Activities calendar

14 January 2017

21:31 - January 14, 2017

కేరళ : శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. సంక్రాంతి పర్వదినాన సాయంత్రం వేళలో పొన్నాంబమేడు పచ్చనికొండపై మిణుకు మిణుకుమంటూ మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని చూసి భక్తులు తరించిపోయారు. జ్యోతిని దర్శించుకోవడానికి లక్షలాదిమంది ప్రజలు తరలివచ్చారు. మకరజ్యోతి దర్శనమిచ్చిన వేళలో శరణు.. శరణు అంటూ భక్తుల నినాదాలతో శబరిమల మార్మోగింది. పవిత్ర శబరిమల.. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో మారుమోగింది. పొన్నాంబల మేడు పర్వతంపై జ్యోతి స్వరూపంలో దర్శనమిచ్చిన హరిహర పుత్రున్ని తిలకించి.. లక్షలాదిమంది అయ్యప్ప స్వాములు పులకించారు. ఆ హరిహర పుత్రున్ని దర్శించకునేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. పంబ నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు లక్షలాదిమంది అయ్యప్పలు బారులు తీరారు.

కేరళ ప్రభుత్వం..
మకర జ్యోతి దర్శనానికి లక్షల సంఖ్యలో అయ్యప్పలు తరలిరావడంతో... భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంతకు ముందు మకర నక్షత్ర దర్శనాన్ని అయ్యప్పలు వీక్షించారు. అనంతరం జ్యోతి రూపంలో హరిహర సుతుడు దర్శనమివ్వడంతో.. అయ్యప్పల శరణుఘోషలతో, శరణు కీర్తనలతో శబరిమల ప్రతిధ్వనించింది. మకర జ్యోతి దర్శనానికి శబరిమల కొండకు అయ్యప్పలు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మకర జ్యోతి దర్శనానికి బారులు తీరారు. సాయంత్రం 6.40 నిమిషాలకు స్వామి మకరజ్యోతి దర్శనం అయ్యప్ప భక్తులకు లభించింది.

లక్షలాది మంది అయ్యప్ప స్వాములు..
కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు మకర జ్యోతి దర్శనానికి వచ్చారు. జ్యోతి దివ్యదర్శనం కోసం భక్తులు ఓపిగ్గా ఎదురు చూశారు. సంక్రాంతి పర్వదినాన చిమ్మ చీకట్లో మూడుసార్లు కనిపించే జ్యోతిని దర్శనం చేసుకుంటే అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని భక్తుల విశ్వాసం. శబరిమలలో గతంలో జరిగిన తొక్కిసలాట ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 1300 మంది పోలీసులను భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.

21:28 - January 14, 2017

పంజాబ్ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సూర్జిత్‌సింగ్‌ బర్నాలా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. బర్నాలా అక్టోబర్‌ 21, 1925లో హరియాణాలోని అటేలీలో జన్మించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. అనంతరం 1977లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా కూడా సేవలందించారు. అనంతరం 1985 నుంచి 1987 వరకు పంజాబ్‌ ముఖ్యమంత్రి గానూ ఉన్నారు. 2000 నుంచి 2011 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్‌గా పనిచేసిన సూర్జిత్‌సింగ్‌ బర్నాలా మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు.

21:27 - January 14, 2017

బీహార్‌ : ఘోరం జరిగింది. 40 మందితో కూడిన ఓ పడవ గంగానదిలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో తొమ్మిది మందికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని కాపాడేందుకు జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

21:26 - January 14, 2017

కరీంనగర్ : అక్రమ దందాలతో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధాలు లేవని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ లో పొలీసులు తయారు చేసిన డేగకన్ను యాప్ ను, వన్ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మట్కా, గుట్కా దందాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. శాంతి భద్రతలు సాఫీగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించామని, అందుకే పోలీసు యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మించనున్నామని చెప్పారు.

21:24 - January 14, 2017
21:24 - January 14, 2017

హైదరాబాద్ : ఆనందాల సంక్రాంతి పండగలో గాలిపటాల కోలాహాలం మిన్నంటుతోంది. రంగు రంగుల పతంగులతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పల్లె, పట్ణణాలు మెరిసిపోతున్నాయి. నీలిరంగుల ఆకాశం వర్ణరంజితం అవుతోంది. పతంగుల పోటీలతో హైదరాబాద్‌లో యూత్‌ పండగ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కైట్‌ ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సంక్రాంతి పండుగలో పతంగుల జోష్‌ కనిపిస్తోంది. అంతర్జాతీయ నైట్ కైట్‌ ఫెస్టివల్‌ను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఆగాఖాన్‌ అకాడమీ సహకారంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 13 నుంచి 17వరకు రెండవ అంతర్జాతీయ నైట్‌ కైట్‌ ఫెస్టివల్‌ను పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. 75 మంది అంతర్జాతీయ కైట్‌ ఫ్లయిర్స్‌ సుమారు 17 దేశాల నుంచి ఈ వేడుకలకు వచ్చారు. 100 మందికి పైగా మనదేశానికి చెందిన కైట్‌ ఫ్లయిర్స్‌ సైతం తమ ప్రతిభను చాటుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఆగాఖాన్‌ స్టేడియంలో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా కొనసాగింది. రంగు రంగుల పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి.

రెండు రోజుల పాటు..
రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో అహ్మదాబాద్‌, ముంబై, పుణే వంటి నగరాలతో పాటు చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌, ఆస్ర్టేలియా, కెనడా, జర్మనీ వంటి 17 దేశాలకు చెందిన కైట్‌ ఫ్లయర్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, రంగోలి, కచేరి వంటి కార్యక్రమాలు ఊర్రూతలూగించాయి.

నెక్లెస్ రోడ్డు..
ఇటు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో కైట్‌ ఫెస్టివల్‌లో రిమోట్‌ డ్రాగన్‌ పతంగులను ఎగురవేశారు. వచ్చే ఏడాది కైట్‌ ఫెస్టివల్‌ను మరింత ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఈతరం పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను వివరించాల్సిన అవసరముందని తలసాని అభిప్రాయపడ్డారు. ఇటు హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో యువకులు పతంగులు ఎగరవేసి సందడి చేశారు. బిల్డింగ్‌పై డీజే సౌండ్‌ బాక్సులు పెట్టి.. డ్యాన్సులు చేశారు.

విశాఖ సాగర తీరాన..
విశాఖ సాగరతీరాన గాలిపటాలు కనువిందు చేస్తున్నాయి. ఓవైపు డీజే సౌండ్స్‌, మరోవైపు యువత డ్యాన్సులు హోరెత్తిస్తున్నాయి. అగర్వాల్‌ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కైట్‌ ఫెస్టివల్‌లో చిన్నా, పెద్దా అందరూ పతంగులు ఎగురవేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఆకర్షణీయమైన గాలి పటాలను ఎగరేసి సందర్శకుల్లో ఆనందం నింపారు. ఈ నెల 16న యాదాద్రిలో, 17న వరంగల్‌లో కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు.

21:21 - January 14, 2017

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా అంతా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, పిండివంటల ఘుమఘుమలతో పల్లెల్లో పండుగ శోభాయమానంగా జరిగింది. మకర సంక్రాంతి ప్రజలకు కొంగొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బంధాలను, మమతానురాగాలను ఇనుమడింప జేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఎక్కడ చూసినా పండుగ ఉత్సాహమే కనిపించింది. మహిళలు తెల్లవారుజామునే ముంగిళ్లలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. వాటిపై గొబ్బెమ్మలను పెట్టారు. హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నల పిలుపులతో సంక్రాంతి పండుగ శోభాయమానంగా జరిగింది. పిండివంటల ఘుమఘుమలు వాడవాడలా వ్యాపించి నోరూరించాయి.

