Activities calendar

17 January 2017

ఉగ్రవాది అరెస్టు..

హైదరాబాద్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. అబూ జాఫర్ ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. మహ్మద్ యజ్దానితో కలిసి నగరంలో పేలుళ్లకు జాఫర్ కుట్రపన్నాడు.

 

 

కొడుకును వదిలిపెట్టి వెళ్లిన తల్లి..

విజయవాడ : మానసిక వికలాంగుడైన కొడుకును ఓ తల్లి బస్టాండులో వదిలిపెట్టి వెళ్లింది. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.

విదేశీ పర్యటనకు కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దక్షిణకొరియా, జపాన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం పర్యటించనున్నారు.

20:18 - January 17, 2017

'ట్విట్టర్ పిట్టె మన అంబర్ పేట అన్మంతన్నను పర్శాను జేస్తున్నదట..? అంతర్జాతీయ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారుకే వస్తయనుకున్నం ఏశాలు గట్టుడుగని..? చంద్రాలు సారూ గూడ నిన్నియాళ్ల సుర్వు జేశిండుగదా..? పాలకొల్లు ఎమ్మెల్యేను అక్కడి అధికారులు దేకుతలేరట...వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే సారు.. చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడం ఇద్దరు హద్దుల పంచాదికాడ అభివృద్ధిని ఆగం జేస్తున్నరట.. సర్కారుకు మంచి పేరు రావాల్నంటే ఏం జెయ్యాలే..? కింది స్థాయిల పనిజేశే అధికారులు మంచిగ నిజాయితీగ పనిజేయాలే అంతేనా..? ఈ సెల్ఫీలు ఎవ్వడు గనిపెట్టిండోగని..? అరరరరే జనం పాణాలు వోతున్నా పట్టించుకుంటలేరు..ఒక్క ఊరికి ఎంత మంది సర్పంజులుంటరు..? కుప్పం నియోజకవర్గంలనే జల్లికట్టు ఆటవెడ్తె.. ఆయింత ఎద్దుకు కోపమొచ్చి ఎంత పని జేశిందో' గిసొంటి మస్త్ మస్త్ ముచ్చట్లను మల్లన్న ఎలా చెప్పిండో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:13 - January 17, 2017

ట్విట్టర్ పిట్టె మన అంబర్ పేట అన్మంతన్నను పర్శాను జేస్తున్నదట..? అగో గా పిట్టెకు అన్మంతన్నకు ఏంది సంబంధం అంటరా..? నాకు గూడ తెల్వదిగని..? ఆ ట్విట్టర్ అంటెనే మస్తు గరమైతున్నడు.. ఆ ట్విట్టర్ పిట్టె దొర్కితె పీక విస్కి సంపెటంత కోపంతోని ఉన్నడు.. మరి అన్మంతన్నను పిట్టె కర్శిందా కొర్కిందా..? ఎందుకంత కోపమంటె ఇగో వీడియో క్లిక్ చేయండి..

20:10 - January 17, 2017

8మంది.. కేవలం 8 మంది బాస్.. ఈ 8మంది దగ్గరే ప్రపంచంలోని సొమ్ములో సింహభాగం ఉంది. వీళ్ల దగ్గరే సకల సంపదంతా చేరుతోంది. ఈ లెక్క ఏటా డబుల్, ట్రిపుల్ అవుతోంది. వీళ్లు పంచుకోగా మిగిలిన అరకొర సంపదనే ప్రపంచంలోని దాదాపు 750 కోట్లమంది పంచుకుంటున్నారు. ఎందుకీ తేడా? సంపద సృష్టిలో, పంపిణీల్లో ఎక్కడ తేడా వస్తోంది? దీనిపై ప్రత్యేక కథనం..డబ్బు డబ్బుని సంపాదిస్తుంది. ఏదో సినిమా డైలాగ్ లా ఉన్నా ఇది నిజమే అనిపిస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే డబ్బు డబ్బుని సంపాదిస్తే, పేదరికం మరింత పేదరికాన్ని ఆకర్షిస్తోంది మరి. ప్రపంచం ఏ రకంగా చూసినా తీవ్ర అసమానతలతో కొట్టు మిట్టాడుతోంది. సంపద అసమాన పంపిణీ ఆదినుంచీ అదే తీరులో కొనసాగుతుంది. ఇక ఆధునిక ప్రపంచంలో ఈ తేడాలు మరింత పెరిగి ప్రపంచ దేశాలను సంక్షోభంలో ముంచే ప్రమాదంలో పడేశాయి. ఈ క్రమంలో జరిగిన సర్వేలు నిజాలను తేటతెల్లం చేస్తున్నాయి.

ఎగబాకుతున్న కుబేరులు..
సంపద అమాంతంగా పెరుగుతోంది. ఏటా చిట్టాలో మరింత పైపైకి ఎగబాకుతున్నారు..అందరిసొమ్మూ ఈ కొందరి దగ్గరికే చేరుతోంది. వనరులను పిండిన లాభమంతా వీళ్లకే అందుతోంది. మరోపక్క మెజారిటీ ప్రజల దగ్గర చిల్లిగవ్వకూడా మిగలని పరిస్థితి ఏర్పడుతోంది. మనదేశంలో కుబేరులు రోజు రోజుకు ఆకాశానికి ఎగబాకుతున్నారు.. బిలియనీర్ల సంపద అనూహ్యంగా పెరుగుతోంది. కానీ, అదే సమయంలో అంతరాలు, ఆర్థిక సంక్షోభాలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బతికే దారిలేక, అసంఖ్యాక జనం అగచాట్ల పాలవుతున్నారు. అధిక ధరలు, రూపాయి విలువ పతనం వంటి కారణాలన్నీ అదృశ్య శక్తులై అశేష జన బాహుళ్యాన్ని అగాథంలోకి నెడుతున్నాయి. ఆక్స్ ఫామ్ నివేదికలో భారత్ గురించిన వివరాలేమున్నాయి? భారత్ లో 84మంది బిలియనీర్లు. ధనవంతుల జాబితాలో నాలుగో స్థానం … దరిద్రుల భారతంలో ధనవంతుల ప్రగతి ఇది. కుబేరులు పెరుగుతున్నారు?

మరి కుచేలుర సంగతేంటి ?
మరి కుచేలుర సంగతేంటి? అసలీ వేలకోట్ల సామ్రాజ్యాలకు పునాదులెక్కడున్నాయి? ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే.. పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాలు మరింత పెరుగుతాయి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:01 - January 17, 2017

రోహిత్ వేముల..కుల వివక్ష రాకాసి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ప్రథమ వర్ధంతి. ఇంతకాలమైనా రోహిత్ కు న్యాయం జరిగిందా ? దళితులపై దాడులు ఆగాయా ? ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. హెచ్ సీయూలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న రోహిత్ తల్లి రాధికను సైతం అడ్డుకున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చర్చలో ఇంద్ర శోభన్ (కాంగ్రెస్), ప్రేమేందర్ (బీజేపీ), మాల్యాద్రి (కేవీపీఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

బెంగళూరులో టి-20లో సంచలనం..

బెంగళూరు : ఒక టీ-20లో సంచలనం నమోదు అయ్యింది. ఒక్క పరుగు ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లను సర్ఫరాజ్ తీశాడు. ఐదు బంతుల్లో వరుసగా ఐదు వికెట్లు తీశాడు. పయెనీర్స్ క్లబ్ -- మెర్కారా క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో పయెనీర్స్ క్లబ్ తరపున సర్ఫరాజ్ ఆడాడు.

పవన్ ను కలిసిన ఏపీ, తెలంగాణ చేనేత సంఘాల నాయకులు..

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ, తెలంగాణ చేనేత సంఘాల నాయకులు కలిశారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పవన్ అంగీకారం తెలిపారు. వచ్చే నెల గుంటూరులో చేనేత సత్యాగ్రహంలో పవన్ పాల్గొననున్నారు.

19:31 - January 17, 2017

గుజరాత్ : పాటీదార్ ఆందోళన్‌ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ 6 నెలల తర్వాత ఇవాళ స్వరాష్ట్రం గుజరాత్‌కు చేరుకోనున్నారు. కోర్టు ఆదేశం మేరకు ఆయన ఆరు నెలల పాటు రాజస్థాన్‌లో గడిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పాటీదార్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని హార్దిక్‌ పటేల్‌ గుజరాత్‌లో పెద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దేశద్రోహం కింద పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేయగా..6 నెలల ముందు బెయిలుపై విడుదలయ్యారు. 6 నెలల పాటు గుజరాత్‌ వెలుపల నివసించాలన్న కోర్టు ఆదేశం నేటితో ముగిసింది. పటేల్‌కు ఘనస్వాగతం పలికేందుకు పాటీదార్‌ ఉద్యమకర్తలు గుజరాత్‌ సరిహద్దులో హార్దిక్‌ ఏర్పాట్లు చేశారు. ఈ ర్యాలీలో 5 వందల కార్లు, లక్షమంది కార్యకర్తలు పాల్గొనున్నారు.

సూరి ఎవరో తెలియదన్న వల్లభనేని వంశీ..

హైదరాబాద్ : సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. సూరి, భాను ఎవరో తనకు తెలియదని, మీడియాలో మాత్రమే చూడడం జరిగిందన్నారు.

