Activities calendar

12 January 2017

21:35 - January 12, 2017

ఢిల్లీ : సహారా గ్రూపు సంస్థల చీఫ్‌ సుబ్రతారాయ్‌ పెరోల్‌ పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవాళ రాయ్‌ కేసును విచారించిన న్యాయస్థానం ఫిబ్రవరి 6లోపు 600కోట్లు సెబీకి చెల్లించాలని తెలిపింది. ఆలోపు చెల్లించలేకపోతే జైలుకి వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం హెచ్చరించింది. ఆర్థిక మందగమనం, పెద్ద నోట్ల రద్దు వల్ల 600కోట్లు చెల్లించేందుకు సమయం పొడిగించాలని రాయ్‌ తరపు న్యాయవాది కోర్టును కోరారు. లండన్‌ బ్యాంకులో జమ అయిన 285కోట్లను సెబికి బదిలీ చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటివరకు ఏ నిందితుడికీ ఇవ్వనంత అవకాశం సుబ్రతా రాయ్‌కి ఇచ్చినట్లు న్యాయస్థానం వెల్లడించింది. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి.. డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో సుబ్రతారాయ్‌ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం గతేడాది మే నెలలో తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి పెరోల్‌ పొడిగిస్తుండటంతో బయటే ఉంటున్నారు.

21:33 - January 12, 2017

ఢిల్లీ : టాటా గ్రూప్‌ నూతన చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ పేరు దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అక్టోబరులో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత చంద్రశేఖరన్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించారు. ఇవాళ ముంబైలో జరిగిన టాటా గ్రూప్ కీలక సమావేశానికి చంద్రశేఖరన్‌ను ఆహ్వానించారు. దీంతో గ్రూప్ ఛైర్మన్‌గా దాదాపు చంద్రశేఖరన్ పేరు ఖాయమైనట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు అస్వస్థత

బీహార్ : కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో పాశ్వాన్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

21:19 - January 12, 2017

విజయవాడ : దశాబ్దాల కల సాకారమైంది. ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ శోభను సంతరించుకుంది. ఈ విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ ఘనంగా ప్రారంభమైంది. టెర్మినల్‌ పూర్తైనప్పుడే పూర్తి సంతోషం కలుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని రేకుల షెడ్‌ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు.

అనేకానేక కొత్త హంగులను...

రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయం అనేక మార్పులకు లోనైంది. అనేకానేక కొత్త హంగులను సంతరించుకుంది. దినదినాభివృద్ధి చెందుతూ వస్తోన్న గన్నవరం విమానాశ్రయంలో అత్యాధునికంగా తయారైన నూతన అంతర్జాతీయ టెర్మినల్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు , బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. రన్‌వే విస్తరణకు భూమి పూజ నిర్వహించారు.

రేకులషెడ్‌ నుంచి ఈ స్థాయికి ...

గన్నవరం ఎయిర్‌పోర్టును రేకులషెడ్‌ నుంచి ఈ స్థాయికి తీసుకువచ్చామని అన్నారు. నూతన టెర్మినల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. టెర్మినల్‌ పనులు పూర్తైనప్పుడే పూర్తి సంతోషం లభిస్తుందని చెప్పారు. పౌర విమానరంగంలో గ్రోత్‌రేట్‌ ఎక్కువగా ఉన్నందున ఉద్యోగావకాశాలు పెరుతున్నాయని చెప్పారు. జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు రావాలనేది తన కోరిక అని చంద్రబాబు అన్నారు.

రవాణా రంగం అభివృద్ధితో చాలా ప్రయోజనాలు...

రవాణా రంగం అభివృద్ధితో చాలా ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీపై నరేంద్ర మోదీకి మమకారం ఉందని, దాంతో పాటు సీఎం చంద్రబాబు సహకారం కూడా తోడైందని అన్నారు. రవాణారంగం అభివృద్ధితో పర్యాటక, వాణిజ్య విస్తరణ జరుగుతుందన్నారు. ఏపీ ఆర్దికాభివృద్ధికి తొలి పునాది పోలవరం ప్రాజెక్టు అయితే.. రెండోది గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ అని వ్యాఖ్యానించారు.

అమరావతి విమానాశ్రయంగా నామకరణం....

గన్నవరం విమానాశ్రయానికి అమరావతి విమానాశ్రయంగా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు నామకరణం చేశారు. ఏపీలో విమానయాన రంగం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. విమానయానం అంటే కేవలం ప్రజా రవాణా మాత్రమే కాదని, కార్గో రవాణా కూడా అని ఆయన అన్నారు. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్‌ ప్రారంభంతో విదేశాలకు సర్వీసులు నడిపేందుకు కూడా సుగమమైంది.

కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మె తాత్కాలిక విరమణ

హైదరాబాద్: కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ సమ్మెను తాత్కాలిక విరమణ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల యాజమాన్యంతో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి చర్చలు జరిపారు. సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరింస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు లెక్చరర్లు స్పష్టం చేశారు.

నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం..

హైదరాబాద్: పీపుల్స్‌ప్లాజాలో అంతర్జాతీయ రాత్రి పతంగుల పండుగ ప్రారంభమైంది. పర్యాటకశాఖ, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పతంగుల పండుగ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ పతంగుల పండుగను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించారు. పతంగుల పండుగలో 15 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వేడుకల్లో 70 మంది విదేశీయులు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు. సింగాపూర్ నిపుణుల పర్యవేక్షణలో రాత్రి పతంగుల పండుగ జరుగుతోంది.

ఎయిరిండియా విమానాల్లో మహిళలకు 6 సీట్లు రిజర్వ్

ఢిల్లీ: ఎయిరిండియా విమానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. ఎయిరిండియా విమానాల్లో మహిళలకు 6 సీట్లు రిజర్వ్ చేసింది.

'గౌతమిపుత్ర' సినిమా చూస్తోన్న పురంద్రేశ్వరి దంపతులు

ప్రకాశం: చీరాల సురేష్ థియేటర్ లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు మాజీ ఎంపి దగ్గుబాటి పురంద్రేశ్వరి దంపతులు, బాలకృష్ణ సోదరుడు జైకృష్ణ కుటుంబం వచ్చింది.

20:15 - January 12, 2017

హైదరాబాద్: పార్టీలు మారంగనే మాటలు మారతయ్..ముఖ్యమంత్రి సాక్షిగా జేసీ వార్నింగ్ లు, షాద్ నగర్ సర్కార్ బడి మొత్తం సత్తెనాస్... చదువు చెప్పమంటే తిట్టుకుంటున్న సార్లు, ఫ్లెక్సీల వనం అయిపోయిన నారాయణ ఖేడ్... నెలల కమాన్ అవుతున్న హోర్డింగ్ లు, విరంజేసి అమ్ముతున్న మద్య కోర్టర్లు... అడిగినందుకు పగలగొట్టిండ్రు కస్టమర్ నెత్తి, జన్మభూమి రుణం తీర్చుకున్న చంద్రాలు....సభలో రంజుమీదున్న పాటలు, డ్యాన్సులు, ముళ్ల చెప్పుల మీద చెంచుల చమత్కారం...చెప్పినోళ్లంతా చెయ్యాలే వీళ్లకు సత్కారం ఇలాంటి అంశాతో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ నేటి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమం కొనసాగింది. ఆ ముచ్చట్లు ఏంటో మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

బిజెపిని సంక్రాంతి విందుకు ఆహ్వానించిన సీఎం నితీశ్

బీహార్: మకర సంక్రాంతి విందుకు బిజెపి నేతలకు సీఎం నితీశ్ కుమార్ ఆహ్వానించారు. ఆదివారం నాడు సీఎం నితీశ్ కుమార్ విందు ఇవ్వనున్నారు. నితీశ్ కుమార్ ఆహ్వానంపై ఢిల్లీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీహార్ బిజెపి నేతలు స్పష్టం చేశారు. విందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ హాజరు కానున్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చూస్తున్న చంద్రబాబు

విజయవాడ: ట్రెండ్ సెట్ థియేటర్ లో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వీక్షిస్తున్నారు. బాలకృష్ణ, క్రిష్, శ్రియతో కలిసి చంద్రబాబు నాయుడు సినిమా చూస్తున్నారు.

టాటాసన్స్ ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్

ముంబై: టాటాసన్స్ బోర్డు కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. 1987 నుంచి టీసీఎస్ లో చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. 2009 నుంచి టీసీఎస్ సీఈవోగా పనిచేస్తున్నారు.

'సహారా'సుబ్రతా రాయ్ కు సుప్రీంవార్నింగ్

హైదరాబాద్: సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీ లోపల రూ. 600 కోట్లను సెబీ-సహారా అకౌంట్ లో జమ చేయాలని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ రంజన్ గొగోయ్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

19:36 - January 12, 2017

హైదరాబాద్: నటసింహం బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. అస్సలు తెలుగు జాతి ఉన్నతిలో గౌతమి, శాతకర్ణి పాత్రలు ఎంత వరకు ఉన్నాయి. సినిమాలో చూపించిన సన్నివేశాలు నిజమేనా? కల్పితమా?, గౌతమీ పుత్ర తెలుగువాడేనా? తెలుగు జాతికి పాల్పడ్డాడా? దర్శకుడు క్రిష్ చేసిన ప్రయత్నం అభినందనీయమేనా? ఈ అంశంపై 'హెడ్ లైన్' షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ చారిత్రక విశ్లేషకులు ఎంఎస్ ఆర్ మూర్తి, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

పేట్ బషీరాబాద్ లో ఓ వ్యక్తి హత్య

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

మేడ్చల్ : పేట్ బషీరాబాద్ లోని పద్మరావు నగర్ లో చక్రవర్తి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఓ రియల్టర్ పై కాల్పుల కేసులో చక్రవర్తి నిందితుడుగా ఉన్నాడు.

19:08 - January 12, 2017

కృష్ణా : సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. 10టీవీ, విజయక్రాంతి జూనియర్‌ కాలేజీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో పాటు చుట్టు పక్క గ్రామాల మహిళలు సైతం ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. చివరగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముగ్గుల పోటీలకు సంబందించి మరిన్ని వివరాలు మా విజయవాడ డిఫ్యూటీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ జయరాజ్‌ అందిస్తారు.

19:06 - January 12, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులు కొత్త శోభను తీసుకొస్తున్నాయి. డూడూ బసవన్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. హరిదాసు కీర్తనలు అలరిస్తున్నాయి. తప్పెటగుళ్లు, కర్రసాము, పులివేషాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సంక్రాంతి పిండివంటకాలతో తెలుగు లోగిళ్లు..ఘుమఘుమలాడుతున్నాయి.

సంబరాన్ని అంటుతోన్న సంబరాలు...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏ పల్లె చూసినా..సంక్రాంతి శోభతో అలరిస్తున్నాయి. పండగ సమయంలోనే కనపడే హరిదాసులు పల్లెల్లో సందడి చేస్తున్నారు. దీంతో సంక్రాంతి శోభతో ప్రతి ఇళ్లూ కళకళలాడుతోంది. ఇంటిముందు రంగవల్లులు ఇంద్రధనస్సులను తలపిస్తున్నాయి. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పంట చేతికి వచ్చిన సమయం కావడంతో రైతన్నలు ఆనందంతో పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక పిండి వంటలతో తెలుగు వాకిళ్లు ఘుమఘుమలాడాయి.

ఉభయగోదావరి జిల్లాల్లో ..

సంక్రాంతి పండుగకు పుట్టినిల్లైన ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నారు. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు రకాల ఆటల పోటీలు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలు హైలెట్‌గా నిలుస్తున్నాయి.

ప్రకాశం జిల్లాలో....

ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి పండుగ సంబరాలు మిన్నంటాయి. హరిదాసు వేశాలతో, సాంప్రదాయ వస్త్రవేశధారణతో భోగిమంటల నడుమ చిన్నారులు సందడి చేశారు. ఆర్కిడ్స్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందంగా ఆడిపాడారు. పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ముగ్గులపోటీలు ఆకట్టుకున్నాయి. సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయాలన్ని ఉద్దేశ్యంతోనే గ్రామాల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు అన్నారు.

రాయలసీమ ప్రాంతంలోనూ....

ఇటు రాయలసీమ ప్రాంతంలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హిందూపురం ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇటు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో కోరమండల్‌ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హైస్కూలు ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు హైలెట్‌గా నిలిచాయి. విజేతలకు కోరమండల్ వారు బహుమతులను ప్రధానం చేశారు.

తెలంగాణలోనూ...

ఇటు తెలంగాణలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో శ్రీ భగవతి డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున విద్యార్థులు ముగ్గులపోటీల్లో పాల్గొన్నారు. వీటితో పాటు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు అబ్బురపరిచాయి. ఇక కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాలు కనువిందు చేశాయి. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. స్థానిక గాంధీనగర్‌ పార్క్‌లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. ఇటు రాజధాని హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌ డివిజన్‌ పరిధిలో స్ధానిక కార్పొరేటర్‌ తీగల సునీతారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందచేశారు.

కోడిపందాలు, ఎండ్ల పందాలు.....

మరోవైపు సంక్రాంతి పండుగ నాడు కోడిపందాలు, ఎండ్ల పందాలు నిర్వహించనిదే పండగ పూర్తికాదు. ఇప్పటికే కోడి పందాల్ని నిర్వహించేందుకు పోటీదారులు బరులను సిద్ధం చేసి ఉంచారు. కోడి పందేలపై హైకోర్టు నిషేదం విధించగా..ఆ నిషేదాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో పందేలాను అడ్డుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నా..పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పందెం రాయుళ్లు పందేల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

19:02 - January 12, 2017

అమరావతి : ఏపీలో సంక్రాంతి సంబరాల కోసం కోటి రూపాయల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మంత్రులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులంతా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. మంత్రి పరిటాల సునీత మహిళలతో కలిసి ముగ్గులు, వంటల పోటీల్లో పాల్గొన్నారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఎద్దుల బండిని స్వయంగా నడిపారు. ముగ్గులను కూడా పెట్టి, హరిదాసులతో పాటు ఆట పాటల్లో పాల్గొన్నారు.

19:00 - January 12, 2017

విజయవాడ : అమరావతిలో ఎన్టీఆర్‌ మ్యూజియం ఏర్పాటుకు నారా లోకేష్‌ బ్రహ్మాణిలు నిర్ణయించారు. అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలో ఎన్టీఆర్‌ ప్రస్థానాన్ని వివరించేలా ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్‌ సేవలను రేపటి తరాలకు అందించడమే లక్ష్యంగా మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

 

18:59 - January 12, 2017

నెల్లూరు :ఆత్మకూరులో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ప్రోటోకాల్‌ వివాదం చెలరేగింది. వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, టీడీపీనేత ఆనం రామనారాయణరెడ్డి మధ్య ఈ వివాదం తలెత్తింది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పేరులేదని వైసీపీ నేతలు ఆరోపించారు. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరును ఎలా చేర్చారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న స్థానిక ఎమ్మెల్యేను అవమానించేలా అధికారులు ప్రవర్తించారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు వైసీపీ నేతలు తెలిపారు.