సీఎం చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఉదయం గ్రామంలోని నాగాలమ్మ, గంగమ్మ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మనువడు దేవాన్ష్‌తో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకనే సమీపంలోని తన తల్లిదండ్రులు సమాధుల దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు.

తూ.గో..
తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా కలిసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. డూడూ బసవన్నలు సందడి చేశాయి. గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు... సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సరికొత్త అనుభూతిని పంచారు.

ప.గో..
ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మహిళలు తెలతెలవారుతుండగానే ఇంటి ముంగిళ్లను అందమైన రంగవల్లులతో నింపారు. ఇక అమ్మాయిలు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. ఆడిపాడారు. మకర సంక్రాంతిని ఉల్లాసంగా జరుపుకున్నారు.

అనంతపురం..
సంక్రాంతి పర్వదినాన అనంతపురంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిటీకేబుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు వివిధ కాన్సెప్ట్‌లతో ముగ్గులువేసి ఆకట్టుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

ప్రకాశంలో..
ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో సంక్రాంతి సందర్భంగా గుండ్రాయి పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణా యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. 120 కేజీల బరువున్న రాతి గుండును 5 నిముషాల్లో ఎక్కువసార్లు ఎత్తిన వారిని విజేతలుగా ప్రకటించి.. వారికి బహుమతులు అందజేశారు.

21:18 - January 14, 2017

విజయవాడ : ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పలుచోట్ల కోళ్ల పందాలను యదేచ్చగా నిర్వహించారు. ఓవైపు కోళ్ల పందాలపై కోర్టులు ఆంక్షలు విధించినా.. ఒక్క సంక్రాంతి రోజే కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా జరిగాయి. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి, సాకుర్రు, గున్నేపల్లి గ్రామాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. అలాగే అల్లవరం మండలం గోడి, కొమరగిరిపట్నం, గండేపూడి, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి, ఎస్.యానాం గ్రామాల్లో కోడిపందాల బరులు నిర్వహించారు. ఈ కోళ్ల పందాలను చూడటానికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విచ్చల విడిగా కోళ్లపందాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 400 కోళ్ల పందాల బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో కోళ్లు, పొట్టేళ్ల పందేలు జోరుగా జరిగాయి. మొవ్వ, పెడసనగల్లు, పెద్దపులిపాక, తేలప్రోలు, పటమట లంక, రామలింగేశ్వరనగర్‌, పెనమలూరు, పామర్రు, కైకలూరు, నిమ్మకూరు, కొమరవోలు ప్రాంతాల్లో జోరుగా ఈ పందేలు నిర్వహించారు. కోళ్ల పందాల మాటున ఇప్పటికే కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కోడిపందేలు, పొట్టేళ్ల పందేలు నిర్వహించడంలో ఈసారి ప్రజాప్రతినిధులు సైతం ఉత్సాహం చూపారు.

అనంతపురం..
ఈసారి సంక్రాంతికి అనంతపురంలో నిర్వహిస్తున్న పందుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాడిపత్రిలో జరిగిన ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా కోళ్ల పందాలను ప్రారంభించారు. నేటి యువత సంస్కృతి, సంప్రదాయంగా వస్తున్న పలు ఆటలను మరిచిపోతున్నారని ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కోర్టులు కోళ్ల పందాలు నిర్వహించవద్దని ఆంక్షలు విధించినా...యధేచ్ఛగా కోళ్ళ పందాలు జరుగుతునే ఉన్నాయి. ఈ కోళ్ల పందాల మాటు కోట్ల వ్యాపారం జరుగుతోంది. కోళ్ల పందాలను నియంత్రిస్తున్నామని చెబుతున్న పోలీసులు.. నిర్వాహకులపై ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

21:16 - January 14, 2017

నిర్మల్ : తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాన్వాయ్‌ వాహనం ఢీకొట్టి ఓ విద్యార్ధి చనిపోయాడు. నిర్మల్‌లోని శాంతినగర్‌ క్రాస్‌ రోడ్డు దగ్గర అతివేగంగా వెళ్తోన్న మంత్రి కాన్వాయ్‌లోని కారు.. బైక్‌ను ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొట్టడంతో బైక్‌ దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో సాత్విక్‌ అనే 9వ తరగతి విద్యార్ధి, అతని తండ్రికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వారిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే సాత్విక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడు లక్ష్మణచాంద మండలం చింతల్‌తండా వాసిగా గుర్తించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతని బంధువులు ఆందోళన నిర్వహించారు. దీంతో మంత్రి డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ముగిసిన విమాన విన్యాసాలు..

విజయవాడ : పున్నమి ఘాట్ వద్ద విమాన విన్యాసాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ విన్యాసాలు జరిగాయి. పెద్దలు..పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఈ విన్యాసాలను తిలకించారు.

లక్నో విమానాశ్రయంలో పనిచేయని రాడార్..

లక్నో : విమానాశ్రయంలో రాడార్ పనిచేయడం లేదు. 16 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లిస్తున్నారు. లక్నో - మధ్య నడిచే జెట్ ఎయిర్ వేస్ విమానాలు రద్దు చేశారు. సాయంత్రం 4.30గంటల నుండి రాడార్ పనిచేయడం లేదు.

దంతెవాడలో మావోలు..పోలీసులకు మధ్య కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : దంతెవాడలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది.

 

 

19:05 - January 14, 2017
19:00 - January 14, 2017
18:56 - January 14, 2017

మంత్రి ఇంద్రకిరణ్ కాన్వాయ్ ఢీకొని బాలుడు మృతి..

నిర్మల్ :పట్టణంలోని శాంతినగర్ క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ఇన్నోవా ఢీకొని సాత్విక్ (17) మృతి చెందాడు.

 

సూర్జిత్ సింగ్ బర్నాల కన్నుమూత..

పంజాబ్ : మాజీ సీఎం సూర్జిత్ సింగ్ బర్నాల (91) తుదిశ్వాస విడిచారు. చండీగఢ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్జిత్ కన్నుమూశారు. 1925 అక్టోబర్ 21న సూర్జిత్ జన్మించారు. కేంద్రమంత్రిగా, ఉమ్మడి ఏపీ, తమిళనాడు, ఉత్తరాఖండ్ గవర్నర్ గా సేవలందించారు.

హైకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్రపతి ఉత్తర్వులు..

~హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులుగా జె.ఉమాదేవి, ఎన్.బాలయోగి, టి.రంజని, షమీమ్, అక్తర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

17:56 - January 14, 2017

తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జనవరి 21 నుండి ఫిబ్రవరి 7వరకు టోర్నీ జరగనుంది. ఎనిమిది జట్ల మధ్య కబడ్డీ వార్ జరగనుంది. లీగ్ కు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కు ఆమోదం తెలిపింది. వరంగల్, కరీంనగర్ వేదికగా లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.జగదీశ్వర్ తో టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

17:33 - January 14, 2017
17:32 - January 14, 2017

ఢిల్లీ : నల్లధనాన్ని నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ట్రైలర్ మాత్రమే అని.. ముందుముందు అసలు సినిమా ఉంటుందని చెబుతూ వస్తున్న కేంద్రం.. ఈ మేరకు చర్యలకు ఉపక్రమిస్తోంది. నల్లధనాన్ని నిర్మూలించడం కోసం ఓ వైపు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే.. మరో వైపు నగదు చెల్లింపులపై ఆంక్షలు, పన్నులు విధించాలని కేంద్రం యోచిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరతతో ప్రజలు డిజిటల్‌ చెల్లింపుల వైపు వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. దీంతో డిసెంబర్‌ నెలలో జరిగిన డిజిటల్‌ చెల్లింపులతో పోల్చితే అంతకుముందు నెలలో 43 శాతం ఎక్కువగా ఉంది. ఈ డిజిటల్‌ లావాదేవీలను మరింత పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాష్‌ ట్యాక్స్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

క్యాష్ ట్యాక్స్‌తో నగదు విత్ డ్రాపై పన్ను..
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌లో క్యాష్‌ ట్యాక్స్‌ ప్రస్థావన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రకారం బ్యాంకు అకౌంట్ల నుంచి నిర్దేశించిన పరిమితిని మించి నగదును విత్‌ డ్రా చేస్తే వారిపై కొంతమేర పన్ను పడే అవకాశం ఉంది. 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను, వ్యక్తిగతంగా 15 లక్షల కంటే ఎక్కువగా నగదు కలిగి ఉండటంపై నిషేధం విధించాలని నల్లధనంపై వేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం సూచించింది. పార్థసారధి షోమ్‌ అధ్యక్షతన ఏర్పాటైన ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీఫామ్‌ కమిషన్‌ సైతం బ్యాంకింగ్‌ క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ను విధించాలని రికమండ్‌ చేసింది. సేవింగ్‌ ఖాతాల నుంచి తప్ప మిగిలిన ఖాతాల నుంచి ఎంత మేర బ్యాంకుల నుంచి విత్ డ్రా అవుతుందో స్పష్టమైన సమాచారం లేదని అది తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాష్‌ ట్యాక్స్‌ తీసుకురావడం మూలంగా నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడమే కాకుండా డిజిటల్‌ వైపు మళ్లించడానికి ఈ చర్య దోహదపడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

17:27 - January 14, 2017

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ సినీరంగంలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నంబర్‌ 150గా బాస్‌ ఈస్‌ బ్యాక్‌... అంటూ వెండితెరపై విన్యాసాలు చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. చిరంజీవి రీఎంట్రీని అభిమానులు స్వాగతిస్తుంటే, రాజకీయాలు స్తబ్ధంగా ఉన్నాయని మళ్లీ సినిమాల్లోకి వచ్చినట్టు చిరంజీవి వ్యాఖ్యానించడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. చిరంజీవి...! తెలుగువారికి పరిచయం అక్కరలేని పేరు. తన డాన్సులు, స్టెప్పులతో క్రేజీ హోరోగా పేరు తెచ్చుకున్నచిరంజీవి అభిమానుల హృదయాల్లో చెరగనిముద్ర వేసుకున్నారు. పున్నమినాగులా బుసలు కొట్టినా, ఖైదీగా తిరగబడినా.... ప్రతి పాత్రలో వైవిధ్యభరితంగా ఒదిగిపోయారు. ఇలా 149 చిత్రాల్లో నటించి ప్రేక్షుల అభిమానాన్నిచూరగొన్నారు.
2008లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి.. సుమారు దశాబ్దకాలపు విరామం తర్వాత.. 150 చిత్రంలో నటించారు. అది కూడా రైతాంగా సమస్యలను ప్రస్తావించే కథాంశాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి 150 సినిమా ఖైదీనంబర్‌-150 హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. చిరు అభిమానుల్లో ఎనలేని జోష్‌ను నింపింది. అయితే.. ఇదే సమయంలో రాజకీయ నాయకుడిగా, ప్రజా సమస్యలపై ఆయన చిత్తశుద్ధిని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సినీ జీవితం ఒడిదొడులకులు లేకుండా సాగిపోతున్న తరుణంలోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోగా, కనీసం ప్రతిపక్ష స్థాయికి కూడా రాలేక పోయారు. రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రంలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్‌ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నా... ఆ లక్ష్యం కూడా నెరవేరలేదు.

రాష్ట్ర సమస్యలుపై ప్రశ్నించలేదు..
చిరంజీవి రాజకీయాల్లో రాణించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయన్నది విశ్లేషకులు అంచనా. ప్రజారాజ్యం అధినేతగా కానీ, కాంగ్రెస్‌ నాయకుడిగా కానీ, చిరంజీవి ప్రజా సమస్యలపై స్పందించిందే లేదు. అడపాదడపా తప్పని తంతులా ధర్నాల్లో పాల్గొనడం తప్ప తీవ్రంగా మాట్లాడిన దాఖలాలే లేవు. రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడడం తప్పిస్తే.. ఆయన నోరు మెదిపిన సందర్భాలే లేవు. ఎంపీగా ఆయన ఒక్కటంటే ఒక్క ప్రశ్న సంధించింది లేదు. 2014 యూపీఏ ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నా... రాష్ట్ర సమస్యలను ఎన్నడూ ప్రశ్నించలేదు. అలాంటి వ్యక్తి రైతాంగ సమస్య ప్రధాన ఇతివృత్తంగా ఖైదీ నెంబర్‌ 150లో నటించారు. నిజజీవితంలో, ఎంపీగా, మంత్రిగా ఉంటూ కూడా ప్రజాసమస్యలను ప్రస్తావించని చిరంజీవి.. సినిమాల ద్వారా ప్రజా సమస్యలను ఎత్తుకోవడం ఏంటన్న విమర్శ వినిపిస్తోంది. చిరంజీవి పలాయన వాదానికిది నిదర్శనమన్నది విమర్శకుల ఆరోపణ. పరిస్థితులు సానుకూలంగా ఉంటే రాజకీయాల్లో కొనసాగడం, ప్రతికూలంగా ఉంటే మళ్లీ సినిమాల్లోకి రావడం అన్నది చిరంజీవి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏటా రెండు సినిమాలు..
చిరంజీవి అభిమానుల వాదన మాత్రం మరోలా ఉంది. చిత్రసీమపై ఉన్న మక్కువతోనే ఆయన తిరిగొచ్చారని అంటున్నారు. రాజకీయాల్లో పదేళ్ల అవమానాలకు ఈ సినిమాయే సమాధానమని కుటుంబ సభ్యులూ బాహాటంగానే చెబుతున్నారు. సున్నితలమైన చిరంజీవి మనస్తత్వానికి సినీరంగమే సరైన మార్గమని అభిమానులు భావిస్తున్నారు. రాజకీయాల్లో రాణించలేకపోయిన మెగాస్టార్‌ రంగుల ప్రపంచంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇకపై ఏటా రెండు సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న చిరంజీవి, ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇతివృత్తంతో తాజాగా సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో.. చారిత్రక ఇతివృత్తంతో రూపొందించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాతో 'బాలయ్య' దూసుకు వెళ్లడం కూడా.. చిరంజీవి 151వ చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథాంశాన్ని ఎంచుకోవడానికి కారణంగా చెబుతున్నారు. గతంలో కూడా బాలయ్య వరుసగా సీమ ఫ్యాక్షన్‌ సినిమాలు చేస్తున్నప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమా ద్వారా హిట్‌ కొట్టారు. అదే ఒరవడిలో ఇప్పుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చిరంజీవి వరుస సినిమాల ప్రణాళికలను పరిశీలిస్తే.. తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదన్న భావన వ్యక్తమవుతోంది.

