Activities calendar

15 January 2017

సోమవారం నుండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు..

దావోస్ : రేపటి నుండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్విస్కీ రిసార్ట్ లో ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. 100 దేశాల నుండి మొత్తం 3వేల మంది ప్రతినిధులు, 1200 మంది సీఈవోలు హాజరు కానున్నారు. భారత్ నుండి 100 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు గడ్కరీ, నిర్మాలా సీతారామన్, నీతి ఆయోగ్ సీఈవో పనగారియా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు హాజరు కానున్నారు.

 

రేపు సీబీఐ చీఫ్ నియామకంపై చర్చ..

న్యూఢిల్లీ : ప్రధాని నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ సీబీఐ చీఫ్ నియామకంపై రేపు చర్చించనుంది. డిసెంబర్ 2న అనిల్ సిన్హా పదవీ విరమణ చేయడంతో నెల నుండి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

బాబు దావోస్ పర్యటన..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు దావోస్ కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బాబు పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు.

21:27 - January 15, 2017
21:26 - January 15, 2017
21:25 - January 15, 2017

విజయవాడ : ఏపీలో మూడోరోజు కోడి పందాలు భారీ ఎత్తున సాగాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ జోరుగా సాగాయి. ఈ పందాల్లో భారీగా డబ్బులు చేతులు మారాయి. కోడి పందాలకు ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కోడి పందాలతోపాటు పేకాట, గుండాటలు యధేచ్చగా కొనసాగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదివారమూ కోళ్ల పందాలు జోరుగా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో కోళ్లు పందానికి కాళ్లు దువ్వాయి.

తూ.గో..
ఇక తూర్పు గోదావరి జిల్లాలోనూ కోడి పందాలు జోరు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 40కిపైగా బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. అమలాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ, పిఠాపురం కిర్లంపూడి, గోకవరం ప్రాంతాల్లో ఈ పందాలు యధేచ్చగా కొనసాగాయి. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కోడి పందాలు జరిగాయి. విశాఖలోనూ పందెం కోళ్లు పోటీకి దిగాయి. విశాఖ నగర శివారు ప్రాంతం ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనుక భాగంలో కోడిపందాలు నిర్వహించారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ఈ కోడి పందాల వెనుక ఉండడంతో పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి రానీయకుండా నిర్వాహకులు జాగ్రత్త తీసుకున్నారు. కోడి పందాలలో భారీ ఎత్తున చేతులు మారాయి. ఒక్కో దగ్గర 20 లక్షలకు పైబడి కూడా పందాలు కాశారు. పందాల కింద వందల కోట్లు చేతులు మారాయి. కోళ్ల పందాలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశాలున్నా... నిర్వాహకులు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. మూడు, నాలుగు రోజులుగా పందేలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పందాలకు తెలంగాణ నుంచి కూడా పందెం రాయుళ్లు వెళ్లారు. కోడి పందాలతో పాటు గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. కోడి పందాల కోసం వచ్చిన పందెం రాయుళ్లు మద్యం సేవిస్తుండడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

21:23 - January 15, 2017

చెన్నై : తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు ఈ ఏడాది కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. జోరుగా జల్లికట్టు నిర్వహించారు. పలుచోట్ల సుప్రీం ఆదేశాలను నిరసిస్తూ నల్లజెండాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. మధురై జిల్లా పాలమేడులో లాంఛనంగా జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును నిషేధించాలన్న న్యాయస్థానం మాటల్ని పట్టించుకోకుండా నిర్వాహకులు యధేచ్ఛగా జల్లికట్టు నిర్వహించారు. దీంతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల జల్లికట్టు క్రీడలు జరిగాయి.

సుప్రీం ఆదేశాలు..
మరోవైపు జల్లికట్టుపై సుప్రీం ఆదేశాలను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. తమిళనాడు ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 12న సుప్రీం తోసిపుచ్చింది. దీంతో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు సైతం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. తమిళనాడులో పొంగల్‌ సందర్భంగా ఎద్దులతో జల్లికట్టు ఆడటం ఆనవాయితీగా వస్తోంది. రెండువేల ఏళ్ల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి ఇటీవల తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ లేఖలు కూడా రాశారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించకపోయినా.. నిర్వాహకులు మాత్రం జల్లికట్టును ఎప్పటిలాగే నిర్వహించారు.

21:21 - January 15, 2017

చిత్తూరు : జల్లికట్టు తమిళనాడులోనే కాదు... చిత్తూరు జిల్లా రంగంపేటలోనూ ఘనంగా జరిగాయి. ఈ సారి కూడా చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఐదారు రోజుల నుంచే ఏర్పాట్లలో నిమగ్నమైన గ్రామస్తులు.. ఇవాళ జల్లికట్టు నిర్వహించే వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహించారు. చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, భీమవరం, బి.కొంగరవారిపల్లి తదితర గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామదేవతల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరిగాయి. కోడెగిత్తల కొమ్ములకు కానుకలు కట్టి డప్పు వాయిద్యాలతో ఉరకలెత్తించారు.

బహుమతులు..
వీధి చివర్లో ఉన్న యువత కోడెగిత్తలను ఒడిసి పట్టుకుని వాటి కొమ్ములకున్న కానుకలను చేజిక్కించుకున్నారు. కొన్ని కోడె గిత్తల పౌరుషం ముందు యువత చేతులెత్తేశారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి జిల్లా నలుదిక్కుల నుంచే కాకుండా తమిళనాడు నుంచి జనాలు వేలాదిగా తరలిరావడంతో రంగంపేట కిక్కిరిసి పోయింది. ఐరాల మండలం ఇరువారం పల్లె పంచాయతీ కలికిరిపల్లెలోనూ జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును సుప్రీం కోర్టు బ్యాన్ చేసినప్పటికీ... తమిళనాడుతో పాటు ఏపీలోనూ కొనసాగడం గమనార్హం.
తాము పశువుల పండుగ జరుపుకున్నామని, పశువుల పండుగ అంటే జల్లికట్టు కాదని, పశువులను అందంగా ముస్తాబు చేశామని గ్రామస్తులు చెబుతున్నారు. రామచంద్రాపురం మండలంలోని బొప్పరాజుపల్లి, నూతుగుంటపల్లి, అనుప్పల్లి, వేపకుప్పం గ్రామాల యువతతో పాటు, గ్రామస్థులు పశువుల కొమ్ములకు కట్టిన బహుమతులను కైవసం చేసుకున్నారు. పందేల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

అపశృతి..
రంగంపేట జల్లికట్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆవు బావిలో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు.. బావిలోంచి ఆవును బయటకు తీశారు. జల్లికట్టు గ్రామస్తులకు ఉత్సాహం తెప్పించినా జంతుప్రేమికులకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. జల్లికట్లుపై నిషేధం పెట్టినా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.

గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకమన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల, జోగురామన్న, పోచారం, తుమ్మల, జూపల్లి, జగదీశ్వర్ రెడ్డిలున్నారు.

సాహో బాలకృష్ణ – జూ.ఎన్టీఆర్..

హైదరాబాద్: ‘గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాను తాను ఇప్పుడే చూడడం జరిగిందని సినీ నటుడు జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. సాహో నందమూరి బాలకృష్ణ... సాహో డైరెక్టర్‌ క్రిష్‌... సాహో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ అని పేర్కొన్నారు.

 

20:17 - January 15, 2017

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు జరుగుతోంది.

