Activities calendar

18 January 2017

ముంబైలో అత్యాచారం చేశాడు : బాధితురాలు

హైదరాబాద్ : ముంబైలో అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. తొలిసారి మత్తుమందు ఇచ్చి రేప్ చేశాడని పేర్కొంది.

యునైటెడ్ ఇండియా కంపెనీల్లో వాటాల ఉపసంహరణ

ఢిల్లీ : యునైటెడ్ ఇండియా కంపెనీల్లో వాటాలు ఉపసంహరణ జరిగింది. పలు సంస్థలు తమ వాటాలను ఉపసంహరించుకున్నాయి. 

 

అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించాం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 18 రోజులు సమావేశాలు నిర్వహించడం.... తమ ఆలోచనకు అద్దం పడుతుందన్నారు. 16 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని పేర్కొన్నారు. 94.56 నిమిషాల పాటు చర్చ జరిగిందన్నారు. 100 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని పేర్కొన్నారు. 361 సప్లిమెంటరీ ప్రశ్నలు అడిగారని చెప్పారు. 

 

తమిళనాడులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

చెన్నై : తమిళనాడులో జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. వేలూరు జిల్లా వాణియంబాడిలో కరెంట్ స్తంభంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. 

21:58 - January 18, 2017

చెన్నై : తమిళనాడులో జల్లికట్టు నిషేధం ఎత్తివేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. వేలూరు జిల్లా వాణియంబాడిలో కరెంట్ స్తంభంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియో చూద్దాం....

 

21:52 - January 18, 2017
21:47 - January 18, 2017
21:44 - January 18, 2017

ఢిల్లీ : ఆర్బీఐ గ‌వ‌ర్నర్ ఉర్జిత్ ప‌టేల్‌ పార్లమెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ విచార‌ణ ముందు హాజ‌ర‌య్యారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత 9.2 ల‌క్షల కోట్ల కొత్త క‌రెన్సీ ప్రవేశ‌పెట్టిన‌ట్లు ఆయన కమిటీకి  తెలిపారు. నోట్ల ర‌ద్దు ప్రక్రియ 2016 జనవరి నుంచే ఆరంభమైనట్లు వీరప్పమొయిలీ నేతృత్వంలోని స్టాండింగ్ క‌మిటీ ముందు ఆయన వెల్లడించినట్లు సమాచారం. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల బ్యాంకులకు ఎంత సొమ్ము వ‌చ్చింద‌ని ఎంపీలు అడిగిన ప్రశ్నకు మాత్రం పటేల్‌ స్పందించలేదు. నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల అస్తవ్యవ‌స్తమైన ఆర్థిక వ్యవ‌స్థ ఎప్పుడు మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి వ‌స్తుంద‌న్న దానిపై ఉర్జిత్ నోరు మెదపలేదు. శుక్రవారం థామస్‌ నేతృత్వంలోని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ముందు కూడా ఉర్జిత్‌ పటేల్‌ హాజరు కానున్నారు.

 

21:41 - January 18, 2017
21:39 - January 18, 2017

హైదరాబాద్ : ఏపీలో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్సిటీలో భాగస్వామి కావాలని సౌదీ ఆరాంకో సంస్థకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆరోంకో సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పలు సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహిస్తూ... ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు బిజీబిజీగా  గడిపారు. 
పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ 
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. పలు సంస్థల  ప్రతినిధులతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. కృష్ణా గోదావరి బేసిన్‌లో హైడ్రో కార్బన్‌ నిక్షేపాలు, టెక్నాలజీ, మానవవనరులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సౌదీ అరాంకో ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించారు. ప్రతిపాదిత పెట్రో యూనివర్సిటీలో భాగస్వామి కావాలని చమురు, సహజవాయు, రిఫైనరీ రంగాలలో దశబ్దాల అనుభవం కలిగిన సౌదీ అరాంకో  సంస్థకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 
విజయ్‌శేఖర్‌శర్మకతో బాబు భేటీ
దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మకతో భేటీ అయ్యారు. డీమానిటైజేషన్‌ నేపథ్యంలో తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు వివరించారు. తర్వాత వెంచర్‌ కాపిటల్‌ సంస్థ-సెక్వియ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే..ఏపీలో వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందిచాలని చంద్రబాబు పుజిసు సంస్థకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో టెక్నాలజీని ప్రభుత్వం వినియోగించుకుంటున్న తీరును బాబు వారికి వివరించారు. 
ఉప్పునీటిని తాగునీటిగా మార్పు...? 
ఏపీ కోస్తాతీరంలో ఉప్పునీటిని తాగునీటిగా మార్చడం తక్షణవసరమని... క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీలో ప్రసిద్ధి చెందిన ఆ సంస్థ సీఈవో జోనాథన్‌ షిమిట్‌తో చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే... సౌరశక్తితో ఉప్పునీటిని మంచినీటిగా మార్చగల సాంకేతికత తమ వద్ద ఉందని ఈ సందర్భంగా జోనాథన్‌ షిమిట్‌ బాబుకు తెలిపారు. ఎన్టీఆర్‌ 21 వ వర్ధంతి సందర్భంగా దావోస్‌లో  ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన విగ్రాహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  దావోస్‌లో పాల్గొన్న  ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సీఎం ముఖ్యకార్యదర్శి జి సాయిప్రసాద్‌, ఇంధన వనరుల, ఐ అండ్‌ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌ ఉన్నారు. 

 