19:20 - January 17, 2017

హైదరాబాద్ : తనను..తన పిల్లలను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, అయినా తన పోరాటం కొనసాగిస్తానని రోహిత్ తల్లి స్పష్టం చేశారు. రోహిత్ ప్రథమ వర్ధంతి సందర్భంగా హెచ్ సీయూలో సభ జరిగింది. అంతకంటే ముందు విద్యార్థులు..పోలీసుల మధ్య తీవ్ర విగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. అక్కడకు చేరుకున్న రోహిత్ తల్లిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగో సభ వద్దకు చేరుకుని ప్రసంగించారు. తాను పిల్లలతో కలిసి జేసీ కార్యాలయానికి వెళ్లడం జరిగిందని, అక్కడ ఆర్డీఓ, ఇతర అధికారులు ఉండడం జరిగిందన్నారు. అదే సమయంలో ఫుల్ గా మద్యం సేవించి తన భర్త మణికుమార్ రావడం జరిగిందని, తాను చెప్పిన మాటలు వినిపించుకోలేదన్నారు. వెంటనే అతడిని బయటకు పంపేసిన అనంతరం తాను చెబుతానని పేర్కొంటే మాకు చెప్పడం ఏంటీ ? అని ఆర్డీఓ పేర్కొన్నారని తెలిపారు. కాపురం చేయలేదంట కదా అని ప్రశ్నించాడని, తన బాధనంతా అణగదొక్కుకుని అక్కడి నుండి వెళ్లిపోయానన్నారు. అంబేద్కరిస్టులు దళితులా ? అని ప్రశ్నించారని పేర్కొన్నారు. ఆయన బీసీ అని ఆనాటి నుండి చెప్పడం జరుగుతోందని, పిల్లలను బయటకు తీసుకొచ్చి పెంచుకున్నానన్నారు. పిల్లలను ఎలా పెంచుకున్నావంటూ తన ప్రవర్తను కించపపరిచే విధంగా మాట్లాడానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే తనకు చావాలని అనిపించిందని, బీసీగా తేల్చాలని నిర్ణయించుకున్నారని, ఎలా తేల్చుకోవాలో తెలియక సతమతమౌతున్నారని పేర్కొన్నారు. ఓ ఛానెల్ లో జరిగిన చర్చకు వెళ్లడం జరిగిందని, దళితులకు వ్యతిరేకం కాదని ఓ బీజేపీ నేత పేర్కొన్నాడని తెలిపారు. ఆమె ఎలాంటి ఆవేదన వ్యక్త పరుస్తున్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

 

చంపేందుకు ప్రయత్నిస్తున్నారు - రోహిత్ తల్లి..

హైదరాబాద్ : తనను..తన పిల్లలను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రోహిత్ తల్లి పేర్కొన్నారు. హెచ్ సీయూలో విద్యార్థులనుద్ధేశించి ఆమె మాట్లాడారు. తనను ఎంతో అవమానపరిచారని, తనను బీసీగా తేల్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

18:39 - January 17, 2017
18:36 - January 17, 2017

కర్నూలు : జిల్లా కలెక్టర్‌పై సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దుర్మార్గమైన పాలన సాగుతోందంటున్నారు. సోలార్‌ ప్లాంట్‌ బాధిత రైతులకు న్యాయం చేయడంలో కలెక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటాన్ని ఆపదని గఫూర్‌ తేల్చి చెప్పారు.

18:34 - January 17, 2017

అనంతపురం : నిరసన దీక్షకు పోలీసులు అనుమతించకపోవడం అప్రజాస్వామికమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అమరావతి ఫ్రీజోన్, ఉద్యోగుల ప్రమోషన్ కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అణచివేస్తుందని అన్నారు. రాయలసీమవాదాన్ని వినిపించకుండా అధికారులు గొంతు నొక్కేస్తున్నారని బైరెడ్డి మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

18:33 - January 17, 2017

విజయవాడ : రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రయత్నిస్తున్నాడని మంత్రులు ప్రత్తిపాతి పుల్లారావు, నారాయణ ఆరోపించారు. రాజధానికి అవసరమైన 98 శాతం భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని వారు అన్నారు. కేవలం రెండు శాతం భూముల కోసం భూ సేకరణ చేస్తంటే దానిని జగన్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కారణంగా.. ఇక్కడ భూములకు మంచి ధరలు వస్తున్నాయని.. కానీ జగన్ విషప్రచారం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు.

 

18:31 - January 17, 2017

ఢిల్లీ : విభజన చట్టంలోని ఉమ్మడి ఆస్తుల పంపకంపై ఏపీ-తెలంగాణ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ చర్చలు జరిపింది. ఆర్టీసీ, ఆగ్రో, ఏపీ ఫుడ్స్‌ సంస్థల ఆస్తులకు సంబంధించి రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టప్రకారం ఆస్తులను 58 : 42 దామాషాలో పంచాల్సి ఉండగా.. ఏపీ ఆగ్రోకు సంబంధించిన ఆస్తులపై ఇరు రాష్ట్రాల అధికారులు భిన్న వాదనలు వినిపించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం 23జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మొత్తం స్థిరాస్తుల వివరాలతో మరోసారి రావాలని కేంద్రం సూచించింది.

18:28 - January 17, 2017

విజయవాడ : దావోస్‌ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదేళ్లతో పాటు సూయెజ్ ఎన్విరాన్మెంట్ సీఈవోతో భేటీ అయ్యారు. భారత్‌లో ఇప్పటికే సూయేజ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, వాటర్ ట్రీట్‌మెంట్‌ వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఏపీ అవసరాలకు తగినట్టు పనిచేయవచ్చని బాబు సూచించారు. ఏపీకి ఒక బృందాన్ని పంపించాలని చంద్రబాబు కోరారు.

హెచ్ సీయూ వద్ద విద్యార్థుల సభ..

హైదరాబాద్ : హెచ్ సీయూ మేయిన్ గేట్ వద్ద విద్యార్థులు సభను నిర్వహించారు. ర్యాలీ అనంతరం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. రోహిత్ స్థూపానికి నివాళులర్పించేందుకు వచ్చిన రోహిత్ తల్లిని పోలీసులు అడ్డుకున్నారు.

 

ఎంపీ కొత్తపల్లి గీత భర్తకు రెండేళ్ల జైలు శిక్ష..

హైదరాబాద్ : బ్యాంకు రుణం ఎగవేత కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ రామకోటేశ్వరరావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును నాంపల్లి క్రిమినల్ కోర్టు సమర్థించింది. రామ కోటేశ్వరరావు పంజాబ్ నేషనల్ బ్యాంకు 25 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. దీంతో బ్యాంకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

17:40 - January 17, 2017

హైదరాబాద్ : మళ్లీ హెచ్ సీయూ వార్తల్లోకి ఎక్కింది. విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్భందం చేశారు. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీడియాను కూడా నియంత్రించే ప్రయత్నం జరిగింది. పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్రంగా తప్పుబట్టారు. కుల వివక్ష కారణంగా విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రథమ వర్ధంతి సందర్భంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశాయి. హెచ్ సీయూలో ర్యాలీ నిర్వహించిన అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. బయటకు రాకుండా గేటుకు తాళం వేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు..పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభకు అనుమతిని నిరాకరించారని, శాంతియుతంగా నిర్వహించే ర్యాలీని కూడా అడ్డుకోవడం సబబు కాదని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భగా పలువురు విద్యార్థులు టెన్ టివితో మాట్లాడారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్లడం జరిగిందని, కారంచెడు ఘటన అనంతరం ఉద్యమం అంత తీవ్రస్థాయిలో జరిగిందన్నారు. రోహిత్ వేముల అనంతరం ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం జరిగిందన్నారు. రోహిత్ వేముల చట్టం తీసుకరావాలని డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.

'ఎందుకు అడ్డుకుంటున్నారు' ?
తనను రోహిత్ వేముల స్థూపం వద్దకు ఎందుకు అనుమతినివ్వడం లేదని రోహిత్ వేముల తల్లి ప్రశ్నించింది. రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు రోహిత్ తల్లి హెచ్ సీయూకు చేరుకున్నారు. ఈసందర్భంగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏమైనా టెర్రరిస్టులామా ? దేశ ద్రోహులమా ? అని ప్రశ్నించారు. తనను అనుమతించాలని వేడుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చారు. దీనిపై పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 15 రోజుల కిందట తాము పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అనుమతినివ్వ లేదని, ఇప్పుడు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించడం కరెక్టు కాదన్నారు.

అగ్రిగోల్డ్ నాలుగు ఆస్తుల వేలం పూర్తి..

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ నాలుగు ఆస్తుల వేలం పూర్తయ్యింది. కీసర, సైదాపూర్ లోని 23 ఎకరాలను రూ. 11.21 కోట్లకు జేఎమ్మార్ కన్ స్ట్రక్షన్ సంస్థ కొనుగోలు చేసింది. సైదాపూర్ లోని మరో ఎకరం భూమిని రూ. 60 లక్షలకు విశ్వనాథ నాయుడు, నందులూరులోని 33.57 ఎకరాలను రూ. 4.25 కోట్లకు నళిని కుమారి అనే మహిళ వ్యాపారి, నందులూరిలోని మరో 2.22 ఎకరాల భూమిని రూ. 32 లక్షలకు కళ్యాణ చక్రవర్తి సొంతం చేసుకున్నారు. విజయవాడలోని కమర్షియల్ కాంప్లెక్స్ కు రేపు వేలం నిర్వహించనున్నారు. అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. సీఐడీ నిగ్గు తేల్చి బినామీ ఆస్తులు బయటపెట్టాలని ఆదేశించింది.

కుమ్మరవాడలో దారుణం..

యాదాద్రి : భువనగిరి కుమ్మరవాడలో దారుణం చోటు చేసుకుంది. పర్వతాలు అనే వ్యక్తిని కొట్టి చంపి మృతదేహాన్ని మృతుడు బాబాయి యాదగిరి తగులబెట్టాడు. కుటుంబ కలహాలే కారణమని బంధువులు పేర్కొంటున్నారు.

తనను అడ్డుకుంటున్నారు - రోహిత్ తల్లి..

హైదరాబాద్ : విద్యార్థి రోహిత్ స్థూపం వద్ద నివాళి అర్పించేందుకు వచ్చిన తల్లిని పోలీసులు అనుమతినివ్వడం లేదు. దీనితో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తాను నివాళి అర్పించి వెళ్లిపోతానని, తనను అనుమతినివ్వాలని వేడుకున్నారు.

హెచ్ సీయూ వద్దకు రోహిత్ తల్లి..

హైదరాబాద్ : హెచ్ సీయూ వద్దకు రోహిత్ తల్లి చేరుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. రోహిత్ కు నివాళి అర్పించేందుకు ఆమె అక్కడకు చేరుకున్నారు.

జయపై శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ : దివంగత జయలలితపై శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంజీఆర్ మరణం తరువాత జయలలితను తమ కుటుంబమే కాపాడిందని, జయను తన భార్య శశికళ 30 ఏళ్లు కాపాడిందన్నారు. ఎంజీఆర్ అంత్యక్రియలకు జయను తామే తీసుకెళ్లడం జరిగిందని, జయ ముఖ్యమంత్రి కాకుండా బ్రాహ్మణులు అడ్డుకొంటే తామే ఆమెను ముఖ్యమంత్రి చేయడం జరిగిందన్నారు.

అఖిలేష్ కు లాలూ మద్దతు..