18:55 - January 12, 2017

హైదరాబాద్: అస్ట్రియో, రూమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? దానికి హోమియో పతి లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? హోమియో కేర్ ఇంటర్నేషనల్ ను డా.సబిత సలహాలు సూచనలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

18:43 - January 12, 2017

శతచిత్ర నటుడు బాలకృష్ణ వందో చిత్రంగా రూపకల్పన చేసిన చారిత్రక కథనం గౌతమీపుత్ర శాతకర్ణి. ఒక తెలుగు యుద్ధయోధుని రాజసానికి, శాంతికి, అఖండభారత ఆకాంక్షకు మూలాలను గుదిగుచ్చి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లోతైన పరిశోధన, సమయోచితమైన,ధీరోదాత్త పాత్రల ఆపాదనతో తీసిన ఈ చిత్రం లో నటీనటులే కాకుండా ప్రతిఫ్రేము వెనుక దర్శకుడు క్రిష్ తపన కూడా కనిపిస్తుంది. హిస్టారిక్ యాక్షన్ డ్రామా తో వచ్చిన ఈ సినిమా కేవలం బాలకృష్ణ అభిమానులకే కాకుండా సినిమా ప్రియులందరికీ కూడా సంక్రాంతి సంబరాన్ని, సందడిని ముందస్తుగానే మోసుకొచ్చేసింది.

కథ విషయానికొస్తే....

ఈ సినిమాలో కథ విషయానికొస్తే ... ముక్కలు ముక్కలుగా, చీలికలు, పేలికలుగా చిన్నాచితక రాజ్యాలతో నిరంతరం యుద్ధాలతో సతమతమవుతుంటుంది భారత దేశం. దేశాన్నంతటినీ ఏకతాటిపైకి తేవాలనుకుంటాడు శాతకర్ణి. అప్పుడే శాంతిని సాధించడం సాధ్యమవుతుందని బాల్యంలోనే కలగంటాడు . దానిని నెరవేర్చుకునేందుకు రణం అనే యుద్ధతంత్రంతో శరణమన్న వాడిని సామంతుడిని చేసుకుంటూ జైత్రయాత్ర సాగిస్తాడు. 32 రాజ్యాలను జయించి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. అతని యుద్ధ పిపాసకు, రాజ్యకాంక్షకు తద్వారా సాధించే సుస్థిర శాంతికి తల్లి గౌతమి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశంలో అత్యధిక భాగాన్ని జయించిన తర్వాత విదేశీయులైన యవనుల నుంచి వచ్చే దురాక్రమణ శాతకర్ణికి సవాల్ గా నిలుస్తుంది. దాదాపు తన సైన్యానికి మూడు రెట్లు ఉన్న ఆ విదేశీ మూకలను ఎలా ఎదుర్కొన్నాడు? వారిని తరిమి కొట్టడం ద్వారా దేశ ఖ్యాతిని ఎలా నిలిపాడు అన్నదే క్లైమాక్స్. రాజనీతి, రణనీతి, బీభత్స , భయానక యుద్ధ సన్నివేశాలు, మాతృప్రేమ , కపట మాయోపాయాలు ... కథలో అంతర్భాగంగా సాగిపోయే సంఘటనాత్మక దృశ్యాలు.కథనంలో బిగి ..పట్టు విడవకుండా ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. యుద్ధ ఘట్టాలు ఒళ్లు గగుర్పాటు కలిగిస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే....

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయాన్ని తరచి చూస్తే బాలకృష్ణ తన వందో చిత్రానికి 100 పెర్సంట్ న్యాయం చేసేందుకు పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు కృషి చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చారిత్రక చిత్రాలకు తన ఆహార్యం, హావభావాలు చక్కగా సరిపోతాయన్న భావనను నిజం చేసి నిరూపించాడు. సీనియర్ నటి హేమామాలిని గౌతమి పాత్రలో కుమారుడిని తీర్చిదిద్దడంలోనూ, అతని కల నేర్చడంలోనూ, రాజ్యంలో తలెత్తుతున్న అసంతృప్తభావనలకు సరైన రీతిలో బదులు చెప్పడంలోనూ హుందాతో కూడిన పరిణత ప్రజ్ణను తన నటనలో కనబరిచారు. ఒకవైపు భర్త యుద్ధకాంక్ష, మరోవైపు కుమారుడని సైతం పణంగా పెట్టాల్సిన దుస్థితిలో కరుణ రసాత్మకమైన మాతృత్వభావనను ఆర్ద్రపూరితంగా పోషించారు వశిష్టాదేవి పాత్రలో శ్రియాశరణ్. మిగిలిన పాత్రలకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కథను నడపడంలో , నాయక పాత్ర ఔచిత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో సందర్భోచితంగా నటీనటులందరూ తమవంతు పాత్రల్లో జీవించారు.

టెక్నీషియన్ల విషయంలో...

టెక్నీషియన్ల విషయంలో నంబర్ ఒన్ మార్కులు దర్శకుడు క్రిష్ కొట్టేస్తాడు. ’అన్ సంగ్‘ హీరోగా తెలుగు వాళ్లకే పెద్దగా తెలియక ఎక్కడో చరిత్ర మూలల్లో పడిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెలికి తీసిన ఘనత ఆయనదే. ఎన్నెన్నో దేశాలు, ప్రదేశాలు తిరిగి , గ్రంథాలయాల్లో శోధించి తాళపత్ర, తామ్ర , శిల్ప శాసనాలను పరిశోధించి దొరికిన ఆధారాలకు అందమైన అల్లికను జోడించి ఒక మంచి చలనచిత్రంగా , చారిత్రక దృశ్య కావ్యంగా మలచిన శిల్పి క్రిష్ . అతితక్కువ కాలవ్యవధిలో నిర్మించినా సెట్టింగులు , గ్రాఫిక్స్ విషయంలో కథకు తగ్గ హంగులు సమకూర్చడంలో క్రిష్ చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ప్రేక్షకుడిని కథతో పాటు భావనా ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎస్సెట్ గా నిలిచింది. బాలకృష్ణ అభిమానులు ఆశించే డైలాగుల పదును , అదే సమయంలో కథలో పాత్ర ఔచిత్యం రెంటినీ దృష్టిలో పెట్టుకుని రెండు వైపులా పదునున్న కత్తిలా భాషను పంచ్ లుగా విసరడంలో ..అందులోనూ పౌరుషం ధ్వనింపచేయడంలో రచయిత సాయిమాధవ్ కృతకృత్యుడయ్యాడు. యుద్ధసన్నివేశాల్లో రౌద్రం, వీరరసం, బీభత్సం తొణికిసలాడేలా సాదృశ్యమానం చేయడంలో కెమెరా పనితనం కేక పుట్టిస్తుంది. మొత్తమ్మీద ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు పండగే. స్వయంగా బాలకృష్ణకు ఆత్మసంతృప్తినిచ్చే సార్థక చిత్రం . తెలుగు సినీ అభిమానులకు మధురమైన తీయని అనుభూతి. గతకాలపు తెలుగు జాతి వైభవానికి, చరిత్రలోని ఒక పార్శ్వానికి తెరనిండైన సాక్ష్యం.

 

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

పదునైన సంభాషణలు

నేపథ్య సంగీతం

పాత్రోచిత నటన

 

మైనస్ పాయింట్స్ :

కాసింత నిడివి ఎక్కువ

కథావేగానికి బ్రేక్ వేసిన పాటలు

ప్రధానపాత్రలతో పోలిస్తే ప్రతినాయక పాత్రలు తేలిపోవడం

 

మరి '10 టివి' ఇచ్చే రేటింగ్, కత్తి మహేష్, మరియు 10టీవీ న్యూస్ ఎడిటర్ సతీష్ విశ్లేషణలు చూడాలనుకుంటే వీడియోను క్లిక్ చేయండి....

'బిజెపి పాలిత రాష్ట్రాల్లో మద్యనిషేధం అమలు చేయాలి'

బీహార్ : బిజెపి పాలిత రాష్ట్రాల్లో మద్యనిషేధం అమలు చేయాలని... ఇందుకు ప్రధాని మోదీ చొర చూపాలని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు.

మంత్రి దేవినేని ఉమ ఆడనా, మగనా?: రోజా

కృష్ణా : వీరులపాడు మండలం అల్లూరు లో సంక్రాంతి సంబరాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. పచ్చ చొక్కాలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రోజా జోశ్యం చెప్పారు. దేవినేని ఉమ ఆడో, మగో అర్థం కావడం లేదని, జగన్ ను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. దేవినేనికి ప్రజలే బుద్ధి చెబుతారని రోజా తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంతో ఆయిల్ కంపెనీల భేటీ

ముంబై : కేంద్ర ప్రభుత్వంతో ఆయిల్ కంపెనీలు భేటీ అయ్యాయి. పెట్రోలు బంకుల్లో కార్డు లావాదేవీల ఛార్జీలపై ఈ భేటీ చర్చిస్తున్నట్లు సమాచారం.

సమావేశం అయిన టాటాసన్స్ బోర్డ్...

ముంబై: టాటాసన్స్ బోర్డు సమావేశం ప్రారంభం అయ్యింది. కొత్త ఛైర్మన్ ఎంపిక పై కసరత్తు చేయనున్నట్లు సమాచారం. ఛైర్మన్ రేసులో నటరాజన్ చంద్రశేఖరన్ ఉన్నట్లు తెలుస్తోంది. 1987 నుంచి టీసీఎస్ లో చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. 2009 నుంచి టీసీఎస్ సీఈవోగా పనిచేస్తున్నారు.

డిసెంబర్ లో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

హైదరాబాద్ : డిసెంబర్ లో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం 3.63శాతం పేండి 3జ41 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.

 

ముగిసిన చంద్రబాబు, పన్నీరు సెల్వం భేటీ

అమరావతి: వెలగపూడి సచివాలయంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడితో భేటీ ముగిసింది. తెలుగుగంగ ఒప్పందం ప్ర‌కారం కృష్ణాజ‌లాల‌ నుంచి చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వాలని చంద్ర‌బాబుని పన్నీరు సెల్వం కోరారు. అయితే, ఏపీతో పాటు క‌ర్ణాట‌క‌, మహారాష్ట్రలు కూడా 5 టీఎంసీల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఆయ‌న‌కు చంద్రబాబు గుర్తుచేశారు. త‌మిళ‌నాడు రూ.443 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉంద‌ని చెప్పారు. దీనిపై స్పందించిన ప‌న్నీర్ సెల్వం రేపు కొంత మేర బకాయిలు విడుదల చేస్తామ‌ని అన్నారు. త‌మిళ‌నాడులో నిషేధం విధించిన‌ తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

17:46 - January 12, 2017

అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. కాకానిపై సభా హక్కుల నోటీసు ఇవ్వనున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. నిరాధారమైన ఆరోపణలు, ఫోర్జరీ సంతకాల ద్వారా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని.. రూల్స్‌ కమిటీ 173 ప్రకారం కాకానిపై సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సోమిరెడ్డి సిద్ధమైనట్లు సమాచారం.

17:44 - January 12, 2017

హైదరాబాద్: కామన్‌ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 6న ఈసెట్‌, మే 12న ఎంసెట్‌, ఓయూ ఆధ్వర్యంలో మే 16న పీఈసెట్‌, కేయూ ఆధ్వర్యంలో మే 18న ఐసెట్‌, మే 27న లాసెట్‌, మే 27న పీజీఎల్‌సెట్‌, ఓయూ ఆధ్వర్యంలో మే 28న ఎడ్‌సెట్‌, మే 30న పీజీ ఈసెట్‌ నిర్వహించనున్నారు.

టీఎస్ కామన్‌ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ను విడుదల

హైదరాబాద్: కామన్‌ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 6న ఈసెట్‌, మే 12న ఎంసెట్‌, ఓయూ ఆధ్వర్యంలో మే 16న పీఈసెట్‌, కేయూ ఆధ్వర్యంలో మే 18న ఐసెట్‌, మే 27న లాసెట్‌, మే 27న పీజీఎల్‌సెట్‌, ఓయూ ఆధ్వర్యంలో మే 28న ఎడ్‌సెట్‌, మే 30న పీజీ ఈసెట్‌ నిర్వహించనున్నారు.

17:42 - January 12, 2017

మహబూబాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంపై సీపీఎం పార్టీ అలుపెరగకుండా పోరాటం చేస్తుండడం వల్లే... సీఎం కేసీఆర్‌కు సీపీఎం పార్టీ అంటే ఉలిక్కి పడుతున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్‌ అమలు చేయడం లేదన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర నేటితో 88వరోజుకు చేరుకుంది. 23వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకుని.. 24వందల కిలో మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్‌ తండా, కాంప్లాతండా, ఉయ్యాలవాడ, డోర్నకల్‌, బుద్దారంగేట్‌, గార్లలో పాదయాత్ర బృంద సభ్యులు పర్యటిస్తున్నారు.

17:39 - January 12, 2017

మహబూబాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర నేటితో 88వరోజుకు చేరుకుంది. 23వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేసుకుని.. 24వందల కిలో మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లాలో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్‌ తండా, కాంప్లాతండా, ఉయ్యాలవాడ, డోర్నకల్‌, బుద్దారంగేట్‌, గార్లలో పాదయాత్ర బృంద సభ్యులు పర్యటిస్తున్నారు. గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ పేర్లతో తాటిచెట్లను నరికివేస్తున్నారని, దీని వల్ల గీతకార్మికులకు ఉపాధి దెబ్బతింటోందని పాదయాత్ర బృంద సభ్యులు రమణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ధనిక రాష్ర్టం అని చెబుతున్న కేసీఆర్‌.. ప్రమాదవశాత్తు గాయాలపాలైతే.. ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంలో ఎందుకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని రమణ ప్రశ్నించారు.

17:33 - January 12, 2017

విశాఖ: గత ఏడాది ఇదే రోజూ విశాఖలో నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. 331 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, 4లక్షలకు పైగా పెట్టుబడులు, ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని నాడు చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు. ఒక్క కంపెనీ కూడా ప్రారంభం కాలేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని, వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

16:50 - January 12, 2017

అమరావతి :మూడూ వివాదాలు..ఆరు సవాళ్లు...రెండు అక్షింతలు. ఇదీ ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితి. క్రమశిక్షకు తొలి ప్రాధాన్యం ఇచ్చే టీడీపీలో విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ప్రజాసమస్యలపై స్పందించాల్సిన నేతలు వివాదాలతో పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారు.. కొందరు నాయకుల తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడంలేదన్న విమర్శలొస్తున్నాయి.. అసలు పార్టీలో ఏంజరుగుతోంది?

పశ్చిమగోదావరి జిల్లాకుచెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు...

ఏపీ టీడీపీలో నేతల వ్యక్తిగత వివాదాలు పెరిగిపోతున్నాయి... క్రమశిక్షణ తప్పిన కొందరు నాయకులపై ఆరోపణలు వస్తూనేఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లాకుచెందిన ఓ ఎమ్మెల్యే తీరుపై పార్టీలోవిమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ అధికారులతో ఘర్షణపడుతూ టీడీపీకి చెడ్డపేరు తెస్తున్నారన్న చర్చ జిల్లాలో నడుస్తోంది.. ఇక గుడివాడకుచెందిన ఓ నేత ప్రైవేట్‌ ఫంక్షన్‌లో గాల్లోకి కాల్పులుజరిపడం కలకలం సృష్టించింది.. అధికారపార్టీ నేత అయిఉండి ఇలాంటి పనులుచేయడాన్ని స్థానికులకూడా తప్పుబట్టారు..

ఓ మంత్రికీ, జడ్పీ చైర్మన్‌కుమధ్య విభేదాలు.....

ఇక గుంటూరు జిల్లాలో ఓ మంత్రికీ, జడ్పీ చైర్మన్‌కుమధ్య విభేదాలు తారాస్థాయికిచేరాయి.. ఆ తర్వాత ఇద్దరిమధ్యా పార్టీ పెద్దలు రాజీకుదిర్చినా ఈ వివాదం పార్టీకి మచ్చగా మారింది.. తూర్పుగోదావరి జిల్లాకుచెందిన మరో ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్‌పై చేయిచేసుకోవడం వివాదాస్పదమైంది... ఇదికాస్తా డాక్టర్లు విధులు బహిష్కరించేవరకూ వెళ్లింది..