19:46 - January 15, 2017
19:45 - January 15, 2017
19:43 - January 15, 2017

తెలంగాణాలో కవులకు కళాకారులకు కొదువలేదు. ఇక్కడ మట్టిలోనే ప్రతిఘటన ఉంది. కవులు గేయాలు రాయడమేకాదు కాళ్లకు గజ్జెకట్టి ప్రజావేదికలపై కదం తొక్కుతారు. ప్రజలను ఉద్యమాలబాట పట్టిస్తారు. అలాంటి వారిలో నడిమెట్ల రామయ్య ఒకరు. ఆయన చిన్నతనం నుండి పాటలు రాయడం ..వాటికి బాణీలు కట్టి ప్రజలకు వినిపించి వారిని చైతన్యవంతులను చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. ప్రముఖ ప్రజాకవి నడిమెట్ల రామయ్యపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

19:38 - January 15, 2017

బీహార్ : మకర సంక్రాతి పర్వదినం రోజున బీహార్‌ రాజధాని పాట్నాలో పెను విషాదం చోటు చేసుకుంది. పాట్నా వద్ద గంగా నదీ తీరం సమీపంలో ఓ పడవ మునిగిన ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఓ దీవి వద్ద పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. సహాయక సిబ్బంది ఎనిమిది మందిని రక్షించగా, మరి కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. 40 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై గంగానదిలో మునిగిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను పడవలో ఎక్కించుకున్నందునే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. గల్లంతైన మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ బోల్తా పడి మృతిచెందిన వారి కుటుంబాలకు బిహార్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపింది.

రాణిఘాట్ కు..
ప్రయాణికులంతా సబల్ పూర్ నుంచి పాట్నా లోని రాణిఘాట్ కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మకర సంక్రాంతి సందర్భంగా చేపట్టిన కైట్ ఫెస్టివల్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పడవ ఓవర్ లోడ్ అయి ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స‌మాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి గురైన వారిలో 17 మంది తెలుగు వారు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ఘటనపై నితీష్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

19:35 - January 15, 2017

ఢిల్లీ : సైన్యంలో సమస్యలపై జవాన్లు సోషల్‌ మీడియాకు ఎక్కడాన్ని ఆర్మీ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలని.. అలా సోషల్‌ మీడియాలో ప్రచారం జవాన్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని ఆర్మీ చీఫ్‌ హెచ్చరించారు. నాసిరకం తిండి పెడుతున్నారని, గంటల తరబడి పనులు చేయిస్తూ... చాలీచాలని జీతాలిస్తున్నారని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ తేజ్‌బహదూర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుపై ఆర్మీ అధికారులు సీరియస్‌ అయ్యారు. ఆర్మీ డే సందర్భంగా జవాన్లకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌. సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను చెప్పుకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలా చేయడం జవాన్లతో పాటు ఆర్మీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తోందని, అందుకు దీన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని బిపిన్‌ రావత్‌ హెచ్చరించారు. జవాన్లకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవవచ్చని రావత్‌ సూచించారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయవద్దని స్పష్టం చేశారు.

క్రమశిక్షణ ఉల్లంఘణ..
బట్టలు ఉతికించడం, బూట్లు పాలిష్‌ చేయించడం, కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లడం లాంటి పనులు చేయిస్తున్నారని ఇటీవల కొందరు జవాన్లు తమ ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగిణించిన ఆర్మీ.. ఇలాంటి చర్యలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందే వస్తాయని సీనియర్‌ అధికారులు ఎదురుదాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ చీఫ్‌ రావత్‌.. ఆర్మీకి ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్‌ ఉందని, దాని ద్వారానే సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ప్రతి అధికారికి వ్యక్తిగత పనులు చేసేందుకు ఒక వ్యక్తిని నియమించే సహాయక వ్యవస్థను కూడా రావత్‌ ఈ సందర్భంగా సమర్ధించుకున్నారు.

19:06 - January 15, 2017

రింగ్ లో ఉంటే ప్రత్యర్థులను మట్టికరిపించే ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి ఏంటీ కట్నం రూ. 1 అంటున్నారు ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది నిజం. కేవలం ఒక్క రూపాయి మాత్రమే కట్నం తీసుకుంటున్నాడంట. అది కూడా శుభసూచకంగా భావించి మాత్రమే రూపాయి కట్నం తీసుకుంటున్నట్లు యోగేశ్వర్ దత్ పేర్కొంటున్నాడు. జనవరి 16వ తేదీన హర్యానా కాంగ్రెస్ నేత జైభగవాన్ శర్మ తనయ శీతల్ ను 'యోగేశ్వర్' వివాహమాడనున్నారు. శనివారం వీరి నిశ్చితార్థం జరిగింది. కట్నం విషయంలో యోగేశ్వర్ కు ఒక కారణం కూడా ఉందంట. తమ ఇళ్లలో ఆడవారి పెళ్లిళ్లకు కట్నాలు ఇచ్చేందుకు పెద్దలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశానని, కేవలం రెజ్లర్ గా రాణించి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. తన కల నిజమవుతున్నందుకు సంతోషంగా ఉందని, తన తండ్రి రామ్మేహర్ దత్, రెజ్లింగ్ తొలిగురువు సత్ బీర్ సింగ్ బతికుంటే బాగుండేది అని యోగేశ్వర్ పేర్కొన్నారు.

రాంపూర్ లో విషాదం..

మెదక్ : అల్లాదుర్గం (మం) రాంపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని బంధువులు పేర్కొంటున్నారు.

18:32 - January 15, 2017

మహబూబాబాద్ : పల్లెపల్లెను పలకరిస్తూ.. ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర.. మహబూబాబాద్‌ జిల్లాలో కొనసాగుతోంది. 91వ రోజు తమ్మినేని పాదయాత్ర బృందం మందకొమురమ్మ నగర్‌లో పర్యటించింది. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరు పేదలు తలదాచుకునేందుకు కనీసం ఇళ్లు కూడా ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ప్రభుత్వాలు అగ్రవర్ణ ధనికులకు కొమ్ముకాయడం వల్లే పేదలకు న్యాయం జరగడం లేదని తమ్మినేని అన్నారు.

18:30 - January 15, 2017

చిత్తూరు : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని వెలివాడ దగ్గర రోహిత్‌ వేముల విగ్రహం దగ్గర నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించాలని ఆయన తల్లి రాధిక కోరారు. ఈనెల 17న రోహిత్‌ వర్ధంతి సందర్భంగా విద్యార్ధిలోకం తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోహిత్‌ వేముల విగ్రహం ఉన్న వెలివాడ ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా వీసీ అప్పారావు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తిరుపతిలో జరిగిన జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో అప్పారావుకు మిలీనియం ప్లేక్యూ అవార్డు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దళిత బిడ్డల చావుకు కారణమవుతున్నందుకు అప్పారావుకు ఈ అవార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. రోహిత్‌ వేముల కుటుంబానికి సాగుభూమిని, అతని సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌ వేముల వర్దంతి పోస్టర్‌ను విడుదల చేశారు.

18:27 - January 15, 2017

నెల్లూరు : టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మాటలతో రెచ్చిపోయారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌతంరెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే ప్రొటోకాల్‌ అంటూ రచ్చచేస్తున్నారని ఆనం విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలెందుకని ఆయన ప్రశ్నించారు. మరి ఆయన ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:25 - January 15, 2017
18:23 - January 15, 2017

విశాఖపట్టణం : జిల్లాలో పందెం కోళ్లు పోటీకి దిగాయి. గత రెండు రోజుల నుంచి విశాఖ నగర శివారు ప్రాంతం అయిన ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనుక భాగంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ఈ కోడి పందాల వెనుక ఉండడంతో పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి రానీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. విశాఖలో కోడిపందాలపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:21 - January 15, 2017

హైదరాబాద్‌ : శివారు రామచంద్రపురంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గోల్డ్‌ చోరీకి పాల్పడిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాని నిందితుడు లక్ష్మణ్‌తోపాటు మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 3.5 కిలోల బంగారం, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీకి ఉపయోగించిన స్కార్పియో, బైక్‌ను సీజ్‌ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నట్టు సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు చెప్పారు. డిసెంబర్‌ 28న ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. సీబీఐ అధికారులమంటూ వచ్చిన 9 మంది బంగారం చోరీకి పాల్పడ్డారు. మొత్తం 40 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:13 - January 15, 2017

ముంబై : బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ 'అమీర్ ఖాన్' ప్రధాన పాత్రలో నటించిన 'దంగల్'కు అవార్డుల పంట పండింది. 62వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా పలు విభాగాల్లో 'దంగల్' కు అవార్డులు లభించాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, కేటగిరీల్లో 'దంగల్' కు అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ నటిగా 'ఉడ్తా పంజాబ్' లో నటించిన 'అలియా భట్'కు అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటిగా 'నీర్జా' సినిమాలో నటించిన 'షబానా ఆజ్మీ' అవార్డు లభించింది.

 • ఉత్తమ నటుడు : అమీర్ ఖాన్ (దంగల్)
 • ఉత్తమ నటి : అలియా భట్ (ఉడ్తా పంజాబ్)
 • ఉత్తమ చిత్రం: దంగల్
 • ఉత్తమ దర్శకుడు : నితీశ్ తివారీ (దంగల్)
 • ఉత్తమ యాక్షన్ : శ్యామ్ (దంగల్)
 • ఉత్తమ సహాయ నటి : షబానా ఆజ్మీ (నీర్జా)
 • ఉత్తమ సహాయ నటుడు : రిషీకపూర్ (కపూర్ అండ్ సన్స్)
 • ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతమ్ (యే దిల్ హై ముష్కిల్)
 • ఉత్తమ నేపథ్య గాయకుడు : అర్జిత్ సింగ్ (యే దిల్ హై ముష్కిల్)
 • ఉత్తమ నేపథ్య గాయని : నీహా భాసిన్ (సుల్తాన్)
 • ఉత్తమ మాటల రచయిత : రితేశ్ షా (పింక్)
 • ఉత్తమ పరిచయ దర్శకుడు : అశ్విన్ అయ్యర్ తివారీ (నిల్ బేటే సంతా)
 • ఉత్తమ పరిచయ నటుడు : దిల్జీత్ దోసాంజ్ (ఉడ్తా పంజాబ్)
 • ఉత్తమ పరిచయ నటి : రితికా సింగ్ (సాలా ఖడూస్)
 • ఉత్తమ స్ర్కీన్ ప్లే : షకున్ భత్రా, అయేషా దేవిత్రి థిల్లాన్ (కపూర్ అండ్ సన్స్)
 • ఉత్తమ కథ : షకున్ భత్రా, అయేషా దేవిత్రి థిల్లాన్ (కపూర్ అండ్ సన్స్)
 • ఫిలిం ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు : శతృఘ్న సిన్హా.
 • ఉత్తమ ఎడిటింగ్ : మోనిషా బల్దవా (నీర్జా)
18:05 - January 15, 2017

గుంటూరు : కృష్ణా నదిలో మరో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈత కొడుదామని వెళుతూ పలువురు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం కోసూరు ప్రాంతానికి చెందిన అజయ్, కోటయ్య, మొలిందర్ అనే యువకులు కృష్ణా నదికి వెళ్లారు. పండుగ రోజు కావడం..సెలవు కావడంతో సరదాగా వీరంతా అక్కడకు వెళ్లారు. అనంతరం వీరు ముగ్గురూ కృష్ణా నదిలోకి దిగారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకపోయారు. స్థానికులు గమనించి గాలింపులు చేపట్టారు. కానీ ఫలితం కనబడలేదు. చివరకు మత్స్యకారులు రంగప్రవేశం ఇద్దరి మృతదేహాలు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపులు చేపట్టారు. మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అవూరాలో కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ జిఆ్ల అవూరాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత బలగాలు - ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

17:54 - January 15, 2017

భారత్ విజయలక్ష్యం 351 పరుగులు..

పుణె : భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్లు ఏడు వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది. భారత్ విజయలక్ష్యం 351 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ రూట్ 78, జాసన్ రాయ్ 73చ స్టోక్స్ 62, బట్లర్ 31, మోర్గాన్ 28, ఆలీ 28, హేల్స్ 9, వోక్స్ 9 పరుగులు చేశారు. హార్థిక్ పాండ్యా, బుమ్రాలకు చెరో రెండు వికెట్లు తీశారు. జడేజా, ఉమేష్ లకు తలో వికెట్ తీశారు.

మళ్లీ వివాదంలో అమెజాన్ సంస్థ..

ఢిల్లీ : అమెజాన్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. ఆన్ లైన్ లో గాంధీ బొమ్మతో కూడిన చెప్పులు విక్రయానికి పెట్టడం తీవ్ర వివాదస్పదమౌతోంది. గతంలో త్రివర్ణ పతాకం ముద్రించిన డోర్ మాట్లను అమేజాన్ అమ్మకానికి పెట్టింది. అమేజాన్ సంస్థ తీరుపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి.

 

అస్సాంలో పెట్రోల్ పంపులు..గ్యాస్ ఏజెన్సీలపై దాడులు..

అస్సాం : పెట్రోల్ పంపులు, గ్యాస్ ఏజెన్సీలపై విజిలెన్స్ అకస్మిక దాడులు నిర్వహించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోదరుడు గ్యాస్ ఏజెన్సీపైనా దాడులు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కల్తీ, గ్యాస్ మార్కెటింగ్ చేస్తున్నారని దాడులు నిర్వహించారు.

రేపటి నుండి కేరళ యూత్ ఫెస్టివల్..

హైదరాబాద్ : రేపటి నుండి కేరళ స్కూల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. యూత్ ఫెస్టివల్ ను సీఎం పినరయి విజయన్ ప్రారంభించనున్నారు. 232 ఈవెంట్లలో 12 వేల మంది విద్యార్థులు పోటీ పడనున్నారు. కేరళ స్కూల్ యూత్ ఫెస్టివల్ ను అవినీతి రహితంగా నిర్వహించేందుకు విజిలెన్స్ డైరెక్టర్ జాకబ్ థామస్ కు బాధ్యతలు అప్పగించారు. ఫెస్టివల్ లో అవినీతి జరుగుతున్నందున ఓ విద్యార్థి లేఖ రాయడంతో సీఎం పినరయి స్పందించారు.

జవాన్లకు రావత్ హెచ్చరికలు..

ఢిల్లీ : జవాన్లకు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేశారు. జవానులు సోషల్ మీడియాకు ఎక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

15:58 - January 15, 2017

మీడియా ఎదుట ముత్తూట్ దోపిడి కేసుల నిందితులు..

సంగారెడ్డి : రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును పోలీసులు చేధించారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 3.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 5లక్షలను స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన సీబీఐ అధికారులమంటూ ఆఫీస్ లోకి చొరబడి 40 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.