ఢిల్లీ : యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు పలికారు. అఖిలేష్ కు మద్దతుగా తన కొడుకుతో కలిసి ప్రచారం చేస్తానని, బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్నారు. ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

చెన్నైలో ఆగుస్టిన్ అరెస్టు - స్వాతిలక్రా..

హైదరాబాద్ : సోలార్ పవర్ ప్రాజెక్టు పేరిట మోసాలకు పాల్పడుతున్న ఆగుస్టిన్ ను చెన్నైలో అరెస్టు చేయడం జరిగిందని అడిషనల్ సీపీ స్వాతిలక్రా పేర్కొన్నారు. రెండు వెబ్ సైట్ లను ఏర్పాటు చేసి మోసాలు చేశాడని, ఆగుస్టిన్ పై ఏడు కేసులున్నాయన్నారు. ఏపీ, ఢిల్లీ, తమిళనాడులో కేసులున్నాయని, ఇతనిపై 406 ఐపీసీ, 420 ఐపీసీ, 66 సీ కింద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అతని బ్యాంకు ఖాతాల్లో రూ. 2కోట్లు సీజ్ చేయడం జరిగిందని, విలువైన కార్లు, భవనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

హెచ్ సీయూ విద్యార్థుల అరెస్టు..

హైదరాబాద్ : రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా విద్యార్థులు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసన చేపడుతున్న పలువురు విద్యార్థులను అరెస్టు చేశారు.

హెచ్ సీయూ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : హెచ్ సీయూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. గేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

16:42 - January 17, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చట్టంపై నిర్లక్ష్యం చేయడం వల్లే వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందని రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. పారిశ్రామిక రంగం కూడా తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతుందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సెమినార్ లో పాల్గొన్న ఆయన.. దేశానికి పట్టుకొమ్మల్లాంటి రంగాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 

16:36 - January 17, 2017

నిజామాబాద్ : పోలీసులు వేధిస్తున్నారంటూ నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో సత్యనారాయణ అనే ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక బస్టాండ్‌ ముందు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు. సంక్రాంతి పండుగ రోజున ధర్మారం దగ్గర జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీంతో పోలీసులు స్థానికంగా తిరుగుతున్న ఆటోలన్నిటినీ పీఎస్‌కు తరలించారు. దీంతో పనిలేక కుటుంబ పోషణ భారంగా మారిందని సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసు వేధింపులు ఆపాలని ఆటో డ్రైవర్లంతా కోరుతున్నారు.

16:34 - January 17, 2017

పశ్చిమగోదావరి : చేపల చెరువుల బడాబాబులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమ్మక్కైయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో విచ్చలవిడిగా తవ్వుతున్న చేపల చెరువులు కాలుష్యానికి కారణమవుతున్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ చేపల చెరువులపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని మధు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి, గణపవరం మండలాల్లో ఆయన పర్యటించారు. చేపల చెరువులను పరిశీలించారు.

16:29 - January 17, 2017

శ్రీకాకుళం : జిల్లాలో దారుణం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఓ బాలుడు సజీవదహనం అయ్యాడు. లావేరు మండలం కూనపువానిపేటలోని రెడ్డిరాము ఇంటికి ఆయన కూతురు ఇందు, అల్లుడు నరేంద్ర సంక్రాంతి పండుగకు వచ్చారు. వీరికి ఇద్దరు చిన్నారులు. అర్ధరాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఆరేళ్ల యశ్వంత్‌ ఇంట్లోనే ఉండిపోయాడు. కాసేపటికి గుర్తించి తల్లిదండ్రులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో యశ్వంత్‌ సజీవదహనం అయ్యాడు. ఇంట్లోని వస్తువులు, మోటార్‌ సైకిల్‌, బంగారం,నగదు అగ్నికి ఆహుతయ్యాయి.

16:28 - January 17, 2017

హైదరాబాద్ : లోధా కమిటీ సూచనల మేరకే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగాయని అధ్యక్షుడిగా పోటీ చేసిన జి. వినోద్‌ అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు జరుగలేదని చెప్పారు. డబ్బుల ఆశచూపి ఓట్లు కొన్నారని శాప్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపణలపై వినోద్‌ తీవ్రంగా స్పందించారు. ఓడిపోతామన్న నిరాశలో ఆయన ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగాయి. 17 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అయితే హైకోర్టు తుది ఉత్తర్వుల తర్వాతే ఫలితాలు వెలువడనున్నాయి.

దావోస్ లో బాబు పర్యటన.

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ లో పర్యటిస్తున్నారు. సత్యనాదెళ్లతో బాబు సమావేశమయ్యారు. ఫైర్ ఇంటర్నేషనల్ ఫార్మా సంస్థ అధినేత కిమ్ స్ట్రాటన్ తో బాబు భేటీ అయ్యారు. ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి అంశాలపై ఫైర్ ఇంటర్నేషనల్ దృష్టి పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కోసం చూస్తున్నట్లు అధినేత పేర్కొన్నారు.

షీనా హత్య కేసులో ఎఫ్ఐఆర్..

ముంబై : షీనా బోరా హత్య కేసులో నిందితులప ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలపై హత్య నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు.

16:13 - January 17, 2017

విజయనగరం : జిల్లా జామి మండలంలో తెల్లవారుజామున తాగుబోతు వీరంగం సృష్టించాడు. రామభద్రాపురం గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

16:08 - January 17, 2017
15:56 - January 17, 2017

హైదరాబాద్ : భీం రావు వాడను అభివృద్ధి చేయాలని సీపీఎం సభ్యుడు రాజయ్య పేర్కొన్నారు. నగరాభివృద్ధిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినవసరం ఉందని పేర్కొన్నారు. నగరంలోని 1800 స్లమ్స్ లను ఆధునీకరించాలని, అసమానతలు లేకుండా చూడాలన్నారు. భీం రావు వాడలో నివాసం ఉంటున్న వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కల్పించాలని పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్దికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు.

15:53 - January 17, 2017

విజయవాడ : రాష్ట్రంలో 130 సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులలో ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల స్కీంలను నిలిపివేశారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయడం లేదని ప్రయివేటు అసుపత్రుల యాజమాన్యాలు ఆరోపించాయి. ఆరోగ్య రక్ష పథకం అమలు విషయంలోనూ ప్రభుత్వం తమతో ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని, దీనితో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. 2013 తరువాత ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు దీనికి అంగీకరించాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆసుపత్రి యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందుకు ప్రభ్వుత్వానికి సమస్యలు తెలియచేసింది. కానీ ఎలాంటి మార్పు రాకపోవడంతో సేవలను నిలిపివేశాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల స్కీం నిలిపివేత..

విజయవాడ : రాష్ట్రంలో 130 సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులలో ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల స్కీంలను నిలిపివేశారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయడం లేదని ప్రయివేటు అసుపత్రుల యాజమాన్యాలు ఆరోపించాయి. ఆరోగ్య రక్ష పథకం అమలు విషయంలోనూ ప్రభుత్వం తమతో ఎలాంటి సంప్రదింపులు జరుపలేదన్నారు

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు..

రాజన్న సిరిసిల్ల : ఇరిగేషన్ అధికారులు ఏసీబీకి చిక్కారు. మిషన్ కాకతీయ కాంట్రాక్టర్ కిషన్ రెడ్డి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఈఈ చిరంజీవిలు, డీఈ నరేష్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.

కంది రైతులను ఆదుకుంటాం - మంత్రి నారాయణ..

గుంటూరు : కంది పంట రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, కంది పంటకు రూ. 5050 మద్దతు ధర కల్పిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కంది కొనుగోలు కేంద్రాల్లో కంది పప్పును అమ్మాలని, ఈ ఏడాది రబీలో 17.5 లక్షల హెక్టార్ లలో కంది పంట వేశారన్నారు. 45 రోజుల్లోఏ రూ. 435 కోట్లు పంట బీమా అందచేసినట్లు చెప్పారు.

15:19 - January 17, 2017

హైదరాబాద్ : నగరాభివృద్ధి అంశంపై విపక్షాలు చెప్పిన వాటినే అమలు చేయడం జరుగుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరాభివృద్ధి అంశంపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. విపక్ష సభ్యుల అభిప్రాయాలపై మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. విపక్షాలు ఇచ్చిన సూచనలు..సలహాల తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీలో తవ్వకాలపై ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు చట్టంలో మార్పు కూడా తీసుకరావడానికి కృషి చేస్తామన్నారు. తాము వచ్చాక జీహెచ్ఎంసీలో సంస్కరణలు జరుగుతున్నాయని, రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత వర్షాకాలంలో ఎదురైన ఇబ్బందులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఉన్న నివాసాల్లో చాలా మటుకు మంచినీటి కనెక్షన్లు లేవని, అధికారంలోకి రాకముందు 20 వేల వరకు కమర్షియల్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. కమర్షియల్ కనెక్షన్లు తాము పెంచడం జరిగిందని, తద్వారా ఆదాయం పెరిగిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నంబర్ వన్ ర్యాంకులో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వ నగరాలు రాత్రికి రాత్రే తయారుకావన్నారు. ఏమీ చేయకుండానే తమకు జీహెచ్‌ఎంసీలో 99 సీట్లు వచ్చాయా ? అని ప్రశ్నించారు. సంస్కరణల్లో భాగంగానే డీపీఎంఎస్ తీసుకొచ్చామని, నాలాల ఆక్రమణలు తొలగించకుండా ప్రత్యామ్నాయాలు చూస్తున్నమని కేటీఆర్ అన్నారు. రోడ్డు రీస్టోరేషన్ టెండర్లు ఆమోదించాకే తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

15:13 - January 17, 2017
15:11 - January 17, 2017

హైదరాబాద్ : సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లను దాఖలు చేశాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఉత్తీర్ణత శాతం పడిపోయిందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు తెలిపాయి. సత్ఫలితాలే వస్తున్నాయని కోర్టు పేర్కొంది. సీసీ కెమెరాకు చిక్కకకుండా విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సహాయం చేస్తున్నారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపీయింగ్ కు పాల్పడకుండా ఏం చర్యలు తీసుకుంటారో కాపీయింగ్ కు పాల్పడకుండా ఏం చర్యలు తీసుకుంటారో వెల్లడించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారనను మూడు వారాలకు వాయిదా వేసింది.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు..సుప్రీం విచారణ..