21:35 - January 18, 2017

హైదరాబాద్ : ముస్లిం మైనార్టీ వర్గాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వచ్చే బడ్జెట్లో 12శాతం రిజర్వేషన్‌ బిల్లును పెట్టడంతో పాటు..వక్ఫ్‌ బోర్డుకు జ్యుడిషియల్‌ అధికారాలు, హైదరాబాద్‌లో ఇస్లామిక్‌ సెంటర్‌తో పాటు అనేక వరాలను గుప్పించారు. శాసనసభలో మైనార్టీల అభివృద్ధిపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.  
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనపై చర్చ 
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై.. శాసనసభలో చర్చ జరిగింది. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంపై స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్..దళితులు, క్రిష్టియన్లతో పాటు ముస్లీం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర, దేశస్థాయిలో నిర్వహించే అన్ని పోటీపరీక్షలను ఉర్దూ మీడియంలోనూ నిర్వహించాలన్నారు. ప్రధాన మంత్రి 15 సూత్రాల ప్రణాళికలను ఇప్పటికైనా అమలు చేయాలని అక్బరుద్దీన్‌ డిమాండ్ చేశారు. 
ముస్లీంల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలి : కాంగ్రెస్  
ఇదే అంశంపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీసీలు, మైనారిటీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించాలని, వారి అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాలని సూచించారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కూడా మైనారిటీ సబ్‌ప్లాన్‌కు డిమాండ్‌ చేశారు. మైనారిటీలకు చెందిన మొత్తం 73 వేల ఎకరాల్లో 54వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఆయన సభ దృష్టికి తెచ్చారు. 
కేసీఆర్‌ వివరణ 
అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇస్తూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల బిల్లును వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిటీ నివేదిక ఇచ్చిందని..దానిపై ప్రభుత్వం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తోందన్నారు. తమిళనాడు తరహాలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు ఇస్తామన్నారు. 
రెసిడెన్షియల్ స్కూల్స్‌ ఏర్పాటు 
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జ్యోతిరావుపూలే పేరుతో రెసిడెన్షియల్ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీల కోసం 125, ఎస్టీలకు 51 రెసిడెన్షియల్ స్కూల్స్‌, మైనార్టీలకు 200 స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి, నియోజకవర్గానికో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మౌజం, ఇమామ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని 1500లకు పెంచుతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. 
శాసనసభ నిరవధిక వాయిదా 
మైనార్టీల అభివృద్ధిపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మైనార్టీ వర్గాలకు వరాల జల్లు కురిపించడంపై ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్ధీన్‌ ఓవైసీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు తీసుకోలేని సాహసోపిత నిర్ణయాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మైనార్టీ సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈమేరకు సభలో స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొత్తం 18రోజులపాటు జరగ్గా..అందులో 94 గంటలపాటు 15 అంశాలపై చర్చించినట్లు స్పీకర్ ప్రకటించారు.  

 

21:28 - January 18, 2017

యాదవులను గిచ్చిన చాగంటి కోటన్న.. ఇదే తరీఖల మాట్లాడితే నీ పని పట్టన్న, డీఈవో మనుసుకు దాకిన మల్లన్నముచ్చట్లు... బడిలే ఫైటింగు జేస్తున్న సార్లకు చివాట్లు, వీఆర్ ఏలను గొట్టిన డిప్యూటీ తహసీల్దార్.. మీ అసనుటోళ్లు ఏడన్న ఉంటార సారు, శాంతిపావురాల యేషమేసిన పోలీసులు.. నల్గొండ కాడ సుతిమెత్తని లాఠీచార్జీ, ఎల్లారెడ్డి కాడ ఎక్కెక్కి ఏడ్సిన ఆటో డ్రైవర్.. కష్టమంత పోలీసోళ్ల పాలైతుందని కబర్, పచ్చ అంగి చేతులవట్టిన బైరెడ్డన్న... ఇంటున్నారే.. నీ మాట ఎవల్లన్న...  ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...
 

రాజేంద్రనగర్ లో కారు బీభత్సం

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ముందు కూర్చున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మైనర్ మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేశాడు. కారులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. 

21:06 - January 18, 2017
21:04 - January 18, 2017

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ 21వ వర్ధంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్‌ బేగంపేట్‌ రసూల్‌పురా చౌరస్తాలో ఎన్టీఆర్‌ విగ్రహానికి సనీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ పూలమా వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. పట్టుదల, క్రమశిక్షణకు ఎన్టీఆర్ మారుపేరని,  ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ గార్డెన్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరి నివాళులర్పించారు. 
విజయవాడ
ఎన్టీఆర్‌ 21 వ వర్ధంతి సందర్భంగా విజయవాడ సిద్దార్ధ కాలేజీలో ఎన్టీఆర్‌ చిత్ర ప్రదర్శనను నారా లోకేష్‌ ప్రారంభించారు. అమరావతిలో ఎన్టీఆర్‌ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో లెజండరీ బ్లడ్‌ డోనేషన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశారు.  చంద్రబాబు వచ్చాకే టీడీపీ పరిస్థితి దారుణంగా మారిందని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ప్రజలకు సేవ చేసేందుకే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని ఆమె గుర్తు చేసుకున్నారు.  
రంగారెడ్డి 
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అరాంగర్ లోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఎన్టీఆర 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, టీడీపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే సామాన్య ప్రజలకు సరైన న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఎల్‌ రమణ అన్నారు. 
వనపర్తి 
వనపర్తి జిల్లాలో ఎన్టీఆర్‌ 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.  వనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రకాశం
ఎన్టీఆర్‌ 21వ వర్దంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, తెదేపా రాష్ట్ర్ర ఉపాధ్యక్షుడు కరణం బలరాం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ 21 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగోండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కోలుకుల రోడ్డు వద్ద గల ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పాలకుర్తి డేవిడ్‌రాజు, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మన్నె రవీంద్ర పూల మాల వేసి నివాళులర్పించారు. 
విశాఖ 
విశాఖ నగరంలో  ఎన్టీఆర్‌ వర్ధంతి ఉత్సవాలను గణంగా నిర్వహించారు..బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తీ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

21:00 - January 18, 2017

హైదరాబాద్ : ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు బిల్లును వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెడతామనన్నారు సీఎం కేసీఆర్‌. ఇదే విషయంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడుతామన్నారు. దాంతో పాటు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవ్వాలని కోర్టులో పిటీషన్‌ వేస్తామన్నారు. 

 

20:58 - January 18, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగానే మైనార్టీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పుడే మైనార్టీలు అభివృద్ధి చెందుతారన్నారు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య. మైనార్టీలకు చెందిన మొత్తం 73 వేల ఎకరాల్లో ఇప్పటివరకు 54వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని సున్నం రాజయ్య అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా మైనార్టీలకు ఊతం ఇచ్చినప్పుడే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. 

 

20:55 - January 18, 2017
20:53 - January 18, 2017

కృష్ణా : నందివాడ మండలం ఇలపర్రులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. అక్రమ చేపల చెరువులను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. గ్రామంలో 165 ఎకరా పేదల భూములను ఆక్రమించి చెరువుల తవ్వుతున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6లోగా ఆగ్రమించిన భూములను పేదలకు అప్పగించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. పేదలకోసం చేస్తున్న పోరాటంలో జనసేన, కాంగ్రెస్‌, వైసీపీపార్టీలు కలిసి రావాలని మధు పిలుపునిచ్చారు. 

 

20:51 - January 18, 2017

గుంటూరు : డీఎస్ పీ దుర్గాప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడుల విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్‌ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తమపై తప్పుడు కేసులు బనాయించి.. ఇబ్బందులకు గురిచేశాడని దుర్గా ప్రసాద్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గా ప్రసాద్‌ను సర్వీస్‌ నుంచి తొలగించాలని, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

20:48 - January 18, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నోట్ల రద్దును నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. నోట్ల రద్దుతో మోదీ సర్కార్ భారీ కుంభకుణానికి పాల్పడిందని.. దీనిపై సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

 

నోట్ల రద్దు నిర్ణయం అణుబాంబు కంటే తీవ్రమైంది : శివసేన

హైదరాబాద్ : నోట్ల రద్దు నిర్ణయం అణుబాంబు కంటే తీవ్రమైందని శివసేన చెప్పింది. చెవిటి, మూగ, రామచిలక లాంటి వ్యక్తిని ఆర్బీఐ గవర్నర్ గా నియమించారని తీవ్రంగా వ్యాఖ్యానించింది. మోడీ ఏకపక్ష నిర్ణయంతో ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందన్నారు. 

