుడు నందమూరి హీరో కోసం రైతు అనే స్టోరీని రెడీ చేసి లాక్ చేసినట్లు తెలుసినట్లు సమాచారం. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిన ఈ మూవీ ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమన్నట్లు వినికిడి. ఆ మధ్య బాలయ్యతో కలిసి కృష్ణవంశీ, అమితాబ్ బచ్చన్ ని కలిసి రైతులో ఓ కీ రోల్ చేయమని రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వీరి కాంబినేషన్ సంబంధించి అప్ డేట్ లేకపోవడంతో ఈ మూవీ ఆగిపోయినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఈ కాంబినేషన్ ఉంటుందా లేదా అనేది బాలయ్య కన్ ఫర్మ్ చేస్తే కానీ తెలియదు. 
ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య999 ప్లాన్ 
బాలకృష్ణ డిసిషన్ కోసం సినియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినియర్ దర్శకుడు బాలయ్యతో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య999 ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో సెట్స్ పైకి వెళ్లుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి మోక్షం దొరకడం లేదు. ఇక లేటేస్ట్ గా బాలయ్య అనుమతి కోసం ఎదురుచూస్తున్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ తో పాటు లయన్ మూవీ ఫేం సత్యదేవా కూడా ఉన్నట్లు వినికిడి. ఈ ఇద్దరు దర్శకులు ఆల్ రెడీ బాలయ్యకు స్టోరీ నేరేషన్ చేసినట్లు సమాచారం. మరి ఈ దర్శకుల్లో నందమూరి నటసింహాం అనుగ్రహం ఎవరికి దక్కుతోందో చూడాలి.

13:08 - January 11, 2017

దర్శకధీరుడు రాజమౌళి థ్యాంక్స్ వెరీ మచ్ ప్రభాస్ అంటున్నాడు. అంతేకాదు నీ నమ్మకానికి హ్యట్సాఫ్ డార్లింగ్ అంటూ యంగ్ రెబల్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నీ విలువైన సమయానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని జక్కన్న ట్వీట్ చేశాడు. ఇంతకీ రాజమౌళి ప్రభాస్ కి ఎందుకు థ్యాంక్స్ చెప్పుతున్నాడో...ఇప్పుడు చూద్దాం...
రాజమౌళి కలలకు అండగా ప్రభాస్   
ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది ఫీపుల్ సక్సెస్ ని క్యాష్ చేసకోవాలని చూస్తారు. ఓ భారీ సక్సెస్ వచ్చిన దర్శకుడు లేదా హీరో వెంట వెంటనే సినిమాలను లైన్ పెట్టి ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటు అందినకాడికి వెనకేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ ప్రభాస్ అలా ఆలోచించలేదు. రాజమౌళి కలలకు అండగా నిలిచాడు. జక్కన్న పెట్టిన కఠోర శ్రమను సంతోషంగా అనుభవించాడు.ఇంతటి సహకారం అందించాడు కనుకే రాజమౌళి, ప్రభాస్ కి థ్యాంక్స్ చెప్పుతున్నాడు. హీరోగా, దర్శకుడిపై ఉంచిన నమ్మకానికి హ్యట్సాఫ్ అంటూ ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
ప్రభాస్ మిర్చి సినిమాతో బిగేస్ట్ హిట్టు 
రెబల్ సినిమాతో డీలా పడిన ప్రభాస్ మిర్చి సినిమాతో కెరీర్ పరంగా బిగేస్ట్ హిట్టు అందుకున్నాడు. ఇలాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ వెంట వెంటనే మరో రెండు సినిమాలు చేస్తాడని అంతా ఊహించారు. కానీ ఈ అరడుగుల అందగాడు మాత్రం ప్రతిష్టాత్మకంగా రాజమౌళి మొదలెట్టిన మహాయజ్ఞం బాహుబలి కోసం ఏకంగా మూడున్నరేళ్ల పాటు బల్క డేట్స్ ఇచ్చాడు. అయితే ప్రభాస్ త్యాగం చేసిన మూడేళ్ల సమయానికి రాజమౌళి అంతకు మించిన పేరు ప్రఖ్యాతలనే బాహుబలి రూపంలో ప్రభాస్ కి బాహుమతిగా ఇచ్చాడు. ప్రభాస్ కెరీర్ లోనే తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం ఇంకా చెప్పాలంటే యావత్తు దేశసిని పరిశ్రమ ఎప్పటికి గుర్తించుకునేలా బాహుబలిని అపురూపచిత్రరాజంగా నిలబెట్టాడు.
ఏప్రిల్ 28న బాహుబలి 2.. రిలీజ్ 
బాహుబలి సెకెండ్ పార్ట్ కోసం సిని ప్రియులే కాదు అన్ని వర్గాలవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్నాళ్లకు జక్కన్న ఈ మూవీ షూటింగ్ కి ప్యాకప్ చెప్పాడు. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి ట్వీటర్ లో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. బహుబలి కోసం ఏ హీరో చేయని సాహసం ప్రభాస్‌ చేశాడు. మూడున్నర ఏళ్లు సినిమా కోసమే వెచ్చించడని, ఇందుకు నీకు హ్యట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు.ఈ మూడున్నరేళ్ల ఈ ప్రయాణం ఓ నరకం వంటిదని.ఈ  సినిమాపై నీకున్నంత నమ్మకం మరెవరికీ లేదని ప్రభాస్ పై పొగడ్తల జల్లు కురిపించాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సెకెండ్ పార్ట్ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను శరవేగంగా కంప్లీట్‌ చేసి ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని రాజమౌళి క్లారిటి ఇచ్చాడు.

ప్రజాభిప్రాయ సేకరణ బహిష్కరణ..

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణనను గ్రామస్తులు బహిష్కరించారు. వామపక్ష, ప్రజా సంఘాల నేతల ముందస్తు అరెస్టుకు నిరసనగా బహిష్కరించారు.

పైడిపాళెం ఎత్తిపోతల పథకం ప్రారంభం..

కడప : జిల్లాలోని పైడిపాళెం ఎత్తిపోతల ప‌థ‌కాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీరు విడుద‌ల చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

నోట్ల రద్దు సరైంది కాదు - రాహుల్..

ఢిల్లీ : ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం సరైంది కాదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చాలా ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యవస్థలను ప్రధాని మోడీ నాశనం చేశారని విమర్శించారు. అధికారంలోకి కాంగ్రెస్ వస్తే దేశానికి మంచి రోజులు వస్తాయని, 70 ఏళ్లుగా తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు.