హైదరాబాద్ : సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లను దాఖలు చేశాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఉత్తీర్ణత శాతం పడిపోయిందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు తెలిపాయి. సత్ఫలితాలే వస్తున్నాయని కోర్టు పేర్కొంది. సీసీ కెమెరాకు చిక్కకకుండా విద్యార్థులకు ఇన్విజిలేటర్లు సహాయం చేస్తున్నారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపీయింగ్ కు పాల్పడకుండా ఏం చర్యలు తీసుకుంటారో కాపీయింగ్ కు పాల్పడకుండా ఏం చర్యలు తీసుకుంటారో వెల్లడించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

అనధికారిక చెరువులను నిలిపివేయాలి - మధు..

పశ్చిమగోదావరి : సీఎం ప్రోత్సాహకంతో విచ్చలవిడిగా చేపలు, రొయ్యలు చెరువులు తవ్వుతున్నారని, సాగు, తాగునీరు లేకుండా చేస్తున్నారని సీపీఎం నేత మధు విమర్శించారు. తక్షణమే అనధికారిక చెరువులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు.

ఉండి..గణపవరంలో సీపీఎం నేత మధు పర్యటన..

పశ్చిమగోదావరి : ఉండి, గణపవరం మండలాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు బృందం పర్యటించింది. ఉండి (మం) పాములపర్రు, గణపవరం (మం) జెల్లికాకినాడలో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సీపీఎం నేతలు అండగా నిలిచారు.

14:36 - January 17, 2017

విజయవాడ : మంత్రి దేనివేని ఉమమహేశ్వరావు ఉత్తరాంధ్ర ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ పనులపై విశాఖ నగరంలో సమీక్షను నిర్వహించారు. పనులు తీసుకుని చాలాకాలం అవుతున్నా ఇంత వరకూ పనులు పర్తి చేయకపోవడంపై మంత్రి మండిపడ్డారు. పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టులు రద్దు చేసి.. వారిని బ్లాక్ లిస్ట్‌లలో పెడతామని హెచ్చరించారు.

14:35 - January 17, 2017

వరంగల్ : సీపీఎం మహాజన పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని కొన్ని గ్రామాలలో మహాజన బృందం పాదయాత్ర కొనసాగింది. కాగా రోహిత్‌ వేముల వర్ధంతి సందర్భంగా ఆయనకు సీపీఎం నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ మతోన్మాద చర్యలు రోహిత్‌ మరణానికి కారణమని.. సంబంధిత బాధ్యులను వెంటనే శిక్షించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

14:34 - January 17, 2017

విజయవాడ : సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని నేటికి ఏడాది పూర్తైంది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ విజయవాడలో దళిత, ప్రజా సంఘాలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:33 - January 17, 2017

హైదరాబాద్ : దేశంలోనే ఏ రాష్ర్టంలో లేని విధంగా సైనికుల సంక్షేమ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. విధి నిర్వహణలో కొనసాగుతున్న సైనికులు, మరణించిన సైనిక కుటుంబ సభ్యులు, యుద్ధంలో క్షతగాత్రులు అయిన వారు, అంగవైకల్యం పొందిన వారు, మాజీ సైనికులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని చెప్పారు. ప్రతి ఏటా ముఖ్యమంత్రులు, మంత్రులు 25 వేల రూపాయలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రతి ఏటా 10 వేల రూపాయలు సైనిక సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సైనిక సంక్షేమ నిధికి ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు.

అవార్డు పొందిన సైనికులకు..
అవార్డులు పొందిన సైనికులకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ తెలిపారు. పరమవీర చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు 2 కోట్ల 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మహావీరచక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి ఒక కోటి 25 లక్షలు, సర్వోత్తమ అవార్డు పొందిన వారికి 25 లక్షలు, యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామని కేసీఆర్‌ తెలిపారు. అన్ని జిల్లాల్లో సైనిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

14:32 - January 17, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని స్వైన్‌ఫ్లూ వ్యాధి మళ్లీ వణికిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు నమోదయ్యాయి. పాతనగరం జాహనుమాకు చెందిన మహిళ స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. అలాగే మృతురాలి కొడుకు కూడా ఇదే వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మొత్తం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ముగ్గురు చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గత సంవత్సరం 17 మంది స్వైన్‌ ఫ్లూకు చికిత్స పొందగా వారిలో ఇద్దరు మరణించినట్టు ఆయన చెప్పారు.

14:27 - January 17, 2017

హైదరాబాద్ : అక్రమంగా నిర్మించిన ఎన్‌కన్వెషన్‌ను కూలగొట్టకుండా.. భండారి లే అవుట్‌ను మాత్రమే ఎందుకు కూలగొట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. పెద్దలకు ఒక రూల్‌, పేదలకు ఒక రూల్‌ పాటిస్తారా..? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు సాగునీరు లేక ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే గోదావరి పైపు లైన్ల నిర్మాణాలను హైదరాబాద్‌కు వేగవంతం చేయాలని కోరారు. పేదవారిని ప్రభుత్వం కాపాడుకోవాలని పేర్కొన్నారు.

14:25 - January 17, 2017

హైదరాబాద్ : స్వచ్చ హైదరాబాద్‌లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. నాలాలపై 938 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను ఐటీ కేంద్రంగా మార్చామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాలకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించామన్నారు.

ముగిసిన హెచ్ సీఏ ఎన్నికల పోలింగ్..

హైదరాబాద్ : హెచ్ సీఏ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైకోర్టు తుది ఉత్తర్వుల తరువాతే ఫలితాలు వెల్లడికానున్నాయి. బరిలో 19 మంది అభ్యర్థులున్నారు.

జైరా వసీంకు అమీర్ మద్దతు..

ముంబై : దంగల్ నటి జైరా వసీంకు అమీర్ ఖాన్ మద్దతు ప్రకటించారు. 'జైరా నీవు ఒంటరి కాదు..నీ వెంట మేమున్నాం..నీవు మాకు రోల్ మోడల్ అంటూ అమీర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

 

జగన్ పై మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ మండిపాటు..

గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై మంత్రులు ప్రత్తిపాటి, నారాయణ మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని, జగన్ రెచ్చగొట్టినా భూ సేకరణ, రాజధాని ఆగదన్నారు. రాజధాని పరిధిలో 1400 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇస్తామంటే తీసుకుంటామని, జగన్ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ అభివృద్ధిలో దూసుకపోతోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్ లో ప్రజలను భాగస్వాములను చేయడం జరిగిందని, తాగునీటి సమస్యను తీర్చేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. నగర శివారు ప్రాంతాలకు మంచినీరు అందచేందుకు పైపులైన్లు వేస్తున్నట్లు, 2018 నాటికి శివారు ప్రాంతాలన్నింటికీ మంచినీరందిస్తామన్నారు.

13:46 - January 17, 2017

చెన్నై : మాజీ సీఎం జయలలిత మేనకోడలు దీప రాజకీయాల్లోకి రానున్నారు. అన్నాడిఎంకేలోని తన మద్దతు దారులు, అనుచరులతో చర్చించిన తర్వాత ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటానని దీప చెప్పారు. ఫిబ్రవరి 24 జయలలిత జయంతి సందర్భంగా రాజకీయాల్లో చేరే విషయంపై ప్రకటన చేస్తానన్నారు. అన్నాడిఎంకేలో కొనసాగాలా...కొత్త పార్టీ పెట్టాలా అన్నదానిపై ఇంకా నిర్ణయించలేదన్నారు. జయలలిత ఆశయ సాధన కోసం కృషి చేస్తానని దీప తెలిపారు.

13:45 - January 17, 2017

యూపీ :పొత్తుపై త్వరలోనే ప్రకటిస్తామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ తెలిపారు. తండ్రిపై గెలవడం పెద్ద ఘనతేమి కాదన్నారు. పార్టీ సింబల్‌ సైకిల్‌ గుర్తు కోసం తండ్రితో బలవంతంగా పోరాటం చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. నేతాజీ ఎప్పుడు తనకు తండ్రేనని స్పష్టం చేశారు. నేతాజీ సూచించిన అభ్యర్థుల జాబితాలో తాను పెద్దగా మార్పులు చేయడం లేదని, 90 శాతం అభ్యర్థులు తండ్రి సూచించినవారేనని పేర్కొన్నారు.

13:44 - January 17, 2017

పంజాబ్ : మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని అమృత్‌సర్‌కు చేరుకున్న సిద్ధూకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అమృత్‌సర్‌ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అమృత్‌సర్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి సిద్ధూ పోటీ చేయనున్నారు. బాదల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంజాబ్‌ హక్కుల కోసం పోరాడతానని సిద్ధూ స్పష్టం చేశారు.

13:36 - January 17, 2017

హైదరాబాద్: అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. కొన్ని షరతులతో కూడిన పరిమితులతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 24 వారాల గ‌ర్భంతో ఉన్న ఓ మ‌హారాష్ట్ర యువ‌తి వేసిన ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం వైద్య నిపుణుల సిఫార‌సు మేరకు ఆమె అబార్ష‌న్ చేయించుకునేందు‌కు అనుమ‌తి ఇచ్చింది. కొన్ని కండీష‌న్‌ల‌ను విధిస్తూ ఈ కీల‌క తీర్పునిచ్చింది.ఈ అంశంపై చర్చను చేపట్టింది వేదిక.ఈ చర్చలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి హైమావతి, జెవివి నేత డాక్టర్ రమాదేవి పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

13:15 - January 17, 2017

హైదరాబాద్: నగరాన్ని విశ్వనగరంగా మార్చకపోయినా పర్వాలేదు కానీ ... విషాద నగరంగా మర్చకండి అంటూ బిజెపి నేత కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హైదరాబాద్ నగరంలో స్వల్పకాలిక చర్చ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వివరణ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.... ప్రభుత్వం ఏర్పడిన తరువాత జీహెచ్ ఎంసీ పని తీరు మెరుగుపడిందా? ట్రాఫిక్ సమస్య ఏమన్నా మెరుగుపడిందా? రెండున్నర సంవత్సరాలు జవాబుదారీ తనం పెరిగిందా? హైదరాబాద్ లో పాడైపోయిన రోడ్ల రమ్మతుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి కాగితాలకే పరిమితం అవుతుంది? టాటా, రిలయన్స్, ఎయిర్ టెల్ సంస్థలు ఇష్టానుసారంగా రోడ్లు తవ్వేస్తున్నారు? హైదరాబాద్ లో స్లమ్స్ పెరిగాయి, జీహెచ్ ఎంసీ నిధుల కొరత ఎదుర్కొంటోంది? అని సూటిగా ప్రశ్నించారు.