 

తమిళనాడులో ఉధృతమవుతున్న జల్లికట్టు ఆందోళనలు

చెన్నై : తమిళనాడులో జల్లికట్టు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా వెండితెర, బుల్లితెర షూటింగ్ లకు ఫిలిం ఎంప్లాయిస్ అసోసియేషన్ బంద్ ప్రకటించింది. విద్యార్థుల జల్లికట్టు ఆందోళనకు మద్దతుగా రేపు విధుల బహిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిలుపు ఇచ్చారు. 

మూలలంకలో ఐటీ సోదాలు

కృష్ణా : కలిదిండి మండలం మూలలంకలో ఐటీ సోదాలు నిర్వహించింది. నోట్ల రద్దు బ్యాంకుల్లో జరిగిన లావాదేవీల ఆధారంగా కొంతమంది ఖాతాదారుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

 

20:21 - January 18, 2017
20:20 - January 18, 2017

ఆదిలాబాద్ : అసలే ఉద్యోగాలు లేక అల్లాడుతున్న నిరుద్యోగులకు అడపా దడపా వెలువడుతున్న ఉద్యోగ ప్రకటనలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో అమాయక అభ్యర్థులకు కొలువుల ఆశ చూపి.. కొందరు మోసగాళ్లు కాసుల వసూళ్లూ మొదలు పెట్టారు. కోర్టులు, గురుకులాలల్లో పోస్టులు ఇప్పిస్తామని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. 
ఉద్యోగాల పేరిట అమాయకులకు వల వేస్తున్న మోసగాళ్లు
ఉద్యోగాల పేరిట అమాయకులకు వల వేస్తున్న మోసగాళ్లు.. నమ్మి సొమ్ములిచ్చాక తప్పించుకు తిరుగుతున్న కేటుగాళ్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలిప్పిస్తామని భారీగా వసూళ్లు...ఇదీ... తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్న మోసగాళ్ల భాగోతం. ఇటు కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాల్లో అనేక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ... అటు దళారుల దందా జోరుగా సాగుతోంది. 
లక్షలు దండుకుంటున్నారు...
మండలాలు, రెవిన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ నమ్మబలుకుతున్న కొందరు దళారులు.. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. అటెండర్లు, స్వీపర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఇప్పస్తామంటూ.. లక్షలు లక్షలు దండుకుంటున్నారు. 
ఒక్కో పోస్టుకు రూ.80 వేల నుంచి లక్ష వరకు వసూలు 
కొత్త కార్యాలయాల్లో ఎలాగూ అదనపు సిబ్బంది అవసరం ఉంటుందన్న ఆశతో అభ్యర్థులూ దళారుల మాటలు నమ్మి.. అప్పు చేసి మరీ డబ్బులు అప్పగిస్తున్నారు. ఒక్కో పోస్టుకు 80 వేల రూపాయల నుంచి లక్ష వరకు దళారులు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  తాజాగా.. నిర్మల్ కోర్టులో కొలువులు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు లక్షల రూపాయలను వసూలు చేశారు. నెలకు 16 వేల వరకు జీతం ఉంటుందని చెబుతూ.. ఒక్కో అభ్యర్థి నుంచి లక్ష వరకు వసూలు చేశారు. ఇప్పటికే ఈ ముఠాకు వందల సంఖ్యలో నిరుద్యోగులు డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. నిర్మల్ కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని
నిర్మల్ కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని మెదక్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు వల వెసిన ముఠా సభ్యుడిని అభ్యర్థులు నిలదీసారు. కొన్ని నెలలుగా ఉద్యోగం ఇప్పిస్తా లేదంటే.. డబ్బులు వాపస్‌ ఇస్తానంటూ కాలం వెల్లబుచ్చుతున్న శ్యామ్‌ అనే దళారిని బాధిత అభ్యర్థులు నిలదీశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎడిపాల గ్రామానికి  చెందిన శ్యామ్‌ కొంతకాలంగా ఇలాగే నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. 
తాత్కాలిక పద్ధతిన నియామకాలు 
అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు పుచ్చుకుంటున్న దళారులు.. ముందుగా తాత్కాలిక పద్ధతిన నియామకాలు ఉంటాయని, ఆ తర్వాత పోస్టులు రెగ్యులర్‌ అవుతాయని నమ్మబలుకుతున్నారు. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తాము చూసుకుంటామని చెపుతుండటం గమనార్హం. ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడక ముందే... అభ్యర్థులు రాతపరీక్షకు హాజరైతే సరిపోతుందని, ఆ తర్వాత అంతా తాము చూసుకుంటామని దళారులు చెబుతున్నారు. కావాలంటే గ్యారెంటీ ఇస్తామంటూ.. బాండ్‌ పేపర్లు కూడా రాసిస్తున్నారు. డబ్బులిచ్చి మోసపోయిన కొందరు అభ్యర్థులు.. దళారి శ్యామ్‌ను గుంటూరు వెళుతుండగా పట్టుకున్నారు. ఏపీలో సైతం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు వెలువడుతుండటంతో..శ్యామ్‌కు అక్కడ కూడా నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల ఆశల్ని ఆసరాగా చేసుకుని దళారులు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారని, దళారుల మాటలు నమ్మి మోస పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

 

20:15 - January 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో  ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోయాయని పీడీఎస్‌యూ లీడర్లు విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తున్న స్టూడెంట్‌ యూనియన్లపై ప్రభుత్వం నిర్బంధం కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కామన్‌ స్కూల్‌ విధానానికి పోరాడతామని పీడీఎస్‌యూ నేతలు స్పష్టం చేశారు. 

20:13 - January 18, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం రాష్ట్ర సమితి సమావేశాల్లో ఆందోళన వ్యక్తం అయింది. హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లోజరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక , రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

20:12 - January 18, 2017

హైదరాబాద్ : దళితులు, క్రిష్టియన్లతో పాటు ముస్లీం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అన్నారు. రాష్ట్ర, దేశస్థాయిలో నిర్వహించే అన్ని పోటీపరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి 15 సూత్రాల ప్రణాళికలను ఇప్పటికైనా అమలు చేయాలని అక్బరుద్దీన్‌ డిమాండ్ చేశారు. 

20:10 - January 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందడానికి ఏవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందో...అదేవిధంగా మైనార్టీలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి ఖర్చు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. 