17:21 - January 14, 2017

వనపర్తి : జిల్లా గ్రామానికి మంజూరైన డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణానికి తమ ఇళ్ల స్థలాలను లాక్కొంటున్నారని యువకులు ఆందోళన నిర్వహించడం కలకలం రేగింది. విరాస్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళితులకు 1985లో ఆనాటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీనితో కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లను నిర్మాణం చేపట్టగా మరికొంతమంది ఇళ్లను నిర్మించుకోలేదు. దీనితో ఖాళీ స్థలంలో ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు స్థానిక టీఆర్ఎస్ నేత ఒకరు టెండర్ కూడా దక్కించుకుని ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. దీనితో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాజేష్, శివ, రవి, ప్రవీణ్, ప్రశాంత్ లు సెల్ టవర్ ఎక్కి ఆందోళన నిర్వహించారు. ఈ విషయం స్థానిక తహశీల్దార్, పోలీసులకు తెలిసింది. ఘటనా ప్రదేశానికి చేరుకుని టవర్ ఎక్కిన యువకులతో మాట్లాడారు. తమకు కేటాయించిన స్థలంలో ఎలాంటి ఇళ్ల నిర్మాణం చేపట్టరని అధికారులు హామీనివ్వడంతో యువకులు కిందకు దిగివచ్చారు.

17:08 - January 14, 2017

నల్గొండ : సంక్రాంతి పండుగ రోజున యాదాద్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. కష్టపడిన సంపాదించిన డబ్బు..నిత్యావసర వస్తువులన్నీ ఖాళీ పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. యాదాద్రిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న షన్ సైన్ సంస్థలో పనిచేయడానికి కూలీలు ఇక్కడకు వచ్చారు. వీరందరూ ఓ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అకస్మాత్తుగా శనివారం మధ్యాహ్నం గుడిసెల్లో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు మొత్తం వ్యాపించడంతో 15 గుడిసెలు ఖాళీ బూడిదయ్యాయి. ప్రాణాలు రక్షించుకోవడానికి గుడిసె వాసులు బయటకు పరుగులు తీశారు. గుడిసెల్లో ఉన్న నగదు..నిత్యావసర వస్తువులు..బట్టలు ఖాళీ బూడిదయ్యాయి. దీనితో వారంతా లబోదిబోమంటున్నారు. కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు కూడా అగ్నిప్రమాదంలో ఖాళీ పోయిందని సూపర్ వైజర్ పేర్కొంటున్నారు. ఈఘటనపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

17:00 - January 14, 2017

‘నీలాంటోడు అడుగడుగునా ఉంటారు..నాలాంటోడు చాలా అరుదుగా ఉంటాడు' అంటూ 'సాయిధరమ్ తేజ్' డైలాగ్ పలుకుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'విన్నర్' సినిమా టీజర్ విడుదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేసింది. ఈ చిత్రంలో 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే 'సాయి ధరమ్ తేజ' నటిస్తున్న 'విన్నర్' సినిమాలో 'అనసూయ' నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ ప్రత్యేక పాటలో 'సాయి ధరమ్'తో చిందేయనున్నట్లు పుకార్లు షికార్ చేస్తున్నాయి. మరి 'సాయి ధరమ్ తేజ' ఎందులో విన్నర్ అయ్యాడో తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

పాశ్వాన్ డిశ్చార్జీ..

పాట్నా : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆసుపత్రి నుండి శనివారం డిశ్చార్జీ అయ్యారు. గురువారం రాత్రి ఆయన అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే.

16:28 - January 14, 2017
16:25 - January 14, 2017

కాకినాడ : డూ.డూ. బసవన్నల సందడి..ఇంటి వాకిళ్ల ఎదుట ముగ్గులతో కాకినాడలో సంక్రాంతి శోభ నెలకొంది. గంగిరెద్దులను ఆడిస్తూ బసవన్నలు ఆశ్వీరదించారు. ఘుమఘుమలాడే పిండి వంటలు.. తొలిపొద్దుకు ముందే వీధుల్లో హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల ఆటలతో సందడి నెలకొంది. మూడు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా కాకినాడ ప్రజలు ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా తాము ఎలా దీవిస్తామో బసవన్నలు పాడి వినిపించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

16:20 - January 14, 2017

తూర్పుగోదావరి : సంక్రాంతి అనగానే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు మొదటిగా గుర్తుకు వస్తాయి. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించడం జరుగుతుంటాయి. కానీ వినూత్నంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ప్రాంతంలో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండానే పందాలు నిర్వహించడం గమనార్హం. ఇందులో యువతులు ఉండడం విశేషం. ఈ సందర్భంగా టెన్ టివితో యువతులు మాట్లాడారు. హింసకు తావు లేకుండా కోళ్ల పందాలను నిర్వహించడం ఆనందంగా ఉంటుందని, తరతరలుగా ఆచారంగా వస్తోందన్నారు. కాళ్లకు కత్తులు కట్టి ఆడించడం చాలా బాధ కలుగుతుందన్నారు.

హెచ్ సీఏ రాజకీయ పార్టీలా మారింది - వీహెచ్..

హైదరాబాద్ : లోధా కమిటీ మంచి నిర్ణయాలు తీసుకుందని, హెచ్ సీఏ ఓ రాజకీయ పార్టీలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. అజహరుద్దీన్ పై ఎక్కడా ఆరోపణలు రుజువు కాలేదని, హెచ్ సీఏకు ఒక్క రూపాయి మిగులు నిధులు లేవన్నారు. హెచ్ సీఏకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఇదే పరిస్థితి కొనసాగితే ఉప్పల్ స్టేడియం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ముంబై జట్టుపై గుజరాత్ విజయం..

ఇండోర్ : రంజీ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ లో ముంబై జట్టుపై గుజరాత్ జట్టు ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ జట్టును పార్థీవ్ పటేల్ గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 143 పరుగులు చేశాడు. ముంబై తొలి, రెండో ఇన్నింగ్స్ లో 228 & 411 పరుగులు చేయగా గుజరాత్ జట్టు తొలి, రెండో ఇన్నింగ్స్ లో 328 & 313 పరుగులు చేసింది.

ఎర్రబెల్లికి మాతృవియోగం..

హైదరాబాద్ : పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై ఏళ్ల ఆదిలక్ష్మి గతకొంత కాలం నుంచి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు కన్నుమూసింది.

2015-16 న్యాయ నివేదిక..దిగ్ర్భాంతికర వాస్తవాలు..

ఢిల్లీ : 2015-16 న్యాయ నివేదికలో దిగ్ర్భాంతికర వాస్తవాలను సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 24 హైకోర్టుల్లో 40.54 లక్షల పెండింగ్ కేసులు ఉన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిలో సుమారు 23 లక్షల సివిల్ కేసులు ఉన్నట్లు, 7.5 లక్షల కేసులు ఏకంగా పదేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని సుప్రీం నివేదిక పేర్కొంది. 44 న్యాయశాతం న్యాయమూర్తుల కొరత న్యాయవ్యవస్థ ను పీడిస్తోందని, హైకోర్టుల్లో 1079 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను జూన్ 2016 నాటికి 609 మందిని నియమించారని పేర్కొంది.

