Activities calendar

16 January 2017

21:27 - January 16, 2017

ఢిల్లీ : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను జీఎస్‌టీ అమలు జూలై ఒక‌టవ‌ తేదీకి వాయిదాపడింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరున్ జైట్లీ ప్రకటన చేశారు. జీఎస్టీ మండ‌లి స‌మావేశం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముందు అనుకున్నట్లు జీఎస్టీని ఏప్రిల్ ఒక‌టి నుంచి అమ‌లు చేయ‌డం లేద‌ని, దాన్ని జూలై ఒక‌ట‌వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప‌న్ను అధికారాల‌పై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌ని కార‌ణంగా జీఎస్టీ అమ‌లు వాయిదా ప‌డిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

21:25 - January 16, 2017
21:24 - January 16, 2017
21:22 - January 16, 2017

హైదరాబాద్ : సంక్రాంతి సెలవులు ముగియడంతో .. జనం మళ్లీ నగరబాట పట్టారు. మూడురోజుల పాటు సంక్రాంతి పండగను సొంతూళ్లలో ఆనందోత్సహాలతో జరురపుకుని తిరుగుప్రయాణం కావడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నారు. మరోవైపు సందంట్లో సడేమియాగా ఆర్టీసీ సహా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తరలివెళ్లిన జనం... తిరుగు ప్రయాణమవుతున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ముగియడంతో తిరిగి ఉద్యోగ, వ్యాపారాల కోసం వారు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి, గొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక్కో వాహనం టోల్ గేట్‌ను దాటి వెళ్లేందుకు సుమారు 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది. వాహనాల రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద తిరిగి అదనపు కౌంటర్లను ప్రారంభించారు. పోలీసులు రంగంలోకి దిగి వాహనాలు త్వరగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మారుమూల పల్లెల నుండి..
ఏపీలోని మారుమూల పల్లెల నుంచి విజయవాడ నెహ్రూబస్టాండ్‌కు చేరుకుంటున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినట్టుగా బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీంతో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. టిక్కెట్‌ రేటుపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 400గా ఉన్నటికెట్‌కు వెయ్యికిపైగా వసూలు చేస్తున్నారు. మరికొందరు 1300 నుంచి 1500 వరకు దండుకుంటున్నారు. మరోవైపు దోపిడీ విషయంలో ఆర్టీసీ ఏమీ తక్కువ తినలేదు. ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు రేట్లు వసూలు చేస్తోంది. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నా కిటికీలు, సీట్లు సరిగాలేని బస్సులను నడుపుతున్నారు. దీంతో రాత్రివేళల్లో చలికితట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

21:21 - January 16, 2017

ఢిల్లీ : రాష్ట్ర విభజన అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి తోపాటు మరో 24 మంది వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ..కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రం విడిపోయి రెండున్నర ఏళ్లు గడిచినా ..విభజన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. నిన్నటిదాకా 9, 10వ షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకం.. తదిత అంశాలపై సాగిన చర్చలు.. ఇపుడు ఏకంగా రాష్ట్ర విభజననే పశ్నిస్తున్నాయి. రాష్ట్రవిభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై దేశఉన్నత న్యాయస్థానం విచారణకు ఓకే చెప్పింది.

విభజన సక్రమంగా జరగలేదు..
రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదని.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా.. హడావిడిగా విభజన చేపట్టారని పిటీషన్లు కోర్టుదృష్టికి తీసుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో సహా రెండు ప్రాంతాల నుంచి మొత్తం 24 పిటీషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనికి సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 24 పిటిషన్లు దాఖలు కావడంతో అన్ని పిటషన్లపై ఒకేసారి విచారణ జరపాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. 2011 నుంచి మే2014 వరకు పలు దఫాలుగా దాఖలైన పిటిషన్లపై ఇపుడు కోర్టు తీర్పును వెలువరించనుంది. మరోవైపు రాష్ట్రాన్ని విడగొట్టినపుడు తెలంగాణ ప్రాంతంలోని మండలాలను ఏపీలో కలపడంపై కూడా విధానాన్ని పాటించలేదని లాయర్లు అంటున్నారు.

కొత్త రాష్ట్రాలకు..
దీంతో రాష్ట్ర విభజనలో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్వాకం బయటపడుతుందని పిటిషనర్ల తరపు లాయర్లు అంటున్నారు. అయితే.. ఉద్యమం.. విభజన చట్టం.. చివరికి రాష్ట్రాన్ని విడదీస్తున్న సమయంలో ముఖ్య మంత్రిగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి అపుడెందుకు సొంతపార్టీ నిర్వాకంపై సైలెంట్‌ అయ్యారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే విభజన పిటీషన్లపై సుప్రీం తీర్పు ఎలా వచ్చినా.. రెండు రాష్ట్రాల్లో పెద్దగా మార్పులేం ఉండవంటున్నారు మరికొందరు న్యాయనిపుణులు. న్యాయస్థానం విచరణతో భవిష్యత్తులో కొత్తరాష్ట్రాల ఏర్పాటు అవసరం వచ్చినపుడు ఈ తీర్పులు ఉపయోగపడతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

21:19 - January 16, 2017

విజయవాడ : పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ మొదలైంది. ఇవాళ దావోస్ చేరుకున్న చంద్రబాబు... వివిధ కంపెనీల ప్రతినిధులతో బిజీబిజీగా గడిపారు. ఏపీలో వ్యాపార అవకాశాలు, తమ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఆయన.. తొలిరోజు ప్రముఖ కంపెనీ స్టాడ్లర్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో విస్తరణకు సంబంధించి ప్రణాళికలను ప్రతినిధులు బాబుకు వివరించారు. అనంతరం స్టాడ్లర్‌ రైలు బోగీల తయారీ కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి సౌత్ ఈస్ట్ ఏషియాకు భారత్‌ను కేంద్రంగా మార్చాలని భావిస్తున్నట్లు స్టాడ్లర్‌ కంపెనీ ప్రతినిధులు బాబుకు వివరించారు. బెంగాల్‌లోని కాంచరపరాలో ఇప్పటికే తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, విశాఖపట్నంలో కూడా మరో యూనిట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించవచ్చని చంద్రబాబుకు వెల్లడించారు.

స్టాడ్లర్ ప్రతినిధులతో..
ఏపీలో రెండు మెట్రో లైన్లు అభివృద్ధి చేస్తూ స్పీడ్ ట్రైన్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని స్టాడ్లర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అన్నారు. కోస్తా తీరం, పేరొందిన ఓడరేవులు ఏపీ సొంతమన్న ఆయన.. వ్యాపార అవకాశాలు, వనరుల లభ్యతపై చంద్రబాబు పెట్టుబడిదారులకు వివరించారు. భారత్‌లో యూనివర్సిటీలతో కలిసి రిసర్చ్‌ సెంటర్ల ఏర్పాటుపై ఆలోచిస్తున్న జర్మనీ గ్రూప్ సంస్థ యూరోపియన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్‌తోనూ సీఎం సమావేశమయ్యారు. వ్యర్థాలతో విద్యుత్‌ తయారీలో పేరుగాంచిన బౌమ్‌గార్టె సంస్థ, చైనాలో దోమ తెరల తయారీలో పేరొందిన ట్రైటెక్‌ సంస్థతో కూడా సీఎం చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో 5 వేల చదరపు మీటర్ల స్థలం కేటాయించాలని చంద్రబాబు బృందాన్ని ట్రైటెక్‌ సంస్థ కోరింది.

21:17 - January 16, 2017

ఢిల్లీ : సమాజ్‌వాది పార్టీ సింబల్‌ సైకిల్‌ పోరులో ములాయం సింగ్‌ యాదవ్‌కు భంగపాటు తప్పలేదు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కే సైకిల్‌ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా...ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ యాదవ్‌ పూర్తి ఆధిపత్య చలాయించనున్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఉత్తరప్రదేశ్‌ అధికార పార్టీలో పెత్తనం కోసం గత కొన్నిరోజులుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. సమాజ్‌వాదీ పార్టీ సింబల్‌ సైకిల్‌ గుర్తు కోసం జరిగిన పోరులో అఖిలేష్‌ తండ్రిపై విజయం సాధించారు. సైకిల్‌ గుర్తును అఖిలేష్‌ వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజ్‌వాదీలో 50 శాతానికి పైగా పదాధికారులు అఖిలేష్ వైపు ఉన్నందునే ఆయనదే అసలైన సమాజ్‌వాది పార్టీగా ఈసీ పేర్కొంది.

అఖిలేష్ వర్గంలో సంబరాలు..
ఈసీ నిర్ణయంతో అఖిలేష్‌ వర్గంలో సంబరాలు మిన్నంటాయి. లక్నోలోని ఎస్పీ పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు సందడి చేశారు. ఈసీ నిర్ణయంతో సమాజ్‌వాది పార్టీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సొంతమైంది. ఎస్పీ అధ్యక్షుడిగా అఖిలేష్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడపడనున్నారు. అఖిలేశ్‌కు సైకిల్‌ గుర్తు పక్కా కావడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీ మహాకూటమి ఏర్పాటు ఖాయమని అఖిలేశ్‌ వర్గంలో కీలక నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌జేడీ పార్టీలతో మహా కూటమిని ఏర్పాటుచేస్తామని, ఈ మేరకు అవసరమైన చర్చలు ప్రారంభమయ్యాయని రాంగోపాల్‌ తెలిపారు.

తిరుగులేని అధిపత్యం..
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా నిన్నమొన్నటి వరకూ తిరుగులేని ఆధిపత్యం సాగించిన ములాయం సింగ్ యాదవ్‌కు భంగపాటు తప్పలేదు. కుటుంబంలో చీలికలు ఏర్పడి చులకనైపోయిన తరుణంలో సైకిల్ గుర్తు కూడా దక్కకపోవడంతో ములాయం షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. అంతకు ముందు లక్నోలో జరిగిన కార్యకర్తల సమావేశంలో యుపి సిఎం అఖిలేష్‌ తన మాట వినడం లేదని వాపోయారు. అఖిలేష్‌ను ముస్లిం వ్యతిరేకని ఆరోపించారు. అఖిలేష్‌ తన మాట వినకుంటే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడుకుపైనే నేరుగా పోటీకి దిగ‌నున్నట్లు ములాయం తేల్చిచెప్పారు. పార్టీ సింబల్‌ను కోల్పోయిన ములాయం-భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది ఆసక్తిగా మారింది.

20:33 - January 16, 2017

మినీ సంగ్రామం మోడీ సర్కారుకు రెఫరెండం కానుందా? 2019ఎన్నికలకు ఇది శాంపిల్ తీర్పు కాబోతోందా? డీమానిటైజేషన్ సెగలను ఈవీఎంల ద్వారా ప్రకటించబోతున్నారా? యూపీ పరిణామాలు ఎలా సాగుతున్నాయి? పంజాబ్ ఓటర్లు ఎటు మొగ్గుచూపుతున్నారు? ఉత్తరాఖండ, గోవా, మణిపూర్ లలో ఏం జరుగుతోంది? ఈ అంశంపై ప్రత్యేక కథనం..మినీ సంగ్రామానికి సై అంటున్నారు. దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎన్నికలకు రాజకీయ పక్షాలు సన్నధ్దమైతున్నాయి . ఎత్తులు పై ఎత్తులు, పొత్తులు వ్యూహాలతో రాజకీయ పక్షాలు ముందుకు కదులుతున్నాయి. మరో రెండు నెలల పాటు దేశమంతటా రాజకీయాలు మాంచి రసవత్తరంగా సాగనున్నాయి. అయిదు రాష్ట్రాలు .. 690 అసెంబ్లీ స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. లక్షా 85వేల పోలింగ్ స్టేషన్లు.. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళితో, వివిధ పార్టీల మధ్య మారుతున్న సమీకరణాలతో రాజకీయాలు వేడెక్కాయి.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం..
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.. మినీ ఇండియాగా పేరు. ఇక్కడ గెలిస్తే దేశ రాజకీయాలపై పట్టు సాధించవచ్చనే ఆలోచన . అన్ని పార్టీల కన్నూ ఈ రాష్ట్రం పైనే. తక్కువ ఓట్ల శాతంతోనే రాజకీయ పక్షాల తలరాతలు మారుతూ ఉంటాయి. మరి ఈ రాష్ట్రంలో వివిధ పార్టీల ఎత్తులు ఎలా ఉన్నాయి. డీమానిటైజేషన్ ...దేశాన్ని రెండునెలలుపైగా ఇబ్బంది పెట్టింది. ఇప్పటికీ ఏటీఎం కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపబోతోందా? కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు ఎన్నికల తీర్పులో ఈ అంశాన్ని కీలకం చేయబోతున్నారా? బడ్జెట్ ని ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాలని సర్కారు భావిస్తోందా?

పొలిటికల్ గా మంచి దూకుడు..
పంజాబ్ పరిణామాలేం చెప్తున్నాయి? మణిపూర్ లో ఏం జరుగుతోంది? ఉత్తరాఖండ్, గోవా రాజకీయాలు ఏ దిశగా మళ్లుతున్నాయి. మినీ సంగ్రామం ఏం తేల్చనుంది? జతకట్టేదెవరు? ఒంటరిగా బరిలో దిగేదెవరు? మినీ సంగ్రామం.... దేశ రాజకీయాలపై స్పష్టమైన అవగాహనను ఇవ్వబోతున్న ఎన్నికలు. మూడేళ్ల మోడీ సర్కారు పాలనపై, డీమానిటైజేషన్ సెగలపై ఇవ్వబోతున్న రెఫరెండం.. మరో పక్క దేశం లోనే పెద్ద రాష్ట్రం యూపీ, కీలకంగా మారిన పంజాబ్ ఇలా ఓవరాల్ గా రాబోయే రెండు నెలలు పొలిటికల్ గా మంచి దూకుడు కనిపించబోతోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

అటవీశాఖలో పోస్టుల భర్తీకి టి.సర్కార్ ఉత్తర్వులు..

హైదరాబాద్ : అటవీశాఖలో 201 ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రేంజ్ ఆఫీసర్లు 67, సెక్షన్ ఆఫీసర్లు 90 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్లు 12, జూనియర్ అసిస్టెంట్లు 32 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ అభ్యర్థుల ప్రకటన..