యూపీలో కాంగ్రెస్, అఖిలేష్ మధ్య కుదిరిన పొత్తు

హైదరాబాద్: యూపీలో కాంగ్రెస్, అఖిలేష్ మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అఖిలేష్ పార్టీ ఎస్పీ 300 స్థానాల్లో, కాంగ్రెస్ 75 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రామభద్రపురంలో వ్యక్తి వీరంగం

విజయనగరం : జామి మండలం రామభద్రపురంలో వ్యక్తి వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో ఓ కుటుంబంపై కత్తితో మందుబాబు దాడి చేశాడు. ఈ దాడిలో 5గురికి గాయాలు అవడంతో వారి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అధికారులు పచ్చచొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారు: బైరెడ్డి

కర్నూలు: అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని కోరుతూ బైరెడ్డి రేపటి నుండి చేపట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ సమస్యలపై నిరాహార దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికం అన్నారు. రాయలసీమ వాదాన్ని వినిపించకుండా అధికారులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు పచ్చచొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని బైరెడ్డి విమర్శించారు.

త్వరలో పార్టీ పేరు ప్రకటిస్తా: జయ మేనకోడలు దీప

చెన్నై : నేను రాజకీయాల్లోకి రావాలని అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారని మాజీ సీఎం జయలలిత మేనకోడలు దీప అన్నారు. కార్యకర్తలు నా పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను అన్నారు. రానున్న రోజుల్లో తమిళ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమన్నారు. జయలలిత పుట్టిరోజు ఫిబ్రవరి 24న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తామన్నారు. జయలలిత మృతిపై నాకెలాంటి సందేహాలు లేవన్నారు.

పంజాబ్ బిజెపిలో అసమ్మతి స్వరాలు

పంజాబ్ : రాష్ట్ర బిజెపిలో అసమ్మతి స్వరాలు రేగాయి. అధిష్టాంనపై బిజెపి పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు కేబినెట్ మంత్రి విజయ్ సాంప్లా రాజీనామాకు సిద్ధమయ్యారు. టికెట్ల కేటాయింపు పై సాంప్లా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దంగల్ నటి జైరా వసీంకు అమీర్ ఖాన్ మద్దతు

హైదరాబాద్: 'దంగల్' సినిమా నటి జైరా వసీంకు అమీర్ ఖాన్ మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో జహీరా నీవు ఒంటరివి కాదు... నీ వెంట మేమున్నాం. నీవు మాకు రోల్ మోడల్ వి అని అమీర్ తెలిపారు.

12:37 - January 17, 2017

హైదరాబాద్: నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు తరలించి రాబోయే 50 వేళ్ల వరకు తాగునీటి సమస్య లేకుండా చూస్తానని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో తెలిపారు. హైదరాబాద్ అభివృధ్ధి పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. జీహెచ్ ఎంసీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. 48 లక్షల డస్ట్ బిన్లు పంపిణీ చేసి వాటి కోసం 2 వేల ఆటో టిప్పర్లను పంపిణీ చేశాం. హైదరాబాద్ లో చెత్త సేకరణ 3,300 మెట్రిక్ టన్నుల నుంచి 4,200 మెట్రిక్ టన్నులకు చేరింది. స్వచ్ఛత ర్యాకింగ్ లో మెరుగుపెడుతున్నాం. హైదరాబాద్ లో ప్లాస్టిక్ రోడ్ల ఫైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని మిగతా ప్రాంతాలకు ప్లాస్టిక్ రోడ్లను విస్తరిస్తాం. నాలాల సర్వే 256 కి.లో మీటర్లకు పూర్తి చేశాం. హుస్సేన్ సాగర్ శుద్దీకరణ పనులు వేగవంతం చేశాం. మెట్రో మొదటి దశ పనులు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం. జీహెచ్ ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాస్తాం. ఎల్ ఈడీ లతో వీధి దీపాల నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తాం. మూసీ నది పొడవునా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 2018 కల్లా నగర శివారు ప్రాంతాలకు నీరు అందిస్తాం. అని కేటీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.

సైనిక సంక్షేమానికి ప్రత్యేక నిధి: సీఎంకేసీఆర్

హైదరాబాద్: దేశంకోసం నిరతరం కృషి చేస్తున్న సైనికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్నుమినహాయింపు, డబెల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో సైనికులకు 2 శాతం కోటా, యుద్ధ సేన మెడల్ పొందిన వారికి రూ.5లక్షల ప్రోత్సాహ, మిలటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.

12:29 - January 17, 2017

ఉత్సాహం..ఉత్తేజం రావడానికి చాలా మంది కాఫీలు..టీలు తాగుతుంటారు. నిత్యం మనం తాగే ఇలాంటివి కన్నా బ్లాక్ టీ తాగడం ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో అనారోగ్యాలను నయం చేసుకోవచ్చంట. పాలు..చక్కెర లేకుండా తయారు చేసుకోవడమే బ్లాక్ టీ. మరి దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దామా..

  • దంత సమస్యలు ఉండే వారు నిత్యం ఒక కప్పు బ్లాక్ టీ తీసుకోవాలి. దీనితో దంత సమస్యల నుండి దూరం కావచ్చు.
  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్లరు రాకుండా అడ్డుకుంటాయి.
  • పొగ తాగే వారికి పార్కిన్సన్ వ్యాధి వస్తుంది తెలిసిందే కదా. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయంట.
  • మధుమేహం ఉన్న వారు బ్లాక్ టీ తాగితే గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
  • దగ్గు..జలుము..అస్తమా వంటి శ్వాస కోశ వ్యాధుల నుండి బ్లాక్ టీ గట్టెక్కిస్తుంది.
  • జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. పలు రకాల విష పదార్థాలను జీర్ణాశయం నుండి తరిమేస్తాయి.
  • బ్లాక్ టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఒత్తిడి..ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. 
12:19 - January 17, 2017

బాలీవుడ్ ఖల్ నాయక్ లైఫ్ స్టోరీ సినిమాగా రాబోతోంది. అదేనండి బాలీవుడ్ సీనియర్ స్టార్ 'సంజయ్ దత్' బయోగ్రఫీకి రంగం సిద్దమైంది. ఈ బయోగ్రఫీ పై బాలీవుడ్ ఇప్పుడు హాట్ హాట్ టాపిక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ బయోగ్రఫీని ఓ సెన్సేషనల్ డైరెక్టర్ హ్యండిల్ చేస్తుండడం బీటౌన్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. 'సంజయ్ దత్' అనగానే ఇప్పుడు 'మున్నభాయ్ ఎంబీబీయస్', 'లగేరహో మున్నాభాయ్' సినిమాలు గుర్తొస్తాయి. కానీ 90టీస్ లో 'సంజయ్ దత్' అంటే బాలీవుడ్ ఖల్ నాయక్. 90టీస్ లో బాలీవుడ్ లో ఈ స్టార్ హవా నడువలేదు. హీరోగా 'సంజయ్' ఊపు చూసి 'అమితాబ్' తరువాత బాలీవుడ్ లో అంతటి స్టార్ డమ్ సొంతం చేసుకుంటాడని బీటౌన్ ఆడియన్స్ అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా ఈ స్టార్ హీరో అక్రమ ఆయుధాల కేసుతో పాటు ముంబై బాస్ట్ ల కేసులోని చిక్కుకుని సిని కెరీర్ ని పాడుచేసుకున్నాడు. ఇలాంటి వెరీ ఇంట్రెస్టింగ్ కోణాలు 'సంజయ్ దత్' కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయన బయోగ్రఫీపై మూవీ రూపొందుతోంది.

రాజ్ కుమార్ హిరానీ..
సంజయ్ దత్ లైప్ స్టోరీని బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తుండడం విశేషం. హానెస్ట్ మూవీస్ తెరకెక్కించే దర్శకుడిగా ఫేం అయిన ఈ దర్శకుడు సంజయ్ లైఫ్ స్టోరీని కూడా అంతకంటే హానెస్ట్గ్ గా తెరకెక్కిస్తాడని బాలీవుడ్ ఆడియన్స్ నమ్ముతున్నాడు. ఈ దర్శకుడు సంజయ్ దత్ తో ఇప్పటికే 'మున్నాభాయ్ ఎంబీబీయస్', 'లగేరహో మున్నాభాయ్' బ్లాక్ బస్టర్స్ తీసి 'సంజయ్' సెకెండ్ ఇన్నింగ్స్ కి రెడ్ కార్పెట్ వేశాడు. ఇప్పుడు ఏకంగా ఆయన లైఫ్ స్టోరీనే తెరకెక్కిస్తుండడంతో ఈ బయోగ్రఫీపై బాలీవుడ్ లో ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతాయనడంలో సందేహం లేదు. దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ ట్రాక్ రికార్డ్ చూస్తే 'సంజయ్ దత్' బయోగ్రఫీని ఎలా హ్యండిల్ చేస్తాడనేది తెలిసిపోతోంది. ఈ మూవీలో 'సంజయ్ దత్' తో పాటు మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అతిత్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురావడానికి రాజ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నాడు. 'పీకే' తో గ్రేట్ రికార్డ్స్ సెట్ చేసిన ఈ దర్శకుడు సంజుభాయ్ లైఫ్ స్టోరీతో అంతకు మించిన రికార్డ్స్ తో పాటు సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడనంలో సందేహం లేదు. 

12:15 - January 17, 2017

స్టైలీష్ స్టార్ న్యూ మూవీ 'డీజే' షూటింగ్ కి మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటికే రెండు నెలలు లీవ్స్ తీసుకున్న 'బన్నీ' ఇప్పుడు మరో టూ వీక్స్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. సరైన రీజన్స్ వల్లే ఈ సరైనోడు, డీజే షూటింగ్ కి విరామం ఇవ్వాల్సివస్తుందని వినికిడి. టాలీవుడ్ లో టాప్ ఫాంలో ఉన్న స్టార్స్ లో 'అల్లు అర్జున్' పేరును మొదటగా చెప్పుకోవాలి. స్టైలిష్ స్టార్ కొన్నేళ్లుగా వరుసగా హిట్స్ సాధిస్తున్నాడు. అంతేకాదు తన సినిమాల ద్వారా ఈజీగా 50 కోట్ల షేర్ వసూల్ చేసే రేంజ్ కి 'బన్నీ' చేరుకున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా నాలుగు 50కోట్ల సినిమాలను చేసిన ఒకే ఒక్క హీరో 'అల్లుఅర్జున్' అని చెప్పాలి. ప్రస్తుతం ఈ హీరో 'డీజే-దువ్వాడ జగన్నాధం' చిత్రంలో నటిస్తున్నాడు. 'హరీష్ శంకర్' దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో 'బన్నీ' డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు టాక్.