కొందరు టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు...

ఇలాంటి విషయాల్లోనేకాదు.. కొందరు టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలుకూడా తీవ్రస్థాయిలో వస్తున్నాయి.. విశాఖ జిల్లాలో ఓ ఎమ్మెల్యేభూకబ్జాలకు పాల్పడ్డారంటూ కేసుకూడా నమోదైంది.. ఉత్తరాంధ్రకుచెందిన ఓ ఎమ్మెల్సీ ఉద్యోగాలను అమ్ముకుంటూ దొరికిపోయారు.

ఒకప్పుడు చిన్న తప్పు చేసినా వెంటనే స్పందన...

ఇలా పార్టీలో నేతలపై ఆరోపణలు పెరుగుతున్నా వీటిపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఒకప్పుడు చిన్న తప్పు చేసినా వెంటనే స్పందన కనిపించేది.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సుద్దాల దేవయ్యలపై ఆరోపణలు రాగానే వెంటనే మంత్రి పదవులనుంచి తొలగించారు.. ఇప్పుడుమాత్రం సర్వే నివేదికల్ని చూపిస్తూ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వ్యక్తులకు చొరవ మరింత పెరుగుతోంది.. త్వరలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని... తప్పుచేసినవారికి శిక్ష తప్పదని పార్టీలోని ముఖ్యనేతలు చెబుతున్నారు..

16:47 - January 12, 2017

హైదరాబాద్: నుమాయిష్‌.. ఈ పేరు వినగానే హైదరాబాదీలకే కాదు.. తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది.. అంతులేని ఉత్సాహం.. అంతేస్థాయిలో సమకూరే విజ్ఞానం. అవును విజ్ఞాన వినోదాల మేళవింపుగా సాగే అపురూప పర్వమే నుమాయిష్‌. ఏటా 46 రోజుల పాటు ప్రజలను అలరించే నుమాయిష్‌.. ఈ ఏడాదీ మరిన్ని విశిష్టతలను సంతరించుకుంది.. ప్రజలను తనదైన శైలితో అలరిస్తోంది.

అంగరంగ వైభవంగా ...

హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే నుమాయిష్‌ ఈసారీ అంగరంగ వైభవంగా సాగుతోంది. నుమాయిష్‌గా కన్నా.. నాంపల్లి ఎగ్జిబిషన్‌గా చిరపరిచితమైన ప్రదర్శన ఆహూతులను అమితంగా ఆకట్టుకునేందుకు సర్వసన్నద్ధమైంది. హైదరాబాద్‌ వాసులనే కాదు.. ఇతర ప్రాంతాల వారినీ నుమాయిష్‌ ఆకర్షిస్తోంది. విజ్ఞాన, వినోదాలను పంచుతోంది.

గడచిన 76 సంవత్సరాలుగా ...

గడచిన 76 సంవత్సరాలుగా నుమాయిష్‌ ప్రజలను అలరిస్తూ వస్తోంది. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1938వ సంవత్సరంలో నుమాయిష్‌కు శ్రీకారం చుట్టారు. స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఉస్మానియా యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ల బృందం సహకారంతో... వంద స్టాల్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్‌ ప్రారంభమైంది. అయితే ఇవాళ, దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులను ప్రదర్శించే స్థాయికి నుమాయిష్‌ చేరింది. ప్రస్తుతం ఉత్పత్తుల ప్రదర్శనకు దాదాపు 2500 స్టాల్స్‌ ఏర్పాటు చేశారిక్కడ. నుమాయిష్‌ చిన్నా పెద్దా అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. తొలినాళ్లలో వేలల్లో ఉన్న సందర్శకుల సంఖ్య ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. నిరుడు దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శించారంటే దీనికున్న ఆదరణ ఏంటో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.

మినీ ఇండియాని తలపిస్తోన్న నుమాయిష్

నుమాయిష్‌.. మినీ ఇండియాను తలపిస్తోంది. ఇక్కడి స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్న ఉత్పత్తులు.. పొరుగు ప్రాంతాల సంస్కృతీసంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల పనితనం.. నుమాయిష్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కాశ్మీరీల హస్తకళలు, రాజస్థానీ హాండ్ వర్క్స్, ఉత్తర్ ప్రదేశ్ అత్తరు వంటివి ఎగ్జిబిషన్‌ లో ప్రతీసారి హైలైట్ గా నిలుస్తాయి.

ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌, బట్టలూ , బొమ్మలూ, పింగాణీ వస్తువుల , ప్లాస్టిక్ సామాను, ఫర్నిచర్, లాడ్ బజారుని మరిపించే గాజులు ఇలా ప్రతిఒక్కటి ఇక్కడ స్పెషల్ అనే చెప్పుకోవాలంటున్నారు సందర్శకులు. బ్యాగుల దగ్గర్నుంచి బైకుల వరకు. రకరకాల మెటీరియల్స్. ఎన్నడూ చూడనివి.. ఎప్పుడూ వాడనివి.. మనసుకు నచ్చేలా పర్సుకు తగిన విధంగా ఉంటాయంటున్నారు వీరు. కొనకపోయినా ఫరవాలేదు. కొత్త డిజైన్లు చూడ్డానికైనా వెళ్లాలన్నది సందర్శకుల మాట. ఇవన్నీ ఒక ఎత్తయితే చిల్డ్రన్ జోన్ మరీ ప్రత్యేకం... పిల్లలకోసం బోలెడన్ని రైడ్స్. టోరటోర, రంగుల రాట్నం, హెలికాప్టర్, రోలింగ్ కప్ సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిజ్బీ, రేంజర్‌లతో పాటు మోటారు బైకులపై విన్యాసాలు, సర్కస్ ఫీట్లు- ఇలా చూసినా కొద్దీ చూడలనిపించేవి... ఆడుకోవాలనిపించేవి బోలెడన్ని ఉన్నాయిక్కడ.. వీటికి తోడు ఎగ్జిబిషన్ అంతా కలియ చుట్టొచ్చేందుకు రైలు కూడా అందుబాటులో వుంటుంది.. దీంట్లో పెద్దా చిన్నా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఉర్రూతలూగిస్తున్న గోమ్స్ జోన్....

నుమాయిష్‌కు తరలివచ్చే పెద్దలను ఇక్కడి వస్తువులు, ఉత్పత్తులు అలరిస్తుంటే.. పిల్లలను మాత్రం గేమ్స్‌ జోన్‌ ఉర్రూతలూగిస్తోంది. ఈ జోన్‌లోకి అడుగుపెట్టిన పిల్లలు పెట్టే కేరింతలతో ఆ ప్రాంగణం హోరెత్తిపోతోంది. నుమాయిష్‌కు తరలివచ్చే పెద్దలను ఇక్కడి వస్తువులు, ఉత్పత్తులు అలరిస్తుంటే.. పిల్లలను మాత్రం గేమ్స్‌ జోన్‌ ఉర్రూతలూగిస్తోంది. ఈ జోన్‌లోకి అడుగుపెట్టిన పిల్లలు పెట్టే కేరింతలతో ఆ ప్రాంగణం హోరెత్తిపోతోంది.

ఫ్రీ పార్కింగ్‌ యాప్‌...

నుమాయిష్‌కు భారీగా సందర్శకులు తరలివస్తారన్న ఉద్దేశంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 46 రోజుల పాటు జరిగే సంరంభంలో.. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సొసైటీ అన్ని విధాలైన చర్యలూ తీసుకుంది. వాహనాలు నిలిపేందుకు ఇబ్బందిలేకుండా నాంపల్లి పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్‌బోర్డుకు చెందిన గగన్‌విహార్‌, చంద్రవిహార్‌, గృహకల్ప, మనోరంజన్‌ కాంప్లెక్స్‌తోపాటూ నల్లకుంట ప్రధాన రహదారిలో ఫ్రీపార్కింగ్‌ ఏర్పాటు చేశారు. నుమాయిష్‌ను సందర్శించడానికి వచ్చే లక్షలాదిమంది తమ వాహనాలను ఎక్కడెక్కడ పార్కింగ్‌ చేసుకోవాలనే వివరాలను తెలుసుకోవడానికి ఫ్రీ పార్కింగ్‌ యాప్‌ను ప్రారంభించారు.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను భద్రతావలయంగా ...

ఇక సందర్శకుల రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను భద్రతావలయంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా సీసీ కెమెరాలు, అంతర్గత భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, వలంటీర్లు, వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది, మెటల్ డిటెక్టర్‌లు, హ్యాండ్ డిటెక్టర్‌లతో తనిఖీలు చేపడుతున్నారు. సందర్శకులకోసం మొబైల్‌టాయ్‌లెట్లు, మంచినీరు, వృద్ధులకు ప్రవేశమార్గాల వద్ద ప్రత్యేకంగా వీల్‌చైర్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు.. సొసైటీ నిర్వహణలోని పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. సందర్శకులకు వినోదాన్ని పంచుతున్నారు.

పెద్ద నోట్ల రద్దు ప్రభావం...

నుమాయిష్‌ మొదలైందంటే నగర వాసులు నయా జోష్ తో ఉంటారు.. కాని ఈ సారి నాంపల్లి ఎగ్జిబిషన్ కి జోష్ తక్కువైందనే చెప్పుకోవాలి. దాదాపుగా 2వేల 500 స్టాల్స్ ఎప్పుడు సందర్శకులతో కళకళలాడుతుండేవి. కాని ఆరంభంలోనే ఆ కళ తప్పినట్టుగా కనిపిస్తోంది. దీనికంతటికి పెద్ద నోట్ల రద్దు కారణమంటున్నారు షాప్ యజమానులు. ఇప్పటికే ఒక్కో స్టాల్‌ లో రోజుకు వేలాది రూపాయల గిరాకి ఉండేదని కాని అసలు కస్టమర్లు లేక ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నుమాయిష్‌ ఎగ్జిబిషన్ లో దొరకని వస్తువంటూ ఉండదు... ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటు లో ఉంటుంది.. మిగితా ఎగ్జిబిషన్ల తో పోలిస్తే ధర కూడా సామాన్యులకి అందుబాటులో ఉంటుంది. అలాంటి ఎగ్జిబిషన్ లో జనాలు లేక స్టాల్స్ అన్నీ వెలవెలబోతున్నాయి. ఎవరిని కదిలించినా నోట్ల రద్దు తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. రెండువేల నోటు తీసుకొస్తే చిల్లర లేదని పంపుతున్నారని కస్టమర్లు చెబుతున్నారు. చాలా వరకు స్టాల్స్ యజమానులు స్వైప్‌ మిషన్లు ఏర్పాటు చేసుకున్నారు. అయినా కూడా కస్టమర్లు రాకపోవడంతో ఈసారి తమ గిరాకి దెబ్బతినేలా వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశ నలుమూలల నుంచి తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి లక్షలాది రూపాయలు పెట్టి సరుకు తీసుకొస్తే ఇక్కడ కొనేవాళ్లు లేక దిగాలుగా కూర్చున్నారు స్టాల్స్ ఓనర్లు. రాజస్థాన్ , గుజరాత్, కాశ్మీర్ , బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి బట్టలు అమ్ముకునేందుకు ఇక్కడికి వచ్చి తాము నష్టాలతో ఇంటికి చేరుకునే పరిస్థితులు వచ్చేలా వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వస్తువులకు కొన్ని ప్రాంతాలే ఫేమస్. అలాంటి ప్రముఖమైన వస్తువులన్నీ ఒకే చోట కలబోసినట్టు ఉండేది కేవలం నుమాయిష్ లో మాత్రమే.. అలాంటి నుమాయిష్‌కు పెద్ద నోట్ల రద్దు పెద్ద షాక్ నే ఇచ్చిందంటున్నారు నిర్వాహకులు.

16:31 - January 12, 2017

హైదరాబాద్: గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేసి ఇంటిముంగిటకు తీసుకొచ్చి ఆటలాడించి అందరినీ ఓలలాడించే గంగిరెద్దుల వృత్తి కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి.. ఆ వృత్తికి ఆదరణ లేకుండా పోయింది. సంచార జీవనం గడిపే వారికి సొంత ఇల్లు, స్థిరాస్తి లాంటివి లేవు. సమాజంలో వారికి గుర్తింపు లేకుండా పోయింది. కుల కట్టుబాట్లు మరింత కుంగదీస్తున్నాయి. గంగిరెద్దు వృత్తిదార్లు చదువు రాకపోయినా సమయస్ఫూర్తితో మాట్లాడి మెప్పించగలరు. ప్రమాదమని తెలిసినా ఎటువంటి సెట్టింగులు లేకుండా గంగిరెద్దుతో విన్యాసాలు చేయించి అందరినీ ఆశ్యర్యపర్చేలా నిలబెట్టుతారు. అబ్బురపరిచే గంగిరెద్దుల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తీ కాదు..

అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం....

అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం పడినట్లు గంగిరెద్దుల వాళ్లపై పట్టణీకరణ ప్రభావం పడింది. గతంలో లాగా గ్రామాలలో గ్రాసం రాక బయట వేరే వృత్తులలోకి వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వృత్తి క్రమంగా కనుమరుగై ఇతర పనులకు మళ్లిపోతున్నారు. విశాఖ జిల్లాలో దాదాపు మూడు వేల వరకు గంగిరెద్దుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న దాదాపు ఆరు వేల కుటుంబాలకు జీవనోపాధి దెబ్బతిన్నది. ప్రభుత్వం నుంచి సరైన ఆదరణలేక, ప్రోత్సాహం ఇవ్వక నానా అవస్థలు పడుతున్నారు. సంచారజాతులుగా జీవనం సాగిస్తున్న ఆ కళాకారులకు రక్షణ కరువైంది. వృత్తిలేక, ఉపాధిలేక, ఆదుకొనే నాధుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జానపదకళలకు రక్షణ కల్పించాల్సిందిపోయి తిండిపెట్టే వృత్తి కనుమరుగవుతున్నా పట్టించుకొని దుస్థితి ఏర్పడింది.

500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం...

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ముద్దుర్తి, లంకెలపాలెం, సబ్బవరం, మల్లునాయుడుపాలెం, చోడవరం, పెద్దబోడేపల్లి, మామిడిపాలెం, కె.కోటపాడు, వేపగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం సాగిస్తున్నాయి. ఏడాదిలో సంక్రాంతి రోజుల్లో తప్ప ఇతర రోజుల్లో వీరికి ఆదరణ లేక కూలీ పనులకు వెళ్తుంటారు. పట్ణణాలు, గ్రామాలకు విసిరిపడేసినట్లు దూరంగా పాకలు వేసుకొని గంగిరెద్దును తిప్పుకొనే వారికి ఇప్పుడు స్థిర నివాస స్థలాల్లేవు. గంగిరెద్దులను మేపుకొనేందుకు కాసింత స్థలమూలేదు. గంగిరెద్దులను పోషించుకోలేక ఆ వృత్తిని విడిచి ప్లాస్టిక్‌, సిల్వర్‌ సామాన్లు అమ్ముకొని జీవిస్తున్నారు. పనులు, వ్యాపారం చేసే శక్తిలేని వారు భిక్షాటన చేసుకొని బతుకు వెళ్లదీస్తున్నారు. అత్యంత వెనుకబడిన తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉన్నత తరగతికి చెందిన బి.సి(ఎ)లో చేర్చి ఎదగనీయకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని....

ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని ధీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమను ఎస్టీలలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమలో చదువుకున్న యువకులకు భవిష్యత్ అందంగా మారుతుందన్నారు. లోన్లు రాక సొంత వ్యాపారాలు ఏవైనా చెసుకునే పరిస్థితి లేక దిక్కు తోచక ఇదే వృత్తిలో కొనసాగుతున్నామంటున్నారు.

సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తమిళనాడు సీఎం

అమరావతి:వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును తమిళనాడుసీఎం పన్నీ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ - ఏప్రిల్ మధ్య విడుదల చేయాల్సిన 4 టీఎంసీల నీటిని ఈ నెలలోనే విడుదల చేయాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ప్రతి సంవత్సరం తెలుగు గంగ ద్వారా ప్రతి ఏడాది 12 టీఎంసీల నీటి విడుదలకు ఏపీ, తమిళనాడు మధ్య ఒప్పందం కుదిరింది.

కొత్త నోట్ల ముద్రణలో కొనసాగుతున్న తప్పిదాలు

హైదరాబాద్: కొత్త నోట్ల ముద్రణలో తప్పిదాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఏటీఎంలో ఒకే వైపు ప్రింట్ అయిన నోట్లు లభ్యం అయ్యాయి.

 

'అమరావతి ప్రాంతంలో ఎన్టీఆర్ మ్యూజియం'

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటుకు నారా లోకష్ - బ్రాహ్మణీలు నిర్ణయించారు. ఈనెల 18న విజయవాడలో ఎన్టీఆర్ ప్రస్తావనంపై ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సేవలను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యమన్నారు.

మసాల దోశల వ్యాపారంలోకి మెక్ డోనాల్స్డ్

హైదరాబాద్: అందు కలదు ఇందు కలదు లాభం ఎక్కడ వస్తుందో అందులో మెక్ డోనాల్డ్ కంపెనీ అక్కడ ఉంటుంది. తాజా మసాల దోశల వ్యాపారంలోకి మెక్ డోనాల్డ్స్ కంపెనీ అడుగు పెట్టబోతోంది. రేపటి నుంచి ముంబై లో 44 ఔట్ లెట్స్ ను ప్రారంభించనుంది.

15:45 - January 12, 2017

ఎండా..వాన..చలికాలం..ఇలా ఏ కాలమైనా కొందరిని చెమట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నలుగురిలో కలవలేక పోతుంటారు. బాడీ స్ర్పేలు వాడుతూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు ఆహార విషయంలో కొద్ది జాగ్రత్రలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది.
అల్లం..ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది.
ఆరెంజ్..పండులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది.
ఆరెంజ్ లాగే నిమ్మరసంలో కూడా విటమిన్ సి కంటెంట్ అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో ఎలాంటి దుర్వాసనైనా నివారిస్తుంది.
యాపిల్స్ ..ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజుకు ఒక్క యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు టాక్సిన్స్ బయటకు పంపుతాయి. దీనితో చెమట వాసన దూరమౌతుంది.
కొత్తమీరలో ఎంజైమ్స్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి చెమట నుండి విముక్తి కల్పిస్తుంది.

15:44 - January 12, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిలో దొంగలు హస్తలాఘవం ప్రదర్శించారు. మహామండపంలో ఉన్న చీరలకు ఎలాంటి భద్రత కల్పించలేదు. దీనితో ఓ వ్యక్తి చీరలను నొక్కేశారు. చీరలు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో కూడా జీడిపప్పు, ద్రాక్ష తదితర వస్తువులను కూడా ఇతను ఇలా నే దొంగిలించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరిన్ని వివరాల కోసం ఈ వీడీయోను క్లిక్ చేయండి.

15:40 - January 12, 2017

వనపర్తి : సంక్రాంతి పండగ పేరింటేనే.. నోట్లో బెల్లంముక్క వేసుకున్నట్టు తియ్యగా నవ్వుతారందరు. పండగపూట బెల్లంతోచేసిన పాయసం , అరిసెల్ని కమ్మగా లాగిస్తూ.. చుట్టపక్కాలతో సరదాకా గడిపేస్తుంటారు. కాని ..ఈసారి పండగపూట తేనెలరుచులు పంచే బెల్లం చేదెక్కింది. అధికారుల ఆంక్షలతో తీయ్యందనాల సంక్రాంతి కాస్తా.. చప్పగా మారుతోంది.

పండగ రోజుల్లో బెల్లంకష్టాలు ....

కొత్తజిల్లా వనపర్తిలో జనానికి బెల్లం కష్టాలు వచ్చిపడ్డాయి. అధికారుల ఆంక్షలతో పిండివటలు తీపిరుచులను కోల్పేయేపరిస్థితి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబాను అడ్డకుకేనేందుకు ఎక్సైజ్‌ శాఖ బెల్లం అమ్మకాలపై ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలు ఇపుడు ప్రజలందరికీ ఇబ్బందిగా మారాయి. పండగపేరుతో అమ్ముతున్న బెల్లం మళ్లీ సారాతయారీకి వెళ్లుతుందని ఎక్సైజ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే బెల్లం కొనుగోళ్లపై నజర్‌ పెట్టారు. ఒకటి రెండు కిలోలు కొనుక్కోవాలన్నా ఆధార్‌కార్డు తప్పని సరి చేశారు. అధికారుల ఆదేశాలతోనే ఆధార్‌ కార్డు నకలు కాపీ ఇస్తేనే బెల్లం అందిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ బెల్లం మాత్రమే....

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ మాత్రమే ఇస్తుండంతో బెల్లం షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు ధరను కూడా ఆకాశానికెత్తేశారు వ్యాపారులు. కేజీ 60రూపాయలు చేసి అమ్ముతున్నారు. దీంతో పండగపూట బెల్లాన్ని చూస్తే బంగారం ధరలే గుర్తుకువస్తున్నాయని ఆదేవన చెందుతున్నారు ప్రజలు.

కేజీ బెల్లంతో పండగ ఎట్లా చేసుకోవాలి..?

పండక్కి కూతురు- అల్లుడు వచ్చారు.. రేషన్‌ ప్రకారం ఇస్తున్న ఒక కేజీ బెల్లాన్ని ఏం జేసుకోవాల అంటున్నారు వనపర్తి జిల్లా ప్రజలు. కిలో బెల్లంతో ఎన్నిరకాల పిండివంటలు చేసుకోవొచ్చో కూడా చెబితే బాగుంటుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ తీరుపై జనం మండిపడుతున్నారు. నాటుసారా తయారీదారులను కంట్రోల్‌ చేయలేక ఇలా పండక్కికూడా బెల్లం అందకుండా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కావాల్సినంత బెల్లం అందించాలని..వనపర్తి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

15:37 - January 12, 2017

ముంబై : ఫ్రెంచ్ డిజైన్‌తో రూపొందించిన రెండవ స్కార్పిన్ క్లాస్ సబ్‌మెరైన్ ఖందేరీ- ముంబైలోని మజగాన్ డాక్స్‌ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ భామ్రే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి భార్య బీనా భమ్రే ఈ సబ్‌మెరైన్‌ను ప్రారంభించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్ సునీల్‌ లాంబా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ సహకారంతో 3 బిలియన్ల ఖర్చుతో మజగాన్‌ డాక్స్‌ 6 సబ్‌మెరైన్లను నిర్మిస్తోంది. కల్వరి మొదటి సబ్‌మెరైన్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. మిగతా 4 సబ్‌మెరెన్లను ప్రారంభించడానికి మరో 9 నెలలు పట్టే అవకాశముంది. ఖందేరి సబ్‌మెరైన్‌కు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఐఎన్‌ఎస్ ఖందేరీగా భారత నేవీకి అప్పగించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సబ్‌మెరైన్‌ను రూపొందించారు. యుద్ధక్షేత్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడే శక్తి దీనికుంది.

15:36 - January 12, 2017

టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన 'నితిన్' చిత్రం ఎలాంటి రాలేదు. కాసుల పంట పండడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం అంట. ఈ ఆనందాన్ని 'నితిన్' తన ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన 'బాలకృష్ణ' 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' గురువారం రిలీజైంది. ఈ సినిమాకు అభిమానుల నుండి భారీ స్పందనే వ్యక్తమౌతోంది. టాలీవుడ్ ప్రముఖులు..ఇతరులు 'బాలకృష్ణ' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్ర నైజాం హక్కులను 'నితిన్' సొంతం చేసుకున్నాడు. సినిమా చారిత్రాత్మక విజయం సాధించిందని 'నితిన్' పోస్టు చేశాడు. అంతేగాకుండా 'బాలకృష్ణ'..'క్రిష్' కు అభినందనలు తెలిపాడు. బాలయ్య సినిమాపై నితిన్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఎలాంటి వసూళ్లు రాబడుతుందో ఆతృతగా ఎదురు చూశాడు. చిత్రానికి మంచి స్పందనే వస్తుండడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయంట. మరి నైజాంలో ఎలాంటి కలెక్షన్లు సాధించిందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది.

పంజాబ్ డిప్యూటి సీఎం నామినేషన్..

పంజాబ్ : డిప్యూటి సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ నామినేషన్ వేశారు. జలాలాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

15:21 - January 12, 2017

అరవు కథ కంటే సొంత కథనే బాగుందని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఉద్ధేశించి ఈ వాఖ్యలు కనిపిస్తున్నాయి. చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఇటీవలే రిలీజైంది. ఈ రోజు బాలకృష్ణ నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఖైదీ..' తమిళ సినిమా 'కత్తి' రీమెక్ అనే విషయం తెలిసిందే. 'గౌతమి..' చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందించబడింది. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై గుర్రుగా ఉన్న 'వర్మ' ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తెలుగు సినిమాను గర్వించదగిన స్థాయిలో 'క్రిష్' తీసుకెళ్లాడంటూ ప్రశంసల వర్షం కురిపించారు. హీరో బాలకృష్ణ..దర్శకుడు క్రిష్ కి సెల్యూట్ అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఇలాంటి ట్వీట్స్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎలాంటి ట్వీట్స్ చేస్తారో చూడాలి.

ఇంద్రకీలాద్రిలో హస్తలాఘవం..

విజయవాడ : ఇంద్రకీలాద్రిలో దొంగలు హస్తలాఘవం ప్రదర్శించారు. మహామండపంలో ఉన్న చీరలకు ఎలాంటి భద్రత కల్పించలేదు. దీనితో ఓ వ్యక్తి చీరలను నొక్కేశారు. చీరలు దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

బాబును కలిసిన పన్నీర్ సెల్వం..

విజయవాడ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటి విడుదలపై చర్చిస్తున్నారు.

సీఐఎస్ఎఫ్ జవాన్లపై సహచరుడు కాల్పులు..

బీహార్ : ఔరంగాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. నలుగురు సీఐఎస్ఎఫ్ జవాన్లపై సహచరుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈఘటనలో ఇద్దరు మృతి చెందారు.

నూతన టెర్మినల్ ప్రారంభించడం సంతోషం - బాబు..

విజయవాడ : నూతన టెర్మినల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు రన్ వే విస్తరణకు ఆయన భూమి పూజ చేశారు. భూములిచ్చిన వారికి అన్యాయం జరగనివ్వనని, విమానయాన రంగంలో భవిష్యత్ లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయన్నారు.

14:54 - January 12, 2017

విజయవాడ : గన్నవరం విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య నెలకొల్పడంతో రాష్ట్ర జనాభా కూడా రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. రద్దీకి తగ్గట్లుగా విమానాశ్రయాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడగు వేసింది. రన్‌వేను విస్తరించడంతో విమానాల రాకపోకల సంఖ్యను పెంచుకోవచ్చు.

14:49 - January 12, 2017

నల్గొండ : మరో అవినీతి చేపను పట్టేశారు ఏసీబీ అధికారులు... నల్లగొండలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ భాస్కర్‌ రావు ఏసీబీ కి చిక్కాడు.. ఆదాయానికిమించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో నల్లగొండ, హైదరాబాద్‌లోని భాస్కర్‌ రావు ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు..

14:47 - January 12, 2017

విజయవాడ :యువతకు మార్గనిర్దేశకుడు స్వామి వివేకనంద అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్క్‌ వద్ద వివేకనంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ సంస్కృతిని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి వివేకనంద అని బండారు అన్నారు.

14:46 - January 12, 2017

కర్నూలు: దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కోరమాండల్‌ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ రవికృష్ణ దంపతులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అతిథులకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. స్కూటర్‌ ర్యాలీ, కబడ్డీ పోటీలు, ఎండ్ల బండ్ల పోటీలు, కోలన్నలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్పీ రవికృష్ణ దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామాభివృద్ధికి కోరమాండల్‌ తరుపున అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి చక్రవర్తి చెబుతున్నారు.

14:44 - January 12, 2017

శ్రీకాకుళం : సంక్రాంతిని సందర్భంగా శ్రీకాకుళంలో 10 టివి నిర్వహించిన ముగ్గుల పోటీకి మహిళల నుంచి మంచి స్పదన లభించింది. పెదపాడులోని SRA విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో 80 మంది పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రంగవల్లు తీర్చిదిద్దారు. డీఎస్‌పీ శ్రీనివాసరావు, ఎస్ ఆర్ ఏ విద్యాసంస్థల చైర్మన్‌ పూడి తిరుపతిరావు, ప్రిన్సిపాల్‌ స్వర్ణలతల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు అందజేసి, జ్ఞాపికలు ప్రదానం చేశారు.

14:42 - January 12, 2017

హైదరాబాద్ : అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కాంగ్రెస్‌నేతల్లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఆధిపత్యపోరుతో కస్సుబుస్సులాడే వారు దోస్త్‌మేరా దోస్త్ అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు చూసి సొంతపార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తమ్ కు దూరంగా సీనియర్లు...

పీసీసీ ఛీఫ్ గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి భాధ్యతలు తీసుకున్నప్పటి నుండి.. చాలా మంది సీనియ‌ర్లు పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా న‌ల్గొండ జిల్లా నేత‌ల మ‌ధ్య ఉన్న గ్రూపిజం అంతా ఇంతా కాదు. ఈవిషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగు ముందే ఉంటారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ ఉన్నంతవరకు తాను గాంధీభన్‌లోకే అడుగుపెట్టనని అప్పట్లో శపథంకూడా చేశారు. కాని.. తాజాగా పీసీసీచీఫ్‌తో కోమటిరెడ్డి భుజం భుజం కలిపి తిరుగుతున్నారు.

రాజ‌న‌ర్సింహ్మ లో కూడా స్పష్టమైన మార్పు

అటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామొద‌ర రాజ‌న‌ర్సింహ్మ లో కూడా స్పష్టమైన మార్పు క‌నిపిస్తోంది. ఉత్తమ్‌కంటే ముందు పీసీపీ పీఠం తనకే దక్కుతుందని ఆశించి భంగపడిన రాజనర్సింహ కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కాని.. మల్లన్నసాగర్‌తోపాటు సాగునీటిప్రాజెక్ట్‌లపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లోనూ ఉత్తమ్‌కు చేదోడుగా మారిపోయారు. ఇక గద్వాల జిల్లాకోసం రాజీలేని పోరాటం చేసిన డీకే అరుణకూడా పీసీసీ చీఫ్‌తో చిటపటలుగానే ఉన్నా.. ప్రస్తుతం పార్టీలో ఉత్తమ్‌ సారథ్యంలో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వీరితోపాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల కూడా మొదట్లో ఉత్తమ్‌కు దూరంగానే ఉన్నా ప్రస్తుతం తిరిగి యాక్టీవ్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇక నిన్నటిదాకా జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో డిస్టెన్స్‌ మెయింట్‌నెన్స్‌ చేసిన మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా మారిపోయారు.