ఉత్తర్ ప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నిలకు 149 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఉత్తరాఖండ్ లో 68 మందితో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

సుధీర్ కమిటీపై రౌండ్ టేబుల్ సమావేశం..

హైదరాబాద్ : సుధీర్ కమిటీ నివేదికపై తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సుధీర్ కమిషన్ ముస్లింల వెనుకబాటు గురించి చెప్పిందని, ముస్లింల అసమానతలపై ఉద్యమించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ నివేదికలో అమలులో బీసీలకు తగాదాలు పెట్టేలా ఉండరాదని, ప్రతి జిల్లాలో సుధీర్ కమిషన్ పై చర్చ పెడుతామన్నారు.

20:21 - January 16, 2017

నెల్లూరు ఆణిముత్యం.. సిగరేట్ కంపిండ్ల బ్రాండ్ అంబాసిడర్.. సీనీ సోగ్గాడు.. సిద్దిపేట జిల్లా హున్నాబాద్ మండలంలున్న ఒక ఊర్లె.. అగ్గిగుండాలు అయితున్నయట..అంగికున్న మీది గుండి ఇప్పేశి..? బాలక్రిష్ణ, చిరంజీవిలను ఊహించుకుంట.. అచ్చం సీన్మల జేశినట్టే బైటజేస్తుంటరు..నెల్లూరు కాడ ఒక పిలగాడు.. తాత పద్యాలు రాశి పేరు సంపాయిస్తె.. వీడు బట్టలిప్పేశి ఇంటిపర్వును బైటికి దెచ్చిండు.. ఏనుగు ఒకదిక్కు ఎల్కపిల్ల ఇంకోదిక్కు.. ఇవ్వి రెండు కొట్లాడితె.. ఏదిగెలుస్తదుల్లా..? ఛలో శ్రీకాకుళం..తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పత్కం బెట్టింది.. కోతులను అడ్వులకు ఎల్లగొట్టెతందుకు పండ్ల చెట్లు వెంచాలే అని నిర్ణయం గూడ దీస్కున్నది.. కని ఒక్క పండ్ల చెట్లేగాదు సారు.. తాటి చెట్లు గూడ వెంచుండ్రి.. గాలిమోటర్ల గూడ పంచాదులు అయితయా..? అంటె అయితయ్.. మొన్ననే ఒక్కటి అయ్యింది..ఒక వీడ్యో మాత్రం సోషల్ మీడియాల భూమికంటె వేగంగ గిర్రున తిర్గుతున్నది'..గిసోంటి గరం..గరం ముచ్చట్లు కోసం వీడియో క్లిక్ చేయండి.

20:14 - January 16, 2017

విశ్వదాభిరామా వినుర వేమా అని పద్యాలు రాశిండు సూడు.. అదే వేమన తాత.. ఆయన ఇంట్ల దొంగలు వడ్తె ఏం దొర్కుతయుల్లా..? తాత పెయ్యిమీద బట్టలే ఉండయ్.. గదా..? ఆ తాతనే ఆదర్శంగ దీస్కోని బైలెళ్లిండు నెల్లూరు కాడ ఒక పిలగాడు.. తాత పద్యాలు రాశి పేరు సంపాయిస్తె.. వీడు బట్టలిప్పేశి ఇంటిపర్వును బైటికి దెచ్చిండు. గీ ముచ్చట కోసం వీడియో క్లిక్ చేయండి.

 

20:13 - January 16, 2017

నెల్లూరు ఆణిముత్యం.. సిగరేట్ కంపిండ్ల బ్రాండ్ అంబాసిడర్.. సీనీ సోగ్గాడు.. వృద్ధ రక్తం ప్రవహిస్తున్న యువకుడు.. శ్రీ ఆనం వివేకానందరెడ్డి. ఈయన ఇటీవలే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నేతలపై విమర్శలు చేసిండు. అయితే ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఎలా వ్యవహరించారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:03 - January 16, 2017

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిష్ఠ మసకబారిందా..? ఉద్యోగులు ఎప్పుడూ లేనంత ఆవేదనకు గురికావడానికి కారణం ఎవరు... నోట్ల రద్దుపై సమాచారం బయటకి పొక్కితే ఆర్బీఐ అధికారుల ప్రాణాలకే ముప్పొస్తుందా.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎందుకు నోరు విప్పడం లేదు. నోట్ల రద్దు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి ఆర్బీఐ మెడకు చుట్టుకుంటోంది. కాదుకాదు.. ఆర్బీఐ మీద నెపం నెట్టేయడానికి ఓ కుట్ర జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో రాంబాబు (బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి), నాగేశ్వర్ రావు (రిజర్వ్య్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), అల్జాపురం శ్రీనివాస్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి.

జులై 1 నుండి జీఎస్టీ అమలు - జైట్లీ..

ముంబై : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు మరో మూడు నెలలు వాయిదా పడింది. జులై 1కి వాయిదా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ మీడియాకు వెల్లడించారు.

19:54 - January 16, 2017

రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిష్ఠ మసకబారిందా..? ఉద్యోగులు ఎప్పుడూ లేనంత ఆవేదనకు గురికావడానికి కారణం ఎవరు... నోట్ల రద్దుపై సమాచారం బయటకి పొక్కితే ఆర్బీఐ అధికారుల ప్రాణాలకే ముప్పొస్తుందా.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎందుకు నోరు విప్పడం లేదు. నోట్ల రద్దు వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి ఆర్బీఐ మెడకు చుట్టుకుంటోంది. కాదుకాదు.. ఆర్బీఐ మీద నెపం నెట్టేయడానికి ఓ కుట్ర జరుగుతోంది. కేంద్రం దూకుడుగా తప్పుడు నిర్ణయం తీసుకొని ఇప్పుడు తమను దోషులుగా ప్రజల ముందు నిలబెడతారా? ఇది ఆర్బీఐలో 16 వేల మంది ఉద్యోగుల మనోవేదన... ఇప్పటికే కేంద్రం తీరును ప్రశ్నిస్తూ 16 వేల మంది ఉద్యోగులు ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాశారు. మరోవైపు ఆర్టీఐ యాక్టు ద్వారా నోట్ల రద్దు నిర్ణయాలపై ఆరా తీస్తే.. సమాచారమిస్తే తమ ప్రాణాలకే ముప్పు ఉందంటూ ఆర్బీఐ సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఎలాంటి ఏర్పాట్లు చేశారు..
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక ఎలాంటి ఏర్పాట్లు చేశారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యల ప్రభావంపై అధ్యయనం చేశారా? ఇవి సమాచార హక్కు చట్టం ద్వారా బ్లూమ్‌బర్ల్‌ న్యూస్‌ అనే సంస్థ ఆర్బీఐని అడిగిన ప్రశ్నలు. కానీ సమాధానం చెప్పాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి వెనకడుగేసింది. ఆ వివరాలు వెల్లడించడం దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు ముప్పుంటూ సమాధాన మిచ్చింది. అక్కడితో ఆగకుండా.. అలాంటి సమాచారాన్ని బహిర్గతం చేస్తే ఉద్యోగుల ప్రాణాలకే పెను ప్రమాదమని స్పష్టం చేసింది. ఆర్టీఐ ద్వారా ఆర్బీఐపై ప్రశ్నలవర్షం కురిపించిన బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ సంస్థ ఈ వివరాలు మీడియాకు వెల్లడించింది. నోట్ల రద్దు నిర్ణయం వెనక బాధ్యులెవ్వరు అనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో..ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానం హాట్ టాఫిక్‌గా మారింది.

కొన్ని ప్రశ్నలు..
నవంబర్‌ 8 నుంచి జనవరి 2 వరకూ ఆర్‌బీఐని బ్లూమ్‌బర్గ్‌ 14 ప్రశ్నలు అడిగితే, వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేస్తే... మరికొన్నింటికి తమ వద్ద సమాచారం లేదని రిజర్వ్ బ్యాంక్ బదులిచ్చింది. సమాచారం హక్కు చట్టం కింద బ్లూమ్ బర్గ్ సంస్థ అడిగిన ప్రశ్నలు చూద్దాం...
1.నవంబర్‌ 8 సాయంత్రం బ్యాంకుల్లో ఉన్న 500, 1000 నోట్లు ఎన్ని?
2.నోట్ల మార్పిడికి ఆర్బీఐ తీసుకున్న చర్యలేవి?
3.భవిష్యత్‌లో నోట్ల ప్రభావంపై అధ్యయనం చేశారా?


దాట వేసిన ఆర్బీఐ..
నవంబర్‌ 8 సాయంత్రం నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసే సమయానికి బ్యాంకుల్లో రద్దయిన నోట్ల సంఖ్య ఎంత మేర ఉందనే ప్రశ్నకు సమాధానాన్ని ఆర్‌బీఐ దాటవేసింది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేసిన వారి ప్రాణాలకు, భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. నోట్ల రద్దుకు ఆర్బీఐ చేసిన ఏర్పాట్లు ,ఈ నిర్ణయం ప్రభావం, పర్యవసానాల అంచనా అధ్యయనంపై వేసిన రెండు ప్రశ్నలను మినహాయించాలని ఆర్బీఐ కోరినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ పేర్కొంది.

బ్లూమ్ వర్గ్ కథనం..
నోట్ల రద్దును ప్రకటించిన క్రమంలో అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ ఎంతమాత్రం సన్నద్ధంగా లేవని దీని బట్టి అర్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్‌ కథనం స్పష్టం చేసింది. ఆర్‌బీఐ స్వతంత్రత, ప్రధాని మోడీ నిర్ణయాలు తీసుకునే విధానం, ఆర్‌బీఐతో ఆయనకున్న సంబంధాలపై అనుమానాలు కల్గుతున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు ప్రభుత్వ నిర్ణయమేనని ఆర్‌బీఐ మొదటినుంచి చెబుతుండగా, దీనిపై ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, ఆర్‌బీఐ సిఫార్సులతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలువురు కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నదని,దాన్ని తాము ఆమోదించామని ఆర్‌బీఐ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేసింది.

స.హ.చట్టం..
సమాచార హక్కు చట్టం కింద పౌరులకు కావాల్సిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంకు నిరాకరించడంపై విమర్శలు వినపిస్తున్నాయి.. నోట్ల రద్దుపై బ్లూమ్ బర్గ్ అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ మినహాయింపు కోరడం ఆశ్చర్యానికి గురిచేసిందని దేశంలో ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు తప్పుబడుతున్నారు. ఈ నెల 20న పార్లమెంటరీ కమిటీ ముందు మరోసారి అర్‌బీఐ గవర్నర్ హజరుకానున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన ఎలాంటి సమాధానం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

19:10 - January 16, 2017

ఉత్తర్ ప్రదేశ్ : గత కొద్ది రోజులుగా తండ్రి..కొడుకుల మధ్య జరుగుతున్న పోరుకు ఈసీ తెరదించింది. గత కొద్ది రోజులుగా ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ల మధ్య తారాస్థాయిలో పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ పేర్కొన్న అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ గుర్తు తనకే కేటాయించాలని వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఈసీని అభ్యర్థించింది. ఇందుకు అఫిడవిట్లు దాఖలు కూడా చేసింది. దీనికి ప్రతిగా అఖిలేష్ తరపున శివపాల్ యాదవ్ అఫిడవిట్లు దాఖలు చేశారు. అంతేగాకుండా జాతీయ కార్యవర్గ సమావేశంలో అఖిలేష్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఎంపీలు, 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బలంతో పాటు లక్షలాది మంది కార్యకర్తల బలం ఉందంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. పార్టీ యునైటెడ్ గానే ఉందని, సీఎం అభ్యర్థి అఖిలేష్ అని ములాయం పేర్కొన్నారు. కానీ సోమవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ గుర్తు కోసం..పార్టీ కోసం తాను తీవ్రంగా కృషి చేయడం జరిగిందని, అఖిలేష్ పైనే పోటీ చేస్తానని ములాయం ప్రకటించడంతో కలకలం రేగింది. చివరకు సాయంత్రం ఎస్పీ గుర్తు సైకిల్ ను అఖిలేశ్ కు కేటాయిస్తూ ఈసీ వెల్లడించింది. దీనితో అఖిలేష్ వర్గాలు సంబరాల్లో మునిగితేలాయి. దీనిపై ములాయం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సైకిల్ గుర్తు అఖిలేష్ కి..

ఉత్తర్ ప్రదేశ్ : ఎస్పీ పార్టీ గుర్తు సైకిల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు కేటాయించింది. తండ్రి కొడుకుల పోరులో అఖిలేష్ పై చేయి సాధించినట్లైంది.

సత్తుపల్లి ఇరిగేషన్ ఈఈ సస్పెండ్..

ఖమ్మం : సత్తుపల్లిలో ఇరిగేషన్ ఈఈ ఎస్.కృష్ణకుమార్ సస్పెండ్ కు గురయ్యారు. అవినీతి ఆరోపణల్లో కృష్ణకుమార్ ను విజిలెన్స్ అరెస్టు చేసింది.

వివాదంలో దంగల్ సినీ నటి..

ముంబై : దంగల్ నటి జైరా వసీం వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ సీఎంను జైరా వసీం కలిశారు. సీఎం కలిసిన దృశ్యాలను ఫేస్ బుక్ లో జైరా పోస్టు చేసింది. వేర్పాటు వాదుల నుండి బెదిరింపులు రావడంతో ఫేస్ బుక్ నుండి ఫొటోలు తొలగించిన జైరా క్షమాపణలు కోరింది. ఆ తరువాత క్షమాపణ పోస్టులను జైరా తొలగించింది. ఎవరు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని, తాను ఎవరి మనోభావాలను కించపర్చడం లేదని పేర్కొన్నారు.