 

20:09 - January 18, 2017

హైదరాబాద్ : మైనార్టీల సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. మైనార్టీల విద్యా అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 200 మైనార్టీ పాఠశాలను కేటాయించిందన్నారు. అలాగే వక్ఫ్‌ బోర్డుకు త్వరలో జ్యుడిషియల్‌ అధికారాలను అప్పచెప్పడంతో పాటు అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను కాపాడతామన్నారు. హైదరాబాద్‌లో 7-8 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఇస్లామిక్‌ సెంటర్‌ను నిర్మిస్తామన్నారు కేసీఆర్‌. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల భర్తీలో ముస్లీం మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు. ఉర్ధూ మీడియంలో డీఎస్సీని నిర్వహించడంతో పాటు నీట్‌ పరీక్షను ఉర్ధూ మీడియాంలో కూడా నిర్వహించాలని ప్రధానమంత్రికి లేఖరాస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

19:17 - January 18, 2017
19:16 - January 18, 2017

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పోలవరం ముంపుగ్రామమైన మూలలంక గ్రామస్తులు  కలిశారు.  డంపింగ్‌ యార్డు నిర్మాణం పేరిట ప్రభుత్వం  తమ నుంచి 203 ఎకరాలను  బలవంతంగా సేకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకే ఉండేలా  చూడాలని కోరారు. అయితే పవన్‌ కల్యాణ్‌... తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

తెలంగాణ శాసనమండలి సమావేశాలు నిరవధిక వాయిదా

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి సమావేశాలు ముగిశాయి. మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.

19:05 - January 18, 2017
19:00 - January 18, 2017

చిత్తూరు : జిల్లాలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. శేషాచల అడవుల్లో వన్యప్రాణులను యథేశ్ఛగా వేటాడుతున్నారు. బంగారుపాళ్యం మండలం తుంబకుప్పంలో ఓ చిరుత వేటగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడింది. స్థానికులు అటవీసిబ్బందికి సమాచారం ఇవ్వడంతో చిరుతను కాపాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:58 - January 18, 2017

విశాఖ : జిల్లాలోని మల్కాపురంలో కిడ్నాప్‌ కలకలం చెలరేగింది. 21 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కోరామండల్‌ గేటు దగ్గర యువతిని కిడ్నాప్‌ చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:56 - January 18, 2017

చెన్నై : జల్లికట్టు నిర్వహించాలంటూ తమిళనాడు ప్రజలు భారీ ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ దగ్గర భారీ నిరనస తెలిపారు.  వేలాదిగా తరలివచ్చిన  ప్రజలు, విద్యార్ధులు ... జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని నినదించారు. జల్లికట్టు జరుపుకోవడానికి అనుమతించాలని కోరారు. దీంతో మంత్రులు నిరసనకారులతో చర్చలు జరిపారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు.

 

18:54 - January 18, 2017

హైదరాబాద్ : మైనార్టీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. మైనార్టీల సంక్షేమంపై అసెంబ్లీలో కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మొదటి బడ్జెట్ లోనే రూ.1030 కోట్లు కేటాయించామని తెలిపారు. మైనార్టీస్ ఓవర్సీస్ పథకం తెచ్చామని చెప్పారు.  

 

18:40 - January 18, 2017

కరీంనగర్‌ : నగరంలో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ ఘనంగా కొనసాగుతోంది.. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 30 దేశాలకుచెందిన కైట్‌ రైడర్స్‌ ఇందులో పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

18:38 - January 18, 2017
18:32 - January 18, 2017

హైదరాబాద్ : మైనారిటీల అభివృద్ధి కోసం నిధులు పెంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 10వేల కోట్లు కేటాయించాలన్నారు. 
ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిఉందని ప్రభుత్వానికి సూచించారు.. బీసీలు, మైనారిటీలకోసం ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించాలని కోరారు.

 

18:26 - January 18, 2017

హైదరాబాద్ : మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిఉందని... సీఎం కేసీఆర్‌ అన్నారు.. మైనార్టీల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేశామని ప్రకటించారు... ఈ పాఠశాలల్లోచేరేందుకు చాలామంది విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారని అసెంబ్లీలో చెప్పారు.. డ్రాపౌట్స్‌ తగ్గించేందుకు బాలికలకోసం వంద స్కూళ్లను ప్రత్యేకంగా కేటాయించామని కేసీఆర్‌ తెలిపారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంపై స్వల్పకాలిక చర్చను సీఎం ప్రారంభించారు.

 

 

18:19 - January 18, 2017

హైదరాబాద్ : నగరంలోని టెలిఫోన్ భవన్‌ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. మంటలు ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా...

హైదరాబాద్ : నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు. అంతకముందు సమావేశాల్లో పలు అంశాలపై సభ్యులు చర్చించారు. 

 

మైనార్టీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ వివరణ

హైదరాబాద్ : మైనార్టీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈమేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మైరార్టీల సంక్షేమానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 200 స్కూళ్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 

13:34 - January 18, 2017

హైదరాబాద్: వైవాహిక హక్కుల పునరుద్దరణ చట్టం అంటే ఏమిటి? ఈ అంశంపై 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి గారు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, డొమెస్టిక్ టెర్మినల్, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఏడుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని... వాళ్లంతా మన సైన్యంలోని సుబేదార్, కెప్టెన్ ర్యాంకుల దుస్తులు ధరించారని నిఘా విభాగం హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతను పెంచారు. చక్రి, గురుదాస్ పూర్ బోర్డర్ పోస్టుల సమీపంలో మన ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు కనిపించారని అమృత్ సర్ నుంచి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో... ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని తెలిపింది.

13:29 - January 18, 2017

హైదరాబాద్ : నెల్లూరులో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు కావలి పోలీసులు. అంతర్‌రాష్ర్ట ఎర్రచందనం దొంగలను అరెస్ట్‌ చేసి.. విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 3కోట్ల విలువైన 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులతో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హైదరాబాద్‌, నెల్లూరు వాసులుగా నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ వివరాలు వెల్లడించారు.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఎన్డీ తివారీ

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ ఎన్డీ తివారి, ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ సమక్షంలో వారు బీజేపీలో చేరారు. అమిత్ షా వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

13:14 - January 18, 2017

విజయవాడ: నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ప్రధాని మోదీ ఒక విధ్వంసకర శక్తి అని విమర్శించారు. నోట్ల రద్దు వ్యతిరేకంగా విజయవాడ ఎస్ బీఐ జోనల్ కార్యాలయం వద్ద ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేతలు, జాతీయ నేత కుంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ.. నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణం అని... సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం బయటికి వచ్చిందో బయటపెట్టాలని కోరారు.