జానారెడ్డి ., ష‌బ్బీర్ అలీ .. భ‌ట్టి విక్రమార్కలు కూడా

ఇక ఉత్తమ్‌తో చిన్న చిన్న విభేదాలు ఉన్నా.. జానారెడ్డి ., ష‌బ్బీర్ అలీ .. భ‌ట్టి విక్రమార్కలు కూడా వాట‌న్నింటినీ పక్కన పెట్టి ప్రతి ఇష్యూలో పీసీసీ ఛీఫ్‌తో ముందుకు క‌దులుతున్నారు. అసెంబ్లీ సెష‌న్స్ లో ప్రతి చిన్న ఇష్యూలో కూడా వీరు స‌మ‌న్వయం ప్రదర్శించారు. ఇక పొన్నాల ఉండ‌గా గాంధిభ‌వ‌న్ కు దూరంగా ఉన్న మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కూడా .. ప్రస్తుతం ఉత్తం కుమార్ రెడ్డితో క‌లివిడిగా ఉంటున్నారు. ఇక పార్టీ ఓడిన త‌ర్వాత గాంధిభ‌వ‌న్ కు దూరంగా .. పార్టీ కార్యక్రమాలను ప‌ట్టించుకోని మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ ఈమ‌ధ్య తెగ హ‌డావిడి చేస్తున్నారు. మ‌రి ముఖ్యంగా ఉత్తమ్‌ను ప్రసన్నం చేసుకునే విధంగా ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. ఇక ఎపుడూ ఎవరో ఒకరిమీద చిటపటలాడే పాల్వాయి గోవ‌ర్ధన్‌ రెడ్డి సైతం ఉత్తమ్‌పై పల్లెత్తు మాటకూడా పడనీయడంలేదు.

ఢిల్లీనుంచి ఫోన్‌లో స్పెషల్‌ క్లాస్‌....

యితే ఢిల్లీనుంచి ఫోన్‌లో స్పెషల్‌ క్లాస్‌ లభించడంతోనే నేతలందరూ సెట్‌అయ్యారని పార్టీలో చెప్పుకుంటున్నారు. నిన్నటి దాకా ఉత్తమ్‌ను మార్చుతున్నార‌న్న ప్రచారంతో.. పీసీసీ ఛీఫ్ ను ఆశించిన నేత‌లు.. ఎవ‌రికి వారుగా త‌మ గ్రూప్ వార్ తో కాగిపోయారు. అయితే పీసీసీని మార్చేది లేద‌ని.. ఎన్నిక‌ల వర‌కు ఉత్తమ్‌ను కొన‌సాగించాల‌ని డిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు స్పష్టంకావడంతో కాంగ్రెస్‌లో కస్సుబుస్సులకు కళ్లెం పడినట్టు తెలుస్తోంది. అందుకే తిట్టుకున్న నోటితోనే నేతలు తెగపొగుడుకుంటున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

14:39 - January 12, 2017

ఢిల్లీ : సైనికులకు ఇస్తున్న నాణ్యతలేని ఆహారం గురించి బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను ఇంకా మరవక ముందే మరో సిఆర్‌పిఎఫ్‌ జవాను జీత్‌ సింగ్‌ వీడియో తెరపైకి వచ్చింది. సైన్యానికి ఇస్తున్న అన్ని సౌకర్యాలను పారా మిలటరీ జవాన్లకు లభించాలని జీత్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదికి విజ్ఞప్తి చేశాడు. ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడుతూ ఎందరో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు తూటాలకు బలైపోతున్నారని.... పరిహారం విషయంలో మాత్రం భేదభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో అక్టోబర్‌ 16, 2016 నాటిదని తెలుస్తోంది. పారమిలటరీ దళాలకు 2004 తర్వాత పెన్షన్‌ ఇవ్వడం లేదని, ఉగ్రవాద పోరులో మృతి చెందిన వారిని అమరులుగా గుర్తించడం లేదని జీత్‌సింగ్‌ పేర్కొన్నాడు.

గోవాలో కాంగ్రెస్ జాబితా విడుదల..

గోవా : రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో 27 మంది ఉన్నారు.

 

విజయవాడకు చేరుకున్న తమిళనాడు సీఎం..

విజయవాడ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ కానున్నారు. తెలుగుగంగ పథకం కింద చెన్నైకు నీరు వ‌ద‌లాల‌ని, ఆ జ‌లాలను కండలేరు జలాశయానికి విడుదల చేయాలని బాబును కోరనున్నట్లు తెలుస్తోంది.

14:19 - January 12, 2017

హైదరాబాద్: 'గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి' సినిమా విజయం తెలుగు ప్రజలందరిది అని హీరో సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమ్యాక్స్ కు బాల‌య్య‌తో పాటు సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్‌, న‌టి శ్రియ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో బాల‌కృష్ణ మాట్లాడుతూ... అస‌మాన శూరుడి పాత్రను తాను చేయడం ఓ అదృష్ట‌మ‌ని అన్నారు. ఇది నాన్న‌గారు (ఎన్టీఆర్‌) చేయాల‌నుకున్న పాత్ర అని ఆ పాత్ర‌ను తాను చేయ‌డం త‌న‌ పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. అద్భుత‌మైన స్పంద‌న‌ను అందుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పంచ‌భ‌క్ష ప‌రమాన్నం అందించిన‌ట్లు సినిమాకు ప‌నిచేసిన బృందం ఈ సినిమాలో అన్నిటినీ క‌లిపారని బాలయ్య చెప్పారు. సాయిమాధ‌వ్ మంచి మాట‌లు అందించార‌ని అన్నారు.

ఏసీబీ చిక్కిన విజిలెన్స్ ఎస్పీ..

నల్గొండ : రూ. లక్ష లంచం తీసుకుంటున్న విజిలెన్స్ ఎస్పీ భాస్కర్ రావు ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నల్గొండ, హైదరాబాద్ లోని భాస్కర్ రావు నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

13:52 - January 12, 2017

ఢిల్లీ : సైనికులకు ఇస్తున్న నాణ్యతలేని ఆహారం గురించి బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను ఇంకా మరవక ముందే మరో సిఆర్‌పిఎఫ్‌ జవాను జీత్‌ సింగ్‌ వీడియో తెరపైకి వచ్చింది. సైన్యానికి ఇస్తున్న అన్ని సౌకర్యాలను పారా మిలటరీ జవాన్లకు లభించాలని జీత్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదికి విజ్ఞప్తి చేశాడు. ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడుతూ ఎందరో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు తూటాలకు బలైపోతున్నారని.... పరిహారం విషయంలో మాత్రం భేదభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో అక్టోబర్‌ 16, 2016 నాటిదని తెలుస్తోంది. పారమిలటరీ దళాలకు 2004 తర్వాత పెన్షన్‌ ఇవ్వడం లేదని, ఉగ్రవాద పోరులో మృతి చెందిన వారిని అమరులుగా గుర్తించడం లేదని జీత్‌సింగ్‌ పేర్కొన్నాడు. 

 

13:48 - January 12, 2017

ముంబై : ఫ్రెంచ్ డిజైన్‌తో రూపొందించిన రెండవ స్కార్పిన్ క్లాస్ సబ్‌మెరైన్ ఖందేరీ ముంబైలోని మజగాన్ డాక్స్‌ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సుభాష్ భామ్రే ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి భార్య బీనా భమ్రే ఈ సబ్‌మెరైన్‌ను ప్రారంభించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్ సునీల్‌ లాంబా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌ సహకారంతో 3 బిలియన్ల ఖర్చుతో మజగాన్‌ డాక్స్‌ 6 సబ్‌మెరైన్లను నిర్మిస్తోంది. కల్వరి మొదటి సబ్‌మెరైన్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. మిగతా 4 సబ్‌మెరెన్లను ప్రారంభించడానికి మరో 9 నెలలు పట్టే అవకాశముంది. ఖందేరి సబ్‌మెరైన్‌కు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఐఎన్‌ఎస్ ఖందేరీగా భారత నేవీకి అప్పగించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సబ్‌మెరైన్‌ను రూపొందించారు. యుద్ధక్షేత్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడే శక్తి దీనికుంది.

 

13:45 - January 12, 2017

నెల్లూరు : ఎప్పుడూ రాష్ట రాజ‌కీయాల్లో బిజీగా ఉండే మంత్రి నారాయణ కాసేపు ష‌టిల్ బ్యాట్ ఆడారు. నెల్లూరు న‌గ‌రంలోని రంగ‌నాయ‌కుల‌పేటలోని పీఎన్ ఎమ్ స్కూల్లో ఏర్పాటు చేసిన ష‌టిల్ టోర్నమెంట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొని కాసేపు షటిల్‌ ఆడారు. ఈ తర్వాత పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి నారాయణ స్పందిస్తూ..శ‌రీరానికి క్రీడ‌లు చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. క్రీడ‌ల ప‌రంగా న‌గ‌రంలోని ష‌టిల్ అభివృద్ధికి 5 కోట్లతో మైదానాన్ని నిర్మించేలా చ‌ర్యలు తీసుకుంటామన్నారు. 

13:43 - January 12, 2017

తూర్పుగోదావరి : పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ప్రాజెక్ట్...ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. పోలవరం కుడి కాలువ ద్వారా 2లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని అధికారపార్టీ చెబుతుంటే...లిఫ్ట్‌ స్కీమ్‌తో అవినీతి సాగుతోందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు భూములు కోల్పోతున్న రైతులు సైతం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దీంతో పురుషోత్తపట్నం వివాదం ఆసక్తిగా మారింది. 
సర్కార్ పై విపక్షాలు మండిపాటు 
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారుతోంది. ఓవైపు పోలవరానికి కాంక్రీటు పండుగలు చేసి..మరోవైపు లిఫ్ట్‌ స్కీమ్‌లు దండగగా నిర్మిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ లిఫ్ట్‌ పథకంతో చంద్రబాబు అవినీతికి ఆజ్యం పోస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంటే...పురుషోత్తపట్నం వల్ల ప్రయోజనం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడుతున్నారు. 
భూసేకరణపై రైతులు ఆగ్రహం 
అటు భూసేకరణపై రైతులు కూడా మండిపడుతున్నారు.. భూములకు ఇచ్చే ధరకూడా చాలా తక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు. టీడీపీ స్వార్థ ప్రయోజనాలకోసమే ఇలాంటి పనులు చేస్తోందని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
విమర్శలను పట్టించుకోని ప్రభుత్వం 
అయితే ఈ విమర్శలను ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఎత్తిపోతల ద్వారా  జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరు అందనుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తవ్వి వదిలేసిన కాలువల్లో రైతుల కన్నీరు పారుతోందని అన్నారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు. 
భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభం 
మరోవైపు పురుషోత్తపట్నం లిఫ్ట్‌ నిర్మాణం కోసం భూసేకరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో తమకు పట్టిసీమ తరహా ప్యాకేజీ చెల్లిస్తేనే భూములిస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు సర్వేబృందాలను అడ్డుకున్న నిర్వాసితులు...2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

13:18 - January 12, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పాలకులు.. ప్రాజెక్టుల పేరిట భూములను బలవంతంగా లాగేసుకుంటున్నాయి. మల్లన్నసాగర్‌ నుంచి నిమ్జ్‌వరకు,  భోగాపురం నుంచి బందరు పోర్టు వరకు.. రైతుల పొట్టకొడుతూ వారి ఇళ్లూ, ఊళ్లూ ఖాళీ చేయిస్తున్నాయి.  రోడ్డున పడ్డ రైతుల వేదన అరణ్య రోదనే అవుతోంది. ప్రత్యేక ఆర్థికమండళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు.. ఇలా పేరేదైనా.. అన్నదాతలే నిర్వాసితులవుతున్నారు. 
కేసీఆర్‌ సర్కారు మొండి వైఖరి..
ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పంథాలోనే ముందుకు సాగుతోంది. మల్లన్నసాగర్‌ కానీ, నిమ్జ్‌ కానీ ప్రాజెక్టు ఏదైనా రైతుల భూములను బలవంతంగా లాక్కుంటోంది. సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తున్న తీరుపై సాగునీటి నిపుణులు, ప్రతిపక్షాలు ఆక్షేపణ చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. ఏదో ఓ రకంగా రైతుల భూములను లాక్కోవాలని చూస్తోంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం 14 గ్రామాలకు చెందిన 16వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా, జీవో ద్వారా భూములు లాక్కోవాలని చూసింది కేసీఆర్‌ సర్కారు. నిర్వాసితులు ఏకమై  హైకోర్టు గడప తొక్కారు. కేసు విచారించిన న్యాయస్థానం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఇప్పుడు తన ఆలోచనలకు చట్టరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్‌ సర్కారు. 
2013 చట్టాన్ని అమలు చేయాలి : భూ నిర్వాసితులు 
భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించుకుని... 2013 చట్టాన్ని అమలు చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. వేములఘాట్‌ వంటి గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత  220 రోజులుగా ఇంకా  రైతుల దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌ మాన్యూఫాక్చరింగ్‌ జోన్‌ పేరిట వేల ఎకరాల భూసేకరణ యధేచ్చగా సాగుతోంది. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టారు.  వారిని పోలీస్‌లతో బెదిరిస్తూ భూములను లాక్కునేందుకే ప్రభుత్వం డిసైడ్‌ అయ్యింది. ఇక్కడ మార్కెట్‌ రేటుకు.. ప్రభుత్వం ఇచ్చిన ధరకు మధ్య సుమారు పదహారు వందల కోట్ల రూపాయల మేర అంతరం ఉంది. అంటే ఆమేరకు రైతులు, స్థానికులు నష్టపోయారని భూనిర్వాసితుల సంఘాలు చెబుతున్నాయి. 
ఏపీలోనూ బలవంతపు భూసేకరణ
అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయం పేరుతో పెద్దపెద్ద సంపన్నులకు తమ భూములు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను  సైతం స్థానికులు అడ్డుకున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. బందరు పోర్టుకు భూసేకరణ అంశమూ వివాదాస్పందంగానే ఉంది. ఇలా ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణకు దిగుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 

 

13:08 - January 12, 2017

'గౌతమిపుత్ర శాతకర్ణి' టీమ్ తో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రం హీరో హీయిన్ బాలకృష్ణ, శ్రియ మాట్లాడారు.  సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను పంచుకున్నారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:02 - January 12, 2017

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి  ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య  కెరీర్‌లో ఇది వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో  గౌతమీపుత్ర  శాతకర్ణి సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు సినివర్గాల్లోను అమితాశక్తి నెలకొంది. ఈ చిత్రం ప్రత్యేక షోను బాలకృష్ణ దర్శకుడు క్రిష్‌తో కలిసి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో వీక్షించారు. మరో వైపు బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.
విశాఖలో 
విశాఖలో బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు... బాలయ్య అదిరిపోయే సినిమాతో వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. శాతకర్ణి అపూర్వ విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు.. 
శాంతి థియేటర్‌ 
హైదరాబాద్‌లోని శాంతి థియేటర్‌ దగ్గర అభిమానులు సందడి చేశారు. 

 

12:57 - January 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఈ పొత్తు వెనక ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించారు. ఒకరు యూపీ సిఎం అఖిలేష్‌ భార్య డింపుల్‌ కాగా...మరొకరు ప్రియాంక గాంధీ. పొత్తు ప్రకటన వెలువడడమే ఆలస్యం...ఈ మహిళా నేతలు కలిసి ప్రచారంలో దూసుకుపోనున్నారు.
ఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడం ఖరారు 
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయడం దాదాపు ఖారరైనట్లే. దీనికి సంబంధించి ప్రకటన వెలువడడం మాత్రమే మిగిలి ఉంది. ఈ వారంతంలో రెండు పార్టీల నేతలు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ, ఆయన సోదని ప్రియాంక గాంధీ పాల్గోనున్నారు.
డింపుల్‌ యాదవ్‌, ప్రియాంకా గాంధీ కీలక పాత్ర 
ఎస్పీ కాంగ్రెస్‌ల మధ్య పొత్తు అవగాహన కుదర్చడంలో అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌, ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో మంగళవారం డింపుల్‌, ప్రియాంక గాంధీ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ప్రియాంక- రాహుల్‌ ఇంటికి వెళ్లారు. రాహుల్‌ ఇంట్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఎస్పీతో పొత్తు గురించి డింపుల్‌తో జరిగిన చర్చలను ప్రియాంక రాహుల్‌, సోనియా, పార్టీ నేతలకు వివరించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేష్‌ ఆసక్తి
కాంగ్రెస్‌తో పొత్తుకు అఖిలేష్‌ యాదవ్‌ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రెండు పార్టీలు జత కడితే 3 వందల సీట్లు కైవసం చేసుకోవచ్చని అఖిలేష్‌ భావిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రకటన ఆలస్యమవుతోంది. పార్టీపై, పార్టీ గుర్తుపై పూర్తి పట్టు సాధించాకే పొత్తుపై ప్రకటన చేయాలని అఖిలేష్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ గుర్తు కోసం ములాయం, అఖిలేష్‌ వర్గాలు ఈసీని సంప్రదించాయి. జనవరి 13న ఈసీ తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈసీ నిర్ణయం అఖిలేష్‌కు అనుకూలంగా వస్తే అదేరోజు పొత్తు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పొత్తుపై ఇరు పార్టీలు ఉత్సాహం
పొత్తుపై ఇరుపార్టీలు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఓవైపు తండ్రితో వివాదం కొనసాగుతున్నా...అఖిలేష్‌ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. డిసెంబర్‌లో ప్రియాంకాగాంధీతో అఖిలేష్‌ జరిపిన చర్చల్లో ఇరు పార్టీల మధ్య పొత్తుపై బీజం పడింది. కాంగ్రెస్‌తో పొత్తుపై ములాయం, అఖిలేష్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీతో అఖిలేష్‌ సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం పొత్తుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

 

12:49 - January 12, 2017

హైదరాబాద్ : చిన్న పని కోసం చెప్పులు అరిగేలా తిరగాలి.. పైసలు లేనిదే పనులు కావు... జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న తీరుపై సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్‌ అన్న మాటలివి. గ్రేటర్‌ వాసుల సమస్యల పరిష్కారం అవ్వాలంటే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అవినీతి లేని పాలన సాగాలని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా గ్రేటర్‌ పరిధిలో సర్కిళ్లను  పెంచింది. అయితే వాటికి అధికారాలు ఇవ్వడంలో.. కార్యాలయాలను ఏర్పాటు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తోంది. 
గ్రేట‌ర్ ప‌రిధిలో స‌ర్కిళ్ల  పెంపు 
గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న కోటి మంది జ‌నాభాకు మెరుగైన సేవ‌లు అందించాలంటే ప్రస్తుతం ఉన్నపాల‌న‌ను పూర్తిగా మార్చాల‌ని డిసైడ్ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న స‌ర్కిళ్లను భారీగా పెంచి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వ‌ర‌కు ప‌నిచేసేలా ప్లాన్‌ చేసింది. అందులో భాగంగానే 18గా ఉన్న గ్రేట‌ర్ స‌ర్కిళ్లను కొద్ది నెలల వ్యవధిలో 30 స‌ర్కిళ్లకు పెంచింది. అందుకు అనుగుణంగా అధికారుల‌ను సిబ్బందిని కేటాయించి సిటిజ‌న్స్ ప‌నులు పెండింగ్ లో ఉండ‌కుండా చూడాలని అధికారుల‌ను ఆదేశించింది ప్రభుత్వం.
ప్రభుత్వ ఆదేశాలు అమ‌లు కావ‌డం లేదు 
ఇంత వ‌ర‌కు భాగానే ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గ్రేట‌ర్ లో అమ‌లు కావ‌డం లేదు. స‌ర్కిళ్ల సంఖ్యను పెంచి మూడు నెల‌లు పూర్తి కావ‌స్తున్నా పూర్తిస్థాయిలో అధికారుల‌ను కేటాయించలేదు.  కొంద‌రు అధికారుల‌ను ట్రాన్స్ ఫ‌ర్ చేసినా ఇప్పటికీ వారు అక్కడ విధుల్లో చేరలేదు. కొన్ని చోట్ల అర‌కొరగా అధికారులు  నియ‌మించ‌బ‌డ్డప్పటికీ కార్యాల‌యాలు మాత్రం పాత ఆఫిసుల్లోనే కొన‌సాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు కొత్త కార్యాల‌యాల‌ను కేటాయించ‌డంలో మాత్రం బ‌ల్దియా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విఫ‌ల‌మ‌య్యారు. 
నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు 
ఇక అధికారుల కేటాయింపు విష‌యంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం లేదు. నలుగురు డిప్యూటి క‌మీష‌న‌ర్లకు అద‌న‌పు బాధ్యతలు ఇచ్చారు. స‌ర్కిల్ కు ఉండాల్సిన స్టాఫ్ కంటే చాలా మంది త‌క్కువ‌గా ఉన్నా రెగ్యులర్‌  స్టాఫ్‌ మాట ప‌క్కన పెడితే కనీసం కాంట్రాక్టు ఉద్యోగుల‌ను కూడా నియ‌మించ‌లేదు. దీంతో ఉన్న త‌క్కువ మంది సిబ్బందితోనే కొత్త పాత, స‌ర్కిళ్ల అధికారులు ప‌నులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న చాలా స‌ర్కిల్ కార్యాల‌యాలు ప్రజ‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన స‌ర్కిళ్లకు ఆయా ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద వార్డు ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి. 
కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న నగరవాసులు 
ఎక్కువ స‌ర్కిళ్లు ఎక్కువ మంది అధికారులు ఉంటే ప‌నులు వేగంగా జ‌రిగి ఎలాంటి అవినీతికి తావు ఉండ‌ద‌ని ప్రభుత్వం భావించినప్పటికీ.. ప‌రిస్థితిలో ఎలాంటి మార్పులేద‌నే విమ‌ర్శలున్నాయి. ఎప్పటి లాగే కార్యాల‌యాల చుట్టు చెప్పుల‌రిగేలా తిరుగాల్సి వ‌స్తుందంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిళ్లకు పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికి సమీపంలో ఉండే ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. 

 

12:42 - January 12, 2017

యాదాద్రి : సంక్రాంతి పండుగ ఎఫెక్ట్‌ యాదాద్రిపై పడింది.. సొంతగ్రామాలకువెళుతున్నవారితో రోడ్లన్నీ నిండిపోయాయి... ఒకేసారి భారీగా వాహనాలు రావడంతో పతంగి టోల్‌గేట్‌ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది..  పతంగి టోల్‌గేట్‌ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది.. 16 గేట్లకుగాను 12 గేట్లు తెరిచినా ఇదే పరిస్థితి ఉంది.. టోల్‌గేట్‌ సిబ్బంది పేటీఎం ద్వారామాత్రమే ట్యాక్స్‌ తీసుకుంటున్నారు.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను అనుమతించకపోవడంతో ట్రాఫిక్ జాం పెరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:38 - January 12, 2017

ఢిల్లీ : జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జల్లికట్టుకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. తీర్పును త్వరగా ఇవ్వాలన్న తమిళనాడు న్యాయవాధులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గన్నవరం ఎయిర్ పోర్టులో భూమి పూజ..

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టులో భూమి పూజ నిర్వహించారు. రన్ వే విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, దత్తాత్రేయలు పాల్గొన్నారు.

12:31 - January 12, 2017

ప్రకాశం : వలేటివారిపాలెంలో ఘోరం జరిగింది. ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. వలేటివారిపాలెంలో అంకమరావు (35) వివాహితుడు.. 14 ఏళ్ల వయసున్న బాలికను కిడ్నాప్ చేశాడు. నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై బాలికపై యాసిడ్ దాడి చేశాడు. అనంతరం నిందితుడు బాలిక పేరు మార్చి శిరీష అనే పేరుతో ఆస్పత్రిలో చేర్పించి, పరార్ అయ్యాడు. బాలిక ఛాతి భాగం నుంచి శరీరం కింది భాగం వరకు పూర్తిగా కాలిపోయింది. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఈనెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు అంకమరావు కోసం గాలిస్తున్నారు. 

 

విజయవాడలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ..

విజయవాడ : బీజేపీ కార్యాలయంలో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత వివేకానందను స్పూర్తిగా తీసుకోవాలని, కార్మిక శ్రేయస్సే మోడీ ప్రభుత్వ లక్ష్యమని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసేలా త్వరలో చట్టం తీసుకొస్తామన్నారు. కార్మికులకు ఈఎస్ఐ పరిమితి రూ. 21వేలకు పెంచినట్లు, ప్రతి కార్మికుడికి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విశాఖ, తిరుపతిలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను ప్రారంభిస్తామని, 2020 నాటికి కార్మికులకు గృహాలు నిర్మించాలన్నదే లక్ష్యమన్నారు.

12:12 - January 12, 2017

హైదరాబాద్ : గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్‌ ఎస్పీ సింగ్‌.. వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. 
జనవరి 26 వేడుకలపై సీఎస్‌ సమీక్ష 
68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. జనవరి 26 వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో సంబంధింత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలకు గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
పారిశుద్ధ్యం, మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు
వేడుకలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో పారిశుద్ధ్యం, మొబైల్‌ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. గన్‌పార్క్‌, క్లాక్‌టవర్‌, ఫతేమైదాన్‌లతో పాటు.. రాజ్‌భవన్‌, సెక్రటేరియెట్‌, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌లను విద్యుద్దీకరించాలని సూచించారు. 
విద్యుత్‌, మంచినీటి సౌకర్యం 
వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, మంచినీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కోసం ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుక ప్రాంగణాలను పుష్పాలతో ముస్తాబు చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. 

 

12:11 - January 12, 2017

సంక్రాంతి బరిలో 'కాటమరాయుడు' వస్తున్నాడా ? పవన్ చిత్రం రిలీజ్ కాబోతుందా ? అని అనుమానాలు పెట్టుకోకండి. మరి సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' చిత్రంలో 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. జనవరి నెలాఖరున షూటింగ్ పూర్తికానున్నట్లు టాక్. ఉగాది పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే 'కాటమరాయుడు'కి సంబంధించిన పలు ఫొటోలు విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫొటోలపై అభిమానులు అంతగా సంతృప్తి చెండడం లేదని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. పంచకెట్టుతో ఉన్న 'పవన్' లుక్ పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. దీనితో 'కాటమరాయుడు' టీజర్ అద్భుతంగా..ఆకట్టుకొనే విధంగా ఉండాలని చిత్ర యూనిట్ ప్రత్యేక శద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 14వ తేదీ సంక్రాంతి రోజున రాత్రి సమయంలో టీజర్ ను విడుదల చేయనున్నారని టాక్. మరి ఈ టీజర్ ఎలాంటి సంచనాలు సృష్టించనుందో వేచి చూడాలి.

12:08 - January 12, 2017

విజయవాడ : నేడు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది బాలయ్య వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు సినివర్గాల్లోను అమితాశక్తి నెలకొంది. బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.

 

ఐ మ్యాక్స్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐ మ్యాక్స్ కు వెళ్లనున్నారు. అక్కడ ప్రదర్శితమౌతున్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఆయన చూడనున్నారు. ఇందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

11:58 - January 12, 2017

విశాఖ : ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైంది. ఇది బాలయ్య వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు సినివర్గాల్లోను అమితాశక్తి నెలకొంది. బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:55 - January 12, 2017

తిరుపతి : నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి  ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య కెరీర్‌లో ఇది వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు సినివర్గాల్లోను అమితాశక్తి నెలకొంది. మరో వైపు బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.

 

11:52 - January 12, 2017

యాదాద్రి : యాదాద్రిలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పెద్దసంఖ్యలో వాహనాలరాకతో ట్రాఫిక్ జాం అయింది. పతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. 16 గేట్లకుగాను 12 గేట్లను తెరిచినా అదే పరిస్థితి నెలకొంది. టోల్ గేట్ దగ్గర పేటీఎం ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్టులను సిబ్బంది అనుమంతించడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:47 - January 12, 2017

గుంటూరు : సీఐ వేధిస్తున్నాడని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని కొత్తపేట మండలం పోలీసు స్టేషన్ లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెల రోజుల క్రితమే డ్యూటీలో జాయిన్ అయిన సీఐ వెంకటేశ్వర్లును కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో వెంకటేశ్వర్లు పీఎస్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు. వెంకటేశ్వర్లు తన వెంబడి తెచ్చుకున్న నిద్రమాత్రలను సీఐ సమక్షంలోనే మింగాడు. తోటి కానిస్టేబుళ్లు 
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్వర్లు మింగిన నిద్రమాత్రలను కక్కించారు. ప్రాణ అపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ఘటనపై సీఐ స్పందించ లేదు. సీఐ కానిస్టేబుళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడనే ఆరోపణ వినిపిస్తోంది. అలాగే సెలవులు ఇవ్వడం లేదని, కొంత ఆలస్యంగా వచ్చినా కూడా సీఐ మందలిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మహిళలపై అత్యాచారం..హత్య చేసిన వ్యక్తి అరె

కాకినాడ : మహిళపై అత్యాచారం..హత్య చేసి బంగారు నగలను ఎత్తుకెళుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు మహిళలపై అత్యాచారం..చేసి నిందితుడు హత్య చేశాడు. పోలీసుల విచారణలో పలు విషలయాలు వెల్లడయ్యాయి. మహిళ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి.

జల్లికట్టు పిటిషన్ తిరస్కరణ..

ఢిల్లీ : జల్లికట్టుకు అనుమతించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే చీఫ్ శశికళ ప్రధాన మంత్రి మోడీకి లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

 

వలేటివారంపాలెంలో దారుణం..

ప్రకాశం : వలేటివారిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అనంతరం బాలిక పేరు మార్చి ఆసుపత్రిలో నిందితుడు చేరిపించాడు.

ఏవియేషన్ సమ్మిట్ ప్రారంభం..

విజయవాడ : హోటల్ గేట్ వేలో ఏవియేషన్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజులు పాల్గొన్నారు.

వాటర్ బోర్డులో అధికారులతో కేటీఆర్ భేటీ..

హైదరాబాద్ : కాసేపట్లో వాటర్ బోర్డు కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. శివారు ప్రాంతాల్లో జరుగుతున్న సాగునీటి పైపులైన్ పనుల పురోగతి, రోడ్డు తవ్వకాల పునరుద్ధరణపై చర్చించనున్నారు.

చినరాజప్ప స్వగ్రామంలో కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు

కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వగ్రామంలో కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదు.  

10:34 - January 12, 2017

దేశంలో ఉపాధి తగ్గుదలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయ్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, ఎపి కాంగ్రెస్ నేత తులసీరెడ్డి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:27 - January 12, 2017

మహబూబాబాద్ : భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు, 8వేల 600 ఎకరాలు సాగులోకి వస్తాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. మహబూబాబాద్‌ జిల్లాలో తక్షణమే ఇంజనీరింగ్‌ కాలేజీతోపాటు... గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. 87వ రోజు మహాజన పాదయాత్ర మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగింది.
సామాజిక న్యాయమే ఎజెండాగా పాదయాత్ర 
సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగింది. 87వ రోజు అబ్బాయిపాలెంలో మొదలైన యాత్ర గాలివారిగూడెం, ఎల్లాదిగూడెం, పురుషోత్తమాయగూడెం, తండ ధర్మారం, లక్ష్మణ తండా, సీరోలు, రామచంద్ర తండా, రేకుల తండా, కాంపల్లి, పెరుమాళ్లసంకేత వరకు సాగింది. మొత్తం 30 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కూడా పాదయాత్ర కొనసాగింది.
డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు నీరందుతుందన్న తమ్మినేని  
తిరుమలాయపాలెం మండలంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రధాన కాలువ, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం స్టోరేజీ కేంద్రాన్ని మహాజన పాదయాత్రం బృందం సభ్యులు సందర్శించారు. భక్తరామదాసు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం డిజైన్‌ను మారిస్తే 9 గ్రామాలకు నీరందుతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు.  దీని ద్వారా 8,600 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. భక్తరామ దాసు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని తమ్మినేని ఆరోపించారు. తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలని  ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు.
సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ  
మహబూబాబాద్‌ జిల్లాలో ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదని తమ్మినేని ప్రభుత్వానికి ఆరోపించారు. ఈ జిల్లాలో తక్షణమే ఇంజనీరింగ్‌ కాలేజీలతోపాటు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.

 

సబ్ మెరైన్ కందేరి జల ప్రవేశం..

ముంబై: ది సెకండ్ స్కార్పిన్ క్లాస్ సబ్‌మెరైన్ కందేరీ ముంబైలో జలప్రవేశం చేసింది. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఈ సబ్‌మెరైన్‌ను రూపొందించింది.

గుంటూరుకు జగన్..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరుకు బయలుదేరారు. హైదరాబాద్ నుండి గన్నవరంకు విమానంలో వెళ్లిన జగన్ అక్కడి నుండి రోడ్డు మార్గాన మంగళగిరి రూరల్ మండలం పరిధిలోని హాయ్ ల్యాండ్ కు చేరుకుంటారు.

కొత్తపేట కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : కొత్తపేట పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం కలకలం రేగింది. కొంతకాలంగా సీఐ వేధిస్తున్నాడని కానిస్టేబుల్ పీఎస్ లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

09:56 - January 12, 2017

తిరుపతి : నేడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శాతకర్ణి మూవీ బెనిఫిట్‌ షో చూసిన బాలకృష్ణ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సినిమా బాగుందంటున్నారు. సినిమా సూపర్‌గా ఉందంటూ కితాబిస్తున్నారు. సూపర్ హిట్....బ్లాక్ బస్టర్ గా ఉందన్నారు. చూడనివారు సినిమా ఎక్ట్ర్సానరీగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:51 - January 12, 2017

విజయవాడ : నేడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శాతకర్ణి మూవీ బెనిఫిట్‌ షో చూసిన బాలకృష్ణ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సినిమా సూపర్‌గా ఉందంటూ కితాబిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:49 - January 12, 2017

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ సినిమా వీక్షించారు. 

 

09:47 - January 12, 2017

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 

09:42 - January 12, 2017

టాలీవుడ్ లో అప్పట్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో 'రంభ' ఒకరు. అగ్రహీరోలతో నటించిన 'రంభ' ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. వర్నకట్నం వేధింపుల కేసులో ఆమెకు పోలీసులు సమన్లు అందచేశారు. 'రంభ' సోదరుడు శ్రీనివాసరావుకు 1999లో పల్లవితో వివాహం జరిగింది. తనను భర్త...అత్తమామలు..ఆడపడుచు (రంభ) వేధించారంటూ 2014 జులైలో పల్లవి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురిపై కేసు నమోదైంది. ‘రంభ'కు సమన్లు అందచేయాలని పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. అమెరికాలో 'రంభ' ఉండడంతో వీలు కాలేదని తెలుస్తోంది. చివరకు పోలీసుల నిరీక్షణ ఫలించింది. ఓ టీవీ ఛానల్ రియాల్టీ షో కోసం 'రంభ' హైదరాబాద్ కు చేరుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పద్మాలయ స్టూడియోకు చేరుకున్నారు. అనంతరం అక్కడున్న 'రంభ'కు సమన్లు అందించారు. మరి ఈ సమన్లపై 'రంభ' ఎలా స్పందిస్తుందో చూడాలి.

09:38 - January 12, 2017

తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని సామాజిక తెలంగాణ గుండె చప్పుడు సంస్థ అధ్యక్షులు ఏపూరి సోమన్న అన్నారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులెందరో వున్నారు. చిందుబాగోతం, యక్షగానం, మందెచ్చుల, కాకిపడగల, శారద, ఒగ్గు, బైండ్ల ఇలా అనేకరకాల కళాకారులు తెలంగాణలో వున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో సాంస్కృతిక కళా సారధిని ఏర్పాటు చేసి, 550 మంది కళాకారులకు ఉద్యోగాలిచ్చారు. ఇంకా అనేకమంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో కళాకారుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో కళలకు, కళాకారులకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తోంది? వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:35 - January 12, 2017

విశాఖ : సంక్రాంతి వచ్చిందంటనే సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడుతాయి. పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. గంగిరెద్దుల ఆటలతో గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. అందంగా ముస్తాబైన గంగిరెద్దులు తరతరాల తెలుగుజాతి సంస్కృతికి ప్రతిబింబాలు. పిల్లా పెద్దలతో గడిపిన పండగ సరదాలు హృదయాల్లో మెదులుతాయి. అలాంటి గంగిరెద్దుల వాళ్ల జీవితాలు కష్టాల్లో కూరుకుపోయాయి. 
గంగిరెద్దుల కళాకారులకు కష్టాలు.. 
గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేసి ఇంటిముంగిటకు తీసుకొచ్చి ఆటలాడించి అందరినీ ఓలలాడించే గంగిరెద్దుల వృత్తి కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి.. ఆ వృత్తికి ఆదరణ లేకుండా పోయింది. సంచార జీవనం గడిపే వారికి సొంత ఇల్లు, స్థిరాస్తి లాంటివి లేవు. సమాజంలో వారికి గుర్తింపు లేకుండా పోయింది. కుల కట్టుబాట్లు మరింత కుంగదీస్తున్నాయి. గంగిరెద్దు వృత్తిదార్లు చదువు రాకపోయినా సమయస్ఫూర్తితో మాట్లాడి మెప్పించగలరు. ప్రమాదమని తెలిసినా ఎటువంటి సెట్టింగులు లేకుండా గంగిరెద్దుతో విన్యాసాలు చేయించి అందరినీ ఆశ్యర్యపర్చేలా నిలబెట్టుతారు. అబ్బురపరిచే గంగిరెద్దుల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తీ కాదు..
గంగిరెద్దుల వాళ్లపై పట్టణీకరణ ప్రభావం 
అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం పడినట్లు గంగిరెద్దుల వాళ్లపై పట్టణీకరణ ప్రభావం పడింది. గతంలో లాగా గ్రామాలలో గ్రాసం రాక బయట వేరే వృత్తులలోకి వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వృత్తి క్రమంగా కనుమరుగై ఇతర పనులకు మళ్లిపోతున్నారు. విశాఖ జిల్లాలో దాదాపు మూడు వేల వరకు గంగిరెద్దుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న దాదాపు ఆరు వేల కుటుంబాలకు జీవనోపాధి దెబ్బతిన్నది. ప్రభుత్వం నుంచి సరైన ఆదరణలేక, ప్రోత్సాహం ఇవ్వక నానా అవస్థలు పడుతున్నారు. సంచారజాతులుగా జీవనం సాగిస్తున్న ఆ కళాకారులకు రక్షణ కరువైంది. వృత్తిలేక, ఉపాధిలేక, ఆదుకొనే నాధుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జానపదకళలకు రక్షణ కల్పించాల్సిందిపోయి తిండిపెట్టే వృత్తి కనుమరుగవుతున్నా పట్టించుకొని దుస్థితి ఏర్పడింది.
భిక్షాటన చేస్తూ జీవనం
విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ముద్దుర్తి, లంకెలపాలెం, సబ్బవరం, మల్లునాయుడుపాలెం, చోడవరం, పెద్దబోడేపల్లి, మామిడిపాలెం, కె.కోటపాడు, వేపగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం సాగిస్తున్నాయి. ఏడాదిలో సంక్రాంతి రోజుల్లో తప్ప ఇతర రోజుల్లో వీరికి ఆదరణ లేక కూలీ పనులకు వెళ్తుంటారు. పట్ణణాలు, గ్రామాలకు విసిరిపడేసినట్లు దూరంగా పాకలు వేసుకొని గంగిరెద్దును తిప్పుకొనే వారికి ఇప్పుడు స్థిర నివాస స్థలాల్లేవు. గంగిరెద్దులను మేపుకొనేందుకు కాసింత స్థలమూలేదు. గంగిరెద్దులను పోషించుకోలేక ఆ వృత్తిని విడిచి ప్లాస్టిక్‌, సిల్వర్‌ సామాన్లు అమ్ముకొని జీవిస్తున్నారు. పనులు, వ్యాపారం చేసే శక్తిలేని వారు భిక్షాటన చేసుకొని బతుకు వెళ్లదీస్తున్నారు. అత్యంత వెనుకబడిన తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉన్నత తరగతికి చెందిన బి.సి(ఎ)లో చేర్చి ఎదగనీయకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తమను అదుకోవాలంటున్న గంగిరెద్దులవారు  
ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని ధీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమను ఎస్టీలలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమలో చదువుకున్న యువకులకు భవిష్యత్ అందంగా మారుతుందన్నారు. లోన్లు రాక సొంత వ్యాపారాలు ఏవైనా చెసుకునే పరిస్థితి లేక దిక్కు తోచక ఇదే వృత్తిలో కొనసాగుతున్నామంటున్నారు.

 

09:32 - January 12, 2017

హైదరాబాద్ : కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయనే నానుడిని రైల్వేశాఖ నిజం చేసింది. బంధువులకు ఆహ్వానం పలికేందుకు, వీడ్కోలు తెలిపేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చేవారిని దోచుకుంటోంది రైల్వేశాఖ. పండగ సమయంలో ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ రెట్టింపు చేసి కొత్త రకం దోపిడీకి పాల్పడుతోంది. రైల్వేశాఖ తీరుపై మధ్య తరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రజలను దోచుకునేందుకు సిద్ధమైన రైల్వేశాఖ  
పండుగ సీజన్‌లో ప్రజలను దోచుకునేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సీజన్‌లో రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ను పెంచేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట బంధువులను రిసీవ్‌ చేసుకునేందుకు.. మళ్లీ బంధువులు వెళ్లేటప్పుడు వీడ్కోలు చెప్పేందుకు అనేకమంది రైల్వేస్టేషన్‌కు తరలివస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రైల్వేశాఖ పండుగ సీజన్‌లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ను అమాంతం రెట్టింపు చేసింది. గతంలో 10 రూపాయలు ఉన్న టికెట్‌ ధరను 20 రూపాయలకు పెంచింది. 
రేట్లు పెంచడం దారుణం : ప్రజలు 
రైల్వేస్టేషన్‌కు 10 మంది కుటుంబసభ్యులు వెళ్తే 200 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. రేట్లు తగ్గించి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రజా రవాణ వ్యవస్థ అమాంతం రేట్లు పెంచడం దారుణమని ప్రజలంటున్నారు. రైల్వేశాఖ నిర్ణయంతో మధ్య తరగతిపై భారం పడుతుందని ప్రజలంటున్నారు. నోట్ల రద్దుతో అసలే అవస్థలు పడుతున్న ప్రజలు ఇలాంటి నిర్ణయంతో మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
పాసింజర్‌ టికెట్‌ ధర రూ.5, ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ.20 
మరోవైపు దగ్గర ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు పాసింజర్‌ టికెట్‌ ఐదు రూపాయలు ఉండగా.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ 20 రూపాయలకు పెంచడం దారుణమంటున్నారు. రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారిపై దృష్టి పెట్టకుండా.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకుని లోపలికి వచ్చేవారిని దోచుకోవడం దారుణమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలు తగ్గించేలా రైల్వేశాఖను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. 

 

09:29 - January 12, 2017

విజయనగరం : భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా ముగిసింది. ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట ఉద్యమ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎయిర్‌ పోర్టు ప్రభావిత గ్రామ ప్రజలు సభను బహిష్కరించారు. దీంతో అధికారులు ఉన్న కొద్దిమందితోనే ప్రజాభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా ముగించి చేతులు దులుపుకున్నారు. 
బాధిత గ్రామాల నుంచి నిరసన 
అరెస్టులు, నిరసనలు, పోలీసుల నిర్బంధం నడుమ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తూతూమంత్రంగా ముగిసింది. ప్రజాభిప్రాయ సేకరణలో బాధిత గ్రామాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తుగా ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. సభకు వెళ్లే అన్ని కూడళ్ల వద్ద భారీగా పోలీసులను పెట్టి, తనిఖీలు నిర్వహించారు. కేవలం బాధిత గ్రామాలు, సామాన్య ప్రజలు తప్పా నేతలెవర్నీ అటువైపు వెళ్లనీయకుండా కట్టుదిట్టం చేశారు. 
ప్రజాభిప్రాయ సేకరణకు చాటేసిన ముఖం ప్రజలు    
జిల్లా కలెక్టర్ అధ్యక్షత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు బాధిత గ్రామాల ప్రజలు ముఖం చాటేశారు. అభిప్రాయ సేకరణకు ఒక  రోజు ముందుగానే ఉద్యమ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సభా ప్రాంగణానికి వెళ్లే రహదారులన్నీ పోలీసుల కనుసన్ననలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పోలీసుల నిర్బంధాన్ని తప్పించుకొని సభా ప్రాంగణం వద్దకు  చేరుకున్న వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై వాపపక్ష నేతలు మండిపడ్డారు. 
ప్రజలు తీవ్ర ఆగ్రహం
దీనిపై సభకు హాజరైన ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ తరపున మాట్లాడే నేతలను అరెస్టు చేయడమేంటని నిరసిస్తూ సభకు హాజరైనవారంతా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన ప్రజలంతా వేదికకు కొంత దూరంలో ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. దీంతో అధికారులు చేసేది లేక ఉన్న కొద్ది మందితోనే సభను కొనసాగించారు. బాధిత గ్రామాలకు చెందిన కొంత మంది కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ అధికారులు వాటికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఏయిర్‌ పోర్టు కు భూములిచ్చిన వారికి తగిన న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్‌ వివేక్ యాదవ్ హామీ ఇచ్చారు. మొత్తం మీద పోలీసుల నిర్భంధంతో బాధిత గ్రామాల ప్రజల గొంతునొక్కి ఎయిర్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు ముగించేశారు. 

 

09:28 - January 12, 2017

కృష్ణా : విజయవాడ ప్రజలను విమాన విన్యాసాలు అబ్బురపర్చనున్నాయి. మూడు రోజుల పాటు ఎయిర్‌క్రాప్ట్‌ల గగనతల విన్యాసాలు వీనులవిందు చేయనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని పేరు మారు మోగేలా ఈ కార్యక్రమం జరగనుంది.
కృష్ణానది తీరాన 12, 13, 14 తేదీల్లో ఎయిర్‌ షో
కృష్ణా నది తీరాన నేటి నుంచి మూడు రోజుల పాటు ఎయిర్‌ షో జరగనుంది. దీనికోసం అధికారులు  చక చకా ఏర్పాట్లు చేస్తున్నారు. నదీ తీర ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పున్నమి స్నాన ఘాట్ వద్ద నుంచి భవానీఘాట్ వరకు మట్టితో చదును చేయిస్తున్నారు. ఘాట్ల వద్దకు వెళ్లేలా రహదారులు నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు రూ.80 లక్షల వ్యయంతో నగరపాలక సంస్థ అధికారులు పనులు నిర్వహిస్తున్నారు.
తిలకించేందుకు లక్షకు పైగా వస్తారని అంచనా
ఎయిర్‌ షోను తిలకించేందుకు లక్ష మందికిపైగా  నగర ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి  సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి అశోక్ గజపతిరాజు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కృష్ణానదిపై బ్రిటన్‌కు చెందిన నాలుగు ఎయిర్ క్రాప్ట్‌ల విన్యాసాలు చేయనున్నాయి. దాదాపు 20 నిమిషాలపాటు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి.  ఈరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 నిమిషాల వరకు, 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11.15 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 నిమిషాల వరకు, 14వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11.15 నిమిషాల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 నిమిషాల వరకు ఎయిర్ షో  జరగనుంది.
అన్నీ ఏర్పాట్లు పూర్తి 
ఎయిర్‌షో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఎయిర్‌షో ట్రయిల్‌ కూడా వేశారు. దీనిని చూసిన వీక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి ఎయిర్‌షో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని..ముందుముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేదుకు అనువుగా నదీ తీర ప్రాంతాన్ని వేదికగా మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

 

09:26 - January 12, 2017

విజయవాడ : అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకొంటున్న విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు సరికొత్త హంగులతో అందుబాటులోకి వస్తోంది. దేశ విదేశాలకు మరిన్ని సర్వీసులు ఇక్కడి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ పోర్ట్‌లో నూతనంగా నిర్మించిన టెర్మినల్‌ను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ప్రారంభించనున్నారు. 
నూతన టెర్మినల్ ముస్తాబు
విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, విశాలమైన భవన సముదాయం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేట్లు చిత్రాలు, సౌకర్యవంతమైన విశ్రాంతి గదులతో నూతన టెర్మినల్ భవనం ముస్తాబైంది. 
సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులచే ప్రారంభం 
గురువారం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు ఈ నూతన టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. దీంతో విమాన రాకపోకలు భారీగా పెరిగే అవకాశముందని విజయవాడ ఎంపీ కేశీనేని నాని తెలిపారు. 
13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం 
ఈ  నూతన టెర్మినల్ 13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేవలం 14 నెలల రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తయ్యింది. దీనికోసం 128 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ టెర్మినల్‌ గ్రౌండ్ ఫ్లోర్ లో చెక్ ఇన్ ఏరియా, సెక్యూరిటీ హోల్డ్ ఏరియా, ఎరైవల్ హాల్, జనరల్ ఏవియేషన్ లాంజ్, డోలి పార్కింగ్ అండ్ బ్యాగేజ్ మెక్ ఆఫ్ ఏరియా, కవర్డ్ గ్రీన్ ఏరియాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్ కార్యాలయాలు, సర్వీస్ జోన్, మరో జనరల్ ఏవియేషన్ లాంజ్ లు నిర్మించారు. 
నూతన టెర్మినల్‌లో చాలా ప్రత్యేకతలు
ఈ టెర్మినల్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. రద్దీ సమయాల్లో ఒకేసారి 500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా టెర్మినల్ నిర్మాణం చేశారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలందించేందుకు డిపార్చర్ బ్లాక్ లో 18 చెక్ ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 3,613 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని జనరల్ ఏవియేషన్ లాంజ్ ఏరియాల్లో వీవీఐపీల కోసం ఒక సెర్ మోనియల్ లాంజ్, వీఐపీల కోసం మరో రెండు విశ్రాంతి గదులు, అదనంగా మరో సూట్ రూమ్ ను నిర్మించారు. డిపార్చర్ లో మరో లాంజ్ ను ఏర్పాటు చేశారు. 
10 లక్షల మంది ప్రయాణ సౌకర్యం
గన్నవరం ఎయిర్‌పోర్టులోని పాత టెర్మినల్ 3200 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి ఏటా 2 లక్షల 50 వేల మంది ప్రయాణీకులకు మాత్రమే వసతలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులోకి రానున్న కొత్త టెర్మినల్ 9  ఏడాదికి 10 లక్షల మంది పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో వసతులు అందుబాటులోకి రానున్నాయి.   

 

09:25 - January 12, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌  కేంద్రాన్ని కోరారు. నీతి ఆయోగ్‌ సూచించిన విధంగా మిషన్‌ భగీరథ, కాకతీయకు 20వేల కోట్లు మంజూరు చేయాలన్నారు.  తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కేటీఆర్‌ హస్తిన పర్యటన సాగింది.  పలువురు కేంద్రమంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు.  ప్రాంతీయ విమాన అనుసంధానంపై  కేంద్ర పౌర విమానయాన శాఖతో ఒప్పందం చేసుకున్నారు.
ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎంవోయూ
తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ముగ్గురు కేంద్రమంత్రులతోపాటు నీతి ఆయోగ్‌ సీఈవో, కేంద్ర ఫైనాన్స్‌ సెక్రెటరీతో ఆయన వరుగా భేటీ అయ్యారు.  మొదట కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుతో భేటీ అయిన కేటీఆర్‌... ప్రాంతీయ విమానయాన అనుసంధానం కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్య ఒప్పందం చేసుకున్నారు.  కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు అనుమతిచ్చినందుకు  కేటీఆర్‌ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.  బేగంపేట ఎయిర్‌పోర్టును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అభివృద్ధికి ఇవ్వాలని ఆయన అశోక్‌గజపతిరాజును కోరారు. 
కేంద్రమంత్రి అనంత్‌గీతేతో కేటీఆర్‌ భేటీ
మధ్యాహ్నం 12 గంటలకు మరో కేంద్ర మంత్రి అనంత్‌గీతేతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్‌ ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  సాయంత్రం కేంద్రజౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు.  తెలంగాణ వేదికగా జాతీయ జౌళి సమ్మేళనం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.  వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు సహకారం అందించాలని కోరినట్టు కేటీఆర్‌ చెప్పారు.  సిరిసిల్లాలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటును  రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరామన్నారు.
నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో కేటీఆర్‌ భేటీ
నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌,  కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌లావసతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నీతి ఆయోగ్‌ సూచించిన 20వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో విడుదలయ్యేలా చూడాలని ఫైనాన్స్‌ సెక్రెటరీని కోరారు. తెలంగాణలో తీసుకొస్తున్న నూతన ఆవిష్కరణలను నీతి ఆయోగ్‌ సీఈవోతో  కేటీఆర్‌ చర్చించారు.   

 

సీపీఎం మహాజన పాదయాత్ర 88వ రోజు..

మహబూబాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 88వ రోజుకు చేరుకుంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్ తండా, కాంప్లాతండా, గార్లలో పాదయాత్ర జరగనుంది.

09:19 - January 12, 2017

కడప : ముఖ్యమంఏపీని నీటి భద్రత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని త్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్నారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చి.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. కడప జిల్లాలో పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 
పైడిపాలెంలో ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించారు. పైడిపాలెంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. గండికోట లిఫ్ట్‌ రాయలసీమకు గుండెకాయ అని, ముచ్చుమర్రి జీవనాడి అన్నారు చంద్రబాబు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామన్నారు. గండికోటను పూర్తి చేస్తే 26 టీఎంసీల నీరు ఉంటుందన్నారు. తాను సీఎం అయ్యాక తాగునీటి ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టిపెట్టానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నీటి భద్రత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. వర్షపు నీరును భూగర్భ జలాలుగా మారుస్తున్నామని చెప్పారు. పోలవరంను 2019 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. త్వరలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి.. కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు చంద్రబాబు.
వైసీపీ నేతలపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫైర్   
పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం తాను సాధించిన తొలి విజయమన్నారు. దూరదృష్టి, అనుభవంతోనే ప్యాకేజీకి ఒప్పుకున్నానని, పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు సాధించామని సీఎం తెలిపారు. మరోవైపు... అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. జగన్ సీమకు అన్నిరకాలుగానూ అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బుద్ధి ఉన్నవారెవరైనా సీమకు ఉపయోగపడే పట్టిసీమను వద్దంటారా? అని జేసీ ప్రశ్నించారు. జగన్‌కు తన తాత రాజారెడ్డి గుణాలు వచ్చాయన్నారు. కులం, వర్గంతో పెట్టుకుంటే లాభం లేదని జగన్‌కు జేసీ సూచించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపైనా నిప్పులు చెరిగారు.
వైఎస్ ఆర్ ఆశయం నెరవేరిందన్న : ఎంపీ అవినాష్ రెడ్డి
పైడిపాలెం రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరిందన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. పైడిపాలెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్‌ హయాంలోనే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో కరెంటు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వారి కరెంటు బిల్లులు చెల్లించి, ఆయా కాలనీలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని సీఎంను అవినాష్‌రెడ్డి కోరారు.
డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి జలదీక్ష విరమణ
కడప జిల్లాలోని సింహాద్రిపురం పైడిపాలెం చెరువులోకి నీళ్లు వస్తేనే గెడ్డం తీస్తానని శపథం చేసిన ఏపీ శాసన మండలి డిప్యూటీ  ఛైర్మన్ సతీష్ రెడ్డి తాను చేపట్టిన జలదీక్షను విరమించారు. చంద్రబాబు పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడంతో.. సతీష్‌రెడ్డి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. అనంతరం దీక్షలో భాగంగా పెంచిన తలనీలాలు తీయించుకున్నారు. 

 

పంతంగి టోల్ గేల్ వద్ద నిలిచిపోయిన 2 కి.మీ మేర వాహనాలు

యాదాద్రి : చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేల్ వద్ద 2కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఢిల్లీలో అలుముకున్న పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో 28 రైళ్లు ఆలస్యంగా నడుస్తాయి. 7 రైళ్లను రద్దు చేశారు. 8 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. 

నేడు ఏపీకి రానున్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం

విజయవాడ : నేడు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఏపీకి రానున్నారు. తెలుగు గంగ ద్వారా తమిళనాడుకు నీటిని ఇవ్వాలని పన్నీరు సెల్వం సీఎం చంద్రబాబును కోరనున్నారు. 

ఢిల్లీలో దట్టమైన పొగమంచు..

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా పొగమంచు అలుముకుంది. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 7 రైళ్లను రద్దు చేశారు. 8 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.

ట్రంప్ తొలిసారి మీడియా సమావేశం..

న్యూయర్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక డోనాల్డ్ ట్రంప్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. రష్యాలో తనకు ఆర్థికపరమైన లావాదేవీలు లేవన్నారు. ఆటోమొబైల్, ఫార్మా రంగాలపై దృష్టి పెడుతానని, భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీనిచ్చారు. ఐసీస్ పై పోరుతో రష్యాతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. పుతిన్ తనను ఇష్టపడితే అది మంచి పరిణామన్నారు.

 

09:01 - January 12, 2017

తనకు హిస్టారికల్ సినిమాలంటే ఇష్టమని టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' పేర్కొన్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలైన 'చిరంజీవి'..’బాలకృష్ణ' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘బాస్ ఈజ్ బ్యాక్' అంటూ 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ద్వారా 'చిరంజీవి' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గురువారం 'బాలకృష్ణ' నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర కథానాకులకు పలువురు బెస్ట్ విషెస్ అందించారు. తన సహచరుల నటుల సినిమాలకు 'నాగ్' కూడా బెస్ట్ విషెస్ చెప్పారు. రీ ఎంట్రీ ఇచ్చిన 'చిరు' మూవీ రిలీజ్ సందర్బంగా బెస్ట్ విషెస్ అందించాడు 'నాగ్’. అలాగే 'బాలయ్య' వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' కూడా శుభాకాంక్షలు అందచేశారు. తనకి హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ .. అందుకే 'గౌతమీపుత్ర శాతకర్ణి' హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నట్టు 'నాగ్' వెల్లడించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దర్శకుడు 'క్రిష్' తో పాటు టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి 'నాగ్' చేస్తున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' ఫిబ్రవరిలో విడుదల కానుంది.

స్వగ్రామానికి రానున్న సీఎం బాబు..

విజయవాడ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి రానున్నారు. ఈనెల 13న సాయంత్రం నుండి 15 సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో నారావారిపల్లెలో బాబు ఉండనున్నారు.

ప్రత్యేక బస్సుల మార్గాలివే..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడువనున్నాయి.
ఎంజీబీఎస్ నుంచి అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు..
ఎల్ బీ నగర్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు..
జేబీఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు..
ఉప్పల్ నుంచి వరంగల్ వైపు బస్సులు..నడపనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు.

07:03 - January 12, 2017

హైదరాబాద్ : ఎన్నికల హామీని నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ముస్లింలు, గిరిజనులకు 12శాతం  రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటున్నారు. పండుగ తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు సిద్ధమవుతున్నారు. 
రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం 
ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు  టీఆర్‌ఎస్ సర్కార్‌ డిసైడ్‌ అయ్యింది. ముస్లింలు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల అంశంపై  ఈ శీతాకాల సమావేశాల్లోనే  తీర్మానం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
టీసర్కార్‌ ప్రయత్నానికి అడ్డంకిగా ఉన్న సుప్రీం తీర్పు 
అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న సుప్రీంకోర్డు తీర్పు  సర్కారు ప్రయత్నానికి   అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకే  చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. రిజర్వేషన్లను పెంచే విధానంపై తెలంగాణ సీఎం అధికారులతో చర్చించారు.  తమిళనాడులో ఇప్పటికే 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్నందున అక్కడి విధానాన్ని అనుసరించి వ్యూహాన్ని రూపొందిస్తామంటున్నారు కేసీఆర్‌.
జనాభాను అనుసరించి రిజర్వేషన్ల డిమాండ్‌
తెలంగాణలో ఎస్టీలతో పాటు ముస్లీం జనాభా  అధికం సంఖ్యలో  ఉంది. అందుకే జనాభా నిష్పత్తిని అనుసరించి  రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్‌తో అసెంబ్లీలో తీర్మానం చేసి..పార్లమెంటుకు పంపాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించింది.  తెలంగాణలో ముస్లీంలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేసీర్‌ సర్కార్‌ నిర్ణయించింది. దీని సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు. 

 

భ్రమరాంభ థియేటర్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చూస్తున్న హీరో బాలకృష్ణ

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని భ్రమరాంభ థియేటర్ లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను హీరో బాలకృష్ణ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు, హీరో నారా రోహిత్ తిలకించారు. 

 

విజయవాడలో ఇవాళ్టి నుంచి ఎయిర్ షో

కృష్ణా : విజయవాడలో ఇవాళ్టి నుంచి ఎయిర్ షో ప్రారంభించనున్నారు. పున్నమిఘాట్ లో మూడు రోజుల పాటు ఎయిర్ షో కొనసాగనుంది. సీఎం చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయలు హాజరయ్యారు. 

 

నేడు గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త టెర్నినల్ ప్రారంభం

కృష్ణా : నేడు గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త టెర్నినల్ ప్రారంభించనున్నారు. కొత్త టెర్మినల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

నేటి నుంచి కాకినాడలో బీచ్ ఫెస్టివల్

తూర్పు గోదావరి : నేటి నుంచి కాకినాడలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఫెస్టివల్ 
జరుగనుంది. 

నేటి నుంచి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు

వరంగల్ : నేటి నుంచి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు కొనసాగునున్నాయి. 

Don't Miss