18:27 - January 16, 2017

కడప : జిల్లాలో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి అనుమానస్పదంగా మారింది. కడప 11వ బెటాలియన్‌లో పనిచేస్తున్న ఏఆర్‌ ఎస్‌ఐ గురునాథం బుగ్గవంక దగ్గర రైల్వే బ్రిడ్జిదగ్గర ట్రాక్‌పై పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం డ్యూటీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పిన గురునాథం రైలు పట్టాలపై మృతి చెందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

18:25 - January 16, 2017

కర్నూలు : పోలీస్‌ ఉద్యోగాల పేరుతో కర్నూలు టూటౌన్‌ ఏఎస్సై హజరత్‌ వలి 15 లక్షలు స్వాహా చేశాడన్న ఆరోపణలతో... బాధితులు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. ఏఎస్సైపై వెంటనే కేసు నమోదు చేసి ఆయన్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని.. 9 నెలలు గడిచిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.

18:23 - January 16, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పలు సంస్థలతో సమావేశమయ్యారు. హైస్పీడ్ రైళ్లు, ఇంజిన్లు, కోచ్‌ల తయారీలో పేరొందిన సంస్థ స్టాడ్లర్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. భారత్‌లో తమ కంపెనీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. ఇప్పటికే బెంగాల్‌లోని తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, విశాఖపట్నంలో కూడా మరో యూనిట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్టాడ్లర్‌ కంపెనీ ప్రతినిదులు చంద్రబాబుకు వివరించారు. ఈ యూనిట్‌ ఏర్పాటుతో 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని వారు చంద్రబాబుకు తెలిపారు.

ఆగ్రాలో రూ. కోటి నగదు..పట్టివేత..

ఉత్తర్ ప్రదేశ్ : ఆగ్రాలో రూ. కోటి నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐటీ శాఖా అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.

17:50 - January 16, 2017
17:49 - January 16, 2017
17:46 - January 16, 2017

కామారెడ్డి : జిల్లాలో వైద్యులు లేక గర్భిణి ప్రాణాలు విడిచింది. బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పురిటి నొప్పులతో ఓ మహిళ వచ్చింది. వైద్యులు లేకపోవడంతో స్టాఫ్‌ నర్స్ కాన్పు చేసింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన భాగ్య ఐదు నిమిషాల తర్వాత ఊపిరాడక చనిపోయింది. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ లేకపోవడం వల్లే భాగ్య చనిపోయిందంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

17:41 - January 16, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ సాధనకు ప్రజలు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రకు సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీపీఎం చేపట్టిన మహాజనపాదయాత్రకు తమపార్టీ మద్దతిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రచారం చేసుకుంటూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసమస్యలను గాలికొదిలారని తమ్మినేని విమర్శించారు.

17:39 - January 16, 2017

కరీంనగర్ : అడవిలోకి వెళ్లి అన్న అయ్యాడు...అంచెలంచెలుగా ఎదిగాడు...ఆపై సహచరులనే హతమార్చి కోవర్ట్‌గా మారాడు... దందాలలో ఆరితేరాడు...అంతలోనే అదృశ్యమయ్యాడు.. అతడే మాజీ నక్సలైట్‌ జడల నాగరాజు. ఐదేళ్లుగా అతని ఆచూకి లేదు..దాని వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. జడల నాగరాజు...అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరి.. నక్సల్‌గా మారాడు. కీలక కేడర్‌కు గన్‌మెన్‌గా పనిచేశాడు. ఎనిమిదేళ్ల పాటు పార్టీలోనే కొనసాగాడు. ఆ తర్వాత పోలీస్‌ కోవర్ట్‌గా మారాడు. ఇందులో భాగంగా అప్పటి జిల్లా కమిటీ కార్యదర్శి విజయ్‌ను రామగిరి గుట్టల వద్ద హతం చేసి... 2000 సంవత్సరంలో పోలీస్‌లకు ఆయుధాలతో లొంగిపోయాడు.

ప్రాణహాని ఉండడంతో పోలీస్‌ అండదండలు..
వనం వీడి జనంలోకి వచ్చిన నాగరాజు... పార్టీకి సంబంధించిన సమాచారాన్ని.. కీలక నిర్ణయాలను... ముఖ్యమైన నేతల ఆచూకిని పోలీసులకు చేరవేసి... పలు ఎన్ కౌంటర్లకు సహకరించాడు. అనతికాలంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని సెటిల్ మెంట్లు, దందాలు కొనసాగించాడు. ఈ మేరకు పోలీసుల అండదండలు నాగరాజుకు ఉండేవి. అలాగే నక్సలైట్ల నుంచి నాగరాజుకు ప్రాణహాని ఉండడంతో అతనికి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్‌లు ఆశ్రయం కల్పించారు.

రామకృష్ణాపూర్‌ ఎంపీటీసీగా విజయం..
నాగరాజు కోవర్టుగా పనిచేస్తూనే మరోవైపు రాజకీయంగా ఎదిగెందుకు వ్యూహ రచనలు చేసుకున్నాడు. మొదట టీడీపీలో చేరాడు.. రామకృష్ణాపూర్ ఎంపీటీసీగా నాగరాజు.. ముత్తారం జడ్పీటీసీగా భార్య రాణి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నాగరాజు ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా మెలిగాడు. ఈ నేపథ్యంలో 2011 డిసెంబర్ 17న నాగరాజు అనుహ్యంగా మాయమయ్యాడు. నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయింది.

విచారణ జరుగుతుందని చెబుతున్న పోలీసులు..
నాగరాజు బంధువు తోట రాములు ఆయుధాలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో నాగరాజు మిస్సింగ్‌ మిస్టరీ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకూ సెటిల్ మెంట్లకు మాత్రమే పాల్పడ్డాడని భావించిన పోలీసులకు అతని అక్రమ ఆయుధాల వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో ఆశ్యర్యపోతున్నారు. కాగా నాగరాజు అదృశ్యంపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఎప్పుడో దాచిపెట్టిన డంప్‌లను వెలికి తీసే పోలీసులకు... జడల నాగరాజు మిస్సింగ్ మాత్రం అంతుచిక్కకుండా తయారైందనే చెప్పాలి.

17:34 - January 16, 2017

నల్గొండ : యాదాద్రిలో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ ఉత్సాహంగా జరిగింది. అగాఖాన్‌ ఫౌండేషన్‌, తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు 31 దేశాల నుంచి 75 మంది కైటిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, యాదాద్రి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ పాల్గొన్నారు.

17:32 - January 16, 2017

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఆర్బీఐ ఓ గుడ్ న్యూస్ అందించింది. విత్ డ్రా పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 8వ తేదీన రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రూ. 2వేల పెద్ద నోటును చలామణిలోకి తెచ్చింది. విత్ డ్రా పరిమితిపై పలు ఆంక్షలు విధించింది. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఆంక్షలను సడలిస్తూ విత్ డ్రా పరిమితిని రోజుకు రూ. 4500 విధించారు. సోమవారం ఆర్బీఐ ఈ పరిమితిని ఎత్తివేసింది. రూ. 10 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అంతేగాకుండా ఖాతాదారులకు కూడా పరిమితిని ఎత్తివేసింది. ఇప్పటి వరకు ఉన్న రూ. 50వేల పరిమితి నుండి రూ. లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంది.

విత్ డ్రా పరిమితి పెంపు..

హైదరాబాద్ : ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ ను కేంద్రం పెంచింది. రూ. పదివేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 4500 వరకు మాత్రమే ఉండేది.

వైసీపీ నేతలపై కేసులు నమోదు.

కృష్ణా : వీరులపాడు, కంచికచర్ల, చందర్లపాడు పీఎస్ లలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని నందిగామ వైసీపీ నాయకులు డా.జగన్ మోహన్ రావు, రోజా, జోగి రమేష్, ఉదయభాను, అరుణ్ కుమార్ పై కేసులు నమోదు చేశారు.

జవాన్ ఫుడ్ క్వాలిటీ వివాదంపై బీఎస్ఎఫ్ నివేదిక..

ఢిల్లీ : బీఎస్ఎఫ్ జవాన్ బహదూర్ ఫుడ్ క్వాలిటీ వివాదంపై బీఎస్ఎఫ్ హోం మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించింది. ఫుడ్ క్వాలిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొంది.

ఇండియా కాన్ఫరెన్స్ కు సినీ నటులు పవన్, మాధవన్ కు ఆహ్వానం..

హైదరాబాద్ : బోస్టన్ లో ఇండియా కాన్ఫరెన్స్ 2017కు సినీ నటులు పవన్ కళ్యాణ్, మాధవన్ లకు ఆహ్వానం వచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ సదస్సు జరునుంది. ఇండియా కాన్ఫరెన్స్ లో పవన్, మాధవన్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 11 నండి రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

 

17:09 - January 16, 2017

ఢిల్లీ : భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సహేతుంగా జరగలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో 24 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. పార్లమెంట్ లో విభజన బిల్లు ప్రవేశపెట్టిన తీరు..విభజన బిల్లు ఆమోదింపు చేసుకొనే తీరు..ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి..ఏపీకి ఆర్థిక లోటును భర్తీ చేయకుండా విభజన చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి, విభజనను వ్యతిరేకించిన వారు, ఇతర ప్రజా సంఘాలు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీం ఎదుట కేంద్రం వాదించే అవకాశం ఉంది. ఏపీకి అమరావతి రాజధాని ఏర్పడుతోందని..ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తి కావచ్చని, నీటి కేటాయింపుల సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని సుప్రీం ఎదుట కేంద్రం పేర్కొనవచ్చని తెలుస్తోంది. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా కేంద్రం చూస్తోందని సుప్రీం ఎదుట వాదించనున్నట్లు సమాచారం. దీనితో ఈ పిటిషనన్లను సుప్రీం తిరస్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అంగన్ వాడీ కేంద్రాల్లో కందిగిట్టుబాటు ధరలపై బాబు సమీక్ష..

విజయవాడ : జ్యూరిచ్ నుండి ఏపీలోని అంగన్ వాడీ కేంద్రాలలో కంది గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. అంగన్ వాడీ కేంద్రాల్లో నిత్యావసరాల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీలలో నాణ్యమైన సరుకులను వినియోగించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు 15 రోజులకొకసారి తనిఖీలు చేయాలని సూచించారు. కంది కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశించారు.

సింగరేణి జీడీకేలో ప్రమాదం..

పెద్దపల్లి : సింగరేణి జీడీకే 11 ఏ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ బ్లాస్ట్ తో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు.

16:55 - January 16, 2017
16:28 - January 16, 2017

విశాఖపట్టణం : సెల్ఫీ..ప్రస్తుతం యువత ఈ మాయలో పడిపోయింది. తమ ఫొటోలను బాహ్యప్రపంచానికి తెలియచేసే ప్రయత్నంలో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కోసారి ఈ సెల్ఫీలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. సెల్ఫీలు తీసుకుంటూ పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితులతో అరకు ప్రాంతానికి వెళ్లారు. గూడ్స్ ట్రైన్ లో ఉన్న వీరు సెల్ఫీ దిగేందుకు ఓ యువకుడు ప్రయత్నించారు. వెరైటీగా ఉంటుందని గూడ్స్ రైల్ ఎక్కి సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ఒక్కసారిగా హైటెన్షన్ వైర్లు తగడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని అరకు నుండి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

16:19 - January 16, 2017

ఢిల్లీ : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఏపీ రాష్ట్రం విభజన అయిపోయి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. కానీ విభజన తాలూకు అంశాలు అప్పుడప్పుడు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో విభజన పునర్ వ్యవస్థీకరణపై 24 పిటిషన్లు దాఖలు కావడం విశేషం. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం విచారణ చేపట్టింది. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని 24 పిటిషన్లలో పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది.

పునర్ విభజన చట్టంపై సుప్రీంలో పిటిషన్లు..

ఢిల్లీ : ఏపీ పునర్ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 24 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది.

16:09 - January 16, 2017
16:04 - January 16, 2017

విశాఖపట్టణం : జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటన అప్పునగర్ వద్ద చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. వెంటనే కారులో మంటలు అంటుకున్నాయి. కారులో ఉన్న నలుగురు యువకులు ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఓ పెద్ద శబ్ధంతో కారు పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. కారు ఎవరిది ? ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది.

15:46 - January 16, 2017
15:44 - January 16, 2017

పంజాబ్ : రాష్ట్రాన్ని రక్షించడానికే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అన్నారు. డ్రగ్స్‌ మాఫియాతో అధికారంలో ఉన్న పంజాబ్‌ నేతలకు సంబంధముందని ఆరోపించారు. పంజాబ్‌ హరిత విప్లవానికి చిహ్నమని...డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారకూడదన్నారు. పంజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తానని సిద్ధూ స్పష్టం చేశారు. పంజాబ్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ-తొలిసారిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌మాకెన్‌తో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సొంతిళ్లు..
కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వెళ్లినట్లుగా ఉందని సిద్ధూ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ నేతగానే జన్మించానని... దేశ స్వాతంత్య్రం కోసం తన కుటుంబం పోరాటం చేసిందని గుర్తు చేశారు. తన తండ్రి 40 ఏళ్లు కాంగ్రెస్ కోసం పని చేశారని తెలిపారు. హరిత విప్లవానికి గుర్తింపుగా ఉన్న పంజాబ్‌ డ్రగ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని సిద్ధూ అన్నారు. అన్నదాతలు అడుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంజాబ్ యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్‌, గుజరాత్‌లో లేని డ్రగ్స్‌ సమస్య పంజాబ్‌లోనే ఎందుకుందని ప్రశ్నించారు.

భాగ్ బాదల్..భాగ్..
పంజాబ్ ప్రభుత్వానికి, నేతలకు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. పంజాబ్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని... భాగ్... బాదల్... భాగ్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతామని సిద్ధూ పేర్కొన్నారు. పార్టీని తల్లిగా భావిస్తామని చెప్పిన సిద్ధూ...బిజెపిని కైకేయిగా...కాంగ్రెస్‌ను కౌసల్యగా అభివర్ణించారు. పంజాబ్‌ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సిద్ధూ రాజ్యసభకు, బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సిద్ధూ చేరికతో కాంగ్రెస్‌కు ఎంత లాభం చేకూరుస్తుందన్నది వేచి చూడాలి.