బన్నీకి కూతురు..
'డీజే' మూవీ షూటింగ్ వేగంగానే సాగుతోంది. కానీ 'అల్లు అర్జున్' కి సంబంధించిన షూటింగ్ మాత్రం పార్టు పార్టులుగా తీయాల్సి వస్తోందట. ఇందుకు మంచి రిజన్స్ ఉన్నాయి. తాజాగా బన్నీకి కూతురు పుట్టింది. అంతలోనే క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేసింది. ఈ ఆక్వేషన్స్ కోసం స్టైలీష్ స్టార్ ఏకంగా నెలన్నర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. దీనికి తోడు బన్నీ మేనత్త ఈ మధ్య కాలం చేశారు. ఇలా రకరకాల కారణాల వల్ల బన్నీ నెలన్నర పాటు డీజే షూటింగ్ సెలవు పెట్టాడు. అయితే ఇప్పుడు టూ వీక్స్ మరోసారి షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడం మాత్రం వెరీ ఇంట్రెస్ట్ గా మారింది.

చిరు ను కలిసిన బన్నీ..
లేటేస్ట్ బన్నీ డీజే మూవీకి టూ వీక్స్ బ్రేక్ ఇవ్వడానికి మెగాస్టార్ మూవీ రీజన్ అని చెప్పాలి. అవును మెగాస్టార్ 'ఖైదీ నెంబర్ 150' సినిమాను చూడటానికే బన్నీ టూ వీక్స్ తన సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడట. రిలీజ్ రోజే బన్నీ తన వైఫ్ తో కలిసి మెగాస్టార్ మూవీని చూసేశాడు. ఈ సంతోషంలో 'చిరంజీవి'ని కలిసి తన హ్యపీనెస్ పంచుకున్నాడట. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో రిలీజ్ చేస్తామని బన్నీ కాన్పిడెంట్ గా చెప్పుతున్నాడు.

12:11 - January 17, 2017

'బాహుబలి' మెడికల్ క్యాంప్ ఇదేంటి అనుకుంటున్నారా, నిజమే దర్శకధీరుడు 'రాజమౌళి' బాహుబలి సినిమా కోసం హోం హస్పటల్ ఏర్పాటు చేశాడట. ప్రధమ చికిత్స కోసమే జక్కన్న ముందు జాగ్రత్తగా ఇలాంటి ఆలోచన చేశాడట. 'బాహుబలి' సీక్వెల్ కోసం సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని నిర్మాతలు పదే పదే చెబుతున్నా, ఆడియన్స్ లో మాత్రం ఏదో మూలన చిన్న అనుమానం మాత్రం ఉంది. కానీ ఓ వారం క్రితం 'బాహుబలి ది కంక్లూజన్' షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టడంతో నిజంగానే 'రాజమౌళి' అండ్ టీం సినిమాను అనుకున్న టైంకే రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారని అంతా అంచనాకు వచ్చేశారు. ఈ బాహుబలి కాస్త లేట్ కావడానికి ఈ సినిమాలోని వార్ సీన్స్ తో పాటు అద్భుతమైన విజువల్స్ కోసమే అనేదే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలిలో యుద్ద సన్నివేశాలతో సహా అనేక డేంజర్ సీన్స్ ఉన్నాయి.

హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్..
వీటికి వచ్చిన రెస్పాన్స్ తో 'బాహుబలి' సీక్వెల్ లో ఈ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ను మరింత పకడ్బందీగా తెరకెక్కించాడట జక్కన్న. అయితే. ఇవన్ని రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో పెద్ద మెడికల్ టీంని కూడా షూటింగ్ జరిగినన్నాళ్లు రెడీగా ఉంచారని తెలుస్తోంది. ఓ ఫిజియో థెరపిస్ట్ తో పాటు కొంతమంది డాక్టర్ల టీంని రాజమౌళి సినిమా సెట్స్ లో ఉంచే ముందు జాగ్రత్తలు తీసుకున్నాడట. యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా నటీనటులకు గాయాలు అయ్యే అవకాశాలు ఉండడం, మరోవైపు యుద్ధ సన్నివేశాల్లో ఏ ఒక్కరికి చిన్నగాయం అయినా వెంటనే ట్రీట్మెంట్ చేయించడం కోసం ఇలా పెద్ద మెడికల్ క్యాంప్ నే రన్ చేసిందట 'బాహుబలి' టీం. మొత్తానికి ఆ షూటింగ్ కష్టాలన్నీ గట్టెక్కి ఇప్పుడు 'బాహుబలి 2' పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న అనుమానాలను నిర్మాతలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. మొత్తానికి 'బాహుబలి' కన్ క్లూజన్ ఎప్రిల్ లో రిలీజ్ కి ముస్తాబవుతోంది. 

12:11 - January 17, 2017

హైదరాబాద్: ప్రపంచంలోని 8 మంది బిలియనీర్ల ఆస్తులు ఎంతో తెలుసా? స‌గం మంది పేదల వద్ద ఉన్న ఆస్తులతో వీరి సంప‌ద సమానం. ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ ఈ నిజాలను బట్టబయలు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు నెలకొన్నాయని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

నేటి నుంచి 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం'లో....

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నేటి నుంచి ప్రారంభం కానున్న 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం'లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనికులు, శాసనకర్తలు పాల్గోనున్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు ఆక్స్‌ఫామ్ అనే స్వచ్ఛంద సంస్థ ధనికులు, పేదలకు మధ్య ఉన్న అంతరానికి సంబంధించిన సర్వే వివరాలను బయటపెట్టింది.

తాజా నివేదిక ప్రకారం...

ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో 50 శాతం మంది పేదల వద్ద ఉన్న సంప‌ద కేవలం ఎనిమిది మంది ద‌గ్గరే ఉంది. ఇందులో ఆరుగురు అమెరికన్లు కాగా...ఒకరు స్పెయిన్‌...మరొకరు మెక్సికోకు చెందిన పారిశ్రామికవేత్తలు. 2016లో ఇదే అంతరం కొంచెం తక్కువగా ఉంది. 9 మంది సంపద ప్రపంచంలోని 360 కోట్ల మంది సంపదతో సమానమని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది. 2010లో 43మంది వద్ద ఉన్న సంపద ప్రపంచ పేదల్లో సగం మంది సంపదతో సమానంగా ఉంది.

గ‌తంలో ఎన్నడూ లేని విధంగా...

గ‌తంలో ఎన్నడూ లేని విధంగా సంప‌ద ప‌రంగా అంత‌రం పెరిగిపోయింద‌ని ఆక్స్‌ఫామ్‌ సంస్థ తెలిపింది. ఇండియా, చైనా దేశాల స‌మాచారం ప్రకారం ప్రపంచంలో స‌గం నిరుపేద‌ల సంప‌ద మ‌రింత త‌రిగిపోయింద‌ని ఈ నివేదిక చెప్పింది. దీనిని దారుణమైన పరిస్థితిగా పేర్కొంది.

సంపన్నులకు పెట్టుబడులు షేర్ల రూపంలో..

సంపన్నులకు పెట్టుబడులు షేర్ల రూపంలో ఉండటంతో వారి సంపద భారీగా పెరుగుతోందని ఆక్సోఫామ్‌ విశ్లేషించింది. గత రెండు దశాబ్దాలుగా చైనా, ఇండోనేషియా, లావోస్, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లోని పది శాతం ధనికుల ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. 2009 నుంచి సంపన్నుల ఆదాయం ఏటా దాదాపు 11శాతం పెరిగితే...పేదల ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేదని తేల్చింది.

బిల్ గేట్స్‌ 2006లో మైక్రోసాఫ్ట్‌ను వ‌దిలినప్పటి ....

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌ 2006లో మైక్రోసాఫ్ట్‌ను వ‌దిలినప్పటి నుంచి ఇప్పటివ‌ర‌కు అత‌ని సంప‌ద 50 శాతం పెర‌గ‌డం విశేషం. ఆయ‌న త‌న సంపాద‌న‌లో భారీ మొత్తాలను చారిటీలకే వెచ్చిస్తున్నా.. సమస్య మూలాలను గుర్తించడం లేదని ఆక్సోఫామ్‌ పేర్కొంది.

అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నది కూడా బిలియనీర్లే...

ఇక అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నది కూడా బిలియనీర్లే... బిలియనీర్లలో చాలా మంది తమ సెక్రటరీలు, క్లీనర్ల కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు ఆక్సోఫామ్‌ తెలిపింది. తక్కువ పన్నులు చెల్లించే వ్యవ‌స్థ ఉన్నంత వ‌ర‌కు ఈ అస‌మాన‌త‌లు అలాగే ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

12:08 - January 17, 2017

అనుకున్నట్లుగానే మల్లు బేబి 'అనుపమ పరమేశ్వరన్' బిగ్ ఛాన్స్ అందుకుంది. రెండే రెండు చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ లేటేస్ట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చాన్స్ పట్టేసింది. తెలుగులో 'అనుపమ పరమేశ్వరన్' హవా సాగేలా కనిపిస్తోంది. 'అ ఆ' సినిమాలో చేసింది చిన్న పాత్రే అయిన ఈ కేరళ బ్యూటీ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ వెంటనే 'నాగచైతన్య' తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది. ఇక 'శర్వానంద్' తో నటించిన 'శతమానం భవతి' మూవీ సంక్రాంతికి రిలీజైంది. అయితే లేటేస్ట్ గా బ్యూటీ భారీ అవకాశం అందిపుచ్చుకున్నట్లు సమాచారం. 'అనుపమ పరమేశ్వరన్' 'రామ్ చరణ్' తో జోడికట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దర్శకుడు సుకుమార్, చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా ఈ కేరళ బ్యూటీని ఎంపిక చేశారు. కొన్ని రోజులుగా ఈ మూవీలో 'అనుపమ'నే హీరోయిన్ గా తీసుకుంటారనే వార్తాలు షికారు చేశాయి. అయితే ఫైనల్ గా సుక్కు, చెర్రీ ఈ బ్యూటీ వైపే మొగ్గు చూపారు. 'చెర్రీ'తో జోడి కట్టుతున్న మాట వాస్తవమేనని 'అనుపమ పరమేశ్వరన్' ట్వీట్ తో మరీ తన సంతోషాన్ని తెలుపడం విశేషం. చూస్తుంటే తెలుగులో నెమ్మదిగా 'అనుపమ పరమేశ్వరన్' గా గాలి వీచేలా కనిపిస్తోంది. 'చెర్రీ' సినిమాతో పాటు ఈ బ్యూటీ బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం. చరణ్, ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీస్ కనుక హిట్టు అయితే అనుపమ స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి ఎంటర్ అయినట్లే. 