13:02 - January 18, 2017

హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మంజూరుచేయడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం కాగితాల మీద అంకెల గారడీతో ప్రజలను మోసంచేస్తోందని ఆరోపించారు. వెనకబడిన కులాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

13:01 - January 18, 2017

హైదరాబాద్: పేదలు, వెనకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని... మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా రుణాలిస్తున్నామని గుర్తుచేశారు.. ఉపాది రుణాలపై యాక్షన్ ప్లాన్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.. SC, ST, BC, మైనార్టీలకు ఉపాదిరుణాలపై కాంగ్రెస్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈటెల సమాధానమిచ్చారు..

12:58 - January 18, 2017

హైదరాబాద్: వెనకబడిన కులాలకోసం కేటాయించిన నిధుల్ని ఎందుకు ఖర్చుచేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... ప్రతిదానికి గత ప్రభుత్వాలమీద నెపంవేయడంసరికాదని విమర్శించారు.. తమ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌నుబట్టి కేటాయింపులు జరిగాయని గుర్తుచేశారు...

12:56 - January 18, 2017

హైదరాబాద్: భద్రాచలాన్ని జిల్లాగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు... సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య... గిరిజన ప్రాంతాలను కలిపి భద్రాద్రి జిల్లా చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు..

12:53 - January 18, 2017

తిరుపతి : ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనదారుడు చాగంటి కోటేశ్వరరావు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీమహాభారతంలో భీఘ్మడు అనే కార్యక్రమంలో ఏం తెలియని గొల్ల కులంలో శ్రీకృష్ణుడు పుట్టాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యాదవ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. తక్షణమే ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ం చేశాయి. ఈ సందర్భంగా చాగంటి మాటలు.. ప్రతిగా యాదవ సంఘం నాయకుల మాటలు వీడియోలో చూడగలరు. 

12:51 - January 18, 2017

రాజస్థాన్ సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. అక్రమాయుధాల కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా తేలుస్తూ జోథ్‌పూర్ కోర్టు తుది తీర్పునిచ్చింది. 1998లో అక్రమాయుధాలు కలిగిఉన్నట్లు సల్మాన్‌పై కేసు నమోదైంది. 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు నుంచి సల్లూ భాయ్‌కు విముక్తి లభించింది.

12:50 - January 18, 2017

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నోట్ల రద్దును నిరసిస్తూ విజయవాడలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. నోట్ల రద్దుతో మోదీ సర్కార్ భారీ కుంభకుణానికి పాల్పడిందని.. దీనిపై సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

12:49 - January 18, 2017

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీ రుణాలను ఈఏడాది మార్చి 31వ తేదీలోపు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఇతర ఖర్చులను తగ్గించుకోనైనా నిధులను తప్పకుండా విడుదల చేస్తామని చెప్పారు.

12:46 - January 18, 2017

ప్రకాశం : ఏసీబీ కి మరో అవినీతి తిమింగళం చిక్కింది... ప్రకాశం జిల్లా చీరాలలో డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.. ఆదాయానికిమించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో 13చోట్ల ఏకకాలంలో దాడులుచేశారు.. చీరాలతోపాటు దుర్గాప్రసాద్‌ బంధువులున్న విజయవాడ.... గుంటూరులోకూడా సోదాలు జరుపుతున్నారు.. గుంటూరులో లెక్కకుమించి ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.. తవ్వేకొద్ది బయటకొస్తున్న ఆస్తులుచూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.. దాదాపు 200కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.. భారీగా ఆదాయాన్ని సంపాదించిన దుర్గాప్రసాద్‌ కొద్దిరోజుల్లో దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారని తెలుస్తోంది.. దుర్గాప్రసాద్‌ ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీకి డీఎస్‌పీగా పనిచేస్తున్నాడు..  ఏసీబీ అధికారులు మొత్తం 11 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13 ప్రాంతాల్లో విచారణ చేస్తున్నట్లు, దుర్గా ప్రసాద్‌ బినామీలపై కూడా దాడులు చేస్తున్నట్లు చెప్పారు.

12:45 - January 18, 2017

హైదరాబాద్: అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఎస్సీల కోసం 125, ఎస్టీలకు కోసం 51 రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మైనార్టీలకు 200 స్కూళ్లను మంజూరు చేసి.. అందులో 71 రెసిడెన్షియల్‌ స్కూళ్లను గత ఏడాది ప్రారంభించామని చెప్పారు. బీసీ విద్యార్థులకు కూడా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బీసీలకు అభ్యున్నతి కోసం జ్యోతిబపూలే పేరిట ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని, రాష్ర్ట వ్యాప్తంగా ఒక వంద 19 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

11:53 - January 18, 2017

హైదరాబాద్: ఖైదీ నెంబర్ 150 సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరో కాజల్ నటించింది. మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా 'టెన్ టివి' కాజల్ ని పలకరించింది. మెగాస్టార్ ఫ్యామిలిలో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవితో నటించడం ఎలా ఉంది. చిరంజీవి గారి నుండి ఏం నేర్చుకుంది? రామ్ చరణ్ కో స్టార్ గా నచ్చారా... ప్రొడ్యూసర్ గా నచ్చారా? ఈ సినిమా గురించి ఏఏ అంశాలను తెలియజేశారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

11:12 - January 18, 2017

విజయవాడ: మాజీ సీఎం ఎన్టీఆర్ 21 వర్థంతి సందర్భంగా నగరంలోని సిద్ధార్థ కాలేజీలో ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనను నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్టీఆర్ వల్లే ప్రపంచంలో తెలుగువారికి గౌరవం దక్కిందన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టామన్నారు. ఎన్టీఆర్ కు చెందిన అరుదైన వస్తువులను సేకరిస్తున్నామని, దీనికి ఆయన అభిమానులంతా సహకరించాలని కోరారు. అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. మంత్రివర్గంలో చోటు అనేది ఊహాగానాలే అని కొట్టిపారేశారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, పార్టీ ఆదేశిస్తే 2019 ఎ న్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: బ్రాహ్మణి

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో లెజండరీ బ్లడ్ డొనేషన్ ను నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం నా అదృష్టం అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 185 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శన ను ప్రారంభించిన లోకేష్

విజయవాడ: ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా సిద్ధార్థ కాలేజీలో ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనను నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్టీఆర్ వల్లే ప్రపంచంలో తెలుగువారికి గౌరవం దక్కిందన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టామన్నారు. ఎన్టీఆర్ కు చెందిన అరుదైన వస్తువులను సేకరిస్తున్నామని, దీనికి ఆయన అభిమానులంతా సహకరించాలని కోరారు. అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. మంత్రివర్గంలో చోటు అనేది ఊహాగానాలే అని కొట్టిపారేశారు.

కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి వీరంగం

అనంతపురం: కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి వీరంగం సృష్టించాడు. వైద్యులు, నర్సులపై రోగి దాడి చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు.దీంతో రోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:49 - January 18, 2017

నల్లగొండ: దామరచర్ల మండలం రాళ్లవాగుతండా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. సాహితీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం... నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో జరుగుతున్న విజ్ఞాన ప్రదర్శనకు సూర్యాపేట నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. రాళ్లవాగు తండా వద్ద ఓ హోటల్‌లో భోజనం చేసి.. రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతున్న విద్యార్థులను ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థినీ ప్రాణేశ్వరి, కరస్పాండెంట్‌ శాంతి ప్రాణాలు కోల్పోయారు. 10వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని ప్రియాంకకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రియాంక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

10:46 - January 18, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇలా వుఆన్నయి. వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని, వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేయాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

10:43 - January 18, 2017

హైదరాబాద్: తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. పట్టుదల, క్రమశిక్షణకు ఎన్టీఆర్ మారుపేరు అని సినీహీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ గార్డెన్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరి నివాళులర్పించారు.

10:41 - January 18, 2017

హైదరాబాద్: పేద బడుగు, బలహీనర్గాల కోసం పాటుపడిన మహోన్నతి వ్యక్తి నందమూరి తారకరామారావు అని మాజీ రాజ్యసభసభ్యులు హరికృష్ణ కొనియాడారు.. ఇవాళ ఎన్టీఆర్ 21వ వర్ధంతి అని... ఎన్‌టీఆర్‌ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు..

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర హరికృష్ణ, సినీహీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్ వారి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు.

ప్రజలకు సేవచేసేందుకే ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టారు:లక్ష్మిపార్వతి

ప్రజలకు సేవచేసేందుకే ఎన్‌టీఆర్‌ పార్టీ పెట్టారని గుర్తుచేసుకున్నారు లక్ష్మీపార్వతి.... చంద్రబాబు వచ్చాక టీడిపి పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు.. పార్టీని అవినీతిమయం చేశారని విమర్శించారు.. ఎన్‌టీఆర్‌ను గుర్తుచేసుకున్న లక్ష్మిపార్వతి... ఆయన్ని తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు..

10:38 - January 18, 2017

చెన్నై : జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడు ఏకమైంది. జల్లికట్టును నిషేదించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పెటా సంస్థపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

10:37 - January 18, 2017

జోథ్ పూర్ : నేడు సల్మాన్‌ఖాన్‌ భవిష్యత్ తేలనుంది. 1998 అక్రమాయుధాల కేసులో మరికాసేపట్లో తుది తీర్పు వెలువడనుంది. జోథ్‌పూర్ కోర్టుకు సల్మాన్ కుటుంబసభ్యులతో హాజరయ్యారు. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

10:35 - January 18, 2017

p { margin-bottom: 0.21cm; }

ఉత్తరప్రదేశ్‌ : కాన్పూర్‌ రైలు ప్రమాదం వెనుక ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. ఇండోర్‌-నేపాల్‌ సరిహద్దులో ముగ్గురు ఐఎస్‌ఐ ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. రైల్వేట్రాక్‌ల కింద బాంబులు అమర్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది.

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, మండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. అనంతరం ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. శాసనసభలో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

10:17 - January 18, 2017

హైదరాబాద్: మోటారు వాహన నిబంధనల్లో మార్పులు, రవాణాశాఖ ఫీజుల పెంపు, ట్రాఫిక్ ఉల్లంఘన పెనాల్టీలు వంటి చర్యలు ఆర్టీసీ పాలిట శాపంగా మారుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను వెనక్కి తీసుకోవాలంటూ కార్మికసంఘాలు పట్టుబడుతున్నాయి. రేపు అన్ని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ ఎస్ డబ్ల్యు ఎఫ్ నేత విఎస్ రావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

10:15 - January 18, 2017

హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాల్లో చేనేత వస్త్రాలకు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారు. ఇరురాష్ట్రాలకు చెందిన చేనేత సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు పవన్‌కల్యాణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పవన్‌కల్యాణ్‌ను కలిసిన చేనేత సంఘం నేతలు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పవన్‌కల్యాణ్‌కు వివరించారు. పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని.. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చేనేత కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో 45 మంది ఆత్మహ్యత చేసుకున్నారని తెలిపారు. చేనేత కార్మికుల జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు సహకరించాలని చేనేత సంఘాల నేతలు పవన్‌కల్యాణ్‌ను కోరారు.

చేనేత మన జాతి సంపద అని....

చేనేత కుటుంబాల కష్టాలపై పవన్‌కల్యాణ్‌ స్పందించారు. చేనేత మన జాతి సంపద అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు పవన్‌కల్యాణ్‌. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే నెలలో ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే చేనేత సత్యాగ్రహం, గర్జనలో పాల్గొనాలని చేనేత కార్మిక సంఘ నేతలు కోరగా.. దానికి పవన్‌కల్యాణ్‌ సానుకూలంగా స్పందించారు.

కిడ్నీ బాధితుల తరపున పవన్‌ పోరాటం..

ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు, శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల తరపున పవన్‌ పోరాటం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చి బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. మరీ.. ఇప్పుడు చేనేతల సమస్యలపై పవన్‌కల్యాణ్‌ స్పందించడంతో.. ఏపీ ప్రభుత్వంలో కదలిక వస్తుందని అందరూ భావిస్తున్నారు. అలాగే వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చేనేతల తరపున పవన్‌ కల్యాణ్‌ స్పందించడంతో చేనేత కార్మికుల సమస్యలపై తెలంగాణ సర్కార్‌ కూడా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేనేతల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోకపోతే.. వచ్చే నెలలో జరిగే సత్యాగ్రహం సభలో పవన్‌కల్యాణ్‌ గళం విప్పే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చేనేతలకు అండగా నిలుస్తానని పవన్‌ హామీ ఇవ్వడంతో ఆ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

10:12 - January 18, 2017

యూపీ : ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీ సింబల్‌ సైకిల్‌ను దక్కించుకున్న యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ ములాయం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లక్నోలో ములాయంతో సమావేశమైన అఖిలేష్‌ ఆ దిశగా సఫలమైనట్లే కనిపిస్తోంది. ములాయం సన్నిహితుల సమాచారం మేరకు తన తరపున ఎవర్నీ పోటీకి దింపనని కుమారుడికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. తనకు మద్దతిస్తున్న 38 మంది పేర్ల జాబితాను అఖిలేష్‌ యాదవ్‌కు ఇచ్చారు. ఇందులో అఖిలేష్‌ బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ పేరు మాత్రం లేదు. శివపాల్‌ స్థానంలో ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్‌ పేరును సూచించారు. అఖిలేష్‌ యాదవ్‌ మంత్రివర్గం నుంచి తొలగించిన శివపాల్‌ యాదవ్‌ సన్నిహితులైన నలుగురు మంత్రుల పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి. అఖిలేష్‌కు సైకిల్‌ గుర్తు దక్కడంతో శివపాల్‌ వర్గం పరిస్థితి దయనీయంగా మారింది.