అత్యవసర పిటిషన్లపై మాత్రమే విచారణ - కోర్టు..

హైదరాబాద్ : 'గౌతమిపుత్ర శాతకర్ణి' కు వినోదపు పన్ను మినహాయింపుపై లంచ్ మోషన్ పిటిషన్ కు హైకోర్టు నిరాకరించింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా అత్యవసర పిటిషన్లు మాత్రమే వింటామని కోర్టు పేర్కొంది. సెలవుల అనంతరం రెగ్యులర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. జీవో జారీలో తప్పులు జరిగితే నిర్మాత నుండి తిరిగి డబ్బులు వసూలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.

12:35 - January 11, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడారు. మోడీ నినాదాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగదు కొరత దేశ ప్రజలను ఇంకా వెంటాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై రెండో దశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
 

 

12:19 - January 11, 2017

హైదరాబాద్ : సంధ్య థియేటర్ బాస్ ఈజ్ బ్యాక్‌ నినాదాలతో మార్మోగుతుంది. అభిమానుల కోలాహలంతో థియేటర్‌ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. టపాసులు పేల్చుతూ, డప్పులు వాయిస్తూ తమ అభిమాన హీరో మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో సంధ్య ధియేటర్లో మూవీ విడుదల కాబోతుంది. డ్యాన్సంటే చిరంజీవే అని అన్నారు. చిరంజీవి.. ఇండియన్ మైకెల్ జాక్సన్ అని అభివర్ణించారు. టపాసులు కాల్చుతూ.. డప్పులు కొడుతూ బాస్ కు వెల్ కం చెబుతున్నారు. ఫ్యాన్స్ చిరంజీవిని వెల్ కం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

12:13 - January 11, 2017

ఢిల్లీ : ప్రకృతి ఎప్పుడు కన్నెర్ర చేసినా.. ఆ ప్రభావం రైతన్నల పైనే పడుతోంది. ప్రతిఏటా సంభవించే కరవు కాటకాలకు దేశవ్యాప్తంగా చిన్న రైతులే చితికి పోతున్నారు. కరవు, వర్షాభావ పరిస్థితులు అదే పనిగా అన్నదాతల పాలిట శాపంగా మారి ఉసురు తీస్తున్నాయి. 2015 ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం కరవు పీడిత ప్రాంతం మహారాష్ట్రలో అత్యధికంగా రైతులు మృతి చెందారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న కమతాల రైతులే అధికంగా ఉండటం శోచనీయం. ! 
కరవుతో రైతులు విలవిల 
గత ఏడాది క్రితం వరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరవుతో రైతులు విలవిలలాడి పోయారు. వర్షాలు లేక మరట్వాడా ప్రాంతం పూర్తిగా ఎడారిని తలపించింది. ఒక్క మహారాష్ట్రలోనే కాదు .. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న, సన్నకారు రైతులే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. 
రైతులే అధిక శాతం ఆత్మహత్యలు 
నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగిన రైతులే అధిక శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా 2015లో 72 శాతం చిన్న రైతులే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 10 హెక్టార్లు ఆపై భూమి కలిగిన రైతుల్లో ఆత్మహత్య శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కోవకు చెందిన రైతుల్లో కేవలం 2 శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015లో 8 వేల ఏడు మంది రైతులు ఉసురు తీసుకుంటే.. ఇందులో నాలుగో వంతు మధ్యతరగతి రైతులు ఉన్నారు. 2 నుంచి 10 హెక్టార్ల భూమి కలిగిన రైతులను మధ్యతరగతి రైతులుగా పరిగణిస్తారు. 
మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతం 
2010-11 వ్యవసాయ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. హెక్టార్‌ కంటే తక్కువగా భూమి ఉన్న వారిలో 67.1 శాతం ఉండగా... 1 నుంచి 2 హెక్టార్లు భూమి కలిగిన రైతులు 17.9 శాతం ఉన్నారు. అదేవిధంగా 2 నుంచి 10 హెక్టార్లు కలిగిన మధ్యతరగతి రైతులు 14.3 శాతం ఉంటే.. 10 హెక్టార్లకంటే ఎక్కువ భూమి కలిగిన మోతుబరి రైతులు 0.7 శాతం ఉన్నారు. మొత్తానికి సాగులో ఉన్న భూమి చిన్న రైతులకు అల్పంగా ఉందని గణాంకాలు చాటుతున్నాయి. ఉపాంత రైతులు సాగులో ఉన్న భూమి కేవలం 22.5 శాతం కాగా, 22.1శాతం భూమి చిన్న రైతుల చేతుల్లో సాగవుతోంది. అదే సమయంలో మధ్యతరగతి రైతుల 44.8 శాతం సాగుబడిలో ఉండగా... మోతుబరి రైతుల చేతిలో సాగవుతున్న భూమి 10.6 శాతంగా ఉంది.   
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి..
కేవలం వ్యవసాయం పైనే కాకుండా..వ్యవసాయేతర రంగాలపైనా దృష్టి పెట్టినప్పుడే రైతన్నల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భువనేశ్వర్‌కు చెందిన నవకృష్ణ చౌదరి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ సృజిత్‌ మిశ్రా  సూచించారు. అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు చితికిపోకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 
ఉపాంత రైతులు బలవన్మరణాలు
గణాంకాల ప్రకారం.. మొత్తం 2,195 అతి తక్కువ భూమి కలిగిన ఉపాంత రైతులు బలవన్మరణాలకు పాల్పడగా...వారిలో మహారాష్ట్రలో 834, ఛత్తీస్‌గడ్‌లో 354 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో ఉన్నారు. అంటే మహారాష్ట్రలో 38 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 16 శాతం ఉపాంత రైతులు బలవంతంగా ఉసురుతీసుకున్నారు.  మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న 3,618 రైతుల్లో...1,285 మంది చిన్న రైతులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే అత్యధిక శాతం అంటే.. 35.5 శాతం ఆత్యహత్యలకు పాల్పడ్డట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక కర్ణాటకలో 3,618 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే... అందులో అధికమొత్తంలో 751 మంది చిన్నరైతులే ఉండటం శోచనీయం. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న వారిలో చిన్నరైతులే 20 శాతం ఉండటం చూస్తే చిన్న రైతుల దుస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది. 2015లో మొత్తం 160 మంది 10 హెక్టార్లకు పైబడ్డ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో తెలంగాణలో అత్యధికంగా అంటే.. 79 మంది మోతుబరి రైతులున్నారు. 37 మంది రైతులతో ఛత్తీస్‌గఢ్‌ రెండోస్థానంలో నిలిచింది. 
ఆత్మహత్య చేసుకున్నవారిలో చిన్న రైతులే అధికం 
అత్యధికంగా.. 354 మధ్యతరగతి రైతుల ఆత్మహత్యలు ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకోగా.. వాటిలో చిన్న రైతులు 310 మంది చనిపోయారు. మొత్తానికి కరవు కాటకాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో చిన్న రైతులే అధికంగా ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