12:07 - January 17, 2017

విపక్షాల వాయిదా తీర్మానాలు తిరస్కరణ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూధనా చారి తిరస్కరించారు.

11:47 - January 17, 2017

హైదరాబాద్: దేశంకోసం నిరతరం కృషి చేస్తున్న సైనికుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. సైనికులు నిర్మించుకునే ఇళ్లకు ఆస్తి పన్నుమినహాయింపు, డబెల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో సైనికులకు 2 శాతం కోటా,ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సైనిక సంక్షేమ నిధికి ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. అవార్డులు పొందిన సైనికులకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. పరమవీర చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రూ. 2.25 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మహావీరచక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి రూ. 1.25 కోట్లు, సర్వోత్తమ అవార్డు పొందిన వారికి రూ. 25 లక్షలు, యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని జిల్లాల్లో సైనిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

11:42 - January 17, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూధనా చారి తిరస్కరించినట్లు ప్రకటించారు. అనంతరం సభను 15 నిమిషాలు వాయిదా వేశారు

11:37 - January 17, 2017

హైదరాబాద్: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, గీత సొసైటీల్లో గీత కార్మికులందరికీ సభ్యత్వం ఇప్పిస్తామని శాసనసభలో మంత్రి పద్మారావు గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈత, తాటి మొక్కలు ఎక్కువగా నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తాటి చెట్లు నరికేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పెంచే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తాటి చెట్లు ఎక్కేందుకు యంత్రాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో తాటి చెట్లు ఎక్కేందుకు ఉపయోగిస్తున్న యంత్రాల విధానాన్ని పరిశీలించిందని చెప్పారు.

11:18 - January 17, 2017

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలవరీల సంఖ్య పెంచడం కోసమే 'అమ్మ ఒడి' కార్యక్రమం చేపట్టామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అసెంబ్లీలో సభ్యులకు వివరణ ఇచ్చారు. గతంలో కంటే ఇప్పుడు సర్కార్‌ దవాఖానాల్లో డెలవరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, త్వరలోనే అమ్మ ఒడి కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. 

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీల సంఖ్య తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. అన్ని ఆస్పత్రుల్లో జరుగుతున్న సర్జరీల సమాచారం ఇవ్వాలని ఇప్పటికే అదేశాలు కూడా జారీ చేశామని చెప్పారు. 108 సర్వీసు ఎమర్జెన్సీ కోసమని, 102 సర్వీస్‌ గర్భిణుల కోసమని చెప్పారు. ఈ రెండు సర్వీసులు కూడా కొనసాగుతాయని కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

11:16 - January 17, 2017

హైదరాబాద్: చైన్నైలో ఎంజీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి దగ్గర శశికళ, దీప వర్గీయుల పోటాపోటీ ప్రదర్శనలు ఇవ్వడంతో... అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తన రాజకీయ ప్రవేశం జరిగిపోయిందని జయలలిత మేనకోడలు దీప అన్నారు. తన భవిష్యత్‌ కార్యాచరణను దీప ప్రకటించనున్నారు.

11:15 - January 17, 2017

అనంతపురం : తాడిపత్రి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కౌన్సిల్‌ మీట్‌లో కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య డైలాగ్‌ వార్‌తో రగడ మొదలైంది. టీడీపీ నేత జగదీశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే అనుచరుడు రవీంద్రారెడ్డి మధ్య కరపత్రాల యుద్ధం కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

11:10 - January 17, 2017

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: రెండో విడత శీత‌కాల స‌మావేశాలు పునఃప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ మధుసూధనా చారి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై మంత్రి దేవినేని సమీక్ష

విశాఖ : ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై మంత్రి దేవినేని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.

కారు-బస్సు ఢీ:ఒకరి మృతి

సంగారెడ్డి : కారు - బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

09:36 - January 17, 2017

ఢిల్లీ : అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అలోక్‌వర్మ... 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్‌గా ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, సీజేఐతో కూడిన కొలీజియం ఎంపిక చేశారు.

09:34 - January 17, 2017

హైదరాబాద్‌ : మరళా స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది. 10 రోజుల వ్యవధిలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతి చెందారు. జనగామకు చెందిన మహిళ స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. నిన్న ఒక్కరోజే గాంధీలో ఆరుగురు బాధితులు చేరారు. రంగారెడ్డి, హైదరాబాద్‌లో 35మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు తెలుస్తోంది. చలి తీవ్రతకు స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. మహిళలు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

09:32 - January 17, 2017

హైదరాబాద్ : కాసేపట్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నిక బరిలో 17 మంది అభ్యర్థులు ఉన్నారు. 218 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హైకోర్టు తుది ఉత్తర్వుల తర్వాతే ఫలితాలు వెలువడనున్నాయి.

విష్ణాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి: పటాన్ చెరువు మండలం విష్ణాపూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. పక్కా భవనాలను కూడా అధికారులు కూల్చివేస్తుండటంతో స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు.

09:16 - January 17, 2017

హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో 'టెన్ టివి'తో మాట్లాడుతూ... ఇప్పటికే రోడ్ల మరమ్మత్తు చేపట్టామని, సిటీ ఔట్స్ కట్స్ వున్న జాతీయ రహదారులన్నిటినీ చాలా బాగున్నాయని తెలిపారు. అలా డబల్ బెడ్ రూం ఇళ్లు వాగ్దానం కొంత వరకు నెరవేర్చామని... మరికొంత సమయంలో ఇచ్చిన వాగ్ధానాలన్నింటి కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చుతుందని తెలిపారు.

09:11 - January 17, 2017

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇలా వున్నాయి. రోహిత్ వేమలు మృతి ఘటనలో సరైన చర్యలు తీసుకోలేదని, రోహిత్ కుటుంబాన్ని ఆదుకోలేదని కాంగ్రెస్, ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని టిడిపి, బ్రాహ్మణుల అభివృద్ధి పై బిజెపి వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

 

తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం : తాడిపత్రిలో టిడిపిలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు కరపత్రాల ద్వారా సవాళ్లు విసురుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు కొంత మంది నేతలను అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలను టీడిపిలో చేర్చుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

నేడే హెచ్ సీఏ ఎన్నికలు

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అత్యంత ఆసక్తిరేపుతున్న ఈ ఎన్నికలు lనేడు జరుగనున్నాయి. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్నివిధాలా ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, సీనియర్ న్యాయవాది రాజీవ్ రెడ్డి వెల్లడించారు. అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, ఎగ్జిక్యూటివ్ సభ్యుని పదవుల కోసం మొత్తం 17మంది పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

08:47 - January 17, 2017

హైదరాబాద్ : నేడు రోహిత్ వేముల తొలి వర్ధంతి సభ. అస్సలు రోహిత్ వేముల ఆత్మహత్య పై నిజనిర్ధారణ కమిటి ఏమి తేల్చింది? రోహిత్ ది ఆత్మహత్య కాదని, కేంద్ర మంత్రులు పరోక్షంగా రోహిత్ ను హత్య చేశారు అని 'న్యూస్ మార్నింగ్' చర్చలో విజయవాడ నుండి సీపీఎం నేత సీహెచ్ బాబూరావు ఆరోపించారు. ఈ చర్చలో ఇంద్రశోభన్ టిడిపి, కుమార్ బిజెపి పాల్గొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సెంట్రల్ యూనిర్శిటీలో రోహిత్ వర్థంతిని ఎందుకు జరుపుకోనివ్వడం లేదు? రోహిత్ ఆత్మహత్య కేసులో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు ఎందుకు చేయలేదు? నిర్భయ చట్టం మాదిరిగానే రోహిత్ చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదా? ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? రోహిత్ వేముల ఎస్సీ కాదు బీసీ అనే అంశంపై ఎందుకు ప్రభుత్వం చర్చ చేస్తోంది? ఇత్యాది అంశాలపై 'న్యూస్ మార్నింగ్' చర్చలో చర్చను చేపట్టింది. ఇలాంటి చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:03 - January 17, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల్లో ఖాళీగా ఉన్న 201 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. వీటిని టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. అటవీ శాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు 67 పోస్టులు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు 90 ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే టెక్నికల్‌ అసిస్టెంట్లు 12, జూనియర్‌ అసిస్టెంట్లు 32 రిక్రూట్‌ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

07:00 - January 17, 2017

హైదరాబాద్ : హెచ్ సియూ పరిశోధన విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకుని నేటికి ఏడాది పూర్తైంది. దళిత విద్యార్థుల పట్ల యూనివర్సిటీ యాజమాన్యం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా రోహిత్‌ ఆత్మత్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనిర్సిటీలో ఇవాళ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోహిత్‌ వర్థంతి, సంస్మరణ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రోహిత్‌కు నివాళులు అర్పించేందుకు వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు హెచ్ సియూ చేరుకుంటున్నారు.

గతేడాది జనవరి 4 వెలివాడ శిబిరం ఏర్పాటు ....