ఈసీ నిర్ణయం తర్వాత ములాయం మౌన ముద్ర...

ఈసీ నిర్ణయం తర్వాత ములాయం మౌన ముద్ర దాల్చారు. ఈసీ నిర్ణయం తనకు వ్యతిరేకంగా వస్తే లోక్‌దళ్‌ నుంచి తన అభ్యర్థులను రంగంలోకి దింపి అఖిలేష్‌కు నష్టం కలిగించాలన్న ఆలోచనలో ములాయం ఉన్నట్లు తెలిసింది. దీంతో అఖిలేష్ తండ్రి మద్దతు కూడగట్టడంపై దృష్టి పెట్టారు. తండ్రిపై గెలవడం పెద్ద ఘనతేమి కాదని... పార్టీ సింబల్‌ సైకిల్‌ గుర్తు కోసం తండ్రితో బలవంతంగా పోరాటం చేయాల్సి వచ్చిందని అఖిలేష్‌ చెప్పారు. నేతాజీ ఎప్పుడు తనకు తండ్రేనని స్పష్టం చేశారు. నేతాజీ సూచించిన అభ్యర్థుల జాబితాలో తాను పెద్దగా మార్పులు చేయడం లేదని, 90 శాతం అభ్యర్థులు తండ్రి సూచించినవారేనని పేర్కొనడం గమనార్హం.

పార్టీ సింబల్‌ సైకిల్‌ రేసులో విజయం సాధించిన అఖిలేష్‌...

పార్టీ సింబల్‌ సైకిల్‌ రేసులో విజయం సాధించిన అఖిలేష్‌-కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌-సమాజ్‌వాదీల మధ్య పొత్తును త్వరలోనే ప్రకటిస్తామని యూపీ సిఎం అఖిలేష్‌ యాదవ్, కాంగ్రెస్‌ తరపున గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. ములాయం తన అభ్యర్థులను పొటీకి దింపక పోయినట్లయితే అఖిలేష్‌ పెద్ద విజయం సాధించినట్లే.

10:11 - January 18, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఐసిస్‌ ఉగ్రవాది అహ్మద్‌ ఇర్ఫాన్‌ అలియాస్‌ అబూ జాఫర్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ఇర్ఫాన్‌ను కోర్టులో హాజరుపరచగా.. ఎన్‌ఐఏ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించింది. హైదరాబాద్‌ మీరాలంమండీకి చెందిన ఇర్ఫాన్‌.. ఐసిస్‌ ఉగ్రవాది మహ్మద్‌ యజ్దానితో కలిసి నగరంలో పేలుళ్లకు కుట్రపన్నినట్లు ఎన్‌ఐఏ నిర్థారించింది. అనంతపురం, నల్లగొండ జిల్లా పోచంపల్లిలో ఇర్ఫాన్‌ పేలుడు పదార్థాలను సేకరించినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడవడంతో.. ఇర్ఫాన్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు గతేడాది జూన్‌లో ఏడుగురు ఎన్‌ఐఏ అధికారులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

10:10 - January 18, 2017

హైదరాబాద్: డైలాగులతో విశ్వనగరం తయారు చేయడం సాధ్యం కాదని 'న్యూస్ మార్నింగ్ ' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో జీహెచ్ ఎంసీ అభివృద్ధి హాట్ హాట్ చర్చ జరిగింది. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రెండేళ్ల కాలంలో... జీహెచ్‌ఎంసీలో చాలా సంస్కరణలు తెచ్చామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అయితే రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చలేమన్నారు. జీహెచ్‌ఎంసీలో తవ్వకాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని.. రహదారి టెండర్‌ పూర్తయితేనే తవ్వకానికి అనుమతి ఇస్తామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రభుత్వం కాగితాలకే పరిమితం అయ్యిందా? బడ్జెట్ కేటాయింపులన్నీ ఖర్చు పెడుతున్నారా? ఇత్యాది అంశాలపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు నగేష్, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చను చేపట్టారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

10:09 - January 18, 2017

దావోస్ : పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన.. ఏపీలో పెట్టుబడులకు కల్పించిన అవకాశాలను ప్రముఖ కంపెనీల సీఈవోలకు వివరిస్తున్నారు. రెండవ రోజు వరుస భేటీలతో చంద్రబాబు దావోస్‌లో బిజీబిజీగా గడిపారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదేళ్లతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.

చంద్రబాబును సూయెజ్ ఎన్విరాన్మెంట్ సీఈవో...

చంద్రబాబును సూయెజ్ ఎన్విరాన్మెంట్ సీఈవో కలిశారు. భారత్‌లో ఇప్పటికే సూయెజ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. జోర్డాన్‌లో సాగు నీటి అవసరాలకు వాడే నీటిలో 10 శాతం నీరు సూయెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా సరఫరా అవుతుందని చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, వాటర్ ట్రీట్‌మెంట్‌ వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఏపీ అవసరాలకు తగినట్టు పనిచేయవచ్చని సూచించారు. ఏపీకి ఒక బృందాన్ని పంపించాలని చంద్రబాబు కోరారు.

బ్రూనో సాటర్‌ను కలిసిన చంద్రబాబు...

అలాగే జూరిచ్‌కు చెందిన బ్రూనో సాటర్‌ను చంద్రబాబు కలిశారు. దావోస్‌లో ఏపీ భాగస్వామ్యం పట్ల బ్రూనో హర్షం వ్యక్తం చేశారు. సాంకేతిక అంశాల్లో ముందున్న జూరిచ్‌.. త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తామని బ్రూనో తెలిపారు. స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ సమస్యలేవీ లేవని బ్రూనో తెలిపారు.

వివిధ దేశాల కార్పొరేట్ సంస్థల అధిపతులతో చంద్రబాబు.....

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు వివిధ దేశాల కార్పొరేట్ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. బాధ్యతాయుతమైన.. సత్వరం స్పందించే నాయకత్వం అనే అంశం పై సదస్సులో చంద్రబాబు ప్రసంగించనున్నారు. యూకే, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాధినేతలు, భారత్ నుంచి 100 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు.

10:07 - January 18, 2017

హైదరాబాద్‌ : నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీపై శాసనసభలో వాడీ వేడీ చర్చ జరిగింది. రెండేళ్ల కాలంలో... జీహెచ్‌ఎంసీలో చాలా సంస్కరణలు తెచ్చామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అయితే రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చలేమన్నారు. జీహెచ్‌ఎంసీలో తవ్వకాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని.. రహదారి టెండర్‌ పూర్తయితేనే తవ్వకానికి అనుమతి ఇస్తామన్నారు.