 

కృష్ణా నదిలో ముగ్గురు యువకులు గల్లంతు..

గుంటూరు : అచ్చంపేట (మం) కోనూరులో కృష్ణానదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా మరొకరి కోసం గాలింపు చేపట్టారు.

పశుసంవర్థక శాఖపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : పశుసంవర్థక శాఖపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసుల అదుపులో డిచ్ పల్లి కాంగ్రెస్ నేత..

నిజామాబాద్ : డిచ్ పల్లి లో కాంగ్రెస్ నేత గంగారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం గ్యాంగ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి.

15:23 - January 15, 2017

విజయవాడ : ప్రతొక్కరూ జన్మనిచ్చిన తల్లిని..పుట్టి పెరిగిన ఊరిని మరిచిపోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలను స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబసమేతంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. జీవితంలో ఓ స్థాయికి చేరిన అనంతరం జన్మభూమిని గుర్తు పెట్టుకుని అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో మనస్సుకు ఆనందం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అలాగే ఆనందంగా ఉండాలని ఆకాక్షించారు.

15:16 - January 15, 2017
15:13 - January 15, 2017

సిద్ధిపేట : జిల్లాలోని హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయంలో అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సెగలు కక్కుతున్న నిప్పులపై నడుస్తూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కళ్యాణోత్సవం, అగ్నిగుండాలు వేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

శంషాబాద్ లో బంగారం స్వాధీనం..

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్ర‌యాణికుడి వద్ద త‌నిఖీ చేసిన‌ కస్టమ్స్ అధికారులు 34 లక్షల రూపాయ‌ల విలువచేసే 192 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

జల్లికట్టులో అపశృతి..

చిత్తూరు : రంగంపేట జల్లికట్టులో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ ఆవు బెదిరి బావిలో పడిపోయింది. దీనితో గ్రామస్తులు స్పందించి ఆవును బయటకు తీశారు.

కొనసాగుతున్న జల్లికట్టు..

చిత్తూరు : రంగంపేటలో జల్లికట్టు కొనసాగుతోంది. సంప్రదాయబద్ధంగా ఈ ఆట వస్తోందని, ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని పలువురు పేర్కొంటున్నారు. పోలీసుల హెచ్చరికలు ఏ మాత్రం లెక్క చేయకుండా జల్లికట్టు పోటీ కొనసాగుతోంది.

14:15 - January 15, 2017

చిత్తూరు : ఎప్పటిలాగానే యువకుల కేరింతలు..ఇసుకవేసే రాలనంత జనసందోహం..రంగంపేటలో ఉత్కంఠ...ఈ దఫా జల్లికట్టు జరుగుతుందా ? లేదా ? అనే దానికి ఉత్కంఠకు తెరపడింది. సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లిన అనంతరం రెండు గంటల అనంతరం జల్లికట్టు ప్రారంభమైంది. పశువులను గ్రామంలోకి వదలవద్దని రైతులకు పోలీసులు హెచ్చరికలు...గ్రామంలో పోస్టర్లు..అతికించినా అక్కడి గ్రామస్తులు లైట్ తీసుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది. అందంగా అలంకరించిన ఆవులకు కట్టిన పలకలు..బంగారు ఆభరణాలు దక్కించుకోవడానికి యువత పోటీ పడ్డారు. అత్యంత వేగంగా పరుగులు తీసే ఆవులను పట్టుకోవడానికి చాలా మంది రంగంపేటకు తరలివచ్చారు. జంతువులను హింసించ లేని పోటీ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఓ ఆవును తప్పించుకోవడానికి వెళ్లి బావిలో పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆవును కాపాడే ప్రయత్నం చేశారు. చివరకు ఆవును సురక్షితంగా బయటకు లాగారు. జల్లికట్టులో గాయపడిన పలువురు యువకులు వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రులుకు వెళుతున్నారు...

మేకపాటి, గౌతంరెడ్డిలపై ఆనం వివేకా ఫైర్..

నెల్లూరు : ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే గౌతంరెడ్డిలపై టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి ఫైర్ అయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై మేకపాటి, గౌతంరెడ్డి కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వారికి కనీసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల పేర్లు కూడా తెలియని ఎద్దేవా చేశారు. వైసీపీలో నాయకుల మధ్య సఖ్యత లేకే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు.

ఎర్రబెల్లి తల్లి భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు..

వరంగల్ రూరల్ : పర్వగిరిలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి తల్లి ఆదిలక్ష్మీ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఎర్రబెల్లి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. సీఎం వెంట డిప్యూటి సీఎం కడియం, స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు తుమ్మల, చందూలాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు.

13:40 - January 15, 2017
13:38 - January 15, 2017

వరంగల్ : ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి మృతదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ఎర్రబెల్లి కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. కేసీఆర్‌ వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల, చందూలాల్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

13:36 - January 15, 2017

యూపీ : డా.బీఆర్‌ అంబేద్కర్‌ పేరును వాడుకుంటున్న బీజేపీ.. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చేసిందేమి లేదని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. మోదీ సర్కార్‌ దళితులను వంచిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో సామాన్యులను తీవ్ర ఇబ్బంది పెట్టిన మోదీ... ఆర్‌ఎస్సెస్‌ ఎజెండాను అమలు చేస్తున్నారని మాయావతి దుయ్యబట్టారు. బీఎస్‌పీ సామాన్యుల పార్టీ అని, రానున్న యూపీ ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతామని ఆమె ప్రకటించారు.

13:34 - January 15, 2017

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసిన ఆయన తన భవిష్యత్‌ కార్యాచరణపై మంతనాలు జరిపారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి పోటీచేయనున్నట్లు ఈ సందర్భంగా నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తెలిపారు.

 

13:33 - January 15, 2017

విశాఖ : అనకాపల్లి రహదారి పై కుక్కను తప్పించబోయి కారు బోల్తాకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారు ఇద్దరు అన్నములు, డ్రైవర్ సీట్లో వున్న మరో వ్యక్తి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు అనకాపల్లి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. మృతులు అనకాపల్లికి చెందిన వారే నని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

13:31 - January 15, 2017

చిత్తూరు : రంగం పేటలో జల్లికట్టు క్రీడ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు మాట్లాడుతూ... తమిళనాడు జల్లికట్టుకు, రంగంపేట జల్లికట్టుకు సంబంధం లేదని తెలిపారు. మేం జంతువులను హింసించం అని తెలిపారు. ఈ ఆటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుండి జనాలు తరలి వచ్చారు. ఈ ఆటలో పశువుల కొమ్ములకు పలకలు, కొన్ని బంగారు ఆభరణాలు తగిలిస్తారు. దాన్ని పట్టుకునేందుకు యువకులు ఉరుకులు తీస్తున్నారు.

13:13 - January 15, 2017

హైదరాబాద్ : సాహిత్యం సమాజానికి దర్పణం పడుతోంది. కవులు, రచయితలు తమ రచనలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. అలాంటి రచయితల్లో ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు ఒకరు. రాగమేదైనా కళ్లుమూసుకుని వినలేను...కవిత్వమైనా సరే... దృశ్య చంచలం కావాలి అంటున్న కవి దాట్ల దేవదానం రాజు. యానాం కు చెందిన ప్రముఖ కథకుడు కవి దాట్ల దేవదానం రాజు అనేక కథలు కవితా సంపుటాలు వెలువరించారు. యానాంలో సాహిత్య సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ సాహిత్యం పట్ల ప్రేమను ప్రకటిస్తున్నారు.. ప్రముఖ కవి కథకులు దాట్ల దేవదానం రాజుపై మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

12:44 - January 15, 2017

.గో : మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్‌రావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైసీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి శ్రీధర్‌ వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఈ నెల 28వ తేదీన జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు కోటగిరి శ్రీధర్‌ వెల్లడించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న తన తండ్రి అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతోనే వైసీపీలోకి చేరుతున్నట్లు చెప్పారు.

12:42 - January 15, 2017

అమరావతి : ఏపీలో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష రద్దు చేస్తే విద్యార్థులకు లాభమా.. నష్టామా..? అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంలో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెడికల్, డెంటల్ కోర్సులు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నీట్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇంజనీరింగ్‌లో ఎంసెట్‌ను రద్దు చేసి.. ప్రవేశాలను నేరుగా ఇంటర్ మార్కుల ఆధారంగా చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు...

వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షను నిర్వహించాలా..? వద్దా అనే దానిపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ మార్కులను బట్టి ప్రవేశాలు కల్పిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో 2,800 ఇంటర్‌ కాలేజీలు ...

రాష్ట్రంలో 2,800 వరకు ఇంటర్‌ కళాశాలలున్నాయి. వీటిలో 572 ప్రభుత్వ, ఎయిడెడ్ కాగా.. మిగతావి కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో నడుస్తున్నాయి. రెండేళ్లకు కలిపి 9.64 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2.95 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ, ఎయిడెడ్, ఇతర శాఖల పరిధిలో విద్యనభ్యసిస్తున్నారు. ఇంటర్ విద్య పూర్తిగా ప్రైవేట్ విద్యా సంస్థల చేతుల్లోకి వెళ్లింది. పరీక్షల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో క్వశ్చన్‌ పేపర్ల లీకేజీ, మాస్‌ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.

ముల్యాంకనంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల అవకతవకలు...

ఇక మూల్యాంకనం విషయంలోనూ ప్రైవేట్‌ విద్యా సంస్థలు అవకతవకలకు పాల్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. సుమారు 10 వేల మంది ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లను మూల్యాంకనం కోసం వినియోగిస్తున్నారు. లెక్చరర్ల స్థానంలో విద్యార్థుల సందేహాల్ని నివృత్తి చేసేందుకు, చదివించేందుకు నియమించుకున్న వారిని మూల్యాంకనానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. పునర్‌ ముల్యాంకనంలో కొన్నిసార్లు ఒకటి నుంచి 5 మార్కుల వరకు కలుపుతుండటంతో.. పలువురు విద్యార్థులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మూల్యాంకనం తీరు వివాదాస్పదంగా మారుతోంది.

తమిళనాడులో ఇంటర్‌ మార్కులతో ఇంజనీరింగ్‌ ప్రవేశాలు ...

మరోవైపు తమిళనాడులో ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 80 నుంచి 90 శాతం కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. తమిళనాడు విద్యావ్యవస్థతో పోల్చితే ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షను రద్దు చేయాలనుకుంటే తొలుత రాష్ట్రంలోని ఇంటర్ విద్య, పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యాంకన వ్యవస్థను పటిష్ట చేయాల్సిన అవసరం ఉందని విద్యామండలి భావిస్తోంది. ఈనేపథ్యంలో ఎంసెట్‌ ఇంజనీరింగ్ పరీక్ష రద్దుపై అధ్యయన కమిటీ నివేదిక కూడా కీలకం కానుంది.

12:08 - January 15, 2017

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దర్శించుకుని మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మంత్రి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పర్వతగిరి చేరుకున్న సీఎం కేసీఆర్

వరంగల్ : ఎమ్మెల్యే ఎర్రబెల్లి తల్లి ఆదిలక్ష్మి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ పర్వతగిరి చేరుకున్నారు. ఇప్పటికే ఆదిలక్ష్మి భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాలులర్పించారు.

బీఎస్పీ మేనిఫెస్టో విడుదల

యూపీ : ఎన్నికలకు బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత మాయావతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. బిజెపి, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

11:39 - January 15, 2017

విజయవాడ: సింగ్‌నగర్‌లో వంగవీటి రంగా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో వంగవీటి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... నూజివీడు, విజయవాడ రహదారిపై రాధారంగా మిత్రమండలి సభ్యులు రాస్తారోకో చేపట్టారు. ధ్వంసమైన రంగా విగ్రహాన్ని వంగవీటి రాధా పరిశీలించారు. ఈ సందర్భంగా వంగవీటి అభిమానులు టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి కాపు నేతలు భారీగా చేరుకుంటున్నారు.

11:36 - January 15, 2017

హైదరాబాద్ : బీహార్‌ పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది.. మృతుల కుటుంబానికి ప్రధాని మోదీ, సోనియా గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.. మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం ఇస్తామని మోదీ ప్రకటించారు.. అటు బీహార్‌ ప్రభుత్వంఇప్పటికే 4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.. శనివారం పాట్నా దగ్గర గంగాతీరంలో పడవ ముగినిపోయింది.. పతంగుల పండుగ నిర్వహిస్తున్న బృందం ఈ పడవలో ప్రయాణిస్తోంది.. మృతుల్లో చిన్నారులు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి...

యూపీలో పడవ బోల్తా :3గురు మృతి

హైదరాబాద్ : పాట్నాలో పడవ బోల్తా పడి 25 మంది మృతి చెందినఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. యూపీలోని హమీర్ పూర్ లోని విర్మానదిలో పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

11:27 - January 15, 2017

పడవ బోల్తా పై సోనిగాంధీ దిగ్భ్రాంతి

బీహార్: పడవ బోల్తా ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోనియాగాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగానది పడవ బోల్తా ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

పడవబోల్తా పై ప్రధానిమోదీ దిగ్భ్రాంతి...

బీహార్ : పట్నాలో పడవ బోల్తా ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

3రోజు జోరుగా కోడిపందేలు..

రాజమండ్రి : గోదావరి ప్రాంతాల్లో మూడో రోజు జోరుగా కోడిపందాలు కొనసాగుతున్నాయి. సీతానగరం, రాజమండ్రి రూరల్, అనపర్తి, జగ్గంపేట మండలాల్లో కోడిపందాల నిర్వహణలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.

విజయవాడలో వంగవీటి విగ్రహం ధ్వంసం

విజయవాడ: సింగ్ నగర్ లో వంగవీటి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో నూజివీడు, విజయవాడ రహదారిపై రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వ్రిగహాన్ని ధ్వసం చేసిన దుండగులను అరెస్టు చేయాలని వంగవీటి రాధా డిమాండ్ చేశారు.

'ముత్తూట్ ఫైనాన్స్' నిందితుల అరెస్ట్...

సంగారెడ్డి: డిసెంబర్ 28న రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మధ్యాహ్నం 2:30 గంటలకు పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. సీబీఐ అధికారులమంటూ 9 మంది నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

10:23 - January 15, 2017
10:20 - January 15, 2017
10:15 - January 15, 2017

అమరాతి: ఏపీ రాజధాని అమరావతి నూతన కమీషనరేట్‌లో రాజకీయ అంశాలు చొరబడుతున్నాయి. పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకృతం చేయడంలో రాజకీయ చదరంగం కొనసాగుతోంది. రెండు జిల్లాల నేతలు ఎవరికివారు తమ పట్టు నిలుపుకునేందుకు పోలీస్ కమిషనరేట్ ను పావుగా వాడుకుంటున్నారు. దీంతో అమరావతి పోలీస్ కమిషనరేట్ చుట్టూ క్రినీడ అలుముకుంది.

అర్బన్ పోలీస్ జిల్లాలు పూర్తిగా కనుమరుగు...

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తే విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్ పోలీస్ జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయి. కృష్ణా, గుంటూరు గ్రామీణ పోలీస్ జిల్లాల స్వరూపం మారుతుంది. నరసరావు పేట కేంద్రంగా గుంటూరు గ్రామీణ పోలీస్ జిల్లా, మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా గ్రామీణ పోలీస్ జిల్లాలు పనిచేయనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్ ఏపీ సీఎం చంద్రబాబు వద్ద ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది. ఈ ఫైల్ కు గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి ఇది దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ గా అవతరించనుంది. గత రెండున్నరేళ్లుగా ఈ ఫైల్ ఉత్తర్వుల కోసం పోలీస్ శాఖ వేచిచూస్తోంది.

టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ...

టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అమరావతి పోలీస్ కమిషనరేట్ బాలారిష్టాలు దాటలేదు. అమరావతిని దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ గా అన్ని అంశాలతో తీర్చిదిద్దాలనేది అటు పోలీస్ శాఖతో పాటు ఇటు ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఇది కార్యరూపం దాల్చితే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి మూడొంతుల పోలీస్ స్టేషన్లు అన్నీ అమరావతి కమిషనరేట్ పరిధిలోకే రానున్నాయి. అయితే ఆదిలోనే హంస పాదు అన్నట్లు అమరావతి కమిషనరేట్ కు కొందరు రాజకీయ నాయకుల జోక్యం, ఇష్టారాజ్యంగా మారడంతో కమిషనరేట్ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. రెండు జిల్లాలకు చెందిన కొందరు నేతలు జిల్లాలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందనే యోచనతో కమిషనరేట్ కు మోకాలడ్డుతున్నారు. దీంతో అమరావతి కమిషనరేట్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమవుతుందనే అపవాదు ప్రభుత్వం మూటగట్టుకుంటోంది.

నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ...

రాజధాని జిల్లాల నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది. త్వరలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఏపీ నూతన రాజధాని ప్రాంతానికి తరలిరావడంతో కొత్త కమిషనరేట్ రావాల్సిందేనని కొందరు ఉన్నతస్థాయి అధికారుల ఆకాంక్షగా ఉంది. విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నందున భద్రతా చర్యల్లో భాగంగా పోలీస్ సిబ్బందిని పెంచడంతోపాటు అమరావతి కమిషనరేట్ ను ఏర్పాటు చేస్తేనే బెటర్ అనే నిర్ణయానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చేశారు.

42 పోలీస్ స్టేషన్లు పూర్తిగా విలీనం...

అమరావతి కమిషనరేట్ లో విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్ జిల్లాలోని 42 పోలీస్ స్టేషన్లు పూర్తిగా విలీనం కానున్నాయి. గుంటూరు గ్రామీణ జిల్లాలోని 20, కృష్ణాజిల్లాలోని 22 ఠాణాలు సైతం విలీనమవుతాయి. 82 పోలీస్ స్టేషన్లు, 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 60 లక్షల జనాభాతో ఈ కమిషనరేట్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా పరిధిలో 52 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 22 పోలీస్ స్టేషన్లు అమరావతి కమిషనరేట్ లో కలవనున్నాయి. ప్రస్తుతం గుంటూరు గ్రామీణ పోలీస్ జిల్లా పరిధిలో 67 ఠాణాలున్నాయి. వీటిలో 20 అమరావతి కమిషనరేట్ లో కలుస్తాయి.

40 ఏళ్ల కాలానికి సరిపోయేలా...

దేశంలోనే అత్యంత పెద్దదైన ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కు డీజీపీ హోదా గల అధికారి కమిషనర్ గా ఉన్నారు. ముగ్గురు స్పెషల్ కమిషనర్లు, 17 మంది జాయింట్ పోలీస్ కమిషనర్లు, ఏడుగురు అడిషనల్, 74 డిప్యూటీ, 272 మంది ఏసీపీలు ఉంటారు. సిబ్బంది సంఖ్యాపరంగా తక్కువే అయినా, విస్తీర్ణం ప్రకారం 7 వేల చదరపు కిలోమీటర్లు ఉన్న అమరావతి కమిషనరేట్ ను మరో 40 ఏళ్ల కాలానికి సరిపోయేలా రూపొందించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

10:08 - January 15, 2017

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా పండుగ ఉత్సాహమే కనిపించింది. మహిళలు తెల్లవారుజామునే ముంగిళ్లలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దారు. వాటిపై గొబ్బెమ్మలను పెట్టారు. హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నల పిలుపులతో సంక్రాంతి పండుగ శోభాయమానంగా జరిగింది. పిండివంటల ఘుమఘుమలు వాడవాడలా వ్యాపించి నోరూరించాయి.

నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఉదయం గ్రామంలోని నాగాలమ్మ, గంగమ్మ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మనువడు దేవాన్ష్‌తో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకనే సమీపంలోని తన తల్లిదండ్రులు సమాధుల దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు.

సందడి చేసిన డూడూడ బసవన్నలు...

తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా కలిసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. డూడూ బసవన్నలు సందడి చేశాయి. గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు... సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సరికొత్త అనుభూతిని పంచారు.

ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు...

ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మహిళలు తెలతెలవారుతుండగానే ఇంటి ముంగిళ్లను అందమైన రంగవల్లులతో నింపారు. ఇక అమ్మాయిలు అంతా ఒకచోట చేరి సందడి చేశారు. ఆడిపాడారు. మకర సంక్రాంతిని ఉల్లాసంగా జరుపుకున్నారు.

అనంతపురంలో ముగ్గులపోటీలు..

సంక్రాంతి పర్వదినాన అనంతపురంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిటీకేబుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు వివిధ కాన్సెప్ట్‌లతో ముగ్గులువేసి ఆకట్టుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

గుండ్రాయి పోటీలు ...

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో సంక్రాంతి సందర్భంగా గుండ్రాయి పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణా యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. 120 కేజీల బరువున్న రాతి గుండును 5 నిముషాల్లో ఎక్కువసార్లు ఎత్తిన వారిని విజేతలుగా ప్రకటించి.. వారికి బహుమతులు అందజేశారు.

10:00 - January 15, 2017

గద్వాల :ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం ఉండడం సహజం. కానీ.. ఆలయం కంటే ఎత్తైన ఇల్లు ఉండకూడదని,.. తామెవరూ తిరుపతి వెళ్లకూడదనే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఏంటా గ్రామం ? ఎందుకీ ఆచారాలను పాటిస్తున్నారో.. తెలుసుకోవాలనుకుందా. అయితే ఈ స్టోరీ చూడండి.

రెండో అంతస్తు బిల్డింగ్‌ ఒక్కటీ లేదు...

ప్రజలకు కట్టుకునే స్తోమత లేక కాదు. ఈ ఊర్లో రెండో అంతస్తు బిల్డింగ్‌ కట్టకూడదనే ఆచారం ఉండడంతో దానిని ప్రజలు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇది ఇప్పుడు పెట్టుకున్న ఆచారం కాదు.. వాళ్ల తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అందుకే ఆ ఊర్లో ఎవరూ రెండో అంతస్తు బిల్డింగ్‌ కట్టరు. అసలు ఇంతకీ ప్రజలు నమ్ముకున్న ఆ ఆచారం ఏంటి ? ఎందుకు రెండో అంతస్తు బిల్డింగ్‌ కట్టరో తెలుసుకుందామా..

గద్వాల జోగులంబ...

ఇది గద్వాల జోగులంబ జిల్లాలోని మల్థకల్‌ గ్రామం. ఇక్కడ స్వయంభూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. సాక్ష్యాత్తూ తిరుపతి వెంకన్ననే కొలువుదీరాడా అని అనిపిస్తుంది. స్వామిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలలా నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు పల్లకి సేవ జరుగుతుంది. అయితే.. పల్లకిలోని దేవతామూర్తులను కింది నుంచే నమస్కారం చేయానే ఆనవాయితి ఉంది. ఇక్కడ కొలువుదీరిన వెంకన్నకు ఎంతో మహాత్యం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

16 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి రెండో అంతస్తు ...

అందుకే ఈ ఊర్లో గ్రామస్తులు రెండో అంతస్తును నిర్మించరు. నిర్మించ తలపెట్టిన వారికి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అందుకే ఎవరూ ఆ సాహసం చేయలేకపోతున్నారు. 16 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి రెండో అంతస్తు నిర్మించేందుకు ప్రయత్నించగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికీ ఆ వ్యక్తి కోలుకోలేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.

సొంత ఖర్చులతో తిరుమల వెళ్లరు.

ఇదే కాకుండా.. ఈ గ్రామంలో మరో ఆచారం కూడా ఉంది. ఈ గ్రామానికి చెందినవాళ్లు సొంత ఖర్చులతో తిరుమల వెళ్లరు. తిమ్మప్ప ప్రతి ఇంటికి దైవంగా ఉండడంతో.. తాము తిరుపతికి వెళ్లమని గ్రామస్తులంటున్నారు.

ఆలయ అభివృధ్ధికి 29 కోట్లు....

అయితే.. తాజాగా ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 29 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. . ఏమైనా ఇలాంటి వింత ఆచారాలతో పాటు.. మహిమ ఉన్న వేంకటేశ్వరస్వామిని అందరూ ఒక్కసారి దర్శించుకోవాల్సిన అవసరం ఉంది.

09:55 - January 15, 2017

తూ.గో : కాకినాడలో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోకుండా కోడి పందేలను నిర్వహిస్తున్నారు. కోనసీమలో అయితే.. కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెండో రోజు పందెం రాయుళ్లు అదేజోరు కనబరుస్తున్నారు. ఐ. పోలవరం మండలం మురముళ్లలో భారీస్థాయి బెట్టింగులు జరుగుతుంటే... అమలాపురం మండలం కామనగరవు, అల్లవరం మండలం గోడి, గుండెపూడి, ఉప్పలగుప్తం మండలం ఎన్‌. కొత్తపల్లి, గొల్లవల్లిలతో పాటు పలు ప్రాంతాల్లో కోడి పందేలు సాగుతున్నాయి. కోడి పందేల నిర్వహణ ప్రాంతాల్లో గుండాటలు, మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తక్కవ స్థాయిలోనే పందేలు జరుగుతున్నాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి మోదీ నోట్ల రద్దు వ్యవహారమే కారణమని చెబుతున్నారు.

09:54 - January 15, 2017

చిత్తూరు : రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. రైతులు ఆవులను ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు జల్లికట్టు పేరిట పశువులను హింసించడం తగదంటూ గ్రామంలో పోలీసులు పోస్టర్లు అంటించారు. పశువులను గ్రామంలోకి వదలొద్దని ఆవుల యజమానులకు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఎవరికైనా హానీ జరిగితే కేసులు పెడతామని హెచ్చరించారు.

09:52 - January 15, 2017

గుంటూరు:అమరావతిలో రైతులకు ప్లాట్ల పంపిణీ చివరిదశకు చేరింది. ఇప్పటి వరకు 20 గ్రామాల్లో 40వేల ప్లాట్ల కేటాయింపును సీఆర్‌డీఏ పూర్తి చేసింది. దీంతో 80శాతం వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మిగిలిన ప్లాట్ల కేటాయింపును ఈనెల 17, 18 తేదీల్లో చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తుళ్లూరు మండలంలోని ..

తుళ్లూరు మండలంలోని మందడం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, మంగళగిరి మండలంలోని నవులూరు, ఎర్రబాలెం, బేతవోలు గ్రామాల్లో మాత్రమే ప్లాట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. ఉండవల్లిలో 870 ఎకరాలు, పెనుమాకలో 720 ఎకరాలు సీఆర్‌డీఏకు అందాల్సి ఉంది. గ్రామ కంఠాలు, కుటుంబ పేచీల కారణంగా తేల్చకుండా ఉన్న భూముల విషయంలో సీఆర్డీఏ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రాజధాని రైతు కమిటీ కోరుతోంది. లంక భూముల విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది.

రైతులకు ఉచితంగానే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌...

ప్లాట్ల కేటాయింపులు పూర్తవగానే ఆ ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలనే దృఢ నిశ్చయంలో సీఆర్‌డీఏ ఉంది. తొలిసారి చేసే రిజిస్ట్రేషన్‌పై రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీలు మినహాయించే యోచనలో సీఆర్‌డీఏ ఉంది. ఆ తర్వాత జరిగే లావాదేవీలకు మాత్రం రిజిస్ట్రేషన్ చార్జీలను యదావిధిగా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రైతులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తమ పేరుమీద రిజిస్ట్రేన్‌ చేసిన ప్లాట్లను తమ వారసులకు తామే తిరిగి వాటాల రూపంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు విడివిడి డాక్యుమెంట్లు కాని, లేదా ప్లాట్ల సంఖ్యనుబట్టి డాక్యుమెంట్లు ఇవ్వటంగాని చేయాలన్నది రైతుల అభిప్రాయం.

రైతులను వేధిస్తోన్న వీధిపోట్ల సమస్య

ఇక ప్లాట్లు పొందిన గ్రామాలలో రైతులను వీధి శూలల సమస్య పట్టి పీడిస్తోంది. కొంతమంది రైతులకు ఇచ్చిన ప్లాట్లపై వీధిపోట్లు ఉన్నాయి. దీనిపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో సీఆర్డీఏ, తమ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో కొంత భద్రత కల్పించింది. అలాంటి వీధిశూలలు ఉన్న ప్లాట్లను గుర్తించి అందులో ముందు భాగాన్ని సీఆర్‌డీఏ తన దగ్గరే ఉంచుకుంటోంది. ఈ ప్లాట్లలో చిన్నిచిన్న షాపులను నిర్మించి కమర్షియల్ అవసరాల కోసం ఇవ్వాలని యోచిస్తోంది. అది కుదరకపోతే అక్కడే గోడ కట్టి ఆ కాలనీ వరకు గేటెడ్ కమ్యూనిటీలా చేయటానికి ప్లాన్ లో పొందుపరిచారు. అయితే భవిష్యత్తులో ఇది పక్కాగా ఉండేలా శాశ్వతపరమైన చట్టబద్ధ రక్షణ కలిపించాలని రైతులు కోరుతున్నారు. ప్లాట్ల కేటాయింపు తర్వాత నిబంధనల ప్రకారం అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రభుత్వం రైతులకు హామీనిచ్చింది. అయితే ఇప్పటికి ఇంకా అనేక గ్రామాలలో మౌలిక సదుపాయాలు ప్రారంభమే కాలేదు.