15:41 - January 16, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని పురాతన ఒక కొండకు చాలా విశిష్టత ఉంది. దశాబ్దాలుగా ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. పిల్లలు పుట్టని వారు ఆ కొండ ఎక్కి జారడం వలన సంతానం కలుగుతుందన్న విశ్వాసం స్థానికుల్లో బలంగా ఉంది. అందుకే ఏటా సంక్రాంతి సీజన్‌లో ఈ డేకరు కొండ పైకి ఎక్కి మొక్కుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఉన్న డేకురుకొండది. ఈ కొండపై అనాదిగా వినూత్న ఆచారం కొనసాగుతూ వస్తోంది. స్థానిక హృదయపురం ప్రాంతంలోని కళ కొండపైకి ఎక్కి జారుడుబల్ల ఆకారంలో ఉన్న ప్రాంతం నుంచి మహిళలు జారితే సంతానం కలుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు. అందుకే సంతానం లేనివారు ఈ వాలు ప్రాంతం నుంచి జారుతూ మొక్కులు చెల్లించుకుంటారు. స్థానికులు ఈ కొండను డేకురుకొండగా పిలుస్తుంటారు. సంక్రాంతి సీజన్‌లో ఈ కొండకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ప్రాశస్త్యం..
ఈ కొండకు ప్రాశస్త్యం కూడా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన నీలకంఠేశ్వర స్వామి ఆలయం, త్రినాథస్వామి ఆలయంతో పాటు కొత్తగా సంతోషిమాత దేవాలయం కూడా ఉన్నాయి. భక్తులు మొక్కులు తీర్చుకొనేందుకు ఈ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ నడి వేసవిలోనూ ఎండిపోని, నిత్యం జలతో కనిపించే బావి కొండ మధ్యలో ఉండడం విశేషం. గంధర్వుల కాలం నాటి ఆలయాల్లో అద్భుతమైన శిల్పసంపద, తర్లకోట, జమిందారుల హయాంలో నిర్మించిన రెండంతస్తుల భవనం, సింహద్వారం, చావిడిలతో పాత 5 ఎకరాల విశాల ప్రాంగణం ఉన్నా.. డేకురు కొండ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. 150 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన పురాతన దేవాలయాలు, భవనాలు, గంధర్వుల కాలం నాటి పురావస్తు ఆనవాళక్లు కల్గిన ఈ డేకురుకొండను, హృదయపురం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

15:39 - January 16, 2017

విజయవాడ : సాంకేతిక టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దూసుకెళ్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏపీని భద్రతా వలయంగా మార్చుతున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్‌ పహారాకు తోడు సరికొత్త యాప్‌లతో ప్రజలకు చేరువకావడానికి కృషి చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఎంతటి కేసులైనా ఛేదిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీకి తమ ఆలోచనలను జోడించి విధి నిర్వహణలో సమర్ధత చాటుకుంటున్న ఏపీ పోలీసులపై 10టీవీ ప్రత్యేక కథనం. సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బెజవాడ పోలీసులు ఆరితేరుతున్నారు. టెక్నాలజీ సహాయంతో క్రైమ్‌ను అదుపుచేయడానికి వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. నేరగాళ్లను, క్రైమ్‌ను సాధ్యమైనంత వరకు అదుపు చేసే విషయంలో రాజీపడకూడదని భావించి.... ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. సాంకేతికతతోనే సవాలక్ష సమస్యలను ధీటుగా ఎదుర్కొంటూ నేరగాళ్లకు సింహస్వప్నంలా మారుతున్నారు.

మిగిలిన జిల్లాల్లోనూ రెట్టింపు భద్రత..
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాలుగా విలసిల్లుతున్న విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భద్రతను పోలీసులు మరింతగా కట్టుదిట్టం చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ అదేస్థాయి భద్రతను రెట్టింపు చేస్తున్నారు. అటు యాప్ లను వినియోగించుకుంటూనే టెక్నాలజీ పరంగా ఇంకేం కావాలో, ఏం చేయాలనే వాటిపై పరిశోధన కొనసాగిస్తున్నారు. విజయవాడ, గుంటూరు పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీస్ వ్యవస్థ అంతటిని ఒకేతాటిపైకి తీసుకొస్తున్నారు. ఈ రెండు నగరాల్లో అడుగడుగునా పోలీసుల పహారా ఉండేటట్లు ముందుకెళ్తున్నారు. యాప్ లతో ఫలితాలు వచ్చినా రాకపోయినా వెనకడుగేయకుండా సీసీ కెమెరాలు, పోలీస్ పహారా, యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం కూడా దీనిలో భాగమే.

13 జిల్లాల్లో..
ప్రజలకు మరింత మెరుగ్గా సేవలదించడం, పోలీస్ పనితీరును నిరంతరాయంగా సులభతరం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ సాంకేతిక సేవల విభాగం ఇప్పటికే పలు యాప్‌లను ప్రవేశపెట్టింది. చాణక్య, అభయ్, ఫోర్త్ లయన్, ఈ-గస్తీ, ఈ-నేత్రం వంటి యాప్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా క్రైం మ్యాపింగ్ పేరుతో మరో యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నేరస్తుల పూర్తి సమాచారం నిక్షిప్తం చేయడానికి ఈ యాప్ ను వినియోగించనున్నారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ఠాణాలకు జియో ట్యాగింగ్ కు అనుసంధానించి మరిన్ని ప్రయోజనాలను పొందాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో నేరస్తుడు ఎక్కడ అరెస్టైనా ఆ నిందితుడి గురించి అన్ని ఠాణాల్లోనూ తెలిసేలా పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. యాప్ లో బటన్ నొక్కగానే నేరస్తుని పుట్టు పూర్వోత్తరాలతో సహా అతనికి సంబంధించిన సమస్త సమాచారం రావడం క్రైం మ్యాపింగ్ యాప్‌ ముఖ్యోద్దేశం. ఏపీలో అమలవుతున్న ఈ యాప్ లు, వాటి ప్రత్యేకతలు, విశేషాలపై కేంద్రం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. అంతేకాదు... ఇతర రాష్ట్రాలు సైతం వీటిపై దృష్టి సారిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని భావిస్తున్నాయి.

డేటా ప్రైవసీపై సుప్రీంకోర్టులో పిటిషన్..

ఢిల్లీ : డేటా ప్రైవసీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ సందేహాలకు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం, ట్రాయ్, వాట్సప్, ఫేస్ బుక్ లకు నోటీసులు జారీ చేసింది.

 

15:34 - January 16, 2017
15:34 - January 16, 2017

దావోస్ లో బాబు..

దావోస్ : స్టాడ్లర్ మేనేజ్ మెంట్ ఏజీ సంస్థ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రైల్ బోగీల తయారీలో స్టాడ్లర్ సంస్థకు 75 ఏళ్ల అనుభవం ఉంది. రైల్ బోగీల తయారీ కేంద్రాన్ని బాబు సందర్శించనున్నారు.

15:12 - January 16, 2017

కాకినాడ : సంక్రాంతి సంబరాల్లో పందాల జోరు కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. మూడు రోజులుగా కొనసాగిన ఈ పందాలు నాలుగో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ పందాలపై పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారనే తారాస్థాయిలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు కూడా పందాలు జరుగుతున్నాయనే విషయం తెలియడం..కోట్ల రూపాయలు చేతులు మారుతుండడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మురముళ్లలో పొట్టేళ్ల పందేలను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర విజయరామారావు హాజరయ్యారు. మరోవైపు పొట్టేళ్ల పందేలను పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజులుగా కోళ్లు, పొట్టేళ్ల పందేళను చూసీ చడనట్లు వ్యవహరించి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజులు ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు నాలుగో రోజు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై తీవ్ర వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

15:08 - January 16, 2017

నిజామాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటుక బట్టీలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. నిబంధలకు నీళ్లొదిలి ఇటుక బట్టీలను నడుపుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులు పొగబారి పోతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి వందల సంఖ్యల్లో బట్టీలు నడుస్తున్నాయి. ఇక వీటిలో చాలా వాటికి అసలు అనుమతులే ఉండవు. నిబంధనలకు విరుద్దంగా వీటిని యజమానులు నడుపుతున్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా వీటిని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ ఏంతమాత్రం అమలుకావు. అసలు వాటిని పట్టించుకొనే వారే ఉండరు. తమ ఇష్టారాజ్యంగా యజమానులు ఇటుక బట్టీలను నిర్వహిస్తూ కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు.

తక్కువ వేతనం ఇస్తోన్న యజమానులు..
ఇక ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులది దయనీయ పరిస్థితి. కార్మికులతో ఎక్కువ పని చేయించకుంటూ అతి తక్కువ కూలీ అంటగడుతున్నారు. యజమానులు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. వారి శ్రమను దోచుకుంటూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఏపీ, ఒడిషా రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తుంటారు. రెండు జిల్లాల్లో కలిపి 1700 వరకు కార్మికులు ఉంటారని ఓ అంచనా. వీరికి యజమానులు కనీస వేతన చట్టాలు అమలు చేయడం లేదు. వారితో ఎక్కువ గంటలు పనిచేయిస్తూ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వారి బాగోగులను యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారికి రోగమొచ్చినా, అనారోగ్యానికి గురైనా పట్టించుకునే నాధుడే ఉండడు.

కార్మిక శాఖ చోద్యం..
ఇటుక బట్టీలు నిర్వహించాలంటే విద్యుత్ శాఖ అనుమతులు సహాయ కార్మిక కమిషనర్‌ అనుమతులు తీసుకొవాలి తప్పని సరిగా తీసుకోవాలి. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులకు.. కార్మిక చట్టాలను అమలు చేయాలి. కానీ ఇవేమీ యజమానులు పట్టించుకోవడం లేదు. కార్మికుల జీవితాలతో యజమానులు ఆటలాడుకుంటున్నా కార్మికశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురి
చేస్తున్నా కార్మికశాఖ చోద్యం చూస్తోంది.

పొగతో రోగాల బారిన జనం..
జనావాసాల మధ్యే ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటుకలను కాల్చే సమయంలో వెలువడే పొగతో అస్తమ, ఉబ్బసం రోగాల బారిన పడుతున్నారు. బోదన్‌, ఆర్మూరు, బాన్సువాడ, డిచ్‌పల్లి ప్రాంతాల్లో ఇటుక బట్టీల పొగను పీల్చుతూ జనం రోగాల బారినపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

15:03 - January 16, 2017

ఢిల్లీ : అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. కొన్ని కండీషన్లతో సుప్రీంకోర్టు ఒప్పుకుంది. 24 వారాల కంటే ముందు అబార్షన్ చేయించుకోవచ్చని కోర్టు పేర్కొంది. పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం అనుమతినిచ్చింది. 22 ఏళ్ల యువతి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. పుణెకు చెందిన ఓ యువతి సుప్రీంను ఆశ్రయించింది. అబార్షన్ కావాలని అభ్యర్థించింది. దీనిపై సుప్రీం సోమవారం సంచలానత్మక తీర్పును వెలువడించింది. వైద్యపరమైన కారణాలతో గర్భంలో శిశువు పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ తొలగించుకోవచ్చని పేర్కొంది. గర్భం తొలగించుకోవడం చట్టపరమైన నేరమనే విషయం తెలిసిందే. దీనిపట్ల మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందిస్తోంది. ఇది సరియైన చర్య కాదని, దీనిని పునరాలోచించుకోవాలని కోరుతోంది. అనారోగ్య సమస్యలు ఉంటేనే గర్భం తొలగించుకోవచ్చని సుప్రీం తెలిపింది.

14:32 - January 16, 2017

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గత లోక్ సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్‌ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు.
తమిళనాడు రాజకీయాలకు, సిని రంగానికి విడదీయలేని సంబంధం ఉంది. సినీ రంగానికి చెందినవారే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. రజనీకాంత్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన మద్దతు కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్‌ ఓ వ్యాఖ్య చేయడం తీవ్ర ప్రభావం చూపింది. జయలలితకు ఓటు వేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడంటూ రజనీ వ్యాఖ్యానించడం డీఎంకే కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? అన్నది తమిళనాడులో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

14:28 - January 16, 2017

ఉత్తర్ ప్రదేశ్ : సమాజ్ వాది పార్టీలో ఏం జరుగుతోంది ? తండ్రి..కొడుకుల మధ్య వివాదం సద్దుమణగలేదా ? రాజకీయ సంక్షోభం మరింత ముదిరిందా ? ఇలా అనేక ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. చీలిక దిశగా సమాజ్ వాది పార్టీ పయనిస్తోంది. కాసేపటి క్రితం లక్నోలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తన మాట వినడం లేదని, పార్టీ కోసం..గుర్తు కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని ములాయం పేర్కొన్నారు. తన మాట వినకపోతే అఖిలేష్ యాదవ్ పై పోటీకి సిద్ధమని ములాయం ప్రకటించారు. రాంగోపాల్ యాదవ్ చేతిలో అఖిలేష్ కీలు బొమ్మగా మారారని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల కిందటే పార్టీ వివాదం సద్దుమణిగిందని, సీఎం అభ్యర్థి అఖిలేష్ అని స్వయంగా ములాయం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది రోజుల అనంతరం ములాయం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఎస్పీ గుర్తు 'సైకిల్' ఎవరికి వర్తించనుందో ఈసీ స్పష్టం చేయనుంది. మరి ములాయం వ్యాఖ్యలపై అఖిలేష్ ఎలా స్పందిస్తారా ? పార్టీ గుర్తు ఎవరికి కేటాయిస్తారు ? అనే ప్రశ్నలకు కొద్దిగంటల్లో సమాధానం రానుంది.

అజహరుద్దీన్ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ..

హైదరాబాద్ : హెచ్ సీఏ ఎన్నికలను సవాల్ చేస్తూ అజహరుద్దీన్ దాఖలు హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

ములాయం మద్దతుదారుల భేటీ..

లక్నో : ఎస్పీ కార్యాలయంలో ములాయం మద్దతు దారులు భేటీ అయ్యారు. కార్యకర్తలను ఉద్ధేశించి ములాయం ప్రసంగించారు. పార్టీని, సైకిల్ గుర్తును కాపాడుకొనేందుకు తన ప్రయత్నం చేసినట్లు, ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా..అభ్యంతరం లేదన్నారు. తన మాటకు వినకపోతే అఖిలేష్ పైనే పోటీ చేస్తానని వెల్లడించారు. రాంగోపాల్ చేతిలో అఖిలేష్ కీలుబొమ్మగా మారారని పేర్కొన్నారు.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..

~ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు.

‘ఫ్యాట్' ట్యాక్స్ యోచనలో కేంద్రం !

ఢిల్లీ : ప్రజారోగ్య పరిరక్షణపై కేంద్రం దృష్టి సారించింది. అధిక కొవ్వు, తియ్యటి ఆహార పదార్థాలపై ఫ్యాట్ ట్యాక్స్ విధించాలని కేంద్రం యోచిస్తోంది. పిజ్జా, బర్గర్ వంటి అధిక కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలు, తియ్యటి పానీయాలపై పన్నుల మోత మోగనుందని తెలుస్తోంది.

అబార్షన్..కండీషన్లతో ఒప్పుకున్న సుప్రీం..

ఢిల్లీ : అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. కొన్ని కండీషన్లతో సుప్రీంకోర్టు ఒప్పుకుంది. 24 వారాల కంటే ముందు అబార్షన్ చేయించుకోవచ్చని కోర్టు పేర్కొంది. పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం అనుమతినిచ్చింది. 22 ఏళ్ల యువతి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది.

13:53 - January 16, 2017

హైదరాబాద్: సాధారణం మనం కుర్తీస్ వేసుకుంటాం. కానీ పార్టీవేర్ గా వాడుకునే కుర్తీ తో ఇవాల్టి 'సొగసు' మీ ముందుకు వచ్చింది. అమీర్ పేటలోని 'సుప్రీయా సారీస్ అండ్ టెక్స్ లైట్స్ షోరూం' లో వివిధ రకాల లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:46 - January 16, 2017

హైదరాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. అటు రుణాలు తీసుకోలేక... ఇటు బీమా చెల్లించక రెండువిధాలా నష్టపోతున్నారు.. నోట్ల రద్దు దెబ్బనుంచి కోలుకోలేక అవస్థలు అనుభవిస్తున్నారు..

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 4లక్షల 30వేలమంది రైతులు...

తెలంగాణలో పంట రుణాల మంజూరు ప్రక్రియ నత్తను గుర్తుచేస్తోంది.. రైతులందరికీ పంట రుణాలిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి.. రుణాల్ని సరిగా మంజూరు చేయకపోవడంతో బీమాపరంగాకూడా రైతులు నష్టపోతున్నారు.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది... ఈ రెండు జిల్లాల్లో 4లక్షల 30వేలమంది రైతులున్నారు.. వీరికి పదకొండున్నరకోట్ల రూపాయల రుణాల్ని ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. ఇప్పటివరకూ కేవలం 380కోట్ల రుణాలుమాత్రమే మంజూరయ్యాయి.. ఇందులో మళ్లీ 35శాతంమందిమాత్రమే రుణాల్ని రెన్యువల్‌ చేయించుకున్నారు.. వీరే ప్రధానమంత్రి ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించారు..

గత ఏప్రిల్‌లో ఫసల్‌ బీమా యోజన ప్రారంభం...

రైతులు పంటనష్టపోయి ఆర్థికంగా చితికిపోకుండా కేంద్రం ఫసల్‌ బీమా యోజనను గత ఏప్రిల్‌లో ప్రారంభించింది... రైతులు తమ పట్టా భూముల్లోపండించే పంటకు బీమా చెల్లించాలని కోరింది.. ఈ ప్రీమియం కట్టినవారికే నష్టపరిహారం అందుతుంది.. కేంద్రం పిలుపుతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో దాదాపు లక్షా 21వేలమంది రైతులు కోటి 66లక్షల 85వేల రూపాయల్ని ప్రీమియంగా చెల్లించారు.. గత ఏడాదివరకూ పరిస్థితి బాగానేఉన్నా నోట్ల రద్దు తర్వాత పరిస్థితి మారిపోయింది.. నోట్ల రద్దుతో రైతులు రుణాల్ని రెన్యువల్ చేసుకోలేకపోయారు.. భారీ క్యూలతో బ్యాంకులకు రావాలంటేనే భయపడిపోయారు.. పైగా పాతనోట్లు జమచేసే సమయం, బీమా యోజన గడువు ఒకేసారి కావడంతో బ్యాంకులుకూడా బీమాపై పెద్దగా దృష్టిపెట్టలేదు.. డిసెంబర్‌ 31తో బీమా ప్రీమియం గడువు ముగిసింది.. ఈ స్కీంకు 50శాతంకూడా స్పందనరాకపోవడంతో కేంద్రం బీమా ప్రీమియం గడువును జనవరి 10వరకూ పెంచింది.. ఇదికూడా పూర్తయినా ఆశించిన ఫలితం రాలేదు.. బీమాపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం, నోట్ల రద్దుతో రైతులు నష్టపోతున్నారు.. గడువును మరికొన్నిరోజులు పెంచి బీమా పథకాన్ని రైతులకు వివరించాలని రైతుసంఘం నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు..

13:42 - January 16, 2017

ఆడపిల్లలకు చదువు ఎందుకు అనే రోజులు పోయి... ఆడపిల్లలకు చదువు ఖచ్చితంగా అవసరం అనే రోజులు వచ్చాయి. అమ్మాయిలు కూడా చదువుల్లో అబ్బాయిలతో పోటీ పడుతూ..మరీ చదువుకుంటున్నారు. విద్యార్హతలకు సరిపడే ఉద్యోగాల్లో స్థిరపడుతూ రాణిస్తున్నారు. మరికొందరు వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి జయకేతనం ఎగురవేస్తున్నారు. అటువంటి విజేత మానస కథనంతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి మానవి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:33 - January 16, 2017

ఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే రాష్ర్ట ప్రభుత్వం బడ్జెట్‌ ఆధారపడి ఉండొచ్చన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదాయం పెరగాలంటే.. పెద్ద డీలర్ల నుంచే పన్నులు వసూలు చేయాలని కేంద్రానికి సూచించామని ఈటెల తెలిపారు. పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గితే.. కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గు ఉండే అవకాశాలున్నాయన్నారు.

13:30 - January 16, 2017
13:29 - January 16, 2017

హైదరాబాద్: భారత దేశాన్ని పేదరికం పట్టిపీడిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు గడిచినా ఇంకా పేదరికం దూరం కాలేదన్నారు. కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోనే పేదరికం పోదని.. దీనికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరిగిన సర్ణభారతి ట్రస్ట్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తల్లిని, మాతృభూమిని, మాతృభాషను మరచిపోవద్దని సూచించారు. సమాజ సేవ చేయడమే స్వర్ణభారతి ట్రస్ట్‌ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. యువతలో చైతన్యం తీసుకొచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కేంద్రమంత్రులు పారికర్‌,దత్తాత్రేయ పాల్గొన్నారు.

13:27 - January 16, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారం కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. మరో వైపు రజనీ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానంటూ సీనియర్ నటుడు శరత్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రజనీ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. రజనీ అభిమానులు.. ఎక్కడికక్కడ శరత్‌కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే వివాదం ముదరడంతో శరత్‌కుమార్ ఇప్పుడు వివరణ ఇచ్చారు. జయలలిత చనిపోయిన తర్వాత రాజకీయ అనిశ్చితి ఏదీ లేదని, తమిళనాడుకు చెందినవాళ్లే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని మాత్రమే తాను అన్నానని శరత్‌కుమార్ చెప్పారు. అయితే... తన రాజకీయ రంగ ప్రవేశంపై రజినీకాంత్‌ ఇప్పటివరకు స్పందించడం లేదు.

13:25 - January 16, 2017

అమరావతి : రాయలసీమలో పట్టు బిగించేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరవుతో విలవిలలాడే ప్రాంతాల్లో.. ఇరిగేషన్‌ రంగాన్ని అభివృద్ధి చేసి పచ్చని పంటలు పండించేలా కసరత్తు చేస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో టీడీపీ దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష వైసీపీలో అంతర్మథనం మొదలైంది.

గోదావరి జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన తెలుగుదేశం..

ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. గోదావరి జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన తెలుగుదేశం.. అటు ఉత్తరాంధ్రలోనూ సత్తా చాటింది. ఇక పట్టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మెజారిటీ స్థానాలు దక్కించుఉంది. అయితే.. ఆ ఊపు రాయలసీమలో కొనసాగించలేకపోయింది. దీంతో 2019 ఎన్నికలే లక్ష్యంగా రాయలసీమలో అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

కరవుపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు..

రాయలసీమలో గత కొన్ని దశాబ్ధాలుగా ఉన్న కరవుపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు.. 2016లో ప్రయోగాత్మకంగా రెయిన్‌గన్‌లను ఉపయోగించారు. దీని ద్వారా బీడుమారిన భూముల్లో మళ్లీ కొత్త చిగుళ్లు మొదలయ్యాయి. రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులు తొలగిపోవాలంటే ఇరిగేషన్‌ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం.. మచ్చుమర్రి, గండిపేట, హంద్రీనీవాలను పూర్తిగా రాయలసీమ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేసిన చంద్రబాబు.. ఇక శ్రీశైలంలో నీటి నిల్వలను పూర్తిగా రాయలసీమ అవసరాలకు ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇంకుడు గుంతలు, నీరు-చెటు్ట కార్యక్రమాలను కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరో రెండు సంవత్సరాల్లో రాయలసీమలో కరవు పూర్తిగా తరిమి కొట్టవచ్చని ఆలోచిస్తున్నారు. ఈ ప్రణాళికల ద్వారా రాయలసీమ ప్రజల మన్ననలు పొందటంతోపాటు.. 2019లో రాయలసీమలో కూడా టీడీపీకి పూర్తి మెజారిటీ వచ్చేలాగా వ్యూహం రచిస్తున్నారు. మరోవైపు అధికార టీడీపీ ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటి పూర్తి అవుతుండడంతో.. ప్రతిపక్ష వైసీపీ అంతర్మథనంలో పడింది. రాయలసీమలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏంటన్న ప్రశ్న వైసీపీ నేతల్లో వెల్లడవుతోంది.

ఏఆర్ ఎస్సై గునాథ్ అనుమానాస్పద మృతి

కడప : బుగ్గవంక సమీపంలో ఏఆర్ ఎస్సై గునాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఐఐటీల్లో అమ్మాయిలకు 20శాతం రిజర్వేషన్లు?

ఢిల్లీ : ఐఐటీల్లో అమ్మాయిలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దీని పై నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2018 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీల్లో అమ్మాయిలకు 20శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందని, ఐఐటీల్లో అమ్మాయిల ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రొ.తిమోతీ గోన్సాల్వేస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యకు సుప్రీం కోర్టు ఆదేశించింది. దీని కోసం మత్తయ్యకు రెండు వారాల గడువును సుప్రీం ఇచ్చింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

రైలు ఎక్కి సెల్ఫీ దిగబోయి...

విశాఖ: అరకు రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు గూడ్స్ రైలు ఎక్కి ఫోటో దిగేందుకు యత్నించాడు. రైలు పై నుండి కింది పడి యుకుడు మృతి చెందాడు.

మెహదీపట్నం వద్ద అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్: మెహదీపట్నం సరోజినీదేవి ఆస్పత్రి సమీపంలోనిఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండవ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

స్వయం ఉపాధి వల్లే పేదరిక నిర్మూలన:వెంకయ్య

హైదరాబాద్: నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి వల్లే పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో స్వర్ణ భారత్ ట్రస్టు శాఖను ప్రారంభోత్సవం సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. పేదరికాన్ని పారద్రోలేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. అలాంటి సంస్థలకు ప్రజల సహకారం ఉండాలన్నారు. ఐటీ సంస్థల బాగస్వామ్యంతో యువతకు స్వర్ణ భారత్ ట్రస్టు శిక్షణ ఇస్తోందన్నారు. రైతులు, గ్రామీణ యువత అభివృద్ధే లక్ష్యంగా ఈ ట్రస్టు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూడటం కాదు..

బెంగళూరులో సీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య

బెంగళూరు : బెంగళూరులోని కెంపె గౌడ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ జవాను తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జవాను ఆత్మహత్యపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆత్మహత్యకు పాల్పడిన జవాన్‌ను సురేశ్ గైక్వాడ్‌గా పోలీసులు గుర్తించారు.

12:15 - January 16, 2017

హైదరాబాద్: కిర్గిస్థాన్‌లో విమాన ప్రమాదం జరిగింది. మనాస్‌ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టర్కీష్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ కార్గో విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.

12:13 - January 16, 2017

చెన్నై : తమిళనాడులో జల్లికట్టును నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధురైలోని అళంగనల్లూర్‌, పలమేడు, అవనియాపురంలో జల్లికట్లును నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే.. జల్లికట్టును నిర్వహించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా నిర్వాహకులు మాత్రం పట్టించుకోకుండా జల్లికట్టుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అళంగనల్లూర్‌లో జల్లికట్టును అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

12:12 - January 16, 2017

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. అదే డీసీసీల నియామకం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని రెండేళ్లవుతున్నా...ఇప్పటికీ బొత్స సత్యనారాయణ వేసిన కమిటీలే చాలా కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత డీసీసీల నియామకం కాంగ్రెస్‌లో సెగ పుట్టిస్తోంది.

కొత్త జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించాలని పీసీసీ నిర్ణయం...

ఇప్పుడు పాత పది జిల్లాలు పక్కనబడితే..కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు కొత్త డీసీసీల ను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. దీంతో పార్టీలో రగడ మొదలైంది. అయితే డీసీసీలుగా పనిచేస్తున్న వారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని ఏఐసీసీ నుంచి సూచనలు రావడంతో మొదట్లో కొంత వెనక్కి తగ్గిన ఆశావాహులు....ఎన్నికల నాటికి ఆ ఫార్ములా ఎలాగూ వర్కవుట్ కాదని అంచనాకొచ్చి ఇప్పుడు జోరు పెంచారు. వీటిలో దక్షిణ తెలంగాణలో పెద్దగా పోటీలేదు. ఆయా జిల్లాలకు చెందిన సీనియర్లు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో దాదాపు ఎంపిక పూర్తి చేశారు. అయితే ఇప్పుడు అసలు పంచాయితీ అంతా ఉత్తర తెలంగాణలోనే వచ్చిపడింది.