నగరంలో 9.60 లక్షల నీటి కనెక్షన్లు ...

కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్ నగరంలో 9.60లక్షలు నీటి కనెక్షన్లు ఉంటే 1.60లక్షలకు మాత్రమే మీటర్లు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్‌. నగరంలో మొత్తం 20వేల కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదని.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తే ఆ సంఖ్య 38 వేలకు చేరిందన్నారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా 2017నాటికి ప్రతిరోజు నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని.. 2018 నాటికి శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నాలాలపై ఉన్న 938 అక్రమ నిర్మాణాలతో పాటు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రశ్నల వర్షం కురిపించిన విపక్షాలు...

అంతకుముందు గ్రేటర్‌ అభివృద్ధిపై చర్చ సందర్భంగా పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ప్రశ్నించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రభుత్వం కాగితాలపైన మాత్రమే చూపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీని ప్రక్షాళన చేసేంతవరకు హైదరాబాద్‌ అభివృద్ధి అసాధ్యమన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయకున్నా పర్వాలేదు కానీ.. విషాదనగరంగా మాత్రం మార్చొద్దని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న మురికివాడలను అభివృద్ధి చేసినప్పుడే నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వానికి సూచించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం..ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌ విసయంలో ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ నిర్మాణం అని తేలితే..

అయితే కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇస్తూ...అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి పేద-పెద్దల మధ్య తారతమ్యం ఏమీ లేదన్నారు. ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ నిర్మాణం అని తేలితే..తప్పకుండా కూల్చివేస్తామన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై చర్చ పూర్తయిన తర్వాత సభను బుధవారానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వాయిదా వేశారు.

07:02 - January 18, 2017

అమరావతి : ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం అమల్లో అలసత్వం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకవైపు పరీక్షల సమయం దగ్గరపడుతున్నా నేటికీ ఆన్ లైన్ లో ప్రవేశ పరీక్షలకు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఈ పరీక్షల తేదీల ఖరారు విషయంలో క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించిన తెలంగాణ సర్కార్....

తెలంగాణలో ఈ ప్రవేశ పరీక్షల తేదీలను ఇప్పటీకే ప్రకటించడంతో పాటుగా అవసరమైన కార్యాచరణ చేపట్టారు. తొలిసారిగా ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించడంలో ఎటువంటి సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుత సెట్ల నిర్వహణకు ....

ఏపీలో ప్రస్తుతం సెట్ల నిర్వహణకు ఆయా యూనివర్సిటీలు, కన్వీనర్లను ప్రకటించినా, పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల ఖరారు ఆలస్యమవుతోంది. సంస్థల ఎంపిక కోసం అధ్యయనం చేసిన ప్రత్యేక కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి పంపింది. అయితే సంస్థల ఎంపికకు మార్గదర్శకాలు జారీకాలేదు. ఆన్ లైన్ లో పరీక్షల్ని మొదటిసారిగా నిర్వహిస్తున్నందున విద్యార్థులకు తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు.

ఇంజనీరింగ్‌కే ప్రతి ఏడాది 3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు...

ప్రవేశ పరీక్షలను ఆన్ లైన్‌లో చేపట్టాలంటే కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే కార్యాచరణ ప్రారంభించాలి. ప్రతి ఏడాది ఇంజనీరింగ్‌కే దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరందరికీ ఆన్ లైన్‌లో పరీక్షలంటే కనీసం రెండు రోజులైనా నిర్వహించాల్సి ఉంటుంది. జనవరి మాసం గడిచినపోతున్నా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ పరీక్షల తేదీలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

06:59 - January 18, 2017

హైదరాబాద్: ఈ ఏడాదికి అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. జూన్‌ 29 యాత్ర ప్రారంభమవుతుందని అమర్‌నాథ్ ఆలయ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 7 శ్రావణపూర్ణిమతో ముగుస్తుంది. ఈసారి యాభై రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. గతేడాది 48 రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్ర సాగింది. అమర్‌నాథ్‌ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లతోపాటు, స్పాట్‌ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారు. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ బోర్డు నిర్ణయించింది.

06:57 - January 18, 2017

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి గ్రామంలోని చెరువులు నిండుకుండలా ఉండేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడిప్పుడే పథకం లక్ష్యం నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది. పాత మహబూబ్‌నగర్ జిల్లా కరవుకు కేరాఫ్ అడ్రస్‌.. జిల్లాలోని కరవును తరిమికొట్టేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లా వాసులు అనేక ప్రాంతాలకు వలసవెళ్లేవారు. ఇక్కడి ప్రజలు పాలమూరు కూలీలుగా బాగా ఫేమస్‌..

జలకళతో చెరువులు...

అయితే ఇదంతా గతం.. మిషన్ కాకతీయ పథకంతో ఇప్పుడు నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలలోని ప్రతి చెరువు జలకళతో దర్శనిమిస్తుండడం పట్ల రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీటిని చెరువుల్లో నింపుతున్నారు. ఈ చెరువుల కింద 22వేల ఎకరాల్లో యాసంగి పంట సాగవుతోంది.. మొత్తమ్మీద మిషన్ కాకతీయ కింద చెరువులన్ని జలకళను సంతరించుకున్నాయి. ప్రతి సంవత్సరం 20శాతం చొప్పున ఐదు సంవత్సరాలలో చెరువులన్నింటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ట్రాక్టర్ బోల్తా: నలుగురి మృతి

వనపర్తి: అదుపుతప్పిన ఓ ట్రాక్టర్ బోల్తాపడిం నలుగురు వ్యక్తులు మృతిచెందగా 7 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి వద్ద జరిగింది. ఈఘటనలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సింగోటం జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఆలంపూర్ మండలం తక్కశిల వాసులు.

హైదరాబాద్ లో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

హైదరాబాద్: నగరంలో ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఐసిస్ ప్రోద్భలంతో మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. నిందితుడికి ఎన్‌ఐఏ కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది. అనంతపురం, నల్లగొండ జిల్లా పోచంపల్లిలో ఇర్ఫాన్ పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ గతేడాది జాన్‌లో హైదరాబాద్‌లో ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

ఇన్నోవా వాహనం ఢీకొని ఇద్దరి మృతి

నల్గొండ: దామరచర్ల మండలం రాళ్లవాగుతండా వద్ద ఇన్నోవా వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు సాహితీ స్కూల్ విద్యార్థిని, కరస్పాండెంట్ గుర్తించారు. సూర్యాపేట నుండి శ్రీహరికోటకు విజ్ఞాన ప్రదర్శనకు వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకుంది.

Don't Miss