రహదారుల నాణ్యతపై అనుమానాలు

అమరావతిలో నిర్మిస్తున్న రోడ్ల నాణ్యతపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామంటున్న ప్రభుత్వం.. రహదారుల నాణ్యతపై శ్రద్ధచూపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేలపాడులో వేస్తున్న రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే రీతిలో రోడ్లను వేస్తే రెండు మూడేళ్లలోనే గోతులు, గుంతలమయం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రోడ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని, ఇందుకోసం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

09:50 - January 15, 2017

కృష్ణా : పెద్ద నోట్ల రద్దు తర్వాత... అందరూ నగదురహిత లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారు. రేషన్‌ బియ్యం మొదలుకుని.. కరెంట్‌ బిల్లులు, నల్ల బిల్లులు, బస్సు, రైలు టికెట్ల వరకు అంతటా డిజిటల్‌ చెల్లింపుల విధానంతో క్యాష్‌లెస్‌ విధానాన్ని అనుసరించేలా ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా డిజిటల్‌ ప్రక్రియలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామీణ, మండల ప్రాంతాల్లోని ప్రజలకు క్యాష్‌లెస్‌ విధానంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ బాబు స్పష్టం చేశారు. క్యాష్‌లెస్‌ విధానంతో అవినీతి తగ్గడంతో పాటు.. దళారులను నిర్మూళించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

అటు పోలీసు శాఖ సైతం...

అటు పోలీసు శాఖ సైతం ప్రజలకు అవసరమైన సేవలను క్యాష్‌లెస్‌ విధానం అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఎవరికి ఎలాంటి అనుమాతులు ఇవ్వాలన్నా... అందుకు అవసరమైన లావాదేవీలన్నీ డిజిటల్‌ విధానంలో జరిగేలా చర్యలు ప్రారంభించారు.

ప్రధాని మోదీ కలను..

ప్రధాని మోదీ కలను.. ఏపీ సీఎం చంద్రబాబు సాకారం చేస్తున్నారని, దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీనే నగదు రహిత విధానం అమలులో ముందంజలో ఉండటం, అందులో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలవడం అభినందనీయమని జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ లెస్ విధానాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఏపీ మంత్రి దేవినేని ఉమ, విజయవాడ ఎంపీ కేశినేని నాని కొనియాడారు.

ప్రజలు అనేక ఇబ్బందులు...

మరోవైపు ప్రజల వద్ద డబ్బుల్లేక, ఇటు స్వైపింగ్ మిషన్లు అందుబాటులోకి రాక... వ్యాపారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల మిషన్‌లు పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యాయని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

బ్యాంకు సిబ్బంది సహకరించినా... ..

బ్యాంకు సిబ్బంది సహకరించినా... స్వైపింగ్‌ మిషన్లు పనిచేయకపోవడంతో..తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలు రావడంతో కనీసం పండుగ జరుపుకొనే పరిస్థితులు కూడా లేవని చెబుతున్నారు.

09:48 - January 15, 2017

నెల్లూరు :తనకు పెళ్లి చేయడం లేదని ఓ వ్యక్తి మద్యం తాగి అర్ధరాత్రి నగ్నంగా విధుల్లో హల్‌చల్‌ చేసిన  ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. హరనాథపురం రెండవ విధుల్లో నివాసం ఉంటున్న సాయికృష్ణ అనే వ్యక్తికి ఇంకా పెళ్లి కాలేదు. తనకు వస్తున్న సంబంధాలను తన తల్లి చెడగొడుతుందనే అనుమానంతో ప్రతిరోజూ తాగి వచ్చి తల్లితో గొడవ పడుతున్నాడు. ఎప్పటిలానే మద్యం తాగి ఇంటికి వచ్చిన సాయి... ఇంటిపైకి రాళ్లు రువ్వుతూ.. అర్ధరాత్రి నానా హల్‌ చల్‌ చేశాడు. స్థానికులపై కూడా రాళ్లు రువ్వుతూ నానా హంగామా చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలికి వచ్చి సాయిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి పూచీకత్తుతో సాయి కృష్ణను పోలీసులు ఇంటికి పంపించారు. సాయికృష్ణ సిద్దు హాస్పిటల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.

09:46 - January 15, 2017

కృష్ణా : విజయవాడలో ఎయిర్‌ షో అందరినీ ఆకట్టుకుంది... పున్నమిఘాట్‌ దగ్గర ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ షోను చూసేందుకు వందలాదిమంది వీక్షకులు తరలివచ్చారు.. విమానాల విన్యాసాలుచూసి కేరింతలు కొట్టారు..

09:45 - January 15, 2017

తూ.గో : కాకినాడలో బీచ్‌ ఫెస్టివల్ అదిరిపోయింది... ఆటా పాటాతో సింగర్స్‌ సందడిచేశారు.. సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్‌ షో అందరినీ ఆకట్టుకున్నాయి.. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో స్థానికులు వచ్చారు.. బీచ్‌ ఫెస్టివల్‌ ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేశారు..

09:43 - January 15, 2017

తూ.గో : కాకినాడలో నేను లోకల్ సినిమా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్‌ సోదరుడు పాడిన పాటలు అందర్నీ ఊర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత దిల్‌ రాజు, డైరెక్టర్‌, హీరో నాని, హీరోయిన్‌ కీర్తి సురేష్‌, సినిమా యూనిట్‌ మెంబర్స్‌ పాల్గొన్నారు. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని నిర్మాత దిల్‌ రాజు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ బాగా నటించిందని, తెలుగులోనూ ఆమె పెద్ద స్టార్‌ అవుతుందన్నారు హీరో నాని.

పరశురాం గ్రామంలో చిరుత సంచారం...

సిద్ధిపేట : దుబ్బాక మండలం పరశురాం గ్రామంలో చిరుత సంచరిస్తోంది. నాలుగు మేకలపై దాడి చేయండంతో ఆ గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు

తిరుపతి : రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు చేశారు. రైతులు ఆవులను ముస్తాబు చేశారు. జల్లికట్టు పేరిట పశువులను హింసించడం తగదంటూ గ్రామంలో పోలీసులు పోస్టర్లు అంటించారు. పశువులను గ్రామంలోకి వదలొద్దని ఆవుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎవరికైనా హాని జరిగితే కేసులు పెడతామని హెచ్చరించారు.

ఢిల్లీలో దట్టంగా అలముకున్న పొగమంచు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలముకుంది. పొంగ మంచు కారణంగా 26 రైల్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక రైలు సర్వీస్ ను రద్దు చేయగా 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.

తిరులమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, నడకదారిన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు ఆరు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

శిల్పారామంలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్

హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం శిల్పారామంలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, 10 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

అజారుద్దీన్ నామినేషన్ తిరస్కరణ

హైదరాబాద్ : హెచ్‌సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి అజహరుద్దీన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరించబడింది. జీవితకాల నిషేధంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోకపోవడం, అజహర్ వివరణతో సంతృప్తి చెందకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనిపై అజహర్ సుప్రీం కోర్టు వెళ్తానని తెలిపారు.

నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్

పుణె: భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ కు కోహ్లీ కెప్టెన్ గా బాధ్యత తీసుకున్నాక తొలి సిరీస్ కావడం విశేషం.

Don't Miss