Activities calendar

13 January 2017

21:29 - January 13, 2017

ఢిల్లీ : నోట్ల ర‌ద్దుపై ప్రధాని న‌రేంద్ర మోదీని ప్రశ్నించే అవ‌కాశం లేద‌ని పార్లమెంటరీ క‌మిటీ స్పష్టం చేసింది. పిఏసి చైర్మన్, కాంగ్రెస్ నేత కేవీ థామ‌స్ చేసిన ప్రక‌ట‌న‌కు పూర్తి భిన్నంగా పీఏసీ స్పందించింది. నిబంధన 99 ప్రకారం క‌మిటీ ముందు సాక్ష్యం చెప్పడానికి లేదా సంప్రదింపుల కోసం ప్రధానిని పిలిచే అధికారం పీఏసీ ఛైర్మన్‌కు లేదని, ప్రధానికి స‌మ‌న్లు జారీ చేసే అధికారం పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి లేద‌ని బీజేపీ స‌భ్యులు నిషికాంత్ దూబె, భూపెంద‌ర్ యాద‌వ్‌, కిరీట్ సోమ‌య్య థామస్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గ‌తంలో యూపీఏ ప్రభుత్వం హ‌యాంలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి.. 2జీ స్కాం కేసులో అప్పటి ప్రధాని మ‌న్మోహ‌న్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డంపై దుమారం రేగింది. కాంగ్రెస్ స‌భ్యులు దీనికి తీవ్ర అభ్యంత‌రం చెప్పారు. అప్పుడు క‌మిటీలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండ‌టంతో జోషి నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోక త‌ప్పలేదు.

21:29 - January 13, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పరిశ్రమలశాఖ, పోలీసుశాఖల పనితీరు మెరుగ్గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పోలీసుల పనితీరు వల్ల క్రైమ్‌రేట్‌ గణనీయంగా తగ్గిందని చెప్పారు. పోలీసులు, పరిశ్రమలశాఖ అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. శాంతిభద్రతలు బాగున్నందునే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ప్రగతి భవన్‌లో హోంశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పోలీసులు మానవతా దృక్పథంతో నేరస్తులను బాగు చేస్తున్నారని చెప్పారు. ఈ సమీక్షలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతోపాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్ల నియామకాల అంశాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

21:27 - January 13, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరందుకున్నాయి. ఉదయం నుంచే పందెంరాయుళ్ల సందడి మొదలైంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. నిషేధం కొనసాగాలన్న సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. పందాలు ఆపాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారు. కరెన్సీ కేట్టల వాసన తగిలిందో ఏమో.. రెట్టించిన ఉత్సాహంతో ఫైట్‌ చేస్తున్నాయి. పెంచిన యాజమానికి కాసుల వర్షం కురిపించేందుకు ప్రత్యర్థి పుంజును మట్టికరిపిస్తున్నాయి. ఇక పుంజుల విషయం ఇలా ఉంటే దాన్ని పెంచిన బాస్‌లు కాస్కో నా రాజా అంటూ రెచ్చిపోతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పందాలు నిర్వహిస్తున్నారు.  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క కోడి పందాలే కాదు..గుండాట, పేకాట కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని మహదేవపట్నం, ఐ.భీమవరం, భీమవరం మండలంలోని వెంప, యలమంచిలి మండంలోని కలగపూడిలో కోడిపందాలు ఊపందుకున్నాయి. ఇక ముమ్మడివరంలో అయితే ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ పందాల్ని నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గంతో పాటు శృగవృక్షం, నవుడూరు, వెంప, కొణితివాడ, వడ్డి గూడెం గ్రామాల్లో కోడి పందాలు కొనసాగుతున్నాయి. కోడి పందాలు ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా...పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడడంలేదు. మరోవైపు కోడిపందాల బరుల్లోకి ఎంట్రీ పాస్‌ ఉన్నవారికే అనుమతి ఇస్తున్నారు నిర్వాహకులు.

కాల్పులు..
పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల వద్ద ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా నుంచి వెళ్లిన గంగవరపు లక్ష్మీదయాకర్‌ అనే వ్యక్తి తన కోడి గెలిచిందన్న ఆనందంతో తుపాకితో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తాడేపల్లిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మీడియాలో కథనాలు రావడంతో మొత్తానికి పోలీసులు స్పందించారు. లైసెన్స్‌ రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. అతనితో పాటు కోడిపందేల నిర్వాహకుడు శ్రీనివాసపురం వాసి పోల్నాటి బాబ్జీని కూడా అరెస్టు చేశారు. ద‌యాక‌ర్ వ‌ద్ద ఉన్న రివాల్వర్, 7 తూటాలు, 1.64 ల‌క్షల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప.గోదావరిలో..
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి గ్రామంలో పందెంరాయళ్ల జోరుకు పోలీసులు బ్రేక్‌ వేశారు. గ్రామంలో పందేలు నిర్వహిస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో ఆగ్రహించిన పందెంరాయుళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. గోకవరం మండలం మల్లవరంలో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఎటపాక మండలం కె.ఎన్‌పురంలో 9 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి కోళ్లు, కత్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వరరామచంద్రపురం మండలం బీసీకాలనీలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

సుప్రీంలో పిటిషన్..
మరోవైపు హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో జాతీయ జంతు సంరక్షణ విభాగం పిటిషన్‌ దాఖలు చేసింది. కోడిపందాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కొందరు వాటిని నిర్వహించేందుకు సిద్ధపడ్డారని తన పిటిషన్‌లో పేర్కొంది. జంతు సంరక్షణ విభాగం సభ్యురాలు గౌరీ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. కోడిపందాలను ఆపాలని ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

21:25 - January 13, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం జనాలు తమ ఊళ్లకు వెళ్తూనే ఉన్నారు. ట్రైన్స్‌, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ఏది దొరికితే దానిలో స్వగ్రామాలకు తరలుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణీకులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను జనాలు ఆశ్రయిస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్తున్న ప్రయాణీకులతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు నిండిపోతున్నాయి. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, ఉప్పల్‌లోని ప్రయాణీకులతో బస్టాండ్లు కళకళలాడుతున్నాయి. అయితే గురువారంతో పోలిస్తే శుక్రవారం మాత్రం ప్రయాణికుల రద్దీ కొంతమేర తగ్గింది. ఎంజీబీఎస్‌లోనూ ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గింది. నిన్నటి వరకు ప్రయాణీకులతో కిటకిటలాడిన ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు తగ్గారు. సొంతూళ్లకు వెళ్లేవారు ముందే ట్రైన్స్‌, ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో బుకింగ్‌లు చేసుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. శుక్రవారం ప్రయాణీకుల రద్దీ తగ్గడం వాస్తవమేనని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అదును చూసి దెబ్బకొట్టినట్టుగా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్‌ ట్రావెల్స్ ప్రయాణీకులను నిలువు‌ దోపిడీ చేస్తున్నాయి. ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచేశాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ 4000 వరకు వసూలు చేస్తున్నాయంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అన్నీ కుమ్మక్కై ధరలను పెంచేశాయని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.

ఆర్టీఏ కొరఢా..
మరోవైపు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేట్‌ దగ్గర ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 28 బస్సులపై కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకుల క్షేమమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

జవాన్ ఆరోపణలు అవాస్తవం - పీఎంఓ..

ఢిల్లీ : బీఎస్ఎఫ్ జవాన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని హోం శాఖ పేర్కొంది. బీఎస్ఎఫ్ సైనికులకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని ప్రదాన మంత్రి కార్యాలయం హోం శాఖను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం శాఖ వివరణనిచ్చింది.

టి.సర్కార్ పై కోదండరాం విమర్శలు..

మహబూబాబాద్ : తెలంగాణలో పాలన సరిగా లేదని ప్రొ.కోదండరాం విమర్శించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, సీమాంధ్ర పాలన నచ్చకే తెలంగాణ తెచ్చుకున్నామని పేర్కొన్నారు.

20:50 - January 13, 2017

సంక్రాంతి సందర్భంగా 'పవన్' అభిమానులకు 'కాటమరాయుడు' చిత్ర యూనిట్ గిఫ్ట్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘కాటమరాయుడు' చిత్ర టీజర్ విడుదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ విడుదల కాలేదు. దీనితో చిత్ర యూనిట్ ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ ఫొటోలో 'పవన్' మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎడ్లబండి కాడిపై కాలుపెట్టి, చేతిలో కండువా పట్టుకుని కనిపిస్తున్నాడు. కిషోర్ కుమార్ పార్థసానీ(డాలీ) దర్శకత్వంలో 'పవన్ కళ్యాణ్' హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'శృతిహాసన్' హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకం శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా 'కాటమరాయుడు'ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మహాజన పాదయాత్ర..గాంధీ పార్క్ వద్ద సభ..

మహబూబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 89వ రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం గాంధీ పార్క్ వద్ద బహిరంగసభ జరిగింది. ఈ సభలో పాదయాత్ర బృంద సభ్యులతో పాటు ప్రొ.కోదండరాం, మాలమహనాడు నేత అద్దంకి దయాకర్, ఎల్ హెచ్ పీఎస్ నేత బెల్లయ్య నాయక్, ఏవూరి సోమన్నలు పాల్గొన్నారు.

టి.ఆర్టీసీకి హడ్కో ఆర్థిక సాయం..

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీకి రూ. 1.33 కోట్ల ఆర్థికసాయాన్ని హడ్కో ప్రకటించింది. హైదరాబాద్ జోన్ లోని 28 డిపోలు, బస్ భవన్ లో లైట్లు అమర్చేందుకు అయ్యే ఖర్చును హడ్కో భరించనుంది.

జనవరి 17న సెలవు దినం..

తమిళనాడు : జనవరి 17న సెలవు దినంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జీ.రామచంద్రన్ వందో జయంతి సందర్భంగా సెలవు ప్రకటించింది.

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..

మధ్యప్రదేశ్ : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భోపాల్ లో చోటు చేసుకుంది.

 

20:05 - January 13, 2017

బాలీవుడ్ లో ఓ జనరేషన్ ను అలరించిన నటీమణుల్లో 'రవీనా టాండన్' ఒకరు. ప్రస్తుతం ఆమెకు ఏమైంది. ఒళ్లంతా రక్తంతో 'రవీనా' ఉన్న ఫొటో చూసి షాక్ తినకండి. పూర్తి వివరాలకు చదవండి...చాలాకాలం తర్వాత మళ్ళీ సినిమాల్లో 'రవీనా' నటిస్తోంది. అందులో భాగంగా తన వయస్సుకు తగిన పాత్రలో నటించాలని నిర్ణయించుకున్న 'రవీనా' అందుకు తగిన కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాలీవుడ్ లో 'ది మదర్' సినిమా తెరకెక్కుతోంది. సయ్యద్ తెరకెకక్కుతున్న ఈ చిత్రంలో 'రవీనా' ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోందంట. తల్లిపాత్రలో నటించిన 'రవీనా' లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తుందని టాక్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కళ్ల నిండా ధారలుగా కారుతున్న నీళ్లు.. చెరిగిపోయిన జుట్టు.. రక్తం ఓడుతున్న తల.. పెదాల నుంచి ధారలుగా కారుతున్న రక్తం.. తో ‘రవీనా’ ఫొటో ఉంది. హాలీవుడ్‌ చిత్రం 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' ఫేం మధుర్‌ మిట్టల్‌ విలన్‌ పాత్రలో కన్పించనున్నాడు. ఏప్రిల్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

19:58 - January 13, 2017

ముగిసిన రాహుల్..ఉత్తమ్ భేటీ..

ఢిల్లీ : రాహుల్ గాంధీతో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం జరిగిందని, రాష్ట్రంలో పీసీసీ ఎలా ముందుకెళ్లాలో రాహుల్ సూచించారని ఉత్తమ్ పేర్కొన్నారు. త్వరలో డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని పేర్కొన్నారు.

ఏపీలో ఐఏఎస్ ల బదిలీ..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. కార్యశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్ కు ప్రసాద్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శిగా సుమితా దావ్రా, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాములు నియమితులయ్యారు.

మావోయిస్టు జడల ఆయుధాల డంప్ స్వాధీనం..

కరీంనగర్ : మాజీ మావోయిస్టు జడల నాగరాజు ఆయుధాల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యారన్యపురిలో నాగరాజు బంధువు తోట రాములు నుండి 8 తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తోట రాములును అదుపులోకి తీసుకున్నారు. తుపాకులతో తోట రాములు భూ సెటిల్ మెంట్లకు పాల్పడ్డాడని, రాములుపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.

19:49 - January 13, 2017

ఢిల్లీ : 2017 సీజన్‌లో టీమిండియా క్రికెట్‌ టీమ్‌ నయా జెర్సీతో బరిలోకి దిగనుంది. టీమిండియా జెర్సీ బ్రాండ్‌ ‘partner’ నైకీ సంస్థ సరికొత్త జెర్సీని విడుదల చేసింది. భారత క్రికెటర్లు ధోనీ, విరాట్‌ , అశ్విన్‌తో పాటు మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో కొత్త జెర్సీతో స్పెషల్‌ ఫోటోషూట్‌ వీడియోను విడుదల చేశారు. ఈ జెర్సీతోనే భారత జట్టు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడనుంది.

19:47 - January 13, 2017

ఢిల్లీ : స‌మాజ్‌వాదీ పార్టీ సింబ‌ల్ సైకిల్‌ను ఎవ‌రికి కేటాయించాల‌న్న దానిపై ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమాజ్‌వాది పార్టీ సింబల్‌ సైకిల్‌ గుర్తును ఎవరికి కేటాయించకుండా ఈసీ రిజర్వ్‌లో ఉంచింది. 4 గంటల పాటు ములాయం, అఖిలేష్‌ వర్గాల వాదనలు పూర్తిగా విన్న ఎన్నికల సంఘం...చివ‌రికి సైకిల్ ఎవ‌రిద‌న్నది చెప్పకుండానే విచార‌ణ ముగించింది. అఖిలేష్‌ వర్గం తరపున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబ్బల్ ఈసీ ముందు హాజరయ్యారు. ఎన్నికల కమిషన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదమేనని తెలిపారు. ములాయం, అఖిలేష్ వర్గాలు బలాబలాలపై ఈసీకి అఫిడవిట్లు సమర్పించారు. ఈసీ ముందు ములాయం, అఖిలేష్‌ తరపున రాంగోపాల్‌ యాదవ్‌ హజరయ్యారు.

19:45 - January 13, 2017

ఢిల్లీ : డిజిటల్‌ ప్రపంచానికి దూరంగా ఉండే బిఎస్పీ అధినేత్రి మాయావతి తన వైఖరిని మార్చుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యువతను ఆకట్టుకునేందుకు సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. యూపీ సోషల్‌ మీడియాలో అఖిలేష్‌ అందరికన్నా ముందున్నాడు. భారత్ డిజిటలైజేషన్‌గా మారుతుండడంతో ఆ దిశగా నేతలు అడుగులు వేస్తున్నారు. ఒక సమయంలో సోషల్‌ మీడియాకు ఆమడ దూరంలో ఉండే బిఎస్‌పి చీఫ్‌ మాయావతి ఇప్పుడిప్పుడే తన వైఖరిని మార్చుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చిలో జరిగే యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బిజెపిలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకోవాలని ఆమె భావిస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో..
బిఎస్పీ మరికొద్ది రోజుల్లో ట్విట్టర్, ఫేస్‌బుక్‌ తదితర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వీడియోలను, పోస్టర్లను విడుదల చేయనుంది. ఇందుకోసం 'బహన్‌జీ కో ఆనేదో' స్లోగన్‌ను ఖరారు చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 50కి పైగా సభల్లో మాయావతి పాల్గోనున్నారు. వీటితో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్, వైట్‌హౌజ్, యూట్యూబ్‌ లాంటి సామాజిక మాధ్యమాలను కూడా మాయావతి వినియోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిఎస్‌పి ఎన్నికల గుర్తు ఏనుగుకు సంబంధించి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ అకౌంట్లు ఇప్పటికే ఉన్నాయి. కానీ అవి అంతగా ప్రాచూర్యం పొందలేదు. పార్టీ ట్విట్టర్‌పై 10 వేలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అదే యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కు 31 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉండడం గమనార్హం. అఖిలేష్‌ యాదవ్‌ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో చాలా ఫేమస్. ఆయన స్లోగన్ ' కామ్‌ బోల్తాహై' అంటే మాటలు కాదు చేతలేననని అర్థం.

వెనుకబడిన బిఎస్పీ..
సోషల్‌ మీడియా విషయంలో ఎస్పీ, బిజెపిల కన్నా బిఎస్పీ చాలా వెనకబడి ఉంది. బిజెపి తన లక్నో కార్యాలయాన్ని వార్‌ రూమ్‌గా మార్చేసింది. ఇందులో కాల్‌ సెంటర్, సోషల్‌ మీడియా గదులను ప్రత్యేకం రూపొందించింది. బిఎస్‌పికి ఉన్న ప్రధాన ఓటర్ల వెనకబడిన తరగతులవారేనని...వారికి ఆన్‌లైన్‌తో సంబంధం లేదన్న అభిప్రాయంతో మాయావతి ఉండేవారు. లక్షలాది యూవ ఓటర్లను దృష్టి పెట్టుకున్న బిఎస్పీ-సోషల్‌ మీడియా ప్రాధాన్యతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పవన్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ కాంతిని నింపాలని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకరావాలని, ఈ సంక్రాంతి ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన చేకూర్చాలని, కరెన్సీ వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దలు వ్యవహరిస్తారని విశ్వస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు.

18:11 - January 13, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంజీబీఎస్ నుండి ప్రత్యేక బస్సులు బయలుదేరుతున్నాయి. కానీ నిన్నటి కంటే శుక్రవారం సందడి తగ్గిందని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మంది ప్రైవేటు బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సైతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆర్టీసీ బస్సుల్లో కూడా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుండడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో వెళుదామంటే అక్కడా ఫుల్ రష్ నెలకొందని, సీట్లు దొరక్కపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణీకులు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్టు..

పశ్చిమగోదావరి : జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందేల ప్రారంభం సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంకు చెందిన లక్ష్మీ దయాకర్ అని పోలీసులు నిర్ధారించారు.

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పోలీసులు, పరిశ్రమల శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. త్వరలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

ముగిసిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

విజయవాడ : సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. పలు కీలక తీర్మానాలు జరిగాయి. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు తేవద్దని..బలవంతపు భూ సేకరణనను ఆపాలని..ప్రభుత్వం నిర్భంద చర్యలను విడనాడాలని...రైతులు, పేదలు చేసే పోరాటానికి మద్దతివ్వాలని తీర్మానం చేశాయి.

రాహుల్ తో ఉత్తమ్ భేటీ..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..ప్రజా ఆందోళనలపై ఉత్తమ్ చర్చిస్తున్నారు.

పామర్రు వైసీపీ ఇన్ చార్జీ జ్ఞానముణి..

విజయవాడ : పామర్రు నియోజకవర్గ బాధ్యతలను కైలే జ్ఞానముణికి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ అప్పగించారు. వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జ్ఞానముణి కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టిడిపిలోకి వెళ్లడంతో వైసీపీ ఇన్ చార్జీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక కోసం ముగ్గురు వైసీపీ నేతలు పోటీ పడ్డారు.

17:47 - January 13, 2017

ఢిల్లీ : క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉండడం సబబుగా ఉంటుందని ఇందుకు విరాట్‌ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అన్నారు. బాధ్యతయుత ఆటగాడిగా తాను జట్టులో కొనసాగుతానని తెలిపారు. వన్డే కెప్టెన్సీని వదులుకోవడానికి మానసికంగా సిద్ధమయ్యానని కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు ఉత్సాహంతో ఉన్నానని ధోని పేర్కొన్నారు. వికెట్‌ కీపర్‌గా కోహ్లీకి తగు సూచనలు ఇస్తానని మాజీ కెప్టెన్‌ చెప్పారు. వన్‌డే, 20-20 క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత మహేంద్రసింగ్‌ ధోని తొలిసారిగా మీడియా ముందు మాట్లాడారు. ప్రస్తుత టీం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

17:44 - January 13, 2017

హైదరాబాద్ : హీరో బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ఓ థియేటర్‌ నుంచి బయటకు వస్తున్న బాలకృష్ణకు అతి దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా..అతడి చేతిని బాలయ్య నెట్టేశాడు. దీంతో అతడి ఐ ఫోన్ కిందపడింది. ఈ వీడియోపై ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. పలువురు అభిమానులు బాలకృష్ణ తీరును విమర్శిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు.

17:41 - January 13, 2017

ఢిల్లీ : జవాన్లు తమ సమస్యలు ఏవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్ రావత్ సూచించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని, కొందరు అధికారులు కింది స్థాయి జవాన్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆర్మీ జవాన్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోపై ఆయ‌న స్పందించారు. ప్రతి ఆర్మీ కార్యాల‌యంలో ఫిర్యాదు బాక్స్ ఉంటుంద‌ని, సైనికులు ఏదైనా ఫిర్యాదు చేయాల‌నుకుంటే ఆ బాక్స్‌లో త‌మ ఫిర్యాదులు వేయ‌వ‌చ్చని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఫిర్యాదుల‌ను త‌నకు కూడా నేరుగా ఇవ్వవ‌చ్చన్నారు. తమకు సమస్యలు ఉంటే సోషల్ మీడియాను ఆశ్రయించడం సరికాదని, వాటిని అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని సూచించారు.

17:39 - January 13, 2017

హైదరాబాద్ : పనిచేసేది ఒకరు.... వెబ్‌సైట్‌లో కనిపించేది మరొకరు.. నెట్‌ ఉంటే చాలు ఎక్కడినుంచైనా పనులు చేసుకోవచ్చంటూ ప్రచారం... తీరా అసలు విషయానికొస్తే సొంత వెబ్‌సైట్‌నే సరిగా నిర్వహించుకోలేక సతమతం. ఇవీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ పనితీరుపై వస్తున్న విమర్శలు. తప్పులతడకగా వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తున్న బల్దియా అధికారుల తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనల్లో తామే ఫస్ట్‌అని.... అమలులోమాత్రం లాస్ట్‌అని జీహెచ్ఎంసీ మరోసారి నిరూపిస్తోంది. అంతా ఆన్‌లైన్‌లోనే హోరెత్తిస్తూ.. సొంత వెబ్‌సైట్‌ను మాత్రం తప్పులతో నింపేస్తోంది. వెబ్ సైట్‌ ఓపెన్‌ చేయగానే ఎప్పుడో ఏడాదిన్నర క్రితం విడుదలైన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఇవేకాదు బల్దియాలో పనిచేస్తున్న అధికారుల పేర్లు చూస్తే ఎవ్వరైనా పరేషాన్‌ కావాల్సిందే. మూడునెలలక్రితం 30 సర్కిళ్లు ఏర్పాటైనా ఇప్పటికీ 24సర్కిళ్లే కనిపిస్తున్నాయి. పైగా అందులో పనిచేస్తున్న డిప్యూటీ కమిషనర్ల పేర్లుకూడా అప్‌డేట్‌ కావడం లేదు. ఎప్పుడో ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోయిన వారిని ఇంకా పాతపోస్టులోనే ఉన్నట్లు చూపిస్తున్నారు. చివరకు సస్పెండ్‌ అయిన వారి పేర్లూ అలాగే ఉంటున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీలు, మెడికల్‌ అండ్ హెల్త్ ఆఫీసర్ల వివరాలూ అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్‌ అద్వైత్‌ కుమార్‌ ఐఏఎస్‌ వివరాలు అసలు ఎక్కడా కనిపించడంలేదు.

సెలవుపై వెళ్లిన హరిచందన..
ఇక సమచార హక్కు చట్టాన్నీ బల్దియా అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. అప్పిలేట్‌ అధికారులపేర్లూ తప్పుగా ఇస్తున్నారు. కొత్త అధికారులు వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా పాత వారి పేర్లు ఉంచుతున్నారు. నార్త్‌జోన్‌లో జోనల్‌ కమిషనర్‌గా పనిచేసిన హరిచందన 7నెలలక్రితం సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో శంకరయ్యను నియమించారు. అయినా ఇప్పటికీ వెబ్‌సైట్‌లో హరిచందనే అప్పిలేట్‌ అధికారిగా కొనసాగుతున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గాఉన్న గౌరవ్‌ ఉప్పల్‌ ఇప్పటికీ జీహెచ్‌ఎంసీలోనే పనిచేస్తున్నట్లు చూపుతున్నారు.

బల్దియా సేవల్ని విమర్శిస్తున్న 64శాతం మంది..
భవన నిర్మాణ అనుమతుల నుంచి పన్నుల చెల్లింపువరకూ అంతా ఆన్‌లైన్‌అంటూ ఊదరగొట్టిన బల్దియా అధికారులు ఎలా పనిచేస్తున్నారో వెబ్‌సైట్‌ చూస్తే అర్ధమవుతోంది. ఆన్‌లైన్‌ బాధ్యతల్ని నిర్వహించేందుకు గ్రేటర్ ఐటీ విభాగానికి ప్రత్యేకంగా ఒక అదనపు కమిషనర్‌తో పాటు పదుల సంఖ్యలో సిబ్బంది ఉన్నారని అధికారులు సెలవిస్తున్నారు. వాస్తవ పరిస్థితిమాత్రం మరోలా ఉంది. ఈ వెబ్‌సైట్‌ నిర్వహణపై ఒపీనియన్‌ పోల్స్‌లోనూ ఇదే విషయం నిర్ధారణ అయింది. ఈ సేవలు పూర్‌గా ఉన్నాయంటూ 14వేల 196 మంది. యావరేజ్‌గా ఉన్నాయంటూ 2వేల 156మంది... బాగా ఉన్నాయని 3వేల 507మంది ఓట్‌ చేశారు.. అంటే దాదాపు 64శాతంమంది బల్దియా సేవల్ని విమర్శిస్తున్నారు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది బల్దియా పనితీరుపై తీవ్ర ప్రభావంచూపే అవకాశముంది.. ఈ తప్పుల్ని సరిదిద్దుకుంటూ బల్దియా ముందుకు సాగాల్సిన అవసరమెంతైనా ఉంది.

17:31 - January 13, 2017
17:28 - January 13, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి మండలం ధర్మారం దగ్గర బీడీ కార్మికులు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ చనిపోగా... ఆటోలో ప్రయాణిస్తున్న 10మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో చిన్నారి కూడా ఉంది. డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

17:27 - January 13, 2017

విజయవాడ : ఆధునిక యుగంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా వారికి నేటీకీ ఆర్ధిక భద్రత లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చేనెల 10 నుంచి 12వరకు అమరావతిలో నేషనల్‌ ఉమెన్స్‌ పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశాల్లో దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ మహిళలతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మహిళా సాధికారతపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ విజయవాడలో తెలిపారు.

17:24 - January 13, 2017

పంజాబ్ : రాష్ట్రంలో లో తొలిసారిగా త్రిముఖ పోటీ నడుస్తోంది. ఏడాది క్రితం మహా జోష్ మీద వున్న ఆప్ తీరా ఎన్నికల ముంగిట్లో హవా కొనసాగించలేకపోతోంది. నిరుద్యోగం, అవినీతి, డ్రగ్స్ మాఫియా ప్రధాన ప్రచారాంశాలుగా వున్న పంజాబ్ లో అధికారం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎస్ఏడి, బిజెపి, కాంగ్రెస్, ఆప్ ఇలా అన్ని పార్టీలనూ పంజాబ్ టెన్షన్ పెడుతోంది. మునుపెన్నడూ లేనిరీతిలో త్రిముఖ పోటీ జరుగుతుండడంతో దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పంజాబ్ లో గత పదేళ్లుగా ఎస్ఏడి, బిజెపి అలయెన్స్ పాలన నడుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత మీద కాంగ్రెస్, ఆప్ చాలా ఆశలు పెట్టుకున్నాయి. 2014లో ఘోరాతి ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పంజాబ్ నుంచి పునర్జీవనం పొందాలన్న ఆశతో వుంది. పంజాబ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటే, 2019 ఎన్నికల్లో ప్రధాని మంత్రి రేసులో పోటీ పడవచ్చన్న ఆశతో పావులు కదుపుతున్నారు కేజ్రీవాల్.

2014లో..
2014 ఎన్నికల్లో దేశం మొత్తం నరేంద్ర మోడీ పవనాలు వీచినా, వాటి ప్రభావం పంజాబ్ లో కనిపించలేదు. 13 ఎంపి స్థానాలున్న ఈ రాష్ట్రంలో బిజెపి కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకుంది. దాని మిత్రపక్షం ఎస్ ఏడికి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి. కానీ, ఆప్ నాలుగు స్థానాలు గెలుచుకుని అందరినీ ఆకర్షించింది.పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుంటే, 33 సెగ్మెంట్ లలో ఆధిక్యత ప్రదర్శించింది. అధికార పక్షానికి షాకిచ్చింది. నిజానికి ఆరేడు నెలల క్రితం వరకు పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రావడం ఖాయమన్న వాతావరణం వుండేది. కానీ, గత జూన్ నుంచి పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ వచ్చాయి. పార్టీలో కుమ్ములాటలు, కొంతమంది నాయకుల అనైతిక ప్రవర్తన, సస్పెన్షన్ లు, రాజీనామాలతో ఆ పార్టీ ఇమేజ్ గ్రాఫ్ పడిపోయింది. అయిన్నప్పటికీ, ఎస్ఏడి, బిజెపి కూటమికీ, కాంగ్రెస్ పార్టీకి గట్టి సవాలు విసురుతోంది.

ఆప్..
ఢిల్లీ తర్వాత ఆప్ బలంగా వున్న రాష్ట్రం పంజాబ్. పార్టీ అధినేత కేజ్రీవాల్ తరచూ పంజాబ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. రైతులు, యువజనులు, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారులు ఇలా విభిన్నవర్గాలతో ఆయన సమావేశమవుతున్నారు. మరోవైపు బూతు స్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేశారు. పంజాబ్ లో ఆప్ సభ్యత్వం పాతిక లక్షలు దాటింది. ప్రతి పోలింగ్ బూత్ కి 5 నుంచి 10 మంది వాలంటీర్లున్నారు. ఇంత భారీ సంఖ్యలో సభ్యత్వం, యంత్రాంగం, నలుగురు ఎంపీలు వున్నా, బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం ఆప్ పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. ఒక దశలో మాజీక్రికెటర్ నవ జ్యోతి సింగ్ సిద్ధూ ఆప్ లో చేరేందుకు ఆసక్తి కనబరిచినా, డీల్ కుదరకపోవడంతో ఆయన దూరమయ్యారు. ఈ పరిణామం ఆప్ గ్రాఫిక్ ను బాగా డ్యామేజ్ చేసింది. తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకు రావాలన్న కోరికతోనే కేజ్రీవాల్ సిద్ధూ డీల్ కు ఓకే చెప్పలేదన్న ప్రచారమూ జరిగింది.

అత్యధికులు సిక్కులు..
పంజాబ్ లో అత్యధికులు సిక్కులు. వీరు 58శాతం మంది వుంటారు. కానీ, ఆప్ కి బలమైన సిక్కు నాయకుడు లేడు. అయితే, 32శాతం మంది వున్న దళితులను ఆకర్షించేందుకు ఆప్ విపరీతంగానే శ్రమిస్తోంది. ఇప్పటికే పది లక్షల దళితుల ఇళ్లకు వెళ్లి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించింది. దళితుల ఓట్లను భారీ సంఖ్యలో రాబట్టుకోగలిగితే పంజాబ్ లో విజయం సాధించవచ్చన్న అంచనాతో ఆప్ నేతలున్నారు. అయితే, పంజాబ్ పార్టీ వ్యవహారాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారన్న ప్రచారం ఆప్ ని ఇరకాటంలో పెడుతోంది. కేజ్రీవాల్ ను చూసి ఓట్లేయాలంటూ ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా కామెంట్ చేసిన మరుక్షణమే ఎస్ఏడి, కాంగ్రెస్ పార్టీలు ఆప్ ను చెడుగుడు ఆడుకున్నాయి. దీంతో తాను పంజాబ్ సిఎం అభ్యర్థిగా రంగంలో లేనంటూ కేజ్రీవాల్ చెప్పుకోవాల్సి వచ్చింది.

ఆశలన్నీ అతనిపైనే..
ఏడాది క్రితం మాదిరిగా ఆప్ కి అనుకూల వాతావరణం లేకపోవడంతో అధికార ఎస్ఏడి, బిజెపి కూటమి కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలితే అది తమకే లాభిస్తుందన్న ఆశతో అధికార పక్షం వుంది. ఓట్ల రద్దు వ్యవహారంపై చివరకు ఓటర్లు ఎట్లా స్పందిస్తారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అధికార పక్షం మీద వ్యతిరేకత, ఆప్ బలహీనతలు తమ నెత్తిన పాలు పోస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ కెప్టెన్ అమరీందర్ సింగ్ మీదనే పెట్టుకుంది. పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎవరికీ అనుకూల వాతావరణం లేదన్న వాదనే వినిపిస్తోంది.

17:21 - January 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీల నియామకం కాక పుట్టిస్తోంది. పట్టుకోసం సీనియర్లు, భవిష్యత్తు కోసం జూనియర్లు తామంటే తామంటూ పోటీ పడుతుండటం పీసీసీకి సవాల్‌గా మారింది. డీసీసీలపై ఇప్పటికే కసరత్తు చేసినా..కొన్ని జిల్లాల్లో సీనియర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. అదే డీసీసీల నియామకం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని రెండేళ్లవుతున్నా...ఇప్పటికీ బొత్స సత్యనారాయణ వేసిన కమిటీలే చాలా కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత డీసీసీల నియామకం కాంగ్రెస్‌లో సెగ పుట్టిస్తోంది.

ఉత్తర తెలంగాణలో మొదలైన డీసీసీల పంచాయితీ ..
ఇప్పుడు పాత పది జిల్లాలు పక్కనబడితే..కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు కొత్త డీసీసీల ను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. దీంతో పార్టీలో రగడ మొదలైంది. అయితే డీసీసీలుగా పనిచేస్తున్న వారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని ఏఐసీసీ నుంచి సూచనలు రావడంతో మొదట్లో కొంత వెనక్కి తగ్గిన ఆశావాహులు....ఎన్నికల నాటికి ఆ ఫార్ములా ఎలాగూ వర్కవుట్ కాదని అంచనాకొచ్చి ఇప్పుడు జోరు పెంచారు. వీటిలో దక్షిణ తెలంగాణలో పెద్దగా పోటీలేదు. ఆయా జిల్లాలకు చెందిన సీనియర్లు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో దాదాపు ఎంపిక పూర్తి చేశారు. అయితే ఇప్పుడు అసలు పంచాయితీ అంతా ఉత్తర తెలంగాణలోనే వచ్చిపడింది.

హాట్‌ హట్‌గా మారిన కరీంనగర్ డీసీసీ..
ముఖ్యంగా కరీంనగర్ డీసీసీ నియామకం హాట్‌హాట్‌గా మారింది. ఎలాగైనా డీసీసీని దక్కించుకునేందుకు ఆశావాహులు కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ డీసీసీగా పనిచేస్తున్న కటకం మృత్యుంజయం స్థానంలో తనకు అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి అడుగుతున్నారు. కౌశిక్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే డీసీసీగా ఉన్న మృత్యుంజయాన్నే తిరిగి కొనసాగించాలంటున్నారు. కౌశిక్ మాత్రం జిల్లాలో ఇతర ముఖ్యనేతల మద్దతు తనకే ఉందని చెప్పుకుంటున్నారు. దీంతో పొన్నం-కౌశిక్‌కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి...బొమ్మ శ్రీరామ్‌లు తాము సైతం రేస్‌లో ఉన్నామంటున్నారు. అంతే కాదు ఎవరికి వారు లాబియింగ్‌ కూడా చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఢిల్లీకి చేరిన మంచిర్యాల డీసీసీ లొల్లి..
ఇక ఆదిలాబాద్ నుంచి ఏర్పడ్డ కొత్త జిల్లా మంచిర్యాల డీసీసీ ఎంపిక కత్తిమీద సాముగా మారింది. ఇప్పటికే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మధ్య నడుస్తున్న వార్‌ పార్టీలో మరింత సెగ రేపుతోంది. ఈ విషయంలో పీసీసీ ముఖ్యనేతలు సైతం రెండుగా చీలిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్‌, భట్టి విక్రమార్కలు వారి వారి వర్గాలకు ప్రాతినిథ్యం కావాలని ప్టటుబడుతుండటంతో సీన్‌ రంజుగా మారింది. ఈ ఇఘ్యాతో ఉత్తమ్‌, భట్టీలు ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది. దీంతో ఈ లొల్లీ ఇప్పటికే ఢిల్లీ గడపకు చేరుకుందని సమాచారం..

వరంగల్ అర్బన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ...దయాసాగర్ ల మధ్య తీవ్ర పోటీ..
మరో వైపు పాత వరంగల్ డీసీసీ పరిస్ధితి కూడా సేమ్‌ టూ సేమ్... కొత్తగా ఏర్పాటైన భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి తన భార్య గండ్ర జ్యోతికి కావాలని మాజీ చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అడుగుతున్నారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇక వరంగల్ అర్బన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ...దయాసాగర్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక వరంగల్ రూరల్‌లో పరకాల వెంకట్రామిరెడ్డి డీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఇదీలా ఉంటే మహబూబ్‌బాద్‌లో డీసీసీని ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ అనధికారికంగా ప్రకటించారు. లోకల్ నేతల నుంచి ఏకాభిప్రాయం రావడంతో డీసీసీగా భరత్ చంద్రా రెడ్డిని డిక్లేర్ చేశారు.

ఖమ్మంలో ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు..
ఇక ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు డీసీసీకి ఇబ్బందికరంగా మారింది. రేణుకాచౌదరి..భట్టి విక్రమార్క..పొంగులేటి సుధాకర్‌లు ఎవరికీ వారు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు తమ అనుచరులను డీసీసీని కట్టబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీసీగా ఉన్న ఐతం సత్యం భట్టికి అనుచరుడిగా పేరుంది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవ డీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి రేణుకాచౌదరి తన అనుచరుడు ఎడవెల్లి కృష్ణ డీసీసీ కోసం ముమ్మరంగా లాబీంగ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎంపిక పీసీసీకి సవాల్‌గా మారింది. మొత్తానికి దక్షణ తెలంగాణలో డీసీసీల ఎంపిక కసరత్తు కూల్‌కూల్‌గా సాగిపోతుంటే ఉత్తర తెలంగాణలో మాత్రం సెగలు పుట్టిస్తోంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు సీనియర్ల ఆధిపోరుతో పీసీసీ నలిగిపోతుంది.

లిక్కర్ షాప్ లకు మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ : లిక్కర్ షాప్ లకు మళ్లీ సుప్రీంలో చుక్కెదురైంది. లైసెన్స్ లను మరో ఏడాది పెంచాలన్న పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. హైవేలపై ఉన్న లిక్కర్ షాపులను మార్చిలోగా మూసివేయాలని సుప్రీం గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

మదర్సాలో నిధుల గోల్ మాల్..

హైదరాబాద్ : మదర్సాల నిధుల గోల్ మాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు అధికారులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ సూపరింటెండెంట్ రమేష్ కు స్కాంతో సంబంధాలున్నట్లు విచారణలో వెల్లడైంది. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు డీఈవో ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ పై వేటు వేశారు.

16:16 - January 13, 2017

చిత్తూరు : తన బైక్ కు అడ్డురావడమే కాకుండా..కొద్దిగా తాకినందుకు ఓ యువకుడు..అతని స్నేహితులు మరో యువకుడిని చితకబాదారు. ఈ ఘటన అతని కండకావురానికి నిలువెత్తు నిదర్శనం. అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద బైక్ పై బాలకృష్ణమ్మ నాయుడు ఆగి ఉన్నాడు. వెనుక నుండి సైకిల్ పై వచ్చిన విజయ్ బాబు బైక్ మిర్రల్ ను కొద్దిగా తాకాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానికి గురైన బాలకృష్ణ తిట్ల దండకం అందుకున్నాడు. ఎందుకు తిడుతున్నావని విజయ్ బాబు ప్రశ్నించడంతో బాలకృష్ణ మరింత రెచ్చిపోయాడు. అక్కడనే ఉన్న అతని స్నేహితులు కూడా విజయ్ ను ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. చెట్టుకు కట్టేసి కొట్టడంతో విజయ్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

16:11 - January 13, 2017

పశ్చిమగోదావరి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కోళ్ల పందాలు జరుగుతున్నాయి. ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. ఈ ఘటన జంగారెడ్డి గూడెంలోని శ్రీనివాసపురంలో చోటు చేసుకుంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కోళ్ల పందాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసపురంలో యదేచ్చగా కోళ్ల పందాలు జరుగుతున్నాయి. అక్కడ ఓ వ్యక్తి రివాల్వర్ తో పందాల బరిలోకి ప్రవేశించాడు. తన కోడి గెలిచిందన్న ఆనందంతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ అని తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్ కు లైసెన్స్ ఉందా ? లేదా ? అనే దానిపై విచారణ జరుపుతున్నారు. కానీ గన్ మాత్రం ఇతరులదని, దయాకర్ మైనింగ్ వ్యాపారం చేస్తుంటారని తెలుస్తోంది.

బైక్ కు అడ్డువచ్చాడని యువకుడిని కొట్టిన వ్యక్తులు..

తిరుపతి : తన బైక్ కు అడ్డు వచ్చాడని ఓ యువకుడిని చెట్టుకట్టేసి బాలృకృష్ణమ్మ నాయుడు, అతని స్నేహితులు చితకబాదారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి బాలకృష్ణమ్మ నాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

హోంగార్డుల సమస్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : హోం గార్డుల సమస్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్శహించారు. హోం గార్డుల జీతాలు పెంచాలనే డిమాండ్ పై సమావేశం జరుగుతోంది. సమావేశానికి హోం మంత్రి నాయినీ, డీజీపీ అనురాగ్ శర్మ, హోం శాఖ కార్యదర్శి హాజరయ్యారు.

ముదురుతున్న ఖాదీ క్యాలెండర్..

ముంబయి : మహారాష్ట్ర ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఉద్యోగ్ క్యాలెండర్‌పై వివాదం ముదురుతోంది. నూలు వడుకుతున్న గాంధీ చిత్రంతో క్యాలెండర్‌ను కేవీఐసీ రూపొందించడం ఆనవాయితీ ఉండగా ఈ ఏడాది మాత్రం గాంధీ ఫోటో ప్లేస్‌లో ప్రధాని మోడీ ఫోటో ముద్రించడంతో వివాదం నెలకొంది.

బాబును కలిసిన జేసీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ముచ్చుమర్రి, పులివెందులకు నీటి విడుదల తదితర పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

15:38 - January 13, 2017
15:37 - January 13, 2017
15:35 - January 13, 2017
15:12 - January 13, 2017

ప్రకాశం : బస్సులోనే 'భోగి' పండుగ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. బస్సులోనే వారంతా 'భోగి' పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు పల్లెలకు పయనమౌతున్నారు. అందులో భాగంగా కొంతమంది కనిగిరికి బయలుదేరేందుకు హైదరాబాద్ నుండి బయలుదేరారు. గురువారం రాత్రి కనిగిరి డిపోకు చెందిన బస్సు 09.30కు బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5.30గంటలకు కనిగిరికి చేరాల్సిన బస్సు మధ్యాహ్నం వరకు కూడా చేరుకోలేదు. దీనితో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. బస్సులో 36 మంది ప్రయాణీకులున్నారు. ఇందులో మహిళలు..చిన్నారులు కూడా ఉన్నారు. టిఫిన్ లేకపోవడం..ఇతరత్రా ఇబ్బందులతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

14:45 - January 13, 2017

విశాఖపట్టణం : జిల్లాలో సైకోల వీరంగాలు అధికమౌతున్నాయి. ఇటీవలే ఓ సైకో దాడిలో కొంతమంది గాయపడిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. భోగి పండుగ నేపథ్యంలో కస్తూరీనగర్ లో ప్రజలు భోగి మంటలు వేసుకుంటున్నారు. అంతా సందడిగా ఉన్న సమయంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కొబ్బరి బొండాల బండిని అక్కడి జనాలపైకి తోశాడు. వెంటనే అక్కడి నుండి ప్రజలు పారిపోయారు. కానీ ఓ చిన్నారి సైకో చేతికి చిక్కింది. కత్తితో చిన్నారి గొంతు కోశాడు. వెంటనే అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన హోం గార్డుపై కూడా దాడికి పాల్పడ్డాడు. చివరకు స్థానికులు వెంబడించి సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

14:39 - January 13, 2017

కృష్ణా : జిల్లా వీరులపాటు మండలం పెద్దాపురంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణ దిగారు. ఈ ఘర్షణలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణ నేపథ్యంలో పెద్దాపురంలో పోలీసుల భారీగా మోహరించారు. గురువారం వైసీపీ నేత రోజా పర్యటన అనంతరం ఈ ఘర్షణలు తలెత్తడం గమనార్హం. గత రాత్రి నుండి ఈ గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం మాత్రం ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. మారణాయుధాలతో దాడి చేసుకొనే వరకు పరిస్థితి వెళ్లింది. తలలు..కాళ్లు..చేతులు విరిగాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన టిడిపి నేతలను ఎంపీ కేశినేని నాని పరామర్శించారు. వైసీపీ ఆగడాలను చూస్తూ ఊరుకోమని, తగిన చర్యలు తీసుకుంటామని నాని హెచ్చరించారు. వెంటనే గాయపడిన వారికి సరియైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

14:36 - January 13, 2017

 కోడి పందాలు, తమిళనాడులో జరిగే జల్లికట్టు ఆట విషయంలో రాజకీయ నాయకులు తాత్కాలిక ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమలో సామాజిక విశ్లేషకులు వివిఎస్ రవి కుమార్, తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీడీపీ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కోడి పందాలు సంప్రదాయం కాదని.. వినోదానం కోసం ఆడారాని తెలపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:30 - January 13, 2017

హైదరాబాద్ : సంక్రాంతి సంబరాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వినూత్నంగా నిర్వహించింది. బల్దియా పరిధిలో ఉన్న ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్స్‌ వద్ద అందమైన ముగ్గులను వేసి నగరాన్ని అందంగా ఉంచాలనే మెసేజ్‌ను అందిస్తున్నారు. గ్రేటర్‌లో మొత్తం 1100 ప్రాంతాల్లో ఓపెన్‌గా ఉన్న చెత్తవేసే కేంద్రాల్లో కార్మికులు అందమైన ముగ్గులను వేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను సత్కరించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

14:28 - January 13, 2017

ప్రకాశం : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను ఒక వేడుకలా నిర్వహించుకోవడం ఆనందకరమని ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. ప్రకాశం జిల్లా..ఒంగోలులోని లాయర్‌పేటలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈరోజున భోగి పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా మంత్రి హాజరై.. సంబరాల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

14:27 - January 13, 2017

విజయవాడ : నీటి కోసం యుద్ధాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్ధితుల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కేవలం 15 టీఎంసీల నీటి కోసం కర్నాటక, తమిళనాడు రెండు రాష్ట్రాలు తీవ్రస్ధాయిలో గొడవలకు దిగడం విచారకరమన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు.

సంక్రాంతి శుభాకాంక్షళు..
తెలుగుప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ తెలుగుజాతికి నూతన వెలుగులు తేవాలని ఆయన కోరుకున్నారు. ఈ సంక్రాంతి ప్రపంచంలోని తెలుగు ప్రజలందరిలో ఆనందం నింపాలన్నారు. సంక్రాంతి మన వారసత్వమని చంద్రబాబు తెలిపారు.

14:19 - January 13, 2017

సంక్రాంతి పండుగ సందర్భంగా సీనియర్ నటి కవితతో 10 టివి మానవి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాక్షాంక్షలు తెలిపారు. ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. పుస్తకాలు నేర్పే పాఠాల కన్నా.. జీవితం నేర్పించే పాఠాలు చాలా గొప్పవంటారని తెలిపారు. ఎక్కువ మంచితనం ఉండొద్దని అర్థమైందని చెప్పారు. 39 సం.రాల్లో నేర్చుకోలేనిది..40వ సం.లో నేర్చుకున్నానని తెలిపారు. తమది చిన్న కుగ్రామమని.. పెంకుటిల్లులో ఉండేవారమని గుర్తు చేశారు. భోగి, సంక్రాంతి పండుగను సంతోషంగా నిర్వహించుకునేవాళ్లమని పేర్కొన్నారు. గొబ్బెమ్మలను తయారు చేయడానికి పేడ కోసం గేదెల దగ్గరకు వెళ్లేవాళ్లమని తెలిపారు. కొన్నిసార్లు వాటి వెనకాలే వెల్లేవాళ్లమని అన్నారు. గొబ్బెమ్మల తయారీలో, పిడకలు తయారు చేసి, వాటితో భోగి మంటలు ఏర్పాటు చేయడంలో ఉన్న ఆనందం దేంట్లో ఉండేది కాదన్నారు. పల్లెటూరు అంటే, అక్కడి ఉండాలంటే చాలా ఇష్టమని తెలిపారు. అప్పుడు సరదా కోసం కోడి పందాలు ఆడేవారు.. డబ్బులు పెట్టి ఆడేవారు కాదని చెప్పారు. డబ్బులు పెట్టి, పందెం కాసి కోడింపందాలు ఆడడం తప్పని స్పష్టం చేశారు. ఆమె మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

ఆగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్..

హైదరాబాద్ : ఆగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్ జరిగింది. మంత్రులు మహబూబ్ ఆలీ, చందూలాల్, శాసనసమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు.

బాలికపై సైకో దాడి..

విశాఖపట్టణం : పదేళ్ల బాలికపై ఓ సైకో కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన సైకోను అరెస్టు చేశారు.

 

బొగ్గు స్కాంలో తుది నివేదిక సిద్ధం..

ఢిల్లీ : బొగ్గు స్కాంలో సీబీఐ తుది నివేదికను సిద్ధం చేసింది. నివేదిక సరిగ్గా లేదని ప్రత్యేక కోర్టు సీబీఐని మందలించింది. జనవరి 23న తదుపరి విచారణ జరగనుంది. వ్యాపార వేత్త నవీన్ జిందాల్, ఇతరులపై బొగ్గు స్కాం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

బడ్జెట్ పై సుప్రీంలో పిటిషన్..

ఢిల్లీ : ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనవరి 20వ తేదీన సుప్రీం విచారించనుంది.

కోడిపందాలు..విజ్ఞప్తిని తోసుపుచ్చిన సుప్రీం..

ఢిల్లీ : ఏపీలో కోడిపందాలు ఆపాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోడిపందాలు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని జాతీయ జంతు సంరక్షణ విభాగం పేర్కొంది.

 

 

14:01 - January 13, 2017

మహారాష్ట్ర : ఖాదీ గ్రామోద్యోగ్‌ ముద్రించిన 2017 కొత్త క్యాలెండర్‌ వివాదాస్పదంగా మారింది. ఆ క్యాలెండర్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి బదులు నూలు వడుకుతూ రాట్నం ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూర్చుని ఉన్న ఫొటో ఉండడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కాలెండల్‌, కేవిఐసి డైరీపై మోది పెద్ద చరఖా ముందు కూర్చొని నూలు వడుకుతున్న ఫొటోను ముద్రించారు. ఈ ఫొటోను చూసిన అధికారులు, ఉద్యోగులు హతాశులయ్యారు. రాట్నం ముందు కూర్చుని నూలు వడకడం గాంధీజీ ముద్రగా పడిపోయింది. ఈ విషయంలో గాంధీజీకి, మోడీజీకి ఎంతో వ్యత్యాసం ఉంది. గాంధీజీ చారిత్రక చరఖా అతి సామాన్యంగా ఉంటుంది. గాంధీజీ అర్ధనగ్న శరీరంతో నూలు వడుకుతూ కనిపిస్తారు. మోదీజీ ఫొటో మాత్రం ఇందుకు విరుద్ధంగా అత్యంత ఆధునికంగా కనిపిస్తుంది. గాంధీజీ ఆదర్శాలకు , ఆలోచలనకు నిదర్శనంగా ఖాదీ గ్రామోద్యోగ్‌ ఏర్పడింది.

ఏపీలో జోరుగా కోడి పందాలు

తూర్పుగోదావరి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క కోడి పందాలే కాదు..గుండాట, పేకాట కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని మహదేవపట్నం, ఐ.భీమవరం, భీమవరం మండలంలోని వెంప, యలమంచిలి మండంలోని కలగపూడిలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. 

13:54 - January 13, 2017

తూర్పుగోదావరి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ పందాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క కోడి పందాలే కాదు..గుండాట, పేకాట కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని మహదేవపట్నం, ఐ.భీమవరం, భీమవరం మండలంలోని వెంప, యలమంచిలి మండంలోని కలగపూడిలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ముమ్మడివరంలో అయితే ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ పందాల్ని నిర్వహిస్తున్నారు. కోడి పందాలు ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా...పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తికూడా చూడడంలేదు. మరోవైపు కోడిపందాల బరుల్లోకి ఎంట్రీ వాస్‌ ఉన్నవారికే నిర్వాహకులు అనుమతి ఇస్తున్నారు.

 

13:51 - January 13, 2017

కృష్ణా : కొమురవోలులో హీరో బాలకృష్ణ సందడిచేశారు.. తన సొంతగ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు.. శాతకర్ణి విజయంతో ఊపుమీదున్న బాలయ్య... ఎడ్లబండి నడిపుతూ సరదాగా గడిపారు.. బాలయ్య రాకతో గ్రామంలో పండుగవాతావరణం ఏర్పడింది.. ఆయన్నిచూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు.. 

 

టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఆధునికయుగంలో టెక్నాలజీ చాలా అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో అధికారికంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. టెక్నాలజీతో ఆనందం, ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ ఉందని.. దాన్ని గుర్తించి వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నూతన ఒరవడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఆడ బిడ్డ ఇంటికి మహాలక్ష్మీగా ఉంటుందన్నారు. విద్యార్థులు, పిల్లలు బ్యూటిఫుల్ గా డ్యాన్స్ లు చేస్తున్నారని చెప్పారు.

13:45 - January 13, 2017

విజయవాడ : ఆధునికయుగంలో టెక్నాలజీ చాలా అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో అధికారికంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. టెక్నాలజీతో ఆనందం, ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ ఉందని.. దాన్ని గుర్తించి వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నూతన ఒరవడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఆడ బిడ్డ ఇంటికి మహాలక్ష్మీగా ఉంటుందన్నారు. విద్యార్థులు, పిల్లలు బ్యూటిఫుల్ గా డ్యాన్స్ లు చేస్తున్నారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని కళలు ఉన్నాయిని తెలిపారు. కూచిపూడి డ్యాన్స్ చేసినప్పుడు పిట్ నెస్, క్రమశిక్షణ వస్తుందన్నారు. అన్ని నాట్యాల కంటే కూచిపూడి బెస్టు నాట్యమని.. ప్రపంచదేశాలు మెచ్చుకుంటున్నాయని తెలిపారు. హిందువులే కాదు క్రిస్టియన్లు కూడా కూచిపూడి నేర్చుకుంటున్నారని తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు

తూర్పుగోదావరి : జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోనసీమ, మెట్ట, కాకినాడ ప్రాంతాల్లో పందాలు కొనసాగుతున్నాయి. 

 

13:24 - January 13, 2017

విజయవాడ : నిత్యం అధికారుల సమీక్షలు, జిల్లా టూర్లతో క్షణం కూడా తీరిక లేకుండా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు కాసేపు ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పొంగలిని రుచి చూసిన చంద్రబాబు..ఆ తర్వాత ఆటలాడారు. సిర్రగోనే, తాడు బొంగురం ఆటలాడారు. ఆ తర్వాత పతంగి ఎగురవేశారు. అయితే సీఎం చంద్రబాబు పక్కనే ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్‌..దగ్గరుండి మరీ ఏ ఆట ఎలా ఆడాలో చూపించారు. 

13:22 - January 13, 2017

విజయవాడ : సంక్రాంతి సందర్భంగా బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ ప్రయాణికులతో రద్దీగా ఉంది. అయితే పండుగ సందర్భంగా రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ అదనపు బస్సుల్ని ఏర్పాటు చేయకపోవడంతో..ప్రయాణికులు గంటలకొద్ది బస్టాండ్‌లోనే పడిగాపులు గాస్తున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీనిపై మరిన్ని వివరాల్ని వీడియోలో చూద్దాం....

13:20 - January 13, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సుల అదనపు దోపిడిని అడ్డుకునేందుకు ఆర్టీఏ రంగంలోకి దిగింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పెద్ద అంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సులపై విస్త్రత తనిఖీలు  నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 28 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల క్షేమమే లక్ష్యంగా ఆర్టీఏ ఈ దాడుల్ని నిర్వహించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే..చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. 

 

13:16 - January 13, 2017

కృష్ణా : సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. బాపులపాడు మండలం అంబాపురంలో కోడిపందాలు జోరుగా కొనసాగతున్నాయి. అత్యాధునిక హంగులతో పందెం బరులు సిద్ధం చేశారు. బరుల వద్ద స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. అయితే కోడి పందాల నిర్వహణపై కోర్టు నిషేధం విధించింది. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. 
మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో దర్జాగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అధికారులు, పోలీసులు కోడి పందాల నిర్వహికులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

13:14 - January 13, 2017
13:13 - January 13, 2017

హైదరాబాద్ : రంగురంగుల పతంగులు.. చూడ ముచ్చటైన ఆకృతుల పతంగులు. వింత వింత పతంగులు.. ఇవన్నీ ఒకేచోట చేరితే ఎలా ఉంటుంది...? సరికొత్త అనుభూతిని కలిగించేలా ఎంతో నయనానందకరంగా ఉంటుంది కదూ..?  అంతటి అనందాన్ని పంచే పతంగుల పండుగకు భాగ్యనగరం రెడీ అయ్యింది. నెక్లెస్‌ రోడ్‌లో నింగిలోకి దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. మరి ఆ కైట్‌ ఫెస్టివల్‌ను కళ్లారా వీక్షించేందుకు మీరు రెడీనా?...
పతంగుల పండుగకు హైదరాబాద్‌ రెడీ 
భారీ పతంగుల పండుగకు హైదరాబాద్‌ రెడీ అయ్యింది. 2వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌కు  హైదారాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ వేదికగా నిలుస్తోంది.  ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు కైట్‌ ఫెస్టివల్‌ కన్నుల పండుగగా జరుగనుంది. ఆగాఖాన్‌ పౌండేషన్‌, తెలంగాణ టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌లో సుమారు  40 దేశాలు పాల్గొంటున్నాయి. 
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ నిర్వహణ
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను అత్యద్భుతంగా నిర్వహించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. రంగురంగులతో కూడిన భారీ పతంగులు గగనతలంలో కనువిందు చేయనున్నాయి. రిమోట్‌ సహాయంతో గాటి పటాలను ఎగరవేయడం ఈ సారి కైట్‌ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. నెక్లెస్‌ రోడ్డుతోపాటు హైదరాబాద్‌లోని 10 స్కూళ్లలో ఈ పతంగుల పండుగ కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
విజయవంతం చేయాలి : టూరిజం శాఖ 
 అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ నాలుగు రోజుల పాటు హైదరాబాదీయులను కనువిందు చేయనుంది. హైదరాబాద్‌తో పాటు యాదాద్రి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌తోపాటు మరికొన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. ఔత్సాహికులు ఈ కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొని విజయవంతం చేయాలని టూరిజంశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు.
14 నుంచి అంతర్జాతీయ డాన్స్‌ ఫెస్ట్‌ 
కైట్‌ ఫెస్టివల్‌తోపాటు హైదరాబాద్‌లో 14 నుంచి అంతర్జాతీయ డాన్స్‌ ఫెస్ట్‌ కూడా ప్రారంభంకానుంది. ఇది శిల్పారామంలో జరుగనుంది. దీనికి దేశ విదేశాల నుంచి కళాకారులు హాజరుకానున్నారు. సంప్రదాయ నృత్యాలతో అలరించనున్నారు.  హైదరాబాద్‌లో జరిగే డాన్స్‌  ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వస్తున్న కళాకారుల కోసం టూరిజంశాఖ ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి అటు కైట్‌ ఫెస్టివల్‌, ఇటు డ్యాన్స్‌ ఫెస్టివల్‌ హైదరాబాదీయులను అలరించనున్నాయి.

 

13:11 - January 13, 2017

విజయవాడ : కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ అనగానే  గుర్తుకొచ్చేది కోడి పందేలు... ఇప్పటికే దీనికోసం పలు గ్రామాల్లో రంగం సిద్ధమైంది. అయితే ఈ ఏడాది పందాలు జరుగుతాయో లేదో.. అనే ఉత్కంఠ నెలకొంది. కోడి పందాల నిర్వహణపై కోర్టు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు దీంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   
కయ్యానికి సై అంటున్న కోడిపుంజులు
కోడిపుంజులు కయ్యానికి సై అంటున్నాయి.. పందెం రాయుళ్లు తమ సత్తా చాటుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో కోడి పందాల కోసం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 
కోడిపందేలకు లక్షల్లో  పెట్టుబడులు
కోడిపందేలకు లక్షల్లో  పెట్టుబడులు.. కోట్లలో లాబియింగ్‌లు..సాగుతున్నాయి. అయితే ఈ ఏడాది కోర్టు ఆంక్షలు విధించడంతో దీనిపై కాస్త ఉత్కంఠ నెలకొంది. కోడి పందాలు కట్టడి చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. పోలీసులు పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీనికోసం పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. 
కోడిపుంజులతో పందాలకు సిద్ధం 
కాగా సంప్రదాయంగా సాగుతున్న కోళ్ల పందాలను ఆపేస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపైనే బతుకుతున్నవారు అన్యాయం అయిపోతారని వాపోతున్నారు. కోడి పందాలను నిషేధించడం సరికాదని..పలువురు అంటున్నారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా... పందేం రాయుళ్లు మాత్రం తమ జోరును ఎక్కడ ఆపడం లేదు. పక్కా ప్రణాళికతో... తమతమ కోడిపుంజులతో పందాల కోసం సిద్ధమవుతున్నారు. 
భారీ స్థాయిలో బెట్టింగ్‌లు..?
ఏదిఏమైనా.. పందాలపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉంది. శాంతి భద్రతల సమస్య ఉంది. గ్రామాల్లో ప్రతి ఏడాది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఈ పందేలు సాగుతూనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులే నిర్వాహకులకు అండగా ఉండడంతో.. పోలీసు వ్యవస్థా ఉదాశీనంగా ఉండిపోతోంది. 

 

13:10 - January 13, 2017

విజయవాడ : ఒకప్పుడు వినోదం .. ఇప్పుడు వ్యాపారం ... ఒక ఆటగా మొదలైన పందాలు ..నేడు జూదంగా మారిపోయాయి అవే కోడిపందాలు... కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి....సామాన్యుల దగ్గర నుంచి.. డబ్బున్నవాళ్ల వరకు కోడి పందేల్లో పాల్గొంటారు. కోడి పందేలపై ...పందేలు వేస్తారు. గెలుపు కోసం ఆరాటపడతారు.
ఒకప్పుడు సరదా క్రీడ
కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందేలు ఒకప్పుడు ఇది గ్రామీణులకు సరదా క్రీడ, వినోదాన్ని పంచే ఆటగా ఉండేది. కానీ ఇవ్వాళ  కోడి పందేలు అంటే అదొక గేంబ్లింగ్‌ ఆటగా మారిపోయింది. కోట్ల రూపాయలను పందెం కోళ్ల మీద కాయడానికి దేశం నలుమూలల నుంచి వస్తారు. ఈ నాలుగు రోజులు జాతర కోలాహలంగా ఉంటుంది. కోడి పందేలపై కోట్లాది రూపాయలు చేతులు మారుతూనే ఉంటాయి. ఈ పందేలను వీక్షించాలని సామాన్యులతో పాటు బడా బాబులు కూడా వస్తుంటారు. తమకి నచ్చిన కోడి మీద లక్షలు పందెం కాస్తూనే ఉంటారు.
పోటాపోటీగా పందేలు
కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలు పోటాపోటీగా జరుగుతాయి. విదేశీయులకు కూడా పందాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంటారు.. వీరు కూడా  కోళ్లపై లక్షల్లో పందెం కాసేందుకు ఆసక్తి చూపుతుంటారు. . దీంతో కోళ్ల పందేలు చాలా ఉత్కంఠ భరితంగా  సాగుతాయి. ఈ పందేలలో లక్షల్లో నష్టపోయిన వారు ఉన్నారు. అయినా.. తగ్గని ఉత్సాహంతో మళ్లీ మళ్లీ కోడి పందేల్లో పాల్గొంటూనే ఉన్నారు.  కాగా పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు.  నిర్వాహకులయితే  పందెం సొమ్ములో 10 శాతాన్ని తీతగా వసూలు చేస్తారు, ఇది నిర్వాహకుల లాభం. కోడి పందేలు ప్రస్తుతం ఒక వ్యాపారం.. వ్యసనం కూడా .. తీవ్రంగా నష్టపోయినా.. మళ్లీ మళ్లీ  కోడి పందాల్లో పాల్గొంటారు. పందేలా కోసం ఏడాదిగా ఎదురుచూస్తుంటారు. 

 

ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు

కాకినాడ : ఉభయగోదావరి జిల్లాలో కోడి పండాలు జోరుగా సాగుతున్నాయి. బరుల వద్ద స్వైపింగ్ మిషన్లు వినియోగిస్తున్నారు. 

13:04 - January 13, 2017

విజయవాడ : కోడిపందాలు ప్రతి ఏడాది ఎనలేని ఉత్సాహంతో... పక్కా ప్రణాళికతోనే సాగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో పరువు ప్రతిష్టలకు ..కోళ్లను ప్రతిరూపాలుగా చేసి.. యుద్ధానికి సిద్ధం చేస్తారు. సంప్రదాయంగా సాగుతున్న కోడిపందాలకు ఏళ్ల నాటి చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. 
అనేక దేశాల్లో చారిత్రక ఆనవాళ్లు 
కోడి పందేలు ఇప్పటివి కావు. ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచే అనేక దేశాల్లో ఈ క్రీడ ఉండేదని చెప్పడానికి చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. 1646లో జార్జి విల్సన్‌ అనే రచయిత  కాక్‌ ఆఫ్‌ ది గేమ్‌  అనే పుస్తకంలో కోడి పందేల గురించి ప్రస్తావించారు. అమెరికా, జపాన్‌, ఇరాన్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌, పెరు, ఫిలపైన్స్‌, మెక్సికో, ఫ్రాన్స్‌, క్యూబా, పాకిస్తాన్‌ మొదలైన దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోడి పందేలు కొనసాగుతూనే ఉన్నాయి. 
అనాదిగా సాగుతున్న కోడిపందాలు
ఈ కోడి పందేలు భారత దేశంలోనూ అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. మధ్య యుగాలనాడు ఈ కోడి పందేలను చూస్తూ వినోదించడమే కాక గెలుపు ఓటములపై పలు రకాల పందేలు కాసేవారట. అయితే ఈ పోటీలు కేవలం వినోదం, ఆహ్లాదం కోసమే కాక రాజ్యాలను కూడా పణంగా పెట్టేవారని చెప్పడానికి పల్నాడు చరిత్రే నిదర్శనం. 
జూదంగా మారిన కోడి పందేలు
కోడి పందాలు రెండు రకాలు.. కత్తి పందాలు.. డింకి పందాలు.. పోటీల్లో పాల్గొనే కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలో దించితే దాన్ని కత్తిపందెం అంటారు. కోడి పుంజులను మామూలుగా బరిలోకి దింపితే దాన్ని డింకీ పందెం అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.   అయితే ఈ కోడి పందేలు కోస్తా ప్రాంతంలో వేడుక ముసుగులో జూదంగా మారిపోయాయి. ఇది సంప్రదాయంగా వస్తోందని వాదిస్తుంటారు. ఈ పందేల కోసం కోళ్లను కొన్ని నెలల ముందు నుంచే బాగా మేపుతారు. పందేలకు సిద్దం చేసే కోళ్ల ధరలు కూడా లక్షల్లో ఉంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఈ కోళ్లకు నాలుగు అంగుళాల పదునైన కత్తులు కట్టి మరీ బరిలోకి వదులుతారు. 
నష్టాల గురించి ప్రజల్లో అవగాహన 
సంప్రదాయం పేరుతో సమాజంలో కోడి పందాలకు ఒక మేరకు ఆమోదం ఉందనే చెప్పాలి. ప్రతి ఏటా ఆంక్షలను.. ఆదేశాలను ధిక్కరిస్తూ యథేచ్ఛగా ..సాగుతున్నాయి.. పందాల వల్ల జరిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

13:01 - January 13, 2017

విజయవాడ : గెలుపు ఇచ్చే కిక్కుతో కొందరు...గెలవాలనే పట్టుతో మరికొందరు... బలిసిన కోళ్లతో బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలో పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణలు..తర్ఫీదులు ఇస్తున్నారు. జాతైన కోడి పుంజులను సమరానికి సిద్ధం చేస్తున్నారు.  
కోడి పందేలు..ప్రత్యేక కసరత్తు
కోట్లల్లో వ్యాపారం సాగే... కోడి పందేలు ఆషామాషీగా జరగవు.. దీనికి ప్రత్యేక కసరత్తు సాగుతుంది. నిర్వాహకులు పందానికి ఎంచుకునే కోడిపుంజు దగ్గర నుంచి...కోళ్ల కాళ్లకు కట్టే కత్తులు వరకు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. ఈ పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం, శిక్షణ కూడా ప్రత్యేకంగా వుంటాయి. 
పందాలకు ప్రత్యేకమైన కోడి 
పందాలకు ప్రత్యేకమైన కోడి పుంజులన ఎంచుకుంటారు. కోడి రంగును బట్టి ఈ పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు.  వీటిలో డేగ, కాకి ,నెమలి, పర్ల , చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు తెగల కోళ్లుంటాయి. సాధారణ కోడిపుంజులకు భిన్నంగా పందెం పుంజులు దృఢంగా ఉంటాయి. 
కోళ్ల ఆహారానికి వారానికి రూ.2వేల ఖర్చు 
పందెంకోళ్లకు ఇచ్చే ఆహారం కోసం తక్కువలో తక్కువగా వారానికి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది.  జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలు, దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి, పందెంపుంజుని దృఢంగా, ఏపుగా  తయారు చేస్తారు. ఇక పందెం దగ్గరపడే కొలదీ వాటికి తినిపించే ఆహారంలో కూడా మార్పులు చేస్తుంటారు. 
పుంజుకి ఇచ్చే శిక్షణ కఠినం 
బలమైన తిండితో పాటు పుంజుకి ఇచ్చే శిక్షణ కూడా చాల కఠినంగా ఉంటుంది. రన్నింగ్, స్విమ్మింగ్‌, ఇతరత్రా శిక్షణలు అందజేస్తారు.  రోజూ ఉదయాన్నే కోడిపుంజును పరిగెత్తిస్తారు. కోడి బాగా అలసిపోయాక దాని నోట్లో నీరుకొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు. కఫాన్ని బయటికి తీశాక పచ్చికోడిగుడ్డు తెల్లసొన తినిపించి కాసేపటి తర్వాత మరో అరగంట పరిగెత్తిస్తారు. తర్వాత కాసేపు విశ్రాంతి ఇస్తారు. 
విశ్రాంతి గడువువ ముగిసాక ఈత 
విశ్రాంతి గడువు ముగిశాక సమీపంలోని వాగు లేదా చెరువుకి తీసుకువెళ్లి ఈత కొట్టిస్తారు. రోజంతా ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ల వల్ల కోడికి ఒంటి నొప్పులు రాకుండా బాడీ మసాజ్ కూడా చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే శిక్షణ ఇచ్చిన కోడి పుంజులు పందాలకు రెడీగా ఉన్నాయి. అయితే కోర్టు ఆంక్షలున్న నేపథ్యంలో.. ఈ సంవత్సరం కోడి పందాలు జరుగుతాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. 

 

13:00 - January 13, 2017

విజయవాడ : సంక్రాంతి వచ్చింది.. కోడిపందేల సందడిని మోసుకొచ్చింది. కోర్టు ఉత్తర్వులు.. ప్రభుత్వ నిషేధాజ్ఞలు.. ఎన్నున్నా.. పందెం రాయుళ్ల జోరును మాత్రం ఆపలేక పోతున్నాయి. బలిసిన కోళ్లు.. కయ్యానికి సై అంటున్నాయి. కోట్లు చేతులు మారే తరుణం ఆసన్నమైంది. 
సంక్రాంతి పండుగ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారు. బోగి మంటలు... రంగురంగుల
ముగ్గులు.. పిండి వంటలు.. ఇంటి నిండా బంధువులు.. వారం రోజుల పాటు ఈ హడావుడి సాగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు పండుగ సమయంలో గ్రామాల్లో నిర్వహించే కోడి పందాలు ఒక ఎత్తు.
కోడి పందాలు నిర్వహణ 
పండుగ సమయంలో కోస్తా జిల్లాలోని .. గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఏడాదికి ఒక సారి జరిగే ఈ పందాలకు నెల రోజుల పాటు కసరత్తు సాగుతుంది. ఇందులో భాగంగా పందానికి జాతి పుంజులను సిద్ధం చేస్తారు. బలమైన ఆహారాన్ని పెట్టి...వ్యాయామం చేయిస్తూ.. కత్తులు దూసుకునే సమరానికి కోళ్లను సిద్ధం  చేస్తారు.    
పరువు ప్రతిష్టలకు ప్రతీకగా కోళ్ల పందాలు
సంప్రదాయంగా  కొనసాగుతున్న కోడిపందాలకు  ప్రత్యేక  క్రేజ్ ఉంది.. కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. పండుగ వారం రోజుల్లో కోళ్ల పందాల  పేరుతో పెద్ద వ్యాపారమే జరుగుతుంది. గ్రామాల్లో  పెద్దలు.. రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఈ పందాలను నిర్వహిస్తుంటారు.  కోడిపందాల్లో  గెలుపును  పరువు ప్రతిష్టలకు ప్రతీకగా  తీసుకుంటారు. అలాగే చాలామందికి  ఇది బతుకుదెరువుగా కూడా ఉంది. కోళ్ల పందాలు  పోటాపోటీగా  జరుగుతాయి. వీటిని చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా.. విదేశాల్లో ఉన్న అభిమానులు తరలివస్తారు. 

12:02 - January 13, 2017

నల్లగొండ : సంక్రాంతి రద్దీతో నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. యాదాద్రి జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా  కోర్లపాడు టోల్‌గేట్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. మాడుగులపల్లి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ పెరగడంతో  ప్రయాణీకులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:59 - January 13, 2017

అనంతపురం : జిల్లాలో సంక్రాంతి శోభను సంతరించుకొంది. ఉదయాన్నే పట్టణంలోని బీఎస్ఎన్‌ఎల్ క్వాటర్స్‌లో స్థానికులలాంతా కలిసి  భోగిమంటలు వేసుకున్నారు.  చిన్నాపెద్దా అంతా కలిసి భోగిమంటల వద్ద సందడి చేశారు.   
శ్రీకాకుళం 
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి తో సంక్రాంతి వేడుకను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు.. పల్లెల నుండి పట్టణాల వరకు వేకువ జామున బోగిమంటలు వేశారు..
సుందర సత్సంగం ఆధ్వర్యంలో బోగిమంటలు వేశారు..
తూర్పుగోదావరి 
తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. ఇంటిముందు ముగ్గులు వేస్తూ మహిళలు, యువతులు సందడి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 
పశ్చిమ గోదావరి 
పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సౌరభాలు విరబూస్తున్నాయి. హరిదాసుల కీర్తనలతో పాటు...తెలుగుదనం ఉట్టిపడేలా యువతులు సందడి చేస్తున్నారు. 
బోగిపళ్ల వేడుక
తూర్పు గోదావరి జిల్లాలో బోగిపళ్ల వేడుకను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.. చిన్నారులు ఉన్నత చదువులు చదివి గొప్పగా బతకాలంటూ ఈ వేడుక నిర్వహిస్తారు.

 

11:54 - January 13, 2017

విజయవాడ : కనకదుర్గమ్మ అమ్మవారిని హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, హీరోయిన్‌ శ్రియ దర్శించుకున్నారు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.. తెలుగుప్రజలకు వీరంతా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. సంక్రాంతి కానుకగా విడుదల శాతకర్ణి మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చెప్పారు.. సినిమాను   సక్సెస్‌ చేసిన తన అభిమానులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు..

 

11:52 - January 13, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలో సంక్రాంతి సౌరభాలు విరబూస్తున్నాయి. హరిదాసుల కీర్తనలతో పాటు...తెలుగుదనం ఉట్టిపడేలా యువతులు సందడి చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:49 - January 13, 2017

వరంగల్‌ : సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కెనడా, మలేషియా, నేపాల్‌, శ్రీలంక, ఆఫ్రికా, చైనా మహిళలు సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. రంగు రంగుల ముగ్గులు వేసి.. డ్యాన్సులు చేశారు. గంగిరెద్దుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. 
విదేశీ వనితలు
వరంగల్‌లోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ విదేశీ వనితలతో మురిసిపోయింది. కెనడా, మలేషియా, నేపాల్‌, శ్రీలంక, ఆఫ్రికా, చైనా మహిళలు జరుపుకొన్న సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి.. వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా ఎంతో హుషారుగా సంక్రాంతి వేడుకల్లో ఆడిపాడారు. డూడూ బసవన్న విన్యాసాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఎంతో ఒపిగ్గా రంగు రంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి మురిసిపోయారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 
గంగిరెద్దుల ప్రదర్శన
గంగిరెద్దుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. సంక్రాంతి తినుబండారాలను ఒకరికిఒకరు పంచుకుని రుచులను ఆస్వాదించారు. బాల వికాస స్వచ్చంధ సంస్థ కార్యకలాపాలను అధ్యాయనం చేయడానికి వచ్చిన విదేశీ బృందం తెలుగు సంస్కృతి గురించి తెలుసుకుని.. అబ్బురపడి సంక్రాంతి సంబరాలను చేసుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విదేశీ మహిళలు తెలుగు సంస్కృతి ఉట్టిపడేవిధంగా సంబరాలు జరుపుకొన్నారు. 

 

11:44 - January 13, 2017

విజయనగం : భోగభాగ్యాల భోగీ పండగను స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే జిల్లాలో సంప్రదాయ రీతిలో సంక్రాంతి వేడుకలకు ప్రజలు శ్రీకారం చుట్టారు. చిన్నా, పెద్ద అన్న వయోబేధం లేకుండా భోగీ వేడుకల్లో పాలుపంచుకున్నారు.  కష్టాలు తొలగి, సుఖశాంతులతో అంతా ఉండాలని  ఆకాంక్షిస్తూ పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. యువతి, యువకులు ఆటపాటలతో సందడి చేశారు.  

11:37 - January 13, 2017

విశాఖ : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి.. తెల్లవారుజామునే బోగిమంటలువేసుకున్న ప్రజలు సరదాగా గడిపారు.
ప్రకాశం 
ప్రకాశం జిల్లాల చీరాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజామునే ప్రజలంతా ఒక్కచోటుకు చేరి భోగిమంటలు వేశారు. భోగభాగ్యాలు కలగాలంటూ పూజలు నిర్వహిస్తున్నారు. 

11:30 - January 13, 2017

తూర్పుగోదావరి : తెలుగు పండుగలకు, పిండి వంటలకు అవినాభావ సంబంధం ఉంది. పండుగ వచ్చిందంటే పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. తెలుగు నేలపై ప్రత్యేక రుచులకు గోదావరి జిల్లాలు  పెట్టింది పేరుగా నిలుస్తాయి. రకరకాల పిండి వంటలకు ఈ ప్రాంతం మొదటి నుంచీ ప్రసిద్ధి గాంచింది.  తూర్పు గోదావరి జిల్లాలో పిండివంటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్న తాపేశ్వరంపై 10టీవీ ప్రత్యేక కథనం...
ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు
సంక్రాంతి పేరు వినగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేవి ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు. అంతేకాదు.. డూడూ బసవన్నలు కూడా ఎంతో ఫేమస్‌. తెలుగు లోగిళ్లలో వేసే ముగ్గులు, భోగి మంటలేకాదు... పిండి వంటలూ ఫేమస్సే. రకరకాల పిండి వంటలకూ సంక్రాంతి పండుగలో ఎంతో ప్రాధాన్యత ఉంది.
బంధుమిత్రులంతా ఒకచోట 
సంక్రాంతి పండుగకు బంధుమిత్రులంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. ఆటపాటలతో అల్లరి చేస్తారు. ఆ తర్వాత కాసేపు రుచులను ఆస్వాదిస్తారు. సంక్రాంతి పర్వదినాన అందరూ ఒకచోట చేరి సందడి చేస్తున్న సమయంలో వారి నోరును పిండి వంటలతో తీపి చేయడం ఆనవాయితీగా వస్తోంది. అది సంప్రదాయంగా కూడా మారింది.
పిండివంటల ఘుమఘుమలు 
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు.. వాడవాడలా పిండివంటల ఘుమఘుమలు వ్యాపిస్తాయి. ఆ వాసన చూస్తేనే చాలు కడుపు నిండిపోతుంది. వెంటనే పిండి వంటలను ఆరగించాలన్న  కోరిక పుడుతుంది. కాలం మారుతూ వస్తోంది. దాంతోపాటే మనకు బిజీ లైఫ్‌ అలవాటైంది. పండుగ సమయానికి రావడం, ఒకరోజో, రెండు రోజులో ఊర్లో గడపడం , మరునాడు మళ్లీ సిటీకి పయనమవ్వటం సాధారణమైపోయింది. ఒకప్పుడు పండుగంటే ఎక్కడెక్కడో ఉన్నవారంతా  వారం రోజులు ముందు వచ్చేవారు.  బిజీ లైఫ్‌లో ఇప్పుడా పరిస్థితులు లేవు. మరి పండివంటలు చేసుకునే టైం ఇంకెక్కడుంటుంది. అందుకే రెడీమేడ్‌ పిండివంటలు వచ్చేశాయి. చివరకు పల్లెల్లోని జనం కూడా రెడీమేడ్‌ పిండివంటలవైపు మొగ్గుచూపుతున్నారు.  సున్ని ఉండలు, చకోడీలు, అరిసెలు, కజ్జికాయలుసహా అన్ని రకాల పిండివంటల కోసం స్వీట్‌ స్టాల్స్‌ మీదే ఆధారపడుతున్నారు జనం
తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్‌ 
రెగ్యులర్‌ స్వీట్స్‌ తయారు చేసే సంస్థలు ఎన్నో తూర్పుగోదావరి జిల్లాలో వచ్చాయి. అందులోనూ సంప్రదాయ పిండివంటలకు మాత్రం కొందరే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్‌ ఒకటి. తీపిపాకపు  జరులతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు స్వీట్స్‌ రుచి  చూపించింది.  దీంతో పిండివంటల కోసం  భక్తాంజనేయ స్వీట్స్‌కు జనం ఎగబడిపోతున్నారు. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా పిండి వంటలు తయారు చేస్తున్నట్టు భక్తాంజనేయ స్వీట్స్‌  అధినేత శ్రీనుబాబు తెలిపారు. మొత్తంగా సంక్రాంతి పిండి వంటల కోసం స్వీట్స్‌ షాపులు పుట్టుకొస్తున్నాయి. సరికొత్త రుచులను అందిస్తున్నాయి. దీంతో పిండివంటల రుచులు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. 

11:07 - January 13, 2017

నెల్లూరు : సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునే ప్రజలు వీధుల్లో భోగిమంటలు వేసి.. పండగను ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రజలంతా ఒకేచోట చేరి భోగి వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. రంగు రంగుల ముగ్గులు వేసి మహిళలు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. 
ప్రకాశం 
ప్రకాశం జిల్లాల చీరాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెల్లవారుజామునే ప్రజలంతా ఒక్కచోటుకు చేరి భోగిమంటలు వేశారు. భోగభాగ్యాలు కలగాలంటూ పూజలు నిర్వహిస్తున్నారు. 

10:58 - January 13, 2017

విజయవాడ : కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. 10టీవీ, విజయక్రాంతి జూనియర్‌ కాలేజీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో పాటు చుట్టు పక్క గ్రామాల మహిళలు సైతం ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. చివరగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముగ్గుల పోటీలకు సంబందించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:45 - January 13, 2017

తూర్పుగోదావరి : సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. మనకు ముందుగా గుర్తొచ్చేది.. చలిమంటలు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు.. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు. ముఖ్యంగా తెలుగింటి లోగిళ్లలో జానపదాల సందడి కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి. అయితే..ఇప్పుడు ఈ జానపదాలు రోజురోజుకు అంతరించిపోతున్న పరిస్థితి నెలకొంది. పండుగ పబ్బాల్లో ప్రధానంగా మన సంస్కృతిని ప్రతిబింబించే కళలు మరుగున పడిపోతున్నాయి. ఈ సంక్రాంతి సందర్భంగా  జానపద కళలపై 10టివి ప్రత్యేక కథనం...!
జానపద కళలు 
జానపద కళలు మన సంస్కృతీ, సంప్రదాయాల్లో ఓ భాగం. ముఖ్యంగా సంక్రాంతికి మాత్రమే కనిపించే కొన్ని కళలు రానురాను కనుమరుగవుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తుంది. 
హరిదాసులు
నెత్తిన తలపాగా.. దానిపై చెంబు... చేతిలో చిరుతలు వాయిస్తూ.. ప్రతిఇంటిముందు దర్శనమిచ్చే హరిదాసులు చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు అలరిస్తుంటారు. హరిలో రంగ హరీ.. అంటూ.. వీనుల విందైన పాటలు పాడుతూ తెలుగింటి లోగిళ్లకు సరికొత్త శోభను తెస్తుంటారు. 
డూ డూ బసవన్నల విన్యాసాలు
ఇక సంక్రాంతికి తెలుగు వారిళ్లలో డూ డూ బసవన్నలు చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు.. అయ్యగారిని దన్నం బెట్టు.. అమ్మగారికి దన్నం బెట్టూ అని యజమాని ఆదేశించగానే.. గంగిరెద్దులు తలాడిస్తూ... మనకు నమస్కరించడం... గంగిరెద్దులను మనింటికి వచ్చిన అతిథిలుగా భావించడం.. చిన్నా పెద్దా అంతా కలిసి ఉల్లాసంగా ఎంజాయ్‌ చేయడం ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత. 
అవసాన దశకు జనపదాలు 
అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా నిలిచిన జానపదాలు.. సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త ఉత్సాహాన్ని తెస్తుంటాయి. అయితే.. ఇప్పుడు జానపదాలు అంతరించిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ జానపద కళలు పొట్టపోసుకునే పరిస్థితి లేకపోవడంతో... అవి అవసాన దశకు చేరుతున్నాయి. పూర్వం రాజులు ఆదరణలో ఉండే ఈ కళలు..ఇపుడు ప్రభుత్వమే రాజుల మాదిరిగా ఆదరించే స్థితి లేకపోవడంతో ఈ కళాకారుల కుటుంబాలు చెదిరిపోతున్నాయి. గతిలేక ఏ ఆదారం లేక ఈ కళలపై జీవనం సాగిస్తున్నారు. 
కళాకారుల జీవన పోరాటం 
కళలనే నమ్ముకుని, కళే జీవన భృతిగా బతుకుతున్న జానపద కళాకారులు.. తాము నమ్ముకున్న కళలు కడుపు నింపకపోవడంతో... అనేక మంది జానపద కళాకారులు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్లు చెల్లాచెదురయ్యారు. తోలు బొమ్మలాట వారు..గంగిరెద్దులు ఆడించే వారు.. జంగమ దేవరలు..రాచరిక కథలు చెప్పే ఒగ్గు కళాకారులు.. సామాజిక స్పృహను కలిగించే కథలు చెప్పే బుర్రకథ.. చెంచు కళాకారులు, పగటి వేషగాళ్లు.. ఇలా అనేక మంది కళాకారులు తమ ఉనికిని కోల్పోయి జీవన పోరాటం చేస్తున్నారు. శాస్త్రీయ అంశాలున్న ఎన్నో విషయాలనూ మనవారు విస్మరిస్తున్నారని సామాజిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
కాల గర్భంలో జానపద కళలు, సంస్కృతి
సంస్క్రృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్న కాలంలోనూ... కొందరు జానపద కళాకారులు మాత్రం.. ఇంకా జానపద కళలను బతికించే తాపత్రయం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో హరిదాసులు, గంగిరెద్దుల వారు తమ కళల ఉనికి కాపాడే ప్రయత్నం చేయడం నిజంగా కొనియాడదగ్గదనే చెప్పాలి. అనేక కళలు, కళారూపాలు... మన ముందే కనుమరుగవుతుంటే.. భావి తరాలకు మన సంస్కృతిని ఎలా అందుతోందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రపంచీకరణ పేరుతో జానపద కళలను సంస్కృతిని కాల గర్భంలో కలిపేస్తున్నామని..వాటిని వెలికి తీసి కాపాడాల్సిన అవసరం ఉందని జానపద పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కళాకారులందరినీ ఒక్క వేదికపై తెచ్చి వారిని ఆదుకున్నప్పుడే జానపద కళలు బతికి బట్ట కడతాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

 

10:44 - January 13, 2017

శ్రీకాకుళం : సంక్రాంతి శోభతో జిల్లా కళకళ్లాడుతోంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వాకిళ్లన్నీ రంగవల్లులతో వర్ణరంజితం అయ్యాయి. ఇళ్లన్నీ చుట్టపక్కాలతో సందడిగా మారాయి. సంవత్సరానికి ఒకసారి పుట్టిన ఊరుకివచ్చిన నగరజీవులు.. పల్లెతల్లిని కళ్లారా చూసుకుంటున్నారు. సిక్కోలు జిల్లాలో సంక్రాంతి శోభ కనువిందుచేస్తోంది.
పల్లెల్లో సంక్రాంతి శోభ 
తెలుగు పల్లెల్లను సంక్రాంతి శోభ కప్పేసింది. తెలిమంచులో అరవిరిసిన పూవులా  అపుడే విచ్చుకుంటున్న భానుని లేలేత కిరణాలు ముగ్గులవాకిళ్లను ముద్దాడుతున్నాయి. భోగిమంటల వెలుగుల్లో వేకువనే పల్లెల్లో సూర్కోదయం అయిందా అనిపిస్తోంది.
హరిదాసుల సంకీర్తనలు
కమ్మగా సంకీర్తనలు పాడుకుంటూ వీధివీధులన్నీ తిరుగుతున్న హరిదాసులు.. మగత నిద్రలో ఉన్న పల్లెలను మేల్కొలుపుతున్నారు. మూడురోజుల పండగను ఎంజాయ్‌ చేస్తామంటున్నారు పల్లెవాసులు. 
శ్రీకాకుళం జిల్లాలో జరిగే పండుగకు ప్రత్యేకత 
శ్రీకాకుళం జిల్లాలో జరిగే పండుగ రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిఉంది. ఇక్కడ చెంచుల నృత్యాలు సంక్రాంతి శోభకు మరింత మెరిపిస్తున్నాయి. పురాణాల కథలను కమ్మని సంగీతంతో  వినసొంపుగా గానం చేయడం .. అద్భుతంగా ఉంటోంది. 
ముగ్గులు, గొబ్బెమ్మలు, పూజలు.. 
పండగరోజు మహిళలు ముగ్గులు, గొబ్బెమ్మలు, పూజలు.. పిండివంటలతో బిజీగా  ఉంటే.. యువకులు మాత్రం.. పందేలతో అబ్బురపరుస్తారు.  ఇదిగో ఇలా బరువుల ఎత్తుతూ బస్తీమేసవాల్‌ అని ఈ యువకుడు బండరాతిని ఓపట్టుపట్టడం వారెవా అనిపిస్తోంది కాదూ..!
పట్టణాలకు వెళ్లినవారు..సొంతూళ్లకు 
మరోవైపు ఉద్యోగాలు, ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు వెళ్లినవారు..సొంతూళ్లకు చేరుకుని పండుగను ఎంజాయ్‌ చేస్తున్నారు. పుట్టిన ఊరును ఓసారి కళ్లారాచూసుకుని.. చిన్ననాటి సంగతులను చెప్పుకుంటూ ఆనందపడుతున్నారు. 
చిన్ననాటి స్మృతులు  
మొత్తం మీద కష్టాలను కాస్తా మైమరపిస్తూ, ఒత్తిడిలను దూరం చేస్తూ... ఆనందాలను రెట్టింపు చేస్తూ... చిన్ననాటి స్మృతులు గుర్తు చేస్తూ... సాంస్కృతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సంక్రాంతి పల్లెలకు కొత్త శోభను తెచ్చిపెడుతోంది... పెద్దనోట్ల రద్దుతో అతలాకుతలం అయిన పల్లెలకు పండగచేసుకోవడం భారమే అయినా సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి శ్రీకాకుళం పల్లెలు.  

10:42 - January 13, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి శోభ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా పండుగ సంబరాలు నిర్వహిస్తోంది. వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేసి.. పండగను ఎంజాయ్‌ చేస్తున్నారు. 
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే వీధుల్లో భోగి మంటలు వేసి.. పండగను ఎంజాయ్‌ చేస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ఘనంగా పెద్ద పండుగ జరుపుకుంటున్నారు. ఉల్లాసంగా విద్యార్థులు పాల్గొన్నారు. భోగి మంటలు, పిండి వంటలు, నృత్యాలు, బొమ్మల కొలుపులు, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. పిడకలతో మంటలు వేసి.. స్థానికులు భోగి మంటలు చుట్టూ ఉత్సాహంగా తిరుగుతున్నారు.
విజయవాడలో 
కృష్ణా జిల్లాలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భోగి మంటలు నిర్వహిస్తున్నారు. 4 గంటల నుంచి భోగి మంటల్లో మునిగి తేలుతున్నారు.
విశాఖ జిల్లాలో
విశాఖ సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేసి.. పండగను ఎంజాయ్‌ చేస్తున్నారు. లిటిల్‌టైగర్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో యువకులు భోగిమంటలు వేసి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
కాకినాడలో 
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజామునే ప్రజలు వీధుల్లో భోగిమంటలు వేసి.. పండగను ఎంజాయ్‌ చేస్తున్నారు. 

10:40 - January 13, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి... పట్టణాలు.. పల్లెల్లో.. పండుగ సందడి నెలకొంది. ముగ్గుల పోటీలు..భోగి మంటలు..పిండి వంటలు.. యువత ఆట పాటలతో సంక్రాంతి జోష్‌ మరింతగా పెరిగింది. 
ఏపీలో అధికారికంగా సంక్రాంతి సంబరాలు 
సంక్రాంతి పండుగ ఔచిత్యాన్ని తెలియజేసేలా.. ఏపీలో ప్రభుత్వమే అన్ని జిల్లాల్లో అధికారికంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా విశాఖపట్నం- ఏయూలో సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు.. భోగి మంటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొని.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏలూరులోను సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత అధికారులు ఏర్పాటు చేసిన సంక్రాంతి స్టాళ్లను తిలకించి.. అనంతరం ఎడ్లబండిని నడిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. శ్రీ చిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాలలోనూ విద్యార్థులు.. బొమ్మల కొలువులు.. ముగ్గుల పోటీలు.. సంప్రదాయ నృత్యాలతో అందరినీ అలరించారు. 
తెలంగాణాలో 
తెలంగాణాలోనూ వాడవాడలా పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. హన్మకొండ నయీంనగర్‌లోని మాస్టర్‌ జీ హైస్కూల్లో మైత్రి సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, విద్యావేత్త సుందర్‌రాజు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ నృత్యాలతో..చీరకట్టుతో అందరినీ  అలరించారు. 
చెన్నైలోనూ పొంగల్‌ సంబరాలు 
చెన్నైలో కూడా పొంగల్‌ సంబరాలు మిన్నంటాయి. కన్యకాపరమేశ్వరి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ మహిళా కళాశాలలో పండుగను నిర్వహించారు. కాలేజ్‌ ప్రాంగణంలో ఎడ్ల బళ్లు.చెరకు గడలు.. రంగులరాట్నాలు..రంగవల్లులతో పల్లె వాతావరణాన్ని సృష్టించి.. తెలుగు సంస్కృతిని చాటిచెప్పారు.   

 

నేషనల్ హైవే 65పై వాహనాల రద్దీ

యాదాద్రి : జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద  
కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

కోర్లపాడు, మాగులపల్లి టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ

నల్గొండ : కేతేపల్లి మండలం కోర్లపాడు టోల్ గేట్, మాగులపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు రద్దీ కొనసాగుతోంది. 

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ, క్రిష్, శ్రియ,

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, శ్రియ దర్శించుకున్నారు. బాలకృష్ణ, క్రిష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నేటి నుంచి ఆగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్

హైదరాబాద్ : నేటి నుంచి ఆగాఖాన్ అకాడమీలో మూడు రోజులపాటు కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా నైట్ లైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. సింగపూర్, సౌతాఫ్రికా నుంచి కైట్ ఫ్లయర్స్ వచ్చారు. 

నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సెమీస్

హైదరాబాద్ : నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సెమీస్ మ్యాచులు జరుగనున్నాయి. అవధ్ వారియర్..చెన్నై, ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. 

Don't Miss