వేముల రోహిత్‌... హెచ్‌సీయూ పరిశోధన విద్యార్థి. గతేడాది ఇదే రోజు యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్‌సీయూలో దళిత విద్యార్థుల పట్ల విశ్వవిద్యాలయం పాలకవర్గం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పిన రోహిత్‌తోపాటు, మరికొందర్ని యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. దీనిని నిరసిస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో గతేడాది జనవరి 4న వెలివాడ శిబిరం ఏర్పాటుచేసి, నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పాలకవర్గం స్పందించకపోవడంతో జనవరి 17న రోహిత్‌ ఆత్మహత్య కు చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

హెచ్‌సీయూలో ఆరు నెలల పాటు ఆందోళనలు

రోహిత్‌ ఆత్మహత్యను నిరసిస్తూ, ఈ బలవన్మరణానికి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ పొదిలి అప్పారావు కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. నెల కాదు.. రెండు నెలలు కాదు.. దాదాపు ఆరు నెలల పాటు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంగణం ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో దద్దరిల్లింది. విద్యార్థుల ఆందోళనకు కొన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించడంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. యూనివర్సిటీలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించకుండా పాలకవర్గం, పోలీసుల ఆంక్షలు విధించినప్పటికీ, వీటిని ఉల్లంఘిస్తూ విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళన చేయడంతో కొన్నిసార్లు యూనివర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.

ఆత్మహత్యకు కారకులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌

వేముల రోహిత్‌ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా ఉద్యమానికి కారణమైంది. ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, విద్యార్థులతో కలిసి యూనివర్సిటీలో నిరసన తెలిపిన రోహిత్‌ తల్లి రాధికను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆప్‌ నేతలతోపాటు, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌, సీపీఎం నేతలు రావడంతో ఆత్మహత్య ఘటన జాతీయ స్థాయిలో చర్చకు దారితీసి, పార్లమెంటులో రగడకు కారమైంది. అప్పటి హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీ ఇరానీతోపాటు, అప్పుడూ, ఇప్పుడూ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ కూడా ఈ ఘటనకు కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. రోహిత్‌ వేముల ఆత్మహత్యతో యూనివర్సిటీ ప్రాంగణంలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదున్న విమర్శలు వినిపించాయి. ఎన్నో ఉద్యమాల దరిమిలా విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించినా, నిరసలు ఆగలేదు.

న్యాయ విచారణకు ఆదేశించిన కేంద్రం

రోహిత్‌ ఆత్మహత్యకు కారణకులైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఉద్యమాన్నితీవ్రతరం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. వీసీ పొదిలి అప్పారావు సెలవుపై వెళ్లారు. కేంద్రం నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ రోహిత్‌ ఆత్మహత్య ఘటనలో వీసీ అప్పారావు ప్రమేయంలేదని క్లీన్‌ చిట్‌ ఇవ్వడంతో, వైస్‌ చాన్సలర్‌గా బాధ్యతులు చేపట్టారు. అయితే రోహిత్‌ దళితుడా.. కాదా.. అన్న విషమై జరిగిన వివాదంపై న్యాయ విచారణ కమిషన్‌ ఎటూ తేల్చలేకపోయింది. దీనిని నిరసిస్తూ విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఇలా నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు ఆరు నెలలపాటు కొనసాగాయి. రోహిత్‌ పేరు మీద విద్యాహక్కు చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో హెచ్‌సీయూ విద్యార్థులు దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకుని ఏడాది పూర్తైన సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలోని వెలివాడ దగ్గర సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేశారు.

06:56 - January 17, 2017

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ రెండో విడత శీత‌కాల స‌మావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 13 రోజుల పాటు సాగిన స‌మావేశాలు..సంక్రాంతి పండ‌గ నేప‌థ్యంలో ఈనెల 17 వ‌ర‌కు వాయిదా వేశారు. అయితే 11 వ తేది వ‌ర‌కు స‌భ కొన‌సాగించాల‌ని గత బీఏసీ భేటీలో నిర్ణయించినా.. స్పీక‌ర్ 6వ తేదినే సమావేశాలను వాయిదా వేశారు. దీంతో విప‌క్షాల‌న్ని స్పీక‌ర్ వైఖ‌రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం స‌భ నియ‌మాల‌ను ఉల్లంఘిస్తుంద‌ని ధ్వజమెత్తాయి.

గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్లకు చట్టబద్దత!...

ఈ సారి సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీల‌క నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించనున్నట్లు సమాచారం. అయితే 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండొద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నందున అన్ని అంశాలపై స్టడీ చేయాలని సిఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై న్యాయ, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా..అధ్యయ‌నం చేయాలనడంతో.. ఇప్పటికే గ్రౌండ్ రీయాల్టీ రిపోర్టు అంద‌చేసిన‌ట్లు స‌మాచారం. తమిళనాడులో బలహీనవర్గాల జనాభాకు అనుగుణంగా 69 శాతం మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందని ప్రభుత్వం భావిస్తోంది.ముందుగా ముస్లింలు, ఎస్టీలు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని యోచిస్తోంది.

గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ...

ఇక మరో వైపు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిoచేoదుకు ఈ శాసనసభ సమావేశాల్లోనే చట్టం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్టీల సామాజిక,ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ చెల్లప్ప కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అయితే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సివుందని అధికారులు అంటున్నారు. మంగళవారం శాసనసభలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు 2 రోజులు సభ నడపాలని..విప‌క్షాలు గ‌ట్టిగ ప‌ట్టుబ‌డితే మ‌రో రెండు రోజులు పొడ‌గించే అవకాశం కనిపిస్తోంది.

06:54 - January 17, 2017

హైదరాబాద్ :సామాన్యుడికి కాస్త ఊరట లభించింది. ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితిని ఆర్‌బీఐ పెంచింది. ప్రస్తుతం ఒక రోజుకు ఉన్న నగదు ఉపసంహరణ పరిమితిని రూ.4,500 నుంచి రూ10 వేలకు పెంచారు. అయితే వారానికి ఉన్న 24,000 రూపాయల పరిమితిని మాత్రం అలాగే ఉంచారు. కరెంటు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి వారానికి రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. గత ఏడాది నవంబర్‌ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై పరిమితి పెట్టిన విషయం తెలిసిందే. మొదట 2000 రూపాయలుగా ఉన్న ఈ పరిమితిని ఇటీవలే రూ.4,500కు పెంచారు. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.10 వేలకు పెంచుతూ ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వారానికి 24 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే విషయంపై కూడా ఆంక్షలు తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది అమల్లోకి వస్తే.. బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

06:51 - January 17, 2017

కృష్ణా : విగ్రాహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత ఘటనలు కృష్ణా జిల్లాలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో రంగా విగ్రహం ధ్వంసం, జిల్లాలోని కైకలూరులో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 ఫ్లెక్సీల చించివేత ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వంగవీట సినిమా తర్వాత కృష్ణా జిల్లాలో...

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ్ తీసిన వంగవీట సినిమా తర్వాత కృష్ణా జిల్లాలో ప్రారంభమైన అలజడి సద్దుమణకగముందే, విజయవాడ సింగ్‌నగర్‌లో రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ రాధా-రంగా మంత్రిమండలి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాలు, రాస్తోరోకోలతో దద్దరిల్లింది. దీంతో రంగంలోని దిగిన రంగా తనయుడ రాధాకృష్ణ... రాధా-రంగా మిత్రమండలి సభ్యులకు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగినా, నివురుకప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఎప్పుడైనా భగ్గుమనే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. రంగా విగ్రహం ధ్వంసం టీడీపీ పనేనని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రంగా విగ్రహం ధ్వంసం వివాదం తర్వాత...

రంగా విగ్రహం ధ్వంసం వివాదం తర్వాత జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాకలో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 ఫ్లెక్సీ చించివేత ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో రంగాతోపాటు చిరంజీవి అభిమానలు గ్రామలో రాస్తారోకో నిర్వహించారు. ఆటపాక నుంచి కైకలూరు వరకు ర్యాలీ తీశారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా ర్యాలీలో పాల్గోవడంతో ఫ్లెక్సీ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది.

ప్రభుత్వంతోపాటు, అధికార పార్టీలో ఆందోళన...

విగ్రాహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత గొడవలు, ఘర్షణలతో ప్రభుత్వంతోపాటు, అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచివేయాలన్న ఉద్దేశంతో విధ్వంసకారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. విగ్రహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత వంటి దుశ్చర్యలకు పాల్పడి, ఉద్రిక్తతలు, ఘర్షణలకు కారమవుతున్న సంఘ వ్యతిరేక శక్తులపై కన్నేసి ఉంచాలి పోలీసులు నిర్ణయించారు.

06:48 - January 17, 2017

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ప్రజల బతుకులు మారాలంటే కనీస వసతులు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ప్రజలు ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ అంటూ ప్రచారం చేసుకుంటూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని తమ్మినేని ధ్వజమెత్తారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్న కేసీఆర్‌... ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందిస్తే బంగారు తెలంగాణ అదే సాధ్యం అవుతోందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు.

ఇచ్చిన హామీలను విస్మరించి.....

టీఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రభుత్వం పూర్తిగా అవినీతి, పక్షపాత ధోరణితో పాలన సాగిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా సీపీఎం తలపెట్టిన మహాజన పాదయాత్రకు తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మాధవరెడ్డి చెప్పారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో...

92వ రోజు మహాజన పాదయాత్ర వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పర్యటించింది. మర్రిమెట్ట, భూపతిపేట, బుధవారంపేట, ఖానాపూర్‌, అశోక్‌నగర్‌, నర్సంపేట గ్రామాల్లో పర్యటించిన తమ్మినేని బృందం ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంది. మహాజన పాదయాత్రకు స్థానిక సీపీఐ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 22వ జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం 2400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మహబాబాబాద్‌ జిల్లాలో గిరిజనుల కోసం తక్షణమే ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు.

06:45 - January 17, 2017

హైదరాబాద్ : గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమలా అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతున్నారు. తెలంగాణలో గొర్రెల పెంపకం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో గొర్రెల పెంపకానికి వున్న అవకాశాలేమిటి? అవరోధాలేమిటి? గొర్రెల పెంపకందారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఉడత రవీందర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేటీ నుండి తెలంగాణ శాసనసభ సమావేశాలు...

హైదరాబాద్: నేటి నుండి తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. పది రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభంకానున్నాయి. మొదటి నిర్ణయం ప్రకారం 17,18 తేదీల్లో జరుగుతాయి. అవసరం అనుకుంటే 18వ తేదీన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమై పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజు శాసనసభలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) అంశంపైన, శాసన మండలిలో మైనారిటీల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపైన లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది.

సీఎం కేజ్రీవాల్ కు ఈసీ నోటీసు

ఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. గోవా ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Don't Miss