14:29 - January 14, 2017

కాకినాడ : బీచ్‌ ఫెస్టివల్‌లో మోడల్స్ అదరగొట్టారు. క్యాట్‌వాక్‌తో దుమ్మురేపారు. మోడల్‌ షోతోపాటు.. డ్యాన్సులు, పాటలు, సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్‌ రెండోరోజు కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

14:27 - January 14, 2017

హైదరాబాద్ : 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ అద్భుతంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కితాబిచ్చారు. హైదరాబాద్ ప్రసాద్‌ ల్యాబ్‌లో మూవీని వెంకయ్య చూశారు. యుద్ధ సన్నివేషాల్ని చాలాబాగా తెరకెక్కించారని మూవీ డైరెక్టర్‌ క్రిష్‌ను ప్రశంసించారు. బాలకృష్ణ నటన కూడా ఈ సినిమాకు ప్లస్‌ అయిందని చెప్పుకొచ్చారు.

14:25 - January 14, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో తెలుగుతనం ఉట్టిపడేలా అమ్మాయిలు తమ వస్త్రాధరణతో ఆకట్టుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరీ సందడి చేస్తున్నారు. మరి పెద్దలు..యువత ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

14:23 - January 14, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాది కైట్‌ ఫెస్టివల్‌ను మరింత ఘనంగా నిర్వహిస్తామని.. మంత్రి తలసాని ప్రకటించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌లో రోడ్‌లో కైట్‌ ఫెస్టివల్‌ను మంత్రి ప్రారంభించారు. పతంగుల్ని ఎగురవేసి సరదాగా గడిపారు. మన పండుగల్ని మనం గౌరవించుకోవాలని తలసాని అన్నారు. ఈతరం పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను వివరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

విశాఖలో..
సంక్రాతి సందర్భంగా విశాఖ సాగరతీరంలో గాలిపటాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అగర్వాల్‌ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన కైట్‌ ఫెస్టివల్‌లో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఆనందంగా పతంగులు ఎగురవేశారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను కాపాడేక్రమంలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

14:21 - January 14, 2017

పశ్చిమగోదావరి : కాకినాడలో యధేచ్చగా కోడిపందాలు కొనసాగుతున్నాయి... 144 సెక్షన్‌ విధించినా పందెంరాయుళ్లు ఆగడంలేదు.. కోడిపందాల బెట్టింగ్‌లో దాదాపు వందకోట్లవరకూ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.. ఐపోలవరం, పిఠాపురం, అల్లవరం, రాజోలు.. జగ్గంపేట ప్రాంతాల్లో జోరుగా కోడిపెందాలు జోరుగా నడుస్తున్నాయి.

ప.గో.జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడింపందాలు జోరందుకున్నాయి. 450 బురుల్లో విచ్చలవిడిగా పందాలు కొనసాగుతున్నాయి. కోళ్లకు కత్తులు కట్టవద్దని చెప్పిన కోర్టు మాటలను పెడచేవిన పెట్టి కోట్లలో పందాలను కాస్తున్నారు. కత్తి ఘాటు దెబ్బకు ప్రతి రెండు నిమిషాలకో కోడి చనిపోతుంది. సంక్రాంతి సందర్బంగా రెండు జోరుగా సాగుతున్న కోడిపందాలపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

శాఖల అవసరాలకు డ్రోన్ల వినియోగం..

విజయవాడ : రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖ అవసరాలకు డ్రోన్ల వినియోగానికి కేంద్ర హోం శాఖ అనుమతినిచ్చింది. వ్యవసాయం, ఉద్యానం, గనులు, రహదారులు - భవనాలు, పంచాయతీ రాజ్, జలవనరులతో సహా మొత్తం పదిహేను శాఖల పనితీరు పరిశీలనకు డ్రోన్ల వినియోగానికి అనుమతినిచ్చింది.

పూలకుండీల్లో గంజాయి సాగు..

రంగారెడ్డి : జిల్లా ఘట్ కేసర్ లో బీ ఫార్మసీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంకు చెందిన హసన్ ఇంట్లో గంజాయి పెంచుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. పూలకుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు.

కేసీఆర్ ను పొగిడిన లగడపాటి..

యాదాద్రి : లక్ష్మీ నరసింహ స్వామి వారిని మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి, మాజీ ఎంపీ లగడపాటిలు దర్శించుకున్నారు. యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి సీఎం కేసీఆర్ కృషి అద్భుతమని లగడపాటి పొగడం విశేషం. యాదాద్రిని విశ్వవ్యాప్తం చేయాలని కేసీఆర్ పరిశీలిస్తున్నారని, అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో యాదాద్రిని సందర్శించిన తరువాతే ఎంపీగా గెలిచినట్లు పేర్కొన్న లగడపాటి రాజకీయ పునరాగమనంపై స్పందించలేదు.

జోరుగా కోళ్ల, పొట్టేల పందాలు..

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా పొట్టెలు, కోళ్ల పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. మొవ్వ పెడసనగుల్ల, పెదపులిపాక, చారిప్రోలు, పడమటలంక, రామలింగేశ్వరనగర్, పెనమలూరు, కైకలూరు, నిమ్మకూరు, పామర్రు, కొమరవోలు ప్రాంతాల్లో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో పందాలు నిర్వహిస్తున్నారు. పెనమలూరులో టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో పొట్టేల పందాలు జరుగుతున్నాయి. భారీగా మద్యం పంపిణీ కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండవల్లి (మం) బుజవలపట్నంలోనూ జోరుగా కోళ్ల పందాలు జరుగుతున్నాయి.

టాస్క్ ఫోర్స్ అదుపులో స్మగ్లర్ నెడుం సెజియన్..

చిత్తూరు : తిరుపతిలో టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. పది టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ నెడుం సెజియన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసులో సెజియన్ నిందితుడిగా ఉన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

12:39 - January 14, 2017
12:38 - January 14, 2017
12:31 - January 14, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసేయేషన్(హెచ్ సీఎ) అధ్యక్ష పదవికి భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అజారుద్దీన్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తనమీద ఉన్న జీవితకాల నిషేధంపై అజరుద్దీన్ ఇచ్చిన వివరణకు బీసీసీఐ సంతృప్తి చెందలేదు. గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ కు సంబంధించిన  విషయంలో తనమీద ఉన్న జీవితకాల నిషేధంపై అజరుద్దీన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదు. మరోవైపు తన నామినేషన్ ను తిరస్కరించడం అన్యాయమని అజరుద్దీన్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

హెచ్ సీఏ అధ్యక్ష పదవికి అజహద్దీన్ నామినేషన్ తిరస్కరణ

హైదరాబాద్ : హెచ్ సీఏ అధ్యక్ష పదవికి అజహద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. రిటర్నింగ్ అధికారి అజహర్ నామినేషన్ ను తిరస్కరించారు. తనమీద ఉన్న జీవితకాల నిషేధంపై అజరుద్దీన్ ఇచ్చిన వివరణకు బీసీసీఐ సంతృప్తి చెందలేదు.

నారావారిపల్లిలో సంక్రాంతి సంబురాలు

తిరుపతి : నారావారిపల్లిలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జగుతున్నాయి. సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు నాగలమ్మను దర్శించుకున్నారు.

11:34 - January 14, 2017

అమీర్ ఖాన్ దంగల్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అనుకున్నట్లుగానే మిస్టర్ ఫర్ ఫెక్ట్ గత రికార్డ్స్ ని పీకేశాడు. లేటేస్ట్ గా దంగల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఓ మూవీని సెకెండ్ ప్లేస్ లోకి నెట్టేసి, బాలీవుడ్ నెంబర్ వన్ హిట్టుగా నిలిచినట్లు బీటౌన్ ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి. మరి సెకెండ్ ప్లేస్ లోకి వెళ్లిన మూవీ ఏంటో బాలీవుడ్ నెంబర్ వన్ హిట్టుగా నిలిచిన దంగల్ బాక్సాఫీసు కలెక్షన్ల విశేషాలేంటో ఈ స్టోరీ చూడండి.
బాక్సఫీసుని షేక్ చేసిన దంగల్ 
బాలీవుడ్ బాక్సపీసు ఖాన్ అమీర్ ఖాన్ లేటేస్ట్ మూవీ దంగల్ బాక్సఫీసుని షేక్ చేస్తోంది. లేటేస్ట్ గా ఈ మూవీ ఇండియన్ బాక్సపీసు వద్ద సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. దంగల్ 350కోట్ల కొల్లగొట్టి బాలీవుడ్ నెంబర్ హిట్టుగా నిలిచింది. కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ ఆల్ టైం రికార్డ్ మూవీస్ కలెక్షన్లను క్రాస్ చేయడం విశేషం. సృష్టించేశాడు.
తన సినిమా రికార్డులను తనే బ్రేక్ చేస్తున్న అమీర్ ఖాన్ 
అమీర్ ఖాన్ తన సినిమాల రికార్డ్స్ తనే బద్దలు కొడుతున్నాడు. దంగల్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ తన గత చిత్రం పీకే రికార్డ్స్ ని చేరిపేశాడు. అధిగమించి మరో దంగల్ 350కోట్లు సాధించి పీకే పేరు మీదున్న340 కోట్లు బాక్సపీసు రికార్డ్ ని తుడిచేశాడు. కేవలం 16 రోజుల్లోనే దంగల్ ఈ కలెక్షన్లను సాధించడం బాలీవుడ్ ని ఆశ్చర్యపరుస్తోంది.షేర్ పరంగా 350కోట్ల వసూల్ చేసిన దంగల్ గ్రాస్ పరంగా ఇప్పటి వరకు 530 కోట్లు వసూల్ చేశాడు. ఫర్ పెక్ట్ టైంలో ఫర్ పెక్ట్ స్టోరీతో అమీర్ ఖాన్ బాక్సఫీసు వద్ద అద్భుతం క్రియేట్ చేశాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
బాలీవుడ్ బాక్సఫీసు రేంజ్ పెంచిన అమీర్ ఖాన్  
అమీర్ ఖాన్ సినిమా సినిమాకి బాలీవుడ్ బాక్సఫీసు రేంజ్ ని పెంచడంతో పాటు స్టార్ గా యాక్టర్ గా తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు. బాలీవుడ్ లో కూడా టాప్ 5 హిట్స్ లో టాప్ 3హిట్స్ అమీర్ ఖాన్ నటించిన చిత్రాలే కావడం విశేషం. ఈ టాప్ త్రీలో షారుఖ్ ఖాన్ మూవీ లేకపోవడం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లలో అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లకు సాధ్యం కానీ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఎడాదికో రెండేళ్లకో అద్భుతమైన కాన్సెప్ట్ బాక్సాఫీసుని బద్దలు కొడుతున్నాడు.  

11:28 - January 14, 2017

మెగా తనయుడు రామ్ చరణ్ రాయబారిగా మారబోతున్నడట అంటే ఫీల్మ్ సర్కిల్స్ లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇమేజ్ ని బ్రేక్ చేసే క్రమంలో చెర్రీ డిఫరెంట్ మూవీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో చరణ్ ఇద్దరు భిన్నమైన దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేయబోతున్నాడు. మరి చెర్రీ ఏ దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడో ఈ స్టోరీ చూడండి.
ధృవతో రామ్ చరణ్ కొత్త దారిలోకి 
ధృవ సినిమాతో రామ్ చరణ్ కొత్త దారిలోకి వచ్చేశాడు. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తాడన్న ముద్రను చెరిపేసుకుని, తాను కూడా వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించగలనని రుజువు చేశాడు. ధృవ తర్వాత చరణ్ సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సుకుమార్ తో చేయనున్న సినిమాలో చెర్రీ లుక్ తో పాటు క్యారెక్టర్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని వినికిడి. ఈ సినిమా తరువాత కూడా మెగా తనయుడు మరో ఇద్దరు భిన్నమైన దర్శకులతో కమిట్ అయినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ రాయబారి మూవీకి కమిట్ 
దర్శకుడు క్రిష్ తో రామ్ చరణ్ రాయబారి అనే మూవీకి కమిట్ అయినట్లు వినిపిస్తోంది. కంచె సినిమా తర్వాత క్రిష్, వరుణ్ తేజ్ హీరోగా రాయబారి టైటిల్ తో మూవీ చేయాలనుకున్నాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను చరణ్ తో చేయడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకు చరణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కెబోయే ఈ సినిమా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వినిపిస్తోంది. 
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో మూవీ 
సుకుమార్, క్రిష్ లతో పాటు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా మరో మూవీకి రామ్ చరణ్ ఒకే చెప్పినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాను కూడా ఈ ఎడాది చివరిలో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. చెర్రీ కోసం గౌతమ్ మీనన్ అద్భుతమైన యాక్షన్ లవ్ స్టోరీని సిద్దం చేసినట్లు వినికిడి. మొత్తానికి చరణ్ మూస మాస్ సినిమాలకు స్వస్తి చెప్పినట్లే కనిపిస్తోంది. 

 

11:23 - January 14, 2017

సొట్టబుగ్గల సుందరి ఆశలు ఆకాశనంటుతున్నాయి. తన కొత్త సినిమాలపై తాప్పీ బోలెడు ఆశలు పెట్టుకుంది. షార్ట్ టైంలో ఈ బ్యూటీ నటిస్తున్న మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు కనుక హిట్టు అయితే ఇక బాలీవుడ్ లో తన కెరీర్ కి ఢోకా లేనట్లే అంటుంది. ఇంతకీ తాప్సీ కొత్త సినిమాలేంటో మీరు చూడండి.
బాలీవుడ్ సినిమాలపై దృష్టి
తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ లు లేకపోవడంతో తాప్సీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఈ సొట్టబుగ్గల సుందరి బాలీవుడ్ సినిమాలపైన ఎక్కువగా దృష్టి పెట్టింది. బీటౌన్ లో ఈ బ్యూటీ కెరీర్ ఆశాజనకంగానే వుంది. తాప్సీ గత ఎడాది బాలీవుడ్ లో నటించిన పింక్ సినిమా భారీ హిట్టు కావడంతో పాటు ఆ సినిమాలోని నటనకు గాను ఈ బ్యూటీకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన మూడు చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. 
రన్నింగ్ షాదీలో తాప్సీ
తాప్సీ నటిస్తున్న రన్నింగ్ షాదీ. కామ్ ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా రానాకి జోడిగా ఈ బ్యూటీ నటించిన ఘాజీ సినిమా కూడా వచ్చే నెల 17న రిలీజ్ కానుంది. ఈ మూవీ సబ్ మైరన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ బ్యూటీ టైటిల్ రోల్ లో నటించిన నామ్ షబానా సినిమా మార్చి 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కేవలం నెలన్నర వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో తాప్సీ ఎనలేని ఆసక్తితో ఎదురుచూస్తోంది.
ఈ సినిమాలపై బాలీవుడ్ లో మంచి బజ్
ఈ సినిమాలపై బాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. దీంతో సినిమాలు హిట్టు అయితే అక్కడ స్టార్ గా నిలదొక్కుకోవచ్చని తాప్సీ ఆశపడుతోంది. తెలుగు,తమిళం కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్ లో సక్సెస్ లు వస్తుండడంతో ఈ బ్యూటీ పుల్ హ్యపీగా ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏ రెండు సినిమాలు హిట్ అయినా బాలీవుడ్ లో తన కెరియర్ మరింత స్పీడ్ అందుకోవడం ఖాయమనే నమ్మకంతో తాప్సీ వుంది. మరి తాప్సీ ఆశలను ఈ మూడు సినిమాలు ఏ మేరకు నిజం చేస్తాయో చూడాలి. 

11:11 - January 14, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంటి వాకిళ్లు ముగ్గులతో కలర్‌పుల్‌గా మారాయి. ఇంటి ముందున్న వాకిళ్లు రంగువల్లులతో అలరిస్తుంటే... డూ..డూ బసన్నలతో పండుగ సందడిగా మారింది. ఆటపాటలతో చిన్నాపెద్దా సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్రాంతి వేడుకలపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:09 - January 14, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ పందేలనుచూసేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 450 పందెంబరుల్లో ఈ కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పందేల పేరుతో కోట్ల రూపాయలు చేతులుమారుతున్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

తమిళనాడులో లారీ బీభత్సం...ఆరుగురు మృతి

తమిళనాడు : తిరుచ్చి జిల్లా మనపారి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. పళని మురుగన్ ఆలయానికి వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలాయ్యయి.

రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌ : రాజాపూర్‌ మండలం రంగారెడ్డి గూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  

10:52 - January 14, 2017

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ప్రైవేట్ బస్ బోల్తా పడింది. ఈప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఆరెంజ్‌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 35 మందితో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. రాజాపూర్‌ మండలం రంగారెడ్డి గూడ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకునేందుకు వెళ్తున్న బెలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేక్రమంలో అదుపుతప్పడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఘట్ కేసర్ లో బీఫార్మసీ విద్యార్థి అరెస్టు

రంగారెడ్డి : ఘట్ కేసర్ లో బీఫార్మసీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంకు చెందిన విద్యార్థి హసన్ తన ఇంట్లో గంజాయి పెంచుతున్నాడు. పూరి కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. 

 

09:27 - January 14, 2017

కాకినాడలో యధేచ్ఛగా కోడి పందాలు

తూర్పుగోదావరి : కాకినాడలో యధేచ్ఛగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించినా పందెం రాయుళ్ల  ఆగడం లేదు. రూ.100 కోట్లతో కోడీ పెందాల బెట్టింగ్ లు కడుతున్నారు. ఐపోలవరం, పీఠాపురం, అల్లవరం, రాజోలు, జగ్గంపేట ప్రాంతాల్లో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు పత్తాలేరు.  
 

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నల్గొండ : చిట్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి దుర్మణం చెందారు. చిట్యాల సమీపంలో విజయవాడ..హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారు జామున 3 గంటల సమయంలో లారీ, తుపాన్ వాహనం ఒకదానికికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.

08:16 - January 14, 2017

నల్గొండ : మకర సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. చిట్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మణం చెందారు. చిట్యాల సమీపంలో విజయవాడ..హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారు జామున 3 గంటల సమయంలో లారీ, తుపాన్ వాహనం ఒకదానికికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్ పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10 టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్ : 10 టీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. 

07:48 - January 14, 2017
07:46 - January 14, 2017

టీ.సర్కార్ ...ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెడుతోందని వక్తలు విమర్శించారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, బీజేపీ నేత లక్ష్మీనారాయణ, టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రతిపక్షాల ఎజెండా ప్రజల ఎజెండగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టమైన పొగమంచు అలుముకుంది. 8 రైళ్లు రద్దు చేశారు. 6 రైళ్లు వేళల్లో మార్పులు చేశారు. 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ లలో భారీగా మంచు కురుస్తోంది. 

 

07:33 - January 14, 2017
07:31 - January 14, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీకి టీజాక్ సవాళ్లు విసురుతోంది. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా  జేఏసీ కూడా  గులాబి పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా... అధికార పార్టీని మాత్రం  ఇరుకున పెడుతున్న టీజాక్ వ్యవహారం గులాబి పార్టీకి కొత్త సమస్యలు సృష్టిస్తోంది.
జేఏసీ.. ప్రధాన ప్రతిపక్షపాత్ర 
తెలంగాణాలో ఏకపక్షంగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ రాజకీయాలకు టీజాక్ చెక్‌పెడుతోంది. ఉద్యమంలో కలిసి అడుగులు వేసిన టీజాక్ టీఆర్‌ఎస్‌లు వైరిపక్షాలుగా మారిపోయాయి. ప్రతిపక్షపార్టీలకంటే.. జేఏసీనే ప్రధాన ప్రతిపక్షపాత్రను పోషిస్తోంది. 
టీఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి 
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గులాబి పార్టీ ఏజెంట్‌ గామారారన్న విమర్శలను కోదండరాం ఎదుర్కొన్నారు.   కాని ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ధీటైన కౌంటర్లను ఇస్తోంది టీజాక్‌. దీంతో టీజాక్‌ తీరు మింగుడుపడక అధికారటీ ఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోదండరాంను టార్గెట్‌ చేస్తూ గులాబీ లీడర్లు విమర్శలు చేసినా.. ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో జేఏసీ స్పీడ్‌ను అడ్డుకోలేక పోతున్నారు. రైతుల సమస్యలు, భూసేకరణ వంటి కీలక అంశాల్లో న్యాయపోరాటానికి   శ్రీకారం చుట్టారు జేఏసీ నేతలు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తూ....గులాబి పార్టీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా  జాక్ మారింది.  
టీఆర్ ఎస్ పై జేఏసీ సూటిగా విమర్శలు 
అటు రాజకీయంగా కూడా గులాబి పార్టీని టార్గెట్‌ చేస్తున్న జేఏసీ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై సూటిగా విమర్శలు ఎక్కుపెడుతోంది. మొత్తానికి పదేపదే ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న టీజాక్‌ ను ఎలా కంట్రోల్‌ చేయాలన్న దానిపైనే ఇప్పుడు గులాబీపార్టీలో చర్చలు నడుస్తున్నాయి. 

07:25 - January 14, 2017

హైదరాబాద్ : నగరాన్ని చెత్తరహితంగా మార్చేందుకు.. పరిశుభ్రంగా చేసేందుకు కృషి చేస్తున్న జీహెచ్‌ఎంసీ... వినూత్నంగా ముందుకెళ్తూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. అందమైన ముగ్గులతో... రోడ్లపై చెత్త వేయకూడదనే నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తుంది. 
చెత్త పడేసే ప్రాంతాల్లో ముగ్గులు.. మొక్కలు
స్వచ్ఛ హైద‌రాబాదే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న బల్దియా.... అందుకోసం అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. రహదారులపై చెత్త వేయకుండా ఉండ‌టానికి పౌరుల‌ను ప‌లు విధాలుగా ఎడ్యుకేట్ చేస్తుంది. అందులో భాగంగానే  బల్దియా అధికారులు ఓపెన్‌గా చెత్త పడివేసే ప్రాంతాల్లో అందమైన ముగ్గులు వేయిస్తున్నారు .. మొక్కలు నాటిస్తున్నారు. ఈ మేరకు  రోడ్లపై చెత్త వేయకూడదనే సందేశాన్ని అందిస్తున్నారు
అవగాహన కార్యక్రమం
నగరాన్ని పరిశుభ్రంగా మార్చాలనే బలమైన సంకల్పంతో ఉన్న బల్దియా.. సంక్రాంతి పండుగ‌ను సైతం త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంది. గ్రేటర్ ప‌రిధిలో ఉన్న  అన్ని ఓపెన్‌ గార్బెజ్ పాయింట్స్ వ‌ద్ద  అంద‌మైన ముగ్గులు వేసి  స్థానికంగా చెత్త వేసే వారికి బహిరంగ స్థలాల్లో  చెత్త వేయోద్దంటూ పిలుపునిచ్చారు.  దీనికోసం పారిశుధ్య కార్మికులు నగరంలోని పదకొండు వందల ఒపెన్‌ గార్బెపాయింట్స్‌ను అంద‌మైన రంగు రంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. కాగా ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే కొంతమార్పు వచ్చిందని.. రోడ్లపై చెత్త వేయకుండా పటష్ఠ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. 
తగ్గిన చెత్త సమస్య 
బల్దియా తీసుకుంటున్న కార్యక్రమాల ద్వారా నగరంలో చెత్త సమస్య కొంత తగ్గింది. దీనిని మరింత మెరుగుపరిచేందుకు.. ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరు చేసే మహిళలను ప్రోత్సాహించేందుకు సర్కిల్‌ స్థాయిలో ఇప్పటికే బంగారం  బహుమతులు ప్రకటించింది. నగర సుందరీకరణ కోసం కృషి చేస్తున్న కొంతమంది కార్మికులను సన్మానించడం జరిగింది. గ్రేట‌ర్ వాసులంద‌రూ చేయి చేయి కలపడం ద్వారా నగరాన్ని మరింత పరిశుభ్రంగా ...అందంగా తయారువచ్చునని గ్రేటర్‌ అధికారులు అంటున్నారు.  

 

07:19 - January 14, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్వేష్టేన్‌ ప్రయాణీకులతో కిక్కిరిసింది. పండగరోజు సొంతూరికి చేరుకోవాలన్న హడావిడిలో రైల్వేష్టేన్‌కు జనం పోటెత్తారు. ప్రత్యేకరైళ్లు ఏర్పాటు చేసినా..అవి ప్రయాణీకుల రద్దీకి సిరిపోలేదు. దీంతో సీట్ల కోసం జనం ఎగబడ్డారు. ప్రయాణీకుల మధ్య తోపులాట జరగడంతో..రైల్వే పోలీసులు లాఠీలు ఝుళిపించారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు ప్రయాణీకులకు తలలు పగిలాయి. లాఠీచార్జీలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.   మహిళలు ,చిన్నారులు అన్న విచక్షణకూడా లేకుండా   కొట్టారని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

07:09 - January 14, 2017

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరుకు వెళ్లారు. బంధువులు, కుటుంబసభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా నారావారిపల్లెకు చేరుకోవడంతో.. చంద్రబాబు ఇంట్లో పండగ ఉత్సాహం మరింత పెరిగింది. చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది.
బాబు రాకతో నారావారిపల్లెలో సందడి 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరులో సంక్రాంతిని జరుపుకున్నారు. బాబు రాకతో చిత్తూరు జిల్లా నారావారిపల్లె సందడిగా మారింది. గత ఆరేళ్ళ నుండి  సంక్రాంతి పర్వదినానికికుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెకు బాబు వస్తు వస్తున్నారు. చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఈ పండుగ వేడుకల్లో పాల్గొంటుంటారు. నారావారి పల్లెకు చేరుకున్న బాబు.. ఈ నెల 15వ తేదీ వరకు అక్కడే ఉంటారు. గ్రామంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
ఈ నెల 15న సాయంత్రం ఢిల్లీకి 
ఆ తర్వాత ఈ నెల 15వ తేదీన సాయంత్రం రేణిగుంట నుండి ఢిల్లీకి బాబు బయలుదేరుతారు. రాత్రి అక్కడే బస చేసి 16వ తేదీ ఉదయం థావోస్ వెళ్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. ఈనెల 21న దావోస్‌ నుంచి విజయవాడ రానున్నారు.
నారావారిపల్లెలో కొత్త శోభ 
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా స్వగ్రామానికి వచ్చే బాబు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడి సంక్రాంతి సంబరాలకు హజరయ్యారు. దీంతో సంక్రాంతి వచ్చిందంటేనే నారావారిపల్లెలో కొత్త శోభ సంతరించుకుంటోంది. 

 

07:05 - January 14, 2017

హైదరాబాద్ : వాకిళ్ల ముందు అందమైన ముగ్గులు.. ఘుమఘుమలాడే పిండి వంటలు.. తొలిపొద్దుకు ముందే వీధుల్లో హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల ఆటలు.. ఇవీ సంక్రాంతికి శోభ తెచ్చే అద్భుతమైన ఘట్టాలు.. మూడు రోజుల పాటు ముచ్చటగా జరిగే ఈ పండగను తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి వేడుకల్లో  ప్రజలు ఉత్సాహంగా గడుపుతున్నారు. 
పట్టణాలు.. పల్లెల్లో.. పండుగ సందడి 
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి. పట్టణాలు.. పల్లెల్లో.. పండుగ సందడి నెలకొంది. ముగ్గుల పోటీలు.. పిండి వంటలు.. యువత ఆట పాటలతో సంక్రాంతి జోష్‌ మరింతగా పెరిగింది. సంక్రాంతి పండుగ ఔచిత్యాన్ని తెలియజేసేలా.. ఏపీలో ప్రభుత్వమే అన్ని జిల్లాల్లో అధికారికంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోంది. అటు తెలంగాణాలోనూ వాడవాడలా పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 
తెలుగునేలను పలకరించే సంక్రాంతి
నూతన సంవత్సరంలో తెలుగునేలను పలకరించే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా జనవరి 14న వచ్చే ఈ పండుగను దేశమంతటా వేడుకగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను జరపుకునే సంప్రదాయం  దాదాపు మూడు వేల ఏళ్ల నుంచీ వస్తోందంటున్నారు పండితులు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి తన ఉత్తర దిశ ప్రయాణాన్ని కొనసాగించడం ఈ సంక్రాంతితోనే ప్రారంభం అవుతుంది. . 
కొత్తపంటలు ఇళ్లకు 
వ్యవసాయప్రధానంగా జరుపుకునే ఈ పండుగ  ప్రకృతికి మానవజీవితంతో విడదీయరాని సంబంధాన్ని తెలియజేస్తుంది సంక్రాంతిరోజుల్లో కొత్తపంటలు ఇళ్లకు చేరుతాయి. ఇల్లంతా పాడిపంటల సౌభాగ్యానికి తోడు.. పండక్కి వచ్చిన బంధువులతో లోగిళ్లలో ఇక సందడే సందడి. 
విదేశాల్లో సంక్రాంతి 
సంక్రాంతి పండుగను మన దేశంలోనే కాదు.. తూర్పుఆసియా  కంబోడియా, థాయ్‌లాండ్‌, లావోస్‌, మైన్మార్‌ తోపాటు నేపాల్లోనూ పెద్దయెత్తున ఆనందంగా జరుపుకుంటారు. 

 

నేడు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ ఫైనల్ మ్యాచ్

ఢిల్లీ : నేడు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ ఫైనల్ మ్యాచ్ జరుగనుది. సాయంత్రం 6.30 గంటలకు చెన్నై..ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. 

Don't Miss