12:00 - January 11, 2017

హైదరాబాద్‌ : నగర కాంగ్రెస్‌ కమిటీ పదవిని సొంతం చేసుకోవడానికి నేతలు తహతహలాడుతున్నారు. ఎలాగైనా డీసీసీ పదవిని దక్కించుకోవడానికి యువనేతలు పోటీపడుతున్నారు. కొందరు పీసీసీ చీఫ్‌ను ప్రసన్నం చేసుకుంటుంటే.. మరికొందరు ఢిల్లీ లెవల్లో చక్రం తిప్పుతున్నారు.   
హైదరాబాద్‌ డీసీసీ కమిటీపై పీసీసీ కసరత్తు
హైదరాబాద్‌ డీసీసీ కమిటీపై పీసీసీ కసరత్తు చేస్తోంది. దీంతో పార్టీలోని యువనేతల చూపు డీసీసీ పదవిపై పడింది. హైదరాబాద్‌ డీసీసీని యువతకు కట్టపెట్టాలని పీసీసీ భావిస్తుండడంతో..ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ రేస్‌లో మాజీ మంత్రులు ముఖేష్‌గౌడ్‌, మర్రి శశిధర్‌రెడ్డిల వారసులు... మాజీ మేయర్‌ బండకార్తీకరెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నట్టు సమాచారం.  
డీసీసీ పదవిని కోరుతున్న విక్రమ్‌గౌడ్‌, ఆదిత్యారెడ్డి
డీసీసీ కోసం ఎవరికీ వారు.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ తనయుడు..విక్రమ్‌ గౌడ్‌ డీసీసీ పదవి తనకే ఇవ్వాలని కోరుతున్నారట...దీని కోసం ఇప్పటికే ముఖేష్‌ గౌడ్‌ పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అలాగే మాజీ ముఖ్యమంత్రి  చెన్నారెడ్డి మనవడు.. మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి కూడా హైదరాబాద్‌ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం శశిధర్‌రెడ్డి ఇప్పటికే తన హస్తిన పరిచయాలను వాడుకుంటున్నట్టు సమాచారం.
డీసీసీ పదవిపై బండ కార్తీకరెడ్డి దృష్టి
డీసీసీ కోసం మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైకమాండ్‌కు తన కోరికను విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గాంధీభవన్‌పై కూడా ఒత్తిడి తెస్తున్నారు. కాగా నగరంలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు డీసీసీ పదవిని దక్కించుకోవడానికి సీనియర్లు అంజన్‌కుమార్‌ యాదవ్‌, దానం నాగేందర్‌ సైతం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ డీసీసీ పదవికోసం సీనియర్లు.. జూనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ కుర్చీ ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

11:57 - January 11, 2017

విజయవాడ : సంక్రాంతి అంటే.. ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. ఏళ్ల తరబడి కోళ్లకు మాంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ.. కోడి పందేలకు సిద్ధం చేస్తుంటారు పందెం రాయుళ్లు. జీడిపప్పు, బాదం, పిస్తాలను లాగించి దట్టంగా తయారైన కోళ్లు బరిలో దిగి పందెం రాయుళ్లకు కాసుల పంట పండిస్తుంటాయి. ఈ  సంక్రాంతికి కూడా పందెంలో ఢీకొట్టేందుకు సిద్థంగా ఉన్నాయి పందెం కోళ్లు. కోళ్ల పందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలతో పాటు ఏపీ నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలు కోడి పందాల నిర్వహణకు సన్నాహామవుతున్నాయి. 
కోళ్లను సిద్ధం చేస్తున్న పందెం రాయుళ్లు 
సంక్రాంతి అంటే కోడి పందాలు.. కోడి పందాలంటే సంక్రాంతి అనేలా మారిపోయింది. ఈ సారి కూడా సంక్రాంతికి కోడిపందాల సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేలా ప్రతిఏటా కోళ్ల పందాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కూడా జోరుగా కోళ్ల పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు.
తెలుగునాట పందాలు 
తెలుగునాట పందాలు అంటే కోడి పుంజులదే హవా. ఎప్పటిలాగే ఈసారి కూడా కోళ్లు బరిలో కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నాయి. తనను పెంచి.. పోషించిన యజమాని పేరు నిలబెట్టాలంటే కోడి పోరు పరువు లోనే సాధ్యమన్నట్లు కాలుదువ్వేందుకు సిద్ధంగా ఉన్నాయి. పందెపు రాయుళ్లు ఇప్పటికే చెరకు, అరటి, మామిడి తోటల్లో కోడి పందాలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. మరికొందరైతే.. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ టెంట్లు వేసి మరీ కోడి పందాలు నిర్వహిస్తున్నారు.  
పందెపు కోళ్లు... లక్షల్లో కొనగోలు  
సెలవు దినాలు కావడంతో  రేంజ్‌ ఏ మాత్రం తగ్గకుండా ఖరీదైన కార్లు, బైక్ ల మీద తరలివస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున డబ్బును కూడగట్టి బరులు సిద్ధం చేస్తున్నారు. సాంప్రదాయకంగా సాగుతున్న పందెపు కోళ్లను లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి కోడి పందాలకు తెగబడుతున్నారు. 
కోళ్ల పందాలు నిర్వహణకు రంగం సిద్ధం 
విజయవాడ సమీపంలోని గన్నవరం, పెనమలూరు, కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు, దివిసీమ, నాగాయలంక, నూజివీడు,  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోళ్ల పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు, సిబ్బంది, అనుచరులు దగ్గరుండి పందెపు కోడికి కత్తులు కట్టించి బరిలో దింపేలా సన్నద్ధం అవుతున్నారు.  
బహిరంగ కోడి పందాల నిర్వహించేలా చర్యలు 
ఈ ఏడాది కొందరు ప్రజాప్రతినిధులు దగ్గరుండి బహిరంగంగానే కోడి పందాల నిర్వహించేలా చర్యలు చేపట్టారు. తమ పేరు మాత్రం బయటకు రాకుండా గోప్యత పాటిస్తూ.. కోడిపందాలకు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తోటల్లో నిర్వహించే కోడి పందాలకు సకల ఏర్పాట్లు జరుగుతున్నా.. వాటిపై ఎలాంటి దాడులు కూడా చేయడం లేదు.  కోడిపందాలపై తహసీల్దార్‌, ఎస్సై సంయక్తంగా కమిటీగా ఏర్పడి నివేదిక ఇవ్వాలని హైకోర్టు కోరగా.. ఆ రెండు శాఖలు మాత్రమే స్పందిస్తున్నాయి. 