హాట్‌ హట్‌గా మారిన కరీంనగర్ డీసీసీ...

ముఖ్యంగా కరీంనగర్ డీసీసీ నియామకం హాట్‌హాట్‌గా మారింది. ఎలాగైనా డీసీసీని దక్కించుకునేందుకు ఆశావాహులు కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ డీసీసీగా పనిచేస్తున్న కటకం మృత్యుంజయం స్థానంలో తనకు అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి అడుగుతున్నారు. కౌశిక్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే డీసీసీగా ఉన్న మృత్యుంజయాన్నే తిరిగి కొనసాగించాలంటున్నారు. కౌశిక్ మాత్రం జిల్లాలో ఇతర ముఖ్యనేతల మద్దతు తనకే ఉందని చెప్పుకుంటున్నారు. దీంతో పొన్నం- కౌశిక్‌కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి...బొమ్మ శ్రీరామ్‌లు తాము సైతం రేస్‌లో ఉన్నామంటున్నారు. అంతే కాదు ఎవరికి వారు లాబియింగ్‌ కూడా చేసుకుంటున్నారు.

కత్తిమీద సాముగా మంచిర్యాల డీసీసీ ఎంపిక ....

ఇక ఆదిలాబాద్ నుంచి ఏర్పడ్డ కొత్త జిల్లా మంచిర్యాల డీసీసీ ఎంపిక కత్తిమీద సాముగా మారింది. ఇప్పటికే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మధ్య నడుస్తున్న వార్‌ పార్టీలో మరింత సెగ రేపుతోంది. ఈ విషయంలో పీసీసీ ముఖ్యనేతలు సైతం రెండుగా చీలిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్‌, భట్టి విక్రమార్కలు వారి వారి వర్గాలకు ప్రాతినిథ్యం కావాలని ప్టటుబడుతుండటంతో సీన్‌ రంజుగా మారింది. ఈ ఇఘ్యాతో ఉత్తమ్‌, భట్టీలు ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది. దీంతో ఈ లొల్లీ ఇప్పటికే ఢిల్లీ గడపకు చేరుకుందని సమాచారం

భూపాలపల్లి జిల్లాకు తన భార్య గండ్ర జ్యోతికి పేరు సూచిస్తున్న గండ్ర ....

మరో వైపు పాత వరంగల్ డీసీసీ పరిస్ధితి కూడా సేమ్‌ టూ సేమ్... కొత్తగా ఏర్పాటైన భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి తన భార్య గండ్ర జ్యోతికి కావాలని మాజీ చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అడుగుతున్నారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇక వరంగల్ అర్బన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ...దయాసాగర్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక వరంగల్ రూరల్‌లో పరకాల వెంకట్రామిరెడ్డి డీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఇదీలా ఉంటే మహబూబ్‌బాద్‌లో డీసీసీని ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ అనధికారికంగా ప్రకటించారు. లోకల్ నేతల నుంచి ఏకాభిప్రాయం రావడంతో డీసీసీగా భరత్ చంద్రా రెడ్డిని డిక్లేర్ చేశారు.

ఖమ్మంలో ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు....

ఇక ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు డీసీసీకి ఇబ్బందికరంగా మారింది. రేణుకాచౌదరి..భట్టి విక్రమార్క..పొంగులేటి సుధాకర్‌లు ఎవరికీ వారు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు తమ అనుచరులను డీసీసీని కట్టబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీసీగా ఉన్న ఐతం సత్యం భట్టికి అనుచరుడిగా పేరుంది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవ డీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి రేణుకాచౌదరి తన అనుచరుడు ఎడవెల్లి కృష్ణ డీసీసీ కోసం ముమ్మరంగా లాబీంగ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎంపిక పీసీసీకి సవాల్‌గా మారింది. మొత్తానికి దక్షణ తెలంగాణలో డీసీసీల ఎంపిక కసరత్తు కూల్‌కూల్‌గా సాగిపోతుంటే... ఉత్తర తెలంగాణలో మాత్రం సెగలు పుట్టిస్తోంది. కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం అన్నట్లు సీనియర్ల ఆధిపోరుతో పీసీసీ నలిగిపోతుంది.

12:08 - January 16, 2017

హైదరాబాద్: లవ్‌.. ఇది ఎక్కడ ? ఎలా పుడుతుందో చెప్పలేం. కొందరు ఫస్ట్‌ లుక్‌లోనే ప్రేమలో పడితే.. మరికొందరు ఎంతో కాలంగా స్నేహం చేసిన తర్వాత ప్రేమించుకుంటారు. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో పడ్డారు కర్నూలు జిల్లా అబ్బాయి, అనంతపురం జిల్లా అమ్మాయి. ఇక ఒకరినొకరు వీడి ఉండలేని వాళ్లు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత వాళ్ల జీవితం అనేక మలుపులు తిరిగింది. ఇంతకీ ఏంటా ట్విస్టులు అనుకుంటున్నారా ? అయితే మీరే చూడండి.

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న రాజేశ్వరి .....

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రాజేశ్వరి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సాయి ఈశ్వర్‌ కర్నూలులో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వీరిద్దరికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంత అనుబంధం పెరిగింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వయసులో అతనికంటే ఆమె పెద్దదైనా రాజేశ్వరిని సాయి పెళ్లి చేసుకున్నాడు.

సంసారంలో మనస్పర్ధలు .....

అయితే.. కొన్నాళ్లపాటు సవ్యంగా సాగిన సంసారంలో మనస్పర్థలు తలెత్తాయి. రాజేశ్వరికి అంతకుముందే వివాహం జరిగి.. విడాకులు తీసుకుందనే విషయం సాయి ఈశ్వర్‌కు తెలిసింది. ఈ విషయంపై రాజేశ్వరితో గొడవపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సాయిఈశ్వర్ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి.. అతనిని కర్నూలుకు తీసుకువెళ్లారు.

కర్నూలుకు వచ్చిన రాజేశ్వరి ....

సాయిఈశ్వర్‌ను వదిల ఉండలేక రాజేశ్వరి కూడా కర్నూలుకు బయల్దేరింది. నువ్వు లేకుండా నేను బతకలేనని సాయిఈశ్వర్‌ను బ్రతిమలాడింది. నువ్వే నా జీవితం అంటూ వేడుకుంది. ఆ తర్వాత చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సాయి ఈశ్వర్‌కు సమాచారమిచ్చారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఈశ్వర్‌.. ప్రేమించిన రాజేశ్వరిని ఆ స్థితిలో చూసి.. చలించిపోయాడు. అంతే.. నీతోనే నా బతుకు అంటూ హామీ ఇచ్చాడు. మళ్లీ ఎప్పుడూ నిన్ను వీడను అంటూ శపథం చేశాడు.

రాజేశ్వరిని కోడలుగా ఒప్పుకునేందుకు నిరాకరిస్తున్న సాయి తల్లిదండ్రులు....

అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్‌ ఏర్పడింది. రాజేశ్వరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోడలిగా చేసుకునేందుకు సాయి ఈశ్వర్‌ తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. దీంతో ఏమీ చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు సాయి ఈశ్వర్‌. ఓ వైపు పెంచిన తల్లిదండ్రులు, మరోవైపు పెళ్లి చేసుకున్న భార్య. మరి తల్లిదండ్రులను ఒప్పించి.. తన ఫేస్‌బుక్‌ ప్రేమను ఎంతవరకు నిలుపుకుంటాడో చూడాలి.

12:05 - January 16, 2017

కృష్ణా :కైకలూరు మండలం ఆటపాకలో చిరంజీవి సినిమా ఫ్లెక్సీపై ఉన్న వంగవీటి రంగా ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో చిరు ఫ్యాన్స్‌, వంగవీటి రంగా అభిమానులు ఆందోళనకు దిగారు. కైకలూరు-భీమవరం రహదారిపై నిరసన చేపట్టారు. ఫ్లెక్సీలను చించినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. చిరు, రంగా అభిమానుల రాస్తారోకోతో కిలో మేటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

12:03 - January 16, 2017

హైదరాబాద్: పంజాబ్‌ హక్కుల కోసం పోరాడుతానని కాంగ్రెస్‌నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ అన్నారు. పంజాబ్‌ ప్రజల ఆత్మగౌరం, అస్థిత్వం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. పంజాబ్‌ యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని... దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామిస్తామన్నారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిద్దూ.. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ తన పుట్టినిల్లు అని.. మళ్లీ తన ఇంటికి రావడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తానొక సైనికుడిని మాత్రమేనన్న ఆయన.. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ఆ 8మంది వద్దే సంపదంతా :ఆక్స్ ఫామ్

హైదరాబాద్: కేవలం 8 మంది వ్యక్తుల వద్దే ప్రపంచ పేదల వద్ద ఉన్న సంపదలో సగం పోగుబడి ఉందని ఆక్స్‌ఫామ్‌ సంస్థ తెలిపింది. నేడు దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పలువురు శాసనకర్తలు, సంపన్నులు పాల్గొననున్నారు. ఈ ఛారిటీ సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం చరిత్రలో ఎన్నడు లేనంత ఆర్థిక అసమానతలు ఉన్నాయని పేర్కొంది.

మనీ విత్ డ్రా పరిమితి రూ.35వేలకు పెంపు

ఢిల్లీ : బ్యాంకుల్లో మనీ విత్ డ్రా లిమిట్ ను రూ.24 నుండి రూ.35 వేలకు కేంద్రం పెంచింది. బడ్జెట్ కుముందు ఈ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

తమిళనాడులో కొనసాగుతున్న జల్లికట్టు

చెన్నై : తమిళనాడు జల్లికట్టు కొనసాగుతోంది. మధురైలోని అళంగనల్లూర్, పలమేడు, అవనియాపురం తదితర ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అళంగనల్లూర్ లో భారీగా పోలీసులు మోహరించారు.

మేడ్చల్ లో దొంగల హల్చల్

మేడ్చల్ : సంక్రాంతి సెలవుల్లో దొంగలు రెచ్చిపోయారు. ఉమానగర్ లో నాలుగు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి నగలు, నగదు దొంగలు దోచుకెళ్లారు.

స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి : శంషాబాద్ మండలం ముచ్చింత్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పారికర్, దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... వెంకయ్యకుమార్తె దీప ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ట్రస్టు హైదరాబాద్ లో చాప్టర్ ప్రారంభించడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ఈ ట్రస్టు మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్టు గాంధీ సిద్ధాంతాలతో నడుస్తోందన్నారు. గ్రామీణులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోందన్నారు.

గర్భిణీకి ఆపరేషన్ చేసిన నర్సు

కామారెడ్డి : బిక్నూరు పీహెచ్ సీలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి నర్సు ఆపరేషన్ చేసింది. శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

10:48 - January 16, 2017

విశాఖ : సంక్రాంతి పండుగంటే తెలుగువారి ఇళ్లల్లో జరిగే హడావుడి అంతాఇంతాకాదు. భోగి మంటలు,ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆటపాటలు. అంతేనా.. చిన్నారులు ఏర్పాటు చేసే బొమ్మల కొలువులూ ముచ్చటగొల్పుతాయి. ఇంటింటా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ఇరుగు పొరుగుని పిలిచి చూపించడంలో ఉండే ఆనందమే వేరు. నేటి ఆధునిక కాలంలో జనం బొమ్మల కొలువులు పెట్టడమే మానేశారు. ఓ కుటుంబం మాత్రం ప్రతి ఏటా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ... మన సంస్కృతి - సంప్రదాయాలను నవ తరానికి పరిచయం చేస్తోంది.

ఆడపిల్లలకు చెందిన వేడుక...

బొమ్మల కొలువు పూర్తిగా ఆడపిల్లలకు చెందిన వేడుక. తమకు నచ్చిన బొమ్మలను అమ్మాయిలు ఒక పద్ధతి ప్రకారం పేర్చుతారు. అందులో దేవతామూర్తుల విగ్రహాలతోపాటు దేశ భక్తుల విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు.. వివిధ వృత్తులకు సంబంధించి విగ్రహాలతోపాటు అన్నిరకాల విగ్రహాలు బొమ్మల కొలువులో కొలువుతీరుతాయి.

బొమ్మల కొలువులో పాల్గొన్న చిన్నారులకు...

బొమ్మల కొలువులో పాల్గొన్న చిన్నారులకు వేడుక ముగిసిన తర్వాత బొమ్మలతోపాటు పసుపు - కుంకుమలతో కూడిన తాంబూలాలను ఇస్తారు. బొమ్మలను జాగ్రత్తగా అలంకరించే ఆడపిల్లలు.. తన కుటుంబాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారని పెద్దలు భావిస్తారు. ఆడపిల్లలే బొమ్మలను అలంకరిస్తారు కాబట్టి.. వారిలో సంబంధ, బాంధవ్యాలు పెంపొందడంతోపాటు కలివిడి తనం పెరుగుతుందని పెద్దలు చెప్తుంటారు.

వారసత్వంగా వస్తున్న కళలు, సంస్కృతి..

ప్రస్తుత ఆధునిక యుగంలో మన వారసత్వంగా వస్తున్న కళలు, సంస్కృతి - సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. మానవులు బిజీలైఫ్‌కు అలవాటు పడిన తర్వాత పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలకు ఆదరణ కరువవుతోంది. ఇందులో భాగంగానే బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడమే మానేశారు. కానీ విశాఖనగరంలోని ఓ కుటుంబం మాత్రం తమ పిల్లలకు ఈ బొమ్మల కొలువును పెట్టడం నేర్పిస్తోంది. తెలుగు బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన చిన్నారులు తమకు ఇది ఎంతగానో నచ్చిందని... ఇకపై ఈ సంప్రదాయాన్ని ప్రతిఏటా కొనసాగిస్తామని చెప్తున్నారు. వారసత్వంగా వస్తోన్న మన సంస్కృతి - సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

10:45 - January 16, 2017

హైదరాబాద్: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఉపయోగించిన కారు దాదాపు ఎనభై ఏళ్ల తర్వాత నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కారు మళ్లీ ప్రాణం పోసుకుంది. బోస్‌ పూర్వీకులు ఇంట్లో ఓ అద్దాల గదికే పరిమితమైన ఈకారును తిరిగి రోడ్డుపైకి కానుంది. నేతాజీ రీసర్చ్‌ బ్యూరో జర్మనీకి చెందిన ఆడి మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని కారుకు పూర్తిగా రిపేరు చేసి, వినియోగంలోకి తేస్తోంది.

సోదరుడు తెప్పించిన కారును ఉపయోగించిన బోస్‌

నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ వాడిన ఈ కారు వాండరర్‌ సెడాన్‌ కంపెనీ 1937లో తయారు చేసింది. నేతాజీ సోదరుడు తెప్పించిన ఈ కారును బోస్‌ ఉపయోగించేవారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటీష్‌ పాలకులు నేతాజీని గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో 1941 జనవరి 16న కోల్‌కతా ఎల్గిన్‌ రోడ్డులోని తన ఇంటి నుంచి అప్పటి బీహార్‌లోని గోమో ప్రాంతానికి ఈ కారులోనే నేతాజీ పారిపోయారు. అక్కడ నుంచి జర్మనీకి వెళ్లారు. అప్పటి నుంచి అద్దాల గదికే పరిమితమై, సందర్శకుల దర్శనం కోసమే పరిమితమైన ఈ కారు ఇప్పుడు మళ్లీ ప్రయాణానికి సిద్ధమైంది.

రెండు వందల మీటర్ల దూరం నడిపేందుకే వినయోగం ....

బిఎల్ ఏ 7169 నంబర్‌తో ఉన్న ఈ కారును డాక్యుమెంటరీ ఫిల్మ్‌ రూపొందించేందుకు నేతాజీ అన్న కుమారుడు సిసిర్‌ బోస్‌ చివరిసారిగా 1971లో నడిపారు. పూర్తి కొత్త పరికరాలతో రిపేరు చేసిన నేతాజీ కారును వంద నుంచి రెండొందల మీటర్ల దూరం వరకు నడిపేందుకు ఉపయోగించాలని నేతాజీ రిసర్చ్‌ బ్యూరో నిర్ణయించింది. డబ్ల్యూ24 మోడల్‌కు చెందిన ఈ కారు పెట్రోల్‌తో నడుస్తుంది.

10:32 - January 16, 2017

హైదరాబాద్: గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈనెల 20 బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్షుడి హోదాలో శ్వేతసౌధంలో అడుగుపెట్టిన మొదటి గంటలో చేయాల్సిన కార్యక్రమాల అజెండాను రూపొందించుకున్నారు. డజను పథకాలను రద్దు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

ఒబామా కేర్‌ స్థానంలో కొత్త వైద్య బీమా పథకం

ఒమాబా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టి వైద్య బీమా పథకం ఒబామా కేర్‌ రద్దు ట్రంప్‌ అజెండాలో ప్రథమస్థానంలో ఉంది. దీని స్థానంలో ఎక్కువ మందికి వర్తించేలా కొత్త వైద్య బీమా పథకాన్ని తీసుకురానున్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపడం ట్రంప్‌ రెండో అజెండా. ఇలాంటి వారు ఇరవై లక్షల మంది వరకు ఉన్నారని అధికారులు లెక్కలు తేల్చారు. వీరిలో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులు కూడా ఉన్నారు. యూఎస్‌ నుంచి తిప్పిపంపేవారిలో తొలి ప్రాధాన్యత నేరస్థులకే ఇస్తారు. అక్రమ వలసులతో అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయని ట్రంప్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అమెరికా సరిహద్దుల్లోని మెక్సికో నుంచి ఎక్కువ మంది వలస వస్తుననారు. దీంతో రెండు దేశాల సరిహద్దుల మధ్య గోడ కట్టేందుకు చట్టం తీసుకొచ్చే ఫైలుపై సంతకం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఉగ్రవాద ప్రాబల్య దేశాల నుంచి వస్తున్న వారితో భద్రతకు ముప్పు

ఉగ్రవాదం కారణంగా సిరియా నుంచి అమెరికాకు శరణార్థులుగా వచ్చిన వారి కోసం అమలు చేస్తున్న సహాయ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ మొదటి రోజు రద్దు చేసే కార్యక్రమాల్లో ఇది కూడా ఉంది. ఉగ్రవాద ప్రాబల్య దేశాల నుంచి అమెరికా వస్తున్న వారిలో స్వదేశంలో భద్రత లోపించిందన్న వాదాన్నిట్రంప్‌ మొదటి నుంచి వినిపిస్తున్నారు. ఒబామా 2012లో ప్రవేశపెట్టిన డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్‌... డీఏసీఏ.. కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఏడున్నర లక్షల మంది పిల్లలు, యువకులు అమెరికాలో ఉంటున్నట్టు గుర్తించారు. ట్రంప్‌ విధానాలతో వీరంతా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.

ఒబామా స్వచ్ఛ ఇంధన ప్రణాళికకు చెక్‌

ఒబామా అనుసరించిన పర్యావరణ, ఇంధన పథకాలను కూడా ట్రంప్‌ పునఃసమీక్షించనున్నారు. కర్బన ఉద్గారాలు వెదజల్లుతున్నాయన్న ఉద్దేశంతో ఒబామా స్వచ్ఛ ఇంధన ప్రణాళిక తీసుకొచ్చారు. దీంతో చాలా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మూతపడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రంప్‌ దీనిని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఒబామా స్వచ్ఛ ఇంధన ప్రణాళిక అమెరికాలో నిరుద్యోగానికి కారణమవుతుందని ట్రంప్‌ భావిస్తున్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మూతపడితే బొగ్గు పరిశ్రమ కూడా ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బొగ్గు తవ్వకాలపై ఒబామా విధించిన తాత్కాలిక నిషేధాన్ని తొలగించాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. కొత్త బొగ్గు గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతోపాటు, చమురు, సహజవాయువు, యూరేనియం నిక్షేపాల వెలికితీతకు ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త అధ్యక్షుడు నిర్ణయించుకున్నారు. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల కార్యక్రమం కింద అందిస్తున్న బిలియన్ల డాలర్ల సహాయన్ని నిలిపివేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ డబ్బును అమెరికాలో మౌలికసదుపాయల అభివృద్ధికి ఉపయోగించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కెనడా-అమెరికా గల్ఫ్‌ రిఫైనరీస్‌ గొట్టపు మార్గానికి ప్రాణం

మరోవైపు ఒబామా నిషేధించిన కొన్ని పథకాలకు తిరిగి ప్రాణం పోయాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. కెనడా నుంచి అమెరికాకు ఏర్పాటు చేస్తున్న గల్ఫ్‌ కోస్ట్‌ రిఫైనరీస్‌ గొట్టపు మార్గం వీటిలో ప్రధానమైనది. ఒబామా ప్రభుత్వం కొన్ని దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను ట్రంప్‌ తిరగతోడనున్నారు. కెనడా, మెక్సికోలతో కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక, పన్నెండు దేశాలతో కుదుర్చుకున్న ట్రాన్స్‌ పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం వీటిలో ఉన్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా కొత్త అధ్యక్షుడు పునఃసమీక్షించనున్నారు. రాజకీయ నియామకాలపై ఐదేళ్లు నిషేధం విధించాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఇలాంటి వారు పైరవీకారులుగా మారారన్న వాదాన్ని కొత్త అధ్యక్షుడు వినిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నియమాకాన్ని కూడా స్తంభింపచేయాలని నిర్ణయించారు. మొత్తంమీద ట్రంప్‌ పోకడలు చూస్తుంటే... అమెరికాను పూర్తిగా సంస్కరణల పథంలో నడిపించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

విద్యుత్ షాక్ తో బాలిక మృతి

మంచిర్యాల : సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌తో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈఘటన బెల్లంపల్లి మండలం జజ్జరవెల్లిలో విషాదం నెలకొంది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేస్తుంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

యూజీసీ సభ్యులుగా ప్రొ.గోపాల్ రెడ్డి

ఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సభ్యుడిగా సీనియర్‌ విద్యావేత్త ప్రొఫెసర్‌ జి.గోపాల్‌రెడ్డిని నియమించాలని కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ నిర్ణయించింది. రెండు మూడ్రో జుల్లో ఉత్తర్వులు వెలువడుతా యని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఉస్మానియా వర్సిటీతో అనుబంధమున్న గోపాల్‌ రెడ్డికి పొలిటికల్‌ సైన్స్‌లో 30ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉంది.

09:58 - January 16, 2017

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇవాళ ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 47 తుపాకులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

కాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇవాళ ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి మూడు ఏకే 47 తుపాకులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

09:55 - January 16, 2017

ఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్‌ 9వ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరుగనుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్ధికమంత్రులు హాజరవుతున్నారు. గత ఎనిమిది సమావేశాల్లో అపరిష్కృతంగా ఉన్న కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా కోటిన్నరలోపు వార్షిక టర్నోవర్‌గల వ్యాపారాలపై ఎవరి అజమాయిషీ ఉండాలన్న దానిపై, రేవుల ద్వారా జరిగే వాణిజ్యంపై పన్నుల వసూళ్లను ఎవరు చేయాలన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రెండు అంశాల్లో రాష్ట్రానికే అధికారం ఉండాలని అన్ని రాష్ట్రాల మంత్రులు గత సమావేశాల్లో కోరారు. అయితే కేంద్రం మాత్రం వీటిని పూర్తిగా తన పరిధిలోకి తీసుకోవాలని యోచిస్తోంది.

09:54 - January 16, 2017

ఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇవాళ నిర్ణయం వెలువడనుంది. సీఈసీ నసీమ్‌ జైదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దీనిపై తాత్కాలిక నిర్ణయం తీసుకోనుంది. వాస్తవానికి, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశకు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దాంతో, ఆ లోపులోనే ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఎవరో ఒకరికి దానిని కేటాయించడం లేదా తాత్కాలికంగా సైకిల్‌ గుర్తును స్తంభింపజేయవచ్చని వివరిస్తున్నారు. సైకిల్‌ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ములాయం సింగ్‌, అఖిలేష్‌ యాదవ్‌ ఇరు వర్గాలూ ఇదే అంశంపై ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాయి. సైకిల్‌ గుర్తు తమకే వస్తుందన్న ఆశతో ములాయం శిబిరం కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ములాయంకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం వెలువడుతుందని శివపాల్‌ కూడా వ్యాఖ్యానించారు.

09:52 - January 16, 2017

పశ్చిమగోదావరి : ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో కోడి పందేలతో పాటుగా పొట్టేలు పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పొట్టేళ్లు పోటీలో పాల్గొన్నాయి. పందెంలో పాల్గొన్న పొట్టెళ్ల పేర్లు రాముడు, భీముడు, పందెంలో రాముడు పొట్టేలుపై భీముడు పొట్టేలు విజేతగా నిలిచింది. ఈ పందేలను వీక్షించేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కిర్జిలో కూలిన విమానం:16మంది మృతి

హైదరాబాద్: కిర్జిస్థాన్లోని మనాస్‌ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టర్కీష్‌ ఎయిర్‌లైన్స్ కార్గోకు చెందిన విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 16 మంది మరణించారని కిర్జీ ప్రభుత్వం ప్రకటించింది. ఓ పైలట్‌, మరో15 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

నేడు జీఎస్టీ 9వ కౌన్సిల్ సమావేశం

ఢిల్లీ :జీఎస్టీ కౌన్సిల్ తొమ్మిదో సమావేశం ఢిల్లీలో సోమవారం జరుగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరవుతున్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్, వాణిజ్య పన్నుల కమిషనర్ అనిల్‌కుమార్, సంయుక్త కమిషనర్ లక్ష్మీనారాయణ హాజరవుతున్నారు. గత ఎనిమిది సమావేశాల్లో అపరిష్కృతంగా ఉన్న కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

 

08:57 - January 16, 2017

హైదరాబాద్ : సంక్షేమ పథకాల స్థానంలో నగదు బదిలీ రాబోతోంది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు సాధ్యం? 2016-17 బడ్జెట్ ఏవిధంగా ఉండబోతోంది. నగదు బదిలీ వల్ల పేదలకు న్యాయం జరుగుతోందా? ఇప్పటికే జరుగుతున్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కేంద్రం రాష్ట్రాలను విశ్వసించే పరిస్థితి ఉందా? ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి ప్రభుత్వాలు తప్పుకొనే ప్రయత్నం చేస్తోందా? 100శాతం నగదు బదిలీ వల్ల అర్హులు నష్టపోయే అవకాశం లేదా? నచ్చినవన్నీ చేసి ప్రజలు కోరుకుంటోంది అని కేంద్రం చెప్పడం సరైందేనా? ఆర్బీఐ లో 12 వేల మంది ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని చెప్తున్న ప్రకటన ఎలాంటి సంకేతాన్ని సూచిస్తోంది. ఈ అంశాలపై 'న్యూస్ మార్నింగ్' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, టిడిపి నేత సాంబశివరావు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాంబశివరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టంగా పొగమంచు అలముకుంది. దీంతో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తోంది. మరో 6 రైళ్లలో మార్పులు చేయగా.. మరో 2 రైళ్లు రద్దు చేసింది.

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీ : దేశ రాజధానిలో దట్టంగా పొగమంచు అలముకుంది. దీంతో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తోంది. మరో 6 రైళ్లలో మార్పులు చేయగా.. మరో 2 రైళ్లు రద్దు చేసింది.

20 న అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్‌

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్ష హోదాలో మొదటిరోజు చేపట్టబోయే కార్యక్రమాలపై పెద్ద అజెండా సిద్ధం చేసుకున్నారు. ఎనిమిదేళ్లపాటు ఒబామా అనుసరించిన అన్ని పథకాలను పునఃసమీక్షిస్తున్న ట్రంప్‌, బాధ్యతలు చేపట్టిన కొద్ది క్షణాల్లోనే ఒక్క కలం పోటుతో కొన్నింటిని రద్దు చేయనున్నారు.