 

కీసర టోల్ గేట్ వద్ద రద్దీ..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి.

11:50 - January 11, 2017

కడప : ఇవాళ కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పైడిపాలెం రిజర్వాయర్‌ను బాబు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ పైడిపాలెం రిజర్వాయర్ వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రిజర్వాయర్ వద్దకు వెళ్లే తనకు హక్కు ఉందని వైఎస్ అవినాష్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:47 - January 11, 2017

ఢిల్లీ : జనవరి 26 రిపబ్లిక్‌ డే సందర్భంగా ఉగ్రదాడి జరగొచ్చని ఇంటలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీచేసింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలెర్ట్‌ ప్రకటించారు. ఇటు ఇంటలిజెన్స్‌ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్‌పోర్టులు, రాష్ట్రాల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కొమరం భీమ్ జిల్లాలో హరీష్..ఇంద్రకిరణ్ పర్యటన..

కొమరం భీమ్ : జిల్లాలో మంత్రులు హరీష్..ఇంద్రకిరణ్ లు పర్యటించారు. కొమరం భీమ్ ప్రాజెక్టును మంత్రులు సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జులై చివరి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్..

ఢిల్లీ : దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఇంటిలెజెన్స్ హెచ్చరించింది.

11:36 - January 11, 2017

వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక వ్యవస్థలో వలస ఉద్యోగులు, కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని అధ్యక్షుడు ఒబామా చెప్పారు. యూఎస్ అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లపాటు పని చేసిన  ఒబామా పదవీకాలం ఈనెల 20తో పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒబామా షికాగో నుంచి  దేశ ప్రజను ఉద్దేశించిన ప్రసంగించారు. వీడ్కోలు ఉపన్యాసంలో ఒబామా తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి గురించి ప్రధానంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దిన విషయనాన్ని ప్రస్తావించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీసా విధానాన్ని పునఃసమీస్తున్న తరుణంలో వలస ఉద్యోగులు, కార్మికులు సేవలను విస్మరించరాదని గుర్తు చేశారు. 
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంలో అణచివేశా -ఒబామా 
అమెరికాలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశానని అధ్యక్షుడు ఒబామా చెప్పారు. ఈ సమస్యతో దేశం ఎదుర్కొన్న కష్టనష్టాలను తన వీడ్కోలు ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదే సమయంలో అమెరికాలో ఉంటున్న ముస్లిం పట్ల ఏ రోజు కూడా వివక్షత చూపలేదని వివరించారు. 

 

11:23 - January 11, 2017

టీఆర్ ఎస్... అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని వక్తలు విమర్శించారు. ఇవాళ్లి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీ.కాంగ్రెస్ నేత కైలాష్, బీజేపీ నేత పాదూరి కరుణ, టీఆర్ ఎస్ నేత మన్నే గోవర్థన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు.  టీసర్కార్ ప్రజలను మోసగిస్తుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గన్నెవారిపల్లిలో అగ్నిప్రమాదం..

అనంతపురం : తాడిపత్రి మండలం గన్నెవారిపల్లిలో ఓ బట్టల ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రూ. 1.5 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.

11:01 - January 11, 2017

హైదరాబాద్ : బాలయ్య 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి వివాదంలో చిక్కుకుంది. సినిమాకు వినోదపు పన్నుమినహాయింపుపై హైకోర్టులో లాయర్‌ ఆదర్శకుమార్‌ లంచ్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.  మధ్యాహ్నం పిటిషన్ విచారణకురానున్న రానుంది.బాలకృష్ణ తన బంధువు అయినందుకే నిబంధనలకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్యాక్స్‌ మినహాయింపు ప్రేక్షకులకు ఉండాలికాని.. నిర్మాతలకు కాదని ఆదర్శకుమార్ తెలిపారు. ఈ సినిమాకు వినోదపుపన్ను మినహాయింపు పరిధిలోకి.. వస్తుందో రాదో కమిటీవేసి పరిశీలించాలని పిటిషన్‌లో కోరారు.  

 

10:58 - January 11, 2017

తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైంది. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తిరుపతిలోని అన్ని థియేటర్లలో తెల్లవారుజామున షో వేశారు. సినిమా చూసిన ఫ్యాన్స్ మూవీ బ్లాక్ బ్లస్టర్ అంటున్నారు. డ్యాన్సులు, ఫైటింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడ ఇలాగే ఉన్నాయని అంటున్నారు. డ్యాన్సులు ఇరగదీశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. మెగాస్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడని అంటున్నారు. అదే డ్యాన్స్, అదే క్రేజ్ ఉందంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

10:50 - January 11, 2017

విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైంది. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లలో బెన్ ఫిట్ షో వేశారు. మరిన్ని కొన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. సినిమా చూచిన ఫ్యాన్స్ మూవీ బ్లాక్ బ్లస్టర్ అంటున్నారు. డ్యాన్సులు, ఫైటింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడ ఇలాగే ఉన్నాయి. బాస్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ రియల్ బ్యాక్... అంటున్నారు. చిరంజీవి నటన వైవిధ్యంగా ఉందన్నారు. డ్యాన్సులు అదుర్స్ అంటున్నారు. చిరంజీవి 149 సినిమాలు ఒక ఎత్తు... 150 సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. పది సం. ముందుకు ప్రస్తుతానికి ఏం తేడా లేదని.. అదే డ్యాన్స్ లు, స్టైలు అంటూ సంబరపడిపోతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాసేపట్లో గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభం..

కడప : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పైడిపాలెం గ్రామంలోని సింహాద్రిపురం మండలంలో గండికోట ఎత్తిపోతల పథకాన్ని బాబు ప్రారంభించనున్నారు. గాలేరు - నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైంది.

సీపీఎం మహాజన పాదయాత్ర 87వ రోజు..

ఖమ్మం : తిరుమలాయపాలెం (మం) ఇస్లావత్ తండాలో సీపీఎం మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. 87వ రోజు అబ్బాయిపాలెం అంబేద్కర్ విగ్రహం, గాలివారిగూడెం తండా, ఎల్లారిగూడెం క్రాస్ రోడ్, పురుషోత్తమయ్యగూడెం, తండా ధర్మారం, లక్ష్మ తండా, రాంచంద్రునాయక్ తండా, రేకుల తండా సీరోలు, కాంపెల్లి, పెరుమాండ్ల సంకీస లో పర్యటించనుంది.

కమీషన్ల కోసమే ప్రాజెక్టు రీ డిజైన్ - తమ్మినేని..

ఖమ్మం : కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అవసరం లేని చోట కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారని, 123 జీవో ద్వారా భూ నిర్వాసితలను ప్రభుత్వం దగా చేసిందన్నారు. భూ నిర్వాసితులకు మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగిందని, ఎన్నిసార్లు పోలీసులను రెచ్చగొట్టామో సూదులతో పొడిచామో వారే చెప్పాలన్నారు. ప్రాజెక్టులు..పరిశ్రమలకు సీపీఎం వ్యతిరేకం కాదన్నారు.

10:36 - January 11, 2017

గుంటూరు : మెగాస్టార్ సినిమాలోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదల సందర్భంగా తిరుపతిలోని పలు థియేటర్ల వద్ద చిరు అభిమానులు కోలాహలం చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీ ధియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో సినిమా విడుదలైంది. మెగా అభిమానులు, ప్రేక్షకులు సినిమా హాళ్లకు బయలుదేరుతున్నారు. ఏ థియేటర్ చూసినా అభిమానులతో కోలాహలంగా మారింది. 
ఫ్యాన్ అభిప్రాయాలు...
సినిమా చాలా బాగుంది. అప్పుడు ఎలా డ్యాన్స్ చేశారో..ఇప్పుడూ అలాగే చేశారు. అదే జోష్ తో ఉన్నారు. చిరంజీవి డ్యాన్స్ చేస్తుంటే.. 25 ఏళ్ల కుర్రాడు డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. 10 సం.ల తర్వాత చేసిన చిరంజీవి సినిమా హిట్ అవుతుంది.  ఎవ్వరూ చిరంజీవి ప్రభంజనం సృష్టించలేరు. 2017 కి చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి సం. మాకు ఒక చిరంజీవి సినిమా కావాలి. బెన్ ఫిట్ షోలు ఆపాలని చూశారు.. కానీ ఇండస్త్రీ రికార్డులు బద్దలు కొట్టేది చిరంజీవే. మెగాస్టార్ కు మించినవారు ఇక లేరు. చిరంజీవి పూర్తిగా సినీ ఫీల్డ్ లోకి రావాలి. 

 

10:22 - January 11, 2017

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్న ఇదే మాట.. ఇప్పుడు అందరికీ మెగా ఫీవర్ పట్టుకుంది. మరికాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 మూవీ ధియేటర్లలో సందడిచేయనుంది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో సినిమా విడుదలైంది. మెగా అభిమానులు, ప్రేక్షకులు సినిమా హాళ్లకు బయలుదేరుతున్నారు. ఏ థియేటర్ చూసినా అభిమానులతో కోలాహలంగా మారింది. ఇక ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో అయితే ఈ హడావుడి ఇంకాస్త ఎక్కువగా ఉంది. బాస్ బాస్‌ బాస్‌ బాస్‌ ఇవే అరుపులు... అదే గోల.. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి...

 

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

ఖమ్మం : దుమ్ముగూడెం మండలం రేగుబల్లిలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు రంగరాజు, సుగుణ మృతి చెందారు. మృతులు చర్చ మండలం ఆర్.కొత్తగూడెం వాసులుగా గుర్తించారు. 

09:48 - January 11, 2017

ప్రయివేట్ స్కూళ్లల్లో ఫీజుల మోత మోగుతుందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా నాగేశ్వరరావు, కోట రమేష్ అన్నారు. ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు.  'మరో మూడు నెలల్లో ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించారు. సిబిఎస్ఈ బోర్డు కూడా పరీక్షల తేదీలు ఖరారు చేసింది. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ కాలేజీల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రయివేట్ కాలేజీలలో విద్యార్థుల ఒత్తిడి పెరుగుతోంది. ప్రయివేట్ స్కూళ్లు ఎడాపెడా ఫీజులు పెంచేస్తున్నాయి. ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ లాంటి సమస్యలు వెన్నాడుతూనే వున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యా సంవత్సరం ఆరంభంలో వున్న  సమస్యలు తగ్గకపోగా, మరింత పెరిగాయి.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎస్ ఎఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై చర్చించారు. విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం మార్చి 3న చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో ఏయే అంశాలు చర్చించారు? మార్చి 3న చలో పార్లమెంట్ పిలుపునివ్వడానికి కారణం ఏమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:40 - January 11, 2017

హైదరాబాద్ : ఖైదీ నెంబర్‌ 150 సినిమా రిలీజ్‌ సందర్భంగా థియేటర్ల దగ్గర మెగా మానియా కనిసిస్తోంది. సినిమా చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ల దగ్గరకు చేరుకుంటున్నారు. నగరంలో మెగాఫ్యాన్స్‌ అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు. దాదాపు దశాబ్దం తర్వాత సిల్వర్‌స్రీన్‌పై చిరు డైనమిజాన్ని చూడ్డానికి అభిమానులు ఉత్సాహపడుతున్నారు. మూవీ సూపర్‌ డూపర్‌ హిట్టవుతుందని ప్రముఖ దర్శకుడు దిల్‌రాజు అన్నారు. కూకట్‌పల్లిలో పలు థియేటర్ల ను దిల్‌రాజు సందర్శించారు..

 

09:38 - January 11, 2017

ఢిల్లీ : కేజ్రీవాల్‌ ఢిల్లీ నుంచి పంజాబ్‌కు షిఫ్ట్‌ కానున్నారా? పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ సిఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ పేరు ప్రకటించనున్నారా? పంజాబ్‌ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కానున్నారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బాంబు పేల్చారు. మోహాలీ ఎన్నికల ప్రచార సభలో కేజ్రీవాల్‌ సిఎం అవుతారని ఆయన ప్రకటించారు. పంజాబ్‌లో ఆప్‌ హవా కొనసాగుతోందని...ఇక్కడి ప్రజలు విప్లవాత్మక మార్పు కోరుకుంటున్నారని సిసోడియా పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రజలు అవినీతి, మత్తు పదార్థాల నుంచి విముక్తి కోరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

 

09:37 - January 11, 2017

నల్లగొండ : వలిగొండలో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్కసారిగా లేచిన మంటలు ఇంటికి అంటున్నాయి. ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసమస్యలతో భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన మహిళ తన పిల్లలపై కూడా కిరోసిన్‌ పోసి నిప్పంటించుకుంది. వెంటనే తేరుకున్న భర్త పిల్లలను బయటికి లాక్కురావడంతో చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. మంటలంటుకుని తీవ్రంగా గాయపడిన వివాహిత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

09:35 - January 11, 2017

హైదరాబాద్ : దేశంలో ఎన్ పీఏ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ అన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమిలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ గుర్రం స్వారీ పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె పతకాలు అందజేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 18టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తాను గతంలో ఐపీఎస్‌గా ఉన్నప్పుడు గుర్రపుస్వారీ చేసిన రోజులను ఈ సందర్భంగా ఆమె నెమరవేసుకున్నారు. 

09:33 - January 11, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ స్పీడ్‌ పెంచారు. నాయకుల వలసలతో డీలాపడిన పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బలపడేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇతరపార్టీలనాయకులను  ఆహ్వానిస్తూనే.. మరోవైపు పార్టీకి సీనీగ్లామర్‌ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్‌.
సినీ గ్లామర్‌పై వైసీపీ దృష్టి
ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే సినీగ్లామర్‌పై వైసీపీ దృష్టిపెట్టింది. పార్టీలో కొత్తకళను తీసుకొచ్చేందుకు టాలీవుడ్‌ తారలను ఆహ్వానించేందుకు జగన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చిన సినీగ్లామర్‌..ఆ పార్టీని అధికారానికి చేరువ చేసిందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. పార్టీలో స్టార్‌ అట్రాక్షన్ బాలయ్యతోపాటు.. కొత్తగా పవన్‌ గ్లామర్‌ తోడవడంతో చంద్రబాబుకు తిరుగేలేకుండా పోయిందని వైసీపీ అభిప్రాయపడుతోంది. అందుకే తమ పార్టీలోనూ సినీ గ్లామర్‌ పెంచెందుకు వైసీపీ అధినేత జగన్‌ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దీన్లో భాగంగా  హాస్యనటి హేమతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జైసమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీచేసి ఓటమి పొందిన హేమ..తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.   
టీడీపీని సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయం
సినీ గ్లామర్‌తో దూసుకు పోతున్న టీడీపీని అదే సినీగ్లామర్‌తో ఎదుర్కోవాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీలోఉన్న రోజా, విజయ్‌చందర్‌ మినహా టాలీవుడ్‌ నటులు ఆ పార్టీకి అంటీముట్టనట్టే ఉంటున్నారు. టీడీపికి పూర్తిగా మద్ధతు తెలుపుతున్న వారిని కాకుండా.. తటస్థంగా ఉండి.. రాజకీయాలపై ఆసక్తి ఉన్న  నటులను పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసీపీ నాయకత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ పెద్దస్టార్‌ కూడా జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు వైసీపీలో ఉత్సాహంగా  ముచ్చట్లు నడుస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల వరకు సమయం ఉన్నందున ..ఇప్పటి నుంచే పార్టీకి సినీ గ్లామర్‌ అద్ది.. అధికారపార్టీకి చెక్‌పెట్టాలని జగన్‌ ప్రయత్నిస్తున్నట్టు వైసీపీనేతలు  చెప్పుకుంటున్నారు.

 

09:27 - January 11, 2017

ఢిల్లీ : కేంద్రప్రభుత్వ తీసుకొచ్చిన ఉదయ్‌ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ సంస్థల నష్టాలను జనంపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని విద్యుత్‌ రంగ నిపుణులంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో భవిష్యత్‌లో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది. 
ఉదయ్‌ పథకంపై విద్యుత్ రంగనిపుణులు పెదవి విరుపు 
ఉదయ్‌ పథకంలో చేరడంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి గట్టేక్కిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనికోసం కేంద్రప్రభుత్వంతో గతవారమే రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిప్రకారం కేంద్రం నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా డిస్కమ్‌లు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయ్‌ పథకంపై విద్యుత్ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒప్పందంతో విద్యుత్‌ సంస్థల నష్టాలు తగ్గవని స్పష్టం చేస్తున్నారు. 
డిస్కమ్‌లపై రూ.11,897 కోట్లు రుణభారం
అయితే ఉదయ్‌ పథకంలో చేరడంవల్ల ప్రస్తుతం డిస్కమ్‌లకు ఉన్న 11,897 కోట్లరూపాయల అప్పుల్లో 75శాతం అంటే 8923 కోట్లు వ‌ర‌కూ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.  దీంతో డిస్కమ్‌లపై ప్రతియేడాది 387 కోట్ల రూపాయల వడ్డీభారం తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. అయితే .. కేంద్రం చెప్పినట్టు ప్రస్తుతం ఉన్న రుణభారం రాష్ట్ర సర్కారు భరించినా.. భవిష్యత్తులో సంస్థలకు నష్టాలు రావని పాలకులు చెప్పగలరా అని విద్యుత్‌రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 
కేంద్ర రాష్ట్రప్రభుత్వాల ప్రచారంపై విమర్శలు
ఉదయ్‌ పథకంతో ఇక రాష్ట్రంలో డిస్కమ్‌లకు వెలుగులే వెలుగులు అని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న ప్రచారంపై విమర్శలు వస్తున్నాయి. పాలకులు మాటలు ఎలా ఉన్నా.. విద్యుత్‌ పంపిణీసంస్థల నష్టాలను పూడ్చడానికి ఎప్పటికపుడు చార్జీలు పెంచుకోవచ్చన్న నిబంధనతో మాత్రం వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయమని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు.
 

 

09:24 - January 11, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్ల వివరాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. కేవలం 50 రోజుల్లో పన్ను ఎగ్గొట్టిన 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో 16 వేల కోట్లు,.. యాక్టివ్‌గా లేని ఖాతాల్లో 25 వేల కోట్ల నగదు జమ కావడంతో ఐటీ శాఖతో పాటు.. ఈడీ అధికారులు ఆ లావాదేవీలపై దృష్టి సారించారు. 
బ్యాంక్‌ ఖాతాలలో 4 లక్షల కోట్లు జమ  
పెద్ద నోట్ల రద్దు తరువాత పన్ను పరిధిలో చూపని దాదాపు 3-4 లక్షల కోట్ల నగదు.. వివిధ మార్గాల్లో బ్యాంక్‌ ఖాతాలలో జమ అయినట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. నవంబర్‌ 8 తర్వాత పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేసుకునేందుకు 50 రోజుల సమయం ఇవ్వడంతో ఈ మొత్తం వివిధ మార్గాల్లో బ్యాంకు ఖాతాల్లోకి చేరిందన్నారు. 
పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు 
ఇక బ్యాంకులలో జమ అయిన నగదు వివరాలన్నింటిని ఆదాయ పన్ను శాఖకు అప్పగించిన ప్రభుత్వం.. పూర్తి వివరాలను పరిశీలించి పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. పన్ను ఎగవేతదారులను, బ్లాక్‌మనీని గుర్తించేపనిలో పడ్డారు. ఇప్పటికే అనేక వివరాల ఆధారంగా కొంతమంది నల్ల కుబేరులపై దాడులు జరుపుతుండగా.. మిగతావారిపై దృష్టి సారించబోతున్నారు. 
నోట్ల రద్దు తర్వాత.. నిద్రాణమైన ఖాతాల్లో రూ.25వేల కోట్ల డిపాజిట్‌ 
ఇక  పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 లక్షల రూపాయలు.. అంతకంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్‌ అయిన ఖాతాల సంఖ్య దాదాపు 60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా బ్యాంకుల్లో మొత్తం 7.34 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో రికార్డ్‌ స్థాయిలో 10,700 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇక సహకార బ్యాంకుల్లో కూడా 16 వేల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయ్యాయి. ఈ డిపాజిట్లపై అనేక అనుమానాలు ఉన్నాయని.. డిపాజిట్‌ వెనక రహస్యాలన్నింటిని ఐటీ శాఖ, ఈడీలకు ప్రభుత్వం అందజేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన 13 వేల కోట్ల వివరాలను కూడా ఐటీ శాఖ అధికారులకు సర్కార్‌ అందజేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. నిద్రాణమైన ఖాతాల్లో దాదాపు 25వేల కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా నవంబర్‌ 8 తర్వాత 80 వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించారు. 
జన్‌ధన్‌ ఖాతాల్లో డిపాజిట్లపై అధికారులు వివరాల సేకరణ 
ఇక ఉగ్రవాద చాయలు ఉన్న రాష్ట్రాల్లో డిపాజిట్‌ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు అందజేసినట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. రెండు నుంచి రెండున్నర లక్షల మధ్య డిపాజిట్లు జరిగిన ఖాతాల్లోని మొత్తం 42 వేల కోట్లుగా గుర్తించామన్నారు. వీటిలో కామన్‌ పాన్‌ కార్డు, ఒక్కటే మొబైల్‌ నెంబర్‌ మీద డిపాజిట్‌ అయినవి ఎక్కువగా గుర్తించామన్నారు. వీటిపై ఆదాయపు పన్ను శాఖ వివరాలు సేకరిస్తోంది. అదేవిధంగా జన్‌ధన్‌ ఖాతాల్లో జమ అయిన డిపాజిట్లపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 
బ్యాంకులలో జమ అయిన నగదుపై ప్రభుత్వం దృష్టి 
మొత్తానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో జమ అయిన నగదుపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే వివరాలన్నీ సేకరించి.. డిపాజిట్‌దారులకు నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో బ్లాక్‌మనీ వివరాలన్నీ బట్టబయలు కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. 

09:22 - January 11, 2017

హైదరాబాద్ : మెగా మానియా షురూ అయింది. కాసేపట్లో మెగాస్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. తమ అభిమాన హీరో రీఎంట్రీ మూవీ కోసం అభిమానులు ఇప్పటికే రెడీ అయిపోయారు. ఖైదీ నెంబర్ 150కి గ్రాండ్‌గా వెల్ కం చెప్పడానికి సర్వం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అర్ధరాత్రి నుంచే సినిమా హాళ్ల వద్ద అభిమానులు బారులు తీరారు. అటు ఓవర్సిస్‌లోను అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3వేల థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది ఖైదీ నెంబర్ 150. 
9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ 
2007 లో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంతో అభిమానులకు బై..బై చెప్పిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ 2017 లో ఖైదీ నెం 150 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడం , అది కూడా తమిళం లో సూపర్ హిట్  సాధించిన కత్తి చిత్రానికి రీమేక్ తో రావడంతో ఈ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు..
స్పెషల్‌ హైలెట్‌గా నిలుస్తున్న డైలాగ్స్ 
'కష్టం వస్తుందో.. కార్పొరేట్ సిస్టం వస్తుందో రమ్మను', 'పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది.. లాంటి డైలాగులు ఖైదీ నెంబర్‌ 150 మూవీలో స్పెషల్‌ హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఈ మూవీలోని అమ్మడు లెటజ్ డు కుమ్ముడు...' సాంగ్‌ విడుదలకు ముందే సూపర్ హిట్టయింది. యూ ట్యూబ్ లో ఈ పాట ఇప్పటికి కోటికి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. విడుదల చేసిన మూడు వారాల్లోనే ఇన్ని వ్యూస్ సాధించి సంచలన రికార్డు నమోదు చేసింది. 
తొలిరోజు నాన్ స్టాప్ షోలకు ప్లాన్ 
ఈ సినిమా తొలిరోజు నాన్ స్టాప్ షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఈ సినిమా తొలి రోజు ఏడు ఆటలు పడే అవకాశం వుంది. అలాగే చిత్రానికి మ్యాగ్జిమం థియేటర్ ఆక్యుపెన్సీ వుంది. దీంతో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్పై అప్పుడే ఓ అంచనాకి  వచ్చేశారు అభిమానులు. తొలి రోజు ఈ సినిమా సుమారు 18 నుంచి 20 కోట్ల రూపాయల వసూళ్ళు కొల్లగొట్టడం ఖాయమని అంచనాలు వినిపిస్తున్నాయి. 
గల్ఫ్ దేశాలకూ ఖైదీ నెంబర్‌ 150 ఫీవర్ 
చిరంజీవి రీ ఎంట్రీమూవీ ఖైదీ నెంబర్‌ 150 ఫీవర్ తెలుగురాష్ట్రాల్లోనే కాదు గల్ఫ్ దేశాలకు కూడా పాకింది. ఒమన్‌లోని మస్కట్‌లో ఉంటున్న తెలుగువారికోసం ఓ నిర్మాణసంస్థ ఆ సినిమా రిలీజ్ రోజైన జనవరి 11వ తేదీన తమ కంపెనీ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించేసింది. ఇక రియాద్‌లోని మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు జనవరి 11న సెలవు ఇచ్చేసింది. 
హైదరాబాద్‌లో 317 థియేటర్లలో విడుదల 
చిరు మూవీ హైదరాబాద్‌లో 317 థియేటర్లలో విడుదల కానుంది. ఒవర్‌సిస్‌లో 300 సినిమా హాళ్లలో రిలీజ్‌ కానుంది. అటు యూరోపియన్‌ కంట్రీస్‌లోనూ అత్యధిక థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. సినిమా హిట్‌ కావాలని తెలంగాణ, ఆంధ్ర సహా ఒవర్‌సిస్‌లో అభిమాన సంఘాలు భారీ ఎత్తున ర్యాలీలు  నిర్వహిస్తున్నారు. మరోవైపు ఖైదీ నంబర్ 150కి విశాఖలో అతి పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. 104 అడుగుల వెడల్పు.. 38 అడుగులు ఎత్తుతో.. ఫ్లెక్సీని డిజైన్ చేయించారు. వైజాగ్‌లోని విమాక్స్‌లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో పోటీపడుతున్న ఖైదీ నెంబర్‌ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఈ స్టార్ వార్‌లో ఎవరిది పైచేయో చూడాలి. 

 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టమైన పొగమంచు అలుముకుంది. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 7 రైళ్ల వేలల్లో మార్పులు చేశారు. 11 రైళ్లను రద్దు చేశారు. ఒక అంతర్జాతీయ, 5 దేశీయ విమానాలు ఆలస్యంగా నడువనున్నాయి.

టేకులపల్లి కేవోసీలో అగ్నిప్రమాదం

భద్రాద్రి : టేకులపల్లి కేవోసీలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. సేవల్ యంత్రం దగ్ధమైంది. రూ. కోటి ఆస్తి నష్టం అయింది.

 

నేడు సదర్ బరాజ్ నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్ : నేడు సదర్ బరాజ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. రూ.516,23 కోట్లతో బ్యారేజీ నిర్మాణం చేయనున్నారు. 

బోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి నేడు ప్రజాభిప్రాయ సేకరణ

విజయనగరం : నేడు బోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. 

ల్యాటరీ ద్వారా సీఆర్ డీఏ ప్లాట్ల పంపిణీ

అమరావతి : నేడు కురగుల్ల, నీరుకొండ గ్రామాల రైతులకు ల్యాటరీ ద్వారా సీఆర్ డీఏ ప్లాట్ల పంపిణీ చేయనుంది. 

 

నేటి నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలు

హైదరాబాద్ : నేటి నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 14 వరకు వారోత్సవాలు జరుగనున్నాయి. 

09:16 - January 11, 2017

చిరంజీవి..మెగాస్టార్..దశాబ్దాకాలం తరువాత ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళ సినిమా 'కత్తి' రీమెక్ ద్వారా ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలతో పాటు ఇటీవల వచ్చిన పలు కామెంట్స్ పై ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. సంవత్సరకాలంగా తాను పలు సబ్జెక్ లు వినడం జరిగిందని 'చిరు' తెలిపారు. తన నుండి ఏం కోరుకుంటారో అన్నీ చిత్రంలో ఉండాలని కోరుకున్నానని..కానీ సోషల్ ఎవర్ నెస్ లాంటి అంశం కూడా ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. 'కత్తి' సినిమా చూసిన అనంతరం తాను ఏం కోరుకున్నానో అలాంటివన్నీ అందులో ఉన్నాయన్నారు. దేశంలో..రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న 'రైతు' సమస్య ఇందులో ఉందన్నారు. ఇంత గ్యాప్ తరువాత మళ్లీ తెరమీదకు వస్తుండడంతో దర్శకులు..రచయితల్లో కొంత ఉత్కంఠ నెలకొందన్నారు. చివరకు 'కత్తి' ని రీమెక్ చేయడం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చానన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ప్రధాని మోడీని కలవనున్న అన్నాడీఎంకే నేతలు

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీని అన్నాడీఎంకే నేతలు కలవనున్నారు. జల్లికట్టుకు అనుమతించాలని కోరనున్నారు. 

 

09:09 - January 11, 2017

చిత్తూరు : 'మెగాస్టార్ 'చిరంజీవి' ఎవర్ గ్రేట్..ఆయన డ్యాన్సులు..ఫైట్లు సూపర్బ్..ఖైదీ నెంబర్ 150లో ఇరగదీశాడు. కొడుకుతో కలిసి పోటాపోటీగా నటించాడు..సినిమా చాలా బాగుంది' అంటూ అభిమానులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ప్రపంచ వ్యాప్తంగా 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలైంది. అభిమానుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులోల భాగంగా జిల్లాలోని ఓ థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకుంది. సినిమా చాలా బాగుందని తెలిపారు. తండ్రి..కొడుకులు డ్యాన్స్ లు చేశారని, చిరంజీవి యువకుడిగా నటించాడంటూ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు యాద్రాద్రిలో రాజగోపురం పనులు ప్రారంభం

యాద్రాద్రి : నేడు యాద్రాద్రిలో రాజగోపురం పనులు ప్రారంభించనున్నారు. 55 అడుగుల ఎత్తులో రాజగోపురం నిర్మాణం చేయనున్నారు. 

 

నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి పర్యటన

భద్రాద్రి : నేడు జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీశ్ రెడ్డి లు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 

Don't Miss