07:09 - January 16, 2017

హైదరాబాద్ : చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానంటూ మంత్రి కెటిఆర్ ప్రకటించి, కొత్త సంవత్సరంలో ఆశావహ దృక్పథం కలిగించారు. అసెంబ్లీ, శాసనమండలి ఆవరణలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ఎంపి కవిత కూడా వస్త్రాలు కొనుగోలు చేయడం మరో విశేషం. చేనేత వస్త్రాలను ఆన్ లైన్ లో విక్రయించేందుకు టెస్కో ప్రయత్నిస్తోంది. ఇలా చేనేతరంగంలో కొత్త సందడి కనిపిస్తోంది. అయితే, గతంలో కూడా వైఎస్ హయాంలోనూ ఇలాంటి హడావిడే జరిగింది. ప్రతి శనివారం మంత్రులు చేనేత వస్త్రాలే ధరించాలంటూ తీసుకున్న నిర్ణయం ఎక్కువ కాలం అమలుకాలేదు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన చర్చనీయాంశంగా వున్నాయి. రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్ల తర్వాత కూడా చేనేత రంగంలో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇలాంటి సమయంలో మంత్రి కెటిఆర్ చెబుతున్నట్టుగా చేనేత రంగానికి మహర్ధశ రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం నేత కూరపాటి రమేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:04 - January 16, 2017

హైదరాబాద్ : కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ శుభారంభంతో మొదలైంది. ధోనీ నుంచి కెప్టెన్‌ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. తొలి వన్డేలోనే భారత్‌ను విజయం వైపు నడిపించడంతో పాటు.. అద్భుతమైన సెంచరీ చేశాడు. అదేవిధంగా కోహ్లీ స్ఫూర్తితో కేదార్‌ జాదవ్‌ మెరుపులు మెరిపించి సెంచరీ చేశాడు. దీంతో భారత్‌.. గెలుపు వాకిట నిలవగా చివర్లో అశ్విన్‌ సిక్స్‌లతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది.

ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం....

ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ కోహ్లీ, కేదార్‌ జాదవ్‌ దూకుడుగా ఆడి శతకాలు చేయడంతో పాటు.. ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్‌ గెలుపు సాధించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్న అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ.. తొలి వన్డేలోనే భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 350 పరుగులు.....

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 350 పరుగుల చేసింది. ఓపెనర్‌ హేల్స్‌, జాసన్‌రాయ్‌లు దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. బుమ్రా బౌలింగ్‌లో 39 పరుగుల వద్ద హేల్స్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత 73 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద జాసన్‌రాయ్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు మోర్గాన్‌, బట్లర్‌, స్టోక్స్‌లు ధాటిగా ఆడారు. స్టోక్స్‌ 33 బంతుల్లో అర్ధశతకం చేశాడు. భారత్‌పై ఓ ఇంగ్లీష్‌ బ్యాట్‌మెన్‌ సాధించిన అత్యంత వేగవంతమైన అర్థ శతకం ఇదే. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్‌ ఔటయ్యాడు. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రాలు చెరో రెండేసి వికెట్లు తీయగా.. ఉమేష్‌యాదవ్‌, జడేజా తలో వికెట్‌ తీశారు.

యువరాజ్‌సింగ్‌ పేలవ ప్రదర్శన .....

అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌. ఆదిలోనే వికెట్లు కోల్పోతూ తడబడింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ పట్టారు. అనంతరం వచ్చిన కెప్టెన్‌ కోహ్లీదూకుడుగా ఆడుతూ స్కోర్‌ పెంచాడు. అయితే మరో ఎండ్‌ నుంచి కోహ్లీకి పెద్దగా సహకారం లభించలేదు. మూడేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చినా.. యువరాజ్‌సింగ్‌ పేలవ ప్రదర్శనతోనే వెనుదిరిగాడు. మాజీ కెప్టెన్‌ ధోనీ కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్‌ జాదవ్‌తో కలిసి కోహ్లీ.. దూకుడును పెంచాడు. వీరిద్దరూ భారీ షాట్లు ఆడుతూ ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ అర్థశతకాలను నమోదు చేసి.. అంతే వేగంగా శతకాలు సాధించారు. అయితే 122 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లీ.. సోక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం జాదవ్‌ కూడా 120 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్‌ 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన పాండ్యా, జడేజా, అశ్విన్‌లు రాణించి గెలుపు లాంచనాన్ని పూర్తి చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బాల్‌ 3 వికెట్లు తీయగా.. విల్లే, స్టోక్స్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మొత్తానికి కోహ్లీ, జాదవ్‌ శతకాలతో భారత్‌ ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. అద్భుతమైన బ్యాటింగ్‌ చేసిన కేదార్‌ జాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇచ్చారు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే 19న కటక్‌లో జరగనుంది.

07:02 - January 16, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: పెట్రోలు, డీజిల్‌ రేట్లు స్వల్పంగా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 42 పైసలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి మూడు పైసులు వంతున పెంచినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన రేట్లు గత అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిచమురు ధరలకు అనుగుణంగా స్వదేశంలో పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచినట్ట ఓఎంసీ ల అధికారులు చెబుతున్నారు.

07:01 - January 16, 2017

తూ.గో : కోనసీమలో ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరగనున్న ఈ ప్రభల తీర్ధాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రభలు తమ పొలాల నుంచి వెళ్తే పంటలు బాగా పండుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కోనసీమవాసులంటున్నారు.

అనాదిగా వస్తున్న ఆచారం....

ప్రభల తీర్థం అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామస్తులంటున్నారు. అనేక గ్రామాల నుంచి 11 ప్రభలను జగ్గన్నతోటకు ఊరేగింపుగా తరలించారు. దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల మేర.. ప్రభలను యువకులంతా భుజాలపై మోసుకుని తీసుకువచ్చారు. ఊరేగింపులో తీసుకువచ్చే ప్రభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రభలను మార్గమధ్యలో ఎక్కడా దించకుండా.. జగ్గన్నతోటకు తీసుకురావడం విశేషం. ప్రభల ఊరేగింపులో యువకులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పంటలు బాగా పండుతాయని....

ఊర్ల నుంచి తరలివచ్చే ప్రభలు తమ పొలాల గుండా వెళ్తే పంటలు బాగా పండుతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అందుకే ప్రభలు తమ పొలాల గుండా వెళ్లాలని కోరుకుంటారు.

11 ప్రభలు.. పొలాల గుండా.. ఊర్లను దాటుకుంటూ..

ప్రజల ఊరేగింపు మధ్య 11 ప్రభలు.. పొలాల గుండా.. ఊర్లను దాటుకుంటూ.. జగ్గన్నతోటకు చేరుకున్నాయి. శివరూప రుద్రులైన 11 మంది రుద్రులు జగ్గన్నతోటలో సమావేశమై.. తమ గ్రామాల్లోని సమస్యలను ఏకాదశ రుద్రులు తీరుస్తారని ప్రజలు నమ్ముతుంటారు. 450 ఏళ్ల క్రితం జగ్గన్న మహారాజు హయాం నుంచి ఈ ప్రభల తీర్థం కొనసాగుతుందని.. దీన్ని తాము కొనసాగిస్తున్నామని ప్రజలంటున్నారు. అయితే.. తోటలోకి వచ్చేందుకు మధ్యలో కాలువ దాటాల్సి ఉంటుంది. ఆ ప్రభలను కాలువలో నుంచి ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా హరహర అంటూ తీసుకువచ్చే యువకుల ధైర్యం చూడడానికి రెండు కళ్లు చాలవు. మామూలుగానే ఆ కాలువలో నడవలేం. ప్రభను 30 మంది మోస్తే గానీ లేవదు. అలాంటిది కాలువలోంచి ప్రభను తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్లు గగుర్పుట్టిస్తుంది. ఇలాంటి కార్యక్రమాన్ని చూడాలని కోనసీమలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిన్నటివరకు కోడిపందాలతో సంబరాలు చేసుకున్న యువకులు.. ఈ ప్రభల తీర్థంలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు. ఇలాంటి ఆచారం మరెక్కడా లేదని.. దీన్ని జరుపుకోవడం తమకెంతో గర్వంగా ఉందని కోనసీమవాసులంటున్నారు.

07:00 - January 16, 2017

హైదరాబాద్: ప్రభుత్వ ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి సంస్థ క్యాలెండర్‌పై ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌నేత వి. హనుమంతరావు మౌనదీక్ష చేపట్టారు. గాంధీ భవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట దీక్షకు దిగారు. జాతిపిత గాంధీ స్థానంలో మోదీ చిత్రపటాన్ని ముద్రించడం గాంధీని అవమానించడమేనని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. తక్షణమే మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాజీమంత్రులు పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

06:58 - January 16, 2017

హైదరాబాద్ :రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని ఇకముందు భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకం కానున్నాయన్నారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రగతి భవన్‌లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీ

రాష్ట్రంలో ఈ రెండు రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్‌, జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, జగద్వీశర్‌రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.

నీటిపారుదల రంగం ద్వారా ప్రజలకు మేలు .....

నీటిపారుదల రంగం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. ఇకపై వివిధ వృత్తులపై ఆధారపడినవారికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని కేసీఆర్‌ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతం అన్నారు. గొర్రెల పెంపకానికి శాఖాపరంగా అన్ని రకాల సహాయచర్యలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల సంపద అభివృద్ధి ద్వారా యాదవులంతా ఆర్థికంగా ఎదగాలని సీఎం ఆశించారు. తెలంగాణ వారికి పరిపాలన చేతకాదని ఎద్దేవా చేసినవారు ముక్కున వేలేసుకునేలా ప్రపంచమంతా మన రాష్ట్రాభివృద్ధిని చూసి అబ్బురపడుతుందని.. అదేవిధంగా గొర్రెల పెంపకం కూడా జరగాలన్నారు. గొర్రెల పెంపకంలో మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

06:56 - January 16, 2017

హైదరాబాద్: పార్టీ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారా.. అని ఎదురు చూస్తున్న టీఆర్‌ఎస్‌ నేతల కలలు నెరవేరే రోజులు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల కమిటీలతోపాటు, రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌ బ్యూరోలను నియమించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లోనే కమిటీల ఏర్పాటుకు కసరత్తు

టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తైంది. ఇంతవరకు జిల్లా కమిటీలను నియమించకపోవడంతో నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లోనే కమిటీలను నియమించాలని నిర్ణయించినా... జిల్లాల పునర్వస్థీకరణ, ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దుతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అవరోధాలు తొలగిపోవడంతో కమిటీల నియామకంపై కేసీఆర్‌ దృష్టి పెట్టారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

పార్టీ నేతల్లో అసంతృప్తి పారదోలే యత్నం ......

2019లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్న కేసీఆర్‌... పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తిని పారదోలాలని నిర్ణయించారు. జిల్లా కమిటీలు ఏర్పాటుచేసి, నేతలకు చేతినిండా పని కల్పించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా కమిటీలతోపాటు, అనుబంధ సంఘాల కార్యవర్గాల నియామకానికి కసరత్తు పూర్తైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా స్థాయిలో అన్ని కమిటీల్లో కలుపుకుని 114 మందికి స్థానం దక్కే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవుల నిమాయకం చేపడతారు. ఓటు బ్యాంకు కోసం యాభై శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రాష్ట్ర కార్యవర్గం నియామకంపై కూడా కేసీఆర్‌ కసరత్తు...

రాష్ట్ర కార్యవర్గం నియామకంపై కూడా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తూ.. పొలిట్‌ బ్యూరో మాత్రం కీలక నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉంది. కమిటీల నియమకాన్ని పూర్తిచేసి, సభ్యత్వ నమోదును ప్రారంభించాలన్న యోచనలో కేసీఆర్‌ ఉన్నారు.

06:53 - January 16, 2017

హైదరాబాద్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. ముందస్తుగా రైల్వే రిజర్వేషన్లు, బస్సు రిజర్వేషన్లు ఉన్నవారు మినహా, మిగిలిన వారంతా ప్రయాణం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రయాణికుల చేరవేతకు అనుగుణంగా రైలు, బస్సు సర్వీసులు లేవు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

అరకొర తనిఖీలతో సరిపెడుతున్న రవాణ శాఖ ....

స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. టిక్కెట్‌ రేటుపై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. వీరిపై నియంత్రణ లేదు. అరకొర తనిఖీలతో సరిపెడుతున్నరవాణ శాఖ, ప్రైవేటు బస్సుల నిర్వాహకులను అదుపు చేయడంలో విఫలమైంది. తిరుగు ప్రయాణం మొదలైన రోజు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్ల దోపిడీ మరింత పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.400గా ఉన్నటికెట్‌కు వెయ్యికిపైగా వసూలు చేస్తున్నారు. మరికొందరు రూ.1300 నుంచి 1500 వరకు దండుకుంటున్నారు. ఏసీ, స్లీపర్‌ బస్సుల్లో ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉంది. స్లీపర్‌ బస్సుల్లో రెండువేల రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో పండుగ ఆనందం తిరుగుప్రయాణంతో ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో యాభైశాతం అదనపు చార్జీలు....

:దోపిడీ విషయంలో ఆర్టీసీ ఏమీ తక్కువ తినలేదు. రోజువారీ సర్వీసులకు ముందుగా రిజర్వేషన్‌ బుక్‌ చేసుకున్నవారికి మినహా, ప్రత్యేక బస్సులకు యాభై శాతం అదనపు రేట్లు వసూలు చేస్తోంది. అదనపు చార్జీలు వసూలు చేస్తున్నా తలుపులు, కిటికీలు సరిగాలేని బస్సులను నడుపుతున్నారు. దీంతో రాత్రివేళల్లో చలికితట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఇష్టముంటే ఎక్కండి, లేకపోతే దిగిపోండని ఆర్టీసీ సిబ్బంది చీత్కరిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆడిందే ఆట, పాడిండే పాటగా మారింది. పండుగ కోసం హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ రెండు వేలకుపైగా నడిపింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులు దీనికి అదనం. తిరుగుప్రయాణంలో ఆర్టీసీకి సరైన అంచనాలు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీంగా ఉన్నాయి. ప్రతిఏటా సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ ఉంటుంది అటు ఆర్టీసీ, ఇటు రైల్వే అధికారులకు తెలియని విషయం కాదు. అయినా అరకొరగానే రైళ్లు, బస్సులు నడుతుపుతున్నారు. రైల్వే శాఖ ప్లాట్‌ఫారం టికెట్‌ను 20 రూపాయలకు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తున్నారు.

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 42 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ. 1.03 పెరిగింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 15 రోజులు గడవక ముందే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss